సాక్షి, నరసరావుపేట: నరసరావుపేటలో టీడీపీ నేతలు రౌడీయిజం చెలాయించారు. సివిల్ వివాదంలో ఐపీ పెట్టిన వ్యక్తి ఇంటిని టీడీపీ నేతలు ఆక్రమించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలను అప్పు ఇచ్చిన మిగిలిన వ్యక్తులు నిలదీశారు. ఈ క్రమంలో అప్పులు ఇచ్చిన వ్యక్తులపై టీడీపీ నేతలు దాడికి తెగబడ్డారు.
దీంతో, ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. అప్పు ఇచ్చిన వ్యక్తులపై టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అరవింద్ బాబు దాడి చేశారు. కాగా, ఈ క్రమంలో టీడీపీ నాయకులు పోలీసు వాహనాల అద్దాలను సైతం పగులగొట్టారు.
ఇది కూడా చదవండి: విషాదం: ప్రియాంక ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment