ఢిల్లీ: దేశీయంగా నడిచే, విదేశాలకు వెళ్లే పలు విమానాలకు బాంబు బెదిరింపు హెచ్చరికల బెడద ఎక్కువైంది. గురువారం దేశంలోని 70 కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతుంది.
ఎయిరిండియా,విస్తారా,ఇండిగోలకు చెందిన 20 విమానాలకు, ఆకాశ ఎయిర్‌కి చెందిన 14 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు విమానయాన సంస్థలు తెలిపాయి. దీంతో 11 రోజుల్లో సుమారు 250 విమానాలకు అగంతకుల నుంచి బాంబు బెదిరింపులు వచ్చాయి.
తాజా, బాంబు బెదిరింపులపై ఆకాశ ఎయిర్ అధికార ప్రతినిధి స్పందించారు. ‘గురువారం సైతం తమ సంస్థకు చెందిన విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అకాశ ఎయిర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌లు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. భద్రత..నియంత్రణ అధికారులతో సంప్రదింపులు జరిపాం. స్థానిక అధికారులతో సమన్వయంతో అన్ని భద్రత పరమైన విధానాలను అనుసరిస్తున్నాము’ అని ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment