Russia And Ukraine war: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రష్యా బలగాలు ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతున్నాయి. ప్రాణాలు అరచేత పట్టుకున్న ప్రజలు ఆగమవుతున్నారు. మీడియా, సోషల్ మీడియా అక్కడి పరిస్థితుల్ని, యుద్ధ తీవ్రతను ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేస్తోంది. ఈ తరుణంలో ఒక్క ఫొటో అక్కడి తీవ్రతకు తార్కాణంగా నిలిచింది.
ఉక్రెయిన్ సరిహద్దు ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి పలు దేశాలు అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే. అయితే యుద్ధ వాతావరణం నెలకొన్నప్పటికీ.. యుద్ధాన్ని మాత్రం ఊహించలేదు. ఈ తరుణంలో తమ పౌరుల తరలింపులో జాప్యం జరిగింది. ఇక గురువారం రష్యా మిలిటరీ చర్యతో ఉక్రెయిన్ వణికిపోయింది. ఈ క్రమంలో రాజధాని కీవ్ విమానాశ్రయం మూసేయగా.. అటుగా వెళ్లిన వందలాది విమానాలను దారి మళ్లించాల్సిన పరిస్థితి దాపురించింది.
ముఖ్యంగా ఉక్రెయిన్‌లో నిత్యం రద్దీగా ఉండే ఉత్తర, పశ్చిమ ప్రాంతాల నుంచి ఎయిర్‌లైన్ ట్రాఫిక్‌ను భద్రతా కారణాల దృష్ట్యా హఠాత్తుగా దారి మళ్లించారు. దీంతో గగనతలంలో ఒక్కసారిగా కుప్పపోసినట్లు విమానాలు కనిపించాయి. విమానాలు దారి మళ్లించిన పలు చిత్రాలను ‘ఫ్లైట్ ట్రాకర్ సాఫ్ట్‌వేర్’ విడుదల చేసింది. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment