aviation
-
ఇరాన్లో తొలిసారి మహిళా సిబ్బందితో విమాన సేవలు..
టెహ్రాన్ : ఇరాన్ విమానయాన రంగంలో కలికితురాయి చోటు చేసుకుంది. డిసెంబర్ 22న ఇరాన్ ఎయిర్ లైన్ సంస్థ అస్మాన్ ఎయిర్‌లైన్స్‌లోని ఇరాన్ బానూ అనే(ఇరాన్ లేడీ)విమానం మొత్తం మహిళలే సేవలందిస్తున్నారు. ఆ విమానం మషాద్‌లోని హషెమినేజాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండయ్యింది. ఈ విమానానికి ఇరాన్ తొలి మహిళా పైలట్ కెప్టెన్ షహ్రాజాద్ షామ్స్ నాయకత్వం వహించారు. ఇందులో మొత్తం మహిళా సిబ్బంది ఉన్నారు. 110 మంది మహిళలు ప్రయాణం చేశారు. మహిళలకు మాత్రమే సేవలందించే విమానం తొలిసారి మషాద్‌లో దిగిందని ఇరాన్ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఈ చారిత్రాత్మక సంఘటన ఇరాన్లో మదర్స్ డే సందర్భంగా జరిగింది.స్థానిక మీడియా ఆదివారం ఉదయం విమాన రాకను ఇరాన్ మహిళలకు మైలురాయిగా అభివర్ణించింది. ఇరాన్ విమానయాన రంగంలో వారి పెరుగుతున్న పాత్రను గుర్తు చేసింది. ఈ సంఘటనతో ఇరాన్లో మహిళల సాధికారతకు చిహ్నంగా మారిన కెప్టెన్ షామ్స్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. In a first, a flight with female passengers and crew has landed at Mashhad International Airport of Iran.Operated by the Aseman Airline, a women-only flight, with 110 elite Iranian women on board and piloted by Sharzad Shams, Iran's first female pilot, landed at Mashhad Hashemi… pic.twitter.com/wDnrVAnzsK— FL360aero (@fl360aero) December 22, 2024 -
విమాన రంగం ఆశావహం
భారత మార్కెట్లో ఏవియేషన్ రంగ వృద్ధికి గణనీయంగా అవకాశాలు ఉన్నాయని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) డైరెక్టర్ జనరల్ విల్లీ వాల్ష్ తెలిపారు. దేశీ విమానయాన సంస్థలు పెద్ద ఎత్తున ఎయిర్‌క్రాఫ్ట్‌లకు ఆర్డర్లు ఇస్తున్న నేపథ్యంలో పైలట్ కావాలనుకునే ఔత్సాహికులు భారత్ వైపు చూడొచ్చని ఆయన సూచించారు.ఎయిర్ కనెక్టివిటీని పెంచుకోవడం ద్వారా ఆర్థిక పురోగతి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని గుర్తించిన భారత్.. విమానాశ్రయాల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంపై ఇన్వెస్ట్ చేస్తోందని వాల్ష్ చెప్పారు. మరోవైపు, దేశీయంగా ఎయిర్పోర్ట్ చార్జీలపై స్పందిస్తూ.. పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుండటం సానుకూలాంశమని ఆయన వివరించారు. పరిశ్రమపై చార్జీల ప్రభావాన్ని గుర్తెరిగిన నియంత్రణ సంస్థ .. విమానయాన సంస్థలు, పరిశ్రమ అభిప్రాయాలు కూడా తెలుసుకోవడంపై సానుకూలంగా వ్యవహరిస్తోందని వాల్ష్ చెప్పారు.ఇదీ చదవండి: రూ.5 కోట్ల వాచ్‌తో జుకర్‌బర్గ్.. ప్రత్యేకతలివే..ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 16.4–17 కోట్లకు చేరుకోవచ్చని కొన్ని సంస్థలు అంచనా వేస్తున్నాయి. 2023–24తో పోలిస్తే ప్రయాణికుల సంఖ్య 7–10 శాతం పెరిగే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ఇటీవల నివేదిక విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో దేశీయంగా 7.93 కోట్ల మంది విమానాల్లో రాకపోకలు సాగించినట్లు తెలిపింది. 2023–24 ఏప్రిల్–సెప్టెంబర్‌తో పోలిస్తే 5.3 శాతం వార్షిక వృద్ధి నమోదైంది. -
కోల్‌కతా విమానాశ్రయానికి వందేళ్లు
కోల్‌కతా: సిటీ ఆఫ్ జాయ్.. భారతదేశపు ఒకనాటి రాజధాని.. బ్రిటిష్ ఇండియా పాలనలో దేశంలోని ఇన్నో కీలక ఘట్టాలకు వేదికగా నిలిచినా మహానగరం కలకత్తా.. ఇప్పుడు ఒకనాడు డమ్ - డమ్ విమానాశ్రయంగా పేరుగాంచి తరువాత 1995 లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు మార్చుకున్న కలకత్తా విమానాశ్రయం ఈ ఏడాది వందేళ్ల పండగను జరుపుకోనుంది. వాస్తవానికి కోల్‌కతా 1772 - 1912 మధ్య భారత రాజధానిగా ఉండేది. ఆ తరువాత 1924లో కోల్‌కతాలో విమానాశ్రయం ఏర్పాటైంది. ఈశాన్య రాష్ట్రాలతోబాటు అటువైపునున్న దేశాలన్నిటికీ ముఖద్వారం వంటి కోల్‌కతా నుంచి విమాన కార్యకలాపాలు మొదలయ్యాయి. ఇప్పుడు దేశంలోని ప్రముఖ విమానాశ్రయాల్లో ఒకటిగా నిలిచినా సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ ఏడాదితో వందేళ్లు పూర్తి చేసుకుంటోంది.వందేళ్ల క్రితం క్రితం .. ఇంకా చెప్పాలంటే అంతకు ముందే... 1900ల కాలంలో చిన్న ఎయిరోడ్రోముగా మొదలైన కలకత్తా ప్రస్థానం.. 1924 నాటికి పూర్తి స్థాయి విమానాశ్రయంగా మారింది. అప్పట్లో నెదర్లాండ్స్ కు చెందిన కెఎల్ఎం ఎయిర్ లైన్స్ (KLM airlines ) ఆమ్స్టర్డామ్ నుంచి ఇండోనేషియాలోని జకార్తాకు నడిపే విమానానికి కోల్ కతాలో స్టాప్ ఇచ్చేది. అలా అందర్జాతీయ విమానసర్వీసులు మొదలైన ఈ విమానాశ్రయం ఆ తరువాత ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఎదిగింది.. ఆకాశాన్ని ఎందుకులే లోహ విహంగాలకు ఆశ్రయం ఇస్తూ.. అంతర్జాతీయ స్థాయికి చేరింది.1924లో బ్రిటన్ కు చెందిన రాయల్ ఎయిర్ ఫోర్స్ విమానం ఇక్కడ ల్యాండ్ అయింది.ఆ తరువాత మే 2న ఫ్రెంచ్ పైలట్ మిస్టర్ డోయ్సీ రాక కూడా జరిగింది. అదే సంవత్సరం, డమ్ డమ్ విమానాశ్రయంలో తొలిసారిగా రాత్రిపూట విమానం ల్యాండ్ అవడం, ఓ గొప్ప ముందడుగుకు నాంది అని చెప్పవచ్చు. మొదట్లో టార్చిలైటు వెలుగులో విమానాలను రాత్రిపూట ల్యాండ్ చేసేవాళ్ళు. వాస్తవానికి ఈ విమానాశ్రయం అటు యూరోప్.. ఉత్తర అమెరికాలనుంచి ఇటు ఆసియావైపు వెళ్లే విమానాలకు మార్గమధ్యంలో ఒక టెక్నీకల్ హాల్ట్‌గా గణనీయంగా ఉపయోగపడడం మొదలయ్యాక దాని స్థాయి అమాంతం పెరిగిపోయిడ్ని. ఆ రెండు మార్గాల నడుమ నడిచే విమానాలన్నీ కలకత్తాలో కాసేపు ఆగి.. ఇంధనం నింపుకు వెళ్లడం.. విమానాల సాంకేతికత తనిఖీ వంటి పనులన్నీ ఇక్కడే చేసుకునేవాళ్ళు. దీంతో అనివార్యంగా ఇక్కడ రద్దీ పెరుగుతూ వచ్చింది.ఇదిలా ఉండగానే 1929లో అప్పటి అప్పటి బెంగాల్ గవర్నర్ సర్ స్టాన్లీ జాక్సన్ డమ్ డమ్ ఏరోడ్రోమ్‌లో బెంగాల్ ఫ్లయింగ్ క్లబ్‌ను ప్రారంభించి విమానాశ్రయ హోదాను మరింతగా పెంచారు.నేతాజీ సుభాష్ చంద్రబోస్ అప్పట్లో బ్రిటిష్ వారితో చేసిన యుద్ధానికి సైతం కోల్ కతా విమానాశ్రయం వేదిక ఐంది. 1938లో బోస్ ఇక్కణ్నుంచే బ్రిటిష్ వారిపై సమరశంఖాన్ని పూరించారు. రెండవ ప్రపంచ యుద్ధానంతర కాలంలో, కోల్‌కతా వాణిజ్య విమానాలకు కీలక గమ్యస్థానంగా మారింది. 1940-1960ల మధ్య, విమానాశ్రయం ఏరోఫ్లాట్, ఎయిర్ ఫ్రాన్స్ మరియు పాన్ ఆమ్ వంటి అంతర్జాతీయ విమానయాన సంస్థలకు ప్రముఖ స్టాప్ ఓవర్ హబ్‌గా మారింది. 1990 తరువాత దశమారింది. 1990ల నాటికి, కోల్‌కతా విమానాశ్రయం ప్రయాణీకు లు,కార్గో కార్యకలాపాలకు ప్రధాన అంతర్జాతీయ, దేశీయ కేంద్రంగా ఎదిగింది1990లలో, విమానాశ్రయం ఆధునీకరణ చేయగా 1995లో నిర్మించిన కొత్త దేశీయ టెర్మినల్ భారత విమానయాన రంగం వృద్ధిని ప్రతిబింబిస్తుంది.అదే ఏడాది దీనిపేరు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చారు.2000లలో భారత వైమానిక రంగం గొప్ప పురోగతి సాధించింది. తక్కువ ధరలకే విమాన ప్రయాణం అంటూ సరికొత్త ప్రయివేటు విమాన సంస్థలు రావడంతో దేశంలోని అన్ని విమానాశ్రయాల మాదిరే ఇక్కడా రద్దీ పెరిగింది. తద్వారా విమానాశ్రయం గణనీయమైన అభివృద్ధిని నమోదు చేసింది.2013లో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణం, రన్‌వే పొడిగింపు వంటి అభివృద్ధి పనులతో ఈ విమానాశ్రయం ప్రాధాన్యం అమాంతం ఆకాశాన్ని అంటింది. ప్రస్తుతంప్రస్తుతం పాతికదేశాలకు పైగా విమానయాన సంస్థలు వాణిజ్యకార్యకలాపాలను ఇక్కణ్ణుంచి కొనసాగిస్తున్నాయి. వందలాది విమానాలు.. కార్గో సంస్థలకు కోల్ కతా ఇప్పుడు ప్రధాన వాణిజ్యకేంద్రంగా మారింది. 2023- 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇక్కణ్ణుంచి 1,97,84,417 మంది దేశీయ, అంతర్జాతీయ ప్రయాణీకులు వివిధ దేశాలకు, ప్రాంతాలకు పయనమయ్యారు. దాదాపు రోజూ 430 విమానాలు ఇక్కడికి వచ్చిపోతుంటాయి. ఈశాన్య భారతదేశపు ఆర్థిక, వాణిజ్య, రవాణా రంగాన్ని మరింత ముందుకు నడిపించడంలో కీలకముగా ఉన్న సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ ఏడాది వందో పుట్టినరోజును జరుపుకుంటోంది. సిటీ ఆఫ్ జాయ్ గా పేరొందిన కోల్ కతా తో బాటు ఈశాన్య భారతానికే కాకుండా పలు ఆసియా దేశాలకు ఈ విమానాశ్రయం ఒక ముఖద్వారం.. ఈ వందేళ్ల పండుగకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాయి.:::సిమ్మాదిరప్పన్న -
గగనతలంలో 17 కోట్ల మంది!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 16.4–17 కోట్లకు చేరుకోవచ్చని అంచనా. 2023–24తో పోలిస్తే ప్రయాణికుల సంఖ్య 7–10 శాతం పెరిగే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తాజా నివేదిక తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో దేశీయంగా 7.93 కోట్ల మంది విమానాల్లో రాకపోకలు సాగించారు. 2023–24 ఏప్రిల్–సెప్టెంబర్‌తో పోలిస్తే 5.3 శాతం వార్షిక వృద్ధి నమోదైంది. తీవ్రమైన వేడి గాలులు, ఇతర వాతావరణ సంబంధిత అంతరాయాలతో 2024 ఏప్రిల్–సెప్టెంబర్ కాలం పాక్షికంగా ప్రభావితమైంది. భారతీయ విమానయాన సంస్థలకు అంతర్జాతీయ ప్రయాణికుల ట్రాఫిక్ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో 16.2 శాతంగా ఉందని ఇక్రా వివరించింది. ద్వితీయార్థం పుంజుకోవచ్చు..గతేడాదితో పోలిస్తే 2024 ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య విమానయాన సంస్థల ఆదాయాలు క్షీణించాయి. విమానాలు నిలిచిపోవడం, అధిక ఇంధన ధరలు ఇందుకు కారణం. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం ప్రయాణికుల సంఖ్య పెరిగి ఆదాయాలు పుంజుకోవచ్చని అంచనా. ఎయిర్‌లైన్స్ వ్యయాల నిర్మాణం సాధారణంగా రెండు కీలక భాగాలైన ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలు, రూపాయి మారకం కదలిక ఆధారంగా ఉంటుంది. గతేడాదితో పోలిస్తే 2024–25 మొదటి ఎనిమిది నెలల్లో సగటు ఏటీఎఫ్ ధరలు 6.8 శాతం తగ్గి కిలోలీటరుకు రూ.96,192కు చేరుకున్నాయి. అయితే కొవిడ్‌కు ముందు కాలం 2019–20 మొదటి ఎనిమిది నెలల్లో ఇది రూ.65,261 నమోదైందని ఇక్రా వివరించింది. విదేశీ కరెన్సీలో చెల్లింపులు..మొత్తం వ్యయాల్లో ఇంధన ఖర్చులు దాదాపు 30 నుంచి 40 శాతం వరకు ఉంటాయి. నిర్వహణ వ్యయాలు 35–50 శాతంగా ఉన్నాయి. విమానాల లీజు చెల్లింపులు, ఇంధన ఖర్చులు, విమానాలు, ఇంజన్ నిర్వహణ వ్యయాలు డాలర్ పరంగా నిర్ణయించబడతాయి. కొన్ని విమానయాన సంస్థలు విదేశీ కరెన్సీ రుణాన్ని కలిగి ఉన్నాయి. దేశీయ విమానయాన సంస్థలు కూడా తమ అంతర్జాతీయ కార్యకలాపాలకు అనుగుణంగా ద్వారా వచ్చే ఆదాయాలపై విదేశీ కరెన్సీలో నికర చెల్లింపులు చేయాల్సి ఉందని రేటింగ్ ఏజెన్సీ తెలిపింది.ఇదీ చదవండి: యాపిల్‌లో ఉద్యోగం జైలు జీవితం లాంటిది!గత నష్టాల కంటే తక్కువగా..దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణికుల ట్రాఫిక్‌లో నిరంతర వృద్ధి మధ్య భారతీయ విమానయాన పరిశ్రమపై ‘స్థిర(స్టేబుల్)’ రేటింగ్‌ను ఇక్రా కొనసాగించింది. 2024–25లో విమానయాన పరిశ్రమ నష్టం రూ.2,000–రూ.3,000 కోట్ల వరకు ఉంటుందని చెబుతోంది. పరిశ్రమ 2025–26లో ఇదే స్థాయిలో నష్టాన్ని నివేదించవచ్చని అంచనా వేస్తున్నట్లు ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కో–గ్రూప్ హెడ్ కింజాల్ షా తెలిపారు. -
భారత్‌లో ప్లాంట్లు పెట్టండి
న్యూఢిల్లీ: భారత్‌లో తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయడాన్ని పరిశీలించాలని ఫ్రాన్స్ ఏవియేషన్ సంస్థలను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ కోరారు. విమానాశ్రయాలు, అనుబంధ పరిశ్రమలను అభివృద్ధి చేయదల్చుకునే సంస్థలకు అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే ప్రపంచ మార్కెట్ల కోసం ఉత్పత్తులను తయారు చేసేలా రక్షణ రంగంలో భారత్, ఫ్రాన్స్ కంపెనీలు కలిసి పని చేయొచ్చని మంత్రి తెలిపారు. వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, రెన్యువబుల్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాలు, ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ తదితర విభాగాల్లో భారత సంస్థలతో భాగస్వామ్యాలు కుదుర్చుకోవచ్చని గోయల్ వివరించారు. ఫ్రెంచ్ ఫారిన్ ట్రేడ్ అడ్వైజర్లకు సంబంధించిన ఆసియా–పసిఫిక్ ఫోరంలో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. దేశీ విమానయాన సంస్థలు 1,500 పైచిలుకు విమానాలకు ఆర్డర్లివ్వగా అందులో సింహభాగం వాటా ఫ్రాన్స్ కంపెనీ ఎయిర్‌బస్‌కి లభించాయి. భారత్‌లో సుమారు 750 ఫ్రెంచ్ కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తుండగా, 75 భారతీయ కంపెనీలు ఫ్రాన్స్‌లో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇరు దేశాల మధఅయ 2023–24లో 15 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం నమోదైంది. భారత్ ఎగుమతులు 7 బిలియన్ డాలర్లుగా ఉండగా, దిగుమతులు 8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. -
రెండు సంస్థలదే ఆధిపత్యం!
దేశంలో మరిన్ని విమానయాన సంస్థలు కార్యకలాపాలు సాగించాలని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు అన్నారు. ప్రస్తుతం రెండు ప్రముఖ కంపెనీలే అధిక వ్యాపార వాటాను కలిగి ఉన్నాయని చెప్పారు. విమానయాన రంగంలో రెండు సంస్థలే ఆధిపత్యం కొనసాగించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఈటీ ఇండియా అసెండ్స్ ఈవెంట్లో నాయుడు పాల్గొని మాట్లాడారు.‘ఏ పరిశ్రమలోనైనా పోటీ ఉండాలి. దాంతో వినియోగదారులకు తక్కువ ధరలకే సేవలందుతాయి. కానీ విమానయాన పరిశ్రమలో కేవలం రెండు సంస్థలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ రంగం ఈ సంస్థలకే పరిమితం కావడం సరైందికాదు. మరిన్ని కంపెనీలు ఈ విభాగంలో సేవలందించాలి. దాంతో వినియోగదారులకు మరింత మెరుగైన సేవలందుతాయి. విమాన ప్రయాణం అందుబాటు ధరలో ఉండేలా ప్రభుత్వం టిక్కెట్ ధరలపై కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఈ రంగంలో ప్రైవేట్ సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నా ప్రభుత్వం విభిన్న పాలసీలను తయారుచేస్తోంది. ఈ రంగాన్ని మరింత ఉత్తమంగా ఎలా చేయగలమో ఆయా సంస్థలతో చర్చిస్తోంది. ఏదైనా విమానయాన సంస్థ దివాలా తీయడం లేదా పరిశ్రమను వదిలివేయడం మాకు ఇష్టం లేదు. ఈ పరిశ్రమలోకి కొత్త విమానయాన సంస్థలు ప్రవేశించేలా ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తోంది. ప్రైవేట్ మూలధనం ద్వారా కార్యకలాపాలు సాగించే కొత్త కంపెనీలు దివాలా దిశగా వెళితే ప్రభుత్వం అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటుంది’ అని అన్నారు.ఇదీ చదవండి: దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీ నిర్వహణకు రంగం సిద్ధంఎయిరిండియా గ్రూపులో ఇటీవల విస్తారా విలీనం అయింది. దాంతో దేశీయ విమానయాన మార్కెట్ వాటాలో 80 శాతం ఇండిగో, ఎయిరిండియాలే సొంతం చేసుకుంటున్నాయి. రీజనల్ ఎయిర్ కనెక్టివిటీ స్కీమ్ ఉడాన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఏప్రిల్ 2023లో మరో పదేళ్ల కాలంపాటు అంటే 2033 వరకు ఈ పథకాన్ని పొడిగించారు. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్(ఉడాన్) పథకంలో భాగంగా ప్రాంతీయ విమాన కనెక్టివిటీని మెరుగుపరచడం, విమానయానాన్ని మరింత మందికి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. -
Microsoft: బగ్ దెబ్బకు ‘విండోస్’ క్లోజ్!
వాషింగ్టన్/వెల్లింగ్టన్/న్యూఢిల్లీ/ఫ్రాంక్ఫర్ట్: టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఒక చిన్న అప్డేట్ పేద్ద సమస్యను సృష్టించింది. విండోస్‌కు సెక్యూరిటీ సేవలు అందించే ‘క్రౌడ్‌స్ట్రయిక్’ సైబర్ సెక్యూరిటీ సంస్థ చేసిన ఫాల్కన్ సెన్సార్ సాఫ్ట్వేర్ అప్డేట్లో లోపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో పనిచేసే కంప్యూటర్లలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పలు విమానయాన, బ్యాంకింగ్, మీడియా సంస్థలుసహా రైల్వే, టీవీ, రేడియో, ఆస్పత్రి సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. దీంతో కోట్లాది మంది జనం, యూజర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మైక్రోసాఫ్ట్ 365 యాప్స్, సరీ్వసెస్ స్తంభించడంతో ఈ సమస్య తలెత్తింది. అయితే అవిశ్రాంతంగా శ్రమించి సమస్యను దాదాపు పరిష్కరించామని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ‘‘ఇది భద్రతాలోపం, సైబర్ దాడి కాదు. మైక్రోసాఫ్ట్ విండోస్‌లో తప్పుడు అప్డేట్ను రన్ చేయడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందని గుర్తించాం. సమస్యను ‘ఫిక్స్’ చేసేందుకు ప్రయతి్నస్తున్నాం’’అని క్రౌడ్‌స్ట్రయిక్ సీఈఓ జార్జ్ కుర్జ్ ‘ఎక్స్’లో పోస్ట్‌చేశారు. ఆగిన సేవలు.. మొదలైన కష్టాలు విమానయాన సంస్థలు తమ కంప్యూటర్లు/పీసీ స్క్రీన్లను యాక్సెస్ చేయలేకపోవడంతో ప్రయాణికులు తమ టికెట్ల బుకింగ్/చెక్ ఇన్ సేవలను పొందలేకపోయారు. విమానాశ్రయాల్లో లక్షలాది మంది ప్రయాణికులు కౌంటర్ల వద్ద చాంతాడంత లైన్లలో బారులుతీరారు. అమెరికా, భారత్, బ్రిటన్, న్యూజిలాండ్, హాంకాంగ్, జర్మనీ, కెన్యా, స్విట్జర్లాండ్, ఇటలీ, ఆ్రస్టేలియాలోని విమానయాన సంస్థలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. శుక్రవారం గంటల తరబడి విమానాలు ఆలస్యం/క్యాన్సిల్ కావడంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లోనే నిద్రించారు. అమెరికాలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్, అమెరికన్ ఎయిర్‌లైన్స్, డెల్టా, అలీజియంట్ విమానయాన సంస్థలు ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నాయి. వారాంతం ఆనందంగా గడుపుదామనుకున్న శుక్రవారం పలు దేశాల ప్రజలను చేదు అనుభవంగా మిగిలిపోయింది. భారత్, హాంకాంగ్, థాయిలాండ్ దేశాల విమానయాన సంస్థలు మ్యాన్యువల్‌గా బోర్డింగ్ పాస్‌లు ఇచ్చి సమస్యను ఒకింత పరిష్కరించుకున్నాయి. రైల్వే, టెలివిజన్ సేవలకూ అంతరాయం బ్రిటన్‌లో రైల్వే, టెలివిజన్ స్టేషన్లూ కంప్యూటర్ సమస్యలతో ఇబ్బందులు పడ్డాయి. తమ దేశంలోని పోస్టాఫీసులు, ఆస్పత్రుల సేవలు ఆగిపోయాయని ఇజ్రాయెల్, బ్రిటన్, జర్మనీ తెలిపాయి. లండన్ స్టాక్ ఎక్సే్ఛంజ్‌లోని రెగ్యులేటరీ న్యూస్ సర్వీస్ అనౌన్స్మెంట్స్, నేషనల్ హెల్త్ సర్వీస్‌లు ఆఫ్‌లైన్‌లోకి వెళ్లిపోయాయని బ్రిటన్ ప్రకటించింది. ఆ్రస్టేలియాలో ఏబీసీ, స్కైన్యూస్ వంటి టీవీ, రేడియా చానళ్ల ప్రసారాలు ఆగిపోయాయి. బ్యాంకింగ్ సేవలకూ దెబ్బ తమ దేశంలో దేశవ్యాప్తంగా ప్రధాన బ్యాంక్ సేవలు స్తంభించిపోయాయని దక్షిణాఫ్రికా తెలిపింది. బ్యాంక్‌ల వద్దే కాదు, గ్యాస్‌స్టేషన్లు, సరకుల దుకాణాల వద్ద క్రెడిట్, డెబిట్ కార్డులు పనిచేయడం మానేశాయి. ఏఎస్‌బీ, కివిబ్యాంక్ సేవలు ఆగిపోయాయని న్యూజిలాండ్ తెలిపింది. పేమెంట్ వ్యవస్థలు, వెబ్సైట్లు, యాప్స్ పనిచేయడం లేదని న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా తెలిపాయి. భారత్‌లో పరిస్థితి ఏంటి? భారత్‌లో ఇండిగో, స్పైస్‌జెట్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, విస్టారా, ఆకాశ ఎయిర్ విమానయాన సంస్థలు ఆన్లైన్ చెక్ ఇన్ సమస్యలను ఎదుర్కొన్నాయి. చాలా ఎయిర్‌పోర్ట్‌ల వద్ద పలు విమానాల సరీ్వస్‌లు రద్దయ్యాయి. దాదాపు 200 ఇండిగో విమానసరీ్వస్లు రద్దయ్యాయి. ఆఫ్‌లైన్‌లో మ్యాన్యువల్‌గా లగేజ్ ‘చెక్ ఇన్’, బోర్డింగ్ పాస్‌లు ఇచ్చి సమస్యను పరిష్కరించారు. లగేజీ చెక్ చేసి బోర్డింగ్ పాస్ రాసివ్వడానికి ఒక్కో వ్యక్తికి 40 నిమిషాలు పట్టిందని కొందరు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే 29 విమానాలు రద్దయ్యాయి.ఇందులో ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కొల్‌కత్తాతో పాటు వివిధ నగరాలకు రాకపోకలు సాగించే విమానాలూ ఉన్నాయి. కొన్ని విమానాలు 1–2 గంటలు ఆలస్యంగా నడిచాయి. విమానాల రద్దయినప్పటికి విమాయనయాన సంస్థలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రకటనలు చేయకపోవడంతో ప్రయాణికులు వెనుదిరిగారు. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ వంటి స్టాక్ఎక్సే్ఛంజ్లు, బ్రోకరేజ్ సంస్థలు, బ్యాంక్‌ల వంటి ఆర్థికరంగ సంస్థల కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం పడలేదు. దేశంలో నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్(ఎన్ఐసీ) నెట్‌వర్క్‌లో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదని కేంద్ర ఐటీ మంత్రి ప్రకటించారు. పేలిన జోకులు కంప్యూటర్లు మొరాయించడంపై సామాజిక మాధ్యమాల్లో జోకులు పేలాయి. శుక్రవారం ఉదయం నుంచే ఐటీ ఉద్యోగులకు వారాంతం మొదలైందని నెటిజన్లు వ్యాఖ్యానించారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మాస్క్ మైక్రోసాఫ్ట్ సంస్థ పెద్ద తలనొప్పి సంస్థ అంటూ కొత్త భాష్యం చెప్పారు. ‘‘ ఇది మైక్రో‘సాఫ్ట్’ కాదు. మాక్రో‘హార్డ్. మైక్రోసాఫ్ట్ వాళ్ల అన్ని సర్వీస్‌లు ఆగిపోయాయి ఒక్క నా ‘ఎక్స్’ తప్ప’ అని తన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వ్యంగ్యంగా పోస్ట్‌చేశారు.ఏమిటీ బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్?:కంప్యూటర్లపై బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ దర్శనమిచి్చంది. ఈ ఎర్రర్ కనిపించాక కంప్యూటర్ రీస్టార్ట్ అవడంగానీ షట్‌డౌన్ అవడంగానీ జరుగుతోంది. విండోస్ అప్డేట్ అడిగితే చేయొద్దని, పొరపాటున చేస్తే ఆపరేటింగ్ సిస్టమ్‌ను తొలగించి మళ్లీ ఇన్స్టాల్ చేయాల్సిన పరిస్థితి వస్తుందని నిపుణులు తెలిపారు. మైక్రోసాఫ్ట్ సంస్థ ఈ సమస్యకు పరిష్కారం కనుక్కున్నాకే కంప్యూటర్లను అప్డేట్ చేసుకోవాలని సూచించారు. ఇంటర్నెట్ ఉల్లంఘనలు, హ్యాకింగ్‌ను రియల్‌టైమ్‌లో అడ్డుకునేందుకు క్రౌడ్‌స్ట్రయిక్ సంస్థ తమ సైబర్‌సెక్యూరిటీ సేవలను మైక్రోసాఫ్ట్‌కు ఇస్తోంది. సొంతంగా మ్యాన్యువల్‌గా సమస్య పరిష్కారానికి ప్రయతి్నంచేవాళ్లకు క్రౌడ్‌స్ట్రయిక్ ఒక చిట్కా చెప్పింది. విండోస్10లో బ్లూ స్క్రీన్ ఎర్రర్‌ను ఎలా ట్రబుల్ షూట్ చేయాలో వివరింది. సిస్టమ్‌ను సేఫ్ మోడ్‌లో లేదా విండోస్ రికవరీ ఎన్విరోన్మెంట్లో ఓపెన్ చేయాలి. తర్వాత C:/W indowsystem32/d rivers/C rowdStrike లోకి వెళ్లాలి. అందులోC-00000291·. sys అనే ఫైల్‌ను డిలీట్ చేయాలి. తర్వాత సాధారణంగా సిస్టమ్‌ను బూట్ చేస్తే సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది. -
పైలెట్ల కొరత.. ఎయిర్ విస్తారా కీలక నిర్ణయం
ప్రముఖ ఏవియేషన్ సంస్థ ఎయిర్ విస్తారా కీలక నిర్ణయం తీసుకుంది. సిబ్బంది కొరత కారణంగా విమాన కార్యకలాపాల్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. విస్తారా రోజుకు దాదాపు 350 విమానాలను నడుపుతోంది. వాటిల్లో 25-30 విమానాల వరకు సర్వీసుల్ని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. విస్తారా విమానాల రద్దు కారణంగా ముఖ్యంగా మెట్రో మార్గాల్లో ఛార్జీలు పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ-ముంబై రూట్లో విస్తారా రోజుకు దాదాపు 18 విమానాలను నడుపుతుండగా..ఇండిగో 19 విమానాలను నడుపుతోంది. ‘మేము మా కార్యకలాపాలను రోజుకు సుమారు 25-30 విమానాలు, అంటే 10శాతం సేవల్ని నిలిపివేస్తున్నాం. ఫిబ్రవరి 2024 చివరి వరకు ఎన్ని విమానాలు నడిపామో.. ఇక నుంచి అన్నే విమానాల్లో ప్రయాణికులకు సేవలందించాలని నిర్ణయించినట్లు ఓ ప్రకటనలో ఎయిర్ విస్తారా తెలిపింది. ఈ సందర్భంగా విస్తారా సీఈఓ వినోద్ కన్నన్ మాట్లాడుతూ..మా సంస్థ పైలట్లను ఎక్కువగా వినియోగించుకుంటోందని, అంతరాయం కారణంగా సవాళ్లను ఎదుర్కొందని చెప్పారు. ఇకపై ఎక్కువ మంది పైలట్లను నియమించుకోవడంపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. -
పైలెట్ల రాజీనామా.. విస్తారా ఎయిర్‌లైన్స్ సేవల్లో అంతరాయం
విస్తారా-ఎయిరిండియా విలీన ప్రక్రియ నేపథ్యంలో వేతనాల సవరణ అంశంపై పైలట్లు నెలలుగా ఆందోళనలు చేస్తున్నారు. ఫలింతగా విమాన సర్వీసులపై ప్రభావం పడుతోంది. పైలట్లు అందుబాటులో లేకపోవడంతో ఇవాళ మరో 38 విస్తారా విమాన సేవలు నిలిచిపోయాయి. ముంబయి నుంచి 15, దిల్లీ నుంచి 12, బెంగళూరు నుంచి 11 విమాన సర్వీసులు రద్దయినట్లు విస్తారా ప్రకటించింది. ఈ తరణంలో ఆ సంస్థకు చెందిన 15 మంది సీనియర్ పైలట్లు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఎక్కువ సమయం విధులు నిర్వహిస్తున్నా, ఫిక్స్డ్ పరిహారం తగ్గించడంపై విస్తారా పైలట్లు ఆందోళన వ్యక్తం చేస్తూ రాజీనామా చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతకు ముందు వైడ్ బాడీ బోయింగ్ 787 విమానాల నిర్వహణ కోసం విస్తారా పైలెట్లు శిక్షణ పొందారు. ట్రైనింగ్ తర్వాత సుమారు సుమారు 800 మంది పైలట్లు, సీనియర్ ఫస్ట్ ఆఫీసర్లు రాజీనామా చేయడంతో కలవరం మొదలైంది. 70 విమానాలతో ప్రతి రోజూ 300కి పైగా విమాన సర్వీసులు అందించే విస్తారా ఎయిర్‌లైన్స్‌లో ఇప్పుడు పైలెట్ల కొరత మరిన్ని ఇబ్బందులు గురి చేస్తోంది. -
పదేళ్ల క్రితం మిస్సైన మలేషియా విమానం.. పైలట్ ఆత్మహత్య స్కెచ్!!
మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం ఎంహెచ్ 370 అదృశ్యమై పదేళ్లు అవుతోంది. ఇప్పటికీ ఈ విమానం మిస్సింగ్ ఒక మిస్టరీగా మిగిలింది. దీనికి సంబంధించి పలు కథనాలు వార్తల రూపంలో తెరపైకి వస్తునే ఉన్నాయి. మార్చి 8, 2014న మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి చైనాలోని బీజింగ్‌కు వెళ్తున్న మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం ఎంహెచ్ 370 అదృశ్యమైంది. ఈ విమానాన్ని గుర్తించడానికి అనేక అంతర్జాతీయ ప్రయత్నాలు చేసినప్పటికీ, విమానం విడి భాగాలు గానీ, దాని అదృశ్యానికి సంబంధించిన ఖచ్చితమైన వివరాలు గానీ గుర్తించలేకపోయారు. ప్రమాద సమయంలో ఈ విమానంలో 239 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ విమానం కౌలాలంపూర్‌లో టేకాఫ్ అయ్యాక 39 నిమిషాల తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సిగ్నల్ కోల్పోయి అదృశ్యం అయింది. ఈ విమానం అదృశ్యంపై పరిశోధన చేసిన బృందంలోని సభ్యుడైన బ్రిటన్ ఏవియేషన్ నిపుణుడు, పైలట్ సైమన్ హార్డీ తాజాగా కీలక విషయాలు వెల్లడించారు. దీనిపై పరిశోధన చేసిన హారీ.. ఈ విమాన అదృశ్యం సదరు పైలట్ జహారీ అహ్మద్ షా ఆత్మహత్య చేసుకోవాలనే పథకంలో భాగంగానే జరిగినట్లు వెల్లడించారు. ఎంహెచ్ 370 విమానం పైలట్ జహారీ అహ్మద్ షా.. తోటి ప్రయాణీకులను తన ఆత్మహత్య పథకంలో భాగంగా విమానం అదృశ్యం చేసినట్లు సైమన్ హార్డీ తెలిపారు. ప్రమాద సమయంలో దక్షిణ హిందూ సముద్రంలో గీల్విన్క్ ఫ్రాక్చర్ జోన్లో విమానం అదృశ్యం అయ్యేలా పైలట్ భావించినట్లు తన పరిశోధనలో తేలిందని పేర్కొన్నారు. విమానం అదృశ్యం విషయంలో ఎఫ్‌బీఐ పరిశోధనలో కూడా దాదాపు దగ్గరా ఉన్న ఇటువంటి ఒక ముగింపు వచ్చినట్లు నివేదికలు ఉన్నాయని తెలిపారు. విమాన అదృష్యానికి సంబంధించిన దర్యాప్తు 2017లో ముగిసింది. అయితే గతంలో హార్డీకి తన పరిశోధనను రుజువు చేసుకోవడానికి సమయం లేదని తెలిపారు. గతంలో ఎంహెచ్370 విమానం సముద్రంలో భూకంపాలు గురయ్యే ప్రాంతంలో అదృశ్యం అయినట్లు నమ్మినట్లు తెలిపారు. అదృశ్యమైన విమానం సముద్రపు అడుగుభాగంలో కప్పబడి ఉండవచ్చని హార్డీ ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు సైమన్ హార్డీ వెల్లండించారు. -
మరో భారీ కొనుగోలుకు శ్రీకారం చుట్టిన ఆకాశ ఎయిర్!
ప్రముఖ ఏవియేషన్ సంస్థ ఆకాశ ఎయిర్ మరో భారీ కొనుగోలుకు శ్రీకారం చుట్టింది. కొద్ది రోజుల క్రితం అమెరికన్ విమాన తయారీదారు బోయింగ్ నుంచి 150 బోయింగ్ 737 మ్యాక్స్ 150 విమానాల కొనుగోలుకు ఆర్డర్ పెట్టింది. అయితే, తాజాగా ఆ విమానాల కోసం సీఎఫ్ఎం ఇంటర్నేషనల్ నుండి 300 ఇంజిన్లను కొనుగోలు చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. లీప్-1బి ఇంజన్లు, విడిభాగాలు, ఇతర సేవల కోసం సీఎఫ్ఎం ఇంటర్నేషనల్‌తో కుదుర్చుకున్న ఈ డీల్ విలువ సుమారు 5 బిలియన్ డాలర్లని అంచనా. కాగా..దేశీయ, అంతర్జాతీయంగా కొత్త మార్గాల్లో సర్వీసులను ప్రారంభించేందుకు ఆకాశ ఎయిర్ ‘మ్యాక్స్ 10, ‘మ్యాక్స్ 8-200’ శ్రేణి విమానాల కోసం ఈ ఏడాడి ప్రారంభంలో విమానాల కొనుగోలుకు సిద్ధమైంది. 2021లో ఆకాశ ఎయిర్ 72 బోయింగ్ 737 మ్యాక్స్‌లను బుక్ చేసుకుంది. గతేడాది మరో నాలుగింటికి ఆర్డర్ ఇచ్చింది. ఈ మొత్తంలో ఇప్పటికే 22 విమానాలను బోయింగ్ డెలివరీ చేసింది. ఇప్పుడు అదనంగా మరో 150 బోయిల్ విమానాలకు ఆర్డర్ పెట్టింది. విమానాల కొనుగోలు ఆర్డర్ పెట్టే సమయంలో చారిత్రాత్మకమైన విమానాల కొనుగోలుతో ప్రపంచంలోని టాప్ 30 ప్రముఖ ఎయిర్‌లైన్స్‌లో ఆకాశ ఎయిర్ ఒటిగా అవతరించేలా చేస్తుంది. అంతేకాదు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మా సేవల్ని అందించేందుకు ఈ ఒప్పందం ఉపయోగడపుతుందని అకాశ ఎయిర్ వ్యవస్థాపకుడు, సీఈఓ వినయ్ దూబే అన్నారు. -
భారత్‌లో ఫ్రాన్స్ ప్రధాని..టాటా - ఎయిర్ బస్‌ల మధ్య కీలక ఒప్పందం
దేశంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సైతం హాజరయ్యారు. ఈ తరుణంలో భారత్ - ఫ్రాన్స్ దేశాల మధ్య వ్యాపార ఒప్పందాలు ఊపందుకున్నాయి. దేశీయ డైవర్సిఫైడ్ దిగ్గజం టాటా - ఫ్రాన్స్ విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్‌ల మధ్యం ఒప్పందం జరిగింది. ఈ రెండు సంస్థల సంయుక్త భాగస్వామ్యంలో హెచ్ 125 హెలికాప్టర్లను తయారు చేసేందుకు సిద్ధమయ్యాయి. అందుకు సంబంధించిన ఒప్పందాలు సైతం చివరి దశకు వచ్చినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే ఈ రెండు సంస్థల మధ్య పలు ఒప్పందాలు జరిగిన విషయం తెలిసిందే. ఇటీవల, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఏ320, ఏ350 వంటి కమర్షియల్ జెట్ల కోసం ఎయిర్‌బస్‌కు విడిభాగాలను తయారు చేయడానికి, సరఫరా చేస్తున్నట్లు ప్రకటించింది. అదనంగా భారత వైమానిక దళం కోసం టాటా, ఎయిర్‌బస్‌లు సీ295 సైనిక రవాణా విమానాన్ని తయారు చేయనున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. -
ఉడాన్‌లో కీలక పరిణామం..ఇంటర్ గ్లోబ్ సీఈఓగా ఆదిత్య పాండే
ప్రముఖ బీ2బీ ఈకామర్స్ కంపెనీ ఉడాన్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొద్ది రోజుల క్రితం చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆదిత్య పాండే ఆ సంస్థకు రాజీనామా చేశారు. తాజాగా పాండే ఏవియేషన్ సంస్థ ఇంటర్ గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ గ్రూప్ సీఈఓ నియమితులయ్యారు. మార్చి 1, 2024 నుండి విధులు నిర్వహించనున్నారు. గతంలో ఇండిగోలో పనిచేసిన అనుభవం కారణంగా ఇంటర్‌గ్లోబ్ యాజమాన్యం సీఈఓగా కీలక బాధ్యతలు అప్పగించింది. వ్యూహాత్మక వ్యాపారం, కార్పొరేట్ సిబ్బంది విధులను పర్యవేక్షించడం, బలోపేతం చేయడం వంటి బాధ్యతలు చూసుకోనున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. 25 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న పాండే ప్రొడక్టివీటీ, ప్రాఫిట్ వంటి విభాగాల్లో దృష్టిసారిస్తూ వివిధ కంపెనీలలో వ్యాపార వ్యూహం, ఆర్ధిక కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించాడు. గతంలో పాండే దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ఉడాన్‌లో చేరారు. తాజాగా ఉడాన్ నుంచి ఇంటర్ గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ సీఈఓగా పదోన్నతి సాధించారు. ఇక,ఉడాన్‌లో పాండే స్థానాన్ని ఎవరు భర్తీ చేయనున్నారనే విషయం వెలుగులోకి రావాల్సి ఉండగా.. బదులుగా ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు అదనపు ఫైనాన్స్ బాధ్యతలను అప్పగించినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. -
జెట్‌సెట్‌గో భారీ డీల్...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ విమాన సర్వీసుల రంగంలో ఉన్న జెట్‌సెట్‌గో భారీ డీల్‌కు తెరలేపింది. ఇందులో భాగంగా 280 హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను సమకూర్చుకుంటోంది. హైదరాబాద్ బేగంపేటలో జరుగుతున్న వింగ్స్ ఇండియా 2024 వేదికగా ఎలెక్ట్రా, ఏరో, హారిజన్ ఎయిర్‌క్రాఫ్ట్, ఓవర్‌ఎయిర్‌తో జెట్‌సెట్‌గో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. డీల్ విలువ సుమారు రూ.10,790 కోట్లు. హారిజన్ తయారీ 50 కెవోరైట్ ఎక్స్7 ఎలక్ట్రిక్ వెర్టికల్ టేక్–ఆఫ్ అండ్ ల్యాండింగ్ (ఈవీటోల్) ఎయిర్‌క్రాఫ్ట్‌లను సమకూర్చుకుంటున్నట్టు సమాచారం. మరో 50 ఎక్స్7 ఈవీటోల్స్ తీసుకునే అవకాశమూ ఉంది. నగరాల్లో ఎయిర్ట్యాక్సీలుగా, విమానాశ్రయం నుంచి ఇతర ప్రాంతాలకు, వివిధ ప్రదేశాలకు, నగరాల మధ్య, నగరంలో ఒకచోటు నుంచి మరోచోటుకు వెళ్లేందుకు హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను వినియోగించవచ్చని జెట్‌సెట్‌గో శుక్రవారం వెల్లడించింది. ‘ఈ మూడు కంపెనీలతో భాగస్వామ్యం భారత్‌కు బ్లోన్ లిఫ్ట్, ఫ్యాన్ ఇన్ వింగ్ లిఫ్ట్ సిస్టమ్స్, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ ప్రొపల్షన్, సూపర్–క్వైట్ ఆప్టిమల్ స్పీడ్ టిల్ట్ రోటర్స్ వంటి ప్రత్యేక సాంకేతికతలను పరిచయం చేస్తుంది’ అని జెట్‌సెట్‌గో ఫౌండర్, సీఈవో కనిక టేక్రివాల్ తెలిపారు. -
WINGS INDIA 2024: 20 ఏళ్లలో 2,840 విమానాలు కావాలి
రాబోయే రోజుల్లో అంతర్జాతీయ ఏవియేషన్ రంగానికి భారత్ దన్నుగా నిలుస్తుందని విమానాల తయారీ దిగ్గజం ఎయిర్‌బస్ ఇండియా ప్రెసిడెంట్ రెమి మిలార్డ్ తెలిపారు. గణనీయంగా వృద్ధి చెందుతున్న భారత మార్కెట్‌కు వచ్చే 20 ఏళ్లలో 2,840 కొత్త విమానాలు అవసరమన్నారు. అలాగే 41,000 మంది పైలట్లు, 47,000 మంది టెక్నికల్ సిబ్బంది కావాల్సి ఉంటుందని గురువారం వింగ్స్ ఇండియా 2024 కార్యక్రమంలో ఆయన చెప్పారు. వచ్చే 20 ఏళ్ల పాటు ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందతున్న దేశంగా భారత్ నిలుస్తుందని అంచనాలు ఉన్నట్లు రెమీ తెలిపారు. భారత్ నుంచి రెట్టింపు స్థాయిలో కొనుగోలు చేయనున్నట్లు రెమీ వివరించారు. ప్రస్తుతం 750 మిలియన్ డాలర్లుగా ఉన్న సోర్సింగ్‌ను ఈ దశాబ్దం చివరికి 1.5 బిలియన్ డాలర్లకు పెంచుకోనున్నట్లు చెప్పారు. భారత్ నుంచి గతేడాది 750 విమానాలకు ఆర్డర్లు రాగా 75 ఎయిర్‌క్రాఫ్ట్‌లను దేశీ విమానయాన సంస్థలకు డెలివరీ చేసినట్లు వివరించారు. వీటిలో 41 విమానాలు ఇండిగో సంస్థకు, ఎయిరిండియాకు 19, విస్తారాకు 14, గో ఫస్ట్‌కు ఒకటి చొప్పున అందించినట్లు రెమీ చెప్పారు. తమ ఏ350 రకం విమానాలు భారత్‌లో అంతర్జాతీయ ప్రయాణాలకు ఊతమివ్వగలవని పేర్కొన్నారు. గతేడాది ఎయిరిండియాకు ఆరు ఏ350 విమానాలను అందించినట్లు చెప్పారు. భారత్‌లో విమానాల నిర్వహణ, రిపేర్లు, ఓవరాలింగ్ వ్యవస్థ అభివృద్ధికి తమ వంతు తోడ్పాటు అందిస్తున్నట్లు తెలిపారు. వింగ్స్ ఇండియా హైలైట్స్ ► హెరిటేజ్ ఏవియేషన్ ఎయిర్‌క్రాఫ్ట్ చార్టర్ కంపెనీ హెరిటేజ్ ఏవియేషన్ తాజాగా హెచ్125, హెచ్130 హెలికాప్టర్ల కోసం ఎయిర్‌బస్‌కు ఆర్డరు ఇచి్చంది. వీటిని ప్రాంతీయ కనెక్టివిటీ స్కీము ఉడాన్ కింద సరీ్వసుల కోసం ఉపయోగించనున్నట్లు సంస్థ సీఈవో రోహిత్ మాథుర్ తెలిపారు. ఎత్తైన, వేడిమి ఎక్కువగా ఉండే వాతావరణాల్లో ప్రయాణాలకు హెచ్125 హెలికాప్టర్ ఉపయోగపడుతుంది. ఇక సైట్ సీయింగ్, అత్యవసర వైద్య సరీ్వసులు మొదలైన వాటి కోసం హెచ్130 సహాయకరంగా ఉంటుంది. ► ఎయిర్ ఇండియా గురుగ్రాంలో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆసియాలో అతిపెద్ద ఏవియేషన్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఎయిర్‌బస్, బోయింగ్ కోసం 20కిపైగా సిమ్యులేటర్స్‌తో పైలట్లకు శిక్షణ. ఆకాశ ఎయిర్ బోయింగ్ 737 మ్యాక్స్ రకం 150 విమానాలకు ఆర్డర్ ఇచ్చింది. ఆకాశ ఎయిర్ బోయింగ్ 737 మ్యాక్స్ రకం 150 విమానాలకు ఆర్డర్ ఇచ్చింది. ఎయిర్ ఇండియా గురుగ్రాంలో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆసియాలో అతిపెద్ద ఏవియేషన్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఎయిర్‌బస్, బోయింగ్ కోసం 20కిపైగా సిమ్యులేటర్స్‌తో పైలట్లకు శిక్షణ. జీఎంఆర్ ఏరో జ్యోతిరాదిత్య సింధియా చేతుల మీదుగా ఏవియేషన్ స్కూల్ వర్చువల్‌గా ప్రారంభం. టీఏఎస్ఎల్ విడిభాగాల తయారీకై మహీంద్రా ఏరోస్పేస్తో కలిసి ఎయిర్‌బస్ నుంచి ఆర్డర్లను పొందింది. -
ఎయిరిండియాకు ఏమైంది? ‘వెజ్ మీల్స్‌లో చికెన్ ముక్కలు’!
టాటా సన్స్ గ్రూప్ ఆధీనంలోని ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుందా? ఫలితంగా ప్రయాణికులకు ఎయిరిండియా సంస్థపై నమ్మకం సన్నగిల్లుతుందా? అంటే అవుననే అంటున్నాయి ఎయిరిండియా సంస్థలోని వరుస సంఘటనలు. టాటా సన్స్ ఎయిరిండియాను కొనుగోలు చేసిన ఆరంభం నుంచి ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. ఇప్పటికే ప్రయాణికులపై మూత్ర విసర్జన,దుబాయ్- ఢిల్లీ ఎయిరిండియా విమానం కాక్‌పిట్‌లోకి ప్రియురాలు, మహిళ భోజనంలో రాయి వంటి వరుస వివాదాలతో ఆ సంస్థ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. తాజాగా, మరో మహిళ వెజ్‌మీల్స్‌లో చికెన్ ముక్కలు కనిపించడంతో కంగుతినడం ఆమె వంతైంది. వీర్‌జైన్ అనే మహిళ ప్రయాణికురాలు కాలికట్ టూ ముంబై ఏఐ582 ఎయిరిండియా విమానం ఎక్కింది. సాయంత్రం 6.40 బయలుదేరాల్సిన విమానం 7.40కి ప్రారంభమైంది. కొన్ని సార్లు రాకపోకల కారణంగా ఫ్లైట్ జర్నీ కొంచెం ఆలస్యం అవుతుందిలే అని సర్ది చెప్పుకుంది. వీర్‌జైన్‌కు జర్నీ ప్రారంభమైంది. కొద్దిసేపటికి బాగా ఆకలివేసిన వీర్‌జైన్ వెజ్మీల్స్ ఆర్డర్ చేసింది. సిబ్బంది వెజ్మీల్స్ తెచ్చారు. అసలే ఆకలి..పైగా ప్లేట్లో మీల్స్ వేడివేడిగా ఉండడంతో ఆతృతగా ఆరగించే ప్రయత్నం చేసింది. క్రూ సిబ్బంది సర్వ్ చేసిన ఆహార ప్యాకెట్‌పై ‘వెజ్ మెయిన్ మీల్’ అని స్పష్టంగా రాసిఉన్నా.. అందులో చికెన్ పీసెస్ రావడం పట్ల ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఇలా ఎందుకు జరిగిందని ఎయిరిండియా కేబిన్ సూపర్వైజర్ సోనాని ప్రశ్నించింది. వీర్‌జైన్‌తో పాటు తన స్నేహితురాలు సైతం తన వెజ్ ప్లేట్లో చికెన్ ముక్కలు వచ్చాయంటూ ఫిర్యాదు చేసింది. పట్టించుకోని ఎయిరిండియా సిబ్బంది? అయితే జరిగిన తప్పిందంపై ఎయిరిండియా సిబ్బంది సరిగ్గా స్పందించ లేదని.. సంబంధిత సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తనని ఆశ్చర్యానికి గురి చేసిందంటూ ఎయిరిండియా విమానంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. దిగొచ్చిన ఎయిరిండియా.. ఆపై క్షమాపణలు ప్రస్తుతం ఆఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా..ఇలాగే పునరావృతమైతే ఎయిరిండియాపై ప్రయాణికులకు నమ్మకాన్ని పోగొట్టుకుంటుందంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎయిరిండియాకు ఏమైందని, ఆ సంస్థ సీఈఓ కాంప్‌బెల్ విల్సన్, మాతృ సంస్థ టాటా గ్రూప్ చర్యలు తీసుకుంటే బాగుంటుదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక సోనాజైన్ ఫోటోలపై ఎయిరిండియా స్పందిస్తూ క్షమాణలు చెప్పింది. చదవండి👉 అంబానీతో పోటీపడి.. ఆపై అడ్డంగా దొరికిపోయిన గౌతమ్ సింఘానియా! -
విమానయానంలో విప్లవం
సాక్షి, రాజమహేంద్రవరం/మధురపూడి: గత తొమ్మిదిన్నరేళ్లలో విమానయాన గణనీయమైన అభివృద్ధి సాధించిందని కేంద్ర పౌర విమానయాన, ఉక్కుశాఖల మంత్రి జ్యోతిరాదిత్య సింథియా చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా మధురపూడిలోని రాజమహేంద్రవరం విమానాశ్రయంలో రూ.347 కోట్లతో నిర్మిస్తున్న డొమెస్టిక్ టెర్మినల్ భవనానికి ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ 65 ఏళ్ల భారతదేశ చరిత్రలో 2014 నాటికి దేశంలో 74 ఎయిర్‌పోర్టులు మాత్రమే ఉన్నాయని, ఈ తొమ్మిదిన్నరేళ్లలో 75 ఎయిర్‌పోర్టులు నిర్మించామని చెప్పారు. దీంతో దేశంలో ఎయిర్‌పోర్టుల సంఖ్య 149కి చేరిందన్నారు. వీటి సంఖ్యను 220కి పెంచుతామని తెలిపారు. రాజమహేంద్రవరంలో నిర్మిస్తున్న కొత్త టెర్మినల్ పాయింట్ 21,094 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉంటుందని, రద్దీవేళల్లో 2,100 మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యంతోపాటు భవిష్యత్‌లో ఏటా 30 లక్షలమంది ప్రయాణికుల వార్షిక సామర్థ్యం ఉంటుందని వివరించారు. 28 చెక్ ఇన్ కౌంటర్లు, నాలుగు అరైవల్ కరైజల్స్, 600 కార్లకు పార్కింగ్, ఫైవ్‌స్టార్ రేటింగ్‌తో టెర్మినల్ రూపు దిద్దుకోనుందని చెప్పారు. రాష్ట్రంలో ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. గతంలో రాజమహేంద్రవరం నుంచి శంషాబాద్‌కు మాత్రమే విమానాల కనెక్టివిటీ ఉండేదని, ప్రస్తుతం మూడు ప్రధాన నగరాలకు ఉందని తెలిపారు. తిరుపతి నుంచి గతంలో ఒక నగరానికి మాత్రమే కనెక్టివిటీ ఉండగా.. ఇప్పుడది 10 ప్రాంతాలకు విస్తరించిందని చెప్పారు. విజయవాడకు రెండు నగరాలతో కనెక్టివిటీ ఉంటే ప్రస్తుతం ఎనిమిదికి పెరిగిందని, షార్జా కూడా వెళ్లగలుగుతున్నారని తెలిపారు. విశాఖ ఎయిర్‌పోర్టుకు తొమ్మిది ప్రాంతాలతో ఉన్న కనెక్టివిటీ ఇప్పుడు 14 నగరాలకు పెరిగిందన్నారు. సింగపూర్‌కు సైతం విమానాలు వెళ్లేలా వసతులు కల్పించామని చెప్పారు. అలాగే కడప, కర్నూలు ఎయిర్‌పోర్టుల ద్వారా వివిధ ప్రాంతాలకు విమానాలు వెళ్లేలా తీర్చిదిద్దామన్నారు. భోగాపురం, ముంబై, ఢిల్లీ ఎయిర్‌పోర్టులను గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులుగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే ఆరు ఎయిర్‌పోర్టుల ద్వారా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారన్నారు. ఇటీవల భోగాపురంలో 2,200 ఎకరాల్లో రూ.4 వేల కోట్లతో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారని చెప్పారు. రెండేళ్లలో దీని నిర్మాణం పూర్తిచేస్తామన్నారు. కర్నూలులో రూ.500 కోట్లతో ఫ్లయింగ్ స్కూల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడారు. ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, కలెక్టర్ కె.మాధవీలత, జేసీ ఎన్.తేజ్‌భరత్, రాజమహేంద్రవరం నగరపాలకసంస్థ కమిషనర్ కె.దినేష్‌కుమార్, ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ సంజీవ్‌కుమార్, మధురపూడి విమానాశ్రయ అధికారి ఎస్.జ్ఞానేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న సింథియా ప్రసంగం అందరికీ నమస్కారం.. అంటూ సింథియా ప్రారంభించిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. సాంస్కృతిక రాజధానిగా ఖ్యాతిగాంచిన రాజమహేంద్రవరం పవిత్ర గోదావరి ఒడ్డున ఉందని, వెయ్యేళ్ల ఉత్సవాలు చేసుకుంటున్న ఈ నగర సాంస్కృతిక వారసత్వం దేశానికే తలమానికమని కొనియాడారు. ప్రజాకవి నన్నయ నడయాడిన నేలగా అభివర్ణించారు. అల్లూరి సీతారామరాజు వంటి ఎందరో మహానుభావులు, స్వాతంత్య్ర సమరయోధులు ఇక్కడి వారేనని ఆయన పేర్కొన్నారు. -
ఎయిరిండియా షాకింగ్ నిర్ణయం!
టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిరిండియా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఎయిరిండియా రెండు డేటా సెంటర్లను షట్‌డౌన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ నిర్ణయంతో ఎయిరిండియా ఏడాదికి వన్ మిలియన్ డాలర్లను ఆదా చేయనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఎయిరిండియా తన కష్టమర్లకు సేవలంచేలా అప్లికేషన్లు, ఇతర సర్వీసులు కోసం ముంబై, న్యూఢిల్లీలలో రెండు డేటా సెంటర్లను ఉపయోగిస్తుంది. అయితే, తాజాగా వాటిని షట్‌డౌన్ చేస్తున్నట్లు ఎయిరిండియా తెలిపింది. ఈ నిర్ణయంతో వన్ బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ మొత్తంలో డబ్బు ఆదా చేయొచ్చని ఎయిరిండియా చెబుతుంది. ఎయిరిండియా కార్యకలాపాలు కొనసాగించేందుకు క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఉపయోగించనుంది. ఈ క్లౌడ్ సేవల్ని అమెరికాలోని సిలీకాన్ వ్యాలీతో పాటు పాటు భారత్‌లోని గురుగ్రామ్, కొచ్చి నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా "మేం ఎయిరిండియా ప్రయాణంలో సాఫ్ట్వేర్-ఎ-సర్వీస్, ప్లాట్‌ఫారమ్-యాజ్-ఎ-సర్వీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్-ఎ-సర్వీస్ మెథడాలజీ సేవల్ని వినియోగిస్తున్నాం " అని ఎయిర్ ఇండియా చీఫ్ డిజిటల్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్ సత్య రామస్వామి చెప్పారు. గతేడాది జనవరిలో టాటా గ్రూప్ టేకోవర్ చేసిన ఎయిరిండియా రానున్న ఐదేళ్ల భవిష్యాత్ ఎలా ఉండాలనే అంశంపై ప్రణాళికల్ని సైతం సిద్ధం చేసుకున్నట్లు రామస్వామి వెల్లడించారు. -
ఎవరీ నరేశ్ గోయల్?..జెట్ ఎయిర్వేస్ ఎలా పతనం అయ్యింది?
చిన్న వయస్సులోనే తండ్రి మరణం..చదువుకునే స్థోమతా లేదు. ఒకపూట తింటే రెండో పూట పస్తులుండే జీవితం. అలాంటి దుర్భుర జీవితాన్ని అనుభవించిన ఓ యువకుడు దేశంలోనే అతి పెద్ద ఎయిర్‌లైన్స్ జెట్ ఎయిర్ వేస్ అనే విమానయాన సంస్థను ఎలా స్థాపించగలిగారు. చిన్న వయస్సు నుంచే ‘నువ్వు మంచి చేస్తే మంచి... చెడు చేస్తే చెడు... తిరిగి మళ్ళీ అది నిన్నే చేరుతుంది’ అమ్మ మాటల్ని వింటూ పెరిగిన ఆయన ఆర్ధిక నేరానికి ఎందుకు పాల్పడ్డారు. వందల కోట్లలో తీసుకున్న బ్యాంకు లోన్లను ఎగ్గొట్టి పరారయ్యేందుకు ఎందుకు ప్రయత్నించారు. చివరికి ఎలా అరెస్ట్ అయ్యారు. జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ అరెస్టు అయ్యారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) ప్రకారం.. కెనరా బ్యాంకుకు సంబంధించి రూ.538 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆయనను అదుపులోకి తీసుకుంది.ఈ తరుణంలో భారతీయలు సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్న నరేశ్ గోయల్ కెరియర్, జెట్ ఎయిర్వేస్ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ప్రయత్నిస్తున్నారు. బీకామ్‌తో సరిపెట్టుకుని నరేశ్ గోయల్ 29 జూలై 1949 పంజాబ్‌లోని సంగ్రూర్ గ్రామంలో జన్మించారు. అదే గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాలలో తన పాఠశాల విద్యాభ్యాసాన్ని, పంజాబ్‌లోని పాటియాలా ప్రభుత్వ బిక్రమ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుండి కామర్స్‌లో బ్యాచిలర్స్ పూర్తి చేశారు. అయితే 11 ఏళ్ల వయస్సుల్లో తన తండ్రి మరణం మరింత ఆర్ధిక ఇబ్బందుల్లోకి నెట్టింది. రుణం కారణంగా ప్రభుత్వం చిన్న తనంలో గోయల్ ఇంటిని, ఇతర ఆస్తుల్ని వేలం పాట నిర్వహించింది. కాబట్టే చార్టెడ్ అకౌంటెంట్ పూర్తి చేయాలన్నా ఆయన కలలు.. కల్లలయ్యాయి. చదువుకునే స్థోమత లేక బీకామ్‌తో సరిపెట్టుకున్నారు. కఠిక నేలపై నిద్రిస్తూ 1967లో గ్రాడ్యుయేషన్ తర్వాత, గోయల్ తన మేన మామ సేథ్ చరణ్ దాస్ రామ్ లాల్ ట్రావెల్ ఏజెన్సీ ఈస్ట్ వెస్ట్ ఏజెన్సీస్‌లో క్యాషియర్‌గా తన వృత్తిని ప్రారంభించారు. అదే ఆఫీస్‌నే ఇంటిగా మార్చుకున్నారు. పగలు ఆఫీస్ పనుల్ని చక్కబెడుతూనే.. రాత్రి వేళలో అదే ఆఫీస్‌లో నిద్రించే వారు. ఆఫీస్ అయిపోయిన వెంటనే అందులోనే స్నానం చేయడం.. పక్కనే ఉన్న దాబాలో సమయానికి ఏది దొరికితే అది తినడం, కఠిక నేలపై నిద్రించడం ఇలా రోజువారీ దినచర్యగా మారింది. అనతి కాలంలో మేనేజర్ స్థాయికి అనతి కాలంలో 1969లో ఇరాకీ ఎయిర్వేస్ పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్‌గా నియమితులయ్యారు. 1971 నుండి 1974 మధ్యకాలంలో రాయల్ జోర్డానియన్ ఎయిర్‌లైన్స్‌కు రీజినల్ మేనేజర్‌గా కూడా పనిచేశాడు. ఆ సమయంలో టిక్కెట్లు, రిజర్వేషన్, అమ్మకాల రంగాలలో అనుభవాన్ని గడించారు. ఆ అనుభవమే మిడిల్ ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్‌లోని భారతీయ అధికారులతో పనిచేసేందుకు ఉపయోగపడింది. తల్లి ఆశీర్వాదంతో 1967 నుండి 1974 వరకు, గోయల్ అనేక విదేశీ విమానయాన సంస్థలతో కలిసి పనిచేశారు. వ్యాపార మెళుకువల్ని నేర్చుకుని ఆ రంగంపై పట్టు సాధించారు. తనకున్న అనుభవంతో 1974లో నరేశ్ గోయల్ తన తల్లి నుంచి 500 డాలర్లు( రూ. 40వేలు) ఇప్పుడు (రూ.2లక్షలకు పైమాటే) వేల వరకు తీసుకున్నారు. ఆ డబ్బుతో తన సోదరుడు సురీందర్ కుమార్ గోయల్‌తో కలిసి తన సొంత స్టార్టప్ జైటర్ అనే ట్రావెల్ ఏజెన్సీని ప్రారంభించారు. సేల్స్, మార్కెటింగ్ విభాగాల్లో జైటర్ ఎయిర్ ఫ్రాన్స్, ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్, కాథే పసిఫిక్ వంటి విమానయాన సంస్థలకు సేలందించేంది. వ్యాపారం జోరుగా కొనసాడంతో లాభాల్ని గడిస్తూ వచ్చారు. అంది వచ్చిన అవకాశం అయితే 1991లో, నాటి భారత ప్రభుత్వం ఓపెన్ స్కైస్ పాలసీని ప్రకటించింది. ఆ ప్రకటనే నరేశ్ మరింత ఎత్తుకు ఎదిగేందుకు దోహదం చేసింది. గోయల్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. సొంతంగా తానే విమానయాన సంస్థను ప్రారంభించారు.1992లో అతని ట్రావెల్ ఏజెన్సీ జెట్ ఎయిర్వేస్గా పేరు మార్చారు. ఆ మరుసటి ఏడాది జెట్ ఎయిర్వేస్ దేశవ్యాప్తంగా తన కార్యకలాపాలను ప్రారంభించింది. 2004 నాటికి, జెట్ ఎయిర్వేస్ అంతర్జాతీయ విమానాల కార్యకలాపాలను ప్రారంభమయ్యాయి. 2007లో జెట్ ఎయిర్వేస్ ఎయిర్ సహారాను కొనుగోలు చేసింది. 2010 నాటికి భారతదేశంలో అతిపెద్ద ఏవియేషన్ సంస్థగా అవతరించింది. కొంపముంచిన అతి విశ్వాసం కానీ రోజులు గడిచే కొద్దీ జెట్ ఎయిర్వేస్ ప్రాభవం మరింత తగ్గుతూ వచ్చింది. ఓవైపు అతి విశ్వాసం.. మరోవైపు మార్కెట్లో ఇతర ఏవియేషన్ సంస్థలు పుట్టుకురావడం, జెట్ ఎయిర్వేస్ విమాన టికెట్ ధరలు ఇతర ఏవియేషన్ కంపెనీ టికెట్ల ధరల కంటే ఎక్కువగా ఉండటం, వ్యాపారం కొనసాగించేందుకు అప్పులు చేయడం.. వాటికి వడ్డీలు చెల్లించడం, సిబ్బందికి జీతాలు ఇవ్వలేక అక్రమ మార్గాన్ని ఎంచుకోవడంతో.. జెట్ ఎయిర్వేస్ పతనం ప్రారంభమైంది. నాలుగు పెద్ద సూట్కేసుల్ని తీసుకుని 2019లో ఎయిర్‌లైన్‌లో ఆర్థిక సంక్షోభంతో మూడింట రెండు వంతుల విమానాలు నిలిచిపోయాయి. ఆ తర్వాత ఆయన మార్చి 25 ,2019న తన భార్య అనితా గోయల్‌తో కలిసి జెట్ ఎయిర్వేస్ బోర్డు నుండి వైదొలిగారు. అదే ఏడాది నాలుగు పెద్ద పెద్ద సూట్‌కేసులతో విదేశాలకు బయలుదేరి వెళ్లేందుకు నరేశ్ గోయల్, ఆయన సతీమణి అనితా గోయల్ ప్రయత్నించారు. ముంబై విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు విమానం ఎక్కడానికి అనుమతి నిరాకరించడం అప్పట్లో పెద్ద ఎత్తున దుమారమే చెలరేగింది. సెప్టెంబరు 2019లో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గోయల్‌పై విదేశీ మారకద్రవ్య ఉల్లంఘన ఆరోపణలపై దర్యాప్తు కోసం ప్రశ్నించారు. 2020లో ఈడీ అధికారులు మనీలాండరింగ్ కేసు నమోదు చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కెనరా బ్యాంక్ నుంచి రూ.538 కోట్లు రుణాలు ఎగవేతకు పాల్పడడం, తన అనుబంధ సంస్థ జేఐఎల్కు 14వందల కోట్ల చెల్లింపులు, పెట్టుబడులు పెట్టి తద్వారా భారీగా నిధుల్ని కాజేశారు. కెనరా బ్యాంక్ అధికారుల ఫిర్యాదు, నిధులు కాజేయడంతో పాటు ఇతర ఆధారాల్ని సేకరించిన ఈడీ అధికారులు గోయల్‌ను ముంబై కార్యాలయంలో సుదీర్ఘంగా ప్రశ్నించించారు. ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నారు. వివాదాలు 👉2000వ దశకంలో నరేష్‌గోయల్‌కు అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. జెట్ ఎయిర్వేస్కు దావూద్ నిధులు సమకూర్చారని పిల్ పేర్కొంది. అయితే నరేష్ కు ప్రభుత్వం క్లీన్ చిట్ ఇవ్వడంతో పాటు సెక్యూరిటీ క్లియరెన్స్ కూడా ఇచ్చింది. 👉మార్చి 2020లో, అతనితో అనుబంధించబడిన 19 ప్రైవేట్ సంస్థలకు సంబంధించిన అనుమానాస్పద లావాదేవీలలో పాల్గొన్నందుకు ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ద్వారా మనీ లాండరింగ్ కేసు నమోదైంది. 👉19 జూలై 2023న, నరేష్ గోయల్, అతని సహచరుల నివాసాల్లో ఢిల్లీ, ముంబైలలో దాడులు చేసింది. దీనికి ముందు, జూలై 14, 2023న గోయల్, అతని భార్యతో పాటు ఇతరులపై సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. చివరికి అదుపులోకి తీసుకుంది. 👉1979లో మార్కెటింగ్ అనలిస్ట్‌గా కంపెనీలో చేరి మార్కెటింగ్, సేల్స్ హెడ్‌గా ఎదిగిన అనిత అనే యువతిని ఆమెను వివాహం చేసుకున్నారు. వారు తొమ్మిదేళ్ల తర్వాత వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. 👉చివరిగా ::: ఎయిర్ డెక్కన్ సంస్థను స్థాపించి అందరికీ తక్కువ ధరకే విమాన ప్రయాణ సౌకర్యం అందించిన కెప్టెన్ గోపీనాథ్ జీవితంలోని అంశాల ఆధారంగా ఆకాశమే నీ హద్దురా సినిమా తెరకెక్కింది. ఆ సినిమాలో విమానయాన సంస్థ పెట్టడానికి ప్రయత్నించే యువకుడిగా కెప్టెన్ గోపీనాథ్ పాత్రను సూర్య చేస్తే.. సినిమాలోని సూర్య (మహా) ఆశయాన్ని ప్రతి అడుగులోను అడ్డగించే విలన్‌గా పరేష్ రావల్ యాక్ట్ చేశారు. నిజజీవితంలో కెప్టెన్ గోపీనాథ్‌ను ఇబ్బంది పెట్టింది మరెవరో కాదు జెట్ ఎయిర్ వేస్ అధినేత నరేశ్ గోయల్. -
ఎయిరిండియా లుక్ మారింది.. అదరగొడుతుంది
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ చేతికి చేరిన విమానయాన సంస్థ ఎయిరిండియా సరికొత్త రూపు సంతరించుకుంటోంది. ఇందుకు సంబంధించి కొత్త బ్రాండ్ గుర్తింపుని, విమానాల లుక్, లోగోను గురువారం ఆవిష్కరించింది. ది విస్టా పేరిట తీర్చిదిద్దిన కొత్త లోగో.. అపరిమిత అవకాశాలు, పురోగతి, భవిష్యత్‌పై సాహసోపేత అంచనాలను ప్రతిబింబిస్తుందని కంపెనీ పేర్కొంది. బ్రాండ్స్‌కి ప్రత్యేక రూపునిచ్చే ఫ్యూచర్‌బ్రాండ్ కంపెనీతో కలిసి దీన్ని రూపొందించినట్లు వివరించింది. ఈ ఏడాది డిసెంబర్లో వినూత్న హంగులతో ఏ350 విమానం అందుబాటులోకి వచ్చిన తర్వాత నుంచి ప్రయాణికులు కొత్త లోగోను చూడవచ్చని ఎయిరిడియా వివరించింది. మరోవైపు, ఎయిరిండియా అనేది తమకు మరో సాధారణ వ్యాపారంలాంటిది కాదని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. మానవ వనరులతో పాటు ఎయిర్‌లైన్‌ని అన్ని విధాలుగా అప్‌గ్రేడ్ చేయడంపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. -
పెరిగిన డ్రోన్ పైలెట్లు!
దేశంలో ఈ ఏడాది జూలై 1 నాటికి 5,072 మంది పైలెట్లు సాక్షి, అమరావతి: ఏడాది వ్యవధిలోనే దేశంలో డ్రోన్ పైలెట్లు 1,365 శాతం మేర పెరిగారని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సోమవారం పార్లమెంట్లో వెల్లడించింది. సాధారణ సేవల నుంచి అత్యవసర సేవల వరకు అంతటా డ్రోన్ల వినియోగం పెరుగుతోందని పేర్కొంది. గత ఏడాది జూలై 1 నాటికి దేశవ్యాప్తంగా కేవలం 346 మంది సర్టిఫైడ్ డ్రోన్ పైలెట్లుండగా.. ఈ ఏడాది జూలై 1 నాటికి ఆ సంఖ్య 5,072కు పెరిగిందని ఆ శాఖ తెలిపింది. 427 మంది సర్టిఫైడ్ డ్రోన్ పైలెట్లతో ఆంధ్రప్రదేశ్ దేశంలో మూడో స్థానంలో ఉంది. అత్యధికంగా తమిళనాడులో ఉన్నారు. ఆ తరువాత స్థానంలో మహారాష్ట్ర ఉంది. అనేక రంగాల్లో వినియోగం.. ఇక డ్రోన్స్ వినియోగం వ్యవసాయంతో పాటు వ్యాక్సిన్ డెలివరీ, నిఘా, శోధన, రక్షణ, రవాణా, మ్యాపింగ్ రంగాల్లో ఉందని ఆ మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా వీటిని ఉపయోగించనున్నట్లు పేర్కొంది. మరోవైపు.. డ్రోన్స్ రిమోట్ పైలెట్ శిక్షణ కోసం వివిధ రాష్ట్రాల్లో 60 సంస్థలకు అనుమతులు మంజూరు చేశారు. ఏపీ విషయానికొస్తే గుంటూరులో రెండు సంస్థలకు, హిందూపురంలో ఒక సంస్థకు కేంద్రం అనుమతించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధానంగా వ్యవసాయ రంగంలో వీటి వినియోగాన్ని పెంచడం ద్వారా రైతులకు చేదోడు వాదోడుగా ఉండేందుకు చర్యలు చేపట్టింది. అలాగే, వచ్చే నెలలో 500 కిసాన్ డ్రోన్స్ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. రైతుల ఖర్చులు తగ్గించేందుకు.. డ్రోన్ రిమోట్ పైలెట్ల శిక్షణకు రైతులతో పాటు గ్రామాల్లోని నిరుద్యోగ యువతను రాష్ట్ర ప్రభుత్వం ఎంపికచేసి వారికి శిక్షణ ఇప్పిస్తోంది. మానవ శ్రమను తగ్గించడంతో పాటు, వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి.. ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచడానికి వ్యవసాయ యాంత్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా డ్రోన్ల వినియోగం పెంచడం ద్వారా పంటల అంచనా, భూ రికార్డుల డిజిటలైజేషన్, పురుగు మందులు, పోషకాలను పిచికారీ చేయడానికి ఉపయోగిస్తారు. తద్వారా రైతుల ఉత్పాదకత వ్యయం తగ్గి, ఆదాయం పెరుగుతుంది. -
ఏమో! కారు ఎగరావచ్చు.. కానీ!
నగరాల్లో విపరీతమైన వాహనాల రద్దీ, అధ్వాన్నమైన రహదారుల వల్ల సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేక ప్రయాణికులు విసుగెత్తిపోతుంటారు. ట్రాఫిక్ జంఝాటం లేకుండా హాయిగా ఆకాశంలో విహరిస్తూ వేగంగా దూసుకెళ్తే బాగుంటుందని అనుకోనివారు ఉండరు. అలాంటివారి కోసం అమెరికాలోని కాలిఫోరి్నయాకు చెందిన అలెఫ్ ఏరోనాటిక్స్ సంస్థ ఎగిరే కారును(ఫ్లైయింగ్ కారు) అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. 2015లో మొదలైన ఈ ఆలోచనకు పదునుపెట్టిన అలెఫ్ కంపెనీ 2019 నాటికి ఎగిరే కారును తయారు చేసింది. మోడల్–ఎ ఫ్లైయింగ్ కారును ఆవిష్కరించింది. కొన్ని రకాల పరీక్షల తర్వాత ఈ ఏడాది జూన్ 12న అమెరికా ఫెడరేషన్ ఏవియేషన్ అడ్మిని్రస్టేషన్(ఎఫ్ఏఏ) ఈ కారుకు స్పెషల్ ఎయిర్‌వర్తీనెస్ సర్టిఫికెట్ అందజేసింది. అంటే పరిమిత ప్రాంతాల్లో ఫ్లైయింగ్ కారును ప్రదర్శించడానికి, దీనిపై పరిశోధన–అభివృద్ధి వంటి కార్యకలాపాల కోసం అనుమతి మంజూరు చేసింది. ఇదొక టరి్నంగ్ పాయింట్ అని చెప్పాలి. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ ఎగిరే కారు ప్రజలకు విస్తృతంగా అందుబాటులోకి రావడానికి సాంకేతికపరమైన, చట్టపరమైన ఎన్నో అవరోధాలు, సవాళ్లు ఉన్నాయి. వాటిని అధిగమిస్తేనే కారులో ఆకాశంలో స్వేచ్ఛగా ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. విడిభాగాల లభ్యత ఎలా ఎక్కువ సంఖ్యలో ఎగిరే కార్లను తయారు చేయడానికి కొన్ని విడిభాగాలు విస్తృతంగా అందుబాటులో లేవని అలెఫ్ ఏరోనాటిక్స్ ముఖ్య కార్యనిర్వహణాధికారి జిమ్ డుఖోవ్నీ చెప్పారు. వాటిని సమకూర్చుకోవడం చాలా కష్టమని అన్నారు. ఉదాహరణకు ఫ్లైయింగ్ కారుకు ప్రయాణంలో ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించడానికి హైలీ స్పెషలైజ్డ్ ప్రొపెల్లర్ మోటార్ సిస్టమ్స్ అవసరమని, అలాంటివి తయారు చేసుకోవడం శ్రమ, ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని తెలిపారు. ఎగిరే కారు ఎంత త్వరగా క్షేత్రస్థాయిలోకి వస్తుందన్నది దాని పరిమాణం, బరువు, ధర, అది ఎంతవరకు సురక్షితం అనేదానిపైనా ఆధారపడి ఉంటుందన్నారు. సేఫ్టీ ఫీచర్ల మాటేమిటి అలెఫ్ కంపెనీ మోడల్–ఎ కార్ల విక్రయాల కోసం ఇప్పటికే ప్రి–ఆర్డర్లను స్వీకరిస్తోంది. ఒక్కో కారు ధరను 3 లక్షల డాలర్లుగా (రూ.2.46 కోట్లు) నిర్ధారించింది. మోడల్–ఎ అనేది అ్రల్టాలైట్, లో స్పీడ్ వెహికల్. చట్టప్రకారం ఈ మోడల్ కారు గోల్ఫ్ కార్ట్లు, చిన్నపాటి విద్యుత్ వాహనాల విభాగంలోకి వస్తుంది. ఫ్లైయింగ్ కారు కేవలం గాల్లో ఎగరడమే కాదు, రోడ్లపై కూడా సాధారణ వాహనాల్లాగే ప్రయాణిస్తుంది. దానికి అనుమతి రావాలంటే ‘నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్’ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అంటే సాధారణ కార్లలో ఉండే సేఫ్టీ ఫీచర్లన్నీ ఉండాలి. అలెఫ్ సంస్థ అభివృద్ధి చేసిన మోడల్–ఎ కారు రోడ్లపై ప్రయాణానికి అంతగా సురక్షితం కాదన్న వాదన వినిపిస్తోంది. భారీ శబ్ధాలు, కాలుష్యం ఫ్లైయింగ్ కార్లు పరిమితమైన ఎత్తులోనే ఎగురుతాయి. భారీ శబ్ధాలు, కాలుష్యం ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. దీనివల్ల కొత్త సమస్యలు తప్పవు. ప్రజల్లో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం లేకపోలేదు. ఏమాత్రం శబ్ధం వెలువడని ఫ్లైయింగ్ కార్లు డిజైన్ చేయడం చాలా సంక్లిష్టమైన ప్రక్రియ అంటున్నారు. రోడ్లపై వాహనాలు ఢీకొంటున్నట్లుగానే గగనతలంలో వేగంగా దూసుకెళ్లే ఫ్లైయింగ్ కార్లు పరస్పరం ఢీకొనే అవకాశాన్ని కొట్టిపారేయలేం. ఎగిరే కార్లు భవనాలను ఢీకొని నేలకూలడానికి ఆస్కారం ఉంది. అదే జరిగితే నష్టం భారీగానే ఉంటుంది. ఈ సమస్యను పరిష్కరించాల్సి ఉంది. ఆకాశంలో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడకుండా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తరహాలో ఎగిరే కార్ల రాకపోకల కోసం శాస్త్రీయమైన మార్గసూచిని రూపొందించాలి. ధనవంతులకే సాధ్యమా? ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే ఎగరే కార్ల ధరలను సంపన్నులే భరించగలరు. కోట్లాది రూపాయలు వెచ్చించి ఇలాంటివి కొనేసే స్తోమత కొందరికే ఉంటుంది. నిర్వహణ ఖర్చులు, లైసెన్స్ ఫీజులు కూడా తక్కువేమీ కాదు. విమాన ప్రయాణం ప్రారంభమైన తొలి రోజుల్లో ధనవంతులకే పరిమితం అన్నట్లుగా ఉండేది. కానీ, ఇప్పుడు దిగువ మధ్యతరగతి ప్రజలు కూడా విమానాల్లో ప్రయాణిస్తున్నారు. ఫ్లైయింగ్ కార్ల విషయంలోనూ అలాంటి పరిణామం సాధ్యపడొచ్చు. ప్రభుత్వాలే ప్రజా రవాణా వ్యవస్థలో భాగంగా ఈ కార్లను ప్రవేశపెడితే సామాన్య ప్రజలు సైతం ఆకాశయానం చేయొచ్చు. నడపడానికి లైసెన్స్ ఎవరిస్తారు? కార్లు నడపాలన్నా, విమానాలు నడపాలన్నా కచ్చితంగా లైసెన్స్ ఉండాల్సిందే. ఫ్లైయింగ్ కార్లు నడపడానికి కూడా లైసెన్స్ అవసరం. డ్రైవింగ్ శిక్షణ ఎవరిస్తారు? లైసెన్స్‌లు ఎవరు జారీ చేస్తారన్న దానిపై స్పష్టత లేదు. ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీనిపై ప్రభుత్వాలదే తుది నిర్ణయం. నేలపై, గాలిలో నడపడానికి డ్రైవర్లు శిక్షణ తీసుకోవాలి. ఫ్లైయింగ్ కార్ల డ్రైవింగ్ లైసెన్స్‌లు జారీ చేయడానికి రవాణా , పౌర విమానయాన శాఖ సమన్వయంతో పని చేయాల్సి రావొచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గో ఫస్ట్ విక్రయానికి కసరత్తు
న్యూఢిల్లీ: స్వచ్ఛందంగా దివాలా ప్రకటించిన విమానయాన సంస్థ గో ఫస్ట్‌ను విక్రయించే అవకాశాలపై కసరత్తు జరుగుతోంది. ఇందుకు సంబంధించి ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలను (ఈవోఐ) ఆహ్వానిస్తూ రిజల్యూషన్ ప్రొఫెషనల్ (ఆర్పీ) శైలేంద్ర అజ్మీరా ప్రకటన జారీ చేశారు. ఈవోఐల దాఖలుకు ఆగస్టు 9 ఆఖరు తేది. అర్హత కలిగిన సంస్థల పేర్లను ఆగస్టు 19న ప్రకటిస్తారు. ప్రొవిజనల్ లిస్టుపై అభ్యంతరాలను తెలియజేసేందుకు ఆగస్టు 24 ఆఖరు తేది. ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ల సరఫరా సమస్య కారణంగా భారీగా ఆదాయ నష్టం వాటిల్లుతోందంటూ గో ఫస్ట్ సంస్థ మే 3 నుంచి ఫ్లయట్ సర్వీసులు నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఆర్థిక సంస్థలకు, ఇతరత్రా రుణదాతలకు కంపెనీ రూ. 11,463 కోట్లు చెల్లించాల్సి ఉంది. నోటీసు ప్రకారం 2022 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఆదాయం రూ. 4,183 కోట్లుగా నమోదు కాగా, 4,200 మంది ఉద్యోగులు ఉన్నారు. రుణదాతల కమిటీ ఆమోదించిన పునరుద్ధరణ ప్రణాళికను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు గో ఫస్ట్ గత నెలలో సమర్పించింది. డీజీసీఏ జూలై 4–6 మధ్య ప్రత్యేక సేఫ్టీ ఆడిట్ నిర్వహించింది. ఈ వారంలో నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. -
ముచ్చటగా మూడోసారి.. ప్రభుత్వ రంగ సంస్థ అమ్మకానికి బ్రేకులు!
న్యూఢిల్లీ: హెలికాప్టర్ సర్వీసుల పీఎస్‌యూ పవన్ హన్స్ లో వ్యూహాత్మక వాటా విక్రయానికి బ్రేక్ పడింది. బిడ్డింగ్‌లో విజయవంతమైన కన్సార్షియంలోని ఒక కంపెనీపై న్యాయపరమైన వివాదాలరీత్యా అనర్హతవేటు పడటం దీనికి కారణమని దీపమ్ పేర్కొంది. వెరసి పవన్ హంస్ ప్రయివేటైజేషన్ ప్రయత్నాలకు మూడోసారి చెక్ పడింది. బిడ్‌ను గెలుపొందిన స్టార్9 మొబిలిటీ ప్రయివేట్ లిమిటెడ్ కన్సార్షియంలోని అల్మాస్ గ్లోబల్ అపార్చునిటీ ఫండ్ ఎస్‌పీసీపై పెండింగ్ కేసుల నేపథ్యంలో ప్రభుత్వం పవన్ హంస్ డిజిన్వెస్ట్‌మెంట్ నిర్ణయాన్ని రద్దు చేసినట్లు దీపమ్ తెలియజేసింది. భాగస్వామ్య కంపెనీ పవన్ హంస్‌లో ప్రభుత్వానికి 51 శాతం, ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం ఓఎన్జీసీకి 49 శాతం చొప్పున వాటా ఉంది. 2018లో షురూ: తొలుత పవన్ హన్స్ లో గల 51 శాతం వాటా విక్రయానికి ప్రభుత్వం 2018లో బిడ్స్‌కు ఆహ్వానం పలికింది. అయితే ఓఎన్జీసీ సైతం 49 శాతం వాటాను విక్రయించేందుకు సిద్ధపడటంతో నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. 2019లో తిరిగి కంపెనీలో 100 శాతం వాటా విక్రయానికి బిడ్స్‌ను ఆహ్వానించినప్పటికీ స్పందన లభించకపోవడం గమనార్హం! ప్రభుత్వం 2020 డిసెంబర్లో మూడోసారి పవన్ హన్స్ విక్రయానికి తెరతీసింది. కంపెనీ కొనుగోలుకి ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) బిడ్స్‌ను ఆహ్వానించింది. 2022 ఏప్రిల్‌లో స్టార్9 మొబిలిటీ కన్సార్షియం గరిష్ట బిడ్డర్‌గా నిలిచింది. కన్సార్షియంలో అల్మాస్ గ్లోబల్ అపార్చునిటీసహా.. బిగ్ చార్టర్ ప్రయివేట్ లిమిటెడ్, మహరాజ ఏవియేషన్ ప్రయివేట్ లిమిటెడ్ సైతం భాగస్వాములుగా ఉన్న సంగతి తెలిసిందే. -
భారీగా పెరిగిన ఆకాశ ఎయిర్ వేతనాలు.. కెప్టెన్ నెల శాలరీ ఎంతంటే?
స్టాక్ మార్కెట్ మాంత్రికుడు, దివంగత రాకేష్ ఝున్‌ఝున్‌వాలా స్థాపించిన ఆకాశ ఎయిర్..సంస్థలో పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు భారీగా పెరిగాయి. మిగిలిన విమానయాన సంస్థలు ఎయిరిండియా, ఇండిగోలు పోటీ పడుతూ వందల సంఖ్యలో కొత్త విమానాల కొనుగోలుకు ఆర్డర్ పెడుతున్నాయి. ఈ క్రమంలో ఆకాశా ఎయిర్ ఉద్యోగులకు జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఆకాశా ఎయిర్‌లో పెంచిన 40 శాతం శాలరీలు జులై నుంచి అమల్లోకి రానున్నాయి. సీనియర్ ఫస్ట్ ఆఫీసర్ (ఫ్లైట్ నడిపేవారు) ఉద్యోగుల జీతం నెలకు రూ.2.75లక్షల నుంచి రూ.3.40 లక్షలకు, సీనియర్ కెప్టెన్స్ల వేతనం రూ.5.75లక్షల నుంచి రూ.6.25లక్షలకు చేరింది. ఇక, పైలెట్ల జీతాలు అనుభవంతో పాటు ఎన్ని గంటల పాటు పైలెట్ విధులు నిర్వహించారనే ఆధారంగా శాలరీలు చెల్లిస్తున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. కెప్టెన్లు నెలకు 60 గంటల ప్రయాణానికి గతంలో రూ.7.28లక్షలు ఉండగా.. తాజాగా నిర్ణయంతో రూ.7.75లక్షలు చేరింది. ప్రస్తుతం, ఉన్న పిక్స్డ్ పే అవర్స్‌ను 40 గంటల నుంచి 45 గంటలకు పెంచింది. వేతనాల సవరింపుతో ప్రతి అదనపు గంటకు కెప్టెన్ రూ. 7,500, ఫస్ట్ ఆఫీసర్ రూ. 3,045 పొందనున్నారు. అంచనా ప్రకారం.. ఆకాశ ఎయిర్ 19 విమానాల్లో మాత్రమే కార్యకలాపాలు నిర్వహిస్తుంది. అయితే, పనిగంటల తక్కువగా ఉండడంతో ఆ ప్రభావం ఉద్యోగుల నెలవారీ జీతాలపై పడుతుంది. దీంతో పైలట్లు ఆశించిన సమయాల్లో విమానాలను నడిపించలేకపోతున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఆ నివేదికల్ని ఊటంకిస్తూ ఆకాశయిర్ వేతనాల్ని 40 శాతంతో జీతాలు భారీగా పెంచింది. చదవండి👉 మోదీ ‘హై - టెక్ హ్యాండ్ షేక్’.. భారత్‌కు పెట్టుబడుల వరద! -
ప్రపంచంలోని టాప్ 10 మిలటరీ ఎయిర్ ఫోర్స్స్స్
-
వింగ్స్ ఇండియా 2024కు శ్రీకారం
వింగ్స్ ఇండియా 2024 కర్టెన్ రైజింగ్ వేడుక సందర్భంగా న్యూఢిల్లీలో గురువారం జరిగిన ఒక ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య ఎం సింధియా నుంచి జ్ఞాపికను స్వీకరిస్తున్న ఫిక్కీ సివిల్ ఏవియేషన్ కమిటీ చైర్మన్, ప్రెసిడెంట్ ఎయిర్‌బస్ ఎండీ (భారత్ అలాగే దక్షిణాసియా) రెమి మెయిలార్డ్. వచ్చే ఏడాది జనవరి 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకూ హైదరాబాద్, బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఉత్సవాలు జరగనున్నాయి. పౌర విమానయాన శాఖ, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సహకారంతో వింగ్స్ ఇండియా 2024 ఆసియాలో అతిపెద్ద పౌర విమానయాన కార్యక్రమంగా నిలవనుంది. ‘‘వరల్డ్ కనెక్ట్ ఇండియా’’ ప్రధాన థీమ్‌తో ఈ కార్యక్రమ నిర్వహణ జరుగుతోంది. సమస్యలను విమానయాన సంస్థలు సొంతంగా పరిష్కరించుకోవాలి కార్యక్రమం సందర్భంగా పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య ఎం సింధియా మాట్లాడుతూ, గోఫస్ట్ దివాలా అంశం పరిశ్రమకు విచారకరమైన అంశమేనని అన్నారు. అయితే అయితే విమానయాన సంస్థలు తమ సమస్యలను స్వయంగా పరిష్కరించుకోవాలని సూచించారు. వీలైనంత త్వరగా సంస్థ తమ విమాన సేవలను తిరిగి ప్రారంభించాలనే ప్రభుత్వ కోరుకుంటోందన్నారు. అయితే తొలుత గోఫస్ట్ తన కార్యాచరణకు సంబంధించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు తప్పనిసరిగా తమ వినతిపత్రాన్ని సమర్పించాలని సూచించారు. -
స్పైస్‌జెట్‌కు ఎన్సీఎల్టీ నోటీసులు
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌పై దివాలా పరిష్కార ప్రక్రియ కింద చర్యలు తీసుకోవాలంటూ కంపెనీకి ఎయిర్‌క్రాఫ్టులను లీజుకి ఇచ్చిన ఎయిర్‌క్యాజిల్ (ఐర్లాండ్) పిటీషన్‌పై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) విచారణ జరిపింది. స్పైస్‌జెట్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మే 17కు వాయిదా వేసింది. నోటీసుల జారీ ప్రక్రియ సాధారణమేనని, ఎన్సీఎల్టీ తమకు ప్రతికూలంగా ఉత్తర్వులేమీ ఇవ్వలేదని స్పైస్‌జెట్ అధికార ప్రతినిధి తెలిపారు. సెటిల్మెంట్ కోసం ఇరు పక్షాలు చర్చలు జరుపుతున్న విషయాన్ని న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుందని పేర్కొన్నారు. ఇకపైనా చర్చలను కొనసాగించవచ్చని వివరించారు. స్పైస్‌జెట్‌పై ఎయిర్‌క్యాజిల్ ఏప్రిల్ 28న పిటిషన్ దాఖలు చేసింది. అయితే, తమ దగ్గర ఎయిర్‌క్యాజిల్ విమానాలేమీ లేవని, ఈ పిటిషన్‌తో తమ కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావమూ ఉండబోదని స్పైస్‌జెట్ గత వారం తెలిపింది. ఎన్సీఎల్టీ వెబ్సైట్ ప్రకారం స్పైస్‌జెట్‌పై ఇప్పటికే రెండు దివాలా పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. -
కీలక పరిణామం.. జెట్ ఎయిర్వేస్ సీఈవో పదవికి సంజీవ్ కపూర్ రాజీనామా!
దేశీయ ఏవియేషన్ రంగంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత ఏడాది జెట్ ఎయిర్వేస్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన సంజీవ్ కపూర్ తన పదవికి రాజీనామా చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆయన సీఈవోగా ఏప్రిల్ 30 వరకు కొనసాగనున్నారు. ఇక సంజీవ్ కపూర్ సీఈవో పదవికి ఎందుకు రాజీనామా చేశారన్న విషయంపై కారణాలు తెలియరావాల్సి ఉంది. రిజిగ్నేషన్పై అటు సంజవ్ కపూర్ గాని, ఇటు జలాన్- కర్లాక్ కన్సార్షియం గాని స్పందించలేదు. అప్పటి వరకు సంజీవ్ కపూర్ సీఈవోగా ఆర్థికంగా కుదేలైన జెట్ ఎయిర్వేస్ 2019లో నిలిచిపోయింది. దీంతో ఈ వ్యవహారం నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌కు వెళ్లగా.. జలాన్- కర్లాక్ కన్సార్షియం బిడ్డింగ్‌లో జెట్ ఎయిర్వేస్ను దక్కించుకుంది. అయితే, తాజాగా జెట్ ఎయిర్వేస్ సేవల్ని పునఃప్రారంభించే విషయంలో కన్సార్షియానికి, రుణదాతలకు మధ్య విభేదాలు నెలకొన్నట్లు సమాచారం. ఈ తరుణంలో సంజీవ్ కపూర్ రాజీనామా చేయడం దేశీయ ఏవియేషన్ రంగంలో కీలక పరిమాలు చోటు చేసుకోవడం చర్చాంశనీయంగా మారింది. సంజీవ్ కపూర్ రాజీనామాతో విమానయాన రంగంలో సంజీవ్ కపూర్‌కు దాదాపు 20 ఏళ్ల అనుభవం ఉంది. ఆసియా, ఐరోపా, అమెరికాలోని పలు కంపెనీల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం ఒబెరాయ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్‌కు అధ్యక్షుడిగా ఉన్నారు. స్పైస్‌జెట్, గోఎయిర్, విస్తారాలో వివిధ హోదాల్లో సంజీవ్ కపూర్ పనిచేశారు. చదవండి👉 ‘నేను మీ పని మనిషిని కాను సార్’.. ఇండిగో ఎయిర్ హోస్టెస్‌కు జెట్ ఎయిర్వేస్ సీఈవో సపోర్ట్ -
విమానంలో స్మోకింగ్.. పట్టుబడ్డాక యాక్టింగ్‌తో పిచ్చెక్కించిన ప్రయాణికుడు?
విమానంలో అభ్యంతరకరంగా ప్రవర్తించడం, ఇతర ప్రయాణికులపై మూత్రవిసర్జన చేయడం, అడ్డుకున్న సిబ్బందిపై దాడికి పాల్పడుతున్న ఘటనలు ఇటీవల తరచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అమెరికాలో నివసించే రమాకాంత్ అనే ప్రయాణికుడు ఎయిరిండియా విమానంలో వీరంగం సృష్టించాడు. ఎయిరిండియాకు చెందిన ఓ విమానం లండన్ నుంచి ముంబైకి బయల్దేరింది. విమానం గాల్లో ఉండగా రమాకాంత్ బాత్రూంలో స్మోక్ చేశాడు. వద్దని వారించినా క్రూ సిబ్బంది, ఇతర ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ముంబై పోలీసులు తెలిపారు. ముంబై పోలీసులు తెలిపిన వివరాల మేరకు..విమానంలో స్మోకింగ్ చేయడం చట్టరిత్యా నేరం. అయినా నిబంధనల్ని ఉల్లంఘించిన రమాకాంత్.. ఎయిరిండియా విమానం టాయిలెట్లో ధూమపానం చేశాడు. అలారం మోగడంతో అప్రమత్తమైన సిబ్బంది సదరు ప్రయాణికుడి చేతిలో సిగరెట్ ఉండటాన్ని గమనించారు. విమానంలో స్మాకింగ్ చేయకూడదని వారించడంతో చేతిలో ఉన్న సిగరెట్‌ను పక్కకు విసిరేశాడు. విమానంలో జిమ్మిక్కులు అనంతరం క్రూ సిబ్బందిపై గట్టిగా కేకలు వేస్తూ నానా హంగామా చేశాడు. అతన్ని నచ్చజెప్పిన సిబ్బంది తన సీట్లో కూర్చోబెట్టారు. కొద్ది సేపటికి విమానం గాల్లో ఉండగా అత్యవసర ద్వారాన్ని (emergency door) తెరిచేందుకు యత్నించాడు. దీంతో ప్రయాణికులు ప్రాణ భయంతో కేకలు వేయడంతో.. జిమ్మిక్కులతో వింతగా ప్రవర్తించాడు. మళ్లీ అరవడం మొదలు పెట్టాడు. తలను అటూ ఇటూ ఊపుతూ విమాన సిబ్బందిని, ప్రయాణికుల్ని భయాందోళనకు గురి చేశారు. ప్రయాణికుల్లో ఉన్న ఓ డాక్టర్ అతని ఆరోగ్యంపై ఆరా తీశాడు. అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా’ అని పరీక్షించాడు. అతని వద్ద ఎలాంటి మెడిసిన్ లభ్యం కాలేదు. ఈ - సిగరెట్ మాత్రమే ఉన్నట్లు ఎయిరిండియా క్రూ సిబ్బంది సహార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు ఎయిరిండియా సిబ్బంది ఫిర్యాదుతో 37ఏళ్ల రమాకాంత్‌పై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 336 (ఇతరుల వ్యక్తిగత భద్రతకు హాని కలిగించేలా నిర్లక్ష్యంగా ప్రవర్తించడం), ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ 1937,22 (పైలట్-ఇన్-కమాండ్ ఇచ్చిన చట్టబద్ధమైన సూచనలను నిరాకరిండం), 23 (దాడి, ఇతరుల భద్రతకు హాని,విధులకు భంగం కలిగించడం), 25 (ధూమపానం చేయడం) సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అనారోగ్య సమస్యలపై ఆరా నిందితుడు భారతీయ సంతతికి చెందినవాడని, అయితే అమెరికా పౌరుడని గుర్తించేలా అమెరికా పాస్ పోర్ట్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడా? లేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? అని నిర్ధారించేందుకు వైద్య పరీక్షల కోసం నిందితుడి బ్లడ్ శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపినట్లు పోలీసులు వెల్లడించారు. -
ఒకేసారి అన్ని విమానాలు కొంటుందా? ఇండిగో భారీ డీల్..
దేశీయ దిగ్గజ ఏవియేషన్ సంస్థలు భారీ ఎత్తున విమానాల కొనుగోళ్లకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఎయిరిండియా కోసం టాటా సన్స్ 500 విమానాల్ని కొనుగోలుకు ఒప్పందాలు కుదుర్చుకుంది. తాజాగా ఇండిగో సైతం బోయింగ్, ఎయిర్ బస్ సంస్థల 500 అంతకంటే ఎక్కువ విమానాల కోసం ఆర్డర్ ఇవ్వనున్నట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది. ప్రస్తుతం విమానాల కొనుగోళ్ల నేపథ్యంలో విమానాల తయారీ సంస్థలతో ఇండిగో చర్చలు జరుపుతుందని, ఆ చర్చలు సఫలమైతే ఎయిరిండియా తర్వాత మరో అతిపెద్ద ఒప్పొందం అవుతుందని రాయిటర్స్ తెలిపింది. బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో గత నెలలో న్యారో బాడీ ప్లైట్ల కోసం ఎయిర్ బస్, ఫ్రెంచ్ ప్రభుత్వాల మధ్య చర్చలు జరిగాయని, ఆ చర్చలు కొలిక్కి రావడంతో వందల విమానాల కొనుగోలుకు సిద్ధపడినట్లు రాయిటర్స్ రిపోర్ట్ హైలెట్ చేసింది. ఇక మరో పదేళ్లలో ఇండిగో సంస్థ మిడ్ సైజ్ వైడ్ బాడీ జెట్స్ విమానాల సంఖ్యను పెంచే ప్రణాళికల్లో ఉండగా అందుకు అనుగుణంగా విమానాల ఆర్డర్ ఉండనుంది ఇప్పటికే ఎయిరిండియా ఎయిరిండియా బ్రాండ్‌కు కొత్త గుర్తింపును తీసుకొచ్చేందుకు మాతృ సంస్థ టాటా సన్స్ ప్రణాళికలు రచిస్తుంది. ఇందులో భాగంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల్ని అందుకునేలా 100 బిలియన్ డాలర్లతో 500 విమానాల్ని కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఒప్పందంలో భాగంగా విమాన తయారీ సంస్థలు ఈ 500 ఎయిర్ క్రాప్ట్‌లను 8 ఏళ్లలో డెలివరీ చేయనున్నట్లు రాయిటర్స్ కథనం వెలువరించింది. -
వేల కోట్లకు అధిపతి.. విమానంలో దిక్కులేని చావు..
కొంతమంది గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా ఏదో మిగిలే ఉంటుంది. చాలా మంది ఒకటి రెండు విషయాల్లో రాణిస్తేనే కాలరెగరేస్తారు. చాలా తక్కువ మంది మాత్రం ఇంకా ఏదో సాధించాలని తపిస్తారు ఎంత సాధించినా ఇంకా దాహంతోనే ఉంటారు. ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకోగలిగిన స్థాయికి ఎదిగి.. దిక్కుమాలిన శవంగా మిగిలి.. మరణానంతరం కోట్లాది డాలర్ల సామాజిక సేవలో చిరంజీవిగా ఉన్న ఓ సంపన్నుడి కథే ఇవ్వాల్టి సీక్రెట్. 1976 ఏప్రిల్ 5 మెక్సికో నుంచి హోస్టన్ వచ్చిన ఓ ప్రయివేట్ ఎయిర్ క్రాఫ్ట్ లో ఓ గుర్తు తెలీని వ్యక్తి మరణించి ఉన్నాడు. ఏళ్ల తరబడి తైల సంస్కారం లేకుండా పొడుగ్గా పెరిగిన జుట్టు.... అంతే కాలంగా పెరుగుతూ వచ్చిన చేతి.. కాలి గోళ్లు... నెలల తరబడి ఏమీ తినలేదేమో అన్నట్లు చిక్కి శల్యమైన శరీరం. ఆరడుగుల రెండంగుళాల పొడగరి అయినా శరీరంలో మాంసమే లేనట్లు 41కిలోలు మాత్రమే తూగిన మృతదేహం. ఎవరూ బాడీని గుర్తించే పరిస్థితే లేదు. ఎఫ్.బి.ఐ. రంగంలోకి దిగింది. అటాప్సీ చేసిన వైద్యులు కిడ్నీ ఫెయిల్యూర్ కావడం వల్లనే చనిపోయాడని తేల్చారు. మాల్ న్యూట్రిషన్ వల్ల దేహమంతా డొల్లయ్యిందని విశ్లేషించారు. అంత తినడానికి కూడా గతి లేని ఈ మనిషి విమానంలో ఎలా వచ్చాడు? ఈ అనుమానమే ఎఫ్. బి. ఐ. ని మరింత లోతుగా దర్యాప్తుచేసేలా చేసింది. ఇతని ఫింగర్ ప్రింట్స్ సేకరించి ఇన్వెస్టిగేషన్ మొదలెట్టింది. అతనెవరో తెలిశాక అందరూ కళ్లు తేలేశారు. సరైన ఆహారం లేక బక్కచిక్కిన ఈ మనిషి అల్లా టప్పా మనిషి కానే కాదు. మొత్తం ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడితను. ఇతనే ద గ్రేట్ హోవర్డ్ రాబర్డ్ హ్యూగ్స్. ఇతని దగ్గరున్న సంపదతో ప్రపంచంలోని కొన్ని దేశాలను కొనేయగలడు. ఇతను కనుసైగ చేస్తే చాలు ఏం కావాలంటే అది వచ్చి ఒళ్లో వాలుతుంది. ఇంతటి రిచెస్ట్ పెర్సన్ కి ఇంత దిక్కులేని చావేంటి? అదే మానవ జీవితంలోని ఐరనీ. అగ్రరాజ్యం అమెరికానే శాసించగల హ్యూగ్స్ మృత దేహాన్ని గ్లెన్ వుడ్ స్మశాన వాటికలో ఖననం చేశారు. మల్టీ బిలియనీర్ అయిన హ్యూగ్స్ ఇక్కడ శాస్వతంగా నిద్రపోతున్నాడు. ఇంతకీ హ్యూగ్స్ ఏం చేసేవాడో అంత గొప్పవాడిగా ఎదిగే క్రమంలో ఎంత కఠోర శ్రమ చేశాడో అతని జీవితంలో ఎన్ని మజిలీలున్నాయో తెలుసుకోవాలంటే అతని ఆటోబయోగ్రఫీని ఓ సారి తెరవాలి. హోవర్డ్ రాబర్డ్ హ్యూగ్స్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది అమెరికన్ ఏవియేటర్. విమానంలో అత్యంత వేగంగా ప్రపంచాన్ని చుట్టి వచ్చిన వీరుడిగా హ్యూగ్స్ రికార్డ్ సృష్టించాడు. కేవలం నాలుగు రోజుల వ్యవథిలోనే లోకాన్ని చుట్టి పారేశాడు. ఆ తర్వాత తన రికార్డును తానే తిరగరాశాడు. ఈ సారి మూడు రోజుల్లోనే ప్రపంచాన్ని చుట్టి వచ్చాడు. హ్యూగ్స్ అంటే ఇంతేనా అనకండి. ఇంకా చాలా ఉంది. హ్యూగ్స్ మంచి ఏవియేటరే కాదు.....ప్రపంచంలోనే అత్యంత పెద్ద విమాన తయారీ కంపెనీకి ఓనర్ కూడా. ఔను .. అమెరికాలో హ్యూగ్స్ ఎయిర్ లైన్స్ నంబర్ వన్ ప్రయివేట్ కంపెనీ. ఎయిర్ క్రాఫ్ట్ లంటే హ్యూగ్స్ కి ఆరో ప్రాణం. ఆ మాటకొస్తే అసలదే మొదటి ప్రాణం కూడా. ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీరే కాదు ఎఫిషియంట్ పైలట్ గానూ హ్యూగ్స్ కు పేరుంది. కొన్ని ఎయిర్ క్రాఫ్ట్ లను అతనే స్వయంగా డిజైన్ చేశాడు. తండ్రి ఇచ్చిన హ్యూగ్స్ టూల్ కంపెనీ ని శాఖోప శాఖలుగా విస్తరించాడు హ్యూగ్స్ జూనియర్. ముందుగా ఎయిర్ క్రాఫ్ట్ కంపెనీని ఫ్లోట్ చేశాడు. 1932 లో కాలిఫోర్నియాలో ఓ రెంటల్ కార్నర్ లో దీన్ని స్టార్ట్ చేశాడు. కొంత మంది ఆలోచనలు కూడా భారీగానే ఉంటాయి. అందరూ నేలపై చూపులు పెడితే వీళ్లు మాత్రం ఆకాశంలో చుక్కలపైనే దృష్టి సారిస్తారు. 27 ఏళ్ల వయసులో ఓ ఎయిర్ క్రాఫ్ట్ కంపెనీకి ఓనరయ్యాడు. ఏడేళ్లలోనే ఈ సంస్థ నంబర్ వన్ గా అవతరించింది. గంటకు 352కిమీ రికార్డు.. 1939 లో ట్రాన్స్ ఇంటర్నేషనల్ వెస్ట్ ఎయిర్ లైన్స్ -T.W.I. లో మేజర్ షేర్ ను హ్యూగ్స్ కొనుగోలు చేశాడు. అతని దృష్టిలో విమానాల తయారీ..ఎయిర్ లైన్స్ యాక్టివిటీస్ కేవలం వ్యాపారాలు కావు. ఈ రెండూ హ్యూగ్స్ కి ప్రొఫెషనల్ పేషన్సే. T.W.I. పై పూర్తి కంట్రోల్ రావడంతోనే హ్యూగ్స్ వైమానిక రంగానికి రారాజైపోయాడు. అతన్నిలాగే వదిలేస్తే ఇక తమ వ్యాపారాలు మూసుకోవలసిందేనని పాన్ అమెరికన్ ఎయిర్ లైన్స్ సంస్థ ఓనర్ ట్రిప్ కు భయం పట్టుకుంది. అతని భయానికి తగ్గట్టే హ్యూగ్స్ ఎయిర్ లైన్స్ లో దూసుకుపోతున్నాడు. స్వతహాగా పైలట్ కూడా అయిన హ్యూగ్స్ H1 రేసర్ టెస్ట్ రన్ లోనే గంటకు 352 కిలోమీటర్ల వేగంతో నడిపి రికార్డు సృష్టించాడు. రాజకీయంగా పాన్ అమెరికన్ ఎయిర్ లైన్స్ వేధింపులు- ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ ఘటనలతో హ్యూగ్స్ మానసికంగా బాగా దెబ్బతిన్నాడు. మానసిక పరిస్థితి దెబ్బతింది. అబ్సెసివ్ కంపల్సరీ డిజార్డర్ అనే మానసిక రుగ్మత మొదలైంది. ఒక్కోసారి ఏం చేస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలిసేది కాదు. ఒకే మాటను అదే పనిగా రిపీట్ చేసేవాడు. ఓ దశలో కొంతకాలం పాటు ఓ గదిలో తలుపులు వేసుకుని ఉండిపోయేవాడు. తాను తీసిన సినిమాలతో పాటు తనకు నచ్చిన సినిమాలను చూస్తూ గడిపేవాడు. ఓ కుర్చీలో నగ్నంగా కూర్చుని పిచ్చిపిచ్చిగా సినిమాలు చూసేవాడు. సన్నిహితుల సమాచారం ప్రకారం ఒక్కోసారి రోజుల తరబడి స్నానం చేసేవాడు కాదు. చాకొలెట్ బార్స్- పాలే ఆహారం. అవిలేకపోతే ఏమీ తినకుండా అలాగే ఉండిపోయేవాడు. కాలిగోళ్లు చేతి గోళ్లు బాగా పెరిగిపోయినా పట్టించుకునేవాడు కాదు. జుట్టు పెరిగిపోయి తైల సంస్కారం లేకుండా రోజుల తరబడి అలాగే ఉండిపోయేవాడు. చూడ్డానికి భయంకరంగా కనిపించేవాడు. హోటల్ బిల్లు రూ.కోట్లు.. అప్పటికే ప్రపంచంలో అత్యంత సంపన్నుల్లో ఒకడిగానే ఉన్నాడు. చివరి దశలో మెక్సికోలో ఓ హోటల్లో కాలక్షేపం చేశాడు. ఆ హోటల్ బిల్లే కొన్ని కోట్లు పే చేశాడు. సరిగ్గా తినక పోవడం వల్ల ఒళ్లంతా గుల్లయింది. 42 కిలోల బరువుకు పడిపోయాడు. కిడ్నీలు ఇక పనిచేయలేమని మొరాయించాయి. ఈ టైమ్ లోనే తాను పుట్టిన హోస్టన్ నగరానికి ఓ స్నేహితుని విమానంలో బయలుదేరాడు. చివరికి అందులోనే చివరి శ్వాస విడిచాడు. ఏ విమానాలనైతే జీవితాంతం ప్రేమించాడో ఏ విమానాల తయారీ కోసం తన మేథస్సునూ డబ్బునూ ఖర్చు చేశాడో ఆ విమానంలోనే అంతిమయాత్ర చేశాడు. హ్యూగ్స్ మరణానంతరం అతని విల్లు ప్రకారం ఆస్తిలో 75శాతం మొత్తాన్ని ఈ ఇన్ స్టిట్యూట్ కే అప్పగించారు. ఇప్పటికీ ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద మెడికల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ గా ఇది చెలామణీ అవుతోంది. ఈ ఇన్ స్టిట్యూట్ ద్వారా ఇప్పటికీ జన హృదయాల్లో బతికే ఉన్నాడు హ్యూగ్స్. అమెరికాలో హ్యూగ్స్ ను ఇప్పటికీ ఒక ఐకాన్ గానే కొలుస్తారు. మనసున్న మారాజని జనం నీరాజనాలు పడతారు. చచ్చీ కూడా బతికుండడమంటే ఇదే. అందుకే హ్యూగ్స్ ఎప్పటికీ చిరంజీవే. -
ప్లీజ్ సార్..ప్లీజ్ అంటూ ప్రాధేయపడ్డ ఎయిర్ హోస్ట్.. పిడిగుద్దులు గుద్దుతూ..
బ్యాంకాక్ నుంచి కోల్‌కతాకు వస్తున్న విమానంలో ఘటన ముయే థాయ్ (థాయ్ బాక్సింగ్) గేమ్‌ను తలపించింది. ఇద్దరు ప్రయాణికుల మధ్య జరిగిన సీటు గొడవ తారా స్థాయికి చేరింది. ఓ ప్రయాణికుడిపై మరో ఐదుగురు ప్రయాణికులు దాడికి పాల్పడ్డారు. గొడవను సద్దుమణిగించేందుకు ఎయిర్ హోస్టెస్ చేసిన ప్రయత్నాలు విఫలయ్యాయి. క్యాబిన్ క్రూ ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా నువ్వెంత అంటే నువ్వెంత అంటూ పిడిగుద్దులు గుద్దుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఆ వివాదంపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు. వివాదానికి కారణమైన ప్రయాణికులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. థాయ్ స్మైలీ ఎయిర్వేస్కు చెందిన విమానం డిసెంబర్ 26న థాయ్‌ల్యాండ్ నుంచి కోల్‌కతాకు వస్తుంది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికి క్రూ సిబ్బంది ప్రయాణికులకు జాగ్రత్తలు చెబుతున్నారు. అదే సమయంలో ఓ ఎయిర్ హోస్ట్ బ్రౌన్ కలర్ (గోధుమ రంగు) షర్ట్ ధరించిన ప్రయాణికుడు తాను కూర్చున్న సీటును నిటారుగా జరపాలని కోరింది. Not many smiles on this @ThaiSmileAirway flight at all ! On a serious note, an aircraft is possibly the worst place ever to get into an altercation with someone. Hope these nincompoops were arrested on arrival and dealt with by the authorities.#AvGeek pic.twitter.com/XCglmjtc9l — VT-VLO (@Vinamralongani) December 28, 2022 అంతే బ్రౌన్ కలర్ షర్ట్ ధరించిన వ్యక్తి రెచ్చిపోయి తన పక్కనే గ్రే కలర్ (బూడిద రంగు) చొక్కా ధరించిన వ్యక్తిపై దాడికి దిగాడు. వివాదానికి కారణమైన ప్రయాణికుడు తన కళ్లజోడు తీసి నల్ల చొక్కా ధరించిన బాధితుడి చెంపలు వాయిస్తూ, ఆపకుండా పిడిగుద్దులు గుద్దాడు. దాడికి పాల్పడే వ్యక్తికి మద్దతుగా అతని స్నేహితులు సైతం కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతలో ఈ గొడవను ఆపేందుకు ఎయిర్ హోస్టెస్ ప్లీజ్ సార్.. ప్లీజ్ సార్ అని ఒకటే ప్రాధేయ పడుతున్నా పట్టించుకో లేదు. నిందితుడు కోల్ కతాలో ఫ్లైట్ దిగే సమయంలో సైతం తన సీటు బెల్ట్ తీసి తోటి ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తించాడని.. అదే ఫ్లైట్‌లో జర్నీ చేస్తున్న అలోక్ కుమార్ అనే ప్రయాణికుడు తెలిపారు.కాగా, విమానంలో జరిగిన ప్రమాదంపై కేంద్ర ఏవియేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరహా గొడవలు విమాన ప్రయాణంలో ఆమోదయోగ్యం కాదని ట్వీట్ చేశారు. ఈ ఘటనలో కారణమైన ప్రయాణికులకు కేసు నమోదు చేయాలని సంబంధిత శాఖ అధికారులుకు ఆదేశాలు జారీ చేసినట్లు ట్వీట్లో పేర్కొన్నారు. With regard to the scuffle between passengers on board a @ThaiSmileAirway flight, a police complaint has been filed against those involved. Such behaviour is unacceptable. — Jyotiraditya M. Scindia (@JM_Scindia) December 29, 2022 చదవండి👉 రతన్ టాటా మరో సంచలనం..500 విమానాల కోసం భారీ ఆర్డరు! -
స్పైస్ జెట్ ఏజీఎం 26న ఆర్థిక ఫలితాల వెల్లడి
న్యూఢిల్లీ: స్పైస్‌జెట్ ఈ నెల 26న సాధారణ వార్షిక సమావేశాన్ని(ఏజీఎం) నిర్వహించనున్నట్లు తాజాగా వెల్లడించింది. 2021–22 ఆడిటెడ్ ఆర్థిక ఫలితాలతోపాటు.. డైరెక్టర్‌గా అజయ్ సింగ్‌ను తిరిగి ఎంపిక చేయడంపై వాటాదారుల అనుమతిని కోరనున్నట్లు తెలియజేసింది. అజయ్ సింగ్ ప్రస్తుతం స్పైస్‌జెట్ చైర్మన్, ఎండీగా వ్యవహరిస్తున్నారు. సింగ్ 2004 నవంబర్ 4న డైరెక్టర్‌గా నియమితులయ్యారు. తదుపరి 2010 ఆగస్ట్ 27న రాజీనామా చేశారు. తిరిగి 2015 మే 21న ఎండీగా ఎంపికైనట్లు బ్యాంక్ పేర్కొంది. ఈ వార్తల నేపథ్యంలో షేరు బీఎస్ఈలో 1 శాతం బలపడి రూ. 39 వద్ద ముగిసింది. -
ఎలక్ట్రిక్ విమానాలూ వచ్చేస్తున్నాయ్!
బైక్‌లు.. కార్లు.. బస్సులే కాదు.. ఎలక్ట్రిక్ విమానాలూ వచ్చేస్తున్నాయి. విమానాల్లో వినియోగించే శిలాజ ఇంధన ధరలు రోజు రోజుకీ పెరుగుతుండటం.. ఇంధన వనరుల వినియోగం సైతం పెరుగుతుండటంతో ప్రత్యామ్నాయాలపై ప్రయోగాలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో ఇజ్రాయెల్‌కు చెందిన ఏవియేషన్ సంస్థ ‘అలైస్’ పేరిట ఎలక్ట్రిక్ ఎయిర్ క్రాఫ్ట్‌ను ఆవిష్కరించింది. ప్రపంచం చూపును తన వైపునకు తిప్పేసుకుంది. 2024 నాటికి గాలిలో చక్కర్లు కొట్టేందుకు ఎలక్ట్రిక్ విమానాలు సిద్ధమవుతుండగా.. జర్మనీకి చెందిన డీహెచ్ఎల్ ఎక్స్‌ప్రెస్ తన వాణిజ్య కార్యకలాపాల కోసం ఎలక్ట్రికల్ విమానాలు నడిపే దిశగా అడుగులు వేస్తోంది. అమెరికాకు చెందిన కొన్ని ఎయిర్‌లైన్స్ సంస్థలు అదే బాటలో పయనిస్తున్నాయి. (కె.జి.రాఘవేంద్రారెడ్డి, సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం): విమానాల్లో ఉపయోగించే సంప్రదాయ ఇంధనం స్థానంలో ప్రత్యామ్నాయ ఇంధనాలు వస్తాయా అనే ప్రశ్నకు ఓ సమాధానం దొరికింది. గతంలో కార్బన్ డయాక్సైడ్ నుంచి ఇంధన తయారీ ప్రయోగాలు విజయవంతమైనప్పటికీ సంప్రదాయ ఇంధనం ధరతో పోలిస్తే.. దీని భారం రెట్టింపు అ య్యింది. దీంతో ఆ ప్రయత్నాల్ని వివిధ సంస్థలు విరమించుకున్నాయి. బయో ఇంధనాలు వినియోగంపై ఆలోచనలు చేసినా.. అవన్నీ ప్రయోగాల దశ దాటలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్లో ఒక్కసారిగా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. దీంతో విమానాలను సైతం విద్యుత్‌తో నడిపించేవిధంగా ప్రయోగాలు చేసిన ఇజ్రాయెల్‌కు చెందిన ఏవియేషన్ ఎయిర్‌క్రాఫ్ట్ అనే సంస్థ సత్ఫలితాలు సాధించింది. ఆ సంస్థ ‘అలైస్’ పేరిట తయారు చేసిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్ గతేడాది పారిస్‌లో జరిగిన ఎయిర్‌షోలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది. మొట్టమొదటి కమర్షియల్ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్‌గా చరిత్ర సృష్టించింది. దీనిని పౌర విమానయాన సేవలకూ వినియోగించాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. 10 వేల అడుగుల ఎత్తులో చక్కర్లు ఇజ్రాయెల్ సంస్థ 200 మిలియన్ డాలర్ల పెట్టుబడితో 2018 నుంచి ఏడాది పాటు శ్రమించి దీనిని తయారు చేసింది. 2021లో ఈ విమానం గాలిలో చక్కర్లు కొట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అమెరికాలోని గ్రాంట్ కౌంటీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో దీనికి టెస్ట్ ఫ్లైట్ చేపట్టగా.. 3,500 అడుగుల ఎత్తులో 8 నిమిషాల పాటు గగన విహారం చేసింది. సాధారణ విమానం ముందుకు వెళ్లడానికి రెండు రెక్కలకు రెండు ప్రొపెల్లర్స్ ఉంటాయి. కానీ.. అలైస్‌లో మాత్రం మూడు ప్రొపెల్లర్స్ ఉంటాయి. ఒక ప్రొపెల్లర్ విమానం వెనక భాగంలో ఉంటే, మిగతా రెంటిండినీ చెరో రెక్కకు అమర్చారు. ప్రమాదం తర్వాత.. ప్రయోగాల సమయంలో అలైస్ నమూనాలో 2020 జనవరి 22న అగ్ని ప్రమాదం సంభవించింది. పాసింజర్ ఏరియాలో ఉండే అండర్ ఫ్లోర్ బ్యాటరీ కంపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయి. ప్రమాదం తర్వాత విమానం నిర్మాణంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. వింగ్స్, ఎలక్ట్రికల్ వైరింగ్ ఇంటర్ కనెక్షన్ సిస్టమ్ తయారీ కోసం జీకేఎన్ ఏరోస్పేస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడంతో అలైస్ తయారీ విజయవంతమైంది. సీమెన్స్, మాగ్నిక్స్ కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ మోటార్లను అలైస్ విమానాల కోసం వినియోగిస్తున్నారు. 60 నుంచి 80 శాతం ఖర్చు ఆదా... ప్రస్తుతం వినియోగిస్తున్న సంప్రదాయ ఇంధనంతో పోలిస్తే విద్యుత్ ఆధారిత విమానం వినియోగంలో ఖర్చు చాలా తక్కువ. ‘సెస్నా కార్వాన్’ అనే ఒక చిన్న విమానం 160 కిలోమీటర్లు ప్రయాణించేందుకు దాదాపు రూ.27 వేల ఇంధనం ఖర్చవుతోంది. కానీ.. అలైస్ ఎలక్ట్రిక్ విమానంలో 160 కిలోమీటర్ల ప్రయాణానికి కేవలం రూ.8 వేల వరకు మాత్రమే ఖర్చవుతోంది. అంటే దాదాపు 60 నుంచి 80 శాతం వరకూ ఖర్చును ఆదా చేసుకోవచ్చు. అందరి చూపూ.. అలైస్ వైపే విమానయాన రంగంలో విప్లవం సృష్టిస్తున్న అలైస్‌ను కొనుగోలు చేసేందుకు ప్రముఖ సంస్థలు పోటీ పడుతున్నాయి. జర్మనీకి చెందిన ప్రఖ్యాత కార్గో సంస్థ డీహెచ్ఎల్ తన సరకు రవాణా కోసం 12 విమానాల కోసం ఆర్డర్లు ఇచ్చింది. అదేవిధంగా అమెరికాకు చెందిన కేప్ ఎయిర్, గ్లోబర్ క్రాసింగ్ ఎయిర్‌లైన్స్ సంస్థలు సైతం పదుల సంఖ్యలో ఆర్డర్లు బుక్ చేశాయి. 2024 నాటికి పూర్తిస్థాయిలో అలైస్ ఎలక్ట్రిక్ ఎయిర్ క్రాఫ్ట్‌లు గాలిలో దూసుకుపోతాయని అంచనా వేస్తున్నారు. విమానయాన రంగంలో కర్బన ఉద్గారాల నియంత్రణకు ఎయిర్‌లైన్స్ సంస్థలు అలైస్‌ను ప్రత్యామ్నాయంగా భావిస్తున్నాయి. అయితే.. ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణానికి పెరుగుతున్న డిమాండ్‌ను అలైస్ అధిగమించగలదా లేదా అనే సందేహాలూ ఉత్పన్నమవుతున్నాయి. -
ఇంటర్‌గ్లోబ్ షేర్ల విక్రయం
న్యూఢిల్లీ: ఇండిగో ఎయిర్‌లైన్స్ సహప్రమోటర్ రాకేష్ గంగ్వాల్, ఆయన భార్య శోభా గంగ్వాల్ మాతృ సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌లో 2.74 శాతం వాటాను విక్రయించారు. ఎన్ఎస్ఈ బల్క్ డీల్ గణాంకాల ప్రకారం ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా 1.05 కోట్ల షేర్లను ఆఫ్‌లోడ్ చేశారు. వీటి విలువ దాదాపు రూ. 2,005 కోట్లుకాగా.. షేరుకి రూ. 1,886.47– రూ. 1,901.34 మధ్య షేర్లను విక్రయించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంటర్‌గ్లోబ్ బోర్డు నుంచి తప్పుకున్న గంగ్వాల్ ఐదేళ్లలో క్రమంగా ఈక్విటీ వాటాను తగ్గించుకోనున్నట్లు గతంలోనే ప్రకటించారు. చౌక ధరల విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్‌ను రాహుల్ భాటియాతో కలసి గంగ్వాల్ ఏర్పాటు చేశారు. 2022 జూన్ చివరికల్లా గంగ్వాల్, ఆయన కుటుంబీకులకు 36.61 శాతం వాటా ఉంది. చదవండి: Mahindra Xuv 400 Electric Suv: మహీంద్రా ఎలక్ట్రిక్ కారు.. సింగిల్ చార్జ్‌తో 400 కి.మీ ప్రయాణం! -
Women In Aviation: యూఎస్, యూకే కంటే మన దేశంలోనే అధికం!
ప్రపంచంలోని అగ్రదేశాలతో పోల్చితే మన దేశంలో మహిళా పైలట్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. సంఖ్యాపరంగానే కాదు... పనితీరు, ప్రతిభ విషయంలోనూ ఇతర దేశాలకు స్ఫూర్తి ఇస్తున్నారు... మూడు దశాబ్దాల వెనక్కి వెళితే... వైమానికరంగంలోకి నివేదిత భాసిన్ పైలట్‌గా అడుగు పెట్టినప్పుడు ఆమె ప్రయాణం అంత సజావుగా సాగలేదు. అడుగడుగునా అహంకారపూరిత అనుమానాలు ఎదురయ్యాయి. అయితే అవేమీ తన ప్రయాణానికి అడ్డుకాలేకపోయాయి. ‘మహిళలు విమానం నడపడం ఏమిటి!’ అనే అకారణ భయం, ఆందోళన ప్రయాణికులలో కనిపించేది. అయితే ఇప్పుడు ఆ దృశ్యం పూర్తిగా మారిపోయింది. ‘వైమానిక రంగంలో మహిళలు’ అనే అంశం ముందుకు వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు మన దేశం వైపే చూస్తున్నాయి. మన దేశంలోని స్ఫూర్తిదాయకమైన మహిళా పైలట్ల గురించి ప్రస్తావిస్తున్నాయి. తాజాగా... ‘ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఉమెన్ ఎయిర్‌లైన్స్ పైలట్’ గణాంకాల ప్రకారం ప్రపంచంలోని ఎన్నో దేశాలతో పోల్చితే మన దేశంలో మహిళా పైలట్(కమర్షియల్, ఎయిర్‌ఫోర్స్)లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఉదా: యూఎస్–5.5 శాతం యూకే–4.7 శాతం ఇండియా–12.4 శాతం.. ‘సంస్థల ఆలోచన తీరులో మార్పు రావడం, స్ఫూర్తిదాయకమైన మహిళా పైలట్లు, కుటుంబ సభ్యుల మద్దతు, ఔట్రీచ్ ప్రోగ్రామ్స్, సోషల్ మీడియా... ఎలా ఎన్నో కారణాల వల్ల మన దేశంలో మహిళా పైలట్ల సంఖ్య పెరుగుతుంది. మహిళలు వైమానిక రంగంలో రాణించడానికి అనుకూలమైన వాతావరణం ఇప్పుడు బాగా కనిపిస్తుంది’ అంటుంది ఎంతోమందికి స్ఫూర్తి ఇచ్చిన నివేదిత భాసిన్. నిజానికి వైమానికరంగంలో మహిళల ఆసక్తి నిన్నా మొన్నటిది కాదు. వెనక్కి వెళితే... 1948లో ఏర్పాటైన యూత్ ప్రొగ్రామ్ ‘నేషనల్ క్యాడెట్స్ కాప్స్ ఎయిర్ వింగ్’ మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను నడపడంలో శిక్షణ ఇచ్చేది. మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపించేవారు. కొన్ని రాష్ట్రప్రభుత్వాలు, హోండా మోటర్లాంటి సంస్థలు శిక్షణ తీసుకునేవారికి ఆర్థిక సహాయం చేసేవి. వర్తమానానికి వస్తే... ఇండిగోలాంటి విమాన సంస్థలు మహిళా పైలట్లకు సంబంధించిన సదుపాయాలు, సౌకర్యాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాయి. ప్రత్యేక సందర్భాలలో వెసులుబాటు ఇస్తున్నాయి. పికప్, డ్రాప్ కోసం గార్డ్‌తో కూడిన వాహన సౌకర్యం కలిగిస్తున్నాయి. విధి నిర్వహణలో తమను ముందుకు నడిపిస్తున్నది ‘కుటుంబ మద్దతు’ అంటున్నారు మహిళా పైలట్లు. జోయా అగర్వాల్ పైలట్ కావడానికి మొదట్లో తల్లిదండ్రులు సుముఖంగా లేరు. అయితే కూతురు పట్టుదల చూసి పచ్చజెండా ఊపారు. వైమానికరంగ చరిత్రలో జోయా సాధిస్తున్న విజయాలు వారికి గర్వకారణంగా నిలుస్తున్నాయి. చిన్నవయసులోనే బోయింగ్ విమానాన్ని నడిపి అందరినీ ఆశ్చర్యపరిచిన జోయా నలుగురు మహిళా పైలట్లను తోడుగా తీసుకొని పదిహేడుగంటల పాటు ఉత్తరధృవం మీదుగా విమానాన్ని నడిపి చరిత్ర సృష్టించింది. ‘కల కనడం ఒక్కటే కాదు ఆ కలను నిజం చేసుకోవడానికి ధైర్యంగా ముందడుగు వేయాలి. ప్రతికూలతల గురించి ఆలోచించవద్దు. విజయాలు అందించడానికి ఈ ప్రపంచమే మీకు తోడుగా ఉంటుంది’ అంటుంది జోయా అగర్వాల్. జోయాలాంటి ప్రతిభ, సాహనం మూర్తీభవించిన మహిళల వల్లే ఇప్పుడు ప్రపంచ వైమానికరంగ చరిత్రలో భారతీయ మహిళా పైలట్లకు ప్రశంసనీయమై, స్ఫూర్తిదాయకమైన ప్రత్యేకత ఏర్పడింది. చదవండి: Vidya Nambirajan: తండ్రి వారసురాలు.. ‘మా నాన్న కోసమే ఈ గ్యారేజ్‌లోకి వచ్చాను’ -
ఏవియేషన్ రంగంలో కొలువుల జాతర, లక్ష ఉద్యోగాలు భర్తీ
న్యూఢిల్లీ: వచ్చే రెండేళ్లలో దేశీ విమానయాన రంగం .. మరో లక్ష మందికి ప్రత్యక్షంగా కొలువులు కల్పించే అవకాశాలు ఉన్నాయని పార్లమెంటరీ అంచనాల కమిటీకి కేంద్ర పౌర విమానయాన శాఖ తెలిపింది. ప్రస్తుతం ఏవియేషన్, ఏరోనాటికల్ తయారీ రంగంలో సుమారు 2,50,000 మంది ఉద్యోగులు ప్రత్యక్షంగా ఉపాధి పొందున్నట్లు వివరించింది. వీరిలో పైలట్లు, క్యాబిన్ సిబ్బంది, ఇంజినీర్లు, టెక్నీషియన్లు, కార్గో, రిటైల్, సెక్యూరిటీ గార్డులు మొదలైన వారు ఉన్నారు. ఈ సంఖ్య 2024 నాటికి 3,50,000కు పెరగవచ్చని అంచనా వేస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. ఏవియేషన్‌లో పరోక్ష, ప్రత్యక్ష ఉద్యోగాల నిష్పత్తి 4:8గా ఉన్నట్లు వివరించింది. లోక్‌సభకు సమర్పించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. చదవండి👉 రాకేష్ ఝున్ ఝున్ వాలా..'ఆకాశ ఎయిర్' సేవలు షురూ! -
రాకేష్ ఝున్ ఝున్ వాలా..'ఆకాశ ఎయిర్' సేవలు షురూ!
దేశీయ స్టాక్ మార్కెట్ మాంత్రికుడు రాకేష్ ఝున్‌ఝన్ వాలా ఏవియేషన్ రంగంలో అడుగపెట్టారు. తన అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నారు. ఇందులో భాగంగా ఝున్‌ఝన్ వాలాకు చెందిన ఆకాశ ఎయిర్ సేవల్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ సేవల్ని పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య ఎం సింధియా పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఆకాశ ఎయిర్ తొలి విమానం ముంబైలో టేకాఫ్ అవ్వగా.. ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు ఈ విమానం ప్రయాణించింది. ఈ విమానయాన సంస్థ అహ్మదాబాద్, బెంగళూరు, ముంబై, కొచ్చి ప్రాంతాలలో తొలుత తన సర్వీసులను అందజేస్తుంది. ముంబై నుంచి అహ్మదాబాద్‌కి 28 వీక్లి ఫ్లయిట్స్‌ను నడపనుంది. ఈ సందర్భంగా తమ కస్టమర్లకు సరికొత్త విమానయాన అనుభవాన్ని అందించేందుకు తాము మరింత ముందుకు వెళ్లనున్నామని, తమ సర్వీసులు కస్టమర్లకు నచ్చుతాయని భావిస్తున్నట్లు ఆకాశ ఎయిర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వినయ్ దుబే అన్నారు . -
కేంద్రం కీలక నిర్ణయం, దేశీ విమానయాన సంస్థలకు భారీ ఊరట!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమానయాన సంస్థలు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్)పై చేస్తున్న వ్యయాలకు అనుగుణంగా విదేశీ సర్వీసులు నడిపే దేశీయ విమానయాన సంస్థల వ్యయాలూ ఉండే కీలక నిర్ణయాన్ని ఆర్థికశాఖ తీసుకుంది. చమురు మార్కెటింగ్ కంపెనీల నుండి కొనుగోలు చేసే ఏటీఎఫ్‌పై ఎక్సైజ్ సుంకం చెల్లింపుల నుంచి (బేసిస్ ఎక్సైజ్ సుంకం, ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం) దేశీయ విమానయాన సంస్థలను కేంద్రం మినహాయించింది. వివరాల్లోకి వెళితే, జూలై 1వ తేదీన కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంటూ, పెట్రోల్, డీజిల్‌తోపాటు ఏటీఎఫ్‌పై 11 శాతం సుంకాన్ని విధించింది. దీనివల్ల అంతర్జాతీయ సర్వీసులు నడిపే విమానయాన సంస్థలపై భారం పడుతుందని పరిశ్రమ కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది. దీనితో కేంద్రం నుంచి తాజా నిర్ణయం వెలువడింది. అయితే దేశీయంగా నడిపే విమానాలకు ఉపయోగించే ఏటీఎఫ్‌పై విమానయాన సంస్థలు 11 శాతం ఎక్సైజ్ సుంకం చెల్లింపులు కొనసాగుతాయి. -
ఇద్దరు పైలెట్ల లైసెన్స్ రద్దు చేసిన డీజీసీఏ
న్యూఢిల్లీ: జబల్పూర్ విమానాశ్రయంలోని రన్‌వే పై మార్చి 12న ల్యాండ్ అయిన ఒక విమానం విషయమై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణ జరిపింది. ఈ మేరకు ఢిల్లీకి చెందిన అలయన్స్ ఎయిర్ ఏటీఆర్-72 విమానం ఆ రోజు జబల్పూర్లో రన్‌వేని దాటి ల్యాండ్ అయ్యింది. ఈ విమానంలో దాదాపు 55 మంది ప్రయాణికులు ఉన్నారు. దర్యాప్తులో ఈ విమానం రన్‌వే సమీపంలో చాలా సేపు ల్యాండ్ అవ్వకుండా గాల్లోనే ఉందని, రన్‌వేకి దాదాపు 900 మీటర్లు దాటి ల్యాండ్ అయ్యిందని తేలింది. అలాంటి విపత్కర సమయంలో మంటలు రాజుకునే అవకాశం పొంచి ఉందని డీజీసీఏ పేర్కొంది. ల్యాండింగ్ సమయంలో విమానం సరిగా స్థిరికరించబడకపోతే వెంటనే గో అరౌండ్ కోసం అధికారులకు సమాచారం ఇవ్వాలి. కానీ ఆ పైలెట్లు ఇద్దరూ అవేమి చేయకుండా ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేసి ఏవియేషన్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ ఒక ఏడాది పాటు వేటు వేసింది. (చదవండి: చీర కట్టుకోవడం రాదని.. లెటర్ రాసి భర్త ఆత్మహత్య) -
Women In Aviation: అమ్మాయిలకు ఈ విషయాలు ఎవరు చెప్తారు? అందుకే..
పదేళ్ల పాపాయి వర్షం కురిస్తే నాన్న చేత కాగితంతో పడవలు చేయించుకుని నీటిలో వదులుతూ మురిసిపోతుంది. వర్షం రాని రోజు కాగితంతో విమానాన్ని చేసే ఏటవాలుగా గాల్లోకి విసురుతుంది. ఎండాకాలం సెలవులు వచ్చాయంటే చాలు... జరిగిపోయిన క్లాసు నోట్‌బుక్‌ల పేజీలన్నీ గాల్లోకి ఎరిగే విమానాలయిపోతాయి. మరి ఈ అమ్మాయిల్లో ఎంతమంది విమానయాన రంగంలో అడుగుపెడుతున్నారు? కాగితంతో విమానం చేయడం నేర్పించిన నాన్న విమానయానరంగం గురించి చెప్పడెందుకు? ఇక అమ్మకైతే ఒకటే భయం. మహిళాపైలట్లు, ఎయిర్ హోస్టెస్‌ల జీవితాల మీద వచ్చిన సినిమాలే గుర్తు వస్తాయామెకి. ఏవియేషన్ ఫీల్డ్‌లో ఆడపిల్లలు అనగానే పైలట్, ఎయిర్‌హోస్టెస్ ఉద్యోగాలు తప్ప మరో ఉద్యోగాలుంటాయని కూడా పాతికేళ్ల కిందటి తల్లి ఊహకందకపోయి ఉండవచ్చు. ఇక అమ్మాయిలకు ఎవరు చెప్తారు? విమానం ఎగరాలంటే రకరకాల విభాగాలు పని చేస్తాయని, ముప్పైరకాల విభాగాలు మహిళలకు అనువైన విభాగాలున్నాయని చెప్పేది ఎవరు? మనకు చదువులంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ (స్టెమ్)లే అనే ఒక పరదాలోపల జీవిస్తున్నామని తల్లిదండ్రులకు ఎవరు చెప్పాలి? మెటలర్జీ చదివితే విమానరంగంలో ఉద్యోగం చేయవచ్చని చెప్పగలిగిన వాళ్లే లేకపోతే పిల్లలు ఆ చదువుల వైపు ఎలా వెళ్లగలుగుతారు. ఆకాశంలో ఎగిరే విమానాన్ని నియంత్రించే విభాగం నేలమీద ఉంటుందని, ఆ పనిని మహిళలు సమర్థవంతం గా నిర్వహిస్తున్నారని తెలిస్తే కదా... ఆడపిల్లలు ఆయా రంగాల్లో కెరీర్ కలలు కనేది. కనీసం కలలు కనడానికి తగినంత సమాచారం కూడా వాళ్ల దగ్గర లేకపోతే ఇక కలను నిజం చేసుకుంటారని ఎలా ఆశించాలి? ఇన్ని ప్రశ్నలు తలెత్తిన తర్వాత రాధా భాటియా ఆ ప్రశ్నలన్నింటికీ తనే సమాధానం కావాలనుకుంది. బర్డ్ అకాడమీ ద్వారా కొత్తతరాన్ని చైతన్యవంతం చేస్తోంది. పాతికేళ్ల కిందట ఆమె మొదలు పెట్టిన ఈ కార్యక్రమం ద్వారా యాభైవేల మందికి పైగా అమ్మాయిలు ఆకాశంలో కెరీర్‌ను నిర్మించుకున్నారు. ఆకాశాన్ని నియంత్రించే శక్తిగా భూమ్మీద నిలిచారు. ప్రోత్సాహం చాలదు! దారి చూపించాలి!! బర్డ్ అకాడమీ బాధ్యతకు ముందు రాధా భాటియా స్కూల్ టీచర్. ఓ సారి స్కూల్లో వర్క్‌షాప్ సందర్భంగా ఎనిమిది, తొమ్మిది తరగతుల పిల్లలను పెద్దయిన తర్వాత ఏమవుతారని అడిగినప్పుడు ఒక్కరు కూడా ఏవియేషన్ గురించి చెప్పలేదు. అందరూ చదువంటే డాక్టర్, ఇంజనీర్, ఐఏఎస్, ఐపీఎస్... వంటివే చెబుతున్నారు. ముఖ్యంగా ఆడపిల్లలైతే టీచర్, డాక్టర్ల దగ్గరే ఆగిపోయారు. పిల్లలకు తెలిసిన రంగాలకంటే తెలియని రంగాలే ఎక్కువగా ఉన్నాయనిపించింది భాటియాకి. మహిళను అవనిలో సగం, ఆకాశంలో సగం అని చెప్పే మోటివేట్ స్పీకర్లు, కథకులు ప్రోత్సహించడంతో తమ బాధ్యత పూర్తయిందనుకుంటున్నారు. అంతేతప్ప ఒక మార్గాన్ని సూచించే ప్రయత్నం జరగడం లేదని తెలిసింది అందుకే ఆ పని తనే∙మొదలు పెట్టారామె. అప్పటివరకు బర్డ్ అనేది ట్రావెల్ అండ్ టూరిజమ్, ఎయిర్‌ఫేర్ అండ్ టికెటింగ్, పాసెంబజర్ అండ్ బ్యాగేజ్ హ్యాండిలింగ్, ఎయిర్ సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ హ్యాండిలింగ్, డేంజరస్ గూడ్స్ రెగ్యులేషన్స్ అండ్ కన్సెల్టెంట్ వంటి సర్టిఫికేట్ కోర్సులు, డిప్లమో కోర్సుల్లో శిక్షణ ఇచ్చే సంస్థ. ఆ తర్వాత దాదాపుగా ముప్పైవిభాగాల్లో శిక్షణ ఇచ్చేటట్లు మెరుగుపరిచారు రాధాభాటియా. ఈ సంస్థ ద్వారా బాలికల్లో ఏవియేషన్ పట్ల చైతన్యం కలిగించడంతోపాటు శిక్షణ కూడా ఇస్తున్నారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సహకారంతో బర్డ్ సంస్థ నుంచి ఏడాదికి మూడు వేల మందికి శిక్షణ ఇస్తున్నారు. ఏవియేషన్ రంగంలో విజయవంతంగా కెరీర్‌ను అభివృద్ధి చేసుకున్న మహిళలు కొత్తతరానికి మార్గదర్శనం చేస్తున్నారు. బర్డ్ కార్పొరేట్ ఆఫీస్ ఢిల్లీ కన్నాట్ ప్లేస్‌లోని కన్నాట్ హౌస్‌లో ఉంది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, కొచ్చిలలో శిక్షణ విభాగాలున్నాయి. ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన అమ్మాయి కల గనడానికి కూడా సాధ్యం కాని విమానయాన రంగం అమ్మాయిల కళ్ల ముందు వాలింది. ఒకప్పుడు గగన కుసుమంగా ఉన్న ఈ రంగం ఇప్పుడు స్నేహహస్తం చాచింది. అవకాశాన్ని అందిపుచ్చుకోవడం ఇక అమ్మాయిల వంతు. ఇన్ని ఉద్యోగాలా! విమానయాన రంగంలో పైలట్, ఎయిర్‌లైన్ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ విభాగం, ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్, టెక్నీషియన్, ఫ్లైట్ అటెండెంట్, క్యాబిన్ క్రూ, ఎయిర్ హోస్టెస్, కమర్షియల్ మార్కెటింగ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఫ్లైట్ డిస్పాచర్, ఎయిర్ స్టేషన్ ఏజెంట్, పాసింజర్ సర్వీస్ ఏజెంట్, రాంప్ స్కిప్పర్ అండ్ ఎగ్జిక్యూటివ్, ఏవియేషన్ మెటలర్జిస్ట్, క్రూ షెడ్యూల్ కో ఆర్డినేటర్, ఎయిర్ టికెట్ ఏజెంట్, మీట్ అండ్ గ్రీట్ ఏజెంట్, ఏవియేషన్ డాక్టర్, ఏవియేషన్ సైకాలజిస్ట్, ఏవియేషన్ ఆటార్నీ, సీఆర్ఎమ్ ఎగ్జిక్యూటివ్, క్వాలిటీ కంట్రోల్ ఎగ్జిక్యూటివ్, ఎయిర్‌లైన్స్ ఫుడ్ సర్వీసెస్, సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్, ఆఫీసర్... ఇన్ని రకాల ఉద్యోగాలుంటాయి. ఇవన్నీ మహిళలు చేయడానికి అనువైన ఉద్యోగాలే. హైదరాబాద్‌లో ఈ నెల చివరి వారంలో నాలుగు రోజుల పాటు జరిగిన వింగ్స్ ఇండియా 2022లో భాగంగా ఏవియేషన్ రంగంలో ఉద్యోగాల పట్ల బాలికలు, యువతులకు అవగాహన కల్పించడానికి హైదరాబాద్‌కి వచ్చింది బర్డ్ అకాడమీ. -రాధా భాటియా బాలికల విమానయానం ఉమన్ ఇన్ ఏవియేషన్ ఇంటర్నేషనల్‌కు అనుబంధంగా ఇండియా విభాగాన్ని 2016లో ప్రారంభించారు. కెరీర్ చాయిస్ ఎంతలా ఉందో వివరించడానికి, కొత్త తరాన్ని చైతన్యవంతం చేయడానికి ఉద్దేశించిన అనుబంధ విభాగం ఇది. ఉమెన్ ఇన్ ఏవియేషన్ 2015 నుంచి ఏటా ‘గర్ల్స్ ఇన్ ఏవియేషన్ డే (జిఐఏడి)’ నిర్వహిస్తోంది. మొదటి ఏడాది 32 ఈవెంట్లలో 3,200 మంది పాల్గొన్నారు. 2019 నాటికి జిఐఏడిలో 18 దేశాల నుంచి ఇరవై వేలకు పైగా పాల్గొన్నారు. 119 ఈవెంట్లు జరిగాయి. 2020లో ‘ఏవియేషన్ ఫర్ గర్ల్స్’ యాప్ రూపొందించింది. 60 దేశాల నుంచి వేలాది మంది అమ్మాయిలు ఈ యాప్ ద్వారా వేడుకల్లో పాల్గొన్నారు. 2022లో సెప్టెంబర్ 24వ తేదీన జరగనుంది. – వాకా మంజులారెడ్డి -
ఆకట్టుకున్న 'వింగ్స్ ఇండియా 2022' ఏవియేషన్ షో
-
20 ఏళ్లు.. 2,210 విమానాలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏవియేషన్ మార్కెట్ పుంజుకుంటున్న నేపథ్యంలో వచ్చే రెండు దశాబ్దాల్లో భారత విమానయాన రంగానికి కొత్తగా 2,210 విమానాలు అవసరం కానున్నాయి. వీటిలో 1,770 చిన్న స్థాయి, 440 మధ్య..భారీ స్థాయి ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉండనున్నాయి. గురువారమిక్కడ వింగ్స్ ఇండియా ఏవియేషన్ షో సందర్భంగా విమానాల తయారీ దిగ్గజం ఎయిర్‌బస్ ఇండియా విభాగం ప్రెసిడెంట్ రెమి మెలార్డ్ ఈ విషయాలు తెలిపారు. భారత మార్కెట్‌పై అంచనాలకు సంబంధించిన నివేదిక ప్రకారం 2040 నాటికి దేశీయంగా ప్రయాణికుల రద్దీ ఏటా 6.2 శాతం మేర వృద్ధి చెందుతుందని భావిస్తున్నట్లు ఆయన వివరించారు. జనాభాపరంగా, ఆర్థికంగా, భౌగోళికంగా భారత్‌కు ఉన్న ప్రత్యేకతలు ఇందుకు దోహదపడగలవని రెమి తెలిపారు. దేశీయంగా మధ్యతరగతి వర్గాలు.. విమాన ప్రయాణాలపై మరింతగా వెచ్చించే అవకాశం ఉందని పేర్కొన్నారు. మెయింటెనెన్స్ .. సర్వీస్ సామర్థ్యాలు, ట్యాక్సేషన్ విధానాలు మొదలైనవన్నీ మరింత అనుకూలంగా ఉంటే భారత్‌లో విమానయాన రంగం గణనీయంగా వృద్ధి చెందగలదని రెమి తెలిపారు. అంతర్జాతీయంగా ప్యాసింజర్ ట్రాఫిక్ వృద్ధి 3.9 శాతం స్థాయిలోనే ఉండగలదన్నారు. అంతర్జాతీయ రూట్లలో వాటా పెంచుకోవాలి గడిచిన పదేళ్లలో దేశీయంగా ఎయిర్ ట్రాఫిక్ దాదాపు తొమ్మిది రెట్లు పెరిగిందని, అంతర్జాతీయ ట్రాఫిక్ రెట్టింపు అయ్యిందని పేర్కొన్నారు. అంతర్జాతీయ రూట్లలో విదేశీ ఎయిర్‌లైన్స్ వాటా 94 శాతం పైగా ఉంటుండగా.. భారత విమానయాన సంస్థల వాటా 6 శాతం స్థాయిలోనే ఉందని రెమి తెలిపారు. ఈ నేపథ్యంలో దేశీ విమానయాన సంస్థలు తమ మార్కెట్ వాటా మరింతగా పెంచుకోవాల్సిన అవసరం ఉందని రెమి చెప్పారు. ప్రస్తుతం కోవిడ్ సహా పలు సంక్షోభాలు ఏవియేషన్ రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని, అయితే పరిశ్రమ వీటి నుంచి ధీటుగా బైటపడగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కోవిడ్ సంక్షోభం నుంచి భారత్ వేగంగా కోలుకుంటోందని.. అందుకే అంచనాలను పెంచామన్నారు. 34 వేల మంది పైలట్లు కావాలి విమానయాన పరిశ్రమ గణనీయంగా వృద్ధి చెందుతుండటంతో 2040 నాటికి భారత్‌లో అదనంగా 34,000 మంది పైలట్లు, 45,000 సాంకేతిక నిపుణులు అవసరమవుతారని భావిస్తున్నట్లు రెమి వివరించారు. భారత్‌లో ఎయిర్‌బస్ 7,000 పైచిలుకు ఉద్యోగాలు కల్పిస్తోందని, ఏటా భారత్ నుంచి 650 మిలియన్ డాలర్ల పైగా కొనుగోళ్లు జరుపుతోందని చెప్పారు. వచ్చే దశాబ్ద కాలంలో ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా భారత్ నిలుస్తుందని, జీ20 దేశాల్లో అత్యంత వేగవంతమైన వృద్ధి సాధించడం కొనసాగిస్తుందని ఆయన పేర్కొన్నారు. రాబోయే పదేళ్లలో భారత్‌లో విమానయాన సంస్థలకు వారానికి ఒకటి పైగా ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఎయిర్‌బస్ డెలివర్ చేయగలదని రెమి చెప్పారు. గతేడాది 611 విమానాలను డెలివర్ చేయగా ఇందులో 10% ఎయిర్‌క్రాఫ్ట్‌లు భారత సంస్థలకు అందించినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది 720 విమానాల డెలివరీ టార్గెట్ అని తెలిపారు. సుదూర ప్రయాణాలకు ఏ350 విమానాలు ఏ350 విమానాలను సుదూర ప్రయాణాలకు అనువుగా రూపొందించినట్లు రెమి తెలిపారు. ఇవి ఏకంగా 18,000 కి.మీ. దూరం ప్రయాణించగలవని, 300–410 మంది వరకూ ప్యాసింజర్లు ప్రయాణించవచ్చని ఆయన చెప్పారు. అధునాతన మెటీరియల్స్ వల్ల ఇదే తరహా పోటీ సంస్థల విమానాలతో పోలిస్తే ఏ350 విమానాలు ఇంధనాన్ని 25% మేర ఆదా చేయగలవని, తద్వారా నిర్వహణ వ్యయాలను తగ్గించగలవని రెమి తెలిపారు. ఈ విమానాల కోసం 50 కస్టమర్ల నుంచి 915 ఆర్డర్లు వచ్చినట్లు (సరుకు రవాణా కోసం ఉపయోగించే ఏ350ఎఫ్ సహా) ఆయన పేర్కొన్నారు. వీటి విక్రయాలకు సంబంధించి భారతీయ విమానయాన సంస్థలతో కూడా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. -
బాబోయ్ ఫ్యూయల్ రేట్లు మండిపోతున్నాయ్! విమానాల్లో మగవాళ్లు వద్దు?
కరోనా దెబ్బతో అతలాకుతలమైన ఏవియేషన్ సెక్టార్‌పై రష్యా - ఉక్రెయిన్ వార్ మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టయ్యింది. అంతర్జాతీయ ఉద్రిక్తలతో గత మూడు నెలలుగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. దానికి తగ్గట్టుగా 2022 జనవరి నుంచి ఇప్పటి వరకు ఆరుసార్లు ఏవియేషన్ ఫ్యూయల్ రేట్లు పెరిగాయి. చివరి సారిగా ఏకంగా 18 శాతం ధరలు పెరిగాయి. పెరిగిన ధరలతో విమానాలు నడిపించడం కత్తిమీద సాములా మారింది. పెరిగిన ఏవియేషన్ ఫ్యూయల్ ధరలు సర్వీసు ప్రొవైడర్లకు ఇబ్బందికరంగా మారాయి. విమాన సర్వీసుల నిర్వాహాణలో 40 శాతం వ్యయం కేవలం ఫ్యూయల్‌కే వెళ్తుంది. దీంతో పెరుగుతున్న ధరలు ఫ్లైట్ సర్వీస్ ప్రొవైడర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇంధన పొదుపుకు సంబంధించి ఏం చేయాలనేది వారికి అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది. ఈ నేపథ్యంలో జెట్ ఎయిర్వేస్ సీఈవో సంజీవ్ కపూర్‌కి ఆసక్తికరమైన సూచన చేశాడు విశాల్ శ్రీవాత్సవ అనే నెటిజన్. విమానం నడిపే క్యాబిన్ క్రూలో మీరు ఎందుకు ఎక్కువ మంది మగవాళ్లనే నియమిస్తున్నారు? పురుషులతో పోల్చితే మహిళలు తక్కువ బరువు ఉంటారు. దీంతో తక్కువ ఇంధనం ఖర్చవుతుంది. మీరు లేడీ కేబిన్ క్రూను తీసుకోవడం ద్వారా ప్రతీ ఫ్లైట్‌కి కనీసం వెయ్యి రూపాయలు ఆదా అవుతాయి అనుకున్నా.. రోజుకు వంద ఫ్లైట్లు నడిపిస్తారనుకున్నా.. ఏడాదికి కనీసం రూ. 3.5 కోట్ల వ్యయం తగ్గుతుంది కదా ? అంటూ ప్రశ్నించాడు. విశాల్ శ్రీవాత్సవ సంధించిన ప్రశ్నలకు జెట్ ఎయిర్వేస్ సీఈవో సంజీవ్ కపూర్ స్పందిస్తూ.. మంచి ఐడియా ఇచ్చారు విశాల్. కేవలం కేబిన్ క్రూ విషయంలోనే ఈ నియమం ఎందుకు అమలు చేయాలి ? ప్రయాణికుల్లో కూడా మొత్తం మహిళలే ఉండేలా చూసుకోవడం లేదా కనీసం మగ ప్యాసింజర్లను తగ్గించినా కూడా ఫ్యూయల్ బాగానే ఆదా అవుతుంది కదా అంటూ బదులిచ్చారు. Extending that logic, imagine the savings if one were to carry only female passengers! Or charge male passengers more! 😉 https://t.co/3GP2YETBnV — Sanjiv Kapoor (@TheSanjivKapoor) March 22, 2022 మీరు చెప్పిన లాజిక్ బాగానే ఉన్నా అది దీర్ఘకాలంలో లింగ వివక్షకు దారి తీస్తుంది. అంతే కాదు చట్టపరమైన చిక్కులు కూడా వస్తాయి. ఫ్యూయల్ కాస్ట్ తగ్గించుకునేందుకు మహిళా క్రూ అనేది అంత సబబైన విధానం కాదంటూ వివరణ ఇచ్చారు సంజీవ్ కపూర్. మొత్తంగా పెరుగుతున్న ఫ్యూయల్ ఛార్జీలతో ఏవియేషన్ సెక్టార్ ఎంతగా ఇబ్బంది పడుతుంతో తెలిపేందుకు విశాల్, సంజీవ్ కపూర్ల మధ్య జరిగిన సంభాషణ ఉదాహారణగా నిలుస్తోందంటున్నారు నెటిజన్లు. చదవండి: నష్టాల ఊబిలో ఏవియేషన్ -
వింగ్స్ ఇండియాలో ఏపీ పెవిలియన్
సాక్షి, అమరావతి: విమానయాన రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి ఆసియాలోనే అతిపెద్ద ఏవియేషన్ షో.. వింగ్స్ ఇండియా 2022 వేదికను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటోంది. గురువారం నుంచి 4 రోజుల పాటు హైదరాబాద్ బేగంపేటలో జరిగే విమానయాన ప్రదర్శన సదస్సులో ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఏడీసీఎల్) పెవిలియన్ ఏర్పాటు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసిన కర్నూలు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్‌పోర్టుతో పాటు పీపీపీ విధానంలో అభివృద్ధి చేయనున్న భోగాపురం, దగదర్తి విమానాశ్రయాల నిర్మాణంలో పెట్టుబడుల అవకాశాలను వివరించనున్నట్లు ఏపీఏడీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్, రాష్ట్ర ప్రభుత్వ ఏవియేషన్ సలహాదారు వీఎన్ భరత్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. కర్నూలు ఎయిర్‌పోర్టులో పైలట్ ట్రైనింగ్ సెంటర్, పారాగైడ్లింగ్ వంటి అంశాల్లో పెట్టుబడుల అవకాశాలను వివరించనున్నారు. పీపీపీ విధానంలో రెండు భారీ విమానాశ్రయాలు రానుండటంతో వీటి ఆధారంగా పలు ఇతర పెట్టుబడుల అవకాశాలను ఈ ప్రదర్శనలో ఇన్వెస్టర్లకు తెలియజేయనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం 108 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న ఏపీ పెవిలియన్‌లో రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాలు, కొత్తగా రానున్న వాటిల్లో పెట్టుబడుల అవకాశాలు, పట్టణాభివృద్ధి అవకాశాలు వంటి అంశాలపై దృష్టి కేంద్రీకరించనున్నట్లు తెలిపారు. పెట్టుబడిదారులతో సమావేశం కావడానికి ప్రత్యేకంగా బిజినెస్ మీట్ రూమ్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. డ్రోన్లపై ప్రత్యేక దృష్టి వేగంగా విస్తరిస్తున్న డ్రోన్ టెక్నాలజీ అవకాశాలను అందిపుచ్చుకోవడంపై వింగ్స్ ఇండియాలో ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు భరత్‌రెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం డ్రోన్ పాలసీని విడుదల చేస్తే దానికనుగుణంగా రాష్ట్రంలో డ్రోన్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడం ద్వారా ఈ రంగంలో పెట్టుబడి అవకాశాలను అందిపుచ్చుకోనున్నట్లు తెలిపారు. ఇప్పటికే అనంతపురం జిల్లాలో డ్రోన్ సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదనలను సిద్ధం చేసిన విషయం తెలిసిందే. -
విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్! ఎయిర్‌లైన్స్‌కు పేమెంట్స్ ప్లాట్‌ఫామ్
ముంబై: దేశీ విమానయాన పరిశ్రమ కోసం పేమెంట్ ప్లాట్‌ఫామ్‌ను ప్రవేశపెట్టేందుకు ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్(ఐఏటీఏ)తో చేతులు కలిపినట్లు గ్లోబల్ బ్యాంకింగ్ గ్రూప్ స్టాన్‌చార్ట్ తాజాగా వెల్లడించింది. దీనిలో భాగంగా ప్రస్తుతమున్న క్రెడిట్ కార్డులు తదితర అవకాశాలుకాకుండా ఐఏటీఏ పే ద్వారా కొత్తతరహా ఇన్స్టంట్ చెల్లింపులకు తెరతీయనున్నట్లు తెలియజేసింది. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా యూపీఐ స్కాన్, పే, యూపీఐ కలెక్ట్ తదితరాలతో చెల్లింపులకు విమానయాన సంస్థలు వీలు కల్పించనున్నట్టు పేర్కొంది. ఈ తరహా సేవలు ఇప్పటికే యూరోపియన్ మార్కెట్లలో అందుబాటులో ఉన్నట్లు తెలియజేసింది. రియల్ టైమ్ చెల్లింపుల దేశీ పథకం యూపీఐ అండతో కస్టమర్లు విమాన టికెట్ల కొనుగోలుకి తమ బ్యాంకు ఖాతాల నుంచి అప్పటికప్పుడు చెల్లించేందుకు వీలు కలి్పంచనున్నట్లు వివరించింది. ప్లాట్‌ఫామ్‌ను దేశీయంగా ప్రారంభించాక ఐఏటీఏ ఈ సర్వీసులను ఇతర మార్కెట్లలోనూ ఆవిష్కరించేందుకు మద్దతివ్వనున్నట్లు స్టాన్‌చార్ట్ పేర్కొంది. -
ఈ ఒక్క ఫొటో చాలు.. ఉక్రెయిన్ పరిస్థితిని చెప్పడానికి!
Russia And Ukraine war: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రష్యా బలగాలు ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతున్నాయి. ప్రాణాలు అరచేత పట్టుకున్న ప్రజలు ఆగమవుతున్నారు. మీడియా, సోషల్ మీడియా అక్కడి పరిస్థితుల్ని, యుద్ధ తీవ్రతను ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేస్తోంది. ఈ తరుణంలో ఒక్క ఫొటో అక్కడి తీవ్రతకు తార్కాణంగా నిలిచింది. ఉక్రెయిన్ సరిహద్దు ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి పలు దేశాలు అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే. అయితే యుద్ధ వాతావరణం నెలకొన్నప్పటికీ.. యుద్ధాన్ని మాత్రం ఊహించలేదు. ఈ తరుణంలో తమ పౌరుల తరలింపులో జాప్యం జరిగింది. ఇక గురువారం రష్యా మిలిటరీ చర్యతో ఉక్రెయిన్ వణికిపోయింది. ఈ క్రమంలో రాజధాని కీవ్ విమానాశ్రయం మూసేయగా.. అటుగా వెళ్లిన వందలాది విమానాలను దారి మళ్లించాల్సిన పరిస్థితి దాపురించింది. ముఖ్యంగా ఉక్రెయిన్‌లో నిత్యం రద్దీగా ఉండే ఉత్తర, పశ్చిమ ప్రాంతాల నుంచి ఎయిర్‌లైన్ ట్రాఫిక్‌ను భద్రతా కారణాల దృష్ట్యా హఠాత్తుగా దారి మళ్లించారు. దీంతో గగనతలంలో ఒక్కసారిగా కుప్పపోసినట్లు విమానాలు కనిపించాయి. విమానాలు దారి మళ్లించిన పలు చిత్రాలను ‘ఫ్లైట్ ట్రాకర్ సాఫ్ట్వేర్’ విడుదల చేసింది. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
హెలికాప్టర్లో ఒకేసారి ఆరుగురు వెళ్లే అవకాశం: భరత్‌రెడ్డి
-
ఎయిర్‌లైన్స్‌కు ఈ ఏడాదీ కష్టకాలమే
ముంబై: కరోనా వచ్చిన దగ్గర్నుంచి విమానయాన రంగం (ఎయిర్‌లైన్స్) కోలుకోకుండా ఉంది. కరోనా మూడో విడత రూపంలో విస్తరిస్తూ ఉండడం, పెరిగిన ఇంధన (ఏటీఎఫ్) ధరలు వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) మొత్తం మీద ఎయిర్‌లైన్స్‌కు రూ.20,000 కోట్ల నష్టాలు రావచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం (2021–21)లోనూ ఎయిర్‌లైన్స్ సంస్థలు రూ.13,853 కోట్ల నష్టాలను మూటగట్టుకున్నాయి. వీటితో పోలిస్తే నష్టాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 44 శాతం మేర పెరగనున్నాయని క్రిసిల్ నివేదిక పేర్కొంది. దీంతో ఈ రంగం కోలుకోవడానికి మరింత సమయం పట్టొచ్చని అంచనా వేసింది. 2022–23 ఆర్థిక సంత్సరం తర్వాతే రికవరీ ఉండొచ్చని పేర్కొంది. దేశీయంగా 75 శాతం మార్కెట్ వాటా కలిగిన ఇండిగో, స్పైస్‌జెట్, ఎయిర్ఇండియా గణాంకాల ఆధారంగా క్రిసిల్ ఈ నివేదికను రూపొందించింది. దేశీయ మార్కెట్ కోలుకుంది.. కరోనా మహమ్మారి దెబ్బకు 2020లో విమాన సర్వీసులు దేశీయంగా చాలా పరిమితంగా నడిచాయి. 2021 డిసెంబర్ నాటికి కానీ ప్రయాణికుల రద్దీ కోలుకోలేదు. కరోనా పూర్వపు నాటి గణాంకాలతో పోలిస్తే 86 శాతానికి పుంజుకుంది. కానీ మరో విడత కరోనా ఉధృతితో 2022 జనవరి మొదటి వారంలో 25 శాతం రద్దీ తగ్గిపోయినట్టు క్రిసిల్ తెలిపింది. కరోనా రెండో విడతలో 2021 ఏప్రిల్–మే నెలలోనూ ఇదే మాదిరి 25 శాతం మేర క్షీణత నమోదైనట్టు గుర్తు చేసింది. అంతర్జాతీయ రెగ్యులర్ విమాన సర్వీసులు ఈ ఏడాది జనవరి తర్వాతే ప్రారంభం కావచ్చని క్రిసిల్ పేర్కొంది. ప్యాసింజర్ లోడ్ ఫ్యాక్టర్ (విమానంలో ప్రయాణికుల భర్తీ) 2021 మే నెలలో 50 శాతంగా ఉండగా.. 2021 డిసెంబర్ నాటికి 80 శాతానికి పెరిగింది. ఆరు నెలల్లో రూ.11,323 కోట్ల నష్టం ‘మూడు ప్రధాన ఎయిర్‌లైన్స్ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లోనే (2021 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు) రూ.11,323 కోట్ల నష్టాలను నమోదు చేశాయి. కాకపోతే దేశీయ విమాన సర్వీసులు బాగా పుంజుకోవడంతో మూడో త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) మెరుగైన ఆదాయం కొంత వరకు నష్టాలను సర్దుబాటు చేసుకునేందుకు మద్దతుగా నిలిచాయి. కానీ, కరోనా మూడో విడత కారణంగా వచ్చిన ఆంక్షల ప్రభావంతో నాలుగో త్రైమాసికంలో (2021 జనవరి–మార్చి) నష్టాలు గణనీయంగా పెరగనున్నాయి. దీంతో ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఎయిర్‌లైన్స్ భారీ నష్టాలు నమోదు చేస్తాయని అంచనా వేస్తున్నాం’ అని క్రిసిల్ డైరెక్టర్ నితేశ్ జైన్ తెలిపారు. ఏటీఎఫ్ ధర 2021 నవంబర్‌లో లీటర్‌కు గరిష్టంగా రూ.83కు చేరింది. 2020–21లో సగటు ఏటీఎఫ్ ధర లీటర్‌కు రూ.44గానే ఉంది. ఇంధన ధరలు రెట్టింపు కావడం, ట్రాఫిక్ తగ్గడం నష్టాలు పెరిగేందుకు కారణంగా క్రిసిల్ వివరించింది. దీంతో ఎయిర్‌లైన్స్ రుణ భారం కూడా పెరిగిపోతుందని అంచనా వేసింది. -
వాయిదా పద్దతుల్లో విమాన టికెట్లు
న్యూఢిల్లీ: చౌక చార్జీల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ కొత్తగా ప్రయాణికుల కోసం ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. విమాన టికెట్ల చార్జీలను సులభ వాయిదాల్లో (ఈఎంఐ) కట్టే సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రకారం మూడు, ఆరు లేదా 12 వాయిదాల్లో చెల్లించవచ్చు. ప్రారంభ ఆఫర్ కింద ఎటువంటి అదనపు భారం (వడ్డీ భారం) లేకుండా మూడు నెలల ఈఎంఐ ఆప్షన్ పొందవచ్చని సంస్థ తెలిపింది. ఈ స్కీమును ఉపయోగించుకోవడానికి ప్రయాణికులు తమ పాన్ నంబరు, ఆధార్ నంబరు వంటి ప్రాథమిక వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత వన్–టైమ్ పాస్‌వర్డ్‌తో ధృవీకరించాల్సి ఉంటుంది. ఏకీకృత చెల్లింపు విధానానికి సంబంధించిన యూపీఐ ఐడీ ద్వారా మొదటి వాయిదా చెల్లించాలి. అదే యూపీఐ ఐడీ నుంచి తదుపరి ఈఎంఐలు డిడక్ట్ అవుతాయి. ఈఎంఐ స్కీమును ఉపయోగించుకోవడానికి క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ వివరాలను సమర్పించనక్కర్లేదు. -
విమానాల్లో ‘జీఎక్స్’ ఇంటర్నెట్ సేవలు
న్యూఢిల్లీ: విమానాల్లో హై–స్పీడ్ ఇన్‌ఫ్లయిట్ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు అవసరమైన లైసెన్సును ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ దక్కించుకుంది. దీనితో ఇకపై ఏవియేషన్, మారిటైమ్, ప్రభుత్వ విభాగాల్లో బ్రిటన్ శాటిలైట్ సంస్థ ఇన్మార్శాట్కు చెందిన గ్లోబల్ ఎక్స్‌ప్రెస్ (జీఎక్స్) మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించనుంది. బీఎస్ఎన్ఎల్ వ్యూహాత్మక భాగస్వామ్య సంస్థ అయిన ఇన్మార్శాట్ ఈ విషయాలు వెల్లడించింది. వివిధ సరీ్వసులను దశలవారీగా ప్రవేశపెట్టనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే స్పైస్‌జెట్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తదితర సంస్థలు జీఎక్స్ సరీ్వసులు పొందేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఇన్మార్శాట్ ఇండియా ఎండీ గౌతమ్ శర్మ తెలిపారు. వీటితో భారత గగనతలంలో ఎగిరే దేశ, విదేశ ఎయిర్‌లైన్స్‌లో వేగవంతమైన ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుంది. దీనితో విమాన ప్రయాణికులు ఆకాశంలో కూడా ఇంటర్నెట్ బ్రౌజ్ చేసుకోవడం, సోషల్ మీడియాను చెక్ చేసుకోవడం, ఈమెయిల్స్ పంపడం, యాప్స్ ద్వారా వాయిస్ కాల్స్ చేయడం వంటివి వీలవుతుంది. -
ఎయిరిండియాకు ఐటీ సపోర్ట్
న్యూఢిల్లీ: విమానయాన పీఎస్‌యూ.. ఎయిరిండియా ఆస్తులను ప్రత్యేక ప్రయోజన కంపెనీ(ఎస్పీవీ)కి బదిలీ చేయడంలో ఎలాంటి పన్ను విధింపులూ ఉండబోవని ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు(సీబీటీడీ) తాజాగా వెల్లడించింది. ఎయిరిండియా అసెట్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ పేరుతో ఏర్పాటు చేసిన ఎస్పీవీకి ఆస్తుల బదలాయింపు చేపట్టిన సందర్భంలో మూలంవద్దే పన్ను విధింపు(టీడీఎస్) నుంచి ప్రభుత్వం మినహాయింపునిచి్చంది. తద్వారా ఎయిరిండియా డిజిన్వెస్ట్మెంట్కు మరింత మద్దతునిస్తోంది. కంపెనీ విక్రయ ప్రక్రియకంటే ముందుగానే ప్రభుత్వం 2019లో ఎస్పీవీ ఏర్పాటుకు తెరతీసింది. దీనిలో భాగంగా ఎయిరిండియా రుణాలు, కీలకంకాని ఆస్తులను ఎస్పీవీకి బదిలీ చేసేందుకు నిర్ణయించింది. ఎస్పీవీకి స్థిరాస్తుల బదిలీ కారణంగా ఎయిరిండియాకు చేపట్టే చెల్లింపుల విషయంలోనూ టీడీఎస్ కోత ఉండబోదని సీబీడీటీ పేర్కొంది. ఆస్తుల బదిలీ అంశంలో ఎయిరిండియాను విక్రేతగా పరిగణించలేమని తెలియజేసింది. ప్రభుత్వం ఎయిరిండియాతోపాటు అనుబంధ సంస్థ ఏఐ ఎక్స్‌ప్రెస్‌లోగల 100 శాతం వాటాలను విక్రయించే ప్రణాళికల్లో ఉంది. అంతేకాకుండా ఎయిరిండియా శాట్స్ ఎయిర్పోర్ట్ సరీ్వసెస్‌లోనూ 50 శాతం వాటాను విక్రయించనుంది. ఇందుకు అనుగుణంగా కొనుగోలుదారులు ఈ నెల 15కల్లా ఫైనాన్షియల్ బిడ్స్‌ను దాఖలు చేయవలసి ఉన్న సంగతి తెలిసిందే. -
డ్రోన్ టెక్నాలజీలో గ్లోబల్ హబ్‌గా భారత్
సాక్షి, హైదరాబాద్: విమానయాన రంగంలో విప్లవాత్మక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. డ్రోన్ టెక్నాలజీని అభివృద్ధి పరుస్తూ కీలక రంగాల్లో వినియోగిస్తున్నట్లు చెప్పారు. అధికారిక పర్యటనలో భాగంగా హైదరాబాద్ వచ్చిన ఆయన శనివారం సాయంత్రం బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. డ్రోన్ టెక్నాలజీలో భారత్ గ్లోబల్ హబ్‌గా మారనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఔషధ సరఫరాకు డ్రోన్లను వినియోగించడం గొప్ప మార్పు అని, దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు. విమానయాన రంగంలో డిజిటల్ ఎయిర్ స్పేస్ మ్యాప్ ద్వారా అనుమతులను సులభతరం చేసినట్లు చెప్పారు. భవిష్యత్‌లో ‘ఓలా ట్యాక్సీ’ తరహాలో ఎయిర్ ట్యాక్సీలు కూడా అందుబాటులోకి వస్తాయన్నారు. హైదరాబాద్ విమానాశ్రయాన్ని విస్తరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిపారు. బేగంపేటలోని పాత విమాశ్రయాన్ని కూడా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. వరంగల్, ఆదిలాబాద్‌లో బ్రౌన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేయబోతున్నట్లు పేర్కొన్నారు. జక్రాన్‌పల్లిలో కూడా ఎయిర్‌పోర్టుకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. తిరుపతి, గన్నవరం విమానాశ్రయాలను ప్రైవేటుపరం చేస్తున్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా, దేశంలో విమాన రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కొన్ని విమానాశ్రయాలను ప్రైవేటు వ్యక్తులకు లీజుకు మాత్రమే ఇస్తున్నట్లు చెప్పారు. టీఆర్ఎస్తో రాజకీయ పోరాటం అధికారిక పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్‌తో భేటీకావడం మర్యాదపూర్వకమేనని జ్యోతిరాదిత్య స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండే సంబంధాలే కేసీఆర్‌తోనూ ఉన్నాయన్నారు. కేంద్రమంత్రులు ప్రధాని విజన్‌ను అమలు చేసేందుకు ప్రయత్నిస్తారని.. దానికి, రాజకీయాలకు సంబంధం లేదని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. టీఆర్ఎస్తో బీజేపీ రాజకీయ పోరాటం కొనసాగుతుందన్నారు. భవిష్యత్తులో రాష్ట్రంలో బీజేపీ బలమైనరాజకీయ శక్తిగా మారనుందన్నారు. -
AP: కోలుకుంటున్న విమానయానం
సాక్షి, అమరావతి: కోవిడ్ సంక్షోభం నుంచి రాష్ట్ర విమానయాన రంగం వేగంగా కోలుకుంటోంది. కోవిడ్ తొలి వేవ్‌తో పోలిస్తే సెకండ్ వేవ్‌లో గణనీయమైన వృద్ధిరేటును నమోదు చేసింది. 2020–21 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)తో పోలిస్తే ఈ ఏడాది ప్రయాణికుల సంఖ్యలో 375.68 శాతం వృద్ధి నమోదైంది. విమాన సర్వీసుల సంఖ్యలో 271 శాతం వృద్ధి నమోదైనట్లు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తాజాగా విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. రాష్ట్రంలో మొత్తం ఆరు విమానాశ్రయాలు ఉండగా.. గతేడాది మొదటి మూడు నెలల్లో 1,933 సర్వీసులు నడిస్తే.. ఈ ఏడాది ఆ సంఖ్య 7,174కు చేరింది. ఇదే సమయంలో ప్రయాణికుల సంఖ్య 89,758 నుంచి 4,26,969కి చేరింది. తిరుపతికి పెరిగిన డిమాండ్ తిరుమలలో దర్శనాలకు అనుమతించడంతో తిరుపతి విమాన సర్వీసులకు డిమాండ్ భారీగా పెరిగింది. గతేడాదితో మొదటి మూడు నెలలతో పోలిస్తే ఈ ఏడాది విమాన సర్వీసుల్లో 530 శాతం, ప్రయాణికుల సంఖ్యలో 690 శాతం వృద్ధి నమోదైంది. గతేడాది మూడు నెలల్లో తిరుపతికి కేవలం 186 సర్వీసులు మాత్రమే నడవగా.. ఈ సారి ఆ సంఖ్య 1,172కు చేరుకుంది. ప్రయాణికుల సంఖ్య 7,272 నుంచి ఏకంగా 61,079కి పెరిగింది. ఈ ఏడాది కొత్తగా ప్రారంభించిన కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం నుంచి కూడా సర్వీసులు బాగానే నడుస్తున్నాయి. ఈ మూడు నెలల కాలంలో ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి 282 సర్వీసుల నడవగా 6,118 మంది ప్రయాణించారు. గతంతో పోలిస్తే విమాన సర్వీసుల సంఖ్య పెరిగినప్పటికీ ఇంకా కోవిడ్ పూర్వ స్థితికి చేరుకోవడానికి సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. కోవిడ్‌కు ముందు విశాఖ నుంచి రోజుకు సగటున 7 వేల మంది వరకు ప్రయాణించేవారని, ఇప్పుడు ఆ సంఖ్య 2,500 నుంచి 3,000కు చేరుకుందని విశాఖ ఎయిర్‌పోర్టు డైరెక్టర్ కృష్ణ కిషోర్ తెలిపారు. అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభమై, థర్డ్ వేవ్ ముప్పు లేకపోతే త్వరలోనే విమానయాన రంగం కోవిడ్ పూర్వస్థితికి చేరుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
ఆకాశవీధిలో పెళ్లి.. వధువరులపై కేసు!
న్యూఢిల్లీ: ఆకాశవీధిలో పెళ్లి చేసుకున్న జంటగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నూతన దంపతులు రాకేశ్‌దక్షిణలకు కొత్త చిక్కు వచ్చి పడింది. పెళ్లి సంబరం ముగియకముందే, శుభాకాంక్షల జడివాన ఆగకముందే కేసులు ఎదుర్కొవాల్సిన విపత్కర పరిస్థితి ఎదురైంది. పెళ్లిపై విచారణ ఛార్టెడ్ ఫ్లైట్‌లో నిబంధనలు ఉల్లంఘించి పెళ్లి చేసుకున్నారంటూ ఈ పెళ్లిపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది. వధువరులతో పాటు ఇరు కుటుంబాల పెద్దలపై కేసులు పెట్టేందుకు సిద్ధమైంది. అంతేకాదు పెళ్లి సమయంలో విధుల్లో ఉన్న ఫ్లైట్ సిబ్బందిని రోస్టర్ నుంచి తప్పిస్తూ షాక్ ఇచ్చింది. ఈ మొత్తం వ్యవహరంపై విచారణ చేయాలంటూ డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. ఉల్లంఘించారనే కోవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తోంది ఏవియేషన్ శాఖ. విమానాశ్రయంలో సైతం మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి చేసింది.ఈ సమయంలో ఎగురుతున్న విమానంలో మాస్కులు ధరించకుండా, సోషల్ డిస్టెన్స్ పాటించకుండా పెళ్లి వేడుక నిర్వహించడడం డీజీసీఏ ఇబ్బందిగా మారింది. దీంతో ఈ పెళ్లిని తీవ్రంగా పరిగణించింది డీజీసీఏ. వైరల్‌గా మారిన పెళ్లి తమిళనాడులోని మధురైకి చెందిన రాకేశ్, దక్షిణలు పెళ్లి కుదిరింది. పెళ్లి మధుర మీనాక్షి అమ్మవారి సన్నిధిలో పెళ్లి చేయాలని నిర్ణయించారు. వధువరులతో పాటు ఇరు కుటుంబాలకు చెందిన వారు బెంగళూరు నుంచి మధురైకి చార్టెట్ ఫ్లైట్‌లో బయల్దేరారు. అయితే తమిళనాడు ప్రభుత్వం లాక్డౌన్ అమలు చేయడంతో ... విమానంలోనే వధువరులకి పెళ్లి జరిపించారు ఇరు కుటుంబాల పెద్దలు.ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. దేశం నలుమూలల నుంచి ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. -
విమానాలకు ఇంధనం...పాడైన ఆహారంతో...!
వాషింగ్టన్: మీ ఇంట్లో ఆహారం ఎక్కువగా వృథా అవుతుందా...! మిగిలిపోయిన ఆహారాన్ని సింపుల్‌గా చెత్త బుట్టలో వేస్తున్నారా...! భవిష్యత్తులో మాత్రం అలా చేయకండి. చెత్తబుట్టలో వేసిన ఆహారాన్ని జాగ్రత్తగా దాచండి. మీరు పాడేసేది ఆహారాన్నే కాదు.. డబ్బులను కూడా ... వీడేవండి బాబు..! ఇలా చెప్తున్నాడు అనుకుంటున్నారా... అవును మీరు వినందీ నిజమే, భవిష్యత్తులో పాడైపోయిన ఆహారం మీకు కాసులను కురిపించనున్నాయి. అది ఎలా అని వాపోతున్నారా..! పాడైపోయిన ఆహారంతో విమానాలకు ఇంధనాన్ని తయారుచేయవచ్చును. ఆహార వ్యర్థాలను విమానయాన ఇంధనంగా మార్చడానికి అమెరికా పరిశోధకులు ఒక మార్గాన్ని కనుగొన్నారు. దీంతోపాటుగా విమానాల నుంచి విడుదలయ్యే కార్బన్‌ను నియంత్రించవచ్చును. అంతేకాకుండా గ్రీన్హాజ్ ఉద్గారాలను 165 శాతం తగ్గించవచ్చును. ఆహార వ్యర్థాల నుంచి రిలీజ్ అయ్యే మిథేన్ వాయువును అరికట్టవచ్చును.ఈ వ్యర్థాలతో పారఫిన్ అనే ఇంధనాన్ని తయారుచేయవచ్చునని పరిశోధకులు తెలిపారు. ఈ ఇంధనాన్ని జెట్ విమానాలకు వాడొచ్చు. ప్రస్తుతం విమాయానరంగ సంస్థలకు ప్రయాణీకుల సంఖ్య గణనీయంగా పెరిగిన, అదే స్ధాయిలో ఉద్గారాలను తగ్గించలేకపోతున్నాయి. పాడైన ఆహారం నుంచి పారాఫిన్... పరిశోధకుల నివేదిక ప్రకారం.. పాడైన ఆహారాన్ని, కార్లలో , ఇతర హెవీ వెహికల్లో వాడే ఇంధనం బయోడిజీల్ మాదిరిగానే పారఫిన్‌ను తయారుచేయవచ్చునని పేర్కొన్నారు. సింథటిక్ ఇంధనాన్ని తయారుచేయడానికి వంటనూనె, పనికి రాని కొవ్వు పదార్థాలు , నూనె , గ్రీజు అవసరమౌతాయి. వీటి కలయికతో డీజీల్‌ను పొందవచ్చు. అదే మాదిరిగా కొన్ని ప్రత్యేక పద్ధతులనుపయోగించి జెట్ ఫ్యూయల్‌ను తయారుచేయవచ్చును. అందుకుగాను పరిశోధకులు ప్రత్యామ్నాయ పద్ధతులతో ఆహార వ్యర్థాలను , జంతువుల ఎరువు, వ్యర్థజలాలను జెట్ హైడ్రోకార్బన్ ఇంధనంగా తయారుచేసే పద్ధతిని అభివృద్ధి పరిచారు. తొందరగా ఆవిరయ్యే ఫాటీ ఆసిడ్స్‌తో సులువుగా జెట్ ఫ్యూయల్‌ను తయారుచేయవచ్చునని అమెరికా జాతీయ పునరుత్పాదక శక్తి పరిశోధన సంస్ధ కు చెందిన సీనియర్ ఇంజనీరు డెరేక్ వార్డన్ తెలిపారు. పాడైన ఆహారంతో తయారైన జెట్ ప్యూయల్తో 2023లో సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి మొట్టమొదటి టెస్ట్ ఫ్లైట్‌ను పరీక్షంచనున్నారు. (చదవండి: గూగుల్ మ్యాప్స్ కొత్త ఆప్డేట్.. !) -
టీకా తీసుకున్నాక 48 గంటలు ఆగాల్సిందే
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న పైలట్లు కనీసం 48 గంటల పాటు వేచి ఉండి, ఆ తర్వాతే విమానాలు నడపాల్సిందిగా విమానయానాన్ని నియంత్రించే డీజీసీఏ మంగళవారం స్పష్టం చేసింది. అప్పటి వరకూ వారంతా మెడికల్‌గా అన్‌ఫిట్ అని తేల్చి చెప్పింది. అంతేగాక 48 గంటల తర్వాత కూడా ఏ ప్రతికూల లక్షణాలు లేకపోతేనే నడపాలని తెలిపింది. అన్‌ఫిట్ లక్షణాలు 14 రోజులకు మించి సాగితే వారికి ప్రత్యేక మెడికేషన్ పరీక్ష ఉంటుందని, అనంతరం వారికి ఫిట్నెస్ ఉందో లేదో చెబుతామంది. పైలట్లతో పాటు క్యాబిన్ సిబ్బందికి కూడా ఇదే నియమం వర్తిస్తుందని చెప్పింది. వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత విమానాల్లో పని చేసే సిబ్బందిని అరగంట పాటు వైద్యులు పరిశీలిస్తారని చెప్పింది. -
పర్యాటకం పట్టాలెక్కేనా?
న్యూఢిల్లీ: కరోనా వైరస్ నియంత్రణ కోసం కేంద్రం విధించిన లాక్డౌన్ చర్యలతో ఎక్కువగా దెబ్బతిన్న రంగాల్లో పర్యాటకం (టూరిజం), ఏవియేషన్‌ను ప్రధానంగా చెప్పుకోవచ్చు. కరోనా భయంతో ప్రజలు ముఖ్య అవసరాలు మినహాయించి ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు తొలి నాళ్లలో సుముఖత చూపలేదు. దీంతో గడిచిన ఏడాది కాలంలో పర్యాటక రంగం భారీ నష్టాలను మూటగట్టుకుంది. ఈ పరిస్థితుల్లో ఫిబ్రవరి 1న ప్రకటించే బడ్జెట్లో కచ్చితంగా తమను ఒడ్డెక్కించే చర్యలు ఉంటాయని ఈ రంగానికి చెందిన కంపెనీలు ఆశావహంగా ఉన్నాయి. రూ.1.25 లక్షల కోట్ల నష్టం.. కరోనా కారణంగా పర్యాటక రంగం ఒక్కటే 2020లో రూ.1.25 లక్షల కోట్ల మేర నష్టపోయినట్టు కేర్ రేటింగ్స్ అంచనా వేసింది. 2020 జనవరి, ఫిబ్రవరి నెలల్లో పర్యాటక రంగంపై 50 శాతం ప్రభావం పడగా.. మార్చిలో 70 శాతానికి పెరిగింది. ఇదే నెలలో అంతర్జాతీయ విమాన సర్వీసులను కేంద్రం పూర్తిగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) ఏప్రిల్ నుంచి జూన్ కాలంలో పర్యాటక రంగం రూ.69,400 కోట్ల మేర నష్టపోయిందని కేర్ రేటింగ్స్ తెలిపింది. వార్షిక ప్రాతిపదికన చూస్తే 30 శాతం నష్టాలుగా పేర్కొంది. ఈ రంగం తిరిగి సాధారణ స్థితికి రావాలంటే రెండేళ్లు పడుతుందని అభిప్రాయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో పరిశ్రమను తిరిగి పట్టాలెక్కించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో పలు చర్యలను ప్రకటించొచ్చని ఈ రంగానికి చెందిన కంపెనీలు ఆశిస్తున్నాయి. పరిశ్రమ డిమాండ్లు.. ► దేశీయంగా చేసే పర్యటనలపై ఆదాయపన్ను మినహాయింపును ఇవ్వాలన్న డిమాండ్‌ను పర్యాటక రంగం ఈ విడత కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లింది. జీఎస్టీ నమోదిత టూర్ ఆపరేటర్లు, ఏజెంట్లు, హోటళ్ల సేవల కోసం రూ.1.5 లక్షల వరకు ఖర్చుపై పన్ను మినహాయింపు ఇవ్వాలి. టూరిజమ్ పరిశ్రమ జీడీపీలో 6.23 శాతం వాటాతో ప్రముఖ పాత్ర పోషిస్తూ.. 8.78 శాతం మందికి ఉపాధి కల్పిస్తోంది. హోటళ్లు, రెస్టారెంట్లు, ట్రావెల్ సంస్థలు, ఏవియేషన్, ఆతిథ్యం ఇవన్నీ టూరిజమ్ పరిశ్రమ కిందకే వస్తాయి. ► ఉద్దీపన ప్యాకేజీని ఇవ్వాలని, జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలి. ► గడిచిన 10–12 నెలల కాలంలో దెబ్బతిన్న డిమాండ్‌ను పునరుద్దరించేందుకు తగినన్ని నిధులు కేటాయించి.. కష్టాల నుంచి బలంగా బయటపడేందుకు, డిమాండ్ పెంచేందుకు ప్రభుత్వం సహకరించాలి. ► ఆర్థిక వ్యవస్థ చురుగ్గా మారాలంటే వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాలి. అందుకు దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును ఎత్తివేయాలి. ► ఎంఎస్ఎంఈ మూలధన నిధుల రుణాలను పర్యాటక రంగానికీ విస్తరించడం ద్వారా ఉద్యోగాల కల్పనకు సహకరించాలి. ► రుణాల వడ్డీపై వెసులుబాట్లు, రుణ చెల్లింపులపై మారటోరియం కల్పించాలి. ► ఏవియేషన్ టర్బయిన్ ఫ్యూయల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి. ఎయిర్పోర్ట్ చార్జీలపై లెవీలను, ల్యాండింగ్, నేవిగేషన్ చార్జీలను కూడా తగ్గించాలి. ► లాక్డౌన్లను ఎత్తేసి, ప్రయాణాలపై ఆంక్షలు తొలగించిన అనంతరం పర్యాటక రంగంలో క్రమంగా పురోగతి కనిపిస్తోంది. వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుతూ వస్తుండడం, మరోవైపు టీకాల కార్యక్రమం కూడా మొదలైనందున రానున్న నెలల్లో మంచి వృద్ధి ఉంటుందని ఈ రంగం అంచనా వేస్తోంది. ప్రభుత్వపరమైన సహకారం తోడైతే తాము మరింత వేగంగా పురోగమించొచ్చని భావిస్తోంది. ఆతిథ్య రంగాన్ని ముందుగా ఒక పరిశ్రమగా గుర్తించాలి. అద్దె ఇళ్ల విధానాన్ని తీసుకురావాలి. ఈ రెండు ప్రధాన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతున్నాము. పరిశ్రమ ఎంత వేగంగా పుంజుకుంటుందన్నది ప్రభుత్వ చర్యలపైనే ఆధారపడి ఉంటుంది. – కృష్ణ కుమార్, సీఈవో, ఇస్తారా పార్క్స్ 2022 నాటికి దేశీయంగా 22 పర్యాటక ప్రాంతాలను సందర్శించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు ఎంతో ఉత్సాహాన్నిచ్చేది. ఇందులో భాగంగా పర్యాటక రంగానికి వెన్నెముకగా నిలిచే హోటళ్లకు ప్రభుత్వం పూర్తి మద్దతునివ్వాలి. ఎంఎస్ఎంఈ వర్కింగ్ క్యాపిటల్ రుణాలను టూరిజమ్ పరిశ్రమకూ ఇవ్వాలి. ఎల్‌టీసీజీని వెనక్కి తీసుకోవాలి. – రోహిత్ వారియర్, వారియర్ సేఫ్ సీఈవో వ్యక్తిగత ఆదాయపన్ను తగ్గింపు దేశీయ పర్యాటక రంగానికి మేలు చేస్తుంది. –దీప్‌కల్రా,మేక్మైట్రిప్ వ్యవస్థాపకుడు -
విమానయాన షేర్లు లాభాల టేకాఫ్
దేశీయ విమానయాన కంపెనీల షేర్లు గురువారం ఉదయం ట్రేడింగ్‌లో లాభాల బాట పట్టాయి. లాక్‌డౌన్‌తో దాదాపు 2నెలల విరామం తర్వాత సోమవారం (మే 25) నుంచి దేశీయ విమాన సర్వీసులను నడపనున్నట్లు కేంద్రం ప్రకటించడంతో ఏవియేషన్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఈ రంగానికి చెందిన ఇండిగో, స్పైస్ జెట్, జెట్ ఎయిర్వేస్, గ్లోబల్ వెక్టా హెలీకార్పో లిమిటెడ్ కంపెనీల షేర్లు 11శాతం నుంచి 8శాతం లాభపడ్డాయి. కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ బుధవారం కీలక ప్రకటన చేశారు. దేశంలో 2,3 నెలలుగా నిలిచిపోయిన దేశీయ (డొమెస్టిక్) విమానాలు మే 25వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయని ఈయన ట్విట్టర్ వేదికగా తెలిపారు. అయితే, కచ్చితమైన నిబంధనలను, ఆంక్షలను విమానాశ్రాయాల్లోను, విమానాల్లోను తప్పకుండా పాటించాల్సి వుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ విధివిధానాలను విమానయాన శాఖ వెల్లడిస్తుందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. షేర్ల ధరల జోరు... ఇండిగో షేరు: నేడు బీఎస్ఈలో రూ.1002.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం 10గంటలకు షేరు మునుపటి ముగింపు(రూ.911.90)తో పోలిస్తే 8శాతం లాభంతో రూ.986.50 వద్ద ట్రేడ్ అవుతోంది. షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.765.05, రూ.1911.00గా ఉన్నాయి. స్పైస్ జెట్ షేరు: నేడు బీఎస్ఈలో 5శాతం లాభంతో రూ.42.95 వద్ద ప్రారంభమైన అదే ధర వద్ద అప్పర్ సర్కూ్యట్‌ను తాకి ఫ్రీజ్ అయ్యింది. జెట్ ఎయిర్వేస్: నేడు బీఎస్ఈలో రూ.19.90 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం 10గంటలకు షేరు మునుపటి ముగింపు(రూ.911.90)తో పోలిస్తే 4.91శాతం లాభంతో రూ.20.30 వద్ద ట్రేడ్ అవుతోంది. షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.13, రూ.164.90గా ఉన్నాయి. -
పర్యాటకం ఢమాల్!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ దెబ్బతో దేశీ పర్యాటక రంగం కుదేలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నెలరోజులపాటు వీసాలు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ట్రావెల్, టూరిజం, ఏవియేషన్ రంగాలు దాదాపు రూ. 8,500 కోట్లు నష్టపోయే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమవర్గాలు తెలిపాయి. కంపెనీలు.. రిక్రూట్మెంట్ నిలిపివేయడం, అంతగా అవసరం ఉండని సిబ్బందిని తొలగించడం వంటి చర్యలు తీసుకోనుండటంతో ఆయా రంగాల్లో భారీగా ఉద్యోగాల కోతలు కూడా ఉండొచ్చని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ (ఏఐటీవో), అసోచాం వంటి పరిశ్రమల సమాఖ్యలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో వీసాలపై నెల రోజుల నిషేధాన్ని పది రోజుల తర్వాతైనా పునఃసమీక్షించాలని, కొన్ని నగరాల నుంచైనా భారత్‌కి ప్రయాణాలను అనుమతించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. కరోనా వైరస్ బైటపడినప్పటికీ ఇప్పటిదాకా ఎంతో కొంతైనా పర్యాటకం కొనసాగుతుండటం వల్ల సిబ్బందిని, ఖర్చులను కాస్తయినా నిర్వహించుకోగలుగుతున్నామని.. వీసాల రద్దుతో గట్టి దెబ్బే తగలనుందని అసోచాం టూరిజం, హాస్పిటాలిటీ కౌన్సిల్ చైర్మన్ సుభాష్ గోయల్ చెప్పారు. దేశీ ఏవియేషన్ క్రాష్: అత్యవసరంగా వెళ్లాల్సిన పనుల మీద తప్పించి.. సాధారణ ప్రయాణాలను ప్రజలు వాయిదా వేసుకుంటున్న నేపథ్యంలో దేశీ విమానయానం ఈ మధ్యకాలంలో 15% వరకు తగ్గిపోయిందని అంచనా. ముఖ్యంగా ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి ప్రధాన నగరాల నుంచి రాకపోకలు గణనీయం గా తగ్గిపోయాయి. టికెట్లు బుక్ చేసుకున్న కస్టమర్లు కూడా ఆఖరి నిమిషంలో రద్దు చేసుకుంటున్నారని ఎయిర్‌లైన్స్ చెబుతున్నాయి. ఆక్యుపెన్సీ రేటు తగ్గిపోతున్న కారణంగా విమాన సేవలు నడిపేందుకయ్యే కనీస ఖర్చులు కూడా గిట్టుబాటు కావడం లేదని, ఫలితంగా ఎయిర్‌లైన్స్ ఆదాయాలు పడిపోతున్నాయని జేఎం ఫైనాన్షియల్స్ ఒక నివేదికలో పేర్కొంది. ఇదే పరిస్థితి ఇంకొన్నాళ్లు కొనసాగితే.. కరోనా వైరస్ మహమ్మారి ధాటికి బ్రిటన్‌కు చెందిన విమానయాన సంస్థ ఫ్లైబీ మాదిరిగానే ఇక్కడి సంస్థలు కూడా కుప్పకూలొచ్చని తెలిపింది. బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో తగ్గిన ట్రాఫిక్.. బెంగళూరు విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రయాణీకుల సంఖ్య 50 శాతం తగ్గిపోయింది. కరోనావైరస్ భయాలతో పలు దేశాలు ట్రావెల్పరమైన ఆంక్షలు విధించడం, పలు ఫ్లయిట్లు రద్దు కావడం తదితర అంశాలు దీనికి కారణం. ఇటు దేశీయంగా ప్రయాణించే వారి సంఖ్య కూడా 2–4 శాతం తగ్గిందని, కరోనా కేసులు పెరిగిన పక్షంలో ఇది ఇంకా పెరగవచ్చని బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (బీఐఏఎల్) ఒక ప్రకటనలో తెలిపింది. దేశీ విమానాశ్రయాల్లో అంతర్జాతీయ ప్యాసింజర్ల సంఖ్య గతంలో రోజుకు 70,000 స్థాయిలో ఉండగా.. ప్రస్తుతం 62,000కు తగ్గిపోయినట్లు పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ తెలిపారు. ఇది 40,000కు కూడా పడిపోవచ్చన్నారు. వోల్వో బస్సు టికెట్ రేటుకే.. ఆఖరి నిమిషంలో టికెట్ల రద్దుతో నిర్వహణ ఖర్చులైనా రాబట్టుకునేందుకు ఎయిర్‌లైన్స్ ప్రయత్నిస్తున్నాయి. ఉదాహరణకు.. చెన్నై నుంచి బెంగళూరుకు వోల్వో బస్సు టికెట్ ధర రూ.1,100 ఉండగా.. ఇదే ధరకు పలు కంపెనీల విమాన టికెట్ లభిస్తోంది. ఇంకా చాలా రూట్లలో ఇదే తరహాలో విమాన టికెట్ల రేట్లు పడిపోయాయి. ‘బేర్’ గుప్పిట్లోకి.. ఈ ఏడాది జనవరిలో సెన్సెక్స్, నిఫ్టీలు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలను తాకాయి. ఈ ఏడాది జనవరి 20న నిఫ్టీ జీవిత కాల గరిష్ట స్థాయి, 12,431 పాయింట్లకు చేరింది. ఈ గరిష్ట స్థాయిల నుంచి చూస్తే గురువారం నాడు నిఫ్టీ 22 శాతం మేర నష్టపోయింది. ఈ దృష్ట్యా చూస్తే, మన స్టాక్ మార్కెట్ బేర్ దశలోకి జారిపోయిందని నిపుణులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా షేర్ గానీ, సూచీ గాని ఇటీవలి గరిష్ట స్థాయి నుంచి 20 శాతం పతనమైతే, బేర్ దశ ప్రారంభమైనట్లుగా పరిగణిస్తారు. మన మార్కెట్ బేర్ దశలోకి జారిపోవడం ఇదే మొదటిసారి కాదు. 2015లో, 2010లో కూడా బేర్ దశలోకి జారిపోయింది. ఈ బేర్ దశ చాలా కాలం కొనసాగవచ్చు. సాధారణంగా బేర్ మార్కెట్ రెండేళ్ల పాటు ఉంటుంది. 2015 బేర్ మార్కెట్ నుంచి 2017లో మన స్టాక్ మార్కెట్ కోలుకుంది. ఇక తాజా బేర్ మార్కెట్ ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కోవిడ్–19 వైరస్ కల్లోలం సద్దుమణగగానే మార్కెట్ మళ్లీ పుంజుకోగలదని వారంటున్నారు. -
విమానయాన సంస్థలతో తల్వార్ లింకులపై దర్యాప్తు
న్యూఢిల్లీ: కార్పొరేట్ లాబీయిస్ట్ (వ్యవహారాల నేర్పరి) దీపక్ తల్వార్‌కు దేశ, విదేశాలకు చెందిన 50 సంస్థలతో ఉన్న సంబంధాలపై దర్యాప్తు ఏజెన్సీలు దృష్టి సారించాయి. తన విదేశీ క్లయింట్లకు అనుకూలంగా ఎయిర్ ట్రాఫిక్ హక్కులను సంపాదించేందుకు గాను ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయనేతలకు తల్వార్ లంచాలు ఇచ్చినట్టు.. తద్వారా విమానయాన సంస్థల నుంచి తల్వార్‌కు రూ.272 కోట్లు ముట్టినట్టు దర్యాప్తు నివేదిక స్పష్టం చేస్తోంది. యూపీఏ హయాంలో తల్వార్ లాబీయింగ్ వ్యవహారాలు, ముఖ్యంగా విమానయాన రంగానికి సంబంధించిన వాటిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ దర్యాప్తు చేస్తున్నాయి. ప్రస్తుతం తల్వార్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. ఈ ఆరోపణలను ఆయన ఖండించడం గమనార్హం. ఎయిర్ఇండియా ప్రయోజనాలకు గండికొట్టి.. 2008–09లో మూడు విదేశీ విమానయాన కంపెనీలకు అనుకూలంగా ట్రాఫిక్ హక్కులను తల్వార్ సంపాదించిపెట్టినట్టు దర్యాప్తు ఏజెన్సీలు అభియోగాలు మోపాయి. -
ఏవియేషన్ స్కామ్‌లో చిదంబరానికి ఈడీ నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : ఏవియేషన్ కుంభకోణం కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరానికి ఈడీ నోటీసులు జారీ చేసింది. బోయింగ్, ఎయిర్‌బస్‌ల నుంచి రూ 70,000 కోట్లకు విమానాల కొనుగోలుకు సంబంధించిన ఈ కేసులో మాజీ కేంద్ర పౌర విమానయాన మంత్రి ప్రఫుల్ పటేల్‌కు సీబీఐ గత వారం సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ రంగ ఎయిరిండియాకు నష్టం వాటిల్లేలా చర్యలు చేపట్టారని వీరిపై ఆరోపణలున్నాయి. ఈ స్కామ్ జరిగిన సమయంలో చిదంబరం ఆర్థిక మంత్రిగా, ప్రఫుల్ పటేల్ పౌరవిమానయాన మంత్రిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఎయిర్ ఇండియాను నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ విమానయాన సంస్థలకు ఆయన అనుకూలంగా వ్యవహరించారని, ఏవియేషన్ లాబీయిస్ట్ దీపక్ తల్వార్‌తో టచ్‌లో ఉన్నారని ప్రఫుల్ పటేల్‌పై ఆరోపణలున్నాయి. విదేశీ ఎయిర్‌లైన్స్‌కు ప్రయోజనాలు దక్కేలా తల్వార్ పటేల్‌తో చర్చలు జరిపారని అభియోగాలు ఎదుర్కొంటున్నారు. 2004 నుంచి 2011 మధ్య పటేల్ పౌర విమానయాన మంత్రిగా వ్యవహరించారు. -
ఏవియేషన్ కుంభకోణంలో దీపక్ తల్వార్ అరెస్ట్
న్యూఢిల్లీ : యూపీఏ హయాంలోని విమానయాన కుంభకోణానికి సంబంధించిన కేసులో దీపక్ తల్వార్‌ను గురువారం అరెస్టు చేసినట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే అప్పటి విమానయాన శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మూడు రోజుల పాటు గ్రిల్ దాఖలు చేసినట్లు స్పష్టం చేసింది. కాగా, ఈ కేసుకు సంబంధించి దీపక్ తల్వార్‌దే మొదటి అరెస్టు అని సీబీఐ తెలిపింది. సీబీఐ వివరాల ప్రకారం.. యూపీఏ హయాంలోని మంత్రులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారులతో దీపక్ తల్వార్ చట్టవిరుద్ధంగా లాబీయింగ్‌లో పాల్గొన్నట్లు స్పష్టం చేసింది. ఎమిరేట్స్, ఎయిర్ అరేబియా,ఖతార్ ఎయిర్వేస్ వంటి విమానయాన సంస్థలు తమ భద్రతకు సంబంధించి 2008-09లో అనుకూలంగా ట్రాఫిక్ హక్కులను పొందేందుకు దీపక్ తల్వార్‌కు రూ. 272 కోట్ల రూపాయలు చెల్లించినట్లు వెల్లడించింది. కాగా ఈ మొత్తం సొమ్మును అతని కుటుంబ సభ్యుల పేరుతో ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు తేలింది. ఈ మొత్తంలో కొంత భాగాన్ని బ్యాంక్ ఆఫ్ సింగపూర్‌లో తన పేరు మీద ఉన్న ఖాతాలో జమచేసినట్లు తమ దర్యాప్తులో తేలిందని స్పష్టం చేసింది. బ్రిటీష్ వర్జీనియాలోని ఎం/ఎస్ ఆసియా ఫీల్డ్ కంపెనీకి ఈ మొత్తాన్ని నగదు రూపంలో బదిలీ చేసినట్లు సమాచారం. అయితే ఈ కంపెనీ దీపక్ తల్వార్ పేరు మీద రిజిస్టరైనట్లు తేలింది. అయితే ఈ కేసు విచారణలో ఉండగానే దీపక్ తల్వార్ దుబాయ్ పారిపోయినట్లు సీబీఐ స్పష్టం చేసింది. అయితే ఈ ఏడాది జనవరి 31న దుబాయ్ ఇమ్మిగ్రేషన్ అథారిటీ అతన్ని దేశం నుంచి బహిష్కరించడంతో తాజాగా ఈడీ అతన్ని అదుపులోకి తీసుకుంది. ఎయిర్ ఇండియాలో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విలీనం, బోయింగ్-ఎయిర్‌బస్ నుంచి 111 విమానాలను రూ.70 వేల కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడం, ప్రైవేటు విమానయాన సంస్థలకు విదేశీ పెట్టుబడులతో శిక్షణా సంస్థలను ప్రారంభించడం లాంటివి ఈడీ ఈ కేసులో అటాచ్ చేసినట్లు సీబీఐ పేర్కొంది. -
ఏవియేషన్ ఎండీగా భరత్ రెడ్డి
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతన నియమాకాలు చేపట్టింది. అందులో భాగంగా ఏవియేషన్ కార్పొరేషన్ ఎండీగా భరత్ రెడ్డిని.. రైతు సాధికార సంస్థ సీఈవోగా అరుణ్ కుమార్‌ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
ప్రఫుల్‌కు ఈడీ సమన్లు
న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో జరిగిన ఏవియేషన్ స్కాంలో మాజీ మంత్రి, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం సమన్లు జారీ చేసింది. జూన్ 6వ తేదీన ఉదయం దర్యాప్తు సంస్థ అధికారి ముందు హాజరుకావాలని ఆయనకు నోటీసు ఇచ్చింది. విమానయాన మంత్రిగా తన హయాంలో వివిధ ఏవియేషన్ సంస్థలకు లాభం చేకూర్చే క్రమంలో ప్రభుత్వం కోట్లాది రూపాయలు నష్టపోయిందని ఈడీ ఆరోపిస్తోంది. అరెస్ట్అయిన లాబీయిస్ట్ దీపక్ తల్వార్ విచారణలో వెల్లడించిన వివరాల ప్రకారం, లభించిన సాక్ష్యాధారాల ఆధారంగా ఈ కుంభకోణంలో కోట్లాది రూపాయల ముడుపులు చేతులు మారాయని ఇది మనీలాండరింగ్ కేసుగా భావిస్తున్నామని ఈడీ తెలిపింది. -
నూతన అకౌంటింగ్ స్టాండర్డ్‌ను నోటిఫై చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: నూతన అకౌంటింగ్ స్టాండర్డ్ ‘ఐఎన్డీ ఏఎస్ 116’ను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. కంపెనీల్లో లీజుల వివరాలను వెల్లడించడం, బ్యాలన్స్ షీట్ల వివరాల వెల్లడిలో పారదర్శకతను తీసుకువచ్చేందుకు ఇది సాయపడుతుందని భావిస్తున్నారు.. విమానాలను లీజులపై తీసుకుని నడిపే ఏవియేషన్ సహా పలు రంగాలపై ఈ నూతన అకౌంటింగ్ ప్రమాణాలు గణనీయమైన ప్రభావం చూపనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి ఐఎన్డీ ఏఎస్ 116 అమల్లోకి వస్తుందని కేంద్రం తెలిపింది. -
ఎగిరే మోటర్‌బైక్.. ద స్పీడర్!
ట్రాఫిక్ పెరిగిపోతోందని చికాకు పడుతున్నారా? ఎంచక్కా గాల్లో ఎగురుకుంటూ ఆఫీసుకు వెళ్లగలిగితే భలే ఉంటుందని అనుకుంటున్నారా? అయితే మీ ఆశలు నెరవేరే రోజు దగ్గరలోనే ఉంది. అమెరికన్ కంపెనీ జెట్ప్యాక్ ఏవియేషన్ ‘ద స్పీడర్’ పేరుతో ఎగిరే మోటర్‌బైక్‌ను అభివృద్ధి చేయడం దీనికి కారణం. కొన్నేళ్ల క్రితం వెన్నుకు తగిలించుకునే జెట్‌ప్యాక్‌ను తయారు చేసిన కంపెనీ కూడా ఇదే కావడం విశేషం. ద స్పీడర్ విషయానికి వస్తే.. ఇది చూడ్డానికి మోటర్‌బైక్ మాదిరిగా ఉంటుంది. కానీ నిట్టనిలువుగా పైకి ఎగరగలదు. కాకపోతే దాదాపుగా బొక్కబోర్లా పడుకుని నడపాల్సి ఉంటుంది. మొత్తం నాలుగు టర్బోజెట్ ఇంజిన్లు ఉంటాయి. గరిష్టంగా 15000 అడుగుల ఎత్తులో ఎగరగల సామర్థ్యం దీని సొంతం. దాదాపు 125 కిలోల బరువు మోసుకెళ్లగలదు. కిరోసిన్ లేదా విమాన ఇంధనం సాయంతో 22 నిమిషాలపాటు ఎగురగలదు. అది కూడా గరిష్టంగా గంటకు 241 కిలోమీటర్ల వేగంతో! ఇంకోలా చెప్పాలంటే 30 నుంచి 40 కిలోమీటర్ల దూరం వెళ్లవచ్చునన్నమాట. ప్రస్తుతానికి తాము 20 నమూనా బైక్‌లను మాత్రమే తయారు చేస్తున్నామని కంపెనీ చెబుతోంది. ఐదు టర్బోజెట్ల ఇంజిన్లతో పైలట్ అవసరం లేని మైక్‌ల తయారీకి జెట్ప్యాక్ మిలటరీ వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అంతా బాగుంది కానీ.. ధర ఎంత అంటారా? ఒక్కో ‘ద స్పీడర్’ ఖరీదు రెండు కోట్ల రూపాయల వరకూ ఉంటుంది. మిలటరీ వెర్షన్ ఎంతన్నది మాత్రమే తెలియదు. -
ఐఆర్సీటీసీ బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: ఐఆర్సీటీసీ పోర్టల్ ద్వారా విమాన టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులు ఇకపై రూ. 50 లక్షల దాకా ప్రమాద బీమా సదుపాయాన్ని ఉచితంగా పొందవచ్చు. దేశ, విదేశీ ఫ్లయిట్స్‌లో ఏ తరగతికి చెందిన టికెట్లు బుక్ చేసుకున్న వారైనా దీన్ని పొందవచ్చని ఐఆర్సీటీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాదవశాత్తు శాశ్వత అంగవైకల్యం, మరణం సంభవించిన పక్షంలో ఈ బీమా కవరేజీ వర్తిస్తుందని పేర్కొంది. ఇన్సూరెన్స్ సేవల కోసం భారతి ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించింది. పాలసీ ప్రీమియంను ఐఆర్‌సీటీసీనే భరిస్తుంది. -
తొలి గగన విహారి ‘శ్రీమతి ఎన్సీ సేన్’
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో తొలి విమానం గాల్లోకి ఎప్పుడు ఎగిరింది? దాన్ని ఎవరు నడిపారు? అన్న ప్రశ్నలకు టక్కున సమాధానం చెప్పడానికి ఎన్నో రికార్డులు అందుబాటులో ఉన్నాయి. అయితే అవన్నీ కూడా భారత్‌లో తొలి విమానాలు ‘ఎగ్జిబిషన్’లో భాగంగా 1910లో ఎగిరాయి అని చెబుతున్నాయి తప్పించి. వాటిలో ఫలానా విమానం ముందు ఎగిరింది, ఫలానాది తర్వాత ఎగిరింది అని కచ్చితంగా చెప్పడం లేదు. బ్రిటీష్ వైమానికుడు వాల్టర్ విండమ్ 1910, డిసెంబర్ పదవ తేదీన అలహాబాద్‌లో ఎగ్జిబిషన్ నిర్వహించారని, అందులో భాగంగా కొంత మంది ప్రయాణికులను తన విమానంలో ఎక్కించుకొని ఆయన గగన విహారం చేశారని కొన్ని రికార్డులు తెలియజేస్తున్నాయి. కాదు, కాదు, అంతకుముందే, అంటే 1910 మార్చి నెలలోనే ఇటలీ హోటల్ యజమాని, వైమానికుడు గియాకోమో డీ ఏంజెలిస్ 1910, మార్చి నెలలో మద్రాస్‌లో తన విమానాన్ని ప్రదర్శించారని, అందులో ప్రయాణికులను ఎక్కించుకొని గగన విహారం చేశారని మరికొన్ని రికార్డులు చెబుతున్నాయి. కచ్చితంగా ఇది ముందు, అది వెనక అని రుజువు చేయడానికి భారత వైమానికి సంస్థ వద్ద కూడా ఎలాంటి చారిత్రక రికార్డులు లేవు. కానీ సరిగ్గా ఈ రోజుకు 108 ఏళ్ల క్రితం, అంటే 1910, డిసెంబర్ 19వ తేదీన తొలి మహిళా ప్రయాణికురాలు కోల్‌కతా నుంచి గగన విహారం చేసినట్లు రుజువులు దొరికాయి. కోల్‌కతాలోని టోలిగంజ్ క్లబ్లో నిర్వహించిన వైమానిక ఎగ్జిబిషన్లో భాగంగా శ్రీమతి ఎన్సీ సేన్ తొలి వైమానిక ప్రయాణికురాలిగా 1910, డిసెంబర్ 19వ తేదీన గగన విహారం చేసినట్లు ముంబైకి చెందిన ఔత్సాహిక వైమానిక అధ్యయన వేత్త దేబాశిష్ చక్రవర్తి కనుగొన్నారు. ఆయన ఏడాది కాలంగా అధ్యయనం చేస్తుండగా ఈ విషయం తేలింది. అది సరే, శ్రీమతి ఎన్సీ సేన్ ఎవరు? ఆమె ఫొటోను ప్రచురించిన నాటి ఏవియేషన్ మాగజైన్లో కూడా ఆమె పేరును ఎన్‌షీ సేన్‌గా పేర్కొన్నారు తప్ప, ఆమె గురించి ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. ఆ నాటికి చెందిన రక రకాల మేగజైన్లను మన చక్రవర్తి తిరిగేయగా, ఆమె బెంగాల్‌కు చెందిన ప్రముఖ తత్వవేత్త, సంఘ సంస్కర్త కేశబ్ చంద్రసేన్ కోడలని తేలింది. కేశబ్ చంద్రసేన్‌కు ఐదుగురు కొడుకులు ఉన్నారు? వారిలో ఏ కోడలు అన్న సమస్య వచ్చింది. వారిలో ముగ్గురు కొడుకులు విదేశీయులను పెళ్లి చేసుకొని విదేశాల్లో సెటిల్ అయ్యారు. ఆ కోడళ్లకు బెంగాల్ సంప్రదాయం ప్రకారం మామ ఇంటి పేరు రాలేదు. కానీ ఇద్దరికి వచ్చింది. దేబాశిష్ చక్రవర్తి వారిలో నిర్మలా సేన్ ఒక కోడలుకాగా, మృణాలిని దేవీ సేన్ మరొకరు. మృణాలిని దేవీ సేన్‌ను కూడా నీ లుద్దీ అని పిలుస్తారు. కనుక వీరిలో ఎవరైనా ఒకరు కావచ్చని, నిర్మలా సేన్‌నే కావచ్చని అధ్యయనవేత్త చక్రవర్తి భావిస్తున్నారు. 1910, డిసెంబర్ 28వ తేదీన టోలిగంజ్ క్లబ్లో ఏవియేషన్ మీటింగ్‌కు సంబంధించిన ఆహ్వాన పత్రం ‘ఈబే’లో వేలం వేసిన విషయం చక్రవర్తికి అధ్యయనంలో తేలడంతో ఆరోజే గగన విహారం జరిగినట్లు ముందుగా ఆయన పొరపొటు పడ్డారు. అదే వేలం పాటలో ఆ నాటి ప్రయాణికులకు టిక్కెట్లు విక్రయించి, వారి పేర్లను నోటు చేసుకొన్న నాటి ఎయిర్ హోస్టెస్ మాబెల్ బేట్స్ రాసుకున్న కాగితాన్ని కూడా విక్రయించారు. దాని ప్రతిని సాధించడంతో డిసెంబర్ 19వ తేదీన తొలి మహిళా ప్రయాణికురాలు గగన విహారం చేసినట్లు రూఢీ అయింది. ఈ విషయాన్ని ఫ్రెంచ్ వార్తా పత్రికలు ‘ఫిగారో’ డిసెంబర్ 22, 1920 నాటి సంచిక, ‘లీ టెంప్స్’ డిసెంబర్ 23, 1910, ‘గిల్ బ్లాస్’ డిసెంబర్ 26, 1910 నాటి సంచికలు రుజువు చేస్తున్నాయి. నాడు టోలిగంజ్ క్లబ్లో బెల్జియంకు చెందిన వైమానికులు బారన్ పిర్రే డీ కేటర్స్, జూలెస్ టైక్లు ఇద్దరూ తమ బైప్లేన్స్ (అంటే రెక్క మీద రెక్క నాలుగు రెక్కలు ఉంటాయి) నడిపారు. వారిలో ఎవరి విమానాన్ని శ్రీమతి ఎన్సీ సేన్ ఎక్కారో ఈ నాటికి ప్రశ్నే. -
జెట్‌పై టాటాల కన్ను!!
న్యూఢిల్లీ: విమానయాన రంగంలో ఇప్పటికే రెండు వెంచర్స్ ఉన్న టాటా గ్రూప్ తాజాగా ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలను మరింతగా విస్తరించడానికి సిద్ధమయింది. ఇందులో భాగంగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న జెట్ ఎయిర్వేస్పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పాక్షిక వాటాలు కాకుండా పూర్తి స్థాయిలో యాజమాన్య అధికారాలు ఉండేలా మొత్తం కంపెనీని లేదా ఎయిర్‌క్రాఫ్ట్ తదితర మౌలిక సదుపాయాలను కొనుగోలు చేయాలని భావిస్తోంది. దీనికి సంబంధించి టాటా సన్స్, జెట్ ఎయిర్వేస్ మధ్య ప్రాథమిక స్థాయిలో చర్చలు జరిగినట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలియజేశాయి. టాటా గ్రూప్ కొంత వాటాలు కొనుగోలు చేసి, ప్రమోటర్ నరేష్ గోయల్ కుటుంబంతో సంయుక్తంగా నియంత్రణ అధికారాలు తీసుకునేలా జెట్ ఎయిర్వేస్ ప్రతినిధులు ఈ సమావేశంలో ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే, టాటా గ్రూప్ ఈ ప్రతిపాదనను తోసిపుచ్చిందని, గోయల్ కుటుంబం పూర్తిగా ఎయిర్‌లైన్స్ నుంచి తప్పుకోవాలని, తమకు మొత్తం నియంత్రణ అధికారాలు ఇవ్వాలని స్పష్టం చేసినట్లు ఆ వర్గాలు వివరించాయి. జెట్ ఎయిర్వేస్ వర్గాలు మాత్రం దీన్ని తోసిపుచ్చాయి. ఇవన్నీ పూర్తిగా ఊహాజనిత వార్తలేనని పేర్కొన్నాయి. తీవ్ర నిధుల సంక్షోభం ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్వేస్ తమ సిబ్బందికి సకాలంలో జీతాలూ చెల్లించలేకపోతోంది. దీంతో కొంత మేర వాటాల విక్రయం కోసం ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతోంది. ఫ్రీక్వెంట్ ఫ్లయర్ వ్యాపార విభాగం జెట్ ప్రివిలేజ్‌ను విక్రయించే ప్రయత్నాల్లో ఉన్నట్లు ఇప్పటికే స్టాక్ ఎక్సే్చంజీలకు కూడా తెలియజేసింది. జెట్ ప్రతిపాదన ఇదీ.. జెట్ ఎయిర్వేస్లో గోయల్, ఆయన భార్యకు 51 శాతం వాటాలు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి చెందిన ఎతిహాద్ ఎయిర్వేస్కు మరో 24 శాతం వాటాలున్నాయి. టాటా గ్రూప్‌తో చర్చల సందర్భంగా 26 శాతం వాటా, వైస్ చైర్మన్ పదవి, బోర్డు స్థాయిలో కొందరిని నియమించే అధికారాలను జెట్ ప్రతినిధులు ఆఫర్ చేశారు. టాటా గ్రూప్ దీన్ని తిరస్కరించింది. ఇప్పటికే ఉన్న విమానయాన కార్యకలాపాల వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకునే క్రమంలో చిన్నా చితకా వాటాల డీల్స్‌పై టాటా గ్రూప్‌నకు ఆసక్తి లేదని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఉక్కు రంగంలో మొత్తం కంపెనీలనే కొనేసినట్లు .. విమానయాన రంగంలో కూడా కొంటే పూర్తి కంపెనీనే కొనుగోలు చేయాలని, పాక్షికంగా వాటాలు తీసుకుంటే లాభం ఉండదని టాటా గ్రూప్ భావిస్తున్నట్లు వివరించాయి. టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, జెట్ ఎయిర్వేస్ చైర్మన్ నరేష్ గోయల్ ఇప్పటికే ఒకసారి సమావేశమయ్యారు కూడా. ఒకవేళ టాటాలకు ఆమోదయోగ్యమైన మరో ప్రతిపాదన ఏదైనా తెరపైకి వస్తే.. చర్చలు ముందుకు సాగొచ్చని తెలుస్తోంది. వ్యాపార పునర్వ్యవస్థీకరణ.. టాటా గ్రూప్ ప్రస్తుతం దేశీయంగా రెండు విమానయాన సంస్థల్లో భాగస్వామిగా ఉంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి విస్తార పేరిట ఫుల్ సర్వీస్ విమానయాన సంస్థను నిర్వహిస్తోంది. అలాగే మలేషియాకి చెందిన బడ్జెట్ ఎయిర్‌లైన్ ఎయిర్‌ఏషియాతో ఎయిర్ఏషియా ఇండియాను నడిపిస్తోంది. ఒకవేళ జెట్ ఎయిర్వేస్ కొనుగోలు చర్చలు గానీ ఫలప్రదమైతే దానికి అనుగుణంగా ప్రస్తుత ఏవియేషన్ కార్యకలాపాలన్నింటినీ పునర్వ్యవస్థీకరించాలని భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. జెట్‌కు టీపీజీ క్యాపిటల్ నో.. నిధుల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్వేస్ .. అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం టీపీజీ క్యాపిటల్‌తో కూడా చర్చించింది. టాటా గ్రూప్ ముందుంచిన ప్రతిపాదన తరహా డీల్‌నే టీపీజీకి కూడా ఆఫర్ చేసింది. కానీ, దీన్ని టీపీజీ తిరస్కరించింది. ఇరు పక్షాల మధ్య రెండు విడతల చర్చలు జరిగాయి. కానీ యాజమాన్య అధికారాలు, వాటాల కొనుగోలు తర్వాత కూడా గోయల్ కుటుంబానికి కీలక హోదానిచ్చే అంశాలపై విభేదాల కారణంగా చర్చలు ముందుకు సాగలేదని సమాచారం. షేరు 6% జంప్.. టాటా సన్స్‌తో చర్చల నేపథ్యంలో శుక్రవారం బీఎస్ఈలో జెట్ ఎయిర్వేస్ షేరు 6 శాతం ఎగిసి రూ. 229.30 వద్ద క్లోజయ్యింది. ఇంట్రాడేలో 8.18% పెరిగి రూ. 233.90 స్థాయిని కూడా తాకింది. బీఎస్ఈలో 13.24 లక్షల షేర్లు, ఎన్ఎస్ఈలో 1 కోటి పైగా షేర్లు చేతులు మారాయి. డీల్ విషయంపై వివరణనివ్వాలంటూ జెట్ ఎయిర్వేస్కు బీఎస్ఈ సూచించింది. -
ఏటీఎఫ్‌పై తగ్గిన ఎక్సైజ్ డ్యూటీ
న్యూఢిల్లీ: ఏవియేషన్ టర్బయిన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్)పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. విమాన ఇంధనంగా పిలిచే ఏటీఎఫ్‌పై డ్యూటీని 14 శాతం నుంచి 11 శాతానికి తగ్గించిన్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. తాజా తగ్గింపు అక్టోబరు 11 (గురువారం) నుంచి అమల్లోకి రానుంది. ప్రస్తుతం ఢిల్లీలో లీటరు ఏటీఎఫ్ ధర రూ.74.56 వద్ద ఉంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల పెరుగుదల నేపథ్యంలో గతేడాది జులై నుంచి ఇప్పటివరకు విమాన ఇంధన ధర 58.6 శాతం పెరిగింది. -
వచ్చే పదేళ్లూ ఆకాశమే హద్దు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘‘అమెరికా జనాభా 33 కోట్లు. కానీ, అక్కడ వాణిజ్య విమానాల సంఖ్య 5 వేలు. ఇండియా జనాభా 120 కోట్లకు పైనే. కానీ, ఇక్కడ సేవలందిస్తున్న విమానాలు జస్ట్ 500–600 మాత్రమే! అమెరికాతో పోలిస్తే నాలుగు రెట్ల జనాభా ఎక్కువున్న ఇండియాలో పది రెట్ల విమానాలు తిరగాల్సిన అవసరముంది. ఇదే దేశీ విమాన కంపెనీలకు వ్యాపార అవకాశాలను కల్పిస్తుంది’’ అని ఇండిగో డిసిగ్నేటెడ్ సీఈఓ గ్రేగొరీ టేలర్ చెప్పారు. వచ్చే పదేళ్ల వరకూ దేశీ విమానయాన పరిశ్రమలో విమాన కంపెనీలతో పాటు టెక్నాలజీ సంస్థలకూ అపారమైన వ్యాపార అవకాశాలుంటాయని తెలిపారు.శనివారం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) లీడర్షిప్ సమ్మిట్–18లో ‘ఇండిగో... తర్వాత ఏంటి?’ అనే అంశంపై మాట్లాడారు. ఆయనింకా ఏమన్నారంటే.. ‘‘రెండేళ్ల క్రితం ఇండిగో వద్ద 30–40 విమానాలుండేవి. ప్రస్తుతం వీటి సంఖ్య 180కి చేరింది. ఈ ఏడాది ముగింపు నాటికి మరో 20 విమానాలను అందుబాటులోకి తీసుకొచ్చి మొత్తంగా 200కు చేరుస్తాం. 2006లో దేశీయ విమాన పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఇండిగో.. ప్రస్తుతం 42 శాతం వాటాతో అతిపెద్ద విమానయాన సంస్థగా అవతరించింది. ప్రస్తుతం ఇండిగో వద్ద 42 న్యూ జనరేషన్ ఏ320 ఎన్ఈవో, 126 ఏ320 సీఈఓ, 10 ఏటీఆర్‌లు ఉన్నాయి. 48 డొమెస్టిక్, 9 ఇంటర్నేషనల్స్‌లో 57 గమ్యస్థానాల్లో సేవలందిస్తోంది. టైమ్‌కు టేకాఫ్ అయితేనే.. ప్రపంచ విమానయాన పరిశ్రమలో ఇండియాది ఉత్సాహపూరితమైన మార్కెట్. తక్కువ టికెట్ ధరలు, సమయానికి టేకాఫ్, ల్యాండింగ్, సులువైన నిర్వహణ ఉంటేనే ఏ విమాన కంపెనీ అయినా సక్సెస్ అవుతుంది. ఇదే ఇండిగో సక్సెస్‌కు ప్రధాన కారణం. దేశంలో ఇండిగో సేవలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ తక్కువ టికెట్ ధర ఉంది. ద్రవ్యోల్బణం, ధరల స్థిరీకరణ వంటి కారణాలతో దేశంలో సగటు విమాన చార్జీలు 50 శాతం వరకు తగ్గిపోయాయి’’ అని టేలర్ వివరించారు. విమానాలు పెంచితే సరిపోదు.. విమానయానంలో పెరుగుతున్న పోటీని తట్టుకొని నిలబడాలంటే కేవలం విమానాల సంఖ్యను పెంచితే సరిపోదని టేలర్ చెప్పారు. ‘‘అందుకు తగ్గట్టుగా టెక్నాలజీని వినియోగించుకొని సరికొత్త ఆవిష్కరణలను చేయాలి. సరికొత్త ఆవిష్కరణలే మేనేజ్మెంట్ నిర్వహణను మారుస్తాయి. స్థానిక ప్రజల అవసరాలు, సంస్కృతితో పోలిస్తే విమాన కంపెనీలకు మూలధనం సమస్య కాదు. దేశంలో విమానయాన కంపెనీలు ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలను విస్తరించడం కంటే ఆయా కంపెనీల్లో సరైన సంస్కృతిని పెంచాలి. దీర్ఘకాలిక ఆలోచనలు చేయాలి’’ అని ఆయన సూచించారు. ఇండిగోలో కొత్త ఉద్యోగాలు.. పైలట్ల కొరతే ఏ విమాన సంస్థకైనా ప్రధాన సమస్యని, బోయింగ్ వంటి కంపెనీలకూ ఇదే సమస్య గా మారిందని ఐఎస్బీ సదస్సులో పాల్గొన్న ఇండిగో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మానవ వనరుల విభాగం) రాజ్ రాఘవన్ అభిప్రాయపడ్డారు. ‘‘పైలట్ రహిత విమానాలు ఆవిష్కరించినా.. అవి సక్సెస్ అవుతాయనేది సందేహమే. ఎందుకంటే పైలట్ లేకుండా ప్రయాణికులు ఎక్కుతారా? అనేది ప్రశ్నే’’ అని సందేహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇండిగోలో 20 వేల మంది ఉద్యోగులున్నారని, పైలెట్స్, ఆపరేషన్స్, హెచ్ఆర్, బ్యాగేజ్ వంటి అన్ని విభాగాల్లోనూ కొత్త ఉద్యోగులను తీసుకోనున్నామని ఆయన తెలిపారు. -
‘రాఫెల్’కు సర్వం సిద్ధం చేస్తోన్న ఐఏఎఫ్
న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందంలో మోదీ ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడిందని ఓ వైపు కాంగ్రెస్ ఆరోపణలు గుప్పిస్తుంటే మరోవైపు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) మాత్రం తనపని తాను చేసుకుంటూ పోతోంది. యుద్ధవిమానాల స్టేషన్లలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపడుతోంది. పైలట్లకు శిక్షణ ఇచ్చిన ఐఏఎఫ్ ఈ ఏడాది చివర్లో వారిని మరోసారి ఫ్రాన్స్‌కు పంపేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి ఈ విమానాలు భారత్‌కు వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే వీటిని భారత్‌కు అందించేందుకు డస్సాల్ట్ ఏవియేషన్ ప్రయత్నం చేస్తోంది. దేశంలోని రెండు ప్రధాన సరిహద్దుల్లో రాఫెల్ యుద్ధవిమానాల స్టేషన్లనూ ఏర్పాటు చేస్తున్నారు. -
ముసాయిదా నివేదిక సమర్పించాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విమానాశ్రయాల కనెక్టివిటీకి సంబంధించి క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి.. నెలలోగా ఏవియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ముసాయిదా నివేదికను సమర్పించాలని సీఎస్ ఎస్కే జోషి ఆదేశించారు. గురువారం సచివాలయంలో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ మేనేజింగ్ కమిటీ సమావేశం జరిగింది. సీఎస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఎయిర్‌క్రాఫ్ట్‌లకు సంబంధించి ప్రస్తుతమున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ను వినియోగించుకోవడంతోపాటు భవిష్యత్తులో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై నివేదిక రూపొందించాలన్నారు. అకాడమీ నిర్వహిస్తోన్న 5 ఏళ్ల ఏవియేషన్ కోర్సు ద్వారా 100% ఉద్యోగాలు లభిస్తున్నాయన్నారు. విదేశాల్లోనూ ఈ రంగంలో రాష్ట్ర యువత ఉద్యోగాలు పొందేలా కొత్త కోర్సులను ప్రారంభించాలన్నారు. అకాడమీ ద్వారా పైలట్ ట్రైనింగ్ పొందిన వారిలో 80 శాతం ఉద్యోగాలు పొందుతున్నారని, ఆచరణాత్మక జ్ఞానం కోసం ఎయిర్ ఇండియాతో ఒప్పందం చేసుకున్నామన్నారు. -
లాబీయింగ్‌లో అవినీతికి పాల్పడలేదు
న్యూఢిల్లీ: పౌర విమానయాన రంగంలో కీలకమైన 5/20 నిబంధన తొలగింపు కోసం చేసిన లాబీయింగ్‌లో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, ‘చట్టబద్ధం కాని చెల్లింపులు’ జరపలేదని మలేసియాకి చెందిన ఎయిర్ఏషియా గ్రూప్ స్పష్టం చేసింది. సక్రమమైన మార్గంలోనే అన్ని అనుమతులూ పొందామని పేర్కొంది. అంతర్జాతీయ రూట్ల లైసెన్సు కోసం అధికారులకు లంచాలు ఎరగా వేసి, ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారంటూ ఎయిర్ఏషియా ఇండియాతో పాటు గ్రూప్ సీఈవో టోనీ ఫెర్నాండెజ్‌పై ఆరోపణలున్న నేపథ్యంలో ఈ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఆరోపణలపై ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ‘అన్ని అనుమతులూ సక్రమమైన మార్గంలోనే పొందాం. ఇందుకు ఏడాది పైగా పట్టింది. వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చే దిశగా.. 5/20 నిబంధనను తొలగించాలని ఏవియేషన్ రంగంలోని ఇతర సంస్థలతో కలిసే లాబీయింగ్ చేశాం. ఇదంతా చట్టబద్ధంగానే జరిగింది. చట్టవిరుద్ధంగా ఎలాంటి చెల్లింపులు జరపలేదు‘ అంటూ ఏఏజీబీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. దేశీ విమానయాన సంస్థలు విదేశీ సర్వీసులు నడపాలంటే కనీసం అయిదేళ్ల పాటు కార్యకలాపాల అనుభవంతో పాటు 20 విమానాలు ఉండాలంటూ 5/20 నిబంధన నిర్దేశిస్తోంది. కొత్త కంపెనీలకు ప్రతిబంధకంగా ఉన్న దీన్ని 2016లో ఎత్తివేశారు. ఎయిర్ఏషియా ఇండియా భారత్‌లో 2014లో కార్యకలాపాలు ప్రారంభించింది. -
ఒకే కంపెనీగా టాటా రక్షణ, ఏరోస్పేస్ విభాగాలు
ముంబై: వివిధ ఏరోస్పేస్, డిఫెన్స్ విభాగాలన్నింటినీ కలిపేసి ఒకే కంపెనీగా ఏర్పాటు చేయాలని టాటా గ్రూప్ యోచిస్తోంది. టాటా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ (టాటా ఏ అండ్ డీ) కంపెనీ కిందకు అన్ని ఏరోస్పేస్, డిఫెన్స్ విభాగాలను తేనున్నామని టాటా సన్స్ తెలిపింది. దీనికి సంబంధించిన శాసన, నియంత్రణ ఆమోదాలు పొందే ప్రక్రియ కొనసాగుతోందని టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తెలిపారు. రక్షణ, విమానయాన రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్లాంట్లు తెలంగాణ, కర్ణాటక, జార్ఖండ్, మహారాష్ట్రలో ఉన్నాయని, ఈ ప్లాంట్లలో మొత్తం 6,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ప్లాంట్లన్నింటినీ టాటా ఏ అండ్ డీ కిందకు తెస్తామని వివరించారు. ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో లభించే అవకాశాలను అందిపుచ్చుకోవడం లక్ష్యంగా టాటా ఏ అండ్ డీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. -
బిజినెస్ జెట్.. రయ్ రయ్!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ విమానయానంలో బిజినెస్ జెట్లు దూసుకెళ్తున్నాయి. ఒకప్పుడు బడా కార్పొరేట్లకే పరిమితమైన ప్రైవేటు విమానాలు... ఇప్పుడు చిన్న వ్యాపారవేత్తలకూ అందుబాటులోకి వచ్చేశాయి. దీంతో నాన్– షెడ్యూల్డ్, ప్రైవేట్ ఆపరేటర్ల హవా నడుస్తోంది. బిజినెస్/జనరల్ ఏవియేషన్‌లో ఉన్న నాన్–షెడ్యూల్డ్, ప్రైవేట్ ఆపరేటర్లు ఏకంగా 200 ఎయిర్‌పోర్టుల్లో అడుగుపెట్టడం వీటి జోరుకు నిదర్శనం. ప్రధానంగా వ్యాపారవేత్తల కారణంగానే ఈ స్థాయిలో కొత్త కొత్త ఎయిర్‌స్ట్రిప్స్‌లో చిన్న ఫ్లయిట్స్ ల్యాండ్ అవుతున్నాయి. వ్యాపారులు తమ అవసరాలకు విమానాలను అద్దెకు తీసుకోవడం లేదా సొంత విమానాల్లో ప్రయాణించడం గణనీయంగా పెరుగుతోందని బిజినెస్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆపరేటర్స్ అసోసియేషన్ (బీఏఓఏ) చెబుతోంది. మౌలిక వసతులు మెరుగైతే దేశం లో ఉన్న 420 విమానాశ్రయాలు, హెలిపోర్టులు బిజీగా ఉం డటం ఖాయమని అసోసియేషన్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇవీ గణాంకాలు.. ప్రస్తుతం దేశంలో బిజినెస్/జనరల్ ఏవియేషన్ రంగంలో నాన్–షెడ్యూల్డ్ ఆపరేటర్లు 120, ప్రైవేటు ఆపరేటర్లు 60 మంది ఉన్నారు. వీరి వద్ద 275 హెలికాప్టర్లు, 125 బిజినెస్ జెట్లు, 100 దాకా టర్బో ప్రాప్ ఎయిర్‌క్రాఫ్టులు ఉన్నాయి. 2018లో మరో 20 విమానాలు కొత్తగా అడుగు పెట్టనున్నాయి. పరిశ్రమ ఏటా 8 శాతం వృద్ధి చెందుతోందని బీఏఓఏ ప్రెసిడెంట్ రోహిత్ కపూర్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఈ రంగం లగ్జరీ అన్న భావన నుంచి ప్రభుత్వం బయటకు వస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని చెప్పారు. ‘విమానాలపై దిగుమతి సుంకం 3% వసూలు చేస్తున్నారు. నాన్ షెడ్యూల్డ్ ఆపరేటర్లకు జీఎస్టీ 5 శాతంగా ఉంది. ప్రైవేటు వినియోగానికి కొనుగోలు చేస్తే 28 శాతం జీఎస్టీ, 3 శాతం సెస్ అమలవుతోంది. ఈ పన్నులు తగ్గితే మరింత మంది విమానాల కొనుగోలుకు ముందుకు వస్తారు’ అని పేర్కొన్నారు. కాగా, టికెట్లు విక్రయించి సర్వీసులు అందించే సంస్థలను షెడ్యూల్డ్ ఎయిర్‌లైన్స్ అంటారు. వ్యాపార విస్తరణకు..: అనుకూలమైన సమయంలో, కోరుకున్న విమానాశ్రయానికి వెళ్లే అవకాశంతోపాటు భద్రత, ప్రైవసీ ఉండటంతో వ్యాపారులు బిజినెస్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆపరేటర్లను ఆశ్రయిస్తున్నారు. ప్రధానంగా షెడ్యూల్డ్ ఎయిర్‌లైన్స్ దేశంలో కేవలం 75 విమానాశ్రయాలకే సర్వీసులు అందిస్తున్నాయి. నాన్–షెడ్యూల్డ్, ప్రైవేట్ ఆపరేటర్లు 200ల విమానాశ్రయాలకు సేవలను విస్తరించారు. బిజినెస్ వర్గాలకు తాము ప్రత్యక్షంగానే సాయపడుతున్నామని రోహిత్కపూర్ అన్నారు. ‘విదేశాల్లోనూ వ్యాపార అవకాశా లను భారతీయులు వెతుక్కుంటున్నారు. అనుకూల ప్రాం తాలకు వెళ్లేందుకు బిజినెస్ ఎయిర్‌క్రాఫ్ట్‌లపై ఆధారపడుతున్నారు. వ్యాపారులు భారత ఎకానమీకి వెన్నెముక’ అని చెప్పారు. ప్రైవేట్ జెట్స్‌లో ప్రయాణం చేస్తున్న నగరాల్లో హైదరాబాద్ నాల్గవ స్థానంలో ఉందని ‘జెట్ సెట్ గో’ ఫౌండర్ కనిక టేక్రివాల్ తెలిపారు. ఏడాదిన్నరలో టాప్–1 స్థానానికి భాగ్యనగరం చేరుతుందనేది ఆమె అంచనా. అడ్డంకులు తొలగితే... దేశంలో ఉన్న 420 విమానాశ్రయాలు, హెలిపోర్టులు అన్నీ మౌలిక వసతుల పరంగా మెరుగైతే విమానయాన రంగం అనూహ్యంగా వృద్ధి చెందడం ఖాయం. న్యూయార్క్, పారిస్, సింగపూర్ మాదిరిగా భారత్‌లోని ప్రధాన నగరాల్లో బిజినెస్ ఎయిర్‌క్రాఫ్ట్స్ కోసం ప్రత్యేక రన్‌వే ఉండాలని పరిశ్రమ డిమాండ్ చేస్తోంది. ముంబై, ఢిల్లీ విమానాశ్రయాలు షెడ్యూల్డ్ ఆపరేటర్ల ఫ్లయిట్స్‌తో బిజీగా ఉంటున్నాయి. బిజినెస్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కోసం స్లాట్స్ పరిమితంగా ఉంటున్నాయి. దీనిని అధిగమించాలంటే ఇక్కడా ప్రత్యేక రన్వేలు ఉండాలని పరిశ్రమ కోరుతోంది. అన్ని జిల్లాల్లోనూ హెలిపోర్టులు ఏర్పాటు కావాలి. ఇదే జరిగితే కొత్త విమానాలు వస్తాయి. చార్జీలు తగ్గుతాయి. ఒక్కో విమానంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 60 మందికి ఉపాధి లభిస్తుందని బీఏఓఏ చెబుతోంది. -
విమానయానానికి రెక్కలు
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ప్రస్తుతం ఉన్న 124 ఎయిర్‌పోర్ట్‌లను 5 రెట్లు పెంచుతామని ఏడాది వంద కోట్ల విమాన రాకపోకలను లక్ష్యంగా నిర్ధేశించుకున్నామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఉడాన్ పథకం ద్వారా 56 అన్రిజర్వ్డ్ ఎయిర్‌పోర్ట్‌లు, 31 అన్సర్వ్డ్ హెలిప్యాడ్ల అనుసంధానం చేపడతామని చెప్పారు. పౌరవిమానయాన రంగం కొత్తపుంతలు తొక్కేలా పలు చర్యలు చేపడతామన్నారు. ఎయిర్ ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణపై ఆర్థిక మంత్రి ఎలాంటి ప్రకటనా చేయకపోవడం గమనార్హం. -
మధ్య తరగతి ‘టేకాఫ్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సమయం కలిసొస్తుంది! అందుబాటు ధరలూ ఉన్నాయి! ఇవే ఇపుడు విమాన ప్రయాణానికి ఇంధనంలా పనిచేస్తున్నాయి. ఈ ఏడాది దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య ఏకంగా 25% పెరిగి... 13 కోట్లకు చేరుతుందని విమానయాన శాఖ అంచనా వేస్తుండటం పరిశ్రమ పరుగుకు నిదర్శనం. ఒక దేశంలో అమ్ముడవుతున్న టికెట్ల పరంగా చూసినపుడు భారత్ టాప్–3లో నిలవటమే కాదు.. వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్‌గా, వృద్ధిలో అమెరికా, చైనాలనూ తలదన్నిందని ‘ఆర్థిక సర్వే’నే వెల్లడించింది. ఆంక్షలు లేకుంటే.. దేశీయంగా సరే!! అంతర్జాతీయ సర్వీసుల విషయంలో అమలు చేస్తున్న ద్వైపాక్షిక ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేస్తే ట్రాఫిక్ వృద్ధి వచ్చే 3–5 ఏళ్లు ఏటా 15 శాతం దాటేస్తుందనే అంచనాలున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయ ప్రయాణికులు 12 శాతం వృద్ధితో 6.5 కోట్లకు చేరవచ్చని, 2018–19లో 7.5 కోట్లను తాకవచ్చని అంచనాలున్నాయి. అంతేకాదు! 2018లో కనీసం మూడు భారతీయ సంస్థలు అంతర్జాతీయ సర్వీసులను ప్రారంభిస్తాయని తెలుస్తోంది. ‘‘మన ఏవియేషన్ పరిశ్రమలో సంస్కరణలకు డీజీసీఏనే ప్రధాన అడ్డంకి. ఎందుకంటే డీజీసీఏ వద్ద వనరులు, నైపుణ్యం లేవు. యూకే మాదిరి భారత్‌లో స్వయం ప్రతిపత్తి కలిగిన సివిల్ ఏవియేషన్ అథారిటీ ఉండాలి’’ అని విమానయాన రంగ రీసెర్చ్ దిగ్గజం ‘కాపా’ దక్షిణాసియా సీఈవో కపిల్ కౌల్ ఘాటుగా వ్యాఖ్యానించారు. విమాన ఇంధన ధరలతో వృద్ధి స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని బోయింగ్ కమర్షియల్ ఎయిర్‌ప్లేన్స్ ఆసియా పసిఫిక్, ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దినేశ్ కేస్కర్ తెలియజేశారు. దేశీయంగా పథకాల తోడు... దేశీయ ప్రయాణాల్లో వృద్ధికి కేంద్రం ప్రవేశపెడుతున్న పథకాలూ కలిసొస్తున్నాయి. చిన్న పట్టణాలకు విమాన సౌకర్యం కలిగించేందుకు ఉద్దేశించిన ‘ఉడాన్’ పథకంలో భాగంగా ఇపుడు 17 చిన్న నగరాలకు విమానాలు తిరుగుతున్నాయి. ట్రూజెట్, ఎయిర్ ఇండియా, ఎయిర్ డెక్కన్, స్పైస్‌జెట్ ఈ పథకం కింద సర్వీసులు నడుపుతుండగా... త్వరలో జెట్ ఎయిర్వేస్, ఇండిగో, ఎయిర్ ఒడిశా పోటీకి రానున్నాయి. 2018లో కొత్తగా 60 నగరాల్లోకి తొలిసారి విమానాలు ల్యాండ్ కానున్నాయి. హైదరాబాద్‌కు చెందిన ట్రూజెట్... ఉడాన్ స్కీమ్ కింద నాలుగు నగరాల్లో సర్వీసులు నడుపుతోంది. ఈ ఏడాది మరో ఆరు నగరాల్లోకి అడుగు పెడతామని ట్రూజెట్‌ను ప్రమోట్ చేస్తున్న టర్బో మేఘా ఎయిర్వేస్ కమర్షియల్ హెడ్ సెంథిల్ రాజా ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధికి చెప్పారు. ‘‘ఉడాన్ రెండో దశలో మాకు కొత్తగా 20 రూట్లు దక్కాయి. కాండ్లా, అహ్మదాబాద్, పోర్బందర్, జైసల్మేర్, నాసిక్, జల్గావ్, గువాహటి, కూచ్‌బిహార్, తేజు, రూప్సి నగరాల మధ్య ఈ సర్వీసులుంటాయి’’ అని తెలియజేశారు. ఇదే పథకం కింద నిరుపయోగంగా, పరిమిత సర్వీసులు నడుస్తున్న 50 విమానాశ్రయాలు, ఎయిర్‌స్ట్రిప్స్ పునరుద్ధరణకు కేంద్రం రూ.4,500 కోట్లు ఖర్చు చేస్తోంది. పునరుద్ధరణ పనులు ఈ ఏడాది డిసెంబరు చివరినాటికి పూర్తి కానున్నాయి. ఉడాన్ రెండో దశలో 17 విమాన సంస్థల నుంచి 502 కొత్త రూట్లలో సర్వీసులు నడిపేందుకు ప్రతిపాదనలు వచ్చాయి. ఇది కార్యరూపంలోకి వస్తే 126 విమానాశ్రయాలు, హెలిప్యాడ్స్ అనుసంధానమవుతాయి. మరోవంక ‘దిశ’ కార్యక్రమం కింద విమానాశ్రయాల్లో మెరుగైన సేవలకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రూ.17,500 కోట్లతో ప్రణాళిక సైతం సిద్ధం చేసింది. జతకూడనున్న విమానాలు.. విమానయాన అభివృద్ధి నేపథ్యంలో... దేశీయంగా కొత్త నగరాల్లో అడుగు పెట్టడం, సర్వీసుల పెంపు, విదేశాలకు విస్తరించటం వంటివి జోరందుకున్నాయి. దీన్లో భాగంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత్‌లోకి 124 నుంచి 130 కొత్త విమానాలు రావచ్చని సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 25 శాతం అధికం. వీటిలో 25 విమానాలు అంతర్జాతీయ కార్యకలాపాలకు ఉద్దేశించినవి. అలాగే ఉడాన్ స్కీమ్ కోసం 22 దాకా విమానాలుంటాయని తెలిసింది. వచ్చే 20 ఏళ్లలో భారత్‌కు 290 బిలియన్ డాలర్ల విలువైన 2,100 విమానాలు కొత్తగా వచ్చి చేరతాయని బోయింగ్ కంపెనీ చెబుతోంది.