Internet
-
మొబైల్ ఇంటర్నెట్ కోసం నెలకు రూ. 50వేలు!.. ఎక్కడో తెలుసా?
ఆర్ధిక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్లో మరో సమస్య తలెత్తింది. ఇంటర్నెట్ వేగం బాగా తగ్గిపోతోంది. ఇది రోజువారీ కార్యకలాపాల మీద ప్రభావం చూపిస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని అక్కడి ప్రభుత్వం శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. ఇది త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.పాకిస్తాన్ ప్రభుత్వం శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసుకు ఆమోదం తెలిపితే.. దానికయ్యే ఖర్చును అక్కడి ప్రజలు భరించగలరా? అనేది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే.. శాటిలైట్ మొబైల్ ప్యాకేజీ ధర నెలకు ఏకంగా 50000 రూపాయలు. ఈ ధరతో ప్యాక్ కొనుగోలు చేస్తే ఇంటర్నెట్ స్పీడ్ 50 Mbps నుంచి 250 Mbps మధ్య ఉంటుందని తెలుస్తోంది. అయితే హార్డ్‌వేర్ కోసం మరో 120000 పాకిస్తానీ రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ధరకు ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.మనం రెసిడెన్షియల్ ప్యాకేజీ ప్లాన్ విషయానికి వస్తే.. దీనికోసం నెలకు 35 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంది. హార్డ్‌వేర్ కోసం ఒకేసారి దాదాపు 110000 పాకిస్తానీ రూపాయలు చెల్లించాలి. అయితే శాటిలైట్ ఇంటర్నెట్ బిజినెస్ ప్యాక్ ధర 95వేల రూపాయలు. ఈ ప్లాన్ ద్వారా యూజర్ 100-500 Mbps స్పీడ్ నెట్ పొందవచ్చు. దీని హార్డ్‌వేర్ కోసం 220000 పాకిస్తానీ రూపాయలు ఖర్చు చేయాలి.ఇంటర్నెట్ వేగం తగ్గడానికి కారణంపాకిస్తాన్లో ఇంటర్నెట్ వేగం తగ్గడానికి ప్రధాన కారణం.. సెన్సార్షిప్ అని చెబుతున్నారు. అయితే ప్రభుత్వం జలాంతర్గామి కేబుల్స్ కత్తిరించడం వల్ల ఇంటర్నెట్ వేగం తగ్గిందనే కారణమ్ కూడా వినిపిస్తోంది. ఈ సమస్యను నెమ్మదిగా ఇంటర్నెట్ వేగం సమస్యను అధిగమించడానికి, ప్రభుత్వం ఉపగ్రహ ఇంటర్నెట్ సేవను ప్రారంభించడానికి కృషి చేస్తోంది.ఇదీ చదవండి: 'ఉద్యోగాలు పోతాయనడం సరికాదు': ఏఐ సమ్మిట్‌లో మోదీ -
Safer Internet Day 2025 భద్రత... బాధ్యత... గౌరవం!
ఫిబ్రవరి 11న ప్రపంచవ్యాప్తంగా180 దేశాలు ‘సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవా’న్ని పాటిస్తున్నాయి. ఈ దినోత్సవం ఈ యేటి నినాదం ‘మెరుగైన ఇంట ర్నెట్ కోసం కలిసి రండి’. ఈ దిశలో ‘డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ నియమాలు-2025’ ముసాయిదాను ప్రజా సంప్రదింపుల కోసం భారత ప్రభుత్వం జనవరిలో విడుదల చేసింది. ఫిబ్రవరి 18 వరకు సూచనలు స్వీకరిస్తారు. వ్యక్తిగత సమాచార గోప్యత పౌరుల ప్రాథమిక హక్కుగా ఈ నియమాలు గుర్తిస్తాయి.అభ్యంతరకర సమాచారం, చిత్రాలు, వీడియోలను ఇంటర్నెట్, ఆన్లైన్ ప్లాట్ ఫామ్‌ల నుండి తొలిగించమని కోరే హక్కును డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ చట్టం–2023 సెక్షన్ 12 (3) కల్పిస్తుంది.ఇతర దేశాల్లో, ముఖ్యంగా యూరోపియన్ యూనియన్‌లో గోప్యతా చట్టాల కింద గుర్తించబడిన కీలకమైన హక్కు ఇది. ఉల్లంఘనలపై రూ. 50 కోట్ల జరిమానా విధించే అధికారం ‘డేటా పరిరక్షణ బోర్డుకు’ఉంటుంది. అంతేగాక, బాలల సమాచారాన్ని ఉపయోగించాలంటే తల్లిదండ్రుల అను మతి తప్పనిసరి. బాలల వ్యక్తిగత గోపనీయతకు, భద్రతకు నష్టం కలిగించేట్లు సమాచారాన్ని దుర్వినియోగం చేస్తే రూ. 200 కోట్ల జరిమానా విధించే అధికారం కూడా బోర్డుకు ఉంది. అనేక రూపాలలో బాలలు, మహిళలపై జరిగే హింసలో ఇటీవల అదనంగా చేరింది– సాంకేతిక (డిజిటల్) జెండర్ హింస. అభ్యంతరకర నగ్న చిత్రాలతో వేధింపులు (ఇమేజ్ బేస్డ్ అబ్యూజ్), బాలికలపై నేరాలు కొన్ని సార్లు వారి ఆత్మహత్యకు దారితీస్తున్నాయి. ఆస్ట్రేలియా, బ్రిటన్, దక్షిణ కొరియా వంటి దేశాలు ఆన్లైన్లో అభ్యంత రకర ఫోటో, వీడియోల తొలగింపు సులభతరం చేయడానికి ఎన్నో చర్యలు తీసు కున్నాయి. ఇందు కోసం ఆస్ట్రేలియా ప్రపంచంలోనే మొదటిగా ‘ఇ–సేఫ్టీ కమిష నర్’ అనే వ్యవస్థను చట్టబద్ధంగా నియమించింది. బ్రిటన్ ‘రివెంజ్ పోర్న్ హెల్ప్ లైన్’ రెండు లక్షల పైచిలుకు అభ్యంతర ఫోటోలను తొలగించింది. కొరియా ‘డిజిటల్ సెక్స్ క్రైమ్ విక్టిమ్ సపోర్ట్ సెంటర్’ ఫోటోల తొలగింపు గురించి ఫిర్యాదు రాకముందే గుర్తించి ముందస్తు తొలగింపు దిశగా పరిశోధన చేస్తోంది. భారత ప్రభుత్వం కూడా ‘నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్’ ఏర్పాటు చేసింది. ‘డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ నియమాల’ రూపకల్పన సాంకేతి కతతో సమాన వేగంతో జరగకపోతే సమాజం నష్టపోతుంది. సురక్షిత ఇంట ర్నెట్ దినోత్సవం స్ఫూర్తితో బాలలు, మహిళల గౌరవానికి, భద్రతకు పెద్దపీట వేయడం ద్వారా మాత్రమే భారతదేశం మరింత న్యాయమైన, వికసిత భవిష్యత్తు వైపు పురోగమిస్తుంది.– శ్రీనివాస్ మాధవ్, సమాచార హక్కు పరిశోధకులు(నేడు సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవం) -
నెట్టింట్లో... భద్రం బీ కేర్‌ఫుల్
తెల్లారి లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఇంటర్నెట్ ప్రపంచంలో ఉంటాం. మనకు అన్నీ తెలిసినట్లుగానే ఉంటుంది. అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉన్నట్లుగానే ఉంటుంది. అయినా సరే... ఏ ప్రమాదం ఎటు నుంచి వచ్చిపడుతుందో తెలియదు.ఇంటర్నెట్ వినియోగించడం ఎంత ముఖ్యమో, మనకు ఎలాంటి చేటు, నష్టాలు జరగకుండా ఉపయోగించడం అంతకంటే ముఖ్యం...‘సేఫర్ ఇంటర్నెట్ డే’ ను పురస్కరించుకొని మల్టీ మీడియా ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ ‘స్నాప్‌చాట్’ డిజిటల్ వెల్–బీయింగ్ ఇండెక్స్ (డిడబ్ల్యూబిఐ) మూడవ ఎడిషన్‌ను విడుదల చేసింది. మన దేశంలో డిజిటల్ విషయాలకు సంబంధించి అవగాహన ఉన్నప్పటికీ ఆన్లైన్ మోసాలు పెరుగుతున్నాయి అని ఈ నివేదిక తెలియజేసింది.మన దేశంతో సహా ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, యూఎస్‌లో నిర్వహించిన డిజిటల్ సేఫ్టీపై నిర్వహించిన సర్వేలో టీనేజర్లు, వారి తల్లిదండ్రులు, యువత... ఇలా ఎంతోమంది పాల్గొన్నారు.మన దేశం హైయెస్ట్ డిజిటల్ వెల్బీయింగ్ స్కోర్‌ను 67తో సాధించింది. ఇంటర్నెట్ భద్రతకు సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటున్న తల్లిదండ్రుల సంఖ్య పెరిగింది. డిజిటల్ శ్రేయస్సు (డిజిటల్ వెల్–బీయింగ్)కు సంబంధించి సానుకూల సూచికలు ఉన్నప్పటికీ ఆన్లైన్ బ్లాక్మెయిల్ లాంటివి మన దేశంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యక్తిగత, సన్నిహిత, ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తామని బెదిరించడం లాంటివి ఎక్కువ అవుతున్నాయి, ఆన్లైన్ భద్రతకు సంబంధించి పురోగతి, సవాళ్లను రెండిటినీ నివేదిక నొక్కి చెప్పింది.డిజిటల్ సేఫ్టీలో మన దేశం మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీ, ఆన్లైన్ బెదిరింపుల ప్రాబల్యం పెరగడంతో యువ యూజర్లు ప్రమాదాల బారినపడకుండా నిరంతర అవగాహన కలిగించాల్సిన అవపరం గురించి నివేదిక నొక్కి చెప్పింది. ఈ సంవత్సరం సేఫర్ ఇంటర్నెట్ డేకి సంబంధించిన థీమ్... ‘టుగెదర్, ఫర్ ఎ బెటర్ ఇంటర్నెట్’. -
మానసిక ఆరోగ్యమే మన భాగ్యం
‘‘మిమ్మల్ని శారీరకంగా, మేధోపరంగా, ఆధ్యాత్మికంగా బలహీనపరిచే ఏ విషయమైనా విషపూరితంగా భావించి తిరస్కరించండి’’. – స్వామి వివేకానంద నూరు శాతం ఆచరించి, అనుసరించి తీరాల్సిన వ్యాఖ్యలివి. మనల్ని క్రిందికి లాగి, ప్రతికూలతను వ్యాప్తి చేసే ఈ విషయంపైనైనా లోతైన ఆత్మపరిశీలన అవసరం. ఇక్కడ, ఇప్పుడు వివేకానందుని పిలుపును యువత తమ మానసిక ఆరోగ్యానికి కూడా వర్తింపజేయాల్సిన సమయమిది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన అంశం అయినందునే 2024–25 ఆర్థిక సర్వేలో ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. – సాక్షి, ఏపీ సెంట్రల్ డెస్క్ యువ భారత్ దారి ఎటు..? భారత్ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్ పురోగతి గురించి చర్చించేటప్పుడు దేశంలో అధికంగా ఉన్న యువశక్తి గురించి ప్రస్తావనకు వస్తుంది. అయితే ఈ యువత మెజారిటీ ఎటువైపు అడుగులు వేస్తోందన్నది ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న అంశం. సోషల్ మీడియాలో ఖాళీ సమయాన్ని గడపడం లేదా అరుదుగా వ్యాయామం చేయడం లేదా కుటుంబాలతో తగినంత సమయం గడపకపోవడం, గంటల కొద్దీ కూర్చున్నచోటు నుంచి లేవకుండా కంప్యూటర్ల ముందు పనిచేయడం యువత మానసిక ఆరోగ్యాన్ని దిగజార్చుతోంది. ఆరోగ్యమే మహాభాగ్యమన్న మన పెద్దల అనుభవ సారానికి తూట్లు పొడుస్తోంది. మన మూలాలవైపు ఇప్పుడు యువత తిరిగి చూడాల్సిన అవసరం ఉంది. ఇది యువతను అత్యున్నత స్థానానికి చేర్చడానికి వీలుకల్పిస్తుంది. భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థను నడిపించడానికి యువత మానసిక ఆరోగ్యం కీలకమైనదంటూ తాజా ఆర్థిక సర్వే విశ్లేషణను నిజం చేస్తుంది. జంక్ ఫుడ్.. ‘పాయిజన్’అల్ట్రా–ప్రాసెస్డ్ లేదా ప్యాక్డ్ జంక్ ఫుడ్‌ను చాలా అరుదుగా తినే వ్యక్తులు రెగ్యులర్‌గా తీసుకునే వారి కంటే మెరుగైన మానసిక స్థితిని కలిగి ఉంటారని ఆర్థిక సర్వే పేర్కొనడం గమనార్హం. సంపాదించిన డబ్బు.. వైద్యానికి సరిపోని పరిస్థితికి ఆహారపు అలవాట్లు కారణంగా మారుతుండడం గమనార్హం. మన సమాజంలో సంపాదన పెరుగుతున్నా, ఆరోగ్య సమస్యలతో చికిత్స ఖర్చులు పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ముఖ్యంగా, ఆహారపు అలవాట్లు ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. నిత్యం ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, అధిక చక్కెర, ఉప్పు, కొవ్వు ఉన్న ఆహార పదార్థాల వినియోగం పెరుగుతోంది.ఇవి ఊబకాయాన్ని, మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు వంటి అనేక ఆరోగ్య సమస్యలను పెంచుతున్నాయి. ఆరోగ్య సమస్యలు పెరగడంతో వైద్య ఖర్చులు కూడా అధికమవుతున్నాయి. ఫలితంగా, సంపాదించిన డబ్బు చాలాచోట్ల వైద్య ఖర్చులకే వెళ్లిపోతోంది. దీని వల్ల కుటుంబ ఆర్థిక స్థితి కూడా దెబ్బతింటోంది. సమతులమైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం తప్పనిసరి. సంపాదనను వైద్య ఖర్చులకు కాకుండా, మంచి జీవన విధానానికి ఉపయోగించుకోవడం మంచిది. మానసిక ఆరోగ్య పరిరక్షణలో ఇది కీలక అంశం. కింకర్తవ్యం..పిల్లలను, యుక్తవయసు్కలను ఇంటర్నెట్కు దూరంగా ఉంచడం, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారించాల్సిన తక్షణ తరుణమిది. స్నేహితులతో కలవడం, బయట ఆడుకోవడం, సన్నిహిత కుటుంబ బంధాలను ఏర్పరచుకోవడంలో సమయాన్ని వెచి్చంచడం వంటి ఆరోగ్యకరమైన కాలక్షేపాలను ప్రోత్సహించడానికి పాఠశాల, కుటుంబ–స్థాయి జోక్యాల తక్షణ అవసరం ఉంది. మానవ సంక్షేమం, మానసిక ఆరోగ్యం ఆర్థిక ఎజెండాలో కేంద్రంగా ఉండాలి. యువ జనాభా అధికంగా ఉండడం వల్ల ఎకానమీకి ఒనగూడే ప్రయోజనాలు ఊరికే ఊడిపడవు. విద్య, శారీరక ఆరోగ్యం, ముఖ్యంగా యువత మానసిక ఆరోగ్యం ఇక్కడ చాలా కీలకం. ఇందుకు ఆచరణీయమైన, ప్రభావవంతమైన వ్యూహాలు, చొరవలపై దృష్టి పెట్టాల్సిన తక్షణ అవసరం ఉంది. వినియోగం వివేకంతో ఉండాలి... రెండు దశాబ్ధాల క్రితం సెల్‌ఫోన్, సోషల్ మీడియా, ఇంటర్నెట్ వినియోగం చాలా తక్కువ. ఇప్పుడు పెరిగింది. సాంకేతిక పరిజ్ఞానం అన్ని స్థాయిల్లో ఎంతో ప్రయోజనాలను అందిస్తుంది. అయితే సాంకేతికత అతి, విచక్షణా రహిత వినియోగం అనర్థాలకు దారి తీస్తోంది. ఇప్పుడు పసితనం నుంచే పిల్లలకు సెల్ఫోన్లు, సోషల్ మీడియాను తల్లిదండ్రులు అలవాటు చేస్తున్నారు. పిల్లలు పెద్ద అయ్యే కొద్దీ అలవాటు వ్యసనంగా మారుతోంది. పెద్దలు సైతం సెల్‌ఫోన్, సోషల్ మీడియాకు బానిసలుగా మారుతున్నారు.ఈ వ్యసనం.. చేసే పని మీద ఏకాగ్రతను దెబ్బతీస్తోంది. పిల్లల చదువుల్లో, పెద్దలు చేసే పనుల్లో నాణ్యత, ఉత్పాదకత తగ్గిపోతోంది. సోషల్ మీడియాలో వచ్చే నెగెటివ్ కంటెంట్ ప్రతికూల ప్రభావం చూసి చాలా మంది మానసికంగా కుంగిపోతున్నారు. బలహీన మనస్కులు మరింత బలహీనంగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో సెల్‌ఫోన్, సోషల్ మీడియా అతిగా వినియోగించడాన్ని ‘బిహేవియరల్ అడిక్షన్’ అనే మానసిక రుగ్మతగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది.దీనికి చికిత్స అవసరం అని సైతం సూచించింది. తల్లిదండ్రులు చిన్న వయస్సు నుంచే పిల్లల ప్రవర్తనను నియంత్రిస్తుండాలి. పిల్లల్లో మానసిక పరిపక్వత వచ్చే వరకూ సెల్ఫోన్లు ఇవ్వద్దు. 18 ఏళ్ల లోపు పిల్లలకు సెల్‌ఫోన్ ఇవ్వాల్సి వస్తే స్కీన్ర్ సమయంపై నియంత్రణ ఉంచాలి. – డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, జాతీయ మానసిక వైద్యుల సంఘం పూర్వ అధ్యక్షులు ఇంటర్నెట్, సోషల్ మీడియా ప్రభావం పిల్లలు, యుక్తవయసు్కలలో మానసిక ఆరోగ్య సమస్యల పెరుగుదల తరచుగా ఇంటర్నెట్ ప్రత్యేకించి సోషల్ మీడియా మితిమీరిన వినియోగంతో ముడిపడి ఉందన్నది కాదనలేని విషయం. స్మార్ట్ఫోన్ల వ్యాప్తి, సోషల్ మీడియా, ఓవర్ ప్రొటెక్టివ్ పేరెంటింగ్ వంటి అంశాలు భావి భారత బాల్యాన్ని నిరాశాజనకంగా మార్చుతాయనడంలో సందేహం లేదు. బొమ్మరిల్లు సినిమాలో ఒక సందర్భంలో తండ్రితో హీరో ‘‘అంతా నువ్వే చేశావు’’ అన్న డైలాగ్‌ను ఇక్కడ మనం గుర్తుచేసుకోవాల్సిందే. ‘ది యాంగ్జియస్ జనరేషన్: హౌ ది గ్రేట్ రివైరింగ్ ఆఫ్ చి్రల్డన్ ఎపిడెమిక్ ఆఫ్ మెంటల్ డిసీజ్’ శీర్షికన ప్రఖ్యాత సామాజిక మనస్తత్వ శాస్త్రవేత్త జోనాథన్ హైద్ట్ రాసిన పుస్తకాన్ని ఎకనమిక్ సర్వే రిఫర్ చేయడం గమనార్హం. ‘‘ఫోన్ ఆధారిత బాల్యం’’ పిల్లల ఎదుగుదల అనుభవాలను అడ్డదారి పట్టిస్తుంది. ఇక చిన్న పిల్లలు ఏడుస్తుంటే చాలు.. వారికి మొబైల్ ఫోన్ ఇచ్చి బుజ్జగిస్తున్నాం. ఇది వారి మానసిక ఆరోగ్య అధోగతి పట్టడానికి తొలి మెట్టు. సమాజ పురోగతికి పునాది జీవితంలోని సవాళ్లను అధిగమించగలిగిన సామర్థ్యాన్ని మానసిక ఆరోగ్యం అందిస్తుంది. ప్రతి రంగంలో ఉత్పాదకత పురోగతికి దోహదపడే అంశం ఇది. ఇంతేకాదు, మానసిక–భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం, విజ్ఞాన సముపార్జన, సమాజ పురోగతికి వినియోగం, శారీరక సామర్థ్యాల సాధన... వంటి ఎన్నో ప్రయోజనాలను ఇక్కడ మనం ప్రస్తావించుకోవచ్చు. జీవనశైలి ఎంపిక, అరమరికలు లేని స్నేహపూర్వక కార్యాలయ పని సంస్కృతి, కుటుంబ పరిస్థితులు దేశ ఎకానమీ పురోభివృద్ధికి మార్గాలు. ఇంత ప్రాముఖ్యత ఉన్న అంశం కాబట్టే భారత్ ఆర్థిక ఆశయాలు నెరవేరాలంటే బాల్యం, యవ్వనం దశ నుంచే జీవనశైలి ఎంపికలపై తక్షణ శ్రద్ధ ఉంచాలని ఎకనమిక్ సర్వే గుర్తుచేసింది. -
నెట్ ఆగితే నష్టమే!
సాక్షి, హైదరాబాద్: నిరసనలు, ఆందోళనలు, ఎన్నికలు, మత ఘర్షణలు, చివరకు పరీక్షల సమయంలో సమాచారం, సందేశాల వ్యాప్తిని నిరోధించేందుకు ప్రాంతాల వారీగా ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడం, సామాజిక మాధ్యమాలను స్తంభింప జేయడం ఇటీవలి కాలంలో సాధారణ విషయమై పోయింది. రాష్ట్రం, దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఇది జరుగుతోంది. 2024లో 88,788 గంటల పాటు ఇంటర్నెట్ సేవలు, సామాజిక మాధ్యమాలు స్తంభించడంతో 60.48 కోట్ల మంది వినియోగదారులపై ప్రభావం పడినట్లు అంచనా. 28 దేశాల ఆర్థిక రంగంపై రూ.68,319 కోట్ల మేర ప్రభావం చూపించగా..మన దేశంలో రూ.279 కోట్ల మేర 6.77 కోట్ల మంది వినియోగదారులపై ప్రభావం చూపించినట్లుగా లెక్కలు వేశారు.ఇంటర్నెట్ సేవల నిలిపివేత కారణంగా నష్టపోతున్న దేశాల జాబితాలో భారత్ ఆరో స్థానంలో ఉండగా పొరుగు దేశం పాకిస్తాన్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. మయన్మార్ రెండు, బంగ్లాదేశ్ ఐదో స్థానంలో ఉన్నాయి. సామాజిక మాధ్యమాల్లో ‘ఎక్స్’, టిక్‌టాక్, సిగ్నల్ అత్యధిక గంటల పాటు స్తంభించిపోయాయి. ఇంటర్నెట్ నిలిపివేత డిజిటల్ ఎకానమీ, టూరిజం, స్టార్టప్ రంగాలపై ఎక్కువగా ప్రతికూల ప్రభావం చూపుతోంది. అలాగే విద్య, టెలీమెడిసిన్‌తో పాటు అత్యవసర సేవలపైనా ప్రభావం చూపుతోంది.పలు సంస్థల సూచికలు పరిగణనలోకి.. ఇంటర్నెట్ సేవల నిలిపివేతకు ప్రభుత్వాలు ఇచ్చే ఆదేశాల ద్వారా జరిగే నష్టాన్ని ప్రపంచ బ్యాంకు, ఇంటర్నేషనల్ టెలీ కమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ), యూరోస్టాట్, యూఎస్ సెన్సస్ తదితర సంస్థల సూచికలను ఆధారంగా చేసుకుని లెక్కిస్తారు. ప్రభుత్వాలు ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేయడం, సోషల్ మీడియా స్తంభన, ఇంటర్నెట్ స్పీడ్‌ను 2జీ స్థాయికి తగ్గించడం తదితరాలను పరిగణనలోకి తీసుకుని ఆర్థిక ప్రభావాన్ని అంచనా వేస్తున్నారు. ఇంటర్నెట్ నిలిపివేత, సామాజిక మాధ్యమాలను స్తంభింప చేసేందుకు ప్రభుత్వాలు తీసుకునే చర్యలను ఒక రకంగా ఇంటర్నెట్ సెన్సార్‌షిప్‌గా భావించవచ్చు.⇒ గత ఏడాది సెప్టెంబర్ మొదటి వారంలో కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఓ గిరిజన మహిళపై అత్యాచారం నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. పరిస్థితులను అదుపులోకి తెచ్చే చర్యల్లో భాగంగా పోలీసులు ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు. ⇒ వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో జిల్లా కలెక్టర్, అధికారులపై రైతుల దాడి నేపథ్యంలో.. శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని గత ఏడాది నవంబర్ 12న దుద్యాల ప్రాంతంలో కొద్ది గంటల పాటు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి.⇒ గత ఏడాది నవంబర్‌లో మత ఘర్షణలతో పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీదాబాద్‌లో, రెండు వర్గాల మధ్య హింస చెలరేగడంతో ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభాల్‌లో ఇంటర్నెట్ అందుబాటులో లేకుండా చేశారు. డిసెంబర్లో రైతుల నిరసనల నేపథ్యంలో హరియాణాలోని అంబాలాలో, జాతి ఘర్షణలు చెలరేగుతున్న మణిపూర్‌లో మరోసారి ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేకుండా పోయాయి.తరచూ స్తంభిస్తున్న ‘ఎక్స్’, ‘టిక్ టాక్’ ప్రాంతాల వారీగానే కాకుండా దేశ సార్వ¿ౌమత్వం, సమగ్రత, భద్రతకు ప్రమాదం పొంచి ఉందనుకున్న ఖాతాలపై ప్రభుత్వం దృష్టి పెడుతుంది. స్థానిక పరిస్థితుల ఆధారంగా కూడా నిర్ణయాలు తీసుకుంటారు. భారత్‌లో గత ఏడాది 28 వేలకు పైగా సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేయగా ఇందులో ఫేస్బుక్, ‘ఎక్స్’కు సంబంధించినవే సుమారు 10 వేల వరకు ఉన్నాయి.సామాజిక మాధ్యమ ఖాతాల తొలగింపులో.. అభ్యంతరకర సమాచారం ఉన్న యూట్యూబ్, ఇన్‌స్ట్రాగామ్, వాట్సాప్‌కు సంబంధించిన ఖాతాలు తర్వాతి స్థానంలో ఉన్నాయి. తొలగింపునకు గురైన వాటిలో ఎక్కువగా ఖలిస్తానీ అనుకూల సమాచారంతో కూడిన ఖాతాలతోపాటు విద్వేష ప్రసంగాలు, జాతీయ భద్రత, ప్రజల భద్రతకు ముప్పు కలిగించే రీతిలో ఉన్న ఖాతాలు ఉన్నాయి. -
స్పెక్ట్రమ్‌ను సమానంగా కేటాయించాలని డిమాండ్
బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరం (BIF) ప్రాతినిధ్యం వహిస్తున్న భారతదేశంలోని టెక్ సంస్థలు(Tech firms) 6 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ బ్యాండ్‌ను సమానంగా కేటాయించేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. స్పెక్ట్రమ్(Spectrum) 5జీ సేవలు, వై-ఫై రెండింటికీ ఈ బ్యాండ్ కీలకం కావడంతో దీని కేటాయింపుపై చర్చ తీవ్రమైంది.టెలికాం ఆపరేటర్లకు ప్రత్యేకంగా 6 గిగాహెర్ట్జ్ బ్యాండ్ (6425-7125 మెగాహెర్ట్జ్)లో ఎగువ భాగాన్ని కేటాయించేందుకు టెలికమ్యూనికేషన్ల శాఖ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ నిర్ణయంపై మెటా, అమెజాన్, గూగుల్‌తో సహా ఇతర టెక్ కంపెనీల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ విధానం వల్ల తమ వినియోగదారులకు పేలవమైన కనెక్టివిటీ ఉంటుందని ఆయా సంస్థలు వాదిస్తున్నాయి.టెక్ సంస్థల వాదనలుఇండోర్ కనెక్టివిటీ: ప్రస్తుతం 80% కంటే ఎక్కువ డేటా వినియోగం ఇండోర్(ఇంటి లోపల)లో ఉండే కస్టమర్ల ద్వారానే జరుగుతుంది. టెలికాం ఆపరేటర్లకు ఎక్కువ బ్యాండ్ కేటాయించడం వల్ల అధిక ఫ్రీక్వెన్సీ కారణంగా తమ సేవలు సమర్థంగా ఉండవని టెక్ కంపెనీలు చెబుతున్నాయి.ప్రపంచ దేశాల మాదిరగానే..: వై-ఫై, ఇన్నోవేషన్ కోసం అమెరికా సహా 84 దేశాలు 6 గిగాహెర్ట్జ్ బ్యాండ్‌లో 500 మెగాహెర్ట్జ్ లైసెన్స్ పొందాయి. వై-ఫై, మెరుగైన కనెక్టివిటీని అందించడానికి ఇండియాలోనూ ప్రపంచ దేశాల మాదిరిగానే వ్యవహరించాలని టెక్ సంస్థలు వాదిస్తున్నాయి.నేషనల్ డిజిటల్ ఎకానమీ: కేవలం టెలికాం ఆపరేటర్లకే అధిక బ్యాండ్(Band) కేటాయించడం సరికాదని అంటున్నాయి. విశ్వసనీయ డిజిటల్ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించే జాతీయ లక్ష్యానికి ఇది విరుద్ధమని టెక్ సంస్థలు భావిస్తున్నాయి.టెలికాం ఆపరేటర్ల వాదనలుస్పెక్ట్రమ్ కొరత: అంతరాయం లేని 5జీ సేవలను అందించడానికి స్పెక్ట్రమ్ కొరత ఉంది. దాన్ని పరిష్కరించడానికి 6 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ అవసరమని టెలికాం ఆపరేటర్లు అంటున్నారు.మౌలిక సదుపాయాలకు ఖర్చులు: వై-ఫై కోసం తక్కువ బ్యాండ్ కేటాయించడం వల్ల మౌలిక సదుపాయాల ఖర్చులు పెరుగుతాయి. సర్వీస్ క్వాలిటీ నిలిపేందుకు తక్కువ దూరాల్లో ఎక్కువ టవర్లు అవసరమవుతాయి.ఇదీ చదవండి: ఆర్బీఐ అంచనాలకు డేటా ఆధారిత విధానంప్రభుత్వ వైఖరి..టెలికాం శాఖ తన నిర్ణయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ కార్యదర్శుల కమిటీ వివరాల ప్రకారం బ్యాండ్‌లో ఎక్కువ విభాగాన్ని 5జీ, 6జీ వంటి అంతర్జాతీయ మొబైల్ టెలికమ్యూనికేషన్స్ (IMT) సేవల కోసం రిజర్వ్ చేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు సూచిస్తున్నాయి. ఈ విభాగంలో మరింత సమర్థంగా సేవలందేలా ఉపగ్రహ కార్యకలాపాలను అధిక కెయు-బ్యాండ్ (12 గిగాహెర్ట్జ్)కు మార్చాలని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. -
విమానంలోనూ వైఫై
దేశీయ ప్రయాణం కోసం విమానం ఎక్కుతున్నామంటే మన మొబైల్ ఫోన్లో ఫ్లైట్ మోడ్ ఆన్ చేయాల్సిందే. నో సిగ్నల్స్.. నో ఇంటర్నెట్... సెల్‌ఫోన్‌ని మడిచి లోపల పెట్టుకోవాల్సిందే. ఇది ఒకప్పటి మాట. కానీ ఇకమీదట... విమానంలో ప్రయాణిస్తూ ఇంటర్నెట్ ద్వారా సినిమాలు చూడొచ్చు. మీ బంధువులు, స్నేహితులతో వీడియో కాల్స్ మాట్లాడొచ్చు. ఆఫీస్ పని చేసుకోవచ్చు. ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది ఎయిర్ ఇండియా.దేశీయ విమాన ప్రయాణికులకు కొత్త ఏడాదిలో సరికొత్త కానుక అందిస్తోంది ఎయిర్ ఇండియా. దేశంలోనే మొట్టమొదటిసారిగా.. తమ విమానాల్లో ప్రయాణించే దేశీయ ప్రయాణికులకు వైఫై ద్వారా జనవరి 1 నుంచి ఈ సేవలు అందుబాటులోకి తెచ్చింది. ప్రారంభ ఆఫర్లా ఈ సదుపాయాన్ని కొంతకాలం ఉచితంగా అందిస్తోంది. ప్రస్తుతానికి కొన్ని సర్వీసులకే పరిమితమైన ఈ సౌకర్యం త్వరలో ఎయిర్ ఇండియాలోని అన్ని విమానాల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తారట. ఒకరు ఒకే సమయంలో ఒకటికంటే ఎక్కువ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల వంటివాటితోనూ కనెక్ట్ కావొచ్చు. ఇప్పటికే ఎయిర్ఇండియా న్యూయార్క్, లండన్, పారిస్, సింగపూర్ వెళ్లే విదేశీ విమానాల్లో పైలట్ ప్రోగ్రామ్‌గా ఈ సదుపాయం అందిస్తోంది.ఎయిర్ ఇండియా వైఫై ఇలా..ఈ సౌకర్యం వినియోగించుకోవాలంటే ప్రయాణికులు వైఫై ఆన్ చేసి, సెటింగ్స్‌లో ‘ఎయిర్ ఇండియా వైఫై నెట్వర్క్’ ఎంపిక చేసుకోవాలి. ఎయిర్ ఇండియా పోర్టల్‌కు వెళ్లాక పీఎన్ఆర్ వంటి వివరాలు ఇవ్వాలి. ఆ తరవాత ఇంటర్నెట్ సేవలు వాడుకోవచ్చు.ఏయే విమానాల్లో..?అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ఎయిర్‌బస్ ఎ350, బోయింగ్ 787–9, ఎంపికచేసిన ఎ321 నియో నియో విమానాలువిమానంలో నెట్ ఎలా?భూమ్మీద నెట్ వాడాలంటే మన చేతిలో ఒక ఫోనో ల్యాప్‌టాపో ఉండి.. సమీపంలో సెల్ టవర్ ఉంటే సరిపోతుంది. కానీ విమానం అలా కాదు కదా. విమానాల్లో వైఫై ద్వారా ఇంటర్నెట్ రావాలంటే 2 రకాల పద్ధతులు ఉన్నాయి. మొదటిది.. భూమిపై ఉండే సెల్ టవర్లు. దీన్నే ఎయిర్ టు గ్రౌండ్ (ఏటీజీ) టెక్నాలజీ అంటారు. ఇక రెండోది శాటిలైట్ ఆధారిత కనెక్షన్. ఈ రెండూ పనిచేయాలంటే విమానం లోపలా, బయటా ప్రత్యేక యాంటెనాల వంటి కొన్ని పరికరాలు అమర్చాలి. వైఫై లేనప్పుడు మన సమీపంలో ఎవరికైనా నెట్ కావాలంటే ఏం చేస్తాం? మన దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్లో హాట్‌స్పాట్ ఆప్షన్ ఆన్ చేసి నెట్ ఇస్తాం. మన ఫోన్ మరొకరికి హాట్ స్పాట్‌లా ఎలా మారుతుందో.. యాంటెనాలూ, సర్వర్లు, రౌటర్ల వంటి వాటితో ఉన్న విమానం వందలాది మంది ప్రయాణికులకు ఒక హాట్ స్పాట్‌లా మారిపోతుంది.సెల్ టవర్ సిగ్నల్స్ఈ సిగ్నళ్లు అందుకోడానికి విమానం కింది లేదా అడుగు భాగంలో యాంటెనాలు ఏర్పాటు చేస్తారు. విమానం భూమి మీద బయలుదేరగానే ఆ యాంటెనాలు.. సమీపంలోని సెల్ టవర్ల నుంచి సిగ్నళ్లు అందుకుంటాయి. ఆ సిగ్నళ్లు క్యాబిన్ సర్వర్‌కు, అక్కడి నుంచి రౌటర్‌కు వెళ్తాయి. అక్కడి నుంచి ప్రయాణికులకు వెళ్లి ఇంటర్నెట్ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తాయి.శాటిలైట్ సిగ్నల్స్సెల్ టవర్ల ద్వారా సిగ్నల్ అందు తున్నంతసేపూ ఎలాంటి ఇబ్బందీ ఉండదు. సముద్రాలు, ఎడారి ప్రాంతాల వంటి వాటి పైనుంచి వెళ్లేటప్పుడు సెల్ టవర్ సిగ్నళ్లు అందవు. శాటిలైట్ సిగ్నళ్ల సాయం కావాల్సిందే. ఇందుకోసం విమానం పై భాగంలో యాంటెనా లు ఏర్పాటుచేస్తారు. అవి తమకు అత్యంత సమీపంలోని శాటిలైట్‌తో అనుసంధానమవుతాయి. ప్రయాణికుల ఫోన్లు, ల్యాప్‌టాపుల వంటివి విమాన క్యాబిన్లో ఉండే వైఫై యాంటెనాకు కనెక్ట్ అవుతాయి.ఆ పరికరాల నుంచి ఈ యాంటెనాలకు వచ్చే సిగ్నళ్లు విమానంలోని సర్వర్‌కు వెళ్తాయి. విమానం పైన ఉండే యాంటెనా ద్వారా ఆ సిగ్నళ్లు శాటిలైట్‌కు వెళతాయి. శాటిలైట్ వాటిని భూమిపై ఉండే స్టేషన్ లేదా టెలిపోర్టుకు పంపితే అక్కడి నుంచి తిరిగి సిగ్నళ్లు శాటిలైట్‌కు అందుతాయి. వాటిని విమానానికి పంపుతుంది శాటిలైట్. శాటిలైట్ సిగ్నళ్లు విమానంలోకి క్యాబిన్ సర్వర్‌కు, అక్కడి నుంచి రౌటర్‌కు వెళ్తాయి. అలా ప్రయాణికులు నెట్ వాడుకోవచ్చు.ఏటీజీ – శాటిలైట్ఏటీజీ ద్వారా ఇంటర్నెట్ అంటే చాలా పరిమితులు ఉంటాయి. అంతరాయాలు ఎక్కువ, స్పీడు కూడా తక్కువ ఉండొచ్చు. కానీ, శాటిలైట్ కనెక్షన్ ద్వారా ఇంటర్నెట్లో అంతరాయాలు తక్కువని, స్పీడు కూడా ఎక్కువని అంతర్జాతీయ విదేశీ ప్రయాణికుల అనుభవాలు చెప్తున్నాయి.2003లో మొదటిసారిగా...⇒ 2003 జనవరి 15న జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ మొట్టమొదటగా తమ అంతర్జాతీయ విమానంలో ప్రయాణికులకు ఇంటర్నెట్ అందించింది.⇒ దేశీయ విమాన ప్రయాణికులకు (2013లో) ఇంటర్నెట్ అందించిన మొదటి సంస్థ అమెరికాకు చెందిన జెట్ బ్లూ.⇒ ప్రపంచంలో ప్రస్తుతంవైఫై ద్వారా ఇంటర్నెట్ అందిస్తున్న కొన్ని విమానయాన సంస్థలు నార్వేజియన్ ఎయిర్‌లైన్స్, ఫిలిప్పీన్స్ ఎయిర్‌లైన్స్, ఫిజి ఎయిర్వేస్, జెట్ బ్లూ, ఎమిరేట్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్, ఖతార్ ఎయిర్వేస్, డెల్టా ఎయిర్వేస్, మొదలైనవి.‘ప్రయాణాల్లో ఇప్పుడు ‘కనెక్టివిటీ’ తప్పనిసరి అవసరమైపోయింది. కొంతమంది సరదాకోసం, షేరింగ్ కోసం ఇంటర్నెట్ వాడితే, మరికొందరు తమ వృత్తి, వ్యాపార అవసరాల కోసం వాడుతుంటారు. ఎయిర్ ఇండియా ఈ సదుపాయం తీసుకొచ్చి విమానాల్లో సరికొత్త ప్రయాణ అనుభూతి అందిస్తోంది. – ఎయిర్ ఇండియా చీఫ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ అధికారి రాజేష్ డోగ్రా -
విమానాల్లో వైఫై.. ఫ్రీగా ఇంటర్నెట్
విమానయాన సంస్థ ఎయిరిండియా (Air India) దేశీ, విదేశీ రూట్లలో నడిపే ఫ్లయిట్స్‌లో వైఫై (Wi-Fi) ఇంటర్నెట్ కనెక్టివిటీ సర్వీసులను ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. ఎయిర్‌బస్ ఏ350, బోయింగ్ 787–9 రకం విమానాలతో పాటు నిర్దిష్ట ఎయిర్‌బస్ ఏ321నియో ఎయిర్‌క్రాఫ్ట్‌లలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.దేశీయంగా ఫ్లయిట్స్‌లో వైఫై సర్వీసులను ప్రవేశపెట్టిన తొలి విమానయాన సంస్థ తమదేనని ఈ సందర్భంగా కంపెనీ తెలిపింది. దేశీ రూట్లలో ప్రస్తుతానికి వీటిని కాంప్లిమెంటరీగా అందిస్తున్నట్లు వివరించింది. క్రమంగా అన్ని విమానాల్లోనూ ఈ సేవలు ప్రవేశపెడతామని పేర్కొంది.విమానాలు 10,000 అడుగుల ఎత్తు దాటాకా ప్రయాణికులు తమ ల్యాప్ టాప్‌లు, టాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లను వైఫైకి కనెక్ట్ చేసుకుని ఇంటర్నెట్ సేవలు ఆస్వాదించవచ్చు. ప్రస్తుతానికి ఈ సదుపాయాన్ని ఉచితంగానే అందుబాటులోకి తెచ్చినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించించింది.ఎయిర్ ఇండియా అంతర్జాతీయ రూట్లలో పైలట్ ప్రోగ్రామ్‌గా గతంలో ఈ సర్వీసును ప్రారంభించింది. వీటిలో న్యూయార్క్, లండన్, పారిస్, సింగపూర్ వంటి ప్రధాన గమ్యస్థానాలు ఉన్నాయి. ఇప్పుడు దేశీయ రూట్లలో కూడా దీన్ని అమలు చేస్తున్నారు. వై-ఫై సేవలను క్రమంగా ఇతర విమానాలకు కూడా విస్తరిస్తారు. -
సైబర్ దాడుల కలకలం.. మీరు ఈ సంస్థ రౌటర్లను వినియోగిస్తున్నారా?
వాషింగ్టన్: అమెరికాలో సైబర్ సెక్యూరిటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఇంటర్నెట్ రౌటర్ల ద్వారా సైబర్ దాడులు జరిగే ప్రమాదం ఉందనే సమాచారంతో చర్యలు ఉపక్రమించింది. సైబర్ సెక్యూరిటీ దాడులపై అమెరికా అప్రమత్తమైంది. టీపీ-లింక్ టెక్నాలజీ కార్పొరేషన్‌కు చెందిన ఇంటర్నెట్ రౌటర్లు సైబర్ దాడులతో ముడిపడి ఉన్నాయన్న ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఆ సంస్థపై నిషేధం విధించేందుకు అమెరికా అధికారులు పరిశీలిస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. అయితే చైనీస్ కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా తమ సంస్థ రూటర్లు ఉన్నాయని తెలిపారు. Mayorkas: “China has, in fact, hacked into our telecommunications providers…and the extent of it is quite serious…and it is still going on.”Their response? Publish a “best practices” document they hope people in positions of responsibility will read.pic.twitter.com/77Pg0tUvYG— Julia 🇺🇸 (@Jules31415) December 18, 2024దేశంలోని వాణిజ్యం, రక్షణ, న్యాయ శాఖలు టీపీ-లింక్ సంస్థపై విచారణ చేసేందుకు రంగంలోకి దిగాయి. అదే సమయంలో డ్రాగన్ దేశానికి చెందిన సదరు సంస్థ అమ్మే టీపీ-లింక్ ఇంటర్నెట్ రూటర్ అమ్మకాలపై బ్యాన్ విధించేలా అధికారులు చర్యలు తీసుకోననున్నట్లు తెలుస్తోంది.సైబర్ దాడులపై అనుమానంతో విచారణ చేపట్టేందుకు అమెరికా ప్రభుత్వ దర్యాప్తు ఏజెన్సీలు కంపెనీ వివరాలు చెప్పేందుకు టీపీ-లింక్ టెక్నాలజీ ఆశ్రయించారు. కానీ ఆ సంస్థ వివరాలు చెప్పలేదని సమాచారం. ఈ పరిణామంతో రక్షణ శాఖ సైతం చైనా కంపెనీ తయారు చేసిన రూటర్లపై ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించినట్లు అమెరికా మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. టీపీ-లింక్ రూటర్లను వినియోగిస్తే దేశంలో సైబర్ దాడులు జరిగే అవకాశం ఉందని, వెంటనే విచారణ చేపట్టాలని కోరుతూ అమెరికన్ చట్ట సభ్యులు అధ్యక్షుడు జోబైడెన్‌కు లేఖ రాశారు. అనంతరం జోబైడెన్ చైనా కంపెనీపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. -
Year Ender 2024: ‘జెన్ జెడ్’.. ఎందుకంత భిన్నం? ఏ తరం వారు ఏం చేస్తున్నారు?
ఈ ఆధునిక ఇంటర్నెట్ ప్రపంచంలో ఈ తరం యువత అన్నిరంగాల్లోనూ వేగంగా ముందుకు దూసుకుపోతోంది. ఇటీవలి కాలంలో ‘జెన్ జెడ్’ అనే పదం విరివిగా వాడుకలో ఉంది. జెన్ జెడ్ అంటే జనరేషన్ జెడ్. ఇదేమీ సాంకేతిక పదం కాదు. ఈ కాలం యువతకు ఈ పదం వర్తిస్తుంది. జనరేషన్ జెడ్‌పై 2024లో విపరీతంగా చర్చలు జరిగాయి.ఒక అమెరికన్ ఇన్స్టిట్యూట్ తెలిపిన వివరాల ప్రకారం, 1995 నుంచి 2012 మధ్య జన్మించిన పిల్లలను ‘జనరేషన్ జెడ్’ అని అంటారు. వీరు అధునాతన స్మార్ట్ఫోన్లు విరివిగా వినియోగించే ఇంటర్నెట్ యుగంలో జన్మించారు. ప్రపంచంలో సాంకేతిక అభివృద్ధిని పరిశీలిస్తే, అది 1995 సంవత్సరం తర్వాత అత్యంత వేగంగా పెరిగింది. స్మార్ట్ఫోన్లు, హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్లు విరివిగా అందుబాటులోకి వచ్చిన తరుణంలో పుట్టిన చిన్నారులు సాంకేతికంగా మరింత ముందడుగు వేస్తారని నిపుణులు అంటున్నారు. ఇంతేకాదు మునుపటి తరంతో పోలిస్తే, జెన్ జెడ్ కేటగిరీకి చెందినవారు మరింత స్నేహశీలురుగా మెలుగుతూ, ప్రపంచాన్ని భిన్నంగా చూస్తారని చెబుతున్నారు. మాట తీరు ఇంతకుముందు తరాలకు భిన్నంగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.జనరేషన్ జెడ్.. సంక్షిప్తంగా జెన్ జెడ్.. వ్యవహారికంగా జూమర్స్ అని ప్రస్తుత తరం యువతను పిలుస్తున్నారు. ఈ తరంలో జన్మించినవారు అంతకుముందు తరాలవారి వ్యవహరశైలికి భిన్నంగా ఉంటున్నారు. వీరి విద్యాభ్యాసం విషయానికొస్తే తమ ముందు తరాల కంటే కొంత భిన్నమైన విద్యావిధానాన్ని అనుసరిస్తున్నారు. ప్రస్తుతం జెన్ జెడ్ తరం వారు హైస్కూలు మొదలుకొని ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న వారిగా ఉన్నారు.వీరు ఆన్లైన్లో స్నేహితులను కలుసుకోవడానికి, భౌతికంగా స్నేహితులను కలుసుకోవడానికి మధ్య పెద్దగా తేడా చూపరు. ఈ కారణంగానే వారు అధికస్థాయిలో స్నేహితులను సంపాదించుకుంటున్నారు. ఇందుకు సాంకేతికను విరివిగా ఉపయోగిస్తున్నారు. జెన్ జెడ్ డిజిటల్ ప్రపంచాన్ని అభివృద్ధి చేయడంతోపాటు దానిని స్వీకరించిన మొదటి తరం. ఈ తరం డిజిటల్ ప్లాట్‌ఫారాలకు, సోషల్ మీడియాకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంటుంది.కరోనా కారణంగా లాక్డౌన్ విధించిన సమయంలో మిగిలిన తరాల వారు ఎంతో ఇబ్బంది పడినా జెన్ జెడ్ వర్గం వారు దానిని కష్టసమయంగా భావించలేదు. ఇంటర్నెట్ సహాయంతో వారు అనేక విషయాలు తెలుసుకున్నారు. మిగిలిన తరాలకు భిన్నంగా ఆలోచిస్తూ జెన్ జెడ్ వర్గంవారు ముందుకు దూసుకుపోతున్నారు. మిగిలిన తరాల కన్నా జెన్ జెడ్వర్గం తక్కువ ఒత్తిడికి గురవుతున్నదని పరిశోధనల్లో తేలింది. ఇంతకుముందు తరాలవారిని ఏ పేరుతో పిలుస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.ది గ్రేటెస్ట్ జనరేషన్ (1901 నుండి 1927 మధ్యకాలంలో జన్మించనవారు) వీరు తమ బాల్యంలో యుద్ధం, వ్యాధులు, ఆర్థిక కష్టనష్టాల వంటి సవాళ్లను ఎదుర్కొన్నారు.సైలెంట్ జనరేషన్ (1928 నుండి 1945 మధ్యకాలంలో జన్మించినవారు)ఈ తరంలోనివారు ప్రపంచ యుద్ధాన్ని, బానిసత్వాన్ని చవిచూసారు. దేనికీ స్పందించకుండా, నిరసించకుండా అన్యాయాన్ని భరిస్తూ వచ్చినందున ఈ జనరేషన్ వారిని సైలెంట్ జనరేషన్ అని సంబోధిస్తున్నారు.బేబీ బూమర్ జనరేషన్(1946 నుండి 1964 మధ్యకాలంలో జన్మించినవారు) ఈ తరాన్ని ఆధునిక యుగానికి నాందిగా చెబుతారు. రాక్ అండ్ రోల్, హిప్పీ సంస్కృతి, సినిమా, కళ, సంగీతానికి కొత్త మెరుగులు దిద్దిన ఘనత ఈ తరానికి చెందుతుంది. ప్రస్తుతం, ఈ తరానికి చెందిన వారు పాత- కొత్త తరాలకు అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తున్నారు.జనరేషన్ ఎక్స్ (1965 నుండి 1980 మధ్య కాలంలో పుట్టినవారు) బేబీ బూమర్ల మాదిరిగానే, ఈతరం వారు కూడా ఆధునిక యుగానికి నాందిగా నిలిచారు. ఈ తరం వారు పాత- కొత్త తరాలకు వారధులుగా ఉన్నారు.మిలీనియల్స్(1981 నుండి 1996 మధ్యకాలంలో జన్మించినవారు) ఈ తరం వారు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని జీవితంలో గణనీయమైన మార్పులను చూశారు. ఈ మార్పులకు అనుగుణంగా జీవితాలను మలచుకున్నారు. మునుపటి తరాలతో పోలిస్తే ప్రపంచంపై ప్రత్యేకమైన దృక్పథాన్ని ఏర్పరుచుకున్నారు.జనరేషన్ జెడ్ (1997 నుండి 2012 మధ్యకాలంలో పుట్టినవారు)1995 నుంచి 2012 మధ్య జన్మించిన వారిని జనరేషన్ జెడ్ అని అంటారు. ఆధునిక, సాంకేతిక సౌకర్యాలను అందిపుచ్చుకోవడంలో వీరు ముందున్నారు.జనరేషన్ ఆల్ఫా (2013 నుండి 2025 మధ్య కాలానికి చెందినవారు) జనరల్ ఆల్ఫా పిల్లలు అధునాతన సాంకేతికతకు చిన్నవయసులోనే అలవాటుపడతారు. ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, సోషల్ మీడియాను అంటిపెట్టుకుని ఉంటారు. జెన్ ఆల్ఫాతరం వారు 21వ శతాబ్దపు అతి పిన్న వయస్కులైన వారిగా పరిగణిస్తున్నారు. ఇది కూడా చదవండి: బోరుబావి ప్రమాదాలకు అంతం లేదా? నాలుగేళ్లలో 281 మంది చిన్నారులు మృతి -
26 ఏళ్ల తర్వాత.. అక్షరం పొల్లు పోకుండా జరిగింది!
ప్రపంచ కుబేరుడు ఇలాన్ మస్క్ (Elon Musk) తన ఎక్స్ ఖాతాలో ఓ పాత వీడియోను షేర్ చేశారు. ఇందులో ఇంటర్నెట్ అనేది.. మీడియాలో విప్లవాత్మక మార్పులు తెస్తుందని పేర్కొన్నారు. 1998లో చెప్పిన ఆ మాటలే నేడు నిజమయ్యాయి.26 సంవత్సరాల క్రితం 1998లో 'మస్క్'ను ఒక ఇంటర్వ్యూయర్ ఇంటర్నెట్ భవిష్యత్తు గురించి ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ''ఇంటర్నెట్ అన్ని మీడియాల సూపర్‌సెట్ అని నేను భావిస్తున్నాను" అని మస్క్ పేర్కొంటూ.. మీడియాకు ఇంధనం ఇంటర్నెట్ అని వివరించారు.ఇంటర్నెట్.. వినియోగదారులు తాము చూడాలనుకుంటున్న వాటిని ఎంచుకోవడానికి అనుమతిస్తుంది. ఇది తప్పకుండా సాంప్రదాయ మీడియాలను విప్లవాత్మకంగా మారుస్తుందని మస్క్ స్పష్టం చేశారు. అప్పుడు నేను చెప్పిన మాటలకు చాలామంది నన్ను వెర్రివాడిగా భావించారని మస్క్ లేటెస్ట్ ట్వీట్లో పేర్కొన్నారు.స్పేస్ఎక్స్ స్టార్‌లింక్ ప్రాజెక్ట్ఇలాన్ మస్క్ ప్రపంచవ్యాప్తంగా హై-స్పీడ్ ఇంటర్నెట్ను అందించాలని లక్ష్యంతో స్పేస్ఎక్స్ స్టార్‌లింక్ ప్రాజెక్ట్ ప్రారభించారు. అపరిమిత డేటా మాత్రమే కాకుండా.. రిమోట్ ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ సర్వీస్ అందించడమే దీని లక్ష్యం. భారత్‌లో.. స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయానికి సంబంధించిన అధికారిక సమాచారం వెల్లడికాలేదు. ఇది రిలయన్స్ జియో, ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా మారుతుంది.ఇదీ చదవండి: తండ్రి బిలియనీర్.. భార్య మిస్ ఇండియా.. అతడెవరో తెలుసా?ఏఐపై మస్క్ వ్యాఖ్యలుఇంటర్నెట్ గురించి మాత్రమే కాకుండా కృత్రిమ మేధస్సు (AI) గురించి కూడా మస్క్ గతంలోనే వ్యాఖ్యానించారు. ఏఐ ఉద్యోగాలను తొలగిస్తుందని అంచనా వేశారు. భవిష్యత్తులో బహుశా ఎవరికీ ఉద్యోగాలు ఉండకపోవచ్చని అన్నారు. ఏఐ, రోబోలు ప్రజలకు అవసరమైన అన్ని వస్తువులు.. సేవలను అందజేస్తాయని ఆయన విశ్వసించారు.The crazy thing is that they thought I was crazy for stating this super obvious predictionpic.twitter.com/OK0akTRj3E— Elon Musk (@elonmusk) December 10, 2024 -
8 నెలల్లో ఇంటింటికీ ఇంటర్నెట్
సాక్షి, హైదరాబాద్: టీ–ఫైబర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోని అన్ని ఇళ్లకు వచ్చే 6–8 నెలల్లో తక్కువ ధరకే హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీతోపాటు డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నామని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు ప్రకటించారు. దీనివల్ల ప్రతి ఇంట్లో టీవీ, ఇంటర్నెట్, టెలిఫోన్‌తోపాటు కంప్యూటర్ ఆధారిత అన్ని రకాల సేవలు అందుబాటులో వస్తాయన్నారు.ఇప్పటికే అన్ని గ్రామాలకు ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్వర్క్ ఏర్పాటు పనులు పూర్తికావొచ్చాయని చెప్పారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో మద్దూరు (కొడంగల్ నియోజకవర్గం), సంగంపేట (అందోల్), అడవి శ్రీరాంపూర్ (మంథని) గ్రామాల్లో ప్రయోగాత్మకంగా అమల్లోకి తెచ్చిన టీ–ఫైబర్ ఇంటర్నెట్ సేవలను మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామస్తులతో వర్చువల్‌గా సంభాషించి అభినందనలు తెలిపారు. అలాగే పరిశ్రమల శాఖ ప్రవేశపెట్టిన పలు యాప్‌లను ఆయన ఆవిష్కరించారు. ఇక 2 రోజుల్లో పంట రుణాలు.... రైతులు పంట రుణాలు పొందడానికి ప్రస్తుతం 30 రోజుల సమయం పడుతుండగా కొత్తగా ఆవిష్కరించిన స్మార్ట్ అగ్రి క్రెడిట్ సర్విస్ యాప్ ద్వారా కేవలం 2 రోజుల్లోనే పొందవచ్చని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. అలాగే రైతులు వాయిస్ కమాండ్ ద్వారా ఎరువులు, క్రిమికీటకాల నివారణ వంటి అంశాల్లో సూచనలను సైతం పొందవచ్చని చెప్పారు. డ్రగ్స్పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కలి్పంచడానికి తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో ‘మిత్ర–తెలంగాణ’అనే మరో యాప్‌ను తీసుకొచ్చామన్నారు. ఇక యాప్ ద్వారా మీ–సేవ మీ–సేవ విస్తరణలో భాగంగా స్టడీ గ్యాప్ సర్టిఫికెట్, పేరు మార్పు, లోకల్ క్యాండిడేట్, మైనారిటీ, ఇన్కమ్, క్యాస్ట్, క్రీమీలేయర్/నాన్ క్రీమీలేయర్ సరి్టఫికెట్లతోపాటు సీనియర్ సిటిజన్స్ మెయింటెనెన్స్ ఫిర్యాదులు, వణ్యప్రాణుల దాడిలో మరణించే వ్యక్తులు, పశువులకు నష్టపరిహారం, టింబర్ డిపో/సామిల్స్‌కు పరి్మట్ల జారీ/రెన్యూవల్ కలిపి మొత్తం 9 సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని శ్రీధర్‌బాబు తెలిపారు.కొత్తగా ఆవిష్కరించిన మీ–సేవ యాప్, ‘కియోస్‌్క’లతో సైతం ఇప్పటికే మీ–సేవ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న 400కిపైగా సేవలను ప్రజలు పొందొచ్చని వివరించారు. టీ–వర్క్స్–బిట్స్ పిలానీ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెంటర్ ఫర్ రీసెర్చ్ ఎక్సలెన్స్ ఇన్ నేషనల్ సెక్యూరిటీ(సీఆర్‌ఈఎన్‌ఎస్)ని మంత్రి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్య అన్వేషణ, అభివృద్ధికి ‘రూరల్ వర్క్స్’ అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామన్నారు.రూ. 7,592 కోట్ల పెట్టుబడులతో 3 మెగా పరిశ్రమలురాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, విస్తరణకు రూ. 7,592 కోట్ల పెట్టుబడులతో ముందుకొచ్చిన 3 కంపెనీలతో మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో పరి శ్రమల శాఖ 4 పరస్పర అవగాహన ఒప్పందా (ఎంవోయూ)లు కుదుర్చుకుంది. ఆయా సంస్థల ఏర్పాటుతో 5,200 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడారు. సీతారాంపూర్‌లో 4 గిగావాట్ల సౌర విద్యుత్ పరికరాల తయారీ పరిశ్రమను నిర్వహిస్తున్న ‘ప్రీమియర్ ఎనర్జీస్’.. వ్యాపార విస్తరణలో భాగంగా రూ. 1,950 కోట్లతో సోలార్ ఇంగాట్స్ అండ్ అల్యూమినియం ప్లాంట్ ఏర్పా టు చేసేందుకు, మరో రూ. 3,342 కోట్ల పెట్టుబడితో 4 గిగావాట్ల సోలార్ పీవీ టాప్కాన్ సెల్, 4 గిగావాట్ల సోలార్ పీవీ టాప్కాన్ మాడ్యూల్స్ తయారీ యూనిట్ల స్థాపనకు ముందుకొచ్చిందన్నారు.అలాగే రూ. 1,500 కోట్లతో ‘లెన్స్‌కార్ట్’ప్రపంచంలోనే అతిపెద్ద కళ్లద్దాలు, అనుబంధ ఉత్ప త్తుల తయారీ హబ్‌ను ఫ్యాబ్‌సిటీలో ఏర్పాటు చేయనుందని వివరించారు. ఆజా ద్ ఇంజనీరింగ్ సంస్థ ఘణపూర్‌లో రూ. 800 కోట్లతో సూపర్ అల్లాయ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుందని చెప్పారు. రాష్ట్రంలో ప్రగతిని అడ్డుకోవడానికి చాలా మంది విషప్రచారం చేసినా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు తాము తెచ్చిన పాలసీకి విశేష స్పందన లభిస్తోందన్నారు. రాష్ట్రంలో త్వరలో 2 వేల ఎకరాల్లో రూ. 1,500 కోట్లతో కొత్తగా 12 మినీ ఇండస్ట్రీయల్ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు శ్రీధర్‌బాబు తెలిపారు. -
డిజిటల్ అక్షరాస్యత..వెనుకబాటులో యువత!
అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో దేశ యువత వెనుకబడుతోంది. డిజిటల్ అక్షరాస్యతలో 15–29 ఏళ్ల మధ్య వయస్కుల్లో కేవలం మూడింట ఒక వంతు కంటే తక్కువ మంది మాత్రమే ఇంటర్నెట్ను సమర్ధంగా శోధిస్తున్నారు. ఇందులో ఈ–మెయిల్ పంపడం, పరిశీలించడం, ఆన్లైన్ లావాదేవీలకే పరిమితమవుతున్నారు. ఇది గణనీయమైన డిజిటల్ వెనుకంజను సూచిస్తోందని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్వో) తమ సమగ్ర వార్షిక మాడ్యులర్ 2022–23 (సీఏఎంఎస్) సర్వే స్పష్టం చేసింది. ఇంటర్నెట్ శోధన నాణ్యమైన విద్య, విజ్ఞానాన్ని ప్రతిబింబిస్తుందని నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. – సాక్షి, అమరావతిస్వీయ అధ్యయనానికి ఇంటర్నెట్ విద్యార్థుల స్వీయ అధ్యయనానికి ఇంటర్నెట్ ఎంతగానో దోహదపడుతుందని విద్యావేత్తలు చెబుతున్నారు. విద్యా వెబ్సైట్లు, పరిశోధన పత్రాలు, ఆన్లైన్ లైబ్రరీల ద్వారా ప్రపంచ సమాచారాన్ని సేకరించుకునే విధానం విద్యార్థులకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచిస్తున్నారు. సంప్రదాయ అభ్యాసానికి అనుబంధంగా ఇంటర్నెట్ యాక్సెస్ ఉండటంతో.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, నిపుణుల మధ్య సహకారాన్ని సులభతరం చేస్తోందని పేర్కొంటున్నారు. డిజిటలైజేషన్, డిజిటల్ స్కిల్స్‌లో ప్రావీణ్యం ఉన్న విద్యార్థులకు జాబ్ మార్కెట్లో ప్రాధాన్యం పెరుగుతోందని చెబుతున్నారు. గోవా ముందంజ.. మేఘాలయ వెనుకంజ దేశంలోని విద్యార్థుల్లో డిజిటల్ సామర్థ్యాల లేమిని సర్వే నొక్కి చెప్పింది. ఇది పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య వ్యత్యాసాన్ని బహిర్గతం చేసింది. పట్టణ ప్రాంతంలోని పురుషులు డిజిటల్ ప్రావీణ్యంలో అగ్రగామిగా ఉండగా, గ్రామీణ మహిళలు చాలా వెనుకంజలో ఉన్నారు. ఈ నివేదిక ప్రకారం 15–24 వయసు్కల్లో 26.8శాతం, 15–29 వయస్కుల్లో 28.5 శాతం, 15 ఏళ్లు పైబడిన వారిలో 25 శాతం మాత్రమే ఆన్లైన్లో సమాచారాన్ని సమర్థంగా శోధించగలుగుతున్నారు. 15–29 వయసు్కల్లో స్త్రీలు కేవలం 14.5 శాతం మాత్రమే ఇంటర్నెట్లో శోధన, ఈ–మెయిల్, ఆన్లైన్ లావాదేవీలు చేస్తున్నారు. డిజిటల్ అక్షరాస్యతలో గోవా, కేరళ మెరుగ్గా ఉంటే మేఘాలయ, త్రిపుర అత్యంత పేలవ ప్రదర్శన కనబరిచాయి. ఇంటర్నెట్ శోధన, ఈ–మెయిల్, ఆన్లైన్ లావాదేవీలు నిర్వహించగల 15–29 వయసు కలిగిన విద్యార్థుల జాతీయ సగటు 28.5శాతం ఉంది. ఈ పనులు చేయడంలో 65.7 శాతంతో గోవా అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత 53.4 శాతంతో కేరళ, 48 శాతంతో తమిళనాడు, 47.2శాతంతో తెలంగాణ, 32.5 శాతంతో ఏపీ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో 16శాతం మాత్రమే ఉండటం గమనార్హం. -
పశ్చిమ బెంగాల్: ఇరువర్గాల మధ్య చెలరేగిన హింస.. నిషేదాజ్ఞలు అమలు
ముర్షిదాబాద్: పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలోని బెల్దంగా ప్రాంతంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో పరిస్థితులను చక్కదిద్దేందుకు పోలీసు అధికారులు ఆ ప్రాంతంలో నిషేధాజ్ఞలు విధించారు. డిజిటల్ డిస్ప్లే బోర్డులో అభ్యంతరకర మెసేజ్ వచ్చిన నేపధ్యంలో ఈ ఘర్షణలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పోలీసులు ఇప్పటివరకూ 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు.బెల్దంగాలో జరిగిన ఘర్షణల్లో కొందరికి స్వల్ప గాయాలైనట్లు పోలీసు అధికారి తెలిపారు. ఘర్షణలు చోటుచేసుకున్న ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. కార్తీకమాస పూజల వేదిక సమీపంలోని గేటు వద్ద ఏర్పాటు చేసిన డిస్ప్లే బోర్డుపై ఉన్న సందేశం ఒక వర్గానికి ఆగ్రహం తెప్పించింది. ఈ నేపధ్యంలోనే ఇరు వర్గాల మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి. ఇరువర్గాల వారు ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఒక పోలీసు వాహనంపై కూడా దాడి జరిగింది. ఈ నేపధ్యంలో పోలీసులు లాఠీచార్జి చేశారు. పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చినప్పటికీ ఉద్రిక్తత కొనసాగుతోంది.ఈ ఘర్షణల కారణంగా సీల్దా నుంచి ముర్షిదాబాద్ వెళ్తున్న భాగీరథి ఎక్స్‌ప్రెస్ కొన్ని గంటలపాటు నిలిచిపోయింది. ఈ ఘటనకు మమతా బెనర్జీ ప్రభుత్వమే కారణమని బీజేపీ ఆరోపించింది. కాగా తృణమూల్ కాంగ్రెస్ నేత ఒకరు మాట్లాడుతూ ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, ఈ అల్లర్లకు పాల్పడినవారిని గుర్తించి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్నారు.ఇది కూడా చదవండి: స్విమ్మింగ్ పూల్‌లో గంతులేస్తూ.. -
రూ.11తో 10 జీబీ డేటా!
రిలయన్స్ జియో వినియోగదారులకు కొత్తగా బూస్టర్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎక్కువగా డేటా వాడుకునే కస్టమర్లకు ఈ ప్లాన్ ఎంతో ఉపయోగమని కంపెనీ తెలిపింది. ఈమేరకు ప్లాన్ వివరాలు వెల్లడించింది.కేవలం రూ.11తో 10 జీబీ 4జీ డేటా వాడుకోవచ్చు.ఈ ఆఫర్ వ్యాలిడిటీ కేవలం ఒక గంట మాత్రమే ఉంటుంది.రీఛార్జ్ చేసుకున్న గంట తర్వాత డేటా స్పీడ్ 64 కేబీపీఎస్‌కు తగ్గిపోతుంది.ఈ ఆఫర్ కేవలం ఇంటర్నెట్ సర్వీసుకే పరిమతం. వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ సర్వీసులను ఇది అందించదు.నిర్ణీత సమయంపాటు హైస్పీడ్ డేటా అవసరమయ్యేవారికి ఈ ఆఫర్ ఎంతో ఉపయోగమని కంపెనీ తెలిపింది.లార్జ్ ఫైల్స్ లేదా సాఫ్ట్వేర్ అప్డేట్లు, డౌన్లోడ్ చేయాలనుకొనేవారికి ఈ ప్లాన్ ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పింది.ఇదీ చదవండి: సీపీఐ నుంచి ఆహార ద్రవ్యోల్బణం మినహాయింపు? -
Internet Day: మొదటి ఎలక్ట్రానిక్ సందేశం చేరిందిలా..
ఈ రోజు (అక్టోబర్ 29) అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవం. ప్రపంచంలో ఇంటర్నెట్ వినియోగానికున్న ప్రాధాన్యతను గుర్తు చేసుకునేందుకే అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1969, అక్టోబర్ 29న ఒక కంప్యూటర్ నుండి మరొక కంప్యూటర్‌కు మొదటి ఎలక్ట్రానిక్ సందేశాన్ని పంపారు. నాడు ఇంటర్నెట్ను అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ నెట్వర్క్(ఆర్పానెట్) అని పిలిచేవారు.ఇంటర్నెట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను కనెక్ట్ చేసింది. ఎటువంటి సమాచారాన్నయినా తక్షణమే అందుకునేలా చేసింది. వివిధ రంగాలలో వినూత్న ఆవిష్కరణలకు నాంది పలికింది. మొదటి ఎలక్ట్రానిక్ సందేశాన్ని 1969లో అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన చార్లెస్ .. స్టాన్ఫోర్డ్ పరిశోధనా సంస్థకు పంపారు. ఇది గ్లోబల్ నెట్వర్క్ అభివృద్ధికి పునాది వేసింది. అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా 2005 నుంచి అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవాన్ని జరపుకుంటున్నారు.అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవం సందర్భంగా, ఇంటర్నెట్ చరిత్రకు సంబంధించిన అంశాలను వివిధ పత్రికల్లో ప్రచురిస్తుంటారు. టెక్ ఔత్సాహికులు ఈరోజున కొత్త ఆన్లైన్ పరికరాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. కొందరు వర్చువల్ సెమినార్లు ఏర్పాటు చేస్తారు. నేడు పాఠశాలలలో పాటు వివిధ సంస్థలలో డిజిటల్ అక్షరాస్యత, సైబర్ భద్రత, ఇంటర్నెట్ భవిష్యత్తుపై చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.ఇది కూడా చదవండి: రతన్ టాటా గౌరవార్థం: లండన్‌లో.. -
గ్రామీణ బ్రాడ్‌బ్యాండ్ విస్తరణకు ఏం చేయాలంటే..
గ్రామీణ బ్రాడ్‌బ్యాండ్ విస్తరణ కోసం ప్రభుత్వం ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను (ఐఎస్పీ) ప్రోత్సహించాలని, వారికి పన్ను మినహాయింపులు ఇవ్వాలని బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరమ్ (బీఐఎఫ్) కోరింది. గతేడాదితో పోలిస్తే 20 శాతం గ్రామీణ వినియోగదారులను పెంచుకున్న కంపెనీలకు రివార్డులు ప్రకటించాలని తెలిపింది.ఈ సందర్భంగా బీఐఎఫ్ ఛైర్పర్సన్ అరుణా సౌందరరాజన్ మాట్లాడుతూ..‘దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఒక ట్రిలియన్ డాలర్ల(రూ.84 లక్షల కోట్లు) మార్కు చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2026-27 నాటికి జీడీపీలో 20 శాతం ఈ వ్యవస్థ తోడ్పటును అందించాలని నిర్ణయించారు. కాబట్టి ఈ వ్యవస్థ వృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందించాలి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని వారికి వేగవంతమైన నెట్వర్క్ సౌకర్యాలు కల్పించాలి. ఈ రంగంలో దేశమంతటా స్థిరమైన బ్రాడ్‌బ్యాండ్ మౌలిక సదుపాయాలను విస్తరించాలి’ అన్నారు.ఇదీ చదవండి: ‘అలాంటివారిని ఇప్పటి వరకు చూడలేదు’‘ప్రస్తుతం దేశంలో డిజిటల్ వృద్ధికి సంబంధించి మొబైల్ వ్యవస్థ మొదటి స్థానంలో ఉంది. 95.6% మంది వినియోగదారులు మొబైల్ ఇంటర్నెట్పై ఆధారపడుతున్నారు. వైర్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్‌ను ఉపయోగిస్తున్న వారి సంఖ్య 4.3% మాత్రమే. వేగవంతమైన ఇంటర్నెట్కు, మొబైల్ కనెక్టివిటీ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్థిర బ్రాడ్‌బ్యాండ్ అవసరం. కాబట్టి ఈ వ్యవస్థలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. గ్రామీణ చందాదారులలో గణనీయమైన వృద్ధిని సాధించే ఐఎస్పీలకు పన్ను మినహాయింపులు ఇవ్వాలి. బ్రాడ్‌బ్యాండ్ కంపెనీలను ప్రధాన మంత్రి వై-ఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ (పీఎం-వాణి) వంటి కార్యక్రమాలతో అనుసంధానించాలి. గ్రామీణ ప్రాంతాల్లో శాటిలైట్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్‌కు కూడా ప్రభుత్వం సహకరించాలి’ అన్నారు. -
‘నెట్టింట’ యువతరం
స్మార్ట్‌ఫోన్ సాయంతో యువతకు ఇంటర్నెట్ చేరువ అయింది. గ్రామీణ ప్రాంతాల్లో 82 శాతం మంది (15–24 ఏళ్ల వయసులోని వారు), పట్టణాల్లో 92 శాతం మంది ఇంటర్నెట్ను వినియోగిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ సర్వేలో తెలిసింది. 15–24 ఏళ్ల వయసులోని 95.7 శాతం గ్రామీణ యువత మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్నారు. పట్టణాల్లో ఇది 97 శాతంగా ఉంది. కేంద్ర ప్రణాళికలు, కార్యక్రమాల అమలు శాఖ ‘కాంప్రహెన్సివ్ యాన్యువల్ మాడ్యులర్ సర్వే’ (సీఏఎంఎస్) వివరాలను విడుదల చేసింది. 79వ జాతీయ శాంపిల్ సర్వే (ఎన్ఎస్ఎస్)లో భాగంగా ఇది జరిగింది. ఇదీ చదవండి: గాల్లో ఎగిరిన ‘టాటా సుమో’.. ఆ పేరు ఎలా వచ్చిందంటే..సర్వే వివరాలు..15–24 ఏళ్లలోని 78.4 శాతం యువత అటాచ్డ్ ఫైల్స్‌తో మెస్సేజ్‌లు పంపుకుంటున్నారు. 71.2 శాతం మంది కాపీ–పేస్ట్ టూల్స్ వాడుతున్నారు. 26.8 శాతం మంది సమాచారం కోసం శోధిస్తున్నారు. అలాగే, మెయిల్స్ పంపడం, ఆన్లైన్ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. 95.1 శాతం ఇళ్లల్లో టెలిఫోన్/మొబైల్ ఫోన్ సదుపాయం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 94.2 శాతంగా ఉంటే, పట్టణాల్లో 97.1 శాతం ఇళ్లకు ఈ సదుపాయం ఉందని సర్వేలో తెలిసింది.9.9 శాతం ఇళ్లల్లోనే డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్ సదుపాయం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 4.2 శాతం ఇళ్లకే ఈ సదుపాయం ఉంటే, పట్టణాల్లో 21.6 శాతంగా ఉంది.96.9 శాతం మంది యువతీ యువకులు సులభంగా ఉండే ప్రకటనలు చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం చేస్తున్నారు. సులభమైన లెక్కలు వేయగలుగుతున్నారు. పురుషుల్లో ఇలాంటి వారు 97.8 శాతంగా ఉంటే, మహిళల్లో 95.9 శాతంగా ఉన్నారు.ఆస్పత్రిపాలైనప్పుడు వైద్యం కోసం జేబులోంచి చేస్తున్న ఖర్చు గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఒక్కో కుటుంబం నుంచి ఏడాదికి రూ.4,129గా ఉంటే, పట్టణాల్లో రూ.5,290గా ఉంది. అదే ఆస్పత్రిలో చేరకుండా పొందే వైద్యం కోసం గడిచిన 30 రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో ఇంటివారు రూ.539 ఖర్చు చేయగా, పట్టణ ప్రాంతాల్లో ఇది రూ.606గా ఉంది.బస్సు, కారు, ట్యాక్సీ, ఆటో వంటి చౌక ప్రజా రవాణా సాధనాలను పట్టణాల్లోని 93.7 శాతం మంది సౌకర్యవంతంగా పొందుతున్నారు. విద్య, ఉపాధి, శిక్షణ పొందని యువత గ్రామీణ ప్రాంతాల్లో 25 శాతం మేర ఉంటే, పట్టణాల్లో 19 శాతం ఉన్నారు. -
నెటిజన్లలో మన ‘సిటి’జన్లు టాప్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో యువత దేశ సగటును మించి ఇంటర్నెట్ వినియోగిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణ యువతలో 93.7 శాతం ఇంటర్నెట్ వినియోగిస్తుండటం విశేషం. అదేవిధంగా రాష్ట్రంలో పురుషులు, మహిళలు కూడా దేశ సగటును మించి రాష్ట్రంలో ఇంటర్నెట్ వాడుతున్నారు. ఈ విషయాలు జూలై–2022 నుంచి జూన్–2023 వరకు నిర్వహించిన సమగ్ర వార్షిక మాడ్యులర్ సర్వేలో వెల్లడైనట్లు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. ప్రధానంగా 15 నుంచి 24 సంవత్సరాల వయసు గల యువతీ, యువకులు ఇంటర్నెట్ వినియోగంపై రాష్ట్రాల వారీగా సర్వేను నిర్వహించారు. ఆ సర్వే ప్రకారం మన రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉన్న యువత దేశ సగటును మించి ఇంటర్నెట్ వినియోగిస్తున్నట్లు తేలింది. ఈ కేటగిరీలో దేశంలో సగటున 84.8 శాతం మంది ఇంటర్నెట్ వినియోగిస్తుండగా... ఆంధ్రప్రదేశ్‌లో 91.1 శాతం మంది వాడుతున్నారు. 15 నుంచి 24 ఏళ్ల మధ్య పురుషులకు సంబంధించి దేశంలో సగటున 89.1 శాతం మంది, మన రాష్ట్రంలో 94.6 శాతం మంది ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. దేశంలో సగటున మహిళలు 80.0 శాతం మంది ఇంటర్నెట్ వినియోగిస్తుండగా... రాష్ట్రంలో 87.3 శాతం మంది మహిళలు వినియోగిస్తున్నట్లు సర్వే స్పష్టంచేసింది. ఈ కేటగిరీలో దేశ సగటుకన్నా అత్యల్పంగా ఉత్తరప్రదేశ్‌లో 75.6 శాతం, బిహార్‌లో 76.4 శాతం, ఒడిశాలో 80.6 శాతం ఇంటర్నెట్ వినియోగిస్తున్నట్లు వెల్లడించింది. -
రూ.83 లక్షల కోట్లకు డిజిటల్ ఎకానమీ
భారత్ డిజిటల్ ఎకానమీ వేగంగా వృద్ధి చెందుతోందని ఆస్క్ క్యాపిటల్ తెలిపింది. 2028 నాటికి ఇండియా డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ట్రిలియన్ డాలర్ల(రూ.83 లక్షల కోట్లు)కు చేరుతుందని అంచనా వేసింది. అందుకోసం యూపీఐ, 4జీ, 5జీ సాంకేతికతలు ఎంతో తోడ్పడుతాయని తెలిపింది. ఈమేరకు నివేదిక రూపొందించింది.నివేదికలోని వివరాల ప్రకారం..దేశంలో ఇంటర్నెట్ వేగంగా విస్తరిస్తోంది. 4జీ, 5జీ సేవలు అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి. యూపీఐ సేవలు మెరుగవుతున్నాయి. 2028 నాటికి భారత్ ట్రిలియన్ డాలర్ల(రూ.83 లక్షల కోట్లు) డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా మారనుంది. గత కొన్నేళ్లుగా స్మార్ట్ఫోన్ల వినియోగం పెరుగుతోంది. ఆర్థిక కార్యకలాపాలను డిజిటలైజేషన్ చేయడంతో నగదు రహిత లావాదేవీలు, ఆన్లైన్ కొనుగోళ్లవైపు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ (ఐసీఆర్ఐఈఆర్) ప్రకారం..భారత్ డిజిటల్ ఎకానమీ పరంగా అభివృద్ధి చెందిన దేశాలైన జపాన్, యూకే, జర్మనీలను అధిగమించింది.ఇదీ చదవండి: ‘కాల్ చేసి స్కామ్ చేయాలి’.. చాట్‌జీపీటీ స్పందన ఇదే..ప్రధానమంత్రి జన్ ధన్ యోజన వంటి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) పథకాలు డిజిటల్ ఎకానమీకి ఊతమిచ్చేలా పనిచేస్తున్నాయి. డిజిటల్ ఎంటర్టైన్మెంట్, ఆన్లైన్ విద్య, టెలి-మెడిసిన్, డిజిటల్ హెల్త్, డిజాస్టర్ రెస్పాన్స్..వంటి సేవలకోసం ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నారు. -
మహిళకు నెట్టిల్లు మేలు!
మహిళకు నెట్టిల్లు మేలు ‘ఇంటర్నెట్ అందుబాటులో లేకపోతే ఏమవుతుంది?’ అనే ప్రశ్న ఒకప్పుడైతే అంత తీవ్రంగా ఆలోచించాల్సినంత ప్రశ్న కాకపోవచ్చు. ఇప్పుడు మాత్రం ఈ ప్రశ్నకు అధ్యయనకర్తలు అనేక కోణాలలో జవాబులు అన్వేషిస్తున్నారు...ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా దక్షిణాసియా కీలక దశలో ఉంది. మధ్యతరగతి అభివృద్ధిపథంలో ఉంది. అయితే ఈ పురోగతికి ఒక ఆటంకం ఉంది. అదే... డిజిటల్ జెండర్ డివైడ్. ఇంటర్నెట్ను ఉపయోగించడంలో స్త్రీ, పురుషుల మధ్య భారీ అంతరం ఉండడమే డిజిటల్ జెండర్ డివైడ్.ఇంటర్నెట్ అందుబాటులో లేని 260 కోట్ల మందిలో ఎక్కువగా మహిళలు, బాలికలే ఉన్నారు. దీనివల్ల మహిళలు ఉద్యోగ శిక్షణకు దూరం అవుతున్నారు. ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. ప్రభుత్వ పథకాల ఫలాలు అందుకోలేకపోతున్నారు. ఆరోగ్య, ఆర్థిక సేవలకు దూరం అవుతున్నారు.గత 25 ఏళ్లలో దక్షిణాసియా అంతటా డిజిటల్ యాక్సెస్ విపరీతంగా పెరిగింది. మన దేశం విషయానికి వస్తే గత దశాబ్దకాలంలో ఇంటర్నెట్ వినియోగం నాలుగు రెట్లు పెరిగింది. అయితే స్త్రీ, పురుషుల విషయంలో ఈ పురోగతి ఒకేరకంగా లేదు. కట్టుబాట్లు మొదలుకొని వ్యవస్థాగత కారణాలు, పేదరికం వరకు రకరకాల కారణాల వల్ల మహిళలు, బాలికలు ఇంటర్నెట్కు దూరం అవుతున్నారు.ప్రపంచంలోని మిగిలిన దేశాలతో పోలిస్తే దక్షిణాసియా దేశాలలో మహిళలు విద్య, ఉద్యోగాలలో వెనకబడిపోతున్నారు. ఇంటర్నెట్కు దూరం కావడం అనేది మహిళల కెరీర్ అవకాశాలను పరిమితం చేస్తుంది. మన దేశంలో 20–25 శాతం వ్యాపారాలు మహిళలు నిర్వహిస్తున్నప్పటికీ 2 శాతం కంటే తక్కువ మంది మాత్రమే మూలధనాన్ని సమీకరించుకోగలుగుతున్నారు.ఇక ‘స్టెమ్’ విషయానికి వస్తే దక్షిణాసియా అంతటా కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో మహిళలు 25 శాతం మాత్రమే ఉన్నారు. ‘స్టెమ్’ ఫీల్డ్‌కు సంబంధించిన ఉద్యోగాలలో కూడా మహిళలకు తక్కువ ప్రాతినిధ్యం ఉంది. ‘డిజిటల్ జెండర్ డివైడ్ అనేది కేవలం సామాజిక సమస్య కాదు ఆర్థిక సమస్య కూడా’ అంటున్నారు నిపుణులు. ప్రపంచవ్యాప్తంగా 600 మిలియన్ల మంది బాలికలకు ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే కేవలం మూడేళ్లలో ఆయా దేశాల జీడిపీలో గణనీయమైన మెరుగుదల కనిపిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.‘మహిళలు ఇంటర్నెట్కు దగ్గరైతే ఉద్యోగ రంగంలో అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగాల వల్ల కుటుంబ ఆదాయం పెరుగుతుంది. ఇది మహిళలకు వారి కుటుంబాల మెరుగైన జీవన నాణ్యత(క్వాలిటీ ఆఫ్ లైఫ్)కు దారి తీస్తుంది. మహిళలకు ఇంటర్నెట్ అందుబాటులో ఉండడం అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. తరతరాలకు ఉపయోగపడే ఫలాలు ఇస్తుంది’ అంటున్నారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం డిజిటల్ ఇన్‌క్లూజన్ హెడ్ కెల్లీ ఓముడ్సెన్.2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ ఉద్యోగాల సంఖ్య 9.2 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఆ ఉద్యోగాలలో మహిళల ప్రాతినిధ్యం పెరగాలంటే వారు ఇంటర్నెట్ అందుబాటులో ఉండడం అనేది అనివార్యం.(చదవండి: శారీ రన్! చీర కట్టులో కూడా పరుగు పెట్టొచ్చు..!) -
Jharkhand: నేడు, రేపు ఐదు గంటలు ఇంటర్నెట్ బంద్
రాంచీ: జార్ఖండ్‌లో నేడు (శనివారం) రేపు (ఆదివారం) ఐదు గంటలపాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేయనున్నారు. జార్ఖండ్ జనరల్ గ్రాడ్యుయేట్ లెవల్ కంబైన్డ్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ (జేజీజీజీఎల్‌సీసీఈ)దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఒక అధికారిక ప్రకటనలో తెలియజేసింది.పరీక్ష సమయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకే శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తామని, అలాగే ఆదివారం కూడా ఇదే పరిమితి కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కొంది. కాగా పరీక్ష ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రత్యేకంగా చర్చించారు. పరీక్ష సమయంలో ఎవరైనా ఏదైనా తప్పు చేయాలని ప్రయత్నిస్తే కఠినంగా వ్యవహరిస్తామని సోరెన్ హెచ్చరించారు. జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రాష్ట్రంలోని 823 కేంద్రాలలో పరీక్షను నిర్వహిస్తుండగా, దాదాపు 6.39 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతున్నారని సంబంధిత అధికారి తెలిపారు.జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సోషల్ మీడియా సైట్ ఎక్స్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేస్తూ ‘ఇప్పుడే సీనియర్ అధికారులతో మాట్లాడి, జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నాను. అధికారులకు అవసరమైన మార్గదర్శకాలను అందించాను. అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు’ అని దానిలో పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: రెండేళ్లలో 9000 మంది నియామకం -
వెండి విమానం! సూర్యుడే ఇంధనం!!
ఇది విమానంలా కనిపిస్తున్నా.. విమానం కాదు. సిల్వర్-ఫాయిల్ తయారు చేసిన, హీలియం నింపిన ఓ పేద్ద బుడగ లాంటిది. గాల్లోకి ఎగిరి మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ అందిస్తుంది. పగలంతా సౌరశక్తిని వాడుకుని రాత్రిళ్లు కూడా పనిచేస్తుంది.రిమోట్ ప్రాంతాలలోని వ్యక్తులకు ఎత్తులో ఎగిరే బ్లింప్ లాంటి విమానం నుంచి ఎందుకు అందించకూడదు? అన్న ఆలోచనతోనే న్యూ మెక్సికోకు చెందిన ఏరోస్పేస్ కంపెనీ స్కీయే (Sceye) సౌర శక్తిని ఉపయోగించుకుని స్ట్రాటోఆవరణలో సంచరించే హ్యాప్స్ (HAPS- హై-ఆల్టిట్యూడ్ ప్లాట్‌ఫారమ్ స్టేషన్)ను రూపొందించింది.స్కీయే హ్యాప్స్ 65 మీటర్ల (213-అడుగులు) పొడవైన సిబ్బంది లేని హీలియం నిండిన విమానం. దీన్ని నిలువుగా నింగిలోకి ప్రయోగిస్తారు. 60,000 నుంచి 65,000 అడుగుల (18,288 నుండి 19,812 మీ) ఎత్తుకు ఇది వెళ్తుంది. సిల్వర్-ఫాయిల్ తయారైన దీని ఉపరితలంపై ఉండే గాలియం సెలీనైడ్, గాలియం ఆర్సెనైడ్ సౌర ఘటాల శక్తి ద్వారా జీపీఎస్ సాయంతో నిర్దేశిత ఎత్తులో దీన్ని సంచరించేలా చేస్తారు. ఇది మారుమూల ప్రాంతాలకు బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ని ప్రసారం చేయడం, వాతావరణం, పర్యావరణాన్ని పర్యవేక్షించడం, అడవుల్లో మంటలు లేదా ఇతర ప్రకృతి వైపరీత్యాలను గుర్తించడం వంటి పనులను చేయగలదు.ఈ విమానానికి సంబంధించిన సరికొత్త మైలురాయి గత వారమే వచ్చింది. దాని సౌర ఘటాల ద్వారా పగటిపూట దాని బ్యాటరీలను ఛార్జ్ చేసుకుని, ఆ బ్యాటరీ శక్తిని ఉపయోగించి రాత్రిపూట కూడా ఆ స్థానంలో నిలిచి ఉంటుంది. ఆగస్టు 15వ తేదీ ఉదయం 7:36 గంటలకు న్యూ మెక్సికోలోని స్కీయే స్థావరం నుంచి దీన్ని ప్రయోగించగా 61,000 అడుగుల (18,593 మీ) ఎత్తుకు చేరుకుని మరుసటి రోజు మధ్యాహ్నం 12:21 గంటల వరకూ నిర్దేశిత ఎత్తులోనే సేవలందించింది. -
టెలికాం సేవల విస్తరణకు కొత్త ప్రాజెక్టులు
భారత్‌లో టెలికాం సేవలందించే ఎయిర్టెల్, జియోతోపాటు ఇతర దేశాల్లోని మెటా, సౌదీ టెలికాం, చైనా మొబైల్ వంటి కంపెనీలు కొత్తగా మూడు ప్రాజెక్ట్‌లను ప్రారంభించాలని యోచిస్తున్నాయి. ఇందులో భాగంగా సముద్రంలో కేబుల్స్ ఏర్పాటు చేసిన డేటాను సరఫరా చేయనున్నాయి. ‘2ఆఫ్రికా పిరల్స్’ అనే ప్రాజెక్ట్ ద్వారా 180 టెరాబిట్స్ పర్ సెకండ్(టీబీపీఎస్) సామర్థ్యంతో డేటాను సరఫరా చేయాలని ఎయిర్టెల్, మెటా, సౌదీ టెలికాం ప్రణాళికలు సిద్ధం చేశాయి. ఆఫ్రికా, యూరప్, మిడిల్ ఈస్ట్, ఆసియా దేశాలను ఈ ప్రాజెక్ట్ ద్వారా అనుసంధానం చేస్తున్నారు. ఇందులో భాగంగా సముద్రంలో మొత్తం 45,000 కిలోమీటర్లు పొడవున కేబుల్స్ ఏర్పాటు చేస్తారు.ఇదీ చదవండి: సెప్టెంబర్ 1 నుంచి ఆ మెసేజ్‌లు, కాల్స్ నిలిపివేత!ఇండియా-ఆసియా ఎక్స్‌ప్రెస్ ప్రాజెక్ట్‌లో భాగంగా జియో, చైనా మొబైల్ సంస్థలు కలిసి 200 టీబీపీఎస్ కెపాసిటీతో 16,000 కి.మీ పొడవున సముద్రంలో కేబుల్ సిద్ధం చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ముంబయి, సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్, శ్రీలంక దేశాల్లో సర్వీసులు అందిస్తారు. ఇండియా-యూరప్ ఎక్స్‌ప్రెస్ ప్రాజెక్ట్ ద్వారా జియో, చైనా మొబైల్ కంపెనీలు 200 టీబీపీఎస్ కెపాసిటీతో 9,775 కి.మీ పొడవున కేబుల్స్ ఏర్పాటు చేస్తాయి. దీంతో ముంబయి, గల్ఫ్, యూరప్ ప్రాంతాల్లో సేవలందించనున్నాయి. ఇదిలాఉండగా, ఇప్పటికే ఎయిర్టెల్ కంపెనీ ఈ విధానం ద్వారా ఆఫ్రికాలో సేవలందిస్తోంది. -
గూగుల్‌పై కన్నెర్ర!
అతిథిగా వచ్చి అడిగినవన్నీ గుక్క తిప్పుకోకుండా చెబుతున్న సిద్ధుణ్ణి చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయిన ప్రవరాఖ్యుడు ‘సృష్టికర్త బ్రహ్మకైనా నేర్వశక్యంగాని ఇన్ని సంగతులు తమరికెలా సాధ్య మయ్యాయ’ని ఎంతో వినయంగా అడుగుతాడు ‘మనుచరిత్ర’ కావ్యంలో. ఈ ఆధునాతన యుగంలో ఆ సిద్ధుణ్ణి మించిపోయి, అడిగిన అరక్షణంలో అన్నిటినీ గూగుల్ ఏకరువు పెడుతోంది. అసలు గూగుల్ లేకపోతే మనకు చాలా విషయాలు తెలిసేవికాదని, మన జ్ఞానానికి ఎన్నో పరిమితులుండేవని ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది విశ్వసిస్తారు. అంతటి గూగుల్‌పై అమెరికా ఫెడరల్ న్యాయ స్థానం రూపంలో పిడుగుపడింది. ఈ సంస్థ గుత్తాధిపత్య పోకడలు పోతోందని న్యాయ స్థానం తీర్పునిచ్చింది. పోటీదారులందరికీ సమానావకాశాలు ఉండితీరాలన్న స్వేచ్ఛా మార్కెట్ సూత్రాలకు తిలోదకాలిచ్చి, చట్ట ఉల్లంఘనలకు పాల్పడి వక్రమార్గంలో లాభార్జనకు పాల్పడుతున్నదని తేల్చి చెప్పింది. సంస్థపై ఏ చర్యలు తీసుకోవాలన్నది న్యాయస్థానం ఇంకా చెప్పలేదు. అయితే దాన్ని భిన్న సంస్థలుగా విభజించాలని ఆదేశించటంతో సహా ఎలాంటి చర్యలనైనా సూచించే అవకాశం ఉంది. అసలు ఒక టెక్ దిగ్గజంగా, మహాసంస్థగా వెలిగిపోతున్న గూగుల్ ఏడెనిమిదేళ్ల క్రితం ఒక పెద్ద కార్పొరేట్ సంస్థ ‘ఆల్ఫాబెట్’లో ఒదిగి చిన్నబోయింది. ఇప్పటికే అమెజాన్, మెటా, యాపిల్ వగైరా భారీ కార్పొరేట్ కంపెనీలపై నడుస్తున్న వ్యాజ్యాలకు తాజా తీర్పు ప్రమాణంగా మారుతుందన్నది గుత్తాధిపత్య నిరోధక చట్టాల నిపుణులంటున్న మాట. నిజానికి మైక్రోసాఫ్ట్‌పై 2000 సంవత్సరంలో వెలువడిన యాంటీట్రస్ట్ తీర్పు ప్రస్తుత గూగుల్ కేసును ప్రభావితం చేసింది. ఈ కేసు పరిష్కారానికి ఏం చేయాలన్న అంశంపై ప్రభుత్వమూ, గూగుల్ మాట్లాడుకోవాలని, వచ్చే నెల 6 నాటికి నిర్ణయం తెలపాలని న్యాయమూర్తి చెప్పారు. ఈ తీర్పుపై గూగుల్ ఎటూ అప్పీల్‌కి పోతుంది.గూగుల్‌పై వచ్చిన ఆరోపణలు కొట్టివేయదగ్గవి కాదు. తన సెర్చ్ ఇంజన్‌ను సెల్ఫోన్లలో, బ్రౌజర్లలో అమర్చేలా యాపిల్‌తో సహా అనేక స్మార్ట్ ఫోన్ కంపెనీలకూ, బ్రౌజర్ కంపెనీలకూ గూగుల్ ఒక్క 2021లోనే 2,600 కోట్ల డాలర్లు చెల్లించిందని, ఇందువల్ల ఇతర సంస్థలు భారీగా నష్టపోయాయని ఆ అభియోగాల సారాంశం. ఒక అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వినియోగ దారుల్లో 90 శాతం మంది గూగుల్ సెర్చ్ ఇంజన్‌పైనే ఆధారపడుతున్నారు. అయితే వినియోగదారులను తాము నియంత్రించటమో, నిర్బంధించటమో చేయటం లేదని... ఎందులో మెరుగైన ఫలితా లొస్తాయో తేల్చుకుని స్వచ్ఛంగా తమను ఎంచుకుంటున్నారని గూగుల్ వాదించింది. వర్తమానంలో ఇంటర్నెట్ తెరిచాక సాగే అత్యంత ప్రధాన వ్యాపకం శోధించటమే. అయితే సెల్‌ఫోన్ తయారీ దార్లకూ, బ్రౌజర్ కంపెనీలకూ భారీ చెల్లింపులు చేసి గూగుల్ సెర్చ్ ఇంజన్‌ను చేర్చాక వాటిని వినియోగించేవారికి అంతకన్నా గత్యంతరం ఏముంటుందని న్యాయమూర్తి వేసిన ప్రశ్న సహేతుక మైనది. నిజానికి గూగుల్‌తోపాటు బింజ్‌తో సహా డజను వరకూ సెర్చ్ ఇంజన్ సంస్థలున్నాయి. కానీ అనేక ఏళ్లుగా గూగుల్ తెరచాటుగా సాగిస్తున్న గుత్తాధిపత్యం పర్యవసానంగా వాటికంత ప్రాధాన్యం లేకుండా పోయింది. ఆసక్తికరమైన విషయాన్నీ, అవసరమైన సమాచారాన్నీ సేకరించటానికి వినియోగదారుల్లో అత్యధికులు యధాలాపంగా ఆధారపడేది గూగులే. దాంతో పోలిస్తే వ్యక్తిగత గోప్యత మొదలుకొని అనేక అంశాల్లో ఇతర సంస్థల తీరు ఎంతో మెరుగ్గా ఉన్నదని టెక్ నిపుణులు చెబుతున్న మాట. వినియోగదారులు ఎలాంటి అంశాల గురించి ఆరా తీస్తున్నారన్న డేటా అత్యంత కీలకమైనది. ఈ క్రమంలో వినియోగదారుల ఇష్టానిష్టాలూ... వారి అలవాట్లు, ఆసక్తులకు సంబంధించిన సమాచారం వివిధ ఉత్పాదక సంస్థలకు చాలా అవసరం. వినియోగదారులకు తెలియకుండా ఈ వివరాలన్నీ గూగుల్ అమ్ముకుంటున్నదని చాన్నాళ్లుగా వినబడుతోంది. దాంతోపాటు ఈ రంగంలో గుత్తాధిపత్యం ఉండటాన్ని ఆసరా చేసుకుని వాణిజ్య ప్రకటనకర్తలు చెల్లించే రుసుమును అపారంగా పెంచుతోంది. వివిధ విషయాలూ, పదాలూ ఆధారంగా సెర్చ్ ఇంజన్లకు వినియోగించే క్రమసూత్రాలు (అల్గారిథమ్స్) ఏమిటన్నది గూగుల్ అత్యంత రహస్యంగా ఉంచుతోంది. అమెరికాలో దాఖలైన ఈ కేసులో ఆసక్తికరమైన అంశం ఉంది. మున్ముందు ఎన్నో సంస్థల భవితవ్యాన్ని ప్రభావితం చేసే ఈ కేసులో వ్యాజ్యాన్ని ఎదుర్కొన్న గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాదిరే తీర్పునిచ్చిన న్యాయమూర్తి అమిత్ మెహతా కూడా భారతీయుడే. యాంటీట్రస్ట్ చట్టం నిజానికి 19వ శతాబ్దం నాటిది. పారిశ్రామికరంగం భిన్నరంగాల్లో ఎదగటానికి గుత్తాధిపత్యం పెను అవరోధమని భావించి అప్పట్లో యాంటీట్రస్ట్ చట్టాన్ని తీసుకొచ్చారు. 1970లలో ఐబీఎం మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్లు, ఆ తర్వాత 1990లలో మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ వ్యవస్థ పైనా ఇలాంటి వ్యాజ్యాలే పడ్డాయి. అవి భారీగా పరిహారాలు చెల్లించుకున్నాయి. మెయిన్‌ఫ్రేమ్ మార్కెట్ ఇప్పుడు దాదాపు లేదు. గూగుల్ రాకతో మైక్రోసాఫ్ట్ గుత్తాధిపత్యం కూడా అంతరించింది. అలాగే ప్రాసెసర్ల మార్కెట్లో వెలుగులీనిన ఇంటెల్ ప్రభ కూడా మరోపక్క క్షీణిస్తోంది. మారిన పరిస్థితులను అందిపుచ్చుకోలేకపోవటం, కొత్త రంగాలకు విస్తరించటానికి బద్ధకించటం లాంటివి వీటి వర్తమాన అవస్థకు ప్రధానంగా చెప్పుకోవాల్సిన కొన్ని కారణాలు. గూగుల్ వ్యవహారాన్ని కూడా మార్కెట్ శక్తులకే వదిలేస్తే కాగల కార్యం అవే తీరుస్తాయనీ, గత కాలపు చట్టాలతో నియంత్రించటం వ్యర్థమనీ వాదించేవారికి కూడా కొదవ లేదు. అయితే నియంత్రణ వ్యవస్థలు లేకపోతే కొత్త సంస్థల ఆవిర్భావం సాధ్యమేనా? ఏది ఏమైనా తాజా తీర్పు పర్యవసానాలు ప్రపంచవ్యాప్తంగా ఉంటాయన్నది వాస్తవం. -
Bangladesh: ఎట్టకేలకు ఇంటర్నెట్ సేవలు.. మూడు రోజులు 5జీబీ డేటా ఫ్రీ
ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ అంశంపై బంగ్లాదేశ్‌లో చెలరేగిన అందోళనలు సద్దుమణిగాయి. ఈ నేపధ్యంలో దేశంలో 10 రోజుల తర్వాత మొబైల్ ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం పునరుద్ధరించింది. రిజర్వేషన్ల అంశంపై సోషల్ మీడియాలో అసంబద్ధ వార్తలు వ్యాప్తి చెందకుండా ఉండేందుకే దేశంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.దేశంలో ఇంటర్నెట్ సేవలను పునరుద్దరించినట్లు ప్రకటించిన ప్రభుత్వం మూడు రోజుల పాటు వినియోగదారులందరికీ 5 జీబీ డేటా ఇంటర్నెట్ ఉచితంగా అందించనున్నట్లు తెలిపింది. ఈ విషయమై సమాచార, కమ్యూనికేషన్ల సాంకేతిక శాఖ సహాయ మంత్రి (ఐసీటీ) జునైద్ అహ్మద్ పాలక్ అధికారిక ప్రకటన చేశారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం జూలై 18 నుంచి మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. రిజర్వేషన్ల అంశంపై దేశంలో జరిగిన హింసాయుత ఘటనల్లో సుమారు వందమంది మృతి చెందారు.యుద్ధ వీరుల బంధువులకు ప్రభుత్వ రంగ ఉద్యోగాలను రిజర్వ్ చేసే వ్యవస్థకు వ్యతిరేకంగా దేశంలోని ఢాకాతో పాటు ఇతర నగరాల్లో విద్యార్థులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అది హింసాత్మకంగా మారింది. స్థానిక మీడియా నివేదికల ప్రకారం ఈ హింసాకాండలో 100 మంది మరణించారు. అయితే, దీనిపై ఇంకా అధికారిక సమాచారం వెల్లడికాలేదు. మరోవైపు హింసాకాండ నేపథ్యంలో కర్ఫ్యూ విధించాలన్న తన నిర్ణయాన్ని ప్రధాని షేక్ హసీనా సమర్థించుకున్నారు. -
బ్రజ్ మండల్ యాత్ర.. 24 గంటల ఇంటర్నెట్ బంద్
చండీగఢ్: బ్రజ్ మండల్ జలాభిషేక యాత్ర నేపథ్యంలో హర్యానా రాష్ట్ర ప్రభత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది చోటుచేసుకున్న ఘర్షణలను దృష్టిలో పెట్టుకొని ముందస్తుగా నుహ్ జిల్లాలో 24 గంటలపాటు మొబైల్ ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సర్వీసులను నిలిపివేసినట్లు ప్రకటించింది. నుహ్ జిల్లాలో ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం సాయత్రం 6 గంటల వరకు ఇంటర్నెట్ సర్వీస్‌ను నిలిపివేస్తున్నట్లు హర్యానా అడిషినల్ చీఫ్ సెక్రటరీ( హోం ) అనురాగ్ రస్తోంగి తెలిపారు. అసత్యాలు, పుకార్లు.. సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా వ్యాప్తి చెందకుండా అడ్డుకుంనేందుకు వాట్సాప్, ఫేస్బుక్, ట్విటర్(ఎక్స్)పై సస్పెన్షన్ విధించామని పేర్కొన్నారు.మరోవైపు.. యాత్ర ప్రశాంతంగా జరిగేలా నుహ్ జిల్లా మొత్తం భద్రత ఏర్పాట్లు చేసినట్ల పోలీసులు తెలిపారు. గతేడాది జూలై 31న యాత్ర సందర్భంగా విశ్వహిందూ పరిషత్ నిర్వహించి ఊరేగింపులో చోటుచేసుకున్న ఘర్షణలో ఇద్దరు హోంగార్డులు, 15 మంది మృతి చెందారు. రాళ్లు విసిరి.. కార్లకు నిప్పుపెట్టారు. అదే రాత్రి గురుగ్రామ్‌లోని ఓ మసీద్‌పై దాడి ఘటనలో ఓ వ్యక్తి మరణించారు. ఆ తర్వాత కూడా పలు ఘర్షణలు చోటుచేసుకోగా.. ఆరుగురు మృతి చెందారు. అప్పడు సీఎంగా ఉన్న ప్రస్తుత కేంద్ర మంత్రి మనోహర్ కట్టర్ ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించారు. -
తెలంగాణ సచివాలయంలో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో మంగళవారం(జులై 16) ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు రెండు గంటలకుపైగానే ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. ఇంటర్నెట్ లేకపోవడంతో సెక్రటేరియట్లో పలు శాఖల సేవలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు.. కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం జరుపుతుండగానే ఈ విఘాతం చోటు చేసుకోవడం గమనార్హం. సెక్రటేరియెట్‌కు ఇంటర్నెట్ సేవలు అందించే ‘నిపుణ’ నెట్‌వర్క్‌కు పెండింగ్ బిల్లులు కోట్ల రూపాయల్లో పేరుకుపోయాయని, అందుకే సేవలు నిలిచిపోయాననే ప్రచారం జరుగుతోంది. కొన్ని రోజులుగా బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదని.. దీంతో ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లేందుకే ఇంటర్ నెట్ నిలిపివేసిందని కథనాలు చక్కర్లు కొట్టాయి. అయితే.. అధికారులు మాత్రం టెక్నికల్‌గా తలెత్తిన సమస్యేనని, కాసేపటికే వైఫై సేవలు తిరిగి ప్రారంభం అయ్యాయని అంటున్నారు. -
అంబానీ పెళ్లికి రాశీ ఖన్నా ఇలా ముస్తాబైంది! (ఫోటోలు)
-
ఖరీదైన బాల్కనీ.. అద్దె ఎంత అని మాత్రం అడగకండి!
దేశం ఏదైనా, ప్రాంతం ఏదైనా అద్దె ఇంటి బాధలు అందరివీ ఒకటే. ఇక ఖరీదైన ఏరియాలో అద్దె ఇల్లు అంటే ఇక చెప్పాల్సిన పనే లేదు. ఈ కష్టాల కత వేరే ఉంటది. కానీ ఖరీదైన బాల్కనీ అద్దె గురించి ఎపుడైనా విన్నారా? ఆస్ట్రేలియాలోని సిడ్నీలో పట్టుమని పది అడుగులు కూడా ఉండని ఒక బాల్కనీ అద్దె వింటే షాకవ్వాల్సిందే. స్టోరీ ఏంటంటే..ఒక విచిత్రమైన ఫేస్బుక్ ప్రకటన ఇది. సిడ్నీలోని ఒక ఇంట్లో ఒక బాల్కనీ అద్దెకు ఉందని ఒక యజమాని ప్రకటించాడు. ఒక మనిషికి ఉండేందుకు అవకాశం. దీని అద్దె నెలకు 969 డాలర్లు (రూ. 81,003)అంటూ ఫేస్బుక్ మార్కెట్‌ప్లేస్ లిస్టింగ్‌లో వెల్లడించాడు. ఇందులో బెడ్, అద్దం కూడా ఉంటుంది. మంచి వెలుతురు, ఎటాచ్డ్గా ఉన్న గదిలోపల బాత్రూమ్ వాడుకోవచ్చని, ఇక కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు అదనమని చెప్పుకొచ్చాడు. దీంతో ఈ ప్రకటన తెగ వైరల్ అవుతోంది.దీంతో నెటిజన్లు విభిన్న రకాలుగా స్పందించారు. బాల్కనీకి ఇంత అద్దా? ఈ బాల్కనీని ఎంచుకునే వాళ్లుంటారా అని మరొకరు వ్యాఖ్యానించారు. కాగా ఇటీవలికాలంలో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో గృహాల అద్దె ధరలలో గణనీయమైన పెరుగుదల నమోద వుతోంది. తాజా లెక్కల ప్రకారం 2024 జూన్ త్రైమాసికంలో సిడ్నీ సగటు అద్దె వారానికి 750 డాలర్ల మేర రికార్డు స్థాయిలో ఉంది.అద్దె ఇళ్లకు పోటీ నేపత్యంలో ఆక్షన్ ద్వారా అద్దెను కేటయిస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. -
ఏఐ.. పార్కింగ్ ఎక్కడోయ్
షాపింగ్ కోసం కోఠి వెళ్లారు. అదసలే బిజీ ఏరియా.. ఫుల్ ట్రాఫిక్.. కారు పార్క్ చేయడానికి స్థలం లేదు. దగ్గరలో ఎక్కడ పార్కింగ్ ఉందో తెలియదు. రోడ్డు పక్కనే పార్క్ చేస్తే.. ట్రాఫిక్‌కు అంతరాయం. పోలీసుల కంట్లో పడితే ఫైన్ కట్టక తప్పదు. అదే ఓ యాప్ ఉండి, దగ్గరలో పార్కింగ్ ఎక్కడుందో తెలిస్తే..? అదీ పార్కింగ్ స్లాట్ బుక్ చేసుకుని, నేరుగా వెళ్లి పార్క్ చేసేసుకోగలిగితే..? ఈ తిప్పలన్నీ తప్పుతాయి కదా.బిజీ ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాల ఏర్పాటుతోపాటు ఇలాంటి వెసులుబాట్లు తెస్తే.. వాహనదారులకు ప్రయోజనం కలుగుతుంది. ట్రాఫిక్ చిక్కులకు చెక్ పడుతుందని నిపుణులు చెప్తున్నారు. ఈ తరహా ఏర్పాట్లపై ‘ఈజీపార్క్ ఏఐ’ అనే సంస్థ ఇటీవల ఐటీ మంత్రి శ్రీధర్‌బాబుకు ప్రజెంటేషన్ కూడా ఇచి్చంది. ఐటీ, కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో పార్కింగ్ సమస్యను పరిష్కరించవచ్చని ప్రతిపాదన చేసింది.సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ నగరం ఇప్పటికే వాహనాలతో కిక్కిరిసిపోయింది. ఏటా పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. అవన్నీ రోడ్లపై తిరగడం సంగతి పక్కనపెడితే.. ఎక్కడో ఓ చోట పార్క్ చేయక తప్పదు. షాపింగ్ కోసం వెళ్లినా, ఏదైనా పని మీద వెళ్లినా.. పార్కింగ్ కోసం తిప్పలే. కార్లే కాదు బైకులు పెట్టడానికీ ఎక్కడా స్థలం లేని దుస్థితి. దీనితో షాపుల ముందు, రోడ్ల పక్కన, గల్లీల్లో వాహనాలను పార్క్ చేస్తున్నారు. దీనితో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు, ప్రభుత్వం ఎంతగా ప్రయత్నించినా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం సమస్యగా మారుతోంది. ఉదయం, సాయంత్రం సమయాల్లో ఈ ఇబ్బంది మరింత ఎక్కువగా ఉంటోంది. పర్యాటక ప్రదేశాలు, ఆలయాలు, సాయంత్రాలు ఆహ్లాదంగా గడపడానికి వెళ్లే చోట్ల పార్కింగ్ పెద్ద ప్రహసనంగా మారింది.ఎలా పనిచేస్తుంది..కృత్రిమ మేధ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) సాయంతో పార్కింగ్ సమస్యను పరిష్కరించే విధానాన్ని ఈజీపార్క్ ఏఐ సంస్థ రూపొందించింది. ఆ వివరాల మేరకు.. పార్కింగ్ స్థలం నిర్వహించే వారికి ఒక డాష్ బోర్డు ఏర్పాటు చేస్తారు. వాహనాలు ఎన్ని వస్తున్నాయి? ఆక్యుపెన్సీ ఎంత ఉంది? ఎంతసేపు వాహనాలు పార్క్ చేస్తారన్న డేటాను దాని ద్వారా అందిస్తుంది. అలా అన్ని పార్కింగ్ స్థలాల వివరాలను ఒకచోట క్రోడీకరిస్తుంది.ఈ వివరాలను ఓ యాప్ సాయంతో వాహనదారులకు అందుబాటులో ఉంచుతుంది. ఈ యాప్ ద్వారా ఎక్కడెక్కడ పార్కింగ్ స్థలాలు అందుబాటులో ఉన్నాయనేది తెలుస్తుంది. ముందుగానే పార్కింగ్ స్లాట్లను బుక్ చేసుకుని, నేరుగా వెళ్లి పార్క్ చేసుకోవచ్చు. పార్కింగ్ ఫీజును కూడా ఆన్లైన్ ద్వారానే చెల్లించేయొచ్చు. ఒకవేళ ఆ ప్రాంతానికి వెళ్లకపోతే.. స్లాట్‌ను క్యాన్సిల్ చేసుకోవచ్చు. పార్కింగ్ ప్రదేశాల్లో ఇంటర్నెట్ ఆధారిత కెమెరాలతో నిఘా ఉంటుంది. వాహనానికి సంబంధించిన అలర్ట్స్ వస్తాయి. దొంగతనం, మరేదైనా జరిగితే వెంటనే అప్రమత్తం చేసే ఏర్పాట్లు ఉంటాయి. వాహనాలు వెళ్లిపోయి పార్కింగ్ స్లాట్లు ఖాళీ అయితే.. వెంటనే యాప్‌లో అప్డేట్ అయి ఖాళీగా చూపిస్తుంది. కావాల్సిన వారు బుక్ చేసుకోవచ్చు. పార్కింగ్ స్థలం వద్ద వాహనాలు బయటికి వెళ్లడం, లోపలికి రావడం ప్రత్యేక పరికరాలతో నమోదవుతూ ఉంటుంది. ఆటోమేటిగ్గా వాటి నంబర్లను గుర్తించి అప్డేట్ చేసే వ్యవస్థ ఉంటుంది.మల్టీలెవల్ పార్కింగ్తో.. అలాగే హైదరాబాద్‌లో భూముల విలువలు విపరీతంగా పెరిగిపోయాయి. దీనికితోడు ప్రధాన ప్రాంతాల్లో స్థలాలకు కొరత ఉండటంతో.. మలీ్టలెవల్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇలా ఏర్పాటు చేసినా.. అవి ఎక్కడున్నాయో అందరికీ తెలిసే అవకాశం తక్కువ. తెలిసినా పార్కింగ్ ఖాళీగా ఉందో లేదో తెలియదు. అక్కడిదాకా వెళ్లి ఖాళీ లేకుంటే.. మళ్లీ మరోచోటికి వెళ్లాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే పార్కింగ్ ఖాళీగా ఉందో, లేదో తెలిసి.. ముందే స్లాట్ బుక్ చేసుకునే అవకాశం ఉంటే బాగుంటుందన్న ఆలోచనతో ‘ఈజీపార్క్ ఏఐ’ అనే సంస్థ ముందుకొచి్చంది. ఇటీవల దీనిపై రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు ప్రజెంటేషన్ కూడా ఇచ్చింది.భవనాల్లో పార్కింగ్ సరిగా లేక.. హైదరాబాద్‌లో 80 లక్షలకుపైగా వాహనాలు ఉన్నాయి. కార్లు, టూ వీలర్లతోపాటు విద్యాసంస్థల వాహనాలు, ఆటోలు వంటివీ భారీగా ఉన్నాయి. ఇందులో కార్లు, టూవీలర్ల పార్కింగ్ కోసం ఇబ్బంది వస్తోంది. ట్రాఫిక్‌లో ఎలాగోలా గమ్యస్థానానికి చేరుకున్న వాహనదారులకు పార్కింగ్ విషయంలో తిప్పలు తప్పట్లేదు. పార్కింగ్‌కు అనుగుణంగా భవన నిర్మాణాలు చేపట్టకపోవడం ఈ సమస్యకు ప్రధాన కారణమని నిపుణులు చెప్తున్నారు.పార్కింగ్ సమస్యపై జనం ఏమంటున్నారు?సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో పార్కింగ్ సమస్యను పరిష్కరించడంపై ఫోకస్ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి గతంలో ఓ సమీక్ష సందర్భంగా ప్రకటించారు. ‘ఈజీపార్క్ఏఐ’ సంస్థ ప్రజెంటేషన్ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. పార్కింగ్ సమస్య పరిష్కారానికి ఐటీని వినియోగించాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఐటీ, కృత్రిమ మేధ (ఏఐ)ను ఉపయోగించి వాహనాల పార్కింగ్ సమస్యను పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఐటీ శాఖ ఇంజనీర్లను ఆదేశించారు కూడా. ఎక్కడికెళ్లినా పార్కింగ్‌కు ఇబ్బందే.. హైదరాబాద్‌లో, ముఖ్యంగా బిజీ ఏరియాల్లో పార్కింగ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటోంది. చాలాసేపు వెతికితే కానీ బండి పెట్టుకోవడానికి ప్లేస్ కనబడటం లేదు. చాలా షాపింగ్ కాంప్లెక్స్‌లలో పార్కింగ్ ఉండట్లేదు. అంతా రోడ్లపైనే పార్కింగ్ చేస్తున్నారు. అది ట్రాఫిక్‌కు ఇబ్బందిగా మారుతోంది. – నరేశ్‌గౌడ్ లోడి, అంబర్పేటప్రభుత్వం చొరవ తీసుకోవాలి హైదరాబాద్‌లో పార్కింగ్ పెద్ద సమస్యగా మారింది. పార్కింగ్ విషయంలో ప్రభుత్వం సరైన పాలసీ రూపొందించాలి. షాపింగ్ కాంప్లెక్స్‌లు, దుకాణాలకు, వాహనదారులకు అవగాహన కలి్పంచాలి. అప్పుడే నగరవాసులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. – కల్యాణ్, దిల్సుఖ్నగర్ -
ఆకాశంలో శాటిలైట్ల లెక్క తెలుసా?
ఇంటర్నెట్ నుంచి జీపీఎస్ దాకా..వాతావరణ అంచనాల నుంచి భూమ్మీద వనరుల అన్వేషణ దాకా.. రోజువారీ జీవితం నుంచి శాస్త్ర పరిశోధనల దాకా అన్నింటికీ శాటిలైట్లే కీలకం. ఇందుకే చాలా దేశాలు ఏటేటా మరిన్ని శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపుతూనే ఉన్నాయి. మరి మన భూమి చుట్టూ తిరుగుతున్న శాటిలైట్లు ఎన్ని?.. అవి ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో ఓసారి తెలుసుకుందామా.. మూడు కక్ష్యల్లో.. ఐక్యరాజ్యసమితి ఆఫీస్ ఫర్ ఔటర్ స్పేస్ అఫైర్స్ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది జూన్ 11వ తేదీ నాటికి భూమి చుట్టూ 11,870 శాటిలైట్లు తిరుగుతున్నాయి. అవి కూడా భూమి చుట్టూ మూడు కక్ష్యలలో తిరుగుతున్నాయి. అవి జియో స్టేషనరీ ఆర్బిట్ (జీఈఓ), మీడియం ఎర్త్ ఆర్బిట్ (ఎంఈఓ), లో ఎర్త్ ఆర్బిట్ (ఎల్ఈఓ). ఇందులో జీఈఓ కక్ష్యలోకి శాటిలైట్లను ప్రయోగించడానికి భారీ రాకెట్లు కావాలి. ఖర్చు చాలా ఎక్కువ. అందుకే అక్కడ శాటిలైట్లు బాగా తక్కువ. జీఈఓభూమికి సుమారు 35,786 కిలోమీటర్ల ఎత్తులో ఉండే కక్ష్య ఇది. పక్కాగా భూమి భ్రమణ వేగానికి సరిపడే వేగంతో శాటిలైట్లు ప్రయాణించేందుకు అనువైన ప్రాంతమిది. అంటే జీఈఓలో తిరిగే శాటిలైట్లు ఎప్పుడూ భూమ్మీద ఒకేప్రాంతంపైనే ఫోకస్ చేస్తూ స్థిరంగా ఉంటాయి. కమ్యూనికేషన్, వాతావరణ శాటిలైట్లను ఈ కక్ష్యలోనే ఉంచుతారు. ఎంఈఓభూమికి పైన 2 వేల కిలోమీటర్ల నుంచి 30 వేల కిలోమీటర్ల మధ్య ఉండే ప్రాంతం ఇది. జీపీఎస్, గ్లోనాస్ వంటి నావిగేషన్ శాటిలైట్లు, రక్షణ రంగ శాటిలైట్లు వంటివాటిని ఈ కక్ష్యల్లో తిరిగేలా చేస్తారు.ఎల్ఈఓభూమికిపైన కేవలం 150 కిలోమీటర్లనుంచి 450 కి.మీ. మధ్య ఉండే ప్లేస్ ఇది. ఇంటర్నెట్, ఫోన్ సిగ్నల్ సంబంధిత శాటిలైట్లు ఈ కక్ష్యల్లో ఉంటాయి. స్టార్ లింక్ శాటిలైట్లతో.. ప్రస్తుతమున్న శాటిలైట్లలో అత్యధికం ‘స్టార్ లింక్’శాటిలైట్ ఇంటర్నెట్ సంస్థకు చెందినవే. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్‌్కకు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ ఆధ్వర్యంలోని స్టార్ లింక్ కోసం 6,050 శాటిలైట్లను ప్రయోగించింది. ఇవన్నీ కూడా గత ఐదేళ్లలో స్పేస్‌లోకి పంపినవే కావడం గమనార్హం. త్వరలోనే మరో 6వేల శాటిలైట్ల ప్రయోగానికి స్పేస్ ఎక్స్ సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. - సాక్షి సెంట్రల్‌డెస్క్ -
ఏఐతో వై-ఫై స్పీడ్ పెంచేందుకు పెట్టుబడులు
యాక్ట్ ఫైబర్‌నెట్ కంపెనీ..నెట్వర్క్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ స్టార్టప్ అప్రెకామ్లో పెట్టుబడులు పెట్టినట్లు ప్రకటించింది. యాక్ట్ ఫైబర్‌నెట్ తమ కస్టమర్లకు అందిస్తున్న హోమ్ వై-ఫై సదుపాయాన్ని మరింత మెరుగుపరిచేందుకు, నెట్ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. అయితే ఈ డీల్ విలువ ఎంతనేది మాత్రం వెల్లడించలేదు.ఈ సందర్భంగా యాక్ట్ ఫైబర్‌నెట్ సీఈఓ బాల మల్లాది మాట్లాడుతూ..‘అప్రెకామ్ అధునాతన సాంకేతికతను యాక్ట్ ఫైబర్‌నెట్ వై-ఫై టెక్నాలజీకు అనుసంధానం చేయనున్నాం. ఇది వై-ఫై పనితీరులో వేగాన్ని పెంచుతుంది. రియల్‌టైమ్ నెట్వర్క్ విజిబిలిటీని అందిస్తుంది. ఇకపై కస్టమర్లకు మరింత ఉత్తమమైన నెట్ సేవలందుతాయి. అప్రెకామ్ తయారుచేసిన ఏఐ ఆధారిత సెల్ఫ్ ఆప్టిమైజింగ్ టెక్నాలజీ, అధునాతన వై-ఫై అనాలసిస్ కంపెనీ నెట్‌వర్క్‌ను నిరంతరం ఆప్టిమైజ్ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది’ అన్నారు.బెంగళూరుకు చెందిన యాక్ట్ ఫైబర్‌నెట్ దేశంలోని అతిపెద్ద వైర్డ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటిగా ఉంది. ఈ సంస్థ 25 నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2.2 మిలియన్ కస్టమర్లకు సేవలు అందిస్తోంది. -
ఇద్దరు వ్యక్తుల ప్రైవేటు సంభాషణ మూడో వ్యక్తి ఎలా వింటున్నాడు..!
ఫోన్ ట్యాపింగ్.. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ట్యాపింగ్ మాటున కొందరు అధికారులు సాగించిన దందా.. రోజురోజుకూ వెలుగుచూస్తున్న సంచలన విషయాలు విస్తుగొలుపుతున్నాయి. దీనిపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధాలు.. ఫిర్యాదుల వంటి విషయాలను పక్కనపెడితే.. అసలు ట్యాపింగ్ కథేంటి? దీనిని ఎలా చేస్తారు? ఇద్దరు వ్యక్తులు ప్రైవేటుగా మాట్లాడుకునే మాటలన్నీ మూడో వ్యక్తి ఎలా వినగలుగుతున్నాడు? ఓసారి చూద్దామా? ► ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు టెలిఫోన్ లేదా మొబైల్ ఫోన్ లేదా ఇంటర్నెట్ ద్వారా జరిపే సంభాషణలను వారికి తెలియ కుండా రహస్యంగా వినడం, రికార్డు చేయడాన్నే ట్యాపింగ్ అంటారు. వాస్తవానికి ట్యాపింగ్ చేయడం చట్టవిరు ద్ధం. దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో ట్యాపింగ్ చేయాల్సి వస్తే.. నిర్దేశిత ప్రభుత్వ ఏజెన్సీలు కేంద్ర హోంశాఖ అనుమతి తీసుకోవాలి. ప్రైవేటు వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ట్యాపింగ్ చేయడానికి అనుమతి లేదు. అనుమతి పొందిన ప్రభుత్వ సంస్థలు సైతం ట్యాపింగ్ చేయడానికి బోలెడు నిబంధనలు పాటించాలి. ఎవరి ఫోన్ అయినా గరిష్టంగా 180 రోజులు మాత్రమే ట్యాపింగ్ చేయాలి. పైగా ప్రతి 60 రోజులకు ఓసారి తాజాగా అనుమతి తెచ్చుకోవాల్సి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో అనుమతి లేకుండా గరిష్టంగా 24గంటలకు మించి ఫోన్ ట్యాపింగ్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ సదరు ట్యాపింగ్‌కు కేంద్ర హోంశాఖ అనుమతి నిరాకరిస్తే అప్పటివరకు రికార్డు చేసిన సంభాషణలన్నీ 48 గంటల్లోగా ధ్వంసం చేయాల్సి ఉంటుంది. ట్యాపింగ్‌లో రకాలు.. సెల్యులర్ ఇంటర్సెప్టర్లు.. ► వీటిని ఐఎంఎస్ఐ క్యాచర్స్ లేదా స్టింగ్రేస్ అని పిలు స్తారు. టవర్ల ద్వారా ప్రసార మయ్యే నిర్దేశిత మొబైల్ సిగ్నల్స్‌ను ఇవి అడ్డుకుంటా యి. అందు లోని డేటాను క్యాప్చర్ చేయడమే కాకుండా.. మొబైల్ లొకేషన్ కూడా ట్రాక్ చేస్తాయి. కాల్స్‌తో పాటు ఎస్సెమ్మెస్ లను సైతం సంగ్రహిస్తాయి. వీఓఐపీ ఇంటర్సెప్షన్ సాధనాలు.. ► వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ (వీఓఐపీ) కమ్యూనికేషన్లను సంగ్రహించేందుకు రూపొందించిన సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ ఆధారిత సాధనాలివి. వీఓఐపీ ప్రొటోకాల్స్‌లోని బలహీనతలను ఆసరాగా చేసుకుని ఇంటర్నెట్లో ప్రయాణించే డేటా ప్యాకెట్లను ఇవి అడ్డుకుని అందులోని డేటాను సంగ్రహిస్తాయి. క్లోన్డ్ సిమ్ కార్డులు.. ► ట్యాపింగ్ చేయాలనుకున్న వ్యక్తి సిమ్‌కు క్లోన్డ్ సిమ్ సంపాదిస్తే చాలు.. సదరు వ్యక్తి మొబైల్ ఫోన్‌కు వచ్చే కాల్స్ అన్నీ చక్కగా వినొచ్చు. రాజకీయపరమైన నిఘా.. ► సర్వీస్ ప్రొవైడర్ సహకారంతో రాజకీయ నాయకుల కాల్స్ రికా ర్డు చేస్తారు. ప్రభుత్వం నుంచి దీనికి అనుమతి ఉండదు. అందువల్ల ఇది అక్రమ ట్యాపింగ్. మానిటరింగ్ సాఫ్ట్వేర్.. హానికరమైన సాఫ్ట్వేర్ లేదా స్పైవేర్‌ను నిర్దేశిత వ్యక్తి మొబైల్ ఫోన్లో వారికి తెలియకుండా చొప్పిస్తారు. ఇవి ఆ ఫోన్ సంభాషణలను రికార్డు చేసి బయటి వ్యక్తు లకు పంపించడంతోపాటు ఫోన్లో ఉన్న సమస్త సమాచారాన్ని మనకు తెలియకుండా బహిర్గతం చేస్తుంది. అధికారిక ట్యాపింగ్.. ప్రభుత్వ అనుమతి తీసుకుని సర్వీస్ ప్రొవైడర్ సహకారంతో చేసే ట్యాపింగ్ ఇది. క్లండెస్టైన్ రికార్డర్ ఉపయోగించి సంభాషణలను రికార్డు చేస్తారు. లా ఎన్ఫోర్స్మెంట్ సంస్థలు డిజి టల్ ఫోరెన్సిక్స్ కోసం ప్రత్యేకమైన సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ సాధనాలను ఉపయోగించి ఈ ట్యాపింగ్ చేస్తాయి. ల్యాప్‌టాప్ సైజు పరికరంతోనే.. ► అక్రమంగా ట్యాపింగ్ చేసేవాళ్లకు పెద్దగా ఎక్విప్మెంట్ కూడా అక్కర్లేదు. ఓ ల్యాప్ టాప్ సైజులో ఉండే సెల్యులర్ ఇంటర్సెప్షన్ మెషీ న్ను కారులో పెట్టుకుంటే చాలు.. ఎవరి ఫోన్ అయినా సులభంగా ట్యాప్ చేసేయొచ్చు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన వ్యక్తి ఇల్లు లేదా ఆఫీసు వద్ద కారు పార్క్ చేసుకుంటే చాలు అవతలి వ్యక్తి సంభాషణలన్నీ వినొచ్చు.. రికార్డు చేయొచ్చు. ఇందుకోసం ముందుగా ఆ వ్యక్తి ఫోన్ నంబర్‌ను మెషీన్లో ఫీడ్ చేయాలి. అనంతరం ఆ వ్యక్తికి ఫోన్ వస్తే.. ఆటోమేటిగ్గా మెషీన్లో రికార్డు అయిపో తుంది. సదరు వ్యక్తి గొంతును రికార్డు చేసి మెషీన్లో ఫీడ్ చేసినా సరే.. దాని ఆధారంగా ఆ కాల్‌ను మెషీన్ రికార్డు చేస్తుంది. ఇజ్రాయెల్ పేరే ఎందుకు? ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాలు తెరపైకి వచ్చిన ప్పుడు ఇజ్రాయెల్ పేరే వినిపిస్తుంది. అధునాతన సాంకేతిక రంగానికి ఇజ్రాయెల్ ప్రసిద్ధి చెందడమే ఇందుకు కారణం. ఫోన్ ట్యాపింగ్ టెక్నాలజీతో సహా నిఘా, గూఢచార సేకరణ పరికరాలను అభివృద్ధి చేసే నైపుణ్యం ఇజ్రాయెల్ సొంతం. ఇటీవల మన దేశంలో సహా పలు దేశాల్లో సంచలనం సృష్టించిన పెగాసస్ స్పైవేర్ రూపొందించింది ఇజ్రాయెలే కావడం గమనార్హం. ట్యాపింగ్ చేసే అధికారం ఎవరికి ఉంది? జాతీయ స్థాయిలో ఇంటెలిజెన్స్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, రీసెర్చ్ అనాలసిస్ వింగ్, డైరెక్టరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటెలిజెన్స్, ఢిల్లీ పోలీస్ కమిషనర్‌తో పాటు రాష్ట్ర పోలీసు విభాగాలు నిబంధనలకు అనుగు ణంగా ఎవరి ఫోన్ అయినా ట్యాపింగ్ చేయొచ్చు. సెల్యులర్ ఇంటర్‌సెప్టర్ ఎలా పనిచేస్తుందంటే? ఇది చాలా సులభమైన ట్యాపింగ్ ప్రక్రియ. కాకపోతే ఖరీదు మాత్రం చాలా ఎక్కువ. చిన్న సూట్ ్డకేసులో ఇమిడిపోయే ఈ పరికరంతో.. నిర్దేశిత వ్యక్తుల ఫోన్లను భౌతికంగా ముట్టు కోకుండా.. ఎలాంటి స్పైవేర్లూ చొప్పించకుండా ట్యాపింగ్ చేయొచ్చు. సాధారణంగా మనం ఎవరికైనా కాల్ చేసినప్పుడు మన సెల్ ఫోన్ నుంచి సిగ్నల్స్ సమీపంలోని టవర్ ద్వారా నిర్దేశిత మార్గంలో అవతలి వ్యక్తికి చేరతాయి. ఈ ప్రక్రియలో సెల్ టవర్ల నుంచి ప్రసారమయ్యే సిగ్నల్స్‌ను నేరుగా ఈ మెషీన్లు సంగ్రహించి ఆ సంభాషణలు వినేలా, రికార్డు చేసేలా పనిచేస్తాయి. ఈ మెషీన్లలో కూడా చాలా రకాలున్నాయి.200 మీటర్ల పరిధి నుంచి దాదాపు 20 కిలోమీ టర్ల పరిధిలోని సెల్‌ఫోన్ సిగ్నల్స్‌ను ఇవి సంగ్రహించగలవు. కొన్ని మెషీన్లు సెల్‌ఫోన్ నుంచి వచ్చే సిగ్నల్స్‌ను టవర్‌కు వెళ్లకుండా ముందుగానే సంగ్రహిస్తాయి. అలాగే సామార్థ్యాన్ని బట్టి పదుల సంఖ్య నుంచి వందల సంఖ్యలో కాల్స్ వరకు ఒకేసారి ఈ మెషీన్లు రికా ర్డు చేయగలవు. కాల్స్, ఎస్సెమ్మెస్‌లే కాకుండా సోషల్ మీడియాతోపాటు మన సెల్ డివైస్ లోని సమస్త సమాచారాన్ని యాక్సెస్ చేసే ఇంటర్సెప్టర్లు ఉన్నాయి. వాస్తవా నికి వీటిని కొనాలన్నా చాలా అనుమ తుల తతంగం ఉంటుంది. అయితే, ఇజ్రాయెల్, సింగ పూర్ తదితర దేశాల నుంచి వీటిని అక్రమ పద్ధతిలో సమ కూర్చుకుంటున్నారు. మీ ఫోన్లో వైరస్ ఉందా!? తగిన జాగ్రత్తలతో డేటాను భద్రపరచుకోవచ్చంటున్న నిపుణులు సాక్షి, హైదరాబాద్: స్మార్ట్ఫోన్లు అందు బాటులోకి వచ్చాక మన పనులు ఎంత సులు వయ్యాయో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే దానితో బోలెడు ముప్పులు సైతం పొంచి ఉన్నాయని సైబర్ నిపుణులు హెచ్చరిస్తు న్నారు. ముఖ్యంగా సైబర్ నేరగాళ్లు ఫోన్లలోకి ఏదో ఒక రూపంలో వైరస్‌ను చొప్పించి ఫొటో లు, వీడియోలు సహా కీలక డేటా కొట్టేయడం, మార్ఫింగ్‌కు వాడుకోవడం లేదా ఆ సమాచారంతో బ్లాక్మెయిల్ చేయడం వంటి ఆగడాలకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మన ఫోన్లో వైరస్ చొరబడితే దాని పనితీరు ఎలా ఉంటుందో, హ్యాకింగ్‌కు గురైన ఫోన్‌ను తిరిగి ఎలా బాగుచేసుకోవాలో కీలక సూచనలు చేశారు. హ్యాకింగ్‌కు గురయ్యే ఫోన్ పనితీరు ఇలా ► ఫోన్ చార్జింగ్ చేసిన కాసేపటికే చార్జింగ్ డౌన్ కావడం లేదా వేగంగా బ్యాటరీ తగ్గి పోవడం ఫోన్ హ్యాకింగ్‌కు అత్యంత ముఖ్య మైన సంకేతం. మన ఫోన్లో ఏవైనా అనుమానాస్పద సాఫ్ట్వేర్లు బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతుంటే.. మన మొబైల్ ఫోన్‌ను తక్కువగా వాడినా, బ్యాటరీ మాత్రం అసాధరణంగా తగ్గిపోతుంది. ► మనకు తెలియని సోర్స్‌ల నుంచి కొత్తకొత్త యాడ్స్ వస్తుండటం, ఫ్లాష్ యాడ్స్ వస్తుండటం సైతం హ్యాకింగ్‌కు గురైనట్లు తెలిపే సూచిక. ► మనకు తెలియకుండానే బ్యాక్‌గ్రౌండ్ యాప్స్ రన్ అవడం, కొన్ని హిడెన్ యాప్స్ పనిచేస్తుండటంతో మొబైల్ ఫోన్ బాగా వేడెక్కుతుంది. ఇలా జరిగితే కూడా ఫోన్ హ్యాక్ అయినట్లు అనుమానించాలి. ► కొత్త నంబర్ల నుంచి తరచూ ఫోన్ కాల్స్ వస్తుండటం, టెక్సŠట్ మెసేజ్‌లలో వింత సింబల్స్, క్యారెక్టర్ల కాంబినేషన్స్‌తో రావడం గమనిస్తే ఫోన్ హ్యాక్ అయినట్లు గుర్తించాలి. ► మొబైల్‌ఫోన్ హ్యాక్ అయితే పనితీరు బాగా నెమ్మదిస్తుంది. ఫోన్‌కాల్ చేయడానికి, మెసేజ్‌లు ఓపెన్ కావడానికి, ఇతర యాప్‌లు పనిచేయడం నెమ్మదిగా జరుగుతుంది. ► ఫోన్లోని కెమెరా, మైక్రోఫోన్లు మనకు తెలియకుండానే యాక్టివ్ కావడం గమనిస్తే అనుమానించాల్సిందే. ► ఫోన్లోని స్క్రీన్‌లాక్, యాంటీ వైరస్ వంటి సెక్యూరిటీ ఫీచర్లన్నీ మనకు తెలియకుండానే డిసేబుల్ కావడం ఫోన్ హ్యాకింగ్ అయ్యిందనడానికి అత్యంత కీలకమైన మార్పుగా గుర్తించాలి. ఫోన్ హ్యాక్ అయితే ఏం చేయాలి..? ► ఏదైనా ఉత్తమమైన యాంటీ వైరస్ సాప్ట్‌వేర్‌ను ఇన్స్టాల్ చేసుకొని ఫోన్‌ను స్కాన్ చేయాలి. ► ఫోన్లో అనుమానాస్పద యాప్‌లను గమనిస్తే వాటిని వెంటనే డిలీట్ చేయాలి. ► ఫోన్ హ్యాక్ అయి, ఫోన్ నుంచి డేటా ట్రాన్స్ఫర్ అవుతున్నట్లు అనుమానిస్తే వెంటనే ఇంటర్నెట్ డేటా ఆఫ్ చేయాలి. వైఫై కనెక్షన్ తొలగించాలి. ఇలా చేయడం వల్ల హ్యాకర్లకు డేటా ట్రాన్స్ఫర్ ఆగిపోతుంది. ► ఫోన్ స్కీన్ర్ లాక్, యాప్ లాక్‌లు, ఈ–మెయిల్, సోషల్ మీడియా ఖాతాల పాస్‌వర్డ్‌లను మార్చేయాలి. ఇలా చేయడం వల్ల మన వ్యక్తిగత సమాచారం చోరీ కాకుండా అడ్డుకోవచ్చు. ► పైవన్నీ చేసినా ఫలితం లేనట్లు గుర్తిస్తే వెంటనే ఫోన్‌ను రీసెట్ చేయాలి. దీనివల్ల మాల్వేర్ అంతా పోవడంతోపాటు అను మాస్పద యాప్‌లు డివైస్ నుంచి తొలగి పోతాయి. అయితే మన వ్యక్తిగత సమా చారం, ఫొటోలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఈ జాగ్రత్తలు పాటిస్తే మేలు.. ► మొబైల్ ఫోన్లోని ఫొటోలు, వీడియో లు, ఇతర డేటాను, సోషల్ మీడియా ఖాతాల్లోని సమాచారాన్ని ఎప్పటిక ప్పుడు పెన్‌డ్రైవ్, ఇతర డివైస్‌లలో బ్యాకప్ చేస్తూ ఉండాలి. ఫోన్ హ్యాక్ అయినా వెంటనే దాన్ని రీసెట్ చేయొ చ్చు.ముందే బ్యాక్అప్ ఉంటుంది కాబ ట్టి డేటా పోయే ప్రమాదం ఉండదు. ► యాపిల్, ఆండ్రాయిడ్ ఫోన్లకు ఆరు అంకెల పాస్వర్డ్లు తప్పక పెట్టుకోవాలి. వాటిని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. ► కొత్త యాప్‌లు ఇన్స్టాల్ చేసే ముందు పూర్తిగా వాటికి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలి. ► పబ్లిక్ వైఫైను వీలైనంత వరకు వాడకపోవడం ఉత్తమం. తప్పనిసరైతే వీపీఎన్ టూల్స్ ద్వారా వాడాలి. ఇలా చేయడం వల్ల మన డేటా ప్రైవేటు ఎన్క్రిప్టెడ్ చానల్ ద్వారా వెళ్తుంది. -
ఇది ఒక సైకాలం..! ఆన్లైన్ రాక్షసులు..!!
"ఇంటర్నెట్ రాకతో ప్రపంచం కుగ్రామంగా మారింది. సోషల్ మీడియా వల్ల ప్రపంచంలో ఏ మూలనున్న వారితోనైనా స్నేహించే, సంభాషించే అవకాశం దొరుకుతోంది. మరోవైపు ముక్కూమొహం తెలియని వారిపై అసహ్యకరమైన వ్యాఖ్యలు చేసి, బాధపెట్టి ఆనందించే ట్రోల్స్ అనే ప్రత్యేక జాతిని సృష్టించింది. చక్కగా అమెరికన్ యాక్సెంట్లో ఇంగ్లిష్ మాట్లాడిన బెండపూడి విద్యార్థులను, పిల్లలని కూడా చూడకుండా విపరీతంగా ట్రోల్ చేశారు. ప్రభుత్వం నుంచి ఇంటి స్థలాన్ని పొందిన వివాహితను అసభ్య పదజాలంతో ట్రోల్ చేసి ఆమె ఆత్మహత్యకు కారణమయ్యారు. సినీ తారలు, రాజకీయ నాయకులు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్.. వారని వీరని లేదు, అందరూ ట్రోలింగ్ బారిన పడ్డవారే!" అదోరకమైన శాడిజం.. జీవితంలో ఎలాంటి గుర్తింపులేని, ఎవరూ పట్టించుకోని వ్యక్తులకు ఆన్లైన్లో ఐడెంటిటీ బయటపడకుండా మాట్లాడగలగటం ధైర్యాన్నిస్తుంది. తమను ఎవరూ పట్టుకోలేరనే ధైర్యంతోనే నోటికొచ్చినట్లు అసభ్యంగా మాట్లాడుతుంటారు. నిజానికి వీరిలో లోతైన అభద్రత ఉంటుంది. దాన్నుంచి బయట పడేందుకు, ఇతరుల అటెన్షన్‌ను పొందేందుకు ట్రోలింగ్‌ను ఒక సాధనంగా చేసుకుంటారు. ఎమోషనల్ కంట్రోల్ లేనివారు కూడా ట్రోలింగ్‌ను ఎంచుకుంటారు. ట్రోల్స్‌లో నార్సిసిజం, మాకియవెల్లియనిజం, శాడిజం ఉంటాయని అధ్యయనాలు వెల్లడించాయి. నార్సిసిజం అంటే విపరీతమైన స్వీయప్రేమ. వీరికి విపరీతమైన అటెన్షన్ కావాలి. దానికోసం ఇతరులను ట్రోల్ చేస్తుంటారు. మన రియాక్షన్ నుంచి వారికి కావాల్సిన అటెన్షన్ పొందుతారు. మాకియ వెల్లియన్ ట్రోల్స్ మానిప్యులేట్ చేయడానికి అబద్ధాలు, మోసం ఉపయోగిస్తారు. వారిలో ఎలాంటి పశ్చాత్తాపం ఉండదు. ఇతరులు బాధపడుతుంటే లేదా బాధపెట్టి ఆనందించడమే శాడిజం. శాడిస్ట్ ట్రోల్స్ సంబంధంలేని అంశాలలో కూడా చేరి బాధపెట్టి ఆనందిస్తుంటారు. బలమైన కోటను నిర్మించుకోవాలి.. పెద్ద పెద్ద సెలబ్రిటీలకు కూడా ట్రోలింగ్ తప్పలేదని, మీరు ఒంటరి కాదని గుర్తించండి. ట్రోలింగ్ ప్రవర్తనను అర్థం చేసుకోవడం ద్వారా, మీ చుట్టూ బలమైన కోటను నిర్మించుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. మీరు సున్నిత మనస్కులైతే సోషల్ మీడియాకు దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ ఉన్నా, ట్రోలింగ్ జరుగుతున్నంతకాలం డియాక్టివేట్ చేసుకోవాలి. ట్రోల్‌కు ప్రతిస్పందించడమంటే మృగానికి ఆహారం అందివ్వడమే. వారు కోరుకునే గుర్తింపు వారికి అందివ్వడమే. అందువల్ల కష్టమైనప్పటికీ ట్రోల్స్‌ను విస్మరించడమే వారి నుంచి తప్పించుకునే మార్గం. అప్పుడే వారు నిరాయుధులవుతారు, ఆకలితో అలమటిస్తారు. ట్రోల్స్‌ను నిరోధించడానికి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు అందించిన రిపోర్టింగ్ మెకానిజాన్ని ఉపయోగించండి. వారిని బ్లాక్ చేయండి, రిపోర్ట్ చేయండి, వారి అకౌంట్ డిలీట్ అయ్యేలా రిపోర్ట్ చేయండి. ట్రోలింగ్ మీ కంటే ట్రోల్ గురించి ఎక్కువగా వెల్లడిస్తుంది. వారి నీచ మనస్తత్వం అందరికీ తెలిసేలా చేస్తుంది. అందువల్ల ట్రోల్స్ గురించి బాధపడకండి. మిమ్మల్ని మీరు ఒంటరిగా ఉంచుకోకండి. స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఆన్లైన్ గ్రూపుల మద్దతు తీసుకోండి. మీ విలువను మీకు గుర్తు చేయగల, మీకు సహాయం చేయగల వ్యక్తులతో ఎక్కువ సమయం గడపండి. ట్రోలింగ్ వల్ల ఆందోళన, నిరాశ, దిగులు, ఆత్మహత్య ఆలోచనలు వస్తుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సైకాలజిస్టును సంప్రదించండి. ట్రోల్స్ 2 రకాలు.. ట్రోలింగ్ చేసేవారిని ట్రోల్ అంటారు. వీరు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటారు. వ్యక్తిగతంగా ఇతరులను ట్రోల్ చేసి ఆనందించేవారు. వీరివల్ల కాస్తంత బాధే తప్ప ప్రమాదం ఉండదు. కానీ ఒక సంస్థ కోసమో, రాజకీయ పార్టీ కోసమో వ్యవస్థీకృతంగా ట్రోల్ చేసేవారు ప్రమాదకరంగా ఉంటారు. ఎందుకంటే వారిలో ఒకరు ట్రోలింగ్ మొదలుపెడితే వందల్లో, వేలల్లో, లక్షల్లో ట్రోల్ చేస్తారు. వారికి ఆయా సంస్థ లేదా పార్టీల మద్దతు కూడా ఉండటంతో విపరీతంగా రెచ్చిపోతారు. ఇవి కొన్నిసార్లు ఆన్లైన్ యుద్ధాలుగా మారవచ్చు. ట్రోలింగ్ సంకేతాలను గుర్తించాలి.. ట్రోల్స్ నుంచి తప్పించుకోవాలంటే ముందు వారి లక్షణాలను, ప్రవర్తనను గుర్తించాలి. అప్పుడే వారికి దూరంగా ఉండవచ్చు. అందుకే వాటిని గుర్తించడం అవసరం. మీతో గొడవపడటం, మిమ్మల్ని రెచ్చగొట్టి, బాధపడేలా చేయడమే ట్రోల్స్ లక్ష్యం. అందుకోసం అవమానకమైన భాష ఉపయోగిస్తారు వాస్తవాలను వక్రీకకరిస్తారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తారు. వాస్తవ సమస్యల నుంచి పక్కదారి పట్టించి, సామాజిక ఉద్రిక్తతలను సృష్టించాలని ప్రయత్నిస్తుంటారు. చర్చను వాదనగా మారుస్తారు. మీ రూపం, విలువలు, విశ్వాసాలను కించపరుస్తూ మాట్లాడతారు. కొందరు మరింత దిగజారి బూతులు కూడా తిడతారు. — సైకాలజిస్ట్ విశేష్ (psy.vishesh@gmail.com) ఇవి చదవండి: Usha Mehta: వెండి తెర మీద రహస్య రేడియో -
ఇచట డిజిటల్ ఆమ్లెట్ డిజిటల్ పరోటా వేయబడును
అమ్లెట్లు ఎచట వేసెదరు? ఆలూ పరాట ఎక్కడ తయారుచేసెదరు?’ అనే ప్రశ్నలకు ‘ఇవి కూడా ప్రశ్నలేనా. స్టవ్ మీద ఉన్న పెనంపై వేస్తారు. చేస్తారు’ అంటాం. అయితే ఒక టెక్ కంటెంట్ క్రియేటర్ మాత్రం మనం చెప్పే జవాబును మార్చే ప్రయత్నంలో ఉన్నాడు. సదరు ఈ క్రియేటర్ కంప్యూటర్ ‘సిపియు’పై ఆమ్లెట్ వేశాడు. ఆ తరువాత మినీ పరోటా తయారుచేశాడు. వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి ‘డిజిటల్ ఆమ్లెట్లు–పరోటాలు వచ్చేశాయి’ అని మురిసిపోతున్నారు ప్రేక్షకమహాశయులు. -
వర్చువల్ ఎవరెస్ట్ జర్నీ
ఎవరెస్ట్ శిఖరం 360 డిగ్రీల కెమెరా వ్యూ ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. వర్చువల్ జర్నీ రూపంలో సరికొత్త అనుభవాన్ని అందిస్తోంది. పర్వతారోహకులు ఎదుర్కొనే కఠినమైన వాతావరణ పరిస్థితులను అనుభవంలోకి తెచ్చేలా ఉంటుంది ఈ వర్చువల్ జర్నీ. స్కిల్డ్ మౌంటెనీర్స్ టీమ్ ఈ ఫుటేజీని కాప్చర్ చేసింది. ‘ఏ 360 డిగ్రీ కెమెరా వ్యూ ఫ్రమ్ ది టాప్ ఆఫ్ మౌంట్ ఎవరెస్ట్’ కాప్షన్‌తో అష్రఫ్ జక్ర ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఈ వీడియో వేలాది వ్యూస్‌ను సొంతం చేసుకుంది. పర్వతారోహక బృందం ధైర్యసాహసాలకు, సాంకేతిక నైపుణ్యానికి నెటిజనులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘టాప్ ఆఫ్ ది వరల్డ్! థ్యాంక్‌ఫుల్ ఫర్ గాడ్స్ క్రియేషన్’... నెటిజనుల నుంచి ఇలాంటి కామెంట్స్ ఎన్నో కనిపించాయి. -
ఇంటర్నెట్ వినియోగదారులకు శుభవార్త!
ఇంటర్నెట్ వినియోగదారులకు శుభవార్త. త్వరలో దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాల్లో శాటిలైట్ ఇంటర్నెట్ను అందించే ఎలాన్ మస్క్ సంస్థ స్టార్‌లింక్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అందుకు సంబంధించిన అనుమతులపై కేంద్ర విభాగానికి చెందిన డిపార్ట్మెంట్ పర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) సంతృప్తిని వ్యక్తం చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. శాటిలైట్ ఇంటర్నెట్ను అందించే విషయంలో స్టార్‌లింక్‌తో పాటు భారత్‌కు చెందిన రిలయన్స్ స్టార్‌లింక్ జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్, ఎయిర్టెల్ వన్వెబ్లు అనుమతి కోసం కేంద్రానికి ధరఖాస్తు చేసుకున్నాయి. ఇక తాజాగా స్టార్‌లింక్‌కు డీపీఐఐటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) స్టార్లింక్కి లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LoI) జారీ చేయవచ్చని సంబంధిత వర్గాలు అభిపప్రాయం వ్యక్తం చేశాయి. అయితే దీనిపై ఎలాన్ మస్క్ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. టెలికాం సెక్రటరీ నీరజ్ మిట్టల్, కమ్యూనికేషన్ శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ ఆమోదం కోసం డాట్ ఒక నోట్‌ను సిద్ధం చేస్తుంది.వారి ఆమోదం పొందిన తర్వాత, డిపార్ట్మెంట్లోని శాటిలైట్ కమ్యూనికేషన్స్ వింగ్ (SCW) అధికారికంగా స్టార్లింక్కి అవసరమైన అనుమతులను మంజూరు చేస్తుంది. దీంతో స్టార్‌లింక్ భారత్‌లో తన సేవల్ని వినియోగదారులకు అందించేందుకు దోహదం చేస్తుంది. -
పాక్‌లో స్థంభించిన ఇంటర్నెట్.. మండిపడ్డ నెటిజన్లు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ అంతటా ఇంటర్నెట్ స్థంబించిపోయింది. ఇంటర్నెట్ అంతరాయంతో పలు సోషల్‌మీడియా అకౌంట్స్ ఓపెన్ కాలేదు. దీంతో నెటిజనట్లు తీవ్రమైన నిరాశ వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) రాబోయే ఎన్నికల కోసం నిధుల సేకరణ ప్రచారాన్ని ప్రారంభించిన క్రమంలోనే ఇంటర్నెట్ అంతరాయం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. Is #internet down in some areas or all over #Pakistan? Social media sites are either not opening or are very slow. #InternetShutDown pic.twitter.com/bxax9qp8oT — Ather Kazmi (@2Kazmi) January 7, 2024 ‘ఎక్స్’(ట్వీటర్)తో పాటు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టిక్‌టాక్, పలు వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్, యూట్యూబ్ సైతం ఓపెన్ కాకుండా మొరాయించడంతో దేశవ్యాప్తంగా ప్రజలు, నెటిజన్లు అసహనం వ్యక్తం చేశారు. వందల సంఖ్యలో వెబ్సైట్లు కూడా ఓపెన్ కాకపోవటం గమనర్హం. ఇంటర్నెట్ అంతరాయంతో గ్లోబల్ ఇంటర్నెట్ అబ్జర్వేటరీ, నెట్ బ్లాక్స్, సోషల్ మీడియా అప్లికేషన్లు కూడా దేశవ్యాప్తంగా ఓపన్ అవ్వలేదని తెలుస్తోంది. దీంతో ప్రజలు, సోషల్ మీడియా నెటిజన్లు ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘ఇది ఖచ్చితంగా సిగ్గుచేటు! అయిన విషయమని ప్రజలకు ఇంటర్నెట్ అంతరాయంతో జరిగిన నష్టానికి కేర్‌టేకర్ ఐటీ మంత్రి రాజీనామా చేయాలి’ అని పీటీఐ ట్విటర్ హ్యాండిల్ డిమాండ్ చేసింది. Absolutely shameful! Caretaker IT Minister should resign for this continuing damage to Pakistanis https://t.co/W9pyXzRr6A — PTI (@PTIofficial) January 7, 2024 చదవండి: మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. మాల్దీవులు మంత్రులపై వేటు! -
2023లో గూగుల్‌లో అత్యధికంగా ఏ ఫుడ్ కోసం వెతికారో తెలుసా?
ఈ ఏడాది ముగింపు దశకు చేరుకుంది. మరికొన్ని రోజుల్లోనే 2024లో అడుగు పెట్టబోతున్నాం. కొత్త ఏడాదికి స్వాగతం పలకడానికి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. 2023లో ఫ్యాషన్, బ్యూటీ, ఫుడ్ విషయంలో అనేక కొత్త ట్రెండ్స్ వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది ఫుడ్ రెసిపిల్లోనూ వెరైటీ ప్రయోగాలెన్నో చూశాం. అలా 2023లో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన 10 ఆహార పదార్థాలుఏంటో చూసేద్దాం. మిల్లెట్స్ 2023 సంవత్సరంలో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన ఆహార పదార్థాల్లో మిల్లెట్స్ పేరు ముందుంది. మిల్లెట్స్ తయారీ విధానం, దాని ప్రయోజనాలు తెలుసుకోవడానికి నెటిజన్లు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారు. దీనికి ప్రధాన కారణం.. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్యసమితి 2023ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించడమే. అవకాడో అవకాడో ఒక అమెరికన్ ఫ్రూట్. దీన్ని తెలుగులో వెన్నపండు అంటారు. గూగుల్‌లో అత్యధికంగా వెతిక ఆహార పదార్థాల్లో అవకాడో ఒకటి. అవకాడలో విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫ్రూట్‌కి బాగా డిమాండ్ ఉంది. అరటిపండు కంటే అవోకాడోలో ఎక్కువ పొటాషియం ఉంది. అవకాడో తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు అవకాడోను పలు స్మూతీల్లో, సలాడ్స్‌లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది కాస్త కాస్ట్లీ అయినప్పటికీ అవకాడోలోని పోషకాలు, హెల్తీ ఫ్యాట్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ కారణంగానే గూగుల్ మోస్ట్ సెర్చ్డ్ ఫుడ్ ఐటెమ్స్‌లో ఒకటిగా నిలిచింది. మటన్ రోగన్ జోష్ గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేసిన ఫుడ్ ఐటమ్స్‌లో మటన్ రోగన్ జోష్ మూడో స్థానం దక్కించుకుంది. ఇది పాపులర్ కశ్మీరీ వంటకం. నాన్ లేదా రైస్‌తో తినే ఈ స్పైసీ ఫుడ్‌కు మంచి ఆదరణ ఉంది. ఈ ఏడాది ఎక్కవుగా సెర్చ్ చేసిన టాప్-3 ఐటెం ఇది. కతి రోల్స్ 2023లో గూగుల్‌లో ఎక్కువగా వెతికిన ఆహార పదార్థాల్లో కతి రోల్స్ నాలుగో స్థానంలో నిలిచింది. కోల్‌కతాలోని పాపులర్ స్ట్రీట్‌ఫుడ్స్‌లో ఇది ఒకటి. రోల్స్‌లో స్టఫింగ్ కోసం వెజ్ లేదా నాన్‌వెజ్‌ను ఎంచుకోవచ్చు. వీటిని చట్నీ లేదా సాస్‌తో వడ్డిస్తారు. టిన్ట్ ఫిష్ చేపల్లో ప్రోటీన్, ఒమేగా-2 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయన్న విషయం తెలిసిందే. 2023లో ఎక్కువగా సెర్చ్ చేసిన వంటకాల్లో టిన్ట్ ఫిష్ కూడా ఉంది. సలాడ్,శాండ్విచ్, పాస్తా,,క్యాస్రోల్ వంటకాల్లో ఎక్కువగా టిన్ట్ ఫిష్‌ను ఉపయోగిస్తారు. -
ప్రపంచంలోనే నాసా కంటే ఎక్కువ డేటా ట్రాన్స్ఫర్..! కానీ..
ప్రస్తుత పరిస్థితుల్లో ఏ చిన్న సందేహం వచ్చినా తెలుకునేందుకు ఇంటర్నెట్లో వెతుకుతుంటాం. సాంకేతికత అందుబాటులోకి వచ్చాక ఇంటర్నెట్ వినియోగం పెరిగిపోయింది. అందుకే వినియోగదారులకు వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అందించేందుకు కంపెనీలు పోటీ పడుతున్నాయి. తాజాగా జపాన్‌కు చెందిన పరిశోధకుల బృందం ప్రపంచంలోనే అధిక ట్రాఫిక్ కలిగిన ఇంటర్నెట్ను సరఫరాచేసి రికార్డు నెలకొల్పారు. ఆప్టికల్ఫైబర్ ద్వారా సెకనుకు 22.9 పెటాబిట్ల డేటాను సరఫరాచేసి రికార్డు సృష్టించారు. అక్టోబర్‌లో స్కాట్లాండ్లో జరిగిన యూరోపియన్ కాన్ఫరెన్స్ ఆన్ ఆప్టికల్ కమ్యూనికేషన్లో ఈ పరిశోధన నివేదికను సమర్పించారు. జపాన్‌కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ (ఎన్ఐసీటీ) సెకనుకు 22.9 పెటాబిట్ల(1 పెటాబిట్ అంటే 10 లక్షల గిగాబిట్లకు సమానం) డేటా ట్రాన్స్మిషన్ రేటును అధిగమించినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక ట్రాఫిక్ కలిగిన డేటాను ఇంటర్నెట్ ద్వారా సరఫరా చేశారు. దీంతో ఇంటర్నెట్లోని మొత్తం ట్రాఫిక్‌ను సెకండ్ బై సెకండ్ 22 సార్లు ప్రసారం చేయవచ్చు. నాసా కూడా కూడా సెకనుకు 46 టెరాబిట్ల డేటాను మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగంగా దాదాపు సెకనుకు 10 గిగాబిట్ డేటాను ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంది. కానీ చాలావరకు సెకనుకు వందల మెగాబిట్ డేటాను మాత్రమే సరఫరా అవుతోంది. అయితే తాజాగా ఎన్ఐసీటీ సెకనుకు 22.9 పెటాబిట్ డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్‌ను సాధించడానికి కొన్ని అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను ఉపయోగించింది. డేటాను ప్రసారం చేయడానికి ఒక కోర్ ఛానల్‌కు బదులుగా, 38 ఫైబర్కేబుళ్లను వినియోగించింది. వీటిలో ఒక్కోటి 3 మోడ్ల చొప్పున మొత్తం 114 ఛానెల్‌ల ద్వారా డేటాను ప్రసారం చేశారు. ప్రతి ఛానెల్లోని ప్రతి మోడ్ ద్వారా 750 వేవ్లెంత్, 18.8 టెరాహెడ్జెస్ బ్యాండ్‌విడ్త్‌తో ఈ డేటాను పంపించినట్లు తెలిసింది. అయితే కనెక్షన్లోని కొన్ని లోపాలు సవరించి ఆప్టిమైజ్ చేయడం వల్ల దాని ప్రస్తుత వేగం సెకనుకు 24.7 పెటాబిట్కు చేరుకోగలదని బృంద సభ్యులు తెలిపారు. ఇదీ చదవండి: జాతీయ రికార్డు సృష్టించిన అదానీ కంపెనీ అయితే, ఇకపై మనకు కావాల్సిన ఎంత డేటా అయినా సెకనులో డౌన్లోడ్ చేసుకోవచ్చని అనుకుంటున్నారేమో. ఈ డేటాను డీకోడ్ చేయడానికి సంక్లిష్టమైన సిగ్నల్ ప్రాసెసింగ్ ఉంటుందని చెప్పింది. దీనికి ఎంఐఎంఓ రిసీవర్లు అని పిలువబడే ప్రత్యేక పరికరాలు నెట్‌వర్క్‌లో ఇన్స్టాల్ చేయాలని వివరించింది. ప్రస్తుతం 4 కోర్ వర్షన్ ద్వారా ఒక్కోమోడ్ విధానంలో సెకనుకు 1 పెటాబిట్ డేటా ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉందని తెలిపింది. -
మంకీ డ్యాన్స్ చాలెంజ్
ఎప్పటికప్పుడు కొత్త కొత్త డ్యాన్స్‌లు వస్తూ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఈ సందడి ఇంటర్నెట్కే పరిమితం కావడం లేదు. బయట రకరకాల ఫంక్షన్లలో నృత్యాభిమానులు ఈ ట్రెండింగ్ డ్యాన్స్‌లను ఫాలో అవుతున్నారు. ‘గాంగ్నమ్’ డ్యాన్స్ తరువాత రకరకాల డ్యాన్సులు వచ్చాయి. తాజాగా ‘మంకీ డ్యాన్స్ చాలెంజ్’ ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌గా మారింది. బాలీవుడ్ హీరోయిన్ ఫాతిమ సనా షేక్ ‘నేను సైతం’ అంటూ ఈ చాలెంజ్‌ను స్వీకరించింది. పింక్ శారీలో మెరిసిపోతూ తన బృందంతో కలిసి చేసిన మంకీ డ్యాన్స్ వీడియో వైరల్ అయింది. ‘దిస్ ఈజ్ అమేజింగ్’లాంటి కామెంట్స్‌తో కామెంట్ సెక్షన్ నిండిపోయింది. కొత్త స్టైల్లో డ్యాన్స్ ట్రై చేయాలనుకుంటున్నావారికి ఈ వీడియో బెస్ట్ ఛాయిస్. -
ప్రపంచంలోనే చైనా ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ ఆవిష్కరణ
బీజింగ్: ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ నెట్‌వర్క్‌ను చైనీస్ కంపెనీలు ఆవిష్కరించాయి. ఇది సెకనుకు 1.2 టెరాబిట్ల డేటాను ప్రసారం చేయగలదని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది. ఈ వేగం ప్రస్తుత ప్రధాన ఇంటర్నెట్ కంటే పది రెట్లు ఎక్కువని పేర్కొంది. సింఘువా విశ్వవిద్యాలయం, చైనా మొబైల్, హువాయ్ టెక్నాలజీస్, సెర్నెట్ కార్పొరేషన్లు దీనిని అభివృద్ధి చేశాయి. బీజింగ్-వుహాన్- గ్వాంగ్‌జౌలను అనుసంధానిస్తూ ప్రత్యేకమైన ఆప్టికల్ ఫైబర్ కేబులింగ్ సిస్టమ్ ద్వారా దాదాపు 3,000 కిలోమీటర్ల వరకు ఈ ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలోని ఇంటర్నెట్ నెట్‌వర్క్‌లు సాధారణంగా సెకనుకు కేవలం 100 గిగాబిట్ల వేగంతో పనిచేస్తాయి. అమెరికా ఐదవ తరం ఇంటర్నెట్ కూడా సెకనుకు 400 గిగాబిట్ల వేగాన్ని కలిగి ఉంది. కానీ చైనా కనిపెట్టిన ఇంటర్నెట్ సెకనుకు 1.2 టెరాబిట్ (1,200 గిగాబిట్)ల డేటాను ప్రసారం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. బీజింగ్-వుహాన్-గ్వాంగ్జౌ ప్రాజెక్టు చైనా భవిష్యత్ ఇంటర్నెట్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగం. ఇది కేవలం ఒక సెకనులో 150 హై-డెఫినిషన్ ఫిల్మ్‌లకు సమానమైన డేటాను బదిలీ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉందని హువాయ్ టెక్నాలజీస్ వైస్-ప్రెసిడెంట్ వాంగ్ లీ వివరించారు. ఇదీ చదవండి: హమాస్ ఇజ్రాయిల్ మధ్య కుదిరిన డీల్! -
ఇజ్రాయెల్-గాజా యుద్ధం: కీలక ప్రకటన చేసిన ఎలాన్ మస్క్
ఇజ్రాయెల్ దాడి కారణంగా అన్ని కమ్యూనికేషన్లు ఆగిపోయి యుద్ధంలో దెబ్బతిన్న గాజాకు బిలియనీర్ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ (elon musk) మద్దతుగా నిలిచారు. గాజాకు ఇంటర్నెట్ సపోర్ట్ అందించనున్నట్లు ప్రకటించారు. హమాస్ నేతృత్వంలో ఉన్న గాజాను ఇజ్రాయెల్ బలగాలు పూర్తిగా చుట్టుముట్టేశాయి. అన్ని వైపుల నుంచి దాడులు ముమ్మరం చేశాయి. దీంతో ఆ ప్రాంతంలో కమ్యూకేషన్ పూర్తిగా స్తంభించింది. ఈ క్రమంలో ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. గాజాలోని యూఎన్, ఇతర అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సహాయ సమూహాలకు కనెక్టివిటీని పునరుద్ధరించడంలో తన ‘స్టార్‌లింక్’ (starlink) సహాయపడుతుందని ‘ఎక్స్’ (ట్విటర్) ద్వారా ప్రకటించారు. ఈ నేపథ్యంలో మస్క్ నేతృత్వంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్)లో #StarlinkForGaza అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. స్పేస్ఎక్స్ (SpaceX) నిర్వహిస్తున్న కృత్రిమ ఉపగ్రహాల సముదాయాన్ని స్టార్‌లింక్ కలిగి ఉంది. ఇది మారుమూల ప్రాంతాలకు సైతం కనెక్టివిటీని అందించగలదు. అక్టోబర్‌లో వెలువడిన బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ఇజ్రాయెల్ యుద్ధకాల కమ్యూనికేషన్లను పెంచే ప్రయత్నంలో స్పేస్ఎక్స్తో చర్చలు కూడా ప్రారంభించింది. ఈ నెట్వర్క్ ఫ్రంట్‌లైన్‌లకు సమీపంలో ఉన్న ఇజ్రాయెల్ పట్టణాలకు నిరంతర ఇంటర్నెట్ సేవను కలిగి ఉండటానికి అనుమతిస్తుందని కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇజ్రాయెల్ ప్రతినిధిని ఉటంకిస్తూ, గాజాలో అన్ని ఇంటర్నెట్, ఫోన్ సేవలను ఇజ్రాయెల్ స్తంభింపజేసే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. గాజాలో ప్రస్తుతం కమ్యూనికేషన్ పూర్తిగా స్తంభించింది. ఇంటర్నెట్, ఫోన్ సేవలు రోజంతా నిలిచిపోయాయి. ఇజ్రాయెల్ కమ్యూనికేషన్లను తొలగించిదని పాలస్తీనా రెడ్ క్రెసెంట్ తెలిపింది. Starlink will support connectivity to internationally recognized aid organizations in Gaza. [ComStar] — Elon Musk (@elonmusk) October 28, 2023 -
ఇప్పటికే దేశంలో 4లక్షల 5జీ బేస్స్టేషన్లు: ప్రధానిమోదీ
న్యూదిల్లీలోని ప్రగతిమైదాన్‌లో ఏర్పాటు చేసిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2023ను శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించి మాట్లాడారు. దేశం ప్రస్తుతం 6జీ దిశగా అడుగులు వేస్తోందన్నారు. 5జీని అందుబాటులోకి తీసుకొచ్చిన ఏడాదిలోపే దేశవ్యాప్తంగా నాలుగు లక్షల 5జీ బేస్ స్టేషన్లను ఏర్పాటు చేసుకోగలిగామన్నారు. బ్రాడ్‌బ్యాండ్ వేగంలో భారత్ గతంలో 118 ర్యాంక్‌లో ఉండగా..ఇప్పుడు 43వ ర్యాంక్‌కు చేరిందని తెలిపారు. ఇటీవలే గూగుల్.. భారత్‌లో పిక్సెల్ ఫోన్‌ను తయారు చేయనున్నట్లు ప్రకటించిందన్నారు. శామ్సంగ్ ఫోల్డ్ 5, యాపిల్ ఐఫోన్ 15 ఇప్పటికే దేశంలో తయారవుతున్నాయని గుర్తచేశారు. ప్రపంచమంతా మేడ్ ఇన్ ఇండియా ఫోన్లను ఉపయోగిస్తుండటం గర్వంగా ఉందని మోదీ కొనియాడారు. భారత టెక్ విప్లవంలో యువత పాత్ర కీలకమని, అంతరిక్ష రంగంలో భారత్ వేగంగా వృద్ధి చెందుతోందని తెలిపారు. 6జీ టెక్నాలజీలో భారత్ ప్రపంచానికి మార్గనిర్దేశంగా నిలుస్తుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. -
ఔరా అండర్ వాటర్ గార్బా
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గార్బా నృత్యాల సంబరం సహజమే. అయితే జయ్‌దీప్ గోహిల్ మాత్రం ‘అండర్–వాటర్ గార్బా డ్యాన్స్’తో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇంటర్నెట్లో ఈ అండర్ వాటర్ గార్బా డ్యాన్స్ వైరల్‌గా మారింది. కొన్నిరోజుల క్రితం ‘నవరాత్రి ఇన్ హెవెన్’ టైటిల్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో కూడా బాగా పాపులర్ అయింది. ఈ వీడియోలో ‘రాధే రాధే’ పాటకు అండర్ వాటర్ డ్యాన్స్ చేస్తూ కనిపించాడు జయ్‌దీప్. అండర్–వాటర్ గార్బా డ్యాన్స్ విషయానికి వస్తే...‘మాటలు చాలని అద్భుతం’ అంటూ నెటిజనులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. జయ్‌దీప్ గోహిల్ పేరు వినిపించగానే ‘అండర్–వాటర్ డ్యాన్సర్’ అనే మాట వినిపిస్తుంది. అండర్–వాటర్ డ్యాన్సింగ్‌లో ప్రావీణ్యం సంపాదించడానికి ఎన్నో నెలల పాటు కష్టపడ్డాడు. చిన్నప్పటి నుంచి జయ్‌దీప్‌కు ఈత, నృత్యం అంటే ఇష్టం. ఇంజనీరింగ్ చేసిన జయ్‌దీప్ 9 టు 5 జాబ్ చేయాలనుకోలేదు. డ్యాన్సర్‌గా మంచి పేరు తెచ్చుకోవాలనుకున్నాడు. బ్రేక్ డ్యాన్స్ నుంచి హిప్–çహాప్ వరకు రకరకాల డ్యాన్సులు నేర్చుకున్నాడు. ఇక మైకేల్ జాక్సన్ డ్యాన్స్‌లను అచ్చం అలాగే చేసేవాడు. -
సగానికిపైగా వినియోగదారులకు ఇంటర్నెట్ కష్టాలు!
జాతీయ స్థాయిలో ఇంటర్నెట్ సరఫరాకు సంబంధించి గత ఆరు నెలలుగా వందలాది ఫిర్యాదులు నమోదయ్యాయి. బ్రాడ్‌బ్యాండ్, ఫైబర్, డీఎస్ఎల్ సేవలపై కొన్ని సంస్థలు ఇంటర్నెట్ అంతరాయంపై సర్వే నిర్వహించాయి. ఇంటర్నెట్ సేవలు అందించే కంపెనీలు దాదాపు రూ.75వేల కోట్లతో వినియోగదారులకు సదుపాయాలు ఏర్పాటు చేస్తామని చెబుతున్నాయి. అయినప్పటికీ కనెక్టివిటీ కష్టాలు మాత్రం తప్పడం లేదు. నిరంతరం ఇంటర్నెట్ సరఫరాలో తీవ్ర అంతరాయంతో ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో 56శాతం మంది నెట్ కనెక్షన్లో అంతరాయం వల్ల ఇబ్బందిపడుతూ సంబంధిత సంస్థలకు ఫిర్యాదు చేస్తున్నారు. కంపెనీలు ముందుగా వాగ్ధానం చేసిన వేగం కంటే నెట్ తక్కువ వేగంతో వస్తుందని ఫిర్యాదులో తెలిపారు. వీరిలో 21శాతం మంది ప్రతి నెలా మూడుసార్లకు పైగా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. దేశం అంతటా 303 జిల్లాల నుంచి 51,000 మందితో ఈ సర్వే నిర్వహించారు. ఇందులో 67శాతం పురుషులు, 33శాతం మహిళలు ఉన్నారు. 46శాతం మంది వినియోగదారులు తమ ఫిర్యాదులను పరిష్కరించడానికి సర్వీస్ ప్రొవైడర్లు 24 గంటల కంటే ఎక్కువ సమయం తీసుకుంటున్నారని తెలిపారు. ఇదీ చదవండి: డేటా సెంటర్లలోకి 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రిమోట్ వర్క్, వర్క్‌ఫ్రంహోం, ఆన్లైన్ ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్ వినియోగదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని నివేదిక చెబుతుంది. 70శాతం మంది యూజర్లు ఇంటర్నెట్ సరఫరాలో మెరుగైన సేవలందించే ఇతర సర్వీస్ ప్రొవైడర్‌కు మారడానికి ఆసక్తిగా ఉన్నట్లు సర్వే వెల్లడించింది. కొన్ని సర్వేల నివేదికల ప్రకారం దేశంలో ఇంటర్నెట్ వినియోగించే సరళి ఈ కింది విధంగా ఉంది. * ఇంటర్నెట్ వ్యాప్తి 2012లో దేశవ్యాప్తంగా 12.6 శాతం నుంచి 2022 నాటికి 48.7 శాతానికి పెరిగింది. * ప్రపంచ వ్యాప్తంగా 692 మిలియన్ల ఇంటర్నెట్ వినియోగదారులతో భారత్ రెండో స్థానంలో ఉంది. * గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ కేంద్రాల్లో ఇంటర్నెట్ కనెక్షన్లు ఎక్కువ. * తక్కువ ధరలకే ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నప్పటికీ..పేదరికం, అవగాహన లేకపోవడం, స్పష్టమైన లింగ వ్యత్యాసం వంటి కారణాల వల్ల దేశంలో ఇంటర్నెట్ వినియోగం ఇంకా ఆశించినమేర ఉండడం లేదు. * 2028 నాటికి 244 మిలియన్ కుటుంబాలు ఇంటర్నెట్ వినియోగిస్తాయని అంచనా. * 2020 నాటికి దేశంలో 622 మిలియన్ల ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. అయితే ఈ సంఖ్య వచ్చే ఐదేళ్లలో దాదాపు 45 శాతం పెరుగుతుందని పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ సంఖ్య 2025 నాటికి 900 మిలియన్లకు చేరుకోనుంది. -
వేగం పెంచిన ఇండియా.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో ఇలా..
భారతదేశం టెక్నాలజీ వైపు వేగంగా అడుగులు వేస్తున్న తరుణంలో 5జీ సేవలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఫలితంగా డౌన్లోడ్ స్పీడ్ మరింత పెరుగుతోంది. దీంతో ఇండియా గొప్ప పురోగతిని చూపించి తాజాగా మంచి ర్యాంక్ సొంతం చేసుకుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. స్పీడ్ టెస్ట్ గ్లోబల్ సూచీలో ఇండియా ప్రస్తుతం 47వ స్థానం పొందినట్లు ఊక్లా (Ookla) నివేదికల ద్వారా తెలుస్తోంది. ఇండోనేషియా, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్ వంటి పొరుగు దేశాలకంటే భారత్ ఈ జాబితాలో ముందు వరుసలో నిలిచింది. కొన్ని G20 దేశాలైన మెక్సికో (90వ స్థానం), టర్కీ (68వ), యూకే (62వ), జపాన్ (58వ), బ్రెజిల్ ( 50వ స్థానం), దక్షిణాఫ్రికా (48వ స్థానం) కూడా ఇండియా కంటే వెనుకబడి ఉన్నట్లు ఊక్లా ఎంటర్ప్రైజ్ ప్రిన్సిపల్ ఇండస్ట్రీ అనలిస్ట్ సిల్వియా కెచిచే తెలిపారు. 5జీ సర్వీస్ ప్రారంభమైన తరువాత దేశంలో ఇంటర్నెట్ వేగం దాదాపు 3.59 రేట్లు పెరిగింది. సెప్టెంబర్ 2022లో డౌన్లోడ్ స్పీడ్ 13.87 Mbpsగా ఉండేది. కాగా 2023 ఆగష్టులో డౌన్లోడ్ స్పీడ్ 50.21 Mbpsకి చేరింది. ఈ కారణంగానే గ్లోబల్ ర్యాంకింగ్‌లో 119 స్థానాల నుంచి 47వ స్థానానికి చేరింది. ఇప్పటికే చాలా సర్వీసులు 4జీ నుంచి 5జీకి అప్డేట్ అవుతున్నాయి. 2003లో మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన చివరి రాష్ట్రాలలో జమ్మూ & కాశ్మీర్ ఒకటి. ఇక్కడ భద్రతా సమస్యలు, ఇంటర్నెట్ షట్డౌన్ల కారణంగా.. మొబైల్ నెట్వర్క్ సేవల్లో అప్పుడప్పుడు అంతరాయాలు ఏర్పడేవి. నేడు అక్కడ కూడా పరిస్థితి ఓ కొలిక్కి వచ్చింది. ఇదీ చదవండి: ఒక్క నెయిల్ పాలిష్ ఇన్ని కోట్లా..!! ఆ డబ్బుతో మూడు బెంజ్ కార్లు కొనేయొచ్చు! ఇంటర్నెట్ వేగాన్ని మరింత పెంచడానికి.. ఎయిర్టెల్ 'Airtel Xstream AirFiber'ని ఢిల్లీ, ముంబైలలో ఆగస్ట్ 2023లో ప్రారంభించింది. కాగా ఇప్పుడు జియో ఇటీవల ఎయిర్ ఫైబర్ ప్రారంభించింది. ప్రస్తుతం ఈ సర్వీస్ అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, పూణే ప్రాంతాల్లో అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో ఈ సర్వీస్ మరిన్ని నగరాలకు విస్తరించే అవకాశం ఉంది. -
భారత్-కెనడా వివాదం.. మీమ్స్‌తో నవ్వులు పూయిస్తున్నారు
ఇండియా-భారత్ మధ్య దౌత్యపరంగా వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వం ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్లో ఆరోపించడం వివాదానికి తెరలేపింది. అయితే.. ఇరుదేశాల మధ్య నెలకొన్న పరిస్థితులను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. వచ్చే జీ20 సమ్మిట్‌లో ఇండియా, కెనడా దౌత్య వేత్తలు ఈ విధంగా కొట్టుకుంటారంటూ ఓ వీడియోను జతచేశారు. ఉత్తరప్రదేశ్‌లో భాగ్‌పత్‌లోని చాట్ సెల్లర్లు కొట్టుకున్న వీడియోను ఇండియా, కెనడా దౌత్య వేత్తలతో ఫన్నీగా పోల్చారు. India and Canada diplomats in the next G20 summit pic.twitter.com/q9wclQuSbY — Sagar (@sagarcasm) September 21, 2023 తాజా పరిణామాలతో ఇరుదేశాలు ‘‘నువ్వా-నేనా’’ అన్నట్లు ఆంక్షలు విధించుకునే స్థాయికి చేరాయి. తమ దేశాల్లోని ఇరుపక్షాల దౌత్య వేత్తలను బహిష్కరించుకున్నాయి. కెనడా భారత దౌత్య అధికారులను బహిష్కరించిన కొద్ది గంటల్లోనే ఇండియా కూడా కెనడా దౌత్య అధికారిని దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. కెనడా, యూఎస్, యూకేల్లో పెరుగుతున్న ఖలిస్థానీల మద్దుతుకు మన దేశ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మరో మీమ్‌ను కూడా నెటిజన్లు ఫన్నీగా ట్రోల్ చేస్తున్నారు. India - Canada situation explained pic.twitter.com/oqCgxNrjxW — Pakchikpak Raja Babu (@HaramiParindey) September 21, 2023 ఇరు దేశాలు అంతటితో ఆగకుండా తమ పౌరులకు ప్రయాణ హెచ్చరికలను జారీ చేశాయి. ఇండియా ఒకడుగు ముందుకేసి కెనడా వీసాలను కూడా రద్దు చేసింది. కెనడాకు పంజాబ్ నుంచి ఎక్కువ సంఖ్యలో వెళ్తుంటారు. వీసాలు రద్దు చేసిన నేపథ్యంలో పంజాబ్ నుంచి వెళ్లేవారి ఇలా ఉంటుందంటూ ఫన్నీగా ఓ వీడియో ట్రోల్ అయింది. Indian Cancels visa Services for Canada right now Whole Punjab now 👇 #canadaindia #IndiaCanada #Canadian pic.twitter.com/DdRCqRvtX2 — Harsh (@Harshjindal22_) September 21, 2023 "Canadian High Commissioner"😭🤣🤣🤣#JustinTrudeau #Khalistani #Canada #India #CanadianPappu #CanadaBanegaKhalistan #canadaindia #CanadaNews #CanadaIndiaRelations #CanadaNews #indianGovernment #KhalistanisAreNotSikhs #KhalistaniTerrorist pic.twitter.com/x7CEe7NSQA — Arun Gangwar (@AG_Journalist) September 19, 2023 కెనడాతో ప్రతిష్టంభన నెలకొన్న వేళ ఆదేశానికి వెళ్లాలనుకునే భారతీయులకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాదానికి సంబంధించిన విపత్కర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని స్పష్టం చేసింది. కెనడాలో ఉన్న భారతీయులు, ఆ దేశానికి ప్రయాణించేవారు జాగ్రత్తలు పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. #canadaindia #KhalistaniTerrorist India has suspended visa services for Canadian nationals. This is what happening : de pic.twitter.com/VtXC7bBenQ — M A 𝕏 A L U 🗡️ (@YourMasalu) September 21, 2023 ఇదీ చదవండి: కెనడా-భారత్ ప్రతిష్టంభనకు అగ్గి రాజుకుంది అక్కడే..? -
‘జియో ఎయిర్‌ఫైబర్’ కొత్త వైర్లెస్ ఇంటర్నెట్ సర్వీస్.. పనితీరు, ధర ఎంతంటే?
ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో సెప్టెంబర్ 19న వైర్లెస్ ఇంట్నెట్ సర్వీస్ జియో ఎయిర్‌ఫైబర్ ప్రారంభించనుంది. ఇళ్లు, ఆఫీసుల్లో వినియోగించేలా పోర్ట్‌బుల్ వైర్లెస్ ఇంట్నెట్ 1.5 జీబీపీఎస్ వేగంతో పనిచేస్తుంది. తద్వారా యూజర్లు ఎలాంటి అంతరాయం లేకుండా వీడియోలు వీక్షించడం, ఆన్లైన్ గేమ్స్ ఆడుకోవడంతో పాటు వీడియో కాన్ఫరెన్స్‌లను నిర్వహించుకోవచ్చని రిలయన్స్ 46వ సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో ఆ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. సెప్టెంబర్ 19 వినాయక చవితి సందర్భంగా అందుబాటులోకి రానున్న ఈ జియో ఎయిర్‌ఫైబర్‌ను తల్లిదండ్రులు నియంత్రించొచ్చు. వైఫై 6కి సపోర్ట్ చేయడంతో పాటు ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ ఫైర్‌వాల్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. జియో ఎయిర్‌ఫైబర్ అంటే ఏమిటి జియో ఎయిర్‌ఫైబర్ అనేది జియో నుండి వచ్చిన కొత్త వైర్లెస్ ఇంటర్నెట్ సర్వీస్. ఇది హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడానికి 5జీని ఉపయోగిస్తుంది. సాంప్రదాయ ఫైబర్-ఆప్టిక్ కనెక్షన్లతో పోలిస్తే దీని స్పీడ్ ఎక్కువ. వినియోగదారులు గరిష్టంగా 1 జీబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ను వినియోగించుకోవచ్చు. జియో ఎయిర్‌ఫైబర్ కాంపాక్ట్ మాత్రమే కాకుండా సెటప్ చేయడం చాలా సులభమని జియో పేర్కొంది. దీన్ని ప్లగ్ ఇన్ చేసి, ఆన్ చేస్తే సరిపోతుంది. దీంతో వైఫై హాట్ స్పాట్, 5జీతో అల్ట్రా-హై-స్పీడ్ ఇంటర్నెట్కి కనెక్ట్ అవుతుంది. జియో ఎయిర్‌ఫైబర్‌తో ఇల్లు లేదా ఆఫీస్‌లో గిగాబిట్-స్పీడ్ ఇంటర్నెట్కు త్వరగా కనెక్ట్ చేయడం సులభం’ అని జియో ఓ ప్రకటనలో పేర్కొంది. జియో ఎయిర్‌ఫైబర్ వర్సెస్ జియో ఫైబర్ టెక్నాలజీ: జియో ఫైబర్ దాని కవరేజ్ కోసం వైర్డు ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్‌ను ఉపయోగిస్తుంది. అయితే జియో ఎయిర్‌ఫైబర్ మాత్రం పాయింట్-టు-పాయింట్ రేడియో లింక్‌లను ఉపయోగించి వైర్లెస్ ఇంటర్నెట్ను అందిస్తుంది. అంటే జియో ఎయిర్‌ఫైబర్ గృహాలు, కార్యాలయాలను నేరుగా జియోకి వైర్లెస్ సిగ్నల్స్ ద్వారా అనుసంధానిస్తుంది. తద్వారా ఫైబర్ కేబుల్స్ వల్ల తలెత్తే ఇబ్బందుల గట్టెక్కొచ్చు. స్పీడ్: జియో ఎయిర్‌ఫైబర్ గరిష్టంగా 1.5 Gbps ఇంటర్నెట్ స్పీడ్‌ను అందిస్తుంది. ఇది జియో ఫైబర్ 1జీబీపీఎస్‌ను మాత్రమే అందిస్తుంది. అయితే, జియో ఎయిర్‌ఫైబర్ స్పీడ్ స్థానికంగా ఉండే టవర్ల ఆధారంగా మారుతుందని గమనించాలి. కవరేజ్: జియో ఫైబర్, విస్తృత కవరేజీని అందిస్తున్నప్పటికీ, దేశవ్యాప్తంగా అందుబాటులో లేదు. జియో ఎయిర్‌ఫైబర్ వైర్లెస్ టెక్నాలజీ సాయంతో విస్తృతమైన కవరేజీని అందింస్తుంది. ఇన్స్టాలేషన్: జియో ఎయిర్‌ఫైబర్ ప్లగ్-అండ్-ప్లే చేయడానికి రూపొందించబడింది.యూజర్ ఫ్రెండ్లీ, కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. జియో ఫైబర్‌కు సాధారణంగా ప్రొఫెషనల్ ఇన్స్టాలేషన్ అవసరం. ధర: జియో ఎయిర్‌ఫైబర్ ధర దాదాపు రూ. 6,000. జియో ఎయిర్‌ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ కంటే ఖరీదైంది. ఎందుకంటే ఇందులో పోర్టబుల్ డివైజ్ ఉంటుంది. చదవండి👉🏻 గూగుల్‌కు బిగ్ షాక్ -
ఇన్ఫ్లేషన్ మండుతోంటే..ఈ డ్యాన్స్‌లేంటి? కమలా హ్యారిస్‌పై మండిపాటు
Kamala Harris Dances To Hip-Hop: యూఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ డ్యాన్స్ చేసిన వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. వైట్ హౌస్‌లో హిప్-హాప్ 50వ వార్షికోత్సవ వేడుకను వైట్ హౌస్ పార్టీ ఇచ్చారు. దీనికి సంబంధించి హిప్-హాప్ ట్యూన్లకు అడుగులేశారు. దీంతో నెటిజన్లు ధ్వజమెత్తారు. ముఖ్యంగా ద్రవ్యోల్బణం షాక్, విధ్వంసకర మౌయి అగ్నిప్రమాదాల అనంతర పరిణామాలు వంటి తీవ్రమైన సమస్యలతో అమెరికా అతలాకుతమవుతోంటే, ఈమె మాత్రం బాధ్యతా రాహిత్యంతో పార్టీని ఆస్వాదిస్తున్నారంటూ నెటిజన్లు ఆమెపై మండి పడ్డారు. మరికొంతమంది వినియోగదారులు ఆమె డ్యాన్స్ టైమింగ్‌పై వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రాజకీయ వ్యాఖ్యాత ఆంథోనీ బ్రియాన్ లోగాన్ గ్రానీ మూవ్స్ అంటూ షేర్ చేసిన 22-సెకన్ల నిడివి గల వీడియోలో హారిస్ డ్యాన్స్ చేశారు. 1999లో క్యూ-టిప్ హిట్ “వివ్రాంట్ థింగ్” కి హారిస్ డ్యాన్స్ చేయడం చూడవచ్చు. హాట్ పింక్ స్లాక్స్, 90ల నాటి నియాన్ బ్లౌజ్‌ని ధరించి చేసిన ఆమె స్టెప్పులు విమర్శలకు తావిచ్చాయి. కోరస్‌కు మించిన సాహిత్యం ఆమెకు తెలియదంటూ సోషల్ మీడియాలో చాలామంది ఎగతాళి చేసారు. "ప్యూర్ క్రింగ్" అని కొందరు "కాకిల్ షఫుల్"గా విమర్శలు వెల్లువెత్తాయి. కాగా హారిస్ డాన్స్‌పై విమర్శలు చెలరేగడం ఇదే మమొదటిసారి కాదు. జూన్‌లో, బ్రావో "వాచ్ వాట్ హాపెన్స్ లైవ్ విత్ ఆండీ కోహెన్"లో డ్యాన్స్, ఇబ్బందికరమైన నవ్వుపై నెటిజన్లు వ్యాంగ్యాస్త్రాలు సంధించిన సంగతి తెలిసిందే. హారిస్ డ్యాన్స్ మూవ్‌లు ఆన్లైన్లో ఎగతాళికి గురి కావడంపై స్పందించిన కొంతమంది పబ్లిక్ ఫిగర్లు కూడా మనుషులే అని గుర్తుంచు కోవాలి అంటున్నారు. సామాజిక కార్యక్రమాలలో భాగస్వామ్యం కావడం,వ్యక్తిగతంగా కొంత సమయాన్ని ఆస్వాదించడానికి వారూ అర్హులే అని వ్యాఖ్యానించారు. Kamala Harris with the granny 👵🏼 moves at her 50th Anniversary of Hip-Hop partypic.twitter.com/8Lg5XCxQ3a — Anthony Brian Logan (ABL) 🇺🇸 (@ANTHONYBLOGAN) September 9, 2023 -
చెన్నైలో ఆటో డ్రైవర్ సృజన.. అతని ఆటోనే ఓ మినీ గార్డెన్
అవడానికి అది ఓ చిన్న ఆటో మాత్రమే. కానీ అందులో ఏకంగా ఒక మినీ గార్డెన్‌నే సృష్టించాడతను. చెన్నైకి చెందిన కుబేందిరన్ అనే ఆటో డ్రైవర్ మది నుంచి పుట్టుకొచి్చన ఈ సృజనాత్మక ఆలోచన నెటిజన్ల మది దోచుకుంటోంది. ఇంటర్నెట్ నిండా అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది... కుబేందిరన్. చెన్నైలోని దాదాపు లక్ష మంది ఆటో డ్రైవర్లలో ఒకడు. కానీ పర్యావరణం మీది ప్రేమ అతన్ని మిగతా వారికంటే ఎంతో ప్రత్యేకంగా నిలిపింది. దేశమంతటా అతని పేరు మారుమోగేలా చేసింది. రకరకాల మీనియేచర్ మొక్కలు తదితరాలతో ఆటోను కదిలే తోటగా తీర్చిదిద్దాడు. ముందు, వెనక సీట్ల మధ్య, వెనక వైపు, సీలింగ్ మీద మాత్రమే గాక సీలింగ్ లోపలి వైపు కూడా పచ్చని మొక్కలతో నింపి ఆకట్టుకుంటున్నాడు. ఆ ఆహ్లాదాన్ని అనుభవిస్తూ ప్రయాణికులు మైమరచిపోతున్నారు. అందుకే ఇప్పుడు కుబేందిరన్ ఆటోను చెన్నైవాసులు ప్రయాణించే పార్కుగా అభివరి్ణస్తూ మురిసిపోతున్నారు. అందులో ప్రయాణించిన వాళ్లు ’గ్రీన్ ఆటో’, ’మూవింగ్ పార్క్’, ఇంకా రకరకాలుగా ప్రశంసిస్తున్నారు. ఇంత చక్కని ఆలోచన చేసినందుకు అతన్ని ఎంతగానో మెచ్చుకుంటున్నారు కూడా. మరెన్నో విశేషాలు: ఇది మాత్రమే కాదు, ఆటో ఎక్కే వారు చదువుకోవడం కోసం ఎన్నెన్నో స్ఫూర్తిదాయక పుస్తకాలు కూడా అందుబాటులో ఉంచాడు కుబేందిరన్. అంతేగాక వారికి స్వచ్ఛమైన చల్లని మంచినీరు కూడా ఇస్తాడు. వీటికి తోడు చక్కని సూక్తులు, నినాదాలతో కూడిన బ్యానర్లు కూడా ఆటో నిండా కనువిందు చేస్తుంటాయి. వాటిని తరచూ మారుస్తూ మరింత ఆకట్టుకుంటాడతను. రోడ్డు భద్రత గురించి కూడా అందరికీ వీలైనంత వరకూ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాడు. తనవంతు సామాజిక బాధ్యతను పరిపూర్ణంగా నెరవేరుస్తూ శెభాష్ అనిపించుకుంటున్నాడు. ఆటోపై రూఫ్ గార్డెన్ కొన్నాళ్ల క్రితం ఢిల్లీకి చెందిన మహేంద్ర కుమార్ అనే ఆటో డ్రైవర్ కూడా ఇలాగే తన ఆటో రూఫ్ టాప్ మీద గార్డెన్ పెంచి వార్తల్లో నిలిచాడు. ఈ గార్డెన్ 2020 నుంచీ అందరినీ అలరిస్తోంది. కుమార్‌తో పాటు అతని ఆటో ఎక్కేవాళ్లు కూడా మండే ఢిల్లీ ఎండల్లో కూడా చక్కని చల్లదనం అనుభవిస్తూ ప్రయాణిస్తూ ఉంటారు. అతన్నీ, అతని ఆటో రూఫ్ టాప్నూ అంతా ఎప్పుడు చూసినా ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ ఉంటారు! – నేషనల్ డెస్క్, సాక్షి -
నాడే విడుదల వీర శూర సూర్యచిత్ర
ఆదిత్య ఎల్1 మిషన్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన సందడి ఆకాశంలోనే కాదు అంతర్జాలంలోనూ కనిపిస్తోంది. సూర్యుడి చుట్టూ పరిభ్రమించిన సైన్స్–ఫిక్షన్ నుంచి సినిమాల వరకు ఎన్నో విషయాలు అంతర్జాలంలో చక్కర్లు కొడుతున్నాయి. మచ్చుకు ఫేస్బుక్లో ఒక వీడియో... జర్నీ టు ది ఫార్ సైడ్ ఆఫ్ ది సన్(1969) సినిమా తాలూకు ట్రైలర్ ఇది. ‘అపోలో హ్యాజ్ కాంకర్డ్ ది మూన్’ ‘వేర్ టూ నౌ ఇన్ స్పేస్?’ టైటిల్స్‌తో ట్రైలర్ మొదలవుతుంది. ఆ తరువాత... ఒక రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకువెళుతుంది. ఇప్పటి సినిమాలకు ఏమాత్రం తగ్గని ఉత్కంఠ ఈ ట్రైలర్లో కనిపిస్తుంది. ‘నాట్ ది ఎండ్’ అని ఊరిస్తూ ట్రైలర్ ముగుస్తుంది. -
చంద్రయాన్-3 విజయం, భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు?
అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ సత్తా చాటుతోంది. దీంతో మరో సారి భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలపై చర్చ ప్రారంభమైంది. ఈ తరుణంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ భారతీయులకు శుభవార్త చెప్పనున్నారు. త్వరలో దేశీయంగా శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందించనున్నారు. ఇందుకోసం భారత్ నుంచి అనుమతులు తీసుకోనున్నారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం, మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 32 దేశాల్లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందిస్తుంది. అయితే, గతంలో స్టార్‌లింక్ భారత్‌లో శాటిలైట్ సేవల్ని అందించేందుకు సిద్ధమయ్యింది. కానీ పలు కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. తాజాగా, సెప్టెంబర్ 20న స్టార్‌లింక్ ప్రతినిధులు భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల కోసం దేశీయ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్ (డాట్) విభాగం అధికారులతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలోనే అనుమతులు తీసుకోన్నట్లు నివేదికలు తెలిపాయి. ఈ సందర్భంగా స్టార్‌లింక్ భారత్‌లో గ్లోబుల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాలిలైట్ (జీఎంపీసీఎస్) లైసెన్స్ తీసుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. స్టార్‌లింక్‌తో పాటు ఎయిర్టెల్ ఇక, భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ను అందించే సంస్థల జాబితాలో స్టార్లింక్తోపాటు ఎయిర్టెల్, జియోలు పోటీ పడుతున్నాయి. ఎయిర్ టెల్ వన్ వెబ్, జియో.. జియో స్పేస్ టెక్నాలజీలు ఉపగ్రహ ఇంటర్నెట్పై పనిచేస్తున్నాయి. ఈ రెండు కంపెనీలు సైతం జీఎంపీసీఎస్ లైసెన్స్ తీసుకున్నాయి. చదవండి👉 భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ పోటీ.. ముఖేష్ అంబానీ - ఎలాన్ మస్క్లలో ఎవరి మాట నెగ్గుతుందో? -
Independence day celebrations 2023: స్వేచ్ఛాగీతం
స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు అంతర్జాలంలో ఆరంభం అయ్యాయి. ఆనాటి దేశభక్తి గీతాల నుంచి బ్లాక్ అండ్ వైట్ ఫోటోల వరకు రకరకాల పోస్ట్‌లు పెడుతున్నారు... వడుకుమురా! వడుకుమురా! వడుకుమురా! వడుకుమురా! వడి వడి స్వేచ్ఛా వాయువు పీల్చి – రాట్నగీతము (గురజాడ రాఘవశర్మ) వీరభారతి సందేశం పరదేశీయులు తొలగండి ఈ భారతదేశం మా దేశం వినండి! వినండి! విశ్వప్రజలు వీరభారతి సందేశం – వానమామలై వరదాచార్యులు చిత్రం: 1857 సిపాయి తిరుగుబాటు ఉప్పోయమ్మ ఉప్పు ముప్పది కోట్ల ప్రజల ముప్పు దీర్చే ఉప్పు ఉప్పుగాదిది రత్నపు తిప్ప మన పాలిటికి – ఉప్పుపాట (గరికపాటి మల్లావధాని) ఫోటో: దండి సత్యాగ్రహం: ఏప్రిల్6, 1930 చెప్పరా...లేకున్న ముప్పురా! చెప్పరా! నీ కన్నులిటపై/ విప్పరా! ఆ ప్రభుత నింతట త్రిప్పరా! లేకున్న–నీకగు ముప్పురా! మాయప్ప ఇప్పుడు – పాంచాలము (గరిమెళ్ల) ఫొటో: సహాయనిరాకరణ ఉద్యమ కాలంలో బాంబేలో బ్రిటిష్ వారి వస్తువులతో ఉన్న ఎడ్లబండి ముందుకు పోకుండా రోడ్డుకు అడ్డంగా పడుకున్న ఉద్యమకారుడు -
బుడతా..! నీ టాలెంట్‌కు హ్యాట్సాఫ్.. నెటిజన్లు ఫిదా..!
సోషల్ మీడియా వేదిక ఎందరికో ఉపాధిని కల్పిస్తే.. మరెందరికో తమ ఆసక్తిని ప్రపంచానికి తెలిసేలా చేస్తుంది. ఎంతటి సదూరంలో ఉన్నా.. అధునాతన సౌకర్యాలు లేకున్నా తమ నైపుణ్యాన్ని ప్రపంచానికి తెలిపే విధంగా సోషల్ మీడియా ఉపయోగపడుతుంది. పాతతరం వాళ్లతో పోలిస్తే.. నేటి తరం చిన్నారులు అన్ని రంగాల్లోనూ చురకత్తుల్లా దూసుకుపోతున్నారు. తాజాగా రుద్ర ప్రతాప్ సింగ్ అనే బుడతడు విల్లు ఎక్కుపెట్టి దూరంగా ఉన్న బెలూన్ను గురి చూసి కొడుతున్నాడు. దూరంలో ఉన్న లక్ష్యాన్ని విల్లుతో ఎక్కుపెట్టడంలో ఏముంది వింత! అనుకుంటున్నారా..? అయితే.. అతను చేసే విలువిద్య చేతులతో కాదు.. కాళ్లతోనే భాణాన్ని సంధిస్తున్నాడు. తన శరీరాన్ని ధనస్సులా వెనక్కి వంచి. అరచేతులపై నిలబడి కాళ్లతోనే బాణాన్ని ఎక్కుపెట్టి ఏమాత్రం గురి తప్పకుండా లక్ష్యాన్ని గురిపెడుతున్నాడు. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Rudra Pratap singh (@littleyogaguru) ఈ వీడియోను చూసిన వారంతా ఆ అబ్బాయి టాలెంట్‌కు ఫిదా అయిపోతున్నారు. 'నీ టాలెంట్‌కు హ్యాట్సాఫ్' అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ చిన్నోడు మామూలోడు కాదని ఏకలవ్యుడని ప్రశంసిస్తున్నారు. మహాభారతంలో ఏకలవ్యుడు కంటికి కనిపించని లక్ష్యాన్ని ఛేదిస్తే.. ఈ బుడతడు కాళ్లతోనే శరాన్ని సంధించి లక్ష్యాన్ని గురి పెట్టాడంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మీరు ఈ చిన్నోడు టాలెంట్ చూసేయండి. ఇదీ చదవండి: ఏంటీ వింత? ఎపుడూ లేనిది.. ఇపుడే కొత్తగా! 45 మందికి షాకిచ్చిన గోవా ఎక్స్‌ప్రెస్ ట్రైన్ -
రద్దీ రోడ్లపై చక్కర్లు కొడుతున్న డ్రైవర్‌లెస్ కారు.. నెటిజన్లు ఫిదా..!
బెంగళూరు: బెంగళూరు రోడ్లపై డ్రైవర్ లేకుండా నడుస్తున్న ఓ వింత ఆకారంలో ఉన్న వాహనం స్థానికుల్నిఆశ్చర్యానికి గురిచేసింది. ఇదేదో బాలీవుడ్ మూవీలో కారు ఆకారంలో ఉన్న వాహనంలా ఉందని ఓ యూజర్ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. ఆన్ ద స్ట్రీట్స్ ఆఫ్ బెంగళూరు అనే క్యాప్షన్‌ను జతచేసి పోస్టు చేశాడు. ఈ కారును చూసిన నెటిజన్లు ఇదేంటీ ఇలా ఉందని? ప్రశ్నించారు. డ్రైవర్ లేకుండా ఎలా ఇంత ట్రాఫిక్‌లో నడుస్తోందని ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ కారుని జీప్యాడ్ అని అంటారని ఓ యూజర్ క్లారిటీ ఇచ్చాడు. సెల్ఫ్ డ్రైవింగ్ కారుని మైనస్ జీరో అనే అంకుర సంస్థ రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని మైనస్ జీరో సంస్థ తన ఇన్‌స్టా పేజీలో వివరంగా పేర్కొంది. ఇప్పటికే రెండు సార్లు ఈ వాహనం రోడ్లపై కనిపించిందని బెంగుళూరు వాసులు తెలిపారు. టెస్టింగ్‌లో భాగంగానే ఇలా రోడ్లపై కారు ప్రత్యక్షమైనట్లు సమాచారం. ఇది భారతదేశంలోనే మొట్ట మొదటి అటానమస్ వాహనం. On the streets of Bengaluru. @peakbengaluru pic.twitter.com/VtahXpa6Mh — anirudh ravishankar (@anrdh89) July 22, 2023 అయితే.. సంప్రదాయ కార్లకు భిన్నంగా ఉండే ఈ జీప్యాడ్కు స్టీరింగ్ ఉండదు. హై రిజల్యూషన్ కెమెరాలతో ట్రాఫిక్‌లోనూ నడుస్తోంది. ఈ కారులో మొత్తం 6 కెమెరాలు అమర్చారు. వీటి సాయంతో చుట్టూరా ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనావేస్తుంది. ప్రమాదం అనిపిస్తే వెంటనే వాహనం నిలిచిపోతుంది. ట్రాఫిక్ సమస్యను, రోడ్డు ప్రమాదాలను తగ్గించటంలో భాగంగానే దీన్ని తీసుకొచ్చినట్లు మైనస్ జీరో తెలిపింది. ఇదీ చదవండి: శుభకార్యాల్లో సినిమా పాటలు.. కాపీ రైట్ కిందకు వస్తుందా..? కేంద్రం ఏం చెప్పింది..? -
‘పోర్న్ వీక్షణం వల్లే లైంగిక వేధింపులు’
సాక్షి, హైదరాబాద్: పెరుగుతున్న సాంకేతికత, సమాచార విప్లవంతో ఇంటర్నెట్లో పోర్న్ వీడియోలు, బూతు సాహిత్యం విపరీతంగా అందుబాటులో ఉంటోందని, పిల్లలపై లైంగిక వేధింపులు అధికం కావడా నికి ఇదే ప్రధాన కారణమని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత బాలలను పోలీసులు వారి పిల్లలుగా భావించి పకడ్బందీగా దర్యాప్తు చేసినప్పుడే దోషులకు శిక్షపడుతుందన్నారు. శనివారం హైదరాబాద్ పర్యటనకు వచి్చన కైలాష్ సత్యారి్థ... డీజీ పీ కార్యాలయంలో పోలీస్ అధికారులను ఉద్దేశించి ప్రసంగించారు. పిల్లల అక్రమ రవాణా వ్యవస్థీకృతమైన, అత్యంత బలమైన మూలాలున్న నేరంగా ఉందని కైలాష్ సత్యార్థి పేర్కొన్నారు. ఈ నేరాలను అరికట్టడంలో తెలంగాణ పోలీసులు అమలు చేస్తున్న విధానాలతో గణనీయమైన ఫలితాలు లభిస్తున్నాయని ప్రశంసించారు. మహిళలు, పిల్లల అక్రమ రవాణాను అరికట్టడంలో తెలంగాణ పోలీసుల పాత్ర దేశంలోనే ఆదర్శప్రాయంగా నిలుస్తోందని కితాబిచ్చారు. డీజీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు అనంతరం రాష్ట్రంలో పిల్లలు, మహిళల భద్రతకు రాష్ట్రం ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నిచ్చిం దని, ఇందులో భాగంగా అదనపు డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో మహిళా భద్రతా విభాగాన్ని ఏర్పాటు చేసిందని వివరించారు. అదనపు డీజీ మహేష్ భగవత్ మాట్లాడుతూ కైలాష్ సత్యార్థి కృషి వల్లే తప్పిపోయిన పిల్లల అంశంపై ఎఫ్ఐఆర్ల నమోదు ప్రారంభమైందని, ఆ తర్వాత అనేక సంస్కరణలు వచ్చాయని చెప్పారు. అనంతరం పోలీసు అధికారులు కైలాష్ సత్యార్థిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీజీలు షికా గోయల్, సౌమ్యా మిశ్రా, సంజయ్ కుమార్ జైన్, ఐజీలు విక్రమ్‌జిత్‌సింగ్ మాన్, షానవాజ్ ఖాసీంతోపాటు రాష్ట్రంలోని పోలీసు కమిషనర్లు, ఎస్పీలు పాల్గొన్నారు. ప్రతి విద్యార్థి భయాన్ని వీడాలి రాయదుర్గం: ప్రతి విద్యార్థి తమకున్న ప్రతిబంధకాలు, చింతలు, భయాలన్నింటినీ వీడి ఆత్మవిశ్వాసంతో పోటీ ప్రపంచంలోకి అడుగు పెట్టాలని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి పిలుపునిచ్చారు. గచ్చిబౌలి శాంతిసరోవర్‌లోని గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో ట్రిపుల్ఐటీ హైదరాబాద్ 22వ స్నాతకోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ట్రిపుల్ఐటీ హైదరాబాద్ గవరి్నంగ్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ రాజ్‌రెడ్డి, డైరెక్టర్ ప్రొఫెసర్ పీజే నారాయణన్‌తో కలిసి విద్యార్థులకు పట్టాలను, పంపిణీ చేశారు. కైలాష్ మాట్లాడుతూ కేవలం జీతాలు, ప్యాకేజీల కోసం వెంటపడకుండా నైతిక విలువలు, సేవా భావంతో జీవితంలో ముందుకు వెళ్లాలని సూచించారు. నారాయణన్ మాట్లాడుతూ పెరుగుతున్న పోటీ ప్రపంచంలో ట్రిపుల్ఐటీ విద్యార్థులు స్వంత మార్గాలను రూపొందించే నైపుణ్యాలను కలిగి ఉన్నారని తె లిపారు. డ్యూయల్ డిగ్రీతోపాటు ఉత్తమ ఆల్‌రౌండర్ అవార్డును పొందిన కందాల సవితా విశ్వనాథ్‌ను పలువురు అభినందించారు. -
బసంతీ... వాట్ ఈజ్ యువర్ నేమ్?
‘హాలీవుడ్ షోలే’ పేరుతో విడుదలైన ఏఐ జెనరేటెడ్ వీడియో ఇమేజ్‌లు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. ‘షోలే’లోని ప్రధాన క్యారెక్టర్లకు హాలీవుడ్ ప్రముఖ నటుల ముఖాలను సూపర్ ఇంపోజ్ చేశారు. ఈ వీడియో క్లిప్‌లలో రాబర్ట్ డి నిరో ‘జై’, అల్ పసినో ‘వీరు’, జూలియా రాబర్ట్స్ ‘బసంతి’, కెవిన్ స్పేసీ ‘ఠాకూర్’, జాక్ నికల్సన్ ‘గబ్బర్‌సింగ్’లుగా కనిపిస్తారు. ‘అంతా బాగానే ఉందిగానీ ఠాకూర్ పాత్రకు కెవిన్‌ను ఎంపిక చేసుకోవడం బాగోలేదు. ఎందుకుంటే ఠాకూర్ నిజాయితీపరుడు. ముక్కుసూటి మనిషి. కెవిన్ సైకో పాత్రలకు పెట్టింది పేరు’ ‘షోలే అనేది ఎన్నో హాలీవుడ్ సినిమాల కాపీ. మెయిన్ ప్లాట్ 7 సమురాయ్, కొన్ని పవర్ఫుల్ సీన్లను వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ వెస్ట్ సినిమాలలో నుంచి తీసుకున్నారు’... ఇలా రకరకాలుగా నెటిజనులు స్పందించారు. -
డిజిటల్ ప్రపంచానికి కష్టకాలం తప్పదా?
పొద్దున లేనిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే దాకా.. మధ్యలో మనం చేసే దాదాపు ప్రతీ పనికి-స్మార్ట్ ఫోన్‌తో ముడిపడిపోయింది. ఎందుకంటే.. మనమంతా డిజిటల్ వరల్డ్‌లో దర్జాగా బతుకుతున్నాం. ఇంటర్నెట్ లేకుంటే ఏ పనులూ జరగవు!. అలాంటిది ఇంటర్నెట్లేని రేపటిని ఊహించుకోగలమా?.. అమ్మో కలలో కూడా కష్టం అంటారా?.. అయితే ఇది చదివేయండి! ఇంటర్నెట్ అపోకలిప్స్ internet apocalypse.. ఇప్పుడు వార్తల్లో చక్కర్లు కొడుతూ ప్రజల్ని భయపెడుతున్న పదం. దీనర్థం ఇంటర్నెట్కి గడ్డుకాలం వచ్చిందని అప్రమత్తం చేయడమే!. 2025 నాటికల్లా సోలార్ మాగ్జిమమ్(ఉగ్రరూపానికి అన్నట్లు)కి సూర్యుడు చేరుకుంటాడని.. అప్పుడు ఏర్పడే సౌర తుపాన్ల ధాటికి ఇంటర్నెట్కు విఘాతం కలగవచ్చని తీవ్ర హెచ్చరికలు జారీ అయ్యాయి. ఒకవేళ సౌర తుపాను గనుక భూమిని తాకితే!.. ఈ చర్చ ఇప్పటిది కాదు.. గత కొంతకాలంగా నడుస్తూ వస్తోంది. సౌర తుపాను భూమిని గనుక తాకితే గంటల నుంచి రోజుల తరబడి కమ్యూనికేషన్ వ్యవస్థ ఆగిపోతుంది. అంటే ఇంటర్నెట్ సహా అన్నీ సంధాన వ్యవస్థలు ఆగిపోవచ్చన్నమాట. ఆశ్చర్యకరంగా.. ఈ వాదనతో పలువురు సైంటిస్టులు, ప్రొఫెసర్లు సైతం అంగీకరిస్తున్నారు. Internet Apocalypse 2025 ఎందుకీ అంతరాయం సౌర తుపాను అంటే సూర్యుడిపై ఏర్పడే విద్యుత్ తరంగం. సూర్యునిలో ఏర్పడే అసాధారణమైన అయస్కాంత విస్ఫోటనం ఇది. ఈ అలలు చుట్టుకుని మబ్బులా ఏర్పడి సూర్యుడి ఉపరితలాన్ని విచ్ఛేదనం చేయడం, సన్నటి పదార్థాలను ఊడ్చేయడం చేస్తాయి. ఈ తుపాన్లు భూమితో పాటు మిగతా గ్రహాలపై ప్రభావం చూపెట్టనుంది. సమాచార వ్యవస్థకు సంబంధించిన ప్రతీదానిని దెబ్బ తీస్తుంది. 2025 ఇంటర్నెట్ Internet Apocalypse 2025 సంక్షోభాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ధృవీకరించలేదు. కానీ, చర్చ జోరుగా నడుస్తోంది. సోషల్ మీడియాలోనూ విపరీతంగా మీమ్స్ కనిపిస్తున్నాయి. మరి ఆధారం ఏమిటి?.. ఎందుకంటే స్పేస్‌సైన్స్ ఆ వాదనతో ఏకీభవిస్తోంది కాబట్టి. సోలార్ మాగ్జిమమ్ ప్రభావం ఇంటర్నెట్పై కచ్చితంగా ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అందుకే అలాంటి పరిస్థితులకు ముందుగా సన్నద్ధం కావాలంటూ ముందు నుంచే సిద్ధం చేస్తున్నారు. సౌర తుపాన్లనేవి అరుదుగా వస్తుంటాయి. గతంలో 1859, 1921లో భూమిని తాకాయి. 1859లో టెలిగ్రాఫ్స్ సేవలు దెబ్బ తిన్నాయి. 1989లో ఓ మోస్తరు తుపాను కూడా సంభవించింది. ఆయా సమయాల్లో రేడియో వ్యవస్థలు మూగబోయాయి. అయితే ఇప్పుడున్నంత ఎలక్ట్రిక్ గ్రిడ్స్, ఇంటర్నెట్ వ్యవస్థ ఆ సమయంలో లేదు. కాబట్టే.. ఇప్పుడు ఓ మోస్తరు తుపాను వచ్చినా తీవ్ర నష్టం ఉండొచ్చని కాలిఫోర్నియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న సంగీత అబు జ్యోతి చెబుతున్నారు. నష్టం ఊహించని దానికంటే.. Internet Apocalypse 2025 సంభవిస్తే గనుక సముద్ర అంతర్బాగం నుంచి విస్తరించి ఉన్న ఇంటర్నెట్ కేబుల్స్‌పై సౌర తుపాను తీవ్ర ప్రభావం చూపెడుతుంది. ఆప్టికల్ సిగ్నల్స్ తరచూ ఇబ్బందికి గురికావడంతో అంతర్గత వ్యవస్థల్లో పెద్ద ఎత్తున్న డ్యామేజ్ జరగొచ్చు. అప్పుడు మొత్తం ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలుగుతుంది. ఆ ప్రభావం ఎన్నిరోజులు ఉంటుంది?.. తిరిగి ఎన్నిరోజుల్లో యధాస్థితికి తీసుకురావొచ్చనేది ఇప్పుడే చెప్పలేం. అంత పెద్ద విపత్తును ఎదుర్కొవడానికి అంతర్జాతీయ సమాజం ఎలా ఎదుర్కొంటుందో కూడా ఊహించలేం. కానీ, జరిగే నష్టం మాత్రం ఊహించని స్థాయిలో ఉంటుందనేది మాత్రం చెప్పొచ్చు. ఒకవేళ నిజంగా సౌరతుపాను Internet Apocalypse 2025 గనుక విరుచుకుపడితే మాత్రం.. ఆసియా దేశాలకు డ్యామేజ్ తక్కువగా ఉండొచ్చు. ఎందుకంటే.. భూమధ్య రేఖకు దగ్గరగా సముద్ర గర్భ కేబుల్స్ ఉండడం కలిసొచ్చే అంశమని చెప్తున్నారు. ఈ లెక్కన భారత్ సహా మరికొన్ని దేశాల కమ్యూనికేషన్ వ్యవస్థపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. కానీ, అట్లాంటిక్, ఫసిఫిక్ మహాసముద్రాల పరిధిలోని అంతర్గత కేబుల్ వ్యవస్థ మాత్రం సౌర తుపానుతో ఘోరంగా దెబ్బతింటుంది. -
ఫ్లైట్‌మోడ్‌లో ఫోన్.. విమానాల్లో ఇంటర్నెట్ ఎలా?
ఏదైనా ఊరెళ్తున్నాం.. బస్సులోనో, రైల్లోనో అయితే వెంటనే స్మార్ట్‌ఫోన్ బయటికి తీయడం, ఏ సినిమాలో, వెబ్ సిరీస్‌లో చూడటం, సోషల్ మీడియాలో కాలక్షేపం చేయడం కనిపించేదే. అదే మరి విమానాల్లో అయితే..!? టవర్ సిగ్నల్స్ ఉండవు. ఉన్నా ఫోన్‌ను ఫ్లైట్ మోడ్‌లో పెట్టాల్సిందే. దీంతో ఫోన్ మెమరీలో ఉన్న వీడియోలు చూస్తూనో, పాటలు వింటూనో గడిపేయాల్సిందే. గంటా గంటన్నర జర్నీ అయితే ఓకేగానీ.. ఆరేడు గంటలకుపైన ప్రయాణించాల్సి వస్తే కష్టమే. అదే విమానాల్లో వైఫై ఉంటే కాసింత కాలక్షేపం. రెండు రకాలుగా ఇంటర్నెట్ విమానాల్లో వైఫై ద్వారా ఇంటర్నెట్ ఇచ్చేందుకు రెండు రకాల అవకాశాలు ఉన్నాయి. ఒకటేమో ఇప్పుడు మనం స్మార్ట్ఫోన్లలో వాడుతున్నట్టుగా టెలికాం టవర్ల నుంచి సిగ్నల్ అందుకోవడం. రెండోది శాటిలైట్ల ద్వారా ఇంటర్నెట్కు అనుసంధానం కావడం. ♦ శాటిలైట్‌కు అనుసంధానమై ఇంటర్నెట్ పొందే విమానాలకు పైభాగంలో యాంటెన్నాలు ఉంటాయి. ఈ ఇంటర్నెట్కు సిగ్నల్ సమస్యేదీ ఉండదు. కానీ అందుబాటు తక్కువ. ఖర్చు చాలా ఎక్కువ. ♦ టెలికం సిగ్నల్స్ నుంచి ఇంటర్నెట్ పొందే విమానాలకు దిగువ భాగంలో యాంటెన్నాలు ఉంటాయి. భూమ్మీద ఉన్న టెలికాం టవర్ల నుంచి సిగ్నల్స్ అందుకుంటూ ఇంటర్నెట్ వాడుతారు. అయితే ఇలాంటి వాటిలో అడవులు, ఎడారులు, సముద్రాల మీదుగా ప్రయాణించిన సమయంలో సిగ్నల్స్ ఉండవు. ♦ దాదాపు అన్ని దేశాలు యుద్ధ విమానాలు, ప్రత్యేక విమానాల్లో మాత్రం శాటిలైట్ కనెక్షన్‌ను వినియోగిస్తున్నాయి. చాలా విమానాల్లో ఇంటర్నెట్.. బాగా స్లో ప్రస్తుతం విమానాల్లో కొంతవరకు వైఫై సదుపాయం ఉన్నా.. దాని వేగం అత్యంత తక్కువ. ఎందుకంటే చాలా వరకు ప్రయాణికుల విమానాల్లో టెలికాం టవర్లకు అనుసంధానమయ్యే పరికరాలే ఉంటున్నాయి. వీటి నుంచి వచ్చే కాస్త ఇంటర్నెట్ స్పీడ్‌నే వైఫై ద్వారా అందిస్తున్నారు. విమానంలోని వారంతా ఆ స్పీడ్‌నే పంచుకోవాల్సి ఉంటుంది. దీనితో ఇంటర్నెట్ బాగా స్లోగా వస్తుంది. విమానాల్లో ఇంటర్నెట్ కోసం ప్రత్యేకంగా.. విమానాల్లో ఇంటర్నెట్ కోసమంటూ ఇటీవలే ప్రత్యేక సంస్థలు తెరపైకి వస్తున్నాయి. అందులో ‘గోగో కమర్షియల్ ఏవియేషన్’ ఒకటి. ఇది ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్ సేవలు అందించే ఇంటెల్‌శాట్ కంపెనీకి అనుబంధ సంస్థ. అత్యంత అధునాతనమైన ‘2కేయూ వ్యవస్థ’తో విమానాల్లో వేగవంతమైన ఇంటర్నెట్ను అందిస్తోంది. ♦ ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సంస్థ ‘స్టార్ లింక్’ కూడా.. సముద్రాలు, ఎడారులు, ధ్రువ ప్రాంతాలు అనే తేడా లేకుండా భూమ్మీద అన్నిచోట్లా వేగవంతమైన ఇంటర్నెట్ అందిస్తామంటూ తెరపైకి వచ్చింది. ♦ఇలాంటి శాటిలైట్ ఇంటర్నెట్ సంస్థలు రావడం, ఆ ఇంటర్నెట్కు అయ్యే వ్యయం కూడా తగ్గుతుండటంతో విమానయాన సంస్థలు తమ అంతర్జాతీయ, దేశీయ విమానాల్లో వైఫైను అందించేందుకు ముందుకు వస్తున్నాయి. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
డేటా సెంటర్ల కేంద్రంగా విశాఖపట్నం... ఇంకా ఇతర అప్డేట్స్
-
నాన్న పాటలు మాటలు
అంతర్జాల ప్రపంచంలో ‘ఫాదర్స్ డే’ సందడి మూడు నాలుగు రోజుల క్రితమే మొదలైంది. ‘ఫాదర్స్ డే రోజు వినాల్సిన బాలీవుడ్ ఫేమస్ పాటలు’ ‘తండ్రి అడుగు జాడల్లో నడుస్తున్న కథానాయికలు’ ‘ఫాదర్స్ డే రోజు తండ్రితో కలిసి చూడాల్సిన సినిమాలు’... ఇలా ఎన్నో విషయాలపై నెటిజనుల పోస్ట్‌లు చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో కొన్ని... ‘ఫాదర్స్ డే’ రోజు వినాల్సిన పాటల విషయానికి వస్తే... అమీర్‌ఖాన్ సినిమా ‘ఖయామత్ సే ఖయామత్’లోని ‘పప్పా కెహ్తహై’... అక్షయ్ కుమార్ ‘బాస్’ సినిమాలోని ‘పితా సే హై నామ్ తేరా’ ‘యారా దిల్ దారా’ సినిమాలోని ‘హమారా పప్పా ఔర్ హమ్’... ఆలియాభట్ ‘రాజీ’ సినిమాలోని ‘దిల్బరో’... ఇలా ఎన్నో పాటలు ఉన్నాయి. ఇక తెలుగు పాటల విషయానికి వస్తే ‘నాన్నా నీ మనసే వెన్నా’ ఆల్‌టైమ్ ఫేవరెట్. జూనియర్ ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో...’ పాట, చిరంజీవి ‘డాడీ’ సినిమాలోని ‘గుమ్మాడి గుమ్మాడీ’, విక్రమ్ ‘నాన్న’ సినిమాలో ‘పప్పా పప్పా’ కమల్‌హాసన్ ‘ఇంద్రుడు–చంద్రుడు’లో ‘లాలిజో లాలీజో చెప్పవే పాపాయి’... మొదలైన పాటలు ‘ఫాదర్స్ డే’ రోజు వినిపించే పాటలు. తండ్రీ కూతుళ్లు బంధాన్ని ప్రతిబింబించే ‘దంగల్’ ‘అంగ్రేజీ మీడియం’ ‘పికు’ ‘తప్పడ్’... మొదలైన బాలీవుడ్ సినిమాల గురించి కొందరు పోస్ట్‌లు పెట్టారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న అందాల కథానాయికలు శ్రద్ధా కపూర్, అనన్య పాండే, కరీనా కపూర్, ఆలియాభట్, సోనాక్షి సిన్హా, సోనాల్ కపూర్... మొదలైన వారి గురించి ప్రశంసాపూర్వకంగా రాశారు. నాన్న నాకు ప్రపంచంలోని అత్యంత విలువైన కానుక ఇచ్చాడు. ఆ కానుక పేరు... ప్రేమ. – సోనాల్ కపూర్ నువ్వు ఎంచుకున్న మార్గం, నువ్వు ఏర్పర్చుకున్న అభిప్రాయం సరిౖయెనది అనిపిస్తే ఎప్పుడూ వెనకడుగు వేయవద్దు... అని నాన్న చెప్పే మాట నాకు చాలా ఇష్టం. – సోనాక్షి సిన్హా స్కూల్లో డ్రాప్ చేసిన, పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకున్నప్పుడు మెచ్చుకున్న, సరదాగా నాతో ఆడుకున్న నాన్నతో నా ప్రతీ జ్ఞాపకం అపురూపం. – సుహానా ఖాన్ బాగా కష్టడాలి. మంచి ఫలితాన్ని ఆశించాలి. ఓటమికి చేరువ అవుతున్నాను... అనే భయంలోనూ ధైర్యాన్ని కోల్పోవద్దు... అని నాన్న తరచు చెప్పేవారు. – అనన్య పాండే నాకు నచ్చిన ఇద్దరు పిల్లలు... మా నాన్న రణŠ ధీర్కపూర్, మా అబ్బాయి జె అలీఖాన్! – కరీనా కపూర్ మా నాన్న చాలా భిన్నంగా ఆలోచిస్తారు. వాటిని అర్థం చేసుకుంటే జీవితం లోతుపాతులు అర్థం అవుతాయి. జీవితంలో ఎలా ముందుకు వెళ్లాలి అనేది తెలుస్తుంది. పిల్లలను సినిమాలు, పార్క్‌లకు తీసుకెళ్లడమే తండ్రి బాధ్యత అని ఆయన అనుకోలేదు. చిన్న చిన్న మాటలతోనే గొప్ప విషయాలు చెప్పడం ఆయన ప్రత్యేకత. ‘యూ మస్ట్ ఫెయిల్’ అని ఏ తండ్రి అయినా అంటాడా? మా నాన్న అనేవాడు! ఒక్క ఫెయిల్యూర్ ఎన్ని పాఠాలు నేర్పుతుంది!! – ఆలియా భట్ -
నాడు ‘చిన్న సినిమాల శ్రీదేవి’... నేడు ‘ ఇంటర్నెట్ ట్రాఫిక్ జనరేటర్’...
ఆమె ఎప్పుడూ మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో కనిపించలేదు. అయితే సింగిల్ స్క్రీన్ సినిమా హాళ్లలో మార్నింగ్ షోలలో కనిపిస్తూ రచ్చ చేసేది. 1990, 2000 దశాబ్ధాలలో ఆమె తన హవా చాటింది. ఆమె సినిమాలను యువకులు ఎగబడి చూసేవారు. ఆ సమయంలో ఆమె ఏకంగా 250 సినిమాలు చేసింది. అందుకే ఆమెను కొందరు అభిమానులు ‘చిన్న సినిమాల శ్రీదేవి’ అంటూ అభివర్ణించేవారు. సప్నా సప్పూ.. బాలీవుడ్ నటి. పెద్ద సినిమాల్లో ఆమె ఎప్పుడూ కనిపించిందేలేదు. 1990, 2000 దశాబ్ధాలలో హిందీ, గుజారాతీ భాషలలో ఏకంగా 250 సినిమాలు చేసింది. ఆ రోజుల్లో ఆమె సినిమాలు సింగిల్ స్క్రీన్ థియేటర్లలలో మార్నింగ్ షోలలో సందడి చేసేవి. ఆమె తెరమీద కనిపించగానే అభిమానులు ఉత్సాహంతో ఊగిపోయేవారు. అయితే 2013లో సప్నా సప్పూ వివాహం చేసుకుంది. తరువాత ఆమె సినిమా ప్రపంచానికి గుడ్‌బై చెప్పేసింది. అయితే పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఆర్థికంగా చితికి పోయిన ఆమె తిరిగి సినిమాల్లో కనిపించడం ప్రారంభించింది. ఓటీటీ ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తోంది. మిథున్ చక్రవర్తితో మొదలు పెట్టి.. 1998లో బాలీవుడ్ హీరో మిథున్ చక్రవర్తితో ‘గూండా’ సినిమాతో సినిమాల్లో కాలు మోపిన ఆమెకు ఇప్పుడు ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. సినీ జగత్తులో ఆమె ప్రవేశం అంత సులభంగా జరగలేదు. ఇందుకోసం ఆమె అనేక త్యాగాలు చేయాల్సివచ్చింది. వాటి గురించి చెప్పేందుకు ఆమె ఏమాత్రం సందేహించదు. ఈ విషయాల గురించి ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘నేను కెరియర్ తొలినాళ్లలో ప్రొడ్యూసర్లతో పాటు ప్రేమికుల కోసం అనేక ‘త్యాగాలు’ చేశాను. పెళ్లయిన తరువాత కూడా నా భర్త నన్ను మరింత ‘శాక్రిఫైజ్’ చేసేలా బలహీనపరిచాడు. చివరికి నేను జీవితాన్ని సరైన పద్ధతిలో నడపాలని భావించి తన కుమారుని కోసం తిరిగి ‘శాక్రిఫైజ్’ చేస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం ఆమె భర్తకు విడాకులిచ్చారు. ఈ కేసు కోర్టులో నడుస్తోంది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే.. భర్తనుంచి విడిపోయి ముంబై తిరిగి వచ్చిక ఆమెను ఆర్థిక సమస్యలు చుట్టిముట్టాయి. ఆమెకు ఏ పనీ దొరకలేదు. అటు సినామాల్లో, ఇటు టీవీల్లో ఆమెకు ఎటువంటి అవకాశాలు రాలేదు. దీంతో ఆమె మరింత నిస్సహాయురాలిగా మారింది. చివరికి ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకుందట. అయితే కుమారుని ముఖం చూసి ఆ ప్రయత్నాన్ని విరమించింది. తన కుమారుడు టైగర్ ఇంకా చాలా చిన్నవాడు. వాడి ఆలనాపాలనా చూడాలి. వాడిని బాగా చదివించి పెద్దవాడిని చేయాలని ఆమె తెలిపింది. వెబ్ సిరీస్‌లో బిజీ.. 2019లో పలు ఓటీటీ ప్లాట్ఫారంలతోపాటు నెట్‌ఫ్లిక్స్ వెబ్‌సిరీస్‌లలో ఆమె తిరిగి రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రేక్షక జనం ఆమెను మరచిపోలేదు. వివిధ ప్లాప్ఫారాల వెబ్ సిరీస్‌లలో ఆమెను ‘ఎక్స్ట్రా సర్వర్’గా చూపించారు. నెట్‌ఫ్లిక్స్ ఏకంగా ఆమెకు ‘సర్వర్ క్రషర్’, ‘ ఇంటర్నెట్ ట్రాఫిక్ జనరేటర్’ అనే బిరుదులు ఇచ్చేసింది. 2020లో వచ్చిన ‘ఆప్ కా సప్నా భాభీ’ మెగాహిట్గా నిలిచింది. దీనిలో ఆమె కీలకపాత్ర పోషించింది. తరువాత ఆమె ‘సౌతల్లీ’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. అనంతరం ఆమె నటించిన పాపింగ్ టామ్ సీజన్ రిలీజ్ అయి, అభిమానుల ఆదరణను పొందింది. దీనికి సస్నానే ప్రొడ్యూసర్, డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఆమె నటించిన ఎల్ఎల్డీ(లవ్, లస్ట్, డ్రామా), సప్నాకే అంగూర్, సప్పూ బాయీ తదితర వెబ్ సిరీస్‌లు ప్రేక్షకాదరణ పొందాయి. ఫ్యాన్స్ కూడా ఆమె షోలను చూసేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపధ్యంలో ఆమెపై ఈర్ష్య పెంచుకున్నవారు కూడా చాలా మంది ఉన్నారు. వీరి గురించి ఆమె మాట్లాడుతూ ‘ఎవరిలో నాపై ద్వేషభావం ఉందో వారే ఇబ్బంది పడతారు. నా పని నేను చేసుకుంటూ ముందుకు వెళతాను’ అని ఆమె స్పష్టం చేసింది. కాగా ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 5 లక్షలకు మించిన ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్‌లో ఆమె వీడియోలు తెగ వైరల్ అవుతుంటారు. ఇది కూడా చదవండి: భర్త లేకుండా పార్టీ.. సింగర్స్ జంట విడాకులు తీసుకోనుందా? -
అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఈ రంగం
-
బడిఈడు పిల్లలు స్కూల్లో ఉండాల్సిందే
సాక్షి, అమరావతి : విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బడి ఈడు పిల్లలు తప్పనిసరిగా స్కూల్లో చేరాలని, 100 శాతం జీఈఆర్ (గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో) సాధించే దిశగా ముందుకు సాగాలన్నారు. డ్రాప్ అవుట్స్ లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులు కోరితే తిరిగి ప్రవేశాలు కల్పించాలని ఆదేశించారు. విద్యాశాఖపై గురువారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను గ్లోబల్ స్థాయిలో తీర్చిదిద్దాలని సూచించారు. అందుకు అనుగుణంగా రాష్ట్రంలోని 45 వేల పాఠశాలల్లో ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి తెచ్చే దిశగా అడుగులు ముందుకు వేయాలని చెప్పారు. మొదటి దశ నాడు–నేడు పూర్తి చేసుకున్న హైస్కూళ్లల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు (ఐఎఫ్‌పీ) ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రెండు హైస్కూళ్ల చొప్పున అప్‌గ్రేడ్ చేయండి ఇంటర్ విద్యను పటిష్టం చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. అందుకోసం ప్రతి మండలంలో రెండు జూనియర్ కాలేజీలు చొప్పున.. ఒకటి బాలికలకు, రెండోది కో ఎడ్యుకేషన్ కోసం ఉండాలన్నారు. జనాభా అధికంగా ఉన్న ఆ మండలంలోని రెండు గ్రామాలు లేదా, పట్టణాల్లో రెండు హైసూ్కళ్లను జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేయాలని ఆదేశించారు. వచ్చే జూన్ నాటికి ఈ జూనియర్ కళాశాలలు అందుబాటులోకి రావాలన్నారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్లో కూడా బైజూస్ కంటెంట్ పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని, తర్వాత దశలో ట్యాబుల పంపిణీకి కూడా సన్నద్ధం కావాలన్నారు. ఇప్పటి నుంచే సరైన ప్రణాళికతో ముందుకు సాగాలని ఆదేశించారు. వరుసగా నాలుగో ఏడాది జగనన్న విద్యా కానుక అందిస్తున్నామని, విద్యార్థులకు అందించే వస్తువుల్లో నాణ్యతా లోపం లేకుండా చూడాలన్నారు. దీనిపై అధికారులు స్పందిస్తూ విద్యా కానుక నాణ్యత పరిశీలనకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నామని సీఎం దృష్టికి తెచ్చారు. నాణ్యత కోసం క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియాతో నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే 93 శాతం విద్యా కానుక వస్తువులను, పుస్తకాలను నిర్దేశిత కేంద్రాల్లో పంపిణీకి సిద్ధం చేశామని చెప్పారు. రెండో సెమిస్టర్ పుస్తకాలు కూడా ముందుగానే ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న గోరుముద్ద, ఎస్ఎంఎఫ్, టీఎంఎఫ్లపై నిరంతరం ఫీడ్‌బ్యాక్ తెప్పించుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఫీడ్‌బ్యాక్ ఆధారంగా నిరంతరం చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ఈ అంశంలో థర్డ్ పార్టీ పరిశీలన ఉండాలన్నారు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించారు. స్కూళ్లల్లో డ్రాపౌట్స్ నివారణకు గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల సహకారం తీసుకోవాలన్నారు. డిజిటల్ బోధనపై ఉపాధ్యాయులకు శిక్షణ ఉన్నత పాఠశాలలకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు, ప్రాథమిక పాఠశాలల్లో స్మార్ట్ టీవీల ద్వారా డిజిటల్ బోధన ప్రవేశపెడుతున్నందున ఉపాధ్యాయులకు వాటి వినియోగంపై శిక్షణ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ఆయా కంపెనీల ప్రతినిధులు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫ్యాకల్టీలకు శిక్షణ ఇస్తారని, వీరి ద్వారా టీచర్లకు శిక్షణ ఇస్తామని వివరించారు. మరింత మందికి దీనిపై నైపుణ్యం పెంచేలా 20 వేల మంది బీటెక్ స్టూడెంట్స్ ఇంటర్న్‌షిప్ చేస్తారని, వీరు ప్రతినెలా ఆయా స్కూళ్లకు వెళ్లి టీచర్లకు ఐఎఫ్‌పీ వినియోగంలో సహాయకారిగా ఉంటారని తెలిపారు. ఐఎఫ్‌పీలతో పాటు స్మార్ట్ టీవీల వినియోగం, ట్యాబులు, బైజూస్ యాప్ పైనా టీచర్లకు శిక్షణ ఇస్తామన్నారు. రోజువారీగా, పాఠ్యాంశాల వారీగా బోధనపై స్కూళ్లకు పవర్ పాయింట్ ప్రజంటేషన్లు అందిస్తామని, అన్ని స్కూళ్లలో ఒకేలా బోధన చేపట్టేలా ఇది ఉపయోగపడుతుందని సీఎంకు వివరించారు. ఏపీఎస్ఎఫ్ఎల్, బీఎస్ఎన్ఎల్ ద్వారా స్కూళ్లకు ఇంటర్నెట్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తొలిదశ నాడు–నేడు పూర్తి చేసుకున్న స్కూళ్లలో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించామని, మిగతా స్కూళ్లకు ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. గతేడాది ఎనిమిదో తరగతి విద్యార్థులకు అందించిన ట్యాబుల నిర్వహణ, వినియోగంపై నిరంతరం సమీక్షలు చేస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్లు ఈ బాధ్యత చూస్తున్నారని వివరించారు. రెండో దశ నాడు–నేడులో 22,224 స్కూళ్లు మన బడి నాడు–నేడు రెండో దశ కింద చేపట్టిన పనుల ప్రగతిని సీఎం జగన్ సమీక్షించారు. రెండో దశ కింద ఇప్పటికే రూ.3,287.08 కోట్లు ఖర్చు చేశామని, 22,224 స్కూళ్లలో పనులు జరుగుతున్నట్టు అధికారులు వివరించారు. డిసెంబర్ నాటికి పనులు పూర్తవుతాయన్నారు. నాడు–నేడు కింద పనులు పూర్తి చేసుకున్న స్కూళ్లలో అదే సమయానికి ట్యాబుల పంపిణీతో పాటు, ఐఎఫ్బీ ప్యానెల్స్నూ ఏర్పాటు చేస్తామన్నారు. విద్యా శాఖలో చేపడుతున్న వివిధ కార్యక్రమాల అమలు, వాటి పురోగతిని వివరించారు. ఈ ఏడాది అన్ని తరహా ప్రభుత్వ స్కూళ్లలో 64 మంది విద్యార్థులు టాప్ 10 ర్యాంకులు సాధించారన్నారు. స్కూళ్లలో పూర్తి స్థాయిలో సిబ్బంది ఉండేలా, సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ అమలు చేస్తూ బదిలీలు చేపడుతున్నామని, యూనిట్ టెస్టుల్లో వెనకబడినవారికి మరింత బోధన, శిక్షణ ఇచ్చేలా కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. ఈ ఏడాది అన్ని తరహా ప్రభుత్వ కాలేజీల్లో 27 మంది టాప్ 10 ర్యాంకులు సాధించారని సీఎంకు తెలిపారు. అకడమిక్ క్యాలెండర్ 2023–24 విడుదల 12న విద్యా సంవత్సరం పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో 2023–24 అకడమిక్ క్యాలెండర్‌ను సీఎం ఆవిష్కరించారు. ఇందులో విద్యా సంవత్సరంలో చేపట్టే ముఖ్యమైన అంశాలతో పాటు స్కూల్ కాంప్లెక్స్ షెడ్యూల్, హెచ్ఎంలు, ఉపాధ్యాయుల విధులు, లాంగ్వేజ్ మేళా, లాంగ్వేజ్ క్లబ్, లాంగ్వేజ్ ల్యాబ్స్, లెసన్ ప్లాన్ ఫార్మాట్ అండ్ గైడ్‌లైన్స్, లెర్న్ ఏ వర్డ్ ఏ డే, తెలుగు భాషా వారోత్సవాలు, కల్చరల్ యాక్టివిటీస్‌తో సహా స్కూళ్లలో చేపట్టాల్సిన పలు అంశాలు ఉన్నాయి. ప్రతిభా అవార్డుల పరిశీలన 2023లో పదో తరగతి, ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో అత్యుత్తమ ప్రతిభావంతులను ప్రభుత్వం జగనన్న ఆణిముత్యాలు పురస్కారాలతో సత్కరించనుంది. ఈ సందర్భంగా విద్యార్థులకు ఇవ్వనున్న మెడల్స్‌ను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఉత్తమ ప్రతిభ కనపర్చిన విద్యార్థులను మూడు దశల్లో సత్కరించనున్నారు. నియోజకవర్గ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనపర్చిన విద్యార్థులను జూన్ 15న, జిల్లా స్థాయిలో జూన్ 17న, రాష్ట్ర స్థాయిలో జూన్ 20న అవార్డులు అందజేయనున్నారు. స్టేట్ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్–2023ను విజయవాడలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా విద్యార్థులకు అందించనున్నారు. -
ఇంటర్నెట్ బిజినెస్‌లో అత్యధిక ఉద్యోగావకాశాలు
సాక్షి, అమరావతి: దేశంలో ఇంటర్నెట్ బిజినెస్ రంగం వేగంగా విస్తరిస్తోందని, ఈ ఏడాది ఈ రంగంలో ఉద్యోగావకాశాలు అత్యధికంగా ఉంటాయని ఇండియా స్కిల్స్ రిపోర్ట్– 2023 వెల్లడించింది. భారతదేశంలో ప్రస్తుతం 74.9 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉండగా.. వచ్చే ఐదేళ్లలో ఆ సంఖ్య 90 కోట్లకు చేరుతుందని రిపోర్ట్ స్పష్టం చేసింది. అత్యంత వేగంగా ఈ రంగం విస్తరిస్తోందని, భారతదేశం డిజిటల్ దిగ్గజంగా స్థిరపడేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇంజినీరింగ్, తయారీ రంగంలో పెట్టుబడులపై దృష్టి సారిస్తోందని, ఫార్మాస్యూటికల్ రంగం కూడా గణనీయంగా విస్తరిస్తోందని, ఈ రంగాల్లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపింది. ఉపాధి అర్హతలో మహిళలే ముందు గత ఆరేళ్లుగా ఉపాధి అర్హత గల యువతలో మహిళలే అత్యధికంగా ఉన్నట్లు రిపోర్ట్ తెలిపింది. 2017లో ఉపాధి అర్హతగల మహిళా వనరులు 40.88 శాతం ఉంటే 2023లో అది 52.80 శాతానికి పెరిగింది. దేశం వ్యాప్తంగా ఉపాధి అర్హత కలిగిన మహిళా వనరులుండటం విద్యలో భారతదేశం సాధించిన విజయాన్ని తెలియజేస్తోందని రిపోర్ట్ వ్యాఖ్యానించింది. దేశంలో అత్యధిక ఉపాధి నైపుణ్యాలు ఈ ఏడాది ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నట్లు రిపోర్ట్ తెలిపింది. ఈ ఏడాది ఉద్యోగావకాశాలు ఎక్కువ దేశంలో గత ఆరేళ్లతో పోల్చితే ఈ ఏడాది ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయని ఇండియా స్కిల్స్ రిపోర్ట్ అంచనావేసింది. 2017లో 40.44 శాతమే ఉద్యోగావకాశాలుండగా ఈ ఏడాది 50.3 శాతం మేరకు అది పెరిగాయని రిపోర్ట్ పేర్కొంది. కోవిడ్ సంక్షోభం కారణంగా మూడేళ్లు అంటే 2020 నుంచి 2022 వరకు దేశంలో ఉద్యోగావకాశాలు 46 శాతానికే పరిమితమయ్యాయి. గత ఆరు సంవత్సరాలుగా ఉద్యోగాలు ఎక్కువగా కల్పించిన రంగాలు.. 2017 – ఆయిల్ అండ్ గ్యాస్, స్టీల్, మినరల్స్, సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, ఆటోమోటివ్స్. 2018 – బ్యాంకింగ్,ఫైనాన్స్, సర్వీస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), రిటైల్. 2019 – బీఎఫ్ఎస్ఐ, సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, మాన్యుఫ్యాక్చరింగ్. 2020 – బీఎఫ్ఎస్ఐ, ఐటీ, 2021 – బీఎఫ్ఎస్ఐ, సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, ఐటీ, ఇంటర్నెట్ బిజినెస్. 2022 – ఇంటర్నెట్ బిజినెస్, సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, ఐటీ, ఫార్మా -
ఆ రాయిని మండిస్తే చాలు.. ఇంటర్నెట్, వైఫై సిగ్నల్స్ వస్తాయ్!
మనకు ఇంటర్నెట్, వైఫై సిగ్నల్స్ బాగా వచ్చేందుకు ఇంటి మేడపైకి, ఎత్తుగా ఉన్న ప్రదేశంలోకి వెళ్తాం. మాగ్జిమమ్ ఇంటర్నెట్ సిగ్నల్స్ రాకపోతే నానా తిప్పలు పడి మరీ యాక్సెస్ అయ్యేలా చేసుకుంటాం. కానీ అవేమి అవరసం లేకుండా ఓ అరుదైన రాయి దగ్గరికి వెళ్తే చాలు మనకు ఇంటర్నెట్, వైఫై సిగ్నల్ పనిచేస్తాయ్. ఇది నిజంగా నమ్మలేని నిజం. జర్మనీలో ఈ అద్భుత ఆవిష్కరణ చేశాడో ఓ వ్యక్తి. శాస్త్రవేత్తలు సైతం ఈ మ్యాజిక్ రాయిని చూసి ఆశ్చర్యపోయారు. వివరాల్లోకెళ్తే..జర్మనీలో ఉంది ఈ రాయి. సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు దీన్ని చూసేందుకు ఎగబడుతున్నారు. దానిలో థర్మల్ ఎలక్ట్రిక్ జనరేటర్ అమర్చబడి ఉంది. దాన్ని మంటల వద్ద పెడితే వేడిని విద్యుత్ శక్తిగా మార్చుతుంది. ఆ తర్వాత వైఫై రూటర్ ఆన్ అవుతుంది. ఇంటర్నెట్ సిగ్నల్స్ ప్రారంభమవుతాయి. వాస్తవానికి అది కృత్రిమ రాయి. ఈ అరుదైన రాయి బరువు 1.5 టన్నులు. ఈ కళాకృతిని కీప్ అలైవ్ అని పిలుస్తారు. ఎరామ్ బర్తోల్ అనే వ్యక్తి దీన్ని తయారు చేశాడు. ఆ ఆవిష్కరణ కారణంగా ఆయన పేరు వార్తల్లో నిలిచింది. (చదవండి: కొత్త పార్లమెంట్ భవనం కోసం షారూఖ్, అక్షయ్ కూమార్‌ల వాయిస్ ఓవర్) -
వాట్సాప్‌లో ఇలాంటి ఫీచర్ ఒకటుందని తెలుసా? తెలిస్తే ఎగిరి గంతేస్తారు!
ఆధునిక ప్రపంచములో స్మార్ట్‌ఫోన్ వాడకం సర్వ సాధారణం అయిపోయింది. స్మార్ట్‌ఫోన్ వాడే వినియోగదారులలో చాలామంది సోషల్ మీడియాలో కాలం గడిపేస్తూ ఉంటారు. అయితే దీనికోసం మొబైల్ డేటా అవసరం. మొబైల్ డేటా లేకుండా సోషల్ మీడియా ఉపయోగించడం అసాధ్యమని అందరూ అనుకుంటారు, కానీ మొబైల్ డేటా లేకపోయినా వాట్సాప్ ఉపయోగించదానికి ఒక కొత్త ఫీచర్ అందుబాటులో ఉందన్న విషయమే మర్చిపోయి ఉంటారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూద్దాం. మొబైల్ డేటా లేకుండా వాట్సాప్ ఉపయోగించలేమనుకునే వారికి ఇది శుభవార్త అనే చెప్పాలి. ఈ అద్భుతమైన ఫీచర్‌ను 'ప్రాక్సీ సపోర్ట్ ఫర్ వాట్సాప్' అంటారు. సంస్థ ఈ ఫీచర్‌ను బ్లాగ్‌లో ప్రకటించింది. దీనిని వినియోగదారులు ఎటువంటి పరిమితులు లేకుండానే వినియోగించుకోవచ్చు, కానీ భద్రతలను దృష్టిలో ఉంచుకుని మెసేజిలను ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేసే అవకాశం ఉంది. 2023లో ఇంటర్నెట్ అంతరాయాలు కలిగే అవకాశం లేదు, కానీ కొన్ని దేశాల్లో అప్పుడప్పుడు ఈ సమస్యలు ఎదురైనప్పుడు వినియోగదారుల సేవలకు ఎటువంటి అంతరాయం కలుగకుండా చూడటానికి సంస్థ కృషి చేస్తోంది. అయితే ఈ ఫీచర్ అనవసరంగా ఉపయోగించుకోకూడదు. ఇంటర్నెట్ లేకుండా వాట్సాప్ ఉపయోగించడం ఎలా? ప్రాక్సీ సపోర్ట్ ఫర్ వాట్సాప్ ఫీచర్ ఉపయోగించడానికి మొదట వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళాలి. స్టోరేజ్ అండ్ డేటా మీద ట్యాప్ చేసి ప్రాక్సీ ఉపయోగించుకోవచ్చు. ప్రాక్సీ అడ్రస్ ఎంటర్ చేసిన తరువాత సేవ్ చేసుకోవాలి. మీ కనెక్షన్ విజయవంతమైతే చెక్ మార్క్ కనిపిస్తుంది. మొత్తం ప్రక్రియ పూర్తయిన తరువాత కూడా మీరు ప్రాక్సీ ఉపయోగించి వాట్సాప్ సందేశాలు పంపించడం లేదా రిసీవ్ చేసుకోవడం వంటివి కాకుండా పోతే ప్రాక్సీ బ్లాక్ చేసి ఉండవచ్చు. అప్పుడు మరో ప్రాక్సీ చిరునామాతో మళ్ళీ ప్రయత్నించాల్సి ఉంటుంది. (ఇదీ చదవండి: 1998లో ప్రభంజనం సృష్టించిన టాటా ఇండికా - అరుదైన వీడియో) మీ వాట్సాప్ ప్రాక్సీకి కనెక్ట్ చేసే ఆప్షన్ అనేది ఆండ్రాయిడ్ & ఐఓఎస్ రెండింటిలోనూ వాట్సాప్ సెట్టింగ్స్‌లో ఉంటుంది. ఒక వేళా మీకు ఆ ఆప్షన్ కనిపించకపోతే మీ వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో అందుబటులో ఉన్నాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
న్యూస్ కోసం పేపర్ చదవటం లేదు! ఎక్కువ అందులోనే చూస్తున్నారు..
న్యూఢిల్లీ: దేశీయంగా సగానికిపైగా ఇంటర్నెట్ యూజర్లు ప్రాంతీయ భాషల్లో న్యూస్ కోసం ఆన్లైన్ మాధ్యమం వైపు మొగ్గు చూపుతున్నారు. పైగా పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో వార్తల వినియోగం అత్యధికంగా (63 శాతం - 23.8 కోట్ల మంది) ఉంటోంది. పట్టణ ప్రాంత యూజర్లలో ఇది 37 శాతంగా ఉంది. టెక్నాలజీ దిగ్గజం గూగుల్, కన్సల్టెన్సీ సంస్థ కాంటార్ రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం .. దేశీయంగా 72.9 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. ఇందులో 52 శాతం మంది (37.9 కోట్లు) వివిధ న్యూస్ యాప్‌లు, వెబ్సైట్లు, సోషల్ మీడియా పోస్టులు, మెసేజ్ ఫార్వర్డ్లు, యూట్యూబ్ మొదలైన వాటి ద్వారా ప్రాంతీయ భాషల్లో వార్తలను ఆన్లైన్లో చూడటం, చదవడం, వినడం చేస్తున్నారు. తమ తోటివాళ్లలో కూడా టీవీ చానళ్లతో పోలిస్తే ఆన్లైన్ మాధ్యమమే ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంటోందని 48 శాతం మంది పేర్కొన్నారు. 14 రాష్ట్రాల్లో, 8 ప్రాంతీయ భాషల్లో, 15 ఏళ్లు పైబడిన వారిలో డిజిటల్ న్యూస్ వినియోగ ధోరణులను తెలుసుకునేందుకు కాంటార్–గూగుల్ దీనికి సంబంధించిన సర్వే నిర్వహించాయి. ఇందుకోసం 16 నగరాలకు చెందిన 4,600 మందిని వ్యక్తిగతంగా ఇంటర్వ్యూ చేసింది. 64 పైచిలుకు చర్చా కార్యక్రమాలు నిర్వహించింది. దీని నివేదిక ప్రకారం.. వార్తల వినియోగానికి వీడియోలు అత్యధికంగా ఇష్టపడే ఫార్మాట్‌గా ఉంటున్నాయి. టెక్ట్స్, ఆడియో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. బెంగాలీ వీడియో కంటెంట్‌కు అత్యధిక డిమాండ్ (81 శాతం) ఉంది. తమిళం (81%), తెలుగు (79%), హిందీ (75%), గుజరాతీ (72%), మలయాళం (70%), మరాఠీ.. కన్నడ (చెరి 66%) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. టెక్ట్స్ వినియోగం ఎక్కువగా గుజరాతీ, కన్నడ కంటెంట్‌కు చెరి 20 శాతం చొప్పున ఉంది. మరాఠీలో 18 శాతంగా ఉంది. ఆడియో న్యూస్ కంటెంట్‌కు మరాఠీ, మలయాళంలో అత్యధికంగా (16 శాతం) డిమాండ్ ఉంది. ఆన్లైన్ న్యూస్ చూసేందుకు ఎక్కువ శాతం మంది (93 శాతం) యూట్యూబ్ వైపు మొగ్గు చూపుతున్నారు. సోషల్ మీడియా (88 శాతం), చాట్ యాప్స్ (22 శాతం), సెర్చి ఇంజిన్లూ (61 శాతం), పబ్లిషర్ న్యూస్ యాప్స్ లేదా వెబ్సైట్లు (45 శాతం), ఆడియో న్యూస్ (39 శాతం), ఓటీటీ లేదా కనెక్టెడ్ టీవీ (21 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. 80 శాతం మంది ఆన్లైన్ న్యూస్ వినియోగదారులకు పలు సందర్భాల్లో అనుమానాస్పద కంటెంట్ ఎదురైంది. అది వాస్తవమైనదా లేక తప్పుడు వార్తా అన్నది తెలుసుకోవడం కష్టతరంగా మారింది. ఏ న్యూస్ వెబ్సైట్లోను కనిపించకుండా కేవలం వాట్సాప్ లేదా నోటిమాటగానో వస్తే అలాంటి వాటిని తాము తప్పుడు సమాచారంగా పరిగణిస్తున్నామని 43 శాతం మంది తెలిపారు. 60 పదాలకన్నా తక్కువగా సంక్షిప్త రూపంలో ఉండే న్యూస్‌ను 70 శాతం మంది చదువుతుండగా, 67 శాతం మంది టాప్ స్టోరీ హెడ్‌లైన్స్‌ను, 48 శాతం మంది సుదీర్ఘ కంటెంట్‌ను చదువుతున్నారు. 25 శాతం మంది ఆన్లైన్ న్యూస్ వినియోగదారులు 60 సెకన్ల లోపు క్లిప్‌లను ఇష్టపడుతుండగా, 19 శాతం మంది మరింత ఎక్కువ నిడివి కలిగి ఉండే వాటిపై ఆసక్తి చూపుతున్నారు. 73 శాతం మంది ఆన్లైన్ రీడర్లు.. ఎక్కువగా హైపర్‌లోకల్ కంటెంట్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. వార్తల్లో కూడా వివిధ సెగ్మెంట్లకు వివిధ రకాలుగా ప్రాధాన్యం ఉంటోంది. ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ న్యూస్‌ను (76 శాతం మంది – 37.9 కోట్లు) యాక్సెస్ చేస్తున్నారు. క్రైమ్ రెండో స్థానంలో ఉండగా.. దేశ, రాష్ట్ర, నగర వార్తలు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. -
‘నెట్’స్పీడైతే.. బోధన ‘వీఆర్’అవుద్ది!
సాక్షి, హైదరాబాద్: మనుషులుగానీ, వస్తువులుగానీ మనం దగ్గరుండి చూసినట్టుగా.. అంతా మన కళ్ల ముందే ఉన్నట్టుగా అనిపించే సాంకేతికతే ‘వర్చువల్ రియాలిటీ (వీఆర్)’. ప్రత్యేకమైన వీఆర్ హెడ్‌సెట్‌ను కంప్యూటర్‌కు అనుసంధానం చేసి, వీడియోలను ప్లే చేయడం ద్వారా అనుభూతిని పొందొచ్చు. ఈ సాంకేతికతతో విద్యా రంగంలో అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. ఉదాహరణకు ఒక విత్తనం మొలకెత్తడం నుంచి పెద్ద చెట్టుగా ఎదిగేదాకా కీలకమైన దశలన్నింటినీ కొన్ని నిమిషాల్లోనే స్పష్టంగా అవగాహన కలిగేలా ‘వీఆర్’వీడియోలను విద్యార్థులకు చూపించవచ్చు. ఇందుకోసమే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ‘వీఆర్’బోధన చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. కానీ స్కూళ్లలో సరైన కంప్యూటర్లు, వేగవంతమైన ఇంటర్నెట్ లేకపోవడం సమస్యగా మారింది. పరిశోధనలపై ఆసక్తి కలిగేలా.. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని పాఠశాలల్లో ‘వర్చువల్ రియాలిటీ, త్రీడీ’పద్ధతుల్లో బోధన అందించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఇందుకోసం కేంద్రం 60%, రాష్ట్రాలు 40% నిధులు వెచ్చించేలా కార్యక్రమాన్ని రూపొందించింది. విద్యార్థుల్లో ఆలోచనను రేకెత్తించేలా, క్లిష్టమైన అంశాలు కూడా అత్యంత సులభంగా అర్థమయ్యేలా బోధన కొనసాగించేందుకు ఏర్పాట్లు చేసింది. జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) ఇందుకు సంబంధించిన ప్రణాళికను కూడా రూపొందించింది. విద్యార్థి స్థాయిలోనే పరిశోధనల వైపు ఆసక్తి కలిగించేలా, పూర్తి అవగాహన వచ్చేలా అంశాలను ఎంపిక చేసింది. ఈ మేరకు 2023–24 నుంచే ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని కొన్ని స్కూళ్లలో ‘వీఆర్’ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. దీని అమలుకు సంబంధించి ఇటీవల స్కూళ్లలో అధ్యయనం చేసింది. పాతకంప్యూటర్లు.. స్లో ఇంటర్నెట్.. ‘వీఆర్–త్రీడీ’వంటి ఆసక్తికర బోధన పద్ధతులను అనుసరించేందుకు సిద్ధంగా ఉన్నా మౌలిక వసతుల కొరత ఇబ్బందిగా మారిందని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం చాలా ప్రభుత్వ స్కూళ్లలో ఇంటర్నెట్ సదుపాయం అరకొరగా ఉందని.. వాడే కంప్యూటర్లు కూడా పాతవని, వాటితో వీఆర్ త్రీడీ పాఠాలు చెప్పడం కష్టమని అధ్యయన నివేదికలో పేర్కొన్నారు. వాస్తవానికి ఒక్కో పాఠశాలకు 20 హెడ్సెట్ల చొప్పున ఐదు బడుల్లో దీన్ని తొలుత ప్రారంభించాలని అనుకున్నారు. కానీ బోధనకు సంబంధించిన వీడియోలు డౌన్లోడ్ చేసుకోవాలంటే సమస్య ఏర్పడుతోందని గుర్తించారు. చాలా స్కూళ్లలో ఇప్పటికీ కనీసం 4జీ నెట్ కూడా లేదు. పాత కంప్యూటర్లు ఎక్కువ పరిమాణంలో ఉండే వీఆర్–త్రీడీ వీడియోలను సరిగా ప్లే చేయలేకపోతున్నాయి. ఇది పిల్లల్లో విసుగు కలిగిస్తుందని అధికారులు అంటున్నారు. ప్రధానంగా సామాన్య, సాంఘిక శాస్త్రాల బోధనలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తేలినట్టు వివరిస్తున్నారు. ఎక్కువ సామర్థ్యమున్న, వేగంగా పనిచేసే కంప్యూటర్లు, వేగవంతమైన ఇంటర్నెట్ ఉంటే తప్ప ‘వీఆర్’బోధన అంశంలో ముందుకెళ్లడం సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరనున్నామని.. సానుకూల స్పందన వస్తే విద్యార్థులకు అద్భుతమైన బోధన అందుతుందని అధికారులు చెప్తున్నారు. -
మణిపూర్‌లో హైటెన్షన్..144 సెక్షన్ విధింపు
మణిపూర్‌లోని చురాచంద్పూర్ జిల్లా తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ పర్యటనకు ముందు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. గురువారం రిజర్వ్ చేసిన రక్షిత అడవులు, చిత్తడి నేలలు, వంటి ప్రాంతాలపై బీజేపీ ప్రభుత్వం చేసిన సర్వేని ఆదివాసి గిజన నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి షెడ్యూల్ కార్యక్రమానికి చెందిన వేదికను ఓ గుంపు ధ్వంసం చేసి, నిప్పంటించారు. దీంతో అధికారులు జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనులు తలెత్తకుండా 144 సెక్షన్‌ని విధించి నిషేధాజ్ఞాలు జారీ చేశారు. ఉద్రిక్తతలు మరింతగా చెలరేగేలా..ప్రజలు ఎవరితోనూ కమ్యూనికేట్ చేయకుండా ఉండేందుకు ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. ప్రజల ప్రాణలు, ఆస్తులకు తీవ్ర ప్రమాదం ఉందని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. తాము శాంతి భద్రతలకు భంగం కలగకుండా ఉండేలా ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు చురాచంద్పూర్ జిల్లా అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఎస్ థియెన్‌లట్‌జోయ్ గాంగ్టే ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం చేసిన సర్వేను ఆదివాసీ గిరిజన నాయకుల ఫోరమ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే జిల్లాలో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జిల్లా బంద్‌కు గిరిజన నాయకుల ఫోరం పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, రైతులు, ఇతర గిరిజన నిర్వాసితులు రిజర్వు అటవీ ప్రాంతాలను తొలగించడం కోసం కొనసాగుతున్న డ్రైవ్‌ను నిరసిస్తూ ప్రభుత్వానికి పదేపదే మెమోరాండంలు సమర్పించారు. అయినప్పటికీ తమ కష్టాలను పరిష్కరించడంలో ప్రభుత్వం సుముఖత లేదా చిత్తశుద్ధి చూపలేదని గిరిజన నాయకుల ఫోరం పేర్కొంది. ఈమేరకు కుకీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ కూడా ఫోరమ్‌కు మద్దతుగా నిలిచింది. ఆదివాసులపై ప్రభుత్వం సవతి తల్లి మాదిరిగా ప్రవర్తిస్తుందిన కుకీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆరోపించింది. మత కేంద్రాలను కూల్చివేయడం, గిరిజన గ్రామాలను అక్రమంగా తొలగించడం వంటి వాటితో గిరిజన హక్కులను నిర్వీర్యం చేస్తుందని, దీన్ని తాము ఖండిస్తున్నట్లు ఆర్గనైజేషన్ పేర్కొంది. కాగా, మణిపూర్‌లోని మూడు చర్చిలను ప్రభుత్వం ఈ నెల ప్రారంభంలో కూల్చివేసి, వాటిని అక్రమ నిర్మాణాలుగా పేర్కొనడం గమనార్హం. (చదవండి: ఐఏఎస్ ఆఫీసర్ నిర్వాకం..స్మారక కట్టడాన్ని కూల్చి బంగ్లాగా..) -
1991లో ఒకటి.. ఇప్పుడు నిమిషానికి 175.. యాక్టివ్‌గా ఉన్నది 18 శాతమే!
సాక్షి, అమరావతి: ఇంటర్నెట్ ప్రపంచంలో కోట్లాది వెబ్సైట్లు సమాచార సామ్రాజ్యాన్ని ఏలుతున్నాయి. లావాదేవీలకు వారధిగా నిలుస్తూ కీలక పాత్ర పోషిస్తున్నాయి. నిమిషానికి 175 కొత్త వెబ్సైట్లు పుట్టుకొస్తున్నాయి. రోజూ 2.52 లక్షల కొత్త వెబ్సైట్లను సృష్టిస్తున్నారు. 1991లో ఒక్క వెబ్‌సైట్‌తో ప్రారంభమైన ఇంటర్నెట్ ఈ రోజు బిలియన్ల సంఖ్యకు చేరుకోవడం విశేషం. ప్రస్తుతం ఇంటర్నెట్లో సుమారు 1.13 బిలియన్ల వెబ్సైట్లు ఉన్నట్లు ఇంగ్లాండ్‌కు చెందిన ఇంటర్నెట్ సంస్థ నెట్క్రాఫ్ తాజా నివేదికలో వెల్లడించింది. అధికంగా ఆంగ్లంలోనే వెబ్సైట్లను రూపొందిస్తున్నారు. 18 శాతం మాత్రమే యాక్టివ్.. ఇంటర్నెట్లోని కోట్లాది వెబ్సైట్లలో కేవలం 18 శాతం మాత్రమే యాక్టివ్‌గా ఉన్నట్టు నెట్క్రాఫ్ట్ పేర్కొంది. ప్రస్తుతం 20.29 కోట్ల వెబ్సైట్లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. యాక్టివ్ వెబ్సైట్ల కంటే పని చేయనివి ఐదు రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. ఒక Ðవెబ్సైట్లో అనేక వెబ్ పేజీల సమాచారం ఉంటుంది. 50 బిలియన్ల వెబ్‌పేజీల సమాచారం నెట్లో నిక్షిప్తమైంది. టిల్æబర్గ్ వర్సిటీ (నెదర్లాండ్స్) పరిశోధన ప్రకారం ఇండెక్డ్ వెబ్ ఏకంగా 4.98 బిలియన్ల పేజీలను కలిగి ఉంది. రెండు బిలియన్ల మంది షాపింగ్ దాదాపు 71 శాతం వ్యాపారాలను వెబ్సైట్లపై ఆధారపడి నిర్వహిస్తున్నారు. ఇందులో 28 శాతం ఆన్లైన్ వ్యాపారం నడుస్తోంది. 43 శాతం మంది చిన్న వ్యాపారులు తమ వెబ్సైట్లను మరింత మెరుగ్గా నిర్వహించేందుకు పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నారు. 2 బిలియన్ల మందికిపైగా వివిధ వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు. ఈ–కామర్స్ విక్రయాలు 4.2 ట్రిలియన్ల డాలర్లుకుపైగా చేరుకుంటున్నాయి. వెబ్సైట్లో ఇలా.. ♦ ప్రపంచ వెబ్ ట్రాఫిక్‌లో 93 శాతం గూగుల్ నుంచే వస్తోంది. గూగుల్‌లో అత్యధికంగా సగటున 22 నిమిషాల పాటు బ్రౌజింగ్ సమయాన్ని వెచి్చస్తున్నారు. ఇది యూట్యూబ్‌లో 9 నిమిషాలుగా ఉంది. ♦ ఒక రోజులో 3 బిలియన్ల కంటే ఎక్కువగా గూగుల్ శోధనలు జరుగుతున్నాయి. ♦ ఒక్క రోజులో 70,000కు పైగా వెబ్సైట్లు హ్యాక్‌కి గురవుతున్నాయి. ♦ ఒక రోజులో దాదాపు 120 బిలియన్ ఈ–మెయిల్స్ పంపుతున్నారు. ♦ప్రతిరోజూ 4 బిలియన్ గిగాబైట్ల కంటే ఎక్కువ ఇంటర్నెట్ ట్రాఫిక్ నమోదవుతోంది. ♦ 63 మిలియన్ వెబ్సైట్లు కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్‌లను ఉపయోగిస్తున్నాయి. ♦ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్ర వెబ్సైట్లలో 76.17 శాతం మొబైల్‌కు అనుకూలమైనవి కాగా 23.83 శాతం వెబ్సైట్లు మొబైల్లో ఓపెన్ కావు. -
కోట్లు పలుకుతోంది.. ఈ దున్నపోతుతో సెల్ఫీ తీసుకునేందుకు ఎగబడుతున్న జనం!
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఇటీవల పశువుల ప్రదర్శన (సంత) నిర్వహించారు. ఇందులో పాల్గొనేందుకు యూపీతో పాటు నాలుగు రాష్ట్రాల నుంచి పశువులు ముజఫర్ నగర్‌లోని సంతకు చేరుకున్నాయి. అయితే ఈ సంతలో అందరి చూపు ఓ దున్నపోతుపై పడింది. అక్కడ జరగుతున్న సంతలో ప్రధాన ఆకర్షణగా అదే నిలిచింది. సంతకు హాజరైన ప్రతీ ఒక్కరూ దానితో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. ఇంతకీ ఆ దున్నపోతు ఎందుకంత ప్రత్యేకమంటే? దీని ధర రూ.10 కోట్లు సంతలో అందరి చూపును ఆకట్టుకున్న ఈ దున్నపోతు పేరు ఘోలు. బాహుబలి సినిమాలో ఉండే ఎద్దుకి ఏ మాత్రం తీసిపోన్నట్లు కనిపిస్తుంది. గురువారం జరిగిన జంతు సంతలో పానిపట్ నుంచి తీసుకొచ్చిన ఈ దున్నపోతు ముర్రా జాతికి చెందినది. ఈ ప్రత్యేక జాతి దున్నపోతు ధర రూ.10 కోట్లు పలుకుతోందట. 16 క్వింటాళ్ల బరువున్న దీన్ని హర్యానాలోని పానిపట్ నుంచి ముజఫర్‌నగర్‌లోని పశువుల సంతకు తీసుకొచ్చారు. ఇది పద్మశ్రీ అవార్డు పొందిన పానిపట్‌లోని దిద్వాడి గ్రామ నివాసి నరేంద్ర సింగ్‌కు చెందినది. ఘోలుకు రోజుకు 10 కిలోల వరకు మేత తింటుందట. ముజఫర్ నగర్ పశువుల ప్రదర్శనకు చేరిన ఈ దున్నపోతు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఈ దున్నపోతు యజమాని దీని ఆహారంతో పాటు, దాని ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. -
పైశాచికత్వంపై కొరడా!
అతనో డాక్టర్. విజయవాడ నుంచి ఢిల్లీ వెళుతూ ఆన్లైన్లో ఓ బాలిక పోర్న్ వీడియో చూశాడు. అంతటితో ఆగని వైద్యుడు వీడియోను డౌన్లోడ్ చేసి ఇన్‌స్టాలో ఉన్న తన ఫేక్ ఐడీ ద్వారా పబ్లిక్ డొమైన్లో షేర్ చేశాడు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వివరాలన్నింటినీ సేకరించిన పోలీసులు.. ఆ డాక్టర్‌ను అరెస్ట్ చేసేందుకు వెళితే ఆ తప్పు తాను చేయలేదంటూ బుకాయించాడు. తీరా సాక్ష్యాలు చూపించాక తోక ముడవగా నిందితుడిని కోర్టుకు తరలించారు. చిత్తూరు అర్బన్: రాష్ట్రంలో గత నెల వరకు 1,787 మంది పిల్లల పోర్న్(అశ్లీల) వీడియోలను పలు సామాజిక మాధ్యమాల్లో, స్నేహితులకు షేర్ చేశారు. చట్ట విరుద్ధమైన ఈ నేరానికి పాల్పడిన వాళ్లపై క్రిమినల్ కేసుల నమోదుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించుకుంది. ఇందులో భాగంగా నిందితుల వివరాలను 26 జిల్లాల ఎస్పీలకు అందజేయగా.. వాళ్లపై చర్యలకు పోలీసులు సిద్ధమయ్యారు. నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డ్రన్(ఎన్‌సీఎంఈసీ).. అనేది అమెరికాకు చెందిన ఎలాంటి లాభాపేక్ష ఆశించని స్వచ్ఛంద సంస్థ. 2019లో ఈ సంస్థ మనదేశంతో ఒప్పందం చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సహకారంతో ఇక్కడ పనిచేస్తోంది. ఈ సంస్థ తప్పిపోయిన, అక్రమ రవాణాకు గురైన పిల్లలతో పాటు లైంగిక దాడికి గురైన పిల్లల్ని సంరక్షిస్తుంది. అలాగే 18 ఏళ్లలోపు వయస్సున్న పిల్లలకు సంబంధించిన అసభ్య వీడియోలు(పోర్న్) ఇంటర్నెట్ నుంచి తీసుకుని మరొకరికి చేరవేయడం, సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ చేయడం వంటివి చేస్తే ఆ వీడియోలను తొలగించడంతో పాటు వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటుంది. ఇలా దేశంలోని ప్రతి రాష్ట్రంలో జిల్లాల వారీగా వివరాలు సేకరించి కేంద్ర హోంశాఖ ద్వారా ఆయా రాష్ట్రాల హోంశాఖలకు పంపుతోంది. లింగ భేదంతో సంబంధం లేకుండా పిల్లల గోప్యత, హక్కులను కాలరాసే ఈ చర్యను తీవ్రంగా పరిగణిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఎస్సీఎంఈసీ పంపిన వివరాల ఆధారంగా నిందితులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని ఆయా జిల్లాల ఎస్పీలకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు నిందితులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. అప్లోడ్ చేసినా, షేర్ చేసినా.. ఇక అంతే! ప్రతి నెలా ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న నిందితుల వివరాలను టిప్‌లైన్ సాంకేతిక వ్యవస్థతో కేంద్ర హోంశాఖ నుంచి రాష్ట్ర హోంశాఖకు అందుతోంది. ఒక టిప్‌లైన్‌లో ఏ వ్యక్తి ఏ తేదీన, ఏ సమయంలో, ఏ మొబైల్/కంప్యూటర్ నుంచి ఏ పోర్న్ వీడియోను ఆప్‌లోడ్ చేశాడు? ఎందులో షేర్ చేశాడు? ఏ స్థలం నుంచి పోర్న్ వీడియో అప్లోడ్ చేశాడు? ఆ చిత్రం ఎన్ని నిమిషాలు ఉంది? ఉపయోగించిన ఎలక్ట్రానిక్ పరికరం ఇంటర్నెట్ ప్రొటోకాల్ అడ్రస్? అనే వివరాలను టిప్‌లైన్‌లో నిక్షిప్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి సాంకేతిక సాక్ష్యాలు కేంద్రం నుంచి రాష్ట్ర పోలీస్‌కు అందుతున్నాయి. పోలీస్ శాఖ దీన్ని జిల్లాల వారీగా విభజించి ఓ ఫైల్‌ను సిద్ధం చేస్తోంది. ఇందులో ప్రతి మూడు నెలలకోసారి ఈ అశ్లీల వీడియోలు షేర్ చేసే వారి వివరాలుంటాయి. గత నెల వరకు రాష్ట్రంలో 1,787 మంది ఈ నేరానికి పాల్పడ్డట్టు నివేదిక అందింది. అత్యధికంగా గుంటూరులో 330, విశాఖ 270, ఎన్టీఆర్ విజయవాడ 238, కడప 126, నెల్లూరు 102, ప్రకాశం 94, అనంతపురం 90, తిరుపతి 77, శ్రీకాకుళం 70, చిత్తూరు 59, కాకినాడ 56, ప.గో 50, కర్నూలు 49, బాపట్ల 44, కృష్ణా 30, విజయనగరం 25, నంద్యాల 14, ఏలూరు 14, పల్నాడు 12, కోనసీమ 11, అన్నమయ్య 10, సత్యసాయి 6, అనకాపల్లి 4, పార్వతీపురం 2, రాజమండ్రి 2, అల్లూరి సీతారామరాజు 2 మంది ఈ నేరాలకు పాల్పడ్డారు. కాగా, ఇప్పటివరకు 680 మందిపై కేసులు నమోదయ్యాయి. శిక్షలు కఠినతరం ఈ కేసుల్లో కఠిన శిక్షలు విధించేలా చట్టాల్లో మార్పులు చేశారు. సాక్ష్యాధారాలు న్యాయస్థానంలో రుజువైతే మొదటిసారి ఐదేళ్ల వరకు కఠిన కారాగార శిక్ష, రెండోసారి ఇదే తప్పు చేస్తే గరిష్టంగా ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 లక్షల వరకు జరిమానా విధించవచ్చని చట్టం చెబుతోంది. -
‘అట్టడుగు’కు చేరేలా అంతరాలు తగ్గేలా..
ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే ఆఫీసులో పనులు చక్కబెట్టుకోవచ్చు.. సంగీతం, సినిమాల వంటి వినోదమూ దొరుకుతుంది. మరి ఇంటర్నెట్ కారణంగా కూలీల జీవితాల్లో వెలుగులు నిండుతాయని, వారి ఆరోగ్యం బాగుపడుతుందని ఎంత మందికి తెలుసు? అట్టడుగు వర్గాల వారికి చదువు అవకాశాలతోపావారిజీవితాలు బాగుపడతాయనీఎందరికి తెలుసు? కొన్ని సంస్థలు, ప్రభుత్వాల కృషితో ఇంటర్నెట్ విషయంలో ధనికులు– పేదలు, విద్యావంతులు– అత్తెసరు చదువరుల మధ్యఇప్పుడు అంతరం తగ్గుతోంది! 2025 నాటికి ఇది మరింత తగ్గనుంది! ఇందుకు బాటలు వేస్తున్న ‘ఎడిసన్ అలయన్స్’గురించి ఈ ప్రత్యేక కథనం.. ప్రపంచ జనాభా సుమారు 800 కోట్లు! వీరిలో 270 కోట్ల మందికి ఇంటర్నెట్ అందుబాటులో లేదు. దీనికి కారణాలెన్నో. ఈ పరిస్థితిని మార్చేందుకు 2021లో ఓ పెద్ద ప్రయత్నమే మొదలైంది. అదే ‘ఎడిసన్ అలయన్స్ (ఎసెన్షియల్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వి సెస్ నెట్వర్క్ అలయన్స్’. 2025 నాటికి అదనంగా కనీసం వంద కోట్ల మందిని ఇంటర్నెట్ సూపర్ హైవేలోకి చేర్చాలన్నదే దీని లక్ష్యం. ఏదో వినోదం పంచేందుకు ఈ ప్రయత్నం జరగడం లేదు. ఆరోగ్యం, విద్య, ఆర్థిక సేవలు సమాజంలోని అట్టడుగు వర్గాల వారికీ చేరాలన్న ఉదాత్త లక్ష్యాన్ని ఈ అలయన్స్ తన భుజాలపైన వేసుకుంది. ఆరోగ్యం, విద్య, బ్యాంకింగ్, రుణాల వంటి ఆర్థిక సేవలు అందుబాటులోకి వస్తే వారి జీవితాలు మారిపోతాయని భావించింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలోని ఆసక్తికరమైన అంశం.. ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలూ భాగస్వాములు కావడం. పేద దేశాలు, లేదా డిజిటల్ సేవలు అందుబాటులో లేనివారికి వాటిని సులువుగా అందించడం, వాడుకునేందుకు అవసరమైన శిక్షణ ఇవ్వడం వంటివి ఈ కార్యక్రమంలో భాగంగా జరుగుతున్నాయి. సూటిగా చెప్పాలంటే ఇంటర్నెట్ సౌకర్యం చౌకగా అందించేందుకు, డిజిటల్ నైపుణ్యాలను నే ర్పించేందుకు, విద్య, వైద్యం అందించేందుకు జరుగుతున్న కృషి ఇది. రెండేళ్ల క్రితం మొదలైన ఎడిసన్ అలయన్స్ ఇప్పటివరకూ సాధించిందేమిటన్న దానిపై వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) ఇటీవలే ఒక నివేదికను విడుదల చేసింది. రానున్న రెండేళ్లలో సాధించాలనుకుంటున్న లక్ష్యాలను సమీక్షించింది. లక్ష్యంలో ఇప్పటికే సగం.. 2021 జనవరిలో ప్రారంభమైన ఎడిసన్ అలయన్స్ తన భాగస్వాముల సాయంతో ఇప్పటివరకు సుమారు 45.4 కోట్ల మంది జీవితాలపై సానుకూల ప్రభావం చూపిందని వరల్ఎకనమిక్ ఫోరమ్ విడుదల చేసిన తాజా నివేదిక తెలిపింది. మొత్తం 90 దేశాల్లో 250కిపైగా కార్యక్రమాలు మొదలయ్యాయి. 2021లో మొత్తం 140 కోట్ల మందికి బ్యాంక్ అకౌంట్ కానీ, రుణ వసతి గానీ లేకపోయింది. ఎడిసన్ అలయన్స్ కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటివరకూ కనీసం 28 కోట్ల మందికి ఈ–బ్యాంకింగ్, మొబైల్ వ్యాలెట్స్, ఎల్రక్టానిక్ చెల్లింపులు అందుబాటులోకి వచ్చాయి. అలాగే సుమారు తొమ్మిది కోట్ల మంది ఆరోగ్యాన్ని డిజిటల్ ఆరోగ్య సేవల రూపంలో పరిరక్షించడం సాధ్యమైంది. టెలిహెల్త్, టెలిమెడిసిన్ వంటి టెక్నాలజీల సాయంతో వేర్వేరు ఆరోగ్య సమస్యలకు చికిత్స అందిస్తున్నారు. విద్య విషయానికొస్తే 2021లో ప్రపంచవ్యాప్తంగా 24.4 కోట్ల మంది (ఆరు నుంచి 18 ఏళ్ల మధ్య వయస్కులు) పాఠశాలలకు దూరం కాగా.. ఎడిసన్ అలయన్స్ భాగస్వాములు ఆన్లైన్ విద్య, రిమోట్ లెర్నింగ్ సొల్యూషన్స్ సాయంతో కోటీ 18 లక్షల మందికి విద్యను అందుబాటులోకి తెచ్చారు. ఇందులో ఉద్యోగం చేసేందుకు అవసరమైన నైపుణ్యాలపైనా శిక్షణ ఇవ్వడం గమనార్హం. ఎంతమందికి.. ఏయే రకంగా? ఎడిసన్ అలయన్స్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి డిజిటల్ టెక్నాలజీ లాభాలు అందాయనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. డిజిటల్ రంగం మౌలిక సదుపాయాల కల్పనకు పెట్టిన ఖర్చుతోనే 6.4 కోట్ల మందికి లబ్ధి చేకూరిందని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ నివేదిక చెబుతోంది. అయితే 250 మంది భాగస్వాముల్లో మూడొంతుల మంది ఆన్లైన్ విద్యపై దృష్టిపెట్టినా దీనివల్ల బాగుపడిన వారి సంఖ్య కొంచెం తక్కువగానే ఉంది. నాణ్యమైన ఆన్లైన్ విద్యకు అవసరమైన వనరులు లేకపోవడం దీనికి కారణంగా చెప్తున్నారు. మొబైల్ బ్రాడ్‌బ్యాండ్, ఇంటర్నెట్ ఆధారిత పరికరాలు, ఆన్లైన్ సర్వి సుల ఖర్చులు తగ్గడం 12.8 కోట్ల మందికి ఉపయోగపడింది. దాదాపు 27 కోట్ల మందికి కనెక్టివిటీ లేదా డిజిటల్ సేవలు లభించడం మొదలైంది. ముందున్న సవాళ్లు.. ఇంకో మూడేళ్లలో 55 కోట్ల మందికి డిజిటల్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ఎడిసన్ అలయన్స్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగస్వాములు కావాల్సిందిగా మరిన్ని కంపెనీలను ఆహా్వనిస్తోంది. ప్రస్తుత భాగస్వాముల్లో కేవలం 12 శాతం మంది మాత్రమే 50 శాతం మేర లక్ష్యాన్ని అందుకోవడంపై అలయన్స్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. సగం మంది భాగస్వాములు లక్ష్యంలో 20 శాతాన్ని మాత్రమే చేరుకోవడంపై అసంతృప్తిగా ఉంది. వచ్చే రెండేళ్లలో పాత, కొత్త భాగస్వాములు వేగంగా లక్ష్యాల సాధనకు పూనుకోవాలని కోరింది. పర్వత ప్రాంతాలకు అపోలో ఆరోగ్య సేవలు ప్రఖ్యాత వైద్యసేవల సంస్థ అపోలో హాస్పిటల్స్, అపోలో టెలిహెల్త్ సర్వి సులను ఎడిసన్ అలయన్స్‌లో భాగంగా హిమాచల్ ప్రదేశ్ వంటి పర్వత ప్రాంతాల్లో అందిస్తోంది. ఆ రాష్ట్రంలో వైద్యసేవలు, నిపుణుల కొరత ఎక్కువగా ఉండటంతో.. ఆ సమస్యను అధిగమించేందుకు డిజిటల్ టెక్నాలజీల సాయం తీసుకుంటున్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి నాలుగు కీలక ప్రాంతాల్లో టెలిమెడిసిన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. 2021 జూలై నాటికి 22,727 టెలికన్సల్టేషన్లు అందించారు. 1,300కుపైగా ఎమర్జెన్సీ కేసులను డిజిటల్ పద్ధతిలోనే ఎదుర్కొని పరిస్థితిని చక్కదిద్దారు. టెలి డిస్పెన్సరీల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉండటం ఒక విశేషమైతే.. రక్తహీనత, అసాంక్రమిక వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు 4,000 మందితో విస్తృత ప్రయత్నం జరుగుతుండటం ఇంకో విశేషం. ‘‘ఎడిసన్ అలయన్స్‌లో భాగస్వామి అయిన మేం మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఐదు డిజిటల్ డిస్పెన్సరీలు ప్రారంభించాం. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నాం. వ్యాధుల నివారణ, నిర్దిష్ట సమస్యలపై టెలికన్సల్టేషన్ సర్వి సులు కూడా అందిస్తున్నాం’’అని అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్ శోభన కామినేని చెప్పారు. అగ్రరాజ్యంలో వెరిజాన్ సేవలు అమెరికా టెక్ దిగ్గజ సంస్థ వెరిజాన్ ఆ దేశంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ లేని విద్యార్థులకు ఎడిసన్ అలయన్స్‌లో భాగంగా కనెక్షన్లు అందించే ప్రయత్నం చేస్తోంది. అమెరికాలో లక్షల మంది విద్యార్థులకు ఇంటర్నెట్ కనెక్టివిటీ అందుబాటులో లేదని.. ఈ కాలపు డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు తగ్గట్టుగా నైపుణ్యాలు లేక విద్యార్థులు నష్టపోతున్నారని వెరిజాన్ గుర్తించింది. దీనిని అధిగమించేందుకు వెరిజాన్ ఇన్నోవేటివ్ లెర్నింగ్ సాయంతో స్కూల్ డిస్ట్రిక్స్‌లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. ఉపాధ్యాయులు, విద్యార్థులకు కూడా టెక్నాలజీ వినియోగంలో శిక్షణ ఇస్తోంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ (స్టెమ్) రంగాలకు సంబంధించిన శిక్షణ కూడా ఇచ్చే ప్రయత్నాలు చేస్తోంది. 2021–22లో ఆ దేశవ్యాప్తంగా సుమారు 500 పాఠశాల్లో 6.5 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందారని అంచనా. ఈ కార్యక్రమం కోసం వెరిజాన్ వందకోట్ల డాలర్లకుపైగా ఖర్చు పెడుతోంది. - కంచర్ల యాదగిరిరెడ్డి -
భారత్‌లో సైబర్ భద్రత, గోప్యత బలహీనం
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ ఆవిష్కరణలు, వాటిని ఉపయోగించుకోవడంలో భారత్ ఎంతో మెరుగైన స్థానంలో ఉన్నట్టు ఐసీఆర్ఐఈఆర్ విడుదల చేసిన భారత డిజిటల్ ఎకనామీ నివేదిక తెలిపింది. కానీ, సైబర్ భ్రదత, గోప్యత విషయంలో భారత్ ఇంకా ఎంతో మెరుగుపడాల్సి ఉన్నట్టు పేర్కొంది. ప్రత్యేకంగా సైబర్ భద్రత చట్టం లేకపోవడం వల్ల, భారతీయులు ఆయా రంగాల నిబంధనలపైనే ఆధారపడాల్సి వస్తోందని పేర్కొంది. అసాధారణ స్థాయిలో డిజిటల్ పరివర్తన చూపిస్తున్న భారత్‌లో, సైబర్ భద్రత బలహీనంగా ఉన్నట్టు అభిప్రాయడింది. భారత్‌లో ఆవిష్కరణలు, డిజిటల్ సేవల సామర్థ్యాలను వినియోగించుకునే తీరుపై ఈ నివేదిక దృష్టి పెట్టింది. ఇంటరెŠన్ట్‌ను ఉపయోగించుకుని, వృద్ధి చెందడం, ఉపాధి కల్పన, పరిపానాల మెరుగుదల అంశాలు ఏ విధంగా ఉన్నాయన్నది విశ్లేషించింది. ‘‘జీ20లోని తోటి దేశాలతో పోలిస్తే తక్కువ మధ్యాదాయం కలిగిన దేశం భారత్. కానీ, ఆవిష్కరణల్లో మాత్రం భారత్ ఎంతో ఉన్నత స్థానంలో ఉంది. భారతీయులు త్వరితగతిన డిజిటల్ సేవలను వినియోగించుకోవడం తదుపరి వృద్ధిని వేగవంతం చేస్తుంది’’అని ఈ నివేదిక వివరించింది. సైబర్ నేరాలు, గోప్యతపై దాడి ఈ రెండు అంశాలపై భారత్ అత్యవసరంగా దృష్టి సారించాల్సి ఉందని సూచించింది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు ద్వారా ఈ అంశాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం పనిచేస్తున్నట్టు తెలిపింది. సైబర్ దాడుల నుంచి డిజిటల్ ఆర్థిక వ్యవస్థను రక్షించుకునేందుకు భారత్ ఎంతో చేయాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది. భారత్‌లో డిజిటైజేషన్ పెద్ద ఎత్తున జరుగుతున్నప్పటికీ.. సైబర్ భద్రత కవచాలు ఏర్పాటు చేసుకోవడంలో మోస్తరు పురోగతినే చూపించినట్టు స్పష్టం చేసింది. -
డిజిటల్ కూడలిలో మహిళ
వందన డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఇంటా బయట చురుగ్గా ఉండే వందన వారం రోజులుగా ఇంటి గడప దాటి కాలు బయట పెట్టలేకపోతోంది. కారణం, తన వ్యక్తిగత ఫొటోలు, వీడియో క్లిప్పింగ్స్ ఒక సైట్లో కనపడటం ఆమెను కలవరపరుస్తోంది. వ్యక్తిగత పరువుకు సంబంధించిన విషయాలు బయటకు రావడం ఆమెను తీవ్ర మనో వేదనకు గురి చేస్తోంది. ఈ విషయాలను ఇంట్లోవారితో పంచుకోలేక, స్నేహితులతో చెప్పలేక ఇబ్బంది పడుతూ ఎటూ తేల్చుకోలేక ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. రకరకాల డిజిటల్ సమస్యలను ఎదుర్కొనే యువతుల సంఖ్య ఇటీవల విపరీతంగా పెరుగుతోంది. ఇటీవల కాలంలో మహిళల అవకాశాలు ఇంటర్నెట్ ద్వారా విస్తృతమయ్యాయి. ఉపా ధి అవకాశాలను పెంచుకోవడానికి, అదనపు ఆదాయాన్ని సంపా దించడానికి, జ్ఞానాన్ని, ఆర్థికవృద్ధిని, మరింత సమగ్రమైన డిజిటల్ ప్రపంచాన్ని సృష్టించడానికి వీలు కల్పిస్తుంది. అయితే, సైబర్ శాఖ ఆన్లైన్లో పెరుగుతున్న మహిళా ప్రయోజనాలనే కాదు, వారికి సమస్యగా మారే అంశాలను కూడా పరిశీలిస్తుంది. మహిళలు ఆన్ లైన్ లో తమ సురక్షిత ప్రయాణం సాగించడానికి డిజిటల్ భద్రత తెలుసుకోవడం అత్యవసరం. డిజిటల్ నేరాలలో ప్రధానమైనవి.. డాక్సింగ్ : ఇది ఒక వ్యక్తి లేదా సంస్థకు సంబంధించిన గతంలోని వ్యక్తిగత సమాచారాన్ని డిజిటల్ మాధ్యమం ద్వారా బహిర్గతం చేసే చర్య. మోసగాళ్లు సాధారణంగా పబ్లిక్‌గా అందుబాటులో ఉన్న డేటాబేస్లు, గత సోషల్ మీడియా పోస్టింగ్‌లు, సోషల్ ఇంజనీరింగ్ నుండి సమాచారాన్నిపొంది, ఆన్ లైన్ షేమింగ్ లేదా దోపిడీకి దారితీయవచ్చు. సైబర్‌స్టాకింగ్: ఇది ఎలక్ట్రానిక్ మార్గాలను ఉపయోగించి ఒక వ్యక్తిని పదేపదే ట్రాక్ చేయడం. ఉదాహరణకు: అసందర్భంగా ఫోన్ కాల్స్ చేయడం, వాయిస్ సందేశాలు లేదా మెసేజ్‌లు చేయడం, గూఢచర్యం లేదా సోషల్ మీడియా కార్యకలాపా లను పర్యవేక్షించడం లేదా ఇంటర్నెట్లో తగని సమాచారాన్ని పోస్ట్ చేస్తామని బెదిరించడం.. వంటి సైబర్‌స్టాకింగ్ శారీరక, మానసిక క్షోభకు దారితీయవచ్చు. స్వాటింగ్: ఇది పోలీసులను రెచ్చగొట్టడానికి, మనల్ని మోసం చేయడానికి అత్యవసర ఫోన్ కాల్స్ చేయడం వంటి చర్య. ఇది సైబర్ దోపిడీకి ఒక రూపం. దీని ద్వారా వ్యక్తులు లైంగిక ప్రయోజనాలనుపొందాలని చూస్తారు. లైంగిక వేధింపులు వ్యక్తిగత, సన్నిహిత ఫొటోల పంపిణీకి దారితీయవచ్చు. రివెంజ్ పోర్న్: అసభ్యకరమైన చిత్రాలు లేదా వీడియోలను ఆన్ లైన్ లో అప్లోడ్ చేసి వేధిస్తారు. ఏ మాత్రం మన అనుమతి లేకుండా ఆన్లైన్లో షేర్ అవుతుంటాయి. ఇవి ఎక్కువగా బాధితురాలి మాజీ జీవిత భాగస్వామి లేదా బాయ్‌ఫ్రెండ్ ద్వారా జరిగేవి ఉంటాయి. లైంగిక వేధింపులు: తెలియకనో లేక ఏదైనా భావోద్వేగ సమయంలోనో లైంగిక అనుకూల రిక్వెస్ట్‌లకు అనుమతి ఇస్తుంటారు. అంటే, ఫొటోలు, కంటెంట్, జోక్స్, మరొక స్త్రీ ద్వేషానికి సంబంధించినవి అయి ఉండవచ్చు. ఇవి ఒకరి ప్రతిష్ఠకు హాని కలిగించే వాస్తవాలు. ఉదాహరణకు.. ‘దొంగ, అబద్ధాలకోరు లేదా అనైతిక ప్రవర్తన’.. వంటివి. వంచన: మోసగాళ్లు మీలా నటిస్తూ నకిలీ ఖాతాను సృష్టిస్తారు. మీ సోషల్ మీడియా పరిచయాల నుండి డబ్బు అడుగుతారు, ఇది బాధితు లను వేధించడానికి ఇతరులకు ్రపోత్సాహకంగా కూడా ఉపయోగపడుతుంది. ద్వేషపూరిత ప్రసంగాల ద్వారా రెచ్చగొట్టడం, జాతి విద్వేషాన్ని ్రపోత్సహించడం లేదా సమర్థించడం, రాజకీయ, కార్పొరేట్ లేదా పోటీదారుల పోటీలో పా ల్గొనడం వంటివి ఉంటాయి. సేఫ్టీ చిట్కాలు: సమస్యలు వస్తాయని ఎవరూ తమ ప్రయోజనాలను వదులుకోరు. అయితే, బయట మన క్షేమం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో, ఆన్లైన్ బజార్లోనూ అంతే భద్రంగా ఉండటం ముఖ్యం. ► HTTPS:// (ప్యాడ్‌లాక్ సింబల్) ఉన్న వెబ్సైట్లను మాత్రమే బ్రౌజ్ చేయండి. ► పెద్ద అక్షరాలు, సంఖ్యలు, ప్రత్యేక అక్షరాలను కలిగి ఉన్న సంక్లిష్ట పా స్వర్డ్ను ఉపయో గించండి. ► అన్ని సామాజిక, ఇ–మెయిల్, బ్యాంకింగ్ లాగిన్ ల (2ఊఅ) కోసం రెండు–దశల ప్రమాణీకరణను పా టించండి. ► ఎస్సెమ్మెస్, వాట్సప్, సోషల్ మీడియా మెసెంజర్ల ద్వారా వచ్చిన చిన్న లింక్‌లను ఎప్పుడూ క్లిక్ చేయవద్దు. ► సామాజిక మాధ్యమాలలో ఫొటోలను చూస్తున్నప్పుడు లేదా అప్లోడ్ చేస్తున్నప్పుడు మీ లొకేషన్ స్టేటస్‌ను స్టాప్ చేయండి. ► ఎండ్–టు–ఎండ్ ఎన్ క్రిప్షన్ మెసెంజర్లను మాత్రమే ఉపయోగించండి. ► అన్ని సోషల్ మీడియా, మెసెంజర్, ఇ– మెయిల్ అప్లికేషన్ ల కోసం ప్రైవసీ సెట్టింగ్స్‌ను సెట్ చేయండి. ► సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో (ఆర్థిక, లాగిన్ ఆధారాలు, సంస్థ, వ్యక్తిగత సమాచారం... వంటి) సెన్సిటివ్ సమాచారాన్ని పంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ► నిజమైన, తెలిసిన వ్యక్తులతో మాత్రమే కనెక్ట్ అవ్వండి. ప్రత్యామ్నాయంగా, గోప్యతా సెట్టింగ్‌లను ఉపయోగించి మీరు మీ ప్రొ ఫైల్‌లను లాక్ చేయడాన్ని ఎంచుకోవచ్చు. ► ఆఫ్‌లైన్, ఆన్ లైన్ పరస్పర చర్యలలో సమ్మతిని ఒకే విధంగా పరిగణించాలి. ► మీ వెబ్‌క్యామ్‌ను ఎప్పుడూ ప్లగ్ ఇన్ చేసి ఉంచవద్దు. ► యాంటీ–వైరస్, యాంటీ–మాల్వేర్ సాఫ్ట్వేర్లతో మీ స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్‌లను సురక్షితం చేయండి. ► ఇది సురక్షితమైన నెట్వర్క్ అని మీరు నిర్ధారించుకునే వరకు పబ్లిక్ వై ఫైని ఎప్పుడూ యాక్సెస్ చేయవద్దు. ► ప్రసిద్ధ మూలాధారాల నుండి మాత్రమే యాప్‌లను డౌన్ లోడ్ చేయండి (ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ వంటివి). సైబర్ టాక్ ఆన్లైన్లో మహిళా భద్రతకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చే సైట్స్.. https://securityinabox.org/en/ https://exposingtheinvisible.org/resources/# filter=.watching-out-yourself https://ssd.eff.org/ https://hackblossom.org/cybersecurity/ https://www.accessn మీరు సైబర్ క్రైమ్‌కు గురైతే జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ https://www.cybercrime.gov.in/ కు లాగిన్ చేసి, ఫిర్యాదును ఫైల్ చేయండి. నేషనల్ టోల్ ఫ్రీ నంబర్ 1930 కి ఫోన్ చేసి, సహాయంపొందవచ్చు. - ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
వచ్చేస్తుంది వెబ్ 3.0.. 2023 చివరికల్లా తుదిరూపం..! ఏం జరగబోతోంది?
దొడ్డ శ్రీనివాస్‌రెడ్డి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ (వరల్డ్ వైడ్ వెబ్) ఇంటర్నెట్ ప్రపంచానికి గుర్తింపు కార్డు. వెబ్ మొదలైనప్పటికీ ఇప్పటికీ పోలికే లేనంతగా మారిపోయింది. చదవడానికి, రాయడానికి, సమాచారాన్ని పంచుకోవడానికి వేదిక అయిన ఈ వెబ్ త్వరలో మరో అవతారం ఎత్తబోతోంది. మరింత స్వేచ్ఛాయుతంగా, ఆంక్షలులేని, అనుమతులు అవసరంలేని సరికొత్త వెబ్ ఆవిష్కృతం కాబోతోంది. వెబ్ పరిణామ క్రమాన్ని మూడు అంచెలుగా చెప్తున్నారు. తొలినాటి వెబ్‌ను వెబ్ 1.0గా, ప్రస్తుతం నడుస్తున్నదాన్ని వెబ్ 2.0గా రాబోయేదానిని వెబ్ 3.0గా పిలుస్తున్నారు. దీనిని సినిమాలతో పోలిస్తే.. వెబ్ 1.0 అంటే బ్లాక్ అండ్ వైట్ సినిమా అయితే వెబ్ 2.0 రంగుల చిత్రం, అదే వెబ్ 3.0 ఏకంగా త్రీడీ సినిమా అనుకోవచ్చు. మరి వెబ్ పుట్టు పూర్వోత్తరాలు, దాని పరిణామం, రాబోయే రోజుల్లో ఏ విధంగా మారబోతున్నదో తెలుసుకుందాం. వెబ్ 3.0 సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి నిరంతరంగా సాగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే వెబ్ 3.0 తెరపైకి వస్తోంది. ఇది ఎప్పుడు మొదలవుతుందో కచ్చితంగా చెప్పలేకున్నా.. ప్రస్తుత పరిణామాల ఆధారంగా 2023 చివరికల్లా వెబ్ 3.0 ఒక రూపుదాల్చుతుందని సాంకేతిక పరిజ్ఞాన నిపుణుల అంచనా. ఎవరి నియంత్రణ అవసరం లేకుండా బ్లాక్‌చైన్ టెక్నాలజీ ఆధారంగా రూపొందిన క్రిప్టోకరెన్సీలే వెబ్ 3.0కు తొలి అడుగుగా వారు చెప్తున్నారు. గత వెబ్ వెర్షన్లకు రాబోయే 3.0కు ఉన్న ప్రాథమిక వ్యత్యాసం ఏమిటంటే.. రాబోయేది నియంత్రణలు లేని స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేయడమే. వెబ్ 3.0 మౌలిక నిర్మాణంలో పెద్దగా మార్పు లేకపోయినా.. నూతన సాంకేతిక పరిజ్ఞానాల కారణంగా దీని స్వభావాలు సమూలంగా మారబోతున్నాయి. ప్రస్తుతం వెబ్ వివిధ కంపెనీల నియంత్రణలో నడుస్తుండగా.. వెబ్ 3.0 పూర్తి స్వేచ్ఛా వాతావరణంలో పనిచేయబోతోంది. దీనికోసం బ్లాక్ చైన్ టెక్నాలజీతోపాటు కృత్రిమ మేధ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెషీన్ లెర్నింగ్ వంటి టెక్నాలజీలు వెబ్‌కు జత అవుతున్నాయి. ప్రస్తుతం ఒకటి లేదా రెండు సర్వర్ల ఆధారంగా ఇంటర్నెట్ సమాచార మార్పిడి జరుగుతోంది. వీటిపై కార్పొరేషన్లు, ప్రభుత్వాల నియంత్రణ ఉంటోంది. సమాచార మార్పిడి ఐపీ అడ్రస్‌ల ఆధారంగా జరుగుతోంది. వీటికి అనుమతించడం, నియంత్రించడం ఆయా సర్వర్లపై పెత్తనం ఉన్న కంపెనీలు, ప్రభుత్వాలకే ఉంది. రాబోయే వెబ్ 3.0 సరికొత్త ఈ నియంత్రణలకు లొంగకుండా పనిచేస్తుంది. కంపెనీలు, ప్రభుత్వాల ఆధారంగా కాకుండా వినియోగించే వారి నియంత్రణలో పనిచేసే విధంగా ఉంటుంది. యూజర్ కోరే సమాచారాన్ని కృత్రిమమేధ ద్వారా ప్రపంచంలో ఏ సర్వర్‌లో ఉన్నా తీసుకునే హక్కు రాబోతోంది. వెబ్ 1.0 యూరప్ పరిశోధన సంస్థ ‘సెర్న్’లో కంప్యూటర్ సైంటిస్టుగా పనిచేసిన బెర్నర్స్‌లీ 1990లో వెబ్‌ను రూపొందించారు. వెబ్‌కు అవసరమైన ప్రాథమిక సాంకేతిక పరిజ్ఞానమైన హెచ్‌టీఎంఎల్, యూఆర్ఎల్, హెచ్టీటీపీల రూపకర్త బెర్నర్స్‌లీ. తొలి వెబ్‌పేజీని కూడా ఆయనే ఆవిష్కరించారు. తొంబై దశకం మొత్తంగా సాగిన ఈ తొలినాటి వెబ్‌లో కేవలం ఒక కంప్యూటర్ నుంచి మరో కంప్యూటర్‌కు వెబ్ పేజీల ద్వారా సమాచారం పంపడానికి మాత్రమే వీలయ్యేది. నెట్‌స్కేప్ వంటి వెబ్బ్రౌజర్ల ద్వారా ఈ–మెయిల్స్ పంపుకొనేవారు. ఇంటర్నెట్లో చాలా పరిమితంగా సమాచారం అందుబాటులో ఉండేది. రీడ్ఓన్లీగా పిలిచే ఈ వెబ్ 1.0 దాదాపుగా 1990లో మొదలై 2004 వరకు సాగింది. వెబ్ 1.0 చివరి రోజుల్లో క్రమంగా రూపాంతరం చెందుతూ వెబ్ 2.0 ఆవిర్భావానికి బాటలు వేసింది. వెబ్ 2.0 ప్రస్తుతం మనకు సుపరిచయమైన వెబ్ వెర్షన్ ఇది. తొలినాటి వెబ్‌కు ఏమాత్రం పోలికలేని స్థాయిలో మార్పు చెంది వెబ్ 2.0గా రూపుదాల్చింది. స్థిరమైన వెబ్ నుంచి అత్యంత వేగవంతమైన క్రియాశీల అప్లికేషన్‌గా అవతరించింది. చదవడానికి పరిమితమైన వెబ్‌పేజీల నుంచి చదవడం, రాయడం, పరస్పరం సంభాషించుకోగలడం వంటివాటికి వేదికైంది. అపార జ్ఞాన సంపదకు భాండాగారంగా మారింది. సోషల్ మీడియా నుంచి డిజిటల్ కరెన్సీ వరకు అన్ని రంగాలను ప్రభావితం చేసింది. యూట్యూబ్, ఫేస్బుక్, ఫ్లిక్కర్, ఇన్‌స్ట్రాగామ్, ట్విట్టర్ వంటి అనేకానేక సోషల్ మీడియా వెబ్సైట్లకు వెబ్ 2.0 పునాది అయింది. సమస్త సమాచారాన్ని ముంగిటకు తెచ్చి.. ప్రపంచ ప్రజల జీవనశైలినే మార్చేసింది. ఆన్లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం వంటి అనేక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. క్రిప్టోకరెన్సీ వంటి డిజిటల్ కరెన్సీ చలామణీలోకి రావడానికి కూడా వెబ్ 2.0 తోడ్పడింది. వినోద రంగంలో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ లాంటి వేల ఓటీటీ చానెల్స్, స్ట్రీమింగ్ సైట్ల పుట్టుకకు ఆస్కారం కల్పించింది. వెబ్ సాంకేతిక పరిజ్ఞానాలైన హెచ్‌టీఎంఎల్5, సీఎస్ఎస్3, జావా స్క్రిప్ట్ ఆధారంగా రోజురోజుకు కొత్త ఆవిష్కరణలతో గూగుల్, ఫేస్బుక్, అమెజాన్ వంటి వందల కోట్ల డాలర్ల వ్యాపార సామ్రాజ్యాల సృష్టిని సాకారం చేసింది. ఇప్పుడు బ్లాక్ చైన్ టెక్నాలజీతో 2.0 మరో అవతారం ఎత్తడానికి సమాయత్తం అవుతోంది. కచ్చితత్వం దిశగా.. ఈ సరికొత్త సాంకేతికత వల్ల వినియోగదారుడికి కచ్చితమైన సమాచారం అందే అవకాశాలు పెరగనున్నాయి. యూజర్ ఏదైనా సమాచారం కొరితే.. ప్రస్తుతం దానికి సంబంధించిన ప్రత్యక్ష, పరోక్ష అంశాలన్నీ అందుబాటులోకి వస్తున్నాయి. ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో నిర్ణయించుకునే ఆస్కారం లేకుండాపోతోంది. ఇక మీద ఏదైనా సమాచారం కోరినప్పుడు వెబ్ 3.0లోని కంప్యూటర్ సమాచారం కోరిన నేపథ్యాన్ని కూడా అర్థం చేసుకుని, వాస్తవికతను జోడించి అవసరమైన మేరకే కచ్చితమైన సమాచారాన్ని అందించగలుగుతుంది. ఇక ముందు కంపెనీలన్నీ ఈ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాలను పొందుపర్చగల కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, ఇతర ఉత్పత్తులను తీసుకురానున్నాయి. ఈ పరిజ్ఞానం ఆధారంగా పనిచేయబోయే యాప్‌లను కూడా డీయాప్స్ (డీసెంట్రలైజ్డ్ యాప్స్)గా పిలవబోతున్నారు. ఏం జరగబోతోంది? ►వెబ్ 3.0 యుగంలో మనకు నియంత్రిత సమాచారం నుంచి విముక్తి లభిస్తుంది. కోరుకున్న సమాచారం కచ్చితత్వంతో, ఎవరి ప్రమేయానికి లోనవకుండా అందుబాటులోకి వస్తుంది. మన వ్యక్తిగత వివరాలపై ఎవరి నియంత్రణ ఉండబోదు. విస్తృతమైన డేటా బేస్ ఉన్న ఫేస్బుక్, గూగుల్ వంటి కంపెనీలు ఇకముందు ఆ డాటాబేస్‌పై నియంత్రణ కోల్పోతాయి. ►కొత్త వెబ్‌లోని సమాచారంపై ప్రభుత్వాలు, పోలీసు వ్యవస్థలకు నియంత్రణ సాధ్యం కాదు. ప్రభుత్వ సెన్సార్షిప్లు పనిచేయవు. ఇప్పటికే సైబర్ క్రైంను అదుపు చేయడానికి అష్టకష్టాలు పడుతున్న పోలీసు వ్యవస్థకు దీనితో మరిన్ని కష్టాలు వచ్చే అవకాశముంది. ►డిజిటల్ సమాచారానికి సంబంధించిన ఆయా దేశాల చట్టాలను అమలు చేయడం కూడా సాధ్యం కాదు. ఇదివరకు కొన్ని సర్వర్ల ద్వారా సమాచార మార్పిడి జరిగేది. వాటి నియంత్రణ ద్వారా ప్రభుత్వాలు, పోలీసులు, కోర్టులు చట్టాలను అమలు చేయగలిగేవి. కొత్త వెబ్‌లో సమాచారం అనేక కేంద్రాల నుంచి లభించడం వల్ల.. దానిపై పెత్తనం అసాధ్యంగా మారబోతోంది. మారబోయే సరికొత్త సాంకేతిక వాతావరణంలో ప్రభుత్వాలు, చట్టాలను అమలు చేసే వ్యవస్థలు తమ పంథా మార్చుకోవలసిన పరిస్థితి రానుంది. -
‘పబ్లిక్ వైఫై’ వాడుతున్నారా? అయితే జర జాగ్రత్త..!
సాక్షి, హైదరాబాద్: ఇప్పుడంతా ఇంటర్నెట్ జమానా...నెట్‌తో కనెక్ట్ కాకుండా క్షణం ఉండలేని పరిస్థితి. ఆన్లైన్ షాపింగ్ మొదలు..ఆఫీస్‌కు ఇన్ఫర్మేషన్ పంపే వరకు ఎప్పుడైనా ఎక్కడైనా..ఇంటర్నెట్ సదుపాయం తప్పనిసరి. కొన్ని సార్లు ప్రయాణంలో ఉన్నప్పుడు, బయట అనుకోని పరిస్థితుల్లో మన ఫోన్లో నెట్ బ్యాలెన్స్ లేనప్పుడు ఫ్రీ వైఫైల వైపు చూడడం పరిపాటే.. అయితే ఇకపై పబ్లిక్ వైఫైలు వాడుతున్నట్లయితే జాగ్రత్తగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు. పబ్లిక్ ప్రదేశాల్లో అందుబాటులో ఉండే వైఫై వినియోగించి మనం ఈ మెయిల్, ఇతర సోషల్ మీడియా ఖాతాలు ఓపెన్ చేయడం,, ఆన్లైన్ బ్యాంక్ లావాదేవీలు చేస్తే మనం నమోదు చేసే యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను సైబర్ నేరగాళ్లు మాల్వేర్ ద్వారా హ్యాక్ చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. పబ్లిక్ ప్రాంతాల్లోని వైఫై వాడినట్లయితే సైబర్ నేరగాళ్లు మన వ్యక్తిగత సమాచారం సైతం కొట్టేసే ప్రమాదం ఉంటుందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. వీలైనంత వరకు పబ్లిక్ వైఫై వాడకుండా ఉండాలని, తప్పనిసరి పరిస్థితుల్లో అయితే నమ్మదగిన వీపీఎన్(వర్చువల్ ప్రైవేటు నెట్వర్క్)ను ముందుగా ఇన్స్టాల్ చేసుకోవాలంటున్నారు. వీపీఎన్ ఉండడం వల్ల మన ఫోన్లోని సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా జాగ్రత్తపడొచ్చని సూచిస్తున్నారు.