
కీవ్: రష్యా ఆక్రమిత జపొరిజియా అణు విద్యుత్ ప్లాంట్‌పై డ్రోన్ దాడి జరిగిందని అధికారులు తెలిపారు. ప్లాంట్‌లోని ఆరో యూనిట్ డోమ్ సహా పలు చోట్ల ఉక్రెయిన్ మిలటరీ డ్రోన్లు ఆదివారం దాడి చేశాయన్నారు. అయితే ఎటువంటి నష్టం వాటిల్లలేదని, ఎవరూ చనిపోలేదని అన్నారు. ప్లాంట్‌లో అణుధారి్మకత స్థాయిలు కూడా సాధారణంగానే ఉన్నట్లు వివరించారు.
దాడి సమాచారం తమకు అందిందని అంతర్జాతీయ అణు శక్తి సంస్థ(ఐఏఈఏ) తెలిపింది. ఇటువంటి దాడులతో భద్రతాపరమైన ప్రమాదాలున్నాయని హెచ్చరించింది. యూరప్‌లోనే అతి పెద్దదైన జపొరిజియా అణు విద్యుత్కేంద్రం 2022 నుంచి రష్యా ఆ«దీనంలోనే ఉంది. ఇందులోని ఆరు యూనిట్లు కొద్ది నెలలుగా మూతబడి ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment