గో ఎయిర్‌ సంక్రాంతి కానుక | GoAir Flight Tickets Offer: Fares Start From Rs. 1,157 | Sakshi
Sakshi News home page

గో ఎయిర్‌ సంక్రాంతి కానుక

Published Sat, Jan 13 2018 1:27 PM | Last Updated on Sat, Jan 13 2018 6:26 PM

GoAir Flight Tickets Offer: Fares Start From Rs. 1,157 - Sakshi

సాక్షి,  న్యూఢిల్లీ: విమానయాన సంస్థ గో ఎయిర్‌  డిస్కౌంట్‌ ధరల్లో విమాన టికెట్లను ఆఫర్‌ చేస్తోంది.   అన్ని చార్జీలు కలుపుకొని రూ.1157లకే టికెట్లను అందిస్తున్నట్టు ప్రకటించింది.  ఫ్లై  స్మార్ట్‌, సేవ్‌  మోర్‌   స్కీం  కింద  ఈ ఆఫర్‌ తీసుకొచ్చింది. ముఖ్యంగా  పండగసీజన్‌, న్యూ ఇయర్‌,  లాంగ్‌ వీకెండ్‌ సందర్భంగా తమ కస్టమర్లకు  గొప్ప అనుభవాన్ని అందించాలని భావిస్తున్నామని గో ఎయిర్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రకటించింది.  ఈ డిస్కౌంట్‌ పాటు గోఎయిర్‌ యాప్‌ ద్వారా టికెట్లను బుక్‌ చేసుకుంటే 10శాతం అదనపు  తగ్గింపుకూడా లభ్యం. ఇలా వన్‌ వేలో రూ.250 తగ్గింపును,  రిటర్న్‌ టికె​ట్‌ బుకింగ్‌పై 500 ఆఫర్‌ చేస్తోంది. జనవరి 22 తో ఈ ఆఫర్‌  బుకింగ్స్‌ ముగుస్తాయి. ఇలా బుక్‌ చేసుకున్న టికెట్ల ద్వారా 1, ఫిబ్రవరి నుంచి 15,ఏప్రిల్‌దాకా ప్రయాణించవచ్చు.

గోఎయిర్  వెబ్‌ సైట్‌​ ప్రకారం హైదరాబాద్-లక్నో రూ. 3002, హైదరాబాద్‌ -అహ్మదాబాద్‌ రూ. 3362,  లక్నో-హైదరాబాద్‌  టికెట్‌ ధర రూ. 3574 గాను  నిర్ణయించింది. అలాగే లక్నో-ఢిల్లీ  టికెట్‌ రూ .1,455,  ఢిల్లీ-లక్నో రూ .1,588, బెంగళూరు-కొచ్చి రూ .1703,  పుణె-బెంగళూరుకు రూ .2,196, గౌహతి-కోల్‌కతా రూ. 2,244, పుణె-అహ్మదాబాద్ రూ .2405 , ఢిల్లీ-పాట్నా రూ .3,104 ధరల్లో టికెట్లను అందిస్తోంది.   వీటితో పాటు ఇతర మార్గాల్లో అందిస్తున్న తగ్గింపు ధరల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపర్చింది.

సాధారణ కాన్సిలేషన్‌, రీ బుకింగ్‌ ఈ చార్జీలు వర్తిస్తాయి.  గ్రూప్‌ బుకింగ్‌లకు ఈ  తగ్గింపు వర్తించదని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement