Akasa Air
-
ఆకాశ ఎయిర్‌లో ప్రేమ్‌జీ ఫ్యామిలీ ఆఫీసు పెట్టుబడులు
టెక్ దిగ్గజం అజీం ప్రేమ్‌జీ (Azim Premji), మణిపాల్ గ్రూప్ చీఫ్ రంజన్ పాయ్లకు చెందిన ఫ్యామిలీ ఆఫీసులు తాజాగా విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్‌లో ఇన్వెస్ట్ చేశాయి. ఇందుకు సంబంధించి క్లేపాండ్ క్యాపిటల్ (రంజన్ పాయ్), ప్రేమ్‌జీ ఇన్వెస్ట్, అసెట్ మేనేజ్మెంట్ సంస్థ 360 వన్ అసెట్ తదితర ఇన్వెస్టర్ల కన్సార్షియంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆకాశ ఎయిర్ వెల్లడించింది.ప్రమోటరు ఝున్‌ఝున్‌వాలా కుటుంబం కూడా మరింతగా మూలధనం సమకూర్చనున్నట్లు వివరించింది. ఎయిర్‌లైన్‌లో ఝున్‌ఝున్‌వాలా కుటుంబానికి ఇప్పటికే దాదాపు 40 శాతం వాటా ఉంది. కాగా పెట్టుబడి మొత్తం గురించి కానీ, ఎంత వాటాను విక్రయిస్తున్నది కానీ ఎయిర్‌లైన్ వెల్లడించలేదు. అయితే దాదాపు 125 మిలియన్ డాలర్లు సేకరించాలని యోచిస్తున్నట్లు సమాచారం.2023-24లో ఆకాశ ఎయిర్ నికర నష్టం రెండింతలు పెరిగింది. గత ఏడాది రూ.744 కోట్ల నుండి రూ.1,670 కోట్లకు చేరుకుంది. మరోవైపు దాని మొత్తం ఆదాయం 2022-23లో రూ.778 కోట్లతో పోలిస్తే 2023-24లో రూ.3,144 కోట్లకు చేరుకుంది. ఈ ఎయిర్‌లైన్‌లో ఝున్‌ఝున్‌వాలా కుటుంబంతో పాటు ముగ్గురు దూబే సోదరులు వినయ్ దూబే, సంజయ్ దూబే, నీరజ్ దూబే దాదాపు 30 శాతం వాటాను కలిగి ఉన్నారు.గత ఏడాది జనవరిలో, ఆకాశ ఎయిర్ అమెరికన్ విమాన తయారీ సంస్థ బోయింగ్‌తో 150 B737 మ్యాక్స్ విమానాలకు ఆర్డర్ ఇచ్చింది. ఇది గతంలో ఆర్డర్ చేసిన 76 మ్యాక్స్ విమానాలకు అదనం. 76 విమానాలలో 27 ఇప్పటికే ఎయిర్‌లైన్‌కు డెలివరీ అయ్యాయి. -
మహా కుంభమేళా.. విమాన ఛార్జీలు తగ్గింపు
మహా కుంభమేళా సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు రాకపోకలు సాగిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ తరుణంలో కొన్ని విమాన సంస్థలు ఇప్పటికే ఛార్జీలు పెంచాయి. దాంతో ప్రయాణికుల రద్దీ పెరగడం వల్ల సహేతుకమైన విమాన ఛార్జీలు ఉండాలనేలా ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన పిలుపు మేరకు ఆకాసా ఎయిర్ స్పందించింది. విమాన ఛార్జీలను గణనీయంగా తగ్గిస్తున్నట్లు, ప్రయాగ్‌రాజ్‌కు విమానాల సంఖ్యను పెంచుతున్నట్లు ప్రకటించింది.ఛార్జీల తగ్గింపు, విమానాల సంఖ్య పెంపుఆకాసా ఎయిర్ ప్రయాగ్‌రాజ్‌కు విమానాల టికెట్ ధరలను 30-45% తగ్గించింది. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం భక్తులకు విమాన ప్రయాణాన్ని మరింత అందుబాటులోకి తెచ్చింది. ముంబై, ఢిల్లీ నుంచి రోజువారీ డైరెక్ట్ సర్వీసులతో పాటు పుణె, హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు వంటి నగరాల నుంచి ప్రత్యేక విమానాలను నడుపుతుంది. మహా కుంభమేళా సందర్భంగా విమానాలను పెంచాలని, సహేతుకమైన ఛార్జీలను నిర్వహించాలని విమానయాన సంస్థలను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. దాంతో కంపెనీ ఈమేరకు స్పందించినట్లు తెలిపింది.ప్రభుత్వ జోక్యంవినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడుకు గతంలో లేఖ రాశారు. ప్రయాగ్‌రాజ్ విమాన ప్రయాణానికి అధిక ఛార్జీలు ఉన్నాయనే ఫిర్యాదులను ఆ లేఖలో హైలైట్ చేశారు. తరువాత ఛార్జీలను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆర్థికపరమైన ప్రయాణ ఇబ్బందులు లేకుండా మహా కుంభమేళాకు భక్తులు వెళ్లేందుకు వీలుగా ప్రభుత్వం జోక్యం చేసుకుంది.ప్రయాణికులపై ప్రభావం..ఛార్జీల తగ్గింపు, విమానాల పెంపు నిర్ణయం మహా కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. గతంలో విమాన ఛార్జీలు 300-600% పెరగడంతో, చాలా మంది రోడ్డు లేదా రైలు రవాణా మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ పీక్ పీరియడ్‌లో ప్రయాణాన్ని సులభతరం చేయడానికి ఆకాసా ఎయిర్ చేస్తున్న ప్రయత్నాలను ప్రయాణికులు స్వాగతిస్తున్నారు.ఇదీ చదవండి: బ్లాక్ బడ్జెట్ గురించి తెలుసా?: ఎప్పుడు ప్రవేశపెట్టారంటే..ఇప్పటికే చాలా సంస్థలు..యాత్రికుల రాకపోకలను మరింత మెరుగ్గా నిర్వహించేందుకు చేసే ప్రయత్నాల్లో ఆకాసా ఎయిర్ ఒక్కటే కాదు.. ఇండిగో, స్పైస్ జెట్ సహా ఇతర విమానయాన సంస్థలు కూడా ప్రయాగ్‌రాజ్‌కు తమ విమానాల సంఖ్యను పెంచాయి. విమానయాన పరిశ్రమ నుంచి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల లక్షల మంది భక్తుల ప్రయాణం సులభతరం అవుతుందని భావిస్తున్నారు. ఫిబ్రవరి 26 వరకు మహా కుంభమేళా కొనసాగుతుంది. -
ఎయిరిండియా, ఇండిగో సహా.. 70కిపైగా విమానాలకు బాంబు బెదిరింపులు
ఢిల్లీ: దేశీయంగా నడిచే, విదేశాలకు వెళ్లే పలు విమానాలకు బాంబు బెదిరింపు హెచ్చరికల బెడద ఎక్కువైంది. గురువారం దేశంలోని 70 కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతుంది. ఎయిరిండియా,విస్తారా,ఇండిగోలకు చెందిన 20 విమానాలకు, ఆకాశ ఎయిర్‌కి చెందిన 14 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు విమానయాన సంస్థలు తెలిపాయి. దీంతో 11 రోజుల్లో సుమారు 250 విమానాలకు అగంతకుల నుంచి బాంబు బెదిరింపులు వచ్చాయి.తాజా, బాంబు బెదిరింపులపై ఆకాశ ఎయిర్ అధికార ప్రతినిధి స్పందించారు. ‘గురువారం సైతం తమ సంస్థకు చెందిన విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అకాశ ఎయిర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌లు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. భద్రత..నియంత్రణ అధికారులతో సంప్రదింపులు జరిపాం. స్థానిక అధికారులతో సమన్వయంతో అన్ని భద్రత పరమైన విధానాలను అనుసరిస్తున్నాము’ అని ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. -
24 గంటల్లో.. 11 విమానాలకు బాంబు బెదిరింపులు
దేశంలో విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 11 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇలా వరుసపెట్టి బెదిరింపులు రావడం ప్రయాణికుల్లో తీవ్ర భయాన్ని రేకెత్తిస్తోంది. విమానాల టేకాఫ్‌కు ముందు ఇటువంటి బెదిరింపులు రావటంతో పలుచోట్ల తనిఖీలు నిర్వహించి దారి మళ్లిస్తున్నారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, పేలుడు పదార్థాలు లభించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.ఢిల్లీ నుంచి లండన్‌కు వెళ్లే విస్తారా విమానానికి బాంబు బెదిరింపుతో జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు మళ్లించారు. జైపూర్-దుబాయ్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి బెదిరింపు వచ్చింది. అయితే అది నకిలీ అని తేలింది. వీటితోపాటు మరో ఐదు ఆకాశా ఎయిర్ విమానాలు, ఐదు ఇండిగో విమానాలకు నేడు బాంబు బెదిరింపులు వచ్చాయి.దుబాయ్-జైపూర్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి బాంబు బెదిరింపు కారణంగా విమానాశ్రయం నుంచి టేకాఫ్ చేసేందుకు ఆలస్యం అయింది. ఈరోజు ఉదయం 6:10 గంటలకు టేకాఫ్ షెడ్యూల్ చేయగా.. 7:45కి దుబాయ్‌కి బయలుదేరింది. మరోవైపు ఫ్రాంక్‌ఫర్ట్‌కు మళ్లించిన విస్తారా విమానం ఆ తర్వాత లండన్‌కు బయలుదేరింది.కాగా గత సోమవారం నుంచి దాదాపు 50 విమానాలకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి.దీంతో పౌర విమానయాన మంత్రిత్వశాఖ అప్రమత్తమైంది. నకిలీ బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేదుకు సిద్ధమైంది. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. బూటకపు కాలర్లను ఐదేళ్లపాటు నో-ఫ్లై లిస్ట్‌లో ఉంచడం వంటి అనేక చర్యలు తీసుకుంటామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజేసీఏ) తెలిపింది. అయితే నకిలీ బాంబు బెదిరింపుల వల్ల తమకు జరిగిన నష్టాన్ని నిందితుల నుంచి వసూలు చేయాలని విమానయాన సంస్థలు సూచిస్తున్నాయి. -
ఆకాసా ఎయిర్‌కు రూ.30 లక్షలు జరిమానా.. ఎందుకంటే..
ప్రముఖ విమానయాన సంస్థ ఆకాసా ఎయిర్‌కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రూ.30 లక్షలు జరిమానా విధించింది. ఎస్ఎన్వీ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తున్న ఆకాసా ఎయిర్ పలు నియంత్రణ ఉల్లంఘనలకు పాల్పడిందని పేర్కొంది. ఈ జరిమానాను ముప్పై రోజుల్లోపు చెల్లించాలని స్పష్టం చేసింది.ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్(ఐసీఏఓ) ఆధ్వర్యంలోని ఎయిర్ ట్రాన్స్పోర్ట్ రెగ్యులేషన్ ప్యానల్(ఏటీఆర్పీ) ఆమోదం లేకుండా పైలట్లకు శిక్షణ ఇస్తున్నట్లు డీజీసీఏ పేర్కొంది. దాంతోపాటు పైలట్ల శిక్షణ సమయం అధికంగా ఉందని చెప్పింది. క్యాట్ 2/3 ఆపరేషన్(విమానం దిగేందుకు అనుసరిస్తున్న విధానం) కోసం అర్హత లేని ఎగ్జామినర్లను నియమించడం వంటివి ఉల్లంఘనల్లో ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి అనేక అవకాశాలు ఇచ్చినప్పటికీ ఆకాసా ఎయిర్ సరైన విధంగా స్పందించలేదని డీజీసీఏ పేర్కొంది. మే 20, 2024న డీజీసీఏ స్పాట్ ఇన్స్పెక్షన్ చేయడంతో ఈ ఉల్లంఘనలు బయటపడినట్లు అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: విదేశాలకు వెళ్తున్నారా? ఈ పాలసీ మీ కోసమే..ఇప్పటికే ఆగస్టు 29, 2024న జారీ చేసిన షోకాజ్ నోటీసుకు సంస్థ వివరణ ఇచ్చింది. అయితే దీనిపై డీజీసీఏ సంతృప్తి వ్యక్తం చేయలేదు. దాంతో ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్ 1937లోని రూల్ 162 ప్రకారం రూ.30 లక్షలు జరిమానా విధించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై ఆకాసా ఎయిర్ స్పందిస్తూ..‘డీజీసీఏ నుంచి జరిమానా విధించాలంటూ అక్టోబర్ 17, 2024న నోటీసు అందింది. సంస్థ ప్రపంచ భద్రత ప్రమాణాలకు కట్టుబడి ఉంది. ఈ విషయంలో డీజీసీఏతో కలిసి పని చేస్తాం’ అని పేర్కొంది. ఒకవేళ కంపెనీ దీనిపై అప్పీల్ చేయడానికి లేదా పెనాల్టీ చెల్లించడానికి 30 రోజుల సమయం ఉంటుంది. -
ఆకాసాలో భారీ పెట్టుబడులకు చర్చలు
ప్రముఖ ఎయిర్‌లైన్ సంస్థ ఆకాసా ఎయిర్‌లో ప్రేమ్‌జీ ఇన్వెస్ట్, క్లేపాండ్ క్యాపిటల్ వాటాను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు కథనాలు వెలువడ్డాయి. రెండు సంస్థలు కలిపి రూ.1,049 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు.భారత్‌లో విమానయాన ప్రయాణికులు పెరుగుతున్నారు. దాంతో చాలా కంపెనీలు దేశీయ రూట్లలో విమానాల సంఖ్యను పెంచుతున్నాయి. రానున్న రోజుల్లో టైర్1, 2, 3 సిటీల్లోని ప్రజలు విమానాల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతారని అంచనా వేస్తున్నాయి. దాంతో ఆయా ప్రాంతాల్లో ప్రయాణాలకు అనువైన మౌలికవసతులను అభివృద్ధి చేస్తున్నాయి. దీన్ని గమనించిన కొన్ని సంస్థలు విమానయాన కంపెనీల్లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇందులో భాగంగానే రూ.2,938 కోట్లు విలువైన ఆకాసా ఎయిర్‌లో తాజాగా అజీమ్ ప్రేమ్‌జీ కుటుంబం కన్సార్టియంగా ఉన్న ప్రేమ్‌జీ ఇన్వెస్ట్, మణిపాల్ గ్రూప్‌కు చెందిన రంజన్‌పాయ్ ఆధ్వర్యంలోని క్లేపాండ్ క్యాపిటల్ పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నాయి. ఫలితంగా ఆకాసా ఎయిర్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది.ఇదీ చదవండి: ప్రైవేట్ బ్యాంకుల్లో తగ్గుతున్న ‘అట్రిషన్’ఇదిలాఉండగా, ఇప్పటికే ఆ కంపెనీలో రాకేష్జున్జున్వాలా కుటుంబానికి గరిష్ఠంగా రూ.293 కోట్ల వాటా ఉంది. ఇప్పుడు ప్రేమ్‌జీ ఇన్వెస్ట్, క్లేపాండ్ క్యాపిటల్ కలిపి దాదాపు రూ.1,049 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు చర్చలు జరుపుతున్నారు. ఇదే జరిగితే ఆకాసాలో మేజర్ వాటాదారులుగా ప్రేమ్‌జీ ఇన్వెస్ట్, క్లేపాండ్ క్యాపిటల్ వ్యవహరిస్తాయి. ఆకాసాలో ప్రస్తుతం 24 ఎయిర్‌క్రాఫ్ట్‌లున్నాయి. 202 విమానాలను ఆర్డర్ చేశారు. 27 నగరాలకు ప్రయాణికులను చేరవేస్తున్నారు. -
సెక్యూరిటీ అలర్ట్.. అహ్మదాబాద్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఢిల్లీ: ఢిల్లీ నుంచి ముంబై బయలుదేరిన అకాసా ఎయిర్ విమానానికి సెక్యూరిటీ అలెర్ట్ రావటం కలకలం రేపింది. దీంతో ఆ విమానాన్ని గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు మళ్లించారు. సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి ముంబైకి 186 మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానానికి సెక్యూరిటీ హెచ్చరిక వచ్చింది.Akasa Air flight diverted to Ahmedabad airport after security alert https://t.co/BMWokfVVF9 pic.twitter.com/itUSAtj16s— DeshGujarat (@DeshGujarat) June 3, 2024 దీంతో అప్రమత్తమైన విమాన సిబ్బంది 10.13 గంటలకు దారి మళ్లించి అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయి పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రయాణికులందరినీ ఫ్లైట్ నుంచి దించివేశారు.‘ఫైట్ కెప్టెన్ అన్ని అత్యవసర సూచనలు పాటించారు. సురక్షింతంగా అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేశారు. అకాశ్ ఫ్లైట్.. సెఫ్టీ, సెక్యూరిటీ ప్రొటోకాల్స్ పాటించింది’ అని అకాసా ఎయిర్ అధికార ప్రతినిధి వెల్లడించారు. -
హీరోయిన్‌తో అసభ్య ప్రవర్తన.. అత్యంత చెత్త అంటూ!
గతంలో డైరెక్టర్‌తో ముద్దు సీన్‌తో పెద్ద ఎత్తున వైరలైన హీరోయిన్ మన్నారా చోప్రా. ఓ ఈవెంట్‌కు హాజరైన ఆమెకు టాలీవుడ్ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ అందరి ముందే ముద్దు పెట్టి ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. అప్పట్లో ఆ వీడియో సంచలనంగా మారింది. పెద్దఎత్తున వైరల్ కావడంతో పాటు ఆయన భారీగా ట్రోలింగ్‌కు కూడా గురయ్యారు. కాగా.. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ హిందీ బిగ్ బాస్ సీజన్-17లో మెరిసింది. అంతే కాదు టాప్-3 కంటెస్టెంట్స్‌లో ఒకరిగా నిలిచింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మకు చేదు అనుభవం ఎదురైంది. ఎయిర్‌లైన్స్ సిబ్బంది తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించారని తెలిపింది. నేను ప్రయాణించిన అత్యంత చెత్త ఎయిర్‌లైన్స్ ఇదే.. ఇలా జరగడం నాకు రెండోసారని పేర్కొంది. గతంలో ఒకసారి నా బ్యాగ్‌ను డ్యామేజ్ చేశారని.. ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పినా మళ్లీ దురుసుగా ప్రవర్తించారని వెల్లడించింది. ఈ విషయాన్ని తన ట్విటర్ ద్వారా పంచుకుంది. అయితే మన్నారా చోప్రా ట్వీట్‌కు విమానయాన సంస్థ స్పందించింది. " మన్నారా ట్వీట్‌పై ఎయిర్‌లైన్స్ . "మన్నారా.. మీకు కలిగిన ఇబ్బందికి మేము చింతిస్తున్నాం. మా బృందం విమానాశ్రయంలోనే అదనపు బ్యాగేజీ రుసుము విధానాన్ని వివరించిందని అర్థం చేసుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు మీ రుసుమును మాఫీ చేయలేము. ఈ విషయంలో మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. అలాగే మీకు ఇంతకు ముందు ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తాం. దయచేసి మాకు ఆ వివరాలను పంపించండి" అంటూ రిప్లై ఇచ్చింది. దీనికి మన్నారా చోప్రా బదులిస్తూ.. "ఏం వ్రాస్తున్నారు సార్.. మీ సిబ్బంది నాతో అసభ్యంగా, దురుసుగా ప్రవర్తించారు. ఈ రోజు ఉదయం నాకు ఆరోగ్యం బాగాలేదు. మీ ఉద్యోగితో ఈ విషయాన్ని ప్రస్తావించా. మీరు చాలా బాగా నటిస్తున్నారు.. వెళ్లి మా మేనేజర్‌తో మాట్లాడండని దురుసుగా ప్రవర్తించింది. కనీసం మీ మేనేజర్ వచ్చి సమస్యను అర్థం చేసుకునే పని కూడా చేయలేదు." అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా.. మన్నారా థ్రిల్లర్ జిద్ అనే మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం తెలుగులో రాజ్ తరుణ్ సరసన తిరగబడరా సామీ చిత్రంలో కనిపించనుంది. ఇటీవలే ముగిసిన బిగ్ బాస్ సీజన్ -17లో మూడోస్థానంలో నిలిచింది. The worst airlines to travel with @AkasaAir .this is my second experience with them,first time I travelled they damaged my bag and this time I’m not feeling well they ended up being rude again — Mannara Chopra (@memannara) February 18, 2024 -
విదేశాలకు ఆకాశ ఎయిర్
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ అంతర్జాతీయ సరీ్వసులు నడిపేందుకు రెడీ అయింది. ముంబై నుంచి దోహాకు తొలి అంతర్జాతీయ సర్వీ సు మార్చి 28న ప్రారంభం కానుంది. వారంలో నాలుగు నాన్–స్టాప్ ఫ్లైట్స్ నడుపనుంది. 2022 ఆగస్ట్ 7న ఆకాశ ఎయిర్ కార్యకలాపాలు ప్రారంభించింది. కంపెనీ వద్ద బోయింగ్ 737 మ్యాక్స్ రకం 23 విమానాలు ఉన్నాయి. 150 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలకు 2024 జనవరిలో ఆర్డర్ ఇచి్చంది. -
మరో భారీ కొనుగోలుకు శ్రీకారం చుట్టిన ఆకాశ ఎయిర్!
ప్రముఖ ఏవియేషన్ సంస్థ ఆకాశ ఎయిర్ మరో భారీ కొనుగోలుకు శ్రీకారం చుట్టింది. కొద్ది రోజుల క్రితం అమెరికన్ విమాన తయారీదారు బోయింగ్ నుంచి 150 బోయింగ్ 737 మ్యాక్స్ 150 విమానాల కొనుగోలుకు ఆర్డర్ పెట్టింది. అయితే, తాజాగా ఆ విమానాల కోసం సీఎఫ్ఎం ఇంటర్నేషనల్ నుండి 300 ఇంజిన్లను కొనుగోలు చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. లీప్-1బి ఇంజన్లు, విడిభాగాలు, ఇతర సేవల కోసం సీఎఫ్ఎం ఇంటర్నేషనల్‌తో కుదుర్చుకున్న ఈ డీల్ విలువ సుమారు 5 బిలియన్ డాలర్లని అంచనా. కాగా..దేశీయ, అంతర్జాతీయంగా కొత్త మార్గాల్లో సర్వీసులను ప్రారంభించేందుకు ఆకాశ ఎయిర్ ‘మ్యాక్స్ 10, ‘మ్యాక్స్ 8-200’ శ్రేణి విమానాల కోసం ఈ ఏడాడి ప్రారంభంలో విమానాల కొనుగోలుకు సిద్ధమైంది. 2021లో ఆకాశ ఎయిర్ 72 బోయింగ్ 737 మ్యాక్స్‌లను బుక్ చేసుకుంది. గతేడాది మరో నాలుగింటికి ఆర్డర్ ఇచ్చింది. ఈ మొత్తంలో ఇప్పటికే 22 విమానాలను బోయింగ్ డెలివరీ చేసింది. ఇప్పుడు అదనంగా మరో 150 బోయిల్ విమానాలకు ఆర్డర్ పెట్టింది. విమానాల కొనుగోలు ఆర్డర్ పెట్టే సమయంలో చారిత్రాత్మకమైన విమానాల కొనుగోలుతో ప్రపంచంలోని టాప్ 30 ప్రముఖ ఎయిర్‌లైన్స్‌లో ఆకాశ ఎయిర్ ఒటిగా అవతరించేలా చేస్తుంది. అంతేకాదు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మా సేవల్ని అందించేందుకు ఈ ఒప్పందం ఉపయోగడపుతుందని అకాశ ఎయిర్ వ్యవస్థాపకుడు, సీఈఓ వినయ్ దూబే అన్నారు. -
ఒకేసారి 150 విమానాలు.. హైదరాబాద్ వేదికగా ఆర్డర్
WingsIndia2024: ప్రముఖ విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్‌లైన్స్ ఏకంగా 150 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను కొనుగోలు చేయడానికి ఆర్డర్ ఇచ్చింది. హైదరాబాద్‌లో జరిగిన వింగ్స్ ఇండియా ఈవెంట్లో దీనికి సంబంధించిన ఒప్పందం కుదుర్చుకున్నట్లు సీఈఓ వినయ్ దూబే వెల్లడించారు. ఆకాశ ఎయిర్ భారతదేశపు సరికొత్త విమానయాన సంస్థ అయినప్పటికీ.. 2022లో కార్యకలాపాలను ప్రారంభించినప్పటి నుంచి నాలుగు శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఇప్పటికే ఈ కంపెనీ గతంలో 72 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలకు ఆర్డర్ ఇచ్చింది. ఇందులో 22 విమానాలను డెలివరీ చేసుకుని నిర్వహణలో ఉంచింది. అంతర్జాతీయ విస్తరణ వైపు అడుగులు వేస్తున్న ఆకాశ ఎయిర్ ప్రణాళికలో భాగంగానే ఈ కొత్త ఆర్డర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అనుకున్నవన్నీ సవ్యంగా జరిగితే.. భారత్ నుంచి ఆగ్నేయాసియా, మిడిల్ ఈస్ట్ సహా సమీప విదేశీ గమ్యస్థానాలకు వెళ్లేందుకు వీలుగా బోయింగ్ విమానాలను ఉపయోగిస్తారు. ఇదీ చదవండి: టీసీఎస్ వర్క్ ఫ్రమ్ హోమ్.. సీఈఓ ఏమన్నారంటే? గత ఏడాది మరో ఎయిర్‌లైన్స్‌లో చేరటానికి ఎలాంటి నోటీసు లేకుండానే సుమారు 40 మంది పైలట్లు రాజీనామా చేయడంలో విమానయాన సంస్థ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో సంస్థ సంక్షోభంలోకి వెళ్ళింది. ఆ సమయంలోనే ఆకాశ ఎయిర్ తన కార్య కలాపాలను నిలిపివేసే అవకాశం ఉందని చాలామంది భావించారు. ఆ తరువాత కొత్త ఫైలెట్లను నియమించుకుని ముందుకు సాగుతోంది. Thank you, Hon’ble @JM_Scindia for your constant support and encouragement. We are proud to be a part of the India growth story and are committed to create an inclusive travel environment by connecting people, places, and cultures. #AkasaAir #ItsYourSky #WingsIndia2024 https://t.co/5AhlZ30z1j — Akasa Air (@AkasaAir) January 18, 2024 -
ఆన్‌టైమ్‌లో బెస్ట్.. ఆకాశ ఎయిర్
తరచూ ఫ్లైట్ ఎక్కే ప్రయాణికులు విమానాల ఆలస్యం, రద్దు వంటి సమస్యలతో ఎప్పుడోసారి ఇబ్బందులు పడే ఉంటారు. ఇలాంటి సమస్యలు అన్ని ఎయిర్‌లైన్స్‌లోనూ ఉంటాయి. అయితే దేశంలోని ఏయే విమానయాన సంస్థలో ఇలాంటి సమస్యలు ఏ స్థాయిలో ఉన్నాయనే దానిపై పౌర విమానయాన సంస్థ తాజాగా గణాంకాలు విడుదల చేసింది. సమయ పనితీరు (ఆన్‌టైమ్ పర్ఫార్మెన్స్- OTP) మెరుగ్గా ఉన్న ఎయిర్‌లైన్స్ జాబితాలో ఆకాశ ఎయిర్ (Akasa Air) అగ్రస్థానంలో ఉంది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకారం.. 2023 నవంబర్ నెలలో ఆకాశ ఎయిర్ సమయ పనితీరు 78.2 శాతం వద్ద ఉంది. ఇండిగో సంస్థ 77.5 శాతంతో రెండవ స్థానంలో నిలిచింది. 72.8 శాతం ఓటీపీతో విస్తారా మూడవ స్థానంలో ఉండగా స్పైస్‌జెట్ 41.8 శాతంతో ఆధ్వాన సమయ పనితీరును నమోదు చేసింది. ఇక అతిపెద్ద దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా 62.5 శాతంతో రెండో అధ్వాన ఆన్‌టైమ్ పర్ఫార్మెన్స్ ఎయిర్‌లైన్‌గా నిలిచింది. ఫ్లై బిగ్.. రద్దుల్లో అత్యధికం దేశంలోని ప్రధాన మెట్రో నగరాలైన బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై విమానాశ్రయాలలో నమోదైన వివరాల ఆధారంగా దేశీయ విమానయాన సంస్థల ఆన్-టైమ్ పర్ఫార్మెన్స్ను లెక్కించారు. ఇక నవంబర్‌లో దేశీయ విమానయాన సంస్థల మొత్తం సరాసరి రద్దు రేటు 0.73 శాతంగా ఉంది. ఇందులో ఫ్లై బిగ్ అత్యధికంగా 7.64 శాతం రద్దు రేటును నమోదు చేయగా ఎయిర్ ఇండియా రద్దు రేటు అత్యల్పంగా 0.10 శాతంగా నమోదైంది. ఇండిగో విమానాల రద్దు రేటు 0.90 శాతంగా ఉంది. ఈ ఏడాది నవంబరులో దేశీయ విమానయాన సంస్థలకు సంబంధించి ప్రయాణికుల నుంచి మొత్తం 601 ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదు రేటు ప్రతి 10,000 మంది ప్రయాణికులకు సుమారు 0.47గా ఉంది. ఇండియావన్ ఎయిర్‌పై అత్యధికంగా ప్రతి వెయ్యి మంది ప్రయాణికులకు 99.1 ఫిర్యాదులు చొప్పున నమోదయ్యాయి. ఇక విస్తారా, ఇండిగో సంస్థలు వరుసగా 0, 0.1 ఫిర్యాదు రేట్లు నమోదు చేశాయి. -
ఆకాశ ఎయిర్‌లైన్స్ సంచలన నిర్ణయం
దేశీయ విమానయాన రంగం సంస్థ అయిన ఆకాశ ఎయిర్ త్వరలో అంతర్జాతీయ రూట్స్‌లో విమానాలు నడపనుంది. అందుకు అనువుగా ఫ్లైట్స్ ఆర్డర్ పెట్టనున్నట్లు కంపెనీ సీఈఓ వినయ్‌దూబే తెలిపారు. సంస్థ ప్రస్తుతం 4.2 శాతం మార్కెట్ వాటాతో కొనసాగుతోందన్నారు. భవిష్యత్తులో మరింత విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. రాకేశ్ ఝన్‌ఝన్‌వాలా పెట్టుబడి పెట్టిన ఆకాశ ఎయిర్ త్వరలో అంతర్జాతీయ రూట్స్‌లో ప్రయాణించడానికి సిద్ధపడుతోంది. దీనికి తోడు స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేసేందుకూ ప్రయత్నిస్తున్నామని ప్రకటించారు. ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, దిల్లీతో సహా 16 దేశీయ గమ్యస్థానాలకు ఆకాశ తన సేవలు అందిస్తోంది. ఈ ఎయిర్ లైన్స్ వారానికి 750 కంటే ఎక్కువ విమానాలను నడుపుతోంది. కాగా ఈ దశాబ్దం చివరి నాటికి ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్గా మార్కెట్లలో లిస్ట్ అయ్యేందుకు రెడీ అవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి అంతర్జాతీయ సేవలను ప్రారంభించాలని చూస్తోంది. 76 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల కోసం ఇప్పటికే ఆర్డర్ చేయగా.. 2027 మధ్య నాటికి ఇవి డెలివరీ అవుతాయని బావిస్తోంది. ప్రస్తుతం ఆకాశ ఎయిర్‌కు 20 విమానాలు ఉన్నాయి. -
ఆకాశ ఎయిర్‌కు బాంబు బెదిరింపు..185 మంది ప్రయాణికులు!
బ్యాగ్‌లో బాంబు ఉందని బెదిరించడంతో శనివారం ఆకాశ ఎయిర్ విమానాన్ని అత్యవసరంగా ముంబయికి మళ్లించారు. పుణె నుంచి దిల్లీకి బయలుదేరిన ఆకాశ ఎయిర్ విమానాన్ని ఓ ప్రయాణికుడు తన బ్యాగ్‌లో బాంబు ఉందని చెప్పడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం టేకాఫ్ అయిన 40 నిమిషాల తర్వాత సదరు ప్రయాణికుడు సిబ్బందితో బెదిరింపులకు పాల్పడ్డాడు. అప్పుడు విమానంలో 185 మంది ప్రయాణికులు ఉన్నారు. సిబ్బంది వెంటనే కెప్టెన్‌కు సమాచారం అందించారు. అత్యవసరంగా ముంబైలో విమానాన్ని ల్యాండ్ చేయాలని నిర్ణయించుకున్నారు. దాంతో ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. బాంబు డిటెక్షన్, డిస్పోజల్ స్క్వాడ్ ద్వారా ప్రయాణీకుల బ్యాగ్‌లు పరిశీలించారు. విమానాశ్రయంలో దిగాక జరిపిన తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు కన్పించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బాంబు బెదిరింపు బూటకమని తేలడంతో, విమానం తిరిగి ఢిల్లీకి బయలుదేరింది. ఘటనకు మందు సదరు ప్రయాణికుడు ఛాతీ సమస్యకు మెడిసిన్ తీసుకున్నట్లు తన కుటుంబ సభ్యులు అన్నారని సీఐఎస్ఎఫ్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు. -
ఢిల్లీ వెళ్తున్న విమానానికి బాంబు బెదిరింపు.. ముంబైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
ముంబై: పుణె నుంచి ఢిల్లీ వెళ్తున్న అకాశ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో విమానాన్ని ముంబై ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేశారు. వివరాలు.. ఆకాశ ఎయిర్ సంస్థకు విమానం(QP 1148) 185 ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో శుక్రవారం అర్థరాత్రి 12 గంటలకు తెల్లవారుజామున పుణె నుంచి బయల్దేరింది. టేకాఫ్ అయిన 40 నిమిషాలల తర్వాత ఓ ప్రయాణికుడు తన వద్దనున్న బ్యాగ్‌లో బాంబ్ ఉందని బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని ముంబైకి మళ్లించి అత్యవసర ల్యాండింగ్ చేశారు. అనంతరం బాంబ్ స్క్వాడ్ బృందం, పోలీసులు విమానం అంతా తనిఖీలు చేపట్టారు. అయితే తమ సోదాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువును గుర్తించలేదని అధికారులు తెలిపారు. బాంబు బెదిరింపు చేసిన ప్రయాణికుడు ఛాతీలో నొప్పి వస్తుందని కూడా చెప్పడంతో విమానం ల్యాండైన వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అనంతరం అతనికి వైద్యం అందించి పంపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాంబు లేదని తేలడంతో శనివారం ఉదయం 6 గంటలకు విమానం మళ్లీ ఢిల్లీకి టేకాఫ్ అయ్యింది. చదవండి: ఘోర ప్రమాదం.. చిన్నారి సహా అయిదుగురు మృత్యువాత -
ఆకాశ ఎయిర్.. ఇక అంతర్జాతీయ సర్వీసులు
న్యూఢిల్లీ: రియాద్, జెడ్డా, దోహా, కువైట్‌కు సర్వీసులు నిర్వహించేందుకు పౌర విమానయాన శాఖ నుంచి ట్రాఫిక్ అనుమతులు లభించినట్టు ఆకాశ ఎయిర్ సీఈవో వినయ్ దూబే వెల్లడించారు. ఇది తమకు ఎంతో ఉత్సాహాన్నిచ్చే దశగా పేర్కొన్నారు. విదేశీ ప్రభుత్వాల నుంచి కూడా అనుమతులు తీసుకుని, త్వరలోనే అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభిస్తామని ప్రకటించారు. ఆకాశ ఎయిర్ కార్యకలాపాలకు ఈ ఏడాది ఆగస్ట్‌తో ఏడాది ముగిసింది. సంస్థ నిర్వహణలోని బోయింగ్ 738 మ్యాక్స్ విమానాల సంఖ్య 20కు చేరుకుంది. దీంతో అంతర్జాతీయ కార్యకలాపాలకు అనుమతులు వచ్చాయి. ఈ ఏడాది చివరికి మరో రెండు విమానాలు సంస్థకు అందుబాటులోకి రానున్నాయి. బలమైన ఆర్థిక మూలాలతో, వృద్ధి దశలో ఉన్నట్టు దూబే తెలిపారు. సంస్థ వద్ద నగదు నిల్వలు తగినన్ని ఉన్నట్టు చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి మూడంకెల స్థాయిలో కొత్త విమానాలకు ఆర్డర్ చేయనున్నట్టు చెప్పారు. తొలి అంతర్జాతీయ సర్వీసు ఎప్పుడు ప్రారంభించేది ఇప్పుడే చెప్పడం కష్టమని దూబే పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఆకాశ ఎయిర్ వారానికి 700 సర్వీసులను, 16 పట్టణాలకు నిర్వహిస్తోంది. దేశీ మార్కెట్లో 4.2 శాతం వాటా కలిగి ఉంది. నిధుల సమస్య లేదు ఆకాశ ఎయిర్ నిధుల సంక్షోభాన్ని ఎదుర్కొంటుందన్న వార్తలను ప్రస్తావించగా, అలాంటిదేమీ లేదని వినయ్ దూబే బదులిచ్చారు. సానుకూల నగదు ప్రవాహాలు ఉన్నాయని, మా నిల్వలను పెంచుకుంటూనే ఉంటామన్నారు. కొత్త విమానాలు ఆర్డర్ చేసేందుకు తమకు నిధుల అవసరం లేదన్నారు. జున్‌జున్‌వాలా కుటుంబం సంస్థను వీడుతున్నట్టు వచ్చిన వార్తలు అసంబద్ధమని స్పష్టం చేశారు. తాము దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేసినట్టు వారు స్పష్టం చేశారని తెలిపారు. పైలట్ల ఆకస్మిక రాజీనామా, వారికి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో దీని గురించి ప్రస్తావించగా, అది ముగిసిపోయిందంటూ.. ప్రస్తుతం వృద్ధి దశలో ఉన్నట్టు చెప్పారు. -
సంక్షోభంలో ఆకాశ ఎయిర్, మూసివేత? సీఈవో స్పందన ఇదీ
Akasa Air Crisis మరో బడ్జెట్ ధరల విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ సంక్షోభంలో చిక్కుకుంది. దివంగత రాకేష్ ఝన్‌ఝన్‌వాలా ప్రధాన వాటాదారుగా గత ఏడాది సేవలను ప్రారంభించిన అకాశ ఎయిర్‌కు పైలట్ల సెగ తగిలింది. ఆకస్మాత్తుగా సంస్థకు గుడ్ బై చెప్పడంతో కొన్ని విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో ఆకాశ ఎయిర్ కూడా మూత పడనుందనే వదంతులు మార్కెట్ వర్గాల్లో వ్యాపించాయి. పైలట్ రాజీనామా ఆందోళనల మధ్య ఆకాశ ఎయిర్ సీఈవో వినయ్ దుబే ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. విశ్వసనీయతను నిర్ధారించడానికే విమానాలను తాత్కాలికంగా తగ్గిస్తుంది తప్ప మరేమీ కాదంటూ మూసివేత రూమరన్లు ఖండించారు. కొద్ది మంది పైలట్లు ఉన్నట్టుండి రిజైన్ చేయడంతో కొన్ని తమ విమాన సర్వీసులను రద్దు చేసినట్టు ప్రకటించారు. పైలట్లు చట్టవిరుద్ధంగా తప్పనిసరి ఒప్పంద నోటీసు వ్యవధిని అందించకుండానే వెళ్లిపోయారంటూ దూబే తెలిపారు. దీనికి పైలట్లపై చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు ఉద్యోగులకు అందించిన ఇమెయిల్‌లో వెల్లడించారు. సంస్థ దీర్ఘకాల కార్యకలాపాలపై విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. (చంద్రయాన్-3 సక్సెస్: వాళ్ల ఏడుపు చూడలేకే, ఇడ్లీ బండి నడుపుకుంటున్నా!) దాదాపు 43 మంది పైలట్ల ఆకస్మిక నిష్క్రమణ కారణంగా స్వల్పకాలంలో తమ సేవలకు అంతరామమని దూబే ఉద్యోగులకు అందించిన ఇమెయిల్ సమాచారం తెలిపారు. కొంతమంది పైలట్ల నిర్ణయం కారణంగా జూలై, సెప్టెంబర్ మధ్య విమానాలకు అంతరాయం ఏర్పడిందనీ, చివరి నిమిషంలో రద్దు చేయవలసి ఇచ్చిందని పేర్కొన్నారు. అంతేకాదు కస్టమర్ల కోసం అత్యుత్తమ విమానయాన సంస్థను నిర్మించామనీ, తమ ప్లాన్ ప్రకారం ప్రతి మైలురాయిని అధిగమించాని చెప్పారు. దీర్ఘకాలం సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ దూబే వివరణ ఇచ్చారు. (మరో భారీ బ్యాంకు స్కాం: ఏకంగా రూ.3847 కోట్లకు ముంచేశారు) కాగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తాజా డేటా ప్రకారం, Akasa మార్కెట్ వాటా ఆగస్టులో 5.2 శాతం నుండి 4.2 శాతానికి పడిపోయింది. గత ఏడాది ఆగస్టులో దేశీయంగా తొలి విమానాన్ని నడిపిన ఆకాశ ఎయిర్ ఆ తరువాత అంతర్జాతీయ విమానాలను నడిపేందుకు అర్హత సాధించింది. ఆగస్టు 1న బోయింగ్ 20వ B737 మ్యాక్స్ విమానాన్ని అందుకుంది. (జ్యూస్ అమ్ముకునే స్థాయినుంచి రూ.5 వేల కోట్ల దాకా: ఎవరీ సౌరభ్?) -
రాకేష్ ఝున్‌ఝున్ వాలా.. ‘ఆకాశ ఎయిర్’లో ఏం జరుగుతోంది?
స్టాక్ మార్కెట్ బిగ్బుల్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలాకు చెందిన బడ్జెట్ ఎయిర్‌లైన్స్‌గా భావిస్తున్న ‘ఆకాశ ఎయిర్’ సంచలన నిర్ణయం తీసుకుంది. నోటీస్ పిరియడ్ సర్వ్ చేయకుండా సంస్థ నుంచి వైదొలగిన 43 మంది పైలెట్లపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పైలెట్లు తీసుకున్న నిర్ణయం కారణంగా ఆయా ప్రాంతాలకు సర్వీసులు అందించే ఆకాశ ఎయిర విమానయాన సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఫలితంగా అధిక సంఖ్యలో విమానాల సేవల్ని రద్దు చేసింది. పైలెట్ల కొరతే విమానయాన సేవలపై ప్రభావం చూపుతుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. బాంబే హైకోర్టుకు ఈ నేపథ్యంలో సంస్థకు రాజీనామా చేసిన ఉద్యోగులు తప్పనిసరిగా 6 నెలల పాటు నోటీస్ పిరియడ్ సర్వ్ చేయాల్సి ఉంటుంది. కానీ అలా చేయకుండా మరో సంస్థలో చేరిన పైలెట్లపై మాత్రమే చట్టపరమైన చర్యలు తీసుకునేలా బాంబే హైకోర్టును ఆశ్రయించింది. తమ సంస్థతో పైలెట్లు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. మరో సంస్థలో చేరే ముందు పైలెట్లు నోటీస్ సర్వ్ చేయాలి. కానీ అలా చేయకుండా నిబంధనల్ని ఉల్లంఘించారని కోర్టుకు విన్నవించింది. కాబట్టి సిబ్బంది తీసుకున్న నిర్ణయం వల్ల తామెంతో నష్టపోతున్నామని, న్యాయం చేయాలని కోరింది. పైలెట్లది అనైతిక, స్వార్థపూరిత చర్య ఈ సందర్భంగా విమానయాన చట్టం ప్రకారం.. ఉద్యోగులు తమ ఒప్పందాన్ని ఉల్లంఘించడమే కాకుండా దేశ పౌర విమానయాన నిబంధనల్ని ఉల్లంఘించారని ఆకాశ ఎయిర్ ప్రతినిధి తెలిపారు.‘ఇది చట్టవిరుద్ధం మాత్రమే కాదు. పైలెట్ల అనైతిక, స్వార్థపూరిత చర్య కారణంగా ఈ ఆగస్టులో విమానాల సేవలకు అంతరాయం కలిగింది. పైలెట్ల కొరత కారణంగా చివరి నిమిషంలో విమానాల్ని రద్దు చేయాల్సి వచ్చింది. వేలాది మంది ప్రయాణికులు సైతం తీవ్ర అసౌకర్యానికి గురయ్యారని అన్నారు. కాగా, ప్రస్తుతం 20 విమానాల సేవల్ని అందిస్తున్న ఆకాశా ఎయిర్ గత ఏడాది ఆగస్టు నెలలో కార్యకలాపాల్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. చదవండి👉 భారీగా పెరిగిన ఆకాశ ఎయిర్ వేతనాలు.. కెప్టెన్ నెల శాలరీ ఎంతంటే? -
ఆకాశ ఎయిర్.. ఏడాది పూర్తి
ముంబై: విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించి ఏడాది పూర్తి చేసుకుంది. ఈ కాలంలో 43 లక్షల మందిని వారి గమ్యస్థానాలకు చేర్చినట్టు కంపెనీ సోమవారం ప్రకటించింది. 20 విమానాలతో వారంలో 900లకుపైగా సరీ్వసుల మైలురాయిని దాటినట్టు వెల్లడించింది. 2023 డిసెంబర్ నుంచి విదేశాలకూ సరీ్వసులను నడపనున్నట్టు ఇప్పటికే ఆకాశ ఎయిర్ తెలిపింది. దేశీయ విమానయాన రంగంలో సంస్థకు 4.9 శాతం వాటా ఉంది. ‘2022 ఆగస్ట్ 7న తొలి విమానం ముంబై నుంచి అహ్మదాబాద్‌లో అడుగుపెట్టింది. 16 నగరాలను అనుసంధానిస్తూ 35 రూట్లలో విమానాలు నడుస్తున్నాయి. సంస్థకు చెందిన విమానాల ద్వారా 25,000 టన్నులకు పైచిలుకు కార్గో రవాణా జరిగింది’ అని వివరించింది. ఇప్పటికే ఆకాశ ఎయిర్ 152 విమానాలకు ఆర్డర్లు ఇచి్చంది. వీటికి అదనంగా 2023 చివరినాటికి మూడంకెల స్థాయిలో విమానాలకు ఆర్డర్ ఇవ్వనున్నట్టు ధీమా వ్యక్తం చేసింది. శిక్షణ కోసం పెట్టుబడి చేస్తామని, దేశంలోని ప్రధాన నగరాల్లో లెరి్నంగ్ కేంద్రాలను నెలకొల్పుతామని తెలిపింది. ఆకాశ ఎయిర్‌ను ఎస్ఎన్వీ ఏవియేషన్ ప్రమోట్ చేస్తోంది. జెట్ ఎయిర్వేస్ మాజీ సీఈవో వినయ్ దూబే, ఇతరులు ఈ కంపెనీలో పెట్టుబడి చేశారు. -
విమాన ప్రయాణికులకు శుభవార్త
-
విమాన ప్రయాణీకులకు బంపర్ ఆఫర్:మెగా సేల్
విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్. దేశీయ ప్రముఖ విమానయాన సంస్థ బడ్జెట్ ధరల ఆకాశ ఎయిర్ గుడ్ న్యూస్ చెప్పింది. తొలి వార్షికోత్సవం సందర్భంగా తక్కువ ధరలకే విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. స్పెషల్ వార్షికోత్స సేల్స్ ద్వారా విమాన టికెట్లపై 15 శాతం మేర డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ 16 డొమెస్టిక్ రూట్లకు వర్తిస్తుందని ఆకాశ ఎయిర్ తెలిపింది. ఆకాశ ఎయిర్ వెబ్సైట్, యాప్‌లోకి వెళ్లి వార్షికోత్సవం ఆఫర్ కింద 15 శాతం తక్కువ ధరకే టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ఆగస్టు 7 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ సేల్ ఆకాశ ఎయిర్ సేవల్, ఫ్లెక్సీ ఫేర్ టికెట్లలో అందుబాటులో ఉంది. వినియోగదారులు ఆకాశ ఎయిర్ వెబ్సైట్లో AKASA1 కోడ్ ఉపయోగించడం ద్వారా ఆఫర్ పొందవచ్చు. అలాగే ఆకాశ ఎయిర్ లైన్స్ యాప్‌లో APPLOVE కోడ్ ఉపయోగించి ఆఫర్ అందుకోవచ్చు. దేశీయంగా 16 రూట్లలో ప్రయాణానికి ఈ మెగా సేల్ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చు. కంపెనీ యాప్‌లో ప్రత్యేకంగా బుక్ చేసుకున్న తర్వాత, ప్రయాణీకులు జీరో కన్వీనియన్స్ ఫీజు పొందే అవకాశం కూడా ఉంది. తద్వారా ప్రతి బుకింగ్‌పై అదనంగా రూ. 350 వరకు ఆదా చేసుకోవచ్చు. ఇది విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి, అందరికీ అందుబాటులో ఉండేలా చేయడానికి ఎయిర్‌లైన్ నిబద్ధతలో భాగంగా అందిస్తున్న పరిమిత-కాల ఆఫర్అని కంపెనీ వెల్లడించింది. అంతేకాదు అంతర్జాతీయ కార్యకలాపాలను ప్రారంభించే క్రమంలో ఆగస్ట్ 1న, అకాశఎయిర్ 20వ ఎయిర్‌క్రాఫ్ట్ 737 MAX ను తన ఖాతాలో చేర్చుకున్నట్లు ప్రకటించింది. 12 నెలల్లోపు సున్నా నుండి 20 విమానాలకు వెళ్లడం కేవలం ఆకాసా రికార్డు మాత్రమే కాదు రికార్డు" అని ఆకాశ ఎయిర్ వ్యవస్థాపకుడు , చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వినయ్ దూబే పేర్కొన్నారు. కాగా ప్రముఖ స్టాక్‌మార్కెట్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝన్‌ఝన్‌వాలాకు చెందిన ఆకాశ ఎయిర్ లైన్ 2022, ఆగస్టులో తన సేవలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. 35 మార్గాల్లో వారానికి 900 విమానాలను నడుపుతోంది. ప్రధానంగా ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, గువాహటి, అగర్తల, పుణే, లఖ్‌నవూ, గోవా, హైదరాబాద్, వారణాసి, భువనేశ్వర్, కోల్‌కతాలకు విమాన సేవలు అందిస్తోంది. Coming soon: Long Weekend. Have you booked yet? Get up to 15% off on over 900 weekly flights across India. Use promo code: AKASA1 Valid till: 7th Aug, 2023 Book NOW: https://t.co/aYCnmVC8ip#ItsYourSky #AkasaAir #flightoffer #longweekend #weekend #flights pic.twitter.com/W4Q1GR6DAi — Akasa Air (@AkasaAir) August 2, 2023 Thank you for being a part of our journey, @BoeingAirplanes! https://t.co/PbUIEgBmf5 — Akasa Air (@AkasaAir) August 2, 2023 -
వేగంగా వృద్ధి సాధిస్తాం
ముంబై: తమ దగ్గర నిధుల సౌలభ్యం ఉందని, ఈ ఏడాది చివరిలో భారీ సంఖ్యలో (మూడు అంకెల) విమానాలకు ఆర్డర్ చేయగలమని ఆకాశ ఎయిర్ సీఈవో వినయ్ దూబే ప్రకటించారు. చాలా వేగంగా వృద్ధి చెందే సామర్థ్యాలున్నట్టు చెప్పారు. ఈ సంస్థను ప్రముఖ ఇన్వెస్టర్ రాకేశ్ జున్‌జున్‌వాలా స్థాపించడం గమనార్హం. వచ్చే నెలతో సంస్థ కార్యకలాపాలకు ఏడాది పూర్తి కానుంది. ఈ కాలంలో తాము అంచనాలను మించినట్టు దూబే తెలిపారు. ప్రస్తుతం ఈ సంస్థ వద్ద 19 విమానాలు ఉండగా, మరొకటి ఈ నెలలోనే అందుబాటులోకి రానుంది. దీంతో అంతర్జాతీయ సరీ్వసులు సైతం ప్రారంభించడానికి వీలు కలగనుంది. మూడు అంకెల విమానాల ఆర్డర్లు, అంతర్జాతీయ సేవల ప్రారంభం ఈ ఏడాదిలో ఉంటాయని దూబే చెప్పారు. ఈ సంస్థ 76 విమానాలకు గత నెలలో ఆర్డర్లు ఇవ్వడం తెలిసిందే. మార్కెట్లో పోటీ పెరగడంతో ఇండిగో, ఎయిర్ ఇండియా ఒకవైపు పెద్ద సంఖ్యలో విమానాలకు ఆర్డర్లు ఇవ్వడాన్ని ప్రస్తావించగా.. తాము ఏదీ కూడా స్వల్పకాల దృష్టితో చేయబోమని దూబే స్పష్టం చేశారు. తాము వృద్ధి కోసం పరుగులు పెట్టడం కాకుండా, స్థిరత్వానికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ‘‘ఇప్పటి నుంచి 2027 మార్చి నాటికి 76 ఎయిర్‌క్రాఫ్ట్‌లు మాకు అందుబాటులోకి వస్తాయి. ఉజ్వలమైన దేశీయ మార్కెట్, పలు అంతర్జాతీయ మార్గాలకు సరీ్వసులతో, ఎక్కువ మంది కస్టమర్ల సంతృప్తి పొందే ఎయిర్‌లైన్ సంస్థగా ఉంటాం’’అని దూబే చెప్పారు. అధికారిక గణాంకాల ప్రకారం మే నెలలో దేశీ మార్గాల్లో ఆకాశ ఎయిర్ 4.8 శాతం వాటాను సంపాదించింది. స్వర్ణయుగం.. వచ్చే రెండు దశాబ్దాల కాలం ఏవియేషన్ చరిత్రలో స్వర్ణయుగంగా నిలిచిపోతుందని దూబే అన్నారు. వచ్చే 15–20 ఏళ్లలో సుమారు 2,000 విమాన సరీ్వసులు, పెద్ద సంఖ్యలో ఎయిర్‌పోర్టులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ‘‘ప్రస్తుతం మేమున్న స్థితి పట్ల ఎంతో సంతోíÙస్తున్నాం. ఎంతో వృద్ధి చూడనున్నాం. మేము చిన్న సంస్థగా ఉన్నాం. కనుక మరింత వేగంగా వృద్ధి చెందే సామర్థ్యాలు మాకున్నాయి. ఒక్కసారి మా విమానాల సంఖ్య 20కు చేరితే అంతర్జాతీయ సరీ్వసులు ఆరంభించేందుకు అర్హత లభిస్తుంది. 120 ఏళ్ల విమానయాన చరిత్రలో సున్నా నుంచి 19 విమానాలకు మా అంత వేగంగా చేరుకున్నది మరొకటి లేదు. గత ఏడాదిలో మేము సాధించిన ప్రగతి పట్ల సంతోíÙస్తున్నాం’’అని దూబే వివరించారు. తాము ఉద్యోగులను పెంచుకుంటున్నామని చెబుతూ, 2023 చివరికి 3,500 మంది ఉద్యోగులను కలిగి ఉంటామని పేర్కొన్నారు. -
భారీగా పెరిగిన ఆకాశ ఎయిర్ వేతనాలు.. కెప్టెన్ నెల శాలరీ ఎంతంటే?
స్టాక్ మార్కెట్ మాంత్రికుడు, దివంగత రాకేష్ ఝున్‌ఝున్‌వాలా స్థాపించిన ఆకాశ ఎయిర్..సంస్థలో పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు భారీగా పెరిగాయి. మిగిలిన విమానయాన సంస్థలు ఎయిరిండియా, ఇండిగోలు పోటీ పడుతూ వందల సంఖ్యలో కొత్త విమానాల కొనుగోలుకు ఆర్డర్ పెడుతున్నాయి. ఈ క్రమంలో ఆకాశా ఎయిర్ ఉద్యోగులకు జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఆకాశా ఎయిర్‌లో పెంచిన 40 శాతం శాలరీలు జులై నుంచి అమల్లోకి రానున్నాయి. సీనియర్ ఫస్ట్ ఆఫీసర్ (ఫ్లైట్ నడిపేవారు) ఉద్యోగుల జీతం నెలకు రూ.2.75లక్షల నుంచి రూ.3.40 లక్షలకు, సీనియర్ కెప్టెన్స్ల వేతనం రూ.5.75లక్షల నుంచి రూ.6.25లక్షలకు చేరింది. ఇక, పైలెట్ల జీతాలు అనుభవంతో పాటు ఎన్ని గంటల పాటు పైలెట్ విధులు నిర్వహించారనే ఆధారంగా శాలరీలు చెల్లిస్తున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. కెప్టెన్లు నెలకు 60 గంటల ప్రయాణానికి గతంలో రూ.7.28లక్షలు ఉండగా.. తాజాగా నిర్ణయంతో రూ.7.75లక్షలు చేరింది. ప్రస్తుతం, ఉన్న పిక్స్డ్ పే అవర్స్‌ను 40 గంటల నుంచి 45 గంటలకు పెంచింది. వేతనాల సవరింపుతో ప్రతి అదనపు గంటకు కెప్టెన్ రూ. 7,500, ఫస్ట్ ఆఫీసర్ రూ. 3,045 పొందనున్నారు. అంచనా ప్రకారం.. ఆకాశ ఎయిర్ 19 విమానాల్లో మాత్రమే కార్యకలాపాలు నిర్వహిస్తుంది. అయితే, పనిగంటల తక్కువగా ఉండడంతో ఆ ప్రభావం ఉద్యోగుల నెలవారీ జీతాలపై పడుతుంది. దీంతో పైలట్లు ఆశించిన సమయాల్లో విమానాలను నడిపించలేకపోతున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఆ నివేదికల్ని ఊటంకిస్తూ ఆకాశయిర్ వేతనాల్ని 40 శాతంతో జీతాలు భారీగా పెంచింది. చదవండి👉 మోదీ ‘హై - టెక్ హ్యాండ్ షేక్’.. భారత్‌కు పెట్టుబడుల వరద! -
ఆకాశ ఎయిర్ దూకుడు: 4 బోయింగ్ విమానాలకు సై
న్యూఢిల్లీ: ఆకాశ ఎయిర్.. మరో 4 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల కొనుగోలు సన్నాహాల్లో ఉన్నట్లు పేర్కొంది. విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ఈ ఏడాది(2023) చివరికల్లా మూడంకెలలో విమాన కొనుగోలుకి ఆర్డర్లు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే ఆర్డర్లు జారీ చేసిన 72 బోయింగ్ 737 మ్యాక్స్‌లకు జతగా మరో 4 విమానాలకు కాంట్రాక్టు ఇస్తున్నట్లు తెలియజేసింది.(క్వాంటమ్ ఎనర్జీ విస్తరణ:హైదరాబాద్‌లో మూడో షోరూం) ప్యారిస్‌లో జరుగుతున్న ఎయిర్ షో సందర్భంగా కంపెనీ ఈ అంశాలను వెల్లడించింది. 2023 చివరికల్లా అంతర్జాతీయ కార్యకలాపాలను ప్రారంభించే లక్ష్యంతో సాగుతున్నట్లు తెలిపింది. తాజాగా కొనుగోలు చేయనున్న విమానాలతో విస్తరణ పటిష్టంకానున్నట్లు వివరించింది. అంతర్జాతీయ విస్తరణ కోసం నాలుగు 737-8 విమానాల కొనుగోలుకి తెరతీసినట్లు కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో వినయ్ దూబే పేర్కొన్నారు. దీంతో రానున్న నాలుగేళ్లలో మొత్తం 76 ఎయిర్‌క్రాఫ్ట్‌లను డెలివరీ తీసుకోనున్నట్లు తెలియజేశారు. దేశీయంగా వేగవంత విస్తరణలో ఉన్న కంపెనీ అంతర్జాతీయ రూట్లలోనూ సరీ్వసుల ప్రారంభంపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. (దేశీయంగా కీవే బైక్స్ తయారీ: లక్కీ కస్టమర్లకు భారీ ఆఫర్) -
ఫ్లైట్‌లో బీడీ పొగ..
Smoking Beedi inside Flight: విమానంలో బీడీ తాగిన ఓ వ్యక్తిని బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. ఫ్లైట్‌లో బీడీ ఎందుకు తాగావని అడిగితే దిమ్మతిరిగే సమాధానం చెప్పాడు ఆ వ్యక్తి. ఇదీ చదవండి: Aditi Avasthi: రూ.1600 కోట్ల నిధులు.. ఎడ్టెక్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తున్న అదితి అవస్తీ! టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. 56 ఏళ్ల ఎం.ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి అహ్మదాబాద్ నుంచి ఆకాశ ఎయిర్ విమానంలో బెంగళూరు నగరానికి వస్తున్నాడు. వాష్‌రూమ్‌లో బీడీ తాగుతుండగా విమాన సిబ్బంది పట్టుకున్నారు. బెంగళూరులో దిగగానే ఎయిర్ ప్లేన్ డ్యూటీ మేనేజర్ విమానాశ్రయ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి బెంగళూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ‘రైలులో తాగినట్లే విమానంలోనూ తాగాను’ తాను ఎక్కువగా రైలులో ప్రయాణిస్తానని, విమానంలో ప్రయాణించడం తనకు తొలిసారి అని పోలీసులకు నిందితుడు తెలిపాడు. రైలు టాయిలెట్ లో బీడీ తాగినట్లే విమానంలోనూ తాగానని అమాయకంగా చెప్పాడు. మార్వార్‌లో కార్మికుడిగా పనిచేస్తున్న కుమార్ మరో వ్యక్తితో కలిసి బెంగళూరులో బంధువు మరణానంతర కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చాడని పోలీసు అధికారులు తెలిపారు. ఇలా బీడీ తాగిన వ్యక్తిని అరెస్టు చేయడం బెంగుళూరు విమానాశ్రయంలో ఇదే తొలిసారి. గతంలో విమానంలో సిగరెట్ తాగిన ఇద్దరు వ్యక్తులపై ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: బంఫరాఫర్: వైజాగ్ నుంచి సింగపూర్ విమాన టికెట్ ఎంతో తెలుసా? -
7 నెలల పసికూన: దిగ్గజాలను ఢీకొంటోంది!
సాక్షి ముంబై: ప్రముఖ స్టాక్‌మార్కెట్ పెట్టుబడిదారుడు, దివంగత రాకేష్ ఝన్‌ఝన్‌వాలా ఆవిష్కరించిన ఆకాశ ఎయిర్ విస్తరణలో దూసుకుపోతోంది. బడ్జెట్‌ధరల్లో విమాన టికెట్లు అందుబాటులోకి తీసుకురావాలనే ఆశయంతో బిగ్ బుల్ లాంచ్ చేసిన డ్రీమ్ ప్రాజెక్ట్ ఆకాశ ఎయిర్ ఇపుడు విస్తరణలో తన ప్రత్యేకతను చాటుకుంటోంది. భారత విమానయాన రంగంలో అడుగుపెట్టిన ఏడాదిలోపే .ఏడు నెలల్లోనే సంస్థ తనదైన ఘనతను సాదించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విడుదల చేసిన ఫిబ్రవరి నెలవారీ గణాంకాల ప్రకారం.. ఆకాశ ఎయిర్ మార్కెట్ వాటా 3 శాతానికి చేరుకుంది. మార్చి చివరి నాటికి 18 ఎయిర్‌క్రాఫ్ట్‌లను చేర్చాలని భావించిన ఎయిర్‌లైన్ సంస్థ ప్రస్తుతం 19 విమానాలను కలిగి ఉంది. ప్రస్తుతం దేశీయ విమానయానంలో అగ్రగామిగా ఉన్న ఇండిగో ఆగస్టు 4, 2006లో సేవలను ప్రారంభించగా, ఆగస్టు 7, 2022లో ఆకాశ ఎయిర్ తన కార్యకలాపాలను ప్రారంభించింది. మరోవైపు అప్పట్లో ఇండిగోలో స్టార్టప్ టీమ్‌లో భాగమై ఆదిత్య ఘోష్ ఇప్పుడు ఆకాశ ఎయిర్‌లో ఉండటం గమనార్హం. ఇండిగో మార్కెట్ వాటా కేవలం 2.6 శాతం. అలాగే ప్రస్తుతం 75కుపైగా దేశీయ గమ్యస్థానలకు, ప్రపంచవ్యాప్తంగా మొత్తం 100 గమ్యస్థానాలకు తన విమానాలను నడుపుతోంది. 2016 నేషనల్ సివిల్ ఏవియేషన్ పాలసీ (ఎన్‌సిఎపి) అమలులోకి వచ్చే వరకు, విమానయాన సంస్థలు అంతర్జాతీయంగా ప్రయాణించడానికి ఐదేళ్ల పాటు వేచి ఉండాల్సి వచ్చింది. అలాగే కనీసం 20 విమానాలను కలిగి ఉండాలి. మారిన నిబంధన ప్రకారం కార్యకలాపాల వ్యవధిపై ఎలాంటి ఎటువంటి పరిమితులు లేవు. దీని ప్రకారం మార్చి 2023 చివరి నాటికి ఆకాశ ఎయిర్ అంతర్జాతీయ విమానాలను కూడా ప్రారంభించాలని యోచిస్తోంది. 2024 చివరి నాటికి మొత్తం శ్రామికశక్తిని 3వేలకు చేరుకోనుంని సంస్థ దాదాపు 1,000 మంది కొత్త ఉద్యోగులను నియమించుకోనుందని ఇటీవలి ఆకాశ ఎయిర్ వినయ్ దూబే ప్రకటించారు. ఈ ఏడాది చివరి నాటికి ‘మూడు అంకెల ఎయిర్‌క్రాఫ్ట్ ఆర్డర్’ చేయనున్నట్లు దూబే వెల్లడించారు. ఇప్పటికే ఆపరేషన్‌లో ఉన్న 19 బోయింగ్ 737 మ్యాక్స్ ఎయిర్ క్రాఫ్ట్‌లతో పాటు, అకాశ ఎయిర్ మరో 72 విమానాలతొ విస్తరిస్తోందని, ఏప్రిల్‌లో ప్రారంభించిన తర్వాత 20వ బోయింగ్ 737 మ్యాక్స్ విదేశీ ఫంక్షన్లకు సిద్ధంగా ఉంటుందని ఆయన ప్రకటించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎయిర్‌లైన్ మరో తొమ్మిది విమానాలతో మొత్తం సంఖ్య 28కి చేరనుంది. అలాగే వేసవి చివరి నాటికి ప్రస్తుత 110 (17 దేశీయ మార్గాలలో) నుండి 150చేరనుందన. ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు లక్నోనుంచి గోవా, అహ్మదాబాద్‌లకు డైరెక్ట్ విమానాలను ప్రారంభించింది ఆకాశ ఎయిర్. నిరంతరాయమైన కనెక్టివిటీని అందించే లక్ష్యంతో, చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంనుంచి ఈ రెండు డైరెక్ట్ విమానాలు ఆదివారం లాంచ్ చేసింది. -
ఆకాశ ఎయిర్‌లో వెయ్యి కొలువులు
న్యూఢిల్లీ: కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తున్న నేపథ్యంలో వచ్చే ఏడాది మార్చి ఆఖరు నాటికి సుమారు 1,000 మంది ఉద్యోగులను తీసుకోవాలని ఆకాశ ఎయిర్ భావిస్తోంది. తద్వారా మొత్తం సిబ్బంది సంఖ్యను 3,000కు పెంచుకోనుంది. దాదాపు ఏడు నెలల క్రితం కార్యకలాపాలు ప్రారంభించిన ఆకాశ ఎయిర్ ఈ ఏడాది ఆఖరు నాటికి అంతర్జాతీయ రూట్లలోనూ సర్వీసులు మొదలుపెట్టాలని యోచిస్తోంది. కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో వినయ్ దూబే ఈ విషయాలు తెలిపారు. (మళ్లి పెరిగిన బంగారం ధర: వెయిట్ చెయ్యాలా? కొనుక్కోవాలా?) అంతర్జాతీయ సేవలకు సంబంధించి అనువైన దేశాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని ఆయన చెప్పారు. ఈ ఏడాది ఆఖరు నాటికి ‘మూడు అంకెల స్థాయిలో’ విమానాల కోసం ఆర్డరు ఇవ్వనున్నట్లు దూబే వివరించారు. ఆకాశ ఎయిర్ 72 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల కోసం ఆర్డరు ఇచ్చింది. ప్రస్తుతం కంపెనీ దగ్గర 19 విమానాలు ఉండగా .. వచ్చే ఆర్థిక సంవత్సరం మరో తొమ్మిది అందుబాటులోకి రానున్నాయి. ఏప్రిల్‌లో వచ్చే విమానంతో కలిపి ఎయిర్‌క్రాఫ్ట్‌ల సంఖ్య 20కి చేరుతుంది. తద్వారా విదేశాలకు సర్వీసులు ప్రారంభించేందుకు అర్హత లభిస్తుంది. తమకు ఇప్పుడు అదనపు విమానాలు లేకపోయినప్పటికీ ముందుగానే సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాల్సి వస్తుందని, వారికి శిక్షణనివ్వాల్సి ఉంటుందని దూబే తెలిపారు. ప్రస్తుతం తాము రోజుకు 110 ఫ్లయిట్స్ నడుపుతున్నామని.. ఈ వేసవి సీజన్ ఆఖరు నాటికి వీటిని 150కి పెంచుకుంటామని ఆయన చెప్పారు. (శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 5జీ , అదిరిపోయే లాంచింగ్ ఆఫర్ కూడా!) (CrickPe: ఫాంటసీ క్రికెట్ యాప్ ‘క్రిక్‌పే’ లాంచ్... అదీ ఐపీఎల్‌కు ముందు) (హురున్ రిచ్ లిస్ట్ 2023: రేఖా ఝున్‌ఝున్‌వాలా ఎంట్రీ! సూపర్!) -
విదేశాలకు ఆకాశ ఎయిర్
బెంగళూరు: విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ ఈ ఏడాది చివరికల్లా అంతర్జాతీయ సర్వీసులను ప్రారంభించనుంది. డిసెంబర్ నాటికి పెద్ద ఎత్తున విమానాలకు ఆర్డర్ ఇవ్వనున్నట్టు సంస్థ ఫౌండర్, సీఈవో వినయ్ దూబే బుధవారం వెల్లడించారు. ‘ఇప్పటికే 72 విమానాలకు ఆర్డర్ ఇచ్చాం. వీటిలో 18 సంస్థ ఖాతాలో చేరాయి. కొత్తగా ఇవ్వనున్న ఆర్డర్ మూడంకెల స్థాయిలో ఉంటుంది. ఏడాది కాలంలో 300 మంది పైలట్లను నియమించుకుంటాం. బెంగళూరులో లెర్నింగ్ అకాడెమీ స్థాపించనున్నాం. వచ్చే పదేళ్లలో సంస్థకు కనీసం 3,500 మంది పైలట్లు అవసరం అవుతారు’ అని వివరించారు. సిబ్బందిలో మహిళల సంఖ్య 37 శాతం ఉంది. దీనిని 50 శాతానికి చేర్చాలన్నది ఆకాశ ఎయిర్ లక్ష్యం. గతంలోనే ఆర్డర్ ఇచ్చిన 72 విమానాలను బోయింగ్ 2027 మార్చి నాటికి డెలివరీ చేయనుంది. ఫిబ్రవరి మొదటి వారంలో ఆరు నెలలు పూర్తి చేసుకున్న ఆకాశ ఎయిర్ 10 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చింది. హైదరాబాద్, వైజాగ్తోసహా 14 నగరాల్లో సేవలు అందిస్తోంది. 2023 ఆగస్ట్ నాటికి వారంలో 1,000 సర్వీసులు నడపాలని లక్ష్యంగా చేసుకుంది. -
హైదరాబాద్ నుంచి ఆకాశ ఎయిర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన రంగ సంస్థ ఆకాశ ఎయిర్ హైదరాబాద్ నుంచి సర్వీసులను నేటి (బుధవారం) నుండి ప్రారంభిస్తోంది. హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–గోవా మధ్య ఇవి నడువనున్నాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు మరో రెండు సర్వీసులను ఫిబ్రవరి 15 నుంచి జోడించనున్నారు. విశాఖపట్నం సహా ప్రస్తుతం ఆకాశ ఎయిర్ దేశంలోని 13 నగరాలకు సేవలను అందిస్తోంది. ఈ ఏడాది మరో నాలుగైదు నగరాలు తోడవనున్నాయని కంపెనీ కో–ఫౌండర్ ప్రవీణ్ అయ్యర్ మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. సంస్థ వద్ద 14 విమానాలు ఉన్నాయని చెప్పారు. మార్చి నాటికి మరో నాలుగు వచ్చి చేరుతున్నాయని వెల్లడించారు. 2023 రెండవ అర్ధ భాగంలో అంతర్జాతీయ సర్వీసులు నడుపుతామని తెలిపారు. నాలుగేళ్లలో ఆకాశ ఎయిర్ ఖాతాలో 72 ఎయిర్‌క్రాఫ్ట్స్ ఉంటాయని కో–ఫౌండర్ బెల్సన్ కొటినో పేర్కొన్నారు. -
ఆకాశ ఎయిర్ దూకుడు: వైజాగ్-బెంగళూరు రూటు టార్గెట్
బెంగళూరు: దేశీయ విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ తన సర్వీసులతో దూసుకుపోతోంది. ఆకాశ ఎయిర్ ఇపుడు వైజాగ్-బెంగళూరు మార్గంలో విమానాల్ని నడపనుంది. తద్వారా బెంగళూరు నుంచి విమానాన్ని సర్వీసును అందిస్తున్న పదవ నగరంగా విశాఖపట్నంను చేర్చింది. ఇదీ చదవండి: డిమాండ్ లేదు, షేర్లు ఢమాల్: కార్వానా సీఈవో సంచలన నిర్ణయం డిసెంబరు 10 నుండి బెంగళూరు నుండి విశాఖపట్నానికి విమాన సేవలను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు ఆకాశ ఎయిర్ తెలిపింది. అంతేకాదు డిసెంబర్ మధ్య నాటికి పది నగరాల్లో మొత్తం పద్నాలుగు రూట్లలో 450కి పైగా వీక్లీ ఫ్లైట్ సర్వీసులను దాటాలని ఆశిస్తోంది. ప్రతిరోజూ రెండుసార్లు బెంగళూరు-వైజాగ్ మధ్య విమానాలను నడపనున్నామని ఆకాశ ఎయిర్ కో-ఫౌండర్, చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ప్రవీణ్ అయ్యర్ ప్రకటించారు. తమ సర్వీసులను ప్రయాణీకులు ఎంజాయ్ చేస్తారని తెలిపారు. మొదటి ఫ్రీక్వెన్సీ డిసెంబర్ 10న, ఎర్లీ మార్నింగ్ ఆప్షన్‌తో రెండో ఫ్రీక్వెన్సీ డిసెంబర్ 12న మొదలవుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే ముంబై, అహ్మదాబాద్, ఢిల్లీ, చెన్నై, కొచ్చి, గౌహతి, పూణే, విశాఖపట్నం ఎనిమిది నగరాలను కనెక్ట్ చేస్తూ ఆకాశ ఎయిర్ ఇప్పుడు 24 రోజువారీ నాన్-స్టాప్ విమానాలను బెంగళూరుకు అందిస్తోంది.(తగ్గేదేలే: మస్క్ కొత్త పాలసీ, అలా చేస్తే అంతే!) కాగా ప్రముఖ పెట్టుబడిదారుడు, దివంగత రాకేశ్ఝన్ఝన్వాలా మద్దతిచ్చిన ఆకాశ ఎయిర్ తన మొదటి వాణిజ్య విమానాన్ని ఆగస్టు 7, 2022న ప్రారంభించింది. నవంబర్ 26 నుంచి దేశంలోని ఐటీ హబ్ నగరాలు పూణే, బెంగళూరులను కలుపుతూ డబుల్ డైలీ విమానాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఆకాశ ఎయిర్ విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి,ముంబై: ఇటీవల విమాన సర్వీసులను ప్రారంభించిన ఆకాశ ఎయిర్ తృటిలో భారీ ప్రమాదంనుంచి తప్పించు కుంది. ముంబై నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఆకాసా ఎయిర్ ఫ్లైట్ QP 1103 క్యాబిన్లో దుర్వాసన రావడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించారు. తమ విమానం ముంబైలో సురక్షితంగా ల్యాండ్ అయ్యిందనీ ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని అకాసా ఎయిర్ ప్రతినిధి తెలిపారు. ఆకాశ ఎయిర్ అక్టోబర్ 14 శుక్రవారం ముంబై-బెంగళూరు విమానంలో పక్షి ఢీకొట్టిన ఘటన చోటుచేసుకుంది. దుర్వాసన వస్తోందని ఫిర్యాదులు రావడంతో సిబ్బంది అప్రత్తమై విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసి, తనిఖీలు చేపట్టడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం లేకుండా ప్రయాణీకులందరూ క్షేమంగా ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దివంగత బిలియనీర్ రాకేష్ ఝన్‌ఝన్‌వాలా అకాసా ఎయిర్‌లో పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 7న 60 రోజులు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఎయిర్‌లైన్స్ వ్యవస్థాపకుడు, సీఈవో వినయ్ దూబే ఇటీవల మీడియాకు తెలిపారు. రెండు నెలలక్రితం తొలుత ముంబై నుంచి అహ్మదాబాద్‌కు, ఆ తరువాత చెన్నై, కొచ్చి, బెంగళూరుకు విమాన సేవలందిస్తోంది ఆకాశ ఎయిర్. -
ఆకాశ ఎయిర్ ఆఫర్: వారి సంబరం మామూలుగా లేదుగా!
సాక్షి, ముంబై: దివంగత పెట్టుబడిదారుడు రాకేష్ ఝన్‌ఝన్ వాలాకు చెందిన దేశీయ విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ పెట్ లవర్స్‌కు శుభవార్త అందించింది. త్వరలోనే తమ విమానాల్లో పెట్స్ తో సహా ప్రయాణించే వెసులుబాటును ప్రయాణీకులకు కల్పించనుంది. ఆకాశ ఎయిర్‌లైన్స్ తాజా ప్రకటన ప్రకారం ఈ ఏడాది నవంబరు 1 నుంచి తన విమానాల్లో పెంపుడు జంతువులను అనుమతించనుంది. దీనికి సంబంధించిన బుకింగ్‌లు అక్టోబరు 15నుంచి ప్రారంభం కానున్నాయి. ఒక వ్యక్తికి 7 కిలోల వరకు బరువు ఉన్న ఒక పెంపుడు జంతువును అనుమతిస్తామని విమానయాన సంస్థ తెలిపింది. "పెంపుడు జంతువుల పాలసీకి సంబంధించి ఇది తొలి అడుగు అని, ప్రస్తుతం పెంపుడు పిల్లులు , కుక్కలను అనుమతిస్తాం త్వరలోనే మరింత విస్తరిస్తామని’’ సంస్థ ప్రకటించింది. ఎయిర్‌లైన్‌లో ప్రస్తుతం 6 ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉన్నాయని, ప్రతి 15 రోజులకు ఒక ఎయిర్‌క్రాఫ్ట్‌ను జోడిస్తున్నామని ఆకాశ ఎయిర్ వ్యవస్థాపకుడు , సీఈఓ వినయ్ దూబే తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మొత్తం 18 విమానాలు, రానున్న అయిదేళ్లలో 72 విమానాల అందుకోవాలనే లక్ష్యంతో ఉన్నామని తెలిపారు. దీంతో పెట్ లవర్స్ సోషల్ మీడియాలో సంతోషం వ్యక్తం చేశారు. Oh yayyy! https://t.co/8mrwX3Hyso — Chinmayi Sripaada (@Chinmayi) October 6, 2022 -
వారానికి 250కి పైగా ప్లయిట్స్: ఆకాశ ఎయిర్
న్యూఢిల్లీ: వచ్చే నెల (అక్టోబర్) రెండో వారం నాటికి దేశీయంగా తొమ్మిది రూట్లలో 250 పైగా ఫ్లయిట్స్ నడపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కొత్తగా కార్యకలాపాలు ప్రారంభించిన ఆకాశ ఎయిర్ వెల్లడించింది. అక్టోబర్ 7 నుంచి ఢిల్లీ నుంచి బెంగళూరు, అహ్మదాబాద్‌లకు కొత్తగా సర్వీసులను, అలాగే బెంగళూరు-అహ్మదాబాద్ రూట్లో రోజూ అదనంగా మరో ఫ్లయిట్‌ను నడపనున్నట్లు పేర్కొంది. (Mankind Pharma: అతిపెద్ద ఐపీవో బాట) అప్పటికి తమకు అయిదో విమానం కూడా అందుబాటులోకి వస్తుందని, తద్వారా వారానికి 250 పైచిలుకు సర్వీసులు నిర్వహించగలమని సంస్థ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ప్రవీణ్ అయ్యర్ తెలిపారు. ఆకాశ ఎయిర్ ఆగస్టు 7న కార్యకలాపాలు ప్రారంభించింది. 2023 మార్చి నాటికి 18 ఎయిర్‌క్రాఫ్ట్‌లను సమకూర్చుకోనుంది. -
చెన్నై-బెంగళూరు రూట్లో ఆకాశ ఎయిర్ సర్వీసులు
చెన్నై: విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ తాజాగా చెన్నై–బెంగళూరు రూట్లో ఫ్లయిట్ సర్వీసులు ప్రారంభించింది. చెన్నై రాకతో తమ నెట్‌వర్క్‌లో అయిదో నగరం చేరినట్లయిందని సంస్థ తెలిపింది. ఈ రూట్లో రోజూ రెండు ఫ్లయిట్స్ నడపడంతో పాటు సెప్టెంబర్ 26 నుండి చెన్నై–కొచ్చి మధ్యలో కూడా సర్వీసులు ప్రారంభించనున్నట్లు ఆకాశ ఎయిర్ వివరించింది. దశలవారీగా దేశవ్యాప్తంగా నెట్‌వర్క్‌ను వేగవంతంగా విస్తరించాలనే తమ లక్ష్యాలకు అనుగుణంగా వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొంది. -
దేశీ ఎయిర్‌లైన్స్ రికవరీకి ఏటీఎఫ్ సెగ
ముంబై: విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు ఆకాశాన్నంటుతుండటం, రూపాయి పతనమవడం వంటి అంశాలు దేశీ విమానయాన సంస్థల రికవరీ ప్రక్రియకు పెను సవాలుగా పరిణమించే అవకాశం ఉందని క్రెడిట్ రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా ఒక నివేదికలో వెల్లడించింది. ఇక జెట్ ఎయిర్వేస్ తిరిగి కార్యకలాపాలు ప్రారంభించనుండటం, ఆకాశ ఎయిర్ సర్వీసులు మొదలుపెట్టడం వంటివి ఎయిర్‌లైన్స్ మధ్య పోటీని మరింత తీవ్రం చేయవచ్చని పేర్కొంది. సాధారణంగా విమానయాన సంస్థల నిర్వహణ వ్యయాల్లో ఏటీఎఫ్ వాటా 45 శాతం దాకా ఉంటుంది. నిర్వహణ వ్యయాల్లో 35–40 శాతం భాగం అమెరికా డాలర్ మారకంలో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏటీఎఫ్ రేట్లు పెరగడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పతనం కావడం వంటివి ఎయిర్‌లైన్స్‌పై ప్రభావం చూపనున్నాయి. ఉక్రెయిన్–రష్యా మధ్య ఉద్రిక్తతలతో ఏటీఎఫ్ రేట్లు ఆగస్టులో ఏకంగా 77 శాతం ఎగిశాయి. ‘ఈ ఆర్థిక సంవత్సరంలో ఏటీఎఫ్ రేట్లు అధికంగా ఉండటంతో పాటు రూపాయి క్షీణత వల్ల పరిశ్రమ ఆదాయాలపై ఒత్తిడి కొనసాగే అవకాశం ఉంది‘ అని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ సుప్రియో బెనర్జీ తెలిపారు. సీజనల్‌గా ఉండే ప్రయాణాల ధోరణుల కారణంగా జూన్‌తో పోలిస్తే జులైలో ప్రయాణికుల సంఖ్య 7 శాతం తగ్గినట్లు ఇక్రా పేర్కొంది. టికెట్ చార్జీలు పెరుగుతుండటం కూడా విహార యాత్రల ప్రణాళికలపై ప్రతికూల ప్రభావం చూపినట్లు వివరించింది. ఆగస్టు 31 నుంచి చార్జీలపై పరిమితులు ఎత్తివేస్తున్నందున .. విమానయాన సంస్థలు వ్యయాల భారాన్ని రేట్ల పెంపు రూపంలో ప్రయాణికులకు బదలాయించే అవకాశాలు ఉన్నాయని ఇక్రా పేర్కొంది. అయితే, పరిశ్రమలో తీవ్ర పోటీ నెలకొన్నందున ఎకాయెకిన చార్జీల పెంపు భారీగా ఉండకపోవచ్చని వివరించింది. -
ఝున్‌ఝున్‌వాలా లేని ఆకాశ ఎయిర్‌లైన్ పరిస్థితి ఏంటి?
సాక్షి,ముంబై: రాకేష్ ఝున్‌ఝున్‌వాలా అకాలమరణంతో ఇటీవలే సేవలను ప్రారంభించిన సరికొత్త విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్‌లైన్ భవితవ్యం ఏంటి? ప్రణాళికలు ఏంటి? సంస్థ నిర్వహణ ఎలా ఉండబోతోంది అనే సందేహాలు బిజినెస్ వర్గాల్లో నెలకొన్నాయి. ఝున్‌ఝున్‌వాలా రెక్కల కింద ఎదగాలని, రాణించాలని ఎదురు చూసిన ఆకాశ ఎయిర్‌కి ఆయన ఆకస్మిక మరణం షాక్‌నిచ్చింది. (ఝున్‌ఝున్‌వాలా అస్తమయంపై స్మృతి ఇరానీ ఏమన్నారంటే) ముఖ్యంగా భారతదేశంలో, బిలియనీర్ యాజమాన్యంలోని విమానయాన సంస్థలు నష్టాల్లో కూరుకుపోయాయి. ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, సుబ్రతా రాయ్ సహారాకు చెందిన సహారా ఎయిర్‌లైన్స్ కథ ఇదే. ఈ కారణంగానే విశ్లేషకులు ఆకాశ ఎయిర్ కార్యకలాపాలను ప్రారంభించకముందే దాని భవిష్యత్తుపై, సందేహాలను, భయాలను వ్యక్తం చేశారు. ఇపుడు ఆయన హఠాన్మరణంతో ఈ భయాలు మరింత పెరిగాయి. (రాకేష్ ఝున్‌ఝున్‌వాలా నిర్మించిన బాలీవుడ్ మూవీలు ఏవో తెలుసా?) అయితే ఆకాశ సీఈఓ వినయ్ దూబే మాట్లాడుతూ ఝున్‌ఝున్‌వాలా వారసత్వాన్ని, విలువను ముందుకు తీసుకెడతామని, మంచి విలువలతో గొప్ప విమానయాన సంస్థగా నడపడానికి కృషి చేస్తామని దూబే ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా తనపై విశ్వాసముంచిన ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఆకాశకు ఝున్‌ఝున్‌వాలా చాలా కీలకం. ముఖ్యమైన పెట్టుబడిదారుడిగా మాత్రమే కాకుండా ఆయనకున్న అపారమైన పలుకుబడితో బ్యాంకులు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల నుండి చౌకగా ఫైనాన్సింగ్ ఏర్పాటు చేయగల సత్తా ఉన్నవారు. అలాంటి ఆయన మరణంతో కొంత ఒత్తిడి తప్పదని సీనియర్ ఎయిర్‌లైన్ ఎగ్జిక్యూటివ్ వ్యాఖ్యానించారు. ఆయన మరణం కంపెనీ వృద్ధికి, ఆశయ సాధనకు తాత్కాలిక బ్రేక్స్ ఇస్తుందని, పెట్టుబడిదారులు కూడా జాగ్రత్తగా ఉంటారని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే దేశ విమానయాన రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకునే గ్లోబల్ఎయిర్లైన్స్తో ఆకాశ ఒప్పందాలు కుదుర్చుకోవచ్చని మరికొంతమంది మార్కెట్ నిపుణుల అంచనా. ఝున్‌ఝున్‌వాలా ఎయిర్ లైన్స్ సంస్థ ఎల్సిసిలో 40 శాతానికి పైగా వాటా 3.5 కోట్ల డాలర్లు (సుమారు రూ. 264 కోట్లు) పెట్టుబడులు పెట్టాడు. ఇది ఆయన చివరి ప్రధాన పెట్టుబడులలో ఒకటి మాత్రమే కాదు, ఆయనకు అత్యంత ఇష్టమైనది కూడా. ఆకాశ మొదటి విమానంలోని ప్రయాణీకులతో తీసుకున్న సెల్పీలు తీపి జ్ఞాపకాలుగా మిగిలి పోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. బిగ్ బుల్ ఆఫ్ దలాల్ స్ట్రీట్ పేరొందిన ఝున్‌ఝున్‌వాలా చివరిసారిగా ఆగస్ట్ 7న ముంబై -అహ్మదాబాద్ మధ్య జరిగిన ఆకాశ ఎయిర్ తొలి విమాన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కనిపించారు. వీల్‌చైర్‌లో తిరుగుతూ అందరిన్నీ ఉత్సాహపరుస్తూ జోక్స్ వేస్తూ పోటీదారులతో ముచ్చటించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణీకుల సౌకర్యాల్లోగానీ, ఉత్పత్తి నాణ్యతలో ఎలాంటి రాజీలేకుండా పొదుపుగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆకాశ యాజమాన్యం , సిబ్బందికి పిలుపునిచ్చారు. ఆకాశ కోసం ఝున్‌ఝున్‌వాలా ఏవియేషన్ రంగంలోకి అడుగుపెట్టి ఇండిగో లాంటి సంస్థల్ని భయపెట్టిన ఝున్‌ఝున్‌వాలా సంస్థ భవిష్యత్తు కోసం భారీ ప్రణాళికలే వేశారు విస్తృతమైన పెట్టుబడితో పాటు, ఎయిర్‌లైన్ నిర్వహణ కోసం అగ్రశ్రేణి విమానయాన పరిశ్రమ లీడర్లను ఎంచుకున్నారు. ప్రపంచంలో బహుశా ఏ విమానయాన సంస్థ ఏర్పాటైన 12 నెలల్లో సేవలు ప్రారంభించ లేదు. కానీ ఝున్‌ఝున్‌వాలా ఆ ఘనతను సాధించారు. ముఖ్యంగా జెట్ ఎయిర్వేస్, గో ఫస్ట్ సీఈఓగా పనిచేసిన దుబెనే సీఈవోగా ఎంపిక చేశారు. విమానయాన సంస్థలో దుబేకు 31 శాతం వాటా ఉంది. అలాగే 2018 వరకు ఇండిగో డైరెక్టర్‌గా ఒక దశాబ్దం పాటు పనిచేసిన ఆదిత్య ఘోష్‌ను కూడా తన టీంలో చేర్చుకున్నారు. ఘోష్ ఎయిర్‌లైన్‌లో 10 శాతం వాటా ఉన్నట్టు తెలుస్తోంది. ఝున్‌ఝున్‌వాలా చరిష్మా సలహాలు, ఫండ్ పుల్లింగ్ సామర్థ్యాలు ఆకాశకు ఇకపై అందుబాటులో లేనప్పటికీ, ఆకాశ అభివృద్ధి చెందుతుందని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్‌లోని రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసాని అన్నారు. ఆ మేరకు ఆయన సంస్థను కట్టుదిట్టం చేశారన్నారు. ఇండియా జనాభా, మధ్య తరగతి ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకోవడంతోపాటు, ఏవియేషన్ పరిశ్రమ వృద్ధిపై ఆయన విశ్వాసానికి, నమ్మకానికి ప్రతీక ఆకాశ ఎయిర్ అని అన్నారు. అక్టోబర్ 11న రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ప్రమోటర్‌గా ఉన్న 'ఆకాశ ఎయిర్' అల్ట్రా-లో కాస్ట్ విమాన సేవలు ప్రారంభించేందుకు పౌర విమానయాన శాఖ నుంచి ప్రాథమిక అనుమతులు లభించాయి. జులై 7న సేవలు ప్రారంభించేందుకు 'డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్' నుంచి 'ఆపరేటర్ సర్టిఫికేట్' పొందింది. ఆకాశ ఎయిర్ ఆగస్టు 7న తొలి సర్వీసును నడిపింది. ఈ క్రమంలోనే ఆగస్టు 13న బెంగళూరు-కొచ్చి, ఆగస్టు19న బెంగళూరు-ముంబై,సెప్టెంబరు 15న చెన్నై-ముంబైకు తన విమాన సేవల్ని అందించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. -
రాకేష్ ఝున్ ఝున్ వాలా..'ఆకాశ ఎయిర్' సేవలు షురూ!
దేశీయ స్టాక్ మార్కెట్ మాంత్రికుడు రాకేష్ ఝున్‌ఝన్ వాలా ఏవియేషన్ రంగంలో అడుగపెట్టారు. తన అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నారు. ఇందులో భాగంగా ఝున్‌ఝన్ వాలాకు చెందిన ఆకాశ ఎయిర్ సేవల్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ సేవల్ని పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య ఎం సింధియా పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఆకాశ ఎయిర్ తొలి విమానం ముంబైలో టేకాఫ్ అవ్వగా.. ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు ఈ విమానం ప్రయాణించింది. ఈ విమానయాన సంస్థ అహ్మదాబాద్, బెంగళూరు, ముంబై, కొచ్చి ప్రాంతాలలో తొలుత తన సర్వీసులను అందజేస్తుంది. ముంబై నుంచి అహ్మదాబాద్‌కి 28 వీక్లి ఫ్లయిట్స్‌ను నడపనుంది. ఈ సందర్భంగా తమ కస్టమర్లకు సరికొత్త విమానయాన అనుభవాన్ని అందించేందుకు తాము మరింత ముందుకు వెళ్లనున్నామని, తమ సర్వీసులు కస్టమర్లకు నచ్చుతాయని భావిస్తున్నట్లు ఆకాశ ఎయిర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వినయ్ దుబే అన్నారు . -
ఆకాశ ఎయిర్: రడీ టూ టేకాఫ్, టికెట్ ధర ఎంతంటే?
సాక్షి,ముంబై: దేశీయ విమానయాన రంగంలో సేవలందించేందుకు ఆకాశ ఎయిర్ సర్వం సిద్ధం చేసుకుంది. బిలియనీర్, ప్రముఖ పెట్టుబడి దారుడు రాకేష్ ఝున్‌ఝన్‌వాలా నేతృత్వంలోని ఆకాశ ఎయిర్ తొలి వాణిజ్య బోయింగ్ 737 మ్యాక్స్ విమానం ఆగస్టు 7న ముంబై-అహ్మదాబాద్ మార్గంలో గాల్లోకి ఎగరనుంది. దీనికి టికెట్ల విక్రయాలను నేటి(జులై 22) నుంచే ప్రారంభించింది. తొలిదశలో అహ్మదాబాద్, బెంగళూరు, ముంబై, కొచ్చి నెట్‌వర్క్‌లకు కంపెనీ టిక్కెట్ల విక్రయిస్తోంది. ఆగస్ట్ 7 నుంచి ముంబై-అహ్మదాబాద్ రూట్లో వారానికోసారి నడిచే 28 విమానాలతోపాటు ఆగస్టు 13 నుంచి బెంగళూరు-కొచ్చి రూట్లో 28 విమానాల టిక్కెట్ల విక్రయాన్ని ప్రారంభించినట్లు ఆకాశ ఎయిర్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే తొలి బోయింగ్ విమానం డెలివరీ అయిందని, రెండో విమానం ఈ నెలాఖరులోపు అందే అవకాశం ఉందన్నారు. రెండు బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలతో విమాన కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు ఆకాశ ఎయిర్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ప్రవీణ్ అయ్యర్ వెల్లడించారు. దీంతో ముంబై-అహ్మదాబాద్ మార్గంలో బోయింగ్ 737 మ్యాక్స్ విమాన రాకపోకలు ప్రారంభం కానున్నాయి. విమానాల బుకింగ్‌లు మొబైల్ యాప్, మొబైల్ వెబ్, డెస్క్‌టాప్ వెబ్సైట్, ఆన్లైన్ ట్రావెల్ ఏజెంట్ల ద్వారా అందుబాటులో ఉంటాయి. ఆకాశ ఎయిర్ ముంబై-అహ్మదాబాద్ మధ్య రోజువారీ విమానాన్ని కూడా నడుపుతుంది. ముంబై విమాన టిక్కెట్లు రూ. 4,314 నుండి ప్రారంభం. కాగా, అహ్మదాబాద్ నుండి ప్రారంభ ధర రూ. 3,906గా ఉంటాయి. బెంగళూరు నుండి కొచ్చికి రెండు రోజువారీ విమానాలను నడుపుతుంది. టికెట్ల ధర రూ. 3,483 నుండి ప్రారంభం.కొచ్చి నుండి తిరిగి వచ్చే విమానం టిక్కెట్ ధరలు రూ. 3,282 నుండి ప్రారంభం. కేఫ్ ఆకాశ అకాశ ఎయిర్ విమానాల్లో ‘కేఫ్ అకాశ’ బై-ఆన్-బోర్డ్ మీల్ సర్వీస్‌ను అందిస్తుంది. ఇందులో పాస్తా, వియత్నామీ రైస్ రోల్స్, హాట్ చాక్లెట్ అందిస్తుంది. అలాగే సంవత్సరం పొడవునా భారతీయ వంటకాలతో కూడిన పండుగ మెనూ కూడా ఉంటుందని తెలిపింది. -
గాల్లో తేలినట్టుందే! రాకేశ్ ఝున్‌ఝున్‌వాలాకు గుడ్‌న్యూస్
సాక్షి, ముంబై: ప్రముఖ పెట్టుబడిదారుడు, స్టాక్‌మార్కెట్ గురు రాకేశ్ ఝున్‌ఝున్‌వాలాకు చెందిన ఆకాశ ఎయిర్‌కు డీజీసీఏ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. లైసెన్స్ పొందిన ఆకాశ ఎయిర్ త్వరలోనే వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించనుంది. దీంతో ఆకాశ ఎయిర్ ఎనిమిదో దేశీయ విమానయాన సంస్థగా అవతరించింది. అలాగే జెట్ ఎయిర్వేస్ కొత్త యాజమాన్యం తిరిగి సేవలను ప్రారంభించేందుకు అనుమతి పొందిన తరవాత ఫైయింగ్ లైసెన్స్ పొందిన రెండో ప్రయాణీకుల విమానయాన సంస్థగా నిలిచింది. ఈ మేరకు సంస్థ గురువారం ట్వీట్ చేసింది. ముఖ్యమైన మైలు రాయిని సాధించాం అంటూ ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్ (ఏఓసీ) రావడంపై సంతో షాన్ని ప్రకటించింది. విమాన కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయంటూ ట్వీట్ చేసింది. ఝున్‌ఝున్‌వాలా ‘ఆకాశ ఎయిర్’ పేరుతో దేశీయంగా విమానయాన రంగంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ నుంచి 18 ‘బోయింగ్ 737 మ్యాక్స్’ ఎయిర్ క్రాఫ్ట్ లను ఆకాశ ఎయిర్ కొనుగోలు చేసింది. మొత్తం 72 ‘బోయింగ్ 737 మ్యాక్స్’ విమానాల ద్వారా సేవలను అందించనుంది. We are pleased to announce the receipt of our Air Operator Certificate (AOC). This is a significant milestone, enabling us to open our flights for sale and leading to the start of commercial operations. — Akasa Air (@AkasaAir) July 7, 2022 -
ఇంటర్వ్యూలకు ఉద్యోగులు..ఫ్లైట్లు నడపలేక చేతులెత్తేసిన విమానయాన సంస్థలు!
దేశ వ్యాప్తంగా విమానాల రాక పోకల్లో అంతరాయం ఏర్పడింది. గంటల తరబడి ఎదురు చూస్తున్నా టికెట్లు బుక్ చేసుకున్న సమయానికి విమానాలు రాకపోవడంపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆయా విమానయాన సంస్థల్ని వివరణ కోరింది. అయితే పైలెట్లు, కేబిన్ సిబ్బంది పెద్ద సంఖ్యలో సిక్ లీవ్‌లు పెట్టి..ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్నట్లు తేలింది. దేశంలోని ప్రధాన నగరాల్లో టాటాకు చెందిన ఎయిరిండియా, ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ ఝున్ వాలా నేతృత్వంలోని ఆకాశ ఎయిర్‌లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ఇందుకోసం ఇతర ఏవియేషన్ సంస్థలకు చెందిన పైలెట్లు, కేబిన్ సిబ్బంది సిక్ లీవ్‌లు పెడుతున్నారు. ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్నారు. దీంతో విమాన రాకపోకలు ఆలస్యంగా జరుగుతున్నాయి. ఎయిర్ ఇండియా..ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, కోల్ కతా వంటి నగరాల్లో రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తుంది. దీంతో షెడ్యూల్ టైంకు విమానాల రాకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఆయా ఏవియేషన్ సంస్థలపై కామెంట్ల రూపంలో మండిపడ్డారు. ఇడిగో ఆలస్యం ఇండిగో విమానాల రాకపోకల్లో ఆలస్యం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. షెడ్యూల్ టైంకు కేవలం 45శాతమే విమానాల్ని నడిపించాయి. 850 కంటే ఎక్కువ విమానాలు వారి షెడ్యూల్ సమయం తర్వాత 15 నిమిషాల కంటే ఎక్కువ సమయం తీసుకున్నాయి. విమానయాన సంస్థ శుక్రవారం దాదాపు 1600 విమానాలను నడపగా..దాదాపు 50 విమానాల్ని రద్దు చేసింది. మా ఉద్యోగుల్ని సెలక్ట్ చేసుకోవద్దు.. కానీ ఇండిగో యాజమాన్యం తమ సమస్యను ఎయిర్ ఇండియా దృష్టికి తీసుకెళ్లింది. తమ నుండి 'నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్' లేదా రిలీవింగ్ లెటర్ లేకుండా సిబ్బందిని రిక్రూట్ చేయవద్దని ఎయిర్‌లైన్‌ని కోరినట్లు సమాచారం. కాగా, ఇదే అంశంపై ఎయిరిండియా అధికార ప్రతినిధి స్పందించలేదు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ అరుణ్ కుమార్‌ను సంప్రదిస్తే ఉద్యోగుల కొరతపై 'మేం పరిశీలిస్తున్నాం' అని చెప్పారు. -
రాకేశ్‌ఝున్‌ఝున్‌వాలా.. ఆకాశ.. మ్యాక్స్ 737
న్యూఢిల్లీ: మార్కెట్ బిగ్బుల్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాల నుంచి వస్తోన్న ఆకాశ ఎయిర్‌లైన్స్ కొత్త విమానాలను కొనుగోలు చేస్తోంది. అందులో భాగంగా తాజాగా ఆకాశ ఎయిర్ ఖాతాలో బోయింగ్ 737 మ్యాక్స్ వచ్చి చేరింది. 2021 నవంబర్‌లో ఆకాశ ఎయిర్, బోయింగ్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం బోయింగ్ నుంచి మ్యాక్స్ రకం 72 విమానాలను ఆకాశ కొనుగోలు చేయనుంది. తొలి విమానం గురువారం డెలివరీ అందుకున్నట్టు కంపెనీ ప్రకటించింది. 2023 మార్చి నాటికి 18 విమానాలు సంస్థకు చేరనున్నాయి. మిగిలినవి తదుపరి నాలుగేళ్లలో అడుగుపెడతాయి. చదవండి: విమాన చార్జీలను 15% పెంచాలి -
ఆకాశ ఎయిర్.. బేబీస్ డే అవుట్..
మార్కెట్ బిగ్బుల్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా నుంచి వస్తోన్న ఆకాశ ఎయిర్‌కి సంబంధించి తొలి విమానం విశేషాలను నెటిజన్లతో పంచుకున్నారు. హ్యాంగర్ నుంచి బయటకు వచ్చిన విమానం ఫోటోను ట్వీట్ చేస్తూ.. మేము మొదలు పెట్టబోతున్నాం.. మా బేబీ బయటకు వచ్చింది. మీరు కూడా ఓ క్యాప్షన్ పెట్టండి అంటూ ఆకాశ ఎయిర్ కోరింది. ఆకాశ ఎయిర్ ట్వీట్‌పై మరో ఎయిర్‌లైన్స్ సర్వీస్ ప్రొవైడర్ ఇండిగో స్పందించింది. హాలివుడ్ సూపర్ హిట్ కామెడీ మూవీ బేబీస్ డే అవుట్‌ను గుర్తుకు తెచ్చేలా బేబీస్ డే అవుట్ అంటూ నవ్వుతున్న రెండు ఎమెజీలు క్యాప్షన్‌గా పెట్టింది. దీనికి అదనంగా ప్లేన్ లేడీ క్రూ చేతిలో ఉన్న చంటి పిల్లాడి ఫోటోను జత చేసింది. మార్కెట్ బిగ్బుల్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా గత ఏడాది కాలంగా ఎయిర్‌లైన్ సర్వీసెస్‌లోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకు సంబంధించి అన్ని అనుమతులు సాధించారు. తొలి విడత విమానాలు కూడా కొనుగోలు చేశారు. జులై - ఆగస్టు త్రైమాసికంలో ఆకాశ ఎయిర్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. Caption this! ✍️ We’ll start – Our baby’s day out! ☺️#ItsYourSky#AvGeek pic.twitter.com/xqRQSxKcXv — Akasa Air (@AkasaAir) June 2, 2022 చదవండి: టాటా సంచలన నిర్ణయం! ఎయిరిండియా ఉద్యోగులు ఇక ఇంటికే! -
రాకేష్ ఝున్‌ఝున్‌వాలా టార్గెట్ ఇదే: 'ఆకాశ'..ఫస్ట్ లుక్!
సామాజిక, ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా అతి తక్కువ ధరకే విమాన ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్ వాలా ఆకాశ ఎయిర్ పేరుతో విమాన సంస్థను ప్రారంభించారు. తాజాగా ఆ సంస్థకు చెందిన విమానాల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాకేష్ ఝున్‌ఝున్ వాలాకు చెందిన ఆకాశ ఎయిర్ విమాన సేవలు ఈ ఏడాది జులై నుంచి అందుబాటులోకి రానున్నాయి. అయితే ఇప్పుటి వరకు ఆకాశ ఎయిర్ విమానాలు ఎలా ఉండబోతున్నాయి. వాటి కోడ్ ఏంటనే విషయాలో వెలుగులోకి రాలేదు. ఈ నేపథ్యంలో ఆకాశ ఎయిర్ తన సంస్థకు చెందిన విమాన రూపు రేఖల్ని ప్రజలకు పరిచయం చేసింది. విమానం ఆకారం, కలర్స్‌తో పాటు కోడ్లను వివరిస్తూ కొన్ని ఫోటోల్ని ట్వీట్ చేసింది. విమానాలకు కోడ్ ఏంటీ! దేశాన్ని బట్టి ఆయా సంస్థలకు చెందిన విమానాలకు కొన్ని కోడ్లు ఉంటాయి. ఉదాహరణకు..ఎయిర్‌లైన్‌కు 'క్యూపీ', ఇండిగో కోడ్ '6ఈ',గో ఫస్ట్ 'జీ8',ఎయిర్ ఇండియాకు 'ఏఐ' అని ఉంది. ఆకాశ ఎయిర్ సైతం తమ విమానాల కోడ్ ఏంటనేదీ రివిల్ చేసింది. కాంట్ కీప్ క్లైమ్! సే టూ హాయ్ అంటూ ఆకాశ ఎయిర్ విమానం కోడ్ 'క్యూపీ- పీఐఈ'! ట్వీట్లో పేర్కొంది. Coming soon to Your Sky! ✈️#AvGeek pic.twitter.com/nPpR3FMpvg — Akasa Air (@AkasaAir) May 23, 2022 ఆకాశ ఎయిర్ సీఈవో వినయ్ దుబే తాము ముందుగా ప్రకటించిన సమయానికే ఆకాశ ఎయిర్ విమాన సర్వీసులు ప్రారంభం అవుతాయి. జున్ 2022కంటే ముందుగా ఫస్ట్ ఎయిర్ క్రాప్ట్ డెలివరీ అవుతుంది. జులై 2022 నాటికి ఆకాశ ఎయిర్ కమర్షియల్ ఆపరేషన్‌ను ప్రారంభింస్తామని ఆకాశ ఎయిర్ సీఈవో వినయ్ దుబే తెలిపారు. బోయింగ్‌తో ఒప్పందం రాకేష్ ఝున్‌ఝున్ వాలా ఆకాశ ఎయిర్ విమానాల్ని తయారు చేసేందుకు అమెరికాకు చెందిన విమానాల తయారీ సంస్థ బోయింగ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఝున్‌ఝున్ వాలా గతేడాది నవంబర్ 26,2021న బోయింగ్ సంస్థతో 72 మ్యాక్స్ విమానాల్ని కొనుగోలు చేశారు. వీటితో పాటు 72బోయింగ్ 737మ్యాక్స్ ఎయిర్ క్రాప్ట్‌లు కూడా ఉన్నాయి. ఆ సంస్థ మొత్తం విమానాల్ని తయారు చేసి ఆకాశ ఎయిర్‌కు అప్పగించనుంది. ఇందులో భాగంగా బోయింగ్ కంపెనీ తొలి ఎయిర్ క్రాప్ట్ ను ఏ ఏడాది జున్ నాటికి ఆకాశ ఎయిర్‌కు అందించనుంది. Can’t keep calm! Say hi to our QP-pie! 😍#AvGeek pic.twitter.com/sT8YkxcDCV — Akasa Air (@AkasaAir) May 23, 2022 సాధ్యమేనా! కాంపిటీషన్, ఫ్లైట్ల నిర్వహణతో పాటు పెరిగిపోతున్న ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, కరోనా కారణంగా ప్రపంచ దేశాల్లో విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించడంతో పాటు ఇతర కారణాల వల్ల గడిచిన 10ఏళ్లలో పెద్ద సంఖ్యలో ఆయా విమాన సంస్థలు తమ సర్వీసుల్ని పూర్తిగా రద్దు చేశాయి. పదుల సంఖ్యలో విమానాలు ప్రభుత్వం ఆధీనంలో సేవలందిస్తున్న ఎయిర్ ఇండియా సైతం నష్టాలకు తట్టుకోలేక టాటా కంపెనీకి అమ్మేసింది. రతన్ టాటా ఎయిర్ ఇండియా కొనుగోలు చేయడంతో కష్టాల నుంచి గట్టెక్కితే మిగిలిన సంస్థలు అప్పుల ఊబిలో కూరుకుపోయి.. కార్యకాలాపాల్ని నిలిపివేశాయి. వాటిలో వాయిదూత్ ఎయిర్ లైన్స్, సహార ఎయిర్ లైన్స్, ఎండీఎల్ ఆర్ ఎయిర్‌లైన్స్, డక్కన్ ఎయిర్ వేస్ లిమిటెడ్, దర్బంగా ఏవియేషన్, దమానియా ఎయిర్ వేస్, గుజరాత్ ఎయిర్ వేస్, ఎయిర్ కోస్టా, ఎయిర్ కార్నివాల్, జెట్ ఎయిర్ వేస్, ఎయిర్ మంత్రా, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్‌లు ఉన్నాయి. సుమారు రూ.66వేల కోట్లు ఈ క్రమంలో రాకేష్ ఝున్‌ఝున్‌వాలా 'ఆకాశ ఎయిర్' బ్రాండ్ కింద ఎస్ఎన్వీ ఏవియేషన్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థను ఏర్పాటు చేశారు. నవంబర్ 16న ఆ కంపెనీ 72 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల్ని ఆర్డర్ చేసింది. ఈ ఒప్పందం విలువ దాదాపు 9 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 66 వేల కోట్లు) గా ఉంది. అయితే ఇండస్ట్రీలో నిలదొక్కుకొని అప్పుల్లో కూరుకుపోవడంతో పెద్ద సంఖ్యలో ఏవియేషన్ సంస్థలు సర్వీసుల్ని నిలిపివేస్తే..ఇప్పుడు ఆకాశ ఎయిర్‌తో కొత్త విమాన సర్వీసుల్ని ప్రారంభించడం కత్తి మీద సామేనని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి👉రాకేష్ ఝున్‌ఝున్‌వాలా టార్గెట్ అదే, రూ.66వేల కోట్లతో..! -
ఆకాశ..ఇక మరింత ఆలస్యం
మార్కెట్ బిగ్బుల్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాల ప్లాన్స్‌కి చివరి నిమిషంలో అనుకోని అవాంతరం వచ్చి పడింది. ఆకాశ ఎయిర్‌లైన్స్ సర్వీసెస్‌ను 2022 మేలో ప్రారంభించాలని ముందుగా బిగ్బుల్ నిర్ణయించుకున్నారు. అయితే కీలకమైన బోయింగ్ విమానం 737 ఎయిర్‌క్రాఫ్ట్ రావడం ఆలస్యం అయ్యింది. దీంతో ఎయిర్‌లైన్స్ సేవలను ముందుగా అనుకున్నట్టుగా మేలో కాకుండా జులైలో ప్రారంభించనున్నారు. ఎయిర్‌లైన్స్ సేవలకు సంబంధించి ఆకాశ సీఈవో వినయ్ దుబే మాట్లాడుతూ.. ఆకాశ ఎయిర్‌లైన్స్‌కి సంబంధించిన తొలి విమానం 2022 జూన్‌లో గాలిలోకి లేస్తుంది. ఇక కమర్షియల్ ఫ్లైట్స్ జులై నుంచి అందుబాటులోకి వస్తాయంటూ ప్రకటించారు. బోయింగ్ విమానం విషయంలో కొంత ఆలస్యమైన మిగిలిన 18 ఎయిర్ క్రాఫ్ట్స్ సకాలంలో వస్తాయంటూ దుబే ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి: రాకేష్ ఝున్‌ఝున్‌వాలా టార్గెట్ అదే, రూ.66వేల కోట్లతో..! -
రాకేష్ ఝున్‌ఝున్‌వాలా టార్గెట్ అదే, రూ.66వేల కోట్లతో..!
ఇండియన్ బిగ్బుల్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా జూన్ నుంచి విమాన సర్వీసుల్ని ప్రారంభించాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఝున్‌ఝున్‌వాలాకు చెందిన 'ఆకాశ ఎయిర్' కార్యకలాపాలు జూన్ నుంచి ప్రారంభం కానున్నాయని ఆ సంస్థ సీఈఓ వినయ్ దూబే వెల్లడించారు దుబాయ్ వేదికగా జరిగిన సైడ్‌లైన్స్ ఆఫ్ వింగ్స్ ఇండియా 2022 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వినయ్ దూబే పాల్గొన్నారు. ఈ సందర్భంగా వచ్చే 5ఏళ్లలో 72 ఆకాశ ఎయిర్ విమాన కార్యకలాపాలు నిర్వహిస్తాయని తెలిపారు. ఇప్పటికే మినిస్టరీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) లైసెన్స్ పొందామని, జూన్ నెలలో ఆకాశ ఎయిర్ తొలి విమాన రాకపోకలు ప్రారంభం కానున్నట్లు స్పష్టం చేశారు. అంతే కాదు తమ వద్ద ప్రస్తుతం 18 విమానాలు ఉండగా.. ఏడాదికి 12 నుంచి 14 విమాన సేవల్ని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు దుబే చెప్పారు. ఇలా 5 ఏళ్లలో మొత్తం 72 విమానాల్ని అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. ఎక్కడి నుంచి ప్రారంభం ఆకాశ ఎయిర్ లైన్ సేవల్ని మెట్రో నగరాల నుంచి టైర్-2, టైర్-3 నగరాల్లో, మెట్రో సిటీస్ నుంచి మరో మెట్రో సిటీలకు సర్వీసులు ఉంటాయని ఆకాశ ఎయిర్ లైన్ సీఈఓ తెలిపారు. ఇలా క్యాలండర్ ఇయర్-2023లో మొత్తం 20 విమాన సర్వీసుల్ని ప్రారంభించేలా టార్గెట్ పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు. సుమారు రూ.66వేల కోట్లు రాకేష్ ఝున్‌ఝున్‌వాలా 'ఆకాశ ఎయిర్' బ్రాండ్ కింద ఎస్ఎన్వీ ఏవియేషన్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థను ఏర్పాటు చేశారు. నవంబర్ 16న ఆ కంపెనీ 72 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల్ని ఆర్డర్ చేసింది. ఈ ఒప్పందం విలువ దాదాపు 9 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 66 వేల కోట్లు) గా ఉందని ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: ఛాఛా!! ఆ పిచ్చిపని చేయకపోతే మరో వెయ్యికోట్లు సంపాదించే వాడిని: రాకేష్ ఝున్‌ఝున్‌వాలా -
జెట్ ఎయిర్వేస్ 2.0లో కీలక పరిణామం
ముంబై: కొత్త ఏడాదిలో జెట్ ఎయిర్ వేస్ విమానయాన సంస్థకు తాత్కాలిక చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుధీర్ గౌర్ షాక్ ఇచ్చారు. తన చీఫ్ ఎగ్జిక్యూటివ్ పదివికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే రాజీనామా చేయడానికి గల కారణాలను మాత్రం గౌర్ వెల్లడించలేదు. అయితే రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ వల్లే.. గౌర్ నిష్క్రమణ జరిగిందా? అనే కోణంలో ప్రత్యేక చర్చ మొదలైంది ఇప్పుడు. నరేష్ గోయల్ స్థాపించిన విమానయాన సంస్థ జెట్ ఎయిర్ వేస్ ఆర్థిక సంక్షోభం కారణంగా రెండు సంవత్సరాల పాటు సేవలు నిలిపివేసిన విషయం తెలిసిందే. తిరిగి 2022లో జెట్ ఎయిర్వేస్ 2.0 పేరుతో సర్వీసుల్ని పున:ప్రారంభించాల్సి ఉంది. ఈ విషయాన్ని జెట్ ఎయిర్వేస్ను దక్కించుకున్న జలాన్ కల్రాక్ కన్సార్షియం అధికారికంగా వెల్లడించింది కూడా. మరోవైపు 2022 మొదటి త్రైమాసికంలో(వేసవిలోపే) విమానయాన సంస్థను పునఃప్రారంభించడానికి గత ఏడాది ఎన్‌సిఎల్‌టి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఇన్వెస్ట్మెంట్ గురు, బిగ్బుల్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ‘ఆకాశ ఎయిర్’ను కూడా తొలి త్రైమాసికంలోనే తెచ్చే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నాడు. ఇదివరకే 'ఆకాశ ఎయిర్' బ్రాండ్ కింద ఎస్ఎన్వీ ఏవియేషన్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థను ఏర్పాటు చేసిన సంగతి తేలిసిందే. ఈ మధ్యే లోగోను లాంఛ్ చేయగా.. బోయిగ్ సంస్థతో విమానాల కోసం ఒప్పందం కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జెట్ ఎయిర్వేస్ నుంచి తాతాల్కిక సీఈవో వైదొలగడం చర్చనీయాంశంగా మారింది. సుధీర్ గౌర్ ఆకాశ ఎయిర్‌లో చేరతారా? లేదా? అన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. ఇక నిధుల కొరత, మితిమీరిన రుణం భారంతో 2019లో జెట్ ఎయిర్వేస్ తన విమాన సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. తదనంతర పరిణామాల నేపథ్యంలో బిడ్డింగ్‌లో జెట్ ఎయిర్వేస్ను దక్కించుకున్న జలాన్ కల్రాక్ కన్సార్షియం దాఖలు చేసిన రుణ పరిష్కార ప్రణాళికకు ఎన్సీఎల్టీ 2021 జూన్‌లో ఆమోదం తెలిపింది. 2022 నుంచి తొలి మూడేళ్లలో 50, వచ్చే ఐదేళ్లలో 100కు పైగా విమాన సేవలను అందుబాటులోకి తేవాలని జలాన్ కల్రాక్ కన్సార్షియం భావించింది. (చదవండి: అమెరికాలో అమెరికన్ కంపెనీకి దిమ్మదిరిగే షాక్..!) -
‘ఇది మీ ఆకాశం’.. బిగ్బుల్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా కొత్త మంత్రం
న్యూఢిల్లీ: ఇన్వెస్ట్మెంట్ గురు రాకేష్ ఝున్‌ఝున్‌వాలాకు చెందిన కొత్త విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ .. తమ ట్యాగ్‌లైన్, ఎయిర్‌క్రాఫ్ట్ లివెరీ (రంగులు, గ్రాఫిక్‌లు మొదలైనవి)ని బుధవారం ఆవిష్కరించింది. నారింజ, ఊదా రంగులు, ’ఉదయించే అ’ చిహ్నంతో వీటిని రూపొందించింది. ఉదయించే సూర్యుడి స్నేహపూర్వక అనుభూతిని, సునాయాసంగా ఎగరగలిగే పక్షి సామర్థ్యాలను, విమాన రెక్కల విశ్వసనీయతను చిహ్నం ప్రతిబింబిస్తుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే ’ఇది మీ ఆకాశం’ పేరిట రూపొందించిన ట్యాగ్‌లైన్.. సామాజిక–ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుం డా అందరికీ విమానయానాన్ని అందుబాటులోకి తేవాలన్న తమ బ్రాండ్ ఆకాంక్షకు స్ఫూర్తిగా ఉంటుందని పేర్కొంది. Unveiling ‘The Rising A’ of Akasa Air Inspired by elements of the sky, The Rising A symbolises the warmth of the sun, the effortless flight of a bird, and the dependability of an aircraft wing. Always moving upwards. Always inspiring to rise. pic.twitter.com/vzMDT9gEmv — Akasa Air (@AkasaAir) December 22, 2021 -
Akasa Air: ఇక ‘ఆకాశ’మే హద్దుగా..
భారత బిలియనీర్ స్టాక్ మార్కెట్ నిపుణుడు రాకేష్ ఝున్‌ఝున్‌వాలా స్టార్టప్ ఎయిర్‌లైన్ ‘ఆకాశ ఎయిర్’ నుంచి మరో అడుగు ముందుకు పడింది. ఝున్‌ఝున్‌వాలా వాలా నేతృత్వంలో 'ఆకాశ ఎయిర్' బ్రాండ్ కింద ఎస్ఎన్వీ ఏవియేషన్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థను ఏర్పాటు చేసిన సంగతి తేలిసిందే. ఇప్పుడు ఆ కంపెనీ 72 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను ఆర్డర్ చేస్తున్నట్లు నేడు(నవంబర్ 16) ప్రకటించింది. ఈ ఒప్పందం విలువ దాదాపు 9 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 66 వేల కోట్లు) అని ఒక సంయుక్త ప్రకటనలో తెలిపింది. ఆకాశ ఎయిర్ సీఈఓ వినయ్ దుబే మాట్లాడుతూ కంపెనీ తన మొదటి విమానాల ఆర్డర్ కోసం బోయింగ్ సంస్థతో భాగస్వామ్యం ఒప్పందం చేసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. "ఈ కొత్త 737 మ్యాక్స్ విమానం కేవలం విమానయాన ఖర్చులను మాత్రమే తగ్గించకుండా తక్కువ ధరకు ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలు అందిస్తూ పర్యావరణ హితమైన సంస్థగా నడపాలనే మా లక్ష్యానికి మద్దతు ఇస్తుందని మేము నమ్ముతున్నాము" అని అన్నారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్లలో భారతదేశం ఒకటి అని దుబే అన్నారు. ఆకాశ ఎయిర్ ప్రధాన ఉద్దేశ్యం భారతదేశం ఎదుగుదలకు శక్తిని అందించడంతో పాటు సామాజిక-ఆర్థిక లేదా సాంస్కృతిక నేపథ్యాలతో సంబంధం లేకుండా భారతీయులందరికీ సమ్మిళిత వాతావరణంలో ప్రజలకు విమాన ప్రయాణాన్ని అందించడం అని దుబే తెలిపారు. అకాసా ఎయిర్ ఆర్డర్ చేసిన వాటిలో రెండు వేరియెంట్లు ఉన్నాయి. అవి ఒకటి 737-8, రెండవది అధిక సామర్ధ్యం గల 737-8-200. బోయింగ్ కమర్షియల్ ఎయిర్ ప్లేన్స్ అధ్యక్షుడు, సీఈఓ స్టాన్ డీల్ మాట్లాడుతూ.. వినియోగదారులకు అద్భుతమైన సేవలు అందించడంతో పాటు పర్యావరణ సుస్థిరతపై దృష్టి సారించే సృజనాత్మక విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన ప్రాంతాలలో తక్కువ ధరకు సేవలను అందించడానికి బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలపై నమ్మకాన్ని ఉంచిందుకు కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: పబ్జీ మొనగాళ్లకు షాక్..! అలా చేస్తే మీ అకౌంట్లు బ్లాక్ అవుతుయ్..!) -
Rakesh Jhunjhunwala: ఇక ‘ఆకాశ’మే హద్దుగా..
Rakesh Jhunjhunwala Akasa Air Ties Up With Boeing: భారత బిలియనీర్, స్టాక్ మార్కెట్ నిపుణుడు రాకేష్ ఝున్‌ఝున్‌వాలా స్టార్టప్ ఎయిర్‌లైన్ ‘ఆకాశ ఎయిర్’ నుంచి మరో అడుగు ముందుకు పడింది. కిందటి నెలలో సివిల్ ఏవియేషన్ నుంచి అనుమతులు పొందిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఆకాశ నుంచి బోయింగ్‌కు రూ.75,000 కోట్ల ఆర్డరు వెళ్లిందని సమాచారం. అతిత్వరలోనే 70 నుంచి 80 దాకా 737 మ్యాక్స్ విమానాలకు సంబంధించిన ఒప్పందాన్ని ఈ కంపెనీ కుదుర్చుకోనుందని వార్తాసంస్థ బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. ఈనెల 14న మొదలయ్యే ‘దుబాయ్ ఎయిర్‌షో’లో అమెరికాకు(చికాగో) చెందిన బోయింగ్‌తో కుదుర్చుకునే ఒప్పందం గురించి ఆకాశ ప్రకటించే అవకాశం ఉందని ఆ వార్తా సంస్థ చెబుతోంది. అయితే ఆకాశ మాత్రం ఈ ఒప్పందంపై ఎలాంటి ప్రకటన వెలువరించలేదు. ప్రస్తుత ధరల ప్రకారం.. ఈ ఒప్పంద విలువ 10 బిలియన్ డాలర్ల (రూ.75,000 కోట్ల) వరకు ఉండొచ్చని అంచనా. తక్కువ ధరతో సామాన్యుడికి విమాన ప్రయాణం అందించాలన్న బిగ్బుల్(ఝున్‌ఝున్‌వాలా) ప్రయత్నం ఏమేర సక్సెస్ అవుతుందో చూడాలి మరి. అయితే ఒక వేళ బోయింగ్ ఈ ఆర్డరును పొందితే కనుక భారత్‌లో ఎయిర్‌బస్ సంస్థకు ఉన్న ఆధిపత్యాన్ని గండి పడినట్లే అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికల్లా కార్యకలాపాలను మొదలుపెట్టాలని ఆకాశ ఎయిర్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. చదవండి: చేతిలో చిల్లిగవ్వ లేదు.. ఇంగ్లీష్ రాదు.. కానీ బిలియనీర్ అయ్యాడు