special story
-
యుగాంతం రాబోతుందా?
-
సునీతను నడిపించిన హీరో.. ఎవరీ బ్యారీ విల్ మోర్ ?
-
ఇక వినాశనమే.. కార్టూన్ చెప్పిన భవిష్యత్తు
-
Avocado డాన్ ఆఫ్ ఫ్రూట్స్.. సాగు ఎలా చెయ్యాలి?
మన దేశంలో పట్టణ ప్రాంత ప్రజల్లో ఆహార – ఆరోగ్య స్పృహ పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని రకాల దేశ, విదేశీ జాతుల పండ్లకు మార్కెట్లో గిరాకీ పెరుగుతోంది. అందులో ఒకటి అవొకాడో. బెంగళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (ఐఐహెచ్ఆర్) ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి. కరుణాకరన్ మాటల్లో చెప్పాలంటే.. అవొకాడో, డ్రాగన్ సహా పన్నెండు రకాల దేశ, విదేశీ ఖరీదైన పండ్ల జాతుల సాగు విస్తీర్ణం మన దేశంలో గత మూడేళ్లుగా పెరుగుతోంది. ఈమొక్కలకు గిరాకీ 30% పెరిగింది. పరిమిత నీరు, పోషకాలు, శ్రమతో సాగు చేయడానికి అవకాశం ఉండటం.. ధాన్యపు పంటలతో పోల్చితే అధికాదాయం రావటం.. యాంత్రీకరణకు అనుకూలం కావటం.. పౌష్టిక విలువలతో కూడిన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉండటం.. మార్కెట్లో డిమాండ్ ఉండటం వంటి అంశాలు ఇందుకు దోహదం చేస్తున్నాయి. అయితే, అవొకాడో పండ్ల తోటలు ఏయే భూముల్లో సాగు చెయ్యాలి? ఏయే రకాలు అనువైనవి? వంటి ప్రశ్నలకు సమాధానాలు డా. కరుణాకర్ మాటల్లోనే చదవండి.అవొకాడో సాగు మనకు కొత్తది కాదు. 70 ఏళ్లుగా కర్ణాటక, కేరళ, తమిళనాడు, సిక్కిం, మహారాష్ట్రల్లో సాగవుతోంది. అయితే, ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ సహా దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ అవొకాడో తోటలను తామర తంపరగా నాటుతున్నారు. గత మూడేళ్లలోనే 8–10 లక్షల అవొకాడో మొక్కలు నాటారు. ఉష్ణమండలం, తేమ ఎక్కువగా ఉండే ఉప–ఉష్ణమండల ప్రాంతాలు అనుకూలం. విభిన్న వాతావరణ పరిస్థితుల్లోనూ పెరిగే లక్షణం దీనికి ఉన్నప్పటికీ, తగిన వాతవరణం, నేలల గురించి పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవలసిందిగా రైతులను కోరుతున్నాను. 18–33 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రతలు, 700–1500 ఎం.ఎం. వర్ష; ఉన్న ప్రాంతాలు.. 5.5 - 8 వరకు ఉదజని సూచిక (పిహెచ్) ఉన్న భూములు అనుకూలం. మొక్కలు నాటిన 5 ఏళ్లకు పూర్తిస్థాయి దిగుబడినిచ్చే స్థితికి పెరుగుతుంది. ప్రస్తుతం మంచి మార్కెట్ డిమాండ్ ఉంది. అందుకే రైతులు, వ్యాపారులు, వినియోగదారులు అమితంగా ఆసక్తి చూపుతున్నారు. అయితే, అవొకాడో ఖరీదైన పండు కాబట్టి మిల్క్‌షేక్, ఐస్‌క్రీమ్‌లు, డిసర్ట్ స్వీట్ల తయారీలో మాత్రమే వాడుతున్నారు. మున్ముందు దిగుబడి పెరిగే నాటికి ప్రాసెసింగ్ సదుపాయాలు పెరిగి వేర్వేరు రూపాల్లో వాడకం పెరగాలి. లేదంటే మార్కెట్ పడిపోయే ముప్పు ఉంటుంది. ఇక రైతుల విషయానికొస్తే.. తోటలు నాటేటప్పుడు అది ఏ రకమో తెలియకుండానే, ఏయే నేలలకు సరి;yతుందో తెలుసుకోకుండానే స్థానిక నర్సరీల నుంచి కొనుగోలు చేసిన మొక్కలు నాటుతున్నారు. దీంతో సాగులో చాలా సమస్యలు వస్తున్నాయి.‘హాస్’ రకం మొక్కలు వద్దుబెంగళూరులోని ఐఐహెచ్‌ఆర్‌లో 16 రకాల అవొకాడో మొక్కలున్నాయి. మీ భూమి, నీరు, వాతావరణానికి అనువైన రకాన్ని ఎంచుకోవటంపై శ్రద్ధ పెడితే విజయం సాధించవచ్చు. అర్క సుప్రీం, అర్క రవి, లాంబ్ హాస్, పింకర్టన్ రకాలు మేలైనవి. చాలా మంది హాస్ రకం సాగు చేస్తున్నారు. ఇది మనకు సూట్ కాదు. నెర్రెలిచ్చే భూముల్లో వద్దుఅవొకాడో చాలా సున్నితమైన పంట. నీటి నిల్వను అసలు తట్టుకోలేదు. అవొకాడోకే కాదు ఏ పండ్ల తోటలకైనా ఎండా కాలం నెర్రెలిచ్చే నల్లరేగడి నేలలు పనికిరావు. వేర్లు తెగి΄ోతాయి. నీరు నిలవని, బాగా గాలి సోకే ఎర్ర గరప నేలలు (రెడ్ శాండీ సాయిల్) మేలు. 40% ఇసుక కలిసిన చెరువు మట్టిలో కూడా బాగా పెరుగుతుంది. బంక మట్టి నేల (క్లే సాయిల్) అసలు పనికిరాదు. ఈ నేలలో సాగు చేయాలంటే... 4x3 అడుగుల గుంతల్లో ఎర్ర మట్టిపోసి, మొక్కలు నాటుకోవాలి. పిహెచ్ సమతుల్యంగా ఉండాలి. నీటిలో ఈసీ 1 కన్నా ఎక్కువ ఉంటే సరిగ్గా పెరగదు. అందుకని, అవొకాడో మొక్కలు నాటే ముందు మట్టి, నీటి పరీక్షలు చేయించి ప్రణాళికాబద్ధంగా పెట్టుబడి పెట్టే నిర్ణయం తీసుకోవాలి.పిహెచ్ 7 కన్నా ఎక్కువ ఉంటే, కాల్షియం కార్బొనేట్ 20% కన్నా ఎక్కువ ఉన్న నేలలు అనుకూలం కాదు. నీరు తగుమాత్రంగా ఇవ్వాలి. ఎక్కువ ఇస్తే ఐరన్ లభ్యత సమస్య వస్తుంది. నీటి ఉప్పదనం 2% కన్నా ఎక్కువ ఉంటే పనికిరాదు. క్లోరైడ్ సాంద్రత ఎక్కువగా ఉన్న నేలలకు తగిన రకాల మొక్కలను ఎంపిక చేసుకోవాలి.ఏటా రెండు సీజన్లుఅవొకాడో పూత వచ్చిన తర్వాత 120–150 రోజుల్లో పండ్లు కోతకు వస్తాయి. ఏప్రిల్–జూలై, అక్టోబర్– ఫిబ్రవరి సీజన్లలో రెండు దఫాలుగా పండ్ల దిగుబడి వస్తుంది. విత్తనం నాటితే 5–6 ఏళ్లలో, అంటు మొక్కలు నాటితే 3–4 ఏళ్లలో కాపుకొస్తాయి. చెట్టుకు 100 నుంచి 500 కాయలు కాస్తాయి. కాయలు పక్వానికి వచ్చినా చెట్టు మీద గట్టిగానే ఉంటాయి. కోసిన తర్వాత మెత్తబడతాయి. ముదురు రంగులోకి మారితే పక్వానికి వచ్చినట్లు గుర్తించి కోయాలి. పక్వ దశను గుర్తించడానికి ఇతర దేశాల్లో చిన్న΄ాటి యంత్రాలను వాడుతున్నారు. మన శరీర ఉష్ణోగ్రతను సెన్సార్లతో గుర్తించే పరికరంతోనే అవొకాడో పక్వ దశను తెలుసుకోవచ్చు. 24% ఆర్గానిక్ కంటెంట్ ఉన్న దశలో పండును కోయాలి. కాయ కోసిన తర్వాత రంగు మారుతుంది. అవొకాడోతో ఒక ఉపయోగం ఏమిటంటే పండు పక్వానికి వచ్చిన తర్వాత కూడా మార్కెట్ ధర లేకపోతే చెట్టు మీదే 1–2 నెలల వరకు కాయ కోతను వాయిదా వేసుకోవచ్చు! ముందుగా/ఆలస్యంగా కోతకు రావటం.. మంచి సువాసనతో అధిక గుజ్జు ఉండటం.. ఎక్కువ రోజులు నిల్వ ఉండటం.. మార్కెట్లో గిరాకీ ఉండటం.. కోసుకు తినటానికి లేదా ప్రాసెసింగ్‌కు అనువుగా ఉండటం.. వంటి అనేక అంశాలను పరిశీలించి అవొకాడో సాగుచేసే రకాలను ఎంపిక చేసుకోవటం కీలకం. మరికొన్ని మెళకువలుసముద్రతలం నుంచి 1,000 మీటర్ల ఎత్తుగల ప్రదేశాల్లో వెస్ట్ ఇండియన్ అవొకాడో వెరైటీలను నాటుకోవాలి. వీటి కొమ్మలు, విత్తనాల ద్వారా మొక్కలు తయారు చేసుకోవచ్చు. మొదటి 5 ఏళ్లూ మధ్యాహ్నపు ఎండ నుంచి మొక్కల్ని కాపాడాలి. 5 ఏళ్ల వరకు ఎట్టిపరిస్థితుల్లోనూ పూత, కాతను ఉంచకూడదు. తీసెయ్యాలి. 5 మీ.“ 5 మీ. సైజులోగొయ్యి తవ్వి, అది 3 నెలలు ఎండిన తర్వాత మొక్కలు నాటుకోవాలి. అవొకాడో పండ్లను ప్రాసెస్ చేసి అనేక ఉత్పత్తుల తయారు చేయటం, స్ప్రే డ్రయ్యింగ్ ద్వారా పొడిని తయారు చేసే టెక్నాలజీని ఐఐహెచ్ఆర్ రూపొందించింది. విలువ జోడించి ఉత్పత్తులు అమ్ముకోగలిగితే మంచి ఆదాయం వస్తుంది.5 అడుగుల ఎత్తు మడులపై మొక్కలు నాటాలి అవొకాడో 2 – నీరు నిలవని ఎర్ర గరప నేల (రెడ్ శాండీ సాయిల్)లో అవొకాడో చెట్టు చక్కగా పెరుగుతుంది. బంక మన్ను (క్లే సాయిల్) దీనికి సరిపడదు. ఐఐహెచ్ఆర్ ప్రధాన శాస్త్రవేత్త డా. కరుణాకరన్ ఈ విషయాన్ని ఈ చిత్రంలో చక్కగా చె΄్పారు. బంక మన్ను నేలలో అవొకాడో సాగు చేయదలిస్తే 4 అడుగుల లోతు, 3 అడుగుల వెడల్పున గొయ్యి తీసి, ఆ గోతిలో 90% వరకు ఎర్ర గరప మట్టి, ఎరువుల మిశ్రమాన్ని నింపి సాగు చేయవచ్చని ఆయన తెలిపారు. గుంతలో సగం వరకే ఎర్ర గరప మట్టిని నింపితే.. చెట్టు కొన్ని సంవత్సరాలు పెరిగిన తర్వాత వేర్లు బంకమన్నులోకి విస్తరించినప్పుడు పోషకాలు, నీరు అందక (చిత్రంలోచూపిన విధంగా) నిలువునా ఎండిపోతుందని వివరించారు. అవొకాడో చాలా సున్నితమైన పంట. వేరుకుళ్లు బెడద ఉంటుంది. అవొకాడో మొక్కల్ని (ఆ మాటకొస్తే ఏ పండ్ల తోటైనా) 5 అడుగుల ఎత్తుమడి (రెయిజ్డ్ బెడ్) పైనే నాటుకోవాలి. ట్రాక్టర్‌తో అంతర సేద్యం చేసినా బెడ్ దెబ్బతినదు. సాళ్ల మధ్య వర్షపు నీరు బయటకు త్వరగా వెళ్లిపోవటానికి కందకం తియ్యాలి. ఇజ్రాయెల్, సౌతాఫ్రికాలో కూడా ఎత్తుమడులపైనే నాటుతారు.5 అడుగుల ఎత్తు మడులపై మొక్కలు నాటాలి.థాంక్స్ టు ‘టొక్సోడాన్’!అవొకాడో.. అమెజాన్, మెక్సికన్ అటవీ ప్రాంతాల్లో నివసించే భారీ శాకాహార జంతువు ‘టొక్సోడాన్’కు పండ్లు తినే అలవాటుంది. అయితే, దానికి ఏ పండూ సరిగ్గా నచ్చేది కాదు. అవొకాడో పండు టొక్సోడాన్కు తెగ నచ్చేసిందట. అందులో పుష్కలంగా ఉండే మోనో అన్ శాచ్యురేటెడ్ ఫాటీ యాసిడ్సే అందుకు కారణమట. ఇందులో 20% కొవ్వు ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైనదే కాకుండా ‘సంతృప్తినిచ్చేది’ కూడానట! అందుకే దీనికి ‘వెన్న పండు’ అని పేరు. ఆ విధంగా దీని గొప్పతనాన్ని జనానికి తెలిసేలా చేసినందుకు టొక్సోడాన్కి థాంక్స్ చెప్పాలి అన్నారు ఐఐహెచ్ఆర్ (బెంగళూరు)లో పండ్ల పరిశోధనా విభాగాధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డా. జి. కరుణాకరన్! అదేవిధంగా, 1950లలో కూర్గ్, వయనాడ్ ప్రాంతాల్లో టీ ఎస్టేట్ల యజమానులు వ్యాహ్యాళికి వెళ్తూ పెంపుడు కుక్కలను వెంట తీసుకెళ్లేవారు. దారి పక్కన చెట్ల కింద రాలినపడి ఉన్న అవొకాడో పండ్లను కుక్కలు ఇష్టంగా తినటం గమనించారు. అప్పటి వరకు ఇవి తినదగిన పండ్లని చాలా మందికి తెలియదు. ఇప్పుడు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. మన దేశంలో ‘డాన్ ఆఫ్ ఫ్రూట్స్’ అయ్యింది! -నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
పాక్ లో ట్రైన్ ను హైజాక్ చేసిన బెలూచిస్థాన్ వేర్పాటు వాదులు
-
రీల్స్, యూట్యూబ్ మోజులో పిల్లలు, తలలు పట్టుకుంటున్న పేరెంట్స్
నా కూతురు 8వ తరగతితో చదువు మానేసింది. యూట్యూబ్ చానల్ ప్రారంభించి ఇన్ఫ్లుయెన్సర్గా మారాలనుకుంటోంది. భారీ పెట్టుబడి లేకుండానే త్వరగా డబ్బు సంపాదించవచ్చని అంటోంది. కౌన్సెలింగ్ కూడా ఇప్పించా. అయినా ఫలితం లేదు. ఆమె మనసును ఎలా మార్చాలో తెలియడం లేదు..- హైదరాబాద్‌కు చెందిన ఓ తండ్రి బాధ మా అమ్మాయిలు ఒకరు 9, మరొకరు8 చదువుతున్నారు. ఇటీవలే రీల్స్ చేయడంఅలవాటు చేసుకున్నారు. మొదట్లో మేం కూడా సరదాగా ఎంకరేజ్ చేశాం. ఇప్పుడు అదే పనిలో పడిపోయి చదువును పూర్తిగా అటకెక్కించారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు.. - వరంగల్ జిల్లాకు చెందిన ఓ తల్లి ఆవేదనపిల్లల మనసు మార్చాలని మా వద్దకు తీసుకొస్తే.. ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంత సంపాదిస్తారో తెలుసా? మీ డాక్టర్లు కూడా అంత సంపాదించలేరు అంటూ ఎదురు ప్రశ్నలేస్తున్నారు.. - మానసిక వైద్యులు చెబుతున్నది ఇది బాల్యం సోషల్ మీడియా వలలో చిక్కి విలవిల లాడుతోంది. రీల్స్, యూట్యూబ్ చానల్స్‌తో లక్షలు సంపాదించొచ్చన్న ఇన్ఫ్లుయెన్సర్ల మాటలగారడీలో పడి స్కూలు పిల్లలు కూడా జీవితాలు పాడుచేసుకుంటున్నారు. పట్టణాలు, నగరాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా అంతటా ఈ జాడ్యం పెరుగుతోంది. దీంతో స్కూల్ పిల్లల్లో చదువుపట్ల ఆసక్తి తగ్గిపోతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు -సాక్షి, హైదరాబాద్చదువు కోసం మొదలై.. కరోనా లాక్డౌన్ సమయంలో పిల్లల చదువు పాడవకూడదని అందరూ ఆన్లైన్ చదువుల వైపు మొగ్గారు. అందుకోసం పిల్లలకు పర్సనల్ కంప్యూటర్స్, ఫోన్లు, ట్యాబులు కొనిచ్చారు. ఇప్పుడు అదే పాపంగా మారింది. ఆన్లైన్లో అధిక సమయం గడపడంతో పిల్లలకు క్విక్ మనీకి బోలెడు మార్గాలు కనిపించాయి. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సహా అనేక అంశాలపై అర్థసత్యాలు, అసత్యాలతో కూడిన అనవసర పరిజ్ఞానాన్ని అందించాయి. ‘హౌ టు మేక్ 30 లాక్స్ ఇన్ 2 ఇయర్స్’వంటి ఊరింపులు టీనేజ్ ఆలోచనలను కలుషితం చేశాయి.సంపాదనకు వెల్కమ్.. స్కూల్‌కు బైబై...సోషల్ మీడియాకు బానిసైన 8 లేదా 9వ తరగతి విద్యార్థుల్లో చాలామంది పాఠశాలకు వెళ్లడానికి కూడా ఇష్టపడడం లేదు. తాము సుఖంగా బతకడానికి సంప్రదాయ విద్య సరిపోదని వీరు బలంగా నమ్ముతున్నారు. ‘సోషల్ మీడియా ద్వారా కొందరు సులభంగా డబ్బు, పాపులారిటీ సంపాదించడాన్ని చూసి తామూ అలాగే చేయగలమని చాలామంది విద్యార్థులు భావిస్తున్నారు. పాఠశాలలో గడిపే కాలం వృథా అనే ప్రమాదకర అభిప్రాయం పెంచుకుంటున్నారు’ అని సైకాలజిస్ట్ అరుణ్ చెప్పారు. యూట్యూబ్ చానల్ ప్రారంభించాలని కొందరు, తమ వ్యాపార ఆలోచనలకు తల్లిదండ్రులు నిధులు సమకూర్చాలని ఇంకొందరు, సేవా సంస్థను ప్రారంభించాలని/ ఇన్ఫ్లుయెన్సర్ / సింగర్‌గా మారాలని.. ఇలా ఏవేవో కోరుకుంటున్నారు. వీరిలో కొందరు చాలా మొండిగా తయారవుతుండడంతో వారికి కౌన్సెలింగ్ కూడా పనిచేయడం లేదని సైకాలజిస్టులు చెబుతున్నారు. బీద, మధ్యతరగతి వర్గాల్లోనే ఎక్కువఇటీవల ఈజీ మనీ మీద టీనేజర్లలో బాగా ఆసక్తి పెరిగింది. అది వారి చదువు మీద వ్యతిరేక ప్రభావం చూపిస్తోంది. ఇది బీద, మధ్యతరగతి వర్గాల్లోనే ఎక్కువ కనిపిస్తోంది. గేమింగ్‌తో సహా రకరకాల యాప్స్ ద్వారా సులభంగా డబ్బులు సంపాదించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తమ పిల్లల్ని వాటికి దూరం చేసి ఎలాగోలా చదువు మీద దృష్టిపెట్టేలా చేయమని మమ్మల్ని సంప్రదించే తల్లిదండ్రులు పెరిగారు. అయితే ఈ వ్యసనాన్ని ముదరనీయకుండా ప్రాథమిక దశలోనే గుర్తించి తుంచాల్సిన అవసరం ఉంది. దీనిపై స్కూళ్లలో అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఫోన్ల ద్వారా కూడా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. - డా. పృథ్వీ రెడ్డి, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, కరీంనగర్ జాగ్రత్తగా డీల్ చేయాలిస్కూల్ విద్యతో ఉపయోగం లేదని 13–15 ఏళ్ల మధ్య వయస్కులు కొందరు పాఠశాల నుంచి నిష్క్రమించాలని కోరుకుంటున్నారు. దీంతో పిల్లలు కనీసం ఇంటర్ పూర్తి చేసినా చాలని, మందులతోనైనా బాగు చేయాలని వారి తల్లిదండ్రులు అడుగుతున్నారు. నా దగ్గరకు కౌన్సెలింగ్‌కు తీసుకొచ్చిన ఓ టీనేజ్ అమ్మాయి ఆన్లైన్లో ఓ రీల్ చూపించి తన వయసే ఉన్న ఓ టీనేజర్ రూ.30 లక్షలు సంపాదించిందని.. మీ డాక్టర్లు కూడా అంత సంపాదించలేరని చెప్పింది. ఫ్రెండ్స్ అంతా కలిసి ప్లాన్ చేసుకుని మరీ డ్రాప్ అవుట్స్‌గా మారుతున్నారు. వీరిని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. గైడెన్స్, అవేర్నెస్ అందించాలి. మన విద్యా విధానం కూడా మారాలి. చదువుతో పాటు లైఫ్ స్కిల్స్ కూడా నేర్పించాలి.- డా.చరణ్ తేజ, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్, హైదరాబాద్ -
అన్ని భాషలు సమానం... హిందీ మరింత సమానం!
దేశంలో ఇప్పుడు హిందీ వివాదం రగులుకుంది. తమిళ నాడు ముఖ్యమంత్రి ఎమ్కే స్టాలిన్ దక్షణ భారతదేశంలో హిందీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఉద్యమించడానికి నడుం బిగించారు. తమిళనాడులో పెరియార్ ఇవీ రామసామి నాయకర్ కాలం నుండే హిందీ వ్యతిరేకతకు చాలా చరిత్ర వుంది. స్టాలిన్ పిలుపు మీద దక్షిణాదిలోని మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పంది స్తాయో వేచి చూడాలి. మనకు జాతీయ భాష హిందీ, అంతర్జాతీయ భాష ఇంగ్లీషు, రాష్ట్ర భాష తెలుగు (Telugu) అనే ఒక తప్పుడు అభిప్రాయం సామాన్యుల్లోనేగాక విద్యావంతుల్లోనూ కొనసాగుతోంది. ఏపీ తెలుగు, తెలంగాణ (Telangan) తెలుగు రెండూ వేరే భాషలు, ప్రజలు వేరే జాతులవారు అనే అభిప్రాయాన్ని కొన్నాళ్ళుగా కొందరు కొనసాగిస్తు న్నారు. అది ఆ యా సమూహాల ఉనికివాద కోరికలు కావచ్చు. ఇవిగాక ఈ రెండు రాష్ట్రాల్లోనూ చెరో పాతిక భాషలు మాట్లాడే సమూహాలున్నాయి. ఇప్పటి ఆంధ్రప్రదేశ్‌లో గోండి, కోయ, కొంద, కువి, కోలామీ, పెన్గొ, మంద, యానాది, లంబాడ, సవర (Savara Language) తదితర చిన్న సమూహాలు ఓ పాతిక వరకు ఉంటాయి. అధికార భాషల ప్రాబల్యంలో చిన్న సమూహాలు చితికి పోతాయి; వాళ్ళ భాషలు అంతరించిపోతాయి. భాష కూడ నిచ్చెనమెట్ల కులవ్యవస్థ లాంటిది. తనకన్నా కింద ఉన్న కుల సమూహాన్ని అణిచివేసే సమూహాన్ని అంతకన్నా పైనున్న కుల సమూహం అణిచివేస్తుంటుంది. చిన్న సమూహాలు తమ మాతృభాషను వదులుకోవాల్సిన పరిస్థితుల్ని సృష్టిస్తారు. ఒక భాష అంతరించిపోవడం అంటే ఒక జాతి తన సంస్కృతీ సంప్రదాయాలనూ, తను సృష్టించినకళాసాహిత్యాలనూ కోల్పోవడమే అవుతుంది. అంటే ఆ జాతి ముందు జీవన్మృతిగా మారిపోతుంది. ఆ తరు వాత అంతరించిపోతుంది. బ్రిటిష్ ఇండియా మతప్రాతిపదిక మీద ఇండియా–పాకిస్తాన్‌గా చీలిపోయినట్టు మనకు తెలుసు. అయితే, ఒకేమత సమూహం అయినప్పటికీ పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ భాషా ప్రాతిపదిక మీద విడిపోయిందని మనకు గుర్తు ఉండదు. మనుషులకు భాష ప్రాణమంత ముఖ్యమైనది. యూరోప్ దేశాలన్నింటిలోనూ క్రైస్తవ మతసమూహాల ఆధిక్యత ఎక్కువ. అయినప్పటికీ, అవి అన్ని దేశాలుగా విడి పోవడానికి ప్రధాన కారణం భాష. సంస్కృతాన్నిసంఘపరివారం దైవవాణిగా భావిస్తుంది. తాము నిర్మించ తలపెట్టిన ‘హిందూరాష్ట్ర’లో సంస్కృతం జాతీయ భాషగా ఉంటుందనేది ఆ సంస్థ అభిప్రాయం. అంతవరకు దేవనాగరి లిపిలోని హిందీని జాతీయ భాషగా కొనసాగించాలని వారి ఆలోచన. జాతీయ భాష మీద చర్చ రాజ్యాంగ సభలోనే జోరుగా సాగింది. మనకు అందుబాటులో ఉన్న భాషల్లో ఏదో ఒకదాన్ని జాతీయ భాషగా చేస్తే అది మిగిలిన భాషల్ని మింగేస్తుందని చాలా మంది తీవ్ర ఆందోళన, అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రాజ్యాంగం ఎనిమిదవ షెడ్యూలు 22 భాషలకు గుర్తింపు ఇచ్చినప్పటికీ ఏ భాషకూ జాతీయ హోదా ఇవ్వలేదు. అన్ని భాషలూ సమానమే. మనకు బాగా ప్రాచుర్యంలో ఉన్న భాషలే తెలుసు. బోడో, డోగ్రీ, మైథిలి, సంథాలి తదితర భాషలకు కూడ రాజ్యాంగంలో స్థానంఉందని మనం తరచూ గుర్తించం. హిందీ జాతీయ భాష కాదు; అది కేంద్ర ప్రభుత్వానికి అధికార భాష మాత్రమే. హిందీ సరసన ఇంగ్లీషును కూడ అనుసంధాన భాషగా గుర్తిస్తున్నారు. జనాభాను బట్టి లోక్‌సభ స్థానాలు నిర్ణయం అవుతాయని మనకు తెలుసు. కేంద్ర ప్రభుత్వ ఆదాయాన్ని రాష్ట్రాలకు పంచే సమయంలోనూ జనాభా, లోక్‌సభ సీట్లు తదితర అంశాలు ప్రాతిపదికగా మారుతాయి. అదీగాక, త్వరలో లోక్‌సభ నియోజక వర్గాల పునర్ వ్యవస్థీకరణ జరగబోతోంది. ఉత్తరాది స్థానాలు మరింతగా పెరిగి దక్షిణాది స్థానాలు మరింతగా తగ్గిపోయే అవకాశం ఉన్నట్టు కొందరు ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. అంచేత ఇది భాషా సమస్య మాత్రమే కాదు; రాజకీయార్థిక సమస్య. ఎవర్ని ఎవరు పాలించాలనే ప్రాణప్రదమైన అంశం ఇందులో ఉంది. 1955లో వచ్చిన భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రతిపాదన... మధ్యప్రదేశ్, బిహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల అధికార భాషగా హిందీని పేర్కొంది. ఒక భాషకుఅంత విస్తారమైన ప్రాంతాన్ని కేటాయించడం ప్రమా దకరం అని ఆందోళన వ్యక్తం చేసిన వారిలో బీఆర్ అంబేడ్కర్ కూడా ఉన్నారు. ఎందుకయినా మంచిది ఉత్తరప్రదేశ్‌ను నాలుగు భాగాలు చేయాలని ఆయన అప్పుడే సూచించారు. ఇప్పుడు అంబేడ్కర్ భయపడి నట్టే జరుగుతోంది. గడిచిన 70 సంవత్సరాల్లో భోజ్ పురి, మైథిలి, గఢ్వాలి, అవధి, బ్రజ్‌లతో సహా దాదాపు 29 స్థానిక భాషల్ని హిందీ మింగేసింది. అది అక్కడితో ఆగలేదు. ఇప్పుడు ఏకంగా ఇండియాను మింగడానికి సిద్ధం అయింది.‘యానిమల్ ఫార్మ్’ వ్యంగ్య నవలలో జార్జ్ ఆర్వెల్ ఒకచోట విరోధాభాసాలంకారం ప్రయోగిస్తాడు. ఫార్మ్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్న పందుల సామాజిక వర్గం ‘జంతువులన్నీ సమానం; కానీ, పందులు మరింత సమానం’ అంటుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అలాంటి విరోధాభాసాలంకారాన్ని తరచూ ప్రయోగిస్తున్నది. రాష్ట్రాలన్నీ సమానం కానీ, హిందీ బెల్టు మరింత సమానం. ఉత్తరాది రాష్ట్రాలు ఇంకా సమానం అంటున్నది. ఇప్పుడు ‘భాషలన్నీ సమానం; కానీ, హిందీ మరింత సమానం’ అంటూ కొత్త పాట మొదలెట్టింది.-డానీవ్యాసకర్త సమాజ విశ్లేషకులు -
‘మూల సంత’ సూర్యకళ : మహిమాన్వితం
మనం జీవించి ఉన్నాం, జీవిస్తున్నాం.. అంటే అనుక్షణం ప్రకృతి నుంచి తీసుకుంటూనే ఉన్నామని అర్థం. మనం తీసుకున్నంత తిరిగి ఇవ్వాలని ప్రకృతి కోరుకోదు. విధ్వంసం చేయకపోతే చాలనుకుంటుంది. ప్రకృతి తనను తాను స్వస్థత పరుచుకుంటుంది. కానీ ఆ సమయం కూడా ఇవ్వనంత వేగంగా కాలుష్యభరితం చేస్తున్నాం. ప్రకృతిని పరిరక్షిస్తూ సాగిన మన భారతీయ జీవనశైలిని మర్చిపోయాం. మనం మరిచిపోయిన ఆరోగ్యకరమైన జీవనశైలిని గుర్తు చేయాలి, ఆచరణలోకి తెచ్చే వరకూ చైతన్యవంతం చేస్తూనే ఉండాలనే ఉద్దేశంతో పదిహేనేళ్లుగా గ్రీన్ వారియర్‌గా మారారు సూర్యకళ మోటూరి. జీవనశైలి మార్పు ఇంటి నుంచే మొదలవ్వాలని, అది మహిళ నుంచే ప్రారంభం కావాలని, అందుకోసం ఆమె మహిళలను చైతన్యవంతం చేయడానికి పూనుకున్నారు. గ్రామభారతి అధ్యక్షబాధ్యతలు నిర్వర్తిస్తున్న ఏకైక మహిళ సూర్యకళ మహిళాదినోత్సవం సందర్భంగా సాక్షితో పంచుకున్న వివరాలివి. – సాక్షి, సిటీబ్యూరోహైదరాబాద్‌లో పుట్టి పెరిగిన సూర్యకళ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో పీజీ చేసి నగరంలోని ఓ ఎమ్ఎన్సీలో ఉద్యోగం చేస్తున్నారు. జాతీయోధ్యమ నాయకుల జీవితగాథలను చదివినప్పుడు ఆ కాలంలో పుట్టనందుకు ఆవేదన చెందేవారామె. రాజీవ్ దీక్షిత్ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు.. ‘దేశం కోసం పని చేయడానికి ఎప్పుడూ ఏదో ఒక సామాజిక అవసరం ఉండనే ఉంటుంది. దానిని తెలుసుకుని పని చేయాలి’ అనే ఆలోచన రేకెత్తింది. సుభాష్ పాలేకర్ శిక్షణలో వాలంటీర్‌గా పని చేసినప్పుడు జరిగిన సంఘటన ఆమెను ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు మళ్లించింది. అక్కడికి వచ్చిన ఒక మహిళారైతు ఇచ్చిన కందిపప్పును ఇంటికి తెచ్చుకుని వండుకున్నారు. ఆ రుచి అమృతంలా అనిపించిందన్నారు సూర్యకళ. ప్రతి ఒక్కరూ అలాంటి ఆహారాన్ని తినాలని కోరుకున్నారు. సేంద్రియ వ్యవసాయం, నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ విభాగాల్లో పని చేయసాగారు. ‘శిక్షణా తరగతులు నిర్వహించి సేంద్రియ వ్యవసాయంపై ‘మా గ్రామభారతి స్వచ్ఛంద సంస్థ’ విజయవంతమైంది. కానీ ఆ ఉత్పత్తులకు మార్కెట్ లేకపోతే ఆ రైతు నిలదొక్కుకునేదెలా అనే ప్రశ్నకు సమాధానంగా ఒక వేదికను రూపొందించాను. ఆర్గానిక్ ఫుడ్ విషయంలో అవగాహన కల్పించడంలో మీడియా చాలా బాగా పని చేస్తోంది. చైతన్యం వచ్చింది కానీ ఉత్పత్తులు అందుబాటులో లేవు. దాంతో ‘మూలసంత’ పేరుతో వాటిని నగరానికి తీసుకొచ్చే బాధ్యత చేపట్టాను. కార్పొరేట్ కంపెనీల్లో మూలసంతలు పెడుతున్నాం. ఇటీవల ఇన్ఫోసిస్‌లో 30 స్టాళ్లతో సంత పెట్టాం. మహిళలను సంఘటిత పరిచి ఆర్గానిక్ ఉత్పత్తులను వారి వంటింటి వరకూ తీసుకెళ్లేలా చేయగలిగాం. నీటి వృథాను అరికట్టడం వంటి విషయాల్లో ఆలోచన రేకెత్తించడం నుంచి పెళ్లి, ఇతర వేడుకల్లో పర్యావరణ హితమైన వేదికల ఏర్పాటు వరకూ కృషి చేశాం. పదిహేనేళ్ల నా ప్రస్థానంలో ఏమి సాధించానని చూసుకుంటే మన వేడుకలు కనిపిస్తాయి. ఆహ్వాన పత్రికల, రిటర్న్ గిఫ్ట్‌లు, భోజనం వడ్డించే ప్లేట్ల వరకూ ప్రతిదీ బయో డీగ్రేడబుల్ థీమ్‌ని అనుసరిస్తున్నారు. మా ప్రయత్నం ఏ మాత్రం వృథా కాలేదు. ఒక మంచి బాట వేయగలిగాం’ అన్నారు సూర్యకళ. చదవండి: International Women's Day 2025 : యాక్సలరేట్ యాక్షన్ అంటే? మాటలేనా!చోదకశక్తి మనమే! ఇంటిని నడిపేది మహిళే. ఇంట్లోకి వచ్చే ఏ వస్తువూ ప్రకృతికి హానికలిగించేదిగా ఉండకూడదు.. అనే నియమాన్ని మహిళలు పాటిస్తే చాలు. ప్రకృతిని కాపాడుకోడం కోసం మేము వేదికల మీద మాట్లాడితే ఆ ప్రయత్నం చైతన్యవంతం వరకే పరిమితం. ఆచరణ ఇంటి నుంచే మొదలు కావాలి, అది మహిళతోనే మొదలు కావాలి. అందుకే సమాజహితమైన ఏ పని అయినా మహిళల నుంచి మొదలైతే అది విజయవంతమవుతుంది. మన పిల్లల భవిష్యత్తు కోసం నిధులు, పొలాలు సమకూరుస్తుంటాం. అంతకంటే ముఖ్యమైన పని పిల్లలకు ఆరోగ్యకరమైన భూమిని అందించడం. మహిని రక్షించే మహిమాని్వతమైన శక్తి మహిళకే ఉంది. మహిళలుగా మనం చేయాల్సిన సమాజసేవ, దేశసేవ ఇది. – సూర్యకళ మోటూరి, గ్రీన్ వారియర్, అధ్యక్షురాలు, గ్రామభారతి -
International Women's Day 2025 : యాక్సలరేట్ యాక్షన్ అంటే? మాటలేనా!
అంతర్జాతీయమహిళాదినోత్సవం అంటే మహిళాహక్కుల గురించి చర్చించుకోవడం. వారి హక్కులరక్షణ, మహిళా సాధికారతను సాధించడం ఎలా దానిపై అవగాహన కలిగిఉండటం. ఈ ఏడాది థీమ్ ‘యాక్సలరేట్ యాక్షన్’ అంటే...లింగ సమానత్వానికి సంబంధించిన చర్యల్ని వేగవంతం చేయడం. అంటే మహిళా విద్యా అవకాశాలను మెరుగుపర్చడం, ఉద్యోగ అవకాశాలను మరిన్ని కల్పించడం. సమిష్టిగా, లింగ సమానత్వం కోసం చర్యలను వేగవంతం చేయడం. ప్రపంచ ఆర్థిక వేదిక డేటా ప్రస్తుత పురోగతి రేటు ప్రకారం, పూర్తి లింగ సమానత్వాన్ని చేరుకోవడానికి 2158 వరకు పడుతుంది. అంటే ఇప్పటి నుండి దాదాపు ఐదు తరాలు పడుతుంది దీనికి సంబంధించి అసలు యాక్సలరేట్ యాక్షన్ అనేది ఎలా ఉండాలి అనే అంశంపై పాపులేషన్ ఫస్ట్ డైరెక్టర్ డాక్టర్ ఎ.ఎల్. శారదతో సాక్షి. కామ్ సంభాషించింది. ఆ వివరాలు మీకోసం...యాక్సలరేట్ యాక్షన్ అంటే మహిళలకు విలువైన సేవలను, వనరులను మరింత వేగంగా, నిర్మాణాత్మకంగా అధికంగా అందుబాటులోకి తీసుకు రావడం. సపోర్ట్ ది సపోర్టర్స్ అనే నినాదానికి కనుగుణంగా ఉమ్మడిగా సాగిపోవడం అన్నారామె. అది మాత్రమే కాకుండా, నాణ్యమైన సేవలను అందించడం అనే లక్ష్యంగా ఈ కార్యాచరణ సాగాలి. వారికి మరిన్ని అవకాశాలను కల్పించడం అనేది ప్రధానంగా ఉండాలి. ఇది సామూహికంగా సాగాలి. నామమాత్రపు చర్యలుగా గాకుండా చిత్తశుద్ధిగా సాగాలి. కేవలం మాటలు, వాగ్దానాలకు పరిమితం గాకుండా, చేతలు, చర్యలుగా ఉండాలి.గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు కూడా ఉపయోగపడేలా చర్యల్ని వేగవంతం చేయాలంటే వివిధ సంస్థలు, వ్యక్తులతో కలిసి జమిలిగా పనిచేయాలి. అపుడు మాత్రమే ఆశించిన ఫలితాలు సాధించగలం. కానీ మహిళలకు సేవలను అందుబాటులోకి తీసుకు రావడం అంటే.. మహిళల అభివృద్ధి అంటే ఆడబిడ్డల పెళ్లికి ఎంతో కొంత డబ్బులు ఇవ్వడం, లేదా ఇతర ఉచిత పథకాలు అనుకుంటాయి ప్రభుత్వాలు. కానీ ఇలాంటి పథకాల వల్ల ఆయా పార్టీలకు ఓట్లు వస్తాయోమోగానీ, మహిళలకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. మహిళల నాణ్యమైన విద్య, ఆరోగ్యం, క్రియేటివిటీ, నైపుణ్య శిక్షణ, వనరులను అందుబాటులోకి తీసుకు రావడం లాంటివి జరగాలి. ప్రాక్టికల్‌గా లింగ వివక్షను రూపు మాపేందుకు, అందుకు తగిన మెరుగైన అవకాశాలు కల్పించేందుకు కృషి చేయాలి. సాధికారత సాధించేలా వారికి తోడ్పాటు అందించాలి. వారి జీవన పరిస్థితుల మెరుగుదలకు కావాల్సిన వనరులు కల్పించాలి. దీంతోపాటు వనరుల రక్షణలో మహిళలకు శిక్షణ ఇవ్వాలి. ఉదాహరణకు నీటి వసతి కల్పించాలి అంటే తాతాల్కిక పరిష్కారాలతోపాటు నీటి నిల్వలను ఎలా కాపాడాలి, బావులను తవ్వడం లాంటి అంశాలపై దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి. దీనిపై మహిళలకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలి. సమస్య ఏదైనా పరిష్కారం మూలాల్లోకి వెళ్లాలి. సమాజంలో వివిధ కమ్యూనిటీలు, వ్యక్తులను ఇందులో భాగస్వామ్యులను చేయాలి. బాలికల అక్షరాస్యత శాతం ఎందుకు పడిపోతోంది అనే పరిశోధన జరగాలి. ప్రాంతీయ భాషల్లో అర్థమయ్యేలా విద్యాబోధన జరగాలి. ఇది శాస్త్రీయపరంగా, ఆధునిక బోధనా పద్దతులు ద్వారా జరగాలి. అపుడు మాత్రమే పిల్లలకు చదువుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది.చర్యలు ఏమైనా ప్లాన్ ఓరియెంటెడ్‌గా గాకుండా, పీపుల్ ఓరియెంటెడ్‌గా ఉండాలి. ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధించిన అంశాలపై దృష్టి పెట్టాలి. వాటిపై అవగాహన కల్పించాలి. జంగా చర్యల్ని వేగవంతం చేయడం అంటే పేపర్‌మీద లెక్కలుగా గాకుండా ఫలితాలు, వాస్తవంగా ప్రయోజనకరంగా ఉండాలి. అపుడు మాత్రమే ఈ థీమ్‌కు సాఫల్యత చేకూరుతుంది. ఆ దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలి. మహిళా హక్కుల కోసం పనిచేస్తున్న వ్యక్తులు, సంస్థలు,నెట్‌వర్క్‌తో గ్రూపులతో చర్చించి చర్యలు తీసుకోవాలి అన్నారు. పాపులేషన్ ఫస్ట్ ఆధ్వర్యంలో తాము ఇలాంటి సేవలనే అందిస్తున్నామని, అనేక మంది సంస్థలు, వ్యక్తులతో జమిలిగా పనిచేసి, ఫలితాలు సాధిస్తున్నామని శారద చెప్పారు. అలాగే లింగ వివక్ష నిర్మూలన సమాన అవకాశాల్లో ఎంత సాధించాం అనేది ఒక్కసారి ఆలోచించుకుంటే.. చాలామార్పును సాధించాం అనడంలో ఎలాంటి సందేహం లేదు. పురుషాధిక్య భావజాలం, ఆధిపత్యం ఇంకా కొనసాగుతున్నప్పటికీ, జరుగుతున్న అన్యాయాలపై, హక్కులపై అవగాహన పెరిగింది. ఎందుకిలా అని ప్రశ్నించే తత్వం, పోరాట స్ఫూర్తి పెరిగింది. నిజం చెప్పాలంటే మహిళలు చాలా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా చాలా ముందుకు పోతున్నారు. కానీ గుణాత్మకమైన మార్పు సాధించాలంటే ఇది సరిపోదు. 90 శాతం మహిళలు ఇంకా వెనుకబడే ఉన్నారన్నారు. వీరి పురోగతి రేటును వేగవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలను, చిత్తశుద్ధిగా, నిబద్ధతతో మరింత వేగవంతం చేయాల్సింది ఉందన్నారు శారద. పాపులేషన్ ఫస్ట్పాపులేషన్ ఫస్ట్ అనేది మహిళా సాధికారత, లింగ సమానత్వం ,సమాజ సమీకరణ కోసం అంకిత భావంతో పనిచేస్తున్న సంస్థ. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుండి సోషియాలజీలో డాక్టరేట్ చేసిన డా. శారద పాపులేషన్ ఫస్ట్ ఫౌండర్ డైరెక్టర్‌గా ఉన్నారు. శారద నేతృత్వంలోని పాపులేషన్ ఫస్ట్ జెండర్ సెన్సిటైజేషన్‌ను గుర్తించి, దాని కోసం పనిచేసే అనేకమంది (ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా) జర్నలిస్టులకు ‘లాడ్లీ’ మీడియా పేరుతో అవార్డులు అందించి ప్రోత్సహిస్తుంది. ఇంకా అవగాహనా వర్క్‌షాప్‌లు నిర్వహిస్తుంది. ఫెలోషిప్‌లు అందిస్తుంది. డా.శారద సెంట్రల్ బోర్డ్ ఫర్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సభ్యురాలిగా కూడా ఉన్నారు. గత మూడు దశాబ్దాలుగా బాలికా విద్యా , మహిళా హక్కులు, సమానత్వం కోసం కృషి చేస్తున్నారు. మహిళామూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు -
తండ్రి బాటలో జగన్.. మహిళలే మహారాణులు
-
SLBC Tragedy : ప్రజల దశాబ్దాల ఆకాంక్ష ఎస్ఎల్బీసీ కథ ఇదీ!
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు తాగు – సాగునీరు అందించే లక్ష్యంతో నిర్మిస్తున్న ‘శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్’ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ పనుల్లో జరిగిన ప్రమాదం అందరికీ బాధ కలిగిస్తోంది. చివరికి సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోవడం తీరని విషాదాన్ని మిగిల్చింది. భద్రతా చర్యల్లో డొల్లతనానికి అద్దం పట్టింది.నల్లగొండ జిల్లా కరువు పీడిత ప్రాంతాలలో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు, 516 ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు తాగునీరు అందించాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు కోసం రోజుకు అరటీఎంసీ చొప్పున 60 రోజుల పాటు 30 టీఎంసీలు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 43.93 కిలో మీటర్ల సొరంగం తవ్వి గ్రావిటీ ద్వారా అందించాల్సి ఉంది. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పూర్తి చేసే లోపు, నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి పుట్టంగండి, అక్కంపెల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లతో నీళ్లు అందించేందుకు ‘ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్’ ప్రారంభించారు. కరెంట్ మోటార్లతో నీళ్లు ఎత్తి పోయడం వల్ల ఇది జిల్లా ప్రజల అవసరాలను పూర్తిగా తీర్చలేదు. విద్యుత్ వినియోగం వల్ల అధిక వ్యయం అవుతుంది.అందువల్ల జిల్లా ప్రజల తాగు–సాగునీటి అవసరాలు తీర్చేందుకు ఎస్ఎల్బీసీ పూర్తి చేయడమే సరైన పరిష్కారం. ఈ ప్రాజెక్టును శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ మీదుగా అర కిలోమీటర్ లోతున సొరంగ తవ్వకం జరుగుతోంది. ఇది పూర్తి అయితేనే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ ప్రభావితప్రాంతాల్లో తాగునీరు; సూర్యాపేట భువనగిరి ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు అవకాశం ఉంటుంది. దీని కోసం గత రెండున్నర దశాబ్దాల నుంచి వామపక్ష పార్టీలు, ఇతర ప్రజా సంఘాలు ఉద్యమాలు చేశాయి. వామపక్ష పార్టీలు శాసనసభ లోపల, వెలుపల ఈ ప్రాజెక్టు నిర్మాణం గురించి ఆందోళనలు చేశాయి. ఈ నేపథ్యంలోనే ఉమ్మడిఆంధ్రప్రదేశ్ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది. ఈ క్రమంలో నాటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో 2005 ఆగస్టు 11న పరిపాలనా అనుమతులు పొంది, అదే నెల 28న ‘జేపీ అసోసియేట్స్’ సంస్థతో ఎస్ఎల్బీసీ ఒప్పందం చేసుకుంది. మొదటి అంచనా మేరకు రూ. 2,813 కోట్ల ఖర్చు. అయితే 2017 నాటికి 3,152 కోట్ల రూపా యలకు పెంచారు. ఇప్పుడు అది 4,636.75 కోట్ల రూపాయలకు పెరిగింది. ఈ ప్రాజెక్టు శ్రీశైలం రిజ ర్వాయర్ బ్యాక్ వాటర్స్ నుంచి ‘దోమల పెంట’ వద్ద ఇన్లెట్తో మొదలై... నాగర్ కర్నూలు జిల్లా ‘మన్నె వారి పల్లె’ వద్ద అవుట్లెట్తో... మొత్తం 49.93 కిలో మీటర్ల ప్రధాన సొరంగం ముగుస్తుంది. ఇప్పటి వరకు 34.71 కిలోమీటర్ల సొరంగం తవ్వకం పూర్త యింది. 7.13 కిలోమీటర్ల పొడవైన రెండవసొరంగం తవ్వకం బ్లాస్టింగ్ పద్ధతిలో మొత్తం పూర్తి చేశారు. అయితే ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ ప్రాజెక్టు పనులు 2010 నాటికి పూర్తి కావాల్సి ఉంది. కానీ గత పాలకులు ముఖ్యంగా పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఈ ప్రాజెక్టుకు ఇప్పటివరకు జరి గిన పనుల విలువ రూ. 2,689.47 కోట్లు. రెండు దశాబ్దాల్లో 34.37 కిలోమీటర్ల సొరంగం తవ్వారు. 9.56 కిలోమీటర్ల సొరంగం తవ్వకం పనులు ఆగి పోయాయి. నాలుగైదు సంవత్సరాలలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టు 20 ఏళ్లుగా కొనసాగడం వల్ల వ్యయ భారా నికీ, తాజా పరిణామాలకూ పాలకుల అలసత్వమే కారణం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక దాన్ని పూర్తి చేయడానికి కొంత బడ్జెట్ కేటాయించి తిరిగి పనులకు శ్రీకారం చుట్టారు. సొరంగం లోపల పైకప్పు నుంచి నీరు, మట్టి పడుతున్నదనీ, పనులు చేయడంలో ఇబ్బంది కలుగుతున్నదనీ కార్మికులు సంబంధిత కాంట్రాక్ట్ కంపెనీకి చెప్పినా, ఏమీ కాదని పని చేయాలని ఒత్తిడి చేయడంతో ఈ ప్రమాదం సంభవించింది. భద్రతా ప్రమా ణాలు, ప్రభుత్వ అజమాయిషీ సరిగా లేక సాగునీటి ప్రాజె క్టుల్లో, పరిశ్రమల్లో తరచుగా ఇలాంటి ప్రమాదాలతో నష్టం జరుగుతోంది. ఆయా సంఘటనలకు ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంది.టన్నెల్లో చిక్కుకుపోయిన 8 మంది కార్మికులను రక్షించడానికి, టన్నెల్లో బురద నీరు, వ్యర్ధాలను తొలగించడానికి వివిధ విభాగాల ప్రభుత్వ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నప్పటికీ ఎలాంటి పురోగతీ కనిపించలేదు. ఈ ప్రమాదంపై ‘నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథార్టీ (ఎన్డీఎస్ఏ) వారి నుంచి స్పందన రాలేదు. ఈ ప్రమాదం జరిగిన దోమల పెంట ప్రాంతాన్ని సీపీఎం బృందం ఫిబ్రవరి 23న సందర్శించింది. అక్కడ సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న రాష్ట్ర మంత్రులు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులతో సహాయక చర్యల విషయం చర్చించింది. చివరికి ఆశలన్నీ గల్లంతై కార్మికుల ప్రాణలు గాల్లో కలిసిపోయాయి. భద్రతాపరంగా తగిన సాంకేతిక చర్యలు తీసుకొని ఇప్పటిౖకైనా పనుల్లో అలసత్వం లేకుండా త్వరిత గతిని పూర్తి చేయాలి. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చాలి.-జూలకంటి రంగారెడ్డి వ్యాసకర్త రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు,సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ -
కొండరాళ్లలో దొరికిన అమ్మ...కొండంత అమ్మ!
కొలిచిన భక్తులకు కొంగుబంగారంగా శ్రీ కొండలమ్మ తల్లి భక్తుల నమ్మకాన్ని చూరగొంటున్నారు. తల్లి చెంతకు వచ్చి తమ కోర్కెలు కోరినంతనే ఆ కోర్కెలను తీర్చే కల్పతరువుగా ప్రసిద్ధి గాంచారు ఈ అమ్మవారు. కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం కొండలమ్మ ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతి గాంచారు. కొండరాళ్లలో దొరకటం వలన ఆ తల్లిని కొండలమ్మ అనే పేరుతో భక్తులు పిలుస్తున్నారు.వ్యాపారం, ఉద్యోగం, సంతానం, వివాహం, రాజకీయ పదవులు, పారిశ్రామికం, సినిమా అవకాశాలు ఒకటేమిటి? ఏ రంగానికి చెందిన వారైనా భక్తితో నమ్మి అమ్మ వద్ద తలచుకుంటే చాలు వారికి వరాల జల్లు కురిపిస్తుంది కొండలమ్మ తల్లి. బిడ్డ పుట్టినా, పెళ్లి జరిగినా పిల్లాపాపలు, నూతన వధూవరులు తమ కోర్కెలు తీరాక తల్లి సన్నిధిలోనే తమతమ మొక్కుబడులను చెల్లించుకోవటం పరిపాటిగా వస్తోంది. భక్తితో కొలవటంతో తృప్తి చెందక తమ ఇంటిలో ఆ తల్లి పేరును అనుకున్నదే తడవుగా స్తుతించాలనే దృక్పథంతో కొండలమ్మను ఆ భక్తులు తలచుకుంటున్నారు. ఆ ఊరిలోనే కాదు చుట్టుపక్కల జిల్లాల్లో కూడా కొండా, కొండలమ్మ, కొండయ్య, కొండబాబు వంటి పేర్లతో ఆ దేవత పేరును తమ కడుపున పుట్టిన బిడ్డలకు పెట్టుకుంటున్నారు. ఆ తల్లి చల్లని సన్నిధిలో వివాహాలు, అన్నప్రాశన, ఊయలలో వేయటం వంటి శుభ కార్యక్రమాలను భక్తులు జరుపుకుని దీవెనలను ΄పొందుతున్నారు మహిమలతో తల్లి కీర్తి చాలా తక్కువ కాలంలోనే దశదిశలకు వ్యాపించింది. అమ్మవారి ఆలయానికి ప్రతి ఆదివారం కృష్ణాజిల్లా నుంచే గాక ఇరు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి మొక్కుబడులు చెల్లిస్తున్నారు. ఆది, గురువారాల్లో 25వేల మంది భక్తులు తల్లిని దర్శించుకుంటున్నారు. అమ్మవారు కొలువైన ప్రాంతం మచిలీపట్నం–నూజివీడు–కత్తిపాడు ప్రధాన రహదారి కావటంతో ఎవరు రోడ్డు వెంబడి వెళ్లినా ఆమె దర్శనం కొరకు నిలుస్తున్నారు. వాహనాల్లోనే గాక నడిచి వెళ్లినా రాకపోకల్లో అమ్మవారిని దర్శించుకోవాల్సిందే. కొండరాళ్లలో దొరికిన అమ్మఈ దేవాలయానికి దాదాపు దశాబ్దాల చరిత్ర ఉంది. వేమవరంలో రహదారి పక్కనే దివాన్ సాహెబ్ కోడ్డు మురుగు కాలువకు రివిట్మెంట్ కడుతున్నారు. ఆ గోడను కొండరాళ్లతో నిర్మిస్తుండగా వాటిలో ఒకరాయి అమ్మవారిని పోలినట్లుగా పనివారికి కనబడింది. ఆ రాయిని నిర్మాణంలో కలపకుండా పక్కన పెట్టారు. కొద్ది రోజులకు ఆ రాయిని రోడ్డు పక్కన నిలబెట్టి... పసుపు, కుంకుమలు చల్లి భక్తులు పూజలు చేసేవారు. అక్కడికి బాతులు పెంచుకునేవారు వచ్చారు. ఆ రాయి పక్కనే కుటీరం ఏర్పాటు చేసుకున్నారు. అమ్మవారి విగ్రహం పక్కనే ఉండటం వలన ఆ బాతులు విపరీతంగా గుడ్లు పెట్టేవని పెంపకం దారులకు నమ్మకం ఏర్పడింది. ఆ బాతుల యజమానికి విపరీతమైన లాభాలు వచ్చాయి. సీజన్ పూర్తి కావటంతో ఆ బాతుల యజమాని గుంటూరు వలస వెళ్లుటకు నిర్ణయించుకున్నాడు. బాతుల్ని లారీలో వేసుకునేటపుడు వాటితోపాటు అమ్మవారిని కూడా తీసుకెళ్లారు. గుంటూరు వెళ్లగానే అక్కడ బాతుల్ని దించారు. వాటితోపాటు అమ్మవారిని దించగా వెంటనే బాతులు మొత్తం హఠాత్తుగా మృత్యువాతపడ్డాయి. వెంటనే అతను మరలా అమ్మవారిని ఈ ప్రాంతానికి తీసుకొచ్చేశాడు. ప్రస్తుతం అమ్మవారు పూజలందుకుంటున్న స్థానంలోనే నిలి΄పాడు. ఈ నిదర్శనం చుట్టుపక్కల ప్రాంతాల్లో అనతికాలంలో మౌఖికంగా ప్రచారం జరిగింది. అప్పటి నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు విరివిగా వచ్చి పాల పొగగళ్లు సమర్పించి మొక్కుబడులు తీర్చుకుంటున్నారు.శోభాయమానంగా నవరాత్రులు...తల్లి సన్నిధిలో ఏటా దసరా నవరాత్రి మహోత్సవాలు శోభాయమానంగా జరుçగుతాయి. దుర్గాష్టమి రోజున కనకడప్పుల వాద్యాలు, బాణాసంచా, చిత్ర విచిత్ర వేషధారణలతో చుట్టుపక్కలున్న గ్రామాల్లో అమ్మవారి భారీ ఊరేగింపు సాగుతుంది. ఆ రోజు 20 వేల మంది భక్తులకు అన్నసమారాధన ఉంటుంది. నవరాత్రుల్లో భక్తుల ఉల్లాసం కొరకు సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనలు ఉంటాయి. తొలుత కొండలమ్మ మూలవిరాట్‌ను దర్శించుకునే ఆలయం చిన్నదిగా ఉండేది. ఆ తర్వాత భారీ ఆలయాన్ని దేవాదాయ శాఖ వారు నిర్మించి అభివృద్ధి చేయటం జరిగింది. అనివేటి మండపాన్ని నిర్మించారు. ఈ మండపంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆ విగ్రహానికే దసరా ఉత్సవాలకు దేవతా స్వరూపాలను అలంకరిస్తున్నాం. ఈ తల్లి మూలవిరాట్ నేల మీదనే తల వరకే దర్శనమిస్తుంది. మనసులో మాట అనుకున్నంతనే అవి తీరుస్తున్న అమ్మవారికి భక్తుల నుంచి తాకిడి నానాటికీ పెరిగి΄ోతుంది. సినీ నటులు, నిర్మాతలు, దర్శకులు, రాజకీయ నేతలు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపార వేత్తలు, రైతులు ఒక్క రంగమే కాదు అన్ని రంగాలకు చెందిన భక్తులు ఏం కోరుకుంటే అది తీరుస్తూ వారి నుంచి పూజలందుకుంటున్నారు అమ్మవారు. మొక్కుబడులు తీర్చుకునే భక్తులు కొండలమ్మకు పాల పొంగళ్లను సమర్పిస్తారు. – అయికా రాంబాబుసాక్షి, గుడ్లవల్లేరు, కృష్ణాజిల్లా -
Shivaratri2025 పుణ్యప్రదం.. జ్యోతిర్లింగ దర్శనం
మహాశివరాత్రి పర్వదినంకోసం ముంబైతోపాటు రాష్ట్రంలోని శివాలయాలన్నీ ముస్తాబ వుతున్నాయి. మహాశివరాత్రికి రాష్ట్రంలోని జ్యోతిర్లింగ క్షేత్రాలు, ఇతర ఆలయాలకు భక్తులు పోటెత్తుతారు. ఈ నేపథ్యంలో ఆలయ కమిటీలు ప్రత్యేక క్యూలైన్లు, మండపాలను ఏర్పాటు చేస్తున్నాయి. దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో అయిదు మహారాష్ట్రలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఔండా నాగనాథ్, భీమాశంకర్, ఘృశ్నేశ్వర్, పర్లి వైద్యనాథ్, త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగాల గురించి కొన్ని విశేషాలు.... త్రయంబకేశ్వర్.. జ్యోతిర్లింగ క్షేత్రాలలో త్రయంబకేశ్వర్ క్షేత్రానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ క్షేత్రం నాసిక్ జిల్లాలో ఉన్న ఈ ఆలయాన్ని నల్లరాతితో అద్భుత శిల్ప నైపుణ్యంతో నిరి్మంచారు. ఇక్కడ జ్యోతిర్లింగం బ్రహ్మ, విష్ణు, మహేశ్వర..ఇలా ముగ్గురి ముఖా లున్న స్వర్ణకవచంతో త్రిముఖ లింగంగా వెలుగొందుతోంది. పాండవుల కాలం నుంచి శివలింగాన్ని ఈ విధంగా అలంకరిస్తున్నట్లు స్థానికుల కథనం. ఈ ఆలయంలో మహా శివరాత్రితోపాటు శ్రావణ మాసంలోనూ విశేష పూజలను నిర్వహిస్తారు. పర్లీ వైద్యనాథ్..బీడ్ జిల్లాలో ఉన్న పర్లీ వైధ్యనా««థ్ దేవాలయ నిర్మాణ కాలం ఇతమిద్ధంగా తెలియదు. అయితే క్రీ.శ.1706 లో రాణి అహల్యాదేవి హోల్కర్ దీన్ని పునఃనిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఈ క్షేత్రం చుట్టుపక్కలంతా కొండలు, చెట్లు, ఔషధ మొక్కలతో అలరారు తుంటుంది. ఈ కారణంగా పర్లీ జ్యోతిర్లింగ క్షేత్రానికి వైద్యనాథ్ అనే పేరు వచ్చిందని భక్తుల కథనం. ఔండా నాగనాథ్ ..ఈ క్షేత్రం రాష్ట్రంలోని హింగోళి జిల్లాలో ఉంది. ఔండా నాగనాథ్ క్షేత్రాన్ని గూర్చి ఓ పురాణ కథ ప్రచారంలో ఉంది. సంత్ జ్ఞానేశ్వర్, విసోబా కేచర, వార్కరీలు (భక్తుల సముదాయం) నాగనాథ్ ఆలయంలో భజనలు చేస్తుండగా పూజకు అంతరాయం కలుగుతోందని దూరంగా వెళ్లండని పూజారి బయటకువచ్చి చెప్పాడు. దీంతో వారు గుడి వెనకకు వెళ్లి తమ భజనలను కొనసాగించారట. వారి భజనలకు ముగ్దుడైన శివుడు వెనకవైపుకు తిరిగి వారి భక్తిగానాన్ని ఆలకించాడట. ఇందువల్లే ఈ ఆలయంలో నందీశుడు మందిరం వెనుక భాగంలో దర్శనమిస్తున్నాడని భక్తులు విశ్వసిస్తారు. భీమశంకర్..పుణేకు 128 కిమీ దూరంలో భీమశంకర్ క్షేత్రం ఉంది. భీమా నదీ తీరంలో ఉన్నందువల్లే ఈ క్షేత్రానికి భీమశంకర్ అనే పేరువచ్చిందని స్థానికులు నమ్ముతారు. భీమశంకర్ దేవాలయాన్ని పదమూడో శతాబ్దంలో నిరి్మంచారని, దేవాలయానికి ముందు భాగంలో ఉన్న మండపాన్ని నానా పద్‌నివాస్ 18 శతాబ్దంలో నిర్మించారని చారిత్రిక ఆధారాలను బట్టి తెలుస్తోంది. భీమశంకర్ దేవాలయాన్ని నాగరా పద్ధతిలో నిర్మించారు. ఘృష్ణేశ్వర్ఔరంగాబాద్ సమీపంలో ఉన్న ఈ ఘృష్ణేశ్వర్ క్షేత్రాన్ని ఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్ నిర్మించినట్టు చారిత్రక ఆ«ధారాలు వెల్లడిస్తున్నాయి. ఈ క్షేత్రాన్ని ఘృష్ణేశ్వర్ క్షేత్రమని కూడా పిలుస్తారు. కుసుమ అనే మహిళ తన కొడుకు ప్రాణాలను రక్షించమని వేడుకుంటూ శివలింగాన్ని చేతులో పట్టుకొని కోనేరులో మునిగి శంకరుడిని గూర్చి ఘోర తపస్సు చేసింది. దీంతో ఆది దేవుడు ప్రత్యక్షమై ఆమెకు పుత్ర భిక్ష పెట్టాడు. ఈ కారణంగానే ఈ క్షేత్రానికి ఘృష్ణేశ్వర క్షేత్రంగా పేరు వచ్చిందదని పురాణ కథనం. మహాశివరాత్రి- ద్వాదశ జ్యోతిర్లింగాలురామనాథస్వామి లింగం, రామేశ్వరంశ్రీశైల క్షేత్రం (మల్లి కార్జున లింగం), శ్రీశైలంభీమశంకర లింగం, భీమా శంకరంఘృష్ణేశ్వర జ్వోతిర్లింగం, ఎల్లోరా గుహలుత్రయంబకేశ్వర లింగం, త్రయంబకేశ్వరాలయం (త్రయంబకేశ్వర్, నాసిక్)సోమనాథ లింగం, సోమనాథ్నాగేశ్వర లింగం, దారుకావనం (ద్వారక)ఓంకారేశ్వర-అమలేశ్వర లింగాలు, ఓంకారక్షేత్రంవైద్యనాథ్ జ్యోతిర్లింగం, డియోఘర్ (జార్ఖండ్)కేదారేశ్వర లింగం, హిమాలయాలపై సముద్రమట్టానికి 11,760 అడుగుల ఎత్తులో ఉందివిశ్వేశ్వర లింగం - వారణాశికేదారేశ్వర్: కేదార్నాథ్ -
Ukraine War ఈ యుద్ధంలో అంతిమ విజయం అమెరికాదే?
గత మూడు సంవత్సరాలుగా జరుగుతున్న ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్ని ఆపే ప్రయత్నంలో అమెరికా ఆధ్యక్షుడు ట్రంప్ 90 నిమిషాలపాటు పుతిన్‌తో టెలీ ఫోనులో సంభాషించిన తర్వాత శాంతి చర్చల ప్రారంభానికి సౌదీ అరేబియా రాజధాని రియాద్‌ను ఎన్నుకొన్నారు. అమెరికా విదేశాంగమంత్రి మార్కో రూబియో రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్ నాయకత్వంలో ఫిబ్రవరి 18 తేదీన మంతనాలు జరిపి తొందరలోనే ఉక్రెయిన్ వివాదాన్ని పరిష్కరించాలనుకొన్నారు. ట్రంప్ మాత్రం ఈ సంప్రదింపులలో పాల్గొనవలసిందిగా అటు ఉక్రె యిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని గానీ, ఇటు యూరప్ దేశా లను కానీ ఆహ్వానించక పోవటంతో పారిస్‌లో పోటీగా శాంతిచర్చలకు యూరప్‌లోని ప్రధాన దేశాధినేతలు సమావేశమవ్వటంతో ఒక్కసారిగా నాటో దేశాల మధ్య ఆధిక్యత బయటపడింది. యుద్ధాన్ని ఆపితే ప్రతిఫలంగా కొన్ని తాయిలా లను ట్రంప్ రష్యాకు ఇస్తానన్నారని అనధికార వార్తలు వస్తున్నాయి. వీటిల్లో ముఖ్యమైనవి ఉక్రెయిన్‌కు భవి ష్యత్తులో నాటో సభ్యత్వం ఇవ్వరు. అలాగే ఇప్పటి వరకూ యుద్ధంలో రష్యా స్వాధీనం చేసుకున్న ఉక్రె యిన్ ప్రాంతం, లోగడ తీసుకొన్న క్రిమియా భాగం రష్యా ఆధీనం కిందకు వస్తుంది. అమెరికా, ఉక్రెయిన్లు ఈ ప్రాంతాల్ని దౌత్యపరంగా గుర్తించాలి. రష్యా ఆధీనంలో ఉన్న భూభాగంలోని 50,000 కోట్ల డాలర్ల విలువ చేసే లిథియం, టైటానియం నిక్షేపాలను అమె రికా పొందుతుంది. పశ్చిమాసియాలో రష్యా అమెరి కాలు ఒకరికొకరు మద్దతునిచ్చుకొని అవసరమైతే చైనా వ్యతిరేక కూటమి ఏర్పాటుకు సన్నాహాలు చేయవచ్చు. పాలస్తీనియన్లను గాజా నుండి పారదోలటంలోనూ, ఇరాన్‌పై యుద్ధం చేస్తే రష్యా మద్దతును పొందడానికే ట్రంప్ ప్రయత్నం చేయవచ్చు.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ ప్రతిపాదనలను తోసిపుచ్చి, ఉక్రెయిన్, అమెరికా వలసవాద దేశం కాజాలదన్నాడు. ట్రంప్ విధానాలు యూరప్‌పై దాడిగా ప్రముఖ యూరప్ పత్రికలు రాశాయి. ఈ విధానాలు ‘ట్రాన్స్ అట్లాంటిక్ కూటమి’ పతనానికి దారి తీస్తుందని వ్యాఖ్యానించాయి. యూరప్ భద్రతా సవాళ్లను చర్చించి మిలిటరీ పరంగా యూర ప్ దేశాలు తమ జీడీపీ నుండి 3 నుండి 5 శాతం వరకూ ఖర్చు చేయాల్సి వస్తుందని దేశాధినేతలు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే యూరపు ఆర్థికవ్యవస్థలు ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో తిరోగమన దిశలో పయనిస్తున్నాయి. ఇంకా మిలిటరీ ఖర్చు పెరిగితే ప్రజలపై అదనపు భారం పడే ప్రమాదముంది.ఉక్రెయిన్ ఆన్లైన్ పత్రిక ‘స్టార్నా’ ట్రంప్, పుతిన్‌ల శాంతి ఒప్పందాలను లీక్ చేసింది. దీన్ని అనుసరించి ఏప్రిల్ 20 నాటికి పరిపూర్ణ కాల్పుల విరమణ జరగా లని, ఉక్రెయిన్ ఆక్రమించిన రష్యా భూభాగం కుర్ స్క్‌ను తిరిగి రష్యాకు ఇవ్వాలని, తొందరలోనే పుతిన్, ట్రంప్‌లు మాస్కోలో, వాషింగ్టన్లో కల్సుకొంటారని, జెలెన్స్కీ, పుతిన్‌లు సౌదీ అరేబియాలో కలుసుకోవ చ్చని అభిప్రాయపడింది. అధికారికంగా ఈ షరతులన్నీ మే 9 నుండి అమలులోకి రావచ్చని తెలిపింది. అయితే ఇవేవీ జరుగలేదు. నిన్న శనివారం కూడా యుద్ధం కొనసాగింది. రష్యా కొత్తగా ఉక్రెయిన్ గ్రామాన్ని ఒక దాన్ని ఆక్రమించుకుంది.ఇదీ చదవండి: చందాకొచ్చర్ న్యూ జర్నీ: కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిచైనాను ఎదుర్కొనే వ్యూహంతాను అమెరికా అధ్యక్షునిగా ఉండి ఉంటే అప్పట్లో యుద్ధాన్ని జరిపించే వాడిని కాదని ట్రంప్ ఇప్పటికే అనేకసార్లు చెప్పారు. 3 సంవత్సరాల యుద్ధంతో ఉక్రె యిన్ తీవ్ర నష్టాల పాలయ్యింది. సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందిన ఈ యూ దేశాల ఆర్థిక వ్యవస్థలు మాంద్యంలో కూరుకోవటం, తిరుగులేని అణుశక్తిగా, మిలిటరీశక్తిగా ఇప్పటికే రష్యా ఉండి, అపారమైన ఖనిజ సంపద కల్గి ఉండటంతో ట్రంప్ రష్యాపై మొగ్గు చూపు తున్నారు. భౌగోళికంగా వ్యూహాత్మకంగా రష్యా సహా యంతో చైనాను చుట్టు ముట్టటం తేలిక అనుకోవటం ట్రంప్ ఆలోచన కూడా కావచ్చు. ఉక్రెయిన్‌కు ఆర్థిక సహాయాన్ని అందించటం కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారం కావటం మరొక కారణం కాగా, అమెరికా మార్కెట్లకు రష్యా కొత్తద్వారాలను తెరుస్తుందని ఆశ పడటం మరొక కారణం కావచ్చు. అసలు యుద్ధం ప్రారంభించటానికి ప్రధాన కారణం రష్యాను ముక్కలుగా చేసి, దాని అపార ఖనిజసంపదను దోచుకోవటానికే ననేది జగమెరిగిన సత్యం. శాంతి చర్చలతో రష్యా అధ్యక్షుడు పుతిన్ విజేతగా నిలువనున్నాడు. అమెరికా ఉక్రెయిన్‌కు మద్డతు పలికి ఓటమిపాలవుతూ ఇప్పుడు ట్రంప్ రూపంలో శాంతి ఒడంబడిక ద్వారా నెగ్గే ప్రయత్నం చేస్తోంది. రష్యాకి సంబంధించిన 30వేల కోట్ల డాలర్లను అమెరికా బ్యాంకుల్లో స్తంభింపజేసి, ఉక్రెయిన్‌లో ఖనిజ సంపదపై కన్నేసిన అమెరికా పెట్టుబడిదారీ వ్యవస్థ నైజాన్ని ప్రపంచానికి తెలిపింది. తాజా వార్తలు అందే సమయానికి ట్రంప్ తన సహజధోరణిలో మాట మార్చి ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు దిగిందని ప్రకటించారు. యుద్ధ పరిసమాప్తి గురించి వాషింగ్టన్...రష్యాతో చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ తమతో ఖనిజ ఒప్పందాలను కుదుర్చుకుంటుందని ప్రకటించారు. మొత్తానికి ఈ యుద్ధం వల్ల అమెరికా ప్రయోజనాలు నెరవేరబోతున్నాయన్నమాట!నేటితో రష్యా – ఉక్రెయిన్ యుద్ధానికి మూడేళ్లు2025 ఫిబ్రవరి 24 నాటికి రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై మూడేళ్లవుతోంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌లో చోటు చేసుకున్న భయంకర యుద్ధం ఇదే. ఉక్రెయిన్‌లో 20 శాతం భూభాగాన్ని రష్యా ఆక్రమించింది. ఈ యుద్ధం వల్ల 2024 నవంబర్ నాటికి ఉక్రెయిన్‌కు సంభవించిన మొత్తం ఆస్తి నష్టం 170 బిలియన్ డాలర్లు అని ‘కేఎస్ఈ ఇనిస్టిట్యూట్’ అంచనా. ఉక్రెయిన్ సైనికులు 80 వేల మంది చనిపోయినట్టు, 4 లక్షల మంది గాయపడినట్టు ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ అంచనా. రష్యా పౌరులు కొద్దిమందే మరణించినా సైనికులను మాత్రం పెద్ద సంఖ్యలోనే కోల్పోయిందని వార్తలు. అందుకే అది కిరాయి సైనికులను రంగంలోకి దించింది. -బుడ్డిగ జమిందార్ వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్, కె.ఎల్. యూనివర్సిటీ ‘ 98494 91969 -
అప్పట్లో ఒకడుండేవాడు!
1993 నుంచి 2009 వరకు: పొడవాటి జుట్టు... ముఖంలో నిర్లక్ష్య ధోరణి... పోలీసులు పక్కనున్నా ధాటిగా మాట్లాడగలిగే తెగింపు... 2009 నుంచి 2012 వరకు: నీట్‌గా కట్ చేసిన హెయిర్... పైకి వినయ విధేయతలు... పోలీసులతో మర్యాద పూర్వక ధోరణి...హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లతో పాటు శివారు జిల్లాల్లోని పోలీసుస్టేషన్లలో 172 చోరీలు చేసిన మహ్మద్ ఖాజా నయీముద్దీన్ అలియాస్ మారుతి నయీం వ్యవహారశైలి ఇది. పోలీసు విభాగంతో పాటు నగర వాసుల్లో అనేకమందికి ‘సుపరిచితుడైన’ ఈ ఘరానాదొంగ కథ 2012 మే 18న ముగిసింది. ఎప్పటికప్పుడు కొత్త అనుచరులను తయారు చేస్తూ, వరుస చోరీలు చేసే మారుతి నయీం చివరకు ఆ చోరీ సొత్తు పంపకాల్లో జరిగిన గొడవల్లో అనుచరుల చేతిలోనే హతమయ్యాడు.యాకుత్‌పురలోని నాగాబౌలి ప్రాంతానికి చెందిన మహ్మద్ ఖాజా నయిముద్దీన్ అలియాస్ మారుతి నయీం అలియాస్ అయూబ్ నేర ప్రస్థానం దాదాపు పంతొమ్మిదేళ్లకు పైగా కొనసాగింది. 1993లో చిల్లర దొంగతనాలతో మొదలుపెట్టిన నయీంపై 2012 వరకు 172 కేసులు నమోదయ్యాయి. రికార్డుల్లోకి ఎక్కనివి ఇంకా అనేకం ఉంటాయని పోలీసులు చెబుతుంటారు. నయీంపై రెయిన్‌బజార్ పోలీసుస్టేషన్లో నోన్ డెకాయిటీ షీట్ ఉండేది. పేరుకు మాత్రం కారు మెకానిక్‌గా చలామణీ అయ్యే ఇతగాడు నానా నేరాలు చేసేవాడు. 2002 అక్టోబర్‌లో జరిగిన బేగంబజార్‌లోని శాంతి ఫైర్ వర్క్స్ ఉదంతం ఇతని నేరజీవితంలో అతి దారుణమైంది. ఆ దుకాణంలో దొంగతనానికి వెళ్లి, ఏమీ దొరకలేదనే అక్కసుతో దుకాణంలోని టపాసులకు నిప్పు పెట్టాడు. ఈ దుకాణం పై అంతస్తులో కార్తికేయ లాడ్జి ఉండేది. ఫైర్ వర్క్స్‌లో మొదలైన మంటలు పైకి విస్తరించాయి. దీంతో లాడ్జిలో నిద్రపోతున్న 13 మంది అమాయకులు సజీవ దహనమయ్యారు. ఉదంతం జరిగిన రోజు ఇది షార్ట్‌సర్క్యూట్ ప్రమాదంగా భావించారు. కొన్నాళ్లకు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అన్ని కేసులున్నా, పోలీసులు మాత్రం అతడికి ఒక్క కేసులోనూ శిక్ష పడేలా చేయలేకపోయారు. పైగా, అతడు సాక్షాత్తు పోలీసుల కస్టడీ నుంచే మూడుసార్లు పరారయ్యాడు.జైలుకు వెళ్లిన ప్రతిసారీ అక్కడి చిల్లర నేరగాళ్లను చేరదీస్తాడు. వారితో జైల్లోనే ఓ కొత్త ముఠా కట్టి బయటకు వస్తుండటం నయీం నైజం. ఆ ముఠాలో ఉండి, బెయిల్ పొంది బయటకు వచ్చే వారితో తనకూ బెయిల్ ఇప్పించేలా ఒప్పందం కుదుర్చుకుంటాడు. విడుదల చేయించాక వాళ్లతో కలిసే దొంగతనాలు చేస్తాడు. స్నాచింగ్స్, చోరీలు, షట్టర్ లిఫ్టింగ్స్ వంటి నేరాలు చేయడంలో దిట్ట అయిన ఖాజా నయీముద్దీన్‌కు మారుతీ కారుతో అనుబంధం ఉంది. మెకానిక్ కావడంతో తేలిగ్గా కారు చోరీలు చేస్తాడు. ఎక్కువగా మారుతీ కారునే ఎంచుకుని, అందులో తిరుగుతూ దాన్ని షట్టర్‌కు అడ్డుపెట్టి, తాళం పగులకొట్టి దర్జాగా లోపలికి ప్రవేశించి, దుకాణాలను లూటీ చేసేవాడు. అందుకే ‘ఖాజా’ స్థానంలో ‘మారుతి’ వచ్చింది. పాత నేరగాళ్లతో పాటు ప్రతిసారీ కొత్తగా మరికొందరిని దొంగలుగా తయారు చేస్తుంటాడు. ఒకసారి తన ముఠాలో వాడిన నేరగాళ్లను మరోసారి వినియోగించేవాడు కాదు. వారి ద్వారా తన ఉనికి బయటపడుతుందనే ఉద్దేశంతో వారిని దూరంగా ఉంచేవాడు. చోరీ సొత్తులో కేవలం కొంత మాత్రమే వారికి పంచి ఇచ్చేవాడు. అలా కొన్నాళ్లకు చోర విద్యలో ఆరితేరే వాళ్లు విడిగా ముఠాలు కట్టుకుని నేరాలు చేసే వాళ్లు. మారుతి నయీం 1993–2012 మధ్య 21 సార్లు అరెస్టయ్యాడు. ఇతడు తొలిసారి, చివరిసారి అరెస్టయింది పాతబస్తీలోనే! తొలిసారిగా 1993లో డబీర్‌పుర పోలీసులు అరెస్టు చేశారు. సీసీఎస్ పోలీసులు 1994, 2000, 2002ల్లో హుమయూన్‌నగర్ పోలీసులు 1996లో, ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు 2001లో, టాస్క్‌ఫోర్స్ పోలీసులు 2005లో, షాహినాయత్‌గంజ్ పోలీసులు 2006 ఏప్రిల్‌లో, తూర్పు–పశ్చిమ మండలాల పోలీసులు సంయుక్తంగా 2006లో అరెస్టు చేశారు. 2011లో ఆయుధచట్టం కింద ఫలక్‌నుమా పోలీసులకు చిక్కాడు. 2009, 2010ల్లో సీసీఎస్, టాస్క్‌ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డాడు. ఆఖరిగా 2012 జనవరి 12న ఫలక్‌నుమా పోలీసులు మహ్మద్ తారిఖ్, మహ్మద్ ముజాహిద్‌లతో కలిసి అరెస్టు అయ్యాడు. అదే ఏడాది మే 18న హతమయ్యాడు. నగరంలోని దాదాపు అన్ని పోలీసుస్టేషన్ల పరి«ధిలోనూ చేతివాటం ప్రదర్శించిన నయీంపై ఒక్క కేసులోనూ నేర నిరూపణ జరగలేదు. నేరాల్లో దిట్ట అయిన నయీం నగరానికి చెందిన ఓ వితంతువును పెళ్లి చేసుకున్నాడు. మారుతి నయీంను పట్టుకోవడం అప్పట్లో పోలీసులకు పెద్ద సవాల్ లాంటిది. అతడిని అరెస్టు చేస్తే, ఏమాత్రం ఇంటరాగేషన్ అవసరం లేకుండానే రూ.లక్షల సొత్తు రికవరీ ఇస్తుండేవాడు. బంగారం, వాహనాలు, వెండి, సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, నగదు ఇలా అనేకం అతడి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకునేవాళ్లు. ఎప్పటికప్పుడు కొత్త అనుచరులను తయారు చేస్తూ, వరుస చోరీలు చేసే మారుతి నయీం చివరకు ఆ చోరీ సొత్తు పంపకాల్లో జరిగిన గొడవల ఫలితంగా అనుచరుల చేతిలోనే హతమయ్యాడు. -
World Day of Social Justice సామాజిక న్యాయం కావాలి!
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ పిలుపు మేరకు 2009 నుంచి ఫిబ్రవరి 20వ తేదీన ‘ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవా’న్ని జరుపుతున్నారు. సమాజాల మధ్య సంఘీభావం, సామరస్యం, సమాన అవకాశాలను ప్రోత్సహించడానికీ; పేదరికం, నిరుద్యోగాన్ని తొలగించవలసిన ప్రాముఖ్యాన్ని గుర్తించడం దీని వెనుక ఉన్న లక్ష్యం. ఈ ఏడాది ఉత్సవం సందర్భంగా... విద్యార్థులకు పేదరికం, ప్రపంచ పౌరసత్వం, మానవ హక్కులు, స్థిరమైన అభివృద్ధి వంటి సామాజిక న్యాయ ఆవశ్యకత గురించి అవగాహన కల్పించాలని నిర్ణయించారు. జాతి, లింగ, వయస్సు, లైంగిక ధోరణి, మతం, జాతీయత, విద్య, మానసిక లేదా శారీరక సామర్థ్యం వంటివాటిలో పక్షపాతం వల్ల ఈ అసమానతలు ఉత్పన్నమవుతాయి. సామాజిక న్యాయం లేక పోవ డానికి గల కారణాలలో వలసవాదం, బానిసత్వం, లేదా అణచివేత ప్రభుత్వాలకు మద్దతు, ఆర్థిక అధికార దుర్వినియోగం, జాత్యహంకారం, ఆర్థిక అసమానత, వర్గ వివక్ష ముఖ్యమైనవి. 2024 నాటికి, సామాజిక న్యాయం అందించడంలో మొదటి ఐదు స్థానాల్లో ఉన్న దేశాలు: స్విట్జర్లాండ్, న్యూజిలాండ్, డెన్మార్క్, లక్సెంబర్గ్, ఐర్లాండ్. మానవ హక్కులు లేకపోవడం, న్యాయం పొందడం కష్టమవ్వడం, అవినీతి రాజ్యమేలడం వంటి అంశాల్లో ముందున్న దేశాలు వెనిజులా, కంబోడియా, అఫ్గానిస్తాన్, హైతీ, మయన్మార్లు.భారతదేశంలో సామాజిక న్యాయాన్ని నెలకొల్పడంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కృషి అపారమైనది. అందుకే ‘భారత సామాజిక న్యాయ పితామహుని’గా అంబేడ్కర్‌ను గౌరవించుకుంటున్నాం. భారతదేశంలో రాజ్యాంగం పీఠిక సామాజిక న్యాయాన్ని సూచిస్తోంది. భారతదేశంలో సామాజిక న్యాయాన్ని నెలకొల్పడంలో మూడు అంశా లను పేర్కొనాలి: ఒకటి – ప్రాథమిక హక్కులు, నిర్దేశక సూత్రాల రూపంలో రాజకీయ సామాజిక–ఆర్థిక హక్కులను కల్పించడం. ఇది సమాన స్వేచ్ఛా సూత్రాన్ని పెంపొందించడానికి ప్రయత్నిస్తుంది,రెండవది–సామాజిక–ఆర్థిక అభివృద్ధి మధ్య, విరుద్ధమైన సామాజిక– ఆర్థిక లక్ష్యాల మధ్య సమాన సంతులనాన్ని సాధించే నమూనాను అవలంబించడం. మూడవది – భారతీయ సమాజంలోని వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక రక్షణలు నిశ్చయాత్మక చర్యలను అందించడం.ఇందుకోసం దేశంలో ఎప్పటికప్పుడు అనేక కార్యక్రమాలు, పథకాలు, చట్టాలు రూపొందించి అమలు చేయడం. – డా. పి.ఎస్. చారి ‘ 83090 82823(ఫిబ్రవరి 20న ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం) -
ఎత్తైన పంచముఖ మహాశివలింగం, కొలువైన శివపరివారం ఎక్కడో తెలుసా?
36 అడుగుల పంచముఖ మహాశివలింగం 12 అడుగుల ఎత్తులో నందీశ్వరుడు, 40 అడుగుల ఎత్తున్న ఓంకార స్థూపం, అర్ధనారీశ్వరుడు, దత్తాత్రేయుడు, హరిహరుడు, శివపరివారం విగ్రహాలు ఇవన్ని ఎక్కడ ఉన్నాయి అనుకుంటున్నారా.. అదేనండీ అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మ కొలువైన విజయవాడ మొగల్రాజ పురంలోని శివగిరిపైన కొలువుదీరి భక్తులతో పూజలందుకుంటున్నాయి. శివపరివారాన్ని సాధారణంగా చిత్రపటాల్లోనే చూస్తు ఉంటాం కాని ఇక్కడ విగ్రహాల రూపంలో శివ పరివారాన్ని దర్శించుకోవచ్చు. అదెక్కడంటే విజయవాడ మొగల్రాజపురంలోని శ్రీవాగ్దేవీ జ్యోతిర్లింగ క్షేత్రం (శివగిరి)పై 36 అడుగుల ఎత్తు ఉన్న పంచముఖ మహాశివలింగం, శివలింగానికి ఎదురుగా 12 అడుగుల ఎత్తులో నందీశ్వరుల విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. 40 అడుగుల ఎత్తు్తన్న ఓంకార స్థూపం విజయవాడ నగరం మొత్తం ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. ఇవే కాకుండా 36 అడుగుల పంచముఖ శివలింగం చుట్టూ దాద్వశ జ్యోతిర్లింగాలను శైవాగమం ప్రకారం ప్రతిష్టించారు. శివగిరిపైన శివపార్వతులు, కుమారస్వామి, విఘ్నేశ్వరుడు, వీరభద్రుడు, అయ్యప్ప, నంది, శృంగి, భృంగి, అర్ధనారీశ్వరుడు, నందీశ్వరుడు, దత్తాత్రేయుడు, హరిహరుడు, కనకదుర్గ, గజలక్ష్మి, సరస్వతి అమ్మవార్ల విగ్రహాలు కూడా కొలువుతీరాయి. గోశాలతోపాటుగా హోమగుండం కూడా ఉన్నాయి. శ్రీ చక్ర ఆకారంలో అష్టాదశ శక్తిపీఠాలను కూడా శివగిరిపై ప్రతిష్టించారు. (ప్రదోష కాలం అంటే ఏంటి, ప్రదోష పూజ ఎలా చేయాలి?) ఏడు అడుగుల నాగ పడగ, నాగదేవత విగ్రహాలు కూడా ఇక్కడ భక్తులతో పూజులు అందుకుంటున్నాయి. ప్రతి ఏడాది మహా శివరాత్రి రోజున చితాభస్మంతో శివలింగానికి అభిషేకం, కపాల హారతి నిర్వహిస్తుంటారు. ఉజ్జయిని నుంచి నాగసాధువులు, అఘోరాలు వివిధ అఖండాల (అఘోరాలు ఉండే అశ్రమాలు) నుంచి శివగిరిపై పూజలు నిర్వహిస్తారు. శివగిరి కొండపైన మరో వైపున 27 అడుగుల ఎత్తులో అభయ ఆంజనేయస్వామి విగ్రహం ఉంది. కొండ దిగువ నుంచి ఈ విగ్రహాన్ని చూసినప్పుడు కొండపై నుంచి ఆంజనేయస్వామి భక్తులకు అభయాన్ని అందిస్తున్నట్లుగా ఉంటుంది. పూజ చేస్తున్న ముస్లిం మహిళఎలా వెళ్ళాలంటే...ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మొగల్రాజపురంలోని సిద్ధార్థ కళాశాల దగ్గర ఉన్న సున్నపుబట్టీల సెంటర్ నుంచి శివగిరిపైకి చేరుకోడానికి మెట్ల మార్గం ఉంది. శివగిరిపైనే పూజలకు అవసరమైన పూజాద్రవ్యాలతో పాటుగా తాగునీటి సౌకర్యం కూడా కల్పించారు. కార్తికమాసం అన్ని రోజులు శివగిరిపై ప్రత్యేక పూజలతో పాటుగా ప్రతిరోజూ అన్నదానం నిర్వహిస్తారు. శివరాత్రి రోజున హిమాలయ నాగసాధువులచే చితాభస్మాభిషేకం, శివకళ్యాణంతోపాటుగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. శివరాత్రి నాటితో పాటుగా కార్తికమాసంలో స్వామి వారి ఉత్సవ విగ్రహాలను విజయవాడలోని రహదారులపై ఊరేగింపు జరుగుతుంది. ఈ విధంగా ఊరేగింపు జరుగుతున్న సమయంలో అక్కడ ఉండే ఒక ముస్లిం మహిళ వచ్చి శివుడుకి హారతులు ఇస్తారు. శివగిరిపైన భక్తులు వారి సొంత ఖర్చులతో శివలింగాన్ని ప్రతిష్టించుకోవచ్చునని శివగిరి వ్యవస్థాపకుడు మల్లికార్జునశర్మ చెప్పారు. (అన్నీ వింత సందేహాలే...బుర్ర తిరిగిపోతోంది..!) అంతా శివయ్య మహిమే!మా తల్లిదండ్రులు శివయ్యను పూజించేవారు. నేను వృత్తిరీత్యా న్యాయవాదిని, నాకు ఒకరోజు కలలో స్వామి వారు దర్శనం ఇచ్చి కొండపై పంచముఖ శివలింగాన్ని ప్రతిష్టించు, నీకు సాధ్యం అవుతుంది, అంతా నేను చూసుకుంటా అని చెప్పినట్లుగా అనిపించింది. అప్పటి నుంచి ఇంటి దగ్గర ఉన్న కొండపై ఈ పంచముఖ శివలింగాన్ని ప్రతిష్టించాను. శివయ్యే నా ద్వారా ఇదంతా చేయిస్తున్నాడు. మల్లికార్జున శర్మ, శివగిరి వ్యవస్థాపకుడు మరి ఇంకెందుకు ఆలస్యం ఒకసారి శివయ్యను దర్శించుకుని వద్దాం. .పదండి...– కొండిబోయిన సుబ్రమణ్యం – సాక్షి, మొగల్రాజపురం, విజయవాడ తూర్పు -
ఇచ్చిన మాట ప్రకారం నీరివ్వండి!
ప్రణాళికా సంఘం నివేదిక ప్రకారం ఉమ్మడి ఆదిలాబాద్ దేశంలోనే అత్యంత వెనుకబడ్డ జిల్లా. స్వతంత్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు అవుతున్నా ఈ జిల్లా పరిస్థితి దాదాపు ఏమీ మారలేదనే చెప్పాలి. ఉమ్మడి జిల్లా నలుదిక్కులా అనేక నదులు ఉపనదులూ ప్రవహి స్తున్నా వ్యవసాయం ఇప్పటికీ వర్షాధారంగానో లేదా భూగర్భ జలాలపైనో ఆధారపడి సాగుతోంది. ఆదిలాబాద్ జిల్లాకు పెద్ద ఎత్తున సాగునీటిని అందించడానికి ‘ప్రాణహిత– తుమ్మిడి హెట్టి’ ప్రాజె క్టుకు వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం 2008లో శంకు స్థాపన చేసింది. దానికి ‘బీఆర్ అంబేడ్కర్ ప్రాజెక్టు’గా నామకరణం చేసింది. ప్రాణహిత నుండి ఎల్లంపల్లి వరకు 116 కి.మీ. కాలువ నిర్మాణానికి జిల్లాలో 1700 కోట్లు ఖర్చు చేసింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం. 38 వేల కోట్లు అయ్యే మొత్తం ప్రాజెక్టుకు, ఆనాడే 9 వేల కోట్లు ఖర్చు చేశారు. 2014లో బీ(టీ)ఆర్ఎస్ అధి కారంలోకి వచ్చింది. నీరు లేదనే కుంటి సాకు చూపి, రీ ఇంజనీరింగ్, రీ డిజైనింగ్ పేరిట (కాళేశ్వరం) మేడి గడ్డకు ప్రాజెక్టును మార్చారు. అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలు నిర్మించారు. బడ్జెట్‌ను లక్ష యాభైవేల కోట్లకు పెంచారు. కాళేశ్వరం ప్రాజెక్టును 2019లో ముగ్గురు మంత్రులు ముచ్చటగా ప్రారంభించారు. నాలుగేళ్ల లోపే ఏడవ బ్లాకులోని అనేక గేట్లు, ఐదు అడుగుల లోతుకు పైగా కుంగిపోయాయి. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలో పునాది అడుగున కూడా భారీ లీకేజీలు, సీపేజీలు ఏర్పడ్డాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ‘డ్యామ్ సేఫ్టీ అథారిటీ’ అత్యున్నత స్థాయి ఇంజనీర్ల బృందం పరిశీలించింది. నీరు నిలువ ఉంచడం ప్రమాదమని, అత్యవసరంగా అన్ని బ్యారేజీలలోని నీటిని బయటికి పంపాలని నాటి ప్రభుత్వాన్ని కోరింది. డ్యామ్ సేఫ్టీ అథారిటీ మధ్యంతర నివేదికలో కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంలో కేసీఆర్ ప్రభుత్వం అత్యంత ఘోరమైన తప్పులు చేసిందని నిర్ధారించింది. ఈ నివేదికప్రకారం: పునాదికి సంబంధించిన భూగర్భ పరీక్షలు ఏమాత్రం చేయలేదు. బలహీనమైన పునాదులపై బ్యారేజీలు నిర్మించింది. బ్యారేజీలలో వచ్చిన నీరు వచ్చినట్టు కాలువకు వెళ్లాలి. ఎక్కువైన నీరు నదిలోకి వెళ్లాలి. కానీ బలహీన పునాదులపై నిర్మించిన బ్యారే జీలలో, ప్రాజెక్టుల వలె భారీ ఎత్తున నీటిని నిలువ చేశారు. బ్యారేజీలను డ్యాముల వలె నిర్వహించారు. ఆ భారీనీటి నిలువ ఒత్తిడి, తాకిడికి పునాదులు భారీగా దెబ్బతిన్నాయి. కేవలం నాలుగు మీటర్ల పునాది క్రింద ఉన్న అడుగు పొరల్లోని ఇసుకంతా భారీ ఎత్తున కొట్టుకుపోయింది. స్పిల్‌వే నిట్టనిలువుగా పునాది నుండి మూడు ఫీట్ల వెడల్పుతో చీలిపోయి, రెండు చెక్కలయ్యింది. భూమిలో కుంగిపోయింది. మేడిగడ్డ వలెనే సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు ఎప్పుడైనా భూమిలో కుంగిపోవచ్చు. నాడు భూమిలో కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజ్‌ను రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు నిశితంగా పరిశీలించి దీని నిర్మాణ ంలో చోటుచేసుకున్న అవినీతిపై విచారణ కమిషన్ వేసి సొమ్ము రికవరీ చేసి శిక్షిస్తామని ప్రకటించారు. ప్రత్యా మ్నాయంగా ప్రాణహిత తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును నిర్మించి తెలంగాణ అంతటికీ సాగునీరు ఇస్తామని గత అసెంబ్లీ ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఏడాది దాటినా, ప్రాజెక్టును ప్రస్తావించడం లేదు. యుద్ధ ప్రాతిపదికన నిధులు కేటాయించి నిర్మాణం ప్రారంభించవలసిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం కాళేశ్వరం(మేడిగడ్డ) ప్రాజెక్టులో సీఎం కేసీఆర్ అవినీతిపై కాంగ్రెస్ వేసిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ‘పినాకీ చంద్రఘోష్ కమిషన్’ విచారణ జరుపుతోంది. నేటి రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి వారివారి నియోజకవర్గాల్లో, కొత్త ప్రాజెక్టులకు భారీ ఎత్తున నిధులు వెచ్చించి శరవేగంతో నిర్మిస్తున్నారు. ఎన్ని కల ప్రణాళికలో పేర్కొన్న ప్రాణహిత – తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన కడెం ఆయకట్టును సస్యశ్యామలం చేసే ‘కుప్టి ప్రాజె క్టు’కు నిధుల కేటాయింపు కానీ, దాని కనీస ప్రస్తావన కానీ లేదు. కుంటాల జలపాతం ఎగువన ఉన్న, కుప్టి ప్రాజెక్టుతో కడెం ఆయకట్టు చివరి వరకు గూడెం ఎత్తిపోతలు లేకుండానే పూర్తిగా రెండు పంటలకు సాగునీరు ఇవ్వవచ్చు. కడెం ఆయకట్టు సస్యశ్యామలం అవుతుంది. చెన్నూరు– ప్రాణహిత వరకు, మంచి ర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల్లోని బీడు భూము లకు సంపూర్ణ గ్రావిటీతో సాగునీరు అందుతుంది. ‘నెహ్రూ ఉత్తర కాలువ’ లేదా ‘మందాకిని ఎన్టీఆర్ కాలువ’ సాగునీటి కలలు పూర్తిగా నిజం అవుతాయి. ఎల్లంపల్లికి వచ్చే ప్రాణహిత కాలువ, కడెం (నెహ్రూ ఉత్తర లేదా మందాకిని) కాలువ ఎక్స్ (గీ) ఆకారంలో క్రాస్ అవుతూ వెళ్తాయి. బెల్లంపల్లి, చెన్నూర్ నియో జకవర్గాల బీడు భూములకు అవసరమయ్యే నీటిని ప్రాణహిత ద్వారా, కడెం కాలువకు అనుసంధానించ డానికి ఒక అద్భుతమైన అవకాశం ఉంది. ఈ ఉత్తర కాలువకు... శ్రీరాంసాగర్ నీటినీ, సదర్మాట్ నీటినీ, ఎల్లంపల్లి నీటినీ పూర్తి గ్రావిటీతో అనుసంధానం చేయవచ్చు. కుప్టి ప్రాజెక్టు సముద్రమట్టానికి 1450 అడుగుల ఎత్తులో ఉంటుంది. కడెం ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం ఎత్తు 700 అడుగులు. అంటే కడెం కంటే 750 అడుగుల ఎత్తులో కుప్టి ప్రాజెక్టు బెడ్ లెవెల్ ఉంటుంది. కడెంకు కుప్టికి మధ్య ఉన్న దూరం కేవలం 30 కి. మీ. మాత్రమే. 750 అడుగుల ఈ వ్యత్యాసపు ఎత్తు అనేది, నీటిపారుదల పరిభాషలో భారీ ఎత్తు గానే పరిగణిస్తారు. కాలుష్యం లేని జల విద్యుత్తుకు, ఎత్తి పోతలు అసలే లేని గ్రావిటీ సాగుకు అత్యద్భు తమైన అరుదైన ప్రాకృతిక అనుకూలత! జల విద్యుత్తు భారీ ఎత్తున ఉత్పత్తి అవుతుంది. కుప్టితో కుంటాల జలపాతం సంవత్సరం అంతా నీరు ఎత్తిపోస్తూ, తెలంగాణలోనే అతి పెద్ద పర్యాటక కేంద్రంగా భారీ ఆదాయంతో కళకళలాడుతుంది. నేరేడిగొండ, ఇచ్చోడ ప్రాంతపు బీడు భూములకు ఎత్తిపోతలతో సాగునీరు ఇవ్వవచ్చు. -నైనాల గోవర్ధన్ (వ్యాసకర్త తెలంగాణ జలసాధన సమితి కన్వీనర్మొబైల్: 97013 81799) -
ఎవల్యూషన్ డే’ని జరుపుకొందాం!
ఇంగ్లిష్ నేచురలిస్ట్ ఛార్లెస్ డార్విన్ తన జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రకటించిన రోజు 1859 నవంబర్ 24. ఈ ఆధునిక వైజ్ఞానిక కాలానికి ఆ సిద్ధాంతం ఎంత ముఖ్యమో గ్రహించడానికి, ఆ శాస్త్రవేత్త మీద ఉన్న గౌరవం ప్రకటించుకోవడానికి 24 నవంబర్‌ను ‘ఎవ ల్యూషన్ డే’గా ప్రపంచ దేశాలన్నీ జరుపుకొంటున్నాయి. దీన్ని పెద్ద ఎత్తున మన దేశంలో కూడా జరపడం అవసరం. ఎందుకంటే వైజ్ఞానిక దృక్పథం దేశంలో బలహీనపడుతోంది. జీవ పరిణామ సిద్ధాంతం (థియరీ ఆఫ్ ఎవొల్యూ షన్) పనికిరానిదని మాట్లాడే రోజులొచ్చాయి. ఇలాంటి వాటిని అడ్డుకోవాలంటే, ప్రగతి శీల భావాలు గల వారంతా వైజ్ఞానిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుపుకోవాలి. ‘నిన్ను నువ్వు తెలుసుకో’ అని ధ్యానిస్తూ కళ్ళు మూసు కోవడం కాదు, నువ్వెవరు? ఎన్ని పరిణామాలు జరిగి, నువ్వు ఇలా మారావు అన్నది తెలుసుకుంటే, నీ కళ్ళు తెరు చుకుంటాయి. ఎన్నెన్ని మానవ జాతులు ఉద్భవించి అంతరించాయి? ఎన్ని వలసల తర్వాత నీ జాతి ఇప్పుడు నువ్వు ఉన్న ప్రాంతా నికి చేరింది వంటి విషయాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే, జీవ పరిణామం గురించి పూర్తిగా తెలుసుకోవాలి. చీకట్లోనే జీవితం బాగుందనుకునే వారితో మనకు పేచీ లేదు. జీవితంలో వెలుగులు కావాలనుకునేవారు తప్పక వైజ్ఞానిక స్పృహ పెంచుకుంటారు. జీవ పరిణామం గురించి తెలుసుకుంటారు. మత మౌఢ్యాన్ని చావుదెబ్బ తీసిన డార్విన్ పరిణామ సిద్ధాంతం వెలువడిన ఆ రోజును గుర్తు చేసుకుంటారు.అర్థవంతమైన వైజ్ఞానిక కార్యక్రమాలు విద్యాసంస్థల్లోగానీ, పౌర సమాజాల్లోగానీ, కుటుంబాల్లోగానీ ఏ ఒక్కటైనా నిర్వహిస్తు న్నారా? లేదు కదా? అందుకే ఉపాధ్యాయులు, అధ్యాపకులు, సైన్స్ కార్యకర్తలు, బాధ్యతగల పౌరులు, వివేకవంతులైన అధికారులు, మరీ ముఖ్యంగా మహిళలు పూనుకుని దేశంలోకొనసాగుతున్న విషమ పరిస్థి తులను అర్థం చేసుకుని, ఎక్క డికక్కడ ఎవరికి వారు వైజ్ఞానిక దృక్పథాన్ని పెంపొందించే కార్యక్రమాలకు రూపకల్పన చేసుకోవాలి. వట్టి ఆలోచన లతో పని జరగదు. వాటిని ఆచ రణలో పెట్టాలి. విద్యా సంస్థల్లో పనిచేసే వారిపై బాధ్యత మరింతగాఉంది. విద్యార్థులకు జీవ పరి ణామంపై, డార్విన్‌పై సంద ర్భాన్ని బట్టి ఇంకా అనేక వైజ్ఞానిక అంశాలపై వ్యాస రచన, ఉపన్యాస పోటీలు పెడుతూ వారిలో వైజ్ఞానిక జిజ్ఞాస పెంచాలి. భావి భారత పౌరులు వారే గనక, మనం వారి మీదే శ్రద్ధ పెట్టాలి. వారిని హేతుబద్ధంగా ఆలోచింప జేయాలి. మానవ వాదులుగా తీర్చిదిద్దు కోవాలి. చేస్తున్న కార్యక్రమాలతో మనం మరొ కరికి స్ఫూర్తినిస్తూ ఉండాలి.– డా. దేవరాజు మహారాజువ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత, బయాలజీ ప్రొఫెసర్‘ -
ప్రేమించడానికి అర్హతలు
యేసు ప్రభువు వారి అసాధారణ బోధ ఏమంటే, ‘నిన్ను ప్రేమించిన వారినే ప్రేమించిన యెడల నీ గొప్పతనం ఏముంది? నీకు కలిగే ఫలం ఏమిటీ?’ అంటే సత్యవిషయమైన ప్రేమను అవలంబించుట ద్వారా దేవుని మెప్పు, సంఘ ప్రోత్సాహాలను పొందుకో గలుగు తాము. సత్యలేఖన ఆజ్ఞల ప్రేరేపణతో ఇక తప్పక అనుసరించదగిన రీతిలో ఉన్నట్టి దైవికప్రేమను చేతలపరంగా చూపుటే సత్యప్రేమ. అది క్రియలలో కనుపరచేదే తప్ప, అది ఏనాడూ తీయని నోటిమాటలతో వ్యక్తం చేయదగ్గది కానేకాదు. పవిత్ర హృదయం, మంచి మనస్సాక్షి, నిష్కపట విశ్వాసం వంటివి ఉన్నతంగా ప్రేమించడానికి కావలసిన అర్హతలు. ప్రేమించే వారికి తప్పక కొన్ని అర్హతలు ఉండే తీరాలని బైబిలు పదే పదే చెబుతుంది. ప్రేమ ఏనాడూ కీడు చేయక అది ఎప్పుడూ మేలే చేస్తుంది. కాబట్టి, ఆలస్యం చేయక ప్రేమించాలి. ఆతురతతో ప్రేమించాలి. ఆత్మసంబంధ ప్రేమతో ప్రేమాతురతతో వేగంగా ప్రేమను వ్యక్తం చేస్తూ ప్రేమించడం ఇరువురి ఆత్మలకు అది బహు మేలే.ప్రేమ పట్ల ఆతురత, క్రీస్తు ప్రేమాతురత ఎప్పుడూ మంచిదే. ఈ విధానం మంచే చేస్తుంది. క్రీస్తు మనస్సును ఆయుధంగా ధరించుకోవడం అంటే ఎలాంటి సమస్యనైనా, కీడునైనా, ప్రతికూలతలనైనా ప్రేమతో దీటుగా ఎదుర్కోవడం. యుక్తంగా, ఉన్నతంగా, అసాధారణ రీతిలో ఇలా సమాజాన్ని ప్రేమించడం. ఆత్రుతతో ప్రేమించే ముందు కొన్ని విషయాలు తెలుసుకోక తప్పదు. అయితే ప్రేమాతురతకు కొన్ని అర్హతలు, లెక్కలంటూ ఉన్నాయి.అపొస్తలుల బోధను యెడతెగక వింటూ, వారి సువార్త ద్వారా రక్షించబడి, పరిశుద్ధాత్మను వరంగా పొందుకొని, లేఖనానుసార సంఘంతో అవినాభావ సహవాస బాంధవ్యం, భాగ్యం కలిగినవారే తమ తోటి వారిని, ఈ సమాజాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని ఇలా ఉన్నతంగా ప్రేమించగలుగుతారు. వారికి అవసరమైన పరిచర్యల విషయమై సకాలంలో స్పందించి కార్యరూపంలో వాటిని అందించగలుగుతారు. ప్రేమించే వారికే ఈ అర్హతలు తప్ప అవసరార్థులకు, లబ్ధిదారులకు, బాధితులకు ఈ అర్హతలు ఉండనవసరం లేదు. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ దేవునిది. ప్రేమ దేవుని నుండి వస్తుంది. ప్రేమ దేవ స్వభావం. నిజమైన ప్రేమ ఆత్మ సంబంధమైనది. ప్రేమ ఆత్మకు సంబంధించిన ఫలం. ఇలాంటి దైవిక ప్రేమ ఎప్పుడూ గుర్తింపు, గౌరవాలను ఆశించదు. మాటతో నాలుకతో కాక, క్రియతో సత్యంతో ప్రేమించాలి. పవిత్ర హృదయంతో, మంచి మనస్సాక్షితో, నిష్కపటమైన విశ్వాసంతో ప్రేమించాలి అనునదే క్రీస్తు వారి అ పొస్తలుల బోధ.ఒక్కటే క్రీస్తుశరీరం అను లేఖనానుసార సంఘంలో చేర్చబడి ఒక్కటే అను లేఖనానుసార బాప్తిస్మము ద్వారా పరిశుద్ధాత్మ వరం పొందుకొనునప్పుడే ఈ పై అర్హతలు అన్నీ సునాయాసంగా అందివస్తాయని గ్రంథం ఘోషిస్తోంది. వాస్తవమైన జీవాన్ని సం΄ాదించే క్రమంలో, నిజానికి ఆత్మసంబంధ ప్రేమను గూర్చి మాత్రమే ఇలా చెప్పబడుతూ ఉంది. లోకంలో ఎన్నో ప్రేమలు ఉండవచ్చు. రోజురోజుకు ఏదో ఒకటి కొత్తగా పుట్టుకురావచ్చు. ఆత్మప్రేమ ఇలాంటిది కాదు. ఈ అర్హతలు ఇప్పుడిప్పుడే తక్షణమే తాజాగా సం΄ాదించిన వ్యక్తికి తప్పక ఇక ప్రేమించకుండా ఉండలేని పరిస్థితులు తలెత్తుతాయి. అర్హతలు, అనుమతులు రాగానే అతడు ఒకచోట స్థిరంగా ఎలా ఉంటాడు? తనలోని ప్రేమను బట్టి హుందాగా పరదేశిలా, యాత్రికునిలా ప్రవర్తిస్తాడు.‘ఒకడు తాను చూచిన తన తోటివానిని ప్రేమింపనివాడు తాను చూడని దేవుణ్ణి ఎట్లు ప్రేమింపగలడు?’ అన్నది గ్రంథపు బోధవాక్యం. నిన్ను వలె నీ ΄÷రుగువానిని ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించినట్టే. యావత్తూ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్టే అనేది గ్రంథపు విలువైన సమాచారం. యుక్తంగా దేవుణ్ణి ప్రేమించాలంటే అనగా సర్వమానవాళిని క్రీస్తు ప్రేమతో ఆ స్ఫూర్తితో ప్రేమించాలంటే మాత్రం ఇట్టి అర్హతలు కలిగి ప్రేమించక తప్పదు. మొదటగా ఈ అర్హతలు సంపాదించకుండా ప్రేమిస్తే అది ఇరువురి మధ్య క్షేమాభివృద్ధి కలిగించదు. ఈ అర్హతలు కలిగి వాటిని ఉన్నతంగా అమలులో పెడుతూ, చేతల పరిచర్యలతో ప్రేమించేవారే దైవికంగా తమ ప్రేమను ఇతరులకు పంచగలుగుతారు. తన తోటివ్యక్తిని ప్రేమిస్తే ఆ దేవ దేవుణ్ణి ప్రేమించినట్టే. ప్రేమ కలిగి సత్యం చెప్పే క్రీస్తు ప్రేమ ప్రచారం అను సువార్త ప్రకటన పరిచర్యలకు అర్హులనే సంఘం నియమించి అనుమతిస్తుంది. అంతియొకయలో ఉన్న సంఘం సద్భక్తితో మార్పు చెందిన పౌలు అనబడిన సౌలును అన్యజనుల పరిచర్య నిమిత్తం ప్రత్యేకంగా కేటాయించి పంపింది. అతడు భూ దిగంతముల వరకు వెళ్ళి క్రీస్తుప్రేమను వ్యాప్తి చేయడం గమనార్హం. ‘క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతం చేయుచున్నది’ అన్న పౌలు మహశయుని మాటలో అర్హత, ప్రేమాతురత ఈ రెండూ ఉండుటను మనం తేటగా గుర్తిస్తాము. ఈ సమాజాన్ని ఉన్నతంగా ప్రేమించాలనే సదుద్దేశం కలిగినవారమై తేటగా క్రీస్తు అడుగు జాడలను గుర్తిస్తే అవే మనలను అర్హతల బాట పట్టిస్తాయి.– జేతమ్ -
Safer Internet Day 2025 భద్రత... బాధ్యత... గౌరవం!
ఫిబ్రవరి 11న ప్రపంచవ్యాప్తంగా180 దేశాలు ‘సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవా’న్ని పాటిస్తున్నాయి. ఈ దినోత్సవం ఈ యేటి నినాదం ‘మెరుగైన ఇంట ర్నెట్ కోసం కలిసి రండి’. ఈ దిశలో ‘డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ నియమాలు-2025’ ముసాయిదాను ప్రజా సంప్రదింపుల కోసం భారత ప్రభుత్వం జనవరిలో విడుదల చేసింది. ఫిబ్రవరి 18 వరకు సూచనలు స్వీకరిస్తారు. వ్యక్తిగత సమాచార గోప్యత పౌరుల ప్రాథమిక హక్కుగా ఈ నియమాలు గుర్తిస్తాయి.అభ్యంతరకర సమాచారం, చిత్రాలు, వీడియోలను ఇంటర్నెట్, ఆన్లైన్ ప్లాట్ ఫామ్‌ల నుండి తొలిగించమని కోరే హక్కును డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ చట్టం–2023 సెక్షన్ 12 (3) కల్పిస్తుంది.ఇతర దేశాల్లో, ముఖ్యంగా యూరోపియన్ యూనియన్‌లో గోప్యతా చట్టాల కింద గుర్తించబడిన కీలకమైన హక్కు ఇది. ఉల్లంఘనలపై రూ. 50 కోట్ల జరిమానా విధించే అధికారం ‘డేటా పరిరక్షణ బోర్డుకు’ఉంటుంది. అంతేగాక, బాలల సమాచారాన్ని ఉపయోగించాలంటే తల్లిదండ్రుల అను మతి తప్పనిసరి. బాలల వ్యక్తిగత గోపనీయతకు, భద్రతకు నష్టం కలిగించేట్లు సమాచారాన్ని దుర్వినియోగం చేస్తే రూ. 200 కోట్ల జరిమానా విధించే అధికారం కూడా బోర్డుకు ఉంది. అనేక రూపాలలో బాలలు, మహిళలపై జరిగే హింసలో ఇటీవల అదనంగా చేరింది– సాంకేతిక (డిజిటల్) జెండర్ హింస. అభ్యంతరకర నగ్న చిత్రాలతో వేధింపులు (ఇమేజ్ బేస్డ్ అబ్యూజ్), బాలికలపై నేరాలు కొన్ని సార్లు వారి ఆత్మహత్యకు దారితీస్తున్నాయి. ఆస్ట్రేలియా, బ్రిటన్, దక్షిణ కొరియా వంటి దేశాలు ఆన్లైన్లో అభ్యంత రకర ఫోటో, వీడియోల తొలగింపు సులభతరం చేయడానికి ఎన్నో చర్యలు తీసు కున్నాయి. ఇందు కోసం ఆస్ట్రేలియా ప్రపంచంలోనే మొదటిగా ‘ఇ–సేఫ్టీ కమిష నర్’ అనే వ్యవస్థను చట్టబద్ధంగా నియమించింది. బ్రిటన్ ‘రివెంజ్ పోర్న్ హెల్ప్ లైన్’ రెండు లక్షల పైచిలుకు అభ్యంతర ఫోటోలను తొలగించింది. కొరియా ‘డిజిటల్ సెక్స్ క్రైమ్ విక్టిమ్ సపోర్ట్ సెంటర్’ ఫోటోల తొలగింపు గురించి ఫిర్యాదు రాకముందే గుర్తించి ముందస్తు తొలగింపు దిశగా పరిశోధన చేస్తోంది. భారత ప్రభుత్వం కూడా ‘నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్’ ఏర్పాటు చేసింది. ‘డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ నియమాల’ రూపకల్పన సాంకేతి కతతో సమాన వేగంతో జరగకపోతే సమాజం నష్టపోతుంది. సురక్షిత ఇంట ర్నెట్ దినోత్సవం స్ఫూర్తితో బాలలు, మహిళల గౌరవానికి, భద్రతకు పెద్దపీట వేయడం ద్వారా మాత్రమే భారతదేశం మరింత న్యాయమైన, వికసిత భవిష్యత్తు వైపు పురోగమిస్తుంది.– శ్రీనివాస్ మాధవ్, సమాచార హక్కు పరిశోధకులు(నేడు సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవం) -
Ma Illu ట్విన్స్ విజేత, శ్వేత అనాథలు కాదు అంగరంగ వైభవంగా పెళ్లి!
బంజారాహిల్స్: వాళ్లిద్దరూ కవలలు.. పదేళ్ల వయసున్నప్పుడే తల్లిదండ్రులను, ఆ కొద్ది రోజులకే తోబుట్టువు, సోదరుడిని కోల్పోయి అనాథలయ్యారు. దీంతో నా అనేవారు ఎవరూ లేకుండా పోయారు.. వీరిని ‘మా ఇల్లు’ ఆశ్రమం చేరదీసింది. మా ఇల్లు ఆశ్రమ నిర్వాహకులు గాదె ఇన్నారెడ్డి, గాదె పుష్పరాణి ఈ కవల సోదరీమణులను చేరదీయడమే కాకుండా విద్యాబుద్ధులను నేర్పించారు. అనాథలైన విజేత, శ్వేత ఆదర్శనగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉన్న ‘మా ఇల్లు’ ఆశ్రమంలో నిర్వాహకుల నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా పెద్ద చదువుల్లో విశేషంగా రాణించారు. విజేత ఎమ్మెస్సీ సైకాలజీ చేసి బీఈడీ చేస్తూనే ఉద్యోగం పొందింది. చెల్లెలు శ్వేత ఎల్ఎల్బీ పూర్తిచేసి ప్రస్తుతం హైకోర్టులో లా ప్రాక్టీస్ చేస్తోంది. చిన్నప్పటి నుంచి చదువుల్లో చురుకుగా రాణించిన వీరిద్దరికీ ఆశ్రమ నిర్వాహకులు గాదె ఇన్నారెడ్డి, గాదె పుష్పరాణి దంపతులు తామే తల్లిదండ్రులై సొంత కూతుళ్ల కంటే ఎక్కువగా ప్రేమించారు. అయితే వీరికి వివాహం ఒక సమస్యగా మారింది. అనాథలైన ఈ కవలలను చేసుకోడానికి ఎవరు ముందుకొస్తారా అని ఇన్నారెడ్డి దంపదతులు ఎదురుచూస్తున్న సమయంలోనే వారికి అండగా మేముంటామంటూ ఇద్దరు ముందుకొచ్చారు. వారిద్దరి గుణగణాలను పరిశీలించిన ఇన్నారెడ్డి దంపతులు విజేత, శ్వేతలకు సరిజోడీ అని నిర్ణయించుకున్నారు. వరంగల్ జిల్లా ఈసుకొండ మండలం ఎల్కుర్తి హవేలీ గ్రామానికి చెందిన అల్లూరి రంజిత్‌రెడ్డి ఎంబీఏ పూర్తి చేసి ల్యాండ్ సర్వేయర్‌గా పనిచేస్తున్నాడు. విజేతను పెళ్లి చేసుకోడానికి ముందుకొచ్చాడు. ఇక అడ్వకేట్‌గా హైకోర్టులో పనిచేస్తున్న సురేష్ రెడ్డి అక్కడే పనిచేస్తున్న శ్వేతను పెళ్లి చేసుకోడానికి ముందుకొచ్చాడు. View this post on Instagram A post shared by Maa Illu Home🏡 (@maaillu) రంజిత్‌రెడ్డి–విజేత, సురేష్‌రెడ్డి–శ్వేతల వివాహం ఫిబ్రవరి 7న అంగరంగ వైభవంగా అనాథల మధ్యనే నిర్వహించనున్నారు. జనగామ జిల్లా జాఫర్ఘడ్ మండలం రేగడి తండాలోని ‘మా ఇల్లు’ ప్రాంగణంలోనే తాము వీరి పెళ్లి ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దీనికి రంజిత్, సురేష్ అంగీకరించారు. విజేత, శ్వేత వివాహం సందర్భంగా ‘మా ఇల్లు’ ఆశ్రమంలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. -
సమస్య, పరిష్కారాలు : సంస్కారాలు
గతాన్ని విడిచిపెడుతూ, ఎప్పటికప్పుడు పునరుత్తేజాన్నిపొందుతూ శిశిర రుతువులో ఒక్క ఆకు కూడా లేనటువంటి చెట్లు వసంత రుతువులో ఆకుపచ్చని ఆకులతో నిండిఉంటాయి. ఎందుకు? ఎందుకంటే ప్రాణంలేని ఆకులన్నీ రాలి పోయి, తిరిగి ప్రాణశక్తిని పొంది కొత్త ఆకులతో చెట్లు నిగనిగ లాడతాయి.మన సంస్కారాలు కూడా మనల్ని గతంలోనికి తోసి వేస్తాయి లేక భవిష్యత్తు లోనికి లాక్కెళతాయి. పర్యవసానంగా మనం మన కళ్లెదుట ఉన్న వర్తమానాన్ని కోల్పోతున్నాం. మన చంచలమైన మనస్సును స్థిర పరచాలి. దీనిని లోపలికి మళ్ళించుట (అనగా అంతర్ముఖత్వం గావించుట)ను అభ్యసించాలి. గతంలో సంభవించిన వాటిని లేక భవిష్యత్తులో సంభవించనున్న వాటిని పట్టుకొని మనస్సు ఊగిసలాడకూడదు. జీవితం దాని మార్గంలో అది నడుస్తూ ఉంటుంది. వర్తమాన కాలంలో ఏం జరుగనున్నదో దానికి సాక్షీభూతుడుగా ఉండాలి. ఇదీ చదవండి: Damerla Ramarao అద్వితీయ చిత్రకళా తపస్విమనస్సు నుండి అనేక కోరికలు పుడతాయి. అటువంటి వానిలో కొన్ని మనం ఏ ప్రయత్నం చేయకుండానే పూర్తవుతాయి. అందువలన మనం సంతోషాన్ని పొందుతాం. మరికొన్ని కోరికలు మనం ఎంతగా ప్రయత్నం చేసినా పూర్తి కావు. కోరికలు ఫలించని పరిస్థితిలో... నా కోరికలు ఏ విధంగా నెరవేరతాయి? ఏ కోరికలు నెరవేరతాయో అటువంటి కోరికలనే నేను కోరుకోవాలా? అనే ప్రశ్నలు తలెత్తుతాయి. అయితే ఈ రెండింటికి సమాధానాలు మన దగ్గర లేవు.మనస్సు వస్తువులతో అంటిపెట్టుకొని ఉండటం వలన కోరికలు జనిస్తాయి. కోరికలు నెరవేరినా, నెరవేరకున్నా వాటిని గూర్చి మనస్సులో ఎక్కువ ఆలోచనలు కలుగుతాయి. ఎవరైతే ఇటువంటి పరిస్థితిలో చిక్కుకుంటారో అటువంటివారి విధిని ఊబిలో చిక్కిన మనిషితో పోల్చవచ్చు. ఈ విధంగా చిక్కుకున్నప్పుడు పరిష్కారం ఎక్కడ లభిస్తుంది?మనస్సును నెమ్మదిగా, క్రమంగా ఆలోచనారహిత స్థితికి తీసుకొని రావాలి. అందుకోసం సాధకుడు తన సాధనల ద్వారా ఆలోచనల వలన కలిగే ఒత్తిడిని దూరం చేసుకోవాలి. ఆధ్యాత్మిక లక్ష్యంపైననే మనస్సును కేంద్రీకరింప చేయాలి. దేవుని (గురువు) అనుగ్రహం వలన సాధకుడు కాస్త ముందుగానో లేక ఆలస్యంగానో తన సాధన ఫలితాలను పొందగలడు. -
World Cancer Day 2025 : లక్షలాదిమంది బిడ్డలు అనాథలుగా; ముందుగా గుర్తిస్తే!
ప్రపంచ కేన్సర్ దినోత్సవాన్నీ ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 4న జరుపుకుంటారు. ఈ ఏడాది థీమ్ "యునైటెడ్ బై యునిక్". కేన్సర్ కారకాలు, సంరక్షణపై దృష్టి సారించి, సంరక్షణలో మార్పు తీసుకురావడానికి కొత్త మార్గాలను అన్వేషించాలనేది దీని లక్ష్యం. వ్యక్తిగతీకరించిన చికిత్సలు, మద్దతుపై ఈ కార్యక్రమం దృష్టి పెడుతుంది. 2000లో యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ (UICC) ఈ రోజును ప్రారంభించింది. కేన్సర్ వ్యాధి సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా వ్యక్తులు, సంఘాలు, సంస్థలను సమీకరించే ఈ కార్యక్రమానికి మరింత ఆదరణ పెరిగింది. కేన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపు, చికిత్స, అందరికీ సంరక్షణలో మెరుగుదల చూడాలనే సంకల్పంతో కేన్సర్ సమాజం ఐక్యంగా ఉంది అని UICC అధ్యక్షురాలు, స్వీడిష్ కేన్సర్ సొసైటీ సెక్రటరీ జనరల్ ఉల్రికా అరెహెడ్ అన్నారు.దేశంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధుల్లో మొదటి స్థానం గుండె జబ్బులది కాగా, తరువాతి కేన్సర్దే. 2050 నాటికి కేసులలో 77 శాతం పెరుగుదల అంచనా. ఫలితంగా 1.32 కోట్ల మరణాలు సంభవించనున్నాయని ఆందోళన వ్యక్తమౌతోంది. 2022లో 90.6 లక్షల మంది మరణించారు. ప్రతీ ఏడాది 10 లక్షల మంది పిల్లలు తమ తల్లిని కోల్పోతున్నారు. 10.4 లక్షల మంది పిల్లలు తమ తండ్రిని కోల్పోతున్నారు. నోటి కేన్సర్, రొమ్ము కేన్సర్, గర్భాశయ కేన్సర్, ఊపిరితిత్తుల కేన్సర్, కడుపు కేన్సర్, లివర్ కేన్సర్ ప్రధానంగా ఉన్నాయి.సాధారణంగా మన శరీరంలో కణ విభజనలు నియంత్రణ కోల్పోయి, చాలా వేగంగా, అస్తవ్యస్తంగా విభజన చెంది, ట్యూమర్, కణితి, గడ్డలుగా మారే స్థితినే కేన్సర్ అని పిలుస్తారు. అయితే ఈ వ్యాధి ముందస్తుగా గుర్తించడం వల్ల చాలావరకు ప్రాణహాని నుంచి బయటపడవచ్చు. ఇది శరీరానికి సంబంధించిన వ్యాధి మాత్రమే కాదు కాదు, బాధిత వ్యక్తి, ఆ కుటుంబానికి చెందిన మానసిక, భావోద్వేగాలకు సంబంధించి కూడా. అయితే వివిధ రకాల అపోహలతోపాటు అవగాహన లేక పోవడం, భయం వల్ల ఈ వ్యాధి నిర్ధారణ ఆలస్యం అవుతోంది. చాలా కేసుల్లో వ్యాధి ముదిరిన తరువాతే గుర్తిస్తుండటంతో మరణాల సంఖ్య పెరుగుతోంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్ అనట్టు ఏ వ్యాధికైనా చికిత్సకంటే ముందస్తుగా గుర్తించడం కీలకం. ఈ సూత్రం కేన్సర్ విషయంలో ఇంకా కీలకం అనడంలో ఎలాంటి సందేహం లేదు.కేన్సర్‌ను గుర్తించేందుకు ముఖ్యమైన లక్షణాలుఉన్నట్టుండి అనూహ్యంగా బరువు తగ్గడం. ఎలాంటి కారణం అంటే, డైటింగ్, వ్యాయామం, లేకుండానే నెలకు ఐదు కేజీలకంటే ఎక్కువ బరువు తగ్గితే ప్రమాద సంకేతమని గుర్తించాలి. సుదీర్ఘం కాలం పాటు జ్వరం వేధించడం. కేన్సర్ కణాలు శరీరంలో వ్యాప్తి చెందేటప్పుడు జ్వరం, బాడీ పెయిన్స్ లాంటివి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. గాయాలు త్వరగా మానకపోవడం. సాధారణంగా ఎలాంటి గాయమైనా మూడు నాలుగు వారల్లో నయం కావాలి. అలా కాని పక్షంలో అనుమానించాలి. గాయం తగ్గకపోగా, లక్షణాలు పెరుగుతుంటే వైద్యులను సంప్రదించాలి.నోట్లో ఎంతకీ మానని పుండ్లు. నోట్లో పుండ్లు ఏర్పడి చాలాకాలం తగ్గకుండా ఉంటే వైద్యులను సంప్రదించాలి. పొగాకు, గుట్కా, పాన్ నమలడం లాంటి అలవాట్లున్నవారు మరింత జాగ్రత్తపడాలి.అకారణంగా అలిసిపోవడం కేన్సర్‌లో మరో ప్రధాన కారణం. విపరీతమైన అసలట. నీరసం, ఓపిక లేకుండా అయిపోవడం. ఏ పని మీదా ధ్యాస పెట్టలేకపోవడం. నిస్సత్తువగా అనిపించడం. ప్రధానంగా లుకేమియా కేన్సర్ సోకిన వారిలో ఈ లక్షణం కనిపిస్తుంది. విపరీతమైన రక్తహీనత. రక్తంలో హిమగ్లోబిన్ శాతం గణనీయంగా తగ్గిపోవడం.శరీరంపై కొత్తగా మచ్చలు పుట్టుకు రావడం, పుట్టుమచ్చలు పెరిగి, వాటి నుంచి రక్తం కారడం. శరీర రంగు నల్లగా మారిపోవడం (హైపర్ పిగ్మెంటేషన్)ఆహారాన్ని మింగడం లేదా నీటిని తాగడం వంటి వాటిల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, విపరీతమైన దగ్గు లేదా గొంతు బొంగురు పోవడంలాంటి సమస్యలున్నా జాగ్రత్తపడాలి. సుదీర్ఘకాలం పాటు,వాంతులు వేధించడం, తిన్నది సరిగ్గా అరగకపోవడం, మలబద్ధకం లాంటి లక్షణాలు పెద్దపేగు కేన్సర్ వల్ల కావచ్చునేమో అనుమానించాలి.రొమ్ముల్లో, వృషణాల్లో, గొంతులో ఏదైనా గడ్డలు తగిలితే అనుమానించాలి. రొమ్మునుంచి రక్తం, చీము లాంటి స్రావాలు కనిపిస్తే అప్రమత్తం కావాలి. అలాగే పురుషాంగం లేదా యోనిపై మానని పుండ్లు ఉండే సాధారణ ఇన్ఫెక్షన్ అవునా? కాదా నిర్ధారించుకోవాలి. మూత్రంలో మంట, నొప్పి, రక్తం పడటం, మూత్రం రంగు మారడం, పదే పదే మూత్రానికి వెళ్లాలని పించడం, లేదా అసలే నీరుడు బంద్ కావడం లాంటి లక్షణాలు బ్లాడర్ లేదా ప్రొస్టేట్ కేన్సర్లకు దారి తీయవచ్చు.మలంలో విపరీతంగా రక్తం, రంగు మారడం పెద్ద పేగు కేన్సర్‌కు సంకేతం కావొచ్చు.ఈ పైన చెప్పిన లక్షణాలు మూడు లేదా నాలుగు వారాలకు మించి కొనసాగుతుంటే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. దానికి కారణాలను నిర్ధారణ చేసుకొని, తగిన చికిత్స తీసుకోవాలి. సైలంట్ కిల్లర్కేన్సర్ను సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. ఎందుకంటే లక్షణాలు కొన్ని నెలలు లేదా సంవత్సరాలు దాకా గుర్తించడం కష్టం. మరో విధంగా చెప్పాలంటే.. దాదాపు నాలుగో స్టేజ్‌లో బయటపడతాయి. ఊపిరితిత్తులు, ప్యాంక్రియాటిక్ , అండాశయ కేన్సర్ లాంటి నిశ్శబ్దంగా చుట్టుముడతాయి. ఈ మహమ్మారికి చిన్నాపెద్దా, ముసలీ ముతకా, స్త్రీ, పురుష అనే దయాదాక్షిణ్యాలేవీ ఉండవు. అందుకే అవగాహన, అప్రమత్తత అవసరం. -
విమాన ప్రమాదాలకు 5 కారణాలు
-
ఆత్మసాక్షాత్కారం సాధించాలంటే..వీటిని జయించాలి!
భ్రమలో ఉండేవారిని అజ్ఞానం ఎంతో తికమకపరుస్తుంది. అటువంటి వారు అనాత్మను ఆత్మగాను; ఆత్మను అనాత్మగాను తలచి ఒకదానిపై వేరొకదానిని ఆరోపించుకుంటున్నారు. వారి సహజ ప్రకృతి వల్ల సచ్చిదానందం అనే వాస్తవాన్ని మరచి పోతున్నారు. ప్రాపంచిక విషయాల్లోనే సంతోషం ఉందనుకుంటున్నారు. భ్రమలో ఉండేవారు ఆత్మనే పరమాత్మ అనే వాస్తవాన్ని తెలుసుకోలేక పోతున్నారు. అటువంటి వారికి విగ్రహా రాధన మొదటి మెట్టుగా పెద్దలు చెప్పారు. ఆత్మే ఎప్పుడూ బంధరహితంగా ఉంటుందనే సత్యం తెలియనంత వరకు అల్పప్రాణులు అనేక దీక్షలు, వ్రతాలు, తీర్థయాత్రలు చేయడానికి పూనుకుంటారు. ఎంతకాలం ఈ శరీరమే ‘నేను’ అనే భావాన్ని కలిగి ఉంటారో అంతకాలం వారెవరూ ఆత్మసాక్షాత్కారం పొందలేరు.ఆధ్యాత్మిక మార్గం ప్రకారం... శారీరక స్పృహ అజ్ఞాన సూచికే. దేహవాసన, శాస్త్రవాసన, లోకవాసన అని మూడు వాసనలు ఉంటాయి. దేహ ధర్మములను ఆత్మపై ఆరోపించడమే ‘దేహవాసన’. నేను సాధించాను, నేను పండితుడను, నేను శాస్త్రాన్ని పఠించాను అనే భావన ‘శాస్త్రవాసన’. ఈ ప్రపంచమే యథార్థమైనది అని తలచి ప్రపంచంతో సంబంధాన్ని కలిగి ఉండటమే ‘లోకవాసన’. వాసనలు ఉన్నంతకాలం మోక్షం లభించదు. వాసనలను దూరం చేయడానికి దివ్య నామ సంకీర్తన, నిరంతర దైవదర్శనం ఉపయోగపడతాయి.ఆధ్యాత్మిక, ఆచార పర ప్రయాణమే ‘అంతరంగ ప్రయాణం’. సద్గుణాలను పెంచుకొని, మనస్సును పరిశుద్ధం చేసికొని జ్ఞానంతో వాటిని కలుష రహితంగా ఉంచాలి. సృజనాత్మకమైన బుద్ధిబలం పెరిగిన కొలదీ తాత్విక చింతనముందడుగు వేస్తుంది, సత్యాన్వేషణ పట్ల జిజ్ఞాస పెరుగుతుంది. వయసు పెరిగిన కొలది శరీరం ఏ విధంగా పెరుగుతుందో, అదే విధంగా మనలో ఉండే మనస్సు, బుద్ధి బలం (జ్ఞానము) కూడా సద్గుణాలతో వెలగాలి. ఈ భౌతిక ప్రపంచం శాశ్వతం కాదని గుర్తెరగాలి. తర్కంలో చురుకు దనాన్ని పెంచుకొని నిత్య, అనిత్య వస్తు భేదమును సరిగా తెలుసుకోవాలి. ఆ తర్వాత నిరంతర ఆచరణతో, శుద్ధ సంకల్పంతో ప్రయత్నించి జిజ్ఞాసాపరుడు అంతరాత్మ సాక్షాత్కారం పొందగలడు.-శ్రీ గణపతిసచ్చిదానందస్వామి -
Punjab Kesari Lala Lajpat Rai స్వతంత్ర సంగ్రామ సింహం
లాలా లజపతిరాయ్ స్వతంత్ర సంగ్రామంలో తన ప్రాణాలను వదిలిన అమర జీవి. మొదట్లో దయానంద సరస్వతి ఏర్పాటుచేసిన ఆర్య సమాజ్ భావాల పట్ల ఆకర్షితులై అందులో చేరి సమాజ సేవ చేశారు. ఆయన మీద ఇటాలియన్ విప్లవకారుడైన జోసెఫ్ మ్యాజినీ ప్రభావం కూడా ఉంది. న్యాయవాద వృత్తిని విడిచి స్వాతంత్య్ర పోరాటంపై దృష్టి సారించారు. ఒకపక్క స్వాతంత్య్రోద్యమంలో పనిచేస్తూనే సామాజిక ఉద్యమాల్లోనూ పాల్గొన్నారు. అంటరానితనం నిర్మూలన కోసం మహాత్మా గాంధీ ‘హరిజన సేవక్ సంఘ్’ బ్యానర్ కింద పని ప్రారంభించారు. ప్రపంచంలోని ఇతర ముఖ్యమైన ఉద్యమాల మాదిరిగానే ఈ సామాజిక సంస్కరణ కూడా జాతీయ ఆమోదం కోసం గొప్ప పోరాటం చేయాల్సి ఉందని ఆయన ప్రకటించారు. లాలాజీ సేకరించిన కరువు నిధిలో కొంత భాగాన్ని అణగారిన వర్గాల అభ్యున్నతికి ఉపయోగించారు. కొన్ని ప్రాథమిక పాఠశాలలు కూడా ఈ ఫండ్ నుండి నిధులు అందు కున్నాయి. అనాథ పిల్లల కోసం ఆశ్రమాలను ఏర్పాటు చేసి వారికి నూతన జీవితాన్ని ప్రసాదించారు.భారత దేశంలో రాజ్యాంగ సంస్కరణలను అధ్యయనం చేయడానికి 1928లో బ్రిటన్ నుంచి వచ్చిన సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. పంజాబ్‌లోని లాహోర్‌లో జరిగిన ఆందోళనకు లజపతిరాయ్ నాయకత్వం వహించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మార డంతో పోలీసులు లాఠీచార్జి చేయడంతో ఈ ‘పంజాబ్ కేసరి’కి తీవ్రమైన దెబ్బలు తగిలాయి. ఆ సందర్భంగా ‘ఈ రోజు నా మీద పడిన దెబ్బలు, బ్రిటిష్ సామ్రాజ్య వాదం శవపేటికకు వేసిన చివరి మేకులు’ అని బ్రిటిష్ పోలీసులను హెచ్చరించారు. ఆ దెబ్బలతోనే చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆయన మృతి స్వాతంత్య్రోద్యమం తీవ్రమవ్వడానికి దారితీసింది.– డా. ఎ. శంకర్, రాజనీతిశాస్త్ర ఉపన్యాసకులు, హైదరాబాద్(నేడు లాలా లజపతిరాయ్ జయంతి) -
దేశాన్ని అణుశక్తిగా మార్చిన మేధ
దేశభక్తి, సంస్కృతీ సంప్ర దాయాల పట్ల గౌరవం, సంగీత సాహిత్యాల పట్ల ప్రేమ, సగటు మనిషి జీవన ప్రమాణాలు పెంచా లన్న తపన కలిగిన గొప్ప శాస్త్రవేత్త డాక్టర్ రాజా రామన్న. ఆయన 1925 జనవరి 28న సంప్రదాయ మైసూర్ అయ్యంగార్ కుటుంబంలో కర్ణాటకలో పుట్టారు. సంగీతంపై ఉన్న అభిమానంతో సంగీత కళాశాలలో చేరాలనుకున్న రాజా రామన్న, సర్సి.వి. రామన్ పరిచయ ప్రభావం వల్ల వైజ్ఞానిక రంగంలోకి ప్రవేశించారు. ఆరేళ్ళ వయసులోనే పియానో నేర్చుకోవడం ప్రారంభించారు.పన్నెండో ఏట మైసూర్ మహారాజు ఎదుట పియానో వాయించి ప్రశంసలందుకున్నారు. 1949లో టాటా గ్రూపు– స్కాలర్‌షిప్‌పై లండన్ వెళ్ళి, అక్కడి ‘కింగ్స్ కాలేజి’ నుండి ‘న్యూక్లియర్ ఫిజిక్స్’లో డాక్టరేట్ తీసుకుని స్వదేశం తిరిగి వచ్చారు. డా‘‘ హోమీ భాభా ఆధ్వర్యంలో పని చేయడానికి 1952లో– టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌లో చేరారు. బొంబాయి, ట్రాంబేలోని ఆ సంస్థ పేరు తరువాత కాలంలో భాభా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ (బీఏఆర్సీ: బార్క్)గా మారింది. 1960లలో అణ్వాయుధా లను తయారు చేయడం, వాటిని అభివృద్ధి చేయ డంలో సాంకేతిక పరిశోధన చేపట్టారు. అప్పుడే మన దేశంలో అణుబాంబుకు రూపకల్పన జరిగింది. 1966లో ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు–అణుపరికరాల తయారీకి సంబంధించిన ప్రాజెక్ట్ కొనసాగింది. ఆ ప్రాజెక్ట్‌లో పనిచేసే 75 మంది శాస్త్రవేత్తల బృందానికి రాజా రామన్న నాయకత్వం వహించారు. బార్క్‌లో ‘పూర్ణిమ’ అనే పేరుతో ప్లుటోనియం ఇంధనంతో నడిచే ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ స్థాపించడానికి కార కులయ్యారు. 1974 మే నెలలో అతి రహస్యంగా అణు పరీక్షను నిర్వహించారు. 1978లో అప్పటి భారత ప్రధాని మొరార్జీ దేశాయ్, డా‘‘ రామ న్నను బార్క్ నుండి తీసు కొచ్చి, రక్షణ మంత్రిత్వ శాఖకు సలహాదారుగా నియమించారు. రక్షణ పరిశోధన కార్యదర్శిగా, డీఆర్డీఓ డైరెక్టర్ జన రల్‌గా కూడా నియమించారు. అప్పుడే ఒక విచి త్రమైన సంఘటన జరి గింది. ఈయన నేపథ్యం తెలుసుకుని ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ అణుబాంబుల తయారీలో రామన్న సహాయం అర్థించాడు. పరిస్థితి విషమించేట్టుగా ఉందను కుని, దేశభక్తుడయిన రాజా రామన్న చెప్పా పెట్ట కుండా ఇండియా విమానం పట్టుకుని హుటా హుటిన తిరిగొచ్చారు. నిబద్ధత గల దేశభక్తుల చర్యలు అలా ఉంటాయి. వారు వేటికీ లొంగరు.చదవండి: ఈశ్వరాజ్ఞ హోమీ జె. భాభా అకాల మరణం తర్వాత, ఆయన నిర్దేశించిన మార్గంలోనే రాజా రామన్న పరిశోధనలు కొనసాగించి, ఆణుశక్తి పరిశోధనల్లో దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టారు. ఆయన న్యూక్లి యర్ ఫిషన్ రంగంలో కూడా కృషి చేశారు. బరువైన కేంద్రకాలను విభజించి, శక్తిమంతమైన న్యూక్లియన్ రేడియేషన్‌ను ఉత్పత్తి చేయవచ్చని– ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఆ సిద్ధాంతం అణుపరిశోధనా రంగానికి, తద్వారా దేశ ప్రగతికి ఎంతో ఉపయోగపడింది. 1980లో ఇందిరాగాంధీ ప్రధాన మంత్రిగా తిరిగి రావడంతో అణు కార్యక్రమం ఊపందుకుంది. ఆమె రామన్నను మళ్ళీ బార్క్‌కు డైరెక్టర్‌గా నియమించారు. పైగా అణుపరీక్షల కోసం అయనకు పూర్తి స్వేచ్ఛ నిచ్చారు. 1990లో వి.పి. సింగ్ ప్రభుత్వంలో రామన్న కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. దేశానికి ఆయన చేసిన సేవలకు గాను పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మవిభూషణ్‌లతో పాటు అనేక పురస్కారాలు, పతకాలు, డాక్ట రేట్లు పొందారు.రాజా రామన్న శత జయంతి (28 జనవరి 1925 – 28 జనవరి 2025) సందర్భంలో మనం ఉన్నాం. మంచి మనిషిగా, అత్యున్నత స్థాయికి ఎదిగిన వైజ్ఞానికుడిగా, పియానో వాద్యకారుడిగా – ఎవరికి తోచిన విధంగా వారు ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది.వ్యాసకర్త సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త(నేడు డా. రాజా రామన్న శతజయంతి)-డా. దేవరాజు మహారాజు -
తొలితరం రాజకీయ దిగ్గజం : ఆసక్తికర సంగతులు
భారత స్వాతంత్య్రోద్యమ తొలితరం మేరునగధీరుల్లో మహదేవ గోవింద రనడే ఒకరు. 1943లో ఆయన శత జయంతి కార్యక్రమంలో డా‘‘ బీఆర్అంబేడ్కర్ మాట్లాడుతూ... ‘రనడే కేవలం ఆజానుబాహుడు మాత్రమే కాదు; విశాల భావాలు కలిగిన వారూ, ప్రజల పట్ల సమదృష్టిని కలిగిన వారు కూడా’ అని ప్రశంసించారు. ఓరిమి కలిగిన ఆశావాది.తన జీవిత కాలంలో‘వక్తృత్వోత్తేజక సభ’, ‘పూర్ణ సార్వజనిక సభ’, ‘మహారాష్ట్ర గ్రంథోత్తేజక సభ’, ‘ప్రార్థనా సమాజం’ లాంటి సంస్థలను స్థాపించారు. తన సాంఘిక, మత సంస్కరణల ఆలోచనలకు అనుగుణంగా ‘ఇందు ప్రకాష్’ అనే మరాఠీ–ఆంగ్ల దినపత్రికను నిర్వహించారు.మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా నిఫాడ్‌లో 1842 జనవరి 18న జన్మించారు. కొల్హాపూర్‌లోని ఒక మరాఠీ పాఠశాలలో చదివారు. తర్వాత ఓ ఆంగ్ల మాధ్యమ పాఠశాలకు మారారు. 14 ఏళ్ల వయసులో బాంబేలోని ఎల్ఫిన్స్టన్ కళాశాలలో చేరారు. బాంబే విశ్వవిద్యాలయం మొదటి విద్యార్థుల్లో ఆయనా ఒకరు. 1867లో ఎల్ఎల్బీ పట్టా పుచ్చు కున్నారు. 1871లో పూనాలో సబార్డినేట్ జడ్జిగా నియమితులయ్యారు. ఆయన రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం గమనించిన ఆంగ్లేయులు 1895 దాకా ఆయనను బాంబే హైకోర్టుకు పంపే పదోన్నతికి అడ్డు పడుతూ వచ్చారు. ఆయన కొన్ని పాశ్చాత్య భావాలకు ప్రభావితులయ్యారు.అందరికీ విద్య, సమానత్వం, మానవత్వం వంటివి ఇందులో ప్రధాన అంశాలు. మత పరంగా హిందూమతంలో ఆయన చేయాలనుకున్న సంస్కరణలు ప్రార్థనా సమాజం స్థాపించడానికి ప్రేరణ. గోపాలకృష్ణ గోఖలే, బాల గంగాధర తిలక్ వంటి స్వాతంత్య్ర సమర యోధులకు రాజకీయ గురువుగా పేరు పొందారు. తుదకు 1901 జనవరి 16న తుదిశ్వాస విడిచారు. నేటి స్వేచ్ఛా భారతానికి దారులు వేసిన ఆయన చిరస్మరణీయులు.– యం. రాం ప్రదీప్; జేవీవీ సభ్యులు, తిరువూరు(రేపు మహాదేవ గోవింద రనడే జయంతి) -
యుద్ధ విషాద గీతం.. గాజా కన్నీటి గాథ
-
పాజిటివ్ ఎనర్జీనిచ్చే డెకరేషన్
శ్రావ్యమైన సవ్వడి.. గాలి వీచినప్పుడల్లా అలవోకగా మోగే హ్యాంగింగ్ బెల్స్ ఇంటికి పాజిటివ్ పవనాలను మోసుకొస్తాయి. ప్రధాన ద్వారం ముందు గానీ, బాల్కనీల్లో గానీ వీటిని వేలాడదీసినప్పుడు ఆ సన్నని శ్రావ్యమైన సవ్వడి మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. సువాసనల కాంతిడెకరేటివ్ వస్తువుల్లో క్యాండిల్స్కున్న ప్రత్యేకతే వేరు! రాత్రి వేళల్లో కాఫీ టేబుల్, డైనింగ్ టేబుల్‌పై సుగంధాల కొవ్వొత్తులను వెలిగించడం వల్ల ఆ సువాసన మదిని ఉల్లాసçపరుస్తుంది. లావెండర్, లైమ్ గ్రాస్, వెనీలా, జాస్మిన్, దాల్చినచెక్క పరిమళాలు కాంతితో కలిసి ప్రయాణం చేస్తూ ఉత్తేజాన్నిస్తాయి.ధూపం కూడా..ధూపం వేయడమూ పాజిటివ్ ఎనర్జీ హోమ్ డెకర్‌లో భాగమైందిప్పుడు. ధూపానికి వైద్యం చేసే శక్తి ఉంటుందనేది ఓ విశ్వాసం. సాంబ్రాణి, గంధపు చెక్క, బంతి, జాస్మిన్, రోజ్, లావెండర్, లెమన్ గ్రాస్ వంటి పరిమళాల ధూప్ స్టిక్స్ మార్కెట్లో లభిస్తున్నాయి. శ్రేయస్సుకు..శాంతి, సానుకూలతలో బుద్ధ విగ్రహానికి చాలా ప్రాధాన్యం ఉంది. ఇది జ్ఞానం, బాధ్యత, కరుణ, విశ్వాసానికి సూచిక. లాఫింగ్ బుద్ధ సంపద, శ్రేయస్సు, అదృష్టాన్ని తీసుకువస్తుందని నమ్ముతారు. ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీ హోమ్ డెకర్‌లో బుద్ధుడి విగ్రహాలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. నెమలి ఈకలునెమలి ఈకలు ప్రతికూలతను దూరం చేసి, సానుకూలతను పెంచే చక్కటి అలంకరణ. నెమలి ఈకలను గాజు సీసాలో లేదా జార్లో ఉంచవచ్చు. లేదంటే గోడకు అలంకరించవచ్చు. గదిలో ఎక్కడ పెట్టినా అందంగా కనిపించడమే కాదు మానసిక ప్రశాంతతనూ కలిగిస్తాయివి. – ఎన్.ఆర్ విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాలన్నదే నా లక్ష్యం. అందుకే, స్క్రిప్ట్ కంటే ముందు నా పాత్రపైనే ఎక్కువ దృష్టి పెడతా! – బనితా సంధూ. -
దోస్తీకి దొన్ను చెక్కీ
భేదభావాలు చూపనిది, షరతులు లేనిది ఈ సృష్టిలో స్నేహం ఒక్కటే! దీన్ని మించిన మాధుర్యం లేదు ఈ లోకంలో! అలాంటి దోస్తీని దొన్ను చెక్కీతో మరింత తీపి చేసుకుంటారు ఉత్కళాంధ్రులు! ఆ మిఠాయి ధనుర్మాసానికి ప్రత్యేకం! శతాబ్దాలనాటిదీ సంప్రదాయం!ఆ స్వీట్ స్టోరీ ..మద్దిలి కేశవరావు, ఇచ్ఛాపురం రూరల్ సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించిన రోజున ఉత్కళాంధ్రులు నెలగంటును వేస్తారు. ధనుర్మాసం తొలిరోజు నుంచి మకర సంక్రాంతి వరకు పేలాలు, బెల్లం, చక్కెర, నెయ్యి, జీడి పప్పు, ఎండు కొబ్బరి ముక్కలు, ఎండు ద్రాక్ష, బాదంపప్పు, ఖర్జూరం వేసి వివిధ ఆకృతుల్లో తయారుచేసిన ‘దొన్ను చెక్కీ’ని ప్రతిరోజూ వైష్ణవాలయాల్లో దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. ధనుర్మాసంలోనే ప్రత్యేకంగా తయారుచేసే ఈ మిఠాయిని ‘ధనుర్మువ్వా’ అని కూడా పిలుస్తారు. ఈ మాసంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదన్నది ఇక్కడి ఆచారం. ప్రాణప్రదంగా ప్రేమించే వ్యక్తుల మధ్య ఉన్న చెలిమిని ఇక్కడ దోస్తీ, నేస్తాలు, మోఖర, సొంగాతి, మిత్తరికం వంటి పేర్లతో పిలుస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారు పరస్పరం సొంత పేర్లతో పిలుచుకునే అవకాశం ఉండదు. అలాంటి అనుబంధాలకు గుర్తుగా ఈ మువ్వా చెక్కీలను బహుమతిగా ఇచ్చిపుచ్చుకుంటారు. వీటితో పాటు చాలా ప్రాంతాల్లో దుస్తులు, కాయగూరలనూ ఇస్తుంటారు. అంతేకాదు ఈ చెక్కీతోనే సంక్రాంతికి కొత్త అల్లుడిని అత్తారింటికి ఆహ్వానిస్తారు. అమ్మాయి తల్లిదండ్రులు, సోదరులు ఈ స్వీట్‌తో మర్యాదపూర్వకంగా అల్లుడిని, కూతురిని తమ ఇంటికి తీసుకొస్తారు. ఈ ఆచార సంప్రదాయాలన్నీ ముఖ్యంగా ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో కనిపిస్తాయి. నెలల తరబడి పాడవకుండా ఉండే ఈ మువ్వా చెక్కీలను ఎక్కువగా బరంపురంలో తయారుచేస్తుంటారు. ఇచ్ఛాపురం, సోంపేట, పలాస, పర్లాకిమిడి వంటి ప్రాంతాల్లోనూ తయారు చేస్తున్నప్పటికి బరంపురం చెక్కీకున్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. ఇక్కడ తయారయ్యే చెక్కీలను అటు బెంగళూరు, ఇటు కోల్కత్తా వరకు ఎగుమతి చేస్తుంటారు. విదేశాల్లో ఉన్న మనవారికీ పంపిస్తుంటారు. డిసెంబర్, జనవరి నెలల్లో మాత్రమే దొరికే ఈ దొన్ను చెక్కీలు కేజీ, అరకేజీ, పావు కేజీల్లో రూ.40 నుంచి రూ.350 వరకు దొరుకుతాయి. ప్రత్యేకంగా తయారు చేసిన చెక్కీ రూ.450 వరకు ధర పలుకుతోంది.ధనుర్మాసంలో మువ్వా చెక్కీని విష్ణుమూర్తికి ఆరగింపునివ్వడం ఇక్కడి సంప్రదాయం. బెల్లం, పంచదారలో పేలాలతో పాటు పలురకాల పదార్థాలను కలిపి తయారు చేసిన ఈ చెక్కీని శీతాకాలంలో తింటే ఆరోగ్యం!∙ నారాయణ పాఢీ, పురోహితుడు, ఇచ్ఛాపురం -
ఎన్ని అడ్డంకులొచ్చినా...సంకల్పమే మీ బలం!
నూతన సంవత్సరంలో చాలా మంది ఎన్నో గొప్ప లక్ష్యాలను పెట్టుకుంటారు. కానీ ఆ లక్ష్యాలను సాధించేందుకు కావాల్సినంత సంకల్ప బలం వారిలో ఉండదు. అందుకే మధ్యలోనే ఆ లక్ష్యాలను వదిలిపెడతారు. కొన్నిసార్లు మీ మనసే ఎన్నో సాకులను వెతుకుతుంది. మీ లక్ష్యాన్ని ఓడించాలని చూస్తుంది. అందుకే మీ మనసును చెదరని సంకల్ప బలంతో నింపండి. నేను ఎన్ని అడ్డంకులు ఉన్నా విజయాన్ని సాధిస్తాను! నేను లక్ష్యాన్ని చేరతాను అని పదే పదే మనసులో అనుకోండి! అనుకుందే ఆచరణలో పెట్టండి. మీరు చేయాల్సిన కృషితో పాటు దృఢమైన సంకల్ప శక్తి కూడా ఉండాలి. ఎత్తైన పర్వతాల నడుమ ఒక సుందరమైన లోయ వద్ద ఒక చిన్న ప్రవాహం ఉండేది. అది మహా సముద్రాన్ని చేరాలని కలలు కంటూ ఉండేది. తన ప్రయాణాన్ని ప్రారంభించిన ప్రతిసారీ దారిలో రాళ్లు, దట్టమైన అడవులు, ఎత్తైన కొండచరియలు ఎదురవడంతో ఆ చిన్న ప్రవాహం వెనుదిరిగి వెనకకు వెళ్లి΄ోయేది.‘‘నీకు ఇది సాధ్యం కాదు,’’ అని దారిలోని పెద్ద రాళ్లు చెప్పేవి. ‘‘నువ్వు చాలా చిన్నగా, బలహీనంగా ఉన్నావు నువ్వు చేయలేవు’’ అని ఆ చిట్టి ప్రవాహాన్ని నిరుత్సాహ పరిచేవి. ఒకనాడు చిట్టి ప్రవాహం చాలా దిగులుగా, ఇక ఎప్పటికీ తన కలను నెరవేర్చుకోలేనన్న బాధతో, సందేహంతో ఉండటాన్ని వృక్షమాత గమనించింది. వృక్ష మాత ప్రవాహంతో ఇలా చెప్పింది, ‘‘ఇలా బాధ పడినంత మాత్రాన నీ లక్ష్యాన్ని నీవు చేరగలవా..?? నువ్వు బాధ పడటం వల్ల ఏ ఉపయోగం లేదు! మహా సముద్రాన్ని చేరాలనే నీ తపననే నీ శక్తిగా మలుచుకో..నీ సంకల్పాన్ని బలపరుచుకో.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనుదిరగననే వజ్ర సంకల్పం చేసుకో!’’ అని చిట్టి ప్రవాహానికి కొండంత ధైర్యమిచ్చి, విజయోస్తు! అని దీవించి పంపింది వృక్ష మాత. ఆ ధైర్యంతో, ప్రవాహం తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అది ముందుకు వెళ్లాలని సంకల్పించుకుంది. పెద్ద రాళ్ళు ఎదురైనప్పుడు వాటి మధ్యనున్న చిన్న సందులనే మార్గంగా చేసుకుంది. ఎండ తీవ్రతకు ఆవిరైపోయే పరిస్థితి వచ్చినప్పుడు, మేఘాలకెగసి అక్కడి నుండి నదిగా భువికి తిరిగి వచ్చింది. ఒకప్పటి చిట్టి ప్రవాహమే ఇప్పుడు మహా ప్రవాహమై చివరికి మహాసముద్రంలో లీనమైంది. ‘‘నీ లక్ష్యాన్ని నీవు సంకల్ప శక్తితో సాధించావు’’ అని వృక్ష మాత హర్షించింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా చెదరని సంకల్ప బలంతో ముందుకు సాగండి. లక్ష్యాన్ని సాధించడంలో ఇటువంటి మనఃస్థితి ఉంటే ఏ పనిలోనైనా నిస్సందేహంగా విజయాన్ని సాధించవచ్చు. ఈ యావత్ విశ్వంలో మీరు సాధించలేనిది ఏదీ లేదు! – మాతా ఆత్మానందమయిఆధ్యాత్మిక గురువు -
వ్యక్తి లోపలనే గుప్తంగా దాగి ఉండే ధనరాశి అదేంటో తెలుసా?
‘విద్య నిగూఢ గుప్తమగు విత్తము’ – ఇతరుల కళ్ళకు కనిపించకుండా, వ్యక్తి లోపలనే గుప్తంగా దాగి ఉండే ధనరాశి వంటిది విద్య అని భర్తృహరి సుభాషితం చెప్పింది. విద్య వలన ప్రయోజనం అదొక్కటి మాత్రమే కాదనీ, మనిషి విద్యావంతుడు కావడం వలన సమకూరే ఉత్తమమైన ప్రయోజనాలు మరి కొన్ని వున్నాయనీ తెలుగు కవులు చెప్పారు. వారిలో, విక్రమార్కుడి సింహాసనపు సాలభంజికలు భోజరాజుకు చెప్పిన కథలను తెలుగులో ‘సింహాసన ద్వాత్రింశిక’ కావ్యంగా రచించిన కొఱవి గోపరాజు ఒకరు. ‘పరులకు, సోదరులకు, భూమిని పాలించే భూవరులకు నిలువెత్తు ధనం వెచ్చించైనా ఒకవ్యక్తి నుండి కొనలేనిది అతడి విద్య అని, ఏ వ్యక్తిలో ఉంటేఆ వ్యక్తికి మాత్రమే నూటికి నూరుపాళ్ళు వశ్యమై ఉండేది విద్య ఒక్కటే అని, ఒకరు తనలోని విద్యను మరొకరికి బోధించినపుడు, ఆ బోధనను గ్రహించిన వ్యక్తిలో తిరిగి అదే రకమైన వృద్ధికి ఆ విద్య దారితీస్తుందని ఆయన చెప్పిన మాటలు చిరస్మరణీయాలు. పరాయి ఊరికి వెళ్ళినప్పుడు వ్యక్తి లోపల ఉన్న విద్యా ధనం ఒక్కటే దొంగలకు కనపడకుండా ఉంటుందని, విద్య ఒక్కటి మాత్రమే ఒక్కొకసారి వ్యతిరేక పరి స్థితులలో సైతం స్నేహితులను పుట్టించగలిగే సామర్ధ్యం కలిగి ఉంటుందని, కాబట్టి విద్యను పోలిన ధనం మరొకటి ఉంటుందనుకోవడం అవివేకమే అవుతుందని కూడా చెప్పాడు కొఱవి గోపరాజు. విద్యను గురించి కావ్యాంతర్గతమైన వివరణ అలా ఉండగా, భారతీయుల ఆధ్యాత్మిక చింతనకు ముఖ్యమైన మార్గదర్శకాలుగా భావించే అష్టాదశ పురాణాలలో ఒకటైన ‘శ్రీవిష్ణుపురాణం’ పంచమ అంశం, పదవ అధ్యాయం, 30వ శ్లోకంలో విద్యను గురించిన అత్యంత ప్రాచీన ఆధ్యాత్మిక భావన కనపడుతుంది. విద్యయా యో యయా యుక్తస్తస్య సా దైవతం మహత్,సైవ పూజ్యార్చనీయా చ సైవ తస్యోపకారికా. ఏ విద్య ఆసరాతో ఒక వ్యక్తి తన జీవనాన్ని సాగిస్తుంటాడో, ఆ విద్యయే అతడికి ఇష్టదైవం వంటిది. ఆ విద్యయే ఆ వ్యక్తికి పూజనీయమైనది. ఆ విద్యయే ఆ వ్యక్తికి చిరకాలం ఆనందాన్ని కలిగించేదిగా కూడా ఉంటుంది అని పై శ్లోకంలో చెప్పబడింది.– భట్టు వెంకటరావు -
ఎందుకీ మౌనం సారూ.. తప్పు గంభీర్ దేనా ?
-
Editor Comment: డిసెంబర్ లాస్ట్ వీక్.. కాంగ్రెస్, బీజేపీకి పాఠాలు చెబుతున్న వందేళ్ల చరిత్ర
-
అవకాయ పచ్చడి కాదు..! ఇది GST కిచిడి
-
కీలక ఘట్టాలు.. కుదిపేసిన అంశాలు
-
అప్పుల్లో రికార్డు సృష్టించిన బాబు
-
శోకసంద్రంలో మన్మోహన్ భార్య గురుశరణ్ : ఆ ప్రేమ గుర్తు ఇంకా ఆమెతోనే!
భారత మాజీ ప్రధానమంత్రి డా. మన్మోహన్ సింగ్ (RIP Manmohan Singh) అస్తమయంతో యావద్దేశం దిగ్బ్రాంతికి లోనైంది. ఆర్థికమంత్రి, ప్రధానమంత్రి, ఇలా పలు హోదాల్లో దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ అనేకమంది రాజకీయ నేతలు, ఆర్థికవేత్తలు నివాళులర్పిస్తున్నారు.సుదీర్ఘ కాలం పాటు పనిచేసిన భారత్ ప్రధానిగా, ఆర్థిక సంస్కరణల సారథిగా మన్మోహన్ సింగ్ పేరొందారు. పదేళ్ల పాటు మన్మోహస్ సింగ్ భారత దేశ ప్రధానిగా పనిచేసినప్పటికీ.. ఆయన కుటుంబం గురించి ప్రజలకు అంతగా తెలియదనే చెప్పాలి. మన్మోహన్ సింగ్ భార్య గురుశరణ్ కౌర్, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కుమార్తెలు వారి సంబంధిత రంగాలలో విశేషమైన విజయాలు సాధించారు.92 ఏళ్ల వయసులో ఆయన ఆకస్మిక మరణం ప్రధానంగా ఆయన భార్య గురు శరణ్ కౌర్‌కి తీరని లోటు. ప్రశాంతమైన,గాంభీర్యంగా ఉండే ఆయన ప్రవర్తనతో మనందరికీ తెలిసిన వ్యక్తి అయితే, ఆయన వెనుకున్న నిజమైన శక్తి అతని భార్య గురుశరణ్ కౌర్. ఆయన వెన్నంటే వుంటూ, ఆయన ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర ఆమెదే. పదవిలో 2019లో, మన్మోహన్ సింగ్‌కు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగినపుడు ఆమె భర్తను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఆయన ఆరోగ్యం కోసం గురుద్వారాలో ప్రార్థనలు చేశారు. అంతేకాదు మన్మోహన్ సింగ్ భారత ప్రధానిగా ఉన్న సమయంలోమన్మోహన్ సింగ్ భోజనాన్ని స్వయంగా తయారు చేసి ప్యాక్ చేసి పంపేవారట. Wow !! So beautifully rendered this soulful Kirtan by Mrs.Gursharan Kaur, w/o Dr. Manmohan Singh ( former Prime Minister of India) pic.twitter.com/0HPVtxfzA0— Indu Kumari (@InduKumari1) November 5, 2023డా. మన్మోహన్ సింగ్ భార్య గురుశరణ్ కౌర్ (GursharanKaur) ఎవరు?మన్మోహన్ సింగ్ భార్య గురుశరణ్ కౌర్ 1937, సెప్టెంబర్ 13; జలంధర్‌లో జన్మించారు. యాదృచ్చింగా మన్మోహన్ కూడా సెప్టెంబరు (1932, సెప్టెంబర్26) లోనే పుట్టారు. తండ్రి, సర్దార్ చత్తర్ సింగ్ కోహ్లీ, బర్మా-షెల్‌లో ఇంజనీర్. ఏడుగురు తోబుట్టువులలో ఈమె చిన్నది. 1958లో మన్మోహన్ సింగ్ , గురుశరణ్ కౌర్ వివాహం జరిగింది. మన్మోహన్ సింగ్ భార్య 2009లో ఫ్యాషన్ మ్యాగజీన్ వోగ్లో దర్శనమిచ్చారు. G-20 సమ్మిట్ సందర్భంగా ఏకైక ప్రథమ మహిళ. తన జట్టుకు రంగు వేసుకోకుండా, సహజత్వాన్ని మోసుకెళ్లిన మహిళగా వోగ్ ఆమెను గౌరవించింది. కౌర్ మంచి గాయని కూడా జలంధర్ రేడియోలో కూడా ఆమె కీర్తలను పాడారు. మన్మోహన్ సింగ్ లాగానే, గురుశరణ్ కౌర్ కూడా మృదుస్వభావి.చెక్కు చెదరని మారుతిగురుశరణ్ కౌర్ మన్మోహన్ సింగ్‌తో నిరాడంబరమైన జీవితాన్ని గడిపారు. పెళ్లి అయిన కొత్తలో తమ వివాహబంధానికి గుర్తుగా కొనుక్కున్న మారుతి-800ని ఇప్పటికీ ఆమె వాడతారు. అయితే వీరిది ప్రేమ వివాహమా, కాదా అనేదానిపై స్పష్టత లేదు. కానీ వీరి సుదీర్ఘ ఆదర్శ దాంపత్యం ఒక ప్రేమ కావ్యం లాంటిదే.ముగ్గురు కుమార్తెలుమన్మోహన్ సింగ్, కౌర్ దంపతులకు కుమార్తెలు ముగ్గరు. వారు ఉపిందర్ సింగ్, అమృత్ సింగ్, దమన్ సింగ్. పెద్ద కుమార్తె ఉపిందర్ సింగ్ ప్రఖ్యాత చరిత్రకారురాలు. ఆమె అశోక విశ్వవిద్యాలయంలో ఫ్యాకల్టీ డీన్. గతంలో ఢిల్లీ యూనివర్సిటీలో చరిత్ర విభాగం హెడ్‌గా పనిచేశారు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్, మాంట్రియల్‌లోని మెక్‌గిల్ యూనివర్శిటీ పూర్వ విద్యార్థి. ఆమె ప్రాచీన భారతీయ చరిత్ర, పురావస్తు శాస్త్రం, పొలిటికల్ ఐడియాస్‌పై విస్తృతంగా పరిశోధన జరిపారు. ఆమె రచనలలో ఎ హిస్టరీ ఆఫ్ ఏన్షియంట్ అండ్ ఎర్లీ మెడీవల్ ఇండియా, పొలిటికల్ వయొలెన్స్ ఇన్ ఏన్షియంట్ ఇండియా వంటి పుస్తకాలు విమర్శకుల ప్రశంసలు పొందాయి.రెండో కుమార్తె అమృత్ సింగ్ ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది. స్టాన్ఫోర్డ్ లా స్కూల్లో ప్రాక్టీస్ ఆఫ్ లా ప్రొఫెసర్.రూల్ ఆఫ్ లా ఇంపాక్ట్ ల్యాబ్‌కు వ్యవస్థాపక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా పనిచేస్తున్నారు. యేల్ లా స్కూల్, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్శిటీల నుంచి డిగ్రీలను పొందారు. హింస, ఏకపక్ష నిర్బంధ పద్ధతులకు వ్యతిరేకంగా అంతర్జాతీయ వేదికపై సైతం ఆమె తన గళం వినిపించారు.ఇక చిన్న కుమార్తె దమన్ సింగ్ మంచి రచయిత్రి . లోతైన వ్యక్తిగత, విశ్లేషణాత్మక రచనలకు ప్రసిద్ధి చెందిన నిష్ణాత రైటర్. దమన్ సింగ్ తన తల్లిదండ్రుల జీవితాలలో చోటుచేసుకున్న పరిణామాలను ప్రతిబింబిస్తూ.. స్ట్రిక్ట్లీ పర్సనల్: మన్మోహన్ అండ్ గురుశరణ్ అనే పుస్తకాన్ని కూడా రాశారు. ది సేక్రేడ్ గ్రోవ్, నైన్ బై నైన్ సహా ఆమె ఇతర పుస్తకాలు కథకురాలిగా ఉన్నారు. దమన్ సింగ్ పుస్తకాలు, రచనలు ఆమె బహుముఖ ప్రజ్ఞను ప్రతిబింబిస్తాయి. ఆమె భర్త అశోక్ పట్నాయక్ 1983 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారి. -
2 లక్షల మందిని మింగేసిన రాకాసి అల
-
బాక్సింగ్ డే మ్యాచ్.. ఈ పేరు ఎలా వచ్చింది?
-
వందేళ్లు పూర్తి చేసుకున్న మెదక్ చర్చ్
-
బందరు బంగారు తీగ
అసలు కన్నా వడ్డీ ముద్దు.. ఒరిజినల్ కన్నా ఇమిటేషన్ ఇంపు! అందుకే.. బంగారం మిన్నుకేసి మిడిసిపడుతుంటే.. మార్కెట్లో మెరుస్తూ రోల్డ్‌గోల్డ్ ఆభరణప్రియులను ఆకట్టుకుంటోంది! గోల్డ్ స్థానాన్ని ఆక్రమిస్తూ తన వన్నె పెంచుకుంటోంది! అలాంటి గిల్టునగలకు మేలిమి చిరునామా ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం!! సామాన్యులతోపాటు ధనికులనూ ఆకర్షిస్తున్న మచిలీపట్నం రోల్డ్‌గోల్డ్ జ్యూల్రీపై ప్రత్యేక కథనం..ఎస్.పి. యూసుఫ్, సాక్షి, మచిలీపట్నం. మచిలీపట్నంలోని ఇమిటేషన్ జ్యూల్రీకి సారేపల్లి సాంబయ్య పోతపోశారు. రోజురోజుకు బంగారం ధర పెరిగిపోతున్న కారణంగా ప్రత్యామ్నాయం వైపు దృష్టిసారించారాయన. బంగారం, రాగి లోహాలతో ‘కట్టు’ పద్ధతి ద్వారా నగల తయారీని ప్రారంభించారు. తక్కువ ధరకే లభించడం, వన్నె తగ్గకుండా ఏళ్లపాటు మన్నడంతో నాడు అది లకలపూడి బంగారంగా పేరుపొందింది. తర్వాతర్వాత బంగారం, రాగితో కాకుండా వేరే మెటల్‌తో ముక్కు పుడక దగ్గర్నుంచి ఒడ్డాణం దాకా పలు రకాల నగలను పలు రకాల డిజైన్స్‌లో తయారుచేసి, బంగారు వర్ణం రేకుతో తాపడం పెట్టసాగారు. రోజువారీ ఉపయోగం నుంచి శుభకార్యాలు, ప్రత్యేక వేడుకల వరకు అన్ని సందర్భాలకు అవసరమయ్యే నగలను తయారుచేస్తారు. ట్రెండ్‌కి తగ్గ డిజైన్స్‌తో మెరుపులో అసలు బంగారానికే మాత్రం తీసిపోని ఈ గిల్టు నగలకు మార్కెట్లో డిమాండ్ కూడా పెరుగుతూ వస్తోంది. జీవం పోసిన వైఎస్సాఆర్వైఎస్ రాజశేఖర రెడ్డి సీమ్ అయ్యాక ఈ పరిశ్రమకు జీవం పోశారు. ఎమ్మెస్సెమ్ఈలో దీన్నో క్లస్టర్‌గా గుర్తించి, ఏపీఐఐసీ ద్వారా అభివృద్ధి చర్యలు చేపట్టారు. ఈ నగల పరిశ్రమల కోసం మచిలీపట్నంలో 48 ఎకరాల భూమిని కేటాయించి, జ్యూల్రీ పార్క్‌గా మలచారు. ప్రస్తుతం ఇక్కడ 236 పరిశ్రమలు న్నాయి. ప్రత్యక్షంగా మూడువేల మంది ఉపాధి పొందుతు న్నారు.ఈ జ్యూల్రీ తయారీ మచిలీ పట్నంతో పాటు పెడన, పామర్రు, అవనిగడ్డ వంటి 40కి పైగా గ్రామాల్లో విస్తరించడంతో సుమారు 30వేల మంది ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ రంగాన్ని ఆదుకునేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ సబ్సిడీపై విద్యుత్‌ను అందించారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీఎమ్ అయ్యాక .. ఏడు రూపాయలున్న యూనిట్ ధరను రూ.3.25 పైసలకే ఇచ్చారు.దేశవిదేశాలకు బందరు బంగారు తీగమామూలు నగలే కాకుండా ఆలయాల్లోని విగ్రహాల కిరీటాలు తదితర సామాగ్రి, భరతనాట్యం, కూచిపూడి నాట్య ప్రదర్శనలకు అవసరమైన ఆహార్యంలోని హారాలు, ఒడ్డాణాలు, డ్రామా కంపెనీల ఆభరణాల సెట్లనూ తయారుచేస్తారిక్కడ. 2007లో రూ. 30 కోట్లున్న ఈ పరిశ్రమ టర్నోవర్ జ్యూల్రీ పార్క్ ఏర్పాటు తర్వాత పుంజుకుని, ఐఎస్ఓనూ పొందింది. ప్రస్తుతం దీని టర్నోవర్ రూ. 100 కోట్లకు పైమాటే! బందరు రోల్డ్‌గోల్డ్ నగలకు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా మొదలైన రాష్ట్రాల్లోనూ డిమాండ్ ఉంది. అంతేకాదు శ్రీలంక, మాల్దీవ్స్, , బంగ్లాదేశ్, మయన్మార్, అరబ్ కంట్రీస్కూ ఎగుమతి అవుతున్నాయి. ఈ ఇమిటేషన్ జ్యూల్రీలో కొన్నింటికి ఆరునెలల గ్యారంటీ ఇస్తారు. రంగుపోతే వాటిని మార్చుకోవచ్చు. స్కిల్ హబ్ కింద ఈ నగల తయారీలో ఉత్సాహవంతులకు మూడు నెలల ఉచిత శిక్షణను అందిస్తున్నారు.నాణ్యతకూ మారుపేరుమచిలీపట్నానికి చెందిన సారేపల్లి సాంబయ్య ఆలోచన ఇప్పుడు వేలాది మందికి ఉపాధిగా మారింది. బందరు బంగారు తీగ డిజైన్స్‌కే కాదు నాణ్యతకూ మారుపేరుగా నిలిచింది.∙పెద్దేటి వెంకటసుబ్బారావు, అధ్యక్షుడు, మచిలీపట్నం ఇమిటేషన్ జ్యూల్రీ పార్కు సంఘంవారసత్వాన్ని కాపాడ్డానికి..ఎంతో చరిత్ర ఉన్న మచిలీపట్నం ఇమిటేషన్ జ్యూల్రీ తయారీని తర్వాత తరాలకూ అందించడానికి ఆసక్తి ఉన్నవాళ్లకు ఉచితంగానే శిక్షణనిస్తున్నాం. దీనివల్ల ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు. ∙అంకెం జితేంద్రకుమార్, కార్యదర్శి, మచిలీపట్నం ఇమిటేషన్ జ్యూల్రీ పార్కు సభ్యుల సంఘం. -
మనసున్న మారాజు.. జగనన్న
ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొనడానికి ప్రత్యేకమైన విజన్ వుండాలి.మొదటగా ప్రజల ప్రాణాలను కాపాడడానికి ప్రాధాన్యత ఇవ్వాలి..ఆ తర్వాత ఆస్తులను రక్షించాలి. అందుకోసం పాలకులు అధికార యంత్రాంగంలో స్ఫూర్తిని నింపి.. చిత్తశుద్ధితో పని చేయాలి. తన పాలనలో అదే పని చేశారు తాను ముఖ్యమంత్రిని మాత్రమే కాదు ప్రజాసేవకున్ని అని నిరూపించుకున్నారు వైఎస్ జగన్మోహన్రెడ్డి. మనసున్న నాయకునిగా అడుగులు వేశారు.కరోనా సమయంలో రాజీలేని పోరాటంప్రజలకు ఇచ్చిన హామీలనే కాదు ఇవ్వని హామీలను కూడా నెరవేర్చారు..కరోనాలాంటి మహా విపత్తు సమయంలో ఎక్కడా సంయమనం కోల్పోకుండా అడుగులు వేశారు. ప్రజల ప్రాణాలకు అత్యంత ప్రాధాన్యాత ఇచ్చి రాజీలేని పోరాట పటిమను ప్రదర్శించారు.ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా సమయంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి..ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయాందోళనలు సర్వత్రా వ్యాపించాయి. కరోనా రోగంతో కొంతమంది..భయంతో అనేక మంది చిగురుటాకుల్లా రాలిపోయిన అత్యంత భయానకమైన రోజులవి..అలాంటి గడ్డు పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహనరెడ్డి ఒక బాధ్యతగల ముఖ్యమంత్రిగానే కాదు.. మానవత్వం ఉన్న నాయకునిగా పని చేశారు. ఎప్పటికప్పుడు అధికారులతో, నిపుణులతో సమావేశమై పరిస్థితులను సమీక్షించి సరైన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజల్లో భయమనేది పోగొట్టారు..ఇంట్లో నుంచి జనం బయటకు రావాలంటేనే దడుసుకుంటున్న పరిస్థితుల్లో గ్రామవార్డు సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా ఆయన చేయించిన సేవలను జనం ఎప్పటికీ మరిచిపోరు. నిత్యం ఫీవర్ సర్వేలు చేయించారు. వాటి ఫలితాల ఆధారంగా నిర్ణయాలు తీసుకొని కరోనా భూతాన్ని తరిమికొట్టారు. ప్రజలకు కావాల్సిన మందులు దగ్గర్నుంచి ఆహార పదార్ధాల వరకు అన్నిటినీ అందించారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా జరగనంతగా సేవా కార్యక్రమాలు దాదాపు రెండేళ్లపాటు కరోనా సమయంలో చేసి చూపించారు.ఒక ప్రభుత్వ పెద్దగా తన కిందనున్న అధికారులకు ఆదేశాలు ఇచ్చి వదిలేయవచ్చు. కానీ మానవత్వం ఉన్న మనిషిగా స్పందించారు.మన ఇంట్లో వారే కష్టాల్లో ఉంటే మనం ఎలా స్పందిస్తామో అలా ఆయన పాలన సాగించారు. ఉచితంగానే కరోనా టెస్టులు చేయించటం దగ్గర్నుంచి...ప్రజలకు కావాల్సిన మందులను కూడా నేరుగా వారి ఇంటికి పంపించారు. పక్క రాష్ట్రాల్లో లక్షల రూపాయల ఖర్చయిన కరోనా చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్పించి ఉచితంగానే చేయించారు. ఇది అప్పట్లో ఒక సంచలనాత్మకమైన నిర్ణయం.క్వారంటైన్ సెంటర్లలో వైద్యం చేయించుకుని ఇంటికి వెళ్లే సమయంలో వెయ్యి రూపాయల చొప్పున అందించటంతోపాటు, ప్రతి ఇంటికీ నెలకు రెండు సార్లు రేషన్ ను కూడా ఉచితంగా ఇప్పించారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ చేయిస్తున్న ఈ సేవా కార్యక్రమాలను చూసి ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగం, వ్యాపారాల కోసం వెళ్లిన వారు సైతం తిరిగి ఆంధ్రప్రదేశ్‌కే వచ్చారంటే పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. కరోనా సమయంలో జగన్ పాలనలో ఉన్నాం కాబట్టే మేము బతికి బట్ట కట్టాం అనే మాట చాలామంది నోట విన్నాం.వరద బాధితులకు కొండంత అండగా..వరద బాధితులను కాపాడటంలో వైఎస్ జగన్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించటం దగ్గర్నుంచి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించటం, వారికి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు కల్పించటం వరకు అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. వరదల సమయంలో వెంటనే ఆయా ప్రాంతాలకు వెళ్లి అధికారుల కాళ్లకు అడ్డం పడే పనిని జగన్ ఏనాడూ చేయలేదు. ముందుగా అధికారుల సహాయక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చారు.వారికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఒక ప్రభుత్వ పెద్దగా పైనుంచి చూసుకునేవారు. అంతేకాదు.. వరద పూర్తిగా తగ్గుముఖం పట్టి, బాధితులు తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో వారికి రెండు వేల రూపాయల చొప్పున ఇప్పించారు. వరద సహాయ చర్యలకు ఇబ్బంది వుండదని తెలుసుకున్న తర్వాతనే ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులతో కలిసి మాట్లాడేటప్పుడు తమకు ఏమీ ఇవ్వలేదన్న మాట వారి నుంచి రాకూడదని ముందుగానే అధికారులకు గట్టిగా చెప్పారు.అక్కడక్కడ ఆకస్మిక తనిఖీలు చేసి బాధితులతో మాట్లాడేవారు. ప్రభుత్వం ప్రకటించిన సాయమంతా అందిందా? అని నేరుగా బాధితులనే అడిగేవారు. అంతేకాదు.. మీ కలెక్టర్ కు ఎన్ని మార్కులు ఇవ్వవచ్చో మీరే చెప్పండని కూడా ప్రశ్నించేవారు.ప్రకృతి విపత్తుల సమయంలో జనంలోకి వెళ్లి, అందునా వరద బాధితుల దగ్గరకు వెళ్లి ప్రభుత్వ సాయం పూర్తిగా అందిందా? అని పాలకులు అడగడం ఒక విధంగా సాహసమే అవుతుంది. అయినాసరే ఆ విషయం తెలిసినా సరే వైఎస్ జగన్ వెనకడుగు వేయలేదు.తన ప్రభుత్వం చేసిన సహాయ కార్యక్రమాల మీద, తన అధికారుల మీద ఆయనకున్న నమ్మకం అలాంటిది.ప్రతి ఏటా కృష్ణా, గోదావరి వరదల సమయంలో ముంపు బాధితుల విషయంలో అత్యంత ఉదారంగా వ్యవహరించాలని వైఎస్ జగన్ తరచూ అధికారులతో చెప్పేవారు. మన సొంత మనుషులు ఆ బాధితుల్లో ఉంటే మనం ఎలా వ్యవహరిస్తామో అలా ఆలోచించండి అంటూ అధికారుల్లో స్ఫూర్తిని నింపి వారిలోని మానవత్వాన్ని బయటకు తీసేవారు. ఇదంతా కేవలం మనుషుల్ని ప్రేమిస్తేనే చేయగలం. ఆ ప్రేమ జగన్ లో పుష్కలం. ఆయన ఓదార్పు, పాదయాత్ర సమయాల్లోనేఅన్ని వర్గాల ప్రజల కష్టాలు, కన్నీళ్లను దగ్గరగా చూశారు. అందుకే పాలకునిగా ఎప్పటికప్పుడు సరైన నిర్ణయాలతో ప్రజల మనసులో జననేతగా పేరు సంపాదించుకున్నారు.కృష్ణలంక వాసుల కష్టాలు తీర్చిన నాయకుడుబుడమేరు వరదలు అనగానే బెజవాడ ప్రజలకు కంటి మీద కునుకు వుండదు. కృష్ణలంక వాసుల కష్టాలయితే పగవాడికి కూడా వద్దనేలాగా వుండేవి. కృష్ణానది పొంగితే అక్కడి వేలాది కుటుంబాల పరిస్థితి మరీ భయంకరం.. గతంలో ఆ ప్రాంత వాసులు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా చంద్రబాబు పట్టించుకోలేదు. కానీ వైఎస్ జగన్ సీఎం అయ్యాక వారధి మీదుగా వెళ్తుండగా కృష్ణలంక వాసుల కష్టాలు కనిపించాయి. ఇక అంతే.. ఆయన వెంటనే అధికారులను పిలిపించి నది ఒడ్డున రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు.రిటైనింగ్ వాల్ నిర్మించి మమ్మల్ని కాపాడంటూ ఏ ఒక్కరూ ఆయన్ను నేరుగా అడగకపోయినా రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కళ్లారా వారి కష్టాలు చూశారు కాబట్టేఆయన ఆ పని మొదలుపెట్టారు. మొత్తం రూ.474 కోట్లు వ్యయం చేసి రెండున్నర కిలోమీటర్ల పొడవునా వాల్ నిర్మాణం చేపట్టారు.దీంతో సుమారు 80 వేల మందిని మొన్నటి వరదల నుంచి కాపాడటానికి వీలైంది.పన్నెండు లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినా ఏ ఇబ్బందీ లేకుండా కృష్ణలంక ప్రాంత ప్రజలు ఇప్పుడు హ్యాపీగా ఉండగలుగుతున్నారు. ఇదంతా కేవలం మనసున్న నాయకుడు వైఎస్ జగన్ వలనే సాధ్యం అయింది. ఎవరూ అడగకుండా అన్ని వేల మందికి ఉపయోగపడే రిటైనింగ్ వాల్ నిర్మాణం చేసి ఆ ప్రాంత ప్రజల మనసుల్లో నిలిచారు వైఎస్ జగన్.ఐదేళ్ల వైఎస్ జగన్ పాలనలో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు, పథకాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. పదులసంఖ్యలో ప్రజాదరణ పథకాలు నిత్యం అమలయ్యేవి. దాంతో చాలావరకు అన్ని వర్గాల ప్రజల్లో ఒక భరోసా కనిపించింది. కీలక విద్య వైద్య వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి..అందుకే వైఎస్ జగన్ మనసున్న నాయకుడయ్యారు. శనివారం(డిసెంబర్ 21వ తేదీ) నాడు జననేత జగనన్న పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు.. -
World Meditation Day : మెరుగైన సమాజం కోసం
ప్రస్తుతంపై మనస్సును లగ్నం చేయడాన్ని ధ్యానం అనవచ్చు. ఇది చాలా ప్రాచీన కాలం నుంచి అనేక సంస్కృతుల్లో భాగంగా కొనసాగుతోంది. వ్యక్తి గత శ్రేయస్సు, మానసిక ఆరోగ్యానికి ఇది ఉపయోగ పడుతుంది. అయితే భారతీయ సంస్కృతిలో యోగా, ధ్యానం మిళితమై కనిపిస్తాయి. అందుకే మన ప్రాచీన గ్రంథాలు కానీ, శిల్పాలు కానీ ధ్యాన ముద్రను ప్రతిబింబిస్తూ ఉంటాయి.జూన్ 21వ తేదీని ప్రపంచ ధ్యాన దినోత్స వంగా జరపాలని ఐక్యరాజ్య సమితి (యూఎన్ఓ) నిర్ణయించడం ముదావహం. ధ్యానం యొక్క శక్తిని గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ధ్యానం మానసిక, భౌతిక శక్తి సామ ర్థ్యాలను వృద్ధి చేయడమే కాక మనస్సును ఒక విషయంపై లగ్నం చేయడానికి ఉపకరిస్తుంది. ఆధునిక కాలపు ఒత్తిడులను తట్టుకోవడానికి ధ్యానం ఇప్పుడు ప్రధాన సాధనం అయ్యింది. అలాగే వ్యక్తిగత ప్రయోజనాలకన్నా సామూ హిక శ్రేయస్సుకు ఇది దోహదం చేస్తుంది. దైనందిన జీవితంలో ధ్యానాన్ని ఒక భాగం చేసుకుంటే మానసిక ఒత్తిడుల నుంచి బయటపడవచ్చని నిపుణులు అంటున్నారు. యోగాకు ధ్యానాన్ని జోడిస్తే రక్తపోటు, స్థూల కాయం, ఆందోళన, నిద్రలేమి వంటి వాటి నుంచి బయటపడవచ్చు. అనా రోగ్యం నుంచి త్వరగా కోలుకోవడానికి ధ్యాన, యోగాలు ఎంతగానో ఉపయోగపడతాయంటున్నారు. మనస్సు– శరీరం మధ్య అవినాభావ సంబం«ధాన్ని మన ప్రాచీన యోగశాస్త్రం చెబుతుంది. కానీ ఆధునిక వైద్యులు మనస్సునూ, శరీరాన్నీ రెండు వేరువేరు విభాగాలుగా చూస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో ఈ ధోరణిలో కొంత మార్పు గమనించవచ్చు. ఆరోగ్యవంతమైన జనాభాను, సుస్థిరమైన ప్రపంచాన్ని సృష్టించడానికి ధ్యానం ఒక మార్గంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది.– జంగం పాండు; పరిశోధక విద్యార్థి, హైదరాబాద్(రేపు ప్రపంచ ధ్యాన దినోత్సవం) -
Christmas 2024 ప్రేమ పరిమళించిన చోట తర్కం అంతరిస్తుంది
ఈ భూమి మీద నడిచిన కారుణ్య మూర్తులైన బుద్ధుడు, మహావీరుడు జీసస్ వంటి వారు మానవీయతను ప్రబోధించి శాంతిస్థాపనకు, సమానత్వానికై అజరామరమైన ప్రేమ తత్వాన్ని ఈ లోకానికి బోధించారు. ప్రాక్ పశ్చిమ ప్రపంచంలో నుండి జీసస్ ఒక విభిన్నమైన నైసర్గిక భౌగోళిక పరిస్థితులు ఉన్న ఇశ్రాయేలులోని బెత్లెహాం నందు జన్మించాడు. అది తన చుట్టూ ఉన్న బాబిలోనియా, ఈజిప్ట్ గ్రీక్ దేశాల ఆధునిక, తాత్విక, వైజ్ఞానిక నాగరికతలు, సంస్కృతుల ప్రభావితం కలిగినది.మానవ జీవితంలో 14 సంవత్సరాల ప్రౌఢదశ ఒక ప్రత్యేకమైన శారీరక మానసిక పరిపక్వత గలిగే దశ ్ర΄ారంభం అవుతుంది. సరిగ్గా ఈ దశ మానవుడిని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. అందుకే జోసెఫ్‌కు క్రీస్తు మానవునిగా 14వ తరంగా కన్య మరియకు జన్మించిన రోజే క్రిస్మస్.క్రీస్తు అత్యంత బాహ్యాంతర సౌందర్యమూర్తి, పరిపూర్ణుడు. నీసాటి వాడు నిన్ను కోపగించుకుంటే నువ్వు ప్రతిగా వారిని కోపగించుకోకు. మళ్ళీ వారిపై క్రోధం పెంచుకుంటే వారికి నువ్వు సహాయపడ్డవాడివి అవుతావు. నీ క్రోధం వాళ్లకు బలం, నీకు బలహీనత. అదే నువ్వు వారిని సహృదయంతో మందహాసంతో స్వీకరిస్తే వారు నిశ్చేష్టులవుతారు, అందుకే జీసస్ నువ్వు నీ శత్రువుని ప్రేమించు అని చెబుతాడు. అయితే ఇక్కడ శత్రువు కన్నా పొరుగువారిని ప్రేమించటమే కొంచెం కష్టం అయినా వారితో ప్రేమపూర్వకంగా మెలగాలి. నీలో ఉన్న అంతర్గత ప్రేమను ఒక ఆలింగనం ద్వారా బహిర్గతం చేయి. వారు ఈ పరిణామానికి తమ తార్కిక జ్ఞానాన్ని కోల్పోవాలి. అటువంటి ప్రేమలో తార్కిక విచక్షణ ఉండదు. కాబట్టి ప్రేమ పరిమళించిన చోట తర్కం అంతరిస్తుంది. ఇలాంటి ప్రేమ మార్గానికి పరాకాష్టే జీసస్ స్వరూపం.సరిగ్గా ఈ భావన కొనసాగింపే జీసస్లో మరో ఉదాత్త అంశం నిదర్శనమైనది. అదే ఒక చెంపపై కొడితే మరో చెంపను చూపించు అనటం. అప్పుడు మరో చెంపని చూపించటం వల్ల అవతలి వాడిని ఆలోచనలో పడేస్తుంది కానీ మొదట్లో ఈ విభిన్న ప్రతిస్పందన యూదు వంశస్థులకు అర్థం అవడానికి చాలా కాలం పట్టింది. అది వారి తర్కానికి అందని దృగ్విషయం, అదొక సందిగ్ధావస్థ. ఈ దశ ప్రేమకు ముందూ, ద్వేషభావానికి తర్వాత ఉంటుంది. ఇది సంఘంలో కొంత పరివర్తనకు నాంది పలికింది. వ్యవస్థలో నెలకొన్న అమానవీయ చేష్టలకు అమూల్యమైన మానవ ప్రాణం బలి కాకూడదని సంకల్పించాడు. అందుకే జీసస్ అత్యంత దయార్ద్ర మానవతామూర్తి గా వెలుగొందాడు. క్రీస్తుకు పూర్వం ప్రజలంతా మోసెస్ న్యాయమార్గాన్ని అనుసరిస్తే ఆ తదుపరి జీసస్ సర్వత్రా తన ప్రేమ మార్గాన్ని చూపాడు.జీసస్ ప్రేమస్వరూపుడు అనటం కాదు, జీసస్ స్వయంగా ఒక ప్రేమ స్వరూపుడు. ఇక్కడ జీసస్ వేరూ ప్రేమ వేరూ కాదు. అది అత్యంత అనిర్వచనీయం. ప్రేమ ఎప్పుడూ సత్యంలాగా భాషలో పలికేది కాదు అది కేవలం వ్యక్తీకరించేది. అందుకే యేసును శిలువ వేసే సమయంలో రోమ్ సైనికాధికారి పిలాట్ ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావు అని అడిగితే సత్యం కోసం చేస్తున్నానని సమాధానం ఇస్తాడు, అప్పుడు పిలాతు యేసును మళ్ళీ ప్రశ్నిస్తాడు సత్యం అంటే ఏంటి? అని– ఆ ప్రశ్నకు యేసు మౌనం వహిస్తాడు. ప్రేమ మౌనంగా వ్యక్తపరిచే భాష, ఈ అవ్యాజమైన ప్రేమతో సమస్త జనులారా మీరు నా వద్దకు రండి మిమ్ములను క్షమిస్తాను, ప్రేమిస్తాను అని ప్రేమతో సందేశాన్ని ఇచ్చాడు యేసు. అయితే యూదులు ఆ సత్యసాక్షిని సహృదయంతో అర్థం చేసుకోలేదు. కనుకనే శిలువపై ఏసుగా మరణించి క్రీస్తుగా పునర్జన్మ పొందిన మానవరూప దివ్య దైవత్వంగా పరిణామం చెందాడు. అందుకే సంఘం యథార్థవాదులందరినీ లోకవిరోధులుగానే చిత్రీకరిస్తుంది. అందుకు తార్కాణంగా ప్రముఖ గ్రీకు దార్శనికుడు సోక్రటీస్కు రాజ్యం విషం ఇచ్చి మరణశిక్షను విధించింది. అలాగే భారతీయ దార్శనికుల్లో విప్లవాత్మకమైన శాంతి, సత్య తత్వాన్ని అందించిన బుద్ధుని బోధలూ, బౌద్ధం భారతదేశం నుంచి తరిమి వేయబద్దాయి. అదేవిధంగా యూదుల ఆలోచనలను సరిదిద్దే ప్రయత్నంలో జీసస్ కృషి నిరర్థకమే అయింది. వారికి సత్యం, ప్రేమల తత్వం అర్థం కాలేదు. వారు జీసస్ సత్యమార్గాన్ని చేరుకోలేక అపవాదిగా మార్చి సిలువ వేశారు. ఈ దార్శనికులంతా వారి తాత్విక సందేశాలతో సమస్త జీవకారుణ్యతతో ఎటువంటి మారణాయుధాలు లేకుండా ఒక మనిషి మరో మనిషిపై గాని, ఒక జాతి మరో జాతిపైగానీ, ఒకరి భావజాలం మరొకరి భావజాలంపై గాని, సాంస్కృతిక దురాక్రమణలు కానీ, ధర్మం పేరిట యుద్ధాలు, రక్తపాతాలు గానీ సృష్టించలేదు. కేవలం ప్రకృతి ధర్మాలను వివరిస్తూ మనుషుల మధ్య సమతను, సమానత్వాన్ని, ప్రేమ పూర్వక ప్రవచనాలతో, వాత్సల్యపు వాక్యాలతో శాంతి సామ్రాజ్యాల స్థాపనకు ప్రాణత్యాగాలు చేశారు. అందుకు కావలసింది ద్వేషాన్ని, అహంకారాన్ని విడనాడటమే. ఇవి మనలో నుండి మనపైకి అధిరోహించి మనల్ని అథఃపాతాళానికి తొక్కేస్తాయి, కానీ మనమే అహంకారాన్ని అధోపాతాళానికి తొక్కిపెడితే మనం ఆకాశానికి ఎదుగుతాం.ప్రేమ మౌనంగా వ్యక్తపరిచే భాష, ఈ అవ్యాజమైన ప్రేమతో సమస్త జనులారా మీరు నా వద్దకు రండి మిమ్ములను క్షమిస్తాను, ప్రేమిస్తాను అని ప్రేమతో సందేశాన్ని ఇచ్చాడు యేసు. అయితే యూదులు ఆ సత్యసాక్షిని సహృదయంతో అర్థం చేసుకోలేదు. కనుకనే శిలువపై ఏసుగా మరణించి క్రీస్తుగా పునర్జన్మ పొందిన మానవరూప దివ్య దైవత్వంగా పరిణామం చెందాడు. - ప్రొ. చెరుకుపల్లి వంశీధర్ -
శోభితతో ప్రేమ గురించి తొలిసారి నోరు విప్పిన నాగ చైతన్య
అక్కినేని అందగాడు హీరో నాగ చైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ మూడుముళ్ల బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. పెళ్లయి పక్షం రోజులు గడుస్తున్నా ఇంకా పెళ్లి ముచ్చట్టుసోషల్మీడియాలో సందడి చేస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ లవ్బర్డ్స్ని ఇంటర్వ్యూ చేసి, వారి ప్రేమ ప్రయాణం గురించి ఆంగ్ల పత్రిక న్యూయార్క్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది. దీన్ని నాగచైతన్య రెండో భార్య శోభిత తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అలాగే తెలుగు భాష ఔన్నత్యాన్ని గురించి కూడా కమెంట్ చేసింది. దీంతో న్యూయార్క్ టైమ్స్ కథనం వైరల్‌గా మారింది.ఈ ఇంటర్వ్యూలో నాగ చైతన్య చాలా విషయాలను పంచుకున్నాడు. ముఖ్యంగా శోభితతో తన ప్రేమ, ఆమెపై అభిమానాన్ని పెంచుకోవడానికి గల కారణాలను షేర్ చేశాడు. శోభిత నిజాయితీ తనకు బాగా నచ్చిందని కామెంట్ చేశాడు. తాను పుట్టింది హైదరాబాదులోనే అయినా పెరిగింది మొత్తం చెన్నైలోనే అనీ, అందుకే తనకు తెలుగు సరిగ్గా రాదని చెప్పుకొచ్చాడు. శోభిత తెలుగు, తనను ఆమెకు మరింత దగ్గరి చేసిందని వెల్లడించాడు. ఆమె స్వచ్ఛమైన తెలుగు, తనను మూలాల్లోకి తీసుకెళ్లిందని అదే ఆమెకు దగ్గరి చేసిందని తెలిపాడు. మాతృభాషలోని వెచ్చదనం తమ ఇద్దరి మధ్యా ప్రేమను చిగురింప చేసిందన్నాడు నాగ చైతన్య. View this post on Instagram A post shared by Sobhita (@sobhitad)శోభితా ప్రేమలో ఎలా పడ్డాడో వివరిస్తూ ఆమె‘మేడ్ ఇన్ హెవెన్ స్టార్' ఆమె మాటలు చాలా లోతుగా ఉంటాయి అంటూ భార్యను పొగడ్తల్లో ముంచెత్తాడు. ఆమె నిజాయితీతో తాను ప్రేమలో పడిపోయానని వెల్లడించాడు. శోభిత సోషల్‌మీడియా పోస్ట్‌లు ఆమె వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి వాస్తవికతకు దగ్గరగా ఉంటాయి అని పేర్కొన్నాడు. అంతేకాదు ఆమె పోస్ట్ చేసే బ్లర్ ఫోటోలే తనకిష్టం, అంతేకానీ, గ్లామర్ కోసం, ప్రచారం కోసం పీఆర్ టీం చేసే ఫోటోలు కాదంటూ వ్యాఖ్యానించాడు. సినిమా షూటింగ్లో ఉండగానే రెండు నెలల్లో తన పెళ్లిని ప్లాన్ చేసుకున్నట్లు శోభితా ధూళిపాళ వెల్లడించింది. ఇద్దరమూ మాట్లాడుకుని, ప్రధానంగా చైతన్య కోరికమేరకు సన్నిహితుల సమక్షంలో చాలా సింపుల్‌గా, సంప్రదాయ బద్ధంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని చెప్పింది. తమ వివాహం ఆధ్మాత్మికంగా, దేవాలయం అంత పవిత్ర భావన కలిగిందంటూ తన పెళ్లి ముచ్చట్లను పంచుకుంది. దీంతో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కాగా డిసెంబర్ 4 న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాగ చైతన్య, శోభితా ధూళిపాళ వివాహం వైభంగా జరిగింది. అంతకుముందు ఆగష్టు 8న నిశ్చితార్థం వేడుకతో తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. శోభితతో పెళ్లికిముందు టాలీవుడ్ హీరోయిన్ సమంతాను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య , ఆ తర్వాత ఆమెకు విడాకులిచ్చిన సంగతి తెలిసిందే. -
వీడని మలబార్ పునుగు పిల్లి పొడుపు కథ!
బిల్డింగ్ చుట్టూ ఉన్న ఏనుగుల కందకంలో ఫారెస్ట్ గార్డ్ రాత్రి భోజనంలో మిగిలిపోగా పారేసిన కోడి ఎముకలను పటపటా నవులుతున్నాయి ఆ రెండు పెద్ద పునుగు పిల్లులు. అవి చిన్న భారత పునుగు పిల్లుల కంటే చాలా పెద్దగా ఉన్నట్టున్నాయి. మా శక్తివంతమైన లైట్లను మెరుగైన దృష్టికోణంతో చూడటానికి అవి మధ్య మధ్యలో వాటి వెనక కాళ్లపై నుంచుంటున్నాయి. మా అందరికి ఒకటే ఆలోచన వచ్చింది: మలబార్ పునుగు పిల్లి, ఎవరికీ అంతుచిక్కని పాలిచ్చే భారతీయ జంతువు. అవి పారిపోతాయేమోనన్న భయానికి మేము కెమెరా తీసుకు వచ్చే ప్రయత్నం చెయ్యలేదు. దానికి బదులుగా మేము చీకట్లోనే దాని లక్షణాలు గుర్తుంచుకోవడానికి ప్రయత్నించాము.దెగ్గర దెగ్గర ఆరు దశాబ్దాల క్రితం హై వేవీ మౌంటెన్స్ తెయ్యాకు ఎస్టేట్‌లోని తెయ్యాకు రైతు అయిన ఆంగస్ హటన్ మలబార్ పునుగు పిల్లి చాలా విరివిగా కనిపించే జంతువని వ్రాసి పెట్టారు., కానీ ఆయన చిన్న భారతీయ పునుగు పిల్లిని చూసి అలా పొరపాటు పడ్డారేమో అనేది ఒక ప్రఘాడ అనుమానం. 1939 కల్లా మలబార్ పునుగు పిల్లి అరుదై, అంతరించిపోవడానికి దెగ్గరగా ఉందేమోనని జంతు శాస్త్రవేత్తలు భయపడ్డారు. మేము ఎంతో ఉత్సాహంగా, రెండు మలబార్ పునుగువ పిల్లులని చూశామని సందర్శకుల పుస్తకంలో రాశాము.మలబార్ పునుగు పిల్లిని లోగోగా పెట్టుకున్న సెంటర్ ఫర్ వైల్డ్‌లైఫ్ స్టడీస్ సంస్థలో అజిత్ కుమార్ గారు మేము మలబార్ పునుగు పిల్లిని చూశామని విశ్వసించలేదు. చిన్న భారతీయ పునుగు పిల్లి ఎంతో విసతృతంగా రకరకాల నివాసాలలో, ఎత్తులలో, ఆక్షాంసాలలో, చాలా విభిన్న లక్షణాలు, శరీర ఆకృతి, పరిమాణాలు కలిగి ఉంటుందని ఆయన సూచించారు.ఒక జీవశాస్త్రవేత్త, మేము చూసిన పునుగు పిల్లికి సింహం వంటి జూలు ఉందా అని అడిగారు. కానీ మేము అది గమనించలేదు. మెడ పొడవునా మూడు చారలూ? అటువంటిదేదో చూశామని మేము అనుకున్నాం. దాని తోక చుట్టూ కట్లు గమనించామా అని ఇంకొకరు అడిగారు. ఏమో, అప్పుడు చాలా చీకటిగా ఉంది. వాటి తోక చివర నల్లగా ఉందా? దృరదృష్టవశాత్తు ఈ లక్షణాల కోసం చూడాలని మాకు తెలియలేదు.పాలిచ్చే చిన్న జంతువుల మీద నిపుణులైన నందిని రాజమణి మారియు దివ్య ముదప్పా, ఇంగ్లాండ్‌లో మారియు ఇండియాలో ఉన్న రకరకాల మ్యూసియంలలో భద్రపరచిన మలబార్ పునుగు పిల్లులకి సంబంధించిన ఆరు చార్మాలూ ఇంకా మూడు కాపలాలు పరీక్షించారు. అంతే కాక 1800లు మొదలుకుని పునుగు పిల్లుల మీద రాయబడ్డ ప్రతీదీ చదివేసారు.నివేదిక ప్రకారం మలబార్ పునుగు పిల్లి పడమర కానుముల లోతట్టు తీరప్రాంత అడవులలోని కర్వార్, ఉత్తర కర్ణాటక నుంచి కేరళలోని త్రివేండ్రమ్ వరకూ కనిపిస్తాయి. కొద్ది సార్లు అవి తిరుణలవెలి లోపల బిలిగిరి రంగస్వామి కోవెల వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలోనూ, హై వేవీ కొండలంలోనూ కనిపించాయి. కానీ అవి ఎక్కువగా కోజికోడ్ చుట్టుపక్కలే కనిపించాయి. ఆసియాలో మరి ఏ పునుగు పిల్లి ఇంత పరిమిత పరిధిలో ఉండదు.పేరుగాంచిన మలబార్ పునుగు పిల్లి యొక్క మస్క్ కోసం దాన్ని వేటడడం వల్ల అవి అరుదైపోయి ఉండడానికి అవకాశం ఉండవచ్చని నందిని, దివ్య ఒప్పుకున్నారు. కానీ, వేరే పునుగు పిల్లులు చక్కగా అభివృద్ధి చెందుతుంటే, ఈ జంతువు వాటి నివాసమైన అడవులను పొలాలుగా మారిస్తే తట్టుకోలేనంత సున్నితమైనవా?మ్యూసియం నమూనాలా మూలం సరిగా తెలియనందువల్ల, ఇంకా పాలిచ్చే జంతువుల నిపుణుల మధ్య బేధభిప్రాయాలవల్ల, మలబార్ పునుగు పిల్లి రూపం పట్లా, లక్షణాల పట్లా నిజమైన స్పష్టత లేదు. ఇది చాలదన్నట్టు దక్షిణ ఆసియాలోని పెద్ద-చుక్కల పునుగు పిల్లులు మారియు మలబార్ పునుగు పిల్లులు దెగ్గర దెగ్గర ఒకే పోలికలతో ఉంటాయి. ఈ విషయం ఒక విప్లవాత్మక ప్రత్యామ్నాయం సూచిస్తుంది: మలబార్ పునుగు పిల్లులు ఎన్నడూ ఉనికిలోనే లేవు!మందుల తయారిలో, సుగంధ ద్రవ్యాలా తయారిలో, ఇంకా పూజలలో ఉపయోగించే పునుగు పిల్లుల మస్క్ గ్రంధిలోని సివిటోన్ కోసం వేల ఏళ్లుగా ఇథియోపియా, దక్షిణ ఆసియా ఇంకా భారతదేశం మధ్య వ్యాపారం సాగుతోంది. ఈ రోజుకి కూడా మస్క్ తియ్యటంకోసం, ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో చిన్న పునుగు పిల్లులను ఫార్మ్ లో పెంచుతారు. ఈ మధ్యకాలంలో అతి ఎక్కువగా మలబార్ పునుగు పిల్లి కనిపించిన స్థలమైన కోజికోడ్ పూర్వ కాలం నుంచీ పునుగు పిల్లుల వ్యాపార కేంద్రం. దక్షిణ ఆసియా నుంచి తెచ్చిన పెద్ద-చుక్కల పునుగు పిల్లులు చెర నుంచి తప్పించుకు పారిపోవడంతో అప్పుడప్పుడు అడవిలో పునుగు పిల్లులు కనిపించడానికి అవకాశం ఇచ్చివుంటుందా అని నందిని, దివ్య ఆలోచించారు. ఇదేమంత అసంభవం కాదు, ఎందుకంటే చిన్న భారత పునుగు పిల్లులు తప్పించుకుని మాడగాస్కర్, ఫిలిప్పీన్స్ మారియు ఇతర దక్షిణ ఆసియా దీవులలో వాటినవి స్థాపించుకున్నాయి. అందువల్ల మలబార్ పునుగు పిల్లి, పెద్ద- చుక్కల పునుగు పిల్లి కంటే పెద్ద ప్రత్యేకత కలిగిందేమి కాకపోవచ్చు అనడానికి ఎంతో అవకాశం ఉండీ. ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడంలో జన్యు పరీక్ష ఇంకొక ముందంజ వేస్తుంది. అసల మలబార్ పునుగు పిల్లులు నిజమైనవేనా? కానీ పురాతన నమూనాల నుంచి తీసిన డిఎన్ఏ మరీ సిధిలం అయిపొయింది. అందువల్ల మలబార్ పునుగు పిల్లిని గురించిన పొడుపు కథ ఇంకా వీడలేదు.Author: జానకి లెనిన్Translator: రోహిణి చింతా -
నోరు మంచిదైతే, ఊరు మంచిదవుతుంది : ఖాళీ బిందె
ఓ గ్రామంలోని చేదబావి దగ్గర ఇద్దరు మహిళలు వాదులాడుకుంటూ ఉన్నారు. ఒక మహిళ గట్టి గట్టిగా అరుస్తోంది. మాటలు పడుతున్న స్త్రీ కన్నీళ్ళు పెట్టుకుంది.దారినపోతున్న ఓ పండితుడు అది గమనించాడు.గట్టిగా మాట్లాడుతున్న మహిళతో ‘‘ఇలా అరవడం మంచిది కాదు’’ అని చెప్పబోయాడు.‘‘నోరు ఉన్న వాళ్ళదే కదా రాజ్యం!’’ అని బదులిచ్చింది అరిచిన మహిళ.చిన్న నవ్వు నవ్వాడు ఆ పండితుడు.ఖాళీగా ఉన్న బిందెను చేంతాడు సహాయంతో బావిలోకి పంపమన్నాడు. ‘అదెంత పని’ అని అనుకున్న ఆమె ఖాళీబిందెను సరసరా బావిలోకి వదిలింది. బిందెలో నీళ్ళు చేరాక పైకి లాగమన్నాడు. శక్తిని ఉపయోగిస్తూ బిందెను లాగడం ప్రారంభించింది.‘‘ఎలా ఉంది?’’ అని ప్రశ్నించాడు పండితుడు.‘‘బిందెలో నీళ్ళు ఉన్నాయి కదా, కాబట్టి బరువుగా ఉంది. కష్టంగా లాగుతున్నాను’’ అని సమాధానమిచ్చింది.‘‘ఖాళీ బిందెని బావిలోకి వదిలినంత సులభంగా మనం ఎదుటివారిని ఎన్నో మాటలనవచ్చు. కానీ ఆ మాటలు ఎదుటి వారి మీద ఎంత ప్రభావం చూపిస్తాయో ఆలోచించాలి. నీళ్ళు చేరాక ఖాళీ బిందె ఎలా బరువయ్యిందో, అలాగే మన మాటలు చాలా మంది మనసుల్ని బరువుగా చేస్తుంది.ఒంటికి తగిలిన గాయాలను కొన్నాళ్ళకు మరుస్తామేమో కానీ, మనసుకు తగిలిన గాయాల్ని అంత సులభంగా మరువలేము. ఆపైన, మనం ఎప్పుడు వారికి కనిపించినా మనం మాట్లాడిన మాటలే వారికి గుర్తుకు వస్తాయి. వారి మనసు బాధగా మూలుగుతుంది. విరిగిన మనసు అంత సులభంగా అతకదని తెలుసుకో. ఆ తర్వాత మనం ఎంత ప్రయత్నించినా మనలోని మంచి వారికి కనిపించదు. అందుకే మనం మాట్లాడేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాలి. మాటలు మన పెదాలు దాటితే అవి మన అధీనంలో ఉండవు. మాటలు అనడం తేలిక. మాటల పర్యవసానం చాలా భారం. దానికి ఎంతో మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అంతేకాదు, మనుషుల్ని రాబట్టుకోవడం కష్టం, పోగొట్టుకోవడం సులభం’’ అని హితవు చెప్పాడు. నోరు మంచిదైతే ఊరు మంచిదని గుర్తించిన ఆ మహిళ, అక్కడే కన్నీళ్ళు పెట్టుకుని బాధపడుతున్న స్త్రీని క్షమాపణలు కోరింది. ఇద్దరూ కలిసి నవ్వుతూ చేద బావిలోని నీళ్ళను చేదుకున్నారు. – ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
యూజీసీ సిఫార్సులు ఆచరణ సాధ్యమేనా?
సాక్షి, ఎడ్యుకేషన్: ఉన్నత విద్యలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రతిపాదించిన సంస్కరణలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డిగ్రీ, పీజీలో ప్రవేశాలు మొదలు.. కోర్సుల వ్యవధి వరకు యూజీసీ సిఫార్సులు ఆచరణలోకి వస్తే ఉన్నత విద్యా రంగంలో కీలక మార్పులు చోటుచేసుకొంటాయి. అయితే ఈ సిఫార్సులపై నిపుణులు భిన్నంగా స్పందిస్తున్నారు. మన దేశ పరిస్థితులకు అనుగుణంగా ఈ మార్పులు సత్ఫలితాల నివ్వడానికి కనీసం పదేళ్ల సమయం పడుతుందని అంటు న్నారు. ఉన్నత విద్యలో సంస్కరణల కోసం ‘మినిమమ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ద గ్రాంట్ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ రెగ్యులేషన్స్–2024’ పేరుతో యూజీసీ ఈ నెల ఐదో తేదీన ముసాయిదాను విడుదల చేసింది. దీనిని అన్ని రాష్ట్రాలకు పంపి, ఈ నెల 23వ తేదీలోగా అభిప్రాయాలు తెలపాలని లేఖలు రాసింది. యూజీసీ సిఫార్సులపై అధ్యయనం చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఉన్నత విద్యామండలిని ఆదేశించింది. ఏటా రెండు సార్లు ప్రవేశం..యూజీసీ సిఫార్సుల్లో ముఖ్యమైనది.. బ్యాచిలర్, పీజీ స్థాయిలో ఏటా రెండు సార్లు (జూలై / ఆగస్ట్, జన వరి/ఫిబ్రవరి) ప్రవేశ ప్రక్రియ నిర్వహించటం. ఇది విద్యా ర్థులకు కొంత మేలు చేసే అంశమేనని విద్యావేత్తలు అంటున్నారు. వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత పొందని.. సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి ఉన్నత విద్య అభ్యసించే విషయంలో సమయం వృథా కాకుండా ఈ ప్రతిపాదన మేలు చేస్తుందని చెబుతున్నారు. అయితే..ఈ ప్రతిపాదన అమలుచేయాలంటే ఫ్యాకల్టీ, ఇతర బోధన సదుపాయా లను రెట్టింపు చేయాల్సి ఉంటుందని అంటున్నారు. ఇప్ప టికిప్పుడు అది సాధ్యం కాకపోవచ్చని పేర్కొంటున్నారు. హెచ్‌ఈసీతో బీటెక్ చదవగలరా?యూజీసీ మరో సిఫార్సు.. అకడమిక్ నేపథ్యం ఏదైనా.. విద్యార్థులు ఉన్నత విద్యలో తమకు నచ్చిన కోర్సులో చేరే అవకాశం కల్పించడం. ఉదాహరణకు.. ఇంటర్మీడియెట్‌లో హెచ్ఈసీ చదివిన విద్యార్థి.. బీటెక్ ప్రవేశాలకు నిర్వహించే ఎంట్రన్స్‌లలో (జేఈఈ, ఈఏపీసెట్ తదితర) ఉత్తీర్ణత సాధించి బీటెక్‌లో చేరొచ్చు. దీనిపై వ్యతిరేక అభిప్రాయా లు వ్యక్తమవుతున్నాయి. ఆర్ట్స్, హ్యుమానిటీస్ విద్యా ర్థులు.. గణితం, సైన్స్, ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌ల సమ్మేళనంగా ఉండే బీటెక్‌లో రాణించడం సాధ్యం కాదని అంటున్నారు. బహుళ ప్రవేశ, నిష్క్రమణ అవకాశంయూజీసీ ప్రతిపాదనల్లో మరో కీలకమైన అంశం బహుళ ప్రవేశ, నిష్క్రమణ (మల్టిపుల్ ఎంట్రీ, ఎగ్జిట్) విధానం. బ్యాచిలర్, పీజీ ప్రోగ్రామ్‌లలో చేరిన విద్యార్థులు తమకు నచ్చిన సమయంలో కోర్సు నుంచి వైదొలగే అవకాశం, ఆ తర్వాత మళ్లీ అదే కోర్సులో.. తదుపరి తరగతిలో ప్రవేశం పొందే అవకాశం కల్పించటం ఈ ప్రతిపాదన ముఖ్య ఉద్దేశం. కానీ.. ఇలాంటి విధానం ఫలితంగా విద్యార్థుల్లో ఉన్నత విద్య స్ఫూర్తి కొరవడే ప్రమాదం ఉందని, ఇది జాబ్ మార్కెట్‌పై ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. స్కిల్ కోర్సులు, అప్రెంటిస్షిప్స్ఉన్నత విద్యలో స్కిల్ కోర్సులను, అప్రెంటిస్షిప్స్ను సమీకృతం చేసేలా మరో ప్రతిపాదన చేశారు. బ్యాచిలర్ డిగ్రీలో మొత్తం క్రెడిట్స్‌లో 50 శాతం పూర్తి చేసుకున్న వారు.. మరో 50 శాతం క్రెడిట్స్ కోసం స్కిల్ కోర్సులను, అప్రెంటిస్‌షిప్‌ను, మల్టీ డిసిప్లినరీ సబ్జెక్ట్‌లను ఎంచుకోవచ్చని పేర్కొన్నారు. అయితే స్కిల్ కోర్సులను అందించే క్రమంలో.. రాష్ట్రాల స్థాయిలో యూనివర్సిటీలకు మౌలిక సదుపాయాల కొరత సమస్యగా మారుతుందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు.ఒకే సమయంలో రెండు డిగ్రీలుఅకడమిక్ ఫ్లెక్సిబిలిటీ విధానంలో ఒకే సమయంలో రెండు డిగ్రీ ప్రోగ్రామ్స్‌ను అభ్యసించే విధానాన్ని కూడా యూజీసీ ప్రతిపాదించింది. విద్యార్థులు తాము చేరిన కోర్సు/విద్యా సంస్థతోపాటు మరో ఇన్స్టిట్యూట్లో లేదా మరో అభ్యసన విధానంలో అర్హత మేరకు మరేదైనా బ్యాచిలర్ లేదా పీజీ డిగ్రీలో చేరొచ్చు. అయితే ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం మన విద్యా వ్యవస్థకు సరితూగేలా లేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.రెండున్నరేళ్లకే బ్యాచిలర్ డిగ్రీరెండున్నరేళ్లకే డిగ్రీ పూర్తి చేసుకునేలా యూజీసీ ప్రతి పాదన చేసింది. యాక్సెలెరేటెడ్ డిగ్రీ ప్రోగామ్ పేరుతో ప్రతి విద్యా సంస్థలోని మొత్తం విద్యార్థుల్లో పది శాతం మందికి ఈ అవకాశం కల్పించాలని సూచించింది. నాలుగేళ్ల డిగ్రీ ప్రోగామ్స్ విషయంలో మూడేళ్లలో వాటిని పూర్తి చేసుకునే అవకాశం కల్పించాలి. కానీ యాక్సలెరేటెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ విధానంలో.. టీచింగ్–లర్నింగ్ కోణంలో సమస్య ఉత్పన్నమవుతుందని, విద్యార్థులు ఒత్తిడికి గుర వుతారని నిపుణులు అంటున్నారు. బ్యాచిలర్ డిగ్రీని రెండున్నరేళ్లలో పూర్తి చేసుకునే అవకాశం కల్పించిన యూ జీసీ.. పీజీ విషయంలో మాత్రం మూడేళ్లు లేదా నాలుగేళ్ల డిగ్రీ పూర్తి చేసుకున్న వారినే అర్హులుగా నిర్దేశించాలని సూచించింది. దీంతో.. రెండున్నరేళ్లకు లేదా మూడేళ్లకే బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసుకున్న వారికి పీజీ ప్రవేశాల అర్హతపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.తక్షణ అమలు సాధ్యం కాదు..యూజీసీ ప్రతిపాదనలు, సిఫార్సులను తక్షణం అమలు చేసే పరిస్థితి ప్రస్తుతం మన దేశంలో లేదు. ఇవి పూర్తి స్థాయిలో అమలు కావాలంటే అయిదు నుంచి పదేళ్ల సమయం పట్టొచ్చు. ముఖ్యంగా ప్రభు త్వ విద్యా సంస్థలు ఈ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటాయి. ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీల్లో కొంత మేర వీటిని వెంటనే అమలు చేసే వీలుంది. – ప్రొఫెసర్. డి.ఎన్. రెడ్డి, యూజీసీ మాజీ సభ్యుడు, జేఎన్టీయూ మాజీ వీసీఆహ్వానించదగ్గ పరిణామంయూజీసీ తాజా సిఫార్సులను ఆహ్వానించదగ్గ పరిణామంగా చెప్పొచ్చు. విద్యార్థులు ఫ్లెక్సిబుల్ లర్నింగ్ విషయంలో అదనపు కసరత్తు చేయాల్సి ఉంటుంది. కొంత మానసిక ఒత్తిడిని కూడా తట్టుకునే సామర్థ్యం ఉండాలి. ఇందుకోసం అవసరమైన వనరులను ఉన్నత విద్యా సంస్థలు కల్పించాలి. – ప్రొఫెసర్. వి.ఎస్.రావు, ప్రొ వైస్ ఛాన్స్లర్ అడ్వయిజర్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీదశల వారీగా అమలు చేయాలిగ్లోబలైజేషన్ నేపథ్యంలో ఈ సంస్కరణలు అవస రమే.. కానీ అమలు విషయంలో ఫ్యాకల్టీ కొరత సమస్యగా మారుతోంది. ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ కోణంలో పలు చర్యలు తీసుకుంటున్నాం. ఆర్ట్స్, హ్యుమానిటీస్ విద్యార్థులు ఫ్లెక్సిబుల్ లర్నింగ్ విధానంలో బీటెక్, సైన్స్ కోర్సుల్లో రాణించడం కష్టంగానే ఉంటుంది. – ప్రొఫెసర్. వి. బాలకిష్టారెడ్డి, చైర్మన్, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి -
క్రేజీ.. డీజే..
అర్ధరాత్రి సమయం..చిమ్మ చీకట్లని. పట్ట పగలుగా మార్చే రంగురంగుల విద్యుత్ కాంతుల్లో.. ఓ వైపు ఛీర్స్‌తో హుషారు.. మరోవైపు చిందుల జోరు.. ఆ సమయంలో తోడు లేకుండా అమ్మాయిలు బయటకు వెళ్లడమే సరికాదని నొక్కి వక్కాణించే సంప్రదాయ వాదుల చెవులకు చిల్లులు పడే సంగీతంతో కదం తొక్కుతున్నారు ఆధునిక యువతులు. డీజేలుగా.. మేల్ డామినేషన్‌కు గండికొడుతూ శరవేగంగా ముందుకు దూసుకొస్తున్నారు. ‘మనసుకు నచ్చిన సంగీతం.. వయసుకు తగ్గ వినోదం.. మంచి ఫ్రెండ్స్. ఇన్ని అందించే రంగాన్ని వదిలేసి సాదా సీదా ఉద్యోగం ఎందుకు చేయాలి?’ అని ప్రశ్నింస్తున్నారు అఖిల. ఉద్యోగం అంటే మంచి ఆదాయం వస్తుంది కదా..అంటే..! ‘నేను ఎంచుకున్న కెరీర్లో అంతకన్నా ఎక్కువ సంపాదనే ఇప్పుడు వస్తుంది’ అంటూ స్పష్టం చేశారు. సాయంత్రం ఆరు దాకా అఖిల.. ఆరు దాటాక డీజే బ్లాక్.ఎవరూ డేర్ చేయని రోజుల్లోనే.. దాదాపు పదేళ్ల క్రితమే ఈ రంగంలోకి వచ్చారు లీనా. నగరంలోని సికింద్రాబాద్‌లో నివసించే ఈ సింథీ యువతి.. డిగ్రీ పూర్తి చేసి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు కూడా చేశారు. అనంతరం కొన్ని షోస్ చేశారు.. చిన్న చిన్న ఉద్యోగాలు చేసి ఆ తర్వాత ఫుల్‌టైమ్ డీజేయింగ్ను ఎంచుకున్నారు. ‘ఏవీ మనసుకు నచ్చలేదు. అదే నా కెరీర్‌ను ఇటు మార్చింది’ అంటూ చెప్పారు డీజే లీనా. ఫ్రీలాన్స్ డీజేగా సిటీలోని సగం పైగా క్లబ్స్‌లో ఇప్పటికే తన మ్యూజిక్ వినిపించానంటున్న లీనా.. బాలీవుడ్ అంటే తనకు ప్రేమ అనీ, అందుకే ఆ సంగీతాన్ని ప్లే చేయడానికి తాను ఇష్టపడతానని అంటున్నారు. అమ్మాయిలు ఈ రంగంలోకి ఎక్కువగా రాకపోవడానికి కుటుంబ సభ్యుల నుంచి మద్దతు దొరకకపోవడమే కారణమంటున్నారు లీనా.. తాను కూడా అతి కష్టం మీద కుటుంబ సభ్యులను ఒప్పించగలిగానని చెబుతున్నారు.ట్రెడిషనల్ ఫ్యామిలీలో.. ట్రెండీగా.. ‘నేను ఇక్ఫాయ్లో బీబీఏ పూర్తి చేశాను. సొంతంగా బిజినెస్ చేయాలనేది నా ఆలోచన. అయితే చిన్నప్పటి నుంచీ డీజేయింగ్ అంటే ఇష్టం. ఫ్రెండ్స్‌తో క్లబ్స్‌కి వెళ్లినప్పుడు కేవలం డీజే మ్యూజిక్ కోసమే వెళ్లేదాన్ని’ అంటూ గుర్తు చేసుకున్నారు అఖిల. మహబూబ్ నగర్‌కు చెందిన ఓ పూర్తి సంప్రదాయ కుటుంబంలో పుట్టిన అఖిల.. 2018లో డీజే స్కూల్లో చేరాలని నిర్ణయించున్నారు. అప్పుడు ఇంట్లో వాళ్ల నుంచి చెప్పుకోదగ్గ ప్రతిఘటననే ఎదుర్కొన్నారు. ‘ఫ్యామిలీ వద్దు అన్నప్పటికీ మనసు మాటే విన్నాను. ఒక ప్రోగ్రామ్‌కి కేవలం రూ.1000తో ప్రారంభించి.. ఇప్పుడు అంతకు పదింతలు తీసుకునే స్థాయికి చేరాను’ అంటూ సగర్వంగా చెప్పారామె. అమ్మాయిల భద్రత విషయం గురించి మాట్లాడినప్పుడు.. ‘మా చుట్టూ బౌన్సర్స్ ఉంటారు. ఇప్పటిదాకా చిన్న చేదు అనుభవం కూడా నాకు ఎదురుకాలేదు’ అంటూ చెప్పారామె. భవిష్యత్తులోనూ డీజేగా కొనసాగుతానని, మరిన్ని టాప్ క్లబ్స్‌లో తన మ్యూజిక్‌ని వినిపిస్తానని బాలీవుడ్ ట్య్రాక్స్కి పేరొందిన ఈ డీజే బ్లాక్ చెబుతున్నారు.‘ఫ్లో లో.. ‘జో’రుగా.. ‘మా నాన్న వాళ్లది వరంగల్. అయితే నేను నార్త్‌లోనే పెరిగాను. ప్రస్తుతం సిటీలో సెటిలయ్యా’ అంటూ చెప్పారు ఫ్లోజో. డిగ్రీ పూర్తి చేశాక.. కొన్ని కార్పొరేట్ ఉద్యోగాలు చేశా. అయితే చిన్నప్పటి నుంచీ సంగీతం పై ఉన్న ఇష్టంతో డీజేసూ్కల్లో చేరి కోర్సు పూర్తి చేసి డీజేగా మారాను అంటూ చెప్పారు ఫ్లోజో. ప్రస్తుతం నగరంలో టాప్ డీజేల్లో ఒకరుగా ఉన్న ఈ అమ్మాయి తొలుత లిక్విడ్స్‌లో రెసిడెంట్ డీజేగా ప్లే చేశానని, కొంత కాలం తర్వాత ఫ్రీలాన్స్ డీజేగా మారి, పలు అవార్డ్స్ కూడా అందుకున్నానని వివరించారు. థాయ్‌ల్యాండ్ వంటి అంతర్జాతీయ వేదికలపైనా, గోవా వంటి పార్టీ సిటీల్లోనూ ప్లే చేశానంటున్న ఫ్లోజోకి తన పేరు స్టైలి‹Ùగా ఉండడంతో మార్చుకోవాల్సిన అవసరం రాలేదన్నారు. ఈ కెరీర్లో అటు ఆనందం, ఇటు ఆదాయం రెండూ బాగుంటాయంటున్న ఫ్లోజో.. ఆరేడేళ్లలోనే కారు, ఫ్లాట్ కొనగలిగానని సంతోషంగా చెప్పారు. ఇదీ చదవండి: గేలి చేసినచోటే గెలిచి చూపించిన మగువలు! -
కృంగి‘పోతున్న’ పండుటాకులు: చట్టం ఉందిగా అండగా!
కనిపెంచిన బిడ్డల్ని,కంటికి రెప్పలా కాపాడి, ఎన్నో కష్టాలకోర్చి వారిని పెంచి ప్రయోజకుల్ని చేస్తారు తల్లిదండ్రులు. కానీ రెక్కలు వచ్చిన బిడ్డలు కన్నతండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారు. మరికొందరు ఆస్తుల కోసం వేధింపులకు పాల్పడుతున్నారు. హృదయాల్ని కదిలించే ఇలాంటి ఉదంతాలపై స్పెషల్ స్టోరీ..వృద్ధాప్యంలో తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొందరు కుమారులు, కూతుళ్లు పట్టించుకోవడం లేదు.. ఆస్తుల కోసం వేధింపులకు గురిచేయడం, తిండి పెట్టకపోవడం, చేయి చేసుకోవడం, చివరకు చంపేందుకూ వెనకాడకపోవడం వంటి ఘటనలు కృంగిపోయేలా చేస్తున్నాయి.. రెక్కలు ముక్కలు చేసుకొని, పిల్లలను పెంచి, ప్రయోజకులను చేస్తే వృద్ధాప్యంలో పట్టెడన్నం పెట్టకుండా మనోవేదనకు గురి చేయడాన్ని తట్టుకోలేకపోతున్నారు. కొంతమంది ఇంటి నుంచి వెళ్లిపోతున్నారు.. మరికొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు.. ఇంకొందరు కలెక్టరేట్లలో ప్రజావాణిని, ఠాణాల్లో పోలీసులను ఆశ్రయిస్తున్నారు.. ఇటీవల ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వృద్ధుల మిస్సింగ్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.ఈమె పేరు గుర్రాల అంతమ్మ. మానకొండూరు మండలం కొండపల్కల. 9 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా కొడుకు లక్ష్మారెడ్డి మాయమాటలు చెప్పి, ఏడెకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. 2022లో తన భర్త మల్లారెడ్డి మరణించడంతో కొన్ని రోజుల తర్వాత ఇంటి నుంచి వెళ్లగొట్టాడని అంతమ్మ వాపోయింది. కూతురు వద్ద తలదాచుకుంటున్నానని కన్నీటిపర్యంతమైంది. మిగిలిన భూమిని కూడా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కుమారుడు ప్రయత్నిస్తున్నాడని తెలిపింది.ఈ చిత్రంలో కనిపిస్తున్నది చొప్పదండికి చెందిన ముత్యాల గోపాల్‌రెడ్డి, ఆయన భార్య. వీరికి ఇద్దరు కుమారులు రవీందర్‌రెడ్డి, సత్యనారాయణ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 20 ఎకరాల వ్యవసాయ భూమితో దర్జాగా బతికేవారు. పిల్లలను చదివించి, ప్రయోజకులను చేశారు. తీరా కుమారులు మాయమాటలు చెప్పి, భూమిని తమ పేరిట పట్టా చేసుకున్నారు. తర్వాత ఇంట్లో నుంచి గెంటేశారని, ఈ వయసులో తమకు ఇదేం దుస్థితి అంటూ ఆ దంపతులు కంటతడి పెడుతున్నారు.జగిత్యాల మున్సిపాలిటీలోని ఓ వార్డుకు చెందిన ఒక వృద్ధుడు కొడుకు పట్టించుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తుండటంతో మానసికంగా కృంగిపోయాడు. ఇంటిని వదిలి వెళ్లిపోయాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని, విచారణ చేపడుతున్నారు.సిరిసిల్లకు చెందిన ఓ వృద్ధుడు కుమారుడు ఆస్తి రాయించుకొని, తర్వాత పట్టించుకోకపోవడంతోపాటు వేధింపులకు గురిచేస్తున్నాడని హెల్ప్ లైన్–14567కు ఫోన్ చేసి, ఫిర్యాదు చేశాడు. అధికారులు తొలుత కౌన్సెలింగ్ ఇచ్చినా అతనిలో మార్పు రాలేదు. దీంతో ఆర్డీవో ఆధ్వర్యంలో మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లారు. అక్కడ తండ్రికి, కుమారుడికి కౌన్సెలింగ్ ఇచ్చారు. చట్టంలోని నిబంధనలు, విధించే శిక్షల గురించి వివరించారు. తర్వాత కుమారుడి ప్రవర్తనలో మార్పు వచ్చింది.సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని గొల్లపల్లిలో ఆస్తి వివాదం కారణంగా కొడుకు సింగరేణి రిటైర్డ్ కార్మికుడైన తన తండ్రి మధునయ్యను తోసేశాడు. అతను కిందపడి, మృతిచెందాడు.చట్టాలున్నాయి.. న్యాయం పొందొచ్చుపండుటాకులకు సొంత బిడ్డల నుంచే వేధింపులు, నిరాదరణ ఎదురవుతుండటంతో కేంద్రం 2007లో తల్లిదండ్రులు, వయోవృద్ధుల రక్షణ, పోషణ చట్టం తీసుకొచ్చింది. దీని ప్రకారం ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2011లో ఒక నియమావళి రూపొందించింది. 2019లో కేంద్రం వృద్ధుల సంక్షేమం మరింత మెరుగ్గా ఉండటానికి చట్టానికి సవరణలు చేసింది. వాటి ప్రకారం ప్రతీ రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటైంది. దానికి ఆర్డీవో లేదా సబ్ కలెక్టర్ స్థాయి అధికారి చైర్మన్‌గా, స్వచ్ఛంద సంస్థల నుంచి ఒకరు లేదా ఇద్దరు సభ్యులుగా ఉంటారు. బాధిత వృద్ధులకు ఉచితంగా వారి బిడ్డల నుంచి రక్షణ, పోషణ కల్పిస్తారు. బాధితులకు ఈ తీర్పు నచ్చకపోతే కలెక్టర్ చైర్మన్‌గా ఏర్పాటయ్యే అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను 60 రోజుల్లో ఆశ్రయించి, అంతిమ న్యాయం పొందొచ్చు. ఆస్తిని తిరిగి పొందే హక్కునిరాదరణకు గురైనప్పుడు తమ బిడ్డలకు రాసిచ్చిన ఆస్తిని వృద్ధులు బేషరతుగా తిరిగి పొందే హక్కును చట్టంలో చేర్చారు. కేవలం గిఫ్ట్ డీడ్ చేసిన ఆస్తి మాత్రమే కాదు రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తిని సైతం తిరిగి పొందొచ్చు. ప్రతీ నెల మెయింటెనెన్స్ రూ.10 వేల వరకు ఇప్పిస్తారు. ఇటీవల పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ఓ వృద్ధుడికి కలెక్టర్ ఇలాగే న్యాయం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం కల్పించిన ఇటువంటి చట్టాలపై వృద్ధులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. కుమారులు నిర్లక్ష్యం చేస్తే టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ 14567 నంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చు. లేదా నేరుగా ప్రతీ సోమవారం కలెక్టరేట్లో జరిగే ప్రజావాణిలో అధికారులకు విన్నవించుకోవచ్చు. కౌన్సెలింగ్ ఇచ్చి, పోషణ కింద ఆర్థికసాయం అందే ఏర్పాటు చేసి, పోలీసుల ద్వారా రక్షణ కల్పిస్తారు.వేధిస్తే కఠిన చర్యలు వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వాలు చట్టాలు చేశాయి. వాటిపై ప్రతీ ఒక్కరు అవగాహన పెంచుకోవాలి. ఎవరి నుంచి ఏ విధమైన వేధింపులను ఎదుర్కొంటున్నా, ఎలాంటి సమాచారం కోసమైనా హెల్ప్‌లైన్ నంబర్లో సంప్రదించవచ్చు. వృద్ధులను వారి సంతానం ప్రేమతో చూడాలి. వేధింపులకు గురిచేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.– శ్రీనివాస్, సీపీ రామగుండం -
విజనరీ ముసుగులో ఆర్ధిక అరాచకాలు
-
సమయం.. సుధారసమయం..
కాలం భగవత్స్వరూపం. ప్రాణుల్ని, జగత్తునూ నడిపించేదీ, హరించేదీ కాలమే. సృష్టి, స్థితి, వినాశం అనే ప్రధానమైన కార్యాలకు సాక్షీభూతంగా నిలిచేదీ కాలమే. అత్యంత బలవత్తరమైన కాలప్రభావాన్ని ఎవరూ అతిక్రమించలేరు. ఏ భౌతిక సాధనాలూ, ఆధ్యాత్మిక సాధనలూ కాలాన్ని బంధించలేవు. ‘‘పారే నదిలో ఈ క్షణం తాకిన నీటిని మరుక్షణం ఎలాగైతే తాకలేమో అలాగే గతించిన కాలాన్ని పట్టుకోలేం. అందుచేత కాలమహిమను ప్రతి ఒక్కరూ గుర్తించండి’’ అంటాడు చాణుక్యుడు. చాణుక్యుని వాక్యాలు ఎంతో అర్థవంతమైనవి.జీవితంలో ప్రతిక్షణం వెలకట్టలేనిదే. గడిచిపోయిన క్షణం మళ్ళీ తిరిగిరాదు. అందుకే, కాలాన్ని విధిగా పాటించడం, లేదా సమయపాలనకు కట్టుపడడం అనేది ప్రతివారికీ అత్యంత ముఖ్యమైన విధి. సమయపాలనకు సంబంధించి రకరకాల నిర్వచనాలు మనకు నిత్యమూ కనబడుతూ ఉంటాయి. సమయానికి మనం అనుకున్న పనిలో, విహితమైన తీరులో, ఏకాగ్ర చిత్తంతో నిమగ్నం కావడాన్నే సమయపాలన అని చెప్పుకోవచ్చు.ఏదైనా పనికోసం మనం సమయాన్ని కేటాయిస్తే, అది మనకు ఆ కార్య పరిపూర్ణతకు ఉపకరించి, సంతృప్తిని కలిగిస్తుంది. ఏదైనా ఉన్నతమైనలక్ష్యాన్ని సాధించడంకోసం సమయాన్ని కేటాయిస్తే, అది మనలో మేధాశక్తినీ పెంచడమే గాక, వ్యక్తిత్వాన్ని శిఖరాగ్రానికీ చేరుస్తుంది. అమేయమైన సారాన్ని నింపుకున్న పుస్తకాలను గానీ, గ్రంథాలను గానీ చదవడానికి సమయాన్ని కేటాయిస్తే, మనలో మనోవికాసం పెంపొందుతుంది. ఎప్పుడూ ఏదో ఒక పనిలోనే నిమగ్నం కాకుండా, ఒకింత నవ్వుకోవడానికి సమయాన్ని కేటాయిస్తే , అది మన జీవితాన్ని ఆహ్లాదమయం చేస్తుంది.కొంత సమయాన్ని పక్కవాడికి సహాయం చేయడానికి కేటాయిస్తే, అది మనకు ఆత్మానందాన్ని కలిగిస్తుంది. దైనందిన జీవితంలో వ్యాయామానికి సమయాన్ని కేటాయిస్తే, అది మనకు ఆరోగ్యప్రదాయినియై సంతసాన్ని కలిగిస్తుంది. సమయం విలువ ప్రతివారూ గుర్తెరగడం అత్యంత ముఖ్యమైన విషయం. ప్రత్యేకించి, పిల్లలకు సమయానికి తగినట్లుగా పనులు అలవాటు చేయడం తల్లితండ్రుల బాధ్యత. ముఖ్యంగా ఉదయాన నిద్రలేవడం నుంచీ, రాత్రి పడుకునే వరకు, వాళ్ళు ఏ సమయానికి ఏం చేయాలో తెలియజెప్పడం తప్పనిసరిగా చేయాలి. ముందు కొంత బద్ధకించినా, కొన్ని రోజులకు సమయం ప్రకారం పనులు చేయడం వారికి అలవాటుగా మారుతుంది. జీవితానికి ఉత్తమ బాటను పరుస్తుంది.‘‘ క్షణము గడిచిన దాని వెన్కకు మరల్పసాధ్యమే మానవున కిలాచక్రమందు‘ అంటారు శ్రీ జాషువ మహాకవి. ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వవిఖ్యాతి గడించిన మహనీయులందరూ ఏరంగానికి చెందిన వారైనా కాలం విలువ బాగా తెలిసిన వారే సమయాన్ని సద్వినియోగపరచుకున్నవారే . కాలం అనేది మనం ఆపితే ఆగదు . కాబట్టి ఏ సమయంలో ఏపని చెయ్యాలో ఆ సమయం లో ఆపని చేస్తే సమయం సద్వినియోగపరిచినట్లే.ప్రపంచంలో గొప్పవాళ్ళయిన వ్యక్తులందరూ కాలం విలువ తెలిసిన వాళ్ళే. ప్రతీ క్షణాన్నీ సద్వినియోగం చేసినవాళ్ళే. స్వామి వివేకానంద యువతకు ఇచ్చిన సందేశం ఎంతో ప్రభాసమానంగా ఉంటుంది. ‘‘యువతీయువకుల్లారా.. మీరంతా మేల్కొనండి. లక్ష్య సాధనకోసం శ్రమించే క్రమంలో ప్రతి క్షణాన్నీ సద్వినియోగపరచండి. మీరు మండే నిప్పు కణికలు అని గమనించండి. మిమ్మల్ని వెనుకకు నెట్టే ఒకే ఒక్క గుణం సోమరితనం. కాబట్టి కాలం విలువ ఎరిగినవారై, బద్దకాన్ని వదలండి.’’ అంటూ పలికిన సందేశం అత్యంత విలువైనది. సమయం విలువను కాల రాచే మహమ్మారి లాంటి జాడ్యం సోమరితనం. సాధారణంగా మనసు సుఖాన్ని, బుద్ధి హితాన్ని కోరుకుంటాయి . పరీక్షలొస్తున్నాయి చదవడం వెంటనే ఆరంభించమని బుద్ధి చెబుతుంది . ఏమీ ఫరవాలేదు, పరీక్షలు బాగా దగ్గరకొచ్చాక చదవొచ్చని మనస్సు చెబుతుంది. మనం మనస్సు పలికిన మాటే వింటాం. బుద్ధి చెప్పింది ఏమాత్రం వినం. అందుకే ఎంతో అనర్థం జరుగుతోంది. కాలాన్ని ఉపయోగించుకుని తగిన రీతిలోసార్థకత్వాన్ని సాధించడం కష్టమైన పని ఏమాత్రం కాదు.జగత్ప్రసిద్ధమైన ఆపిల్ కంపెనీ సహవ్యవస్థాపకుడైన స్టీవ్ జాబ్స్ మాట్లాడుతూ, ‘‘నీ సమయం ఎంతో విలువైనది. ఆ సమయాన్ని వినియోగించి నీ జీవితాన్ని స్వర్గమయం చేసుకో. కాలాన్ని వ్యర్థం చేసుకుని, ఇంకొకరి జీవితంలో నీవు బతకకు’’ అంటారు. ఇందులో ఎంతో సందేశం ఉంది. కాలం విలువ తెలుసుకుని, ప్రగతినిసాధిస్తూ, ముందుకు సాగమని, ఇంకొకరితో తనను పోల్చుకోకుండా ధరిత్రిలో మరొక కొత్త చరిత్రను లిఖించమనే ప్రబోధమూ ఈ మాటల్లో దాగి ఉంది. – వెంకట్ గరికపాటి వ్యాఖ్యాన విశారద‘‘ప్రపంచంలో అతి విలువైన వస్తువులు రెండు.. మొదటిది సహనం, రెండోది కాలం.’’ అంటారు లియో టాల్స్టాయా. సృష్టిలో మనకు లభించే అత్యంత విలువైన సంపద కాలమే. కానీ అత్యంత దయనీయంగా నిత్యమూ మనం వృథా చేసేదీ కాలాన్నే..!!‘‘సమయం ప్రధానమైన విషయాల్లో ఒకటి కాదు. సమయమే అత్యంత ప్రశస్తమైన సంపద’’ అని యువత గ్రహిస్తే, వారి భవిత బంగరుబాట కావడం కష్టమైన విషయమేమీ కాదు. కాలానికి గాలం వేయడం కష్టమే. కానీ, దాని విలువను తెలుసుకుని, విహితమైన ఆలోచనకు ఆలవాలం చేసి, సద్వినియోగపరచిన ప్రతివ్యక్తీ చేయగలిగేది సుగతితో, ప్రగతితో కూడిన మహేంద్రజాలమే. -
Archa Mehta: ఎక్స్పరిమెంటలిస్ట్
సంజయ్ లీలా భన్సాలీ సినిమా అంటే ఫ్యాషన్ డిజైనర్లందరికీ పండుగ! ఆయన సినిమా విడుదల తర్వాత చిన్న చిన్న బోటీక్ ఓనర్స్ నుంచి టాప్ మోస్ట్ ఫ్యాషన్ డిజైనర్స్ దాకా అందరూ ఆ చిత్రం రిఫరెన్స్‌తో కొత్త కలెక్షన్స్‌ను విడుదల చేస్తారు. అలాంటిది కాస్ట్యూమ్ డిజైనర్‌గా, స్టయిలిస్ట్‌గా తొలి అవకాశమే సంజయ్ లీలా భన్సాలీ మూవీలో వస్తే.. అదృష్టమే అనుకుంటారు! అలాంటి చాన్స్ దక్కించుకున్న అదృష్టవంతురాలే ఇక్కడ పరిచయమవుతున్న స్టయిలిస్ట్ అర్చా మెహతా!అర్చా మెహతా స్వస్థలం ఢిల్లీ. కెరీర్ విషయంలో తండ్రి ఏం చెప్తే అదే అనుకొని, ఇంటర్ అయిపోగానే ఇంజినీరింగ్ కాలేజీలో చేరింది. కాలేజీ కల్చరల్ ప్రోగ్రామ్స్‌లో భాగమైన ర్యాంప్ వాక్‌లో పాల్గొన్నది. అప్పుడు గ్రహించింది తన అసలు ప్యాషన్ ఫ్యాషనే అని! ఆ విషయాన్ని తండ్రితోనూ చెప్పింది. కూతురి ఇష్టాన్ని గుర్తిస్తూ ఆయన వెంటనే అర్చాను ఇంజినీరింగ్ మాన్పించి, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ కోసం లండన్ పంపించాడు. అక్కడ ఆమె ఫ్యాషన్ డిజైనింగ్‌తో పాటు స్టయిలింగ్ గురించి కూడా తెలుసుకుంది. కోర్స్ పూర్తవగానే అక్కడే సుప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్ల దగ్గర ఇంటర్న్‌గా పనిచేసింది. తర్వాత ముంబై చేరింది. వెంటనే ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ చిత్రం ‘గోలియోంకీ రాస్లీలా రామ్‌లీలా’కి అసిస్టెంట్ స్టయిలిస్ట్, అసిస్టెంట్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసే అవకాశం దొరికింది. అది పనిలో అనుభవాన్నే కాదు.. టాలీవుడ్లో ఎంట్రీనీ కల్పించింది. ‘హార్ట్ ఎటాక్’ మూవీలో అగ్రతారలకు స్టయిలిస్ట్‌గా! అందులో ఆమె కేవలం కాస్ట్యూమ్స్ మీదే కాదు స్కార్ఫ్‌లు, యాక్ససరీస్, ఆఖరకు పచ్చబొట్టు లాంటి వాటిపైనా దృష్టి పెట్టి స్టయిలింగ్ చేసింది. తక్కువ ఎక్స్‌పోజింగ్‌తో ట్రెండీ లుక్ ఇచ్చినందుకు హీరోయిన్స్ ఆదా శర్మ మెప్పును కూడా పొందింది. అప్పటి నుంచి అదే ఆమె సిగ్నేచర్ స్టయిలింగ్ అయింది. ఆ స్కిల్‌కి టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీస్ చాలామంది ఫిదా అయ్యారు. ఆ జాబితాలో కీర్తీ సురేశ్, మృణాల్ ఠాకుర్, కృతీ శెట్టీ, రాశీ ఖన్నా, కాజల్ అగర్వాల్, సంయుక్తా మీనన్, కళ్యాణీ ప్రియదర్శన్, కేథరిన్ త్రెసా, హన్సిక, మెహ్రీన్, ప్రణీత, దిశా పాట్నీ, నుస్రత్ భరూచా ఎట్సెట్రా ఉన్నారు. వాళ్లంతా అర్చాను తమ పర్సనల్ స్టయిలిస్ట్‌గా అపాయింట్ చేసుకున్నారు. ఈ హీరోయిన్స్‌కే కాదు శర్వానంద్, నితిన్ లాంటి హీరోలకూ ఆమె స్టయిలింగ్ చేస్తోంది. ∙దీపిక కొండి -
పొలిటికల్ ట్విస్టులతో దద్దరిల్లిపోతున్న మహారాష్ట్ర
-
ప్రతీదానికీ ఓ పద్ధతి ఉంటుంది కళ్ళు మూసుకుంటే సరిపోదు!!
అతను తన గురువుగారి ఆశ్రమంలో విడిగా ఏర్పాటు చేసిన ఓ పూరిపాకలో కూర్చుని స్థిరమైన మనసు కోసం తీవ్రంగా ప్రయత్నించ సాగాడు. ఎవరు చూడడానికి వచ్చినా అతను కళ్ళు తెరచి చూసేవాడు కాదు. ఎవరైనా వచ్చినట్టు అలికిడైనా సరే చూసేవాడు కాదు.అయితే ఒకరోజు గురువుగారు ఈ శిష్యుడిని చూడడానికి వెళ్ళారు. కానీ శిష్యుడు గురువుగారిని కూడా పట్టించుకోలేదు. అయినా గురువుగారు అక్కడి నుంచి కదలలేదు. పైగా ఆ పూరిపాక గుమ్మంలో ఓ ఇటుకరాయిని మరొక రాయిమీద పెట్టి అరగదీయడం మొదలుపెట్టాడు. అలా గీయడంతో పుట్టిన శబ్దాన్ని శిష్యుడు భరించలేకపోయాడు.అతను కళ్ళు తెరిచి అడిగాడు –‘‘మీరేం చేస్తున్నారు...తెలుస్తోందా...’’అని.గురువు చెప్పాడు – ‘‘ఇటుకను అద్దంగా మారుస్తున్నాను’’ అని.అప్పుడతను ‘‘ఇటుకను అద్దంగా మార్చడం సాధ్యమా... దానిని పిచ్చితనమంటారు... మరెంత అరగదీస్తే అంతగా అది అరిగి చివరికి ఇటుకరాయి జాడ కూడా కనిపించకుండా పోతుంది. అలాంటిది అద్దం ఎలా ఏర్పడుతుంది. కాస్త ఆపండి ఆలోచించండి... నన్ను నా మనసు మీద ఏకాగ్రత నిలుపు కోనివ్వండి’’ అని చెప్పాడు.అతని మాటలకు గురువుకు నవ్వొచ్చింది.‘‘అలాగైతే నువ్వేం చేస్తున్నావు... ఇటుకరాయి అద్దం కాలేని పక్షంలో మనసు ఎలా స్వచ్ఛమైన అద్దమవుతుందో చెప్పు. ముక్కు మూసుకుని కూర్చున్నంత మాత్రాన నిలకడ వచ్చేయదు. దానికో పద్ధతి ఉంది. అది తెలుసుకోకుండా ఎవరినీ చూడనని కళ్ళు గట్టిగా మూసుకుంటే సరిపోతుందని అనుకోవడం ఎంత అవివేకం?’’ అని ప్రశ్నించాడు గురువు. శిష్యుడు సిగ్గుతో తలవంచుకున్నాడు. – యామిజాల జగదీశ్ -
World Kindness Day 2024 : హృదయాన్ని కదిలించే వీడియోలు!
ప్రపంచ దయ దినోత్సవాన్ని (World Kindness Day ) ఏటా నవంబర్ 13న జరుపుకుంటారు. వ్యక్తులుగా ఒకరిపట్ల ఒకరు, తమ పట్ల , వారి చుట్టూ ఉన్న ప్రపంచం పట్ల దయ చూపేలా ప్రోత్సహించడం దీని ఉద్దేశం. మానవులుగా పుట్టినందుకు ప్రతి ఒక్కరూ, తోటివారితోపాటు ఈ ప్రకృతి, జంతువుల పట్ల ప్రేమతో, దయతో కృతజ్ఞతగా ఉండడంలోని ప్రాధాన్యతను గుర్తించే రోజు ప్రపంచ దయ దినోత్సవం. చుట్టూ ఉన్న సమాజం పట్ల దయతో ఉండటం మనుషులుగా మనందరి ప్రాథమిక లక్షణం,ప్రపంచ దయ దినోత్సవం: చరిత్రవరల్డ్ కైండ్‌నెస్ డేని 1998లో వరల్డ్ కైండ్‌నెస్ మూవ్మెంట్ ప్రారంభించింది. సామరస్య ప్రపంచాన్ని సృష్టించడంలో దయ యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడం లక్ష్యం. 1997లో జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన మొదటి ప్రపంచ దయ ఉద్యమ సదస్సు తర్వాత ప్రపంచ దయ ఉద్యమం ఏర్పడింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్‌గా మారాయి.మనసు అందరికీ ఉంటుందికానీ అది గొప్పగా కొందరికి మాత్రమే ఉంటుంది..❤️✨#WorldKindnessDay2024 pic.twitter.com/MwM1NRPexm— Do Something For 👉Better Society ✊ (@ChitraR09535143) November 13, 2024 It is called true happiness which gives peace to the heart and smile to the faces. In fact, the beauty of nature lies in its precious creations, animals and birds. Make your contribution in protecting nature, environment, animals, birds and creatures.#WorldKindnessDay2024 pic.twitter.com/kpXDNaRRZ8— Munesh Kumar Ghunawat (@GhunawatMunesh) November 13, 2024 -
ట్రంప్ గెలిచారు?.. మరి మనకేంటి?
-
నఖ శిఖం : క్యాన్సర్ మహమ్మారి
ఓ పరిమితి లేకుండా అనారోగ్యకరంగా, అసాధారణంగా పెరుగుతూ, తొలుత ఒక కణంతోనే క్యాన్సర్ తన ప్రస్థానాన్ని ప్రారంభిస్తుంది. ఎప్పటికప్పుడు రెట్టింపు అయ్యే ఈ ప్రక్రియలో 20వ సారి అది ఒక మిలియన్ కణాలుగా వృద్ధి చెందుతుంది. మిలియన్ కణాల సముదాయంగా పెరిగినప్పటికీ ఆ టైమ్‌లోనూ దాన్ని కనుక్కోవడం కష్టసాధ్యం. అదే 30వసారి రెట్టింపు అయ్యే సమయంలో అందులో బిలియన్ కణాలకు పైగా ఉంటాయి. అప్పుడు మాత్రమే అది ఓ గడ్డ (లంప్)లా రూపొంది గుర్తించడానికి వీలయ్యేలా ఉంటుంది. అంటే... చేత్తో గడ్డను తడిమి గుర్తించడానికి వీలయ్యే సమయానికి ఆ క్యాన్సర్ గడ్డలో బిలియన్ కణాలు... వందకోట్ల కణాలకు పైనే ఉంటాయి. ఇక 40వ సారి రెట్టింపయ్యాక అందులో ఒక ట్రిలియన్ కణాలుంటాయి. అప్పటికీ చికిత్స లభించక 42–43వ సారి రెట్టింపయినప్పుడు రోగి ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్తాడు. అన్ని రెట్టింపులు కాకముందే... అంటే కేవలం 20వ సారి రెట్టింపయ్యే లోపు కనుక్కోగలిగితే...? క్యాన్సర్‌ను నయం చేసే అవకాశాలు చాలా ఎక్కువే. మరి ఆ దశలోనే క్యాన్సర్‌ను కనుక్కోవడం ఎలాగో తెలిపేదే ఈ కథనం. క్యాన్సర్ లక్షణాలు అవయవానికీ అవయవానికీ మారి΄ోతున్నప్పటికీ క్యాన్సర్ బాధితులందరికీలోనూ కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. ఆరోగ్యవంతుల్లోనూ అప్పుడప్పుడూ ఆ లక్షణాలు కనిపించేవే కావడంతో వాటిని గుర్తించడం కష్టం.క్యాన్సర్‌ను గుర్తించేందుకు తోడ్పడే కొన్ని సాధారణ అంశాలు... ఆకలి తగ్గడం కారణం తెలియకుండా / ఏ కారణమూ లేకుండానే బరువు తగ్గడం ఎడతెరిపి లేకుండా దగ్గు లింఫ్ గ్లాండ్స్ (చంకల్లో, గజ్జల్లో, గొంతుదగ్గర) వాపు అవయవాలనుంచి రక్తస్రావం... (ఈ లక్షణం కొన్నిసార్లు కొన్ని అవయవాలలో మాత్రమే) ఒక్క చివరిది మినహా ఇక్కడ పేర్కొన్నవన్నీ చాలామందిలో ఏదో ఓ దశలో క్యాన్సర్ లేకపోయినప్పటికీ కనిపించే మామూలు లక్షణాలు. అందుకే ఈ లక్షణాలన్నీ తప్పనిసరిగా క్యాన్సర్‌వే కానక్కర్లేదు. కాబట్టి వీటిలో ఏదో ఒకటి కనిపించిన మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ లక్షణాలకు అవవసరమైన తొలి చికిత్సలు తీసుకున్న తర్వాత కూడా, అవే పునరావృతమవుతుంటే ఒకసారి డాక్టర్ చేత పరీక్ష చేయించుకుని అది క్యాన్సర్ కాదని నిర్ధారణ చేసుకొన్న తర్వాతే నిశ్చింతగా ఉండాలి. తల నుంచి కాలి వేలి వరకు ఆయా అవయవాల్లో క్యాన్సర్ ఉంటే కనిపించేందుకు / తొలి దశలోనే గుర్తించేందుకు ఉపయోగపడే ప్రాథమిక లక్షణాలివి... బ్రెయిన్ క్యాన్సర్ : తలనొప్పి వస్తుంటుంది. అకస్మాత్తుగా మతిమరపు రావడం, కొన్ని సార్లు సామాజిక సభ్యత మరచి ప్రవర్తించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మనిషి మెదడులో మాట్లాడటానికీ, దృష్టికీ, వినికిడికీ, కాళ్లూ, చేతుల కదలికల నియంత్రణకు... ఇలా వేర్వేరు ప్రతిచర్యలకు వేర్వేరు కేంద్రాలు (సెంటర్స్) ఉంటాయి. క్యాన్సర్ అభివృద్ధి చెందిన సెంటర్ దేనికి సంబంధించినదైతే ఆ అవయవం చచ్చుబడటం వంటి లక్షణాలూ కనిపిస్తాయి. ఇవీ ఆయా అవయవాలకు సంబంధించి తొలిదశలో క్యాన్సర్‌కు లక్షణాలు. తల భాగంలో: ఈ క్యాన్సర్స్ నోటిలో, దడవ మీద, నాలుక మీద లేదా చిగుర్లు (జింజివా) మీదా ఇలా తలభాగంలో ఎక్కడైనా రావచ్చు. ఆయా భాగాల్లో ఎరుపు, తెలుపు రంగుల ΄్యాచెస్ ఉన్నా, దీర్ఘకాలంగా మానని పుండు (సాధారణంగా నొప్పి లేని పుండు, కొన్ని సందర్భాల్లో నొప్పి ఉండవచ్చు కూడా) ఉంటే క్యాన్సర్ అయ్యేందుకు అవకాశం ఎక్కువ. అదే నాలుక మీద అయితే నాలుక కదలికలు తగ్గవచ్చు. నాలుక వెనక భాగంలో అయితే స్వరంలో మార్పు వస్తుంది. మరింత వెనకనయితే మింగడంలో ఇబ్బంది కలుగుతుంది. ఇక స్వరపేటిక ్ర΄ాంతంలో అయితే స్వరంలో మార్పు వస్తుంది. మెడ దగ్గర లింఫ్ గ్రంధుల వాపు కనిపిస్తుంది. గొంతు భాగంలో : దీన్ని ఓరో ఫ్యారింజియల్ భాగంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ గొంతులో ఏదో ఇరుక్కుని ఉన్న ఫీలింగ్ ఉంటుంది. అన్నవాహిక మొదటి భాగంలో అయితే మింగడం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఊపిరితిత్తులు : పొగతాగేవాళ్లలో ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. ఇది ఉన్నవాళ్లలో దగ్గు, కళ్లె (స్ఫుటమ్)లో రక్తం పడటం వంటì లక్షణాలు కనిపిస్తాయి. ఎక్స్–రే, సీటీ స్కాన్ పరీక్ష ద్వారా దీన్ని తెలుసుకోవచ్చు.రొమ్ము క్యాన్సర్ : మహిళల్లో ఎక్కువగా కనిపించే ఈ రకం క్యాన్సర్‌లో... రొమ్ములో ఓ గడ్డ చేతికి తగలడం, రొమ్ము పరిమాణంలో మార్పు, రొమ్ము మీది చర్మం ముడతలు పడటం, రొమ్ము చివర (నిపుల్) నుంచి రక్తంతో కలిసిన స్రావం లాంటివి రొమ్ము క్యాన్సర్ లక్షణాలు.కడుపు (స్టమక్)లో: కడుపు (స్టమక్)లో మంట పుడుతున్నట్లుగా నొప్పి. పొట్టలో మంట. కొన్నిసార్లు పొట్టలో రక్తస్రావం అయినప్పుడు ఆ రక్తం వల్ల విసర్జన సమయంలో మలం నల్లగా కనిపిస్తుంది. రక్తస్రావం వల్ల రక్తహీనత (ఎనీమియా) కూడా కనిపించవచ్చు. దాంతో పాటు కొన్ని సార్లు కొద్దిగా తినగానే కడుపునిండిపోయిన ఫీలింగ్ ఉంటుంది.పేగుల్లో... మలమూత్ర విసర్జన అలవాట్లలో మార్పులు కనిపిస్తాయి.రెక్టమ్ క్యాన్సర్‌లో: మలద్వారం (రెక్టమ్) క్యాన్సర్ విషయంలోనూ మల విసర్జన తర్వాత కూడా ఇంకా లోపల మలం మిగిలే ఉందన్న ఫీలింగ్. దీనికో కారణం ఉంది. విసర్జించాల్సిన పదార్థం మామూలుగా మలద్వారం వద్దకు చేరగానే అక్కడి నాడులు స్పందించి అక్కడ మలం పేరుకుని ఉన్నట్లుగా మెదడుకు సమాచారమిస్తాయి. అప్పుడా పదార్థాల్ని విసర్జించాల్సిందిగా మెదడు ఆదేశాలిస్తుంది. కానీ విసర్జన తర్వాత కూడా అక్కడ క్యాన్సర్ ఓ గడ్డలా ఉండటంతో ఏదో మిగిలే ఉందన్న సమాచారాన్ని నాడులు మెదడుకు మళ్లీ మళ్లీ చేరవేస్తుంటాయి. దాంతో ఇంకా అక్కడేదో ఉందన్న ఫీలింగ్ కలుగుతుంటుంది. ఈ లక్షణంతో పాటు కొందరిలో బంక విరేచనాలు, రక్తంతో పాటు బంక పడటం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.సర్విక్స్ క్యాన్సర్: దక్షిణ భారతదేశంలోని తీర్ర ప్రాంతాల్లోని మహిళల్లో అత్యధికంగా కనిపించే క్యాన్సర్ ఇది. రుతుస్రావం సమయంలో గాక మధ్యలోనూ రక్తం రావడం, రుతుస్రావం ఆగిపోయిన (మెనోపాజ్) మహిళల్లో అసాధారణంగా రక్తస్రావం కావడం, మహిళల్లో సెక్స్ తర్వాత రక్తస్రావం ( పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్), ఎరుపు, తెలుపు డిశ్చార్జ్ వంటివి దీని లక్షణాలు.ఒవేరియన్ క్యాన్సర్ : దాదాపు 50, 60 ఏళ్ల మహిళల్లో పొట్ట కింది భాగంలో నొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. సాధారణంగా ఈ భాగానికి క్యాన్సర్ వస్తే ఒక్కోసారి ఏ లక్షణాలూ కనిపించకుండానే ప్రమాదకరంగా పరిణమించవచ్చు.టెస్టిస్ క్యాన్సర్ : పురుషుల్లో వచ్చే ఈ క్యాన్సర్‌లో వృషణాల సైజ్ పెరగడం, దాన్ని హైడ్రోసిల్‌గా పొరబాటు పడటం వల్ల పెద్దగా సీరియస్‌గా తీసుకోకపోవడంతో అది సైజ్‌లో పెరిగి ప్రమాదకరంగా పరిణమించే అవకాశాలెక్కువ.ప్రొస్టేట్ క్యాన్సర్ : సాధారణంగా 50, 60 ఏళ్లు దాటిన పురుషుల్లో తరచూ కనిపించే క్యాన్సర్ ఇది. దాదాపు లక్షణాలేవీ పెద్దగా కనిపించకుండా వచ్చే ఈ క్యాన్సర్‌లో రాత్రివేళల్లో మూత్రవిసర్జనకు వెళ్లాల్సిన అవసరం ఎక్కువగా ఉండవచ్చు. పీఎస్ఏ అనే పరీక్ష ద్వారా దీన్ని తేలిగ్గా గుర్తించవచ్చు.కిడ్నీ అండ్ బ్లాడర్ క్యాన్సర్ : మూత్ర విసర్జన సమయంలో రక్తం కనిపించడం, మాటిమాటికీ మూత్రం రావడం మూత్రపిండాలు, మూత్రాశయ క్యాన్సర్లలో కనిపించే సాధారణ లక్షణం.బ్లడ్ క్యాన్సర్స్ : రక్తం కూడా ద్రవరూపంలో ఉండే కణజాలమే కాబట్టి... బ్లడ్ క్యాన్సర్ కూడా రావచ్చు. రక్తహీనత, చర్మం మీద పొడలా (పర్ప్యూరిక్ పాచెస్) రావడం, చిగుళ్లలోంచి రక్తం రావడం, బరువు తగ్గడం, జ్వరం రావడం వంటివి బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు. లింఫ్ గ్లాండ్స్ అన్నవి బాహుమూలాల్లో, దవడల కింది భాగంలో మెడకు ఇరువైపులా, గజ్జల్లో ఉండే ఈ గ్రంథులకూ క్యాన్సర్ రావచ్చు. దాన్ని లింఫోమా అంటారు.స్కిన్ క్యాన్సర్: చర్మం క్యాన్సర్‌ను ఏ, బీ, సీ, డీ అనే నాలుగు లక్షణాలతో తేలిగ్గా గుర్తించవచ్చు. శరీరంపై ఏదైనా మచ్చ తాలూకు ఏ– అంటే... ఎసిమెట్రీ (అంటే మచ్చ సౌష్టవం మొదటికంటే మార్పు వచ్చినా, బీ– అంటే... బార్డర్ అంటే అంచులు మారడం, మందంగా మారడం జరిగినా, సీ– అంటే కలర్ రంగు మారినా, డీ అంటే డయామీటర్... అంటే వ్యాసం (సైజు) పెరిగినా దాన్ని చర్మం క్యాన్సర్ లక్షణాలుగా భావించవచ్చు.కొంతమందిలో తమ తాత తండ్రుల్లో, పిన్ని వంటి దగ్గరి సంబంధీకుల్లో క్యాన్సర్ ఉన్నప్పుడూ, అలాగే స్మోకింగ్, ఆల్కహాల్ వంటి అనారోగ్యకరమైన జీవనశైలి ఉన్నవారూ...ఇక జన్యుపరంగా అంటే... జీరోడెర్మా, న్యూరోఫైబ్రమాటోసిస్ వంటి వ్యాధులున్నవారిలో క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి హైరిస్క్ వ్యక్తులంతా మిగతావారికంటే మరింత అప్రమత్తంగా ఉంటూ, మరింత ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి. గమనించాల్సిన అంశం ఏమిటంటే... ఇక్కడ ప్రస్తావించిన లక్షణాలన్నీ తప్పనిసరిగా క్యాన్సర్‌కు సంబంధించినవే కావచ్చేమోనని ఆందోళన వద్దు. తొలిదశలో తేలిగ్గా గుర్తిస్తే క్యాన్సర్ తగ్గుతుందన్న విషయం గుర్తుంచుకుని, ఏవైనా లక్షణాలు కనిపిస్తే ఆందోళన చెందకుండా ఒకసారి డాక్టర్ల సూచన మేరకు పరీక్షలు చేయించుకోవాలి. అది క్యాన్సర్ కాదని నిర్ధారణ చేసుకున్న తర్వాత నిశ్చింతగా ఉండాలి. -
స్నేక్ ఫ్రెండ్స్..
పాము అంటే ఎవరికి భయం ఉండదు చెప్పండి.. ఎక్కడైనా కనిపిస్తే చాలు భయంతో పరుగులు పెడుతుంటాం. ఇక ఇంట్లోకి వచి్చందంటే కథ వేరేలా ఉంటుంది. భయానికి చెమటలతో సగం తడిచిపోతుంటాం. ఇంకొందరైతే తెగ హడావుడి చేసి ఎలాగైనా చంపేయాలని చూస్తుంటారు. కానీ వీరు మాత్రం పాములు కనిపిస్తే చాలు ప్రేమగా వాటిని పట్టుకుంటారు. వాటికి ఎలాంటి హానీ కలగకుండా జాగ్రత్తగా తీసుకెళ్లి దగ్గర్లోని అడవుల్లో వదిలేస్తుంటారు. ఇంతకీ వాళ్లెవరా అని ఆలోచిస్తున్నారా? వాళ్లే ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్.. వీరి గురించి మరిన్ని విశేషాలు.. ఎవరి ఇంటికైనా పాములు వచ్చాయని ఫోన్ చేస్తే చాలు క్షణాల్లో వాలిపోయి.. పాములను చాలా జాగ్రత్తగా పట్టుకుని సురక్షిత ప్రాంతాల్లో వదిలిపెడతారు. ఏటా దాదాపు 10 వేల నుంచి 12 వేల వరకూ పాములను పట్టి.. వేరే ప్రాంతాల్లో విడిచిపెడుతున్నారు. ఇటు మనుషుల ప్రాణాలతో పాటు పాములను కూడా కాపాడుతూ రియల్ హీరోలుగా నిలుస్తున్నారు ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ సభ్యులు. వర్షాకాలంలో ఎక్కువ..సాధారణంగా పాములు బొరియల్లో తలదాచుకుంటాయి. వర్షాకాలంలో ఆ బొరియల్లోకి వరద నీరు చేరుతుండటంతో బయటకు వస్తాయి. అప్పుడు ఎక్కడికి వెళ్లాలో తెలియక అప్పుడప్పుడూ ఇళ్లల్లోకి వస్తుంటాయి. అంతేకాకుండా నాళాల పక్కన ఉన్న ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి కూడా పాములు చేరుతుంటాయి. అంతేకానీ మనకు ఎలాంటి హానీ తలపెట్టబోవని ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. వాటికి మనం హాని చేస్తున్నామని అనిపిస్తేనే అవి కాటేస్తాయని పేర్కొంటున్నారు. స్వచ్ఛందంగా సేవలు.. ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సంస్థను 1995లో రాజ్‌కుమార్ కానూరి స్థాపించారు. పాములు జీవవైవిధ్యానికి ఎంతో కీలకమని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన చెబుతుండేవారు. ఒకరిద్దరితో ప్రారంభమైన ఈ సంస్థలో.. ఇప్పుడు ఏకంగా 150 మంది వలంటీర్లు ఉన్నారు. పాములపై ప్రేమ.. పాములను పట్టుకోవాలని ఆసక్తి ఉన్న ఉద్యోగులు, స్టూడెంట్స్ తమకు ఉన్న ఖాళీ సమయాల్లో స్నేక్ క్యాచింగ్ చేసేందుకు ముందుకు వస్తుంటారు. స్నేక్ క్యాచింగ్ అంటే ఆసక్తి ఉన్న వారు ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సంస్థను సంప్రదిస్తే.. వారికి 6 నెలల పాటు శిక్షణ ఇస్తున్నారు. ఎక్కడైనా పాము గురించి సమాచారం అందగానే దగ్గరలో ఉన్న వలంటీరు అక్కడికి వెళ్లి వాటిని రక్షిస్తారు. జీవ వైవిధ్యానికి ముఖ్యం.. ప్రకృతిలో అన్ని జీవులకూ సమాన హక్కులు ఉంటాయని, ఏ ప్రాణినీ చంపే అధికారం ఎవరికీ లేదని ఈ సంస్థ వాళ్లు చెబుతున్నారు. కాకపోతే పట్టణీకరణ కారణంగా భవన నిర్మాణ కార్యకలాపాలు పెరుగుతుండటంతో పాములు, ఇతర జంతువుల ఆవాసాలైన అడవులను నరికేస్తున్నారని, ఈ నేపథ్యంలో వాటికి ఆవాసం లేకపోవడంతో ఇళ్ల్లల్లోకి వస్తున్నాయని పేర్కొంటున్నారు. ఇక, పాములు జీవవైవిధ్యానికి, మనిషి జాతి మనుగడకు చాలా కీలకమని, వాటిని కాపాడుకుంటే భవిష్యత్తు తరాలు సుస్థిరంగా ఉంటాయని చెబుతున్నారు. ఆహార భద్రతలో కూడా పాములు కీలక పాత్ర పోషిస్తాయని సంస్థ ప్రతినిధులు అంటున్నారు. అందుకే పాములపై తాము పరిశోధనలు చేస్తున్నామని ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ నిర్వాహకులు చెబుతున్నారు. ఇందుకోసం సంస్థలో పరిశోధనా విభాగం ఉందని, వాళ్లు ఎప్పటికప్పుడు కొత్త రకం పాముల గురించి పరిశోధనలు చేస్తుంటామని వివరించారు. ఈ విషయంలో అటవీ శాఖ, జూపార్కు అధికారులు తమకు ఎంతో మద్దతు ఇస్తుంటారని చెబుతున్నారు.అవగాహన అవసరం..పాములన్నీ విషపూరితం కాదు.. ఎవరికీ హాని చేయని పాములు కూడా ఉంటాయి. వాటిని చూసి అనవసరంగా భయపడి వాటిని చంపొద్దని ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ వలంటీర్లు చెబుతున్నారు. పాముల గురించి ప్రజల్లో మరింత అవగాహన రావాలనే ఉద్దేశంతో ఏటా దాదాపు 200 నుంచి 300 వరకూ అవగాహనా కార్యక్రమాలు చేస్తుంటామని వివరించారు. పాము కాటు వేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా అవగాహన కలి్పస్తుంటామని పేర్కొంటున్నారు. దీంతో పాటు అడవుల్లో అరుదైన జాతి పాములను కాపాడేందుకు తాము కృషి చేస్తున్నామని వివరించారు. ఔషధ గుణాలున్నాయంటూ కొన్ని పాములను అనవసరంగా చంపి, విదేశాలకు ఎగుమతి చేస్తుంటారని, ఇలాంటి వారి గురించి తమ దృష్టికి వస్తే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించి.. అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట వేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఆ తృప్తి వేరు.. పాములు పట్టాలంటూ రోజూ చాలా మంది ఫోన్ చేస్తుంటారు. రెస్క్యూ చేసిన పాముల్లో దాదాపు 50 శాతం విషపూరితమే. కొన్నిసార్లు వాటిని పట్టే సమయంలో వలంటీర్లు కూడా ఇబ్బందులు పడుతుంటారు. ఎంతగా శిక్షణ తీసుకున్నా.. ఫీల్డ్‌లోకి వచ్చేసరికి కొన్ని సవాళ్లు ఉంటాయి. వాటిని అధిగమిస్తూ.. సమస్యలను ఎదుర్కొంటూ ముందుకు వెళ్తుంటాం. పాములను జాగ్రత్తగా పట్టుకున్న తర్వాత.. ఇంటి యజమానుల కళ్లల్లో కృతజ్ఞతాభావం మాకు ఎంతో సంతృప్తిని ఇస్తుంది. మేం చేస్తున్న పనిలో ఆ క్షణం తృప్తినిచ్చే క్షణం. – అవినాష్ విశ్వనాథం, జనరల్ సెక్రటరీ, ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ -
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజేతను చేసే రహస్యం ఏంటి?
-
టాలీవుడ్ నే అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఏకైక స్టార్ ప్రభాస్
-
ధర్మ చక్రం: నాలుగు ఆశ్రమాలలో ఏది గొప్పది?
గృహస్థాశ్రమంలో నిత్యం జరిగే పంచ మహా యజ్ఞాలలో మూడవది – హోమోదైవో.. దేవ యజ్ఞం. వేదమంత్రాల పఠనంతో భగవంతుడిని ఉద్దేశించి హోమం చేస్తూ నైవేద్యాలను సమర్పించాలి – హుతో హోమః... అంటే యజ్ఞయాగాది క్రతువులు. మహాభారతంలో శాంతిపర్వంలో అంపశయ్యమీద పడుకుని భీష్మాచార్యుల వారంటారు..‘‘అసలు ధర్మానికంతటికీ ఇరుసువంటివాడు గృహస్థు... ఓ ధర్మరాజా! గృహస్థులేని నాడు ఈ సృష్టే లేదు. గృహస్థులేని నాడు ఈ ధర్మచక్రం తిరగనే తిరగదు.’’ అని. అగ్ని ద్వారా దేవతలకు హవిస్సును గృహస్థే ఇస్తాడు. ఇతర ఆశ్రమాల వాళ్ళు ఇవ్వరు. గృహస్థు ఇచ్చిన హవిస్సును దేవతలు తిని సంతుష్ఠులై వర్షం కురిపిస్తారు... ఎక్కడ..? గృహస్థు ఇంట్లోకాదు, ఆ ్ర΄ాంతమంతా కురిపిస్తారు. ‘‘అన్నద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః/ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మసముద్భవః... ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః/ అఘాయురింద్రియారామో మోఘం పార్థ స జీవతి’’... అంటే ఇది ఒక చక్రం. తిరుగుతోంది. ప్రాణులు పుట్టాలి అంటే అన్నం (ఆహారం) తినాలి. అన్నసారం స్త్రీలో శోణితంగా, పురుషునిలో శుక్రంగా మారి రెండూ కలిసి సృష్టి జరగాలి. బిడ్డలు పుట్టాలి. దీనికంతటికీ మూలమైన అన్నం పుట్టాలంటే పంటలు పండాలి.. అంటే వర్షం పడాలి... వర్షం పడాలంటే... యజ్ఞం జరగాలి.అన్నం, నీరు ఎంత కాలం దొరుకుతాయో అంతకాలమే ధర్మం ఉంటుంది. వాటిలో మొదట నీరు. ఇవి దొరకనప్పుడు ఎన్ని ధర్మాలు, నీతులు, ప్రవచనాలు చెప్పినా వినేవారు కానీ, ΄ాటించేవారు కానీ లోకంలో ఉండరు. ధర్మం తప్పి΄ోతుంది. ‘ఆ΄ోవా ఇదగుం సర్వం...అమృతం వా ఆపః...’’ నీరు అమృతం. ్ర΄ాణులన్నీ ఆ నీటి మీదే ఆధారపడి ఉన్నాయి. అన్నం, నీరు కావాలంటే వర్షం పడాలి... అలా పడాలంటే యజ్ఞం చేయాలి. యజ్ఞ కర్మ సముద్భవమ్... కర్మ చేస్తే వస్తుంది. అదెవరు చేయాలి?... ఒక్క గృహస్థు మాత్రమే.. పక్కన ధర్మపత్నితో కూడుకుని ఉన్నవాడు మాత్రమే యజ్ఞాన్ని చేస్తాడు. అప్పుడు ఈ సృష్టి ఏర్పడుతుంది, నిలబడుతుంది, లయమవుతుంది. ప్రశాంతత కలుగుతుంది. అందరూ నిర్వర్తించాల్సిన ధర్మాన్ని అందరూ నిర్వర్తిస్తున్నారు. కాబట్టి ధర్మచక్రం సవ్యంగా తిరుగుతుంది.ఎంత సంపన్న కుటుంబంలో పుట్టిన వాడయినా తల్లిపా లమీద ఆధారపడాల్సిందే. తల్లి లేకపోతే సృష్టి లేదు. అలాగే గృహస్థాశ్రమం మిగిలిన అన్ని ఆశ్రమాలకు తల్లిలాంటిది. ఆ గృహస్థులేని నాడు మిగిలిన ఆశ్రమాల వాళ్ళకు భిక్ష లేనే లేదు... ఈ మాటలు నావి కావు.. మహాభారతంలో శాంతిపర్వంలో భీష్ముడు చెప్పినవి. రామాయణంలో అయోధ్యకాండలో భరతుడు కూడా ఇదే అంటాడు..‘‘అన్నయ్యా ! నీకు తెలుసు కదా! గార్హస్థ్యం శ్రేష్టమాశ్రమం... నాలుగు ఆశ్రమాలలో గృహస్థాశ్రమమే గొప్పది.’’ ‘హోమో దైవో బలిర్భౌతో...’’ హవిస్సు ద్వారా దేవతలకు అన్నం పెట్టిన గృహస్థుకు సమస్త భూతములు, ప్రాణులను కూడా పోషించే కర్తవ్యం ఉంది. భీష్ముడు మరో మాట కూడా చెప్పాడు... గృహస్థాశ్రమంలో ఉన్నవారు ఎప్పడూ సంసార లంపటంలో పడి ఉంటారు, వారు అగాధంలో పడి΄ోయారని అనుకుంటున్నావేమో ... గృహస్థుకు మోక్షం లేదని ఎవరన్నారు !!! దేవతలకు అన్నం పెడుతున్న గృహస్థుకు కూడా మోక్షం లభిస్తుంది.-చాగంటి కోటేశ్వరరావు -
అరచేతిలో వైకుంఠం.. అబద్ధానికి రెక్కలు.. దగా బాబు అరాచకాలు
-
మహా సంగ్రామంలో విజేతగా నిలిచేదెవరు ?
-
Valmiki Jayanti 2024 ఆది స్మరణీయుడు
జగదానంద కారకుడు, శరణాగత వత్సలుడు, సకల గుణాభిరాముడు, మూర్తీభవించిన ధర్మతేజం శ్రీరాముని దివ్యచరిత్రను, శ్రీరామ నామ మాధుర్యాన్ని మన కందించిన కవికోకిల, ఆది కవి వాల్మీకి మహర్షి చిరస్మరణీయుడు. శ్రీరాముని దివ్యచరితాన్ని కావ్య రూపంలో అందించమని ఆదేశించిన బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు శ్రీరాముని కీర్తి పరిమళాలను ముల్లోకాల్లో గుబాళింప చేసిన వాల్మీకి మహర్షి శ్రీరామాయణ మహాకావ్యాన్ని అందించారు. రామాయణంలో మానవ ధర్మాలన్నిటి గురించి వాల్మీకి చక్కగా విశదపరచాడు. శిష్య ధర్మం, భ్రాతృధర్మం, రాజ ధర్మం, పుత్ర ధర్మం, భత్యు ధర్మం, ఇంకా పతివ్రతా ధర్మాలు, ప్రేమలూ, బంధాలు, శరణాగత వత్సలత, యుద్ధనీతి, రాజనీతి, ప్రజాభ్యుదయం, సత్యవాక్య పరిపాలన, ఉపాసనా రహస్యాలు, సంభాషణా చతురత, జీవితం విలువ, ధర్మాచరణ మున్నగు అనేక రకాల ఉపదేశాలున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే రామాయణ కావ్యంలో మంచి చెడుల గురించి చెప్పనిదంటూ ఏదీ లేదు. ఆధునిక సమాజంలో మనం ఉపయోగించే ప్రసార కౌశలాలు, కార్యనిర్వహణ కౌశలాలు, ప్రశాసనం, నగర, గ్రామీణ నిర్మాణ యోజన, సార్థకమైన వ్యూహరచనా నిర్మాణం, ఆంతరిక రక్షణా పద్ధతి, యుద్ధ వ్యూహరచన మొదలైనవాటికి రామాయణ రచన నిధి వంటిది.ఇంత విలువైన సత్యాలను చెప్పి, ఇంతటి మహత్తర కావ్యాన్ని అందించిన కవి వాల్మీకి మహర్షి సదావందనీయుడు. ప్రతి ఒక్కరూ రామాయణ కావ్యం చదివి అందులోని నీతిని అవలోకనం చేసుకుని, అందులో కొంతయినా ఆచరించ గలిగితే ఆ మహాకవి ఋణం తీర్చుకున్నట్లే. -
World Food Day 2024 : ఆహార భద్రత ఏదీ?
1945లో ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) స్థాపన తేదీని గుర్తుచేసుకోవడానికి అక్టోబర్ 16న ప్రతి సంవత్సరం ‘ప్రపంచ ఆహార దినోత్సవం’ జరుపుకొంటున్నాం. ఆకలి, ఆహార భద్రతకు సంబంధించిన ఇతర సంస్థలు... ప్రపంచ ఆహార కార్యక్రమం, ప్రపంచ ఆరోగ్య సంస్థ, వ్యవసాయ అభివృద్ధికి అంతర్జాతీయ నిధి వంటివి ఈ రోజును ఘనంగా జరుపుకుంటాయి.ఆకలిని ఎదుర్కోవడానికి, సంఘర్షణ ప్రాంతాలలోశాంతికి దోహదపడటానికి, యుద్ధం సంఘర్షణలకు ఆకలిని ఉపయోగించడాన్ని ఆపడంలో ప్రముఖ పాత్ర పోషించినందుకు ప్రపంచ ఆహార కార్యక్రమం 2020లో నోబెల్ శాంతి బహుమతిని అందుకుంది. ‘ప్రపంచ ఆహార దినోత్సవం 2024’ యొక్క సారాంశం ‘మెరుగైన జీవితం, మంచి భవిష్యత్తు కోసం ఆహార హక్కు’. 2022 నివేదిక ప్రకారం ఆహార భద్రత కలిగిన మొదటి ఐదు దేశాలు ఫిన్లాండ్, ఐర్లాండ్, నార్వే, ఫ్రాన్స్, నెదర్లాండ్‌లు. అత్యంత ఆహార అభద్రత ఉన్న దేశాలు యెమెన్, హైతీ, సిరియాలు. భారతదేశంలో ఆహార భద్రత ప్రధాన ఆందోళన కలిగిస్తోంది. 2022లో, ప్రపంచ ఆహార భద్రతా సూచిక పరంగా 113 ప్రధాన దేశాలలో భారత దేశానికి 68వ స్థానాన్ని ఇచ్చింది. 2024లో, ప్రపంచ ఆకలి సూచిక (జీహెచ్ఐ –2024) ప్రకారం 127 దేశాలలో భారతదేశం 27.3 స్కోరుతో 105వస్థానంలో ఉంది. దేశంలో 27 కోట్ల మందిఆకలితో ఉన్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధికం. భారతీయ జనాభాలో అధిక భాగం వ్యవసాయ కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నప్పటికీ, దేశంలో పెరుగుతున్న జనాభా కారణంగా అందరికీ ఆహారం లభించడం సవాలుగా ఉంది. కరవు, వరదల అస్థిర చక్రాలను దేశం అనుభవిస్తున్నందున, వాతావరణ మార్పుల కారణంగా భారతదేశం ఆహార భద్రత ముప్పులో ఉంది. దేశంలో సగటు కంటే కొంచెం ఎక్కువ వర్షపాతం మాత్రమే నమోదవుతున్నప్పటికీ, అవపాతం హెచ్చుతగ్గులు వివిధ ప్రాంతా లలో తీవ్రంగా మారుతూ పంటలను అస్థిరపరుస్తున్నాయి. ఆహార భద్రతను మెరుగుపరచడానికి... ఆహారాన్ని వృధా చేయడాన్ని తగ్గించడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, న్యాయమైన వ్యాపార పద్ధతులను ప్రోత్సహించడం, వైవిధ్యంపై శ్రద్ధ చూపడం, దిగుబడి అంతరాన్ని తగ్గించడం, వాతావరణ మార్పులను ఎదుర్కోవడం, ఆహార అభద్రతకు పరోక్ష కారణాలను పరిష్కరించడం వంటి మార్గాలు అవసరం.– డా. పి.ఎస్. చారి మేనేజ్మెంట్ స్టడీస్ ప్రొఫెసర్, తిరుపతి -
ప్రపంచానికి సవాల్ విసురుతోన్న కృత్రిమ మేథ
-
పాముకాటు వీరులు
1960లలో నా భర్త రోమ్ తన స్నేహితులుతో కలిసి ఫ్లోరిడాలోని "ఎవర్ గ్లేడ్" అనే నీటితో నిండిన గడ్డి మైదాన ప్రాంతంలో పాములను వెతుకుతూ వెళ్లేవారు. ఒకసారి తన స్నేహితుడు షూబెర్ట్ తో కలిసి వెళ్ళినప్పుడు వారికి ఒక మోకాస్సిన్ అనే నీటి పాము నీటిలో తేలుతున్న దుంగపై కనిపించింది. దాన్ని పట్టుకునే ప్రయత్నంలో ఆ దుంగ నీటిలో మునిగిపోబోయింది. ఎక్కడ ఆ పాము నీటిలోకి తప్పించుకుని వెళ్లిపోతుందో అనే కంగారులో రోమ్ ఆ పాముని చేత్తో పట్టుకుని సంచిలో పెట్టేసాడు. ఆ పాముని సంచిలో పెట్టాక నింపాదిగా "షూబెర్ట్ ఆ పాము నన్ను కరిచింది !" అని అసలు విషయం చెప్పాడు. ఆ విషయం విన్న షూబెర్ట్ ఎలాంటి తొణుకు బెణుకు లేకుండా "అవి అంతే అప్పుడప్పుడు ఆలా కరుస్తుంటాయి!" అని చాలా తేలికగా అనేశాడు. కాసేపటికి రోమ్ చెయ్య వాసిపోయేసరికి వారు ఆరోజుకి పాములను వెతకటం ఆపేసి ఇంటికి వెళ్లిపోయారు. షూబెర్ట్ మాత్రం రోమ్ చేసిన పని వలన తను ఆ రోజంతా పాములను చూసే మంచి అవకాశం కోల్పాయానని నసుగుతూనే ఉన్నాడు.రోమ్ బాస్ బిల్ హాస్ట మాత్రం ఎంతో అయిష్టంగానే రోమ్ కు మరుసటి రోజు సెలవు తీసుకొనిచ్చాడు. మిగిలిన మిత్రులైతే - "ఆయన ఇంకా నేర్చుకుంటున్నట్టు ఉన్నాడు!", "అమ్మాయిల్ని ఆకట్టుకుందామని అనుకుంటున్నాడా ఏంటి ఈ మూర్ఖుడు!" అనే అన్నారు. ఒక ఎలక్ట్రీషియన్ తన పని చేస్తున్నప్పుడు చిన్న షాక్ కొడితే తన తోటి ఎలక్ట్రీషియన్ వారి నుంచి ఎలాంటి స్పందన వస్తుందో, అలాగే తన సహోద్యోగులు కూడా స్పందించారు. తన పని సరిగ్గా ఎలా చెయ్యాలో తెలియని వాడు అని వారి ఉద్దేశం. మరొకసారి అట్టిల అనే మా స్నేహితుడు తన ఇంటివద్ద పెంచుకుంటున్న పాము నీటి గిన్నె మార్చబోతుంటే, ఆ పాము అతని చేతిపై కాటువేసింది. ఈ సారి రోమ్ కొంత విచక్షణతో "నువ్వు ఆ పాముని ఇంకో సంచిలోనో లేక పెట్టెలోనో ఎందుకు పెట్టలేదు? " అని అడిగాడు. "ఆ పాము మరొక వైపు చూస్తుంది కదా ఈ లోపల నేను చటుక్కున నీరు మార్చేద్దామని అనుకున్నా!" అన్నాడు అట్టిల . ఆ మాట విన్న స్నేహితులంతా , ఒక పక్క నొప్పితో అట్టిల బాధపడుతున్నా అతని అవివేకానికి విరగబడి నవ్వేశారు. చివరకి ఎవరో అతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లారు అనుకోండి. పాములను పట్టుకుని వాటిని రక్షించే వారు (స్నేక్ క్యాచర్స్ ) పాము కాటుకి గురైతే అది వారి తప్పే అవుతుంది తప్ప పాముది కాదు! ఆ పాముని పట్టుకునే వ్యక్తి నిర్లక్ష్యం వలనో లేక కోసం ఏదో హడావిడి చేద్దాం అనే వారి ఉద్దేశం వలనే ఇలా పాముకాటుకు గురవుతారని రోమ్ మరియు అయన స్నేహితులకి 1960ల నుండి ఉన్న అభిప్రాయం. ఈ అభిప్రాయం రీల్స్ / వీడియో లైక్స్ మోజులో ఉన్న ఈ తరానికి కూడా వర్తిస్తుంది. ఈ ఉద్దేశంతోనే ఆలా ఎవరైనా పాములను రక్షించేవారు పాము కాటుకు గురైతే మాత్రం వారిని నిర్దాక్షిణంగా ఆటపట్టిస్తుంటారు. అనుకోకుండా పాముకాటుకు గురైన సాధారణ జనాలకి మాత్రం ఇది వర్తించదులెండి. ఒక రకంగా ఇలాంటి సహచరులను మందలించే సాంప్రదాయమే వారిని నిర్లక్షానికి అవకాశమివ్వకుండా పని చేస్తూ, ఈ రోజుకి జీవించి ఉండేటట్లు చేసింది అనేది నా అభిప్రాయం.కానీ మన దేశంలో అనేక స్నేక్ క్యాచర్స్, అందులోని ముఖ్యంగా యువకులు, వారు పాముకాటుకు గురైన సందర్భాల గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. కొంతకాలం క్రిందట ఒక కుర్రవాడు పల్చటి సంచిలో త్రాచుపామును పట్టుకుని ముడి వేయబోతుంటే, ఆ పాము పల్చటి సంచిలో నుండి కాటు వేసింది. అతను కొన్ని రోజుల హాస్పిటల్లో ఉండగా ఆ సమయంలో చుట్టుపక్కల వాళ్లంతా అలవాటుగా పరామర్శకు వచ్చారు. ఆ కుర్రాడు ఇదేదో తాను చేసిన ఘనకార్యం వలనే అనుకుని పొంగిపోయాడే తప్ప ఒక్కసారి కూడా ఈ అనుకోని ప్రమాదం ఎందుకు జరిగిందో ఆలోచించలేదు. తన ఘనకార్యం గురించి అనేక సార్లు మాట్లాడుతుంటే, ఒకసారి రోమ్ "అసలు ఇందులో తప్పు ఎవరిది?" అని అడిగాడు . ఆ కుర్రాడైతే కచ్చితంగా సమాధానం చెప్పలేకపోయాడు కానీ తన తప్పయితే ఏమి లేదని బుకాయించాడు. దానికి రోమ్ " నువ్వు సరైన బ్యాగ్ వాడినట్లైతే ఆ పాము నిన్ను కాటు వేసి ఉండేది కాదు కదా!" అని అడిగితే అటు నుండి సమాధానమే లేదు. నేను మా "మద్రాస్ క్రొకోడైల్ బ్యాంక్" మాసపత్రికలో ప్రచురించడం కోసం వ్యాసాలు అడిగితే అనేక మంది తమ పాముకాటు అనుభవం గురించి రాసి పంపారు. ఆలా వచ్చిన వాటిల్లో ఓక వ్యాసం శీర్షిక "నా సాహస పతకం" అని రాసి పంపారు. నాకైతే దాన్ని "నా అజ్ఞాన పతకం" అని మార్చాలని అనిపించింది. ఇలా పాముకాటు నుండి బతికి బయటపడ్డవాళ్లు గమనించని విషయాలు రెండు ఉన్నాయి. ఒకటి - వారిని కాటేసిన పాముకాటులో ఎంత విషం ఉంది , రెండవది - వారిని కాపాడిన డాక్టర్ ప్రతిభ. ఈ రెండు కారణాలతో వారు బహుశా బ్రతికి బయపడి ఉండవచ్చు. "పాము పోకరీలు" అనే మేము ముద్దుగా పిలిచే ఇలాంటి వారు తమ పాముకాటు సంఘటన ఏదో తమ ప్రతిభ అన్నటు మాట్లాడతారు కానీ అది వారి తెలివితక్కువతనం అని తెలుసుకోవట్లేదు. ఒక వండ్రంగి మేకుని కొట్టబోతే ఆ సుత్తి గురితప్పు వేలుకి తగిలి రక్తం వస్తే, అదేదో తన ప్రతిభ వల్లే అయ్యింది అని అనుకున్నట్లు ఉంటుంది వీరి ప్రవర్తన. పాములను పట్టుకుని రక్షించే మీ స్నేక్ క్యాచర్ స్నేహితులు ఎవరైనా పాముకాటు నుండి కోలుకుని బ్రతికి బయటపడితే మీరు మాత్రం దయచేసి వారిని పరామర్శించడానికి వెళ్లి ఆహా ఓహో అని మాత్రం వారిని పొగడకండి! -రచయిత, ఫోటోలు : జానకి లెనిన్-అనువాదం : చంద్ర శేఖర్ బండి -
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు: శ్రీనివాసుని వైభోగం చూద్దాం రారండి!
శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 04, శుక్రవారం వైభవంగా ఆరంభమయ్యాయి. ఇవి 12వ తేదీ, శనివారం వరకు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వైశిష్ట్యం ఇలా... బంగారు తిరుచ్చి ఉత్సవం: అక్టోబర్ 4, శుక్రవారం ఉదయం శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారు బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.సాయంత్రం ధ్వజారోహణం: సాయంత్రం 5.45కు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రాంరంభమయ్యాయి. 7 – సోమవారం ఉదయం: కల్పవృక్ష వాహనం: నాలుగోరోజు ఉదయం స్వామి ఉభయ దేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి దర్శనమిస్తారు. కల్పవృక్ష వాహన దర్శనం వరాలను అనుగ్రహిస్తుంది.రాత్రి: సర్వభూపాల వాహనం... సర్వభూపాల అంటే విశ్వానికే రాజు అని అర్థం. అంటే శ్రీవారు సకల దిక్పాలకులకు రాజాధిరాజని భావం. దిక్పాలకులందరూ స్వామివారిని హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారనే సందేశాన్ని ఇస్తున్నారు.8 – మంగళవారం ఉదయం మోహినీ అవతారం: ఐదోరోజు ఉదయం మోహినీరూపంలో దర్శనమిస్తారు. పక్కనే స్వామి దంతపు పల్లకిపై వెన్నముద్ద కృష్ణుడై మరో రూపంలో అభయమిస్తాడు. తనకు భక్తులైనవారు మాయను సులభం గా దాటగలరని స్వామి ప్రకటిస్తున్నాడు.సాయంత్రం గరుడ వాహనం: ఐదో రోజు రాత్రి గరుడవాహనంలో ఊరేగుతూ భక్తులందరికీ తన దివ్యమంగళ రూపదర్శనమిస్తారు. గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయి.9 – బుధవారం ఉదయ: హనుమంత వాహనం: ఆరోరోజు ఉదయం శేషాచలాధీశుడు రాముని అవతారంలో హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తాడు. ఈ ఇరువురినీ చూస్తే వేదాల తత్త్వం ఒనగూరుతుంది.సాయంత్రం 4 గంటలకు స్వర్ణరథం: ఆరోరోజు సాయంత్రం స్వామి స్వర్ణరథాన్ని అధిరోహించి అనుగ్రహిస్తాడు. స్వర్ణోత్సవ సేవలో కల్యాణకట్ట సేవాపరులు బంగారు గొడుగును అలంకరించడం సంప్రదాయం. రాత్రి 7 గంటలకు గజవాహనం... ఆరోరోజు రాత్రి వేంకటాద్రీశుడు గజవాహనంపై భక్తులకు అభయ మిస్తాడు. భక్తులు శ్రీనివాసుని హృదయంలో పెట్టుకుని శరణాగతి చెందాలని తెలుస్తోంది.10 – గురువారం ఉదయం సూర్యప్రభ వాహనం: ఏడోరోజున ఉదయం సూర్యప్రభ వాహనంపై తిరుమాడవీధులలో విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు. సూర్యప్రభ వాహనంపైన దర్శనం వల్ల ఆరోగ్యం, విద్య, ఐశ్వర్యం, సంతానం సిద్ధిస్తాయి.రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం: ఏడో రోజు రాత్రి స్వామి చంద్రప్రభ వాహనం పై విహరిస్తారు. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది.11 – శుక్రవారం ఉదయం: శ్రీవారి రథోత్సవం: ఎనిమిదో రోజు ఉదయం ఉభయదేవేరులతో కూడిన స్వామి రథోత్సవం జరుగుతుంది.రాత్రి 7 గంటలకు అశ్వవాహనం: ఎనిమిదో రోజు రాత్రి శ్రీమలయప్పస్వామివారు అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహిస్తాడు. స్వామి అశ్వవాహనారూఢుడై కల్కి అవతారంలో తన స్వరూ΄ాన్ని ప్రకటిస్తూ భక్తులను కలిదోషాలకు దూరంగా ఉండాలని ప్రబోధిస్తున్నాడు.12 – శనివారం ఉదయం 6 గంటలకు చక్రస్నానం: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరిదైన తొమ్మిదో రోజు ఉదయం చక్రస్నానం జరుగుతుంది. ముందుగా ఉభయదేవేరులతో కలిసి శ్రీవారి సరసన ఉన్న చక్రత్తాళ్వార్లకు ΄ాలు, పెరుగు, నెయ్యి, తేనె, చందనంతో అర్చకులు అభిషేకం చేస్తారు. ఈ అభిషేక కైంకర్యాన్ని అందుకుని చక్రత్తాళ్వార్ ప్రసన్నుడవుతాడు. చక్రస్నానం సమయంలో పుష్కరిణిలో స్నానం చేసిన వారు యజ్ఞఫలాన్ని పొందుతారని ప్రతీతి..రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణం: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరిదైన తొమ్మిదో రోజు రాత్రి బంగారు తిరుచ్చి ఉత్సవం తరువాత ధ్వజావరోహణం శాస్త్రోక్తంగా జరుగుతుంది. ధ్వజావరోహణ ఘట్టంతో తొమ్మిది రోజుల పాటు జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.– లక్ష్మీకాంత్ ఆలిదేనా, సాక్షి, తిరుమల -
సైబర్ థ్రిల్లర్ CTRL : సోషల్‌మీడియా కంట్రోల్...కంట్రోల్
జీవితాన్ని ‘విధి’ నియంత్రించడం మాట దేవుడెరుగు... రకరకాల యాప్‌లు మాత్రం నియంత్రిస్తున్నాయి. టెక్నాలజీపై అతిగా ఆధారపడి అనర్థాలను కొని తెచ్చుకోవడం నుంచి డీప్‌ఫేక్ వరకు డిజిటల్ స్పేస్‌లోని చీకటి ప్రపంచంపై దృష్టి సారిస్తుంది కంట్రోల్. నెట్‌ఫ్లిక్స్ సైబర్–థ్రిల్లర్ ‘కంట్రోల్’ ట్రైలర్ నేపథ్యంలో సాంకేతిక వైపరీత్యాల గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది...అనగనగా ‘కంట్రోల్’ అనే యాప్. ఈ యాప్‌లోకి అడుగు పెడితే ఏ.ఐ అసిస్టెంట్ ప్రత్యక్షమౌతాడు. ‘నేను మీకు ఏ విధంగా సహాయపడగలను’ అని అడుగుతాడు.యూజర్ తన మనసులో మాట చెప్పుకోవచ్చు. ఇక అప్పటి నుంచి యూజర్ జీవితం, సంతోషం ఏఐ ఆసిస్టెంట్ నియంత్రణలోకి వెళ్లిపోతుంది.విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వం వహించిన సైబర్ థ్రిల్లర్ ‘కంట్రోల్’లో అనన్య పాండే, విహాన్ సమత్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో అనన్య పాత్ర పేరు... నెల్లా అవస్తీ.కంట్రోల్యాప్. ఇన్‌లోకి నెల్లా లాగిన్ కావడంతో రెండు నిమిషాల నిడివిగల ట్రైలర్ మొదలవుతుంది. ఈ యాప్‌లోకి లాగిన్ అయిన నెల్లా తన జీవితాన్ని నియంత్రించే హక్కును ఏఐ–జనరేటెడ్ పర్సన్ ఎలెన్‌కు ఇస్తుంది. నెల్లా, జో ల మధ్య ఆనందకరమైన ప్రేమ అర్ధంతరంగా విచ్చిన్నం అవుతుంది. దీనికి కారణం జో చేసిన మోసం. బ్రేకప్ తరువాత కక్షసాధింపు చర్యల్లో భాగంగా నెల్లాను విపరీతంగా ట్రోలింగ్ చేస్తుంటాడు జో. జో టార్చర్ తట్టుకోలేక ‘కంట్రోల్’ యాప్‌ను ఆశ్రయిస్తుంది నెల్లా. తన ‘ఎక్స్’ను రిమూవ్ చేయడానికి ఏఐ అసిస్టెంట్ సహాయం కోరుతుంది. దీంతో జో సోషల్ మీడియా బ్లూప్రింట్ పిక్సెల్ బై పిక్సెల్ తుడిచిపెట్టుకు΄ోతుంది. సోషల్ మీడియాలోనే కాదు రియల్ వరల్డ్‌లోనూ అతడి ఉనికి కనిపించదు. జో ‘మిస్సింగ్’ వార్త నెల్లా చెవిలో పడుతుంది. ‘నీకు కావాల్సింది ఇదే కదా’ అని నెల్లాతో ఏఐ–అసిస్టెంట్ చెప్పడంతో క్లిప్ ముగుస్తుంది.‘అన్లైన్లో మన ఉనికికి, నిజ జీవితంలో మనం ఎవరం అనే దానికి మధ్య గీసుకోవాల్సిన విభజన రేఖ గురించి కంట్రోల్ సిరీస్ దృష్టి పెడుతుంది’ అంటుంది అనన్య.ఇటీవల కాలంలో అమీర్‌ఖాన్, రణ్వీర్ సింగ్, ఆలియాభట్, రష్మిక మందనలాంటి టాప్ మూవీస్టార్స్ ‘డీప్‌ఫేక్’ బారిన పడ్డారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘చాలా భయంగా ఉంది. సెలబ్రిటీలుగా మా ముఖాలు, గొంతులు ఎప్పుడు ఏ రకంగా బయటకు వస్తాయో తెలియకుండా ఉంది. మనం ఎంత వరకు భద్రంగా ఉన్నామో తెలియడం లేదు. టెక్నాలజీ దుర్వినియోగం కాకుండా చట్టాలు తేవాలి. గట్టిగా అమలు పర్చాలి. ఇదొక్కటే పరిష్కారం’ అంటుంది అనన్య పాండే.జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత ఉత్సాహవంతమైనదో, సృజనాత్మకమైనదో మరో కోణంలో చూస్తే వినాశకరమైనది. డీప్‌ఫేక్ టెక్నాలజీని మహిళల విషయంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఆన్లైన్ వేధింపులలో మహిళలలే బాధితులు. కృత్రిమ మేధను ఒక ప్రత్యేకమైన జీవిగా, ఒక కొత్త జాతిగా... ఇలా ఎన్నో రకాలుగా వర్ణించారు. అయితే ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని మంచి కోసం ఉపయోగించుకోవడంలో ఆ వర్ణణలేవీ ఉపయోగపడడం లేదు.– వెరిటీ హార్డింగ్, కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ జియో పాలిటిక్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రియాంక చోప్రాకు ట్రోలింగ్ కొత్త కాదు. ఎన్నో సందర్భాలలో ట్రోలింగ్‌కు గురైంది అయితే చో్ర΄ా ఎప్పుడూ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. డీలా పడి΄ోలేదు. ఆమె జపించే మంత్రం... సెల్ప్–లవ్. తాజాగా ప్రియాంక చోప్రా ఒక హార్ట్వామింగ్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. విశాలమైన కళ్ల అబ్బాయిలా కనిపించే తొమ్మిది సంవత్సరాల అమ్మాయి ఫొటో అది. ఆ ఫొటో చోప్రాదే. ఫొటోను షేర్ చేస్తూ ప్రియాంక ఇలా రాసింది...వార్నింగ్: నా తొమ్మిదేళ్ల చిన్నారిని ట్రోల్ చేయకండి. తన ప్రీ- టీనేజ్ హెయిర్ స్టైల్‌ను ‘కటోరి కట్’గా అభివర్ణించింది. ‘మిమ్మల్ని మీరు ప్రేమించండి’ అంటూ సెల్ఫ్–లవ్ ప్రాముఖ్యత గురించి చెప్పింది. -
వరల్డ్ యానిమల్ డే : అమ్మలా ప్రేమను పంచుతున్నారు!
జంతు సంక్షేమం. సంరక్షణకు సంబంధించి మహిళల కృషి నిన్నామొన్నటిది కాదు. దీనికి ఎంతో చరిత్ర ఉంది. ప్రపంచవ్యాప్తంగా జంతుసంరక్షణకు సంబంధించిన ఉద్యమాలు, సంస్థలలో ఎక్కువగా మహిళలే నాయకత్వ బాధ్యత వహిస్తున్నారు. మన దేశంలో జంతుసంక్షేమ విధానానికి వెన్నెముక అయిన పీసీఏ యాక్ట్‌లో అప్పటి రాజ్యసభ ఎంపీ, ప్రముఖ నృత్యకారిణి రుక్మిణీ ఆరండల్ కీలకపాత్ర పోషించింది.‘మన దేశంలో జంతువులపై క్రూరత్వాన్ని నిరో«ధించే విషయంలో మహిళా నాయకుల చొరవ, శ్రమ ఎంతో ఉంది. జంతు సంరక్షణ ఉద్యమంలో ఎన్నో వినూత్న విధానాలకు రూపకల్పన చేస్తున్నారు. నా మిత్రురాలు స్వర్ణాలీరాయ్ కోల్‌కతాలో బడులు, కాలేజీలకు వెళుతూ వ్యవసాయ రంగంలో జంతువులను ఎలా చూస్తున్నారు నుంచి జంతు సంక్షేమం వరకు ఎన్నో విషయాల గురించి అవగాహన కలిగిస్తుంది. పంజాబ్ యూనివర్శిటీలో వందలాదిమంది విద్యార్థులకు వ్యవసాయంలో భాగమైన జంతువుల సంక్షేమం గురించి ఎంతో అవగాహన కలిగించింది. ఇలాంటి వారు దేశవ్యాప్తంగా ఎంతోమంది ఉన్నారు’ అని చెబుతున్నారు అలోక్పర్ణ సేన్‌గుప్తా.అలోక్పర్ణసేన్ యానిమల్ రైట్స్ అడ్వకేట్. హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్, ఇండియా మేనేజింగ్ డైరెక్టర్. వీధికుక్కల సంక్షేమం నుంచి వ్యవసాయ రంగంలో జంతు సంరక్షణ వరకు ఎన్నో అంశాలపై పనిచేస్తోంది.‘రుక్మిణీదేవి కృషి వల్లే పీసీఏ చట్టం, యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా అమల్లోకి వచ్చాయి. జంతుసంక్షేమానికి సంబంధించిన లక్ష్యాల కోసం మహిళలు అంబాసిడర్లుగా పనిచేస్తున్నారు. తాము పనిచేయడమే కాదు ఇతరులకు స్ఫూర్తిని ఇస్తున్నారు. జంతు సంక్షేమ ఉద్యమంలో కూడా ఎంతోమంది మహిళలు పనిచేస్తున్నారు. కొందరు ప్రముఖంగా కనిపించవచ్చు. చాలామంది తెరవెనుక నిశ్శబ్దంగా పనిచేస్తున్నారు’ అంటుంది జంతు సంక్షేమ ఉద్యమకారిణి నజరేత్. -
మిడిల్ ఈస్ట్ లో యుద్ధ మేఘాలు.. మూడో ప్రపంచ యుద్ధం..?
-
John Floor: ఆ జంప్ విలువ అమూల్యం..!
పదహారేళ్ల వయసు.. కొత్తగా రెక్కలు విప్పుకుంటూ రివ్వున ఎగిరిపోవాలని, ప్రపంచాన్ని చుట్టిరావాలని కోరుకుంటుంది! కానీ ఆ ప్రాయంలోనే జరిగిన ఒక అనూహ్య ఘటన ఆ అమ్మాయి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసింది. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ గడిపిన ఆ బాలికకు ఆపై నడవడమే అసాధ్యమైంది. పుట్టుకతో వచ్చిన లోపానికైతే జీవితంలో సన్నద్ధత వేరుగా ఉంటుంది. కానీ ఎదుగుతున్న వయసులో ఎదురైన ఆ పరిస్థితికి ఆమె చలించిపోయింది. పట్టరాని దుఃఖాన్ని అనుభవించింది. అయితే ఆ బాధతోనే కుంగిపోకుండా.. నిలిచి పోరాడాలని నిర్ణయించుకుంది. అందుకోసం ఆమె క్రీడలను ఎంచుకుంది. ఆ దారిలో తీవ్రంగా శ్రమించి శిఖరానికి చేరింది. ఎందరికో స్ఫూర్తినిచ్చింది. ఆ అథ్లెట్ పేరు ఫ్లోర్ జాన్. నెదర్లండ్స్‌కు చెందిన పారాలింపియన్. వరుసగా రెండు పారాలింపిక్స్‌లలో స్వర్ణ పతకాలు సాధించి సత్తా చాటింది.ఫ్లోర్ జాన్ స్వస్థలం నెదర్లండ్స్‌లోని పర్మెరెండ్పట్టణం. చిన్నప్పటి నుంచి చదువులో, ఆటల్లో మహా చురుకు. టీనేజ్‌కి వచ్చాక ఆ ఉత్సాహం మరింత ఎక్కువైంది. ఎక్కడ ఎలాంటి పోటీ జరిగినా అక్కడ వాలిపోయేది. ముఖ్యంగా అథ్లెటిక్స్‌లో బహుమతి లేకుండా తిరిగొచ్చేది కాదు. ఆ ఉత్సాహంతోనే దూసుకుపోతూ, తన 17వ పుట్టినరోజు వేడుకలకు సిద్ధమవుతోన్న వేళ.. బ్యాక్టీరియల్ బ్లడ్ ఇన్ఫెక్షన్కు గురైంది. ఆ కారణంగా ఆమె కుడి కాలు, చేతి వేళ్ల ముందు భాగానికి రక్తప్రసరణ ఆగిపోయింది. దాంతో హడావిడిగా ఫ్లోర్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. అసలు అలాంటి రక్త సమస్యతో ఆమె బతకడమే అసాధ్యం అనిపించింది.కాళ్లను తీసివేసి..వేర్వేరు శస్త్రచికిత్సల తర్వాత ఎట్టకేలకు డాక్టర్లు ప్రాణాపాయం నుంచి కాపాడగలిగారు. అయితే మరో షాకింగ్ విషయంతో వారు ముందుకొచ్చారు.. కుడి కాలును తొలగిస్తేనే ఇన్ఫెక్షన్ దరి చేరకుండా ఉంటుందని! ఒప్పుకోక తప్పలేదు. మోకాలి కింది భాగం నుంచి కుడి కాలును తీసేశారు. అదే తరహాలో రెండు చేతుల ఎనిమిది వేళ్లను కూడా గోళ్ల భాగం వరకు తొలగించారు. ఆ వయసులో ఇలాంటి పరిస్థితి ఎంత వేదనాభరితమో ఊహించుకోవచ్చు.ఫ్లోర్ పోరాడేందుకు సిద్ధమైంది. రీహాబిలిటేషన్ కేంద్రంలో కోలుకోవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత కొద్ది రోజులకు కార్బన్ ఫైబర్‌తో కృత్రిమ కాలును అమర్చారు. కానీ కొంతకాలానికి అదే ఆమెకు భారంగా మారింది. దానివల్ల తన సహజమైన కాలును కూడా కదపడం కష్టమైపోయింది. ఆ రెండిటినీ బ్యాలెన్స్ చేసుకోలేకపోయింది. దాంతో ఈసారి తానే డాక్టర్లను సంప్రదించింది. తన రెండో కాలునూ తొలగించమని కోరింది. వైద్యులు నిర్ఘాంతపోయినా చివరకు ఒప్పుకోక తప్పలేదు. ఆపరేషన్‌తో ఆ రెండో కాలును కూడా తీసేశాక రెండు బ్లేడ్లే ఆమెను నిలబెట్టాయి.అథ్లెటిక్స్‌లోకి అడుగు పెట్టి..ఆ ఘటన తర్వాత ఫ్లోర్ సమయాన్ని వృథా చేయలేదు. ఏడాదిలోపే డచ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ పారా అథ్లెట్ల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ప్రతిభాన్వేషణ కార్యక్రమానికి హాజరైంది. అక్కడే ఆమె అథ్లెటిక్స్ను ఎంచుకుంది. ఫ్లోర్ ప్రతిభ, పట్టుదలను చూసిన కోచ్ గైడో బాన్సన్ ఆమెకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ముందుగా 100 మీటర్లు, 200 మీటర్ల పరుగుకు మెరుగులు దిద్దుకుంది. జాతీయ స్థాయిలో, యూరోపియన్ సర్క్యూట్లో ఫ్లోర్ వరుస విజయాలు సాధించి ఆపై ప్రతిష్ఠాత్మక వరల్డ్ చాంపియన్‌షిప్‌పై దృష్టిసారించింది.పారా క్రీడల్లోకి అడుగు పెట్టిన మూడేళ్ల లోపే ఆమె ఖాతాలో వరల్డ్ చాంపియన్‌షిప్ మెడల్ చేరడం విశేషం. 2015లో దోహాలో జరిగిన ఈవెంట్లో 200 మీటర్ల పరుగులో కాంస్యం గెలుచుకుంది. 100 మీటర్ల పరుగులో ఆమె 12.78 సెకన్ల టైమింగ్‌తో కొత్త రికార్డు నమోదు చేయడంతో పాటు ర్యాంకింగ్స్‌లో కూడా మూడో స్థానానికి చేరింది. పారా అథ్లెట్లకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు రావడంతో ఫ్లోర్ ఆ తర్వాత లాంగ్‌జంప్‌కు మారింది. రెండు కాళ్లూ లేని అథ్లెట్ల కేటగిరీ టి62 లాంగ్‌జంప్‌లో రెండు వరల్డ్ రికార్డులు సృష్టించిన ఈ డచ్ ప్లేయర్ తొలిసారి ఈ విభాగంలో 6 మీటర్ల దూరాన్ని జంప్ చేసిన తొలి అథ్లెట్‌గా కూడా నిలిచింది. ఇదే జోరులో లాంగ్‌జంప్‌లోనూ రెండు వరల్డ్ చాంపియన్‌షిప్ స్వర్ణాలు ఫ్లోర్‌ను వెతుక్కుంటూ వచ్చాయి.ఒలింపిక్స్ పతకాలతో..లాంగ్‌జంప్‌కు మారక ముందు 2016 రియో ఒలింపిక్స్‌లో 100 మీ., 200 మీ. పరుగులో పాల్గొన్న ఫ్లోర్ పతకాలు సాధించడంలో విఫలమైంది. ఆ తర్వాత లాంగ్‌జంప్‌లో వరుసగా మూడు టోర్నీల్లో నాలుగో స్థానానికే పరిమితమైంది. అయితే మెడల్ గెలవడమే లక్ష్యంగా 2020 టోక్యో పారాలింపిక్స్‌కు సిద్ధమైంది. ఏడాది పాటు కఠోర సాధన చేసి స్వర్ణంతో తన కలను నిజం చేసుకుంది. గత మూడేళ్లుగా తన ఆటలో అదే పదును కొనసాగించిన ఈ అథ్లెట్ 2024 పారిస్ పారాలింపిక్స్‌లోనూ తన పతకాన్ని నిలబెట్టుకుంది. వరుసగా రెండో స్వర్ణాన్ని గెలుచుకొని సత్తా చాటింది. కమ్యూనికేషన్ సైన్సెస్ చదివిన ఫ్లోర్ ఇప్పుడు క్రీడాకారిణిగానే కాదు మోటివేషనల్ స్పీకర్‌గానూ తనలాంటి ఎంతో మందికి స్ఫూర్తి పంచుతోంది. – మొహమ్మద్ అబ్దుల్ హాది ఇవి చదవండి: బలవంతంగా ఖాళీ చేయించం.. ఒప్పించి పంపిస్తాం -
రెక్కలు..
చెరువు ఏమీ ఎరగనట్టుగా ఉంది. లేత మట్టిరంగు నీరు గాలికి అలలను ఏర్పరుస్తూ ఉంది. చాలా పెద్ద చెరువే అది. ఎంత లోతు ఉంటుందో. లోతును తలుచుకునే సరికి రాఘవకు కొంచెం భయం వేసింది. మళ్లీ తెగింపు వచ్చింది. ఆ తెగింపును చెదరగొడుతున్నట్టుగా గుడి గంట టంగుమని మోగింది. రాఘవ తల తిప్పి చూశాడు.చెరువు గట్టునే ఉన్న గుడికి పనుల మీద వెళుతున్నవాళ్లు ఆగి నమస్కారాలు పెట్టి వెళుతున్నారు. కొందరు దర్శనం కోసమే వచ్చి లోపలికి వెళుతున్నారు. ఉదయం తొమ్మిది అయి ఉంటుంది. అక్కడికి కాస్త దూరంలోనే ఉన్న స్కూల్ ఫస్ట్ బెల్ కూడా టంగుమని మోగింది.రాఘవ అదేమీ పట్టనట్టుగా దృష్టిని చెరువు వైపు మళ్లించాడు. గుడి వైపు చెరువు ఒడ్డు ఉండటంతో నీళ్లు తక్కువగా ఉన్నాయి. గట్టు మీద నడుచుకుంటూ వెళితే కుడి చివర నీళ్లు ఎక్కువగా ఉన్నాయి. అంచు నుంచి జారినా దూకినా గల్లంతే. రాఘవకు చెమట పట్టింది. వెంటనే ఆకలి కూడా వేసింది. స్టవ్ మీద ఇడ్లీ ఉడుకుతుంటే తల్లి ‘ఆగరా’ అంటున్నా వచ్చేశాడు. తండ్రి గొంతు వెనుక నుంచి వినిపిస్తూనే ఉంది ‘పోనీ వెధవనీ’ అని.వెధవా తను? టెన్త్‌లో ఎన్ని మార్కులొచ్చాయి. ఇంటర్లో ఎన్ని మార్కులొచ్చాయి. బీటెక్ పూర్తి చేశాక కాలేజీలో అందరూ ‘నువ్వే టాప్. క్యాంపస్ సెలక్షన్లో నీకు ఉద్యోగం వస్తుంది’ అనంటే నిజమే అనుకున్నాడు. మార్కెట్ డౌన్లో ఉందట. క్యాంపస్ సెలక్షన్సే జరగలేదు. ఒక చిన్న కంపెనీ ముంబై నుంచి ఉద్యోగం ఇస్తానని అందిగాని అది బోగస్‌దని తేలింది. ఆరు నెలలుగా ఖాళీగా ఉన్నాడు. తండ్రిని చేతి ఖర్చులు అడగాలన్నా నామోషీగా ఉంది. తండ్రి మాత్రం ఏం చేయగలడు. చిన్న ఊరు. చిన్న ఉద్యోగం.చేతికందొస్తాడనుకున్న కొడుకు ఖాళీగా ఉంటే బాధ ఉంటుంది. విసుక్కుంటున్నాడు. రాత్రి ఫోన్ చూసుకుంటూ పడుకుని ఉంటే తిట్టాడు. ‘దేశంలో అందరికీ ఉద్యోగాలొస్తుంటే నీకెందుకు రావడం లేదురా. ముప్పొద్దులా తింటూ ఫోను చూసుకుంటూ వుంటే ఎవడిస్తాడు’ అన్నాడు. బాధ కలిగింది. థూ ఎందుకీ జన్మ అనిపించింది. హైదరాబాద్‌లో ఉన్న ఫ్రెండ్స్‌కు ఫోన్ చేశాడు. ‘మేమే బెంచ్ మీద ఉన్నాం బ్రో. ప్రాజెక్ట్‌లో దూరడం చాలా కష్టంగా ఉంది’ అన్నారు. ఏ ఆశా మిగల్లేదు. ఆ అర్ధరాత్రే వెళ్లి చెరువులో దూకుదామా అనుకున్నాడు. ధైర్యం చాల్లేదు. ఉదయాన్నే లేచి టిఫిన్ కూడా చేయకుండా ఇటొచ్చేశాడు. వచ్చి? దూకాలి. దూకాలంటే మాటలా?ఏదో అలికిడిగా కేరింతలుగా వినిపించింది. గుడి దగ్గర ఎవరో తాత. గుడ్డ పరిచి జామకాయలు అమ్ముతున్నాడు. స్కూలుకెళ్లే పిల్లలు చుట్టూ మూగి ఉన్నారు. పిల్లలు అంతగా మూగడానికి కారణం ఏమిటో చూద్దామని అటుగా అడుగులు వేశాడు. అతనికి తెలియకుండానే పెదాల మీద చిరునవ్వు వచ్చింది. తాత భుజం మీద చిలుక. పిల్లలతో ముద్దు ముద్దు మాటలు చెబుతోంది. ఆ మాటలకు పిల్లలు సంతోషంతో కేరింతలు కొడుతుంటే అది తన రెండు రెక్కల్ని అటు ఇటు ఆడిస్తూ ముక్కుతో శబ్దం చేస్తూ వారిలో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. పిల్లలు ‘హాయ్’ అని పలకరిస్తే అది దాని రెండు రెక్కల్ని కలిపి వందనం చేసింది. జామకాయలు అమ్ముతున్న తాత ‘చిలకమ్మా.. గుడి ఎటువైపుంది’ అనగానే కుడి రెక్కతో గుడి వైపు చూపిస్తూ శబ్దం చేసింది. ‘బడి ఎక్కడుందో చెప్పు’ అనగానే తన ఎడమ రెక్కతో బడివైపు చూపిస్తూ శబ్దం చేసింది. ‘బడి, గుడి అంటే నీకు ఇష్టమా తల్లీ?’ అని తాత అనగానే చిలకమ్మ అవునన్నట్లు బుర్ర ఊపుతూ శబ్దం చేసింది.తాత చిలకమ్మకి ఎంత చక్కగా ట్రైనింగ్ ఇచ్చాడో అనుకున్నాడు రాఘవ. ఓ పిల్లవాడు తాత భుజాన్ని బలంగా తాకడంతో భుజంపైన ఉన్న చిలకమ్మ కింద పడింది. ‘అయ్యో’ అంటూ దాన్ని చేతిలోకి తీసుకున్న రాఘవకి తెలిసింది దాని రెండు కాళ్లలో బలం లేదని. అది తన పొట్ట మీద తాత భుజం మీద కూచుని ఉందని. తాత వెంటనే చిలకమ్మని తన చేతిలోకి తీసుకుని దాని వీపు మీద నిమురుతూ మరల తన భుజం పైకి ఎక్కించుకుని ప్రేమగా జాంపండు తినిపించసాగాడు.రాఘవ కళ్లల్లోని బాధను చూసి ‘మనుషులకే కాదు పక్షులకు కూడా పక్షవాతం వస్తుంది బాబూ. ఇది ఇంతకు ముందు బానే ఉండేది. ఏమైందో ఏమో ఒకరోజు ఉన్నట్టుండి కాళ్లు పడిపోయాయి. కాళ్లు పడిపోయాక రెక్కలున్నా లాభం లేదు. అయినా మా చిలకమ్మ బాధ పడదు. సందడి చేయడం ఏ మాత్రం ఆపదు. దానికి తెలుసు అది సందడి ఆపేస్తే ఈ తాత దగ్గర పిల్లలు మూగరు. జామకాయలు కొనరు. అందుకే ఎగిరే శక్తి పోయినా ఎగరగలననే ఆశను చావనివ్వదు’ అన్నాడు తాత.ఆ మాటలకు చిలకమ్మ తనకి ఏదో అర్థమైనట్టుగా తాత బుగ్గ మీద ముక్కుతో అటు ఇటు రాస్తూ ముద్దాడింది. దానికి వచ్చిన కష్టంతో పోలిస్తే తనకు వచ్చిన కష్టాలు ఏమంత పెద్దవి? తల్లిదండ్రుల ఆశ తీర్చలేకపోయినందుకు బాధ కలిగి, వారికి తన మొహం చూపించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.నిజంగా అలా చేస్తే వాళ్లు ఏమైపోతారు? వాళ్లు మాత్రం సంతోషంగా జీవిస్తారా? నిజంగా అది వాళ్లకి చావు కంటే పెద్ద నరకం. అంటే తన చేతులారా తన కన్న తల్లిదండ్రులని తనే చంపుకున్నట్టు కదా... ఇంతకంటే ఘోర పాపం ఉంటుందా?ఇంత ముసలివాడైన తాత జామకాయలు అమ్ముతూ ఎవరి మీద ఆధారపడకుండా జీవిస్తున్నాడే... యువకుడైన తనకీ నిరాశ ఏమిటి? తాత రాఘవ వైపు చూస్తూ ‘చెరువులో దూకడానికి వచ్చావు గదా బాబూ’ అన్నాడు.రాఘవ ఉలిక్కి పడ్డాడు.‘నీకెలా తెలుసు?’ అన్నాడు.‘ఉదయమే చూశాను బాబూ నిన్ను చెరువు గట్టున. నీలాంటి కుర్రాళ్లు ఒంటరిగా వచ్చి హైరానా పడుతుంటే ఆ మాత్రం కనిపెట్టలేనా బాబూ. నేను ముసలాణ్ణయినా ఇప్పటికీ చెరువులో ఆ చివర నుంచి ఈ చివరకు ఈదగలను. ఒకవేళ నువ్వు దూకితే లటుక్కున దూకి జుట్టు పట్టుకుని లాక్కొద్దామని ఒక కన్ను వేసే ఉంచాను. నువ్వే వచ్చావు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది నాయనా.. వెతకాలి. కష్టమొచ్చిన ప్రతి ఒక్కరూ చనిపోతే ఈ లోకంలో మనుషులే ఉండరు‘ అన్నాడు.రాఘవ మనసులో ఇప్పుడు ఉదయపు కోరిక పూర్తిగా చచ్చిపోయింది. కొత్త రాఘవ అయ్యాడు.‘ఈ జామకాయ తిను బాబూ’ అంటూ తన జామకాయల బుట్టలో నుంచి ఓ కాయని తీసి తాత రాఘవ చేతిలో పెట్టాడు. రాఘవ ‘అయ్యో.. నా దగ్గర పైసా కూడా లేదు తాతా’ అనగానే ‘మరేం పర్వాలేదు బాబూ’ అన్నాడు. జామకాయ చాలా రుచిగా ఉంది. చిన్న ముక్క అరచేతిలో ఉంచి చిలకమ్మ దగ్గర పెడితే స్వతంత్రంగా పొడిచి గుటుక్కుమనిపించిందది. నవ్వుకున్నాడు.‘కాయ చాలా రుచిగా ఉంది తాతా’‘ఊరవతల తోటలోవి బాబూ. వాళ్లు నాకు తెలిసినవాళ్లే. మంచి కాపొచ్చే తోట. డబ్బున్నోళ్లు. చేసుకోవాలని లేదు. ఎవరికైనా గుత్తకు ఇద్దామనుకుంటున్నారు. ఈ కాయలను ఒక ఆటోలో వేసుకొని టౌన్‌కు తీసుకెళ్లి అమ్మితే ఇక్కడ పది రూపాయలకు అక్కడ యాభై వస్తాయి. నేనా చేయలేను’ అన్నాడు తాత.రాఘవకు ్రౖడైవింగ్ వచ్చు. చిన్న ట్రాలీ అద్దెకు తీసుకోగలడు. ‘తోట యజమానితో మాట్లాడి నన్ను పరిచయం చేయి తాతా. తర్వాతి కథ నేను చూసుకుంటాను. రేపటి నుంచి మన బిజినెస్ టౌన్లోనే. నువ్వు తోడుండు చాలు’ అన్నాడు రాఘవ.‘ఏంటి బాబూ నువ్వనేది’‘అవును తాతా’ అన్నాడు రాఘవ.తాత కూడా చిరునవ్వు నవ్వాడు.‘ఏం చిలకమ్మా’ అన్నాడు.అది కిచకిచమని అంగీకారం తెలిపింది.ముగ్గురూ లేచి అక్కడ నుంచి కదిలారు. గుడి గంట మరోసారి టంగుమంది. కొత్త రెక్కలతో రాఘవ, తాత, చిలకమ్మ ముందుకు సాగిపోయారు. – నేదూరి భాను సాయి శ్రేయ -
Ananda Nilayam: ఒకేచోట.. ఈ అష్టాదశ శక్తిపీఠాలు!
పురాణాల ప్రకారం, అమ్మవారిని ఆరాధించే దేవాలయాలలో ప్రశస్తమైనవి అష్టాదశ శక్తిపీఠాలు. శివుడి అర్ధాంగి సతీదేవి శరీరం 18 ముక్కలై, 18 ప్రదేశాల్లో పడ్డాయని, వాటినే అష్టాదశ శక్తిపీఠాలు అంటారని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ శక్తిపీఠాలను దర్శించుకుని, అమ్మవార్ల అనుగ్రహం పొందాలని భక్తులు భావిçస్తుంటారు. రకరకాల కారణాల వల్ల కొంతమందికి శక్తిపీఠాల దర్శనభాగ్యం కరవవుతోంది. అలాంటివారికి అన్ని శక్తిపీఠాలను ఒకేచోట దర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తూ అష్టాదశ శ«క్తిపీఠాలన్నిటినీ ఒకే దగ్గర నిర్మించారు.అది ఎక్కడో కాదు తెలంగాణ, సిద్దిపేట జిల్లా, కొండపాక గ్రామ శివారులోని ఆనంద నిలయంలో! గత ఏడాది నవంబరులో.. ఇక్కడి అష్టాదశ శక్తిపీఠ సహిత ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయంలో 18 శక్తిపీఠాలతో పాటు లక్ష్మీగణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివపార్వతులనూ ప్రతిష్ఠించారు.గట్టు రాంరాజేశం గుప్త సంకల్పంతో..సిద్దిపేటకు చెందిన గట్టు రాంరాజేశం గుప్త అమ్మవారికి అపర భక్తుడు. అష్టాదశ శక్తి పీఠాలన్నిటినీ ఒకే దగ్గర నిర్మించాలని ఆయన చిరకాల కోరిక. ఒకసారి, తన మనసులో మాటను రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఆనంద నిలయ వ్యూహకర్త కేవీ రమణాచారి ముందుంచారు. ఆయన ట్రస్ట్ సభ్యులతో చర్చించి, ఆనంద నిలయంలో 5 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఆలయ నిర్మాణానికి తన వంతుగా రాంరాజేశం రూ. 1.5 కోట్లను అందజేశారు. ఆనంద నిలయం వృద్ధాశ్రమ ట్రస్ట్ సభ్యులు, ఇతర దాతల సహకారంతో మొత్తం రూ.10 కోట్ల వ్యయంతో దేవాలయాలను నిర్మించారు. అమ్మవార్ల రాతి విగ్రహాలను తమిళనాడులో తయారుచేయించారు. వీటిని పుష్పగిరి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ అభినవోద్దండ విద్యాశంకర భారతి మహాస్వామి, శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి ప్రతిష్ఠించారు.22 దేవాలయాలు..పద్దెనిమిది శక్తిపీఠాల్లో పదిహేడు మనదేశంలో ఉండగా, శాంకరీదేవి శ్రీలంకలోని ట్రింకోమలిలో ఉంది. మన దేశంలో ఉన్న కామాక్షీదేవి (కంచి, తమిళనాడు), శృంఖలాదేవి (కోల్‌కతా, పశ్చిమబెంగాల్), చాముండేశ్వరీదేవి (మైసూరు, కర్ణాటక), జోగులాంబ (ఆలంపూర్, తెలంగాణ), భ్రమరాంబికాదేవి (శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్), మహాలక్ష్మీదేవి (కొల్హాపూర్, మహారాష్ట్ర), ఏకవీరాదేవి (మాహుర్, మహారాష్ట్ర), మహాకాళీదేవి (ఉజ్జయిని, మధ్యప్రదేశ్), పురుహూతికాదేవి (పిఠాపురం, ఆంధ్రప్రదేశ్), గిరిజాదేవి (జాజ్‌పూర్, ఒడిశా), మాణిక్యాంబాదేవి (ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్), కామాఖ్యాదేవి ( గౌహతి, అస్సాం), మాధవేశ్వరీదేవి (ప్రయాగ, ఉత్తరప్రదేశ్), వైష్ణవీదేవి (జమ్మూ, జమ్మూ– కశ్మీర్ రాష్ట్రం), మంగళగౌరీదేవి (గయ, బిహార్), విశాలాక్షీ (కాశి), సరస్వతీదేవి (శ్రీనగర్) రూపాలను కొండపాక శివారులోని ఆనంద నిలయంలో దర్శించుకోవచ్చు. ఇదే ప్రాంగణంలో లక్ష్మీగణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మరకత లింగం, శివపార్వతులతో కూడిన 22 దేవాలయాలను నిర్మించడం విశేషం. ఆయా శక్తిపీఠాల్లో జరిగినట్లుగానే ఇక్కడా పూజాకార్యక్రమాలుంటాయి. ప్రతి పౌర్ణమికి హోమం, ప్రతి శుక్రవారం అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ చేస్తారు. దర్శనానికి పలు ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేస్తున్నారు.సామాజిక సేవ.. ఆధ్యాత్మిక శోభ!ఆనంద నిలయంలో సామాజిక సేవతోపాటు ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. సుమారు వంద ఎకరాల్లోని ఈ ట్రస్ట్‌లో ఒకవైపు వృద్ధాశ్రమం, మరోవైపు అనాథాశ్రమం, ఇంకోవైపు సత్యసాయి పిల్లల హృద్రోగ ఆసుపత్రి, జూనియర్ కళాశాల ఉన్నాయి. భక్తులు, సామాజిక సేవకుల సందర్శనతో ఈ ప్రాంగణమంతా సందడిగా ఉంటుంది. ఇది హైదరాబాద్‌కు 73 కిలోమీటర్లు, సిద్దిపేటకు 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. – గజవెల్లి షణ్ముఖరాజు, సాక్షి, సిద్దిపేట, ఫొటోలు: కె సతీష్, స్టాఫ్ ఫొటోగ్రాఫర్శక్తిపీఠాల్లో జరిగినట్టుగానే..ఇక్కడ పూజాకార్యక్రమాలన్నిటినీ శక్తిపీఠాల్లో మాదిరే జరుపుతాం. భక్తులు అమ్మవార్లకు ఒడి బియ్యం పోస్తారు. ప్రతి శుక్రవారం ప్రత్యేక అలంకరణ ఉంటుంది. ప్రతిరోజు శివుడికి, మరకత లింగానికి రుద్రాభిషేకం చేస్తాం. – పురుషోత్తమ రామానుజ, అర్చకుడుఅందరికీ దర్శనభాగ్యం కలగాలని.. అష్టాదశ శక్తిపీఠాలను దర్శించుకోవటం కొందరికి సాధ్యపడకపోవచ్చు. అలాంటివారికి శక్తిపీఠాల దర్శనభాగ్యం అందాలనేది నాన్నగారి కోరిక. కేవీ రమణాచారి, ఇంకెంతో మంది దాతల సహకారంతో నేడు అది నెరవేరింది. – గట్టు అమర్నాథ్, రవి, శ్రీనివాస్అమ్మవారి అనుగ్రహం..కొండపాకలో అష్టాదశ శక్తిపీఠాల నిర్మాణం అమ్మవారి దయ. అమ్మవారి అనుగ్రహం, అందరి సహకారంతో దేవాలయ నిర్మాణాలు సాధ్యమయ్యాయి. – డాక్టర్ కేవీ రమణాచారి, ఆనంద నిలయ వ్యూహకర్తఇవి చదవండి: అవును..! వారిది గుర్తింపు కోసం ఆరాటమే.. -
మీరెప్పుడైనా.. ఈ మృత్యుసరోవరం గురించి విన్నారా!?
సముద్రంలో ఉన్న మృత్యుసరోవరం ఇది. సముద్రంలోకి దిగి చూస్తే, ఇది మామూలుగానే కనిపిస్తుంది గాని, ఇందులో ఈత కొట్టాలని సరదా పడితే మాత్రం, చావును కోరి కొనితెచ్చుకున్నట్లే! వంద అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ మడుగులోని అత్యంత లవణీయత కలిగిన నీరు, మీథేన్, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి ప్రాణాంతక విషవాయువులు దీనిని మృత్యుసరోవరంగా మార్చాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిని తొలిసారిగా 2015లో కనుగొన్నారు. ఇందులో ఈదులాడేందుకు దిగి మరణించిన జంతువుల కళేబరాలను శాస్త్రవేత్తలు పరిశోధనల కోసం సేకరించి, భద్రపరచారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో వద్ద సముద్రంలోకి దిగి పరిశోధనలు సాగిస్తున్న శాస్త్రవేత్తలకు సముద్రం లోపలి భాగంలో ఈ మడుగులాంటి ప్రదేశం కనిపించింది. దాదాపు వంద అడుగుల విస్తీర్ణంలో బురదనీటితో నిండిన ఈ మడుగులోకి వెళ్లే పీతలు, మొసళ్లు వంటి జీవులు నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోవడాన్ని వారు గమనించారు.సాధారణంగా సముద్రపు నీటిలో ఉండే ఉప్పదనం కంటే, ఈ మృత్యుసరోవరం నీటి ఉప్పదనం నాలుగురెట్లు ఎక్కువని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అతి కొద్ది జలచరాలు మాత్రమే ఇందులోని పరిస్థితులను తట్టుకుని మరీ బతకగలవని, మిగిలినవి ఇందులోకి దిగితే నిమిషాల్లోనే మరణిస్తాయని చెబుతున్నారు. దీనిని ‘హాట్ టబ్ ఆఫ్ డిస్పెయిర్’ అని, ‘జకూజీ ఆఫ్ డిస్పెయిర్’ అని అభివర్ణిస్తున్నారు.ఇవి చదవండి: గ్యాప్ ఇవ్వలా... వచ్చింది -
పరివర్తనం: ‘దేవరపాలెం.. దేవరపాలెం..’
‘దేవరపాలెం.. దేవరపాలెం..’ అంటూ కండక్టర్ కనకరాజు రాబోయే స్టాపులో దిగబోయే ప్రయాణికులను అలర్ట్ చేస్తూ గట్టిగా అరిచాడు. కనకరాజు అరుపులకు కొంతమంది సీట్లలోంచి లేచి, హడావిడిగా తమ సామాన్లను తీసుకుంటున్నారు. ‘రావాలి.. రావాలి..’ అంటూ కనకరాజు వారిని మరింత వేగిరపెట్టాడు. కొంతమంది దిగిపోయాక, కొంతమంది ఎక్కారు. కనకరాజు టికెట్స్ కొట్టే కట్టర్‌తో ఎదురుగా ఉన్న ఇనుప రాడ్ మీద ‘రైట్.. రైట్..’ అంటూ గట్టిగా కొట్టాడు. అతను ఇచ్చిన శబ్దసందేశానికి బస్సు పొగలు చిమ్ముకుంటూ బయల్దేరింది.ఆ బస్టాపుకి కొద్దిదూరంలో వున్న ఒకావిడ మర్రిచెట్టు కింద కూర్చుని, బస్సులోంచి దిగుతున్న ప్రయాణికులను ఆత్రంగా చూడటం కనకరాజు కొద్దిరోజులుగా గమనిస్తున్నాడు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వచ్చే ఆ బస్ కోసమే ఆమె రెండు పూటలా వస్తోంది. ఆమెకు సుమారుగా నలభై ఐదేళ్లుంటాయి. ఆమె కళ్ళు తీక్షణంగా మెరుస్తూ, దేనికోసమో వెతుకుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. ప్రతిరోజు ఇదే ఆమె క్రమం తప్పని దినచర్య!‘ఆమె ఎవరు? రోజూ ఎవరి కోసం ఎదురుచూస్తోంది?’ అనే ప్రశ్నలు ఆమెని చూసినప్పుడల్లా కనకరాజు మదిని తొలిచేస్తున్నాయి. కనకరాజు తన ఆలోచనల్లోంచి బయటికి వచ్చి, ఓ పెద్దాయనకు టికెట్ కొడుతూ ‘బాబాయ్, ఎవరావిడ?’ తన మనసుని కుదిపేస్తున్న ప్రశ్నని అతని ముందు పెట్టాడు.‘ఆవిడో పిచ్చి మాలోకమయ్యా..!’ అతను ముక్తసరిగా బదులిచ్చాడు. కనకరాజు ఇంకేమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు.తన డ్యూటీ ముగించుకొని ఇంటికి చేరుకున్న కనకరాజు నిస్సత్తువగా హాల్లోని సోఫాలో వాలిపోయాడు. భర్త రాకను గమనించిన అతని భార్య సరోజ వంటగదిలోంచి వస్తూ ‘టీ పెట్టమంటారా?’ అని అనునయంగా అడిగింది.‘వద్దు సరోజా.. అలేఖ్యకి ఇప్పుడెలా వుంది? నిద్రపోతోందా?’ దుఃఖాన్ని గుండె లోతుల్లోనే దిగమింగుకుని నెమ్మదిగా అడిగాడు కనకరాజు.‘జ్వరం కొంచెం కూడా తగ్గుముఖం పట్టడంలేదు. ఏమి తిన్నా వాంతులు చేసుకుంటోంది. ఇప్పుడే పడుకుంది’ చెప్పింది సరోజ బాధని పంటితో బిగబట్టుకుని.కనకరాజుని ఈ మధ్యకాలంలో బాగా వేధిస్తోన్న అతిపెద్ద సమస్య తన ఎనిమిదేళ్ల కూతురి అనారోగ్యం! అతని కూతురు సంవత్సర కాలంగా అంతుచిక్కని కొత్త తరహా న్యుమోనియాతో నరకాన్నే చూస్తోంది. ఏడాదిగా స్కూలుకి కూడా పోవడంలేదు. తెలిసిన వాళ్లు చెప్పిన స్పెషలిస్టులందరికీ చూపించాడు. డాక్టర్లు సూచించిన అన్నిరకాల టెస్టులు చేయించాడు, చేయిస్తూనే వున్నాడు. ఫలితం మాత్రం శూన్యం!కనకరాజుకి ఎప్పటిలాగే ఆరోజు కూడా దేవరపాలెం బస్టాపు దగ్గర రెండు దఫాలూ అదే దృశ్యం ఎదురైంది. ఈసారి ఎవరినీ అడగకూడదని, తనే స్వయంగా ఆమెని కలిసి, విషయమేంటో ఆరా తీయాలని గట్టిగా తీర్మానించుకున్నాడు. తన సెలవు రోజున దేవరపాలెం వెళ్లాడు. బస్టాపు దగ్గర్లోని ఓ బడ్డీ కొట్టులో ఒక వాటర్ బాటిల్ కొంటూ, మర్రిచెట్టు కింద కూర్చున్న ఆవిడను చూపిస్తూ ‘ఎవరండీ ఆవిడ? రోజూ అక్కడ కూర్చుని, ఎవరి కోసం ఎదురు చూస్తుంది?’ అడిగాడు కాస్త చొరవతీసుకుని.‘ఆవిడా? ఎప్పుడో చిన్నప్పుడే పారిపోయిన కొడుకు తిరిగొస్తాడని.. అవిడో పిచ్చిది సార్!’ క్లుప్తంగా బదులిచ్చాడతడు.‘ఈ మాత్రం చాలు. ఆమెని చేరుకోవడానికి’ అనుకుంటూ, ఆ పక్కనే వున్న చెక్కబల్ల మీద కూర్చున్నాడు. ఆ కాసేపటికి బస్సు రావడం, వెళ్లిపోవడం జరిగిపోయాయి. బస్సు వచ్చేటప్పుడు ఆమె కళ్లల్లో అదే వెలుగు. బస్సు వెళ్లిపోయిన మరుక్షణమే నిరాశగా ఇంటిదారి పట్టింది. కనకరాజు దూరం నుంచే ఆమెను అనుసరించసాగాడు. ఆమె వెళ్తూవెళ్తూ ఓ ఇంటి ముందు ఆగిపోయింది. అదే.. తన నివాసం కాబోలు అనుకున్నాడు. అది ఓ సెంటు స్థలంలో కట్టిన చిన్న పాత పెంకుటిల్లు.కనకరాజు ధైర్యాన్ని కూడగట్టుకుని, మరో ఆలోచన చేయకుండా గబగబా ఆమె దగ్గరకు వెళ్లి ‘అమ్మా..! నా పేరు కనకరాజు. మీ బిడ్డకోసం ఎదురు చూస్తున్నారని విన్నాను. నేను డ్యూటీ మీద చాలాచోట్లకు తిరుగుతుంటాను. మీ అబ్బాయి గురించి వివరాలు చెప్తే, నా శాయశక్తులా వెతికిపెడతాను’ నిజాయితీగా తన మనసులోని మాటని ఆమె ముందు పెట్టాడు. ఆమె కనకరాజు వైపు ఆశ్చర్యంగా చూస్తూ ‘ఎవరు బాబూ మీరు? మీరు చెబుతున్నది నిజమేనా? నా బిడ్డ నిజంగా నా చెంతకొస్తాడా?’ ఆత్రంగా అడిగింది.‘అవునన్నట్లు’ తలూపాడు కనకరాజు. ఆమె మొహం ఒక్కసారిగా కాంతివంతమైంది.‘బాబూ.. నా కొడుకు పారిపోయి పదిహేనేళ్లు గడిసిపోనాయి. కానీ ఇంతవరకు ఎవ్వరూ యివ్వని భరోసాని యిత్తున్నావు. అందరూ నన్ను ‘పిచ్చిది’ అనేటోళ్లే గానీ, ఎవరూ యిలా చెప్పలేదు బాబూ..’ తన పట్టరాని సంతోషాన్ని, కన్నీళ్ల రూపేణా వ్యక్తపరచింది.ఆమె భావోద్వేగానికి కనకరాజు ఎంతోగానో చలించిపోయాడు. అతని కంట్లో కూడా నీళ్లూరాయి.‘మీ పేరెంటమ్మా..’ అడిగాడు. ‘ఎర్రయ్యమ్మ..’ చెప్పింది.మిగతా వివరాలూ అడిగాడు కనకరాజు. తన కొడుకు పేరు రాజు అని చెప్పింది ఆమె. పదేళ్లప్పుడు మాస్టారు కొట్టారని పుస్తకాల సంచిని అక్కడే విసిరికొట్టి, ఇంటికొచ్చేశాడట. కొడుక్కి బుద్ధి రావాలని రెండు దెబ్బలు వేసిందట ఎర్రయ్యమ్మ. అంతే..కోపంతో రాజు ఊరొదిలి పారిపోయాడు. అది మొదలు ఎర్రయ్యమ్మ పిచ్చిదానిలా చుట్టుపక్కల ఊళ్లే కాదు, సిటీలోని వీథులు, రోడ్లనూ గాలించిందట. తిరిగి తిరిగి కాళ్లు అరిగాయి కానీ కొడుకు జాడ మాత్రం తెలియలేదు. అదో తీరని వెతగా మారిపోయింది. కొడుకు కోసం ఎదురుచూస్తూ లోకం దృష్టిలో పిచ్చిదైపోయింది. ప్రభుత్వం అందిస్తోన్న ఫించనుతోపాటు రెండు ఇళ్లల్లో పాచిపనులు చేస్తూ జీవితాన్ని నెట్టుకొస్తోంది. తను వుంటున్నది అద్దె ఇల్లే! అయితే ఒకప్పుడు అది తనదేనట. తాగుబోతు భర్త తన వ్యసనాల కోసం ఆ ఇంటిని అమ్మేశాడట. అయితే పెళ్లయిన మూడేళ్లకే చనిపోయాడట అతను. త్వరలోనే తన కొడుకు తనని వెతుక్కుంటూ ఇంటికి వస్తాడని ఈమధ్యనే ఓ సాధువు ఆమెకు జోస్యం చెప్పాడట.ఆమె నోట ఆ వివరాలన్నీ విన్న కనకరాజు ‘ఎర్రయ్యమ్మా, అప్పుడెప్పుడో పారిపోయిన నీ కొడుకు ఇన్నేళ్ల తర్వాత కనిపిస్తే ఎలా గుర్తుపడతావు?’ అనుమానంగా అడిగాడు. అంతే.. ఆమె గబగబా ఇంట్లోకెళ్లి, పోస్టుకార్డు సైజులో వున్న బ్లాక్ అండ్ వైట్ ఫొటో ఒకటి తెచ్చి, ‘మా రాజుగాడి కుడి చెంప మీద కంది గింజంత పుట్టుమచ్చ వుంది.. చూశావా బాబూ..?’ అంటూ ఆ ఫొటోలో స్పష్టంగా కనిపిస్తోన్న పుట్టుమచ్చని చూపించింది.కనకరాజు ఆ ఫొటోని అడుగుదామనుకునేలోపే ఎర్రయ్యమ్మే ‘ఈ ఫొటో నీ దగ్గర ఉంచు బాబూ.. మా వాడిని గుర్తుపట్టడానికి.. ఇంకా ఇలాంటి ఫొటోలు నాలుగైదు నా దగ్గరున్నాయిలే’ అంటూ ఆ ఫొటోని కనకరాజు చేతిలో పెట్టింది.ఆ ఫొటోని భద్రంగా జేబులో పెట్టుకుంటూ, చిన్న కాగితం మీద తన మొబైల్ నెంబరు రాసి ఆమెకిచ్చాడు కనకరాజు. అలా ఎర్రయ్యమ్మకు అంతులేని విశ్వాసాన్ని కలిగించి, కొండంత ధైర్యాన్ని నూరిపోసి ఆమె దగ్గర సెలవు తీసుకున్నాడు.తర్వాత కొన్ని రోజులకే డిపోవారు కనకరాజు డ్యూటీ రూటు మార్చేయడంతో అతనికి ఎర్రయ్యమ్మను చూసే వీలు చిక్కలేదు. కూతురిని తరచుగా ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి రావడం వల్ల కూడా అతనికి ఎర్రయ్యమ్మను కలిసే తీరిక దొరకలేదు. అలా రెండునెలలు గడిచిపోయాయి. ఒకరోజు ఎర్రయ్యమ్మే అతనికి ఫోన్ చేసింది తన కొడుకు ఇంటికి వచ్చేశాడంటూ! ఆనందాశ్చర్యాలకు లోనయ్యాడు కనకరాజు. డ్యూటీకి సెలవు పెట్టి, ఉన్నపళంగా దేవరపాలెం బయలుదేరాడు.కనకరాజుని చూడగానే సంతోషంతో ఉప్పొంగిపోయింది ఎర్రయ్యమ్మ.‘అయ్యా! మీరు చెప్పినట్టుగానే నా బిడ్డ నాకు దక్కాడు.. మీరు నా పాలిట భగమంతుడే! తమరు కలకాలం చల్లగా ఉండాలయ్యా..’ అంటూ ఆనందబాష్పాలతో కృతజ్ఞతలు చెప్పుకుంది.‘నీ కొడుకు ఎక్కడమ్మా..?’అంటూ ఆత్రంగా అడిగాడు కనకరాజు.‘వంట సరుకులు కొనుక్కొత్తానని వెళ్లాడు బాబూ, వచ్చేత్తాడు..’ ఎర్రయ్యమ్మ అంటుండగానే ఓ పాతికేళ్ల యువకుడు రెండు చేతులతో రెండు సంచులను మోసుకుంటూ ఆ ఇంట్లోకి అడుగుపెట్టాడు.అతను ఎర్రయ్యమ్మలాగే సన్నగా, పొడవుగా వున్నాడు. ఇంకా పసితనపు ఛాయలు పోలేదు. ఏదో తేజస్సు ఆ కుర్రాడి ముఖంలో! ఎర్రయ్యమ్మ ‘రాజూ, నేను చెప్పానే, గొప్ప మనసున్న మారాజు అని.. ఈ బాబే’ అంటూ కొడుక్కి కనకరాజుని పరిచయం చేసింది.ఆ అబ్బాయి తన రెండు చేతులెత్తి కనకరాజుకి దండం పెట్టాడు. ఎర్రయ్యమ్మ, కొడుక్కి ఏదో చెప్తున్నట్టుగా సైగచేసింది. ఆ యువకుడు చెక్క బెంచీపై కూర్చున్న కనకరాజు కాళ్లకి నమస్కరించాడు.అనుకోని ఆ పరిణామానికి కనకరాజు బిత్తరపోతూ, ఆ కుర్రాడిని పైకి లేపుతూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు. భోంచేసి వెళ్లాలని ఎర్రయ్యమ్మ పట్టుపట్టింది. భోంచేసి, వాళ్లిద్దరి దగ్గర వీడ్కోలు తీసుకుని బస్సులో కూర్చున్న కనకరాజు మనసుకి ఎంతో ఊరటగా ఉంది. కానీ.. ఎక్కడో ఏదో తెలియని వెలితి!ఆ వెలితికి సాక్షీభూతంగా నిలిచిన ఓ సంఘటన కళ్ల ముందు కదుల్తూ అతన్ని రెండు వారాల వెనక్కు తీసుకువెళ్లింది.రాజు ఫొటోతో ఎర్రయమ్మ ఇల్లు దాటిన నాటి నుంచి ఎక్కడికి వెళ్లినా.. ఏ కుర్రాడు కనిపించినా ఆ ఫొటోతో పోల్చి చూసుకోవడం కనకరాజు దినచర్యలో భాగమైపోయింది. అలా ఎర్రయ్యమ్మ వేదన గురించే ఆలోచిస్తోన్న కనకరాజుకి ఒకరోజు.. బస్సులో ఓ పాతికేళ్ల యువకుడు బేల ముఖంతో చిన్నగా శోకిస్తూ కనిపించాడు. అది చివరి ట్రిప్ కావడంతో బస్సంతా ఖాళీగావుంది. అతన్ని గమనించిన కనకరాజు, అతని పక్కనే కూర్చుని ‘ఏమైంది బాబూ.. అంతగా కుమిలిపోతున్నావు?’ అంటూ అనునయంగా అడిగాడు. ఆ అనునయానికి కదిలిపోయిన ఆ కుర్రాడు నెమ్మదిగా గొంతు విప్పాడు.‘నా పేరు డేవిడ్ రాజు. ఒక క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదువుకున్నాను. మా అమ్మను చూడాలని, ఆమెతో కబుర్లు చెప్పుకోవాలని ఆశ! మా అమ్మ గురించి నా శక్తి మేర చాలా సమాచారం సేకరించాను. అమ్మ నాకు తిండిపెట్టలేని దీనావస్థలో నన్ను మిషనరీ ట్రస్ట్‌లో వదిలేసిందట. ఏడాది పాటు అమ్మ ఆచూకీ కోసం చాలాచోట్లకి తిరిగాను. చాలామందిని కలిశాను. చిట్టచివరికి తన అడ్రస్ పట్టుకోగలిగాను. కానీ, నాలాంటి దురదృష్టవంతుడు ఇంకొకడు ఉండడు సార్! తను ఓ నెల కిందటే ఎవరూలేని అనాథలా చనిపోయింది. నన్ను నిజంగానే అనాథని చేస్తూ..’ అంటూ బొటబొటా కన్నీళ్లుకార్చాడు.తను చదివిన ‘లా ఆఫ్ అట్రాక్షన్’ ప్రత్యక్షంగా ఎదురుకావడంతో మాటల్లో చెప్పలేని వింతానుభూతికి లోనయ్యాడు కనకరాజు. ‘మనం ఏదైనా బలంగా కోరుకుంటే.. అది జరిగితీరుతుంది!’ అని ఆ పుస్తకంలో చదివినట్టు జ్ఞాపకం. కుర్రాడి కళ్ల కిందుగా జారిపోతున్న కన్నీళ్లను తుడుస్తూ ‘నీకు అమ్మ ప్రేమ దక్కేటట్టు చేసే బాధ్యత నాది!’ అంటూ తిరుగులేని హామీనిచ్చాడు.ఆ కుర్రాడు తన్నుకొస్తోన్న దుఃఖాన్ని ఆపుకుంటూ, కుతూహలంగా కనకరాజు వైపు చూశాడు. ‘అయితే, నీ కుడి చెంప మీద చిన్న పుట్టుమచ్చ ఒక్కటే లోటు’ అన్నాడు కనకరాజు ఏదో ఆలోచిస్తూ!ఆరోజు ఆలా రెండు హృదయాల వేదనలను ‘ఒక సంతోష సాఫల్యం’గా రూపకల్పన చేశాడు కనకరాజు.ఎర్రయ్యమ్మ, రాజును కలిసిన కనకరాజు తన ఇంటికి చేరుకునేసరికి సాయంత్రమైంది. మెయిన్ గేటు తీసి, లోనికి అడుగుపెడుతుండగా ఎదురుగా కనిపించిన దృశ్యం అతన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. అతని కూతురు ‘నాన్నా..’ అంటూ కిలకిలా నవ్వుతూ తనకేసి పరుగుతీస్తోంది లేడిపిల్లలా. పట్టరాని భావోద్వేగంతో కూతుర్ని చేతుల్లోకి తీసుకుని గుండెకు హత్తుకున్నాడు. కళ్లు కన్నీటి సంద్రాలయ్యాయి. ఎదురుగా వస్తోన్న అతని భార్య, తల్లి ముఖాల్లో వెల్లివిరిసిన వసంతకాలపు వెలుగులు!ఆశ్చర్యంగా భార్య వైపు చూశాడు. ‘ఉదయాన్నే మీరు అలా వెళ్లారో లేదో.. ఎప్పుడూ తిననని మొండికేసే పిల్ల ‘ఆకలీ.. ఆకలీ..’ అంటూ ఒకటే గొడవ. జ్వరం ఉందేమోనని చూశాను. ఏదో మంత్రం వేసినట్టుగా పూర్తిగా మాయం! అప్పటికప్పుడు టిఫిన్ చేసి, వేడివేడిగా తినిపించాను. తిన్నప్పటి నుంచి ఒకటే అల్లరి! ఇల్లంతా ఉరుకులు, పరుగులు! ఉదయం నుంచి పది నిమిషాలకొకసారి ఏదో ఒకటి అడిగి తింటూనే ఉంది. ఒక్క వాంతి కూడా కాలేదు. నాకే ఆశ్చర్యంగా ఉందండీ..’అంటూ ఆమె సంబరంగా జరిగినదంతా చెప్పుకుపోయింది. ‘సాటి మనిషికి సాయం చేసే నీ తత్త్వమేరా నీ బిడ్డకు ఆయుష్షు పోసుంటుంది..!’ అంది కనకరాజు తల్లి, కొడుకు వైపు మెచ్చుకోలుగా చూస్తూ. తల్లి మాటలకు చిన్నగా నవ్వేస్తూ, కూతురిని మురిపెంగా చూసుకుంటూ ఇంట్లోకి నడిచాడు కనకరాజు.ఎర్రయ్యమ్మని రాజు ఎలా చూసుకుంటున్నాడో తెలుసుకోవాలన్పించి, ఒకరోజు దేవరపాలెం వెళ్లాడు కనకరాజు. సాదరంగా ఆహ్వానించింది ఎర్రయ్యమ్మ. రాజు ఇంట్లో లేడు. ఆఫీస్ పని మీద సిటీకి వెళ్లాడని చెప్పింది. సాఫ్ట్వేర్ అయిన రాజు.. వారానికి ఒకటీ, రెండ్రోజులు మాత్రమే ఆఫీసుకి వెళ్తుంటాడు. మిగతా రోజులన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్. ఎర్రయ్యమ్మ కట్టూబొట్టూ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఆమె ఒంటి మీదకి బంగారం కూడా చేరింది. కొడుకు కోరిక మేరకు పాచిపనులకు స్వస్తి చెప్పింది.ఎర్రయ్యమ్మ చెప్పిన మరో విషయం రాజు మీద కనకరాజుకి తిరుగులేని నమ్మకాన్ని కలిగించింది. తన భర్త ద్వారా పోగొట్టుకున్న, ఒకప్పటి తన సొంతిల్లు అదే ఇప్పుడు అద్దెకున్న ఆ ఇల్లు, దాన్ని ఆనుకొని వున్న మరికొంత ఖాళీస్థలాన్నీ కొని, ఎర్రయ్యమ్మ పేరిట కాగితాలు రాయించాడని చెప్పింది. విన్న కనకరాజు తన ప్రయత్నం సంపూర్తిగా సఫలీకృతమైంది అనుకున్నాడు. మనసు నిండింది.‘ప్రతి జీవితానికి చెప్పుకోవడానికి ఏదో ఒకటి ఉండాలంటారు. నా జీవితానికిది చాలు!’ అనుకుంటూ బయల్దేరడానికి సమాయత్తమయ్యాడు కనకరాజు.కుర్చీలోంచి లేచిన కనకరాజు కాళ్లకి ఎర్రయ్యమ్మ నమస్కరించబోయింది. ఆ హఠాత్పరిణామానికి అతను బిత్తరపోయి దూరం జరుగుతూ ‘ఎర్రయ్యమ్మా, నేను నీ తమ్ముడు లాంటివాడిని. నువ్వు నా కాళ్లకు నమస్కరించడం ఏంటీ?’ అన్నాడు ఇబ్బందిపడుతూ.‘సాటిమనిషి కోసం ఆలోచించే తీరికలేని ఈ కాలంలో.. అనామకురాలైన ఈ ఎర్రయ్యమ్మ కోసం నువ్వు ఎంత తాపత్రయపడ్డావో నాకెరుకే బాబూ..! పారిపోయిన నా కొడుక్కి కుడి చెంప మీద కంది గింజంత పుట్టుమచ్చ ఉందని చెప్పాను. కానీ, వాడి ఛాతీ మీదున్న పాపిడి బిళ్లంత మరొక పుట్టుమచ్చ గురించి చెప్పలేదు! అది నీకు తెలియదు కదా బాబూ..’ అంటోన్న ఆమెకు బదులేం ఇవ్వాలో తెలియక నిశ్శబ్దంగా ఉండిపోయాడు కనకరాజు.‘నా బాధ చూడలేక, నా కొడుకు రూపంలో ఈ అబ్బాయిని, నువ్వే పంపించావని నాకు ఎరుకే బాబూ! రాజు నా కడుపున కాయకపోయినా అంతకన్నా ఎక్కువే! ఇలాంటి మారాజు బిడ్డని నాకు చూపించినందుకు నీకు ఈ ఎర్రయ్యమ్మ జనమ జనమలకు రుణపడి ఉంటాది బాబూ..! నా కొడుకు మొన్ననే నీ గురించి ఓ మాట చెప్పినాడు.. ‘కండక్టర్’ అంటే నడిపించేవాడని అర్థమట! నువ్వు, నిజంగా మా బతుకులను నడిపించిన దేవుడివయ్యా..’ అంటూ చేతులెత్తి దండం పెట్టింది.‘ఎర్రయ్యమ్మా.. నీ రాజును నీ దరికి చేర్చే క్రమంలో నిన్ను ఒక అబద్ధంతో మభ్యపెడుతున్నానని ఎంతో అపరాధభావానికి గురయ్యాను. ఆ వెలితిని కాస్త దూరం చేశావు. నేనే నీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి’ అన్నాడు కనకరాజు. తేలికపడిన మనసుతో తన ఇంటి దారి పట్టాడు. – శ్రీనివాసరావు తిరుక్కోవుళ్ళూరు -
కుర్రాళ్ల గుండెలకు.. ఏమవుతోంది?
మనుషుల్లో గుండెజబ్బులు సర్వసాధారణమే! నడివయసు దాటాక చాలామంది గుండెజబ్బుల బారిన పడుతుంటారు. ఆధునిక వైద్యచికిత్స పద్ధతులు మెరుగుపడటంతో గుండెజబ్బులు ఉన్నవారు కూడా తగిన చికిత్సలతో, ఔషధాల వినియోగంతో ఆయుష్షును పొడిగించుకునే వీలు ఉంటోంది. గుండెజబ్బులు గుర్తించిన తర్వాత కూడా తగిన చికిత్స పొందుతూ ఒకటి రెండు దశాబ్దాల కాలం సునాయాసంగా జీవించగలిగే వారి సంఖ్య పెరుగుతోంది.ఇదంతా చూసుకుంటే పరిస్థితి ఆశాజనకంగానే కనిపిస్తోంది గాని, ఇటీవలి కాలంలో గుండెపోటుతో యువకులు మరణిస్తున్న సంఘటనలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చినా, ఆరోగ్యంగా కనిపించే యువకుల గుండెలకు రక్షణ ఎందుకు కొరవడుతోంది? ఈ పరిస్థితులకు కారణాలేమిటి? నివారణ మార్గాలేమిటి? నేడు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో అత్యధిక మరణాలకు కారణం గుండెజబ్బులే! ముఖ్యంగా గుండెకు రక్త సరఫరా నిలిచిపోవడం వల్ల సంభవించే ‘ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్’ వల్ల అత్యధిక మరణాలు సంభవిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చెబుతోంది. ‘వరల్డ్ హార్ట్ ఫెడరేషన్’ గత ఏడాది ‘వరల్డ్ హార్ట్ రిపోర్ట్–2023’ విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా 2.05 కోట్ల మంది గుండెజబ్బులతో మరణిస్తున్నారు. సకాలంలో చికిత్స అందించినట్లయితే, వీటిలో 80 శాతం మరణాలను నివారించే అవకాశాలు ఉన్నాయని ఈ నివేదిక చెబుతోంది.గడచిన ఐదు దశాబ్దాల కాలంలో గుండెజబ్బులను గుర్తించడం, తగిన చికిత్స అందించడం దిశగా వైద్యశాస్త్రం గణనీయమైన పురోగతి సాధించింది. అయినా, ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న గుండెజబ్బు మరణాల్లో 80 శాతం ఆర్థికంగా వెనుకబడిన దేశాల్లోను, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోను సంభవిస్తున్నాయి. పాత రికార్డులను చూసుకుంటే, 1990లో 1.21 కోట్ల మంది గుండెజబ్బులతో మరణించారు. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు అధునాతన వైద్యచికిత్స పద్ధతులు, మెరుగైన పరికరాలు అందుబాటులో ఉన్నా, గుండెజబ్బుల మరణాలు దాదాపు రెట్టింపుగా నమోదవుతుండటం ఆందోళనకర పరిణామం.గుండెజబ్బులతో అకాల మరణాలు..ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న అకాల మరణాలకు గుండెజబ్బులే ప్రధాన కారణం. అకస్మాత్తుగా గుండెకు రక్త సరఫరా నిలిచిపోవడం వల్లనే అత్యధికంగా గుండెపోటు మరణాలు సంభవిస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రమాణాల ప్రకారం 30–70 ఏళ్ల లోపు సంభవించే మరణాలను అకాల మరణాలుగా పరిగణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న అకాల మరణాల్లో 38 శాతం మరణాలకు ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ కారణమని ‘వరల్డ్ హార్ట్ రిపోర్ట్–2023’ చెబుతోంది. ఈ అకాల మరణాలకు అనేక కారణాలు ఉన్నాయి. జీవనశైలి, శరీరంలోని జీవక్రియల తీరు, పర్యావరణ కారణాల వల్ల జనాలు గుండెజబ్బుల బారిన పడుతున్నారు.జీవనశైలి కారణాలు: తగిన శారీరక శ్రమ లేకపోవడం, పొగతాగడం, మితిమీరి మద్యం తాగడం, ఉప్పుతో కూడిన పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం.జీవక్రియ కారణాలు: అధిక రక్తపోటు, మధుమేహం, అధిక బరువు, ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం.పర్యావరణ కారణాలు: పరిసరాల్లో మితిమీరిన వాయు కాలుష్యం, పొగ, దుమ్ము, ధూళి నిండిన పరిసరాల్లో పనిచేయడం.ఆకస్మిక గుండెపోటుతో మరణాలు గుండెజబ్బులకు తెలిసిన కారణాలకైతే జాగ్రత్తలు తీసుకుంటాం. మరి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి, నిమిషాల్లోనే గుండె ఆగిపోతేనో! అకస్మాత్తుగా వచ్చే గుండెపోటు వల్లనే ఎక్కువమంది చికిత్స అందేలోపే ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో చాలామంది నిన్న మొన్నటి వరకు ఆరోగ్యంగా ఉన్న యువకులు ఉంటున్నారు. ఆకస్మిక గుండెపోటు వల్ల సంభవించే మరణాలు గుండెజబ్బులతో బాధపడే వృద్ధుల్లో సహజం.ప్రతి 50 వేల మరణాల్లో ఒక యువ క్రీడాకారుడు ఉంటున్నట్లు ‘వరల్డ్ హార్ట్ రిపోర్ట్–2023’ చెబుతుండటం ఆందోళనకరం. శారీరక శ్రమతో కూడిన జీవనశైలి, క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారు, ఆటలాడే వారు కూడా ఆకస్మిక గుండెపోటుతో మరణిస్తున్నారు. ‘కోవిడ్’ తర్వాత ఇలాంటి మరణాలు ఎక్కువయ్యాయి. ‘కోవిడ్’కు ముందు ఆకస్మిక గుండెపోటుతో సంభవించే ప్రతి లక్ష మరణాల్లో ఒక యువక్రీడాకారుడు చొప్పున ఉండేవారు. ఇప్పుడు ఈ సంఖ్య రెట్టింపు కావడమే ఆందోళనకరం.ఆకస్మికంగా గుండెపోటుకు కారణాలు..ఆకస్మికంగా గుండెపోటు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. గుండెలోని విద్యుత్ సిగ్నలింగ్ వ్యవస్థలో ఆకస్మిక మార్పులు ఆకస్మిక గుండెపోటు కలిగిస్తాయి. గుండె లయ వేగంగా పెరగడం వల్ల గుండె దిగువ భాగంలోని గదులు బాగా కుంచించుకుపోతాయి. ఫలితంగా శరీరానికి కావలసిన రక్తాన్ని అందించడంలో గుండె విఫలమవుతుంది. ప్రాణాంతకమైన ఈ పరిస్థితిని ‘వెంట్రిక్యులర్ ఫైబ్రిలేషన్’ అంటారు. ఈ పరిస్థితి వల్ల ఆకస్మిక గుండెపోటు మరణాలు సంభవిస్తుంటాయి.1. గుండె కండరం దళసరిగా తయారవడం కూడా యువకుల్లో ఆకస్మిక గుండెపోటు మరణాలకు మరో కారణం. గుండె కండరం ఒక్కోసారి దళసరిగా తయారవుతుంది. అలాంటప్పుడు గుండె శరీరానికి కావలసిన రక్తాన్ని సరఫరా చేయలేదు. గుండె కండరం దళసరిగా మారితే గుండె లయలో వేగం పెరుగుతుంది. ఈ పరిస్థితి ఒక్కోసారి ఆకస్మిక గుండెపోటుకు దారితీస్తుంది.2. గుండెలయలో హెచ్చుతగ్గులకు దారితీసే ‘బ్రుగాడా సిండ్రోమ్’, ‘వూల్ఫ్–పార్కిన్సన్–వైట్ సిండ్రోమ్’ వంటి రుగ్మతలు కూడా ఆకస్మిక గుండెపోటు మరణాలకు కారణమవుతాయి. ఇవే కాకుండా, కొందరిలో పుట్టుకతోనే గుండెలో లోపాలు ఉంటాయి. గుండెనాళాల్లోను, రక్తనాళాల్లోను హెచ్చుతగ్గులు ఉంటాయి. అలాంటప్పుడు కూడా ఆకస్మికంగా గుండెపోటుతో మరణాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.3. ‘లాంగ్ క్యూటీ సిండ్రోమ్’ వల్ల కూడా ఆకస్మికంగా గుండెపోటు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పరిస్థితి ఉన్నవారికి గుండె చాలా వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. ‘లాంగ్ క్యూటీ సిండ్రోమ్’ కొందరిలో జన్యు కారణాల వల్ల పుట్టుక నుంచి ఉంటుంది. ఈసీజీ పరీక్ష చేయించినప్పుడు ఈ పరిస్థితి బయటపడుతుంది. ఒక్కోసారి ఇతరేతర ఆరోగ్య కారణాల వల్ల, దీర్ఘకాలికంగా వాడే మందుల దుష్ప్రభావం వల్ల కూడా ‘లాంగ్ క్యూటీ సిండ్రోమ్’ రావచ్చు. ఈ పరిస్థితి ఒక్కోసారి ఆకస్మిక గుండెపోటు మరణాలకు దారితీసే అవకాశాలు ఎక్కువ.ముందుగా గుర్తించాలంటే?ఎలాంటి ముందస్తు సూచనలు లేకుండా ఆకస్మికంగా వచ్చే గుండెపోటును ముందుగానే గుర్తించడం సాధ్యమేనా? అంటే, ఆకస్మికంగా వచ్చే గుండెపోటును నివారించడం సాధ్యం కాకపోయినా, కొన్ని ముందస్తు పరీక్షల వల్ల ఆకస్మిక గుండెపోటు మరణాలను తగ్గించగలమని వైద్య నిపుణులు చెబుతున్నారు. కఠిన వ్యాయామాలు చేసే యువకులు, క్రీడారంగంలో కొనసాగే యువకులకు ఈసీజీ పరీక్షలు తప్పనిసరి చేయడం ద్వారా వారిలో ఆకస్మిక గుండెపోటు మరణాలను తగ్గించవచ్చునని ఇటాలియన్ వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈసీజీ వల్ల పాక్షిక ప్రయోజనం మాత్రమే ఉంటుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నిపుణులు చెబుతున్నారు. కుటుంబంలో అనువంశిక చరిత్ర సహా ఇతరేతర కారణాల వల్ల గుండెజబ్బులు ఉన్న యువకులు కఠిన వ్యాయామాలకు, క్రీడా పోటీలకు దూరంగా ఉండటమే మంచిదని కూడా వైద్య నిపుణులు సూచిస్తున్నారు.గుండెజబ్బుల నివారణ.. హెల్దీ లైఫ్‌స్టైల్‌తో సాధ్యమే!ఈమధ్య గుండెజబ్బులు చాలా చిన్నవయసులోనే వస్తుండటం డాక్టర్లుగా మేము చూస్తున్నాం. యువతరంలో గతంలో ఎప్పుడోగానీ కనిపించని గుండెజబ్బులు, గుండెపోటు కేసులు ఇటీవల చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉద్యోగాల్లో పని ఒత్తిడి, పని ఒత్తడిలో పడి హడావుడిగా జంక్‌ఫుడ్ తినడం, వ్యాయామం తగ్గిపోవడం, ఫలితంగా స్థూలకాయులవడం, మద్యపానం, పొగతాగడం వంటి అలవాట్లు యువతలో గుండెజబ్బులు పెరగడానికి ప్రధాన కారణాలు. అందుకే ఆరోగ్యకరమైన సమతులాహారం తీసుకోవడం, పని ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం వంటివి చేయడం, రోజుకు 45 నిమిషాల చొప్పున వారంలో కనీసం ఐదురోజులు వ్యాయామం చేయడం వంటి హెల్దీ లైఫ్‌స్టైల్‌ను అనుసరిస్తే యువతలో గుండెజబ్బులను చాలావరకు నివారించవచ్చు.ఎలాంటి హెచ్చరిక ఉండదు..సాధారణంగా ఆకస్మిక గుండెపోటు సంభవించే ముందు ఎలాంటి హెచ్చరిక ఉండదు. ఎలాంటి ముందస్తు లక్షణాలు కనిపించవు. అయితే, కొన్ని లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా గుండె పరీక్షలు చేయించుకోవడం మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.నడుస్తున్నప్పుడు, ఏదైనా పని చేస్తున్నప్పుడు లేదా ఆటలాడుతున్నప్పుడు హఠాత్తుగా మూర్ఛపోవడం జరిగితే, వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలి. గుండె సమస్యల వల్ల కూడా ఇలా మూర్ఛపోయే పరిస్థితి తలెత్తుతుంది.ఉబ్బసంలాంటి పరిస్థితి లేకపోయినా, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడినట్లయితే గుండె పనితీరులో లోపాలు ఉన్నట్లే భావించాలి. ఈ పరిస్థితి ఎదురైతే, వెంటనే వైద్యనిపుణులను సంప్రదించాలి.కుటుంబ సభ్యులు ఆకస్మిక గుండెపోటు వల్ల మరణించిన చరిత్ర ఉన్నట్లయితే, ముందు జాగ్రత్తగా గుండె పరీక్షలు చేయించుకోవాలి. జన్యు కారణాల వల్ల గుండెలో లోపాలు ఉన్నట్లయితే ఆ పరీక్షల్లో బయటపడతాయి. వాటిని ముందుగానే గుర్తించినట్లయితే, తగిన చికిత్స పొందడానికి అవకాశం ఉంటుంది.ఆకస్మిక గుండెపోటు లక్షణాలు..ఆకస్మికంగా గుండెపోటు వచ్చినప్పుడు సాధారణంగా కనిపించే లక్షణాలు ఇవి:– హఠాత్తుగా కుప్పకూలిపోవడం– నాడి అందకపోవడం– ఊపిరాడకపోవడం– స్పృహ కోల్పోవడంఒక్కోసారి ఆకస్మికంగా గుండెపోటు వచ్చే ముందు ఇంకొన్ని లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపించిన కొద్ది నిమిషాల్లోనే గుండెపోటు వస్తుంది.– ఛాతీలో అసౌకర్యంగా ఉండటం– ఊపిరి తీసుకోవడం కష్టమవడం– నిస్సత్తువ– వేగంగా ఊపిరి తీసుకోవడం– గుండె లయ తప్పి కొట్టుకోవడం– స్పృహ కోల్పోతున్నట్లుగా అనిపించడంఈ లక్షణాలు కనిపిస్తే, వెంటనే అంబులెన్స్‌కు కాల్ చేయడం మంచిది. ఎంత వేగంగా చికిత్స అందితే రోగికి అంత మంచిది. ఈ పరిస్థితుల్లో ఉన్నవారికి వెంటనే ‘కార్డియో పల్మనరీ రిసటేషన్’ (సీపీఆర్) అందించాలి. అలాగే, అందుబాటులో ఉంటే ‘ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫైబ్రిలేటర్’ (ఏఈడీ)తో ప్రాథమిక చికిత్సను అందించాలి. సీపీఆర్ చేసేటప్పుడు ఛాతీపై నిమిషానికి 100–120 సార్లు బలంగా మర్దన చేయాలి. ఆస్పత్రికి చేరేలోగా రోగికి ఈ రకమైన ప్రాథమిక చికిత్స అందిస్తే, చాలావరకు ప్రాణాపాయం తప్పుతుంది. -
Chakali Ailamma: ఆత్మగౌరవ ప్రతీక!
ఆధిపత్య వర్గాల పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడి దొరలను గడీల నుంచి ఉరికించి తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడిన వీర వనిత చాకలి ఐలమ్మ. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం సాగిన సాయుధ పోరాటంలో పాల్గొన్న వారిలో అగ్రగణ్య ఐలమ్మ.ఉమ్మడి నల్లగొండజిల్లా (నేటి జనగాం జిల్లా) పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్య – ఐలమ్మలకు ఆరుగురు సంతానం. వారిది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం. కులవృత్తే వారికి జీవనాధారం. కులవృత్తితో బతకలేక పాలకుర్తికి పక్కనే ఉన్న మల్లంపల్లి దొర కుటుంబానికి చెందిన ఉత్తంరాజు జయప్రదాదేవి వద్ద 40 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుంది ఐలమ్మ. అదే విసునూరు దేశ్‌ముఖ్ రాపాక రామచంద్రారెడ్డికి కంటగింపు అయింది.అప్పుడే వెట్టి గొట్టాలు చేయవద్దని పిలుపునిచ్చి... 1940–44 మధ్య కాలంలో విసునూరులో దేశ్‌ముఖ్‌లు, రజాకర్ల అరాచకా లపై ఎదురుతిరిగి ఎర్రజెండా పట్టి ఆంధ్రమహాసభ (సంఘం)లో చేరింది ఐలమ్మ. దీంతో రామచంద్రారెడ్డి రగిలిపోయాడు. ఆమె కౌలుకు తీసుకున్న భూమిలో కాపు కొచ్చిన పంటను కాజేయాలని పన్నాగం పన్నాడు. గూండా లను పురమాయించారు. ‘ఈ భూమి నాది. పండించిన పంట నాది. తీసుకెళ్లడానికి దొరెవ్వడు... నా ప్రాణం పోయాకే ఈ పంట, భూమి మీరు దక్కించుకోగలిగేది’ అంటూ తన పంటను దోచుకోవడానికి వచ్చిన దొరగూండాలతో పలికింది ఐలమ్మ.సంఘం కార్యకర్తలు వరిని కోసి, వరికట్టం కొట్టి ధాన్యాన్ని ఐలమ్మ ఇంటికి చేర్చారు. భీంరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల రాంచంద్రారెడ్డి, చకిలం యాదగిరిలు సైతం ధాన్యపు బస్తాలను భుజాలపై మోశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ సహకారంతో ఐలమ్మకు అనుకూలంగా కోర్టులో తీర్పువచ్చింది. ఐలమ్మ భూపోరాటం సామాజికంగా దిగువ ఉన్న జనానికి ప్రేరణ, స్ఫూర్తి నిచ్చింది. పల్లెపల్లెన ఉద్యమం ఎగిసిపడి, దొరల ఆధిపత్యం నేలమట్టమైంది. బడుగులను ఆదుకోవడమే ఆమెకు నిజమైన నివాళి! – ఆలేటి రమేష్, రజక విద్యార్థి సంఘం తెలంగాణ ప్రధాన కార్యదర్శిఇవి చదవండి: మహాలక్ష్మి కేసులో షాకింగ్ ట్విస్ట్ -
కాలం మారినా కళ తగ్గలేదు
వస్త్ర ప్రపంచంలో వన్నె తగ్గని కలంకారీ మొగలుల కాలంలో ఆదరణ పొంది, బహుళ ప్రాచుర్యంలోకి వచ్చింది. రసాయనాలకు తావులేకుండా సహజసిద్ధమైన రంగులతో తయారవుతున్న ఈ అద్దకం మచిలీపట్నం కలంకారీగా వాసికెక్కింది. 1960లో పెడన వరకు విస్తరించింది. కలంకారీలో ఈ ఊరిది ప్రత్యేక స్థానమని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇక్కడ వందల దుకాణాలున్నాయి. పెడనతోపాటు గూడూరు, పోలవరం, కప్పదొడ్డి తదితర గ్రామాల్లోనూ ఈ కళే ప్రధాన జీవనోపాధిగా మారి ఓ పరిశ్రమగా విరాజిల్లుతోంది. దీనిపై ఆధారపడి దాదాపు పదివేల మందికి పైగా కార్మికులు జీవిస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్త సోకులను సంతరించుకుంటున్న ఫ్యాషన్ ప్రపంచం తన కేటలాగ్ నుంచి కలంకారీని మాత్రం రీప్లేస్ చేయట్లేదంటే అర్థం చేసుకోవచ్చు దానికున్న క్రేజ్ ఎలాంటిదో! ఇలా ప్రింట్ అవుతుంది..కలంకారీ అద్దకం కోసం ముందుగా ఒక కొర్రగుడ్డను (గోధుమ వర్ణంలోని వస్త్రం) తీసుకుని దాన్ని ఒకరోజంతా నీటిలో నానబెడతారు. తర్వాత ఆ గుడ్డకు కరక్కాయ గుజ్జు పట్టించి, రోజంతా ఉంచుతారు. అనంతరం దాని మీద బ్లాక్ ప్రింట్ (పలు రంగుల్లోని డిజైన్ అచ్చులు) వేసి, 24 గంటల తర్వాత ఆ గుడ్డను తీస్తారు. దాన్ని పారుతున్న కాలువ నీటిలో శుభ్రం చేస్తారు. దాంతో బ్లాక్ ప్రింట్ వేసిన తర్వాత గుడ్డకు అంటిన రంగులు పోతాయి. అప్పుడు దాన్ని రాగి బానలో 45 నిమిషాల పాటు ఉడకబెడతారు. దీనివల్ల గుడ్డ మీద డిజైన్ మరింత చిక్కగా, వెలిసిపోకుండా తయారవుతుంది. ఇలా ఈ ప్రక్రియలో ఒక బెడ్‌షీట్ తయారు కావాలంటే వారం పడుతుంది. కానీ స్క్రీన్ ప్రింట్లో ( రసాయన రంగులు ఉపయోగించి చేసిన రెడీమేడ్ అచ్చులు) అయితే ఒక కార్మికుడు రోజుకు 6 బెడ్షీట్లను తయారుచేయగలడు. ఇలా అన్ని రకాల ఉత్పత్తులతో జిల్లా వ్యాప్తంగా రోజుకు రూ.50 కోట్ల టర్నోవర్ జరుగుతోంది.డిజైన్లు ఇలా..ఈ కళలో పలు పౌరాణిక కథథలను, పూల తీగలను, అమ్మాయిల నృత్య భంగిమలను డిజైన్లుగా చిత్రీకరించి, తర్వాత వాటికి వెజిటబుల్ డైస్‌తో రంగులు అద్దుతారు. ఇది ఆంగ్లేయుల కాలంలో అంతర్జాతీయ స్థాయి మార్కెట్‌ను ప్రభావితం చేసింది. ఇప్పటికీ లండన్‌లోని విక్టోరియా మ్యూజియంలో అలనాటి కలంకారీ వస్త్రాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. అమెరికా, ఫ్రాన్స్, నెదర్లండ్స్, ఆస్ట్రేలియా, దుబాయ్ తదితర దేశాల్లో కలంకారీకున్న ప్రాచుర్యం అంతా ఇంతా కాదు. ఆయా ప్రాంతాల నుంచి చీరలు, డ్రెస్ మెటీరియల్స్, బెడ్షీట్లు, కుషన్ కవర్లకు ఆర్డర్లు వస్తుంటాయి. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ సైతం కలంకారీ దుస్తులు వినియోగించారంటే దీని ప్రత్యేకత ఎలాంటిదో తెలుసుకోవచ్చు.∙ఎస్.పి. యూసుఫ్, సాక్షి, మచిలీపట్నం. ఫొటోలు: చక్రపాణి, విజయవాడపిచ్చుక వీరసుబ్బయ్యతో మొదలు..పెడనలో కలంకారీ వస్త్రాల తయారీని తొలిసారిగా పిచ్చుక వీరసుబ్బయ్య ప్రారంభించారు. నేటికీ ఆయన వంశస్థులు ఇందులో కొనసాగుతున్నారు. ప్రకృతిసిద్ధమైన రంగులతో ఈ కళకు జీవం పోస్తున్నారు.మూడుతరాలుగా ఇందులోనే.. పెడనలో కలంకారీని మా నాన్న పిచ్చుక వీరసుబ్బయ్య మొదలుపెట్టారు. ఇక్కడ తయారైన వస్త్రాలు విదేశాలకు ఎగుమతి కావాలన్నది మా నాన్న కోరిక. ఈ కళ మా ఇంట్లో వారసత్వంగా కొనసాగుతోంది. ప్రస్తుతం నేను, మా అబ్బాయి పిచ్చుక వరుణ్‌కుమార్ ఇద్దరం ఇదే రంగంలో ఉన్నాం. మా అబ్బాయి బీటెక్ పూర్తి చేశాడు. సాంకేతిక పరిజ్ఞానంతో స్వతహాగా ఇంకో పది డిజైన్లు తయారు చేశాడు. వీటికి విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది.– పిచ్చుక శ్రీనివాస్, పెడన.16 ఏళ్లుగా.. ఏడవ తరగతి వరకు చదువుకున్నాను. పెళ్లికి ముందు నుంచే అంటే 16 ఏళ్లుగా ఈ అద్దకం చేస్తున్నాను. చీరలు, డ్రెస్ మెటీరియల్స్, చున్నీలు, బెడ్షీట్లపై కలంకారీ ప్రింట్ వేస్తాను. యజమానులు సూచించిన, డిమాండ్‌లో ఉన్న డిజైన్లను చేతితో అచ్చు వేస్తాను.– ఈడే వెంకటలక్ష్మి, పెడన.ప్రభుత్వం ఆదుకోవాలి ఫ్యాషన్ మార్కెట్లో కలంకారీకి ఏ మాత్రం డిమాండ్ తగ్గలేదు. అయితే పెరిగిన ముడి సరుకుల ధరలతో గిట్టుబాటు కాక ఇబ్బందులు పడుతున్నాం. తగిన కూలీ లేక చాలా మంది ఈ వృత్తిని వదిలేస్తున్నారు. ఈ పరిశ్రమ కొనసాగాలంటే దీనిని ప్రభుత్వం ఆదుకోవాలి.– యర్ర టార్జ¯Œ రావు, వస్త్ర వ్యాపారీ, పెడన. -
గాక్’ ఫ్రూట్.. ద గ్రేట్! అత్యంత ఖరీదైన పండు, లాభాలు మెండు
గాక్ ఫ్రూట్.. అత్యంత ఖరీదైన పండు. మనకు కొత్త పంట. కానీ, అనేక దక్షిణాసియా దేశాల్లో విరివిగా సాగవుతున్నది. ఎన్నెన్నో ΄ోషకాలు, ఔషధ గుణాల గని ఈ అద్భుత పండు. పండ్ల ప్రాసెసింగ్ పరిశ్రమకు కూడా ఎంతో ఉపయుక్తమైన పండ్ల జాతి గాక్. కేరళ, కర్ణాటకలో అతికొద్ది మంది ఇంటిపంటగా సాగు చేస్తున్న ఈ పంటను తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటగా ఏలూరు జిల్లాకు చెందిన ఓ ఉద్యోగి పెరట్లో సాగు చేస్తూ.. కిలో రూ. 500కు విక్రయిస్తూ.. అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇంటిపంటగా, వాణిజ్య పంటగా సాగు చేసుకోదగిన ఈ కొత్త పంటపై ప్రత్యేక కథనం. బొరగం వెంకట్ బీటెక్ చదువుకొని పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇంతవరకే అయితే పెద్ద విశేషం ఏమీ లేదు. ఏదైనా మంచి కొత్త పంటను మన ప్రజలకు పరిచయం చేయాలన్న తపనతో ఇంటర్నెట్ సహాయంతో లక్షణమైన గాక్ ఫ్రూట్‌ను సాగు చేయనారంభించారు. వెంకట్ స్వస్థలం ఏలూరు జిల్లా పోలవరం మండలం లోని మామిడిగొంది గ్రామం. గాక్ ఫ్రూట్‌ను కేరళలో కొందరు సాగు చేస్తుండటాన్ని ఇంటర్నెట్ ద్వారా తెలుసుకున్న వెంకట్, మొక్కలు తెప్పించి తన ఇంటి పెరట్లో 2023 నవంబర్ నెలలో నాటారు. సుమారు 300 మొక్కల్ని నాటి, పందిరి పైకి పాకించారు. ఇందులో కొన్ని ఆడ, మగ మొక్కలు కలిసి ఉన్నాయి. చాలా ఏళ్లపాటు పండ్ల దిగుబడిని ఇవ్వటంతోపాటు.. ఏడాది పొడవునా పండ్లను అందించే అద్భుత తీగజాతి పంట ఇది. అవగాహన లోపం వల్ల మొక్కల్ని దగ్గరగా నాటటం వల్ల కొన్ని మొక్కలు చనిపోయాయని, ప్రస్తుతం 120 మొక్కలు మాత్రమే బతికి ఉన్నాయని వెంకట్ ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. రెండు నెలల క్రితం నుంచి చక్కని ఎర్రటి పండ్ల దిగుబడి తీసుకుంటున్నానని, ఎంతో ఆరోగ్యకరమైన ఈ పండ్లకు చాలా గిరాకీ ఉందని వెంకట్ తెలి΄ారు. గాక్ ఫ్రూట్ సాగు గురించి తెలుసుకున్న ప్రజలు హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి కిలో పండ్లకు రూ. 500 చెల్లించి కొనుగోలు చేస్తున్నారని సంతోషంగా చెప్పారు. ఒక్కో పండు అరకేజీ వరకు బరువు పెరుగుతోంది. ప్రతి రెండు ఆడ మొక్కల పక్కన ఒక మగ మొక్కను నాటుకోవాలని, 6“6 అడుగుల దూరంలో నాటుకొని పందిరి వేస్తే సరిపోతుందని ఆయన తెలిపారు. ఒక్కసారి నాటితే 30 ఏళ్ల పాటు ఏడాది పొడవునా నిరంత రాయంగా పండ్ల దిగుబడి వస్తూ ఉంటుందన్నారు. దీని తీగలు ఎంత విస్తారంగా పెరిగే వీలుంటే అన్ని ఎక్కువ పండ్ల దిగుబడి వస్తుందని తన అనుభవంలో తెలుసుకున్నానన్నారు. ఆకాకర జాతికి చెందిన గాక్ ఫ్రూట్ పైన కూడా నూగు ఉంటుంది. లోపల గుజ్జుతో ΄ాటు గింజలు ఎక్కువగానే ఉంటాయి. గింజల్ని తీసేసి గుజ్జును జ్యూస్ చేసుకొని తాగితే పోషకాల లోపం తగ్గి΄ోతుందని, జబ్బులు సైతం తగ్గుతాయని ఆయన చెబుతున్నారు. గాక్ ఫ్రూట్ పూలకు కృత్రిమంగా చేతులతో పరపరాగ సంపర్కం చేస్తే అధిక పండ్ల దిగుబడి వస్తుందని, సహజంగా జరిగితే సగం దిగుబడి మాత్రమే వస్తుందని వెంకట్ వివరించారు. గాక్ ఫ్రూట్ పువ్వు రెండు నెలల్లో పిందె నుంచి పండు దశకు పెరుగుతుంది. రంగులు మారుతుంది. పిందె పడిన తొలి నెలలో ఆకు పచ్చగా ఉంటుంది. ఈ దశలో ఈ కాయలను గోకాకర మాదిరిగానే కూరవండుకొని తినొచ్చు. దోస కాయ మాదిరి రుచి ఉంటుందన్నారు. రెండో నెలలో మొదటి పది రోజుల్లో పసుపు పచ్చ రంగుకు మారుతుంది. 20 రోజులకు నారింజ రంగులోకి మారి, 30 రోజులకు ఎర్రగా మారుతుంది. పండు పండిన తర్వాత త్వరగా మెత్తబడి పోతుందని వెంకట్ వివరిస్తున్నారు. విత్తనాలు నల్లగా ఉంటాయి. యూట్యూబ్ ద్వారా వెంకట్ దగ్గర ఈ కొత్త పంట సాగవుతున్నట్లు తెలుసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ స్పందించి ఉద్యాన శాఖ అధికారులను పంపారు. పండ్లతో పాటు కొన్ని మొక్కలను తెప్పించి ప్రయోగాత్మకంగా సాగు చేయించటం ప్రారంభించారు. గాక్ ఫ్రూట్ పోషక విలువలతో కూడిన పంటని, దీన్ని సులువుగా తీగ ముక్కలను కత్తిరించి నాటుకోవచ్చని వెంకట్ ఇంటిపంటను పరిశీలించిన ఉద్యానాధికారి సందీప్ ‘సాక్షి సాగుబడి’తో చె΄్పారు. ఇది చీడపీడలు ఆశించని పంటని, సాగు చేయటం కూడా సులువేనని అన్నారు. ఇద్దరు రైతులతో తాము ప్రయోగాత్మకంగా సాగు చేయిస్తున్నామన్నారు. వియత్నాం, చైనా, థాయ్‌లాండ్, ఇండోనేషియా, మలేషియా తదితర దేశాల్లో చిరకాలంగా సాగులో ఉన్న గాక్ ఫ్రూట్‌ను అనాదిగా సందప్రదాయ వైద్యంలో విస్తృతంగా వినియోగిస్తున్నారని యూనివర్సిటీ సైన్స్ మలేషియా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లైకోపెన్, బీటా కెరోటిన్, ఫ్యాటీ ఆసిడ్స్, యాంటీఆక్సిడెంట్లు అత్యధిక మోతాదులో కలిగి ఉండటం వల్ల కేన్సర్, అల్సర్లు, కంటి సమస్యలు తదితర జబ్బుల్ని నయం చేసే విశేష ఔషధ గుణాలు గాక్ ఫ్రూట్లో ఉన్నాయని శాస్త్రవేత్తలు ఆస్ట్రేలియా జర్నల్ ఆఫ్ క్రాప్సైన్స్లో రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. ఔషధాలు, సౌందర్య సాధనాల తయారీ పరిశ్రమలకు గాక్ ఫ్రూట్ ముడిసరుకుగా ఉపయోగపడుతున్నందున వాణిజ్యపరమైన విలువ కలిగి ఉండటం మరో విశేషం. నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్కిలో రూ. 500కు అమ్ముతున్నామన ప్రాంతానికి ఓ మంచి కొత్త పంటను పరిచయం చేయాలనే తపన నాకుండేది. ఇంటర్నెట్లో గాలిస్తుండగా గాక్ ఫ్రూట్ గురించి తెలిసింది. కేరళలో ఒకరి దగ్గరి నుంచి మొక్కలు తెప్పించి నాటా. 20 సెంట్ల నా పెరటి తోటలో గాక్ ఫ్రూట్స్ వారానికి 10–15 కిలోల వరకు పండుతున్నాయి. కూరకు ఉపయోగపడే పచ్చి గాక్ కాయలను కిలో రూ. 300కు అమ్ముతున్నా. కేరళలో కిలో రూ. 1,000 – 1,500 వరకు అమ్ముతున్నారు. గ్యాస్ ఫ్రూట్ జ్యూస్ రోగనిరోధక శక్తిని పెంపొదించటంతో పాటు.. షుగర్, కేన్సర్ వంటి జబ్బుల్ని కూడా నయం చేస్తుంది. హైదరాబాద్ తదితర దూర ప్రాంతాల వాళ్లు ముందే బుక్ చేసుకొని కొనుగోలు చేస్తున్నారు. మొక్కలు కావాలని కూడా చాలా మంది అడుగుతున్నారు. – బోరగం వెంకట్ (77999 11174), గాక్ ఫ్రూట్ సాగుదారు, మామిడిగొంది, పోలవరం మండలం, ఏలూరు జిల్లా -
నార్కోండం - మాయమైన మేకలు ఆసక్తికర కథనం
దట్టమైన అడవులు, కొండలు, బోలెడన్ని పక్షులు , మంచి నీటి సరస్సులు, అద్భుతమైన పగడపు దీవులతో నాగరికతకు దూరంగా ఒక దీవి ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి.ఆ దీవిలో ఒక విషపూరితం కాని పాము కూడా ఉందనుకోండి. అలాంటి ఒక దీవిని చూడాలని నేను ఎన్నో ఏళ్లగా అనుకుంటున్నాను. అయితే అనుకోకుండా ఒక రోజు నా కల నిజమైంది.అండమాన్ సముద్రములో 48 అడుగుల పడవపై నేను, మరో తొమ్మిది స్నేహితులు కలిసి నార్కోండం అనే ఒక నిద్రాణ అగ్నిపర్వతపు దీవిని పరిశీలించడం కోసం వెళ్ళాము.ఈ దీవిపై అతి కొద్దిమంది మాత్రమే కాలుమోపారు. ఆలా వెళ్లిన వారిలో నార్కోండం హార్నబిల్ అనే అరుదైన పక్షిని చూడటానికి వెళ్లిన పక్షి ప్రేమికులే ఎక్కువ. నార్కోండం హార్నబిల్ పక్షులు కేవలం 7 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణము కలిగిన ఈ నార్కోండం దీవిపై తప్ప ప్రపంచంలో మరెక్కడా కనిపించవు. కాకపోతే ఈ మధ్య కాలంలో సింగపూర్‌లోని పక్షులని అధ్యయనం చేసి ఒక సంస్థ ఈ జాతి ఆడ పక్షిని అక్కడ చూసినట్టు చెప్పారు. బహుశా ఎవరో కొన్నింటిని అక్రమంగా రవాణా చేసినట్టున్నారు.మా పడవ దీవి దక్షిణ అంచుని దాటి ఈశాన్య అంచున ఉన్న పోలీస్ పోస్ట్ అనే లంగరు వేసే చోటుకి చేరుకుంటూండగానే మాకు నార్కోండం హార్నబిల్ పక్షులు ఎగురుతూ కనిపించాయి. మా పడవ నుంచి చూస్తే 710 మీటర్ల ఎతైన ఆ అగ్నిపర్వతము ఆంతా దట్టమైన అడవితో నిండి ఉంది.ఈ దీవి భారత భూభాగ పరిధిలోకి వస్తుంది, అందుకే ఇక్కడ ఇండియన్ రిజర్వు బటాలిన్ వారి పారా మిలిటరీ పోలిసుల పోస్టు ఉంటుంది. ఒకప్పుడు ఏపుగా ఉండే బర్మా జీలుగ చెట్ల స్థానంలో ఇప్పుడు అక్కడ కొబ్బరి , అరటి , వక్క వంటి మనుషులకు ఉపయోగ పడే చెట్లు కనిపిస్తున్నాయి. ఆ దట్టమైన అడవిలో అనేక మేకలు మొక్కలను తింటూ హార్నబిల్ పక్షుల మనుగడకు ముప్పుగా తయారయ్యాయని ఒక కధనం విన్నాను.ఈ మేకలు ఆ దీవిపై సహజంగా కనిపించే ప్రాణులు కావు. ఈ మేకల వెనుక ఒక ఆసక్తికరమైన కధ ఉంది. 15 నుంచి 17వ శతాబ్దం మధ్యలో ఐరోపా నుండి అన్వేషక నావికులు ప్రపంచమంతా నౌకలలో ప్రయాణించే వారు. ఆ ప్రయాణంలో సుదూర ప్రాంతాల్లో ఉండే చిన్న దీవులు కనిపించినప్పుడు ఆ దీవుల్లో కొన్ని మేకలు, పందులు, కోళ్లు, కుందేళ్లు మరియు తాబేళ్లను వదిలి వెళ్లేవారు. ఆ దారిన వెళ్లే ఇతర నౌకలకు లేక దురదృష్టవశాత్తు పడవ మునిగిపోతే బ్రతికి బయటపడి దీవికి చేరుకున్నవారికి ఆహారముగా ఇవి ఉపయోగపడతాయని వారి ఉద్దేశం. 1899 లో ఏ. ఓ. హ్యూమ్ ఒక కధనంలో ఈ దీవిపై పందులు, మేకలు, కోళ్లను వదిలిపెట్టారు అని వ్రాసారు. కానీ మొదటిసారిగా ఎప్పుడు వాటిని అక్కడ వదిలారో ఎవరికీ కచ్చితంగా తెలియదు. ఆ కాలంలో వదిలిన వాటిని సముద్రపు దొంగలు లేక నావికులు ఆహారంగా తినేశారో లేక ఆ జంతువులే చనిపోయావో తెలియదు.అయితే ప్రపంచ వ్యాప్తంగా ఇలా యాదృచ్ఛికంగా దీవులలో వదిలిన జంతువుల ఆ దీవులలోని జీవ సమతుల్యతను దెబ్బతీస్తున్నాయని ప్రభుత్వ అధికారులు నిర్మూలిస్తుండంగా, 1976 లో మన దేశ పోలీసులు రెండు జతల మేకలను ఈ దీవిపై పనిచేసే పోలీసుల ఆహారంకోసం ఉపయోగపడతాయని తీసుకువచ్చారు. ప్రతీరోజు మేక మాంసం తిని విసుగెత్తిపోయారో లేక తోటలను పెంచినట్టు ఆ దీవిలో మేకల పెంపకం పెద్ద వ్యాపారమే అయ్యిందో లేక మేకలు మిగతా దీవులలో వలె మేకలు నియంత్రణ లేకుండా చేయదాటిపోయాయో తెలియదు కానీ 1998 నాటికి ఆ దీవిపై దాదాపు 400 మేకలు చక్కగా భయంలేకుండా బ్రతుకుతూ కనిపించాయట!1990 దశాబ్దం మొదట్లో పక్షులను అధ్యయనం చేసే శాస్త్రవేత్తలు ఈ దీవిపై నుండి ఈ మేకలను నిర్మూలించాలని అడగడం మొదలుపెట్టారు. సాధారణంగా అగ్నిపర్వతం పరిసరాలు చిన్న రాళ్లతో నిండి ఉంటుంది. ఈ పర్వతంపై పెరుగుతున్న చెట్ల వేళ్ళు ఆ రాళ్లను ఒడిసి పట్టి ఉంచడం వలనే ఆ దీవిని ఒక్కటిగా ఉంచడం సాధ్యపడిందని కొందరు వాదిస్తారు. ముఖ్యంగా అత్తి జాతి చెట్లు ఈ రకంగా తమ వేళ్ళతో రాళ్ళని ఒడిసిపడతాయి. హార్నబిల్ పక్షుల ఆ చెట్ల పళ్ళను తమ పిల్లలకు ఆహారంగా ఉపయోగిస్తాయి. అయితే ఈ దీవిపై అపరిమితంగా పెరిగిపోయిన మేకలు, మొలకెత్తుతున్న అత్తి జాతి మొక్కలను తినడం మూలంగా, కొత్త చెట్లు పెరగడానికి అవకాశం లేక ఆ హార్నబిల్ పక్షుల ఆహారానికి ఇబ్బంది కలిగి తద్వారా వాటి మనుగడ ప్రమాదంలో పడింది. చివరికి మేకలు ఆ దీవికి ప్రమాదకారులుగా మారాయి. మేము ఈ దీవి చేరుకున్నాక, మూడు రోజులపాటు మేకల అడుగుల గుర్తుల కోసం, అవి తిని విసర్జించిన గుర్తుల కోసం, వాటి ఉనికిని తెలిపే ఏదైనా ఆధారాల కోసం దాదాపు ఆ దీవి మూడు వంతులు నడిచి పరిశీలించాము. ఆశ్చర్యంగా మాకు ఒక్క ఆధారం కూడా దొరకలేదు. బహుశా అధికారులు పక్షి శాస్త్రవేత్తలు అడిగినట్లే ఎంతో కష్టపడి వారి కోరిక తీర్చినట్టు ఉన్నారు. అయితే ఇక్కడ నివసిస్తున్న పోలీస్ మాత్రం, అంతకు ముందరి వారమే రెండు మేకలు కొండపైకి పరిగెడుతూ పారిపోవడం చూశామని చెప్పారు. ఏదేమైనప్పటికీ ఈ దీవిపైనా ఆ మేకల ప్రభావం తెలియాలంటే కాలమే సమాధానం చెప్పాలి.రచయిత్రి: జానకి లెనిన్ఫోటోలు- రోహిత్ నానీవాడేకర్ -
గృహస్థాశ్రమ వైశిష్ట్యం: పంచ మహాయజ్ఞం
పంచమహా యజ్ఞం అని ఐదు యజ్ఞాలు నిరంతరం జరిగే ప్రదేశం గహస్థాశ్రమం. గృహస్థాశ్రమ ప్రవేశం చేసినవారు ఈ ఐదింటిమీద శ్రద్ధపెట్టి ఉండాలి. అందుకే దీనిని యజ్ఞం అని వదిలేయకుండా మహాయజ్ఞం అని అన్నారు. సాధారణంగా యజ్ఞం అంటే అగ్నిముఖంగా హవిస్సును ఇవ్వడం ఉంటుంది. స్వాహాకారంతో అగ్నిహోత్రుడిని పిలిచి ఇచ్చిన హవిష్యాన్నం దేవతలకు అందచేయడానికి ..అని యజమాని సంకల్పం చేస్తాడు. కానీ అగ్ని ఆరాధనం పంచ యజ్ఞాలలో అంతర్భాగం అయినప్పటికీ ... మిగిలిన నాలుగింటినీ కూడా యజ్ఞాలనే పిలిచారు. వీటినే మహాయజ్ఞాలని అన్నారు. అలా అనడానికి కూడా ఒక కారణం ఉంది. దీనికి ప్రత్యేకంగా హోమశాలకానీ, ప్రత్యేకంగా మంత్రభాగం కానీ అవసరం లేకుండా ప్రతివారు కూడా శ్రద్ధతో అనుసరించాల్సిన విషయాలు ఈ ఐదింటిలో అంతర్లీనంగా ఉంటాయి. ‘‘నేను ఈ గృహస్థాశ్రమంలో ప్రవేశించినందుకు దీనిని ధన్యం చేసుకుని తరించడానికి ఈ ఐదు ఆలంబనాలు. వీటిని ఊతంగా చేసుకుని తరించాలి’’ అని గృహస్థు భావిస్తాడు. అందుకే ఇవి గృహస్థాశ్రమంలోనే నడుస్తాయి.వీటిలో మొదటిది – అధ్యాపనం బ్రహ్మయజ్ఞః–అంటారు. అధ్యాపనం అంటే బోధ చేయడం. బోధ చేయడాన్నే బ్రహ్మ విద్య.. అంటారు. బోధ దేనికి! మనిషి తరించడానికి ఇది మార్గాన్ని చెబుతుంది. సనాతన ధర్మం గొప్పతనం ఏమిటంటే.. అది ఏది పట్టుకోవాలో చెబుతుంది, ఏది పట్టుకోకూడదో చెబుతుంది. పట్టుకోకూడదన్నంత మాత్రం చేత అదంత సులభసాధ్యం కాదు కాబట్టి పట్టుకోకుండా ఉండడానికి ఎటువంటి మనస్తత్వాన్ని సాధించుకోవాలో ఇది బోధ చేస్తుంది. అది మన రుషుల ప్రత్యేకత.మనకు సంవత్సరం ఆరంభంలో అంటే సంవత్సరాదినాడు చేదుపచ్చడి తినిపిస్తారు. సంవత్సరం పూర్తి ఎప్పుడు.. అంటే చాంద్రమానంలో కాదు, ఫాల్గుణ మాసంలో వచ్చే అమావాస్య కాదు, సౌరమానంలో వచ్చే భోగి పండగను ప్రమాణం చేస్తారు. భీష్మ ఏకాదశి, కష్ణాష్టమి, మహాశివరాత్రి, శ్రీరామనవమిల లాగా తిథులతో కూడుకుని రాదు. భోగికి తిథి ఉండదు. దక్షిణాయనానికి చిట్టచివర వచ్చేది.. భోగిపండగ అవుతుంది. దక్షిణాయనం ఉ΄ాసనా కాలం. ఉపాసన కష్టంగా ఉంటుంది. పరిశ్రమ చేయడానికి, ఉపాసన చేయడానికి సిద్ధపడితే అది చేదు తినడం.. కష్టపడాలి కాబట్టి ఉగాది పచ్చడిని ప్రారంభంలో తినిపిస్తారు. కష్టపడడం దేనికి! తరించడానికి అవకాశం రావాలంటే ముందుగా ఈశ్వరుడు పెట్టుబడిగా ఇచ్చిన శరీరాన్ని సాధన ద్వారా సిద్ధపరచాల్సి ఉంటుంది.ఎవరు కష్టపడ్డారో, ఎవరు ఉగాదినాడు చేదు పచ్చడి తిన్నారో, వారు భోగినాడు పొంగల్.. మధుర పదార్థం తింటారు. అంటే భోగం అనుభవించే అర్హత పొందుతారు. ఏ ఉపాసన చేయకుండా, ఏ శాస్త్రాన్నీ పాటించకుండా, ఏ ఆశ్రమంలో ఉన్నారో దాన్ని ధన్యం చేసుకోకుండా భాగ్యం కావాలంటే సాధ్యం కాదు. ఇవన్నీ బోధించి గహస్థాశ్రమ ప్రవేశం చేయించి, అక్కడ విధివిధానాలు సక్రమంగా నిర్వర్తించేటట్లు బోధించడమే ..అధ్యాపన యజ్ఞం. అంటే ఒకరికి చెప్పడం.. అదెప్పుడు సాధ్యం. ముందుగా మన చదివి ఉంటేనే కదా.. దేనికోసం చదవాలి....అంటే ఇది మన కర్తవ్యం ఏమిటో మనం తెలుసుకోవడం కోసం ఉపయోగపడేది. -
మెదడు.. మోకాల్లోకి..
కలో.. భ్రమో.. రాత్రి తోకచుక్క కనపడింది. తోకచుక్క సంఘ సంస్కరణ ప్రయాణ పతాక కదా. ఏం జరుగుతుందో ఏం జరగదో.. మెలకువను స్వప్నించి నిద్రలోనే లేచినట్టు.. తిరిగినట్టు.. మాట్లాడినట్టు.. చీకటి తెరలు పూర్తిగా తొలగిపోలేదు. తెల్లవారిన సందడి ఇపుడిపుడే మేల్కొంటోంది. పలుచని మంచు పొగలా చుట్టుకుంటోంది.లేచాను. రోజూ లేచే ఉదయపు నడకల సమయమే. అడుగు ముందుకేశాను. ఒకరకమైన తూలింపు. పట్టించుకోలేదు. లుంగీ మడిచి బాత్రూమ్కు వెళ్ళాను. అపుడు చూశాను, మోకాలు కొద్దిగా వాచినట్లుంది. నొప్పి లేదు. ఎత్తుగా ఉబ్బిన చోట చేతితో నొక్కాను. మెత్తగా నునుపుదేరి ఉంది, రబ్బరు బంతిలా. ఏమైందీ? ఎక్కడైనా తగిలిందా? ఏదైనా కుట్టిందా? గిల్లి మాత్రం చూడలేదు. నడక దుస్తుల్లోకి మారాను. నడుస్తుంటే ఇబ్బందేమీ లేదు. సలుపు కూడా లేదు. ఆటల మైదానంలో పదిసార్లు వలయంగా తిరిగాను. రెండు కిలోమీటర్లు తిరిగినట్టు లెక్క. ‘అలా నడుస్తున్నారేంటీ? కాలు ఈడుస్తున్నట్టు..’ ఇంటికొస్తుంటే సుబ్బారాయుడు పలకరించాడు.‘ఏమీ.. లేదే..’ అన్నాను జాగ్రత్తగా అడుగులేస్తూ. ప్రతిక్షణం నడక దగ్గర్నుంచి మాట దగ్గర్నుంచి అందరికీ కావాలి. రోజువారీకి భిన్నంగా ఎవరూ ఉండకూడదు. ఉంటే ఒకటే ప్రశ్నలు.. ఎందుకు, ఏమిటి, ఎలా.. ఆరా! అరే.. ఎదురైన చాలామంది నడకల్లో ఏదో తేడా స్పష్టంగా కనబడుతోంది. కుంటి నడక కాదు గానీ నేలకు పాదం ఈడుస్తూ.. ఎవర్నీ అడగలేదు. తీరా ఇంట్లోకి చేరగానే ఉమ ఎదురొచ్చింది. ఆమె నడక తీరూ అలాగే ఉంది. ఉన్నట్టుండి నన్ను ఆట పట్టించడానికన్నట్టు గాలిలోకి ఎగిరింది. పైగా నవ్వుతోంది. ఆశ్చర్యంగా చూశాను. ‘ఏమీ లేదండి. నొప్పేం లేదు. అయితే నేలకు తాకించి నడుస్తుంటే బావుంది’ ఇంకేం ప్రశ్నలు వేయలేదు. మొత్తమ్మీద లోకమంతా తెలియని రాగమేదో ఆలపిస్తోంది. ఒకరి నుంచి మరొకరికి అంటుకునేదా? కాదేమో. స్నానానికి వెళ్ళినపుడు తేరిపారి పరిశీలనగా చూశాను. మోకాలు చిప్ప ఉబ్బి నల్లగా తాటికాయలా ఒకవిధమైన గరుకుగా మారింది. రెండో కాలు మామూలుగానే ఉంది. కూరగాయలు కొనడానికి మార్కెట్టుకెళ్ళాను. అందరూ తెలిసినవారే. కొంచెం పట్టుబట్టి జాగ్రత్తగా అడుగులేస్తూ తిరుగుతున్నాను. చాలామంది ముఖాలు నీరసంగా కనిపిస్తున్నాయి. ఏదో పోగొట్టుకుని దాచినా దాగని సత్యాన్ని మోస్తున్నట్టుగా భారంగా అడుగులేస్తున్నారు. లోకం వింతగా కనిపిస్తోంది.రెండురోజుల క్రితం రామంగాడి గృహప్రవేశం సందర్భంగా సత్యనారాయణ ప్రతం చేయించిన పురోహితుడు కనిపించాడు. ఆయన పంచె ఎగదోసి మోకాలు చిప్ప కనిపించేలా ఎత్తి ఎత్తి అడుగులేస్తూ నడిచి వస్తున్నాడు. అసింటా అన్నట్టు దూరంగా జరుగుతూ అడుగులేస్తున్నాడు. ఆయనకు కూడా అదే చోటులో నల్లగా చర్మం చిట్లినట్లుగా ఉంది. మొన్నటి దృశ్యం కళ్ళ ముందు కనిపించింది. వ్రతం అయిపోయింది. ఇక కథ చెప్పాలి. చెప్పడం మొదలెట్టగానే అది ఎప్పుడూ చెప్పే పాతకథ అని తెలిసిపోయింది. ఆగమని సైగ చేశాను.‘అయ్యా.. పురోహితులు గారూ.. మన్నించండి. ఎపుడూ అదే కథా? మీరు కథలో చెబుతున్న సముద్ర వ్యాపారాలు గట్రా ఇపుడు లేవు కదా. వ్రతం చేయకపోతే వచ్చే నష్టం మా రామం గాడికి వర్తించదు. వాడిది రియలెస్టేటు బిజినెస్. దానికి సంబంధించిన కథ అల్లి చెబితే సబబుగా అర్థవంతంగా ఉంటుంది. వాడు జాగ్రత్తలేవో పడతాడు. అలాగే సాఫ్టువేర్ ఇంజనీరు.. గవర్నమెంటు ఉద్యోగం.. సారా వ్యాపారం.. ఎగుమతులు దిగుమతులు, వాణిజ్యం.. వగైరాల కథలు రెడీమేడ్‌గా తయారుచేసుకుని ఉంచుకుని చెప్పొచ్చు కదా! ఎపుడూ పాత పురాణమేనా.. ఎవరు మెచ్చుకుంటారు?’ అన్నాను సూటిగా చూస్తూ.పురోహితుడు ఒక్కక్షణం మాట్లాడలేదు. ఎదుట వ్యక్తి చెప్పేవి కొందరికి సహించవు. అహం దెబ్బతింటుంది కాబోలు. రామాన్నీ నన్నూ చూస్తూ ఉండిపోయాడు. ఆలోచిస్తున్నట్టుగా ఆగాడు. కాసేపటికి తేరుకున్నాడు. ఆ తర్వాత తనకు సహజసిద్ధమైన లౌక్యం ప్రదర్శించాడు.‘నిజమే సుమండీ.. మహ బాగా చెప్పారు. మీరన్నట్టుగా మహ బేషుగ్గా ఉంటుంది. మీరు చెప్పింది చక్కగా ఉంది. కానీ కథలెక్కడ్నుంచి వస్తాయండీ’ అంటూ దీర్ఘం తీస్తూ అన్నాడు. ఇందాక మొదలెట్టిన కథను తిరిగి చెప్పడం ప్రారంభించాడు. అంతేకాదు వెళుతూ వెళుతూ నా ముఖం కేసి చూసి నాలో ఏ దైన్యం సూచిక కనిపించిందో ఏమో ఒక ఉచిత సలహా విసిరాడు.‘ఏడు ఏలకులను పసువు గుడ్డలో చుట్టి దిండు కింద పెట్టుకుని పడుకోండి. మీ అప్పులన్నీ తీరిపోతాయి. మీరూ బ్రహ్మాండమైన ఇంతకుమించిన గృహం కట్టుకుంటారు’ అన్నాడు. ఆయన వృత్తికి నేనేమైనా ఆటంకం కలిగించానా? ఏమో మరి. ఇది జరిగి మూడురోజులైంది. ఇంతలో ఇట్లాంటి మోకాలుతో కనిపించాడు. తిరిగొస్తుంటే కామేశ్వరరావు కనిపించాడు. వాళ్ళ అమ్మాయికి ఇంకా పెళ్ళి ఘడియలు రాలేదనుకుంటాడు. వయసొచ్చిన ఆడపిల్ల ఇంట్లో ఉంది. భారం దేవుడి మీద వేసేశాడు. అసలు జరిగిందేమిటంటే కళ్యాణ యోగం గురించి ఒక జ్యోతిష్యుడ్ని సంప్రదించాడు. అతగాడేమో ‘రెండు సంవత్సరాలు ఆగాలి. ఈలోపు ఎంత ప్రయత్నించినా మీ అమ్మాయికి పెండ్లి చేయలేవు’ అని చెప్పాడట.అంతే ఇక మౌనంగా ఉండిపోయాడు. సరిగ్గా అదే సమయంలో మంచి సంబంధాలు కోరి వచ్చినా ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోయాడు. ఆ తర్వాత కుజదోషమనీ వరనిరూపణ కుదరలేదనీ.. అదనీ ఇదనీ జాతకాల పిచ్చిలోపడి కాలయాపన చేసేశాడు. పోనీ ఆ జ్యోతిష్యుడు చెప్పిన ఆ రెండేళ్ళు ఊరుకుని తర్వాత కాలంలో గట్టి ప్రయత్నం చేస్తే ఈపాటికి కూతురుకు పెళ్ళి జరిగిపోయేదేమో. కార్యసాధనకు ప్రయత్నం తోడుగా ఉండాలి. గీచి గీచి జాతకాలు పట్టించుకుని చెడగొట్టుకుంటున్నాడు. పలకరించాను. చేతితో మోకాలు దగ్గర తడుముకున్నాడు. ఎత్తుగా గాలి బుడగలా కనిపిస్తోంది. అతని పరిస్థితి అర్థమైపోయింది.ఇంటికెదురుగా శంకరయ్య ఉన్నాడు. భార్య పేరు భారతమ్మ. బయటికెళితే చాలు ప్రతిరోజూ పెళ్ళాం ఎదురు రావాలి. వీధిలోంచి గట్టిగా రమ్మని అరుస్తాడు. ఇంటి లోపల ఎక్కడున్నా ముసిముసి నవ్వులు నవ్వుతూ చీర చెంగుతో ముఖం తుడుచుకుంటూ వచ్చేస్తుంది భారతమ్మ. ఎదురురావడాన్ని మొగుడు ప్రసాదిస్తున్న అరుదైన గౌరవంగా భావిస్తుంది. ఆ అవకాశం ఇచ్చి అర్ధాంగి దగ్గర మంచి మార్కులు కొట్టి బంధం గట్టిగా ముడిపెట్టే చిట్కాను శంకరయ్య పాటిస్తున్నాడేమో. ఆవేళ చూద్దును కదా శంకరం కుంటుకుంటూ నడుస్తున్నాడు. ఓహో .. అనుకున్నాను.జబ్బకూ మెడలోనూ తాయెత్తులు కట్టుకునే వీరయ్య, మెడనిండా ఏవో పసుపు, ఎరుపు రంగుల తాళ్ళూ, ఒంటి మీద కాషాయం దుస్తులూ ముఖం నిండా ఎర్రటి పెద్ద బొట్టూ నుదుటన విభూది పూసుకునే నారాయణ, రాహు కాలం, వర్జ్యం, ముహూర్తం చూసుకుంటే గానీ ఇల్లు కదలని వీరబాబు, ప్రతిరోజూ టెంకాయ కొట్టి దేవుని దర్శనం చేసుకునే సూరిబాబు, నలుపు ఎరుపు దుస్తుల్లో కనిపిస్తున్న సీజనల్ భక్తులు, నిత్యం నదీ స్నానం చేసే వీరభద్రాచార్యులు, దూరపు బంధువెవరో చనిపోతే నిష్ఠగా ఎండుగడ్డితో తలగడ చేసుకుని నేల మీద పడుకుంటూ మైల పడుతున్న రామచంద్రం.. వీళ్ళందరూ అదేరోజు తారసపడ్డారు. అందరూ మోకాలు వాచినవాళ్ళే.ఈవేళే ఎందుకు అకస్మాత్తుగా పాదాలు ఎగేస్తూ కనిపిస్తున్నారు? అసలు నేనెందుకు ఇదే బాధ అనుభవిస్తున్నాను? మనిషి నాగరీకం అయ్యే కొలదీ కొత్త కొత్త బలహీనతల్ని ఎందుకు మోస్తున్నాడు? తాతగారి నాన్నగారి బామ్మగారి భావాలతో కునారిల్లి సొంత ఆలోచనల్ని చంపుకుని బతకడం సరైనదేనా? ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే ఏ పని అయినా విజయం సాధిస్తుందనీ మూఢనమ్మకాలతో కాలాన్ని వృథా చేసుకోవడం తగదనీ ఎంతమందికి చెప్పగలం? ఉపాధ్యాయుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నాకు తత్వం బోధపడింది. నడవడికలో అమలు చేయాలి.ఉదయం తొమ్మిది గంటలు. బైకు తీసుకుని రోడ్డు మీదకు రాగానే తెల్లని బట్టలతో అచ్చమ్మ ఎదురు పడింది. నన్ను చూసింది. అశుభం అని తలచి వెనక్కి తిరిగి నిలబడింది. తన వల్ల ఎవరికీ మనసులో కూడా ఏ బాధా ఇబ్బంది కలగకూడదనే తలంపుతో చేసిన పని అది. ఆవిడెందుకలా చేసిందో తెలుసు. నేను ఊరుకుంటానా? నేనూ ఆగాను. వారగా తల తిప్పి చూసింది. ఆమె వంకే చూస్తున్నాను. ‘నాకు చాలా ముఖ్యమైన పని ఉంది. మీరు ఎదురొస్తేనే ముందుకు వెళతాను. లేకపోతే ఇక్కడ్నుంచి కదలను’ అన్నాను. ఆమె కళ్ళు మెరిశాయి. ముఖంలో కాంతులు. గబగబా నా దగ్గరకొచ్చి నిలబడింది.‘నా బాబే.. నా నాయనే.. నా ఆయుస్సు కూడా పోసుకుని నిండు నూరేళ్ళూ సుఖసంతోషాలతో బతుకు తండ్రీ..’ అని తటాలున తన తలలోంచి తెల్ల వెంట్రుకను పీకి నా తలలో వేసి తెల్లని స్వచ్ఛమైన నవ్వుతో అనేక రకాలుగా దీవించింది. మనస్ఫూర్తిగా ఎదురొచ్చి ‘అంతా శుభమే జరుగుతుంది’ అంది. వెనక్కి చూడకుండా వెళ్ళిపోయింది. ఎన్నాళ్ళ నుండో గుట్టగా దాచిన శుభాశీస్సుల బలం.. నాకొక్కడికే చెందుతుందనుకోడం ఎందుకు? దీవెనలు, ఆశీస్సులను ఒక సానుకూల దృక్పథ సంకేతంగానే చూడాలి. పాఠశాల చేరాను. మనసు ఎంతో ఎపుడూ లేనంత ఉల్లాసంగా ఉంది. రోజంతా నెగటివ్ భావనలు రానీయకుండా మసలుకున్నాను. నా వైపు నుండి కాకుండా ప్రతి వ్యక్తినీ అతని దృష్టి కోణంలోంచి పరిశీలిస్తున్నాను. నాలోని మార్పుకు నాకే ఆనందం అనిపించింది. హాయిగా ఉంది.మోకాలు వాపు విచిత్రంగా కొద్దిగా తగ్గింది. ఫలితం అపుడే కనిపించిందా? మనిషి నడవడికను బట్టే రోగాలొస్తాయి. ప్రవర్తనలు ఆలోచనలు దేహానికీ మససుకూ చెందినవేనా? ఖాళీ పీరియడ్‌లో మళ్ళీ ఆలోచనలు చుట్టుముట్టాయి. ఇంతకీ నాకెందుకు మోకాలు వాచింది? తటాలున బుర్రలో ఒక వెలుగు.. మిత్రుడి బలవంతం మీద శంకుస్థాపన జరిగినరోజున కొబ్బరికాయ కొట్టడం గుర్తుకొచ్చింది. అంతేనా? ఇంకా ఏమైనా ఉందా? ఆలోచనలు సాగుతున్నాయి. ఇప్పటికిప్పుడు ఏమీ గుర్తుకు రావడంలేదు.ఏదో అపసవ్యంగా ఉండే ఒక చెడు నమ్మకాన్ని మనసులో దూర్చే ఉంటాను. లేకపోతే ఎంతో కొంత శాస్త్రీయంగా ఆలోచించే నాకీ తిప్పలు ఎందుకొచ్చాయి? స్కూలు అయ్యింతర్వాత అట్నుంచి అటే జిల్లా పరిషత్‌కు వెళ్ళాల్సి వచ్చింది. కార్యాలయం హడావుడిగా ఉంది. క్యాంటీను నిండుగా ఉంది. ఉద్యోగుల్లో చాలామంది ఒక కాలు కుంటుకుంటూనో ఈడ్చుకుంటూనో మోకాలు నిమురుకుంటూనో నడుస్తున్నవారే. ఇంటికి చేరేటప్పటికి రాత్రి ఎనిమిది అయ్యింది. వాకిట్లోనే చిన్నాన్న ఎదురయ్యాడు. ఆందోళనగా ఉన్నాడు. నలిగిన ముఖం. నుదుటన చెరిగిన ఎర్రని నిలువు బొట్టు. చెదిరిన జుట్టు. కొద్దిగా కుంటుతూ దగ్గుతూ దగ్గరకొచ్చాడు.‘నీ కోసమే ఎదురు చూస్తున్నాను. నీవేం కంగారుపడకు. పద.. పద.. లోపలికి..’చిన్నాన్న ఎప్పుడూ అంతే. ఏదీ సరిగ్గా చెప్పడు. విషయం కొస అందిస్తాడు. సాగదీసి గానీ అసలు సంగతి చెప్పడు. మా ఇద్దరిదీ ఒకే ఇల్లు. అన్నదమ్ముల పంపకం. ఇంట్లో వెనుక వైపు వాటాలో ఉంటాడు. భక్తిపరుడు. సకల సెంటిమెంట్లనూ గౌరవిస్తాడు. పాటిస్తాడు. రోజూ పంచాంగం చూస్తాడు. అడిగినవాళ్ళకు అడగనివాళ్ళకు మంచిచెడ్డలు చెప్పడమే పనిగా పెట్టుకుంటాడు. ఎవరింటికైనా వెళితే దిక్కుల్ని చూసి వాస్తు గురించి ఉచిత సలహాలిస్తాడు.‘ఏమైంది?’ గాభరాగా లోపలికెళ్ళాను. గుండెల మీద చేతులేసుకుని సీలింగు చూస్తున్నాడు నాన్న. నన్ను చూసి తల పక్కకు తిప్పి నీరసంగా నవ్వాడు. నోరు విప్పి నెమ్మదిగా గుసగుసగా మాట్లాడుతున్నాడు. మాట స్పష్టంగా లేదు. దగ్గరగా ముఖం పెట్టి వినడానికి ప్రయత్నం చేశాను. ఏదో చెప్పాలనుకుంటున్నాడు. చెప్పలేకపోతున్నాడు. కాసేపటికి చూపు నిలబడిపోయింది. చిన్నాన్నకు అర్థమైంది. ‘ఒరేయ్.. రండి.. వాకిట్లో పడుకో పెడదాం..’ చిన్నాన్న ఉద్దేశం తెలిసింది. ఆయనకేసి కోపంగా చూశాను. చేయి అడ్డంగా పెట్టి వారించాను. ‘మీరాగండి, చిన్నాన్నా.. ఇక్కడ్నుంచి ఆయన్ని కదల్చడానికి వీల్లేదు. ఏమొచ్చింది మీకు? ఇప్పటి దాకా బాగానే ఉన్న వ్యక్తి.. ఇంతట్లోనే ఇంటికి చెడ్డ అయిపోయాడా?’ అన్నాను.‘ఏమంటున్నావు? నీకేమైనా తెలుస్తుందా? ఇంట్లో పోతే ఇల్లు పాడు పెట్టాల్సి వస్తుంది. నా మాట విను..’ బాబాయి హోదా, వయసు తెచ్చిన అధికారంతో నన్ను గదమాయించాడు. ఆయనను దూరంగా గది మూలకు తీసుకెళ్ళి చెప్పడం మొదలెట్టాను. ‘ఆయన ఇన్నాళ్ళూ ఉన్న ఇల్లు ఇది. ఈ ఇంట్లో ఈ గదిలో ఆఖరి ఊపిరి తీసుకునే హక్కు ఆయనకు ఉంది. ఎక్కడికెళ్ళినా ఎంత రాత్రయినా చేరుకునే చోటు ఇది. నా ఊరూ నా ఇల్లూ అంటూ నిత్యం పలవరించేవాడు. మరోచోట నిద్ర పట్టదనేవాడు. మీరెన్నైనా చెప్పండి.. ఇక్కడ్నుంచి కదపడానికి ఒప్పుకోను. పొద్దుట దాక ఇక్కడే ఉంటారు’ స్థిర స్వరంతో చెప్పాను.‘ఈ సమస్య నీ ఒక్కడిదే కాదు. మాది కూడా. ఇదే ఇంట్లో నేనూ కాపురం ఉంటున్నానని గుర్తు పెట్టుకో. మంచి ఘడియలు కావు ఇవి. ఆరుమాసాలో సంవత్సరమో ఇల్లు మైల పడితే ఎక్కడికెళ్ళాలి? ఇంటి పెద్దగా చెబుతున్నాను. చెప్పింది చేయి’ అంటూ వంగి మోకాలు చిప్ప దగ్గర పాముకుంటూ నొక్కుకుంటూ అన్నాడు చిన్నాన్న.నేను రాజీ పడలేదు. పట్టుదలను వీడలేదు. ‘రోజులకు పేర్లు, తిథులు మనం కల్పించుకున్నవే. ఇందులో మంచి చెడ్డలంటూ ఉండవు. అన్ని రోజులూ ఒకలాంటివే. ఆయన ఇంట్లో ఆయన బతకడానికి ఎంత హక్కు ఉందో చావడానికీ అంతే హక్కు ఉంది. ఆ హక్కును కాపాడటానికి కొడుకుగా ఎంతకైనా తెగిస్తాను’ చివర మాట గట్టిగా అన్నాను. ఈ మాటలు పలికానో లేదో మోకాలు చిప్ప వాపు పూర్తిగా తగ్గిపోయింది. ఆయన మాటను విననని అర్థమైపోయింది. నసుక్కుంటూ వెళ్ళిపోయాడు.‘పెద్దాళ్ళు సరే కుర్రాళ్ళు పుట్టుకతో వృద్ధులైపోతున్నారు. మనుషులు చేసిన దేవుళ్ళారా.. మీరెక్కడ? మిమ్మల్ని పోగుచేసి వ్యాపారం చేసే వాళ్ళనీ అసలు మూఢవిశ్వాసాల్ని ఎగదోసేవాళ్ళనీ వినియోగదారుల చట్ట పరిధిలోకి తీసుకు రావాలి. భవిష్యత్తు చెప్పేవాళ్ళకు చెప్పింది జరగనపుడు కఠినశిక్ష విధించి తీరాలి. కనీసం వందేళ్ళ తర్వాత కాలం వీటన్నింటినీ మాన్పుతుందనే నమ్మకం నాది’ అనుకుంటూ సన్నగా లోలోపల మూలిగాను. మామూలు స్థితికి వచ్చిన మోకాలును ప్రేమగా నిమిరాను. ఇంతట్లో మెలకువ తట్టి లేపింది. – దాట్ల దేవదానం రాజుఈ కథను వినడానికి ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయండి. ఇకపై ప్రతివారం ‘ఈవారం కథ’కు క్యూఆర్ కోడ్ ఇక్కడ ఉంటుంది.ఇవి చదవండి: సింగరేణి తంగలాన్..! -
Acharya Aatreya: అక్షర లక్షలు... ఆ గీతాలు!
‘ఆత్రేయ సాహితి’ సంపాదకులు డా‘‘ జగ్గయ్య – ‘సినిమా పాటకు సాహిత్య మందిరంలో పట్టాభిషేకం చేయించిన అపర శ్రీనాథుడు. మనిషికీ, మనసుకీ కొత్త భాష్యాలు పలికిన అక్షర యోగి...’ అంటూ ఆత్రేయను ప్రశంసించారు.‘కొమ్మ కొమ్మకో సన్నాయి’ అనే స్వీయ వ్యాస సంపుటిలో వేటూరి ‘శబ్దాడంబరం లేకుండా నిర్మల గంగా ప్రవాహం లాగ చిరు చిరు అలలతో అగాథాల్ని దాస్తూ... ప్రకటిస్తూ సాగిన సాహితీగంగ ఆత్రేయది’ అని మెచ్చుకున్నారు. వెన్నెలకంటి ఆత్రేయను ‘సినీ వేమన’ అన్నారు. శ్రీశ్రీ తెలుగు కవిత్రయంగా తిక్కన, వేమన, గురజాడలను పేర్కొంటే వారి సరసన సినీరంగం నుంచి ఆత్రేయను చేర్చారు వెన్నెలకంటి! ఆత్రేయ మాటలు పాటలు లాగా, పాటలు మాటలు లాగా వుంటాయనీ, ఆత్రేయ పత్రికల్లో వార్తలా వచనం రాసినా, అది మామ మహదేవన్ స్వరకల్పనలో పాటగా ఒదిగేదనీ నిర్మాత మురారి అంటుండేవారు. అటువంటి ఆత్రేయ పాటల్లో పంక్తులు కొన్ని తెలుగునాట నానుడులుగా, నిత్య సత్యాలుగా, హితోక్తులుగా స్థిర పడిపోయాయి కూడా! అలాంటి ఆణిముత్యాలను కొన్నిటిని ఏరుకుందాం.ఆత్రేయకు జనం పెట్టిన పేరు మన‘సు’ కవి. అది జనం మనసుల్లో ఆయనకు పడిన ముద్ర తప్ప, ఏ సన్మాన సభలోనో, సాహితీ సంస్థో, ప్రభుత్వమో ప్రదానం చేసిన బిరుదు కాదు. ఆత్రేయ మనసు పాటల్లో తరళరత్నం ‘ప్రేమనగర్’ చిత్రంలోని ‘మనసు గతి యింతే/ మనిషి బ్రతుకింతే/ మనసున్న మనిషికి/ సుఖము లేదంతే...’ అనే పంక్తులు. అవి విని మురిసిపోయిన దర్శకుడు కె.ఎస్. ప్రకాశరావు ఆత్రేయను మెచ్చుకుంటూనే చిన్న సందేహం వచ్చి ‘చివర్లో ‘అదంతే’ ఎందుకు?’ అని అడిగారట. ‘అదంతే’ అని చిరునవ్వుతో బదులిచ్చారట... మాటల్ని ఆచితూచి ప్రయోగించే అక్షరయోగి ఆత్రేయ.‘ప్రేమలు–పెళ్లిళ్లు’ చిత్రంలోని – ‘మనసులేని దేవుడు మనిషి కెందుకో మనసిచ్చాడు/ మనసు మనసును వంచన చేస్తే/ కనుల కెందుకో నీరిచ్చాడు’ అనే పంక్తులు కూడా నిత్యజీవితంలో అంద రికీ గుర్తొచ్చే గొప్ప అభివ్యక్తులు. పద క్రీడలతో సార్వకాలిక సత్యాలను వెల్లడించిన ఆత్రేయ ‘ఉండడం’, ‘లేకపోవడం’ అనే రెండు పదాలను తీసుకొని అమ్మ గొప్పతనం గురించి ఎంతక్లుప్తంగా, ఆప్తంగా చెప్పారో చూడండి – ‘అమ్మ ఉంటే లేనిదేమీ లేదు/ అమ్మ లేక ఏమున్నా ఉన్నది కాదు’ (కలసిన మనసులు)! ప్రేమ గురించి ‘అది’, ‘ఇది’ అంటూ ఆత్రేయ అంత గోప్యంగా చెప్పిన కవులు అరుదు. ‘నువ్వంటే నాకెందుకో ఇంత యిది, ఇంత యిది’ (అంతస్తులు); ‘ఇదే నన్నమాట – ఇది అదే నన్నమాట/ మది మదిలో లేకుంది – మనసేదో లాగుంది/ అంటే ఇదేనన్నమాట – ఇది అదేనన్న మాట’ (కొడుకు–కోడలు).మరో రెండు వాక్చిత్రాలను కూడా పేర్కొనాలి. అందులో మొదటిది అందరికీ తెలిసిన ‘మూగ మనసులు’ చిత్రంలో నూతన వధూవరులు, పెద్దల సమక్షంలో కథానాయకుడు గోపి పాడిన ‘ముద్ద బంతి పూవులో...’ పాటలోని – ‘నవ్వినా ఏడ్చినా... కన్నీళ్లే వస్తాయి.’ ఇది పది వాక్యాల పెట్టు అని డాక్టర్ సి.నా.రె. వ్యాఖ్యానించిన తర్వాత ఇంకే వివరణ కావాలి? ఇలా అక్షర లక్షల విలువైన జీవిత సత్యాలను గమనిస్తే ఆత్రేయ... వేమనలా కవి మాత్రమే కాదు– ఒక యోగి కూడా అనిపిస్తారు. – డా‘‘ పైడిపాల, సినీ గేయ సాహిత్య పరిశోధకులు, 99891 06162ఇవి చదవండి: కాసేపట్లో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై స్పీకర్‌కు ఫిర్యాదు -
నైపుణ్యమే సంపద
‘జీవితంలోని ప్రతి దశలోనూ గైడ్ చేస్తూ నా ఎదుగుదలకు దోహదపడిన వారు ఎంతో మంది ఉన్నారు. వారందరూ నాకు గురువులే..’ అంటూ పరిచయం చేసుకున్నారు వనమల స్వప్న. హైదరాబాద్ లోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్’ లో అసోసియేట్ ఫ్యాకల్టీగా ఉన్న వనమల స్వప్నకు ఇటీవల నేషనల్ ఎంట్రప్రెన్యూర్ అవార్డు వచ్చింది. గురువారం రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న సందర్భంగా సాక్షి ‘ఫ్యామిలీ’తో తన విజయానందాన్ని పంచుకున్నారు. ‘‘సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం శిక్షణా తరగతులను నిర్వహించడంలో 18 ఏళ్ల అనుభవం ఉంది. 12 ఏళ్లుగా మేనేజ్మెంట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎమ్ఎస్ఎమ్ఇ’లో వర్క్ చేస్తున్నాను. స్పెషలైజేషన్ ఇంక్చువ ప్రాపర్టీ రైట్స్ ఇన్ఛార్జిగానూ వర్క్ చేస్తున్నాను.వారధిగా.. సాయంబిజినెస్ చేయాలని, రాణించాలనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది. కానీ, సరైన నైపుణ్యాలు ఉండవు. అలాగే, ప్రభుత్వం నుంచి వచ్చే స్కీమ్స్ గురించి కూడా తెలియవు. స్కిల్స్‌తో పాటు వ్యాపార అవకాశాలు, లోన్లు, ప్రభుత్వ పథకాలను ఎలా ఉపయోగించుకోవాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి.. అనే విషయాల్లో సాయం చేస్తాం. మా అకాడమీ నుంచి వివిధ రకాల స్కీమ్స్ ఉన్నాయి. వాటిలో ఇప్పుడు నాలుగు స్కీమ్స్‌తో నిరుద్యోగ యువత, మహిళలకు ఎంట్రప్రెన్యూర్షిప్ స్కిల్స్ డెవలప్మెంట్ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. నాలుగేళ్ల నుంచి మల్టీమీడియా, ఫ్యాషన్, బ్యూటీ.. వంటి రంగాలలో దాదాపు 4000 మంది యువతకు శిక్షణ ఇచ్చాం. స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్, ప్రైవేట్, పబ్లిక్ సెక్టార్స్‌లోని వాళ్లకూ స్కిల్ ట్రెయినింగ్స్ ఇస్తున్నాం. మంచి రేటింగ్ త్రీ స్టార్స్ రేటింగ్ రావడంతో ఎమ్ఎస్ఎన్మి ఇన్నోవేటివ్ స్కీమ్ కింద సివిల్ సర్వెంట్స్‌కు శిక్షణ ఇవ్వడానికి మా ఇన్స్టిట్యూట్కు అప్రూవల్ వచ్చింది. వివిధ రంగాలలో నిపుణులైన వారు కూడా శిక్షణ తరగతులకు హాజరవుతుంటారు. తాము సృష్టించిన ఉత్పత్తులను ప్రదర్శించడానికి వేదికలను కూడా ఏర్పాటు చేస్తుంటాం. ఇటీవల శిక్షణ తీసుకుంటున్న వారిలో మహిళల శాతం ఎక్కువగా ఉంటోంది. దీంతో 55 స్కిల్ప్రోగ్రామ్స్ మహిళలకే పరిచయం చేస్తున్నాం. జిల్లా, గ్రామీణ స్థాయి మహిళలకు కూడా 60 స్కిల్స్ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాం. ప్రతి రోజూ సవాళ్లే దేశవ్యాప్తంగాప్రోగ్రామ్స్, శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడానికి ఆయా ్రపాంతాలకు వెళ్లినప్పుడు కాలేజీలు, యూనివర్శిటీల సాయం తీసుకుంటాం. అక్కడ చాలా వరకు శిక్షణకు కావల్సిన సరంజామా ఉండదు. దీంతో ప్రతీదీ సవాల్‌గానే ఉంటుంది. ముఖ్యంగా టెక్నాలజీకి సంబంధించిన శిక్షణ ఇచ్చేటప్పుడు సమస్యలు ఎదురవుతుంటాయి. దీంతో ఏ లోపం లేకుండా ముందస్తుగానే ΄్లాన్ చేసుకుంటాం. ఇటీవల సైబర్‌సెక్యూరిటీకి సంబంధించి కాకినాడ ప్రభుత్వ కాలేజీలో, డిజిటల్ మార్కెట్‌కు సంబంధించి తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం వారితో కలిసి వర్క్ చేశాం. ఫ్యాషన్ రంగానికి సంబంధించి ఇండోర్ ఫ్యాషన్ ఇన్సిట్యూట్తో కలిసి వర్క్ చేశాం. 2023–24 సంవత్సరానికి గాను 200కు పైగా ప్రోగ్రామ్స్ చేశాం. ట్రైనింగ్ క్లాసులకు ప్రిపేర్ అవడం,ప్రోగ్రామ్స్‌ని నిర్వహించడం, జనాల్లోకి రీచ్ అయ్యేలా చేయడం ఓ పెద్ద ప్రణాళిక. కుటుంబ మద్దతునేను పుట్టింది తెలంగాణలోని సిద్దిపేట. మా నాన్నగారి ఉద్యోగరీత్యా రామగుండంలో చదువుకున్నాను. ఉస్మానియా యూనివర్శిటీలో ఇంజనీరింగ్ చేశాను. మా వారు సాఫ్ట్వేర్ ఇంజనీర్, మాకు ఇద్దరు పిల్లలు. మహిళగా నా వర్క్‌లో రాణించాలంటే కుటుంబం స΄ోర్ట్ ఉండాలి. మా పేరెంట్స్ ఉన్న అపార్ట్మెంట్లోనే నేనూ ఇల్లు తీసుకోవడంతో పిల్లలకు సంబంధించి ఒత్తిడి తక్కువగా ఉంటుంది. హైదరాబాద్‌లోని అడిక్‌మెట్ నుంచి రోజూ నా ప్రయాణం ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కో దశలో నన్ను గైడ్ చేయడానికి వచ్చారు. వారంతా నాకు గురువులే’ అంటూ తెలిపారు స్వప్న. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
Vinayaka Chavithi 2024: సకలకార్యాల సిద్ధికై.. తొలిపూజ మహాగణపతికే!
గణపతి సకల దేవతాగణానికి అధిపతి! సకల విఘ్నాలకూ అధినాయకుడు! సకల కార్యాలనూ నెరవేర్చగల వరసిద్ధి ప్రదాత! తలచిన కార్యక్రమం నిర్విఘ్నంగా సాగాలంటే ఆ విఘ్ననాయకుని అనుగ్రహం తప్పనిసరిగా కావలసిందే! గణేశ్వరుని నామస్మరణతో సకల దేవతలూ సుప్రసన్నులౌతారనీ, తలపెట్టిన కార్యక్రమం దైవారాధనైనా, పూజాది కార్యక్రమాలైనా, శుభకార్యాలైనా ఏదైనాసరే ఎటువంటి అవాంతరాలూ లేకుండా సుఖవంతం అవుతుందనీ విశ్వాసం! అందుకే ప్రతి పూజాధి శుభకార్యాల ఆరంభంలో గణపతిని ప్రథమంగా పూజిస్తుంటాం.అమ్మ చేతిలో పసుపు ముద్దగా అవతరించి ‘పసుపు గణపతి’గా మనందరి తొలి పూజలందుకుంటున్న గణపతి స్వామి విఘ్న నివారకుడు మాత్రమే కాదు.. విద్యాప్రదాత కూడా! అందుకే కోరిన విద్యలకెల్ల ఒజ్జయైయుండెడి పార్వతీ తనయ, ఓయి! గణాధిప నీకు మ్రొక్కెదన్ అంటూ మనం గణపతిని ప్రార్థిస్తుంటాము.పండుగ వస్తుందంటే పిల్లలకు ఎంతో సంబరం. వినాయకుడు అనే పేరు విన్నా, పలికినా ఏదో తెలియని శక్తి మనల్ని ఆవహించి ఆనందం కలుగుతుంది. గణపతి తన గోడు వింటాడు, తను తలచిన ఏ కార్యక్రమమైనా కూడా ఎటువంటి ఆటంకం కలుగనీయడు అని ప్రతి భక్తుడి విశ్వాసం. భక్తుల భావాల్లో ఇంతగా సుప్రతిష్ఠితమైన గణపతిని ఆరాధించటంలో అనంతమైన భావాలు నిక్షిప్తమై ఉన్నాయి. వినాయకచవితి పర్వదినాన సకల విఘ్నాలకు అధిపతియైన ఆ విఘ్నేశ్వరున్ని భక్తితో కొలిస్తే చాలు విఘ్నాలన్నిటినీ తొలగించి స్వామి కోరిన వరాలిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే సంవత్సరం పొడవునా ఎలాంటి ఆటంకాలు, కష్టనష్టాలు కలుగకుండా విజయవంతం కావాలని, సకల విఘ్నాలకు అధిపతిగా విఘ్నేశ్వరాధిపత్యం స్వీకరించిన రోజైన భాద్రపద శుద్ధ చవితిరోజు మనం ప్రతి సంవత్సరమూ కుటుంబ సమేతంగా విఘ్నేశ్వరున్ని కొలుస్తుంటాం.మన సర్వశుభకార్యాలకు, సుఖసంతోషాలకు, ఆనందాభ్యుదయాలకు క్షేమ స్థైర్య విజయ అభయ, ఆయురారోగ్యాలకు, సకల కళలకు, విజ్ఞానానికి మూల స్వరూపుడైన వినాయకుడు పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఆరాధ్యదైవమే.ఈ వ్రతం పరమార్థం.. సమాజంలో ఐకమత్యాన్ని, దైవభక్తిని, జీవనశైలిని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పెంపొందింపజేయటమే కాక.. భావసమైక్యతకు, సహజజీవన సిద్ధాంతానికి నిదర్శనంగా నిలుస్తుంది. అందుకే ఈ పండుగ ఇంటిగడప దాటి వీధుల్లోకి వచ్చి నేడు పట్టణాలు, గ్రామవీధుల్లో ఆరాధనోత్సవంగా సాగుతూ ఒక గొప్ప సామూహిక జాతీయ పండుగగా విశేష ప్రాచుర్యం పొందుతోంది.మట్టి వినాయకుడ్ని పూజిద్దాం !పర్యావరణాన్ని కాపాడుకుందాం !!మనం మట్టితో చేసే గణపతి విగ్రహం పంచభూతాల సమాహారం. ఆ మట్టి ప్రతిమను పూజించటం ద్వారా పంచభూతాలను, వాటి అధిష్ఠాన దేవతలను పూజిస్తున్నాం. ఇది ఇతర పదార్థాలతో తయారు చేసిన గణపతి మూర్తులను ఆరాధించడం వలన కలగదు. ఏ తత్త్వాలతో ఒక వస్తువు ఏర్పడుతుందో, తన జీవితకాలం పూర్తయిన తర్వాత ఆ తత్త్వాలలోనే ఆ వస్తువు లయం అవుతుంది. ఇది సృష్టిధర్మం. వినాయక విగ్రహాన్ని నీళ్ళలో కలపడం వల్ల, ఆ విగ్రహంలో ఉన్న పంచతత్వాలు క్రమంగా వాటిల్లో లీనమవుతాయి.విఘ్నేశ్వరుని పూజాద్రవ్యములు..(శ్రీ విఘ్నేశ్వరుని పూజకు ముందుగా సమకూర్చుకోవలసినవి)ప్రతి ఏడాది వచ్చే వినాయకచవితి పర్వదిన శుభసందర్భంగా ప్రతి గృహంలోను, సంస్థల్లోనూ ప్రత్యేకంగా పూజాదికార్యక్రమాలు చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ పూజలో ఉపయోగించే పూజాద్రవ్యాలతో పాటుగా, స్వామివారిని పూజించే పత్రిది కూడా ప్రథమస్థానం. అందువల్ల ఈ పూజకు సమకూర్చుకోవలసిన అన్ని రకాల పూజాద్రవ్యాలు, పత్రి తదితరాలన్నీ మీకోసారి జ్ఞప్తికి తీసుకురావాలని ఈ క్రింద ఇస్తున్నాం. ఇవి నూతన గృహస్థులకు మరింత ఉపయోగపడగలవని ఆశిస్తున్నాం.పూజా ద్రవ్యములు:వినాయక ప్రతిమ, పత్రి, పసుపు, కుంకుమ, అగరువత్తులు, హారతి కర్పూరం, గంధం, సాంబ్రాణి, అక్షతలు, బియ్యం, ఆవునేయి లేదా నువ్వుల నూనె, పంచామృతాలు (ఆవుపాలు, పెరుగు, నేయి, తేనె, పంచదార), తమలపాకులు, పోకచెక్కలు, పువ్వులు, పూమాల, పళ్ళు, కొబ్బరి కాయలు, కలశము, నైవేద్య పదార్థములు, సుగంధ ద్రవ్యములు. పూజా వస్తువులు:దీపం కుందులు, వత్తులు, అగ్గిపెట్టె, వస్త్రం, యజ్ఞోపవీతం, పంచపాత్ర, ఉద్ధరిణి, కలశంమీద నూతన వస్త్రం, పూజాస్థలంలో పీఠంపై వేయడానికి తగిన పరిమాణంలో తెల్లని వస్త్రం/తువ్వాలు, పళ్ళెం, పాలవెల్లి, నూలు వస్త్రాలు, మామిడి తోరణాలు, దేవునికి తగిన పీఠము.నైవేద్యం:ఉండ్రాళ్లు, కుడుములు, వడపప్పు, పానకం, అటుకులు, కొబ్బరిముక్కలు, బెల్లం, అరటిపళ్ళు, పిండివంటలు మొదలగునవి రకానికి 21 చొప్పున.పూజాపత్రి: గరిక, మాచి, బలురక్కసి లేక ములకీ, మారేడు, ఉమ్మెత్త, రేగు, ఉత్తరేణి, తులసి, మామిడి, గన్నేరు, విష్ణుక్రాంతం, దానిమ్మ, దేవదారు, మరువం, వావిలాకు, జాజి, దేవకాంచనం, జమ్మి, రావి, తెల్లమద్ది, జిల్లేడు మొదలగునవి తమకు లభ్యమగు పత్రిని సంపాదించి ఆయా మంత్రాలతో స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఒకవేళ పత్రిలో లోపం కలిగినా భక్తిలో మాత్రం లోపం ఉండరాదు. పత్రి సకాలంలో లభ్యంకానిచో పువ్వులు, అక్షింతలతో పూజించి నమస్కరించాలి.పాలవెల్లి పూజ:శ్రీ విఘ్నేశ్వరస్వామి వారి పీఠానికి పైభాగాన పాలవెల్లిని కట్టాలి, పాలవెల్లిని పసుపు కుంకుమలతోను, పూజాపత్రితో తోచినవిధంగా శోభాయమానంగా అలంకరించుకోవచ్చు. దీనినే మనం సాధారణంగా పాలవెల్లి పూజ అంటాము.పూజా మందిరంలో:విఘ్నేశ్వరస్వామి పూజకు ఉపక్రమించే ముందు ఇంటిలో చదువుకునే పిల్లలు ఉన్నట్లయితే స్వామి ప్రతిమతోపాటు సరస్వతీదేవి పటం, వారి పాఠ్యపుస్తకాలు, పెన్ను, పెన్సిల్. అలాగే గృహస్థు(యజమాని) వ్యాపారి అయితే శ్రీలక్ష్మీ అమ్మవారి పటం, వ్యాపార లెక్కల పుస్తకాలు, సంబంధిత వస్తువులు ఇలా ఇతర వృత్తులలో వున్నవారు వారి ప్రధానమైన వస్తువులతోపాటుగా వారి ఇష్టదైవం పటాన్ని పెట్టి పూజించడంæ శుభఫలదాయకం.గణేశుని పూజ..పూజకు ఏర్పాట్లు..ముందుగా పీట మీద ముగ్గువేసి, బియ్యంపోసి, దానిమీద శ్రీ విఘ్నేశ్వరస్వామి వారి ప్రతిమను ఉంచి పైభాగాన పసుపుకుంకుమతో అలంకరించిన పాలవెల్లిని కట్టాలి. పసుపు వినాయకుణ్ణి చేయాలి. పూజ చేసేవాళ్ళు బొట్టు పెట్టుకుని దీపారాధనచేసి వినాయకునికి నమస్కరించి పూజ ప్రారంభించాలి. ముందుగా పసుపుతో చేసిన గణపతిని పూజించాలి.ఓం శ్రీ మహాగణాధిపతయే నమఃదీపారాధన:(ఈ క్రింది శ్లోకాన్ని చదువుతూ దీపాన్ని వెలిగించి, దీపం కుందివద్ద అక్షతలు ఉంచి నమస్కరించాలి.)శ్లో‘‘ భోదీపదేవి రూపస్త్యం, కర్మసాక్షి హ్యామిఘ్నకృత్‘ యావత్పూజాం కరిష్యామి తావత్వం సిద్ధిదో భవ ‘‘ దీపారాధన ముహూర్తస్తు సుముహూర్తోస్తు‘‘పరిశుద్ధి:(పంచపాత్రలోని నీటిని చెంచాతో తీసుకుని కుడిచేతి బొటనవేలు, మధ్య ఉంగరపు వేళ్ళతో నీటిని ఈ క్రింది మంత్రం చెబుతూ తలపై చల్లుకోవాలి)"అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా!యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశ్శుచిఃపుండరీకాక్ష, పుండరీకాక్ష, çపుండరీకాక్షాయ నమః"శ్రీరస్తు.. శుభమస్తు! అవిఘ్నమస్తు!!విఘ్నేశ్వరుని వ్రతకల్పము..శ్రీ గణేశాయ నమః శ్లో‘‘ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘø్నపశాన్తయే ‘‘ అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేక దన్తం భక్తానాం యేకదన్త ముపాస్మహే ‘‘శ్రీ గణేశ షోడశ నామ ప్రతిపాదక శ్లోకాః శ్లో‘‘ సుముఖశ్చైకదన్తశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణో హేరమ్బస్కన్దపూర్వజః షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపిః విద్యారమ్భే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా, సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తన్య నజాయతే ‘‘ఆచమనం:ఓం కేశవాయ స్వాహానారాయణాయ స్వాహామాధవాయ స్వాహా..(అని 3 సార్లు తీర్థం పుచ్చుకోవాలి) తరువాత చేయి కడుక్కోవాలి."గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమఃత్రివిక్రమాయ నమః వామనాయ నమఃశ్రీధరాయ నమః హృషీకేశాయ నమఃపద్మనాభాయ నమః దామోదరాయ నమఃసంకర్షణాయ నమః వాసుదేవాయ నమఃప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమఃపురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమఃనారసింహాయ నమః అచ్యుతాయ నమఃజనార్దనాయ నమః ఉపేంద్రాయ నమఃహరయే నమః శ్రీ కృష్ణాయ నమః"(రెండు అక్షింతలు వాసన చూసి వెనుకకు వేయవలెను)శ్లో‘‘ ఉత్తిష్ఠంతు భూత పిశాచాః! యేతే భూమి భారకాః ఏతేషామవిరోధేన! బ్రహ్మకర్మ సమారభే!"(ముక్కుపట్టుకుని ఎడమవైపు నుండి గాలిపీల్చి క్రింది మంత్రం చదివిన తరువాత ముక్కు కుడివైపు నుండి గాలి వదలవలెను.)ప్రాణాయామం.."ఓం భూః ఓం భువః ఓగ్ం సువః ఓం మహః ఓం జపఃఓం తపః ఓగ్ం సత్యం ఓం తత్సవితుర్వ రేణ్యం భర్గోదేవస్యధీమహి ధియోయోనః ప్రచోదయాత్‘‘ ఓమాపో జ్యోతీరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్‘‘సంకల్పం:మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞేయా ప్రవర్తమానస్య ఆద్యబ్రాహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య .............. ప్రదేశే .............. – ............. నదీ మధ్యప్రదేశే (మీ ప్రస్తుత నివాస ప్రాంతం ఏ జీవనదుల మధ్య వున్నదో ఆ నదుల పేర్లు చెప్పుకోండి) స్వగృహే (సొంత ఇల్లుకానివారు మమ వసతిగృహే అని చెప్పుకోవాలి) సమస్త దేవతాబ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక స్వస్తిశ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధి నామ సంవత్సరే, దక్షిణాయనే, వర్ష బుుతౌ, భాద్రపద మాసే, శుక్లపక్షే, చతుర్థి తిథౌ, స్థిరవాసరే, శుభనక్షత్రే, శుభయోగే, శుభకరణ, ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ, శ్రీమాన్ శ్రీమతః గోత్రః................. (మీ గోత్రం చెప్పవలెను) నామధేయః ............................... (ఇంటిపెద్ద / యజమాని తన పేరు చెప్పుకోవలెను) ధర్మపత్నీ సమేతస్య మమ సపుత్రకస్య, సపుత్రికస్య సహ కుటుంబానాం క్షేమ, స్థైర్య, ధైర్య, వీర్య, విజయ, అభయ, ఆయురారోగ్య, ఉద్యోగ, వ్యాపార, ఐశ్వర్యాభివృద్ధ్యర్థం, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం, సకల ధన కనక, విద్యా ప్రాప్త్యర్థం, వస్తువాహన సమృద్ధ్యర్థం, పుత్రపౌత్రాభివృద్థ్యర్థం, సర్వాభీష్ట ఫల సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధివినాయక దేవతా ముద్దిశ్య శ్రీ వరసిద్ధివినాయక దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే‘‘ (కుడిచేతి ఉంగరపు వేలిని నీటిలో తాకవలెను)తదంగ కలశపూజాం కరిష్యేః (మరలా కుడిచేతి ఉంగరపు వేలిని నీటిలో తాకవలెను)కలశపూజ: (కలశాన్ని గంధం, పుష్పములు, అక్షతలతో పూజించి కలశముపై కుడిచేతిని ఉంచి, క్రింది శ్లోకము చెప్పుకొనవలెను)శ్లో‘‘ కలశస్య ముఖే విష్ణుః కంఠేరుద్ర సమాశ్రితః మూలేతత్రస్థితో బ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌతు సాగరాః సర్వేసప్తద్వీపా వసుంధరా! ఋగ్వేదోధయజుర్వేదస్సామవేదో హ్యధర్వణః అంగైశ్చసహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి! నర్మదే సింధు కావేరి జలేస్మిం సన్నిధింకురు ‘‘అయాంతు శ్రీ గణపతి పూజార్థం దురితక్షయ కారకాః కలశోదకేన పూజా ద్రవ్యాణిచ సంప్రోక్ష్యః దేవమాత్మానంచ సంప్రోక్ష్యః(పసుపుతో చేసిన గణపతిని తమలపాకుపై ఉంచి కుంకుమతో బొట్టు పెట్టవలెను. పసుపు విఘ్నేశ్వరుని క్రింది విధంగా పూజించాలి)శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి (నమస్కరించవలెను) గణానాంత్వా గణపతిగ్ం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణాస్పత ఆనఃశృణ్వన్నూతిభిస్సీదసాదనంఆవాహయామి ఆవాహనం సమర్పయామి (నీటిని చల్లవలెను)పాదయోః పాద్యం సమర్పయామి (మరల నీటిని చల్లవలెను)హస్తయోః అర్ఘ్యం సమర్పయామి (మరల నీటిని చల్లవలెను)ముఖే ఆచమనీయం సమర్పయామి(మరల నీటిని చల్లవలెను) ఔపచారిక స్నానం సమర్పయామి (నీటిని చల్లవలెను)స్నానానంతర ఆచమనీయం సమర్పయామి (నీటిని చల్లవలెను)వస్త్రం సమర్పయామి (పత్తితో చేసిన వస్త్రం లేదా పుష్పం ఉంచాలి)గంధాన్ ధారయామి (గంధమును చల్లవలెను)కుంకుమం సమర్పయామిగంధస్యోపరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి (అక్షతలు చల్లవలెను)పుష్పాని సమర్పయామి (పూలతో స్వామివారిని అలంకరించవలెను)స్వామికి పుష్పాలతో పూజ..(ఈ క్రింది నామాలు చదువుతూ పుష్పాలతో పూజ చేయవలెను)ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయనమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కంద పూర్వజాయ నమః ఓం మహాగణాధిపతయే నమఃనానావిధ పరిమళ పత్రపుష్పాణి సమర్పయామి(పుష్పాలతోను, పత్రితోనూ పూజించవలెను)ధూపం ఆఘ్రాపయామి (అగరువత్తిని వెలిగించవలెను)దీపం దర్శయామి (దీపమును చూపవలెను)నైవేద్యం సమర్పయామి (బెల్లం ముక్కను నైవేద్యం పెట్టాలి)ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహిః ధియోయోనః ప్రచోదయాత్‘‘ సత్యం త్వరేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి (అని చెప్పి నైవేద్యముపై చుట్టూ నీటిని త్రిప్పి నైవేద్యంపై నీటిని అభికరించి ఎడమచేతితో కుడి చేతిని పట్టుకొని, కుడిచేతితో నైవేద్యాన్ని గణాధిపతికి చూపిస్తూ ఈ క్రింది మంత్రాలు చెప్పుకోవలెను)."ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా"శ్రీ మహాగణాధిపతయే నమః యథాభాగం గుడం నివేదయామి (బెల్లం ముక్కను నివేదించాలి)మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటిని చల్లవలెను)హస్తప్రోక్షయామి, పాదౌ ప్రోక్షయామి, ముఖే ఆచమనీయ సమర్పయామి (4సార్లు నీళ్ళు చూపించి వదలాలి)తాంబూలం సమర్పయామి (తాంబూలం ఉంచవలెను)ఆచమనీయం సమర్పయామి (నీటిని చల్లవలెను)ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి (కర్పూరమును వెలిగించాలి)శ్లో‘‘ వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ ‘ అవిఘ్నంకురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా ‘‘శ్రీ మహాగణాధిపతయే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. గణాధిపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు. మమ ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి (గణపతికి పూజచేసిన అక్షతలు కొన్ని తీసుకొని శిరస్సున ఉంచుకొనవలెను.) శ్రీ మహాగణాధిపతిం యథాస్థానం ప్రవేశయామి (పసుపు గణపతిని తూర్పునకు కొద్దిగా జరిపి మరల యథాస్థానంలో పెట్టాలి)వరసిద్ధి వినాయక పూజా ప్రారంభం..స్వామిన్, సర్వజగన్నాథ యావత్పూజావసానగాఃతావత్త్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధింకురుధ్యానం: స్వామి వారి రూపాన్ని ఊహించుట (పువ్వులు, అక్షతలు చేతితో పట్టుకుని గణపతికి నమస్కరిస్తూ ఈ క్రింది ప్రార్థన చేసిన తరువాత ఆయన పాదాల వద్ద ఉంచాలి) "ఓం భవసంచిత పాపౌçఘ విధ్వంసన విచక్షణం‘‘"విఘ్నాంధకారభాస్వంతం విఘ్నరాజ మహం భజే‘‘ "ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం‘‘"పాశాంకుశధరం దేవం ధ్యాయేత్సిద్ధి వినాయకమ్‘‘ "ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం ‘‘ "భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్న నాయకమ్ ‘‘ "ద్యాయేద్గజాననం దేవం తప్తకాంచన సన్నిభం‘‘"చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం ‘‘"శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధివినాయక స్వామినే నమః ధ్యాయామి". (వినాయకుని ధ్యానించండి...)ప్రాణ ప్రతిష్ఠ: (స్వామి వారికి ప్రాణం పోయుట) ఓమ్ అసునీతే పునరస్మాను చక్షుః‘ పునః ప్రాణ మిహనో దేహి భోగమ్‘ జ్యోక్పశ్యేమ సూర్యముచ్ఛరంత‘ మనుమతే మృడయాన స్వస్తి అమృతం నై ప్రాణాః అమృత మాపః‘ ప్రాణానేవ యథాస్థాన మువహ్వయతే ‘‘ స్వామిన్ సర్వజగన్నాథ యావత్పూజావసానకమ్‘ తావత్త్వం ప్రతిభావేన ప్రతి మేస్మిన్ సన్నిధిం కురు‘‘ సాంగం సాయుధం సవాహనం సశక్తిం పత్నీ పుత్రం పరివార సమేతం శ్రీ వరసిద్ధివినాయక స్వామిన్ ఆవాహితో భవ, స్థాపితో భవ, సుముఖోభవ, సుప్రసన్నోభవ, వరదో భవ, స్థిరాసనంకురు, ప్రసీదః ప్రసీదః ప్రసీద‘‘ఆవాహనమ్: స్వామివారిని పిలవటం స్వామివారు వచ్చినట్లుగా భావించటం. (పువ్వులు, అక్షతలు చేతితో పట్టుకుని గణపతికి ఆసనం చూపుతూ నమస్కరించి ఈ క్రింది శ్లోకాన్ని చదివిన తరువాత ఆయన పాదాల వద్ద ఉంచాలి) అత్రాగచ్ఛ జగద్వంద్య సురరాజార్చితేశ్వర‘ అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్భవ‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధివినాయక స్వామినే నమః ఆవాహయామి‘ఆసనమ్: స్వామివారు మనముందు ఆసనముపై కూర్చుండినట్లు ఊహించటం (పువ్వులు, అక్షతలు చేతితో పట్టుకొని గణపతికి నమస్కరిస్తూ ఈ క్రింది శ్లోకాన్ని చదివిన తరువాత ఆయన పాదాల వద్ద ఉంచాలి). మౌక్తికైః పుష్పరాగైశ్చ నానారత్నైర్విరాజితం! రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః నవరత్నఖచిత సింహాసనార్థ పుష్పాక్షతాన్ సమర్పయామి"పాద్యమ్: స్వామి వారి పాదాలకు నీళ్ళు సమర్పించి పాదాలు కడుగుతున్నట్లు భావించడం (పుష్పంతో కలశంలోని నీటిని గణపతి పాదాలపై కొద్దికొద్దిగా చల్లాలి)శ్లో ‘‘సర్వతీర్థ సముద్భూతంపాద్యం గంగాది సంయుతంవిఘ్నరాజ! గృహాణేదంభగవన్భక్త వత్సలశ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః తమ పాదయోః పాద్యం సమర్పయామి"అర్ఘ్యమ్: స్వామి వారి చేతులకు నీళ్ళు ఇచ్చుట (పుష్పంతో కలశంలోని నీటిని గణపతి పాదాలపై కొద్దికొద్దిగా చల్లాలి)గౌరీపుత్ర! నమస్తేస్తు శంకర ప్రియనందన! గృహాణార్ఘ్యం మయాదత్తం గంధపుష్పాక్షతైర్యుతం‘‘ శ్రీ సిద్ధిబుద్ధిసమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి‘‘ఆచమనీయమ్: స్వామివారి నోటికి నీళ్ళు అందించడం తాగుతున్నట్లు భావించుట (పుష్పంతో కలశంలోని నీటిని గణపతి పాదాలపై కొద్దిగా చల్లాలి) అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజితః గృహాణాచమనం దేవః తుభ్యం దత్తం మయా ప్రభో‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామినే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి‘‘మధుపర్కం: పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార వీటిని కలిపి స్వామి వారికి అందించుట (గణపతికి మధుపర్కం సమర్పించాలి) దధిక్షీర సమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితం ‘‘ మధుపర్కం గృహాణేదం గణనా«థం నమోస్తుతే‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మధుపర్కం సమర్పయామి.పంచామృత స్నానమ్: పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, వీటితో అభిషేకించేటట్లు భావించుట (పంచామృతాలతో ఈ క్రింది చెప్పిన వరుసలో గణపతికి అభిషేకం చేయాలి)పాలు: ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వత స్సోమ వృష్ణి యం‘ భవా వాజన్య సంగథే‘‘ శ్రీ సిద్ధిబుద్ధిసమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః క్షీరేణ స్నపయామి‘‘పెరుగు: ఓం దధిక్రాపుణ్ణో ఆకారిషం‘ జిష్ణోరశ్వస్య వాజినః సురభినో ముఖాకరత్‘ ప్రణ ఆయూగ్‌ంషి తారిషత్‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః దధ్నా స్నపయామి‘‘నేయి: ఓం శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవస్సవితోత్పునా త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో స్సూర్యన్యరశ్మిభిః‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ఆజ్యేన స్నపయామి‘‘తేనె: ఓం మధువాతా బుుతాయతే‘ మధుక్షరంతి సింధవః మాధ్వీర్నస్సంత్వోషధీ!‘ మధునక్తముతోషసి మధుమత్వార్థినగ్‌ం రజః‘ మధుద్యైరస్తునః పితా‘ మధుమాన్నో వనస్పతిర్మధుమాగ్ం అస్తుసూర్యః మాధ్వీర్గావో భవంతునః‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మధునా స్నపయామి‘‘పంచదార: ఓం స్వాదుఃపవన్వ దివ్యాజన్మనే‘ స్వాదురింద్రాయ సుహవీతు నామ్నే‘ స్వాదుర్మి త్రాయ వరుణాయ వాయమే‘ బృహస్పతయే మధుమాగ్‌ం ఆదాభ్యః‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః శర్కరేణ స్నపయామి‘‘ (మిగిలిన పంచామృతాలన్నింటినీ ఈ క్రింది శ్లోకం చెబుతూ అభిషేకం చేయాలి) స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక‘ అనాథనాథ‘ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత‘‘శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి.ఫలోదకమ్ : (కొబ్బరినీటితో అభిషేకం చేయాలి)యాః ఫలినీర్యా అఫలాఅపుష్పాయాశ్చ పుష్పిణీః‘ బృహస్పతి ప్రసూతాస్తానో ముంచస్త్యగ్‌ంహనః‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ఫలోదకేన స్నపయామి‘శుద్ధోదకమ్ : మంచి నీటితో స్వామిని అభిషేకించునట్లుగా భావించడం (ఈ క్రింది శ్లోకంతో కలశంలోని నీటితో అభిషేకంచేయాలి. ఇక్కడ గణపతి ఉపనిషత్తు, పురుషసూక్త, నమకచమకాదులతో యథాశక్తి అభిషేకం చేయవచ్చు) గంగాది సర్వతీర్థేభ్యః అహృతైరమలైర్జలైః స్నానం కురుష్వ భగవాన్ ఉమాపుత్ర నమోస్తుతే‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః శుద్ధోదకస్నానం సమర్పయామి‘‘ స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి‘‘ (అంటూ కలశంలోని పుష్పంతో నీటిని పళ్ళెంలో విడవాలి. తరువాత ప్రతిమను వస్త్రంతో తుడిచి గంధం కుంకుమలతో అలంకరించి యథాస్థానంలో ఉంచాలి.)వస్త్రమ్ : (నూతన వస్త్రములనుగాని, పత్తితో చేసిన వస్త్రద్వయాన్నిగాని ఈ క్రింది శ్లోకం చదివాక గణపతి పాదాలవద్ద ఉంచాలి) రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యంచ మంగళం‘ శుభప్రదం గృహాణత్వం లంబోదర హరాత్మజ‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి‘‘యజ్ఞోపవీతమ్ : (పత్తితో చేసిన యజ్ఞోప వీతాన్నిగాని, పుష్పాక్షతలనుగాని దేవునివద్ద ఉంచాలి) రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం‘ గృహాణ దేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి‘‘గంధమ్ : (ఒక పుష్పాన్ని చందనంలో ముంచి గణపతి పాదాల వద్ద ఉంచాలి) చందనాగరుకర్పూర కస్తూరీ కుంకుమాన్వితం‘ విలేపనం సురశ్రేష్ఠ! ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామినే నమః గంధాన్ ధారయామిఅక్షతలు : (అక్షతలు దేవుని పాదాల వద్ద ఉంచాలి) అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాం తండులాన్ శుభాన్‘ గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి‘‘సింధూరం : శ్లో‘‘ ఉద్యద్భాస్కర సంకాశం‘‘ సంధ్యా వదరుణంప్రభో‘‘ వీరాలంకరణం దివ్యం‘‘ సింధూరం ప్రతిగృహ్యతాం‘‘ శ్రీ సిద్ధి బుద్ధి నమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః సింధూరం సమర్పయామి"మాల్యం : శ్లో‘‘ మాల్యాదీవి సుగంధాని‘‘ మాలత్యా దీనివై ప్రభో‘‘ మయాహృతాని పుష్పాణి‘‘ ప్రతిగృహ్ణీష్య శాంకర‘‘ శ్రీ సిద్ధి బుద్ధి నమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మాల్యం సమర్పయామి‘‘పుష్పమ్ : (సుగంధ పుష్పాలను దేవుని పాదాల వద్ద ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పుష్పం చొప్పున అ«థాంగపూజ, అష్టోత్తరాలను చెబుతూ అలంకరణ చేయాలి. పుష్పాలు సరిపోని పక్షంలో అక్షతలతో పూజించవచ్చు). సుగన్ధానిచ పుష్పాణి జాజీకుందముఖానిచ ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే‘ శ్రీ సిద్ధి బుద్ధి నమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః పుష్పైః పూజయామి‘‘అథాంగ పూజా.. : (స్వామి వారి అంగాన్ని ఒక్కొక్కటిగా అర్చించుట)గణేశాయ నమః పాదౌ పూజయామి‘ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి‘విఘ్నరాజాయ నమః జానునీ పూజయామి‘కామారిసూనవే నమః జంఘే పూజయామి‘అఖువాహనాయ నమః ఊరూ పూజయామి‘హేరంబాయ నమః కటిం పూజయామి‘లంబోదరాయ నమః ఉదరం పూజయామి‘గణనాథాయ నమః హృదయం పూజయామి‘స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి‘పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి‘గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి‘విఘ్నహంత్రే నమః నేత్రౌ పూజయామి‘శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి‘ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి‘సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి‘శ్రీ గణాధిపాయ నమః సర్వాణ్యంగాని పూజయామి‘‘ఏకవింశతి పత్ర పూజ.. : (ఏకవింశతి పత్రిపూజ సమయంలో పత్రితోనే పూజించాలి. దూర్వాయుగ్మ పూజా సందర్భంలో గరికతో పూజించాలి. లేని పక్షంలో అక్షతలతో పూజించాలి)- ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి‘ (మాచి ఆకు)- ఓం గణాధిపాయ నమః బృహతీ పత్రం పూజయామి‘ (బలురక్కసి లేక ములక)- ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి‘ (మారేడు)- ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి‘ (గరికె రెమ్మలు)- ఓం çహరసూనవే నమః దత్తూర పత్రం పూజయామి‘ (ఉమ్మెత్త ఆకు)- ఓం లంబోదరాయ నమః బదరీ పత్రం పూజయామి‘ (రేగు ఆకు)- ఓం గుహాగ్రజాయ నమః అపామార్గ పత్రం పూజయామి‘ (ఉత్తరేణి)- ఓం గజకర్ణాయ నమః తులసీ పత్రం పూజయామి‘ (తులసి)- ఓం ఏకదంతాయ నమః చూత పత్రం పూజయామి‘ (మామిడి ఆకు)- ఓం వికటాయనమః కరవీర పత్రం పూజయామి‘ (గన్నేరు ఆకు)- ఓం భిన్న దంతాయ నమః విష్ణుక్రాంత పత్రం పూజయామి‘ (విష్ణు క్రాంతం)- ఓం వటవే నమః దాడిమీ పత్రం పూజయామి‘ (దానిమ్మ)- ఓం సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి‘ (దేవదారు)- ఓం ఫాలచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి‘ (మరువం)- ఓం హేరంబాయ నమః సింధువార పత్రం పూజయామి‘ (వావిలాకు)- ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి‘ (జాజి తీగ ఆకు)- ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి‘ (దేవకాంచనం)- ఓం ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి‘ (జమ్మి ఆకు)- ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి‘ (రావి ఆకు)- ఓం సుర సేవితాయ నమః అర్జునపత్రం పూజయామి‘ (తెల్లమద్దె)- ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి‘ (జిల్లేడు ఆకు)ఓం శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రిణి పూజయామి‘‘ (21 రకముల ఆకులను కలిపి వేసి నమస్కారము చేయవలెను)ఏకవింశతి దూర్వాయుగ్మ పూజ(రెండు, రెండు గరికలుగా స్వామిని అర్చించాలి)గణాధిపాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!పాశాంకుశధరాయనమః దుర్వాయుగ్మం పూజయామి!అఖువాహనాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!వినాయకాయనమః దుర్వాయుగ్మం పూజయామి!ఈశపుత్రాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!సర్వసిద్ధిప్రదాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!ఏకదంతాయనమః దుర్వాయుగ్మం పూజయామి!ఇభవక్త్రాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!మూషికవాహనాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!కుమారగురవే నమః దుర్వాయుగ్మం పూజయామి!కపిలవర్ణాయనమః దుర్వాయుగ్మం పూజయామి!బ్రహ్మచారిణేనమః దుర్వాయుగ్మం పూజయామి!మోదకహస్తాయనమః దుర్వాయుగ్మం పూజయామి!సురశ్రేష్ఠాయనమః దుర్వాయుగ్మం పూజయామి!గజనాసికాయ నమః దుర్వాయుగ్మం పూజయామి!కపిత్థఫలప్రియాయనమః దుర్వాయుగ్మం పూజయామి!గజముఖాయనమః దుర్వాయుగ్మం పూజయామి!సుప్రసన్నాయనమః దుర్వాయుగ్మం పూజయామి!సురాగ్రజాయనమః దుర్వాయుగ్మం పూజయామి!ఉమాపుత్రాయనమః దుర్వాయుగ్మం పూజయామి!స్కందప్రియాయనమః దుర్వాయుగ్మం పూజయామి!శ్రీ వరసిద్ధి వినాయకాయ స్వామినే నమః ఏకవింశతి – దుర్వాయుగ్మం సమర్పయామిశ్రీ గణపతి అష్టోత్తర శతనామావళి..ఓం గజాననాయ నమః ఓం గణాధ్యక్షాయ నమఃఓం విఘ్నరాజాయ నమఃఓం వినాయకాయ నమఃఓం ద్వైమాతురాయ నమఃఓం ద్విముఖాయ నమఃఓం ప్రముఖాయ నమఃఓం సుముఖాయ నమఃఓం కృతినే నమఃఓం సుప్రదీపాయ నమఃఓం సుఖనిధయే నమఃఓం సురాధ్యక్షాయ నమఃఓం సురారిఘ్నాయ నమఃఓం మహాగణపతయే నమఃఓం మాన్యాయ నమఃఓం మహాకాలాయ నమఃఓం మహాబలాయ నమఃఓం హేరంబాయ నమః ఓం లంబకర్ణాయ నమఃఓం హ్రస్వగ్రీవాయ నమఃఓం మహోదరాయ నమఃఓం మహోత్కటాయ నమఃఓం మహావీరాయ నమఃఓం మంత్రిణే నమఃఓం మంగళస్వరూపాయ నమఃఓం ప్రమధాయ నమఃఓం ప్రథమాయ నమఃఓం ప్రాజ్ఞాయ నమఃఓం విఘ్నకర్త్రే నమఃఓం విఘ్నహంత్రే నమఃఓం విశ్వనేత్రే నమఃఓం విరాటత్పయే నమఃఓం శ్రీపతయే నమఃఓం శృంగారిణే నమః ఓం ఆశ్రితవత్సలాయ నమఃఓం శివప్రియాయ నమఃఓం శీఘ్రకారిణే నమఃఓం శాశ్వతాయ నమఃఓం బలాయ నమఃఓం బలోత్థితాయ నమఃఓం భవాత్మజాయ నమఃఓం పురాణ పురుషాయ నమఃఓం పూష్ణే నమః ఓం పుష్కరక్షిప్తవారిణే నమఃఓం అగ్రగణ్యాయ నమఃఓం అగ్రపూజ్యాయ నమఃఓం అగ్రగామినే నమఃఓం మంత్రకృతే నమఃఓం చామీకరప్రభాయ నమఃఓం సర్వాయ నమఃఓం సర్వోపన్యాసాయ నమఃఓం సర్వకర్త్రే నమఃఓం సర్వనేత్రే నమఃఓం సర్వసిద్ధిప్రదాయ నమఃఓం సర్వసిద్ధయే నమఃఓం పంచహస్తాయ నమఃఓం పార్వతీనందనాయ నమఃఓం ప్రభవే నమఃఓం కుమార గురవే నమఃఓం అక్షోభ్యాయ నమఃఓం కుంజరాసుర భంజనాయ నమఃఓం ప్రమోదాయ నమఃఓం మోదకప్రియాయ నమఃఓం కాంతిమతే నమఃఓం ధృతిమతే నమఃఓం కామినే నమఃఓం కపిత్థ పనసప్రియాయ నమఃఓం బ్రహ్మచారిణే నమఃఓం బ్రహ్మరూపిణే నమఃఓం బ్రహ్మవిద్యాధిపాయ నమఃఓం విష్ణవే నమఃఓం విష్ణుప్రియాయ నమఃఓం భక్తజీవితాయ నమఃఓం జితమన్మథాయ నమఃఓం ఐశ్వర్యకారణాయ నమఃఓం జ్యాయనే నమఃఓం యక్షకిన్నరసేవితాయ నమఃఓం గంగాసుతాయ నమఃఓం గణాధీశాయ నమః ఓం గంభీరనినదాయ నమఃఓం వటవే నమఃఓం అభీష్టవరదాయినే నమః ఓం జ్యోతిషే నమఃఓం భక్తనిధయే నమఃఓం భావగమ్యాయ నమః ఓం మంగళప్రదాయ నమఃఓం అవ్యక్తాయ నమః ఓం అపాకృతపరాక్రమాయ నమఃఓం సత్యధర్మిణే నమఃఓం సఖ్యే నమఃఓం సరసాంబునిధయే నమఃఓం మహేశాయ నమఃఓం దివ్యాంగాయ నమఃఓం మణికింకిణీ మేఖలాయ నమఃఓం సమస్తదేవతామూర్తయే నమఃఓం సహిష్ణవే నమఃఓం సతతోత్థితాయ నమఃఓం విఘాతకారిణే నమఃఓం విశ్వక్‌దృశే నమఃఓం విశ్వరక్షాకృతే నమఃఓం కళ్యాణ గురవే నమఃఓం ఉన్మత్తవేషాయ నమఃఓం అపరాజితే నమఃఓం సమస్త జగదాధారాయ నమఃఓం సర్వైశ్వర్యప్రదాయ నమఃఓం ఆక్రాన్తచిదచిత్ప్రభవే నమఃఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమఃశ్రీసిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి.బిల్వం :శ్లో‘‘ త్రిదళం త్రిగుణాకరం‘‘ త్రినేత్రంచ త్రియాయుధం‘‘ త్రిజన్మ పాప సంహారం‘‘ఏకబిల్వం శివార్పణం ‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః బిల్వపత్రం సమర్పయామి.ధూపమ్ : (అగరువత్తులను వెలిగించి ఆ ధూపాన్ని గణపతికి కుడి చేతితో చూపించాలి. అంతేగాని అగరువత్తులను చుట్టూ తిప్పకూడదు) దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం‘‘ ఉమా సుత నమస్తుభ్యం గృçహాణవరదో భవ‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ధూపమాఘ్రాపయామి.దీపమ్ : (కర్పూర దీపాన్ని గాని, నేతి దీపాన్ని గాని కుడిచేతితో భగవంతునికి చూపాలి) సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాద్యోతితం మయా‘ గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే‘‘ శ్రీసిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః దీపం దర్శయామి‘‘నైవేద్యమ్ : (గణపతికి నివేదించాల్సిన అన్ని ఫలాలను, పిండి వంటలను పళ్లెంలో ఒక ఆకువేసి ఆ ఆకులో పెట్టి ఉంచాలి. వాటిపై ఈ క్రింది మంత్రంతో నీళ్ళు చల్లాలి) ఓమ్ భూర్భువస్సువః ‘ ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ‘ ధియోయనః ప్రచోదయాత్ ‘‘ (పుష్పంతో నీటిని పదార్థాల చుట్టూ తిప్పాలి) ఓమ్ సత్యంత్వర్తేన పరిషించామి‘‘ ఓమ్ బుుతంత్వా సత్యేన పరిషించామి‘‘సుగంధాన్ సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్ నైవేద్యం గృహ్యతాం దేవగణముదై్గః ప్రకల్పితాన్‘ భక్ష్యం భోజ్యం చ లేహ్యంచ చోష్యం పానీయమేవచ‘ ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మహానైవేద్యం సమర్పయామి. (పుష్పంతో నీటిని రెండుసార్లు పళ్లెంలో విడిచిపెట్టాలి)ఓమ్ అమృతమస్తు! ఓమ్ అమృతోపస్తరణమసి‘‘(అయిదుసార్లు ఎడమచేతితో కుడిమోచేయిని పట్టుకుని కుడి చేతితో గణపతివైపు నైవేద్యాన్ని చూపాలి) ఓమ్ ప్రాణాయ స్వాహా‘ ఓమ్ అపానాయ స్వాహా‘ ఓమ్ వ్యానాయ స్వాహా‘ ఓమ్ ఉదానాయ స్వాహా ఓమ్ సమానాయ స్వాహా‘‘ (తరువాత సమర్పయామి అన్నప్పుడల్లా పుష్పంతో పళ్ళెంలో నీళ్ళు వదలాలి) మధ్యే మధ్యే పానీయం సమర్పయామి‘ అమృతాపి« దానమసి ఉత్తరాపోశనం సమర్పయామి‘ హస్తౌ ప్రక్షాళయామి‘ పాదౌప్రక్షాళయామి‘ శుద్ధాచమనీయం సమర్పయామి‘‘తాంబూలమ్ : (మూడు తమలపాకులు, వక్కలు, అక్షతలు, పుష్పం, ఫలం సుగంధ ద్రవ్యాలు, దక్షిణలతో తాంబూలాన్ని గణపతి వద్ద ఉంచాలి) పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం‘ కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్‘‘ శ్రీసిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః తాంబూలం సమర్పయామి‘‘శ్రీ గణేష ప్రార్థన.."తుండమునేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జౖయె యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదన్‘తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటినందన నీకు మ్రొక్కెదన్ఫలితము సేయుమయ్య నిను ప్రార్థన చేసెద నేకదంత నా వలపటి చేతి గంటమున వాక్కున నెప్పుడు బాయకుండు మీ తలపున నిన్ను వేడెద దైవగణాధిప‘ లోకనాయకా!తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని తలచిన పనిగా దలచితినే హేరంబుని దలచితి నా విఘ్నముల దొలగుట కొఱకున్" "అటుకులు కొబ్బరిపలుకులు చిటిబెల్లము నానుబ్రాలు చెరకు రసంబున్నిటలాక్షు నగ్రసుతునకుపటుతరముగ విందుసేతు ప్రార్థింతు మదిన్"శ్రీ వినాయకుని దండకము.. శ్రీ పార్వతీపుత్ర లోకత్రయీస్తోత్ర, సత్పుణ్యచారిత్ర, భద్రేభవక్త్రా మహాకాయ, కాత్యాయనీనాథ సంజాత స్వామీ శివాసిద్ధి విఘ్నేశ, నీ పాదపద్మంబులన్, నీదు కంఠంబు నీ బొజ్జ నీ మోము నీ మౌళి బాలేందు ఖండంబు నీ నాల్గు హస్తంబులన్నీ కరాళంబు నీ పెద్ద వక్త్రంబు దంతంబు నీ పాద యుగ్మంబు లంబోదరంబున్ సదా మూషికాశ్వంబు నీ మందహాసంబు నీ చిన్ని తొండంబు నీ గుజ్జు రూపంబు నీ శూర్పకర్ణంబు నీ నాగ యజో›్ఞపవీతంబు నీ భవ్యరూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మ్రొక్కంగ శ్రీ గంధమున్ గుంకుమం బక్షతలాజులున్ చంపకంబున్ తగన్ మల్లెలన్మొల్లలన్మంచి చేమంతులున్ తెల్లగన్నేరులన్ మంకెనల్ పొన్నలన్ పువ్వులు న్మంచి దుర్వంబు లందెచ్చి శాస్త్రోక్తరీతిన్ సమర్పించి పూజించి సాష్టాంగంబు జేసి విఘ్నేశ్వరా నీకు టెంకాయలుం పొన్నంటిపండున్ మరిన్మంచివౌ ఇక్షుఖండంబులు, రేగుబండ్లప్పడాల్ వడల్ నేతిబూరెల్ మరీస్ గోధుమప్పంబులు న్వడల్ పున్గులున్ గారెలున్ చొక్కమౌ చల్మిడిన్ బెల్లమున్ తేనెయుం జున్ను బాలాజ్యమున్నాను బియ్యంబు చామ్రంబు బిల్వంబు మేల్ బంగరున్ బళ్లెమం దుంచి నైవేద్యముంబంచనీ రానంబున్ నమస్కారముల్జేసి విఘ్నేశ్వరా నిన్ను బూజింపకే యన్యదైవంబుల్ ప్రార్థనల్చే యుటల్ కాంచనం బొల్లకే యిన్ముదాగోరు చందంబుగారే మహాదేవ యో భక్తమందారయో సుందరాకార యో భాగ్య గంభీర యో దేవ చూడామణీ లోకరక్షామణీ బంధు చింతామణీ స్వామి నిన్నెంచ నేనెంత నీదాస దాసాదిదాసుండ శ్రీ దొంత రాజన్వయుండ రామాభిధానుండ నన్నిప్డు చేపట్టి సుశ్రేయునింజేసి శ్రీమంతుగన్జూచి హృత్పద్మసింహాస నారూఢతన్నిల్పి కాపాడుటే కాదు నిన్గొల్చి ప్రార్థించు భక్తాళికిన్ కొంగు బంగారమై కంటికిన్ రెప్పవై బుద్ధియున్విద్య యున్నాడియున్ బుత్ర పౌత్రాభివృద్ధిన్ దగన్‌గల్గగాజేసి పోషించుమంటిన్ గృపన్ గాÐ గావుమంటిన్ మహాత్మా! ఇవే వందనంబుల్ శ్రీ గణేశా నమస్తే.. నమస్తే...నమఃనీరాజనమ్: (హారతి కర్పూరాన్ని వెలిగించి ఆ దీపాన్ని తిప్పుతూ గణపతికి చూపించాలి) ఘృతవర్తిసహస్రైశ్చ కర్పూర శకలైస్తదా‘ నీరాజనం మయాదత్తం గృహాణ వరదోభవ‘‘ సమ్రాజంచ విరాజంచ అభిశ్రీః యాచనోగృహే లక్ష్మీరాస్ట్ర్య యాముఖే తయామా సగ్ం సృజామసి‘‘ సంతత శ్రీరస్తు‘ సమస్త సన్మంగళానిభవంతు‘ నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః నీరాజనం దర్శయామి‘‘ నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి‘‘ (అని పుష్పంతో పళ్ళెంలో నీటిని విడవాలి)మంత్రపుష్పమ్: (ఇక్కడ మంత్రపుష్పాన్ని పెద్దదిగాని, చిన్నదిగాని చెప్పవలెను. రానివారు ఈ శ్లోకాలతో మంత్రపుష్పాన్ని సమర్పించాలి)"గణాధిప నమస్తేస్తుఉమాపుత్రా విఘ్ననాశన‘వినాయకేశ తనయ సర్వసిద్ధి ప్రదాయక‘‘ఏకదంతైక వదన తథా మూషికవాహన‘కుమారగురవే తుభ్యమర్పయామి సుమాంజలిమ్‘‘తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి‘తన్నోదంతిః ప్రచోదయాత్‘‘శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః"- మంత్రపుష్పం సమర్పయామి..ఆత్మప్రదక్షిణ నమస్కారమ్: (పువ్వులు, అక్షతలు తీసుకుని లేచి నిలబడి నమస్కారం చేయాలి. అంతేగాని తనచుట్టూ తాను తిరగకూడదు)"ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ‘ నమస్తే విఘ్నరాజాయ‘ నమస్తే విఘ్ననాశన‘‘యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ‘తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే‘పాపోహం పాపకర్మానాం పాపాత్మా పాపసంభవఃత్రాహిమాం కృపయాదేవ శరణాగత వత్సల‘అన్యాధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ‘తస్మాత్కారుణ్యభావేన రక్షరక్ష గణాధిప‘‘శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.."ప్రార్థన..(పుష్పాక్షతలతో ప్రార్థించి, తరువాత వాటిని గణపతి పాదాల వద్ద ఉంచాలి)నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన‘ ఈప్సితంమే వరందేహి పరత్రచ పరాంగతిమ్‘‘ వినాయక నమస్తుభ్యం సతతం మోదకప్రియ‘ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా‘‘ అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా పుత్రోయమితి మామత్వా క్షమస్వ గణనాయక‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమఃప్రార్థన నమస్కారాన్ సమర్పయామి‘‘సాష్టాంగ నమస్కారమ్..ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా‘ పాదాభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే‘‘ శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి‘‘ శ్లో‘‘ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపతి యత్పూజితంమయాదేవ పరిపూర్ణం తదస్తుతే అనేన పూజావిధానేన శ్రీ మహాగణాధిపతిసుప్రీత స్సుప్రసన్నో వరదోభవతు.(నేను చేసిన పూజలో మంత్రలోపము, క్రియాలోపము, భక్తి లోపము ఉన్నను అవన్నీ మన్నించి గణపతి దేవా పరిపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదించుము.అపరాధ ప్రార్థన: అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిశంమయా‘ దాసోయమితి మాంమత్వా క్షమస్వ గణనాయక‘‘ ఆవాహనం నజానామి నజానామి విసర్జనం‘ పూజాంచైవ నజానామి క్షమ్యతాం గణనాయక‘‘ శ్రీ వరసిద్ధి బుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామినే నమః అపరాధ నమస్కారాన్ సమర్పయామి‘‘ (రెండు చేతులు జోడించి గణపతికి నమస్కరించి, చెంపలు వేసుకోవాలి).(ఈ కింది మంత్రాలను చెబుతూ కొన్ని అక్షింతలు చేతిలో తీసుకొని నీటితో పళ్లెంలో విడిచిపెట్టాలి)అనేన మయాకృతేన కల్పోక్త ప్రకారేణ గణపతి అష్టోత్తర శతనామ సహిత యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజానేన భగవాన్ సర్వాత్మకః శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామిన్ సుప్రీతః సుప్రసన్నః వరదో భవతు.విఘ్నేశుని కథా ప్రారంభం..(కథ చదివేవారు వినేవారు అందరూ అక్షతలు చేతిలో వుంచుకొని కథ వినాలి)సూతమహాముని శౌనకాది మునులకు విఘ్నేశ్వరోత్పత్తియు, చంద్రదర్శన దోషకారణంబును, దాని నివారణను ఇలా చెప్పెను. పూర్వము గజరూపముగల రాక్షసేశ్వరుండు శివుని గూర్చి ఘోర తపస్సు చేసెను. అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఒక వరము కోరుకోమనగా, అంత గజాసురుండు పరమేశ్వరుని స్తుతించి, స్వామీ! నీవు ఎల్లప్పుడూ నా యుదరమందు నివసించియుండమని కోరెను. భక్త సులభుండగు నా పరమేశ్వరుండు అతని కోర్కెదీర్చి గజాసురుని ఉదరమందు ప్రవేశించెను.కైలాసమున పార్వతీదేవి భర్త జాడ తెలియక పలు ప్రదేశములలో అన్వేషించుచూ కొంత కాలమునకు గజాసురుని గర్భంలో వున్నాడని తెలుసుకొని రప్పించుకొను మార్గం తెలియక పరితపించుచు విష్ణుమూర్తిని ప్రార్థించి తన పతి వృత్తాంతం తెలిపి, ‘‘మహాత్మా! నీవు పూర్వము భస్మాసురుని బారి నుండి నా పతిని రక్షించి నాకు యొసంగితివి, ఇప్పుడు కూడా ఉపాయాంతరముచే నా పతిని రక్షింపుము’’ అని విలపిస్తుండగా, శ్రీహరి పార్వతిదేవిని ఓదార్చి ధైర్యము చెప్పి పంపెను. అంత హరి బ్రహ్మాదిదేవతలను పిలిపించి, పరమేశ్వరుని రప్పించుటకై గజాసుర సంహారమునకు గంగిరెద్దు మేళమే సరియైనదిగా నిశ్చయించి, నందిని గంగిరెద్దుగా ముస్తాబుచేసి, బ్రహ్మాది దేవతలందరిచేత తలొక వాద్యమును ధరింపజేసి, తానును కూడా చిరుగంటలు, సన్నాయిలు తీసుకుని గజాసురపురానికి వెళ్ళి జగన్మోహనంబుగా వాయిద్యాలతో నందిని ఆడించుచుండగా, గజాసురుండు విని వారిని తన చెంతకు పిలిపించి తన భవనమందు ఆడింపమని కోరెను. బ్రహ్మాదిదేవతలు వాద్య విశేషంబుల బోరు సలుప జగన్నాటక సూత్రధారియగు హరి చిత్రవిచిత్రముగా గంగిరెద్దును ఆడించగా, గజాసురుండు పరమానందభరితుడై ‘‘మీకేమి కావలయునో కోరుకోండి’’ ఇచ్చెదను అనిన పిదప, విష్ణుమూర్తి వానిని సమీపించి, ‘‘ఇది శివుని వాహనమగు నంది. శివుని కనుగొనుటకై వచ్చెను. కావున శివునొసంగు’’ అనెను.ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపడి, అతనిని రాక్షసాంతకుడగు శ్రీహరిగా గ్రహించి, తనకు మరణమే నిశ్చయమనుకొనుచు తన గర్భస్థుండగు పరమేశ్వరుని ‘‘నా శిరసు త్రిలోకపూజ్యముగా జేసి, నా చర్మము నీవు ధరింపు’’మని ప్రార్థించెను. విష్ణుమూర్తి అంగీకారము తెలిపి నందిని ప్రేరేపించెను. నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి సంహరించెను. అంత శివుడు గజాసురగర్భము నుండి బహిర్గతుడై విష్ణుమూర్తిని స్తుతించెను. అంత నా ‘‘హరి దుష్టాత్ములకిట్టి వరంబు లీయరాదు... ఇచ్చినచో పామునకు పాలు పోసినట్లగు’’నని ఉపదేశించి బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు తెలిపి తాను వైకుంఠమునకు వెళ్ళెను. పిదప శివుడు నంది నెక్కి కైలాసమునకు వేగంగా బయలుదేరెను.వినాయకోత్పత్తి..కైలాసంబున పార్వతీదేవి భర్త రాకను దేవాదుల వలన విని సంతోషించి పరమేశ్వరుని స్వాగతసన్నాహానికై అభ్యంగన స్నానాలంకార ప్రయత్నంలో తనకై వుంచిన నలుగుపిండితో ఒక ప్రతిమను చేయగా అది చూడముచ్చటైన బాలుని రూపముగా వుండెను. ఆ రూపానికి ప్రాణప్రతిష్ఠ చేయాలనిపించి అంతకుపూర్వం తన తండ్రి నుండి పొందిన మంత్ర ఫలముతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసెను. ఆ దివ్యస్వరూపుడైన బాలుడ్ని వాకిటముందు కాపుగా వుంచి ఎవ్వరినీ లోనికి రానీయవద్దని చెప్పెను. స్నానానంతరము పార్వతి సర్వాభరణములు అలంకరించుకొనుచు పతి ఆగమనమును నిరీక్షించుచుండెను. అపుడు పరమేశ్వరుడు నంది నధిరోహించి వచ్చి లోపలికి పోబోవ వాకిలి ద్వారముననున్న బాలుడు అడ్డగించెను. బాలుని ధిక్కారానికి కోపం వచ్చిన శివుడు తన మందిరమున తనకే ధిక్కరింపా అని రౌద్రరూపంలో తన త్రిశూలముతో బాలుని కంఠంబు తొలగించి లోపలికి వెళ్ళెను.అంత పార్వతీదేవి భర్తను చూసి, ఎదురువెళ్ళి అర్ఘ్యపాద్యాదులచే పూజించె, వారిరువురును పరమానందమున ప్రియసంభాషణములు ముచ్చటించుకొనుచుండగా ద్వారం దగ్గరవున్న బాలుని ప్రస్తావన వచ్చెను. అంత ఆ మహేశ్వరుండు తాను చేసిన పనికి చింతించి, గజాసురుని శిరస్సును బాలునికి అతికించి ప్రాణంబు ప్రసాదించి ‘‘గజాననుడు’’ అని పేరుపెట్టి, అతనిని పుత్ర ప్రేమంబున ఉమామహేశ్వరులు పెంచుకొనుచుండిరి. గజాననుడు తల్లిదండ్రులను పరమభక్తితో సేవించుచుండెను. అతడు సులభముగా ఎక్కి తిరుగుటకు అనింద్యుడను నొక ఎలుక రాజును వాహనముగా జేసికొనెను.కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వురులకు కుమారస్వామి జనియించెను. అతడు మహాబలశాలి. అతని వాహనరాజము నెమలి. దేవతల సేనానాయకుడై ప్రఖ్యాతిగాంచి యుండెను.విఘ్నేశాధిపత్యము..ఒకనాడు దేవతలు, మునులు పరమేశ్వరుని ప్రార్థిస్తూ తమకు ఏ పని చేసినా విఘ్నాలు కలుగకుండా ఒకరిని అధిపతిగా నియమించమని కోరిరి. గజాననుడు తాను పెద్దవాడు గనుక అయ్యాధిపత్యము ఇవ్వమని కోరెను. గజాననుడు మరుగుజ్జువాడు, అసమర్థుడు గనుక అయ్యాధిపత్యము తనకే ఇవ్వమని కుమారస్వామి కూడా తండ్రిని వేడుకొన్నాడు.సమస్య పరిష్కారానికి శివుడు ఇరువురు కుమారులను చూచి, ‘‘మీలో ఎవ్వరు ముల్లోకములలోని పుణ్యనదులలో స్నానంచేసి ముందుగా నా వద్దకు వచ్చెదరో, వారికి యీ ఆధిపత్యం ఇచ్చెదను’’ అని మహేశ్వరుడు తెలిపిన వెంటనే కుమారస్వామి నెమలి వాహనము ఎక్కి వాయు వేగముగా వెళ్ళెను. అంత గజాననుడు ఖిన్నుడై, తండ్రిని సమీపించి ప్రణమిల్లి ‘‘అయ్యా! నా అసమర్థత మీకు తెలిసి కూడా ఈ పరీక్ష తగునా! నీ పాదసేవకుడను నాయందు కటాక్షించి తగు ఉపాయయు తెలిపి రక్షింపవే’’ యని ప్రార్థించగా మహేశ్వరుడు దయతో, కుమారా! ఒకసారి ‘‘నారాయణ మంత్రం పఠించు’’ మని ఆ నారాయణ మంత్రాన్ని ఉపదేశించెను.‘‘సకృత్ నారాయణేత్యుక్త్యాపుమాన్ కల్పశతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక’’ అంత గజాననుడు సంతోషించి, అత్యంత భక్తితో ఆ మంత్రం జపించుచూ తల్లిదండ్రులకు మూడుసార్లు ప్రదక్షిణములు చేయుచూ కైలాసమున వుండెను. ఆ మంత్ర ప్రభావముతో∙అంతకు పూర్వము గంగానదికి స్నానానికి వెళ్లిన కుమారస్వామికి తన అన్న గజాననుడు ఆ నదిలో స్నానమాడి తన కెదురుగా వస్తున్నట్లుగా కనిపించెను. ఆ విధముగా అతడు మూడు కోట్ల యాభై లక్షల నదులలో కూడా అలాగే చూచి ఆశ్చర్యపడుచూ, కైలాసమునకు వెళ్ళి తండ్రి సమీపంలోవున్న గజాననుని చూసి, నమస్కరించి, తన బలమును నిందించుకుని ‘‘తండ్రీ! అన్నగారి మహిమ తెలియకట్లంటిని క్షమింపుము. ఈ ఆధిపత్యంబు అన్నగారికే ఇవ్వుము’’ అని ప్రార్థించెను.అంత పరమేశ్వరునిచే భాద్రపదశుద్ధ చతుర్థినాడు గజాననుడు విఘ్నాధిపత్యం స్వీకరించడం ద్వారా విఘ్నేశ్వరునిగా కీర్తింపబడుచున్నాడు. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుని తమ విభవముల కొలది కుడుములు, అప్పములు మున్నగు పిండివంటలు, టెంకాయలు, పాలు, తేనె, అరటి పండ్లు, పానకము, వడపప్పు మొదలగునవి సమర్పించి పూజించగా, విఘ్నేశ్వరుడు సంతోషంతో కుడుములు మొదలైనవి భుజించి, కొన్ని తన వాహనమైన ఎలుకకు ఇచ్చి, కొన్ని చేత ధరించి భుక్తాయాసంతో సూర్యాస్తమయం వేళకు కైలాసమునకు వెళ్ళి తల్లిదండ్రులకు వంగి నమస్కారము చేయబోగా ఉదరము భూమికి ఆని, చేతులు భూమికి అందవయ్యే, ఈ విధంగా ప్రణామము చేయుటకు శ్రమించుచుండగా శివుని శిరంబున వెలసివున్న చంద్రుడు జూచి వికటంబుగ నవ్వెను. అంత ‘రాజదృష్టి’ సోకిన రాలు కూడ నుగ్గగును అన్న సామెత నిజమగునట్లు విఘ్నదేవుని ఉదరము పగిలి అందున్న కుడుములు తదితరములన్నియు బయటకు దొర్లిపోయి అతడు మృతుండయ్యెను. పార్వతి శోకించుచు చంద్రుని జూచి,‘‘పాపాత్ముడా! నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించెను కావున, నిన్ను చూచినవారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురుగాక’’ అని శపించెను. చంద్రునికి కలిగిన శాపము లోకానికి కూడా శాపమైంది.ఋషిపత్నులకు నీలాపనిందలు..ఆ సమయంబున సప్తమహర్షులు యజ్ఞంబు చేయుచు తమ భార్యలతో అగ్నిప్రదక్షిణము చేయుచున్నారు. అగ్నిదేవుడు ఋషి పత్నులను చూచి మోహించాడు, కానీ ఋషులు శపిస్తారని భయపడెను. ఈ విషయం గ్రహించిన అగ్నిదేవుని భార్య స్వాహాదేవి ఒక్క అరుంధతీ రూపం తప్ప తక్కిన ఋషిపత్నుల రూపాలను తానే ధరించి పతికి ప్రియంబు చేసెను. ఇది చూసిన ఋషులు అగ్నిదేవునితో వున్నవారు తమ భార్యలేయని శంకించి తమ భార్యలను విడనాడిరి. పార్వతీ శాపానంతరము ఋషిపత్నులు చంద్రుని చూచుటచే వారికట్టి నీలాపనింద కలిగినది.ఋషిపత్నుల యాపద పరమేష్టికి విన్నవించుకొన్న పిదప ఆయన సర్వజ్ఞుడగుటచే అగ్నిహోత్రుని భార్య(స్వాహాదేవి)యే ఋషిపత్నుల రూపము దాల్చి వచ్చుట తెలియపరచి సప్త ఋషులను సమాధానపరచెను. వారితో కూడా బ్రహ్మ కైలాసంబున కేతెంచి, ఉమామహేశ్వరుల సేవించి మృతుడై పడియున్న విఘ్నేశ్వరుని బ్రతికించి ముదంబుగూర్చె.అంత దేవాదులు, ‘‘ఓ పార్వతీ దేవి! నీవిచ్చిన శాపము వలన లోకములకెల్ల కీడు వాటిల్లుచున్నది. దానిని ఉపసంహరింపు’’మని ప్రార్థించగా, పార్వతీదేవి అంగీకరించి, ‘‘ఏ రోజున విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వెనో ఆ రోజున చంద్రుని చూడరాదు’’ అని శాపమునకు ఉపశమనము చెప్పెను. అంత బ్రహ్మాదులు çసంతోషించి తమ గృహములకేగి, భాద్రపదశుద్ధ చతుర్థియందు మాత్రము చంద్రుని చూడకుండ జాగ్రత వహించి సుఖముగా ఉండిరి.శమంతకోపాఖ్యానము..యదువంశమునందు సత్రాజిత్తు, ప్రసేనుడు అను సోదరులుండిరి. వారు నిఘ్నని కుమారులు. సత్రాజిత్తునకు సూర్యభగవానుడు మిత్రుడు. ఒకనాడు సత్రాజిత్తు సూర్యభగవానుని స్తుతించెను. తదేక మనస్కుడై సత్రాజిత్తు చేసిన స్తుతికి ప్రసన్నుడై సూర్యభగవానుడు అతనికి ప్రత్యక్షమయ్యెను. అంతట సత్రాజిత్తు సూర్యునకు ప్రణామములు చేసి స్తుతించెను. ప్రసన్నుడైన సూర్యుడు వరమును కోరుకొనమనెను. అంతట సత్రాజిత్తు సూర్యుని నుండి ‘‘శ్యమంతకమణి’’ని కోరెను. అది విని సూర్యభగవానుడు శ్యమంతకమణిని తన కంఠం నుండి తీసి సత్రాజిత్తునకు ఇచ్చెను. ఆ సమయమున సూర్యుడు సత్రాజిత్తుతో ఇట్లు పలికెను. ఆ దివ్యమణిని పవిత్రుడై ధరించినచో ప్రతిదినమా మణి ఎనిమిది బారువుల బంగారము అనుగ్రహించును. ఆ మణియున్ను దేశమున అనావృష్టి, ఈతి బాధలు, అగ్ని, వాయు, విషక్రిములచే ఉపద్రవములు, దుర్భిక్షము మొదలగునవి వుండవు. కానీ అశుచిౖయె ధరించినచో అది ధరించిన వానిని చంపును. ఈ విషయములను తెలిసికొని, సత్రాజిత్తు సూర్యుని నుండి మణిని గ్రహించి, ధరించి, పురవీధులలో నడిచి వచ్చుచుండగా చూసిన పౌరులు దాని కాంతికి భ్రమించి సూర్యభగవానుడే శ్రీకృష్ణదర్శనమునకై వచ్చుచున్నాడని భావించి, ఆ విషయము శ్రీ కృష్ణునకు తెలియజేసిరి. శ్రీకృష్ణుడు అట్టి రత్నము ప్రభువు వద్ద ఉన్నచో దేశాభివృద్ధికి, ప్రజా సంక్షేమమునకు ఉపయోగపడునని ఆ మణిని ప్రభువైన ఉగ్రసేనునికి ఇప్పింప సంకల్పించెను.అది తెలిసిన సత్రాజిత్తు ఆ దివ్యమణిని తన తమ్ముడైన ప్రసేనునకిచ్చెను. ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకై అరణ్యానికి వెళ్ళెను. కొంత సమయమునకు శరీరశోధన కారణంగా ప్రసేనుడు అశౌచమును పొందెను. ఈ కారణముచే ప్రసేనుడు సింహం దాడిలో మరణించెను. ఆ సింహాన్ని జాంబవంతుడను భల్లూకము సంహరించి మణిని తీసుకొనిపోయి దానిని గూహలో ఊయలలోనున్న తన కుమారునకు ఆట వస్తువుగా ఇచ్చెను. ఆ పిల్లవాని పేరు సుకుమారుడు.ప్రసేనుడు అరణ్యములోనికి వేటకై వెళ్ళినపుడు శ్రీకృష్ణుడు కూడా వేటకై వెళ్ళివుండెను. ఆనాడు భాద్రపద శుక్ల చవితి. ప్రదోష వేళలో ప్రసేనుడు సంహరింపబడెను. వానికై అడవిలో శ్రీకృష్ణుడు వెదుకుచూ తలెత్తి చూడగ ఆకాశమున శుక్లపక్ష చవితినాటి చంద్రబింబము కనపడెను. చీకట్లుబాగుగా ముసురుకున్న కారణముచే శ్రీకృష్ణుడు తన మందిరమునకు తిరిగి వచ్చెను. దానికి పూర్వము, దేశ ప్రయోజనాల కొరకై ఆ మణిని శ్రీకృష్ణుడు కోరిన కారణము చేత, అతడే ప్రసేనుని చంపి మణిని అపహరించెనని సత్రాజిత్తు, పౌరులు భావించిరి. అంతట ఆ అపవాదును పోగొట్టుకోవాలనే సంకల్పంతో శ్రీకృష్ణుడు మరునాడు సపరివారంగా అడవిలో వెదుకగా ఎముకలు, చిరిగిన బట్టలు, తెగిపడిన ఆభరణములు కనబడెను. శ్యమంతకమణి మాత్రము దొరకలేదు. కాని కృష్ణుని వెంట వచ్చిన సత్రాజిత్తు సన్నిహితులు, కృష్ణుడే ముందటి రోజు ప్రసేనుని సంహరించి, శ్యమంతకమణిని అపహరించెననియు రాత్రి వేళ సింహము ప్రసేనుని, అతని గుర్రమును తిని యుండునని నిష్టూరముగా పలికిరి.ఈ అపవాదు నుండి తప్పించుకొనుటకై శ్రీకృష్ణుడు మరింత ప్రయత్నము ప్రారంభించెను. కొంత దూరము వెళ్ళగా అచట సింహపు కళేబరము కనబడెను. అచ్చటినుండి భల్లూకపు పాదముద్రలు కనబడెను. వాని ననుసరించి వెళ్ళి ఒక గుహలోనికి ప్రవేశించెను. అచ్చట యవ్వనమునందున్న ఒక యువతి ఊయలలో çపడుకున్న బాలుని ఊపుచుండెను. ఊయలపై ఆటవస్తువుగా శ్యమంతకమణి కట్టబడి ఉండెను. ఊయల ఊపుచున్న ఆమెయే జాంబవతి. ఆమె కృష్ణుని చూచి ఆయన సౌందర్యమునకు వశపడి, బహుశః ఆయన శ్యమంతకమణికై వచ్చెనని భావించి, గట్టిగా మాట్లాడినచో తనతండ్రి జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణునకేమైనా ఆపద కల్పించునేమోనని భయపడి, పాటపాడుచున్న దానివలె ఆ శ్యమంతకమణి వచ్చిన విధమునిట్లు చెప్చెను.శ్లో‘‘ సింహః ప్రసేనమవధీః సింహో జాంబవతాహతాః సుకుమారక మారోధీః తవ హ్యేష శ్యమంతకః(తా‘‘ ప్రసేనుని వధించిన సింహమును జాంబవంతుడు వధించి, శ్యమంతకమణిని తెచ్చెను. ఓ సుకుమారుడా! ఈ మణి నీకే ఏడవకుము.)అంతలో లోపల నిద్రించుచున్న జాంబవంతుడు లేచి వచ్చి, శ్యమంతకమణి కొరకై వచ్చెనని శంకించి శ్రీకృష్ణునితో ద్వంద్వ యుద్ధమునకు తలపడెను.ఆ కృష్ణుడే రామావతార కాలమున జాంబవంతునికి చిరంజీవిగా వరమిచ్చెను. ఆ కాలమున జాంబవంతునకు రాముని ఆలింగనమొనర్చుకొనవలెనని కోర్కె యుండెడిది. కాని కృష్ణుడు ఆ కోర్కెనిప్పుడు తీర్చుటకై జాంబవంతునితో ఇరవైయొక్క (21) రోజుల పాటు యుద్ధమొనర్చెను. క్రమముగా జాంబవంతుని బలము క్షీణించసాగెను. అప్పుడు తనతో యుద్ధం చేస్తున్నది ఎవరో కాదు త్రేతాయుగంలో రావణాసురుని సంహరించిన శ్రీరామచంద్రుడే అని గ్రహించాడు. వెంటనే చేతులు జోడించి దేవాదిదేవా! ఆర్తజనరక్షకా! నిన్ను త్రేతాయుగంలో భక్తజనపాలకుడైన శ్రీరామచంద్రునిగా గుర్తించాను. ఆ జన్మంలో నీవు నామీద అభిమానంతో కోరిక కోరమంటే నేను తెలివితక్కువగా మీతో ద్వంద్వయుద్ధం చేయాలని కోరుకున్నాను. నీవు ముందుముందు నా కోరిక తీరుతుందన్నావు. అప్పటినుంచి నీ నామస్మరణ చేస్తూ నీకోసం ఎన్నో యుగాలుగా ఎదురుచూస్తున్నా. నా ఇంటికే వచ్చి నా కోరిక నెరవేర్చావు. ధన్యుడను స్వామీ! నా అపచారమును మన్నించి నన్ను కాపాడుమని పలువిధాల అభ్యర్థించాడు. శ్రీకృష్ణుడు దయతో జాంబవంతుని శరీమంతా తన చేతితో నిమిరి జాంబవంతా! శ్యమంతకమణి అపహరించానన్న నింద నాపై వచ్చినది. దాని రూపుమాపుకొనుటకు వచ్చాను. నువ్వు ఆ మణి ఇస్తే వెళ్ళివస్తాను అన్నాడు. జాంబవంతుడు సంతోషంగా శ్యమంతకమణితో పాటుగా తన కుమార్తె ఆయిన జాంబవతిని శ్రీ కృష్ణునికిచ్చి సాగనంపెను.ద్వారాకానగర పౌరులకు ఈ సత్యము తెలిసి, శ్రీకృష్ణుడు శ్యమంతకమణిని సత్రాజిత్తునకిచ్చివేసెను. అప్పుడు సత్రాజిత్తు తన తప్పు తెలిసికొనిరి. శ్రీ కృష్ణుని క్షమింపమని ప్రార్థించి, తన కన్యారత్నమైన (కుమార్తె) సత్యభామను, మణిరత్నమైన శ్యమంతకమణిని గోపాలరత్నమైన శ్రీకృష్ణునకు సమర్పించెను.శ్రీకృష్ణుడు భూదేవి అవతారమైన సత్యభామను గ్రహించి శ్యమంతకమణి సత్రాజిత్తునకే తిరిగి ఇచ్చివేసెను.ఈలోగా పాండవులు, కుంతీదేవి, లక్క ఇంటిలో కాలి మరణించినారని వార్త వచ్చెను. శ్రీ కృష్ణునకు వారు సజీవులై ఉన్నారని తెలిసినప్పటికీ, కుటుంబ పెద్ద అయిన ధృతరాష్ట్రుని అనునయించుట, లౌకిక మర్యాదగా భావించి, హస్తినాపురమునకు వెళ్ళెను. యాదవుల యందే శతధన్వుడు, కృతవర్మ, అక్రూరుడను ముగ్గురు ప్రముఖులుండెడివారు. సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి పరిణయము చేయుటకు పూర్వము, వీరు ముగ్గురు ఆమెను తమకిచ్చి వివాహము చేయమని సత్రాజిత్తునడిగిరి. వారిలో ఒకరికి సత్యభామ నిత్తునని సత్రాజిత్తు వాగ్దానమొనర్చెను. కానీ అనుకోని పైన పరిణామములతో సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి వివాహం జరిపెను. దానిచే కక్ష పెంచుకొనిన ఈ ముగ్గురు, ఏకమై కృష్ణుడు లేని సమయమెరిగి, సత్రాజిత్తును సంహరించి శ్యమంతకమణిని అపహరింపమని శతధన్వుని ప్రేరేపింపగా, అతడట్లే చేసి ఆ మణిని అక్రూరుని వద్ద వదలి పారిపోయెను, ఇది తెలిసి శ్రీకృష్ణుడు హస్తినాపురమునుండి వచ్చి, సత్యభామను ఓదార్చి శతధన్వుని సంహరించుటకై బలరామునితో కలిసి రథములో బయల్దేరెను. గుర్రంపై పారిపోవుచున్న శతధన్వుడు, అది అలసి పడిపోగా, దానిని వదిలి పరుగిడుచుండెను. అంతట కృష్ణుడు బలరాముని రథమందుండమని, తాను దిగి శతధన్వుని వెంబడించి, పట్టి ద్వంద్వ యుద్ధంలో అతనిని సంహరించి ఒడలంతయు వెదుకగా, మణి దొరకదయ్యే అంతట కృష్ణుడు తిరిగి వచ్చి బలరామునకా విషయము తెలుపగా, అతడు కృçష్ణునితో నీవు బాల్యమునుండియూ చోరుడవు, ఇప్పుడు ఆ మణిని నేనడిగెదనని శంకించి, దానిని దాచివైచి నీవిట్లు చెప్పుచున్నావని శ్రీకృష్ణుని నిందించి, నీతో కలిసి యుండనని, విదేహ రాజ్యమునకు వెడలిపోయెను.బాహ్యశౌచము లేక మణిని ధరించి ప్రసేనుడు మరణించెను. అంతఃశౌచము లేక (శ్రీకృష్ణుని అనుమానించుటచే) సత్రాజిత్తు మరణించెను. పరమ భక్తుడైనప్పటికినీ, తాత్కాలికంగా భగవద్విరోధ భావమునొందిన అక్రూరుడు మనఃశాంతికై తీర్థయాత్ర చేయుచూ, కాశీ పట్టణమునకు చేరెను. అచ్చటికి పోగానే మనఃశాంతిని పొంది శ్యమంతకమణి వలన ప్రతిదినము వచ్చు బంగారమును ధైవకార్యములకు ఉపయోగించెను. అక్రూరుడు బాహ్యభ్యంతర శౌచమును పొంది యుండుటచే అచ్చట అతివృష్టి, అనావృష్టి రోగబాధలు లేక ప్రశాంతముగా వుండెను.ఇచ్చట శ్రీకృష్ణుడు బలరామునిచే నిందింపబడి ఒక్కడే తిరిగి ద్వారక నగరమునకు చేరెను. ఈ మణి విషయమై తమ దండ్రులకు కీర్తి కలుగరాదని శ్రీకృష్ణుడు ఏదో మాయ చేసెనని, జాంబవతి, సత్యభామలు అనుమానించిరి. శ్రీకృష్ణుడు ఈ అపనిందలకు కారణమేమిటాయని విచారవదనంతో ఆలోచించుచుండగా నారదుడు ప్రతక్షమై ఆ అపనిందలకు కారణం భాద్రపద శుక్ల చవితినాటి రాత్రి వేటకై అడవికి వెళ్ళినపుడు చంద్రుని చూచుటయేయని, ఆ విశేషముల గురించి ఇట్లు చెప్పెను.శశివర్ణుడను పేరుగల మహాగణపతి, అన్ని లోకములలో విహరించుచూ ఒకనాడు చంద్రలోకమునకు చేరెను. బాహ్యమున వినాయకుడు మరుగుజ్జు, లంబోదరుడు, అయినప్పటికీ హృదయమున మిక్కిలి కారుణ్యమూర్తి. కానీ చంద్రుడు పైకి అందగాడైనప్పటికీ, కవులచే వర్ణింపబడినప్పటికీ నడవడియందు దోషములున్నవాడు. అట్టి చంద్రుడు వినాయకుని చూచి వికటముగా నవ్వెను. అప్పుడు చంద్రుని అహంకారమును తగ్గించుటకై వినాయకుడు, ఎవ్వరేని చంద్రుని చూసినచో అపనిందలు పొందెదరని శపించెను. దానిచే జనులెవ్వరు చంద్రుని చూడరైరి. దానితో కుంగినవాడై చంద్రుడు తాను జన్మించిన క్షీరసాగరములోనికి వెళ్ళిపోయెను.చంద్రకాంతి లేమిచే ఓషధులు ఫలించుట మానెను. ప్రజలకు ఆహ్లాదము కరువాయెను. దీనిచే దయతలిచి, దేవతలు, ఋషులు, బ్రహ్మగారి వద్దకు పోయి నివారణోపాయము కొరకు ప్రార్థించిరి. అంతట బ్రహ్మ బాద్రపద శుక్ల చవితినాడు నక్తవ్రత మొనరింపవలెననీ (పగటి ఉపవాసము) విఘ్నేశ్వరుని పూజించి, మోదకములు, (ఉండ్రాళ్ళు), పండ్లు, కుడుములు, ప్రత్యేకించి దోసపండు, నివేదన మొనరింపవలెనని, సూచించెను. అప్పుడు చంద్రుడు కూడా ఆ వ్రతమొనర్చి వినాయకుని అనుగ్రహమును పొందెను. అంతట వినాయకుడు, ఒక్క తన అవతారదినమైన భాద్రపద శుక్ల చవితినాటి రాత్రి తప్ప మిగిలిన రోజులలో చంద్రుని చూచినను ఎట్టి నిందలు కలగవని శాపావకాశమిచ్చెను.అంతట భాద్రపద శుక్ల చవితినాటి చంద్రబింబము చూచుటవలన జరిగిన విపరీతములను స్వయముగా అనుభవించిన శ్రీకృష్ణ పరమాత్మ తనకు కలిగిన నిందలను పోగొట్టుకొనుటకై నారదుని సలహా మేరకు శ్రీకృష్ణుడు వినాయక వ్రతమాచరించెను. వెంటనే వినాయకుడు ప్రత్యక్షమై శ్రీకృష్ణునికి వచ్చిన అపనిందలు తొలగిపోవునని మంగళవాక్కులు పలికెను. అంతట శ్రీకృష్ణుడు తాను సమర్థతతో ఇంత కష్టపడితిని గాని, సామాన్యులకది ఎట్లు సాధ్యమగుననీ, కావున లోకమంతటినీ అనుగ్రహింపమని కోరెను.భాద్రపద శుక్ల చవితినాడు ఉదయం తనను ఫూజించి, శ్యమంతకోపాఖ్యానమును చదివిన మరియు విన్నా, చంద్రుని చూచిననూ ఎటువంటి అపనిందలు కలగవని వినాయకుడు వరమిచ్చెను.ఈ వృత్తాంతంలో దేవతలు, మహర్షులు, ప్రజలెల్లరు వినాయకుని యథాశక్తి పూజించి, కోర్కెలు నెరవేర్చుకుంటూ సుఖముగా వున్నారని సూతమహాముని శౌనకాదిమునులతో ఈ వృత్తాంతం తెలిపెను. దీనిలో ఏ మాత్రం ఏమరుపాటు తగదని శ్యమంతకోపాఖ్యానములో శ్రీకృష్ణపరమ్మాత వృత్తాంతం ద్వారా స్పష్టమైనది. అందువలన ఈ శ్యమంతోకాపాఖ్యానమును అనగా అందులో హితబోధను చెప్పుకొని గణేశతత్వంపట్ల భక్తి, వినయములతో శిరమున అక్షతలు ధరించిన యెడల చవితి చంద్రుని చూచిననూ నిష్కారణంగా నిందాభయం ఉండదని లోకులకు వరము ఇచ్చినారు. అది మొదలు శ్యమంతోకాపాఖ్యానము గాథను చదువుట, వినుట సాంప్రదాయమైనది.ద్వారకా నగరమునందు కలిగిన క్షామ నివారణకు మాహా భక్తుడైన అక్రూరుని రాక అవసమని భావించి, శ్రీ కృష్ణుడు అక్రూరునకు కబురుపంపెను. పరమభక్తుడైన అక్రూరుడు ద్వారక నగరమునకు వచ్చుటచే, అందరికి శ్యమంతకమణి వృత్తాంతము తెలిసి శ్రీకృష్ణుని పై వచ్చిన అపనిందలు తొలగిపోయినవి. లోపల, బయట, శౌచము కల అక్రూరుని వద్ద శ్యమంతకమణి శుభ పరంపరలిచ్చుచూండెను.‘‘మంగళం మహత్’’చేతిలో వున్న అక్షతలను కొన్ని విఘ్నేశ్వరుని పాదాల చెంత కొన్ని వుంచి కొన్ని మీ శిరస్సుపై వేసుకొని మిగిలినవి మీ పిల్లల శిరస్సుపై వేసి దీవించవలెను.– కథ సమాప్తం –పునఃపూజ :ఛత్రమాచ్ఛాదయామి‘ చామరేణ వీచయామి‘ నృత్యం దర్శయామి‘ గీతం శ్రావయామి‘ ఆందోళికా నారోహయామి‘ గజానారోహయామి‘ అశ్వానారోహ యామి‘ సమస్త రాజోపచార, భక్త్యోపచార, శక్త్యోపచార పూజాన్ సమర్పయామి‘‘ (స్వామిపై పుష్పాక్షతలు వేయాలి)విఘ్నేశ్వరుని మంగళహారతులు..శ్రీ శంభుతనయునకు సిద్ధిగణనాథునకు వాసిగల దేవతా వంద్యునకును ఆ సరసవిద్యలకు ఆదిగురువైనట్టి భూసురోత్తమ లోకపూజ్యునకును జయ మంగళం నిత్య శుభమంగళం! నేరేడు మారేడు నెలవంక మామిడి దూర్వార చెంగల్వ ఉత్తరేణి వేరువేరుగా దెచ్చి వేడ్కతో పూజింతు పర్వమున దేవ గణపతికి నెపుడు ‘‘జయ‘‘సుచిరముగ భాద్రపద శుద్ధచవితి యందు పొసగ సజ్జనులచే పూజగొల్తు శశి చూడరాదన్న జేకొంటినొక వ్రతము పర్వమున దేవగణపతికి నిçపుడు ‘‘ జయ‘‘ పానకము వడపప్పు పనస మామిడి పండ్లు దానిమ్మ ఖర్జూర ద్రాక్షపండ్లు తేనెతో మాగిన తియ్యమామిడిపండ్లు మాకు బుద్ధినిచ్చు గణపతికినిపుడు ‘‘ జయ‘‘ ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ల మీదికి దండుపంపు కమ్మనీ నెయ్యియు కడుముద్దపప్పును బొజ్జనిండుగ దినుచును పొరలుచును ‘‘ జయ ‘‘ వెండి పళ్లెములోన వేవేల ముత్యాలు కొండలుగ నీలములు కలయబోసి మెండుగను హారములు మెడ నిండ వేసుకొని దండిగా నీకిత్తు ధవళారతి ‘‘ జయ ‘‘పువ్వులను నినుగొల్తు పుష్పాల నినుగొల్తు గంధాల నినుగొల్తు కస్తూరినీ ఎప్పుడూ నినుగొల్తు ఏకచిత్తమ్మున పర్వమున దేవగణపతికి నిపుడు ‘‘ జయ ‘‘ ఏకదంతంబున ఎల్లగజవదనంబు బాగైన తొండంబు వలపు కడుపు జోకయిన మూషికము పరకనెక్కాడుచు భవ్యుడగు దేవ గణపతికి నిపుడు ‘‘ జయ ‘‘ మంగళము మంగళము మార్తాండ తేజునకు మంగళము సర్వజ్ఞ వందితునకు మంగళము ముల్లోక మహిత సంచారునకు మంగళము దేవ గణపతికి నిపుడు ‘‘ జయ ‘‘ సిద్ధి విఘ్నేశ్వర ప్రసిద్ధిగా పూజింతు ఒనరంగ నిరువది యొక్క పత్రి దానిమ్మ మరువమ్ము దర్భవిష్ణుక్రాంత యుమ్మెత్త దూర్వార యుత్తరేణి ‘‘ జయ ‘‘కలువలు మారేడు గన్నేరు జిల్లేడు దేవకాంచన రేగు దేవదారు జాజి బలురక్కసి జమ్మి దానిమ్మపువ్వు గరిక మాచీపత్రి మంచి మొలక ‘‘ జయ ‘‘అగరు గంధాక్షత ధూప దీప నైవేద్య తాంబూల పుష్పోపహారములును భాద్రపద శుద్ధ చవితిని కుడుములు నానుబాలు ఉండ్రాళ్లు పప్పు ‘‘ జయ ‘‘పాయసము జున్ను తేనెయు భక్తిమీర కోరి పూజింతు నిన్నెపుడు కోర్కెలలర ‘‘ జయ ‘‘బంగారు చెంబుతో గంగోదకము దెచ్చి సంగతిగ శిశువునకు జలకమార్చి మల్లెపువ్వుల దెచ్చి మురహరిని పూజింతు రంగైన నా ప్రాణలింగమునకు ‘‘ జయ ‘‘పట్టు చీరలు మంచి పాడిపంటలు గల్గి ఘనముగా కనకములు కరులు హరులు యిష్ట సంపదలిచ్చి యేలిన స్వామికి పట్టభద్రుని దేవగణపతికి నిపుడు ‘‘ జయ ‘‘ముక్కంటి తనయుడని ముదముతో నేనును చక్కనైన వస్తుసమితి గూర్చి నిక్కముగ మనమును నీయందె నేనిల్పి ఎక్కుడగు పూజలాలింప జేతు ‘‘ జయ ‘‘మల్లెలా మొల్లలా మంచి సంపెంగలా చల్లనైనా గంధసారము లను ఉల్లమలరగ మంచి ఉత్తమపు పూజలు కొల్లలుగ నేజేతు కోరి విఘ్నేశ ‘‘ జయ ‘‘దేవాదిదేవునకు దేవతారాధ్యునకు దేవేంద్రవంద్యునకు దేవునకును దేవతలు మిముగొల్చి తెలిసి పూజింతురు. భవ్యుడగు దేవగణపతికి నిపుడు ‘‘ జయ ‘‘చెంగల్వ చేమంతి చెలరేగి గన్నేరు తామరలు తంగేడు తరచుగాను పుష్పజాతులు తెచ్చి పూజింతు నేనిపుడు బహుబుద్ధి గణపతికి బాగుగాను ‘‘ జయ ‘‘మారేడు మామిడి మాదీఫలంబులు ఖర్జూర పనసలును కదళికములు నేరేడు నెంవంది టెంకాయ తేనెయు చాలగా నిచ్చెదరు చనువుతోడ ‘‘ జయ ‘‘ఓ బొజ్జగణపతి ఓర్పుతో రక్షించి కాచి నన్నేలు మీ కరుణతోను మాపాలగలవని మహిమీద నెల్లపుడు కొనియాడుచుందును కోర్కెదీర జయమంగళం నిత్య శుభమంగళం! ‘‘ జయ ‘‘వాయనదానము..శో‘‘ గణేశః ప్రతిగృహ్ణాతు గణేశో వైదదాతి చ గణేశః తారకోభాభ్యాం గణేశాయ నమోనమః (ఈ శ్లోకము వాయనమిచ్చువారు చెప్పవలెను) మంత్రము – దేవస్యత్యాసవితుః ప్రసవేశ్వినోర్బాహుభ్యాం పూషోహస్తాభ్యామా దదా!(ఈ మంత్రము వాయనము పుచ్చుకొనువారు చెప్పవలెను)ఉద్వాసన మంత్రము : (ఈ క్రింది మంత్రంతో గణపతి ప్రతిమ ఈశాన్యదిశగా మూడుసార్లు కదపవలెను) యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః‘ తాని ధర్మాణి ప్రథమాన్యాసన్‘‘ తేహనాకం మహిమానస్యచంతే‘ యత్రపూర్వే సాధ్యాస్సంతి దేవాః‘‘ శ్రీ సిద్ధిబుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామిన్ యథాస్థాన ముద్వాసయామి‘‘ పూజా విధానం సంపూర్ణమ్.(వ్రతకల్ప పూజా విధానం సమాప్తం) -
Teacher's Day 2024: జీవితాలను దిద్దేవాడు..
బాల్యం, కౌమారం యవ్వనం, ఆ తరువాత, ముదిమి వయసు మానవ జీవితంలో సహజ పరిణామాలు! బాల్య యవ్వనాల్లో గురువు పాత్ర అత్యంత కీలకమైనది. తరువాతి దశల్లో మనిషి ఉత్తమ ప్రపంచ పౌరునిగా, సామా జిక జీవిగా పరిణామం చెందడానికి ఉపాధ్యాయుని పాత్ర ఎనలేనిది. ప్రతి పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు ఏడాదికి ఒక్కసారైనా వైద్యులను పిలి పించి అవగాహనా కార్యక్రమం నిర్వహించాలి.వయసు పెరిగే కొలదీ మానవునిలో వచ్చే శారీరక మార్పులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించేలా చర్యలు తీసుకోవాలి. అలాగే పిల్లల తల్లిదండ్రులకు కూడా ఒక సీనియర్ ఉపాధ్యాయుని సహాయంతో, వీలైతే లేడీ టీచర్‌తో అవగాహన కల్పించాలి. ఫలితంగా టీనేజ్‌లో హార్మోన్ల ప్రభావం వల్ల పిల్లలలో కలిగే మార్పుల పట్ల అవగాహన కలుగుతుంది. క్షణికోద్రేకాలకు లోనై అకృత్యాలకు పాల్పడ కుండా ఈ అవగాహన పిల్లలను కాపాడుతుంది. తల్లిదండ్రులు కూడా వారు ఎటువంటి జాగరూకత వహించాలో తెలుసుకోగలుగుతారు.భారతీయ సమాజంలో గురువును దేవునిగా పూజించే సంప్రదాయం ఉంది. ‘గురు దేవోభవ!’ అన్న మాటలు అందుకే ఉనికిలోకి వచ్చాయి. గురువు పాత్ర కేవలం పాఠాలు చెప్పడంతోనే అయిపోదు. పిల్లలకు కర్తవ్యాన్ని, ధర్మాచరణ నూ నూరిపోయడం; దానం, సహనం, సహానుభూతి, సత్వగుణం, నిర హంకారం, నైపుణ్యాలను పెంపొందించడం లక్ష్యంగా పనిచేయాలి. విద్యార్థుల్లో దాగి ఉన్న శక్తి సామర్థ్యా లను వెలికి తీయాలి. వ్యాయామం, యోగ, ధ్యానం వంటివి గురు సముఖంలోనే రాణింపు కొస్తాయి.నిరాడంబరులై వినుతికెక్కిన సర్వేపల్లి రాధాకృష్ణ, గాంధీజీ, వివేకానందుడు, అబ్దుల్ కలాం వంటి ప్రముఖుల గురించి మన పాఠశాలలు, విశ్వవిద్యా లయాల్లో ఉపాధ్యాయులు చెప్పాలి. యువతను వజ్ర సంకల్పంతో దేశానికి ఉత్కృష్ట వనరులుగా మార్చగ లిగినవారు ఉపాధ్యాయులు! వారికి గురుపూజోత్సవ శుభాకాంక్షలు!గురువులు సమాజ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టు కుని, బోధనా విధానంలో నూతన దారులు తొక్కాలి. నిష్ఠ, అంకితభావం, విద్యా ర్థుల పట్ల వాత్సల్యం, ఆద రణ కలిగి ఉండటం మంచి గురువు లక్షణాలు. వారిలో ప్రశ్నలడిగే జిజ్ఞాస, ఉత్సు కతలను నలిపివేయకుండా ఉండాలి. విద్యార్థుల్లో శీల నిర్మాణానికి కృషి చేయడం ముఖ్యమైన విధి. ఆత్మ విమర్శ, ఆత్మ విశ్లేషణ, ఆత్మ గౌరవం, ఆత్మ నిగ్రహాలను ప్రోది చేసుకుని ఎవరి జీవితాన్ని వారు తీర్చిదిద్దుకునేలా పిల్లలను తీర్చిదిద్దే వాడు గురువు. మన భారతీయ గురు పరంపరకు ప్రణామాలు! – పరిమి శ్యామలా రాధాకృష్ణ, వ్యాసకర్త బీఈడీ కాలేజీ విశ్రాంత ప్రిన్సిపాల్, మదనపల్లె, అన్నమయ్య జిల్లాగురుతర బాధ్యత..నేడు భారతదేశంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో దాదాపు 15 లక్షల పాఠశాలలు, 58 వేల కళాశాలలు, 1,500 విశ్వవిద్యా లయాలు ఉండగా వీటిలో దాదాపు 27 కోట్ల మంది విద్యార్థినీ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. దాదాపు 1 కోటి 14 లక్షల మంది ఉపాధ్యా యులుగా పనిచేస్తున్నారు. అనాదిగా ప్రపంచంలోని అనేక దేశాలతో పోలిస్తే భారతదేశంలో విద్యకు, ఉపాధ్యాయులకు ఒక ప్రత్యేక గుర్తింపు,గౌరవాలు ఉన్నాయి. దీనికి నిదర్శనం తక్షశిల, నలందా వంటి విశ్వ విద్యాలయాలలో ప్రపంచంలోని అనేక దేశాల నుండి విద్యా ర్థినీ విద్యార్థులు వచ్చి విద్యను అభ్యసించి తిరిగి వెళ్లి తమ విద్యా ర్థినీ విద్యార్థులకు విద్యను బోధించిన విషయం చారిత్రక సత్యం. మనం ఆరాధ్య పురు షులుగా భావిస్తున్నటువంటి రాముడు, కృష్ణుడు, ప్రహ్లాదుని నుంచి గౌతమ బుద్ధుడి వరకు గురు కులాలలో గురువులకు సేవ చేస్తూ విద్యాబుద్ధులను అభ్యసించిన వారే. విదేశీయుల పాలన కింద శతా బ్దాలు తరబడి ఉన్న మన భారతదేశం అనాది నుంచి ఉన్న శ్రేష్ఠమైన విద్యా వ్యవస్థను కోల్పోయింది.స్వాతంత్య్రానంతరం మన విద్యా వ్యవస్థను గాడిన పెట్టే ప్రయత్నాలు అనేకం జరిగినప్పటికీ విద్యార్థుల్ని సౌశీల్యం, క్రమశిక్షణ కలిగిన ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దే సరైనటువంటి విధానాలు విద్యా వ్యవస్థలో కొరవడినాయి. నేడు యువతలో ముఖ్యంగా విద్యార్థినీ, విద్యార్థులలో పెద్దల ఎడల గౌరవం, కుటుంబ విలు వలు, నైతిక విలువలు, కఠోర శ్రమ, పరస్పర గౌరవం, దయ, సౌశీల్యం, ఐకమత్యం వంటి మానవీయ విలు వలు క్రమంగా తగ్గుతున్నాయి.ఫలితంగా వారు వ్యక్తి గత జీవితాలను కోల్పోతు న్నారు. అదే సమయంలో భారతదేశానికి అనాదిగా ఉన్న కీర్తి ప్రతిష్ఠలు కూడా పోతున్నాయి. అనేక విద్యాలయాలలో విద్యార్థులు మాదకద్రవ్యాలు, మద్యం, ధూమపానం వంటి వ్యస నాలకు బానిసలు కావడమే కాకుండా తమ అమూల్య మైన సమయాన్ని సోషల్ మీడియాకు బలి చేస్తున్నారు. అలాగే ఈమధ్య స్త్రీలపై అత్యాచారాలు పెరిగిపోవడమూ గమనార్హం. కావున కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థినీ విద్యా ర్థులకు విద్యతో పాటు బుద్ధిని కూడా నేర్పించవలసిన గురుతర బాధ్యత నేటి అధ్యాపకులపై ఉంది.గతంలో ప్రతి అధ్యాపకుడు సబ్జెక్టుతో సంబంధం లేకుండా పెద్ద బాలశిక్ష, చిన్న బాలశిక్ష వంటి వాటి నుండే కాకుండా సుమతి, వేమన, భాస్కర శతకాల నుండి విద్యార్థినీ విద్యార్థులకు సందర్భానుసారంగా నీతి వాక్యాలను, జ్ఞానాన్ని, శీలాన్ని, ఐకమత్యాన్ని బోధించేవారు. నేటి ఆధునిక అధ్యాపకులు కూడా విద్యార్థులను పరి పూర్ణమైన పౌరులుగా తీర్చిదిద్దడా నికి అన్ని విధాలా కృషి చెయ్యాలి. – వై.వి. రామిరెడ్డి, వ్యాసకర్త తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆచార్యులు -
Teachers' Day 2024: నా బెస్ట్ స్టూడెంట్స్..
ఉపాధ్యాయురాలిగా నేను 1992లో చాక్‌పీస్ పట్టుకున్నాను. తల్లిదండ్రులకు దూరంగా ఉన్న చిన్నారులు, అందులోనూ పేదింటి పిల్లలకు చదువు చెప్పేటప్పుడు చాలా బాధ్యతగా ఉండాలి. నా కన్నపిల్లలు ఇద్దరైతే 32 ఏళ్ల సర్వీస్‌లో దేవుడిచ్చిన పిల్లలు ఇరవై వేలకు పైనే.జ్వరంతో పరీక్ష రాసింది..లక్ష్మి... చక్కగా చదివే అమ్మాయి. నేను వాళ్లకు మాథ్స్ టీచర్ని, హౌజ్ పేరెంట్‌ని కూడా. మాథ్స్ పరీక్షకు ముందు లక్ష్మికి అమ్మవారు ΄ోసింది. ఒళ్లంతా కాలి΄ోతూ ఉంది. హాస్పిటల్‌కి తీసుకెళ్లి సెలైన్ పెట్టించి, బెడ్ పక్కనే ఉండి ధైర్యం చెపుతూ ఉన్నాను. ఉదయానికి జ్వరం కొంచెం తగ్గింది.‘పరీక్ష రాయగలవా?‘ అని అడిగాను. ‘మీరు పక్కన ఉంటే రాస్తాను‘ అంది ధైర్యంగా. మెల్లిగా సెంటర్‌కి తీసుకొని వెళ్ళాను. మా అబ్బాయికి కూడా ఆ రోజు పదో తరగతి పరీక్ష. కానీ ఈ పిల్లలే నా తొలి ్రపాధాన్యం. మొదటి అంతస్తు లో లక్ష్మి పరీక్ష గది.‘ఎక్కగలవా లక్ష్మీ?‘ అడిగాను. నీరసంగా బదులిచ్చింది. కొబ్బరి నీళ్లు తాగించి ఎగ్జామ్ హాల్లో పక్క పిల్లలకి లక్ష్మి గురించి చెప్పి కిందకు వచ్చాను. రిజల్ట్ వచ్చింది. చక్కటి మార్క్స్. పదో తరగతి మార్కులతోనే ΄ోస్ట్ ఆఫీస్ ఉద్యోగంలో చేరిందని తెలిసి ఎంత సంతోషం వేసిందో! ఓల్డ్ స్టూడెంట్స్ నా దగ్గరకు వచ్చినప్పుడు ‘పక్క వాళ్లకు మంచి చేస్తున్నారా? చెడు అలవాట్లు చేసుకున్నారా?‘ అని రెండు ప్రశ్నలు వేస్తాను. వాళ్లు ‘మేము మీ స్టూడెంట్స్ మేడం’ అంటారు. నా పిల్లలు ఇంజినీర్లు, టీచర్స్, నర్స్‌లు, ఎస్.ఐ, ్రపాజెక్ట్ మేనేజర్ లు, ఫిజియో థెరపిస్టులు... ఇందరికి అమ్మగా ఉండగల వరం ఇదిగో ఈ ఉపాధ్యా వృత్తిలోనే సాధ్యం. అబ్దుల్ కలాం గారి అడుగుజాడల్లో నడిచే నాకు ఇంతకంటే కావలసింది ఏముంది! చివరి క్షణం వరకూ అధ్యాపకురాలిగానే ఉంటాను.చదువు కోసం పెళ్లిని వాయిదా వేసింది..‘ఉమ‘. పదో తరగతి మంచి మార్క్స్‌తో పాస్ అయింది. మా గురుకుల పాఠశాలలోనే ఇంటర్ చదివింది. రోజూ నా క్లాస్‌కి వచ్చి కొద్దిసేపు ఉండేది. ఎందుకలా అని అడిగినప్పుడు ‘మా అమ్మను చూసినట్లు ఉంటుంది. ఇప్పుడు మీరు క్లాసుకు రావడం లేదు కదా! అందుకే రోజూ వచ్చి చూసి వెళ్తున్నాను’ అని ఉమ చెప్తుంటే నాకు కన్నీళ్లాగలేదు. ఇంటర్ తరువాత మా ఇంటికి వచ్చి ‘బీటెక్‌లో చేరడానికి కాలేజ్‌లు ఆప్ష¯Œ ్స పెట్టండి... పదో తరగతి తరువాత పెళ్లి చేసుకోవద్దు... ఇంట్లో ఒప్పించి చదవండి అని మీరు చెప్పేవారు కదా. నేను మా నాన్నను అలాగే ఒప్పించి చదువుకోబోతున్నాను. చదువు తరువాతే పెళ్లి అని చెప్పేశాను’ అంటున్న ఉమని చూస్తే తృప్తి. ఉమ బీటెక్ పూర్తి చేసి ఉద్యోగంలో చేరింది. మరో ఇంజినీర్ నే పెళ్లి చేసుకున్నది... అని తెలిసినప్పుడు సంతృప్తి. – తన్నీరు శశి, గణిత అధ్యాపకురాలు, పుదూరు సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల, తిరుపతి జిల్లా -
Teacher's Day 2024: థ్యాంక్యూ టీచర్..!
అంతవరకూ నీవొక రాయివి. గురువు చేయి పడగానే చెకుముకి అవుతావు. అంతవరకూ నీవొక ప్రవాహం. గురువు కాళ్లను తడపగానే దిశ గల్గి సారవంతమైన నేలకు మళ్లి విత్తుకు ప్రాణం పోస్తావు. అంతవరకూ కేవలం తోలు ముక్క. గురువు?... దానికి నాదం ఇస్తాడు. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసినా ఎవరో ఒకరు ప్రేమగా ఆలనా పాలనా చేయగలరు. ప్రేమ పంచగలరు. కాని జ్ఞానం మాత్రం సరైన గురువే ప్రసాదిస్తాడు. గద్దించి బుద్ధి చె΄్తాడు. కనుచూపుతోనే శాసించి కడుపులో కరుణ దాచుకుని ఎదిగే వరకూ చేయి పట్టి నడిపిస్తాడు. తల్లిదండ్రులు జన్మనిస్తే దానిని సార్థకం ఎలా చేసుకోవాలో గురువే తెలియచేస్తాడు. ఒక్క గురువు వేల జీవితాలకు దిక్సూచి. గొప్ప గొప్ప టీచర్లు ఎందరో. తెలియని మహానుభావులు ఎందరో. విద్యార్థులు ఎదిగేందుకు నిచ్చెనలుగా మారి వారు మాత్రం నేల మీదే ఉండిపోతారు. అలాంటి మహనీయులందరికీ ‘టీచర్స్ డే’ సందర్భంగా నమస్కారాలు. థ్యాంక్యూ టీచర్.నేచరే టీచర్..‘ప్రకృతి అనే బడిలో ఎంతో మంది గురువులు ఉన్నారు’ అంటుంది రచయిత్రి, ఇలస్ట్రేటర్ బుల్బుల్ శర్మ. తానే ఒక గురువుగా మారి ప్రకృతిని గురువుగా చేసుకుని ఎలాంటి పాఠాలు నేర్చుకోవచ్చో పిల్లలకు చెబుతోంది. వారి కోసం స్టోరీ, ఆర్ట్ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తోంది. క్లాస్‌రూమ్‌లో కూచుంటే టీచర్ మాత్రమే గురువు. అదే ప్రకృతి అనే క్లాస్‌రూమ్‌లోకి వెళితే ప్రతి తీవ, చెట్టు, పక్షి, ఊడ అన్నీ ఎన్నో నేర్పిస్తాయి పిల్లలకు. విషాదం ఏమంటే పిల్లలు ఈ అతి పెద్ద క్లాస్‌రూమ్‌ను మిస్ అవుతున్నారు అంటుంది శర్మ.పిల్లలకు అడవి తెలియదు..‘ఎలాంటి కాలంలో ఉన్నాం మనం? చెట్టు కనిపించడమే అపూర్వం, చెట్టు మీద పిట్ట కనిపించడం అద్భుతం అనుకునే కాలంలో ఉన్నాం. అక్కడెక్కడో చంద్రుడి మీద ఆవాసాల గురించి ఆలోచించే మనం చుట్టు ఉన్న ప్రకృతికి మాత్రం దూరం అవుతున్నాం. పిల్లలను ప్రకృతిలోకి తీసుకురావడానికి, అక్కడ పక్షులు అనే గురువులను వారికి పరిచయం చేయడానికి ఎన్నో కథలు రాశాను. బొమ్మలు వేశాను. వాటిని చూసిన, చదివిన పిల్లలు మనం కూడా పచ్చటి అడవిలోకి వెళదాం అనుకుంటారు’ అంటుంది శర్మ.ఫోన్ నుంచి ఫారెస్ట్‌కి..ఒక రోజు శర్మ ఫోన్ మోగింది. తనని తాను పరిచయం చేసుకున్న తరువాత ‘మా అబ్బాయి మీ పుస్తకం చదివిన తరువాత ఫారెస్ట్‌కు తీసుకువెళ్లు, పక్షులు చూపించు అని ఒకటే అడగడం...’ అని ఒక తల్లి శర్మతో ఫోన్లో చెబుతూ పోయింది. ఆ తల్లి గొంతులో పిల్లాడి మీద అసహనం లేదు. ఆమె మనసు సంతోషంతో నిండిపోయింది. బుల్బుల్ శర్మ పుస్తకాలు పిల్లలపై చూపిన సానుకూల ప్రభావం గురించి చెప్పడానికి ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ‘మీరు ఏం నేర్చుకున్నారు పక్షుల నుంచి’ అని అడిగితే ‘క్రమశిక్షణ, ఐక్యత. కష్టపడడం, ఆత్మవిశ్వాసం, ఎప్పుడూ సంతోషంగా ఉండడం, గుడ్ పేరింటింగ్ ఇలా ఎన్నో మంచి విషయాలు పక్షుల నుంచి నేర్చుకోవచ్చు’ అంటారు పిల్లలు. ఆమె ఏ స్కూల్లోనూ టీచర్‌గా పని చేయలేదు. కాని వందలాది విద్యార్థులకు ప్రియమైన గురువు. ఆమె పుస్తకాలే వారికి గురుబోధ. వారితో ఆమె చేయించే హోమ్‌వర్క్ పేరే అడవి. పిల్లల కోసమే జీవితందిల్లీలో పుట్టిన బుల్బుల్ శర్మ భిలాయ్‌లో పెరిగింది. దిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీలో రష్యన్ లాంగ్వేజ్‌లో గ్రాడ్యుయేషన్ చేసి పై చదువుల కోసం మాస్కో స్టేట్ యూనివర్శిటీకి వెళ్లింది. స్వదేశానికి తిరిగివచ్చిన తరువాత పెయింటర్‌గా ప్రస్థానంప్రారంభించింది. పిల్లల కోసం ఆమె రాసిన కథలు భారతీయ భాషలతో పాటు ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్.. మొదలైన విదేశి భాషల్లోకి కూడా అనువాదం అయ్యాయి. తన పరిశీలన, ప్రయాణాల ఆధారంగా పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా రచనలు చేయడం బుల్బుల్ శర్మ శైలి. ‘ఏమైనా నేర్చుకోవచ్చు. ఏ వయసులో అయినా నేర్చుకోవచ్చు. ఎవరి నుంచి అయినా నేర్చుకోవచ్చు’ అనేది శర్మ నోటి నుంచి వినిపించే మాట.ఇవి చదవండి: Teacher's Day Special: నా బెస్ట్ టీచర్.. -
Teacher's Day Special: నా బెస్ట్ టీచర్..
ఈ ఏడాది జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకుంటున్నారు డాక్టర్ ఎన్. మృదుల. హైదరాబాద్, బేగంపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో తెలుగు అసోసియేట్ ప్రొఫెసర్. ఉపాధ్యాయురాలిగా 34 ఏళ్లలో ఆమె దగ్గర పదివేల మంది విద్యార్థులు తెలుగు నేర్చుకున్నారు. తనను బోధనరంగం వైపు నడిపించింది సికింద్రాబాద్, ప్యాట్నీలోని తాను చదువుకున్న స్కూలు, ఆ స్కూల్ తెలుగు టీచర్ భువనేశ్వరి గారేనన్నారు డాక్టర్ మృదుల. అంటే ఈ బెస్ట్ టీచర్ మెచ్చుకున్న తన బెస్ట్ టీచర్ భువనేశ్వరి.అంతా ఆ టీచర్ ప్రభావమే..‘భువనేశ్వరి టీచర్ పద్యంలోని ప్రతి పదానికి అర్థం చెప్పడంతో పాటు, దానికి వ్యుత్పత్తి, ఆ పదాన్ని ప్రయోగించడం వెనుక కవి ఉద్దేశం చెప్పేవారు. కవితలు, కథలు రాయించేవారు. సభా నిర్వహణ చేయించేవారు. ఆమె ప్రభావంతోనే తెలుగు భాష మీద మక్కువ పెరిగింది. ఆ ప్రోత్సాహమే ఇప్పటికీ మయూఖ, తరుణి మ్యాగజైన్లలో కాలమిస్టుగా వ్యాసాలు రాయిస్తోంది. పాఠం చెప్పడంలో కూడా ఆమె బాటనే అనుసరిస్తున్నాను’ అంటారు మృదుల.నిత్యం విద్యార్థినే!‘నా విద్యార్థులకు నేను అసైన్మెంట్లు ఇచ్చినప్పుడు వాళ్లు కచ్చితంగా గడువులోపే పూర్తి చేయాలని కోరుకుంటాను. అలాగే అధికారుల నుంచి మాకు వచ్చే అసైన్మెంట్లను కూడా గడువులోపు పూర్తి చేసేదాన్ని. పనిని శ్రద్ధగా అంకితభావంతో చేయాలనుకుంటాను. మా కుటుంబంలో టీచర్లు లేరు. నేను టీచింగ్‌లోకి వచ్చినందుకు అమ్మానాన్న చాలా సంతోషించారు. కోవిడ్‌లో ఆన్లైన్ క్లాసులు చెప్పడానికి సాంకేతికపరంగా అవసరమైన సహాయం మా పిల్లలు చేసేవాళ్లు. కోవిడ్ తర్వాత కూడా అవసరాన్ని బట్టి ఆన్లైన్ క్లాసులను కొనసాగించాను. క్లాసులో పూర్తి కాని పాఠాలను ఇంటికి వచ్చిన తర్వాత ఆన్లైన్లో చెప్తున్నాను. టీచర్‌గా ‘బెస్ట్ ఆన్‌లైన టీచర్, బెస్ట్ హెచ్ఓడీ, బెస్ట్ ఫ్యాకల్టీ’ గౌరవాలందాయి. ఉపాధ్యాయురాలిగా ప్రభుత్వం నుంచి పురస్కారం అందుకోవడం ఇదే మొదటిసారి’’ అని తన ఉపాధ్యాయ ప్రస్థానాన్ని వివరించారు డాక్టర్ మృదుల. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఢిల్లీలోని విజ్ఞానభవన్‌లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఆమె ‘ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు’నందుకోనున్నారు.సీతమ్మబడి..మా స్కూల్ పేరు ‘పరోపకారి బాలికోన్నత పాఠశాల’. సీతమ్మ అనే మహిళ కట్టించిన స్కూల్ కావడంతో సీతమ్మబడి అంటారు. కవితలు రాయడంతోపాటు స్కూల్లో జరిగే సభలు, సమావేశాల్లో చురుగ్గా ఉండేదాన్ని. చక్కటి తెలుగుతో వక్తలను వేదిక మీదక ఆహ్వానించేదాన్ని. పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో ఉన్నప్పుడు ఆకాశవాణిలోని యువవాణి కార్యక్రమంలో ప్రయోక్తగా ప్రముఖులను ఇంటర్వ్యూ చేశాను. అనౌన్స్మెంట్లు, వ్యాసాలు కధానికలు చదవడం... ఇలా కలం, గళం కలిసి కొనసాగాయి. ఇక బోధనరంగంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజూ ఇష్టమైన రోజుగానే గడిచింది. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
గురువును మించిన శిష్యులు: ఈ సెలబ్రిటీల గురించి తెలుసా?
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెబరు 5న మన దేశంలో టీచర్స్‌డే జరుపుకోవడం ఆనవాయితీ. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆసాధారణ ప్రజ్ఞాశాలి. రాజ నీతి కోవిదుడు, విద్యావేత్త. భారత తొలి ఉపరాష్ట్రపతిగా, రెండో రాష్ట్రపతిగా విశేషసేవంలందించి, భారత అత్యున్నత పురస్కారం ‘భారతరత్నం’ అందుకున్న గొప్ప వ్యక్తి.ఉధ్యాయ దినోత్సవం అనగానే విద్యార్థులకు ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది.ఒక విధంగా చెప్పాలంటే ఇదొక అరుదైన సందర్భం అని చెప్పవచ్చు. టీచర్లు, విద్యార్థుల కలిసి సరదాగా ఆడుతూ పాడుతూ గడిపే చక్కటి అవకాశం. తమ అభిమాన టీచర్ల వేషధారణలో సందడి చేస్తారు. వారిని అనుకరిస్తారు. భవిష్యత్తులోతామూ ఇలాగే కావాలని కలలు కంటారు. జీవితాంతా తమ అభిమాన టీచర్లను, వారి జ్ఞాపకాలను తమ గుండెల్లో పదిలంగా దాచుకుంటారు. అలాంటి వారిలో కొంతమంది సెలబ్రిటీల గురించి తెలుసుకుందాం. ‘‘రాయిని వజ్రంలా మార్చగలిగే శక్తే ఉపాధ్యాయుడు’’గురువు అంటే మనల్ని అజ్ఞానంనుంచి జ్ఞానంవైపు నడిపించే అద్భత శక్తి. విద్యతో పాటు విచక్షణ కూడా నేర్పించేవాడే గురువు. గురువు లేనిదే ఏ మనిషికీ పురోగతి లేదు. గురువు అనేక రూపాలలో ఉంటాడు. గైడ్ అనే ఆంగ్ల పదం సంస్కృత పదం గురు నుండి ఉద్భవించింది. నిస్వార్థంగా తన విజ్ఞానమంతా శిష్యుడికి ధారపోస్తాడు గురువు. ఆ జ్ఞానంతో తన శిష్యుడు లోకానికి మేలు చేయాలని భావిస్తాడు.‘‘విద్యార్థులను తీర్చిదిద్దే క్రమంలో వెలకట్టలేని త్యాగాలు చేసిన ఉపాధ్యాయులందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు.’’అమితాబ్ బచ్చన్: బాలీవుడ్ స్టార్ యాక్టర్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్. గంభీరమైన ఆయన వాయిస్‌కు ఫిదా కాని వారు ఉండరు. ఆయన స్వరమే ఆయనకు కొండంత ఆస్తి. ఆయన స్వరంగా ఇంత గొప్ప ఖ్యాతి గడించినడానికి, పాపులర్ కావడానికి కారణం ఇంగ్లీష్ టీచర్ మార్టిన్. తప డిక్షన్‌ను అభివృద్ధి చేయడంలో మార్టిన్ ఎంతో సాయం చేశారని, తనను ఎంతో ప్రోత్సహించేవారని మార్టిన్ గురించి ఎపుడూ చెబుతూంటారు.ఏ.పీ. జే అబ్దుల్ కలాం: భారతదేశ మాజీ రాష్ట్రపతి, ప్రఖ్యాత శాస్త్రవేత్త అబ్దుల్ కలాం చాలా మందికి స్ఫూర్తి. మరి ఆయనకు ప్రేరణ ఇచ్చిన టీచర్ ఎవరో తెలుసా? కలాం పాఠశాల ఉపాధ్యాయుడు ఇయాదురై సోలమన్. పెద్ద కలలు కనడం, ఆ కలల సాకారం కోసం కష్టపడి పనిచేసే లక్షణాలను ఆయన సోలమన్ నుంచే నేర్చుకున్నారట.ప్రియాంక చోప్రా: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాకు ఒక మహిళా ఉపాధ్యాయురాలు ప్రేరణ. తన హైస్కూల్ టీచర్, ఓ'బ్రియన్ గురించి ప్రియాంక తరచూ ప్రస్తావిస్తూ ఉంటుంది. నిర్మాణం విషయంలో తనను ఎంతో ప్రోత్సహించేవారని చెప్పేవారు. వైఎస్ రాజశేఖర రెడ్డి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి. వైఎస్ఆర్ గా ప్రసిద్ధి చెందిన వై.ఎస్.రాజశేఖర రెడ్డి కూడా ఉపాధ్యాయులనుచి బాగా ప్రభావితమయ్యారు. తనపై తన టీచర్లు ప్రభావం గణనీయంగా ఉంటుందని స్వయంగా ఆయన చెప్పేవారు. ముఖ్యంగా కేవీ సుబ్బారెడ్డి తన శక్తి సామర్థ్యాలను ఆదిలోనే గుర్తించి, ఉన్నత విద్యను అభ్యసించి, ప్రజా సేవలో కొనసాగాలని సూచించారట. ఆయన మార్గదర్శకత్వం, ప్రోత్సహంతోనే నిబద్ధతతో కూడిన ప్రజాపాలనలో, క్రమశిక్షణతో, ఉన్నతమైన ఆశయాలతో తాను రాణించినట్టు వైఎస్ఆర్ చెప్పేవారు. సచిన్ టెండుల్కర్: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ సాధించిన విజయాలను, క్రమశిక్షణ గురించి ప్రత్యేక పరిచయం అవసం లేదు. తన కోచ్ రమకాంత్ అచ్రేకర్ శిక్షణే తనను లెజెండరీ క్రికెటర్, "మాస్టర్ బ్లాస్టర్", "ది గాడ్ ఆఫ్ క్రికెట్" గా క్రికెట్ చరిత్రలో నిలబెట్టింది. అతని క్రికెట్ ప్రయాణంలో కోచ్ రమాకాంత్ అచ్రేకర్ ముఖ్యమైన పాత్ర పోషించాడు. ముంబైలోని దాదర్‌లోని శివాజీ పార్క్‌లో సచిన్‌కు శిక్షణ ఇచ్చాడు. వినోద్ కాంబ్లీ కూడా ఇతని శిష్యుడే. అచ్రేకర్ చెప్పిన స్ఫూర్తివంతమైన మాటలే తన జీవితాన్ని సమూలంగా మార్చేశాయని సచిన్ గుర్తు చేసుకున్నారు. -
ఆట కదరా శివా!
పాండిచ్చేరి పట్టణానికి చెందిన ఉన్నత విద్యావంతుడైన ఓ యువకుడికి అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణం చేయాలనిపించింది. అనుకున్నదే తడవుగా అరుణాచలం బస్సు ఎక్కాడు. అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకుని రాజగోపురం వద్ద నిలబడి వినాయకుణ్ణి ప్రార్థించి నడక ప్రారంభించాడు. అష్టలింగాలను చూస్తూ గిరి ప్రదక్షిణ పూర్తి చేయాలని అతడి ఆలోచన.నడుస్తూ నడుస్తూ రమణ మహర్షి ఆశ్రమం చేరాడు. అక్కడ గిరి ప్రదక్షిణ చేయడానికి వచ్చిన ఓ ఆధ్యాత్మిక వేత్త పరిచయం అయ్యాడు. ‘‘అలజడి లేని జీవితాన్ని గడ΄ాలంటే ఏమి చేయాలి?’’ అని ఆసక్తిగా ఆ ఆధ్యాత్మికవేత్తను అడిగాడు యువకుడు. ఆధ్యాత్మిక వేత్త చిరునవ్వు ముఖంతో ‘‘ఇద్దరూ ఆడగలిగి, ఇద్దరూ గెలవగలిగే ఆట ఆడాలి’’ అని బదులిచ్చాడు. అర్థం కాని ముఖం పెట్టాడు ఆ యువకుడు. ఆధ్యాత్మికవేత్త యువకుడి హావభావాలు పట్టించుకోకుండా వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ‘ఇద్దరు ఆడితే ఎవరో ఒకరు గెలుస్తారు కానీ, ఇద్దరూ ఎలా గెలుస్తారు?’ అని ఆలోచనలు మొదలయ్యాయి ఆ యువకుడిలో. సమాధానం తెలుసుకుందామని తను కూడా వేగం పెంచాడు. వల్లలార్ ఆశ్రమం వద్ద మళ్ళీ ఆధ్యాత్మిక వేత్త కనిపించాడు. ఆశ్చర్యంగా ‘‘మీరు చెప్పింది ఎలా సాధ్యం?’’ అని ప్రశ్నించాడు. ‘‘ఆలోచించు. నీకే అర్థమవుతుంది. తమాషా ఏమిటంటే ఇద్దరే కాదు, ఆ ఆటని యాభై మంది ఆడినా... అందరూ గెలుస్తారు. అంతేకాదు... అది అందరూ ఆడగలిగిన ఆట కూడాను’’ అంటూ ఆధ్యాత్మిక వేత్త వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. మళ్ళీ మొదటికి వచ్చింది యువకుడి పరిస్థితి. ఎవరినైనా అడిగి తెలుసుకుందామని ముందూ వెనుకా చూశాడు. తెలిసిన ముఖాలేవీ కనిపించలేదు. చేసేదేం లేక ఆధ్యాత్మికవేత్తను వెదుక్కుంటూ వెళ్ళాడు.ఎలాగైతేనేమి ఈశాన్య లింగం వద్ద కనిపించాడు. గెసపోసుకుంటూ చెమటలు కారుస్తూ వెళ్ళి‘‘మీరు సమాధానం చెప్పక΄ోతే నా తల బద్దలై ΄ోయేలా ఉంది’’అని దిగులుగా ముఖం పెట్టాడు. యువకుడి భుజం తడుతూ ఆ ఆధ్యాత్మికవేత్త ‘‘విచిత్రం ఏమిటంటే... వందమంది ఆ ఆట ఆడినా, వందమందీ గెలుస్తారు. అదేమిటంటే... ఎదుటివారిని ప్రేమించే ఆట. అక్కడ అందరూ విజేతలే. ఓటమి పాలయ్యేవారు ఎవ్వరూ ఉండరు’’ అని సమాధానమిచ్చి అక్కడినుంచి మెరుపు వేగంతో వెళ్ళి΄ోయాడు.‘‘నిజమే. జీవితమనేది ఒక ఆటలాంటిది. ప్రేమ విత్తనాలు వెదజల్లే ఆట ఆడటం ప్రారంభిస్తే జీవితం పూల తోట అవుతుంది. దానికి వయస్సు, భాష, లింగం, ్ర΄ాంతం, కులం, మతం అనే హద్దులు ఉండవు ’’ అనుకుంటూ ఆ యువకుడు గిరి ప్రదక్షిణ పూర్తి చేశాడు. – ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
పిందె.. పండు...వైరాగ్యం
రుషిరుణం, పితృరుణం, దేవరుణం... ఈ మూడు రుణాలు తీరాలంటే ధర్మపత్ని సహకారం ఉండి తీరాలి. అంటే నీవు గృహస్థాశ్రమ ప్రవేశం చేస్తున్నావు. అప్పుడు నీవు ఏమి చేసినా అవి ధర్మంతో కట్టుబడి ఉంటాయి. చేయవలసినవి చేస్తూ తరించి΄ోతుంటావు. కారణం– అడుగున ధర్మం ప్రవహిస్తూ ఉంటుంది. అందువల్ల నీ కర్మలన్నీ శాపాలను విప్పేస్తుంటాయి. అందుకే ఈ తేలిక మార్గాన్ని నిర్దేశించారు. అది లేక΄ోతే ఇంద్రియాలు అకస్మాత్తుగా కాటువేసే అవకాశం ఉంది. అంటే ధర్మచట్రంలో ఉన్న అర్ధకామాలు దేనినయినా అనుభవించు... క్రమ క్రమంగా ఒక వయసు వచ్చేసిన తరువాత ధర్మానుష్ఠాన బలం వైరాగ్య సుఖాన్నిస్తుంది. క్రమేణా ఒక నిరాసక్తత, ఒక అనుభవం బయల్దేరుతుంది లోపల. అంటే బలవంతంగా అంటించుకున్నది కాదు, అది ఈశ్వర కృపతో వచ్చేది. వైరాగ్యమంటే.. ఈ సుఖాలన్నీ ఒక సుఖాలా... అనిపించడం... ఏమీ పట్టించుకోకుండా అని కాదు. గాలి తన పని తాను చేసుకు΄ోతుంటుంది. జాజి పందిరి మీదినుంచి ΄ోతే పరిమళభరితం అవుతుంది..అప్పుడు గాలిని అభినందిస్తే ΄÷ంగి΄ోదు. ఒక కళేబరం మీది నుంచి΄ోయినప్పుడు దుర్గంధాన్ని వ్యాపింపచేస్తుందని అభిశంసిస్తే అది కృంగి΄ోదు. దాని పని అది చేసుకుంటూ ΄ోతుంది. అలా ΄÷ంగి΄ోవడాలు, కుంగి΄ోవడాలు లేకుండా... నీ కర్తవ్యం నీవు చెయ్యాలి. నీ నిజాయితీ నీ అంతరాత్మకు, ఈశ్వరుడికి తెలిస్తే చాలు..‘‘లోకుల్ నన్గని మెచ్చనీ యలగనీ లోలోన నిందించనీ/ చీకాకున్ బడనీ మహాత్ముడననీ../ మూకీభావమునన్ తిట్టనీ త్రోయనీ / నీ కారుణ్యము కల్గి ఉండినను అంతేచాలు నోశంకరా!’’ అంటారు శంకరాచార్యులు. నీ స్వచ్ఛత ఈశ్వరుడికి తెలిసినంత కాలం నీవు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఆయన ముందు కూడా నీవు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తే... పూజామందిరంలోకి వెళ్ళు.. లెంపలేసుకుని క్షమాపణలడుగు.‘ఈశ్వరా! నా వల్ల ఇటువంటి అపరాధం మళ్ళీ జరగకుండు గాక!’ అని శరణువేడుకో. చాలు.ఎవరయితే ద్వంద్వాలకు అతీతులయిపోతున్నారో వారు నాకు దగ్గరవుతున్నట్లు.. అంటాడు గీతాచార్యుడు. వైరాగ్యం క్రమంగా సత్యాన్ని అంగీకరించే స్థాయికి తీసుకువెడుతుంది. సూర్యోదయ సూర్యాస్తమయాల్లో ఆయుర్దాయం కరిగిపోతున్నది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. ఈ శరీరం ఉండగానే నీవు చేయవలసిన కర్తవ్యాలు నెరవేర్చు. సద్వినియోగం చేసుకో. అంటే మంచి విషయాల్లోనే అనురక్తి ఉంటుంది తప్ప లౌకిక విషయాలపట్ల నిరాసక్తత పెరగడమే వైరాగ్యం. ‘కోటిమంది వైద్యులు కూడి వచ్చినకాని మరణమన్న వ్యాధి మాన్పలేరు’. అంటే ఈ వైరాగ్యం ఎప్పుడు వస్తుంది..?. పిందెకూ పండుకూ తేడా తెలుసుకుంటే ఈ ప్రశ్నకు జవాబు దొరుకుతుంది. పిందె పట్టుకుని ఉండాలి. పండు తనంతటతాను విడి΄ోయి పడి΄ోవడానికి సిద్ధంగా ఉండాలి. అంటే పట్టుకోవాల్సిన వయసులో అన్నీ పట్టుకో... ధర్మబద్ధంగా. విడవాల్సి వచ్చినప్పుడు నిస్సంకోచంగా విడిచేసెయ్. కొబ్బరికన్నా పెంకును గట్టిగా పట్టుకునే వాళ్ళు ఎవరుంటారు... నీళ్ళు లోపలికి ఎప్పుడు ఎలా వెళ్ళాయో తెలియదు, ఎలా ఆవిరయ్యాయో తెలియదు. లోపల గురుగుడుమంటూ ఉంది... అంటే విడిపోయింది. పూర్ణాహుతికి పనికొస్తుంది. అంటే ఈ శరీరం నేను కాదు...ఆత్మ అని అనుభవంలోకి రావడమే వైరాగ్యం. దీనికి ఈశ్వరకృప ప్రధానమయినా, నీ కర్మాచరణ లేకుండా ఈశ్వర కృప ఉండదు. -
అంతా.. ఆ ఏడుకొండల వాడి దయ!
‘ఇంకెన్ని గల్లీలు తిప్పుతారు?’ పక్కనే ఉన్న సహోద్యోగిని అడిగింది ఆమె. ‘అదే కదా.. ఎక్కడ బండి ఆగినా, ఆ స్ట్రీట్‌లోనే రెయిడేమో అనుకుంటున్నా’ అన్నాడు సహోద్యోగి. ఆ జీప్ మరో రెండు మలుపులు తిరిగి, ఆగింది. ‘వార్నీ.. తిరిగి తిరిగి బయలుదేరిన చోటుకే వచ్చాం!’ అంది ఆమె. ఆ మాటకు ఆ జీప్‌లో వెనకాలకూర్చున్న మిగతా ముగ్గురూ చిన్నగా నవ్వుకోసాగారు. అంతలోకే ఆ టీమ్‌ని లీడ్ చేస్తున్న ఆఫీసర్ జీప్ దిగి, ఆ పరిసరాలను మార్చి మార్చి చూడసాగాడు. అది గమనించిన నలుగురు ఉద్యోగులూ జీప్ దిగారు. టార్గెట్ వైపు నడకసాగించాడు ఆఫీసర్. ఆ నలుగురూ అతన్ని అనుసరించారు.వంద అడుగులు నడిచి, ఒక చిన్న పెంకుటిల్లు చేరుకున్నారు. ఒకసారి వాచ్ చూసుకున్నాడు ఆఫీసర్. సరిగ్గా రెండు నిమిషాలకు ‘పదండి’ అన్నట్టుగా ఆ ఇంటి ప్రహరీ గేటు తీశాడు. ఇంట్లోకి నడిచే దారి మా్రతమే ఫ్లోరింగ్‌తో, మిగతా ముంగిటంతా పూలు, పళ్ల చెట్లు, కూరగాయల పాదులతో ఉంది. గేటు పక్కనున్న మామిడి చెట్టుకు కాస్త ఆవల పూల చెట్లకు వేసిన ఫెన్సింగ్‌కి కట్టేసున్న కుక్క అరవడం మొదలుపెట్టింది. దాని అరుపులకు ఇంట్లోంచి ఒకతను బయటకు వచ్చాడు. సర్వెంట్లా కనపడ్డాడతను వాళ్లకు.‘ఎవరు మీరు?’ కుక్క అరుపులను లెక్క చేయకుండా ముందుకు వస్తున్న వాళ్లనడిగాడతను. బదులు చెప్పకుండానే ఆ ఇంట్లోకి వెళ్లారు వాళ్లు. ఆ అలికిడికి, హాల్లో.. రాకింగ్ చెయిర్లో కూర్చుని నిద్రపోతున్న ఒక పెద్దాయన కళ్లు తెరిచి, లేవబోయి మళ్లీ కుర్చీలోనే కూలబడ్డాడు. డైనింగ్ టేబుల్ మీద ఏదో సర్దుతున్న ఒకావిడ, ‘అమ్మగారూ, ఎవరో వచ్చారండీ’ అంటూ లోపలికి కేకేసింది. ఆ మాటకు లోపలి నుంచి ఒక పెద్దావిడ వచ్చింది, బొడ్లో దోపుకున్న నాప్కిన్కి చేయి తుడుచుకుంటూ! ఆమెతో ఆ ఆఫీసర్ ‘వి ఆర్ ఫ్రమ్ ఐటీ డిపార్ట్మెంట్’ అంటూ తన ఐడీ చూపించి, ‘సెర్చ్ వారంట్ ఉంది’ అని చెప్పి తన టీమ్‌కి ఆ ఇంటికున్న నాలుగు గదులను చూపిస్తూ ‘సెర్చ్’ అన్నట్టుగా సైగ చేశాడు.‘షో మీ?’ అడిగాడు రాకింగ్ చెయిర్ పెద్దాయన. అర్థంకానట్టుగా ఆయన్ని చూశాడు ఆఫీసర్. ‘సెర్చ్ వారంట్’ రెట్టించాడాయన! చూపించాడు ఆఫీసర్. వెంటనే ఆ పెద్దాయన తన పక్కనే చిన్న స్టూల్ మీదున్న ల్యాండ్ లైన్ ఫోన్ రిసీవర్ తీసుకున్నాడు. లాక్కున్నాడు ఆఫీసర్ ఆ చర్యను ముందే గ్రహించినట్టుగా! నిశ్చేష్టుడయ్యాడు పెద్దాయన. ఇదంతా చూసి విస్తుపోతున్న ఆ పెద్దావిడను మహిళా ఉద్యోగి అక్కడే ఉన్న డైనింగ్ టేబుల్ కుర్చీ మీద కూర్చోబెట్టి.. చేష్టలుడిగిన పనమ్మాయితో ‘మంచి నీళ్లు’ అన్నట్టుగా సైగ చేసింది.పరిస్థితిని పసిగట్టిన మేల్ సర్వెంట్ బయటకు పరుగెత్తబోయాడు. గేట్ దగ్గరున్న జీప్ డ్రైవర్ అడ్డుపడ్డాడు. చేసేదిలేక మళ్లీ లోపలకి వచ్చేశాడు మేల్ సర్వెంట్. మహిళా ఉద్యోగి ఆ ఇంటి పెద్దావిడను ఏవో ప్రశ్నలడుగుతుండగా, మిగిలిన వాళ్లు ఆ ఇంటిని చుట్టబెట్టసాగారు.ఓ గంట గడిచింది.. ఆ టీమ్ అంతా ‘ప్చ్..’ అంటూ తల అడ్డంగా ఆడిస్తూ హాల్లోకి వచ్చారు. ఆ ఆఫీసర్ నిరాశతో బయటకు వచ్చి, చూరు కిందున్న వరండాలో నిలబడ్డాడు. రెండు చేతులతో జుట్టును సరిచేసుకుంటూ చూరు వైపు చూశాడు. తన తలపైన చూర్లో ఏదో అబ్నార్మల్ థింగ్‌లా కనిపించింది దూలాల రంగులో కలసిపోయి! పరీక్షగా చూస్తే తప్ప తెలియడం లేదది. తన స్టాఫ్‌లోని ఒక వ్యక్తిని పిలిచి, చూరు చూపించాడు. అది ఒక స్లయిడ్లా కనిపించింది. వెంటనే మేల్ సర్వెంట్‌ని పిలిచి పెద్ద స్టూల్ అడిగారు. ‘లేదండీ’ చెప్పాడతను. ‘నిచ్చెన?’ అడిగాడు ఉద్యోగి. ఉందన్నట్టుగా తలూపుతూ వెళ్లి నిచ్చెన తీసుకొచ్చాడు.పైకెక్కి స్లయిడ్‌ని పక్కకు జరిపాడు ఉద్యోగి. అందులో వెడల్పుగా, పలకలా కనపడిన ఓ ఇనప్పెట్టెను కిందకు దించాడు. ఈలోపు వెనుక పెరట్లోనూ గాలించి, ఏమీ లేదంటూ మిగిలిన ఉద్యోగులూ వరండాలోకి వస్తూ ఆ బాక్స్ చూసి ఆశ్చర్యపోయారు. ‘ఎక్కడ దొరికింది?’ అడిగాడు ఒక కొలీగ్. చూరు చూపించాడు ఆ బాక్స్ తీసినతను. బాక్స్‌లో డాక్యుమెంట్స్, డైమండ్స్ కనిపించాయి. దాన్ని లోపలికి తీసుకెళ్లి, ఆ ఇంటి ల్యాండ్ లైన్‌తో ఎవరికో ఫోన్ చేశాడు ఐటీ ఆఫీసర్. విషయం చెప్పి, ‘అవునా.. సరే’ అంటూ ఫోన్ పెట్టేశాడు. ‘వీళ్లబ్బాయింట్లో ఏమీ దొరకలేదట. అంటే అంతా ఇక్కడే దాచుంటాడు. ఇంకా సెర్చ్ చేయాలి’ అంటూ ఇంట్లోంచి మళ్లీ బయటకు వచ్చాడు ఆ ఆఫీసర్.ఇంటి ముందున్న గార్డెన్ ఏరియా అంతా కలియతిరిగాడు. అతన్ని చూస్తూ ఆ కుక్క మొరుగుతూనే ఉంది. ‘ఇది ఎందుకింతలా అరుస్తోంది’ అనుకుంటూ మామిడి చెట్టు వైపు వచ్చాడు. దాని కింద పొదలా పెరిగిన గడ్డీగాదం మధ్యలో ఓ సిమెంట్ గచ్చు కనిపించిందతనికి. అనుమానంతో ముందుకు కదిలాడు. ఆగకుండా కుక్క అరుస్తూనే ఉంది. ఆ అరుపుకి మిగిలిన స్టాఫ్ కూడా బయటకు వచ్చి ఆఫీసర్ని చేరుకున్నారు. ఆ గచ్చును చూపించాడతను. మేల్ సర్వెంట్‌ని పిలిచి ఆ కుక్కను అరవకుండా చూడమని పురమాయించి, గచ్చు దగ్గరికి వెళ్లి.. గడ్డి, పిచ్చి మొక్కలను పీకేశారు స్టాఫ్. ఆ గచ్చుకు మ్యాన్‌హోల్‌కి ఉండే ఐరన్ లిడ్ లాంటిది ఉంది. ‘అది పాత సంప్’ అన్నాడు సర్వెంట్ కంగారుగా. పట్టించుకోలేదు వాళ్లు్ల. మూత తీశారు. అదొక నేలమాళిగ. అందులో డబ్బులు, బంగారం, వెండి దొరికాయి.దాదాపు పాతికేళ్లనాటి ఆ రెయిడ్ అప్పటి సంచలనం. ఆ ఇంటి యజమాని గల్ఫ్ ఏజెంట్, ‘హుండీ’ వ్యాపారి. చిన్న పెంకుటింట్లో సాధారణ జీవితం గడిపే తన తల్లిదండ్రుల దగ్గర తన సంపాదనను దాస్తే ఏ భయమూ ఉండదని అక్కడ దాచాడు. ఆ రెయిడ్ జరిగిన ఏడు ఆ యజమాని తిరుపతి హుండీలో భారీ విరాళం వేయడంతో ఆ వార్త పేపర్కెక్కి.. ఐటీ దృష్టిలో పడి రెయిడ్కి దారితీసింది! అందుకే రెయిడ్ అయిపోయి తిరిగివెళ్లిపోతూ ‘ఆ ఏడుకొండలవాడి దయ’ అంటూ నవ్వుకున్నారు స్టాఫ్!ఇవి చదవండి: 'బేరం'.. బెండకాయలెంత కిలో..? -
'బేరం'.. బెండకాయలెంత కిలో..?
‘బెండకాయలెంత కిలో?’ బుట్ట తీస్తూ అడిగింది అమ్మ.‘నలభై రూపాయలమ్మ’‘నలభై రూపాయలా!’ సాగదీస్తూ పావుకేజీ చికెన్ వస్తుంది తెలుసా.. నలభైకి’ అంది.‘పోనీ అదే కొనుక్కోండమ్మా.. నేనేం మిమ్మల్ని పిలవలేదుగా!’ దురుసుగా సమాధానం వచ్చింది అటు నుండి.‘అదేనా సమాధానం చెప్పే పద్ధతి?’ అమ్మ కోపం ఎక్కువైంది.‘ఎందుకు ఉమా ఆ బేరాలు? కావల్సినవి తీసుకో డబ్బుల సంగతి నీకెందుకు?’ సలహా ఇచ్చారు నాన్న.‘ఏం ఇంట్లో ఏమైనా డబ్బుల చెట్టు నాటరా ఏంటి? అసలందుకే మిమ్మల్ని నాతో రావద్దంది’ కూరగాయలావిడ మీద కోపం నాన్న మీదకి మళ్లించింది ఘాటుగా.ఇదెప్పుడూ ఉండేదే! నాన్నకసలు నోరు ఊరికే ఉండదు వద్దన్నా సలహాలిస్తూనే ఉంటారు. ‘కాసేపు కామ్‌గా ఉండొచ్చు కదా నాన్న! ఎందుకిక్కడ కూడా యుద్ధం?’ సలహా ఇచ్చా! నాది కూడా నాన్న పోలికెనేమో?‘నేనా మాత్రం కలుగజేసుకోకుంటే ఈ రోజంతా వాళ్లతో బేరాలాడుతూ ఇక్కడే ఉంటుంది’‘ఉఫ్.. ఎప్పటికి పూర్తవుతుందో?’ ఆలోచిస్తూ ఆసీనురాలినయ్యా బెంచ్ మీద. మార్కెట్ అంతా తిరిగి, కూరగాయల వాళ్లతో బేరాలాడి.. వాళ్లను విసిగించి, తనూ విసుక్కుని మొత్తానికి రెండు గంటల తర్వాత వచ్చింది.‘ఉమా ఎంత మిగిలించావ్? ఛ.. రెండు గంటలు వేస్ట్.. ’ నుదురు రుద్దుకున్నారు నాన్న.‘నా టైమ్ అంత ఖరీదైనది కాదు కానీ పదండి’ అంటూనే ఓ కవర్ నాన్న చేతిలో, మరో కవర్ నా చేతిలో పడేసి ఆటోస్టాండ్ వైపు నడిచింది. నోరు మూసుకుని అమ్మని అనుసరించాం. ‘మరో ఘట్టం మొదలవుతుందిప్పుడు’ మెల్లగా అన్నారు నాన్న.‘ఈ రోజుకిదే చివరి అంకమేమో’ అంతే మెల్లగా చెప్పాను. ‘శ్రీరాం నగర్ కాలనీకి ఎంత తీసుకుంటావ్?’‘అరవై రూపాయలమ్మ’‘నలభై రూపాయలే కదా?’‘పోనీ యాభై ఇవ్వండమ్మ’‘లేదు, లేదు నలభై రూపాయలే’ బేరం సాగీ, సాగీ ఇంటికెళ్లేసరికి పది గంటలు దాటింది.‘దేవుడా!’ అనుకుంటూ సోఫాలో పడిపోయాం నీరసంగా.‘ఉమా! నువ్వెంత మిగిల్చావోనాకు తెలియదు కానీ ఈ టైమ్ తప్పిన భోజనంతో నా షుగర్ కూడా కంట్రోల్ తప్పుతుంది. ఆ మిగిలించిన డబ్బంతా నా హాస్పిటల్ బిల్కి సరిపోతుంది’ అరిచారు నాన్న.‘అవునులే అలా మిగిలించిన డబ్బుతోనే ఈ నగలన్నీ చేయించుకున్నాను’వాదన మొదలైంది. ఇదిప్పట్లో ఆగదు. ఎందుకో గానీ ఈసారి నాన్నకి సపోర్ట్ చేయాలనిపించలేదు. అమ్మది మాత్రం ఏం తప్పుంది? సగటు మధ్యతరగతి గృహిణిలానే ఆలోచిస్తోంది. ఆ చేసేదంతా ఎవరి కోసం? ఇంటి కోసం.. ఇంట్లో ఉన్న మా కోసమేగా? నాన్న పూర్తిగా వ్యతిరేకం అమ్మకి. బేరం అనే పదం కూడా నచ్చదు. సమయం వృథా, అంతకన్నా ముఖ్యంగా అలా బేరమాడటం ఆ వస్తువుల విలువను తగ్గించటమే అని వాదన. ఎవరి కోణంలోంచి చూస్తే వాళ్ళదే సరనిపిస్తుంది.‘ఏంటా ఆలోచన? దేని కోసం?’ ఉలిక్కిపడి చూశాను నాన్న వైపు.‘మీ ఇద్దరి గురించే..’‘మా గురించా?’ అర్థంకానట్టు చూశారు.‘అవును, అసలు మీ ఇద్దరూ గొడవపడకుండా ఉన్న రోజేదైనా ఉందా?’ అని నవ్వాను.‘అది కష్టమమ్మా! ఇంకా చెప్పాలంటే అసాధ్యం కూడా!’ గట్టిగా నవ్వారు నాన్న కూడా.‘అసాధ్యం కాదే మీ నాన్నని మౌనవ్రతం చేయమను’ లోపలి నుండి వచ్చింది అమ్మ.‘ అప్పుడు మాత్రం నీ నోరు ఊరుకుంటుందంటావా?’ ‘అయితే ఇద్దరూ చేయండి. నాకు మనశ్శాంతిగా ఉంటుంది చెప్తూనే లోపలికి పరిగెత్తాను.‘దానర్థం నోరు మూసుకుని ఉండమనేగా?’ మాటలు బాగా ఎక్కువయ్యాయి. రూమ్లోకెళ్లినా అమ్మ మాటలు వినిపిస్తున్నాయి.‘రేపు క్లాస్ లేదుగా?’ లోపలికొస్తూ అడిగారు నాన్న.‘ఎందుకు? స్పెషల్ క్లాస్ ఉంది, రికార్డ్ వర్క్ కూడా ఉంది’ ‘నీతో కొంచం వర్క్ ఉంది. ఎక్కువసేపు కాదు, మహా అయితే ఓ గంటన్నర అంతేలే’‘అది సరే కానీ ఆ గంటన్నర ఏం చేయాలి?’ విసుగొచ్చింది. ‘నోరు ముసుకుని, కుదురుగా కూర్చోవాలి’‘ఎక్కడ? ఎందుకు?’ విసుగు ఎక్కువైంది. ‘పెళ్లిచూపుల్లో’ నవ్వేసి వెళ్లిపోయారు.నాకు మాత్రం నవ్వు రాలేదు. ఉత్సాహం, కుతూహలం ఏవీ రాలేదు. గొప్ప కార్యక్రమం మరి! తలనొప్పికి బోనస్‌గా మెడనొప్పి కూడా. ‘ఇప్పుడప్పుడే ఇలాంటి ప్రోగ్రామ్స్ వద్దని చెప్పా కదా? ఇంజనీరింగ్ అవలేదు, జాబ్ రాలేదు. మీకెందుకంత తొందర?’ ఇలాంటి డైలాగ్స్ నాన్న మీదకేం విసరాలనిపించలేదు. అలాంటి వాటి వల్ల ప్రయోజనమేం ఉండదు. పైగా నాన్న సంగతి నాకు తెలియంది కాదు. ఎలాంటి వారినైనా ఒప్పించగల నైపుణ్యం కలిగిన వారు. ‘చూద్దాం ఏం జరుగుతుందో?’ అనుకోవటమే నాకు మిగిలిన ఆప్షన్.‘హరీ టైమెంతయిందో తెలుసా?’ సూర్యుడు పూర్తిగా డ్యూటీ ఎక్కక ముందే లేపింది అమ్మ.‘అబ్బా! వాచ్ చూడొచ్చుకదమ్మా! లేపి మరీ అడగాలా?’ తలకొట్టుకున్నాను.‘వేశావులే పెద్ద జోక్, నోరు మూసుకుని లేచి రెడీ అవ్వు’ బాత్రూమ్లోకి తోసింది.వాళ్లొచ్చేసరికి పదిన్నర దాటుతుంది. ఇప్పుడింకా ఆరు కూడా కాలేదు. ఇప్పటి నుండి రెడీ అవుతూ ఉండాలా? ఈ దృక్పథం ఎప్పటికి మారుతుంది? అసలు మారుతుందా?‘ఏంటమ్మా ఉదయం నుండి అమ్మ చెప్పిందంతా కీ ఇచ్చిన బొమ్మలా చేస్తున్నావు? ఏంటో?’ దీర్ఘం తీశారు నాన్న. చేయకపోతే తిట్లు, చేస్తే అనుమానాలు. వాళ్లెంత మంది వస్తారో? ఎన్ని ప్రశ్నలడుగుతారో? ఆలోచిస్తుండగానే వాళ్లు రావటం, అతిథి సత్కారాలు, మరబొమ్మలా వాళ్ల ముందు కూర్చోబెట్టడం.. అన్నీ సెకెన్ల ముల్లులా చకాచకా సాగిపోయాయి. పెద్దల ప్రశ్నలు, నా సమాధానాలు సాగుతూన్నాయి.ఈ అబ్బాయికి మాటలు రావా? మొహమాటమా? నోరే విప్పటం లేదు. మరీ తెగించి చూడటం బాగుండదేమో? ఏవేవో సినిమా సన్నివేశాలు చకచకా కదిలిపోతున్నాయి. ఎంత మధురంగా ఉంటాయో పెళ్లి చూపుల సన్నివేశాలు! నాలాగే చాలా మంది అమ్మాయిలు వాటిని చూసి అలాగే ఉంటాయని భ్రమపడి, పెళ్లి చూపులయ్యాక నిరాశపడతారు.‘ఏరా? అమ్మాయితో ఏమైనా మాట్లాడతావా?’ పెళ్లికొడుకు తండ్రనుకుంటా.. ఎంత దర్పమా గొంతులో!అప్రయత్నంగా కళ్లు తిప్పాను నాన్న వైపు. ఇప్పుడు నాన్న కూడా అబ్బాయితో మాట్లాడతావా? అంటే అందరి మొహాలు ఎలా ఉంటాయో? ఒక్కసారిగా షాకవుతారేమో?‘మాట్లాడకపోతే.. పోనీ నచ్చిందో? లేదో?’ చెప్పు సీరియస్‌గా అడిగాడాయన.‘మీ ఇష్టం నాన్నా’ మంద్రంగా వినిపించిందో స్వరం.ఏం సమాధానం..? అవుననా? కాదనా? ఇప్పుడు నేను షాకయ్యాను. అసలెలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రుల మాట మీద గౌరవం ఎక్కువనా? తనకి వ్యక్తిత్వం తక్కువనా?ఏ మూలో మిగిలున్న కాస్త ఆసక్తి కూడా ఎగిరిపోయింది. ముళ్ళ మీద కూర్చున్న ఫీలింగ్!‘నువ్వేమంటావమ్మా?’ దగ్గర్లో గట్టి వస్తువులేం లేవు కానీ, ఉండుంటేనా వాటితో తల కొట్టుకోవాలనిపించింది.అంతా నా వైపే చూస్తున్నారు. ‘మా నాన్న ఇష్టం’ అనే నా డైలాగ్ కోసం. అలా అంటేనే కదా అమ్మానాన్నల పెంపకాన్ని పదిమందీ మెచ్చుకునేది! వాళ్ళ మెప్పు కోసం, అమ్మానాన్నల ఆనందం కోసం అలా చెప్పటం కరెక్టా కాదా? మరి నా సంగతేంటి తన గురించి ఏం తెలియకుండా ఎలా నిర్ణయించుకోవాలి? ఎక్కువ సమయం తీసుకుంటే బాగుండదు. ఏం తెలియటంలేదు. ‘పర్లేదు చెప్పమ్మా..’ మరోసారి అడిగేసరికి నాన్న వైపు చూశాను నిస్సహాయంగా.‘ఉమా! తనని లోపలికి తీసుకెళ్లు’ నాన్న మాటకి నిజంగానే ప్రాణం వచ్చినట్టయింది. లోపలికెళ్తూ నెమ్మదిగా కళ్లు తిప్పాను అబ్బాయి వైపు. ఓ నవ్వు కాదుకదా! కనీసం చూడను కూడా చూడలేదు. ‘మొహమాటమంటే ఒప్పుకుంటాను. కానీ దీపు చాలా మంచివాడు చిన్నప్పటి నుండి చూస్తున్నా కదా! ఒక్క చెడలవాటు కూడా లేదు’ ఆపకుండా చెప్పుకుపోతోంది అమ్మ. ‘చిన్నప్పటి నుండి చూస్తున్నావా?’ ఇంకో షాక్ నాకు.‘ఆ! ఎప్పుడైనా ఏ ఫంక్ష¯Œ కైనా, పెళ్లికైనా వస్తేగా చుట్టాలో, స్నేహితులో తెలియడానికి! ఎంతసేపూ ఇంటినే అంటిపెట్టుకునుంటే ఏం తెలుస్తుంది?’‘అమ్మా! ఒక ప్రశ్నకి మరో ప్రశ్న సమాధానమా?’‘వాడు నాకు మేనల్లుడి వరస. మా పెద్దమ్మ కొడుకు తెలుసు కదా.. శేఖరన్నయ్య.. వాడి కొడుకు. మంచి ఉద్యోగం కూడా! ఒప్పుకోవచ్చు కదే?’కిటికీ తెరిచి దీపు వైపు చూశాను. హుందాగా ఉన్నా అమాయకత్వం నిండి ఉన్న మొహం. అమ్మ సర్టిఫికేట్‌కి తిరుగులేదు. ‘పైగా తనకి నువ్వంటే చాలా ఇష్టం కూడా ’ అనేసి వెళ్లిపోయింది.అదేంటో ఇప్పటి వరకూ ఉన్న చిరాకంతా టక్కున మాయమైపోయింది. ‘ఏంటి బావా? వీళ్లిద్దరూ సరిగ్గా చెప్పకుండా దాటేస్తున్నారు. ఏం చేద్దాం?’ వాళ్ల మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి.‘మౌనం అంగీకారమేనేమో?’ ఇంకెవరో అన్నారు. ‘అంతవరకూ లాంఛనాల గురించి ఒక మాటనుకుంటే సరిపోతుందేమో?’ మరొకరి సలహా.‘అబ్బాయిది గవర్నమెంట్ ఉద్యోగం. ఉన్న ఆస్తికి ఒక్కడే వారసుడు. మీరెంత వరకు ఇద్దామనుకుంటున్నారు?’‘మా అమ్మాయిది డిగ్రీ అవుతుంది. తెలివైనది కూడా!’ మా పిన్ని నన్ను పొగడటం మొదలుపెట్టింది.‘ఇరవై లక్షలు, అబ్బాయికి నాలుగు తులాల బంగారం. అమ్మాయి కెంత బంగారం పెడతారో మీ ఇష్టం, బైక్ ఎలాగూ పెడతారుగా?’బట్టీ పట్టిన సమాధానంలా టకటకా చెప్పేశాడు మధ్యవర్తి. ‘అదేంటి బావా? మా స్థాయి తెలిసి కూడా..’ ఆపేశారు నాన్న. ‘పదిలక్షల వరకూ అయితే పరవాలేదు’ ఓ క్షణమాగి మెల్లగా అన్నారు.భూకంపం వచ్చిన ఫీలింగ్. మొదటిసారి వింటున్నా నాన్న బేరమాడటం. ఆటో డ్రైవర్ల కష్టానికి విలువనిచ్చే నాన్న, కూరగాయలకి విలువిచ్చి బేరమాడని నాన్నేనా.. ఈ రోజు నా గురించి బేరమాడుతోంది!? అదేంటో చిత్రంగా కోపం రాలేదు.. నవ్వొచ్చింది. నా జీవితంలో ఎప్పటికీ చూడలేననుకున్నది చూశాను. దీపక్ అలాగే కూర్చున్నాడు విగ్రహంలా! ఆ బేరసారాలలో పాలుపంచుకోలేదు. అరగంటసేపు సాగుతూనే ఉందా కార్యక్రమం. నాన్నకి నా మీదెంత ప్రేమున్నా తలకి మించిన భారాన్నెలా మోయగలరు?మరోవైపు నా జీవితం.కేవలం నా కోసమేగా తనకిష్టంలేని బేరమాడింది! పోనీ నా కోసమేదైనా చేస్తారని ఎంతలా సముదాయించుకున్నా ఏదో గుచ్చుతోంది మనసులో.నాన్న నా విలువను తగ్గించారా? అంగీకరించలేని నిజం!దీపక్‌ని నేను కొనుక్కుంటున్నానా? లేదు, లేదు డబ్బిచ్చి మరీ నన్నే అమ్ముతున్నారా? బాగుంది వాళ్ళ కొనుగోలు, నాన్న అమ్మకం!క్రమక్రమంగా మాట్లాడే ధోరణి నుండి బతిమాలే స్థాయికి దిగిన నాన్న గొంతు. అమ్మాయిగా పుట్టినందుకు మొదటిసారి కలిగిన బాధ! నా కారణంగానే నాన్న తగ్గాల్సి వచ్చిందన్న గిల్టీ ఫీలింగ్!నాలాగే ప్రతి అమ్మాయి ఎప్పుడో ఒకసారి ఎదుర్కోవాల్సిన సందర్భమేమో!‘కంగ్రాట్స్ హరీ’ అరుస్తున్నట్టే లోపలికొచ్చింది అమ్మ. ‘అదృష్టమంటే నీదేనే ..’ ఇంకా ఏదేదో చెప్తున్నా ఆ మాటలేం వినిపించట్లేదు.‘నాకు నచ్చలేదు’ సూటిగా, స్పష్టంగా చెప్పేశాను.‘ఏంటి?’ కోపంగా మారిపోయింది అమ్మ గొంతు. ‘ఏం నచ్చలేదే?’ ‘ఈ బేరం, బేరంలో కూర్చున్న ఆ అబ్బాయి’‘నోరు మూసుకో.. అర్థంలేని మాటలు’‘అమ్మా! ప్లీజ్ నన్నిలా వదిలేస్తావా?’ నా గొంతు నరాలు తెగిపోయాయేమో అన్నంత గట్టిగా వచ్చిందా అరుపు.‘ఉమా! దాన్నింకా విసిగించకు’ నాన్న అమ్మని తీసుకెళ్ళారు.ఎందుకీ విపరీతమైన అలజడి? గందరగోళం మనసంతా! నాకు తెలుసు. ఈ కోపం అమ్మ మీద కాదు, నాన్న మీదా కాదు, దీపు మీదసలు కాదు. మరెవరి మీద? ఆలోచిస్తూండిపోయానలా ఎంతసేపో?!‘హరీ..’ మంద్రమైన అమ్మ పిలుపు ఈ లోకానికి తీసుకొచ్చింది నన్ను. ‘నిన్ను అర్థం చేసుకోగలను కానీ మార్పు నువ్వనుకున్నంత సులభంగా రాదు. దానికి ఎన్నో ఏళ్ల కష్టంకావాలి. జడివానలా ఒక్కసారిగా వస్తుందనుకున్నావా? చిరుజల్లులా నిదానంగానే వస్తుంది. నీ కోపం పక్కన పెట్టి ఒక్కసారి ఆలోచించు’ చెప్పి వెళ్లిపోయింది.నిజమే మార్పు ఆవేశం వలనో, ఆక్రోశం వలనో రాదు. రాజారామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం వంటి మహానుభావులు పుట్టిన దేశంలో అబ్బాయిలందరూ దీపక్ లాగానే ఉంటారనుకోవటం నా పొరపాటు. తల్లిదండ్రులపై గౌరవంతో పాటు భార్య వ్యక్తిత్వానికి విలువనిచ్చే వారూ ఉంటారు. అమ్మాయిలు వంటిల్లు దాటి ఉద్యోగం దాకా రావటానికి శతాబ్దకాలం పట్టింది. కట్నకానుకలు, బేరసారాలు లేకుండా పెళ్లి జరగటానికి మరో రెండు శతాబ్దాలు పూర్తవ్వాలేమో .. ఆలోచిస్తూ కొత్త ప్రాజెక్ట్ హెడ్డింగ్ పెట్టాను..‘40 వ శతాబ్దం.. భారతీయ వివాహా వ్యవస్థ!’ – ధనలక్ష్మి. ఎమ్ -
కాదంబరి జెత్వాని బాగోతం బట్టబయలు
-
జమ్ముపై బీజేపీ.. కాశ్మీర్ పై కాంగ్రెస్ గెలుపెవరిది..?
-
గాఢాంధకారంలో ఒక గైడ్, బంగ్లాదేశ్ టాప్ అడ్వైజర్
గాఢాంధకారంలో ఒక వెలుగు రేఖ ఎంతో ఆశను, నమ్మకాన్ని ఇస్తుంది. సంక్షోభపు చీకటి నుంచి వెలుగు దారుల వైపు అడుగులు వేయడానికి సన్నద్ధం అవుతున్న బంగ్లాదేశ్‌కు కనిపిస్తున్న వెలుగు రేఖల్లో షర్మీన్ ఒకరు. ప్రపంచానికి ఆమె పేరు అపరిచితం కావచ్చు. బంగ్లా ప్రజలకు మాత్రం సుపరిచితం. బంగ్లాదేశ్ పునర్నిర్మాణానికి రాళ్లెత్తుతున్న మేధావులు, ఉద్యమకారులలో షర్మీన్ ప్రముఖురాలు. బంగ్లాదేశ్ ఆపద్ధర్మ ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్‌కు సహాయపడే ఉన్నత స్థాయి సలహాదారులలో షర్మీన్ ఒకరు....‘శాంతిభద్రతలను పునరుద్ధరించడం, ప్రజాస్వామికంగా ఎన్నికలు జరిపించడం, సాధారణ పరిస్థితులను నెలకొల్పడం, సుపరిపాలన అందించే రోజులను తీసుకురావడానికి ప్రాధాన్యత ఇస్తాం’ అంటోంది షర్మీన్. విద్యావంతుల కుటుంబం, సామాజిక ఉద్యమాల్లో భాగమయ్యే కుటుంబంలో ఢాకాలో పుట్టింది షర్మీన్. ఆమె తండ్రి ఖాన్ సర్వర్ ముర్షీద్ ప్రఖ్యాత విద్యావేత్త. దౌత్యవేత్త, మేధావి. తల్లి నూర్జహాన్ జర్నలిస్ట్, సోషల్ యాక్టివిస్ట్. తల్లిదండ్రుల స్ఫూర్తితో ఎన్నో సంవత్సరాలుగా బంగ్లాదేశ్‌లోని సామాజిక, సాంస్కృతిక ఉద్యమాల్లో భాగం అవుతూ వస్తుంది షర్మీన్.సామాజిక మార్పుల కోసం శ్రమించే ఎన్నో సంస్థలతో కలిసి పనిచేసిన షర్మీన్ ‘బ్రోటీ’ అనే మానవ హక్కుల, ఎన్నికల పర్యవేక్షణ బృందానికి సీయీవోగా పనిచేసింది. పారదర్శకమైన, ప్రలోభాలకు వీలులేని, స్వేచ్ఛాయుత ఎన్నికలు ఈ సంస్థ లక్ష్యం. కళలు, సాంస్కృతిక వారసత్వం కోసం పనిచేసే ‘ఉత్తర్సురీ’ అనే సాంస్కృతిక కేంద్రానికి కార్యదర్శిగా పనిచేసింది.లింగ సమానత్వం నుంచి సామాజిక సమానత్వం వరకు ఎన్నో కార్యక్రమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ తనకు ఎంతో ఇష్టమైన సంగీతానికి మాత్రం ఎంతో కొంత సమయం కేటాయిస్తుంది షర్మీన్. 1995లో వచ్చిన ‘ముక్తీర్ గాన్’ అనే డాక్యుమెంటరీ గాయకులలో షర్మీన్ ఒకరు.‘ఏ భేదాలు లేకుండా ప్రజలను ఏకం చేసే శక్తి సంగీతానికి ఉంది’ అంటుంది షర్మీన్. సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం మాట ఎలా ఉన్నప్పటికీ సామాజిక ఉద్యమాలకు సంబంధించి షర్మీన్ ఎన్నోసార్లు బెదిరింపులు ఎదుర్కొన్నది. అయితే ఆమె ఎప్పుడూ వెనక్కి తగ్గింది లేదు. తన ధైర్యమే తనకు రక్షగా నిలిచింది.తాజా విషయానికి వస్తే...బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న దాడులను షర్మీన్ ఖండిస్తుంది. ‘ఇవి మత కలహాలు కాదు. రాజకీయ ప్రేరేపిత దాడులు’ అంటున్న షర్మీన్ బాధితుల తరఫున నిలబడుతుంది. వారికి ధైర్యాన్ని ఇస్తోంది. ‘విషాదగతాన్ని మరచి΄ోదాం. బంగారు భవిష్యత్తుపై మాత్రమే దృష్టి పెడదాం’ అని అన్ని వర్గాల ప్రజలకు పిలుపు ఇస్తోంది షర్మీన్. ‘షర్మీన్’ అనే పేరుకు ఉన్న అర్థాలలో ‘గైడ్’ కూడా ఒకటి. ఇప్పుడు బంగ్లాదేశ్‌కు షర్మీన్ ఖచ్చితంగా ఒక గైడ్!‘గత ఏడాది కాలంగా మన దేశ ఆర్థిక వ్యవస్థపై మన అవగాహన తప్పుడు సమాచారంపైనే ఆధారపడి ఉంది. దాని నుంచి బయటికి రావాలి. స్థూల జాతీయ ఉత్పతి (జీడీపి) గురించి గత ΄ాలకులు చెప్పినవి నిజాలు కావు. విదేశీ నిల్వలు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో మన దేశంలో ప్రాథమిక, మౌలిక మార్పులు జరగబోతున్నాయని మీకు హామీ ఇస్తున్నాను’ అని బంగ్లా ప్రజలను ఉద్దేశించి చెబుతోంది షర్మీన్ ముర్షిద్. -
మనిషిలోని చీకటి కోణాల ఆవిష్కర్త!
కాశీభట్ల వేణుగోపాల్ అనే పేరు తెలుగు సాహిత్యంలో సుపరిచతమే. ఆ పేరుతో పాటు అతను ‘ఏవో మనో చీకటి కోణాల్ని గురించి రాస్తాడట’ అని కూడా పరిచయమే. కాశీభట్లను ఏమీ చదవనివాళ్లు కూడా ఈ మాత్రపు ప్రాథ మిక అవగాహనతో అతడి పట్ల ఒక కొండ గుర్తును ఏర్పరుచుకుంటారు. ఒక ప్రశస్త కుదింపునకు గురైన రచయితలలో కాశీభట్ల ముందుంటాడు.కాశీభట్ల మొదటి నవల ‘నేనూ–చీకటి’ వచ్చినప్పుడు దానిలోని చైతన్య స్రవంతి శైలి వల్ల అతడిని హత్తుకున్నవాళ్లు కొందరైతే, బండ కేసి బాదిన వాళ్లు కొల్లలు. ఎక్కువ మంది భాషాపాటవానికి అచ్చె రువొందారు. కాశీభట్లకు కవితాత్మకంగా వచనం రాయడం ఇష్టం. అది శేషేంద్ర ప్రభావం. కథా కథ నాన్ని సంక్లిష్టమైన చైతన్య స్రవంతిలో రాయడం ఇష్టం. ఇదేమో జేమ్స్ జాయిస్ ప్రభావం. రెండవ నవల ‘తపన’కు చాలా గుర్తింపు వచ్చింది కానీ మూడో నవల ‘దిగంత తాత్వికంగా ఉన్న నవల. సార్త్రే అస్తిత్వవాద ధోరణి ఈ నవలంతా పరుచుకొని ఉంది.నవలల్లో నైనా, కథల్లోనైనా కాశీభట్ల ఒకే దృష్టికోణంతో కథాకథనం చేస్తాడు. అది ప్రధాన పాత్ర మానసిక కోణం నుంచి జరుగుతుంది. కాబట్టి రచయిత ఆలోచనల్ని పాత్ర ఆలోచనలకు రంగరించడం సులభమయ్యింది. ఈ సందర్భంగానే చెప్పు కోవాల్సిన విష య మేమంటే... కాశీభట్ల సాహిత్యంలో స్త్రీ పాత్ర గొంతుకతో కథాకథనం జరగలేదు. స్త్రీలుంటారు గానీ స్త్రీల మానసిక కోణం ఉండదు. ఆయా పాత్రల ఒంటరి ఆలోచనలు (వాటినే రచ యిత చీకటి ఆలోచనలు అంటాడు) కథకు ఉత్ప్రేరకాలు. సర్వ సాధారణంగా బాహ్య ప్రపంచానికి అభ్యంతరకరంగా ఉండే ప్రవ ర్తనల్ని సృష్టించుకొని వాటి పర్యవసానాల ఆధారంగా కథను నడపడం కాశీభట్ల శైలి. పాత్ర ఆలోచనలో ఒకానొక మైక్రో సెకెనులో తలెత్తే ఆలోచనా శకలం, సభ్య సమాజ ఆలోచనకు అభ్యంతరకరంగా ఉంటుందనీ, అలా అభ్యంతరంగా ఉన్నప్పటికీ నెగెటివ్ ఆలోచనా శకలాలు పుట్టడమే సహజమనీ, వాటిని చూపించి మానవుడిని నగ్నంగా ఎత్తి చూపడమే తన సాహిత్య లక్ష్య మనీ గట్టిగా నమ్మాడు కాశీభట్ల. తన మొదటి నవల నుంచి చివరి నవల ‘అసంగతం’ దాకా దీన్ని చెప్పడానికే రాశానంటాడు.ఒకే ఒక్క సత్యం ‘మానవుడి మొదటి ఆలోచన దిగంబరమైనది’ అంటాడు. అదే కాశీభట్ల ఉద్దేశ్యంలో ‘చీకటి’. తన నవలలూ, కథలూ నిండా చీకటిని ఎన్ని రూపాల్లో చెప్పాడో ఎవరైనా పరిశోధన చేయెచ్చు. చీకటి ఒక ప్రలోభం. చీకటి ఒక కోరిక. చీకటి ఒక క్రియ. చీకటి ఒక ప్రయాణం. ఒక్కోసారి కాశీభట్ల సాహిత్యంలో చీకటే వెలుగు. చీకటిని గౌరవంగా తమోనమః అంటాడు. ఇక నేను అనే వాడు అన్ని సంద ర్భాల్లోనూ తన ప్రధాన పాత్ర. ఈ పాత్ర మనసు లోపలి దుర్మార్గ ఆలోచనల్ని, అభ్యంతరకరమైన యోచనల్నీ, అవి చర్యలుగా మారి, పాత్ర చుట్టూ ఉన్న సమాజంలోని చెడు, ప్రలోభం, దుర్మార్గం లాంటి చీకటులకు దోహదపడటాన్ని చిత్రిస్తాడు.విపరీతంగా ప్రపంచ సాహిత్యాన్ని చదివాడు. తెలుగు, ఇంగ్లీషు, సంస్కృతం, కన్నడ భాషల్లో పట్టు ఉండటం వల్ల... కథన భాష మణిప్రవాళం కావడం, తను రాసే వస్తువు పట్లా, అంశం మీదా గట్టి విషయ సేకరణా, తర్ఫీదు ఉండటంతో తను అనుకున్న వస్తువుతో ఆటలాడినంత సులభంగా రాస్తాడు. తన కేంద్రంగా రాస్తాడు. పాఠక కేంద్రాన్ని ఎట్టి పరిస్థి తుల్లోనూ అంగీకరించడు. కథాకథనంలో వాడే ప్రతీక లనో, అన్వయాలనో ఎవరైనా ప్రశ్నిస్తే, ‘మీరు సోమరి పాఠకులు. నన్ను చదవకున్నా ఫర్వాలేదు’ అంటాడు. అయితే ఈ కఠిన శైలి ‘కాలం కథల’లోనూ ఇటీవల రాసిన ‘చీకటీ గలు’, ‘అసత్యానికి ఆవల’, ‘అసంగతం’ నవలల్లో కొంత సరళమవడం చూడొచ్చు.కాశీభట్లను తాత్వికంగా చూసినప్పుడు నిరీశ్వర వాది. సొంత జీవితంలో తన బ్రాహ్మణత్వాన్ని తెంచి అవతలకి విసిరి వేసి డీ కాస్ట్ అయినవాడు. తొలి రోజుల్లో నక్సలైట్ భావాల పట్ల కూడా ఆసక్తి చూపినవాడు. ఇదంతా తన పాత్రల రూపంలో రికార్డు అయ్యే వుంది. ఒక ఇంటర్వ్యూలో కాశీభట్ల నిహిలిస్టును అన్నాడు. ప్రతి దాన్నీ అనుమానిస్తానన్నాడు. రేషనాలిటీ ఏదో మేరకు తన ఆలోచనల్లో భాగమైన రచయిత. తెలుగులో సీరియస్ సాహిత్యంతో మనసా కర్మణా నిజాయితీగా నిలబడ్డాడని చెప్పగలం. తనదైన సాహిత్య శైలి అపూర్వం అని అనవచ్చుగానీ అదే సమ యంలో త్రిపురనీ, వడ్డెర చండీదాస్నూ అతని ముందువారని గుర్తించకుండానూ ఉండలేం.– జి. వెంకటకృష్ణ, వ్యాసకర్త కవి, విమర్శకులు -
ఎవరు పొతే మాకేంటి.? డేటా ఔట్.. ఈసీపై డౌట్
-
Shri Krishna Janmashtami: కృష్ణం వందే జగద్గురుం!
బాల్యంలో వెన్నదొంగగా వన్నెకెక్కినవాడు. మన్నుతిన్నాడని గద్దించిన తల్లి యశోదకు తన నోట ఏడేడు పద్నాలుగు లోకాలనూ చూపించినవాడు. బృందావనంలో వేణుగానం వినిపిస్తూ, గోపికలను రాసలీలలతో అలరించినవాడు. దుష్టశిక్షణ శిష్టరక్షణ నెరవేర్చినవాడు. కురుక్షేత్రంలో బంధువులను తన చేతులతో చంపలేనని, యుద్ధం చేయలేనని అస్త్రాలను విడిచిపెట్టిన అర్జునుడికి భగవద్గీతను బోధించి, కర్తవ్యోన్ముఖుణ్ణి చేసినవాడు. భగవద్గీతను బోధించినందున గీతాచార్యుడిగా, జగద్గురువుగా భక్తుల పూజలు అందుకొనే శ్రీకృష్ణ పరమాత్ముడు సర్వాంతర్యామి. ఆయన జగన్నాథుడు. ఆయన ఆర్తత్రాణపరాయణుడు. శ్రీకృష్ణుడి భక్తులు ప్రపంచం నలుమూలలా ఉన్నారు. మన దేశంలో బృందావనం, మథుర, ద్వారక సహా పలు శ్రీకృష్ణ క్షేత్రాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా శ్రీకృష్ణుడికి వేలాదిగా ఆలయాలు ఉన్నాయి. ఇవే కాకుండా, విదేశాల్లోనూ శ్రీకృష్ణుడికి ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఆగస్టు 26 శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా విదేశాల్లో ఉన్న శ్రీకృష్ణ ఆలయాల విశేషాలు మీ కోసం...శ్రీకృష్ణుడి ఆరాధాన ప్రాచీనకాలంలోనే విదేశాలకు పాకింది. క్రీస్తుపూర్వం ఎనిమిదో శతాబ్దంలోనే ప్రాచీన గ్రీకులు శ్రీకృష్ణుడిని వాసుదేవుడిగా, దేవాదిదేవుడిగా కొలిచేవారు. గ్రీకు రాయబారి హిలియోడారస్ క్రీస్తుపూర్వం 113 సంవత్సరంలో మధ్యప్రదేశ్‌లోని విదిశా నగరంలో ఒక గరుడస్తంభాన్ని నాటించాడు. ఈ రాతి స్తంభంపై బ్రహ్మీలిపిలో ‘వాసుదేవుడు దేవాదిదేవుడు’, ఆయన అడుగుజాడలైన ఆత్మనిగ్రహం, జ్ఞానం, దానం అనుసరించడం వల్ల స్వర్గాన్ని చేరుకోవచ్చు’ అని రాసి ఉంది. గ్రీస్ రాజధాని ఏథెన్స్లో ప్రస్తుతం ‘ఇస్కాన్’ శ్రీకృష్ణ ఆలయాన్ని నిర్వహిస్తోంది.మన పొరుగు దేశాల్లో కృష్ణాలయాలు..బ్రిటిష్ పాలనలో ఒకటిగా ఉండి తర్వాత విడిపోయిన మన పొరుగు దేశాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్, బర్మాలలోను, నేపాల్లోను కృష్ణాలయాలు ఉన్నాయి. బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ ఆధ్వర్యంలో నడిచే కృష్ణాలయాలతో పాటు కొన్ని పురాతన ఆలయాలు కూడా ఉన్నాయి. దినాజ్‌పూర్‌లోని ‘కళియా జుయె’ ఆలయం, జెస్సోర్‌లోని రాధాకృష్ణ మందిరం, పాబ్నాలోని జగన్నాథ ఆలయం బంగ్లాదేశ్‌లోని పురాతన కృష్ణాలయాల్లో ప్రముఖమైనవి. పాకిస్తాన్‌లోని క్వెట్టా, రావల్పిండి, హరిపూర్, ఫతేజంగ్ తదితర చోట్ల పురాతన కృష్ణాలయాలు ఉన్నాయి. లాహోర్‌లో 2006లో కొత్తగా కృష్ణాలయాన్ని నిర్మించారు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో అక్కడి ప్రభుత్వ అనుమతితో కొత్తగా కృష్ణాలయ నిర్మాణం ప్రారంభమైంది. దీని నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. నేపాల్ రాజధాని కాఠ్మాండూ సహా పాటన్, నవల్పరాసీ, రాజ్‌బిరాజ్ తదితర ప్రాంతాల్లో పురాతన కృష్ణాలయాలు ఉన్నాయి.ఖండ ఖండాంతరాల్లో కృష్ణాలయాలుమన పొరుగు దేశాల్లోనే కాకుండా, ఆసియా, యూరోప్, అమెరికా, ఆస్ట్రేలియాల్లో కృష్ణాలయాలు ఉన్నాయి. మలేసియాలోని కౌలాలంపూర్‌లో అక్కడ స్థిరపడిన తమిళులు నిర్మించిన కుయిల్ శ్రీకృష్ణాలయం, పెనాంగ్‌లో శ్రీకృష్ణాలయం, రాధాకృష్ణాలయం సహా పలు కృష్ణాలయాలు ఉన్నాయి. సింగపూర్‌లో 1870 నాటి శ్రీకృష్ణాలయం ఉంది. దీనిని సింగపూర్ ప్రభుత్వం జాతీయ సాంస్కృతిక వారసత్వ నిర్మాణంగా గుర్తించింది. మయాన్మార్లో రాధామండలేశ్వర ఆలయం, థాయ్లండ్లో క్రీస్తుశకం ఏడో శతాబ్ది నాటికే వైష్ణవారాధన ఉండేది. థాయ్లండ్లోని శ్రీథేప్లో పదమూడో శతాబ్ది నాటి వైష్ణవాలయంలో గోవర్ధనగిరి పైకెత్తిన శ్రీకృష్ణుడి విగ్రహం కనిపిస్తుంది. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో స్థిరపడిన భారతీయులు రాధా శ్యామసుందర ఆలయాన్ని నిర్మించుకున్నారు. భారత సంతతి జనాభా ఎక్కువగా ఉండే ట్రినిడాడ్ అండ్ టొబాగోలో సెయింట్ మాడలిన్ నగరంలోని కృష్ణ మందిరం, డెబె పట్టణంలోని గాంధీగ్రామంలో రాధాకృష్ణ మందిరం సహా పలు కృష్ణాలయాలు ఉన్నాయి.బ్రిటన్ రాజధాని లండన్‌లో కృష్ణయోగ మందిరం, రాధాకృష్ణ ఆలయాలతో పాటు లివర్‌పూల్, మాంచెస్టర్, ఓల్డ్హామ్, స్వాన్సీలలో రాధాకృష్ణ ఆలయాలు, గ్లోస్టర్‌షైర్, ష్రాప్షైర్, కాన్వెంట్రీ, డుడ్లీ, శాండ్వెల్, బోల్టన్లలో కృష్ణ మందిరాలు చాలాకాలంగా ఉన్నాయి. ఇవే కాకుండా, బ్రిటన్‌లో పలుచోట్ల కృష్ణారాధన జరిగే ‘ఇస్కాన్’ మందిరాలు, స్వామినారాయణ్ మందిరాలు కూడా ఉన్నాయి. అమెరికాలోని బోయిజ్ స్టేట్ యూనివర్సిటీ సమీపంలో హరేకృష్ణ ఆలయం ఉంది. ఈ ఆలయంలో వైదిక సంస్కృతీ కేంద్రం కూడా పనిచేస్తోంది. హాల్బ్రూక్లో ‘బ్రజమందిర్’ పేరిట కృష్ణాలయం ఉంది. ఆస్టిన్‌లో రాధామాధవధామ్ ఆలయం, మిల్‌క్రీక్ సాల్ట్‌లేక్ సిటీలో కృష్ణాలయం, స్పానిష్ఫోర్క్లో రాధాకృష్ణాలయం, మిల్వాకీలో రాధామాధవ మందిరంతో పాటు పలుచోట్ల ‘ఇస్కాన్’ నిర్వహిస్తున్న కృష్ణాలయాలు ఉన్నాయి. భారత్ నుంచి వెళ్లి స్థిరపడిన హిందువులు ఎక్కువగా నివసించే గల్ఫ్ దేశాల్లోనూ కృష్ణాలయాలు దుబాయ్‌లో ‘శ్రీకృష్ణ హవేలి’, బహ్రెయిన్‌లో శ్రీనాథ ఆలయం, ఓమన్‌లో శ్రీకృష్ణాలయం ఉన్నాయి. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో హరేకృష్ణ ఆలయంతో పాటు పలుచోట్ల ఇస్కాన్ ఆధ్వర్యంలోని కృష్ణాలయాలు ఉన్నాయి. దక్షిణాఫ్రికాలోని మార్ల్బ్రోలో, శాండ్టన్లలో రాధేశ్యామ్ ఆలయాలు ఉన్నాయి.ఇవే కాకుండా, ‘ఇస్కాన్’ ఆధ్వర్యంలో ప్రపంచం నలుమూలలా దాదాపుగా అన్ని దేశాల్లోనూ కృష్ణాలయాలు ఉన్నాయి. అలాగే స్వామినారాయణ్ ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయాల్లో ఏటా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. వీటితో పాటు దేశ విదేశాల్లోని ఇతర వైష్ణవ ఆలయాల్లో కూడా శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరుగుతాయి. -
చట్టంతో చంద్రబాబు చదరంగం.. వాటే స్కిల్ బాబు
-
మై డియర్ బ్రదర్.. లవ్ యూ సిస్టర్
అన్నాచెల్లెలు.. అక్కాతమ్ముడు.. ఒక కొమ్మకు పూసిన పువ్వులు.. ఒక గూటిలో వెలిగిన దివ్వెలు.. తోడబుట్టిన బంధం ఆతీ్మయతల హరివిల్లు.. అనురాగాలు, అనుబంధాల పొదరిల్లు.. చిన్ననాటి చెలిమి.. పెరిగి పెద్దయ్యాక బలిమి.. అన్నా.. అంటే నేనున్నా.. అని ఆపదలో చెల్లికి అభయహస్తం.. అమ్మా–నాన్నల తరువాత అంతటి ఆతీ్మయబంధం ఏదైనా ఉందంటే.. అది సోదర–సోదరీ బంధమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాసింత తెలివితేటలు వచ్చే వరకే తల్లిదండ్రులు.. ఆపైన అంతా అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్లే. ఇంతటి జన్మజన్మల బంధాన్ని వేడుకలా చేసుకునే రక్షాబంధన్ కోసం ప్రతీ ఒక్కరూ ఎదురుచూస్తుంటారు. ఏడాదంతా ఎలా గడిచినా, రాఖీ పౌర్ణమి నాడు మాత్రం వారి ప్రేమనంతా పోగేసుకుని సంబరాలు జరుపుకుంటారు. ఇలా తమ జీవితంలో మధురమైన సోదర–సోదరీ బంధాల గురించి పలువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. రక్షాబంధన్ నేపథ్యంలో వారి అనుభవాలు, అనుభూతులు వారి మాటల్లోనే... సాక్షి, సిటీబ్యూరో/శ్రీనగర్ కాలనీ సర్‘ప్రైజ్’ ఇచ్చాను.. నా తమ్ముడిది నాది తల్లీ కొడుకుల అనుబంధం. అమ్మానాన్న లేకపోవడంతో తమ్ముడు మహే‹Ùచంద్రను కొడుకులానే చూసుకున్నాను. మహేష్ చిన్నోడైనా కష్టాలు చుట్టిముట్టిన సమయంలో ఆత్మస్థైర్యాన్ని నింపుతూ తోడునీడలా ఉన్నాడు. షూటింగ్స్ కానీ, ఇతర వ్యక్తిగత విషయాల్లోగానీ సపోర్ట్‌గా ఉన్నాడు. తనకు ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు మా అమ్మ మరణించింది. నేను జాబ్ చేస్తుంటే.. అప్పటి వరకు అమ్మ బాగోగులు, ఇంటి పనులు అన్నీ తానే చూసుకునేవాడు. చివరకు అమ్మ మరణించినప్పడు తన వయస్సు చిన్నదైనా అన్నీ తానై కార్యక్రమాలు నిర్వహించాడు. అలా ఒకరికొకరం ఆతీ్మయతను పంచుకుంటూ పెరిగాం. ఏడాది క్రితం జాబ్‌లో చేరిన మహేష్... ఏడాదంతా తన జీతాన్ని దాచి, ఈసారి రాఖీకి బహుమతిగా గోల్డ్–ప్లాటినం బ్రాస్లెట్ చేయించాడు. ఇంకా ఆ సంతోషంలోనే ఉన్నాను. ఓసారి స్కూల్లో ఓ అవార్డుకు మహేష్ సెలెక్ట్ అయ్యాడు. నన్ను సర్ప్రైజ్ చేయాలనే ఉద్దేశంతో పేరెంట్స్ మీటింగ్ ఉందని పిలిచాడు. కానీ, అదే కార్యక్రమానికి నేను ముఖ్యఅతిథిగా వెళ్లి అవార్డు ప్రదానం చేసి నేనే తమ్ముడికి సర్ప్రైజ్ ఇచ్చాను. మా ఇద్దరికీ ఇది మరచిపోలేని జ్ఞాపకం. –రోజా భారతి, నటిటామ్ అండ్ జెర్రీ లాగే.. చెల్లి సోనీ, నేను ఒక దగ్గర ఉంటే.. టామ్ అండ్ జెర్రీల్లాగే పోట్లాడుకుంటాం. ఒకరినొకరం ఏడిపించుకుంటుంటాం. కానీ, మా మధ్యలో మూడో వ్యక్తి ఎవరైనా వస్తే వాళ్ల పని ఖతమే. ఏదో పండుగకో, పుట్టినరోజుకో గిఫ్ట్‌లు ఇచ్చుకోవడం మాకు అలవాటు లేదు. ఎప్పుడు తను ఏది అడిగినా కొనిస్తుంటా. ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఏదైనా నచి్చతే తీసుకొచ్చి మా చెల్లికి ఇస్తుంటా. సోనీ కూడా నా కోసం ఏదో ఒకటి తెస్తూ ఉంటుంది. నా పని విషయంలో సోనీయే పెద్ద క్రిటిక్. ముందుగా సోనీ నా పాటలను విని ఓకే చేసిన తర్వాతే వేరే ఎవరికైనా వినిపిస్తా. ప్రతి విషయాన్ని ముందుగా సోనీతోనే పంచుకుంటుంటా. ప్రతి విషయంలో నాకు పిల్లర్‌గా సపోర్టు చేస్తుంటుంది. ఇక, ఇద్దరం కలిసి చాలా టూర్స్ వెళ్లాం. అది ఎవరికీ తెలియకుండా సీక్రెట్‌గా ప్లాన్ చేస్తాం. అన్ని ఓకే అయి బయల్దేరే ముందే అమ్మ, నాన్నకు చెప్పేవాళ్లం. 8 ఏళ్ల కింద చెల్లి పుట్టినరోజున తన పేరును నా చేతిపై టాటూగా వేయించుకున్నా. అప్పుడు తను చాలా ఎమోషనల్ అయింది. తనపై నాకున్న ఇష్టాన్ని అంతకన్నా బాగా చెప్పలేను కదా! అది జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని సందర్భం. పూజితతో నా పెళ్లి విషయంలో కూడా మొదటి నుంచీ సోనీయే సపోర్టుగా ఉంది. ఇప్పుడు పూజిత, సోనీ కలిసి నన్ను ఆడుకుంటున్నారు. రాఖీ పండుగ మా ఇంట్లో స్పెషల్ రాఖీ పండుగ మా ఇంట్లో చాలా స్పెషల్.. మా అన్నయ్య వంశీ కార్తీక్ అంటే నాకు చాలా ఇష్టం. చిన్నతనం నుంచి ఓ నాన్నలా నన్ను ప్రోత్సహించి, ముందుండి నడిపించాడు. డిజిటల్ మీడియా, సినీ ఇండస్ట్రీలోకి అమ్మాయిలు వెళ్లాలంటే ఆలోచిస్తారు. కానీ, నేను కచి్చతంగా మంచిస్థాయిలో ఉంటానని నమ్మి నాకు గాడ్‌ఫాదర్‌లా నిలబడ్డాడు. ఇద్దరం కెరీర్ పరంగా చాలా కష్టాలను ఎదుర్కొన్నాం. నేడు ఇద్దరం మంచిస్థానాల్లో ఉన్నాం. నాకు తండ్రిలా నడిపించిన మా అన్నయ్యకు, నాకు అన్నివిధాలుగా వెన్నుతట్టే అన్నయ్యలు వందేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని రాఖీ పండుగ శుభాకాంక్షలు. – హారిక, నటిఅత్యద్భుత బంధం మాది.. అనితర సాధ్యమైన అద్భుత..ఆతీ్మయ బంధం మాది. మధురమైన జ్ఞాపకాలతో, షరతులు లేని ప్రోత్సాహంతో ఎల్లప్పుడూ ఒకరికొకరు అండగా ఉంటాం. క్రీడలు, చదువులు ఇలా ఏ విషయంలోనైనా నా తమ్ముడు అగస్త్య నిరంతరం మద్దతుగా నిలిచాడు. నా కంటే చిన్నవాడైనప్పటికీ కీలక నిర్ణయాల్లో తమ్ముడి భాగస్వామ్యం ఉంటుంది. ముఖ్యంగా కఠినమైన శిక్షణ సమయాల్లో, సవాల్‌తో కూడిన టోర్నీల్లో పాల్గొనే సమయంలో ఆత్మస్థైర్యాన్ని నింపే కోచ్‌గా నాకు మార్గనిర్దేశం చేస్తూ, ప్రోత్సహిస్తాడు. మల్లె పూల కన్నా.. మంచు పొరల కన్నా, నెమిలి హొయల కన్నా, సెలయేటి లయల కన్నా.. మా బంధం అందమైనదని చెప్పగలను. పాకిస్తాన్లో బంగారు పతకాలు సాధించి దక్షిణాసియా ఛాంపియన్‌గా నిలవడం ఓ మధుర జ్ఞాపకం. ఈ ఫైనల్స్‌కు ముందు ఫోన్ కాల్లో నా సోదరుడు ‘భారత్ మాతా కీ జై’ అంటూ గోల్డ్ మెడల్ కోసం నన్ను ప్రోత్సహించిన శక్తివంతమైన మాటలు నాకింకా గుర్తున్నాయి. నేను కట్టిన రాఖీకి రిటర్న్ గిఫ్ట్‌గా తను ఇచి్చన టేబుల్ టెన్నిస్ రాకెట్ నా ఫేవరెట్. నేషనల్ ఛాంపియన్íÙప్ సమయంలో నాతో పాటే ఉండమని అడిగినప్పుడు..అగస్త్య తన డిగ్రీ 2వ సంవత్సరం పరీక్షను వదిలి మరీ వచ్చాడు. – నైనా జైస్వాల్, ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణిభాయ్.. తమ్ముడు.. అన్నయ్య ఈసారి మార్కెట్లో కాస్త వెరైటీ రాఖీలు దర్శనమిస్తున్నాయి. రాఖీలపైన భాయ్, తమ్ముడు, అన్నయ్య పేర్లు వచ్చేలా అందంగా తీర్చిదిద్దారు. కాస్త కొత్తగా.. విభిన్నంగా ఉండడంతో ఈ రాఖీలను కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఇక ఫ్యాషన్ కూడా తోడవడంతో రాఖీలు కొత్తరూపాలను సంతరించుకుంటున్నాయి. సంస్కృతీ సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూనే మోడ్రన్‌గా ఉండే రాఖీలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. -
Natarajan: సంగీతానికి ఇన్స్ట్రుమెంట్ ఈ కుటుంబం..
భక్తి పాటల భజనకైనా, జానపద గీతాలకైనా, సంగీత కచేరీలకైనా తంబురా, హార్మోనియం, డోలక్, తబలా వంటి వాద్యాలు తప్పనిసరి! పాపులర్ మ్యూజిక్‌లో వీటి జాడ అరుదు ఇంకా చెప్పాలంటే కరవూ! కానీ కర్నూల్లోని నటరాజన్ ఇంట్లో ఇప్పటికీ ఇవి శ్రుతి సరిచేసుకుంటున్నాయి.. శ్రోతలకు మెలోడీ ఫెస్ట్‌ని అందివ్వడానికి!నటరాజన్ సంగీత వాద్యపరికరాలు తయారు చేయడంలో ఘనాపాఠి! ఇది ఆయనకు వారసత్వంగా అబ్బిన, అందిన విద్య, వృత్తి, సంపద కూడా! నటరాజన్ తాత, ముత్తాతల కాలం నుంచీ ఇది కొనసాగుతోంది. ఆ కుటుంబంలోని అందరూ బాగా చదువుకున్నవారే. నటరాజన్ ముత్తాత మురుగేషన్ మొదలియార్.. బ్రిటిష్ కాలంలో హార్మోనియం గురువుగా ఉన్నారు. డ్రామాలకు దుస్తులను సరఫరా చేసే కంపెనీనీ నడిపారు. ఆయన ఇద్దరు కొడుకుల్లో ఒకరైన రామస్వామి కొడుకే నటరాజన్ తండ్రి.. బాలసుబ్రహ్మణ్యం.పేపర్ మిల్లో ఎలక్ట్రికల్ ఇంజినీర్‌గా పనిచేసేవారు. ఆ మిల్లు మూతపడటంతో తాతల వృత్తి సంగీత వాద్యపరికరాల తయారీని జీవనోపాధిగా మలచుకున్నారు. దాన్ని తన కొడుకు నటరాజన్‌కూ నేర్పారు. నటరాజన్ కూడా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్. అయినా తండ్రి నేర్పిన విద్యకే ప్రాధాన్యం ఇచ్చారు. హార్మోనియం, వయొలిన్, వీణ, మృదంగం, డోలక్, తబలా, ఫ్లూట్ వంటి వాయిద్యాలను యువతను ఆకర్షించేలా తయారుచేస్తున్నారు. వీరి ఈ పరికరాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కర్ణాటకలోనూ డిమాండ్ ఉంది. ఈయన దగ్గర అయిదు వేల రూపాయల నుంచి 50 వేల రూపాయల దాకా విలువ చేసే హార్మోనియం, వీణ, తబలాలు అందుబాటులో ఉన్నాయి.‘నేటి స్ట్రెస్ఫుల్ లైఫ్‌కి మంచి ఊరట సంప్రదాయ వాద్య సంగీతం. ఇది మనసును ఇట్టే తేలిక చేసి సాంత్వననిస్తుంది. అయితే ఎలక్ట్రానిక్ సంగీత పరికరాలు అందుబాటులోకి రావడంతో అలనాటి సంగీత పరికరాలను మర్చిపోతున్నారు. గత అయిదారు సంవత్సరాల నుంచి దేవాలయాల్లో భజన కార్యక్రమాలు ఎక్కువవడంతో మళ్లీ అలనాటి సంగీత పరికరాలకు ఆదరణ పెరిగి.. మాకు మళ్లీ చేతినిండా పని దొరికినట్టయింది’ అని చెబుతున్నారు నటరాజన్. – కె.రామకృష్ణ -
ఇమామ్ కజిన్ : ఓ సిటీలోని ఒక కాలనీలో..
ఓ సిటీలోని ఒక కాలనీలో.. ‘మేజ్..అరటి పళ్లూ..’ అంటూ పళ్ల బండి తోసుకుంటూ ఓ బంగ్లా ముందు నుంచి వెళ్తున్నాడో వ్యక్తి. ‘రేయ్.. ఈ ఏరియాల నిన్నెప్పుడు జూడ్లే! యేడి నుంచి ఒచ్చినవ్ బే?’ అంటూ ఆ బంగ్లా ముందున్న ఒక నడి వయసు వ్యక్తి బెదిరింపు స్వరంతో అడిగాడు. అతని పేరు శంకర్. ఆ బంగ్లా యజమాని అయిన మల్లేశ్‌కి కుడి భుజం లాంటివాడు. ఆ ప్రశ్నకు ఆ వ్యాపారి ఆ ఇంటి ముందు తన బండి ఆపి, తన పిల్లి గడ్డాన్ని సవరించుకుంటూ ‘నేను మార్కెట్ల పనిజేసే ఇమామ్ కజిన్‌ని భాయ్’ అని చెప్పాడు.బండిలోంచి ఓ పండును తీసుకుంటూ ‘ఏ మార్కెట్లయినా ఈ శంకర్‌కి పహచానత్ ఉంటది. నాకు దెల్వని ఇమామ్.. గాయన కజిన్ ఏడికెంచొచ్చె..’ అన్నాడు అరటి పండు తొక్కతీస్తూ! ‘నాది కరీంనగర్. కామ్‌కే లియే భాయ్‌కే పాస్ ఆయా. భాయ్ ఈ మేజ్ బండి ఇప్పిచ్చిండు’ చెప్పాడు ఇమామ్ కజిన్ అమాయకంగా. ‘అచ్ఛా..’ అని అరటి పండు తింటూ ఇమామ్ కజిన్‌ని ఇంకేదో అడగబోతుండగా.. అప్పుడే రాజ్‌దూత్ మీద ఎవరో ఆ ఇంటికి వచ్చేసరికి అరటి పండు తొక్కను అదే బండిలో విసిరేసి లోపలకు వెళ్లిపోయాడు శంకర్.పది రోజులు గడిచాయి..ఇమామ్ కజిన్ రోజూ ఆ కాలనీకి వస్తున్నాడు అరటి పండ్ల బేరానికి. కాలనీ అంతా తిరిగి మల్లేశ్ ఇంటి ముందున్న చెట్టు కిందే బండి పెట్టుకుంటున్నాడు చీకటి పడేవరకు. బంగ్లా యజమాని మల్లేశ్ ల్యాండ్ సెటిల్మెంట్లు, రియల్ ఎస్టేట్‌లో ఆరితేరినవాడు. వడ్డీ వ్యాపారి కూడా. ఆ పనుల్లో మల్లేశ్ సహాయార్థం బిజీ అయిపోయాడు శంకర్. ఇమామ్ని, అతని కజిన్‌ని పట్టించుకునే తీరికలో లేడు. ఆ పదిరోజుల్లో ఇమామ్ కజిన్.. ఆ బంగ్లా సెక్యురిటీ గార్డ్ లాంటివాడైన శ్రీశైలానికి అరటి పండ్లు ఇస్తూ, రిలీజైన సినిమాలు, చిరంజీవి డాన్స్‌లు, సంజయ్ దత్ యాక్షన్ గురించి మాట్లాడుతూ క్లోజ్ అయ్యాడు.ఆ దోస్తానా ఎక్కడిదాకా వెళ్లిందంటే రెండు రోజులకోసారి ఆ ఇద్దరూ బిర్యానీ, మందు పార్టీ చేసుకునేదాకా! అయితే తాను ముస్లిం ధర్మాన్ని నిష్ఠగా పాటిస్తాడు కాబట్టి మందు ముట్టనని ముందే శ్రీశైలంతో చెప్పాడు ఇమామ్ కజిన్. ‘దాందేముంది భయ్యా.. నేను మందు తాగుతా.. నువ్వు కూల్‌డ్రింక్ సప్పరియ్’ అంటూ ఇమామ్ వ్రతం చెడకుండా జాగ్రత్తపడ్డాడు శ్రీశైలం. ఆ ఫ్రెండ్షిప్ అక్కడితోనే ఆగలేదు.. ఇమామ్ కజిన్‌కి మల్లేశ్ ముఖ్యమైన అనుచరులనూ పరిచయం చేసే వరకు వెళ్లింది.తరచుగా వాళ్లనూ తమ పార్టీకి తీసుకొచ్చేవాడు శ్రీశైలం. తన సెన్స్ ఆఫ్ హ్యూమర్‌తో వాళ్లందరినీ ఆకట్టుకుంటూ వాళ్లకూ మాలిమయ్యాడు ఇమామ్ కజిన్. ఆ చనువుతో అతను తనకు కుదిరినప్పుడల్లా మల్లేశ్ ఇంటికి వెళ్లేవాడు వాళ్లను కలవడానికి. అలా ఇంకో పది రోజులు గడిచాయి. ఇప్పుడు అతను.. మల్లేశ్ ఇంటికి ఎన్ని ద్వారాలున్నాయి, ఆ ఇంట్లో ఏ మూల ఏం ఉంది.. మల్లేశ్ కుటుంబ సభ్యుల్లో ఎవరు ఏ గదిలో ఉంటారు లాంటి వివరాలన్నిటితో కళ్లు మూసుకుని ఆ ఇంటి నకలు గీసి చూపించగలడు!ఇరవై రెండో రోజు..రాత్రి ఇమామ్ కజిన్.. మల్లేశ్ అనుచరుల్లోని అతి విశ్వాసపాత్రులు, తన దోస్తులూ అయిన ఓ ఇద్దరికి దావత్ ఇచ్చాడు. తన భాయ్ ఇమామ్ తనకు పండ్ల దుకాణం పెట్టించబోతున్నాడనే ఖుష్ ఖబర్ను పంచుకుంటూ! ఆ అనుచరులిద్దరూ ఇమామ్ కజిన్‌ని గుండెకు హత్తుకున్నారు. అన్నేళ్ల నుంచి మల్లేశ్ ఇంట్లో ఉంటున్నా తమకు ఒరగని లాభాన్ని, చేస్తున్న చాకిరీని ఏకరువు పెట్టుకున్నారు. వచ్చిన నెలలోపే ఇమామ్ తన కజిన్‌కి దందా పెట్టివ్వడాన్ని పొగిడారు. అందుకు అర్హత సాధించిన ఇమామ్ కజిన్ నిజాయితీకి సలాం చేశారు. ఆ మత్తులో ఇంకా.. తమ బాస్ ఎలా సంపాదిస్తున్నాడో.. ఆ సంపదను దాచే ఆ ఇంట్లోని సీక్రెట్ ప్లేసెస్ ఏంటో డీటేయిల్డ్‌గా చెబుతూ మల్లేశ్ మీదున్న కసిని వెళ్లగక్కారు. అంతేకాదు ఆ రోజు ఉదయమే మల్లేశ్కున్న డెయిరీ ఫామ్‌లోని గడ్డివాముల్లో దాచిన డబ్బు సంగతీ చెప్పారు. నెమ్మదిగా కూల్‌డ్రింక్ సిప్ చేస్తూ విన్నాడు ఇమామ్ కజిన్!తెల్లవారి..ఆరు గంటలకు ఇన్కమ్ టాక్స్ సిబ్బంది ఆ సిటీలోని శంకర్ ఇల్లు సహా అతని స్థావరాలన్నిట్లోకి అడుగుపెట్టారు సెర్చ్ వారెంట్‌తో! ఇంటి గరాజ్లోని నేల మాళిగ, స్టోర్ రూమ్, డెయిరీ ఫామ్ గడ్డి వాములు.. అన్నిచోట్లా నాలుగు గంటల్లో.. లెక్క, పత్రాల్లేని ఆదాయం కొన్ని పదుల కోట్లలోనే దొరికింది. బంగారు ఆభరణాలు, బిస్కట్లు సహా!ఇమామ్ లేడు..ఇది దాదాపు 20 ఏళ్ల కిందటి సంగతి. మల్లేశ్ వాళ్ల కాలనీలోని ఒక గవర్నమెంట్ టీచర్ ఐటీ డిపార్ట్మెంట్కు అందించిన టిప్‌తో ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది డిపార్ట్మెంట్. మామూలుగా ఆ కాలనీ అంతా మల్లేశ్ మనుషులే కాపలా కాస్తుంటారు. సాదాసీదా వ్యక్తిగా వెళితే వివరాలు దొరికే ఆస్కారం లేదు. అందుకే ఇమామ్ అనే ప్రాతను సృష్టించి, అతని కజిన్‌గా పెట్టుడు పిల్లి గడ్డంతో, అరపటి పండ్ల వ్యాపారిగా మల్లేశ్ ఉంటున్న కాలనీలోకి ఎంటర్ అయ్యాడు ఆ ఉద్యోగి. 20 రోజుల్లోనే మల్లేశ్ అనుచరులు అతని గురించిన సీక్రెట్స్ అన్నీ కక్కడంతో ఆ ఆపరేషన్ అనుకున్నదాని కంటే ముందే అయిపోయింది. ఆ రోజు రెయిడ్ చేయకపోతే మరుసటి రోజు గడ్డివాముల్లో దాచిన డబ్బు బెంగళూరుకు రవాణా అయిపోయేది. అదీ ఆ రాత్రి పార్టీలోనే తెలియడంతో వెంటనే రాత్రికిరాత్రే సెర్చ్ వారెంట్ సిద్ధమైపోయింది. రెయిడ్ సక్సెస్ అయింది.(‘ద రెయిడ్’ అనే కొత్త శీర్షిక కింద.. ఓ వాస్తవ సంఘటనకు కాస్త ఫిక్షన్‌ను జోడించి రాసిన కథనం ఇది. అందుకే ఊరు పేరు ఇవ్వలేదు. వ్యక్తుల పేర్లు మార్చాం. ఇక నుంచి వారం వారం ఇక్కడ ఇలాంటి ఆసక్తికర కథనాన్ని చదవొచ్చు.) – శరాదిఇవి చదవండి: దయ్యాల పండుగ..! ఒక రకంగా ఇది..? -
లక్ష్మీపూజ.. తెలుగింటి ఆడపడుచుల పండుగ!
నగర జీవనంలో ఎక్కువగా పాశ్చాత్య సంస్కృతే కనిపిస్తుంటుంది. ఆధునిక పోకడలతో మనవైన సంప్రదాయాలను పక్కనపెట్టేస్తున్నారు అనుకునే వారి ఆలోచనలకు నగరవాసులు ఎప్పుడూ కొత్త అర్థాలను చెబుతూనే ఉన్నారు. తెలుగింటి ఆడపడుచులు అత్యంత భక్తి శ్రద్ధలతో, సాంప్రదాయ బద్దంగా ఆచరించే వేడుకలలో మొట్టమొదటి వేడుక శ్రావణ మాసంలో నిర్వహించే వరలక్ష్మీ పూజ. నెల రోజుల పాటు ప్రతి శుక్రవారం సాంప్రదాయ వస్త్రధారణతో చూడముచ్చటగా అలంకరించుకుని.. తెలుగింటి వంటలు ప్రసాదాలుగా చేసి, పచ్చని తోరణాలతో, పుష్పాలతో అమ్మవారి అలంకరణలో వైభవంగా తమదైన సృజనకు మెరుగులు దిద్దుతున్నారు. – సాక్షి సిటీబ్యూరోపర్యావరణ అలంకరణ.. మట్టి లేదా ఇత్తడి పాత్రలో నీళ్లు నింపి, పువ్వులతో అలంకరించి, వాటి మధ్యలో అమ్మవారిని ఏర్పాటు చేస్తున్నారు. లిల్లి, నందివర్ధనం, మల్లెలు, తెల్ల చామంతి, తామర పువ్వులతో పాటు డెకార్ పువ్వులను కూడా వాడుతున్నారు. వాడిన ప్రతి వస్తువునూ రీ సైక్లింగ్ విధానంతో పర్యావరణ అనుకూలంగా మార్చుతున్నారు.తోరణపు కళ.. బ్యాక్ డ్రాప్స్..నెగిటివ్ ఎనర్జీని తీసేసి ఇంటికి శోభని, శుభాన్ని కలుగజేసే వరి తోరణాలతో పాటు ఎంబ్రాయిడరీ చేసిన డిజైనర్ తోరణాలనూ అలంకరణకు ఉపయోగిస్తున్నారు. అమ్మవారి వెనకాల బ్యాక్ డ్రాప్లో వాడుకోవడానికి ఐదారు అడుగుల ఎత్తున్న ఫ్రేమ్‌లు రకరకాల మోడల్స్‌లో అందుబాటులోకి వచ్చాయి. పచ్చని కళ రావాలంటే విస్తరాకులు, కొబ్బరి ఆకులు, తమలపాకులు, ఇలా ఏదైనా ఆకులతో చేసే బ్యాక్ డ్రాప్‌ను వాడుతున్నారు. పట్టు చీరలు, ఇండోర్ మొక్కలు, రాగి, ఇత్తడి పాత్రలు అలంరకణలో చేరాయి.భక్తిని అలంకరిస్తే ఎంత అందంగా ఉంటుందో వరలక్ష్మీ వ్రతం రోజున ఇంటి కళను బట్టి తెలిసిపోతుంది. వారం పది రోజుల ముందు నుంచే అమ్మవారి అలంకరణకు కావాల్సిన వస్తువుల ఎంపిక మొదలవుతుంది. వీటిని పూజా స్టోర్స్, ఆన్లైన్, జనరల్ స్టోర్స్, బేగం బజార్, డెకార్ ప్లేస్‌లకు వెళ్లి నచి్చనవి ఎంపిక చేసుకోవడం ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. ఒక్కో డిజైన్ సెట్‌కి సాధారణంగా 2 నుంచి 10 వేల రూపాయల వరకూ ఖర్చు చేస్తున్నారు. పెళ్లి లాంటి వేడుకలకే కాదు పండగల్లోనూ కలర్‌ఫుల్ థీమ్‌తో చేసే అలంకరణలో మహిళలు తమదైన ప్రత్యేకతను చూపుతున్నారు. ముందే అడిగి.. ఐదేళ్ల క్రితం అమ్మవారి అలంకరణ వస్తువులు ఎక్కడ దొరుకుతాయి, ఎవరు డెకరేట్ చేస్తారు అని వెదికేవారు. అలా మేం పదిహేనేళ్లుగా వరలక్ష్మీ పూజలకు డెకరేట్ చేస్తున్నాం. ఇప్పుడు సోషల్‌మీడియాలోని వీడియోలు చూసి సొంతంగా ఎవరికి వారు క్రియేటివిటీకి పదును పెడుతున్నారు. వారి సొంతంగానే డిజైన్ చేసుకుంటున్నారు. ఈ ఆలోచన వల్ల ఆన్లైన్ మార్కెట్ కూడా బాగా పెరిగింది. యువత తమ భక్తిని చాలా అందంగా చూపుతున్నారు. ఎలాంటి డిజైన్స్ కావాలో ముందే అడిగి మరీ అలంకరణ చేయించుకుంటున్నారు.– కల్పనారాజేష్, డెకార్ బై కృష్ణఆర్గానిక్ మెటీరియల్స్.. నా ఎంపిక ప్రతి వస్తువూ తిరిగి ఉపయోగించుకునేలా ఉంటుంది. బ్యాక్‌డ్రాప్‌కి తాజా పువ్వులు వాడతాం. అమ్మవారికి కట్టే చీర హ్యాండ్లూమ్దే ఎంచుకుంటాం. తిరంగా స్టైల్లో అమ్మవారి అలంకరణ చేశాను. అమ్మవారికి ముఖం, కాళ్లూ చేతులు కొని పెట్టి, వాటిని మొత్తం సెట్ చేసి, మేమే అలంకరిస్తాం. తాంబూలాన్ని వస్త్రంతో చేసిన బ్యాగ్‌లో/ తాటాకు బుట్టలలో పెట్టి ఇస్తుంటాం. ప్రతి వస్తువూ ఆర్గానిక్‌గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాం.– ప్రతిమ, వైష్ణవి రాపర్తి, వెస్ట్మారేడుపల్లిపాజిటివ్ వైబ్రేషన్స్..బిజీ జీవనంలోనూ అమ్మవారి పూజ ప్రత్యేకంగా అనిపిస్తుంది. కొన్ని రోజులు ముందునుంచే అమ్మవారి అలంకరణకు సంబంధించిన వస్తువులను ఎంపిక చేసుకోవడం, వీలైనంతగా ముందురోజే సిద్ధం చేసుకోవడం జరుగుతుంటుంది. ప్రతియేటా ఒక ప్రత్యేకమైన కళ తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటాం. పిల్లలు కూడా ఈ పనిలో భాగం అవుతుంటారు. ఈ విధానం వల్ల వారిలో సృజన పెరుగుతుంది, భక్తి కూడా అలవడుతుంది.– డాక్టర్ శిరీషారెడ్డి, తార్నాక -
ఇది.. సైనికుల సంగ్రామం!
ఒక్కో ఊరికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలా ఈ ఊరికి ఉన్న ప్రత్యేకత ‘దేశభక్తి’. దేశాన్ని కాపాడాలనే ధ్యేయంతో ఊరి యువకులు సైన్యం బాట పట్టారు. ఒకే ఊరి నుంచి ఇంటికి ఒక్కరు చొప్పున సుమారుగా 92 మందికిపైగా యువకులు సైన్యంలో తమ సేవలను అందిస్తున్నారు. ఫలితంగా ఒకప్పుడు పీపుల్స్‌వార్ ఖిల్లాగా ఉన్న ఆ ఊరిని ఇప్పుడు ఆర్మీ జవాన్ల పుట్టినిల్లుగా పిల్చుకుంటున్నారు. ఆ ఊరు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కట్కూర్ గ్రామం. ఆ ఊరి ముచ్చట్లలోకి వెళదామా?సుమారు 40 ఏళ్ల క్రితం కట్కూర్ గ్రామానికి చెందిన జేరిపోతుల డేనియల్ మిలిటరీలో జవాన్ గా చేరాడు. ఆయన స్ఫూర్తితో గ్రామంలోని యువకులు సైన్యం బాటపట్టారు. ఇలా ఒకరిని చూసి మరొకరు ఆర్మీలో చేరారు. జవాన్ స్థాయి నుంచి లాన్స్‌నాయక్, నాయక్, హవల్దార్, నాయక్ సుబేదార్ స్థాయి వరకు వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ఇలా గ్రామానికి చెందిన వారు ప్రస్తుతం 92 మంది ఆర్మీలో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. దాంతో జిల్లాలో కట్కూరు గ్రామం అంటే ఆర్మీజవాన్ ల గ్రామంగా గుర్తింపు ΄÷ందింది. ఈ గ్రామంలో 1,014 కుటుంబాలుండగా జనాభా సుమారుగా 3,045 ఉన్నారు. అందులో మొత్తం గ్రామంలో 175 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. వీరిలో కొందరు ఇతర ఉద్యోగాలు చేస్తుండగా, మరికొందరు గ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్నారు. – మాలోతు శ్రీనివాస్, సాక్షి, అక్కన్నపేటదేశసేవ ఇష్టం...దేశసేవ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే 1998లో భారతసైన్యంలో చేరాను. మద్రాస్ ఇంజినీరింగ్ గ్రూప్ బెంగళూర్‌లో ట్రైనింగ్ చేశాను. కార్గిల్ యుద్ధంలో కూడా పాల్గొన్నాను. కాశ్మీర్లో రాష్ట్రీయ విభాగంలో సేవలు అందించి అనేక టెర్రరిస్ట్ ఆపరేషన్ లలో పాల్గొన్నాను. కాశ్మీర్ సేవలను గుర్తించి నాకు సుబేదార్ మేజర్‌గా ప్రమోషన్ ఇచ్చారు. – పంజా సదయ్య, సుబేదార్గర్వపడుతున్నా...దేశరక్షణ కోసం సైన్యంలో పని చేస్తున్నందుకు గర్వపడుతున్నాను. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా దేశం కోసం పని చేయడం ఆనందంగా ఉంది. – కొయ్యడ శ్రీనివాస్, ఆర్మీ జవాన్ -
Shravanamasam Special.. ప్రతి శుక్రవారం.. మహా నైవేద్యం విందు!
సాక్షి, సిటీబ్యూరో: శ్రావణమాసం వచ్చిందంటే చాలు.. ఈ మాసంలో పూజలతో ఇంటిల్లిపాది పండుగ వాతావరణం నెలకొంటుంది. అయితే చాలా మంది ఉపవాసాలు చేస్తుంటారు. ఈ నెల మొత్తం మాంసాహారం తినకుండా ఉంటారు. అలాంటి వారికోసం ఓ రెస్టారెంట్ వినూత్నంగా ఆలోచించింది. ప్రతి శుక్రవారం పూర్తి శాఖాహారంతో విందు ఏర్పాటు చేసింది. కోకాపేటలోని యునైటెడ్ తెలుగు కిచెన్ ఈ ఆలోచనకు కార్యరూపం తీసుకొచ్చింది. ప్రతి శ్రావణ శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఈ విందును వడ్డించనుంది. రూ.699కు ఈ శ్రావణ మాస మహా నైవేద్య విందును భోజన ప్రియులకు అందిస్తోంది. -
ఊపిరి తీస్తున్న వాయు కాలుష్యం!
మనిషి బ్రతకడానికి ఊపిరి తీసుకుంటాడు. అలాంటిది ఈ మధ్య కాలంలో ఊపిరి తీసుకోవడమే ప్రాణాలకు ప్రమాదకరంగా పరిణమించింది. వాతావరణంలో కర్బన ఉద్గారాలు విపరీతంగా పెరిగి పోవడం వలన స్వచ్ఛమైన ప్రాణవాయువు శాతం తగ్గిపోతోంది. దీనివలన చిన్నారుల నుంచి సీని యర్ సిటిజన్స్ వరకు అనేక ఆరోగ్య సమస్యలు అనుభవించాల్సి వస్తోంది.మనం పీల్చే గాలిలో ప్రాణాంతకమైన కాలుష్య కారకాలు కలుస్తున్నాయి. ఊపిరి తీసుకున్న తరువాత శరీరంలోకి చేరిపోయి అవయవాలను నిర్వీర్యం చేస్తున్నాయి. మనదేశంలో అతిపెద్ద నగ రాలలో సంభవిస్తున్న మరణాల్లో సగటున 7.2 శాతం మరణాలకు వాయు కాలుష్యమే కారణమని తాజా అధ్యయనంలో తెలిసింది. ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ వంటి మహానగరాలలోని గాలిలో అత్యంత సూక్ష్మమైన ‘పి.ఎం 2.5’ ధూళి కణాలు అధికంగా ఉన్నట్లు ఒక నివేదిక తెలిపింది. మనదేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో చాలా మరణాలకు వాయు కాలుష్యమే కారణమవుతున్నట్లు తెలిపింది. పి.ఎం అంటే పార్టిక్యులేట్ మ్యాటర్. 2.5 అంటే... గాలిలో ఉండే సూక్ష్మ కణాల వ్యాసం 2.5 మైక్రోమీటర్లు లేదా అంతకంటే తక్కువ ఉన్నవని అర్థం. ఈ కణాలు ఆరోగ్యానికి చాలా హాని చేస్తాయి. ఇవి ముఖ్యంగా గుండె, ఊపిరితిత్తులు, శ్వాసనాళాల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. ఈ గాలిలోకి చేరే సల్ఫేట్లు, బొగ్గు సంబంధమైన కలుషితాల వంటివి ఊపిరితిత్తులకు పట్టేస్తున్నాయి. గుండెకు వెళ్లే రక్తపునాళాల్లో పేరుకుపోతున్నాయి.మనదేశంలోని పెద్ద పెద్ద నగరాలలో నిత్యం వెలువడుతున్న పి.ఎం 2.5 ధూళికణాల వలన మరణాలు రేటు నానాటికీ పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఒక క్యూబిక్ మీటర్ గాలిలో 2.5 ధూళి కణాలు 10 మైక్రోగ్రాములు పెరిగితే రోజువారీ మరణాల సంఖ్య 1.4 శాతం పెరుగు తున్నట్లు ఒక పరిశోధనలో గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమాల ప్రకారం ఒక రోజు అనగా 24 గంటల వ్యవధిలో క్యూబిక్ మీటర్ గాలిలో పి.ఎం 2.5 కణాలు 15 మైక్రోగ్రాముల లోపు ఉంటే ప్రమాదం వుండదు, అంతకంటే పెరిగితే ముప్పు తప్పదు.భారతదేశ వాయు నాణ్యతా ప్రమాణాల ప్రకారం 24 గంటల వ్యవధిలో క్యూబిక్ మీటర్ గాలిలో పి.ఎం 2.5 కణాలు 60 మైక్రోగ్రాముల లోపు ఉంటే ప్రమాదం అంతగా ఉండదు. కానీ మనదేశంలో ప్రస్తుతం 75 మైక్రోగ్రాముల కంటే అధికంగానే ఉంటున్నట్లు తెలిసింది. క్యూబిక్ మీటర్ గాలిలో పి.ఎం 2.5 కణాలు 10 మైక్రోగ్రాములు పెరిగితే మరణాల రేటు సగటున 3 శాతం దాకా పెరుగుతున్నట్లు గుర్తించారు. వాయు కాలుష్యం వలన బ్రెయిన్ స్ట్రోక్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మొనరీ వ్యాధులు, న్యూమోనియా, శ్వాసకోశ ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది.కళ్లు, ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల్లో చీకాకుతో పాటు దగ్గు, తుమ్ములు పెరుగుతాయి. దీనితో పాటు ఆస్తమా లాంటి సమస్యలు వస్తాయని డాక్టర్లు హెచ్చరి స్తున్నారు. ఈ వాయుకాలుష్యం ఇలానే పెరిగితే భూమికి రక్షణ కవచం అయిన ఓజోన్ పొర క్షీణించడం ఎక్కువవుతుంది. ఓజోన్ పొర దెబ్బతింటే యూవీ కిరణాలు నేరుగా భూమిపైన పడడం వలన చర్మ, నేత్ర సమస్యలు వస్తాయి. వ్యవసాయంపైన కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి వాయుకాలుష్యం తగ్గించడానికి ప్రభుత్వాలు సాధ్యమైనంత సత్వర చర్యలు తీసుకోవాలి. – మోతె రవికాంత్, సేఫ్ ఎర్త్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, హైదరాబాద్ -
అవి తను పదో తరగతి చదువుతున్న రోజులు..
‘ఏమైంది?’ వెళుతున్న కారు వేగం తగ్గడంతో అడిగాడు మాధవ.. డ్రైవర్ని. ‘ముందు ఏదో ఊరేగింపులాగా వుంది సర్. వెళ్ళే బండ్లను ఆపేస్తున్నారు’ డ్రైవర్ తలని బయటపెట్టి చూసి చెప్పాడు సమాధానం. ‘అది వెళ్ళేదాకా మనం వెళ్ళలేమా? ఇంకో దారి ఏదైనా వుంటే అటుగా వెళ్ళు.’ ‘ఇక్కడ వేరే పక్క దారి లేదండి. సగం దాకా వచ్చేశాం ఈ రోడ్డులో’బండి పక్కకు ఆపుతూ చెప్పాడు డ్రైవర్.‘కనుక్కో ఏంటో..?’ పక్కనున్న మ్యాగజైన్‌ని చేతిలోకి తీసుకుంటూ చెప్పాడు మాధవ. కారు దిగి వెళ్లి ట్రాఫిక్ పోలీస్తో మాట్లాడి వచ్చిన డ్రైవర్ మాధవతో ‘మొన్న బోర్డర్లో చనిపోయిన సైనికుడి బాడీ అంట సర్. ఇవ్వాళ వచ్చిందిట అక్కడి నుండి. ముందున్న పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కి తీసుకెళ్తున్నారుట’ అని చెప్పి ఆగి.. మళ్లీ ‘పాకిస్తాన్ సరిహద్దుల్లో టెర్రరిస్ట్‌లతో జరిగిన పోరాటంలో ఇద్దర్ని చంపి మరొకడిని సజీవంగా పట్టుకుని తెస్తుండగా వాడిని వాడు పేల్చుకోడంలో ఈయన కూడా చనిపోయాడట అని చెప్పుకుంటున్నారు సర్!’ అన్నాడు.‘ఆ బాడీ అక్కడికి చేరేదాకా మనమేం చేయలేమా! ఇట్లా రోడ్డు మీద వుండిపోవాల్సిందేనా?’ మాధవ మాటలు మనసులో అసహనాన్ని ప్రతిబింబిస్తున్నాయి! ‘కొంచెం ముందుకెళ్లాక డబుల్ రోడ్డు వస్తది. అక్కడ వచ్చే పోయే ట్రాఫిక్‌ను పక్క రోడ్డు నుండి పంపిస్తున్నారట సర్, కానిస్టేబుల్ చెప్పాడు’ అన్నాడు డ్రైవర్. బయటకి చూసిన మాధవ ఆశ్చర్యపోయాడు. నేల ఈనినట్లు వస్తున్నారు జనం ఊరేగింపులో కలవడానికి. ప్లకార్డ్స్ను పైకి ఎత్తి పట్టుకొని నినాదాలు చేస్తూ నడుస్తున్నారు వాళ్లు. కొన్ని స్కూల్ బస్సులు కూడా వస్తున్నాయి ఊరేగింపులోకి. ఇప్పుడు బండిని వెనక్కి తిప్పించుకొని కూడా వెళ్ళలేడు! ఇంతలో వాళ్ళ కారు పక్కకి వచ్చి ఆగింది ఒక జీపు. దానికో ఫ్లెక్సీ కట్టి ఉంది.. ‘కెప్టెన్ శంకర్ స్వామి జిందాబాద్’, ‘కెప్టెన్ శంకర్ స్వామి అమర్ రహే’ అనే నినాదాలతో!అది చదివిన మాధవ ఆలోచనలో పడ్డాడు. ఆ పేరు తనకు పరిచయమైనదే! గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించసాగాడు. ఇంతలో మరొక ఆటో కాస్త ముందుకొచ్చి ఆగింది. దాని వెనుక ఆ అమర సైనికుడి ఫొటో వున్న ఫ్లెక్సీ ఉంది. ఆ ఫొటో చూసిన మాధవకు.. ఆ ఫొటోలోని వ్యక్తిలో తనకు తెలిసిన వాళ్ళ పోలికలు కనపడ్డాయి. ఆ మనిషిని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించసాగాడు. తన స్మార్ట్ ఫోన్లో గూగుల్ న్యూస్ చూశాడు. అందులో శంకర్ స్వామి జీవిత విశేషాలు, కొన్ని ఫొటోలు కనిపించాయి. పక్కనే ఆగిన జీపు ముందుకు కదులుతుండగా ‘శంకర్ స్వామి అమర్ రహే’ అంటూ వినిపించిన నినాదాలు.. మాధవ ఆలోచనలను తన ఉన్నత పాఠశాల రోజుల్లోకి తీసుకెళ్లినయ్.అవి తను పదో తరగతి చదువుతున్న రోజులు. మరునాటి నుంచే ప్రిపరేటరీ సెలవులు. ఆరోజు పిల్లలు.. స్లామ్ బుక్‌లో మిగిలిన పిల్లల సందేశాలు, ఆటోగ్రాఫ్‌లను సేకరిస్తున్నారు. అంతా కోలాహలంగా, ఉత్సాహంగా వుంది తరగతి గదిలో. ఇంతలో పిల్లలతో చనువుగా ఉంటూ పిల్లల్లో కలిసిపోయే సోషల్ మాష్టారు వచ్చారు క్లాసులోకి. వస్తూనే ‘మీ సరదాలను పాడుచేస్తూ.. పాఠం చెప్పను. కానీ మీరంతా నాకొకటి చెప్పాలి ఇవాళ. నేను దాన్ని గుర్తుపెట్టుకొని మరీ మిమ్మల్ని అడిగి తీరతాను జీవితంలో మీరెప్పుడుప్పుడు కలిసినా!’ అన్నాడు.‘అడగండి సర్, అదేంటో?’ ముక్త కంఠంతో పలికారందరూ! ‘అది అందరూ కలిసి చెప్పాల్సినది కాదు. ఒక్కొక్కరూ చెప్పాల్సినది. ముందుగా రంగాను అడుగుతాను. చెప్పు రంగా.. పెద్దయ్యాక నువ్వేం అవాలనుకుంటున్నావ్?’ అడిగాడు సోషల్ మాష్టారు. ‘పోలీస్ ఆఫీసర్ అవాలనుకుంటున్నాను సార్’ చెప్పాడు రంగా. ‘ఎందుకురా?’ ‘పోలీస్ అంటే అందరికీ భయం కదా సార్.. అందుకని!’ చెప్పేటప్పుడు నవ్వు ఆపుకోలేక పోయాడు రంగా. అతనితోపాటు క్లాస్ అంతా నవ్వేసింది.‘నువ్వురా శరత్?’ ‘లాయర్ అవుతాను సర్.’ అలా తరగతిలో పిల్లలందరినీ అడుగుతున్న మాష్టారు శంకర్ స్వామినీ అడిగాడు ‘నువు చెప్పరా శంకర్’ అంటూ. ‘గొప్పగా సావాలనుకుంటున్నాను సర్!’ శంకర్ స్వామి సమాధానంతో సోషల్ మాష్టారు ఉలిక్కిపడ్డాడు. క్లాస్ అంతా ఒక్కసారిగా నిశ్శబ్దమయింది. క్లాసులో అప్పటి దాకా ఉన్న సరదా వాతావరణం కాస్త గంభీరంగా మారింది! సోషల్ మాష్టారు తేరుకొని, ‘ఏంట్రా అట్లా అన్నావ్?’ అడిగాడు శంకర్ స్వామిని. ‘అవును సార్ గొప్పగా సావాలి సర్!’ శంకర్ నోట మళ్ళీ అదే మాట! అవాక్కయిన మాష్టారు, ‘నువ్వు ఇక్కడకి రారా’ అంటూ పిలిచాడు శంకర్‌ని తన దగ్గరకి. శంకర్ వచ్చాడు మాష్టారు దగ్గరకి.‘గొప్పగా చావడం ఏంటిరా? ఎవరు చెప్పారు నీకు ఈ మాట?’ శంకర్ భుజమ్మీద చెయ్యి వేస్తూ అనునయంగా అడిగాడు మాష్టారు. ‘మా యమ్మ సర్! కష్టపడిన వాళ్లందరూ గొప్పవాళ్ళుగా బతకచ్చుట.. కానీ గొప్పగా సావడం గొప్ప విషయం అంట సర్’ కళ్లింత చేసుకుంటూ చెప్పాడు శంకర్. ‘అంటే?’ రెట్టించి అడిగాడు మాష్టారు.‘మన బతుకు మనం బతుకుతా సస్తే గొప్ప కాదంట! మన వాళ్ళ కోసం సస్తే అది గొప్ప సావంట! అందుకోసం నేను ఆర్మీలోకి ఎలతాను సర్’ శంకర్ కంఠం స్థిరంగా పలికింది. ఆ స్వరంలో.. తన తల్లి మాటల పట్ల అతనికున్న విశ్వాసం వినిపించింది.ఆ రోజు శంకర్ స్వామిలో ఒక కొత్త వ్యక్తి కనపడ్డాడు క్లాస్ మొత్తానికి! అప్పటిదాకా ఏ ప్రత్యేకతా లేని ఒక మామూలు విద్యార్థిలో దాగి వున్న ఆశయం విస్ఫోటం చెందింది! అది అందరినీ అతని వైపు ఆకర్షించింది. అందులో మాధవ కూడా ఒకడు. మాధవ, ఇంకా నలుగురు స్నేహితులూ కలిసి సైకిళ్ల మీద స్కూల్‌కి వెళ్ళేవాళ్ళు. శంకర్.. స్కూల్‌కి నడిచివెళ్లే వాళ్ళల్లో ఒకడు. ఆర్థికపరమైన తారతమ్యం వలన ఒకే తరగతికి చెందిన వాళ్లయినప్పటికీ అలా వేరు వేరు స్నేహితుల గుంపుగా సాగేవారు విద్యార్థులు. శంకర్.. స్కూల్ అయిన తర్వాత తండ్రి నడిపే ఇస్త్రీ దుకాణంలో.. తండ్రికి రెండు మూడు గంటలు సాయపడేవాడు. అందువల్ల బయట స్నేహాలు అతనికి అలవాటు కాలేదు.టెన్త్ లెక్కల పరీక్ష రోజున జరిగిన సంఘటన కూడా గుర్తుకు వచ్చింది మాధవకు! తనకు ముందువరుసలో తల వంచుకొని పరీక్ష రాస్తున్నాడు శంకర్. ప్రశ్నపత్రం చాలా కష్టంగా వుంది. తనకు తెలిసిన లెక్కలు రెండే వున్నాయి. వాటివల్ల పాస్ మార్కులు కూడా రావు. ఇంతలో శంకర్ రాసిన ఆన్సర్ పేపరు ఒకటి జారివచ్చి మాధవ కాళ్ళ దగ్గర పడింది. శంకర్, మాధవ ఇద్దరూ గమనించుకోలేదు. తర్వాత అటుగా వచ్చిన ఇన్విజిలేటర్ దాన్ని తీసి మాధవకి ఇస్తూ ‘పేపర్లు జాగ్రత్తగా పెట్టుకో’ అని సలహా ఇచ్చాడు!అది తన పేపర్ కాదని తెలుసుకున్న మాధవ పేపర్ని తరచిచూశాడు. తనకు తెలియని ఇరవై మార్కుల లెక్క ఒకటి చేసి వుంది అందులో. తన అదృష్టాన్ని తానే నమ్మలేకపోయాడు. అంది వచ్చిన అవకాశాన్ని వదులుకోక దాన్ని పూర్తిగా కాపీ చేసి, ఇన్విజిలేటర్ చూడనప్పుడు శంకర్‌ను పిలిచి ‘కిందపడి వుంది’ అంటూ అతనికిచ్చాడు. శంకర్ పేపర్ నుండి కాపీ చేయండం వల్ల తను టెన్త్త క్లాసు లెక్కల పరీక్ష గట్టెక్కేశాడు!మాధవ.. ఇంటర్, ఇంజనీరింగ్ వేరే ఊర్లో చదివాడు. ఊరు శివార్లలో తండ్రి.. తన చిన్నప్పుడు కొన్న అయిదు ఎకరాల వ్యవసాయ భూమి.. పట్టణ విస్తరణ దాహానికి లోనయ్యింది! దాని విలువకు ముందుగా కాళ్ళు, తర్వాత రెక్కలు వచ్చేసరికి.. తను చదివిన సివిల్ ఇంజనీరింగ్‌ను ఉపయోగించి ఆ భూమిలో విల్లాలు కట్టి తనో పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి అయ్యాడు. పెళ్లి, ఇద్దరు పిల్లలు, బంగళా, ఖరీదైన కారు ఇవన్నీ ఏర్పడిన జీవితం తనది.శంకర్, ఆర్థిక పరిస్థితులు సహకరించక ఇంటర్మీడియేట్ తర్వాత పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండటంతోనే మిలిటరీలో చేరాడు. ఆర్మీలో వుంటూ టెక్నికల్ కోర్సులు పూర్తిచెయ్యడం, అంకిత భావంతో విధులు నిర్వర్తించడంతో కెప్టెన్ స్థాయికి చేరుకున్నాడు. ఆ విషయం తనకి అయిదేళ్ల క్రితం జరిగిన పూర్వ విద్యార్థుల కలయిక సందర్భంగా తెలిసింది. చాలా ఏళ్ళ తర్వాత కలుసుకున్నారందరూ! శంకర్ దేహ దారుఢ్యం, గంభీరత చూసి ఆశ్చర్యపోని మిత్రులు లేరు. ఆ సందర్భంలో శంకర్ ఎవరితోనో.. ‘పురోహితులకు, దేశహితులకు.. అంటే మా డిఫెన్త్స వాళ్ళకి పెళ్లిళ్లు అంత తేలికగా అవవు’ అని అంటుండగా విని అతనికి ఇంకా పెళ్లి కాలేదని తెలిసింది మాధవకి.గతం నుండి మాధవ ఆలోచనలు వర్తమానంలోకి వచ్చాయి. తాను కట్టేవి ఖరీదైన బట్టలు.. వాటి విలువను డబ్బుతోనే చూస్తారు.. డబ్బున్న ప్రతివారు కొని వేసుకొనగలరవి. శంకర్ స్వామి వేసే యూనిఫాం ఖరీదైనది కాకపోయినా హోదానిచ్చేది! అది వేసుకోవాలి అంటే అర్హత వుండాలి. తన బట్టలు తన శరీరానికి సుఖాన్నిస్తున్నాయి. శంకర్ స్వామి దుస్తులు వ్యక్తికి గౌరవాన్నిస్తున్నాయి. స్వామి దేశం కోసం శ్రమించాడు. తాను తన కోసం, తన కుటుంబం కోసం మాత్రమే శ్రమించాడు.తనది స్వార్థానికి చోటిచ్చే మామూలు జీవితం. అతనిది గౌరవాన్ని కలిగించే సేవా పూరిత జీవితం. తను సుఖాలను ఎంచుకున్నాడు. స్వామి త్యాగాలను ఆహ్వానించాడు! తనకేమైనా అయితే తన కుటుంబానికి మాత్రమే నష్టం. అతను లేని లోటు దేశానికి నష్టం! తనకు చావు.. వయసైపోయో.. అనారోగ్యంతోనో రావచ్చు. స్వామికి విధి నిర్వహణలో వచ్చింది! తనకు కలిగేది సామాన్యమైన చావే! అతనికి వచ్చినది అసామాన్య మరణం.. అంటే వాళ్ళమ్మ చెప్పిన గొప్ప సావా? అవును.. అదే గొప్ప సావు!! మాధవ ఆలోచనలు అతన్ని అసౌకర్యానికి గురిచేస్తున్నాయి.ప్రభుత్వ లాంఛనాలతో సాగుతున్న శంకర్ స్వామి పార్థివ దేహాన్ని ఉంచిన వాహనం దగ్గరకి మాధవ కారు వచ్చింది. శంకర్ స్వామి శరీరం మీద జాతీయ జెండా కప్పి వుంది. ఆ వాహనం అంతా పూలతో అలంకరించి వుంది. వ్యాన్ ముందు నడుస్తున్న పోలీస్ బ్యాండ్ వాళ్లు ‘జర యాద్ కరో ఖుర్బానీ’ పాటను వాయిస్తున్నారు. పోలీస్ బ్యాండ్‌కి ముందు కొంత మంది కాలేజ్ యువతి, యువకులు మార్చ్ పాస్ట్ చేస్తున్నట్లుగా నడుస్తున్నారు.. అతని ఫొటో పోస్టర్లను ఎత్తి పట్టుకొని!ఒకే తరగతి గదిలో చదువుకున్న తామిద్దరూ.. ఒకేచోట పక్కపక్కనే! అతను నిర్జీవంగా.. తాను జీవిస్తూ. అతను దేశం అంతర్గత భూభాగంలోని తనలాంటి ఎంతో మంది రక్షణ కోసం శ్రమిస్తూ మృత్యువును కౌగిలించుకున్నాడు. ఆ స్వామి శంకరుడు గరళాన్ని తీసుకున్నాడు.. ఈ శంకర్ స్వామి బుల్లెట్లు తీసుకున్నాడు తమ మీదకు రాకుండా! దేశ ప్రజలకు రక్షణ కలిగించే ప్రతి సైనికుడు ఒక శంకరుడే! చిన్ననాడే గొప్ప మరణం కోసం ఎంత గొప్పగా ప్రేరితుడు అయ్యాడు శంకర్ స్వామి! అతను కావాలనుకున్న ‘‘గొప్పసావు’’ అతను పొందాడు!!మాధవ మనసు వ్యక్తం చెయ్యలేని వ్యాకులతతో బరువెక్కింది. అతని కళ్ళు తడి బారినయ్. గద్గద స్వరంతో ‘కారు అపు..’ అన్నాడు డ్రైవర్‌తో. ఆగిన కారులో నుండి దిగి, ‘నువ్వు ఇంటికి వెళ్ళిపో. నేను తర్వాత వస్తాను’ అని చెప్పి.. రోడ్డు మధ్యన వున్న డివైడర్‌ను దాటుకొని వెళ్లి శంకర్ స్వామి పార్థివ శరీరాన్ని మోస్తున్న వాహనం దగ్గరకు వెళ్లాడు. దానికి తగిలించిన శంకర్ ఫొటో ప్లకార్డ్‌ని పట్టుకుని.. ‘శంకర్ స్వామీ అమర్ రహే’ నినాదంతో గొంతు కలిపి.. ఆ సమూహంతో నడుస్తుంటే మాధవ మనసు తేలికపడసాగింది! – రా.శా -
చ్యవనుడి చేతిలో.. ఇంద్రుడి గర్వభంగం?
అశ్వనీ కుమారుల వల్ల చ్యవన మహర్షికి నవయవ్వనం లభించింది. తనకు యవ్వనాన్ని ప్రసాదించిన అశ్వనీ దేవతలకు ప్రత్యుపకారం చేయాలని తలచాడు చ్యవనుడు. అప్పటికి అశ్వనీ కుమారులకు సోమపానం చేసే అర్హత లేదు. అందువల్ల వారి చేత సోమపానం చేయిస్తానని చ్యవనుడు ప్రతిజ్ఞ చేసి, వారిని సాదరంగా సాగనంపాడు. యవ్వనవంతుడైన చ్యవనుడిని చూడటానికి ఒకనాడు అతడి మామగారైన సంయాతి వచ్చాడు. నవయవ్వన తేజస్సుతో మెరిసిపోతున్న అల్లుడిని చూసి సంయాతి సంతోషించాడు.తన రాజ్యం సుభిక్షంగా ఉండటానికి, రాజ్యప్రజల క్షేమం కోసం, తన అభివృద్ధి కోసం యజ్ఞం తలపెట్టానని సంయాతి చెప్పాడు. మామగారు యజ్ఞం తలపెట్టడం పట్ల చ్యవనుడు సంతోషం వ్యక్తం చేశాడు. తానే స్వయంగా ఆ యజ్ఞాన్ని నిర్వహిస్తానని చెప్పి, యజ్ఞానికి ముహూర్తాన్ని నిర్ణయించాడు. యజ్ఞ ముహూర్తానికి కొద్దిరోజులు గడువు ఉండగానే భార్య సుకన్యతో కలసి చ్యవనుడు మామగారైన సంయాతి ఇంటికి చేరుకున్నాడు. నిర్ణీత ముహూర్తానికి సంయాతి తన అల్లుడు చ్యవనుడి ఆధ్వర్యంలో యజ్ఞం ప్రారంభించాడు. యజ్ఞానికి ఇంద్రాది అష్టదిక్పాలకులు వచ్చారు.యజ్ఞం శాస్త్రోక్తంగా జరుగుతోంది. పురోహితులు మంత్ర సహితంగా హవిస్సులను సమర్పిస్తున్నారు. యజ్ఞంలో సోమాన్ని సమర్పించే ఘట్టం వచ్చింది. అశ్వనీ దేవతలకు ఇచ్చిన మాట ప్రకారం చ్యవనుడు వారికి కూడా సోమాన్ని సమర్పించడానికి సిద్ధపడ్డాడు. చ్యవనుడు చేయబోతున్న పనిచూసి ఇంద్రుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. ‘అశ్వినులు దేవతలు కారు. వారికి సోమపానార్హత లేదు. వారికి సోమాన్ని సమర్పించడం అనాచారం’ అంటూ అభ్యంతరపెట్టాడు. మిగిలిన దిక్పాలకులు కూడా ఇంద్రుడికి వంత పలికారు.చ్యవనుడు వారిని ఏమాత్రం లక్ష్యపెట్టకుండా, అశ్వినులకు సోమాన్ని సమర్పించాడు. చ్యవనుడి చేతుల మీదుగా అశ్వినులు సంతృప్తిగా సోమపానం చేశారు. అశ్వినులు సోమపానం చేయడాన్ని కళ్లారా చూసిన ఇంద్రుడు తట్టుకోలేకపోయాడు. పట్టరాని ఆగ్రహంతో రగిలిపోతూ, చ్యవనుడిపై విసరడానికి తన వజ్రాయుధాన్ని పైకెత్తాడు. మహిమాన్వితుడైన చ్యవనుడు మంత్రోచ్ఛాటన చేస్తూ, ఇంద్రుడి వైపు తన చూపు సారించాడు. వజ్రాయుధంతో పైకెత్తిన ఇంద్రుడి చేయి అలాగే కదలకుండా నిలిచిపోయింది. ఇంద్రుడు నిశ్చేష్టుడయ్యాడు. ఈ దృశ్యాన్ని చూసి మిగిలిన దిక్పాలకులంతా హతాశులయ్యారు.వెంటనే చ్యవనుడు యజ్ఞగుండంలో హవిస్సును వేయగా, అందులోంచి భీకరాకారుడైన ‘మధుడు’ అనే రాక్షసుడు పుట్టుకొచ్చాడు. భూమ్యాకాశాలను తాకుతున్నట్లున్న శరీరం, పదునైన కోరలు, అగ్నిజ్వాలలాంటి నాలుకతో పెదవులు నాక్కుంటూ వచ్చి ఇంద్రుణ్ణి అమాంతం మింగేయబోయాడు. ఇది చూసి దిక్పాలకులు హాహాకారాలు చేశారు. ఇంద్రుడు భయకంపితుడయ్యాడు.‘రక్షించు మహర్షీ! రక్షించు!’ అంటూ చ్యవనుడి పాదాల మీద పడ్డాడు. అశ్వనీకుమారుల సోమపానానికి తాను అంగీకరిస్తున్నానని ప్రకటించాడు. ఇంద్రుడి పట్ల శాంతించిన చ్యవనుడు అతడికి అభయమిచ్చాడు. యజ్ఞగుండం నుంచి వెలువడిన మధుడిని సాగనంపడానికి ప్రయత్నించాడు. ‘ఇంద్రుడిని విడిచిపెట్టి, ఇక్కడి నుంచి వెళ్లిపో!‘ అని మధుడిని ఆదేశించాడు. చ్యవనుడి ఆదేశంతో మధుడు ఇంద్రుడిని విడిచిపెట్టాడు. తర్వాత చ్యవనుడి ఎదుట వినయంగా చేతులు కట్టుకుని నిలబడ్డాడు. ‘మహర్షీ! నీ సంకల్పంతో నన్ను సృష్టించావు. నాకు ఆశ్రయాన్ని చూపిస్తే, ఇక్కడి నుంచి వెళ్లిపోతాను’ అని పలికాడు.‘నువ్వు మద్యాన్ని, స్త్రీలోలురను, మృగయా వినోదంలో మునిగి తేలే వేటగాళ్లను, అక్షక్రీడలో కాలం వెళ్లబుచ్చే జూదరులను ఆశ్రయించుకుని ఉండు’ అని ఆదేశించాడు. చ్యవనుడి ఆదేశంతో మధుడు అక్కడి నుంచి వెంటనే అదృశ్యమైపోయాడు. పెను ప్రమాదాన్ని తప్పించుకున్న ఇంద్రుడు బతుకు జీవుడా అనుకుంటూ స్వర్గానికి బయలుదేరాడు. మిగిలిన దిక్పాలకులు కూడా తమ తమ నెలవులకు బయలుదేరారు. చ్యవన మహర్షి తన తపోమహిమను వెల్లడి చేసిన యజ్ఞవాటిక గల పర్వతానికి ‘అర్చీక పర్వతం’ అనే పేరు వచ్చింది. – సాంఖ్యాయన -
ఆ తడబాటుతోనే ఈ ఎడబాటు..
శతాబ్దాల పాటు విదేశీ పాలనలో సర్వం కోల్పోయిన జాతి మేల్కొని స్వాతంత్య్రం సాధించుకోవడం చరిత్రాత్మకమే! భారత స్వాతంత్య్రోద్యమం ప్రధానంగా అహింసాయుతంగా సాగినా, స్వరాజ్యం రక్తపుటడుగుల మీదనే వచ్చిందన్న సత్యం దాచకూడనిది. స్వాతంత్య్రం, దేశ విభజన ఏకకాలంలో జరిగాయి. నాటి హింసకు ఇరవై లక్షల మంది బలయ్యారు. కోటీ నలభయ్ లక్షల మంది నిరాశ్రయులయ్యారు. భారత విభజన ప్రపంచ చరిత్రలోనే అత్యంత రక్తపాతంతో కూడిన ఘటనగా నమోదైంది.విస్మరించలేని వాస్తవాలు స్వాతంత్య్ర సమరంలో భారత జాతీయ కాంగ్రెస్ అగ్రస్థానంలో నిలిచిన సంగతితో పాటు గిరిజన, రైతాంగ పోరాటాలు, విదేశీ గడ్డ మీద నుంచి జరిగిన ఆందోళనలు, తీవ్ర జాతీయవాదులు సాగించిన ఉద్యమాలు, బ్రిటిష్ ఇండియా చట్టసభలలో ప్రవేశించిన భారతీయ మేధావులు నాటి చట్టాలను దేశ ప్రయోజనాలకు అనుగుణంగా మలచడానికి చేసిన కృషి విస్మరించలేనివి. అటవీ చట్టాల బాధతో కొండకోనలలో ప్రతిధ్వనించిన గిరిజనుల ఆర్తనాదాలు, అండమాన్ జైలు గోడలు అణచివేసిన దేశభక్తుల కంఠశోష ఇప్పటికైనా వినడం ధర్మం.విభజన సృష్టించిన హింసాకాండ..రెండో ప్రపంచయుద్ధం ప్రారంభమైన రెండేళ్లకే వలసల నుంచి ఇంగ్లండ్ వైదొలగడం అవసరమన్న అభిప్రాయం ఆ దేశ నేతలలో బలపడింది. ఆ నేపథ్యంలోనే 1942 నాటి క్విట్ ఇండియా ఘట్టం భారత్ స్వాతంత్య్రోద్యమాన్ని చివరి అంకంలోకి ప్రవేశపెట్టింది. ‘భారత్‌ను విడిచి వెళ్లండి!’ అన్నది భారత జాతీయ కాంగ్రెస్ నినాదం. ‘భారత్‌ను విభజించి వెళ్లండి!’ అన్నది ముస్లిం లీగ్ సూత్రం. ఇదే ప్రతిష్టంభనను సృష్టించింది. స్వాతంత్య్రం రావడానికి సరిగ్గా సంవత్సరం ముందు (16 ఆగస్ట్ 1946) ముస్లిం లీగ్ ఇచ్చిన ‘ప్రత్యక్ష చర్య’ పిలుపు, పర్యవసానాలు ఆ ప్రతిష్టంభనకు అవాంఛనీయమైన ముగింపును ఇచ్చాయి. భారత్‌లో అంతర్యుద్ధం తప్పదన్న భయాలు ఇంగ్లండ్‌కు కలిగించిన పరిణామం కూడా అదే! అంతర్యుద్ధం అనుమానం కాదు, నిజమేనని పంజాబ్ ప్రాంత ప్రముఖుడు మాస్టర్ తారాసింగ్ ప్రకటించారు.అటు పంజాబ్లోను, ఇటు బెంగాల్లోను మతఘర్షణలు తారస్థాయికి చేరాయి. ఈ దృశ్యానికి పూర్తి భిన్నమైన చిత్రం మరొకటి ఉంది. 1946లో జాతీయ కాంగ్రెస్, ముస్లిం లీగ్ భాగస్వాములుగా ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం విభేదాలతో సతమతమవుతున్నది. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో విభజన ప్రయత్నాలు శరవేగంగా జరిగాయి. భారత స్వాతంత్య్రానికి 1947 ఫిబ్రవరి 20న లేబర్ పార్టీ ప్రధాని క్లెమెంట్ అట్లీ ముహూర్తం ఖరారు చేశాడు. 1947 మార్చి 5న బ్రిటిష్ పార్లమెంట్లో చర్చ జరిగింది. నిజానికి అది భారత్‌కు స్వాతంత్య్రం ఇచ్చే అంశం కాదు. ఉపఖండ విభజన గురించి. ఫిబ్రవరి 20 నాటి ప్రకటన ప్రకారం 1948 జూన్ మాసాంతానికి భారత్‌కు స్వాతంత్య్రం ఇవ్వాలి. కానీ ఆ ఘట్టాన్ని 11 మాసాల ముందుకు తెచ్చినవాడు లార్డ్ లూయీ మౌంట్‌బాటన్ , ఆఖరి వైస్రాయ్. ఈ తడబాటే, ఈ తొందరపాటే ఉపఖండాన్ని నెత్తురుటేరులలో ముంచింది.గాంధీజీకి నెరవేరని కోరిక..విభజన సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాడన్న నెపంతో 1947 ఫిబ్రవరిలో వైస్రాయ్ వేవెల్ను వెనక్కి పిలిపించి, 1947 మార్చి 22న మౌంట్‌బాటన్ ను పంపించారు. భారత్ విభజనను ఆగమేఘాల మీద పూర్తి చేసేందుకే మౌంట్‌బాటన్ ను నియమించారు. ఈ దశలోనే గాంధీజీకీ, జాతీయ కాంగ్రెస్‌కూ మధ్య ‘మౌన’సమరం మొదలయింది. ‘విభజనను కాంగ్రెస్ ఆమోదిస్తే అది నా శవం మీద నుంచే జరగాలి’ అని మౌలానా అబుల్ కలాం ఆజాద్‌తో గాంధీజీ వ్యాఖ్యానించినా దాని ప్రభావం కనిపించలేదు. 1947 మేలో మౌంట్‌బాటన్ విభజన ప్రణాళికను కాంగ్రెస్, ముస్లిం లీగ్‌ల ముందు పెట్టాడు. ఇది స్వదేశీ సంస్థానాలకు స్వయం నిర్ణయాధికారం ఇచ్చింది. దీనిని మొదట నెహ్రూ వ్యతిరేకించినా, తరువాత అంగీకరించారు. స్వాతంత్య్రం ఇవ్వక తప్పని పరిస్థితులలో 565 సంస్థానాలకు తమ భవిష్యత్తును నిర్ణయించుకునే అధికారాన్ని విభజన ప్రణాళిక ఇచ్చింది.గాంధీజీ లేకుండానే విభజన నిర్ణయం..1947 జూన్ 3న మౌంట్‌బాటన్ భారత్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, విభజన గురించి ప్రకటించారు. కేవలం తొమ్మిది మంది సమక్షంలో విభజన నిర్ణయం ఖరారైంది. నెహ్రూ, పటేల్, జేబీ కృపలానీ (కాంగ్రెస్), జిన్నా, లియాఖత్ అలీ ఖాన్ (లీగ్) బల్దేవ్సింగ్ తదితరులు మాత్రమే ఉన్నారు. ఈ కీలక సమావేశంలో గాంధీజీ లేని సంగతి గమనించాలి. మౌంట్‌బాటన్ పథకానికే 1947 జూలై 5న ఇంగ్లండ్ సింహాసనం ఆమోదముద్ర వేసింది. మూడు రోజుల తరువాత బ్రిటిష్ పార్లమెంట్ అంగీకారం తెలియచేసింది. ఆగస్ట్ 15వ తేదీకి ఐదు వారాల ముందు 1947 జూలై 8న సరిహద్దు కమిషన్ ఆ పని ఆరంభించింది. కాంగ్రెస్, లీగ్‌ల నుంచి చెరొక నలుగురు సభ్యులుగా ఉన్నారు. సర్ సిరిల్ జాన్ రాడ్‌క్లిఫ్ ఆ కమిషన్ అధ్యక్షుడు. భారతదేశం గురించి ఏమాత్రం అవగాహన లేనివాడని ఆయన మీద ఆరోపణ. కాలదోషం పట్టి మ్యాపుల ఆధారంగా విభజన రేఖలు వచ్చాయి. బెంగాల్, పంజాబ్‌ల విభజనకు కూడా కమిషన్ లు ఏర్పడినాయి.ప్రమాదాన్ని ముందే పసిగట్టిన పటేల్, మేనన్..యూనియన్ జాక్ దిగితే భారత్‌కు సార్వభౌమాధికారం వస్తుంది. కానీ సంస్థానాలు స్వయం నిర్ణయం తీసుకుంటే కొత్త సార్వభౌమాధికారానికి పెను సవాలు ఎదురవుతుంది. ఈ ప్రమాదాన్ని సకాలంలో గుర్తించిన వారు సర్దార్ పటేల్, బ్రిటిష్ ఇండియాలో రాష్ట్రాల వ్యవహారాల ఇన్ చార్జ్ వీపీ మేనన్ . ఆ సమస్యను పరిష్కరించినవారూ వారే! దేశం మీద స్వతంత్ర భారత పతాకం ఎగిరే నాటికే కశ్మీర్, జునాగఢ్, హైదరాబాద్ తప్ప మిగిలిన అన్ని సంస్థానాలను వారు భారత యూనియన్ లోకి తేగలిగారు. ఇది స్వతంత్ర భారతావని భవిష్యత్తును తీర్చిదిద్దిన నిర్మాణాత్మక ఘట్టం. సాంస్కృతిక ఐక్యతకు రాజకీయ ఐక్యతను జోడిరచిన పరిణామం. 1947 ఆగస్ట్ 15న భారత్ స్వతంత్ర దేశమైంది. – డాక్టర్ గోపరాజు నారాయణరావు -
దక్షిణాది భాషల.. మహా సాహిత్య ఉత్సవం!
దక్షిణాది దేశీభాషల మధ్య ఎంత సారూప్యత, సామీప్యం ఉన్నా, సంస్కృతుల ఆదాన ప్రదానాలున్నా, భావోద్వేగాల దగ్గరితనం ఉన్నా ఈ అన్ని భాషల కళా, సాంస్కృతిక రంగాల ఉమ్మడి సమ్మేళనాలు జరిగేది తక్కువ. జాతీయంగా జరిగే వేడుకలలో దక్షిణాది కళా సాహిత్య సాంస్కృతిక రంగాల సభ్యులు కలవడమే తప్ప స్థానికంగా వీరికై వీరు నిర్వహించుకునే సామూహిక సమ్మేళనాలు అరుదు. సాహిత్య రంగంలో అయితే తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషా రచయితలు ఒకచోట కూడి సాహిత్యాన్ని చర్చించుకునే మహా ఉత్సవాలు కొన్ని దశాబ్దాలుగా లేవు. సాహిత్య అకాడెమీ నిర్వహించుకునే సమావేశాలలో కొద్ది మంది కలవడమే కాని పెద్ద సంఖ్యలో కలిసే మహా ఉత్సవాలు ఏనాడూ జరగలేదు.ఈ వెలితిని పూడ్చేందుకు బహుశా తొట్ట తొలిసారిగా సందర్భం వచ్చింది. బెంగళూరులో పుస్తక ప్రచురణ, ప్రచార రంగంలో కృషి చేస్తున్న ‘బుక్‌బ్రహ్మ’ సంస్థ ఆగస్టు 9, 10, 11 తేదీలలో ‘బుక్‌బ్రహ్మ లిటరేచర్ ఫెస్టివల్– 2024’ పేరుతో భారీ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నది. కోరమంగళలోని సెయింట్ జాన్స్ ఆడిటోరియంలో మూడు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకల్లో నాలుగు భాషల నుంచి దాదాపు 300 మంది రచయితలు, విమర్శకులు, అనువాదకులు, ప్రచురణకర్తలు పాల్గొననున్నారు. ఆడిటోరియంలో ఐదు వేదికలలో సమాంతరంగా ప్రతి గంట ఒక సమావేశం జరగనుంది. కన్నడ సాహిత్యకారుడు సతీష్ చప్పరికె ఈ ఫెస్టివల్‌కు డైరెక్టర్. అనువాదకుడు అజయ్ వర్మ తెలుగు భాషకు అనుసంధానకర్తగా ఉన్నారు. ఓల్గా, మృణాళిని, కుప్పిలి పద్మ, వివినమూర్తి, వాడ్రేవు చినవీరభద్రుడు, కాత్యాయని విద్మహే, వినోదిని, జూపాక సుభద్ర, గోగు శ్యామల తదితర 30 మంది తెలుగు రచయితలు ఈ ఉత్సవంలో పాల్గొననున్నారు.పెరుమాళ్ మురుగన్, కె.సచ్చిదానందన్, వివేక్ శాన్‌భాగ్, జయమోహన్ వంటి సుప్రసిద్ధులు వేదికల మీద ప్రసంగించనున్నారు. ప్రధానంగా కథ, నవలా సాహిత్యంపై చర్చ ఉంటుంది. ఇంగ్లిష్ భాష ద్వారా కాకుండా నేరుగా దక్షణాది భాషల మధ్య అనుసంధానం ఏర్పరచడమే ఈ ఉత్సవం లక్ష్యం. ప్రతి ఉదయ, సాయంత్రాలు నాలుగు భాషల ఉద్దండ కళాకారులు సంగీత ప్రదర్శనలు ఇవ్వనున్న ఈ ఉత్సవంలో విద్యార్థులను భాగస్వామ్యం చేశారు. ద్రవిడ భాషలలో సాహిత్య వికాసానికి ఈ వేడుక ఒక మేలైన చోదకశక్తి కాగలదని పలువురు సాహిత్యకారులు భావిస్తున్నారు. ఈ ఉత్సవానికి ప్రవేశం ఉచితం. రిజిస్ట్రేషన్ చేయించుకుని ఎవరైనా పాల్గొనవచ్చు. -
32 ప్రశ్నలు.. 5 బిల్లులు.. హాట్ హాట్ గా బడ్జెట్ సమావేశాలు
-
అలుపెరుగని అక్షరాయుధుడు..
తెలుగు జర్నలిజాన్ని కొత్త పుంతలు తొక్కించిన సృజనాత్మక సంపాదకుడు ఏబీకే ప్రసాద్. పుస్తకాలు చదివే అల వాటు లేని వారంతా ఇతర కారణాలతో సంపాదకులై పోతున్న తరుణంలో ఏబీకే లాంటి నిత్య పఠనాభిలాషి సంపాదకుడు కావడం అరుదు, ఆదర్శం.వెనకటికి ‘నా కలమే ఖడ్గ’మని చెప్పిన కోటంరాజు రామారావు ప్రతిరోజూ రాజీనామా లేఖ తన జేబులో పెట్టుకొని ఉండేవారని చెప్పగా విన్నాము. కానీ ఏబీకే విషయంలో దాన్ని సమకాలీనులంతా స్వయంగా చూశారు. తన భావాలకు చోటు లేనిచోట ఆయన నిమిషమైనా నిలువలేరు. అందుకే ‘ఈనాడు’ వైజాగ్ ఎడిషన్‌లో ఎడిటర్‌గా తన జీవితాన్ని ప్రారంభించిన ఏబీకే రాష్ట్రంలో ఎడిటర్‌గా పని చేయని తెలుగు దినపత్రికంటూ దాదాపు లేకుండా పోయింది. నిజానికి తెలుగు పత్రికల సంస్థాపక సంపాదకుడుగా ఆయనకు గొప్ప పేరు వచ్చింది.‘ఈనాడు’ తర్వాత ‘ఉదయం’, ‘వార్త’, ‘ఆంధ్రజ్యోతి’ హైదరాబాద్, తిరుపతి ఎడిషన్లు ఏబీకే వెలిగించిన దీపాలే. ‘ఆంధ్రభూమి’ అసోసియేట్ ఎడిటర్‌గా, ‘ఆంధ్రప్రభ’ చీఫ్ ఎడిటర్‌గానూ ఆయన పనిచేశారు. ప్రభుత్వ మాస పత్రిక‘ఆంధ్రప్రదేశ్’కు కూడా ఎడిటర్‌గా పనిచేశారాయన. పక్ష పత్రికలు ‘సుప్రభాతం’, ‘మాభూమి’లకు ఎడిటర్‌గా తొలు దొలుత వాటిని తీర్చిదిద్దింది ఆయనే.1956లో వామపక్ష భావాల పత్రిక ‘విశాలాంధ్ర’లో తెలుగు జర్నలిజం రంగంలో ప్రవేశించిన ఏబీకే గత ఏడు దశా బ్దాలుగా ఈ భూప్రపంచంలో జరిగే మానవ సంబంధ పరి ణామాలన్నింటిపై స్పందించారు. ఆయన చలించిపోయి అక్షరా కృతి నిచ్చిన ‘నిబద్ధాక్షరి’ సాహిత్య ప్రియులంతా చదివి తీర వలసిందే. ఏబీకే సంపాదకీయాలు ఇప్పటివరకు పది సంపు టాలుగా వచ్చాయి. ఆయన సంపాదకీయాలు విస్తృత విజ్ఞానా నికి, పఠనశీలానికి, నిశిత పరిశీలనాశక్తికి, భావనాపటిమకు, భాషా పాటవానికి, పాఠక మార్గదర్శకత్వానికి ప్రతీకలు. మరీ ముఖ్యంగా తెలుగు పత్రికలలో ఇతర సంపాదకులు స్పృశించని ఆర్థిక సంబంధ అంశాలకు చెందిన అంశాలను తీసుకుని ఎంతో లోతుగా, సమయస్ఫూర్తితో సంపాదకీయాలు రాశారు. ఆర్థిక రంగ నిపుణులకు దిక్సూచి వంటి సేవలందించారు.పాఠక జనరంజకంగా సంపాదకీయం రాయడంతో పాటుగా పత్రిక మొదటి పేజీని సుందరంగా, సందర్భాను సారంగా తీర్చిదిద్దడం, చద్దివాసన లేకుండా పరిశోధనాత్మక వార్తలు ప్రచురించడం, ఆకర్షణీయమైన శీర్షికలు పెట్టడం, ఆ తర్వాత ఎడిట్ పేజీని చక్కగా రూపొందించడం, ప్రత్యేకంగా వ్యాసాలు రాయడం, ఇతరులతో పలు కొత్త శీర్షికలు రాయించడం – దిన పత్రికను అన్నివిధాలా సమగ్రంగా, అప్పుడే వండి వార్చిన భోజనంలాగా తాజా వార్తల కోసం, వ్యాసాల కోసం నకనక లాడే పాఠక జనానికి వడ్డించడంలో ఏబీకే సిద్ధహస్తులు. అత్యాధునిక భావా లుగల ఏబీకేలో పట్టుదల, సమయ స్ఫూర్తి, వేగం ఎక్కువ. జర్నలిజం రంగంలో ఆయనతో పాటుగా కలాలు పట్టిన వారంతా కలాలు మూసేశారు. ఏబీకే లాగా ఇప్పటికీ రచనలు చేస్తున్న పాత్రికే యులెవరూ లేరు.ఇవాళ తెలుగు జర్నలిజం రంగంలో పనిచేస్తున్న వారిలో ఎక్కువమంది ఏబీకే తయారుచేసిన సైన్యమే. ప్రవృత్తిపరంగా ఎవరెలా ఉన్నా, వృత్తిపరంగా చాలామందిని ఆయన చాకుల్లా మార్చారు. ప్రజాభిప్రాయాన్ని మలచడంలో ఏడు దశాబ్దాల అనుభవం గల ఏబీకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షుడుగా నిరంతర కృషి చేశారు. తెలుగు భాషకు ప్రాచీన ప్రతిపత్తి సాధించడంలో ఆయన పాత్ర ఎంత గానో ఉంది.ముప్ఫై శాతం మంది పిల్లలు తమ మాతృభాషకు దూరమైపోతున్న కొద్దీ ఆ భాషను మృత భాషగా పరిగణించవలసి వస్తుందని యునెస్కో నిర్ధారణ చేసిందనీ, సమాచార విశ్వీకరణవల్ల భాషా వైవిధ్యానికి ప్రమాదం ఏర్పడిందనీ కూడా యునెస్కో తీర్మానించిందని ఏబీకే హెచ్చరించారు. ఒక భాష మరొక భాషపై పెత్తనం చలాయించడాన్ని నిరసించాలని యునెస్కో ఇచ్చిన సలహాను తెలుగు ప్రజానీకం ఆహ్వానించాలన్నారు. పాఠశాల విద్యలో తెలుగు బోధనను అయిదవ తరగతి వరకే పరిమితం చేయకుండా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాలయా న్నింట్లో ఎస్.ఎస్.సి. వరకు విధిగా అమలు చేస్తేనే విద్యార్థుల్లో భావప్రకటనకు స్థిరత్వం వస్తుందని ఏబీకే అభిప్రాయం వ్యక్తం చేశారు. జపనీస్, చైనీస్ భాషల అభివృద్ధికి, వాటి వికాసానికి మూలం అంతా మాతృభాషలను మాధ్యమంగా చేసుకున్నందు వల్లనే అన్నారు.ఈ ఆగస్టు ఒకటో తేదీన తొంభయ్యవ ఏట అడుగిడుతున్న ఏబీకేను వయోధిక పాత్రికేయ సంఘం ‘జీవన సాఫల్య పుర స్కారం’తో ప్రెస్‌క్లబ్‌లో సత్కరిస్తున్నది. ఏబీకే వ్యక్తిత్వాన్ని ప్రతి బింబిస్తూ సమగ్రంగా రూపొందించిన ‘అలుపెరుగని అక్షరా యుధుడు–ఏబీకే’ గ్రంథాన్ని పూర్వ ప్రధాని మీడియా సలహా దారు సంజయ్‌బారు ఆవిష్కరిస్తున్నారు.ఈ సందర్భంగా యువ పాత్రికేయులకు మీరిచ్చే సందేశ మేమిటి? అని ప్రశ్నిస్తే – ‘యువ పాత్రికేయులు సమకాలీన సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, సాంకేతిక, శాస్త్రీయ సంబంధమైన ప్రతి పరిణామాన్నీ పరిశీలించాలి. వాటిని అవగా హన చేసుకోవాల’న్నారు. పుస్తక పఠనాన్ని మరవకూడద న్నారు. పాత్రికేయులు వృత్తిరీత్యా తమకు అప్పగించిన పని మీద దృష్టి మొత్తం కేంద్రీకరించాలన్నారు.అంతేకాదు– ‘యువ పాత్రికేయులు తమ వృత్తికి సంబంధంలేని అంశాలలో జోక్యం చేసుకోకూడదు, ధర్మాచరణను వీడ కూడదు. ఇందులో సాధకబాధకాలు ఉన్నాయి. అది అందరికీ తెలిసిన విషయమే అయినా, అన్ని అవాంతరాలను తట్టుకుని నిలబడినవాడే ఆదర్శం కాగలడ’ని ఏబీకే ఘంటాపథంగా చెప్పారు.– టి. ఉడయవర్లు, వ్యాసకర్త సీనియర్ పాత్రికేయుడు, 98856 86415 -
మహిళలకు సెకండ్ ఇన్నింగ్స్ వరం : ప్రతీ ‘క(ల)ళ’ కో లెక్క ఉంది!
ఆమె అందరిలా కాదు. సవాళ్లను ఎదుర్కోవడం అంటే ఇష్టం. విభిన్నంగా ఉండటం తన నైజం. అందుకే చిన్నప్పటినుంచీ అందరిలా రంగుల లోకంలో విహరించలేదు. రంగులనే తన లోకంగా ఎంచుకున్నారు. అక్కడితో ఆగిపోలేదు..అద్భుతమైన కళాఖండాలను తీర్చిదిద్దే గొప్ప శిల్పిగా అవతరించారు. మహిళా శిల్పిగా గత రెండు దశాబ్దాలుగా అనేక అపురూప శిల్పాలతో దేశ, విదేశాల్లో పేరు తెచ్చుకున్న డా. స్నేహలత ప్రసాద్‌ను సాక్షి.కాం పలకరించింది.ప్రతి మహిళకూ ఏదో ఒకటి సాధించాలనే పట్టుదల ఉంటుంది. కానీ కుటుంబం, పెళ్లి, పిల్లల బాధ్యతలు వారికి కల సాకారానికి బ్రేక్ పడుతుంది. కానీ ఆ తరువాత వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని తామేంటో నిరూపించుకుంటారు. ఆ కోవకు చెందిన వారే డా. స్నేహలత. ఆ అవకాశమే ‘సెకండ్ ఇన్నింగ్స్’ అంటారు స్నేహలత. ఈ సమయంలో భర్త, కుటుంబ సభ్యులు ఎలాంటి ఆటంకాలు అవరోధాలు సృష్టించకుండా, చేయూతనందిస్తే అద్భుతాలు సృష్టిస్తారంటారు ఆమె. రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌లో జన్మించారు స్నేహలత. తల్లి లీలాదేవి అండతో కళారంగంలోకి అడుగుపెట్టారు. ఫైన్ ఆర్ట్స్సబ్జెక్ట్లో పోస్ట్-గ్రాడ్యుయేషన్, ఆ తరువాత పీహెచ్డీ పట్టా పుచ్చుకున్నారు. పెళ్ళి తరువాత హైదరాబాద్‌కు రావడం, ఇద్దరు సంతానం కుటుంబం, పిల్లల బాధ్యతల నేపథ్యంలో ఆమె ఆలోచనలకు తాత్కాలిక బ్రేక్ పడింది. కానీ తనలోని సృజనాత్మక సామర్థ్యాలను వెలికి తీయాలనే కోరిక రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది.బాధ్యతల్లో కాస్తంత వెసులుబాటు, భర్త డా.ప్రసాద్ తోడ్పాటుతో తన కరియర్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది అని అంటారు డా. స్నేహలత. అరుదైన తన కళకు ఆత్మవిశ్వాసాన్ని జోడించి ఆకాశమే హద్దుగా ఎదిగారు. అతిపెద్ద పెయింటింగ్ వేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆమె కేవలం ఆర్టిస్టు మాత్రమే కాదు. ప్రకృతి, పర్యావరణ ప్రేమికురాలు కూడా. ప్రకృతి మీద ఆమెకున్న ప్రేమ అంతా ఆమె ప్రతీ పెయింటింగ్‌లోనూ గోచరిస్తుంది. ఢిల్లీ, జైపూర్, హైదరాబాద్‌లో అనేక ఆర్ట్ ఎగ్జిబిషన్స్ నిర్వహించారు. దాదాపు అన్ని గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఈ విజయమే తనకు మరింత ప్రోత్సాహాన్నించింది అన్నారు ఆమె.చిత్రకళ కరియర్ ఉత్సాహంగా కొనసాగుతున్న సమయంలోనే అనూహ్యంగా శిల్ప కళతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ కళమీద అంతులేని మక్కువ ఏర్పడింది. పట్టుదలగా అందులోనూ రాణించారు. ఇక అప్పటినుంచి వెనుదిరిగి చూసింది లేదు. భారతదేశంలో అత్యంత నైపుణ్యం కలిగిన మహిళా శిల్పులలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు ఆమె తొలి శిల్పం తెలంగాణా తల్లిది కావడం విశేషం. అలాగే పారిశ్రామిక వ్యర్థాలను అందమైన కళాకృతులుగా, రాయి, ఫైబర్ ఇలా మీడియం ఏదైనా దాన్ని అద్భుతంగా మలచడంలోనూ ఆమెది అందె వేసిన చేయి.స్నేహఆర్ట్స్ పేరుతో ఆర్ట్ క్యాంపులు, ఆర్ట్ ఫెయిర్, కోర్సులు, ఆర్ట్ గ్యాలరీ ఎగ్జిబిషన్లు, ఆర్ట్ టాక్‌లు, లైవ్ డెమోలు, డాక్యుమెంటరీలతో ఎపుడూ బిజీగా ఉండే స్నేహలత ‘రంగభూమి’ అనే వేదిక ద్వారా ఔత్సాహిక కళాకారులకు శిక్షణ ఇస్తున్నారు. పుణేలో పర్యావరణ శిల్పంపుణేలోని వాకాడ్‌లో, కస్తూరి చౌక్ వద్ద ఇటీవల ఒక పర్యావరణ శిల్పాన్ని ఏర్పాటు చేయడం విశేషం. ఇందులో కార్మికుల భద్రతకు చిహ్నమైన టోపీ,సమాజానికి, స్థిరత్వానికి మధ్య కీలకమైన బంధాన్ని తెలిపేలా డీఎన్ఏ గొలుసు, ఇంకా పరిశ్రమలు,శక్తి, ఆవిష్కరణల మేళవింపుతో దీన్ని ఏర్పాటు చేయడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పర్యావరణ పరిరక్షణ ,వాతావరణ మార్పులపై పౌరులకు అవగాహన కల్పించే లక్ష్యంతో దీన్ని రూపొందించారు. 21 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పుతో రెండునెలలపాటు శ్రమించి తయారు చేయడం విశేషం. తెలంగాణా కోసం చార్మినార్పుట్టింది రాజస్టాన్లోనే అయినా తనకిష్టమైన కళలో రాణించింది మాత్రం హైదరాబాద్ వచ్చిన తరువాతే. అందుకే హైదరాబాద్ కోసం ఏదైనా చేయాలనే తపన నాలో చాలా ఉంది. తనకు అవకాశం లభిస్తే పరిశ్రమలనుంచి వచ్చిన ఇనప వస్తువులు, బోల్ట్‌లు, నట్లు తదితర స్క్రాప్‌తో తెలంగాణాకు తలమానికమైన చార్రితక కట్టడం ‘చార్మినార్’ను యథాతథంగా నిర్మించాలనుకుంటు న్నాననీ, అది కూడా సందర్శకులు చార్మినార్ పైకి ఎక్కి నగర అందాలను దర్శించే అవకాశాన్ని కల్పించాలని భావిస్తున్నారు. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పారు. ప్రభుత్వం, పరిశ్రమ వర్గాలనుంచి సహకారం లభిస్తే దీన్ని సాధించి తీరుతానని చెప్పారు.చెత్తనుంచే చిత్రమైన కళాకృతులుపనికిరాకుండా పారవేసే చెత్త, ఇతర వ్యర్థాలనుంచి కళాఖండాలను తీర్చిదిద్దడం ద్వారా ప్రకృతికి, పర్యావరణానికి జరుగుతున్న నష్టాన్ని, ముప్పును తగ్గించడం ఒక మహిళగా తన బాధ్యత అని పేర్కొన్నారు. కాలుష్య నివారణలో అందరమూ తలా ఇంత చేయాల్సిందే అని సూచించారు.చిన్నప్పటినుంచీ గొప్పగా, పెద్దగా సాధించాలనేదే నా తాపత్రయం. అందుకే మహిళలకు ప్రవేశం అరుదుగా లభించే శిల్ప కళను ఎంచుకున్నాను. శిల్పాన్ని చెక్కేటపుడు వచ్చే దుమ్ము, ధూళి నాకు కనిపించదు. 200 ఏళ్లకు పైగా చరిత్రను చూసిన ఒక పవిత్రమైన వస్తువును స్పృశిస్తున్న పారవశ్యం. అదొక గొప్ప అనుభూతి. తొమ్మిది నెలలు గర్భంలో బిడ్డకు ప్రాణం పోసినంత సహజంగా శిల్పం ఆవిష్కృతమవుతుంది అంటారామె. అందుకే అనేక అవార్డులు, రివార్డులు ఆమెను వరించాయి. చిత్ర కళ అయినా, శిల్ప కళ అయినా ఇందులోనే గణితం కూడా ఇమిడి ఉంటుంది. ప్రతీ దానికి ఒక లెక్క ఉంటుంది. దాని ప్రకారమే పోవాలి. నా జీవితమూ అంతే. ఒక లెక్క ప్రకారం కలలు, కళల మేళవింపుతో ఒక అందమైన చిత్రంగా మల్చుకున్నాను అని చెప్పారు స్నేహలత.విద్యార్థుల కోసం గురుకులం‘‘గురుకుల లాంటి విద్యా సంస్థను ఏర్పాటు చేసి, పట్టుదలగా, పూర్తి నిబద్దతతో చిత్రకళను, శిల్ప కళను నేర్చుకోవాలనే వారికి శిక్షణ ఇవ్వాలనేది నా లక్ష్యం. విద్యార్థులకు సరియైన రీతిలో శిక్షణ ఇవ్వాలి. దేశ సంస్కృతీ,సంప్రదాయాల మీద వారికి అవగాహన కల్పించాలి. ఆసక్తిని కలిగించాలి. అపుడే వారు ఎవరూ ఉహించలేని అద్భుతాలు సృష్టిస్తారు.’’- స్నేహలతమహిళలకో మాట‘ఆడపిల్లలకు కూడా ఆశలు, కోరికలు, లక్ష్యాలు ఉంటాయి. పట్టుదలా ఉంటుంది. కానీ తొలుత నచ్చింది నేర్చుకోవడంలో అడ్డంకు లొస్తాయి. తీరా చదువుకున్నాక, కుటుంబం ముందు, కరియర్ తరువాత అనే కట్టుబాట్లు మరింత అవరోధంగా మారతాయి. ఇలాంటి కారణాల రీత్యా చాలామంది తమలోని ఆశలను చంపేసు కుంటున్నారు. కానీ, అలా కాదు. దొరికిన వెసులుబాటును ఉపయోగించుకుని మహిళలు తమ ప్రతిభకు పదును పెట్టుకోవాలి. సానుకూల ధోరణి, దృక్పథంతో ముందుకు పోవాలి...’ ఇదీ స్నేహలత మాట! -
మగ్గానికి మంచి రోజులు ఎప్పుడు ?
-
వరదలో అల్లాడుతోన్న మహానగరాలు
-
ఓటమి ఎరుగని ధీరుడు..
-
వైద్యరంగంలో రాజముద్ర
-
ఢిల్లీ వెళ్ళింది అందుకా..! ప్రత్యేక హోదా కోసం కాదా ?
-
మధ్యేమార్గ సంస్కరణలతోనే.. సుపరిపాలన!
వరి పంటలో పొడుగు రకం అక్కుళ్ళు స్థానంలోకి పొట్టి రకం–స్వర్ణ ‘హైబ్రీడ్’ వచ్చినప్పుడు పాత–కొత్తల మధ్య అప్పట్లో జరిగిన ఆ మార్పు ఏమంత సాఫీగా అవలేదు. ఆ బియ్యంతో వాతం కలిగి కీళ్ళ నొప్పులు వస్తాయనీ, ఆ గడ్డి తిన్న పశువులు పాలు ఇవ్వవు అనీ అపోహలు ఊళ్ళల్లో ఉండేవి. ఇప్పుడు అదంతా చరిత్ర. అదే ‘పొట్టి’ వరి రకాలపై వందలకొద్దీ పరిశోధనలు జరిగిన తర్వాత, వస్తున్న పలు రకాల‘రిఫైండ్’ బియ్యం అన్నం ఇప్పుడు మనం తింటున్నాం.ఒక అన్నం అనే కాదు, అది ఏ రంగమైనా కొత్తదనాన్ని అంత తేలిగ్గా అంగీకరించడానికి మనం సిద్ధంగా ఉండం. పైకి అది నిజమని ఒప్పుకోవడానికి మనం పెద్దగా ఇష్టపడం. కానీ, జీవితం ఏవో కొన్ని చట్రాల మధ్య స్తబ్ధుగా అలా సాగిపోవడంలో కూడా వొక నులివెచ్చని సౌఖ్యం ఉంటుంది. దాన్ని తప్పు పడుతూనే ప్రతి కాలంలోనూ కవులు, రచయితలు సమాజాన్ని జాగృతం చేసేది.అది ఏ చట్రం అయినా కానీ, ఈ నులివెచ్చని సౌఖ్యం మనకు ఎలా ఉండాలి అంటే– కష్టం వస్తే చెప్పుకోవడానికి సమీపాన ఒక పెద్దమనిషి ఉండాలి. అతడు మనకంటే కొంచెం ఎత్తులో కూర్చుని అవసరమైతే మనల్ని గదమాయిస్తూ సలహా వంటిది చెప్పే వాడై ఉండాలి. అతడు చెప్పాలి మనం వినాలి. వెళ్ళిన పని అయ్యీ కానట్టుగా పాక్షికంగా జరగాలి. ఎందుకంటే, మన కష్టానికి కారణమైన వారికీ ఇదే పెద్దమనిషి పూచీ.ఇదీ ఇన్నాళ్ళూ మనకు తెలిసిన లెక్క. మరి ఇప్పుడు అదేమీ కాదని ఆ స్థానంలోకి ఒక ‘వలంటీర్’ వచ్చాక, ఆ వెనుక ఒక సచివాలయం అనే ఆఫీసు... అక్కడిచ్చిన ఫిర్యాదు పైకి వెళ్లి కిందికి పరిష్కారం రావడం అంటే, మరీ కాళ్ళకు చక్రాలు కట్టుకున్నట్టు ఏమిటి ఇదంతా?! అదే పని అయినా... మరీ ఇంత వేగిరం (‘ఎస్ ఆర్ నో’) తెమిలిపోతే ఎలా? ఆ తర్వాత ఏమిటి చేయడం? 2019–24 మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అదే పెద్ద సమస్య అయింది. ఒకే ఒక్క ‘బటన్ నొక్కడం’ అనేది పైన చెప్పిన వైనం మొత్తానికి చోటు లేకుండా చేసింది. ఇంకా చెప్పాలంటే, సామాన్యుల జీవనంలో ఎంతో విస్తరించుకుని ఉండే ఇంత పెద్ద ‘మెలోడ్రామా’ బొత్తిగా మాయమయింది.సంప్రదాయ రాజకీయ సమాజంలో ఆధిపత్య కులాల పెద్దలకు ‘రికార్డు’లో వారికి ఎటువంటి హోదా లేకున్నా కేవలం ‘బై నేమ్’ వారు ఫోన్ చేసి రెవెన్యూ, పోలీస్ ఆఫీసుల్లో ‘పవర్’ చెలాయిస్తూ పనులు చేయించడం చాలా పాత విషయం. చట్టసభల్లో ఉండే నాయకులు ఇటువంటి ‘సెమీ వర్టికల్స్’ వలయాలు తమచుట్టూ ఏర్పడాలని, అటువంటివి వీలైనంత ఎక్కువగా ఉండేట్టుగానే వారు కూడా కోరుకుంటారు. ఎందుకంటే, ఎన్నికలప్పుడు ఓటర్లతో ‘లైవ్ నెట్ వర్క్’ ఉండే ‘ఛానెల్’ వాళ్లకు ఇదే! కుదిరితే ఏవో నామినేటెడ్ చైర్మన్ పదవులు లేదా ‘కాంట్రాక్టులు’ వీళ్ళకు ఎటూ ఉంటాయి. కౌన్సిలింగ్ పద్ధతి లేని రోజుల్లో చిన్న ఉద్యోగుల బదిలీలు వీళ్ళు అవలీలగా చేయించేవారు. వీరు కేంద్రంగా జరిగే లావాదేవీలు పార్టీల్లో చిన్నకులాల కార్యకర్తలకు అదొక మధ్యస్థాయి అదనపు వ్యాపారంగా సాగేది.అయితే, దశాబ్దాలుగా ఇంత చిక్కటి వలయాలుగా అల్లబడిన అధికార చట్రం కూసాలను, ఐదేళ్ళ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం–గ్రామ సచివాలయాలు, వార్డు వాలంటీర్ల వ్యవస్థతో ఎక్కడికక్కడ వదులు చేసేసింది. దాంతో ‘డెలివరీ సిస్టం’లో ఉండే ‘లీకేజీ’ల వద్ద ప్రయోజనం పొందే ‘కేడర్’ నష్టపోయి అసంతృప్తులు అయ్యారు.‘పవర్ పాలిటిక్స్’లో జరిగే ఇటువంటి మార్పును నిజానికి ‘న్యూట్రల్ ఓటర్’ హర్షించాలి. అది జరగలేదు సరికదా– ‘మాది తీసి వాళ్లకు పెడుతున్నారు...’ అనే ఫిర్యాదు వద్దే వాళ్ళు ఆగిపోయారు. అలా ‘ఇంక్లూజివ్ గ్రోత్’ అవసరాన్ని గడచిన పదేళ్ళలో అందరూ మర్చిపోయారు. ఇంతకీ జరిగింది ఏమిటి, మునుపున్న ‘సెమీ–వర్టికల్స్’ జాగాను గ్రామ సచివాలయాలలోని బహుజన యువతతో ‘హారిజాంటల్’గా జగన్ మార్చారు.అయితే, సంప్రదాయ అధికార నిర్మాణ చట్రం ఎప్పుడూ భద్రత కోరుకుంటుంది. ఏ కారణం చేత అది బీటలకు గురైనా పార్టీలతో పనిలేకుండా మొత్తం రాజకీయ చిత్రంపై దాని పర్యవసానాలు ఉంటాయి. జగన్ పాలనలో ఏపీలో సుపరిపాలన లక్ష్యంగా పరిపాలనా సంస్కరణలు మొదలైనట్టు తెలుస్తూనే ఉంది. కానీ జరిగింది ఏమిటి? సంప్రదాయ ‘పవర్ పాలిటిక్స్’ బహుళ అంచెలు (హైరార్కీ) కొంతమేర నిర్వీర్యం కావడం నిజమే. కానీ, ఈ స్వల్ప వ్యవధిలో ఆ స్థానంలోకి వచ్చిన ‘ఫంక్షనల్ పాలిటిక్స్’ ఆ పార్టీకి పాక్షికంగానే ఉపకరించాయి. ఆ కారణంగా, ఒక హక్కుగా ‘రాజ్యం’ ఇచ్చే సంక్షేమ ప్రయోజనాలు తీసుకుంటూనే, ఏ ఒక్క రాజకీయ పార్టీకి విశ్వాసంగా ఉండనక్కర లేదనే స్వేచ్ఛాశ్రేణులు ఏర్పడే కొత్త పరిస్థితికి అది దారితీసింది.ఈ పార్టీ తీసుకున్న ఈ కొత్త వైఖరి వల్ల, అది తన ఓటర్లకు– ‘మీ మెడమీద ఇకముందు ఏ కాడి ఉండదు’ అని భరోసా ఇచ్చింది. గెలిచారా, ఓడారా అనేది అటుంచితే... రూపాంతర ప్రజాస్వామ్యం (‘ట్రాన్స్ఫార్మింగ్ డెమోక్రసీ’) దృష్టి నుంచి చూసినప్పుడు ఇది ఆహ్వానించదగిన పరిణామం. ఇన్నాళ్ళూ కనిపించని చట్రాల మధ్య బంధించబడిన పక్షుల్ని ఇక స్వేచ్ఛగా బతకమని పంజరంలో నుంచి వాటిని బయటకు వదలడం వంటిది.ఇంత చేసి– ‘మా పార్టీ వల్ల మీకు మేలు జరిగిందని నమ్మితేనే మాకు ఓటు వేయండి’ అని జగన్ ‘ఆప్షన్’ ఇవ్వడం– ‘లిబరల్ డెమోక్రసీ’ వైఖరికి పరాకాష్ట. జనానికి అది అర్థం కాకపోతే, రాజకీయ పార్టీగా దానికి నష్టం అయితే కావొచ్చు. కానీ, దేశ రాజకీయాల్లో 2024 ఆంధ్రప్రదేశ్ ప్రయోగం ఒక ‘కేస్ స్టడీ’ కానుంది. ఇప్పటికే నెదర్లాండ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏసియా రీసెర్చ్ ఫెలో విగ్నేష్ కార్తీక్, జేఎన్‌యూ పరిశోధకుడు వి. చంద్రశేఖర్ ఈ ఎన్నికల్లో రెండు పక్షాల వైఖరిలోని వైవిధ్యాన్ని ఇటీవల ఒక ప్రముఖ ఆంగ్లపత్రిక వ్యాసంలో వెలికి తీశారు.– జాన్ సన్ చోరగుడి, వ్యాసకర్త అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత -
ఆచరణ ముఖ్యం..!
ఒక రోజు బోధివనానికి వచ్చిన ఓ నడివయస్కుడు బోధిసత్త్వుని పాదపద్మాలను తాకి నమస్కరించాడు. చిరునవ్వుతో అతని వివరాలు అడిగాడాయన. ‘దేవా నా పేరు అభినందనుడు. నేను పేదవాడిని. నాకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. లౌకిక పాశాల్లో చిక్కుకుని తల్లడిల్లుతున్నాను. మీరేదైనా పరిష్కారం చెప్పాలి. మీరే నాకు జ్ఞానమార్గం చూపాలి’ అని వేడుకున్నాడు ఆ వ్యక్తి.బోధిసత్త్వుడు ‘అభినందనా, ఈ చెట్లకున్న ఆకులను చూడు. అవన్నీ ఎందుకు కదులుతున్నాయో తెలుసా... గాలి వచ్చి ఢీకొనడంతో కదులుతున్నాయి. పాశమనే గాలి వచ్చి ఢీకొన్నప్పుడల్లా మనిషి ఆకులా ఇలా ఊగుతాడు. మొదట నీ మనసులో ఉన్న లౌకిక పాశాలను తెంచుకో. అప్పుడే నీవు జ్ఞానమార్గంలో నడవగలవు. అది నీ వల్ల సాధ్యమేనా? అన్నాడు. సాధ్యమే అన్నాడు అభినందనుడు. అయితే ఈరోజు నుంచి నువ్వు ఇక్కడే ఉండన్నాడు బోధిసత్త్వుడు.అభినందనుడు అక్కడే ఉండిపోయాడు. కొద్ది రోజులు సన్యాసి జీవితం చక్కగానే గడిపాడు. క్రమంగా అతడు మళ్లీ లౌకిక బంధనాల్లోకి జారుకోవడాన్ని బోధిసత్త్వుడు గమనించాడు.ఒక రోజు అభినందనుని పిలిచి రెండు పాత్రలు తీసుకున్నాడు. ఓ పాత్రలో రకరకాల పదార్థాలు ఉన్నాయి. మరొకటి ఖాళీ పాత్ర. పదార్థాలు ఉన్న పాత్రను నీటిలో వదిలేశాడు. అది లోపలికి మునిగిపోయింది. ఖాళీ పాత్రను నీటిలో వేశాడు. అది తేలియాడుతూ కనిపించింది. ‘బరువైన పాత్ర కనిపించకుండా పోయింది. ఖాళీ పాత్ర తేలుతోంది. ఖాళీ పాత్ర ఉంది చూశావూ, అది జ్ఞానపాత్ర. బరువైన పాత్ర ఉంది చూశావూ, అది బంధనాల పాత్ర.నేను సన్యాసినవుతాననీ, జ్ఞానినవుతాననీ చెప్పడం సులభం. కానీ ఆచరణ కొచ్చేటప్పటికి అది చాలా కష్టం. అది అంత సులభమైన విషయం కాదు. ఆశనూ, లౌకిక పాశాలనూ వదులుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు నువ్వేంటో నీకు అర్థమై ఉండాలి’ అన్నాడు బోధిసత్త్వుడు. అప్పటి నుంచి పూర్తిగా ఆధ్యాత్మిక మార్గంలో నడిచాడు అభినందనుడు. – యామిజాల జగదీశ్ -
మనం మరచిన గాంధీజీ రక్షకుడు..
జాతిపిత మహాత్ము ప్రాణాలు కాపాడిన ఓ త్యాగశీలి జన్మదినం నేడు. ఆయన పేరు బతఖ్ మియా అన్సారీ. 1869 జూన్ 25న బిహార్‌లోని మోతీహార్ గ్రామంలో జన్మించారు. బిహార్ లోని చంపారణ్ జిల్లాలో ఆహార పంటలు వదలి, నీలిమందు లాంటి వాణిజ్య పంటలు పండించమని బ్రిటిష్ వలస పాలకులు రైతులను నిర్బంధించేవారు, హింసించేవారు. ఈ అకృత్యాలను వివరించి అక్కడి రైతులను పరామర్శించమని ఆ ప్రాంతంవారు కొందరు గాంధీజీని అభ్యర్థించారు.దీంతో 1917 ఏప్రిల్‌లో ఆయన అక్కడికి వెళ్లారు. దీంతో ఇర్విన్ అనే బ్రిటిష్ ఇండిగో ఎస్టేట్ మేనేజర్ గాంధీజీని భోజనానికి ఆహ్వానించి అంతం చేయాలని పథకం పన్నాడు. తన వంటమనిషి బతఖ్ మియా అన్సారీని పిలిచి, గాంధీజీకి పాలలో విషం కలిపి ఇచ్చి చంపాలని ఆదేశించాడు.ఈ పని చేస్తే జీతం పదింతలు పెంచుతాననీ, విలువైన భూములు ఇస్తాననీ చెప్పాడు. బాబూ రాజేంద్ర ప్రసాద్‌తో కలిసి గాంధీజీ భోజనానికి వచ్చారు. ఇర్విన్ ఆజ్ఞను ధిక్కరిస్తే గతి ఏమవుతుందో తెలిసినప్పటికీ, పాలు అందిస్తూనే అందులో విషం కలిపిన విషయాన్ని ఆయన గాంధీజీకి చెప్పి ఆయన ప్రాణాలు రక్షించారు. అగ్గిమీద గుగ్గిలమైన ఇర్విన్ ఆ తరువాత అన్సారీ ఇంటినీ, ఆయనకున్న కొద్దిపాటి భూమినీ జప్తుచేయించి ఊరి నుండి వెళ్ళగొట్టాడు.1950లో మొదటి రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ మోతీహార్ వెళ్ళి ఒక సభలో ప్రసంగిస్తుండగా తనను కలవడానికి ప్రయత్నిస్తున్న అన్సారీని వేదికపైకి పిలిచి ఆప్యాయంగా గుండెలకు హత్తుకున్నారు. ఇర్విన్ అకృత్యాలు విని విచలితుడై అప్పటికప్పుడు 50 ఎకరాల భూమిని అన్సారీ, ఆయన ముగ్గురు కుమారుల కుటుంబాలకూ కేటాయించాల్సిందిగా ఆదేశించారు. అన్సారీ ఏడేళ్ళపాటు కార్యాలయాల చుట్టూ తిరిగినా రాష్ట్రపతి ప్రకటించిన భూమి ఆయనకు దక్కలేదు.చివరికి 1957 డిసెంబర్ 4న కన్నుమూశారు. మొత్తంమీద ఒక ఆరు ఎకరాల భూమిని ఓ నది ఒడ్డున జిల్లా కలెక్టర్ కేటాయించారు. ప్రస్తుతం నది కోతకు గురై ఐదెకరాల భూమి మాయమై ఎకరం మిగిలింది. ఇప్పటికీ తమకు రావలసిన భూమికోసం అన్సారీ కుటుంబీకులు అర్జీలు పట్టుకుని తిరుగుతూనే ఉన్నారు. – ఎమ్.డి. ఉస్మాన్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్ -
నాన్న వంటబట్టించిన కళ
తన తండ్రి చిన్నప్పటి నుంచీ బజ్జీలు వగైరా తయారు చేసి బండి మీద విక్రయించేవాడని ఆయన ఆధ్వర్యంలో ఎప్పటికైనా ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ ప్రారంభించడమే తన లక్ష్యమని మాస్టర్ చెఫ్ భాషా అంటున్నారు. ఇటీవల సోనీలివ్ ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి తెలుగు మాస్టర్ చెఫ్ పోటీలలో ఈ అనంతపురం నివాసి విజేతగా నిలిచారు. ఈ సందర్భంగా సాక్షితో మాట్లాడుతూ... తన అభిప్రాయాలను పంచుకున్నారు..నాన్న ‘వంటబట్టించిన’కళ... మాది అనంతపురంలోని పుటపర్తి దగ్గర గోరంట్ల మా నాన్నకు ముగ్గురు పిల్లలం. చిన్నప్పటి నుంచి ఇంటి దగ్గరే స్వీట్లు, కారపు సరుకులు వగైరా తినుబండారాలను తయారు చేసి వాటిని బండి మీద తీసుకెళ్లి విక్రయించేవాడు.. ఆ బండి నడుపుతూనే ఆయన మా సంసారమనే బండిని కూడా విజయవంతంగా నడిపారు. పిల్లలు అందర్నీ బాగా చదివించారు. నేను బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశాను. ఆ తర్వాత బెంగుళూర్లోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగంలో చేరాను. కానీ...నాకు నేనుగా ఏదైనా సృజనాత్మక రంగంలో రాణించాలనే తపన, చిన్నప్పటి నుంచీ ఇంట్లో వంటల తయారీ వల్ల వంటబట్టిన పాకశాస్త్ర కళ నన్ను నాలుగైదు నెలలకు మించి ఉద్యోగంలో ఉంచలేదు. దాంతో ఇంట్లో వాళ్లకి ఇష్టం లేకున్నా ఉద్యోగాన్ని వదిలేసి గరిట చేతబట్టాను.కంప్యూటర్ సైన్స్ టూ కిచెన్ సెన్స్...అలా కంప్యూటర్ సైన్స్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పి కిచెన్ లో వంటలకు వెల్కమ్ చెప్పాను. చెన్నైలో నివసించే ప్రముఖ మహిళా చెఫ్ దగ్గర బేకరీ ఐటమ్స్‌లో శిక్షణ పొందాను. ఆమె సారధ్యంలో వైవిధ్యభరితమైన బేకరీ ఉత్పత్తుల తయారీని తెలుసుకున్నాను. ప్రస్తుతం రెస్టారెంట్స్‌కి మెనూ రూపొందించే సేవలు అందిస్తున్నాను. మరిన్ని వెరైటీ వంటల్లో రాణించాలని సాధన చేస్తున్నాను. అదే క్రమంలో తొలిసారి తెలుగులో సోనీ లివ్ వారు నిర్వహించిన మాస్టర్ చెఫ్ పోటీలకు దరఖాస్తు చేయడం అందులో పాల్గొని టైటిల్ గెలుపొందడం జరిగింది. టైటిల్ పోటీలో నేను రూపొందించిన గ్రేట్ ఫుల్ పిస్తాషో పేస్ట్రీలో ఒక్కో లేయర్‌ను నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులకు అంకితమిస్తూ చేయడం న్యాయనిర్ణేతలను ఆకట్టుకుంది. ఈ టైటిల్ స్ఫూర్తితో పేరొందిన చెఫ్‌గా రాణించడం, నాన్న ప్రస్తుతం గోరంట్ల బస్‌స్టాండ్ దగ్గర నడుపుతున్న చికెన్ కబాబ్స్ బండిని పూర్తి స్థాయి ఫైన్ డైనింగ్ రెస్టారెంట్‌గా మార్చడం... ఇవే నా భవిష్యత్తు లక్ష్యాలు.ఫాదర్స్ డే స్పెషల్ కథనం -
'అనాగరికుడు'! గేటుతీసుకుని లోపలికొచ్చి..
గేటుతీసుకుని లోపలికొచ్చి వరండాలో స్తంభానికి ఆనుకుని కూర్చున్నాడు పీరయ్య. మాసిన గళ్లచొక్కా, నలిగిన ప్యాంటు, చెదిరిన జుట్టు, పెరిగిన గడ్డం, లోతుకుపోయిన ఎర్రటి కళ్లు, వొంగిన కడ్డీలాంటి గరుకు శరీరం. జైలు నుంచి విడుదలైన సంవత్సరకాలంలో ఇంకా సన్నబడ్డాడు. ఈమధ్య అంతగా రావడంలేదు.‘మనవూర్లోనే వుంటున్నావా?’ అడిగాను న్యూస్ పేపరు పక్కనపెట్టి. ‘వొకవూరని లేదు వాసుబాబూ’ ఉదయపుటెండలో పూల మీద ఎగురుతున్న సీతాకోకచిలుకను చూస్తూ అన్నాడు. ‘యెందుకని?’‘యేడేండ్లలో కాలం మారలేదా? నేను యిడుదలైవొచ్చే లోపల రాజకీయాలూ మారిపోయినాయి. మా పెదలింగయ్య, ఆయన దాయాదీ రాజీపడి ఫ్యాక్చన్ వైరాలు నిలిపేసిరి. వాల్ల పిల్లోళ్లు డాకటర్లు, యింజనీర్లై సిటీలకు, యిదేసాలకు యెళ్లిపోయిరి. యింగ మందీమార్బలంతో, జీపులతో, నా మాదిరి డ్రైవర్లతో పనేముండాది? పెదలింగయ్య బెంగుళూరులో కొడుకు దెగ్గిరికి యెళ్లిపోయినాడు’మార్పువచ్చి ఉపాధి పోయినందుకు అతనిలో నిరాశ కనిపించలేదు. పోరాట వాతావరణంలో ఉండేవాళ్లు ఎలాంటి నష్టానికైనా సిద్ధంగా ఉంటారేమో అనుకున్నా. ‘డ్రైవరు పని లేకపోతే సేద్యం చేసుకోవచ్చు. నీక్కొంచెం చేనుండాలిగదా?’ అన్నా. ‘నేను జైలుకుబోయి, మాయమ్మ కాలమైపోయినాక సేనంతా కంపసెట్లు మొల్చి నా మాదిరే తరంగాకుండా ఐపోయిండాది’ ‘బాగుచేసుకోలేకపోయినావా?’ ‘వూళ్లో వుండలేక పోయినాను. ఫ్యాక్చన్లో యెదుటోణ్ణి సంపితే వోడు యీరుడు. పెండ్లాన్ని సంపిన కేసు మీద యేడేండ్లు జైలుకు పోయొచ్చినోడికి మర్యాదేముంటాది?’ పీరయ్య తన భార్య సంగతి మాట్లాడినప్పుడు గొంతు జీరగా పలుకుతుంది. అందులో దుఖంతోపాటు తను నిర్దోషిననే భావన ఉంటుంది. ‘నువ్వాపని చెయ్యలేదని, అది ప్రమాదం వల్ల జరిగిందని వూళ్లో నమ్మడంలేదా?’‘యెవురు నమ్మినారో యెవురు లేదో. అందురూ నీమాదిరుంటారా? తల్లీ, బార్యా యిద్దురూ పోయినారు. కోర్టు సెప్పిన సిచ్చ ఐపోయినా ప్రెపంచం యేసిన సిచ్చ యింగా నడస్తావుంది. పెదలింగయ్య నీడ గూడా పాయె. జెనం సైలెంటుగా వుండేదానికి నేనేమన్నా డబ్బు, పలుకుబడీవుండే బడాబాబునా? నా గురించి సెప్పినాక యాడా కుదురుగా పని యియ్యడంలేదు, ఆడా యీడా తిరగతావుండా’ ఉదాసీనంగా అన్నాడు.‘తను తప్పు చెయ్యలేదనే భావన ఒక్కటే పీరయ్య జీవితేచ్ఛేను కొనసాగిస్తున్నట్టుంది’ అనుకున్నా.నా శ్రీమతి తెచ్చిపెట్టిన ఉప్మాతిని, కాఫీతాగి ‘సిటీలో నాకేదైనా డ్రైవరుద్యోగం సూపించు వాసుబాబూ. నీలాంటి మంచోడు సెప్తే యిస్తారు’ అని వెళ్లిపోయాడు. పీరయ్య గురించిన ఆలోచనల్లో పడ్డాను.ఆర్థిక నేపథ్యాలు వేరైనా పీరయ్యా నేనూ చిన్నతనంలో స్నేహితులం. తండ్రి అనారోగ్యంతో చనిపోయాక పీరయ్య చదువును ఐదోతరగతిలోనే ఆపేసి తల్లి అంకమ్మతో పొలం పనులకు, యెనుములను మేపడానికి వెళ్లేవాడు. పీరయ్యకు మొదట్నుంచి డ్రైవింగ్ అంటే మోజు. అతనికి పన్నెండేళ్లప్పుడే ఊరి దగ్గర కడుతున్న పెద్దచెరువు పనికోసం వచ్చే టిప్పర్లు, జీపులకు క్లీనరుగా వెళ్తూండేవాడు. పెద్దయ్యాక డ్రైవింగ్ నేర్చుకుని మా పక్కవూర్లోని ఫ్యాక్షన్ లీడర్ పెదలింగయ్య దగ్గర జీపుడ్రైవరుగా స్థిరపడ్డాడు.మా కుటుంబం ఊరొదిలేశాక పీరయ్యను కలవడం తగ్గిపోయింది. ఎప్పుడైనా కలసినప్పుడు తన సాహసంతో, డ్రైవింగ్ ప్రతిభతో పెదలింగయ్యను ప్రత్యర్థుల నుంచి ఎలా రక్షించాడో ఉద్వేగంగా చెప్పేవాడు. పోరాటంలో హింస తప్పుకాదని, ఐతే అది న్యాయం కోసం అయివుండాలి అనేవాడు. నమ్మినవాళ్ల కోసం త్యాగానికి సిద్ధంగా ఉండాలనేవాడు. పైకి అనాగరికంగా, నిర్లక్ష్యంగా, రఫ్‌గా కనపడ్డం, ఫ్యాక్షనిస్టు నాయకుడితో ఉండడంవల్ల లోకం అతన్ని ఒక రౌడీగానే చూసేది. పీరయ్యకూడా తన వృత్తికి ఆ ఇమేజ్ అవసరమని భావించి దాన్నే బహుముఖంగా ప్రదర్శించేవాడు.పీరయ్యకు పెదలింగయ్య పొలాలు చూసే ఓబయ్య కూతురు గౌరితో పెళ్లైంది. గౌరి చక్కగా వుంటుంది. ‘తండ్రికి ఇష్టంలేకపోయినా, తను మోటుగా వున్నా జానపద కథల్లోలా తన నైపుణ్యం, తెగువ చూసి గౌరే పట్టుబట్టి పెళ్లిచేసుకుందని’ నమ్మాడు పీరయ్య. అదే బయట గర్వంగా చెప్పుకుని వ్యతిరేకులను పెంచుకున్నాడు. భార్యాభర్తలు అన్యోన్యంగానే ఉండేవాళ్లు. ఐతే గౌరికి ముక్కు మీద కోపమని, తన తల్లి అంకమ్మతో పడదని వాపోయేవాడు. క్రమంగా అత్తాకోడళ్లకు తగవులు పెరిగిపోయాయి. తగవులైనప్పుడు పీరయ్య నలుగురి ముందు భార్య మీదే కేకలేసి పైకి తన ఆధిక్యతను ప్రదర్శించేవాడు. ఒక్కోరోజు విసుగెత్తి ఇంటికి రాకుండా పెదలింగయ్య బంగళా దగ్గరే ఉండిపోయేవాడు.పెళ్లైన కొన్నేళ్ల తరువాత ఒక తుఫాను రాత్రి పీరయ్య జీవితంలోనే తుఫాను తెచ్చింది. పెద్దవర్షంలో అతను ఆలస్యంగా ఇంటికొచ్చేసరికి కోడలితో పోట్లాట జరిగి అంకమ్మ యెనుముల కొట్టంలో తడుస్తూ చలికి ముడుచుకుపోయి ఏడుస్తూ కనపడింది. పీరయ్య ఆవేశంగా ఇంట్లోకెళ్లి ఒక్కతేవున్న గౌరితో గొడవ పడ్డాడు. పెనుగులాటలో గోడకున్న పెద్దమేకు తలవెనక దిగి, రక్తంకారి గౌరి స్పృహ తప్పి పడిపోయింది.పీరయ్య జీపులో ఆమెను దగ్గర్లోని చిన్నాసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ డాక్టరు సెలవులో ఉండడంతో ఆ వర్షంలో, కిందామీదా పడి పొంగుతున్న వాగులుదాటి, ఆలస్యంగా టౌనుకు తీసుకెళ్లాడు. అక్కడ చికిత్స జరిగింది గాని గౌరి స్పృహలోకి రాలేదు. రెండురోజుల తరువాత చనిపోయింది. పీరయ్య డ్రైవింగ్ నైపుణ్యం తుఫాను చేతిలో ఓడిపోయింది. పీరయ్య షాక్ కి గురై కొన్నాళ్లపాటు అచేతనంగా ఉండిపోయాడు.అల్లుడే తనకూతుర్ని హత్య చేశాడని ఓబయ్య కేసు పెట్టాడు. పీరయ్య వ్యతిరేకులే అతన్నలా ఎగదోశారని కొందరన్నారు. ఓబయ్య కూడా తన మనిషే కాబట్టి పెదలింగయ్య తటస్థంగా ఉండిపోయాడు. పీరయ్య సానుభూతిపరుల సాయం సరిపోలేదు. కేసు రెండేళ్లు నడిచాక పీరయ్యకు రిమాండుతో కలిపి ఎనిమిదేళ్లు శిక్షపడింది.పీరయ్యను జైల్లో కలిసినప్పుడు ‘మంట ఆరిన కాగడాలా’ కనిపించేవాడు. ‘నేను ఫ్యాక్చన్ మనిసిగా వుండడం, రౌడీగా ఔపడ్డం, గౌరితో మనువాసించి బంగపడిన యెదవలు మాపెదలింగయ్య మనుసు యిరిసేయడమే గాక నాకు యెతిరేక సాచ్చమివ్వడం వల్ల సెయ్యని నేరానికి సిచ్చపడింది’ అని వాపోయేవాడు. ‘ఆడికీ ‘కోర్టు సానుభూతిగా సూసి తక్కవలో పోగొట్టిందని’ మా వకీలుసారు సెప్పినాడు’ అని సమాధానపడేవాడు. మళ్లీ అంతలోనే ‘ఐనా నేను గౌరిని సంపడమేంది, నాకీ సిచ్చేంది వాసుబాబూ’ అని ఏడ్చేవాడు.‘ఆరాత్రి ఏం జరిగిందో ఇంకెవరూ చూడలేదు. పీరయ్యకు హింసాప్రవృత్తి లేదని అనుకునే నాలాంటి వాళ్లు కొందరు తప్ప మిగతావాళ్లెవరూ అతని మాటలు నమ్మినట్టు కనపడదు. దానికి చాలావరకూ కారణం అతనే. పీరయ్య ఏ ధర్మాన్ని నమ్ముకున్నాడో అదే అతన్ని దెబ్బతీసింది’ అనుకున్నా.‘గౌరి ప్రెమాదం వల్లే సచ్చిపోయిందని లోకం యేపొద్దుటికైనా తెల్సుకుంటాది. ఐనా గౌరి ఆత్మకు నిజెం తెల్సు, అదేసాలు’ అని శిక్ష చివరి రోజుల్లో గాలిలోకి చూస్తూ అనేవాడు. జైలు జీవితంలో పీరయ్య చూడ్డానికి మరింత గరుకు తేలినా, మొహంలో మునుపటి రౌడీ కవళికలు పోయాయి. మంచి ప్రవర్తన కారణంగా సంవత్సరం ముందే విడుదలయ్యాడు.‘మీ ఆఫీసుకు టైమౌతోంది’ అన్న శ్రీమతి పిలుపుతో వర్తమానంలోకి వచ్చాను.నెలరోజుల తరువాత ఒక సాయంత్రం నేను డాబా మీద కుండీల్లో మొక్కలకు నీళ్లు పోస్తూంటే వచ్చాడు పీరయ్య. మంచి ప్యాంటు షర్టు వేసుకున్నాడు, తల దువ్వుకుని, తేట మొహంతో నీట్‌గా ఉన్నాడు. సూర్యుడు దిగిపోయాడు, గుళ్లోని సుబ్బులక్ష్మి పాటకి చెట్లు తలలూపుతున్నాయి, జమ్మిచెట్టు మీది పక్షులు ముందే గూళ్లు చేరుకుంటున్నాయి. ‘మీ కాలనీలో దేవరాజుసారు దెగ్గిర డ్రైవరుద్యోగం దొరికింది. రెండురోజులాయె. మకాం యింటెనకాల అవుటౌసులోనే’ గట్టు మీద కూర్చుంటూ చెప్పాడు. ‘మా కాలనీ ప్రెసిడెంటు దేవరాజుగారు నీకు తెలుసా?’ అడిగాను ఆశ్చర్యపోయి. ‘మా పెదలింగయ్య కొమారుడు నితీషుబాబూ యీయనా వొకే కాలేజీలో సదూకున్నారంట. ఆయన సిఫార్సు సేసినారు’ ‘దేవరాజుగార్తో నాకంత పరిచయంలేదు గాని ఆయన్నందరూ పెద్దమనిషిగా గౌరవిస్తారు. గుడి ధర్మకర్త కూడా ఆయనే. బాగా డబ్బు, పలుకుబడి వున్నా మృదువుగా మాట్లాడతారు, అన్నదానం లాంటి కార్యాలకు వుదారంగా సాయం చేస్తారు. యెత్తుగా, తెల్లగా, చక్కగా వుంటారు’ ‘ఆయన్ని సూస్తే అట్లాగే అనిపిస్తాది. యెందుకైనా మంచిదని మా నితీషుబాబు దేవరాజుసారుకి నా సంగతంతా సెప్పినాడు. అంతా యిన్నాక గూడా నన్ను డ్రైవరుగా తీసుకున్నాడంటే ఆయన శానా మంచోడనేగదా! అంతేగాదు, నన్ను ఆయన భార్య అనసూయమ్మగారి కారు తోలమన్నాడు, దర్మాత్ముడు. ఆయమ్మది సామనసాయ. ఆయనంత సక్కగా వుండదు. కానీ దయాగునంలో మహాతల్లి’ చేతులు జోడించి కళ్లు సగం మూశాడు పీరయ్య.‘ఆయనకు తగ్గ యిల్లాలని చెప్తారు. కాని ఆమెకు యీమధ్య ఆరోగ్యం అంత బావుండడం లేదని, మనిషి కూడా చిక్కిపోయిందనీ విన్నాను. దాన్ని గురించి ఆయన తిరగని ఆసుపత్రి, వెళ్లని గుడీ లేదంటారు’ గుడిగంట పెద్దగా మోగింది. పక్షులు కలకలంగా లేచి మళ్లీ చెట్లల్లో సర్దుకున్నాయి. ‘ఆయిల్లెట్లుంది బాబూ? యింద్రబొవనమే! యిల్లంతా పాలరాయి, టేకు వొస్తువులే, గోడలకు పేద్ద పటాలు, మూలల్లో సెందనం బొమ్మలు, కనపడని లైట్లు! దీనిముందు మా పెదలింగయ్య బంగళా పాతబడిన మహలే’ ‘మా కాలనీలో వుండాల్సిన యిల్లు కాదంటారు. నీ తిండితిప్పల సంగతేమిటి?’ ‘ఆయమ్మ పనోళ్లనట్లా వొదిలేస్తాదా బాబూ? మూడుపూట్లా తిండి ఆణ్ణే. మాయమ్మగూడా నన్నట్లా సూడలేదు’ తృప్తిగా చెప్పాడు, ‘మరింకేం, వుద్యోగం జాగ్రత్తగా చేసుకో’ ‘సరేగాని బాబూ, పెండ్లాన్ని సంపిన కేసులో నేను యేడేండ్లు జైలుకు బోయి వొచ్చినా యీసారు నాకెట్లా వుద్యోగమిచ్చినాడు?’ అడిగాడు పీరయ్య.‘కాలం మారింది పీరయ్యా, యిప్పుడు పనిలో నైపుణ్యం, విధేయత ఇవే చూస్తారు. అవి నీ దగ్గరున్నాయి. వుద్యోగమిచ్చేవాళ్లకి అంతకుమించి అక్కర్లేదు. నీకవి వున్నన్నాళ్లూ నీ వుద్యోగం నిలుస్తుంది’ అన్నా. అర్థం అయ్యీ కానట్టుగా తలవూపి ‘ఖాలీ దొరికినప్పుడు వొస్తా’ అంటూ వెళ్లిపోయాడు.‘హఠాత్తుగా తనకు పూర్తిగా కొతై ్తన నాగరిక ప్రపంచంలో పడ్డాడు పీరయ్య, యెలా నెట్టుకొస్తాడో’ అనుకున్నా. ఒక ఉదయం నేను బస్టాపులో వెయిట్ చేస్తుంటే పీరయ్య కారాపి ‘యెక్కుబాబూ అఫీసుదెగ్గిర దింపతా’ అని బలవంతం చేసి వెనకసీట్లో ఎక్కించాడు. దారిలో ఒక హోటల్ దగ్గర చెట్టుకింద ఆపి ‘టీ తాగుదాం బాబూ, తలనొప్పిగా ఉండాది’ అని రెండు పేపరు కప్పుల్తో టీ పట్టుకొచ్చాడు. ‘యెలావుంది వుద్యోగం’ అడిగాను టీ తాగుతూ. ‘బాగుంది బాబూ. జీతమంతా మిగులే. వూర్లో సేను బాగసేయించి మా సిన్నాయన కొడుకును దున్నుకోమని సెప్పినా. నేనింగ ఆవూర్లో వుండలేను గాబట్టి యిల్లుగూడా రిపేరు జేయించి బాడుక్కిచ్చేసినా’ అన్నాడు. ‘వొక గాడిలో పడినట్టే’ టీ తాగాక పీరయ్య గొంతు తగ్గించి ‘దేవరాజుసారు ఆస్తి, యాపారాలు మొత్తం అమ్మగారివేనంట బాబూ. యీ అయ్యగారు కాలేజీలో ఆమె యెంటబడి ప్రేమించి ఆమె నాయనకు యిష్టం లేకపొయ్యినా పెండ్లి సేసుకున్నాడంట’ అన్నాడు. ‘అవన్నీ నీకెందుకు?’ అన్నా, ‘గాసిప్ లేకపోతే మనుషులు ఎలా వుండేవారో’ అనుకుంటూ. ‘నాకేమీ కుశాల లేదు, ఆయింట్లో పాత నౌకరొకామె వొద్దన్నా రోజూవొచ్చి అన్నీ సెప్తాది. కొన్ని కండ్లకు కనబడతానే వుండాయి. అమ్మగారు శానా మంచిదా? అంత డబ్బుండాదా? పెద్ద డాకటర్లే సూస్తావున్నారా? బాగవడం లేదెందుకు? అది మనసులో ఖాయిలా గాబట్టి. గుండె, నరాలు వీకైపోయినాయని సెప్తావున్నారంట’ ‘కొన్ని జబ్బులలాగే వుంటాయి’‘మొన్నమొన్నటి దాంకా ఆమె సక్కగా, నవ్వతా తిరగతా వుండేదంట. దేవరాజుసారు అనుకున్నంత మంచోడు కాదు. శాన్నాళ్లుగా ఆతల్లిని లోలోపల బాదపెడతా వుండాడని నాకనిపిస్తా వుండాది’ ‘నువ్వు నీ వుద్యోగానికి విశ్వాసంగా వుండాలి, నీ అభిప్రాయాలు, కోపతాపాలకు కాదు. యిది ఆధునికానంతర ప్రపంచం. పద, యికవెళ్దాం’నా మాటలు అర్థంకానట్టుగా చూసి ‘అమ్మగారు వొక్కోతూరి వొంటరిగా రూములో కూస్సోని యేడ్సేది సూసినా. ఆయమ్మను సూస్తే ‘రగతంకారి పడిపోయిన గౌరి’ గుర్తుకొచ్చి మనసు యికలమైతాది. వుండలేక నీకు సెప్తావున్నా’ అని కారు స్టార్ట్ చేశాడు పీరయ్య. మళ్లీ కొన్నాళ్లు పీరయ్య కనిపించలేదు.తుఫాను మూలంగా ఆరోజు సాయంత్రంనుంచే పెద్దవర్షం మొదలైంది. ఈదురుగాలి, వణికించే చలి. కరెంటు పోయింది. తెల్లవారు ఝామున ఐదవుతూండగా వీధితలుపు కొట్టిన చప్పుడు రావడంతో టార్చిలైటు వేసి తలుపు తెరిచాను. వరండాలో తడిసిన బట్టల్తో చేతిలో బ్యాగుతో నిలబడివున్నాడు పీరయ్య. మొహం గంభీరంగా ఉంది. ఆశ్చర్యపోయి అతన్ని హల్లోకి రమ్మని తువ్వాలు, పంచె ఇచ్చాను. అప్పటికి ఉద్ధృతి తగ్గి సన్నటి వర్షపుధార మిగిలింది.కాఫీచేసి ఇచ్చాను. పీరయ్య పొడిబట్టలు కట్టుకుని మౌనంగా తాగాడు. ‘అర్జెంటుగా యెక్కడికన్నా వెళ్తున్నావా?’ నిదానంగా అడిగాను.‘నేనుద్యోగం సాలించి వూరికి యెళ్లిపోతావుండా. సెప్పిపోదామని వచ్చినా’ అన్నాడు పీరయ్య బొంగురు గొంతుతో. ‘యేమైంది? మనవూరికిక వెళ్లనన్నావు గదా?’పీరయ్య తటపటాయించాడు ‘దేవరాజుసారు మంచోడు కాదు బాబూ. నేను సెప్తావచ్చిందే నిజం. అమ్మగారిని శానా బాధపెడతా వున్నాడు. ఆమె యెక్కవ రోజులు బతకదు. బైట యెంత ఫ్యాక్చనిస్టైనా పెదలింగయ్యగారే మేలు, యేదున్నా పైక్కనపడతాడు, యింట్లో అమ్మయ్యదే పెత్తనం. యీసారు యేరే మనిసి’‘అందుకని రాకరాక వచ్చిన మంచి వుద్యోగం మానేసి వెళ్తున్నావా?’ ‘నా తల్లట్లాటి అమ్మగారికి అంత సెడు జరగతావుంటే సూస్తా ఆయింట్లో వుండలేను. యేమైండాదో విను. నిన్న అయ్యగారి డ్రైవరు లేడు, కారు నన్ను తోలమన్నాడు. మాటేల వొర్సం మొదులయ్యేతలికి మేం యాభైమైళ్ల దూరంలోవున్న వూరేదో యెళ్లినాం. వూరిబైట తోటలో గెస్టౌసు, అయ్యగార్దే అనుకుంటా. అప్పుటికే ఆడ రెండు పెద్దకార్లొచ్చి వుండాయి’‘వుంటే?’ ‘నేను రాత్రి తొమ్మిదైనాక మంచినీళ్ల కోసమని యింటి యెనకపక్కకు యెళ్లా, వొరండాలో అయ్యగారు, యిద్దురు దోస్తులు కూస్సోని మందు తాగతావుండారు. వోళ్ల మాటలు యినబడినాయి. ‘ఆమెకు ఖాయిలా అనీ, యింగేయో సాకులు సూపి అమ్మగార్ని వొప్పించేదానికి సూస్తావుండానని, తొందర్లోనే యెట్లైనా యేదోవొకటి సేసి సంతకాలు పెట్టిస్తానని, ఆనక వోళ్లనుకున్న యాపారాల్లో యెంత డబ్బైనా పెడ్తానని అయ్యగారు సెప్తావున్నాడు’‘అవునా?’ ‘నాకు కోపం తన్నుకోనొచ్చింది. ‘అర్జెంటు పనుండాదని’ అయ్యగార్ని పక్క రూంలేకి తీసకపోయి ‘నువ్విట్లా సేస్తావుండేది శానా తప్పయ్యగారూ, దేవతట్లాటి అమ్మగార్ని పోగొట్టుకోవద్దు’ అని యినయంగానే సెప్పినా. ఆయన నన్ను తిట్టినాడు, బెదిరిచ్చినాడు, నేను బైపడలేదు. జీతం పెంచుతానని అశ పెట్టినాడు’ అని చీకట్లోకి చూస్తూ ఆగాడు. నేను ఏమనాలో తెలియక అలాగే చూస్తూండిపోయాను.పీరయ్యే మళ్లీ ‘నాకు యిరక్తొచ్చింది. కారు బీగంచెవులు ఆయనముందు యిసిరేసి బైటికొచ్చేసినా. వానలో రెండుమైళ్లు నడిసి, రోడ్డుమీదికొచ్చి పాలయాను, లారీ యెక్కి వూర్లేకొచ్చి యింటికి సేరినాను. టైము నాలుగుదాటింది. అమ్మగారు అప్పుడే లేచినారు. యేదైతే అదైందని అమెకు జెరిగిందంతా సెప్పి వచ్చేసినా‘ అని అలసినట్టుగా గోడకు తలానించి కళ్లు మూసుకున్నాడు.హింసను ఒక మార్గంగా ఒప్పుకుని, భార్యను చంపినవాడిగా శిక్షను అనుభవించి, అనాగరికుడని ముద్రపడ్డ పీరయ్య నాగరిక సమాజంలోని పరోక్ష గృహహింసను చూసి తట్టుకోలేకపోవడం నాకు ఆశ్చర్యమనిపించింది. వర్షం ఆగింది, చీకటి ఇంకా విడలేదు. ‘మనపల్లెలోనే యెట్నో బతుకుతా. యెప్పుడైనా వొచ్చి నిన్ను సూసిపోతుంటా. వస్తా బాబూ’ అని బ్యాగు బుజానికి తగిలించుకుని బయటికి వెళ్లిపోయాడు పీరయ్య. – డా.కె.వి. రమణరావు -
బ్రహ్మ నారదుల పరస్పర శాపాలు..
శ్రీమన్నారాయణుడి నాభి కమలం నుంచి ఉద్భవించిన బ్రహ్మదేవుడు నారాయణుడి ఆజ్ఞ మేరకు సకల చరాచర జగత్తును సృష్టించే పని ప్రారంభించాడు. బ్రహ్మదేవుడి వెనుక భాగం నుంచి అధర్ముడు, వామ భాగం నుంచి అలక్ష్మి అనే దారిద్య్రదేవత, నాభి నుంచి విశ్వకర్మ, ఆ తర్వాత అష్టవసువులు ఉద్భవించారు.బ్రహ్మ మనసు నుంచి సనక, సనందన, సనాతన, సనత్కుమారులనే నలుగురు పుత్రులు ఉదయించారు. ‘మీరంతా భూమ్మీదకు వెళ్లి సృష్టి చేయండి’ అని వారిని ఆజ్ఞాపించాడు బ్రహ్మదేవుడు.తమకు సంసార వ్యామోహం లేదని చెప్పి, ఆ నలుగురు మానస పుత్రులూ తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోయారు. బ్రహ్మ ముఖం నంచి స్వాయంభువ మనువు, అతడి భార్య శతరూప ఆవిర్భవించారు. ఆ తర్వాత బ్రహ్మదేవుడి భృకుటి నుంచి కాలాగ్ని, మహాన్, మహాత్మ, మతిమాన్, భీషణ, భయంకర, రుతుధ్వజ, ఊర్ధ్వకేశ, పింగళాక్ష, రుచి, శుచి అనే ఏకాదశ రుద్రులు ఉద్భవించారు. వీరిలో కాలాగ్ని రుద్రుడు ప్రళయకాలంలో సృష్టిని సంహరిస్తాడు.ఏకాదశ రుద్రుల ఆవిర్భావం తర్వాత బ్రహ్మదేవుడి కర్ణేంద్రియాల నుంచి పులస్త్యుడు, పులహుడు, కుడికంటి నుంచి అత్రి, ఎడమకంటి నుంచి క్రతు, నాసిక నుంచి అరణి, ముఖం నుంచి అంగిరస, ఎడమభాగం నుంచి భృగువు, కుడిభాగం నుంచి దక్షుడు, ఆయన నీడ నుంచి దక్షుడు, కంఠభాగం నుంచి నారదుడు, స్కంధభాగం నుంచి మరీచి, గొంతు నుంచి అపాంతరతమ, నాలుక నుంచి వశిష్ఠ, పెదవుల నుంచి హంస మహర్షి, కుడి పార్శ్వం నుంచి యతి తదితర మహర్షులు ఉద్భవించారు.బ్రహ్మదేవుడు వారందరినీ పిలిచి, ‘మీరంతా నేటి నుంచి సృష్టికార్యం చేయండి’ అని ఆజ్ఞాపించాడు. నారదుడికి బ్రహ్మదేవుడి ఆజ్ఞ రుచించలేదు. ‘తండ్రీ! మాకంటే ముందుగా పుట్టిన మా సోదరులు సనక సనందాదులకు ముందుగా వివాహం చేసి, వారిని సృష్టికార్యానికి వినియోగించు. ఆ తర్వాత మమ్మల్ని గురించి ఆలోచించవచ్చు. వారేమో తపస్సు చేయడానికని వెళ్లిపోయారు. వారినేమీ అనకుండా, మమ్మల్ని సంసార నరకకూపంలోకి తోసేయాలని అనుకోవడం ఏమి న్యాయం? సంసారకూపంలో చిక్కుకున్నవాళ్లు ఎంతటివారైనా దాని నుంచి బయట పడలేరు కదా! మాకు కూడా సంసారం చేసి, సృష్టికార్యాన్ని కొనసాగించాలనే ఇచ్ఛ లేదు. తపోవృత్తిని ఆశ్రయించి జీవించాలనేదే మా కోరిక’ అన్నాడు నారదుడు. నారదుడి నిష్ఠురానికి బ్రహ్మదేవుడికి కోపం వచ్చింది.‘నన్ను ధిక్కరించడమే కాకుండా, ఎదురు సమాధానం చెబుతావా? అందుకే నిన్ను శపిస్తున్నాను. నేటి నుంచి నీ జ్ఞానం అంతరిస్తుంది. త్వరలోనే నువ్వు గంధర్వుడిగా జన్మిస్తావు. ఆ జన్మలో నువ్వు స్త్రీలోలుడివి అవుతావు. ఎందరో స్త్రీలతో విషయ భోగాలను అనుభవిస్తావు. ఆ జన్మ చాలించిన తర్వాత ఒక దాసికి పుత్రుడిగా జన్మిస్తావు. ఆ జన్మలో విష్ణుకథలను వినడం వల్ల, విష్ణుభక్తులను సేవించడం వల్ల తర్వాత జన్మలో తిరిగి నా పుత్రుడిగా జన్మిస్తావు. నువ్వు చేసిన అపరాధానికి ఇదే తగిన శిక్ష’ అని కఠినంగా పలికాడు.బ్రహ్మ శాపంతో నారదుడికి దుఃఖం ముంచుకొచ్చింది. ‘తండ్రీ! నా మీద కోపాన్ని ఉపసంహరించుకో! ఎందరినో సృష్టించే నీకు కోపం తగదు. అయినా, నేనేం తప్పు చేశానని? నేను చెడుమార్గంలో సంచరిస్తూ ఉంటే నన్ను దండించవచ్చు గాని, నేను తపస్సు చేసుకుంటానంటే అకారణంగా శపించావే! ఇదేమైనా న్యాయమా? భావ్యమా? శపిస్తే శపించావు గాని, ఎన్ని జన్మలు ఎత్తినా హరిభక్తి విడవకుండా ఉండేలా నన్ను అనుగ్రహించు. బ్రహ్మపుత్రుడైనా సరే హరిభక్తి లేనివాడు సూకరంతో సమానుడు’ అన్నాడు నారదుడు.అప్పటికి కాస్త శాంతించిన బ్రహ్మ ‘అన్ని జన్మలలోనూ నువ్వు హరిభక్తుడిగానే ఉంటావు’ అన్నాడు.‘తండ్రీ! ఏ యజమాని అయినా తన భార్యకు, సంతానానికి, బంధువులకు, సేవకులకు సన్మార్గాన్ని చూపిస్తే అతడు ఉత్తమ గతులు పొందుతాడు. అలా కాకుండా, చెడుమార్గాన్ని చూపిన వాడు నరకానికి పోతాడు. శ్రీహరి మీద భక్తిప్రపత్తులను పెంచుకున్నవాడిని తిరస్కరిస్తే, అతడు గురువైనా, తండ్రి అయినా, కొడుకు అయినా, యజమాని అయినా దుర్మార్గుడే అవుతాడు. అందువల్ల తండ్రీ! నా తప్పు లేకపోయినా నువ్వు నన్ను శపించావు. కాబట్టి నువ్వు కూడా శాపానికి అర్హుడివే!సకల సృష్టికీ కారకుడివి అయినప్పటికీ నీకు మంత్రం, స్తోత్రం, పూజ అనేవి లోకంలో లేకుండా పోతాయి. నీకు భూమ్మీద ఆలయాలు కూడా ఉండవు. నిన్ను ప్రత్యేకంగా ఆరాధించే భక్తులెవరూ ఉండరు. నా శాప ప్రభావం మూడు కల్పాల వరకు ఉంటుంది. మూడు కల్పాలు గడచిన తర్వాత మాత్రమే నీకు ఇతర దేవతలతో సమానమైన పూజలు అందుతాయి’ అని శపించాడు నారదుడు. నారదుడి శాపం కారణంగానే బ్రహ్మదేవుడికి ఎక్కడా ఆలయాలు లేవు. బ్రహ్మదేవుడికి ప్రత్యేకమైన మంత్ర స్తోత్రాలేవీ లేవు. – సాంఖ్యాయన -
Father's Day 2024: హాయ్..! నాన్న..!!
"ఏ కష్టం ఎదురొచ్చినా.. కన్నీళ్లు ఎదిరించినా.. ఆనందం అనే ఉయ్యాలలో నను పెంచిన నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం నే ఏ దారిలో వెళ్లినా ఏ అడ్డు నన్నాపినా నీ వెంట నేనున్నానని నను నడిపించినా నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం ఏ తప్పు నే చేసినా తప్పటడుగులే వేసినా ఓ చిన్ని చిరునవ్వుతోనె నను మన్నించినా నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం ఏ ఊసు నే చెప్పినా ఏ పాట నే పాడినా భలే ఉంది మళ్లీ పాడరా అని మురిసిపోయినా నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం"...నేడు ‘ఫాదర్స్ డే’ ఈ పాట వినగానే గూస్బమ్స్ వస్తాయి.. ఇప్పుడెందుకు ఈ పాట గురించి చెప్పాల్సి వచ్చిందంటే..అదే నండి జూన్ 16న ‘ఫాదర్స్ డే’. నేటి హాయ్ నాన్న.. మొదలుకుని.. నాటి ‘డాడీ’ వరకూ అనేక సినిమాలు నాన్న కూతురు, నాన్న కొడుకుల అనుబంధాన్ని తెలిపేలా చిత్రించారు. ఇది సినిమాలకు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే.. నిజజీవితంలోనూ మనలో చాలామందికి రోల్ మోడల్ నాన్నే.. పైకి కోపంగా, కటువుగా, గంభీరంగా కనిపించే నాన్న మనసు పొరల్లో దాగున్న ప్రేమ బయటకు చెప్పలేనిది.లోపల ఎంత ప్రేమున్నా.. పైకి చూపిస్తే..పిల్లలపై ప్రభావం పడుతుందనుకునే నాన్నను అర్థం చేసుకునేవాళ్లు తక్కువ మందే.. అందుకే చాలా మందికి చివరి వరకూ నాన్న విలన్ లానే కనిపిస్తాడు. కానీ ఆయన ప్రేమను అర్థం చేసుకున్న వారికి ఆయనే నిజమైన హీరో. అయితే నాన్న ప్రేమను అర్థం చేసుకోవడమూ అంత తేలికేం కాదు...మన కోసం తన కోర్కెలను, ఆశయాలను, ఆలోచనలను, ప్యాషన్‌ను, ఇష్టాలను అన్నీ త్యాగం చేస్తాడు. అలాంటి నాన్నల గురించి ఫాదర్స్ డే సందర్భంగా పలువురిని సాక్షి పలుకరించగా.. వారు పంచుకున్న విశేషాలు...వారిమాటల్లోనే...ఆయన అలవాట్లే నాకొచ్చాయి..మాది ఉమ్మడి కుటుంబం. తాత కొండా వెంకటరంగారెడ్డి. నాన్న పేరు జస్టిస్ కొండా మాధవరెడ్డి. మాది పెద్ద కుటుంబం కావడంతో అంతా కలిసి భోజనం చేసే వాళ్లం. చిన్నప్పటి నుంచి నాన్ననే చూస్తూ పెరిగాను. ఆయనంటే భయం కన్నా గౌరవమే ఎక్కువ. ఆయన చెప్పిన ప్రతి అంశాన్నీ విధిగా పాటించేవాడిని. నాపై ఆయన కోపం చేసిన సందర్భాలు చాలా తక్కువ. ఆయన ఎంత బిజీగా ఉన్నా...కుటుంబ సభ్యులకు సమయం ఇచ్చేవారు. ప్రతి రోజు కలిసే డిన్నర్ చేసేవాళ్లం. ఈ సమయంలో జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలపైనే కాకుండా శాస్త్ర, సాంకేతిక అంశాలపై పెద్ద చర్చే జరిగేది.ఆయన అలవాట్లే నాకూ వచ్చాయని అంతా అంటుంటారు. భోజనం తర్వాత స్వీటు తినే అలవాటు ఆయన నుంచి వచ్చినదే. కోపం కూడా ఆయన మాదిరే. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలకపాత్ర పోషించారు. జడ్జిగా పని చేస్తూ వ్యవసాయ పనులు చూసుకునే వారు. సాంస్కృతిక కేంద్రాలు. విద్యా సంస్థలు నిర్వహించారు. చాలా అంశాల్లో నాన్నే ఆదర్శం. ప్రతి అంశాన్నీ విశ్లేషించడమేకాదు..వాటి పరిణామాలనూ చెప్పేవారు. – చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డినాన్నే స్ఫూర్తి..స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా. కుటుంబంతో కలిసి సోమాజీగూడలోనే స్థిరపడ్డాం. ఖైరతాబాద్ నాసర్ స్కూల్లోనే 12వ తరగతి వరకూ చదువుకున్నా. అమ్మ సుజాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ ఉద్యోగిని. నాన్న చార్టెడ్ అకౌంటెంట్ అయినప్పటికీ ఆఫీస్ మా ఇంటి పక్కనే ఉండేది. మధ్యాహ్నం 1.30 గంటలకు స్కూల్ అయిపోయేది. దీంతో నాన్నే వచ్చి చూసుకునే వారు. ఆయన ప్రోత్సాహంతోనే స్కూల్ టాపర్‌గా మారా.నాన్న వారసురాలిగా 2011లో సీఏ పూర్తి చేసి చార్టెడ్ అకౌంటెంట్ అయ్యా. నాన్నకు చిన్న తనం నుంచి సివిల్స్‌పై ఆసక్తి ఉండేది. వ్యవసాయ కుటుంబం కావడంతో సాధ్యంకాలేదు. నాకూ చిన్నప్పటికీ నుంచి సివిల్స్‌పై ఆసక్తి ఉండేది. మొదటి రెండు ప్రయత్నాల్లో సరైన గైడెన్స్ లేక అర్హత సాధించలేకపోయా. మూడో ప్రయత్నంలో నేను చేసిన తప్పు వల్ల అవకాశం కోల్పోయా. అప్పుడు నాన్న చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తున్నాయి.‘నా కోసం వద్దు. నీకు పూర్తి ఆసక్తి ఉంటే విఫల్యాలను మర్చిపోయి మరింత దీక్ష, ప్రణాళికతో ముందుకెళ్లు’ అంటూ స్ఫూర్తి నింపారు. 2016లో జాతీయ స్థాయిలో 103వ ర్యాంకుతో ఇండియాన్ ఫారెన్ సరీ్వస్‌కు ఎంపికయ్యా. ఆ తర్వాత అనేక విభాగాల్లో పనిచేశా. గడిచిన ఆరు నెలలుగా సికింద్రాబాద్ ఆరీ్పఓగా సేవ లు అందిస్తున్నా. నా భర్త రోహిత్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సరీ్వస్ (ఐఐఎస్) అధికారి. మా పాప సహస్రను ఆయనే చూసుకుంటారు. నాన్నకు సహస్ర మరో స్నేహజ. ‘నేను స్నేహజ ఫాదర్’ అంటూ నాన్న గర్వంగా చెప్పుకుంటుంటే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. –స్నేహజ, ఆర్పీఓ, సికింద్రాబాద్నాన్న వల్లనే ఈ స్థాయికి..చిన్న తనం నుంచి చదువు ఎంత ముఖ్యమో చెప్పేవారు. తాను హెడ్మాస్టర్గా పనిచేస్తూ ఉద్యోగవిరమణ చేసినా పిల్లలందరినీ ఉన్నత చదువులకు పట్టుబట్టారు. నాన్న పేరు అంబడపూడి మనోహరం. నాన్నతో గడిపిన క్షణాలు ఇప్పటికీ గుర్తుకొస్తుంటాయి. ఎంతో ప్రేమానురాగాలను పంచేవారు. ఎంత కష్టమైనా ఉద్యోగాలు పొందాలనే అందరికీ చెప్పేవారు. ఆయన ఒత్తిడితోనే గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నాను. ఆడపిల్లలకు నాన్న అంటే భరోసా, కొండంత అండ, అన్నింటికీ నాన్న ఉన్నాడులే అనే భావన ఎప్పటికీ ఆడపిల్లలకు ఉంటుంది. అందుకే నాన్నే నాకు స్పూర్తి. – అంబడపూడి శారద, ప్రిన్సిపల్ – సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల గౌలిదొడ్డి ఆత్మీయ అనురాగాలకు నిదర్శనం..నాన్న ఉన్నప్పుడు ఆయన విలువ మనకు తెలియకపోవచ్చు. ఆయన మరణించిన తర్వాత ఆ పాత్ర ప్రతిక్షణం కనిపిస్తూనే ఉంటుంది. మాది కోనసీమజిల్లా చెయ్యేరు అగ్రహారం. దార్ల లంకయ్య(అబ్బాయిగారు), తల్లి దార్ల పెదనాగమ్మకు మేము ఐదుగురు సంతానం. అయినా ప్రతి ఒక్కరినీ ఎంతో ప్రేమతో చూసేవారు. తాను చదువుకోకపోయినా మమ్మల్ని ఉన్నత చదువులు చదివించి ఉన్నతమైన ఉద్యోగాల్లో స్థిరపడేలా చేశారు.నాన్న ఎన్నో రాత్రులు ఆకలితో పస్తులున్నా మా కడుపులు నిండాలని తపించేవారు. అందరికీ ఉద్యోగాలు వచ్చాయి.. ఆ ఫలితాలను అనుభవించడానికి ఆయన లేకపోవడం మాకు తీరని లోటు. మా చిన్నప్పుడు తన భుజాలపై ఎత్తుకుని నాటకాలకీ, సినిమాలకీ తీసుకెళ్లేవారు. ఆహార పదార్థాలను తన చేతి రుమాలలో మూటగట్టుకొని తెచ్చిన రోజుల్ని మర్చిపోలేము.మా నాన్నని అందరూ ముచ్చటగా ‘అబ్బాయి’ అని పిలిచేవారు. అసలు పేరుకంటే అదే íస్థిరపడిపోయింది. అదే మానాన్న ఆత్మీయానురాగాలకు గొప్ప నిదర్శనం. నాన్న జ్ఞాపకార్థం హెచ్‌సీయూలో ప్రతి ఏటా ఎంఏ తెలుగు విద్యార్థులకు ఒక గోల్డ్ మెడల్ ఇస్తున్నాను. – ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు తెలుగుశాఖ పూర్వ అధ్యక్షులు–హెచ్సీయూమంచి ఇంజినీర్ కావాలి..ఆస్తులు అమ్మి అయినా ఖర్చు పెడతా అనేది మా తండ్రి. మహబూబ్‌నగర్ జిల్లా కౌకుంట్లలో పేద కుటుంబం మాది. నాన్న జి బాలకిష్టయ్య గౌడ్, అమ్మ లక్ష్మీదేవమ్మ. ఇంట్లో ఆరుగురు అక్కలు పుట్టిన తర్వాత నేను పుట్టడం, అదే రోజు మా వనపర్తి రాజుగా ఉండే రామేశ్వరరావు ఊరికి రావడంతో అయన పేరునే నాకు పెట్టారు. ఏకోపాధ్యాయ పాఠశాలలో తెలుగు మీడియం చదివా. తర్వాత పాలిటెక్నిక్ చేసి ఉద్యోగం చేస్తూ ఇంజినీరింగ్ చదివా.అవసరమైతే ఆస్తులు అమ్మేస్తా... నువ్వు ఇంజినీర్ అయ్యి అందరికీ ఆదర్శంగా ఉండాలనేవారు. నాన్న కల నెరవేర్చేందుకు మా తమ్ముడిని కూడా ఇంజినీరింగ్ చదవించా. ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాకు డైరెక్టర్ కావడం నాన్న ప్రోద్బలమే.. ఆయన ఎక్కువగా చదువుకోలేదు కాబట్టి నలుగురూ చదువుకునేలా ప్రోత్సహించాలనేవారు నాన్న. ఇప్పటికీ నాన్న మాటలు నా చెవులకు వినిపిస్తుంటాయి. – డాక్టర్ జి రామేశ్వరరావు, డైరెక్టర్ ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాఅందరూ చదవాలి..ఎంతకష్టమైనా పడతా...చదవండి అనేవారు నాన్న... అనంతపురం రాయదుర్గంలో టైలర్ మహ్మద్ అనీఫ్ నాన్న. కుటుంబంలో చదువుకున్నవారుంటే ఆ కుటుంబంతోపాటు సమాజం కూడా అభివృద్ధి చెందుతుంది. అందుకోసం ఎంత కష్టమైనా పడతా చదవండి అంటూ మమ్మల్ని ప్రోత్సహించారు.ఒకరిని నేవీలో ఉన్నతస్థాయికి చేరేలా ప్రోత్సహించారు. అక్క మంచి గైనకాలజిస్ట్‌గా గుర్తింపు పొందారు. నన్ను కూడా చదివించగా అనంతపురం జేఎన్టీయూలోఎంటెక్లో గోల్డ్ మెడల్ సాధించాను. అనంతరం ఏపీపీఎస్సీ పరీక్షలు రాసి 1999లో రాయదుర్గం జీఐఎల్‌టీలో లెక్చరర్‌గా చేరా. ప్రస్తుతం ప్రిన్సిపల్‌గా కొనసాగుతున్నాను. ఇప్పటికీ రాయదుర్గంలో ఉంటూ ఫోన్ చేస్తే మొదట పిల్లలు ఎలా చదువుతున్నారని అడుగుతారు. –షేక్ ఎక్బాల్ హుస్సేన్, ప్రిన్సిపల్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ–రాయదుర్గంనా ఇష్టాలను గౌరవిస్తారు...నాన్న అడక్కుండానే అన్నీ ఇచ్చేవారు. మొదట సినిమాల గురించి అడిగితే అస్సలు ఒప్పుకోలేదు. దీంతో టీసీఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేశా. ఆ సమయంలోనే ఓ షార్ట్‌ఫిల్మ్ కాంటెస్ట్‌లో చేయడం, అది పెద్దగా హిట్ అవ్వడంతో సుకుమార్ నన్ను రంగస్థలానికి ఎంపికచేశారు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పలేదు. ప్రీమియర్‌కి పిలిచినప్పుడే చెప్పా.యాక్టింగ్ చూశాక హ్యాపీగా ఫీల్ అయ్యారు. అప్పటి వరకూ ఒప్పుకోరనుకున్నా.. మా నాన్నే నా లైఫ్‌లో రియల్ హీరో.. ఇండస్ట్రీకి ఓ అమ్మాయి వెళ్తుందంటే చాలా విమర్శలు ఎదుర్కోవాలి. కానీ నా ఇష్టాన్ని గౌరవించి ప్రోత్సహించారు. రూమర్స్‌ని అస్సలు పట్టించుకోరు.. నా ఎదుగుదల చూసి గర్వపడతారు.. – పూజిత పొన్నాడ, హీరోయిన్ఇవి చదవండి: -
Gunshot: ఇదికదా YS జగన్ స్టామినా.. పర్ఫెక్ట్ విశ్లేషణ
-
పంఘాల్ పంచ్..
అమిత్ పంఘాల్ ఎత్తు 5 అడుగుల 2 అంగుళాలు మాత్రమే. బాక్సింగ్ ఆటపరంగా చూస్తే ఇది ఒక రకంగా ‘పొట్టి’ కిందనే లెక్క. అతని కెరీర్లో పెద్ద సంఖ్యలో తనకంటే ఎంతో ఎత్తయిన బాక్సర్లనే ఎదుర్కోవాల్సి వచ్చింది. సాధారణంగా రింగ్‌లో ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యంతో పంచ్‌లు విసిరేందుకు ఎత్తు కూడా కీలకంగా పని చేస్తుంది. ఇక్కడే అమిత్‌లో లోపం కనిపించింది. ‘చిన్నప్పటి నుంచి నాకు ఇదే సమస్య. కొన్నిసార్లు నేను పూర్తిగా ఆకాశంలోకి చూస్తూ ప్రత్యర్థితో తలపడుతున్నానేమో అనిపించేది’ అని అమిత్ చెప్పుకున్నాడు కానీ తన పట్టుదలతో అతను దానిని అధిగమించాడు.అసాధారణంగా, మెరుపు వేగంతో పంచ్‌లు విసరడాన్ని సాధన చేసిన అతను అందులో ఆరితేరాడు. ప్రాక్టీస్‌లో కూడా కావాలనే తనకంటే ఎత్తు ఎక్కువ ఉన్న బాక్సర్లతోనే అతను పోటీ పడేవాడు. కెరీర్ ఎదుగుతున్న దశలో అదే అతడి బలంగా మారి అమిత్‌ను పెద్ద బాక్సర్‌ను చేసింది.అన్న అండగా నిలవడంతో...హరియాణాలోని రోహ్టక్ పట్టణానికి సమీపంలో ఉన్న ఊరు ‘మేనా’ అమిత్ స్వస్థలం. రైతు కుటుంబం నుంచి వచ్చాడు. అతని పెద్దన్న అజయ్ పంఘాల్ ముందుగా బాక్సింగ్‌లోకి వచ్చాడు. అతని ద్వారానే అమిత్కూ ఆటపై ఆసక్తి పెరిగింది. ముందుగా ఫిట్నెస్ మెరుగుపరచుకోవడం కోసమనే బాక్సింగ్‌లో చేరినా, ఆ తర్వాత పూర్తి స్థాయిలో బాక్సింగ్‌పై దృష్టి పెట్టాడు. అనిల్ ధన్కర్ అనే రాష్ట్ర స్థాయి కోచ్ రోహ్టక్లో శిక్షణ ఇచ్చేవాడు. ఇద్దరూ అక్కడే కోచింగ్ తీసుకున్నారు.అయితే అజయ్ ఆశించిన రీతిలో పెద్ద స్థాయికి చేరలేకపోయాడు. కానీ జాతీయ స్థాయిలో కొన్ని చక్కటి ప్రదర్శనలతో ఆర్మీలో హవల్దార్‌గా ఉద్యోగం మాత్రం పొందగలిగాడు. మరో వైపు అమిత్ పంచ్‌లు, అతని శైలి మాత్రం కోచ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టేలా చేశాయి. దాంతో అజయ్‌కు మున్ముందు తాను ఏం చేయాలో అర్థమైంది. తను పూర్తిగా ఆట నుంచి తప్పుకొని తమ్ముడిని తీర్చిదిద్దడంపై దృష్టి పెట్టాడు.2018 ఆసియన్ గేమ్స్ స్వర్ణ పతకంతో, తల్లిదండ్రులతో..తన ఉద్యోగం కారణంగా ఆర్థికపరంగా కూడా చేయూత ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ తప్ప మరో ప్రపంచం లేకుండా కష్టపడాలని హితబోధ చేశాడు. దీనిని చిన్న వయసులోనే అర్థం చేసుకున్న అమిత్ 24 గంటలూ బాక్సింగ్‌నే తన భాగస్వామిగా మార్చుకున్నాడు. ఇప్పటికీ, ఏ స్థాయికి చేరినా తన సోదరుడు తన కోసం చేసిన త్యాగాలను అతను గుర్తు చేసుకుంటాడు. ప్రతి మ్యాచ్‌కు ముందు అన్న సూచనలను తీసుకునే అమిత్.. అతడిని బెస్ట్ కోచ్ అంటూ పిలుస్తాడు.జాతీయ స్థాయిలో మెరిసి...అమిత్‌కు 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అతని బరువు 24 కిలోలే! బక్కగా, బలహీనంగా కనిపించేవాడు. కానీ పట్టుదల, పోరాటానికి ఏమాత్రం లోటు లేదు. అందుకే నన్ను చూసి కాదు నా ఆటను చూసి తలపడండి అంటూ బరిలోకి దిగేవాడు. చాలా సందర్భాల్లో తనకంటే ఎక్కువ వయసు ఉన్న ఎంతో బలమైన ఆటగాళ్లను అతను పడగొట్టాడు. ఈ క్రమంలో 14 ఏళ్ల వయసులోనే జాతీయ సబ్ జూనియర్ చాంపియన్‌గా అమిత్ నిలిచాడు. అన్న అండ, ప్రోత్సాహంతో మరింత దూసుకుపోయిన అమిత్ గుర్గావ్లోని కాంబాట్ బాక్సింగ్ క్లబ్లో చేరాడు. అక్కడి అతని బాక్సింగ్ మరింత పదునెక్కింది.కాంబాట్ క్లబ్లో శిక్షణ తర్వాత జూనియర్ స్థాయిలో వరుసగా విజయాలు వచ్చాయి. ఈ క్రమంలో 2017లో అతడిని కోచ్‌లు సీనియర్ స్థాయికి ప్రమోట్ చేశారు. అతను ఆ స్థాయికి తగినవాడా అనే సందేహాలు వచ్చిన నేపథ్యంలో అమిత్ పట్టుదలగా ఆడి తానేంటో నిరూపించుకున్నాడు. వారు తీసుకున్న నిర్ణయానికి న్యాయం చేస్తూ సీనియర్ జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సొంతం చేసుకున్నాడు.2019 ఆసియన్ చాంపియన్ షిప్ స్వర్ణ పతకంతో, 2024 పారిస్ ఒలింపిక్స్‌కు ఎంపికైన అమిత్..ప్రపంచ వేదికలపై...జాతీయ విజేతగా మారిన తర్వాత అవకాశాలు వరుసగా రావడంతో పాటు మరింత స్థాయికి ఎదిగేందుకు దోహదం చేశాయి. 2017లో ఆసియా చాంపియన్‌షిప్ కాంస్యం గెలుచుకోవడంతో అతని సత్తా ఏమిటో అందరికీ తెలిసింది. ఆ తర్వాత కొద్ది రోజులకే 22 ఏళ్ల వయసులో అమిత్ తొలిసారి వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కూడా పాల్గొన్నాడు. అక్కడ పతకం గెలవకపోయినా ఆ అనుభవం పెద్ద స్థాయిలో రాటుదేలేందుకు ఎంతో పనికొచ్చింది.క్వార్టర్ ఫైనల్లో తలవంచినా, ఆ మ్యాచ్‌లో రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, ఉజ్బెకిస్తాన్‌కు చెందిన హసన్బయ్ దుస్మతోవ్‌ను అతను నిలువరించిన తీరు అందరీ ఆకట్టుకుంది. ఇదే జోరులో 2018 కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగే అవకాశం లభించింది. లైట్ ఫ్లయ్‌వెయిట్ కేటగిరీలో వరుస విజయాలతో సత్తా చాటిన అతను ఫైనల్లోకి దూసుకెళ్లాడు. అయితే బ్రిటిష్ బాక్సర్ గలాల్ యాఫైతో జరిగిన ఫైనల్లో హోరాహోరీగా పోరాడి చివరకు తలవంచాడు. దాంతో ఈ క్రీడల్లో రజతపతకం దక్కింది.అయితే సరిగ్గా నాలుగేళ్ల తర్వాత జరిగిన 2022 కామన్వెల్త్ క్రీడల్లో తన స్థాయిని అమిత్ పెంచుకున్నాడు. ఆ పోటీల్లో అదే విభాగంలో అతను స్వర్ణం సాధించడం విశేషం. అంతకు ముందు 2018లోనే జరిగిన ఆసియా క్రీడల్లో కూడా అమిత్ స్వర్ణపతకంతో మెరిశాడు. దీంతో పాటు ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో వరుసగా మూడుసార్లు అతను పతకంతో తిరిగి రావడం పంఘాల్కు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. 2017లో కాంస్యం, 2019లో స్వర్ణం గెలిచిన అతను.. 2021లో రజత పతకాన్ని అందుకున్నాడు.వరల్డ్ నంబర్‌వన్‌గా...2019లో జరిగిన వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ అమిత్‌ను అగ్రశ్రేణి బాక్సర్ల జాబితాలో చేర్చింది. ఈ టోర్నీకి కొద్ది రోజుల ముందే ఆసియా చాంపియన్‌షిప్‌లో పసిడి గెలిచిన ఊపులో అమిత్ ఉన్నాడు. అప్పటి వరకు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్ నుంచి ఐదుగురు పతకాలు సాధించగా, వీరంతా కాంస్యానికే పరిమితమయ్యారు. కానీ వీరందరినీ అధిగమించి అమిత్ రజతపతకాన్ని గెలుచుకున్న తొలి భారతీయుడిగా నిలిచాడు. ఆ సమయంలో అద్భుత ఫామ్‌లో ఉన్న అమిత్ ప్రపంచ బాక్సింగ్ సమాఖ్య ప్రకటించిన వరల్డ్ ర్యాంకింగ్స్‌లో 52 కేజీల విభాగంలో నంబర్‌వన్‌గా నిలవడంతో అతని కెరీర్ శిఖరానికి చేరింది. ప్రస్తుతం భారత ఆర్మీలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్‌గా అతను పని చేస్తున్నాడు.2019 ప్రపంచ చాంపియన్ షిప్ రజత పతకంతో.., కామన్ వెల్త్ స్వర్ణ పతకంతో అమిత్ (2022)ప్రతికూల పరిస్థితి దాటి...అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాల తర్వాత బాక్సింగ్ సమాఖ్య అమిత్ పంఘాల్ పేరును ప్రతిష్ఠాత్మక ఖేల్‌రత్న పురస్కారం కోసం సిఫారసు చేసింది. అంతకు ముందు వరుసగా మూడేళ్లు అర్జున అవార్డు కోసం సిఫారసు చేసినా, అతడి పేరును కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఒకప్పుడు డోపింగ్‌లో పట్టుబడ్డాడనేది దానికి కారణంగా చెప్పింది. అయితే నిజానికి అమిత్ 2012లో 17 ఏళ్ల వయసులో యూత్ స్థాయిలో ఆడుతున్నప్పుడు ఇది జరిగింది.తాను ఉద్దేశపూర్వకంగా డ్రగ్స్ తీసుకోలేదని, చికెన్ పాక్స్ కోసం చికిత్స చేయిస్తుండగా వాడిన మందుల్లో నిషేధక ఉత్ప్రేరకం ఉన్నట్లు తేలింది. దీనిపై అతను చాలా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. యూత్ స్థాయిలో చేసిన తప్పులను ఎవరైనా మన్నిస్తారని, అయినా కూడా దానికి తాను తగిన శిక్ష కూడా అనుభవించానని అతను చెప్పాడు. భారత్ తరఫున తన ఘనతలను పరిగణించాలని పంఘాల్ కోరాడు. చివరకు 2022లో కేంద్రం అమిత్‌ను ‘అర్జున’ అవార్డుతో గౌరవించింది.‘ఒలింపిక్ పతకం సాధించిన రోజే బాక్సింగ్‌లో నా ప్రయాణం మొదలైనట్లుగా భావిస్తాను’... అమిత్ చేసిన ఈ వ్యాఖ్య ఒలింపిక్ మెడల్ విలువేంటో చెబుతుంది. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్నా, అనూహ్య రీతిలో అతను విఫలమైన నిష్క్రమించాడు. కానీ ఇప్పుడు మరో ఒలింపిక్స్‌కు అమిత్ సిద్ధమయ్యాడు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో పతకం సాధించాలనే పట్టుదలతో శ్రమిస్తున్న ఈ బాక్సర్ కల నెరవేరాలని ఆశిద్దాం. – మొహమ్మద్ అబ్దుల్ హాది -
'అపార్ట్మెంట్ 66బి’ గురించి.. కనీసం మాట్లాడాలన్నా ధైర్యం చాలదు!
దేవుడు విడిచిపెట్టిన ప్రదేశాలలో మాత్రమే దయ్యాలు కనిపిస్తాయనేది నానుడి. అలాగే, ‘నిర్మానుషమైన ప్రదేశాల్లో చీకటి వేళల్లో మాత్రమే దయ్యాలు కనిపిస్తాయనుకుంటే పొరబాటే’ అంటారు చాలామంది. అందుకే కాబోలు.. మహారాష్ట్ర రాజధాని ముంబై పరిసర ప్రాంతాలు ఎంత రద్దీగా ఉన్నా.. ఎంత జన సందోహంతో నిండి ఉన్నా.. అక్కడ వెంటాడే భయానక కథలు కోకొల్లలుగా వినిపిస్తుంటాయి. అలాంటి కథల్లో బృందావన్ సొసైటీ హారర్ స్టోరీ ఒకటి.ముంబై, థానే ప్రాంతంలో ‘బృందావన్ సొసైటీ’ హడలెత్తించే కథలకు బాగా ఫేమస్. అందులో పదుల సంఖ్యలో బిల్డింగ్స్, వందల సంఖ్యలో అపార్ట్మెంట్స్ ఉంటాయి. అయితే అక్కడ నివసించే వారితో పాటు.. కాపలాకి వచ్చే వాచ్‌మన్, ఇంటి పని, వంట పని చేయడానికి వచ్చే పనివాళ్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్ ఇలా ప్రతి ఒక్కరూ ‘అపార్ట్మెంట్ 66బి’ గురించి కనీసం మాట్లాడాలన్నా భయపడతారు. అటు వైపు తేరిపార చూడాలన్నా వణికిపోతారు. అందులో దయ్యం ఉందని అక్కడివారి నమ్మకం. అందుకే ఆ దరిదాపుల్లోకి కూడా చాలామంది అడుగుపెట్టరు.ఆ అపార్ట్మెంట్లో ఉన్న దయ్యం తనకు ఎవరి వల్లనైనా ఇబ్బంది కలిగితే, వారిని లాగిపెట్టి కొడుతుందట! ఆ దయ్యం కొట్టిన చెంపదెబ్బకు గూబ గుయ్యిమంటుందట! అంతేకాదు, ఆ భవనం కారిడార్లలో ఏవేవో వింతస్వరాలు ప్రతిధ్వనిస్తుంటాయట! బెడ్ రూముల్లో ఏవో గుసగుసలు చెవిన పడతుంటాయట!ఆ చుట్టుపక్కల నివసించేవారిలో కొందరు మాత్రం ఆ 66బిలో కచ్చితంగా ఏదో ప్రేతాత్మ ఉందని, అటుగా వెళ్లినా, ఆ వైపు పరిశీలనగా చూసినా ఎవరో వేగంగా తమవైపు వస్తున్నట్లుగా అనిపిస్తుంటుందని చెబుతారు.అయితే అపార్టమెంట్ 66బి చరిత్రను తవ్వితే ఒక విషాదగాథ వినిపిస్తుంది. చాలా ఏళ్ల కిందట ఆ ఇంట్లో ఒంటరిగా ఉండే ఓ పెద్దాయన జీవితం మీద విరక్తితో, మానసిక ఒత్తిడితో బాల్కనీలోంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి బలవన్మరణం పోలీసు రికార్డుల్లో కూడా నమోదైంది. అయితే అప్పటి నుంచి అతని ఆత్మ ఆ పరిసరాల్లోనే తిరుగాడుతుందని, తనకు చిరాకు తెప్పించేవారిని కొట్టి భయభ్రాంతులను చేస్తుందని స్థానికుల్లో చాలామంది నమ్ముతారు.స్థానికుల నమ్మకానికి తగినట్లుగానే ఆ 66బి ఫ్లా్లట్ ఇప్పటికీ ఖాళీగా ఉంది. కొంతమంది నివాసితులు భవనంలో దయ్యం ఉండే అవకాశమే లేదని కొట్టిపారేస్తుంటే, మరికొందరు మాత్రం స్వయంగా తాము దయ్యం నీడను చూశామని, దాని గొంతును విన్నామని, దయ్యం చేతిలో దెబ్బలు కూడా తిన్నామని చెబుతుంటారు. ఇంకొందరైతే ఆ అపార్ట్మెంట్లో ఆ చుట్టు ప్రక్కల కేవలం ఒక్క దయ్యమే లేదని, చాలా దయ్యాలు ఉన్నాయని హడలెత్తిస్తారు. ఆ మాట విన్న కొందరు మాత్రం.. ‘ఇక్కడ చాలా దయ్యాలేమీ లేవు.. కొట్టే దయ్యం ఒక్కటే ఉంది. దానితో జాగ్రత్తగా ఉంటే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు’ అని చెబుతారు.ఏది ఏమైనా, ఆ సొసైటీకి వెళ్లిన కొత్తవారు ఈ వింత అనుభవాన్ని చవిచూడక మానరట! ఎందుకంటే కొత్తవారిని అక్కడి దెయ్యం ఈజీగా గుర్తుపడతుందట! తన దెబ్బను రుచి చూపిస్తుందట! పాతవారైనా సరే ఆ దయ్యానికి ఇబ్బంది కలిగిస్తే లాగిపెట్టి ఒక్కటి ఇచ్చి పోతుందట. మరి నిజంగానే అక్కడ ఆ పెద్దాయన ఆత్మ ఉందా? అసలు అది ఆ అపార్ట్మెంట్ యజమాని ఆత్మేనా? అసలు అక్కడుండేవారిని, అక్కడికి కొత్తగా వచ్చేవారిని కొడుతున్న అదృశ్య శక్తి ఏమిటి? ఆ ఆత్మతో పాటు మరికొన్ని అతీంద్రియశక్తులు అక్కడ గుమిగూడాయా? అనేది మాత్రం నేటికీ మిస్టరీనే! – సంహిత నిమ్మనఇవి చదవండి: దేవుళ్ల పండగ అంటే తెలుసు..! మరి దెయ్యాల పండగ? -
Gunshot: ఓడినా గెలిచాడు YS Jagan
-
నేలపట్టు! ‘మామయ్యా.. ఒక్క విషయం'..
జీవితం జీవించటానికి కాదు. జీవితం నిర్వహించాల్సిన కర్తవ్యమని భావించే వ్యక్తి చంద్రశేఖరం. ఉదయ సంధ్య వేళ. చుట్టూ స్వచ్ఛమైన ప్రాణవాయువు ఆవరించిన స్పృహ. ప్రాణం నిలకడగా ఉచ్ఛ్వాసనిశ్వాసాల్లో డోలలూగుతున్న భావన. ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంతో హాయి పొందుతున్నాడు చంద్రశేఖరం. ఎప్పుడో వెళ్లిపోయిన యవ్వనం తిరిగి వచ్చినంత ఉత్సాహంగా ఉంది. సూర్యోదయం అయ్యేంత వరకు పొలం గట్ల మీద అలా తిరుగుతూనే ఉండిపోయాడు. అది అలవాటు. దినచర్యలో మొదటి ప్రస్థానం.తెల్లటి ఖద్దరు జుబ్బా, ఎగ కట్టిన పంచెతో తదేకంగా నడుస్తున్నాడు. అప్పుడే పొలంలోకి కూలీలు దిగుతున్నారు. ఆ పక్క చెరువులో కడప చెట్ల మీద పక్షుల కిలకిలరావాలు. వీనులవిందుగా ప్రతిధ్వనిస్తూ ఉంది ఆ ప్రాంతమంతా. చంద్రశేఖరాన్ని చూస్తే మరింత అల్లరి వాటిది. రోజూ టిఫిన్ తెచ్చి ఫామ్‌హౌస్‌లో పెట్టి వెళ్లే మాణిక్యం హడావుడిగా పొలం గట్ల మీద ఎదురు రావడం కొద్దిగా గాబరా పడ్డాడు. పడమర పొలం వెళ్లటం మానుకొని ఎదురు నడిచాడు.‘టిఫిన్ తెచ్చి టేబుల్ మీద పెట్టాను అయ్యా.. మధ్యాహ్నం అన్నం వండాలా?’ కొత్తగా అడగటంతో అర్థం కాలేదు. అదే ప్రశ్నించాడు చంద్రశేఖరం. ‘ఆ యశోదమ్మ వచ్చి అయ్యగారికి భోజనం పంపిస్తాము నీవేమీ వండొద్దు, మేం చెప్పామని అయ్యగారికి చెప్పు అని చెప్పి వెళ్ళారయ్యా’ వినయంగా బిడియంగా చెప్పింది మాణిక్యం. ‘ఏమిటి విషయం ఈరోజు?’ చంద్రశేఖరం ప్రశ్న పూర్తిగా వినకుండానే ‘అయ్యా పక్షుల కొరకు చెరువు గట్టు మీద మన ఊరోళ్ళు పొంగళ్ళు పెట్టేది ఈ రోజే కదయ్యా’ మాణిక్యం జవాబుతో గుర్తుకు వచ్చిన వాడిలా ‘అవును కదూ సరే ఆ పొంగలి పులిహోరతో ఈ పూట ఇక్కడే గడిపేస్తానులే. రాత్రికి వచ్చి, మామూలుగానే చపాతీ చేసి వెళ్ళు.. సరేనా’ అంటూనే ఇక నీవెళ్ళచ్చు అని తల ఆడిస్తూ మాణిక్యాన్ని పంపేశాడు.‘నాన్న నువ్వు ఎప్పటికీ ఊర్లో వాళ్ళు పంపిన అన్నం తినవద్దు. ఇంట్లోనే చేయించుకో. పొలం వెళితే వారితో కలసి అన్నం తినొద్దు’ కూతురు రోహిణి మాటలు గుర్తుకు వచ్చాయి. కళ్ళలో సన్నటి నీటి చెమ్మ. రోహిణిని చూసి ఐదేళ్లయ్యింది. ఫోన్లోనే కులాసాలు, కబుర్లు. ఆడబిడ్డ మేలు.. ప్రతివారం ‘ఏం నాన్నా..’ అని నోటినిండా అరగంట మాట్లాడుతుంది. ప్రశాంతు, సుమన్‌లు అయితే పలకరింపు క్కూడా అందడం లేదు. పిల్లలు సరే, కట్టుకొని, నాలుగు పదుల కాలం కాపురం చేసిన తాళికి ఏమైంది.. ఎక్కడ నుంచి వచ్చాము, ఏ మట్టి తల్లి బిడ్డలం అనేది మర్చిపోతే ఎలా? మూలాలు దాచేసే జీవితాలా? జన్మనిచ్చిన పల్లెను, జీవితాన్ని పంచిన నేల పరిమళాలు తుడిచేస్తే పోయేవేనా?‘పల్లె నచ్చక, పల్లె జీవితం చిన్నతనంగా భావించి పిల్లలకు తోడు, వారి బాగోగులు అంటూ వాళ్ళు దేశాలు పట్టుకుని తిరుగుతుంటే కంటికి రెప్పలా మనమేగా కాసుక్కూర్చోవాలి’ అనేది శకుంతల. నిజానికి పల్లెలో ఉండలేక తన పాత జీవితాన్ని, పునాదుల్ని గుర్తు చేసుకోను ఇష్టంలేక పిల్లలకు తోడుగా ముగ్గురు బిడ్డలతో విలాస జీవితం గడుపుతూ ఉంది శ్రీమతి చంద్రశేఖరం. ఒకప్పుడు ఇంట్లో అందరూ ఉన్నా ఉద్యోగ బాధ్యతలు మధ్య బతికేవాడు. కుటుంబాన్ని.. వారి బాగోగులను ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదు. ఇప్పుడు ఎవరికి వారు ఉద్యోగాల్లో, సొంత కాపురాల్లో ఎక్కడో ఎక్కడెక్కడో విడిపోయారు. తను ఒంటరిగా బతుకుతున్నాడు రిటైర్డ్ ఏఎస్పీ చంద్రశేఖరం.నేలపట్టు సముద్ర తీరాన దట్టమైన చెట్లు, అడవుల మధ్య రస్తాల వాసన సోకనంత దూరంగా విసిరేసినట్టున్న కుగ్రామం. నాగరికులు అనేదానికి వీల్లేదు. పల్లెలకు పట్నాలకు దూరంగా ఉంది. నాగరికత నీడ పడని ఊరు. ఆ చిన్న పల్లెటూరే నేలపట్టు. యాబై గడప దాటని కుగ్రామం. దొరవారి సత్రం వెళ్లే తారు రోడ్డు కోసం ఏడు కిలోమీటర్లు అడ్డంగా నడవాలి. అక్కడ అందరి జీవనం ఒక్కటే. నీళ్ల కాలంలో పులికాట్ సరస్సులో చేపల వేట. మిగిలిన రోజుల్లో చెరువు, దొరువుల్లో వేట. ఇదే వారి జీవనాధారం.నేలపట్టులో మూడు నాలుగు తరగతుల వరకు చదివినవారే అంతా. అదీ సుదూరం నడిచి వెళ్లి. ఆ ఊర్లో తొలి డిగ్రీ పట్టా పొందిన వ్యక్తి చంద్రశేఖరం. దాని వెనుక సుబ్బయ్య, పిచ్చమ్మ పట్టుదల బోలెడంత. వారి ఒక్కగానొక్క కొడుకు చంద్రశేఖరం. చదివించాలనే మూర్ఖత్వం వారిది. మూర్ఖత్వం అని అప్పట్లో ఆ ఊరి వారి నింద లేదా బిరుదు. ఈ జీవితం నుండి వెలుగు చూడాలనే ఓ కిరణం కోసం వెతుకులాట సుబ్బయ్య – పిచ్చమ్మ దంపతులది. నేలపట్టులో అది ఎనిమిదో వింత. శిక్షణ పూర్తిచేసుకుని ఇందుకూరుపేట పోలీస్ సబ్ ఇన్స్పెక్టరుగా చార్జి తీసుకొని గ్రామానికి చేరుకున్నాడు చంద్రశేఖరం. ఒక్క క్షణం ఆ పల్లె గడప, పోలీసు జీపు దుమ్ముకు, ఖాకీ బట్టల వాసనకు సన్నగా వణికింది. నేలతల్లికి ముద్దు పెట్టుకొని నడిచి వస్తున్న ఎస్ఐని చూసి ‘పోలీసు కాదురా మన చంద్రుడే!’ అని సన్నటి చిరు జల్లుల సందడిలో పల్లె అంతా సరదాల చిత్తడి అయింది.‘మా చంద్రుడు బీఏ అంట’ నేలపట్టు వాళ్ళు ఘనంగా చెప్పుకునే వారు. వారికి తెలియని అందని ఎన్నో విషయాలు చాలానే ఉన్నాయి. బీఏ కాదు పీజీ చేశాడని, నెల్లూరు చరిత్ర మీద తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో పీహెచ్డీ కూడా చేశాడని ఇప్పటికీ తెలియదు. కానీ ఆ చందురూడే కాల చక్రభ్రమణంలో ఎస్సై మాత్రమే కాదు సీఐ, డి.ఎస్.పి, ఏఎస్పీ కూడా అయినాడని ఎనిమిది జిల్లాల్లో పనిచేసి రిటైర్మెంట్కు చివరి రెండేళ్లు నెల్లూరు వచ్చారు.రాష్ట్రస్థాయిలో పొందిన గుర్తింపు గౌరవంతో సొంత జిల్లాలోని బాధ్యతలు నెరవేరుస్తున్న విషయం ఇప్పటికి అందరూ తెలుసుకున్నారు. నేలతల్లిని ముద్దాడి ఉద్యోగ ప్రయాణాన్ని మొదలెట్టిన నేలపట్టు చంద్రుడు ఊరిని మరవలేదు. వంద గడప ఉన్న తన తల్లిలాంటి ఊరి కోసం పాతికేళ్ల కృషిని నాలుగైదు ఏళ్ళలో పూర్తి చేయగలిగాడు. సొంత ఊరు నుండి నాయుడుపేట, దొరవారి సత్రానికి తారు రోడ్లు మొదలు పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య సబ్‌సెంటర్, పక్కా ఇళ్లు.. అన్ని ప్రభుత్వ పథకాలు గ్రామానికి అందేలా కృషి చేయడమే కాక ప్రతి నెల సొంత ఊరిలో రెండు రోజులు ప్రజలను చైతన్య పరచడం తన విధులలో ఒకటిగా భావించాడు చంద్రశేఖరం. నాటు పడవలు, వలల వద్ద నుంచి చెరువుకు రెండు వైపులా ఉన్న పోరంబోకు భూములను గ్రామçస్థులకు కేటాయించేలా కృషిచేసి డి ఫారములు అందేలా చేశాడు. ఊరికి ఒక్కడిలా చంద్రుడు గ్రామానికి వెన్నెల వెలుగయ్యాడు.మూడు పదుల ఏళ్ల కృషి – ఆ నేల వైభవం ఆ ప్రాంతాలలో ప్రవచనంలా మారుమోగుతుంది. దానికి అనేకానేక కారణాలు. అభివృద్ధి మాత్రమే కాదు, ప్రతి ఇంట చదువుకున్న వారే. గ్రామం నుంచే ఇప్పుడు రైల్వే, పోలీసు, బడి పంతుళ్లు, ఇంజినీర్లుగా ఎదిగిన పిల్లలతో పల్లె స్వరూపమే మారింది. నేలపట్టు.. ఆకాశమంత సముద్రాన్ని ఇక్కడ భూమిపైన జల తివాచీగా పరచినట్టు ఉంటుంది. చెట్లకి ప్రాణమిచ్చే మట్టి, మట్టిని మెత్తగా మలచిన చెట్లు. చెట్లుకీ మట్టికీ ఉనికినిచ్చిన పులికాట్ సరస్సు. చెట్టు, మట్టి, సముద్రం, పులికాట్‌లకు స్థానమిచ్చినదే నేలపట్టు. ఒకప్పుడు మురుగు కూపం – నేడు ఆదర్శగ్రామం. తైల సంస్కారమెరగని పల్లెసీమ – నేడు ఉత్తమ పల్లె. పోరంబోకు పొలాలు పంట పొలాలు అయ్యాయి.చెరువు ఆయకట్టు కింద రెండు కార్లు జీలకర్ర మసూర్లకు వేదికైంది. ఆ డివిజనులోనే అభివృద్ధికి దర్వాజా అయింది. ప్రతి పిల్లోడు చదువుకున్న యువత కాగలిగింది. ప్రతి గడప ప్రభుత్వ ఉద్యోగి కాపురంగా నిలిచింది. దానితో పాటు ఎర్ర చెరువు.. నేలపట్టుకు కలసొచ్చిన మరో ఆయువుపట్టు అయింది. అదే వలస పక్షులు. చెరువులోనే ప్రత్యేకంగా ఉన్న కడప చెట్లు వీటికి ఆసరా.ఈశాధాన్యుల హిమాలయ యాత్రలా, కాశీతీర్థ ప్రయాణంలో వలసపక్షులు చేరుతుంటాయి. విశ్వసుందరి పోటీలకు పయనమైన సోయగాల్లా, విశ్వశాంతి చాటే ఆత్మీయ అతిథుల రాయబారుల్లా, పులికాట్ సరస్సు ఒడ్డున వాలుతాయి ఈ తారా పక్షులు. ప్రేమయాత్రో, ఆత్మీయ సంగమ ప్రయాణమో, తను పుట్టిన మట్టిని ముద్దాడుతుంటాయి ఈ ఫెలికాన్లు. సుదూర తీర ప్రయాణ ప్రయాస తీర్చుకుంటూ ఫ్లెమింగోలు, దండయాత్రకు తరలివచ్చిన సముద్ర సైన్యంలా, పెలికాన్లు, ఫ్లెమింగోలు, నారాయణ పక్షి, నీటి కాకి, పాలపిట్ట, కళ్లకంకణాయి, ఎర్రకాళ్ల కొంగ, నీటి కొంగ, చెకుముకి పిట్ట, ఇక్కడ ఆవాసాలతో బృందావనంలా మలచుకుంటాయి ఈ నేలపట్టుని. ఒకనాడు అలెగ్జాండరు జయించాడు జంబూ ద్వీపాన్ని, ఈనాడు విదేశీ పక్షులు ముద్దాడుతున్నాయి ఈ నేలపాదాల్ని. వేల పక్షులు ఆరు నెలలు పాటు ప్రేమమయ భక్తి భావనలే. రాధా మాధవ ప్రణయ వేద వేదనా స్వనాలే. కొత్త సృష్టి రచనా రీతికి అనుక్రమణికలు ఈ చెరువు చిరునామాగా మారుతుంది. సృష్టియాగం మదనభంగిమ అందుకేనేమో పరువపు ఘుమఘుమలు – రేగడి నేలల్లో రెట్టల పరిమళం.రేపటి పంటలకు శుభోదయం అవుతుంటాయి. చెరువు, పొలాల గట్లలో నిండిన చెట్లు పక్షుల ఎరువుతో కలసి పదిరెట్లు పండించే పంటలు హరిత దుప్పట్లు. నేలపట్టు మహిళలు జాతర చేసుకునేది ఈ పక్షుల కోసమే. గుళ్లు, గోపురాలు, దేవుళ్లు, దేవతలకు కాదు, చెరువుకు కడప చెట్లకు మొక్కులు తీర్చుకుంటారు. దేశ విదేశీ పక్షులకు ఇవే ఆసరాలు. పక్షులకు స్వాగతం పలకటం ఇక్కడ జరిగే అతి పెద్ద జాతర. అదే తిరణాల. అందుకే సవినయ సాదర స్వాగతం పలుకుతూ, నేలపట్టు నాగేటి చాళ్లతో ఆహ్వాన గీతం పలుకుతుండటం రెండు దశాబ్దాలుగా ఇక్కడ సాగుతున్న పక్షుల పండుగ. ఎక్కడున్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, చదువుల్లో ఉన్నా అందరూ ఈ పక్షుల జాతరకు, ఈ పొంగళ్లు, ఉత్సవాలకు హాజరవటం ఈ నేలపట్టు పుణ్యస్థలిగా మారుతుంది.వేడుకల్లో పాల్గొనడమే కాదు వచ్చే ఏడాది ప్రణాళికలను రూపొందించుకోవటం. అన్ని తరగతుల వారికి, అన్ని వర్గాల వారికి, ఎవరి పనులు వారికి, ఎవరి బాధ్యతలు, కర్తవ్యాలను అందరూ ఒక్కమాటగా పంచుకుంటుంటారు. అవన్నీ అమలు జరగాల్సిందే. ఈ పాతికేళ్లుగా అదే కట్టుబాటు, ప్రతిఒక్కరిలో అదే కసి, అందుకే నేలపట్టుకు గుర్తింపు, గౌరవం. దీనికి కర్త, కర్మ, క్రియ ఒక్కరే.. చంద్రశేఖరం.ప్రతికదలికలోనూ ఓ రాజసం. ఎక్కడివో, ఏ ప్రాంతానివో, మరే దేశానివో సరిగ్గా ఈ సీజనులో వస్తాయి. ఐదారు నెలలు కాపురం చేస్తాయి. సంతతి వృద్ధి చేసుకొని వెళతాయి. మంచుకాలంలో ఉండలేవు. మంచు తగలక ముందే వెళ్లిపోతాయి. పెలికాన్ లు.. వాటి కదలికలను చూసి చంద్రశేఖరం పెదాలు చిరునవ్వుల సందడి చేస్తున్నాయి. దరహాసాల నాట్యమాడుతున్నాయి. ఈ నేల మీద ఎంత ప్రేమ..నమ్మకం..! ఠంచనుగా ప్రతి ఏడాది వేల కి.మీ. దాటుకొని సముద్రాలు దాటుకొని ఈ నేలతల్లి ఒడిలో సేద తీరుతాయి. ఎక్కడిదో ఈ విశ్వాసం.. ఏమిటో.. ఈ నేలతో ఆత్మీయ అనురాగ సంగమం! ఈ విదేశీ పక్షులకు ఉన్న ప్రేమాభిమానాలు ఈ నేల మీద పురుడు పోసుకున్న మనుషులకు ఎందుకు లేకుండా పోయింది! చంద్రశేఖరం మనసు బాధగా మూలిగింది. ఇక్కడ పునాదులతోనే గదా ఎదిగింది. ఈ నేలతల్లి ఒడి ఎందుకు గిట్టడం లేదు. నేలపట్టు పొడ ఎందుకు పడటం లేదు. పదవీ విరమణ జరిగి, ఒక్కడే నేలపట్టు గ్రామానికి చేరుకోవటం వెనుక నిర్మించుకొన్న ఆశల సౌధం బీటలు వారినంత వ్యథ..‘డాడీ.. మీరెన్నయినా చెప్పండి చెన్నై, లేదా హైద్రాబాదులలో సెటిల్ అవ్వండి. మీరు నెల్లూరు నేలపట్టు అనటం మాత్రం మాకు మింగుడు పడటం లేదు’ పెద్ద కొడుకు ప్రశాంత్. ‘సొంత ఊరంటే అభిమానం కాదనం డాడీ. అంతా ట్రాష్, మేమేమో ముగ్గురం మూడు దేశాల్లో స్థిరపడ్డాం. మేము రావాలన్నా పోవాలన్నా మా వసతి కూడా గమనించండి’ చిన్న కొడుకు సుమంత్. ‘అక్కడ పొలాలు, ఇళ్లు మీ పేరుతో ఊరి అభివృద్ధికి కేటాయించండి డాడీ. అంతేకానీ మీరిద్దరూ ఆ పల్లెలో ఉంటే మేమెలా ఇక్కడ స్థిరంగా ఉండగలం! మమ్మల్ని అర్థం చేసుకో డాడీ..’ తన ఆలోచనలను పుణికి పుచ్చుకున్న రోహిణి ఆలోచనలు కూడా గాడి తప్పాయి.‘మామయ్యా.. ఒక్క విషయం. ఒకటో తరగతిలో అక్షరాలు దిద్దామని, ఐదవ తరగతిలో గుణింతాలు దిద్దామని, డిగ్రీ పాసైనా అక్కడే ఉండి చదువుకుంటాను డిగ్రీలో కూడా ఆ టీచరే పాఠాలు చెప్పాలంటే కుదరుతుందా? అంతే మామయ్యా. ఊరి నుండి ఎదిగారు. ఎంతో చేశారు మీ వంతు.. ఆ గౌరవంతోనే మనం తప్పుకుంటే గొప్పగా నిలిచిపోతాం గదా మామయ్యా’ అల్లుడు చైతన్య అనునయించే ప్రయత్నం. చంద్రశేఖరంలో అప్పుడే ఓ మెరుపు మెరిసింది. నిజమే .. గౌరవంగా తప్పుకోవాలి. శాశ్వతంగా తప్పుకోవాలి. ఎక్కడ నుండి.. ఊరునుండే తప్పుకోవాలి! ఎలా తప్పుకోవాలి.. ఊరు ఖాళీ చేసికాదు.. ‘బొందిలో జీవం వెళ్లిన తర్వాతనే’ అప్పటికే ఓ నిశ్చయ నిర్ణయానికి చేరువయ్యాడు. ‘పిల్లలు లేకుండా, మనవళ్లు, మనవరాళ్లను చూడకుండా వారితో ఆడుకోకుండా జీవితాన్ని చూడకుండా, ఆస్వాదించకుండా ఆ పల్లెలో బిక్కుబిక్కుమంటూ నేనుండలేను. మీరు కావాలంటే వెళ్లండి’ జీవిత భాగస్వామి శకుంతల తెగేసి చెప్పింది. పదవీ విరమణ తర్వాత కూడా రెండు మూడు నెలలు ఇదే యుద్ధం.ఇదే చర్చ, ఇవే సమస్యలు. శకుంతల వైభోగం.. చంద్రశేఖరం ఆశయం పోటీ పడ్డాయి. కదులుతున్న కాలమే మన గురువు.. ఎంతటి సమస్య వచ్చినా ముందుకు కదలమనే చెబుతుంది తప్ప అక్కడే ఆగిపొమ్మని చెప్పదనే చంద్రశేఖరం విశ్వాసం. లగేజీ వాహనం పల్లెకు చేరుకుంది. వెనుక కారులో చంద్రశేఖరం ఒంటరిగా నేలపట్టుకు చేరి అప్పడే ఏడేళ్లు దాటింది. చందురూడూ ఒక్కడే. తారలేదని గుండెలు బోరుమన్నా, ఇప్పడు అంతా సర్దుకుపోయారు. చందురూడే.. నేలపట్టుకు వెలుగయ్యాడు. చెరువు ఒడ్డున పక్షులకోసం పొంగళ్లు పెడుతున్న గ్రామ మహిళలు, పిల్లలు, గ్రామానికి చేరుకొన్న కొత్త సందడి చప్పుళ్లతో చంద్రశేఖరం హృదయం కోటి వెలుగులతో కాంతిపుంజం అయింది.అయినా ఒక్కడే.. ఆ భావన లేదు. ఊరంతా తనది. అన్నీ మన మంచికే అనుకుంటే ఆపదలో కూడా ఆత్మవిశ్వాసం పోదు. ఒక వ్యక్తి విజయం సాధించాలంటే అతని సంకల్పం గొప్పదై ఉండాలి. అతని గురి లక్ష్యం వైపు ఉండాలి. శ్రద్ధ.. చేసే పనిపై ఉండాలి! ఫోన్ లో పలకరింపులు, కుశలాలు సాగుతూ, సాగుతూ పలచబడ్డాయి. అప్పుడప్పుడు చేసే రోహిణి కూడా పిల్లల వ్యాపకాలు, చదువు సంధ్యల ఒత్తిడి వలనేమో ఫోన్ లో కూడా పలకరించి చాలా కాలమయింది. పిల్లలు, కోడళ్ళు, కట్టుకున్న తాళి అందరూ ఎవరికి వారు యంత్రాలైపోయారు. కానీ చంద్రశేఖరం మాత్రం ప్రేమానురాగాలు ఆత్మీయత అనుబంధాలు అన్నీ గుండె నిండా ఆస్వాదిస్తున్నాడు. ఎందుకంటే అక్కడ అతను ప్రతి ఇంటిలోనూ దీపం వెలిగించిన మకరజ్యోతిగా నిలిచాడు. పిల్లా జెల్లా ఆ ఊరే కాదు, పక్క ఊరు వాళ్ళ అభిమానాన్ని కూడా పొందిన చంద్రశేఖరానికి ఏ లోటూ లేదు. కాని కాలం కదా! అయినా ఇప్పటికీ లోటు లేదు.ప్రతి ఒక్కరూ.. నమస్కారం బాబయ్యా.. పెద్దయ్యా దండాలు.. గుడ్‌మార్నింగ్ తాతయ్యా.. పెదనాన్నా ఊరెళుతున్నాం శెలవులకు వస్తాం! నాకు తాశిల్దారుగా ప్రమోషన్ వచ్చింది. వీసా కన్ ఫర్మ్ అయ్యింది తాతయ్యా!ఆ ఊరి వాళ్ళకే కాదు, పక్క ఊరి వాళ్ళకూ ఆదర్శనీయుడే! ఎందుకంటే నేలపట్టుకు వసతులు ఏర్పడటంతో పక్క దీవులు కూడా చైతన్యవంతమయ్యాయి. అందుకే అందరకీ పూజ్యనీయుడు! ప్రతి ఏడాది వచ్చే విదేశీ పక్షులు, వలస పక్షులు రావటం ఆగలేదు. నాలుగైదు నెలలు కాపురం చేయటమూ ఆగలేదు. ఆ ఊర్లో ఏం జరిగినా.. ఎవరు వెళ్ళినా, వచ్చినా చంద్రశేఖరానికి నమస్కరించాల్సిందే. చివరకు పక్షులు కూడా ఆ ఊరిలో బాగమే. పక్షులు తిరిగి వెళుతూ గ్రామం చుట్టూ చక్కర్లు కొట్టి వెళుతుంటాయి. ఆ ఊరి ప్రజలూ అంతే. ఊరి వారంతా చంద్రశేఖరానికి చెప్పి వెళ్లాల్సిందే. దండాలు పెట్టి వెళ్ళాల్సిందే. ఆ ఊరుకి ఏర్పడిన సంస్కారం అది. అదే ఆ ఊరి సంప్రదాయంగా మారిపోయింది. కాని ఒక్కటే లోటు. అవన్నీ కూడా గ్రామం నడిబొట్టున నిర్మించిన చంద్రశేఖరం విగ్రహానికి. ఎందుకంటే కాలం గొప్పది కదా! – ఈత కోట సుబ్బారావు -
నవరత్నాల నవశకానికి ఐదేళ్లు
-
మిమిక్రీ చేసే పక్షులు!
అండమాన్ దీవుల్లో నేను, నా భర్త రోమ్ ఒక రోజు తెల్లవారుజామున రెండు పిల్లులు అరుస్తూ కొట్టుకుంటున్నట్టు వినిపించిన శబ్దాలకు నిద్ర లేచాము. నిద్ర కళ్ళతో బాల్కనీకి వెళ్లి అడవిలో ఆ శబ్దాలు వస్తున్న వైపు చూసాము. ఆశ్చర్యంగా ఆ రెండు శబ్దాలు చేస్తున్నది పొడుగు తోకల ఏట్రింత (రాకెట్ టైల్డ్ డ్రోంగో) అనే పక్షి అని తెలుసుకుని ఆశ్చర్యపోయాము. ఒకసారి సముద్రపు గ్రద్ద వలె, మరోసారి దర్జీ పిట్టలా, మధ్యలో లారీ హార్న్ శబ్దాలను నమ్మశక్యం కానీ రీతిలో అనుకరిస్తున్న ఆ పక్షి అనుకరణలు గమనించాము. ఒక పక్షికి ఇంత అద్భుతమైన అనుకరణ (మిమిక్రీ) చేయవలసిన అవసరం ఏముంది?ఏట్రింతలు ఇతర జాతుల పక్షులతో కలిసి వేటాడుతూ ఉంటాయి. ఇతర పక్షుల జాతులతో కలిసి ఒక జట్టుగా ఏర్పడుట కోసమే ఇవి వాటి అరుపులను అనుకరిస్తాయని శ్రీలంక పక్షి శాస్త్రవేత్తలు భావిస్తారు. ఈ అనుకరణ యాదృచ్చికమో లేక కావాలని చేసే అనుకరణో కచ్చితంగా చెప్పడం కష్టం.ఇతర పక్షులు తమ ఆహారాన్ని తినే సమయంలో ఏట్రింతలు ఘాతుక పక్షుల ముప్పు లేకుండా కాపలా కాస్తుంటాయి . ఏదైనా ఘాతుక పక్షి దగ్గరగా వచ్చినట్లైతే ఆ ఘాతుక పక్షిపై మూకుమ్ముడిగా దాడి చేయడానికి ఇతర పక్షుల హెచ్చరిక అరుపులను అనుకరిస్తూ వాటిని ప్రోత్సాహిస్తాయిని భావిస్తారు.కొద్దిసేపటి క్రితం మేము ఒక జాలె డేగ, వంగ పండు పక్షిపిల్లని పట్టుకుని తింటూండటం చూసాము. దాని సమీపంలోనే నల్ల ఏట్రింత, జాలె డేగ అరుపులను అనుకరించినా, ఆ డేగ పట్టించుకోలేదు. దీనినినిబట్టి ఏట్రింతలు ప్రతీసారి మూకుమ్మడి దాడి కోసమే అనుకరిస్తాయని భావించలేము. కొన్ని సందర్భాలలో పక్షులు తమ చుట్టుపక్కల విన్న శబ్దాలను అనుకరించవచ్చు, ముఖ్యంగా అవి ఒత్తిడికి గురైనప్పుడు లేక మొదటి సారి ఆ శబ్దం విన్నప్పుడు ఆ విధంగా అనుకరించవచ్చు.చిలుకలు మరియు మైనా జాతి పక్షులు మనుషులను అనుకరించగలవు. ఇలా అనుకరించడం కోసం వాటికి చిన్నప్పటినుంచే తర్ఫీదు ఇస్తారు. అవి మనుషుల మాటలను సరిగ్గా అనుకరించగానే వాటికి ఆహారాన్ని బహుమానంగా ఇస్తూ ఈ విధంగా నేర్పిస్తుంటారు. చిలుకలు వాక్క్యూమ్ క్లీనర్ చేసే శబ్దాన్ని, టెలిఫోన్ రింగు, కుక్క అరుపులను కూడా అనుకరించగలవు. ఐన్స్టీన్అనే పేరుతో ప్రసిద్ధి చెందిన ఆఫ్రికా దేశపు చిలుక, అమెరికాలోని నాక్స్విల్లె జూలోని తోడేళ్లు , చింపాంజీలు, కోళ్లు, పులులు మరియు ఇతర జంతువుల అరుపులను అనుకరించేది. ఈ అనుకరణ విద్య అవి సహజసిద్ధంగా బ్రతికే అడవుల్లో జీవించేందుకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆలోచించవలసిన విషయము. అడవిలో సమూహంగా జీవించే చిలుకలు సామూహిక బంధాన్ని బలపర్చుకోవడానికి ఒకటినొకటి అనుకరించుకుంటూ ఉంటాయని ఆస్ట్రేలియాలోని డీకిన్ విశ్వవిద్యాలయలోని లారా కెల్లీ అన్నారు. అవే చిలుకలు పంజరంలో బంధించినట్లైతే వాటి సమీపంలోని మనుషులను అనుకరిస్తాయి. ప్రపంచంలో ఈ అనుకరణ విద్యలో ఆస్ట్రేలియాకి చెందిన "లైర్ బర్డ్" చాలా ప్రముఖమైన పక్షి . యూట్యూబ్‌లో ఒక వీడియోలో ఈ పక్షి, కార్ రివర్స్ చేసే శబ్దాన్ని, కెమెరా క్లిక్ శబ్దాన్ని, చైన్ సా , చెట్లు పడిపోయే శబ్దాన్ని, తుపాకి, వాద్య పరికరాలు, ఫైర్ అలారం, పసి పాపాల ఏడుపు, రైళ్లు, మనుషులు, ఈ విధంగా అనేక రకాలైన శబ్దాలను అనుకరించడం చూడవచ్చు. మగ పక్షులు ఆడ పక్షులను ఆకర్షించడానికి ఎంతో కష్టపడి అనేక రకాల శబ్దాలను అనుకరిస్తూంటాయి కనుక ఆడ పక్షులు ఏ మగ పక్షైతే ఎక్కువ శబ్దాలను అనుకరిస్తుందో దాన్ని భాగస్వామిగా ఎంచుకోవచ్చు అని కొందరు భావిస్తూంటారు. కానీ ఐరోపా జీవశాస్త్రవేత్తలు ఈ సిద్ధాంతాన్ని నిరూపించానికి ఎటువంటి ఆధారం దొరకలేదు అంటున్నారు. మరొక శూన్యవాద సిద్ధాంతం ప్రకారం ఈ అనుకరణ వలన ఎటువంటి ఉపయోగం ఉండదు, అది కేవలం సాధన మాత్రమే అని భావిస్తుంటారు. ఆఫ్రికాలోని కలహారి ఎడారిలో కనిపించే ఏట్రింతలు ఈ అనుకరణ విద్యని ఉపయోగించి తెలివిగా ఆహారాన్ని సంపాదించుకుంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పక్షులు తమ పరిసరాల్లోని ఇతర పక్షులు లేక జంతువులు ఆహారాన్ని తీసుకుంటున్నప్పుడు, ఘాతుక పక్షులు లేక వాటిపై దాడి చేసే ఇతర జంతువులు అరుపులను అనుకరిస్తాయి. ఆ శబ్దాలను విన్న ఆ జంతువులు లేక పక్షులు భయంతో ఆహారాన్ని వదిలి వెళ్ళగానే ఏట్రింతలు ఆ ఆహారాన్ని దొంగిలిస్తాయి. ఇప్పటి వరకు “పక్షుల అనుకరణ” వలన అవి పొందే ప్రయోజనాలలో ఇది ఒక్కటే నిరూపితమైనది.ఈ అండమాన్ దీవుల్లో మేము చూసిన ఏట్రింత కూడా ఇదే విధంగా ఆహారంగా కోసం అనుకరిస్తుందా? ఇది తెలియాలంటే కొంత సమయం మరియు పరిశీలన అవసరం. ఈ అనుకరణ విద్యను ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లోని పక్షులు ప్రదర్శిస్తాయి కనుక ఈ చర్యని వివరించడానికి ఓకే వివరణ అన్నింటికీ వర్తింపచేయలేమని కెల్లీ అభిప్రాయపడతారు.ఈ ఆలోచనల మధ్యలో, డిష్ వాషర్లు, అంబులెన్సు శబ్దాలను కూడా అనుకరించే వాటి సామర్ధ్యానికి, ప్రకృతినే ఒక సంగీత వర్ణమాలగా ఉపయోగించే అద్భుతమైన నైపూణ్యానికి నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. రచయిత - జానకి లెనిన్ ఫోటో క్రెడిట్: సుభద్రాదేవితెలుగులో ప్రకృతి గురించి రాయాలనుకునే వారు ఈ ఫారమ్‌ను నింపండి- bit.ly/naturewritersపుడమి సాక్షిగా అనే కార్యక్రమం సాక్షి మీడియా గ్రూప్ చేపట్టిన పర్యావరణ హిత క్యాంపెయిన్. దీని గురించి మరింత 'సమాచారం తెలుసుకోవడానికి విజిట్ చేయండి. www.pudamisakshiga.com -
Rave Party: ఓరి దేవుడా! రేవ్ పార్టీలు ఇన్ని రకాలా..!
రేవ్ పార్టీ అంటే సంగీతం, నృత్యం, పార్టీలు, ఆనందం ఇవన్నీ లైసెన్స్ పొందిన నైట్‌క్లబ్‌లలో సాగే వ్యవహారం. కానీ రాను రాను డీజేలు, లేజర్ లైట్లు, లైవ్ పాప్ అండ్ ర్యాప్,ఎలక్ట్రానిక్ సంగీత కారుల హోరు, అర్థనగ్న నృత్యాలు, బాడీ పెయింటింగ్స్, విజువల్ ఎఫెక్ట్స్ మద్యం, మాదక ద్రవ్యాల వినియోగం, లైంగిక కార్యకలాపాలు, అమ్మాయిలపై వేధింపులు, ఒక్కోసారి అత్యాచారాలకు నిలయంగా రేవ్ పార్టీలు మారిపోయాయి. కాలానుగుణంగా ఈవెంట్ ప్రమోటర్లు తమ వ్యూహాలను మార్చుకుంటూ రావడం గమనార్హం.సాధారణంగా ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ (EDM), టెక్నో మ్యూజిక్ ,ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ఇలా అనేక రకాల మ్యూజిక్స్‌తో హోరెత్తించే భారీ ఆల్-నైట్ డ్యాన్స్ పార్టీలు. మిరుమిట్లు గొలిపే లైట్ షోలు, విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్ మిళితంగా సాధారణంగా నివాస ప్రాంతాలకు దూరంగానో, లైసెన్స్ ఉన్న క్లబ్స్‌లో జరుగుతాయి. రేవ్ పార్టీలు విభిన్న రకాలుగా ఉంటాయి. వాటి వివరాలు చూద్దాం.రేవ్ పార్టీలు, రకాలుఫెస్టివల్ రేవ్స్: ఫెస్టివల్ రేవ్‌లు చాలా రోజుల పాటు జరిగే భారీ స్థాయిలో జరిగే ఈవెంట్లు. ఇందులో టెక్నో, హౌస్ ,డ్రమ్, బాస్ వంటి అనేక రకాల ఎలక్ట్రానిక్ మ్యూజిక్ స్టయిల్స్ ఉంటాయి.అండర్‌గ్రౌండ్ రేవ్‌లు: అండర్‌గ్రౌండ్ రేవ్‌లు సాధారణంగా గిడ్డంగులు, పాడుబడిన భవనాలుచ అండర్ గ్రౌండ్ క్లబ్‌లలో నిర్వహిస్తారు. క్లబ్ రేవ్స్: క్లబ్ రేవ్‌లు సాంప్రదాయ నైట్‌క్లబ్ వేదికలలుగా ఏర్పాటు చేస్తారు. టెక్నో, హౌస్ , ట్రాన్స్ వంటి ఎలక్ట్రానిక్ సంగీత కళా ప్రక్రియల మిశ్రమాన్ని కలిగి ఉంటాయి. ఈ పార్టీలు ఎక్కువగా కమర్షియల్‌గానే జరుగుతాయిథీమ్ బేస్డ్ రేవ్‌లు: హాలిడే లేదా నిర్దిష్ట సంగీత శైలి వంటి నిర్దిష్ట థీమ్ చుట్టూ కేంద్రీకృతమై ఉండే పార్టీలను థీమ్డ్ రేవ్‌లు అంటారు. ఈ పార్టీల్లో ధరించే దుస్తులు, డెకరేషన్, యాక్టవిటీస్ అన్నీ థీమ్‌కు అనుగుణంగా ఉంటాయి.డే రేవ్స్: డే రేవ్‌లు అనేది పగటిపూట జరిగేవి. వివిధ రకాల ఎలక్ట్రానిక్ సంగీతంతో ఆరు బయట జరుగుతాయి.సైలెంట్ డిస్కో: పేరుకు తగ్గట్టుగానే ఇవి చుట్టుపక్కలవారికి ఎలాంటి అంతరాయంగా లేకుండా సెలెంట్‌గా ఉంటాయి. ఈ పార్టీలో సంగీతాన్ని వినడానికి హాజరైనవారు సైలెంట్ డిస్కోల సంప్రదాయ స్పీకర్లకు బదులుగా వైర్లెస్ హెడ్ఫోన్లను ధరిస్తారు.సైట్రాన్స్ రేవ్స్: సైట్రాన్స్ రేవ్‌లు సైకెడెలిక్ ట్రాన్స్ సంగీతంపై దృష్టి సారించే పార్టీలు. డ్యాన్స్, కాస్ట్యూమ్స్ విజువల్స్ తోపాటు తమదైన సొంత సబ్‌కల్చర్ మ్యూజిక్ ఉంటుంది. హార్డ్స్టైల్ రేవ్‌లు: హార్డ్స్టైల్ రేవ్‌లు హార్డ్స్టైల్ సంగీతాన్ని కలిగి ఉండే పార్టీలు. హార్డ్ టెక్నో, హార్డ్‌కోర్, ఫాస్ట్ టెంపో మ్యూజిక్‌తో హై ఎనర్జీతో ఉంటాయి. ఇలా ఒక్కో రేవ్ పార్టీకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. -
Mothers day 2024 అమ్మలూ మీరూ, మీ ఆరోగ్యం జాగ్తత్త!
కుటుంబం, పిల్లలు, భర్త అంటూ చాలామంది మహిళలు తమ శారీరక ఆరోగ్యాన్నిఅస్సలు పట్టించుకోరు. భర్త పిల్లలకు పెట్టి, మిగిలింది తిని కడుపునింపుకునే శ్రామిక మహిళలు చాలా మందే ఉన్నారు. భారతీయ మహిళలు, యువతులు పోహకాహారం లోపంతో బాధపడు తున్నారు. రోజంతా ఉత్సాహంగా ఉండాలన్నా, కుటుంబానికి సేవ చేయాలన్నా శరీరానికి సమతులాహారం అందాలంటారు పోషకాహార నిపుణులు.క్రమం తప్పని వ్యాయామంఇంటి పనిచేస్తున్నాంకదా అని శారీరక వ్యాయామాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. వ్యాయామం చేయడం శారీరక బలాన్ని కాదు, మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది. అలాగే పనిలోపని బ్రేక్ ఫాస్ట్‌ను అస్సలు పట్టించుకోరు.ఆహారం పట్ల నిర్లక్ష్యంఉదయం లేచింది మొదలు.. పడుకునేదాకా, ఏం టిఫిన్ చేయాలి. ఏం కూరలు ఉండాలి. ఎలాంటివెరైటీ ఫుడ్‌ను అందించాలి అంటూ తపన పడే చాలామంది అమ్మలు తమ అలవాట్లను, అభిరుచులను మర్చిపోతారు. పనిలో పడి అస్సలు దేన్నీ పట్టించుకోరు. కానీ ఉదయం అల్పాహారం చాలా ముఖ్యం. కార్బ్స్ ఎక్కువ కాకుండా, ఫైబర్ ఎక్కువ ఉండేలా జాగ్రత్త పడండి. తద్వారా ప్రసవం తరువాత లావు కాకుండా ఉంటారు. అందుకే కేలరీలు అందేలా చూసుకోవాలి. నూనెలేని ఇడ్లీ, దోశలు, మిల్లెట్స్‌తో చేసిన వాటిని తీసుకోండి. లేదంటే ఉడకబెట్టిన గుడ్లు, పాలు, మొలకెత్తిన గింజలు, నట్స్, వెజిటబుల్ సలాడ్ కొద్దిగా నిమ్మరసం వేసుకొని తినండి.కింగ్ లాంటి లంచ్కింగ్ లాంటి భర్తే కాదు, అంతకంటే కింగ్ లాంటి లంచ్ అవసరం. మధ్యాహ్నంహ భోజనం ఆరోగ్యంగా ఉండేటట్టు చూసుకోవాలి. అన్నం లేదా చపాతీతోపాటు ఆకుకూరలు, కాయగూరలు, బఠాణీలూ, బీన్స్, పుట్టగొడుగులూ, పప్పు ధాన్యాలూ గుడ్లూ, చేపలూ, చికెన్ ఇలా మీకిష్టమైనదాన్ని ఎంచుకోండి. అలాగే రోజూ ఒకేలా రొటీన్‌లా కాకుండా, మంచి పోషకాలుండేలా చూసుకోండి. స్నాక్స్రోజంతా పనిచేసిన తరువాత సాయంత్రం ఏదైనా తినాలనిపిస్తుంది. మరోవైపు పిల్లలు స్కూలునుంచి ఇంటికి వచ్చే సమయం. మరి వారి అల్లరిని భరించాలన్నా, ఓపిగ్గా వారిని లాలించాలన్నా శక్తి తప్పదు. అందుకే మొక్కజొన్నతో చేసినవి, పండ్ల ముక్కలూ, చిరుధాన్యాల పిండితో చేసిన మురుకులూ, పల్లీ పట్టీ, నువ్వులు బెల్లం ఉండలు ఇలాంటి.. అప్పుడపుడూ పకోడీ, మిరపకాయ బజ్జీలాంటివి తినేయొచ్చు.చివరిగాఏదైనా అనారోగ్యం అనిపించినా.. అదే తగ్గిపోతుందిలే అని ఊరుకోవద్దు. వెంటనే వైద్యులను సంప్రదించడం, సరైన చికిత్స తీసుకోవడం చాలా మంచిది. ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మానసికంగా ఒంటరిగా అనిపించినా, ఏమాత్రం సంకోచించ కుండా కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా భర్తతో పంచుకోండి. తగిన పరిష్కారాన్ని వెదుక్కోండి. అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా, ఆత్మవిశ్వాసంగా ఉండండి! దీంతో మీ పిల్లలు, మీ కుటుంబం మొత్తం ఆరోగ్యం ఆనందంగా ఉండటమే కాదు, సమాజం, దేశం కళకళలాడుతూ ఉంటుంది.మహిళలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు! -
చిత్తం, చింత, చింతన
చిత్త వ్యాపారాలే చింత, చింతన. మనస్సు చేత ప్రేరేపితమైన ఇంద్రియ వ్యాపారాలను భద్రపరచేది చిత్తం. విషయాలను, అనుభవాలను, భావోద్వేగాలు మొదలైనవాటిని జ్ఞాపకాల రూపంలో భద్రపరచి దాచి ఉంచేది చిత్తం. దానిలో ప్రతి మనోవ్యాపారం ముద్రితమై ఉంటుంది. ఒకోసారి మర్చిపోయాం అనుకొన్నవి కూడా సందర్భానుసారం బయట పడుతూ ఉంటాయి. అందుకే ఏదైనా మరచిపోతే కళ్ళు మూసుకుని ఆలోచిస్తాం. అప్పుడు జ్ఞాపకాల గది తలుపు తెరుచుకుంటుంది. చింతన అంటే నిరంతరం ఒక విషయాన్ని గురించి తలచుకుంటూ, మననం చేయటం. ఇది కూడా చిత్తం చేసే పనే అయినా చింతకి చింతనకి మధ్య ఎంతో తేడా ఉంది. నక్కకి నాకలోకానికి ఉన్నంత. లౌకిక స్థాయిలోచింతన మనిషి మేథకి మెఱుగులు పెడుతుంది. ఆలోచనలకి పదును పెడుతుంది. ఒక విషయాన్ని గురించి కూలంకషంగా విశ్లేషించి తగిన నిర్ణయం తీసుకోవటానికి తోడ్పడుతుంది. ఇది వ్యక్తిగతంగా తన సమస్యలని పరిష్కరించుకోవటానికి ఎంతో అవసరం. చింత అంటే జరిగి పోయిన లేదా జరగబోయే విషయాలను తలుచుకుంటూ బాధపడుతూ వేదన చెందుతూ ఉండటం. పైకి వ్యక్తం చేయక పోయినా మనసు లోపల నిరంతరం అదే విషయం మెదులుతూ సంతోషమన్నది లేకుండా చేస్తుంది. కొంతమంది ముఖాలు చూస్తూనే చెప్పవచ్చు వాళ్ళు ఏదో విషయంలో చాలా బాధ పడుతున్నారు అని. సాధారణంగా ఆ విషయానికి పరిష్కారం వాళ్ళకి తెలియక పోవటమో, తెలిసినా చేయగలిగే పరిస్థితిలో లేక΄పోవటమో దానికి కారణం అయి ఉంటుంది. ఆ అనిశ్చితి, అసమర్థత నిరంతరం మనసులో తిరుగుతూ వేదనని కలిగించి కుంగదీస్తాయి. పరిష్కారం దొరికితే కొంత ఉపశమనం కలుగుతుంది. దానిని అమలు చేయగల శక్తి ఉంటే ధైర్యం కలుగుతుంది. వేదన కొంత ఉపశమిస్తుంది. ఇక్కడ అర్థమయ్యే విషయం ఏమంటే ఒక విషయం గురించి తీవ్రంగా ఆలోచించ గల శక్తి మనిషి మనస్సుకి ఉంది అని. దానిని ఉపయోగపడని వాటికి వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవచ్చు. అప్పుడు అది చింతన అవుతుంది. చింతన మనిషిని తాత్త్వికుడిగా పరిణమింప చేస్తుంది. వ్యక్తిగతమైన సమస్యలు, వాటి పరిష్కారాలు అనే స్థాయి దాటి ఏదైనా ఒక అంశం గాని, సిద్ధాంతం గాని, మరేదైనా గాని – దానిని గురించి లోతుగా, అన్ని కోణాలలోనూ, పరిశీలించి, అధ్యయనం చేసి, మూల తత్త్వాన్ని తెలుసుకునేందుకు సహకరిస్తుంది. ఆధ్యాత్మికత, మతం, రాజనీతి, సాంఘిక సామాజిక పరిస్థితులు, కమ్యూనిజం వంటి ఆధునిక సిద్ధాంతాలు – ఒకటేమిటి ఏవైనా కావచ్చు, వాటి మౌలికతత్త్వం తెలుసుకోవటానికి వాటి గురించిన చింతన ఒకటే మార్గం. ఆ విషయానికి సంబంధించిన అంశాలనే నిరంతరం తలుచుకుంటూ, మననం చేస్తూ ఉంటే, పైకి కనపడే అంశానికి మూలమైన సూత్రం, అసలు లక్షణం, సరిగా చెప్పాలంటే బీజం స్ఫురిస్తుంది. దానితో విరాడ్రూపం మనోనేత్రం ముందు కదలాడుతుంది. లోతుపాతులు, మంచిచెడులు, విస్తరణ, పరిమితులు మొదలైన వన్ని చాలావరకు అర్థం అవుతాయి. ఇతరులు గుర్తించ లేని రహస్యాలు స్ఫురిస్తాయి. శాస్త్రవేత్తలని దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఎంతోమంది శాస్త్రవేత్తలు తాము చేసే పరిశోధనల గురించి నిరంతరం ఆలోచిస్తూనే ఉంటారు నిత్యకృత్యాలు నిర్వహిస్తూ కూడా. కొన్నిమార్లు వారికి నిద్రలో కలల రూపంలోనో, పరిసరాల్లో జరుగుతున్న సంఘటనల రూపంలోనో, ఆహారం తీసుకుంటున్నప్పుడో హఠాత్తుగా చేయవలసినది కానీ, పరిష్కారం గాని స్ఫురిస్తుంది. ఆర్కిమిడీస్ దానికి పెద్ద ఉదాహరణ. అతడికి తొట్టెలో స్నానం చేస్తుండగా నీళ్ళలో మునిగినప్పుడు పదార్థం బరువు తగ్గటానికి కారణం స్ఫురించింది. దానికి అతడు దాని గురించి చింతన చేస్తూ ఉండటమే కారణం. మనిషి దేనిని చింతన చేస్తే దానిగా మారిపోతాడు అన్నది ఆధునిక మనస్తత్వశాస్త్ర పరిశోధకులు నిర్ధారించి చెప్పిన మాట. సాధకుడు ఏమి పొందాలని అనుకుంటున్నాడో దానిని సిద్ధింపచేసేది చింతన అని ఆధ్యాత్మికవేత్తలు చెప్పేమాట. – డా. ఎన్. అనంతలక్ష్మి -
చిన్నమ్మ!! ‘ఏరా ఎప్పుడూ ఆ దస్తాలేనా, పుస్తకాలు తియ్యవా’?
పాత ముతక చీర కట్టిన పండు ముసలమ్మలా ఉందా పాక. అటూ ఇటూ నల్లరంగేసిన రెండరుగులు, మధ్యలో గడప. ఓ అరుగు మీద కూర్చున్న ఆడవాళ్ళు ఆల్చిప్పతో కలెక్టరుకాయలు తొక్కతీసి, మాగాయ, తొక్కుపచ్చడికి సిద్ధం చేస్తున్నారు. రెండో అరుగు మీద చంటి ఒక్కడే పేకాడుకుంటున్నాడు.‘ఏరా ఎప్పుడూ ఆ దస్తాలేనా, పుస్తకాలు తియ్యవా’ అడిగిందొకావిడ ఓ పండుముక్క నోట్లో వేసుకుంటూ. ఓ సారి అటువైపు చూసి మళ్ళీ ఆటలో పడిపోయాడు చంటి. ‘పాచి పళ్ళు, తలంతా ఈళ్ళు, పుల్లల్లాంటి కాళ్ళు, ఎక్కడో బంగారు పూల పూజ చేస్తోంది వీడి గురించి’ సాగదీస్తూ వెక్కిరించింది మరొకావిడ. అంతలో ఎదురింటి ముందు సామాన్లతో వేన్ ఆగింది. తండ్రి వేను దిగి చేతులు అందించాడు. అతని చేతుల్ని పక్కకి నెట్టి, చెంగుమని దూకింది చిన్న. ‘జాగ్రత్తే చిన్నా’ అంటోంది వెనక రిక్షాలో వచ్చిన తల్లి. ఆ చప్పుడుకి చేతిలో పేక మూసి పాకలోంచి పైకి చూశాడు చంటి. కృష్ణుడి రంగు, ముందుకేసుకున్న రెండు జడలు, కోడి కత్తిలాంటి చిన్న ముక్కు, ముఖ్యంగా ఆ కళ్ళు, ఒక్క క్షణం ఓ చోట నిలవకుండా చుట్టూ పరిశీలిస్తూ గుండ్రంగా తిప్పుతూ, చంటి మీద ఓ రెండు సెకన్లు ఎక్కువసేపు నిలిపి, కళ్ళతోనే ఓ నవ్వు చిలికి, మిగిలినవాళ్ళు సామాన్లు సర్దుతూ ఉండగానే వీధి మొత్తం ఓ రౌండ్ కొట్టి వచ్చింది చిన్న.‘ఏవండీ,’ అంటూ వాకిట్లోకి వచ్చింది సరస్వతి. ‘రండి, కూర్చోండి’ అంటూ పేడలో ఎండుగడ్డి కలిపి బెందడి గోడకి పిడకలు వేస్తున్న పనాపి, చెయ్యి కడుక్కుని, పక్కనే ఉన్న చెక్క స్టూల్ లాగింది లక్ష్మి కూర్చోమని. ‘నమస్తే. నిన్ననే మీ ఎదురింట్లో దిగాము. పాలు వాడకం పెట్టుకుందామని’ అంది సరస్వతి కూర్చుని ఆ పాకంతా పరికిస్తూ. ‘అలాగే, వీధంతా మా చుట్టాలే. నేనే పోస్తాను పాలు. మీరు నలుగురులా ఉంది. సేరు పాలు సరిపోతాయేమో. పూటకి తవ్విడు చొప్పున పొయ్యమంటారా లేక సేరూ ఒకేపూట కావాలా?’‘ఉదయాన్నే సేరు పోసేయ్యండి. రేటు ఎక్కువైనా పరవాలేదు, పొదుగు దగ్గర పాలు కావాలి, మేము రావాలా?’ అడిగింది సరస్వతి ముక్కుకి చీర చెంగు అడ్డుపెట్టుకుంటూ. ‘ఈ వీధిలో అందరూ మా చుట్టాలే. అందుకని కాదు కానీ, మీరు అడిగినా నీళ్ళు కలపం. మా పాలతో బొట్టు పెట్టుకోవచ్చు. ఓ వారం చూస్తే మీకే తెలుస్తుంది. పాలు మా చంటి తెస్తాడు. గిన్నె వెంటనే ఇచ్చెయ్యాలి. ఉండండి కొంచెం కాఫీ పెడతాను’ అంది లక్ష్మి ఆప్యాయంగా. ‘వద్దండీ, అలవాటు లేదు’ అంది సరస్వతి వాకిట్లో ఉన్న జాంచెట్టుని చూస్తూ. ‘అన్నయ్యగారు ఏం చేస్తారు. పిల్లలు చదువుతున్నారా?’ అడిగింది లక్ష్మి అప్పుడే లోపలికొచ్చిన చంటిని జాంకాయలు కొయ్యమని సైగ చేస్తూ. ‘ఆయన ట్రెజరీలో చేస్తారు. అబ్బాయి పాలిటెక్నిక్ చదువుతున్నాడు. పిల్ల ఎయిత్’ అని, ‘అన్నయ్యగారు ఊళ్ళో లేరా?’ అడిగింది సరస్వతి చుట్టూ పరికిస్తూ.‘లేరు, వీడి ఆరో ఏటే పోయారు. అప్పటినించి నాలుగు గేదెల్ని సాకుతూ పాలవ్యాపారం చేసుకుంటూ వాణ్ణి పెంచుతున్నా. మా అమ్మ వాళ్ళదీ ఇదే వీధి చివరిల్లు’ అంది లక్ష్మి చంటి కోసిచ్చిన కాయల్లో ఓ నాలుగు దోరకాయల్ని సరస్వతి చేతిలో పెడుతూ. అవి మొహమాటంగా అందుకుని, ‘సరే వస్తానండి, పాలు రేపటినించి పొయ్యండి’ అని వెళ్ళిపోయింది సరస్వతి.గొళ్ళెంతో తలుపు మీద మెత్తగా కొట్టాడు చంటి. చటుక్కున తలుపు తీసి అతని వేళ్ళు తగిలేలా పాల గిన్నె అందుకుంటూ నవ్వి కన్ను గీటింది చిన్న. కంగారుగా అటూ ఇటూ చూసి, గిన్నె ఖాళీ చేసి ఇచ్చేవరకూ ఆగకుండా ఇంటికి పరిగెత్తాడు చంటి. ‘గిన్నేదిరా’ అడిగింది లక్ష్మి. ‘తర్వాత ఇస్తామన్నారమ్మా’ అనేసి అరుగు మీద కూర్చుని పేక ముక్కలు పేర్చుకోవటం మొదలు పెట్టాడు. కాసేపట్లో ఖాళీ గిన్నెతో వచ్చింది చిన్న. అటూ ఇటూ చూసి ఓ చీటీ చంటి మీదకి విసిరి లోపలికి వెళ్ళింది. ‘పాలు’ అన్నాడు చంటి బెరుగ్గా. ‘తెలుసు’ అందామె కొంటెగా. ‘అమ్మ గిన్నె తెమ్మంది’. ‘తినెయ్యంలే నీ గిన్నె. లోపలికి రావొచ్చుగా!’ చంటి భయంగా అటూ ఇటూ చూసి, ‘మీ అన్నయ్య లేడా?’ అడిగాడు. ‘ఉంటే నిన్నేమీ కట్టెయ్యడులే!’ ‘ఆంటీ?’ అడిగాడు సిగ్గుపడుతూ.‘అమ్మ పెరట్లో ఉంది’ అంది అదే సొట్ట బుగ్గల నవ్వుతో. వెళ్లి రేక్కుర్చీలో ముందుకు కూర్చున్నాడు భయంగా. ‘మొహమంతా మొటిమలు, చింపిరి జుట్టు, వాడు నీకెలా నచ్చాడే’ అంటోంది మా ఫ్రెండ్ ఇందిర’ అంది వస్తున్న నవ్వు ఆపుకుంటూ.‘నేనేం నీ వెంట పడలేదు. నచ్చకపోతే మానెయ్’అన్నాడు ఉక్రోషంగా. ‘సరదాగా తను అన్నది చెప్పాను తప్ప నేననలేదు కదా, నాకు నీ కళ్ళంటే ఇష్టమని చెప్పాను’ అంది అతని కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ. ‘కళ్ళు నచ్చటమేంటి?’ అడిగాడు చంటి ఉత్సాహంగా. ‘నువ్వు చిన్నపిల్లాడివి నీకు తెలీదులే. అది సరే, టె¯Œ ్త ఎగ్జామ్స్ దగ్గరకొస్తున్నాయి. కాసేపు ఆ పేకముక్కలు పక్కన పెట్టి చదువుకోవచ్చుగా. కావాలంటే నేనూ వస్తా కంబైండ్ స్టడీస్‌కి’ అంది.‘అక్కర్లేదు. నువ్వు మాత్రం ఏం చదువుతున్నావు? ఎంతసేపూ వీధంతా తిరుగుతావు అందరిళ్ళకీ!’ ‘బాబి వాళ్ళ ఇంటికి వెళ్ళాననే కదా నీ కోపం. ఫిజిక్స్‌లో ఏదో డౌట్ ఉంటే అన్నయ్య తీసుకెళ్ళాడు.’‘నాకెందుకు కోపం. వాడు మంచోడు కాదు, సిగరెట్లు కాలుస్తాడు. అవునూ, ఫిజిక్స్ అంటే జీవశాస్త్రమేనా?’ అడిగాడు అనుమానంగా. ‘ఆహా మరి పేకాడే వాళ్ళు మంచోళ్ళా?’ అని, ‘మా అన్నయ్యకి చెప్పి ఈసారి డౌట్లు నిన్నే అడుగుతాలే తెలుగు మీడియం అబ్బాయి’ అంది అల్లరిగా నవ్వుతూ. ‘చిత్రలహరికి వాణ్ణి లోపల కుర్చీ వేసి కూర్చోబెడతారు. నేనేమో బయట కిటికీ ఊసలు పట్టుకుని వేళ్ళాడుతూ చూడాలి’ అన్నాడు చంటి ఉక్రోషంగా. ‘బావుంది అతను మా అన్నయ్య ఫ్రెండ్. నిన్ను రమ్మంటే రావు దానికి నేనేం చేయను’ అంది జాలిగా. ‘బాబి వాళ్ళింట్లో ఉసిరి చెట్టున్నట్టుంది, కాయలు కోసావా’ అడిగాడు మాట మారుస్తూ ఊరేసిన ఉసిరికాయలు ఇస్తుందేమో అని ఆశగా. ‘నాకు ఉసిరికాయలు నచ్చవు. జాంకాయలంటేనే ఇష్టం’ అంది కొంటెగా. అందులో శ్లేష అతనికి అర్థంకాలేదని తెలిసి కాస్త కోపంగా ‘రేప్పొద్దున్న పెళ్ళయ్యాక పేక ముక్కలు ముట్టుకున్నావో చేతులు విరక్కొడతా?’అంది.‘ష్! మీ అమ్మగారు వింటారు..’‘మన సంగతి మా అమ్మకి ఎప్పుడో చెప్పేశా. ఇంకో విషయం తెలుసా, మొన్న మీ అమ్మగారే అడిగారు నన్ను ‘మా చంటిని చేసుకోవే, ఈ పాడి నువ్వైతేనే బాగా చూసుకుంటావు’ అన్నారు తెలుసా?’ ఆ మాటకి చంటి తెగ సిగ్గుపడిపోయాడు. అతని సిగ్గు చూసి ముద్దేసి అతని రెండు బుగ్గలూ గట్టిగా పట్టుకుని లాగింది చిన్న. ‘అమ్మా..’ అన్నాడు కందిపోయిన బుగ్గల్ని రాసుకుంటూ.‘చిన్నా ఎవరే?’ పెరట్లోంచి సరస్వతి కేకేసింది. ‘పిల్లి.. తరుముతున్నాను’ అంది చిన్నా చంటిని వెళ్ళిపొమ్మని సైగ చేస్తూ.‘అమ్మా బాబిని నేను చేసుకోను. నీకు ఎప్పుడో చెప్పాను చంటిని తప్ప ఎవర్నీ చేసుకోనని, దానికి నువ్వు కూడా ఒప్పుకున్నావు’ అంది చిన్న విసురుగా. అప్పటికి రెండు గంటల్నించి నడుస్తోంది యుద్ధం. అమ్మ, నాన్న, అన్నయ్య ఒక వైపు చిన్న ఒక్కర్తీ ఒకవైపు. ‘ఏంటే నువ్వొప్పుకునేది? అసలు నీకు ఎనిమిదో తరగతినించీ ఈ ప్రేమలేంటి. అప్పుడే ఓ నాలుగు తగిలిస్తే ఇంతవరకూ వచ్చేది కాదు. వాడింకా బి.ఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. పైగా ఆ పేకాట పిచ్చొకటి. ఎప్పుడు సెటిల్ అవుతాడో, ఏ ఉద్యోగం వస్తుందో తెలీదు. బాబికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. మనం తొందరపడాలి’ కోపంగా అన్నాడు ఆమె అన్నయ్య. ఆమె తండ్రి ఎవరు మాట్లాడితే వాళ్ళకేసి చూడ్డం తప్ప ఇంకేం చెయ్యట్లేదు. ‘గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే సరిపోతుందా? నాకు నచ్చక్కర్లేదా? నీ చెల్లిని ప్రేమించాడు కాబట్టి నీకు నచ్చటం లేదు తప్ప, చంటి తెలివైన వాడురా! పదమూడు ముక్కలూ పేర్చకుండా ఆడతాడు, కళ్ళతో ఓసారి చూసి కౌంట్ చెప్పేస్తాడు. వాడికీ మంచి ఉద్యోగమే వస్తుంది. మీరు ఒప్పుకుంటే సరే లేదంటే....’ అంతే విసురుగా సమాధానం చెప్పింది చిన్న.అన్నయ్య కొంచెం తగ్గి, ‘ఏముందే వాళ్ళింట్లో? పేడ కంపు కొట్టే ఆ పాక, నాలుగు గేదెలు, వర్షమొస్తే కారకుండా ఇల్లంతా పేర్చిన సత్తు గిన్నెలు, ఓ రోజు గేదె తంతే నాలుగు రోజులు కూరలేకుండా గడుపుకోవాలి. నా మాట విను’ అన్నాడు. సరస్వతి కల్పించుకుని, ‘దానికి నేను నచ్చచెబుతా లేరా?’ అంటూ చిన్నని గదిలోకి తీసుకెళ్ళింది. ‘చిన్నమ్మా, నీకు తెలుసుకదా నాన్నగారికి ఏం తెలీదు. మనింట్లో నిర్ణయాలన్నీ మగపిల్లాడు, అన్నయ్యే చూసుకుంటాడు. వాడు కూడా ఏం చేసినా నీ మేలు కోరే చేస్తాడు. ఊడ్చిన చేను కంటే ఉడికిన అన్నం నయం కదా. వాడి మాట విను’ అంది సరస్వతి చిన్నని ఓదారుస్తూ. ‘అమ్మా, అయిదేళ్ళ నించి చూస్తున్నావు, నీకు తెలీదా చంటి మంచోడని? ఆ విషయం గ్యారంటీ కార్డు లాంటి వాడి కళ్ళు చూసి చెప్పొచ్చు ఎవరైనా. వాడితో ఉంటే అభయాంజనేయుడు తోడున్నట్టే. ఇక ఉద్యోగం అంటావా, ఉసిరి చెట్టు తొందరగా కాపు కొస్తుంది, జాంచెట్టు కాస్త ఆలస్యమౌతుంది’ అని చిన్నమ్మ ఇంకా చెప్పేలోపు మధ్యలో అడ్డుపడి ‘చంటి మంచోడంటే బాబి చెడ్డోడని కాదు కదమ్మా’ అంది సరస్వతి.‘నిజమేనమ్మా, కానీ ఇక్కడ సమస్య స్వేఛ్చ గురించి. నేనో పిల్లని చూసి అన్నయ్యని చేసుకోమంటే చేసుకుంటాడా. మంచో, చెడ్డో నా జీవితానికి సంబంధించిన నిర్ణయంలో నన్ను కూడా భాగం చెయ్యండి అంటున్నా అంతే’ అని, ‘అమ్మా.. నాకింకా పద్దెనిమిదే కదా. ఒక్క రెండేళ్ళు చూడండి. ఈలోగా నా డిగ్రీ కూడా పూర్తవుతుంది. అప్పటికీ చంటి సెటిల్ కాకపోతే మీ ఇష్టం. ఇప్పుడు మాత్రం మీరు ఎంత చెప్పినా ఏం చేసినా నేను ఈ పెళ్ళి చేసుకోను’ అంది చిన్న ఏడుస్తూ.అదే సమయంలో.. ఎదురింటి పాకలో లక్ష్మి, చంటి దిగులుగా కూర్చున్నారు. నాలుగింటికిలేచి, పాలుపితికి, వీధంతా పొయ్యటం, పేడకళ్ళెత్తడం, పిడకలు చెయ్యటం, మిల్లుకెళ్ళి చిట్టు, తౌడు, సంతకెళ్లి పచ్చగడ్డి, కొనుక్కురావటం, రాత్రిళ్ళు గేదె తప్పిపోతే హరికెన్ లాంతరు, చేపాటి కర్ర.. పట్టుకుని ఇంటి వెనకున్న తమలపాకు తోటంతా వెతికి పట్టుకోవటం, ఇలా అన్ని పనులూ పంచుకునే ఆ తల్లీ, కొడుకులు ఆ క్షణం దుఃఖాన్ని కూడా పంచుకుంటున్నారు.‘ఊరుకోరా.. ఏం చేస్తాం! నువ్వు మంచోడివని నీకూ, నాకూ తెలిస్తే చాలదు. లోకానికి తెలియాలి. ఆ పేక ముక్కలు వదలరా అంటే విన్నావు కావు. మీ నాన్న కూడా ఇలాగే పేకాట పిచ్చితో ఇంటికే వచ్చేవాడు కాడు. ఓ రోజు మీ తాత తిట్టాడని ఉరేసుకున్నాడు. నువ్వు కూడా ఎక్కడ అలాంటి పని చేస్తావో అని భరిస్తున్నాను. అయినా నిన్నని ఏం లాభం. వీధి వీధంతా ఏ అరుగుమీద చూసినా, ఐదేళ్ళ పిల్లాడి నించి ఎనభై ఏళ్ల ముసలాళ్ళ వరకూ, ఆడ మగ తేడా లేకుండా ఇదేం అలవాటో. ఇక్కడినించి పోదాం అంటే సొంతిల్లు, పాడి వదులుకుని ఎక్కడకని పోతాం. ఇప్పుడు చూడు. పాపం వెర్రిది. నువ్వంటే పిచ్చి దానికి. ఇరవై ఏళ్లకి ఉద్యోగం లేదని ఎందుకూ పనికిరావని నిర్ణయించేశారు. చిన్నమ్మ ఎంతో చురుకైనది, నువ్వా నెమ్మది. దాన్ని నీకు కట్టబెడితే నీ బతుకు బావుంటుందని ఆశపడ్డాను’ అంది చంటి తల్లి భారంగా.‘అమ్మా, జీవితంలో మళ్ళీ పేక ముట్టుకోనమ్మా. నువ్వు ఎలాగైనా వాళ్ళకి చెప్పమ్మా. ఒక్క రెండేళ్ళు టైము ఇమ్మనమ్మా. టైపు, షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటున్నా, మంచి ఉద్యోగం సంపాదిస్తాను. నాకు చిన్న కావాలమ్మా’ అతనికి దుఖం ఆగటం లేదు. ‘ఊరుకోరా. రేపు వాళ్ళమ్మగారితో ఓసారి మాట్లాడి చూస్తా. నువ్వు బెంగెట్టుకోకు’ అంది లక్ష్మి చంటిని దగ్గరకి తీసుకుని తల నిమురుతూ! ‘ఆ చెప్పు చిన్నమ్మా’ అతని మాట ముద్దగా వస్తోంది ఫోన్లో. క్లబ్బులా ఉంది పక్కనే అంతా గోలగోలగా ఉంది.‘చిన్నాడికి వొంట్లో బాగోలేదు. ఇంటికెప్పుడొస్తావు’ విసుగ్గా అడిగింది చిన్న. ‘వచ్చేస్తా బంగారం. ఈ ఒక్క రౌండ్ అయిపోగానే వచ్చేస్తా అంటూ ఫోన్ ఆఫ్ చెయ్యకుండానే పక్కన పెట్టేశాడతను.ఉసూరుమంటూ ఫోన్ పెట్టేసి పిల్లాడికి పాలు, బ్రెడ్డు పెట్టి టాబ్లెట్ వేసి పడుకోమని చెప్పి పక్కనే ఉన్న రైతు బజారుకి బయల్దేరింది చిన్న. ‘నువ్వు చిన్నవి కదూ’ అంది కూరలు ఏరుతూ ఉంటే పక్కనున్నామె.‘అవును. నువ్వు .. ఇందిర కదూ, నువ్వుండేది హైదరాబాద్ కదా!’ అడిగింది చిన్న. ‘అవునే. మా అక్కయ్య గృహప్రవేశం ఉంటే వచ్చాను. పూల దండల కోసం ఇలా వచ్చా. బావున్నావా చిన్నా’ అడిగింది ఇందిర చిన్నమ్మ చేతిని అందుకుంటూ. ‘హా, బావున్నాం. మా ఇల్లు ఇక్కడే శివాజీ పాలెం. రా ఇంటికి వెళదాం’ అంటూ కూరలు కొనుక్కోవటం అయిపోయాక ఇద్దరూ చిన్నమ్మ ఇంటికి వెళ్ళారు.ఇందిర కేసి చూసింది చిన్న. చిన్నప్పుడు కళ్ళపుసులతో, పుల్లలా ఉండేది. ఇప్పుడు దబ్బపండులా, ఎండమొహం ఎరుగనట్టు నిగ నిగ లాడుతూ, ఒతై ్తన జడ, మితంగా బంగారం, చక్కటి డ్రెస్సు, హుందాగా ఉంది. ‘నువ్వేమిటే ఇలా అయిపోయావు చిన్నప్పుడు చిలకలా ఉండేదానివి’ అడిగింది ఇందిర. నవ్వి ఊరుకుంది చిన్న.‘మీ ఆయనా పిల్లలు బావున్నారా?’ అడిగింది మాట మారుస్తూ. ‘హా’ అంటూ నంబర్ తీసుకుని ఫ్యామిలీ ఫొటో వాట్సాప్‌లో షేర్ చేసింది ఇందిర. ఆ ఫొటో కేసి చూస్తూ, ‘నిన్ను బాగా చూసుకుంటాడా?’ అడిగింది చిన్న.‘రాత్రి పొడవాటి కురులని పొగిడి, పొద్దున్నే పచ్చట్లో అదే వెంట్రుక కనబడితే విసుక్కునే రకం కాదే. అమ్మలా అభిమానంగా, బిడ్డలా గారంగా చూసుకుంటాడు. ఏ లోటూ రానివ్వడు. ఇంటి పనిలో సాయం చేస్తాడు, సాయంత్రం ఆరుకల్లా ఇంటికొచ్చి పిల్లల్ని చూసుకుంటాడు. పెళ్ళయ్యాక ఇంతవరకూ మేము ఓ మాట అనుకున్నది లేదు. మనకి అంతకన్నా ఇంకేం కావాలే, ఓ సారి మా ఇంటికి రా నీకే తెలుస్తుంది’ అంది ఇందిర మురిసిపోతూ. మనస్పూర్తిగా సంతోషించడానికి ప్రయత్నించింది చిన్న. కాసేపు మాట్లాడాక, జాకెట్ ముక్క, ఓ యాపిల్ చేతిలో పెట్టింది చిన్న. తెలిసిన ఆటో మాట్లాడి ఎక్కించి, ఆమె వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది. ఇంతలో సరస్వతి ఫోను ‘చిన్నమ్మా కార్తీకమాసం కదా, యమ ద్వితీయ నాడు భగినీ హస్త భోజనం చేస్తే అన్నయ్యకి ఆయుష్షు వృద్ధి, నీ కాపురం బావుంటుందట ఈ శనివారం అన్నయ్యని ఇంటికి పిలు’ అంది.అంతే అప్పటివరకూ అణచిపెట్టిన దుఖం ఎగజిమ్మింది. ‘అమ్మా, వాడు నాకేం చేశాడని? నేను చంటిని అందగాడనో, వయసు వ్యామోహం వల్లో ప్రేమించలేదు. ఫలానా వాడితో నా జీవితం భద్రంగా ఉంటుందని ప్రతీ అమ్మాయికీ ఓ నమ్మకం ఉంటుంది. నాకు వాడి కళ్ళు చూస్తే అదే అనిపించి వాణ్ణి ఇష్టపడ్డాను. మీరు పడనివ్వలేదు. ఏదో చిన్నప్పుడు సరిగ్గా చదవలేదని వాడు ప్రయోజకుడు కాడని నిర్ణయించేశారు. ఆడపిల్లకి జీవితంలో అతి పెద్ద బెట్టింగ్ పెళ్ళి.మా ఆయనెప్పుడూ ఏం చెబుతాడో తెలుసా, కౌంటు ఇచ్చినా పర్లేదు కానీ ఎవడి పేక వాడే ఆడాలట. నా బాధల్లా అదే. ధర్మరాజు జూదమాడితే ద్రౌపది అడవుల పాలైనట్టు అన్నయ్య నిర్ణయానికి నేను బలైపోయాను. ఉంటాను, మళ్ళీ మీరు ఏరి కోరి మరీ చేసిన బాబి తాగి, ఇంటికొచ్చేటప్పటికి నేను ఫోన్ మాట్లాడుతూ కనబడితే గొడవ చేస్తాడు’ అందామనుకుని, గ్రీష్మాన్ని గుండెల్లోనే దాచి, పెదవులపై వసంతం పూయిస్తూ, ‘సర్లే, ఆరోజు అన్నయ్యకి కుదిరితే రమ్మను’ అంటూ ఫోన్ పెట్టేసి ఎందుకో ఇందిర షేర్ చేసిన ఫొటోలో ఆమె భర్తని తదేకంగా చూసింది.అభయాంజనేయుడిలా భద్రత నిస్తూ గ్యారంటీ కార్డు లాంటి కళ్ళు, అవి కనబడకుండా చిన్నమ్మ కళ్ళ నిండా నీళ్ళు. — ఉమా మహేష్ ఆచాళ్ళ -
అభివృద్ధిపథంలో అల్లూరి జిల్లా సీఎం జగన్ మార్క్..!
-
KamaReddy: ఊరంతా చుట్టాలే !
సాక్షి, కామారెడ్డి: ఆ ఊర్లలో కుటుంబాలన్నీ ఒకే సామాజిక వర్గానికి చెందినవి. ఇంటి పేరు వేరైనా, దాదాపు అన్ని కుటుంబాలతో బంధుత్వం ఉండే ఉంటుంది. ఎవరికి ఏ ఆపద వచ్చినా ఒకరికొకరు అండగా నిలుస్తారు. ఏవైనా విభేదాలొస్తే అక్కడే పరిష్కరించుకుంటారు. కామారెడ్డి జిల్లాలో ఉన్న ఆ నాలుగు ఊళ్లపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. కామారెడ్డి మండలంలోని కొటాల్పల్లి, భిక్కనూరు మండలంలోని అయ్యవారిపల్లి, లింగంపేట మండలంలోని నాగారం, గాంధారి మండలంలోని నర్సాపూర్ గ్రామాల్లో ఒకే సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు ఉన్నాయి. ఆ ఊళ్లలో అన్ని రాజకీయ పార్టీలు ఉన్నా... ఎన్నికల వరకే రాజకీయాలు. ఆ తరువాత అందరూ కలిసే ఉంటారు. ఏమైనా విభేదాలొస్తే స్థానికంగానే పరిష్కరించుకుంటారు. ఆ గ్రామాల నుంచి గొడవలతో పోలీసు స్టేషన్ దాకా వెళ్లిన ఘటనలు తక్కువే. నాగారం గ్రామం మున్నూరుకాపుల కొటాల్పల్లి... కామారెడ్డి మండలంలోని కొటాల్పల్లి గ్రామంలో 101 కుటుంబాలు ఉండగా జనాభా 425. ఇక్కడ అన్నీ మున్నూరుకాపు కులానికి చెందిన కుటుంబాలే ఉన్నాయి. 255 ఎకరాల వ్యవసాయ భూము లున్నాయి. అందరూ వ్యవసాయం అందునా ఆకు కూరలు పండించడంలో సిద్ధహస్తులు. మున్నూరు కాపు కులానికి చెందిన జొనకంటి, కల్లూరి, ఆకుల, బచ్చగారి ఇంటిపేర్లతో కుటుంబాలు ఉన్నాయి. దాదాపు అన్ని కుటుంబాలకు వ్యవసాయ భూమి ఉంది. అందరూ వ్యవసాయం చేస్తారు. అయ్యవారిపల్లి గ్రామం ముదిరాజ్‌ల అయ్యవారిపల్లి.... భిక్కనూరు మండలంలోని అయ్యవారిపల్లి 2018 లో పంచాయతీగా ఏర్పడింది. 128 కుటుంబాలుండగా 683 మంది జనాభా ఉన్నారు. గ్రామంలోని అన్ని కుటుంబాలు ముదిరాజ్ కులానికి చెందినవే ఉన్నాయి. వర్షాధారంపై పంటలు సాగు చేస్తారు. బోర్లు ఉన్న రైతులు వాటిపై ఆధారపడి వరి, ఇతర పంటలు సాగుచేస్తారు. భూములు లేని వాళ్లు కొందరు వ్యవసాయ పనులకు కూలీలుగా వెళతారు. కొటాల్పల్లి గ్రామం పొలాల మధ్యన నాగారం... లింగంపేట మండలం నాగారం అనే కుగ్రామంలో 22 కుటుంబాలు, 120 మంది జనాభా ఉన్నారు. అందరూ ముదిరాజ్ సామాజికవర్గం వారే. వ్యవసాయం మీదే ఆధారపడి జీవనం సాగిస్తారు. కోర్పోల్ పంచాయతీకి అనుబంధ గ్రామం ఇది. కుల వృత్తుల వారితో పనులు ఉంటే కోర్పోల్ గ్రామానికి వెళ్లి చేయించుకుంటారు. ఊరు చుట్టూ పచ్చని పంటలు ఉంటాయి. అందరూ వ్యవసాయం చేస్తారు. అన్ని కుటుంబాల వాళ్లతో బంధుత్వం ఉంది. చుట్టూ అడవి.. నడుమ నర్సాపూర్.... గాంధారి మండలంలోని నర్సాపూర్ గ్రామం అడవి మధ్యన ఉంటుంది. ఇక్కడ 72 కుటుంబాలు ఉన్నా యి. 298 మంది జనాభా ఉన్నారు. అందరూ ముది రాజ్ వర్గం వారే. వ్యవసాయంపైనే ఆధారపడి జీవ నం సాగిస్తుంటారు. వర్షాధార పంటలు ఎక్కువగా పండిస్తారు. బోర్లు, బావులు ఉన్న వారు వరి తదితర పంటలు వేస్తున్నారు. ఎవరి పనుల్లో వారుంటారు... అందరం ఒకే కులం వాళ్లం. కలిసిమెలిసే ఉంటాం. ఎవరి పనుల్లో వారు తీరికలేకుండా ఉంటారు. ఏదైనా సమస్య వస్తే కూర్చుని మాట్లాడుకుంటాం. కూరగాయలు.. ముఖ్యంగా ఆకుకూరల సాగులో మా ఊరుకు ఎంతో పేరుంది. – బాలయ్య, కొటాల్పల్లి, కామారెడ్డి మండలం అందరం కలిసిమెలిసి ఉంటాం... మా ఊరిలో ఎవరి పని వాళ్లు చేసుకుని బతుకుతారు. ఎలాంటి గొడవలు ఉండవు. పొలం ఉన్న వాళ్లు వ్యవసాయం చేస్తారు. పొలం లేని వాళ్లు పొరుగూళ్లకు వెళ్లి కూలీ నాలీ చేసుకుని వస్తారు. ఒకే కులానికి చెందిన వాళ్లమే కావడంతో చాలా పనులు మాకుగా మేమే చేసుకుంటాం. – చిన్న రాజయ్య, అయ్యవారిపల్లి, భిక్కనూరు మండలం 3 కుటుంబాలతో ఏర్పడిన గ్రామం మా తాతల కాలంలో 3 కు టుంబాలతో గ్రామం ఏర్పడింది. తరువాత పెరిగి కుటుంబా ల సంఖ్య 22కు చేరుకుంది. అందరం ఒకే కుటుంబం నుంచి వ చ్చిన వాళ్లం. గొడవలు లేకుండా అందరం వ్యవసాయం చేసుకుని బతుకుతుంటాం. – చింతకుంట లక్ష్మీనారాయణ, నాగారం, లింగంపేట మండలం -
దారి తప్పిన బాటసారి.. ప్రతి అడుగు అపాయం వైపే...!
-
Ugadi 2024 అచ్చంగా ఆరు : జీవితానికి ఎన్నో లాభాలు
త్వరలో ఉగాది వస్తోంది. ఆరు రుచులున్న ఉగాది పచ్చడిని ఈ రోజు తప్పనిసరిగా సేవించడం ఈ పండగ ఆచారం. ఉగాది రోజున షడ్రుచుల సమ్మేళనం అయిన ఉగాది పచ్చడి సేవిస్తే ఆయా రుచుల్లాగే సంవత్సరమంతా మనకు ఆయా ఫలాలు అందుతాయని, అలా రకరకాల అనుభవాలూ, అనుభూతులను ఆస్వాదించడమే జీవితమని పెద్దలు చెబుతారు. అయితే అలా కేవలం ఉగాది నాడు మాత్రమే కాదు, వీలయితే ప్రతిరోజూ ఆరు రుచుల ఆహారాలను తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండచ్చని ఆయుర్వేదం చెబుతోంది. ఏయే రుచులు ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం. 1. తీపి శరీరంలోని వాత, పిత్త దోషాలను ఈ రుచి సమం చేస్తుంది. తీపి పదార్థాలను తీసుకోవడం వల్ల ఆయుర్దాయం పెరుగుతుంది, శరీరం దృఢంగా మారుతుంది. శక్తి అందుతుంది. శరీరంలో ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. అయితే వీటిని చాలా తక్కువగా తినాలి. లేదంటే శరీరంలో కఫ దోషం పెరుగుతుంది. ఫలితంగా అధిక బరువు, స్థూలకాయం, డయాబెటిస్ వంటి వ్యాధులు వస్తాయి. కనుక ఈ రుచి ఉన్న ఆహారాలను నిత్యం తక్కువ మోతాదులో తీసుకుంటే ఆరోగ్యంగాఉండవచ్చు . 2. పులుపు వాత దోషాలను పులుపు తగ్గిస్తుంది. పులుపు రుచి ఉన్న ఆహారాలను తినడం వల్ల ఆకలి పెరుగుతుంది. జీర్ణ సమస్యలు ఉండవు. నిమ్మ, చింతకాయ వంటి పులుపు ఉన్న ఆహారాలను నిత్యం పరిమితంగా తీసుకోవచ్చు. అయితే ఎక్కువగా తీసుకుంటే పిత్త, కఫ దోషాలు పెరుగుతాయి. కనక పులుపు ఆహారాలను కూడా తక్కువగా తీసుకోవాలి. 3. ఉప్పు ఉప్పు ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల వాత దోషం తగ్గుతుంది. ఉప్పు అధికమైతే పిత్త, కఫ దోషాలు పెరుగుతాయి. ఉప్పు ఉన్న ఆహారాల వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది. కణాలు శుభ్రమవుతాయి. ఉప్పు ఉన్న పదార్థాలను కూడా తక్కువగా తీసుకోవాలి. ఎక్కువైతే బీపీ పెరుగుతుంది. గుండె జబ్బులు వస్తాయి. 4. కారం కారపు రుచి గల ఆహారాలను తీసుకుంటే జీర్ణశక్తి పెరుగుతుంది. ఆకలి వేస్తుంది. కణాలు శుభ్రమవుతాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది. కఫ దోషం తగ్గుతుంది. కారం ఎక్కువైతే పిత్తదోషం పెరుగుతుంది. అందువల్ల కారాన్ని నిత్యం తక్కువగానే తీసుకోవాలి. 5. చేదు చేదుగా ఉన్న పదార్థాలను తినడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. పిత్త, కఫ దోషాలు తగ్గుతాయి. చేదుగా ఉన్న పదార్థాలను నిత్యం కొద్దిగా ఎక్కువ మోతాదులో తీసుకున్నా పెద్దగా సమస్యలు ఉత్పన్నం కావు. 6. వగరు వగరు ఉన్న పదార్థాలను కూడా నిత్యం తినాలి. కానీ వీటిని తక్కువగా తీసుకోవాలి. లేదంటే జీర్ణాశయంలో గ్యాస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇక పిత్త దోషం ఉన్న వారికి ఈ రుచి ఉన్న పదార్థాలు ఎంతగానో మేలు చేస్తాయి. పచ్చి అరటి పండ్లు, క్రాన్ బెర్రీలు, గ్రీన్ బీన్స్ వంటివి ఈ రుచి ఉన్న పదార్థాలకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. అయితే భోజనం చేసేటప్పుడు ఒకేసారి ఆరు రుచులు కలిసిన పదార్థాలను తినాల్సిన పనిలేదు. రోజులో మొత్తంగా చూసుకుంటే ఈ ఆరు రుచులు ఉన్న పదార్థాలను తిన్నామా లేదో అని చెక్ చేసుకుంటే చాలు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనాల్లో ఈ ఆరు రుచుల నుంచి ఏవైనా రెండు రుచులు కలిగిన ఆహారాలను ఎంచుకుని తింటే చాలు. అంటే ఉదయం చేదు, కారం, మధ్యాహ్నం తీపి, వగరు, రాత్రి పులుపు, ఉప్పు.. ఇలా రెండేసి రుచులు ఉండేలా ఆహారాలను తీసుకుంటే చాలు. ఇవే తినాలని ఏమీ లేదు. ఎవరికి నచ్చినట్లు వారు ఆహారాలను ఎంచుకుని ఆరు రుచులు కవర్ అయ్యేలా చూసుకుంటే చాలు. -
RashmikaMandanna : అద్దె కట్టడానికి డబ్బుల్లేవు..మరెలా వచ్చిందీ స్టార్డమ్
సినీ పరిశ్రమలో మహిళలు నిలదొక్కుకోవడం అంటే మాటలు కాదు. స్టార్ హీరో, మెగాహీరో, సూపర్ స్టార్, క్రేజీ స్టార్, గ్లోబల్ స్టార్, ప్యాన్ ఇండియా స్టార్ ఈ ట్యాగ్లు, బిరుదులు అన్నీ హీరోలకే. వీటిన్నింటిని తోసి రాజని తామేంటో నిరూపించుని నిలబడిన వారు చాలాకొద్దిమంది. అలాంటి వారిలో టాప్‌లో ఉంటుంది నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకున్న నటి రష్మికమందన్నా. టాలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని చోట్లా స్టార్ హీరోయిన్గా చలామణి అవుతోంది. ‘తగ్గేదేలే’ అంటూ దూసుకు పోతోంది. ఒక కుగ్రామంనుంచి వచ్చి ఇంత స్టార్డమ్ ఎలా తెచ్చుకుంది.. ఆ వివరాలు ఒకసారి చూద్దాం. 1996 ఏప్రిల్ 5న పుట్టింది రష్మిక. ఆంగ్ల సాహిత్యం, జర్నలిజం, మనస్తత్వశాస్త్రంలో డిగ్రీలు చేసింది. రష్మిక మధ్యతరగతి కుటుంబానికి చెందినది. తల్లిదండ్రులు ఆర్థికంగా కష్టపడటం చూసింది.అద్దె కట్టడానికి కూడా డబ్బు లేని పరిస్థితిని కూడా చూసింది. కర్ణాటకలో పుట్టిపెరడంతో 2016లో కన్నడ మూవీతో "కిరిక్ పార్టీ" , తెరంగేట్రం చేసింది. తొలి సినిమాలనే సూపర్‌హిట్ అయింది. 20 ఏళ్లకే నటిగా మారిన రష్మిక అదృష్టం వరించింది. ఈ మూవీ బడ్జెట్ రూ.4 కోట్లు కాగా బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల బిజినెస్ చేసింది. అందం, అభినయానికి , పట్టుదల, కృషిని జోడించింది. అలా టాలీవుడ్‌కి పరిశ్రమను ఆకర్షించింది. 2018 లో "ఛలో" తో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. కిల్లర్ లుక్స్‌తో ఇటు యూత్ ఐకాన్‌గా, అటు దర్శక నిర్మతాల బెస్ట్ ఆప్షన్‌గా మారింది. సమంతా సినిమా తిరస్కరించడంతో. రష్మిక మందన్నకు అదృష్టం వరించింది. ఇక ఆ తరువాత "డియర్ కామ్రేడ్", గీత గోవిందం" వంటి చిత్రాలలో తన అద్భుతమైన నటనతో రష్మిక అగ్ర నటిగా నిలదొక్కుకుంది. స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. వరుస సినిమాలతో ఈమె మన తెలుగు అమ్మాయే అన్నట్టుగా మారిపోయింది. అగ్రహీరోల సరసన కూడా నటించింది. ఆ తరువాత అల్లు అర్జున్ సరసన నటించిన 'పుష్ప' సినిమా ఆమెకు ఎక్కడలేని స్టార్డమ్ తెచ్చి పెట్టింది. చిత్తూరు యాసతో శ్రీవల్లిగా అందరినీ అబ్బుర పరిచింది. శ్రీవల్లి కాస్తా 'నేషనల్ క్రష్' గా అవతరించింది. ఇక ‘సామి.. సామి’ సాంగ్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. పుష్ప రికార్డు వసూళ్లను రాబట్టింది. దీంతో బాలీవుడ్ కూడా రారమ్మని ఆహ్వనించింది. సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి "మిషన్ మజ్ను"లో రష్మిక మందన్న బాలీవుడ్ అరంగేట్రం చేసింది. అటు తమిళంలో కార్తీతో కలిసి "సుల్తాన్" లో కోస్టార్‌గా నటించింది. తరువాత విజయ్ లాంటి పెద్ద స్టార్స్ పక్కన కూడా అవకాశాలు వచ్చాయి. బాలీవుడ్ రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన సెన్సేషనల్ మూవీ 'యానిమల్' మూవీ రష్మిక మందన్న కెరీర్‌ని కొత్త మలుపు తిప్పింది. తమిళంలో విజయ్‌తో చేసిన 'వారిసు' మూవీ కూడా సూపర్‌హిట్ అయింది. దీంతో ఇంటర్ నేషనల్ క్రష్‌గా మారిపోయింది. అంతేనా ఇటీవల వరల్డ్ టాప్ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇండియా త '30 అండర్ 30' అనే కేటగిరీలో చోటు సంపాదించుకుంది. సినిమా పరిశ్రమనుంచి అత్యంత ప్రతిభావంతుల్లో ఒకరిగా నిలిచింది. అవార్డులు "కిరిక్ పార్టీ"లో తన నటనకు ఉత్తమ తొలి నటిగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డు (SIIMA) గెలుచుకుంది. “గీత గోవిందం” మూవీకి ఉత్తమ నటిగా జీ సినీ అవార్డ్స్ తెలుగు , తెలుగు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు వీటన్నింటికన్న మిన్నగా తన యాక్టింగ్ స్టయిల్, స్మైల్, ఆన్-స్క్రీన్ లుక్స్, మెస్మరైజింగ్ లుక్స్‌తో పాన్-ఇండియా స్టార్‌గా లక్షలాదిమంది అభిమానుల గుండెల్లో తన స్థానాన్ని పదిలం చేసుకుంది. వ్యక్తిగత జీవితంలో ఎదురుదెబ్బలు, డేటింగ్ రూమర్లు, పెళ్లికబుర్లు, ట్రోలింగ్లు, డీప్ ఫేక్ వీడియోలు ఇవేవీ రష్మిక కమిట్మెంట్ను దెబ్బతీయలేవు.. ఒక్క చిరునవ్వుతో అవన్నీ బలా దూర్ అంటారు ఫ్యాన్స్. -
ఆ స్వరం మూగబోయినా...ఆయన అందరివాడే!
తొలి తరం తెలుగు టీవీ వార్తా వ్యాఖ్యాత శాంతి స్వరూప్ ఇకలేరు. అనారోగ్యంతో బాధపడుతున్న శాంతి స్వరూప్ చికిత్స పొందుతూ కన్నుమూశారు. సుదీర్ఘ కాలం పాటు దూరదర్శన్‌లో న్యూస్ రీడర్‌గా బాధ్యతల్ని నిర్వర్తించిన ఆయన స్వరం తెలుగు వారికి సుపరిచితం. ఎంతోమంది న్యూస్ రీడర్లకు, వ్యాఖ్యాతలకు ప్రేరణగా నిలిచారు. తన గాత్రంతో ఎన్నో వార్తలను, సంచలనాన్ని, విజయాల్ని, విషాదాలను ప్రేక్షకులకు చేరవేసిన ఆయన మరణం అభిమానులను తీరని విషాదంలో ముంచేసింది. ఆయన భౌతికంగా మూగబోయినా.. ఆ స్వరం మాత్రం ఆ చంద్ర తారార్కం...! 2014లో శాంతి స్వరూప్ గారితో సాక్షి, ఫ్యామిలీ ప్రతినిధి డా. పురాణపండ వైజయంతి సంభాషణ పాఠకుల కోసం.. టీవీ వల్లే... అందరివాణ్ణయ్యా! తెలుగు దూరదర్శన్ పేరు చెప్పగానే... అందరికీ గుర్తుకు వచ్చేది శాంతిస్వరూప్. పేరుకు తగ్గట్టుగా... మాటల్లో, చేతల్లో ఆయన శాంతి స్వరూపుడే..! వార్తలు... సమాచారం... ‘జాబులు - జవాబులు’... ‘ధర్మసందేహాలు’ కార్యక్రమం... ఇలా దేనినైనా ప్రేక్షకుల మదిలోకి ప్ర‘శాంతం’గా చొచ్చుకుపోయేలా చేశారు.. తెలుగు నేలపై 1977 అక్టోబరు 23న దూరదర్శన్ కార్యక్రమాలను నాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ప్రారంభించారు. సోమాజీగూడలో స్టూడియో నుంచి మాట్లాడిన మొట్టమొదటి యాంకర్ని నేనే. మొదటి బులెటిన్... 1983 నవంబరు 14న తెలుగు వార్తా విభాగం ప్రారంభమైంది. మొట్టమొదటి న్యూస్ రీడర్‌గా నన్నే నియోగించారు. ఆ రోజు బాలల దినోత్సవ ప్రారంభోత్సవ వేడుకలను ఓబీ వ్యాన్ లేకపోవడం వల్ల కేవలం కవరేజ్ మాత్రమే చే శాం. ఆ కార్యక్రమానికి సంబంధించిన విజువల్స్ చూపుతూ వార్తలు చదివాను. ఆ రోజు చాలా ఉత్సాహంగా, సంతోషంగా అనిపించింది. నాటి జ్ఞాపకాలు ఇప్పటికీ నా మనసులో తాజాగా మెదుల్తూనే ఉన్నాయి. మాకు ఆ రోజుల్లో ఎదురుగా తెరపై కనిపిస్తున్న అక్షరాలను చూసి చదవడానికి ఇప్పటిలా టెలీ ప్రాంప్టర్లు లేవు. అందువల్ల నేను విద్యార్థిలా వార్తలన్నీ ముందుగానే వల్లెవేసుకునేవాడిని. నా కొలీగ్స్ నన్ను ఎగతాళి చేసేవారు. నేను ఇలా చేయడానికి కారణం లేకపోలేదు. ఇక్కడ నుంచి తెలుగు వార్తలు పూర్తయిన వెంటనే రాత్రి తొమ్మిది గంటలకు ఢిల్లీ నుంచి హిందీ వార్తలు వస్తాయి. అక్కడ వాళ్లకి టెలీ ప్రాంప్టర్లు ఉన్నాయి. వాళ్లు పేపరు చూడకుండా చదువుతారు. వారికి ఏ మాత్రం తగ్గకుండా ఉండటం కోసం చిన్న పిల్లవాడిలాఅంతా వల్లె వేసి, జ్ఞాపకం ఉంచుకునేవాడిని. ప్రతిరోజూ నా జ్ఞాపకశక్తికి అది ఒక పరీక్ష. సందర్భోచితంగా... వార్తలలోని మూడ్ ప్రేక్షకులకు అందాలనేది నా ఉద్దేశం. భారత జట్టు క్రికెట్ ప్రపంచ కప్ గెలుచుకున్న సందర్భంలో నేను సంతాప వార్తలా ముఖ కవళికలు ఉంచి చదవలేను. అలాగని గట్టిగా అరవనూ లేను. ఇరుగుపొరుగు వారితో మాట్లాడుతున్నట్లుగానో, తోటివారికి చెబుతున్నట్లుగానో చదివేవాడిని. మధురజ్ఞాపకాలు... కేంద్ర ప్రభుత్వం నుంచి ‘షా కమిషన్’ కి సంబంధించిన పది పేజీల రిపోర్టు ఇంగ్లీషులో ప్రతిరోజూ హైదరాబాద్ దూరదర్శన్‌కి వచ్చేది. దానిని అనువదించి, రికార్డు చేసి ప్రసారం చేసే బాధ్యతను నాకు అప్పగించారు. ఆ పని చేయాలంటే కొన్ని గంటల సమయం పడుతుంది. అయితే నేను ఆ రిపోర్టును తెలుగులోకి అనువదించకుండా, ముందుగానే చదివి అర్థం చేసుకుని, ఇంగ్లీషు రిపోర్టు కాగితాలను రిఫరెన్స్ కోసం చేతిలో ఉంచుకుని, మధ్యమధ్యలో దానిని పరిశీలిస్తూ తెలుగులో ప్రత్యక్షంగా చదివేవాడిని. ఆ పనిని నేను సవాలుగా తీసుకున్నాను. ఏ తప్పు జరగకుండా చేస్తున్నందుకు కొంచెం గర్వంగా అనిపించేది. మా పై అధికారులంతా నన్ను మెచ్చుకునేవారు. మరో సంఘటన... పదహారు సంవత్సరాల అమ్మాయి తన వదినగారు తిట్టిందన్న కోపంతో ఇంటి నుంచి పారిపోయి రైలు ఎక్కిందట. టికెట్ కలెక్టర్ వచ్చి టికెట్ అడిగేసరికి, ‘శాంతి స్వరూప్ మా మేనమామ. ఆయన్ని చూడటానికి వెళుతున్నాను’ అని చెప్పిందట. ఆ టీసీ సహృదయంతో ఆ అమ్మాయిని జాగ్రత్తగా మా ఇంటికి పంపారు. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. పోలీసు లు విచారణ చేసి, ఆ అమ్మాయి అన్నగారిని పిలిపించి, ఇంటికి పంపారు. ఆ అమ్మాయి ‘‘నా పెళ్లికి మీరు తప్పక రావాలి’’ అని నా దగ్గర మాట తీసుకుంది. అలా తెలుగువారందరికీ కుటుంబ సభ్యుడిలా అయ్యానంటే అది దూరదర్శన్ చలవే. దాన్నిబట్టి దూరదర్శన్ ఎంత శక్తిమంతమైన మాధ్యమమో అర్థం అవుతుంది. ప్రభావం... ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 24 గంటలూ కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాం. సాంకేతికంగా ఎన్నో సౌకర్యాలు, మార్పులు వచ్చాయి. వీటివల్ల నేటి యాంకర్లు కష్టపడవలసి వస్తోంది. అయితే ఔట్పుట్ మాత్రం సంతృప్తిగా ఉండట్లేదు. సర్కస్‌లో జోకర్లా వాళ్ల మీద వాళ్లే జోకులు వేసుకుంటున్నారు. తెలుగు, ఇంగ్లీషు భాషలు కలిపి చదువుతున్నారు. ఒక్కోసారి మాండలికాలు ఉపయోగిస్తున్నారు. అందువల్ల వినసొంపుగా ఉండట్లేదు. తెలుగు దూరదర్శన్‌లో మొట్టమొదటి యాంకర్ని, న్యూస్ రీడర్ని కావడం వల్ల దూరదర్శన్ పేరు ప్రస్తావించినప్పుడు నన్ను మర్చిపోలేరు. జనవరి 7, 2011 జనవరి వరకు నేను ఉద్యోగంలో ఉన్నాను. నేను పదవీ విరమణ చేసినప్పటికీ తెలుగు ప్రజలింకా నన్ను ఇప్పటికీ గుర్తుపట్టడం, గుర్తుంచుకోవడం ఆనందంగా ఉంది. నన్ను ప్రేమిస్తున్న వారందరికీ ఋణపడి ఉంటాను. నా ఉద్దేశంలో టీవీ అంటే... ఇదొక శక్తిమంతమైన మాధ్యమం. ప్రపంచాన్ని గుప్పెట్లోకి తీసుకువచ్చింది. అయితే... దీన్ని కొంత దుర్వినియోగం చేస్తున్నారు. టీవీ అసలు లక్ష్యాన్ని మర్చిపోతున్నారు. వైద్యం, విద్య, సంస్కృతి సంప్రదాయం, మానవ సంబంధాలకు టీవీ దూరమైపోతోంది. అదే అప్పుడప్పుడు బాధగా అనిపిస్తుంది. -
Ugadi 2024: కవి పలికిన ఉగాది
చిన్నప్పుడు వీధిబడిలో చదివిన పిల్లలకు తెలుగు ఋతువులు, వాటి ధర్మాలు నోటి మీద వుంటాయ్. సాయంత్రం పూట అన్ని తరగతుల్ని ఒకచోట మళ్లేసి, చైత్ర వైశాఖాలు, ప్రభవ విభవలు చెప్పించేవారు. అందులో జ్ఞాపకమే – ‘చైత్ర వైశాఖాలు వసంత ఋతువు, చెట్లు చిగిర్చి, పూలు పూయును’ అనే మాటలు. తెలుగు నెలల్లో ఫాల్గుణం పన్నెండోది. చైత్రం మొదటిది. మొదటి నెల మొదటి రోజునే ఉగాది అని, యుగాది అని అన్నారు. ప్రాచీన సాహిత్యంలో వసంత శోభలు వెల్లివిరుస్తాయి గాని, ఉగాది పండుగ ప్రస్తావనలు రావు. కవులు ప్రకృతిని అక్షరాలలో నిక్షిప్తం చేయడానికి తమ శక్తి సామర్ధ్యాలను ధారపోశారు. కొత్త చిగుళ్లతో పొటమరించే మొగ్గలలో ప్రతి చెట్టూ దీప స్తంభమై వెలుగుతుంది. కవిత్రయ కవి ఎర్రన – ‘ఎందున పుష్పసౌరభమే ఎందును మంద మాదాలిఝంకృతుల్ ఎందును సాంద్ర పల్లవము లెందునుకోకిల కంఠ కూజితం’ అని వర్ణించాడు. ఋతు సంహార కావ్యంలో కాళిదాసు: పుంస్కోకిలః చూత రసాస వేన మత్తః ప్రియాం చుమ్బతి రాగహృష్ణః అన్నారు. ఎవరే భాషలో అన్నా కోయిలలు, తుమ్మెదలు శృంగార క్రీడలో మునిగి తేలుతున్నాయనే కవి హృదయం. ఉగాది అనగానే గుర్తొచ్చేది పంచాంగాలు, అందులో మన కందాయ ఫలాలు, సంవత్సర ఫలితాలు. భవిష్యత్తు గురించి తెల్సుకోవడంలో ఎవరికైనా వుత్సుకత, వుత్సాహం వుంటుంది. షడ్రుచుల ఉగాది ప్రసాదం తర్వాత పంచాంగ శ్రవణం యీ రెండే ప్రస్తావనకి వస్తాయి. ఆరు రుచులకు ఆరు స్వారస్యాలు చెబుతారు. ఆరోగ్య రహస్యాలు వివరిస్తారు. ఊగిపోయే చెరకు తోటలు ఊహల్లో తీపి నింపుకోమంటాయ్. విరబూసిన వేపపూతలు పచ్చి నిజాల్లోని చేదుని గ్రహించ మంటున్నాయ్. ఈ తరుణంలో లేచిగుళ్లు తింటూ పచ్చని చెట్టుకొమ్మల్లోంచి కోయిల మధుర మధురంగా పాడుతుంది. కొండా కోనా కూహూ రావాలతో ప్రతిధ్వనిస్తాయి. మనం రెట్టిస్తే ‘కూహూ’ అని మరింత ధాటిగా కోయిల జవాబిస్తుంది. కవులు వసంత వర్ణనల్లో కోయిలకు అగ్రస్థానం యిచ్చారు. కోయిల స్వరానికి తిరుగులేని స్థాయి వుంది. అందుకని కవికోకిలలుగా వ్యవహారంలోకి వచ్చారు. వీణ చిట్టిబాబు కోయిలని అద్భుతంగా పలికించేవారు. అయితే, శ్రోతల్ని వూరించేవారు. ఇంత గొప్ప గౌరవం ఇచ్చినందుకు మనం వసంత రుతువులో గళం విప్పకపోతే ఏమాత్రం మర్యాదకాదని కవులు ఉగాదికి కవితలల్లడం మొదలుపెట్టారు. అది క్రమంగా ఆచారంగా మారింది. ఆకాశవాణిలో ఉగాది కవిసమ్మేళనం ఉండి తీరాల్సిందే. దువ్వూరి రామిరెడ్డికి, గుర్రం జాషువాకి ‘కవి కోకిల’ బిరుదు ఉంది. హేమా హేమీలతో వాసిగల కవులందరితో కావ్యగోష్ఠి జరుగుతోంది. విశ్వనాథ, జాషువా, కాటూరి ప్రభృతులున్నారు. ‘నిర్వాహకులు ఇక్కడ గుర్రాన్ని గాడిదని ఒక గాటన కట్టేశారు’ అన్నారట విశ్వనాథ ప్రారంభోపన్యాసంలో. ‘నాకూ అదే అనిపిస్తోంది’ అన్నారు గుర్రం జాషువా. అంతరార్థం తెలిసిన సభ చప్పట్లతో మార్మోగింది. బెజవాడ ఆకాశవాణి కేంద్రంలో ఉగాది కవి సమ్మేళనం ఆహూతుల సమక్షంలో జరుగుతోంది. సంగీత సాహిత్యాల మేలు కలయిక. బాలాంత్రపు రజనీకాంతరావు నాటి స్టేషన్ డైరెక్టర్. పేరున్న కవులంతా నాటి సమ్మేళనంలో ఉన్నారు. సుప్రసిద్ధ పత్రికా సంపాదకులు నార్ల వెంకటేశ్వరరావుకి అధ్యక్షపీఠం కట్టబెట్టారు. విశ్వనాథ గురించి మాట్లాడుతూ నార్ల ‘నాకూ వారికీ అభిప్రాయ భేదాలున్నప్పటికీ ప్రతిభ విషయంలో నాకెప్పుడూ గౌరవమే’ అన్నారు. ప్రేక్షక శ్రోతల్లో వొదిగి కూర్చున్న రజనీకి గుండెల్లో రాయి పడింది. విశ్వనాథ మైకు ముందుకొస్తే ఏదో అనకమానడు, రచ్చరచ్చ అవుతుందని భయపడుతున్నారు. విశ్వనాథ వంతు రానే వచ్చింది. ‘మిత్రుడు నార్ల అభిప్రాయ భేదాలున్నప్పటికీ అన్నాడు. మాకు సొంత అభిప్రాయాలు ఏడిస్తే అప్పుడూ భేదాలుండేవి. ఆయన కారల్ మార్క్స్ అభిప్రాయాలు పట్టుకు వేలాడుతున్నాడు, నేను శంకరాచార్యని పట్టుకు అఘోరిస్తున్నా’ అనగానే సభ నిలబడి కరతాళ ధ్వనులు చేసింది. ఒక్కసారి ప్రాచీనుల్ని పరామర్శిస్తే ఆదికవి నన్నయ్య భారతం ఆదిపర్వంలో వసంతకాలాన్ని వర్ణిస్తూ ఎన్నో పద్యాలు చెప్పాడు. వసు చరిత్రలో రామరాజ భూషణుడి పద్యాలు లయాత్మకంగా ఉంటాయని చెబుతారు. వసంత వర్తనలో–‘లలనా జనాపాంగ వలనా వసదనంగ తులనాభిగాభంగ దోప్రసంగ మలయానిల విలోలదళ సాసవరసాల ఫలసాదర’ అని సాగే ఈ పద్యాన్ని వీణ మీద వాయించగా విన్నవారున్నారు. జానపదుల జీవన స్రవంతిలో ఉగాది ఉన్నట్టు లేదు. ఎక్కడా మన సామెతల్లో ఈ పండగ ప్రసక్తి కనిపించదు, వినిపించదు. సంకురాత్రి, శివరాత్రి సామెతల్లో కనిపిస్తాయ్. పూర్వం గ్రామ పురోహితుడు ఈ పండగనాడు వేప పూత ప్రసాదం ఇంటింటా పంచేవాడు. వారు ధనధాన్యాల రూపంలో చిరుకానుకలు సమర్పించేవారు. ఉగాదినాడు వ్యక్తులవే కాదు దేశాల రాష్ట్రాల జాతకాలు కూడా పంచాంగం ద్వారా పండితులు నిర్ధారిస్తారు. ‘ఖగోళంలో కూడా క్యాబినెట్ ఉంటుందండీ. సస్యాధిపతిగా ఫలానా గ్రహం వుంటే పంటలు బాగుంటాయి. అలాగే వర్షాలకి హర్షాలకి అధిపతులుంటారు. పంచాంగమంటే తిథి వార నక్షత్ర యోగ కరణాలే కాదు చోర అగ్ని యుద్ధ ప్రమాదాల్ని కూడా ఢంకా బజాయించి చెబుతాయ్’ అంటారు పంచాంగవేత్తలు. ఆ ఢంకా సంగతి అట్లా వుంచితే, ప్రస్తుత కాలంలో మాత్రం పంచాంగాల్ని బహుముఖంగా ప్రదర్శింపచేస్తున్నారు. ఏ పార్టీ కార్యాలయానికి వెళితే ఆ పార్టీకి అనువుగా పంచాంగ ఫలితాలుంటాయి! పార్టీ అధినాయకులు కూడా చక్కగా సమయానికి తగుమాటలాడే వారినే పిలిచి పీట వేస్తారు. పంచాంగం మీద పట్టు కంటే లౌకికజ్ఞానం ప్రధానం. పేరులో విళంబి వుంది కాబట్టి నిదానంగా హిందుస్థానీ శాస్త్రీయ సంగీత గోష్ఠిలా సాగుతుందని అనకోవద్దు. కాలానికి ఒక వేగం వుంటుంది. అది చచ్చినా మారదు. తెలుగు సంవత్సరాల పేర్లకి వాటి లక్షణాలకి మాత్రం సంబంధం లేదు. ఈ మధ్య కొత్త సంవత్సరమంటే ఉగాది మాత్రమేనని, జనవరి ఒకటి కానేకాదని ఒక సిద్ధాంతం లేవనెత్తారు. ముఖ్యంగా దేవాలయాలు తెలుగుకి కట్టుబడి వుండాలన్నారు. ఉన్న సమస్యలకి కొత్తవి తగిలించుకోవడమంటే యిదే! మన ఆడపడుచులు పుట్టినరోజుని ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం అత్తారింటోనూ, తెలుగు లెక్కన పుట్టింట్లోనూ జరుపుకుంటున్నారు. అన్నీ డబల్ డబల్... ఆనందం కూడా డబల్. జీవితాన్ని సాల్వా దాళ్వాలతో పండించు కోవడమంటే యిదే. ఒక పెద్దాయన దగ్గర ఉగాది ప్రస్తావన తెస్తే, మాకు మార్చిలో బోనస్‌లు వచ్చేవి. సంవత్సరాదీ అప్పుడే వచ్చేది. ఇప్పుడే వుంది, మార్చి వచ్చిందంటే, ఐ.టి.రిటర్న్స్ దిగులు తప్ప అన్నాడు. ఇంకో సీనియర్ సిటిజెన్ ఆ నాటి ఆంధ్రవారపత్రిక ఉగాది సంచికల్ని తల్చుకున్నాడు. ‘కునేగా మరి కొళుందు’ సెంటు కొట్టుకుని ఘుమ ఘుమలతో వచ్చేది. ఇప్పుడు ఏ పరిమళమూ లేదని చప్పరించేశాడు. ‘మీకు తెలియదండీ, విజయవాడ రేడియో కవి సమ్మేళనలో అద్భుతమైన కవితలు వినిపించేవి. ఓ సంవత్సరం ఆరుద్ర, వేదంలా ప్రవహించే గోదావరి/ వెన్నెల వలె విహరించే కృష్ణవేణి అంటూ కవిత చదివారు. ఆ తర్వాత పాతికేళ్లకి ‘ఆంధ్ర కేసరి’ సినిమాకి పాట రాస్తూ వేదంలా ఘోషించే గోదావరి/ అమరధామంలా వెలుగొందే రాజమహేంద్రి అని రాశారు. నేను చెన్నపట్నం ఆరుద్ర ఫోన్ నెంబర్ తీసుకుని చేశా. మీరప్పుడు చదివిందే యిప్పుడు మళ్ళీ రాశారని నిలదీశా. ఆరుద్ర స్టన్ అయిపోయి మీకున్నంత జ్ఞాపకశక్తి నాకు లేకపోయింది. మన్నించండని ఫోన్ పెట్టేశాడు. మనకేంటి భయం?’ అని లోకల్ పొయెట్ నాకు వివరించారు. ఒకళ్లేమో ‘రారా ఉగాదీ’ అనీ, ఇద్దరేమో ‘రావద్దు ఉగాదీ’ అని మొదలుపెడతారు. యీ కవి గోష్ఠులలో ఏదో ఒకటి తేల్చండి పాపం అన్నాడొకాయన అసహనంగా. పిలుపులు రాని కవులకు కొంచెం అలకగానే ఉంటుంది. ఒక్కోసారి యీ అలక కవులంతా ఓ వేదిక మీదకు చేరుతారు. అవి పి.క.సమ్మేళనాలవుతాయ్. ఉగాది నాడు పిలుపొస్తే ఏడాది పొడుగునా మైకు అందుబాటులో ఉంటుందని ఓ నమ్మకం. ‘మాకుగాదులు లేవు, మాకుష్షస్సులు లేవు’ అని కోపం కొద్దీ అన్నారే గాని కృష్ణశాస్త్రి వసంతాన్ని దోసిళ్లకెత్తుకున్నాడు. ‘మావి చిగురు తినగానే.. ’ లాంటి పాటలెన్నో రాశారు. సుఖదుఃఖాలు చిత్రంలో ‘ఇది మల్లెల వేళయనీ, ఇది వెన్నెల మాసమనీ తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ’ పాట హిట్టున్నర హిట్టు. తర్వాత ఎవరో అడిగారట వెన్నెల మాసమేమిటి, వెన్నెల పక్షం ఉంటుంది గాని అని. నేను మల్లెల మాసమనీ, వెన్నెల వేళయనీ రాయాలని మనసులో అనుకున్నా కాని కాయితం మీదకి అలా వచ్చింది అన్నారట. మిగతా సంగతులు ఎట్లా వున్నా ఉగాది మార్కెట్లోకి మల్లెపూలు తీసుకువస్తుంది. వేసవి చెమటల్ని పరిహరిస్తూ మల్లెలు పరిమళిస్తాయ్. ఈ కాలం యువత ఇతర వత్తిళ్లలో పడిపోయి దాంపత్య వత్తిళ్లు మర్చిపోతున్నారు. ఇంటికి వెళ్తూ ధరకి వెరవకుండా రెండుమూరల మల్లె మొగ్గులు తీసికెళ్లండి. ఆ మల్లెవాసనలు వుత్తేజకరమైన ఆలోచనలు పుట్టిస్తాయి. వచ్చిన వసంతాన్ని అందిపుచ్చుకుని ఆనందించాలి గాని జారిపోనీకూడదు. ప్రతీరాత్రి వసంతరాత్రి కావాలని కాంక్షిస్తూ– – శ్రీరమణ (2018లో ఉగాది సందర్భంగా దివంగత రచయిత, కవి శ్రీరమణ అందించిన ప్రత్యేక వ్యాసం ఇది)