Safer Internet Day 2025 భద్రత... బాధ్యత... గౌరవం! | Special Story on Safer Internet Day 2025 deets inside | Sakshi
Sakshi News home page

Safer Internet Day 2025 భద్రత... బాధ్యత... గౌరవం!

Published Tue, Feb 11 2025 10:40 AM | Last Updated on Tue, Feb 11 2025 10:47 AM

Special Story on Safer Internet Day 2025  deets inside

ఫిబ్రవరి 11న ప్రపంచవ్యాప్తంగా180 దేశాలు ‘సురక్షిత ఇంటర్నెట్‌ దినోత్సవా’న్ని పాటిస్తున్నాయి.  ఈ దినోత్సవం ఈ యేటి నినాదం ‘మెరుగైన ఇంట ర్నెట్‌ కోసం కలిసి రండి’. ఈ దిశలో ‘డిజిటల్‌ వ్యక్తిగత డేటా పరిరక్షణ నియమాలు-2025’ ముసాయిదాను ప్రజా సంప్రదింపుల కోసం భారత ప్రభుత్వం జనవరిలో విడుదల చేసింది. ఫిబ్రవరి 18 వరకు సూచనలు స్వీకరిస్తారు. వ్యక్తిగత సమాచార గోప్యత పౌరుల ప్రాథమిక హక్కుగా ఈ నియమాలు గుర్తిస్తాయి.

అభ్యంతరకర సమాచారం, చిత్రాలు, వీడియోలను ఇంటర్నెట్, ఆన్‌లైన్‌ ప్లాట్‌ ఫామ్‌ల నుండి తొలిగించమని కోరే  హక్కును డిజిటల్‌ వ్యక్తిగత డేటా పరిరక్షణ చట్టం–2023 సెక్షన్‌ 12 (3) కల్పిస్తుంది.ఇతర దేశాల్లో, ముఖ్యంగా యూరోపియన్‌ యూనియన్‌లో గోప్యతా చట్టాల కింద గుర్తించబడిన కీలకమైన హక్కు ఇది. ఉల్లంఘనలపై రూ. 50 కోట్ల జరిమానా విధించే అధికారం ‘డేటా పరిరక్షణ బోర్డుకు’ఉంటుంది. 

అంతేగాక, బాలల సమాచారాన్ని ఉపయోగించాలంటే తల్లిదండ్రుల అను మతి తప్పనిసరి. బాలల వ్యక్తిగత గోపనీయతకు, భద్రతకు నష్టం కలిగించేట్లు సమాచారాన్ని దుర్వినియోగం చేస్తే రూ. 200 కోట్ల జరిమానా విధించే అధికారం కూడా బోర్డుకు ఉంది. అనేక రూపాలలో బాలలు, మహిళలపై జరిగే హింసలో ఇటీవల అదనంగా చేరింది– సాంకేతిక (డిజిటల్‌) జెండర్‌ హింస. అభ్యంతరకర నగ్న చిత్రాలతో వేధింపులు (ఇమేజ్‌ బేస్డ్‌ అబ్యూజ్‌), బాలికలపై నేరాలు కొన్ని సార్లు వారి ఆత్మహత్యకు దారితీస్తున్నాయి.  

ఆస్ట్రేలియా, బ్రిటన్, దక్షిణ కొరియా వంటి దేశాలు ఆన్‌లైన్‌లో అభ్యంత రకర ఫోటో, వీడియోల తొలగింపు సులభతరం చేయడానికి ఎన్నో చర్యలు తీసు కున్నాయి. ఇందు కోసం ఆస్ట్రేలియా ప్రపంచంలోనే మొదటిగా ‘ఇ–సేఫ్టీ కమిష నర్‌’ అనే వ్యవస్థను చట్టబద్ధంగా నియమించింది. బ్రిటన్‌ ‘రివెంజ్‌ పోర్న్‌ హెల్ప్‌ లైన్‌’ రెండు లక్షల పైచిలుకు అభ్యంతర ఫోటోలను తొలగించింది. కొరియా ‘డిజిటల్‌ సెక్స్‌ క్రైమ్‌ విక్టిమ్‌ సపోర్ట్‌ సెంటర్‌’ ఫోటోల తొలగింపు గురించి ఫిర్యాదు రాకముందే గుర్తించి ముందస్తు తొలగింపు దిశగా పరిశోధన చేస్తోంది.  

భారత ప్రభుత్వం కూడా ‘నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌’ ఏర్పాటు చేసింది. ‘డిజిటల్‌ వ్యక్తిగత డేటా పరిరక్షణ నియమాల’ రూపకల్పన సాంకేతి కతతో సమాన వేగంతో జరగకపోతే సమాజం నష్టపోతుంది. సురక్షిత ఇంట ర్నెట్‌ దినోత్సవం స్ఫూర్తితో బాలలు, మహిళల గౌరవానికి, భద్రతకు పెద్దపీట వేయడం ద్వారా మాత్రమే భారతదేశం మరింత న్యాయమైన, వికసిత భవిష్యత్తు వైపు పురోగమిస్తుంది.

– శ్రీనివాస్‌ మాధవ్, సమాచార హక్కు పరిశోధకులు
(నేడు సురక్షిత ఇంటర్నెట్‌ దినోత్సవం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement