Flight Charges
-
విద్యార్థుల గుండెల్లో ట్రంప్ ‘బెల్స్’
సాక్షి, హైదరాబాద్: ‘అమెరికా ఫస్ట్’ అన్న అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నినాదం మన విద్యార్థులు, ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారీ విజయం సాధించి జనవరి 20న బాధ్యతలు స్వీకరించనుండటం ఒకవైపు మోదాన్ని, మరోవైపు ఖేదాన్ని కలిగిస్తోంది. ప్రతిభావంతులైన నిపుణులకు అమెరికా రెడ్ కార్పెట్ పరుస్తుందని చెబుతూనే... విద్య, ఉద్యోగ అవకాశాల కోసం వచ్చే వారిపై ఆంక్షలు విధిస్తామని, ఇమిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేస్తామని ఎన్నికల సమయంలో ట్రంప్ ప్రకటించారు.ఇది లక్షలాది మంది తెలుగు విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. దీనితో అమెరికాలోని వివిధ విద్యాసంస్థల్లో చదువుకుంటున్న మన విద్యార్ధులు జనవరి 20వ తేదీలోగా అమెరికాకు చేరుకోవాలనే ఉద్దేశంతో పరుగులు పెడుతున్నారు. ఇమిగ్రేషన్ నిబంధనలు కఠినతరం కావొచ్చనే ఉద్దేశంతో ఆ దేశ విశ్వవిద్యాలయాలు కూడా విదేశాల్లోని తమ విద్యార్థులు త్వరగా క్యాంపస్‌కు చేరుకోవాలంటూ నోటీసులు ఇస్తున్నాయి. జూమ్ మీటింగ్‌లు, వెబ్నార్లు ఏర్పాటు చేస్తున్నాయి. దీనితో సెలవుల కోసం ఇళ్లకు వచ్చిన తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 1.5 లక్షల మందికిపైగా విద్యార్థులు తమ సెలవులు పూర్తికాకుండానే అమెరికాకు పయనం అవుతున్నారు. మరోవైపు ట్రంప్ రాక నేపథ్యంలో స్టూడెంట్ వీసాలు కూడా గణనీయంగా తగ్గినట్టు తెలిసింది. గతేడాదితో పోల్చితే ఈసారి 40 శాతం వీసాలు తగ్గినట్లు కన్సల్టెన్సీలు చెబుతున్నాయి. అమెరికాలో చదువుకోవాలనుకొనే విద్యార్ధులను ఇది నిరాశకు గురిచేస్తోందని పేర్కొంటున్నాయి.గత హయాంలోనే ట్రంప్ కొరడా..ట్రంప్ గతంలో తొలిసారి అమెరికా అధ్యక్షుడిగా అధికారం చేపట్టిన వెంటనే ఇమిగ్రేషన్ నిబంధనలను కఠినం చేశారు. వెనిజులా, మెక్సికోతోపాటు తొమ్మిది అరబ్ దేశాల విద్యార్థులు, జనం రాకపోకలపై ఆంక్షలు విధించారు. రకరకాల విద్యాసంస్థల్లో చదువుకుంటున్నట్టు అడ్మిషన్లు తీసుకొని ఫుల్‌టైమ్ ఉద్యోగాలు చేసే విదేశీ విద్యార్థులపై తీవ్ర ఆంక్షలు విధించారు. అడ్డదారుల్లో హెచ్–1 వీసాలు పొంది ఉద్యోగులుగా చలామణీ అయ్యే వారిని గుర్తించి వీసాలు రద్దు చేసేం దుకు కూడా చర్యలు చేపట్టారు. అంతేకాదు.. అమెరికాకు వెళ్లే విదేశీ విద్యార్థులకు సంబంధించి ఏ చిన్న పొరపాటు ఉన్నా స్వదేశాలకు తిప్పి పంపారు కూడా. అమెరికన్లకు దక్కాల్సిన ఉద్యోగాలను విదేశాలకు చెందినవారు ఎగరేసుకెళ్తున్నారన్న ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టినట్టు ట్రంప్ ప్రకటించడం గమనార్హం.ఇప్పుడు మరింత కఠినంగా ఆంక్షలు!ఇటీవలి ఎన్నికల్లోనూ ట్రంప్ ఇదే తరహాలో ప్రకటనలు చేశారు. విదేశాలకు చెందిన భార్యాభర్తలు అమెరికాలో ఉంటూ పిల్లలను కంటే వారికి అమెరికన్ పౌరసత్వం (బర్త్ రైట్స్) ఇవ్వబోమని తేల్చి చెప్పారు. తప్పుడు పద్ధతుల్లో ఉద్యోగాలు చేసేవారి ఇమిగ్రేషన్‌ను రద్దు చేస్తామన్నారు. మరోవైపు అమెరికాలోని టాప్ విశ్వవిద్యాలయాల్లో చదువుకొనేవారు, క్యాంపస్ ఎంపికల్లోనే ఉద్యోగాలు పొందేవారికి నేరుగా గ్రీన్‌కార్డు ఇస్తామని కూడా ట్రంప్ ప్రకటించారు. దీనితో అమెరికా ఇమిగ్రేషన్ చట్టాల్లో ఎలాంటి మార్పులైనా చోటు చేసుకోవచ్చని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ దేశ విద్యాసంస్థలు విదేశీ విద్యార్ధులను త్వరగా యూఎస్‌కు చేరుకోవాలని స్పష్టం చేస్తున్నాయి. గత హయాంలోని పరిణామాలను దృష్టిలో ఉంచుకుని.. ఈసారి జనవరి 20 తర్వాత వెళ్లేవారికి పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఇబ్బందులు తలెత్తవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.విద్యా సంస్థల ఎంపికే కీలకం..ట్రంప్ ఆంక్షలను కొట్టిపారేయడానికి వీల్లేదని, అలాగని అతిగా భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. విద్యార్థులు ఎంపిక చేసుకొనే విద్యా సంస్థలు, యూనివర్సిటీలు, చేరబోయే ఉద్యోగాలు ఏమిటన్నది కీలకమని సూచిస్తున్నారు. ‘‘నిబంధనలకు విరుద్ధంగా సరైన సర్టిఫికెట్లు ఇవ్వడం, డాక్యుమెంట్లు సమర్పించకపోవడం, నకిలీ విద్యాసంస్థల్లో చదవ డం వంటివి చేసేవారు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కో వాల్సి ఉంటుంది’’ అని హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌కు చెందిన ఓ కన్సల్టెన్సీ సంస్థ ప్రతినిధి స్పష్టం చేశారు.విద్యార్థులకు తోడు న్యూ ఇయర్ సందడితో..విద్యార్థులు అమెరికాకు క్యూ కట్టడంతోపాటు క్రిస్మస్ సెల వులు, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో యూఎస్‌కు వెళ్లే పర్యాటకుల సంఖ్య పెరిగింది. దీనితో విమాన టికెట్లకు డిమాండ్ మరింతగా పెరిగి.. చార్జీలు అనూహ్యంగా పెరిగాయి. గతంలో రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకు అందుబాటులో ఉన్న రౌండప్ చార్జీలు ఇప్పుడు రూ.2 లక్షల వరకు చేరడం గమనార్హం.⇒ యూఎస్‌లో భారతీయ విద్యార్ధులు: 3.35 లక్షలు⇒ అందులో తెలుగు విద్యార్ధులు: సుమారు 56 శాతం⇒ వీరిలో తెలంగాణ నుంచి వెళ్లినవారు: 34 శాతం..⇒ ఏపీ నుంచి వెళ్లినవారు: 22 శాతం..హడావుడిగా పెళ్లిళ్లు..⇒ ఇమిగ్రేషన్ నిబంధనలు కఠిన తరం కావొచ్చనే వార్తల నేపథ్యంలో యూఎస్‌లో హెచ్–1బీ వీసాలపై ఉంటున్నవారు హడావుడిగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. జనవరి 20 తర్వాత డిపెండెంట్ వీసాల్లో మార్పులు రావొచ్చని.. ఆలోగానే పెళ్లి చేసుకొని జీవిత భాగస్వామితో కలిసి అమెరికా వెళ్లాలని భావిస్తున్నారు. ఇలాంటి వారు ఎంగేజ్మెంట్ అయినా కాకున్నా ముహూర్తాలు పెట్టేసుకుంటుండటం గమనార్హం.⇒ ఈ నెల 20వ తేదీన యూఎస్ విమానాల రౌండప్ చార్జీలు ఇవీ(రూ.ల్లో) (సుమారుగా)⇒ హైదరాబాద్ – డల్లాస్ 2,05,000⇒ బెంగళూర్ – షికాగో 2,15,000⇒ బెంగళూర్ – శాన్ఫ్రాన్సిస్కో 1,40,000⇒ చెన్నై– న్యూయార్క్ 1,32,000⇒ న్యూఢిల్లీ– వాషింగ్టన్ డీసీ 1,65,000ఇల్లీగల్ ఉద్యోగాల జోలికి వెళ్లొద్దు..ఓపీటీ (పార్ట్ టైమ్)కి మాత్రమే అర్హత కలిగిన వాళ్లు సీపీటీ (ఫుల్‌టైమ్) ఉద్యోగాల వైపు మొగ్గుచూపుతున్నారు. సీనియర్ల మాటలు విని నష్టపోతున్నారు. అలాంటి తప్పుడు పద్ధతులు కష్టాలకు గురిచేస్తాయి. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లేవారిలో కొందరు ఏదో ఒక విద్యాసంస్థలో చేరి.. నిబంధనలకు విరుద్ధంగా ఫుల్ టైమ్ ఉద్యోగాలు చేస్తున్నారు. సంపాదించుకోవాలనే ఉద్దేశంతో కొందరు ఆన్లైన్ కోర్సుల్లో చేరి ఫుల్‌టైమ్ ఉద్యోగాలను ఆశిస్తు న్నారు. తాము చదివే విద్యాసంస్థలకు, పనిచేసే ప్రదేశాలకు ఏ మాత్రం సంబంధం ఉండదు. అలాంటి వారికి సమస్య. స్టేటస్ ఉన్న నిజమైన విద్యార్ధులు సెలవులు ముగిసిన తర్వాత ఎప్పుడైనా అమెరికా వెళ్లవచ్చు– హిమబిందు, కాన్వోకేషన్స్స్క్వేర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ,అమీర్పేట్బాగా చదివేవాళ్లకు మంచి అవకాశాలు ఉంటాయిమంచి విద్యాసంస్థల్లో చదివేవాళ్లు ఏమాత్రం భయపడాల్సిన పనిలేదు. ట్రంప్ కాలంలో కష్టాలు ఉంటాయనేది అపోహ మాత్రమే. బాగా చదివేవాళ్లకు అద్భుత అవకాశాలు ఉంటాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ దొడ్డిదారుల్లో (షార్ట్‌కట్) ఉద్యోగాల్లో చేరవద్దు. వర్సిటీల్లో చేరిన తర్వాత పార్ట్‌టైమ్ ఉద్యోగాలకు ఇప్పటివరకు 3 ఏళ్లే చాన్స్ ఉంది. దీన్ని 6 ఏళ్లకు పెంచాలని ట్రంప్ భావిస్తున్నారు. ఇది మనవాళ్లకు గొప్ప అవకాశం. కానీ పార్ట్‌టైమ్ అర్హత మాత్రమే ఉన్నవాళ్లు అత్యాశకు పోయి ఫుల్‌టైమ్ ఉద్యోగాల్లో చేరవద్దు – సూర్యగణేశ్ వాల్మీకి, (వాల్మీకి గ్రూప్) -
Flight Offers: ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్.. జస్ట్ రూ. 932కే టిక్కెట్..
-
ఇండిగో టికెట్ ధర తగ్గింపు.. కారణం ఇదే..
విమాన టికెట్లపై సంస్థలు ప్రత్యేకంగా ఫ్యూయెల్ ఛార్జీను వసూలు చేస్తూంటాయి. అయితే గత మూడునెలలుగా విమానాల్లో వాడే జెట్ ఇంధనం/ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ఏటీఎఫ్) ధరను కేంద్రం తగ్గిస్తోంది. అందులో భాగంగా ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో తన వినియోగదారుల కోసం టికెట్లపై విధించే ఫ్యూయెల్ ఛార్జీలను తొలగించినట్లు ప్రకటించింది. గురువారం నుంచే తొలగింపు నిర్ణయం అమల్లోకి వచ్చిందని సంస్థ తెలిపింది. కేంద్ర తీసుకుంటున్న నిర్ణయంతో తన వినియోగదారులకు సైతం మేలు జరగాలని ప్రత్యేక ఛార్జీని తొలగించినట్లు ఇండిగో తెలిపింది. అయితే, ఏటీఎఫ్ ధరలు ఎప్పటికప్పుడు మారే అవకాశం ఉంది. కాబట్టి టికెట్ల ధరలనూ అందుకు అనువుగా సవరిస్తామని సంస్థ స్పష్టం చేసింది. ఇదీ చదవండి: తీవ్ర ఒడిదుడుకుల్లో చమురు మార్కెట్లు విమాన ఇంధన (ఏటీఎఫ్) ధరను ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థలు జనవరిలో 4 శాతం తగ్గించాయి. ఇప్పటి వరకు దిల్లీలో కిలోలీటరు ధర రూ.1,06,155.67 కాగా, రూ.4162.50 తగ్గించడంతో రూ.1,01,993.17కు చేరింది. -
విమాన టికెట్ కంటే ఎక్కువా?
కోల్‌కతా: రైళ్లలో డైనమిక్ ప్రైసింగ్‌ను తక్షణం ఉపసంహరించాలని పశి్చమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆదివారం డిమాండ్ చేశారు. పండుగలు తదితర రద్దీ సందర్భంగా గత వారం దేశవ్యాప్తంగా పలు రూట్లలో రైలు టికెట్ల ధరలు విమాన టికెట్లను కూడా మించిపోతున్నాయని విమర్శించారు. ఇలాగైతే అత్యవసర పరిస్థితిలో రైల్లో ప్రయాణించాల్సిన వారి గతి ఏమిటని ఆమె ప్రశ్నించారు. డైనమిక్ ప్రైసింగ్‌ను తక్షణం రద్దు చేయడంతో పాటు ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలని సూచించారు. మమత గతంలో రైల్వే మంత్రిగా కూడా చేయడం తెలిసిందే. రైలు టికెట్లకు డైనమిక్ ప్రైసింగ్‌ను 2016లో రైల్వే శాఖ ప్రవేశపెట్టింది. ఛత్ పూజ తదితరాల నేపథ్యంలో బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని పలు ముఖ్య నగరాలకు రైలు టికెట్ల ధరలు విమాన టికెట్లను కూడా మించినట్టు వార్తలొచ్చాయి. -
రూ. 14 వేల ఫ్లైట్ టిక్కెట్ ఛార్జీకి రిఫండ్‌గా 2 కప్పుల చాయ్!
ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నా అనుకోని పరిస్థితుల్లోఫ్లైట్ టిక్కెట్ క్యాన్సిల్ చేయాల్సివస్తే ఎంత రిఫండ్ వస్తుందోనని ఆందోళనపడుతుంటాం. టిక్కెట్ క్యాన్సిలేషన్ ఛార్జెస్ ఎంత ఉంటాయోనని అనుకుంటాం. ఇటువంటి సందర్భాల్లో టిక్కెట్ ఛార్జీలోని సగం మొత్తం అయినా రిఫండ్ రూపంలో మనకు అందదు. బీహార్ క్యాడర్‌కు చెందిన ఐఎఎస్ అధికారి రాహుల్ కుమార్‌కు ఫ్లయిట్ టిక్కెట్ రిఫండ్ విషయంలో చేదు అనుభవం ఎదురయ్యింది. రాహుల్ కుమార్ రూ. 13,820కు ఫ్లైట్ టిక్కెట్ బుక్ చేసుకుని, అనుకోని పరిస్థితుల్లో క్యాన్సిల్ చేసుకోగా, అతనికి రిఫండ్ రూపంలో కేవలం రూ. 20 చేతికి అందింది. అంటే రెండు కప్పుల చాయ్ పైసలు రిఫండ్ రూపంలో తిరిగి వచ్చాయి. ఏదైనా పెట్టుబడుల పథకం ఉంటే.. ఐఎస్ అధికారి రాహుల్ కుమార్ ఫైట్ టిక్కెట్ క్యాన్సిలేషన్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్ షేర్ చేశారు. తాను విమాన ప్రయాణాన్ని రద్దు చేసుకున్న అనంతరం ఎయిర్‌లైన్స్.. ఫ్లైట్ క్యాన్సిలేషన్ రిఫండ్ ఆఫ్ టిక్కెట్‌ను ఆయనకు పంపింది. దానిలో టిక్కెట్ క్యాన్సిలేషన్ ఛార్జీ రూ.11,800, జీఐ క్యాన్సిలేషన్ ఛార్జీ 1,200గా ఉంది. కన్వీనియన్స్ ఛార్జీలు రూ. 800. మొత్తంగా క్యాన్సిలేషన్ ఫీజు 13,800. ఫలితంగా రాహుల్ కుమార్‌కు రిఫండ్ రూపంలో కేవలం రూ.20 తిరిగి వచ్చాయి. దీనికి క్యాప్షన్‌గా ఆయన తనకు రిఫండ్ అయిన ఈ మొత్తంతో ఏదైనా పెట్టుబడుల పథకం ఉంటే తెలియజేయాలని వ్యంగ్యంగా కోరారు. రాహుల్ కుమార్ పోస్టుకు 5 లక్షలకు మించిన వ్యూస్ వచ్చాయి. 5 వేలకుపైగా లైక్స్ వచ్చాయి. యూజర్స్ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. Pls suggest some good investment plans for my refund. pic.twitter.com/lcUEMVQBnq — Rahul Kumar (@Rahulkumar_IAS) July 10, 2023 ఇది కూడా చదవండి: ఆ తేనెలో మద్యానికి మించిన మత్తు.. ఎక్కడ దొరుకుతుందంటే.. -
విమాన టికెట్లపై గో ఫస్ట్ అదిరిపోయే ఆఫర్: రేపటి వరకే ఛాన్స్
సాక్షి,ముంబై: దేశీయ విమానయాన సంస్థ గో ఫస్ట్ తగ్గింపు ధరల్లో విమాన టికెట్లను అందిస్తోంది. దేశీయ,అంతర్జాతీయ విమాన టికెట్ల ధరలపై ఆఫర్‌ను అందిస్తోంది. నేటి నుంచి రెండు రోజుల పాటు (ఫిబ్రవరి 23-24) విక్రయిస్తున్న ఈ స్పెషల్ సేల్‌లో దేశీయ విమాన టికెట్ల ధరలు రూ. 1,199 వద్ద, అంతర్జాతీయ విమానాల ఛార్జీలు రూ. 6,139 నుంచి ప్రారంభమవుతాయని గో ఫస్ట్ తెలిపింది. (ఇదీ చదవండి: ఐసీఐసీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్) సమ్మర్ ట్రావెల్ సీజన్‌కు ముందు బడ్జెట్ ధరల విమానయాన సంస్థ గో ఫస్ట్ ఫిబ్రవరి 23న రెండు రోజుల ధరల విక్రయాన్ని ప్రకటించింది. ఈ సేల్ ఫిబ్రవరి 24 వరకు కొనసాగుతుందని, ప్రయాణ కాలం మార్చి 12 నుంచి సెప్టెంబర్ 30, 2023 వరకు ఉంటుందని పేర్కొంది. ఇప్పటికే భారతదేశపు అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో కూడా ఇదే విధమైన ఆఫర్ ప్రకటించింది.ఇండిగో దేశీయ విమాన టిక్కెట్లను రూ. 2,093 (ప్రారంభ ధర) ఆఫర్ ప్రకటించిన రోజు తర్వాత గో ఫస్ట్ ప్రకటన వచ్చింది. ఇండిగో సేల్ ఫిబ్రవరి 25 వరకు కొనసాగనుంది. ఈ ఆఫర్లో బుక్ చేసుకున్న టికెట్లపై మార్చి 13 నుండి అక్టోబర్ 13, 2023 వరకు ప్రయాణించవచ్చు. (సుమారు 5 వేలమంది సీనియర్లకు షాకిచ్చిన ఈ కామర్స్ దిగ్గజం) కాగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఫిబ్రవరి 20న విడుదల చేసిన డేటా ప్రకారం జనవరి 2023లో 125.42 లక్షల మంది ప్రయాణీకులతో దేశీయ విమానాల రాకపోకలు గత ఏడాది కాలంతో పోలిస్తే దాదాపు రెట్టింపయ్యాయి. డిసెంబరు 2022 నుండి 127.35 లక్షలతో పోలిస్తే 1.5 శాతం తక్కువగా ఉంది. అయితే విమాన ట్రాఫిక్ ఇప్పటికీ ప్రీ-కోవిడ్ స్థాయిల కంటే తక్కువగా ఉంది. జనవరి 2020లో దేశీయ విమానయాన సంస్థలు 127.83 లక్షల మంది ప్రయాణికులతో ప్రయాణించారు. (నెలకు రూ.4 లక్షలు: రెండేళ...కష్టపడితే, కోటి...కానీ..!) -
ఏపీకి క్యూ కట్టిన ప్రయాణికులు.. విమానాల రద్దీ.. భారీగా పెరిగిన చార్జీలు
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ నగరాలకు వెళ్లే విమాన ప్రయాణికుల రద్దీ పెరిగింది. దీంతో ప్రయాణ చార్జీలు ఆకాశాన్నంటుతున్నాయి. సాధారణ సమయాల్లో హైద రాబాద్ నుంచి రాజమండ్రికి రూ. 3 వేల టికెట్ ధర ఉండగా ప్రస్తుతం రూ.8 వేల నుంచి గరి ష్టంగా రూ. 11 వేల చార్జీలను తీసుకుంటున్నా యి. విశాఖపట్నం వెళ్లేందుకు విరివిగా విమానాలుండడంతో చార్జీలు కొంతమేరకు మాత్రమే పెరిగాయి. విజయవాడకు రద్దీ ఎక్కువగా ఉండటంతో సాధారణ సమయాలతో పోల్చితే వందశాతం అదనంగా టికెట్ ధరలు పెరిగాయి. సెలవులు కావడంతో తిరుపతి వెళ్లే ప్రయాణికు ల రద్దీ కూడా సాధారణ సమయాలతో పోల్చితే వందశాతం అధికంగా ఉండటంతో యాభైశా తానికి పైగా చార్జీలు పెరిగాయి. కర్నూలు, కడప నగరాలకు వెళ్లే విమానాలకు రద్దీ ఉండటంతో ఆ చార్జీలను కూడా పెంచేశారు. -
విమానం మోత: న్యూఢిల్లీ టు హైదరాబాద్ రూ.27,302
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ మధ్య విమాన చార్జీలు మోత మోగుతున్నాయి. కొద్ది రోజులుగా పెరిగిన ప్రయాణికుల రద్దీ, భారత రాష్ట్రసమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ వేడుకల కోసం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, తదితర శ్రేణులు పెద్ద ఎత్తున న్యూఢిల్లీకి తరలి వెళ్లడం వంటి పరిణామాల దృష్ట్యా ఒక్కసారిగా చార్జీలు పెరిగాయి. గురువారం న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు విస్తారా విమానంలో చార్జీ రూ.26,373 వరకు ఉంది. ఎయిర్ ఏసియాలో రూ.28,841 వరకు పెరిగింది. పైగా చెన్నై, బెంగళూర్ కనెక్టింగ్ ఫ్లైట్లు కావడంతో ప్రయాణ సమయం కూడా ఎక్కువే కావడం గమనార్హం. వారణాసి మీదుగా నగరానికి చేరుకొనే ఇండిగో కనెక్టింగ్ ఫ్లైట్ చార్జీ రూ.22,177 కావడం గమనార్హం. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి భారత రాష్ట్ర సమితి ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలివెళ్లినట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు పేర్కొన్నాయి. అనూహ్యంగా డిమాండ్ పెరగడంతో చార్జీలకు రెక్కలొచ్చేశాయి. -
ఫ్లైట్ టికెట్స్: ఆ సీట్లకు భారీ డిమాండ్.. పైసలు ఖర్చవుతాయ్!
బ్లాక్ దందా అనే మాట గుర్తుందా. గతంలో ఈ మాటలు ఎక్కువగా సినిమా థియేటర్ కేంద్రాలలో వినేవాళ్లం. తన అభిమాన హీరో, హీరోయిన్ సినిమా కోసం ప్రేక్షకులు అదనంగా ఖర్చు పెట్టి కొనేవాళ్లు. తాజాగా ఈ తరహా పరిస్థితులు విమానయాన రంగంలోకి వచ్చాయని ఓ సర్వే అంటోంది. ఇటీవలే విమానాల్లో ప్రయాణికుడు కోరుకున్న చోట సీటు కావాలంటే అదనంగా చెల్లించుకోవాల్సి వస్తోందట! అసలు ఏవియేషన్ రంగంలో ఏం జరుగుతోందో ఓ లుక్కేద్దాం. లోకల్ సర్కిల్స్ నిర్వహించిన తాజా సర్వేలో గడిచిన 12 నెలల్లో మూడింటా ఒక వంతు ప్రయాణీకులు తమకు నచ్చిన చోట కూర్చోవడం కోసం ఎయిర్‌లైన్స్‌కు అదనపు నగదును చెల్లించినట్టు తేలింది. దేశంలోని 351 జిల్లాలో ఈ సర్వే నిర్వహించగా.. ఇందులో 30వేల మంది ప్రయాణికులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇందులో పాల్గొన్న వారిలో మూడో వంతు ప్రయాణికులు తాము ప్రయాణించిన విమానయాన సంస్థ ఉచిత సీటును ఎంచుకునే ఆప్షన్ ఇవ్వలేదని వెల్లడించారు. నిర్దిష్ట సీట్లకు, లగేజ్‌కు, ఎయిర్‌లైన్ లాంజ్‌ను ఉపయోగించుకునేందుకు ప్రయాణికుల నుంచి దేశీ ఎయిర్‌లైన్స్ అదనపు చార్జీలు వసూలు చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ 2015లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా కాస్త ఎక్కువ జాగా ఉంటుందనే ఉద్దేశ్యంతో బుకింగ్ లేదా వెబ్ చెకిన్ చేసేటప్పుడు కొందరు ప్రయాణికులు ముందు వరుసల్లోనూ, ఎమర్జెన్సీ వరుసల్లోనూ సీట్లకు ప్రాధాన్యమిస్తుంటారు. ఇందుకోసం ఎయిర్‌లైన్స్ రూ. 200–1,500 వరకూ అదనంగా చార్జి చేస్తుంటాయి. ఇలాంటి ప్రాధాన్య సీట్లతో పాటు తగినంత స్థాయిలో ఉచిత సీట్లను కూడా ఎయిర్‌లైన్స్ అందుబాటులో ఉంచాల్సి ఉంది. మరోవైపు కొన్ని ఎయిర్‌లైన్స్ సంస్థలు డిమాండ్ ఉందంటూ ఎక్కువగా కూడా వసూలు చేస్తున్నాయని ప్రయాణీకులు చెప్తున్నారు. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
అయ్యో మనీషా! కానరాని దేశంలో అవస్థలు.. చార్జీల కోసం వాట్సాప్ వీడియో
తెర్లాం (విజయనగరం): విదేశాల్లో ఉద్యోగం, లక్షల్లో జీతం వస్తుందని ఓ ఏజెంట్ చెప్పిన మాయమాటలను నమ్మి మోసపోయిన ఓ వివాహిత ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. దేశం కాని దేశంలో ఉద్యోగం లేక, తినడానికి తిండిలేక అవస్థలు పడుతోంది. విజిటింగ్ వీసా గడువు కూడా ఈ ఆదివారంతో ముగియనుండడంతో ఏమి చేయాలో తెలియక దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని ఆశ్రయించింది. దుబాయ్ నుంచి వచ్చేందుకు విమాన చార్జీలు ఎవరైనా దాతలు పంపిస్తే తాను ఇండియాకు వస్తానని, తనను ఆదుకోవాలని దుబాయ్ నుంచి వాట్సాప్ వీడియోను శనివారం ఆమె పోస్ట్ చేసింది. వివరాలిలా ఉన్నాయి.. విజయనగరం జిల్లా, తెర్లాం గ్రామానికి చెందిన మనీషా ఉద్యోగం కోసమని కొన్నిరోజుల క్రితం దుబాయ్ వెళ్లింది. విశాఖపట్నానికి చెందిన ఓ ఏజెంట్ ఆమెతో రూ.80 వేలు కట్టించుకుని, దుబాయ్‌లో మంచి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. దీంతో ఆమె తన దగ్గరున్న సొమ్మునంతా ఆ ఏజెంట్‌కు ఇచ్చి, అతడి విజిటింగ్ వీసాతో ఆమె దుబాయ్ వెళ్లింది. ఇలా దుబాయ్‌కు వెళ్లిన కొద్దిరోజుల్లోనే చిన్న చిన్న ఉద్యోగాలు చూపించాడు. ఆ ఉద్యోగాలు నచ్చకపోవడంతో మంచి ఉద్యోగం చూపిస్తానని నమ్మబలికాడు. ఆ తర్వాత అతడు కొన్నాళ్లకు పరారయ్యాడు. దీంతో ఆ మహిళకు ఏమి చేయాలో, ఎక్కడకు వెళ్లాలో తెలియలేదు. ఆఖరికి దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని ఆశ్రయించింది. తాను మోసపోయిన విషయం వివరించింది. ఆమె వద్ద ఉన్న వీసాను రాయబార కార్యాలయ అధికారులు పరిశీలించగా, అది విజిటర్స్ వీసా అని, ఆదివారంతో గడువు ముగుస్తుందని తెలిపారు. ఇండియాకు వెళ్లేందుకు తన వద్ద ఒక్క రూపాయి కూడా లేదని, కొన్ని రోజులుగా తిండి కూడా తినలేదని, దాతలెవరైనా తనను ఇండియా తీసుకువచ్చేందుకు ఆర్థిక సాయం చేయాలని ఆమెతో ఓ వీడియో చిత్రీకరించి, దానిని వాట్పాప్‌లో పోస్ట్ చేసింది. ఈ విషయం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. మనీషా వివరాలపై అధికారుల ఆరా.. మనీషా వివరాలపై విజయనగరం ఎస్బీ(స్పెషల్ బ్రాంచ్) అధికారులు శనివారం ఆరా తీశారు. దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం నుంచి వచ్చిన సమాచారం మేరకు ఎస్బీ అధికారులు తెర్లాం గ్రామం, మండలంలోని పలువురికి ఫోన్ చేసి, ఆమె వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
కష్టంగా మారిన అమెరికా ప్రయాణం.. ఏకంగా రూ.1.5 లక్షలకు చేరిన..
సాక్షి, హైదరాబాద్: అమెరికా..అమెరికా అంటూ విద్యార్థులు అమెరికా తరలిపోతున్నారు. కోవిడ్ నేపథ్యంలో ఉన్నత చదువు కోసం తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికా వెళ్లే విద్యార్థుల సంఖ్య కొంత తగ్గింది. ప్రస్తుతం పరిస్థితులు మారడం, కోవిడ్ నిబంధనల సడలింపుతో ఈ విద్యా సంవత్సరంలో ఎమ్మెస్, ఇతర కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు పరుగులు పెడుతున్నారు. అమెరికా కూడా ప్రస్తుతం ఒక్క స్టూడెంట్ వీసాలు తప్ప సాధారణ వీసాలు అంత త్వరగా జారీ చేయడం లేదు. సాధారణ వీసా కోసం కనీసం రెండు, మూడు నెలల పాటు నిరీక్షించవలసి వస్తోంది. దీంతో సాధారణ ప్రయాణికులు, పర్యాటకులు అమెరికాకు వెళ్లడం కష్టంగా మారింది. విద్యార్థుల రద్దీని ఆసరాగా చేసుకుని విమానయాన సంస్థలు టికెట్ల ధరలు పెంచేశాయి. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి అమెరికాకు రూ.75 వేల వరకు టికెట్ ధర ఉంటే ఇప్పుడది ఏకంగా రూ.1.5 లక్షలకు చేరింది. కొన్ని సంస్థలు రూ.2 లక్షల వరకు కూడా వసూలు చేస్తున్నాయి. అయినప్పటికీ విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటంతో విద్యార్థులు అమెరికాకు పోటెత్తినట్లు తరలిపోతున్నారని, టికెట్లు దొరకడం కష్టంగా మారిందని ట్రావెల్ ఏజెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు. ఫ్లైట్ చార్జీ లు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప, విద్యార్థుల రద్దీ తగ్గేవరకు మరో మూడు నెలలపాటు ప్రయాణాలను వాయిదా వేసుకోవడమే మంచిదని సూచిస్తున్నారు. రెట్టింపైన విద్యార్ధులు ప్రస్తుతం అన్ని రకాల ఆంక్షలు తొలగిపోయి అమెరికాలోని విశ్వవిద్యాలయాలు తెరుచుకోనున్నాయి. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విద్యార్ధులు తమ అమెరికా కలను సాకారం చేసుకొనేందుకు ఫ్లైట్ ఎక్కేస్తున్నారు. అమెరికాలో వర్క్ పర్మిట్లకు అవకాశం ఉండటంతో ఆ దేశానికే ఎక్కువ డిమాండ్ నెలకొంది. ఈసారి సుమారు 30 వేల మందికి పైగా విద్యార్ధులు అమెరికా వెళ్లే క్రమంలో ఉన్నట్లు అంచనా. ఇదే సమయంలో సాధారణ ప్రజలు కూడా ఇంతకాలం వాయిదా వేసుకున్న అమెరికా ప్రయాణానికి సమాయత్తమవుతున్నారు. దీంతో టికెట్లకు డిమాండ్ బాగా పెరిగింది. కానీ రద్దీకి తగిన విమానాలు అందుబాటులో లేవు. కోవిడ్ అనంతరం అన్ని ఎయిర్‌లైన్స్ విమాన సేవలను పునరుద్ధరించినప్పటికీ విమానాల సంఖ్యను కుదించారు. గతంలో వారానికి ఏడు ఫ్లైట్లు నడిపిన ఎయిర్‌లైన్స్ ఇప్పుడు నాలుగు మాత్రమే నడుపుతున్నాయి. సిబ్బంది కొరత వంటి అంశాలు విమానాల సంఖ్య తగ్గడానికి కారణమని ట్రావెల్ ఏజెన్సీల ప్రతినిధులు చెబుతున్నారు. హైదరాబాద్–చికాగో ఒక్కటే హైదరాబాద్ నుంచి నేరుగా అమెరికాకు వెళ్లే ఫ్లైట్లు చాలా తక్కువ. ఎయిర్ ఇండియా మాత్రమే హైదరాబాద్ – చికాగో ఫ్లైట్ నడుపుతోంది. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ హైదరాబాద్ నుంచి దుబాయ్ మీదుగా కనెక్టింగ్ ఫ్లైట్స్‌ను ఏర్పాటు చేసింది. అలాగే ఖతార్, బ్రిటిష్ ఎయిర్‌వేస్‌లు ఖతార్, లండన్ మీదుగా విమానాలను నడుపుతున్నాయి. ఇత్తేహాద్ సంస్థ అబుదాబి మీదుగా న్యూయార్క్‌కు నడుపుతోంది. దీంతో చాలామంది ఢిల్లీ, ముంబయిల నుంచి అమెరికాకు బయలుదేరుతున్నారు. వివిధ నగరాల మీదుగా వెళ్లే కనెక్టింగ్ ఫ్లైట్లలో కొంత మేరకు చార్జీలు తక్కువ ఉన్నప్పటికీ బ్రేక్ జర్నీలో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. చాలావరకు ఎయిర్‌లైన్స్ రెట్టింపు చార్జీలు వసూలు చేస్తుండగా.. హైదరాబాద్ నుంచి జెడ్డా మీదుగా అమెరికాకు విమానాలు నడుపుతున్న సౌదీ ఎయిర్‌లైన్స్‌లో మాత్రం చార్జీలు కొంత తక్కువగా ఉన్నట్టు తెలిసింది. వన్‌వే చార్జీ రూ.లక్ష వరకు ఉన్నట్లు అంచనా. కానీ జెడ్డాలో ఏకంగా 13 గంటల పాటు నిరీక్షించాల్సివస్తోంది. పెరిగిన టికెట్ ధరలను భారంగా భావించే విద్యార్ధులు, సాధారణ ప్రయాణికులు ఈ ఎయిర్‌లైన్స్‌ను ఎంపిక చేసుకుంటున్నట్లు ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి. ఇలా ప్రయాణించే వారు ఆ 13 గంటలు జెడ్డాలో పర్యటించేందుకు వీలుగా సౌదీ ఎయిర్‌లైన్స్ ప్రత్యేక అనుమతితో కూడిన వీసాలు ఇస్తున్నట్లు ఐఆర్సీటీసీ ప్రతినిధి ఒకరు తెలిపారు. డిమాండ్‌కు తగ్గ విమానాల్లేవు టికెట్ ధరలు పెరగడానికి, డిమాండ్‌కు తగ్గట్లుగా విమానాలు అందుబాటులో లేకపోవడమే కారణం. ప్రయాణికుల భర్తీ రేషియో వంద శాతం ఉంటే హైదరాబాద్ నుంచి 50 శాతంసీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో సహజంగానే టికెట్ ధరలు పెరుగుతున్నాయి. రూ.లక్షలు వెచ్చించినా టికెట్లు దొరకడం కష్టంగా ఉంది. కనీసం 3 నెలల ముందే టికెట్లు తీసుకుంటే మంచిది. – వాల్మీకి హరికిషన్, వ్యవస్థాపకులు, వాల్మీకి ట్రావెల్ అండ్ టూరిజమ్ సొల్యూషన్స్ -
విమాన ప్రయాణికులపై 'క్యూట్ ఫీ'.. చిత్రాలు వైరలవటంతో..
దిల్లీ: విమాన టికెట్లోనే ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఫీ, యూజర్ డెవలప్మెంట్ ఫీ అంటూ వివిధ రకాల ఛార్జీలు వసూలు చేస్తారు. అయితే.. ఇటీవల ఇండిగో విమానంలో ప్రయాణించిన వారు తమ టికెట్లో 'క్యూట్ ఛార్జ్' అంటూ కనిపించటంపై ఆశ్చర్యానికి గురయ్యారు. అందంపై రుసుము వసూలు చేయటమేంటని తికమకపడ్డారు. శాంతాను అనే వ్యక్తి తన టికెట్ వివరాలను ట్విట్టర్లో షేర్ చేశారు. 'క్యూట్ ఛార్జ్' వివరాలతో కూడిన ఆ టికెట్ వైరల్‌గా మారింది. దీంతో పలువురు నెటిజన్లు దీనిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇండిగో సంస్థపై విమర్శలు గుప్పించారు. 'నా వయసుతో నేను చాలా అందంగా కనిపిస్తానని తెలుసు. కానీ దానికి నాపై ఇండిగో ఇలా ఛార్జ్ వసూలు చేస్తుందని ఎప్పుడూ ఊహించలేదు' అని పేర్కొన్నారు. I know I’m getting cuter with age but never thought @IndiGo6E would start charging me for it. pic.twitter.com/L7p9I3VfKX — Shantanu (@shantanub) July 10, 2022 శాంతాను షేర్ చేసిన చిత్రంలో టికెట్ ధరకు సంబంధించిన వివరాలను ఉంచారు. అందులో ఎయిర్‌ఫేర్ ఛార్జీలు, సీట్ ఫీ, సెక్యూరిటీ, కన్వీనియన్స్ ఫీజులతో పాటు క్యూట్ ఛార్జ్ అంటూ రూ.100 వసూలు చేశారు. ఇలాంటి ఫోటోనే మరో వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. 'ఈ కొత్త ఛార్జీల కారణంగానే నేను ఇండిగోలో ప్రయాణించాలనుకోవట్లేదు. ఆ ఛార్జీలు నాకు రూ.20వేలు అవుతుంది. విమానం టికెట్ ధర కన్నా అది చాలా ఎక్కువ' అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. క్యూట్ ఫీ అంటే ఏమిటి? క్యూట్ అంటే 'కామన్ యూజర్ టెర్మినల్ ఈక్వీప్మెంట్' అని అర్థం. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ఛార్జీలు వసూలు చేస్తుంది. ఎంపిక చేసిన విమానాశ్రయాల్లో మెటల్ డిటెక్టింగ్ మిషన్లు, ఎస్కలేటర్లు, ఇతర సామగ్రిని ఉపయోగిస్తున్నందుకు దీనిని వసూలు చేస్తారు. ట్విట్టర్లో క్యూట్ ఫీపై వైరల్‌గా మారిన క్రమంలో ఇండిగో సమాధానమిచ్చింది.'ఎంపిక చేసిన విమానాశ్రయాల్లో కామన్ యూజర్ టెర్మినల్ ఈక్వీప్మెంట్(క్యూట్) సేవలను ఉపయోగిస్తున్నందుకు ఈ ఛార్జీలను వసూలు చేస్తారని తెలుసుకోండి. మీకు సేవ చేసేందుకే మేము ఉన్నాం' అని ఓ నెటిజన్‌కు సమాధానమిచ్చింది. Ms. Waliya, please know that the CUTE charges are levied at select airports for the usage of Common User Terminal Equipment (CUTE) services. You may visit https://t.co/anjh8jarWV to know more. (1/2) — IndiGo (@IndiGo6E) July 10, 2022 ఇదీ చదవండి: 10 నెలలు.. 9 దేశాలు.. 6,500 కిలోమీటర్లు నడిచి 'హజ్' యాత్ర -
విమాన ప్రయాణికులకు బంపరాఫర్!
విమాన ప్రయాణికులకు ఎయిర్ ఏసియా బంపరాఫర్ ప్రకటించింది. 'స్ప్లాష్ సేల్'ను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈ సేల్‌లో ప్రయాణికులు ఢిల్లీ - జైపూర్ వంటి మార్గాల్లో తక్కువ ధరకే ఫ్లైట్ టికెట్లను బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది. దీంతో పాటు దేశ వ్యాప్తంగా ఎయిర్ ఏసియా నెట్ వర్క్ ఉన్న ప్రాంతాల ప్రయాణికులు ఈ ఆఫర్‌ను పొంద వచ్చని తెలిపింది. ఆఫర్‌తో పాటు అదనంగా డిస్కౌంట్లు పొందవచ్చని పేర్కొంది. వచ్చే ఏడాది వరకు ఎయిర్ ఏసియా జూలై 7 నుంచి జులై 10వరకు స్ప్లాష్ సేల్ నిర్వహిస్తుంది. ఈ సేల్‌లో ఢిల్లీ-జైపూర్ మార్గాల్లో ఫ్లైట్ టికెట్ ప్రారంభ ధర రూ.1497గా ఉంటుందని, ఈ సేల్‌లో బుక్ అయిన టికెట్స్‌ను జూలై 26, 2022 నుంచి మార్చి 31, 2023 వరకు వినియోగించుకోవచ్చని తెలిపింది. పరిమిత ఇన్వెంటరీ ఆఫర్ కోసం కేటాయించిన సీట్లు మొత్తం బుకింగ్ అయితే .. జులై 10 తరువాత బుకింగ్‌కు రెగ్యులర్ ఛార్జీలు అందుబాటులో ఉంటాయని ఎయిర్‌లైన్ పేర్కొంది. కాగా, ఎయిర్ ఏషియా ఇండియా తన అధికారిక వెబ్ సైట్, మొబైల్ యాప్స్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. టాటాదే బెంగళూరులో ప్రధాన కేంద్రంగా టాటా సన్స్ అనుబంధ సంస్థ ఎయిర్ ఏసియా (ఇండియా) కార్యకలాపాలు నిర్వహిస్తుంది. జూన్12,2014నుంచి ఎయిర్ ఏసియా తన కార్యకలాపాలను ప్రారంభించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 50 కి పైగా 100 కనెక్టింగ్ రూట్లలో ఎయిర్ ఏసియా విమానాల రాకపోకల్ని నిర్వహిస్తుంది. -
Flight Charges: విమాన చార్జీల మోత
సాక్షి, చెన్నై : క్రిస్మస్ రద్దీ దృష్ట్యా, చెన్నై నుంచి రాష్ట్రంలోని తూత్తుకుడి, మదురై, తిరుచ్చి వైపుగా సాగే విమానాల్లో చార్జీలు భారీగా పెరిగాయి. ఆయా విమాన సంస్థల వెబ్సైట్లో ఇది వరకు ఉన్న చార్జీ కన్నా రెట్టింపు చార్జీలు ఉండడంతో ప్రయాణికులకు షాక్ తప్పలేదు. క్రిస్మస్ దృష్ట్యా, చెన్నై నుంచి తూత్తుకుడి, మదురై, తిరునవంతపురం, కొచ్చి వైపుగా వెళ్లే విమానాల టికెట్లు ముందుగానే రిజర్వ్ అయ్యాయి. చెన్నై నుంచి తూత్తుకుడికి ›రోజూ 4 విమానాలు, మదురైకు 6, కొచ్చికి, తిరువనంతపురానికి తలా రెండు విమానాలు నడుపుతున్నారు. తూత్తుకుడి చెన్నై నుంచి సాధారణంగా రూ. 3,500 టికెట్ చార్జీ కాగా, ప్రస్తుతం రూ. 10,500, రూ.12 వేలుగా చార్జీలు ఉండటం ప్రయాణికుల్ని విస్మయానికి గురి చేశాయి. అలాగే, మదురైకు రూ. 3,500 ఉన్న చార్జీ తాజాగా రూ. 9,800, తిరువనంతపురానికి రూ. 4 వేలు ఉన్న చార్జీ తాజాగా రూ. 9 వేలుగా, కొచ్చికి రూ. 3,500 ఉన్న చార్జీ రూ. 9,500గా పేర్కొనడం గమనార్హం. ఈ పెంపు గురించి ఆయా విమాన సంస్థల ప్రతినిధుల్ని ప్రశ్నించగా, తాము చార్జీలు పెంచలేద, మీడియం, తక్కువ చార్జీ టికెట్లు పూర్తిగా రిజర్వ్ కావడంతో, కొన్ని తరగతుల టికెట్ల ధర పైన పేర్కొన్నట్టుగానే కొంత ఎక్కువగా ఉంటాయని వివరించారు. ఇక, చెన్నై నుంచి శుక్ర, శనివారాల్లో గోవా వైపుగాసాగే విమానాలు ఫుల్ అయ్యాయి. -
అమెరికా వెళ్తున్నారా ? మోత మోగుతున్న విమాన ఛార్జీలు!
విదేశీ ప్రయాణం చేయాలనుకునే వారికి చుక్కలు చూపిస్తున్నాయి విమానయాన కంపెనీలు. ముఖ్యంగా అమెరికా వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నవారి నుంచి ముక్కుపిండి మరీ అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. తొలగిన ఆంక్షలు కరోనా సంక్షోభం మొదలైనప్పటి నుంచి అంతర్జాతీయంగా ప్రయాణాలపై ఆంక్షలు ఉన్నాయి. దాదాపు ఏడాదిన్నర కాలంగా ఇండియా నుంచి అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూకే, గల్ఫ్ తదితర దేశాలకు ప్రయాణం చేయడంపై అనేక ఆంక్షలు ఉన్నాయి. ఇటీవలే క్రమంగా ఒక్కో దేశం అంతర్జతీయ ప్రయాణాలపై ఆంక్షలు ఎత్తివేస్తున్నాయి. తాజాగా అమెరికా సైతం నవంబరు 8 నుంచి ఆంక్షలను సడలించింది. రెండు డోసులు టీకాలు తీసుకున్న వ్యక్తులను తమ దేశంలోకి అనుమతిస్తామని పేర్కొంది. పెరిగిన రేట్లు అమెరికా ప్రయాణాలపై ఉన్న ఆంక్షలు తొలగిపోవడంతో ఎంతో కాలం నుంచి అక్కడికి వెళ్లాలనుకునే వారికి ఊరట లభించింది. దీంతో ఒక్కసారిగా విమాన టిక్కెట్లు బుక్ చేసుకునేందుకు ఉత్సాహం చూపించారు. గత ఏడాది కాలంగా విమాన సర్వీసులు లేక ఇక్కట్లు ఎదుర్కొన్న విమానయాన సంస్థలు ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీంతో విమాన ఛార్జీలను ఒక్కసారిగా అనూహ్యంగా పెంచాయి. మోగిపోతున్న ఛార్జీలు ఇండియా నుంచి అమెరికాకు సింగిల్ జర్నీ టిక్కెట్ల ధరల మోత మోగుతోంది. ట్రావెల్ ఇండస్ట్రీ వర్గాల అందిస్తున్న సమాచారం ప్రకారం.. నిన్నామొన్నటి వరకు సింగిల్ జర్నీ టిక్కెట్టు ధర రూ.87,000ల నుంచి రూ.1.02 వరకు ఉండేది. కానీ ఇప్పుడు ఈ టిక్కెట్ల సగటు ధర రూ. 1.5 లక్షలకు చేరుకుంది, ఇక రద్దీ ఎక్కువగా ఉండే వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, షికాగో నగరాల వరకు టిక్కెట్ల ఛార్జీలయితే ఆకాశాన్ని తాకుతున్నాయి. సింగిల్ జర్నీ టిక్కెట్ ధర ఏకంగా రూ.3 లక్షల దగ్గరగా ఉంటోంది. ఇక బిజినెస్ క్లాస్ టిక్కెట్ ధర నిన్నామొన్నటి వరకు రూ.3.5 లక్షలకు అటుఇటు ఉండగా ఇప్పుడు రూ.6 లక్షలకు పైమాటగానే చెబుతున్నాయి విమానయాన సంస్థలు. థర్డ్‌వేవ్ ముప్పు ఉండటంతో టిక్కెట్ల ధరలు అనూహ్యంగా పెరిగినా రద్దీ మాత్రం తగ్గడం లేదు. దాదాపు ఏడాదిన్నర ప్రయాణాలకు అనుమతులు రావడం, టీకా కార్యక్రమం సైతం పూర్తయిపోవడంతో ఛార్జీలు పెరిగినా సరే అమెరికా ప్రయాణం చేసేందుకే మొగ్గు చూపుతున్నారు భారతీయులు. ఇప్పుడు ఆలోచిస్తూ కూర్చుంటే మరోసారి థర్డ్‌వేవ్ అంటూ మొదలైతే.. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదనే ఆందోళన కూడా నెలకొంది. ఫలితంగా విమాన ప్రయాణ ఛార్జీలు పెరిగినా.. ఎవ్వరూ వెనక్కి తగ్గడం లేదు. చదవండి: ‘ఇండియా అమెరికాల మధ్య సత్సంబంధాలున్నాయి’ -
స్పైస్‌జెట్ బంపర్ ఆఫర్, డబ్బులు లేవా.. తర్వాతే ఇవ్వండి
ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్ ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటికే బ్యాంకింగ్, రీటైల్, ఈ కామర్స్‌తో పాటు వినియోగదారులకు అందుబాటులో ఉన్న ఈఎంఐ సదుపాయాన్ని స్పైస్ జెట్ ఇప్పుడు విమాన ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చింది. విమాన ప్రయాణికులు ఈఎంఐ సౌకర్యంతో స్పైస్ జెట్ ఫ్లైట్ టికెట్లను కొనుగోలు చేయొచ్చు. 3,6,12 నెలల పాటు వాయిదా పద్దతుల్లో వడ్డీ లేకుండా, కొనుగోలు చేసిన టికెట్ల ధర మొత్తాన్ని ఈఎంఐలో చెల్లించుకోవచ్చు. ప్రయాణికులు చేయాల్సిందల్లా ఒక్కటే స్పైస్ జెట్ విమాన టికెట్లకు ఈఎంఐ సదుపాయం కావాలంటే ప్రయాణికులు పాన్ నెంబర్, ఆధార్ కార్డ్, వీఐడీ వివరాల్ని నమోదు చేయాలి. వన్‌టైమ్ పాస్వర్డ్ తో యాక్టీవ్ చేసుకోవాలి. వినియోగదారులు యూపీఐ ఐడీ ద్వారా ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఈఎంఐ స్కీమ్‌ను పొందేందుకు ప్రయాణికులు ఎలాంటి క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ వివరాలను అందించాల్సిన అవసరం లేదని స్పైస్ జెట్ పేర్కొంది. చదవండి:ఇకపై ఎంచక్కా..ఫ్లైట్ జర్నీలోనే క్యాబ్ బుక్ చేసుకోవచ్చు -
విమాన చార్జీలకు రెక్కలు
న్యూఢిల్లీ: దేశీయంగా విమాన ప్రయాణాలకు సంబంధించిన చార్జీలపై కనిష్ట, గరిష్ట పరిమితులను 9.83 శాతం – 12.82 శాతం మేర పెంచుతూ కేంద్ర పౌర విమానయాన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం 40 నిమిషాల లోపు వ్యవధి ఉండే ఫ్లయిట్ల కనిష్ట చార్జీ పరిమితి రూ. 2,600 నుంచి రూ. 2,900కి (11.53 శాతం) పెంచింది. అలాగే గరిష్ట పరిమితిని 12.82 శాతం పెంచడంతో ఇది రూ. 8,800కి చేరింది. అలాగే 60–90 నిమిషాల వ్యవధి ఉండే ఫ్లయిట్ల కనిష్ట చార్జీ పరిమితి 12.5 శాతం పెరిగి రూ. 4,500కి, గరిష్ట చార్జీ 12.82 శాతం మేర పెరిగి రూ. 13,200కి చేరినట్లవుతుంది. మొత్తం మీద ఇకపై 90–120, 120–150, 150–180, 180–210 నిమిషాల ప్రయాణ వ్యవధి ఉండే దేశీ ఫ్లయిట్ల కనిష్ట చార్జీల పరిమితి వరుసగా రూ. 5,300, రూ. 6,700, రూ. 8,300, రూ. 9,800గాను ఉంటుంది. కరోనా వైరస్ కట్టడి కోసం గతేడాది రెండు నెలల పాటు విధించిన లాక్డౌన్ ఎత్తివేశాక మే 25 నుంచి విమాన సేవలు ప్రారంభమయ్యాయి. సంక్షోభం లో ఉన్న ఎయిర్‌లైన్స్‌ని గట్టెక్కించే ఉద్దేశంతో ప్రభుత్వం కనిష్ట చార్జీలపైన, ప్రయాణికుల ప్రయోజనాలను కాపాడేందుకు గరిష్ట చార్జీలపైనా కేంద్రం పరిమితులు విధించింది. -
విమానాలపై లాక్డౌన్ ఎఫెక్ట్
-
ప్రయాణీకులకు షాక్: విమాన ఛార్జీలు పెంపు
సాక్షి, హైదరాబాద్: విమానయాన ధరలు జూన్ 1వ తేదీ నుంచి పెరగనున్నాయి. ఈ మేరకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. సంస్థలు తమ ఛార్జీల పట్టికలో మార్పులు చేస్తున్నాయి. విమానయాన కనీస ఛార్జీలు 13 నుంచి 16 శాతానికి పెరుగుతున్నాయి. 40 నిమిషాల ప్రయాణ ఛార్జీ రూ.2,300 నుంచి రూ.2,600కు ఉండనుంది. 60 నిమిషాల ప్రయాణ ఛార్జీ రూ.2,900 నుంచి రూ.3,300కు పెరగనుంది. కరోనా రెండో దశ విజృంభణతో విమానయాన రంగానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ క్రమంలోనే విమానయాన రంగానికి ఊతమిచ్చేలా మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. గతేడాది దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్.. ఈ ఏడాది మార్చి నుంచి విమానయాన సేవలు అంతంత మాత్రమే కొనసాగాయి. అంతర్జాతీయంగా కూడా ప్రతికూల వాతావరణం ఉండడంతో విమానయాన రంగం తీవ్రంగా నష్టపోయింది. ఛార్జీల పెంపు ఇలా.. కనీస ఛార్జీలు 13 నుంచి 16 శాతానికి పెంపు 40 నిమిషాల ప్రయాణం: రూ.2,600కు పెంపు..అత్యధిక ధర రూ.7,800 60 నిమిషాల ప్రయాణం: రూ.3,300కు పెంపు... అత్యధిక ధర రూ.9,800 -
లగేజీ తక్కువుంటే ధర కూడా తక్కువే
న్యూఢిల్లీ :మీకు ఎక్కువగా లగేజీ లేదా ? చిన్న బ్యాగుతోనే విమానంలో ప్రయాణించాలనుకుం టున్నారా ? అయితే మీ టిక్కెట్ ధర మరింత చౌకగా లభించనుంది. కేవలం కేబిన్ లగేజీ మాత్రమే ఉన్నవారికి దేశీయ విమానాల్లోని టిక్కెట్ ధరల్లో డిస్కౌంట్ ఇవ్వడానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అనుమతినిచ్చింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం విమాన ప్రయాణికులు కేబిన్ లగేజీ కింద 7 కేజీలు, చెక్ ఇన్ లగేజీ కింద 15 కేజీలు తీసుకువెళ్లవచ్చు. అంతకంటే ఎక్కువ బరువున్న సామాన్లు తీసుకువెళితే అదనపు చార్జీలు ఉంటాయి. అయితే ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే ప్రయాణికులు టిక్కెట్ బుకింగ్ సమయంలోనే తాము ఎంత బరువైన లగేజీ తీసుకువెళతారో స్పష్టం చేయాల్సి ఉంటుంది. అప్పుడే తక్కువ లగేజీ ఉన్నవారికి టిక్కెట్ డిస్కౌంట్ ధరకి వస్తుందని తెలిపింది. ప్రత్యేకంగా ఒక సీటు కావాలన్నా, భోజనం, స్నాక్స్, డ్రింక్స్ అడిగినా, మ్యూజిక్ వినాలనుకున్నా విమానయాన సంస్థలు అదనపు చార్జీలను వసూలు చేస్తున్నాయి. ఈ సర్వీసులు అవసరం లేని ప్రయాణికుల వాటిని ఎంచుకోకపోతే టిక్కెట్« ధర తగ్గుతుంది. అదే విధంగా లగేజీ లేకపోతే టిక్కెట్ ధర తక్కువకి వచ్చే సదుపాయాన్ని డీజీసీఏ ప్రయాణికులకు కల్పించింది. విమానయాన సంస్థలను నష్టాల నుంచి బయటపడేయడానికి కేంద్రం విమాన చార్జీలను 10–30శాతం వరకు పెంచాలని నిర్ణయించింది. ప్రయాణికులకు కూడా ఊరట కల్పించడానికి ఈ విధానాన్ని తీసుకువచ్చింది. -
వలస కార్మికులపై విమాన చార్జీల మోత
మోర్తాడ్/సాక్షి, జగిత్యాల: బతుకుదెరువుకోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన కార్మికుల పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యిలా తయారైంది. కరోనా వైరస్ సృష్టించిన కల్లోలంతో ఒక పక్క ఉద్యోగాలు ఊడిపోయి రోడ్డున పడగా, మరో పక్క సాధారణ ప్రయాణికుల షెడ్యూల్ విమానాలకు ప్రభుత్వాల అనుమతి లేకపోవడంతో ఇంటికి రావాలనుకుంటున్న కార్మికులకు చార్టర్డ్ విమానాలే దిక్కవుతున్నాయి. దీంతో రవాణా చార్జీ తడిసి మోపెడవుతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ), సౌదీ అరేబియా, ఒమన్, కువైట్, బహ్రెయిన్, ఖతర్‌లలో లాక్‌డౌన్‌కు సడలింపులు ఇవ్వడంతో ఇంటికి వెళ్లాలనుకునే తెలంగాణ కార్మికులు చార్టర్డ్ విమానాలను ఆశ్రయిస్తున్నారు. సాధారణ పరిస్థితుల్లో హైదరాబాద్‌కు రావాలంటే విమానాల్లో టికెట్ ధర రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఉంటుంది. అయితే కరోనా విపత్కర పరిస్థితుల్లో షెడ్యూల్ విమానాల రాకపోకలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు. చార్టర్డ్ విమానాల ల్యాండింగ్‌కు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో పలు గల్ఫ్ దేశాల్లోని వలస కార్మికులు ఇళ్లకు చేరుకోవడానికి చార్టర్డ్ విమానాలను ఆశ్రయిస్తున్నారు. ఇందులో ఒక్కో వ్యక్తినుంచి టికెట్ ధర రూ.30 వేల నుంచి రూ. 50 వేల వరకు వసూలు చేస్తున్నారు. చార్టర్డ్ విమానాల్లో చార్జీలు అధికంగా ఉండడంతో గల్ఫ్ దేశాల్లో ఉన్న అనేక మంది కార్మికులు తమకు తెలిసిన వారి వద్ద అప్పు చేస్తున్నారు. కొందరు ఇంటి నుంచి డబ్బులు తెప్పించుకుని టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. చార్టర్డ్ విమానాల్లో కూడా వెంటనే టికెట్లు లభ్యం కావడం లేదని, రోజుల తరబడి వెయిటింగ్ చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇప్పటికే ఉద్యోగాలు కోల్పోయి ఆర్థిక భారంతో ఉన్న తమను ఆదుకోవడానికి సాధారణ విమానాలకు అనుమతివ్వాలని కార్మికులు కోరుతున్నారు. వందే భారత్ మిషన్‌లో భాగంగా నడుపుతున్న విమానాలు అరకొరగా ఉండటంతో చార్టర్డ్ విమానాలను ఆశ్రయించాల్సి వస్తోందని చెబుతున్నారు. గల్ఫ్ కార్మికులకు ఎంతో నష్టం కలిగింది కరోనా కట్టడి కోసం అమలు చేసిన లాక్డౌన్ వల్ల గల్ఫ్ కార్మికులకు ఎంతో నష్టం కలిగింది. నష్టానికి తోడు ఇంటికి రావాలంటే రవాణా చార్జీల భారమూ పెరిగింది. ఉపాధి లేక ఆందోళనలో ఉన్న కార్మికులకు రవాణా చార్జీలు అధికం కావడం ఇబ్బందిగా మారింది. – సిద్దిరాములు, పెద్దమల్లారెడ్డి, కామారెడ్డి జిల్లా షెడ్యూల్ విమానాలను నడపాలి.. గల్ఫ్ దేశాల్లో ఉన్న ఎంతో మంది తెలంగాణ వాసులు ఇళ్లకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. చార్టర్డ్ విమానాల టికెట్ ధర భారీగా ఉంది. వాటిలో రావడం తలకుమించిన భారం. షెడ్యూల్ ప్రకారం విమానాలను నడిపి వలస కార్మికులను ఇళ్లకు రప్పించాలి. – నవీన్, చంద్రాయన్పల్లి, నిజామాబాద్ -
విమాన టికెట్ డబ్బు వెనక్కి ఇవ్వరా..?
న్యూఢిల్లీ: లాక్డౌన్ కారణంగా రద్దయిన విమానాలకు సంబంధించి టికెట్ డబ్బులను పూర్తిగా వాపసు ఇవ్వకపోవడంపై అత్యున్నత న్యాయస్థానం– సుప్రీంకోర్టు దృష్టి సారించింది. పూర్తి సొమ్ము వెనక్కు ఇచ్చేలా విమానయాన సంస్థలకు ఆదేశాలకు ఇవ్వాలని దాఖలైన ఒక పిటిషన్‌పై పౌర విమానయాన మంత్రిత్వశాఖ, డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్)లకు నోటీసులు జారీ చేసింది. ‘ప్రయాణికుల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా’ రద్దయిన ప్రయాణ టిక్కెట్ డబ్బును తరువాత వినియోగించడానికి ఉద్దేశించిన ‘క్రెడిట్ షెల్’ యంత్రాంగంలోకి మళ్లించడం ‘చట్ట విరుద్ధమని’ పిటిషన్ సుప్రీంకు విన్నవించింది. ఎయిర్ ప్యాసింజర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణకు స్వీకరించి నోటీసులకు ఆదేశాలిచ్చింది. కోవిడ్–19 నేపథ్యంలో రద్దయిన విమాన టికెట్ల డబ్బును వెనక్కు ఇచ్చే విషయంలో సంయుక్తంగా కొన్ని విధివిధానాలను రూపొందించుకోవాలని పౌర విమానయాన శాఖ, ఎయిర్‌లైన్స్‌కు జూన్ మొదట్లో సుప్రీం సూచనలు ఇచ్చింది. -
విమానాల్లో మధ్య సీట్లను ఖాళీగా ఉంచండి
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మరి కారణంగా విధించిన లాక్‌డౌన్‌ను తాజాగా మరోమారు కేంద్రప్రభుత్వం పొడిగించింది. అయితే ఈసారి లాక్డౌన్లో మరిన్ని సడలింపులకు అవకాశం ఇచ్చింది. రవాణా సౌకర్యాల విషయంలో కొన్ని వెసులుబాటులను ఇస్తూ మే 25 నుంచి దేశీయ విమానాల రాకపోకలను పునరుద్దరించిన విషయం తెలిసిందే. అయితే విమాన ప్రయాణాల్లో పాటించాల్సిన జాగ్రత్తపై విమానయాన శాఖ కంపెనీలకు కొన్ని మార్గదర్శకాలు చేసింది. ముఖ్యంగా సామాజిక దూరం విషయంలో చేపట్టాల్సిన చర్యలపై కీలక సూచనలు చేసింది. విమానాల్లో ప్రయాణించేటప్పుడు సామాజిక దూరం పాటించే క్రమంలో విమానంలో మధ్యలో ఉండే సీటును ఖాళీగా ఉంచాలని విమానయాన శాఖ ఆదేశించింది. అయితే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని అని మధ్యలో సీటును ఖాళీగా ఉంచాల్సి వస్తే ఆ సీటు ఖరీదు భారం మిగిలిన ప్రయాణీకులపై పడి టికెట్ ధర అధికమవుతుందని ఎయిర్‌లైన్స్ కంపెనీలు ఏవియేషన్ శాఖకు విన్నవించుకున్నాయి. (పావురం సిక్స్ ప్యాక్ ట్రైనింగ్ అదిరింది) దీని గురించి ఆలోచించిన కేంద్రప్రభుత్వం మధ్యలో సీటు కేటాయించిన వారికి చుట్టూ కప్పబడి రక్షణ కవచంలా ఉండే గౌను అందించాలని ఎయిర్‌లైన్స్ కంపెనీలను ఆదేశించింది. ఈ గౌనును జౌళి శాఖ అంగీకరించిన ఆరోగ్యప్రమాణాలతో తయారు చేయాలని విమానయాన శాఖ సూచించింది. దీనితో పాటు శానిటైజర్లు అందుబాటులో ఉంచడం, క్యాబిన్ ఎయిర్‌ను తరుచుగా మార్చుతుండటం, ఎలాంటి ఆహారాన్ని విమానాల్లో సరఫరా చేయకూడదని ఆదేశించింది. అయితే ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి కొన్ని ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచొచ్చు. మధ్యసీటు ఖాళీగా ఉంచే అవకాశం ఉంటే విమానాల్లో కచ్ఛితంగా సామాజిక దూరం పాటించేలా చూడాలని, ఒకే కుటుంబానికి చెందిన వారికి పక్కపక్కనే కూర్చొనే అవకాశం కల్పించవచ్చని విమానయాన శాఖ పేర్కొంది. (కరోనా: రోజుల తరబడి కోమాలో శిశువు) మధ్యలో సీటు ఖాళీగా ఉంచే అంశంపై సుప్రీం కోర్టు స్పందిస్తూ విమానాల్లో సామాజిక దూరం పాటించాలంటే మధ్యలో సీటును కచ్చితంగా ఖాళీగా ఉంచాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ విషయంలో ప్రభుత్వం ఎయిర్‌లైన్స్ ఆర్ధిక ప్రగతి గురించి కాకుండా ప్రజల ఆరోగ్యం గురించే చింతించాలని సూచించింది. మే7న వందేమాతరం మిషన్‌లో భాగంగా విదేశాల్లో ఉన్న భారతీయులను విమానాల ద్వారా స్వదేశానికి తీసుకువచ్చే సమయంలో బయట ఆరు అడుగుల సామాజిక దూరాన్ని పాటిస్తున్నాం, మరి విమానాల్లో సామాజిక దూరం విషయం ఏంటి అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే ప్రశ్నించారు. అయితే విమానాల్లో మధ్య సీట్ల బుకింగ్‌కు కేవలం జూన్ 7 వరకు మాత్రమే అవకాశం కల్పించాలని కోర్టు తెలిపింది. బాంబే హైకోర్టులో ఈ మధ్యసీట్లు విషయానికి సంబంధించి పిటీషన్ దాఖలైంది. దీనిపై బాంబే హైకోర్టు రేపు విచారించనుంది. ఇదిలా ఉండగా కేంద్ర విమానయాన శాఖా మంత్రి హర్దీప్ సింగ్ పూరి విమానాల్లో మధ్య సీటు ఖాళీగా ఉంచడాన్ని ఖండించారు. దీనివల్ల టికెట్ ధరలు అధికంగా పెరుగుతాయన్నారు. -
విమానం ఎక్కుతానని ఎప్పుడూ అనుకోలేదు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్, లాక్డౌన్ సమయంలో వలస కార్మికుల అనేక కష్టాల మధ్య ఇది నిజంగా ఊరటనిచ్చే వార్త. కొన్నేళ్లుగా తన దగ్గర పనిచేస్తున్న పదిమంది కార్మికులను విమానంలో సొంత రాష్ర్టానికి పంపడానికి ఏర్పాట్లు చేసి మానవత్వాన్ని చాటుకున్నారు ఢిల్లీకి చెందిన పుట్టగొడుగుల రైతు పప్పన్ గెహ్లాట్. దీంతో వీరంతా గురువారం ఉదయం బీహార్ లోని పాట్నాకు ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం నుండి బయలుదేరారు. అంతేకాదు యజమాని సొంత వాహనాల్లోనే విమానాశ్రయానికి చేరుకున్నారు. యజమాని ఔదార్యానికి కార్మికులంతా సంతోషం వ్యక్తం చేశారు. జీవితంలో విమానం ఎక్కుతామని కలలో కూడా అనుకోలేదంటూ కృతజ్ఞతలు తెలిపారు. (శ్రామిక రైళ్లలో అన్న పానీయాలు కరవు) 1993 నుండి పుట్టగొడుగుల పెంపకం చేస్తున్నారు పప్పన్. బీహార్‌కు చెందిన ఈ కార్మికులంతా గత 20 ఏళ్లుగా తన దగ్గర పనిచేస్తున్నారని, ఏప్రిల్ మొదటి వారంలో వారిని ఇంటికి పంపించాలనుకున్నా సాధ్యపడలేదని పప్పన్ తెలిపారు. శ్రామిక్ రైళ్లలోనే వారికి స్వస్థలాలకు పంపుదామని భావించినా టికెట్లు దొరకలేదన్నారు. వేలాది మైళ్ళు కాలి నడకన వెళ్లడం, రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది కార్మికులు ప్రాణాలు కోల్పోవడం లాంటివి వింటున్నాం. ఈ నేపథ్యంలో వీళ్ల జీవితాలు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని భావించే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన వివరించారు. అన్ని వైద్య పరీక్షలు, కరోనా సంబంధిత అన్ని మార్గదర్శకాలను పూర్తి చేశామని, ఇపుడిక వారు సురక్షితంగా ఇంటికి చేరతారని చెప్పారు. విమాన టికెట్ల కోసం తాను సుమారు రూ .6800 ఖర్చు చేశానని, అలాగే సొంత రాష్ట్రానికి చేరుకున్న తరువాత కూడా ఇబ్బంది పడకుండా వారికి తలొక రూ.3 వేల నగదు ఇచ్చానని పప్పన్ గెహ్లాట్ చెప్పారు. లాక్డౌన్ కారణంగా స్వస్థలాలకు వెళ్లలేకపోవడంతో ఇప్పటిదాకా పప్పన్ వారికి ఆహారంతోపాటు నివాస ఏర్పాట్లూ చేయడం విశేషం. చదవండి: పోయిన ప్రాణం తిరిగొచ్చింది: పండ్ల వ్యాపారి -
ఎల్లుండి నుంచి ఎగిరిపోవచ్చు!
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ లాక్డౌన్ కారణంగా నిలిచి పోయిన విమానాలు తిరిగి ఎగర డానికి సన్నద్ధమవుతున్నాయి. దేశీయ విమానాలు నడిపేందుకు కేంద్రం అనుమతినివ్వడంతో హైదరాబాద్ అంతర్జా తీయ విమానాశ్రయం నుంచి వివిధ నగరాలకు విమానాలను నడిపేందుకు ఎయిర్‌లైన్స్ సంస్థలు బుకింగ్‌లు ప్రారంభిం చాయి. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 25న మొదటి విమానం బయల్దేరనుంది. ఆ తర్వాత బెంగళూర్, ముంబై, చెన్నై, కోల్‌కతా తదితర మెట్రో నగరాలకు విమానాలు వెళ్లనున్నాయి. అనంతరం అన్ని ప్రధాన నగరాలకు హైదరాబాద్ నుంచి విమానాల రాకపోకలు అందుబాటులోకి వస్తాయి. విజయవాడ, విశాఖ, రాజమండ్రి, తిరుపతి, కడప తదితర నగరాలకూ పలు ఎయిర్‌లైన్స్ బుకింగ్‌లు ప్రారంభించాయి. దశల వారీగా దేశంలోని 35 నగరాలకు విమానయాన సేవలు వినియోగంలోకి రానున్నాయి. పెరిగిన చార్జీలు... లాక్డౌన్ అనంతరం ప్రారంభమవుతున్న అన్ని దేశీయ విమాన సర్వీసుల్లో చార్జీలు పెరిగాయి. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఈనెల 25న టికెట్ ధర రూ.8,407 ఉంది. స్పైస్‌జెట్‌లో ఇది రూ.11,220 వరకు ఉంది. హైదరాబాద్–చెన్నై టికెట్ ధర రూ.4,551 ఉండగా.. ముంబైకి రూ.4,603 చార్జీ ఉంది. విజయవాడ, విశాఖ, రాజమండ్రి, తిరుపతి, తదితర నగరాలకు కూడా చార్జీలు పెరిగాయి. కరోనా కారణంగా విమానంలోని సీట్ల సం ఖ్యను తగ్గిస్తున్నారు. 80 నుంచి 100 సీట్లున్న చిన్న ఫ్లైట్లలో సుమారు 40 నుంచి 50 సీట్లు మాత్రమే వినియోగంలోకి రానున్నాయి. అలాగే 250 నుంచి 300 సీట్లుండే ఫ్లైట్లలోనూ సీట్ల సంఖ్యను భారీగా కుదించనున్నారు. ప్రతి విమానంలో చివరి 3 సీట్లను వదిలేస్తారు. ప్రయాణ సమయంలో అనుకోని విధంగా ప్రయాణికులు అనారోగ్యానికి గురైనా, కరోనా లక్షణాలు కనిపించినా వారిని వెనుక సీట్లలోకి మారుస్తారు. కరోనా నిబంధనల మేరకు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అన్నివిధాలుగా సిద్ధం చేశారు. ఎయిర్ పోర్టులోకి ప్రవేశించి విమానం ఎక్కే వరకు భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు.