plane
-
ఎయిర్ఇండియా విమానానికి బాంబు బెదిరింపు
న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి అమెరికాలోని షికాగో బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఏఐ-127 విమానానికి ముప్పు ఉందని మంగళవారం(అక్టోబర్ 15) బెదిరింపు మెయిల్ అందింది.దీంతో అప్రమత్తమైన ఎయిర్ ఇండియా సిబ్బంది ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని కెనడాలోని ఇకాల్యూట్ ఎయిర్‌పోర్టుకు మళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా ఎక్స్(ట్విటర్)లో తెలిపింది. ఇకాల్యూట్ ఎయిర్‌పోర్టులో ప్రోాటోకాల్ ప్రకారం విమానంలోని ప్రయాణికులను,సిబ్బందిని తనిఖీ చేసిన తర్వాత విమానం తిరిగి బయలుదేరేందుకు అనుమతిస్తారని ఎయిర్ ఇండియా వెల్లడించింది. ఇటీవలి కాలంలో తమ విమానాలకు తరచుగా బాంబు బెదిరింపులు వస్తున్నాయని పేర్కొంది. -
Kolkata: విమానం ప్రయాణంలో విషాదం
ఇరాక్ నుంచి చైనా వెళ్తున్న విమానంలో విషాదం చోటు చేసుకుంది. ఓ టీనేజీ ప్రయాణికురాలు అస్వస్థతకు గురై సీటులోనే కుప్పకూలిపోగా.. విమానాన్ని కోల్‌కతాలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అయితే.. ఆస్పత్రికి తరలించేలోపు ఆ బాలిక కన్నుమూసింది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతినిధి వెల్లడించిన వివరాల ప్రకారం.. మృతురాలు బాగ్దాద్ సర్ చినార్ ప్రాంతానికి చెందిన డెరన్ సమీర్ అహ్మద్(16). మరో ఇద్దరు కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ఏఐ 473 విమానంలో చైనా గువాంగ్జౌకు వెళ్తోంది. అయితే బుధవారం అర్ధరాత్రి దాటాక.. హఠాత్తుగా ఆమె అస్వస్థతకు గురైంది.దీంతో విమానాన్ని దారి మళ్లించి అరగంటకు కోల్‌కతా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎయిర్‌పోర్ట్‌లో దించారు. ఎయిర్పోర్ట్ నుంచి ఆమెను ఏఏఐ ఆంబులెన్స్‌లో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. ఈ ఘటన తర్వాత గురువారం అర్ధరాత్రి మిగతా ప్రయాణికులతో విమానం తిరిగి బయల్దేరింది. ఈ ఘటనపై అసహజ మరణంగా కోల్‌కతా బాగౌతి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం పూర్తి అయ్యాక.. మృతదేహాన్ని ఆమె బంధువులకు అప్పగిస్తామని అధికారులు తెలిపారు. -
Rajasthan: కూలిన మిగ్ 29 యుద్ధ విమానం.. పైలట్లకు తప్పిన ప్రమాదం
బార్మర్: రాజస్థాన్‌లోని బార్మర్‌లో ఓ యుద్ధ విమానం కూలిపోయింది. ఓలానియోక్లోని ధాని సమీపంలో యుద్ధ విమానం మిగ్ 29కు ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న నాగనా పోలీస్‌స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలంలో పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదం నుంచి పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు.మిగ్ 29 యుద్ధ విమానం భారతదేశంలోని ముఖ్యమైన విమానాలలో ఒకటి. ఈ జెట్ విమానం బార్మర్‌లో రాత్రిపూట సాధారణ శిక్షణ మిషన్‌లో సాంకేతిక లోపానికి గురైందని వైమానిక దళం తెలిపింది. ప్రమాదంపై ఎయిర్ ఫోర్స్ విచారణకు ఆదేశించింది. మిగ్ 29 విమానంలో మంటలు చెలరేగిన వీడియోను డిఫెన్స్ కోర్ అనే ఖాతా నుంచి షేర్ చేశారు. During a routine night training mission in Barmer sector, an IAF MiG-29 encountered a critical technical snag, forcing the pilot to eject. The pilot is safe and no loss of life or property was reported. A Court of Inquiry has been ordered.— Indian Air Force (@IAF_MCC) September 2, 2024మిగ్ 29 విమానం 1987 నుండి అంటే దాదాపు 36 సంవత్సరాలుగా భారత వైమానిక దళం సేవలో ఉంది. సోవియట్ యూనియన్ నుంచి భారత్ ఈ విమానాన్ని కొనుగోలు చేసింది. ఈ విమానాన్ని పలుమార్లు నవీకరించారు. విమానంలోని ప్రాథమిక నిర్మాణం మినహా దాదాపు ప్రతిదీ మార్చారు. ఇందులో కొత్త కాక్‌పిట్, నూతన రాడార్, కొత్త ఇంధన ట్యాంక్ ఉన్నాయి. కొత్త ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ కూడా అమర్చారు. కొత్త క్షిపణులను అమర్చడం ద్వారా దీనికి పూర్తిగా ఆధునిక రూపాన్నిచ్చారు.మిగ్ 29 వేగంగా దాడి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది కేవలం ఆరు నిమిషాల్లో లక్ష్యన్ని ఛేదించగలదు. కార్గిల్ యుద్ధ సమయంలో ఈ విమానం కీలక పాత్ర పోషించింది. బాలాకోట్ ఘటన సమయంలో కూడా తీవ్రవాద శిబిరంపై వైమానిక దాడిలో మిగ్ 29 పాల్గొంది. ఈ విమానంలో రెండు ఇంజన్లు ఉంటాయి. పరిమాణంలో చిన్నదిగా ఉన్నా చాలా చురుకైనది. ఇది నాల్గవ తరం యుద్ధ విమానం. గంటకు దాదాపు 2,500 కిలోమీటర్ల వేగంతో ఎగిరే సామర్థ్యం దీని సొంతం.Another crash this time IAF's MIG-29 in Barmer, Rajasthan. Pilot is safe, and no damage reported on the ground. More details to follow. pic.twitter.com/5hkXpUt9lY— Defence Core (@Defencecore) September 2, 2024 -
ఆ రోజుల్లో ఈ డిజైన్ చూసి ఉంటే?: ఆనంద్ మహీంద్రా
దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే తాజాగా ఇప్పుడు ఓ పేపర్ ప్లేన్కు సంబంధించిన వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో పేపర్ ప్లేన్ రూపొందించడం చూడవచ్చు. బహుశా ఇలాంటివి చిన్నప్పుడు అందరూ చేసి ఉంటారు. ఈ వీడియో షేర్ చేస్తూ.. ''పిల్లలకు ఇంకా ఇలాంటి వాటిమీద ఆసక్తి ఉందో లేదో తెలియదు, కానీ నా స్కూల్ రోజుల్లో చాలా దూరం ప్రయాణించే పేపర్ ప్లేన్‌ని డిజైన్ చేయాలనే ఆసక్తి ఉండేది. ఆ రోజుల్లో నేను ఈ డిజైన్ని చూసి ఉంటే... పోటీలో తేలికగా గెలిచి ఉండేవాడిని'' అని వెల్లడించారు.నిజానికి పేపర్ ప్లేన్స్ అనేవి వివిధ రకాలుగా తయారు చేయవచ్చు. అయితే ఎక్కువ దూరం ప్రయాణించే పేపర్ ప్లేన్ తయారు చేయడానికి కొన్ని టిప్స్ అవసరం. అలాంటివి ఈ వీడియోలో చూడవచ్చు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన అతి తక్కువ సమయంలోనే ఈ వీడియో వేల లైక్స్ పొందింది.Don’t know if kids are still interested but in my school days designing the farthest travelling paper plane was a preoccupationWish I had seen this design in those days… would have handily won the competition. #Sunday is perfect for paper planes…pic.twitter.com/jifbSuwtxy— anand mahindra (@anandmahindra) August 25, 2024 -
సీప్లేన్ ఏరోడ్రోమ్ నిబంధనల సడలింపు
కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సీప్లేన్ కార్యకలాపాల కోసం నిబంధనలను సరళీకృతం చేసింది. నాన్-షెడ్యూల్డ్ సంస్థలు సీప్లేన్ సేవలు నిర్వహించేలా అనుమతులను సవరించింది. ఏరోడ్రోన్ సర్టిఫికేట్ ప్రక్రియను సులభతరం చేసింది. ప్రాంతీయ ఎయిర్ కనెక్టివిటీ పథకం ఉడాన్ పథకం కింద సీప్లేన్ కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ..‘సీప్లేన్ కార్యకలాపాలు పర్యాటకం అభివృద్ధికి దోహదం చేస్తాయి. గతంలో వీటి నిర్వహణకు ఉన్న నిబంధనలను సవరిస్తున్నాం. సాధారణంగా సీప్లేన్లు సముద్రంలో టేకాఫ్, ల్యాండ్ అవ్వాలంటే ఇప్పటివరకు ఉన్న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిబంధనల ప్రకారం వాటర్‌డ్రోమ్ లైసెన్స్ తప్పనిసరి. కానీ ఇకపై ఈ లైసెన్స్ అవసరం లేకపోయినా టేకాఫ్, ల్యాండ్ అవ్వొచ్చు. కమర్షియల్ పైలట్ లైసెన్స్ (సీపీఎల్) కలిగినవారు నేరుగా సీప్లేన్ రేటింగ్లను పొందవచ్చు. దాంతో పైలట్ల కొరత తీరుతుంది. నాన్-షెడ్యూల్డ్ ఆపరేటర్లు సీప్లేన్ కార్యకలాపాలను నిర్వహించవచ్చు’ అన్నారు.ఇదీ చదవండి: ‘లెజెండ్స్’ సర్వీసు నిలిపేత‘గతంలో అండమాన్ & నికోబార్ దీవులతో పాటు గుజరాత్లో సీప్లేన్ కార్యకలాపాలు జరిగేవి. కానీ అవి ఎక్కువ కాలం కొనసాగలేదు. తిరిగి వీటిని ప్రారంభించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దేశవ్యాప్తంగా మొత్తం 100 మార్గాల్లో ఈ సీప్లేన్లు ఎగరనున్నాయి. ఇప్పటికే వీటికి అనువైన మార్గాలను కనుగొనాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరాం. అండమాన్ & నికోబార్, గుజరాత్, లక్షద్వీప్, గోవా, అస్సాం, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌ల్లో విస్తరించి ఉన్న 18 ప్రదేశాల్లో వాటర్ సీప్లేన్ ఏరోడ్రోమ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది’ అని మంత్రి పేర్కొన్నారు. -
ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు
-
విమానంలో సీఐఎస్ఎఫ్ సిబ్బందిపై మహిళ దాడి
ముంబై: విమానంలో ఓ మహిళ.. తోటి ఇద్దరు ప్రయాణికులు, సీఐఎస్ఎఫ్ సిబ్బందిపై దాడికి తెగపడ్డారు. ఈ ఘటన శనివారం పుణెలోని లోహెగావ్ ఎయిర్‌పోర్టులో చోటు చేసుకుంది. ఉదయం 7. 45 గంటలకు పుణె నుంచి ఢిల్లీకి బయలుదేరే.. ఓ ప్రైవేటు విమానంలో బోర్డింగ్ ప్రాసెస్ సమయంలో ఓ మహిళ దాడికి తెడపడ్డారు. మొదట ఆ మహిళ ముందు సీట్లో ఉన్న ఇద్దరు ప్రయాణికులపై దాడి చేశారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకుంది. వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి విమాన సిబ్బంది, సీఐఎస్ఎఫ్ కానిస్టెబుల్స్ ఆమె వద్దకు వచ్చారు. దీంతో ఆమె మరింత రెచ్చిపోయి.. సీఐఎస్ఎఫ్ సిబ్బందిపై దాడి చేసింది. అనంతరం ఆ మహిళను, ఆమె భర్తను విమానం నుంచి దింపేశారు. ఆ మహిళను ఎయిర్ పోర్టు పోలీసులకు అప్పగించగా.. కేసు నమోదు చేశారు.సీనియర్ ఇన్స్పెక్టర్ అజయ్ సంకేశ్వరి మాట్లాడుతూ.. విచారణ కోసం సదరు మహిళకు నోటీసు ఇచ్చి విడిచిపెట్టాం. ఎయిర్‌లైన్ సిబ్బంది, సీఐఎస్ఎఫ్ సిబ్బంది,సహ ప్రయాణీకులు వాంగ్మూలాలను రికార్డు చేశాం’ అని చెప్పారు. వ్యక్తిగత అత్యవసర పరిస్థితి కారణంగా ఆమె తీవ్రమైన బాధలో ఉన్నట్లు గమనించామని, అందుకే ఆమె తోటి ప్రయాణికులతో వాగ్వాదానికి దిగారని ఓ సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ తెలిపారు. -
హైదరాబాద్ నుంచి ఇండిగో కొత్త సర్వీసులు
హైదరాబాద్-అహ్మదాబాద్ మధ్య విమానయాన సంస్థ ఇండిగో కొత్త, అదనపు సర్వీసులు నడుపుతామని ప్రకటించింది. హైదరాబాద్-హిరాసర్ మధ్య నూతన డెయిలీ సర్వీసును సెప్టెంబర్ 16 నుంచి ప్రారంభిస్తున్నట్లు చెప్పింది.సెప్టెంబర్ ఒకటి నుంచి హైదరాబాద్-ఉదయ్‌పూర్ మధ్య వారంలో నాలుగు ఫ్లైట్స్, సెప్టెంబర్ మూడు నుంచి హైదరాబాద్-జోద్పూర్ మధ్య వారంలో మూడు సర్వీసులు తిరిగి మొదలు అవుతాయని చెప్పింది. కొత్త రూట్ల చేరికతో భాగ్యనగరి నుంచి 69 నగరాలకు ప్రతివారం డైరెక్ట్ ఫ్లైట్స్ సంఖ్య 1,220కి చేరనుంది. ఇక అహ్మదాబాద్ నుంచి అమృత్సర్, భువనేశ్వర్‌కు అదనపు ఫ్లైట్స్‌ను నడుపుతామని ఇండిగో పేర్కొంది.ఇదీ చదవండి: ధరలు తగ్గించిన ఏకైన దేశం ఇండియాప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా విమాన ప్రయాణీకుల రద్దీ 40.7-41.8 కోట్లకు చేరుతుందని కొన్ని నివేదికలు అంచనా వేస్తున్నాయి. అదే సమయంలో విమాన సంస్థల ఆదాయాలు 15-17 శాతం పెరుగుతాయని చెబుతున్నాయి. దాంతో కంపెనీలు తమ సర్వీసులు పెంచుతున్నాయి. మెట్రో నగరాలతోపాటు టైర్1, 2 సిటీలకు కూడా తమ సర్వీసులను పొడిగిస్తున్నాయి. దేశీయంగా నడిపే విమానాల సంఖ్యను పెంచుతున్నాయి. -
ధీరేంద్రశాస్త్రిని ఆస్ట్రేలియా నుంచి రప్పించిన అంబానీ
ప్రపంచంలోని ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరైన ముఖేష్ అంబానీ తన కుమారుడు అనంత్ అంబానీ వివాహాన్ని అత్యంత ఘనంగా జరిపించారు. ఈ సందర్భంగా జరిగిన వివిధ వేడుకలకు హాజరైన అతిథుల సంఖ్య కూడా భారీగానే ఉంది.బాలీవుడ్ సెలబ్రిటీలు మొదలుకొని ప్రపంచంలోని ప్రముఖ గాయకులు, నేతలు ఈ పెళ్లికి హాజరయ్యారు. పెళ్లి అనంతరం అనంత్ అంబానీ, రాధికలను ఆశీర్వదించేందుకు ప్రముఖ సాధువులు కూడా తరలివచ్చారు. ఈ వివాహానికి తాను ఎలా హాజరైనదీ మధ్యప్రదేశ్‌లోని బాగేశ్వర్ ధామ్‌కు చెందిన స్వామీజీ ధీరేంద్ర శాస్త్రి ఒక ప్రసంగంలో తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన బాబా బాగేశ్వర్ ధామ్ ఫేస్బుక్ హ్యాండిల్లో షేర్ చేశారు.అనంత్ అంబానీ వివాహానికి సంబంధించి తనకు ఆహ్వానం అందిందని, అయితే తాను అప్పుడు ఆస్ట్రేలియాలో ఉండటంతో తొలుత నిరాకరించానని ధీరేంద్ర శాస్త్రి తెలిపారు. అయితే అంబానీ తన కోసం ఆస్ట్రేలియాకు విమానాన్ని పంపారని, సకల సదుపాయాలు ఏర్పాటు చేశారని, దీంతో తాను అనంత్ అంబానీ వివాహానికి హాజరయ్యానన్నారు. తనతో పాటు కొందరు శిష్యులు కూడా విమానంలో ముంబై చేరుకున్నామని తెలిపారు. అనంతరం అనంత్, రాధికలను ఆశీర్వదించి, తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లిపోయామన్నారు. -
పాతకాలం విమానం కుప్పకూలి ఇద్దరి మృతి
కాలిఫోర్నియా: ఫాదర్స్ డే సందర్భంగా అమెరికాలోని కాలిఫోర్నియాలో నిర్వహించిన వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం సదరన్ కాలిఫోర్నియా ఎయిర్‌ఫీల్డ్‌కు చెందిన ఎయిర్ మ్యూజియం నిర్వహించిన వేడుకల్లో పాత కాలపు విమానం కుప్పకూలటంతో ఇద్దరు మృతి చెందారు.CALIFORNIAVintage plane crashes after takeoff from Chino Airport; 2 deadJun 16, 2024The Federal Aviation Administration is investigating after a vintage plane crashed shortly after taking off in Chino early Saturday afternoon, killing two people.#Chino #Planecrash #Airport… pic.twitter.com/sg6KSnp4GQ— Abhay (@AstuteGaba) June 16, 2024 ఈ విషయాన్ని ఎయిర్ మ్యూజియం అధికారులు వెల్లడించారు. శాన్ బెర్నార్డినో కౌంటీలోని చినో ఎయిర్ పోర్టుకు పశ్చిమాన శనివారం మధ్యాహ్నం 12:30 గంటల ట్విన్-ఇంజిన్ లాక్‌హీడ్ 12A విమానం కూలిపోయిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు తెలిపారు.చాలా పురాతనమైన ఈ విమానం యాంక్స్ ఎయిర్ మ్యూజియానికి చెందినదిగా అధికారులు తెలిపారు. యాంక్స్ మ్యూజియం అనేక పురాతన విమానాలకు కలిగి ఉందని తెలిపారు. ఈ ఘటనపై నేషనల్ ట్రాన్స్‌పోర్టు సేఫ్టీ బోర్డు దర్యాప్తు చేపట్టింది. అయితే మృతి చెందిన వారి వివరాలును అధికారులు వెల్లడించింది. -
ఖతర్ ఎయిర్వేస్ విమానంలో కుదుపులు.. 12 మందికి గాయాలు
డబ్లిన్: ఖతర్ రాజధాని దోహా నుంచి ఐర్లాండ్ వెళ్లిన ఖతర్ ఎయిర్వేస్కు చెందిన బోయింగ్ 787 విమానం గగనతలంలో భారీ కుదుపులకు గురైంది. దీంతో విమానంలో ప్రయాణిస్తున్న 12 మందికి గాయాలయ్యాయి.ఈ విమానం ఆదివారం(మే26) ఒంటిగంటకు డబ్లిన్‌లో ల్యాండ్ అయింది. ఖతర్ ఎయిర్వేస్ విమానం ల్యాండ్ అవగానే అత్యవసర సర్వీసులు, ఫైర్, రెస్క్యూ, ఎయిర్‌పోర్టు పోలీసు విభాగాల సిబ్బంది విమానాన్ని పరిశీలించారు. విమానం టర్కీ మీదుగా ప్రయాణిస్తున్నపుడు గాలిలో కుదుపులకు గురైంది. కుదుపుల కారణంగా విమానంలో ఉన్న ఆరుగురు ప్యాసింజర్లు, ఆరుగురు సిబ్బందికి గాయాలయ్యాయి’అని డబ్లిన్ ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ఇటీవలే సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం గాలిలో భారీ కుదుపులకు గురై ఒక ప్యాసింజర్ మరణించిన విషయం తెలిసిందే. -
Hyderabad: విమానం గాల్లో ఉండగా డోర్ తెరిచే ప్రయత్నం..
శంషాబాద్: ప్రయాణంలో ఉన్న విమానం డోరు తెరిచే ప్రయత్నం చేసి కలకలం రేపిన ఓ ప్రయాణికుడి ఘటనలో పలు వివరాలు వెల్లడయ్యాయి. స్నేహితులతో ఉజ్జయిని వెళ్లిన ఓ ప్రయాణికుడు ఈ నెల 21 ఇండోర్ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానంలో కొందరు ప్రయాణికులతో గొడవ పడడంతో అతడిని ముందు సీటులో కూర్చోబెట్టారు. ఆ తర్వాత కొద్దిసేపటికి అతడు గాల్లో ప్రయాణిస్తున్న విమానం డోరు తెరిచేందుకు యతి్నంచడంతో అందులోని ఉద్యోగులు నివారించారు.ఈ విషయమై ఆర్జీఐఏ పీఎస్‌లో కేసు నమోదు అయినప్పటికి వివిధ మెడికల్ రిపోర్టుల ఆధారంగా అతడు స్టేషన్ బెయిల్ పొందాడు. అసలు సదరు ప్రయాణికుడు అలా ప్రవర్తించడానికి గల కారణం ఏంటని స్నేహితులను ప్రశి్నంచిన పోలీసులకు అతడు బంగు (మూలికలతో చేసిన మత్తుపదార్థం) సేవించడమే కారణమని తెలిపారు. బంగు మత్తులో ఉన్నందునే సదరు ప్రయాణికుడు అలా ప్రవర్తించినట్లు తెలిపారు. -
ఒక్కొక్కరూ, రెండు సీట్లు కొనుక్కోండి : ఎయిర్‌లైన్ సిబ్బంది అమానుషం
బరువుఎక్కువగా ఉన్నారనే కారణంతో ఇద్దరు మహిళల్ని విమానం నుంచి దించేసిన అమానుష ఘటన న్యూజిలాండ్‌లో చోటుచేసుకుంది. మార్చి 8వ తేదీ అంతర్జీతీయ మహిళా దినోత్సవం రోజు ఈ పరిణామం జరగడం గమనార్హం. అయితే ఈ వివాదంపై స్పందించిన ఎయిర్ న్యూజిలాండ్ ఇద్దరు మహిళలకు క్షమాపణలు చెప్పింది. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి: ఏంజెల్ హార్డింగ్ మరో ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి నేపియర్ నుండి ఆక్లాండ్ ఇంటికి ప్రయాణిస్తుండగా ఈ షాకింగ్ పరిణామం ఎదురైంది. విమానం ఎక్కి, విమానం రన్‌వేపైకి చేరుకుందో లేదో అటెండెంట్ వచ్చి సీట్ ఆర్మ్‌రెస్ట్‌ను కిందకు దించేందుకు ప్రయత్నించింది. దీనిపై ఎందుకని ప్రశ్నిస్తే అది సరిగ్గా ఫిట్ అయ్యేంతవరకు విమానం టేకాఫ్ చేయబోనని పైలట్ చెప్పినట్లు వెల్లడించింది. ఈ క్రమంలో తన పట్ల అటెండెంట్ చాలా దురుసుగా వ్యవహరించిందని ఏంజెల్ హార్డింగ్ ఆవేదన వ్యక్తంచేశారు. అంతేకాదు సిబ్బంది తమను కిందకు దించేస్తామని బెదిరించారట. దీంతో ఈ వివాదం మరింత ముదిరి విమానాన్ని బోర్డింగ్ ప్రదేశానికి తీసుకొచ్చారు. మరోవైపు తమకు ఇబ్బంది కలుగుతోంది అంటూ మిగిలిన ప్రయాణీకులు ఒత్తిడి తేవడంతో బాధిత మహిళల్ని దిగిపోవాలని సిబ్బంది కోరారు. అయితే ఇలా ఎందుకు బాధిత మహిళలు గట్టిగా నిలదీశారు. ఇక్కడ సిబ్బంది సమాధానంతో వారు షాకయ్యారు. ఒక్కొక్కరు రెండు సీట్లు బుక్ చేసుకోవాలంటూ వ్యంగ్యంగా మాట్లాడటంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఇలాంటి అవమానకర పరిస్థితి మనమందరం మనుషులం,మరెవ్వరికీ తన లాంటి అవమానం ఎదురుకాకూడదంటూ విమానయాన సంస్థకు ఫిర్యాదు చేశారు. దీన్ని విచారించిన సంస్థ బాధితులకు క్షమాపణలు చెప్పింది. వారి విమాన ప్రయాణ బిల్లును చెల్లించి, వారి ఖర్చు లన్నింటినీ భరించింది. అలాగే ప్రయాణికులతో హుందాగా నడుచుకునేలా చూస్తామని ఎయిర్‌లైన్ ప్రతినిధి హామీ ఇచ్చారు. అయితే ఈ అవమానానికి తగిన పరిహారం చెల్లించాల్సిందే అంటూ హార్డింగ్ స్నేహితుడు పట్టుపడుతున్నాడు. -
ప్రధానితో ముందుగానే వెళ్లిన విమానం.. 31 మంది ప్రయాణికులు విలవిల
నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ యూఏఈలో జరిగే కాప్- 28 వాతావరణ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లారు. ఈ సమయంలో ఒక విచిత్రం చోటుచేసుకుంది. ప్రధాని ప్రచండను తీసుకుని దుబాయ్‌కు బయలుదేరిన విమానం షెడ్యూల్ కంటే ముందే బయలుదేరింది. నిర్ణీత సమయానికి ముందుగానే విమానం టేకాఫ్ కావడంతో 31 మంది ప్రయాణికులు విమానాశ్రయంలో చిక్కుకుపోయి, పలు అవస్థలు పడ్డారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం నేపాల్ ప్రధాని ప్రచండతో దుబాయ్‌కి బయలుదేరిన నేపాల్ ఎయిర్‌లైన్స్ విమానం నిర్ణీత షెడ్యూల్‌కు రెండు గంటల ముందుగానే బయలుదేరింది. దీంతో ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 31 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. దుబాయ్ వెళ్లే విమానం ఆర్ఏ- 299 బుధవారం రాత్రి 11.30 గంటలకు టేకాఫ్ కావాల్సి ఉండగా, వీవీఐపీ హోదా కారణంగా విమానం 9.30 గంటలకు బయలుదేరిందని విమానయాన సంస్థ తెలిపింది. ‘ప్రధాని ప్రచండ అదే విమానంలో ఉన్నారు. కాప్-28 సమ్మిట్ కోసం ఆయన ప్రతినిధి బృందంతో కలిసి దుబాయ్‌కి బయలుదేరారని, అందుకే విమానం ముందుగానే బయలుదేరాల్సి వచ్చింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు’ అంటూ విమానయాన సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ విమాన ప్రయాణికుల జాబితాలో 274 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో 31 మంది విమానం ఎక్కలేకపోయారు. విమానం రెండు గంటలు రీషెడ్యూల్ చేశాం. ఇమెయిల్ ద్వారా విమానం బయలుదేరే సమయం గురించి ప్రయాణికులకు ముందుగానే తెలియపరిచాం. అయితే 31 మంది ప్రయాణికులు స్పందించలేదని ఎయిర్‌లైన్ వివరించింది. యూఏఈలో జరిగే వాతావరణ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని ప్రచండ.. నేపాల్ నుంచి దుబాయ్ చేరుకున్నారు. అక్కడ ఆయన పలువురు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు కూడా జరుపుతారు. మరోవైపు కాప్- 28 వాతావరణ సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇప్పటికే దుబాయ్ చేరుకున్నారు. అక్కడ ప్రవాస భారతీయులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఇది కూడా చదవండి: ఎయిమ్స్ నుంచి కార్మికులు డిశార్జ్ -
విమానం రెక్కలపై సిబ్బంది డ్యాన్సులు..
విమానం రెక్కపై డ్యాన్స్ చేస్తూ స్విస్ ఎయిర్‌పోర్టు లైన్స్ సిబ్బంది బుక్కయ్యారు. బోయింగ్ 777 విమానం రెక్కపై సిబ్బంది డ్యాన్సులు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో విమానయాన సంస్థ చర్యలకు సిద్ధపడింది. విమానాల్లో ఇలాంటి ఘటనలు ఎంత మాత్రం సహించరానివని స్పష్టం చేసింది. బోయింగ్ 777 విమానం ఎయిర్‌పోర్టులో ఆగింది. ఈ క్రమంలో ఓ మహిళా సిబ్బంది విమానం రెక్కపై డ్యాన్స్ చేసింది. ఆ తర్వాత అధికారిగా కనిపించే మరో వ్యక్తి కూడా బాడీ బిల్డింగ్ పోజులు ఇచ్చారు. ఈ దృశ్యాలను విమానం కోసం టెర్మినల్ వద్ద వేచి చూస్తున్న ఓ వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఇది కాస్త వైరల్‌గా మారి స్విస్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు యాజమాన్యానికి చేరింది. Moment air hostesses for #Swiss International Air Lines are caught on camera posing for selfies as they dance on wing of Boeing 777 in #BuenosAires, #Argentina pic.twitter.com/9lCwCrjVRA — Hans Solo (@thandojo) August 27, 2023 బోయింగ్ విమానం రెక్క ఐదు మీటర్ల వెడల్పు, 16.4 మీటర్ల ఎత్తు ఉంటుంది. అంత ఎత్తు నుంచి కిందపడితే తీవ్ర ప్రమాదానికి దారి తీస్తుందని ఎయిర్ పోర్టు యాజమాన్యం తెలిపింది. సిబ్బంది ఇలాంటి చర్యలకు పాల్పడితే క్షమించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. చూడటానికి సరదాగా అనిపించినా.. ఇలాంటి ఘటనలు ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేసింది. ఇదీ చదవండి: ప్రభుత్వాఫీస్‌లో అధికారి మద్యం సేవిస్తూ.. వీడియో వైరల్.. -
వాగ్నర్ చీఫ్ విమానం పేలుడు.. వీడియో వైరల్
పుతిన్ ఒకప్పటి సన్నిహితుడు, రష్యాలో తిరుగుబాటు ఎగరేసిన కిరాయి సైన్యం గ్రూప్ వాగ్నర్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో మరణించారు. అయితే.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై తిరుగుబాటు చేసిన రెండు నెలల్లోనే ఆయన మృతి చెందడం అనుమానాలకు తావిస్తోంది. ప్రిగోజిన్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని అమెరికా నిఘా సంస్థ నుంచి గతంలోనే హెచ్చరికలు వచ్చాయి. పుతిన్ ప్రత్యర్థులందరూ తెరిచి ఉన్న కిటికీల నుంచి జారిపడ్డారని, ఈ క్రమంలో కిటికీలకు దూరంగా ఉండాలనే స్థాయిలో సూచనలు వచ్చాయి. అయినప్పటికీ ధైర్యంగా రష్యాలోనే తిరుగుతున్న ప్రిగోజిన్.. ఇంతలోనే విమాన ప్రమాదంలో మరణించారు. 🚨#BREAKING: Wagner chief Prigozhin has died along with 10 other passengers on the jet that just crashed in Russia's Tver region pic.twitter.com/4kPLrsGANb — R A W S A L E R T S (@rawsalerts) August 23, 2023 30 సెకన్లలోనే.. ప్రిగోజిన్ ప్రాణాలు కోల్పోయిన విమాన ప్రమాదం మాస్కోకు మాస్కోకు 100 కిలోమీటర్ల దూరంలో త్వెర్ ప్రాంతంలో జరిగింది. సవ్యంగా సాగుతున్న విమాన ప్రయాణం అప్పటివరకు బాగానే ఉన్నా.. కేవలం 30 సెకన్ల వ్యవదిలోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఆకాశం నుంచి విమానం పొగలు వెదజల్లుతూ కిందకు పడుతున్న దృశ్యాలు తాజాగా వైరల్‌గా మారాయి. ఈ ప్రమాదంలో ఎవరూ బతికే అవకాశాలు లేవని అధికారులు తెలిపారు. అందులో ప్రిగోజిన్ కూడా ఉన్నట్లు స్పష్టం చేశారు. పుతిన్‌పై తిరుగుబాటు.. ఉక్రెయిన్‌పై.. సైనిక చర్యలో భాగంగా కొన్నాళ్లు రష్యా సైనిక బలగాలకు అండగా ఉన్న ప్రిగోజిన్.. జూన్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్, ఆయన ప్రభుత్వంపై ఎదురుతిరిగారు. పుతిన్ సైనిక నాయకత్వాన్ని కూలదోసేందుకు.. అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా.. రష్యా ఉలిక్కిపడింది. బెలారస్ అధ్యక్షుడు లుకషెంకో మధ్యవర్తిత్వంతో వాగ్నర్ బృందాల తిరుగుబాటుకు తెరపడింది. ఎవరీ ప్రిగోజిన్..? రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే ప్రిగోజిన్‌ను.. పుతిన్ షెఫ్‌గా వ్యవహరిస్తుంటారు. 1980ల్లో దొంగతనం, దోపిడీ కేసుల్లో ప్రిగోజిన్ దాదాపు 9 ఏళ్ల జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చారు. 1990ల్లో పుతిన్‌కు-ప్రిగోజిన్‌కు పరిచయం ఏర్పడింది. 2000లో పుతిన్ రష్యా అధ్యక్షుడు అయ్యారు. మరోవైపు.. ప్రిగోజిన్ రెస్టారెంట్లు ఇతర వ్యాపారాలను విస్తరించారు. 2001 నుంచి పుతిన్ సన్నిహిత వర్గాల్లో ప్రిగోజిన్ కనిపిస్తూనే ఉన్నాడు. రష్యా ప్రభుత్వానికి చెందిన సైనిక, పాఠశాల ఫుడ్ కాంట్రాక్టులు ఇతనికే దక్కాయి. ఆ తర్వాత 2014లో వాగ్నర్ పీఎంసీ నిర్వహణలో ప్రిగోజిన్ పాత్ర కూడా బయటకు వచ్చింది. ఇదీ చదవండి: ‘వాగ్నర్’ చీఫ్ ప్రిగోజిన్ ప్రాణాలకు ముప్పు -
విమానంలో భయానక అనుభవం ..
వాషింగ్టన్: సాంకేతిక లోపం కారణంగా విమానంలో ఒక్కసారిగా తక్కువ ఎత్తుకు దిగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పీడన సమస్యను అధిగమించేందుకు విమానాన్ని మూడు నిమిషాల్లోనే 15 వేల అడుగుల మేర దించాల్సి వచ్చినట్లు పిడ్మాంట్ ఎయిర్‌లైన్స్ సంస్థ ఫాక్స్ న్యూస్‌కు తెలిపింది. నార్త్ కరొలినాలోని చార్లొట్టె నుంచి ఫ్లోరిడాలోని గైన్స్విల్లెకు వెళ్తున్న పిడ్మాంట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో ఈ నెల 10వ తేదీన ఈ ఘటన చోటుచేసుకుంది. చివరికి గమ్యస్థానానికి చేరుకుని సురక్షితంగా ల్యాండయింది. ‘టేకాఫ్ తీసుకున్న 43 నిమిషాల తర్వాత 29 వేల అడుగుల ఎత్తులో ఉండగా విమానంలో సమస్య మొదలైంది. క్యాబిన్లో పీడనం అకస్మాత్తుగా తగ్గిపోవడంతో ప్రయాణికులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. ఆరు నిమిషాల వ్యవధిలోనే మొత్తం 18,600 అడుగులు కిందికి దిగింది’అని ఫ్లైట్అవేర్ డేటా విడుదల చేసింది. ఘటనపై హారిసన్ హోవ్ అనే ప్రయాణికుడు సోషల్ మీడియా ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ‘కాలుతున్న వాసన, పెద్ద శబ్దం, చెవుల్లో హోరు’తో గగుర్పాటు కలిగించిందని పేర్కొన్నారు. కేబిన్‌లో కాలుతున్న వాసన, పెద్ద శబ్దాలు రావడంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. ఊపిరాడక కొందరు ప్రయాణికులు ఆక్సిజన్ మాసు్కలతో గాలి పీల్చుకుంటున్న ఫొటోను హారిసన్ షేర్ చేశారు. -
చెన్నై విమానాశ్రయంలో శ్రీలంక మహిళ మృతి
అన్నానగర్: చైన్నె నుంచి శ్రీలంకలోని జాఫ్నాకు అలయనన్స్ ఎయిర్‌లైన్స్ ప్యాసింజర్ విమానం శనివారం ఉదయం 10.05 గంటలకు బయలుదేరేందుకు సిద్ధమైంది. ఆ విమానంలో ప్రయాణించాల్సిన వారు భద్రతా తనిఖీలు ముగించుకుని బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. శ్రీలంకకు చెందిన శివకజన్ లిట్టి(43) తమిళనాడులో ఆధ్యాత్మిక పర్యటన ముగించుకుని తిరిగి వెళ్లడానికి వచ్చారు. ఆ సమయంలో ఒక్కసారిగా ఆమె స్పృహతప్పి పడిపోయారు. వైద్యులు పరీక్షించి ఆమె గుండెపోటుతో మృతి చెందినట్లు వెల్లడించారు. ఎయిర్‌పోర్టు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం క్రోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చైన్నె ఎయిర్పోర్ట్ పోలీసులు సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం చైన్నెలోని శ్రీలంక రాయబార కార్యాలయానికి కూడా సమాచారం అందించారు. దీంతో విమానం గంట ఆలస్యంగా బయలుదేరింది. -
శ్రీవారి ఆలయంపై విమానం
తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయం పైనుంచి విమానం వెళ్లిన ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. విమానం రేణిగుంట విమానాశ్రయం నుంచి వచ్చిందా.. లేక ఇతర ప్రాంతాల నుంచి వచ్చిందో తెలియడం లేదు. ఆగమశాస్త్ర నియమం ప్రకారం తిరుమల ఆలయంపై ఎటువంటి విమానాలు వెళ్లరాదు. అయితే తరచూ ఆలయ పైభాగంలో విమానాలు వెళుతున్నాయి. తాజాగా ఘటన నేపథ్యంలో టీటీడీ భద్రతాధికారులు పరిశీలిస్తున్నారు. వైభవంగా అమావాస్య ఉత్సవం శ్రీకాళహస్తి: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరాలయంలో సోమవారం అమావాస్య ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ అలంకార మండపంలో స్వామి, అమ్మవార్లకు విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి ధూప, దీప నైవేద్యాలు సమర్పించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, వేదమంత్రాల నడుమ స్వామి, అమ్మవార్లను చప్పరాలపై అధిష్టించారు. పురవీధుల్లో ఊరేగుతున్న స్వామి,అమ్మవార్లను భక్తులు దర్శించి పరవశించారు. ఆలయ పాలకమండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. -
విమానంలో ధూమపానం!
సాక్షి, చైన్నె: కువైట్ నుంచి చైన్నెకు వచ్చిన విమానంలో ఓ యువకుడు పొగతాగి అడ్డంగా బుక్కయ్యాడు. అతడిని చైన్నెలో పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. కువైట్ నుంచి ఆదివారం రాత్రి ఓ విమానం చైన్నెకు బయలు దేరింది. 184మంది ప్రయాణికులు ఇందులో ఉన్నారు. 38 వేల అడుగుల ఎత్తులో విమానం ప్రయాణిస్తుండగా, ఇందులో ప్రయాణించిన ఓ యువకుడు సిగిరెట్ వెలిగించాడు.. దీనిని పక్కనే ఉన్న మరో ప్రయాణికుడు వ్యతిరేకించాడు. అతడు పట్టించుకోక పోవడంతో విమాన సిబ్బందికి తెలియజేశాడు. విమాన సిబ్బంది, ఫైలట్, ఇతర ప్రయాణికులు వారించినా అతడు ఖాతరు చేయలేదు. దీంతో అతడి చర్యలపై చైన్నె విమానాశ్రయ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు. అర్ధరాత్రి వేళ విమానం చైన్నెలో ల్యాండ్ కాగానే భద్రతా సిబ్బంది ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. విమానంలో తనకు సిగరేట్ తాగాలనిపించింది తాగాను..అంటూ అతడు ఇచ్చిన సమాచారం భద్రతా సిబ్బందిని విస్మయానికి గురి చేసింది. దీంతో ఆయువకుడ్ని చైన్నె విమానాశ్రయ పోలీసులకు అప్పగించారు. విచారణలో ఆ యువకుడు మహారాష్ట్ర రాజధాని నగరం ముంబై లోని థానే ప్రాంతానికి చెందిన మహ్మద్ సదాం(32)గా గుర్తించారు. అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. -
డ్యూటీ టైమైపోయిందని విమానాన్ని మధ్యలోనే వదిలేసిన పైలెట్లు
జైపూర్: లండన్ నుండి ఢిల్లీ వెళ్ళవలసిన ఎయిరిండియా ఫ్లైట్ పైలెట్లు తమ డ్యూటీ సమయం అయిపోయిందన్న కారణంతో ప్రయాణం మధ్యలోనే ప్రయాణికులను విమానాన్ని వదిలేసి వెళ్లిపోయిన సంఘటన ప్రయాణికులను విస్మయానికి గురిచేసింది. లండన్ నుండి బయలుదేరిన AI-112 ఎయిరిండియా విమానం ఆదివారం 4 గంటలకు ఢిల్లీ చేరుకోవాల్సి ఉంది. కానీ ఢిల్లీలోని వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా అత్యవసర పరిస్థితుల్లో విమానాన్ని జైపూర్‌లో ల్యాండ్ చేశారు. తర్వాత కొద్దిసేపటికి విమానానికి క్లియరెన్స్ లభించినప్పటికీ ఎయిరిండియా పైలెట్లు తమ డ్యూటీ సమయం ముగిసిందని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయారు. దీంతో ఆ ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్న సుమారు 350 మంది ప్రయాణికులను చాలాసేపు నిరీక్షణ తర్వాత ప్రత్యామ్నాయ మార్గాల్లో ఢిల్లీకి తరలించారు. పైలెట్ల చర్యపైనా, ఎయిర్ పోర్టు సిబ్బంది వ్యవహరించిన తీరుపైనా చిర్రెత్తిపోయిన ప్రయాణికులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా ఒక ప్రయాణికుడు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, బీజేపీ నేత రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ లకు విజ్ఞప్తి చేస్తూ.. జైపూర్ ఎయిర్ పోర్టు అధికారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణానికి ఇంతవరకు ఎటువంటి ఏర్పాట్లు చేయలేదని తమను ఎదో ఒక విధంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. Passengers of @airindia AI112 flying from London to Delhi have been diverted to Jaipur due to bad weather but passengers have not been assisted with any recourse to reaching their final destinations. @JM_Scindia please assist us urgently. We did manage to speak with @Ra_THORe… pic.twitter.com/DjLOD8dXLK — Adit (@ABritishIndian) June 25, 2023 -
ధోనితో అట్లుంటది మరి..
-
అండమాన్ వెళ్లిన విమానం తిరిగి చైన్నెకి..
తిరువొత్తియూరు: అండమాన్‌లో సుడిగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుండడంతో చైన్నె నుంచి 156 మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానం తిరిగి చైన్నెకి చేరుకుంది. దీంతో ఆగ్రహించిన ప్రయాణికులు విమానాశ్రయ అధికారులతో వాగ్వివాదానికి దిగారు. చైన్నె మీనంబాక్కం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అండమాన్‌కు 150 మంది ప్రయాణికులు, ఆరుగురు వి మానాశ్రమాల ఉద్యోగులతో ఇండిగో విమాన ము బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరింది. అండమాన్ సరిహద్దుకు వెళ్లిన సమయంలో అక్కడ తీవ్రమైన సుడిగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీంతో విమానం అండమాన్ వద్ద ఆకాశంలో చక్కెర్లు కొట్టింది. దీంతో వాతావరణ పరిస్థితి అనుకూలించకపోవడంతో పైలట్ చైన్నె విమానాశ్రయ కంట్రోల్ రూంను సంప్రదించారు. చైన్నె విమానా శ్రయ అధికారులు విమానాన్ని తిరిగి చైన్నెకి తీసుకురావాలని ఆదేశించారు. దీంతో పైలట్ విమానా న్నిసాయంత్రం 5.10లకు చైన్నె ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేశారు. అండమాన్‌లో ప్రతికూల వాతావరణంతో విమానాన్ని రద్దు చేశారు. గురువారము ఉదయం చైన్నె నుంచి అండమాన్‌కు బయలుదేరు తుందని ప్రకటించారు. ప్రయాణికులు అందరూ అదే టికెట్‌తో విమానంలో ప్రయాణించవచ్చని తెలిపారు. ప్రయాణికులు విమానాశ్రయ ఉద్యోగులతో వాగ్వివాదానికి దిగారు. 150 మంది ప్రయాణికులు తమ టికెట్లు రద్దు చేసుకొని వెళ్లినట్లు తెలిసింది. అదే సమయంలో అండమాన్ నుంచి విమానంలో చైన్నెకి రావడానికి 162 మంది ప్ర యాణికులు అండమాన్ విమానాశ్రయంలో వేచి ఉన్నట్లు తెలిసింది. -
అనూహ్యంగా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..నలుగురు ప్రయాణికులు అరెస్టు
ఇటీవల విమానంలో ప్రయాణికుల వికృత ప్రవర్తనకు సంబంధించిన ఘటనలను చూశాం. వాటిని తలదన్నేలా విమానంలో మరో దారుణ ఘటన జరిగింది. ముగ్గురు ప్రయాణికుల కారణంగా విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ షాకింగ్ ఘటన కెయిర్న్స్ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్తున్న విమానంలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..ఏప్రిల్ 20న కెయిర్న్స్ నుంచి నార్తర్న్ టెరిటరీ ఆఫ్ ఆస్ట్రేలియాకు వెళ్తున్న విమానంలో ముగ్గురు ప్రయాణికులు ఘోరంగా ప్రవర్తించారు. ఆ విమానంలో ఆ ముగ్గురు ప్రయాణికుల మద్య వివాదం తలెత్తింది. దీంతో వారంతా దారుణంగా కొట్టుకున్నారు. వారు ప్రయాణిస్తున్నది విమానం అన్న స్ప్రుహ లేకుండా అత్యంత హేయంగా ప్రవర్తించారు. ఆ బృందంలోని 23 ఏళ్ల మహిళ, మరో 22 ఏళ్ల ప్రయాణికుడు చాలా దారుణంగా కొట్లాడుకున్నారు. ఇతర ప్రయాణికులకు భయం కలిగించేలా.. విమానంలోని ఫర్నిచర్ డ్యామేజ్ అయ్యేలా పోట్లాడుకున్నారు. విమాన సిబ్బంది సైతం వారిని నియంత్రించడంలో విఫలం కావడంతో విమానాన్ని క్వీన్ల్యాండ్స్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేందుకు దారి మళ్లించాల్సి వచ్చింది. చివరికి విమానం టేకాఫ్ అయినప్పుడూ కూడా ఆ గుంపు ఏ మాత్ర తగ్గలేదు. మరోసారి గొడవపడ్డారు. వారి రగడ కారణంగా విమానం కిటికి అద్దం కూడా పగిలిపోయింది. దీంతో విమానం దిగిన వెంటనే ఆ సముహన్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. కాగా, ప్రయాణికుడి వద్ద మాదక ద్రవ్యాలను గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు పోలీసులు సదరు విమానంలో నలుగురు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. Departing Cairns today.. Just someone trying to glass someone. More fighting amongst themselves. Complete disregard for other passengers and the plane. I wonder if there were any consequences. #VoteNO 🇦🇺 #VoiceToParliament pic.twitter.com/v5iKWbWRtM — Jet Ski Bandit (@fulovitboss) April 20, 2023 (చదవండి: పియానో వాయించిన చిన్నారికి ప్రధాని మోదీ ఫిదా.. వైరలవుతున్న వీడియో) -
షాకింగ్ ఘటన.. ఇంట్లోకి దూసుకెళ్లిన విమానం
జార్ఖండ్: ధన్బాద్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గ్లైడర్ విమానం ఇంట్లోకి దూసుకెళ్లింది. బార్వాడా ఎయిర్‌స్ట్రిప్ నుంచి టేకాప్ అయిన కాసేపటికే ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పైలట్ సహా పద్నాలుగేళ్ల బాలుడు గాయపడ్డారు. ధన్‌బాద్‌లోని బర్వాడ్డ ఏర్స్ట్రిప్ నుంచి చిన్న విమానం బయలుదేరింది. టేక్ఆఫ్ అయిన కొద్దిసేపటికే విమానం ఎయిర్‌పోర్టుకు ఐదు వందల మీటర్ల దూరంలో ఉన్న ఓ ఇంటిని ఢీకొట్టగా, అందులో ఉన్న పైలట్, బాలుడు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని ఆసుపత్రికి తరలించారు. ఇంట్లో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరగలేదని ఇంటి యజమాని తెలిపారు. చదవండి: అమృత్‌పాల్ కేసులో ఊహించని ట్విస్ట్.. ఆమె అరెస్ట్