రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరోసారి ఉధృతమైంది. తాజా దాడుల నేపథ్యంతో కీవ్ సైన్యం రష్యా భూభాగాల్లో విరుచుకుపడుతోంది. అక్కడి ఇంధన స్థావరాల నాశనమే లక్ష్యంగా ముందుకు పోతోంది. దీంతో అప్రమత్తమైనట్లు మాస్కో వర్గాలు ప్రకటించుకున్నాయి.
అస్ట్రాఖాన్ రీజియన్‌లోని ఇంధన స్థావరం ఉక్రెయిన్ డ్రోన్ దాడుల్ని జరిపిందని అక్కడి గవర్నర్ ఇగోర్ బాబుష్కిన్ టెలిగ్రామ్ ద్వారా ప్రకటించారు. ఈ ఆ దాడిలో ఎటు వంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని తెలిపారాయన. అదే రీజియన్‌లోని గ్లాస్ ప్లాంట్‌పైనా, మరో ఎనర్జీ సెంటర్‌పై దాడి జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ దాడులను కీవ్ వర్గాలు ధృవీకరించాయి.
ఉక్రెయిన్ డ్రోన్ దాడుల నేపథ్యంలో.. అస్ట్రాఖాన్‌తో పాటు పలు రీజియన్లకు విమానాల సర్వీసులను రద్దు చేసినట్లు ఆ దేశ పౌరవిమానాయాన విభాగం రోసావయాట్షియా ప్రకటించింది. 2022 ఫిబ్రవరిలో ఇరుదేశాల మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి.. రష్యాలోని ఎనర్జీ, రవాణా, సైన్య సంబంధిత ఉత్పత్తుల కేంద్రాలపై ఉక్రెయిన్ దాడులు చేస్తూనే ఉంది.
ఇదీ చదవండి: స్కూల్‌పై క్షిపణి దాడి.. పుతిన్‌దే బాధ్యత!
Comments
Please login to add a commentAdd a comment