మాస్కో: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. తాజాగా రష్యా ఆధీనంలోని అణు ప్లాంట్‌పై ఉక్రెయిన్ డ్రోన్లు దాడికి దిగాయి. జపరోజియాలోని అణు ప్లాంట్‌పై ఉక్రెయిన్ దాడి చేసింది. ఈ సందర్భంగా రష్యా స్పందిస్తూ.. 24 గంటల్లో ఐదుసార్లు డ్రోన్ దాడులు జరిగినట్టు తెలిపింది. ఉక్రెయిన్ దాడుల్లో ప్లాంట్ పరిపాలన భవనం దెబ్బతిన్నట్టు పేర్కొంది. అలాగే, ఉక్రెయిన్‌కు చెందిన మూడు డ్రోన్లను తాము కూల్చివేసినట్టు రష్యా వెల్లడించింది.
ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌కు అమెరికా అణ్వాయుధాలను సరఫరా చేయడాన్ని రష్యా తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ సందర్భంగా రష్యా సీనియర్ భద్రతా అధికారి డిమిత్రి మెద్వెదేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ దేశాలు అణుయుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అలాగే, అణ్వాయుధాలను ఉక్రెయిన్‌కు బదిలీ చేసి అమెరికా ఓ భారీ యుద్ధానికి సిద్ధమవుతోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రపంచంలోని అనేక మంది జీవితాలను బలిగొనేందుకు సిద్ధమయ్యారు. ఉక్రెయిన్‌తో రష్యా పోరులో అమెరికా.. కీవ్‌కు అణ్వాయుధాలు సరఫరా చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాము. రష్యాపై అణ్వాయుధాలు ప్రయోగిస్తే కొత్త అణు విధానం ప్రకారం తాము స్పందిస్తామని హెచ్చరించారు.
ఇదిలా ఉండగా.. రష్యా వద్ద మొత్తం 4,380 అణ్వాయుధాలు ఉన్నాయి. వీటిల్లో 1,700 వినియోగానికి సిద్ధంగా ఉంచారు. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో పుతిన్ నాన్ స్ట్రాటజిక్ అణ్వాయుధాలను వాడే అవకాశం ఉందన్న ఆందోళనలు నెలకొన్నాయి. మరోవైపు.. ఉక్రెయిన్‌పై ఆక్రమణకు పాల్పడిన రోజే రష్యాలోని అణ్వాయుధాలను యుద్ధంలో వాడేందుకు సిద్ధంగా ఉంచినట్టు ఆ దేశ సైనికుడు ఆంటోన్ చెప్పుకొచ్చాడు. ఉక్రెయిన్‌తో యుద్ధానికి ముందు తాము కేవలం యుద్ధ విన్యాసాల సమయంలో మాత్రమే సాధన చేసే వాళ్లమని.. కానీ, కీవ్‌పై దండయాత్ర మొదలైన నాడే పూర్తిస్థాయి అణు దాడికి సిద్ధమైనట్లు వెల్లడించాడు.
🇷🇺🇺🇦The deputy head of Russia's Security Council, Dmitry Medvedev, has commented on discussions by US politicians and journalists about the transfer of nuclear weapons to Kiev:
The very threat of transferring nuclear weapons to the Kiev regime can be seen as a preparation for a… pic.twitter.com/m92Vg3HeGK— dana (@dana916) November 26, 2024
Comments
Please login to add a commentAdd a comment