సాక్షి, పల్నాడు జిల్లా: మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరితెగించారు. దుర్గి మండలం కోలగొట్లలో వైఎస్సార్‌సీపీ నేత కన్నెబోయిన నాసరయ్య పొలాన్ని జేసీబీలతో మట్టిని తవ్వేసి తరలించుకుపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీడీపీ నేతల బెదిరింపులతో కన్నెబోయిన నాసరయ్య ఊరు వదిలి బయటకు వచ్చి నివసిస్తున్నారు. టీడీపీ నాయకుల దందాను వీఆర్వో దృష్టికి తీసుకువెళ్తే.. టీడీపీ నేతలను సంప్రదించమంటూ సలహా ఇస్తున్నారని నాసరయ్య మండిపడుతున్నారు.
ప్రోక్లైన్లతో నాసరయ్య పొలంలో పెద్ద పెద్ద గోతులు పెడుతూ టీడీపీ నేతలు మట్టి తీసుకెళ్లిపోయారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి మరోసారి పొలంలో తవ్వకాలు మొదలుపెట్టిన టీడీపీ రౌడీలు.. భారీగా మట్టి తరలిస్తున్నారు. ప్రభుత్వం మాదంటూ.. పోలీసులు, కలెక్టర్ గాని మమ్మల్ని ఎవరు ఏం చేయలేరంటూ టీడీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. తెలుగుదేశం నాయకుల బెదిరింపులతో అధికారులు చేతులెత్తేశారు.
ఇదీ చదవండి: మాధవీలతపై వ్యాఖ్యలు..క్షమాపణ చెప్పిన జేసీ ప్రభాకర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment