safer
-
Safer Internet Day 2025 భద్రత... బాధ్యత... గౌరవం!
ఫిబ్రవరి 11న ప్రపంచవ్యాప్తంగా180 దేశాలు ‘సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవా’న్ని పాటిస్తున్నాయి. ఈ దినోత్సవం ఈ యేటి నినాదం ‘మెరుగైన ఇంట ర్నెట్ కోసం కలిసి రండి’. ఈ దిశలో ‘డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ నియమాలు-2025’ ముసాయిదాను ప్రజా సంప్రదింపుల కోసం భారత ప్రభుత్వం జనవరిలో విడుదల చేసింది. ఫిబ్రవరి 18 వరకు సూచనలు స్వీకరిస్తారు. వ్యక్తిగత సమాచార గోప్యత పౌరుల ప్రాథమిక హక్కుగా ఈ నియమాలు గుర్తిస్తాయి.అభ్యంతరకర సమాచారం, చిత్రాలు, వీడియోలను ఇంటర్నెట్, ఆన్లైన్ ప్లాట్ ఫామ్‌ల నుండి తొలిగించమని కోరే హక్కును డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ చట్టం–2023 సెక్షన్ 12 (3) కల్పిస్తుంది.ఇతర దేశాల్లో, ముఖ్యంగా యూరోపియన్ యూనియన్‌లో గోప్యతా చట్టాల కింద గుర్తించబడిన కీలకమైన హక్కు ఇది. ఉల్లంఘనలపై రూ. 50 కోట్ల జరిమానా విధించే అధికారం ‘డేటా పరిరక్షణ బోర్డుకు’ఉంటుంది. అంతేగాక, బాలల సమాచారాన్ని ఉపయోగించాలంటే తల్లిదండ్రుల అను మతి తప్పనిసరి. బాలల వ్యక్తిగత గోపనీయతకు, భద్రతకు నష్టం కలిగించేట్లు సమాచారాన్ని దుర్వినియోగం చేస్తే రూ. 200 కోట్ల జరిమానా విధించే అధికారం కూడా బోర్డుకు ఉంది. అనేక రూపాలలో బాలలు, మహిళలపై జరిగే హింసలో ఇటీవల అదనంగా చేరింది– సాంకేతిక (డిజిటల్) జెండర్ హింస. అభ్యంతరకర నగ్న చిత్రాలతో వేధింపులు (ఇమేజ్ బేస్డ్ అబ్యూజ్), బాలికలపై నేరాలు కొన్ని సార్లు వారి ఆత్మహత్యకు దారితీస్తున్నాయి. ఆస్ట్రేలియా, బ్రిటన్, దక్షిణ కొరియా వంటి దేశాలు ఆన్లైన్లో అభ్యంత రకర ఫోటో, వీడియోల తొలగింపు సులభతరం చేయడానికి ఎన్నో చర్యలు తీసు కున్నాయి. ఇందు కోసం ఆస్ట్రేలియా ప్రపంచంలోనే మొదటిగా ‘ఇ–సేఫ్టీ కమిష నర్’ అనే వ్యవస్థను చట్టబద్ధంగా నియమించింది. బ్రిటన్ ‘రివెంజ్ పోర్న్ హెల్ప్ లైన్’ రెండు లక్షల పైచిలుకు అభ్యంతర ఫోటోలను తొలగించింది. కొరియా ‘డిజిటల్ సెక్స్ క్రైమ్ విక్టిమ్ సపోర్ట్ సెంటర్’ ఫోటోల తొలగింపు గురించి ఫిర్యాదు రాకముందే గుర్తించి ముందస్తు తొలగింపు దిశగా పరిశోధన చేస్తోంది. భారత ప్రభుత్వం కూడా ‘నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్’ ఏర్పాటు చేసింది. ‘డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ నియమాల’ రూపకల్పన సాంకేతి కతతో సమాన వేగంతో జరగకపోతే సమాజం నష్టపోతుంది. సురక్షిత ఇంట ర్నెట్ దినోత్సవం స్ఫూర్తితో బాలలు, మహిళల గౌరవానికి, భద్రతకు పెద్దపీట వేయడం ద్వారా మాత్రమే భారతదేశం మరింత న్యాయమైన, వికసిత భవిష్యత్తు వైపు పురోగమిస్తుంది.– శ్రీనివాస్ మాధవ్, సమాచార హక్కు పరిశోధకులు(నేడు సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవం) -
నెట్టింట్లో... భద్రం బీ కేర్‌ఫుల్
తెల్లారి లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఇంటర్నెట్ ప్రపంచంలో ఉంటాం. మనకు అన్నీ తెలిసినట్లుగానే ఉంటుంది. అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉన్నట్లుగానే ఉంటుంది. అయినా సరే... ఏ ప్రమాదం ఎటు నుంచి వచ్చిపడుతుందో తెలియదు.ఇంటర్నెట్ వినియోగించడం ఎంత ముఖ్యమో, మనకు ఎలాంటి చేటు, నష్టాలు జరగకుండా ఉపయోగించడం అంతకంటే ముఖ్యం...‘సేఫర్ ఇంటర్నెట్ డే’ ను పురస్కరించుకొని మల్టీ మీడియా ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ‘స్నాప్‌చాట్’ డిజిటల్ వెల్–బీయింగ్ ఇండెక్స్ (డిడబ్ల్యూబిఐ) మూడవ ఎడిషన్‌ను విడుదల చేసింది. మన దేశంలో డిజిటల్ విషయాలకు సంబంధించి అవగాహన ఉన్నప్పటికీ ఆన్లైన్ మోసాలు పెరుగుతున్నాయి అని ఈ నివేదిక తెలియజేసింది.మన దేశంతో సహా ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, యూఎస్‌లో నిర్వహించిన డిజిటల్ సేఫ్టీపై నిర్వహించిన సర్వేలో టీనేజర్లు, వారి తల్లిదండ్రులు, యువత... ఇలా ఎంతోమంది పాల్గొన్నారు.మన దేశం హైయెస్ట్ డిజిటల్ వెల్బీయింగ్ స్కోర్‌ను 67తో సాధించింది. ఇంటర్నెట్ భద్రతకు సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటున్న తల్లిదండ్రుల సంఖ్య పెరిగింది. డిజిటల్ శ్రేయస్సు (డిజిటల్ వెల్–బీయింగ్)కు సంబంధించి సానుకూల సూచికలు ఉన్నప్పటికీ ఆన్లైన్ బ్లాక్మెయిల్ లాంటివి మన దేశంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యక్తిగత, సన్నిహిత, ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తామని బెదిరించడం లాంటివి ఎక్కువ అవుతున్నాయి, ఆన్లైన్ భద్రతకు సంబంధించి పురోగతి, సవాళ్లను రెండిటినీ నివేదిక నొక్కి చెప్పింది.డిజిటల్ సేఫ్టీలో మన దేశం మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీ, ఆన్లైన్ బెదిరింపుల ప్రాబల్యం పెరగడంతో యువ యూజర్లు ప్రమాదాల బారినపడకుండా నిరంతర అవగాహన కలిగించాల్సిన అవపరం గురించి నివేదిక నొక్కి చెప్పింది. ఈ సంవత్సరం సేఫర్ ఇంటర్నెట్ డేకి సంబంధించిన థీమ్... ‘టుగెదర్, ఫర్ ఎ బెటర్ ఇంటర్నెట్’. -
టాటా, బిర్లాల నష్టం ఎంతో తెలుసా?
-
టాటా, బిర్లాల నష్టం ఎంతో తెలుసా?
న్యూఢిల్లీ: పెద్ద నోట్లను రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బడా పారిశ్రామికవేత్తలకు భారీగానే తాకింది. గత 15 రోజులుగా దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న కరెన్సీ నోట్ల రద్దు టాటా, బిర్లాకు భారీ షాకిచ్చింది. టాటా, బిర్లా, మహేంద్ర గ్రూపులకు చెందిన మార్కెట్ వాల్యూ కుప్పకూలింది. దాదాపు రూ. 61,664 కోట్ల (9 బిలియన్ డాలర్ల) సంపద తుడుచు పెట్టుకుపోయింది. ఒకవైపు స్టాక్ మార్కెట్ భారీ ఒడిదుడులకు మధ్య కొనసాగుతుండగా.. టాటా,బిర్లా గ్రూపు కంపెనీల లాభాలు కేవలం8 సెషన్లలో భారీగా నష్టపోయాయి. భారీ అమ్మకాల నేపథ్యంలో దాదాపు అన్ని మేజర్ కంపెనీలు భారీగా పతనమవుతుండగా ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ మాత్రం స్వల్ప నష్టాలను పరిమితం కావడం విశేషం. నవంబరు 8-21 మధ్య కాలంలో టాటా గ్రూపులోని 27మంది వాటాదారులకు చెందిన 39,636 కోట్లు,టీసీఎస్ రూ.21,839 కోట్లు , టాటా మెటార్స్ రూ.8,954 కోట్లు, టైటాన్ రూ. 3,131 కోట్లు, టాటా స్టీల్ రూ.1,128 కోట్లు ఆవిరై పోయాయి. అలాగే బిర్లా గ్రూపునకు చెందిన అల్ట్రాటెక్ కూడా భారీగానే నష్టపోయింది. ఈ కంపెనీలో 62.26 వాటా కలిగివున్న ప్రమోటర్లు రూ.10,678 కోట్లు నష్టపోయారు. అలాగే గ్రాసిం ఇండస్ట్రీస్ వెయ్యికోట్లు, హిందాల్కో సుమారు 800 కోట్లను కోల్పోయాయి. మహేంద్ర గ్రూపు 6 వేలకోట్లు నష్టపోయింది. ఎంఅండ్ఎం, ఎంఅండ్ఎం ఫైనాన్షియల్ సంస్థ వాటాదారులరూ. 5278 కోట్ల పెట్టుబడులు గల్లంతయ్యాయి. కాగా రిలయన్స్ గ్రూపు 1.78 శాతం మాత్రమే నష్టపోయింది. మిగతా మార్కెట్ దిగ్గజ కంపెనీలతో పోలిస్తే ముఖ్యంగా ఆర్ఐఎల్ 1748కోట్లను, టీవీ18 రూ.704కోట్ల నష్టాలతో సరిపెట్టుకుంది. కాగా ఆపరేషన్ బ్లాక్ మనీ, అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బెంచ్ మార్క్ సెన్సెక్స్ కూడా 7శాతం పతనాన్ని నమోదుచేసింది. దీంతోపాటుగా నోట్ల రద్దు ప్రభావం, ఫెడ్ వడ్డీరేట్లు పెంచనుందనే అంచనాలతో దేశీయ కరెన్సీ విలవిల్లాడుతోంది. డాలర్ మారకపు రేటుతో రూపాయి రూ.68.50 వద్ద తొమ్మిది నెలల కనిష్టాన్ని నమోదుచేసిన సంగతి తెలిసిందే.