Chief
-
హమాస్ చీఫ్ హత్య..ఇజ్రాయెల్ కీలక ప్రకటన
టెల్అవీవ్:హమాస్ ముఖ్య నేత ఇస్మాయిల్ హనియే ఈ ఏడాది జులైలో హత్యకు గురైన విషయం తెలిసింది. హనియేను తామే అంతం చేశామని ఇజ్రాయెల్ తాజాగా ధ్రువీకరించింది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇటీవల కాలంలో యెమెన్‌కు చెందిన హౌతీ ఉగ్రవాద గ్రూపు ఇజ్రాయెల్‌పై క్షిపణులు ప్రయోగిస్తుంది.ఈ క్రమంలో వారికి ఓ స్పష్టమైన సందేశం అందించాలనుకుంటున్నా. హమాస్, హెజ్బొల్లాలను ఓడించాం. వారి మౌలిక సదుపాయాలను దెబ్బతీయడంతో పాటు హనియా, సిన్వర్, నస్రల్లాలను హతమార్చాం. ఇరాన్ రక్షణ,ఉత్పత్తి వ్యవస్థలను నాశనం చేశాం.సిరియాలో బషర్ అల్ అసద్ పాలనను పడగొట్టాం. హౌతీలకు కూడా గట్టి దెబ్బ తప్పదు’ అని కాట్జ్ హెచ్చరించారు.ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో జులైలో జరిగిన ఆ దేశ నూతన అధ్యక్షుడి ప్రమాణస్వీకారంలో పాల్గొన్న హనియా హత్యకు గురైన విషయం తెలిసిందే. పథకం ప్రకారమే ఇజ్రాయెలే ఈ పని చేసిందని ఇరాన్ అప్పుడే ఆరోపించింది.అయితే అప్పట్లో ఇజ్రాయెల్ దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.తాజాగా ఈవిషయాన్ని ధ్రువీకరించింది. మరోవైపు గాజాలో యుద్ధం మొదలైనప్పటినుంచి హౌతీలు ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులకు పాల్పడుతున్నారు. వీరికి ఇరాన్ మద్దతిస్తూ వస్తోంది. తాము పాలస్తీనియన్లకు సంఘీభావంగా వ్యవహరిస్తున్నామని హౌతీ రెబెల్స్ పేర్కొంటున్నారు. -
మళ్లీ పార్టీ పగ్గాలు..?బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి,కరీంనగర్:తాను బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి రేసులో లేనని, తనకు పార్టీ నాయకత్వం పెద్ద బాధ్యతలు అప్పగించిందిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండిసంజయ్ అన్నారు. ఈ విషయమై బండి సంజయ్ ఆదివారం(డిసెంబర్ 15) మీడియాతో మాట్లాడారు.‘పార్టీ ఇచ్చిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తున్నా. నాకు తెలంగాణ రాష్ట్ర పార్టీ పగ్గాలు మళ్లీ అప్పగిస్తారనేది ఊహాగానాలే. కొన్ని శక్తులు ఇలాంటి ప్రచారం చేసి నాకు, పార్టీకి నష్టం కలిగించేలా కుట్రలు చేస్తున్నాయి. పార్టీ అధ్యక్ష పదవి నియామకంపై హైకమాండ్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.బీజేపీలో సమిష్టి నిర్ణయం తీసుకున్నాకే అధ్యక్ష పదవిపై ప్రకటన చేస్తారు.హైకమాండ్ తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలి.ఈ విషయంలో మీడియా సహకరించాలని చేతులెత్తి జోడిస్తున్నా’అని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. -
60 గంటల్లో ప్రపంచాన్ని చుట్టి.. ‘నాసా’ కొత్త చీఫ్ ఇసాక్‌మన్ సక్సెస్ స్టోరీ
అగ్రరాజ్యం అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికార పీఠం అధిష్టించాక పాలనలో పలు మార్పులు తీసుకువస్తున్నారు. ప్రతిష్టత్మక పదవులలో నూతన నియామకాలు చేపడుతున్నారు. ఈ నేపధ్యంలోనే అధ్యక్షుడు ట్రంప్ తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా)కు చీఫ్‌గా 41 ఏళ్ల బిలియనీర్ జారెడ్ ఇసాక్మన్ను నియమించారు.ఎలాన్ మస్క్‌కు చెందిన కంపెనీ స్పేస్ ఎక్స్ సాయంతో అంతరిక్షంలోకి మొదటి ప్రైవేట్ ట్రిప్ చేసిన వ్యక్తి ఇసాక్‌మన్. 2009లో ఇసాక్‌మన్ 60 గంటల్లో ప్రపంచాన్ని చుట్టి నూతన ప్రపంచ రికార్డు నెలకొల్పారు. 16 ఏళ్ల వయసులో చదవును విడిచిపెట్టి, నేడు నాసాకు చీఫ్‌గా నియమితులయ్యే వరకూ ఇసాక్‌మన్ ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా సాగింది. ఇసాక్‌మన్ అమెరికాలో ప్రముఖ వ్యాపారవేత్తగానూ గుర్తింపుపొదారు.ఇసాక్‌మన్ 1983, ఫిబ్రవరి 11న న్యూజెర్సీలో డొనాల్డ్,సాండ్రా మేరీ ఐజాక్మన్ దంపతులకు జన్మించారు. నలుగురు తోబుట్టువులలో ఇసాక్‌మన్ చిన్నవాడు. ఆయన కిండర్ గార్టెన్ నుండి ఆరవ తరగతి వరకు వెస్ట్‌ఫీల్డ్‌లోని విల్సన్ ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నాడు. ఇసాక్మన్కు 12 ఏళ్లు ఉన్నప్పుడు అతని కుటుంబం న్యూజెర్సీలోని బెర్నార్డ్స్ టౌన్‌షిప్‌లోని లిబర్టీ కార్నర్ విభాగానికి షిఫ్ట్ అయ్యింది. అక్కడ ఇసాక్‌మన్ విలియం అన్నీన్ మిడిల్ స్కూల్లో చదువుకున్నారు.హైస్కూల్లో చదువుతున్న రోజుల్లో ఇసాక్‌మాన్ తన స్నేహితునితో కలిసి తన ఇంటిలో క్రెడిట్ కార్డ్ ప్రాసెసింగ్ కంపెనీ షిఫ్ట్ 4ను ప్రారంభించారు. 1999లో ఇసాక్‌మన్ పాఠశాల చదువును మధ్యలోనే విడిచిపెట్టారు. అయితే హైస్కూల్ డిప్లొమాకు సమానమైన జీఈడీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ప్రస్తుతం కంపెనీ షిఫ్ట్ 4 కంపెనీ విలువ దాదాపు 7.4 బిలియన్ డాలర్లు. ఈ కంపెనీ హిల్టన్, కేఎఫ్‌సీ వంటి బ్రాండ్లకు చెల్లింపు ప్రాసెసింగ్ చేస్తుంది.ఇసాక్‌మన్ ఎంబ్రీ-రిడిల్ ఏరోనాటికల్ విశ్వవిద్యాలయం నుండి ప్రొఫెషనల్ ఏరోనాటిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని అందుకున్నారు. 2011లో ఈ డిగ్రీని పొందిన ఇసాక్మన్కు సైనిక విమానాలను నడిపేందుకు అవసరమైన లైసెన్స్ కూడా ఉంది. అతని దగ్గర దాదాపు 100 యుద్ధ విమానాలు ఉన్నాయి. అతని కంపెనీ అమెరికా, నాటో దేశాల వైమానిక దళాల ఫైటర్ పైలట్లకు శిక్షణ ఇస్తుంది. ఇసాక్‌మన్ అమెరికాలో అత్యంత ధనవంతుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. అతని ఆస్తుల నికర విలువ 1.9 అమెరికన్ బిలియన్ డాలర్లు. 2021లో పొలారిస్ ప్రోగ్రామ్ కింద ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ఎక్స్ సహాయంతో చారిత్రక అంతరిక్ష యాత్ర చేశాడు. ఈ పర్యటన కోసం ఇసాక్‌మన్ 200 మిలియన్ డాలర్లు ఖర్చు చేశాడు.ఇది కూడా చదవండి: భారత్‌తో కుస్తీ.. పాక్‌తో దోస్తీ.. మారిన బంగ్లాదేశ్ వైఖరి? -
బీజేపీ కీలక నిర్ణయం.. పార్టీ జమ్ముకశ్మీర్ చీఫ్ మార్పు
జమ్ము: జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే అక్కడి పార్టీ నాయకత్వం విషయంలో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది.పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడిని మార్చింది. జమ్ముకశ్మీర్ పార్టీ కొత్త అధ్యక్షుడిగా సత్‌శర్మను నియమించింది. ఇప్పటివరకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగిన రవీందర్‌రైనాను పార్టీ జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నారు.ఈ మేరకు బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ అరుణ్‌సింగ్ దివారం(నవంబర్ 3)ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం తక్షణం అమలులోకి వస్తుందని ఉత్వర్వుల్లో పేర్కొన్నారు.సత్‌శర్మను సెప్టెంబర్‌లోనే రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రెండు నెలల్లోనే అధ్యకక్షుడిని చేయడం గమనార్హం. ఇదీ చదవండి: 10 రోజుల్లో యోగి రాజీనామా చేయకుంటే.. -
పార్టీ చీఫ్ పదవిపై పంజాబ్ సీఎం కీలక వ్యాఖ్యలు
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పార్టీ చీఫ్ పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ రాష్ట్ర విభాగానికి పూర్తికాల అధ్యక్షుడిని నియమించటంపై ఆప్ పార్టీ నాయకత్వంతో చర్చిస్తామని అన్నారు. ఆయన చబ్బేవాల్లో జరిగిన ర్యాలీలో ప్రసంగించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను రాష్ట్ర చీఫ్ పదవి నుంచి వైదొలగాలనే కోరికను బయటపెట్టారు.‘‘రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకు పెద్ద బాధ్యతలు ఉన్నాయి. ఇప్పటికే నాకు 13-14 శాఖలు ఉన్నాయి. బాధ్యతలు విభజించబడేలా పూర్తి సమయం రాష్ట్ర యూనిట్ చీఫ్‌ను నియమించడానికి పార్టీ న్యాయకత్వంతో మాట్లాడతా’’ అని అన్నారు. భగవంత్ మాన్ 2017లో సంగ్రూర్ ఎంపీగా ఉన్నప్పుడు ఆప్ పంజాబ్ యూనిట్ చీఫ్‌గా నియమితులయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికలు, 2022 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాన్ పంజాబ్‌లో పార్టీకి నాయకత్వం వహించారు. అంతేకాకుండా.. 2022లో 117 మంది సభ్యుల పంజాబ్ అసెంబ్లీలో 92 స్థానాలను గెలుచుకుని ఆప్‌ను అధికారంలోకి తీసుకువచ్చారు. అయితే.. 2023 జూన్ ఆప్ పంజాబ్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బుధ్ రామ్‌ను నియమించింది. మరోవైపు.. గిద్దర్బాహా, డేరా బాబా నానక్, చబ్బేవాల్, బర్నాలా నాలుగు అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు నవంబర్ 23న వెలువడుతాయి. ఈ స్థానాల ఎమ్మెల్యేలు లోక్‌సభకు ఎన్నిక కావటంతో ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి.చదవండి: సీజేఐ ఇంట్లో గణపతి పూజకు మోదీ హాజరు.. చంద్రచూడ్ రియాక్షన్ -
యమునలో మునకేసిన ఢిల్లీ బీజేపీ చీఫ్.. ఆస్పత్రిలో చికిత్స
న్యూఢిల్లీ: ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపేందుకు ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ పెద్ద సాహసమే చేశారు. కాలుష్య కాసారంగా మారి విషపు నురగలు కక్కుతున్న యమునా నదిలో సచ్దేవ మునిగారు. నదిలో మునిగిన మూడు రోజుల తర్వాత సచ్‌దేవపై యమున కాలుష్యం ఎఫెక్ట్ పడింది.చర్మంపై దురదలు రావడంతో పాటు శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో సచ్‌దేవను శనివారం(అక్టోబర్ 26) ఆస్పత్రిలో చేర్చి చికిత్సనందిస్తున్నట్లు బీజేపీ పార్టీ సోషల్‌మీడియా వెల్లడించింది. యమునలో కాలుష్యం ఇంతగా పెరగడానికి ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాలే కారణమని బీజేపీ విమర్శించింది. కాగా, ఢిల్లీలో కాలుష్య నివారణకు కేటాయించాల్సిన నిధులను ఆప్ ప్రభుత్వం దారి మళ్లించిందని నిరసన తెలపడంలో భాగంగా సచ్దేవ గురువారం యమునలో మునిగారు. అయితే సచ్దేవ యమునలో మునగడంపై ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్‌రాయ్ విమర్శలు గుప్పించారు. అదంతా ఒక పెద్ద డ్రామా అని కొట్టిపారేశారు.ఇదీ చదవండి: అక్కడ కనిపించని దీపావళి వేడుకలు.. కారణమిదే -
యాహ్యా సిన్వార్ మృతి.. హమాస్‌కు చీఫ్ లేనట్లే!
ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇటీవల హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ మృతిచెందారు. దీంతో హామాస్‌ను ఎవరు నడిపిస్తారనే అంశంపై చర్చ జరగుతోంది. అయితే చీఫ్ లేకుండా.. దోహ కేంద్రంగా పాలక కమిటీని నియమించే అవకాశం ఉన్నట్లు హమాస్ వర్గాలు తెలిపాయి. మార్చిలో జరగనున్న ఎన్నికల వరకు దివంగత చీఫ్ యాహ్యా సిన్వార్‌కు వారసుడిని నియమించకూడదని హమాస్ నాయకత్వం యోచిస్తున్నట్లు సమాచారం. టెహ్రాన్‌లో రాజకీయ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్య అనంతరం ఆగస్టులో ఏర్పడిన ఐదుగురు సభ్యుల కమిటీ హమాస్ గ్రూప్ నాయకత్వాన్ని తీసుకుంది. ఇక.. సిన్వార్ మృతికి ముందు.. గాజాలో ఉన్న ఆయనతో కమ్యూనికేట్ కావటంలో తీవ్ర ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని హమాస్ ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.2017లో హమాస్ గ్రూప్ గాజా చీఫ్‌గా నియమించబడిన సిన్వార్.. జూలైలో హనియే హత్య అనంతరం హమాస్ గ్రూప్ మొత్తానికి చీఫ్‌గా నియమితులయ్యారు. గాజాకు ఖలీల్ అల్-హయ్యా, వెస్ట్ బ్యాంక్‌కు జహెర్ జబరిన్, విదేశాలలో ఉన్న పాలస్తీనియన్ల కోసం ఖలీద్ మెషాల్ చెందిన ప్రతినిధులతో పాలక కమిటీని రూపొందించినట్లు తెలుస్తోంది.ఇక.. ఈ పాలక కమిటీలో హమాస్ షూరా సలహా మండలి అధిపతి మహమ్మద్ దర్విష్, పొలిటికల్ బ్యూరో కార్యదర్శి కూడా ఉన్నారు. అయితే.. వీరిని భద్రతా కారణాల దృష్ట్యా గుర్తించకపోవటం గమనార్హం. కమిటీలోని ప్రస్తుత సభ్యులందరూ ఖతార్‌లో ఉన్నారు. యుద్ధం, అసాధారణమైన పరిస్థితులలో దాడులు, భవిష్యత్తు ప్రణాళికలను నిర్వహించటంపై ఈ కమిటీ బాధ్యత వహిస్తుంది. వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడానికి ఈ పాలక కమిటీకి అధికారం ఉంటుంది.చదవండి: ఇజ్రాయెల్ దాడులు.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్ -
హమాస్ చీఫ్ బతికే ఉన్నాడు: ఇజ్రాయెల్ మీడియా
టెల్అవీవ్: హమాస్ అధినేత యహ్యా సిన్వార్ బతికే ఉన్నట్లు ఖతర్‌కు చెందిన సీనియర్ దౌత్యవేత్త సోషల్‌మీడియాలో పోస్ట్ చేసినట్లు ఇజ్రాయెల్ మీడియా కథనాలు ప్రచురించింది.సిన్వార్ తన చుట్టూ ఇజ్రాయెల్ బందీలను రక్షణ కవచంగా ఏర్పరుచుకున్నారని ఖతర్ అధికారులు చెప్పినట్లు కథనాల సారాంశం.సెప్టెంబర్ 21న గాజాలోని ఓ స్కూల్లో ఉన్న హమాస్ కమాండ్ సెంటర్ టార్గెట్‌గా పెద్దఎత్తున దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ దళాలు తెలిపాయి.ఈ దాడుల్లో సిన్వార్ మృతిచెంది ఉంటారని ఇజ్రాయెల్ దళాలు భావించాయి.ఈ విషయంలో సిన్వార్ వైపు నుంచి కూడా ఎలాంటి ప్రకటన రాలేదు.దీంతో అతడు మృతి చెంది ఉంటాడన్న వాదనకు బలం చేకూరింది. గతేడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన మెరుపు దాడులకు సూత్రధారి సిన్వార్. హమాస్ చీఫ్‌గా ఉన్న హనియే మృతి తర్వాత ఈ ఏడాది ఆగస్టులో సిన్వార్ ఆ బాధ్యతలు తీసుకున్నారు. ఇదీ చదవండి: ఇరాన్ భూగర్భ అణు పరీక్షలు -
మిస్టరీగా హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ జాడ!
ఇజ్రాయెల్, హమాస్ మధ్య దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. హమాస్ కీలక నేతలను అంతం చేయాటమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం గాజాలో దాడులను జరుపుతోంది. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 7 దాడుల రూపకర్త, హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ జాడ మిస్టరీగా మారినట్లు ప్రచారం జరుగుతోంది. అసలు ఆయన బతికే ఉన్నారా? లేరా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే యాహ్యా సిన్వార్‌కు సంబంధించి.. ఖతార్ అధికారులు కీలక విషయాలు వెల్లడించారు.ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం మొదటి నుంచి ఖతార్ కృషి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. గత వారం రోజులుగా సిన్వార్ తమకు టచ్‌లో లేరని ఖతార్ అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్ సైన్యం.. తమతో ఆయన కమ్యూనికేషన్‌కు సంబంధించి కీలక విషయాలను వింటారనే భయంతో సిన్వార్ ప్రస్తుతం పెన్, పేపర్లతో మాత్రమే కమ్యూనికేట్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయనతో మధ్యవర్తిత్వ చర్చలకు జరపడానికి తమకు సవాల్‌గా మారిందని తెలిపారు. అయితే ఈ ప్రచారంపై ఇప్పటివరకు హమాస్ స్పందించలేదు.ఇక.. సిన్వార్ తన చుట్టూ ఇజ్రాయెల్ బందీలను రక్షణగా పెట్టుకొని ఉన్నారని ఇజ్రాయెల్ స్థానిక మీడియా ఓ నివేదిక ప్రచురించింది దీంతో హమాస్ చీఫ్ వైమానిక దాడిలో మరణించి ఉండవచ్చనే ఊహాగానాలకు తెరపడినట్లైంది. మరోవైపు.. కాల్పుల ఒప్పందానికి విరుద్ధంగా ఇజ్రాయెల్ దాడులతో హత్యల విధానాన్ని కొనసాగిస్తోందని ఖతార్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే మాజీ హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేను ఇజ్రాయెల్ అంతం చేసింది. ప్రస్తుతం హమాస్‌కు కీలకమైకన నేతగా ఖలీద్ మషాల్ ఉన్నారు. ఆయన హనియే కంటే చాలా బలవంతుడని ఖతార్ అధికారులు తెలిపారు.చదవండి: మీరెన్ని చెప్పినా.. ఇరాన్‌పై మా యుద్ధం ఆగదు : ఇజ్రాయెల్ ప్రధాని -
హెజ్బొల్లా చీఫ్ ఎలా చనిపోయాడు..?
బీరుట్:ఇటీవల ఇజ్రాయెల్ దాడుల్లో హతమైన హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా మృతదేహం లభ్యమైంది.దక్షిణ బీరుట్ నుంచి తమ నేత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు హెజ్బొల్లా ఆదివారం(సెప్టెంబర్29) వెల్లడించింది.అయితే నస్రల్లా మృతదేహంపై ఎలాంటి ప్రత్యక్ష గాయాలు లేవని సమాచారం.బాంబు దాడి కారణంగా షాక్‌కు గురై నస్రల్లా మరణించి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇజ్రాయెల్ దాడుల్లో నస్రల్లా కుమార్తె కూడా మరణించినట్లు కథనాలు వెలువడ్డాయి.కాగా,తాము లెబనాన్‌పై ఆదివారం తాజా దాడుల్లో హెజ్బొల్లా మరో కీలక నేత నబిల్కౌక్కూడా మరణించినట్లు ఇజ్రాయెల్ తెలిపింది.ఇదీచదవండి: హెజ్బొల్లాకు మళ్లీ షాక్..మరో ముఖ్యనేత హతం -
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు సెక్యూరిటీ పెంపు
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ భద్రతను కేంద్ర ప్రభుత్వం మరింత పెంచింది. దీంతో ఆయనకు ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు కల్పిస్తున్న తరహాలో భద్రత లభించనుంది.హోం మంత్రిత్వ శాఖ మోహన్ భగవత్ భద్రతను జెడ్ ప్లస్ నుంచి నుండి ఎఎస్ఎల్(అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజన్)స్థాయికి పెంచింది. ఆర్ఎస్ఎస్ చీఫ్‌కు ఇంతవరకూ జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉండేది. మోహన్ భగవత్‌కు క్పల్పించిన భద్రత సరిపోదని గుర్తించిన ప్రభుత్వం అతని కోసం క్తొత భద్రతా ప్రోటోకాల్ రూపొందించింది. పలు భారత వ్యతిరేక సంస్థలు ఆయనను టార్గెట్ చేస్తున్నాయనే నిఘావర్గాల సమాచారం మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.నూతన భద్రతా ఏర్పాట్ల ప్రకారం మోహన్ భగవత్ సందర్శించే ప్రదేశంలో సీఐఎస్ఎఫ్ బృందాలు ఉంటాయి. ఆయనకు 2015, జూన్ లో జెడ్ ప్లస్ భద్రత కల్పించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆయనకు జెడ్ ప్లస్ భద్రత కల్పించాలని ఆదేశించింది. అయితే ఆ సమయంలో సిబ్బంది, వాహనాల కొరత కారణంగా జెడ్ ప్లస్ భద్రత కల్పించలేదు. ఈ తరహా భద్రతలో 55 మంది కమాండోలు మోహన్ భగవత్ కోసం 24 గంటలపాటు విధులు నిర్వహిస్తుంటారు.ఏఎస్ఎల్ కేటగిరీ భద్రతలో సంబంధిత జిల్లా పరిపాలన, పోలీసు, ఆరోగ్యం, ఇతర విభాగాలు వంటి స్థానిక ఏజెన్సీలు పాలుపంచుకుంటాయి. మోహన్ భగవత్ ఏదైనా కార్యక్రమానికి వెళ్లే సందర్భంలో ఆ స్థలాన్ని పరిశీలించడానికి అధికారుల బృందం వెళ్తుంది. వారు క్లాలిటీ ఇచ్చిన తరువాతనే మోహన్ భగవత్ ఆ కార్యక్రమానికి వెళతారు. -
ఫ్రెష్‌వర్క్స్ సాఫ్ట్వేర్ కంపెనీ సీపీవో రాజీనామా
నాస్డాక్-లిస్టెడ్ సాఫ్ట్వేర్ సంస్థ ఫ్రెష్‌వర్క్స్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ (CPO) ప్రకాష్ శ్రీనివాసగోపాలన్ రామమూర్తి రాజీనామా చేశారు. ఆగస్టు 14నాటి ఎస్ఈసీ ఫైలింగ్ సమాచారం ప్రకారం.. కొత్తగా నియమితులైన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డెన్నిస్ వుడ్సైడ్కి అక్టోబర్ 1 వరకు రామమూర్తి సహకారంగా ఉంటూ సాఫీగా పరివర్తన జరిగేలా చూస్తారు.మరోవైపు కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ టైలర్ స్లోట్ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా అదనపు పాత్రను పోషిస్తారని ఆగస్టు 6న ఎస్ఈసీ ఫైలింగ్‌లో సంస్థ ప్రకటించింది. అలాగే ఫిలిప్పా లారెన్స్‌ను చీఫ్ అకౌంటింగ్ ఆఫీసర్‌గా కంపెనీ నియమించింది. గత ఆరు నుంచి ఎనిమిది నెలలుగా సంస్థలో మేనేజ్మెంట్ స్థాయిలో అనేక మార్పులు జరుగుతూ వస్తున్నాయి.సంస్థ అంతర్గత పునర్వ్యవస్థీకరణలో భాగంగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఉన్న గిరీష్ మాతృభూతం కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ అయ్యారు. డెన్నిస్ వుడ్‌సైడ్ సీఈవో అయ్యారు. ఇది జరిగిన నాలుగు నెలల తర్వాత సీపీవో రాజీనామా వ్యవహారం చోటు చేసుకుంది. ఫ్రెష్‌వర్క్స్ చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ (CRO) ప్రదీప్ రథినం కూడా ఈ ఏడాది ఫిబ్రవరిలో సంస్థకు రాజీనామా చేశారు. -
తెలంగాణ బీజేపీ చీఫ్ నియామకంపై సస్పెన్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ చీఫ్ నియామకంపై సస్పెన్స్ కొనసాగుతోంది. బీసీ నేతకే బీజేపీ పగ్గాలు అంటూ ప్రచారం జరుగుతోంది. బీసీ కోటాల్లో ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ మధ్య పోటీ నెలకొంది. సామాజిక వర్గాల ప్రకారం మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్‌కి కేంద్రమంత్రి పదవి ఇవ్వడంతో అదే సామాజికవర్గానికి చెందిన అర్వింద్‌కు పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశం లేదంటున్నాయి పార్టీ వర్గాలు.మరోవైపు, ఈసారి సంఘ్ పరివార్ క్షేత్రాల ప్రతినిధికి ఇవ్వాలనే వాదన ఉంది. మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావుకు కేటాయించాలని ఆయన అనుచరులు కోరుతున్నారు. లోకల్‌బాడీ ఎన్నికల నేపథ్యంలో అధ్యక్ష నియామకంపై ఢిల్లీ జాతీయ నాయకత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది.ఇప్పటికే కేంద్ర మంత్రిగా, పార్టీ రాష్ట్రఅధ్యక్షుడిగా కిషన్ రెడ్డి ఉన్నారు. దీంతో టికెట్ ఆశిస్తున్న రెడ్డి సామాజికవర్గానికి చెందిన డీకే అరుణకు ఇస్తారా? లేదా? అన్నది కూడా ఉత్కంఠగా మారింది. ఇదిలా ఉండగా ఇద్దరు సీఎంలను ఢీకొట్టి గెలిచిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి సైతం అధ్యక్షుడి రేసులో ఉన్నట్లు సమాచారం. కాగా, ఇప్పటికే బీజేఎల్పీ బాధ్యతలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మహేశ్వర్ రెడ్డికి ఇవ్వడంతో పార్టీ పగ్గాలు బీసీ నేతలకే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త అధ్యక్షుడి నియామకం శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నెలాఖరులోగా ఈ టెన్షన్‌కు తెరపడే చాన్స్ ఉంది. -
Bihar: వీఐపీ అధినేత తండ్రి హత్య
బీహార్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ) అధినేత ముఖేష్ సాహ్ని తండ్రి జితన్ సాహ్ని హత్యకు గురయ్యారు. ఈరోజు (మంగళవారం) ఉదయం దర్భంగా జిల్లాలోని బిరౌల్లోని ఆయన నివాసంలో ఆయన మృతదేహం కనిపించింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఎఫ్ఎస్ఎల్ బృందాన్ని పిలిపించారు. ఎస్డీపీఓ మనీష్ చంద్ర చౌదరి కేసు దర్యాప్తు చేస్తున్నారు. తండ్రి హత్య జరిగిన సమయంలో వీఐపీ అధినేత ముఖేష్ సాహ్ని ముంబైలోని తన కార్యాలయంలో ఉన్నారు. విషయం తెలియగానే ఆయన దర్భంగాకు బయలుదేరారు.మాజీ మంత్రి ముఖేష్ సాహ్నీకి ఇద్దరు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో ముఖేష్ సాహ్ని తండ్రి జితన్ సాహ్ని ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. ఈ హత్య గురించి బీజేపీ నేత అజయ్ అలోక్ మాట్లాడుతూ జరిగిన ఘటన అత్యంత ఘోరమని అన్నారు. 72 గంటల్లో హంతకుడిని పట్టుకుంటామన్నారు. నేరాలను ఎలా అరికట్టాలో రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసని ఆయన పేర్కొన్నారు. -
రుణం కోసం ఐఎంఎఫ్‌ను సంప్రదించిన పాక్!
పొరుగు దేశం పాకిస్తాన్ రుణ సాయం కోసం మరోమారు చేయి చాచింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆదివారం అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టాలినా జార్జివాను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నగదు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తమ దేశానికి కొత్త రుణం కోసం అభ్యర్థించారు.పాక్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యుఇఎఫ్) సమావేశంలో పాక్‌కు మూడు బిలియన్ యూఎస్ డాలర్లు ఎస్బీఏ కింద అందించేందుకు ఐఎంఎఫ్ మద్దతు ఇచ్చినందుకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ వివరాలను పీటీవీ న్యూస్ సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో తెలిపింది. కాగా స్టాండ్‌బై అరేంజ్మెంట్ (ఎస్బీఏ) కింద 1.1 బిలియన్ డాలర్ల రుణంపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సోమవారం సమావేశం కానుంది.గత ఏడాది జూన్‌లో జరిగిన ఐఎంఎఫ్ కార్యక్రమంలో పాకిస్తాన్ మూడు బిలియన్ డాలర్ల రుణం అందుకుంది. తాజాగా జరిగిన డబ్ల్యుఈఎఫ్ ప్రత్యేక సమావేశంలో పాక్ ప్రధాని షరీఫ్ ‘ప్రపంచ ఆరోగ్య అజెండాను పునర్నిర్వచించడం’పై జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య సంరక్షణలో ప్రపంచ అసమానతలను ప్రస్తావించారు. 2003లో సౌదీ అరేబియా వెళ్లినప్పుడు తనకు క్యాన్సర్ సోకిందని షరీఫ్ తెలిపారు. ఆ తర్వాత న్యూయార్క్‌కు వెళ్లి వేల డాలర్లు వెచ్చించి శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఇంతటి ఖరీదైన చికిత్సను తమ దేశంలోని ప్రజలు భరించలేరని తెలిపారు.తాను పాకిస్తాన్‌కు తిరిగి వచ్చినప్పుడు, పంజాబ్ ప్రావిన్స్‌కు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యానని, తమ ప్రభుత్వం కిడ్నీ, కాలేయ వ్యాధులతో పాటు క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన ప్రత్యేక ఆసుపత్రులను నిర్మించిందని షాబాజ్ చెప్పారు. కరోనా మహమ్మారి ప్రపంచంలోని ఆరోగ్య అసమానతలను, లోపాలను బహిర్గతం చేసిందని షరీఫ్ పేర్కొన్నారు. -
‘ప్రచార బుల్లెట్’ ఎక్కిన బెంగాల్ బీజేపీ చీఫ్
పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 లోక్‌సభ స్థానాలకు తృణమూల్ కాంగ్రెస్ (TMC) అభ్యర్థులను ప్రకటించిన మరుసటి రోజే భారతీయ జనతా పార్టీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. బుల్లెట్ వాహనంపై బాలూర్ఘాట్ నియోజకవర్గంలో ప్రచారం చేశారు. సోమవారం ఉదయం 7 గంటలకు బాలూర్ఘాట్ రైల్వేస్టేషన్లో రైలు దిగిన మజుందార్‌కు బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. నాయకుల నినాదాల మధ్య దాదాపు మూడు కిలోమీటర్ల మేర మోటర్ సైకిల్ నడుపుతూ మజుందార్ ప్రచారం నిర్వహించారు . మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీని ఓడించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఎంసీపై పలు విమర్శలు చేశారు. ‘ఓ వైపు ప్రధాని మోదీ అభివృద్ధి చేస్తుంటే మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ నేతలు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. తృణమూల్ ఇక్కడి నుంచి అనేక కుంభకోణాలు చేసిన దొంగను అభ్యర్థిగా నిలబెట్టింది. ఇది దొంగలు, మంచి వ్యక్తుల మధ్య పోరు. తృణమూల్ కాంగ్రెస్ ఈ నియోజకవర్గాన్ని మోసం చేసింది’ అన్నారు. బాలూర్ఘాట్ నియోజకవర్గం నుండి టీఎంసీ తన లోక్‌సభ అభ్యర్థిగా బిప్లబ్ మిత్రను నిలబెట్టింది. మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలోని ఇండియా కూటమి నుంచి దూరం జరిగిన తృణమూల్ కాంగ్రెస్ రాబోయే సార్వత్రిక ఎన్నికలకు పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 42 లోక్‌సభ స్థానాలకు తమ అభ్యర్థులను ఆదివారం ప్రకటించింది. -
Karni Sena Chief’s Killing Case: కర్ణిసేన చీఫ్ హత్య..మరో నిందితుడి అరెస్టు
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన కర్ణిసేన చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్ గొగామెడి హత్య కేసులో మరో ప్రధాన నిందితుడు అశోక్ కుమార్‌ను నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ(ఎన్ఐఏ) బుధవారం అరెస్టు చేసింది. తాజా అరెస్టుతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది. ఈ హత్యకు సంబంధించి రాజస్థాన్, హర్యానాల్లోని 31 ప్రదేశాల్లో బుధవారం జరిపిన సోదాల్లో పెద్ద ఎత్తున ఆయుధాలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. తాజాగా అరెస్టయిన నిందితుడు అశోక్‌కుమార్ కర్ణిసేన చీఫ్ హత్య తామే చేశామని క్లెయిమ్ చేసుకున్న గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోడారాకు సన్నిహితుడు. ‘కేసు దర్యాప్తులో భాగంగా బుధవారం(జనవరి 3)న హర్యానా, రాజస్థాన్‌లోని 31 ప్రాంతాల్లో సోదాలు జరిపాం. వీటిలో నిందితులకు సంబంధించిన ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఈ సోదాల్లో పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాం. సోదాల్లో భాగంగానే అశోక్ కుమార్ అనే నిందితుడిని రాజస్ధాన్‌లోని జున్జున్లో అరెస్టు చేశాం’ అని ఎన్ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది. గత ఏడాది డిసెంబర్ 5వ తేదీన జైపూర్‌లోని శ్యామ్నగర్లో ఉన్న ఆయన ఇంట్లోనే కర్ణిసేన చీఫ్ గొగామెడిని ముగ్గురు షూటర్లు కాల్చిచంపారు. పట్టపగలు జరిగిన ఈ హత్య సంచలనం రేపింది. హత్య తర్వాత రాజస్థాన్‌లో పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి. ఇదీచదవండి..మహువా పిటిషన్..లోక్‌సభ సెక్రెటరీకి సుప్రీం నోటీసు -
జేడీయూ చీఫ్ పదవికి లలన్ సింగ్ రాజీనామా
పట్నా: జనతా దళ్(యునైటెడ్) పార్టీ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ అలియాస్ లలన్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన జేడీయూ చీఫ్ పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీలో జరిగిన జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశంలో నితీశ్ కుమార్ పార్టీ చీఫ్‌గా ఎన్నికయ్యారు. నితీష్ కుమార్ ఎన్నికకు ముందు లలన్ సింగ్ పార్టీ చీఫ్ పదవికి రాజీనామా చేసి.. నితీష్ కుమార్‌ను అధ్యక్షుడిగా ప్రతిపాదించారు. మరో వైపు లలన్ గత కొంతకాలంగా ఆర్జేడీ అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌తో సన్నిహితంగా ఉంటున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక అతనిపై అసంతృప్తితో ఉన్న సీఎం నితీశ్ కుమార్.. ఆయన్ని పార్టీ చీఫ్ పదవి నుంచి తప్పించాలనే నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరిగింది. ఇక.. జనతా దళ్ యునైటెడ్ ఏర్పడిన తొలినాళ్లలో శరద్ యాదవ్ వ్యవస్థాప అధ్యక్షుడిగా కొనసాగారు. ఆపై నితీశ్ కుమార్ 2016 నుంచి 2020 దాకా, 2020-21 మధ్య రామచంద్ర ప్రసాద్ సింగ్, లలన్ సింగ్ 2021 నుంచి జేడీయూ జాతీయాధ్యక్షుడిగా ఉన్నారు. ప్రస్తుతం పార్టీ బాధ్యతలను నితీశ్ కుమార్ చేపట్టడం గమనార్హం. -
యాపిల్‌కి గట్టి దెబ్బ.. తప్పుకొంటున్న చీఫ్ డిజైనర్
ప్రపంచవ్యాప్తంగా అత్యంత క్రేజ్ ఉండే ప్రీమియం ఫోన్లు, వాచీల తయారీ సంస్థ యాపిల్‌కి గట్టి దెబ్బ తగిలింది. ఐఫోన్లు, యాపిల్ వాచీల డిజైన్‌ను పర్యవేక్షిస్తున్న యాపిల్ ప్రొడక్ట్ డిజైన్ వైస్ ప్రెసిడెంట్ టాంగ్ టాన్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వైదొలుగుతున్నారు. కీలకమైన టాన్ నిష్క్రమణతో కంపెనీ డిజైన్ బృందానికి గట్టి దెబ్బ తగిలిందని యాపిల్ వర్గాలు బ్లూమ్‌బెర్గ్‌కి వెల్లడించాయి. యాపిల్‌కు చెందిన అత్యంత ముఖ్యమైన ఉత్పత్తులకు సంబంధించి క్లిష్టమైన నిర్ణయాలు తీసుకునేది ఈయనే. యాపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్ వంటి ఇతర ఉత్పత్తుల రూపకల్పనలో టాన్ ప్రభావం ఎక్కువగా ఉంది. యాపిల్ ఉత్పత్తుల ఫీచర్లు, వాటి రూపం, అమరిక.. అన్నీ టాన్ బృందం ఆధ్వర్యంలోనే జరుగుతాయి. ముఖ్యంగా ఎయిర్ పాడ్స్, యాపిల్ వాచీలను కంపెనీకి లాభదాయక ఉత్పత్తులుగా మార్చడంలో టాన్ కీలక పాత్ర వహించారు. ఇప్పుడు టాన్ నిష్క్రమణతో కంపెనీ ముఖ్యమైన ఉత్పత్తి శ్రేణులలో మార్పులు అనివార్యం కానున్నాయి. ఈయన నేరుగా హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న జాన్ టెర్నస్ కింద పనిచేశారు. మరిన్ని నాయకత్వ మార్పులు కంపెనీకి చెందిన ఇతర మ్యాక్ ప్రొడక్ట్ డిజైన్, ఐఫోన్ హార్డ్‌వేర్ ఎగ్జిక్యూటివ్‌లు ఇటీవల పదోన్నతి పొందిన నేపథ్యంలో రాబోయే సంవత్సరంలో యాపిల్ మరిన్ని నాయకత్వ మార్పులకు సిద్ధమవుతుందని నివేదిక సూచిస్తోంది. కాగా టాన్ నిష్క్రమణ కంపెనీలో కీలక కార్యనిర్వాహక నిష్క్రమణల్లో రెండోది. ఐఫోన్ మల్టీటచ్ స్క్రీన్, టచ్ ఐడీ, ఫేస్ ఐడి వంటి కీలక సాంకేతికతలపై పనిచేసిన స్టీవ్ హోటల్లింగ్ యాపిల్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ఈ వారం ప్రారంభంలో వార్తలు వచ్చాయి. -
ఐటీ కంపెనీ విప్రోలో కీలక నాయకత్వ మార్పు.. రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడి
దిగ్గజ ఐటీ సంస్థ విప్రోలో వచ్చే నెలలో కీలక నాయకత్వ మార్పు చోటుచేసుకోనుంది. కంపెనీ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ స్టెఫానీ ట్రౌట్మన్ డిసెంబర్ 31న వైదొలుగుతున్నట్లు విప్రో రెగ్యులేటరీ ఫైలింగ్‌లో శుక్రవారం ప్రకటించింది. ట్రాట్మన్ను దాదాపు మూడు సంవత్సరాల క్రితం యాక్సెంచర్ పీఎల్సీ నుంయి విప్రో హై-ప్రొఫైల్ హైరింగ్‌లో తీసుకువచ్చింది. విప్రో వెబ్‌సైట్‌లోని ఆమె ప్రొఫైల్ ప్రకారం, ట్రాట్మాన్ అభివృద్ధి భాగస్వాములతో విప్రో సంబంధాలకు నాయకత్వం వహించారు. మార్కెట్ ఇంటెలిజెన్స్‌ను అందించారు. విప్రో బ్రాండ్ అవగాహనను మెరుగుపరిచారు. గ్లోబల్, స్ట్రాటజిక్ పర్స్యూట్ టీమ్ ఏర్పాటుతో సహా సంస్థ అంతటా అమ్మకాల సామర్థ్యాలను అభివృద్ధి చేశారు. స్టెఫానీ ట్రాట్మాన్ సమర్పించిన డిసెంబరు 8 నాటి రాజీనామా లేఖ కాపీని కూడా ఫైలింగ్‌లో కంపెనీ పొందుపరిచింది. సంస్థలో కొనసాగిన మూడేళ్ల కాలంపై ఆమె సంతృప్తి వ్యక్తం చేసిన ట్రౌట్మన్.. విప్రో వెలుపల వ్యక్తిగత, వృత్తిపరమైన లక్ష్యాల కోసమే రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. -
ఖలిస్తానీ ఉగ్రవాది లఖ్బీర్ సింగ్ రోడే మృతి
పాకిస్తాన్లో ఖలిస్తానీ ఉగ్రవాది లఖ్బీర్ సింగ్ రోడే(72) మృతి చెందాడు. ఆయన నిషేధిత ఉగ్రవాద సంస్థ ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్(కేఎల్ఎఫ్)తో పాటు ఇంటర్నేషనల్ సిక్కు యూత్ ఫెడరేషన్‌కు చీఫ్. లఖ్బీర్ గుండెపోటుతో మృతి చెందాడు. లఖ్బీర్ సింగ్ రోడే.. ఖలిస్తానీ ఉగ్రవాది జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే మేనల్లుడు. భారత్ ప్రకటించిన ఉగ్రవాదుల జాబితాలో ఉన్నాడు. లఖ్బీర్ సింగ్ రోడే సోదరుడు, అకల్ తఖ్త్ మాజీ నేత జస్బీర్ సింగ్ రోడే.. లఖ్బీర్ మరణాన్ని ధృవీకరించారు. లఖ్బీర్ సింగ్ రోడేకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె వారు కెనడాలో నివసిస్తున్నారు. లఖ్బీర్ సింగ్ రోడే భారతదేశంలోని పంజాబ్‌లోని మోగా జిల్లాలోని రోడే గ్రామంలో ఉండేవాడు. భారతదేశం నుండి దుబాయ్‌కి పారిపోయాడు. తరువాత దుబాయ్ నుండి పాకిస్తాన్‌కు చేరుకున్నాడు. తన కుటుంబాన్ని కెనడాలో ఉంచాడు. 2002లో 20 మంది టెర్రరిస్టులను భారత్‌కు అప్పగించేందుకు పాక్‌కు భారత్ ఒక జాబితాను అందజేసింది. అందులో లఖ్బీర్ సింగ్ రోడే పేరు కూడా ఉంది. మీడియా దగ్గరున్న సమాచారం ప్రకారం లఖ్బీర్ సింగ్ రోడే తన అంతర్జాతీయ సిక్కు యూత్ ఫెడరేషన్ శాఖలను బ్రిటన్, జర్మనీ, కెనడా,అమెరికాతో సహా అనేక ప్రాంతాలలో ప్రారంభించాడు. భారత్‌కు అక్రమంగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను పంపినట్లు రోడేపై పలు ఆరోపణలు ఉన్నాయి. ఇది కూడా చదవండి: రైలు టాయిలెట్లో ఐదు నెలల చిన్నారి.. తరువాత? -
ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌పై ఇజ్రాయెల్ ఆగ్రహం
ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం మొదలై ఇప్పటికే 19 రోజులు దాటింది. ఈ దాడుల్లో మృతుల సంఖ్య ఏడువేలు దాటింది. ప్రపంచమంతా ఈ యుద్ధాన్ని గమనిస్తోంది. ఐక్యరాజ్యసమితి (యూఎన్ఓ)లో కూడా ఈ యుద్ధంపై చర్చలు జరుగుతున్నాయి. వీటినడుమ ఇజ్రాయెల్ రాయబారి గిలాడ్ ఎర్డాన్ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారులు, మహిళలు, వృద్ధులపై హమాస్ సాగిస్తున్న దారుణాలపై ఆంటోనియో గుటెర్రెస్ ఉపేక్ష వహిస్తున్నట్టు కనిపిస్తున్నారని, అందుకే ఆయన ఐక్యరాజ్యసమితికి నాయకత్వం వహించడానికి తగినవారు కాదని ఎర్డాన్ ఆరోపించారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలన్నారు. ఇజ్రాయెల్, యూదు ప్రజలపై దురాగతాలకు తెగబడుతున్న వారిపై సానుభూతి తెలిపేవారితో తాను మాట్లాడటంలో అర్థం లేదని అన్నారు. కాగా ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఆంటోనియో గుటెర్రెస్ మాట్లాడుతూ ఇజ్రాయెల్ అంతర్జాతీయ మానవతా చట్టాలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ, హమాస్ ఎటువంటి కారణం లేకుండా దాడులు చేసి ఉండదని తెలుసుకోవడం కూడా ముఖ్యమేనని అన్నారు. పాలస్తీనా ప్రజలు 56 ఏళ్లుగా దురాక్రమణలను ఎదుర్కొంటున్నారని, అయినప్పటికీ హమాస్ దాడులను సమర్థించలేమని కూడా ఆయన అన్నారు. ఇది కూడా చదవండి: భారత్ నుంచి గాజాకు 38 టన్నుల ఆహార పదార్థాలు, వైద్య పరికరాలు! -
'యుద్ధాల్లో హీరోలు ఉండరు.. కేవలం బాధితులే'
రియాద్: యుద్ధాల్లో హీరోలు ఉండరని కేవలం బాధితులు మాత్రమే మిగులుతారని సౌదీ అరేబియా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ టర్కీ ఆల్ ఫైసల్ అన్నారు. ప్రజాపోరాటాలు, శాసనోల్లంఘన ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. శాసనోల్లంఘన ఉద్యమం భారతదేశంలో బ్రిటిష్, తూర్పు యూరప్‌లో సోవియట్ రాజ్యాధికారాలను కూలదోశాయని ఆయన గుర్తుచేశారు. దురాక్రమణ ప్రాంతాల్లో ప్రజలకు సహాయనిరాకరణ చేసే హక్కు ఉంటుందని తెలిపారు. పాలస్తీనాలో ఇజ్రాయెల్ దురాక్రమణను ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇజ్రాయెల్ సైన్యం దురంహకారం గాజాలో విధ్వంసం సృష్టిస్తోందని అన్నారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్న నేపథ్యంలో ఫైసల్ అభిప్రాయం విలువైనదిగా పేర్కొంటూ ఆయన మాట్లాడిన వీడియోను కాంగ్రెస్ నాయకుడు మనీష్ తివారీ ట్విట్టర్(ఎక్స్) లో షేర్ చేశారు. హమాస్ తీరు శోచనీయం ఇస్లామిక్ ప్రతినిధిగా పేర్కొంటూ పిల్లలు, మహిళలపై క్రూరంగా దాడులకు పాల్పడుతున్న హమాస్ చర్యలను ఖండిస్తున్నానని ఫైసల్ అన్నారు. అమాయక పిల్లలు, మహిళలు, వృద్ధులను హతమార్చడం ఇస్లామిక్ సాంప్రదాయానికి విరుద్ధమని పేర్కొన్న ఆయన.. పవిత్ర స్థలాలను అపవిత్రం చేయడాన్ని కూడా ఇస్లాం అంగీకరించబోదని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ ప్రభుత్వంపై నైతికతను ప్రదర్శించడం పట్ల ఆయన హమాస్‌ను విమర్శించారు. ఇజ్రాయెల్‌లాగే హమాస్ కూడా పాలస్తీనా అధికార వర్గాలను తక్కువ అంచనా వేయడంపై ఆయన మండిపడ్డారు. పాలస్తీనా ప్రజల దుస్థితికి శాంతియుత పరిష్కారం కోసం సౌదీ అరేబియా చేస్తున్న ప్రయత్నాన్ని విధ్వంసం చేసిన హమాస్ తీరును ఫైసల్ తప్పుబట్టారు. The legendary chief of Saudi Intelligence Turki -Al- Faisal could not have said it better. Worth a listen 👇🏾 pic.twitter.com/0YjQAd158I — Manish Tewari (@ManishTewari) October 19, 2023 ఇజ్రాయెల్ రక్తపాతం.. పాలస్తీనా ప్రజలపై విచక్షణారహితంగా బాంబుల వర్షం కురిపిస్తున్న ఇజ్రాయెల్ తీరుపై ఫైసల్ మండిపడ్డారు. పాలస్తీనా వెస్ట్ బ్యాంక్‌లో పిల్లలు, మహిళల పట్ల ఇజ్రాయెల్ సైన్యం చేస్తున్న మారణకాండపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ దారుణాలకు అమెరికా సైతం వంతపాడటాన్ని తప్పుబట్టారు. దాదాపు 75 ఏళ్లుగా ఈ దారుణాన్ని పాలస్తీనా ప్రజలు భరిస్తున్నట్లు చెప్పారు. 1948 నాటి పాలస్తీనా దురంతం పేరుతో వెలుగులోకి వచ్చిన 2014 నాటి ఓ పత్రికా కథనంలో ఇజ్రాయెల్ సేనల పాత్రను ఆయన ఎండగట్టారు. ఈ ఏడాది కూడా మే నుంచి జులై మధ్య 67 మంది పిల్లలతో సహా దాదాపు 450 మంది పాలస్తీనియన్లను పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రక్తపాతాన్ని తక్షణమే నిలిపివేయాలని కోరారు. ప్రాశ్చాత్య మీడియా తీరు సరికాదు.. పాలస్తీనా భూభాగాలను ఇజ్రాయెల్ ఆక్రమించడాన్ని ఖండిస్తున్నానని ఫైసల్ తెలిపారు. అల్-అక్సా మసీదులోని ప్రార్థనా స్థలాలను ఇజ్రాయెల్ ఆక్రమించడాన్ని తీవ్రంగా విమర్శించారు. పాలస్తీనా స్త్రీలు, పిల్లలు పురుషులను నిర్బంధించారని మండిపడ్డారు. పాలస్తీనియన్ల చేతుల్లో చనిపోతున్న ఇజ్రాయెలీల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ.. పాలస్తీనియన్ల హత్యలపై కనీసం విచారం వ్యక్తం చేయని ప్రాశ్చాత్య మీడియా తీరును ఆయన ఖండించారు. ఇదీ చదవండి: రష్యా, హమాస్ ఒకటే: బైడెన్ -
యూజ్లెస్ ఫెలో.. గెట్ లాస్ట్ అన్నారు! అక్కడే చైర్మన్ అయ్యాను..
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) మాజీ చీఫ్ డాక్టర్ కె శివన్ తన మొదటి ప్రయత్నంలో అంతరిక్ష సంస్థలో జాబ్ పొందలేకపోయాయని 'నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ' (NIT) గోవా తొమ్మిదవ కాన్వకేషన్‌లో వెల్లడించాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. చదువు పూర్తయిన తరువాత నేను టీచర్ అవ్వాలనుకున్నాను, అయితే అంతరిక్ష సంస్థకు ఛైర్మన్‌గా మారాను అంటూ గుర్తు చేసుకున్నారు. మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన తరువాత ఉద్యోగం కోసం ఇస్రో కేంద్రానికి వెళితే అక్కడ యూజ్లెస్ ఫెలో.. నీకు జాబ్ రాదు.. గెట్ లాస్ట్ అన్నారని వెల్లడించాడు. ఇలా అనిపించుకున్న తరువాత, చివరకు అదే సెంటర్‌కు చైర్మన్ అయ్యానని చెప్పుకొచ్చాడు. మొదట శాటిలైట్ సెంటర్లో ఉద్యోగం రాకపోవడంతో రాకెట్ సెంటర్లో ఉద్యోగం సంపాదించి ఆ తరువాత అప్పటికే నాలుగు సార్లు విఫలమైన జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (GSLV) ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా బాధ్యత తీసుకున్నప్పుడు స్నేహితులు, సన్నిహితులు నువ్వు పెద్ద మూర్ఖుడివి అంటూ విమర్శించారని వెల్లడించారు. ఎన్నెన్నో విమర్శలు ఎదుర్కొని జీఎస్ఎల్వీ ప్రాజెక్టును విజయవంతం చేసానని శివన్ చెప్పాడు. ఈ విజయం ఇస్రో కమ్యూనిటీకి కనపడేలా చేయడంతో ఇస్రో చైర్మన్ పదవి కూడా వరించిందని తెలిపాడు. నిజానికి నా జీవితంలో ఓ గొప్ప విషయం నేర్చుకున్నాను, అదేంటంటే.. మీరు ఎక్కడైనా విమర్శలకు, తిరస్కరణకు గురైతే తప్పకుండా మీ కోసం మరో గొప్ప అవకాశం మరొకటి వేచి ఉంటుందని శివన్ చెప్పారు. ఇదీ చదవండి: మామకు తగ్గ మేనల్లుడు.. అర్జున్ కొఠారి ఆస్తులు ఇన్ని కోట్లా? ఆ తరువాత చంద్రయాన్ 2 మిషన్ ప్రారంభమైంది. దీనిని 2019 జూలై 22న అంతరిక్షంలో పంపించారు, కానీ అది 2019 సెప్టెంబరు 7 విఫలమైనట్లు తెలిసింది. ఆ తరువాత చంద్రయాన్-3తో ముందుకు వెళ్లేందుకు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ఆమోదం లభించిందని చెప్పారు. డాక్టర్ కె శివన్ గురించి ఏప్రిల్ 1957లో కన్యాకుమారిలోని తారక్కన్‌విలై గ్రామంలో ఒక మామిడి రైతుకు జన్మించిన 'శివన్' పాఠశాల విద్యను తమిళ మాధ్యమ పాఠశాల నుంచి, ఆ తరువాత 1980లో మద్రాస్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటికల్ డిగ్రీ పూర్తి చేసాడు.1982లో బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని పొంది ఇస్రోతో కలిసి పనిచేయడం ప్రారంభించాడు. 2006లో ఐఐటీ బాంబే నుంచి ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో డాక్టరల్ డిగ్రీ కూడా సొంతం చేసుకున్నాడు. ఈయన పీఎస్ఎల్వి, జీఎస్ఎల్వి, జీఎస్ఎల్వి MkIII వంటి ప్రాజెక్టుల్లో కూడా పనిచేశాడు. ఆ తరువాత 2022 జనవరిలో ఇస్రో ఛైర్మన్‌గా ఎస్ సోమనాథ్ బాధ్యతలు స్వీకరించాడు. -
ఇస్రో చీఫ్ సోమనాథ్‌కు బుడ్డోడు సర్ప్రైజ్ గిఫ్ట్
ఢిల్లీ:చంద్రయాన్ 3 విజయంపై ఇస్రో చీఫ్ సోమనాథ్ పట్ల ప్రశంసల వెల్లువ కురుస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో సోమనాథ్‌కు ఓ చిన్నారి నుంచి అరుదైన బహుమతి అందింది. జాబిల్లిపై వాలిన విక్రమ్ ల్యాండర్ నమూనాను చేతితో తయారు చేసిన పిల్లాడు.. దానిని ఇస్రో చీఫ్ సోమనాథ్‌కు బహుకరించాడు. ఈ విషయాన్ని ఇస్రో శాస్త్రవేత్త పీవీ వెంకటకృష్ణన్ తన ట్విట్టర్ (ఎక్స్) వేదికగా షేర్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లు తెగ కామెంట్లు చేశారు. చంద్రయాన్ 3 విజయంతో దేశంలో వచ్చే తరాలకు ఎంతో ప్రోత్సాహం అందించారని సోమనాథ్‌ను కొనియాడారు. ఆ బాలున్ని ఆసక్తిని మెచ్చుకున్నారు. భవిష్యత్‌లో ఎందరో పిల్లలు శాస్త్రవేత్తగా ఎదగాలనుకుంటారు. బాలునికి శుభాకాంక్షలు అని తెలిపారు. ISRO Chief Sri Somanath today had a surprise visitor,A young neighbour boy has handed over own made Vikram Lander model to the ISRO chief on behalf of all the neighbours. pic.twitter.com/BcyHYO0pDW — Dr. P V Venkitakrishnan (@DrPVVenkitakri1) September 2, 2023 చంద్రయాన్ 3 ప్రాజెక్టులో భాగంగా ఆగష్టు 23న విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై ల్యాండ్ అయింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇస్రోకు ప్రశంసల వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఇస్రో చీఫ్ సోమనాథ్ విమానంలోకి ఎక్కగానే.. ఫ్లైట్‌లో ప్రయాణికులందరూ ఆయన్ని అభినందించిన విషయం తెలిసిందే. చంద్రయాన్ 3తో పాటు సెప్టెంబర్ 2న ఇస్రో ఆదిత్య ఎల్1ను కూడా ప్రయోగించింది. సూర్యూనిపై పరిశోధనలు జరపడానికి ఈ మిషన్‌ను ప్రయోగించిన విషయం తెలిసిందే. 125 రోజుల పాటు ప్రయాణం చేసి సూర్యుని గుట్టు విప్పే పనిలో ఆదిత్య ఎల్ 1 నిమగ్నమవనుంది. ఇదీ చదవండి: Chandrayaan-3: స్లీప్ మోడ్‌లోకి ప్రజ్ఞాన్..