ఈపీఎఫ్‌ సమస్యపై ఫిర్యాదు చేయాలా? మొత్తం ఆన్‌లైన్‌లోనే ఇలా.. | How To Raise PF Complaints On EPFO Portal Check Details - Sakshi
Sakshi News home page

EPFO: ఈపీఎఫ్‌ సమస్యపై ఫిర్యాదు చేయాలా? మొత్తం ఆన్‌లైన్‌లోనే ఇలా..

Published Sat, Sep 9 2023 8:20 PM | Last Updated on Sat, Sep 9 2023 8:30 PM

How to raise PF Complaints on EPFO Portal Check Details - Sakshi

ఉద్యోగం చేసే ఎవరికైనా ఈపీఎఫ్ఓ (EPFO) అకౌంట్ ఉంటుందనే విషయం అందరికి తెలిసింది. అయితే కొన్ని సందర్భాల్లో పీఎఫ్‌కు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. అలాంటి సమస్యల పరిష్కారానికి ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆన్‌లైన్‌ సదుపాయాన్ని అందిస్తోంది. దీనితో పాటు EPF i-గ్రీవెన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అనే ఒక ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌ కూడా తీసుకు వచ్చింది. వీటి ద్వారా ఏదైనా పిర్యాదు చేయవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఈపీఎఫ్‌కి ఖాతాకు సంబంధించి ఫిర్యాదులు చేయడం ఎలా?

  • https://epfigms.gov.in/లో EPF i-గ్రీవెన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అధికారిక వెబ్‌సైట్‌ ఓపెన్ చేయాలి.
  • హోమ్‌పేజీకి కుడివైపు పైన ఉన్న మెనులోని 'రిజిస్టర్ గ్రీవెన్స్'ని ఆప్షన్ ఎంచుకోవాలి, ఆ తరువాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
  • కొత్త పేజీ ఓపెన్ అయిన తరువాత అక్కడ PF Member, EPS Pensioner, Employer, Others అనే నాలుగు ఆప్షన్స్ కనిపిస్తాయి.
  • ఇందులో మీరు PF Member మీద క్లిక్ చేసిన తరువాత Yes లేదా No అనే రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి.
  • No ఆప్షన్ మీద క్లిక్ చేస్తే యూఏఎన్ అండ్ సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి.

  • అప్పటికె లింక్ చేసిన మీ వ్యక్తిగత వివరాలు అక్కడ కనిపిస్తాయి.
  • గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే.. రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది.
  • ఓటీపీ ఎంటర్ చేసిన తరువాత.. పర్సనల్ డీటైల్స్ ఫిల్ చేసి.. కంప్లైంట్ చేయవల్సిన పీఎఫ్ నెంబర్ మీద క్లిక్ చేయాలి.
  • స్క్రీన్ మీద పాప్-అప్ కనిపిస్తుంది.. అందులో మీ ఫిర్యాదుకు సంబంధించిన ఆప్షన్ ఎంచుకోవచ్చు.
  • గ్రీవెన్స్ కేటగిరీ ఎంచుకున్న తరువాత.. పిర్యాదు వివరాలను ఎంటర్ చేసి ఏవైనా సంబంధిత సర్టిఫికెట్స్ ఉంటె అటాచ్ చేసుకోవచ్చు.
  • తరువాత మీ కంప్లైంట్ రిజిస్టర్ అవుతుంది. సమస్య పరిష్కారం కావడానికి 15 నుంచి 30 రోజులు సమయం పడుతుంది.

కంప్లైంట్ స్టేటస్ తెలుసుకోవడం ఎలా?

  • పిర్యాదు చేసిన తరువాత ట్రాక్ చేయడానికి అధికారిక వెబ్‌సైట్‌ https://epfigms.gov.in/ ఓపెన్ చేయాలి.
  • హోమ్ పేజీలో.. వ్యూ స్టేటస్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ నెంబర్, మొబైల్ నుమెబ్ర, సెక్యూరిటీ కోడ్ వంటి వాటిని ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు స్టేటస్ కనిపిస్తుంది.
  • మీ పిర్యాదు సకాలంలో పరిష్కారం కాకపోతే.. వెబ్‌సైట్‌ నుంచి రిమైండర్ పంపవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement