సాక్షి,అనంతపురం:తన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వెనక్కి తగ్గారు. సినీ నటి మాధవీలతకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. మాధవీలతపై జేసీ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
జేసీ వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు రావడంతో మాధవీలతను ఆయన క్షమాపణలు కోరారు.‘ఆవేశంలో నోరు జారాను,టంగ్ స్లిప్ అయింది..సారీ’అని జేసీ అన్నారు. అయితే బీజేపీ నేతలపై మాత్రం జేసీ విమర్శలు కొనసాగించారు.
బీజేపీ నేతలంతా ఫ్లెక్సీ గాళ్లు అంటూ మరోసారి ఫైరయ్యారు జేసీ. పవర్ ఉందని మంత్రి సత్యకుమార్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. తాను మీరకున్నంత నీచున్ని కాదన్నారు.
పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదన్నారు. నేను జోలి పడితే కోట్ల రూపాయలు ఇచ్చేందుకు జనం సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మీడియా ఎదుట నోట్ల కట్టలు విసురుతూ జేసీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఇదీ చదవండి: తుస్సుమన్న బాబు,పవన్ హామీ
Comments
Please login to add a commentAdd a comment