GoAir
-
వ్యాక్సిన్ వేసుకున్న వారికి గోఎయిర్ బంపర్ ఆఫర్..!
ముంబై: భారతదేశంలోని ముంబై కేంద్రంగా స్థాపించిన గోఎయిర్ విమానాయాన సంస్థ విమానయాన ప్రయాణీకులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. రెండు కరోనా టీకాలు వేసుకున్న ప్రయాణీకులకు 20 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. గోఎయిర్ దేశీయ విమానాలలో ప్రయాణించే ప్రయాణీకులు గోవక్కి పథకాన్ని(GOVACCI Scheme) ఉపయోగించడం ద్వారా ఈ డిస్కౌంట్ ఆఫర్ పొందవచ్చు. విమానయాన సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఆఫర్ భారతదేశంలో ప్రయాణించే ప్రయాణీకులకు మాత్రమే వర్తిస్తుంది. భారత ప్రభుత్వ ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసిన కోవిడ్-19 వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తీసుకెళ్లడం లేదా ఎయిర్ పోర్ట్ చెక్ ఇన్ కౌంటర్ వద్ద ఆరోగ్య సేతు మొబైల్ యాప్‌లో వ్యాక్సినేషన్ స్టేటస్ తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ గో ఫస్ట్ వెబ్ సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది అని కంపెనీ తెలిపింది. భారతదేశం ఓమిక్రాన్ కేసుల సంఖ్య 200 దాటడంతో ఈ ప్రకటన చేసింది. ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీలో 54 పైగా కేసులు నమోదు అయ్యాయి. అమెరికాలో, గత వారం వచ్చిన కొత్త కోవిడ్-19 కేసులలో సుమారు 73 శాతం ఓమిక్రాన్ కేసులకు సంబంధించినవే. (చదవండి: ఇక పాకిస్తాన్, చైనాకు చుక్కలే.. పంజాబ్‌లో ఎస్-400 మోహరింపు!) -
‘ఆకాశ’ .. మాస్టర్ మైండ్స్ వీరే
ముంబై: ఇండియాలో విమానయానం సామాన్యులకు ఎప్పుడు అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది. గతంలో తక్కువ ధరలకే ఎయిర్ డెక్కన్ వచ్చినా ఎక్కువ కాలం మనుగడ సాగించలేక పోయింది. తాజాగా తక్కువ ధరకే విమాన సర్వీసులు అందిస్తామంటూ ఏస్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఆకాశ విమానయాన సంస్థ నెలకొల్పారు. ఆకాశ ఆకాశ పేరుతో రాబోయే కొద్ది రోజుల్లోనే ఎయిర్ సర్వీసులు ప్రారంభించేందుకు రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా రెడీ అయ్యారు. మార్కెట్ నిపుణుడైన రాకేశ్ ఝున్‌ఝున్‌వాలాకు ఎయిర్‌లైన్స్‌లో ఉన్న అనుభవం ఎంత ? అయన ఈ రంగంలోకి అడుగు పెట్టేందుకు అండగా నిలబడింది ఎవరు? తనకు అందుబాటులో ఉండే ధరలతోనే కామన్ మ్యాన్ ఆకాశయనం చేయడం సాధ్యమవుతుందా అనే సందేహాలు మార్కెట్లో నెలకొన్నాయి. అయితే ఆకాశ స్థాపన వెనుక మార్కెట్ బిగ్బుల్ రాకేశ్‌తో ఎయిల్లైన్స్లో అపాన అనుభవం ఉన్న మాస్టర్ మైండ్స్ ఉన్నాయి. వీరిద్దరే స్టాక్‌మార్కెట్ ఇన్వెస్ట్ చేసి లక్షల కోట్లు సంపాదించి మార్కెట్ బిగ్‌బుల్‌గా పేరుపడిన రాకేశ్ఝున్ఝున్వాలాకి ఎయిర్‌లైన్స్ ఇండస్ట్రీలో పట్టులేదు. కానీ ఆ రంగంలో అపార అనుభవం ఉన్న వినయ్ దుబే, ఆదిత్యాఘోష్లు రాకేశ్‌కు కుడిఎడమలుగా నిలబడ్డారు. వారిద్దరే రెక్కలుగా మారి రాకేశ్ చేత ఆకాశయానం చేయిస్తున్నారు. వినయ్‌దుబే ఆకాశ ఎయిర్వేస్ ఆలోచన పురుడుపోసుకోవడానికి ప్రధాన కారణం జెట్ ఎయిర్వేస్ మాజీ సీఈవో వినయ్ దుబే. ఎయిర్ ఇండియాకు పోటీగా ఎదిగిన జెట్ ఎయిర్వేస్ సీఈవోగా వినయ్ దుబే పని చేశారు. ఆ తర్వాత ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చి.. రాకేశ్ ఝున్‌ఝున్‌వాలాతో కలిసి ఆకాశకు బీజం వేశారు. ఆకాశలో వినయ్ దుబేకి 15 శాతం వాటా ఉంది. ఆదిత్యా ఘోష్ చౌక విమాన సర్రీసులు అందించిన గో ఎయిర్‌లో 2008లో ఆదిత్య ఘోష్ చేరారు. అప్పటి నుంచి 2018లో కంపెనీని వీడేవరకు వివిధ హోదాల్లో రకరకాల స్కీమ్‌లు అమలు చేస్తూ గో ఎయిర్ అభివృద్దికి తోడ్పడ్డారు. ఇప్పుడు 160 విమానాలతో దేశంలోనే ప్రముఖ ఎయిర్‌లైన్స్ కంపెనీగా గో ఎయిర్ కొనసాగుతోంది. ఈయన ఆకాశ ఎయిర్‌లైన్స్‌లో 10 శాతం వాటాను కలిగి ఉన్నారు. ర్యాన్ఎయిర్ తరహాలో ప్రపంచంలోనే అత్యంత చౌక ధరలకే విమానయానం అందిస్తామని ఆకాశ హామీ ఇస్తోంది. ఆగష్టు చివరి నాటికి ప్రభుత్వం నుంచి అనుమతలు వచ్చే అవకాశం ఉంది. యూరప్‌కి చెందిన ‘ర్యాన్ఎయిర్’ తరహాలో ఆకాశ ఎయిర్‌లైన్స్ సర్వీసెస్ ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ద్వితీయ శ్రేణి నగరాల్లో ద్వితీయ శ్రేణి నగరాలకు విమాన సర్వీసులు అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో ఉదాన్ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. చిన్న నగరాల్లో ఎయిర్‌పోర్టులు నిర్మిస్తోంది, కొత్తగా అనుమతులు మంజూరు చేస్తోంది. దీంతో భవిష్యత్తులో ఎయిర్‌లైన్ సర్వీసులకు డిమాండ్ పెరుగుతందనే అంచనాలు ఉన్నాయి,. ఈ నేపథ్యంలో 70 ఫ్లైట్లలతో ఆకాశ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. -
గోఎయిర్ రిపబ్లిక్ డే సేల్ : బంపర్ ఆఫర్
సాక్షి,ముంబై: దేశీయ విమానయాన సంస్థ గోఎయిర్ రిపబ్లిక్ డే ఆఫర్‌ను ప్రకటించింది. దేశీయ ప్రయాణికుల కోసం సుమారు 10 లక్షల సీట్లను తగ్గింపు ధరలో అందిస్తోంది. టికెట్ ధరను రూ.859 (అన్నీ కలిపి) కే అందిస్తున్నట్లు గోఎయిర్ తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 31 మధ్య కాలంలో ప్రయాణించే ప్రయాణికులు జనవరి 22 నుంచి జనవరి 29 మధ్య టికెట్లను బుకింగ్ చేసుకున్న వాళ్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. ఈ చార్జీలు డైరెక్ట్ ఫ్లైట్లలో కేవలం ఒకవైపు ప్రయాణానికి మాత్రమేనని పేర్కొంది. అలాగే టికెట్ బుక్ చేసుకున్న తర్వాత 14 రోజుల లోపు ఏవైనా మార్పులు చేసినా చార్జీలు ఏవీ ఉండవనిసంస్థ తెలిపింది. -
వేతనాల వాయిదాపై గో ఎయిర్ వివరణ
సాక్షి, న్యూఢిల్లీ : ఉద్యోగులకు వేతనాలు అందించే పరిస్థితి లేదని తమ ఉద్యోగులకు మార్చి, ఏప్రిల్ వేతనాలను చెల్లించాల్సిన గో ఎయిర్ స్పష్టం చేసింది. ఏప్రిల్‌లో ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధించిన ఎయిర్‌లైన్ మరికొందరు ఉద్యోగులను సెలవుపై పంపించింది. బ్యాంకింగ్ వ్యవస్థ, ప్రభుత్వం నుంచి ఎలాంటి ఊరట లభించకపోవడంతో సిబ్బందికి తక్షణమే వేతనాలు చెల్లించేందుకు నిధులు లేవని గోఎయిర్ సీఎండీ నుస్లీ వాదియా, ఎండీ జే వాదియా ఉద్యోగులకు సంయుక్తంగా రాసిన లేఖలో పేర్కొన్నారు. ఎయిర్‌లైన్ కార్యకలాపాలు నిలిచిపోయినందున సంస్థ వద్ద నగదు నిల్వలు లేవని వెల్లడించారు. తమకు మారో మార్గం లేకున్నా మార్చి, ఏప్రిల్ నెల వేతనం చెల్లించాల్సి ఉందన్నారు. దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో విమానయాన సర్వీసులు నిలిచిపోవడంతో అన్ని విమానయాన రంగం తమ ఉద్యోగులకు వేతనాలు చెల్లించేందుకు సమస్యలు ఎదుర్కొంటున్నదని వివరించారు. మొత్తం ఉద్యోగుల్లో 40 శాతం మందికి పూర్తి వేతనాలు చెల్లించిన గో ఎయిర్ మిగిలిన ఉద్యోగులకు దశలవారీగా, వాయిదాల పద్ధతిలో చెల్లింపులు చేపడతామని పేర్కొంది. ఇక లాక్డౌన్ ఫలితంగానే పరిమిత వనరుల పరిస్థితి నెలకొందని, తమ చేతిలో లేని పరిస్థితులతోనే ఉద్యోగులకు ఇబ్బందులు నెలకొన్నాయని లేఖలో సంస్థ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. గో ఎయిర్ బోర్డు సభ్యులు, సీఎండీ సైతం వేతనాలు తీసుకోవడం లేదని లేఖ పేర్కొంది. ఇక అమెరికా, దక్షిణాసియా, మధ్యప్రాచ్య, యూరప్ దేశాల్లో ప్రభుత్వాలు, బ్యాంకింగ్ వ్యవస్థ అక్కడి విమానయాన సంస్థలు ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేలా ఆదుకున్నాయని వివరించింది. ఉద్యోగుల పరిస్థితిని మెరుగుపరిచి, ఎయిర్‌లైన్ మనుగడ కోసం తాము కూడా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని గో ఎయిర్ ఆ లేఖలో వెల్లడించింది. -
గోఎయిర్ ప్రయాణీకులకు తప్పని కష్టాలు..
సాక్షి, న్యూఢిల్లీ : గోఎయిర్ ప్రయాణీకులకు మంగళవారం వరుసగా రెండో రోజూ కష్టాలు తప్పలేదు. సిబ్బంది కొరత, విమానాలు అందుబాటులో లేకపోవడంతో రెండో రోజూ గోఎయిర్ 19 విమానాలను రద్దు చేసింది. విమానాల రద్దుతో పలు గమ్యస్ధానాలకు చేరాల్సిన ప్రయాణీకులు వివిధ నగరాల్లో చిక్కుకుపోయారు. సోమవారం ఇవే కారణాలు చూపుతూ గోఎయిర్ ఏకంగా 21 విమానాలను రద్దు చేయడంతో ఆఖరినిమిషంలో ప్రయాణ షెడ్యూల్ తారుమారు కావడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రతికూల వాతావరణం, వివిధ నగరాల్లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను సంస్థ కారణాలుగా చూపింది. కాక్‌పిట్ సిబ్బంది సమస్యలూ ప్రభావం చూపాయని పేర్కొంది. గోఎయిర్ ప్రతిరోజూ పలు దేశీ, విదేశీ గమ్యస్ధానాలకు రోజూ 200 విమాన సర్వీసులను నిర్వహిస్తోంది. విమానాలు, పైలట్లు అందుబాటులో లేకపోవడంతో గోఎయిర్ ఇప్పటివరకూ 19 విమానాలు రద్దు చేసిందని సంస్థ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, కొచ్చి, పట్నా, లక్నో సహా పలు గమ్యస్ధానాల నుంచి బయలుదేరాల్సిన విమానాలు రద్దయిన వాటిలో ఉన్నాయని తెలిసింది. -
హ్యాపీ బర్త్‌డే మమ్మీ.. ఐయామ్ సారి..!
ముంబై : తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఓ యువకుడు.. అనంతరం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నాగ్‌పూర్‌లో శుక్రవారం వెలుగుచూసింది. వివరాలు.. మంథన్ మహేంద్ర చావన్ (19) ప్రైవేటు విమానయాన సంస్థ గోఎయిర్‌లో గ్రౌండ్ స్టాఫ్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబంతో కలిసి చంద్రమణి నగర్లో నివాసముంటున్నాడు. గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేనిది చూసి సీలింగ్‌కు ఉరివేసుకుని తనువు చాలించాడు. అఘాయిత్యానికి పాల్పడేముందు తన తల్లి పుట్టినరోజు సందర్భంగా ఓ పేపర్‌పై ‘హ్యాపీ బర్త్‌డే మమ్మీ, ఐయామ్ సారి’అని రాసిపెట్టాడు. అతని తల్లి పోలీష్ ఆఫీసర్. ఆమె నాగ్‌పూర్ స్పెషల్ బ్రాంచ్‌లో పనిచేస్తున్నారు. తన కుమారుడు గత రెండు వారాలుగా జాండీస్‌తో బాధపడుతున్నాడని, సెలవుపై ఇంటివద్దనే విశ్రాంతి తీసుకుంటున్నాడని అతని తండ్రి చెప్పారు. చావన్ ఆత్మహత్యకు గల నిర్ధిష్ట కారణాలేంటో తెలియవని అన్నారు. పనిఒత్తిడి కారణంగానే యువకుడు ప్రాణాలు తీసుకుని ఉండొచ్చని అజ్నీ పోలీస్ ఇన్స్పెక్టర్ కైలాష్ మగార్ అనుమానం వ్యక్తం చేశారు. ఘటనాస్థలిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని, తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని రాసిపెట్టిన చీటీ మాత్రమే దొరికిందని వెల్లడించారు. విచారణ చేపట్టామని అన్నారు. చావన్ గత 9నెలలుగా తమ సంస్థలో ట్రెయినీ రాంప్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడని గో ఎయిర్ తెలిపింది. ఉద్యోగి మరణంపట్ల దిగ్భాంతి వ్యక్తం చేసింది. కంపెనీ నిబంధనల ప్రకారం చావన్ కుటుంబానికి రావాల్సిన బకాయిలన్నీ చెల్లిస్తామని తెలిపింది. -
గో ఎయిర్ డిస్కౌంట్ ఆఫర్
సాక్షి, ముంబై: బడ్జెట్ ధరల విమానయాన సంస్థ గో ఎయిర్ తక్కువ ధరల్లో దేశీయ విమాన టికెట్లను ప్రకటించింది. పరిమిత కాల ఆఫర్‌గా తీసుకొస్తున్న ఈ ఆఫర్లో రూ.1375 (అన్నీ కలుపుకొని) ప్రారంభ ధరగా టికెట్లను అందుబాటులోకి తెచ్చింది. ఏప్రిల్ 17 వరకు టికెట్ల కొనుగోలుకు అవకాశం ఉంది. ఇలా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా ప్రయాణించేందకు గడువు జూన్ 2019తో ముగియనుంది. అహ్మదాబాద్- బెంగళూరు, బెంగళూరు-పట్నా, కోలక్తతా-ముంబై, కోలకతా-పుణే తదితర మార్గాల్లో ఈ డిస్కౌంట్లు రేట్లు వర్తిస్తాయని గో ఎయిర్ తన అధికారిక వెబ్సైట్లో ప్రకటించింది. It’s time to take off on that summer vacation! 🌴☀🌊 #FlySmart with domestic fares starting at ₹1,375*. Book now: https://t.co/dWTOajy6vD pic.twitter.com/Qh4pg9aroz — GoAir (@goairlinesindia) April 13, 2019 -
అటు ధరల సెగ : ఇటు గోఎయిర్ డిస్కౌంట్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ : బడ్జెట్ ఎయిర్‌లైన్ గోఎయిర్ విమాన టికెట్ల ధరలను తగ్గించింది. జాతీయ, అంతర్జాతీయ రూట్లలో విమాన టికెట్లను తగ్గింపు ధరల్లో ఆఫర్ చేస్తున్నట్టు ప్రకటించించింది. డొమెస్టిక్ రూట్లలోరూ.1099 (అన్నిచార్జీలు కలుపుకొని), అంతర్జాతీయంగా రూ.4999 (అన్నిచార్జీలు కలుపుకొని) ప్రారంభ ధరలుగా ఆఫర్ చేస్తోంది. లిమిటెడ్ పీరియడ్ఆఫర్గా తీసుకొచ్చిన అవకాశం మార్చి4వ తేదీవరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అలాగే ఇలా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా సెప్టెంబరు 1వతేదీ దాకా ప్రయాణించవచ్చు. పూర్తి వివరాలను గో ఎయిర్ వెబ్సైట్లో పొందుపర్చింది. కాగా ఒక పక్క భారీగా పెరిగి విమాన ఇంధన ధరలు, మరో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో విమాన ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ ధరల సంస్థ తక్కువ ధరల్లో టికెట్లను ఆఫర్ చేయడం గమనార్హం. Planning your next trip? Book your flight tickets early and SAVE with fares starting as low as ₹1,099*. Hurry! Offer valid till 4th March 2019. pic.twitter.com/PsNPud7wdZ — GoAir (@goairlinesindia) March 2, 2019 -
మస్కట్‌కు డైరెక్ట్ ఫ్లైట్ : గోఎయిర్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ : విమానయాన రంగంలో నెలకొన్న పోటీ నేపథ్యంలో ఎయిర్‌లైన్ సంస్థలు ఆఫర్లతో ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా బడ్జెట్ ఎయిర్‌లైన్ గో ఎయిర్ అంతర్జాతీయ విమాన టికెట్లపై రాయితీ ధరలను ప్రకటించింది. ముఖ్యంగా కేరళలోని కన్నూరు -మస్కట్- కన్నూరు మధ్య నడిచే విమానాలకు ఈ ధరలు వర్తించనున్నాయి. ఫిబ్రవరి 28 నుంచి వారానికి మూడు (మంగళ, గురు, శని వారాల్లో) డైరెక్ట్ విమాన సర్వీసులను నడుపుతుంది. అన్ని చార్జీలు కలుపుకుని ఇంటర్నేషనల్ ఎయిర్ టికెట్ ధరలు (ఒకవైపు) రూ.4999 నుంచి ప్రారంభం అవుతాయని గో ఎయిర్ వెల్లడించింది. తక్షణమే అంటే ఈ రోజు (జనవరి 19) నుంచి ఈ డిస్కౌంట్ ధరల్లో టికెట్లు లభ్యమవుతాయని తెలిపింది. మరిన్ని వివరాలు గోఎయిర్ అధికారిక వెబ్సైట్లో లభ్యం. -
రూ.1,313కే గో ఎయిర్ టికెట్...
న్యూఢిల్లీ: బడ్జెట్ విమానయాన సంస్థ గోఎయిర్ రూ.1,313(అన్నీ కలుపుకొని) ధరకే విమాన టికెట్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ డిస్కౌంట్లో భాగంగా మొత్తం 13 లక్షల సీట్లను ఆఫర్ చేస్తున్నామని గోఎయిర్ తెలిపింది. ఈ టికెట్లకు బుకింగ్స్ ఈ నెల 5 నుంచే ఆరంభమయ్యాయని, ఈ నెల 18 వరకూ టికెట్లను బుక్ చేసుకోవచ్చని గోఎయిర్ సీఈఓ కార్నిలిస్ వీస్‌జివిక్ పేర్కొన్నారు. ఇలా బుక్ చేసుకున్న టికెట్లతో వచ్చే ఏడాది నవంబర్ 4 వరకూ ప్రయాణించవచ్చని వివరించారు. 2005, నవంబర్‌లో కార్యకలాపాలు ప్రారం భించామని, విమాన సర్వీస్‌లను ఆరంభించి 13 సంవత్సరాలైన సందర్భంగా 13 లక్షల సీట్లను ఈ ఆఫర్లో అందిస్తున్నామని వివరించారు. మరోవైపు జెట్‌ఎయిర్‌వేస్ సంస్థ తన దివాలీ ఆఫర్‌ను ఈ నెల 11 వరకూ పొడిగించింది. ఈ ఆఫర్లో భాగంగా ఈ కంపెనీ దేశీ, అంతర్జాతీయ విమాన టికెట్లపై 30 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. -
విదేశీ రూట్లలో గోఎయిర్ సేవలు..
ముంబై: దేశీ చౌక చార్జీల విమానయాన సంస్థ గోఎయిర్ తాజాగా అంతర్జాతీయ రూట్లలో సర్వీసులు ప్రారంభించనుంది. అక్టోబర్‌లో ముంబై–ఫుకెట్ రూట్లో డైలీ ఫ్లయిట్‌ను నడపనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి గురువారం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని, త్వరలోనే టికెట్ల బుకింగ్ ప్రారంభం కావొచ్చని వివరించాయి. వచ్చే ఏడాది మార్చికి మూడు లేదా నాలుగు విదేశీ ప్రాంతాలకు సేవలు ప్రారంభించవచ్చని సదరు వర్గాలు తెలిపాయి. ఫుకెట్ (థాయ్‌లాండ్) తర్వాత లిస్టులో మాలే (మాల్దీవులు) ఉంటుందని పేర్కొన్నాయి. 2005లో గోఎయిర్ కార్యకలాపాలు ప్రారంభించింది. రెండేళ్ల క్రితమే విదేశీ సర్వీసులకు అనుమతులు కూడా వచ్చాయి. గతేడాది అక్టోబర్‌లోనే ప్రారంభించాలని భావించినప్పటికీ కీలకమైన ఎయిర్‌బస్ ఏ320 నియో విమాన ఇంజిన్లలో సాంకేతిక లోపాల కారణంగా వాయిదాపడింది. గోఎయిర్ ప్రస్తుతం 23 ప్రాంతాలకు వారానికి 1,544 ఫ్లయిట్స్ నడుపుతోంది. కంపెనీ వద్ద 38 ఎయిర్‌బస్ ఏ320 విమానాలున్నాయి. -
గోఎయిర్ తగ్గింపు ధరలు : భారీ డీల్స్
సాక్షి, ముంబై: బడ్జెట్ క్యారియర్ గోఎయిర్ విమానయాన సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఫెస్టివల్ సీజన్స్ సేల్ పథకంలో దేశీయ విమాన టికెట్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. తన నెట్‌వర్గ్ అంతటా దాదాపు లక్షటికెట్లను ఈ తగ్గింపు ధర ఆఫర్లో విక్రయించాలని ప్లాన్ చేసింది. 1099 (అన్నీ కలిసిన) రూపాయల ప్రారంభ ధర వద్ద వన్‌వే విమాన టికెట్లను అందిస్తున్నట్టు తెలిపింది. ఈ ఆఫర్లో టికెట్ బుకింగ్ నేటి(ఆగస్టు 4,శనివారం) నుంచి మొదలైన ఆగస్టు 9వ తేదీవరకు అందుబాటులో ఉంటుంది. అలాగే ఇలా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా ఆగస్టు 4 నుంచి డిసెంబరు 31, 2018 దాకా ప్రయాణించవచ్చని కంపెనీ వెల్లడించింది. దీంతోపాటు కొన్ని ఇతర అదనపు ప్రయోజనాలను కూడా ఆఫర్ చేస్తోంది. గో ఎయిర్ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్‌ద్వారా బుక్ చేసినట్లయితే వినియోగదారులకు 3 వేల రూపాయల వరకు ప్రత్యేకమైన డిస్కౌంట్. ఇంకా పేటీఎం వాలెట్ ద్వారా చెల్లింపులు చేస్తే కనిష్టంగా 5శాతం లేదా 250 రూపాయలు, గరిష్టంగా 20శాతం లేదా 1,100 రూపాయల రాయితీ ఇస్తామని తెలిపింది. కాగా గోఎయిర్ దేశీయంగా అహ్మదాబాద్, బాగ్డోదర,బెంగళూరు, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గోవా, గువహతి, జైపూర్, జమ్మూ, కొచ్చి, కోల్‌కతా, లెహ్, లక్నో, ముంబై, నాగ్‌పూర్, పాట్నా, పోర్ట్ బ్లెయిర్, పూణే, రాంచీ, శ్రీనగర్, హైదరాబాద్ 23 మార్గాల్లో వారానికి 1544 విమాన సర్వీసులను అందిస్తోంది. -
ఆ సీఈవో మా డేటా దొంగలించారు
వోల్ఫ్‌గ్యాంగ్ ప్రోక్ స్కావియర్... ఒకప్పుడు గోఎయిర్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేశారు. ప్రమోటర్లతో నెలకొన్న వివాదాలతో ఆయన గోఎయిర్‌కు గుడ్‌బై చెప్పారు. గోఎయిర్ నుంచి వెళ్లిపోయిన స్కావియర్, దాని ప్రత్యర్థి కంపెనీ ఇండిగోలో జనవరి చివరి నుంచి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. అయితే అంతకముందు తమ సంస్థలో పనిచేసిన స్కావియర్, తమ డేటాను దొంగలించాడంటూ గోఎయిర్ ఆరోపిస్తోంది. అంతేకాక ఆయన నియామకంపై కూడా గోఎయిర్ బొంబై హైకోర్టు దావా దాఖలు చేసింది. ఈ దావాలో తమ రహస్య సమాచారాన్ని స్కావియర్ బహిర్గతం చేయకుండా నిరోధించాలని కోరింది. ఇద్దరు పోటీదారుల మధ్య పోరాటంలో స్కావియర్ను బలిపశువును చేస్తున్నారంటూ స్కావియర్ తరుఫున వాదిస్తున్న న్యాయవాది జనక్ ద్వారకాదాస్ ఆరోపిస్తున్నారు. గోఎయిర్‌లో చేరకముందు ఆస్ట్రేలియన్ అయిన స్కావియర్, జెట్ ఎయిర్వేస్లో పనిచేసేవారు. జూన్‌తో గోఎయిర్‌లో ముందుగా నిర్ణయించిన స్కావియర్ కాంట్రాక్ట్ ముగియబోతోంది. కానీ కొన్ని నెలల ముందు గానే ఆయను తన పదవికి రాజీనామ చేసేశారు. ప్రమోటర్లకు, స్కావియర్కు మధ్య నెలకొన్న వివాదాలే ఆయన రాజీనామాకు కారణమయ్యాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. స్కావియర్ వైదొలగడానికి కొన్ని రోజుల ముందు నుంచి కంపెనీ మేనేజ్మెంట్ నిర్మాణాన్ని మార్చి వేయడం ప్రారంభించింది. స్కావియర్ విదేశీ పైలెట్లను ఎక్కువగా నియమించుకుంటున్నారని గోఎయిర్ ప్రమోటర్లు ఎక్కువగా గుర్రుగా ఉండేవారని, ఆ విషయంలోనే వారికి వివాదాలు నెలకొన్నాయని ఫిబ్రవరిలో ఎకనామిక్ టైమ్స్ రిపోర్టు చేసింది. -
అతి తక్కువ ధరకే టికెట్లు: గోఎయిర్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ: విమానయాన సంస్థ గోఎయిర్ కూడా డిస్కౌంట్ ధరలో విమాన టికెట్లకు ఆఫర్ చేస్తోంది. అధికారిక వెబ్సైట్ (goair.in) అందించిన సమాచారం ప్రకారం అతితక్కువ ధరల్లో దేశీయ మార్గాల్లో టికెట్లను అందిస్తోంది. రూ.991 ప్రారంభధర (అన్నీకలుపుకుని)గా వివిధ మార్గాల్లో టికెట్లను ప్రకటించింది. ఈ ఆఫర్ ద్వారా టికెట్లను బుక్ చేసుకునే అవకాశం ఏప్రిల్ 5,2018 వరకు అందుబాటులో ఉంటుంది. అంతేకాదు ఈ ప్రత్యేక ఛార్జీల పథకంలో మరో ఆఫర్ కూడా ఉంది. గోఎయిర్యాప్లో ప్రోమో కోడ్ 'GOAPP10' ద్వారా బుక్ చేసుకున్న టికెట్లపై అదనంగా 10శాతం డిస్కౌంట్ పొందవచ్చు. హైదరాబాద్ - బెంగళూరు.. రూ.1699 బెంగళూరు- హైదరాబాద్.. రూ.2,034 అహ్మదాబాద్-ముంబై రూ.1608 బాగ్డోగ్ర- గువహతి.. రూ.991 గోవాహతి- బాగ్డోగ్రా.. రూ.1,346 పాట్నా- కోలకతా.. రూ.1,505 ప్రారంభధరలుగా ఉన్నాయి. -
600కి పైగా దేశీయ విమానాలు రద్దు
ముంబై : ఇండిగో, గోఎయిర్ కలిసి ఈ నెలలో 600కి పైగా దేశీయ విమానాలను రద్దు చేస్తున్నట్టు తెలిసింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌కు గురువారం ఈ ఎయిర్‌లైన్స్ సమర్పించిన షెడ్యూల్లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఇండిగో 488 విమానాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించగా.. గోఎయిర్ 138 విమానాలను రద్దు చేయబోతున్నట్టు తెలిసింది. రద్దు అయిన విమానాల జాబితాలను ఈ విమానయాన సంస్థలు తమ సంబంధిత వెబ్సైట్లలో పొందుపరిచాయి. ఈ రెండు విమానయాన సంస్థలు ప్రయాణికులకు ప్రత్యామ్నాయ విమానాలను ఆఫర్ చేస్తుండటంతో పాటు, మొత్తం నగదును రీఫండ్ చేస్తున్నాయి. ఈ రద్దుతో దాదాపు లక్ష మంది ప్రయాణికులు ప్రభావితం కానున్నారని తెలిసింది. వచ్చే నెల నుంచి వేసవి సెలవుల షెడ్యూల్ ప్రారంభం కాబోతుండటంతో, ఈ రద్దు ప్రభావం అప్పుడు కూడా ఉండబోతోంది. ఏప్రిల్‌లో విమానయాన సంస్థలకు ఎంతో డిమాండ్ ఉన్న ట్రావెల్ సీజన్. డిమాండ్ ఎక్కువగా ఉండి, విమానాల రద్దు ఉండటంతో, వచ్చే నెలలో విమానాల ధరలు పెరుగనున్నాయి. ఇండిగో, గోఎయిర్ కలిసి రోజూ 1200 విమానాలను నడుపుతున్నాయి. ఫ్రాట్, విట్నీ తయారు చేసిన ఇంజిన్లలో తలెత్తిన సమస్యల కారణంగా ఇరు సంస్థలు విమానాలను రద్దు చేసే నిర్ణయం తీసుకున్నాయి. మార్చి 15 నుంచి 31 మధ్యలో ఇండిగో 488 విమానాలను క్యాన్సిల్ చేయగా.. గోఎయిర్ మార్చి 15 నుంచి 22 వరకు 138 విమానాలను రద్దు చేసింది. -
రూ.991కే విమాన టిక్కెట్
న్యూఢిల్లీ : దేశీయ ఎయిర్‌లైన్ సంస్థ గోఎయిర్ అతి తక్కువ ధరకే విమాన టిక్కెట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద టిక్కెట్‌ను రూ.991కే విక్రయించనున్నట్టు పేర్కొంది. ఈ ఆఫర్ కింద కస్టమర్లకు గోఎయిర్ ఆఫర్ చేస్తున్న టిక్కెట్లను 2018 ఫిబ్రవరి 20 వరకు బుక్ చేసుకోవచ్చు. హెచ్డీఎఫ్సీ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకునే వారికి అదనంగా 10 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉండనుందని గోఎయిర్ వెబ్‌సైట్‌పేర్కొంది. అయితే 'GOHDFC10' ప్రోమో కోడ్‌ను కస్టమర్లు వినియోగించాల్సి ఉంటుంది. ''ఈ ఫిబ్రవరిలో అతి తక్కువ ధరలను ఎంజాయ్ చేయండి. రూ.991కే విమాన ప్రయాణాన్ని ఆస్వాదించండి. 'GOHDFC10' ప్రోమో కోడ్ వాడి హెచ్డీఎఫ్సీ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకున్న వారికి 10 శాతం తగ్గింపు లభిస్తోంది. 2018 ఫిబ్రవరి 20 వరకే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఇప్పుడే బుక్ చేసుకోండి'' అంటూ గోఎయిర్ తెలిపింది. బాగ్డోగ్ర నుంచి గౌహతికి విమాన టిక్కెట్ ధర రూ.991 నుంచి ప్రారంభమవుతోంది. గౌహతి నుంచి బాగ్డోగ్రకు టిక్కెట్ ధరను రూ.1,299కు, కొచ్చి నుంచి బెంగళూరుకు రూ.1,390కు, హైదరాబాద్ నుంచి చెన్నైకి రూ.1,399కు, కొచ్చి నుంచి చెన్నైకి రూ.1,540కి, పాట్న నుంచి రాంచికి రూ.1,560కు, చెన్నై నుంచి కొచ్చికి రూ.1,653కు, హైదరాబాద్ నుంచి బెంగళూరుకు రూ.1,731కు టిక్కెట్లను గోఎయిర్ ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్‌కు స్టాండర్డ్ క్యాన్సిలేషన్, రీబుకింగ్ పాలసీ అమల్లో ఉంటుంది. ఈ ఆఫర్ కింద పరిమిత సీట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. గ్రూప్ డిస్కౌంట్‌కు ఈ ఆఫర్ పనిచేయదు. ఇన్ఫాంట్ బుకింగ్‌కు ఇది అందుబాటులో ఉండదు. -
గో ఎయిర్ : ఫ్లై స్మార్ట్..డిస్కౌంట్స్
సాక్షి, ముంబై: బడ్జెట్ విమానయాన సంస్థ గో ఎయిర్ దేశీయ మార్కెట్లో డిస్కౌంట్ ధరల్లో టికెట్లను ఆఫర్ చేస్తోంది. దేశీయ రూట్లలోఈ టికెట్లను ఆఫర్ చేస్తోంది. వివిధ రూట్లలో టికెట్లపై రూ.2500 డిస్కౌంట్ ఆపర్ చేస్తున్నట్టు వెల్లడించింది. ఫ్లై స్మార్ట్ పేరుతో ఈ డిస్కౌంట్ రేట్లను అందిస్తోంది. ఇందుకుగాను జూమ్‌కార్, లెన్స్‌కార్ట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఫిబ్రవరి 10వరకు చేసుకునే బుకింగ్‌లకు ఆఫర్ వర్తించనుంది. ఇలా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా ఆగస్టు 10, 2018 వరకు ప్రయాణాలకు అనుమతి. అలాగే గో ఎయిర్ మొబైల్ యాప్ లేదా, వెబ్సైట్ ద్వారా చేసుకున్న జూమ్‌కార్ బుకింగ్‌పై 1200 రూపాయలు, లెన్స్‌కార్ట్‌పై వెయ్యి రూపాయల డిస్కౌంట్‌ను గో ఎయిర్ అందిస్తోంది. దీంతో పాటు GOAPP10 ప్రోమోకోడ్ పై 10శాతం అదనపు డిస్కౌంట్ కూడా ఉంది. నోట్: ఫిబ్రవరి 23, మార్చి 4, ఏప్రిల్ 4, ఏప్రిల్ 15, జూలై 15, 2018 తేదీలకు ఈ ఆఫర్ వర్తించదని గోఎయిర్ వెల్లడించింది. Vacation mode ON! ✔#FlySmart from Mumbai at fares starting Rs 1844*. Book now: https://t.co/C1GFSeRXtz pic.twitter.com/D85CMAGe7K — GoAir (@goairlinesindia) February 1, 2018 -
‘రిపబ్లిక్ డే’ ఆఫర్లే ఆఫర్లు!
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ విమానయాన సంస్థ ‘ఇండిగో’, త్వరితగతి వృద్ధి పథంలో దూసుకెళ్తోన్న మరో ఎయిర్‌లైన్స్ ‘గోఎయిర్’ రెండూ కూడా రిపబ్లిక్ డే ఆఫర్ల జాబితాలోకి చేరాయి. సోమవారమే స్పైస్‌జెట్ ఈ ఆఫర్లు ప్రకటించగా... మంగళవారం ఇవి కూడా తమ డిస్కౌంట్ ఆఫర్ల వివరాలు వెల్లడించాయి. ఇండిగో..: ఈ విమానయాన సంస్థ రిపబ్లిక్ డే సందర్భంగా రూ.797 ప్రారంభ ధరతో ప్రయాణికులకు విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. జనవరి 25 వరకు అందుబాటులో ఉండే ఈ ఆఫర్లో భాగంగా టికెట్లు బుక్ చేసుకున్నవారు ఏప్రిల్ 15 వరకు ఎప్పుడైనా ప్రయాణించొచ్చు. ఎంపిక చేసిన ఫ్లైట్స్‌కు, పరిమిత సంఖ్యలో సీట్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. అంటే ఆఫర్లోని సీట్లు భర్తీ అయితే అప్పుడు టికెట్ బుకింగ్‌కు సాధారణ చార్జీలే వర్తిస్తాయి. ఇక గ్రూప్ బుకింగ్స్‌కు ఆఫర్ వర్తించదు. గోఎయిర్..: ఈ ఎయిర్‌లైన్స్ సంస్థ రూ.1,326 ప్రారంభ ధరతో టికెట్లను ఆఫర్ చేస్తోంది. జనవరి 28 వరకు అందుబాటులో ఉండనున్న ఈ డిస్కౌంట్ ఆఫర్లో భాగంగా టికెట్లను బుక్ చేసుకున్నవారు ఈ ఏడాది మార్చి 1 నుంచి డిసెంబర్ 31 వరకు మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రయాణించొచ్చు. కాగా డిస్కౌంట్ ఆఫర్ పరిమిత సంఖ్యలో సీట్లకు మాత్రమే వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. ఇక అదనంగా ప్రతి టికెట్ బుకింగ్‌పై రూ.2,500 విలువైన ప్రయోజనాలు పొందొచ్చని పేర్కొంది. -
గో ఎయిర్ సంక్రాంతి కానుక
సాక్షి, న్యూఢిల్లీ: విమానయాన సంస్థ గో ఎయిర్ డిస్కౌంట్ ధరల్లో విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. అన్ని చార్జీలు కలుపుకొని రూ.1157లకే టికెట్లను అందిస్తున్నట్టు ప్రకటించింది. ఫ్లై స్మార్ట్, సేవ్ మోర్ స్కీం కింద ఈ ఆఫర్ తీసుకొచ్చింది. ముఖ్యంగా పండగసీజన్, న్యూ ఇయర్, లాంగ్ వీకెండ్ సందర్భంగా తమ కస్టమర్లకు గొప్ప అనుభవాన్ని అందించాలని భావిస్తున్నామని గో ఎయిర్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. ఈ డిస్కౌంట్ పాటు గోఎయిర్ యాప్ ద్వారా టికెట్లను బుక్ చేసుకుంటే 10శాతం అదనపు తగ్గింపుకూడా లభ్యం. ఇలా వన్ వేలో రూ.250 తగ్గింపును, రిటర్న్ టికెట్ బుకింగ్‌పై 500 ఆఫర్ చేస్తోంది. జనవరి 22 తో ఈ ఆఫర్ బుకింగ్స్ ముగుస్తాయి. ఇలా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా 1, ఫిబ్రవరి నుంచి 15,ఏప్రిల్‌దాకా ప్రయాణించవచ్చు. గోఎయిర్ వెబ్ సైట్ ప్రకారం హైదరాబాద్-లక్నో రూ. 3002, హైదరాబాద్ -అహ్మదాబాద్ రూ. 3362, లక్నో-హైదరాబాద్ టికెట్ ధర రూ. 3574 గాను నిర్ణయించింది. అలాగే లక్నో-ఢిల్లీ టికెట్ రూ .1,455, ఢిల్లీ-లక్నో రూ .1,588, బెంగళూరు-కొచ్చి రూ .1703, పుణె-బెంగళూరుకు రూ .2,196, గౌహతి-కోల్‌కతా రూ. 2,244, పుణె-అహ్మదాబాద్ రూ .2405 , ఢిల్లీ-పాట్నా రూ .3,104 ధరల్లో టికెట్లను అందిస్తోంది. వీటితో పాటు ఇతర మార్గాల్లో అందిస్తున్న తగ్గింపు ధరల వివరాలను వెబ్సైట్లో పొందుపర్చింది. సాధారణ కాన్సిలేషన్, రీ బుకింగ్ ఈ చార్జీలు వర్తిస్తాయి. గ్రూప్ బుకింగ్‌లకు ఈ తగ్గింపు వర్తించదని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. Make the most of your long weekend. Fly Smart from Delhi at our lowest fares only on GoAir.in and mobile app. Book now: https://t.co/yVdvutXhdl pic.twitter.com/e56Ku0xlRa — GoAir (@goairlinesindia) January 12, 2018 -
గోఎయిర్ భారీ డిస్కౌంట్
ముంబై : దేశీయ ఎయిర్‌లైన్ సంస్థ గో ఎయిర్ భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. పరిమిత కాల ఆఫర్లో భాగంగా ఎంపిక చేసిన మార్గాలకు అతి తక్కువకు రూ.312కే టిక్కెట్లను విక్రయిస్తోంది. ఢిల్లీ, కొచ్చి, బెంగళూరులను కలుపుకుని ఏడు నగరాలకు వన్-వే జర్నీకి ఈ టిక్కెట్ ధరలను ఆఫర్ చేస్తుంది. శుక్రవారం నుంచి బుక్ చేసుకునే టిక్కెట్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఫస్ట్-కమ్-ఫస్ట్ సర్వ్డ్ బేసిస్‌లో, పరిమిత కాల వ్యవధిలో ఈ ఆఫర్ అందించనున్నట్టు గోఎయిర్ విమానయాన సంస్థ ప్రకటించింది. ఈ డిస్కౌంట్ ధరల్లో పన్నులను కలుపలేదు. డిసెంబర్ 1 నుంచి వచ్చే ఏడాది అక్టోబర్ 28 వరకు ప్రయాణాలకు ఇది వాలిడ్‌లో ఉండనుంది. నేటి నుంచి నవంబర్ 29 వరకు ఈ ఆఫర్‌పై టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. న్యూఢిల్లీ, కొచ్చి, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్, లక్నో మార్గాలకు ఈ ప్రత్యేక ధరలు అందుబాటులో ఉండనున్నాయి. -
రూ.999కే విమాన టిక్కెట్
బడ్జెట్ క్యారియర్ గో ఎయిర్ తాజాగా 'ప్రీ-మాన్ సూన్' సేల్ ను ప్రకటించింది. ఈ సేల్ కింద ఎంపికచేసిన దేశీయ రూట్లలో 999 రూపాయలకే విమాన టిక్కెట్ అందించనున్నట్టు పేర్కొంది. 48 గంటలు లేదా రెండు రోజులు అందుబాటులో ఉండే ఈ గోఎయిర్ సేల్ జూలై 1 నుంచి అక్టోబర్ 31 మధ్యలోని ప్రయాణాలకు వర్తించనుందని ఎయిర్ లైన్స్ తెలిపింది. జూన్ 4కు ఈ ఆఫర్ ముగుస్తుంది. ఈ ఆఫర్ ను మిగతా ఏఇతర సేల్ తో కలుపబోమని ఎయిర్ లైన్ చెప్పింది. గ్రూప్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉండదని పేర్కొంది. ఈ స్పెషల్ ప్రమోషనల్ ధరల కింద టిక్కెట్ బుక్ చేసుకున్న వారు, తర్వాత క్యాన్సిల్ చేసుకుంటే ఆ మొత్తాన్ని రీఫండ్ చేయమని కూడా స్పష్టంచేసింది. ఈ ఆఫర్ కింద ఎన్ని సీట్లను అందుబాటులో ఉంచుతుందో కూడా గోఎయిర్ ప్రకటించలేదు. ఫస్ట్-కమ్-ఫస్ట్-సర్వ్డ్ బేసిస్ లో సీట్లను అందుబాటులో ఉంచే అవకాశముంటుంది. గో ఎయిర్ ప్రస్తుతం 23 ప్రాంతాలకు 140 డైలీ విమానాలను, సుమారు 975 వీక్లి విమానాలను నడుపుతోంది. దేశంలో విమాన ప్రయాణికుల ట్రాఫిక్ మార్చి నెలలో 14.6 శాతం వృద్ధి నమోదుకాగ ఏప్రిల్ నెలలో 15.3 శాతానికి పెరిగిందని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్టు అసోసియేషన్ డేటా తెలిపింది. 48 Hour Pre-monsoon Sale! Fares starting from ₹999*. Travel Period: 1st July – 31st Oct’17. Hurry! Book now - https://t.co/T9wm0iMdZl pic.twitter.com/JOtDa3vfAp — GoAir (@goairlinesindia) June 2, 2017 -
గోఎయిర్ ‘999’ ఆఫర్
ముంబై: కస్టమర్ల ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా దేశీ విమానయాన సంస్థ ‘గోఎయిర్’ తాజాగా పరిమిత కాల టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా సంస్థ విమాన టికెట్లను రూ.999 నుంచి ఆఫర్చేస్తోంది. డిసెంబర్ 31 వరకూ అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్లో టికెట్లను బుక్ చేసుకున్న వారు 2017 జనవరి 9 –ఏప్రిల్ 15 మధ్య ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చని కంపెనీ పేర్కొంది. కాగా రూ.999 ఆఫర్కేవలం గోఎయిర్ నెట్వర్క్స్ (గోఎయిర్ వెబ్సైట్, గోఎయిర్ టికెటింగ్ కౌంటర్స్, గోఎయిర్ కాల్ సెంటర్, ట్రావెల్ ఏజెంట్స్)లో మాత్రమే అందుబాటులో ఉంటుందని వివరించింది. -
గో ఎయిర్ 'క్రిస్మస్ క్యాంపెయిన్' ధరలు
న్యూఢిల్లీ: క్రిస్మస్, న్యూ ఇయర్ ఆఫర్ల సందడి మొదలైంది. వరుసగా విమానయానసంస్థలు భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా డొమెస్టిక్ క్యారియర్ గో ఎయిర్ వినియోగదారులకు తగ్గింపు ధరలను ఆఫర్ చేస్తోంది. "క్రిస్మస్ క్యాంపెయిన్'' ఆఫర్ లో భారీ తగ్గింపు ధరలను అందిస్తోంది. 23 సెక్టార్స్ లో సేవలు అందిస్తున్న గో ఎయిర్ తన ఎంటైర్ నెట్వర్కులో పరిమిత కాలానికి రూ.999 లనుంచి ప్రారంభ ధరలను బుధవారం ప్రకటించింది. ఈరోజు (21 డిసెంబర్) నుంచి డిసెంబర్ 1 వరకు ఈ తగ్గింపుధరల టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని తెలిపింది. "క్రిస్మస్ క్యాంపెయిన్'' ఆఫర్ లో అన్ని చార్జీలు కలుపుకొని ఈ తగ్గింపు ధరల్ని ఆఫర్ చేస్తోంది. ఇలా బుక్ చేసుకున్న టికెట్ల తో జనవరి 9 నుంయి ఏప్రిల్ 15, 2017 ప్రయాణ అవకాశం కల్పిస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. రూ. 999 ఆఫర్ ప్రత్యేకంగా గోఎయిర్ నెట్ వర్క్స్ (గోఎయిర్ వెబ్సైట్, గో ఎయిర్ టికెట్ కౌంటర్లు, గోఎయిర్ కాల్ సెంటర్ మరియు ట్రావెల్ ఏజెంట్లు) అంతటా అందుబాటులో ఉన్నట్టు తెలిపింది. పరిమితమై సీట్లు అందుబాటులో ఉన్నాయని, ఫస్ట్ కం ఫస్ట్ సెర్వ్ ప్రాతిపదికన టికెట్లు కేటాయిస్తామని తెలిపింది. -
‘విస్తారా’, గోఎయిర్ డిస్కౌంట్ ఆఫర్లు
న్యూఢిల్లీ: విస్తారా, గోఎయిర్ విమానయాన సంస్థలు తక్కువ ధరలకు విమానయానాన్ని ఆఫర్ చేస్తున్నాయి. విస్తారా రూ.999కు, గోఎయిర్ రూ.736కు విమాన టికెట్లను ఆఫర్ చేస్తున్నాయి. ‘సెలెబ్రేషన్ సేల్’’ పేరుతో అందిస్తున్న తమ ఆఫర్ కోసం బుధవారం నుంచి శుక్రవారం అర్థరాత్రి (ఈ నెల 25) వరకూ టికెట్లు బుక్ చేసుకోవచ్చని విస్తారా వెల్లడించింది. వచ్చే నెల 5 నుంచి వచ్చే ఏడాది అక్టోబర్ 1 లోపు ప్రయాణాలు చేయాల్సి ఉంటుందని, ఎకానమీ క్లాస్‌కు ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. గోఎరుుర్ విమానయాన సంస్థ తక్కువ ధరకే, రూ.736 ధరకు విమాన సర్వీసులను ఆఫర్ చేస్తోంది. అన్ని రూట్లలో వర్తించే ఈ ఆఫర్‌కు నేటి వరకూ (ఈ నెల 24న) టికెట్లు బుక్ చేసుకోవచ్చని గో ఎరుుర్ సంస్థ తెలిపింది. ఈ ఆఫర్‌తో వచ్చే ఏడాది జనవరి 9 నుంచి మార్చి 31 వరకూ ప్రయాణించవచ్చని పేర్కొంది. రూ.500, రూ.1,000 నోట్లు నేటి అర్థరాత్రి వరకూ తమ టికెట్ కౌంటర్లలో చెల్లుతాయని వివరించింది. -
రూ.611కే గోఎయిర్ టిక్కెట్
విమానయాన సంస్థలు అందించే సీజన్ టిక్కెట్లు కొనడం చేజారినవని బాదపడుతున్నారా..? అయితే ఎలాంటి దిగులు అవసరం లేదట. వాదియా గ్రూప్‌కు చెందిన లో-కాస్ట్ విమానయాన సంస్థ గోఎయిర్ ఆకర్షణీయమైన డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రయాణికుల ముందుకు తీసుకొచ్చింది. 11వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, రూ.611కే విమాన టిక్కెట్‌ను అందించనున్నట్టు పేర్కొంది. నవంబర్ 4 తేదీ నుంచి 8వ తేదీ మధ్యలో ప్రయాణికులు ఈ టిక్కెట్లను బుక్ చేసుకోవాలని తెలిపింది. 2017 జనవరి 11 నుంచి 2017 ఏప్రిల్ 11వరకున్న ట్రావెల్ కాలంలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని గోఎయిర్ ప్రకటించింది. రూ.611 ప్రారంభ టిక్కెట్ ధరలో కేవలం బేస్ ఛార్జీలు, ప్యూయెల్ సర్ఛార్జీలు మాత్రమే కలిసి ఉండనున్నాయి. ప్రస్తుతం అందుబాటులోఉన్న నియమాల ప్రకారం పన్నులు, టిక్కెట్ ధరకు ఎక్కువగా ఉండొచ్చని తెలుస్తోంది. డిస్కౌంట్లు మాత్రమే కాక, ఇతర డిస్కౌంట్లను కూడా ప్రయాణికులు పొందవచ్చు. ప్రతి 11వ కస్టమర్, ఉచిత టిక్కెట్‌ను, 111వ కస్టమర్ అన్ని లెమన్ ట్రీ హోటల్ స్టేలో 40 శాతం డిస్కౌంట్‌ను, 1,111వ కస్టమర్ తిరుగు ప్రయాణ టెక్కెట్స్తో పాటు, రెండు రాత్రులు హోటల్స్‌లో గడిపే అవకాశాలను గెలుపొందవచ్చు. అయితే కొన్ని ట్రావెల్ సెక్టార్లలో మాత్రం ఈ ఆఫర్ వర్తించదు అవి.. ముంబాయి-పోర్ట్ బ్లెయిర్- ముంబాయి బెంగళూరు-పోర్ట్ బ్లెయిర్-బెంగళూర్ చెన్నై-పోర్ట్ బ్లెయిర్-చెన్నై ఢిల్లీ-లెహ్-ఢిల్లీ ముంబాయి-లెహ్-ముంబాయి కోల్కత్తా-పోర్ట్ బ్లెయిర్-కోల్కత్తా ఢిల్లీ-పోర్ట్ బ్లెయిర్-ఢిల్లీ -
హైదరాబాద్ నుంచి గోఎయిర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : విమానయాన రంగ సంస్థ గోఎయిర్ తాజాగా తన సర్వీసులను హైదరాబాద్ నుంచి ప్రారంభిస్తోంది. అక్టోబరు 12 నుంచి ఈ సేవలు మొదలు కానున్నాయి. దీంతో సంస్థకు భాగ్యనగరి 23వ నగరం కానుంది. హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, భువనేశ్వర్, కోక్కత నగరాలకు ప్రతిరోజు నాన్ స్టాప్ సర్వీసులను గోఎయిర్ నడుపనుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు మీదుగా పోర్ట్‌బ్లెయిర్‌కు ఫ్లైట్స్ ప్రారంభించనుంది. ప్రస్తుతం గోఎయిర్ నుంచి ప్రతిరోజు 144 సర్వీసులు నడుస్తున్నాయి. డిసెంబరు చివరికల్లా ఈ సంఖ్య 184కు చేరుకోనుందని కంపెనీ తెలిపింది. -
గో ఎయిర్ భారీ ఆఫర్
న్యూఢిల్లీ: విమాయాన సంస్థల ఆఫర్ల వరద కురుస్తోంది. వరుసగా వర్షాకాల బొనాంజా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా ప్రముఖ విమానయాన సంస్థ గో ఎయిర్ రానున్న సీజన్ ను దృష్టిలో పెట్టుకుని బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. తక్కువ ధరకే విమాన టిక్కెట్లను ఆఫర్ చేసి విమాన ప్రయాణీకులను ఊరిస్తోంది. పరిమిత కాలానికి రూ.849 నుంచి ప్రారంభమయ్యే ధరలను ప్రవేశపెట్టింది. ఈ ప్రత్యేక ఆఫర్ కింద జూన్ 29 నుంచి జూలై 2వ తేదీ మధ్యలో టికెట్స్ బుక్ చేసుకోవాలి. ఇలా బుక్ చేసుకున్నవారు జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 లోగా ప్రయాణించాల్సి ఉంటుంది. అలాగే ఈ స్కీం కింద బుక్ చేసుకున్న టికెట్లను రద్దుచేసుకునే అవకాశం లేదని గో ఎయిర్ వెల్లడించింది. దీంతోపాటుగ పేటీఎం ద్వారా ఈ చెల్లింపులు చేస్తే...10 శాతం క్యాష్ బ్యాక్ ను ఆఫర్ చేస్తోంది. అలాగే ప్రీ మీల్స్ బుకింగ్ కింద 60 శాతం తగ్గింపు, 200 రూపాయలు విలువచేసే కేఫ్ కాఫీడే వోచర్ ఆఫర్ ను కూడా అందిస్తోంది. -
చిన్న రన్‌వేలపై రిస్క్ తీసుకోవద్దు
న్యూఢిల్లీ: చిన్న రన్వేలు కలిగిన జమ్మూ, పాట్నాలకు పూర్తి లోడ్‌తో విమానాలు నడుపుతున్న ఇండిగో, స్పైస్‌జెట్, గోఎయిర్లపై ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. తీరు మార్చుకోకపోతే వాటి కార్యకలాపాలను నిలిపేస్తామని హెచ్చరించింది. డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఈ మేరకు శుక్రవారం ఆయా కంపెనీలకు నోటీసులు జారీచేసింది. దీనిపై శనివారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. చిన్న రన్వేలు కలిగిన ఎయిర్‌పోర్టులకు 20 శాతం తక్కువ లోడ్‌తో విమానాలు నడపాల్సి ఉందని అధికార వర్గాలు తెలిపాయి. నిబంధనల ప్రకారం ఆ రెండు ఎయిర్‌పోర్టుల్లో ల్యాండ్ అయ్యే విమానాల్లో ప్రయాణీకుల సంఖ్య 150-155 వరకు ఉండాలి. కానీ, ఈ కంపెనీలు ఒక్కో విమానంలో 170-180 మంది పాసెంజర్లను తరలిస్తున్నాయి. ఈ వ్యవహారంపై స్పందించడానికి మూడు కంపెనీల ప్రతినిధులు నిరాకరించారు. లోడ్ పరిమితి నిబంధనలను ఈ కంపెనీలు ప్రతిరోజూ ఉల్లంఘిస్తున్నాయనీ, తద్వారా ప్రయాణీకుల భద్రతకు నీళ్లొదులుతున్నారనీ అధికార వర్గాలు వ్యాఖ్యానించాయి. -
మగువలూ.. మీకోసమే..!
న్యూఢిల్లీ/ముంబై: అంతర్జాతీయ మహిళా దినోత్సవం (శనివారం) సందర్భంగా వివిధ కంపెనీలు వివిధ ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. టాటా మోటార్స్, ముత్తూట్ ఫైనాన్స్, గూగుల్‌తో పాటు దేశీయ విమానయాన సంస్థలు మహిళల కోసం ఆకర్షణీయ ఆఫర్లను, డిస్కౌంట్లను అందిస్తున్నాయి. జెట్.. డిస్కౌంట్ ఆఫర్ మహిళలకు విమాన టికెట్లపై డిస్కౌంట్లనందిస్తోంది. ఈ నెల 8 నుంచి మే 8 మధ్య బుక్ చేసుకునే టికెట్లకు ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. ఈ టికెట్ల వ్యాలిడిటీ 11 నెలలు. ఈ ఆఫర్లో భాగంగా అంతర్జాతీయ రూట్లలో బేసిక్ చార్జీల్లో 10% డిస్కౌంట్ పొందొచ్చు. దేశీ రూట్లలోనైతే ఫ్యూయల్ సర్‌చార్జీపై 10% డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ జెట్ ఎయిర్వేస్, జెట్ కనెక్ట్ కంపెనీలకు కూడా వర్తిస్తుంది. కాగా గో ఎయిర్ కూడా మహిళా ప్రయాణికుల కోసం రూ.999కే బిజినెస్ క్లాస్‌కు అప్‌గ్రేడ్ అయ్యే స్కీమ్‌ను ఆఫర్ చేయడం తెలిసిందే. ఎయిరిండియా ‘మహిళా’ ఫ్లైట్లు... మహిళా దినోత్సవం సందర్భంగా గతంలో అంతా మహిళా సిబ్బంది ఉండే విమానాలను ఈ సంస్థ నడిపింది. ఈ ఏడా ది కూడా అలా చేయాలని ప్రయత్నాలు చేస్తోంది. విమానాలు నడపడం వంటి కష్టసాధ్యమైన పనులను చేయడంలో మహిళలు పురుషులకు ఏ మాత్రం తీసిపోరనే సందేశాన్నివ్వడం కోసం ఇలా చేస్తున్నామని ఎయిరిండియా పేర్కొంది. గూగుల్... రూ.6 కోట్లు టెక్నాలజీ రంగంలో మరింత మంది మహిళలకు ఆసక్తి కలిగించేందుకు ఇంటర్నెట్ సెర్చిం జన్ దిగ్గజం గూగుల్ నడుంబిగిస్తోంది. ఇందుకోసం రూ. 6 కోట్ల వరకూ పెట్టుబడులు పెడుతోంది. గూగుల్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా ‘షార్ప్ 40 ఫార్వార్డ్’ పేరుతో గూగుల్ ఈ ప్రయత్నాలు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 40 సంస్థలను ఎంపిక చేసి, మహిళా ఎంటర్ప్రెన్యూర్లకు మరింత ప్రోత్సాహాన్నిచ్చే దిశగా ఈ ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొంది. భారత్ నుంచి నాస్కామ్ 10,000 స్టార్టప్స్, జాగృతి యాత్ర సంస్థలు ఎంపికయ్యాయి. న్యూ ఇండియా ‘ఆశా కిరణ్’ ఆరోగ్య బీమా... మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వరంగ సాధారణ బీమా కంపెనీ న్యూ ఇండియా అష్యూరెన్స్ ‘ఆశా కిరణ్’ పేరుతో ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. కేవలం అమ్మాయిలు పిల్లలుగా ఉన్న కుటుంబాల కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు కంపెనీ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇలాంటి పిల్లల పేరుమీద పాలసీలు తీసుకుంటే ప్రీమియంలో 50 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు న్యూ ఇండియా సీఎండీ జి.శ్రీనివాసన్ తెలిపారు. తల్లిదండ్రులకు ఏమైనా ప్రమాదం జరిగితే బీమా మొత్తాన్ని పిల్లల పేరు మీద డిపాజిట్ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. మహిళా బ్యాంక్- టాటా రుణాలు మహిళా వినియోగదారులకు వాహన రుణాలివ్వడం కోసం భారతీయ మహిళా బ్యాంక్‌తో టాటా మోటార్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా అర్హులైన మహిళా వినియోగదారులకు టాటా కార్లు, యుటిలిటి వాహనాల కొనుగోళ్ల కోసం భారతీయ మహిళా బ్యాంక్ 10.5 శాతం వడ్డీరేటుకే రుణాలందిస్తుందని టాటా మోటార్స్ పేర్కొంది. రుణ కాలపరిమితి ఏడేళ్ల వరకూ ఉంటుందని, వాహనం విలువలో గరిష్ట మొత్తం బ్యాంక్ రుణంగా అందించగలదని, దేశవ్యాప్తంగా ఉన్న 12 భారతీయ మహిళా బ్యాంక్ బ్రాంచీల్లో ఈ రుణాలు అందుబాటులో ఉంటాయని వివరించింది. ప్రస్తుతం తమ మొత్తం వినియోగదారుల్లో మహిళల సంఖ్య 11 శాతంగా ఉందని, ఈ తాజా ఒప్పందంతో ఈ సంఖ్య మరింతగా పెరగగలదని టాటా మోటార్స్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ ఒప్పందం బ్యాంక్‌కు, టాటా మోటార్స్ కంపెనీకి కూడా ప్రయోజనకరమేనని భారతీయ మహిళా బ్యాంక్ సీఎండీ ఉషా అనంతసుబ్రమణ్యన్ వ్యాఖ్యానించారు. తక్కువ రేట్లకే ముత్తూట్ రుణాలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు తక్కువ రేట్లకే రుణాలిస్తామని ముత్తూట్ ఫైనాన్స్ పేర్కొంది. బంగారం తనఖాగా ఏడాది కాలానికి రూ.50 వేల లోపు రుణాలను 12% వడ్డీకే అందిస్తామని పేర్కొంది. సాధారణంగా రూ.50 వేల లోపు రుణాలకు 14% వడ్డీరేటు వసూలు చేస్తామని, మహిళా దినోత్సవం సందర్భంగా 2% తక్కువకే ఈ రుణాలిస్తున్నట్లు పేర్కొంది. బంగారం విలువలో 71% వరకూ రుణమిస్తామని తెలిపింది. దేశవ్యాప్తంగా తమ 3,829 బ్రాంచీల్లో ఈ నెల 15 వరకూ ఆఫర్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. -
దిగొచ్చిన విమానం..!
న్యూఢిల్లీ: అధిక చార్జీల కారణంగా ప్రయాణికులు తగ్గిపోతూ... ఉన్న ప్రయాణికులు కూడా సింహభాగం కొన్ని ఎయిర్‌లైన్స్‌నే ఆశ్రయిస్తుండటంతో కంపెనీలు మరోసారి ధరల పోరుకు తెరతీశాయి. ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండే జనవరి-మార్చి మధ్య కాలంలో ఈసారి కూడా ఎయిర్‌లైన్స్ కంపెనీలు డిస్కౌంట్ ఆఫర్లతో తెరమీదికొచ్చాయి. బేస్ ఫేర్, ఇంధన సర్‌చార్జీలను 50 శాతం తగ్గిస్తున్నట్లు సన్ గ్రూప్‌నకు చెందిన స్పైస్‌జెట్ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన కాసేపటికే... ఇండిగో, గోఎయిర్, ఎయిర్ ఇండియా సంస్థలు కూడా ఇలాంటి ఆఫర్లనే అందుబాటులోకి తెచ్చాయి. ఎయిర్ ఇండియా ‘స్ప్రింగ్‌సేల్’... డిస్కౌంట్ అనంతరం కొన్ని రూట్లలో ఎయిర్ ఇండియా టికెట్ ప్రారంభ ధర పన్నులతో కలిపి రూ.1,357 స్థాయిలో ఉంది. సాధారణ రోజుల్లో చార్జీలతో పోలిస్తే ఇది 70 శాతం తక్కువ. ‘స్ప్రింగ్‌సేల్’ పేరుతో ఎయిర్ ఇండియా ప్రారంభిస్తున్న డిస్కౌంట్ సేల్ నేటి (బుధవారం) నుంచి ప్రారంభమై శుక్రవారం అర్ధరాత్రి వరకు కొనసాగుతుంది. ఈ టికెట్లు కొన్నవారు ఫిబ్రవరి 21 నుంచి ఏప్రిల్ 15లోగా ప్రయాణించాల్సి ఉంటుంది. తమ నెట్‌వర్క్‌లోని అన్ని రూట్లలోనూ రాయితీ చార్జీలు వర్తిస్తాయని ఎయిర్ ఇండియా వెల్లడించింది. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్లైన్లోనూ టికెట్లు బుక్ చేసుకోవచ్చని వివరించింది. స్పైస్‌జెట్... 50 శాతం బేస్ ఫేర్‌తో పాటు ఇంధన సర్‌చార్జీలను సగానికి తగ్గించామని స్పైస్‌జెట్ ప్రకటించింది. ప్రయాణ తేదీకి కనీసం 30 రోజుల ముందు టికెట్ బుక్ చేసుకోవాలని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఎయిర్‌లైన్ కంపెనీలు ఈ సీజన్లో ఇలాంటి ఆఫర్ల సాయంతో సీట్లను భర్తీ చేస్తుంటాయని, డిస్కౌంట్లు ఇచ్చి ప్రయాణికులను ఆకట్టుకోకపోతే ఆ సీట్లు ఖాళీగానే ఉంటాయని స్పైస్‌జెట్ ప్రతినిధి తెలిపారు. మంగళవారం ప్రారంభమైన చార్జీల రాయితీ మూడు రోజులపాటు అమల్లో ఉంటుంది. అంటే గురువారం రాత్రి 12 గంటల్లోపు బుక్ చేసుకునే టికెట్లపైనే డిస్కౌంట్ వర్తిస్తుంది. ‘ఈ ఆఫర్ దేశంలోని కొన్ని నగరాలకే పరిమితం. అంతర్జాతీయ పర్యటనలపై డిస్కౌంటు ఉండకపోవచ్చు...’ అని సన్ గ్రూప్ సీఎఫ్ఓ నారాయణన్ చెప్పారు. రాయితీ చార్జీలతో కంపెనీ ఆదాయంపై ఎలాంటి ప్రభా వం పడబోదన్నారు. ఆఫర్లో భాగంగా ఏప్రిల్ 15వ తేదీ లోపు ప్రయాణించగలిగే టికెట్లు మాత్రమే లభ్యమవుతాయన్నారు. ఇండిగో, గో ఎయిర్ కూడా... ఇండిగో, గో ఎయిర్ అధికారికంగా ఇంకా డిస్కౌంట్లను ప్రకటించకపోయినా... ప్రయాణ తేదీకి 30-60 రోజుల ముందు టికెట్లు కొనేవారికి ఆ కంపెనీలు 50 శాతం వరకు టికెట్ చార్జీలను తగ్గిస్తున్నట్లు ట్రావెల్ ఏజెంట్లు తెలియజేశారు. కాగా ఎయిర్‌లైన్ కంపెనీలు బేస్ ఫేర్‌ను మాత్రమే తగ్గిం చాయి. వర్తించే ఇతర ఫీజులు, పన్నులన్నిటినీ ప్రయాణికులే భరించాలి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే స్పైస్‌జెట్ విమానంలో గోవా - ముంబై చార్జీ కేవలం 20 శాతమే తగ్గుతుంది. చార్జీల తగ్గింపును ధ్రువీకరించడానికి ఆయా ఎయిర్‌లైన్స్ అధికారులు అందుబాటులోకి రాలేదు. రెండున్నర రెట్లు పెరిగిన బుకింగ్స్.. ఎయిర్‌లైన్స్ కంపెనీలు చార్జీలను తగ్గించిన కొద్ది గంటల్లోనే తమ వెబ్సైట్లో బుకింగ్‌ల సంఖ్య దాదాపు 250% పెరిగినట్లు యాత్రా డాట్‌కామ్ ప్రతినిధి శరత్ దలాల్ చెప్పారు. మరో ట్రావెల్ పోర్టల్ మేక్మైట్రిప్ సైతం ఎయిర్ టికెట్ల బుకింగ్‌లు గణనీయంగా పెరిగినట్లు పేర్కొంది. డిస్కౌంట్ సంగతి అందరికీ తెలిసిన తర్వాత బుకింగ్స్ మరింత పెరగవచ్చని పేర్కొంది. గూగుల్‌లో రెండు లక్షల సెర్చ్‌లు స్పైస్‌జెట్ చార్జీలను సగానికి సగం తగ్గించినట్లు తెలియడంతో నెట్లో ఎంక్వయిరీలు ప్రారంభించారు. గూగుల్‌లో మంగళవారం ఒక్కరోజే దాదాపు రెండు లక్షల మంది సెర్చ్ చేశారు. చార్జీలు ఎంత తగ్గాయో ఆరా తీశారు. -
గో ఎయిర్ టికెట్లపై రూ.888 డిస్కౌంట్
ముంబై: గోఎయిర్ కంపెనీ అన్ని విమాన టికెట్లపై రూ.888 డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా రానున్న ఎనిమిది రోజుల్లో బుక్ చేసుకునే టికెట్లకు ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని కంపెనీ సోమవారం తెలిపింది. వచ్చే నెల 20 వరకూ జరిగే ప్రయాణాలకు ఈ డిస్కౌంట్‌ను అందిస్తామని పేర్కొంది. ఈ సంస్థ 21 నగరాలకు వారానికి మొత్తం 840 విమాన సర్వీసులను నడుపుతోంది. 2005, నవంబర్ 4న సర్వీసులను ప్రారంభించిన ఈ సంస్థ అహ్మదాబాద్, బగ్దోగ్ర, బెంగళూర్, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గోవా, గౌహతి, జైపూర్, జమ్మూ, కోచి, కోల్‌కత, లెహ్, లక్నో, ముంబై, నాగ్‌పూర్, పాట్నా, పోర్ట్బ్లైర్, పుణే, రాంచి, శ్రీనగర్లకు విమాన సర్వీసులందిస్తోంది.