nuclear power plant
-
రష్యాకు ఎదురుదెబ్బ.. దూసుకెళ్తున్న ఉక్రెయిన్ దళాలు!
మాస్కో: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. తాజాగా రష్యా ఆధీనంలోని అణు ప్లాంట్‌పై ఉక్రెయిన్ డ్రోన్లు దాడికి దిగాయి. జపరోజియాలోని అణు ప్లాంట్‌పై ఉక్రెయిన్ దాడి చేసింది. ఈ సందర్భంగా రష్యా స్పందిస్తూ.. 24 గంటల్లో ఐదుసార్లు డ్రోన్ దాడులు జరిగినట్టు తెలిపింది. ఉక్రెయిన్ దాడుల్లో ప్లాంట్ పరిపాలన భవనం దెబ్బతిన్నట్టు పేర్కొంది. అలాగే, ఉక్రెయిన్‌కు చెందిన మూడు డ్రోన్లను తాము కూల్చివేసినట్టు రష్యా వెల్లడించింది.ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌కు అమెరికా అణ్వాయుధాలను సరఫరా చేయడాన్ని రష్యా తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ సందర్భంగా రష్యా సీనియర్ భద్రతా అధికారి డిమిత్రి మెద్వెదేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ దేశాలు అణుయుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అలాగే, అణ్వాయుధాలను ఉక్రెయిన్‌కు బదిలీ చేసి అమెరికా ఓ భారీ యుద్ధానికి సిద్ధమవుతోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రపంచంలోని అనేక మంది జీవితాలను బలిగొనేందుకు సిద్ధమయ్యారు. ఉక్రెయిన్‌తో రష్యా పోరులో అమెరికా.. కీవ్‌కు అణ్వాయుధాలు సరఫరా చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాము. రష్యాపై అణ్వాయుధాలు ప్రయోగిస్తే కొత్త అణు విధానం ప్రకారం తాము స్పందిస్తామని హెచ్చరించారు.ఇదిలా ఉండగా.. రష్యా వద్ద మొత్తం 4,380 అణ్వాయుధాలు ఉన్నాయి. వీటిల్లో 1,700 వినియోగానికి సిద్ధంగా ఉంచారు. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో పుతిన్ నాన్ స్ట్రాటజిక్ అణ్వాయుధాలను వాడే అవకాశం ఉందన్న ఆందోళనలు నెలకొన్నాయి. మరోవైపు.. ఉక్రెయిన్‌పై ఆక్రమణకు పాల్పడిన రోజే రష్యాలోని అణ్వాయుధాలను యుద్ధంలో వాడేందుకు సిద్ధంగా ఉంచినట్టు ఆ దేశ సైనికుడు ఆంటోన్ చెప్పుకొచ్చాడు. ఉక్రెయిన్‌తో యుద్ధానికి ముందు తాము కేవలం యుద్ధ విన్యాసాల సమయంలో మాత్రమే సాధన చేసే వాళ్లమని.. కానీ, కీవ్‌పై దండయాత్ర మొదలైన నాడే పూర్తిస్థాయి అణు దాడికి సిద్ధమైనట్లు వెల్లడించాడు. 🇷🇺🇺🇦The deputy head of Russia's Security Council, Dmitry Medvedev, has commented on discussions by US politicians and journalists about the transfer of nuclear weapons to Kiev:The very threat of transferring nuclear weapons to the Kiev regime can be seen as a preparation for a… pic.twitter.com/m92Vg3HeGK— dana (@dana916) November 26, 2024 -
Russia-Ukraine war: జపొరిజియా అణు ప్లాంట్‌పై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు
కీవ్: రష్యా ఆక్రమిత జపొరిజియా అణు విద్యుత్ ప్లాంట్‌పై డ్రోన్ దాడి జరిగిందని అధికారులు తెలిపారు. ప్లాంట్‌లోని ఆరో యూనిట్ డోమ్ సహా పలు చోట్ల ఉక్రెయిన్ మిలటరీ డ్రోన్లు ఆదివారం దాడి చేశాయన్నారు. అయితే ఎటువంటి నష్టం వాటిల్లలేదని, ఎవరూ చనిపోలేదని అన్నారు. ప్లాంట్‌లో అణుధారి్మకత స్థాయిలు కూడా సాధారణంగానే ఉన్నట్లు వివరించారు. దాడి సమాచారం తమకు అందిందని అంతర్జాతీయ అణు శక్తి సంస్థ(ఐఏఈఏ) తెలిపింది. ఇటువంటి దాడులతో భద్రతాపరమైన ప్రమాదాలున్నాయని హెచ్చరించింది. యూరప్‌లోనే అతి పెద్దదైన జపొరిజియా అణు విద్యుత్కేంద్రం 2022 నుంచి రష్యా ఆ«దీనంలోనే ఉంది. ఇందులోని ఆరు యూనిట్లు కొద్ది నెలలుగా మూతబడి ఉన్నాయి. -
ప్రయోగాలతో నన్నే నాశనం చేస్తున్నారు.. కొన్నాళ్లు ఎటైనా పారిపో చంద్ర!
ప్రయోగాలతో నన్నే నాశనం చేస్తున్నారు.. కొన్నాళ్లు ఎటైనా పారిపో చంద్ర! -
అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో పీఎస్‌యూలు
నాగ్‌పూర్: అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూ) పెద్ద ఎత్తున పాలు పంచుకోనున్నట్లు కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. పవర్ ప్లాంట్ల నిర్మాణానికి అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణ కోసం పీఎస్‌యూలతో జాయింట్ వెంచర్లను ఏర్పాటు చేసుకునేలా న్యూక్లియర్ రంగ నిబంధనలను ప్రభుత్వం సరళీకరించినట్లు ఆయన పేర్కొన్నారు. 108వ భారతీయ సైన్స్ కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు వివరించారు. అణు విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించే దిశగా న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐఎల్), ప్రభుత్వ రంగ సంస్థల మధ్య జాయింట్ వెంచర్లకు వెసులుబాటు కల్పిస్తూ 2015లో అటామిక్ ఎనర్జీ చట్టాన్ని ప్రభుత్వం సవరించిందని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా దాదాపు అన్ని అణు విద్యుత్ ప్లాంట్లను నిర్వహించే ఎన్పీసీఐఎల్ మరింతగా కార్యకలాపాలు విస్తరించేలా నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ న్యూక్లియర్ ఎనర్జీ, నాల్కో పవర్ కంపెనీ మొదలైన వాటితో జేవీలు ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో అణు విద్యుత్ స్థాపిత సామర్థ్యం 6,780 మెగావాట్లుగా ఉంది. మరో 21 యూనిట్ల ఏర్పాటుతో 2031 నాటికి దీన్ని 15,700 మెగావాట్లకు చేర్చుకోవాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది. (క్లిక్ చేయండి: ముడిచమురుపై విండ్‌ఫాల్ ట్యాక్స్ పెంపు) -
ఎనిమిదేళ్లలో కొత్తగా 20 అణు విద్యుత్కేంద్రాలు
న్యూఢిల్లీ: అదనంగా 15వేల మెగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని పెంచే ఉద్దేశంతో 2031 ఏడాదికల్లా దేశంలో కొత్తగా 20 అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పనున్నట్లు కేంద్రప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది. ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఈ విషయం చెప్పారు. కొత్త వాటిల్లో మొదటిదానిని వచ్చే ఏడాది గుజరాత్‌లోని కాక్రపార్‌లో 700 మెగావాట్ల సామర్థ్యంతో నెలకొల్పుతారు. 2024 ఏడాదిలో కల్పకంలో 50 మెగావాట్ల సామర్థ్యంతో ప్రోటోటైప్ ఫాస్ట్‌బ్రీడ్ రియాక్టర్‌ను, 2025లో చెరో 1,000 మెగావాట్ల సామర్థ్యంతో రెండు యూనిట్లను కుడంకుళంలో నిర్మిస్తారు. రాజస్తాన్‌లోని రావత్‌భటాలో చెరో 700 మెగావాట్ల సామర్థ్యంతో రెండు, 2027లో 1,000 మెగావాట్ల సామర్థ్యంతో మరో రెండు అణువిద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటుచేస్తారు. హరియాణాలోని గోరఖ్‌పూర్‌లో 2029 ఏడాదిలో 700 మెగావాట్ల సామర్థ్యంతో రెండు యూనిట్లు సిద్ధంచేస్తారు. 700 సామర్థ్యంతో మరో పదింటిని వేర్వేరు రాష్ట్రాల్లో.. అంటే హరియాణా, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో నిర్మిస్తారు. -
Ukraine Russia War: ఉక్రెయిన్‌లో మళ్లీ రష్యా క్షిపణి దాడులు
కీవ్: దక్షిణ ఉక్రెయిన్‌లోని జపొరిజాజియా సిటీలో రష్యా క్షిపణులు గర్జించాయి. క్షిపణి దాడుల్లో 40కిపైగా భవనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారని, కనీసం 12 మంది గాయపడ్డారని స్థానిక అధికారులు గురువారం వెల్లడించారు. ఒకటి సూర్యోదయానికి ముందు, మరొకటి ఉదయం క్షిపణి దాడి జరిగిందని పేర్కొన్నాయి. యూరప్‌లోనే అతి పెద్దదైన అణు విద్యుత్ ప్లాంట్ జపొరిజాజియాలో ఉంది. ఈ ప్లాంట్ సమీపంలోనే రష్యా సైన్యం క్షిపణి దాడులు నిర్వహించడం గమనార్హం. అణు విద్యుత్ ప్లాంట్‌ను రష్యా గతంలోనే ఆక్రమించుకుంది. రష్యా ఆక్రమించుకున్న తమ భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకుంటున్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. దీనివల్ల రష్యా అధినేత పుతిన్ అణ్వస్త్ర ప్రయోగానికి పాల్పడతారా? అనేది చెప్పడం కష్టమని అన్నారు. అణు దాడికి పుతిన్ సాహసించకపోవచ్చని తాను భావిస్తున్నాని తెలిపారు. సిడ్నీలో లౌవీ ఇనిస్టిట్యూట్‌లో జరిగిన ఓ సదస్సులో జెలెన్స్కీ వీడియో లింక్‌లో ప్రసంగించారు. -
Russia-Ukraine War: అణు ప్లాంట్ చీఫ్ కిడ్నాప్
కీవ్: ఉక్రెయిన్‌లోని జపొరిఝియా అణు విద్యుత్ ప్లాంట్ డైరెక్టర్ జనరల్ ఇహోర్ మురసోవ్ కిడ్నాప్‌నకు గురయ్యారు. శుక్రవారం కారులో వెళ్తున్న ఆయన్ను రష్యా సైనికులు అడ్డగించి, కళ్లకు గంతలు కట్టి గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లినట్లు ఉక్రెయిన్ అణు విద్యుత్ సంస్థ ఎర్గోఆటం ఆరోపించింది. ఉక్రెయిన్‌లో ఆక్రమించిన నాలుగు ప్రాంతాలను కలిపేసుకుంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతకం చేసిన కొద్ది సేపటికే యూరప్‌లోనే అతిపెద్ద అణు ప్లాంట్ చీఫ్ కిడ్నాప్ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. కాగా, లేమాన్ నగరం నుంచి తమ సైన్యాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు రష్యా ప్రకటించింది. -
Russia Ukraine War: ‘విలీనం’ రోజే రష్యా మొదలెట్టేసిందిగా..!
కీవ్: ఉక్రెయిన్‌లోని నాలుగు కీలక ప్రాంతాలను విలీనం చేసుకున్నట్లు ప్రకటించింది రష్యా. ఆ రోజు నుంచే తమ ఆధీనంలోని ప్రాంతాల్లో ఉక్రెయిన్ మద్దతుదారులను అణచివేసే దుశ్చర్యలు మొదలు పెట్టింది. ఉక్రెయిన్ జపోరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్రస్తుతం రష్యా సేనల ఆధీనంలో ఉంది. ఈ క్రమంలో న్యూక్లియర్ ప్లాంట్ డైరెక్టర్ జనరల్ ఇహోర్ మురాషోవ్‌ను రష్యా కిడ్నాప్ చేసినట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఎనెర్హోడార్కు వెళ్తున్న క్రమంలో మురాషోవ్ కారును అడ్డగించిన రష్యా సేనలు.. ఆయన కళ్లకు గంతలు కట్టి రహస్య ప్రాంతానికి తీసుకెళ్లినట్లు కీవ్ ప్రభుత్వ న్యూక్లియర్ ఏజెన్సీ ‘ఎనర్జోఆటమ్’ వెల్లడించింది. మురాషోవ్ కిడ్నాప్.. జపోరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ భద్రతను ప్రమాదంలో పడేసిందని ఎనర్జోఆటమ్ ప్రెసిడింగ్ పెట్రో కొటిన్ ఆందోళన వ్యక్తం చేశారు. మురాషోవ్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. మురాషోవ్ కిడ్నాప్‌పై రష్యా, అంతర్జాతీయ అణు విద్యుత్ ఏజెన్సీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇదీ చదవండి: Russia Ukraine War: ఉక్రెయిన్ నగరాలపై రష్యా దాడులు -
Ukraine Russia War: అణు విద్యుత్ కేంద్రంపై బాంబుల వర్షం, తేడా వస్తే!
కీవ్: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మళ్లీ తీవ్ర రూపం దాల్చుతోంది. డాన్బాస్ సరిహద్దు ప్రాంతంలో ఇరు దేశాలు భీకర దాడులకు దిగాయి. ఈ క్రమంలోనే ఐరోపాలోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం జపోరిజజియా ప్లాంట్‌పై బాంబుల వర్షం కురిసింది. అయితే ఈ చర్యపై ఉక్రెయిన్, రష్యా పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్నాయి. అణు విద్యుత్ ప్లాంట్‌పై దాడిలో షెల్స్ హై వోల్టేజ్ పవర్ లైన్‌పై పడినట్లు తెలుస్తోంది. దీని వల్ల రేడియేషన్ లీక్ కానప్పటికీ ఆపరేటర్లు ఓ రియాక్టర్‌ను డిస్ కనెక్ట్ చేశారు. యుద్ధం మొదలైన తొలినాళ్లలో మార్చిలోనే ఈ ప్లాంట్‌ను రష్యా తన అధీనంలోకి తీసుకుంది. అయితే అక్కడ పనిచేసేది మాత్రం ఉక్రెయిన్ టెక్నీషియన్లే. ఐక్యరాజ్యసమితి న్యూక్లియర్ వాచ్ డాగ్ ఈ ప్లాంట్‌ను పరిశీలించేందుకు అనుమతి ఇవ్వాలని అడిగింది. ఈ విద్యుత్ కేంద్రాన్ని రష్యా యుద్ధంలో రక్షక కవచంలా ఉపయోగించుకుంటోందని అమెరికా ఇటీవలే ఆరోపించింది. అదృష్టం బాగుంది అణువిద్యుత్ కేంద్రంపై భయానక దాడికి పాల్పడినందుకు రష్యాపై అణు ఆంక్షలు విధించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ కోరారు. మరోవైపు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ మాత్రం ఉక్రెయినే ఈ ప్లాంట్‌పై షెల్స్ దాడి చేసిందని, అదృష్టం కొద్ది రేడియో ధార్మిక శక్తి లీక్ కాలేదని వ్యాఖ్యానించింది. ఈ దాడి వల్ల ప్లాంట్‌లో ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోయిందని పేర్కొంది. సమీప నగరంలోని ప్రజలు విద్యుత్, నీటి సంక్షోభంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపింది. మరోవైపు ఉక్రెయిన్ పోర్టు నుంచి మూడు ధాన్యం ఓడలు శుక్రవారం బయలుదేరాయి. రష్యా దండయాత్ర మొదలైన 5 నెలల్లో ఉక్రెయిన్ ఓడ బయటకు వెళ్ళడం ఇదే తొలిసారి. చదవండి: తైవాన్ జలసంధిపై చైనా బాంబుల వర్షం.. వీడియో విడుదల -
Russia-Ukraine War: చెర్నోబిల్‌ను వీడిన రష్యా ఆర్మీ
ప్రమాదకరంగా మారిన చెర్నోబిల్ అణు విద్యుత్ ప్లాంట్ నుంచి రష్యా సేనలు వైదొలిగాయని ఉక్రెయిన్ ప్రభుత్వ విద్యుత్ సంస్థ ఎనెర్గోఆటం తెలిపింది. ఉక్రెయిన్‌పై ఫిబ్రవరి 24వ తేదీ నుంచి యుద్ధం ప్రారంభించిన రష్యా సేనలు చెర్నోబిల్‌ను స్వాధీనం చేసుకోవడంతో ప్రపంచ నేతలు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 1986 నుంచి మూసివేసి ఉన్న ఈ ప్లాంట్ వెలుపల తవ్విన గుంతల నుంచి ప్రమాదకర స్థాయిలో అణుధార్మికత వెలువడటంతో ఆ ప్రాంతం నుంచి వైదొలుగుతున్నట్లు రష్యా సేనలు తెలిపాయని ఎనెర్గోఆటం పేర్కొంది. చెర్నోబిల్‌కు సంబంధించి తాజాగా తమకు ఎటువంటి సమాచారం అందలేదని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ తెలిపింది. త్వరలోనే ఆ ప్రాంతాన్ని సందర్శిస్తామని ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ రఫేల్ గ్రోస్సి తెలిపారు. మారియుపోల్ నగరంపై రష్యా దాడులు తీవ్రతరమయ్యాయి. నగరంలో చిక్కుకుపోయిన పౌరులను తీసుకు వచ్చేందుకు ఉక్రెయిన్ ప్రభుత్వం పంపించిన 45 బస్సుల కాన్వాయ్‌ను రష్యా ఆర్మీ అడ్డుకుంది. మారియుపోల్‌లో పౌరుల కోసం 14 టన్నుల ఆహారం, మందులతో వెళ్లిన వాహనాలను కూడా రష్యా సైన్యం అడ్డుకున్నట్లు సమాచారం. బెల్గోరాడ్ ప్రాంతంపై ఉక్రెయిన్ హెలికాప్టర్ గన్‌షిప్పులు దాడి చేయడంతో చమురు డిపో మంటల్లో చిక్కుకుందని ఆ ప్రాంత గవర్నర్ ఆరోపించారు. ఉక్రెయిన్–రష్యా చర్చలు పునఃప్రారంభం ఉక్రెయిన్–రష్యా మధ్య శాంతి చర్చలు వీడియో లింక్ ద్వారా శుక్రవారం పునఃప్రారంభమయ్యా యి. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కార్యాలయం సైతం ధ్రువీకరించింది. ఇరు దేశాల ప్రతినిధుల మధ్య చివరిసారిగా మూడు రోజుల క్రితం టర్కీలో చర్చలు జరిగాయి. డోన్బాస్, క్రిమియాపై తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని చర్చల్లో రష్యా ప్రతినిధి మెడిన్స్కీ చెప్పారు. -
Ukraine: న్యూక్లియర్ పవర్ ప్లాంట్ దగ్గర తగలబడుతున్న అడవి.. పెను ముప్పు తప్పదా?
ఉక్రెయిన్‌పై రష్యా దాడి కొనసాగుతూనే ఉంది. దీనిని ఆపేందుకు పలు దేశాలు ఎన్ని ఆంక్షలు విధించిన వాటిని లెక్కచేయకుండా రష్యా తన దూకుడుని ఏ మాత్రం తగ్గించడం లేదు. అయితే ఈ యుద్ధం కారణంగా సామాన్య ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారనే చెప్పాలి. ఇప్పటివరకు జరిగినా వినాశనం ఒకటైతే తాజాగా మరో సంఘటన ఉక్రెయిన్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఉక్రెయిన్‌లో చెర్నోబిల్ అణువిద్యుత్ ప్లాంట్ కీలకమే కాకుండా పెద్దదనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం చెర్నోబిల్ జోన్ సమీపంలోని 10,000 హెక్టార్లకు పైగా అడవులు కాలిపోతున్నాయని, ఈ మంటలు ప్లాంట్ సమీపానికి వచ్చే ప్రమాదం ఉందని ఉక్రేనియన్ అధికారి హెచ్చరించారు. సాధారణంగా చెర్నోబిల్ ప్లాంట్ చూట్టు నాలుగు వేల చదరపు కిలోమీటర్ల వరకు నిషేధిత ప్రాంతం. అంటే ఆ ప్రాంతంలో వాహన సంచారం, ఇతరేతర కార్యక్రమాలు ఉండవు. అయితే ఇటీవల రష్యా సైన్యం ఆక్రమించుకోవడంతో వాహన సంచారం ఎక్కువకావడంతో అక్కడి ప్లాంట్‌లోని అణువ్యర్థాలు యాక్టివేట్ అయి ఒక్కసారిగా రేడియేషన్ స్థాయులు పెరిగాయి. ప్రస్తుతం చెర్నోబిల్ సమీపంలో ఉన్న ఈ మంటలు వేడి ప్లాంట్ నిషేదిత ప్రాంతంలోకి ప్రవేశించడం ద్వారా అక్కడి వాతావరణం వేడిగా మారడంతో పాటు ప్లాంట్‌లో ఉండే కూలింగ్ వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. దీని వల్ల రేడియేషన్ పెరుగుతుందని శాస్తవేత్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్ఫాక్స్ ఏజెన్సీ ప్రకారం.. చెర్నోబిల్ పవర్ ప్లాంట్ సమీపంలో కనీసం 31 ప్రాంతాలు అగ్నికి ఆహుతయ్యాయని, దీని ఫలితంగా రేడియోధార్మిక వాయు కాలుష్యం పెరిగి ఉక్రెయిన్ దేశంతో పాటు పొరుగున ఉన్న యూరోపియన్ దేశాలకు చేరుకోవచ్చని చెప్పారు. ఇదే జరిగితే పెను ప్రమాదాన్ని చవి చూడాల్సి వస్తుందని, వాటి ఫలితాలు తీవ్రంగా ఉంటాయని అయన అన్నారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధికారి డెనిసోవా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. చదవండి: మహిళను అడ్డుకున్న సిబ్బంది.. ఇండియన్ రెస్టారెంట్ మూసివేత -
Russia-Ukraine war: రష్యా అణు చెలగాటం
కీవ్: ఉక్రెయిన్‌లో రష్యా అణు చెలగాటమాడుతోంది. వారం కింద చెర్నోబిల్ అణు విద్యుత్కేంద్రాన్ని స్వాధీనం చేసుకున్న వైనాన్ని మర్చిపోకముందే మరో అణు ప్లాంట్‌పై దాడికి తెగబడింది. ఆగ్నేయ ప్రాంతంలో ఎనర్‌హోడర్ నగరంపై గురువారం అర్ధరాత్రి దాటాక రష్యా దళాలు యుద్ధ ట్యాంకులతో భారీ దాడులకు దిగాయి. దాన్ని ఆక్రమించే ప్రయత్నంలో యూరప్‌లోనే అతి పెద్దదైన జపోరిజియా అణు విద్యుత్కేంద్రం వద్దా బాంబుల వర్షం కురిపించినట్టు సమాచారం. దాంతో వాడుకలో లేని ఒకటో నంబర్‌రియాక్టర్‌కు మంటలంటుకున్నట్టు తెలుస్తోంది. భద్రతా, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగి వాటిని ఆర్పేయడంతో పెను ప్రమాదం తప్పింది. మంటలకు కాల్పులే కారణమా అన్నది తెలియరాలేదు. కొద్దిపాటి ప్రతిఘటన అనంతరం విద్యుత్కేంద్రాన్ని రష్యా బలగాలు ఆక్రమించుకున్నాయి. దాడిలో ముగ్గురు ఉక్రెయిన్ సైనికులు మరణించారని, అగ్నిప్రమాదంలో ఇద్దరు స్బిబంది గాయపడ్డారని సమాచారం. కాల్పుల వల్లే రియాక్టర్‌కు మంటలంటుకున్నాయని ఉక్రెయిన్ చెప్పగా, దాడుల్లో ప్లాంటులోని శిక్షణ కేంద్రం దెబ్బ తిన్నది తప్పిస్తే అందులోని ఆరు రియాక్టర్లకు ఎలాంటి నష్టమూ వాటిల్లలేదని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) చీఫ్ రాఫెల్ గ్రోసీ అన్నారు. రష్యా దుశ్చర్య యూరప్ వెన్నులో చలి పుట్టించింది. ప్రపంచ దేశాలన్నింటినీ షాక్‌కు గురిచేసింది. చెర్నోబిల్ అణు విద్యుత్కేంద్రం పేలుడు తాలూకు ఉత్పాతాన్ని తలచుకుని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రష్యాది మతిమాలిన చర్య అంటూ యూరప్ దేశాలన్నీ దుమ్మెత్తిపోశాయి. సాధారణంగానే అణు ధార్మికత అణు విద్యుత్కేంద్రంపై దాడికి సంబంధించిన ఫుటేజీని ఉక్రెయిణ్ విడుదల చేసింది. గురువారం అర్ధరాత్రి నుంచే రష్యా సైనిక వాహనాలు భారీ సంఖ్యలో దానివైపు దూసుకెళ్లడం అందులో స్పష్టంగా కన్పించింది. తర్వాత కాసేపటికే విద్యుత్కేంద్రం పరసరాల్లోని భవనాలన్నీ బాంబుల దాడితో దద్దరిల్లిపోయాయి. అయితే ఆ తర్వాత కన్ను పొడుచుకున్నా కానరానంత పొగ పరసరాలన్నింటినీ కమ్మేసింది. కాసేపటికే రియాక్టర్‌కు మంటలంటుకున్నాయి. రియాక్టర్లు గనక పేలితే సర్వం నాశమయ్యేదంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ మండిపడ్డారు. రష్యా దూకుడును అడ్డుకోవడానికి ఉక్రెయిన్ను తక్షణం నో ఫ్లై జోన్‌గా ప్రకటించాల్సిందిగా పశ్చిమ దేశాలను కోరారు. అయితే నాటో అందుకు నిరాకరించింది. ‘‘జెలెన్స్కీ ఆందోళనను మేం అర్థం చేసుకోగలం. కానీ నో ఫ్లై జోన్ ప్రకటన చేస్తే ఉక్రెయిన్ గగనతలాన్ని కాపాడేందుకు నాటో ఫైటర్ జెట్లు రంగంలోకి దిగి రష్యా విమానాలను కూల్చాల్సి ఉంటుంది. అది యూరప్‌లో పూర్తిస్థాయి యుద్ధానికి దారి తీస్తుంది’’ అని నాటో ప్రధాన కార్యదర్శి జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ అన్నారు. అమెరికా, ఇంగ్లండ్, ఐర్లండ్, నార్వే, అల్బేనియా విజ్ఞప్తి మేరకు అణు కేంద్రంపై దాడిని చర్చించేందుకు ఐరాస భద్రతా మండలి శుక్రవారం అత్యవసరంగా సమావేశమైంది. తమను అప్రతిష్టపాలు చేసేందుకు అణు కేంద్రం వద్ద ఉక్రెయినే అగ్నిప్రమాదానికి పాల్పడిందని రష్యా ఆరోపించింది. రియాక్టర్ వద్ద, పరిసరాల్లో రేడియో ధార్మికత స్థాయిలు పెరిగినట్టు ఉక్రెయిన్ చెప్పగా, సాధారణంగానే నమోదైనట్టు ఐఏఈఏ ప్రకటించింది. ఉక్రెయిన్ విద్యుత్ అవసరాల్లో 25 శాతాన్ని తీరుస్తున్న జపోరిజియా ప్లాంటులోని ఆరు అణు రియాక్టర్లలో ప్రస్తుతం ఒక్కటే 60 శాతం సామర్థ్యంతో పని చేస్తోంది. దాడులు మరింత ముమ్మరం రాజధాని కీవ్, ఖర్కీవ్ నగరాలు రష్యా దాడులతో అట్టుడుకుతున్నాయి. శుక్రవారమంతా ఎడతెరిపి లేని బాంబు పేలుళ్లతో దద్దరిల్లిపోయాయి. కీవ్‌లో అయితే కనీసం ప్రతి 10 నిమిషాలకు ఒక పేలుడు జరిగిందని సమాచారం. రాజధానిని ఆక్రమించేందుకు 15 వేలకు పైగా అదనపు బలగాలు తాజాగా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. నగరానికి వాయవ్యంగా క్షిపణి దాడులు, యుద్ధ ట్యాంకుల బీభత్సం తీవ్రంగా ఉందని ఉక్రెయిన్ చెబుతోంది. ఖర్కీవ్‌తో పాటు ఒఖ్తిర్కాలపై రష్యా దళాలు భారీగా దాడులకు దిగుతున్నాయి. రేవు పట్టణం మారిపోల్‌లోనూ, పలు ఇతర నగరాల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. తిప్పికొడుతున్న ఉక్రెయిన్ చెర్నిహివ్, మైకోలెయివ్ వంటి పలు నగరాల్లో రష్యా దాడిని ఉక్రెయిన్ సైన్యాలు సమర్థంగా తిప్పికొడుతున్నాయి. అలాగే రేవు పట్టణం ఒడెసాలోనూ రష్యా సైన్యాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. నౌకలపై నుంచి నగరంపైకి రష్యా దాడులకు దిగుతోంది. రష్యా సైనికులకు ఆహారం, నిత్యావసరాలు అందకుండా చేస్తూ వారిని నీరసింపజేసే వ్యూహాన్ని ఉక్రెయిన్ ఎక్కడికక్కడ అమలు చేస్తోంది. ఉక్రెయిన్ వలసలు 12 లక్షలు: ఐరాస జెనీవా: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలయ్యాక శుక్రవారం నాటికి ఆ దేశం నుంచి 12 లక్షల మంది వలసబాట పట్టారని ఐక్యరాజ్య సమితి వలసల విభాగం తెలిపింది. గురువారం ఒక్కరోజే 1.65 లక్షల మంది దేశం వీడారని తెలిపింది. సుమారు 6.5 లక్షల మంది పొరుగునున్న పోలండ్‌లో, 1.45 లక్షల మంది హంగరీ, లక్ష మంది మాల్దోవా, 90వేల మంది స్లొవేకియాలో తలదాచుకున్నట్లు వివరించింది. వీరిలో ఎక్కువ మంది వృద్ధులు, మహిళలు, చిన్నారులేనని పేర్కొంది. జపాన్ రక్షణ సామగ్రి టోక్యో: ఉక్రెయిన్‌కు సాయంగా రక్షణ సామగ్రి పంపుతూ జపాన్ అసాధారణ నిర్ణయం తీసుకుంది. సంక్షోభంలో ఉన్న దేశాలకు రక్షణ సామగ్రిని అందజేయొద్దన్న స్వీయ నియమాన్ని పక్కన పెట్టి మరీ బుల్లెట్‌ఫ్రూప్ జాకెట్లు, హెల్మెట్లు, టెంట్లు, జనరేటర్లు, ఆహారం, దుస్తులు, మందులు వంటివి పంపింది. -
అమెరికా సహకారంతో కొవ్వాడలో అణువిద్యుత్ కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికా సహకారంతో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో అణువిద్యుత్ కేంద్రం నెలకొల్పాలని ప్రతిపాదించినట్లు పీఎంవో కార్యాలయ సహాయమంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ గురువారం రాజ్యసభలో చెప్పారు. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా సమాధానమిస్తూ.. మొత్తం ఆరు రియాక్టర్లతో 1,208 మెగావాట్ల సామర్థ్యంతో ఈ అణువిద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దేశీయంగా తయారయ్యే ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ (పీహెచ్‌డబ్ల్యూఆర్)ను ఈ అణువిద్యుత్ కేంద్రంలో ఏర్పాటు చేయడం లేదని చెప్పారు. దేశం మొత్తం మీద ప్రస్తుతం 18 ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ అణువిద్యుత్ ఉత్పత్తి చేస్తుండగా మరో ఆరు నిర్మాణంలో ఉన్నాయని, మరో 10 పీహెచ్‌డబ్ల్యూఆర్‌ల ఏర్పాటుకు ఆర్థిక, పాలనాపరమైన మంజూరు లభించిందని వివరించారు. ఈ మొత్తం రియాక్టర్ల ద్వారా 7 వేల మెగావాట్ల అణువిద్యుత్ ఉత్పత్తి అవుతుందని చెప్పారు. న్యాయవ్యవస్థలో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర పథకం న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని అమలు చేస్తున్నట్లు న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాలను కల్పించి, అభివృద్ధి చేసే ప్రాథమిక బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వలదే అయినప్పటికీ ఈ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక తోడ్పాటు ఇచ్చేందుకు కేంద్రం పథకాన్ని ప్రారంభించిందని చెప్పారు. ఈ పథకం కింద మౌలిక వసతుల అభివృద్ధికి అయ్యే ఖర్చులో కేంద్రం 60 శాతం భరిస్తుందని, కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఏప్రిల్ 2021 నుంచి మరో అయిదేళ్లు పొడిగించిందని తెలిపారు. ఈ పథకం కింద రూ.9 వేల కోట్లు కేటాయించగా అందులో కేంద్ర ప్రభుత్వం వాటా 5,307 కోట్లని తెలిపారు. 1993–94లో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు 8,758 కోట్లు విడుదల చేసిందని, అందులో ఆంధ్రప్రదేశ్ వాటా రూ.199 కోట్లని చెప్పారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల పెంపు ప్రతిపాదన వచ్చింది ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపునకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నుంచి ప్రతిపాదన వచ్చిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలతో కలిపి పూర్తి ప్రతిపాదనలు పంపాలని గత నవంబర్ 29న, గతనెల 3వ తేదీన ఏపీ ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిలను కోరామని కేంద్రమంత్రి చెప్పారు. -
అప్రెంటిస్ ఖాళీలు.. అప్లై చేసుకోండి!
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన కాక్రాపర్లోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎన్పీసీఐఎల్).. అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 121 ► ట్రేడులు: ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్, వెల్డర్, టర్నర్ తదితరాలు. ► అర్హత: సంబంధిత ట్రేడ్‌ను అనుసరించి ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. ► కాలవ్యవధి: ఒక సంవత్సరం ► వయసు: 14 నుంచి 24 ఏళ్లు మించకూడదు. ► స్టైపెండ్: నెలకు రూ.7,700 నుంచి రూ.8855 వరకు చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: ఐటీఐ మార్కులు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కాక్రాపర్ గుజరాత్ సైట్, అనుమల–394651, టీఏ.వ్యారా, జిల్లా. తపి, గుజరాత్ చిరునామాకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 15.07.2021 ► వెబ్సైట్: www.npcilcareers.co.in నరోరా అటామిక్ పవర్ స్టేషన్లో 50 అప్రెంటిస్‌లు భారత ప్రభుత్వ రంగ సంస్థ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎన్పీసీఐఎల్)కి చెందిన ఉత్తరప్రదేశ్‌లోని నరోరా అటామిక్ పవర్ స్టేషన్.. అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 50 ► ట్రేడుల వారీగా ఖాళీలు: ఫిట్టర్–20, ఎలక్ట్రీషియన్–13, ఎలక్ట్రానిక్స్–12, మెషినిస్ట్–05. ► అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. ► వయసు: 07.07.2021 నాటికి 14–24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీలకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు లభిస్తుంది. ► ఎంపిక విధానం: ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. ఒకవేళ ఐటీఐ మార్కులు ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఉంటే.. వారి వయసును ప్రామాణికంగా తీసుకుంటారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును మేనేజర్( హెచ్ఆర్ఎం), నరోరా అటామిక్ పవర్ స్టేషన్, ప్లాంట్ సైట్, నరోరా,బులందసహార్–203389(ఉత్తరప్రదేశ్) చిరునామాకు పంపించాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 07.07.2021 ► దరఖాస్తు హార్ట్కాపీలను పంపడానికి చివరి తేది: 21.07.2021 ► వెబ్సైట్: https://www.npcil.nic.in మరిన్ని నోటిఫికేషన్లు: పవర్‌గ్రిడ్‌లో డిప్లొమా ట్రెయినీ ఖాళీలు సింగరేణిలో అప్రెంటిస్ ఖాళీలు.. త్వరపడండి పవర్‌గ్రిడ్, ఎస్బీఐలో ఉద్యోగ అవకాశాలు -
చైనాలో మరో విపత్తు!
బీజింగ్: చైనాలోని దక్షిణ గాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో ఉన్న తైషాన్ అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ప్రమాదకరమైన రేడియో యాక్టివ్ గ్యాస్ లీకవుతోందని, ఇదొక భారీ విపత్తుగా మారనుందని అమెరికా సీక్రెట్ ఇంటెలిజెన్స్ నివేదిక బహిర్గతం చేసింది. గత రెండు వారాల నుంచి గ్యాస్ లీకేజీ కొనసాగుతున్నట్లు తైషాన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో భాగస్వామ్యం ఉన్న ఫ్రాన్స్ సంస్థ ఫ్రామటోమ్ తెలిపింది. ఫ్రామటోమ్ ఈ ప్లాంట్ నిర్వహణ బాధ్యతలను చూస్తోంది. ఈ సమాచారాన్ని అమెరికాకు చేరవేసింది. దీంతో అమెరికన్ ఏజెంట్లు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారు. లీకేజీని ఆపకపోతే ఇది పెద్ద విపత్తుకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ హెచ్చరికలను తైషాన్ ప్లాంట్ యజమాన్యం కొట్టిపారేస్తోంది. అంతా సాధారణంగానే ఉందని చెబుతోంది. తైషాన్ ప్లాంట్ నుంచి గ్యాస్ బయటకు వెళ్తున్నట్లు మే చివర్లో గుర్తించినట్లు ఫ్రాన్స్ సంస్థ తెలిపింది. జూన్ 3న అమెరికాకు చెందిన డిపార్టుమెంట్ ఆఫ్ ఎనర్జీకి(డీఓఈ) తెలియజేసింది. సమస్యను› పరిష్కరించేందుకు సహకరించాలని కోరింది. అమెరికా నుంచి స్పందన రాకపోవడంతో జూన్ 8న మరోసారి విజ్ఞప్తి చేసింది. ప్లాంట్‌ను మూసివేసేందుకు చైనా యాజమాన్యం అంగీకరించడం లేదని పేర్కొంది. దీంతో అమెరికా పరిశోధకులు రంగంలో దిగారు. పరిస్థితి తీవ్రతను అంచనా వేశారు. ప్రజల ప్రాణాలను హరించే విపత్తుగా మారకముందే గ్యాస్ లీకేజీని ఆపేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. తాము క్షేత్రస్థాయిలో పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నిస్తున్నట్లు ఫ్రామటోమ్ సంస్థ సోమవారం తెలియజేసింది. తైషాన్ ప్లాంట్ కూలింగ్ సిస్టమ్ నుంచి ప్రమాదకర వాయువులు వెలువడుతున్నట్లు ఫ్రాన్స్ ఇంధన సంస్థ ఈడీఎఫ్ సోమవారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. అలాంటి వాయువుల జాడలేదు అణు విచ్ఛిత్తిలోని ఉప ఉత్పత్తుల్లో నోబుల్ గ్యాసెస్ ఉంటాయి. న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లోని కూలింగ్ వ్యవస్థలో ఈ వాయువుల ఉనికి ఉన్నట్లయితే రియాక్టర్ లీకలవుతున్నట్లు లెక్క. న్యూక్లియర్ పవర్ ప్లాంట్లలో పెద్ద అణువును చిన్న అణువులుగా విచ్ఛిత్తి చెందిస్తారు. ఈ ప్రక్రియలో అత్యధిక ఉష్ణోగ్రతతోపాటు వృథా వాయువులు వెలువడుతుంటాయి. తైషాన్ ప్లాంట్‌ను చైనా ప్రభుత్వ పరిధిలోని జనరల్ న్యూక్లియర్ పవర్ గ్రూప్ నిర్వహిస్తోంది. ప్లాంట్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ప్రమాదరకరమైన వాయువుల జాడ లేదని, పరిస్థితి మొత్తం సవ్యంగానే ఉందని ఈ గ్రూప్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ప్లాంట్ పరిసరాల్లో రేడియో ధార్మికత ఎంతుండాలనే దానికి ఒక పరిమితి ఉంటుంది. తాజా ఘటన నేపథ్యంలో చైనా ఈ పరిమితిని పెంచిందనే ఆరోపణలు వస్తున్నాయి. -
ఏపీలో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు
న్యూఢిల్లీ: ఏపీలో అణువిద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయన్నుట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ వద్ద అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు అమెరికాకు చెందిన వెస్టింగ్ హౌజ్ ఎలక్ట్రిక్ కంపెనీతో చర్చిస్తున్నట్లు తెలిపారు. 1,208 మెగావాట్ సామర్థ్యం కలిగిన 6 అణు రియాక్టర్లను ఏర్పాటు చేయనున్నారు. అన్ని రకాల అధ్యయనాల తర్వాతే కొవ్వాడ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ సూచించిన అర్హతల ప్రకారమే కొవ్వాడ ఎంపిక జరిగిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. (విశాఖలో ట్రైబ్యునల్ బెంచ్ ఏర్పాటు చేయండి) -
అంతరిక్షంలో నాసా మరో ప్రయోగం..
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) త్వరలో మరో ప్రయోగానికి సిద్ధమైంది. అంతరిక్షంలో మానవులు జీవించడానికి న్యూక్లియర్ పవర్ ప్లాంట్లను(అణు విద్యుత్) నిర్మించనుంది. కొత్తగా నిర్మించే న్యూక్లియర్ ప్లాంట్లు ద్వారా చంద్రుడు(మూన్), అంగారకుడు(మార్స్) ప్రదేశాలలో శక్తిని అందిస్తుందని నాసా పేర్కొంది. ఈ క్రమంలో ప్లాంట్లను నిర్మించడానికి ప్రైవేట్ న్యూక్లియర్ సంస్థల సలహాలను నాసా కోరింది. అయితే చిన్న న్యూక్లియర్ రియాక్టర్లు(అణు రియాక్టర్లు) అంతరిక్ష ప్రయోగాలకు కావాల్సిన శక్తిని అందిస్తాయని ఓ పరిశోధన సంస్థ పేర్కొంది. ఈ అంశంపై చర్చించడానికి ఆగస్ట్‌లో నాసా ఓ సమావేశాన్ని నిర్వహించనుంది. అయితే మెదటగా ఈ ప్రోగ్రామ్ విజయవంతమవ్వాలంటే రియాక్టర్‌ను డిజైన్(రూపకల్పన) చేసి చంద్రుడుపైకి పంపించాలి. మరోవైపు ప్లాంట్లను చంద్రుడుపైకి పంపే క్రమంలో ఫ్లైట్ సిస్టమ్, ల్యాండర్‌ను అభివృద్ధి పరచాలని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. రియాక్టర్, ల్యాండర్ పూర్తి స్థాయిలో నిర్మించడానికి దాదాపుగా ఐదేళ్లు పట్టవచ్చని నాసా ప్రతినిధులు తెలిపారు. (చదవండి: ఏప్రిల్ 19న యుగాంతం; ఏంటి కథ?) -
అలలపై అణు విద్యుత్
మాస్కో: రష్యా మరో కీలక ప్రాజెక్టును చేపట్టేందుకు సిద్ధమైంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి నీటిలో తేలియాడే అణు విద్యుత్ కేంద్రాన్ని రష్యా అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. రష్యా ప్రభుత్వ అణుశక్తి సంస్థ రోసాటమ్ రూపొందించిన ఈ అణు కేంద్రానికి ‘ది అకడెమిక్ లొమొనోసొవ్’గా నామకరణం చేశారు. దీన్ని రష్యాలోని మారుమూల ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం అందించేందుకు అభివృద్ధి చేశారు. తాజాగా ‘ది అకడెమిక్ లొమొనోసొవ్’ తన గమ్యస్థలాన్ని చేరుకుంది. ఆర్కిటిక్ మహాసముద్రంలో 5,000 కి.మీ ప్రయాణించి రష్యాలోని చుకోట్కాలో పీవెక్ అనే ప్రాంతానికి చేరుకుంది. ఈ అణు విద్యుత్ కేంద్రం బరువు 21 టన్నులు కాగా, ఎత్తు 470 అడుగులు ఉంటుంది. ఇందులోని 35 మెగావాట్ల సామర్థ్యమున్న రెండు అణురియాక్టర్లు ఉన్నాయి. ఈ రియాక్టర్ ద్వారా చుకోట్కాలోని లక్ష మందికిపైగా ప్రజలకు విద్యుత్ సరఫరా చేయొచ్చు. ఈ ఏడాది చివరికల్లా ‘ది అకడెమిక్ లొమొనోసొవ్’ అందుబాటులోకి రానుంది. ఇది ఓసారి పనిచేయడం ప్రారంభిస్తే 3 నుంచి ఐదేళ్ల వరకూ ఇంధనాన్ని మార్చాల్సిన అవసరముండదు. మిశ్రమ స్పందన.. ఈ తేలియాడే అణు కేంద్రంపై రష్యాలోని గ్రీన్ పీస్ అనే పర్యావరణ సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇలాంటి అణు విద్యుత్ కేంద్రాలను తరలిస్తున్నప్పుడు ఏదైనా విపత్తు సంభవిస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది. చుకోట్కా వంటి మంచు ప్రాంతాల్లో ఒకవేళ అణు విపత్తు సంభవిస్తే పర్యావరణంపై పడే దుష్ప్రభావం ఊహకు కూడా అందదని హెచ్చరించింది. దీన్ని ఓ ‘అణు టైటానిక్’గా సదరు సంస్థ అభివర్ణించింది. అయితే రోసాటమ్, ప్రభుత్వ అనుకూలవర్గాలు మాత్రం ఇందులోని సానుకూలతలు కూడా చూడాలని చెబుతున్నాయి. ఎందుకంటే మారుమూల చుకోట్కా ప్రాంతంలో ఈ అణు కేంద్రం ఏర్పాటుతో థర్మల్ ప్లాంట్, మరో అణుకేంద్రం మూతపడతాయని రోసాటమ్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. తద్వారా పర్యావరణంలోకి విడుదలవుతున్న కాలుష్యం భారీఎత్తున తగ్గుతుందని వెల్లడించారు. అణు ఇంధనంతో నడిచే సబ్మెరైన్ల వల్ల ఎలాంటి ముప్పు ఉండదనీ, తమ అణు విద్యుత్ కేంద్రం కూడా అంతే సురక్షితమని వ్యాఖ్యానించారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా తట్టుకునేలా ఇందులో భద్రతను ఏర్పాటుచేశామని పేర్కొన్నారు. -
‘ఏపీలో అణు విద్యుత్ కేంద్రం స్థాపన యత్నాలు’
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరంలో అనువైన చోట రష్యా సహకారంతో అణు విద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, స్థలాన్ని ఎంపిక చేయడానికి ఏర్పాటైన ప్రభుత్వ కమిటీ స్థలాన్వేషణ చేస్తోందని ప్రధాని కార్యాలయ వ్యవహారాల కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి అడిగిన పలు ప్రశ్నకు కేంద్ర మంత్రి గురువారం లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. -
దుబాయ్‌కి త్వరలో అణు విద్యుత్!
చమురు సరఫరాలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న యూఏఈ.. తన మొట్టమొదటి అణు విద్యుత్ ప్లాంటును పూర్తి చేసే దశలో ఉంది. ఈ ప్లాంటు పనులు దాదాపు 75 శాతం పూర్తయ్యిందని ఎమిరేట్స్ అణు ఇంధన కార్పొరేషన్(ఈఎన్‌ఈసీ) శనివారం తెలిపింది. అబూ దాబీలో ఉన్న ఈఎన్‌ఈసీ... మూడు, నాలుగు యూనిట్ల పని సగానికి పైగా పూర్తయింది. నాలుగు యూనిట్ల నుంచి సురక్షితమైన, శుద్ధమైన, సమర్ధవంతమైన అణుశక్తి సరఫరా అవుతుందని, ఇది తమ దేశంలోని దాదాపు నాలుగోవంతు విద్యుత్ అవసరాలను తీరుస్తుందని చెబుతున్నారు. అయితే.. ఈ ప్లాంటుకు ఇంకా రెగ్యులేటరీ సమీక్షలు, లైసెన్సింగ్ ప్రక్రియలు మాత్రం పెండింగులో ఉన్నాయి. యూఏఈకి చెందిన అల్ గార్బియాలోని నైరుతి ప్రాంతంలో ఉన్న ఈ బర్కా అణువిద్యుత్ ప్లాంటు నిర్మాణం 2020 నాటికి పూర్తవుతుంది. దీన్నుంచి వచ్చే స్వచ్ఛ ఇంధనం వల్ల ప్రతియేటా 12 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను యూఏఈ అరికట్టగలదు. అరబ్బు ప్రపంచంలోనే ఇది మొట్టమొదటి అణు విద్యుత్ ప్లాంటు. దీని నిర్మాణంలో కృషిచేసిన బృందాన్ని ఈఎన్‌ఈసీ సీఈఓ మొహమ్మద్ అల్ హమ్మాది ప్రశంసించారు. మూడు, నాలుగు యూనిట్ల సాధన అనేది ఓ మైలురాయని, ఒకటి రెండు యూనిట్ల భద్రతా పరీక్షలలో నెగ్గడం మంచి పరిణామం అని ఆయన అన్నారు. -
శ్రీకారం..
సాక్షి, చెన్నై :కూడంకులం అణు విద్యుత్ కేంద్రం ఆవరణలో మూడు, నాలుగు యూనిట్ల పనులకు శనివారం శ్రీకారం చుట్టారు. గోవా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ పనుల్ని ప్రారంభించారు. ఇక, రెండో యూనిట్లో ఉత్పత్తి వేగం పెరగడం విశేషం. తిరునల్వేలి జిల్లా కూడంకులంలో భారత్, రష్యా సంయుక్తంగా ఏర్పాటు చేసిన అణు విద్యుత్ కేంద్రంలో తొలి యూనిట్ ద్వారా వెయ్యి మెగావాట్ల విద్యుత్ అందుతున్న విషయం తెలిసిందే. రెండో యూనిట్లో ఉత్పత్తికి శ్రీకారం చుట్టినా, కొన్ని సాంకేతిక కారణాలతో తరచూ ఉత్పత్తిని నిలుపుదల చేసి, మరలా కొనసాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆ కేంద్రం ఆవరణలో రూ. 39 వేల కోట్లతో మూడు, నాలుగో యూనిట్ల ఏర్పాటుకు రెండు దేశాల మధ్య గతంలో ఒప్పందాలు కుదిరాయి. ఆ మేరకు ఆ యూనిట్ల పనులకు తగ్గ చర్యల్ని అణు విద్యుత్ శక్తి బోర్డు వర్గాలు తీసుకున్నాయి. ఈ పనులకు శ్రీకారం చుట్టేందుకు సర్వం సిద్ధం చేశారు. ఎక్కడ అణు వ్యతిరేకుల నుంచి నిరసనలు బయలు దేరుతాయోనన్న ముందస్తు సమాచారంతో ఆ పరిసరాల్లో నిఘాను కట్టుదిట్టం చేశారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం గోవా నుంచి రష్యా అధ్యక్షుడు పుతిన్, ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పనుల్ని ప్రారంభించారు. ఈ సమయంలో మూడు, నాలుగు యూనిట్ల పనులకు శ్రీకారం చుడుతూ అణు విద్యుత్ కేంద్రం వర్గాలు ముందుకు సాగాయి. ఈసందర్భంగా భారత్, రష్యా శాస్త్ర వేత్తలు, ఇంజనీర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పుతిన్, మోదీలతో మాట్లాడారు. అదే సమయంలో గత కొద్ది రోజులుగా ఆగి ఉన్న రెండో యూనిట్ ద్వారా ఉత్పత్తి వేగాన్ని పెంచుతూ ముందుకు సాగారు. ఈ విషయంగా కూడంకులం అణు విద్యుత్ కేంద్రం డెరైక్టర్ సుందర్ మీడియాతో మాట్లాడుతూ, ఒకటో యూనిట్ ద్వారా వెయ్యి మెగావాట్ల ఉత్పత్తి సాగుతున్నదన్నారు. రెండో యూనిట్ ద్వారా తమకు అణు శక్తి కమిషన్ యాభై శాతం మేరకు మాత్రమే ఉత్పత్తికి తగ్గ అనుమతి ఇచ్చి ఉన్నట్టు పేర్కొన్నారు. మరి కొద్ది రోజుల్లో ఆ శాతాన్ని పెంచనున్నారని, ఆ మేరకు పూర్తి స్థాయిలో కొన్ని నెలల వ్యవధిలో వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఆ యూనిట్ ద్వారా దక్కుతుందన్నారు. ప్రస్తుతం, మూడు, నాలుగు యూనిట్ల పనులకు చర్యలు తీసుకున్నామని, పనుల వేగం పెంచనున్నామని వివరించారు. ఈ పనుల్ని 2022 నాటికి ముగించేవిధంగా ముందుకు సాగనున్నట్టు పేర్కొన్నారు. -
కావలిలో రష్యా అణు విద్యుత్ కేంద్రం?
రష్యా అధ్యక్షుడి పర్యటనలో ఒప్పందం అమరావతి: రాష్ట్రంలో మరో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఉత్తరాంధ్రలో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు అమెరికా కంపెనీలు ప్రయత్నిస్తుండగా, తాజాగా రష్యా కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. తమిళనాడులోని కుడంకుళం అణు విద్యుత్ కేంద్రం విజయంతో రాష్ట్రంలో కాలు మోపడానికి రష్యా రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. రష్యాకు చెందిన రోస్టమ్ కంపెనీ నెల్లూరు జిల్లా కావలి సమీపంలో ఒక్కొక్కటి 1,000 మెగా వాట్ల సామర్థ్యంతో ఆరు భారీ అణు విద్యుత్ కేంద్రాలు ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి కావాల్సిన భూమిని ఇప్పటికే గుర్తించినప్పటికీ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్న భయంతో ఈ విషయాన్ని ప్రభుత్వం గోప్యంగా ఉంచుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెపుతున్నాయి. వచ్చేనెలలో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనకు వచ్చినపుడు ఈ ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే రష్యా ఉప ప్రధాని దిమిర్తి రొగొజిన్ ముందస్తు కసరత్తు పూర్తి చేశారు. సుష్మతో రష్యా చర్చలు: నెల రోజుల్లోనే రెండు సార్లు ఆయన మన దేశ పర్యటనకు రావడం, విదేశీ వ్యవహారామంత్రి సుష్మాస్వరాజ్‌తో చర్చలు జరపడం ఈ విషయాలను మరింత బలపరుస్తున్నాయి. రెండు రోజుల క్రితం సుష్మాస్వరాజ్‌తో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో ఏర్పాటు చేసే అణు విద్యుత్ కేంద్రానికి సంబంధించి ఒప్పంద పత్రాలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇరు దేశాల భాగస్వామ్యంతో అణు విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామని, 2020 నాటికి దేశంలో 10 అణు విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నది తమ లక్ష్యమని రొగొజిన్ ఢిల్లీలో ప్రకటించడం గమనార్హం. ప్రధాని మోదీ రష్యా పర్యటనలో అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఇటీవల జీ-20 సమావేశంలో కూడా ఇరువురి మధ్య ఈ అం శం చర్చకు వచ్చింది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు రష్యా పర్యటనలో కూడా ఈ అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటు గురించి చర్చలు జరిపారు. -
ఇరాన్లో మరో అణు కేంద్రం
టెహ్రాన్: రష్యా సహకారంతో ఇరాన్ రెండో అణు విద్యుత్ కేంద్ర నిర్మాణ పనులను శనివారం ప్రారంభించింది. ఆరు అగ్ర దేశాలతో గతేడాది కుదిరిన ఒప్పందం తరువాత ఇరాన్ చేపడుతున్న తొలి ప్రాజెక్టు ఇదేనని ప్రభుత్వ టీవీ చానల్ ఒకటి పేర్కొంది. 8.5 బిలియన్ డాలర్ల(రూ. 57 వేల కోట్లు) వ్యయమయ్యే ఈ కేంద్రం ద్వారా 1,057 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. వేయి మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యమున్న తొలి , ఏకైక అణు రియాక్టర్ ఉన్న బుషెహర్ పట్టణంలో ఈ కార్యక్రమం జరిగింది. -
అండగా ఉంటాం !
ప్రగతిపథంలో పయనిస్తున్న తమిళనాడు వంటి రాష్ట్రాలకు అణువిద్యుత్ కేంద్రం ఎంతో అవసరమని ముఖ్యమంత్రి జయలలిత అన్నారు. నాలుగు కనెక్షన్ల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్రమోదీ, రష్యా అధ్యక్షులు పుతిన్, ముఖ్యమంత్రి జయలలిత కూడంకుళంలోని అణువిద్యుత్ కేంద్రాన్ని భారత జాతికి బుధవారం అంకితం చేశారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: కూడంకుళం పరిసర గ్రామాల ప్రజలకు ఎటువంటి ముప్పు వాటిల్లకుండా తమ ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి జయలలిత హామీ ఇచ్చారు. అణువిద్యుత్‌పై ప్రజల్లో నెలకొన్న అనవసర భయాందోళనలను రూపుమాపాల్సి ఉందని చెప్పారు. రెండో యూనిట్లో కూడా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించడం అవసరమని అన్నారు. అణువిద్యుత్ కేంద్రాన్ని అందించిన రష్యా అధ్యక్షులు పుతిన్‌కు, రష్యా ప్రజలకు జయలలిత కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ భారత్-రష్యా మైత్రిలో ఇది ఒక మైలురాయని అభివర్ణించారు. వాతావరణ, పర్యావరణ సమస్యలకు తావులేకుండా దేశాభివృద్ధికి దోహదం చేయగలదని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. భారత్-రష్యా దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం శాశ్వతంగా కొనసాగాలని కోరుకుంటున్నట్లు రష్యా భాషలో మోదీ చెప్పారు. అణువిద్యుత్ కేంద్రం రూపుదిద్దుకున్నది ఇలా.. భారత్-రష్యా సంయుక్తంగా తిరునెల్వేలి జిల్లా కూడంకుళంలో రూ.22 వేల కోట్లతో రెండు యూనిట్లతో అణువిద్యుత్ కేంద్రాన్ని నిర్మించేందుకు 1998లో ఒప్పందం జరిగింది. అణువిద్యుత్ కేంద్రం వల్ల ప్రజలకు పెనుముప్పు తప్పదంటూ ఉదయకుమార్ అనే సామాజిక కార్యకర్త నేతృత్వంలో 2011 ఆగస్టు నుంచి ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. కూడంకుళం పరిసర గ్రామాల్లోని ప్రజలను ఉద్యమకారులు భయంకపితులను చేశారు. అణువిద్యుత్ కేంద్రం వల్ల వాతావరణ కాలుష్యం, ప్రాణాపాయం తప్పదని మత్స్యకార గ్రామాల్లోని వారిని రెచ్చగొట్టి ఉద్యమానికి పురిగొల్పారు. ఆందోళనలతో సుమారు ఆరు నెలలపాటు కూడంకుళంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగి నిర్మాణ పనులు స్తంభించిపోయాయి. పోలీసులు అరెస్ట్‌లకు దిగడంతో ఆందోళనకారులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అణువిద్యుత్ కేంద్రం వల్ల ఎటువంటి ముప్పులేదని సుప్రీంకోర్టు 2013 మే 6న తీర్పు చెప్పింది. అంతేగాక అణువిద్యుత్ నిపుణులు నచ్చజెప్పడంతో క్రమేణా ఆందోళనలు సద్దుమణిగి విద్యుత్ కేంద్రం నిర్మాణం పూర్తి చేసుకుంది. 2012 సెప్టెంబర్ 19న విద్యుత్ ప్లాంట్లలో ఇంధనం నింపడం ప్రారంభమై అక్టోబర్ 2తో ముగిసింది. 2013 అక్టోబర్ 22వ తేదీ తెల్లవారుజాము 2.45 గంటలకు కూడంకుళంలో 160 మెగావాట్లతో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమై 2014 జూన్ 7వ తేదీ నాటికి వెయ్యిమెగావాట్ల ఉత్పత్తికి చేరుకుంది. ఒక్కో యూనిట్ సామర్థ్యం వెయ్యియూనిట్లు కాగా మొత్తం రెండువేల యూనిట్ల ఉత్పత్తికి సిద్ధమైంది. తొలి యూనిట్ పనులు 2013లో పూర్తికాగా అదే ఏడాది జులై 13న విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. తొలి యూనిట్ సక్రమంగా పనిచేస్తున్న దశలో రెండో యూనిట్ కూడా పూర్తిచేసుకుని విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది. -
‘కూడంకుళం’ జాతికి అంకితం
♦ అణు విద్యుత్ ప్లాంట్‌లోని తొలి యూనిట్‌ను ♦ అంకితం చేసిన మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, జయ ♦ భారత్-రష్యా సంబంధాల్లో మైలురాయిగా అభివర్ణన ♦ వెయ్యి మెగావాట్ల యూనిట్ గర్వకారణం: మోదీ సాక్షి ప్రతినిధి, చెన్నై : భారత్.. రష్యా సాంకేతిక సహకారంతో తమిళనాడులో నిర్మించిన ప్రతిష్టాత్మక కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం(కేఎన్‌పీపీ) జాతికి అంకితమైంది. ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్, తమిళనాడు సీఎం జయలలితలు సంయుక్తంగా బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్లాంటులోని మొదటి యూనిట్‌ను జాతికి అంకితం చేశారు. మోదీ ఢిల్లీ నుంచి, పుతిన్ మాస్కో నుంచి, జయ చెన్నైలోని సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ యూనిట్ భారత్, రష్యాల సంబంధాల్లో మైలురాయి అని మోదీ, పుతిన్‌లు పేర్కొన్నారు. ఇదుదేశాల వ్యూహాత్మక, ప్రత్యేక భాగస్వామ్యానికి నిదర్శనమని కొనియాడారు. ప్లాంటు నిర్మాణంలో పాల్గొన్న శాస్త్రవేత్తలను మోదీ అభినందించారు. అతిపెద్ద యూనిట్: మోదీ వెయ్యి మెగావాట్ల సామర్థ్యమున్న ఈ యూనిట్ దేశ విద్యుత్ రంగంలో అతిపెద్ద యూనిట్ అని, స్వచ్ఛ ఇంధన ఉత్పత్తిని భారీగా పెంచాలన్న భారత లక్ష్యాల్లో మైలురాయి అని మోదీ పేర్కొన్నారు. ఇందుకు భారతీయులు రష్యాకు రుణపడి ఉన్నారన్నారు. ‘ఒకేచోట వెయ్యిమెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే తొలి యూనిట్ ఇదే కావడం గర్వకారణం. కూడంకుళం-1తో భారత్-రష్యా సంబంధాల్లో మరో చారిత్రక ముందుడుగు వేశాం. ఇది ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యానికే కాక, దృఢమైత్రికీ వేడుకలాంటిది. పారిశ్రామిక ప్రగతి స్వచ్ఛ ఇంధనంతో ముందుకు సాగాలి. అణు విద్యుత్ ఉత్పత్తి ఎజెండాను ముందుకు తీసుకెళ్తాం. రష్యా సహకారంలో కూడంకుళంలోనే ఇలాంటి మరో ఐదు భారీ యూనిట్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాం’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని తమిళంలో జయను ఉద్దేశించి చెప్పారు. భారత్-రష్యా దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం శాశ్వతంగా కొనసాగాలని కోరుకుంటున్నట్లు పుతిన్‌ను ఉద్దేశించి రష్యన్లో అన్నారు. ఉన్నత ప్రమాణాలు: పుతిన్ అత్యాధునిక రష్యా సాంకేతిక పరిజ్ఞానం, ఉన్నతస్థాయి భద్రతా ప్రమాణాలతో ఈ యూనిట్‌ను నిర్మించినట్లు పుతిన్ చెప్పారు. కూడంకుళం ప్రాజెక్టు సాకారం కావడానికి తాను సీఎంగా ఉన్న పదేళ్ల కాలంలో ఎల్లప్పుడూ మద్దతిచ్చానని జయ పేర్కొన్నారు. ప్రాజెక్టు భద్రతకు సంబంధించిన స్థానికుల భయాందోళనలు తొలగించేందుకు, వారికి నచ్చజెప్పేందుకు ప్రాధ్యాన్యమిచ్చానని ఆమె పేర్కొన్నారు. ప్రాజెక్టు విశేషాలు.. కూడంకుళం ప్రాజెక్టు నిర్మాణం కోసం 1988లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ, సోవియట్ యూనియన్ అధ్యక్షుడు గోర్బచెవ్లు ఒప్పందంపై సంతకాలు చేశారు. అసలు కార్యాచరణ 1997లో మొదలైంది. భారత అణువిద్యుత్ కార్పొరేషన్, రష్యాకు చెందిన రోసాటమ్ సంస్థలు కేఎన్‌పీపీని నిర్మించాయి. శుద్ధి చేసిన యురేనియంతో పనిచేసే వీవీఈఆర్ రకం అణు రియాక్టర్లను ఇందులో నెలకొల్పారు. మొదటి, రెండో యూనిట్లను రూ. 21 వేల కోట్ల ఖర్చుతో నిర్మించారు. రెండో యూనిట్ ఈ ఏడాదిలోనే ఉత్పత్తి ప్రారంభించే అవకాశముంది. ఇక్కడ ఉత్పత్తయ్యే విద్యుత్‌లో అత్యధిక భాగం తమిళనాడు, మిగతా భాగం కర్ణాటక, కేరళ, పుదుచ్చేరిలు పంచుకుంటాయి.