Accident
-
‘హుస్సేన్ సాగర్ బోటు ప్రమాదం.. రిపోర్ట్ ఎందుకివ్వలేదు?’
సాక్షి, హైదరాబాద్: హుస్సేన్ సాగర్ బోటు ప్రమాదంపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన నెక్లెస్ రోడ్డులో జరిగిన మహా హారతి కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. అయితే, హుస్సేన్ సాగర్‌లోని బోటులో క్రాకర్స్ ఎవరి అనుమతితో కాల్చారంటూ ప్రశ్నించిన మంత్రి.. ప్రమాదంపై తనకు ఇప్పటి వరకు ఎందుకు నివేదిక ఇవ్వలేదంటూ అధికారులను నిలదీశారు.తక్షణమే ప్రమాద బాధితులకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. టూరిజం బోటులో బాణాసంచా ఎలా అనుమతి ఇస్తారంటూ మండిపడ్డ మంత్రి.. సంబంధిత అధికారిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. కాగా, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని ఫోన్లో సంప్రదించేందుకు జూపల్లి కృష్ణారావు ప్రయత్నించగా, జూపల్లి ఫోన్‌కు కిషన్‌రెడ్డి స్పందించలేదు. బోటు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించిన విషయాన్ని జూపల్లికి తెలియకుండా అధికారులు గోప్యంగా ఉంచారు.కాగా, సాధారణంగా బాణసంచా కాల్చేందుకు పోలీసు ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. కానీ హుస్సేన్‌సాగర్‌లో మహా హారతి కార్యక్రమంలో బాణసంచా కాల్చేందుకు పోలీసుల అనుమతి తీసుకోలేదని తెలుస్తోంది. లుంబినీ పార్కు మేనేజర్, బోటింగ్ ఇన్చార్జి, ఇతర అధికారుల అనుమతితో బోటులో బాణసంచా కాల్చేందుకు వెళ్లినట్లు సమాచారం.ఇదీ చదవండి: బోటు ప్రమాదం.. కన్నతల్లి కన్నీటి వ్యథ -
Baghpat Incident: లడ్డూ పండుగలో విషాదం.. ఏడుగురు మృతి
ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో ఈరోజు (మంగళవారం) పెను ప్రమాదం చోటుచేసుకుంది. ఆదినాథుని నిర్వాణ లడ్డూ పండుగ సందర్భంగా మానస్తంభ్ కాంప్లెక్స్‌లో నిర్మించిన చెక్క నిర్మాణం కూలిపోయింది. ఈ ఘటనలో 50 మందికి పైగా భక్తులు శిథిలాల కింద చిక్కుకున్నారు. తాజాగా ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందినట్లు తెలుస్తోంది.ఈ ఘటన గురించి బాగ్పత్ పోలీసు అధికారి అస్మితా లాల్ మాట్లాడుతూ ‘బరౌట్లో జైన సమాజ ఉత్సవం జరుగుతుండగా, ఒక చెక్క నిర్మాణం కూలిపోయింది. ఫలితంగా 40 మంది గాయపడ్డారు. చికిత్స తర్వాత 20 మందిని వారి ఇళ్లకు పంపించారు. మరో 20 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏడుగురు మృతి చెందారు’ అని తెలిపారు.ఈ ప్రమాదం మంగళవారం ఉదయం బరౌత్‌లోని గాంధీ రోడ్డులో జరిగింది. ప్రమాదం అనంతరం సంఘటనా స్థలంలో తొక్కిసలాట జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఏడుగురు పోలీసులు కూడా గాయపడ్డారని తెలుస్తోంది. ఈ సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే డిఎం అస్మితా లాల్, ఎస్పీ అర్పిత్ విజయవర్గియా ఆసుపత్రికి చేరుకుని గాయపడిన వారిని పరామర్శించారు.#बागपत l भगवान आदिनाथ के निर्वाण लड्डू पर्व पर मान स्तम्भ परिसर में बना लकड़ी से बना पैड ढह गया। इसमें सात श्रद्धालुओं की मौत की खबर है। जबकि 75 से अधिक घायल हैं। मृतकों की संख्या में इजाफा हो सकता है। #baghpat #upnews pic.twitter.com/0BHLOjFYdE— Sudhir Chauhan (@sudhirstar) January 28, 2025బాగ్‌పత్‌లో జరిగిన ప్రమాదం గురించి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలుసుకున్నారు. అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి సరైన చికిత్స అందించాలని జిల్లా పరిపాలన అధికారులను సీఎం ఆదేశించారు. అలాగే గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఇది కూడా చదవండి: Mahakumbh : 15 కోట్ల మంది పుణ్యస్నానాలు పూర్తి.. మౌని అమావాస్య అంచనాలివే -
పరవాడ ఫార్మాసిటీలో మరో ప్రమాదం.. కార్మికుడి దుర్మరణం
సాక్షి,అనకాపల్లిజిల్లా: పరవాడ ఫార్మాసిటీలో మరో ప్రమాదం జరిగింది. విష్ణు కెమికల్స్ ఫ్యాక్టరీలో శనివారం(జనవరి25) జరిగిన ప్రమాదంలో కాంట్రాక్టు కార్మికుడొకరు ప్రాణాలు కోల్పోయాడు. ఫ్యాక్టరీ కన్వేయర్ బెల్ట్‌లో పడి కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు. మృతుడిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన కార్మికుడిగా గుర్తించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫార్మాసిటీలో ఇటీవలి కాలంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. జనవరి 21వ తేదీన ఇక్కడ ఓ ప్రమాదం జరిగింది. మెట్రోకెన్ పరిశ్రమ స్టోరేజ్ ట్యాంక్‌లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.కాగా, గత ఏడాది డిసెంబర్లో ఫార్మాసిటిలో విజయశ్రీ ఆర్గానిక్స్ పరిశ్రమలో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో విష రసాయనాలు మీద పడడంతో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. విజయశ్రీ ఆర్గానిక్స్ పరిశ్రమలో ప్రొడక్షన్ బ్లాక్–1లో ఏఎన్ఎఫ్–డి రియాక్టర్ మ్యాన్‌హోల్ ఓపెన్ చేసినప్పుడు మంటలు ఎగసిపడ్డాయి. ఆ సమయంలో విధి నిర్వహణలో ఉన్న ఏఎన్ఆర్గా పనిచేస్తున్న రజ్జూ, మరో ఉద్యోగి సీహెచ్ వెంకట సత్య సుబ్రహ్మణ్య స్వామి తీవ్రంగా గాయపడ్డారు. ఇదీ చదవండి: మంటల్లో దగ్ధమైన నివాసాలు.. పలువురికి గాయాలు -
సురక్షితం ఏఐ రాస్తే
నిత్యం జరిగే రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని ప్రమాదాలకు మానవ తప్పిదాలు కారణమవుతుండగా, మరికొన్ని చోట్ల రోడ్ల నిర్మాణంలోని లోపాలు కారణంగా నిలుస్తున్నాయి. ఈ రెండో సమస్యకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో పరిష్కారం కనిపెట్టారు. హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలోని ఐఎన్ఏఐ కేంద్రం ఆవిష్కరించిన ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ ఫర్ రోడ్ సేఫ్టీ త్రూ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ (ఐరాస్తే) ఈ సమస్యకు దారి చూపింది. తెలంగాణ ప్రభుత్వం, ఇంటెల్ సహకారంతో ఐరాస్తేను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. -సాక్షి, హైదరాబాద్ఒక రహదారిపై ప్రమాదాలు జరిగే అవకాశం 80 నుంచి 90 శాతం ఉన్న ప్రదేశాన్ని గ్రే స్పాట్‌గా గుర్తిస్తారు. అయితే, వరుసగా మూడేళ్లపాటు అదేచోట ప్రమాదాలు జరిగి పది మందికంటే ఎక్కువ చనిపోతే, ఆ ప్రదేశాన్ని బ్లాక్ స్పాట్ జాబితాలో చేర్చుతారు. ఇలాంటి ప్రదేశాలను గ్రే స్పాట్ల స్థాయిలోనే తెలుసుకోగలిగితే ప్రమాదాలు జరగకుండా, ప్రాణాలు పోకుండా కాపాడవచ్చు. సరిగ్గా ఈ పనే చేస్తుంది ఐరాస్తే. ఒక ప్రాంతాన్ని బ్లాక్ స్పాట్‌గా గుర్తించేందుకు మూడేళ్లు ఆగాల్సిన పనిలేకుండా ఏఐ సహకారంతో ముందుగానే గుర్తిస్తుంది. మూడు రహదారులపై అధ్యయనం.. ఐరాస్తేను రాష్ట్రంలోని మూడు ప్రధాన రహదారులపై ప్రయోగించి చూశారు. 2023, ఏప్రిల్ నుంచి 2024, మార్చి వరకు టీఎస్ఆర్టీసీకి చెందిన 200 బస్సుల్లో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ఏడీఏఎస్) పరికరాలు, 10 డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ (డీఎంఎస్) యూనిట్లను ఏర్పాటు చేసి పరీక్షించారు. మొత్తం 691 కిలోమీటర్ల మేర రోడ్లను అధ్యయనం చేశారు. 2022 నుంచి 2024 వరకు 5,606 ఎఫ్ఐఆర్లు, రోడ్డు ప్రమాద రికార్డులతో సహా క్రాష్ నివేదికలు, ఏడీఏఎస్ హెచ్చరికలు, బ్లాక్ స్పాట్లపై నిర్వహించిన భద్రతా ఆడిట్ట్లను పరిశీలించి ఒక్కో రహదారిపై 20 చొప్పున గ్రే స్పాట్లను ఐ రాస్తే గుర్తించింది. 15 గ్రే స్పాట్‌ల్లో పరిష్కార చర్యలను సూచిస్తూ జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ (ఎన్హెచ్ఏఐ)కు నివేదికలు సమర్పించారు. బారియర్స్‌తో సరిదిద్దవచ్చు.. కొన్ని గ్రే స్పాట్లకు స్వల్ప పరిష్కారాలు సరిపోతాయి. బారియర్స్, సైన్‌బోర్డులు, టీ–ఇంటర్ సెక్షన్ హెచ్చరిక సంకేతాలతో వాటిని సరిదిద్దవచ్చు. మరికొన్నింటికి ఆకృతి మార్పులు అవసరం. ఇప్పటివరకు మూడు గ్రే స్పాట్స్ సరిదిద్దే చర్యలకు ఎన్హెచ్ఏఐ టెండర్లను ఆహ్వనించింది. మిగిలిన ప్రదేశాలలో పని జరుగుతోంది. – పృథ్వీ, ఐ–రాస్తే ఆపరేషన్స్ మేనేజర్ 600 మందికి ఏబీసీలో శిక్షణ ప్రమాదాలు జరిగినప్పుడు తొలి స్పందన కోసం ఐరాస్తే 600 మంది స్థానికులకు యాక్టివ్ బ్లీడింగ్ కంట్రోల్ (ఏబీసీ)లో శిక్షణ ఇచ్చింది. వీరు 8 నెలల్లో 10 మంది ప్రాణాలు కాపాడారు. ఈ ఇంటిగ్రేటెడ్ నివారణ విధానం బ్లాక్ స్పాట్స్ ఏర్పడుతున్నప్పుడు వాటిని అంచనా వేయగలదు. ఈ ప్రాజెక్టు విస్తరణకు రాజస్థాన్, జమ్ముకశీ్మర్ ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నాం. – గోవింద్ కృష్ణన్, ఐ–రాస్తే ప్రోగ్రామ్ మేనేజర్, ట్రిపుల్ హైదరాబాద్ -
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం, 8 మంది మృతి
-
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం
-
ఊడిన కారు టైరు.. మంత్రాలయ విద్యార్థుల దుర్మరణం
బెంగళూరు, సాక్షి : కర్ణాటకలో బుధవారం(జనవరి22) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు టైర్ ఊడిపడడంతో.. వాహనం బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా నలుగురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల్లో ముగ్గురిని కర్నూలు జిల్లా మంత్రాలయ రాఘవేంద్రస్వామి మఠం వేద పాఠశాల విద్యార్థులుగా గుర్తించారు.హంపిలోని శ్రీ నరహరి తీర్థుల బృందావనంలో ఆరాధానోత్సవాల కోసం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. నట్లు, బోల్టులు ఊడిపోవడంతో తుఫాన్ వాహనం బోల్తాపడినట్లు ప్రాథమికంగా తేలింది. ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం 14 మంది విద్యార్థులున్నారు. పోలీసులు ప్రమాద స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకున్నారు. -
ఫార్మాసిటీలో మరో ప్రమాదం..
సాక్షి, అనకాపల్లి: ఫార్మాసిటీలో మరో ప్రమాదం జరిగింది. మెట్రోకెన్ పరిశ్రమ స్టోరేజ్ ట్యాంక్‌లో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు వరుస ప్రమాదాలతో కార్మికులు, స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.కాగా, గత ఏడాది డిసెంబర్లో ఫార్మాసిటిలో విజయశ్రీ ఆర్గానిక్స్ పరిశ్రమలో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో విష రసాయనాలు మీద పడడంతో ఇరువురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.విజయశ్రీ ఆర్గానిక్స్ పరిశ్రమలో ప్రొడక్షన్ బ్లాక్–1లో ఏఎన్ఎఫ్–డి రియాక్టర్ మ్యాన్‌హోల్ ఓపెన్ చేసినప్పుడు మంటలు ఎగసిపడ్డాయి. ఆ సమయంలో విధి నిర్వహణలో ఉన్న ఏఎన్ఆర్గా పనిచేస్తున్న రజ్జూ, మరో ఉద్యోగి సీహెచ్ వెంకట సత్య సుబ్రహ్మణ్య స్వామి తీవ్రంగా గాయపడ్డారు. -
అమెరికాలో హైదరాబాద్ యువకుడిపై కాల్పులు
-
షూటింగ్ సెట్లో ప్రమాదం.. రకుల్ ప్రీత్ సింగ్ భర్తకు గాయాలు!
బాలీవుడ్ మూవీ షూటింగ్ సెట్లో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో హీరో అర్జున్ కపూర్‌తో పాటు నిర్మాత జాకీ భగ్నానీ, దర్శకుడు ముదస్సర్ అజీజ్‌కు గాయాలయ్యాయి. మేరే హస్బెండ్‌కి బీవీ మూవీ షూట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదం ఈనెల 18న జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం కాస్తా ఆలస్యంగా బయటకొచ్చింది. మూవీ షూటింగ్ జరుగుతుండగా సెట్లో సీలింగ్ కూలిపోవడంతో ప్రమాదం జరిగినట్లు చిత్రబృందం తెలిపింది. ఈ ప్రమాదంపై ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) అధ్యక్షుడు బీఎన్ తివారీ స్పందించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఆయన వెల్లడించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆ ప్రదేశంలో షూటింగ్‌ను నిలిపివేశామని తెలిపారు.బీఎన్ తివారీ మాట్లాడుతూ.. 'ఎవరికీ పెద్ద గాయాలు ఏమీ లేవు. కానీ అదృష్టవశాత్తూ ఎవరూ తీవ్రంగా గాయపడలేదు. షూటింగ్ జరుగుతున్న ప్రదేశంలో సరైన నిర్వహణ లేకపోవడంతోనే స్టూడియోలో పైకప్పు కూలిపోయింది. కాబట్టి, భద్రతా కారణాల దృష్ట్యా షూటింగ్ ఆపేశారు. సినీ పరిశ్రమలోని సిబ్బంది ఆరోగ్యం, భద్రతపై మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ పంపాం. భవనాలు ఏదో ఒక రోజు కూలిపోయేలా ఉన్నాయని ఫిలిం సిటీకి కూడా లేఖ రాశాం. ఈ ప్రమాదం జరిగినప్పుడు అత్యవసర ద్వారం కనిపించలేదు. చిత్ర పరిశ్రమ అంతా దేవుడి ఆశీస్సులతో ముందుకెళ్తోంది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం' అన్నారాయన.కాగా.. అర్జున్ కపూర్ గాయంతోనే ఆసుపత్రిలో సైఫ్ అలీ ఖాన్‌ను పరామర్శించేందుకు వెళ్లారు. మేరే హస్బెండ్ కి బీవీ ఫిబ్రవరి 21, 2025న థియేటర్లలోకి రానుంది. నిర్మాత జాకీ భగ్నానీ గతేడాది టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. -
పారాసెటమాల్..వాడకం.. జర భద్రం...!
ఏపీ సెంట్రల్ డెస్క్: పారాసెటమాల్.. ఈ ట్యాబ్లెట్ గురించి తెలియని వారుండరు. కరోనా తరువాత దీనికి మరింత గుర్తింపు వచ్చింది. జ్వరం రాగానే చాలామంది డాక్టర్‌ను సంప్రదించకుండానే వేసుకునే మందు బిళ్ల ఇది. అదీ కాకుండా నొప్పులకు కూడా పనిచేస్తుందని తెలిసిన తరువాత దీని వినియోగం మరింత పెరిగింది. ఇదిలా ఉంటే.. చిన్న, చిన్న నొప్పులకు కూడా ఈ ట్యాబ్లెట్‌ను జనం విస్తృతంగా వాడేస్తున్నారు. ఇలా వినియోగించడం ఆరోగ్యానికి ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అతిగా వినియోగిస్తే కాలేయానికి హాని చేస్తుందని, కిడ్నీ సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. పారాసెటమాల్ విషపూరితంగా మారితే ఎక్కువ శాతం స్త్రీలే ముప్పు ఎదుర్కొంటున్నారు.కాలేయానికి హాని: పారాసెటమాల్‌ను అధిక మోతాదులో వినియోగిస్తే కాలేయానికి తీవ్ర హాని చేస్తుంది. ఈ మందును తీసుకున్నప్పుడు కాలేయం దీన్ని సమర్ధంగా ప్రాసెస్ చేయలేకపోతుంది. ఆ సమయంలో వచ్చే విషపూరిత ఉత్పత్తుల వల్ల కాలేయ కణాలు దెబ్బతింటాయి. కొన్ని పరిస్థితుల్లో కాలేయ వైఫల్యానికి దారి తీసే అవకాశం ఉంటుంది. వికారం, వాంతులు, కడుపునొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి.కిడ్నీ సమస్యలు: దీర్ఘకాలం పాటు అధిక మోతాదులో పారాసెటమాల్ తీసుకోవడం వల్ల కిడ్నీలకు కూడా హాని కలుగుతుంది. పనితీరు దెబ్బతింటుంది. మూత్రవిసర్జనలో మార్పులు, కాళ్లవాపు, అలసట, రక్తపోటు వంటి సమస్యలు తలెత్తుతాయి. గుండె సంబంధిత సమస్యలు:ఎక్కువమంది పారాసెటమాల్ ను నిర్లక్ష్యంగా వాడటం వల్ల గుండెపోటు, రక్తనాళాల కుదింపు/రక్తప్రవాహం మార్పు వంటి గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మరికొంతమందికి అలెర్జీ సమస్యలు రావచ్చు. చర్మంపై దద్దుర్లు, దురద, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముఖం, పెదవులు, నాలుక వాపు వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉంది.అతి వినియోగం.. అనర్ధదాయకంపారాసెటమాల్ టాబ్లెట్‌ను డోస్‌కు మించి అతిగా వినియోగించకూడదు. అలా చేస్తే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పేగుపూత, కాలేయం దెబ్బతినడం, కామెర్లు, కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఒక్కో సందర్భంలో గుండె సంబంధిత వ్యాధులకూ దారి తీయవచ్చు. – డాక్టర్ జె. నాగరాజు, డిప్యూటీ సివిల్ సర్జన్, ఏరియా ఆస్పత్రి, నరసరావుపేట. -
విహార యాత్రలో విషాదం
-
యూపీకి వెళ్తున్న తెలంగాణ బస్సులో మంటలు
-
మీకు తెలుసా? ప్రమాద బాధితుల్ని కాపాడితే కేంద్రం డబ్బులిస్తుంది!
ఢిల్లీ : రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్యం కోసం ఆస్పత్రులకు తరలించే గుడ్ సమరిటన్ల (good samaritans) రివార్డ్ మొత్తాన్ని రూ.5 వేల నుంచి రూ.25వేలకు పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (nitin gadkari) శనివారం తెలిపారు.రోడ్డు భద్రతపై నటుడు అనుపమ్ ఖేర్ జరిగిన ఇంటర్వ్యూలో గడ్కరీ మాట్లాడుతూ.. గంటలోపు రోడ్డు ప్రమాద బాధితుల్ని ఆస్పత్రికి తరలించడంతో పాటు వారి ప్రాణాల్ని రక్షించే వారికి అందించే రివార్డ్ (reward) తక్కువగా ఉందని, ఆ మొత్తాన్ని పెంచుతున్నట్లు రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖకు ఆదేశించినట్లు చెప్పారు.అక్టోబర్ 2021 నుంచి రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేసే వారికి ప్రోత్సహించేలా రివార్డ్‌ను అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా రోడ్డు ప్రమాద బాధితులకు గంటలోపు ఆస్పత్రికి తరలించి, వారి ప్రాణాల్ని కాపాడేందుకు రూ.5వేల రివార్డ్ అందిస్తోంది. గుడ్ సమరిటన్ రివార్డ్ పొందాలంటేకేంద్రం అందించే గుడ్ సమరిటన్ రివార్డ్ పొందాలంటే ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా ప్రమాదంలో గాయపడ్డ క్షతగాతుల్ని గంటలోపు ఆస్పత్రికి తరలించి ప్రాణాల్ని కాపాడిన ప్రాణదాతలు పోలీసులకు సమాచారం అందించాల్సి ఉంది. పోలీసులు అధికారిక లెటర్ ప్యాడ్‌పై మిమ్మల్ని ప్రాణదాతగా గుర్తించి మీ వివరాల్ని మోదు చేసుకుంటారు. అంనతరం మీకో ఎక్నాలెడ్జ్మెంట్ ఇస్తారు. ఆ ఎక్నాలెడ్జ్మెంట్ను జిల్లాస్థాయి అప్రైజల్ కమిటీకి పంపుతారు. అక్కడి నుంచి ప్రాణదాతకు ప్రోత్సాహం అందించాలంటూ రాష్ట్ర రవాణా కమిషనర్‌కు సిఫార్సు చేస్తారు. రవాణాశాఖ సంబంధిత వ్యక్తికి బ్యాంకులో రూ.5 వేలు జమ చేయడంతోపాటు ప్రశంసాపత్రం అందజేస్తుంది. బాధితుల్ని కాపాడిన వ్యక్తులకు వేధింపులు ఇతర ఇబ్బందుల నుంచి గుడ్ సమరిటన్ చట్టం రక్షిస్తుంది.👉చదవండి : నా భార్యను చూడటం నాకు చాలా ఇష్టం -
అజిత్ కుమార్‌కు తప్పిన పెను ప్రమాదం.. వీడియో వైరల్!
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్‌కు(Ajith Kumar) పెను ప్రమాదం తప్పింది. దుబాయ్‌లో జరుగుతున్న రేసింగ్‌లో ఆయన నడుపుతున్న కారు పక్కనే ఉన్న ట్రాక్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అజిత్‌కు స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. రేసింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా కారు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంక్రాంతి బరిలో అజిత్..కాగా.. అజిత్ కుమార్ హీరోగా ప్రస్తుతం ‘విడాముయర్చి మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మగిళ్ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో అర్జున్ సర్జా ప్రధాన పాత్ర పోషించారు. లైకా ప్రోడక్షన్స్ బ్యానర్‌పై జీకేఎం తమిళ్ కుమరన్ నేతృత్వంలో సుభాస్కరన్ నిర్మించిన ఈ సినిమా ఈ సంక్రాంతికి విడుదల కానుంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన విడాముయార్చి సినిమా టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. దీంతో మా మూవీపై అంచ నాలు మరింతగా పెరిగాయి. ఈ చిత్రంలో ఆరవ్, రెజీనా కసండ్రా, నిఖిల్ నాయర్ కీలక పాత్రల్లో నటించారు.మైత్రి మూవీ మేకర్స్‌తో మరో సినిమా..అజిత్ కుమార్ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌తో జతకట్టారు. ఆయన హీరోగా తెరకెక్కిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఇందులోనూ త్రిషనే హీరోయిన్గా నటిస్తోంది . ‘మార్క్ ఆంటోని’ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.వేసవిలో రిలీజ్..ఈ మూవీని వేసవిలో ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ మేరకు కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. అజిత్‌పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. ఇండియన్ మూవీ చరిత్రలోనే గుడ్ బ్యాడ్ అగ్లీ ఓ మైలురాయిగా నిలుస్తుందిని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతం అందించారు. కాగా ఈ చిత్రాన్ని తొలుత సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ వీలు కాకపోవడంతో ఏప్రిల్‌కు రిలీజ్ కానుంది. Ajith Kumar’s massive crash in practise, but he walks away unscathed.Another day in the office … that’s racing!#ajithkumarracing #ajithkumar pic.twitter.com/dH5rQb18z0— Ajithkumar Racing (@Akracingoffl) January 7, 2025 -
పోలీసుల కర్కశం.. యాక్సిడెంట్ జరిగిన ప్రాంతం మాది కాదయ్యా..
భోపాల్ : మానవత్వం చూపించాల్సిన పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు చనిపోతే.. బాధితుడి భౌతిక కాయాన్ని స్వాధీనం చేసుకుని తదుపరి కార్యక్రమాలు నిర్వహించాల్సింది పోయి కర్కశాన్ని ప్రదర్శించారు. అచ్చం ‘జై భీమ్’(jai bhim) సినిమాలో పోలీస్ స్టేషన్లో తాము చేసిన దాడిలో గిరిజనుల చనిపోతే.. కేసు నుంచి తప్పించుకునేందుకు పోలీసులు బాధితుల మృతదేహాల్ని జిల్లాల సరిహద్దుల్ని ఎలా మార్చారో.. అలాగే ఈ విషాదంలో బాధితుడికి ప్రమాదం జరిగిన ప్రాంతం తమ పరిధిలోకి రాదంటూ రెండు రాష్ట్రాల పోలీసులు తప్పించుకున్నారు. డెడ్ బాడీని రోడ్డుమీద వదిలేశారు. చివరికి.. మధ్యప్రదేశ్‌కు చెందిన రాహుల్ అహిర్వార్ (27) దినసరి కూలి. మధ్యప్రదేశ్ (madhya pradesh) నుంచి ఢిల్లీకి వచ్చి అక్కడే దొరికిన పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే ఈ క్రమంలో రాహుల్ మధ్యప్రదేశ్ నుంచి ఢిల్లీకి వెళ్లాడు. అక్కడ ఓ ప్రాంతంలో రోడ్డు దాటుతుండగా నిన్న సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మరణించాడు. రాహుల్ మరణంపై సమాచారం అందుకున్న రాహుల్ సన్నిహితులు మధ్యప్రదేశ్‌లోని హర్పాల్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సన్నిహితుల ఫిర్యాదుతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ప్రమాదం జరిగిన ప్రాంతం ఉత్తరప్రదేశ్(uttarpradesh)లోని మహోబా జిల్లాలోని మహోబ్‌కాంత్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని చెప్పారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు.చేసేది లేక రాహుల్ భౌతిక కాయాన్ని అక్కడే ఉంచి ఉత్తర ప్రదేశ్ మహోబ్‌కాంత్ పీఎస్‌కు సమాచారం అందించారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. శవ పరీక్ష చేయించేందుకు నిరాకరించారు. ఇది తమ ప్రాంతం పరిధిలోకి రాదంటూ బుకాయించారు.దీంతో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు రోడ్డును దిగ్బంధించారు. ప్రమాదం జరిగిన నాలుగు గంటల తర్వాత మధ్యప్రదేశ్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్షకు పంపించారు. ఆ తర్వాతే గ్రామస్తులు రోడ్డును క్లియర్ చేసి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.రాహుల్ మరణంతో అతడి కుటుంబ సభ్యులు రోడ్డుపై మృతదేహం పక్కనే రోదిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా యువకుడి బంధువు మాట్లాడుతూ...‘ మా కుటుంబ సభ్యుడు రాహుల్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఈ ప్రాంతం మధ్యప్రదేశ్ పరిధిలోకి వస్తుంది. కానీ పోలీసులు కేసు నమోదు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. మృత దేహం గంటల తరబడి రోడ్డుపైనే ఉంది. మేం చేసిన ఫిర్యాదుతో ఘటనా స్థలానికి వచ్చిన మధ్యప్రదేశ్ పోలీసులు.. ఈ ప్రదేశం మా ప్రాంతంలోకి రాదని మమ్మల్ని తిట్టారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను గుర్తించాలని కోరారు.పోలీసుల తీరుతో రాత్రి 7 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగితే..రాత్రి 11 గంటల సమయంలో మృతదేహాన్ని రోడ్డుపై నుంచి బయటకు తీశారు’అని కన్నీరు మున్నీరయ్యారు. -
వాట్సాప్‌లో మునిగిపోవడం వల్లే ఘోరం!
తిరువనంతపురం: కేరళ కన్నూరు స్కూల్ బస్సు ప్రమాదం ఘటనలో విస్తుపోయే విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. సరిగ్గా ప్రమాదం జరిగిన సమయంలోనే.. డ్రైవర్ ఫోన్ నుంచి వాట్సాప్ స్టేటస్ అప్లోడ్ అయ్యి ఉంది. దీంతో డ్రైవర్ ఫోన్లో మునిగిపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.కన్నూరు జిల్లా వలక్కై శ్రీస్కంధపురం వద్ద బుధవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేట్ స్కూల్‌కు చెందిన బస్సు ఒకటి బోల్తాపడడంతో ఓ చిన్నారి మృతి చెందగా, 15 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం ధాటికి బస్సు కిటీకిలోంచి చిన్నారి బయట ఎగిరిపడగా.. ఆ వెంటనే బస్సు ఆమె మీద పడడంతో చిధ్రమయ్యింది. కలవరపరిచే ఆ దృశ్యాలు సోషల్ మీడియాకు చేరాయి.#Kerala : A tragic accident occurred in Valakkai, Sreekantapuram, #Kannur, when a school bus belonging to Chinmaya School overturned, claiming the life of an 11-year-old student and injuring 13 others.The deceased, Nedya S Rajesh, a Class 5 student, lost her life after falling… pic.twitter.com/csNHtZAiv3— South First (@TheSouthfirst) January 1, 2025అయితే నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ వాదనను డ్రైవర్ నిజాం తోసిపుచ్చాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతను.. తాను బస్సు నడుపుతూ ఫోన్ వాడలేదని.. ఎలాంటి వాట్సాప్ స్టేటస్(Whatsapp Status) అప్లోడ్ చేయలేదని.. బహుశా ఫోన్ టచ్ అయ్యి అలా జరిగి ఉంటుందని చెబుతున్నాడు. అంతేకాదు బస్సు బ్రేకులు పడకపోవం వల్లే యాక్సిడెంట్ జరిగిందని అంటున్నాడతను. అయితే.. యాక్సిడెంట్ టైంకే డ్రైవర్ వాట్సాప్ స్టేటస్ అప్లోడ్ అయిన విషయాన్ని స్థానిక చానెల్స్ ప్రముఖంగా ప్రసారం చేస్తున్నాయి.ఇక బస్సును పరిశీలించిన మోటార్ వెహికిల్స్ డిపార్ట్మెంట్ అధికారులు ఆ డ్రైవర్ వాదనను కొట్టిపాస్తున్నారు. బ్రేకులు కండిషన్లోనే ఉన్నాయని చెబుతున్నారు. అలాగే బస్సు ఫిట్నెస్ సర్టిఫికెట్ కిందటి నెల డిసెంబర్ 29తో ముగియగా.. తిరిగి ఈ ఏడాది ఏప్రిల్ దాకా రెన్యువల్ అయినట్లు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం(Driver Negligence) వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. మరోవైపు..స్థానికులు మాత్రం సర్వీస్ రోడ్డు నుంచి మెయిన్ రోడ్డుకు వెళ్లే ప్రమాదకరమైన మలుపు కారణంగానే ఈ ఘోరం జరిగిందని, తరచూ ఇక్కడ పలు ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతుండడం గమనార్హం.అప్పటికే ఆలస్యమైంది..శ్రీస్కంధపురం స్కూల్ బస్సు ప్రమాదం(School Bus Accident)లో చనిపోయిన స్టూడెంట్ను ఐదో తరగతి చదువుతున్న నెద్యా రాజేష్(11)గా గుర్తించారు. ప్రమాదం జరిగిన తర్వాత అక్కడికి చేరుకున్న స్థానికులు పిల్లలను బయటికి తీసుకొచ్చి ఆస్పత్రికి తరలించారు. అయితే.. బస్సు కింద నలిగిపోయిన నెద్యాను మాత్రం కాస్త ఆలస్యంగా గుర్తించినట్లు చెబుతున్నారు వాళ్లు.‘‘పెద్ద శబ్దం రాగానే ఇక్కడున్న కొందరం పరిగెత్తాం. బోల్తా పడ్డ బస్సులోంచి పిల్లల రోదనలు వినిపించాయి. వాళ్లను బయటకు తీసి నీళ్లు తాగించాం. డ్రైవర్ సహా పిల్లల్లో కొందరికి గట్టి దెబ్బలే తగలడంతో వెంటనే ఆస్పత్రికి తరలించాం. కానీ, ఓ అమ్మాయి బస్సు కిందే ఉందన్న విషయం కాసేపటికి తెలిసింది. ఆమెను బయటకు తీసేసరికి బాగా రక్తం పోయి స్పృహ లేకుండా ఉంది. ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది’’ అని స్థానికుడొకరు తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 15 మందికి చికిత్స అందుతుండగా.. ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
ఇథియోపియాలో ఘోర ప్రమాదం..
అడిస్ అబాబా: ఆఫ్రికా దేశం ఇథియోపియాలో నదిలో ట్రక్కు పడిన దుర్ఘటనలో 71 మంది మృత్యువాతపడ్డారు. దక్షిణ ప్రాంత సిడామాలోని లెమ్మ లగిడెలో ఆదివారం దుర్ఘటన చోటుచేసుకుంది. బాధితులంతా పెళ్లి బృందంలోని వారు. కిక్కిరిసిన ట్రక్కు గలానా నదిపైన వంతెన మీదుగా వెళ్తుండగా అదుపు తప్పి పడిపోయింది. అక్కడి కక్కడే 60 మంది అసువులు బాశారు. మిగతా 11 మంది చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని అధికారులు చెప్పారు. పేద దేశం కావడంతో వివాహాలు వంటి వేడుకలకు వెళ్లే వారు ఎక్కువ ఖర్చయ్యే బస్సులకు బదులుగా తక్కువకే దొరికే ట్రక్కులనే జనం వాడుతుంటారు. రహదారుల నిర్వహణ లోపభూయిష్టంగా మా రడంతో ఇక్కడ ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. ఇదీ చదవండి: గాలిలో ప్రాణాలు -
Jubilee Hills: మద్యం మత్తులో కారు నడిపి..
బంజారాహిల్స్: ఓ యువకుడు మద్యం మత్తులో కారు నడిపి మితిమీరిన వేగంతో చెట్టుకు, డివైడర్‌కు ఢీకొట్టిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. వెస్ట్ మారేడ్‌పల్లి సుమన్ హౌసింగ్ కాలనీలో నివసించే తీగుళ్ల దయాసాయిరాజ్ (27) రైల్వే ఆఫీసర్స్ కాలనీలో నివసించే తన స్నేహితురాలు (27)తో కలిసి శనివారం రాత్రి ఫిలింనగర్ సమీపంలోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఓ విందుకు హాజరయ్యాడు. ఇద్దరూ ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటల వరకు ఆ విందులో పాల్గొని మద్యం తాగారు. దయాసాయిరాజ్ మోతాదుకు మించి మద్యం తాగి ఇంటికి వెళ్లే క్రమంలో తన స్నేహితురాలిని తీసుకుని అర్ధరాత్రి 2.30 గంటలకు ఫంక్షన్ హాల్ నుంచి బెంజ్ కారు బయలుదేరాడు. సినీ నటుడు బాలకృష్ణ ఇంటి వద్దకు రాగానే కారు అదుపు తప్పి డివైడర్‌ను, ఆ తర్వాత చెట్టును ఢీకొని రోడ్డుకు అవతల వైపు బోల్తాపడింది. ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో కారులోని ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. చెట్టు విరిగిపడి డివైడర్ ధ్వంసమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వీరిద్దరినీ స్టేషన్‌కు తరలించారు. ఆదివారం ఉదయం 3 గంటలకు స్టేషన్‌కు తీసుకువచి్చన వీరిద్దరినీ డ్రంకన్ డ్రైవ్ టెస్ట్‌కు యతి్నంచగా వీరు సహకరించలేదు. 3 గంటల పాటు పోలీసులను దూషిస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఠాణాలో న్యూసెన్స్ చేశారు. మద్యం మత్తులో స్టేషన్లో ఇద్దరూ వీరంగం సృష్టించారు. ఎట్టకేలకు వీరికి శ్వాస పరీక్షలు నిర్వహించగా దయాసాయిరాజ్కు 94 ఎంజీ, యువతికి 73 ఎంజీ రక్తంలో ఆల్కహాలిక్ నమోదైంది. వీరిద్దరిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. హత్యాయత్నం కింద సెక్షన్ విధించి ఆదివారం రిమాండ్‌కు తరలించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. -
Jaipur Tanker Blast: మానవత్వమా.. నీవెక్కడ..?
జైపూర్ : మానవత్వానికి మాయని మచ్చ వంటి ఘటన రాజస్థాన్ జైపుర్‌లో చోటు చేసుకుంది. ఈ శుక్రవారం ఎల్పీజీ ట్యాంకర్‌ను, ఓ ట్రక్ ఢీకొట్టి మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకున్న బాధితులు తమని కాపాడాలని వేడుకుంటూ హాహాకారాలు చేస్తూ పరిగెత్తారు. స్థానికులు బాధితుల్ని రక్షించేందుకు ముందుకు రాకపోగా .. వీడియోలు, ఫొటోలు తీస్తూ రాక్షసానందం పొందినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం తెల్లవారు జామున 5:30 గంటలకు రాజస్థాన్‌లోని జైపుర్‌లో జైపుర్-అజ్మీర్ హైవేపై ఓ పెట్రోల్ బంకులో ఎల్పీజీ ట్యాంకర్‌ను, ఓ ట్రక్కు ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగి దగ్గరలో ఉన్న పెట్రోల్ బంకుకు వ్యాపించాయి. ఆ సమయంలో బంకు వద్ద ఉన్న పలు వాహనాలు దగ్ధమయ్యాయి. ఇప్పటి వరకు ఈ ఘటనలో 14 మంది మృతి చెందగా.. దాదాపు 40 మంది గాయపడ్డారు.గాయపడిన వారిలో రాధేశ్యామ్ చౌదరి (32) ఒకరు. మంటల్లో చిక్కుకున్న రాధేశ్యామ్ తనని కాపాడాలని కోరుతూ 600 మీటర్లు పరిగెత్తారు. అక్కడే ఉన్న వారు రాధేశ్యామ్‌ను రక్షించేందుకు ముందుకు రాకపోగా .. వీడియోలు, ఫొటోలు తీస్తూ రాక్షసానందం పొందినట్లు బాధితుడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.రాధేశ్యామ్ చౌదరి నేషనల్ బేరింగ్స్ కంపెనీ లిమిటెడ్‌లో మోటార్ మెకానిక్. శుక్రవారం తెల్లవారు జామున విధులు నిమిత్తం ఇంటి నుంచి కంపెనీకి తన బైక్‌పై బయలు దేరాడు. ఎల్పీజీ ట్యాంకర్‌ను, ఓ ట్రక్ ఢీకొట్టే సమయంలో రాధేశ్యామ్ అక్కడే ఉన్నారు. మంటల్లో చిక్కుకున్నారు. తనని తాను రక్షించుకునేందుకు 600 మీటర్లు పరుగులు తీశారు. అనంతరం కుప్పుకూలాడు. కొద్ది సేపటికి స్థానికులు రాధేశ్యామ్ చౌదరి సోదరుడు అఖేరామ్కు ఫోన్ చేసి సమాచారం అందించారు. రాధేశ్యామ్ అగ్ని ప్రమాదానికి గురయ్యాడని, వెంటనే హీరాపురా బస్ టెర్మినల్‌కు రావాలని కోరాడు. దీంతో భయాందోళనకు గురైన అఖేరామ్ ఘటనా స్థలానికి చేరుకున్నాడు. ఆ సమయంలో ఏం జరిగిందో కళ్లకు కట్టినట్లు మీడియాకు వివరించారు. ‘నా సోదరుడు తీవ్రంగా కాలిన గాయాలతో రోడ్డుపై ఆపస్మారస్థితిలో కనిపించాడు. పేలుడు జరిగిన ప్రదేశం నుంచి సుమారు 600 మీటర్లు పరిగెత్తినట్లు స్థానికులు చెప్పారు. తనని కాపాడాలని ఆర్తనాదాలు చేశారని, సాయం కోసం అర్దిస్తే ఒక్కరూ ముందుకు రాలేదని,బదులుగా చాలా మంది వీడియోలు తీశాడని విలపించారు. రాధేశ్యామ్‌ను అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్ రాకకోసం ఎదురు చూశాం. కానీ రాలేదు. దీంతో కారులో నా సోదరుణ్ని జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ ఆస్పత్రికి తరలించాం. అతను బ్రతుకుతాడనే నమ్మకం ఉంది. కానీ 85 శాతం కాలిన గాయాలు మరింత ఇబ్బంది పడుతున్నట్లు అఖేరామ్ కన్నీటి పర్యంతరమయ్యారు. -
కంటెయినర్ ట్రక్కు కింద నలిగిన కారు.. ఆరుగురి దుర్మరణం
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో శనివారం(డిసెంబర్21) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు శివార్లలోని నెలమంగళ వద్ద జాతీయ రహదారిపై ఒక కంటెయినర్ ట్రక్కు బోల్తా పడింది. పక్కనే వెళుతున్న ఒక కారుతో పాటు టూ వీలర్ ట్రక్కు కింద పడి నలిగిపోయాయి. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు పిల్లలతో సహా మొత్తం ఆరుగురు చనిపోయారు. వీకెండ్సెలవులు కావడంతో ఓ వ్యాపారవేత్త తన కుటుంబంతో సరదాగా గడిపేందుకు బెంగళూరు నుంచి కారులో బయలుదేరాడు. కారు వెళుతున్న వైపే వెళుతున్న కంటెయినర్ ట్రక్కు ముందు వెళుతున్న పాలట్యాంకర్‌ను ఢీకొట్టి పక్కనే ఉన్న కారుపై బోల్తాపడడంతో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదం కారణంగా జాతీయ రహదారి 48పై మూడు కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రమాదం కారణంగా బెంగళూరు-తుమకూరు హైవేపై ట్రాఫిక్ అంతరాయంపై ట్రాఫిక్ పోలీసులు అడ్వైజరీ జారీ చేశారు. — SP Bengaluru District Police (@bngdistpol) December 21, 2024 -
ఆటోను ఢీకొన్న మోటార్ బైక్.. ఇద్దరు విద్యార్థులు మృత్యువాత
తవణంపల్లె: చిత్తూరు, కాణిపాకం రోడ్డు సత్తారు బావి సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృత్యువాత పడ్డారు. తవణంపల్లె ఎస్ఐ చిరంజీవి కథనం మేరకు.. మండలంలోని ముత్తరపల్లె గ్రామానికి చెందిన గోవిందు కుమారుడు సాయితేజ (19), మైనగుండ్లపల్లెకు చెందిన ప్రసాద్‌రెడ్డి కుమారుడు హర్ష (19) ఇద్దరు స్నేహితులు. వీరిద్దరూ చిత్తూరు నగరంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. శుక్రవారం సాయితేజ తన మోటార్ సైకిల్లో తన స్నేహితుడు హర్షను వెనుక కూర్చోబెట్టుకుని పరీక్ష రాయడానికి కాలేజ్‌కు బయలుదేరారు. ఈ తరుణంలో సత్తారు బావి సమీపంలో ముందు వెళ్తున్న బస్సును అధిగమించే క్రమంలో ఎదురుగా వస్తున్న ఆటోను వేగంగా ఢీకొన్నారు. ప్రమాదంలో సాయితేజ, హర్షకు బలమైన గాయాలు కావడంతో తీవ్రంగా రక్తస్రావం అయ్యింది. దీంతో క్షతగాత్రులను 108 వాహనం ద్వారా చికిత్స నిమిత్తం చిత్తూరులోని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే వారిద్దరూ మృతి చెందినట్లు నిర్థారించారు. తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు, గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. -
ఆగని ప్రమాదాలు
సాక్షి, పెద్దపల్లి: సింగరేణి బొగ్గు గనులు, వివిధ విభాగాల్లో ప్రస్తుతం రక్షణ పక్షోత్సవాలు కొనసాగుతున్నాయి. ‘రక్షణే ప్రథమం.. రక్షణే ఎల్లప్పుడు’అని ప్రతీ గని, డిపార్ట్‌మెంట్‌పై కార్మికులతో అధికారులు ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. అయితే, రక్షణ పక్షోత్సవాలు వేడుకల కోసమేనని, క్షేత్రస్థాయిలో కార్మికుల రక్షణకు తీసుకుంటున్న చర్యలేవీ లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా.. సింగరేణిలో ప్రమాదాలు మాత్రం తగ్గడం లేదు.నిమ్, యూఎంటీఐ, వీటీసీ, అత్యాధునిక సిమ్టార్స్.. ఇలా ఎన్ని శిక్షణ సంస్థలు ఏర్పాటు చేసినా ప్రమాదాలు నియంత్రణలోకి రావడం లేదు. తట్టాచెమ్మాస్, సెమీ మెకనైజ్డ్, పూర్తిస్థాయి యాంత్రీకరణ జరిగినా రక్షణలో వైఫల్యాలతో బొగ్గు గనుల్లో ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఏటా కార్మికులు చనిపోతున్నా, ప్రమాదాలపై సమీక్షించ డం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బొగ్గు ఉత్ప త్తి విషయంలో సింగరేణి చూపుతున్న శ్రద్ధ ప్ర మాదాల నియంత్రణకు తీసుకోవడం లేదని కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. 17ఓసీపీలు.. 22 భూగర్భ గనులు ఏటా మాదిరిగానే ప్రమాద రహిత సింగరేణిగా తీర్చిదిద్దడం లక్ష్యంగా యాజమాన్యం ఈనెల 9 నుంచి 21వ తేదీ వరకు రక్షణ పక్షోత్సవాలు నిర్వహిస్తోంది. సింగరేణిలోని 11 ఏరియాల్లో 17 ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులు, 22 భూగర్భ గనులు ఉన్నాయి. వీటిలో దాదాపు 42 వేల మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి కాంట్రాక్ట్ కార్మికులు అదనం. వీరు సుమారు 30 వేల మంది వరకు ఉంటారని అంచనా. రక్షణ పక్షోత్సవాల్లో భాగంగా 12 బృందాలు వివిధ గనులు, సీఎస్పీలు తదితర విభాగాల్లో తనిఖీలు చేసి అత్యుత్తమ రక్షణ చర్యలు పాటించే గనులకు బహుమతులు అందిస్తాయి.అయితే కార్మికులకు రక్షణ సూత్రాల గురించి వివరిస్తున్న అధికారులు.. వాటిని అమలు చేయాలని అవగాహన కలి్పస్తున్నారు. మరోవైపు.. కార్మికులతోపాటు అధికారులు యూనిఫాం, టోపీలు ధరించకుండానే అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని కార్మికుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సరైన పర్యవేక్షణ లేకే.. రక్షణ పక్షోత్సవాల్లో చేయించిన ప్రతిజ్ఞ, సూచనలు ఆచరణలో సాధ్యం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 15 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా జీఎం స్థాయి అధికారుల బృందం తనిఖీలు చేసి నివేదికలు తయారు చేసి వెళ్లిపోతుంది. అప్పటివరకు ఏరియా అధికారులు గనులు, డిపార్టుమెంట్లలో సూచిక బోర్డులు, రక్షణకు సంబంధించిన కొటేషన్లు రాసి, జెండాలు కట్టి హంగూ ఆర్భాటాలతోనే సరిపెట్టుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. నోటీస్ బోర్డులపై కానరాని సమాచారం ప్రమాదాల్లో కొందరు ప్రాణాలు కోల్పోతుండగా మరికొన్ని సందర్భాల్లో క్షతగాత్రులవుతున్నారు. గనులపై ప్రమాదాల సమాచారం వెల్లడించాల్సి ఉన్నా.. ఎక్కడ కూడా నోటీసు బోర్డులపై కానరావడం లేదు. ఉన్నతాధికారులు సందర్శనకు వచ్చినప్పుడు హడావుడి చేసి.. ఆ తర్వాత మళ్లీ పట్టించుకోవడం లేదు. ఏడాది పొడవునా రక్షణ చర్యలు తీసుకునే అంశాలను మరుగున పడేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇదే విషయమై సింగరేణి స్టేపీ అధికారులను సంప్రదించగా.. సింగరేణివ్యాప్తంగా సేఫ్టీ మేనేజ్మెంట్ పద్ధతు లు పాటిస్తున్నామని స్పష్టం చేశారు. ఉద్యోగులకు వాటిపై అవగాహన కలి్పస్తున్నామని తెలిపారు. గతంతో పొల్చితే ప్రస్తుతం ప్రమాదాల సంఖ్య తగ్గిందని, అయినా, జీరో హార్మ్ సంస్థగా సింగరేణిని తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వివరించారు. -
సీట్బెల్ట్తో కిడ్నీలకూ రక్షణ!
కారు డ్రైవిం చేసే సమయంలో సీట్‌బెల్ట్ పెట్టుకోవడంతో కేవలం యాక్సిడెంట్స్‌లో ప్రాణరక్షణ మాత్రమేగాక... కిడ్నీలకూ మంచి రక్షణ కలుగుతుందంటున్నారు అధ్యయన వేత్తలు. సీట్ బెల్ట్స్ కట్టుకున్నప్పుడు యాక్సిడెంట్ జరిగిన మరుక్షణం ఎయిర్‌బ్యాగ్ తెరచుకొని, వాహనంలోని వ్యక్తుల ప్రాణాలు కాపాడుతుందన్న విషయం తెలిసిందే. సీట్ బెల్ట్ పెట్టుకోవడమన్న అంశం కారణంగా వాహనంలోని ఎయిర్‌బ్యాగ్స్ తెరచుకుని, ప్రయాణికుల తలనూ, ఛాతీనీ అన్నివైపుల నుంచి ఆవరించడం వల్ల యాక్సిడెంట్ తాలూకు దెబ్బలను ప్రయాణికులకు తగలకుండా చూస్తాయి. అయితే ఇది మాత్రమే కాకుండా ఈ ఎయిర్‌బ్యాగ్ అనేది డ్రైవింగ్ చేసే వ్యక్తి మూత్రపిండాలనూ కాపాడుతుందని అమెరికన్ యూరాలజీ అసోసియేషన్‌కు చెందిన కొందరు అధ్యయన వేత్తలు చెబుతున్నారు. దాదాపు మూడు లక్షల మందిపై నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం తేటతెల్లమైనట్లు పేర్కొన్నారు. ఈ అధ్యయనం ద్వారా యాక్సిడెంట్ తర్వాత ఎయిర్‌బ్యాగ్ విచ్చుకోవడం వల్ల 2,580 మంది కిడ్నీలకు రక్షణ లభించిందంటూ వారు వివరించారు. (చదవండి: ముక్కుదిబ్బడ బాధిస్తోందా?! ) -
కోనసీమలో ఘోర ప్రమాదం.. పంట కాల్వలోకి దూసుకెళ్లిన కారు
సాక్షి, కోనసీమ జిల్లా: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పి.గన్నవరం మండలం ఊడిమూడి చింతావారిపేట వద్ద అదుపుతప్పి కారు పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తల్లి, ఇద్దరు కుమారులు గల్లంతయ్యారు. ప్రమాదం నుంచి తండ్రి బయటపడ్డారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.నేలపూడి విజయ్ కుమార్ భార్య, పిల్లలతో విశాఖపట్నం వెళ్లి తిరిగి పోతవరం వస్తుండగా చింతావారిపేట వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో భార్య ఉమ కారు డ్రైవింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బ్రిడ్జిపై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య అమలాపురం రూరల్ పేరూరు పంచాయతీ తలుపులపేటకు చెందిన అంబటి రాజు (22) బోడసకుర్రు బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకి ఆదివారం ర్రాతి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సినిమాకు వెళ్తున్నానని ఇంటి నుంచి బయలుదేరిన రాజు ఆదివారం రాత్రి 10 గంటలకు బ్రిడ్జి వద్దకు వచ్చి మోటారు సైకిల్ని పార్కు చేసి, చెప్పులు వదిలి బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.అదే సమయంలో కొంతమంది మోటారు సైకిల్‌ను పార్కు చేసి ఉండడాన్ని గమనించారు. సోమవారం ఉదయం వరకు మోటారు సైకిల్ బ్రిడ్జిపైనే పార్కు చేసి ఉండడంతో ప్రయాణికులు గమనించి 100కి సమాచారం ఇచ్చారు. దీంతో అల్లవరం పోలీసులు అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకుని మత్స్యకారులతో గాలించగా నదిలో మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని ఒడ్డుకి చేర్చారు. మృతుడు తండ్రి పాపారావు ఫిర్యాదుతో అల్లవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు ఏ కారణం వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డాడో విచారణలో తెలియవలసి ఉంది. మృతుడుకి తండ్రి, తల్లి ఉన్నారు.