
సాక్షి, అనకాపల్లి: అనకాపల్లిలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. అనకాపల్లి-విజయరామరాజుపేట అండర్ బ్రిడ్జి వద్ద సేఫ్టీ గడ్డర్‌ను క్వారీ రాళ్లను తీసుకెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ క్రమంలో సెఫ్టీ గడ్డర్ ఢీకొనడంతో రైల్వే ట్రాక్ పక్కకి జరిగింది. దీంతో, రైలు ప్రయాణాలకు అంతరాయం ఏర్పడింది.
వివరాల ప్రకారం.. అనకాపల్లి పెను ప్రమాదం తప్పింది. అండర్ బ్రిడ్జి వద్ద సేఫ్టీ గడ్డర్‌ను లారీ ఢీకొనడంతో పైన ఉన్న రైల్వే ట్రాక్ పక్కకి జరిగింది. ఇదే సమయంలో ఆ మార్గంలో వస్తున్న గూడ్స్ రైలు వచ్చింది. అయితే, ట్రాక్ పక్కకి జరిగిన విషయాన్ని గుర్తించిన గూడ్స్ లోకోపైలట్ వెంటనే రైలును నిలిపివేశారు. దీంతో, ప్రమాదం తప్పింది. ఈ ఘటన కారణంగా విజయవాడ నుంచి విశాఖ వెళ్లే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. కశింకోట వద్ద గోదావరి, విశాఖ ఎక్స్‌ప్రెస్‌లను నిలిపేశారు. ఎలమంచిలిలో మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపేశారు. కొంత సమయం తర్వాత మరో ట్రాక్ పైకి నుంచి రాకపోకలను పునరుద్ధరించారు. దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌కు సిబ్బంది మరమ్మతులు చేపట్టారు.

ఇదిలా ఉండగా.. అనకాపల్లిలో క్వారీ లారీలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కూటమి నేతల కనుసన్నల్లో అక్రమ మైనింగ్ జరుగుతోంది. దీంతో, అడ్డూ అదుపు లేకుండా బ్లాస్టింగ్స్ చేస్తున్నారు. పరిధికి మించి లారీల్లో రాయి NOABకి తరలిస్తున్నారు. ఈ క్రమంలో అనేక ప్రమాదాలకు క్వారీ లారీలు కారణం అవుతున్నాయి. నేడు బ్రిడ్డిని లారీ ఢీకొంది. నిన్న క్వారీ.. ఎల్‌ఐసీ ఏజెంట్‌ను ఢీకొనడంతో అతడు మృతిచెందారు. ఇక, ఓవర్ లోడ్ వస్తున్న లారీ కారణంగా గ్రామాల్లో రోడ్లు ధ్వంసమవుతున్నాయి. లారీల ఓవర్ స్పీడ్ కారణంగా గామాస్తులు భయాందోళనకు గురవుతున్నారు.

Comments
Please login to add a commentAdd a comment