ఢిల్లీ : రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్యం కోసం ఆస్పత్రులకు తరలించే గుడ్ సమరిటన్‌ల (good samaritans) రివార్డ్ మొత్తాన్ని రూ.5 వేల నుంచి రూ.25వేలకు పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (nitin gadkari) శనివారం తెలిపారు.
రోడ్డు భద్రతపై నటుడు అనుపమ్ ఖేర్ జరిగిన ఇంటర్వ్యూలో గడ్కరీ మాట్లాడుతూ.. గంటలోపు రోడ్డు ప్రమాద బాధితుల్ని ఆస్పత్రికి తరలించడంతో పాటు వారి ప్రాణాల్ని రక్షించే వారికి అందించే రివార్డ్ (reward) తక్కువగా ఉందని, ఆ మొత్తాన్ని పెంచుతున్నట్లు రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖకు ఆదేశించినట్లు చెప్పారు.
అక్టోబర్ 2021 నుంచి రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేసే వారికి ప్రోత్సహించేలా రివార్డ్‌ను అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా రోడ్డు ప్రమాద బాధితులకు గంటలోపు ఆస్పత్రికి తరలించి, వారి ప్రాణాల్ని కాపాడేందుకు రూ.5వేల రివార్డ్ అందిస్తోంది.
గుడ్ సమరిటన్ రివార్డ్ పొందాలంటే
కేంద్రం అందించే గుడ్ సమరిటన్ రివార్డ్ పొందాలంటే ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా ప్రమాదంలో గాయపడ్డ క్షతగాతుల్ని గంటలోపు ఆస్పత్రికి తరలించి ప్రాణాల్ని కాపాడిన ప్రాణదాతలు పోలీసులకు సమాచారం అందించాల్సి ఉంది. పోలీసులు అధికారిక లెటర్ ప్యాడ్‌పై మిమ్మల్ని ప్రాణదాతగా గుర్తించి మీ వివరాల్ని మోదు చేసుకుంటారు. అంనతరం మీకో ఎక్నాలెడ్జ్‌మెంట్ ఇస్తారు. ఆ ఎక్నాలెడ్జ్‌మెంట్‌ను జిల్లాస్థాయి అప్రైజల్ కమిటీకి పంపుతారు. అక్కడి నుంచి ప్రాణదాతకు ప్రోత్సాహం అందించాలంటూ రాష్ట్ర రవాణా కమిషనర్‌కు సిఫార్సు చేస్తారు. రవాణాశాఖ సంబంధిత వ్యక్తికి బ్యాంకులో రూ.5 వేలు జమ చేయడంతోపాటు ప్రశంసాపత్రం అందజేస్తుంది. బాధితుల్ని కాపాడిన వ్యక్తులకు వేధింపులు ఇతర ఇబ్బందుల నుంచి గుడ్ సమరిటన్ చట్టం రక్షిస్తుంది.
👉చదవండి : నా భార్యను చూడటం నాకు చాలా ఇష్టం
Comments
Please login to add a commentAdd a comment