redmi
-
2024లో బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే (ఫొటోలు)
-
అదిరిపోయే ఫీచర్లతో.. త్వరలో విడుదల కానున్న మరో రెడ్మీ సిరీస్ ఫోన్
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రెడ్మీ త్వరలో మరో స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెడ్మీ 12 4జీ ఫోన్ యూజర్లను ఆకట్టుకుంటోంది. అదే తరహాలో రెడ్మీ 13 4జీ ఫోన్‌ను మార్కెట్‌కి పరిచయం చేయనుందంటూ పలు మీడియా కథనాలు చెబుతున్నాయి.రెడ్మీ 13 4జీ ధర, కలర్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయంటే?6జీబీ ప్లస్ 128జీబీ ఆప్షన్‌తో రెడ్మీ 13 4జీ ధర రూ.16,500 ఉండనుంది. 8జీబీ ప్లస్ 256జీబీ వేరియంట్ ధర రూ.19,000గా ఉండనుందని తెలుస్తోంది.బ్లాక్,బ్లూ కలర్స్‌తో యూజర్లను అలరించనుంది.వాటికి అదనంగా పింక్, ఎల్లో కలర్స్ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేయనుందని సమాచారం.రెడ్మీ 13 4జీ డిజైన్స్ రెడ్మీ 13 4జీ డిజైన్స్ విషయానికొస్తే ఫోన్ టాప్ లెప్ట్ కార్నర్లో రెండు సర్కిల్ కెమెరా యూనిట్స్, ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్లు ఉన్నాయి.ఫోన్ బాడీ గ్లోసీ ఫినీష్‌తో రానుంది.ఫోన్ ఛార్జర్ యూఎస్బీ టైప్-సీకి సపోర్ట్ చేస్తోంది. ఫోన్ ముందు భాగంలో ఫ్లాట్ డిస్ప్లే, థిక్ బెజెల్స్,ఫోన్ పై భాగంగా సెంటర్డ్ హోల్ పంచ్ కటౌట్, సెల్ఫీ కెమెరా సెన్సార్లు ఉన్నాయి.రెడ్మీ 13 4జీ స్పెసిఫికేషన్స్, ఫీచర్లురెడ్మీ 13 4జీ 6.79 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ సన్ స్క్రీన్, మీడియా టెక్ హీలియా జీ91 అల్ట్ రా, 8జీబీ ర్యామ్, 256జీబీ వరకు స్టోరేజ్, స్టోరేజ్ 1టీబీ వరకు పొడిగించుకోవచ్చు. మైక్రోఎస్డీ కార్డ్, ఆండ్రాయిడ్ ఐపర్ ఓఎస్,108 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్,2 సెకండరీ సెన్సార్,ఫోన్ ముందు భాగంలో 13 మెగా పిక్సెల్ సెన్సార్‌తో విడుదల కానుందని పలు జాతీయ మీడియా కథనాలు హైలెట్ చేస్తున్నాయి. -
అదిరిపోయే ఫీచర్లతో.. భారత్‌లో రెడ్మీ ఏ3 విడుదల.. ధర ఎంతంటే?
స్మార్ట్ ఫోన్ ప్రియులకు శుభవార్త. ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ తన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రెడ్మీ సిరీస్‌లో రెడ్మీ ఏ2కి కొనసాగింపుగా రెడ్మీ ఏ3ని తీసుకొచ్చింది. మూడు కలర్ ఆప్షన్లు, మూడు స్టోరేజ్ వేరియంట్లలో లభ్యమవుతున్న ఫోన్ ధర రూ.7,299గా ఉంది. రెడ్ మీ ప్రీమియం ఫోన్లలో కనిపించే హాలో డిజైన్ ఈ బడ్జెట్ ఫోన్లలో కనిపిస్తుంది. రెడ్మీ ఏ3 ధర ఫిబ్రవరి 23 నుండి రిటైల్ అవుట్లెట్లలో లభ్యమయ్యే రెడ్మీ ఏ3 ధర 3జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 7,299 ఉండగా.. 4జీబీ ర్యామ్/128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 8,299, 6జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 9,299 అందుబాటులో ఉంటుంది. రెడ్మీ ఏ3 స్పెసిఫికేషన్స్ రెడ్మీ ఏ3 1650*720 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.7 అంగుళాల హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లేను కలిగి ఉంది. 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వాటర్‌డ్రాప్ స్టైల్ నాచ్‌ను కలిగి ఉంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియా జీ36 చిప్సెట్తో 6జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జీబీ వరకు ఈఎంఎంసీ 5.1 స్టోరేజ్‌తో పనిచేస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కోసం బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్, కనెక్టివిటీ పరంగా రెడ్మీ ఏ3 సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, డ్యూయల్ 4జీ సిమ్ కార్డ్ స్లాట్లు, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.3లు ఉన్నాయి. 8ఎంపీ ప్రైమరీ సెన్సార్, 0.08 ఎంపీ సెకండరీ సెన్సార్‌తో సహా వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్, సెల్ఫీ, వీడియో కాల్ సంబంధిత అవసరాలను తీర్చడానికి 5ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ షూటర్ ఉంది. -
మొబైల్ ప్రారంభోత్సవంలో బిగ్‌బాస్ ఫేమ్ హిమజా’ సందడి (ఫొటోలు)
-
రెడ్మీ నోట్ 13 సిరీస్ వచ్చేది అప్పుడే.. ధర ఎంతంటే?
భారత్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో రెడ్ మీ ఫోన్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో ఇప్పటి వరకు విడుదలైన అన్నీ ఫోన్లు టెక్ ప్రియుల్ని ఎంతగానో అలరించాయి. ఈ తుణంలో షావోమీ రెడ్మీ నోట్ 13 5జీ సిరీస్‌ను భారత్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. షావోమీ రెడ్మీ నోట్ 13, రెడ్మీ నోట్ 13 ప్రో, రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ ఫోన్లను సెప్టెంబర్‌లోనే చైనాలో లాంచ్ చేసింది. ఈ మూడు వేరియంట్ మోడళ్లు 6.67 అంగుళాలు 1.5కే ఫుల్ హెచ్డీ ప్లస్ అమోలెడ్ డిస్ప్లే, 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్‌లో మీడియా టెక్ డైమన్సిటీ 7200 ఆల్ట్రా ఎస్ఓసీ, రెడ్మీ నోట్ 13 ప్రో స్నాప్ డ్రాగన్ 7 జనరేషన్ 2 ఎస్‌ఓఎస్‌తో వచ్చింది. ఇప్పుడు ఈ ఫోన్లను భారత్‌లో జనవరి 4, 2024న విడుదల చేయనున్నట్లు షావోమీ ఇండియా అధికారికంగా ట్వీట్ చేసింది. షావోమీ రెడ్మీ నోట్ 13 సిరీస్ ధరలు ఎంతంటే? రెడ్మీ నోట్ 13 సిరీస్ ఫోన్ ప్రారంభ ధర (చైనా కరెన్సీ యువాన్‌లో ) రూ.13,900, రెడ్మీ నోట్ 13 ప్రో ప్రారంభ ధర రూ.17,400, రెడ్మీ నోట్ 13ప్రో ప్లస్ ప్రారంభ ధర రూ.22,800 ఉండగా భారత్‌లో సైతం ఇవే ధరల్లో అందుబాటులో ఉంటాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక యూరప్‌లో రెడ్మీ నోట్ 13 ప్రో మోడల్ ధర రూ.40,700, రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ రూ.45,000గా ఉంది. రెడ్మీ నోట్ 13 సిరీస్ స్పెసిఫికేషన్స్ రెడ్మీ నోట్ 13 ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14తో ఈ ఫోన్ రాబోతోంది. 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల 1.5కే హెచ్డీ ప్లస్ అమోలెడ్ డిస్ప్లేలను కలిగి ఉంది. ప్రో మోడల్ స్నాప్‌డ్రాగన్ 7 ఎస్ జెన్3 ఎస్ఓఎసీపై నడుస్తుంది. అయితే రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ మీడియాటెక్ డైమన్సిటీ 7200 ఆల్ట్రా ఎస్ఓసీతో పనిచేస్తుంది. వెనిలా రెడ్మి నోట్ 13 మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఎస్ఓసీని కలిగి ఉంది. -
రెడ్మీ నోట్ 13 సిరీస్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్ - సూపర్ ఫీచర్లు
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ.. షావోమీ రెడ్మీ నోట్ 13 సిరీస్ స్మార్ట్ ఫోన్లను మార్కెట్‌కు పరిచయం చేసింది. షావోమీ 12 సిరీస్ సూపర్ హిట్ కావడంతో.. లేటెస్ట్ సిరీస్ షోవోమీ 13పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ సిరీస్‌లో రెడ్మీ నోట్ 13, రెడ్మీ నోట్ 13 ప్రో, రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ మోడళ్లను సెప్టెంబర్ 22న చైనాలో లాంచ్ చేసింది. రేపటి నుంచి ఈ సిరీస్ ఫోన్ల అమ్మకాలు ప్రారంభమవుతున్నాయి. రెడ్మీ నోట్ 13 స్పెసిఫికేషన్లు 6.67-అంగుళాల అమోలెడ్ డిస్ప్లే ఉన్న రెడ్మీ నోట్ 13లో 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, మీడియా టెక్ డైమెన్సిటీ 6080 SoC, 12జీబీ ర్యామ్ 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందిస్తుంది. దీంతో పాటు ఈ ఫోన్లో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్లో 100-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్లు ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ సెన్సార్ సౌకర్యం ఉండగా..ఫోన్ 33డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. రెడ్మీ నోట్ 13 ప్రో స్పెసిఫికేషన్లు ప్రో మోడల్లో 6.67-అంగుళాల 1.5కే హెచ్డీ ప్లస్ అమోలెడ్ ప్యానల్,120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జనరేషన్ 2 చిప్సెట్తో పాటు 16జీబీ ర్యామ్ 512జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. ఫోటోగ్రఫీ విభాగంలో నోట్ 13 ప్రో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 200-మెగాపిక్సెల్ శాంసంగ్ ISOCELL హెచ్‌పీ3 ప్రైమరీ రియర్ సెన్సార్, అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, ఫ్రంట్ అండ్ బ్యాక్ 16 మెగాపిక్సెల్ సెన్సార్‌తో వస్తుండగా 67డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,100ఎంఏహెచ్ బ్యాటరీని పొందవచ్చు. రెడ్మీ నోట్ 13ప్రో ప్లస్ స్పెసిఫికేషన్లు ఈ రెడ్మీ నోట్ 13 ప్రో+ రేర్‌లో లో 200ఎంపీ ప్రైమరీ, 8ఎంపీ అల్ట్రా వైడ్, 2ఎంపీ షూటర్ కెమెరా సెటప్ ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఫ్రెంట్లో 16ఎంపీ కెమెరా వస్తోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అల్ట్రా ప్రాసెసర్, 16జీబీ ర్యామ్- 512జీబీ స్టోరేజ్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 120 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, యూఎస్బీ-సీ పోర్ట్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, ఐఆర్ బ్లాస్టర్, 5జీ, వైఫై-6, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్సీ వంటి కనెక్టివిటీ ఫీచర్స్ సైతం ఉన్నాయి. రెడ్మీ నోట్ 13, రెడ్ మీ నోట్ 13 ప్రో, రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ ధరలు రెడ్మీ నోట్ 13, 6జీబీ ప్లస్ 128జీబీ వేరియంట్ ఫోన్ ధర దాదాపు రూ. 13,900, 8జీబీ ప్లస్ 128 జీబీ, 8జీబీ ప్లస్ 256 జీబీ వేరియంట్ల ఫోన్ ధరలు రూ. 15,100, రూ. 17,400గా ఉంది. 12జీబీ ప్లస్ 256 జీబీ ఫోన్ ధర రూ. 19,700గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. రెడ్మీ నోట్ 13 ప్రో 8జీబీ ర్యామ్, 128 జీబీ, 256 జీబీ వేరియంట్ ఫోన్ల ధరలు రూ. 17,400, రూ. 19,700 వద్ద అందుబాటులో ఉన్నాయి. నోట్ 13 ప్రో 12జీబీ ప్లస్ 256జీబీ వేరియంట్ రూ. 22,000, 12జీబీ ప్లస్ 512 జీబీ వేరియంట్ ఫోన్ ధర రూ. 23,100కే కొనుగోలు చేయొచ్చు.హై-ఎండ్ ప్రో మోడల్ 16జీబీ ప్లస్ 512 జీబీ వేరియంట్ ఫోన్ ధర రూ. రూ. 24,300గా ఉంది. -
కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా? త్వరలో లాంచ్ అయ్యే మొబైల్స్ చూసారా!
Upcoming Smartphones: దేశీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఉత్పత్తులు విడుదలవుతూనే ఉన్నాయి. ఇప్పటికే మనం ఆగష్టు నెలలో విడుదలకానున్న కార్లను గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వచ్చే నెలలో విడుదలకు సిద్దమవుతున్న స్మార్ట్‌ఫోన్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. షావోమి మిక్స్ ఫోల్డ్ 3 (Xiaomi Mix Fold 3) ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న షావోమి త్వరలో మిక్స్ ఫోల్డ్ 3 మొబైల్ లాంచ్ చేయనుంది. ఇది చైనా మార్కెట్లో అడుగుపెట్టనున్నట్లు సమాచారం, భారతదేశంలో తరువాత కాలంలో విడుదలయ్యే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నాము. ఈ స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ గెలాక్సీ జాజ్ ఫోల్డ్ 5కి ప్రత్యర్థిగా ఉండనుంది. వివో వీ29 సిరీస్ (Vivo V29 Series) వివో కంపెనీకి చెందిన వీ29 సిరీస్ గ్లోబల్ మార్కెట్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో వీ29 అండ్ వీ29 ప్రో ఉండనున్నాయి. ఇది కూడా చైనా మార్కెట్లో విడుదలైన తరువాత భారతదేశంలో విడుదలయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. రియల్మీ జీటీ 5 (Realme GT 5) 2023 ఆగష్టు నెలలో రియల్మీ తన జీటీ 5 స్మార్ట్‌ఫోన్ విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ఎస్ఓసీ చిప్ ఉంటుంది, అదే సమయంలో 144 Hz ఓఎల్ఈడీ డిస్ప్లే పొందుతుంది. అద్భుతమైన కెమెరా సెటప్ తప్పకుండా కొనుగోలుదారులను ఆకర్షించడంలో సహాయపడుతుంది. ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వజ్రం ఈయన సొంతం - వెహికల్స్ ఫ్యూయెల్కే వందల కోట్లు.. ఇన్ఫినిక్స్ జీటీ 10 ప్రో (Infinix GT 10 Pro) ఇన్ఫినిక్స్ తన జీటీ 10 ప్రో స్మార్ట్‌ఫోన్ ఆగష్టు 03న ఆవిష్కరించడానికి సన్నద్ధమవుతోంది. ఈ మొబైల్ ఫోన్ ఆకర్షణీయమైన డిజైన్ కలిగి చూడచక్కగా ఉంటుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్సెట్ ఉంటుందని తెలుస్తోంది. ధరలు & ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్న దుబాయ్ షేక్ కారు.. వీడియో వైరల్ రెడ్మీ 12 5జీ (Redmi 12 5G) రెడ్మీ కంపెనీ ఆగష్టు 01న మరో కొత్త 5జీ మొబైల్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇది ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో గట్టిపోటీనిచ్చే విధంగా కంపెనీ దీనిని రూపొందించింది. ఇందులో స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్, 90Hz FHD+ డిస్ప్లేతో 5000 mAh బ్యాటరీ ఉంటాయి. -
రెడ్మీ నోట్ 12 5జీపై భారీ డిస్కౌంట్, రూ.12,999కే కొనుగోలు చేయొచ్చు!
ఈ ఏడాది జనవరిలో విడుదలైన 5జీ స్మార్ట్‌ఫోన్ రెడ్మీ నోట్ 12 5జీ ఫోన్‌పై ప్రముఖ ఫోన్ తయారీ సంస్థ షావోమీ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. వీటితో పాటు రెడ్మీ నోట్ 12ప్రో 5జీ, రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్ 5జీ రేట్లను సవరించింది. అమెజాన్, ఎంఐ.కామ్ డిస్కౌంట్లలో ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చని తెలిపింది. విడుదల సమయంలో రెడ్మీ నోట్ 5జీ స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ ప్లస్ 128 స్టోరేజ్ వేరియంట్ ఫోన్ ధర రూ.17,999 ఉండగా.. తాజాగా ఆఫోన్ ధరను వెయ్యిరూపాయలు తగ్గించింది. దీంతో పాటు ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసిన కస్టమర్లు రూ.2,000 వరకు డిస్కౌంట్‌ను సొంతం చేసుకోవచ్చు. ఆ ఫోన్ ధర రూ.14,999కే తగ్గుతున్నట్లు షావోమీ కంపెనీ పేర్కొంది. కొనుగోలు దారులు హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించి ఈఎంఐ ఆప్షన్‌ను ఎంపిక, ఐసీఐసీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ.2,000 ఇన్స్టంట్ డిస్కౌంట్, మరో రెండు వేలు ఎక్ఛేంజ్ బోనస్‌ను పొందవచ్చు. ఇలా రూ.17,999 ఉన్న ఫోన్ ధర రూ.12,999కి తగ్గుతుంది. అలాగే, 6జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ మోడల్ రెడ్మీ నోట్ 12 5జీ ధర రూ.18,999 ఉండగా 8జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,999గా ఉంది. ఇప్పుడు ఆ రెండు వేరియంట్ ఫోన్ ధరల్ని షావోమీ తగ్గించడంతో బ్యాంక్ డిస్కౌంట్‌తో కలిపి రూ.16,999, 18,999కే లభిస్తుంది. రెడ్మీ నోట్ 12 5జీ స్పెసిఫికేషన్లు రెడ్మీ నోట్ 12 5జీ (1,080*2,400) పిక్సెల్స్‌తో 6.67 అంగుళాల అమోలెడ్ డిస్ప్లేతో 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 5000 ఏఎంహెచ్ బ్యాటరీ, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4జెనరేషన్ 1 ఎస్ఓఎస్, 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 13 మెగా పిక్సెల్ సెల్ఫీ సెన్సార్, 128 జీబీ స్టోరేజ్, 33 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. చదవండి👉 ‘విలాసాల రుచి మరిగి’.. అశ్నీర్ గ్రోవర్ దంపతులకు మరో ఎదురు దెబ్బ! -
లేటెస్ట్ స్మార్ట్ఫోన్లు.. ధర రూ.10 వేల లోపే.. ఫీచర్స్ అదుర్స్!
తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఉన్న స్మార్ట్ ఫోన్లు కొనాలని చూస్తున్న వారి కోసం మే నెలలో మంచి స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. రియల్మీ (Realme), రెడ్మీ (Redmi) తమ ఎంట్రీ-లెవల్ స్మార్ట్ఫోన్లను మే నెలలో లాంచ్ చేశాయి. రియల్మీ నార్జో ఎన్53 (Realme Narzo N53)j, Redmi A2 సిరీస్ ఫోన్లు తక్కువ ధరకు లభిస్తున్నాయి. భారతదేశంలో Realme Narzo N53 ధర రూ. 8,999 వద్ద ప్రారంభమవుతుంది. Redmi A2 Plus ధర రూ. 8,499. వీటితోపాటు పోకో సీ51 (Poco C51), మోటో జీ13 (Moto G13), శాంసంగ్ గెలాక్సీ ఎం13(Samsung Galaxy M13) వంటి ఫోన్లు కస్టమర్లకు అందుబాటులో ఉన్నాయి. రియల్మీ నార్జో ఎన్53 Narzo N53 6.74 అంగుళాల పెద్ద డిస్ప్లే, 50MP మెయిన్ కెమెరా, 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. ధర రూ. 8,999. ఇందులో విశేషం ఏంటంటే ఐఫోన్ 14ప్రో (iPhone 14 Pro) లాంటి డిజైన్ ఉండటం. యాపిల్ డైనమిక్ ఐలాండ్ నాచ్ సిస్టమ్ ఇందులో ఉంది. రియల్ ఏ2 ప్లస్ Redmi A2 Plus అద్భుతమైన ఫీచర్లలో ముఖ్యమైనవి దాని డిజైన్, Android 13 Go ఎడిషన్ సాఫ్ట్వేర్. అలాగే ఇందులో అతిపెద్ద 5,000mAh బ్యాటరీని ఇస్తుంది. తక్కువ ర్యామ్, స్టోరేజ్ (2GB/32GB) చాలు, ఫింగర్‌ప్రింట్ రీడర్ అవసరం లేదు అనుకునే వారికి ఈ ఫోన్ సరిపోతుంది. దీని ప్రారంభ ధర రూ. 5,999 ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు. Redmi A2 స్టాండర్డ్ మోడల్. ఇందులో 2GB/64GB వేరియంట్ రూ.6,499, 4GB/64GB వర్షన్ రూ.7,499కి లభిస్తుంది. మోటరోలా జీ13 Motorola G13 ఫోన్ వేగవంతమైన 90Hz డిస్ప్లే, స్టీరియో స్పీకర్లతో వస్తుంది.డాల్బీ అట్మాస్ సౌండ్‌ను ఇది విడుదల చేస్తుంది. కంటెంట్ కోసం వినియోగించేవారికి ఈ ఫోన్ అనువుగా ఉంటుంది. ఇందులో 5,000mAh బ్యాటరీ ఉంటుంది. 4GB/128GB వేరియంట్ ధర రూ.9,999. పోకో సీ51 Poco C51 భారత్‌లో ఏప్రిల్‌లోనే లాంచ్ అయింది. 4GB/64GB వేరియంట్ ధర ప్రారంభంలో రూ. 8,499 ఉండగా ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 7,249లకే లభిస్తోంది. ఇది చూడాటానికి Redmi A2 ప్లస్ లాగే ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ ఎం13 Samsung Galaxy M13 ఒక సంవత్సరం పాతదే అయినా నేటికీ దీనికి మంచి ఆదరణ ఉంది. ఈ ఫోన్ 4GB/64GB వేరియంట్ ధర ఇటీవల రూ. 11,999 నుంచి రూ. 9,699కి తగ్గింది. దీంతో దీన్ని కొనేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. డెడికేటెడ్ అల్ట్రావైడ్ శక్తివంతమైన కెమెరా సెటప్, 6,000mAh భారీ బ్యాటరీ ఈ ఫోన్ ప్రత్యేకతలు. ఇదీ చదవండి: Flipkart Big Bachat Dhamaal Sale: స్మార్ట్ఫోన్లపై సూపర్ డిస్కౌంట్లు.. ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే డీల్స్! -
రూ. 6 వేలకే సరికొత్త స్మార్ట్ఫోన్లు.. లాంచ్ చేసిన షావోమీ
అతి తక్కువ ధరలో సరికొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది షావోమీ (Xiaomi). రెడ్మీ ఏ2 (Redmi A2), రెడ్మీ ఏ2 ప్లస్ (Redmi A2 Plus) ఫోన్లు భారత్‌లో అధికారికంగా విడుదలయ్యాయి. ఇదీ చదవండి: Motorola Edge 40: మోటరోలా ఎడ్జ్ 40 లాంచ్‌కు రెడీ.. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు భలే ఉన్నాయే! రెడ్మీ ఏ2 సిరీస్ గత సంవత్సరం వచ్చిన రెడ్మీ ఏ1 సిరీస్‌కు కొనసాగింపు. పైకి చూడటానికి ఒకేలా ఉన్నా ఏ2 సిరీస్‌లో మరికొన్ని హంగులు చేర్చారు. మరింత శక్తివంతమైన చిప్‌ను జోడించారు. తాజా ఆండ్రాయిడ్ ( Android 13 Go) ఎడిషన్ సాఫ్ట్‌వేర్‌ను జత చేశారు. ఇక రెడ్మీ ఏ2, ఏ2 ప్లస్ డిజైన్ పరంగా రెండూ ఒకే రకంగా ఏ2 ప్లస్ ఫోన్లో అదనంగా ఫింగర్‌ప్రింట్ రీడర్ ఫీచర్ ఉంటుంది. రెడ్మీ ఏ2 సిరీస్ ధర రూ. 5,999 నుంచి ప్రారంభమవుతుంది. మే 23 తర్వాత ఈ ఫోన్లు కొనుగోలుదారులకు అందుబాటులోకి వస్తాయి. రేట్లు ఎంత.. ఎక్కడ కొనాలి.. ఆఫర్ల సంగతేంటి? రెడ్మీ ఏ2 2జీబీ/32జీబీ వేరియంట్ ధర రూ.5,999. 2జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ వెర్షన్ ధర రూ.6,499. ఇది 4జీబీ/64జీబీ కాన్ఫిగరేషన్‌లో కూడా కూడా అందుబాటులో ఉంది. దీని ధర రూ.7,499. ఇక రెడ్మీ ఏ2 ప్లస్ ధర రూ. 8,499. ఇది 4జీబీ/64జీబీ కాన్ఫిగరేషన్‌లో మాత్రమే వస్తుంది. సీ గ్రీన్, కామింగ్ ఆక్వా బ్లూ, క్లాసిక్ బ్లాక్ కలర్స్‌లో ఈ ఫోన్స్ లభిస్తాయి. ఈ ఫోన్లను ఆన్లైన్లో అయితే అమెజాన్, షావోమీ ఆన్లైన్ స్టోర్‌లో, అదే ఆఫ్‌లైన్‌లో అయితే ఎంఐ హోమ్ స్టోర్లతో పాటు కంపెనీ ఇతర రిటైల్ పార్టనర్ స్టోర్లలో మే 23 (మధ్యాహ్నం 12 తర్వాత) నుంచి కొనుగోలు చేయవచ్చు. ఇక ఆఫర్ల విషయానికి వస్తే షావోమీ ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ వినియోగదారులకు ఈ ఫోన్ల కొనుగోలుపై రూ. 500 వరకు అదనపు తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఈ మోడళ్లపై 2 సంవత్సరాల వారంటీ ఉంటుందని కంపెనీ పేర్కొంది. సీనియర్ సిటిజన్లకైతే ఈ ఫోన్లను హోం సర్వీస్‌లో అందించనున్నట్లు తెలిపింది. స్పెసిఫికేషన్లు, ఫీచర్లు వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌తో 6.52 అంగుళాల 720p డిస్ప్లే MediaTek Helio G36 చిప్సెట్ 4GB ర్యామ్ 64GB ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ Android 13 Go సాఫ్ట్వేర్. వెనుకవైపు 8MP ప్రధాన సెన్సార్‌తో డ్యూయల్ కెమెరా సెటప్, ముందువైపు మరో 5MP కెమెరా 10W మైక్రో USB ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ. ఇదీ చదవండి: అదిరిపోయే రంగులో శాంసంగ్ గెలాక్సీ ఎస్23.. ధర ఎంతంటే.. -
బీ న్యూ మొబైల్స్ స్టోర్‌లో రెడ్మీ 12సి సిరీస్ ఫోన్లు
హైదరాబాద్: ప్రముఖ రిటైల్ చైన్ బీ న్యూ మొబైల్ స్టోర్ రెడ్మీ 12సీ, 12 సిరీస్ స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తెచ్చింది. సినీ నటి దక్ష నాగర్కర్ గురువారం రెడ్మీ 12సీ స్మార్ట్‌ఫోన్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ‘‘బీ న్యూ స్టోర్స్ అద్భుతమైన ఆఫర్లతో రెడ్ మీ 12సీ స్మార్ట్ఫోన్లను తక్కువ ధరకే అందిస్తుంది. కస్టమర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి’’ అని నాగర్కర్ కోరారు. ఆవిష్కరణ కార్యక్రమంలో కంపెనీ సీఎండీ బాలాజీ చౌదరి, సీఈఓ సాయి నిఖిలేశ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి నితేశ్తో పాటు రెడ్మీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
రెడ్మి 12సీ, రెడ్మి నోట్12 వచ్చేశాయ్! అందుబాటు ధరలే
సాక్షి, ముంబై: చైనా స్మార్ట్‌ఫోన్‌కు షావోమి రెడ్ మి 12 సిరీస్‌లో రెండు కొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. గత వారం యూరప్‌లో విడుదల చేసిన రెడ్మినోట్12 4జీతోపాటు, రెడ్మి12 సీనిక ఊడా ఇపుడు భారతదేశంలో తీసుకొచ్చింది. రెడ్మినోట్12 4జీ 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ అనే రెండు స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంటుంది రెడ్మినోట్12 4జీ ధర , లభ్యత 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ.16,999 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ధర రూ.14,999గా ఉంది. లూనార్ బ్లాక్, ఫ్రాస్టెడ్ ఐస్ బ్లూ సన్‌రైజ్ గోల్డ్ కలర్స్‌లో లభ్యం. అలాగే లిమిటెడ్ ఆఫర్ కింద కొనుగోలుదారులు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై రూ. 1,000 తగ్గింపుకు అర్హులు. ఏప్రిల్ 6 నుండి ఎం స్టేర్లతోపాటు, అమెజాన్, ఇతర రిటైల్ స్టోర్ల ద్వారా విక్రయంజ రెడ్మినోట్12 4జీ స్పెసిఫికేషన్స్ 6.67అంగుళాల పంచ్-హోల్ AMOLED FHD+ డిస్ప్లే | 2400 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ 120Hz వరకు రిఫ్రెష్ రేట్ Qualcomm Snapdragon 685 చిప్సెట్ Android 13 ఆధారంగా MIUI 14 50+ 8+ 2ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 13ఎంపీ సెల్ఫీ కెమెరా 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు 5,000mAh బ్యాటరీ రెడ్మి 12 సీ స్పెసిఫికేషన్స్ 6.71-అంగుళాల HD+ డిస్ప్లే MediaTek Helio G85 SoC ఆండ్రాయిడ్ 12 OS 50 + 2 ఎంపీ రియర్ డ్యూయల్ కెమెరాలు 5ఎంపీ సెల్ఫీ కెమెరా 5,000W బ్యాటరీ రెడ్మి 12 సీ లభ్యత,ధరలు 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ ధర : రూ. 8,999 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ రూ. 10,999 ఏప్రిల్ 16నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. బ్యాంక్ కార్డ్‌తో 500 తక్షణ తగ్గింపు -
Redmi : వావ్.. 32 అంగుళాల టీవీ కేవలం రూ.12 వేలు మాత్రమే!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రెడ్మీ కొత్త టీవీని విడుదల చేసింది. రెడ్మీ స్మార్ట్ఫైర్ టీవీ 32 (Redmi Smart Fire TV 32) పేరుతో భారత్‌లో లాంచ్ చేసింది. కేవలం రూ.11,999కే 32 అంగుళాల వేరియంట్ టీవీలో అమెజాన్ ఫైర్ ఓఎస్‌ని అందిస్తుంది. గతంలో రెడ్మీ పలు టీవీలను విడుదల చేసినప్పటికీ.. అవి ఆండ్రాయిత్ టీవీ ఓఎస్‌తో వచ్చేవి. భారత్‌లో రెడ్మీ స్మార్ట్ఫైర్ టీవీ 32 ధర రెడ్మీ స్మార్ట్ఫైర్ టీవీ 32 ధర రూ.13,999 గా ఉంది. ప్రారంభ ఆఫర్, కార్డు ఆఫర్లు పోగా..రూ.11,999కే లభిస్తుంది. ఈ కొత్త స్మార్ట్ టీవీని మార్చి 21నుంచి రెడ్మీ అమ్మకాలు ప్రారంభించనుంది. ఇక ఈ టీవీ అమెజాన్, ఎంఐ స్టోర్ల నుంచి కొనుగోలు చేయొచ్చు. రెడ్మీ స్మార్ట్ ఫైర్ టీవీ 32 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు పైన పేర్కొన్నట్లుగా రెడ్మీ స్మార్ట్ఫైర్ టీవీ 32 ప్రస్తుతానికి 32 అంగుళాలు,హెచ్డీ (1366x768-పిక్సెల్) రిజల్యూషన్‌తో టెలివిజన్ ఫైర్ ఓఎస్ 7 ఆధారితమైనది. ఇందులో ప్రైమ్ వీడియో, అమెజాన్ మ్యూజిక్ వంటి అమెజాన్ సొంత యాప్‌ల సపోర్ట్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్, యాపిల్ టీవీ, స్మార్ట్ టీవీ యాప్‌లు, స్ట్రీమింగ్ సేవలకు ఫైర్ ఓఎస్ సపోర్ట్ చేస్తుంది. సౌండ్ కోసం డాల్బీ ఆడియోకు సపోర్ట్‌గా 20డబ్ల్యూ స్పీకర్ సిస్టమ్‌ను అందిస్తుంది. కనెక్టివిటీ పరంగా, Redmi Smart Fire TV 32లో బ్లూటూత్ 5, డ్యూయల్ బ్యాండ్ వైఫై, ఎయిర్ ప్లే, మిరా క్యాస్ట్(Miracast)లకు సపోర్ట్ ఇస్తుంది. రెండు హెచ్డీఎంఐ పోర్ట్‌లు, రెండు యూఎస్బీ పోర్ట్‌లు, ఏవీ ఇన్పుట్ సాకెట్లు, వైర్డు హెడ్‌ఫోన్ లేదా స్పీకర్ కనెక్టివిటీ కోసం 3.5ఎంఎం సాకెట్, వైర్డు ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం ఈథర్నెట్ పోర్ట్, యాంటెన్నా సాకెట్ ఉన్నాయి. 1జీబీ ర్యామ్, 8జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సౌకర్యం ఉంది. ఇది కాకుండా రెడ్మీఫైర్ టీవీలో అలెక్సా వాయిస్ అసిస్టెంట్‌ని వినియోగించేందుకు వీలుగా టీవీ రిమోట్లో అలెక్సా బటన్ ఉంది. తద్వారా అమెజాన్ అకౌంట్‌తో కనెక్ట్ చేసిన ఐఓటీ, స్మార్ట్ హోమ్ పరికరాలను ఆపరేట్ చేసేందుకు ఉపయోగించవచ్చు. రిమోట్లో ప్రైమ్ వీడియో, అమెజాన్ మ్యూజిక్, నెట్‌ఫ్లిక్స్ కోసం హాట్‌కీలు కాకుండా ప్లేబ్యాక్కోసం ప్రత్యేక బటన్లు, మ్యూట్ బటన్లు ఉన్నాయి. -
Redmi Fire TV: కొత్త ఓఎస్‌తో, కొత్త కొత్తగా వచ్చేస్తోంది!
సాక్షి,ముంబై:బడ్జెట్ ధరల స్మార్టఫోన్లు, స్మార్ట్ టీవీలతో ఆకట్టుకున్న చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ షావోమికి చెందిన రెడ్మీ స్మార్ట్ టీవీని తీసుకొచ్చింది. ఇండియన్ మార్కెట్లో తొలిసారిగా ఫైర్ ఓఎస్‌తో సరికొత్త టీవీని పరిచయం చేసింది. ఈమేరకు షావోమీ ట్విటర్లో షేర్ చేసింది. రెడ్మీ ఫైర్ స్మార్ట్ టీవీ ఈ నెల (మార్చి) 14వ తేదీన లాంచ్ కానుంది. అమెజాన్‌కు చెందిన ఫైర్ ఓఎస్ 7 (Fire OS7)పై ఈ స్మార్ట్ టీవీ రన్ అవుతుంది. రెడ్మీ ఫైర్ టీవీని లాంచ్ కోసం మైక్రోపేజీని క్రియేట్ చేసింది. అమెజాన్ భాగస్వామ్యంతో ఈ టీవీని షావోమీ రూపొందించింది. అమెజాన్ ద్వారా ఈ టీవీ అందుబాటులోకి రానుంది. రెడ్మీ ఫైర్ టీవీ ఫీచర్లు, అంచనాలు రెడ్మీ ఫైర్ టీవీ బెజిల్లెస్ డిజైన్, క్వాడ్-కోర్ ప్రాసెసర్, మెటాలిక్ బాడీ డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 వెర్షన్ కనెక్టివిటీ ఫోన్, ల్యాప్‌టాప్, టాబ్లెట్ టీవీ స్క్రీన్ కాస్టింగ్ కోసం మిరాకాస్ట్, యాపిల్ ఎయిర్ ప్లే , అలెక్సా వాయిస్ అసిస్టెంట్ ప్రధాన ఫీచర్లుగా ఉండనున్నాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగాఫైర్ ఓఎస్‌తో గ్లోబల్‌గా ఇటీవల షావోమీ ఎఫ్2 సిరీస్‌లో కొన్ని టీవీలను లాంచ్ చేసింది. 4K అల్ట్రా స్క్రీన్ రిజల్యూషన్, 43, 50, 55 అంగుళాల సైజుల్లో మెటల్ యూనీబాడీ డిజైన్‌తో వీటిని రూపొందించినట్టు తెలుస్తోంది. ఇక ధర, ఇతర స్పెషికేషన్లపై లాంచింగ్ తరువాత మాత్రమే క్లారిటీ రానుంది. Experience the excitement of curtain raiser performances from the comfort of your home. Stay Tuned!#FireUp pic.twitter.com/mcQv20qN09 — Xiaomi TV India (@XiaomiTVIndia) March 2, 2023 -
10వేలకే స్మార్ట్‌టీవీ, రెడ్మీ స్మార్ట్‌టీవీ 32 ఉచితంగా పొందే లక్ మీదే!
సాక్షి,ముంబై: చైనాకు చెందిన ప్రముఖ కంపెనీ షావోమీ రిపబ్లిక్ డే సేల్ ప్రకటించింది. 74వ గణతంత్ర సంవత్సరం సందర్భంగా, అధికారిక వెబ్సైట్ ప్రత్యేకమైన డీల్స్, ప్రమోషన్లను అందిస్తోంది. రోజువారీ 12 గంటలకు పరేడ్, 3 గంటలకు ఫ్లాష్ సేల్, ఎక్స్చేంజ్ అవర్ లాంటివి ప్రకటించింది. అంతేకాకుండా, వినియోగదారులు ప్లే అండ్ విన్ ఆఫర్ ద్వారా రెడ్మీ స్మార్ట్ టీవీ 32, రెడ్మి నోట్ ప్రోలాంటి అద్భుతమైన ఉచిత ఉత్పత్తులను గెలుచుకునే అవకాశాన్ని పొందుతారు. జనవరి 20 వరకు, 23న ఈ సేల్ అందబాటులో ఉంటుంది.ఈ సేల్‌లో షావోమీ స్మార్ట్ఫోన్లు స్మార్ట్ టీవీలు, ల్యాప్టాప్స్, ఇతర ప్రొడక్టులు డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇండస్ఇండ్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులతో పాటు యూపీఐ పేమెంట్లపై కూడా అదనపు డిస్కౌంట్ అందిస్తోంది. ముఖ్యంగా ఈ సేల్‌లో కొన్ని షావోమీ, రెడ్మీ, ఎంఐ టీవీలు మంచి తగ్గింపుతో స్మార్ట్‌టీవీలనుకొనుగోలు చేయవచ్చు. రెడ్మీ స్మార్ట్ టీవీ 32 హెచ్డీ రెడీ రెడ్మీ 32 ఇంచుల ఈ స్మార్ట్ టీవీ రూ.10,999గా ఉంది. ఇండస్ఇండ్ బ్యాంకు క్రెడిట్ కార్డుతో ఈఎంఐ పద్ధతిలో ఈ టీవీని కొనుగోలు చేస్తే రూ.2,000 అదనపు తగ్గింపు. అంటే రూ.9,999కే ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని సొంతం చేసుకోవచ్చు. ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో సింగిల్ పేమెంట్‌లో కొంటే రూ.1,500 తగ్గింపు ఉంటుంది. పేటీఎం వ్యాలెట్, ఏదైనా యూపీఐ ద్వారా పేమెంట్లపై రూ.1,000 డిస్కౌంట్ లభ్యం. షావోమీ స్మార్ట్ టీవీ 5ఏ షావోమీ స్మార్ట్ టీవీ 5ఏ రూ.12,499 ధరతో సొంతం చేసుకోవచ్చు. ప్రీపెయిడ్ పేమెంట్లపై రూ.1,000, పేటీఎం వ్యాలెట్‌తో చెల్లింపులు చేస్తే మరో రూ.1,000, ఇండస్ఇండ్ క్రెడిట్ కార్డు ఆఫర్లు వినియోగించుకుంటే ఈ 32 ఇంచుల ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని రూ.10,499కే కొనుగోలు చేయవచ్చు. -
బీ న్యూలో రెడ్మీ నోట్ 12 5జీ సిరీస్ ఆవిష్కరణ
హైదరాబాద్: మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ చైన్ బీ న్యూ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్ స్టోర్లలో రెడ్మీ నోట్ 12 5జీ సిరీస్ అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు ఇక్కడ బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో ప్రముఖ నటి ఈషా రెబ్బ ఈ ఫోన్‌ను ఆవిష్కరించారు. సంస్థ సీఎండీ వైడీ బాలాజీ చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి నితేష్, రెడ్మీ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొబైల్ కొనుగోళ్లకు సంబంధించి ఈఎంఐ, జీరో ఫైనాన్స్ సౌలభ్యం అందుబాటులో ఉన్నట్లు సంస్థ విడుదల చేసిన ప్రకటన తెలిపింది. చదవండి: World Richest Pet: దీని పనే బాగుంది, రూ.800 కోట్లు సంపాదించిన పిల్లి! -
అమెజాన్ ఆఫర్: ఇలా చేస్తే రెడ్మీ ఏ1 స్మార్ట్‌ఫోన్ రూ.1000లోపు సొంతం చేసుకోవచ్చు!
కొత్త సంవత్సరంలో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా ? అయితే ఈ శుభవార్త మీ కోసమే. దిగ్గజ ఈకామర్స్ సంస్థ అమెజాన్‌లో తన కస్టమర్లకు ఈ అద్భుత ఆఫర్‌ను తీసుకువచ్చింది. మార్కెట్లో డిమాండ్ ఉన్న రెడ్మి స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపుని అందిస్తోంది. అమెజాన్ ప్రకటించిన ఆఫర్లన్నీ ఉపయోగిస్తే ఈ మొబైల్ వెయ్యి రూపాయలు లోపు చెల్లించి మన ఇంటికి తెచ్చుకోవచ్చు. అదెలాగో చూద్దాం! రెడ్మి ఏ1 స్మార్ట్‌ఫోన్ .. ఇది మరో రకంగా బడ్జెట్ ఫోన్ అని చెప్పవచ్చు. అమెజాన్ వెబ్సైట్లో దీని ధర రూ. 8,999గా ఉంది. ఈ ధరపై 28 శాతం తగ్గింపు కూడా ఉంది. దీంతో తగ్గింపు పోను రూ. 6,499కే కస్టమర్లు కొనేయచ్చు. అంతేనా ఇది కాకుండా మరో అదిరిపోయే డీల్స్ కూడా ఉన్నాయి, వాటిపై ఓ లుక్కేద్దాం. ఈ ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్ కింద రూ. 620 వరకు తగ్గింపు లభిస్తోంది. అలాగే అమెజాన్ ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొంటే 5 శాతం క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. ఇలా మీకు అదనపు ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. నెలవారీ ఈఎంఐ రూ. 311 నుంచి ప్రారంభం అవుతోంది. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. దాదాపు రూ. 6,100 వరకు ఈ తగ్గింపు ఉంటుంది. ఫైనల్‌గా రూ.1000 లోపే ఈ ఫోన్ మన సొంతం చేసుకోవచ్చు. తమ పాత ఫోన్ ఇచ్చి ఈ ఫోన్ కొనాలని భావించే వారికి ఇది బెస్ట్ డీల్ అని చెప్పాలి. ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే.. మీ ఫోన్ మోడల్, అది ఉన్న కండీషన్ ప్రాతిపదికన మీకు వచ్చే ఎక్స్చేంజ్ బోనస్ మారుతుంది. -
న్యూ ఇయర్ ధమాకా: జనవరిలో లాంచ్ కానున్న 5జీ స్మార్ట్ఫోన్లు ఇవే!
భారత్‌లో స్మార్ట్ఫోన్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. అంతేకాకుండా 2022లో 5జీ సేవలు దేశంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీంతో 5జీ టెక్నాలజీకి అనుగుణంగా వివిధ కంపెనీలు తన స్మార్ట్ఫోన్లను లేటెస్ట్ ఫీచర్లుతో తయారు చేయడం మొదలుపెట్టాయి. ఇక ప్రస్తుతం కొత్త సంవత్సరం కావడంతో పలు బ్రాండెడ్ కంపెనీలు తమ ఫోన్లను గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాయి. వివిధ సెగ్మెంట్లలో అద్భుతమైన ఫీచర్స్‌తో స్మార్ట్ఫోన్లను తీసుకురానున్నాయి. ఈ జనవరిలో లాంచ్ కానున్న బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లు వాటి ప్రత్యేకతలని తెలుసుకుందాం! Tecno Phantom X2 ►టెక్నో ఫాంటమ్ ఎక్స్2 (Tecno phantom X2) జనవరి 2న భారత్‌లో లాంచ్ కానుంది. ఈ ఫోన్ ఇటీవలే ఫాంటమ్ X2 ప్రోతో పాటు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ► ఫాంటమ్ X2 6.8 ఇంచెస్ FHD+ AMOLED డిస్ప్లే ►ఇది 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ► ఇందులో 64MP ప్రధాన కెమెరా, 13MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ ► 5,160mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ Poco C50 ►పోకో సీ 50 (Poco C50) ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్‌లో నడుస్తుంది కాబట్టి Poco ఇండియా ఇంటి నుండి సరసమైన స్మార్ట్‌ఫోన్‌గా కనిపిస్తోంది. ►ఈ స్మార్ట్‌ఫోన్ 6.52-అంగుళాల HD+ డిస్ప్లే ► 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ► వెనుకవైపు 8MP డ్యూయల్ కెమెరాలు, 5MP సెల్ఫీ కెమెరా ► ఇది ఫింగర్‌ప్రింట్ రీడర్, 5,000mAh బ్యాటరీ సపోర్ట్ కూడా ఉంది. Samsung Galaxy F04 ►సాంసంగ్ నుంచి మరో సరసమైన ఫోన్, గెలాక్సీ ఎఫ్ 04 (Galaxy F04 )జనవరి 4న భారత మార్కెట్లో లాంచ్ అవుతుంది. ► 6.5-అంగుళాల HD+ రిజల్యూషన్ డిస్ప్లే ► 8GB RAM వరకు MediaTek Helio P35 చిప్సెట్ ద్వారా ఎనర్జీని పొందుతుంది. ► 5,000mAh బ్యాటరీ సపోర్ట్ Redmi Note 12 series ►రెడ్మీ నోట్ 12 (Redmi Note 12) సిరీస్ భారతదేశంలో జనవరి 5 న మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ సిరీస్‌లో రెడ్మీ నోట్ 12 5జీ (Redmi Note 12 5G), రెడ్మీ నోట్ 12 ప్రో (Redmi Note 12 Pro), రెడ్మీ నోట్ 12 ప్రో+ ( Redmi Note 12 Pro+) ఫోన్లు ఉన్నాయి. ►రెడ్మీ నోట్ 12 ఈ సంవత్సరం బేస్ Redmi నోట్ ఫోన్‌కు 5G కనెక్టివిటీని తీసుకువస్తుంది. అయితే రెడ్మీ నోట్ 12 ప్రో + అత్యధికంగా 200MP ప్రధాన కెమెరా సిస్టమ్, 120W ఫాస్ట్ ఛార్జింగ్‌తో రానుంది. iQOO 11 ►ఐక్యూ 11 సిరీస్‌లో రెండు ప్రీమియం మోడల్స్ జనవరి 10న భారత్‌లో గ్రాండ్‌గా లాంచ్ కానున్నాయి. ఇందులో ఒకటి ఐక్యూ 11 కాగా , మరొకటి ఐక్యూ 11 ప్రో. ►144 Hz రిఫ్రెష్ రిఫ్రెష్ రేట్, ►2K రెజల్యూషన్‌తో 6.78 ఇంచెస్ E6 అమోలెడ్ డిస్ప్లే ►పవర్ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ► ట్రిపుల్ కెమెరా సెటప్‌తో రానుంది. ► 5,000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో వస్తోంది. -
న్యూ ఇయర్ క్రేజీ ఆఫర్.. అదిరే ఫీచర్లున్న ఈ రెడ్మీ 5జీ స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింపు!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ షావోమీ ఇండియా ఇటీవలే రెడ్మీ 11 ప్రైమ్ 5జీ (Redmi 11 Prime 5G) స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి విడుదల సంగతి తెలిసిందే. తాజాగా తన కస్టమర్లకు న్యూ ఇయర్ ఆఫర్‌గా ఈ స్మార్ట్‌ఫోన్ ధరను తగ్గించింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రెండు వేరియంట్లపై రూ.1,000 చొప్పున తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం Mi.com, అమెజాన్ (Amazon)లో వెయ్యి రుపాయలు తగ్గింపు ధరతో... 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.12,999 ధరకు, 6జీబీ+128జీబీ వేరియంట్ రూ.14,999 ధరగా ఉంది. అంతకుముందు ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999. Redmi Prime 5Gలో 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇది డిస్ప్లేలో వాటర్‌డ్రాప్-స్టైల్ డిస్ప్లే నాచ్‌ను కలిగి ఉంది. ఇందులో 5,000mAh బ్యాటరీ ఉండగా 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 22.5వాట్ ఛార్జర్ బాక్సులోనే లభిస్తుంది. పవర్ఫుల్ నైట్ విజన్, పోర్ట్రైట్ మోడ్, మూవీ ఫ్రేమ్, షార్ట్ వీడియో, టైమ్ ల్యాప్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. మెడో గ్రీన్, థండర్ బ్లాక్, క్రోమ్ సిల్వర్ కలర్స్‌లో లభిస్తుంది. అదనంగా, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌లు ద్వారా ఈఎంఐ లావాదేవీలను ఉపయోగించి ఈ హ్యాండ్‌సెట్‌ను కొనుగోలు చేసే కస్టమర్లకు రూ. 1,000 తగ్గింపు ఇస్తుండగా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డ్‌ల ద్వారా చేసిన కొనుగోళ్లకు 750 తక్షణ తగ్గింపు అందిస్తోంది. అమెజాన్ నుంచి ఈఎంఐ ద్వారా కొనాలనుకునేవారికి నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ రూ.2,000 నుంచి ప్రారంభం అవుతుంది. -
5జీ, ఇతర స్మార్ట్ఫోన్లపై అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్లు
సాక్షి,ముంబై: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ‘స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్’ పేరుతో డిస్కౌంట్ సేల్కు తెర తీసింది. డిసెంబర్ 10 నుంచి 14 వరకు ఐదు రోజుల పాటు స్మార్ట్‌ఫోన్స్ పై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందించనుంది. ముఖ్యంగా కొన్ని 5జీ మోడల్స్‌తోపాటు, వన్‌ప్లస్ 10 ప్రొ, ఐఫోన్ 14, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 సహా అనేక స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లను అందిస్తుంది. హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసినవారికి 10శాతం తక్షణ డిస్కౌంట్ లభ్యం. కనిష్టంగా రూ. 5,000 కొనుగోలు చేసిన వినియోగదారులు రూ. 1,000 వరకు (పది శాతం) తగ్గింపు పొందవచ్చు. ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగ దారులు కనీసం రూ. 1,250 వరకు పది శాతం తగ్గింపును పొందవచ్చు. అమెజాన్ ఆఫర్లు శాంసంగ్ గెలాక్సీ ఎం13 స్మార్ట్ ఫోన్ రూ. 9,699కి లభ్యం. ఐక్యూ జీ6 లైట్ 13,999 కి లభిస్తుంది. రెడ్మీ ఏ1 డిస్కౌంట్ అనంతరం రూ. 6,119 కి లభిస్తుంది.రెడ్మీ 11ప్రైమ్ 5జీ రూ. 11,999, రెడ్ మీ నోట్ 11 రూ. 10,999లకు కొనుగోలు చేయ వచ్చు. ఒప్పో ఎఫ్ 21ఎస్ ప్రొ 5జీ: ఒప్పో ఎఫ్21ఎస్ ప్రొ 5జీ రూ. 24,499కి అందుబాటులో ఉంది. ఎక్స్ఛేంజ్ఆఫర్గా అదనంగా రూ. 3,000 తగ్గింపును కూడా పొందవచ్చు. ఇంకా ఒప్పో ఏ సిరీస్‌లో, ఒప్పో ఏ76, ఏ77 వరుసగా రూ. 15,490. రూ. 16,999కి అందుబాటులో ఉన్నాయి. లావా: ఇక స్వదేశీ బ్రాండ్, లవా బ్లేజ్ NXTని రూ.8,369కి సొంతం చేసుకోవచ్చు. అలాగే లావా జెడ్3 రూ.6,299కే లభ్యం. టెక్నో టెక్నో పాప్ 6 ప్రో రూ.5,579కి, టెక్నో స్పార్క్ 9 రూ.7,649కి అందుబాటులో ఉంటాయి. అలాగే ఇటీవల తీసుకొచ్చిన పోవా 5జీ , టెక్నోకేమాన్ 19 మాండ్రియన్ వరుసగా రూ. 14,299 ,రూ. 16,999కి అందుబాటులో ఉంటాయి. -
‘రాత్రి మా ఆంటీ చనిపోయింది’, ఫోన్ పక్కనే పెట్టుకుని పడుకుంటున్నారా?
రాత్రి పూట స్మార్ట్ ఫోన్ వాడే అలవాటు ఉందా? నిద్రపోయే ముందు మొబైల్‌ను పక్కనే పెట్టుకొని పడుకుంటున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. ఇటీవల కాలంలో చైనా స్మార్ట్ ఫోన్లు పేలుతున్న వరుస సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా చైనాకు చెందిన ఓ స్మార్ట్ ఫోన్ పేలింది. ఈ ఘటనలో మహిళ ప్రాణాలు కోల్పోయింది. ప్రస్తుతం మొబైల్ పేలిన ఘటన నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీకి చెందిన ఓ మహిళ రెడ్మీ 6ఏ ఫోన్‌ను వినియోగిస్తుంది. అయితే ఈ క్రమంలో ఆర్మీలో విధులు నిర్వహించే ఆమె కుమారుడితో మాట్లాడి..ఆ ఫోన్‌ను పక్కనే పెట్టుకొని పడుకుంది. ఆ మరుసటి రోజు ఆమె అల్లుడు వచ్చి చూసే సరికి బాధితురాలు రక్తపు మడుగులో ప్రాణాలు కోల్పోయి విగతజీవిగా కనిపించింది. దీంతో తన అత్త మరణంపై ఆమె అల్లుడు మంజీత్ స్పందించాడు. Hi @RedmiIndia @manukumarjain@s_anuj Yesterday in Night my Aunty found dead 😭, she was using Redmi 6A, she was sleeping & she kept the phone near her face on pillow side & after sometime her phone blast. It's a bad time for us. It's a responsibility of a brand to support🙏 pic.twitter.com/9EAvw3hJdO — MD Talk YT (Manjeet) (@Mdtalk16) September 9, 2022 ‘నిన్న రాత్రి మా ఆంటీ చనిపోయింది. ఆమె రెడ్మీ 6ఏ వాడుతోంది. రాత్రి పడుకునే సమయంలో దిండు పక్కనే దాన్ని పెట్టుకొని పడుకుంది. మధ్య రాత్రిలో అది పేలి మా అత్త చనిపోయింది. ఇది మాకు చాలా విషాదమైన సమయం. మాకు సాయం చేయాల్సిన బాధ్యత సదరు స్మార్ట్ ఫోన్ సంస్థపై ఉంటుంది’ అని అతను ట్వీట్ చేశాడు. అంతేకాదు పేలిన ఫోటోలు, రక్తపు మడుగులో ప్రాణాలు కోల్పోయిన తన అత్త ఫోటోల్ని షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట్లో వైరల్ కావడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని రెడ్మీ కంపెనీ వెల్లడించింది. -
బిగ్ బ్యాటరీ, బిగ్ స్క్రీన్, ధర మాత్రం ఏడువేల లోపే!
సాక్షి,ముంబై: రెడ్మీ అందుబాటులో ధరలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. క్లీన్ ఆండ్రాయిడ్ 12,హీలియో ఏ22 చిప్, వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌తో రెడ్మి ఏ1 పేరుతో దీన్ని లాంచ్ చేసింది.ఈ ఎంట్రీ-లెవల్ ఫోన్ ధర రూ. 6,499గా ఉంచింది. సెప్టెంబర్ 9 నుండి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. భారతదేశంలో రెడ్మి ఏ1 ధర, విక్రయ తేదీ 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.6,499. సెప్టెంబర్ 9నుంచి షావోమివెబ్సైట్, మై హోమ్, అమెజాన్ రిటైల్ అవుట్లెట్లలో లభ్యం. లేత ఆకుపచ్చ, లేత నీలం, నలుపు మూడు రంగుల్లో లాంచ్ అయింది. రెడ్మి ఏ1 స్పెక్స్, ఫీచర్లు 6.52 అంగుళాల 720p డిస్ప్లే 8 ఎంపీ రియర్‌కెమెరా 5 ఎంపీ సెల్పీ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 10W మైక్రో-యూఎస్బీ ఛార్జింగ్ సపోర్ట్ -
ఐఫోన్ ఇన్స్పిరేషన్తో..బోలెడన్ని ఫీచర్లతో బడ్జెట్ ఫోన్! ధర ఎంతంటే!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ సబ్ బ్రాండ్ రెడ్మీ బడ్జెట్ ధరలో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఐఫోన్ ఎస్ఈ మోడల్ ఇన్స్పిరేషన్తో 'రెడ్మీ నోట్ 11ఎస్ఈ' ఫోన్‌ను డిజైన్ చేసింది. అంతేకాదు ఐఫోన్లో ఉన్న ఫీచర్లు ఈ కొత్త చైనా ఫోన్లో ఉన్నాయి. ధర విషయంలో ఐఫోన్ అంత కాస్ట్లీ కాకుండా బడ్జెట్ ధరనే నిర్ణయించింది. మైక్రో ఎస్డీ స్లాట్ వరకు అప్‌గ్రేడ్ చేసుకునేలా 64జీబీ స్టోరేజ్,మీడియా టెక్ హీలియా జీ95 చిప్ సెట్‌తో వస్తుంది. రెడ్మీ నోట్ 11ఎస్ఈ స్పెసిఫికేషన్లు 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 6.43అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, హోల్ పంచ్ కటౌట్‌తో 13మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 2400*1080పిక్సెల్ రెజెల్యూషన్‌తో డిస్ప్లే,ఎంఐయూఐ తరహాలో కంటిపై ఒత్తిడి తగ్గించేందుకు రీడింగ్ మోడ్ 3.0, సన్‌లైట్ మోడ్ 2.0, 6జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ర్యామ్ అండ్ 64జీబీ యూఎఫ్ఎస్2.2 స్టోరేజ్‌తో మీడియాటెక్ హీలియా చిప్సెట్, 33డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది దీంతో పాటు ఈ ఫోన్లో 64 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 8మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో కెమెరా, కెమెరా యాప్‌లో నైట్ మోడ్,ఏఐ బ్యూటీఫై, ఏఐ పోట్రేట్ వంటి మోడ్లు ఉన్నాయి. ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్,ఏఐ ఫేస్ అన్‌లాక్, డ్యూయల్ సిమ్ కార్డ్ స్లాట్, డ్యూయల్ బ్యాండ్ వైఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. రెడ్మీ నోట్ 11ఎస్ఈ ధర 64జీబీ ర్యామ్ అండ్ 64జీబీ స్టోరేజ్ వేరియంట్ రెడ్మీ నోట్ 11ఎస్ ఫోన్ ధర రూ.13,499గా ఉంది. బ్లాక్,వైట్,బ్లూ కలర్స్‌లో ఈ ఫోన్ లభ్యమవుతుంది. ఇక ఈ ఫోన్ ఆగస్ట్ 31 నుంచి షావోమీ వెబ్సైట్, ఫ్లిప్ కార్ట్‌లో లభ్యం అవుతుంది. ఈ ఫోన్‌తో పాటు రెడ్ మీ నోట్ 11 రెగ్యూలర్ (రూ.13,499),రెడ్మీ నోట్ 11 టీ 5జీ (రూ.15,999),రెడ్మీ నోట్ 11 ప్రో (18,999)ఫోన్లు సైతం అందుబాటులో ఉంటాయని రెడ్ మీ ప్రతినిధులు తెలిపారు. -
రెడ్మీ, షావోమీ స్మార్ట్ ఫోన్ యూజర్లకు అదిరిపోయే ఆఫర్!
మీరు రెడ్మీ, షావీమీ బ్రాండ్ స్మార్ట్ఫోన్లను వినియోగిస్తున్నారా? కానీ, ఆ ఫోన్ బ్యాటరీలు డెడ్ అయ్యాయ్యా? ఛార్జింగ్ సరిగ్గా ఎక్కడం లేదా? లేదంటే ఛార్జింగ్ ఎక్కినా నిలవడం లేదా? అయితే మీకో శుభవార్త. షావోమీ స్మార్ట్ ఫోన్ యూజర్లకు శుభవార్త. యూజర్లు వినియోగిస్తున్న స్మార్ట్ ఫోన్ బ్యాటరీ సమస్యల్ని పరిష్కరించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. పనితీరు మందగించిన ఫోన్ల బ్యాటరీను మార్చి వాటి స్థానంలో కొత్త బ్యాటరీలను అమర్చుతున్నట్లు ప్రకటించింది. షావోమీ తన యూజర్లకు రూ.499కే పాత ఫోన్ల బ్యాటరీల స్థానంలో కొత్త బ్యాటరీలను అందిస్తున్నట్లు ట్విట్ చేసింది. మీ షావోమీ, రెడ్ మీ ఫోన్ బ్యాటరీ డెడ్ అయినట్లు అనిపించినా, లేదంటే ఛార్జింగ్ ఎక్కకపోయినా మీ సర్వీస్ సెంటర్‌ని ఆశ్రయిస్తే తక్కువ ధరకే కంపెనీ బ్యాటరీలను అందిస్తామని ట్వీట్లో పేర్కొంది. బ్యాటరీ ఎప్పుడు రిప్లెస్ చేయాలి షావోమీ, రెడ్మీ స్మార్ట్ ఫోన్ల బ్యాటరీ ఛార్జింగ్ లైఫ్ టైమ్ ఉదాహరణకు 10 గంటల ఉంటుంది. కానీ ప్రతిరోజు పలు మార్లు ఛార్జింగ్ తగ్గిపోతుంటే బ్యాటరీ మార్చుకోవాలి. లేదంటే ఫోన్ ఛార్జింగ్ 100శాతం ఉండి నిమిషాల వ్యవధిలో 80-90కి పడిపోతే అప్పుడు మార్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. చదవండి👉 జూన్‌లో విడుదల కానున్న 9 స్మార్ట్ ఫోన్లు ఇవే! -
తక్కువ ధరకే, అదిరిపోయే రెడ్ మీ 5జీ స్మార్ట్ ఫోన్!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ షావోమీ సబ్ బ్రాండ రెడ్మీ తక్కువ ధరకే 5జీ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేయనుంది. రెడ్మీ 11 5జీతో రానున్న ఈ ఫోన్ భారత్ మార్కెట్లో జూన్ నెలలో విడుదల కానుండగా..ఈ ఫోన్ ధర, ఫీచర్ల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం 6.58 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, మీడియాటెక్ డైమన్సిటీ 700 ప్రాసెసర్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్‌గా ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్ వెనుక భాగంలో రెండు కెమెరాలు ఉండగా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉంటాయి. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను రెడ్మీ డిజైన్ చేసింది భారత్ మార్కెట్లో జూన్ నెలలో విడుదల కానున్న ఇక ఈ ఫోన్ ధర విషయానికొస్తే 4జీబీ ర్యామ్ ప్లస్ 64జీబీ స్టోరేజ్ ఉండే వేరియంట్ ధర రూ.13,999 ధరగా ఉండనుంది. అయితే షావోమీ త్వరలోనే ఈ మొబైల్ గురించి మరిన్ని విషయాల్ని వెలడించనుంది. టీజ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.