కర్ణాటక రోడ్డు ప్రమాదంపై వైఎస్‍ జగన్ దిగ్భ్రాంతి | Ys Jagan Mohan Reddy Reacts On Karnataka Accident Today | Sakshi
Sakshi News home page

ఏపీ కూలీలు మృతి.. వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి

Feb 8 2026 10:50 PM | Updated on Feb 9 2026 8:54 AM

Ys Jagan Mohan Reddy Reacts On Karnataka Accident Today

సాక్షి, తాడేపల్లి: కర్ణాటకలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన నలుగురు కూలీలు మృత్యువాత పడ్డారు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ విచారం వ్యక్తం చేశారు. కర్ణాటకలోని శ్రీనివాసపురం వద్ద ఈ ప్రమాదం జరగ్గా.. ఏపీకి చెందిన నలుగురు కూలీలు మరణించడం విషాదకరమని వైయస్‌ జగన్‌ అన్నారు. 

మృతులంతా అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందినవారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు కూడా. మృతుల కుటుంబాలకు జగన్.. ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

 

Advertisement
 
Advertisement
Advertisement