
స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమికి చెందిన రెడ్‌మి శుభవార్త అందించింది.
సాక్షి, ముంబై: స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమికి చెందిన రెడ్‌మి శుభవార్త అందించింది. వైఫై కాలింగ్ సదుపాయాన్ని రెడ్‌మి స్మార్ట్‌ఫోన్లలో కల్పిస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. టెలికాం దిగ్గజ సంస్థలు భారతి ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో తన విని యోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చిన వాయిస్ వైఫై కాలింగ్ సేవలు ఇక మీదట తమ స్మార్ట్‌ఫోన్లలో వినియోగించు కోవచ్చని తెలిపింది. ఈమేరకు ఫోన్ల జాబితాలో ట్విటర్‌లో షేర్ చేసింది.
కాగా భారతి ఎయిర్‌టెల్ దేశవ్యాప్తంగా వై ఫై కాలింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చామనీ, తమ వైఫై చందాదారుల సంఖ్య 10 లక్షలు దాటిందని ఇటీవల ప్రకటించింది. అటు రిలయన్స్ జియో కూడా ఈ సదుపాయాన్ని కొన్ని పరిమిత సర్కిళ్లలో ఇటీవల లాంచ్ చేసింది. త్వరలోనే దేశ వ్యాప్తంగా అందుబాటులో ఉంచుతామని తెలిపింది. ఈ సేవలకు అదనంగా ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. వీఓ వైఫై టెక్నాలజీతో పబ్లిక్ హాట్‌స్పాట్ లేదా ప్రైవేట్ హోం వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేసుకొని ఏ మొబైల్‌ఫోన్‌కైనా, ల్యాండ్‌లైన్‌కైనా కాల్స్ చేసుకోవచ్చు.
చదవండి: జియోకు షాక్ : దూసుకుపోతున్న ఎయిర్‌టెల్
Welcome to the future of voice calling! #VoWiFi is now available across our exciting range of #Redmi smartphones. 🤙
— Redmi India for #MiFans (@RedmiIndia) January 14, 2020
Make calls using WiFi on your @airtelindia and @reliancejio WiFi network.
RT and help us spread the word! 🙏 pic.twitter.com/XywK6Hk67P