యాక్ట్ ఫైబర్‌నెట్ కంపెనీ..నెట్‌వర్క్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ స్టార్టప్ అప్రెకామ్‌లో పెట్టుబడులు పెట్టినట్లు ప్రకటించింది. యాక్ట్ ఫైబర్‌నెట్ తమ కస్టమర్లకు అందిస్తున్న హోమ్ వై-ఫై సదుపాయాన్ని మరింత మెరుగుపరిచేందుకు, నెట్ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. అయితే ఈ డీల్ విలువ ఎంతనేది మాత్రం వెల్లడించలేదు.
ఈ సందర్భంగా యాక్ట్ ఫైబర్‌నెట్ సీఈఓ బాల మల్లాది మాట్లాడుతూ..‘అప్రెకామ్ అధునాతన సాంకేతికతను యాక్ట్ ఫైబర్‌నెట్ వై-ఫై టెక్నాలజీకు అనుసంధానం చేయనున్నాం. ఇది వై-ఫై పనితీరులో వేగాన్ని పెంచుతుంది. రియల్‌టైమ్ నెట్‌వర్క్ విజిబిలిటీని అందిస్తుంది. ఇకపై కస్టమర్‌లకు మరింత ఉత్తమమైన నెట్ సేవలందుతాయి. అప్రెకామ్ తయారుచేసిన ఏఐ ఆధారిత సెల్ఫ్ ఆప్టిమైజింగ్ టెక్నాలజీ, అధునాతన వై-ఫై అనాలసిస్ కంపెనీ నెట్‌వర్క్‌ను నిరంతరం ఆప్టిమైజ్ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది’ అన్నారు.
బెంగళూరుకు చెందిన యాక్ట్ ఫైబర్‌నెట్ దేశంలోని అతిపెద్ద వైర్డ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్‌లలో ఒకటిగా ఉంది. ఈ సంస్థ 25 నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2.2 మిలియన్ కస్టమర్‌లకు సేవలు అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment