ప్రముఖ ఏవియేషన్ సంస్థ ఆకాశ ఎయిర్ మరో భారీ కొనుగోలుకు శ్రీకారం చుట్టింది. కొద్ది రోజుల క్రితం అమెరికన్ విమాన తయారీదారు బోయింగ్ నుంచి 150 బోయింగ్ 737 మ్యాక్స్ 150 విమానాల కొనుగోలుకు ఆర్డర్ పెట్టింది. అయితే, తాజాగా ఆ విమానాల కోసం సీఎఫ్‌ఎం ఇంటర్నేషనల్ నుండి 300 ఇంజిన్లను కొనుగోలు చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
లీప్-1బి ఇంజన్లు, విడిభాగాలు, ఇతర సేవల కోసం సీఎఫ్‌ఎం ఇంటర్నేషనల్‌తో కుదుర్చుకున్న ఈ డీల్ విలువ సుమారు 5 బిలియన్ డాలర్లని అంచనా. కాగా..దేశీయ, అంతర్జాతీయంగా కొత్త మార్గాల్లో సర్వీసులను ప్రారంభించేందుకు ఆకాశ ఎయిర్ ‘మ్యాక్స్ 10, ‘మ్యాక్స్ 8-200’ శ్రేణి విమానాల కోసం ఈ ఏడాడి ప్రారంభంలో విమానాల కొనుగోలుకు సిద్ధమైంది. 2021లో ఆకాశ ఎయిర్ 72 బోయింగ్ 737 మ్యాక్స్‌లను బుక్ చేసుకుంది. గతేడాది మరో నాలుగింటికి ఆర్డర్ ఇచ్చింది. ఈ మొత్తంలో ఇప్పటికే 22 విమానాలను బోయింగ్ డెలివరీ చేసింది. ఇప్పుడు అదనంగా మరో 150 బోయిల్ విమానాలకు ఆర్డర్ పెట్టింది.
విమానాల కొనుగోలు ఆర్డర్ పెట్టే సమయంలో చారిత్రాత్మకమైన విమానాల కొనుగోలుతో ప్రపంచంలోని టాప్ 30 ప్రముఖ ఎయిర్‌లైన్స్‌లో ఆకాశ ఎయిర్ ఒటిగా అవతరించేలా చేస్తుంది. అంతేకాదు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మా సేవల్ని అందించేందుకు ఈ ఒప్పందం ఉపయోగడపుతుందని అకాశ ఎయిర్ వ్యవస్థాపకుడు, సీఈఓ వినయ్ దూబే అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment