EPFO
-
రిటైర్మెంట్కు ఏ పథకాలు మేలు..?
రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది ఆర్థిక ప్రణాళికలో కీలకమైన భాగం. సరైన ప్రణాళిలు ఎంచుకుని వాటిని అనుసరిస్తే రిటైర్మెంట్ తర్వాత సురక్షితమైన, సౌకర్యవంతమైన జీవితాన్ని గడపవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ప్రైవేట్ సంస్థలు విభిన్న రిటైర్మెంట్ స్కీమ్‌లతో వినియోగదారులకు ఆకర్షిస్తున్నాయి. కానీ ఆయా కంపెనీలు ఇస్తున్న హామీలపై చాలానే ప్రశ్నలొస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఫండ్స్‌ను ఎంచుకుని పదవీ విరమణ తర్వాత ఆర్థిక, సామాజిక భద్రత కలిగిన జీవితాన్ని సాగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), ఉద్యోగుల భవిష్య నిధి (EPF), నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)లను పదవీ విరమణ పథకాల్లో భాగంగా చాలామంది ఎంచుకుంటున్నారు. వీటి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.ఇదీ చదవండి: రూపాయి పడినా ఇంకా విలువైనదే.. -
నెలలో కొత్తగా 14.63 లక్షల మంది చందాదారులు
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) నవంబర్ 2024 తాత్కాలిక పేరోల్ డేటాను విడుదల చేసింది. నవంబర్‌లో 14.63 లక్షల మంది సభ్యులు చేరినట్లు ఈపీఎఫ్ఓ తెలిపింది. 2024 అక్టోబర్‌తో పోలిస్తే ఇది 9.07 శాతం అధికం. 2023 నవంబర్‌తో పోలిస్తే ఈ సంఖ్యలో 4.88 శాతం పెరుగుదల నమోదైంది.ఈపీఎప్‌వో తెలిపిన వివరాల ప్రకారం..2024 నవంబర్‌లో సుమారు 8.74 లక్షల మంది ఈపీఎఫ్‌లో కొత్త సభ్యులు నమోదు చేసుకున్నారు. ఇది అక్టోబర్ 2024తో పోలిస్తే 16.58 శాతం అధికం.18-25 సంవత్సరాల మధ్య వయసువారు అత్యధికంగా 4.81 లక్షల మంది కొత్తగా సభ్యులుగా చేరారు. ఇది మొత్తం కొత్త సభ్యుల్లో 54.97%గా ఉంది.సుమారు 2.40 లక్షల మంది మహిళా సభ్యులు కొత్తగా చేరారు. ఇది అక్టోబర్ 2024తో పోలిస్తే 14.94% పెరుగుదలను సూచించింది.ఇటీవల కొత్తగా చేరిన మొత్తం సభ్యుల్లో 20.86% వాటాతో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలిచింది.ఇదీ చదవండి: అమెరికా చమురు ఎగుమతులు పెంపుఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) 7.6 కోట్లకుపైగా చందాదార్లకు ఇటీవల కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. యాజమాన్యం (కంపెనీ) నుంచి తనిఖీ లేదా ఈపీఎఫ్ఓ ఆమోదం లేకుండా ఉద్యోగులే వారి పేరు, పుట్టిన తేదీ, జాతీయత, లింగం, తల్లి/తండ్రి పేరు, జీవిత భాగస్వామి పేరు, కంపెనీలో చేరిన/రాజీనామా చేసిన తేదీ వంటి వ్యక్తిగత వివరాలను ఆన్లైన్లో మార్చుకునే వెసులుబాటును తెచ్చింది. అంతేగాక ఆధార్ ఓటీపీ సాయంతో ఈపీఎఫ్ ఖాతాను కొత్త కంపెనీకి బదిలీ చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నట్టయితే యజమాని వద్ద పెండింగ్‌లో ఉన్న బదిలీ క్లెయిమ్ అభ్యర్థనను తొలగించి.. చందాదార్లు నేరుగా ఈపీఎఫ్ఓకు క్లెయిమ్‌ను సమర్పించవచ్చు. -
పేరు మార్పు, ఖాతా బదిలీ చందాదారులే చేయొచ్చు
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) 7.6 కోట్లకుపైగా చందాదార్లకు శుభవార్త చెప్పింది. యాజమాన్యం (కంపెనీ) నుంచి తనిఖీ లేదా ఈపీఎఫ్ఓ ఆమోదం లేకుండా ఉద్యోగులే వారి పేరు, పుట్టిన తేదీ, జాతీయత, లింగం, తల్లి/తండ్రి పేరు, జీవిత భాగస్వామి పేరు, కంపెనీలో చేరిన/రాజీనామా చేసిన తేదీ వంటి వ్యక్తిగత వివరాలను ఆన్లైన్లో మార్చుకునే వెసులుబాటును అందుబాటులోకి తెచ్చింది. అంతేగాక ఆధార్ ఓటీపీ సాయంతో ఈపీఎఫ్ ఖాతాను కొత్త కంపెనీకి బదిలీ చేసుకోవచ్చు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నట్టయితే యజమాని వద్ద పెండింగ్‌లో ఉన్న బదిలీ క్లెయిమ్ అభ్యర్థనను తొలగించి.. చందాదార్లు నేరుగా ఈపీఎఫ్ఓకు క్లెయిమ్‌ను సమర్పించవచ్చు. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ సేవలను శనివారం పరిచయం చేశారు. ‘2017 అక్టోబర్ 1 తర్వాత యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) పొందిన సభ్యులకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఎటువంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు. 2017 అక్టోబర్ 1 కంటే ముందు యూఏఎన్ జారీ అయితే ఈపీఎఫ్ఓ ఆమోదం లేకుండా యాజమాన్యాలు ఈ వివరాలను సరిచేయవచ్చు. అటువంటి సందర్భాలలో పత్రాల ఆవశ్యకత కూడా సరళీకృతం చేశాం. ఆధార్‌తో యూఏఎన్ అనుసంధానం కాకపోతే ఏదైనా దిద్దుబాటు కోసం పత్రాలను యజమానికి భౌతికంగా సమర్పించాలి. ధ్రువీకరణ తర్వాత యాజమాన్యాలు ఆమోదం కోసం ఈపీఎఫ్ఓకు పంపాల్సి ఉంటుంది’ అని వివరించారు. సభ్యులు దాఖలు చేసిన ఫిర్యాదుల్లో దాదాపు 27 శాతం ప్రొఫైల్/కేవైసీ సమస్యలకు సంబంధించినవేనని మంత్రి తెలిపారు. ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల భవిష్యనిధి సంస్థకు ఫిర్యాదులు గణనీయంగా తగ్గుతాయని అన్నారు. -
ఈపీఎఫ్‌వో కొత్త రూల్.. కంపెనీ హెచ్ఆర్తో పనిలేదు!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తమ 8 కోట్ల మంది క్రియాశీలక చందాదారుల కోసం కీలక సంస్కరణలు తీసుకువస్తోంది. వచ్చే జూన్ నుండి కేవైసీ (KYC) ధ్రువీకరణ కోసం స్వీయ-ధ్రువీకరణ సదుపాయాన్ని అమలు చేయబోతోంది. దీంతో కంపెనీ హెచ్ఆర్ ఆమోదంతో పనిలేకుండానే ఉద్యోగులు తమ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. తద్వారా ఈపీఎఫ్ ఖాతాల నిర్వహణలో సభ్యులకు వేగంతోపాటు ఎక్కువ సౌలభ్యం లభిస్తుంది.కేవైసీ ప్రక్రియ సులభతరంఇప్పటి వరకు సభ్యుల కేవైసీ వివరాలను వారి యూఏఎన్ (UAN) నంబర్ల ఆధారంగా ప్రామాణీకరించే బాధ్యత కంపెనీకు ఉండేది. ఇప్పుడు కంపెనీల ఆమోదంతో పని లేకుండా స్వీయ-ధ్రువీకరణ సదుపాయం ద్వారా సభ్యులు తామే ధ్రువీకరిస్తే సరిపోతుంది. దీంతో కంపెనీ షట్-డౌన్ మోడ్‌లోకి వెళ్లినప్పుడు లేదా సకాలంలో స్పందించడంలో విఫలమైనప్పుడు ప్రతిసారీ తలెత్తే ఇటువంటి ఆలస్యం తగ్గే అవకాశం ఉంది. అలాగే కేవైసీ ఫార్మాలిటీల అసంపూర్తి కారణంగా జరిగే ఈపీఎఫ్ క్లెయిమ్‌ల తిరస్కరణలు కూడా తగ్గుతాయని భావిస్తున్నారు.సభ్యులకు సేవలను మెరుగుపరచడానికి చేపడుతున్న ఈపీఎఫ్‌వో 3.0 (EPFO 3.0) ప్రాజెక్ట్‌లో స్వీయ-ధ్రువీకరణ సదుపాయం కూడా భాగం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్‌లతో ఈపీఎఫ్‌వో మెంబర్షిప్ బేస్ 10 కోట్లకు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్న తరుణంలో ఈ డిజిటల్ అప్‌గ్రేడ్ సహాయం అందించనుంది. ఇప్పటికే సంస్థ ఐటీ వ్యవస్థలు బలంగా ఉన్న క్రమంలో ఇక సభ్యులకు వేగవంతమైన, సమర్థవంతమైన సేవలను అందించడంపై ఈపీఎఫ్‌వో దృష్టి సారిస్తోంది.క్లెయిమ్ పెట్టకుండానే ఉపసంహరణబ్యాంక్ ప్లస్ ఈపీఎఫ్‌వో 3.0 సిస్టమ్‌లో అందుబాటులోకి రానున్న మరో ముఖ్యమైన వెసులుబాటు క్లెయిమ్‌కు దరఖాస్తు చేయకుండానే నిధులను ఉపసంహరించుకోవడం. దీనికి సంబంధించిన వ్యవస్థను వచ్చే మార్చి లోపు ప్రవేశపెట్టాలని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. దీని కింద చందాదారు తన ఈపీఎఫ్ కార్పస్ నుండి క్లెయిమ్ దాఖలు చేయకుండానే నేరుగా మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇది 2025-26 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉంది.ఈపీఎఫ్‌వో చందాదారులు కష్టపడి సంపాదించి దాచుకున్న డబ్బును ఆలస్యం, అవాంతరాలు లేకుండా సులభంగా డ్రా చేసుకునేలా అవకాశం కల్పిస్తామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఇటీవల హామీ ఇచ్చారు. ఈపీఎఫ్‌వో అందించే సేవల ఆధునీకరణ దిశగా, లక్షలాది మంది కార్మికులకు ఆర్థిక సాధికారత కల్పించే దిశగా ఈ సంస్కరణలు ఒక ముఖ్యమైన దశను సూచిస్తాయి. -
మీకు వచ్చే పెన్షన్ తెలుసుకోండిలా..
పదవీ విరమణ తర్వాత ఆర్థిక భరోసా ఇచ్చే వాటిలో పెన్షన్ ప్రధానపాత్ర పోషిస్తుంది. పెన్షన్(Pension) లెక్కలకు సంబంధించి చాలామందికి చాలా ప్రశ్నలుంటాయి. ప్రైవేట్ సంస్థలో 10 సంవత్సరాలుగా పనిచేస్తుంటే పెన్షన్ ఎంత వస్తుందో ఈ కథనంలో తెలుసుకుందాం. అయితే అంతకంటే ఎక్కువ అనుభవం ఉంటే వచ్చే పెన్షన్ అధికంగా ఉంటుంది. అందుకు భిన్నంగా తక్కువ సర్వీసు ఉంటే తక్కువ పెన్షన్ అందుతుందని గుర్తుంచుకోవాలి.ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS)ను నిర్వహిస్తుంది. ఉద్యోగుల పెన్షన్ పథకానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు ముందుగా తెలిసుండాలి.పెన్షన్‌కు అర్హత పొందాలంటే కనీసం 10 ఏళ్ల సర్వీసు ఉండాలి.ఉద్యోగికి 58 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి పెన్షన్ విత్‌డ్రా చేసుకోవచ్చు.పెన్షన్ విధానంలో కనీసం నెలవారీ మొత్తం రూ.1,000 అందుతుంది.గరిష్ఠంగా అందే పెన్షన్ రూ 7,500.ఎలా లెక్కిస్తారంటే..ఈపీఎస్ కింద పెన్షన్ పొందాలంటే కనీసం 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకుని 58 ఏళ్లకు చేరుకుని ఉండాలి.పెన్షన్ తీసుకోవాలనుకునే సమయం నుంచి గత 60 నెలల సగటు జీతం (నెలకు గరిష్టంగా రూ.15,000)ను పరిగణనలోకి తీసుకుంటారు.ఈపీఎస్‌కు మీరు కంట్రిబ్యూషన్ చేసిన మొత్తం సంవత్సరాల సంఖ్యను పెన్షనబుల్ సర్వీసు అంటారు. కింది ఫార్ములా ఉపయోగించి పెన్షన్ లెక్కిస్తారు.నెలవారీ పెన్షన్ = పెన్షనబుల్ జీతం(రూ.15,000కు మించకుండా 60 నెలల సరాసరి)×పెన్షనబుల్ సర్వీస్/70ఉదాహరణకు, మీ పెన్షనబుల్ జీతం రూ.15,000, పెన్షనబుల్ సర్వీస్ 10 సంవత్సరాలు అయితే నెలవారీ పెన్షన్ కింది విధంగా ఉంటుంది.నెలవారీ పెన్షన్=15,000×10/70=2,143ఇదీ చదవండి: కాలర్ ఐడీ ఫీచర్‌ను వెంటనే అమలు చేయాలని ఆదేశాలుపదేళ్లలో విభిన్న కంపెనీలు మారితే..పెన్షన్ పొందాలంటే పదేళ్లు ఒకే కంపెనీలో పని చేయాలనే నిబంధనేం లేదు. పదేళ్లలోపు ఈపీఎస్ సర్వీసు అందుబాటులో ఉన్న విభిన్న కంపెనీల్లో పని చేసినా పెన్షన్ పొందడానికి అర్హులు అవుతారు. అయితే, మీ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (యూఏఎన్) మాత్రం యాక్టివ్‌గా ఉండాలి. కేవైసీ వివరాలను అప్డేట్ చేయాలి. ఉద్యోగం మారినప్పుడు మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ కొత్త యజమాన్యం పీఎఫ్ ఖాతాకు బదిలీ అవుతుంది. అయితే ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) బ్యాలెన్స్ మీ మునుపటి యజమాని వద్ద ఉంటుంది. అయినప్పటికీ సర్వీస్ వివరాలు బదిలీ చేస్తారు. దాంతో మొత్తం సర్వీసును పరిగణలోకి తీసుకుని ట్రాక్ చేస్తారు. -
ఇలా జరుగుతోంది జాగ్రత్త.. ఈపీఎఫ్‌వో వార్నింగ్
మీరు జాబ్ హోల్డర్ అయిఉండి ఈపీఎఫ్‌వో (EPFO) కిందకు వస్తే ఈ వార్త మీకోసమే. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సభ్యులందరికీ హెచ్చరిక జారీ చేసింది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ మోసాల (Cyber frauds) కేసుల దృష్ట్యా, దేశంలోని సంఘటిత రంగాలలో పనిచేస్తున్న కోట్లాది మంది ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలని ఈపీఎఫ్‌వో విజ్ఞప్తి చేసింది.ఉద్యోగులు తమ ఈపీఎఫ్‌వో ఖాతాకు సంబంధించిన రహస్య సమాచారం అంటే యూఏఎన్ నంబర్ (UAN), పాస్వర్డ్, పాన్ నంబర్ (PAN), ఆధార్ నంబర్ (Aadhaar), బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీ (OTP) వంటి వాటిని ఎవరితోనూ పంచుకోకూడదని ఈపీఎఫ్‌వో తెలిపింది. ఈ మేరకు ఈపీఎఫ్‌వో తన అధికారిక ‘ఎక్స్’ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేసిందిఆ వివరాలు చెప్పొద్దుఈపీఎఫ్వో తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో ముఖ్యమైన సమాచారం ఇచ్చింది. ‘ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వారి ఖాతాకు సంబంధించిన వివరాలను ఏ ఉద్యోగిని అడగదు. ఒకవేళ ఈపీఎఫ్‌వో ఉద్యోగినని చెప్పుకుంటూ ఎవరైనా మిమ్మల్ని మీ ఈపీఎఫ్‌వో ఖాతాకు సంబంధించిన యూఏఎన్ నంబర్, పాస్వర్డ్, పాన్ నంబర్, ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలు వంటి రహస్య సమాచారాన్ని అడిగినా.. ఫోన్, మెసేజ్, వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా ఓటీపీలు చెప్పాలని కోరినా ఎలాంటి సమాచారం ఇవ్వవద్దు’ అని అప్రమత్తం చేసింది.వెంటనే ఫిర్యాదు చేయండి‘ఇది సైబర్ నేరగాళ్ల పన్నాగం కావచ్చు. మీరు సంవత్సరాల తరబడి కష్టపడి సంపాదించి ఈపీఎఫ్ ఖాతాలో దాచుకున్న డబ్బును వారు దోచుకునే ప్రమాదం ఉంది. ఈపీఎఫ్‌వో ఉద్యోగినని చెప్పుకుంటూ ఎవరైనా మిమ్మల్ని యూఏఎన్ నంబర్, పాస్వర్డ్, పాన్ నంబర్, ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీ అడిగితే ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులకు, సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేయండి’ అని సూచించింది.వ్యక్తిగత డివైజ్‌లనే వాడండిఈపీఎఫ్ ఖాతాను ఆన్లైన్లో యాక్సెస్ చేయడానికి సైబర్ కేఫ్ లేదా పబ్లిక్ డివైజ్‌ని ఉపయోగించొద్దని ఈపీఎఫ్‌వో సూచించింది. ఈపీఎఫ్‌వో ఖాతాకు సంబంధించిన ఏ పని కోసమైనా ఎల్లప్పుడూ ల్యాప్‌టాప్, కంప్యూటర్, టాబ్లెట్ లేదా మొబైల్ ఫోన్ వంటి మీ వ్యక్తిగత పరికరాన్నే ఉపయోగించండి. సైబర్ మోసం నుండి సురక్షితంగా ఉండే మార్గాల గురించి ఈపీఎఫ్‌వో తన వెబ్సైట్ ద్వారా సభ్యులకు నిరంతరం తెలియజేస్తూనే ఉంది.Never share your UAN, password, OTP, or bank details with anyone. EPFO will never ask for this information. Protecting these details is essential to keeping your money secure.#EPFO #EPFOWithYou #HumHainNaa #EPF #PF #ईपीएफओ #ईपीएफ@mygovindia @PMOIndia @LabourMinistry… pic.twitter.com/MN1a4nYIFm— EPFO (@socialepfo) January 5, 2025 -
ఈపీఎఫ్ఓ ఏటీఎం కార్డులు ఎప్పటి నుంచో తెలుసా..
కోట్లాది మంది ఈపీఎఫ్ఓ(EPFO) చందాదారులు తమ పీఫ్ డబ్బును ఏటీఎం(ATM) ద్వారా విత్‌డ్రా చేసుకునేందుకు తేదీ ఖరారైంది. ఇందుకోసం ప్రభుత్వం కొత్తగా సాఫ్ట్వేర్ వ్యవస్థను ప్రారంభిస్తుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఈ ఏడాదే ఈపీఎఫ్ఓ 3.0ను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ఈ కొత్త విధానం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) సభ్యుల సమస్యలను పరిష్కరించి, వారికి మెరుగైన సర్వీస్‌ను అందిస్తుందన్నారు. ఈపీఎఫ్ఓ ఏటీఎం కార్డులను జూన్ 2025 వరకు అందుబాటులోకి తీసుకొచ్చేలా కార్యాచరణ రూపొందించినట్లు మంత్రి పేర్కొన్నారు.ఈపీఎఫ్ఓ ఏటీఎం కార్డుఈపీఎఫ్ఓ 3.0 వెర్షన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పీఎఫ్ చందాదారులకు ఏటీఎం కార్డులను జారీ చేస్తామని కేంద్ర మంత్రి మాండవీయ ధ్రువీకరించారు. ఉద్యోగులు ఈ ఏటీఎం కార్డు ద్వారా తమ ఈపీఎఫ్ పొదుపును సులభంగా పొందవచ్చన్నారు. తద్వారా అత్యవసర పరిస్థితుల్లో డబ్బు వెంటనే అందుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అందుకు సంబంధించి వెబ్సైట్, సిస్టమ్ అప్డేట్ల(Updates) ప్రారంభ దశను ఈ నెలాఖరులోగా ఖరారు చేస్తామని మాండవీయ పేర్కొన్నారు.ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ఈపీఎఫ్వో సభ్యులను ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ETF) పరిధికి మించి ఈక్విటీలలో పెట్టుబడి పెట్టడానికి అనుమతించే అవకాశాన్ని పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదిత మార్పు పీఎఫ్ ఖాతాదారులకు వారి ఫండ్లను మెరుగ్గా నిర్వహించడానికి, అధిక రాబడిని అందుకునేందుకు, పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్‌కు వీలు కల్పిస్తుంది. ఇది ఆమోదం పొందితే డైరెక్ట్ ఈక్విటీ పెట్టుబడి సభ్యులకు తమ పెట్టుబడి వ్యూహాలను, ఆర్థిక వృద్ధిని పెంచుకోవడానికి కొత్త మార్గాన్ని అందిస్తుంది.ఇదీ చదవండి: ప్రపంచంలో అధిక వేతనం ఈయనకే..!ఏ బ్యాంకు నుంచైనా పెన్షన్ఈపీఎఫ్వో పెన్షనర్ల కోసం గణనీయమైన మార్పులను అమలు చేస్తోంది. ఇటీవలి ఆదేశాల ప్రకారం.. పింఛనుదారులు అదనపు ధ్రువీకరణ లేకుండా తమ పెన్షన్‌ను దేశవ్యాప్తంగా ఏ బ్యాంకు నుంచి అయినా ఉపసంహరించుకునే వెసులుబాటు రానుంది. -
జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన మార్పులు ఇవే..
కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టాం. ఈ రోజు జనవరి 1, 2025 నుంచి దేశవ్యాప్తంగా కొన్ని అంశాల్లో మార్పులు అమలు అవుతున్నాయి. ఈపీఎఫ్ఓ, యూఎస్ వీసా, ఎల్పీజీ సిలిండర్ ధరలు, కార్ల ధరలు, రేషన్ కార్డులకు కేవైసీ నమోదు చేయడం వంటి వాటిలో మార్పులు వచ్చాయి. ఈమేరకు ఇప్పటికే ఆయా విభాగాలు ప్రకటనలు విడుదల చేశాయి. అందులో కొన్ని ముఖ్యమైన వాటి వివరాలు తెలుసుకుందాం.ఎల్పీజీ సిలిండర్ ధరలుజనవరి 1, 2025 నుంచి ప్రధాన నగరాల్లో 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలు తగ్గాయి. మారిన ధరలు కింది విధంగా ఉన్నాయి.ఢిల్లీ: రూ.1,804 (రూ.14.5 తగ్గింది)ముంబై: రూ.1,756 (రూ.15 తగ్గుదల)కోల్‌కతా: రూ.1,911 (రూ.16 తగ్గింది)చెన్నై: రూ.1,966 (రూ.14.5 తగ్గింది)14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర స్థిరంగా ఢిల్లీలో రూ.803, కోల్‌కతాలో రూ.829, ముంబైలో రూ.802.50, చెన్నైలో రూ.818.50గా ఉంది.కార్ల ధరలుమారుతి సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా, బీఎండబ్ల్యూ(BMW) వంటి ప్రధాన ఆటో కంపెనీలు కార్ల ధరలను 3% వరకు పెంచాయి.రేషన్ కార్డులకు ఈ-కేవైసీరేషన్ కార్డుదారులకు ఈ-కేవైసీ(e-KYC) తప్పనిసరి. 2024 డిసెంబర్ 31లోగా ఈ-కేవైసీ పూర్తి చేయని రేషన్‌కార్డులు రద్దవుతున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.పెన్షన్ ఉపసంహరణ నిబంధనలుపెన్షనర్లు అదనంగా ఎలాంటి ధ్రువీకరణ అవసరం లేకుండా ఏదైనా బ్యాంకు నుంచి పెన్షన్‌ను ఉపసంహరించుకోవడానికి ఈపీఎఫ్ఓ అనుమతించింది.ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్డ్రాసులభంగా పీఎఫ్(PF) ఖాతాలోని నగదును ఉపసంహరించుకోవడానికి ఏటీఎం కార్డు సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఈపీఎఫ్ఓ తెలిపింది.ఇదీ చదవండి: ఏడాది మొదటిరోజు తులం బంగారం ఎంతంటే..యూపీఐ పరిమితి పెంపుయూపీఐ 123పే కింద ఫీచర్ ఫోన్ యూజర్లకు చెల్లింపు పరిమితిని రూ.10,000కు కేంద్రం పెంచింది. ఇది గతంలో రూ.5,000గా ఉండేది. జనవరి 1 నుంచి ఈ పెంపు అమల్లోకి వస్తున్నట్లు గతంలో ప్రభుత్వం ప్రకటించింది.యూఎస్ వీసా రూల్స్నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా(Visa) దరఖాస్తుదారులు జనవరి 1 నుంచి ఒకసారి ఉచితంగా అపాయింట్మెంట్ను రీషెడ్యూల్ చేసుకోవచ్చు. -
ఈపీఎఫ్‌వోలో కొత్త ఏడాది ముఖ్యమైన మార్పులు..
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) మార్గదర్శకాలు, విధానాల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు తీసుకురానుంది. వీటిలో చాలా మార్పులు రాబోయే కొత్త సంవత్సరంలో అమలులోకి వస్తాయని భావిస్తున్నారు. వీటితోపాటు పలు కొత్త సేవలను పరిచయం చేయనుంది. పీఎఫ్ ఖాతాదారులకు సౌకర్యాన్ని మెరుగుపరచడమే ఈ అప్డేట్ల ప్రధాన లక్ష్యం. కొత్త ఏడాదిలో ఈపీఎఫ్‌వోలో వస్తున్న ముఖ్యమైన మార్పులు.. చేర్పులు ఏంటన్నది ఇక్కడ తెలుసుకుందాం.ఉద్యోగి కంట్రిబ్యూషన్ పరిమితిఈపీఎఫ్వో ముఖ్యమైన అప్డేట్లో ఉద్యోగుల ఈపీఎఫ్ ( EPF ) కంట్రిబ్యూషన్ పరిమితి తొలగింపు ఒకటి. ప్రస్తుతం, ఉద్యోగులు ప్రతి నెలా వారి ప్రాథమిక వేతనంలో 12% తమ ఈపీఎఫ్ ఖాతాకు కేటాయిస్తున్నారు. ఈ బేసిక్ వేతనాన్ని రూ. 15,000 లుగా ఈపీఎఫ్‌వో నిర్దేశించింది. దీనికి బదులుగా ఉద్యోగులు తమ వాస్తవ జీతం ఆధారంగా ఈపీఎఫ్ ఖాతాకు కేటాయించుకునేలా కొత్త ప్రతిపాదన ఉంది. ఇది అమలులోకి వచ్చిన తర్వాత ఉద్యోగులు పదవీ విరమణ నిధిని భారీగా కూడగట్టుకునే అవకాశం ఉంటుంది. ఫలితంగా నెలవారీ పెన్షన్ చెల్లింపు ఎక్కువగా ఉంటుంది.ఏటీఎం నుంచి పీఎఫ్ డబ్బుఈపీఎఫ్వో సభ్యులు తమ ప్రావిడెంట్ ఫండ్ డబ్బును ఏటీఎం ( ATM ) కార్డ్‌తో విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు అతి త్వరలోనే అందుబాటులోకి రానుంది. దీంతో చందాదారులు ఎప్పుడైనా, ఎక్కడైనా నిధులను ఉపసంహరించుకోవచ్చు. ఏటీఎం ఉపసంహరణ సౌకర్యం 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభం కానుంది. ఇది అందుబాటులోకి వస్తే సభ్యులు తమ బ్యాంకు ఖాతాల్లోకి పీఎఫ్ డబ్బును పొందడానికి 7 నుండి 10 రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా విలువైన సమయం ఆదా అవుతుంది.ఈపీఎఫ్‌వో ఐటీ సిస్టమ్ అప్గ్రేడ్పీఎఫ్ హక్కుదారులు, లబ్ధిదారులు తమ డిపాజిట్లను సులభంగా ఉపసంహరించుకునేలా ఈపీఎఫ్‌వో తన ఐటీ (IT) వ్యవస్థను మెరుగుపరుస్తోంది. ఈ అప్‌గ్రేడ్ 2025 జూన్ నాటికి పూర్తవుతుందని అంచనా. ఐటీ వ్యవస్థ అప్‌గ్రేడ్ పూర్తయిన తర్వాత, సభ్యులు వేగవంతమైన క్లెయిమ్ సెటిల్మెంట్లు, మెరుగైన పారదర్శకత, మోసపూరిత కార్యకలాపాల తగ్గుదలని ఆశించవచ్చు.ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ఈపీఎఫ్వో సభ్యులను ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ ( ETF ) పరిధికి మించి ఈక్విటీలలో పెట్టుబడి పెట్టడానికి అనుమతించే అవకాశాన్ని పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదిత మార్పు పీఎఫ్ ఖాతాదారులకు వారి ఫండ్లను మెరుగ్గా నిర్వహించడానికి, అధిక రాబడిని అందుకునేందుకు, పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్‌కు వీలు కల్పిస్తుంది. ఇది ఆమోదం పొందితే డైరెక్ట్ ఈక్విటీ పెట్టుబడి సభ్యులకు తమ పెట్టుబడి వ్యూహాలను, ఆర్థిక వృద్ధిని పెంచుకోవడానికి కొత్త మార్గాన్ని అందిస్తుంది.ఏ బ్యాంకు నుంచైనా పెన్షన్ఈపీఎఫ్వో పెన్షనర్ల కోసం గణనీయమైన మార్పులను అమలు చేస్తోంది. ఇటీవలి ఆదేశాల ప్రకారం.. పింఛనుదారులు అదనపు ధ్రువీకరణ లేకుండా తమ పెన్షన్‌ను దేశవ్యాప్తంగా ఏ బ్యాంకు నుండి అయినా ఉపసంహరించుకునే వెసులుబాటు రానుంది. -
నెలరోజుల్లో 13.41 లక్షల మందికి ఉపాధి
సంఘటిత రంగంలో అక్టోబర్‌లో 13.41 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO)లో ఈ మేరకు కొత్తగా పేర్లను నమోదు చేసుకున్నారు. కేంద్ర కార్మిక శాఖ అక్టోబర్ నెలకు సంబంధించి గణాంకాలను విడుదల చేసింది. ఈ నివేదిక ఆధారంగా చూస్తే.. ఈపీఎఫ్‌వోలో అక్టోబర్‌లో చేరిన నికర కొత్త సభ్యులు 7.50 లక్షలుగా ఉన్నారు. అంటే మిగిలిన వారు ఒక సంస్థలో మానేసి, మరో సంస్థలో ఉపాధి అవకాశాలు పొందిన వారు. ఉపాధి అవకాశాల వృద్ధిని, ఉద్యోగుల ప్రయోజనాలపై పెరుగుతున్న అవగాహనను ఈ గణాంకాలు తెలియజేస్తున్నట్టు కార్మిక శాఖ తెలిపింది.ఇదీ చదవండి: ఆర్థిక దార్శనికుడు.. మన్మోహనుడుఅక్టోబర్లో కొత్త సభ్యుల్లో 58 శాతం 18–25 ఏళ్ల వయసులోని వారే. అంటే సంఘటిత రంగంలో వీరు కొత్తగా ఉపాధి అవకాశాలు సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది.కొత్త సభ్యుల్లో 2.09 లక్షల మంది మహిళా సభ్యులు కావడం గమనార్హం. క్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే 2 శాతం పెరిగింది.కొత్త సభ్యుల్లో 61 శాతం మంది ఐదు రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఉన్నారు. మహారాష్ట్ర నుంచి 22 శాతం మంది చేరగా, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, హర్యానా, తెలంగాణ(Telangana), గుజరాత్ నుంచి (విడిగా) 5 శాతానికి పైగా సభ్యుల చేరిక ఉంది.రోడ్డు మోటారు రవాణా, ఎల్రక్టానిక్ మీడియా కంపెనీలు, బ్యాంక్‌లు (జాతీయ బ్యాంక్‌లు కాకుండా) అక్టోబర్‌లో ఎక్కువ మందికి ఉపాధి కల్పించాయి. -
EPFO: కొత్తగా 7.50 లక్షల మందికి పీఎఫ్
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO)లో సభ్యలు మరింత మంది పెరిగారు. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఈపీఎఫ్‌వో అక్టోబర్‌లో 13.41 లక్షల మంది సభ్యుల నికర చేరికను నమోదు చేసింది. 2024 అక్టోబర్‌లో కొత్తగా దాదాపు 7.50 లక్షల మంది సభ్యులు చేరారు.పెరుగుతున్న ఉపాధి అవకాశాలు, ఉద్యోగి ప్రయోజనాలపై పెరిగిన అవగాహన, ఈపీఎఫ్‌వో విజయవంతమైన ఔట్రీచ్ ప్రోగ్రామ్‌లు ఈ కొత్త సభ్యత్వాల పెరుగుదలకు కారణమని చెప్పవచ్చు. 2024 అక్టోబరులో జోడించిన మొత్తం కొత్త సభ్యులలో 58.49% మంది 18-25 ఏళ్ల మధ్య ఉన్నవారే కావడం గమనార్హం. వీరు 5.43 లక్షల మంది ఉన్నారు.ఇక దాదాపు 12.90 లక్షల మంది సభ్యులు తిరిగి ఈపీఎఫ్‌వోలో చేరారని పేరోల్ డేటా వెల్లడిస్తోంది. ఇది 2023 అక్టోబర్‌తో పోలిస్తే 16.23% అధికం. కొత్తగా చేరిన సభ్యులలో దాదాపు 2.09 లక్షల మంది మహిళలు ఉన్నారు. ఈ సంఖ్య గతేడాది అక్టోబరుతో పోల్చితే 2.12% ఎక్కువ. రాష్ట్రాలవారీగా చూస్తే నికర సభ్యులలో 22.18% జోడించి మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, హర్యానా, తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాలు అక్టోబర్ నెలలో మొత్తం నికర సభ్యులలో 5% కంటే ఎక్కువ వాటాను అందించాయి.పరిశ్రమల వారీగా నెలవారీ డేటాను పరిశీలిస్తే.. రోడ్డు మోటారు రవాణా, ప్రైవేట్ రంగ ఎలక్ట్రానిక్ మీడియా కంపెనీలు, ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు వంటి పరిశ్రమలలో సభ్యత్వంలో గణనీయమైన వృద్ధిని చూపింది. మాన్పవర్ సప్లయర్లు, కాంట్రాక్టర్లు, భద్రతా సేవలుచ ఇతర కార్యకలాపాలను కలిగి ఉన్న నిపుణుల సేవలు, జోడించిన మొత్తం నికర సభ్యత్వంలో 42.29% వాటాను కలిగి ఉన్నాయి. -
ఈ–వ్యాలెట్లలోకి పీఎఫ్ సొమ్ము?
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) సభ్యులు తమ పీఎఫ్ క్లెయిమ్‌లను త్వరలో ఏటీఎంల నుంచి ఉపసంహరించుకోవచ్చని కార్మిక శాఖ ఇటీవలే ప్రకటించగా.. ఈ–వ్యాలెట్ల నుంచి సైతం ఈ సదుపాయం కల్పించే దిశగా పనిచేస్తున్నట్టు తెలిపింది. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ కార్యదర్శి సుమితా దావ్రా దీనిపై స్పందించారు.‘తమ సొమ్మును ఎంత సులభంగా ఉపసంహరించుకోవచ్చన్న దానిపై సభ్యుల్లో ఆసక్తి నెలకొంది. ఆటో సెటిల్మెంట్లో క్లెయిమ్ మొత్తం సభ్యుల బ్యాంక్ ఖాతాల్లోకి వెళుతుంది. దాంతో బ్యాంక్ ఏటీఎం నుంచి ఉపసహరించుకోవచ్చు. క్లెయిమ్ మొత్తం వ్యాలెట్లోకి నేరుగా ఎలా పంపాలన్న విషయమై కొన్ని మార్గదర్శకాలను రూపొందించాల్సి ఉంది. దీనిపై బ్యాంకర్లతో చర్చలు మొదలు పెట్టాం. దీని అమలు విషయమై ప్రణాళిక అవసరం’ అని పర్యాటక సదస్సుకు హాజరైన సందర్భంగా మీడియాకు సుమితా దావ్రా వివరించారు. ఆర్బీఐని సంప్రదించి త్వరలోనే తగిన ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్పారు.ఇదీ చదవండి: బీమా పాలసీతో ఆరోగ్యం కొనుక్కోవచ్చు!ఈపీఎఫ్‌వో సభ్యులు అతి త్వరలోనే తమ భవిష్యనిధి (పీఎఫ్) క్లెయిమ్‌ల మొత్తాన్ని ఏటీఎం నుంచి ఉపసంహరించుకునే అవకాశం అందుబాటులోకి రానున్నట్లు ఇప్పటికే ఆ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఈపీఎఫ్‌వో సభ్యుల ఆన్లైన్ క్లెయిమ్ ఆమోదానికి 7–10 రోజుల సమయం తీసుకుంటోంది. క్లెయిమ్ పరిష్కారం తర్వాత ఆ మొత్తాన్ని సభ్యుల బ్యాంక్ ఖాతాకు బదిలీ చేస్తున్నారు. ప్రతిపాదిత కొత్త విధానంలో సభ్యులకు ప్రత్యేకమైన కార్డులు అందించనున్నారు. వీటి ద్వారా ఏటీఎం నుంచి క్లెయిమ్ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చని ఇటీవల ఓ సీనియర్ అధికారి తెలిపారు. -
ఈపీఎఫ్ క్లయిమ్ సెటిల్మెంట్లో మారిన నిబంధనలు.. అవేంటో మీకు తెలుసా?
ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)ఖాతాదారులకు శుభవార్త. ఖాతాదారులు ఈపీఎఫ్ క్లయిమ్ సెటిల్ చేసుకునే మొత్తం నగదుపుపై వడ్డీ, ఈపీఎఫ్ క్లయిమ్ సెటిల్ చేసుకునే సమయంపై ఈపీఎఫ్ఓ కీలక ప్రకటన చేసింది.కేంద్ర కార్మిక , ఉపాధి మంత్రిత్వ శాఖ నేతృత్వంలో ఈపీఎఫ్ఓ కార్యకలాపాలు నిర్వహించే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ (సీబీటీ) పాలక మండలి సమావేశం ఈ ఏడాది నవంబర్ 30న సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈపీఎఫ్ఓ సభ్యులకు లబ్ధి చేకూరేలా కొత్త నిబంధనను అమల్లోకి తేనున్నట్లు వెల్లడించింది.ఈ కొత్త నిబంధనతో ఈపీఎఫ్ఓ అధిక మొత్తంలో వడ్డీతో పాటు క్లయిమ్ సెటిల్మెంట్ వేగవంతం చేసుకోవచ్చని సూచించింది.ఈపీఎఫ్ఓలో కొత్త నిబంధనలు ఈపీఎఫ్‌వో ప్రకటన ప్రకారం.. సీబీటీ ఈపీఎఫ్ స్కీమ్ 1952లోని పేరా 60(2)(బి)లోని నిబంధనలను సవరణకు ఆమోదించింది. దీంతో ఈపీఎఫ్‌వో ఖాతాదారులు తమ పీఎఫ్ క్లయిమ్ సెటిల్ అయ్యిందో ఆ తేదీ వరకు వడ్డీని పొందవచ్చు.ఉదాహరణకు..ఓ సంస్థలో పనిచేస్తున్న సురేష్ అనే వ్యక్తి ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన రెండు నెలల తర్వాత, అంటే డిసెంబర్ నెలలో తన పీఎఫ్ క్లయిమ్ సెటిల్ చేసుకున్నారు. పీఎఫ్ క్లయిమ్ సెటిల్ చేసిన మొత్తం డిసెంబర్ 20న అకౌంట్లో జమ అయ్యిందని మెసేజ్ వచ్చింది. అయితే, ఆ క్లయిమ్ సెటిల్ చేసిన మొత్తంపై ఈపీఎఫ్ అందించే 8.25 శాతం వడ్డీ పొందడం సాధ్యం కాదు. నవంబర్ నెల వరకు మాత్రమే సెటిల్మెంట్పై వడ్డీ వర్తిస్తుందని, డిసెంబర్ 1 నుండి 20 వరకు ఈపీఎఫ్ సెటిల్పై వడ్డీ కోల్పోయే పరిస్థితి ఉంది.కానీ ఇప్పుడు ఈపీఎఫ్‌వో తాజా మార్పుల ద్వారా, ఆ 20 రోజుల వడ్డీ కూడా సురేష్ అందుకోగలుగుతారు. దీని ద్వారా సురేష్ వంటి ఈపీఎఫ్ ఖాతాదారులకు ఊరట లభించిందిదీంతో పాటు ఓ ఉద్యోగి తన సంస్థకు రాజీనామా చేసిన రెండు నెలల తర్వాత మూడో నెలలో 24వ తేదీకి లోపు ఈపీఎఫ్‌వో క్లయిమ్ సెటిల్మెంట్ చేసుకోవాలి. ఆ తర్వాత క్లయిమ్ ప్రాసెస్ జరగదు. 25వ తేదీ నుంచి నెల చివరి వరకు వడ్డీ నష్టపోవడం, అలాగే క్లయిమ్ సెటిల్ చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టేది. అయితే, ఇప్పుడు 25వ తేదీ తర్వాత కూడా క్లయిమ్ సెటిల్ ప్రాసెస్ జరిగేలా ఈపీఎఫ్‌వో నిర్ణయం తీసుకుంది. -
ఏటీఎం నుంచే పీఎఫ్ నిధుల డ్రా
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) సభ్యులు అతి త్వరలోనే తమ భవిష్యనిధి (పీఎఫ్) క్లెయిమ్‌ల మొత్తాన్ని ఏటీఎం నుంచి ఉపసంహరించుకునే అవకాశం అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఈపీఎఫ్‌వో సభ్యుల ఆన్లైన్ క్లెయిమ్ ఆమోదానికి 7–10 రోజుల సమయం తీసుకుంటోంది. క్లెయిమ్ పరిష్కారం తర్వాత ఆ మొత్తాన్ని సభ్యుల బ్యాంక్ ఖాతాకు బదిలీ చేస్తున్నారు. ప్రతిపాదిత కొత్త విధానంలో సభ్యులకు ప్రత్యేకమైన కార్డులు అందించనున్నారు. వీటి ద్వారా ఏటీఎం నుంచి క్లెయిమ్ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఏడు కోట్లకు పైగా సభ్యులకు బ్యాంక్‌ల మాదిరి సేవలు అందించాలన్నది ఈపీఎఫ్‌వో ఆలోచనగా పేర్కొన్నారు. ఈపీఎఫ్‌వో తన ఐటీ సదుపాయాలను మెరుగుపరుచుకుంటోందని కార్మిక శాఖ కార్యదర్శి సుమితా దావ్రా తెలిపారు. కొత్త వ్యవస్థ అమల్లోకి వస్తే పీఎఫ్ ప్రయోజనాలు, బీమా ప్రయోజనాలను ఏటీఎంల నుంచే పొందొచ్చని చెప్పారు. -
రూ.25,820 కోట్లకు చేరిన పీఎఫ్ బకాయిలు!
ఉద్యోగుల భవిష్య నిధి (పీఎఫ్) వాటాను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)కు చెల్లించడంలో యాజమాన్యాలు విఫలమవుతున్నాయి. ఈపీఎఫ్ఓ డిఫాల్ట్‌ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2023-24లో ఈపీఎఫ్ఓ డిఫాల్ట్‌లు రూ.25,820.88 కోట్లకు చేరుకున్నాయి. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 69.3 శాతం అధికంగా ఉంది. ఇది గతంలో రూ.15,254.06 కోట్లు ఉండేదని అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి.పీఎఫ్ కాంట్రిబ్యూషన్ల బకాయిలు తెలంగాణలోనే అధికంగా ఉన్నట్లు తెలిసింది. కొన్ని కంపెనీల్లో తలెత్తుతున్న ఆర్థిక ఇబ్బందులు, పరిపాలనాపరమైన లోపాలు లేదా ఉద్దేశపూర్వకంగానే ఈ ఎగవేతలు జరుగుతున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఈపీఎఫ్ఓ రాష్ట్ర ప్రభుత్వ సహాయం కోరడం, ఎగవేతదారుల వివరాలను పబ్లిక్ డొమైన్లో ప్రచారం చేయడం, ఎగవేతదారుల చరాస్తులు, స్థిరాస్తులను జప్తు చేయడం వంటి అనేక చర్యలు తీసుకుంటోంది.ఇదీ చదవండి: స్పామ్ కాల్స్, ఆన్లైన్ మోసాల కట్టడికి సూచనలుఈపీఎఫ్ఓ రికవరీ ఇలా..రాష్ట్ర ప్రభుత్వ సహాయం: బకాయిల రికవరీకి వీలుగా ఈపీఎఫ్ఓ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తోంది. స్థానిక ప్రభుత్వాల మద్దతుతోపాటు అక్కడి పరిపాలనా యంత్రాంగాన్ని ఉపయోగించడం వల్ల రికవరీకి అవకాశం ఉంటుందని నమ్ముతుంది.డిఫాల్టర్ల వివరాలు ప్రచారం చేయడం: కొత్తగా ఉద్యోగంలో చేరాలనుకునే వారికి అవగాహన కల్పించడంతోపాటు నిబంధనలు పాటించకపోవడంపై సంస్థలకు సమాచారం అందించేందుకు డిఫాల్ట్ కంపెనీల పేర్లను ప్రచారం చేస్తున్నారు.ఆస్తుల అటాచ్మెంట్: ఈపీఎఫ్‌వో యాజమాన్యాల చరాస్తులు, స్థిరాస్తులను జప్తు చేస్తోంది. ఈ చట్టపరమైన చర్యల వల్ల నగదుగా మార్చగల ఆస్తులను స్వాధీనం చేసుకుని బకాయి వసూలు చేస్తోంది.చట్టపరమైన చర్యలు: దీర్ఘకాలిక ఎగవేతదారులపై ఈపీఎఫ్ఓ చట్టపరమైన చర్యలు తీసుకుంటోంది. నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేయడం, కఠిన శిక్షలు విధించేలా చూస్తోంది. -
ఏటీఎం నుంచి ఈపీఎఫ్‌వో సొమ్ము!
ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఈపీఎఫ్‌వో 3.0 అనే కొత్త వెర్షన్‌కి అప్‌గ్రేడ్ అయ్యే ప్రణాళికలో ఉంది. ఏటీఎం నుండి పీఎఫ్ సొమ్ము ఉపసంహరణ, ఉద్యోగి ప్రస్తుత 12 శాతం చందా పరిమితి పెంపు, పీఎఫ్ సొమ్మును పెన్షన్‌గా మార్చుకునే అవకాశం వంటి కొత్త సంస్కరణలు ఇందులో ఉండవచ్చని భావిస్తున్నారు.ఏటీఎం తరహా కార్డుఈటీ నౌ రిపోర్ట్ ప్రకారం.. ఈపీఎఫ్‌వో 3.0 అనే కొత్త వెర్షన్లో అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే, పీఎఫ్ సొమ్ము ఉపసంహరణల కోసం ఒక కార్డును జారీ చేయాలని కార్మిక మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ఈ కార్డును ఉపయోగించి ఏటీఎం ద్వారా పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేయవచ్చు. అయితే, పీఎఫ్ మొత్తంలో గరిష్టంగా 50 శాతం మాత్రమే ఇలా విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్ వచ్చే ఏడాది మే నుంచి జూన్ నెలల మధ్య ఎప్పుడైనా అమలు చేయవచ్చు.ఇక మరొక పరిణామం ఏమిటంటే, ఉద్యోగులు తమ జీతంలో ఈపీఎఫ్‌కు జమ చేసే కాంట్రిబ్యూషన్లపై ప్రస్తుతం ఉన్న 12% పరిమితిని తొలగించవచ్చు. ఉద్యోగులు తమకు నచ్చినంత మొత్తాన్ని పీఎఫ్‌కు జమ చేసుకునే అవకాశాన్ని ఇది కల్పిస్తుంది. అయితే, యజమాన్యం కాంట్రిబ్యూషన్ మాత్రం ఉద్యోగి జీతం ఆధారంగా ఉంటుంది. అలాగే ఉద్యోగి సమ్మతితో పీఎఫ్ మొత్తాన్ని పెన్షన్‌గా మార్చాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. -
EPFO Update: ఆధార్ లేకుండానే ఈపీఎఫ్ క్లెయిమ్!
కొంత మంది ఉద్యోగులకు పెద్ద ఊరటనిస్తూ ఫిజికల్ క్లెయిమ్‌లను సెటిల్ చేయడానికి ఇకపై తమ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)తో ఆధార్‌ను లింక్ చేయాల్సిన అవసరం లేదని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ప్రకటించింది. ఇటీవలి సర్క్యులర్‌లో పేర్కొన్న కొత్తగా సవరించిన విధానంలో భాగంగా ఈ మార్పు చేసింది.అయితే మినహాయింపు అందరికీ కాదు. భారతదేశంలో తమ అసైన్మెంట్ పూర్తి చేసి, ఆధార్ పొందకుండా స్వదేశానికి తిరిగి వెళ్లిన అంతర్జాతీయ వర్కర్లు, విదేశాలకు వలస వెళ్లి, అక్కడి పౌరసత్వం పొందిన ఆధార్ లేని భారతీయులకు ఈ మినహాయింపు వర్తిస్తుంది. అలాగే ఈపీఎఫ్&ఎంపీ చట్టం ప్రకారం "ఉద్యోగులు"గా అర్హత పొంది ఆధార్ లేకుండా భారత్ వెలుపల నివసిస్తున్న నేపాలీ, భూటాన్ పౌరులు కూడా మినహాయింపును వినియోగించుకోవచ్చు. ఇదీ చదవండి: EPFO 3.0: భారీ సంస్కరణలు.. అధికంగా పీఎఫ్ సొమ్ము!వీరంతా ఆధార్ స్థానంలో పాస్‌పోర్ట్‌లు లేదా పౌరసత్వ గుర్తింపు ధ్రువీకరణ పత్రాలు వంటి పత్రాలను ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాలుగా ఉపయోగించవచ్చు. "డ్యూ డిలిజెన్స్" ప్రక్రియలో భాగంగా, మినహాయింపులు క్లెయిమ్ చేస్తున్న ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలను తనిఖీ చేయాలని, పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ రూ. 5 లక్షలకు మించి ఉంటే సంబంధిత యాజమాన్యాలతో వివరాలను ధ్రువీకరించాలని ఈపీఎఫ్‌వో అధికారులకు సూచించింది. సెటిల్మెంట్ సొమ్మును నెఫ్ట్ ద్వారానే బదిలీ చేయనున్నట్లు పేర్కొంది. -
ఈపీఎఫ్‌వో క్షమాభిక్ష పథకం
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తాజాగా 2024 క్షమాభిక్ష పథకాన్ని ఆమోదించింది. దీని ప్రకారం సంస్థలు ఎటువంటి పెనాల్టీ లేకుండా గత ప్రావిడెంట్ ఫండ్ బకాయిలను డిపాజిట్ చేయడానికి అనుమతిస్తుంది.కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా నేతృత్వంలో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థకు (ఈపీఎఫ్‌వో) చెందిన అత్యున్నత నిర్ణయాధికార సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ (సీబీటీ) శనివారం ఈపీఎఫ్‌వో ఆమ్నెస్టీ స్కీమ్ 2024ను కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పెనాల్టీలు లేదా చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోకుండా యజమానులను స్వచ్ఛందంగా బహిర్గతం చేయడానికి, గతంలో పాటించని లేదా తక్కువ నిబంధనలను సరిదిద్దడానికి ప్రోత్సహించడానికి ఈ పథకాన్ని రూపొందించారు.స్కీమ్ ప్రయోజనాలను పొందేందుకు యజమానుల నుండి ఒక సాధారణ ఆన్లైన్ డిక్లరేషన్ సరిపోతుంది. స్వచ్ఛంద సమ్మతి కోసం పరిమిత అవకాశాన్ని అందించడం ద్వారా మరింత మంది ఉద్యోగులకు సామాజిక భద్రతా ప్రయోజనాలను విస్తరించడం, యజమానులతో నమ్మకాన్ని పునర్నిర్మించడం, శ్రామిక శక్తిని అధికారికంగా ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యం అని ఈపీఎఫ్‌వో పేర్కొంది. -
ఈపీఎఫ్ఓ క్లెయిమ్ తిరస్కరించారా? ఇవి తెలుసుకోండి!
ఉద్యోగ భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) క్లెయిమ్‌లు గత కొంతకాలంగా ఎక్కువగా తిరస్కరణకు గురవుతున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఈపీఎఫ్ఓ వార్షిక నివేదిక ప్రకారం 2023లో దాదాపు ఆరు కోట్ల ఉపసంహరణ దరఖాస్తులు నమోదైతే అందులో సుమారు 27 శాతం తిరస్కరణకు గురయ్యాయి. అయితే క్లెయిమ్ రెజక్ట్ అయ్యేందుకు చాలా కారణాలున్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు.వ్యక్తిగత వివరాలు సరిగా లేకపోవడం: క్లెయిమ్ ఫారం, ఈపీఎఫ్ఓ రికార్డుల్లో ఉద్యోగి పేరు, పుట్టిన తేదీ, ఇతర వ్యక్తిగత సమాచారంలో తేడా ఉండడం వల్ల క్లెయిమ్ తిరస్కరించబడుతుంది.కేవైసీ పూర్తి చేయకపోవడం: ఆధార్, పాన్ లేదా బ్యాంక్ వెరిఫికేషన్ వంటి వాటిలో కేవైసీని అప్డేట్ చేయాలి. లేదంటే క్లెయిమ్ నిలిపేసే అవకాశం ఉంటుంది.తప్పుడు బ్యాంకు వివరాలు: బ్యాంకు ఖాతా నంబర్ లేదా ఐఎప్ఎస్సీ కోడ్‌లో తప్పుల వల్ల క్లెయిమ్‌ను తిరస్కరించవచ్చు.యూఏఎన్: ఇన్ యాక్టివ్ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్)తో క్లెయిమ్ నమోదు చేస్తే రెజెక్ట్ అవుతుంది.తగినంత బ్యాలెన్స్ లేకపోవడం: క్లెయిమ్ చేసిన మొత్తాన్ని కవర్ చేయడానికి ఈపీఎఫ్ ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకపోతే క్లెయిమ్ ఇవ్వరు.పెండింగ్ బకాయిలు: ఈపీఎఫ్ఓకు చెల్లించాల్సిన బకాయిలు క్లియర్ అయ్యే వరకు క్లెయిమ్ అందించరు. కొన్నిసార్లు యాజమాన్యం చెల్లించాల్సిన ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్‌ను జమ చేయడం ఆలస్య అవుతుంది. అలాంటి సందర్భాల్లో క్లెయిమ్ రాదు.కొన్నిసార్లు సాంకేతిక సమస్యలు, నిబంధనల ప్రకారం సర్వీసు లేకుండానే దరఖాస్తు చేస్తుండడం వంటి కారణాల వల్ల క్లెయిమ్ తిరస్కరించే అవకాశం ఉంది. -
EPFO 3.0: భారీ సంస్కరణలు.. అధికంగా పీఎఫ్ సొమ్ము!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 3.0 వెర్షన్లో మెగా పునరుద్ధరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల ప్రయోజనాలు లక్ష్యంగా కార్యక్రమాలను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. 12 శాతం ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ పరిమితిని తొలగించడంతో సహా ఈపీఎఫ్‌వో సేవల్లో భారీ సంస్కరణలను కార్మిక మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది.ఉద్యోగుల 12 శాతం కాంట్రిబ్యూషన్ పరిమితిని ఈపీఎఫ్ఓ సమీక్షించే అవకాశం ఉందని ఈటీ నౌ మూలాధారాలను ఉటంకిస్తూ రిపోర్ట్ చేసింది. ఉద్యోగులు తమ కాంట్రిబ్యూషన్‌ను పెంచుకోవడం ద్వారా మరింత సొమ్మును పీఎఫ్‌కు జమ చేసుకునేందుకు వీలు కలగనుందని నివేదిక పేర్కొంది. అయితే, యాజమాన్యం వంతుగా జమ చేసే మొత్తం ఉద్యోగి జీతంపై ఆధారపడి ఉంటుంది.మొత్తంమీద, ఈపీఎఫ్‌వో తీసుకుంటున్న చర్యలను ఉద్యోగుల పొదుపును పెంచే ప్రయత్నంగా చూడవచ్చు. అదనంగా ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్‌ను వారి సమ్మతితో పెన్షన్‌గా మార్చడానికి అనుమతించాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. అంటే ఏ సమయంలోనైనా ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ మొత్తాన్ని పెన్షన్‌గా మార్చుకునే అవకాశం ఉంటుంది. -
EPFO: కొత్తగా 18.81 లక్షల మందికి పీఎఫ్
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) సభ్యులు సెప్టెంబర్‌లో 18.81 లక్షల మంది పెరిగారు. క్రితం ఏడాది ఇదే నెలలోని గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 9.33 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. ఉపాధి అవకాశాల పెరుగుదలను ఇది సూచిస్తోంది. వీరిలో 9.47 లక్షల మంది కొత్త సభ్యులు.క్రితం ఏడాది ఇదే నెల కంటే 6.22 శాతం పెరిగారు. సభ్యుల్లో 8.36 లక్షల మంది 18–25 ఏళ్లలోపు వారే (60 శాతం) కావడం గమనార్హం. అంటే వీరు మొదటిసారి సంఘటిత రంగంలో ఉపాధి పొందినట్టు అర్థం చేసుకోవచ్చు. 14.10 లక్షల మంది సభ్యులు సెప్టెంబర్ నెలలో ఈపీఎఫ్‌వో పరిధిలోనే ఒక సంస్థ నుంచి మానేసి, మరో సంస్థలో చేరారు.వార్షికంగా క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే ఇది 18 శాతం అధికం. కొత్త సభ్యుల్లో 2.47 లక్షల మంది మహిళలు ఉన్నారు. 9 శాతం వృద్ధి నమోదైంది. సెప్టెంబర్ నెల మొత్తం మీద నికరంగా చేరిన మహిళా సభ్యుల సంఖ్య 3.70 లక్షలుగా ఉంది. ఇది కూడా 12 శాతం అధికం. 21 శాతం మహారాష్ట్ర నుంచే.. సెప్టెంబర్ నెలలో నికర సభ్యుల చేరికలో మహారాష్ట్ర నుంచే 21.20 శాతం మంది ఉన్నారు. ఇక కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, హర్యాన, గుజరాత్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ నుంచి విడిగా 5 శాతం కంటే ఎక్కువ సభ్యులు చేరారు. నైపుణ్య సేవలు, ట్రేడింగ్–వాణిజ్య సంస్థలు, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇంజనీరింగ్ ఉత్పత్తులు, వస్త్రాల తయారీ, క్లీనింగ్, స్వీపింగ్ సేవలు, హాస్పిటళ్లలో ఎక్కువ మందికి ఉపాధి లభించింది. -
EPFO: కొత్త రూల్.. కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)కు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. సభ్యులైన ఉద్యోగులందరూ ఆధార్ ఆధారిత ఓటీపీ వ్యవస్థ ద్వారా తమ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)లను యాక్టివేట్ చేసుకోవాలని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆదేశించింది.ఈ మేరకు యాజమాన్యాలతో కలిసి వ్యూహాత్మకంగా పనిచేయాలని ప్రభుత్వం సూచించినట్లు ఈపీఎఫ్‌వో ఓ ప్రకటనలో తెలిపింది. సమర్థవంతమైన అమలు కోసం ఈపీఎఫ్‌వో జోనల్, ప్రాంతీయ కార్యాలయాలు ఇందులో పాలుపంచుకోనున్నాయి. 2024-25 యూనియన్ బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించిన ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ (ELI) పథకం అమలులో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.ఆధార్ చెల్లింపు వ్యవస్థ ద్వారానే అన్ని సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందించే క్రమంలో 100 శాతం బయోమెట్రిక్ ఆధార్ ప్రమాణీకరణను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది.ఆధార్‌ను గుర్తింపు పత్రంగా ఉపయోగించడం డెలివరీ ప్రక్రియ సులభతరం అవుతుందని, పారదర్శకత, సామర్థ్యాన్ని పెంచుతుందని ప్రభుత్వం భావిస్తోంది.ఇదీ చదవండి: కొత్త క్రెడిట్ కార్డ్.. లైఫ్ టైమ్ ఫ్రీ!మొదటి దశలో యజమాన్యాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేరిన తమ ఉద్యోగులందరికీ నవంబర్ 30 నాటికి ఆధార్ ఆధారిత ఓటీపీ ద్వారా యూఏఎన్ యాక్టివేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన ఉద్యోగులందరికీ ప్రక్రియను పూర్తి చేయాలి. -
EPFO: 7.66 లక్షల కంపెనీలు.. 7.37 కోట్ల మందికి పీఎఫ్
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)లో సభ్యత్వం గడిచిన ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా పెరిగింది. ఉద్యోగులకు చందా కట్టే కంపెనీల సంఖ్య 6.6 శాతం మేర పెరిగింది. దీంతో వీటి మొత్తం సంఖ్య 7.66 లక్షలకు చేరింది. అలాగే ఉద్యోగుల చేరికలు సైతం 7.6 శాతం పెరిగి ఈపీఎఫ్‌వో మొత్తం సభ్యుల సంఖ్య 7.37 కోట్లకు చేరినట్టు కేంద్ర కార్మిక శాఖ గణాంకాలు విడుదల చేసింది.2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నివేదికను ఈ నెల 8న జరిగిన ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ 109వ సమావేశం పరిగణనలోకి తీసుకున్నట్టు కేంద్ర కార్మిక శాఖ తెలిపింది. ఈపీఎఫ్‌వో కింద చందాలు జమ చేసే సంస్థలు 6.6 శాతం పెరిగి 7.66 లక్షలకు చేరాయి. చందాలు జమ చేసే సభ్యులు 7.6 శాతం పెరిగి 7.37 కోట్లుగా ఉన్నారు. మొత్తం 4.45 కోట్ల క్లెయిమ్‌లకు పరిష్కారం లభించింది.ఇదీ చదవండి: పాన్ కార్డ్ కొత్త రూల్.. డిసెంబర్ 31లోపు తప్పనిసరి!2022–23లో ఇవి 4.13 కోట్లుగా ఉన్నాయి. కొత్త కారుణ్య నియామక ముసాయిదా విధానం, 2024ను సైతం ఎగ్జిక్యూటివ్ కమిటీ పరిగణనలోకి తీసుకున్నట్టు కార్మిక శాఖ ప్రకటించింది. ఐటీ, మెరుగైన పరిపాలనా, ఆర్థిక సంస్కరణలపై చర్చించినట్టు.. వచ్చే కొన్ని నెలల పాటు ప్రతి నెలా సమావేశమైన సంస్కరణల పురోగతిని సమీక్షించాలని నిర్ణయించనట్టు తెలిపింది. -
ఈపీఎఫ్ గరిష్ఠ వేతన పరిమితి పెంపు?
ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించనుంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్) ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితి(ఈపీఎఫ్ఓ వేజ్ సీలింగ్)ని పెంచాలని యోచిస్తోంది. ఈమేరకు త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నట్లు కొందరు అధికారులు తెలిపారు. ప్రస్తుతం రూ.15 వేలుగా ఉన్న ఈ పరిమితిని రూ.21 వేలకు పెంచనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఒకవేళ అనుకున్న విధంగానే ఈ మేరకు నిర్ణయం తీసుకుంటే ఉద్యోగులకు మరింత సామాజిక భద్రత చేకూరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.ప్రస్తుత విధానం ప్రకారం.. (ఈపీఎఫ్ఓ గరిష్ఠ వేతన పరిమితి: రూ.15,000)ఉద్యోగి ప్రాథమిక జీతం: నెలకు రూ.25,000ఎంప్లాయి కాంట్రిబ్యూషన్: రూ.25,000లో 12 శాతం= రూ.3,000యజమాని కాంట్రిబ్యూషన్: రూ.25,000లో 12 శాతం= రూ.3,000ఎంప్లాయి పెన్షన్ స్కీమ్ కాంట్రిబ్యూషన్: నెలకు రూ.15,000(గరిష్ఠ పరిమితి)లో 8.33 శాతం = రూ.1,250ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్: నెలకు రూ.3,000 - రూ.1,250 = రూ.1,750ఇదీ చదవండి: ‘తను నా కోసమే పుట్టిందనిపించింది’ప్రతిపాదిత విధానం ప్రకారం.. (వేతన సీలింగ్: రూ.21,000)ఉద్యోగి ప్రాథమిక జీతం: నెలకు రూ.25,000ఎంప్లాయి కాంట్రిబ్యూషన్: రూ.25,000లో 12 శాతం= రూ.3,000యజమాని కాంట్రిబ్యూషన్: రూ.25,000లో 12 శాతం= రూ.3,000ఎంప్లాయి పెన్షన్ స్కీమ్ కాంట్రిబ్యూషన్: నెలకు రూ.21,000(గరిష్ఠ పరిమితి)లో 8.33 శాతం = రూ.1,749ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్: నెలకు రూ.3,000 - రూ.1,749 = రూ.1,251కేంద్రం వేతన గరిష్ఠ పరిమితిలో మార్పులు తీసుకొస్తే గతంలో కంటే ఈపీఎస్ కాంట్రిబ్యూషన్ పెరుగుతుంది. ఈపీఎఫ్ తగ్గుతుంది. -
వీపీఎఫ్..పన్ను రహిత వడ్డీ పరిమితి పెంపు?
స్వచ్ఛంద భవిష్య నిధి(వీపీఎఫ్)పై సమకూరే పన్ను రహిత వడ్డీ పరిమితిని పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం రూ.2.5 లక్షల వరకు వీపీఎఫ్‌పై సమకూరే వడ్డీపై పన్ను మినహాయింపు ఉంది. ఈ పరిమితిని పెంచితే మరింత మందికి మేలు జరుగుతుందని, కాబట్టి ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ఈ విషయం తెలిసిన వ్యక్తులు తెలిపారు.ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) ఆధ్వర్యంలోని స్వచ్ఛంద భవిష్య నిధి(వీపీఎఫ్) ద్వారా ఉద్యోగులు తమ డబ్బుపై అదనంగా వడ్డీ సమకూర్చుకోవచ్చు. ఈపీఎఫ్, వీపీఎఫ్‌కు ఒకే వడ్డీరేటు ఉంటుంది. దాంతో దీర్ఘకాలంలో మంచి రాబడి పొందవచ్చు. వీపీఎఫ్‌లో జమ చేసే నగదుకు సంబంధించి ఎలాంటి పరిమితులు లేవు.వీపీఎఫ్ గురించి కొన్ని విషయాలుఈ పథకం కోసం ఉద్యోగి ప్రత్యేకంగా కంపెనీ యాజమాన్యానికి లేఖ అందించాల్సి ఉంటుంది. కచ్చితంగా అందరు ఉద్యోగులు ఈ పథకంలో చేరాల్సిన నిబంధనేమీ లేదు. బ్యాంకు సేవింగ్స్ ఖాతా, కొన్ని బ్యాంకులు అందించే ఎఫ్డీ వడ్డీ కంటే మెరుగైన వడ్డీ ఉంటుంది. కాబట్టి దీర్ఘకాలంలో మంచి రాబడులు అందుకోవచ్చు. భవిషత్తు అవసరాల కోసం మెరుగైన వడ్డీ కావాలని భావించే ఉద్యోగులు ఇందులో చేరవచ్చు.ఈ పథకంలో చేరిన వారు తమ ప్రాథమిక జీతంలో కట్ అవుతున్న 12 శాతం ఈపీఎప్ కంటే అధికంగా జమ చేసుకునే వీలుంది.ఇదీ చదవండి: ఆహార శుభ్రతకు ‘స్విగ్గీ సీల్’ఏటా జమ చేసే మొత్తం రూ.1.5 లక్షల వరకు ఉంటే సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంటుంది.ప్రస్తుతం ఈపీఎఫ్ వడ్డీ 8.15 శాతంగా ఉంది. ఇదే వడ్డీ వీపీఎఫ్‌కు వర్తిస్తుంది.ఉద్యోగం మానేసిన రెండు నెలల తర్వాత, లేదా పదవీ విరమణ చేసిన తర్వాత ఈ డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. వైద్య అత్యవసరాలు, విద్య, వివాహాలు..వంటి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కూడా నిబంధనల ప్రకారం విత్‌డ్రా చేసుకోవచ్చు.