రూ.991కే విమాన టిక్కెట్‌ | GoAir Offers Domestic Flight Tickets Starting At Rs. 991 | Sakshi
Sakshi News home page

రూ.991కే విమాన టిక్కెట్‌

Published Sat, Feb 10 2018 2:30 PM | Last Updated on Tue, Oct 2 2018 7:37 PM

GoAir Offers Domestic Flight Tickets Starting At Rs. 991 - Sakshi

న్యూఢిల్లీ : దేశీయ ఎయిర్‌లైన్ సంస్థ గోఎయిర్ అతి తక్కువ ధరకే విమాన టిక్కెట్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌ కింద టిక్కెట్‌ను రూ.991కే విక్రయించనున్నట్టు పేర్కొంది. ఈ ఆఫర్‌ కింద కస్టమర్లకు గోఎయిర్‌  ఆఫర్‌ చేస్తున్న టిక్కెట్లను 2018 ఫిబ్రవరి 20 వరకు బుక్‌ చేసుకోవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా టిక్కెట్లను బుక్‌ చేసుకునే వారికి అదనంగా 10 శాతం డిస్కౌంట్‌ అందుబాటులో ఉండనుందని గోఎయిర్‌ వెబ్‌సైట్‌పేర్కొంది. అయితే 'GOHDFC10' ప్రోమో కోడ్‌ను కస్టమర్లు వినియోగించాల్సి ఉంటుంది. 

''ఈ ఫిబ్రవరిలో అతి తక్కువ ధరలను ఎంజాయ్‌ చేయండి. రూ.991కే విమాన ప్రయాణాన్ని ఆస్వాదించండి. 'GOHDFC10' ప్రోమో కోడ్‌ వాడి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా టిక్కెట్లను బుక్‌ చేసుకున్న వారికి 10 శాతం తగ్గింపు లభిస్తోంది. 2018 ఫిబ్రవరి 20 వరకే ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. ఇప్పుడే బుక్‌ చేసుకోండి'' అంటూ గోఎయిర్‌ తెలిపింది. 

బాగ్డోగ్ర నుంచి గౌహతికి విమాన టిక్కెట్‌ ధర రూ.991 నుంచి ప్రారంభమవుతోంది. గౌహతి నుంచి బాగ్డోగ్రకు టిక్కెట్‌ ధరను రూ.1,299కు, కొచ్చి నుంచి బెంగళూరుకు రూ.1,390కు, హైదరాబాద్‌ నుంచి చెన్నైకి రూ.1,399కు, కొచ్చి నుంచి చెన్నైకి రూ.1,540కి, పాట్న నుంచి రాంచికి రూ.1,560కు, చెన్నై నుంచి కొచ్చికి రూ.1,653కు, హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు రూ.1,731కు టిక్కెట్లను గోఎయిర్‌ ఆఫర్‌ చేస్తోంది. 

ఈ ఆఫర్‌కు స్టాండర్డ్‌ క్యాన్సిలేషన్‌, రీబుకింగ్‌ పాలసీ అమల్లో ఉంటుంది. ఈ ఆఫర్‌ కింద పరిమిత సీట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. గ్రూప్‌ డిస్కౌంట్‌కు ఈ ఆఫర్‌ పనిచేయదు. ఇన్‌ఫాంట్‌ బుకింగ్‌కు ఇది అందుబాటులో ఉండదు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement