![New Delhi To Hyderabad Flight Charges Hike - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/16/Flights.jpg.webp?itok=I0dO1Eo0)
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ మధ్య విమాన చార్జీలు మోత మోగుతున్నాయి. కొద్ది రోజులుగా పెరిగిన ప్రయాణికుల రద్దీ, భారత రాష్ట్రసమితి (బీఆర్‌ఎస్) ఆవిర్భావ వేడుకల కోసం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, తదితర శ్రేణులు పెద్ద ఎత్తున న్యూఢిల్లీకి తరలి వెళ్లడం వంటి పరిణామాల దృష్ట్యా ఒక్కసారిగా చార్జీలు పెరిగాయి. గురువారం న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు విస్తారా విమానంలో చార్జీ రూ.26,373 వరకు ఉంది. ఎయిర్ ఏసియాలో రూ.28,841 వరకు పెరిగింది.
పైగా చెన్నై, బెంగళూర్ కనెక్టింగ్ ఫ్లైట్‌లు కావడంతో ప్రయాణ సమయం కూడా ఎక్కువే కావడం గమనార్హం. వారణాసి మీదుగా నగరానికి చేరుకొనే ఇండిగో కనెక్టింగ్ ఫ్లైట్ చార్జీ రూ.22,177 కావడం గమనార్హం. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి భారత రాష్ట్ర సమితి ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలివెళ్లినట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు పేర్కొన్నాయి. అనూహ్యంగా డిమాండ్ పెరగడంతో చార్జీలకు రెక్కలొచ్చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment