Flights cancelled
-
హీత్రూలో విమాన సేవలు పునరుద్ధరణ
లండన్: అగ్ని ప్రమాదం కారణంగా దాదాపు 18 గంటలపాటు మూతబడిన లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో విమానాల రాకపోకలు తిరిగి మొదలయ్యాయి. శనివారం ఉదయం నుంచి పూర్తి స్థాయిలో కార్యకలాపాలను పునరుద్ధరించినట్లు హీత్రూ విమానాశ్రయం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, విమానాల రాకపోకలకు కలిగిన అంతరాయం ప్రభావం మరికొన్ని రోజులపాటు కొనసాగుతుందని పేర్కొంది.‘టెర్మినల్స్ వద్ద అదనంగా వందల సంఖ్యలో సిబ్బందిని సిద్ధంగా ఉంచాం. శనివారం అదనంగా మరో పది వేల మంది ప్రయాణికులను పంపించేందుకు విమానాల షెడ్యూల్‌ను తయారు చేశాం’అని హీత్రూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ థామస్ వోల్డ్బై ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘ప్రమాద ఘటనకు ఎయిర్‌పోర్టు కారణం కాదనే విషయం గుర్తుంచుకోవాలి. అంతేకాదు, రోజులపాటు మూసివేయలేదు, హీత్రూ కేవలం కొన్ని గంటలు మూతబడిందంతే. బ్యాకప్ వ్యవస్థను కూడా అత్యవసరాల్లో మాత్రమే ఉపయోగపడేలా డిజైన్ చేశారు. అది కూడా మొత్తం విమానాశ్రయాన్ని నడిపేందుకు సరిపోదు. హీత్రూకు ఒక చిన్న నగరానికి సరిపడా విద్యుత్ అవసరమవుతుంది. ఇతర విమానాశ్రయాల్లోనూ గతంలో ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయి’అని ఆయన వివరించారు.అయితే, ఎయిర్‌పోర్టుకు బయలుదేరే ముందు సంబంధిత ఎయిర్‌లైన్స్ నుంచి వివరాలను చెక్ చేసుకోవాలని ప్రయాణికులను కోరారు. శనివారం హీత్రూ నుంచి రాకపోకలు సాగించాల్సిన తమ 600 విమాన సర్వీసులకు గాను 85 శాతం మేర పునరుద్ధరించినట్లు బ్రిటిష్ ఎయిర్వేస్ తెలిపింది. అనూహ్యంగా చోటుచేసుకున్న ఘటన తర్వాత తిరిగి పూర్తిస్థాయిలో సేవలను పునరుద్ధరించడం ఎంతో క్లిష్టమైన వ్యవహారమని పేర్కొంది. హీత్రూకు 2 మైళ్ల దూరంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌లో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాదంతో విమానాశ్రయంలో కరెంటు సరఫరా నిలిచిపోయింది.దీని కారణంగా 1,300కు పైగా విమానాలు రద్దు కాగా ఆ ప్రభావం 2 లక్షల మంది ప్రయాణికులపై పడింది. శుక్రవారం రాత్రికి స్వల్ప సంఖ్యలో విమానాల రాకపోకలను పునరుద్ధరించగలిగారు. అయితే, తమకు కలిగిన తీవ్ర అసౌకర్యంపై హీత్రూ విమానాశ్రయం అధికారులపై ప్రయాణికులు మండిపడుతున్నారు. అగ్ని ప్రమాదం వెనుక కుట్ర కోణం లేదంటున్న పోలీసులు..సబ్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విద్యుత్ పరికరాలపైనే దృష్టి పెట్టినట్లు తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన విమానాశ్రయాల్లో ఒకటైన హీత్రూ నుంచి గతేడాది 8.39 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ఎయిరిండియా సేవలు ప్రారంభంన్యూఢిల్లీ: లండన్‌లోని హీత్రూ ఎయిర్‌పోర్టుకు విమానాల రాకపోకలను ప్రారంభించినట్లు ఎయిరిండియా శనివారం తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఎయిరిండియాతోపాటు వర్జిన్ అట్లాంటిక్, బ్రిటిష్ ఎయిర్వేస్ విమానాలు శనివారం షెడ్యూల్ ప్రకారం నడిచాయి. శుక్రవారం హీత్రూ మూతబడటంతో దేశంలోని వివిధ నగరాల నుంచి పెద్ద సంఖ్యలో విమానాలు రద్దు కావడం తెల్సిందే. ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఎయిరిండియా నిత్యం ఆరు విమానాలను హీత్రూకు నడుపుతోంది. బ్రిటిష్ ఎయిర్వేస్కు చెందిన మొత్తం 8 విమానాలు హీత్రూ ఢిల్లీ, ముంబైల మధ్య రాకపోకలు సాగిస్తుంటాయి. వర్జిన్ అట్లాంటిక్ కూడా ఢిల్లీ, ముంబై, బెంగళూరుల నుంచి హీత్రూకు ఐదు సర్విసులను నడుపుతోంది. -
ఉక్రెయిన్ భీకర దాడులు.. రష్యాలో విమానాల నిలిపివేత
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరోసారి ఉధృతమైంది. తాజా దాడుల నేపథ్యంతో కీవ్ సైన్యం రష్యా భూభాగాల్లో విరుచుకుపడుతోంది. అక్కడి ఇంధన స్థావరాల నాశనమే లక్ష్యంగా ముందుకు పోతోంది. దీంతో అప్రమత్తమైనట్లు మాస్కో వర్గాలు ప్రకటించుకున్నాయి. అస్ట్రాఖాన్ రీజియన్‌లోని ఇంధన స్థావరం ఉక్రెయిన్ డ్రోన్ దాడుల్ని జరిపిందని అక్కడి గవర్నర్ ఇగోర్ బాబుష్కిన్ టెలిగ్రామ్ ద్వారా ప్రకటించారు. ఈ ఆ దాడిలో ఎటు వంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని తెలిపారాయన. అదే రీజియన్‌లోని గ్లాస్ ప్లాంట్‌పైనా, మరో ఎనర్జీ సెంటర్‌పై దాడి జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ దాడులను కీవ్ వర్గాలు ధృవీకరించాయి. ఉక్రెయిన్ డ్రోన్ దాడుల నేపథ్యంలో.. అస్ట్రాఖాన్తో పాటు పలు రీజియన్లకు విమానాల సర్వీసులను రద్దు చేసినట్లు ఆ దేశ పౌరవిమానాయాన విభాగం రోసావయాట్షియా ప్రకటించింది. 2022 ఫిబ్రవరిలో ఇరుదేశాల మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి.. రష్యాలోని ఎనర్జీ, రవాణా, సైన్య సంబంధిత ఉత్పత్తుల కేంద్రాలపై ఉక్రెయిన్ దాడులు చేస్తూనే ఉంది.ఇదీ చదవండి: స్కూల్‌పై క్షిపణి దాడి.. పుతిన్‌దే బాధ్యత! -
ఇజ్రాయెల్-ఇరాన్ దాడి.. పలు విమానాలు రద్దు
ఇజ్రాయెల్-ఇరాన్ దాడి కారణంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని గల్ఫ్ ఎయిర్‌లైన్స్ చర్యలు చేపట్టాయి. ఈమేరకు పలు విమాన సర్వీసుల సమయంలో మార్పలు, మరికొన్నింటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. ఎతిహాద్, ఎమిరేట్స్, ఖతార్ ఎయిర్వేస్, ఫ్లైదుబాయ్, కువైట్ ఎయిర్వేస్ వంటి ప్రముఖ విమానయాన సంస్థలు ఈమేరకు ప్రకటన విడుదల చేశాయి.మిడిల్ ఈస్ట్‌లోని కొన్ని ప్రాంతాల్లో గగనతల పరిమితుల కారణంగా బుధవారం విమానాలను దారి మళ్లిస్తున్నట్లు ఎతిహాద్ ఎయిర్వేస్ తెలిపింది. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ అక్టోబర్ 2, 3 తేదీల్లో ఇరాక్ (బాస్రా, బాగ్దాద్), ఇరాన్, జోర్డాన్లకు వెళ్లే అన్ని విమానాలను రద్దు చేసింది. ఇరాక్, ఇరాన్‌లకు ప్రయాణించే విమానాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఖతార్ ఎయిర్వేస్ ప్రకటించింది. జోర్డాన్, ఇరాక్, ఇజ్రాయెల్, ఇరాన్‌లకు అక్టోబర్ 2, 3 తేదీలకు ప్రయాణాలు సాగించే ఎయిర్‌క్రాఫ్ట్‌లను నిలిపేస్తున్నట్లు ఫ్లైదుబాయ్ పేర్కొంది. కువైట్ ఎయిర్వేస్ విమాన సమయాల్లోనూ మార్పులు చేసినట్లు కంపెనీ ప్రతినిధులు స్పష్టం చేశారు.ఇదీ చదవండి: పెట్రోల్ అప్.. డీజిల్ డౌన్!ఇజ్రాయెల్‌పై ఇరాన్ మంగళవారం సుమారు 400 బాలిస్టిక్ మిసైల్స్‌తో భీకరంగా దాడులు చేసింది. అయితే వెంటనే అప్రమత్తమైన ఇజ్రాయెల్ తమ ఐరన్ డోమ్ వ్యవస్థతో ఇరాన్ మిసైల్స్‌ను అడ్డుకున్నట్లు ప్రకటించింది. -
ఎయిరిండియాలో ఆకస్మిక సమ్మె
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ యాజమాన్యంలోని విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సిబ్బంది మూకుమ్మడిగా సెలవు పెట్టడం తీవ్ర గందరగోళానికి దారి తీసింది. యాజమాన్యం వైఖరికి నిరసనగా క్యాబిన్ క్రూలోని 200 మందికి పైగా సిబ్బంది మంగళవారం రాత్రి సిక్ లీవ్ పెట్టారు. హఠాత్తుగా చోటుచేసుకున్న పరిణామంతో ఎయిరిండియా 100 వరకు దేశీయ, అంతర్జాతీయ సరీ్వసులను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఫలితంగా, కోచి, కాలికట్, ఢిల్లీ, బెంగళూరు తదితర విమానాశ్రయాల్లో సుమారు 15 వేల మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. సరీ్వసుల రద్దు విషయం కొందరికి సెక్యూరిటీ తనిఖీలు కూడా పూర్తయ్యాక ఆఖరి నిమిషంలో తెలిపారు. దీంతో, వారు ఎయిరిండియా తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన కొన్ని సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. వేసవి రద్దీ దృష్ట్యా మార్చి చివరి వారం నుంచి రోజూ 360 సరీ్వసులను నడుపుతోంది. టాటా గ్రూప్‌నకే చెందిన విస్తారాను ఎయిరిండియాతో, అదేవిధంగా ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ను ఏఐఎక్స్ కనెక్ట్‌తో విలీనం చేయాలన్న నిర్ణయం క్యాబిన్ క్రూలోని సీనియర్ల అసంతృప్తికి కారణమైందని భావిస్తున్నారు. నిర్వహణ లోపం సీనియర్ ఉద్యోగుల నైతికతను దెబ్బతీసిందని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ తెలిపింది. విమాన సర్వీసుల రద్దుపై బుధవారం కేంద్ర పౌరవిమాన యాన శాఖ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ నుంచి వివరణ కోరింది. సిబ్బంది సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు ఎయిరిండియా ప్రతినిధి తెలిపారు. రద్దయిన సరీ్వసులకు టిక్కెట్ చార్జీలను వాపసు చేస్తామని, కోరిన పక్షంలో మరో తేదీకి ప్రయాణాన్ని రీషెడ్యూల్ చేస్తామని వివరించారు. -
దుబాయ్‌లో మళ్లీ దంచికొడుతున్న వాన.. పలు విమానాలు రద్దు
రెండు వారాలకు ముందు దుబాయ్‌లో కుండపోత వర్షాలు కురిశాయి. ఆ ఘటన మరువకముందే మరోసారి ఎడారి దేశంలో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షం, ఉరుములు కారణంగా అనేక అంతర్జాతీయ విమానాలు తాత్కాలికంగా రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది.గత నెలలో కురిసిన వర్షాలతో పోలిస్తే ఈసారి కురుస్తున్న వర్షాలు తక్కువగా ఉంటాయని.. నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NCEMA) అంచనా వేసింది. అయినప్పటికీ ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. గురువారం ఉదయం నుంచి వర్షం భారీగా పడుతూనే ఉందని స్థానిక మీడియా వెల్లడించింది. రేపు (మే 3) వర్షం మరింత బలంగా ఉండే అవకాశం ఉంటుందని సంబంధిత శాఖ అంచనా వేసింది.ఇప్పటికే అబుదాబిలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. వాహనాలు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. బలమైన గాలుల వల్ల చెట్లు మాత్రమే కాకుండా విద్యుత్ స్తంభాలు కూడా నేలకొరిగాయి. దీంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నట్లు తెలుస్తోంది. అత్యవసర సమయంలో బయటకు వచ్చే ప్రజలు కూడా తప్పకుండా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.1949 తరువాత భారీ వర్షం ఏప్రిల్ 14, 15వ తేదీలలో పడినట్లు అధికారులు పేర్కొన్నారు. గత నెలలో పడ్డ వర్షాల కారణంగా పలువురు మృత్యువాత పడ్డారు. వాహనాలు కూడా నీటిలో చిక్కుకున్నాయి. మళ్ళీ అలాంటి పరిస్థితి వస్తుందా అని ప్రజలు భయపడుతున్నారు. -
యూఏఈలో అనూహ్య వర్షాలు
దుబాయ్: మాడ పగిలిపోయే ఎండ వేడికి, ఎడారులకు నిలయమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ను భారీ వర్షాలు పలకరించాయి. బుధవారం కుండపోత వర్షాలతో యూఏఈ తడిసి ముద్దయింది. భారీ వర్షాలను తట్టుకునే ఏర్పాట్లేవీ పెద్దగా లేకపోవడంతో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వే మొత్తం నీట మునిగింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత రద్దీ ఎయిర్‌పోర్ట్‌గా ఖ్యాతికెక్కిన దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎయిర్పోర్ట్ పార్కింగ్ ప్రాంతంలోని కార్లు మునిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒకటిన్నర సంవత్సరంలో పడాల్సిన వర్షపాతం బుధవారం ఒక్కరోజే నమోదైందని సిటీ వాతావరణ శాఖ వెల్లడించిన గణాంకాల్లో తేలింది. 14.2 సెంటీమీటర్లమేర వర్షపాత నమోదైందని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా స్కూళ్లు మూసేశారు. సమీప బహ్రెయిన్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియాల్లోనూ వర్షాలు కురిశాయి. భారీ వర్షాల కారణంగా జరిగిన ఆస్తినష్టాల వివరాలను ప్రభుత్వం బయటపెట్టలేదు. వర్షాల కారణంగా భారత్ నుంచి దుబాయ్‌కు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే మేఘమథనం వల్లే ఈ వర్షాలు కురిశాయని నిపుణుల అంచనా. -
Dubai Floods: భారీ వర్షాల ఎఫెక్ట్.. 28 విమానాల రద్దు
పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన దుబాయ్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. మంగళవారం కురిసిన కుండపోత వర్షాలతో నగరం అల్లకల్లోలంగా మారింది. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయంగా మారాయి. నివాస స్థలాలు, రోడ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు.. ఇలా ప్రతి చోట వరద బీభత్సం సృష్టించింది. ఆ దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద కుంభవృష్టి అని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. వరద నీరు భారీగా చేరడంతో రోడ్లపై కార్లు ఎక్కడికక్కడా నిలిచిపోయాయి. కార్లు సగం నీటితో మునిగిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో వరద చేరి విమానాలరాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రన్‌వేపై మోకాలిలోతు నీరు ఉండటంతో ఇక్కడికి వచ్చే విమానాలనుని దారిమళ్లిస్తున్నారు. వర్షాల కారణంగా దుబాయ్ నుంచి వచ్చేవి, వేళ్లే విమానాలు మిఒత్తం 500కి పైగా రద్దయ్యాయి. మరికొన్నింటిని దారి మళ్లీంచారు. అత్యవసరమైతే తప్ప విమానాశ్రయానికి రావద్దని ప్రయాణికులను అధికారులు హెచ్చరించారు కఠిన సవాళ్లను ఎదుర్కొంటూ వీలైనంత త్వరగా ఎయిర్‌పోర్టులో కార్యకలాపాలను పునరుద్ధరించడానికి తాము ప్రయత్నిస్తున్నట్లు దుబాయ్ విమానాశ్రయ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. భారత్-దుబాయ్ మధ్య 28 విమానాలు రద్దయ్యాయి. ఈ మేరకు భార పౌర విమానాయనశాఖ తెలిపింది.వీటిలో భారత్ నుంచి దుబాయ్ వెళ్లేవి 15 కాగా, అక్కడి నుంచి వచ్చే 13 విమానాలను రద్దు చేసినట్లు తెలిపారు. మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని వెల్లడించారు. దీనిపై ఎప్పటికప్పుడు ప్రయాణికులకు సమాచారం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఢిల్లీని వణికిస్తున్న చలిగాలులు
ఢిల్లీ: దేశ రాజధానిని చలి, పొగమంచు వణికిస్తున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 8 డిగ్రీలకు పడిపోయాయి. చలిగాలులు వీస్తుండటంతో గురువారం ఢిల్లీ, పరిసర రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు అలుముకుంది. దీంతో విమానాలు, రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరో కొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. భారత వాతావరణ శాఖ ప్రకారం.. ఈ రోజు ఉదయం 5.30 గంటలకు పంజాబ్, హర్యానా, పశ్చిమ రాజస్థాన్, బిహార్‌లోని పలు ప్రాంతాల్లో చాలా దట్టమైన పొగమంచు కనిపించింది. దేశ రాజధాని గత నెల రోజులుగా తీవ్రమైన చలిగాలులతో అల్లాడిపోతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు సింగిల్ డిజిట్‌కు పడిపోతున్నాయి. పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో దృశ్యమానత(విజిబిలిటీ) 50 మీటర్లకు పడిపోయింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, అస్సాంలోని పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. సబ్-హిమాలయన్ పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు పొగమంచు కనిపించిందని ఐఎండీ తెలిపింది. ఇదీ చదవండి: ఆ రోజు కోర్టులకు సెలవు ఇవ్వండి.. సీజేఐకి లేఖ -
Vishaka: విమానాలు రద్దు.. ప్రయాణికుల ఆందోళన
సాక్షి, విశాఖపట్నం: ప్రతికూల వాతావరణం కారణంగా విశాఖ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం నుంచి పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. విశాఖకు వచ్చేవి, విశాఖ నుంచి వెళ్లే సర్వీసులు రద్దు కావడంతో పండగపూట గమ్యస్థానానికి చేరుకోలేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. విశాఖ నుంచి ఢిల్లీ వెళ్లే ఇండిగో, ఢిల్లీ ఎయిర్ఇండియా, విజయవాడ ముంబయి,హైదరాబాద్, చెన్నై,ఇండిగో, ఎయిర్ఇండియా,విమానాలు రద్దయ్యాయి. ఒక్కసారిగా వాతావరణం మారి పొగ మంచు ఏర్పడటం వల్లే విమానాలు రద్దు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. పండగ రోజు తమను గమ్యస్థానాలకు వెళ్లకుండా చేశారని ప్రయాణికులు ఇండిగో, ఎయిర్ఇండియా విమాన సంస్థల అధికారులతో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఇదీచదవండి.. చెన్నై వెళ్లే విమానాల దారి మళ్లింపు -
London: లూటన్ ఎయిర్‌పోర్టులో భారీ అగ్ని ప్రమాదం
లండన్: లండన్‌లోని ఎయిర్‌పోర్టులో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. లండన్‌లోని లూటన్ విమానాశ్రయంలో ఉన్న కారు పార్కింగ్ ఏరియాలో మంటలు పెద్ద ఎత్తున మంటలు వ్యాప్తించాయి. దీంతో, అప్రమత్తమైన అధికారులు.. విమానాశ్రయంలో రాకపోకలను నిలివేశారు. ఈ మేరకు ప్రయాణికులకు సమాచారం అందించినట్టు అధికారులు తెలిపారు. వివరాల ప్రకారం.. లండన్‌లోని లూటన్ విమానాశ్రయంలో మంగళవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎయిర్‌పోర్టులోని కారు పార్కింగ్ ఏరియాలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అర్ధరాత్రి వేళ మంటల కారణంగా విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ వ్యాపించింది. అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, దట్టమైన పొగను పీల్చుకున్న కొందరు ప్రయాణికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో, వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. Flight operations suspended at London Luton Airport due to fire, passengers asked to stay away. All flights have been suspended until Wednesday afternoon. #khaleejtimes #fire #london #lutonairport https://t.co/XChyrDTHhZ pic.twitter.com/AqgDUlBdMv — Khaleej Times (@khaleejtimes) October 11, 2023 ఇక, అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో పార్కింగ్ ఏరియాలో దాదాపు 1200 వాహనాలు నిలిచి ఉన్నాయి. వీటిలో ఎక్కువగా ఈవీ కార్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పార్కింగ్ భవనం దెబ్బతిన్నట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా ప్రయాణికులు, సిబ్బంది భద్రత మేరకు నేటి (అక్టోబరు 11) నుంచి రేపు(అక్టోబర్ 12) మధ్యాహ్నం వరకు విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు. కాగా, విమానాలను నిలిపివేయడంతో ప్రయాణికులంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ❗️Massive fire breaks out at London’s Luton Airport, dozens of cars destroyed. pic.twitter.com/qtBrKOQjJT — Action And Laughs 🚀 (@Drawingart111) October 11, 2023 ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్ వార్ వేళ పుతిన్ షాకింగ్ కామెంట్స్.. యూఎస్‌ను టార్గెట్ చేసి.. -
కర్ణాటక బంద్ ఎఫెక్ట్: స్కూల్స్ మూసివేత.. 44 విమానాలు రద్దు
సాక్షి, చెన్నై: కావేరి జలాల సమస్య కారణంగా కర్ణాటక రాష్ట్రంలో శుక్రవారం బంద్ కొనసాగుతోది. పొరుగున్న ఉన్న తమిళనాడుకు కావేరి నీటి విడుదల చేయాలని కావేరీ వాటర్ మేనేజ్ మెంట్ అధారిటీ (CWMA) కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించడాన్ని వ్యతిరేకిస్తూ కన్నడ ఒక్కూట రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. ఇందుకు దాదాపు 1900 కన్నడ సంఘాలు మద్దతు తెలిపాయి. వీటిలో హోటళ్లు, సినీరంగం, ప్రైవేటు క్యాబ్‌లు, ఆటో సంఘాలు, ప్రైవేటు విద్యాసంఘాలు ఉన్నాయి. బంద్‌లో భాగంగా నిరసనల్లో పాల్గొన్న వివిధ సంఘాలకు చెందిన 60 మంది ఆందోళనకారులను కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంద్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టామని బెంగళూరు రూరల్ ఏఎస్పీ మల్లికారంరోజున బాలదండి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగుకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కర్ణాటక బంద్ ఎఫెక్ట్ కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుపై పడింది. బంద్ కారణంగా రవాణా సౌకర్యాలు దెబ్బతినడంతో శుక్రవారం ప్రయాణించాల్సిన ఏకంగా 44 విమానాలు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వీటిలో 22 విమానాలు బెంగుళూరులో ల్యాండ్ అయ్యేవి కాగా మరో 22 విమానాలు ఇక్కడి నుంచి టేకాఫ్ కావాల్సినవి ఉన్నాయి. ప్రయాణికులకు సకాలంలో సమాచారం అందించడం ద్వారా వారు తమ టికెట్లను రద్దు చేసుకున్నట్లు పేర్కొన్నారు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బంద్ ప్రభావం కొనసాగనుంది. బెంగళూరు నగరంలో పోలీసులు సెక్షన్ 144 విధించారు. ప్రజలు గుంపులుగా బయటకు వచ్చి ర్యాలీలు, నిరసనలు చేపట్టకూడదని, అయిదుగురు కంటే ఎక్కువ మంది సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు. 1,900కు పైగా సంఘాలు బంద్‌కు మద్దతు తెలిపాయి. బెంగళూరుతో సహా రాష్ట్రంలో కిరాణా దుకాణాలు, ఇతర షాప్‌లను మూసేశారు. అయితే ఆసుపత్రులు, అంబులెన్స్‌లు, ఫార్మసీలు వంటి అత్యవసర సేవలు కొనసాగుతున్నాయి. Karnataka Bandh: Section 144 Imposed in Mandya District; Schools, Colleges Closed#BNN #Newsupdate #Dailynews #Breakingnews #India #KarnatakaBandh #CauveryIssue #Bengaluru #Cauveryrow #Karnataka #WATCH pic.twitter.com/XxoBNFwLni — Rafia Tasleem (@rafia_tasleem) September 29, 2023 బెంగళూరులో మెట్రో సర్వీసులు యథావిధిగా నడవనున్నాయి. మెట్రో స్టేషన్ల వద్ద ఎలాంటి అల్లర్లు జరగకుండా అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కర్ణాటక బంద్ దృష్ట్యా బెంగళూరులోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు బెంగళూరు డిప్యూటీ కమిషనర్ దయానంద కేఏ సెలవు ప్రకటించారు. అనేక విశ్వవిద్యాలయాల్లో పరీక్షలను వాయిదా వేశారు. కాగా బంద్‌తో సంబంధం లేకుండా రాష్ట్ర రవాణ బస్సులు, బీఎంటీసీ బస్సులు నడవనున్నాయి. అయితే తమిళనాడు వైపు వెళ్లే బస్సులు నడవకపోవచ్చని, పరిస్థితిని బట్టి మారుతుంటాయని అధికారులు పేర్కొన్నారు. బెంగళూరులోని ప్రధాన రహదారులపై, ముఖ్యంగా సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పాడే అవకాశం ఉందన్నారు. Actor #Siddharth was forced to leave a press conference he was attending of #Tamil movie "#Chiththa" on #September 28, due to angry #protestors over the #Cauverywater dispute. pic.twitter.com/qviXRWcgLM — Madhuri Adnal (@madhuriadnal) September 28, 2023 ఓలా ఉబర్ వంట క్యాబ్ యాజమాన్యాలు బంద్‌కు మద్దతునిచ్చాయి. ర్యాలీలో పాల్గొనాలని భావించాయి. ఆటో, రక్షా సంఘాలు కూడా సంఘీభావం తెలిపాయి. 32 ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ యూనియన్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫెడరేషన్ ఆఫ్ కర్ణాటక స్టేట్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ కర్ణాటక బంద్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. కర్ణాటక హోటల్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్రవ్యాప్తంగా తన కార్యకలాపాలను మూసివేయాలని నిర్ణయించింది. ఇక శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు ఎలాంటి సినిమాలను ప్రదర్శించబోమని కర్ణాటక ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. -
2,600లకు పైగా విమానాలు రద్దు.. ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్ విజ్ఞప్తులు
అమెరికాలో భారీ వర్షాలు, పిడుగుల కారణంగా ఆదివారం(జులై 16) 2,600లకు పైగా విమానాలు రద్దయ్యాయి. సుమారు 8 వేల విమానాలు ఆలస్యంగా నడిచాయి. ఈ మేరకు ఏబీసీ న్యూస్ వార్తా సంస్థ పేర్కొంది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) ప్రకారం అత్యధికంగా ఈశాన్య ప్రాంతంలోనే రద్దయ్యాయి. ఒక్క న్యూజెర్సీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచే 350 కిపైగా విమానాలు రద్దయినట్లు ఎన్బీసీ న్యూస్ నివేదించింది. తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెన్నడీ ఎయిర్పోర్ట్, లా గార్డియన్ విమానాశ్రయాలు కూడా స్తంభించినట్లు పేర్కొంది. ఇదీ చదవండి ➤ ఆకాశంలో ఉండగా.. ఎయిరిండియా విమానంలో కలకలం ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్‌కు వచ్చే ముందే ఫ్లయిట్ టైమింగ్, వాతావరణ పరిస్థితులను సరిచూసుకోవాలని ఎయిర్‌లైన్స్ సంస్థలు ప్రయాణికులకు ట్విటర్ ద్వారా విజ్ఞప్తులు చేశాయి. కాగా ఆ దేశంలోని ఈశాన్య రాష్ట్రాలను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్, పెన్సిల్వేనియా, మసాచుసెట్స్, వెర్మాంట్ ప్రాంతాల్లో వరద హెచ్చరికలు జారీ అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రాణాంతక వరదలు సైతం నమోదైనట్లు నేషనల్ వెదర్ సర్వీస్ పేర్కొంది. ఇది ఇలా ఉంటే, రికార్డు స్థాయి ఉష్ణోగ్రతల కారణంగా ఆ దేశంలోని కొన్ని పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో వడ గాల్పుల హెచ్చరికలు జారీ చేశారు. నైరుతి, పశ్చిమ గల్ఫ్ కోస్ట్, దక్షిణ ఫ్లోరిడాలోని కొన్ని ప్రాంతాలలో తీవ్ర ఉష్ణోగ్రతలు బెంబేలెత్తిస్తున్నాయి. రాబోయే వారంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని ఎన్‌డబ్ల్యూఎస్ హెచ్చరించింది. -
అమెరికాలో మంచు వడగండ్ల వాన
ఆస్టిన్/న్యూయార్క్: అమెరికాలోని దక్షిణాది రాష్ట్రాల్లో మూడు రోజులుగా అతిశీతల పరిస్థితులు కొనసాగుతున్నాయి. టెక్సాస్ మొదలుకొని వెస్ట్ వర్జీనియా వరకు భారీగా కురిసిన మంచు వడగండ్ల వానతో జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. రహదారులపై వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. మంచు వాన కారణంగా జరిగిన ప్రమాదాల్లో ఆరుగురు చనిపోయారు. వాహనదారులు రోడ్లపైకి వెళ్లవద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బుధవారం ఉదయం 1,400 విమాన సర్వీసులు రద్దయ్యాయి. డల్లాస్, ఆస్టిస్, టెక్సాస్, నాష్విల్లె, టెన్నెస్సీ విమానాశ్రయాల్లో విమానాలు నిలిచిపోయాయి. ప్రమాదకర అతిశీతల వాతావరణంతో డల్లాస్, మెంఫిస్, టెన్నెస్సీల్లో స్కూళ్లు మూతబడ్డాయి. లక్షలాది మంది విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. అర్కాన్సస్‌లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. న్యూయార్క్‌లో అసాధారణం న్యూయార్క్ వాసులు ఏటా డిసెంబర్– జనవరి ఆఖరు వరకు కురిసే మంచులో స్లెడ్జిలపై తిరుగుతూ, స్నోబాల్స్తో కొట్లాడుతూ ఎంజాయ్ చేసేవారు. కానీ, ఈసారి.. దాదాపు 50 ఏళ్ల తర్వాత అలాంటి పరిస్థితులు కనిపించకుండా పోయాయి. గడిచిన 325 రోజుల్లో నగరంలో ఒక్కసారైనా అరంగుళం మంచు కూడా పడలేదని స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. 1973 తర్వాత ఇలాంటి పరిస్థితులు ఏర్పడటం ఇదే మొదటిసారని వాతావరణ శాస్త్రవేత్తలు అన్నారు. వరుసగా 332 రోజులు అతి తక్కువ మంచుకురిసిన 2020 నాటి రికార్డు త్వరలో బద్దలు కానుందని కూడా చెప్పారు. ఏడాదికి సరాసరిన 120 అంగుళాల మంచు కురిసే సిరాక్యూస్‌లో ఈసారి 25 అంగుళాలు మాత్రమే నమోదైంది. రొచెస్టర్, బఫెల్లోలోనూ దాదాపు ఇవే పరిస్థితులున్నాయి. ఉటాహ్‌లోని వెల్స్విల్లెలో మంచును తొలగిస్తున్న ఓ వ్యక్తి -
మంచు గుప్పెట్లోనే అమెరికా.. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పతనం
బఫెలో: అమెరికాలో మంచు తుఫాను బీభత్సం కొనసాగుతూనే ఉంది. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పతనమవుతున్నాయి. అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్యే పౌరులు క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటున్నారు. న్యూయార్క్ తదితర రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఇంత దారుణమైన వాతావరణ పరిస్థితులను రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ చూడలేదని న్యూయార్క్‌వాసులు చెబుతున్నారు. బఫెలో తదితర చోట్ల హరికేన్లను తలపించే గాలులు ప్రజల కష్టాలను రెట్టింపు చేస్తున్నాయి. రోడ్లు, రన్‌వేలపై ఏకంగా 50 అంగుళాలకు పైగా మంచు పేరుకుపోయింది. దాంతో పలు విమానాశ్రయాలను రెండు రోజుల పాటు మూసేశారు. శని, ఆదివారాల్లో కూడా వేలాది విమానాలు రద్దయ్యాయి. దేశవ్యాప్తంగా కరెంటు సరఫరాలో అంతరాయాలు వరుసగా మూడో రోజూ కొనసాగాయి. అయితే పలుచోట్ల పరిస్థితిని అధికారులు క్రమంగా చక్కదిద్దుతున్నారు. బహుశా ఒకట్రెండు రోజుల్లో పరిస్థితులు కాస్త మెరుగు పడొచ్చని భావిస్తున్నారు. -
చెన్నైలో భారీ వర్షాలు.. హైదారాబాద్, కర్నూల్ సహా 8 విమానాలు రద్దు
చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడు రాజధాని చెన్నై సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెన్నై వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ క్రమంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవటంతో మదురై, హైదరాబాద్, కర్నూలు సహా వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన 8 విమానాలు రద్దయ్యాయి. మరోవైపు.. చెన్నై డొమెస్టిక్ టెర్మినల్ నుంచి వెళ్లాల్సిన పలు సర్వీసులు నిలిపివేశారు. చెన్నై నుంచి ఫ్రాంక్ఫర్ట్, శ్రీలంక, పారిస్, దోహా, షార్జా, దుబాయ్, అండమాన్లకు వెళ్లే విమానాలు కూడా ఒక గంట ఆలస్యంగా నడిచాయి. వర్షం కారణంగా విమాన సర్వీసులను రీషెడ్యూల్ చేయడంతో ఎలాంటి ప్రభావం లేదని అధికారులు తెలిపారు. ప్రయాణికులకు ఆలస్యంగా సమాచారం అందించామని వెల్లడించారు. ఇదీ చదవండి: తమిళనాడులో కుండపోత.. నిండుకుండలా చెన్నై.. సెలవు ప్రకటన.. హెచ్చరికలు -
కుక్కకాటుకి చెప్పు దెబ్బ.. చైనాకి అమెరికా సమాధానం ఇది
America Vs China Flight Fight: బయటి దేశాల పౌరులు తమ దేశంలోకి అడుగుపెట్టే విషయంపై చైనా కఠినమైన నియంత్రణల్ని అవలంభిస్తోంది. విమానాల సర్వీసుల్ని తగ్గించడంతో పాటు ‘‘సర్క్యూట్ బ్రేకర్’’ విధానం ప్రవేశపెట్టింది. ఈ విధానం ప్రకారం.. ఎక్కువ ఇన్ఫెక్షన్ కేసులు వస్తాయని భావించే రూట్లో విమానాల్ని నిలిపివేస్తోంది. తద్వారా అమెరికాను టార్గెట్ చేయగా.. ఇప్పుడు చైనాకి కుక్కకాటుకి చెప్పు దెబ్బ పడింది. అమెరికా నుంచి ఎక్కువ కేసులు వస్తున్నాయని ప్రకటించిన చైనా పౌర విమానయాన సంస్థ ఈ మేరకు.. అమెరికన్, డెల్టా, యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానాల్ని రద్దు చేసింది. టేకాఫ్‌కు ముందు ఈ విమానాల్లో ప్రయాణించిన వాళ్లకు నెగెటివ్ ఉందని, తీరా చైనాకి చేరుకున్నాక పాజిటివ్ వచ్చిందని చైనా ఏవియేషన్ ప్రకటించడంపై దుమారం రేగింది. ఈ మేరకు కొవిడ్ ప్రొటోకాల్స్‌లో అమెరికన్లను చేర్చిన నిర్ణయం వెలువడ్డాక.. అమెరికా ప్రభుత్వం నుంచి వెంటనే కౌంటర్ వస్తుందని అంతా భావించారు. కానీ, రోజులు గడిచినా అలా జరగలేదు. ఈ క్రమంలో శుక్రవారం అమెరికా నుంచి బీజింగ్‌కు వెళ్లాల్సిన 44 విమానాల్ని రద్దు చేస్తున్నట్లు ఆఘమేఘాల మీద ఉత్తర్వులు జారీ చేసి ఆశ్చర్యపర్చింది. ఎయిర్ చైనా, చైనా ఈస్ట్రన్ ఎయిర్‌లైన్స్, చైనా సదరన్ ఎయిర్‌లైన్స్, గ్జియామెన్ ఎయిర్‌లైన్స్.. విమానాల్ని కొంతకాలం పాటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ‘‘డెల్టా, అమెరికన్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలను దెబ్బతీసే చర్యలు ప్రజా ప్రయోజనాలకు ప్రతికూలమైనవి. అస్థిరమైన చర్యల్ని చూస్తూ ఊరుకోబోం’ అని ప్రకటనలో పేర్కొంది The US Department of Transportation. అంతేకాదు చైనీస్ రెగ్యులేషన్స్ పాటిస్తూ.. పాజిటివ్ బారిన పడ్డ US క్యారియర్లకు ఎలాంటి జరిమానా విధించబడదని ప్రకటిస్తూ.. చైనా ఆదేశాలకు గట్టికౌంటర్ ఇచ్చింది. ఈ మేరకు విమానాల నిషేధం జనవరి 30 నుంచి మార్చి 29 వరకు వర్తిస్తుందని పేర్కొంది. మరోవైపు చైనా ఏవియేషన్.. డిసెంబర్ 31 నుంచి అమెరికాకు చెందిన విమాన సర్వీసులపై నిషేధం విధించగా.. ఇప్పుడు అమెరికా కౌంటర్‌కు దిగింది. అమెరికా తాజా చర్యపై చైనా రాయబారి ప్రతినిధి Liu Pengyu వాషింగ్టన్లో మాట్లాడుతూ.. అసంతృప్తి వ్యక్తం చేశారు. మిగతా దేశాలకు ఒకలా.. చైనాకు ఒకలా నిర్ణయం తీసుకోవడంపై అసహనం వ్యక్తం చేశారు. అయితే చైనా విషయంలోనే కాదు.. జర్మనీ, ఫ్రాన్స్ విషయంలో అమెరికా రవాణా విభాగం ఇదే పంథా పాటిస్తోందని ఎయిర్‌లైన్స్ ఫర్ అమెరికా చెబోతోంది. వింటర్ ఒలింపిక్స్ మూడు వారాల ముందుగా చోటు చేసుకున్న ఫ్లైట్ ఫైట్ పరిణామం ఆసక్తికర చర్చకు దారితీసింది. ఇదిలా ఉంటే చైనాలో కరోనా విజృంభణతో బీజింగ్ నుంచి వేల కొద్దీ విమానాలు రద్దైన సంగతి తెలిసిందే. చదవండి: చైనాలో కొవిడ్ నిబంధనల పైశాచికం.. ఎంత దారుణమో తెలుసా? -
అమెరికాను వణికిస్తున్న ఇజ్జీ.. 1,200 విమానాలు రద్దు
అట్లాంటా: అమెరికా ఆగ్నేయ ప్రాంతాన్ని చలి తుఫాను, పెనుగాలులు, హిమపాతం వణికిస్తున్నాయి. వీటి ప్రభావంతో చాలాచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయాలు, వృక్షాలు నేలకూలడం, రోడ్లన్నీ మంచుతో నిండిపోవడం జరుగుతోంది. జార్జియా, ఉత్తర కరోలినా, దక్షిణ కరోలినా, ఫ్లోరిడా తదితర ప్రాంతాలన్నీ ఆదివారం నుంచి చలిపులి చేతికి చిక్కి వణుకుతున్నాయి. పలు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు హైవే పెట్రోల్ అధికారులు తెలిపారు. (చదవండి: లైన్లో నిలబడితే డబ్బులే డబ్బులు.. గంటకు రూ.2 వేలు పక్కా!) కారును మంచు కప్పేసిన దృశ్యం ఫ్లోరిడాలో గంటకు 190 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులతో విరుచుకుపడ్డ టోర్నడో బీభత్సంతో ఒక ట్రైలర్ పార్క్ నాశనమైంది. చార్లట్ డగ్లస్ విమానాశ్రయం నుంచి 1,200కు పైగా విమానాలను రద్దు చేశారు. కరోలినాలో దాదాపు 1.5 లక్షల మంది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. న్యూయార్క్ పై ప్రభావం ఉండకపోయినా, లాంగ్ ఐలాండ్, కనెక్టికట్ తీరప్రాంతాల్లో ప్రభావం ఉంటుందని అంచనా. ఒహాయో, పెన్సిల్వేనియాల్లో 6– 13 అంగుళాల మేర హిమపాతం ఉండొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. (చదవండి: అఫ్గనిస్తాన్‌లో భారీ భూకంపం.. 26 మంది మృతి) -
జూన్ 21 వరకు భారత విమానాలపై నిషేధం
ఒట్టావా: భారత్, పాకిస్తాన్ల నుంచి వచ్చే ప్రయాణికుల విమానాలపై నిషేధాన్ని నెల రోజుల పాటు పొడిగిస్తున్నట్లు కెనడా ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 21 వరకూ ఈ నిషేధం కొనసాగుతుందని, అప్పటి వరకూ భారత్, పాక్‌ల నుంచి డైరెక్టు విమానాలు ఉండవంది. కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగానే నిషేధం పొడిగించినట్లు పేర్కొంది. అయితే ఈ ఇరు దేశాల ప్రజలు ఏదైనా మూడో దేశం మీదుగా తమ దేశంలోకి చేరుకోవడానికి మాత్రం అనుమతి ఇచ్చింది. ఇందుకుగానూ కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్‌ను చూపించాల్సి ఉంటుంది. అత్యవసర వస్తువులు, వ్యాక్సిన్లు, ఇతర మెడికల్ సంబంధమైన వాటిని రవాణా చేసేందుకుగానూ కార్గో ఫ్లైట్లు తిరుగుతాయని స్పష్టం చేసింది. ప్రజల ప్రాణాలను కాపాడటం ప్రభుత్వం బాధ్యత అని అందుకే నిషేధం పొడిగించినట్లు ఆ దేశ రవాణా శాఖ మంత్రి ఒమర్ అల్ఘాబ్రా చెప్పారు. వాస్తవానికి ఏప్రిల్ 22న విధించిన 30 రోజుల నిషేధం ఈ నెల 22తో ముగియనున్న నేపథ్యంలో కెనడా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. -
శంషాబాద్‌లో 30 విమాన సర్వీసులు రద్దు
సాక్షి, శంషాబాద్ రూరల్: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వివిధ నగరాలకు వెళ్లాల్సిన పలు దేశీయ విమాన సర్వీసులు శుక్రవారం అర్ధరాత్రి నుంచి రద్దయ్యాయి. కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో వివిధ నగరాల్లో ప్రయాణికులపై ఆంక్షలు ఉన్నం దున ఈ నిర్ణయం తీసుకున్నట్లు విమానాశ్రయ వర్గాలు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చే వారు 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని ఇతర రాష్ట్రాలు షరతులు విధిస్తున్న నేపథ్యంలో ప్రయాణికులు తమ షెడ్యూల్‌ను వాయిదా వేసుకుంటున్నారు. నైట్ కర్ఫ్యూ సందర్భంగా రాకపోకలకూ ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్‌లకు ప్రయాణికులు తగ్గిపోయారు. ఈ కారణాలతో హైదరాబాద్ నుంచి ఢిల్లీ, ముంబై, గోవా, çపుణే, చెన్నై తదితర నగరాలకు వెళ్లే సుమారు 30 విమాన సర్వీసులు నిలిచిపోయినట్లు పేర్కొన్నారు. చదవండి: (తెలంగాణలో రెండు వారాల్లో లక్ష కేసులు) -
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే టోర్నీకి భారత్ దూరం
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ ఈవెంట్ అయిన ప్రపంచ అథ్లెటిక్స్ రిలే టోర్నమెంట్ నుంచి భారత అథ్లెటిక్స్ జట్టు వైదొలిగింది. పోలాండ్లోని సిలెసియా నగరంలో మే 1, 2 తేదీల్లో ఈ టోర్నీ జరుగుతుంది. భారత మహిళల 4గీ100 మీటర్ల రిలే, పురుషుల 4గీ400 మీటర్ల రిలే జట్టు సభ్యుల కోసం భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) నెదర్లాండ్స్‌కు చెందిన కేఎల్ఎమ్ రాయల్ డచ్ ఎయిర్‌లైన్స్ ద్వారా గురువారం ఉదయం న్యూఢిల్లీ నుంచి అమ్‌స్టర్‌డామ్ వరకు విమానం టికెట్లను బుక్ చేసింది. అమ్‌స్టర్‌డామ్ నుంచి కనెక్టింగ్ ఫ్లయిట్లో భారత జట్లు పోలాండ్‌కు వెళ్లాల్సింది. అయితే కరోనా కల్లోల పరిస్థితుల నేపథ్యంలో భారత్ నుంచి తమ దేశానికి వచ్చే విమానాలను నెదర్లాండ్స్ ప్రభుత్వం సోమవారం రాత్రి నుంచి రద్దు చేసింది. భారత్ నుంచి నేరుగా పోలాండ్‌కు విమానాలు లేకపోవడంతో ఏఎఫ్ఐ ముందుగా అమ్స్టర్డామ్కు టికెట్లు బుక్ చేసి అక్కడి నుంచి పోలాండ్‌కు పంపించే ఏర్పాట్లు చేసింది. ‘యూరప్‌లోని ఇతర నగరాల నుంచి పోలాండ్‌కు వెళ్లేందుకు ఏమైనా ఫ్లయిట్స్ ఉన్నాయా అని తీవ్రంగా ప్రయత్నించాం. కానీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. దాంతో ఈ టోర్నీ నుంచి భారత జట్లు వైదొలగక తప్పలేదు’ అని ఏఎఫ్ఐ అధ్యక్షుడు అదిలె సుమరివల్లా తెలిపారు. భారత మహిళల 4గీ100 రిలే జట్టులో హిమ దాస్, ద్యుతీ చంద్, ధనలక్ష్మీ, అర్చన, ధనేశ్వరి, హిమశ్రీ రాయ్ సభ్యులుగా ఉన్నారు. వరల్డ్ రిలే టోర్నీలో టాప్–8 లో నిలిచిన జట్లు ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాయి. -
30కి పైగా దేశాల్లో కొత్త స్ట్రెయిన్
న్యూఢిల్లీ: 2020 చివర్లో యూకేలో గుర్తించిన కరోనా కొత్త స్ట్రెయిన్ వేగంగా ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. తాజాగా శనివారం వియత్నాంలో ఈ స్ట్రెయిన్‌ను గుర్తించారు. దాంతో తక్షణమే అంతర్జాతీయ విమాన రాకపోకలపై ఆ దేశం నిషేధం విధించింది. ఇప్పటివరకు దాదాపు 30కి పైగా దేశాల్లో ఈ కొత్త వైరస్ ప్రకంపనలను సృష్టిస్తోంది. వేగంగా వ్యాప్తి చెందే లక్షణం కారణంగా.. ఈ వైరస్‌పై అత్యంత అప్రమత్తత అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. ఈ స్ట్రెయిన్ కారణంగా యూకేలో కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం, దాంతో, అక్కడ కఠిన ఆంక్షలను అమలు చేయడం తెలిసిందే. అమెరికాలోనూ దాదాపు 3 రాష్ట్రాల్లో ఈ స్ట్రెయిన్‌ను గుర్తించారు. అది మరిన్ని రాష్ట్రాలకు విస్తరించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ వైరస్ స్ట్రెయిన్ వేగంగా వ్యాప్తి చెందుతుందే కానీ, గత వైరస్ కన్నా ఎక్కువ ప్రాణాంతకం కాదని వైద్యులు చెబుతున్నారు. అలాగే, ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన, త్వరలో మార్కెట్లోకి రానున్న టీకాలు ఈ వైరస్‌పై కూడా సమర్ధవంతంగా పనిచేస్తాయని చెబుతున్నారు. వైరస్‌లో జన్యు పరివర్తనాలు సహజమేనని వివరిస్తున్నారు. -
ఫ్రాన్స్‌కు పాకిన కొత్త కరోనా
పారిస్: ఫ్రాన్స్‌లో తొలిసారి కొత్తరకం కరోనా వైరస్ బయటపడినట్లు ఫ్రెంచ్ వైద్యాధికారులు నిర్ధారించారు. దీంతో బ్రిటన్ నుంచి వచ్చే విమానాల రాకపోకలపై కఠిన లాక్డౌన్ ఆంక్షలు విధించారు. ఇంగ్లండులో నివసించే ఫ్రాన్స్‌కి చెందిన వ్యక్తి 19న ఫ్రాన్స్‌కి తిరిగి వచ్చారు. ఈయనకు పరీక్షలు జరపగా కొత్తరకం కరోనా వైరస్ సోకినట్లు తేలింది. ఇతర యూరోపియన్ దేశాల్లో సైతం ఈ కొత్తరకం కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌కి అత్యంత వేగంగా విస్తరించే లక్షణం ఉన్నట్టు బ్రిటన్ అధికారులు వెల్లడించారు. బ్రిటన్‌లో ఈ కొత్త కరోనా వైరస్ బయటపడినట్టు 19న, ప్రకటించిన వెంటనే 40 వరకు దేశాలు బ్రిటన్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించాయి. ఫ్రాన్స్ సైతం బ్రిటన్నుంచి వచ్చే ప్రయాణీకులపై, కార్గోలపై రెండు రోజులు నిషేధం విధించింది. దీంతో తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు తలెత్తడంతో ఫ్రాన్స్ రాకపోకలకు అనుమతిచ్చింది. అయితే, బ్రిటన్ నుంచి వచ్చే వారికి కరోనా పరీక్షలు తప్పనిసరి చేసింది. మోడెర్నా టీకాతో వైద్యుడికి తీవ్ర అలర్జీ వాషింగ్టన్: మోడెర్నా కరోనా టీకా తీసుకున్న ఓ వైద్యుడికి తీవ్ర అలర్జీ లక్షణాలు కనిపించినట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. బోస్టన్‌కు చెందిన వైద్యుడు హొస్సీన్ సదర్జాదేహ్కు అంతకు ముందే షెల్ఫిష్ అలర్జీ ఉంది. టీకా వేయించుకున్న వెంటనే మైకం కమ్మేసినట్లు, గుండె వేగంగా కొట్టుకున్నట్లు అనిపించిందని వైద్యుడు తెలిపారు. -
బ్రిటన్ విమానాలపై నిషేధం
లండన్/న్యూఢిల్లీ/వాషింగ్టన్: కొత్త రకం కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. మహమ్మారి ముప్పు త్వరలో తొలగిపోనుందన్న ఆశలపై నీళ్లు చల్లుతూ.. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదకర వైరస్‌గా గుర్తింపు పొంది, ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసింది. బ్రిటన్‌లో మొదట గుర్తించిన ఈ ‘వీయూఐ 202012/1’ వైరస్ ఇప్పటివరకు డెన్మార్క్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, బెల్జియం, ఇటలీ దేశాల్లోనూ అడుగుపెట్టింది. కొత్త తరహా వైరస్ అదుపు చేయలేని స్థాయిలో వ్యాపిస్తోందని ఆందోళన వ్యక్తం చేసిన బ్రిటన్.. ఆదివారం నుంచి పౌరులపై అత్యంత కఠినమైన లాక్డౌన్ ఆంక్షలను విధించింది. పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రి మేట్ హన్‌కాక్ పేర్కొన్నారు. ‘ప్రజలంతా, ముఖ్యంగా టయర్ –4 ఆంక్షలు అమల్లో ఉన్న ప్రాంతాలవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వైరస్ తమకు కూడా సోకిందన్నట్లుగానే జాగ్రత్తలు పాటించాలి. అప్పుడే దీన్ని నియంత్రించగలం’ అని విజ్ఞప్తి చేశారు. కొత్త రకం వైరస్ 70% వేగంగా వ్యాప్తి చెందుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు. అది ఎక్కువ ప్రాణాంతకం అనేందుకు ఆధారాలేవీ లభ్యం కాలేదని, టీకాకు కూడా.. గత వైరస్‌తో పోలిస్తే వేరుగా స్పందిస్తుందనేందుకూ ఆధారాల్లేవని వివరించారు. ఉత్తర ఐర్లాండ్ మినహా బ్రిటన్ అంతటా ఈ వైరస్‌ను గుర్తించారు. ముఖ్యంగా లండన్, తూర్పు ఇంగ్లండ్, ఆగ్నేయ ఇంగ్లండ్ ప్రాంతాల్లో దీని వ్యాప్తి ఎక్కువగా ఉంది. అప్రమత్తంగా ఉన్నాం కొత్త తరహా వైరస్‌పై ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని, దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు. కొత్త రకం వైరస్ ముప్పుపై సోమ వారం ఆరోగ్య శాఖ అత్యవసర సమావేశం నిర్వహించింది. అనంతరం వైరస్ ముప్పుపై విలేకరులు ప్రశ్నించగా.. ‘ఇదంతా ఊహాజనితం. ఎక్కువగా ఊహించి భయాందోళనలకు గురికావద్దు. ప్రభుత్వం పూర్తి అప్రమత్తతతో ఉంది. ఆందోళన అవసరం లేదు’ అని హర్షవర్ధన్ వివరించారు. రాలేకపోతున్నారు.. బ్రిటన్ నుంచి విమానాల రాకపోకలను నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న ఆకస్మిక నిర్ణయంతో అక్కడి నుంచి భారత్ రావాలనుకున్న పలువురు విద్యార్థులు, ఉద్యోగులు అక్కడే చిక్కుకుపోనున్నారు. క్రిస్ట్మస్, నూతన సంవత్సర వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనేందుకు భారత్ రావాలని యూకేలో చదువుకుంటున్న పలువురు విద్యార్థులు ఏర్పాట్లు చేసుకున్నారు. కొందరు విద్యార్థులు టికెట్స్ కూడా బుక్ చేసుకున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో భారత్‌కు రాలేని పరిస్థితి ఏర్పడటంతో వారు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు జనవరిలో ప్రారంభమయ్యే అకడమిక్ సెషన్లో జాయిన్ అయ్యేందుకు భారత్ నుంచి బ్రిటన్ రావాలనుకుంటున్న వారికి కూడా ఏం చేయాలో తోచని పరిస్థితి ఏర్పడింది. విమానాలు రద్దు కావడంతో విమానయాన సంస్థలు కూడా టికెట్స్‌ను బుక్ చేసుకున్న వారికి డబ్బులు తిరిగివ్వడం కానీ, ప్రయాణ తేదీని మార్చుకోవడానికి అవకాశమివ్వడం కానీ చేస్తున్నాయి. ప్రాణాంతకం అనేందుకు ఆధారాల్లేవు కరోనా కొత్త వేరియంట్ మరింత ప్రాణాంతకం అనేందుకు ఆధారాలు లభించలేదని భారతీయ అమెరికన్ ఆరోగ్య నిపుణుడు వివేక్ మూర్తి తెలిపారు. అమెరికా కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ టీమ్‌లో వివేక్ మూర్తి సర్జన్ జనరల్‌గా బాధ్యతలు తీసుకోబోతున్న విషయం తెలిసిందే. మహారాష్ట్రలో కర్ఫ్యూ కొత్త రకం కరోనా వైరస్‌తో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త గా రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లలో రాత్రి కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది. ఈ కర్ఫ్యూ డిసెంబర్ 22 నుంచి జనవరి 5వ తేదీ దాకా అమల్లో ఉంటుంది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సోమవారం అధికారులతో సమావేశమయ్యారు. తాజా పరిస్థితిపై చర్చించారు. భారత్ సహా ప్రపంచ దేశాల ఆంక్షలు తాజా వైరస్ ముప్పుపై స్పందించిన దేశాలు బ్రిటన్ నుంచి రాకపోకలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. భారత్ కూడా బుధవారం నుంచి డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు యూకే నుంచి అన్ని విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. బ్రిటన్ నుంచి మంగళవారం అర్ధరాత్రి లోపు భారత్ వచ్చిన విమాన ప్రయాణికులకు ఆరీ్టపీసీఆర్ పరీక్ష చేస్తామని, ఆ టెస్ట్‌లో ఎవరైనా కోవిడ్ పాజిటివ్‌గా తేలితే క్వారంటైన్‌కు పంపిస్తామని విమానయాన శాఖ సోమవారం ప్రకటించింది. నెగటివ్‌గా నిర్ధారణ అయినవారు కూడా వారం పాటు హోం క్వారంటైన్లో ఉండా లంది. ప్రయాణానికి ముందు 72 గంటల లోపు పరీక్ష చేయించుకుని, నెగెటివ్ రిపోర్ట్‌తో వచ్చిన ప్రయాణికులకు ఇప్పటివరకు ఎలాంటి పరీక్షలు, క్వారంటైన్లు లేకుండానే ఇంటికి పంపించేవారు. ఈ మధ్యకాలంలో బ్రిటన్ నుంచి వేరే దేశం వచ్చి, అక్కడి నుంచి భారత్ రావాలనుకుంటున్న ప్రయాణికులను కూడా అడ్డుకోవాలని అన్ని అంతర్జాతీయ విమానయాన సంస్థలను డీజీసీఏ ఆదేశించింది. లాక్డౌన్ అనంతరం కొన్ని నెలలుగా బ్రిటిష్ ఎయిర్వేస్, విస్టారా, ఎయిరిండియా, వర్జిన్ అట్లాంటిక్ సంస్థలు భారత్, బ్రిటన్ మధ్య విమాన సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. కెనడా, టర్కీ, బెల్జియం, ఇటలీ, ఇజ్రాయెల్, ఆస్ట్రియా, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, బల్గేరియా దేశాలు కూడా యూకే నుంచి విమానాల రాకపోకలపై తాత్కాలిక నిషేధం విధించాయి. ఫ్రాన్స్ సహా పలు యూరోప్ దేశాలు బ్రిటన్‌తో సరిహద్దులను మూసేశాయి. హాంకాంగ్, ఇరాన్, క్రొయేషియా, అర్జెంటీనా, చిలీ, మొరాకో, కువైట్ బ్రిటన్ ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. కొత్త ముప్పుపై చర్చించేందుకు యూరోపియన్ యూనియన్ దేశాలు ప్రత్యేకంగా భేటీ కానున్నాయి. -
ప్రయాణికులకు రీఫండ్ వోచర్లు..?
న్యూఢిల్లీ: లాక్డౌన్ సమయంలో ప్రయాణాలకు ముందుగా రిజర్వేషన్లు చేసుకున్న ప్రయాణికులకు రిఫండ్స్ ఎలా జరగాలన్న అంశంపై తీర్పును సుప్రీంకోర్టు శుక్రవారం రిజర్వ్ చేసుకుంది. బదలాయింపులకు వీలయిన రిఫండ్ వోచర్లు జారీ ద్వారా సమస్యకు సానుకూల పరిష్కారం చూపవచ్చన్న కేంద్రం ప్రతిపాదనను పరిశీలిస్తామని న్యాయమూర్తులు అశోక్ భూషన్, ఆర్ సుభాషన్ రెడ్డి, ఎంఆర్ షాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. కేంద్ర ప్రతిపాదనలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... లాక్డౌన్ సమయంలో రద్దయిన సర్వీసులకు సంబంధించి ప్రయాణి కులకు డబ్బు వాపసు చేస్తే, ఇప్పటికే తీవ్ర కష్టాల్లో ఉన్న విమానయాన సంస్థలపై ఆర్థికంగా మరింత ప్రతికూల ప్రభావం పడుతుంది. అయితే ఈ సమస్య పరిష్కారానికి ‘బదలాయింపునకు వీలయిన రిఫండ్ వోచర్లను’ ప్రయాణి కులకు జారీ చేస్తే అటు ప్రయాణికులు, ఇటు విమానయాన సంస్థల ప్రయోజనాలకు విఘాతం కలుగదు. వోచర్స్‌ను ప్రయాణికులు టికెట్లు బుక్ చేసిన తమ ఏజెంట్లకు సమర్పించి, డబ్బు వాపసు తీసుకోవచ్చు. లేదా తదుపరి తమ ప్రయాణాల టికెట్ బుకింగ్‌లకు వినియోగించుకోవచ్చు. డబ్బు వాపసు ఇచ్చిన పక్షంలో ఆయా వోచర్లను వేరొకరి ప్రయాణాలకు వినియోగించే సౌలభ్యతను ఏజెంట్లకు కల్పించడం జరుగుతుంది. ఎన్జీఓలు, ప్యాసింజర్ల అసోసియేషన్స్‌సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై కోర్టు రెండు వర్గాల వాదనలు విన్న సంగతి తెలిసిందే. కేంద్రం, డీజీసీఏ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) తరఫున తుషార్ మెహతా చేసిన ‘బదలాయింపులకు వీలయిన రిఫండ్స్ వోచర్ల’ ప్రతిపాదనకు ట్రావెల్ ఏజెంట్ల సంస్థ తరఫున వాదలను వినిపించిన సీనియర్ అడ్వకేట్ పల్లవ్ సిసోడియా సానుకూల స్పందన వ్యక్తం చేయడం శుక్రవారంనాటి మరో కీలకాంశం. ఇండిగో ఎయిర్‌లైన్ తరఫున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీ కూడా సంబంధిత ప్రతిపాదనకు అంగీకారం తెలిపారు. విదేశీ విమాన సర్వీసులకు వర్తించదు! కాగా వాదనల సమయంలో ‘ప్రవాసీ లీగల్ సెల్’ ఎన్జీఏ సంస్థ తరఫు సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్గే విదేశాల నుంచి టికెట్ బుక్ చేసుకున్న వారికి రిఫండ్ పరిస్థితిని ప్రస్తావించారు. దీనికి అత్యున్నత న్యాయస్థానం స్పందిస్తూ, విదేశీ విమాన సర్వీసుల అంశంలోకి వెళ్లలేమని పేర్కొంది. సంబంధిత టికెట్లకు రిఫండ్‌ను భారత్ ప్రభుత్వం ఆదేశించలేదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. -
ఆ నగరాల నుంచి కోల్‌కతాకు విమానాల్లేవ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రయాణాల ద్వారా ఒక నగరం నుంచి మరో నగరానికి వైరస్ వ్యాప్తి జరుగుతున్నట్లు తేలడంతో ఈ నెల 6 నుంచి 19వ తేదీ వరకు పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాకు విమానాల రాకపోకలను నిలిపివేస్తూ అధికార వర్గాలు నిర్ణయం తీసుకున్నాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై, పుణే, నాగపూర్, అహ్మదాబాద్ నుంచి కోల్‌కతాకు ప్యాసింజర్ ఫ్లైట్లు ఉండబోవని కోల్‌కతా ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. -
అక్కడ మళ్లీ వైరస్.. దీంతో 1255 విమానాలు..
బీజింగ్ : చైనాలోని బీజింగ్‌లో మరలా కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతున్న విషయం తెలిసిందే. కొంతకాలంగా తగ్గుతూ వస్తున్న కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతూ వస్తుంది. బీజింగ్ నగరంలో బుధవారం కొత్తగా 31 కరోనా కేసులు వెలుగుచూడడంతో అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తుగా సుమారు 1255 విమానాలను రద్దు చేస్తున్నట్లు నగరంలోని రెండు విమానాశ్రయాలు ప్రకటించాయి. దీంతో బీజింగ్‌లో దాదాపు 70 శాతం విమాన రాకపోకలు నిలిచిపోనున్నాయి. బీజింగ్‌లో తాజాగా ఓ మార్కెట్ నుంచి వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు అధికారులు ద్రువీకరించారు. దీంతో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని మూడవ స్థాయి నుంచి రెండవ స్థాయికి ప్రకటించారు.(అమరులైన భారత సైనికులకు అమెరికా సంతాపం) గత 5 రోజుల్లోనే బీజింగ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వంద దాటింది. ఒకవేళ అత్యవసం అనుకుంటే తప్ప, బీజింగ్ ప్రజలు ఎవరూ తమ ఇండ్లు దాటి బయటకు వెళ్లకూడదని ఆ నగర మున్సిపల్ అధికారి చెన్ బీయి తెలిపారు. ఫెంగ్టాయి జిల్లాలో ఉన్న జిన్‌ఫాడి మార్కెట్ నుంచి అత్యధిక సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. ప్రైమరీ, హైయర్ స్కూళ్ల విద్యార్థులు క్యాంపస్‌కు రావద్దు అని ఆదేశించింది. కాలేజీ విద్యార్థులు కూడా క్యాంపస్‌కు రావాల్సిన అవసరం లేదన్నారు. నగరంలోని ప్రజలంతా అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది.(వైరల్ : భలే గమ్మత్తుగా పోలీస్ ట్రైనింగ్) -
ముంచుకొస్తున్న తుపాను : పలు విమానాలు రద్దు
సాక్షి, ముంబై: నిసర్గ తుపాను పెనువేగంతో ముంబై తీరంవైపు దూసుకొస్తోందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో దేశీయ విమానయాన సంస్థలు అప్రమత్తమయ్యాయి. బుధవారం దేశ ఆర్థిక రాజధాని ముంబైకి రాకపోకలను సాగించే విమానాలను రద్దు చేశాయి. ఇండిగో, విస్తారా, స్పైస్‌జెట్ సంస్థలు పలు విమానాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించాయి. ఈ సమాచారాన్ని సంబంధిత ప్రయాణీకులకు అందించామనీ, దీన్ని దృష్టిలో ఉంచుకుని వారు అప్రమత్తంగా కావాలని సూచించాయి. (తీవ్ర తుఫానుగా ‘నిసర్గ’) ఇండిగో 17 విమానాలను రద్దు చేసింది. . ముంబై నుండి చండీగఢ్, రాంచీ పాట్నాకు కేవలం మూడు విమానాలను మాత్రమే నడుపుతున్నట్టు ఇండిగో పేర్కొంది. ప్రత్యామ్నాయ విమానంలో తిరిగి బుక్ చేసుకునే అవకాశం లేదా క్రెడిట్ సౌకర్యాన్ని అందివ్వనున్నామని ఇండిగో మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. తుపాను కారణంగా తమ సేవలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని విస్తారా ప్రకటించింది. ప్రధానంగా ముంబై, గోవా మధ్య విమానాలను రద్దు చేసినట్టు తెలిపింది. మరిన్ని వివరాలకు విస్తారా అధికారిక వెబ్ సైట్ ను గానీ, 9289228888 నంబరుగానీ సంప్రదించాలని ట్వీట్ చేసింది. అలాగే ముంబై నుంచి , ఢిల్లీ కోల్‌కతాకు వెళ్లే విమానాలను కూడా బుధవారం రద్దు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎయిరిండియా ఉదయం విమానాలను రీషెడ్యూల్ చేస్తోంది. అలాగే విమాన షెడ్యూల్లో ఏదైనా రద్దు, మార్పులను ఇ-మెయిల్స్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తామని స్పైస్‌జెట్ తెలిపింది. కాగా కరోనా వైరస్ , లాక్ డౌన్ కారణంగా పూర్తిగా నిలిచిపోయిన దేశీయ విమాన ప్రయాణాలకు ఆంక్షల సడలింపుల నేపథ్యంలో ఇటీవల అనుమతి లభించించి. మళ్లీ ఇంతలోనే నిసర్గ తుపాను రూపంలో అంతరాయం ఏర్పడింది. #6ETravelAdvisory : To know your flight status, click here https://t.co/Z25uUH5PWw #StaySafe #NisargaAlert pic.twitter.com/tkvwHX0OoA — IndiGo (@IndiGo6E) June 2, 2020 #TravelAdvisory : To check your flight status, please visit https://t.co/VkU7yLB2ny. pic.twitter.com/JYIW9ftpW3 — SpiceJet (@flyspicejet) June 2, 2020 #TravelUpdate Due to the movement of cyclonic storm "NISARGA" flights to/from Mumbai and Goa are likely to be impacted. Please visit https://t.co/IZ9taT0TOv or SMS UK to 9289228888 to check updated flight status before booking and leaving for the airport. Thank you. — Vistara (@airvistara) June 2, 2020 -
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల కష్టాలు..
-
తొలి రోజే ప్రయాణికుల కష్టాలు..
న్యూఢిల్లీ : దాదాపు రెండు నెలల తర్వాత పలు దేశీయ విమాన సర్వీసులు నేటి నుంచి ప్రారంభమయిన సంగతి తెలిసిందే. దీంతో పెద్ద ఎత్తున ఎయిర్‌పోర్ట్‌లకు చేరకున్న ప్రయాణికుల్లో కొందరికి నిరాశే మిగిలింది. దేశవ్యాప్తంగా పలు విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్టుగా కేంద్రం ప్రకటించిగానే పలువురు ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకున్నారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లకు క్యూ కట్టారు. అయితే ముందుగా ప్రకటించిన పలు సర్వీసులు రద్దు కావడంతో.. ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లలోనే నిరీక్షిస్తున్నారు. చాలా ప్రయాణికులకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సర్వీసులు రద్దు కావడంతో.. గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌తో సహా దేశంలోని పలు ఎయిర్‌పోర్ట్‌లలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు నిలిచిపోయారు. విమాన సర్వీసులు పునరుద్దరించబడ్డ తొలి రోజే ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి 80 సర్వీసులను రద్దు చేసినట్టుగా సమాచారం. మరోవైపు హైదరాబాద్ నుంచి ముంబై, ఛండీగఢ్, విశాఖపట్నం, తిరుపతి, నాందేడ్, బెంగళూరు, కడప, పుణె, త్రివేండ్రం, గోవా, కోయంబత్తూరులకు వెళ్లే విమానాలను రద్దు చేశారు. కాగా, పలు రాష్ట్రాలు పరిమిత సంఖ్యలో మాత్రమే విమాన సర్వీసులకు అనుమతించడం, 14 రోజులపాటు క్వారంటైన్‌కు సంబంధించి పూర్తి స్థాయిలో స్పష్టత లేకపోవడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. మరోవైపు విమాన సర్వీసులు పున: ప్రారంభం కావడంతో ఎయిర్‌పోర్ట్‌ల వద్ద ప్రయాణికులు సందడి నెలకొంది. ఇప్పటికే పలువురు ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు. పలు చోట్ల ఎయిర్‌పోర్ట్‌లకు చేరకున్న ప్రయాణికుల చేతుల మీద హోం క్వారంటైన్ ముద్ర వేస్తున్నారు. తెలంగాణ విషయానికి వస్తే.. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే బెంగళూరు నుంచి ఎయిర్ ఇండియా విమానం హైదరాబాద్‌కు చేరుకుంది. -
నా కుటుంబాన్ని కలవాలి... ఆర్థిక సహాయం చేయండి!
క్రైస్ట్‌చర్చ్: ‘యూకే వెళ్లేందుకు విమాన టికెట్లకు కొంత డబ్బు కావాలి. నా దగ్గర ఒక ఆలోచన ఉంది. స్కైప్/ వీడియో కాల్ ద్వారా నాతో ఎవరైనా 20 నిమిషాలు మాట్లాడవచ్చు. క్రికెట్, రాజకీయాలు, వంటలు, మానసిక ఒత్తిడి, సచిన్ టెండూల్కర్ ఏదైనా సరే...మీకు నచ్చితే కొన్ని డాలర్లు/పౌండ్లు నాకు పంపండి’... ఒక మాజీ క్రికెటర్ ఆవేదన ఇది. న్యూజిలాండ్‌కు చెందిన పేస్ బౌలర్ ఇయాన్ ఓబ్రైన్ జాతీయ జట్టు తరఫున 22 టెస్టులు, 10 వన్డేలు, 4 టి20 మ్యాచ్‌లు ఆడాడు. అతని స్వదేశం న్యూజిలాండే అయినా భార్య, ఇద్దరు పిల్లలతో ఇంగ్లండ్‌లో స్థిరపడ్డాడు. తన తల్లిదండ్రులను కలిసేందుకు అతను స్వస్థలం వచ్చాడు. అయితే కరోనా కారణంగా దాదాపు అన్ని విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఏదోలా వెళ్దామనుకొని అందుబాటులో ఉన్న మూడు ఫ్లయిట్లలో అతను బుకింగ్ చేశాడు. అయితే ఆ మూడు చివరి నిమిషంలో రద్దు కాగా, డబ్బులు కూడా తిరిగివ్వలేదు. ఇప్పుడు ఎంత ఎక్కువ మొత్తమైనా ఇచ్చి వెళ్లాలనుకుంటున్నానని, దాంతో ఇలా చేయక తప్పడం లేదని అతను వాపోయాడు (2009 హామిల్టన్ టెస్టులో అతను సచిన్‌ను అవుట్ చేశాడు. అందుకే దాని గురించి కూడా ఎవరైనా అడగవచ్చని సచిన్ పేరు కూడా జత చేశాడు). ఇంగ్లండ్‌లో ఉన్న తన కుటుంబం గురించి అతను తీవ్రంగా ఆందోళన చెందుతున్నాడు. ‘నా భార్య ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతోంది. ఇప్పుడు ఛాతీకి ఇన్‌ఫెక్షన్‌లాంటిదేమైనా వస్తే కరోనా కారణంగా ఆమె ప్రాణాలకే ప్రమాదం. పైగా ఇద్దరు చిన్నపిల్లలు, 80 ఏళ్ల తల్లి కూడా ఉన్నారు. అక్కడికి వెళ్లి ఆమె బాధను కొంత పంచుకోవాలని భావిస్తుంటే ఇప్పుడు నా కారణంగా అది మరింత పెరిగేటట్లు అనిపిస్తోంది’ అని ఓబ్రైన్ బాధపడుతున్నాడు. -
పూర్తి లాక్డౌన్లో భారత్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ రోజురోజుకూ విస్తరిస్తూ ప్రమాదకరంగా మారుతున్న నేపథ్యంలో దాన్ని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతా (యూటీ)ల్లోని 548 జిల్లాల్లో లాక్డౌన్ ప్రకటించింది. చండీగఢ్, ఢిల్లీ, గోవా, జమ్మూకశ్మీర్. నాగాలాండ్ కూడా ఇందులో ఉన్నాయి. అంతేగాక వాయు, జల, భూ మార్గాల ద్వారా భారత్‌లోకి ప్రవేశించగల 107 ఇమిగ్రేషన్ పోస్టులను మూసేస్తూ రాత్రి నిర్ణయం తీసుకుంది. దేశీ విమానాలన్నీ రద్దు రానున్న బుధవారం నుంచి దేశవ్యాప్తంగా అన్నిరకాల దేశీ విమానయాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు, కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పౌర విమానాయాన శాఖ మంత్రి తెలిపింది. అంతర్జాతీయ సర్వీసుల్ని ఆపేయడం తెల్సిందే. దేశీ విమానాలపై నిషేధం మార్చి 24వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి అమల్లోకి వస్తుందని విమానయాన శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. సరుకుల రవాణా చేసే విమానాలకు మాత్రం ఈ నిషేధం వర్తించదు. దేశీ, అంతర్జాతీయ సరుకు రవాణా విమానాల రాకపోకలు ఉంటాయి. కార్గో విమానాలకు మాత్రమే అనుమతి శంషాబాద్: కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు మంగళవారం అర్ధరాత్రి నుంచి శంషాబాద్ నుంచి వెళ్లే విమానాలు సహా అన్ని దేశీయ విమానాల రాకపోకలు నిలిచిపోనున్నాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రతిరోజూ 380కి పైగా దేశీయ సర్వీసులు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇప్పటికే ఆదివారం అర్ధరాత్రి నుంచి అంతర్జాతీయ విమానసర్వీసులు నిలిచిపోయాయి. ఆదివారం రాత్రి 8.38 గంటలకు చికాగో నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం తిరిగి రాత్రి 10 గంటలకు శంషాబాద్ నుంచి బయలుదేరింది. ఇది మినహా మిగతా అన్నీ ఆదివారం అర్థరాత్రి నుంచి పూర్తిగా టేకాఫ్, ల్యాండింగ్ నిలిపివేశాయి. అంతర్జాతీయంగా మొత్తం 37 ప్రాంతాలకు శంషాబాద్ నుంచి రాకపోకలు సాగించే విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల రద్దీ పూర్తిగా తగ్గిపోయింది. -
కరోనా : ఇండిగో వేతనాల కోత
సాక్షి, ముంబై : కోవిడ్-19 (కరోనా వైరస్) ప్రకంపనలు పలు రంగాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా గ్లోబల్‌గా విమానయానరంగం మరింత కుదేలవుతోంది. దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో డిమాండ్ పడిపోయి దాదాపు సగం విమానాలను ఖాళీగా ఎగురుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ విమాన యాన సంస్థ ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది. విమాన సర్వీసులను నిలిపివేయడంతోపాటు, ఉద్యోగుల వేతనాల్లో కోత విధించనుంది. వివిధ స్థాయిలలో జీతం కోతలను ప్రకటిస్తూ ఉద్యోగులకు ఈ మెయిల్ సమాచారాన్ని అందించింది. ఇండిగో సీఈవో రణుంజోయ్ దత్తా తన వేతనంలో 25 శాతం , సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు, ఆపైన ఉద్యోగుల్లో 20 శాతం వేతన కోత వుంటుందని ఉద్యోగులకు రాసిన మెయిల్లో పేర్కొన్నారు. జీతాలలో అన్ని మార్పులు 2020 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తాయి. భారతదేశపు అతిపెద్ద క్యారియర్ ఇండిగో మొత్తం 260 విమానాలలో 16 విమానాలను నిలిపివేసింది. దేశీయ, అంతర్జాతీయ విమానాలపై కరోనావైరస్ ప్రభావంతో 10-20 శాతం జీతం కోత విధించుకోవాలని ఎయిర్‌లైన్స్ తన ఉద్యోగులను కోరుతోంది. స్వయంగా ఇండిగో సీఈవో రణుంజోయ్ దత్తా తన వేతనంలో 25 శాతం తగ్గించుకున్నట్టు ప్రకటించారు. ఆదాయాలు భారీగా క్షీణించాయి. విమానయాన పరిశ్రమ మనుగడ ఇప్పుడు ప్రమాదంలో ఉందని దత్తా వెల్లడించారు. కరోనా ప్రభావంతో విమానయాన రంగంలో ఆర్థిక వాతావరణం గణనీయంగా ప్రభావితమవుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం ఏర్పడిందని వ్యాఖ్యానించారు. తాజా పరిణామంతో ఇండిగో ఉద్యోగులు సంక్షోభంలో పడిపోయారు. ఏవియేషన్ కన్సల్టెన్సీ సంస్థ సీఏపీఏ సమాచారం ప్రకారం ఇండిగో మొదట్లో 150 విమానాలను నిలిపి వేయనుంది. రాబోయే వారాల్లో ఈ సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు. ట్రాఫిక్ క్షీణత తీవ్రంగా కొనసాగితే, ఏప్రిల్ నాటికి మెజారిటీ విమానాలను నిలిపివేయవచ్చు. ఈ ప్రభావంవిమానయాన సిబ్బందిపై 30శాతం, 50 శాతం వరకు గ్రౌండ్ స్టాఫ్ మీద పడనుందని భావిస్తున్నారు. -
కువైట్‌కు విమానాలు రద్దు
తిరువనంతపురం : కోవిడ్ -19 ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న భయాల నేపథ్యంలో కువైట్ కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశంతో సహా ఏడు దేశాల నుంచి విమాన సర్వీసులను నిలిపివేసింది. ఈ ఆదేశాలు ఒక వారం పాటు అమల్లో వుంటాయని కువైట్ అధికారులు ప్రకటించారు. శనివారం కువైట్ ఆరోగ్య అధికారులు తీసుకున్న ఈ ఆకస్మిక ప్రయాణ నిషేధంతో కోజికోడ్ కరీపూర్ విమానాశ్రయంలో 170 మంది ప్రయాణికులు విమానాశ్రయంలో చిక్కుకు పోయారు. భారతదేశంతో పాటు ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఈజిప్ట్, సిరియా, లెబనాన్ నుండి కువైట్‌కు వెళ్లే అన్ని విమానయాన సంస్థలకు ఈ నిషేధం వర్తిస్తుంది. -
విదేశీయుల తరలింపునకు రెడీ!
బీజింగ్: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తమ దేశం నుంచి విదేశీయులను సురక్షితంగా పంపించేందుకు సిద్ధమని చైనా బుధవారం పేర్కొంది. కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న వుహాన్ నుంచి భారతీయులను తరలించేందుకు భారత్ ప్రయత్నాలు ప్రారంభించింది. హ్యుబయి రాష్ట్రంలో దాదాపు 250 మంది భారతీయులున్నారు. వారిలో విద్యార్థులే అత్యధికం. అయితే, భారత్ వచ్చిన తరువాత వారంతా 14 రోజుల పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుంది. చైనాకు విమాన సర్వీసుల రద్దు చైనాకు తమ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు విమానయాన సంస్థలు ఇండిగో, ఎయిర్ ఇండియా ప్రకటించాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఢిల్లీ – షాంఘై సర్వీస్‌ను నిలిపేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించగా, బెంగళూరు– హాంకాంగ్ రూట్లో ఫిబ్రవరి 1 నుంచి, ఢిల్లీ–చెంగ్డూ రూట్లో 14వరకు సర్వీస్‌లను రద్దు చేశామని ఇండిగో పేర్కొంది. ‘కరోనా’కు హోమియోపతి, యునానీ భేష్ శ్వాస సమస్యలు వస్తే ఫోన్ చేయాలని కోరుతూ ఆరోగ్య శాఖ బుధవారం హెల్ప్‌లైన్ నంబర్ 011–23978046ను ప్రకటించింది. కరోనా వైరస్ సోకినవారిని గుర్తించేందుకు విశాఖపట్టణం సహా దేశంలోని 21 విమానాశ్రయాల్లో థర్మల్ స్క్రీనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వైరస్ వ్యాప్తిని హోమియోపతి, యునానీ మందులు సమర్ధవంతంగా అడ్డుకోగలవని ఆయుష్ శాఖ ప్రకటించింది. ఈ దిశగా పనిచేసే కొన్ని ఔషధాలను పేర్కొంది. చైనాలోని హ్యుబయి రాష్ట్రంలో ఈ వైరస్ బారిన పడి మరో 25 మంది మృతి చెందారు. మొత్తంగా చైనావ్యాప్తంగా మృతుల సంఖ్య 132కి చేరింది. అలాగే, దాదాపు 6 వేల మందికి ఈ వైరస్ సోకినట్లు ధ్రువీకరించారు. ‘కరోనా’ను తయారు చేసినశాస్త్రవేత్తలు నోవల్ కరోనా రకం వైరస్‌ను ప్రయోగశాలలో ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు విజయవంతంగా తయారు చేశారు. చైనా బయట వైరస్‌ను తయారు చేయడం ఇదే మొదటిసారని, దీని సాయంతో కరోనా వైరస్‌పై పరిశోధనలు చేయవచ్చని వారు భావిస్తున్నారు. భారత్‌కు కరోనా సోకే ప్రమాదం న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందే అత్యంత అధిక అవకాశాలు ఉన్న 30 దేశాల్లో భారత్ ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. చైనాలో కరోనా వైరస్ బారిన పడ్డ నగరాల నుంచి ఎక్కువ సంఖ్యలో విమాన ప్రయాణికులు ఈ 30 దేశాలకు ప్రయాణిస్తున్నారని తెలిపారు. దీని వల్ల ఈ 30 దేశాలకు కరోనా వైరస్ సోకే ప్రమాదం అత్యంత అధికంగా ఉందని తాజా అధ్యయనంలో గుర్తించారు. ఈ అధ్యయనాన్ని బ్రిటన్‌లోని సౌతాంప్టన్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించారు. అత్యంత ప్రమాదకర దేశాల్లో తొలి 3స్థానాల్లో థాయిలాండ్, జపాన్, హాంకాంగ్ ఉండగా.. అమెరికా(6), ఆస్ట్రేలియా(7), బ్రిటన్(17), భారత్(23) స్థానాల్లో ఉన్నాయి. -
హాంకాంగ్ విమానాశ్రయంలో నిరసనలు
హాంకాంగ్: నిరసనకారుల సెగ హాంకాంగ్ విమానాశ్రయాన్ని తాకింది. విమానాశ్రయంలోకి ప్రవేశించిన నిరసనకారులు ఆ దేశ పోలీసులకు వ్యతిరేకంగా గళం విప్పారు. నల్లటి దుస్తులు ధరించి ఫ్లకార్డులు ప్రదర్శించారు. విమానాశ్రయం లోపల ఇంత పెద్ద స్థాయిలో ఆందోళనలు జరపడం ఇదే తొలిసారి. నిరసన తెలుపుతోన్న ఓ మహిళపై ఆదివారం పోలీసులు దాడి చేయడాన్ని ఖండిస్తూ వారు ఆందోళన నిర్వహించారు. పోలీసుల దాడిలో రక్తమోడుతున్న మహిళ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ దాడిలో మహిళ కంటిచూపు కోల్పోయిందని వారు ఆరోపించారు. ఆమెకు మద్దతుగా కంటికి బ్యాండేజీలు కట్టుకుని నిరసన తెలిపారు. హాంకాంగ్ పోలీసులకు మతి భ్రమించిందని, వారు తమ పరిధిని దాటి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ‘హాంకాంగ్ పోలీసులు మమ్మల్ని చంపేస్తున్నారు’, ‘హాంకాంగ్ సురక్షిత స్థలం కాదు’, ‘హాంకాంగ్ ప్రజలారా మేల్కోండి.. భయపడాల్సిన అవసరం లేదు’ అని ఫ్లకార్డులు ప్రదర్శించారు. నల్లటి దుస్తులు ధరించిన వేలాది మంది నిరసనకారులతో విమానాశ్రయ ప్రాంగణ మంతా నలుపు రంగును పులముకున్నట్లు అయింది. నిరసనకారుల దెబ్బకు హాంకాంగ్ నుంచి బయలుదేరాల్సిన, అక్కడికి రావాల్సిన అన్ని విమానాలను రద్దు చేశారు. నిరసనకారులు ఉగ్రవాదులే: చైనా పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తున్న హాంకాంగ్ నిరసనకారులపై చైనా మండిపడింది. నిరసనకారుల చర్యలు ఉగ్రవాద చర్యల్లాగే ఉన్నాయని, ఇప్పుడిప్పుడే ఉగ్రవాదం పురుడు పోసుకుంటోందని వ్యాఖ్యానించింది. -
ముంబై అతలాకుతలం
సాక్షి, ముంబై: ముంబైను కుండపోత వర్షాలు మంగళవారమూ స్తంభింపజేశాయి. మలద్‌లోని పింప్రిపద ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఓ గోడ కూలి, పక్కన గుడిసెల్లో నివసిస్తున్న 21 మంది మరణించారు. మరో 78 మంది క్షతగాత్రులయ్యారు. గత రెండ్రోజుల్లో వర్షం సంబంధిత కారణాలతో మహారాష్ట్రలో మొత్తంగా 39 మంది మరణించారని అధికారులు చెప్పారు. ఆదివారం నుంచి ముంబైలో భారీ వర్షాలు కురుస్తుండటంతో రోడ్డు, రైలు, విమాన రవాణా సేవలు ప్రభావితమయ్యాయి. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం ముందుగానే హెచ్చరించడంతో ప్రభుత్వం ముంబై, చుట్టుపక్కల ప్రాంతాల్లో మంగళవారం సాధారణ సెలవుగా ప్రకటించింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది. మలద్ ప్రాంతంలో గోడ కూలిన ఘటనలో 15 ఏళ్ల బాలిక శిథిలాల కింద చిక్కుకోగా, ఆమెను రక్షించే ప్రయత్నం విఫలమైంది. శిథిలాల నుంచి బయటకు తీసుకొచ్చే సమయానికే బాలిక మృతి చెందింది. మలద్ ప్రాంతంలోనే వరద రావడంతో మరో ఇద్దరు వ్యక్తులు కారులో చిక్కుకుని చనిపోయారు. విలే పార్లే ప్రాంతంలో ఓ వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మరణించగా, ముంబై శివారు ప్రాంతమైన ములంద్లోనూ గోడ కూలి ఓ సెక్యూరిటీ గార్డు ప్రాణాలు కోల్పోయారు. ముంబైలోనే 25 మంది వర్షాల కారణంగా మృత్యువాత పడ్డారు. ముంబైలోని ఎయిర్పోర్ట్ కాలనీ, వకోలా జంక్షన్, పోస్టల్ కాలనీ తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. మిఠీ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అవాంఛనీయ సంఘటనలను నివారించేందుకు పరివాహక ప్రాంతాల నుంచి వెయ్యి మందిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు. బీఎస్సీ విద్యార్థులకు నిర్వహించాల్సిన ఓ పరీక్షను కూడా ముంబై విశ్వవిద్యాలయం వాయిదా వేసింది. మహారాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వచ్చే రెండ్రోజులపాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోమవారం ఉదయం 8.30 నుంచి మంగళవారం ఉదయం 8.30 గంటల మధ్యన ఉన్న 24 గంటల్లో ముంబైలో 16.3 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ముంబైకి తూర్పున ఉన్న శివారు ప్రాంతాల్లో 32.9 సెంటీ మీటర్లు, పడమరన ఉన్న శివారు ప్రాంతాల్లో 30.9 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. 203 విమానాల రద్దు.. మరో 55 దారి మళ్లింపు మూడ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ముంబైలో ప్రజా రవాణా సేవలు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వాతావరణం సహకరించని కారణంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించాల్సిన విమానాల్లో 203 పూర్తిగా రద్దవ్వగా, మరో 55 దారి మళ్లాయి. మరో 350 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. గురువారం వరకు విమానాశ్రయంలో ప్రధాన రన్‌వే మూసి ఉంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్య, పశ్చిమ రైల్వే జోన్లకు సంబంధించిన అనేక దూరప్రాంతపు రైళ్లను కూడా రద్దు చేశారు. మరిన్ని రైళ్లు గమ్యస్థానం చేరకుండానే మధ్యలో నిలిచిపోయాయి. పట్టాలపైకి నీరు రావడం తో లోకల్ రైళ్లు కూడా కొన్ని చోట్ల దారి మధ్యలోనే నిలిచిపోయాయి. రైళ్లలో చిక్కుకున్న వేలాదిమంది ప్రయాణికులను ఆర్పీఎఫ్ జవాన్ల సాయంతో మధ్య రైల్వే సిబ్బంది రక్షించి, వారికి తేనీరు, ఆహార పదార్థాలు అందించారు. పశ్చిమ రైల్వే అధికారి ఒకరు మాట్లాడుతూ తమ సబర్బన్ రైలు సేవలు చర్చిగేట్, విరార్‌ల మధ్య సాధారణం కన్నా తక్కువ సంఖ్యలో తిరుగుతున్నాయని చెప్పారు. రోడ్లన్నీ నీళ్లతో నిండటంతో వాహనాల రాకపోకలకు కూడా తీవ్ర ఆటంకం కలిగింది. పుణేలోనూ ఆరుగురు.. ఇక మహారాష్ట్రలోని రెండో అతిపెద్ద నగరం పుణేలోని అంబేగావ్‌లో సోమవారం రాత్రి పొద్దుపోయాక గోడ కూలడంతో ఆరుగురు కార్మికులు చనిపోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఠాణే జిల్లాలోని కల్యాణ్ ప్రాంతంలోనూ మంగళవారం ఉదయం గోడ కూలి ముగ్గురు మరణించారు. బుల్ధానా జిల్లాలో పిడుగు పడటంతో 52 ఏళ్ల మహిళ చనిపోయింది. నాసిక్ జిల్లాలో మంగళవారం నీళ్ల ట్యాంకు కూలి నలుగురు కూలీలు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఉత్తర కొంకణ్ ప్రాంతం మొత్తం రుతుపవనాల కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు, చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. కాగా, ప్రభుత్వాల అవినీతి కారణంగానే ముంబై, పుణేల్లో గోడలు కూలి ప్రజలు చనిపోయారని ప్రతిపక్ష పార్టీలు మంగళవారం అధికార బీజేపీ, శివసేన పార్టీలపై విరుచుకుపడ్డాయి. నగరాన్ని నీళ్లతో ముంచేసినందుకు ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్ చవాన్ డిమాండ్ చేశారు. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే నివాసం ఉండే ప్రాంతమైన బాంద్రాలోని కళా నగర్ కూడా నీట మునిగిందని, లోక్‌సభ ఎన్నికలకు ముందు ఠాక్రే తమ ఎంపీలతో గుళ్లు, గోపురాలకు తిరగకుండా తమ ప్రాంతంలో జరుగుతున్న పనులను పరిశీలించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదని ఎద్దేవా చేశారు. అదే స్ఫూర్తి.. భారీ వర్షాలతో కష్టాల్లో చిక్కుకున్న వారికి నగర ప్రజలు ఆపన్నహస్తం అందించారు. దారి మధ్యలో చిక్కుకున్న వారిని వీలైతే గమ్యస్థానాలకు చేర్చడం, సమీప ఇళ్లలో ఆశ్రయం కల్పించడం తదితర చర్యలతో సాయం చేశారు. రవాణా సౌకర్యాలు లేకపోవడంతో దగ్గర్లో ఎవరైనా చిక్కుకుపోతే తమ ఇళ్లకు వచ్చి ఆతిథ్యాన్ని స్వీకరించాల్సిందిగా పలువురు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ‘నేనే చేసేది చాలా చిన్న సాయమే. వీర దేశాయ్ రోడ్ లేదా అంబోలీ ప్రాంతంలో ఎవరైనా చిక్కుకుపోయి ఉంటే వర్షం, వరద తగ్గే వరకు మా ఇంటికి వచ్చి ఉండటానికి మొహమాట పడకండి. ఎవరైనా ఉంటే నాకు నేరుగా మెసేజ్ పంపండి’ అని బిభాష్ చటర్జీ అనే వ్యక్తి ట్వీట్ చేశారు. విధుల్లో ఉన్న పోలీసులు అవెంజర్స్ సూపర్ హీరోలు అని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ అన్నారు. ముంబైని భద్రంగా ఉంచేందుకు వారెంతో శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఓ ట్వీట్ చేస్తూ ‘ముంబై విమానాశ్రయం మూతపడింది. పాఠశాలలను మూసేశారు. రైల్వే స్టేషన్లలోకి నీరు చేరింది. అయినా నా ఇంటికి వార్తా పత్రికలు సరైన సమయానికి, తడవకుండా వచ్చాయి. ఎవరికీ కనిపించని విధంగా గొప్ప గొప్ప పనులు చేస్తున్న వాళ్లందరికీ నేను అభివాదం చేస్తున్నా’ అని పేర్కొన్నారు. వర్షాలు, వరదలను తట్టుకునేలా సరైన మౌలిక వసతులు లేకపోవడం, పరిస్థితిని ఎదుర్కొనేందుకు యంత్రాంగం ముందుగా సిద్ధం కాకపోవడం తదితర సమస్యలపై వ్యాపారవేత్తలెవరూ ఒక్క మాటా మాట్లాడకపోవడం గమనార్హం. ముంబై విమానాశ్రయంలో ల్యాండ్ అవుతూ భారీ వర్షం ధాటికి రన్‌వే నుంచి పక్కకు వెళ్లిన విమానం ఘట్కోపర్లో వరదతో నిండిన రోడ్డు ముంబైలో చిన్నారిని సురక్షితంగా తీసుకెళ్తున్న స్థానికుడు -
అమెరికా @ 12" మంచు
షికాగో: భారీ మంచు తుపాను, చలిగాలుల కారణంగా అమెరికాలో ఏడుగురు మృతి చెందగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో శుక్రవారం ఒక్కరోజే 500 పైగా విమాన సర్వీసులు రద్దు కాగా 5,700 విమానాలు ఆలస్యంగా నడిచాయి. మంచు తుపాను కారణంగా చాలా చోట్ల 12 అంగుళాల మేర మంచు పేరుకుపోయింది. ఈ తీవ్రత రానున్న రోజుల్లో న్యూమెక్సికోతోపాటు దక్షిణ, తూర్పు రాష్ట్రాల్లో మరింత ఎక్కువవుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణాది రాష్ట్రాల్లో చలితోపాటు భారీ వర్షాలతో పాటు వరదలు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. లూసియానా, కెన్సాస్, నార్త్ డకోటా, టెన్నిస్సీ, మిన్నెసొట్టా ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, తొమ్మిది మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. గురువారం కూడా దేశవ్యాప్తంగా 6,500 విమానాలు ఆలస్యంగా నడవగా మరో 800పైగా సర్వీసులు రద్దయినట్లు వివరించారు. మంచు కారణంగా చాలా చోట్ల రహదారులను కూడా మూసి వేశారు. మరికొద్ది రోజులు ఇవే పరిస్థితులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఈ పరిస్థితుల్లో చాలా మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లోనే పడిగాపులు కాస్తున్నారు. నూతన సంవత్సర వేడుకలకు దూరం కావాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
పలు విమానాలు రద్దు :కంపెనీ వివరణ
సాక్షి,ముంబై: అప్పుల ఊబిలో కూరుకుపోయిన దేశీయ రెండవ అతిపెద్ద విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్కు మరిన్ని కష్టాలు తప్పడంలేదు. అనూహ్యంగా విమానాలను రద్దు చేసిన విమర్శల పాలైన జెట్ ఎయిర్వేస్ మరోసాకి 14 విమానాలను రద్దు చేసింది. పైలట్ సెలవు కారణంగా దేశీయంగా వివిధ ప్రదేశాలకు ఈ విమానాలను రద్దు చేయడం కలకలం రేపింది. గత కొన్నినెలలుగా సిబ్బందికి ముఖ్యంగా పైలట్లకు వేతనాలను సక్రమంగా చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. ఈ నేపథ్యంలోనే అనారోగ్యంతో విధులకు హాజరు కాలేకపోతున్నామంటూ వారు యాజమాన్యానికి సమాచారం అందించారు. దీంతో సుమారు 14 సర్వీసులను సంస్థ ఆదివారం రద్దు చేసింది. అనూహ్యంగా విమానాలను రద్దు చేయడంతో టికెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులు విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. దీంతో వారి అవస్థలు అన్నీ ఇన్నీ కావు. జీతం, ఇతర బకాయిలు చెల్లింపుల వ్యవహారంలో జెట్ ఎయిర్వేస్ వైఖరిపై జాతీయ ఏవియేటర్స్ గిల్డ్ (నాగ్)కు ఫైలట్లు ఫిర్యాదు చేశారు. అనారోగ్యం సాకుగా చూపిన పైలట్లు భారీ సంఖ్యలో విధులకు గైర్హాజయ్యారు. అలాగే ఈ పరిస్థితుల్లో పనిచేయలేమంటూ సంస్థ ఛైర్మన్ నరేష్‌గోయల్‌కు లేఖ రాసినట్టు కూడా తెలుస్తోంది. జెట్ ఎయిర్వేస్ వివరణ మరోవైపు దీనిపై స్పందించిన జెట్ ఎయిర్వేస్ విమానాల రద్దుకు పైలట్ల నిరసన కారణం కాదని వివరణ ఇచ్చింది. ఊహించని కార్యాచరణ పరిస్థితి మూలంగా విమానాలను రద్దు చేశామని పేర్కొంది. ప్రయాణికులకు ముందస్తు సమాచారం ఇవ్వడంతోపాటు, ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది. అయితే ఎన్ని సర్వీసులను రద్దు చేసిందీ స్పష్టత ఇవ్వలేదు. కాగా అక్టోబరు, నవంబరు నెలల్లో సిబ్బందికి పూర్తి జీతాలు చెల్లించకపోయినా, సెప్టెంబర్‌లో పాక్షికంగా చెల్లించింది జెట్. అంతర్జాతీయ సర్వీసుల్లో కోత ఇది ఇలా వుంటే ఖర్చులను తగ్గించునే క్రమంలో అంతర్జాతీయంగా నిర్వహిస్తున్న సర్వీసుల్లో వారానికి కొన్నింటిపై కోత పెట్టనుంది. ముఖ్యంగా తొమ్మిది గల్ఫ్ మార్గాల్లో నడిపే విమాన సర్వీసులను తగ్గించనుంది. దేశీయంగా వివిధ నగరాలనుంచి మస్కట్, దోహా, అబుదాభి, దుబాయ్‌కి వెళ్లే విమానాల్లో వారానికి దాదాపు 40విమానాలను రద్దు చేయనుంది. అయితే వివిధ నగరాలనుంచి సింగపూర్, ఖట్మాండు, బ్యాంకాక్ సహా ఇతర గ్లోబల్ రూట్లలో డిసెంబరు 1నుంచి డైరెక్టు విమానాలను పరిచయం చేసినట్టు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. -
ఒక్క రోజులో 14 ‘జెట్’ విమానాల రద్దు
ముంబై: పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉన్న జెట్ ఎయిర్వేస్కు పైలట్లు సహకరించకపోవడంతో ఆదివారం ఆ సంస్థకు చెందిన 14 విమానాలు రద్దయ్యాయి. పైలట్లు సహా పై స్థాయి ఉద్యోగులకు సెప్టెంబర్ నెల వేతనాలను పాక్షికంగా చెల్లించిన జెట్ ఎయిర్వేస్.. అక్టోబర్, నవంబర్ నెల జీతాలను మాత్రం ఇప్పటివరకు పూర్తిగా చెల్లించలేదు. దీంతో కొందరు పైలట్లు తమకు అనారోగ్యంగా ఉందనే సాకు చూపుతూ ఆదివారం అకస్మాత్తుగా విధులకు గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో 14 విమానాలను జెట్ ఎయిర్వేస్ రద్దు చేయాల్సి వచ్చింది. అయితే అనూహ్యంగా ఎదురైన నిర్వహణ పరిస్థితుల కారణంగా విమానాలను రద్దు చేయాల్సి వచ్చిందనీ, పైలట్లు సహకరించకపోవడం వల్ల కాదని జెట్ ఎయిర్వేస్ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులకు విషయాన్ని ఎస్ఎంఎస్ల ద్వారా తెలియజేశామనీ, వీలైనంత మందిని ఇతర విమానాల్లో పంపి, మిగతా వారికి పరిహారం చెల్లించామంది. -
26 వరకు కొచ్చికి విమానాలు డౌటే!
సాక్షి, హైదరాబాద్: కేరళలో వర్షాలు, వరదలు విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడుతోంది. రన్ వేపై ఇంకా నీళ్లు నిలిచి ఉండటంతో ఆదివారం కూడా కొచ్చి వెళ్లాల్సిన విమానాలు రద్దయ్యాయి. శనివారం మధ్యాహ్నానికి రన్‌వేపై నీటిని తోడేయగలమని విమానాశ్రయ అధికారులు భావించినా, ప్రతికూల వాతావరణం కారణంగా సాధ్యపడలేదు. ఈ నెల 26 వరకు రన్‌వే అందు బాటులోకి వచ్చే అవకాశం లేదని తెలిసింది. -
‘ప్రయాణం’పై వర్షం దెబ్బ!
సాక్షి, హైదరాబాద్: కేరళ, ఇతర ప్రాంతాల్లోని వరదలు, భారీ వర్షాల ప్రభావం ఇంకా తగ్గలేదు. ఫలితంగా ఈ ప్రభావం నగరం నుంచి కేరళకు వెళ్లే.. వివిధ రైళ్లు, విమాన సర్వీసులపై పడింది. శుక్రవారం కూడా పలు రైళ్లు, విమానాలు రద్దయ్యాయి. మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేయగా, ఇంకొన్నింటిని దారి మళ్లించారు. పాక్షికంగా రద్దయిన రైళ్లివే.. సేలం– త్రివేండ్రం రాకపోకలకు అంతరాయం కలగడంతో హైదరాబాద్–త్రివేండ్రం సెంట్రల్ శబరి ఎక్స్‌ప్రెస్‌ను సేలం వరకు పరిమితం చేశారు. కోయంబత్తూరు– ఎర్నాకుళం మధ్య రాకపోకలు నిలిచిపోవడంతో పట్నా–ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లను కొయంబత్తూరు వరకు పరిమితం చేశారు.తిరువనంతపురం– పాలక్కడ్ల మధ్య వరదల కారణంగా హైదరాబాద్ నుంచి శుక్రవారం బయల్దేరాల్సిన హైదరాబాద్– త్రివేండ్రం ఎక్స్‌ప్రెస్‌ను తిరుపతి వరకే పరిమితం చేశారు.మంగళూరు–కాచిగూడ మెయిల్ ఎక్స్‌ప్రెస్‌ను శనివారం తాత్కాలికంగా రద్దు చేశారు.కొల్లాం– విశాఖ మెయిల్ ఎక్స్‌ప్రెస్‌ను కొల్లాం–కోయంబత్తూరు మధ్య తాత్కాలికంగా రద్దు చేశారు.బనస్వాడి– సంబల్పూర్ ఎక్స్‌ప్రెస్ (ఈస్ట్‌కోస్ట్ రైల్వే) శుక్రవారం తాత్కాలికంగా రద్దు చేశారు. వీటిని దారి మళ్లించారు.. ముంబై సీఎస్ఎంటీ – కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్, న్యూఢిల్లీ– త్రివేండ్రం సెంట్రల్ ఎక్స్‌ప్రెస్, కొబ్రా– త్రివేండ్రం సెంట్రల్ ఎక్స్‌ప్రెస్, త్రివేండ్రం సెంట్రల్ – న్యూఢిల్లీ ఎక్స్‌ప్రెస్, కన్యాకుమారి– ముంబై సీఎస్ఎంటీ ఎక్స్‌ప్రెస్‌లను ఈరోడ్, దిండిగల్, మదురై, తిరునల్వేలి, నాగర్‌కోయిల్‌టౌన్, త్రివేండ్రం సెంట్రల్ మీదుగా దారి మళ్లించారు.శ్రీగంగానగర్ –హజుర్ సాహిబ్ ఎక్స్‌ప్రెస్ నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌ను(ఈస్ట్‌కోస్ట్ రైల్వే) శనివారం కొదియార్, చండ్లోడియా, సబర్మతీ మీదుగా దారి మళ్లించారు. సమయ వేళల్లో మార్పులు.. లోకమాన్య తిలక్ – కోయంబత్తూరు ఎక్స్‌ప్రెస్ (ఈస్ట్‌కోస్ట్ రైల్వే) శుక్రవారం 1.10 గంటలు ఆలస్యంగా బయల్దేరింది. వాతావరణ మార్పుల కారణంగా ఈ మార్పులు జరిగాయని, అసౌకర్యానికి చింతిస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఉమామహేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. కొచ్చికి రద్దయిన విమానాలు..! కేరళలో కొచ్చి ఎయిర్‌పోర్టు రన్‌వే పూర్తిగా మునిగిపోవడంతో పలు విమాన సర్వీసులు ప్రభావితమయ్యాయి. శంషాబాద్ విమానాశ్రయం నుంచి కొచ్చికి వెళ్లాల్సిన 4 విమానాలు నేడు కూడా రద్దయ్యాయి. వరుసగా రెండోరోజూ కొచ్చి వెళ్లాల్సిన విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కొచ్చి విమానాశ్రయంలో రన్‌వే శనివారం మధ్యాహ్నం తర్వాత అందుబాటులోకి వచ్చే అవకాశముందని సమాచారం. -
విలవిల్లాడుతున్న కేరళ
తిరువనంతపురం: కేరళను ప్రకృతి బీభత్సం మరింత కుదిపేస్తోంది. అనేక జిల్లాల్లో ప్రజల పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. భారీ వర్షాలు, వరదల్లో గత మే నెల నుంచి ఇప్పటివరకూ 324మంది చనిపోయారని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. దాదాపు రెండు లక్షలమందిని సహాయక శిబరాలకు తరలించినట్టు తెలిపారు. కేరళకు విరివిగావిరాళాలివ్వాల్సిందిగా మరోసారి ఆయన విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన లింక్‌ను సీఎంఓ కేరళ ట్విటర్ లో పోస్ట్ చేసింది. కేరళకు మద్దతు ఇవ్వండంటూ ఒక ఆన్లైన్ డొనేషన్ క్యాంపెయిన్ ప్రారంభించింది. 14 జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. రాష్ట్రంలో పలుచోట్ల విద్యుత్ లేక అల్లాడిపోతున్నారు. కేరళ విద్యుత్ బోర్డు పవర్‌కట్ చేయడంతో దాదాపు 80శాతం రాష్ట్రం చీకట్లో మగ్గుతోంది. కొబ్బరి, కాఫీ, నల్ల మిరియాలు లాంటి ఇతర ముఖ్య పంటల ఉత్పత్తి కూడా తీవ్రంగా దెబ్బతింది. వరదలు, కొండచరియలు కారణంగా కొజీకోడ్, ఎర్నాకులం, తిరువనంతపురం, పాలక్కాడ్, త్రిశూర్, పతనమిత్తిట్ట, ఇడుక్కి జిల్లాల్లో రోడ్లు, రైలు మార్గాలు దెబ్బతిన్నాయి. దీంతో అనేక రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటికి దారి మళ్లించారు. అలాగే ఆగస్టు 26 వరకు కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులను రద్దు చేశారు.14 జిల్లాల్లో సుమారు 2లక్షలకు పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. 32,500పైగా ఎకరాల్లో పంట దెబ్బతిందని నేషనల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ ప్రకటించింది. కేరళ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీని సుప్రీంకోర్టు కోరింది. మరోవైపు కేరళలోని వరద పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ సాయంత్రం అక్కడ పర్యటించనున్నారని తెలుస్తోంది. Kerala is facing its worst flood in 100 years. 80 dams opened, 324 lives lost and 223139 people are in about 1500+ relief camps. Your help can rebuild the lives of the affected. Donate to https://t.co/FjYFEdOsyl #StandWithKerala. — CMO Kerala (@CMOKerala) August 17, 2018 -
ఎయిర్ ఏషియా బంపర్ సేల్
సాక్షి,ముంబై: ప్రైవేటు విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. బై మోర్, సేవ్ మోర్ ఆఫర్లో భాగంగా దేశీయ,అంతర్జాతీయ ప్రయాణాలపై 40 శాతం (వన్ వే)రాయితీ ఇవ్వనున్నట్టు తెలిపింది. ఇందులో భాగంగా బుక్ చేసుకున్న టికెట్లపై రేపటి నుంచి (31 జూలై)నవంబరు 30 మధ్య ప్రయాణించవచ్చు. ఆగస్టు 5 వరకు ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అంతర్జాతీయ రూట్లలోనూ 40 శాతం డిస్కౌంట్ అందించనుంది. ఎయిర్ ఏషియా అధికారిక వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేసే టికెట్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. క్రిడిట్, డెబిట్, చార్జ్కార్డ్ ద్వారా జరిగే పేమెంట్స్ ప్రాసెసింగ్ ఫీ నాన్-రిఫండబుల్. సీట్లు పరిమితంగా ఉంటాయి. ఎంపిక చేసిన విమానాలకు ఆఫర్ టికెట్లు వర్తించనున్నాయి. టికెట్లన్నీ సింగిల్ జర్నీకి ఉద్దేశించినవనీ, ఆఫర్లో భాగంగా జరిగే ఫేమెంట్స్ రిఫండ్ చేయనమని ఎయిర్ ఏషియా వెల్లడించింది. -
ఇక ఎగిరే రైళ్లు వస్తున్నాయ్!
సాక్షి, న్యూఢిల్లీ : దశాబ్దం క్రితం కలలుగన్న ఎగిరే కార్లు, హైపర్‌లూప్ రైళ్లు త్వరలో సాకారం కానున్న విషయం తెల్సిందే. ఇదే కలల్లోకి మరో కొత్త కల వచ్చి చేరింది. అదే ఎగిరే రైళ్లు. ఫ్రాన్స్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న అక్కా టెక్నాలజీస్ సంస్థ ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదనను తీసుకొచ్చింది. ఇందులో గుండ్రని రైలు ఆకారంలో ప్రయాణికులు కూర్చునే ఓ ట్యూబ్ ఉంటుంది. దాన్ని ఓ చక్రాల వాహనం రన్‌వేలో గద్దలా ఆగిన విమానం కిందకు తీసుకొస్తుంది. ఆ విమానానికి రెక్కలు తప్ప బాడీ ఉండదు. చక్రాల బండి మీద తీసుకొచ్చిన రైలును విమానానికి అటాచ్ చేస్తారు. అది దాన్ని మోసుకొని గమ్యస్థానానికి బయల్దేరి వెళుతుంది. ఈ ప్రాజెక్ట్ కాన్సెప్ట్‌ను కంపెనీ త్రీడీ వీడియోగా రూపొందించింది. ఈ కొత్త ప్రాజెక్టులో పెట్టుబడుల కోసం ప్రపంచ ప్రసిద్ధ చెందిన కంపెనీలను ఆహ్వానించగా ఇప్పటికే పలు కంపెనీలు ఉత్సాహం చూపించినట్లు కంపెనీ సీఈవో మారిస్ రిక్కీ తెలిపారు. 170 కోట్ల డాలర్ల విలువ కలిగిన అక్కా టెక్నాలజీస్‌తో ఇప్పటికే పలు ప్రముఖ కంపెనీలు వివిధ ప్రాజెక్టుల్లో కలిసి పోతున్నాయి. ఈ ఎగిరే రైళ్లు ప్రాజెక్ట్ పూర్తయితే రైల్వే వ్యవస్థలోనే పిప్లవాత్మక మార్పులు వస్తాయని, వివిధ ప్రాంతాలకు వెళ్లే ట్యూబ్ లాంటి రైళ్లు రైల్వే స్టేషన్ల వద్ద ఉంటాయని, వాటిని ఎగిరే విమానాలు వచ్చి తీసుకెళతాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. తద్వారా, రైల్వేలకు ఓ వైమానిక వ్యవస్థ ఏర్పడుతుందని, ప్రయాణికుడు తన ఇంటికి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్లో దిగే సౌకర్యం వస్తుందని ఆ వర్గాలు వివరించాయి. -
స్పైస్‌జెట్ ‘థ్రిల్లింగ్ థర్స్డే’ ఆఫర్
చవక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ స్పెషల్ ‘థ్రిల్లింగ్ థర్స్డే’ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద విమాన టిక్కెట్లపై వెయ్యి రూపాయల వరకు డిస్కౌంట్‌ను అందిస్తోంది. డిస్కౌంట్ ఆఫర్‌తో పాటు, ప్రియారిటీ చెక్-ఇన్ను కూడా తన కస్టమర్లకు ఆఫర్ చేస్తోంది. నేడు అంటే గురువారం ఈ ఆఫర్ వాలిడ్‌లో ఉంది. అంతేకాక వచ్చే గురువారం జూలై 26న కూడా ఈ ఆఫర్ వాలిడ్‌లో ఉంటుంది. ఈ ఆఫర్ టిక్కెట్లు స్పైస్‌జెట్ వెబ్సైట్, స్పైస్‌జెట్.కామ్, మొబైల్ యాప్‌లో అందుబాటులో ఉంటాయి. స్పైస్‌జెట్ థ్రిల్లింగ్ థర్స్డే ఆఫర్ పొందడానికి కస్టమర్లు ప్రోమో కోడ్ ఎస్సీబీ1000ను వాడాల్సి ఉందని ఎయిర్‌లైన్ తన వెబ్సైట్లో తెలిపింది. స్పైస్‌జెట్ థ్రిల్లింగ్ థర్స్డే ఆఫర్ పొందడమెలా... స్పైస్‌జెట్ థ్రిల్లింగ్ థర్స్డే ఆఫర్ విమాన టిక్కెట్లను 2018 జూలై 26 వరకు వచ్చే గురువారాల్లో బుక్ చేసుకోవాలి. www.spicejet.com, స్పైస్‌జెట్ మొబైల్ యాప్‌లపై విమానాన్ని ఎంపిక చేసుకోవాలి. బుక్ చేసుకునేటప్పుడే ప్రియారిటీ చెక్-ఇన్ను పొందాలి. ప్రమోకోడ్ ఎస్సీబీ1000ను అప్లయి చేసుకోవాలి. పేమెంట్ పేజీపై ఉన్న ప్రమోషన్ కోడ్ సెక్షన్లో స్టాండర్డ్ ఛార్టడ్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు నెంబర్ నమోదు చేయాలి. రౌండ్ ట్రిప్ బుకింగ్‌కు వెంటనే రూ.1000 డిస్కౌంట్ పొందుతారు. వన్ వే బుకింగ్‌కు రూ.500 డిస్కౌంట్ లభిస్తుంది. -
విశాఖ-కౌలాలంపూర్ టిక్కెట్ రూ.3,399!
న్యూఢిల్లీ : మలేషియాకు చెందిన బడ్జెట్ విమానయాన సంస్థ ఎయిర్ఏషియా ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రముఖ స్థానిక నగరాల నుంచి ఎంపిక చేసిన అంతర్జాతీయ ప్రాంతాలకు విమాన టిక్కెట్లను కేవలం రూ.3,399కే అందించనున్నట్టు తెలిపింది. ఈ ఆఫర్ ఇప్పటికే ప్రారంభమైంది. జూలై 15 వరకు ఈ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఎయిర్ఏషియా ప్రకటించిన ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్గాల సేల్ ప్రయాణ కాలం 2019 ఫిబ్రవరి 13 నుంచి ప్రారంభమై 2019 ఆగస్టు 13 వరకు ముగియనుందని ఎయిర్ఏషియా.కామ్‌లో వెల్లడించింది. న్యూఢిల్లీ, అమృత్సర్, జైపూర్ వంటి నగరాల నుంచి వీటి విమానాలు బయలుదేరతాయి. కౌలాలంపూర్, క్రాబీ, హనోయి, ఆక్లాండ్ వంటి దేశాలకు ఈ విమానాలు అందుబాటులో ఉంటాయి. ఎంబార్గో కాలాల్లో ఈ ధరలు అందుబాటులో ఉండవు. తక్కువ ధరకే ఎయిర్ఏషియా విమాన టిక్కెట్ ఆఫర్.. విశాఖపట్నం నుంచి కౌలాలంపూర్ వరకు అంతర్జాతీయ విమాన టిక్కెట్లను ఎయిర్ఏషియా తన సేల్ కింద అత్యంత తక్కువగా రూ.3,999కే అందిస్తోంది. క్రెడిట, డెబిట్, ఛార్జ్ కార్డుల ద్వారా పేమెంట్లు జరిపే వాటికి నాన్-రీఫండబుల్ ప్రాసెసింగ్ ఫీజు వర్తిస్తుంది. ఈ ధరలోనే ఎయిర్‌పోర్టు పన్నులు కలిసి ఉంటాయి. అయితే డిపార్ట్చర్ సమయంలో సేకరించే ఎయిర్‌పోర్టు పన్నులు దీనిలో ఉండవు. సీట్లు కూడా పరిమితమే. అన్ని ఎయిర్ఏషియా విమానాలకు ఈ ఆఫర్ వర్తించదు. ఈ సేల్ కింద అమృత్సర్ నుంచి కౌలాలంపూర్ వెళ్లాలంటే విమాన టిక్కెట్‌ను రూ.4,490కు అందిస్తుంది. భువనేశ్వర్ నుంచి కౌలాలంపూర్‌కు, సింగపూర్‌కు వెళ్లాలంటే టిక్కెట్ ధర రూ.6,436కు ప్రారంభమవుతుంది. కోల్‌కతా నుంచి కౌలాలంపూర్, పెర్త్లకు వెళ్లాలంటే టిక్కెట్ ధర రూ.11,355 నుంచి ఉంది. హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్, సిడ్నీలకు రూ.3,497, న్యూఢిల్లీ నుంచి కౌలాలంపూర్, బ్యాండంగ్కు రూ.8,730, బెంగళూరు నుంచి కౌలాలంపూర్, మెల్బోర్న్కు రూ.14,999కు విమాన టిక్కెట్లను ఎయిర్ఏషియా విక్రయిస్తోంది. -
స్పైస్‌జెట్ మాన్సూన్ బొనాంజ
న్యూఢిల్లీ : విమానయాన సంస్థలు మాన్సూన్ ఆఫర్లతో హోర్రెత్తిస్తున్నాయి. తాజాగా స్పైస్‌జెట్ ‘మెగా మాన్సూన్ సేల్’ను ప్రకటించింది. దీని కింద దేశీయ విమాన టిక్కెట్లను రూ.999కే అందిస్తున్నట్టు పేర్కొంది. స్పైస్‌జెట్ తీసుకొచ్చిన ఈ కొత్త ప్రమోషనల్ సేల్ 2018 జూలై 8 వరకే వాలిడ్‌లో ఉంటుందని స్పైస్‌జెట్ తన వెబ్సైట్లో ప్రకటించింది. 2018 అక్టోబర్ 8వ తేదీకి ఈ ఆఫర్ ప్రయాణ కాలం ముగియనుంది. తక్కువ ధరకు టిక్కెట్లను అందించడమే కాకుండా.. ఎయిర్‌లైన్ అధికారిక వెబ్సైట్లో టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తున్నట్టు పేర్కొంది. సీట్లు, మీల్స్, స్పైస్‌మ్యాక్స్, ఇతర యాడ్-ఆన్స్‌పై 20 శాతం డిస్కౌంట్‌ను ఈ క్యారియర్ అందిస్తున్నట్టు తెలిపింది. అదనపు డిస్కౌంట్ ఆఫర్ ప్రోమో కోడ్ ఏడీడీ0ఎన్20గా స్పైస్‌జెట్ వెల్లడించింది. స్పైస్‌జెట్ ‘మెగా మాన్సూన్ సేల్’ నియమ, నిబంధనలు... వన్-వే ధరలకు మాత్రమే ఈ మెగా సేల్ వర్తిస్తోంది. ఈ ఆఫర్‌ను మిగతా ఏ ఆఫర్‌తో కలుపరు. గ్రూప్ బుకింగ్స్‌కు ఇది వర్తించదు. ఒకవేళ అవసరమైతే స్వల్ప రద్దు ఛార్జీలతో టిక్కెట్ ధర మొత్తాన్ని రీఫండ్ చేయనుంది. ఫస్ట్-కమ్, ఫస్ట్-సర్వ్డ్ బేసిస్‌లోనే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. విమానం బయలుదేరే సమయం, ఇతర షెడ్యూల్స్ రెగ్యులేటరీ ఆమోదం మేరకే ఉంటాయి. ఈ ఆఫర్‌కు బ్లాక్-అవుట్ డేట్స్ వర్తిస్తాయి. స్పైస్‌జెట్ అదనపు 20 డిస్కౌంట్ ఆఫర్... స్పైస్‌జెట్.కామ్ ద్వారా బుకింగ్స్ చేసుకునే యాడ్-ఆన్ ప్రొడక్ట్‌లకు మాత్రమే 20 శాతం అదనపు డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. స్పైస్‌మ్యాక్స్, సీట్, హాట్ మీల్, ప్రియారిటీ చెక్ఇన్, ప్రిఫర్డ్ బ్యాగ్ అవుట్ వంటి వాటికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. అన్ని ఇతర ఛార్జీలు, ఫీజులు, పన్నులను ప్రయాణికులే చెల్లించాల్సి ఉంటుంది. దేశీయ, అంతర్జాతీయ విమానాల రౌండ్-ట్రిప్, వన్‌వే బుకింగ్స్ రెండింటికీ ఈ ఆఫర్ వాలిడ్‌లో ఉంటుంది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఈ ఆఫర్‌ను సవరించుకోవడం, రద్దు చేసుకోవడం చేయొచ్చు. -
విమానం ఎగిరితే చాలు హడలెత్తిపోతున్నారు!
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఉంటున్న పౌరులకు విమానాల రాకపోకలు హడలెత్తిస్తున్నాయి. ఎప్పుడు ఏ విమానం వచ్చి కూలుతుందోనని బెంబేలెత్తిపోతున్నారు. అందుకు ప్రధాన కారణం ముంబైలో ఉన్న దేశీయ, అంతర్జాతీయ విమానాశ్రయాల రన్వేలు నిత్యం బిజీగా ఉండటమే. దీంతో సకాలంలో ల్యాండింగ్‌కు అవకాశం దొరక్క అనేక సందర్భాలలో విమానాలు ఆకాశంలోనే చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి ఎదురవుతోందని రవాణ శాఖ సాంకేతిక నిపుణులు గుర్తించారు. ఈ నేపథ్యంలో విమానంలో ఏదైన సాంకేతిక లోపం తలెత్తిన లేదా పక్షులు ఢీ కొడితే విమానం జనవాసాల మ«ధ్య కూలడం ఖాయం. జనవాసాల మధ్య చక్కర్లు.. 1978లో బాంద్రాలో ఎయిర్ ఇండియా విమానం–855, 1982లో ముంబైలో ఎయిర్ ఇండియా విమానం–403, అంతేకాకుండా 1993, ఏప్రిల్ 26న ఔరంగాబాద్‌లో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానం, ఇటీవల ఘాట్కోపర్లో 12 సీట్ల సామర్థ్యమున్న చార్టర్డ్ విమానం కూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనల్లో చాలా మంది దుర్మరణం చెందారు. కాగా, గత పదేళ్లతో పోలిస్తే ప్రస్తుతం విమానాశ్రయం ఉన్న పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువగా నివసిస్తున్నారు. దీంతో ఒకవేళ విమానాలు కూలితే నష్టం ఊహించలేనంతగా ఉండే అవకాశం ఉంది. ఘాట్కోపర్లో అదృష్టవశాత్తు విమానం నిర్మాణంలో ఉన్న భవనంపై కూలడంతో ప్రాణ నష్టం ఎక్కువ జరగలేదు. ఈ తాజా ఘటనతో విమానాల రాకపోకల వల్ల ముంబైకర్లకు పెను ప్రమాదం పొంచి ఉందన్న విషయం వెలుగులోకి వచ్చింది. రన్‌వేపై ఇప్పటికే చాలా విమానాలు ఉండటంతో ఇక ల్యాండిండ్ కావాల్సిన విమానాలు జనావాసాల్లోనే చక్కర్లు కొడుతున్నాయి. ఇంధనం ఖాళీ అయితే.. నగరంలో దేశీయ, అంతర్జాతీయ ఇలా రెండు విమానాశ్రయాలున్నాయి. ట్రాఫిక్ వల్ల విమానాశ్రయంలోని రన్ వే పై విపరీతమైన భారం పడుతోంది. దీంతో వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి ముంబైకి వచ్చే విమానాలు గాలిలోనే చక్కర్లు కొడుతుంటాయి. వివిధ ప్రాంతాల నుంచి ముంబైకి వచ్చే విమానంలో అర గంటకు సరిపడా ఇంధనం అదనంగా నిల్వ ఉంటుంది. ముంబై జనవాసాల మీదుగా చక్కర్లు కొట్టే విమానంలో ఏదైన సాంకేతిక సమస్య తలెత్తితే లేదా రన్‌వే బిజీ కారణంగా ల్యాండింగ్‌కు అనుకున్నదానికంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది. కాగా, అదే సమయంలో ఇంధనం ట్యాంక్ ఖాళీ అయితే అప్పుడు పరిస్థితి ఏంటనే అంశం తెరమీదకు వచ్చింది. నిబంధనల మేరకే.. అంతర్జాతీయ ఎయిర్ పోర్టు అథారిటీ నియమాల ప్రకారం విమానాశ్రయం నగరం బయట ఉండాలి. ఎదైనా ప్రమాదం జరిగితే ప్రాణ హాని ఎక్కువ శాతం జరగదని దీని వెనక ముఖ్యోద్దేశం. కానీ, నాలుగైదు దశాబ్ధాల కిందట ముంబైలో దేశీయ, అంతర్జాతీయ విమానాశ్రయాలు నిర్మించినప్పుడు చుట్టుపక్కల జనవాసాలు అంతగా లేవు. కాలక్రమేణా విమానాశ్రయం చుట్టూ నక్షత్రాల హోటళ్లు, బహుళ అంతస్తుల భవనాలు, మధ్య తరగతి, పేదలు ఇలా అనేక రకాల జనవాసాల బస్తీ పెరిగిపోయింది. ఫలితంగా విమానాశ్రయాలు నగరం నడిబొడ్డున ఉన్నట్లే ఉన్నాయి. మరోపక్క విమానాల రాకపోకలు పెరగడంతో ఇక్కడ పడుతున్న భారాన్ని తగ్గించేందుకు నవీముంబైలో కొత్తగా అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాల్సిన అవసరం ఉందని విమానాశ్రయం వర్గాలు అభిప్రాయపడ్డాయి. అందుకు స్థల సేకరణ పనులు పూర్తయ్యాయి. రన్‌వేకు అడ్డు వస్తున్న భారీ ఉలవే కొండను నేల మట్టంచేసే పనులు ఇదివరకే ప్రారంభమైన విషయం విదితమే. ప్రస్తుతం ఈ విమానాశ్రయం నిర్మాణం కూడా అడవిలో జరుగుతోంది. కొన్ని దశాబ్ధాల తరువాత ఈ ప్రాంతంలో కూడా జనవాసాల బస్తీలు వెలుస్తాయని చెప్పడంలో సంశయం లేదు. అప్పుడూ ఇదే పరిస్థితి ఎదురుకావడం ఖాయం. రోజుకు 950 విమానాలు.. ముంబై విమానాశ్రయంలో రోజుకు 950 విమానాలు రాకపోకలు సాగిస్తాయి. గంటకు 45 విమనాలు ల్యాండింగ్, టేకాప్ అవుతుంటాయి. విమానాశ్రయానికి ఆనుకుని ఉన్న కుర్లా ప్రాంతంలో 1.20 లక్షల జనాలు, ఘాట్కోపర్, శాంతాకృజ్‌లో 90 వేల చొప్పున, విలేపార్లేలో 80 వేల మంది జనాలు ఉంటారు. విమానాశ్రయం పరిసరాల్లో కుర్లా, ఘాట్కోపర్లో చిన్న, చిన్న కొండలున్నాయి. కొండపై అనేక పేదల గుడిసెలున్నాయి. అవి రన్ వేకు చాలా దగ్గరగా ఉండటం వల్ల ఇంటి పైకప్పు పై నిలబడి చేయి పైకెత్తితే విమానం తగులుతుందా అనే అనుమానం వస్తుంది. దీన్ని బట్టి ఆ గుడిసెలు విమానాశ్రయానికి ఎంత దగ్గరున్నాయో ఇట్టే అర్ధమవుతోంది. -
సింగపూర్‌కు బాబు బంపర్ ఆఫర్
-
రూ.1,177కే విమాన టిక్కెట్
న్యూఢిల్లీ : ఉడాన్ స్కీమ్ కింద జెట్ ఎయిర్వేస్ కంపెనీ విమాన టిక్కెట్లను చౌక ధరలో అందిస్తోంది. ఎంపిక చేసిన దేశీయ మార్గాల్లో విమాన టిక్కెట్లను రూ.1,177కే అందించనున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం జెట్ ఎయిర్వేస్, విమానాలను ఇతర పెద్ద గమ్యస్థానాలతో పాటు ప్రాంతీయ ప్రాంతాలకు కనెక్ట్ చేస్తోంది. తాజాగా లాంచ్ చేసిన మార్గాలను జెట్ ఎయిర్వేస్ ప్రభుత్వ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ లేదా ఆర్సీఎస్ కింద ప్రారంభించింది. సాధారణ వ్యక్తులకు కూడా విమాన ప్రయాణాన్ని చౌక ధరకు అందించే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ఉడాన్-ఆర్సీఎస్ స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఆర్సీఎస్ రూట్లలో తన నెట్‌వర్క్‌పై పలు ఇతర మార్గాలతో అలహాబాద్‌ను కనెక్ట్ చేస్తోందని జెట్ ఎయిర్వేస్ తెలిపింది. కొత్త విమానాలను అలహాబాద్ నుంచి ముంబైకు టూ-వే కనెక్షన్లలో వయా నాగ్‌పూర్, ఇండోర్, లక్నో మార్గాల ద్వారా ఆఫర్ చేయనున్నాయని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. అదేవిధంగా టూ-వే కనెక్షన్లలోనే వయా ఇండోర్, పాట్నా ద్వారా అలహాబాద్ నుంచి బెంగళూరుకు విమానాలను ఆఫర్ చేస్తోంది. వయా ఇండోర్ మార్గాన అలహాబాద్ నుంచి పుణేను కనెక్ట్ చేసుకునే అవకాశం కూడా సందర్శకులకు కల్పిస్తోంది. అదేవిధంగా వయా లక్నో రూట్లో అలహాబాద్ నుంచి ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పుణే, జైపూర్, అబుదాబిలకు విమానాలను జెట్ ఎయిర్వేస్ కనెక్ట్ చేస్తోంది. -
హింసకు ప్రగతే పరిష్కారం
భిలాయ్: అన్ని రకాల హింస, కుట్రలకు అభివృద్ధి మాత్రమే ఏకైక పరిష్కారమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో గురువారం రూ. 22 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల్ని ప్రారంభించిన అనంతరం ఆయన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో హింసకు పాల్పడుతున్న నక్సల్స్‌కు స్పష్టమైన సందేశమిచ్చే ప్రయత్నం చేశారు. ప్రజల్లో నమ్మకం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషిచేస్తోందని, అభివృద్ధే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు అనేక పథకాల్ని ప్రారంభించాయని అన్నారు. యూపీఏ హయాంలో ఛత్తీస్‌గఢ్ అభివృద్ధిని పట్టించుకోలేదని, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భిలాయ్‌లో ఐఐటీ ఏర్పాటు చేశామని, మౌలిక వసతులు కల్పిస్తున్నామని ప్రధాని వెల్లడించారు. అంతకుముందు భిలాయ్ ఉక్కు కర్మాగారం ఆధునిక విస్తరణ ప్లాంటును ఆయన ప్రారంభించారు. ఈ కర్మాగారం ఆధునిక భారతదేశ పునాదులను బలోపేతం చేస్తుందని చెప్పారు. అలాగే జగదల్పూర్–రాయ్‌పూర్ మధ్య విమాన సేవల్ని, నయా రాయ్‌పూర్‌లో కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ప్రధాని ప్రారంభించారు. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న ఛత్తీస్‌గఢ్‌లో నెలరోజుల వ్యవధిలో ప్రధాని మోదీ పర్యటించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ‘సహజ వనరుల నుంచి వచ్చే ఆదాయంలో కొంత స్థానిక గిరిజనుల కోసం ఖర్చుపెట్టాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. ఛత్తీస్‌గఢ్‌కు అదనంగా రూ. 3 వేల కోట్లు అందాయి. వాటిని ఆస్పత్రులు, పాఠశాలలు, రహదారులు, మరుగుదొడ్ల నిర్మాణానికి ఖర్చు చేస్తారు. గిరిజనులు, వెనకబడ్డ ప్రాంతాల్లో నివసించేవారి ఆదాయం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంది’ అని ప్రధాని పేర్కొన్నారు. జగదల్పూర్–రాయ్‌పూర్ మధ్య విమాన సేవల ప్రారంభాన్ని ప్రస్తావిస్తూ.. ‘హవాయ్ జహజ్(విమానం)లో హవాయి చెప్పులు వేసుకుని ఎవరైనా ప్రయాణిస్తే చూడాలనేది నా కల. చిన్న నగరాలు, పట్టణాలకు కూడా విమాన సేవలు అందించడమే మేం ప్రారంభించిన ఉడాన్ పథకం లక్ష్యం. గత ప్రభుత్వం రోడ్లు కూడా నిర్మించని ప్రాంతాల్లో.. ఎన్డీఏ ప్రభుత్వం రోడ్లు, విమానాశ్రయాల్ని నిర్మిస్తోంది. ఇంతకముందు రాయ్‌పూర్ విమానాశ్రయంలో రోజుకు కేవలం ఆరు విమానాలు ఎగిరేందుకు అవకాశముందేది. ఇప్పుడు 50 విమానాల రాకపోకలకు సామర్థ్యం కల్పించాం’ అని మోదీ చెప్పారు. భిలాయ్ ఐఐటీని సాకారం చేశాం ఎప్పటి నుంచో చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి ఐఐటీ కేటాయించమని సీఎం రమణ్ సింగ్ డిమాండ్ చేసినా యూపీఏ ప్రభుత్వం పట్టించుకోలేదని.. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక దానిని సాకారం చేశామని చెప్పారు. గతంలో చత్తీస్‌గఢ్ అంటే అడవులు, గిరిజనులే గుర్తుకు వచ్చే వారని, ఇప్పుడు స్మార్ట్ సిటీ(నయా రాయ్‌పూర్)కి పేరుగాంచిందన్నారు. బస్తర్ అనగానే బాంబులు, తుపాకీల పేర్లు మాత్రమే వినిపించేదని, ఇప్పుడు జగదల్పూర్లో నిర్మించిన విమానాశ్రయం అందరికీ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. నవ భారతానికి పునాదులు ఛత్తీస్‌గఢ్ పర్యటనలో భాగంగా ఆధునికీకరించిన భిలాయ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. అనంతరం మోదీ మాట్లాడుతూ.. నవ భారతానికి ఈ స్టీట్ ప్లాంట్ పునాదులు వేస్తుందని అన్నారు. దాదాపు రూ. 18,800 కోట్లతో విస్తరించిన ఈ స్టీల్ ప్లాంట్ సామర్థ్యం ఏడాదికి 4.7 మిలియన్ టన్నుల నుంచి 7.5 మిలియన్ టన్నులకు పెరుగుతుంది. ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ మాట్లాడుతూ.. నాలుగేళ్ల క్రితం వరకూ ఉక్కు పరిశ్రమ ఇబ్బందుల్ని ఎదుర్కొందని, ఇప్పుడు ప్రపంచంలో భారత్ రెండో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తి దేశంగా నిలిచిందన్నారు. రూ. 72 వేల కోట్లతో స్టీల్ ప్లాంట్ల ఆధునీకరణ, విస్తరణ కార్యక్రమంలో భిలాయ్ ప్లాంట్ అభివృద్ధిని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(సెయిల్) చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా దేశంలో ఉక్కు ఉత్పత్తి ఏడాదికి 13 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం 21 మిలియన్ టన్నులకు చేరుతుంది. బస్తర్ జిల్లాకు తొలిసారి విమాన సేవలు భిలాయ్ నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జగదల్పూర్ నుంచి రాయ్‌పూర్‌కు మొదటి విమానాన్ని మోదీ ప్రారంభించారు. దీంతో మావోయిస్టులకు పేరుపడ్డ బస్తర్ జిల్లాకు తొలిసారి విమాన సేవలు అందుబాటులోకి వచ్చాయి. -
జెట్ ఎయిర్వేస్ బిగ్ సేవింగ్స్ ఆఫర్
సాక్షి, ముంబై: ప్రముఖ విమానయాన సంస్థ దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. బిగ్ సేవింగ్స్ పథకం కింద జెట్ ఎయిర్వేస్ దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో టికెట్లపై తగ్గింపును అందిస్తోంది. జెట్ ఎయిర్వేస్ వెబ్సైట్, లేదా మొబైల్ యాప్ ద్వారా చేసిన బుకింగ్స్‌కు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో వుంటుందని కంపెనీ తెలిపింది. దేశీయ మార్గంలో టికెపై 400 రూపాయలదాకా డిస్కౌంట్‌ను అందిస్తోంది. అంతర్జాతీయ విమాన టికెట్లపై 600 రూపాయల దాకా తగ్గింపురేట్లను వర్తింప చేస్తోంది. వన్ వే టికెట్లపై 200 రూపాయల దాకా, రిటర్న్ జర్నీపై రూ.600 దాకా డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దేశీయ మార్గంలో కూడా ఇదే ఆఫర్‌ను అందిస్తోంది. ప్రీమియర్, ఎకానమీ క్లాసు టికెట్లపై ఈ డిస్కౌంట్ ఆఫర్‌ను అందిస్తున్నట్టు జెట్ ఎయిర్వేస్ ప్రకటించింది. ఈ డిస్కౌంట్ ఆఫర్ ప్రయాణానికి కనీసం పదిహేను రోజులముందుగా బుక్ చేసుకున్న, ఇండియన్ రూపీ కరెన్సీ ద్వారా కొనుగోలు చేసిన టికెట్లకు మాత్రమే వర్తిస్తుంది. -
విమానం 6 గంటల ఆలస్యం.. రచ్చరచ్చ
ముంబై : ఎయిరిండియా విమానయాన సంస్థ మరోసారి ప్రయాణికుల ఆగ్రహనికి బలైంది. ఎయిరిండియాకు చెందిన ఏఐ 625 విమానం సుమారు ఆరు గంటల పాటు ఆలస్యం కావడంతో, ముంబై అంతర్జాతీయ విమానశ్రయంలో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో లక్నోలో ఉదయం 10.30 గంటలకు దిగాల్సిన ప్రయాణికులు, సాయంత్రం 5 గంటలకు చేరుకున్నారు. విమాన రాకకు ఆలస్యంపై ఎయిరిండియా అధికారులు సరిగ్గా స్పందించకపోవడంతో, బోర్డింగ్‌కు వేచిచూసిన ప్రయాణికులు తీవ్ర అసహనం పాలయ్యారు. మరోవైపు వారికి ఆహారం కానీ, మంచి నీళ్లు కానీ ఎలాంటి సౌకర్యాలను ఎయిరిండియా అధికారులు కల్పించలేదు. ఎందుకు విమానం ఆలస్యం అవుతుందో కూడా సమాధానం చెప్పకపోవడంతో ప్రయాణికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎయిరిండియాకు చెందిన ఏఐ 625 అసలు ఉదయం 8 గంటలకు బయలుదేరాల్సి ఉంది. ముంబై అంతర్జాతీయ విమానశ్రయం నుంచి 8 గంటలకు బయలుదేరి, లక్నోకు ఉదయం 10.30కు చేరుకోవాలి. కానీ మధ్యాహ్నం 2.30 అయినా విమానం టేకాఫ్ కాలేక పోయింది. విమానం కోసం వేచిచూస్తున్న ప్రయాణికులకు ఏమైందో కూడా తెలియలేదు. ఎయిరిండియా అధికారులను అడిగినా వారు కూడా సరిగ్గా స్పందించలేదు. సమాధానం చెప్పకపోగా.. తమల్ని తప్పించుకుంటూ తిరిగారని ప్రయాణికుడు వివేక్ భల్లా చెప్పాడు. ఇక గ్రౌండ్ స్టాఫ్ అయితే తమతో చాలా అమర్యాదగా వ్యవహరించినట్టు పేర్కొన్నాడు. తమల్ని బెదిరించినట్టు కూడా తెలిపాడు. సీఐఎస్ఎఫ్ అధికారులు మధ్యలో కల్పించుకుని, తమల్ని వారి బారి నుంచి కాపాడినట్టు పేర్కొన్నాడు. ఎయిరిండియా అధికారులు ఎప్పుడూ ప్రయాణికులతో అమర్యాదగానే వ్యవహరిస్తారని భల్లా చెప్పాడు. ప్రతి ఒక్కరూ నరకయాతన అనుభవించినట్టు చెప్పాడు. లక్నోలో తమ బంధువు చనిపోతే, కడసారి చూపుకు వెళ్తున్న ఓ ప్రయాణికులకు అది నెరవేరకుండా చేశారని మండిపడ్డాడు. విమాన టిక్కెట్లపై తాము భారీ మొత్తంలో వెచ్చిస్తామని, కానీ వారు తీరిగ్గా గంటల కొద్దీ విమానాన్ని ఆలస్యం చేస్తారని ఎద్దేవా చేశాడు. విమానం ఆలస్యం, సరిగ్గా స్పందించలేకపోవడంపై పైలెట్, విమానంలో ప్రయాణికులను క్షమాపణ కోరాడు. సిబ్బందితో హైదరాబాద్ నుంచి వస్తున్న విమానం టెక్నికల్ సమస్యతో ఆలస్యమైందని, తమ మొత్తం ప్రొగ్రామ్‌లను రీషెడ్యూల్ చేసి, కొత్త విమానం, సిబ్బందిని నియమించినట్టు పేర్కొన్నాడు. -
సుష్మా విమానం సేఫ్
న్యూఢిల్లీ: విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రయాణిస్తున్న విమానం ఆదివారం కాసేపు ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్)తో సంబంధాలు కోల్పోవడంతో ఆందోళన నెలకొంది. 14 నిమిషాల తర్వాత మళ్లీ విమానం జాడ దొరకడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దక్షిణాఫ్రికాలో జరగనున్న బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా), ఐబీఎస్ఏ (ఇండియా, బ్రెజిల్, సౌతాఫ్రికా) సదస్సుల్లో పాల్గొనేందుకు సుష్మ శనివారం ఢిల్లీ నుంచి వాయుసేనకు చెందిన ఐఎఫ్‌సీ 31 ఎంబ్రాయర్ (మేఘదూత్) విమానంలో బయల్దేరి దక్షిణాఫ్రికా వెళ్లారు. ఏకధాటిగా దక్షిణాఫ్రికా వరకు ప్రయాణించడానికి సరిపోయేంత ఇంధనాన్ని నింపుకునే సదుపాయం మేఘదూత్‌కు లేదు. దీంతో తిరువనంతపురం, మారిషస్‌లో విమానం ఆగి ఇంధనాన్ని నింపుకోవాల్సి ఉంది. తిరువనంతపురం నుంచి మధ్యాహ్నం 2.08 గంటలకు బయల్దేరి మాల్దీవుల గగనతలంలో ప్రయాణిస్తున్నంత వరకు కూడా అంతా సవ్యంగా ఉంది. అయితే మేఘదూత్ మారిషస్ గగనతలంలోకి ప్రవేశించగానే అక్కడి ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. సాధారణంగా ఏటీసీతో విమానాలకు సంబంధాల విషయంలో తొలి 10, 20, 30 నిమిషాల్లోపు వివిధ దశల్లో హెచ్చరికలు జారీచేస్తారు. 30 నిమిషాల తర్వాత కూడా ఏటీసీతో సంబంధాలు పునరుద్ధరణ కాకపోతే విమానం జాడ తెలియడం లేదని ప్రకటిస్తారు. 4.44 గంటలకు సుష్మ ప్రయాణిస్తున్న విమానం జాడ మిస్సయింది. దీంతో 12 నిమిషాల తర్వాత కూడా జాడ దొరకకపోవడంతో తొలి హెచ్చరిక జారీ అయింది. దీంతో ఆందోళన మొదలైంది. అయితే 4.58 గంటలకు విమానం రాడార్ పరిధిలోకి వచ్చినట్లు తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రాడార్లలో సాంకేతిక లోపం కారణంగా ఈ సమస్య తలెత్తి ఉండొచ్చని భారత వినాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ) అధికారి ఒకరు తెలిపారు. మారిషస్ ప్రధానితో భేటీ మారిషస్‌లో ఇంధనం నింపుకోవడానికి ఆగినసమయంలో ఆ దేశ ప్రధాని ప్రవీంద్ జగన్నాథంతో సుష్మ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా చర్చలు జరిపిన అనంతరం ఆమె దక్షిణాఫ్రికా వెళ్లారు. -
ఇండిగో చార్జీలు ప్రియం..
న్యూఢిల్లీ: విమాన ఇంధన ధరలు పెరుగుదలతో టికెట్ల రేట్లకూ రెక్కలొస్తున్నాయి. అన్నింటికన్నా ముం దుగా.. ఇండిగో ఎయిర్‌లైన్స్ ఇందుకు తెరతీసింది. దేశీ రూట్లలో టికెట్లపై రూ.400 దాకా ఇంధన సర్‌చార్జీ విధించాలని నిర్ణయించింది. 1,000 కిలోమీటర్ల లోపు ప్రయాణాలకు సంబంధించిన టికెట్లపై రూ.200, అంతకు మించిన దూరాలపై రూ.400 సర్‌చార్జీ ఉంటుందని ఇండిగో తెలిపింది. మే 30 నుంచి ఇది అమల్లోకి వస్తుందని వివరించింది. అటు ఇంధన (ఏటీఎఫ్) రేటు పెరగడానికి ఇటు రూపాయి విలువ క్షీణించడం కూడా తోడవడంతో ఎయిర్‌లైన్స్‌పై అదనపు భారం పడుతోందని ఇండిగో చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సంజయ్ కుమార్ తెలిపారు. -
ఊపందుకున్న విమాన ప్రయాణాలు
వేసవి సెలవులకు ఎక్కడెక్కడికో టూర్లు వెళ్లే వారు కొందరైతే.. వచ్చే వారు మరి కొందరు.. ఆ ప్రయాణికులను ఆకర్షించడానికి విమాన సంస్థల మధ్య పోటీ.. తగ్గింపు ధరలకే ఆఫర్ల్లో ముందస్తు టికెట్లు.. అందులో టికెట్ దొరక్కపోయినా ఎక్కువైనా ఫరావాలేదు సుఖ మయ ప్రయాణమే బెస్టని ప్రయాణికులు ఎక్కువగా విమానాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో విశాఖ విమానాశ్రయం దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులతో కోలాహలంగా కనిపిస్తోంది. ఈ సర్వీసులకూ డిమాండ్ ఆకాశమంత ఎత్తున పెరిగిపోతోంది. గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దాదాపు 42 విమాన సర్వీసులు దేశీయ, అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, కోల్‌కతా, భువనేశ్వర్, విజయవాడ, చెన్నై, తిరుపతి, పోర్ట్‌బ్లెయిర్, అహ్మదాబాద్, కోయంబత్తూర్, ఢిల్లీతో పాటు శ్రీలంక, దుబాయ్, సింగపూర్, కౌలాలంపూర్‌లకు సర్వీసులు ఉన్నాయి. విశాఖ నుంచి అంతర్జాతీయ పట్టణాలను సైతం చేరుకోడానికి ఎయిర్ కనెక్టివిటీ ఉండడంతో జనం ఇలా వెళ్లడానికే ఆసక్తి చూపుతున్నారు. టికెట్ ధరలకు రెక్కలు.. ప్రయాణాల డిమాండ్‌ను చూసి ప్రైవేటు బస్ ఏసీ సర్వీసులు విపరీతమైన గిరాకీ చూపుతున్నాయి. ఏసీ రైళ్లలో ప్రయాణాలకూ వేలకు వేలు వెచ్చించాల్సి వస్తోంది. ఈదశలో గంటలు, రోజుల ప్రయాణాలకు వేలు రూపాయలు వెచ్చించే కంటే గంటో, గంటన్నరలోనో హైదరాబాద్, బెంగళూరు తదితర పట్టణాలకు వెళ్లడం మంచిదన్న భావన ప్రయాణికుల్లో కనిపిస్తోంది. ఇలా కొందరు వేసవికి ముందే రూ.999, రూ.2000 టికెట్ల ఆఫర్లు పొంది పిల్లాపాపలతో హాయిగా ప్రయాణాలు సాగిస్తున్నారు. ఆఫర్లలో టికెట్ దొరక్కపోయినా డబ్బుకు వెనకాడని ప్రయాణికులు మాత్రం విమాన ప్రయాణంకే మొగ్గు చూపుతున్నారు. దీంతో విమానాలన్నీ ఫుల్‌గా నడుస్తున్నాయి. ఒడిశా వారూ ఇక్కడి నుంచే.. ఒడిశా భువనేశ్వర్‌లో విమానాశ్రయం ఉన్నా అక్కడి నుంచి బెంగళూరు వెళ్లే ప్రయాణికులు విశాఖ నుంచే అధికంగా ప్రయాణాలు సాగిస్తున్నారు. ఒడిశా నుంచి ఉన్నత చదువులకు, ఉన్నత ఉద్యోగాల కోసం బెంగళూరుకు వెళ్లే వారు ఎక్కవగా కనిపిస్తున్నారు. వారు అక్కడి నుంచి రైల్లో సింహాచలం రైల్వేస్టేషన్‌కో, విశాఖ స్టేషన్‌కో వచ్చి విశాఖ విమానాశ్రయం నుంచి సర్వీసులు పట్టుకుంటున్నారు. ఇలా ప్రయాణించడం వల్ల సమయం ఆదాతో పాటు ప్రయాణ ఖర్చుల భారం బాగా తగ్గుతున్నట్లు వారు చెబుతున్నారు. రాజమండ్రిలో విమానాశ్రయం ఉన్నా అక్కడి నుంచి ఎక్కడికీ సర్వీసులు లేక పోవడంతో అక్కడి ప్రయాణికులూ విశాఖకు వచ్చి ప్రయాణాలు చేస్తున్నారు.ఇలా విశాఖ విమానాశ్రయం నుంచి ప్రయాణికుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. మొత్తంమ్మీద ప్రయాణాల్లో మొదటి స్థానం హైదరాబాద్ కాగా తర్వాత బెంగళూరుకే ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. -
ఉచిత టిక్కెట్లు : జెట్ ఎయిర్వేస్ క్లారిటీ
న్యూఢిల్లీ : సామాజిక మాధ్యమాల్లో వచ్చే సందేశాల్లో నిజాలెంత ఉంటాయో? అబద్ధాలు కూడా అంతే. ఇటీవల జెట్ ఎయిర్వేస్ తన 25వ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత విమాన టిక్కెట్లు ఇస్తుందంటూ మెసేజ్‌లు తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ మెసేజ్‌లో నిజమెంత ఉందో, అబద్ధమెంతో జెట్ ఎయిర్వేస్ తేల్చేసింది. తాము ఎటువంటి ఉచిత టిక్కెట్లు ఇవ్వడం లేదని, సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న సందేశాలన్నీ పూర్తిగా అవాస్తవమేనని జెట్ ఎయిర్వేస్ బుధవారం స్పష్టంచేసింది. ఇది 100 శాతం పూర్తిగా అవాస్తవమని తెలిపింది. అధికారిక ఖాతాలను నుంచి వచ్చిన సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని కస్టమర్లకు సూచించింది. ‘25 వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని జెట్ ఎయిర్వేస్లో ప్రయాణించే ప్రతి ఒక్కరికీ రెండు టికెట్లు ఉచితంగా ఇస్తున్నట్లు వస్తోన్న సందేశాలన్నీ పూర్తిగా అవాస్తవం. అది అధికారిక సమాచారం కాదు. అలాంటి సమాచారం ఏదైనా ఉంటే ఎయిర్వేస్ అధికారిక ఖాతాల్లోనే ఉంచుతాం. దానికి బ్లూ టిక్ మార్క్ ఉంటుంది’ అని జెట్ ఎయిర్వేస్ ట్వీట్ చేసింది. 25వ వార్షికోత్సవ సందర్భంగా జెట్‌ఎయిర్‌వేస్ ప్రతి ఒక్కరికీ రెండు ఉచిత టిక్కెట్లు ఇస్తోందని, ఆ లింక్‌ను మరో 20 మందికి షేర్ చెయ్యాలని, దాంతో 48 గంటల్లో యూజర్ మెయిల్ ఐడీకి టికెట్లు అందుతాయని ఆ మెసేజ్‌లో ఉంది. అయితే అదంతా పూర్తిగా అవాస్తవమని జెట్ ఎయిర్వేస్ తేల్చేసింది. ఈ వైరల్ మెసేజ్‌పై బుధవారం క్లారిటీ ఇచ్చింది. ఎయిర్‌లైన్ ప్రకటనపై స్పందించిన చాలామంది ట్విటర్ యూజర్లు తాము ఈ మెసేజ్‌ను పొందామని, క్లిక్ కూడా చేసినట్టు పేర్కొన్నారు. #FakeAlert There's a fake link being circulated regarding ticket giveaways for our 25th Anniversary. This is not an official contest/giveaway and we advise caution. Genuine contests & giveaways are hosted only on our verified social media accounts, indicated with a blue tick. pic.twitter.com/NvJrFaq3aL — Jet Airways (@jetairways) May 23, 2018 -
ఎయిర్ ఏసియా బిగ్ సేల్: రూ.999కే సింగపూర్
సాక్షి, ముంబై: బడ్జెట్ క్యారియర్ ఎయిర్ ఏసియా ఇండియా విమాన టికెట్లపై మరోసారి డిస్కౌంట్ ధరలను ప్రారంభించింది. అదీ అంతర్జాతీయ మార్గంలో ‘బిగ్సేల్’ పేరుతో తక్కువ ధరలకే విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. అదీ అంతర్జాతీయంగా 999 రూపాయలకే విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. మే21- 27తేదీల మధ్య ఈ ఆఫర్లో టికెట్ల బుకింగ్ సౌకర్యం లభ్యం. ఇలా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా నవంబర్ 1, 2018నుంచి ఆగస్టు13, 2019 వరకు ప్రయాణించే అవకాశం. అంతర్జాతీయంగా కౌలాలంపూర్, బ్యాంకాక్, క్రబీ, సిడ్నీ, ఆక్లాండ్, మెల్బోర్న్, సింగపూర్, బాలి లాంటి అన్ని ప్రాంతాల నుంచి రూ. 999 (వన్ వే) ప్రారంభ ధరకే టికెట్లను అందిస్తోంది. బెంగళూరు, కొచ్చి, గోవా, జైపూర్, చండీగఢ్, పుణె, న్యూఢిల్లీ, గువహతి, ఇంఫాల్, విశాఖపట్నం, హైదరాబాద్, శ్రీనగర్, బాగ్డోగ్ర, రాంచి, కోలకతా, నాగ్‌పూర్ ఇండోర్, చెన్నై, సూరత్ , భువనేశ్వర్ నుంచి ఈ విదేశీ టికెట్లను ఎంపిక చేసుకోవచ్చు. ఎయిర్ ఏసియా ప్రకటించిన ఈ కొత్త ప్రమోషనల్ ఆఫర్ కింద ఎయిర్ ఆసియా, ఆసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ విమానాల్లో డిస్కౌంట్ టిక్కెట్లు అందిస్తోంది. ఈ రాయితీ ధరల టిక్కెట్లు www.airasia.com, మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్ బుకింగ్స్‌కు మాత్రమే లభిస్తాయి. ఎయిర్ ఏసియా గ్రూప్ నెట్‌వర్క్‌లోని ఎయిర్ ఏసియా ఇండియా, ఎయిర్ ఏసియా బెర్హాడ్, థాయ్ ఎయిర్ ఏసియా తదితర ఆపరేటింగ్ సర్వీసుల ద్వారా ఈ ఆఫర్ లభ్యమవుతుంది. ఎయిర్ ఏసియా వెబ్సైట్ లో పొందుపర్చిన సమాచారం ప్రకారం గోవా నుండి కౌలాలంపూర్ టికెట్ 1999నుంచి ప్రారంభం. కోచి నుండి కౌలాలంపూర్‌కు 3,399 రూపాయలు, విశాఖపట్నం-కౌలాలంపూర్ , గోవా-కౌలాలంపూర్ రూ.5514 , హైదరాబాద్- కౌలాలంపూర్ 4,999 రూపాయలు, జైపూర్-కౌలాలంపూర్ 3,590 రూపాయలు న్యూఢిల్లీ నుంచి కౌలాలంపూర్ రూ.4,290 ప్రారంభ ధరలుగా ఉన్నాయి. భారతదేశం నుండి కౌలాలంపూర్ ద్వారా పయనించే విమానాల్లో కూడా తక్కువ ధరలను ప్రకటించింది. భువనేశ్వర్-కౌలాలంపూర్-జకార్తా రూ .2,255, భువనేశ్వర్-కౌలాలంపూర్-యోగ్యకార్తా రూ.3,341, కొచ్చి-కౌలాలంపూర్-బ్రూనే 4,649 రూపాయలు, కోలకతా-బ్యాంకాక్ - డాన్ మెయంగ్-ఫుకెట్ రూ .5405, హైదరాబాద్-కౌలాలంపూర్-పెనాంగ్ 6,613 రూపాయలు, జైపూర్-కౌలాలంపూర్ -క్రిబి 5,701 రూపాయలు ప్రారంభ ధరలుగా ఉన్నాయి. పూర్తి వివరాలు ఎయిర్ ఏసియా అధికారిక వెబ్సైట్లో లభ్యం. -
విమాన ఆలస్యం.. వామ్మో అంత జరిమానా!
న్యూఢిల్లీ : దేశీయ విమానయాన సంస్థ ఎయిరిండియాకు కష్టాలు వెన్నంటే ఉన్నట్టు ఉన్నాయి. విమాన ఆలస్యమైనందున ఈ విమానయాన సంస్థ భారీ మొత్తంలో నష్టపరిహారాన్ని చెల్లించాల్సి వస్తోంది. మే 9న ఢిల్లీ నుంచి చికాగో బయలుదేరిన విమానం ఆలస్యమైనందుకు 323 మంది ప్రయాణికులకు 8.8మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.59కోట్లు చెల్లించాల్సి వస్తోంది. విమాన సిబ్బందికి సంబంధించిన ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ వల్ల ఈ ఆలస్యం ఏర్పడింది. మే 9న ఢిల్లీ నుంచి చికాగో బయలుదేరిన ఏఐ 127 విమానం 16 గంటల్లో చికాగో చేరుకోవాల్సి ఉంది. కానీ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల విమానాన్ని చికాగోకు సమీపంలోని మిల్వాకీ ప్రాంతానికి తరలించారు. మిల్వాకీ నుంచి చికాగోకు విమానంలో వెళ్లడానికి 19 నిమిషాలే సమయం పడుతుంది. ఆ సమయానికే ఆ విమానం 16 గంటలు ప్రయాణించింది. డీజీసీఏ నిబంధలన ప్రకారం విమానంలోని సిబ్బంది డ్యూటీ గంటల కంటే ఎక్కువ పనిచేయకూడదు. దీంతో విమానంలోని సిబ్బంది డ్యూటీ గంటలు అయిపోయాయి. మరోవైపు నిబంధనలనుసరించి వారికి ఆ రోజుకు ఒక్కసారి మాత్రమే ల్యాండింగ్‌కు అనుమతి ఉంది. ఈ కారణాలతో మరో మార్గం లేక ఎయిరిండియా ఆ విమానం కోసం కొత్త సిబ్బందిని రోడ్డుమార్గంలో మిల్వాకీకి తరలించింది. ఈ మొత్తం ప్రక్రియ వల్ల ఆ విమానం చికాగో చేరుకోవడానికి దాదాపు ఆరు గంటలు ఆలస్యమైంది. ఇన్ని గంటల పాటు కూడా ప్రయాణికులు విమానంలోనే ఉండిపోయారు. ఆరు గంటల ఆలస్యంగా ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చింది. అంతటితో సమస్య ముగిసిపోయిందనుకున్న ఎయిరిండియా మరో పెద్ద సమస్యే ఎదురైంది. అమెరికా నిబంధనల ప్రకారం ప్రయాణికులు విమానంలో ఉండగా నాలుగు గంటల కంటే ఎక్కువ సమయం నిలిపి ఉంచితే విమాన ఆలస్యంపై ఆ విమానయాన సంస్థ పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. దీని ప్రకారం ఒక్కో ప్రయాణికుడికి 27,500డాలర్ల పరిహారం చెల్లించాలి. అంటే ఆ విమానంలో 323 మంది ప్రయాణికులు ఉన్నందున మొత్తం కలిపి 8.8మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాల్సి వస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. భారీ మొత్తంలో పెనాల్టీ చెల్లించాల్సి వస్తున్నందున డీజీసీఏ నిబంధనల్లో కొన్ని మార్పులు కోరుతూ ఎయిరిండియా, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. ఈ ఫిర్యాదు మే 15న ఢిల్లీ హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ విచారణలో తాము వాతావరణ ప్రతికూలతతోనే విమానాన్ని దారి మరలించాల్సి వచ్చిందని ఎయిరిండియా తెలిపింది. -
ఐఆర్సీటీసీలో విమాన టికెట్లు
సాక్షి, ముంబై: భారత రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) విమాన ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. అవును మీరు చదివింది నిజమే.. దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించే వారికి చల్లని కబురు చెప్పింది. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ విమాన టికెట్ల బుకింగ్‌పై నామమాత్రపు ఫీజును వసూలు చేయనున్నామని ప్రకటించింది. ఐఆర్సీటీసీ అధికారిక ట్విటర్ ద్వారా ఈ తీపి వార్తను వినియోగదారులకు అందించింది. వినియోగదారుడు నేరుగా ఐఆర్సీటీసీ ఎయిర్ వెబ్సైట్ (air.irctc.co.in) ద్వారా గానీ ఐఆర్సీటీసీ ఎయిర్ యాప్ ద్వారా విమాన టిక్లెకు బుక్ చేసుకోవచ్చని ఐఆర్సీటీసీ వెల్లడించింది. ఇందుకు కేవలం 59 రూపాయల నామమాత్రపు ఫీజును వసూలు చేయనున్నామని తెలిపింది. ఎలాంటి హిడ్డెన్ చార్జీలు వుండవని స్పష్టం చేసింది. ప్రతి విభాగంలోనూ విమాన టికెట్ల బుకింగ్‌పై భారీ సేవింగ్స్‌ను అందిస్తున్నట్టు తెలిపింది . వినియోగదారుల సౌలభ్యంకోసం 24గంటలు తమ సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. అంతేకాదు కస్టమర్ల సమస్యలు, సందేహాల నివారణకోసం 1800110139 అనే టోల్ ఫ్రీ నెంబర్‌ను కూడా అందుబాటులో ఉంది. అలాగే flights@irctc.co.in. అనే మెయిల్ ద్వారా కూడా తమను సంప్రదించవచ్చని ఐఆర్సీటీసీ ప్రకటించింది. ఆన్లైన్ టికెట్ టిక్కెట్లను బుకింగ్ కోసం 50కిపైగా పేమెంట్ ఆప్షన్లను అందుబాటులో ఉన్నాయనీ, దాదాపు అన్ని ప్రధాన బ్యాంకుల నెట్ బ్యాంకింగ్‌తో సహా అన్ని ప్రధాన కార్డుల చెల్లింపుల సౌలభ్యం వెబ్సైట్, యాప్‌లో లభ్యమవుతాయని తెలిపింది. విమాన టికెట్ల బుకింగ్‌లో ఎల్టీసీ (ప్రయాణ రాయితీ) ధరల సదుపాయం కూడా అందుబాటులో ఉంచింది. దీంతోపాటు టికెట్ కాన్సిలేషన్,బుకింగ్ సదుపాయం సరళీకరణతో యూజర్లకు ఫ్రెండ్లీ అనుభవాన్ని అందిస్తున్నామని పేర్కొంది. Get the #best #deals on #flight #tickets when you #travel both within #India and #Abroad! Take your family in full-fledged comfort via the #IRCTCAir app, available for both #iOS & #Android! Log on to https://t.co/3j431pWZPj pic.twitter.com/lO2jMh9ZtM — IRCTC (@IRCTCofficial) May 11, 2018 -
ఎయిర్ఏసియా ‘మిడ్ సమ్మర్ సేల్’
ఎయిర్ఏసియా ఇండియా ‘మిడ్ సమ్మర్ సేల్’ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద ఎంపిక చేసిన రూట్లలో విమాన టిక్కెట్లను రూ.1500 కంటే తక్కువకే అందించనున్నట్టు పేర్కొంది. ఢిల్లీ, కోల్కత్తా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, రాంచి మార్గాలకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనున్నట్టు విమానయాన సంస్థ తన వెబ్సైట్ ఎయిర్ఏసియా.కామ్‌లో వెల్లడించింది. మిడ్-సమ్మర్ సేల్ కింద భువనేశ్వర్-కోల్కత్తా, రాంచి-కోల్కత్తా, కొచ్చి-బెంగళూరు, కోల్కత్తా-భువనేశ్వర్, హైదరాబాద్-బెంగళూరు, బెంగళూరు-చెన్నై మార్గాలకు విమాన టిక్కెట్లు రూ.1399కే ప్రారంభమవనున్నట్టు ఎయిర్ఏసియా ఇండియా తెలిపింది. ఎయిర్‌లైన్ సంస్థల మధ్య తీవ్ర పోటీ ఏర్పడిన సమయంలో ఎయిర్ఏసియా ఇండియా ఈ సమ్మర్ సేల్‌ను ప్రారంభించింది. మిడ్ సమ్మర్ సేల్ కింద టిక్కెట్లను అడ్వాన్స్‌గా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ కేవలం www.airasia.com వద్ద ఆన్లైన్ బుకింగ్స్కే అందుబాటులో ఉంది. 2018 మే 13 వరకు ఈ సేల్ కింద టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. 2018 అక్టోబర్ 31 వరకు ఈ టిక్కెట్ల బుకింగ్‌పై ప్రయాణించవచ్చు. ఈ ఆఫర్ కింద సీట్లు పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి. అన్ని విమానాలకు ఈ ఆఫర్ వర్తించదు. ఈ ధరలన్నీ కేవలం సింగిల్ జర్నీకి మాత్రమే. క్రెడిట్, డెబిట్, ఛార్జ్ కార్డు ద్వారా పేమెంట్లను ఎయిర్ఏసియా అంగీకరించనుంది. టిక్కెట్లను కొనుగోలు చేసేటప్పుడే అన్ని పన్నులను చెల్లించాల్సి ఉంటుందని ఎయిర్ఏసియా ఇండియా తెలిపింది. అదేవిధంగా మిడ్ సమ్మర్ సేల్ కింద ఆసియన్, ఆస్ట్రేలియన్ మార్గాల విదేశీ విమానాలకు టిక్కెట్లు రూ.3999కే ప్రారంభమవ్వనున్నట్టు తెలిసింది. ఈ టిక్కెట్లను కూడా 2018 మే 13 వరకే బుక్చేసుకోవాలి. -
సాగర్‌లో విమానాల హోరు!
నాగార్జునసాగర్: రాబోయే రోజుల్లో నాగార్జునసాగర్ జలాశయంలో విమానాల హోరు వినిపించనుంది. చిన్న పట్టణాలను రవాణాపరంగా అనుసంధానించేందుకు జల విమానాలను వాణిజ్య సేవలకు వినియోగించనున్నారు. ఈ నేపథ్యంలో పోర్టుకు అనువుగా ఉన్న నాగార్జునసాగర్‌ను ఎంపిక చేశారు. ఏప్రిల్ తొలి వారంలో పౌర విమానయాన శాఖ అధికారి కెప్టెన్ ఇల్షాద్ అహ్మద్ నేతృత్వంలో నిపుణుల బృందం హెడ్రోపోర్టు ఏర్పాటుకు సాగర్ జలాశయాన్ని పరిశీలించింది. రవాణాపరంగా జలాశయాలను వినియోగించేందుకు సాధ్యమేనని, త్వరలోనే ఇది కార్యరూపం దాల్చేందుకు డీజీసీఏ నిబంధనలు సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ, ఏపీలో రిజర్వాయర్ కనెక్టింగ్ సర్వీస్ 9, 12, 20 సీట్ల సామర్థ్యం కలిగిన విమాన సర్వీసులను నడపనున్నారు. సాగర్‌తోపాటు శ్రీశైలం, హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ అనుకూలమేనని సర్వేలో తేలింది. కేంద్ర ప్రభుత్వ ‘ఉడాన్’పథకం విమాన సర్వీసులను సామాన్యులకు చేరువ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. విమాన సర్వీసులు ప్రారంభమైతే నాగార్జునసాగర్‌కు పలు దేశాల నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయి. జలాశయంలో ఏర్పాటు చేసే హైడ్రో పోర్టును తెలంగాణ వైపు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికుల ఆందోళన
సాక్షి, గన్నవరం : గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఉదయం గన్నవరం నుంచి ముంబయి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం రాలేదు. దీంతో ప్రయాణికులు ఎయిర్‌పోర్టు అధికారులను సంప్రదించగా ఉదయం 9.30 నిమిషాలకు రావాల్సిన విమానం సాంకేతిక లోపం కారణంగా సాయంత్రం 5 గంటలకు రానుందని వారు తెలిపారు. తమకు ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రయాణికులు ఆందోళనకు దిగారు. 10 గంటలకే ముంబయి చేరుకోవాల్సిన తమకు ఇంత అసౌకర్యం కలుగుతున్నా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదంటూ అధికారులపై ప్రయాణికులు మండిపడ్డారు. -
విమానం రద్దయితే రూ.20 వేల పరిహారం
న్యూఢిల్లీ: విమానాలు ఆలస్యమైనా లేదా రద్దయినా ఇకపై విమానయాన సంస్థలు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి రావొచ్చు. వినియోగదారులకు సౌకర్యంగా ఉండేలా పలు కొత్త నిబంధనలను పౌరవిమానయాన శాఖ తీసుకురానుంది. సంబంధించిన ముసాయిదాకు ప్రస్తుతం అధికారులు తుదిమెరుగులు దిద్దుతున్నారు. విమానం 6 గంటలకుపైగా ఆలస్యమైతే మొత్తం చార్జీని తిరిగి చెల్లించడం, అనుసంధాన విమానాల ద్వారా ప్రయాణించేవారికి తొలి విమానం రద్దయ్యి, ఆ కారణంగా మరో సిటీలో ఎక్కాల్సిన రెండో విమానాన్ని వారు అందుకోలేని పరిస్థితుల్లో అలాంటి ప్రయాణికులకు రూ. 20వేల వరకు నష్టపరిహారంగా చెల్లించడం తదితర కొత్త నిబంధనలను ప్రవేశపెట్టబోతున్నారు. టికెట్ కొన్నాక విమానంలోకి ఎక్కడానికి అనుమతివ్వకపోతే రూ.5 వేలు పరిహారం చెల్లించాలని ప్రతిపాదించారు. -
అమెరికాలో తుపాను.. ముగ్గురి మృతి
మిన్నియపోలిస్: తుపాను ప్రభావంతో మధ్య అమెరికా ప్రాంతంలో వడగళ్ల వానలు కురుస్తున్నాయి. తుపాను ధాటికి శనివారం రెండేళ్ల చిన్నారి సహా ముగ్గురు మరణించారు. వందల విమానాలు రద్దయ్యాయి. రోడ్లపై 35 సెంటీ మీటర్ల ఎత్తుమేర మంచు పేరుకుపోయింది. మిషిగన్, విస్కాన్సిన్, ఇల్లినాయిస్, లూసియానా, ఆర్కాన్సస్, టెక్సస్ తదితర రాష్ట్రాల్లో తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. -
బాబోయ్.. విమానం!
- మార్చి 14వ తేదీన హైదరాబాద్ నుంచి రాయ్‌పూర్ వెళ్తున్న ఇండిగో (6ఈ334) విమానం ఉదయం 10.40 గంటలకు టేకాఫ్ అయింది. కొద్దిసేపటికే సాంకేతిక కారణాల వల్ల వెనుదిరిగి వచ్చింది. - ఇదే నెలలో బ్యాంకాక్ నుంచి దుబాయ్ వెళ్లే ఏ–380 విమానాన్ని సాంకేతిక కారణాల వల్ల తెల్లవారు జామున 3.45 గంటల సమయంలో అకస్మాత్తుగా నిలిపేయాల్సి వచ్చింది. - ఇక గత వారం తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఇండిగో(7117) విమానం టైర్లు పేలిపోయి రన్‌వేపై నిలిచిపోయింది. దీంతో బుధవారం రాత్రి 10 గంటల నుంచి గురువారం తెల్లవారు జామున 2.30 గంటల వరకు రన్‌వే మూసేశారు. ..ఇలా ఏదో ఒక కారణంతో ప్రతి నెలా రెండు నుంచి మూడు విమానాలు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆగిపోతున్నాయి. హైదరాబాద్ విమానాశ్రయంలో ఆగిపోతున్న ఫ్లైట్ల వల్ల దేశవ్యాప్తంగా విమానాల రాకపోకలపై ప్రభావం పడుతోంది. దీంతో దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులు గంటల తరబడి ఎయిర్‌పోర్టుల్లోనే పడిగాపులు కాయాల్సి వస్తోంది. విమానప్రయాణంలో అనిశ్చితి.. ఆకస్మాత్తుగా ఆగిపోతున్న విమానాలు.. తరచూ నిలిచిపోతున్న రన్‌వే సేవల కారణంగా విమానం ఎక్కాలంటేనే ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. అయితే కొన్ని విమాన సంస్థలకు చెందిన ఫ్లైట్లు పాతవి కావడం వల్లే ఈ తరహా సాంకేతిక సమస్యలు చోటు చేసుకుంటున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రెండో రన్‌వే తెరుచుకొనేదెప్పుడో..! శంషాబాద్ విమానాశ్రయంలో ప్రస్తుతం 4.26 కిలోమీటర్ల పొడవైన ప్రైమ్ రన్‌వే నుంచే అన్ని విమానాల రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో రాత్రింబవళ్లు రన్‌వేపై తీవ్ర ఒత్తిడి నెలకొంటోంది. నిత్యం రాకపోకలు సాగించే విమానాల్లో నైట్ ఫ్లైట్సే ఎక్కువ. దీంతో రాత్రి పూట అకస్మాత్తుగా తలెత్తే సాంకేతిక కారణాల వల్ల ఏ ఒక్క విమానం రన్‌వేపై నిలిచిపోయినా.. మొత్తం సర్వీసులపై దాని ప్రభావం ఉంటోంది. ఈ ఇబ్బందుల దృష్ట్యా విమానాశ్రయ విస్తరణలో భాగంగా 3.7 కిలోమీటర్ల పొడవైన రెండో రన్‌వే నిర్మించారు. సాంకేతికంగా దీనికి అన్ని అనుమతులూ వచ్చాయి. కానీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) అనుమతి లభిస్తే తప్ప ఈ రన్‌వే వినియోగంలోకి వచ్చే పరిస్థితి లేదు. గతేడాది నవంబర్లోనే డీజీసీఏ ఆమోదం లభిస్తుందని భావించినా.. ఇప్పటికీ ఎదురు చూపులు తప్పడం లేదు. డీజీసీఏ అనుమతి లభిస్తే నైట్ ఫ్లైట్స్‌కు ఈ రన్‌వేను వినియోగించాలని జీఎంఆర్ భావిస్తోంది. ప్రైమ్ రన్‌వేపై ఓ విమానం ఆగిపోయినా మిగతా వాటి రాకపోకలకు రెండో దానిని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ‘డీజీసీఏ నుంచి ఎంత త్వరగా అనుమతి లభిస్తే అంత త్వరగా రెండో రన్‌వే సేవలను ప్రారంభిస్తాం. అందుకోసం అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం’అని శంషాబాద్ విమానాశ్రయ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. వీలైనంత త్వరలోనే అనుమతి లభించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. – సాక్షి, హైదరాబాద్ ఒక రన్‌వే..470 విమానాలు.. శంషాబాద్ విమానాశ్రయంలో ప్రస్తుతం ఉన్న ఒక్క రన్‌వే నుంచే ప్రతి రోజూ సుమారు 470 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో ఏ చిన్న సాంకేతిక కారణంతోనైనా ఒక విమానం రన్‌వేపై నిలిచిపోతే శంషాబాద్ రావలసిన మొత్తం విమానాలకు బ్రేక్ పడుతోంది. ఇటీవల ఇండిగో విమానం టైర్ పేలిన ఉదంతంతో హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై విమానాశ్రయాల్లోనూ సర్వీసులకు అంతరాయం కలిగింది. మొత్తం 31 సర్వీసులకు బ్రేక్ పడింది. ఇందులో 10 అంతర్జాతీయ విమానాలు ఉన్నాయి. మరికొన్ని సర్వీసులను మళ్లించారు. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్న ప్రతిసారీ దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. విమానాల్లో సాధారణంగా తలెత్తే సాంకేతిక సమస్యల వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ రన్‌వేపై అకస్మాత్తుగా నిలిచిపోయే వాటితోనే ఇతర సర్వీసులకు బ్రేక్ పడుతోంది. -
శంషాబాద్‌లో విమాన రాకపోకలు బంద్
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో గురువారం విమాన రాకపోకలు నిలిచిపోయాయి. బుధవారం రాత్రి తిరుపతి నుంచి హైదరాబాద్ వచ్చిన ఇండిగో విమానం ల్యాండింగ్ సమయంలో టైర్ పేలి మంటలు వ్యాపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రమాదానికి గురైన విమానం రన్‌వే పైన నిలిచిపోవడంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో అధికారులు పలు విమానాలను వేరే విమానాశ్రయాలకు దారి మళ్లించడంతో పాటు కొన్నింటిని రద్దు చేశారు. త్వరంలో రన్‌వేను క్లియర్ చేసి సర్వీసులు పునరుద్ధరిస్తామని వెల్లడించారు. గన్నవరంలో ప్రయాణికుల ఆందోళన విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. గన్నవరం నుంచి బెంగళూరు వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని అధికారులు క్యాన్సిల్ చేశారు. దీంతో ప్రయాణికులు విమానాశ్రయంలోనే పడిగాపులు కాస్తున్నారు. ప్రయాణికుల తెలిపిన వివరాల ప్రకారం.. ఈ రోజు ఉదయం 8 గంటలకు 70 మంది ప్రమాణికులతో బయలుదేరాల్సిన విమానాన్ని రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఈ విషయాన్ని తెల్లవారుజాము సదరు ప్రయాణికులకు మేసేజ్ పంపించారు. అయితే అకస్మాత్తుగా మెసేజ్‌లు పంపడమేంటని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానాన్ని క్యాన్సిల్ చేసినా, మరో ప్రత్యామ్నాయం చూపలేదంటూ అధికారుల తీరుపై అసహనం వ్యకం చేస్తూ ఆందోళన చేశారు. -
ఎయిర్ ఏషియా సమ్మర్ ఆఫర్
సాక్షి, ముంబై: ఎయిర్ ఏషియా విదేశీటికెట్లపై సమ్మర్ ఆఫర్ ప్రకటించింది. ఎంపిక చేసిన రూట్లలో విదేశీ విమాన టిక్కెట్లపై తగ్గింపును రేటును ప్రకటించింది. అన్నీ కలుపుకొని రూ.1,999 టికెట్ ప్రారంభ ధరలో టికెట్‌ను ఆఫర్చేస్తోంది. కౌలాలంపూర్, బ్యాంకాంక్,లాంగ్‌కవి బాలి, ఫూకట్, సింగపూర్ రూట్లలో ఈ డిస్కౌంట్ ఆఫర్. ఈనెల 25వరకు బుకింగ్స్ అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ ప్రమోషనల్ ద్వారా టికెట్లను అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలని ఎయిర్‌లైన్స్ పేర్కొంది. అలాగే ఇలా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా ప్రయాణ అనుమతి సెప్టెంబర్ 30,2018 న ముగుస్తుంది. భారతదేశంలోని అనేక ప్రదేశాల నుంచి కౌలాలంపూర్, సింగపూర్, జకార్తా, సిడ్నీ, బాలి, ఎయిర్ ఆసియా విమాన సర్వీసులను అందిస్తోంది. ఎయిర్‌లైన్స్ వెబ్సైట్ ప్రకారం దేశంలోని కొచ్చి లాంటి వివిధ ప్రదేశాల నుంచి కోలాలంపూర్, సియోల్, పెర్త్, ఆక్లాండ్ వంటి ఇతర ప్రదేశాల నుంచి ఎయిర్ ఏషియా డిస్కౌంట్ టికెట్లు అందిస్తోంది. ముఖ్యంగా జైపూర్-కౌలాలంపూర్-ఫుకెట్ (రూ .6,818), జైపూర్-కౌలాలంపూర్-హనోయి (రూ .7,556), జైపూర్-కౌలాలంపూర్-లాంబోక్ (రూ .7,738), న్యూఢిల్లీ-కౌలాలంపూర్ (రూ .8,999), తిరుచిరాపల్లి-కౌలాలంపూర్-హనోయి (రూ.7,401). దీంతోపాటు ప్రీమియం ఫ్లాట్‌బెడ్ విమానాల్లో న్యూఢిల్లీ- కౌలాలంపూర్-ఫుకెట్ మధ్య టికెట్ రూ .20,157 ప్రారంభ ధరగా ఉంది. మిగిలిన వివరాలకు ఎయిర్ ఏషియా వెబ్‌సైట్‌ను పరిశీలించగలరు. -
బికినీ ఎయిర్‌లైన్స్ సేవలు ఇక ఢిల్లీకి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ బడ్జెట్ ఎయిర్‌లైన్ వియత్నాంకు చెందిన వియట్జెట్ ఢిల్లీనుంచి డైరెక్ట్ విమాన సర్వీసులను ప్రకటించింది. బికినీ ఎయిర్‌లైన్స్‌గా పేరు తెచ్చుకున్న వియట్ జెట్ ఢిల్లీ నుంచి వియత్నాంలోని హోచిమిన్ నగరానికి నడపనున్నట్లు ప్రకటించింది. ఇండియా-వియత్నాం దౌత్య సంబంధాల 45వ వార్షికోత్సవం సందర్భంగా వియత్నాం-ఇండియా బిజినెస్ ఫోరమ్‌లో ఈ విషయాన్ని ప్రకటించింది. ఆసియన్ ఏజ్ నివేదించిన ప్రకారం బికినీ ఎయిర్‌లైన్స్‌గా పేరొందిన వియట్జెట్ ఎయిర్‌లైన్స్ జులై- ఆగస్టు లో భారత్‌కు డైరెక్ట్ ఫ్లైట్స్ సేవలు అందించనున్నామని వెల్లడించింది. ఈ రెండు నగరాలమధ్య వారానికి నాలుగు సార్లు విమానాలను నిర్వహిస్తుంది. పైలట్లు, ఎయిర్‌హోస్టెస్‌లు సహా ఇతర క్యాబిన్ క్రూ అంతా బికినీ ధరించి సేవలు అందించడమే ఈ బికినీ ఎయిర్‌లైన్స్ ప్రత్యేకత. అలా బికినీ ఎయిర్‌లైన్స్‌గా ప్రఖ్యాతి పొందింది. 2007లో మహిళా బిలియనీర్ గుయేన్ థీ ఫుంగ్ థావో స్థాపించిన వైమానిక సంస్థ వియత్నాం దేశంలోనే రెండవ అత్యుత్తమ సేవలు అందిస్తున్న అతిపెద్ద సంస్థగా పాపులారిటీ సాధించింది. పైలట్లు, ఫ్లైట్ అటెండెంట్లతో బికినీలు ధరింపజేసి 2011లో ఈ సంస్థ చేసిన ప్రచారం అప్పట్లో వివాదాస్పదమైంది. అ క్కడి ప్రభుత్వంనుంచి జరిమాను కూడా ఎదుర్కొంది.అయితే కొన్ని ప్రత్యేక విమానాల్లో మాత్రమే ప్రయాణీకులను ఆకర్షించడానికి బికినీల్లో ఉన్నమహిళా సిబ్బందిని ఉపయోగిస్తుంది. అయితే ఇంత ప్రతికూల ప్రచారం ఉన్నప్పటికీ, ప్రారంభించినప్పటి నుంచీ సంస్థ పెరుగుదల గణనీయంగా ఉంది. తాజా త్రైమాసికంలో లాభాల్లో 75.9 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. దీనికి తోడు కంపెనీకి 55 ఏ320, ఏ321 విమానాల విమానాలను కలిగి ఉంది. దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో 385 విమానాలు నడుపుతోంది. -
600కి పైగా దేశీయ విమానాలు రద్దు
ముంబై : ఇండిగో, గోఎయిర్ కలిసి ఈ నెలలో 600కి పైగా దేశీయ విమానాలను రద్దు చేస్తున్నట్టు తెలిసింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌కు గురువారం ఈ ఎయిర్‌లైన్స్ సమర్పించిన షెడ్యూల్లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఇండిగో 488 విమానాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించగా.. గోఎయిర్ 138 విమానాలను రద్దు చేయబోతున్నట్టు తెలిసింది. రద్దు అయిన విమానాల జాబితాలను ఈ విమానయాన సంస్థలు తమ సంబంధిత వెబ్సైట్లలో పొందుపరిచాయి. ఈ రెండు విమానయాన సంస్థలు ప్రయాణికులకు ప్రత్యామ్నాయ విమానాలను ఆఫర్ చేస్తుండటంతో పాటు, మొత్తం నగదును రీఫండ్ చేస్తున్నాయి. ఈ రద్దుతో దాదాపు లక్ష మంది ప్రయాణికులు ప్రభావితం కానున్నారని తెలిసింది. వచ్చే నెల నుంచి వేసవి సెలవుల షెడ్యూల్ ప్రారంభం కాబోతుండటంతో, ఈ రద్దు ప్రభావం అప్పుడు కూడా ఉండబోతోంది. ఏప్రిల్‌లో విమానయాన సంస్థలకు ఎంతో డిమాండ్ ఉన్న ట్రావెల్ సీజన్. డిమాండ్ ఎక్కువగా ఉండి, విమానాల రద్దు ఉండటంతో, వచ్చే నెలలో విమానాల ధరలు పెరుగనున్నాయి. ఇండిగో, గోఎయిర్ కలిసి రోజూ 1200 విమానాలను నడుపుతున్నాయి. ఫ్రాట్, విట్నీ తయారు చేసిన ఇంజిన్లలో తలెత్తిన సమస్యల కారణంగా ఇరు సంస్థలు విమానాలను రద్దు చేసే నిర్ణయం తీసుకున్నాయి. మార్చి 15 నుంచి 31 మధ్యలో ఇండిగో 488 విమానాలను క్యాన్సిల్ చేయగా.. గోఎయిర్ మార్చి 15 నుంచి 22 వరకు 138 విమానాలను రద్దు చేసింది. -
ఎయిరిండియా అకౌంట్ హ్యాక్, విమానాలన్నీ రద్దు
ముంబై : ఎయిరిండియా అధికారిక ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయింది. ఉదయం చాలా గంటల పాటు ఎయిరిండియా ట్విటర్ అకౌంట్ హ్యాకింగ్ బారిన పడినట్టు ఈ విమానయాన సంస్థ తెలిపింది. హ్యాక్ అయిన తమ ట్విటర్ అకౌంట్ @airindiain లో టర్కిష్ భాషలో మెసేజ్‌లు పోస్టు అవుతున్నాయని ఎయిరిండియా అధికార ప్రతినిధి చెప్పారు. తమ అకౌంట్లో పోస్టు అయిన హానికరమైన కంటెంట్ అంతటిన్నీ తాము తొలగించనట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్విటర్ అకౌంట్ రిస్టోర్ అయిందని వెల్లడించారు. హ్యాకింగ్‌కు గురైన ఎయిరిండియా అకౌంట్లో పోస్టు అయిన ఒక మెసేజ్ ఈ విధంగా ఉంది. ''చివరి నిమిషంలో ఎంతో ముఖ్యమైన ప్రకటన. మా అన్ని విమానాలను రద్దు చేశాం. ఇప్పటి నుంచి, టర్కిష్ ఎయిర్‌లైన్స్‌తో మేము ఎగరాలనుకుంటున్నాం'' అని పోస్టు అయింది. ఈ మెసేజ్ చూసిన ఎయిరిండియా ట్విటర్ ఫాలోవర్స్ అందరూ ఒక్కసారిగా షాకింగ్‌కు గురయ్యారు. తీవ్ర అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియాను ఇటీవల ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎయిరిండియా అధికారిక అకౌంట్లో ఈ మెసేజ్ కనిపించడం తీవ్ర గందరగోళానికి తెరతీసింది. ప్రస్తుతం ఎయిరిండియా ట్విటర్ అకౌంట్‌కు 1,46,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. -
బిజినెస్ జెట్.. రయ్ రయ్!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ విమానయానంలో బిజినెస్ జెట్లు దూసుకెళ్తున్నాయి. ఒకప్పుడు బడా కార్పొరేట్లకే పరిమితమైన ప్రైవేటు విమానాలు... ఇప్పుడు చిన్న వ్యాపారవేత్తలకూ అందుబాటులోకి వచ్చేశాయి. దీంతో నాన్– షెడ్యూల్డ్, ప్రైవేట్ ఆపరేటర్ల హవా నడుస్తోంది. బిజినెస్/జనరల్ ఏవియేషన్‌లో ఉన్న నాన్–షెడ్యూల్డ్, ప్రైవేట్ ఆపరేటర్లు ఏకంగా 200 ఎయిర్‌పోర్టుల్లో అడుగుపెట్టడం వీటి జోరుకు నిదర్శనం. ప్రధానంగా వ్యాపారవేత్తల కారణంగానే ఈ స్థాయిలో కొత్త కొత్త ఎయిర్‌స్ట్రిప్స్‌లో చిన్న ఫ్లయిట్స్ ల్యాండ్ అవుతున్నాయి. వ్యాపారులు తమ అవసరాలకు విమానాలను అద్దెకు తీసుకోవడం లేదా సొంత విమానాల్లో ప్రయాణించడం గణనీయంగా పెరుగుతోందని బిజినెస్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆపరేటర్స్ అసోసియేషన్ (బీఏఓఏ) చెబుతోంది. మౌలిక వసతులు మెరుగైతే దేశం లో ఉన్న 420 విమానాశ్రయాలు, హెలిపోర్టులు బిజీగా ఉం డటం ఖాయమని అసోసియేషన్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇవీ గణాంకాలు.. ప్రస్తుతం దేశంలో బిజినెస్/జనరల్ ఏవియేషన్ రంగంలో నాన్–షెడ్యూల్డ్ ఆపరేటర్లు 120, ప్రైవేటు ఆపరేటర్లు 60 మంది ఉన్నారు. వీరి వద్ద 275 హెలికాప్టర్లు, 125 బిజినెస్ జెట్లు, 100 దాకా టర్బో ప్రాప్ ఎయిర్‌క్రాఫ్టులు ఉన్నాయి. 2018లో మరో 20 విమానాలు కొత్తగా అడుగు పెట్టనున్నాయి. పరిశ్రమ ఏటా 8 శాతం వృద్ధి చెందుతోందని బీఏఓఏ ప్రెసిడెంట్ రోహిత్ కపూర్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఈ రంగం లగ్జరీ అన్న భావన నుంచి ప్రభుత్వం బయటకు వస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని చెప్పారు. ‘విమానాలపై దిగుమతి సుంకం 3% వసూలు చేస్తున్నారు. నాన్ షెడ్యూల్డ్ ఆపరేటర్లకు జీఎస్టీ 5 శాతంగా ఉంది. ప్రైవేటు వినియోగానికి కొనుగోలు చేస్తే 28 శాతం జీఎస్టీ, 3 శాతం సెస్ అమలవుతోంది. ఈ పన్నులు తగ్గితే మరింత మంది విమానాల కొనుగోలుకు ముందుకు వస్తారు’ అని పేర్కొన్నారు. కాగా, టికెట్లు విక్రయించి సర్వీసులు అందించే సంస్థలను షెడ్యూల్డ్ ఎయిర్‌లైన్స్ అంటారు. వ్యాపార విస్తరణకు..: అనుకూలమైన సమయంలో, కోరుకున్న విమానాశ్రయానికి వెళ్లే అవకాశంతోపాటు భద్రత, ప్రైవసీ ఉండటంతో వ్యాపారులు బిజినెస్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆపరేటర్లను ఆశ్రయిస్తున్నారు. ప్రధానంగా షెడ్యూల్డ్ ఎయిర్‌లైన్స్ దేశంలో కేవలం 75 విమానాశ్రయాలకే సర్వీసులు అందిస్తున్నాయి. నాన్–షెడ్యూల్డ్, ప్రైవేట్ ఆపరేటర్లు 200ల విమానాశ్రయాలకు సేవలను విస్తరించారు. బిజినెస్ వర్గాలకు తాము ప్రత్యక్షంగానే సాయపడుతున్నామని రోహిత్కపూర్ అన్నారు. ‘విదేశాల్లోనూ వ్యాపార అవకాశా లను భారతీయులు వెతుక్కుంటున్నారు. అనుకూల ప్రాం తాలకు వెళ్లేందుకు బిజినెస్ ఎయిర్‌క్రాఫ్ట్‌లపై ఆధారపడుతున్నారు. వ్యాపారులు భారత ఎకానమీకి వెన్నెముక’ అని చెప్పారు. ప్రైవేట్ జెట్స్‌లో ప్రయాణం చేస్తున్న నగరాల్లో హైదరాబాద్ నాల్గవ స్థానంలో ఉందని ‘జెట్ సెట్ గో’ ఫౌండర్ కనిక టేక్రివాల్ తెలిపారు. ఏడాదిన్నరలో టాప్–1 స్థానానికి భాగ్యనగరం చేరుతుందనేది ఆమె అంచనా. అడ్డంకులు తొలగితే... దేశంలో ఉన్న 420 విమానాశ్రయాలు, హెలిపోర్టులు అన్నీ మౌలిక వసతుల పరంగా మెరుగైతే విమానయాన రంగం అనూహ్యంగా వృద్ధి చెందడం ఖాయం. న్యూయార్క్, పారిస్, సింగపూర్ మాదిరిగా భారత్‌లోని ప్రధాన నగరాల్లో బిజినెస్ ఎయిర్‌క్రాఫ్ట్స్ కోసం ప్రత్యేక రన్‌వే ఉండాలని పరిశ్రమ డిమాండ్ చేస్తోంది. ముంబై, ఢిల్లీ విమానాశ్రయాలు షెడ్యూల్డ్ ఆపరేటర్ల ఫ్లయిట్స్‌తో బిజీగా ఉంటున్నాయి. బిజినెస్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కోసం స్లాట్స్ పరిమితంగా ఉంటున్నాయి. దీనిని అధిగమించాలంటే ఇక్కడా ప్రత్యేక రన్వేలు ఉండాలని పరిశ్రమ కోరుతోంది. అన్ని జిల్లాల్లోనూ హెలిపోర్టులు ఏర్పాటు కావాలి. ఇదే జరిగితే కొత్త విమానాలు వస్తాయి. చార్జీలు తగ్గుతాయి. ఒక్కో విమానంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 60 మందికి ఉపాధి లభిస్తుందని బీఏఓఏ చెబుతోంది. -
పలు విమానాలు రద్దు
శంషాబాద్ : డైరెక్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఆదేశాల మేరకు ఇండిగో, గోఎయిర్ ఎయిర్‌లైన్స్ సంస్థలకు సంబంధించిన పలు దేశీయ విమాన సర్వీసులు మంగళవారం రద్దయ్యాయి. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, త్రివేండ్రం నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ఏడు ఇండిగో విమానాలతోపాటు ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావాల్సిన గోఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన విమానం కూడా రద్దయింది. దీంతో ముందుగా ఆయా విమానాల్లో బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఆయా నగరాల నుంచి రాకపోకలు సాగించే ఇండిగో, గోఎయిర్‌లైన్స్‌కు చెందిన మిగతా విమానాలు యథాతథంగా నడవటంతో ప్రయాణికులను వాటిలో సర్దుబాటు చేసినట్లు విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. -
వణికిపోతున్న అగ్రరాజ్యం
అమెరికాను మంచు తుపాను వణికిస్తోంది. న్యూయార్క్, న్యూజెర్సీల్లో ఉష్ట్రోగ్రతలు విపరీతంగా పడిపోవడం, తీవ్రంగా మంచు కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడ చూసినా మంచు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయింది. న్యూయార్క్‌లో 6 నుంచి 10 అంగుళాలు, న్యూజెర్సీ, కనెక్టికట్‌లలో 20 అంగుళాల మేర మంచు పేరుకుపోయి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరో వైపు తుపానుతో పాటు బలమైన గాలులు కూడా వీస్తుండటంతో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. గాలుల నేపథ్యంలో పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాదాపు లక్ష ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. విమానాల రద్దు మంచు తుపాను కారణంగా విమానాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే న్యూయార్క్, న్యూజెర్సీ ఎయిర్ పోర్టుల్లో వేల సంఖ్యలో విమానాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. దాదాపు 2600 విమానాలు రద్దు అయినట్టు అధికారులు తెలిపారు. దీంతో ఆయా ప్రయాణికులంతా ఎయిర్‌పోర్టుల్లోనే వేచి ఉండాల్సి వచ్చింది. ప్రయాణికుల అవసరాల కోసం ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. -
బెజవాడను కమ్మేసిన పొగమంచు
సాక్షి, విజయవాడ : విజయవాడను మంచు దుప్పటి కప్పేసింది. తెల్లవారుజాము నుంచి దట్టమైన పొగమంచు విజయవాడతో పాటు పరిసర ప్రాంతాలను ముంచేసింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వేకువజామునే రోజు వారి కార్యక్రమాలు, జాగింగ్ చేసే పాదచారులు సైతం ఇబ్బందులు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పొగమంచు తీవ్రంగా అలముకోవడంతో కొన్ని చోట్ల వాహనదారులు ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక జారి కింద పడ్డారు. విమానాల రాకపోక ఆలస్యం : గన్నవరం విమానాశ్రయంలో పొగమంచు దట్టంగా అలముకుంది. దీంతో పలు విమానాల రాకపోకలు ఆలస్యం అవుతున్నాయి. హైదరాబాద్, బెంగుళూరు నుంచి రావాల్సిన స్పైస్‌జెట్, ఇండిగో, హైదరాబాద్ నుంచి రావాల్సిన ట్రూజెట్ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఎయిర్ ఏషియా నుంచి రూ.799కే విమాన టికెట్
బెంగళూరు: ఎయిర్ ఏషియా విమానయాన సంస్థ రూ.799 నుంచే దేశీయ ప్రయాణ టికెట్లను, రూ.999 నుంచి అంతర్జాతీయ ప్రయాణ టికెట్లను అందిస్తోంది. ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకు ఆఫర్ అమల్లో ఉంటుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 3 నుంచి వచ్చే ఏడాది మే 29 మధ్య ప్రయాణాల కోసం ఆఫర్ కింద టికెట్లను బుక్ చేసుకోవచ్చు. కార్పొబ్రీఫ్స్ ఆల్ట్రాటెక్ సిమెంట్: ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన ఈ కంపెనీలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్మెంట్(ఎఫ్‌పీఐ) పరిమితిని 30 శాతం నుంచి 40 శాతానికి పెంచింది. భారత్‌లో అతి పెద్ద సిమెంట్ కంపెనీ ఇది. ఈ కంపెనీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 6.8 కోట్ల టన్నులు. టాటా మోటార్స్: ఆర్థిక ఫలితాలు అధికారికంగా వెల్లడికాకముందే వాట్సాప్ ద్వారా లీకైన విషయంలో దర్యాప్తు జరపాలని టాటా మోటార్స్‌ను మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ ఆదేశించింది. సంబంధిత నివేదికను మూడు నెలల్లోగా అందజేయాలని పేర్కొంది. -
రూ.999కే ఇంటర్నేషనల్ ఫ్లైట్ టిక్కెట్
ముంబై : ఎయిర్ఏషియా అంతర్జాతీయ విమాన టిక్కెట్లపై బంపర్ ఆఫర్ ప్రకటించింది. ''బిగ్ సేల్'' ఆఫర్ కింద ఎంపిక చేసిన మార్గాలలో రూ.999కే విమాన టిక్కెట్‌ను అందించనున్నట్టు ఎయిర్ఏసియా తన వెబ్సైట్లో పేర్కొంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ కింద ఎంపిక చేసిన రూట్లలో అంతర్జాతీయ టిక్కెట్లు 2018 మార్చి 11 వరకు అందించనున్నామని ఈ ఎయిర్‌లైన్స్ తెలిపింది. ట్రావెల్ పిరియడ్ 2018 సెప్టెంబర్ 3 నుంచి ప్రారంభమై, 2019 మే 28 వరకు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఎయిర్ఏషియా ఇండియా దేశీయ విమాన టిక్కెట్ల ధరలు రూ.799 నుంచి ప్రారంభమవుతున్నాయి. ''బిగ్ సేల్కు ఇది సరియైన సమయం. బీట్దిబడ్జెట్పై తమ అంతర్జాతీయ నెట్వర్క్ రూ.999 నుంచి ప్రారంభమవుతుంది'' అని ఎయిర్‌లైన్స్ తెలిపింది. భువనేశ్వర్ నుంచి కౌలాలంపూర్ వరకు వన్-వే విమానాలకు రూ.999కి విమాన టిక్కెట్‌ను ఆఫర్ చేస్తోంది. బిగ్ సేల్ కింద ఇతర రూట్లు కొచ్చి నుంచి కౌలాలంపూర్‌కు టిక్కెట్ ధర రూ.2,999కు, చెన్నై నుంచి కౌలాలంపూర్‌కు టిక్కెట్ ధర రూ.3,399కు, విశాఖపట్నం నుంచి కౌలాలంపూర్‌కు టిక్కెట్ ధర రూ.1,399కు, జైపూర్ నుంచి కౌలాలంపూర్‌కు టిక్కెట్ ధర రూ.3,690కు ఎయిర్ఏషియా ఆఫర్ చేస్తోంది. www.airasia.comలో ఆన్‌లైన్‌గా మాత్రమే ఈ డిస్కౌంట్ టిక్కెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. క్రెడిట్, డెబిట్, ఛార్జ్ కార్డుల ద్వారా జరిపే పేమెంట్లకు నాన్-రిఫండబుల్ ప్రాసెసింగ్ ఫీజు వర్తిస్తోంది. పరిమిత సంఖ్యలో సీట్లు, అన్ని విమానాలకు ఇది వర్తించదు వన్-వే జర్నీకే ఈ ఆఫర్ అందుబాటు -
వణుకుతున్న ఐరోపా
-
గల్ఫ్ కార్మికులకు టీఆర్ఎస్ మొండిచెయ్యి
హైదరాబాద్: కువైట్‌లో ఇబ్బంది పడుతున్న పేద ప్రవాసీ కార్మికులకు ఉచితంగా విమాన టికెట్లు ఇప్పిస్తానని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం వారికి మొండిచెయ్యి చూపిందని రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నారై విభాగం ఆరోపించింది. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ఎన్నారై విభాగం చైర్మన్ బి.ఎం.వినోద్‌కుమార్, కాంగ్రెస్ గల్ఫ్ ఎన్నారై విభాగం కన్వీనర్ దేవేందర్ రెడ్డి, ప్రవాసీ సంక్షేమ వేదిక అధ్యక్షుడు భీంరెడ్డి మాట్లాడారు. గల్ఫ్ కార్మికుల కోసం రూ.500 కోట్లు కేటాయిస్తామని మేనిఫెస్టోలో పెట్టిన టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని మరిచిపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా నేతృత్వంలో ఎన్నారై బృందం గత నెల 16న కువైట్‌లో భారత రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడి బాధితులకు న్యాయం జరిగేలా చేసిందని చెప్పారు. ఇమ్మిగ్రేషన్ చట్టాలను ఉల్లంఘించిన కార్మికులు తమ దేశాలకు వెళ్లిపోయే అవకాశం కల్పిస్తూ కువైట్ ప్రభుత్వం జనవరి 29 నుంచి ఫిబ్రవరి 22 వరకు క్షమాభిక్ష అవకాశం కల్పించిందన్నారు. తమ బృందం అక్కడి అధికారులతో మాట్లాడి క్షమాభిక్ష గడువును ఏప్రిల్ 22 వరకు పొడిగించినట్లు తెలిపారు. చాలామంది పేదలకు చార్జీలూ తామే చెల్లించామని వెల్లడించారు. -
‘క్షమాభిక్ష’ కార్మికులకు టికెట్ల భారం
మోర్తాడ్(బాల్కొండ): మూలిగే నక్కపై తాటికాయ పడిందన్న చందంగా తయారైంది కువైట్ లోని మన కార్మికుల పరిస్థితి. ఆ దేశంలో ఖల్లివెల్లి (నిబంధనలకు విరుద్ధంగా) కార్మికులుగా ఉంటున్న వారు కువైట్ విడిచి వెళ్లేందుకు అక్కడి ప్రభుత్వం క్షమాభిక్ష ద్వారా అవకాశం కల్పించింది. దీంతో భారత కార్మికులు పెద్ద సంఖ్యలో స్వదేశానికి వస్తున్నారు. ఫలితంగా విమాన టికెట్లకు డిమాండ్ పెరగడంతో విమానయాన సంస్థలు ఇష్టారాజ్యంగా ధరలు పెంచేస్తున్నాయి. సాధారణంగా రూ.8 వేలు ఉన్న విమాన చార్జీ ఇప్పుడు ఏకంగా రూ.18 వేలకు పెంచడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కువైట్ ప్రభుత్వ క్షమాభిక్షలో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్న కార్మికులు ఈ నెల 22 లోపు ఆ దేశాన్ని వదలి వెళ్లాలి. జనవరి 29 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. క్షమాభిక్షను వినియోగించుకునే వారిలో తెలుగు రాష్ట్రాల కార్మికులు వేల సంఖ్యలో ఉన్నారు. గడువు నాలుగు రోజులే ఉండటం, ప్రయాణికులు ఎక్కువగా ఉండటంతో విమానయాన సంస్థలు టికెట్ల ధరలను భారీగా పెంచాయి. ప్రత్యేక విమానాల ఊసే లేదు.. కువైట్‌లో ఆమ్నెస్టీ కారణంగా మన దేశం నుంచి ఎక్కువ విమానాలను నడపాలి. అయితే, కువైట్ నుంచి మన దేశానికి ప్రధానంగా శంషాబాద్ విమానాశ్రయానికి రావడానికి ప్రత్యేక విమానాలను నడపడం లేదు. దీనివల్ల అందుబాటులో ఉన్న విమానాల టికెట్లను కార్మికులు కొనుగోలు చేయాల్సి వస్తోంది. కాగా, అనేకమందికి విమాన చార్జీలకు సరిపడా చేతిలో డబ్బులు లేవు. దీంతో ప్రభుత్వం లేదా స్వచ్ఛంద సంస్థల సహకారం కోసం వారు ఎదురు చూస్తున్నారు. విమాన చార్జీల పెంపుపై కేంద్రం దృష్టి సారించాలని, క్షమాభిక్షపై తిరిగి వస్తున్న కార్మికులకు టికెట్ రాయితీ సౌకర్యం కల్పించాలని కార్మికులు కోరుతున్నారు. కువైట్‌లో పరిస్థితి దారుణం కువైట్‌లో క్షమాభిక్ష వల్ల స్వదేశానికి వచ్చే కార్మికులకు సహకారం అందించడానికి ఏఐసీసీ నేత రామచంద్ర కుంతి యా బృందంలో సభ్యుడిగా నేను కువైట్‌లో పర్యటిస్తున్నాను. ఇక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. దీనికి తోడు విమాన సంస్థలు చార్జీలను పెంచడం వల్ల కార్మికులపై మరింత భారం పడుతోంది. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలి. – డాక్టర్ జేఎన్ వెంకట్,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి -
డిసెంబర్‌లోపు లీప్ విమాన ఇంజిన్ల తయారీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్‌లోని ఆదిభట్లలో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్) కేంద్రంలో లీప్ విమాన ఇంజిన్ అభివృద్ధి పనులు మొదలయ్యాయి. ఈ ఏడాది డిసెంబర్ ముగింపులోగా తయారీ పూర్తయి విపణిలోకి విడుదల కానుంది. గతేడాది అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ (జీఈ), టీఏఎస్ఎల్ మధ్య వ్యూహాత్మక ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారమిక్కడ ఇరు కంపెనీలు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీఓఈ) కేంద్రానికి భూమి పూజ చేశాయి. ఈ కేంద్రంలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అమ్ముడవుతున్న జెట్, సీఎఫ్ఎం లీప్ ఇంజిన్లను అభివృద్ధి చేస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ కేంద్రంలో జీఈ, టీఏఎస్ఎల్తో పాటూ తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రధాన పెట్టుబడి వాటాదారుగా ఉన్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి కేటీ రామారావు మాట్లాడుతూ.. ‘‘దేశార్థికాభివృద్ధిలో తయారీ రంగం కీలకమైంది. అందులోనూ వైమానిక రంగంలో తయారీ అనేది అత్యంతకీలకమైందని.. అలాంటి కీలక కేంద్రం తెలంగాణలో ఉండటం రాష్ట్ర అభివృద్ధి సూచికని’’ వివరించారు. హైదరాబాద్‌లోని ప్రముఖ కంపెనీల్లో టాటా ఒకటని.. ఇందులో జీఈ జత కట్టడం ముదావహమన్నారు. ‘గతంలో ఢిల్లీలో జీఈ సీఈఓ, చైర్మన్ జాన్ ఫ్లానెర్రీ కలిశానని.. వచ్చే ఐదేళ్ల వరకూ జీఈ ఆర్డర్ బుక్ ఫుల్‌గా ఉందని ఈ విషయాన్ని చెప్పారని’’ కేటీఆర్ గుర్తుచేశారు. వైమానిక రంగంలో నైపుణ్య శిక్షణ నిమిత్తం అకడమిక్స్‌తో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. భవిష్యత్తులో వాణిజ్య, మిలిటరీ ఇంజిన్లు.. జీఈకి ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరులో పరిశోధన మరియు అభివృద్ధి (ఆర్అండ్డీ), సాంకేతికత కేంద్రాలున్నాయి. ఇందులో హైదరాబాద్ కేంద్రంలో 700 మంది ఇంజనీర్లు పనిచేస్తున్నారని జీఈ సౌత్ ఏషియా సీఈఓ, ప్రెసిడెంట్ విశాల్ వాన్చూ తెలిపారు. సాంకేతికత విభాగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నామన్నారు. ‘‘జీఈ మిలిటరీ ఇంజిన్లకు పెద్ద చరిత్రే ఉంది. ఇప్పటికే ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ వంటి రక్షణ విభాగానికి జెట్ ఇంజిన్స్, మెరైన్ గ్యాస్ టర్బైన్స్ అభివృద్ధి చేశాం. అలాగే భవిష్యత్తులో టీఏఎస్ఎల్ కేంద్రంలో వాణిజ్య, మిలిటరీ ఇంజిన్లను కూడా తయారు చేస్తామని’’ వాన్చూ వివరించారు. ప్రస్తుతం ఎగుమతులకే.. జీఈ భాగస్వామ్యంతో దేశీయంగా తయారీ నైపుణ్యం మెరుగవ్వడంతో పాటూ అంతర్జాతీయ విమానయాన రంగంలో టాటా సామర్థ్యం మరింత వృద్ధి చెందుతుందని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డిఫెన్స్ అండ్ ఎయిరోస్పేస్ ప్రెసిడెంట్ బాన్మాలీ అగర్వాల్ అన్నారు. ప్రస్తుతానికైతే దేశీయం గా ఎలాంటి లీప్ ఇంజిన్ల అర్డర్లు లేవని, అభివృద్ధి చేస్తున్నవాటిని ఎగుమతి చేస్తామని ఆయన పేర్కొన్నారు. లీప్ ఇంజిన్లతో పాటు, ఇంజిన్‌లోని విడిభాగాలను కూడా తయారు చేస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా లీప్ ఇంజిన్లకు డిమాండ్ పెరుగుతుంది. ప్రస్తుతం ఏడాదికి వెయ్యి ఇంజిన్ల డిమాండ్ ఉందని.. 2020 నాటికి ఏటా 2 వేల ఇంజిన్లకు చేరుతుందని వాన్చూ తెలిపారు. సీఎఫ్ఎం ఇంటర్నేషనల్ ఉత్పత్తే లీప్ ఇంజిన్. ఇది జీఈ, సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్స్ 50:50 జాయింట్ వెంచర్. 18 నెలల్లో 5 దేశాలకు చెందిన 35 ఎయిర్‌లైన్స్‌కు 200 లీప్ ఇంజిన్లు అభివృద్ధి చేశామని ఆయన వివరించారు. -
రూ.991కే విమాన టిక్కెట్
న్యూఢిల్లీ : దేశీయ ఎయిర్‌లైన్ సంస్థ గోఎయిర్ అతి తక్కువ ధరకే విమాన టిక్కెట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద టిక్కెట్‌ను రూ.991కే విక్రయించనున్నట్టు పేర్కొంది. ఈ ఆఫర్ కింద కస్టమర్లకు గోఎయిర్ ఆఫర్ చేస్తున్న టిక్కెట్లను 2018 ఫిబ్రవరి 20 వరకు బుక్ చేసుకోవచ్చు. హెచ్డీఎఫ్సీ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకునే వారికి అదనంగా 10 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉండనుందని గోఎయిర్ వెబ్‌సైట్‌పేర్కొంది. అయితే 'GOHDFC10' ప్రోమో కోడ్‌ను కస్టమర్లు వినియోగించాల్సి ఉంటుంది. ''ఈ ఫిబ్రవరిలో అతి తక్కువ ధరలను ఎంజాయ్ చేయండి. రూ.991కే విమాన ప్రయాణాన్ని ఆస్వాదించండి. 'GOHDFC10' ప్రోమో కోడ్ వాడి హెచ్డీఎఫ్సీ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకున్న వారికి 10 శాతం తగ్గింపు లభిస్తోంది. 2018 ఫిబ్రవరి 20 వరకే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఇప్పుడే బుక్ చేసుకోండి'' అంటూ గోఎయిర్ తెలిపింది. బాగ్డోగ్ర నుంచి గౌహతికి విమాన టిక్కెట్ ధర రూ.991 నుంచి ప్రారంభమవుతోంది. గౌహతి నుంచి బాగ్డోగ్రకు టిక్కెట్ ధరను రూ.1,299కు, కొచ్చి నుంచి బెంగళూరుకు రూ.1,390కు, హైదరాబాద్ నుంచి చెన్నైకి రూ.1,399కు, కొచ్చి నుంచి చెన్నైకి రూ.1,540కి, పాట్న నుంచి రాంచికి రూ.1,560కు, చెన్నై నుంచి కొచ్చికి రూ.1,653కు, హైదరాబాద్ నుంచి బెంగళూరుకు రూ.1,731కు టిక్కెట్లను గోఎయిర్ ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్‌కు స్టాండర్డ్ క్యాన్సిలేషన్, రీబుకింగ్ పాలసీ అమల్లో ఉంటుంది. ఈ ఆఫర్ కింద పరిమిత సీట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. గ్రూప్ డిస్కౌంట్‌కు ఈ ఆఫర్ పనిచేయదు. ఇన్ఫాంట్ బుకింగ్‌కు ఇది అందుబాటులో ఉండదు. -
హై టెన్షన్ : 282 విమానాలు రద్దు
బీజింగ్ : చైనా-తైవాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విమానాల ప్రయాణమార్గంపై ఇరుదేశాల మధ్య వివాదం చెలరేగింది. న్యూ ఇయర్ హాలీడే ట్రిప్‌కు తైవాన్ వెళ్లేందుకు ప్రయాణీకులు క్యూ కట్టారు. దీంతో ప్రస్తుతం నడుస్తున్న సర్వీసుల టికెట్లు అన్ని అమ్ముడుపోయాయి. అయినా, తైవాన్ వెళ్లేందుకు రద్దీ ఎక్కువగా ఉండటంతో ప్రత్యేక సర్వీసులను నడపాలని చైనా నిర్ణయించింది. చైనాకు చెందిన చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్, గ్జియామెన్ ఎయిర్‌లైన్స్‌లు 282 ప్రత్యేక సర్వీసులను నడిపేందుకు సిద్ధమయ్యాయి. ప్రత్యేక సర్వీసులను అనుమతించబోమని తైవాన్ ప్రకటించింది. తైవాన్ చర్యతో చేసేదేమీ లేక చైనా విమానయాన సంస్థలు ప్రత్యేక సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో లూనార్ న్యూ ఇయర్‌ను జాలీగా ఎంజాయ్ చేద్దామనుకున్న వారి ఆశలన్నీ ఆవిరయ్యాయి. కొత్త మార్గాలల్లో విమాన రాకపోకలపై చైనా తమతో చర్చించలేదని వెల్లడించింది. అంతేకాకుండా ఇరుదేశాల మధ్య వివాదాస్పదంగా ఉన్న ఎమ్503 అనే మార్గం గుండా కూడా సర్వీసు నడుపుతామని చైనా తనంతట తనే ప్రకటించడంపై తైవాన్ అధ్యక్షురాలు త్సాయ్ ఇంగ్ వెన్ మండిపడ్డారు. చైనా మరోసారి ఇలాంటి దుందుడుకు చర్యకు దిగితే ఇరు దేశాల మధ్య సంబంధాలు బలహీనపడతాయని హెచ్చరించారు. -
స్పైస్ జెట్ 20 విమానాలు: 10 ఆంధ్రాకు
సాక్షి, ముంబై: విమానయాన సంస్థ స్పైస్‌జెట్ దేశీయంగా కొత్తగా 20 విమానాలను ప్రవేశపెట్టింది. దేశీయ రూట్లలో 20 నాన్‌స్టాప్ విమానాలను త్వరలోనే ప్రారంభించ నున్నామని కంపెనీ ప్రకటించింది. చెన్నై-మంగళూరు, గౌహతికి చెన్నై మార్గాలు సహా ఫిబ్రవరి 11 ప్రారంభించి అనేక మార్గాల్లో ఫ్రీక్వెన్సీని జోడిస్తున్నట్టు తెలిపింది. అంతేకాదు కోల్‌కతా, జబల్పూర్, బెంగళూరు, పుదుచ్చేరి మధ్య డైరెక్ట్ ఫ్టైట్ నడుపనున్న తొలి సంస్థగా స్పైస్ జెట్ నిలిచింది. తన కార్యకలాపాల విస్తరణలోభాగంగా చెన్నై-విశాఖపట్నం( సెకండ్ ఫ్రీక్వెన్సీ) కోల్‌కతా- విశాఖపట్నం( సెకండ్ ఫ్రీక్వెన్సీ) , చెన్నై-విజయవాడ( థర్డ్ ఫ్రీక్వెన్సీ) బెంగళూరు-చెన్నై (ఐదవ ఫ్రీక్వెన్సీ) రూట్లలో నాన్ స్టాప్ విమానాలను నడుపుతుంది. చెన్నై, విశాఖపట్నం, కోలకతా- విశాఖపట్నం, చెన్నై- విజయవాడ మధ్య రోజువారీ విమానాలు పనిచేస్తాయనీ, అయితే బెంగళూరు- తిరుపతి ధ్య మంగళవారాలు తప్ప అన్ని రోజుల్లోనూ తమ సేవలు అందుబాటులోఉంటాయని పేర్కొంది. దక్షిణాన 18 విమానాలతో నాన్ మెట్రో, మెట్రో నగరాల మధ్య అనుసంధానం పెంచుతున్నట్టు తెలిపింది. వీటిల్లో 10 సర్వీసులను ప్రాంతీయ కనెక్టివిటీ థీమ్ ‘కనెక్టెడ్ ది అన్‌కనెక్టెడ్ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను కలుపుతున్నట్టు వెల్లడించింది. -
వైఫై కనెక్షన్ : అర్థగంటకు రూ.500
చెన్నై : విమానాల్లో త్వరలోనే వైఫై సౌకర్యం అందుబాటులోకి రాబోతోంది. ఆకాశంలో ఉండగానే నెట్ వాడుకోవచ్చు. సెల్ఫీలు దిగి పోస్ట్ చేసుకోవచ్చు. ఇక స్నేహితులతో చాట్ చేసుకోవచ్చు. అయితే, ఇవన్నీ చాలా ఖరీదుతో కూడుకున్నవిగా ఉండబోతున్నాయి. వీటి కోసం విమాన చార్జీలతో కలిపి అదనంగా 20 శాతం నుంచి 30 శాతం చెల్లించాల్సి ఉండనుంది. ట్రాయ్ ఆదేశాలతో విమానంలో వైఫై సేవలను ప్రారంభించేందుకు విమానయాన సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పెను భారం వినియోగదారులపైనే పడబోతున్నట్టు తెలిసింది. అంతర్జాతీయ ప్రమాణాల పరంగా 30 నిముషాల నుంచి గంట వరకు నెట్‌కనెక్షన్ కోసం రూ.500 నుంచి రూ.1000 వరకు ఛార్జీలు విధించనున్నట్టు అధికారులు చెప్పారు. వాస్తవానికి విమానయాన సంస్థలు ఇన్‌ఫ్లైట్ వైఫై సేవల కోసం ఇన్మార్శాట్ తదితర సర్వీస్ ప్రొవైడర్లకు భారీ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. దీంతో దేశీయ మార్గాల్లో ఇన్‌ఫ్లైట్ ఇంటర్నెట్ సౌలభ్యం కోసం అడ్వాన్స్ బుకింగ్ చార్జీలు రూ.1200 నుంచి రూ.2,500 దాకా ఉండబోతున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులకే కాకుండా విమానయాన సంస్థలకూ ఆ చార్జీలు భారంగానే పరిణమించనున్నాయి. ఖండాంతర, దేశీయ మార్గాల్లో ప్రయాణించే విమానాలకు ఇన్‌ఫ్లైట్ వైఫై వెసులుబాటు ప్రయోజనం చేకూరుస్తుందని ఓ విమానయాన సంస్థ అధికారి ఒకరు చెప్పారు. అంతేగాకుండా భారత గగనతలంలో ఉన్నప్పుడు వైఫైని స్విచాఫ్ చేయాల్సిన అవసరం కూడా లేదని ఆయన చెప్పారు. దేశీయ విమానాల్లో వైఫై సౌకర్యం గురించి చర్చిస్తున్నామని, దానిపై పూర్తి నిర్ణయం తీసుకునేముందు దాని చార్జీలు, వైఫైకి ఉన్న డిమాండ్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఓ ప్రైవేటు విమానయాన సంస్థ అధికారి ఒకరు సూచించారు. ఇక, వైఫై సేవలను అందించేందుకు గానూ సిగ్నల్స్ కోసం విమానాల్లో యాంటెన్నాను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. -
రూ.769లకే విమాన టికెట్
సాక్షి, న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే సందర్భంగా విమానయాన సంస్థలు తగ్గింపు ధరల్లో టికెట్లను ఆఫర్ చేయడంలో పోటీ పడుతున్నాయి. తాజాగా ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ రిపబ్లిక్‌డే ఆఫర్ ప్రకటించింది. ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్’ పేరుతో ప్రత్యేక రూట్లలో పరిమిత కాలానికి డిస్కౌంట్ రేట్లలో టికెట్లను ఆఫర్ చేస్తున్నట్టు తెలిపింది. దేశీయంగానూ, అంతర్జాతీయంగానూ ఈ టికెట్లను ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్లో టికెట్ బుకింగ్స్ జనవరి 22 నుంచి జనవరి 25వ తేదీ వరకు చేసుకోవచ్చు. ఈ ఏడాది డిసెంబరు 12 వరకు ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని ఒక ప్రకటనలో ఎయిర్ లైన్స్ వెల్లడించింది. దేశీయంగా 769 రూపాయలు (వన్ వే, అన్నీ కలుపుకొని) అంతర్జాతీయ ప్రయాణాల్లో టికెట్ ప్రారంభ ధర రూ.2.469 ఉంది. జమ్ము-శ్రీనగర్, సిల్చార్-గువహటి, డెహ్రాడూన్-ఢిల్లీ , ఢిల్లీ-జైపూర్, అగర్తల-గువహటి, కోయంబత్తూర్-బెంగళూరు, కొచ్చి-బెంగళూరు, ఢిల్లీ-డెహ్రాడూన్ తదితర మార్గాల్లో టికెట్ ప్రారంభ ధర రూ.769 ఉందని స్పైస్‌జెట్ వెల్లడించింది. అలాగే అంతర్జాతీయ నెట్‌వర్క్‌లో చెన్నై- కొలంబో రూట్‌కు టికెట్ ప్రారంభ ధర రూ.2,249 ఉందని తెలిపింది. స్పైస్‌జెట్ .కాం, లేదా సంస్థ మొబైల్ యాప్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎస్బీఐ క్రెడిట్ ద్వారా 10శాతందాకా డిస్కౌంట్. దాదాపు 500రూపాయల దాకా తగ్గింపు తోపాటు ఎస్బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఫ్రీ ప్రయారిటీ చెక్ సౌకర్యం కూడా. -
40 నిమిషాలు గాల్లోనే చక్కెర్లు కొట్టిన విమానాలు
గన్నవరం : దట్టమైన పొగమంచు కారణంగా విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో బుధవారం ఉదయం విమానాల ల్యాండింగ్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పలు విమానాలు సుమారు 40 నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టాయి. తెల్లవారుజాము నుంచి గన్నవరం విమానాశ్రయంలో రన్‌వేని పూర్తిగా పొగ మంచు కప్పేయడంతో ఉదయం 8.00 గంటలకు హైదరాబాద్ నుంచి వచ్చిన ట్రూజెట్ విమానం ల్యాండింగ్‌కు ఇబ్బంది ఏర్పడింది. అలాగే హైదరాబాద్-విజయవాడ-బెంగళూరు స్పైస్ జెట్, హైదరాబాద్-విజయవాడ-హైదరాబాద్ స్పైస్ జెట్ విమానాలు ల్యాండింగ్‌కు అవకాశం లేకపోవడంతో తిరిగి వెనక్కు వెళ్లిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. హైదరాబాద్, బెంగుళూరుల నుండి కనెక్టివిటీ విమానాలలో వెళ్ళవలసిన ప్రయాణీకులు ఆందోళన చెందుతున్నారు. -
ఎయిర్ ఏషియా బంపర్ ఆఫర్
సాక్షి, ముంబై: బడ్జెట్ ధరల ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.99లకే విమానటికెట్‌ను ఆఫర్ చేస్తోంది. దేశంలో 7 నగరాల మధ్య ప్రయాణానికి రూ .99 నుంచి ప్రమోషనల్ బేస్ ఛార్జీలను ప్రారంభించింది. బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి, కోల్‌కతా, న్యూ ఢిల్లీ, పూణే, రాంచీ వంటి నగరాలకు డైనమిక్ ధర రూ .99 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఎయిర్ ఏషియా వెబ్సైట్, లేదా యాప్ ద్వారా బుక్ చేసుకున్న టికెట్లపై మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అంతేకాదు ఇంకో ఆకర్షణీయమైన ఆఫర్ కూడా ఉంది. 10 ఆసియా-పసిఫిక్ ప్రాంతం (అపాక్) దేశాలు ఆక్లాండ్, బాలి, బ్యాంకాక్, కౌలాలంపూర్, మెల్బోర్న్, సింగపూర్ సిడ్నీలకు బేస్ ధర రూ.1499గా నిర్ణయించింది. కాగా ఇప్పటికే అనేక విమానయాన సంస్థలు ప్రయాణికులకు అత్యంత తక్కువ ధరలకే విమానయన సదుపాయం కల్పిస్తూ చౌక ధరల యుద్ధానికి తెరతీస్తున్న తరుణంలో ఎయిర్ ఏషియా మరోమారు డిస్కౌంట్ ధరలను అందిస్తోంది. దేశీయంగా, ఇతర దేశాలను చుట్టి రావాలనుకునే విమాన ప్రయాణికులకు మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. -
రూ.1,099కే విస్తారా టికెట్!
ముంబై: విమానయాన సంస్థ ‘విస్తారా’ తాజాగా 3వ వార్షికోత్సవం సందర్భంగా పరిమితకాల టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.1,099 ప్రారంభ ధరతో విమాన టికెట్లను (ఎకానమీ క్లాస్) ఆఫర్ చేస్తోంది. ఇక ప్రీమియం ఎకానమీ క్లాస్ టికెట్ ధర రూ.2,599 నుంచి, బిజినెస్ క్లాస్ టికెట్ ధర రూ.7,499 నుంచి ప్రారంభమౌతుంది. మంగళవారం ఒక్కరోజు మాత్రమే అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్లో భాగంగా టికెట్లను బుక్ చేసుకున్న వారు ఈ ఏడాది జనవరి 17 నుంచి ఏప్రిల్ 18 వరకు ఎప్పుడైనా ప్రయాణించొచ్చు. -
త్వరలో తిరుపతి విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులు
రేణిగుంట: తిరుపతి విమానాశ్రయం నుంచి విదేశాలకు త్వరలోనే కనెక్టివిటీ విమాన సర్వీసులను నడిపేదిశగా చర్యలు తీసుకుంటామని కేంద్ర విమానయాన శాఖామంత్రి అశోకగజపతిరాజు అన్నారు. రేణిగుంటలోని తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయన ఇండిగో విమాన సర్వీసులను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన బోర్డింగ్ కౌంటర్ వద్ద మొదటి ప్రయాణికునిగా ఇండిగో ప్రెసిడెంట్ ఆదిత్యఘోష్ నుంచి టికెట్టు పొందారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తిరుపతి నుంచి అంతర్జాతీయ విమానాలను నడిపేందుకు అడ్డంకిగా ఉన్న అన్ని సమస్యలను అధిగమిస్తామని తెలిపారు. ఇండిగో ప్రెసిడెంట్ ఆదిత్యఘోష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో మరో వారంలో రాజమండ్రి, మార్చి నాటికి విజయవాడ నుంచి తమ సర్వీసులను ప్రారంభిస్తామన్నారు. -
చెన్నై నుంచి 63 విమానాలు రద్దు
సాక్షి, టీ.నగర్: ఢిల్లీలో రిపబ్లిక్ వేడుకల సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భద్రతా చర్యల్లో భాగంగా చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్ళాల్సిన 63 విమాన సర్వీసులను రద్దు చేశారు. ఈ నెల 26వ తేదీన రిపబ్లిక్‌డే ఉత్సవాలను దేశవ్యాప్తంగా జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ప్రత్యేక పరేడ్ జరగనున్నందున కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఏడాది ఢిల్లీ గగనతలంపై విమానాలు తిరగడాన్ని నిషేధించారు. ఈ నెల 18వ తేది నుంచి 26వ తేదీ వరకు 9 రోజుల పాటు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు విమానాల పయనాన్ని రద్దు చేశారు. చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్లే 63 విమానాలను ఈ సందర్భంగా రద్దు చేస్తున్నారు. -
అశోక్ గజపతి రాజుకు విమానంలో చుక్కలు
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి అశోక్ గజపతి రాజుకు విమానంలో ప్రయాణీకులు చుక్కలు చూపించారు. గుక్కతిప్పుకోకుండా ప్రశ్నలు సంధిస్తూ చిరాకు పెట్టించారు. ఢిల్లీ నుంచి విజయవాడకు బయలుదేరాల్సిన తమ విమానం గంటపాటు ఎందుకు ఆలస్యం అయిందని, ఎందుకు అంతసేపు తమను విమానంలో కూర్చొబెట్టారని నిలదీశారు. దాంతో ఆయన వెంటనే ఎయిర్ ఇండియా చైర్మన్‌కు మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ ఖరోలాకు ఫోన్ చేసి వెంటనే జరిగిన తప్పిదానికి వివరణ కోరారు. వివరాల్లోకి వెళితే ఎయిర్ ఇండియాకు చెందిన విమానం ఒకటి ఢిల్లీ నుంచి విజయవాడకు బయలుదేరాల్సి ఉంది. అదే విమానంలో మంత్రి అశోక్ గజపతి రాజుతోపాటు మొత్తం 125మంది ప్రయాణీకులు కూర్చున్నారు. గంట సేపు అయినా పైలట్, ఇతర సిబ్బంది రాలేదు. దీంతో చిర్రెత్తిపోయిన ప్రయాణీకులు అందులో ఉన్న విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతి రాజును ప్రశ్నలతో చుట్టుముట్టారు. దీనికి బదులుగా ఎయిర్ ఇండియా వెంటనే పైలట్‌తో సహా ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేసింది. ఎయిర్ లైన్ అధికారిక ప్రతినిధి జీపీ రావ్ తెలిపిన వివరాల ప్రకారం ఎయిర్ ఇండియా 459 విమానం గంటన్నరపాటు ఆలస్యం అయింది. -
వినూత్న ఆఫర్ : జీరోకే విమాన టిక్కెట్
ఉచితంగా విమాన ప్రయాణం చేయాలనుకుంటున్నారా. అయితే స్పైస్‌జెట్ విమానం ఎక్కేయండి. వివిధ రకాల ఆఫర్లతో ఊరిస్తున్న విమాన సంస్థలకు బిన్నంగా స్పైస్‌జెట్ జీరోకే విమాన టిక్కెట్లను ఆఫర్ చేస్తోంది. విమాన ప్రయాణానికి చెల్లించిన మొత్తాన్ని తిరిగి వోచర్ రూపంలో చెల్లిస్తోంది. ఈ కొత్త డీల్ కింద ఎయిర్ఫేర్కు చెల్లించిన మొత్తం నగదును రిడీమ్ చేసుకునే ఆప్షన్‌ను తీసుకొచ్చింది. డిసెంబర్ 1 నుంచి ఈ ఆఫర్‌ను ప్రారంభించిందని, ఈ నెలంతా అంటే 2017 డిసెంబర్ 31 వరకు ఇది అందుబాటులో ఉంటుందని స్పైస్‌జెట్ తెలిపింది. 2017 డిసెంబర్ 1 నుంచి 2018 మార్చి 31 మధ్య ప్రయాణానికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఆఫర్ పొందడం ఎలా..? కంపెనీ సొంత వెబ్సైట్ www.spicejet.comలో మీరు విమాన టిక్కెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని ఛార్జీలతో కలిపి టికెట్ మొత్తాన్ని ఆ పోర్టల్ ద్వారా చెల్లించాలి. ఒక్కసారి ఆ లావాదేవీ పూర్తయిన తర్వాత స్పైస్జెట్కే చెందిన www.spicestyle.com వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. అక్కడ మీరు చెల్లించిన మొత్తాన్ని రిడీమ్ చేసుకోవడానికి, అన్ని వివరాలను నమోదుచేయాల్సి ఉంటుంది. తర్వాత స్టైల్ క్యాష్లోని మై అకౌంట్ సెక్షన్లోకి వెళ్లి, ఎస్సెమ్మెస్ ద్వారా వచ్చిన కోడ్‌ను ఎంటర్ చేయడం ద్వారా టికెట్‌కు చెల్లించిన మొత్తం స్టైల్క్యాష్లో జమ అవుతుంది. స్టైల్ క్యాష్ SpiceStyle.comకు చెందిన ఈ-వాలెట్. స్టైల్క్యాష్లో జమ అయిన ఈ మొత్తాన్ని www.spicestyle.com వెబ్సైట్లో కొనుగోళ్లకు ఉపయోగించుకోవచ్చు. ఒక్కో లావాదేవీకి గరిష్ఠంగా 30 శాతం మొత్తాన్ని వినియోగించుకోవచ్చు. స్టైల్క్యాష్ మొత్తాన్ని 2018 మార్చి 31లోపు వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఒక పీఎన్ఆర్ నంబర్‌కు ఒక వోచర్‌ను మాత్రమే ఇస్తారని స్పైస్‌జెట్ తన వెబ్సైట్లో పేర్కొంది. మరే ఇతర స్పెషల్ ఆఫర్ లేదా ప్రమోషన్లకు దీన్ని వాడుకోవడానికి లేదని స్పైస్‌జెట్ తెలిపింది. ఎయిర్ఏసియా, ఇండిగో కూడా న్యూఇయర్ సందర్భంగా విమాన టిక్కెట్లపై పలు డిస్కౌంట్ ఆఫర్లను తీసుకొచ్చాయి. ఎయిర్ఏసియా రూ.999కే టిక్కెట్‌ను విక్రయిస్తుండగా... ఇండిగో రూ.1005కు విమాన టిక్కెట్‌ను అందిస్తోంది. -
ప్రయాణికులకు ఇండిగో ఆఫర్
తీవ్రమైన పోటీ వాతావరణం, అంతకంతకు పెరుగుతున్న ప్రయాణికుల వృద్ధితో విమానయాన సంస్థలు టిక్కెట్ ధరలపై ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా ఇండిగో ఎంపికచేసిన మార్గాలకు రూ.1,112కే టిక్కెట్‌ను విక్రయించనున్నట్టు పేర్కొంది. జమ్ము నుంచి శ్రీనగర్‌కు వచ్చే నెల నుంచి వెళ్లే ఎంపికచేసిన విమానాలను రూ.1,112కే బుక్ చేసుకోవచ్చని ఈ విమానయాన సంస్థ తన వెబ్సైట్ 'గోఇండిగో.ఇన్' లో తెలిపింది. కోయంబత్తూర్ నుంచి చెన్నైకు రూ.1,195కు, విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు రూ.1259కు, పట్నా నుంచి కోల్‌కత్తాకు రూ.1,264కు, బెంగళూరు నుంచి చెన్నైకు రూ.1,285కు టిక్కెట్లను ఇండిగో అందిస్తోంది. టిక్కెట్ ధరల తగ్గింపుపై కస్టమర్లు ఇండిగో బుకింగ్స్ పోర్టల్‌లో సెర్చ్ చేస్తే, జనవరి మధ్యలో నుంచి జమ్ము నుంచి శ్రీనగర్‌కు టిక్కెట్ ధర రూ.1,112కు అందుబాటులో ఉన్నట్టు చూపిస్తోంది. దీనిలోనే రూ.825 రెగ్యులర్ ఫేర్, ఫ్యూయల్ ఛార్జీ, రూ. 42 జీఎస్టీ కూడా ఉన్నాయి. న్యూఇయర్, హాలిడే సీజన్ కానుకగా విమానయాన సంస్థలు ఈ డిస్కౌంట్ ఆఫర్లకు తెరతీస్తాయి. మరో ఎయిర్‌లైన్ ఎయిర్ ఏసియా కూడా లిమిటెడ్ పిరియడ్ ప్రమోషనల్ స్కీమ్ కింద ఎంపికచేసిన విమానాలపై 40 శాతం వరకు తగ్గింపును ఆఫర్ చేస్తోంది. ఈ తగ్గింపు 2018 జనవరి 15 నుంచి 2018 ఏప్రిల్ 25 వరకు చేసే ప్రయాణాలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 2017 డిసెంబర్ 3 నుంచి ఈ టిక్కెట్ల బుకింగ్స్ ప్రారంభమవుతాయి. -
మంత్రిపై ఫైర్.. అయినా స్పందన లేదు
పట్న : కేంద్ర మంత్రి కేజే ఆల్ఫోన్స్ పై తీవ్ర స్థాయిలో ఓ మహిళ మండిపడిన వీడియో మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. వీవీఐపీ కల్చర్‌కు వ్యతిరేకంగా మంత్రిపై వేలెత్తి చూపిన ఆమె తెగువను పలువురు అభినందించారు కూడా. దీనిపై సదరు వీడియోలో ఉన్న మహిళ.. బిహార్‌కు చెందిన డాక్టర్ నిరాల సిన్హా మీడియా ముందుకు వచ్చి స్పందించారు. ‘‘వీవీఐపీ కల్చర్ మూలంగా దేశంలో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. వాళ్లే కాదు.. ప్రతీ పౌరుడూ దేశానికి అవసరమే. సెలబ్రిటీలు, నేతలు అన్న తేడా లేకుండా సేవలు అందరికీ అందాల్సిన అవసరం ఉంది’’ అని నిరాల ఓ ఛానెల్‌తో అభిప్రాయపడ్డారు. తన కుటుంబంలోని ఓ వ్యక్తి చనిపోతే అంత్యక్రియల కోసం తాను బయలుదేరానని.. కానీ, మంత్రి మూలంగానే ఆ కార్యక్రమానికి తాను హాజరుకాలేకపోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఇంఫాల్‌లో వైద్యురాలిగా పని చేస్తున్న నిరాల నవంబర్ 21న పట్నకు ఇండిగో విమానంలో ప్రయాణానికి సిద్ధమయ్యారు. అదే సమయంలో మంత్రి ఆల్ఫోన్స్ రాక సందర్భంగా ఎయిర్‌లైన్స్ వాళ్లు ఆమె ప్రయాణించాల్సిన విమానాన్ని ఆలస్యం నడిపారు. దీంతో ఆమె మీడియా ముందే మంత్రిపై ధ్వజమెత్తారు. అయితే అంత జరిగినా మంత్రి తనకు సాయం చేయకపోగా.. ఏం పట్టనట్లు అక్కడి నుంచి వెళ్లిపోవటంతో నిరాల అసంతృప్తి వ్యక్తం చేశారు కూడా. మంత్రి వివరణ... రాష్ట్రపతి, ప్రధాని విషయంలో ఖచ్ఛితంగా ప్రోటోకాల్ పాటించాల్సి ఉంటుంది. మంత్రులు, మిగతా నేతల విషయంలో అలాంటి నిబంధనలు ఏం ఉండవు. ఆ సమయంలో రాష్ట్రపతి కోవింద్ అక్కడ రావటంతో విమానాలు ఆలస్యం అయ్యాయి. అంతే తప్ప ఆ మహిళ వాదిస్తున్న దాంట్లో వాస్తవం లేదు అని ఆల్ఫోన్స్ వివరణ ఇచ్చుకున్నారు. -
కేంద్రమంత్రికి మహిళా డాక్టర్ చీవాట్లు
-
కేంద్రమంత్రికి మహిళా డాక్టర్ చీవాట్లు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రమాదకర పరిస్థితిలో ఉన్న రోగికి చికిత్స అందించేందుకు వెళుతుండగా విమానం ఆలస్యం కావడంతో కేంద్ర ఎలక్ట్రానిక్, సమాచార, సాంస్కృతిక, పర్యాటక శాఖ సహాయమంత్రి అల్ఫోన్స్ కన్నాథనమ్పై ఓ మహిళా డాక్టర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్ర మంత్రి కారణంగా విమానం జాప్యం కావడంతో మహిళా వైద్యురాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఐపీ కల్చర్‌ను తీవ్రంగా తప్పుపడుతూ విమర్శలు గుప్పించారు. విమానం మరింత ఆలస్యం కాదని స్పష్టం చేస్తూ తనకు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని మంత్రిని పట్టుబట్టారు. ఇంఫాల్ ఎయిర్‌పోర్ట్‌లో వీవీఐపీల కారణంగా విమానాలు ఆలస్యమవుతున్నాయంటూ మహిళా డాక్టర్ మంత్రితో తీవ్ర వాగ్వాదానికి దిగారు. -
అక్కడకు విమానాలు నడపలేం
న్యూఢిల్లీ : ఢిల్లీ ఆవరించిన పొగమంచు, వాతావరణ కాలుష్యం విమాన సేవలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఢిల్లీలో వాతావరణ కాలుష్యం అధికంగా ఉండడంతో పాటు, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూపుతున్న ప్రమాదకర గణాంకాలతో యునెటైడ్ ఎయిర్‌లైన్స్ సంస్థ న్యూయార్క్- ఢిల్లీ విమానసేవలను తాత్కాలికంగా నిలిపేసింది. మరో వారం రోజుల పాటు ఢిల్లీలో ఇటువంటి పరిస్థితులు ఉంటాయన్న వాతావరణ శాఖ అంచనాలతో యెనైటెడ్ ఎయిర్‌లైన్స్ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. పలు క్లిష్టపరిస్థితుల్లోనపూ విమాన సేవలు అందిస్తున్న పలు సంస్థలు.. విమాన సర్వీసులును రీ షెడ్యూల్ చేయడం. ఆలస్యంగా నడడం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ తీసుకున్న నిర్ణయం మిగిలిన విమాన సంస్థలపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయోనని పౌర విమానయాన శాఖ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. -
ఢిల్లీకి విమానాలు రద్దు
సాక్షి, న్యూఢ్లిలీ : దేశ రాజధానిలో కాలుష్య స్థాయిలు, పొగమంచు విపరీతంగా పెరుగడంతో గాలి నాణ్యతలో ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లే విమానాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు యునిటెడ్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. నవంబర్ 9కు తీసుకున్న టిక్కెట్లను నవంబర్ 13న రీ-బుక్ చేసుకోవాలని, ఎలాంటి అదనపు ఖర్చులు లేకుండా నవంబర్ 18కు ముందు తీసుకువెళ్లేలా చూస్తామని ఎయిర్‌లైన్స్ పేర్కొంది. పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ కింద ఈ ప్రాంతాన్ని ఎప్పడికప్పుడూ అడ్వయిజరీలతో పర్యవేక్షిస్తున్నామని, సంబంధిత ప్రభుత్వ ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రమాదకరమైన వాతావారణ పరిస్థితులు తమ కార్యకలాపాలపై ప్రభావం చూపుతున్నాయని, కొన్ని సార్లు ప్రయాణికులు ఎలాంటి అదనపు ఫీజులు చెల్లించాల్సినవసరం లేకుండానే ప్రత్యామ్నాయ విమానాలకు అనుమతి ఇచ్చేలా ప్రయాణ ఉపసంహరణలు ఆఫర్ చేస్తామని కంపెనీ తెలిపింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్, డెల్టా విమానాలు కూడా ఢిల్లీకి ప్రయాణించడం లేదు. ఇతర ప్రత్యర్థి విమానయాన సంస్థలు కేఎల్ఎం, వెర్జిన్ అట్లాంటిక్, ఇతిహాద్లు కూడా ప్రయాణ ఉపసంహరణలు ఆఫర్ చేయనున్నాయో లేదో తెలుపలేదు. -
మెరుపు వేగంతో అండమాన్‌కు..
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): మొన్నటి వరకూ అండమాన్ ఎవరైనా వెళ్తున్నారంటే అబ్బో... అండమానే...అని ఆశ్చర్యంగా ప్రశ్నించే పరిస్థితి. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. రెండుంపావు గంటల్లోనే అండమాన్ చేరుకోవచ్చు. విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎయిరిండియా రెండేళ్లుగా పోర్టుబ్లెయిర్(అండమాన్)కు విమాన సర్వీసులు వారానికి రెండు మార్లు అందిస్తోంది. రెండుంపావు గంటల్లో పోర్టుబ్లెయిర్ నుంచి విశాఖకు చేరుస్తోంది. ఈ సర్వీసులకు డిమాండ్ పెరగడంతో ఆ సంస్థ ఇంకో రెండు సర్వీసులు పెంచే నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ మీదుగా కనెక్టివిటీ పెంచింది. మొత్తం ఢిల్లీ ప్రయాణికులే నెలకు 30 వేల మంది వరకూ ఉన్నారు. ఢిల్లీ, పోర్టుబ్లెయిర్‌లకు విమాన సర్వీసులు పెంచుతూ చర్యలు చేపట్టడంపై ప్రయాణికులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఢిల్లీ–విశాఖ–పోర్టుబ్లెయిర్–ఢిల్లీకి ఇలా... ఢిల్లీ –విశాఖ–పోర్టుబ్లెయిర్ –ఢిల్లీకి సోమ, గురు, శనివారాల్లో సర్వీసులు అందించడానికి ప్రణాళిక చేసింది. ఆ రకంగా ఢిల్లీలో ఉదయం 5.30కి బయలుదేరి విశాఖకు 7.40కి చేరుతుంది. ఇక్కడి నుంచి ఉదయం 8.15కి బయలుదేరి 10.10కి పోర్టుబ్లెయిర్ చేరుతుంది. పోర్టుబ్లెయిర్‌లో 10.50కి బయలుదేరి ఢిల్లీకి మధ్యాహ్నం 2.35కి వెళ్తుంది. ఢిల్లీ–పోర్టుబ్లెయిర్–విశాఖ–ఢిల్లీకి... ఎయిరిండియా విమాన సంస్థ ఢిల్లీ–పోర్టుబ్లెయిర్–విశాఖ–ఢిల్లీకి మంగళ, బుధ, శుక్ర,ఆదివారాల్లో సర్వీసులు అందించనుంది. ఢిల్లీలో ఉదయం 5.30కి బయలుదేరి పోర్టుబ్లెయిర్‌కు 9.15కు చేరుతుంది. అక్కడి నుంచి 9.55కి బయలుదేరి విశాఖకు 11.55కి వస్తుంది. ఇక్కడి నుంచి మధ్యాహ్నం 12.30కి బయలుదేరి 2.35కి ఢిల్లీ చేరుతుంది. వెయిటింగ్ లిస్ట్ పెరిగిపోతోంది... అండమాన్‌కు కోస్తాంధ్ర జిల్లాలనుంచి ప్రయాణికులు, వ్యాపారులు, టూరిస్టులు విపరీతంగా పెరిగారు. శ్రీకా కుళం నుంచి అధికంగా ప్రయాణాలు జరుగుతున్నాయి. విశాఖ నుంచి నేవీ అధికారులు,ఉద్యోగులూ రక్షణ రంగ అవసరాల కోసం తరచూ వెళ్లొస్తున్నారు. ప్రయాణాలకు వెయిటింగ్ లిస్టు పెరిగిపోతోంది.దీంతో ఎయిరిండియా విమాన సంస్థ వారానికి నాలుగు సార్లు ఢిల్లీకి కనెక్టివిటీ సర్వీసులు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.ప్రతి రోజూ సర్వీసులు ఇచ్చే ప్రతిపాదన జరుగుతోంది. – డి.వరదారెడ్డి, భారత విమాన ప్రయాణికుల సంఘ అధ్యక్షుడు విమాన ప్రయాణం బాగుంది అండమాన్ నుంచి విమాన ప్రయాణం చాలా బాగుంది. రెండుంపావు గంటల్లో పోర్టుబ్లెయిర్ నుంచి విశాఖకు వస్తున్నాం. ఓడలో కంటే విమాన ప్రయాణం హాయిగా ఉంది. గతంలో వ్యయ ప్రయాశపడేవాళ్లం. సులభప్రయాణం అందుబాటులోకి రావడం సంతోషంగా ఉంది. – మాధవరావు, అండమాన్ ప్రయాణికుడు, శ్రీకాకుళం అవస్థలు తప్పాయి గతంలో షిప్‌పై అండమాన్ వెళ్లేవాళ్లం. ఇపుడు విమాన సదుపాయంతో అవస్థలు తొలగాయి. సులువుగా ప్రయాణిస్తున్నాం. తాజాగా కొత్త సర్వీసులు వస్తే మరింత సులభంగా ప్రయాణాలు సాగించవచ్చు. – సంగీత,అండమాన్ ప్రయాణికురాలు, కవిటి -
హిండన్ నుంచి ప్రాంతీయ విమానాలు
సాక్షి, న్యూఢిల్లీ: కొన్ని ప్రాంతీయ విమానాలను తాత్కాలిక ప్రాతిపదికపై ఘాజియాబాద్‌లోని హిండన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి నడిచేందుకు అనుమతించాలని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ.. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్(డయల్)కు విజ్ఞప్తి చేసింది. ఇందుకు ఢిల్లీ విమానాశ్రయం అంగీకరించింది. ఢిల్లీ విమానాశ్రయం, పౌరవిమానయాన మంత్రిత్వశాఖ త్వరలో మెమోరాండం ఆ‹ఫ్ అండర్స్టాండింగ్(ఎంవోయూ)పై సంతకం చేయనున్నాయి. ఢిల్లీ విమానాశ్రయంలో ప్రస్తుతం విస్తరణ పనులు జరుగుతున్నాయి. విమానాశ్రయం ఇరుకుగా మారినందువల్ల విస్తరణ పనులు పూర్తయ్యేంతవరకు కొన్ని ప్రాంతీయ విమానాలు హిండన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి నడిచేందుకు అనుమతించాలని విమానయానశాఖ డయల్‌ను కోరింది. ఢిల్లీ విమానాశ్రయం ప్రైవేటీకరణ సందర్భంగా కుదరిన ఒప్పందం ప్రకారం ఢిల్లీ విమానాశ్రమానికి 150 కిలో మీటర్ల పరిధిలో వాణిజ్య విమానాలను డయల్ అనుమతి లేకుండా నడుపరాదన్న నియమం దృష్ట్యా ప్రభుత్వం డయల్ అనుమతి కోరింది. స్థానిక అనుసంధాన పథకం కింద ప్రభుత్వం కొత్త రూట్లను వచ్చే నెలలో ప్రకటించనుంది. కొంతకాలం ఢిల్లీ నుంచి విమానాలను హిండన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి నడపవలíని ఉంటుందని ప్రభుత్వం ఈ రూట్ల కోసం బిడ్ వేయనున్నవారికి తెలిపింది. మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్పై సంతకాలు జరిగిన తరువాత ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హిండన్ స్టేషన్లో ప్రయాణీకుల సదుపాయాలను అభివద్ధి చేస్తుంది. ఢిల్లీ విమానాశ్రయాలలో విస్తరణ పనుల కింద కొత్త టెర్మినల్, కొత్త రన్‌వే, ఎలివేటెడ్ టాక్సీవే, అంతర్గత రైలు వ్యవస్థను అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుతం టెర్మినల్–1 సామర్థ్యానికి మించి పనిచేస్తున్నందువల్ల అక్కడి నుంచి విస్తరణ పనులు మొదలుపెడ్తారు. మాస్టర్‌ప్లాన్‌ను మూడు మాడ్యులర్ దశలలో అమలుచేస్తారు. నిష్క్రమణ టెర్మినల్–డి, ఆగమన టెర్మినల్ డి–1సిని కలిపి సాలుకు 4 కోట్ల మంది ప్రాయాణీకుల సామర్థ్యాన్ని తట్టుకునేలా టెర్మినల్–టి1ను అభివృద్ధి చేస్తారు. టెర్మినల్–1 ప్రస్తుతం రెండు కోట్ల ప్రయాణీకుల సామర్థ్యంతో íపనిచేస్తోంది. ఇందులో 22 ఏరోబ్రిడ్జిలు నిర్మిస్తారు. టి3 సామర్థ్యాన్ని కూడా 3.4 కోట్ల ప్రయాణీకుల నుంచి 4 కోట్ల ప్రయాణీకులకు పెంచుతారు. -
సంక్షోభంలో అతిపెద్ద ఎయిర్‌లైన్స్, విమానాలన్నీ రద్దు
లండన్ : యూకేలో అతిపెద్ద ఎయిర్‌లైన్ సంస్థ మోనార్క్ సంక్షోభంలో కూరుకుపోయింది. సోమవారం నుంచి మోనార్క్ ఎయిర్‌లైన్స్ తన సేవలను నిలిపివేసింది. 3 లక్షల బుకింగ్స్‌ను కూడా ఈ ఎయిర్‌లైన్స్ రద్దు చేసింది. దీంతో విదేశాల్లో ఉన్న మోనార్క్ విమాన ప్రయాణికులు ఇరకాటంలో పడిపోయారు. విదేశాల్లో చిక్కుకుపోయిన లక్షకు పైగా మోనార్క్ ప్రయాణికులను జాగ్రత్తగా తిరిగి స్వదేశానికి తీసుకురావాలని సివిల్ ఏవియేషన్ అథారిటీ(సీఏఏ)ని బ్రిటీష్ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు వారిని వెనక్కి తీసుకురావడానికి సీఏఏ 30కి పైగా ఎయిర్‌క్రాఫ్ట్‌లను సిద్ధం చేసింది. మోనార్క్ విమానాలను, హాలిడేస్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించడం విచారకరమంటూ మోనార్క్ ట్విట్టర్ తన ద్వారా తన సేవల నిలిపివేతను ప్రకటించింది. మోనార్క్ ప్రయాణికులు విమానశ్రయాలకు వెళ్లాల్సినవసరం లేదని, అక్కడ విమానాలు లేవంటూ పేర్కొంది. మోనార్క్ తీసుకున్న ఈ నిర్ణయం తన కస్టమర్లపై, ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపుతుందని సీఏఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆండ్రూ హైన్స్ చెప్పారు. యూరోపియన్ ఎయిర్‌లైన్స్‌తో తీవ్రకరమైన పోటీ, డ్రైవింగ్ కన్సాలిడేషన్ వంటి పలు కారణాలచే మోనార్క్ సేవలు స్తంభించిపోయాయి. మోనార్క్ తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియా యూజర్లు సైతం విరుచుకు పడుతున్నారు. మోనార్క్‌కు ఆర్థికపరమైన సమస్యలు విపరీతంగా పెరిగిపోయాయని మోనార్క్ దివాలాపై నియమింపబడ్డ అకౌంటింగ్ సంస్థ కేపీఎంజీ చెప్పింది. -
ముంబైలో కుండపోత
-
ముంబైలో కుండపోత
183 విమానాలు రద్దు, 51 విమానాల దారి మళ్లింపు ముంబై/హైదరాబాద్: దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలకు దక్షిణ ముంబై, బోరివలీ, కాందివలీ, అంధేరీ, భందూప్ తదితర ప్రాంతాలు నీటమునిగాయి. భారీవర్షాల ప్రభావంతో దాదాపు 183 విమానాలు రద్దు కాగా, 51 విమానాలను దారి మళ్లించినట్లు ముంబై అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు తెలిపారు. బుధవారం సాయంత్రం 6 గంటల వరకు విమానాశ్రయంలో విమానాల రాకపోకలపై నిషేధం విధించామన్నారు. వారణాసి నుంచి 183 మంది ప్రయాణికులతో బయలుదేరిన స్పైస్‌జెట్ విమానం ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవుతున్న సమయంలో రన్‌వే నుంచి పక్కకు జారిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. భారీగా వరదనీరు నిలిచిపోవడంతో ముంబైతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని బృహన్ ముంబై కార్పొరేషన్ ఆదేశించింది. మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి బుధవారం తెల్లవారుజామున 5.30 గంటల వరకు 303.7 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు శాంతాక్రుజ్‌లోని భారత వాతావరణ విభాగానికి చెందిన అబ్జర్వేటరీ తెలిపింది. బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. కాగా పాల్ఘర్ జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ఐదుగురు దుర్మరణం చెందినట్లు వెల్లడించారు. భారీ వర్షాలు, వరదల ప్రభావంతో మన్మాడ్–ముంబై ఎక్స్‌ప్రెస్, గుజరాత్ ఎక్స్‌ప్రెస్, సౌరాష్ట్ర ఎక్స్‌ప్రెస్, బాంద్రా టెర్మినస్ సూరత్ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్, ముంబై సెంట్రల్–అహ్మదాబాద్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ సర్వీసులను రద్దు చేసినట్లు రైల్వేశాఖ తెలిపింది. మరోవైపు వరద ప్రభావంతో చాలా సబర్బన్ రైళ్లు రద్దు కావడంతో తమ సేవల్ని నిలిపివేస్తున్నట్లు డబ్బావాలాలు ప్రకటించారు. శంషాబాద్ విమానాశ్రయంలో... భారీ వర్షాలతో ముంబై ఎయిర్పోర్ట్ రన్‌వేను మూసివేయడంతో అధికారులు 16 దేశీయ, అంతర్జాతీయ విమానాలను శంషాబాద్ విమానాశ్రయానికి మళ్లించారు. పదహారు విమానాల్లో వచ్చిన దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులకు శంషాబాద్ విమానాశ్రయంలో, నోవాటెల్, తదితర హోటళ్లలో బస ఏర్పాటు చేశారు. నిలిచిపోయిన విమానాలు: జూరిచ్–ముంబై (ఎల్ఎక్స్ 154, కౌలాలంపూర్–ముంబై (ఎంహెచ్ 194), లండన్–ముంబై (9డబ్ల్యూ 119), ఆమ్స్టర్డ్యామ్–ముంబై (9 డబ్ల్యూ 231), బెంగళూరు–ముంబై (ఏఐ610), కొచ్చి–ముంబై (9 డబ్ల్యూ 404), ఢిల్లీ–ముంబై (9డబ్ల్యూ 376), బెంగళూరు –ముంబై (9డబ్ల్యూ442), రాజ్‌కోట్–ముంబై (ఏఐ 656), ఢిల్లీ–ముంబై (ఏఐ 191), టొరంటో–ముంబై (ఏసీ 046), ఢిల్లీ–ముంబై (9డబ్ల్యూ 354), జైపూర్–ముంబై (9డబ్ల్యూ 2054), హైదరాబాద్–పుణే–ముంబై (9 డబ్ల్యూ 2574), కోల్‌కతా–ముంబై (9డబ్ల్యూ 628), కోల్‌కతా–ముంబై (9డబ్ల్యూ 616). -
చిత్తూరు టీడీపీ మూడు ముక్కలు
-
రూ. 999కే విమానయానం
ఎయిర్ఏషియా ఆఫర్ న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ఎయిర్ఏషియా ఇండియా తాజాగా రూ. 999కే విమాన ప్రయాణ టికెట్ల ఆఫర్‌ను ప్రకటించింది. ఈ నెల 27 దాకా ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈలోగా టికెట్లు బుక్ చేసుకున్న వారు వచ్చే ఏడాది ఫిబ్రవరి 26 నుంచి ఆగస్టు 28 మధ్య కాలంలో ప్రయాణించవచ్చు. వెబ్సైట్, ఎయిర్ఏషియా మొబైల్ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. అయితే ఈ ఆఫర్ కింద ఎన్ని సీట్లు అందుబాటులో ఉంటాయన్నది ఎయిర్ఏషియా ఇండియా వెల్లడించలేదు. సీట్లు పరిమితంగానే ఉంటాయని, అన్ని ఫ్లయిట్స్‌లో అందుబాటులో ఉండకపోవచ్చని పేర్కొంది. కంపెనీ వెబ్సైట్ ప్రకారం కోల్‌కతా, బాగ్డోగ్రా మధ్య విమాన ప్రయాణ చార్జీలు రూ. 999 నుంచి ఉన్నాయి. -
84 విమానాలు రద్దు చేసిన ఇండిగో
ముంబై : బడ్జెట్ క్యారియర్ ఇండిగో 84 విమానాలను శుక్రవారం రద్దు చేసింది. అంతేకాక 13 విమానాలను ఎక్కడికక్కడ నిలిపివేసింది. ఎయిర్‌బస్ ఏ320 నియో విమానాల్లో కొత్త ఇంజిన్‌లో తలెత్తిన సమస్యతో ఈ విమానయాన సంస్థ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. తమ నిర్ణయానికి ప్రభావితమయ్యే ప్రయాణికులకు తగిన ప్రదేశాల్లో వసతి కల్పించామని లేదా వారిని వేరే మార్గాలకు బదలాయించినట్టు ఇండిగో ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాది జూన్ 21 నుంచి జూలై 3 మధ్య కాలంలో కూడా మొత్తం 667 విమానాలను ఇండిగో రద్దు చేసింది. జూన్ 27 ఒక్కరోజే 61 విమానాలను రద్దుచేసింది. యునెటెడ్ టెక్నాలజీస్‌కు చెందిన ప్రాట్, విట్నీలు అభివృద్ధి చేసిన ఇంజిన్లలో తరుచు సమస్యలు తలెత్తుతున్నాయని ఇండిగో తెలిపింది. ఈ సమస్యలతో ఎయిర్‌బస్ నుంచి ఇండిగో, దాని ప్రత్యర్థి గోఎయిర్‌లు నడిపే విమానాల రాక ఆలస్యమవుతోంది. ఈ నెల మొదట్లో కూడా ఇంజిన్‌లో తలెత్తిన సమస్యతో ప్రాట్ అండ్ విట్నీ ఈ విమానయాన సంస్థలకు నష్టపరిహారం చెల్లించింది. అయితే ఎంత మొత్తంలో నష్టపరిహారాలు అందుకున్నాయో మాత్రం ఇండిగో, గోఎయిర్ ప్రకటించలేదు. గత ఏడాదిగా తలెత్తుతున్న ఈ సమస్యలపై విచారణ వ్యక్తంచేసిన ఎయిర్‌లైన్స్ అధికారులు, త్వరలోనే వీటిని పరిష్కరిస్తామని చెప్పారు. ఇప్పటికే సమస్య ఉన్న ఇంజిన్లను పెద్ద మొత్తంలో తొలగించామని, కానీ తమ వద్ద తగినంత స్పేర్ ఇంజిన్లు అందుబాటులో లేవని ఇండిగో ప్రెసిడెంట్ ఆదిత్య గోష్ చెప్పారు. తమ కార్యచరణలో లోపాలు సవాళ్లుగా నిలుస్తున్నాయని, ప్రస్తుత పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పేర్కొన్నారు. బిలీనియర్ రాహుల్ భాటియా, రాకేష్ గంగ్వాల్ ఆధీనంలో ఇండిగో నడుస్తోంది. 430 ఏ320 నియో జెట్స్‌కు ఆర్డర్ ఇస్తే, 22 మాత్రమే ఇప్పటికే పొందినట్టు బ్లూమ్‌బర్గ్ రిపోర్టు చేసింది. -
డల్లాస్, డెట్రాయిట్కు సర్వీసులు నడపండి
టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సాక్షి, హైదరాబాద్: అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని డెట్రాయిట్, డల్లాస్‌లలో నివసిస్తు న్న తెలుగు ప్రజల సౌకర్యం కోసం హైదరాబాద్ నుంచి నేరుగా విమాన సర్వీసులను నడపాలని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజుకు ఆయన ఒక లేఖ రాశారు. ఇటీవల నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఆధ్వర్యంలో నిర్వహించిన అమెరికా తెలుగు సంబరాల కార్యక్రమాల్లో తాను పాల్గొన్న సందర్భంలో అక్కడ నివసిస్తున్న వేలాది తెలుగు కుటుంబాలు ఈ విషయాన్ని తన దృష్టికి తెచ్చారని తెలిపారు. -
విమానం మిస్సయిన మీరాకుమార్
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం నుంచి భువనేశ్వర్ వెళ్లాల్సిన విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి మీరా కుమార్ ఫ్లైట్ మిస్సయ్యారు. సాయంత్రం 5.15 గంటలకు ఆమె విమానం ఎక్కాల్సి ఉంది. అయితే, వీఐపీ లాంజ్‌లో కాంగ్రెస్ నేతలతో మాట్లాడుకుంటూ ఉండిపోయిన ఆమె సమయానికి లోపలికి వెళ్లలేకపోయారు. దీంతో విమానం వెళ్లిపోయింది. దీంతో రాత్రి 8 గంటలకు భువనేశ్వర్ వెళ్లే విమానం కోసం అక్కడే ఎదురుచూస్తున్నారు. కాగా, రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని కోరేందుకు ఆమె హైదరాబాద్ వచ్చారు. అంతకుముందు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. తర్వాత నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ హాల్లో వామపక్ష నాయకులతో సమావేశమయ్యారు. తనకు మద్దతు ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. -
ఆఫర్లు..అబద్ధాల రెక్కలు
భారీ తగ్గింపు అంటూ తరచూ విమాన సంస్థల ఆఫర్లు - రూ.11 కే, రూ.12 కే టికెట్ అని ఊదరగొడుతూ ప్రచారం - వాస్తవంగా ధర తగ్గించేది బేస్ చార్జీలపైనే - పన్నులు, ఫీజులు, సెస్సులు, ఇతర చార్జీలు మామూలే - ఆ కాస్త తగ్గింపు కోసమూ సవాలక్ష షరతులు - ‘యాడ్– ఆన్’సేవల పేరిట భారీగా వడ్డింపులు - ఇంటర్నెట్ చార్జీలంటూ మరో దోపిడీ - ఆఫ్ సీజన్లో.. అదీ నెల ముందే బుక్ చేసుకోవాలి - ఇలా బుక్ చేసుకుంటే ఎప్పుడైనా తక్కువ ధరే విమాన టికెట్ ధర 11 రూపాయలే.. ఇది ఓ సంస్థ ఆఫర్. మా దగ్గర టికెట్ కొంటే 12 రూపాయలు మాత్రమే. ఇది మరో ఎయిర్ లైన్స్ ప్రకటన. ఇలాంటి ఆఫర్లకు విస్తృత ప్రచారం కల్పిస్తూ.. విమాన టికెట్లు ఉచితంగా ఇచ్చేస్తున్నారన్న స్థాయిలో పలు మీడియా సంస్థలు ఊదరగొట్టేశాయి కూడా. మరి ఈ ఆఫర్లతో ప్రయాణికులకు ఒరిగిందేమిటి? నిజంగానే 11 రూపాయలకో, 12 రూపాయలకో టికెట్లు దొరికాయా? కావాల్సిన రూట్లలో నిజంగానే చౌక టికెట్లున్నాయా? ఒకవైపు ప్రయాణం సరే! మరి రెండోవైపు సంగతేమిటి? అసలు మామూలు సమయాల్లోకన్నా ఎంత చౌకగా టికెట్లు దొరికాయి? ఇవన్నీ పరిశీలిస్తే ఇలాంటి ఆఫర్లన్నీ ఉత్తవేనని స్పష్టమవుతోంది. మరి ఇలాంటి ఆఫర్ల గుట్టు విప్పడంతోపాటు అసలు విమాన టికెట్లు చౌకగా పొందాలంటే ఏం చేయాలనే అంశంపై ఈ వారం ఫోకస్.. – సాక్షి, బిజినెస్ ప్రత్యేక ప్రతినిధి హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి టికెట్ ధర ఎంత? ఎవరూ కచ్చితంగా చెప్పలేరు. టికెట్ ధర ప్రధానంగా మనం తీసుకునే సమయంపై ఆధారపడి ఉంటుంది. వారం రోజుల ముందు బుక్ చేస్తే.. అన్నీ (టికెట్ ధర, పన్నులు, ఇతరత్రా) కలిపి టికెట్ ధర రూ.2,500–3,000 మధ్య ఉండొచ్చు. అదే ఓ నెల తరవాత ప్రయాణిద్దామని ముందే బుక్ చేసుకుంటే రూ.1,500– 2,000 మధ్య ధరకే టికెట్ లభించొచ్చు. అదే రేపే ప్రయాణించాల్సి వచ్చి ఇవ్వాళ టికెట్ బుక్ చేసుకుంటే.. రూ.4,000 నుంచి రూ.9,000 వరకు ఎంతైనా చెల్లించాల్సి రావొచ్చు. ఇదీ విమాన టికెట్ల ధర తీరు. మరి ఆఫర్ల సమయంలోనూ దాదాపు ఇవే ధరలు వర్తిస్తాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇతర చార్జీలు, పన్నులే అధికం.. ఏ విమానయాన సంస్థ ఎంత ఆఫరు ప్రకటించినా.. అది వర్తించేది కేవలం బేస్చార్జీలకే. నిజానికి విమాన టికెట్ల ధరలో ఇతర చార్జీలు, పన్నుల శాతమే ఎక్కువ. ఉదాహరణకు రూ.2,500 టికెట్లో బేస్చార్జీ కేవలం రూ.1,000 వరకే ఉంటుంది. అదే రూ.1,200 టికెట్లో అయితే ఈ బేస్చార్జీ కేవలం రూ.300గానే ఉంటుంది. మిగిలినవన్నీ పన్నులు, సెస్సులు, విమానాశ్రయాలు వసూలు చేసే యూజర్ డెవలప్మెంట్ చార్జీలు, క్యూట్ ఫీజు వంటివే. ఇవి ఏ ఆఫర్ సమయంలోనైనా తప్పనిసరిగా ఉంటాయి. ఇక బేస్చార్జీని తగ్గించే విమానయాన సంస్థలు.. ఒక్కోసారి ఆ తగ్గించిన మొత్తాన్ని ఎయిర్‌లైన్స్ ఫీజు పేరిట వసూలు చేస్తుండటం గమనార్హం. ‘యాడ్–ఆన్’ఎప్పుడూ మోతే! చౌక విమానయాన సంçస్థలన్నీ ఈ మధ్య టికెట్లపై అదనంగా వసూలు చేయడంలో కొత్త మార్గాలు అవలంబిస్తున్నాయి. టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే రకరకాల సేవలను చూపిస్తూ.. అవి కావాలనుకుంటే అదనపు చార్జీలు వసూలు చేస్తున్నాయి. ► ఆహార పానీయాలు నేరుగా విమానంలో కొనుక్కుంటే ధర ఎక్కువే. అదే ముందే బుక్ చేసుకుంటే కాస్త తక్కువ. ఈ తక్కువ కూడా విమానంలోని చార్జీలతో పోలిస్తే మాత్రమే! ► టికెట్ తీసుకున్నాక ఎలాగూ ఓ సీటిస్తారు. కానీ మంచి సీటు కావాలంటే ముందే అదనపు మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఎమర్జెన్సీ విండో దగ్గర, మొదటి రెండు వరసల్లో కాళ్లు చాపుకోవటానికి కాస్త ఎక్కువ స్థలమున్న చోట్లు.. ఇలాంటి వాటికి రూ.300–600 మధ్య అదనంగా వసూలు చేస్తున్నాయి. ► తీసుకున్న టికెట్ తేదీని మార్చుకోవాలన్నా, రద్దు చేసుకుంటే కాస్త ఎక్కువ డబ్బులు రిఫండ్ రావాలన్నా.. అందుకోసం ముందే అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ► బ్యాగేజీకు కూడా చార్జీలు అదనమే. తీసుకెళ్లే లగేజీ బరువును బట్టి రూ.500–1,500 మధ్య వసూలు చేస్తున్నాయి. ► మరీ చిత్రమైన సేవ కూడా ఒకటి ఉంది. విమానాశ్రయంలో టికెట్ కోసం లైన్లో నిల్చోకుండా నేరుగా వెళ్లిపోవాలనుకుంటే.. ‘ఫాస్ట్ ఫార్వర్డ్’సేవలు ఉంటాయి. దీనికి రూ.400 వరకూ చెల్లించాల్సి ఉంటుంది. కాకపోతే ఈ ‘ఫాస్ట్ ఫార్వర్డ్’ను ఎంచుకున్న కొద్దిమంది కూడా అక్కడ లైన్లో ఉంటారు సుమా!! ► ఒకవేళ విమానం ఆలస్యం కావటమో, మీరు కాస్త ముందుగా విమానాశ్రయానికి చేరుకోవటమో జరిగితే.. అక్కడ కాస్త విశ్రాంతిగా లాంజ్‌లో కూర్చోవటానికి రూ.600 వరకూ ముందే చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఆ సేవల్ని ఉపయోగించుకున్నా, ఉపయోగించుకోకున్నా ఒకసారి చెల్లిస్తే అంతే. ► ఇక విమానం ఆలస్యమైనా, రద్దయినా, బ్యాగేజీ పోయినా, ఇతరత్రా ప్రమాదాలేవైనా జరిగినా ఆదుకోవటానికంటూ ట్రావెల్ బీమా ఉంటుంది. దానికీ అదనపు చార్జీలు చెల్లించాల్సిందే. ఇదీ విమానయాన సంస్థల ఆఫర్ల కథ. ఇన్ని కూడికలు, తీసివేతలు చేశాక నిజంగా ఆఫర్లో మిగిలేదెంత? మామూలు సమయాలకన్నా ఈ సమయంలోనే బుక్ చేస్తే లాభమెంత? పరిశీలిస్తే వాస్తవమేమిటో తెలిసిపోతుంది. గంటలోపు ప్రయాణానికి రూ.2,500 ధర మించకూడదని చెప్పే రెగ్యులేటర్లు ఇలాంటివి ఎందుకు చూడటం లేదన్న సందేహమూ రాకమానదు. బాబోయ్ కన్వీనియెన్స్ చార్జీలు కన్వీనియెన్స్ చార్జీలు, ఇంటర్నెట్ చార్జీలు... ఇలా ఏ పేరుతో పిలిచినా టికెట్ల బుకింగ్ సమయంలో చివరన ఈ చార్జీల మోత తప్పదు. నిజానికి ఇప్పుడు విమాన టికెట్లను బుక్ చేయాలంటే ఎవరైనా ఇంటర్నెట్ను ఆశ్రయించాల్సిందే. ట్రావెల్ ఏజెంట్ల దగ్గరకు వెళితే వారు చేసేది కూడా అదే. ఎక్కడో ఉన్న విమానయాన సంస్థల కౌంటర్లకు వెళ్లి టికెట్లు బుక్ చేసుకోవాలని ఎవరూ చూడటం లేదు కూడా. కానీ ఇంటర్నెట్ ద్వారా బుక్ చేసేటపుడు విమానయాన సంస్థల చార్జీలు, పన్నులు ఒక ఎత్తయితే... చివరగా జతయ్యే ఇంటర్నెట్ చార్జీలు మరో ఎత్తు. నేరుగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ నుంచో, వాలెట్ నుంచో, డెబిట్‌కార్డు నుంచో చెల్లిస్తే ప్రతి ప్రయాణికుడికి రూ.150 చొప్పున వడ్డిస్తున్నారు. అదే క్రెడిట్ కార్డు అయితే మరో రూ.25 అదనంగా వసూలు చేస్తున్నారు. నిజానికి ఇంటర్నెట్ చార్జీలనేవి ఒక టికెట్‌కు ఇంత చొప్పున వసూలు చేస్తే బాగానే ఉంటుందనుకోవచ్చు. కానీ ఒకేసారి ఆరుగురికి టికెట్ బుక్ చేస్తే.. ప్రతి ప్రయాణికుడికి రూ.150 చొప్పున రూ.900 బాదేయటం దారుణమని చెప్పవచ్చు. ఒకవైపు డిజిటల్ చెల్లింపుల్ని ప్రోత్సహిస్తున్నామని ప్రభుత్వం మొత్తుకుంటుంటే... మరోవైపు డిజిటల్ చెల్లింపులకు ఈ స్థాయిలో వసూళ్లు చేయటం విమానయాన సంస్థలకే చెల్లింది. చౌక టికెట్లు దొరికేదెలా? ఆఫర్ ఉన్నా లేకున్నా విమాన టికెట్లు కాస్త చౌకగా పొందాలంటే కొన్ని మార్గాలున్నాయి. ఆఫీసుల తరఫున కాకుండా వ్యక్తిగతంగా తరచూ ప్రయాణాలు చేసేవారు చాలామంది వాటిని పాటిస్తుంటారు. అవేంటో ఒకసారి చూద్దాం.. ముందే బుక్ చేసుకోవాలి టికెట్లు ఎంత ముందుగా బుక్ చేసుకుంటే అంత మంచిది. కనీసం 30 రోజుల నుంచి 90 రోజుల ముందుగా బుక్ చేసుకుంటే తక్కువ ధరకు టికెట్లు పొందొచ్చు. పండుగలు, ప్రత్యేక రోజుల్లో డిమాండ్ ఎక్కువ గనుక ఆ రోజుల్లో ధరల తగ్గింపులకు అవకాశాలు తక్కువ. వ్యాలెట్ ద్వారా చెల్లిస్తే డిస్కౌంట్! గో–ఐబిబో, యాత్రా, మేక్ మై ట్రిప్, క్లియర్ ట్రిప్ వంటి ట్రావెల్ సంస్థలన్నీ ఇపుడు వర్చువల్ వ్యాలెట్లను నిర్వహిస్తున్నాయి. వీటి లో నగదును లోడ్ చేసుకుని.. వాటి ద్వారా విమాన టికెట్లు బుక్ చేసుకుంటే కొంత క్యాష్‌బ్యాక్ ఇస్తున్నాయి. అలా ఆయా వ్యాలెట్ల లోకి వచ్చిన క్యాష్‌బ్యాక్‌ను మరో టికెట్ బుకింగ్ కోసం ఉపయోగించుకోవచ్చు. ఇక్సిగో అయితే యాప్ ద్వారా విమాన టికెట్లు బుక్ చేసుకుంటే క్యాష్‌బ్యాక్ ప్రయోజనాన్ని సిట్రస్ వ్యాలెట్‌కు బదిలీ చేస్తోంది. పేటీఎం, మొబిక్విక్ వంటివి తమ వ్యాలెట్ల ద్వారా చెల్లింపులు చేస్తే అదనంగా క్యాష్‌బ్యాక్ ఇస్తున్నాయి. సమయాన్ని బట్టి చార్జీలు! అర్ధరాత్రి దాటాకో, లేకపోతే తెల్లవారు జామునో ప్రయాణించటానికి ఇబ్బంది లేకపోతే తక్కువ ధరకు విమాన టికెట్లను పొందే అవకాశాలుంటాయి. అత్యవసరంగా ఫలానా సమయానికి చేరుకోవాలని అనుకునేవారికి ఇది కుదరకపోవచ్చు. మిగతా వారికి ధర తగ్గించుకునే అవకాశం ఉంటుంది. బ్యాంకు కార్డులూ డిస్కౌంట్ ఇస్తాయి పలు బ్యాంకులు క్రెడిట్ కార్డులపై తరచూ ఆఫర్లు ఇస్తుంటాయి. మీ దగ్గరున్న కార్డుపై వచ్చే ఆఫర్ల గురించి కాస్త గూగుల్‌లో సెర్చ్ చేస్తే వివరాలు తెలుసుకోవచ్చు. మేక్ మై ట్రిప్, యాత్రా డాట్‌కామ్ వంటి పోర్టళ్లలోనూ ఆఫర్ల వివరాలు తెలుసుకోవచ్చు. వాటికి మీరు అర్హులైతే సదరు డిస్కౌంట్ కోడ్‌ను టికెట్ బుక్ చేసే సమయంలో వినియోగించుకోవాలి. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ అయితే జెట్ ఎయిర్‌వేస్‌తో కలసి విమానయాన ప్రయాణికులకు ప్రత్యేక క్రెడిట్ కార్డును ఆఫర్ చేస్తోంది. తరచూ ప్రయాణించేవారు.. విమానయాన సంస్థలతో కలసి బ్యాంకులు అందించే ప్రత్యేక క్రెడిట్ కార్డులు తీసుకుంటే లాభమన్నది నిపుణుల మాట. మొబైల్ యాప్‌లూ ఉన్నాయి వెబ్సైట్ల నుంచి కాకుండా ఎక్కువ సంస్థలు యాప్స్ ద్వారా చేసే బుకింగ్‌లపై తరచు ఆఫర్లు ఇస్తున్నాయి. కనీసం 5 నుంచి 10 శాతం తగ్గింపు అయినా పొందడానికి వీలుంటుంది. ఇంకా రివార్డు పాయింట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, ప్రత్యేకమైన డిస్కౌంట్లు, ఆహార పదార్థాలపై తగ్గింపులకు అవకాశం ఉంటుంది. నేరుగా ఎయిర్‌లైన్ సైట్ల నుంచి.. టికెట్ల బుకింగ్‌కు మధ్యవర్తులుగా ఉన్న పేటీఎం, మేక్‌మై ట్రిప్, ఇక్సిగో, ఎక్స్పీడియా, గోఐబిబో, యాత్రా వంటి సంస్థల నుంచి ఆఫర్లు లేవనుకుంటే ఎయిర్‌లైన్ సంస్థల వెబ్సైట్లు పరిశీలించాలి. మధ్యవర్తిత్వ సేవలందించే సంస్థలకు టికెట్ల బుకింగ్‌పై విమానయాన సంస్థలు కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. నేరుగా వాటి సైట్ల నుంచి బుక్ చేసుకుంటున్నందున కొంత తగ్గింపు లభించే అవకాశం ఉంటుంది. డైనమిక్ ప్రైసింగ్... జాగ్రత్త! డిమాండ్‌కు అనుగుణంగా టికెట్ల ధరలను పెంచే విధానాన్ని ఎయిర్‌లైన్స్ అనుసరిస్తున్నాయి. ఓ వ్యక్తి ఫలానా తేదీ, ఫలానా సమయానికి టికెట్ల బుకింగ్ కోసం నాలుగైదు వెబ్సైట్లలో సెర్చ్ చేశారనుకోండి. ఆ వివరాలు కుకీల ద్వారా ఆయా సంస్థలకు తెలిసిపోతాయి. దీంతో బుకింగ్‌కు వచ్చే సరికి ధర పెరిగిపో తుంది. అందుకే వీలయితే వెబ్సైట్ ద్వారా సెర్చ్ చేసేటపుడు ఇన్‌కాగ్నిటో (రహస్య) మోడ్‌లో ఉండి సెర్చ్ చేయండి. టికెట్లన్నీ ఒకే సంస్థ ద్వారా కాకుండా.. ప్రయాణం, తిరుగు ప్రయాణం టికెట్లను ఒకే సంస్థ ద్వారా బుక్ చేసుకుంటే చాలా సందర్భాల్లో తగ్గింపు ప్రయోజనాలుండవు. పైగా రెండు వైపులా టికెట్లను ఒకే లావాదేవీగా బుక్ చేసుకుంటే తగ్గింపు పరిమితి కూడా ఉంటుంది. అందువల్ల ఆఫర్లున్న రెండు సంస్థలను ఎంచుకుని చెరోవైపు చొప్పున బుక్ చేసుకుంటే లాభం. ► పలు సంస్థలు విద్యార్థులు, సీనియర్ సిటిజన్లకు టికెట్లపై 8–10 శాతం తగ్గింపు ఇస్తున్నాయి. స్పైస్‌జెట్ విద్యార్థులకు బేస్ ధరపై 8 శాతం తగ్గింపు ఇస్తోంది. ఇలాంటివి కొన్ని రూట్లలో, కొన్ని తేదీల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ► మీరు కావాలనుకున్న విమాన టికెట్ రేటు బాగా ఎక్కువగా ఉందనుకోండి. ఆ ధరలు తగ్గినప్పుడు మిమ్మల్ని అప్రమత్తం చేయడానికి గూగుల్ అలర్ట్స్ ఉపయోగపడుతుంది. ధర మారినప్పుడల్లా ఆ వివరాలు ఈమెయిల్‌కు వచ్చేస్తాయి. ► ఆఫర్ల వివరాలు తెలుసుకోవాలంటే ఎయిర్‌ఫేర్ న్యూస్‌లెటర్‌కు సబ్స్క్రయిబ్ చేయాలి. దానివల్ల ఎప్పటికప్పుడు ఆఫర్ల వివరాలు మీకు తెలుస్తుంటాయి. ► గోఐబిబో, యాత్రా వంటి సంస్థలు ఎలాంటి నగదు చెల్లించకుండా టికెట్లను ముందుగా బుక్ చేసుకునే అవకాశాన్నిస్తున్నాయి. ముందు సీట్‌ను బ్లాక్ చేసుకుని తర్వాత చెల్లించే సదుపాయం ఉంది. ఎంపిక చేసిన రూట్లే ఎందుకు? విమానయాన సంస్థలు ఏ ఆఫర్ ఇచ్చినా అన్ని మార్గాలకూ ఇవ్వవు. పెద్దగా రద్దీ, డిమాండ్ లేని కొన్ని ఎంపిక చేసిన రూట్లకు మాత్రమే వర్తింపజేస్తాయి. అంటే మనకు కావాల్సిన రూట్లలో ఈ ఆఫర్ టికెట్లు దొరికే అవకాశం తక్కువ. అయితే మనకు కావాల్సిన రూట్లలో దొరికితే టికెట్ తీసుకుని వెళ్లొచ్చు. కానీ కొన్ని సంస్థలు ఒకవైపు ప్రయాణానికే టికెట్ ఆఫర్‌ను వర్తింపజేస్తున్నాయి. అంటే వెళ్లినవారు ఎలాగూ తిరిగి రావాలి గనక... రెండోవైపు టికెట్‌కు ఫుల్ పైసా వసూల్ అన్నమాట. ఎంపిక చేసిన తేదీల్లోనే.. సహజంగా విమాన సంస్థలు రద్దీ లేని సమయాల్లోనే ఆఫర్లు ఇస్తుంటాయి. ఉదాహరణకు 10 రోజుల కింద స్పైస్‌జెట్, ఇండిగో, జెట్ ఎయిర్వేస్ సంస్థలు ఆఫర్లు ప్రకటించినా.. ఆ ఆఫర్ వర్తించేది మాత్రం జూన్ 26 తరవాతేనని పేర్కొన్నాయి. కానీ టికెట్ల బుకింగ్ మాత్రం మే నెలాఖరులోగానే చేసుకోవాలి. అంటే ప్రయాణ సమయానికి వేసవి సెలవులన్నీ అయిపోతాయి. అప్పుడు ప్రయాణాలు తక్కువగా ఉంటాయి కాబట్టి... అన్ సీజన్లో తమ విమానాలు నిండుగా ఉండటానికి విమానయాన సంస్థలు ఆఫర్లు ప్రకటిస్తాయి. అంతేగాకుండా ఈ ఆఫర్ల కింద బుక్ చేసుకునే సమయానికి, ప్రయాణించే సమయానికి మధ్య దాదాపు నెల రోజుల సమయం ఉంది. ఈ లెక్కన మామూలు సమయాల్లోనూ మనం నెల రోజుల ముందు టికెట్ బుక్ చేసుకుంటే.. రెండు మూడు వందల తేడాతో దాదాపు ఇదే ధరకు టికెట్లు దొరుకుతాయన్నది వాస్తవం. అలాచేస్తే టికెట్ దొరికిందని ప్రయాణం పెట్టుకోకుండా.. మనకు కావాల్సినపుడు ప్రయాణం చేసినట్లవుతుంది. షరతులు... షరా మామూలే! ఆఫర్ల సమయంలో తీసుకునే టికెట్లపై కొన్ని షరతులు తప్పనిసరి. వాటిలో కొన్నింటిని పరిశీలిస్తే.. ► ఈ టికెట్లను రద్దు చేసుకోవడంగానీ, తేదీ మార్చుకోవటం కానీ చేయలేం. ఆ సమయంలో మనకు వేరే ఏదైనా అత్యవసరమైన పని ఉండి ప్రయాణాన్ని రద్దు చేసుకుంటే.. మొత్తం టికెట్ డబ్బులకు నీళ్లొదులుకోవాల్సిందే. అయితే ఆఫర్ల సమయంలోనే కాదు. మామూలు సమయాల్లో కూడా కాస్త తక్కువ ధరకు లభించే టికెట్లన్నీ ఈ షరతుకు లోబడే ఉంటాయి. అయితే టికెట్ రద్దు చేసుకుంటే.. ప్రయాణ తేదీలోగా ఒకవేళ ఆ టికెట్ భర్తీ కాకపోతే విమానయాన సంస్థలు చార్జీలను మాత్రమే నష్టపోతాయి. కానీ పన్నులు, యూడీఎఫ్, సెస్సులు వంటి వాటిని కూడా రిఫండ్ చేయరు. ఇదొక రకమైన దోపిడీయే. ► ఈ ఆఫర్లలో లగేజీ/బ్యాగేజీలకు కూడా పరిమితులుంటాయి. చాలా ఆఫర్లు హ్యాండ్ బ్యాగేజ్కు మాత్రమే వర్తిస్తున్నాయి. కాస్త లగేజీ పట్టుకెళ్లినా.. దానికి అదనపు డబ్బులు చెల్లించాల్సిందే. -
మయన్మార్‌లో విమానం గల్లంతు
సముద్రంలో శకలాలు గుర్తించినట్లు ప్రకటించిన సైన్యం యాంగాన్: సుమారు 100 మందికి పైగా ప్రయాణిస్తున్న మయన్మార్ సైన్యానికి చెందిన ఓ విమానం బుధవారం గల్లంతైంది. ఆ తరువాత అండమాన్ సముద్రంలో దాని శకలాలను గుర్తించినట్లు ఎయిర్స్‌ఫోర్స్ అధికారులు వెల్లడించారు. చైనాలో తయారైన వై–8ఎఫ్–200 అనే సరకు రవాణా విమానం ఈ ప్రమాదానికి గురైంది. మైయెక్ పట్టణం నుంచి యాంగాన్ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌తో విమానానికి సంబంధాలు తెగిపోయినప్పటి నుంచి నేవీ ఓడలు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు గాలింపు ప్రారంభించాయి. ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణిస్తున్న వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నట్లు తెలిసింది. వారిలో కొందరు వైద్య పరీక్షలకు, మరికొందరు పాఠశాలలకు బయల్దేరినట్లు భావిస్తున్నారు. దావేయ్ పట్టణానికి 218 కి.మీ దూరంలో విమాన శకలాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో మిలిటరీ అన్వేషణ కొనసాగిస్తోందని చెప్పారు. మధ్యాహ్నం 1.35 గంటలకు విమానం మయన్మార్ దక్షిణ తీరంలో ఉండగా సంబంధాలు తెగిపోయాయని కమాండర్ ఇన్ చీఫ్ కార్యాలయం వెల్లడించింది. విమానంలో ప్రయాణిస్తున్న వారి సంఖ్యపై స్పష్టత రాలేదు. సైనికులు, వారి కుటుంబీకులు, సిబ్బంది మొత్తం కలిసి 120 దాకా ఉంటారని కమాండర్ ఇన్ చీఫ్ కార్యాలయం తెలిపింది. మయన్మార్‌లో ప్రస్తుతం వర్షాకాలం. అయితే విమానం గల్లంతైనపుడు వాతావరణం బాగానే ఉంది. -
గగనతలంలో విమానం అదృశ్యం
నెపైడా: 116 మందితో వెళుతున్న మయన్మార్ సైనిక విమానం గగనతలంలో అదృశ్యమైంది. దక్షిణాది నగరం మైయిక్, యాంగాన్ మధ్య బుధవారం కనిపించకుండాపోయిందని ఆర్మీ చీఫ్ కార్యాలయం వెల్లడించింది. మధ్యాహ్నం 1.35 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా విమానంతో సంబంధాలు తెగిపోయాయని తెలిపింది. విమానం ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నట్టు పేర్కొంది. విమానంలో 105 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బంది ఉన్నట్టు సమాచారం. విమానంలో ఉన్నవారందరూ సైనికుల కుటుంబ సభ్యులని తెలుస్తోంది. సాంకేతిక లోపమే విమానం అదృశ్యానికి కారణమని, వాతావరణం బాగానే ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. విమానం అదృశ్యమైనప్పుడు అండమాన్ సముద్రంపై ప్రయాణించింది. దీంతో అండమాన్ సముద్రంలో గాలింపు చేపట్టారు. ఓడలు, విమానాలను రంగంలోకి దింపారు. -
బెజవాడ– వైజాగ్ రూ. 19,332..
రూ.4 వేల విమాన టిక్కెట్ ధర భారీగా పెంపు.. ఒకే ఒక్క సర్వీసు కారణంగా రద్దీ సాక్షి, అమరావతి: విజయవాడ– విశాఖపట్నం మధ్య విమానం టిక్కెట్ ధర శుక్రవారం అమాంతంగా ఆకాశానికి ఎగబాకింది. సాధారణ రోజుల్లో నాలుగు.. నాలుగున్నర వేలకు లోపే ఉండే టిక్కెట్ ధరను ఏకంగా రూ.19,332కు పెంచేశారు. రెండు నగరాల మధ్య ఒకే ఒక విమాన సర్వీసు నడుస్తుండడంతో పాటు శనివారం నుంచి విశాఖపట్నంలో మహానాడు కార్యక్రమం మొదలవుతున్నందున శనివారం మధ్యాహ్నం వెళ్లే విమానానికి రద్దీ పెరిగిందని తెలుస్తోంది. శుక్రవారం వరకు విజయవాడలో కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు మహానాడుకు హాజరయ్యేందుకు గాను విమాన ప్రయాణానికి మొగ్గుచూపడంతో డిమాండ్ పెరిగిందని చెబుతున్నారు. ఇలావుండగా విశాఖ విమానం టిక్కెట్ ధరను ఐదు రెట్లు దాకా పెంచడాన్ని నిరసిస్తూ శనివారం తన ప్రయాణాన్ని రద్దు చేసుకుంటున్నట్లు బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు ప్రకటించారు. ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా రద్దీ పేరుతో ధర ఇలా పెంచడం ఏ మాత్రం సమంజసం కాదని ఆయన ‘సాక్షి’వద్ద వ్యాఖ్యానించారు. -
అమెరికా విమానంలో అనుకోని అతిథి!
అమెరికాలోని హ్యూస్టన్ నగరం నుంచి ఈక్వెడార్‌లోని క్విటో నగరానికి వెళ్లాల్సిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం మూడు గంటలు ఆలస్యంగా బయల్దేరింది. విమానంలోకి ఒక అనుకోని అతిథి దూరడమే అందుకు కారణమని విమానయాన సంస్థ వర్గాలు తెలిపాయి. విషయం ఏమిటంటే.. విమానంలో కూర్చున్న ఒక ప్రయాణికుడి దుస్తుల మీదుగా ఓ తేలు పాక్కుంటూ వెళ్లింది. విమానంలో తేలు కనిపించడంతో ఒక్కసారిగా ప్రయాణికులంతా గగ్గోలు పెట్టారు. అదృష్టవశాత్తు అది విమానంలో ఉన్న ఎవరినీ కుట్టలేదు కాబట్టి సరిపోయింది. ఆ తేలు ఎక్కడుందో గుర్తించి, దాన్ని విమానం నుంచి కిందకు దించి మళ్లీ బయల్దేరడానికి మాత్రం మూడు గంటల సమయం పట్టింది. నిజానికి ఈ ఘటన జరిగే సమయానికి విమానం గేటు నుంచి కొద్ది దూరం వెళ్లింది. కానీ, తేలు విషయం తెలియగానే మళ్లీ దాన్ని వెనక్కి తీసుకొచ్చారు. ముందు జాగ్రత్త చర్యగా ప్రయాణికులందరినీ కిందకు దించేసి వాళ్లను వేరే విమానంలోకి ఎక్కించారు. ఇటీవలి కాలంలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సంస్థ తరచు వార్తల్లో నిలుస్తోంది. తమ కుందేలు చనిపోవడానికి ఈ సంస్థే కారణమంటూ దాని యజమానులు కేసు పెడతామని కూడా ఇటీవల హెచ్చరించారు. అంతకుముందు ఓ ప్రయాణికుడిని విమానంలోంచి లాక్కుంటూ తీసుకెళ్లిన వీడియో బయటకు వచ్చింది. ఏప్రిల్ 14న అయితే ఇదే విమానయాన సంస్థకు చెందిన ఓ విమానంలో హ్యూస్టన్లోనే ఓ ప్రయాణికుడిని తేలు కుట్టింది. -
ప్రతి మూడు నెలలకి టిక్కెట్ ధరలు ఛేంజ్
విమాన టిక్కెట్లు ధరలు ఇక ప్రతి మూడు నెలలకోసారి మారనున్నాయి. విమాన ఛార్జీలను, విమానసంస్థలకు ఇచ్చే ప్రభుత్వ సబ్సిడీలను రీజనల్ ఎయిర్ కనెక్టివిటీ స్కీమ్ ఉడాన్ కింద ప్రతి మూడు నెలలకోసారి మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ద్రవ్యోల్బణ పరిస్థితులకు అనుగుణంగా ఈ ధరల్లో మార్పు రానుంది. ఉడాన్ స్కీమ్ కింద వైబిలిటీ గ్యాఫ్ ఫండింగ్(వైజీఎఫ్), విమాన టిక్కెట్లను క్వార్టర్లీ బేసిస్ లో మార్చనున్నామని సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ తెలిపింది. విమాన ఛార్జీలను ద్రవ్యోల్బణంతో లింక్ చేస్తామని, వీజీఎఫ్ నిర్ణయించడంలో కూడా ద్రవ్యోల్బణం, ఏవియేషన్ టర్బైన్ ప్యూయల్, రూపీ, డాలర్ ఎక్స్చేంజ్ రేటును పరిగణలోకి నిర్ణయిస్తుంటామని పేర్కొంది. సామాన్యుడికి కూడా విమాన ప్రయాణం అందుబాటులో ఉండేలా ఉడాన్ స్కీమ్ ను ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఉడాన్ తొలి విమానం గత నెల సిమ్లాలో ఆకాశంలోకి ఎగిరింది. ఉడాన్ కింద విమాన టిక్కెట్ ధర గంటకు రూ.2500. ఈ స్కీమ్ కింద ఎంపికచేసిన సీట్లను తక్కువ ధరలకు అందుబాటులో ఉంచుతున్నారు. ఉడాన్ స్కీమ్ కింద మార్గాలు గ్రాంట్ అయ్యే విమాన సంస్థ ఆపరేటర్లు, ఎయిర్ క్రాఫ్ట్ సామర్థ్యంలో 50 శాతం డిస్కౌంట్ ధరలకు పక్కన ఉంచాలని ప్రభుత్వం తెలిపింది. -
రన్ వేపై విమానాలు ఢీ
రన్ వేపైకి వెళ్తున్న ఓ విమానం.. పక్కనే ఉన్న మరో విమాన రెక్కకు తగిలింది. ఈ ఘటన ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ప్రమాదంలో ప్రయాణీకులకు ఎలాంటి అపాయం జరగలేదు. జెట్ ఎయిర్వేస్కు చెందిన 9డబ్ల్యూ603 విమానం ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు వెళ్లాల్సివుంది. దీంతో విమానాన్ని మరల్చేందుకు పైలట్ ప్రయత్నించాడు. ఈ సందర్భంగా పక్కనే ఉన్న మరో విమానం రెక్కకు జెట్ ఎయిర్వేస్ విమానం వెనుక భాగం తాకింది. ఘటనకు సంబంధించిన మరింత సమాచారం ఇంకా తెలియాల్సివుంది. -
హైజాక్ అంటూ ప్రధానికే ట్వీట్
జైపూర్: విమానం హైజాక్ అంటూ నేరుగా ప్రధాని మోదీకే ట్వీటర్ మెసేజ్ పంపించాడో ప్రబుద్ధుడు. దీంతో అధికారులు అరెస్టు చేసి కటకటాల వెనక్కు పంపించారు. శుక్రవారం ఉదయం ముంబై నుంచి ఢిల్లీ బయలుదేరిన జెట్ ఎయిర్వేస్ విమానాన్ని వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో జైపూర్‌లో ల్యాండ్ చేశారు. దీంతో నితిన్ వర్మ అనే ప్రయాణికుడు.. ‘‘మోదీ సర్.. మూడు గంటల క్రితం విమానం ఎక్కాను. పరిస్థితులను చూస్తుంటే విమానం హైజాక్ అయినట్లుగా ఉంది. వెంటనే సాయం చేయగలరు’ అని ప్రధానికి ట్వీట్ చేశాడు. అప్రమత్తమైన భద్రతా దళాలు 176 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ప్రయాణిస్తున్న విమానాన్ని తనిఖీ చేసి హైజాక్ నిజంకాదని తేల్చారు. విమాన ల్యాండింగ్ గురించి ప్రకటన చేసినా.. హైజాక్ అంటూ హడావుడి చేసినందుకు వర్మను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ప్రతికూల వాతావరణం వల్ల ఢిల్లీలో ల్యాండ్ కావాల్సిన ఐదు ఆరు విమానాలను జైపూర్ ఎయిర్‌పోర్టులో దింపినట్లు అధికారులు తెలిపారు. -
మీవల్ల ఆలస్యమైతే.. 15 లక్షల ఫైన్!
ఎయిరిండియా విమానాల్లో ప్రయాణం చేసేటపుడు ఇకమీదట జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం గొడవలు పడినా ఇక మీదట క్రిమినల్ చర్యలను ఎదుర్కోవడంతో పాటు భారీ జరిమానాలు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఎవరైనా ప్రయాణికుల ప్రవర్తన కారణంగా విమానం గంట ఆలస్యమైతే రూ. 5 లక్షలు, రెండు గంటలలోపు అయితే రూ. 10 లక్షలు, రెండు గంటలు దాటి ఆలస్యమైతే రూ. 15 లక్షల జరిమానా విధించాలని ఎయిరిండియా భావిస్తోంది. ఇటీవలి కాలంలో ప్రయాణికుల అనుచిత ప్రవర్తన, ఎయిరిండియా ఉద్యోగుల మీద దాడులు చేయడం (వీవీఐపీలు గానీ, మామూలు ప్రయాణికులు గానీ) లాంటి ఘటనల వల్ల ఉద్యోగుల నైతిక స్థైర్యం బాగా దెబ్బతిందని, చివరకు హోటళ్లలో కూడా ఎవరు రావాలి, ఎవరు రాకూడదన్న నిబంధనలు విధించే అవకాశం ఉన్నప్పుడు ఎయిరిండియాకు కూడా ఇలాంటి అనుచిత ప్రవర్తన కలిగి ఉండే ప్రయాణికుల విషయంలో తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉండాలని ఓ అధికారి చెప్పారు. ఇటీవలి కాలంలో పలువురు నాయకులు తమ ఆధిపత్యాన్ని చూపించడం కోసం ఎయిరిండియా, ఇతర విమానయాన సంస్థల సిబ్బందితో గొడవ పడటం, వాళ్లపై శారీరకంగా దాడి చేయడం లాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి. శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ అయితే ఏకంగా 60 ఏళ్ల ఉద్యోగి ఒకరిని పాతికసార్లు చెప్పుతో కొట్టారు. అలాగే తన తల్లి ప్రయాణం విషయంలో కేబిన్ సిబ్బందితో గొడవ పడిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ విమానాన్ని బాగా ఆలస్యం చేశారు. ఈ వీవీఐపీ సంస్కృతి విమాన సిబ్బందికి చుక్కలు చూపిస్తోంది. అంత చేసినా చివరకు వాళ్లు ఏమీ లేకుండానే బయటపడిపోతున్నారు. అందుకే ఇప్పుడు భారీ జరిమానాలతో కూడిన శిక్షలు పడేలా చూడాలని ఎయిరిండియా భావిస్తోంది. జరిమానా విధించే అధికారం ఎయిరిండియా చేతుల్లోనే ఉంటుంది గానీ, క్రిమినల్ చర్యల కోసం మళ్లీ పోలీసులను ఆశ్రయించాల్సి ఉంటంఉది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగుల ప్రయోజనాలకు పెద్దపీట వేయాలని యాజమాన్యం భావిస్తోంది. -
సమ్మర్ స్పెషల్: 999కే విమాన టిక్కెట్
తక్కువ ధరలు కలిగిన విమానసంస్థగా పేరొందిన ఇండిగో ఇటీవలే 900 విమానాలను ఒకే రోజు ఆపరేట్ చేసి దేశీయ విమానయాన రంగంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇదే ఊపుతో ఉన్న ఇండిగో ప్రయాణికుల కోసం స్పెషల్ ఆఫర్లను ప్రకటించింది. అన్ని ధరలను కలుపుకుని విమాన టిక్కెట్ ను కేవలం 999 రూపాయలకే అందించనున్నట్టు పేర్కొంది. మూడు రోజుల ''సమ్మర్ వొకేషన్ ఆఫర్'' కింద అన్ని నెట్ వర్క్ పరిధిలో దీన్ని వర్తింపజేస్తోంది. 6ఈ నెట్ వర్క్-దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలకు తక్కువ ధరల్లో ఇండిగో టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని ఈ విమానయాన సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. 2017 ఏప్రిల్ 10 నుంచి 2017 ఏప్రిల్ 12 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ఎయిర్ లైన్ పేర్కొంది. 2017 మే 1 నుంచి జూన్ 30కి మధ్యలో ప్రయాణాలకు ఎంపికచేసిన ప్రాంతాలకు మాత్రమే ఇది వర్తిస్తుందట. ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ తో ఈ స్పెషల్ ఫేర్స్ అందుబాటులో ఉంటాయని, ఒక్కసారి టిక్కెట్ కు చెల్లించిన ఛార్జీలు మళ్లీ రీఫండ్ చేయమని పేర్కొంది. 44 ప్రాంతాలకు చక్కర్లు కొడుతున్న ఈ సంస్థ మొత్తం 907 డైలీ ఫ్లైట్స్ ను కలిగి ఉంది. -
ఇక్కడ పెయిన్ కిల్లర్స్ అక్కడ డ్రగ్స్
-
త్రుటిలో తప్పిన ప్రమాదం
ఢిల్లీ విమానాశ్రయంలో ఢీకొనబోయిన ఎయిరిండియా, ఇండిగో విమానాలు న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం రెండు విమానాలకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి గోవా వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం (ఏఐ156), రాంచీ నుంచి ఢిల్లీ వచ్చిన ఇండిగో (6ఈ389) విమానాలు దాదాపు ఢీకొనబోయాయి. ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) సిబ్బంది అప్రమత్తంగా ఉండటంతోపాటు పైలట్లు నైపుణ్యాన్ని ప్రదర్శించి భారీ ప్రమాదాన్ని నివారించగలిగారు. ఢిల్లీ విమానాశ్రయంలోని రన్ –27, రన్ వే–28లు ఒక చివరన కలిసిపోయి ఉంటాయి. రన్ వే–27పై ఇండిగో విమానం దిగాల్సి ఉండగా, రన్ వే–28 నుంచి ఎయిరిండియా విమానం టేకాఫ్ తీసుకోవా ల్సి ఉంది. ప్రణాళిక ప్రకారం ఎయిరిండియా విమానం రన్ వే 28 నుంచి మొదలై, రెండు రన్ వేలు కలిసేచోట టేకాఫ్ తీసుకోవాలి. అలాగే ఇండిగో విమానం రన్ వే–27పై దిగాలి. కానీ ఇండిగో రన్ వే పైకి వచ్చాక ల్యాండిగ్‌కు పరిస్థితులు అనుకూలించకపోవడంతో మళ్లీ టేకాఫ్‌కు వెళ్లింది. అప్పటికే ఎయిరిండియా విమానం కూడా గంటకు 185 కి.మీ వేగంతో టేకాఫ్ తీసుకోడానికి వెళ్తోంది. రెండు రన్ వేలు అవతలి చివరన కలిసి ఉన్నందున, రెండు విమానాలు టేకాఫ్ తీసుకొని ఉంటే గాలిలోనే ఢీకొనేవి. అయితే అప్రమత్తమైన ఏటీసీ సిబ్బంది, ఎయిరిండియా విమానాన్ని నిలిచిపోవాల్సిందిగా ఆదేశించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. ఇండిగో విమానం ఎందుకు ల్యాండ్ కాకుండా మళ్లీ టేకాఫ్ తీసుకోవాల్సి వచ్చిందో విచారణలో తేలుతుందని అధికారులు పేర్కొన్నారు. వేగంలోనూ విమానాన్ని సురక్షితంగా నిలిపి వేసిన పైలట్ మళ్లీ వెనక్కు తీసుకొచ్చారు. -
ట్రూజెట్ ‘ఉడాన్’..!
⇒ కొత్తగా 16 చిన్న పట్టణాలకు విమాన సర్వీసులు... ⇒ టర్బో మేఘా ఎయిర్వేస్కు గ్రీన్‌సిగ్నల్ ⇒ కంపెనీ ఎండీ వంకాయలపాటి ఉమేష్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో ట్రూజెట్ పేరుతో ప్రాంతీయ విమాన సర్వీసులు అందిస్తున్న టర్బో మేఘా ఎయిర్వేస్ చిన్న పట్టణాల్లో అడుగుపెడుతోంది. ఇప్పటి వరకు 10 నగరాలకు సేవలు అందిస్తున్న ఈ సంస్థ ఉడాన్ ప్రాజెక్టులో పాలు పంచుకుంటోంది. ఇందులో భాగంగా 16 చిన్న పట్టణాలకు సర్వీసులు అందించేందుకు రెడీ అయింది. కొన్ని రూట్లకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ అందుకుంది. కొత్త కేంద్రాలకు సేవలు ఎప్పటి నుంచి ప్రారంభించేది మార్చి 30న ఖరారు అవుతుందని టర్బో మేఘా ఎయిర్వేస్ ఎండీ వంకాయలపాటి ఉమేష్ సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. నిర్దేశించిన రూట్లలో ప్రతి రోజు కనీసం ఒక్క సర్వీసు అయినా ఉంటుందని పేర్కొన్నారు. చిన్న పట్టణాలకు విమాన సేవలు విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఉడే దేశ్కే ఆమ్ నాగరిక్ (ఉడాన్) ప్రాజెక్టు చేపట్టడం తెలిసిందే. ఇవీ ట్రూజెట్ కొత్త రూట్లు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రలో ట్రూజెట్ కొత్త రూట్లు రానున్నాయి. కడప–విజయవాడ, కడప–చెన్నై, కడప–హైదరాబాద్, హైదరాబాద్–నాందేడ్, నాందేడ్–ముంబై, హైదరాబాద్–బళ్లారి, బళ్లారి–బెంగళూరు, చెన్నై–కడప, చెన్నై–మైసూరు, చెన్నై–సేలం తదితర రూట్లు వీటిలో ఉన్నాయి. అలాగే బెంగళూరు–బీదర్, చెన్నై–హŸస్సూరు రూట్లకు కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి ట్రూజెట్‌కు అనుమతి రావాల్సి ఉంది. కంపెనీ వద్ద ప్రస్తుతం నాలుగు విమానాలు ఉన్నాయి. ఒక్కో ఫ్లయిట్ సామర్థ్యం 72 సీట్లు. ఏప్రిల్‌లో మరో విమానం జతకూడుతోంది. 2017 డిసెంబరు నాటికి మొత్తం 8 విమానాలు కంపెనీ వద్ద ఉంటాయని ఉమేష్ తెలిపారు. ఉడాన్‌తో జోష్.. రానున్న రోజుల్లో ప్రాంతీయ విమానయాన రంగంలో ఉడాన్ జోష్‌నిస్తుందని ఉమేష్ తెలిపారు. చిన్న నగరాలకు విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏ రూట్లో అయినా ఒక గంట ప్రయాణానికి ఒక్కో టికెట్ ధర రూ.2,500 మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే ట్రూజెట్ ద్వారా 2.5 లక్షల మందికిపైగా కస్టమర్లు పలు నగరాలకు ప్రయాణించారని వివరించారు. రెండేళ్లలో దేశవ్యాప్తంగా సేవలు అందించాలని భావిస్తున్నట్టు తెలిపారు. కంపెనీ వద్ద ప్రస్తుతం 450 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. మరో నాలుగు కంపెనీలు.. ఉడాన్ ప్రాజెక్టులో ట్రూజెట్తోపాటు డెక్కన్ చార్టర్, ఎయిర్ ఒడిషా, అలయన్స్ ఎయిర్, స్పైస్ జెట్ సైతం పాలుపంచుకుంటున్నాయి. ఈ అయిదు కంపెనీలకు 70 రూట్ల దాకా కేటాయించినట్టు తెలుస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణాల్లో ట్రూజెట్తోపాటు ఈ కంపెనీలు సర్వీసులు అందించనున్నాయి. దేశవ్యాప్తంగా 11 కంపెనీలు ప్రస్తుతం 43 విమానాశ్రయాల కోసం రూట్లను ప్రతిపాదించాయి. ఉడాన్ ప్రాజెక్టు అమలు బాధ్యతను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చేపట్టింది. 43 విమానాశ్రయాల్లో 31 కేంద్రాలకు అసలు విమానాలే నడవడం లేదు. మిగిలిన 12 విమానాశ్రయాలకు సర్వీసులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. -
అమెరికాను వణికిస్తున్న మంచుతుఫాను
⇒ పలు చోట్ల గాఢాంధకారం ⇒ ఇళ్ల నుంచి బయటికి రావొద్దని అధికారుల సూచన ⇒ విమానాల రద్దు, స్కూళ్లకు మూత వాషింగ్టన్: అమెరికా తూర్పు తీరం చిగురుటాకులా వణికిపోతున్నది. మంచు తుఫాన్ తీవ్రమవడంతో మూడు కోట్ల మంది అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పటికే 7,600 విమానాలు రద్దయ్యాయి. వేలాది స్కూళ్లు మూతపడ్డాయి. దీంతో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, వీక్షణస్థాయి సున్నా పడిపోనుండటంతో అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. అమెరికాలోని ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ మంచు తుఫాన్ కారణంగా ప్రభావితమవుతున్నట్లు సీఎన్ఎన్ చానెల్ వెల్లడించింది. న్యూయార్క్, బోస్టన్‌లాంటి ప్రధాన నగరాలను మంచు దుప్పటి కప్పేస్తుందని అంచనా వేస్తున్నారు. రెండు అడుగుల మేర భారీగా మంచు కురిసే అవకాశాలు ఉన్నట్లు మంగళవారం వాతావరణ నివేదికలు తెలిపాయి. ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు ఈ ప్రాంతంలోని అన్ని విమానాలను రద్దు చేశారు. న్యూయార్క్ నగరంలో 20 అంగుళాల మేర మంచు కురవనున్నట్లు అంచనా వేస్తున్నారు. న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ కూమో అత్యవసర చర్యలకు ఆదేశించారు. ఇప్పటికే భారీగా బలగాలను నగరంలో మోహరించారు. ఫిలడెల్ఫియాలో 10 అంగుళాలు, మసూచుసెట్స్‌లో 24 అంగుళాల మేర మంచు కురవనుంది. మంగళవారం ఉదయం నుంచి కనెక్టికట్ రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణాలపై నిషేధం విధించారు. అటు వర్జీనియాలో పోర్ట్ ఆఫ్ వర్జీనియాను కోస్ట్ గార్డ్ మూసివేసింది. తూర్పు తీరంలో ప్రజలంతా సురక్షితంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. ఇప్పటికే మంచు తుఫాన్ కారణంగా విస్కాన్సిన్లో ఇద్దరు చనిపోయారు. సేవా కార్యక్రమాలకు ట్రంప్ జీతం వివాదాలతో సహజీవనం చేసే అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మంచి నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ తన జీతం మొత్తాన్ని విరాళంగా ఇస్తారని వైట్‌హౌస్ అధికారి సీన్ స్పైసర్ వెల్లడించారు.ట్రంప్ తన వార్షిక జీతం నాలుగు లక్షల డాలర్లను సేవాసంస్థకు ఇస్తారని వెల్లడించారు. ఏడాది చివరన తన జీతాన్ని విరాళంగా ఇవ్వాలనేది ట్రంప్ ఉద్దేశమని స్పైసర్ మీడియాకు వివరించారు. అంతేగాక, ఈ విషయమై ట్రంప్ ఇప్పటికే అమెరికా ప్రజలకు వాగ్దానం చేశారని ఆయన గుర్తు చేశారు. మా జోలికొస్తే ఊరుకోం: అమెరికాకు ఉత్తర కొరియా హెచ్చరిక సియోల్: తమ దేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా ఏ చిన్న చర్య జరిగినా అమెరికా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఉత్తరకొరియా మంగళవారం హెచ్చరించింది. వాయు, జల, భూమార్గాల ద్వారా నిర్దాక్షిణ్యంగా దాడులు చేయడానికి ఉత్తర కొరియా సిద్ధంగా ఉందని వెల్లడించింది. దక్షిణ కొరియాతో కలిసి నిర్వహిస్తున్న డ్రిల్స్‌లో భాగంగా అమెరికా నేవీ ‘కార్ల్ విన్సన్’ అనే యుద్ధనౌకను మోహరిస్తున్న నేపథ్యంలో కొరియా ఈ హెచ్చరిక జారీ చేసింది. కార్ల్ విన్సన్‌ను మోహరించడం వెనుక తమ దేశంపై దాడి చేయాలనే కుట్ర దాగుందని ఆరోపించింది. ఈ నెల 11న సైతం శత్రువుల యుద్ధవిమానాలు తమ ప్రాదేశిక జలాల సమీపంలోకి వచ్చాయని ఉత్తరకొరియా ఆరోపించింది. ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా దక్షిణ కొరియాలో క్షిపణి విధ్వంసక వ్యవస్థను మోహరించడంపై చైనా అమెరికాను విమర్శించిన విషయం తెలిసిందే. -
అడ్డంగా దొరికేసిన ఇండిగో పైలట్
విమానాలు ఆలస్యం కావడం ఆరుదు. అలా లేటైనప్పుడు అందుకు కారణం ఏంటని ప్రయాణికులు గట్టిగానే నిలదీస్తారు. అలాగే ప్రయాణికులు నిలదీస్తుంటే.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అనుమతి ఇవ్వలేదని వంక చెప్పేందుకు ప్రయత్నించిన ఇండిగో విమాన పైలట్ అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన చెన్నై విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఏటీసీ తప్పు ఏమీ లేకపోయినా.. దానిమీదకు తోసేయడంపై ఇండిగో విమానయాన సంస్థను ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రశ్నించింది. అనవసరంగా తప్పుడు ఆరోపణలు చేయొద్దని స్పష్టం చేసింది. దాంతో ఇండిగో సంస్థ తన పైలట్లందరికీ ఓ ఈమెయిల్ పంపింది. ఇలాంటి పనులకు పాల్పడొద్దని అందులో గట్టిగానే చెప్పింది. చెన్నై నుంచి మదురై మార్గంలో వెళ్లాల్సిన 6ఇ-859 విమానం 11.45కి బయల్దేరాల్సి ఉండగా, దాన్ని 12.25కి రీషెడ్యూల్ చేశారు. ఆ విషయమై ప్రయాణికులకు ఎస్ఎంఎస్లు పంపారు. విమాన డిపార్చర్‌కు ఏటీసీ నుంచి అనుమతి రాలేదని పైలట్ తెలిపాడు. అయితే.. ప్రయాణికుల్లో ఒక ఏటీసీ అధికారి కూడా ఉన్న విషయం సదరు పైలట్‌కు తెలియదు. ఆయన వెంటనే చెన్నై ఏటీసీకి ఫోన్ చేసి విషయం ఏంటని అడిగారు. కానీ, వాళ్లు అసలు తమవైపు నుంచి సమస్య ఏమీ లేదని చెప్పడంతో మొత్తం వ్యవహారం బయటపడింది. పైలట్ ఆ విషయం చెప్పే సమయానికి కాక్‌పిట్‌లో కో పైలట్ కూడా లేరు. ఆ తర్వాత తాను చెప్పిన అబద్ధానికి సదరు పైలట్ బేషరతుగా క్షమాపణలు చెప్పారు. కో పైలట్ రాకపోవడం వల్లే విమానం ఆలస్యం అయ్యిందని తెలిపారు. అయితే.. తమ విమానం కేవలం మూడు నిమిషాలే ఆలస్యం అయ్యిందని ఇండిగో తెలిపింది. -
టాయిలెట్ కంపు.. దిగిపోయిన విమానం
సాధారణంగా బస్టాండ్లలో టాయిలెట్లు కంపు కొడితే వాటికి దూరంగా వెళ్లి నిలబడతాం. అదే రైళ్లలో అయితే అటువైపు వెళ్లడం మానేసి ఊరుకుంటాం. కానీ వేలకు వేలు పోసి టికెట్లు కొనుక్కున్న విమానంలోనే టాయిలెట్లు కంపు కొడితే..? లోపల ఉన్నవాళ్లు అసలు భరించే పరిస్థితి ఉండదు. అలాంటప్పుడు తప్పనిసరిగి విమానాన్ని దించేయాల్సి ఉంటుంది. తాజాగా ఓ స్పైస్‌జెట్ విమానంలో ఇలాగే జరిగింది. బెంగళూరు నుంచి ఢిల్లీకి ఓ విమానం బయల్దేరింది. అందులో 188 మంది ప్రయాణికులున్నారు. విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే టాయిలెట్ నుంచి ఘోరమైన దుర్వాసన వస్తోందని చాలామంది ఫిర్యాదు చేశారు. కాసేపటికి అది ఇక భరించలేని స్థితికి చేరుకుంది. చివరకు సిబ్బంది కూడా తమ వల్ల కాదని చేతులెత్తేశారు. దాంతో.. ఇక అక్కడకు సమీపంలోనే ఉన్న హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో విమానాన్ని దించేశారు. ఏకంగా టాయలెట్ నుంచి కాక్‌పిట్ వరకు కూడా దుర్వాసన వచ్చేయడంతో స్పైస్‌జెట్ విమానం బి-737ను హైదరాబాద్‌లో దించేయాల్సి వచ్చిందని స్పైస్‌జెట్ ప్రతినిధి ఒకరు తెలిపారు. హైదరాబాద్‌లో ల్యాండయిన తర్వాత మొత్తం అంతా శుభ్రం చేసి, బాగా గాలి ఆడనిచ్చి ఆ తర్వాత విమానాన్ని నడిపించినట్లు వివరించారు. -
చౌక టికెట్లకు కిటుకులున్నాయ్ !
►విమాన టికెట్ల బుకింగ్‌కు రకరకాల మార్గాలు ►సెర్చ్ నుంచి చెల్లింపుల దాకా జాగ్రత్త పడితే మేలు ►డిస్కౌంట్లు, ఆఫర్లను అందుకుంటే మరింత చౌక హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి గనక ఒకటిరెండు వారాల ముందు టికెట్ తీసుకుంటే... రూ.3,000తో ఎంచక్కా వెళ్లి వచ్చేయొచ్చు. ఎందుకంటే... ఒకవైపు విమాన చార్జీ రూ.1,500 మాత్రమే కాబట్టి!! నిజానికి బస్సుల్లో వెళ్లినా రూ.1,200 చెల్లించక తప్పదు. ఒకవేళ రైల్లో థర్డ్ ఏసీలో వెళ్లాలన్నా దాదాపు వెయ్యి రూపాయల వరకూ అవుతుంది. మరి రూ.1,500కే గంటలో విశాఖ వెళ్లిపోవచ్చంటే..? ఇదిగో అందుకే విమానాల్లో రద్దీ పెరుగుతోంది. మధ్య తరగతి వారూ విమానాల్లో ప్రయాణించే స్థాయికి ధరలు దిగి రావటంతో... ఒకవైపు సర్వీసుల సంఖ్య పెరగటంతో పాటు మరోవంక కొత్త కొత్త విమానయాన కంపెనీలూ మార్కెట్లోకి దూసుకొస్తున్నాయి. ఇదంతా ఎందుకంటే... ప్రయాణికులు పెరుగుతున్న కొద్దీ విమానయాన సంస్థల్లో పోటీ కూడా పెరుగుతోంది. ఫలితంగా టికెట్లు ఒక్కోసారి మరింత తక్కువ ధరకు దొరుకుతున్నాయి. ఇక టికెట్లు విక్రయించేందుకు రకరకాల సంస్థలు బరిలోకి దిగుతున్నాయి. ఇవి విమానయాన సంస్థలతో ప్రత్యేక ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో... ఆఫర్లను అందిపుచ్చుకోవటం ఎలా? విమాన టికెట్లపై చక్కని డిస్కౌంట్ పొందేందుకు ఉన్న మార్గాలేంటి? ఏం చేస్తే తక్కువ ధరకు టికెట్లు పొందొచ్చు? ఈ వివరాల సమాహారమే ఈ కథనం... మీ కార్డులూ డిస్కౌంట్ ఇస్తాయి.. పలు బ్యాంకులు తమ క్రెడిట్ కార్డులపై తరచూ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఉదాహరణకు ఎస్బీఐ కార్డు ఉందనుకోండి. ఎస్బీఐ కార్డు ఆఫర్ ఫ్లయిట్ టికెట్స్ అని గూగుల్‌లో సెర్చ్ చేయడం ద్వారా వాటి వివరాలు పొందవచ్చు. అలాగే మేక్ మై ట్రిప్, యాత్రా వంటి పోర్టళ్లలోనూ ఆఫర్ల వివరాలు తెలుసుకోవచ్చు. అయితే, ఇందులో కొన్ని షరతులు కూడా ఉంటాయి. ఉదాహరణకు ఒక బ్యాంకు కార్డులకు ఇచ్చే ఆఫర్‌కు గడువు తేదీ, కనీస టికెట్ విలువ వంటివి ఉంటాయి. వాటికి మీరు అర్హులే అయితే అక్కడున్న డిస్కౌంట్ కోడ్‌ను టికెట్ బుక్ చేసే సమయంలో అప్లయ్ చేయాల్సి ఉంటుంది. అలా చేస్తేనే తగ్గింపు లభిస్తుంది. ఇక అమెరికన్ ఎక్స్‌ప్రెస్ అయితే జెట్ ఎయిర్‌వేస్‌తో కలసి విమానయాన ప్రయాణికులకు ప్రత్యేకంగా క్రెడిట్ కార్డును ఆఫర్ చేస్తోంది. సిటీ బ్యాంక్ వంటివి కూడా విమాన ప్రయాణికులకు ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నాయి. ఎక్కువగా విమానాల్లో ప్రయాణించేవారు... విమానయాన సంస్థలతో కలసి బ్యాంకులు అందించే ప్రత్యేక క్రెడిట్ కార్డులు తీసుకుంటే అధిక ప్రయోజనం ఉంటుందన్నది నిపుణుల మాట. ముందు బుక్ చేసుకుంటే బెటర్ విమాన ప్రయాణానికి ఎంత ముందుగా బుక్ చేసుకుంటే అంత మంచిది. కనీసం 30 రోజుల నుంచి 90 రోజుల్లోపు బుక్ చేసుకుంటే తక్కువ ధరకు టికెట్లను పొందొచ్చు. ప్రారంభంలో రేట్లు ఒక మోస్తరుగా ఉంటాయి. 60 రోజుల ముందుకు వచ్చే సరికి కొంత తగ్గుతాయి. ఆ తర్వాత నుంచి ప్రయాణానికి రోజులు దగ్గర పడుతున్నకొద్దీ రేట్లు పెరుగుతూ వెళతాయి. అయితే పండుగలు, ప్రత్యేక రోజుల్లో తగ్గింపులకు అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే అప్పుడు డిమాండ్ అధికం కనక. వ్యాలెట్ ద్వారా చెల్లిస్తే కొంత డిస్కౌంట్! గో–ఐబిబో, యాత్రా, మేక్ మై ట్రిప్, క్లియర్ ట్రిప్ తదితర వెబ్సైట్లన్నీ ఫ్లయిట్ టికెట్లకు, హోటల్ బుకింగ్‌లకు, పర్యాటక ప్యాకేజీలకు వీలు కల్పిస్తాయి. ఇవన్నీ కూడా ఇపుడు వర్చువల్ వ్యాలెట్లను నిర్వహిస్తున్నాయి. వీటిలో నగదును లోడ్ చేసుకుని వాటి ద్వారా ఫ్లయిట్ టికెట్లను బుక్ చేసుకుంటే కొంత క్యాష్ బ్యాక్ రూపంలో పొందేందుకు అవకాశం ఉంది. ఇలా మళ్లీ మన వ్యాలెట్లోకి వచ్చిన క్యాష్‌ను తిరిగి మరోసారి బుకింగ్ సమయంలో ఉపయోగించుకోవచ్చు. ఇక గో–ఐబిబో యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటే కొంత నగదు సైతం వ్యాలెట్‌కు జమయ్యే ఆఫర్లు ఒకోసారి ఉంటుంటాయి. వీటికి అదనంగా కొన్ని సందర్భాల్లో టికెట్ బుకింగ్‌పై ఉచితంగా షాపింగ్ వోచర్లు కూడా అందుకోవచ్చు. ఇక్సిగో డాట్‌కామ్ అయితే యాప్ ద్వారా ఫ్లయిట్ టికెట్లు బుక్ చేసుకుంటే క్యాష్ బ్యాక్ ప్రయోజనాన్ని సిట్రస్ వ్యాలెట్‌కు బదిలీ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఫ్రీచార్జ్, పేటీఎం, మొబిక్విక్, పేయూ మనీ వంటివి తమ వ్యాలెట్ల ద్వారా చెల్లింపులు చేస్తే అదనంగా క్యాష్ బ్యాక్ సౌకర్యాన్ని అందిస్తుంటాయి. సమయాన్ని బట్టి ఛార్జీలు! అర్ధరాత్రి దాటాక ప్రయాణానికి మీకు ఇబ్బంది లేకపోతే తక్కువ ధరకు విమాన టికెట్లను పొందే అవకాశాలుంటాయి. అత్యవసర పని మీద, ఫలానా సమయానికి చేరుకునే విధంగా వెళ్లే వారికి ఇది కుదరకపోవచ్చు. మిగిలిన వారికి ఆ అవకాశం ఉంటుంది. అర్ధరాత్రి సమయాల్లో ప్రయాణానికి డిమాండ్ తక్కువగా ఉంటుంది కనక కంపెనీలు కొంత తక్కువ ధరకే టికెట్లు ఆఫర్ చేస్తాయి. మొబైల్ యాప్‌లూ ఉన్నాయి టికెట్ల బుకింగ్‌కు మొబైల్ యాప్స్‌ను ఉపయోగించడం మరో విధానం. వెబ్సైట్ల ద్వారా బుకింగ్ చేసే అలవాటున్న వారు తగ్గింపు ధరలపై ఫ్లయిట్ టికెట్లు పొందాలంటే యాప్స్‌ను కూడా పరిశీలించాల్సిందే. ఎక్కువ సంస్థలు యాప్స్ ద్వారా బుకింగ్‌లపై తరచు ఆఫర్లు ఇస్తున్నాయి. కనీసం 5–10 శాతం తగ్గింపు అయినా పొందడానికి వీలుంటుంది. ఇంకా రివార్డు పాయింట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు, ప్రత్యేకమైన డిస్కౌంట్లు, ఆహార పదార్థాలపై తగ్గింపులకు అవకాశం ఉంటుంది. నేరుగా ఎయిర్‌లైన్ సైట్ల నుంచి... ఒకవేళ టికెట్ బుకింగ్‌లకు మీడియేటరీ సంస్థలుగా ఉన్న పేటీఎం, మేక్‌మై ట్రిప్, ఇక్సిగో, ఎక్సపీడియా, గోఐబిబో వంటి సంస్థల నుంచి ఆఫర్లు లేవనుకుంటే ఎయిర్‌లైన్ సంస్థల వెబ్సైట్లను పరిశీలించాలి. ఎందుకంటే మధ్యవర్తిత్వ సేవలందించే పేటీఎం వంటి సంస్థలకు టికెట్ల బుకింగ్‌పై విమానయాన సంస్థలు కొంత మొత్తాన్ని కన్వేయన్స్ చార్జ్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. నేరుగా వాటి సైట్ల నుంచి బుక్ చేసుకుంటున్నందున కొంత తగ్గింపునకు అవకాశం లేకపోలేదు. డైనమిక్ ప్రైసింగ్... జాగ్రత్త!! డిమాండ్‌కు అనుగుణంగా టికెట్ల ధరలను పెంచే విధానాన్ని విమానయాన సంస్థలు అనుసరిస్తున్నాయి. ఓ వ్యక్తి ఫలానా తేదీ, ఫలానా సమయానికి విమాన టికెట్ల బుకింగ్ కోసం నాలుగైదు సంస్థల సైట్లలో సెర్చ్ చేశారనుకోండి. ఆ వివరాలు కుకీల ద్వారా ఆయా సంస్థలకు తెలిసిపోతాయి. దీంతో బుకింగ్‌కు వచ్చే సరికి ధర పెరిగిపోతుంది. అందుకే వీలయితే, వెబ్సైట్ ద్వారా సెర్చ్ చేసేటపుడు ఇన్‌కాగ్నిటో మోడ్‌లో ఉండి సెర్చ్ చేయండి. కోరుకున్న రోజు డిమాండ్ ఎక్కువుంటే? మీరు ఏప్రిల్ 1న ప్రయాణించాలని డిసైడ్ అయ్యారు. టికెట్ బుక్ చేసుకుందామని సైట్ ను ఆశ్రయించారు. కానీ, ఆ రోజు టికెట్‌రేట్లు ఎక్కువగా ఉన్నాయనుకోండి. వీలుంటే రెండు రోజులు అటో, ఇటో ప్రయాణాన్ని మార్చుకోవచ్చేమో కూడా పరిశీలించాలి. అందుకు సిద్ధమైతే తగ్గింపునకు అవకాశం ఉంటుంది. ఇందుకు సెర్చ్ సమయంలో ఎడిట్ ఆప్షన్‌కు వెళ్లి ప్రయాణ తేదీని క్లిక్ చేస్తే వేర్వేరు తేదీల్లో ధరలతో పట్టిక కనిపిస్తుంది. గూగుల్ ఫ్లయిట్స్‌లో సెర్చ్ చేస్తే రెండు మూడు నెలల పాటు ఏ రోజున ఎంత ధర ఉందో ఒక్కచోటే తెలుసుకోవచ్చు కూడా. ఒక్కో తేదీన 50 శాతం తక్కువ ధరకు కూడా టికెట్ లభించొచ్చు. వారంలో విమాన ప్రయాణానికి తక్కువ చార్జీలుండే రోజులు మంగళవారం, బుధవారం అని గమనించాలి. టికెట్లన్నీ ఒకే సంస్థ ద్వారా కాకుండా... ప్రయాణం, తిరుగు ప్రయాణం టికెట్లను ఒకే సంస్థ ద్వారా బుక్ చేసుకుంటే చాలా సందర్భాల్లో తగ్గింపు ప్రయోజనాలకు దూరమవ్వాల్సి ఉంటుంది. పైగా రెండు వైపులా టికెట్లను ఒకే లావాదేవీగా బుక్ చేసుకుంటే తగ్గింపు పరిమితి కూడా ఉంటుంది. కనుక ఆఫర్లున్న రెండు సంస్థలను ఎంచుకుని ఒకవైపు ప్రయాణానికి ఒక వేదిక నుంచి, తిరుగు ప్రయాణానికి మరో వేదిక నుంచి టికెట్లను బుక్ చేసుకోవడం తెలివైన చర్య. ఉదాహరణకు ఓ సంస్థ రూ.5,000 టికెట్‌పై 10 శాతం తగ్గింపునందిస్తోంది. అదే సమయంలో గరిష్ట ప్రయోజనం రూ.500గానే నిర్దేశించిందనుకోండి. మీరు ఇరువైపులా టికెట్లను ఒకే లావాదేవీ కింద చేసేస్తే మొత్తం తగ్గింపు రూ.500కే పరిమితం అవుతుంది. అందుకే రెండు వేర్వేరు సంస్థల నుంచి టికెట్లను బుక్ చేసుకోవడం వల్ల డబుల్ బెనిఫిట్ పొందొచ్చు. ఇంకా ఇలా చేయొచ్చు... ♦ పలు విమానయాన సంస్థలు విద్యార్థులు, సీనియర్ సిటిజన్లకు టికెట్లపై 8–10 శాతం రేంజ్లో తగ్గింపు ఇస్తున్నాయి. స్పైస్‌జెట్ విద్యార్థులకు బేస్ ధరపై 8 శాతం తగ్గింపు ఇస్తోంది. ఇలాంటివి కొన్ని రూట్లలో, కొన్ని తేదీల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ♦ వీలయితే చిన్న బ్యాగుతో ప్రయాణం చేయండి. దీనివల్ల లగేజీ ఖర్చులు తగ్గుతాయి. కొన్ని సంస్థలు బ్యాగేజ్‌పై చార్జీలు వడ్డిస్తున్న విషయం తెలిసిందే కదా. ♦ కూపన్ దునియా వంటి కొన్ని సైట్లు విమాన టికెట్ల బుకింగ్‌పై డిస్కౌంట్ల కూపన్లు ఇస్తుంటాయి. టికెట్ల బుకింగ్‌కు ముందు గూగుల్ లో సెర్చ్ చేయడం ద్వారా వీటిని తెలుసుకోవచ్చు. ♦ మీరు కావాలనుకున్న ఫ్లయిట్‌కు టికెట్ రేటు బాగా ఎక్కువుందనుకోండి. అవి తగ్గినప్పుడు మిమ్మల్ని అప్రమత్తం చేయడానికి గూగుల్ అలర్ట్స్ ఉపయోగపడుతుంది. ధర మారినప్పుడల్లా ఆ వివరాలు ఈమెయిల్‌కు వచ్చేస్తాయి. ♦ విమానయాన సంస్థలు, వాటి తరఫున బుకింగ్ సేవలు అందించే ఇతర సంస్థలు ఇచ్చే ఆఫర్ల వివరాలు తెలుసుకోవాలంటే ఎయిర్‌ఫేర్ న్యూస్‌లెటర్‌కు సబ్స్క్రయిబ్ చేయాలి. దానివల్ల ఎప్పటికప్పుడు ఆఫర్ల వివరాలు మీకు తెలుస్తుంటాయి. ♦ గోఐబిబో, యాత్రా వంటి సంస్థలు ఎలాంటి నగదు చెల్లించకుండా టికెట్లను ముందుగా బుక్ చేసుకునే అవకాశాన్నిస్తున్నాయి. ప్రయాణం విషయంలో సందిగ్ధత ఉన్నా, డిస్కౌంట్ల కోసం వేచి ఉందామనుకున్నా, సీట్‌ను బ్లాక్ చేసుకుని తర్వాత చెల్లించే సదుపాయం ఉంది. -
శంషాబాద్‌లో ఆగిన ఇండిగో విమానం
శంషాబాద్: శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి శనివారం ఉదయం చెన్నై వెళ్లాల్సిన ఇండిగో విమానం నిలిచిపోవడంతో.. ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం వల్లే నిలిచిపోయినట్లు సమాచారం. విమానంలో 120 మంది ప్రయాణికులు ఉన్నా ఎయిర్‌లైన్స్ సిబ్బంది పట్టించుకోవడం లేదు.. ప్రయాణికుల్లో అధికార పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు కేశవరావు ఉన్నారు. -
గోవా ప్రయాణం ఇక కాస్ట్లీనే!
న్యూఢిల్లీ : గోవా ప్రయాణం ఇక మరింత కాస్ట్లీగా మారబోతుంది. గోవా నుంచి గాని, గోవాకు కానీ ప్రయణించాలనుకునే వారికి గాని ఏప్రిల్ నెల నుంచి ఓ ఆరు నెలల పాటు విమాన టిక్కెట్ల ఖర్చు మోతమోగనుంది. దాబోలిమ్ ఎయిర్ పోర్టు నుంచి విమాన రాకపోకలను ఇండియన్ నేవి తగ్గించింది. కార్యచరణ కారణాలతో 12.30 నుంచి 15.30 మద్యలో ప్రయాణించే విమానాలను తగ్గిస్తున్నట్టు ఇండియన్ నేవి ప్రకటించింది. గంటకు 15 విమానాలు నడిచే ఈ సమయంలో ఇకనుంచి గంటకు 5 విమనాలు మాత్రమే నడువనున్నాయని ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అధికారి చెప్పారు. దీంతో విమానాలు తగ్గి, ప్రయాణికుల ట్రాఫిక్ పెరిగి, ఛార్జీలు మోత మోగనుందని తెలుస్తోంది. నేవి నిర్వహించే ట్రైనింగ్ సెషన్‌తో ఇప్పటికే ఈ విమానాశ్రయాన్ని గంటలకు నాలుగు గంటలు మూత వేస్తున్నారు. ఇలా మూత వేయడం, విమానాలు తగ్గించడం ప్రయాణికుల వృద్ధిపై కూడా ప్రభావం చూపనుందని ట్రావెల్ ఇండస్ట్రి ఎగ్జిక్యూటివ్‌లంటున్నారు. విమాన టిక్కెట్ల రేట్లు పెరగడం ట్రావెల్, టూరిజం సెక్టార్‌కు గండికొట్టనుందని చెబుతున్నారు. . -
వారణాసి–విజయవాడ విమాన సర్వీస్ ప్రారంభం
విమానాశ్రయం (గన్నవరం): ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసి (కాశీ) నుంచి గన్నవరం విమానాశ్రయానికి స్పైస్‌జెట్ సంస్థ ఆదివారం నుంచి కొత్త విమాన సర్వీస్‌ను ప్రారంభించింది. 189 సీటింగ్ సామర్థ్యంగల బోయింగ్ 737–800 విమానం 126 మంది ప్రయాణికులతో వారణాసి నుంచి హైదరాబాద్ మీదుగా మధ్యాహ్నం 2 గంటలకు ఇక్కడికి చేరుకుంది. న్యూ టెర్మినల్ భవనంలో వారణాసి, హైదరాబాద్ వెళ్తున్న ప్రయాణికులకు తొలి బోర్డింగ్ పాస్‌ను ఎయిర్‌పోర్టు డైరెక్టర్ ఎం.మధుసూదనరావు తదితరులు అందజేశారు. అనంతరం ఇక్కడి నుంచి 156 మంది ప్రయాణికులతో మధ్యాహ్నం 2.40 గంటలకు విమానం వారణాసికి బయల్దేరింది. వీరిలో వారణాసి వెళ్లే ప్రయాణికులు 54 మంది ఉన్నారు. -
దలైలామా విమానానికి ల్యాండింగ్ ట్రబుల్
కృష్ణా జిల్లా గన్నవరం ప్రాంతంలో పొగమంచు దట్టంగా అలముకుంది. దాంతో రన్‌వే మీద విమానాలు దిగేందుకు వీలు లేకుండా పోయింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిరిండియా విమానం కూడా ఇలాగే దిగేందుకు అవకాశం లేక గాల్లో చక్కర్లు కొడుతోంది. ఆ విమానంలో ప్రముఖ బౌద్ధ మత గురువు దలైలామా కూడా ఉండటంతో అధికారులు ఆందోళన చెందుతున్నరు. ఉదయం 8.55 గంటలకు ఢిల్లీ నుంచి రావాల్సిన విమానం ల్యాండ్ అవ్వడానికి తగిన విజిబులిటీ లేకపోవడంతో అది గాల్లోనే చక్కర్లు కొడుతోంది. విమానం దిగడానికి వాతావరణం అనుకూలంగా లేదని పైలట్ విమానాశ్రయ అధికారులకు చెప్పారు. సూర్యుడి వేడి వచ్చిన తర్వాత గానీ పొగమంచు విడిపోయే అవకాశం లేదని అధికారులు అంటున్నారు. మహిళా పార్లమెంటు సదస్సులో పాల్గొనేందుకు దలైలామా ఢిల్లీ నుంచి బయల్దేరి వచ్చారు. గన్నవరం విమానాశ్రయంలో తరచు ఇదే పరిస్థితి తలెత్తుతోంది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఉదయం పూట వచ్చే విమానాలు ల్యాండింగ్ కావడానికి ఆలస్యం అవుతోంది. గ్రామీణ ప్రాంతం కావడంతో మంచు ఎక్కువగా ఉండటం ఒక కారణం కాగా, రన్‌వే పెద్దది కాకపోవడం కూడా మరో ముఖ్యమైన సమస్య అని చెబుతున్నారు. -
గన్నవరం నుంచి నూతన విమాన సర్వీసులు
విమానాశ్రయం(గన్నవరం): ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో గన్నవరం విమానాశ్రయానికి కొత్త విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. టర్బో మెగా ఎయిర్వేస్కు చెందిన ట్రూజెట్తోపాటు స్పైస్‌జెట్ సంస్థలు కొత్తగా అదనపు విమాన సర్వీసులు నడిపేందుకు ముందుకువచ్చాయి. ప్రస్తుతం హైదరాబాద్, చెన్నై, కడప, తిరుపతికి విమాన సర్వీసులు నడుపుతున్న ట్రూజెట్ సంస్థ ఈ నెల 20వ తేదీ నుంచి హైదరాబాద్‌కు రెండవ విమాన సర్వీసును నడపనుంది. ఈ విమానం ప్రతిరోజు మధ్యాహ్నం 12.40కు గన్నవరం నుంచి బయలుదేరి 1.40కు హైదరాబాద్‌కు చేరుకుంటుంది. ఫిబ్రవరి 19 నుంచి వారణాసికి సర్వీస్ స్పైస్‌జెట్ విమాన సంస్థ ఫిబ్రవరి 19వ తేదీ నుంచి వారణాసి నుంచి హైదరాబాద్ మీదుగా ఇక్కడికి నూతన సర్వీస్‌ను ప్రారంభించనుంది. ఈ విమాన సర్వీస్ మంగళవారం మినహా వారంలో ఆరు రోజులపాటు ఉంటుంది. ఈ విమానం ప్రతిరోజు వారణాసి నుంచి ఉదయం 10 గంటలకు బయలుదేరి హైదరాబాద్ మీదుగా మధ్యాహ్నం 1.50కు గన్నవరం చేరుకుంటుంది. ఇక్కడ మధ్యాహ్నం 2.40 గంటలకు బయలుదేరి హైదరాబాద్ మీదుగా సాయంత్రం 6.55కు వారణాసి చేరుకుంటుంది. ఈ సర్వీస్ నిమిత్తం స్పైస్‌జెట్ సంస్థ 189 సీటింగ్ కెపాసిటీ కలిగిన 737–800 బోయింగ్ విమానాన్ని నడపనుంది. ప్రస్తుతం ఇక్కడికి రాకపోకలు సాగిస్తున్న విమానాల్లో ఇదే అతిపెద్ద విమానం కావడం విశేషం. -
ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియా సిబ్బందితో అనుచితంగా, వికృతంగా ప్రవర్తించే ప్రయాణికులకు చెక్ పెట్టేందుకు నిర్ణయించింది. ప్రయణీకుల భద్రతే ముఖ్యమైనప్పటికీ, వేధింపులకు దిగిన ప్రయాణికులకు సంకెళ్లు వేసేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల సిబ్బందిపై వేధింపుల ఉదంతాలు చోటుచేసు కోవడంతో ఎయిర్ ఇండియా ఈ నిర్ణయానికి వచ్చింది. ఇప్పటివరకూ అంతర్జాతీయ విమానాల్లో మాత్రమే అనుమతి ఉన్న రిస్ట్రెయినర్స్ ను ఇక మీదట జాతీయ, అంతర్జాతీయ విమానాల్లోకూడా తీసుకెళ్లనున్నట్టు నివేదికలుచెబుతున్నాయి. ఇకమీదట దురుసుగా ప్రవర్తించే ప్రయాణికులను నియంత్రించేందుకుగాను ప్లాస్టిక్ సంకెళ్లను తీసుకెళ్లనున్నట్టు ఎయిర్ ఇండియీ అధ్యక్షుడు అశ్విన్ లోహాని తెలిపారని రిపోర్ట్ చేశాయి. విమానం, ప్రయాణీకుల భద్రత విషయంలో ఎలాంటి రాజీలేదని తెలిపారు. అదే సందర్బంగా తమ సిబ్బంది రక్షణ కూడా ముఖ్యమే అన్నారు. విమానాల్లో దుష్ప్రవర్తన ఇటీవల కాలంలో బాగా పెరుగుతోందని, తమ పైలట్లు పూర్తి అసహనంతో ఉంటున్నా, లైంగిక వేధింపులు లాంటివి చోటు చేసుకున్నాయని ఆశ్విన్ చెప్పారు. అయితే పూర్తిగా నియంత్రణ కోల్పోయినపుడు మాత్రమే ప్లాస్టిక్ సంకెళ్ల ద్వారా వారిని నియంత్రిస్తామని తెలిపారు. అనంతరం వారిని దర్యాప్తు ఏజెన్సీలకు అప్పగిస్తామన్నారు.కాగా జనవరి 2 న మస్కట్-ఢిల్లీ విమానంలో ఎయిర్ హోస్టెస్ పై లైంగిక దాడి, డిసెంబర్ 21 న ముంబై-న్యూయార్క్ విమానంలో సహ-ప్రయాణీకుడి అనుచిత ప్రవర్తన నేపథ్యంలో ఎయిర్ ఇండియా ఈ నిర్ణయం తీసుకున్నట్టుతెలుస్తోంది. -
పొగమంచు ఎఫెక్ట్: పలు రైళ్లు, విమానాల ఆలస్యం
ఢిల్లీ: దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీకి రావలసిన, అక్కడి నుంచి వెళ్లవలసిన పలు రైలు, విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. నేటి (శనివారం) ఉదయం పొగమంచు కారణంగా 70 రైళ్లు ఆలస్యం కాగా, 16 రైళ్ల వేళలలో మార్పులు చేశారు. 7 సర్వీసులను రైల్వేశాఖ అధికారులు రద్దు చేశారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి రావాలసిన రెండు విదేశీ విమాన సర్వీసులతో పాటు నాలుగు డొమెస్టిక్ సర్వీసులు ఆలస్యం అవుతున్నాయి. ఓ విమాన సర్వీసులను రద్దు చేశారు. గత కొన్ని రోజులుగా పొగమంచు కారణంగా పలు రైళ్లు, విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్న విషయం తెలిసిందే. ఈ కారణంగా కొన్ని సర్వీసులను రద్దు చేస్తున్నారు. -
అయినా.. మనిషి మారలేదు..!
మనం బస్సులు, విమానాలు, రైళ్లలో ప్రయాణం చేస్తున్నప్పుడు కొంత మంది ప్రయాణికుల ప్రవర్తన మనకు ఇబ్బందిని కలిగిస్తూనే ఉంటుంది. ఇలాంటి అరుదైన అనుభవమే తనకూ ఎదురైందని కుమేల్ నంజియాని అనే వ్యక్తి చెబుతున్నాడు. ఇటీవల ఓ ఫ్లైట్‌లో తాను ప్రయాణిస్తున్న సమయంలో తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తన పక్క సీట్లో కూర్చున్న వ్యక్తి ఫ్లైట్‌నే తన ఇంటిగా మార్చుకొని ఎంత దర్జాగా.. ఇతరులకు అసౌకర్యం కలిగించాడో చెబుతూ కుమేల్ చేసిన ట్వీట్లు ఇప్పుడు ఆన్లైన్లో హల్చల్ చేస్తున్నాయి. విమాన ప్రయాణంలో కుమేల్‌కు ఆరోజు దురదృష్టవశాత్తు ముందు సీటు లభించింది. ఫ్లైట్ టేకాఫ్ కాగానే.. పక్కన కూర్చున్న వ్యక్తి చకచకా తన ప్యాంటు విప్పేసి ముందున్న వాల్‌పై తన రెండు కాళ్లు పెట్టుకొని కూర్చున్నాడు. అది మిగతా ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా ఉందని చెప్పినా ఆ వ్యక్తి వినిపించుకోలేదని కమేల్ తన ట్వీట్లలో ఆందోళన వ్యక్తం చేశాడు. సిబ్బంది చెప్పిన విషయాన్ని సైతం అతడు పట్టించుకోకుండా మూర్ఖంగా ప్రవర్తించాడని.. చివరికి నాలుగు గంటల ప్రయాణం తరువాత.. ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక ప్యాంటు వేసుకొని అతడు బయటకు నడిచాడని కుమేల్ వెల్లడించాడు. సిబ్బంది ఫిర్యాదు మేరకు అతడిని అరెస్ట్ చేస్తారని తాను భావించానని అయితే.. అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని కుమేల్ వాపోయాడు. -
ప్రైవేటు విమానంలో 3.5 కోట్ల పాతనోట్ల తరలింపు!
హర్యానాలోని హిస్సార్ నుంచి నాగాలండ్‌లోని డిమాపూర్‌కు రూ. 3.5 కోట్లను ఒక ప్రైవేటు విమానంలో తరలిస్తుండగా ఆ విమానాన్ని దించేసి, సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రైవేటు విమానాలు ఎగరాలంటే తప్పనిసరిగా ఉండాల్సిన సెక్యూరిటీ ప్రోగ్రాంను ఈ విమానం నడిపిస్తున్న ఎయిర్‌కార్ ఎయిర్‌లైన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) రద్దుచేసింది. హిస్సార్‌లో తాము బ్యాగులు చెక్ చేశామని, అందులో కేంద్రం రద్దుచేసిన 500, 1000 నోట్లు ఉన్నాయన్న విషయాన్ని ఏటీసీకి పైలట్లు తప్పనిసరిగా చెప్పాలి. అయితే, పైలట్ టాయిలెట్‌కు వెళ్లాల్సి వచ్చిందని, అందువల్ల ఏటీసీకి ఆ విషయం చెప్పలేదని ఎయిర్‌కార్ చెబుతోంది. ఎయిర్‌కార్ సంస్థకు మూడు విమానాలున్నాయి. వాటిలో ఒకదాన్ని హిస్సార్‌లో సెక్యూరిటీ చెకింగులు ఏమాత్రం లేని ఒక చిన్న ఎయిర్‌ఫీల్డ్ నుంచి తీసుకుని నవంబర్ 22న డిమాపూర్‌కు బయల్దేరి వెళ్లారు. తాను ఈ మొత్తానికి పన్ను కట్టానని, కొంత మినహాయింపు ఉందని చెప్పిన ప్రయాణికుడు.. అందుకు ఆధారంగా కొన్ని పత్రాలను కూడా చూపించాడని, అందుకే తమ పైలట్లు పెద్దగా పట్టించుకోలేదని ఎయిర్ కార్ అధినేత మానవ్ సింగ్ చెప్పారు. పెద్దనోట్లను రద్దు చేయకముందు కూడా చాలామంది పెద్దమొత్తాలను దూరప్రాంతాలకు తీసుకెళ్లాల్సి వచ్చినప్పుడు ఇలాగే పెద్దగా సెక్యూరిటీ చెకింగులు ఏవీ లేని చిన్న చిన్న ఎయిర్‌ఫీల్డుల నుంచి ప్రైవేటు విమానాలు తీసుకుని వెళ్లేవారు. దాంతో.. ఇలాంటి చిన్న ఎయిర్‌ఫీల్డుల నుంచి బయల్దేరే ముందు తప్పనిసరిగా పోలీసుల పర్యవేక్షణలో ప్రయాణికుల బ్యాగేజి చెక్ చేయాలని డీజీసీఏ స్పష్టం చేసింది. అయినా అక్కడక్కడ మాత్రం ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. -
విమానాల నుంచి వ్యర్థాలు పడితే జరిమానా
న్యూఢిల్లీ: విమానాలు ల్యాండింగ్ అవుతున్నప్పుడు అందులోని టాయిలెట్ ట్యాంకుల నుంచి మానవ వ్యర్థాలు ఇళ్లపై పడితే విమానయాన సంస్థలు పర్యావరణ నష్టపరిహారం కింద రూ. 50 వేల జరిమానా చెల్లించాలని జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఆదేశించింది. ఈమేరకు వాటికి సర్క్యులర్లు జారీచేయాలని విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏకు ఉత్తర్వులిచ్చింది. -
చెన్నై-న్యూఢిల్లీ టిక్కెట్టు ధర రూ.52 వేలు
-
చెన్నై-న్యూఢిల్లీ టిక్కెట్టు ధర రూ.52 వేలు
న్యూఢిల్లీ: చెన్నై-న్యూఢిల్లీ విమాన చార్జీల ధరలు ఆకాశాన్నంటాయి. వర్దా తుపాను ప్రభావం కారణంగా చెన్నై-న్యూఢిల్లీ వెళ్లే విమానం టికెట్ల ధర ఏకంగా ఐదు రెట్లు పెరిగింది. మంగళవారం అర్ధరాత్రి ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్న విమాన టిక్కెట్ల ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీ-చెన్నై వెళ్లే విమాన టికెట్ ధర రూ.24,792లు, కోల్ కతా నుంచి చెన్నై వచ్చే విమానం టిక్కెట్ ధర రూ.17,283లు గా ఉన్నాయ. అదే చెన్నై నుంచి ఢిల్లీ వెళ్లే డైరెక్ట్ ఫ్లైట్ ధర ఏకంగా రూ.52,000లుగా ఉంది. సాధారణంగా ఆఖరి నిమిషంలో తీసుకునే విమానధరలు రూ.5 వేల నుంచి 8వేల వరకూ పెరుగుతూ ఉంటాయని నిపుణులు అంటున్నారు. సోమవారం చెన్నై ఎయిర్ పోర్టును మూసివేసిన కారణంగా ఒక్కసారిగా విమానాశ్రయంలో రద్దీ పెరిగింది. దీంతో చార్జీలను ఆయా విమానయాన సంస్ధలు పెంచేశాయి. -
‘వర్దా’తో పలు విమానాలు రద్దు
హైదరాబాద్: వాతావరణం అనుకూలించని కారణంగా శంషాబాద్ విమానాశ్రయం నుంచి మంగళవారం బయలుదేరాల్సిన పలు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. రద్దయిన వాటిల్లో చెన్నైకి వెళ్లాల్సిన ఏడు, తిరుపతి వెళ్లాల్సిన 4, జైపూర్, విజయవాడ, రాజమహేంద్రవరం వెళ్లాల్సిన ఒక్కో ఫ్లయిట్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వర్దా తుపాన్ కారణంగా సోమవారం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి చెన్నై, తిరుపతితోపాటు, పలు ప్రాంతాలకు వెళ్లే విమాన సర్వీసులను రద్దు చేశారు. చెన్నై విమానాశ్రయాన్ని మూసివేయడంతో, మస్కట్ నుంచి అక్కడకు వెళ్లాల్సిన ఓమన్ ఎయిర్వేస్ విమానాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు దారి మళ్లించారు. చెన్నై, తిరుపతి, జైపూర్, రాజమండ్రి, ముంబాయి నుంచి హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగించే 18 విమాన సర్వీసులు రద్దయ్యాయి. హైదరాబాద్ నుంచి మస్కట్ వెళ్లాల్సిన విమానం ఐదు గంటలు ఆలస్యంగా బయలుదేరింది. హైదరాబాద్–దుబాయి విమానం రెండు గంటలు, హైదరాబాద్– ముంబాయి, ఢిల్లీ, బెంగళూరు విమానాలు సుమారు ఐదు గంటలు ఆలస్యంగా నడిచాయి. సాంకేతిక లోపంతో వెనక్కు..: రాజీవ్‌గాంధీ విమానాశ్రయం నుంచి కౌలాలంపూర్ వెళ్లే ఎయిర్ ఏసియా విమానం సోమవారం ఇక్కడి నుంచి టేకాఫ్ తీసుకున్న 15 నిమిషాలకు తిరిగి వచ్చింది. విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్ విమానాన్ని సురక్షితంగా ఎయిర్‌పోర్టులో దింపాడు. ఈ సమయంలో విమానంలో 167 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. -
విమాన ప్రయాణానికీ.. ఈఎంఐ ఆప్షన్..
జెట్ ఎయిర్వేస్ వినూత్న సేవలు న్యూఢిల్లీ: కార్లు, టీవీలు, ఏసీలు, స్మార్ట్ఫోన్లే కాదు.. ఇప్పుడు విమాన టికెట్‌ను కూడా ఈఎంఐ ఆప్షన్లో పొందొచ్చు. ప్రముఖ విమానయాన సంస్థ ‘జెట్ ఎయిర్వేస్’ తాజాగా విమాన ప్రయాణానికి ఈఎంఐ ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. సంస్థ దీనికోసం పలు బ్యాంకులతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ‘రూ.500, రూ.1,000 నోట్ల రద్దు నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో క్రెడిట్ కార్డు ద్వారా ఈఎంఐ విధానంలో జరిగే లావాదేవీలు పెరుగుతున్నాయి. అందుకే ప్రయాణికులకు మేం కూడా ఈఎంఐ పేమెంట్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చాం’ అని జెట్ ఎయిర్వేస్ చీఫ్ కమర్షియల్ అధికారి జయరాజ్ వివరించారు. సంస్థ వెబ్సైట్, మొబైల్ యాప్‌లో విమాన టికెట్‌ను బుకింగ్ చేసుకునే సమయంలో యాక్సిస్, హెచ్ఎస్బీసీ, ఐసీఐసీఐ, ఇండస్ఇండ్, కొటక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకుల క్రెడిట్ కార్డులను కలిగిన వారికి ఈఎంఐ పేమెంట్ ఆప్షన్ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈఎంఐ చెల్లింపుల గడువు 3, 6, 9, 12 నెలలుగా ఉంటుందని పేర్కొన్నారు. -
పొగమంచు కారణంగా విమానాలు ఆలస్యం
శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయం వద్ద దట్టమైన పొగమంచు అలుముకున్న కారణంగాశుక్రవారం ఉదయం పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇక్కడి నుంచి ఢిల్లీ, విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, గోవా, తిరుపతి తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన పలు విమానాలు రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరుతున్నాయని అధికారులు తెలిపారు. అయితే, వందలాదిగా నిలిచిపోయిన ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఢిల్లీలో కూడా దట్టమైన పొగమంచు కారణంగా 9 అంతర్జాతీయ, 15 దేశీయ విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. -
ఆలస్యంగా వెళ్తున్న రైళ్లు, విమానాలు
-
దట్టమైన పొగమంచు.. విమానాల రాకపోకలు ఆలస్యం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు వ్యాపించింది. దీంతో రవాణ వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పొగమంచు కారణంగా 8 అంతర్జాతీయ విమానాలు, 5 దేశీయ విమాన సర్వీసులు, 81 రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 3 అంతర్జాతీయ విమాన సర్వీసులు, 3 రైళ్ల సర్వీసులు రద్దయ్యాయి. బుధవారం ఉదయం ఢిల్లీలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఢిల్లీ-నోయిడా, ఢిల్లీ గుర్గావ్ ఎక్స్ప్రెస్వేస్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. -
ఢిల్లీ-హైదరాబాద్ విమానం రద్దు
న్యూఢిల్లీ: ప్రతికూల వాతావరణంలో దేశ రాజధాని ఢిల్లీలో రవాణా వ్యవస్థ స్తంభించింది. దట్టంగా అలముకున్న పొగ మంచు కారణంగా రైళ్లు, విమానాల రాకపోకలకు తీవ్ర విఘాతం కలిగింది. పొగ మంచుతో వెలుతురు మందగించడంతో 54 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 11 రైలు సర్వీసులను రద్దు చేశారు. నాలుగు అంతర్జాతీయ విమానాలు, ఐదు దేశీయ విమానాలు ఆలస్యమయ్యాయి. ఢిల్లీ-హైదరాబాద్ విమాన సర్వీసు రద్దు చేశారు. మరోవైపు కనిష్ట ఉష్ణోగత్రలు రోజురోజుకు తగ్గుతుండడంతో హస్తినవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగమంచు, చలిగాలులు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. -
ఆలస్యంగా నడుస్తున్న 81 రైళ్లు
-
ఆలస్యంగా నడుస్తున్న 81 రైళ్లు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో పొగమంచు ప్రభావం తీవ్రంగా ఉంది. పొగమంచు, వెలుతురులేమి కారణంగా రవాణ వ్యవస్థ స్తంభించిపోయింది. శనివారం ఉదయం విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తొమ్మిది అంతర్జాతీయ విమాన సర్వీసులు, నాలుగు దేశీయ విమానాలు ఆలస్యమయ్యాయి. ఢిల్లీ-లక్నో విమానాన్ని రద్దు చేశారు. గత మూడు రోజులుగా పొగమంచు కారణంగా 200 పైగా విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి. ఇక ఈ రోజు ఢిల్లీ నుంచి వెళ్లాల్సిన, రావాల్సిన 81 రైళ్లు ఆలస్యమయ్యాయి. కొన్ని రైళ్లు గంటల కొద్దీ ఆలస్యంగా నడుస్తున్నాయి. 40 రైళ్ల ప్రయాణ వేళలను మార్పు చేశారు. మరో 13 రైళ్లను రద్దు చేశారు. -
దీదీని హతమార్చేందుకు కుట్ర!
-
దీదీని హతమార్చేందుకు కుట్ర!
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న ఓ ప్రైవేటు విమానం కోల్‌కతా విమానాశ్రయం వద్ద దాదాపు అరగంట పాటు ల్యాండింగ్ కాకుండా గాలిలో చక్కర్లు కొడుతూనే ఉంది. దాంతో.. తమ దీదీని చంపేందుకు కుట్ర జరుగుతోందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. పెద్దనోట్ల రద్దుకు నిరసనగా బిహార్‌లో నిర్వహించిన ర్యాలీ అనంతరం రాత్రి 7.35 గంటల సమయంలో మమత అక్కడ విమానం ఎక్కారు. వాస్తవానికి అది 6.35కే రావాల్సి ఉంది. తర్వాత సాంకేతిక కారణాల వల్ల విమానం అరగంట పాటు గాల్లోనే తిరుగుతూ 9 గంటల సమయంలో ల్యాండయిందని విమానాశ్రయం అధికారులు తెలిపారు. ఏ విమానాశ్రయంలో అయినా ఇలాంటి ఘటనలు మామూలేనని అన్నారు. ఏటీసీ నుంచి అనుమతి రాకపోవడం వల్లనే విమానం కిందకు దిగలేదని, ఇదంతా మమతను హతమార్చేందుకు జరగుతున్న కుట్రేనని తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఫిర్హాద్ హమీక్ ఆరోపించారు. ఆయన కూడా మమతతో పాటే విమానంలో వచ్చారు. తాము ఐదు నిమిషాల్లో కోల్‌కతా వస్తామని పైలట్ 180 కిలోమీటర్ల ముందునుంచే చెబుతున్నా.. అరగంట ఆలస్యంగా విమానం కిందకు దిగాల్సి వచ్చిందని ఆయన అన్నారు. దీంతో మమతా బెనర్జీతోపాటు ఇతర ప్రయాణికులకు కూడా తీవ్ర అసౌకర్యం కలిగిందన్నారు. విమానంలో ఇంధనం అయిపోతోందని పైలట్ చెప్పినా.. ఏటీసీ మాత్రం విమానాన్ని గాల్లోనే ఉంచేసిందని ఆయన ఆరోపించారు. ఇది ముఖ్యమంత్రిని చంపడానికి చేసిన కుట్ర తప్ప మరొకటి కానే కాదని.. పెద్దనోట్ల రద్దును గట్టిగా ప్రశ్నించడమే కాక, ప్రజా ఉద్యమంలో భాగంగా ఆమె దేశవ్యాప్తంగా తిరుగుతున్నందునే ఆమెను చంపాలనుకుంటున్నారని హకీమ్ అన్నారు. -
బ్రిటన్ నుంచి విమానాల్లో పెద్ద నోట్లు
లండన్: పెద్ద నోట్ల రద్దు ప్రభావం భారతదేశంలోనే కాదు విదేశాల్లో కూడా పడుతోంది. బ్రిటన్‌లోని భారతీయులంతా తమ వద్ద ఉన్న పాత నోట్లను మార్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. వాటిని స్నేహితులు, బంధువులు, మరెవరైనా తెలిసిన వారు లేదా మధ్య వర్తుల ద్వారా తమ వద్ద ఉన్న పాత రూ.500, రూ.1000 నోట్లను విమానాల్లో పంపిస్తున్నారు. ప్రస్తుతం డిపాజిట్ చేసేందుకు, ఆర్బీఐలో మార్పిడి చేసుకునేందుకు అవకాశం ఉన్న ఈ నోట్లు డిసెంబర్ తర్వాత నేరుగా ఆర్బీఐకి వెళితే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ నేపథ్యంలో బ్రిటన్ లోని భారతీయులు తమ వద్ద ఉన్న పాత డబ్బుకు కంగారు పడుతున్నారు. ప్రస్తుతం దీన్ని విదేశాల్లో మార్పిడి చేసుకునే అవకాశం కూడా లేదు. బ్రిటన్‌లో 2011లో నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం భారతీయులు 2.5శాతం మంది ఉన్నారు. వారంతా ఇప్పుడు నోట్ల మార్పిడి కోసం ఎంత కంగారు పడుతున్నారో గుజరాత్‌కు చెందిన నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ గుజరాతీ ఆర్గనైజేషన్ యూకే(ఎన్సీజీవో) అధ్యక్షుడు సీజే రాభేరు తెలిపారు. రోజుకు కొన్ని వందల్లో ఫోన్లు వస్తున్నాయని, ఏం జరుగుతుందో తనకేం అర్థం కావడం లేదన్నారు. పెద్ద నోట్ల రద్దుకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియక కంగారు పడుతున్నవారే ఎక్కువగా ఉన్నారని, రూమర్లను నమ్ముతున్నారని అన్నారు. దాదాపు 10లక్షల మంది బ్రిటన్ భారతీయులపై పెద్ద నోట్ల ప్రభావం పడిందని తెలిపారు. -
ఢిల్లీలో పొగమంచు; విమానాల రాకపోకలు ఆలస్యం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాలతో పాటు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో దట్టమైన పొగమంచు వ్యాపించింది. దీంతో రవాణ వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పొగమంచు కారణంగా 18 విమానాలు, 50 రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బుధవారం ఉదయం ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాలు పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌లలో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఢిల్లీ-నోయిడా, ఢిల్లీ గుర్గావ్ ఎక్స్ప్రెస్వేస్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. మంగళవారం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 9.7 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.