WiFi
-
విమానంలోనూ వైఫై
దేశీయ ప్రయాణం కోసం విమానం ఎక్కుతున్నామంటే మన మొబైల్ ఫోన్లో ఫ్లైట్ మోడ్ ఆన్ చేయాల్సిందే. నో సిగ్నల్స్.. నో ఇంటర్నెట్... సెల్‌ఫోన్‌ని మడిచి లోపల పెట్టుకోవాల్సిందే. ఇది ఒకప్పటి మాట. కానీ ఇకమీదట... విమానంలో ప్రయాణిస్తూ ఇంటర్నెట్ ద్వారా సినిమాలు చూడొచ్చు. మీ బంధువులు, స్నేహితులతో వీడియో కాల్స్ మాట్లాడొచ్చు. ఆఫీస్ పని చేసుకోవచ్చు. ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది ఎయిర్ ఇండియా.దేశీయ విమాన ప్రయాణికులకు కొత్త ఏడాదిలో సరికొత్త కానుక అందిస్తోంది ఎయిర్ ఇండియా. దేశంలోనే మొట్టమొదటిసారిగా.. తమ విమానాల్లో ప్రయాణించే దేశీయ ప్రయాణికులకు వైఫై ద్వారా జనవరి 1 నుంచి ఈ సేవలు అందుబాటులోకి తెచ్చింది. ప్రారంభ ఆఫర్లా ఈ సదుపాయాన్ని కొంతకాలం ఉచితంగా అందిస్తోంది. ప్రస్తుతానికి కొన్ని సర్వీసులకే పరిమితమైన ఈ సౌకర్యం త్వరలో ఎయిర్ ఇండియాలోని అన్ని విమానాల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తారట. ఒకరు ఒకే సమయంలో ఒకటికంటే ఎక్కువ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల వంటివాటితోనూ కనెక్ట్ కావొచ్చు. ఇప్పటికే ఎయిర్ఇండియా న్యూయార్క్, లండన్, పారిస్, సింగపూర్ వెళ్లే విదేశీ విమానాల్లో పైలట్ ప్రోగ్రామ్‌గా ఈ సదుపాయం అందిస్తోంది.ఎయిర్ ఇండియా వైఫై ఇలా..ఈ సౌకర్యం వినియోగించుకోవాలంటే ప్రయాణికులు వైఫై ఆన్ చేసి, సెటింగ్స్‌లో ‘ఎయిర్ ఇండియా వైఫై నెట్వర్క్’ ఎంపిక చేసుకోవాలి. ఎయిర్ ఇండియా పోర్టల్‌కు వెళ్లాక పీఎన్ఆర్ వంటి వివరాలు ఇవ్వాలి. ఆ తరవాత ఇంటర్నెట్ సేవలు వాడుకోవచ్చు.ఏయే విమానాల్లో..?అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ఎయిర్‌బస్ ఎ350, బోయింగ్ 787–9, ఎంపికచేసిన ఎ321 నియో నియో విమానాలువిమానంలో నెట్ ఎలా?భూమ్మీద నెట్ వాడాలంటే మన చేతిలో ఒక ఫోనో ల్యాప్‌టాపో ఉండి.. సమీపంలో సెల్ టవర్ ఉంటే సరిపోతుంది. కానీ విమానం అలా కాదు కదా. విమానాల్లో వైఫై ద్వారా ఇంటర్నెట్ రావాలంటే 2 రకాల పద్ధతులు ఉన్నాయి. మొదటిది.. భూమిపై ఉండే సెల్ టవర్లు. దీన్నే ఎయిర్ టు గ్రౌండ్ (ఏటీజీ) టెక్నాలజీ అంటారు. ఇక రెండోది శాటిలైట్ ఆధారిత కనెక్షన్. ఈ రెండూ పనిచేయాలంటే విమానం లోపలా, బయటా ప్రత్యేక యాంటెనాల వంటి కొన్ని పరికరాలు అమర్చాలి. వైఫై లేనప్పుడు మన సమీపంలో ఎవరికైనా నెట్ కావాలంటే ఏం చేస్తాం? మన దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్లో హాట్‌స్పాట్ ఆప్షన్ ఆన్ చేసి నెట్ ఇస్తాం. మన ఫోన్ మరొకరికి హాట్ స్పాట్‌లా ఎలా మారుతుందో.. యాంటెనాలూ, సర్వర్లు, రౌటర్ల వంటి వాటితో ఉన్న విమానం వందలాది మంది ప్రయాణికులకు ఒక హాట్ స్పాట్‌లా మారిపోతుంది.సెల్ టవర్ సిగ్నల్స్ఈ సిగ్నళ్లు అందుకోడానికి విమానం కింది లేదా అడుగు భాగంలో యాంటెనాలు ఏర్పాటు చేస్తారు. విమానం భూమి మీద బయలుదేరగానే ఆ యాంటెనాలు.. సమీపంలోని సెల్ టవర్ల నుంచి సిగ్నళ్లు అందుకుంటాయి. ఆ సిగ్నళ్లు క్యాబిన్ సర్వర్‌కు, అక్కడి నుంచి రౌటర్‌కు వెళ్తాయి. అక్కడి నుంచి ప్రయాణికులకు వెళ్లి ఇంటర్నెట్ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తాయి.శాటిలైట్ సిగ్నల్స్సెల్ టవర్ల ద్వారా సిగ్నల్ అందు తున్నంతసేపూ ఎలాంటి ఇబ్బందీ ఉండదు. సముద్రాలు, ఎడారి ప్రాంతాల వంటి వాటి పైనుంచి వెళ్లేటప్పుడు సెల్ టవర్ సిగ్నళ్లు అందవు. శాటిలైట్ సిగ్నళ్ల సాయం కావాల్సిందే. ఇందుకోసం విమానం పై భాగంలో యాంటెనా లు ఏర్పాటుచేస్తారు. అవి తమకు అత్యంత సమీపంలోని శాటిలైట్‌తో అనుసంధానమవుతాయి. ప్రయాణికుల ఫోన్లు, ల్యాప్‌టాపుల వంటివి విమాన క్యాబిన్లో ఉండే వైఫై యాంటెనాకు కనెక్ట్ అవుతాయి.ఆ పరికరాల నుంచి ఈ యాంటెనాలకు వచ్చే సిగ్నళ్లు విమానంలోని సర్వర్‌కు వెళ్తాయి. విమానం పైన ఉండే యాంటెనా ద్వారా ఆ సిగ్నళ్లు శాటిలైట్‌కు వెళతాయి. శాటిలైట్ వాటిని భూమిపై ఉండే స్టేషన్ లేదా టెలిపోర్టుకు పంపితే అక్కడి నుంచి తిరిగి సిగ్నళ్లు శాటిలైట్‌కు అందుతాయి. వాటిని విమానానికి పంపుతుంది శాటిలైట్. శాటిలైట్ సిగ్నళ్లు విమానంలోకి క్యాబిన్ సర్వర్‌కు, అక్కడి నుంచి రౌటర్‌కు వెళ్తాయి. అలా ప్రయాణికులు నెట్ వాడుకోవచ్చు.ఏటీజీ – శాటిలైట్ఏటీజీ ద్వారా ఇంటర్నెట్ అంటే చాలా పరిమితులు ఉంటాయి. అంతరాయాలు ఎక్కువ, స్పీడు కూడా తక్కువ ఉండొచ్చు. కానీ, శాటిలైట్ కనెక్షన్ ద్వారా ఇంటర్నెట్లో అంతరాయాలు తక్కువని, స్పీడు కూడా ఎక్కువని అంతర్జాతీయ విదేశీ ప్రయాణికుల అనుభవాలు చెప్తున్నాయి.2003లో మొదటిసారిగా...⇒ 2003 జనవరి 15న జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ మొట్టమొదటగా తమ అంతర్జాతీయ విమానంలో ప్రయాణికులకు ఇంటర్నెట్ అందించింది.⇒ దేశీయ విమాన ప్రయాణికులకు (2013లో) ఇంటర్నెట్ అందించిన మొదటి సంస్థ అమెరికాకు చెందిన జెట్ బ్లూ.⇒ ప్రపంచంలో ప్రస్తుతంవైఫై ద్వారా ఇంటర్నెట్ అందిస్తున్న కొన్ని విమానయాన సంస్థలు నార్వేజియన్ ఎయిర్‌లైన్స్, ఫిలిప్పీన్స్ ఎయిర్‌లైన్స్, ఫిజి ఎయిర్వేస్, జెట్ బ్లూ, ఎమిరేట్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్, ఖతార్ ఎయిర్వేస్, డెల్టా ఎయిర్వేస్, మొదలైనవి.‘ప్రయాణాల్లో ఇప్పుడు ‘కనెక్టివిటీ’ తప్పనిసరి అవసరమైపోయింది. కొంతమంది సరదాకోసం, షేరింగ్ కోసం ఇంటర్నెట్ వాడితే, మరికొందరు తమ వృత్తి, వ్యాపార అవసరాల కోసం వాడుతుంటారు. ఎయిర్ ఇండియా ఈ సదుపాయం తీసుకొచ్చి విమానాల్లో సరికొత్త ప్రయాణ అనుభూతి అందిస్తోంది. – ఎయిర్ ఇండియా చీఫ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ అధికారి రాజేష్ డోగ్రా -
సిమ్ కార్డు, వై-ఫై కనెక్షన్ లేకపోయినా మెసేజ్‌లు పంపాలా..?
మొబైల్లో సిమ్ లేకుండా మెసేజ్ చేయడం సాధ్యమవుతుందా..? ఎందుకు అవ్వదు.. వై-ఫై ద్వారా వీలవుతుంది కదా అంటారా. మరి వై-ఫై లేకపోయినా మెసేజ్చేసే అవకాశం ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఒకేవేళ మారుమూల ప్రదేశాలు, అడవులు, కొండలు, సముద్రాలు.. వంటి ప్రాంతాల్లో కూడా మన సమాచారాన్ని ఇతరులకు చేరేవేసే అవకాశం ఉంటే అదిరిపోతుంది కదా. ఇలాంటి కొత్త టెక్నాలజీను ప్రపంచ ప్రఖ్యాత సంస్థ యాపిల్ ప్రవేశపెడుతుంది. కాలిఫోర్నియాలోని సంస్థ ప్రధానకార్యాలయంలో జరుగుతున్న వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2024లో ఇలాంటి కొత్త ఫీచర్లను ఆవిష్కరిస్తుంది. ఈ ఏడాది చివరినాటికి విడుదలచేసే ఐఓఎస్ 18 వర్షన్లో ఈ ఫీచర్లను అందుబాటులో ఉంచనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.యాపిల్ ఐఫోన్లో శాటిలైట్ మెసేజింగ్ సామర్థ్యాలను విస్తరిస్తోంది. కొత్త iOS 18 వర్షన్ ద్వారా సాటిలైట్ సేవలను వినియోగించుకుని ఎమర్జెన్సీ మెసేజ్‌లను పంపించేలా ఏర్పాటు చేస్తున్నారు. సెల్యులార్, వై-ఫై కనెక్షన్లు అందుబాటులో లేనప్పుడు శాటిలైట్ ద్వారా సందేశాలు పంపే టెక్నాలజీను తీసుకొస్తున్నారు. ఇది ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ను కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. 2022లో విడుదల అయిన ఐఫోన్14తోపాటు దాని తర్వాత మార్కెట్లోకి వచ్చిన యాపిల్ ఫోన్లలో ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని చెప్పింది. ఈమేరకు ఆయా ఫోన్ల్లోని యాంటెన్నాలు ఉపగ్రహాల ప్రత్యేక ఫ్రిక్వెన్సీని చేరుకునేలా ఇప్పటికే హార్డ్‌వేర్ సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. అందుకు అనువుగా నిర్దిష్ట సాప్ట్వేర్, అల్గారిథమ్‌లను రూపొందించినట్లు యాపిల్ పేర్కొంది. ఈ కొత్త ఫీచర్‌తో ఐఫోన్ వినియోగదారులు ఐమెసేజ్, ఎస్ఎంఎస్ల ద్వారా టెక్స్ట్‌లు, ఎమోజీలు పంపవచ్చని వివరించింది.ఇదీ చదవండి: విదేశాలకు వెళ్తున్నారా..? ప్రయాణబీమా తీసుకున్నారా..?యాపిల్ శాటిలైట్ కనెక్టివిటీ కాంపోనెంట్ కోసం అమెరికాకు చెందిన గ్లోబల్‌స్టార్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. గ్లోబల్‌స్టార్ సంస్థ స్పేస్టెక్నాలజీ అందిస్తున్న ఎండీఏతో ఈమేరకు ఒప్పందం చేసుకుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. -
మొబైల్లో ఆర్డర్‌చేసి కిచెన్‌లోకి వెళితే వంట రెడీ!
వై-ఫైతో అనుసంధానమయ్యే గ్యాడ్జెట్లు మన హాల్ నుంచి తిన్నగా వంట గదిలోకి ప్రవేశిస్తున్నాయి. ఎలాగంటారా.. కిచెన్‌లోనూ స్మార్ట్ పరికరాల సంఖ్య పెరుగుతోంది. హాల్లో ఎక్కువగా స్మార్ట్ టీవీ, స్మార్ట్ హోం థియేటర్, స్మార్ట్ ఫ్యాన్, సెన్సార్ డోర్లు.. వంటి పరికరాలు వాడుతుంటాం. మరి కిచెన్‌లోనూ వై-ఫైతో అనుసంధానమయ్యే ఏఐ పరికరాలు వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. కరెంట్ లేకపోయినా ఇండక్షన్ కుకర్ పనిచేస్తే.. మనకేం కావాలో మొబైల్లో ఆర్డర్ పెట్టి కిచెన్‌లోకి వెళితే వంట సిద్ధంగా ఉంటే.. మైక్రోఓవెన్లో పెట్టే పదార్థాలు ఎంత సమయంలో వేడి అవుతాయో ముందుగానే తెలిస్తే.. ఊహించుకుంటేనే ఆహా అనిపిస్తుంది కదా. ఇటీవల సీయాటెల్లో జరిగిన స్మార్ట్ కిచెన్ సమ్మిట్(ఎస్కేఎస్)లో కంపెనీలు ఇలాంటి పరికరాలనే ప్రదర్శించాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.మొబైల్లో ఆర్డర్‌పెట్టి కిచెన్‌లోకి వెళితే..స్మార్ట్ కిచెన్ సమ్మిట్‌లో చెఫీ అనే కంపెనీ కొత్తరకం పరికరాన్ని పరిచయం చేసింది. కంపెనీకు చెందిన యాప్‌లో మనకు కావాల్సిన వంటను ఆర్డర్‌పెట్టి కాసేపయ్యాక కిచెన్‌లోకి వెళితే ఆ వంట సిద్ధంగా ఉంటుంది. ఎలాగంటారా.. కిచెన్‌లో వంటచేసే స్మార్ట్ పరికరాన్ని ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలి. అందులో వంటకు కావాల్సిన కూరగాయలు, పప్పులు, ఇతర ధాన్యాలు, బియ్యం..వంటివాటిని ఏర్పాటుచేసుకోవాలి. ట్రేల్లో వాటికి కేటాయించిన ప్రత్యేక సెటప్‌లో పెట్టుకోవాలి. కిచెన్‌లోని పరికరం వై-ఫైకు అనుసంధానమై ఉంటుంది. దాంతో యాప్ ద్వారా మనకు కావాల్సిన పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే అందుకు తగ్గట్టుగా ముందే ఉంచిన ట్రేల్లోని ముడి పదార్థాలను ఉపయోగించుకుని వంట సిద్ధం చేస్తుంది. ఈమేరకు కంపెనీ ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేసిన వీడియో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Chefee Robotics (@chefeerobotics)బ్యాటరీతో పనిచేసే ఇండక్షన్ కుకర్ఇంపల్స్ ల్యాబ్స్ తయారుచేసిన ఇండక్షన్ కుక్‌టాప్ కరెంట్ లేకపోయినా పనిచేస్తుంది. ముందుగా వినియోగించినపుడు విద్యుత్ ద్వారా కుకర్‌లో ఉండే బ్యాటరీలు ఛార్జ్ అవుతాయి. కరెంటులేని సమయంలో తిరిగి ఆ బ్యాటరీల ద్వారా కుకుర్ను వేడిచేసి వంట చేసుకునే వీలుంటుంది.ముందే సమయాన్ని చెప్పే థర్మామీటర్మైక్రోఓవెన్లో ఏదైనా పదార్థాన్ని వేడి చేయాలనుకున్నప్పుడు కంబషన్ కంపెనీ తయారుచేసిన థర్మామీటర్ ఎంతో ఉపయోగపడుతుంది. ముందుగా మనం వేడి చేయాలనుకున్న ఆహారంపై థర్మామీటర్ ఉంచాలి. అందులోని ఎనిమిది సెన్సార్లు అది ఎలాంటి పదార్థమే గుర్తించి తినడానికి అనువుగా వేడి అవ్వాలంటే ఎంతసమయం పడుతుందో తెలియజేస్తుంది.ఇదీ చదవండి: డ్రైవింగ్ లైసెన్స్ మరిచిపోయి పోలీసులకు చిక్కారా..? మీకోసమే ‘డిజీలాకర్’స్మార్ట్ కిచెన్ సమ్మిట్‌లో కలినరీ టెక్నాలజిస్ట్ స్కాట్ హెమెండెంగర్ మాట్లాడుతూ..‘ఈ సమ్మిట్‌లో ఎన్నో అద్భుతమైన ప్రాడక్ట్స్ ప్రదర్శించారు. ఇవన్నీ చూస్తుంటే కొద్ది రోజుల్లోనే మన కిచెన్లు స్మార్ట్గామారే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. Wife అయితే గరిటెను ఎలా అయినా వాడుతుంది. కానీ Wi-Fi మాత్రం గరిటెను స్మార్ట్ కిచెన్ కోసమే వాడుతుంది’ అన్నారు. -
ఏఐతో వై-ఫై స్పీడ్ పెంచేందుకు పెట్టుబడులు
యాక్ట్ ఫైబర్‌నెట్ కంపెనీ..నెట్వర్క్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ స్టార్టప్ అప్రెకామ్లో పెట్టుబడులు పెట్టినట్లు ప్రకటించింది. యాక్ట్ ఫైబర్‌నెట్ తమ కస్టమర్లకు అందిస్తున్న హోమ్ వై-ఫై సదుపాయాన్ని మరింత మెరుగుపరిచేందుకు, నెట్ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. అయితే ఈ డీల్ విలువ ఎంతనేది మాత్రం వెల్లడించలేదు.ఈ సందర్భంగా యాక్ట్ ఫైబర్‌నెట్ సీఈఓ బాల మల్లాది మాట్లాడుతూ..‘అప్రెకామ్ అధునాతన సాంకేతికతను యాక్ట్ ఫైబర్‌నెట్ వై-ఫై టెక్నాలజీకు అనుసంధానం చేయనున్నాం. ఇది వై-ఫై పనితీరులో వేగాన్ని పెంచుతుంది. రియల్‌టైమ్ నెట్వర్క్ విజిబిలిటీని అందిస్తుంది. ఇకపై కస్టమర్లకు మరింత ఉత్తమమైన నెట్ సేవలందుతాయి. అప్రెకామ్ తయారుచేసిన ఏఐ ఆధారిత సెల్ఫ్ ఆప్టిమైజింగ్ టెక్నాలజీ, అధునాతన వై-ఫై అనాలసిస్ కంపెనీ నెట్‌వర్క్‌ను నిరంతరం ఆప్టిమైజ్ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది’ అన్నారు.బెంగళూరుకు చెందిన యాక్ట్ ఫైబర్‌నెట్ దేశంలోని అతిపెద్ద వైర్డ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటిగా ఉంది. ఈ సంస్థ 25 నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2.2 మిలియన్ కస్టమర్లకు సేవలు అందిస్తోంది. -
ఎయిర్టెల్ 5జీ వైర్లెస్ వైఫై ప్రారంభం.. జియో కంటే ముందుగా..
దేశంలో ప్రముఖ టెలికాం సంస్థ భారతి ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఎయిర్‌ఫైబర్ (Xstream AirFiber) పేరిట ఫిక్స్డ్ వైర్లెస్ 5జీ సర్వీస్‌లను ప్రకటించింది. ఢిల్లీ, ముంబై నగరాల్లో తొలి 5జీ టెక్నాలజీ ఆధారిత ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ (FWA) సేవలను ప్రారంభించింది. నెట్వర్క్ అందుబాటులోని మారుమూల గ్రామాలకు సైతం ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించే ఉద్దేశంతో ఈ టెక్నాలజీ 5జీ వైర్లెస్ సేవలు అందుబాటులోకి తీసువచ్చినట్లు ఎయిర్టెల్ తెలిపింది. ఈ ఎక్స్ట్రీమ్ ఎయిర్ ఫైబర్ వైర్‌లెస్‌గా 100 Mbps వేగంతో ఇంటర్నెట్ అందిస్తుంది. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఎయిర్‌ఫైబర్ అనేది స్వతంత్రంగా పనిచేసే ఓ ప్లగ్ అండ్ ప్లే పరికరం. వైఫై 6 ప్రమాణాలతో అంతరాయం లేకుండా విస్తృత నెట్వర్క్ కవరేజీని అందిస్తుంది. దీని ద్వారా ఏకకాలంలో 64 ఫోన్లు లేదా ల్యాప్‌టాప్‌లకు హై స్పీడ్ ఇంటర్నెట్ను పొందవచ్చు. ఈ పరికరానికి సంబంధించిన హార్డ్‌వేర్ పరికరాలన్నీ భారత్‌లోనే తయారైనట్లు కంపెనీ పేర్కొంది. గత మూడు నాలుగేళ్లుగా ఇళ్లలో ఉపయోగించే వైఫై సేవలకు డిమాండ్ విపరీతంగా పెరిగిందని, ఎక్స్ట్రీమ్ ఎయిర్‌ఫైబర్‌తో ఫిజికల్ ఫైబర్ నెట్వర్క్ సదుపాయం లేని ప్రాంతాలకు కూడా వేగవంతమైన వైఫై ఇంటర్నెట్ సేవలు అందిస్తామని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం డిల్లీ, ముంబై నగరాల్లోనే ఈ సేవలు ప్రారంభించినప్పటికీ రాబోయే రోజుల్లో దేశమంతటా విస్తరించాలని యోచిస్తోంది. 5జీ ఆధారిత ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ సర్వీస్‌ను అధికారికంగా ప్రారంభించిన మొదటి కంపెనీ ఎయిర్టెల్. అయితే కొన్ని నెలల క్రితం జియో కూడా జియో ఎయిర్‌ఫైబర్ పేరుతో ఇటాంటి సర్వీసునే తీసుకురాన్నుట్లు ప్రకటించింది. ప్రస్తుతానికి జియో ఎయిర్‌ఫైబర్ ధరలు ఎంత ఉంటాయి.. అధికారికంగా ఎప్పుడు ప్రారంభిస్తారు? అన్న వివరాలపై సమాచారం లేదు. ఎయిర్టెల్ ఎయిర్‌ఫైబర్ ప్లాన్ వివరాలు ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఎయిర్‌ఫైబర్ నెలకు రూ. 799. హార్డ్‌వేర్ కాంపోనెంట్ కోసం సెక్యూరిటీ డిపాజిట్‌గా అదనంగా రూ. 2,500 చెల్లించాలి. మొత్తం ఆరు నెలల ప్యాకేజ్ 7.5 శాతం తగ్గింపుతో రూ. 4,435లకే అందిస్తోంది. అయితే ఎయిర్టెల్ అపరిమిత డేటాను ఆఫర్ చేస్తుందా లేదా మిగిలిన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ల మాదిరిగానే పరిమితి ఉంటుందా అనేది స్పష్టత లేదు. -
ఫ్లైట్‌మోడ్‌లో ఫోన్.. విమానాల్లో ఇంటర్నెట్ ఎలా?
ఏదైనా ఊరెళ్తున్నాం.. బస్సులోనో, రైల్లోనో అయితే వెంటనే స్మార్ట్‌ఫోన్ బయటికి తీయడం, ఏ సినిమాలో, వెబ్ సిరీస్‌లో చూడటం, సోషల్ మీడియాలో కాలక్షేపం చేయడం కనిపించేదే. అదే మరి విమానాల్లో అయితే..!? టవర్ సిగ్నల్స్ ఉండవు. ఉన్నా ఫోన్‌ను ఫ్లైట్ మోడ్‌లో పెట్టాల్సిందే. దీంతో ఫోన్ మెమరీలో ఉన్న వీడియోలు చూస్తూనో, పాటలు వింటూనో గడిపేయాల్సిందే. గంటా గంటన్నర జర్నీ అయితే ఓకేగానీ.. ఆరేడు గంటలకుపైన ప్రయాణించాల్సి వస్తే కష్టమే. అదే విమానాల్లో వైఫై ఉంటే కాసింత కాలక్షేపం. రెండు రకాలుగా ఇంటర్నెట్ విమానాల్లో వైఫై ద్వారా ఇంటర్నెట్ ఇచ్చేందుకు రెండు రకాల అవకాశాలు ఉన్నాయి. ఒకటేమో ఇప్పుడు మనం స్మార్ట్ఫోన్లలో వాడుతున్నట్టుగా టెలికాం టవర్ల నుంచి సిగ్నల్ అందుకోవడం. రెండోది శాటిలైట్ల ద్వారా ఇంటర్నెట్కు అనుసంధానం కావడం. ♦ శాటిలైట్‌కు అనుసంధానమై ఇంటర్నెట్ పొందే విమానాలకు పైభాగంలో యాంటెన్నాలు ఉంటాయి. ఈ ఇంటర్నెట్కు సిగ్నల్ సమస్యేదీ ఉండదు. కానీ అందుబాటు తక్కువ. ఖర్చు చాలా ఎక్కువ. ♦ టెలికం సిగ్నల్స్ నుంచి ఇంటర్నెట్ పొందే విమానాలకు దిగువ భాగంలో యాంటెన్నాలు ఉంటాయి. భూమ్మీద ఉన్న టెలికాం టవర్ల నుంచి సిగ్నల్స్ అందుకుంటూ ఇంటర్నెట్ వాడుతారు. అయితే ఇలాంటి వాటిలో అడవులు, ఎడారులు, సముద్రాల మీదుగా ప్రయాణించిన సమయంలో సిగ్నల్స్ ఉండవు. ♦ దాదాపు అన్ని దేశాలు యుద్ధ విమానాలు, ప్రత్యేక విమానాల్లో మాత్రం శాటిలైట్ కనెక్షన్‌ను వినియోగిస్తున్నాయి. చాలా విమానాల్లో ఇంటర్నెట్.. బాగా స్లో ప్రస్తుతం విమానాల్లో కొంతవరకు వైఫై సదుపాయం ఉన్నా.. దాని వేగం అత్యంత తక్కువ. ఎందుకంటే చాలా వరకు ప్రయాణికుల విమానాల్లో టెలికాం టవర్లకు అనుసంధానమయ్యే పరికరాలే ఉంటున్నాయి. వీటి నుంచి వచ్చే కాస్త ఇంటర్నెట్ స్పీడ్‌నే వైఫై ద్వారా అందిస్తున్నారు. విమానంలోని వారంతా ఆ స్పీడ్‌నే పంచుకోవాల్సి ఉంటుంది. దీనితో ఇంటర్నెట్ బాగా స్లోగా వస్తుంది. విమానాల్లో ఇంటర్నెట్ కోసం ప్రత్యేకంగా.. విమానాల్లో ఇంటర్నెట్ కోసమంటూ ఇటీవలే ప్రత్యేక సంస్థలు తెరపైకి వస్తున్నాయి. అందులో ‘గోగో కమర్షియల్ ఏవియేషన్’ ఒకటి. ఇది ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్ సేవలు అందించే ఇంటెల్‌శాట్ కంపెనీకి అనుబంధ సంస్థ. అత్యంత అధునాతనమైన ‘2కేయూ వ్యవస్థ’తో విమానాల్లో వేగవంతమైన ఇంటర్నెట్ను అందిస్తోంది. ♦ ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సంస్థ ‘స్టార్ లింక్’ కూడా.. సముద్రాలు, ఎడారులు, ధ్రువ ప్రాంతాలు అనే తేడా లేకుండా భూమ్మీద అన్నిచోట్లా వేగవంతమైన ఇంటర్నెట్ అందిస్తామంటూ తెరపైకి వచ్చింది. ♦ఇలాంటి శాటిలైట్ ఇంటర్నెట్ సంస్థలు రావడం, ఆ ఇంటర్నెట్కు అయ్యే వ్యయం కూడా తగ్గుతుండటంతో విమానయాన సంస్థలు తమ అంతర్జాతీయ, దేశీయ విమానాల్లో వైఫైను అందించేందుకు ముందుకు వస్తున్నాయి. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
ఆ రాయిని మండిస్తే చాలు.. ఇంటర్నెట్, వైఫై సిగ్నల్స్ వస్తాయ్!
మనకు ఇంటర్నెట్, వైఫై సిగ్నల్స్ బాగా వచ్చేందుకు ఇంటి మేడపైకి, ఎత్తుగా ఉన్న ప్రదేశంలోకి వెళ్తాం. మాగ్జిమమ్ ఇంటర్నెట్ సిగ్నల్స్ రాకపోతే నానా తిప్పలు పడి మరీ యాక్సెస్ అయ్యేలా చేసుకుంటాం. కానీ అవేమి అవరసం లేకుండా ఓ అరుదైన రాయి దగ్గరికి వెళ్తే చాలు మనకు ఇంటర్నెట్, వైఫై సిగ్నల్ పనిచేస్తాయ్. ఇది నిజంగా నమ్మలేని నిజం. జర్మనీలో ఈ అద్భుత ఆవిష్కరణ చేశాడో ఓ వ్యక్తి. శాస్త్రవేత్తలు సైతం ఈ మ్యాజిక్ రాయిని చూసి ఆశ్చర్యపోయారు. వివరాల్లోకెళ్తే..జర్మనీలో ఉంది ఈ రాయి. సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు దీన్ని చూసేందుకు ఎగబడుతున్నారు. దానిలో థర్మల్ ఎలక్ట్రిక్ జనరేటర్ అమర్చబడి ఉంది. దాన్ని మంటల వద్ద పెడితే వేడిని విద్యుత్ శక్తిగా మార్చుతుంది. ఆ తర్వాత వైఫై రూటర్ ఆన్ అవుతుంది. ఇంటర్నెట్ సిగ్నల్స్ ప్రారంభమవుతాయి. వాస్తవానికి అది కృత్రిమ రాయి. ఈ అరుదైన రాయి బరువు 1.5 టన్నులు. ఈ కళాకృతిని కీప్ అలైవ్ అని పిలుస్తారు. ఎరామ్ బర్తోల్ అనే వ్యక్తి దీన్ని తయారు చేశాడు. ఆ ఆవిష్కరణ కారణంగా ఆయన పేరు వార్తల్లో నిలిచింది. (చదవండి: కొత్త పార్లమెంట్ భవనం కోసం షారూఖ్, అక్షయ్ కూమార్‌ల వాయిస్ ఓవర్) -
టెల్కోలు, వైఫై సంస్థలు జట్టు కట్టాలి
న్యూఢిల్లీ: డిజిటల్ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చే దిశగా కొత్త వ్యాపార విధానాలను అమలు చేసేందుకు టెల్కోలు, వైఫై సంస్థలు కలిసి పని చేయాలని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాట్ చైర్మన్ పి.డి. వాఘేలా సూచించారు. మొబైల్, వైఫై సాంకేతికతల సామర్థ్యాలను వెలికితీయాలని పేర్కొన్నారు. బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరం (బీఐఎఫ్) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. 5జీ సర్వీసులు అందుబాటులోకి వస్తే డేటా వినియోగం అనేక రెట్లు పెరుగుతుందని వాఘేలా చెప్పారు. ‘5జీ బ్రాడ్కాస్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ల మధ్య కమ్యూనికేషన్, రోబోటిక్స్ మొదలైన టెక్నాలజీలతో డేటా వినియోగం భారీగా పెరుగుతుంది‘ అని తెలిపారు. ప్రస్తుతం 5జీ సేవలు అందుబాటులో ఉన్న దక్షిణ కొరియా, బ్రిటన్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, జర్మనీ తదితర దేశాల్లో స్మార్ట్‌ఫోన్ యూజర్లు 4జీతో పోలిస్తే 1.7–2.7 రెట్లు ఎక్కువగా మొబైల్ డేటా వినియోగిస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయని వాఘేలా వివరించారు. బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని పెంచేందుకు పబ్లిక్ వైఫై కూడా ఎంతగానో ఉపయోగపడగలదని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే 2022 నాటికి 1 కోటి పబ్లిక్ వైఫై హాట్‌స్పాట్స్‌ను ఏర్పాటు చేయాలని 2018 నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్స్ పాలసీలో నిర్దేశించుకున్నట్లు వాఘేలా చెప్పారు. భవిష్యత్తులో వైఫై7 కూడా రాబోతోందని, దీనితో డేటా డౌన్లోడ్ వేగం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. -
గుడ్‌న్యూస్ : 4000 రైల్వే స్టేషన్లలో ప్రీపెయిడ్ వైఫై
సాక్షి,న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వేకు చెందిన బ్రాండ్‌బ్యాండ్, వీపీఎన్ సర్వీసెస్ కంపెనీ రైల్‌టెల్ దేశంలోని 4 వేల రైల్వే స్టేషన్లలో ప్రీపెయిడ్ వైఫై సేవలను ప్రారంభించింది. ఇప్పటికే 5,950కి పైగా స్టేషన్లలో ఉచిత హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) ఆధారిత ధ్రువీకరణతో ఎవరైనా సరే ఇంటర్నెట్ సేవలను పొందవచ్చు. తాజాగా విడుదల చేసిన ప్రీపెయిడ్ ప్లాన్ ప్రకారం ప్రయాణికులు రోజుకు 30 నిమిషాల ఉచిత వైఫైను 1 ఎంబీపీఎస్ వేగంతో ఉపయోగించుకోవచ్చు. కానీ అంతకంటే ఎక్కువ వేగవంతమైన లేదా 34 ఎంబీపీఎస్ వేగం వరకు ఇంటర్నెట్ కోసం వినియోగదారులు నామమాత్రపు రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. రోజుకు 5 జీబీ డేటా చార్జీ రూ.10, 10 జీబీకి రూ.15 చార్జీ, అలాగే ఐదు రోజుల వ్యాలిడిటీతో 10 జీబీ చార్జీ రూ.20, 20 జీబీ చార్జీ రూ.30గా ఉన్నాయి. 10 రోజుల వ్యాలిడిటీతో 20 జీబీ చార్జీ రూ.40, 30 జీబీకి రూ.50, అదేవిధంగా 30 రోజుల వ్యాలిడిటీ ఉండే 60 జీబీకి రూ.70 చార్జీలున్నాయి. వినియోగదారులు వారి అవసరాలకు అనుగుణమైన ప్లాన్స్‌ను ఎంచుకునేలా రూపొందించామని రైల్‌టెల్ సీఎండీ పునీత్ చావ్లా తెలిపారు. -
ఇది చేస్తే రైల్వే స్టేషన్లలో ఎంతైనా వైఫై వాడొచ్చు
న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వేకు చెందిన బ్రాండ్‌బ్యాండ్, వీపీఎన్ సర్వీసెస్ కంపెనీ రైల్‌టెల్ దేశంలోని 4 వేల రైల్వే స్టేషన్లలో ప్రీపెయిడ్ వైఫై సేవలను ప్రారంభించింది. ఇప్పటికే 5,950కి పైగా స్టేషన్లలో ఉచిత హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. వన్ టైమ్‌పాస్‌వర్డ్ (ఓటీపీ) ఆధారిత ధ్రువీకరణతో ఎవరైనా సరే ఇంటర్నెట్ సేవలను పొందవచ్చు. తాజాగా విడుదల చేసిన ప్రీపెయిడ్ ప్లాన్ ప్రకారం ప్రయాణికులు రోజుకు 30 నిమిషాల ఉచిత వైఫైను 1 ఎంబీపీఎస్ వేగంతో ఉపయోగించుకోవచ్చు. కానీ అంతకంటే ఎక్కువ వేగవంతమైన లేదా 34 ఎంబీపీఎస్ వేగం వరకు ఇంటర్నెట్ కోసం వినియోగదారులు నామమాత్రపు రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. రోజుకు 5 జీబీ డేటా చార్జీ రూ.10, 10 జీబీకి రూ.15 చార్జీ, అలాగే ఐదు రోజుల వ్యాలిడిటీతో 10 జీబీ చార్జీ రూ.20, 20 జీబీ చార్జీ రూ.30గా ఉన్నాయి. 10 రోజుల వ్యాలిడిటీతో 20 జీబీ చార్జీ రూ.40, 30 జీబీకి రూ.50, అదేవిధంగా 30 రోజుల వ్యాలిడిటీ ఉండే 60 జీబీకి రూ.70 చార్జీలున్నాయి. వినియోగదారులు వారి అవసరాలకు అనుగుణమైన ప్లాన్స్‌ను ఎంచుకునేలా రూపొందించామని రైల్‌టెల్ సీఎండీ పునీత్ చావ్లా తెలిపారు. -
మీ వై-ఫై స్పీడ్ పెంచుకోండి ఇలా?
ప్రస్తుతం ఉన్న ఇంటర్నెట్ యుగంలో వై-ఫై అంటే తెలియని వాళ్లు చాలా కొద్దీ మాత్రమే ఉంటారు. ప్రస్తుత కరోనా కాలంలో గతంలో వై-ఫై ఉపయోగించని వారు కూడా ఇప్పుడు ఉపయోగించాల్సి వస్తుంది. దీనికి తోడు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం, ఆన్ లైన్ క్లాసుల పుణ్యమా అని గతం కంటే ఎక్కువగా వై-ఫైలు వాడకం బాగా పెరిగిపోయింది. లాక్ డౌన్ తర్వాత మన దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వై-ఫై వాడకం పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. వైఫై కనెక్షన్ కోసం మీరు మంచి బ్రాడ్ బ్యాండ్ ని ఎంచుకొని ఉన్న కొన్ని సార్లు సమస్యలు ఎదుర్కొంటారు కొందరు. దానికి ప్రధాన కారణం వారు చేసే చిన్న తప్పులే. అయితే ఇప్పుడు మీ వై-ఫై వేగాన్ని పెంచే కొన్ని మార్గాలను మనం తెలుసుకుందాం. (చదవండి: గూగుల్ డ్యుయో సేవలు నిలిపివేత!) వై-ఫై వేగాన్ని పెంచడానికి ఈ టిప్స్ పాటించండి: మొదటగా మీరు మీ ఇంట్లో వై-ఫై అవసరం లేకపోయినా దానికి కనెక్ట్ చేయబడిన ఎలక్ట్రానిక్ పరికరాలను ముందుగా డిస్ కనెక్ట్ చేయండి. కొన్ని సార్లు మీరు వై-ఫై రూటర్ ప్రక్కన నిలబడితే మాత్రమే వై-ఫై సిగ్నల్ వస్తుంటే ముందుగా మీ వై-ఫై రూటర్ స్థానాన్ని మార్చండి. అది కూడా మీ గదిలో మధ్యలో ఉండే విదంగా చూసుకోండి. అలాగే దాని పక్కన ఎలాంటి ఎలక్ట్రానిక్, ఐరన్ వంటివి లేకుండా చూసుకోండి. అలాగే ముందుగా మీ ఇంటి యొక్క అవసరాలను గుర్తించండి. చాలా మంది వారి ఇంటిలో ఎక్కువ ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్న తక్కువ స్పీడ్ గల వై-ఫై కనెక్షన్ తీసుకోవడానికి ఇష్టపడుతారు. దీని వల్ల కొన్ని సార్లు మనకు అత్యవసర సమయంలో వై-ఫై సిగ్నల్ తగ్గిపోవడం వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. డ్యూయల్ బ్యాండ్ 2.4గిగాహెర్ట్జ్ నుంచి 5గిగాహెర్ట్జ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ గల రూటర్ ని మీ అవసరాని బట్టి ఎంచుకోవాలి. మీ వై-ఫై వేగాన్ని పరిశీలించండి. ఒక్కోసారి మీరు వాడుతున్న ఎలక్ట్రానిక్ పరికరంలో ఏదైనా సమస్యలు ఉంటే తక్కువ స్పీడ్ వచ్చే అవకాశం ఉంది. ఇతర పరికరాలలో కూడా ఒక సారి వైఫై వేగాన్ని కొలవండి. దీని కోసం fast.com ను ఉపయోగించవచ్చు. ఒకవేల ఏదైనా సమస్య ఉన్నట్లు అయితే ముందుగా మీ పరికరంలో నెట్ వర్క్ సెట్టింగ్స్ చేయండి. మీరు ఎక్కువ మంది నివసించే ప్రాంతాలలో ఉంటే మాత్రం ఇతర నెట్ వర్క్, ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి వచ్చే సిగ్నల్ మీకు కనెక్ట్ కావడానికి మీ రూటర్ పై ప్రభావం చూపుతుంది. అందువల్ల మీ రూటర్ లో ఛానల్ ఎంపిక మోడ్ సెట్ చేసుకోవాలి లేదా మీకు నచ్చిన ఛానెల్ ని మీరు స్వయంగా ఎంచుకోవచ్చు. కొన్ని సార్లు వై-ఫై తగ్గిపోవడానికి రూటర్ యాంటెన్నా కూడా కారణం కావచ్చు. అందుకని ఒకసారి మీ రూటర్ యాంటెన్నాల పోజిషన్ ను మార్చి చూడండి. అలాగే, ఒకసారి వై-ఫై రూటర్ ఆఫ్ చేసి మళ్లీ ఆన్ చేయండి. ఇప్పటికి కూడా మీ వై-ఫై వేగం పెరగకపోతే రూటర్ లేదా వై-ఫై కనెక్షన్ సేవలను మార్చి చూడండి. అంటే వేరే రూటర్ తీసుకోవడం లేదా వేరే వైఫై కనెక్షన్ తీసుకోవడం మంచిది. -
గూగుల్ మరో కొత్త ఫీచర్
ఆండ్రాయిడ్ 12లో వైఫై పాస్వర్డ్ షేర్ చేసుకోవడాన్ని సులభతరం చేయడానికి గూగుల్ మరో కొత్త ఫీచర్ తీసుకొస్తున్నట్లు సమాచారం. దీని ద్వారా యూజర్స్ తమ వైఫై నెట్వర్క్ పాస్‌వర్డ్‌ని ఇతరులతో సులభంగా షేర్ చేసుకోవచ్చు. గూగుల్ ఆండ్రాయిడ్‌లో నియర్‌బై షేర్ ద్వారా వైఫై పాస్‌వర్డ్‌లను షేర్ చేసుకోవడానికి వినియోగదారులను సహాయపడనుంది. ఆపిల్ యొక్క ఎయిర్‌డ్రాప్ టెక్నాలజీని తరహాలోనే ఇది కూడా పనిచేయనుంది. క్రొత్త ఫీచర్లో ఆండ్రాయిడ్ షేర్ వైఫై పేజీలో షేర్ బటన్ అనే ఆప్షన్ తీసుకొచ్చింది. షేర్ బటన్ నొక్కడం ద్వారా రెండు ఫోన్ల మధ్య ఎటువంటి కేబుల్ సహాయం లేకుండా వైఫైకి కనెక్ట్ చేయబడిన ఫోన్ నుంచి వైఫై పాస్‌వర్డ్‌ను వినియోగదారులు షేర్ చేసుకోవచ్చు.(చదవండి: ఈ రోజు ఫేస్ మార్చుకుందామా!) ఇప్పటికే ఆండ్రాయిడ్ 10 ఓఎస్ యూజర్స్‌కి క్యూఆర్ కోడ్ ఆధారంగా వైఫై పాస్వర్డ్ షేర్ చేసుకునే ఫీచర్ అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ 12 డెవలపర్ ప్రివ్యూ ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫైనల్ వెర్షన్ ని ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో తీసుకురానున్నట్లు సమాచారం. షేర్ వైఫై పేరుతో ఈ ఏడాడి రెండో అర్ధభాగంలో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తారని సమాచారం. ఇప్పటికే దీని సంబంధించిన కార్యచరణను గూగుల్ ప్రారంభించింది. -
రెడ్మి వినియోగదారులకు శుభవార్త
సాక్షి, ముంబై: స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమికి చెందిన రెడ్మి శుభవార్త అందించింది. వైఫై కాలింగ్ సదుపాయాన్ని రెడ్మి స్మార్ట్ఫోన్లలో కల్పిస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. టెలికాం దిగ్గజ సంస్థలు భారతి ఎయిర్టెల్, రిలయన్స్ జియో తన విని యోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చిన వాయిస్ వైఫై కాలింగ్ సేవలు ఇక మీదట తమ స్మార్ట్ఫోన్లలో వినియోగించు కోవచ్చని తెలిపింది. ఈమేరకు ఫోన్ల జాబితాలో ట్విటర్లో షేర్ చేసింది. కాగా భారతి ఎయిర్టెల్ దేశవ్యాప్తంగా వై ఫై కాలింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చామనీ, తమ వైఫై చందాదారుల సంఖ్య 10 లక్షలు దాటిందని ఇటీవల ప్రకటించింది. అటు రిలయన్స్ జియో కూడా ఈ సదుపాయాన్ని కొన్ని పరిమిత సర్కిళ్లలో ఇటీవల లాంచ్ చేసింది. త్వరలోనే దేశ వ్యాప్తంగా అందుబాటులో ఉంచుతామని తెలిపింది. ఈ సేవలకు అదనంగా ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. వీఓ వైఫై టెక్నాలజీతో పబ్లిక్ హాట్‌స్పాట్ లేదా ప్రైవేట్ హోం వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేసుకొని ఏ మొబైల్‌ఫోన్‌కైనా, ల్యాండ్‌లైన్‌కైనా కాల్స్ చేసుకోవచ్చు. చదవండి: జియోకు షాక్ : దూసుకుపోతున్న ఎయిర్టెల్ Welcome to the future of voice calling! #VoWiFi is now available across our exciting range of #Redmi smartphones. 🤙 Make calls using WiFi on your @airtelindia and @reliancejio WiFi network. RT and help us spread the word! 🙏 pic.twitter.com/XywK6Hk67P — Redmi India for #MiFans (@RedmiIndia) January 14, 2020 -
జియోకు షాక్ : దూసుకుపోతున్న ఎయిర్టెల్
సాక్షి, ముంబై: టెలికాం దిగ్గజం సంస్థ భారతి ఎయిర్టెల్ ఇటీవల ప్రారంభించిన వైఫై కాలింగ్ ఫీచర్ దూసుకుపోతోంది. ఇప్పటికే ఒక మిలియన్‌కు పైగా వినియోగదారులను నమోదు చేసింది. ఈ మేరకు ఎయిర్టెల్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా వైఫై కాలింగ్ ఫీచర్ తీసుకొచ్చింది తామేనని ఎయిర్టెల్ వినియోగదారులు ఏ వైఫైలో అయినా ఈ సేవను ఉపయోగించుకోవచ్చని భారతి ఎయిర్టెల్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ రణదీప్ సెఖోన్ తెలిపారు. ముఖ్యంగా ప్రధాన ప్రత్యర్థి, రిలయన్స్ జియో తమ మొబైల్ వినియోగదారులకోసం వైఫై సేవలను ప్రారంభించిన రెండు రోజుల తరువాత ఈ గణాంకాలను విడుదల చేయడం గమనార్హం. కాగా గత ఏడాది డిసెంబరులో ఎయిర్టెల్ తన ‘వాయిస్ ఓవర్ వైఫై (వీఓవైఫై)’ సేవలను మొట్టమొదటి సారిగా ప్రారంభించింది. ఈ సేవలు తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాలతోపాటు ఢిల్లీ, ముంబై, తమిళనాడు, కోల్‌కతాలో అందుబాటులో ఉన్నాయి. 16 బ్రాండ్లలో 100కి పైగా స్మార్ట్‌ఫోన్ మోడళ్లు, ప్రస్తుతం ఎయిర్టెల్ వైఫై కాలింగ్ ఫీచర్‌కు మద్దుతునిస్తున్నాయి. ఈ సేవలకు అదనంగా ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. వీఓ వైఫై టెక్నాలజీతో పబ్లిక్ హాట్‌స్పాట్ లేదా ప్రైవేట్ హోం వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేసుకొని ఏ మొబైల్‌ఫోన్‌కైనా, ల్యాండ్‌లైన్‌కైనా కాల్స్ చేసుకోవచ్చు. -
దీపాలతో 250 ఎంబీపీఎస్ ఇంటర్నెట్!
లైట్లతోనే వైఫై! ఇది పాత విషయమే కావచ్చుగానీ.. ఏకంగా 250 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుందంటే మాత్రం విశేషమే. ఫిలిప్స్ లైటింగ్ కంపెనీ (ఇప్పుడు సిగ్నిఫై అని పిలుస్తున్నారు) మార్కెట్లోకి ప్రవేశపెట్టిన ట్రూలైఫై లైట్లతో ఇది సాధ్యమే. సాధారణంగా ఇంటర్నెట్ సమాచారం మొత్తం రేడియో తరంగాల రూపంలో మనకు అందుతూంటే.. ట్రూలైఫైలో మాత్రం కాంతి తరంగాలు ఉపయోగపడతాయి. కొన్నేళ్లుగా ఈ టెక్నాలజీ అందుబాటులో ఉన్నప్పటికీ అంతగా ప్రాచుర్యం పొందలేదు. ఈ నేపథ్యంలో సిగ్నిఫై ట్రూలైఫైను అందుబాటులోకి తెచ్చింది. రేడియో తరంగాల వాడకం నిషిద్ధమైన ఆసుపత్రులు, పారిశ్రామిక ప్రాంతాల్లోనూ దీన్ని వాడుకోవచ్చు. వైఫై నెట్‌వర్క్‌పై ఉన్న భారాన్ని తగ్గించడంతోపాటు నెట్ వేగాన్ని గణనీయంగా పెంచేందుకు ట్రూలైఫైలో ప్రత్యేకమైన ఆప్టికల్ ట్రాన్స్‌రిసీవర్‌ను ఏర్పాటు చేశారు. అప్లోడింగ్ డౌన్లోడింగ్ రెండింటికీ 150 ఎంబీపీఎస్ వేగానిన ఇవ్వడం దీనికున్న ఇంకో ప్రత్యేకత. ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్‌కు మాత్రమే సమాచార ప్రసారం జరగాలనుకున్నప్పుడు వేగం 250 ఎంబీపీఎస్ వరకూ ఉంటుంది. ఏఈఎస్ 128 బిట్ ఎన్క్రిప్షన్ వాడటం వల్ల సమాచారం భద్రంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. లైట్ వెలుగును తగ్గించినా, లేదా ఆఫ్ చేసినా లైఫై మాత్రం పనిచేస్తూనే ఉంటుందని కంపెనీ చెబుతోంది. లైఫైతో పనిచేసే ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు అందుబాటులోకి వచ్చేంతవరకూ ఒక యూఎస్‌బీని వాడటం ద్వారా లైఫైను వాడుకోవచ్చునని సిగ్నిఫై తెలిపింది. -
‘సరదా కోసం ఉగ్రవాద సంస్థ పేరు పెట్టా’
సాక్షి, ముంబై: యావత్ దేశం ఉగ్రవాదులు, ఉగ్రసంస్థలపై చర్చ జరుగుతున్న సమయంలో ఓ కుర్రాడు చేసిన తుంటిరి పనితో నగరంలోని కళ్యాణ్ ప్రాంతంలో కలకలం సృష్టించింది. తన వై ఫై నెట్వర్క్ పేరును లష్కరే తాలిబన్ అని పెట్టుకోవడంతో ఆ కుర్రాడు చిక్కుల్లో పడ్డాడు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. ముంబైలోని ఓ అపార్ట్ మెంట్లోని కొంతమంది వై ఫై నెట్వర్క్స్ గురించి సెర్చ్ చేస్తే ఆ జాబితాలో ఉగ్రవాద సంస్థ పేరు ఉండటం చూసి భయాందోళనలకు గురయ్యారు. దీంతో అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే కేసును ఛేదించారు. అపార్ట్‌మెంట్‌కు చెందిన కుర్రాడే కావాలనే ఉగ్రవాద సంస్థ పేరు పెట్టినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో అతడిని విచారించగా.. ఉగ్రవాద సంస్థలతో అతడికి ఎలాంటి సంబంధంలేదని, కేవలం వై ఫై నెట్‌వర్క్‌ను ఎవరు వాడకూడదనే ఉద్దేశంతోనే సరదాగా ఆ పేరు పెట్టినట్లు పోలీసులకు వివరించారు. అయితే వెంటనే ఆ పేరును మార్చాలని లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు అతడిని హెచ్చరించారు. -
రైలుబండి.. సినిమాలండి!
రైలు ప్రయాణంలో బోరు కొడుతోందా? మీ సీరియళ్లు, క్రికెట్ మ్యాచ్‌లు మిస్సవు తున్నామన్న బెంగా? సినిమాలు చూద్దామంటే నెట్ బ్యాలెన్స్ తక్కువుందా? లైట్ తీసుకోండి.. ఎందుకంటే.. రైల్వే శాఖ లేటెస్ట్గా తెస్తున్న ఓ కొత్త సదుపాయం ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపనుంది. – సాక్షి, హైదరాబాద్ ఇంతకీ ఏమిటది? మనకు తెలిసిందే.. వైఫై.. ఇళ్లలో ఉన్నట్టుగానే ఇప్పుడు వీటిని బోగీల్లోనూ పెట్టనున్నారు. ఇప్పటికే ఈ హాట్స్పాట్లను ఆపరేషన్ స్వర్ణ్ కింద శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో రైల్వే అధికారులు పరీక్షించి చూశారు కూడా. ప్రయోగం విజయవంతమవడంతో మరిన్ని రైళ్లకు విస్తరించనున్నారు. తేజస్‌లో అనుకున్నా.. తొలుత దీన్ని తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో అమలు చేద్దామనుకున్నారు. ఈ ఎక్స్‌ప్రెస్‌లో ప్రతీసీటుకు ఓ ఎల్సీడీ స్క్రీన్ ఉంటుంది. అయితే, మొన్నామధ్య ఈ తేజస్ ముంబై– గోవా ట్రైన్లో సీట్లకు ఉన్న ఎల్సీడీ స్క్రీన్లను, హెడ్సెట్లను ప్రయాణికులు ఎత్తుకెళ్లడంతో రైల్వేశాఖ వెనకడుగు వేసింది. మరి ఏయే రైళ్లలో.. శతాబ్ది, ప్రీమియం, దురంతోలాంటి రైళ్లలో దీన్ని అందు బాటులోకి తేనున్నారు. ఫోన్లు, ల్యాప్‌టాపుల్లో వైఫై కనెక్ట్ చేసుకుని.. కావాల్సిన సినిమా, సీరియళ్లు, మ్యాచ్‌లు చూసుకోవచ్చు. త్వరలో టెండర్లు పిలిచేందుకు రైల్వే శాఖ సన్నద్ధమవుతోంది. ప్రయాణికుల నుంచి అదనపు చార్జీలు వసూలు చేస్తారా లేదా తెలియరాలేదు. దీనిపై త్వరలోనే రైల్వే శాఖ ఓ నిర్ణయం తీసుకోనుంది. -
నిద్రిస్తున్న జంటను లేపి మరీ...
నిద్రిస్తున్న జంటను లేపి మరీ షాకిచ్చాడు ఓ యువకుడు. ముసుగు ధరించి ఇంట్లోకి దొంగలాగ దూరి ఆ దంపతులను బెదిరించాడు. అయితే అతను అడిగిన ప్రశ్నకు బిత్తర పోయిన ఆ జంట.. తన్ని బయటకు తరిమేశారు. నార్తర్న్ కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... పాలో అల్టో పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సుమారు 17 ఏళ్ల వయసున్న ఓ యువకుడు ఈస్ట్ ఛార్లెస్టన్ ప్రాంతంలోని ఓ ఇంట్లోకి అర్ధరాత్రి చొరబడ్డాడు. నిద్రిస్తున్న వృద్ధ జంటను లేపి తన ఫోన్లోని డేటా అయిపోయిందని.. వైఫై పాస్వర్డ్ చెప్పాలని కోరాడు. అంతే కంగుతిన్న ఆ ఇంటి యాజమాని కంగారులో యువకుడ్ని మెడ బట్టి బయటకు గెంటేశాడు. ఆపై పోలీసులకు ఫోన్ చేయగా.. యాజమాని ఇచ్చిన క్లూస్ మేరకు మరుసటి రోజు అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అదే రాత్రి ఆ ప్రాంతంలో ఓ బైక్ మిస్సింగ్ కంప్లైయింట్ రావటంతో సదరు యువకుడిని అనుమానితుడిగా భావించి విచారణ చేపట్టారు. సెక్స్‌లో పాల్గొన్నాడు.. పొద్దున్నే షాకిచ్చాడు -
హైదరాబాద్‌లో హైటెక్ బస్‌స్టాపులు
సాక్షి, హైదరాబాద్ : ఎయిర్కండీషనింగ్, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, ఏటీఎం, కాఫీ మిషన్లు, వైఫై, సీసీ టీవీ, టాయిలెట్లు ఇవన్నీ ఇప్పటిదాక మనం ఎయిర్‌పోర్టులో లేదా మెట్రో స్టేషన్లలోనే చూసేవాళ్లం. ప్రస్తుతం హైదరాబాద్ సిటీ బస్‌స్టాపుల్లో కూడా ఈ సౌకర్యాలన్నీ అందుబాటులోకి వస్తున్నాయి. విశ్వనగరంగా రూపొందుతున్న గ్రేటర్ హైదరాబాద్‌లో అత్యాధునిక హంగులతో బస్‌స్టాపులను(బస్షెల్టర్లను) ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఈ మేరకు ప్రయాణికులకు అత్యంత మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఏసీ, వైఫై, ఏటీఎం, సీసీ టీవీ, మొబైల్ చార్జింగ్, టాయిలెట్లు ఉండేలా ఆధునిక బస్షెల్టర్లను ఏర్పాటు చేస్తోంది. పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేసిన ఏసీ బస్‌షెల్టర్‌ను శిల్పారామం వద్ద రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రారంభించారు. ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ ఆఫీసు దగ్గర, కూకట్‌పల్లికి దగ్గరిలో కేపీహెచ్‌బీ వద్ద మరో రెండు ఆధునిక లేదా గ్రేడ్ 1 బస్షెల్టర్లు తుది దశలో ఉన్నాయి. వీటిని కూడా త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో మొత్తం 826 ఆధునిక బస్షెల్టర్లను నాలుగు ప్యాకేజీలలో జీహెచ్ఎంసీ నిర్మిస్తోంది. వీటిలో మొదటి గ్రేడ్‌లో అడ్వాన్స్డ్ ఏసీ బస్షెల్టర్లను నిర్మిస్తున్నారు. కేవలం పాశ్చాత్య దేశాల్లోని ప్రముఖ నగరాల్లో మాత్రమే ఈ విధమైన బస్షెల్టర్లు అందుబాటులో ఉన్నాయి. గ్రేడ్-2 బస్షెల్టర్లలో డస్ట్బిన్లు, టాయిలెట్లు, మొబైల్ చార్జింగ్ పాయింట్లు, తాగునీటి సౌకర్యం, వైఫై, ఫ్యాన్లు, టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. గ్రేడ్-3 బస్‌షెల్టర్‌లో డస్ట్‌బిన్, మొబైల్ చార్జింగ్ పాయింట్, టాయిలెట్స్, తాగునీటి సౌకర్యం ఉండనుంది. గ్రేడ్-4లో కేవలం బస్షెల్టర్తో పాటు డస్ట్బిన్లే ఉంటాయి. మొత్తం నాలుగు ప్యాకేజీలుగా 826 బస్షెల్టర్లను విభజించి టెండర్ ద్వారా వివిధ ఏజెన్సీలకు అప్పగించారు. అత్యాధునిక బస్షెల్టర్లతో ఏర్పాటు చేయడం వల్ల హైదరాబాద్ నగరం ప్రపంచంలోని ప్రముఖ నగరాల్లో మాదిరిగా నగరవాసులకు మెరుగైన సౌకర్యం ఏర్పడుతుందని నగర మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. -
వైఫై ఆఫ్ చేసిందన్న కోపంతో భార్యను...
-
హైదరాబాద్‌లో దారుణం.. వైఫై కోసం భార్యను...
సాక్షి, హైదరాబాద్ : వైఫై కోసం భార్యను చితకబాదాడు ఓ వ్యక్తి. ఆఫ్ చేసిందన్న కోపంతో ఆమెపై పిడిగుద్దులు గుద్దాడు. సోమాజిగూడలో బుధవారం రాత్రి చోటు చేసుకోగా.. గాయాలపాలైన భార్య ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుల్తానా అనే మహిళ తన భర్త అర్ధరాత్రి వరకు ఇంటర్నెట్లో మునిగిపోతుండటం భరించలేకపోయింది. ఈ క్రమంలో వైఫైను ఆఫ్ చేయటంతో ఆ భర్తకు చిర్రెత్తుకొచ్చింది. ఆమెపై పడి దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సుల్తానాను ఆమె తల్లి గురువారం ఉదయం ఆస్పత్రిలో చేర్చింది. సుల్తానా ముఖం, ఛాతీ, తలపై గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సుల్తానా తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే కేసు నమోదు చేసే ముందు వారిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చే యత్నం చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. -
బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్స్
సాక్షి, హైదరాబాద్ : వినియోగదారుల సౌకర్యార్థం బీఎస్ఎన్ఎల్ పలు ఆఫర్లు ప్రకటించింది. ఇందులో ఎస్టీవీ-99, ఎస్టీవీ-319, ప్లాన్-999, ప్లాన్-949, డేటా ఎస్టీవీ-7 ప్లాన్లు ఉన్నాయి. ఎస్టీవీ-319, 99 ప్లాన్లు ఇవాళ్టి (మంగళవారం) నుంచి అందుబాటుకి వస్తాయి. ప్లాన్ 999, 949లు ఈ నెల 15 నుంచి, డేటా ఎస్టీవీ-7 ప్లాన్ ఈ నెల 17 నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. వీటితో పాటు ఎస్టీవీ-26, ట్రిపుల్ ఏస్-333, బీఎస్ఎన్ఎల్ చౌక-444, ఇంటర్నేషనల్ వైఫై ప్లాన్లు కూడా అందుబాటులో ఉన్నట్లు వెల్లడించింది. ప్రీపెయిడ్ కస్టమర్లకు ఈ నెల 10 నుంచి యూఏఈ, యూఎస్ఏలకు ఇంటర్నేషనల్ రోమింగ్ సౌకర్యాన్ని సైతం కల్పించినట్లు పేర్కొంది. ఈ నెల 19 (సోమవారం) నుంచి 28 వరకు సంస్థ స్టోర్లలో మెగా సిమ్ మేళాలు నిర్వహిస్తామని వెల్లడించింది. ఉచితంగా 3జీ సిమ్‌లను అందజేయడంతో పాటు ప్రతి రూ.110 రీచార్జ్‌తో ఫుల్ టాక్‌టైమ్ ఇవ్వనున్నట్లు తెలిపింది. -
చౌక ఇంటర్నెట్ : రూపాయికే వై-ఫై
వై-ఫై ఇప్పుడు నిత్యావసర జాబితాలో చేరిపోయింది. వై-ఫై లేని చోటు లేదంటే అతిశయోక్తి కాదేమో! అదే వైఫై ఇప్పుడు రోజూ తాగే టీ కంటే కూడా చవగ్గా అందుబాటులోకి వచ్చేసింది. ఛాయ్ దుకాణంలో కూర్చుని ఇంటర్నెట్ సర్ఫ్ చేసుకోవడమే కాకుండా... అదే ఛాయ్ దుకాణంలో, లేదా పక్కనే ఉన్న కిరాణా షాపుల్లో వై-ఫై కూపన్లను కొనుక్కొని ఎంచక్కా వాడుకోవచ్చు. ఇందుకోసం ఢిల్లీ, బెంగళూరులోని ఈ స్టోర్లు, ప్రీ-పెయిడ్ వై-ఫై ప్యాక్స్‌లను అందించడానికి కొన్ని స్టార్టప్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. రూపాయి నుంచి రూ.20 వరకు అందరికీ అందుబాటులో ఉండేలా కూపన్లను విడుదల చేస్తున్నాయి. పట్టణాల్లోని మురికివాడలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా అత్యంత చవగ్గా వైర్లెస్ ఇంటర్నెట్ను అందించడమే లక్ష్యంగా స్టార్టప్‌లు ఈ సర్వీసులను అందిస్తున్నాయి. హరియాణా సరిహద్దులో ఉన్న ఢిల్లీలోని సంగం విహార్‌కు చెందిన ఓ స్టేషనరీ దుకాణ యజమాని బ్రహం ప్రకాశ్ ఇప్పటికే 250 వై-ఫై కూపన్లను విక్రయించాడు. రెండున్నర నెలల క్రితం తన దుకాణంలో వై-ఫై హాట్ స్పాట్‌ను ఏర్పాటు చేశాడు. ఐదు నిమిషాల పాటు వై-ఫైను ఉపయోగించుకునేందుకు రూపాయి కూపన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాడు. 15 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్యలో యువత ఎక్కువగా ఈ ప్యాక్‌లను కొనుగోలు చేస్తున్నారని అతను పేర్కొన్నాడు. రూపాయితో కొనుగోలు చేసిన వైఫైతో ఐదు నిమిషాల్లో తమకు కావాల్సిన గేములు, పాటలు డౌన్లోడ్ చేసుకుని వెళ్లిపోతున్నారని తెలిపాడు. తన వద్ద రూ.20 కూపన్లు కూడా ఉన్నాయని ప్రకాశ్ చెప్పుకొచ్చాడు. ఢిల్లీకి చెందిన 'ఐ2ఆ1', బెంగళూరుకు చెందిన 'వైఫై డబ్బా' స్టార్టప్‌లు పబ్లిక్ డేటా ఆఫీసు(పీడీవో)లు ప్రారంభించి ప్రతి ఒక్కరికి వై-ఫైని అందుబాటులోకి తెస్తున్నాయి. అంతేకాక కిరాణా స్టోర్లలో రూటర్లను ఇన్స్టాల్ చేయడం 23 శాతం పెరిగిందని తమ అనాలసిస్‌లో వెల్లడైనట్టు ఐ2ఈ1 సహ వ్యవస్థాపకుడు సత్యం ధర్మోరా చెప్పారు. బెంగళూరు వ్యాప్తంగా 600 దుకాణాల్లో తాము వై-ఫై సేవలందిస్తున్నామని, 50ఎంబీపీఎస్ స్పీడులో 100-200 మీటర్ల రేడియస్ వరకు వైఫై అందిస్తున్నామని వైఫైడబ్బా సహ వ్యవస్థాపకుడు సుభేంద్ శర్మ చెప్పారు. అయితే ఖరీదైన ప్రాంతాల్లో మాత్రం వై-ఫై కూపన్లు అమ్ముడుపోవడం లేదని ఢిల్లీకి చెందిన ఓ టీస్టాల్ యజమాని వాపోయాడు. తాను ఇప్పటి వరకు ఒక్క కూపన్ కూడా విక్రయించలేదని, వై-ఫై రౌటర్‌ను తిరిగి ఇచ్చేయాలని భావిస్తున్నట్టు తెలిపాడు. ప్రస్తుతం రూ.5 వై-ఫై కూపన్‌కు మంచి డిమాండ్ ఉందని ఓ షాప్ కీపర్ తెలిపాడు. -
వైఫై పాస్వర్డ్ ప్లీస్..
సాక్షి, న్యూఢిల్లీ : ఇండియా-న్యూజిలాండ్ మధ్య కాన్పూర్‌లో జరిగిన మూడో వన్డే సందర్భంగా క్రికెట్ వ్యాఖ్యాత మయాంతి లాంగర్, క్రికెటర్ సురేష్ రైనా మధ్య ఆసక్తికర సంభాషణ సాగింది. దీనిని మయాంతి స్క్రీన్ షాట్ తీసి ట్విటర్లో పోస్ట్ చేశారు. కాన్పూర్ వన్డే జరుగుతున్న సమయంలో మయాంతి తన మొబైల్ ఫోన్లో వైఫై నెట్వర్క్స్ చూస్తున్న సమయంలో అందులో సురేష్ రైనా అని కనిపించింది. వెంటనే మయాంతి.. సురేష్ రైనాకు వైఫై పాస్వర్డ్ చెప్పాలంటూ మెసేజ్ పెట్టింది. స్క్రీన్ షాట్ ఫొటోల్లో థర్డ్ అంఫైర్ వైఫై కూడా కనిపించడం విశేషం. మయాంతి ట్వీట్‌కు సురైష్ రైనా స్పందించలేదు.. అయితే క్రికెట్ అభిమానులు మాత్రం విపరీతంగా ప్రతిస్పందించారు. ఒకరైతే.. ధోని పాస్వర్డ్ కోసం ట్రై చేయమంటే.. మరొకరు.. రైనా దగ్గరి వ్యక్తిని అడగండి అని, ఇంకొకరు అయితే.. నో షార్ట్స్ బాల్స్ ప్లీస్ అంటూ రీ ట్వీట్ చేశారు. సురేష్ రైనా టీమిండియాకు దూరమై చాలా కాలమైంది. మళ్లీ జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు ఈ మధ్యే సురేష్ రైనా తెలిపారు. Hi 🙋🏻 @ImRaina possible to get the password to your network? 😃 #Kanpur #IndvNZ pic.twitter.com/z0FUJ31tLp — Mayanti Langer Binny (@MayantiLanger_B) 29 October 2017 -
కాలేజి విద్యార్థులకు వైఫై ఫ్రీ: జియో
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో మరో కొత్త సంచలనానికి తెరలేపనుందా?. తాజా రిపోర్టులు ఈ విషయాన్నే సూచిస్తున్నాయి. దేశంలోని మూడు కోట్ల కళాశాలలకు ఉచిత వైఫై సేవలు అందించేందుకు జియో సిద్ధపడుతున్నట్లు తెలిసింది. ఈ మేరకు జియో ఇప్పటికే మానవవనరుల శాఖ(హెచ్ఆర్డీ)కు ఓ ప్రపోజల్‌ను కూడా పెట్టినట్లు సమాచారం. గత నెలలో హెచ్ఆర్డీకు ఇచ్చిన ప్రెజెంటేషన్‌లో దేశంలోని 38 వేల కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా వైఫై సేవలు అందిస్తామని చెప్పినట్లు తెలిసింది. భవిష్యత్తులో దేశంలోని మూడు కోట్ల కళాశాలలకు ఉచిత వైఫై సేవలు ఇస్తామని చెప్పినట్లు రిపోర్టులు వచ్చాయి. దీనిపై మాట్లాడిన ఓ హెచ్ఆర్డీ అధికారి.. వైఫై సేవలు ఉచితంగా అందిస్తామని రిలయన్స్ జియో చెప్తుండటంతో ప్రాజెక్టు దానికే వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. మిగిలిన కంపెనీలకు అవకాశం ఇవ్వకుండా జియోకే పట్టం కట్టడం సరికాదు కాబట్టి టెండర్ ప్రాసెస్‌ను అమలు చేస్తామని అన్నారు. అయితే, ఉచితంగా సర్వీసులు జియో ఇస్తుంది కాబట్టి టెంబర్ దానికే వస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. -
ఇక రూ.10కే డేటా సర్వీసులు
న్యూఢిల్లీ : అతి తక్కువ ధరకే డేటా సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రత్యేకగా రూపొందించిన వై ఫై హాట్ స్పాట్ ల ద్వారా రూ.10ల కంటే తక్కువ ధరకే ఈ సేవలను అందించనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వరంగ సంస్థ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్(సీ-డాట్) అభివృద్ధి చేసిన పబ్లిక్ డాటా ఆఫీస్(పీడీవో)ను టెలికాం శాఖామంత్రి మనోజ్‌సిన్హా శుక్రవారం ప్రారంభించారు. సీ-డాట్ పీడీఓ టెక్నాలజీని 2-3 నెలల్లోనే దేశీయ తయారీదారులకు అందించాలని భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. సెల్‌ఫోన్ లేని కాలంలో పబ్లిక్ టెలిఫోన్ బూత్‌లను వినియోగించుకున్నట్టుగా డేటా ప్యాక్‌లను వినియోగించుకోవచ్చు. పబ్లిక్ టెలిఫోన్ బూత్‌ల మాదిరిగా త్వరలో పబ్లిక్ డేటా ప్యాక్‌ల బూత్‌లు రాబోతున్నాయి. ఈ బూత్‌ల ద్వారా మొబైల్ ఫోను వినియోగదారులకు చౌకగా వై-ఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ సేవలను కిరాణా స్టోర్స్, చిల్లర దుకాణలు, తోపుడు బండ్ల ద్వారా సైతం అందించే వెసులుబాటు ఉందని సిన్హా తెలియజేశారు. పీడీవో నుంచి 2జీ, 3జీ, 4జీ సిగ్నల్స్ ద్వారా వై-ఫై హాట్‌స్పాట్‌ను ఏర్పాటు చేసి 500 మీటర్ల పరిధిలో ఏకకాలంలో వంద మొబైళ్లకు నెట్ కనెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాదు ప్రస్తుతం ఉన్న మొబైల్ టవర్స్ ద్వారా కూడా ఈ సేవలను అందించే సౌలభ్యం ఉందని తెలిపారు. ప్రస్తుతం డిజిటల్ ఇండియా, దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించి లేని కారణంగా పీడీవోతో తక్కువ ధరకు బ్రాడ్ బ్యాండ్ సర్వీసులను మూలమూలల విస్తరించవచ్చని సీడీఓటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విపిన్ త్యాగి చెప్పారు. ముఖ్యంగా ఇంటర్నెట్ సేవలను ఉపయోగించుకోవడానికి అమితాసక్తిగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో దీనికి భారీ సంఖ్యలో అవకాశాలు ఉన్నాయన్నారు. అలాగే జనరల్ రీటైలర్స్ కోసం టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్‌తో సంప్రదింపులపై దృష్టిపెట్టినట్టు ఆయన తెలిపారు. సుమారు 50వేల యూనిట్లను నెలకొల్పేందుకు యోచిస్తున్నట్టు తెలిపారు. తద్వారా 10 రూపాయలు లేదా అంతకంటే తక్కువ ధరకు ఈ డేటా సర్వీసులను కొనుక్కోవచ్చని పేర్కొన్నారు. -
త్వరలో బీఎస్ఎన్ఎల్ 5జీ
హైదరాబాద్ టెలికం జిల్లా పీజీఎం రాంచంద్ర సిటీబ్యూరో: బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలను త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు హైదరాబాద్ టెలికం జిల్లా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ కె.రాంచంద్ర తెలిపారు. బీఎస్ఎన్ఎల్ భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలపై ఇప్పటికే నోకియాతో ఒప్పందం కుదురిందని, 4జీ టెండర్ ప్రక్రియ పూర్తయిందని వెల్లడించారు. ఇందుకోసం త్వరలో 4జీ 339 బీటీఎస్, 3జీ 464 బీటీఎస్, 2జీ 464 బీటీఎస్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే నగరంలో 2జీ 1178 బీటీఎస్, 3జీ 1101 బీటీఎస్‌లు పనిచేస్తున్నాయని చెప్పారు. అదనంగా మెట్రో కారిడార్‌లో 39 బీటీఎస్‌లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. నాగోల్ వద్ద ఒక బీటీఎస్ ప్రారంభించగా, మరో 21 బీటీఎస్‌ల ఏర్పాటుకు మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. సొంతంగా వైఫై హాట్‌స్పాట్స్.. బీఎస్ఎన్ఎల్ సొంతంగా 51 హాట్స్పాట్లను ఏర్పాటు చేసి 381 కేంద్రాలకు అనుసంధానం చేసేందుకు చర్యలు చేపట్టిందని పీజీఎం ప్రకటించారు. ఇప్పటికే మైత్రివనం, ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రి, కోఠిలలో హాట్స్పాట్లను ఏర్పాటు చేసిందన్నారు. మరోవైపు ప్రైవేట్ సంస్థ ఒప్పందంతో 42 హాట్స్పాట్లు కొనసాగుతున్నాయన్నారు. బీఎస్ఎన్ఎల్.. టాటా సంస్థతో కలిసి అంతర్జాతీయ వైఫై సేవలు కూడా ప్రారంభించిందని పేర్కొన్నారు. విదేశాలకు వెళ్లే పర్యాటకులకు ఈ సేవలు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. టెలిఫోన్ ఎక్చేంజ్‌ల ఆధునికీకరణ.. బీఎస్ఎన్ఎల్ టెలిఫోన్ ఎక్చేంజ్‌లను నూతన టెక్నాలజీతో ఆధునికీకరిస్తున్నుట్లు పీజీఎం తెలిపారు. న్యూ జనరేషన్ నెట్వర్క్ ఫేస్–2 ప్రాజెక్ట్‌లో భాగంగా 42 ఎక్చేంజ్‌లను 100.5కే పరికరాలతో ఆధునికీకరించిన్నట్లు పేర్కొన్నారు. మూడు విడతల్లో భాగంగా 200కే పరికరాలతో ఆధునికీకరించనున్నట్లు చెప్పారు. ఈ ఏడాది 3,250 లైన్ల సామర్థ్యం ఉన్న ఏడు ఎక్చేంజ్‌లను ఏర్పాటు చేశామన్నారు. త్వరలో మల్టీమీడియా వీడియో కాన్ఫరెన్స్ సేవలు కూడా ప్రారంభిస్తామన్నారు. రూ.510 కోట్ల రెవెన్యూ.. హైదరాబాద్ టెలికం జిల్లా 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ.510 కోట్ల రెవెన్యూ సాధించిందని పీజీఎం వెల్లడించారు. ప్రస్తుతం 3.48 లక్షల ల్యాండ్‌లైన్, 71వేల బ్రాడ్‌బ్యాండ్, 13వేల ఎఫ్టీటీహెచ్, 9.56 లక్షల మొబైల్ ప్రీపెయిడ్, 76వేల పోస్ట్‌పెయిడ్ కనెక్షన్లు ఉన్నాయ న్నారు. జీఎం సత్యానందం, రవిచంద్ర, సీతారామరాజు పాల్గొన్నారు. -
హైదరాబాద్ సిటీ ఏసీ బస్సుల్లో ఫ్రీ వైఫై
-
75 ఏసీ బస్సుల్లో వైఫై
సాక్షి , హైదరాబాద్: సిటీ ఏసీ బస్సుల్లో 4జీ ఎరుుర్‌టెల్ వైఫై సదుపాయం అందుబాటులోకి వచ్చింది. కొంతకాలంగా ప్రయోగాలకే పరిమితమైన ఈ సదుపాయాన్ని ఎట్టకేలకు 75 బస్సుల్లో ఏర్పాటు చేశారు. బుధవారం బస్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎండీ రమణారావు లాంఛనంగా ఈ సదుపాయాన్ని ప్రారంభించారు. ప్రయాణికుల స్పందన, డిమాండ్‌కు అనుగుణంగా దశల వారీగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఏసీ, సూపర్ లగ్జరీ, ఎక్స్‌ప్రెస్ బస్సులకు సైతం వైఫై సదుపాయాన్ని విస్తరించనున్నట్లు సోమారపు తెలిపారు. మొదటి దశలో 75 సిటీ మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లో ప్రారంభించగా, రెండో దశలో 115 ఏసీ బస్సులకు అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. నోట్ల రద్దు వల్ల ఆర్టీసీ తీవ్ర నష్టానికి గురైందన్నారు. మొదట రోజుకు రూ.కోటి చొప్పున నష్టం వచ్చిందని, ఆ తరువాత క్రమంగా పరిస్థితి కొంత మేరకు మెరుగుపడిందని చెప్పారు. గో రూరల్ ఇండియా సంస్థ సహకారంతో ఫోర్ జీ వైఫై సదుపాయాన్ని ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పురుషోత్తం, ఆర్ఎం కొంరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ రూట్లలో వైఫై... ► ఎల్బీనగర్ - లింగంపల్లి (222ఎల్) రూట్లో 20 బస్సులు ► దిల్సుఖ్నగర్-లింగంపల్లి (218డి) రూట్లో 23 బస్సులు ► ఉప్పల్-లింగంపల్లి (113 కె/ఎల్) 10 బస్సులు ► ఉప్పల్-వేవ్‌రాక్ (113 ఎం/డబ్ల్యూ) 8 బస్సులు ► ఈసీఐఎల్-వేవ్‌రాక్ (17హెచ్) 14 బస్సులు వినియోగం ఇలా... ► బస్సులోకి ప్రవేశించగానే వైఫై సిగ్నళ్లు అందుతారుు. వినియోగదారులు వైఫై సేవలను పొందేందుకు మొబైల్లో ఎంపిక చేసుకున్న వెంటనే ఒక పాస్వర్డ్ వస్తుంది. ► ఈ పాస్వర్డ్ ఆధారంగా ఎరుుర్‌టెల్ ఫోర్ జీ వైఫై సేవలను పొందవచ్చు. ► మొదటి 20 నిమిషాలు ఉచితం. ఎలాంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదు. ఆ సమయంలో తమకు కావలసిన డాటా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ► ఆ తరువాత ఆన్లైన్ పేమెంట్ ద్వారా రూ.25 చెల్లించి 100 ఎంబీ డాటా పొందవచ్చు. దీనిని 24 గంటల పాటు వినియోగించుకొనే సదుపాయం ఉంటుంది. -
ఏసీ బస్సుల్లో వైఫై ప్రారంభం
హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త. ఏసీ బస్సుల్లో ఫ్రీ వైఫై అందుబాటులోకి వచ్చింది. నగరంలో తిరిగే ఏసీ బస్సుల్లో ఇక నుంచి అరగంటపాటు ఉచిత వైఫై వాడుకునే అవకాశం కల్పించారు. ఏసీ బస్సుల్లో 4జీ వైఫై సౌకర్యాన్ని సంస్థ చైర్మన్ సోమవారపు సత్యనారాయణ, ఎండీ రమణారావులు బుధవారం ప్రారంభించారు. ఈ బస్సుల్లో మొదటి 20 నిమిషాలు ఉచితంగా వైఫై వినియోగించుకోవచ్చని, ఆ తరువాత అరగంటకు చార్జీ చెల్లించాల్సి ఉంటుందన్నారు. దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్సుల్లో ప్రవేశపెడతామని చైర్మన్ తెలిపారు. మొదటి విడతలో 115 ఏసీ బస్సుల్లో ఫ్రీ వైఫై సౌకర్యం కల్పించారు. కాగా, పెద్ద నోట్ల రద్దుతో చిల్లర లేక ప్రజలు బస్సులు ఎక్కడం తగ్గిందని, దాంతో ఆర్టీసీ రోజుకు రూ. 60 లక్షల ఆదాయం కోల్పోతున్నట్లు ఆయన తెలిపారు. -
'వైఫై మనల్ని చంపేస్తుంది'
లండన్: టెక్నాలజీ డెవలప్మెంట్ మన జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆస్కార్ విన్నింగ్ సింగర్ అడెలె ఆందోళన చెందుతోంది. మరో 25 ఏళ్లలో వైర్లెస్ ఇంటర్నెట్ టెక్నాలజీ అందరి మరణానికి కారణమౌతుందని అంచనావెస్తుంది. టెక్నాలజీ మనుషుల జీవితాలను డామినేట్ చేస్తుందని ఇది అంత మంచిది కాదని ఫీమేల్ ఫస్ట్‌తో మాట్లాడుతూ అడెలె వెల్లడించింది. ప్రజలు నిజానికి వారి ముందున్న క్షణాన్ని ఆస్వాదించకుండా.. ఫోటోలపైనే దృష్టి పెడుతున్నారని అంది. 'గతంలో నేను షో చేస్తున్న సమయంలో ఎవరివద్దా ఎక్కువగా మొబైల్ ఫోన్స్ ఉండేవి కావు. కాబట్టి నేను జనాల కోసం స్టేజిపైకి వెళ్లేదాన్ని. ఇప్పుడు మాత్రం ఫోన్ల కోసం వెళ్తున్నట్లుగా ఉంది' అని అడెలె అసహనం వ్యక్తం చేసింది. ఇప్పుడు వాస్తవ ప్రపంచంలోకి ఎవరూ చూడటం లేదని.. అందరూ ఫోన్లలోనే ఉంటున్నారని అంది. రాబోయే కాలంలో వైఫై మూలంగా తీవ్ర పరిణామాలు తప్పవని చెప్పుకొచ్చింది. -
ఏసీ బస్సుల్లో వైఫై..
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని 5 మార్గాల్లో తిరిగే 115 ఏసీ బస్సుల్లో వైఫై సదుపాయాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పురుషోత్తమ్ తెలిపారు. ఈ సౌకర్యం అక్టోబర్ 1 నుంచి అందుబాటులోకి వస్తుందన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గో గ్రీన్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తేనుందన్నారు. దిల్సుఖ్నగర్–లింగంపల్లి, కుషాయిగూడ–వేవ్‌రాక్, ఉప్పల్–వేవ్‌రాక్, ఎల్బీనగర్–పటాన్చెరు, ఉప్పల్–లింగంపల్లి మార్గాల్లో నడిచే ఏసీ బస్సుల్లో వైఫై అమల్లోకి రానుందన్నారు. ఈ బస్సుల్లో మొదటి 20 నిమిషాలు ఉచితంగా వైఫై వినియోగించుకోవచ్చని, ఆ తరువాత అరగంటకు చార్జీ చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ ప్రయాణికులు తమ ఇంట్లో వైఫై సదుపాయం ఉంటే ఆ పాస్‌వర్డ్‌పై బస్సుల్లో ఎంతసేపైనా ఉచితంగా వినియోగించుకునే వెసులుబాటు ఉందని వివరిచారు. కొత్త రూట్లకు బస్సుల విస్తరణ సిటీ బస్సులను కొత్త రూట్లలో విస్తరించేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. గత ఏడాది కాలంగా నిర్వహిస్తున్న ‘డయల్ యువర్ ఆర్టీసీ ఆఫీసర్’ కార్యక్రమంలోప్రయాణికుల నుంచి అందిన సలహాలు, సూచనల ఆధారంగా రిసాలాబజార్–గచ్చిబౌలి (5ఆర్జీ) రూట్లో నాలుగు మెట్రో డీలక్స్ బస్సులను నడుపుతారు. వనస్థలిపురం ఎన్జీవోస్ కాలనీ నుంచి కేపీహెచ్‌బీ (186 రూట్) వరకు మరో 8 బస్సులు తిరుగుతాయి. ఈసీఐఎల్ క్రాస్‌రోడ్స్ నుంచి గచ్చిబౌలి (6ఎల్జీ) రూట్‌ను కొత్తగా పరిచయం చేయనున్నారు. ఈ రూట్లో కొన్ని లాలాపేట్ మీదుగా, మరికొన్ని నాచారం మీదుగా గచ్చిబౌలికి రాకపోకలు సాగిస్తాయి. ఇవి కాకుండా మరో 21 సిటీ ఆర్డినరీ బస్సులను పలు మార్గాల్లో నడిపేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. -
పెంచలకోనలో ఉచిత వైఫై సేవలు
రాపూరు: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో క్షేత్ర వివరాలను తెలిపే వెబ్సైట్, ఉచిత వైఫై సేవలను వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ శుక్రవారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం వెబ్‌సైట్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. వెబ్సైట్ ద్వారా కోనలో జరిగే నిత్య కార్యక్రమాలు తెలుసుకోవచ్చునని వివరించారు. వెబ్‌సైట్‌ను మారెళ్ల చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకుడు సంపత్ రూపొందించినట్లు తెలిపారు. అలాగే పెంచలకోనలో సెల్ సిగ్నల్స్ అందక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతుండడాన్ని దృష్టిలో ఉంచుకుని ఉచిత వైఫై సేవలను ప్రారంభించినట్లు తెలిపారు. రూ.3లక్షల విలువ చేసే వైఫై హాట్‌స్పాట్‌ను హైదరాబాదుకు చెందిన సంస్థ ఉచితంగా అందించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నానాజీ, గూడూరు డీఎస్పీ శ్రీనివాస్, ఈఓ శ్రీరామమూర్తి, ధర్మకర్తలు సోమయ్య, గోపాల్, తదితరులు పాల్గొన్నారు. -
విమానాల్లో వైఫై వాడొచ్చు
- కాల్స్‌కూ అవకాశం - వచ్చే నెల నుంచి ప్రారంభం - తుది ఆమోదమే తరువాయి న్యూ ఢిల్లీ : విమానాల్లో సెల్‌ఫోన్ సేవలకు లైన్ క్లియర్ అవనుంది. రానున్న పది రోజుల్లో ఈ దిశగా సానుకూల నిర్ణయం వెలువడనుందని పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఆర్ఎన్ చౌబే తెలిపారు. విమానాల్లో వైఫై అనుమతించే అంశంపై పౌర విమానయాన, టెలికం, హోం శాఖలు దృష్టి సారించాయని ఆయన చెప్పారు. ఇందుకు కేబినెట్ అనుమతి అవసరం పడకపోవచ్చన్నారు. డేటా వినియోగానికి అనుమతించినప్పుడు కాల్స్ చేసుకునేందుకు కూడా అనుమతి లభించవచ్చన్నారు. విమానాల్లో వైఫై సేవలు అనుమతించే ప్రతిపాదన కేంద్ర ముందు ఎప్పటి నుంచో ఉంది. భద్రతాపరమైన అంశాల దృష్ట్యా దీనిపై ఇంతవరకు ఓ నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో డేటా, కాల్స్‌ను భద్రతా సంస్థలు పర్యవేక్షించడం వంటి అంశాలపై చర్చ జరిగిందని చౌబే వెల్లడించారు. అవసరమైతే భద్రతా సంస్థలు వివరాలు పొందవచ్చని, ట్రాక్ కూడా చేయవచ్చని చెప్పారు. ప్రస్తుతం దేశీయంగా అన్ని విమానాల్లోనూ వైఫై సర్వీసులను అనుమతించడం లేదు. కానీ, ప్రపంచ వ్యాప్తంగా చాలా ఎయిర్‌లైన్స్ సంస్థలు తమ ప్రయాణికులకు వైఫై సేవలు అందిస్తున్నాయి.అయితే, భారత గగనతలంలోకి ప్రవేశించగానే ఆ సేవలను నిలిపివేస్తున్నాయి. ఇవి తొలుత కొంత సమయం పాటు ఉచితంగా వైఫై అందిస్తూ... ఆ పై వినియోగానికి చార్జీలు వసూలు చేస్తున్నాయి. అయితే, దేశీయంగానూ వైఫై సేవలకు అనుమతి లభిస్తే... ఎయిర్‌లైన్ సంస్థలకు అదనపు ఆదాయం సమకూరనుంది. అయితే, ఈ సేవలు అందించడం తప్పనిసరి కాబోదు. ఆయా సంస్థల ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది. -
అన్నవరంలో అరగంట ఉచిత ‘వైఫై’
అన్నవరం దేవస్థానంతో బెంగళూరుకు చెందిన కంపెనీ ఒప్పందం సెల్ సిగ్నల్స్ స్పష్టంగా అందించేందుకు ఏంటెన్నాల ఏర్పాటు ట్రాన్స్‌పోర్టు, సహజ కాంట్రాక్ట్ సిబ్బంది వేతనాల పెంపు ఘాట్‌రోడ్ ముఖద్వారంలో హైమాక్స్ దీపాలు దేవస్థానం ట్రస్ట్ బోర్డు తీర్మానాలు అన్నవరం : అన్నవరం దేవస్థానానికి వచ్చే భక్తులు ఇకపై అరగంట పాటు ఉచితంగా ‘వైఫై’ సదుపాయం పొందవచ్చు. ఇందుకు బెంగళూరుకు చెందిన ‘బాల్గో ఇన్ఫ్రా’ సంస్థ దేవస్థానంతో ఒప్పందం కుదుర్చుకోనుంది. శనివారం దేవస్థా నం చైర్మన్ రాజా ఐవీ రోహిత్, ఈఓ కె.నాగేశ్వరరావు, అధికారులతో జరిగిన ట్రస్ట్‌బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆ సంస్థ ఐదు ప్రముఖ సెల్‌ఫోన్ సర్వీస్ ప్రొవైడర్స్ సిగ్నల్స్ అందించేందుకు దేవస్థానంలో ఐదు ఏంటెన్నాలను ఏర్పాటు చేస్తుందని, ఏంటెన్నాకు నెల కు రూ.ఐదు వేలు అద్దె చెల్లిస్తుంది. తద్వారా భక్తులకు పూర్తి స్థాయిలో సెల్‌ఫోన్ సిగ్నల్స్ అందుబాటులోకి రావడంతో పాటు మొదటి అరగంట ‘వైఫై’ సిగ్నల్స్ ఉచితంగా వాడుకోవచ్చు. దేవాదాయ శాఖ కమిషనర్ అనుమతి కూడా లభించింది. మున్ముందు మరో రెండు సెల్‌ఫోన్ సర్వీస్ ప్రొవైడర్ల సేవలు కూడా ఆ కంపెనీ అందుబాటులోకి తెస్తుంది. సమావేశంలో పలు అంశాలను తీర్మానించారు. ముఖ్యమైన తీర్మానాలు –రత్నగిరి ఘాట్‌రోడ్‌లోని ఆర్చి గేటు ముందు రూ.6.60 లక్షలతో హైమాక్స్ విద్యుద్దీపాలు ఏర్పాటు l దేవస్థానం ట్రాన్స్‌పోర్టులో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కండక్టర్లు, కాంట్రాక్ట్ కండక్టర్ల వేతనం రూ.8,500కు, అలాగే కాంట్రాక్ట్ డ్రైవర్లకు వేతనం రూ.10,500కు పెంచేలా కమిషనర్‌కు నివేదిక. –సహజ ప్రకృతి చికిత్సాలయ సిబ్బందిలో మసాజర్స్, ఇతర స్కిల్డ్ ఉద్యోగుల వేతనాన్ని రూ.7,500కి, సెంట్రీ, నైట్ వాచ్‌మన్ వంటి అన్‌స్కిల్డ్ ఉద్యోగుల వేతనాన్ని రూ.6,500కు పెంచేందుకు నిర్ణయం. –దేవస్థానంలో విద్యుత్ ఆదా చర్యల్లో భాగంగా పాత మోటార్ల స్థానంలో 5స్టార్ రేటింగ్ కలిగిన 11 సబ్మెర్సిబుల్ మోటార్లను రూ.ఏడు లక్షలతో కొనుగోలు చేసేందుకు టెండర్ పిలించేందుకు నిర్ణయం. –సీతారామ సత్రం ఉత్తరం వైపు బ్లాక్‌లో రూ.9.90 లక్షలతో బాత్రూమ్స్లో కొత్తగా టైల్స్ ఏర్పాటు, కొత్త పైపులు వేయడం వంటి పనులకు టెండర్ల ఆహ్వానం. అనంతరం దక్షణం వైపు బ్లాక్ మరమ్మతులకు కూడా టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకున్నారు. -
ఇతరుల వైఫై వాడితే కఠిన చర్యలు..
రియాద్: ఇంటర్ నెట్ కోసం ఇతరుల వైఫై(వైర్ లెస్ ఫెడిలిటీ)ని వారి అనుమతి లేకుండా వాడితే చోరీగా భావించి కఠిన చర్యలు తీసుకుంటామని సౌదీ అరేబియాలో ఫత్వా జారీ చేశారు. వైఫై వాడకాన్ని చోరీగా పరిగణించాలని ఫత్వాలో అధికారులు పేర్కొన్నారు. సౌదీ అరేబియా రాజుకు సలహాలిచ్చే అధికారి అలీ అల్ హకామీ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. వైఫై వాడాలనుకుంటే ఆయా వ్యక్తుల పర్మిషన్ తీసుకోవాలని లేదంటే చర్యలు తప్పవని హై స్కాలర్స్ కమిషన్ సభ్యుడు వెల్లడించారు. పార్కులు, ప్రైవేట్ షాపింగ్ మాల్స్, హోటల్స్, ప్రభుత్వ కార్యాలయాలలో పాస్ వర్డ్ లేకుండా ఉన్న వైఫై సౌకర్యాన్ని ఎవరైనా యూజ్ చేసుకోవచ్చునని, అలాంటి సందర్భాలలో ఇది నేరం కింద పరిగణించమని స్పష్టం చేశారు. ఇతర దేశాలలో ప్రభుత్వ నియమాలు, చట్టాలు ఎలాగైతే ఉన్నాయో ఇక్కడ మాత్రం ఫత్వా అంటే చట్టంతో సమానం. గతంలో కూడా మహిళలు ఫుట్ బాల్ మ్యాచ్ లు చూడటం, వారు కుర్చీలలో కూర్చోవటం, కొన్ని రకాల పండ్లను తినరాదని, ఏ వ్యక్తి కూడా మార్స్ మీదకు వెల్లకూడదని.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఫత్వాలు జారీ అయిన విషయం తెలిసిందే. -
వైఫై స్థానంలో లైఫై
హైదరాబాద్: ప్రస్తుతం ఇంటర్నెట్ వినియోగానికి మనం వాడుతున్న వైఫై (వైర్లెస్ ఫిడిలిటీ) స్థానంలో లైఫై అందుబాటులోకి రానుందని ఏపీ రాష్ట్ర సహకార, రిజిస్ట్రేషన్ల విభాగం ప్రత్యేక కమిషనర్ ఎంవీ శేషగిరి బాబు చెప్పారు. వైర్లెస్ విధానంలో వేగవంతమైన ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించేందుకు రేడియో తరంగాలను ఉపయోగించుకునే నెట్ వర్కింగ్ టెక్నాలజీని వైఫై అంటుంటారు. లైఫైలో కాంతి తరంగాల ద్వారా మరింత వేగంగా సమాచార మార్పిడి జరుగుతుంది. ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ (ఇ-గవర్నెన్స్) లీడర్షిప్ ప్రోగ్రాంలో భాగంగా దేశ వ్యాప్తంగా 15 మంది ఐఏఎస్ అధికారులు యూరప్‌లోని ఇస్తోనియాలో శిక్షణ పొంది వచ్చారు. ప్రపంచంలో నూటికి నూరు శాతం డిజిటల్ అక్షరాస్యత సాధించిన దేశంగా గుర్తింపు పొందిన ఇస్తోనియాలో పదేళ్ల కిందటే ప్రభుత్వంలోని అన్ని లావాదేవీలు, ఉత్తరప్రత్యుత్త్తరాలు కంప్యూటర్ల ద్వారానే సాగుతున్నాయి. భూమి రికార్డులు, రిజిస్ట్రేషన్లు అన్నీ కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తారు. ప్రతి పౌరునికీ రెండు రకాల గుర్తింపు కార్డులు ఇస్తారు. ఒకటి మొబైల్ ఫోన్ ఐడీ, రెండోది స్మార్ట్‌కార్డు ఐడీ. ఈ రెండింటితోనే అన్ని పనులూ జరుగుతాయి. చివరకు ఓటు కూడా ఇంటినుంచే వేయవచ్చు. ప్రభుత్వ శాఖల్లోని ఫైళ్ల కదలికలు సైతం కంప్యూటర్ల ద్వారానే నిర్వహిస్తున్నారు. దీనివల్ల అవినీతి మాసిపోయింది. సేవల్లో వేగం పెరిగింది. పారదర్శకత పెరిగింది. ఇ-డెమోక్రసీ ద్వారా జనం తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలుపవచ్చు. దీంతోపాటు వ్యక్తిగత సమాచారాన్నీ ఎవరికి ఇవ్వాలో, ఎవరికి ఇవ్వకూడదో కూడా నిర్ణయించే హక్కు పౌరునికి ఉంటుందని’ శేషగిరిబాబు వివరించారు. తన శిక్షణకు సంబంధించి ప్రభుత్వానికి ఓ సమగ్ర నివేదిక సమర్పించనున్నట్టు తెలిపారు -
యాప్ కాఫీ
రోజూ ఉదయాన్నే ఒకే టైమ్‌కు నిద్ర లేవాలంటే ఏం చేస్తాం.. అలారంలో టైమ్ సెట్ చేసి పెట్టుకుంటాం. మరి రోజూ అదే టైమ్‌కి చేతిలోకి కాఫీ రావాలంటే..? అలాగే కాఫీ పెట్టుకోవాల్సిన టైమ్‌లో మీరు ఎక్కడో బయట ఉన్నా సరే.. ఇంటికొచ్చే సరికి కాఫీ రెడీగా ఉండాలంటే..? ఇదెలా సాధ్యం అనుకునేవారికి.. పెద్ద షాక్ ఇచ్చేందుకే వచ్చాడు ‘మిస్టర్ కాఫీ’.. దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ టెక్నాలజీతో తయారు చేశారు. ఈ మిస్టర్ కాఫీ పనితీరు గురించి వింటే ఎవరైనా ఆశ్చర్యపోక తప్పదు. మీ ఫోన్లో వైఫై ఉంటే చాలు. ఆఫీస్, సినిమా థియేటర్.. ఇలా ఎక్కడున్నా ఇంటికెళ్లే ఏడు నిమిషాల ముందు మీ ఫోన్లో ఒక్క బటన్ నొక్కితే చాలు.. ఇంట్లో కాఫీ రెడీ అయిపోతుంది. ఇంకేముంది వెళ్లగానే వేడి వేడి కాఫీని లాగించేయొచ్చు. అంతేకాదు.. ఇంట్లో ఉండి కూడా ఒక్కోసారి కాఫీ పెట్టుకోవాలంటే బద్దకిస్తుంటాం. కానీ ఈ మిస్టర్ కాఫీకి ఒక్కసారి టైమ్ సెట్ చేస్తే చాలు.. వారం రోజులపాటు అదే టైమ్‌కు కాఫీ ఆటోమెటిక్‌గా రెడీ అయిపోతుంది. -
ఏసీ బస్సుల్లో వైఫై ఫ్రీ....
* దశలవారీగా మెట్రో ఎక్స్‌ప్రెస్‌లకు విస్తరణ * మొదటి అరగంట ఉచితం * రెండు రూట్లలో ప్రయోగాత్మకంగా అమలు సాక్షి, సిటీబ్యూరో: ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు త్వరలో వైఫై సదుపాయం అందుబాటులోకి రానుంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని వివిధ రూట్లలో నడిచే 80 మెట్రో లగ్జరీ, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే 29 పుష్పక్ లతో కలిపి వందకు పైగా ఏసీ బస్సుల్లో వైఫై ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం సికింద్రాబాద్ జూబ్లీబస్‌స్టేషన్ నుంచి ఎయిర్‌పోర్టు వరకు, ఉప్పల్ నుంచి వేవ్‌రాక్ వరకు 2 మార్గాల్లో త్వరలో ప్రయోగాత్మకంగా వైఫై సదుపాయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటీవ్ డెరైక్టర్ పురుషోత్తమ్ బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ రెండు మార్గాల్లోని ఫలితాలను పరిశీలించిన అనంతరం అన్ని ఏసీ బస్సులకు వైఫై సేవలను విస్తరిస్తారు. భవిష్యత్తులో మెట్రో డీలక్స్, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కూడా ఈ సదుపాయాన్ని అం దుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. మొదటి 30 నిమిషాలు ఉచితంగా ఉంటుంది. ఆ తరువాత చార్జీ చేస్తారు. ఈ మేరకు ‘గో రూరల్ ఇండియా’ అనే సంస్థతో ఆర్టీసీ తాజాగా ఒప్పందం ఏర్పాటు చేసుకుంది. ప్రస్తుతానికి మాత్రం ఏసీ బస్సుల్లోనే వైఫై సేవలు అందుబాటులోకి వస్తాయి. మహా త్మాగాంధీ, జూబ్లీబస్స్టేషన్లలో ఇప్పటికే వైఫై సేవలను ఏర్పాటు చేసిన ఆర్టీసీ అదే తరహాలో ప్రయాణికులను ఆకట్టుకొనే చర్యల్లో భాగంగా ఏసీ బస్సులకు సైతం విస్తరిం చేందుకు సన్నాహాలు చేపట్టింది. నగరంలోని వివిధ మార్గాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి నడుస్తున్న పుష్పక్ బస్సుల్లోనూ, మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లోనూ ప్రయాణికుల ఆదరణ తక్కువగా ఉన్న దృష్ట్యా ప్రయాణికులను పెంచుకొనేందుకు గ్రేటర్ ఆర్టీసీ ఈ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. పుష్పక్ బస్సుల్లో వెహికల్ ట్రాకింగ్... వైఫై సదుపాయంతో పాటు పుష్పక్ బస్సులన్నింటిలో ‘వెహికల్ ట్రాకింగ్, ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ వ్యవస్థ’ ను అమ లు చేస్తారు. దీంతో పుష్పక్ బస్సుల కోసం ఎదురు చూసే ప్రయాణికులకు ముందస్తుగానే సమాచారం లభిస్తుంది. బస్టాపుల్లో ఏర్పాటు చేసిన డిస్‌ప్లేబోర్డులపై ఏ బస్సు ఎక్కడ ఉందనే సమాచారం ప్రద ర్శిస్తారు. అలాగే బస్సుల్లోనూ రాబోయే స్టేషన్ల ప్రదర్శనతో పాటు, అనౌన్స్మెంట్ కూడా ఉంటుంది.ప్రస్తుతం నగరంలోని 1200 మెట్రో డీలక్స్, ఏసీ బస్సుల్లో ఈ వెహికల్ ట్రాకింగ్, ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ వ్యవస్థ అమలవుతుంది. జాతీయ,అంతర్జాతీయ స్థాయి ప్రయాణికులను ఆకట్టుకోవడంతో పాటు, ఆదరణ పెంచుకొనే చర్యల్లో భాగంగా పుష్పక్ బస్సులన్నింటికీ ఈ వ్యవస్థను విస్తరించనున్నారు. అలాగే రూ.2.20 కోట్ల వ్య యంతో పుష్పక్ బస్సుల్లో సమూలమైన మార్పులు చేయనున్నట్లు ఈడీ తెలిపారు. బస్సు బాడీలను కొత్తగా ఏర్పాటు చేస్తారు. కలర్‌కోడ్ కూడా మారుతుంది. జూబ్లీబస్‌స్టేషన్, బీహెచ్ఈఎల్, జేఎన్టీయూ నుంచి 29 బస్సులు ప్రతిరోజు ఉదయం 3.30 గంటల నుంచి రాత్రి ఒంటిగంట వరకు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రయాణికులకు చేరువయ్యేందుకు.... * వెహికల్ ట్రాకింగ్,ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ వ్యవస్థలో భాగంగా ‘హైదరాబాద్ మెట్రో బస్’ మొబైల్ యాప్ ద్వారా * ఏ బస్సు ఎక్కడ ఉందో తెలుసుకొనే సదుపాయాన్ని ప్రవేశపెట్టనున్నారు. * హైదరాబాద్-బెంగళూర్ రూట్లో ‘ఫైండ్ టీఎస్ఆర్టీసీ’ పేరుతో ఈ యాప్ అందుబాటులోకి రానుంది. * 2010-2015 మధ్య కాలంలో జెఎన్ఎన్యూఆర్ఎం పథకంలో భాగంగా కొనుగోలు చేసిన 650 బస్సులను సమూలంగా మార్చేందుకు చర్యలు చేపట్టారు. ఈ ఏడాది 300 బస్సులు, వచ్చే ఏడాది 350 బస్సుల్లో ఇంజన్, చాసీస్ మినహాయించి బస్సు బాడీలను, సీట్లను, అన్నింటిని కొత్తగా ఏర్పాటు చేస్తారు. ఇప్పటి వరకు 20 బస్సులను ఈ తరహాలో అభివృద్ధి చేశారు. * త్వరలో ప్రారంభం కానున్న మియాపూర్-ఎస్సార్‌నగర్ మెట్రో రైలుకు అనుసంధానంగా జీడిమెట్ల-గచ్చిబౌలి రూట్లో 4 కొత్త బస్సులను ప్రవేశపెట్టనున్నారు. ప్రతి అరగంటకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది. * మెట్రో పనుల కారణంగా నిలిపివేసిన వనస్థలిపురం-కేపీహెచ్‌బీ (186) రూట్ బస్సును త్వరలో ప్రారంభిస్తారు. ఈ మార్గంలో ప్రతి 25 నిమిషాలకు ఒకటి చొప్పున 8 బస్సులు రాకపోకలు సాగిస్తాయి. -
డ్రైవర్ లేకుండానే మెట్రో రయ్ రయ్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో త్వరలో డ్రైవర్ రహిత రైళ్లు పట్టాలెక్కనున్నాయి. డ్రైవర్ రహిత రైళ్లను బుధవారం ఢిల్లీ మెట్రో రైల్వే కార్పొరేషన్ (డీఎంఆర్సీ) పరీక్షించింది. ఫేస్ 3 కింద రెండు కారిడార్లను ఈ పరిధిలోకి తీసుకురానున్నారు. వైఫై సౌకర్యం, సెల్ ఫోన్ ఛార్జింగ్ కోసం ప్రత్యేక యూఎస్బీ డివైస్ అందుబాటులో ఉంటాయి. ఈ ఏడాది చివరికల్లా డ్రైవర్ లేకుండా నడిచే ఈ మెట్రో రైళ్లు రాజధానిలో పరుగులు పెట్టనున్నాయని మెట్రో ఎండీ మంగు సింగ్ వెల్లడించారు. మొదటగా డ్రైవర్ పర్యవేక్షణలో ఓ ఏడాది రైళ్లను నడిపి 100 శాతం సక్సెస్ సాధించాక డ్రైవర్ రహిత రైళ్లను ప్రారంభిస్తామన్నారు. దక్షిణ కొరియాలో తయారైన ఐదు డ్రైవర్ రహిత రైళ్లను ఇటీవలే దిగుమతి చేసుకున్నారు. ఇవి ఇప్పటికే ఢిల్లీలోని ముకుంద్‌పూర్ డిపోకు చేరుకున్నాయి. మరో మూడు రైళ్లు 'సిగ్నలింగ్ సిస్టమ్, ఎలెక్ట్రికల్ ఫిటింగ్స్‌తో అనుసంధానించి డ్రైవర్ రహిత రైళ్లను పరీక్షించనున్నారు. స్పెషల్ రైళ్లు ఒక్కసారి 1866 మంది ప్రయాణికులను గమ్యానికి చేర్చుతాయి. డ్రైవర్ క్యాబిన్ తీసివేయడంతో 40 మంది ప్రయాణించేందుకు అవకావం ఉంది. ఈ రైళ్లకు 6 కోచ్‌లు ఉంటాయి. మజ్లిస్ పార్క్-శివ్ విధార్ ల మధ్య 58.5 కిలోమీటర్లు, నొయిడాలోని బొటానికల్ గార్డెన్-జానక్పూరి పశ్చిమ ఢిల్లీ ల మధ్య 38 కి.మీ మేర ఇప్పటికే ట్రయల్ రన్ సాఫీగా సాగిపోతున్న విషయం తెలిసిందే. ఫేస్ 3లో డ్రైవర్ రహిత రైళ్లను ప్రవేశపెట్టే సమయంలో ప్రాథమిక పరీక్షల్లో సిబ్బంది అందుబాటులో ఉంటారు. అయితే పరీక్షలన్నీ పూర్తయ్యాక సిబ్బంది లేకుండా రైళ్లను నడుపుతాం' అని ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ ఓ ప్రతినిధి చెప్పారు. 56 కిలో మీటర్ల దూరాన్ని 12 నిమిషాల్లో చేరుకునే వేగంతో ఈ రైళ్లు పరుగులు పెట్టడం విశేషం. -
ఓలా క్యాబ్ ల్లో ఆటో వైఫై !
న్యూఢిల్లీ: మైక్రో, మినీ క్యాబ్‌లతో పాటు ఆటోల్లోనూ వైఫై సేవలనందించాలని ట్యాక్సీ అగ్రిగేటర్ ఓలా యోచిస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీ ప్రైమ్ కేటగిరి వినియోగదారులకు కారులో వైఫై సర్వీసులందిస్తోంది. తమ క్యాబ్‌లో ప్రయాణించే వినియోగదారులకు ఆటోమేటిక్‌గా ఇంటర్నెట్కు కనెక్ట్ అయ్యేలా వైఫై సర్వీస్‌ను అందిస్తున్నామని ఓలా పేర్కొంది. వినియోగదారులు ఒకసారి అథంటికేషన్ పొందితే, ఎప్పుడు తమ క్యాబ్‌ల్లో ప్రయాణించినా, వైఫై సర్వీసులకు తక్షణం కనెక్ట్ కావచ్చని ఓలా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ రఘువేశ్ సరూప్ చెప్పారు. ప్రస్తుతం ఈ ఆటో కనెక్ట్ వైఫై సర్వీస తమ ప్రైమ్ కేటగిరి వినియోగదారులకు ఉచితంగా అందిస్తున్నామన్నారు. త్వరలో మైక్రో, మినీ, ఆటో వినియోగదారులకు కూడా ఈ సౌకర్యాన్ని అందించనున్నామని తెలియజేశారు. -
ఉచితంగా 45 నిమిషాలు వైఫై
ఉచితంగా వైఫై సేవలు 45 నిమిషాల సదుపాయం 15 రోజుల్లోఅందుబాటులోకి ఏర్పాట్లలో జీహెచ్ఎంసీ సిటీ నెటిజన్లకు శుభవార్త. ఇక నగరం నలుమూలలా హ్యాపీగా బ్రౌజింగ్ చేసుకునేందుకు..ఇంటర్నెట్ ఆధారిత సేవలు ఉచితంగా పొందేందుకు జీహెచ్ఎంసీ అవకాశం కల్పిస్తోంది. స్మార్ట్ సిటీలో భాగంగా గ్రేటర్ పరిధిలో వంద ప్రాంతాల్లో ఒకే రోజు ఉచిత వైఫై హాట్స్పాట్లను అందుబాటులోకి తెచ్చేందుకు గ్రేటర్ యంత్రాంగం సిద్ధమవుతోంది. ప్రజలకు ఇంటర్నెట్ సేవలందిస్తున్న ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్లలో పలువురు తాము ఉచిత సేవలందిస్తామని..అనుమతులివ్వాల్సిందిగా జీహెచ్ఎంసీని ఆశ్రయిస్తుండటంతో.. వచ్చే 15 రోజుల్లో వంద ప్రాంతాల్లో వీటిని ప్రజలకు అందించాలని అధికారులు భావిస్తున్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతోపాటు జోనల్ కార్యాలయాలు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టరేట్లు, హైకోర్టు ప్రాంగణం, ఇమ్లిబన్, జూబ్లీ బస్టాండ్లు, కేబీఆర్, సంజీవయ్య, వెంగళ్రావు, ఇందిరాపార్కులతో సహ ఆరు ప్రధాన పార్కుల్లో వైఫై సదుపాయం అందుబాటులోకి తేనున్నారు. వీటితోపాటు ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో మొత్తం వంద ప్రాంతాల్లో ఒకేరోజు వీటిని అందుబాటులోకి తెచ్చే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించాలని జీహెచ్ఎంసీ అధికారులు యోచిస్తున్నారు. రోజుకు 45 నిమిషాలపాటు ఈ ఉచిత సదుపాయం లభిస్తుంది. ఈ ఉచిత సదుపాయంతోపాటు ..ఇప్పటికే ఆయా ప్రైవేట్ సంస్థలనుంచి ఇళ్లకు ఇంటర్నెట్ ను వినియోగించుకుంటున్నవారు తమ యూజర్ లాగిన్, పాస్‌వర్డ్‌లను వినియోగించుకొని కూడా ఈ వంద స్పాట్లలో వైఫై సదుపాయాన్ని పొందవచ్చు. అయితే ఈ వినియోగం వారి ఖాతాలో నమోదవుతుంది. ఇప్పటికే మొబైల్ యాప్స్‌ను విస్తృతంగా వినియోగిస్తున్న జీహెచ్ఎంసీ.. ప్రజలు ఎక్కడినుంచైనా తమ ఫిర్యాదులు పంపించేందుకు.. పరిష్కారమయ్యిందీ లేనిదీ తెలుసుకునేందుకు కూడా ఈ ఉచిత వైఫై సదుపాయం ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తోంది. వాట్సప్ ద్వారా రహదారులపై గుంతలు, చెత్త తొలగించని ప్రాంతాలు తదితర ఫిర్యాదులు చేసేందుకు సైతం ఈ ఉచిత వైఫై సేవలు ఉకరించగలవని అంచనా వేస్తున్నారు. ట్యాంక్‌బండ్, నెక్లెస్రోడ్లతో సహ నగరంలోని వివిధ ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ 30 ప్రాంతాల్లో ఇప్పటికే 20 నిమిషాల ఉచిత వై ఫై సదుపాయం క ల్పిస్తుండటం తెలిసిందే. ఇదే తరహాలో మరో వంద ప్రాంతాల్లో ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా 45 నిమిషాలపాటు ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. వైఫై ఉంటే.. ఆన్లైన్లో అనుసంధానించిన సుమారు 15 రకాల ప్రభుత్వ సేవలను ఉచితంగా పొందవచ్చు.వైఫై సౌకర్యం ఉన్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, ట్యాబ్ ఉంటేచాలు.. మొబైల్ డేటా నెట్వర్క్ లేకున్నా, వైఫై కనెక్టివిటీ ద్వారా ఇంటర్నెట్ను బ్రౌజింగ్ చేసే వీలుంటుంది. వాట్సప్, ఈ-మెయిల్స్, ఫేస్బుక్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్‌ల్లో చాటింగ్ చేయొచ్చు.ఒకే కనెక్షన్‌పై ఒకటి కన్నా ఎక్కువ మంది మాట్లాడుకునే యాక్సెస్ లభిస్తుంది. వైఫైతో ప్రభుత్వ, ప్రైవేటు సేవలే కాకుండా కొన్ని రకాల యాప్స్ కూడా ఉచితంగా పొందవచ్చు. ఉదాహరణకు పార్కింగ్ యాప్, గార్బేజ్ యాప్ వంటివి. ఈ యాప్ సేవలతో నగరం పరిశుభ్రంగా ఉండటమే కాకుండా ట్రాఫిక్ చిక్కులూ తప్పుతాయి. దీని ద్వారా స్మార్ట్‌సిటీగా మారవచ్చునని భావిస్తున్నారు. లాగిన్ ఇలా.. ప్రస్తుత బీఎస్ఎన్ఎల్ సేవల తరహాలోనే లాగిన్ కావాల్సి ఉంటుంది. అందుకు...స్మార్ట్ ఫోన్లో వైఫై ఆప్షన్‌పై క్లిక్‌చేసి మొబైల్ నెంబరును, ఈ-మెయిల్ అడ్రస్ టైప్‌చేసి సబ్మిట్చేయాలి.మీ మొబైల్‌కు యూజర్‌నేమ్, పాస్వర్డ్ ఎస్ఎంఎస్ రూపంలో అందుతాయి.వాటిని టైప్‌చేసి లాగిన్ కావాలి. ఇదీ వినియోగం.... గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రస్తుతం 30 ప్రాంతాల్లో బీఎఎస్ఎన్ఎల్ ద్వారా ఉచిత వైఫై సేవలు అందుబాటులో ఉన్నాయి. రోజుకు సగటున వంద జీబీల డేటా వినియోగమవుతోంది. నెక్లెస్‌రోడ్డు, చార్మినార్ తదితర ప్రాంతాల్లో ఈసేవలు వినియోగించుకుంటున్నవారు అధికసంఖ్యలో ఉన్నారు. నెక్లెస్ రోడ్లో సగటున 79,076 సెషన్స్ మేర ఉచిత వై-ఫై వినియోగమవుతుండగా, ట్యాంక్‌బండ్ వద్ద 61,745 సెషన్లమేర ఉచిత వై-ఫై వినియోగించుకుంటున్నారు. కనిష్టంగా బిర్లా ప్లానెటోరియం వద్ద 503 సెషన్స్, నిమ్స్ ఆస్పత్రి వద్ద 580 సెషన్స్ మేర వై-ఫై సేవలను వినియోగించుకుంటున్నారని సమాచారం. -
ప్రపంచంలో తొలి 50 సమస్యలేంటంటే..
లండన్: నిత్యం మనల్ని చాలా సమస్యలు వేధిస్తుంటాయి. అందులో కొన్ని తీవ్రత ఎక్కువున్నవయితే మరికొన్ని తక్కువ తీవ్రతగలవి. అది ఏ సమస్య అయినా, చిరాకు పెట్టించేదైనా ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు అందరికీ కొన్ని సమస్యలు సమానంగా ఉన్నాయని బ్రిటన్‌లో ఓ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఓ యానిమల్ చారిటీకి చెందిన సంస్థ స్పానా ఈ సర్వేను నిర్వహించింది. అది దాదాపు రెండు వేలమందిని ప్రశ్నించి కామన్‌గా ప్రపంచంలో అందరినీ వేధిస్తున్న తొలి 50 సమస్యలు ఏమిటో గుర్తించి వాటిని వెల్లడించింది. దీని ప్రకారం ప్రపంచాన్ని వేధిస్తున్న తొలి 50 సమస్యల్లో తొలిస్థానం రన్నీ నోస్ (జలుబుతో చీముడు కారుతున్న ముక్కు)కు దక్కింది. ఎప్పుడూ చీముడు కారుతుండటం అనేది ప్రపంచంలోనే అందరినీ వేధించే తొలిసమస్యగా ఉందని ఆ సర్వే వివరించింది. దాని తర్వాత గుర్తు తెలియని నెంబర్ల నుంచి ఫోన్ కాల్స్ రావడం, ఏదైనా కంపెనీకి ఫోన్ చేసినప్పుడు వారు హోల్డ్‌లో ఉంచడం.. అందాల్సిన డెలివరీ అందకపోవడం, వైఫై సేవలు లేకపోవడం, ఫోన్ సిగ్నల్స్ రాకపోవడం వంటి టెక్నికల్ సమస్యలు కూడా ఉన్నాయని సర్వే తెలిపింది. వీటితోపాటు సాధారణంగా ఇబ్బందిపెట్టి మరికొన్ని సమస్యలేంటంటే.. ♦ డోర్ టు డోర్ సేల్స్ పీపుల్ ♦ ప్రజా రవాణా వాహనాల్లో నిల్చోవాల్సి రావడం ♦ లాగిన్ అవ్వాలనుకున్నప్పుడు పాస్ వర్డ్ మర్చిపోవడం ♦ దుస్తులు కొనాలనుకొని షాపింగ్‌కు వెళ్లినప్పుడు ఏం లభించకపోవడం ♦ ఆన్ లైన్ ఆర్డర్స్ ఆలస్యంగా రావడం ♦ కొత్త షూ వేసుకున్నప్పుడు బొబ్బలు రావడం ♦ టీవీలో లైవ్ షోలు ఫార్వార్డ్ చేసే అవకాశం లేకపోవడం ♦ అనుకున్న సమయానికి బస్సులు రాకపోవడం ♦ టీ చల్లగా అవడం ♦ 4జీ సిగ్నల్ రాకపోవడం ♦ విమానంలో చిన్నపిల్లలకు సమీపంలో లేదా ఎదురుగా కూర్చోవడం ♦ ఫోన్ చార్జర్ మర్చిపోవడం ♦ ట్యాక్సీ డ్రైవర్ ఆలస్యంగా రావడంతో పాటు ఇంకా చాలా సమస్యలు ఒక ప్రాంతమని కాకుండా అందరినీ సమానంగా వేధిస్తున్నాయని సర్వే తేల్చింది. -
అరే వా! భాద్రా
సమ్‌థింగ్ స్పెషల్ రాజస్థాన్... ఎడారి ప్రాంతం... ఆ ఎడారిలో ఓ చిన్న గ్రామం... పేరు తహసిల్ భాద్రా. అక్కడికి కేవలం రెండు రైళ్లు మాత్రమే వస్తాయి. జనాభా కేవలం 40, 000. ఢిల్లీ నగరం నుండి 275 కి.మీ. దూరంలో ఉన్న ఈ గ్రామం ప్రస్తుతం వార్తల్లోకెక్కింది. ఎందుకంటే.. భారతదేశంలోనే సంపూర్ణంగా, అతి చౌకగా వైఫైను వినియోగిస్తున్న గ్రామం ఇది. బెంగళూరు, పుణే, కొచ్చి, ఢిల్లీ నగరాలలో పూర్తి వైఫై సేవలు ఉన్నప్పటికీ, వాడేవారి సంఖ్య తక్కువగా ఉంది. కాని రాజస్థాన్‌లోని భాద్రా గ్రామ ప్రజలు అందరూ వైఫై సేవలు వినియోగించుకుంటున్నారు. బస్‌స్టాండ్‌కి వెళ్లి చూస్తే, అక్కడ చాటింగ్ చేసేవారు, వీడియో కాన్ఫరెన్స్‌లో ఉండేవారు, టికెట్ బుక్ చేసుకునేవారు కనిపిస్తారు. బస్‌స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ వరకు, గల్లీ గల్లీలోనూ, మార్కెట్లలోనూ భాద్రా గ్రామ ప్రజలు సాంకేతికంగా ముందడుగులు వేసేశారు. పూర్తిస్థాయిలో సినిమాలు డౌన్లోడ్ చేసుకునేవారు కొందరు, ఆన్లైన్లో మనీ ట్రాన్స్ఫర్లు చేసేవారు కొందరు, వ్యాపారాలు చేసేవారు కొందరూ... ఇలా అందరూ ఎవరి పనులు వారు చ కచకా కాలు కదపకుండా చేసేస్తున్నారు. ఇంతకుముందు ఆన్లైన్ పాఠాలకు, జాబ్ అప్లికేషన్లకు ... భాద్రా నుంచి 160 కి.మీ. దూరంలోఉన్న హనుమాన్గఢ్కి వెళ్లవలసి వచ్చేది. ఇప్పుడు ఆ సమస్య తీరిపోయింది. కొద్దినెలల క్రితమే వైఫై ఆ గ్రామానికి వచ్చింది. అతి తక్కువ సమయంలోనే ఈ గ్రామ వాసులంతా ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. వన్ జీబీ డేటా ఒక నెలకు, ఇక్కడ కేవలం 64 రూపాయలకే దొరుకుతోంది. ఈ చిన్నగ్రామంలో రోజుకి 160 జీబీ డేటాను ఉపయోగిస్తున్నారంటే, భాద్రా ప్రజలు సాంకేతికంగా ఎంత ఎదిగిపోయారో తెలుస్తుంది. ఇక్కడి వారు స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు. వీడియో కాలింగ్, చాటింగ్, రీచార్జ్... అన్నీ చక్కగా ఉపయోగించుకుంటున్న గ్రామం తహసీల్ - భాద్రా. వాహ్ భాద్రా అనిపించట్లేదూ!!! - వైజయంతి -
10 భాషల్లో ఆండ్రాయిడ్ సేవలు: వెంకయ్య
హైదరాబాద్: ప్రపంచం చూపంతా భారత్ వైపే ఉందని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అందరికీ ఆశాదీపంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మోదీ పిలుపుకు సాంకేతిక దిగ్గజ సంస్థలు సానుకూలంగా స్పందించాయని తెలిపారు. 500 రైల్వే స్టేషన్లలో ఉచిత వై-ఫై సదుపాయం కల్పించేందుకు గూగుల్ ముందుకు వచ్చిందన్నారు. ఆండ్రాయిడ్ సేవలు 10 భారతీయ భాషల్లో అందించేందుకు గూగుల్ సుముఖంగా ఉందన్నారు. 5 లక్షల గ్రామాల్లో బ్రాడ్ బ్యాండ్ సేవలకు మైక్రోసాఫ్ట్ ముందుకు వచ్చిందని వెంకయ్య తెలిపారు. -
బందరురోడ్డు.. ఇక వైఫై జోన్
విజయవాడ : రాజధాని నగరంగా రూపాంతరం చెందుతున్న బెజవాడను వైఫై ఫ్రీ సిటీగా మార్చేందుకు రంగం సిద్ధమవుతోంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రజావసరాల కోసం ఈ సేవలను అందుబాటులోకి తేనున్నారు. ఇప్పటికే వైఫైకు సంబంధించిన నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. వచ్చేనెల మొదటి వారం నుంచి ఉచిత వైఫై అందుబాటులోకి తీసుకురావటానికి రిలయన్స్ జియో కసరత్తు చేస్తోంది. బెంజిసర్కిల్ టూ పోలీస్ కంట్రోల్ రూమ్ బందరు రోడ్డులో ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈరోడ్డులో వైఫై ఎలైన్మెంట్లు ఏర్పాటుచేసి అందరికీ ఉచితంగా సేవలు అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. బెంజిసర్కిల్ మొదలుకుని పోలీస్ కంట్రోల్ రూమ్ వరకు ఇది అందుబాటులో ఉంటుంది. 40 పోల్ ఎలైన్మెంట్లు వైఫై సిగ్నల్ కోసం రిలయన్స్ జియో సంస్థ నగరపాలక సంస్థకు రూ.11లక్షలు నగదు చెల్లించి 20 రోజుల క్రితం పనులు మొదలుపెట్టింది. ట్రాఫిక్ రద్దీ పగటిపూట అధికంగా ఉండటంతో రాత్రివేళల్లో పనులు నిర్వహిస్తున్నారు. డివైడర్ల మధ్యలో ఉన్న పోల్స్‌కు ఎలైన్మెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి 100 మీటర్లుకు ఒక ఎలైన్మెంట్ చొప్పున 40 ఎర్పాటు చేయనున్నారు. అలాగే, వైఫైకు సంబంధించి కేబుల్‌ను రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌లో అమరుస్తున్నారు. నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ బృందం వైఫై పనులను రిలయన్స్ జియో ప్రతినిధులతో కలిసి పర్యవేక్షిస్తోంది. అక్టోబర్ మొవటి వారానికి పూర్తిస్థాయిలో సిగ్నల్ ఇచ్చి వైఫై సేవల్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. -
'డిజిటల్ తెలంగాణ' కు శ్రీకారం
పౌరులకు డిజిటల్ సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రాష్ట్రవ్యాప్తంగా 4జీ, ముఖ్య పట్టణాల్లో వైఫై తదితర సేవల కల్పనే లక్ష్యం జూలై 1 నుంచి వారోత్సవాలు ఐటీశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న డిజిటల్ ఇండియా లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో డిజిటల్ తెలంగాణ పేరిట అభివృద్ధి కార్యక్రమాలకు సర్కారు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు జూలై 1 నుంచి డిజిటల్ తెలంగాణ వారోత్సవాలు నిర్వహించాలని ఐటీశాఖ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ డి జిటల్ సదుపాయాలను అందుబాటులోకి తెచ్చేందుకు ఉన్నతాధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆప్టిక్ ఫైబర్ నెట్వర్క్ ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం, రాష్ట్రం మొత్తం 4జీ సేవలను అందించడం, పెద్ద నగరాలు, ముఖ్య పట్టణాల్లో వైఫై సదుపాయాల కల్పన, ఈ పంచాయత్ పథకం ద్వారా ప్రతి పంచాయతీలోనూ వన్‌స్టాప్ షాప్‌ను ఏర్పాటు చే యడం వంటి వాటిని ఈ కార్యక్రమం లక్ష్యాలుగా నిర్దేశించుకుంది. డిజిటల్ అక్షరాస్యత డిజిటల్ తెలంగాణ లక్ష్యాలను పూర్తి చేయడం ద్వారా ప్రతి పౌరుడికి డిజిటల్ అక్షరాస్యత, పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య, మొబైల్ గవర్నెన్స్ ద్వారా మీ-సేవలను మరింత విస్తృతపరచడం, టెక్నాలజీ ద్వారా వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి పౌరులకు మెరుగైన సేవలందించడం సులభం కానుంది. డిజిటల్ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా దేవాదాయశాఖ పరిధిలోని యాదాద్రి, భద్రాచలంలో ఆన్లైన్ పేమెంట్ గేట్‌వేల ఏర్పాటు, వ్యవసాయశాఖలో గ్రీన్ ఫ్యాబ్లెట్ సదుపాయాన్ని కల్పించనున్నారు. డిజిటల్ లిటరసీని ప్రమోట్ చేయడం, సైబర్ సెక్యూరిటీ, పరిశుభ్రతపై అవగాహన కల్పించడం, 2కె, 5కె రన్లు, ప్రతిజ్ఞలు, హ్యాక్థాన్లు నిర్వహించనున్నారు. వరంగల్ జిల్లాలోని పలు ప్రభుత్వ సంస్థల్లో హాజరు నమోదుకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నారు. నిజామాబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీకి వైఫై సదుపాయం కల్పించనున్నారు. డిజిటల్ వారోత్సవాలు ఇలా... వారోత్సవాల్లో భాగంగా జూలై 1న ప్రధాని మోదీ రేడియో ప్రసంగం మన్‌కీబాత్‌ను రాష్ట్రవ్యాప్తంగా ప్రసారం చేస్తారు. 2న గ్రామస్థాయిలో ఆధార్, జీవన్ ప్రమాణ్, డిజిటల్ లాకర్ అంశాలపై అవగాహన కల్పిస్తారు. 3న డివిజన్ స్థాయిలో ప్రభుత్వ విభాగాల అధికారులు, మీసేవ సిబ్బందికి నూతన సర్వీసులపై శిక్షణ అందిస్తారు. 4న జిల్లా స్థాయిలో పాఠశాలలు, కళాశాలల్లో వ్యాసరచన, చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తారు. 5న రాష్ట్రస్థాయిలో సైబరాబాద్‌లో 5కె రన్, డిజిటల్ రాహ్‌గిరి కార్యక్రమాలతో డిజిటల్ తెలంగాణపై అవగాహన కల్పిస్తారు. 6న ఈ-వేస్ట్ మేనేజ్మెంట్తో స్వచ్ఛ తెలంగాణ, ప్రముఖ సంస్థలతో అవగాహన ఒప్పందాలు, అవార్డుల ప్రదానం తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నారు. -
ఇంటింటికీ ఫైబర్ కనెక్టివిటీ... వైఫై సౌకర్యం
-రెండంకెల వృద్ధి రేటు సాధించడంలో సహకరించాలి -బ్యాంకర్ల సమావేశంలో చంద్రబాబు వినతి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటింటికి ఫైబర్ కనెక్టవిటీ ఇస్తున్నామని, అన్ని కూడళ్లలో వైఫై సౌకర్యం కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. కొత్తగా ఆదాయ వనరుల సమీకరణ కార్యకలాపాలపై సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా బ్యాంకర్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. అంగన్ వాడీ కార్యకర్తలు, 6గామ కార్యదర్శులకు ఇప్పటికే ట్యాబ్‌లు అందిస్తున్నామని, వీటి ద్వారా ఎప్పటికప్పుడు ప్రభుత్వ పథకాల లబ్ది పేదలకు చేరువ చేయనున్నట్లు ఆయన తెలిపారు. శనివారం లేక్‌వ్యూ అతిధి గృహంలో ముఖ్యమంత్రి వాణిజ్య బ్యాంకుల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగానికి, మహిళా సంఘాలకు, అలాగే రాష్ట్ర అభివృద్ధికి రుణాల మంజూరును పెంచాల్సిందిగా బ్యాంకర్లను ముఖ్యమంత్రి కోరారు. ప్రజల ఆహార అలవాట్లు మారిపోయాయని, పౌల్ట్రీ, మత్య్స ఉద్యాన అనుంబంధ రంగాలకు డిమాండ్ పెరిగిందన్నారు. ఈ రంగాల రైతులకు రుణాల మంజూరును ఎక్కువగా చేయాలని, తద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని సీఎం కోరారు. ఎర్ర చందనం విక్రయాల ద్వారా రెండు దశల్లో 3000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందన్నారు. బైరటీస్ ద్వారా 5000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందన్నారు. ఈ-పాస్ ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థలో ఒక నెలలోనే 45 కోట్ల రూపాయలను ఆదా చేసినట్లు ఆయన వివరించారు. ఇసుక విక్రయాలను మహిళా సంఘాలకు అప్పగించడం ద్వారా విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నామన్నారు. రెండంకెల వృద్ది సాధించేందుకు బ్యాంకులు అవసరమైన ఆర్థిక సాయం అందించాలని ఆయన కోరారు. నూతన రాజధాని అమరావతిలో బ్యాంకుల తమ బ్రాంచీలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆర్థికంగా రాష్ట్రాన్ని బలోపేతం చేసేందుకు బ్యాంకులు సహకరించాల్సిందిగా చంద్రబాబు కోరారు. -
ఉచిత వైఫై సేవలు ప్రారంభం
-
నచ్చే సినిమా.. మెచ్చే వైఫై
* ఆర్టీసీ బస్సుల్లో కొత్త విధానానికి శ్రీకారం * మొదటగా ఏసీ సర్వీసుల్లో ప్రారంభం * అందుబాటులో ఉన్న సినిమాల్లో నచ్చింది చూసే వెసులుబాటు హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేసే సురేశ్ సొంతూరు విశాఖపట్నం వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కాడు. బస్సు బయలుదేరగానే సిబ్బంది ఏదో సినిమా ఆన్ చేశారు. నిన్నే టీవీలో చూసిన సినిమా కావడంతో మరొకటి పెట్టాలని సురేశ్ సిబ్బందిని కోరాడు. బస్సులో ఉన్న ఇంకొందరు ఆ సినిమానే ఉంచాలని పట్టుబట్టడంతో చేసేది లేక అదే సినిమా చూశాడు సురేశ్. ఆర్టీసీ బస్సుల్లో తరచూ ప్రయాణించే వారికి ఎదురయ్యే పరిస్థితి ఇది. ఇకపై ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారు ఎవరికి నచ్చిన సినిమా వారు ఎంచక్కా చూడొచ్చు. అయితే.. సొంత ల్యాప్‌టాప్ ఉన్న వారికే అది కూడా ఏసీ బస్సుల్లోనే ఇది సాధ్యమవుతుంది. - సాక్షి, హైదరాబాద్ ఎలా సాధ్యం.. ఏమా విధానం.. ప్రస్తుతం ఆర్టీసీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 309 ఏసీ బస్సులు నడుపుతోంది. వీటిల్లో ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్ల ఆధ్వర్యంలో ఇంట్రానెట్ వసతి కల్పిస్తున్నారు. ఆర్టీసీలో అందుబాటులో ఉన్న సినిమాలను అందులో పొందుపరుస్తారు. బస్సు ఎక్కిన ప్రయాణికులు తమ ల్యాప్‌టాప్‌లను సర్వర్‌తో అనుసంధానించుకోవాలి. అప్పుడు ఆర్టీసీ వద్ద అందుబాటులో ఉన్న సినిమాల జాబితా ల్యాప్‌టాప్‌లో ప్రత్యక్షమవుతుంది. అందులో నచ్చిన సినిమాను ఎంచుకుని చూడొచ్చు. ఇందుకు కొంత మొత్తాన్ని ఆర్టీసీకి చెల్లించాలి. తొలి గంటపాటు ఉచితంగా.. ఆ తర్వాత ప్రతి గంటకు రూ.10 చొప్పున చార్జ్ చేస్తారు. ఈ చార్జీ విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. వారం పది రోజుల్లో ఈ విధానం అందుబాటులోకి రానుంది. మొదటగా గరుడ, గరుడ ప్లస్, వెన్నెల వంటి ఏసీ బస్సుల్లో దీనిని అందుబాటులోకి తెచ్చి.. ఆ తర్వాత సూపర్ లగ్జరీ బస్సులకూ వర్తింప చేయాలని ఆర్టీసీ భావిస్తోంది. మరోవైపు ప్రస్తుతం ఏసీ బస్సుల్లో సీట్లపై కవర్లు ఉండకపోవడంతో దుమ్ము చేరి ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు. దీంతో సీట్లకు కవర్లు ఏర్పాటు చేసి వాటిని రోజూ మార్చాలని అధికారులు నిర్ణయించారు. వాటిపై వ్యాపార ప్రకటనలు ముద్రించే వెసులుబాటు కల్పించారు. ఆర్టీసీలో 5జీ వైఫై సేవలు.. దేశంలోనే తొలిసారిగా 5జీ వైఫై సేవలను వినియోగించే రవాణా సంస్థగా ఏపీఎస్ఆర్టీసీ నిలవనుంది. తొలుతగా విజయవాడ బస్టాండ్‌లో బీఎస్ఎన్ఎల్ ద్వారా 5జీ వైఫై సేవలను మరికొద్ది రోజుల్లో ప్రారంభిస్తోంది. అమెరికాకు చెందిన క్వాడ్జెన్ అనే సంస్థతో ఇటీవల బీఎస్ఎన్ఎల్ టైఅప్ అయ్యింది. ఆ సంస్థ ద్వారా ఆర్టీసీ 5జీ వైఫై సేవలను పొందబోతోంది. సెల్ టవర్ల ద్వారా సిగ్నళ్లు పొందే సౌకర్యం అందుబాటులోకి రానందున ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారా విజయవాడ బస్టాండ్‌కు దీనితో అనుసంధానిస్తున్నారు. బస్టాండ్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లాంజ్‌లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. తొలి అరగంట ఉచితంగా.. ఆ తర్వాత ప్రతి గంటకు రూ.10 చొప్పున చార్జీ వసూలు చేస్తారు. ఈ లాంజ్‌ను దాటి సిగ్నళ్లు వెళ్లకుండా జియో ఫెన్సింగ్‌తో నియంత్రిస్తారు. రెండో ప్రయత్నంగా హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌లో ఈ సేవలు ప్రారంభించాలని నిర్ణయించింది. 5జీతో ఇంటర్నెట్ స్పీడ్, క్వాలిటీ ఉన్నతంగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. -
హైదరాబాద్‌లో మరో 200 ఫ్రీ వైఫై కేంద్రాలు..
హైదరాబాద్ : నగరవాసులకు శుభవార్త. ఎన్నో రోజుల నుంచి వైఫై సదుపాయం కోసం వేచి చేస్తున్నవారికి జీహెచ్ఎంసీ ఉపశమనం కలిగించబోతోంది. వైఫై సేవలందించేందుకు హైదరాబాద్‌లో 200 వైఫై కేంద్రాలను గుర్తించింది. ఇందుకు సంబంధించి జీహెచ్ఎంసీ కమిషనర్ 10 కోట్లు కూడా కేటాయించారు. ఇందిరా పార్క్, కేబిఆర్ పార్క్, సంజీవయ్య పార్క్, తదితర ప్రాంతాలతోపాటు సెంట్రల్ మాల్, పంజాగుట్ట, నెక్లెస్ రోడ్ లాంటి ప్రాంతాల్లో తొలుత ఈ సేవలను ప్రారంభించాలని జీహెచ్ఎంపీ యోచిస్తోంది. ఎంపిక చేసిన ప్రాంతాల్లో మూడు గంటలపాటు ఉచిత వైఫై సేవలు తొలత అందించి ఆ తరువాత పూర్తి స్థాయిలో ఈ సేవలను అందించాలనుకొంటోంది. ఇందుకు సంబంధించి అతి త్వరలోనే ఈ మెయిల్, ఫోన్ నంబర్ ఇవ్వనుంది, ఇందులో సంప్రదించిన వారికి వైఫై పాస్‌వర్డ్‌ను అందిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు. కాగా ఇప్పటికే హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ ఏరియాలలో సుమారు 8కిలోమీటర్ల మేరకు ఈ వైఫై సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. -
ఫ్రీ వైఫై కోసం చర్చలు ప్రారంభం
న్యూఢిల్లీ: ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు లోబడి నగరంలో ఉచిత వైఫై ఏర్పాటుకు ఆప్ సర్కారు తన యత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా పలు కంపెనీలతో పాటు ఫేస్బుక్ యాజమాన్యంతో సంప్రదింపులు ప్రారంభించింది. దీనికి దాదాపుగా రూ.150-200 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ముంబైలో ఇప్పటికే వైఫై సర్వీసులు ప్రారంభించిన ఫేస్బుక్తోను, మరి కొన్ని ఇతర కంపెనీలతోను చర్చలు ప్రారంభించినట్టు ఆ పార్టీ నేత ఒకరు తెలిపారు. ఉచిత సేవల్లో భాగంగా మొదటి 30 సెకండ్లు ప్రకటనలు వస్తాయని, దీని ద్వారా ప్రభుత్వానికి రూ.100 కోట్లు వరకూ ఆదాయం సమకూరనుందన్నారు. దేశ రాజధానిలో యువతను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల్లో ఇచ్చి హామీకి అనుగుణంగా ఉచిత వైఫై వసతి కల్పిస్తామని కాబోయే ఉప ముఖ్యమంత్రి మనీష్ తెలిపారు. మొదటి 30 నిమిషాలు ఉచితంగా ఉపయోగించుకోవచ్చని, ఆ తరువాత సర్వీసులపై డ బ్బు చెల్లించాలన్నారు. కాగా మహిళల రక్షణకు సంబంధించి యాప్‌ను విడుదల చేస్తామని ఆప్ వర్గాలు తెలిపాయి. -
హైదరాబాద్‌లోని అన్ని పోలీసుస్టేషన్లకు వైఫై
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని అన్ని పోలీసుస్టేషన్లు, విభాగాలను వై-ఫై (వైర్లెస్ ఫెడిలిటీ)తో అనుసంధానం చేసినట్లు పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ హోంగార్డు స్థాయి నుంచి ఐపీఎస్ వరకు అందరికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించిన ఘనత హైదరాబాద్ పోలీసు విభాగానికే దక్కిందన్నారు. ఇలాంటి ప్రయోగం దేశంలోనే మొదటిదన్నారు. -
అన్ని కాలేజీలకూ వైఫై
రెండేళ్లలో ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ కనెక్షన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ప్రారంభ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు సాక్షి, విజయవాడ బ్యూరో: రాబోయే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో వైఫై నెట్వర్క్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. డిజిటల్ ఇండియాలో భాగంగా రెండేళ్లలో ప్రతి ఇంటికీ 15-20 ఎంబీపీఎస్, కాలేజీలకు ఒక గిగా బైట్ బ్యాండ్ విడ్త్‌తో ఫైబర్ కనెక్టివిటీ ఇస్తామని తెలిపారు. విజయవాడలోని పీబీ సిద్ధార్థ కళాశాలలో సోమవారం జరిగిన 13 జిల్లాల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ప్రారంభం, యాప్ డెవలప్మెంట్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. భవిష్యత్తు అంతా నాలెడ్జ్దేనని, ఈ వయసులో కొంచెం కష్టపడితే బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ఒక్కో ఆవిష్కరణ ప్రపంచాన్నే మార్చేస్తుందని, బిల్‌గేట్స్ తీసుకొచ్చిన ఇంటర్నెట్ ప్రపంచం మొత్తాన్ని ఒక గ్రామంగా మార్చేసిందని చెప్పారు. 600 మంది విద్యార్థులు రకరకాల యాప్‌లను అభివృద్ధి చేశారని, అందులో కొన్ని చాలా బాగున్నాయని తెలిపారు. లెర్న్, ఎర్న్, అప్లయ్, ప్రోపగేషన్ పేరుతో లీప్ అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. యాప్‌లను అభివృద్ధి చేసిన విద్యార్థులు వాటిగురించి ఐదుగురికి శిక్షణ ఇస్తే స్మార్ట్ ఫోన్ ఉచితంగా ఇస్తామని తెలిపారు. అన్ని ఇంజనీరింగ్ కాలేజీలు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటుచేసుకోవాలని, యాప్‌ల అభివృద్ధిని ప్రోత్సహించాలని సూచించారు. రాబోయే రోజుల్లో సెక్రటేరియట్ మొత్తాన్ని ఇ-కార్యాలయంగా మారుస్తామన్నారు. భవిష్యత్తులో హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీల కోర్సులను ఆన్లైన్లో ఏపీలో ప్రవేశపెడతామని చెప్పారు. కుటుంబ నియంత్రణ వద్దు గతంలో ఫ్యామిలీ ప్లానింగ్ కావాలని చెప్పానని, కానీ మారిన పరిస్థితులను బట్టి వద్దని చెబుతున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. దేశంలో రోజూ 9 లక్షల మంది పుడుతుంటే, 9 లక్షల మంది చనిపోతున్నారని దీనివల్ల యువత లేకుండా పోయే ప్రమాదం ఉందని చెప్పారు. అందుకే జనాభాను బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ వంద ఎకరాలు ఇస్తే ఏపీకి మోడల్ ఐటీఐ మంజూరు చేస్తామని చెప్పారు. యాప్‌లు పరిశీలించిన సీఎం తొలుత సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో రాష్ట్రంలోని 17 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ప్రారంభించిన సీఎం వివిధ జిల్లాల ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు తయారుచేసిన యాప్స్‌ను పరిశీలించారు. వారిని అభినందించి పలు సూచనలు చేశారు. -
ఇంటర్నెట్, వైఫై అవసరం లేదు
*రింగో... స్మార్ట్ ఇంటర్నేషనల్ కాలింగ్ యాప్ ముంబై: రింగో... స్మార్ట్ ఇంటర్నేషనల్ కాలింగ్ యాప్ భారత్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ రింగో యాప్‌తో ఇంటర్నెట్, వైఫై లేకుండానే ఇంటర్నేషనల్కాల్స్ చేసుకోవచ్చు. 16 దేశాల్లో విజయవంతమైన ఈ యాప్ ఇప్పుడు భారత్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ రింగో యాప్ కారణంగా ఇంటర్నేషనల్ కాలింగ్‌లో 90% పొదుపు చేయవచ్చు. తమ రింగో యాప్‌తో ప్ర పంచంతో భారతీయుల కమ్యూనికేషన్ విషయంలో పెనుమార్పు వస్తుందన్న ధీమాను రింగో సీఈఓ భవిన్ తురకియా వ్యక్తం చేశారు. ఇతర ఓటీటీ వాయిస్ యాప్‌ల వలె రింగో కాల్స్‌కు ఇంటర్నెట్, వైఫై, డేటా అవసరం లేదని వివరించారు. భారత్‌లోని రింగో యూజర్, ఇంగ్లాండ్‌లోని వ్యక్తికి ఫోన్ చేయాలనుకున్నట్లైతే, రింగో భారత యూజర్‌కు లోకల్ కాల్‌ను డయల్ చేస్తుంది. అలాగే ఇంగ్లాండ్‌లోని యూజర్‌కు కూడా లోకల్ కాల్‌ను డయల్ చేస్తుంది. ఈ ఇరువురిని కేరియర్ సర్క్యూట్ల ద్వారా అనుసంధానం చేస్తుందని వివరించారు. ఏడాదికి భారతీయులు 200 కోట్ల డాలర్లు విదేశీ కాల్స్ కోసం వెచ్చిస్తున్నారని భవిన్ పేర్కొన్నారు. ఇది వొడాఫోన్, ఎయిర్‌టెల్‌ల కంటే 70 శాతం తక్కువని, స్కైప్, వైబర్‌తో పోల్చితే 25% తక్కువని తెలిపారు. -
బెంగళూరు మాదిరిగా వైఫై నగరంగా..
సాక్షి, సిటీబ్యూరో: దేశంలో బెంగళూరు మహానగరం తొలి ఫ్రీ వైఫై నగరంగా పేరొందింది. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో నిత్యం మూడు గంటలపాటు సెల్‌ఫోన్స్, ల్యాప్‌ట్యాప్స్‌తో ఉచితంగా నెట్ బ్రౌజ్ చేసుకునే సౌకర్యంతోపాటు500 ఎంబీ డేటా ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించడం విశేషం. నగరం నలుమూలల కూ వైఫై సౌకర్యం కల్పించేం దుకు కర్నాటక ఐటీ శాఖ ప్ర యత్నాలు ముమ్మరం చేసింది. డి-వాయిస్ సంస్థ ఈ పనులు చేపడుతోంది. వై-ఫైని విని యోగిస్తున్న వారు ఏ హ్యాండ్ సెట్ వినియోగించారు, ఏ సమాచారం డౌన్లోడ్ చేసుకున్నారో సర్వర్ ద్వారా పసిగట్టే వీలుండడంతో పూర్తి భద్రత గల వై-ఫై నగరంగా ప్రా చుర్యం పొందింది. ఉచిత పార్కింగ్ యాప్ ద్వారా మీరున్న చోటు నుంచి దగ్గరున్న పార్కింగ్ కేంద్రాలు, గార్బేజ్ యాప్ ద్వారా చెత్త ఎక్కడ పడవేయాలో తెలుసుకోవడం ఈ వై-ఫై ప్రత్యేకత. అదే స్ఫూర్తితో.. కొత్త ఏడాదిలో బెంగళూరు బాట లో మన సైబర్‌సిటీగా పేరొందిన హైదరాబాద్ మహా నగరం కూడా వై-ఫై బాటలో వేగంగా ముందుకెళుతోంది. హైటెక్‌సిటీ, మాదాపూర్ పరిధిలో 8 కిలోమీటర్ల పరిధిలో 17 కేంద్రాల వద్ద వైఫై సౌకర్యం అందుబాటులోకి రావడంతో స్మార్ట్‌సిటీ దిశ గా హైదరాబాద్ దూసుకుపోతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. స్మార్ట్ఫోన్లు, ట్యాబ్ ఇతర వైఫై ఆధారిత ఎలక్ట్రానిక్ వస్తువులు వినియోగిస్తున్న వారికి సాంకేతిక సేవలను ఉచితంగా వినియోగించుకునే సౌలభ్యం కలుగుతోంది. ప్రతి ఒక్కరూ నిత్యం 750 ఎంబీ నిడివిగల వైఫై సేవలను వినియోగించుకోవచ్చు. వైఫై సేవల కోసం హైటెక్‌సిటీ మాదాపూర్ పరిధిలో మొత్తం 17 చోట్ల ఎయిర్టెల్ సంస్థ ప్రత్యేక పోల్స్ ఏర్పాటు చేసింది. ఇదే తరహాలో నగరం నలుమూలలకు ఈ ఏడాదిలో వై-ఫై సదుపాయం కల్పించేందుకు సర్కారు చేస్తోన్న కృషి సఫలీకృతం కావాలని ఆశిద్దాం. -
హైటెక్ సిటీ పరిసరాల్లో ఫ్రీ వైఫై
హైదరాబాద్ : పైలట్ పబ్లిక్ వైఫై సేవలను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం వైఫై సేవలను ప్రారంభించారు. దాంతో ఈ సేవలు హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ ఏరియాలలో సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరం వరకూ ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఒక్కో వినియోగదారుడు 750 ఎంబి ఉచితంగా వినియోగించుకునే అవకాశం ఉంది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరాన్ని వైఫై నగరంగా అభివృద్ధి చేస్తామని, వైఫై సేవలను అందించేందుకు త్వరలో టెండర్లు పిలువనున్నట్లు తెలిపారు. నగరాన్ని గ్లోబల్ స్మార్ట్ సిటీగా చేయటంలో భాగంగా ఇది తొలి అడుగు అని ఆయన అన్నారు. వైఫైతో హైదరాబాద్ ఇమేజ్ను పెంచుతామని తెలిపారు. ఐదు నెలల్లో నగరం మొత్తం వైఫై సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రస్తుతం ఎయిర్ టెల్ సహకారంతో 17 సెంటర్లల్లో ప్రయోగాత్మకంగా వైఫై సేవలు అందిస్తున్నాట్లు తెలిపారు. -
Wi Fiతో జర భద్రం
ఇంటర్నెట్.. ఈ రోజుల్లో చిన్నపిల్లల దగ్గరి నుంచి పెద్దల వరకు ఎక్కువగా ఆధారపడుతున్న సాధనం. ముఖ్యంగా యువత ఎక్కువగా నెట్‌కు ఆకర్షితులవుతున్నారు. ఇంటర్నెట్ కనెక్షన్ లేని వారు వైఫై ఎక్కడుంటుందో చూసుకుని మరీ వాడుకుంటున్నారు. అయితే ఈ వైఫైతో ఒకరి ఇంటర్నెట్ కనెక్షన్‌ను వాడుకోవడం ప్రమాదకరమని నిపుణులు పేర్కొంటున్నారు. దీనివల్ల చేయని తప్పులకు బాధ్యులు కావాల్సి వస్తుందంటున్నారు. నెట్ సెంటర్లతోపాటు ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న ప్రతీ ఒక్కరు పాస్వర్డ్ సిస్టమ్స్‌తోపాటు లాక్ వేసుకోవడం, వినియోగించిన తర్వాత ఆఫ్ చేసుకోవడం మంచిదని చెబుతున్నారు. వైఫైతో జరిగే అనర్థాలు, వాటిని ఏ విధంగా తిప్పికొట్టాలి తదితర విషయాలపై కథనం.. వైఫై అంటే.. వైఫై అంటే వైర్లెస్ ఫెడిలిటీ. రేడియో తరంగాలను ఉపయోగించి ఇంటర్నెట్ కనెక్షన్ పొందే ఒక వైర్లెస్ సాంకేతికత. ఈ వైఫై ఆధారంగా కేబుల్ అవసరం లేకుండా ఒక ఇంట్లో లేదా కార్యాలయంలో ఉన్న ఇంటర్నెట్ కనెక్షన్‌పై ఆధారపడి సమీప ప్రాంతాల్లో ఉన్న కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ఫోన్లలో ఇంటర్నెట్ సులువుగా వాడుకోవచ్చు. ఒక హాట్‌స్పాట్ నుంచి 20 మీటర్లు(66 అడుగులు) వరకు ఇండోర్‌లో అంతకంటే ఎక్కువ దూరం వరకు అవుట్‌డోర్‌లో వాడుకోవచ్చు. ఫైర్‌వాల్స్ డిజిబుల్ కావద్దు ప్రతీ కంప్యూటర్, రూటర్లలో ఉన్న ఫైర్‌వాల్స్‌ను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. ఆధునికంగా తయారవుతున్న రూటర్లలో బిల్ట్ ఇన్ ఫైర్‌వాల్స్ ఉంటున్నాయి. వాటిని డిజేబుల్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది.అందుకే ఎల్లప్పుడూ ఫైర్‌వాల్స్ ఆన్‌లో ఉండేలా చూసుకుంటూ వినియోగించిన ప్రతీ సారి చెక్ చేసుకోవాలి. ఢీఫాల్ట్లు వద్దే వద్దు చాలా వరకు రూటర్లు డీఫాల్ట్ లాగిన్, పాస్ వర్డ్స్‌తో ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కనె క్షన్ వినియోగంలో వీటిని కొనసాగించకూడదు. కనెక్షన్ పొందిన వెంటనే సొంతంగా మీరే లాగిన్, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. డీఫాల్ట్ వివరాలను హ్యాక్ చేయడం చాలా తేలిక. యాక్సిస్ పాయింట్ అందుబాటులో వద్దు వైఫై కనెక్షన్ ఇన్ స్టాల్ చేసే సందర్భంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దీని యాక్సిస్ పాయింట్, రూటర్లు బయటివారికి అందుబాటులో లేకుండా ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. సాధ్యమైనంతవరకు కిటికీలకు దూరంగా ఉండడం మేలు. ఎంఏసీ అడ్రస్ ఫిల్టర్స్ వదలద్దు ప్రతీ వైర్లెస్ డివైస్‌కు ఒక ప్రత్యేకమైన మీడియా యాక్సిస్ కంట్రోల్ (ఎంఏసీ) అడ్రస్ ఉంటుంది. యాక్సిస్ పాయింట్లు, రూటర్లు వాటికి కనెక్ట్ అయి ఉన్న ప్రతీ డీవైస్ కు సంబంధించిన ఈ ఎంఏసీ అడ్రస్‌ను ట్రాక్ చేస్తుంటాయి. హ్యాకింగ్‌కు దూరంగా ఉండాలంటే వైఫై కనెక్షన్‌కు సంబంధించిన ఎంఏసీ అడ్రస్ ఫిల్టర్స్‌ను ఎనేబుల్గా ఉంచుకోవాలి. టర్న్ ఆఫ్ విషయం మరవద్దు కొంత కాలంపాటు వైఫై కనెక్షన్ వాడని పక్షంలో నెట్వర్క్ అందుబాటును టర్న్ ఆఫ్ చేయడం మరవకూడదు. నెట్‌వర్క్‌ను షట్ డౌన్ చేయడం వల్ల హ్యాకింగ్ చేసుకునేందుకు ఆస్కారం ఉండదు. కనెక్షన్ బ్రేక్ చేయడానికి అవకాశం చిక్కదు. ఆటో కనెక్ట్ అసలే వద్దు వైఫై వినియోగంలో ఆటో కనెక్ట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించవద్దు. దీని వల్ల సమీపంలోని ఏ రూటర్ నుంచైనా కనెక్ట్ కావడం వంటి వాటితో మీకు సౌకర్యవంతంగా అనిపించినా, అంతకంటే ఎక్కువ ఇబ్బందులు తెచ్చిపెడుతుందని మరవద్దు. ఆటోకనెక్ట్ వాడటం వల్ల మీ కంప్యూటర్, కనెక్షన్స్‌కు సెక్యూరిటీ రిస్క్‌తో పాటు ఎటాక్స్ ముప్పు ఉంటుందని గుర్తించుకోండి. -
ఎడ్యు న్యూస్
త్వరలో అన్ని యూనివర్సిటీల్లో ఉచిత వైఫై దేశవ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీలు, కళాశాలల్లో రానున్న రోజుల్లో వైఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఇంటర్నెట్ ద్వారా ఆన్లైన్లో నాణ్యమైన మెటీరియల్ పొందవచ్చు. ఫ్యాకల్టీ కొరతను ఎదుర్కొంటున్న ఎన్నో విద్యా సంస్థలకు వైఫై సౌకర్యం ఎంతో లాభదాయకం. వైఫై ద్వారా దేశవ్యాప్తంగా 600 యూనివర్సిటీలు, 20 వేల కళాశాలలు లబ్ధి పొందే అవకాశం ఉంది. ఉచిత ఇంటర్నెట్ ద్వారా మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సులు (మూక్స్) అభ్యసించడానికి కూడా వీలు కలుగుతుంది. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా నిపుణులైన ఫ్యాకల్టీ చెప్పే వీడియో లెసన్స్, గెస్ట్ లెక్చర్స్‌ను చూడొచ్చు. ఇప్పటికే మనదేశంలో కొన్ని విద్యా సంస్థలు తమ విద్యార్థులకు ఉచిత వైఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి. నెట్‌ను నిర్వహించనున్న సీబీఎస్ఈ దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్), కళాశాలల్లో లెక్చరర్‌షిప్‌నకు అర్హత సాధించాలంటే రాయాల్సిన పరీక్ష నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్). ఇప్పటివరకు దీన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్వహించింది. ఈ ఏడాది డిసెంబర్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నెట్‌ను నిర్వహిస్తుందని యూజీసీ వెల్లడించింది. విద్యా సంస్థల్లో డీఆర్డీవో.. టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్లు దేశంలోని ప్రముఖ విద్యా సంస్థల్లో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో).. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. ముందుగా ఐఐటీ - బాంబే, జాదవ్‌పూర్ యూనివర్సిటీ - కోల్‌కతాలో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర రక్షణ, ఆర్థిక శాఖల మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. డీఆర్డీవో ఈ కేంద్రాల్లో శాస్త్రవేత్తలు, రీసెర్చ్ ఫ్యాకల్టీతో వర్క్‌షాప్స్ నిర్వహిస్తుంది. ఈ కేంద్రాల ద్వారా విద్యార్థులు పరిశోధనల్లో అత్యుత్తమ నైపుణ్యాలు సొంతం చేసుకోవచ్చు. 2012లో ఐఐటీ - చెన్నైలో డీఆర్డీవో .. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. -
హైదరాబాద్‌ను వైఫై సిటీగా మార్చేస్తాం
సైబర్ సెక్యూరిటీ సదస్సులో ఐటీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : భాగ్యనగరాన్ని దేశంలోనే మొట్టమొదటి వైఫై సిటీగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, నగరంలో అతిపెద్ద ఇంక్యుబేషన్ హబ్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఐటీ మంత్రి కె.తారకరామారావు వెల్లడించారు. బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణ హోటల్లో శుక్రవారం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ) ఆధ్వర్యంలో జరిగిన సైబర్ సెక్యూరిటీ సదస్సుకు ఆయన ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. సైబర్ సెక్యూరిటీ చాలా ముఖ్యమన్నారు. దేశం, ఐటీ ఇండస్ట్రీ సైబర్ నేరాలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. రాష్ట్రంలో ఇలాంటి వాటి నివారణకు సమష్టిగా కృషిచేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐడీ అదనపు డీజీ టి.కృష్ణప్రసాద్, సీఐఐ ఛైర్మన్ సురేష్ ఆర్ చిత్తూరి, వైస్ ఛైర్మన్ వనిత, స్కోప్ ఇంటర్నేషన్ ఉపాధ్యక్షులు అకయ్య జనగరాజ్, డీఆర్డీఓ జాయింట్ డెరైక్టర్ అమిత్‌శర్మ తదితరులు పాల్గొన్నారు. ‘అవుట్సోర్సింగ్’ క్రమబద్ధీకరణపై కమిటీ రాష్ట్రంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసుల క్రమబద్దీకరణ అంశాన్ని పరిశీలించేందుకు ఒక కమిటీని వేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె.తారకరామారావు హామీ ఇచ్చారు. మంత్రివర్గ ఉపసంఘాన్నిగానీ, అధికారుల కమిటీనిగానీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని, త్వరలోనే ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం ప్రతినిధులు శుక్రవారం మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. తమ సర్వీసుల క్రమబద్దీకరణతోపాటు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం అధ్యక్షుడు శ్యామలయ్య మంత్రిని కోరారు. ఎనిమిదేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నామని, వయోపరిమితి దాటడంతో ఇతర ఉద్యోగాలకు అర్హత కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మండల పరిధిలో బదిలీలకు అవకాశం ఇవ్వాలని, అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలని కోరారు. -
ఫొటాన్ మ్యాక్స్ వైఫై... ప్లగ్ చేస్తే.. ఎక్కడైనా నెట్!
రోజంతా ఇంటర్నెట్ వాడుతూంటారా? స్మార్ట్ఫోన్తోపాటు పీసీ, టాబ్లెట్ కూడా ఉన్నాయా? అన్నింటికీ ఒకేసారి నెట్ కనెక్షన్ కావాలనుకుంటున్నారా? అయితే టాటా డొకోమో ఫోటాన్ వైఫై మ్యాక్స్ మీ కోసమే. ఎక్కడ ప్లగ్ చేసుకుంటే అక్కడ ఓ మొబైల్ వైఫై హాట్‌స్పాట్‌ను ఏర్పాటు చేసే దీన్ని ఒకేసారి అయిదు గాడ్జెట్స్‌కు అనుసంధానించుకోవచ్చు. ఉపయోగించడం కూడా చాలా సులువు. యూఎస్బీ అడాప్టర్ ఉన్న ప్లగ్‌లోకి దీన్ని చొప్పించి పవర్ సాకెట్లో పెట్టేస్తే చాలు. నెట్ బ్రౌజింగ్‌కు వైఫై హాట్‌స్పాట్ రెడీ! టాటా ఫొటాన్ మ్యాక్స్ వైఫై పరికరాన్ని ‘శాస్త్ర’ బృందం వారం రోజులపాటు పరీక్షించింది. హైదరాబాద్ నలుమూలా ఉన్న సాక్షి ఉద్యోగులు ఒకరోజుపాటు దీన్ని వాడి చూశారు. నెట్బ్రౌజింగ్తోపాటు వీడియో స్ట్రీమింగ్, స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ల డౌన్లోడింగ్, అప్డేషన్లకు ఉపయోగించి చూశారు. వీరిలో 75 శాతం మంది నెట్ వేగం బాగుందని మెచ్చుకోగా... మిగిలిన వారు ఫర్వాలేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. గరిష్టవేగం 3.1 ఎంబీపీఎస్ వరకూ ఉంటుందని కంపెనీ చెబుతున్నప్పటికీ ఇది 1.2 నుంచి 2 ఎంబీపీఎస్ వరకూ ఉన్నట్లు అంచనా. వంద మీటర్ల పరిధి వరకూ వైఫై హాట్‌స్పాట్ ఏర్పాటవుతుందని కంపెనీ చెబుతోంది. కనెక్షన్ స్థిరంగా ఉన్నప్పటికీ దూరం పెరిగేకొద్దీ నెట్ వేగం మందగించింది. 20 నుంచి 30 మీటర్ల దూరం వరకూ మాత్రమే నెట్ వేగం బాగా ఉన్నట్లు గుర్తించాం. రెండు, మూడు పరికరాలను అనుసంధానించినప్పుడు ఉన్నంత వేగం అయిదింటిని కనెక్ట్ చేసినప్పుడు లేకపోవడం గమనార్హం. దాదాపు రూ.2000 ఖరీదు చేసే ఈ పరికరం... నెలకు రూ.650 మొదలుకొని రూ.1500 వరకూ నెలవారీ ఛార్జీలతో అయిదు పరికరాలకు నెట్ అందిస్తుంది. ఒక్కో గాడ్జెట్ నెట్ ఛార్జీలను పరిగణలోకి తీసుకుంటే ఇది కొంత చౌకనే చెప్పాలి.