World Meditation Day : మెరుగైన సమాజం కోసం | World Meditation Day 2024: Here's A Special Story | Sakshi
Sakshi News home page

World Meditation Day: మెరుగైన సమాజం కోసం

Published Fri, Dec 20 2024 1:02 PM | Last Updated on Fri, Dec 20 2024 1:35 PM

World Meditation Day 2024: Here's A Special Story

ప్రస్తుతంపై మనస్సును లగ్నం చేయడాన్ని ధ్యానం అనవచ్చు. ఇది చాలా ప్రాచీన కాలం నుంచి అనేక సంస్కృతుల్లో భాగంగా కొనసాగుతోంది. వ్యక్తి గత శ్రేయస్సు, మానసిక ఆరోగ్యానికి ఇది ఉపయోగ పడుతుంది. అయితే భారతీయ సంస్కృతిలో యోగా, ధ్యానం మిళితమై కనిపిస్తాయి. అందుకే మన ప్రాచీన గ్రంథాలు కానీ, శిల్పాలు కానీ ధ్యాన ముద్రను ప్రతిబింబిస్తూ ఉంటాయి.

జూన్‌ 21వ తేదీని ప్రపంచ ధ్యాన దినోత్స వంగా జరపాలని ఐక్యరాజ్య సమితి (యూఎన్‌ఓ) నిర్ణయించడం ముదావహం. ధ్యానం యొక్క శక్తిని గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ధ్యానం మానసిక, భౌతిక శక్తి సామ ర్థ్యాలను వృద్ధి చేయడమే కాక మనస్సును ఒక విషయంపై లగ్నం చేయడానికి ఉపకరిస్తుంది. 

ఆధునిక కాలపు ఒత్తిడులను తట్టుకోవడానికి ధ్యానం ఇప్పుడు ప్రధాన సాధనం అయ్యింది. అలాగే వ్యక్తిగత ప్రయోజనాలకన్నా సామూ హిక శ్రేయస్సుకు ఇది దోహదం చేస్తుంది. దైనందిన జీవితంలో ధ్యానాన్ని ఒక భాగం చేసుకుంటే మానసిక ఒత్తిడుల నుంచి బయటపడవచ్చని నిపుణులు అంటున్నారు. యోగాకు ధ్యానాన్ని జోడిస్తే రక్తపోటు, స్థూల కాయం, ఆందోళన, నిద్రలేమి వంటి వాటి నుంచి బయటపడవచ్చు. అనా రోగ్యం నుంచి త్వరగా కోలుకోవడానికి ధ్యాన, యోగాలు ఎంతగానో ఉపయోగపడతాయంటున్నారు. మనస్సు– శరీరం మధ్య అవినాభావ సంబం«ధాన్ని మన ప్రాచీన యోగశాస్త్రం చెబుతుంది. కానీ ఆధునిక వైద్యులు మనస్సునూ, శరీరాన్నీ రెండు వేరువేరు విభాగాలుగా చూస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో ఈ ధోరణిలో కొంత మార్పు గమనించవచ్చు. ఆరోగ్యవంతమైన జనాభాను, సుస్థిరమైన ప్రపంచాన్ని సృష్టించడానికి ధ్యానం ఒక మార్గంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది.


– జంగం పాండు; పరిశోధక విద్యార్థి, హైదరాబాద్‌
(రేపు ప్రపంచ ధ్యాన దినోత్సవం) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement