Big Bull Rakesh JhunJhunwala Promoted Akasa Airlines Revealed Its Tagline - Sakshi
Sakshi News home page

Akasa Air: ‘ఎగిరేందుకు రెక్కలు సిద్ధంగా ఉన్నాయి’

Published Thu, Dec 23 2021 8:38 AM | Last Updated on Thu, Dec 23 2021 9:35 AM

Big Bull Rakesh JhunJhunwala Promoted Akasha Airlines Revealed Its Tagline - Sakshi

న్యూఢిల్లీ: ఇన్వెస్ట్‌మెంట్‌ గురు రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలాకు చెందిన కొత్త విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్‌ .. తమ ట్యాగ్‌లైన్, ఎయిర్‌క్రాఫ్ట్‌ లివెరీ (రంగులు, గ్రాఫిక్‌లు మొదలైనవి)ని బుధవారం ఆవిష్కరించింది. 

నారింజ, ఊదా రంగులు, ’ఉదయించే  అ’ చిహ్నంతో వీటిని రూపొందించింది. ఉదయించే సూర్యుడి స్నేహపూర్వక అనుభూతిని, సునాయాసంగా ఎగరగలిగే పక్షి సామర్థ్యాలను, విమాన రెక్కల విశ్వసనీయతను చిహ్నం ప్రతిబింబిస్తుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే ’ఇది మీ ఆకాశం’ పేరిట రూపొందించిన ట్యాగ్‌లైన్‌.. సామాజిక–ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుం డా అందరికీ విమానయానాన్ని అందుబాటులోకి తేవాలన్న తమ బ్రాండ్‌ ఆకాంక్షకు స్ఫూర్తిగా ఉంటుందని పేర్కొంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement