software update
-
ఈపీఎఫ్‌వో క్లెయిమ్ ప్రాసెసింగ్.. ఇప్పుడు మేలు!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) క్లెయిమ్‌ల ప్రాసెసింగ్‌లో ఇటీవల గణనీయమైన పెరుగుదలను సాధించింది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబరులో ఇది సుమారు 30 శాతం పెరిగింది. దీనంతటికీ కారణం ఈపీఎఫ్‌వో ఇటీవల అమలు చేసిన భారీ సాఫ్ట్వేర్ అప్‌గ్రేడ్. ఇది దాని డిజిటల్ ప్లాట్‌ఫామ్ సామర్థ్యాన్ని మెరుగుపరిచింది.గతంలో క్లెయిమ్‌ల పరిష్కారం నెమ్మదిగా ఉండేది. దీంతో చందాదారులు, ప్రత్యేకించి అత్యవసర ఆర్థిక అవసరాల కోసం నిధులను ఉపసంహరించుకోవాల్సిన వారు ఇబ్బందులు పడేవారు. కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్తో ఇప్పుడది బాగా మెరుగుపడింది. ఈ వేగాన్ని కొనసాగించడానికి మరిన్ని హార్డ్‌వేర్ అప్గ్రేడ్లు, అదనపు సాఫ్ట్వేర్ మెరుగుదలలను కూడా ఈపీఎఫ్‌వో ప్లాన్ చేస్తోంది.ఇదీ చదవండి EPFO: కొత్త ప్రతిపాదన.. రిటైరయ్యాక భారీగా సొమ్ముసెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (C-DAC) అభివృద్ధి చేసిన కొత్త వ్యవస్థ క్లెయిమ్ తిరస్కరణలను తగ్గించడంలో కీలకపాత్ర పోషించింది. ఇటీవలి సాఫ్ట్వేర్ అప్‌గ్రేడ్ తర్వాత, క్లెయిమ్ ప్రాసెసింగ్ వేగం, ఖచ్చితత్వం రెండింటిలోనూ మెరుగుదలను గుర్తించారు. దీంతోపాటు చందాదారులు ఉద్యోగాలు లేదా స్థానాలను మార్చినప్పటికీ, చెల్లింపు వ్యవస్థల క్రమబద్ధీకరణ, చందాదారుల రికార్డులను ఒకే చోట నిర్వహించే కేంద్రీకృత డేటాబేస్‌ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇది రెండు నెలల్లో కార్యరూపం దాల్చనుంది. -
‘తప్పు జరిగింది..క్షమించండి’
సైబర్ సెక్యూరిటీ సంస్థ క్రౌడ్‌స్ట్రైక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆడమ్ మేయర్స్ యూఎస్ ప్రతినిధుల సభ సబ్‌కమిటీ ముందు క్షమాపణలు చెప్పారు. జులై నెలలో ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సిస్టమ్స్‌లో కలిగిన అంతరాయం గుర్తుంది కదా. అందుకు సంబంధించి సెక్యూరిటీ సేవలందించిన క్రౌడ్‌స్ట్రైక్ సంస్థ ప్రతినిధులు విచారణ ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఈ వ్యవహారం యూఎస్ ప్రతినిధుల సభ సబ్‌కమిటీ ముందుకు వచ్చింది. దాంతో క్రౌడ్‌స్ట్రైక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆడమ్ మేయర్స్ క్షమాపణలు కోరారు.మేయర్స్ తెలిపిన వివరాల ప్రకారం..‘జులైలో జరిగిన సంఘటనకు సైబర్ అటాక్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కారణం కాదు. కొత్త థ్రెట్ డిటెక్షన్ కాన్ఫిగరేషన్లను అప్డేట్ చేస్తున్నపుడు ఫాల్కన్ సెన్సార్ రూల్స్ ఇంజిన్ తప్పుగా కమ్యూనికేట్ చేయడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ అప్డేట్ వల్ల మైక్రోసాఫ్ట్ విండోస్ పరికరాల్లో సెన్సార్లు సరిగా పనిచేయలేదు. తిరిగి కాన్ఫిగరేషన్లను అప్డేట్ చేసేంతవరకు వినియోగదారులు ఈ సమస్యతో ఇబ్బంది పడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి యూఎస్ సైబర్‌సెక్యూరిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సబ్‌కమిటీ ముందు విచారణ జరిగింది. ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్త పడుతామని హామీ ఇచ్చాం. జరిగిన తప్పుకు క్షమాపణలు కోరాం’ అని చెప్పారు.ఇదీ చదవండి: టెలిగ్రామ్‌లో ఇకపై అవి సెర్చ్ చేయలేరు!జులై 19న సంభవించిన ఈ అంతరాయంతో విమానయాన సంస్థలు, బ్యాంకులు, హెల్త్‌కేర్, మీడియా, హాస్పిటాలిటీతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశ్రమలు ప్రభావితం చెందాయి. ఇంటర్నెట్ సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది. గ్లోబల్‌గా దాదాపు 85 లక్షల మైక్రోసాఫ్ట్ విండోస్ పరికరాలపై దీని ప్రభావం పడింది. డెల్టా ఎయిర్ లైన్స్ పెద్ద సంఖ్యలో విమానాలను రద్దు చేసింది. దానివల్ల 13 లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడినట్లు కొన్ని నివేదికలు తెలిపాయి. -
16.8 లక్షల కార్లను రీకాల్ చేసిన టెస్లా!
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా చైనాలో 16.8 లక్షల కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. సాఫ్ట్వేర్ అప్‌గ్రేడ్ చేయకపోవడం వల్ల సమస్య తలెత్తే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రీకాల్ చేసిన కార్లులో ఉచితంగా సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసి ఇస్తామని పేర్కొంది.టెస్లా తెలిపిన వివరాల ప్రకారం..చైనాలో దిగుమతి చేసుకున్న మోడల్ ఎస్, మోడల్ ఎక్స్ కార్లను రీకాల్ చేస్తున్నారు. వాటితోపాటు అక్టోబర్ 15, 2020 నుంచి జులై 17, 2024 మధ్య చైనాలో తయారు చేసిన మోడల్ 3, మోడల్ వై కార్లను కూడా రీకాల్ చేస్తున్నారు. అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక ప్రకారం..డ్రైవింగ్ సమయంలో కారులో సామాన్లు పెట్టుకునేందుకు వీలుగా ఉండే ట్రంక్ డోర్ దానికదే తెరుచుకునే ప్రమాదం ఉంది. ఇది డ్రైవర్ దృష్టికి అంతరాయం కలిగిస్తుంది. అయితే ఇలాంటి సమస్య ఎక్కడ జరిగిందనే వివరాలను మాత్రం టెస్లా వెల్లడించలేదు. ఈ సమస్య పరిష్కారానికి రిమోట్ సాఫ్ట్వేర్ అప్‌గ్రేడ్ చేయాలని పేర్కొంది. రీకాల్ చేసిన కార్లలో ఉచితంగానే ఈ సర్వీసును అందిస్తామని చెప్పింది.ఇదీ చదవండి: క్రెడిట్ కార్డుల వినియోగం ఎంతంటే..ఇదిలాఉండగా, టెస్లాకు చైనా ప్రధాన మార్కెట్‌గా నిలుస్తోంది. జులైలో చైనా ప్రభుత్వం పెద్దమొత్తంలో ఈ కార్లను కొనుగోలు చేసింది. షాంఘైలో టెస్లా గిగాఫ్యాక్టరీని స్థాపించింది. 2023లో ఈ ఫ్యాక్టరీలో దాదాపు 9,47,000 కార్లు తయారు చేసింది. వీటిలో చాలా వరకు స్థానికంగా విక్రయించింది. మిగతావాటిని యూరప్‌కు ఎగుమతి చేసింది. చైనాకు చెందిన బీవైడీ కంపెనీ తయారు చేస్తున్న ఈవీ కార్లు టెస్లాకు పోటీగా నిలుస్తున్నాయి. -
ఆధునిక సాంకేతికతను ప్రవేశపెట్టినా నేరమేనా ?
-
స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు భారీ షాక్: కేంద్రం సంచలన నిర్ణయం?
న్యూఢిల్లీ: జాతీయ భద్రత నేపథ్యంలో కేంద్రం మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. పలు స్మార్ట్‌ఫోన్లలోముందే ఇన్స్టాల్ చేసిన యాప్‌లను నిరోధించే ప్లాన్‌లో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం యోచన ప్రకారం ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే చైనా సహా, ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు భారీ షాక్ తగలనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. రాయిటర్స్ నివేదిక ప్రకారం గూఢచర్యం , వినియోగదారు డేటా దుర్వినియోగం గురించి ఆందోళనల మధ్య భారతదేశ ఐటీ మంత్రిత్వ శాఖ ఈ కొత్త నిబంధనలను పరిశీలిస్తోంది. స్మార్ట్ఫోన్లకు సంబంధించి కొత్త భద్రతా నియమాలను తీసుకురానుంది. ఫిబ్రవరి 8న ప్రభుత్వ రహస్య రికార్డు ప్రకారం ప్రీ-ఇన్స్టాల్ చేసిన యాప్‌లను తీసివేయడానికి, ప్రధాన ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్లను తప్పనిసరిగా స్క్రీనింగ్ చేయడానికి అనుమతించమని స్మార్ట్‌ఫోన్ తయారీదారులను నిలువరించాలని యోచిస్తోంది. చైనా సహా విదేశీ కంపెనీల గూఢచర్యాన్ని నిరోధించాలని భావిస్తున్నట్టు పేరు చెప్పడానికి నిరాకరించిన సీనియర్ ప్రభుత్వ అధికారిని ఉటంకిస్తూ రాయిటర్స్ నివేదించింది. (పోకో ‘ది 5జీ ఆల్ స్టార్’ లాంచ్: ఆఫర్ ఎంతంటే?) కొత్త నిబంధనల ప్రకారం, స్మార్ట్‌ఫోన్ తయారీదారులు ఆయా ఫోన్లలో అన్ఇన్స్టాల్ ఆప్షన్ ఇవ్వాలి. అలాగే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఏజెన్సీ ఆమోదించిన ల్యాబ్ ద్వారా కొత్త మోడల్స్ టెస్టింగ్‌కు సమ్మతించాలి. ప్రతి ప్రధాన ఆపరేటింగ్సిస్టమ్ అప్డేట్ను వినియోగదారులకు అందించే ముందు తప్పనిసరి స్క్రీనింగ్ అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది ప్రపంచంలోని నం.2 స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఆయా కంపెనీల లాంచ్ టైమ్ లైన్లను పొడిగించవచ్చని, ఇది యాపిల్ సహా శాంసంగ్, షావోమి, వివో తదితర సంస్థలకు ఎదురుదెబ్బేనని నిపుణులు భావిస్తున్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో చైనా కంపెనీలదే ఆధిపత్యం. కౌంటర్ పాయింట్ డేటా ప్రకారం షావోమి, బీబీకే ఎలక్ట్రానిక్స్ వివో, ఒప్పో మొత్తం ఫోన్ అమ్మకాలలో దాదాపు సగం వాటాను సొంతం చేసుకోగా, దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్‌కు 20శాతం, యాపిల్‌కు 3 శాతం వాటా ఉంది. (లడ్డూ కావాలా నాయనా! పెళ్లికీ ఈఎంఐ ఆఫర్: మ్యారీ నౌ పే లేటర్!) పరిశ్రమ నిపుణులు ఏమంటున్నారు? ♦ కెమెరా వంటి కొన్ని ముందే ఇన్స్టాల్ చేసిన యాప్‌లు వినియోగదాలకు చాలా కీలకమని, స్క్రీనింగ్ నిబంధనలను విధించేటప్పుడు ప్రభుత్వం వీటికి , అనవసరమైన వాటికి మధ్య తేడాను గుర్తించాలి. ♦ స్మార్ట్‌ఫోన్ ప్లేయర్లు తరచుగా తమ మొబైల్స్‌ను ప్రొప్రయిటరీ యాప్‌ల ద్వారా విక్రయిస్తారు, అలాగే మానిటైజేషన్ ఒప్పందాలనుతో కొన్ని యాప్స్‌ను ముందే ఇన్స్టాల్ చేస్తారు. ♦ ముఖ్య ఆందోళన ఏమిటంటే, టెస్టింగ్‌లకు ఎక్కువ సమయం పడుతుంది. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్, దాని భాగాలను భద్రతా సమ్మతి కోసం ప్రభుత్వ ఏజెన్సీ టెస్టింగ్‌కు దాదాపు 21 వారాలు పడుతోంది. ఈనేథ్యంలో గో-టు మార్కెట్ వ్యూహానికి ఇది భారీ అవరోధమని పరిశ్రమకు కొంతమంది ఎగ్జిక్యూటివ్స్‌అభిప్రాయం. కాగా జాతీయ భద్రత ముప్పు నేపథ్యంలో 2020 ఇండో-చైనా సరిహద్దు ఘర్షణ ఆందోళనల నేపత్యంలో టిక్‌టాక్‌తో సహా 300 కంటే ఎక్కువ చైనీస్ యాప్‌లను నిషేధించిన సంగతి తెలిసిందే. -
విరాసత్ నుంచి నాలా వరకు..
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్‌లో వ్యవసాయ భూముల లావాదేవీలకు సంబంధించి తలెత్తుతున్న చిన్నచిన్న సమస్యల పరిష్కారానికి భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నవీన్‌మిత్తల్ కసరత్తు ప్రారంభించారు. సమస్యలను గుర్తించి వాటిని సరిచేసేందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను తయారు చేయిస్తున్నారు. ఈ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు వారంలోపే పూర్తవుతాయని.. ఆ తర్వాత ప్రస్తుతం ధరణి పోర్టల్‌లో వస్తున్న ఇబ్బందుల్లో పదికిపైగా చిన్నచిన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని సీసీఎల్ఏ వర్గాలు చెబుతున్నాయి. చిన్నవే కానీ.. సతాయిస్తున్నాయి వాస్తవానికి వ్యవసాయ భూముల లావాదేవీలు మాన్యువల్‌గా జరిగే సమయంలో ఎక్కడికక్కడ సమస్యలు వచ్చినా పెద్దగా వెలుగులోకి వచ్చేవి కావు. వాటి పరిష్కారానికి ఎక్కువ సమయం పట్టినప్పటికీ క్షేత్రస్థాయిలోనే వాటిని పరిష్కరించేవారు. కానీ ధరణి పోర్టల్ ఆన్లైన్ వేదిక కావడంతో ఏ చిన్న సమస్య అయినా రాష్ట్రవ్యాప్తంగా రైతులను ఏకరీతిలో ఇబ్బందులు పెడుతోంది. దీనికితోడు భూసమస్యల పరిష్కార అధికారం కలెక్టర్ల చేతిలో ఉండటంతో మరింత జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ధరణి సమస్యలపై సీసీఎల్ఏ నవీన్‌మిత్తల్ ప్రత్యేక దృష్టి సారించారు. రెవెన్యూ రికార్డులను ధరణి పోర్టల్‌లో అప్లోడ్ చేయడంలోనే అసలు సమస్య వచ్చిందనే నిర్ధారణకు వచ్చి ఆయా సమస్యల నివృత్తి, పరిష్కారానికి రోజూ కొంత సమయం కేటాయిస్తున్నారు. తన వరకు వస్తున్న దరఖాస్తులు, విజ్ఞప్తులను అధ్యయనం చేయడంతోపాటు సీసీఎల్ఏ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. శాశ్వత పరిష్కారం దిశగా.. ధరణి పోర్టల్ ద్వారా రైతులకు చిన్న సమస్యలు కూడా అగ్నిపరీక్షలుగా మారిపోయాయి. ముఖ్యంగా పట్టాదారు చనిపోయే సమయం నాటికి ఆ వ్యక్తి పేరిట ఉన్న భూమికి సంబంధించిన రికార్డులపై తహసీల్దార్ డిజిటల్ సంతకం లేకపోతే ఆ భూమిని చనిపోయిన పట్టాదారు వారసులకు బదిలీచేసే అవకాశం ధరణి పోర్టల్ సాఫ్ట్‌వేర్‌లో అందుబాటులో లేదు. అలాగే గతంలో నాలా (వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్పు) భూములు ఇప్పటికీ ధరణి పోర్టల్‌లో వ్యవసాయ భూముల విభాగంలోనే కనిపిస్తున్నాయి. ఈ భూములను నాలా కింద మార్పు చేసే ఆప్షన్ కూడా ధరణిలో లేదు. గతంలో కంపెనీలు, ట్రస్టుల పేర్లపై ఉన్న భూముల వివరాలు ధరణిలో సక్రమంగా అప్లోడ్ కాకపోవడంతో వాటి పాసుపుస్తకాలు ఆయా కంపెనీలు, ట్రస్టుల పేరిట రావట్లేదు. ఇలాంటి సమస్యలకు ఇప్పుడు పరిష్కారం చూపగా ఇందుకు సంబంధించిన మార్పులు వారం రోజులు లోపే ధరణిలో కనిపించనున్నాయి. మరోవైపు మరికొన్ని సమస్యలను గుర్తించి వాటికి అవసరమైన మార్పులు చేసే ప్రక్రియను ప్రారంభించారు. మిస్సింగ్‌కు మిత్తల్ ‘మార్కు’ ధరణిలో ఎదురవుతున్న మరో సమస్య మిస్సింగ్ సర్వేనంబర్లు. రెవెన్యూ ఆన్లైన్ రికార్డుల్లో కొన్ని సర్వేనంబర్లు మిస్సవడంతో ఈ సర్వే నంబర్లలోని భూముల రైతులు పాసు పుస్తకాలు లేక, ప్రభుత్వం నుంచి వచ్చే రైతుబంధు అందక ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ధరణిలో మిస్సింగ్ సర్వేనంబర్ల నమోదు కోసం సీసీఎల్ఏ ప్రత్యేక ఆప్షన్ కల్పించారు. టీఎం–33 కింద దరఖాస్తు చేసుకున్న రైతులకు సంబంధించిన సర్వేనంబర్లను పోర్టల్‌లో సరిచేస్తున్నారు. ఇలాంటి సమస్యలు రాష్ట్రవ్యాప్తంగా వేలల్లో ఉన్న నేపథ్యంలో రోజుకు 500 చొప్పున దరఖాస్తులను పరిష్కరించేందుకు సీసీఎల్ఏ కార్యాలయంలో ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. -
ఐఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్!
భారత్‌లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 5జీ సేవలు (5G Services) ప్రారంభమయ్యాయి. అయితే ఈ సేవలు ఒకేసారి దేశవ్యాప్తంగా కాకుండా ప్రస్తుతానికి కొన్ని ప్రధాన నగరాల్లో మాత్రమే లభ్యమవుతోంది. 5జీ సేవలు ఉపయోగించాలంటే ఆయా మొబైల్ కంపెనీలు సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. దీంతో కొన్ని కంపెనీలు ఇప్పటికే అప్డేట్ ప్రక్రియను పూర్తి చేయగా.. తాజాగా యాపిల్ కంపెనీ ఐఫోన్ యూజర్లకు శుభవార్త చెప్పింది. దేశంలోని ఐఫోన్ యూజర్లకు 5జీ సపోర్ట్ అందించినట్లు యాపిల్ కంపెనీ తెలిపింది. 5జీ సేవలు ప్రారంభం జియో , ఎయిర్టెల్ నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తున్న ఐఫోన్ యూజర్లకు 5జీ అప్డేట్ సేవలు అందజేసినట్లు యాపిల్ స్పష్టం చేసింది. iOS 16.2 రిలీజ్ కావడంతో.. భారత్‌లోని వినియోగదారులు కవరేజీ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో 5G నెట్వర్క్ స్పీడ్‌ను ఉపయోగించగలరు. ఐఫోన్ 12 తర్వాత మార్కెట్లోకి వచ్చిన అన్ని అనుకూల మోడల్‌లలో 5G సేవలు సపోర్ట్ చేస్తాయి. మొదట ఐఫోన్లో సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. అనంతరం జనరల్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆపై సాఫ్ట్వేర్ అప్డేట్పై ట్యాప్ చేయాలి. అక్కడ iOS 16.2ని డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. నిబంధనలు అంగీకరించిన తర్వాత అప్డేట్ను డౌన్లోడ్ చేయాలి. సాఫ్ట్వేర్ అప్డేట్ iOS 16.2కి అప్డేట్ చేయడానికి ముందు మీ మొబైల్లో తగినంత బ్యాటరీ ఉందని నిర్ధారించుకోవడం ముఖ్యం. చదవండి: పదేళ్లుగా నడుస్తోంది.. ఐఫోన్లకు సంబంధించి పెద్ద సీక్రెట్ బయటపెట్టిన యాపిల్ సీఈఓ! -
షావోమీ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ పలు స్మార్ట్‌ఫోన్ యూజర్లకు త్వరలోనే గుడ్‌న్యూస్‌ను అందించనుంది. షావోమీ త్వరలోనే షావోమీ, రెడ్మీ స్మార్ట్ఫోన్లకు సాఫ్ట్వేర్ అప్డేట్ను తీసుకురానుంది. త్వరలోనే కొత్త MIUI 13 అప్డేట్ను షావోమీ విడుదలచేయనుంది. ఒక నివేదిక ప్రకారం..MIUI 13 అప్డేట్ పలు స్మార్ట్ఫోన్లతో సహా వచ్చే నెలలో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా...ఈ నెలలోనే (డిసెంబర్ 13) న లాంచ్ ఈవెంట్‌ను షావోమీ హోస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు పుకార్లు వస్తున్నాయి. లాంచ్ ఈవెంట్లో షావోమీ 12, షావోమీ 12ఎక్స్ మోడళ్లతో సహా నెక్ట్స్ జనరేషన్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లను కంపెనీ ఆవిష్కరించే అవకాశం ఉన్నట్లు నిపుణుల భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్స్ ఆండ్రాయిడ్ 12 కి బదులుగా ఆండ్రాయిడ్ 11తో రన్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. కానీ వీటిలో MIUI 13తో రన్ అవుతాయని సమాచారం. కొద్దిరోజల తరువాత షావోమీ 12 స్మార్ట్ఫోన్లకు ఆండ్రాయిడ్ 12 వచ్చే అవకాశం ఉంది. MIUI 13తో రన్ అయ్యే స్మార్ట్‌ఫోన్స్ ఏవంటే..! ఎంఐ మిక్స్4 ఎంఐ 11 అల్ట్రా ఎంఐ 11 రెడ్మీ కే40 ప్రో రెడ్మీ కే40 ఎంఐ 10ఎస్ ఎంఐ 11లైట్ 5జీ వీటిలో అప్డేట్ అయ్యే అవకాశం.! ఎంఐ 10 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ షావోమీ 11టీ రేంజ్ స్మార్ట్‌ఫోన్స్ షావోమీ సివీ షావోమీ మిక్స్4 షావోమీ మిక్స్ ఫోల్డ్ షావోమీ పాడ్5 ఎంఐ నోట్10 రెడ్మీ 9టీ, రెడ్మీ 9 పవర్ రెడ్మీ 10ఎక్స్ 5జీ, రెడ్మీ 10ఎక్స్ ప్రో,రెడ్మీ 10, రెడ్మీ 10 ప్రో భారత్‌లో ఇప్పటికే చాలా షావోమీ, రెడ్మీ స్మార్ట్ఫోన్లలో MIUI 12.5 అప్డేట్ను ప్రారంభించింది. దీంతో MIUI 13 అప్డేట్ రావాలంటే కొత్త సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆండ్రాయిడ్ ఓఎస్‌కు, MIUI తేడా ఇదే..! సాధారణంగా అన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో గూగుల్ రూపొందించిన ఆండ్రాయిడ్ ఓఎస్ ఉంటుంది. షావోమీ లాంటి కంపెనీలు MIUI పేరుతో కస్టమైజ్డ్ వ్యూ, ఫ్రేమ్వర్స్క్, సెట్టింగ్స్ ఉంటాయి. MIUI అనేది యూఐ ఆధారిత ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్. చదవండి: కళ్లుచెదిరే లాభం.. లక్షకు ఏకంగా రూ.80 లక్షలు! -
ఐఫోన్ ఇక మరింత సురక్షితం
శాన్ఫ్రాన్సిస్కో: అమెరికా టెక్నాలజీ దిగ్గజం యాపిల్ కీలక ప్రకటన చేసింది. పాస్వర్డ్ అవసరం లేకుండా ఐఫోన్లలోని సమాచారాన్ని హ్యాకర్లు తస్కరించేలా ఉన్న సాఫ్ట్వేర్ లోపాన్ని సరిదిద్దనున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం త్వరలోనే ఐవోస్ సాఫ్ట్వేర్ అప్డేట్ను విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఐఫోన్‌కు చార్జింగ్ పెట్టేందుకు, సమాచార మార్పిడి కోసం వాడుతున్న లైటనింగ్ పోర్ట్ ద్వారా ఫోన్‌ను అన్‌లాక్ చేయగలుగుతున్నారని తెలిపింది. త్వరలో తీసుకురానున్న అప్డేట్తో తప్పుడు పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయగానే ఐఫోన్ డేటా గంటపాటు నిలిచిపోతుందని వెల్లడించింది. తాజా అప్డేట్ తర్వాత కూడా లైటనింగ్ పోర్ట్‌తో చార్జింగ్, డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చంది. యాపిల్ తాజా నిర్ణయం ఈ లోపాన్ని సద్వినియోగం చేసుకుంటున్న ఎఫ్‌బీఐ, పోలీసులకు ఇబ్బందికరం కానుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. -
అప్పటిదాకా ఏటీఎంలు తెరవొద్దు: ఆర్బీఐ
-
అప్పటిదాకా ఏటీఎంలు తెరవొద్దు: ఆర్బీఐ
ముంబై: ప్రపంచాన్ని వణికిస్తున్న వాన్నా క్రై వైరస్‌ను దృష్టిలో ఉంచుకుని విండోస్ అప్డేట్ వచ్చే వరకూ ఏటీఎం సెంటర్లను మూసేయాలని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది. కంప్యూటర్లోకి ర్యాన్సమ్ వేర్‌ను చొప్పించి డేటాను చోరి చేసి బిట్ కాయిన్ల రూపంలో డాలర్లను.. వాన్నా క్రై డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సోమవారం రెండో సారి వాన్నా క్రై హ్యాకింగ్‌కు పాల్పడతుందనే వార్తలతో ప్రపంచదేశాలు అప్రమత్తమవుతున్నాయి. వాన్నా క్రై బాధితుల్లో ఎక్కువ మంది వినియోగించేది విండోస్ ఆపరేటింగ్ సిస్టం. భారత్‌లో దాదాపు 90 శాతం మంది విండోస్ మీదే ఆధారపడుతున్నారు. మన దేశంలో ఉన్న 2.25 లక్షల ఏటీఎంలలో 60 శాతం విండోస్ ఆపరేటింగ్ సిస్టంతో నడిచేవే. దీంతో రక్షణ చర్యలు చేపట్టిన ఆర్బీఐ సెక్యూరిటీ అప్డేట్ వచ్చే వరకూ ఏటీఎంలను తెరవొద్దని ఆదేశాలు జారీ చేసింది. వాన్నా క్రై లక్ష్యం ఏటీఎంల నుంచి ప్రజల డబ్బును దొంగిలించడం కాదని.. నెట్‌వర్క్‌లలో సమాచారాన్ని లాక్ చేసి డబ్బును డిమాండ్ చేస్తుందని ఓ బ్యాంకు అధికారి పేర్కొన్నారు. ఒకవేళ వాన్నా క్రై ఏటీఎంల నెట్‌వర్క్‌లను హ్యాక్ చేస్తే.. వినియోగదారులు ఎలాంటి లావాదేవీలు జరపలేరిని వివరించారు. అయితే, ఇప్పటికే రెండు దక్షిణాది బ్యాంకుల కంప్యూటర్లు హ్యాకింగ్‌కు గురయ్యాయనే పుకార్లు కూడా వస్తున్నాయి. ఆర్బీఐ దీని మీద ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. -
మార్పిడికి మంగళమేనా?
రేపో మాపో ప్రకటన వెలువడే అవకాశం సీఎం అత్యవసర వీడియోకాన్ఫరెన్స నోటు కష్టాలు, చేపట్టాల్సిన చర్యలపైనే చర్చ 10 ఏటీఎం కేంద్రాల్లో సాఫ్ట్వేర్ అప్డేట్ నేడు జిల్లాకు రానున్న రూ.వంద నోట్లు నగదు మార్పిడి రద్దుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. రేపోమాపో ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నారుు. పాత పెద్దనోట్ల మార్పిడికి 12రోజులుగా ఆపసోపాలు పడుతున్న సామా న్య జనం మున్ముందు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోనున్నారు. నగదు మార్పిడి రద్దరుుతే ఎదురయ్యే ఇబ్బందులు, చేపట్టాల్సిన చర్యలపై సీఎం చంద్రబాబునాయుడు ఆదివారం కలెక్టర్లు, బ్యాంక్ అధికారులతో అత్యవసరంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం దీనికి మరింత బలాన్ని చేకూర్చుతోంది. తిరుపతి (అలిపిరి): పెద్ద నోట్ల రద్దు ప్రభావం జిల్లా ప్రజలను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేసింది. 12 రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఉన్న 593 బ్యాంకుల్లో నగదు మార్పిడి కొనసాగినా ప్రజలకు నోటు కష్టా లు తీరడంలేదు. ప్రతి బ్యాంకు ఎదుటా నగదు మార్పిడికి చాంతాడంత క్యూలే కనిపిస్తున్నారుు. పరిస్థితుల్లో నగదు మార్పిడిని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచించడం విమర్శలకు తావి స్తోంది. మరిన్ని కష్టాలు తప్పవేయోనని పలువురు ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయాన్ని జిల్లా బ్యాంకు అధికారులూ స్పష్టం చేస్తున్నారు. చిల్లర కష్టాలు తీరేనా? నోట్ల మార్పిడి రద్దు ప్రక్రియలో భాగంగానే జిల్లా వ్యాప్తంగా రద్దీగా ఉండే ప్రాంతాల్లోని పలు శాఖలకు చెందిన ఏటీఎంల్లో సాఫ్ట్వేర్ అబ్డేట్ చేశారు. జిల్లాలో ఇప్పటికే 10 ఏటీఎంలకు సాఫ్ట్వేర్ అబ్డేట్ చేసినట్లు తెలుస్తోంది. సోమవారం వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోం ది. సాఫ్ట్వేర్ అబ్డేట్ చేసిన ఏటీఎం కేంద్రాల నుంచి ప్రజలు రూ.2వేల నోటును డ్రా చేసుకుంటున్నారు. ఆర్బీఐ నుంచి జిల్లాకు సోమవారం రూ.170 కోట్ల మేర వంద నోట్లు రానున్నారుు. చిల్లర నోట్ల కొరత నేపథ్యంలో వంద నోట్లును ఆర్బీఐ అత్యవసరం నిమిత్తం విడుదల చేసింది. నోటు కష్టాలపైనే చర్చ పెద్ద నోట్ల మార్పిడి రద్దు చేస్తారన్న వార్తల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్, ప్రధాన బ్యాంకు శాఖల అధికారులతో ఆదివారం వీడియోకాన్ఫరెన్స నిర్వహించారు. నగదు మార్పిడి రద్దుచేస్తే ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులు.. జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా సూచనలు చేసినట్టు తెలుస్తోంది. ఆర్బీఐ పంపే వంద నోట్లను ఆయా బ్యాంకు అవసరాలకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోవాలని సూచించి నట్లు సమాచారం. కష్టాలు తప్పవు నగదు మార్పిడి రద్దు చేస్తే సామాన్యులు ఇబ్బం దులు పడాల్సిందేనని పలువురు నిపుణులు హె చ్చరిస్తున్నారు. కుటుంబంలో యజమానికి తప్ప మిగతా వారికి బ్యాంకు అకౌంట్లు ఉండే అవకాశం చాలా తక్కువ. దీనికి తోడు వారి దగ్గర ఉండే అరకొర నగదు బ్యాంకుల్లో డిపాజిట్ చేసి డ్రా చేసుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో సులువు కాదు. నగదు మార్పిడి రద్దు చేస్తే దిన కూలీలు, సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. -
స్మార్ట్‌ఫోన్‌నుపరుగెత్తించండి!
మీ స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్ నత్తనడకన నడుస్తోందా? అప్లికేషన్లు మార్చేందుకు, హోమ్స్క్రీన్ వేగంగా వచ్చేందుకు మొరాయిస్తోందా? తాజా ఓ.ఎస్ ఉన్నా, ప్రాసెసర్ వేగం బాగున్నా అదే తీరా? అయితే మీ గాడ్జెట్‌ను గాడిలో పెట్టాల్సిన సమయం వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం.. ఈ ఐదు చిట్కాలతో వాటిని స్పీడప్చేసేయండి! బరువు దించుకోండి... అప్లికేషన్ల సంఖ్య పెరిగిన కొద్దీ స్మార్ట్‌ఫోన్/టాబ్లెట్ల వేగంలో తేడాలొచ్చేస్తాయి. మ్యూజిక్, ఫొటో, వీడియోలతో మెమరీ నింపేసే వారికైతే ఈ ఇబ్బంది ఇంకా ఎక్కువ. అందుకే అసలు వాడని.. అవసరం లేవనుకున్న అప్లికేషన్లను తొలగించండి... లేదంటే డిజేబుల్ అయినా చేయండి. సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆప్స్మెనూను తెరిచి తొలగించాల్సిన అప్లికేషన్‌ను ఎంచుకుంటే సరి! కష్టపడి డౌన్లోడ్ చేసుకున్న వాటిని తొలగించడం ఇష్టం లేకపోతే గూగుల్‌డ్రైవ్, డ్రాప్‌బాక్స్ వంటి క్లౌడ్ స్టోరేజీ సర్వీసుల్లోనైనా భద్రపరచుకోండి. మీ స్మార్ట్‌ఫోన్/టాబ్లెట్‌లో ఎస్డీకార్డు సౌకర్యముంటే... అప్లికేషన్లను దాంట్లోకి మార్చుకున్నా సరిపోతుంది. ఇంకో విషయం... ఫోన్‌తోపాటు వచ్చే అప్లికేషన్లు కొన్ని అన్ఇన్స్టాల్ కావు. వాటిని డిజేబుల్ చేయడం ఉత్తమం. లైవ్ వాల్పేపర్లను నియంత్రించండి లైవ్ వాల్పేపర్లు, విడ్జెట్లతోనూ బ్యాటరీ మందగిస్తుంది. సామర్థ్యం దెబ్బతింటుంది. డేటా ఎక్కువగా వాడుకునే ఫేస్బుక్ వంటివాటితో ఈ ఇబ్బంది మరీ ఎక్కువ. తొలగించాలనుకునే విడ్జెట్‌ను కొద్దిసేపు నొక్కి ఉంచి స్క్రీన్పైభాగంలోకి నెట్టేస్తే అది తొలగిపోతుందన్న విషయం తెలిసిందే. లైవ్ వాల్పేపర్లను కూడా ఇదేలా నియంత్రించుకోవచ్చు. కాషేతోనూ ఇబ్బందే... కంప్యూటర్ల మాదిరిగానే స్మార్ట్‌ఫోన్/టాబ్లెట్లలోనూ సమయంతోపాటు క్యాషే మెమరీ పేరుకుపోతూంటుంది. దీని ప్రభావం గాడ్జెట్ పనితీరుపై పడుతుంది. ఆప్స్మెనూకి వెళ్లి క్యాషే ఒక్కోదాన్ని తొలగించుకోవచ్చు. లేదంటే ఆప్ క్యాషే క్లీనర్, క్లీన్‌మాస్టర్ వంటి ఫ్రీ అప్లికేషన్లతోనూ ఈ పనిచేయవచ్చు. సాఫ్ట్వేర్లు అప్డేట్ చేసుకోండి... ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్లను అప్డేట్ చేసుకోవడం ద్వారా స్మార్ట్‌ఫోన్ మరింత స్మార్ట్‌గా పనిచేసేలా చేయవచ్చు. ఈ అప్డేట్ల ద్వారా సెక్యూరిటీలోపాలను అధిగమించవచ్చు. ఉన్న లోటుపాట్లను సరిచేసుకోవచ్చు. సెట్టింగ్స్‌లోని అబౌట్ ఫోన్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకుని సిస్టమ్ అప్డేట్స్ బటన్‌ను నొక్కితే తాజా అప్డేట్లు డౌన్లోడ్ అవుతాయి.