Palnadu District
-
రెచ్చిపోయిన టీడీపీ గూండాలు.. వైఎస్సార్పీపీ నేతపై దాడి
సాక్షి, పల్నాడు: జిల్లాలో టీడీపీ దాడులు కొనసాగుతున్నాయి. పిడుగురాళ్ల మండలం జులకల్లులో టీడీపీ గుండాలు దాష్టీకానికి పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ నేత నర్రెడ్డి లక్ష్మా రెడ్డిపై కత్తులు, ఇనుపరాడ్డులతో దాడి చేశారు. ఈ ఘటనలో లక్ష్మారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. నర్రెడ్డి లక్ష్మా రెడ్డిని అంతమొందించాలనే పథకంతో టీడీపీ నాయకులు ఊరి చివర మాటు వేశారు. గ్రామస్తులు అడ్డుకోవడంతో లక్ష్మారెడ్డి ప్రాణాలతో బయటపడ్డారు. ఆయనను పిడుగురాళ్ల ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. -
పల్నాడులో రెడ్ బుక్ పోలీసింగ్
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లాలో రెడ్‌బుక్ పోలీసింగ్ నడుస్తోంది. అక్రమ కేసులు, నిర్బంధాలతో ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు టార్గెట్‌గా వేధింపులకు పాల్పడుతున్నారు. కేసు పెట్టకుండా.. నోటీసు ఇవ్వకుండా స్టేషన్లో కూర్చోబెట్టి వేధిస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తే.. ఎమ్మెల్యేల ఒత్తిడితో తప్పడం లేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అర్ధరాత్రి ఎత్తుకెళ్లి... శనివారం అరర్ధరాత్రి 12 గంటల సమయంలో రెంటచింతల మాజీ జెడ్పీటీసీ, వైఎస్సార్సీపీ నేత నవులూరి భాస్కర్‌రెడ్డి ఇంటికి రెంటచింతల ఎస్ఐ సీహెచ్ నాగార్జున తన సిబ్బందితో వచ్చి తీసుకెళ్లారు. ఎందుకు తీసుకెళ్తున్నారు? ఎక్కడి తీసుకెళ్తున్నారు? అనే ప్రశ్నలకు ఎస్ఐ సమాధానం ఇవ్వలేదు. పిడుగురాళ్ల వరకు తీసుకువెళ్లి తెల్లవారుజామున 4 గంటల సమయంలో తిరిగి రెంటచింతలలో వదిలివెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు పరోక్షంగా భాస్కర్‌రెడ్డికి చెప్పిందేమంటే... ‘నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ముఖ్య నేతలంతా ఊర్లు వదలి వెళ్లిపోయారు. మీరు వెళ్లలేదని మాకు పైనుంచి ఒత్తిడి ఉంది. మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్లిపోతే మంచిది’ అని హెచ్చరించారు. అధికారపార్టీ నేతలపై చర్యలేవీ? వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు తప్పు చేయకపోయినా వేధిస్తున్న పోలీసులు... కూటమి పార్టీ నేతలు రోజూ దౌర్జన్యాలకు, దాడులకు తెగబడుతున్నా అడ్డుకోవడం లేదు. నరసరావుపేట, చిలకలూరిపేటలలో వ్యాపారులపై దాడులకు దిగినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్సీపీ మహిళా నాయకురాలు పాలేటి కృష్ణవేణిని శనివారం అరెస్ట్ చేసి చిలకలూరిపేట పోలీస్‌స్టేషన్‌లో ఉంచిన సమయంలో తెలుగు మహిళలు నానా హంగామా సృష్టించారు. కృష్ణవేణిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. అడ్డుకున్న పోలీసులను నడిరోడ్డుపై తీవ్రంగా దుర్భాషలాడినా పల్నాడు పోలీసులు పట్టించుకోలేదు. -
వ్యాపారిపై జనసేన నేతల అరాచకం
నరసరావుపేట టౌన్: ఓ దుకాణంలోకి చొరబడి వ్యాపారిపై జనసేన నాయకులు దాడి చేసిన ఘటన పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఆలస్యంగా వెలుగు చూసింది. పట్టణానికి చెందిన పువ్వాడ నాగేశ్వరరావు కోట సెంటర్లోని మహాత్మాగాంధీ క్లాత్ మార్కెట్లోని ఓ షాపులో రెడీమేడ్ వస్త్ర దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. 4 రోజుల క్రితం బట్టలు కొనుగోలు చేసేందుకు వెళ్లిన కస్టమర్ (జనసేన కార్యకర్త)తో దుకాణ యజమానికి చిన్నపాటి వాగ్వాదం జరిగింది. దీంతో జనసేన నేతలు నాని, సాంబలను వెంటబెట్టుకొని వచ్చిన జనసేన కార్యకర్తలు దుకాణంలో ఉన్న నాగేశ్వరరావు, అతని కుమారుడిపై భౌతిక దాడికి పాల్పడ్డారు.పిడిగుద్దులతో వీరంగం సృష్టించారు. కేసు పెడితే మరో మారు దాడి చేస్తామని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ బయటకు రావడంతో అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని టూ టౌన్ సీఐ హైమారావు తెలిపారు. కాగా, ఇటీవలే నరసరావుపేట ఎమ్మెల్యే అరవిందబాబుకు మద్యం దుకాణాల్లో వాటా ఇవ్వలేదని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ రెస్టారెంట్ పై టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి చల్లా సుబ్బారావు 2 రోజుల క్రితం తన అనుచరులతో దాడి చేసి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఇలా..టీడీపీ, జనసేన నేతల వరుస దాడులతో నరసరావుపేటలోని వ్యాపారులు భయాందోళనకు గురవుతున్నారు -
నరసరావుపేట: బార్లో వీరంగం.. టీడీపీ నేత కక్ష సాధింపు
సాక్షి, పల్నాడు: నరసరావుపేటలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. మద్యం షాపులో వాటా ఇవ్వలేదని కక్ష సాధింపు చర్యలకు దిగారు. టీడీపీ నేత చల్లా సుబ్బారావు బార్లో వీరంగం సృష్టించారు. అనుచరులతో కలిసి బార్‌లోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. టీడీపీ నేతల నుంచి ప్రాణ హాని ఉందని బార్ నిర్వాహకులు అంటున్నారు.బార్ అండ్ రెస్టారెంట్ యజమాని పోక శ్రీనివాసరావు మాట్లాడుతూ, 26 ఏళ్లగా బార్ నడుపుతున్నామని.. ఎప్పుడూ తమకు ఇంత ఇబ్బందులు ఎదురుకాలేదన్నారు. మొన్న మద్యం టెండర్లలో మొత్తం 145 షాపులకు దరఖాస్తు చేసుకున్నాం. నరసరావుపేట టౌన్లో 7 మద్యం షాపులకు 5 మద్యం షాపులు మాకు వచ్చాయి. టెండర్లో మేము గెలుచుకున్న మద్యం షాపులన్ని మాకు అప్పగించాలంటూ టీడీపీ నాయకులు తమపై ఒత్తిడి తెచ్చారని ఆయన తెలిపారు.టీడీపీ నాయకులు కోరినట్టే మేము టెండర్లో గెలుచుకున్న షాపులు వాళ్లకు అప్పజెప్పాము. అయినా సరే మమ్మల్ని వేధిస్తూనే ఉన్నారు. టీడీపీ నాయకులు పిలిచినప్పుడు మేము వెళ్లలేదని ఇవాళ మా బార్ అండ్ రెస్టారెంట్‌పైన దాడి చేశారు. నరసరావుపేటలో అరాచక శక్తుల నుంచి మమ్మల్ని కాపాడాలి’’ అని శ్రీనివాసరావు వేడుకుంటున్నారు. -
మరో ఆరుగురికి డయేరియా
నరసరావుపేట: పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీలోని అంజనాపురం కాలనీలో డయేరియా మరింత ప్రబలుతోంది. కేసులు పెరుగుతున్నాయి. కాలనీలో శనివారం మరో ఆరుగురికి డయేరియా సోకింది. వీరిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇప్పటివరకు ఈ కాలనీలో వాంతులు, విరేచనాలతో ఇద్దరు మృతిచెందారు. 17 మంది ఆస్పత్రుల్లో చేరారు. వీరిలో కొంతమంది ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఇళ్లకు వెళ్లారు. శనివారం కూడా ఆరుగురికి డయేరియా సోకటం ఆందోళన కలిగిస్తోంది. కాలనీలో తమ్మిశెట్టి మాధవి, దేవళ్ల రాకేష్, తమ్మిశెట్టి అశోక్, తమ్మిశెట్టి శ్రీనివాసరావు, కొట్రా అన్నమ్మ, మరొకరు శనివారం వాంతులు, విరేచనాలతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరారు. కాలనీలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాల్లో ప్రాథమిక చికిత్స చేసిన తరువాత మెరుగైన వైద్యం కోసం సత్తెనపల్లి, నరసరావుపేట, గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలకు తరలిస్తున్నారు.ప్రస్తుతం వాంతులు, విరేచనాలతో చికిత్స పొందుతున్న వారిలో కొట్రా అన్నమ్మ ఆరోగ్య పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది. తాగునీటి బోరులో నీరు కలుషితమవడంతో అంజనాపురం కాలనీ వాసులు ఈ నెల 22 నుంచి డయేరియా కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వం స్పందించి వ్యాధి నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు. -
అటవీ భూములు అన్యాక్రాంతం కాలేదు
మాచవరం: పల్నాడు జిల్లాలో సరస్వతీ పవర్ సంస్థ భూముల్లో ఫారెస్ట్ లాండ్స్ లేవని అధికారుల పరిశీలనలో వెల్లడైంది. సరస్వతీ పవర్ సంస్థ భూముల్లో అటవీ భూములున్నాయోమో పరిశీలించాలని డిప్యూటీ సీఎం పవనకళ్యాణ్ ఇచ్చిన ఆదేశాల మేరకు అటవీ శాఖ, రెవెన్యూ శాఖల అధికారులు ఇక్కడి భూమలను శనివారం పరిశీలించారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు మాచవరం మండలం చెన్నయపాలెం, దాచేపల్లి మండలం తంగెడ శివారు అటవీ భూములను, సరిహద్దు రాళ్లను పరిశీలించారు. అటవీ భూములు ఏవీ అన్యాక్రాంతం కాలేదని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు చెప్పారు. అటవీ భూములకు ఎనిమిది మీటర్ల దూరంలోనే సరస్వతీ భూములు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. అయినా మరో రెండు రోజులు మాచవరం మండలం భీమవరం, పిన్నెల్లి గ్రామాల సరిహద్దు భూములను కూడా పరిశీలిస్తామన్నారు. ఆయన వెంట డీఆర్వో విజయలక్ష్మి, అటవీశాఖ సిబ్బంది ఉన్నారు. రెవెన్యూ భూముల పరిశీలన మండలంలోని చెన్నయపాలెం, వేమవరం గ్రామాల పరిధిలో ఉన్న రెవెన్యూ భూములను తహసీల్దార్ క్షమారాణి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సరస్వతీ సంస్థకు చెందిన కొంత భూమి వెబ్‌ల్యాండ్ చేయడం జరిగిందని, మరికొంత భూమి వెబ్‌ల్యాండ్ చేయాల్సి ఉందని చెప్పారు. రికార్డులను తనిఖీ చేసి ప్రభుత్వ భూములు ఏమైనా అన్యాక్రాంతం అయ్యాయా లేదా అనే విషయాన్ని తేలుస్తామని చెప్పారు. వార్తా కథనాలు, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెండు రోజులు ఆ గ్రామాల్లోని భూములలో సర్వే చేస్తామని తెలిపారు. -
మూతపడిన బండ్లమోటు జింక్ ఫ్యాక్టరీ తెరవాలి
సాక్షి, నరసరావుపేట: బండ్లమోటు.. రాష్ట్ర చరిత్రలో దీనికంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలానికి చెందిన ఈ ప్రాంతంలో దేశంలో రాజస్థాన్ తరువాత అత్యధికంగా సీసం లభించే ప్రాంతంగా చరిత్రలోకెక్కింది. దీంతో హిందుస్థాన్ కంపెనీ జింక్ ఫ్యాక్టరీని నిర్మించింది. మినీ వైజాగ్‌గా గుర్తింపు పొంది ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పించింది. కాలక్రమేణా ఉత్పత్తి వ్యయం పెరగడం, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పతనమవడంతో 2002లో ఫ్యాక్టరీ మూతపడింది. అప్పటి నుంచి ఈ ప్రాంత ప్రజలు, ప్రజాసంఘాలు, కార్మికులు తిరిగి జింక్ ఫ్యాక్టరీ తెరవాలని ఆకాంక్షిస్తున్నారు. తాజాగా, అంతర్జాతీయ మార్కెట్లో శుద్ధిచేసిన జింక్ ధరలు రూ.1.3 నుంచి 1.5 లక్షల మధ్య ఉంటుండటంతో సీసం తవ్వకాలు తిరిగి ప్రారంభించాలని డిమాండ్ పెరుగుతోంది. కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి తిరిగి ఫ్యాక్టరీ అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతంలో ఉపాధి అవకాలు పెరుగుతాయని ఆశిస్తున్నారు.480 మందితో మొదలైన తవ్వకాలు...బండ్లమోటులో సర్వే ఆఫ్ ఇండియా 1969లో సర్వే నిర్వహించి.. ఇక్కడ సీసం, రాగి నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించి జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థకు నివేదిక ఇచ్చింది. ఈ రిపోర్టు ఆధారంగా కేంద్రం హిందూస్థాన్ జింక్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 1978లో 480 మంది కార్మికులతో పనులు ప్రారంభించింది. 1980 నాటికి రోజుకు 240 టన్నుల సీసం శుద్ధి చేసే స్థాయికి కంపెనీ చేరింది. 1993కి ఆర్థిక సరళీకృత విధానాలు అమల్లోకి వచ్చాక సీసం ధరలు పడిపోయాయి. గనులు నిర్వహణతో లాభం లేకపోవడంతో ఉద్యోగుల భారం తగ్గించుకునేందుకు “గోల్డెన్‌షేక్ హ్యాండ్’ పేరిట 150 మంది ఉద్యోగులను స్వచ్ఛంద పదవీ విరమణకు ఒప్పించింది. దీంతో 310 మంది ఉన్న శాశ్వత ఉద్యోగుల సంఖ్య 160కి పడిపోయింది. కాంట్రాక్ట్ ఉద్యోగులతో కొంతకాలం నెట్టుకొచ్చారు. 1998కి బండ్లమోటు జింక్ ఫ్యాక్టరీను సొంతం చేసుకుంది. ఇక్కడి వెలికితీసిన సీసం శుద్ధి చేయడానికి రాజస్థాన్‌కు పంపడంతో రవాణా ఖర్చు తడిసిమోపెడు అవడంతో కంపెనీని మూసివేసింది. ఆ సమయంలో 125 మంది శాశ్వత, 150 మంది కాంట్రాక్టు సిబ్బంది ఫ్యాక్టరీలో పనిచేసేవారు. వీరితోపాటు పరోక్షంగా ఉపాధి పొందుతున్న వేలాది మంది రోడ్డునపడ్డారు.అంతర్జాతీయంగా పెరిగిన ధరలతో...గత కొంత కాలంగా అంతర్జాతీయంగా సీసం ధరలు రూ.1.3 లక్షల నుంచి 1.5 లక్షల వరకు ఉంటోంది. దీంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తిరిగి తవ్వకాలు ప్రారంభించేందుకు కృషి చేసింది. 2022 డిసెంబర్లో ప్రైవేట్ కంపెనీలను టెండర్లు వేయాలని ప్రకటన జారీ చేసింది. కొంత సాంకేతిక సమస్యలతో బిడ్డింగ్ పనులు ఆలస్యం అవ్వడం, ఇంతలో ఎన్నికల సమీపించడంతో ఈ ప్రతిపాదన మరుగునపడింది.తాజాగా బండ్లమోటు కార్మికల సంఘాలు సమావేశం ఏర్పాటు చేసి తిరిగి తవ్వకాలు ప్రారంభించాలని పిలుపునిచ్చాయి. పెరిగిన ధరలతో గిట్టుబాటు అవుతుందని, ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభిస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. గనిలో ఇంకా మేలైన సీసం నిల్వలు ఉన్నాయి. గతంలో తవ్వి తీసి ధరలు పడిపోవడంతో వదిలేసిన ముడి ఖనిజం సైతం 15 లక్షల టన్నుల వరకు నిల్వ ఉంది. ఇప్పటికే తవ్వితీసిన గనులను పర్యాటక క్షేత్రంగా మలిస్తే ఈ ప్రాంతానికి ఆర్థికంగా బలం చేకూర్చినట్టు అవుతుంది.తవ్వకాలు చేపట్టాలి నేను బండ్లమోటు జింక్ ఫ్యాక్టరీ కార్మిక సంఘం నేతగా పనిచేశాను. గతంలో ఓ వెలుగు వెలిగిన ఫ్యాక్టరీ మూతపడటంతో ఈ ప్రాంతానికి చెందిన వందలాది మంది ఉపాధి కోల్పోయారు. అప్పట్లో సీసం ధరలు తక్కువగా ఉండటం, తవ్వకం ఖర్చు పెరగడంతో మూతపడింది. ప్రస్తుతం ధరలు ఆశాజనకంగా ఉన్న నేపథ్యంలో సాంకేతికతను ఉపయోగించి తవ్వకాలు ప్రారంభిస్తే మంచిది. కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అందుకు అవసరమైన అటవీశాఖ అనుమతులు సైతం పునరుద్ధరించుకోవాల్సి ఉంది. – జయకర్ రావు, కార్మిక సంఘం మాజీ వర్కింగ్ సెక్రటరీ, హిందుస్తాన్ జింక్ లిమిటెడ్జీవనశైలిలో మార్పు వస్తుందిప్రస్తుత అంతర్జాతీయ మార్కెట్లో సీసం ధరలతో ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభించడానికి సానుకూలంగా ఉంది. ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభిస్తే ఈప్రాంత ప్రజల జీవనశైలిలో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంది. దళిత, గిరిజన ప్రజలలో సాంఘిక పరమైన మార్పులు పెద్ద ఎత్తున రానుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిపెట్టి వీలైనంత త్వరగా తవ్వకాలు పునఃప్రారంభించాలి. గతంలో పనిచేసిన కార్మికులంతా కలిసి మాకు చేతనైనంతగా పోరాటాలు చేస్తున్నాం. – ఎంహెచ్ ప్రసాద్, హిందుస్తాన్ జింక్ లిమిటెడ్, కార్మిక సంఘం పూర్వ నేత -
డయేరియా మరణాల పాపం ప్రభుత్వానిదే, ఏపీలో మైన్స్, వైన్స్ దోపిడీ
-
పల్నాడులో మరోసారి డయేరియా మృత్యు ఘంటికలు
సాక్షి, నరసరావుపేట, దాచేపల్లి: చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో డయేరియా వేగంగా విస్తరిస్తోంది. విజయనగరం జిల్లా గుర్ల మండలంలో 14 మందిని బలితీసుకున్న అతిసారం.. ఇప్పుడు పల్నాడు జిల్లాలోనూ మృత్యు ఘంటికలు మోగిస్తోంది. దాచేపల్లి మండలంలో బుధవారం వ్యాధి ప్రబలి, ఇద్దరు చనిపోగా, 14 మంది ఆస్పత్రుల పాలయ్యారు. జూలై నెలలోనే పల్నాడు జిల్లా దాచేపల్లి, పిడుగురాళ్ల, కారంపూడి మండలాల్లో డయేరియా కేసులు నమోదై, పలువురు మరణించారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో చర్యలు చేపట్టకపోవడంతో ఇప్పుడు దాచేపల్లి మండలంలో మరోసారి వ్యాధి విజృంభించింది. దాచేపల్లి పంచాయతీ అంజనాపురంలో బుధవారం నుంచి వాంతులు, విరేచనాలతో అనేక మంది ఆస్పత్రులపాలయ్యారు. వీరిలో బండారు చిన్న వీరయ్య(58), తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకటేష్ (21) బుధవారం రాత్రి మృతి చెందారు. వీరిలో చిన్న వీరయ్య మంగళవారం నుంచే వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వెంకటేశ్వర్లు బుధవారం మధ్యాహ్నం వ్యాధి బారిన పడ్డారు. కుటుంబ సభ్యులు స్థానికంగా చికిత్స చేయించి, మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట తరలిస్తుండగా దారి మధ్యలోనే చనిపోయాడు. తాగు నీరు కలుషితం అవడంవల్లే..తారు నీరు కలుషితం కావడం వల్లే డయేరియా వ్యాప్తి చెందినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అంజనాపురం కాలనీ ప్రజలకు తాగు నీరు అందించే బోరు సమీపంలో సెప్టిక్ ట్యాంక్ నీళ్లు, మురికి కాలువల్లోని నీరు చేరటం వల్లే కలుషితమైనట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు గ్రామంలో పారిశుధ్యం నిర్వహణ కూడా అధ్వానంగా ఉంది. మురికి కాలువల్లో చెత్త పేరుకుపోయి దుర్వాసన వస్తోంది. పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్‌బాబు గురువారం అంజనాపురం కాలనీలో పర్యటించి బాధితులతో మాట్లాడారు. సురక్షితమైన తాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు. కా>గా, అంజనాపురంలో డయేరియాతో ఇద్దరు మృతికి కూటమి ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు బాధ్యత వహించాలని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని కలెక్టర్‌కు సీఎం ఆదేశం సాక్షి, అమరావతి: పల్నాడు జిల్లాలో అతిసారంపై సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడారు. దాచేపల్లిలో పరిస్థితి, ప్రభుత్వపరంగా తీసుకున్న చర్యలను కలెక్టర్ సీఎంకు వివరించారు. ఆ ప్రాంతంలో సాధారణ స్థితి వచ్చేంతవరకు నిత్యం పర్యవేక్షించాలని సీఎం సూచించారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని సీఎం ఆదేశించారు. జూలైలో వ్యాధి ప్రబలినా సరైన చర్యలు చేపట్టని సర్కారు జూలై నెలలోనే జిల్లాలో అతిసారం వ్యాధి వ్యాప్తి చెందిందని, అప్పుడే చంద్రబాబు ప్రభుత్వం సరైన చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడు వ్యాపించి ఉండేది కాదని స్థానికులు చెబుతున్నారు. ఆ నెలలో దాచేపల్లి మండలం కేసానుపల్లిలో డయేరియాకు వంగూరి నాగమ్మ అనే మహిళ మృతి చెందగా, మరో 30 మంది ఆస్పత్రి పాలయ్యారు. అదే సమయంలో పిడుగురాళ్ల, కారంపూడి మండలాల్లోనూ పదుల సంఖ్యలో డయేరియా బారినపడ్డారు. 9 మంది మృత్యువాత పడ్డారు. అప్పట్లో మంత్రి నారాయణ ఒకరోజు హడావుడి చేసి వెళ్లిపోయారు. తాగునీరు కలుషితమవడం, పారిశుధ్య నిర్వహణ సరిగాలేకపోవడమే డయేరియాకు కారణమని నిర్ధారణకు వచ్చారు. అయినా, రక్షిత నీరు అందించడానికి, పారిశుద్ద్యం మెరుగుదలకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. దీంతో మరోసారి జిల్లాలో డయేరియా వ్యాప్తి చెందింది. -
చికలూరిపేట ICICI బ్యాంకులో సీఐడీ విచారణ
-
నడివీధిలో ఎస్సై చొక్కా పట్టుకుని..లాగేసి.. చింపేసి.. దౌర్జన్యం
సాక్షి టాస్క్‌ఫోర్స్: అధికారం అండ చూసుకుని టీడీపీ నేతల ఆగడాలు రోజు రోజుకూ మితిమీరిపోతున్నాయి. ప్రతిపక్ష నేతలు, ప్రజలపై దాడులు చేయడమే కాకుండా ఇంకో అడుగు ముందుకేసి పోలీసులపై కూడా దౌర్జన్యాలు, దాడులకు తెగబడుతున్నారు. నీ అంతు చూస్తామంటూ.. నడివీధిలో ఏకంగా ఒక ఎస్సైని చొక్కా పట్టుకుని లాగడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ ఘటనలో పోలీస్ అధికారి యూనిఫాం బటన్స్ తెగిపోవడంతోపాటు చొక్కా చిరిగిపోయింది. పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.స్థానికుల కథనం మేరకు.. గ్రామంలో ఒక సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నాయకులు బతుకమ్మ ఊరేగింపు చేస్తున్నారు. కొంత సేపటి తర్వాత ఊరేగింపులో ఏర్పాటు చేసిన డీజే వద్ద వివాదం తలెత్తింది. బందోబస్తులో ఉన్న ఎస్సై రాజా జోక్యం చేసుకుంటూ సర్ది చెప్పారు. గొడవ చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. అయినా వినిపించుకోక పోవడంతో గొడవకు కారణమని భావించిన ఒక యువకుడి వీపుపై తడుతూ వెళ్లిపొమ్మని చెప్పారు.దీంతో ఆగ్రహించిన ఆ యువకుడి బంధువులు, టీడీపీ నాయకులు ‘మావాడిపై చేయి చేసుకుంటావా.. కొట్టడానికి నువ్వు ఎవరు.. నీ సంగతి చూస్తాం..’ అంటూ మూకుమ్మడిగా ఎస్సైపైకి దూసుకువెళ్లారు. చొక్కా పట్టుకుని గట్టిగా లాగేశారు. దీంతో బటన్స్ ఊడిపోయి, చొక్కా చిరిగిపోయింది. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో తన పైకి దాడికి రావడంతో దిక్కుతోచని ఎస్సై వెనక్కు తగ్గాడు. గొడవ పడొద్దని చెప్పడమే పాపమైందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పెదకూరపాడు సీఐ సురేష్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. అటువంటి ఘటన ఏమీ జరగలేదని, ఎటువంటి వివాదం లేకుండా ఊరేగింపు జరిగిందని చెప్పారు. -
ఐసీఐసీఐ బ్యాంకులో భారీ స్కామ్.. సీఐడీ విచారణ
-
కొండల్లోకి పారిపోయిన ‘గురుకుల’ విద్యార్థులు
నాదెండ్ల: గురుకుల పాఠశాలలో తమను వేధింపులకు గురిచేస్తున్నారని, సరైన ఆహారం అందించకుండా హింసిస్తూ తమతో బాత్రూమ్లు కడిగిస్తున్నారని.. అదేమని అడిగితే చావబాదుతున్నారంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు విద్యార్థులు పాఠశాల గోడ దూకి సమీపంలోని కొండల్లోకి పారిపోయారు. సోమవారం జరిగిన ఈ సంఘటన పల్నాడు జిల్లాలో సంచలనం రేపింది. యడ్లపాడు మండలం వంకాయలపాడులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో 6–10 తరగతుల్లో 450 మంది విద్యార్థులున్నారు. సోమవారం ఉదయం పాఠశాలలో ప్రార్థన జరుగుతుండగా 67 మంది గోడ దూకి బయటకు వెళ్లారు.ఇది చూసి కొందరు ఉపాధ్యాయులు 30 మందిని వెనక్కి తేగా.. మరో 37 మంది సమీపంలోని కొండల్లోకి వెళ్లి దాక్కున్నారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. దీంతో చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బానాయుడు, ఎస్ఐ బాలకృష్ణ సిబ్బందితో కలిసి కొండల్లో విద్యార్థులను వెతికి పట్టుకున్నారు. పాఠశాలలో భోజనం బాగుండదని, తాగునీటి సౌకర్యం కూడా సరిగా లేదని, మెనూ ప్రకారం వడ్డించరని తెలిపారు. విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ పాకెట్ మనీని ప్రిన్సి పాల్‌కు ఇస్తామని, సెలవుల్లో తాము ఇళ్లకు వెళ్లేట ప్పుడు అడిగినా ఆ డబ్బు ఇవ్వడం లేదని కన్నీటిపర్యంతమయ్యారు.పాఠశాల ప్రారంభంలో త మకు ఫ్రీ సీట్లు వచ్చినా ఒక్కో విద్యార్థి వద్ద నుంచి రూ.4 వేలకు పైగా వసూలు చేశారని చె ప్పారు. పోలీసులు నచ్చజెప్పి తిరిగి పాఠశాలకు తీసుకెళ్లారు. అనంతరం నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు, గురుకుల పాఠశాల జిల్లా కో–ఆరి్డనేటర్ పద్మజ, తహసీల్దార్ జయశ్రీలు పాఠశాలకు చేరుకున్నారు. విద్యార్థులతో ఏకాంతంగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రిన్సిపల్ హనుమంతరావు, వైస్ ప్రిన్సిపల్ కంచర్ల శిరీష్‌బాబు, ఉపాధ్యాయులతోనూ మాట్లాడారు. జిల్లా కోఆరి్డనేటర్ మాట్లాడుతూ ఈ పాఠశాలలో ఉపాధ్యాయుల మధ్య విభేదాలున్నాయని, దీంతో వారు విద్యార్థులను రెచ్చగొడుతున్నారని, వారి ప్రోద్బలంతోనే గోడదూకి పారిపోయారని తెలిపారు. -
వైఎస్సార్సీపీ నేతలతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, గుంటూరు: తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలతో వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సమావేశమయ్యారు. ఈ భేటీలో నెల్లూరు, పల్నాడు జిల్లాల నేతలతో పాటు ఇతర జిల్లాల నేతలు కూడా పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిణామాలపై నేతలతో వైఎస్ జగన్ చర్చించారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.వరద బాధితులకు చిన్నారి సాయంవరద బాధితులకు అండగా నేను ఉన్నానంటూ పులివెందులకు చెందిన చిన్నారి వర్ణిక ముందుకొచ్చింది. తాను దాచుకున్న పాకెట్‌మనీని వరద బాధితుల కోసం వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను కలిసి అందజేసింది. తాన బాబాయితో వచ్చిన విద్యార్థిని వరద బాధితుల కోసం రూ.72,500 ఆర్థిక సాయాన్ని అందించింది.ఇదీ చదవండి: పవన్.. గొంతు ఎందుకు పెగలడం లేదు? -
గణేష్ ఉత్సవాల్లోనూ టీడీపీ బరితెగింపు
నరసరావుపేట: అధికారమే హద్దుగా టీడీపీ బరితెగిస్తోంది. ఇప్పటి వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు. చివరికి వైఎస్సార్ సీపీ నాయకులు ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహ ఊరేగింపు అడ్డుకున్నారు. నిమజ్జనానికి వెళ్లే దారికి అడ్డంగా ట్రాక్టర్లు, ట్రక్కులు అడ్డుపెట్టారు. కాదని వస్తే సహించేది లేదంటూ కర్రలు, రాళ్లు, రాడ్లు పట్టుకుని దాడులకు సిద్ధపడ్డారు. ఆఖరుకు నిమజ్జనోత్సవం సందర్భంగా నిర్వహించే అన్నదాన సంతర్పణకు కూడా భక్తులను వెళ్లనీయలేదు. ఘటన పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం గ్రంథశిరి గ్రామంలో చోటుచేసుకుంది. వినాయక చవితి పురస్కరించుకుని గ్రామా లో వైఎస్సార్ సీపీ, టీడీపీ మద్దతుదారులు ఎప్పటిలాగానే వినాయకుడి విగ్రహ మండపాలు ఏర్పాటు చేసుకున్నారు. తొమ్మిది రోజులపాటు పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్న తరువాత నిమజ్జనానికి ఇరువర్గాలు ఒకేరోజు అంటే అదివారం అనుమతి కావాలంటూ పోలీసులను కోరారు. పోలీసులు ముందుగా టీడీపీ వారికి అనుమతి ఇవ్వడంతో ఆదివారం సాయంత్రం డీజే సౌండ్స్, బాణసంచా, తీన్మార్ డుప్పులతో గ్రామోత్సవం నిర్వహించి నిమజ్జనం చేసుకున్నారు. వైఎస్సార్ సీపీ వారిని సోమవారం నిమ జ్జనం చేసుకునేందుకు అనుమతించారు. ఈ క్రమంలో కొంతమంది టీడీపీ వర్గీయులు తమ ఇళ్లపై రాళ్లు రువ్వి గులాంలో కారం కలిపి చల్లారని, వైఎస్సార్ సీపీ వర్గీయులు ఘర్షణకు దిగారు. ఇంతలో పోలీసులు రావడంతో గొడవ సద్దుమణిగింది.వినాయకుడి నిమజ్జనానికి తరలిస్తుండగా..సోమవారం ఉదయాన్నే వైఎస్సార్ సీపీ వర్గీయులు వినాయకుడిని నిమజ్జనం చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. టీడీపీ వాళ్లు చేసుకున్న విధంగానే డీజే సౌండ్స్, బాణసంచా, తీన్మార్ డప్పులను సిద్ధం చేసుకున్నారు. వినాయడిని మండపంలో నుంచి ప్రత్యేకంగా అలంకరించిన ట్రాక్టరుపై ఎక్కించి ప్రధాన వీధిలోనుంచి ఉరేగింపుగా వెళ్లేందుకు సిద్ధపడ్డారు. అంతే ఉరేగింపునకు వెళ్లకుండా ప్రధాన రహదారికి అడ్డంగా ట్రాక్టరు ట్రక్కులను టీడీపీ వర్గీయులు అడ్డు పెట్టారు. గొడవకు ముందుగానే సిద్ధపడ్డ టీడీపీ వారు తమ పలుకుబడితో అడిషనల్ ఎస్పీ లక్ష్మీపతి, సత్తెనపల్లి డీఎస్పీ గురునాథబాబు, సీఐ వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామంలో పోలీసు బలగాలను మోహరింపజేశారు. టీడీపీ వర్గీయులు కూడా గ్రామోత్సవాన్ని అడ్డుకునేందుకు దారికి అడ్డంగా ట్రాక్టర్లు, ట్రక్కులు అడ్డంపెట్టి అవతలివైపు కర్రలు, రాడ్లతో కాపుకాశారు. ఉరేగింపు నిర్వహించాల్సిందేనని వైఎస్సార్ సీపీ వర్గయులు కూడా భీష్మించుకూర్చున్నారు. గ్రామ సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి కూడా వెళ్లకుండా టీడీపీ వారు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనిపై పోలీసులు కూడా టీడీపీకే వంత పలకడంతో చేసేది లేక వైఎస్సార్ సీపీ మద్దతుదారులు మేము మా ప్రభుత్వం వచ్చేంతవరకు ఐదేళ్లు పూజలు నిర్వహించుకుని అప్పుడే నిమజ్జనం చేసుకుంటామంటూ నిమజ్జనోత్సవాన్ని విరమించుకుని వినాయక నిమజ్జనోత్సవానికి ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక వాహనంపై నుంచి దించి యథావిధిగా మండపంలో ఉంచారు.మీరు వేరే దారిన వెళ్లకుంటే కేసులు: లక్ష్మీపతి, అడిషనల్ ఎస్పీగ్రామంలో గొడవలు వద్దు. మీకు డీజే పెట్టుకునేందుకు, బాణసంచాతో ఉరేగింపు చేసుకునేందుకు అనుమతి లేదు. వేరే దారిన ప్రశాంతంగా వెళ్లి నిమజ్జనం చేసుకోవాలి. లేకుంటే వైఎస్సార్ సీపీ నాయకులపై కేసులు తప్పవు. భిన్నంగా చేస్తే నిర్వహక కమిటీ పాటు సపోర్టు చేసిన అందరిపై కేసులు నమోదు చేస్తాం. కేసులుంటే వీసాలు కూడా రావు, బ్యాంకుల్లో రుణాలు కూడా ఇవ్వరు. మీరు తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు చట్టాన్నే మార్చేంత వ్యక్తులేం కాదుగా, మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి మేం ఇంతమందిమి రావాలా... పంతాలు, పట్టింపులు వద్దు, మేము చెప్పినట్లుగా వినండి. వాళ్లు వద్దన్న దారినే మీరు ఎందుకు వెళ్లాలి, డీజే సౌండ్స్ లేకపోతే వినాయకుడు ఒప్పుకోడా, మర్యాదగా నేను చెప్పినట్లు వేరే దారిని వెళ్లి నిమజ్జనం చేసుకోవాలి. ఈసారికి ఇలా పోనివ్వండి, వచ్చే ఏడాది ఇరువర్గాలను కూర్చోబెట్టి ఎలా చేయాలో ఆలోచిద్దాంలే అని అడిషనల్ ఎస్పీ అన్నారు. దీంతో వైఎస్సార్సీపీ వర్గీయులు ఏర్పాటు చేసుకున్న విగ్రహం నిమజ్జనానికి వెళ్లకుండా వెనుదిరిగారు. -
వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కన్వీనర్లపై పోలీసుల ఓవర్ యాక్షన్...
-
పల్నాడులో మరోసారి రెచ్చిపోయిన టీడీపీ గూండాలు
సాక్షి,పల్నాడు జిల్లా: పల్నాడులో మరోసారి టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. పెదకూరపాడులో టీడీపీ నేతలు దాదాగిరి చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ నేతల వాహనాలను ధ్వంసం చేసిన టీడీపీ శ్రేణులు.. ముంపు ప్రాంతాల పరిశీలనకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావుపై దాడికి యత్నించారు.టీడీపీ నేతలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని నంబూరి శంకర్రావు మండిపడ్డారు. ‘‘ముంపు ప్రాంత బాధితులను పరామర్శించడం తప్పా?. పోలీసుల సమక్షంలోనే మాపై దాడి చేశారు. ఇదంతా ప్లాన్ ప్రకారం చేసిన దాడి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు చేయడం దారుణం’’ అని శంకర్రావు అన్నారు. ఆళ్లగడ్డలో అఖిలప్రియ రెడ్ బుక్ రాజ్యాంగంమరోవైపు, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో అఖిలప్రియ రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతోంది. అఖిలప్రియ వర్గీయులు దౌర్జన్యాలకు పాల్పడుతూ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పట్టణానికి చెందిన విశ్వనాథం పెద్ద కొండయ్య స్థలాన్ని కబ్జాకు యత్నించారు. అడ్డుకున్న కొండయ్య కూతురిపై అసభ్యపదజాలంతో తిడుతూ అఖిలప్రియ అనుచరుడు రవి చంద్రారెడ్డి రెచ్చిపోయారు. -
‘టీడీపీ నేతల వేధింపులకు ఇది పరాకాష్ట’
పల్నాడు జిల్లా : ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు, హత్యలు, అక్రమాలు తప్పితే మరేం కనిపించడం లేదని గురుజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ధ్వజమెత్తారు. గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల మండలం జూలకల్లులో దళిత మహిళకు అన్యాయం చేశారని కాసు మహేష్ రెడ్డి మండిపడ్డారు.రేషన్ షాపు వ్యవహారంలో మనీషా అనే యువతిని టీడీపీ నేతలు వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. తన తండ్రి చనిపోయిన తర్వాత రేషన్‌షాపును మనీషా అనే యువతి చూసుకుంటుంటే ఆమెపై టీడీపీ వారు వేధింపులకు పాల్పడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే ఆమె షాప్ తీసేయడమే కాకుండా అక్రమ కేసులు పెడతామని హింసించడం మొదలుపెట్టారని, రూ. 70 వేల నుంచి రూ. 80 వేలు కట్టాలని టీడీపీ నేతలు వేధించారన్నారు. టీడీపీ నేతల వేధింపులతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసిందన్నారు. టీడీపీ నేతల వేధింపులకు ఇది పరాకాష్ట అని కాసు మహేష్‌రెడ్డి విమర్శించారు.ఆడ పడుచులను మరీ ముఖ్యంగా ఎస్టీ, ఎస్టీలపై టీడీపీ దాడులకు దిగుతుందన్నారు. పోలీసులు దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేపు, మా పార్టీ నాయకులు జూలకల్లు వెళ్తామని, మనీషా కుటుంబానికి అండగా ఉంటామని కాసు మహేష్‌రెడ్డి స్పష్టం చేశారు. -
నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ రైల్ లో దోపిడీకి యత్నం
-
ఏపీలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందా?: అంబటి
సాక్షి, గుంటూరు: పల్నాడులో వైఎస్సార్సీపీ కార్యకర్త నాగరాజు కిడ్నాప్‌పై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? అంటూ ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నాగరాజుకు ఏమైనా హానీ జరిగితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై నాగారాజును కిడ్నాప్ చేశారని.. ఆయన కుటుంబ సభ్యులపై కూడా దాడి చేశారంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు.‘‘మాచర్ల నియోజకవర్గానికి చెందిన నాగరాజు ప్రాణభయంతో వినుకొండ వచ్చారు. పోలీసు వ్యవస్థ పని చేస్తోందా?. ఎస్పీతో కూడా మాట్లాడాం. నాగరాజుకు ఏ విధమైన హాని జరిగినా చంద్రబాబు బాధ్యత వహించాలి. బెయిల్ మీద బయట వచ్చి కూరగాయల వ్యాపారం చేసుకుంటున్నారు. అలాంటి వ్యక్తిని కిడ్నాప్ చేశారు. నాగరాజు కుటుంబ సభ్యులను కొట్టి టీడీపీ గూండాలు కిడ్నాప్‌కి దిగారు. నడిరోడ్డు మీద హత్యలు, కిడ్నాప్‌లు జరుగుతున్నాయి. అసలు రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నట్టా? లేనట్టా?’’ అంటూ అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.‘‘రాష్ట్రాన్ని మణిపూర్, బీహార్‌లాగా మార్చారు. టీడీపీ నేతలు ఏం చేసినా పోలీసులు వారిని ఏమీ అనటానికి వీల్లేదని హోంమంత్రి నుండే ఆదేశాలు వెళ్లాయి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. ఆటవిక రాజ్యం కొనసాగుతోంది. పోలీసులు వెంటనే స్పందించి నాగరాజును కాపాడాలి’’ అని అంబటి రాంబాబు విజ్ఞప్తి చేశారు. -
పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాగరాజు కిడ్నాప్
-
పల్నాడు జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్త కిడ్నాప్
సాక్షి, పల్నాడు జిల్లా: బొల్లాపల్లి మండలం వెంకుపాలెంలో వైఎస్సార్సీపీ కార్యకర్త ఒంటేరు నాగరాజును కిడ్నాప్ చేశారు. ఆటోలో కూరగాయలు అమ్ముకుంటున్న నాగరాజును బొలెరో వాహనంతో అడ్డుకుని.. బలవంతంగా తీసుకెళ్లిన ప్రత్యర్థులు.. నాగరాజు కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దుర్గి మండలం జంగమహేశ్వరపాడు వదిలేసి వెల్లటూరులో నాగరాజు కుటుంబం ఉంటుంది.కాగా, టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అడ్డూ అదుపు లేకుండా దాడులు కొనసాగుతున్నాయి. టీడీపీ రౌడీమూకలు దండెత్తుతుండటంతో సామాన్యులు ప్రాణభయంతో కన్నతల్లి వంటి సొంత ఊరును వదిలి వలసవెళ్లిపోతున్నారు. పొరుగు రాష్ట్రంతోపాటు అటవీ ప్రాంతాల్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఒక్క పల్నాడు జిల్లాలోనే 1,500 కుటుంబాలు తెలంగాణకు వెళ్లి తలదాచుకోవడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం.చిత్తూరు జిల్లాలో దాదాపు 500 కుటుంబాలు, అనంతపురం జిల్లాలో 350 కుటుంబాలు, శ్రీసత్యసాయి జిల్లాల్లో 100, అన్నమయ్య జిల్లాలో 120 కుటుంబాలు, కర్నూలు జిల్లాలో 135 కుటుంబాలు తమ గ్రామాలను వదిలి వలసవెళ్లాయి. వలస వెళ్లిన కుటుంబాల పంటలను, ఆస్తులను సైతం టీడీపీ మూకలు ధ్వంసం చేస్తూ పైశాచికంగా ప్రవర్తిస్తున్నాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు దాదాపు 2,700 కుటుంబాలు ప్రాణభయంతో వలస వెళ్లాయి. -
విత్తనం దొరక్క రైతులు ‘వర్రీ’
నరసరావుపేట రూరల్: పల్నాడు జిల్లాలో వరి విత్తన కొరత తీవ్రంగా ఉంది. కోరిన విత్తనం దొరక్క రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే మడులు సిద్ధం చేసుకున్న రైతులు.. అదను దాటి పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నిండి నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేయడంతో కుడి కాలువ ఆయకట్టు పరిధిలోని రైతులు పూర్తి స్థాయిలో మాగాణి భూముల్లో వరి సాగుకు సిద్ధమయ్యారు. దీంతో పది రోజులుగా నాణ్యమైన వరి విత్తనాల కోసం దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు.నరసరావుపేట డివిజన్‌తో పాటు వినుకొండ, సత్తెనపల్లి డివిజన్లలోనూ విత్తన కొరత ఉండటంతో ఆయా ప్రాంత రైతులు నరసరావుపేట పట్టణానికి విత్తనాల కోసం తరలి వస్తున్నారు. తెలంగాణలోని జగిత్యాల ప్రాంతం నుంచి సరఫరా అవుతున్న స్వల్ప కాలిక రకం జేజీఎల్–384 విత్తనాలు సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపు తున్నారు. 135 రోజుల్లో పంట చేతికి రావడంతో పాటు తెగుళ్లను తట్టుకునే వంగడం కావడంతో ఈ రకం విత్తనాల కోసం రైతుల్లో డిమాండ్ ఎక్కువగా ఉంది.నరసరావుపేట ప్రకాష్‌నగర్‌లోని చిన్నయ్య అండ్ సన్స్ దుకాణంలో సబ్సిడీపై ఏపీ సీడ్స్ సరఫరా చేసే విత్తనాలతో పాటు ప్రైవేటు రకం విత్తనాలను కూడా విక్రయిస్తుంటారు. ఇందులో భాగంగా జేజీఎల్–384 రకం విత్తనాలు కూడా అందుబాటులో ఉంచారు. 25 కి లోల విత్తనాల బస్తా రూ.1,350.. 30 కిలోల విత్తనాల బ స్తా రూ.1,500కు విక్రయిస్తున్నారు. దీంతో రైతులు ఈ విత్తనం కోసం దుకాణం ఎదుట బారులు తీరుతున్నారు. పోలీసు బందోబస్తుతో విత్తనాల విక్రయం వారం నుంచి విత్తనాల కోసం వందల మంది రైతులు దుకాణం వద్ద పడికాపులు కాస్తున్నారు. తెల్లవారు జామున 4 గంటల నుంచి రైతులు గ్రామాల నుంచి జేజీఎల్–384 రకం విత్తనాల కోసం తరలి వస్తున్నారు. రైతులు పెద్ద ఎత్తున రావడంతో పోలీసు బందోబస్తుతో విత్తనాల విక్రయం సాగుతోంది. అయినప్పటికీ బుధవారం ఉదయం రైతుల మధ్య తోపులాట జరగడంతో టౌన్ హాల్లో టోకెన్లు జారీ చేసేందుకు కౌంటర్ ఏర్పాటు చేశారు.కొంత మందికి టోకెన్లు అందజేసి కౌంటర్‌ను మూసివేశారు. దీనిపై రైతులు నిలదీయడంతో స్టాక్ ఉన్న వరకే టోకెన్లు అందజేశామని నిర్వాహకులు తెలిపారు. దీంతో గత్యంతరం లేక రైతులు వెనుదిరగాల్సి వచ్చింది. టోకెన్లు తీసుకున్న రైతులు జోరు వానలోనూ క్యూలైన్లో వేచి ఉండటం కనిపించింది. రైతులు అన్ని ఇబ్బందులు పడి టోకెన్ తీసుకున్నా, కేవలం ఒక బస్తానే ఇస్తుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జేజీఎల్–384 రకం వరి విత్తనాల కోసం రైతులు కష్టాలు పడుతుంటే ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని రైతులు మండిపడుతున్నారు. ఇతర రకాలు సాగు చేసుకోవాలని అధికారులు ఉచిత సలహా ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ విత్తనాలు సిద్ధంజేజీఎల్–384 రకం వరి విత్తనాలు ఎక్కడా అందుబాటులో లేవని, అదే రీతిలో దిగుబడి ఇచ్చే స్వల్ప కాలిక రకాలు ప్రత్యామ్యాయంగా సిద్ధంగా ఉన్నాయని జిల్లా వ్యవసాయాధికారి ఐ.మురళి తెలిపారు. పల్నాడు ప్రాంతానికి అనుకూలమైన వంగడాలతో పాటు రైతులు ఎక్కువగా ఇష్టపడే అంకుర్ సోనా, అంకుర్–పద్మ, ఏపి–567, అన్నపూర్ణ తదితర రకాల విత్తనాలను సరిపడా అందుబాటులో ఉంచామని చెప్పారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.నాలుగు రోజులుగా తిరుగుతున్నా..జేజీఎల్–384 రకం వరి విత్తనాల కోసం నాలుగు రోజు లుగా పట్టణానికి వచ్చి దుకాణాల చుట్టూ తిరుగుతున్నాం. ఈ రోజు టోకెన్ దొరికితే ఒక బస్తా (25 కిలోలు) ఇచ్చారు. ఐదు ఎకరాల్లో ఈ రకం వేయాలని సిద్ధమయ్యాం. ఒక బస్తాతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. – వసంత శ్రీనివాసరావు, రైతు, పమిడిమర్రుఇంత ఇబ్బంది ఎప్పుడూ పడలేదు వరి విత్తనాల కోసం ఇంత ఇబ్బంది ఎప్పుడూ పడలేదు. విత్తన దుకాణాల్లోనే అన్ని రకాల విత్తనాలు దొరికేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రైతులకు కావాల్సిన విత్తనం దుకాణాల్లో దొరకడం లేదు. ఇక్కడ ఒక్క చోటే విత్తనాలు అమ్ముతున్నారు. దీంతో రైతులందరూ ఇక్కడికే రావడంతో తోపులాట జరుగుతోంది. – రావి సుబ్బారావు, రైతు, చీమలమర్రిరైతులు కోరిన విత్తనాలు అందించాలి లాభసాటిగా ఉండే విత్తనాలను రైతులకు ప్రభుత్వం అందించాలి. రైతులు అడిగిన విత్తనం కాకుండా, ఇతర రకాలు సబ్సిడీపై ఇస్తే ప్రయోజనం ఏమిటి? జేజీఎల్ రకం విత్తనాలు మార్కెట్లో అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. – జె.వెంకటేశ్వర్లు, రైతు, తుంగపాడు -
ఎన్సీసీ సీనియర్ల దాష్టీకం
సాక్షి, నరసరావుపేట: క్రమశిక్షణకు మారుపేరుగా నిలవాల్సిన ఎన్సీసీ సీనియర్ క్యాడెట్లు పైశాచిక ఆనందంతో జూనియర్లను చితకబాదారు. సర్టిఫికెట్ కోసం ఉబికి వస్తున్న కన్నీటినీ దిగమింగుకుని జూనియర్ క్యాడెట్లు బాధను ఓర్చుకున్నారు. ఈ వీడియో ఆలస్యంగా బయటకు రావటంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యారి్థలోకం ఉలిక్కిపడింది. విద్యార్థి సంఘాలు రంగంలోకి దిగి ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఏటా ఇదే తంతువజ్రోత్సవాలు జరుపుకోబోతున్న పల్నాడు జిల్లా నరసరావుపేటలోని శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ(ఎస్ఎస్ అండ్ ఎన్) కళాశాల స్థాయిలో ఎన్సీసీ విభాగం ఉంది. ఇక్కడ ఏటా సీనియర్ విద్యార్థులు జూనియర్లపై వికృతచేష్టలకు పాల్పడడం సర్వసాధారణంగా మారిందనే విమర్శలు ఉన్నాయి. ఏటా బీ సరి్టఫికెట్ పరీక్షకు వెళ్లే క్యాడెట్లను సీనియర్లు విచక్షణారహితంగా వెదురు బెత్తాలతో కొట్టడం ఇక్కడ ఆనవాయితీగా ఉందని సమాచారం. సీనియర్లు కొట్టే దెబ్బలకు చర్మం లేచిపోయి భరించలేని నొప్పితో ఎంతో మంది జూనియర్లు నరకయాతన అనుభవించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వైరలైన వీడియోలోనూ సీని యర్లు జూనియర్లను చితకబాదిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. గత ఫిబ్రవరిలో ఘటన గత ఫిబ్రవరి 3,4 తేదీలలో చీరాలలో జరగనున్న ఎన్సీసీ బీ–సరి్టఫికెట్ పరీక్షకు వెళ్లే 20 మంది క్యాడెట్లను సీనియర్లు 2 తేదీ అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు చితక్కొట్టారు. ఆ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. తమను తమ సీనియర్లు ఇంత కంటే ఎక్కువగా కొట్టారని వీడియోలో కామెంట్ చేయటం ఈ తంతు గత కొన్నేళ్లుగా కొనసాగుతున్నదనేందుకు నిదర్శనంగా ఉంది. క్యాడెట్ల పరేడ్‌ను పర్యవేక్షించాల్సిన ఎన్సీసీ ఆఫీసర్ డ్రిల్ సమయంలో ఉండరని విద్యార్థులు బుధవారం చెప్పారు. డ్రిల్ ఉన్న రోజు సాయంత్రం ఆలస్యంగా హాజరయ్యే క్యాడెట్లను క్రమశిక్షణ పేరుతో చిత్రహింసలకు గురిచేస్తుంటారని పేర్కొంటున్నారు. శృతి మించుతున్న ర్యాగింగ్!పల్నాడు జిల్లా నరసరావుపేటలోని SSN కాలేజీలో NCC ట్రైనింగ్ పేరుతో జూనియర్ విద్యార్థులను అర్ధరాత్రి వేళలో పిలిచి కట్టెలతో కొడుతున్న సీనియర్ విద్యార్థులు. pic.twitter.com/YxldJoRNew— Telugu Scribe (@TeluguScribe) July 24, 2024నోరువిప్పని యాజమాన్యం ఘటనపై ఎస్ఎస్ అండ్ ఎన్ కళాశాల యాజమాన్యం నోరు విప్పడం లేదు. కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు కపలవాయి విజయకుమార్ కళాశాలకు వచ్చి ప్రిన్సిపల్ డాక్టర్ సోము మల్లయ్య, ఎన్సీసీ ఆఫీసర్ మేజర్ బి.ఎస్.ఆర్.కె.రాజు, బాధిత విద్యార్థులను తన చాంబర్‌కు పిలిపించుకొని విచారణ చేశారు. విద్యార్థి సంఘాల నాయకులు ప్రిన్సిపల్ కార్యాలయాన్ని చుట్టుముట్టడంతో ప్రిన్సిపల్ డాక్టర్ మల్లయ్య ఘటనపై విచారణ జరుపుతున్నామని మొక్కుబడిగా ప్రకటించారు. కేసు నమోదు వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన వన్‌టౌన్ సీఐ కృష్ణారెడ్డి బుధవారం ఉదయం కళాశాల హాస్టల్‌కు వెళ్లారు. అక్కడ దాడిలో గాయపడిన విద్యార్థులను ఘటనపై ఆరా తీశారు. తమపై సీనియర్లు అజయ్‌కుమార్, గోపీకృష్ణ మరో నలుగురు కలిసి దాడి చేశారని సీహెచ్ పాల్ థామస్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. కాగా వివరణ కోరేందుకు కళాశాల హాస్టల్‌కు వచ్చిన మీడియా ప్రతినిధులపై ఎన్సీసీ ఆఫీసర్ మేజర్ బి.ఎస్.ఆర్.కె.రాజు, సీనియర్ ఎన్సీసీ క్యాడెట్లు దురుసుగా ప్రవర్తించారు.ఏఐఎస్ఎఫ్ ధర్నా.. ఎన్సీసీ జూనియర్ క్యాడెట్లపై సీనియర్ల దాషీ్టకాన్ని నిరసిస్తూ బుధవారం ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం, సీపీఐ ఆధ్వర్యంలో ఎస్ ఎస్ అండ్ ఎన్ కళాశాల ఎదుట, హాస్టల్ వద్ద ధర్నా నిర్వహించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు ఎం.నాగేశ్వరరావు, గోపిచంద్, సీపీఐ జిల్లా సహాయకార్యదర్శి కాసా రాంబాబు, పట్టణ కార్యదర్శి వైదన వెంకట్, ఉప్పలపాటి రంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
పల్నాడులో మళ్లీ పచ్చ మూకల అరాచకం
పెదకూరపాడు/నగరంపాలెం: పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం క్రోసూరు మార్కెట్ యార్డు చైర్మన్ ఈదా సాంబిరెడ్డి (70)పై మంగళవారం సినీ ఫక్కీలో హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఆయనను గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఘటన జరిగిన సమయంలో పల్నాడు జిల్లా ఎస్పీ కె. శ్రీనివాసరావు క్రోసూరులోనే ఉండటం గమనార్హం.సాంబిరెడ్డికి వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శిగా, మార్కెట్ యార్డు చైర్మన్‌గా, ఎంపీపీగా, సర్పంచ్‌గా ప్రజల్లో మంచి పేరు ఉంది. ఎన్నికలు ముగిసిన నాటి నుంచి ఆయన తన స్వగ్రామం పెదకూరపాడు మండలం 75 త్యాళ్ళూరులో ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ పెదకూరపాడు ఇన్చార్జి నంబూరు శంకరరావు మంగళవారం గుంటూరులోని తన కార్యాలయానికి వచ్చినట్లు తెలియడంతో సాంబిరెడ్డి.. తన ఇద్దరు అనుచరులు కీసర గంగాధరరెడ్డి, కల్లి శ్రీనివాసరెడ్డి, కారు డ్రైవర్ దామోదరరెడ్డితో వెళ్లి ఆయనను కలిశారు.తిరిగి వస్తుండగా అమరావతి మండలం ఉంగుటూరు, పెదకూరపాడు మండలం కంభంపాడు మధ్య సాంబిరెడ్డి ప్రయాణిస్తున్న కారుపై కొందరు దుండగులు మాటు వేసి మూకుమ్మడిగా దాడి చేశారు. ఆంజనేయ స్వామి దేవాలయం రోడ్డులో రెండు కారుల్లో మాటు వేసిన దుండగులు సాంబిరెడ్డి ప్రయాణిస్తున్న కారుకు ఇంకో కారును అడ్డుపెట్టి ఆయన కారు అద్దాలు పగలగొట్టారు. ఈ క్రమంలో శ్రీనివాసరెడ్డి, దామోదర్‌రెడ్డి, గంగాధరరెడ్డికి గాయాలయ్యాయి. సాంబిరెడ్డిని బయటకు లాగి పక్కకు తీసుకెళ్లి చేతులు మెలవేసి.. కాళ్లను లక్ష్యంగా చేసుకుని విచక్షణారహితంగా పది మంది దాడి చేశారు.ఈ దాడిలో ఆయన కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం మృతి చెందారని భావించి వదిలివెళ్లిపోయారు. ఎన్నికల సమయంలో మా అక్క (టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ భార్య లావణ్య) కారునే అడ్డుకుంటారా అంటూ దాడి చేసినట్లు బాధితులు తెలిపారు. కాగా, ఘటనాస్థలిని ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్లను రప్పించి వివరాలు సేకరిస్తామన్నారు. నిందితులను పట్టుకోవడానికి ఐదు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.దారుణంతెల్లారక ముందే.. దుకాణాలు కూల్చేశారు!విజయవాడ బుడమేరు వంతెన సెంటర్లో ఘటన.. లబోదిబోమంటున్న బాధితులుమధురానగర్ (విజయవాడసెంట్రల్): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చన నాటినుంచి పేదోడికి కష్టాలు ప్రారంభమయ్యాయి. విజయవాడ నడి»ొడ్డునున్న బుడమేరు సెంటర్లోని చిరువ్యాపారుల దుకాణాలను మంగళవారం తెల్లవారుజామున కూలి్చవేయడంతో వారంతా నడిరోడ్డున పడ్డారు. ఎటువంటి సమాచారం లేకుండా తమ బతుకుపై దెబ్బకొట్టారని వారు లబోదిబోమంటూ రోడ్డెక్కి నిరసనకు దిగారు.వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని బుడమేరు వంతెన సెంటర్లో పలువురు చిరువ్యాపారాలు సాగిస్తూ 40 ఏళ్లుగా జీవనం సాగిస్తున్నారు. వైఎస్సార్సీపీ సానుభూతి పరులు కావడంతో పది రోజుల క్రితం దుకాణాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమను కలిసి గోడు విన్నవించుకోగా.. తాను అధికారులతో మాట్లాడతానని చెప్పి పంపించి వేశారు. దీంతో విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు.అయితే మంగళవారం తెల్లవారుజాము రెండు గంటల సమయంలో ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా నగరపాలక సంస్థ టౌన్‌ఫ్లానింగ్ అధికారులు, పోలీసుల సహకారంతో దుకాణాలను కూలి్చవేశారు. సమాచారం తెలుసుకున్న దుకాణదారులు లబోదిబోమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ 40 ఏళ్లుగా దుకాణాలను పెట్టుకుని జీవనం సాగిస్తున్నామని ఇప్పుడు అర్ధాంతరంగా దుకాణాలు తొలగిస్తే.. ఎక్కడకు వెళ్లాలని ప్రశి్నస్తున్నారు. కనీసం తమకు సమాచారం ఇవ్వకుండా తాళాలు వేసి ఉన్న దుకాణాలు కూలి్చవేశారని, తమకు పునరావాసం కలి్పంచాలని డిమాండ్ చేస్తున్నారు.దుర్మార్గంశిలాఫలకంలోని చిత్రాలను పగులకొట్టారు⇒ఏలూరు జిల్లా నూజివీడు మండలంలోని బోర్వంచలోని గ్రామ సచివాలయ భవనం శిలాఫలకాన్ని పచ్చ మూకలు సోమవారం రాత్రి ధ్వంసం చేశాయి. సచివాలయం గోడకు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఏర్పాటు చేసి దానిపై అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, ఎంపీ కోటగిరి శ్రీధర్ల ఫొటోలను ఏర్పాటు చేశారు.పచ్చమూకలు శిలాఫలకంపై ఉన్న వైఎస్ జగన్, మేకా ప్రతాప్ ఫొటోలను పలుగులతో పగులగొట్టారు. దీనిపై వైఎస్సార్సీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇదే సచివాలయం కిటికీ అద్దాలను పగులకొట్టారని, దీనిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే ఇంతవరకు కేసు కూడా నమోదు చేయలేదని మండిపడ్డారు. – నూజివీడుదాష్టీకం అభాగ్యురాలి జీవితం చిదిమేశారు⇒ విశాఖలో యువతిపై అత్యాచారం⇒ కేజీహెచ్‌కు బాధితురాలు తరలింపు⇒ గోప్యంగా ఉంచుతున్న పోలీసులు⇒ కొద్ది రోజుల క్రితమే ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడి⇒ ఆ ఘటన మరువకముందే మరో దారుణంమధురవాడ (విశాఖపట్నం): విశాఖపట్నంలోని మధురవాడలో కొద్ది రోజుల కిందట ముక్కుపచ్చలారని ఐదేళ్ల చిన్నారిపై అత్యాచార ఘటన మరువక ముందే సోమవారం రాత్రి మరో దారుణం చోటు చేసుకుంది. గంజాయి మూకలు 19 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాయి. ఈ ఘటన విశాఖ నార్త్ సబ్ డివిజన్ పీఎంపాలెం పోలీస్‌స్టేషన్ పరిధి కొమ్మాది జంక్షన్ వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. యువతి చోడవరం ప్రాంతం నుంచి వచ్చి కొమ్మాది జంక్షన్ వద్ద ఉన్న ఒక బేకరీలో పనిచేస్తోంది.ఓ ప్రైవేటు హాస్టల్లో ఉంటోంది. సోమవారం రాత్రి ఆమె విధులు నిర్వహిస్తున్న క్రమంలో కాలకృత్యాల కోసం బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆమెపై బేకరీ–హాస్టల్‌కి మధ్య ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో గంజాయి సేవిస్తున్న కొందరు యువకులు దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డట్టు సమాచారం. రాత్రి ఒంటి గంట సమయంలో బాధితురాలు హాస్టల్‌కి వెళ్లింది. కాసేపటికే వాంతి చేసుకుంది. హాస్టల్ వార్డెన్ పరిశీలించగా యువతి చెంపపై గాయం కూడా కనిపించింది.దీంతో అనుమానం వచ్చిన వార్డెన్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కి సమాచారం ఇచ్చారు. వెంటనే పీఎం పాలెం పోలీసులు హాస్టల్‌కి చేరుకుని పక్కనే ఉన్న గాయత్రి ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచనలతో విశాఖ కేజీహెచ్‌కి తీసుకెళ్లారు. అయితే బాధితురాలితో మాట్లాడేందుకు ఎవరినీ అనుమతించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.ఈ దారుణ ఘటనపై విశాఖ పోలీస్ కమిషనర్ సీరియస్ అయినట్టు తెలిసింది. ఈ వ్యవహారాన్ని పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. ఈ విషయమై నార్త్ జోన్ ఏసీపీ సునీల్‌ను వివరణ కోరగా అత్యాచారం లాంటిది ఏమీ లేదన్నారు. యువతికి చిన్న దెబ్బలు తగిలాయని.. విచారణ చేస్తున్నామని తెలిపారు.