narsaraopet
-
హత‘విధీ’.. ఆనందాన్ని చిదిమేసింది
కారంపూడి: ప్రసవ వేదన పడుతున్న భార్యను ఆస్పత్రిలో చేర్చి.. ఆస్పత్రి ఖర్చులకోసం డబ్బు తీసుకుని బైక్‌పై వెళ్తున్న భర్త ప్రమాదవశాత్తూ బైక్‌పై నుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. భార్యను తరలించిన అంబులెన్స్‌లోనే అతడిని కూడా అదే ఆస్పత్రికి తీసుకెళ్లగా ప్రాణాలు విడిచాడు. అప్పటికే భార్య ప్రసవించగా.. పుట్టిన పాపను కూడా చూసుకోకుండా ఆ తండ్రి కన్ను మూయడంతో అక్కడి వారి హృదయాలు బరువెక్కాయి. వివరాల్లోకి వెళితే.. పల్నాడు జిల్లా కారంపూడి ఇందిరా నగర్ కాలనీ గనిగుంతలుకు చెందిన బత్తిన ఆనంద్ (33) భార్య రామాంజనికి పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో శుక్రవారం 108లో గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమెకు రక్తం తక్కువగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం నర్సరావుపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆమె వెంట వాళ్ల అమ్మ, చిన్నమ్మ, ఆశా వర్కర్ ఏసమ్మ వెళ్లారు. భర్తను కూడా అంబులెన్స్ ఎక్కమంటే ఆస్పత్రి ఖర్చులకు డబ్బు తీసుకు వస్తానని ఆగిపోయాడు. శనివారం వేకువజామున డబ్బు తీసుకుని బైక్‌పై నర్సరావుపేట బయలుదేరాడు. మార్గమధ్యంలో జూలకల్లు అడ్డరోడ్డు వద్ద రోడ్డు పక్కన కంకర చిప్స్ ఉండటంతో బైక్ అదుపు తప్పి పడిపోయాడు. తలకు బలమైన గాయం కాగా.. కొంతసేపటి వరకు ఎవరూ చూడకపోవడంతో చాలా రక్తం పోయింది. ఆ తరువాత ఓ వ్యక్తి గమనించి 108కు ఫోన్ చేయడంతో భార్యను ఆస్పత్రి తీసుకెళ్లిన అంబులెన్సే వచ్చి అతన్ని కూడా నర్సరావుపేటలో భార్య ఉన్న ఆస్పత్రికే తీసుకెళ్లింది. అప్పటికే రక్తం ఎక్కువగా పోవడంతో ఆస్పత్రికి వెళ్లిన కొద్దిసేపటికే ఆనంద్ మృతి చెందాడు. అదే ఆస్పత్రిలో ఉన్న భార్యకు సకాలంలో సరైన వైద్యం అందడంతో ఆమె ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన బిడ్డను కూడా చూసుకునే భాగ్యానికి నోచుకోని ఆనంద్ మృతి ఘటన బంధుమిత్రులను కలచి వేస్తోంది. ఇదిలా ఉంటే రామాంజనికి ఇది నాలుగో కాన్పు. ఇంతకుముందు ఇద్దరు అమ్మాయిలు.. ఒక అబ్బాయి ఉన్నారు. -
గణేష్ నిమజ్జనం ఊరేగింపులో విషాదం
సాక్షి, పల్నాడు జిల్లా: నగరాలు, పట్టణాలు అనే తేడా లేకుండా గణపతి నవరాత్రి ఉత్సవాలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఆలయాల్లో, వీధుల్లో, వ్యాపార సముదాయాల్లో, అపార్ట్మెంట్లలో వివిధ రూపాల్లో వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేసుకుని పూజలు నిర్వహిస్తున్నారు. మండపాల్లో గణనాధుడిని నిత్య అలంకరణలు చేస్తూ ఉదయం, సాయంత్రం పూజలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల గణేష్ నిమజ్జనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే కొన్ని చోట్ల నిమజ్జనం మహోత్సవంలో పలు అపశ్రుతి, అనుకోని సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా గణేష్ నిమజ్జనం ఊరేగింపులో కరెంట్ షాక్ తగిలి 13 ఏళ్ల బాలుడు మృతిచెందాడు. ఈ విషాదకర ఘటన నరసరావుపేటలో చోటుచేసుకుంది. సోమవారం వినాయకుడి ఊరేగింపు చూసేందుకు 13 ఏళ్ల బాలుడు వెళ్లాడు. కాగా ప్రమాదవశాత్తు కరెట్ షాక్ తగిలి బాలుడు కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు పిల్లాడిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. చదవండి: తిరుమల: ముగింపు దశకు బ్రహ్మోత్సవాలు.. వేడుకగా చక్రస్నానం -
టీడీపీ నేతల రౌడీయిజం.. పోలీసు వాహనాలు ధ్వంసం
సాక్షి, నరసరావుపేట: నరసరావుపేటలో టీడీపీ నేతలు రౌడీయిజం చెలాయించారు. సివిల్ వివాదంలో ఐపీ పెట్టిన వ్యక్తి ఇంటిని టీడీపీ నేతలు ఆక్రమించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలను అప్పు ఇచ్చిన మిగిలిన వ్యక్తులు నిలదీశారు. ఈ క్రమంలో అప్పులు ఇచ్చిన వ్యక్తులపై టీడీపీ నేతలు దాడికి తెగబడ్డారు. దీంతో, ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. అప్పు ఇచ్చిన వ్యక్తులపై టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అరవింద్ బాబు దాడి చేశారు. కాగా, ఈ క్రమంలో టీడీపీ నాయకులు పోలీసు వాహనాల అద్దాలను సైతం పగులగొట్టారు. ఇది కూడా చదవండి: విషాదం: ప్రియాంక ఆత్మహత్య -
మూడేళ్లుగా ఏపీ నంబర్ వన్.. ఇదీ మన ఘనత
సాక్షి, నరసరావుపేట: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందని, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు పూర్తిగా అనుకూల వాతావరణం ఉందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. పరిశ్రమలకు సింగిల్ విండోలోనే అనుమతులు ఇస్తున్నందున ప్రముఖ పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రంపై అత్యంత ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు. ఈ కారణంగా గత మూడేళ్లుగా మన రాష్ట్రం వరుసగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం వంకాయలపాడు వద్ద ఐటీసీ సంస్థ సుమారు రూ.200 కోట్లతో ఏర్పాటు చేసిన గ్లోబల్ స్పైసెస్ (సుగంధ ద్రవ్యాలు) ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. వేలాది మంది రైతులకు మేలు చేసేలా ఈ పరిశ్రమను ఏర్పాటు చేసిన ఐటీసీకి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘పరిశ్రమలు పెట్టే వాళ్ల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్న తర్వాతే మూడేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సంబంధించి మార్కులు ఇస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ వరుసగా మూడేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నంబర్ వన్ స్థానం దక్కించుకోవడం గొప్ప మార్పునకు నిదర్శనం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. రెండేళ్లలోనే పూర్తి ► దాదాపు రూ.200 కోట్ల పెట్టుబడితో ఐటీసీ గ్లోబల్ స్పైసెస్ ప్లాంట్ ప్రారంభమవ్వడం ఒక అద్భుత ఘట్టం. ఏటా 20 వేల మెట్రిక్ టన్నుల దాకా ప్రాసెస్ చేసి, ఇక్కడ నుంచి ఎగుమతి చేస్తారు. మిర్చితోపాటు అల్లం, పసుపు, ధనియాలు, యాలకులు వంటి 15 రకాల సేంద్రియ సుగంధ ద్రవ్యాలను ప్రాసెస్ చేస్తారు. ► ఈ ప్లాంట్ తొలి దశ పూర్తయింది. రెండో దశ కూడా మరో 15 నెలల్లో పూర్తవుతుందని చెబుతున్నారు. అది కూడా పూర్తయితే.. దేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే అతిపెద్ద సుగంధ ద్రవ్యాల ప్రాసెసింగ్ ప్లాంట్ మన రాష్ట్రంలోనే ఉంటుందని ఐటీసీ చైర్మన్ సంజీవ్ పూరి చెప్పారు. ► ఈ యూనిట్ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 1,500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న 14 వేల మంది రైతులకు ఇది ఒక గొప్ప వరం. వీరి ఉత్పత్తులకు గిరాకీ లభిస్తుంది. 2020 నవంబర్‌లో ఈ ప్లాంట్ నిర్మాణం ప్రారంభించారు. 2022 నవంబర్.. అంటే కేవలం 24 నెలల్లోనే నిర్మాణం పూర్తి చేశారు. ఇంత వేగంగా అడుగులు పడ్డాయంటే ఇందులో రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఏ మేరకు ఉందో అందరికీ తెలుస్తోంది. ఒక్క ఫోన్ కాల్ దూరంలో.. ► ఐటీసీ సంస్థ ఈ రాష్ట్రంలో ఇంకా మెరుగైన స్థితికి ఎదగాలని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి అన్ని రకాల మద్దతు ఇచ్చే విషయంలో ఎప్పుడూ వెనుకడుగు ఉండదని యాజమాన్యానికి చెబుతున్నా. ► ఎప్పుడు ఏ సమస్య వచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఉంటుందనే విషయాన్ని సంజీవ్ పూరి మనసులో పెట్టుకోవాలి. మీ కష్టాన్ని మా కష్టంగా భావించి.. సాధ్యమైనంత వేగంగా పరిష్కరిస్తాం. ఇది మా మాట. ఇంత మంచి ప్రాజెక్టు ఏర్పాటు చేసినందుకు మీకు మరొక్కసారి ధన్యవాదాలు. రూ.3,450 కోట్లతో పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ► రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఇంకా ఎక్కువ రావాలని ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించాం. 26 జిల్లాల్లో రైతులు స్థానికంగా పండించే పంటలన్నింటికీ ఇంకా మెరుగైన ధర రావాలి. వ్యాల్యూ ఎడిషన్ ద్వారా అది సాధ్యమవుతుందని 26 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను రూ.3,450 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ► తద్వారా ప్రతి జిల్లాలోని రైతులందరికీ మేలు చేయడమే కాకుండా, దాదాపు 33 వేల ఉద్యోగాలు కల్పించగలుగుతాం. ఇందులో ఫేజ్–1కు సంబంధించి రూ.1,250 కోట్ల పెట్టుబడితో 10 యూనిట్ల కోసం డిసెంబర్, జనవరిలో శంకుస్థాపన చేయనున్నాం. మరో రెండు మూడేళ్లలో మొత్తం 26 యూనిట్లు అందుబాటులోకి వస్తాయి. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకు ఇవి ఒక పెద్ద వరంగా మారనున్నాయి. ► ఈ కార్యక్రమంలో ఐటీసీ చైర్మన్ సంజీవ్‌పూరి, స్పైసెస్ బోర్డు సెక్రటరీ సతియాన్, రాష్ట్ర మంత్రులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు, విడదల రజని, అంబటి రాంబాబు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, పోతుల సునీత, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసుమహేష్‌రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరు శంకర్రావు, కిలారి రోశయ్య, జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీక్రిస్టినా, జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి, ఎస్పీ రవిశంకర్‌రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రైతుల ఉత్పత్తులకు వ్యాల్యూ ఎడిషన్ ► ఐటీసీ స్పైసెస్ ప్లాంట్‌కు సంబంధించిన వీళ్ల ప్రొసీజర్ పక్కాగా ఉంటుంది. సరుకు వచ్చిన వెంటనే క్లీనింగ్, గ్రేడింగ్, డీ స్టీమింగ్, గ్రైండింగ్, బ్లెండింగ్, స్టీమ్ స్టెరిలైజేషన్ చేశాక, ప్యాకింగ్ చేస్తారు. ఇలా ప్రాసెసింగ్ పూర్తి చేసుకోవడం వల్ల రైతులు పండించిన పంటకు వ్యాల్యూ ఎడిషన్ తోడవుతుంది. ► ఎక్స్పోర్ట్ మార్కెట్లో వీటి అమ్మకం కూడా సులభమవుతుందనే ఉద్దేశంతో ఈ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సహకరిస్తున్నాం. ఇటువంటి ప్రాసెసింగ్ యూనిట్లు మన రాష్ట్రంలో రావడం వల్ల మన రైతులకు కచ్చితంగా మేలు జరుగుతుంది. మన రైతుల ఉత్పత్తులకు మెరుగైన రేటు ఇచ్చి, మన రైతులను చేయిపట్టుకుని నడిపించే కార్యక్రమంలో ఐటీసీ ముందడుగు వేస్తోంది. ► ఇటువంటి గొప్ప మార్పులు వ్యవసాయ రంగంలో వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మన ప్రభుత్వం రాగానే ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాల స్థాపనతో ఇందుకు తొలి అడుగు పడింది. రాష్ట్రంలో దాదాపు 10,668 ఆర్బీకేలు ఏర్పాటు చేశాం. ప్రతి ఆర్బీకేలో అగ్రికల్చర్ గ్యాడ్యుయేషన్ చదివిన ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్‌ను నియమించాం. విత్తనం నుంచి విక్రయం వరకు రైతును చేయి పట్టుకుని నడిపించేలా గొప్ప విప్లవం సృష్టించాం. ప్రతి దశలో అండగా నిలిచిన ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్.. దేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే నంబర్ వన్. ఈ ప్లాంట్ తొలి దశ పూర్తయింది. రెండో దశ మరో 15 నెలల్లో పూర్తవుతుంది. అది కూడా పూర్తయితే, ఆసియా ఖండంలోనే అతిపెద్ద సుగంధ ద్రవ్యాల ప్రాసెసింగ్ ప్లాంట్ మన రాష్ట్రంలోనే ఉంటుంది. ఈ ప్లాంట్ ద్వారా 14 వేల మంది రైతులకు మేలు జరుగుతుంది. కేవలం రెండేళ్లలోనే ఈ ప్లాంట్‌ను ప్రారంభిస్తున్నాం. ఇంత వేగంగా అడుగులు పడటానికి కారణం ప్రతి దశలోనూ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అండగా నిలవడమే. – సంజీవ్‌పూరి, ఐటీసీ చైర్మన్ రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి ఐటీసీ చైర్మన్ సంజీవ్ పూరి గొప్పగా చెప్పారు. ఆయన నోటి వెంటæ ఈ మాటలు రావడం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి అధికారికి గొప్ప క్రెడిట్. ఈ మూడేళ్లలో మనందరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రముఖ పారిశ్రామిక వేత్తలు రాష్ట్రం వైపు చూస్తున్నారు. ఇక్కడ పరిశ్రమలు స్థాపించడానికి అనువైన వాతావరణం ఉందని అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇలా వచ్చే వారందరికీ అన్ని విధాలా సహకరిస్తున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మూడేళ్లుగా వరుసగా మొదటి స్థానంలో నిలిచామంటేనే మన చిత్తశుద్ధి ఏమిటో చేతల్లోనే తెలుస్తోంది. – సీఎం వైఎస్ జగన్ ఏపీలో ఆదర్శవంతమైన పాలన మా చిలకలూరిపేట నియోజకవర్గంలో ఈ యూనిట్‌ను ప్రారంభించడం శుభ పరిణామం. ఇందులో స్థానికులకు.. ప్రత్యేకించి 70 శాతం మహిళలకు అవకాశం ఇవ్వడం విశేషం. ఈ ప్రాంతానికి స్పైసెస్ పార్క్ రావడానికి కేంద్రాన్ని ఒప్పించి, సాధించిన ఘనత దివంగత నేత వైఎస్సార్‌దే. ఆయన అడుగుజాడల్లోనే జగనన్న రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక మంది ముందుకు వస్తుండడం శుభ పరిణామం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కావాల్సింది 40 ఏళ్ల అనుభవం కాదు. మంచి మనసు, పట్టుదల. ఇవి మా ముఖ్యమంత్రికి పుష్కలంగా ఉన్నాయి. రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ ఆదర్శవంతమైన పాలన సాగిస్తున్నారు. – విడదల రజిని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చదవండి: సీఎం జగన్ హామీ.. ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు -
మహిళ గాల్ బ్లాడర్‌లో 219 రాళ్లు
నరసరావుపేట (పల్నాడు జిల్లా): పట్టణంలోని మాతాశ్రీ హాస్పిటల్ వైద్యులు ఓ మహిళ పిత్తాశయం (గాల్ బ్లాడర్) నుంచి ఏకంగా 219 రాళ్లను వెలికితీశారు. హాస్పిటల్ డాక్టర్ పి.రామచంద్రారెడ్డి శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన 52 ఏళ్ల ఫాతిమా కడుపునొప్పితో తమను సంప్రదించిందన్నారు. హైప్రోస్కోపిక్ ద్వారా ఆమె పిత్తాశయంలో రాళ్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఆమెకు ఈ నెల 20న ఆపరేషన్ చేసి 219 రాళ్లను వెలికితీశామన్నారు. సాధారణంగా 20 రాళ్లు ఉంటేనే కఠినతరంగా భావిస్తామని, ఏకంగా ఓ మహిళ గాల్ బ్లాడర్ నుంచి ఇన్ని రాళ్లను వెలికితీయటం బహుశా ఇదే మొదటిసారి కావొచ్చని పేర్కొన్నారు. ఆపరేషన్ అనంతరం ఆ మహిళ సురక్షితంగా ఇంటికి వెళ్లారన్నారు. -
బస్తీమే సవాల్.. ఛాలెంజ్‌గా మారిన ట్రాఫిక్ నియంత్రణ
సాక్షి, గుంటూరు, తెనాలి, నరసరావుపేట: నగర/పట్టణాల్లో జనాభా నానాటికీ పెరుగుతోంది. జీవనం ఉరుకులు పరుగుల మయమవుతోంది. దీనికి అనుగుణంగా వాహనాల వినియోగమూ పెరుగుతోంది. ఫలితంగా ట్రాఫిక్ సమస్య తీవ్ర రూపం దాలుస్తోంది. వాహనాల రద్దీతో నిత్యం రోడ్లు కిటకిటలాడుతున్నాయి. రాకపోకల నియంత్రణ పోలీసులకు సవాల్‌గా మారుతోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో అయితే తలకు మించిన భారమే అవుతోంది. గుం‘టూరు కష్టమే’ గుంటూరు నగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. సమీపంలోని గ్రామాల నుంచి ప్రజలు వలస వస్తున్నారు. ఇప్పటికే శివారు ప్రాంతాలు చాలా వరకు నగరంలో కలిసిపోయాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం గుంటూరు నగర జనాభా 6.76 లక్షలు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 9 లక్షలకుపైగా ఉంటుందని అధికారుల అంచనా. నగరంలో మొత్తం అన్ని రకాల వాహనాలు కలిపి సుమారుగా 6,43,000 వరకు ఉంటాయని తెలుస్తోంది. దీంతో నగరంలో రద్దీ పెరిగింది. దీనికి తగ్గట్టు ప్రధాన రహదారుల విస్తరణ జరగకపోవడంతో నగరం ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకుపోతోంది. పార్కింగ్ సమస్య వేధిస్తోంది. పరిష్కారం దిశగా ప్రభుత్వం.. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రహదారుల విస్తరణ, వంతెనల నిర్మాణమే శరణ్యమని ప్రభుత్వం గుర్తించింది. శంకర్‌విలాస్ వద్ద బ్రిడ్జి విస్తరణ లేదా కొత్త వంతెన నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డులో ఉన్న గడ్డిపాడు రైల్వేగేట్, శ్యామలానగర్, నెహ్రూనగర్, సంజీవయ్య నగర్, సీతారామ్‌నగర్ రైల్వేగేట్ల వద్ద ఆర్వోబీ, ఆర్‌యూబీలు నిర్మించడంపైనా ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీనిలోభాగంగా ఆర్అండ్బీ, జీవీఎంసీ అధికారులు ఇటీవల పరిశీలన చేశారు. నందివెలుగు రోడ్డు రైల్వే వంతెన పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. పలు రోడ్ల విస్తరణకూ ప్రతిపాదనలు ఉన్నాయి. ఆంధ్రా ప్యారిస్‌లోనూ పాట్లు గుంటూరు జిల్లాలో ఏకైక స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ, ఆంధ్రా ప్యారిస్‌గా గుర్తింపు పొందిన తెనాలిలోనూ ట్రాఫిక్ పాట్లు తప్పడం లేదు. ఆక్రమణలతోపాటు రోడ్లపైనా వ్యాపారాల వల్ల ఈ సమస్య జఠిలమవుతోంది. తెనాలి పట్టణ జనాభా రెండు లక్షలకుపైగానే ఉంటుంది. అన్ని రకాల వాహనాలు కలిపి 1.10 లక్షల వరకు ఉంటాయని తెలుస్తోంది. సమీపంలోని వేమూరు, మంగళగిరి నియోజకవర్గాల నుంచి రోజూ 40 నుంచి 50 వేల మంది వరకు రాకపోకలు సాగిస్తుంటారు. పెరిగిన జనాభా, వాహనాలకు అనుగుణంగా పట్టణంలో రోడ్ల విస్తరణ జరగలేదు. పార్కింగ్ సమస్య కూడా వేధిస్తోంది. వీధివ్యాపారులకు ప్రత్యేక స్థలం, పార్కింగ్ జోన్ల కేటాయింపు కాగితాలకే పరిమితమైంది. పరిష్కారమార్గం ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రోడ్ల విస్తరణ, వంతెనల నిర్మాణమే మార్గం. గతంలో మార్కెట్ వంతెన వద్ద స్కైవాక్ బ్రిడ్జి నిర్మాణం కోసం అధికారులు సర్వే చేశారు. నెహ్రూ, బోస్, మెయిన్, బుర్రిపాలెం రోడ్లను విస్తరించాలి. మరో కొత్త వంతెన అవసరం ఉంది. కాలువ రోడ్లను విస్తరించే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఉంది. పేటలోనూ ‘నడక’యాతనే పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట పట్టణంలోనూ ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణ జనాభా 1.18 లక్షలు. ఇప్పుడు 1.50 లక్షల వరకు ఉంటుందని అధికారుల అంచనా. అన్ని రకాల వాహనాలు కలిపి 1,00,000 వరకు ఉంటాయని తెలుస్తోంది. చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచీ పట్టణానికి నిత్యం రాకపోకలు జరుగుతుంటాయి. దీంతో పట్టణంలోని రోడ్లు రద్దీగా ఉంటున్నాయి. ట్రాఫిక్ నియంత్రణ పోలీసులకు సవాల్‌గా మారుతోంది. పార్కింగ్ సమస్య వేధిస్తోంది. ట్రాఫిక్ సిగ్నల్స్ సరిగా పనిచేయడం లేదు. ఫ్లైఓవర్ మంజూరు చేసిన సీఎం వైఎస్ జగన్ నరసరావుపేటలో ప్రస్తుతం రెండు ఫ్లైఓవర్లు, ఒక అండర్‌గ్రౌండ్ బ్రిడ్జి ఉంది. జిల్లా కేంద్రమైనందున రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్ల నిర్మాణం ఆవశ్యకత అధికమైంది. దీంతో రెండు ఆర్‌యూబీలు, ఓ ఫ్లైఓవర్ మంజూరు చేయాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికీ తీసుకెళ్లారు. మల్లమ్మసెంటర్ నుంచి గడియారం స్తంభం సెంటర్‌వరకు ఫ్లైఓవర్ మంజూరు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు. లాల్‌బహుదూర్ కూరగాయల మార్కెట్ సెంటర్ వెనుకగా చిత్రాలయ థియేటర్ ఎదురుగా ఆర్యుబీ నిర్మాణానికి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకొచ్చారు. వీటితోపాటు రోడ్ల విస్తరణ పూర్తయితే ట్రాఫిక్ సమస్య తీరినట్టే. కిలోమీటర్ మేర బారులు గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. ఒక్కోసారి కిలోమీటర్ మేర వాహనాలు బారులు తీరుతుంటాయి. శ్యామలానగర్ రైల్వే గేట్ పడిందంటే అంతే సంగతులు. వెంటనే ఇక్కడ రైల్వే అండర్ బ్రిడ్జ్‌ను నిర్మించాలి. గడ్డిపాడు రైల్వే గేట్ వల్ల ట్రాఫిక్ ఆగిపోతోంది. ఇక్కడ ఆర్వోబీ నిర్మించాలి. – మాన్నిడి సుధమారుతిబాబు, నల్లపాడు, గుంటూరు పూర్తి స్థాయిలో దృష్టి సారించాం ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు నిత్యం చర్యలు తీసుకుంటున్నాం. వారం రోజుల క్రితం డీఐజీ, ఎస్పీ సమీక్ష చేశారు. ట్రిఫిక్ నియంత్రణపై దృష్టిసారించాం. పలు ప్రాంతాల్లో డివైడర్లు తొలగించాలని జీఎంసీకి ప్రతిపాదలు పంపాం. పార్కింగ్ జోన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. – వీవీ రమణకుమార్, డీఎస్పీ, గుంటూరు సిటీ ట్రాఫిక్ పరిష్కారానికి సమష్టిగా కృషి తెనాలి పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి సమష్టిగా కృషి చేస్తాం. దీనికి ప్రజల సహకారమూ అవసరం. ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసు శాఖ తరఫున అన్ని చర్యలూ చేపడుతున్నాం. ప్రధాన కూడళ్లలో వన్ వే, ఫ్రీ లెఫ్ట్ వంటివి ఏర్పాటు చేశాం. – జోగి శ్రీనివాస్, ట్రాఫిక్ ఎస్ఐ, తెనాలి రోడ్లు విస్తరించాలి నరసరావుపేటలో ట్రాఫిక్‌పై పోలీసులు దృష్టిపెట్టాలి. రోడ్లను విస్తరించాలి. వీధి వ్యాపారులకు ప్రత్యేక జోన్ కేటాయిస్తే మేలు. పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేయాలి. ఆటోవాలాలను నియంత్రించాలి. – గుదే రామయ్య, బరంపేట, నరసరావుపేట ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా మళ్లిస్తాం నరసరావుపేట పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు సమష్టిగా కృషి చేస్తున్నాం. ఔటర్ రింగ్‌రోడ్డును ఉపయోగించి ఇకపై వినుకొండ, పల్నాడు, చిలకలూరిపేట, సత్తెనపల్లి, గుంటూరు వైపు వెళ్లాల్సిన వాహనాలను మళ్లిస్తాం. దీనివల్ల పట్టణంలో రద్దీ తగ్గుతుంది. ట్రాఫిక్ సిగ్నల్స్, సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తాం. – సి.విజయభాస్కరరావు , డీఎస్పీ, నరసరావుపేట -
ద్వేషించేవాళ్లను ఏం అంటాం?: సీఎం జగన్
సాక్షి, నరసరావుపేట: ఏపీలో అవినీతిరహిత, పారదర్శకమైన పాలన అందిస్తున్నామన్న సీఎం వైఎస్ జగన్.. ప్రజాహితమైన ఈ పాలనను ద్వేషించేవాళ్లను ఏమనాలో అర్థం కావట్లేదన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన వలంటీర్ల సత్కార సభలో ఆయన ప్రతిపక్షాలపై, ఎల్లో మీడియాపై విమర్శలు, చమక్కులు సంధించారు. డిపాజిట్లు దక్కవనే భయం ఎల్లో పార్టీ, దాని అధినేత చంద్రబాబులో స్పష్టంగా కనిపిస్తోందని, అనుబంధంగా ఉన్న పార్టీలోనూ ఆ బాధ కనిపిస్తోందని అన్నారు సీఎం జగన్. ఎల్లో మీడియాలో సైతం ఆ బాధ, ఏడ్పు స్పష్టంగా చూపిస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వం దోచుకుని రాష్ట్రాన్ని అప్పుల పాలుజేసిందని గుర్తు చేస్తూ.. ఇప్పుడేమో వాళ్లు అబద్ధాలతో తమ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని సీఎం జగన్ అన్నారు. చదవండి: వలంటీర్ల మహా సైన్యానికి సెల్యూట్: సీఎం వైఎస్ జగన్ ప్రస్తుతం రాక్షసులతో, మారీచులతో యుద్ధం చేస్తున్నామన్న ఆయన.. దెయ్యాలు, రక్త పిశాచుల మాదిరి ప్రతిపక్షం-మద్ధతు పార్టీలు, అనుబంధ మీడియాలు వ్యవహరిస్తున్నాయన్నారు. ఢిల్లీ పర్యటనలో మోదీగారు జగన్‌కు క్లాస్ పీకారంటూ యెల్లో మీడియాలో కథనాలు వచ్చాయి.. యెల్లో మీడియాగానీ, దానికి అనుబంధం ఉన్నవాళ్లు ఎవరైనాగానీ ఆ టైంలో సోఫాల కిందగానీ దాక్కున్నారా? అంటూ చమత్కరించారు సీఎం జగన్. భవిష్యత్‌లో ఎవరూ ఓటు వేయరన్న భయమే వాళ్లతో అలాంటి పనులు చేయిస్తోందని అన్నారు. అసూయ మంచిది కాదని, దాని వల్ల నష్టమే తప్ప మంచి జరగదని హితవు పలికారు. ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోని దుర్మార్గులు ఇప్పుడు.. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్న ప్రభుత్వాన్ని విమర్శించడం చోద్యంగా ఉందన్నారు. మంచి పాలన అందిస్తుంటే మరో శ్రీ లంక అవుతుందని కామెంట్లు చేస్తున్నారని, మరి వాళ్లలా వెన్నుపోట్లు పొడిస్తే అమెరికా అవుతుందా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం కన్నా కనివినీ ఎరుగని రేంజ్లో సేవ అందిస్తున్నామని, నచ్చితే అభిమానించడని, నచ్చకపోతే తనను ద్వేషించడన్న సీఎం జగన్.. ఎల్లో పార్టీ, అనుబంధ ఎల్లో మీడియా, చంద్రబాబు, ఆయన దత్తపుత్రులు చెప్పే మాటల్ని మాత్రం నమ్మనే నమ్మొద్దంటూ ప్రజలను కోరారు సీఎం వైఎస్ జగన్. -
అదృశ్యమైన నాగరాజు దారుణహత్య
నరసరావుపేట రూరల్: ఇటీవల అదృశ్యమైన మాచర్ల నియోజకవర్గానికి చెందిన బీసీ సంఘాల నాయకుడు కంచర్ల నాగరాజును పట్టణ సమీపంలోని పెదతురకపాలెం రోడ్డు గ్రావెల్ గుంటలలో దారుణంగా హతమార్చి దహనం చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. వెల్దుర్తి మండలం గంగలకుంట గ్రామానికి చెందిన నాగరాజు ఈ నెల 20వ తేదీ నుంచి కనిపించటం లేదు. దీంతో కుటుంబసభ్యులు 21వ తేదీన వెల్దుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు మృతుడి సెల్‌ఫోన్ డేటా ఆధారంగా చివరి లోకేషన్ నరసరావుపేట, పరిసర ప్రాంతాలుగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో పోలీసులతో పాటు కుటుంబసభ్యులు సైతం నాగరాజు ఆచూకీ కోసం వెతుకులాట ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కాలిపోయిన మృతదేహన్ని పెదతురకపాలెం రోడ్డులో కుటుంబసభ్యులు కనుగొని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మాచర్ల రూరల్ సీఐ భక్తవత్సలరెడ్డి, వెల్దుర్తి ఎస్ఐ సుధీర్‌కుమార్, దుర్గి ఎస్ఐ రామాంజనేయులు తమ సిబ్బందితో అక్కడికి చేరుకుని రూరల్ పోలీసుల సహకారం తీసుకున్నారు. మృతదేహం వద్ద లభించిన ఆధారాలను బట్టి మృతుడు నాగరాజే అని అతని కుటుంబసభ్యులు నిర్దారించడంతో పోలీసులు ఘటనా స్థలంలోనే శవపంచనామా, పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా మాచర్ల సీఐ భక్తవత్సలరెడ్డి మాట్లాడుతూ నాగరాజుకు తురకపాలెంకు చెందిన ముస్లిం యువతితో ప్రేమ వివాహం అయిందని చెప్పారు. 2013 లో వివాహం అయిన మూడు నెలలకే ఆ యువతి మృతి చెందిందని తెలిపారు. ఆ కేసు 2017 వరకు కొనసాగిందన్నారు. ఈ నేపథ్యంలో నాగరాజు మృతదేహం ఇక్కడ లభించడంతో యువతి కుటుంబసభ్యులకు ఈ కేసుతో సంబంధం ఉందనే అనుమానం ఉందన్నారు. సమగ్ర దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. ప్రణాళిక ప్రకారమే హత్య... వెల్దుర్తి: హత్య చేసేందుకు ముందే ప్రణాళిక చేసుకొని మధ్యవర్తిగా ఉన్న ఓ ఉపాధ్యాయురాలి ద్వారా నాగరాజును ఫంక్షన్ అని చెప్పి పిలిపించారని సమాచారం. ఫంక్షన్‌కు వెళ్లే సమయంలో వారు వెంబడించి పట్టుకొని అతనిని తీసుకెళ్లి హత్య చేశారని తెలిసింది. ఆనవాళ్లు కనబడకుండా నాగరాజు సెల్‌ను ఆ రహదారిలో వెళ్తున్న లారీలో విసిరివేశారు. కాగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు, బీసీ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో రాయవరం జంక్షన్ నుంచి నాగరాజు అంతిమయాత్రను నిర్వహించారు. బైక్‌ను కారు ఢీకొని మహిళ దుర్మరణం పెదకాకాని: జాతీయ రహదారిపై వెళుతున్న బైక్‌ను వెనుక నుంచి కారు ఢీ కొన్న ఘటనలో మహిళ దుర్మరణం చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పెదకాకాని సమీపంలో బుధవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చేబ్రోలు కొత్త రెడ్డిపాలెంకు చెందిన గుంటూరు ప్రసాద్ నంబూరు అత్తగారింటికి వచ్చాడు. భార్య నిర్మల ఇద్దరు పిల్లలతో కలసి తిరిగి ఇంటికి బయలు దేరాడు. వారు ప్రయాణిస్తున్న బైక్ జాతీయ రహదారిపై పెదకాకాని డక్కన్ టుబాకో కంపెనీ సమీపంలోకి చేరుకునే సరికి వెనుక నుంచి అతివేగంగా అజాగ్రత్తగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో హైవేలో బైక్‌పై వస్తున్న నలుగురు గ్రిల్స్ (రెయిలింగ్) దాటి సర్వీసు రోడ్డులో పడ్డారు. ప్రసాద్, భార్య నిర్మల ఇద్దరు పిల్లలకు తీవ్రగాయాలయ్యాయి. జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ నిర్మల (45) మృతి చెందింది. వారిలో కుమార్తె పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఘటనా స్థలానికి పెదకాకాని సీఐ సిబ్బందితో చేరుకుని బాధితులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రసాద్ చేబ్రోలు మండలం ప్రజాశక్తి విలేకరిగా పనిచేస్తున్నాడు. బైక్‌ను ఢీ కొన్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొంది. ప్రమాద సమయంలో కారులో బెలూన్లు ఓపెన్ కావడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడి నుంచి పరారీ అయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
కోడెల మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు మంగళవారం నర్సరావుపేటలో జరగనున్నాయి. మరోవైపు కోడెల మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం పూర్తియింది. ఇద్దరు ప్రొఫెసర్లు, ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్‌మార్టం నిర్వహించగా, ఈ ప్రక్రియను పోలీసులు వీడియో రికార్డు చేశారు. అలాగే కోడెల మృతదేహాన్ని ఫోరెన్సిక్ బృందం పరిశీలించగా, ఆయన చెవుల దగ్గర నుంచి గొంతు మీదగా ఉరి వేసుకున్నట్లు గుర్తులు ఉన్నట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ భవన్‌కు కోడెల భౌతికకాయం పోస్ట్‌మార్టం అనంతరం భౌతికకాయాన్ని పార్టీ నేతలు, కార్యకర్తల సందర్శనార్థం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు తరలించారు. టీడీపీ నేతలు ట్రస్ట్ భవన్ చేరుకుని, కోడెలకు నివాళులు అర్పిస్తున్నారు. ఇవాళ రాత్రి అక్కడే ఉంచి, రేపు (మంగళవారం) ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్‌లో కోడెల పార్దీవదేహంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకష్ రోడ్డు మార్గంలో బయల్దేరనున్నారు. సూర్యాపేట, విజయవాడ మీదగా మధ్యాహ్నం గుంటూరులోని టీడీపీ పార్టీ కార్యాలయంలో సందర్శకుల కోసం కొద్దిసేపు ఉంచి, అనంతరం నర్సరావుపేట తీసుకు వెళతారు. మరోవైపు కోడెల అనుమానాస్పద మృతిపై బంజారాహిల్స్ ఏపీసీ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు అయింది. సిట్ బృందం కోడెల నివాసంలో తనిఖీలు నిర్వహించి, ప్రత్యక్ష సాక్షులు, సెక్యూరిటీ, డ్రైవర్‌ను ప్రశ్నించారు. క్లూస్ టీమ్ కూడా పలు ఆధారాలను సేకరించింది. చదవండి: శివరామే తండ్రిని హత్య చేశాడని ఫిర్యాదు కోడెల మృతితో షాక్‌కు గురయ్యాను... కోడెల మరణం: క్షణక్షణం అనేక వార్తలు! కోడెల మెడపై గాట్లు ఉన్నాయి కాబట్టి: సోమిరెడ్డి కోడెల మృతిపై అనేక సందేహాలు: అంబటి కోడెల మృతిపై కేసు నమోదు కోడెల కొడుకు ఆస్పత్రికి ఎందుకు రాలేదు? కోడెలది ఆత్మహత్యా? సహజ మరణమా? సుదీర్ఘ రాజకీయ జీవితం.. అనూహ్య విషాదం! కోడెల శివప్రసాదరావు కన్నుమూత -
వైఎస్సార్సీపీలో చేరిన డాక్టర్ అశ్వినీకాంత్
నరసరావుపేట రూరల్/సాక్షి, హైదరాబాద్: పోలింగ్ తేదీ సమీపిస్తున్న తరుణంలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరికల పరంపర కొనసాగుతూనే ఉంది. శుక్రవారం గుంటూరు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవిందబాబు మేనల్లుడు, ప్రముఖ వైద్యుడు డాక్టర్ అశ్వినీకాంత్, ఆయన సతీమణి డాక్టర్ వీరవల్లి రమ్య వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. జనసేనలో క్రియాశీలంగా పనిచేస్తున్న విశాఖపట్టణానికి చెందిన వేర్‌హౌజింగ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ గుంటూరు వెంకట నరసింహారావు, ఆయన సతీమణి భారతి, అనుచరులు హైదరాబాద్‌లో వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. (చదవండి: వైఎస్సార్సీపీలో చేరిన పార్థసారధి రెడ్డి) -
నరసరావు పేటలో అధికారపార్టీనేతల అగడాలు
-
టీడీపీ నేత విజయకుమార్ అరెస్టు
సాక్షి, నరసరావుపేట టౌన్: సంచలనం సృష్టించిన కిడ్నీరాకెట్ కేసులో నరసరావుపేటకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, టీడీపీ నేత కపలవాయి విజయకుమార్‌ను నరసరావుపేట వన్‌టౌన్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం గుంటూరు చంద్రమౌళీనగర్‌కు చెందిన చిగురుపాటి నాగేశ్వరరావు కిడ్నీ వ్యాధితో బాధపడుతూ 2017లో గుంటూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చేరాడు. కిడ్నీ మార్పిడికి దాతను చూసుకోవాలని వైద్యులు సూచించడంతో దుర్గి మండలం ముటుకూరు గ్రామానికి చెందిన ముఢావత్ వెంకటేశ్వర్లు నాయక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. నరసరావుపేటకి చెందిన రావూరి రవి అనే వ్యక్తి ఆధార్‌కార్డుపై వెంకటేశ్వర్లు నాయక్ ఫొటోను మార్ఫింగ్ చేసి గతేడాది అక్టోబరు నెలలో నరసరావుపేట రెవెన్యూ అధికారుల వద్ద అనుమతులు పొందారు. పోలీసుల అనుమతి కోసం వెళ్లగా బార్‌కోడింగ్ ఆధారంగా నకిలీ ఆధార్‌కార్డుగా గుర్తించి రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన అప్పటి తహసీల్దార్ సీహెచ్ విజయజ్యోతికుమారి 2017 నవంబరు 20వ తేదీన వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఛీటింగ్ కేసు నమోదు చేశారు. అనంతరం కిడ్నీ మార్పిడి అనుమతులకు కపలవాయి విజయకుమార్ సిఫారసు చేశాడని తహసీల్దార్ పోలీసులకు వాంగ్మూలం ఇవ్వటంతో విజయకుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పాటు విచారణలో ముడావత్ వెంకటేశ్వర్లునాయక్ తనను బెదిరించి కిడ్నీ మార్పిడికి ఒప్పించారని తెలపడంతో కేసును అట్రాసిటీ కేసుగా మార్పు చేశారు. ఈ కేసులో ఇప్పటికే 8 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. తొమ్మిదో నిందితుడయిన విజయకుమార్‌ను శుక్రవారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చారు. న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో సబ్‌జైలుకు తరలించారు. ఆరోగ్యపరిస్థితి బాగోలేదని జైలు అధికారులకు తెలపడంతో వైద్య పరీక్షలకోసం ఏరియా వైద్యశాలకు తరలించారు. బంగారం, వెండి వర్తకసంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న కపలవాయి విజయకుమార్ నరసరావుపేట పట్టణంలో తెలుగుదేశం పార్టీలో ద్వితీయ శ్రేణి నేతగా చలామణి అవుతున్నారు. ఆయన అరెస్టును నిరసిస్తూ పట్టణంలోని బంగారం వ్యాపారులంతా దుకాణాలను మూసివేసి సంఘీభావం తెలిపారు. -
ట్రాక్టర్ కిందపడి యువకుడి మృతి
దుగ్గొండి(నర్సంపేట) : ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి యువకుడు మృతి చెందిన సంఘటన వరంగల్‌రూరల్ జిల్లా దుగ్గొండి మండలం మహ్మదాపురం గ్రామ సమీపంలో శనివారం సాయంత్రం జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన పాశికంటి మహేందర్, రమ దంపతుల కుమారుడు పాశికంటి రాకేష్ (22) అనస్తిషియా డిప్లొమా పూర్తి చేశాడు. అనంతరం గత సంవత్సర కాలంగా హన్మకొండలోని మాక్స్‌కేర్ ఆస్పత్రిలో అనస్తిషియా అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇదే క్రమంలో విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతుండగా తిమ్మంపేట గ్రామం వట్టెంచెరువు కట్ట క్రాస్ తిరుగుతుండగా మహ్మదాపురం నుంచి తిమ్మంపేట వైపుకు ట్రాక్టర్ ఎదురుగా వస్తుండటంతో సడన్ బ్రేక్ వేశాడు. దీంతో అదుపుతప్పి రోడ్డుపై పడ్డాడు. ఇదే క్రమంలో వేగంగా వస్తున్న ట్రాక్టర్ రాకేష్ పైనుంచి వెళ్లింది. దీంతో రాజేష్‌కు తీవ్ర గాయాలు కాగా స్థానికులు గమనించి వరంగల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.విషయం తెలుసుకున్న ఎస్సై భాస్కర్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పది రోజుల క్రితమే కూతురు.. పాశికంటి మహేందర్, రమ దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు. అయితే ఇటీవల 10 రోజుల క్రితం గర్భవతిగా ఉన్న కూతురు అనూషకు అధిక రక్తస్రావం కావడంతో చికిత్స చేయించినా ఫలితం లేక మృతి చెందింది. దశదిన కర్మ పూర్తి అయిన వెంటనే కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ దంపతులకు తీరని శోకాన్ని మిగిల్చింది. కన్న పేగులను పొగొట్టుకున్న వారి రోదనలు కంటతడి పెట్టించాయి. మహ్మదాపురం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య
నర్సంపేటరూరల్ : ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన నర్సంపేట పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... పట్టణంలోని బజ్జు భద్రయ్య కుమారుడు కిషన్‌కు పాలకుర్తికి చెందిన బొగ్గరావు శ్రీనివాస్ కుమార్తె స్వాతి (27)తో గత 8 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి పాప కూడా ఉంది. కిషన్ పట్టణంలో ఓ బుక్‌స్టోర్ షాపును నడిపిస్తున్నాడు. స్వాతి చెన్నారావుపేట మండలంలోని ముగ్దుంపురం శివారులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తుంది. ఉదయం పాపను స్కూల్‌కు పంపించి వచ్చి కిషన్ షాపుకు వెళ్లాడు. తిరి మధ్యాహ్నం ఇంట్లోకి వెళ్లి చూసే సరికి ఉరి వేసుకుని కనిపించింది. దీంతో చుట్టు పక్కల వారి సాయంతో 108లో నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లుగా ధ్రువీకరించారు. దీనిపై స్థానిక పోలీసులను వివరణ కోరగా ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. -
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయం
చెన్నారావుపేట(నర్సంపేట) : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయమని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. మండలంలోని బాపునగర్ గ్రామానికి చెందిన భాస్కర్, రాజేందర్, రాజు, హరిలాల్, మొగిలితో పాటు 50 మంది ఎమ్మెల్యే సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాటలు చెప్పడం కంటే చేసి మాట్లాడటమే తన తత్వం అన్నారు. ప్రజల కోసమే పనిచేస్తున్నానని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతానని చెప్పారు. ఎంపీపీ జక్క అశోక్, జెడ్పీటీసీ జున్నూతుల రాంరెడ్డి, మాజీ సర్పంచ్ రాంచంద్రు, లింగం, రవి, మంగీలాల్, హతిరాం, బాలు, హనుమ, నవీన్, రవి, శ్రీను గోపాల్ ఉన్నారు. -
120వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
సాక్షి, గుంటూరు: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 120వ రోజు షెడ్యూల్ ఖరారైంది. ఆదివారం ఉదయం ఆయన గుంటూరు జిల్లా నరసరావుపేట నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి బరంపేట, బీసీ కాలనీ, ఇసాప్పపాలెం, ములకలూరు వరకు సాగుతోంది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం 2.45 గంటలకు పాదయాత్ర పున ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి గొల్లపాడు, ముప్పళ్ల వరకు పాదయాత్ర సాగుతుంది. 119వ రోజు ముగిసిన పాదయాత్ర 119వ రోజు ప్రజాసంకల్పయాత్ర ముగిసింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నర్సరావుపేటలో పాదయాత్రను ముగించారు. ఆయన ఇవాళ (శనివారం) 14 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. కోమటినేనివారి పాలెం, గంగన్నపాలెం, ఇర్లపాడు, అమీన్ సాహెబ్ పాలెం, బసికాపురం, కెసానుపల్లి మీదగా నర్సరావుపేట వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగింది. ఇప్పటివరకూ వైఎస్ జగన్ 1586.2 కిలోమీటర్లు నడిచారు. -
అనగనగ ఒక దొంగ.. జగన్ చెప్పిన పిట్టకథ!
సాక్షి, నర్సారావుపేట : ‘అనగనగనగా.. ఒక దొంగ ఉన్నాడు. అతను దొంగతనానికి వెళ్లి.. అడ్డగోలుగా తప్పుడు పనులు చేస్తూ.. అడ్డంగా దొరికిపోయాడు. దీంతో ప్రజలు, వ్యవస్థలు ఆ దొంగను ప్రశ్నించాయి. దానికి ఆ దొంగ.. ‘నన్ను అరెస్టు చేస్తే..పోయేది మన ఊరి పరువే’నని అన్నాడట. అంతేకాదు.. ‘నన్ను అరెస్టుచేస్తే.. మన ఊరిని, మన ప్రజల్ని బలహీన పర్చినట్టు అవుతుందని’ అని చెప్పాడట. ఈ మాటలు వింటే అచ్చం చంద్రబాబు మాటలు వింటున్నట్టు గుర్తుకు రావడం లేదు. తనను బలహీనపరిస్తే.. రాష్ట్రాన్ని బలహీనపర్చినట్టు అంటూ చంద్రబాబు బుకాయిస్తున్నారు. తనను బలహీన పరిస్తే.. తెలుగు ప్రజలను బలహీనపర్చినట్టు ఆయన చెప్పుకొస్తున్నారు. తప్పు చేసినా చంద్రబాబును ఎవరూ దండించకూడదంటూ ఇంత అన్యాయమైన మాటలు మాట్లాడుతున్నారు’ అంటూ చంద్రబాబు నిజస్వరూపాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎండగట్టారు. తప్పులు, మోసాలు, అన్యాయాలు, అవినీతి నిస్సిగ్గుగా చేస్తున్న చంద్రబాబు.. తనను బలహీనపరిస్తే.. రాష్ట్రం బలహీనపడినట్టు బూటకపు మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ‘ఈ మాదిరిగా తప్పులు, మోసాలు, అన్యాయాలు, అవినీతి చేయమని ఏ ప్రజలు చెప్పారు నీకు చంద్రబాబూ’ అని ఆయన నిలదీశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. అయ్యా చంద్రబాబూ.. ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టుమని ఏ ప్రజలు చెప్పారు నీకు? హోదాకు బదులు అబద్ధపు, మోసపు ప్యాకేజీ తీసుకోవాలని ఏ ప్రజలు చెప్పారు నీకు? తెలుగువారిని ఆత్మగౌరవాన్ని అమ్మేయమని చెప్పి.. ఏ ప్రజలు చెప్పారు నీకు? అయ్యా చంద్రబాబూ.. ఓట్లకోసం, పదవుల కోసం అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి.. అడ్డంగా దొరికిపోమ్మని ఏ ప్రజలు చెప్పారు నీకు? రైతుల్ని పీడించి.. వారి భూముల్ని లాక్కోమని ఏ ప్రజలు చెప్పారు నీకు? అయ్యా చంద్రబాబూ.. కేంద్రం కట్టాల్సిన పోలవరం ప్రాజెక్టును కమీషన్ల కోసం మీ చేతుల్లోకి తీసుకోమ్మని ఏ ప్రజలు చెప్పారు ? ఇరిగేషన్ ప్రాజక్టుల్టలో అంచనాలు పెంచి అడ్డంగా దోచుకోమ్మని ఏ ప్రజలు చెప్పారు నీకు? అయ్యా చంద్రబాబూ.. ఇసుక నుంచి మట్టి దాక మట్టి నుంచి బొగ్గు దాకా.. మద్యం, రాజధాని భూములు, గుడిభూముల దాక మేయమని ఏ ప్రజలు చెప్పారు నీకు? 23మంది ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిని 20 కోట్లు, 30 కోట్లు అడ్డగోలుగా ఇస్తూ.. సంతలో పశువులను కొన్నట్టు కొనమని ఏ ప్రజలు చెప్పారు నీకు? అయ్యా చంద్రబాబూ.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించవద్దని చెప్పి ఏ ప్రజలు చెప్పారు నీకు? రుణమాఫీ పేరుతో రైతుల్ని, మహిళల్ని మోసం చేయమని ఏ ప్రజలు చెప్పారు నీకు? ఎన్నికల సమయంలో జాబు రావాలంటే బాబు రావాలని చెప్పి.. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి.. ఆ తర్వాత మోసం చేయమని ఏ ప్రజలు చెప్పారు నీకు? ఫీజు రీయింబర్స్‌మెట్, ఆరోగ్యశ్రీ పథకాలను నీరుగార్చమని ఏ ప్రజలు చెప్పారు నీకు? ఎన్నికలప్పుడు బెల్టూ షాపులు తీసేస్తామని చెప్పి.. ఇప్పుడు మద్యం ఏరులై పారించమని ఏ ప్రజలు చెప్పారు నీకు? ఎవరు చెప్పారని చంద్రబాబు ఇవన్నీ చేశారు తన స్వార్థప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని బాబు తాకట్టు పెట్టారు ఇలాంటి వ్యక్తిని మనం క్షమించకూడదు అబద్ధాలు, మోసం చేసేవారని బంగాళాఖాతంలో కలిపేయాలి అప్పుడే చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత వస్తుంది విశ్వసనీయత రావాలంటే జగన్ ఒక్కడి వల్లే కాదు జగన్‌కు మీ అందరి తోడు కావాలి, ఆశీస్సులు కావాలి అప్పుడు మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాసంక్షేమం కోసం నవరత్నాలను తీసుకొస్తాం నవరత్నాలతో అందరి జీవితాల్లో సంతోషాన్నినింపుతాం ప్రతి పేదవాడు ఉన్నత చదువులు చదవాలి ఇంజినీరింగ్ చదవాలంటే లక్షలు లక్షలు ఫీజులు ఉన్నాయి. ఉన్నత చదువులు చదివే పిల్లలకు పూర్తి ఫీజులు చెల్లిస్తాం. విద్యార్థుల ఖర్చుల కోసం ఏటా రూ. 20వేల చొప్పున అందజేస్తాం. బడికి వెళ్లే పిల్లలకు ఏటా రూ. 15వేలు ఇస్తాం -
కాకితో కబురు చేస్తే కాసు మహేశ్ వస్తాడు..
సాక్షి, గుంటూరు : ధృడమైన నాయకత్వం ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని, అది వైఎస్ ఒక్క జగనన్నతోనే సాధ్యమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కాసు మహేశ్ రెడ్డి అన్నారు. వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రలో శనివారం నర్సరావుపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ‘నర్సరావుపేట ప్రస్తుతం లంచాలపేటగా మారిపోయింది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నర్సరావుపేటలో అభివృద్ధి జరిగింది. ఆయన మరణాంతరం టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్, ఆయన కుమారుడు, కుమార్తె, వారి అనుచరులు కలిసి నర్సరావుపేటను అవినీతిమయం చేశారు. చేతకాని టీడీపీ దద్దమ్మ ప్రభుత్వం పోయి, మంచి ప్రభుత్వం రావాలి. ఈ ప్రాంతంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు అరికట్టి వైఎస్ జగన్‌ను సీఎం చేయాలన్న ఆరాటం అందరిలో ఉంది. వైఎస్ జగన్ సీఎం అయితేనే అభివృద్ధి సాధ్యం. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నర్సరావుపేట రూపురేఖలు మార్చుతామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. కాసు మహేష్ రెడ్డి ఇక్కడ ఉండడు అంటూ... కొందరు టీడీపీ నేతలు పుకార్లు రేపుతున్నారు. వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై ఈగ వాలినా ...కాకితో కబురు చేస్తే కాసు మహేష్ రెడ్డి వస్తాడు. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు, వాటిని ఎవరూ నమ్మొద్దు. పార్టీ అభివృద్ధికి అందరం కలిసి పని చేస్తాం.’ అని స్పష్టం చేశారు. -
హోటల్ గదిలో యువకుడు ఆత్మహత్య
సాక్షి, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరులో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మోతుకూరి సాయి వెంకట వంశీ కృష్ణ అనే యువకుడు స్థానిక సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో సీఎస్ఈ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇక్కడి ఓ హోటల్ గదిలో ఆదివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన హోటల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. త్రీ టౌన్ పోలీసులు హోటల్‌కు చేరుకుని మృతుడి వివరాలు సేకరిస్తున్నారు. మృతుడిని గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందినవాడిగా గుర్తించారు. -
అందుబాటులో లేని ‘పేట’ ఆర్డీవో, ఎమ్మార్వో
సాక్షి, గుంటూరు: నరసరావుపేట కిడ్నీ రాకెట్ వ్యవహారంపై విజిలెన్స్ విచారణ మంగళవారం ప్రారంభమైంది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కిడ్నీ మార్పిడికి సంబంధించిన రికార్టులను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై నరసరావుపేట ఎమ్మార్వో, ఆర్డీవోలను విచారించేందుకు విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ శోభామంజరి, అధికారులు వారి కార్యాలయాలకు వెళ్లారు. అయితే ఆయా కార్యాలయాల్లో ఆ అధికారులు లేకపోవడంతో గుంటూరు తిరిగి వచ్చారు. -
కిడ్నీ రాకెట్లో కొత్త కోణం
సాక్షి, గుంటూరు : నరసరావుపేట పట్టణంలో వెలుగు చూసిన కిడ్నీ రాకెట్లో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. కిడ్నీ మార్పిడికి రిఫర్ చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వేదాంత ఆసుపత్రి ఎండీ రామకృష్ణ శనివారం సంచలన విషయాలను వెల్లడించారు. పేషెంట్ శివ నాగేశ్వర్రావు కుటుంబం తమను మోసం చేసిందని, కిడ్నీ దానం చేసే రావూరి రవి కుమార్ స్ధానంలో వెంకటేశ్వర నాయక్‌ను తీసుకొచ్చారని చెప్పారు. వ్యక్తిని మార్చి ఆసుపత్రిని మోసగించారని ఆరోపించారు. నకిలీ ఆధార్ కార్డు పెట్టడంతో విచారణలో వెంకటేశ్వర నాయక్ దొరికాడని తెలిపారు. నాయక్ దొరకడంతో దేవరగట్టు గోపి అనే కొత్త వ్యక్తిని తెరపైకి తెచ్చారని అన్నారు. కిడ్నీ మార్పిడికి గుంటూరు ఎమ్మార్వో మూడు నెలల సమయాన్ని ఎలా ఇచ్చారో తనకు అర్థం కావడం లేదన్నారు. ఆసుపత్రికి గోపి అందించిన అడ్రస్ కూడా తప్పని తేలినట్లు చెప్పారు. తెలుగుదేశం నేత కపిలవాయి విజయకుమార్‌కు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. నరసరావుపేటలో సినిమా థియేటర్ నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. అయితే, థియేటర్ నిర్మాణానికి అనుమతి ఇచ్చేందుకు ఎమ్మార్వో విజయ జ్యోతి కుమారి లంచం డిమాండ్ చేశారని వెల్లడించారు. డబ్బు ఇవ్వనందుకే వేదాంత ఆసుపత్రిపై ఆమె ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. పేషంట్ శివనాగేశ్వరావు, వెంకటేశ్వరనాయక్, గోపిల మధ్య ఎలాంటి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయో ఆసుపత్రి యజమాన్యానికి తెలియదని చెప్పారు. కిడ్నీ రాకెట్‌పై పూర్తి విచారణ చేస్తేనే నిజనిజాలు బయటకు వస్తాయని అన్నారు. -
స్పీకర్ కోడెల తనయుడిపై కేసు నమోదు
గుంటూరు : నర్సరావుపేటలో కేబుల్ వైర్ల కత్తిరింపు వ్యవహారంలో ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు శివరామ్‌పై పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. నరసరావుపేటకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువనేత నల్లపాటి రామచంద్రప్రసాద్ నిర్వహిస్తున్న ఎన్సీవీ(నల్లపాటి కేబుల్ విజన్) కార్యాలయంపై టీడీపీ వర్గీయులు గతంలో దాడిచేశారు. పోలీసుల సమక్షంలోనే వైర్లు కత్తిరించి ప్రసారాలను నిలిపివేశారు. అప్పట్లోనే కోడెల తనయుడు శివరామ్‌పై బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆదేశాలతో శివరామ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కన్నకూతురిపై లైంగికదాడి
నరసరావుపేట టౌన్: పాము తన గుడ్లను తానే మింగేసినట్లు.. తల్లి లేని పిల్లను అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన ఆ తండ్రే కాలకూట విషాన్ని చిమ్మి ఆమె జీవితాన్ని చిదిమేశాడు. అభం శుభం తెలియని కన్నపేగుపై లైంగిక దాడికి పాల్పడి సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించాడు. వివరాల్లోకెళితే.... నరసరావుపేట బాపనయ్యనగర్‌కు చెందిన షేక్ బాపనపల్లి జాన్‌బాబుకు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె పట్టణంలోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతుండగా, 16 ఏళ్ల చిన్నకుమార్తె ఇంట్లో ఉంటుంది. జాన్‌బాబు భార్య అల్లాబి ఏడాది క్రితం అనారోగ్యంతో మృతిచెందింది. అప్పటి నుంచి కుమార్తెలను మానసికంగా జాన్‌బాబు వేధిస్తున్నాడు. గతేడాది నవంబర్ 14న చిన్నకుమార్తెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దంటూ బెదిరింపులకు దిగాడు. పెద్దకుమార్తె పట్ల కూడా అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వచ్చాడు. నెల రోజుల క్రితం ఇన్సూరెన్స్ బాండులో నామినీగా తమ పేర్లు పెడతానని నమ్మించి ఆస్తి డాక్యుమెంట్లపై కుమార్తెలచే సంతకాలు చేయించుకున్నాడు. ఈ నెల 14న రెండోసారి చిన్నకుమార్తెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. కళాశాల నుంచి ఇంటికొచ్చిన పెద్దకుమార్తె గమనించి అడగ్గా.. జరిగిన విషయాన్ని తెలిపింది. దీంతో వారిద్దరూ గుంటూరు రోడ్డులో నివాసం ఉంటున్న అమ్మమ్మ, తాతయ్యల వద్దకు చేరుకొని ప్రస్తుతం అక్కడే ఉంటున్నారు. జైభారత్ స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర మహిళా వేదిక అధ్యక్షురాలు విజయలక్ష్మిని ఆశ్రయించి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. దీంతో ఆమె బాధితురాళ్లను వెంటబెట్టకొని శుక్రవారం వన్‌టౌన్ ఎస్ఐ సాంబశివరావును కలిసి జరిగిన సంఘటనలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు వెంటనే జాన్‌బాబును అదుపులోకి తీసుకునేందుకు అక్కడికి వెళ్లగా ఇంటికి తాళం వేసి ఉంది. కోటప్పకొండ రోడ్డులోని దాల్‌మిల్లులో డ్రైవర్‌గా పనిచేస్తుంటాడని తెలుసుకొని అక్కడికి వెళ్లినా లేకపోవడంతో వెనుతిరిగారు. బాధితురాలి సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సాంబశివరావు తెలిపారు. -
'వైఎస్ఆర్ పథకాల అమలే వైఎస్ఆర్సీపీ ధ్యేయం'
గుంటూరు: నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని నరసరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్ధి అయోధ్య రామిరెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ... పేద ప్రజల సంక్షేమం, వైఎస్ఆర్ పథకాల అమలే వైఎస్ఆర్ సీపీ ధ్యేయం అని అయోధ్య రామిరెడ్డి అన్నారు. ఎలాంటి సమస్య వచ్చినా అండగా ఉండి పరిష్కరిస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన సంక్షేమ పథకాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారానే పేద ప్రజలకు చేరుతాయన్నారు. అభివృద్ది కేవలం వైఎస్ జగన్ తోనే సాధ్యమని అయోధ్య రామిరెడ్డి తెలిపారు. నరసరావుపేటలో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి భారీ స్పందన లభించింది. -
చెరిగిన ‘హస్త’ రేఖలు
సాక్షి, గుంటూరు: 125 ఏళ్ల ఘన చరిత్ర ఉందని చెప్పుకొనే కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ముఖ్యంగా నరసరావుపేట పార్లమెంటు పరిధిలో మచ్చుకైనా కనిపించని దుస్థితి నెలకొంది. రాష్ట్ర విభజనకు సహకరించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ప్రజాగ్రహానికి గురైంది. ఇతర పార్టీలతో పొత్తు కుదుర్చుకున్నా స్థానిక ఎన్నికల్లో నామివేషన్ వేసేందుకు సైతం అభ్యర్థులు లేని దైన్య స్థితిలో కాంగ్రెస్ కొట్టుమిట్టాడుతుంది. కొన్ని చోట్ల ఒకరిద్దరు నామినేషన్లు వేసినప్పటికీ టీడీపీతో కుమ్మక్కై ప్రచారం సాగిస్తున్నారు. గురువారం ముగిసిన మండల, జెడ్పీ ఎన్నికల నామినేషన్లు పరిశీలిస్తే మాచర్ల నియోజకవర్గంలోని మాచర్ల, వెల్దుర్తి, రెంటచింతల, దుర్గి, కారంపూడి మండ లాల్లో జెడ్పీటీసీ అభ్యర్థిగా ఒక్కరు కూడా కాంగ్రెస్ తరఫున నామినేషన్ దాఖలు చేయలేదు. ఈ ఐదు మండలాల్లో 70 ఎంపీటీసీ స్థానాలు ఉండగా కాంగ్రెస్ కేవలం నాలుగు చోట్ల మాత్రమే నామినేషన్లు వేయగలిగింది.తాజా మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ సొంత గ్రామమైన గురజాల నియోజకవర్గంలో సైతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అధ్వానంగా ఉంది. గురజాల, మాచవరం, పిడుగురాళ్ల మండలాలకు జెడ్పీటీసీ అభ్యర్థులుగా కాంగ్రెస్ నుంచి ఒక్క నామినేషన్ కూడా దాఖలు చేయలేదు. ఈ నాలుగు మండలాల పరిధిలో 65 ఎంపీటీసీ స్థానాలు ఉండగా కేవలం 20 స్థానాలకు మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మరో తాజా మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి సొంత నియోజకవర్గమైన నరసరావుపేట నియోజకవర్గంలో ఆయన ఎంత ప్రయత్నించినప్పటికీ పార్టీ తరఫున నామినేషన్లు దాఖలు చేసేందుకు ఎవరు ముందుకు రాలేదు.నరసరావుపేట మండలం నుంచి జెడ్పీటీసీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసినప్పటికీ 27 ఎంపీటీసీ స్థానాలకు కేవలం 15 చోట్ల మాత్రమే నామినేషన్లు వేయించగలిగారు.