ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) క్లెయిమ్‌ల ప్రాసెసింగ్‌లో ఇటీవల గణనీయమైన పెరుగుదలను సాధించింది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబరులో ఇది సుమారు 30 శాతం పెరిగింది. దీనంతటికీ కారణం ఈపీఎఫ్‌వో ఇటీవల అమలు చేసిన భారీ సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్. ఇది దాని డిజిటల్ ప్లాట్‌ఫామ్ సామర్థ్యాన్ని మెరుగుపరిచింది.
గతంలో క్లెయిమ్‌ల పరిష్కారం నెమ్మదిగా ఉండేది. దీంతో చందాదారులు, ప్రత్యేకించి అత్యవసర ఆర్థిక అవసరాల కోసం నిధులను ఉపసంహరించుకోవాల్సిన వారు ఇబ్బందులు పడేవారు. కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌తో ఇప్పుడది బాగా మెరుగుపడింది. ఈ వేగాన్ని కొనసాగించడానికి మరిన్ని హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్‌లు, అదనపు సాఫ్ట్‌వేర్ మెరుగుదలలను కూడా ఈపీఎఫ్‌వో ప్లాన్ చేస్తోంది.
ఇదీ చదవండి EPFO: కొత్త ప్రతిపాదన.. రిటైరయ్యాక భారీగా సొమ్ము
సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (C-DAC) అభివృద్ధి చేసిన కొత్త వ్యవస్థ క్లెయిమ్ తిరస్కరణలను తగ్గించడంలో కీలకపాత్ర పోషించింది. ఇటీవలి సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ తర్వాత, క్లెయిమ్ ప్రాసెసింగ్ వేగం, ఖచ్చితత్వం రెండింటిలోనూ మెరుగుదలను గుర్తించారు. దీంతోపాటు చందాదారులు ఉద్యోగాలు లేదా స్థానాలను మార్చినప్పటికీ, చెల్లింపు వ్యవస్థల క్రమబద్ధీకరణ, చందాదారుల రికార్డులను ఒకే చోట నిర్వహించే కేంద్రీకృత డేటాబేస్‌ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇది రెండు నెలల్లో కార్యరూపం దాల్చనుంది.
Comments
Please login to add a commentAdd a comment