విత్తనాలు రాలే.. పుస్తకాలు రాలే !
- బాబు ప్రశ్నలకు వెనుకవైపు సమాధానాలివీ
పలమనేరు: పలమనేరులో శుక్రవారం ముఖ్యమంత్రి పాల్గొన్న పలు కార్యక్రమాల్లో ఆయన అడిగిన ప్రశ్నలకు వెనుకవైపు జనం నుంచి ‘నో.నో..’ అనే సమాధానాలు అధికంగా వినబడ్టాయి. దీంతో సంబంధిత శాఖలకు చెందిన అధికారులు బిక్కమొహం పెట్టాల్సి వచ్చింది. బొమ్మిదొడ్డిలో అధికారులు ముందుగా తర్ఫీదునిచ్చి ఏర్పాటుచేసిన సభలో రైతులు ఒకరకంగా సమాధానం చెప్పగా బ యట ఉన్నవారు మాత్రం బాబన్నా వేరుశెనగ విత్తనాలు లేవన్నా అంటూ గట్టిగా అరిచారు.
ఇక కనికల చెరువులో ఆయన రైతులతో మటడ్లాడుతుండగా వెనుకవైపున్న వారు పలుమార్లు అభ్యంతరాలు చెప్పబోగా అ క్కడున్న అధికారులు, పోలీసులు వారి నోర్లు మూయిం చారు. స్టేజ్‌పైకి వెళ్లిన రైతులు, మహిళలు బాబు అడిగే ప్రశ్నలతో సంబంధం లేకుండా అధికారులు చెప్పించిన డైలాగులు మాత్రం కంటస్థం చేసి మరీ ఒప్పించారు. బడిపిలుస్తోంది కార్యక్రమంలో పిల్లలూ మీకు మొత్తం పుస్తకాలు అందాయా.. అని బాబు అడగ్గా అధికారులు స్టేజ్‌పైనున్నవారు మాత్రం అందాయని సమాధానం చెప్పా రు. కా నీ సభలోని విద్యార్థులు ‘లేదు.. లేదు..’ అంటూ గట్టిగా అరిచారు.
దీంతో లేదు అనేవారు చేతులెత్తాలని సీఎం కోరగా చాలామంది చేతులెత్తడంతో విద్యాశాఖ విస్తుబోయింది. పొలం పిలుస్తోంది కోసం తీసుకొచ్చిన ఎద్దులకు మేతలేక పాపం అక్కడే ఆకలితో ఆలమటించాయి. బాబు ఈవైపు మడక దున్నుతోండగా పక్కనే ఎండిన బోరు ఉన్నప్పటికీ దానిగురించి ఎవరూ మాట్లాడలేదు. ఉన్నట్టుండి ముఖ్యమంత్రి పర్యటన ఖరారు కావడంతో అధికారులు ఆఘమేఘాలపై ఏర్పాట్లుచేశారు. ఓవైపు కార్యక్రమం మొదలైనప్పటికీ కొన్ని పనులు జరుగుతూనే కనబడ్డాయి. మరో వైపు పట్టణంలోని పలు దుకాణాలను పోలీసులు మూసివేయించారు. దీంతో తమ కూలీ పోగొట్టుకున్నామని పలువురు చిన్న వ్యాపారులు ఆవేదన చెందారు.