పుతిన్ ఒకప్పటి సన్నిహితుడు, రష్యాలో తిరుగుబాటు ఎగరేసిన కిరాయి సైన్యం గ్రూప్ వాగ్నర్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో మరణించారు. అయితే.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై తిరుగుబాటు చేసిన రెండు నెలల్లోనే ఆయన మృతి చెందడం అనుమానాలకు తావిస్తోంది. ప్రిగోజిన్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని అమెరికా నిఘా సంస్థ నుంచి గతంలోనే హెచ్చరికలు వచ్చాయి. పుతిన్ ప్రత్యర్థులందరూ తెరిచి ఉన్న కిటికీల నుంచి జారిపడ్డారని, ఈ క్రమంలో కిటికీలకు దూరంగా ఉండాలనే స్థాయిలో సూచనలు వచ్చాయి. అయినప్పటికీ ధైర్యంగా రష్యాలోనే తిరుగుతున్న ప్రిగోజిన్.. ఇంతలోనే విమాన ప్రమాదంలో మరణించారు.
🚨#BREAKING: Wagner chief Prigozhin has died along with 10 other passengers on the jet that just crashed in Russia's Tver region pic.twitter.com/4kPLrsGANb
— R A W S A L E R T S (@rawsalerts) August 23, 2023
30 సెకన్లలోనే..
ప్రిగోజిన్ ప్రాణాలు కోల్పోయిన విమాన ప్రమాదం మాస్కోకు మాస్కోకు 100 కిలోమీటర్ల దూరంలో త్వెర్ ప్రాంతంలో జరిగింది. సవ్యంగా సాగుతున్న విమాన ప్రయాణం అప్పటివరకు బాగానే ఉన్నా.. కేవలం 30 సెకన్ల వ్యవదిలోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఆకాశం నుంచి విమానం పొగలు వెదజల్లుతూ కిందకు పడుతున్న దృశ్యాలు తాజాగా వైరల్‌గా మారాయి. ఈ ప్రమాదంలో ఎవరూ బతికే అవకాశాలు లేవని అధికారులు తెలిపారు. అందులో ప్రిగోజిన్ కూడా ఉన్నట్లు స్పష్టం చేశారు.
పుతిన్‌పై తిరుగుబాటు..
ఉక్రెయిన్‌పై.. సైనిక చర్యలో భాగంగా కొన్నాళ్లు రష్యా సైనిక బలగాలకు అండగా ఉన్న ప్రిగోజిన్.. జూన్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్, ఆయన ప్రభుత్వంపై ఎదురుతిరిగారు. పుతిన్ సైనిక నాయకత్వాన్ని కూలదోసేందుకు.. అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా.. రష్యా ఉలిక్కిపడింది. బెలారస్ అధ్యక్షుడు లుకషెంకో మధ్యవర్తిత్వంతో వాగ్నర్ బృందాల తిరుగుబాటుకు తెరపడింది.
ఎవరీ ప్రిగోజిన్..?
రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే ప్రిగోజిన్‌ను.. పుతిన్ షెఫ్‌గా వ్యవహరిస్తుంటారు. 1980ల్లో దొంగతనం, దోపిడీ కేసుల్లో ప్రిగోజిన్ దాదాపు 9 ఏళ్ల జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చారు. 1990ల్లో పుతిన్‌కు-ప్రిగోజిన్‌కు పరిచయం ఏర్పడింది. 2000లో పుతిన్ రష్యా అధ్యక్షుడు అయ్యారు. మరోవైపు.. ప్రిగోజిన్ రెస్టారెంట్లు ఇతర వ్యాపారాలను విస్తరించారు. 2001 నుంచి పుతిన్ సన్నిహిత వర్గాల్లో ప్రిగోజిన్ కనిపిస్తూనే ఉన్నాడు. రష్యా ప్రభుత్వానికి చెందిన సైనిక, పాఠశాల ఫుడ్ కాంట్రాక్టులు ఇతనికే దక్కాయి. ఆ తర్వాత 2014లో వాగ్నర్ పీఎంసీ నిర్వహణలో ప్రిగోజిన్ పాత్ర కూడా బయటకు వచ్చింది.
ఇదీ చదవండి: ‘వాగ్నర్’ చీఫ్ ప్రిగోజిన్ ప్రాణాలకు ముప్పు
Comments
Please login to add a commentAdd a comment