ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ పలు స్మార్ట్‌ఫోన్ యూజర్లకు త్వరలోనే గుడ్‌న్యూస్‌ను అందించనుంది. షావోమీ త్వరలోనే షావోమీ, రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్లకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను తీసుకురానుంది. త్వరలోనే కొత్త MIUI 13 అప్‌డేట్‌ను షావోమీ విడుదలచేయనుంది. ఒక నివేదిక ప్రకారం..MIUI 13 అప్‌డేట్ పలు స్మార్ట్‌ఫోన్లతో సహా వచ్చే నెలలో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా...ఈ నెలలోనే (డిసెంబర్ 13) న లాంచ్ ఈవెంట్‌ను షావోమీ హోస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు పుకార్లు వస్తున్నాయి.
లాంచ్ ఈవెంట్‌లో షావోమీ 12, షావోమీ 12ఎక్స్ మోడళ్లతో సహా నెక్ట్స్ జనరేషన్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లను కంపెనీ ఆవిష్కరించే అవకాశం ఉన్నట్లు నిపుణుల భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్స్ ఆండ్రాయిడ్ 12 కి బదులుగా ఆండ్రాయిడ్ 11తో రన్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. కానీ వీటిలో MIUI 13తో రన్ అవుతాయని సమాచారం. కొద్దిరోజల తరువాత షావోమీ 12 స్మార్ట్‌ఫోన్లకు ఆండ్రాయిడ్ 12 వచ్చే అవకాశం ఉంది.
MIUI 13తో రన్ అయ్యే స్మార్ట్‌ఫోన్స్ ఏవంటే..!
- ఎంఐ మిక్స్4
- ఎంఐ 11 అల్ట్రా
- ఎంఐ 11
- రెడ్‌మీ కే40 ప్రో
- రెడ్‌మీ కే40
- ఎంఐ 10ఎస్
- ఎంఐ 11లైట్ 5జీ
వీటిలో అప్‌డేట్ అయ్యే అవకాశం.!
- ఎంఐ 10 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్
- షావోమీ 11టీ రేంజ్ స్మార్ట్‌ఫోన్స్
- షావోమీ సివీ
- షావోమీ మిక్స్4
- షావోమీ మిక్స్ ఫోల్డ్
- షావోమీ పాడ్5
- ఎంఐ నోట్10
- రెడ్‌మీ 9టీ, రెడ్‌మీ 9 పవర్
- రెడ్‌మీ 10ఎక్స్ 5జీ, రెడ్‌మీ 10ఎక్స్ ప్రో,రెడ్‌మీ 10, రెడ్‌మీ 10 ప్రో
భారత్‌లో ఇప్పటికే చాలా షావోమీ, రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్లలో MIUI 12.5 అప్‌డేట్‌ను ప్రారంభించింది. దీంతో MIUI 13 అప్‌డేట్ రావాలంటే కొత్త సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఆండ్రాయిడ్ ఓఎస్‌కు, MIUI తేడా ఇదే..!
సాధారణంగా అన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో గూగుల్ రూపొందించిన ఆండ్రాయిడ్ ఓఎస్ ఉంటుంది. షావోమీ లాంటి కంపెనీలు MIUI పేరుతో కస్టమైజ్డ్ వ్యూ, ఫ్రేమ్‌వర్స్క్, సెట్టింగ్స్ ఉంటాయి. MIUI అనేది యూఐ ఆధారిత ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్.
చదవండి: కళ్లుచెదిరే లాభం.. లక్షకు ఏకంగా రూ.80 లక్షలు!
Comments
Please login to add a commentAdd a comment