Grievance
-
ఈపీఎఫ్ సమస్యపై ఫిర్యాదు చేయాలా? మొత్తం ఆన్లైన్లోనే ఇలా..
ఉద్యోగం చేసే ఎవరికైనా ఈపీఎఫ్ఓ (EPFO) అకౌంట్ ఉంటుందనే విషయం అందరికి తెలిసింది. అయితే కొన్ని సందర్భాల్లో పీఎఫ్‌కు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. అలాంటి సమస్యల పరిష్కారానికి ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆన్లైన్ సదుపాయాన్ని అందిస్తోంది. దీనితో పాటు EPF i-గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ఒక ప్రత్యేక ప్లాట్‌ఫామ్ కూడా తీసుకు వచ్చింది. వీటి ద్వారా ఏదైనా పిర్యాదు చేయవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఈపీఎఫ్‌కి ఖాతాకు సంబంధించి ఫిర్యాదులు చేయడం ఎలా? https://epfigms.gov.in/లో EPF i-గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి. హోమ్‌పేజీకి కుడివైపు పైన ఉన్న మెనులోని 'రిజిస్టర్ గ్రీవెన్స్'ని ఆప్షన్ ఎంచుకోవాలి, ఆ తరువాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. కొత్త పేజీ ఓపెన్ అయిన తరువాత అక్కడ PF Member, EPS Pensioner, Employer, Others అనే నాలుగు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో మీరు PF Member మీద క్లిక్ చేసిన తరువాత Yes లేదా No అనే రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. No ఆప్షన్ మీద క్లిక్ చేస్తే యూఏఎన్ అండ్ సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. అప్పటికె లింక్ చేసిన మీ వ్యక్తిగత వివరాలు అక్కడ కనిపిస్తాయి. గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే.. రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తరువాత.. పర్సనల్ డీటైల్స్ ఫిల్ చేసి.. కంప్లైంట్ చేయవల్సిన పీఎఫ్ నెంబర్ మీద క్లిక్ చేయాలి. స్క్రీన్ మీద పాప్-అప్ కనిపిస్తుంది.. అందులో మీ ఫిర్యాదుకు సంబంధించిన ఆప్షన్ ఎంచుకోవచ్చు. గ్రీవెన్స్ కేటగిరీ ఎంచుకున్న తరువాత.. పిర్యాదు వివరాలను ఎంటర్ చేసి ఏవైనా సంబంధిత సర్టిఫికెట్స్ ఉంటె అటాచ్ చేసుకోవచ్చు. తరువాత మీ కంప్లైంట్ రిజిస్టర్ అవుతుంది. సమస్య పరిష్కారం కావడానికి 15 నుంచి 30 రోజులు సమయం పడుతుంది. కంప్లైంట్ స్టేటస్ తెలుసుకోవడం ఎలా? పిర్యాదు చేసిన తరువాత ట్రాక్ చేయడానికి అధికారిక వెబ్సైట్ https://epfigms.gov.in/ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో.. వ్యూ స్టేటస్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ నెంబర్, మొబైల్ నుమెబ్ర, సెక్యూరిటీ కోడ్ వంటి వాటిని ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు స్టేటస్ కనిపిస్తుంది. మీ పిర్యాదు సకాలంలో పరిష్కారం కాకపోతే.. వెబ్సైట్ నుంచి రిమైండర్ పంపవచ్చు. -
ఓఎన్డీసీలో ఫిర్యాదుల పరిష్కారానికి ఆటోమేటెడ్ వ్యవస్థ
న్యూఢిల్లీ: చిన్న వ్యాపారులను కూడా ఈ–కామర్స్‌లో భాగం చేసేందుకు ఉద్దేశించిన ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ)లో ఫిర్యాదుల పరిష్కారానికి పూర్తి ఆటోమేటెడ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసినట్లు సంస్థ సీఈవో టీ. కోషి తెలిపారు. త్వరలోనే ఆన్లైన్ పరిష్కార వ్యవస్థను కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారు. చిన్న రిటైలర్లు కూడా డిజిటల్ కామర్స్ ప్రయోజనాలను అందుకోవడంలో తోడ్పాటు అందించే ఉద్దేశంతో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ 2021 డిసెంబర్లో ఓఎన్డీసీని ప్రవేశపెట్టింది. ఇది కొన్నాళ్లుగా శరవేగంగా విస్తరిస్తోందని, గత కొద్ది నెలల్లోనే నెట్‌వర్క్‌లోని విక్రేతలు, సర్వీస్ ప్రొవైడర్ల సంఖ్య లక్ష దాటిందని కోషి వివరించారు. -
మళ్లీ మొదటికి వచ్చిన ట్విటర్.. గ్రీవెన్స్ ఆఫీసర్‌గా నాన్ లోకల్..!
కేంద్రం, ట్విటర్ మధ్య ఉద్రిక్తలు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం కేంద్ర ఐటీ శాఖ మంత్రి ట్విటర్ ఖాతాను బ్లాక్ చేసి తిరిగి పునరుద్దరించిన కొద్ది రోజులోకే ట్విటర్ ఇండియా గ్రీవెన్స్ ఆఫీసర్ పోస్టు నుంచి ధర్మేంద్ర చాతుర్ ఆ పదవికి రాజీనామా చేశారు. జూన్ 9న ట్విటర్, సోషల్ మీడియా సంస్థలకు సంబంధించి కొత్తగా తీసుకొచ్చిన మార్గదర్శకాలను పాటించనునట్లు ప్రభుత్వానికి లేఖ రాసింది. కొత్త ఐటీ నిబందనల ప్రకారం భారత్‌లో ట్విట్టర్ వినియోగదారుల పీర్యాదుల కోసం మన దేశానికి చెందిన వారినే గ్రీవెన్స్ ఆఫీసర్‌గా నియమించాలని కొత్త ఐటీ నిబంధనలు చెబుతున్నాయి. దీంతో ఇటీవల ట్విట్టర్ సంస్థ ధర్మేంద్ర చాతుర్‌ని గ్రీవెన్స్ అధికారిగా నియమించింది. ధర్మేంద్ర ఆ పదవికి రాజీనామా చేయడంతో కొత్తగా ఆయన స్థానంలోకి ట్విటర్ గ్లోబల్ లీగల్ పాలసీ డైరెక్టర్ అయిన జెరెమి కెస్సెల్‌ను భారతదేశానికి గ్రీవెన్స్ అధికారిగా నియమించింది. ఇండియాలో కొత్ ఐటీ రూల్స్‌ను పాటిస్తూ ఈ ఆఫీసర్‌ను నియమించింది. అయితే నిబందనల ప్రకారం స్థానికులనే గ్రీవెన్స్ ఆఫీసర్‌గా నియాయమించాలి. ఇప్పుడు ఆ నిబందనలు ఉల్లఘించడంతో ఈ నియామకాన్ని భారత ప్రభుత్వం అంగీకరించట్లేదు. కొత్త ఐటీ గైడ్‌లైన్స్ ప్రకారం 50 లక్షల కన్నా ఎక్కువ యూజర్లు కలిగి ఉన్న సోషల్ మీడియా సంస్థలో పబ్లిష్ అయ్యే కంటెంట్‌కు సదరు సంస్థల్ని బాధ్యుల్ని చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. చదవండి: ట్విట్టర్‌కు గ్రీవెన్స్ ఆఫీసర్ ‘గుడ్ బై’ -
ట్విట్టర్‌కు గ్రీవెన్స్ ఆఫీసర్ ‘గుడ్ బై’
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమం ట్విట్టర్ ఇటీవల నియమించిన తాత్కాలిక ఫిర్యాదుల స్వీకరణ అధికారి ధర్మేంద్ర చాతుర్ పదవికి గుడ్ బై కొట్టేశారు. భారత్‌లో ట్విట్టర్ వినియోగదారుల œర్యాదుల కోసం మన దేశానికి చెందిన వారినే గ్రీవెన్స్ ఆఫీసర్‌గా నియమించాలని కొత్త ఐటీ నిబంధనలు చెబుతున్నాయి. దీంతో ఇటీవల ట్విట్టర్ సంస్థ ధర్మేంద్ర చాతుర్‌ని గ్రీవెన్స్ అధికారిగా నియమించింది. కానీ ఇప్పుడు ట్విట్టర్ వెబ్సైట్లో ఆయన పేరు కనిపించడం లేదు. ధర్మేంద్ర ఆ పదవికి రాజీనామా చేశారు. భారత్ కొత్త డిజిటల్ చట్టం అమలులో ట్విట్టర్‌కు, కేంద్రానికి మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్న నేపథ్యంలోనే ట్విట్టర్‌కి గ్రీవెన్స్ ఆఫీసర్ లేకపోవడం గమనార్హం. -
సమస్యల పరిష్కారం కోసం..
► గ్రీవెన్స్‌లో అర్జీలిచ్చిన ప్రజలు నెల్లూరు(వేదాయపాళెం) : కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షణలు చేసినా సమస్యలు పరిష్కారం కావడంలేదంటూ పలు ప్రాంతాల ప్రజలు సోమవారం జరిగిన గ్రీవెన్స్‌లో అధికారుల వద్ద విన్నవించుకున్నారు. నగరంలోని నెల్లూరు ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ కె.వెంకటేశ్వర్లు డివిజన్ పరిధిలోని మండలాల నుంచి వచ్చిన వారు ఇచ్చిన అర్జీలు స్వీకరించారు. భూ సమస్యలపై అధికంగా అర్జీలు అందాయి. రైల్వేలైన్ ఏర్పాటుతో భూములు కోల్పోయిన రాపూరు మండలంలోని పలు గ్రామాల వారు నష్టపరిహారం కోరుతూ వినతి సమర్పించారు. ఈ నెలాఖరుకు ఆర్డీఓ పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో ఆయనకు ఇదే చివరి గ్రీవెన్స్డేగా మారింది. దీంతో ఆయా సమస్యల పరిష్కారం విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వలేకపోయారు. రెండు రోజుల్లో వెళ్లిపోయే నాకు స్వల్పకాలంలో సమస్యలను పరిష్కరించేందుకు వీలుకాదంటూ ఆయా సమస్యలను చెప్పుకోడానికి వచ్చిన వారితో బాహాటంగానే చెప్పారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ నరసింహులు సెలవుపై వెళ్లడంంతో డిప్యూటీ తహసీల్దార్ మనోహర్, రూరల్ ఎంపీడీఓ వసుమతి, హౌసింగ్ ఏఈ మనోజ్‌కుమార్‌లు రూరల్ అర్బన్ ప్రాంతాల ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్బన్ ప్రాంతంలో శివారు ప్రాంతాల్లోని భూ ఆక్రమణలపై అర్జీలు అధికంగా అందాయి. నివేశన స్థలాలు, రేషన్‌కార్డులు మంజూరు చేయాలని వినతిపత్రాలు అందజేశారు. రూరల్ ప్రాంత గ్రామాల సమస్యలను ఎంపీడీఓకు వివరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. -
గ్రీవెన్స్‌పై భానుడి ప్రభావం
► తక్కువ సంఖ్యలో వినతులు ► అర్జీలు స్వీకరించిన కలెక్టర్ ఆదిలాబాద్‌టౌన్: ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల విభాగానికి వినతులు తగ్గాయి. అర్జీదారులతో కిటకిటలాడే కలెక్టరేట్ ఎండ తీవ్రతతో ప్రజలు నామమాత్రంగా కనిపించారు. అర్జీదారుల నుంచి కలెక్టర్ జ్యోతి బుద్ధప్రకా‹శ్, సంయుక్త కలెక్టర్ కృష్ణారెడ్డి వినతులు స్వీకరించారు. వాటిని త్వరగా పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఈ వారం వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని.. అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దు ఉట్నూర్(ఖానాపూర్): అర్జీల పరిష్కారంలో అలసత్వం వహించొద్దని ఆర్డీవో విద్యాసాగర్ అన్నారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో గిరిజనుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ అర్హులైన వారికి న్యాయం చేయాలని అధికారులకు సూచించారు. డీటీడీవో కృష్ణనాయక్, ఐటీడీఏ ఏపీవో(జనరల్) నాగోరావ్, ఏవో భీంరావ్ పాల్గొన్నారు. ♦ టాటా మ్యాజిక్ ఆటో కొనుగోలుకు రుణం అందించాలని ఉట్నూర్ మండలం మారుతిగూడకు చెందిన కొడప జంగు అర్జీ సమర్పించాడు. ♦ ఎడ్ల జత మంజూరు చేయాలని ఉట్నూర్ మండలం చెక్డ్యాంగూడకు చెందిన సోయం శకుంతల వేడుకుంది. ♦ వ్యవసాయ బావి మంజూరు చేయాలని సిర్పూర్(యు) మండలం మహగావ్కు చెందిన గెడం కిషన్రావ్ విన్నవించాడు. ♦ కిరాణ దుకాణం ఏర్పాటుకు రుణం అందించాలని నేరడిగొండ మండలం అరెపల్లికి చెందిన మాడవి మారు అర్జీ సమర్పించాడు. ♦ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని సోనాపూర్‌కు చెందిన గిరిజనులు అర్జీ సమర్పించారు. -
24న ఎస్సీ, ఎస్టీ స్పెషల్ గ్రీవెన్స్
కర్నూలు(అర్బన్): ఈ నెల 24వ తేదీన ఎస్సీ,ఎస్టీ స్పెషల్ గ్రీవెన్స్‌ను కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు యు ప్రసాదరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ అధ్యక్షతన జరగనున్న కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, దళిత సంఘాల నాయకులు, ప్రజలు హాజరు కావాలని కోరారు. -
తుపాకీ లైసెన్సులు ఇప్పించండి
ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక గ్రీవెన్స్‌లో దళితుల మొర కర్నూలు(అర్బన్): ఆధిపత్య వర్గాల నుంచి తమకు ప్రాణహాని ఉన్నందున తమకు తుపాకీ లైసెన్సు ఇప్పించాలని చిప్పగిరికి చెందిన సి. లక్ష్మీనారాయణ, క్రిష్ణగిరి మండలం సీహెచ్ ఎర్రగుడికి చెందిన కె. కిష్టన్న అధికారులను కోరారు. సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో జరిగిన ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమానికి వీరు హాజరయ్యారు. జిల్లా జాయింట్ కలెక్టర్ సీ. హరికిరణ్, జేసీ–2 ఎస్ రామస్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎస్సీ, ఎస్టీ తమ సమస్యలను అధికారుల ముందుంచారు. పశు సంవర్ధకశాఖ నుంచి జీవక్రాంతి పథకం ద్వారా లబ్ధిపొందేందుకు దరఖాస్తులు సమర్పించినా, ఇంతవరకు రాలేదని, తమ దరఖాస్తులు ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొందని నందికొట్కూరు మండలం దామగట్ల గ్రామానికి చెందిన 15 మంది జేసీకి ఫిర్యాదు చేశారు. గోస్పాడు మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన కనక ప్రభాకర్ తనకు పూర్వీకుల నుంచి సంక్రమించిన 4.19 ఎకరాలకు ఈ పాస్ బుక్ మంజూరు చేయలేదని ఫిర్యాదు చేశారు. కర్నూలు మండలం బి. తాండ్రపాడుకు చెందిన 30 కుటుంబాలకు చెందిన వారు తమకు ఇంటి పట్టాలకు సర్వే చేయించి హద్దులు చూపించాలని కోరారు. గత ఏడాది అక్టోబర్ 3వ తేదీన కురిసిన వర్షాలకు కూలి పోయిన తన ఇంటి స్థానంలో ఐఏవై కింద గహాన్ని మంజూరు చేయాలని ప్యాపిలికి చెందిన ఏ నాగేంద్రమ్మ కోరారు. -
ఎస్సీ, ఎస్టీ స్పెషల్ గ్రీవెన్స్ రద్దు
కర్నూలు(అర్బన్): ప్రతి నెలా నాల్గవ సోమవారం కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ఎస్సీ, ఎస్టీల స్పెషల్ గ్రీవెన్న్ ఈ నెల 25వ తేదీన రద్దు చేసినట్లు సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు యు.ప్రసాదరావు తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ప్రజా సాధికార సర్వే జరుగుతున్న నేపథ్యంలో గ్రీవెన్స్‌ను రద్దు చేసి ఆగస్టు 29వ తేదీన నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. -
అధిక వడ్డీలు ఆశ చూపి...
* రూ.8కోట్ల సొమ్ముతో ఉడాయించిన పెద్ద మనిషి * లబోదిబోమంటున్న పేదలు, చిరు వ్యాపారులు * షిర్డీకి వెళ్తున్నామని ఉడాయింపు విజయనగరం కంటోన్మెంట్ : అత్యవసర పని ఉంది.. అధికంగా వడ్డీలు ఇస్తామని చెప్పి సుమారు రూ. 8 కోట్లకు కుచ్చు టోపీ వేశారు ఆ దంపతులు. పాఠశాల యజమానిగా పరిచయం చేసుకొని దొరికిన కాడికి దోచుకుపోయారు. షిర్డీ వెళ్తున్నామని చెప్పి పక్కా ప్రణాళిక ప్రకారం పిల్లల టీసీలు తీసుకొని మరీ ఉడాయించారు. మోసపోయామని గ్రహించిన బాధితులు సోమవారం కలెక్టరేట్‌కు వచ్చి గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఒబ్బిలిశెట్టి రాజశేఖర్, గాయత్రి దంపతులు విజయనగరంలోని వక్కలంకవారి వీధిలో అద్దె ఇంట్లో ఉండేవారు. పదేళ్ల క్రితం సాయిరాం పబ్లిక్ స్కూల్‌ను స్థాపించారు. మరో పక్క లార్వెన్స్ స్కూల్లో ఓ డెరైక్టర్‌గా పరిచయం చేసుకున్నారు. పెద్ద మనుషులుగా చలామణి అయ్యారు. చుట్టుపక్కల అందరితో వరుసలు కలిపారు. లార్వెన్స్, పెన్ స్కూళ్లలో భాగస్వామ్యం ఉందన్నారు. రోటరీ క్లబ్లో కూడా సభ్యులయ్యారు. పాఠశాలకు వచ్చే పేద, మధ్యతరగతి ప్రజలతో కలుపుగోరుగా ఉండేవారు. కల్లబొళ్లి కబుర్లు చెప్పి ఎక్కువ వడ్డీలిస్తామని ఆశచూపి దొరికిన వారి వద్ద వేలు, లక్షల్లో అప్పులు చేశారు. సమాజంలో స్థితిమంతులైన వారి దగ్గరి నుంచి ఇళ్లల్లో పాచిపనులు చేసుకునే వారిని, పాల ప్యాకెట్లు అమ్ముకునే వారిని బుట్టలో వేసుకున్నారు. ఫంక్షన్లకు వెళ్తామని చెప్పి మహిళల వద్ద నగలు కాజేశారు. పథకం ప్రకారం... దాదాపు రూ.8 కోట్ల సొమ్ము, విలువైన నగలతో ముందుగా వేసుకున్న పథకం ప్రకారం షిర్డీ వెళ్తున్నామని చెప్పి ఉడాయించేశారు. షిర్డీ వెళ్లిన వీరు ఇంకా రాలే దేంటని బాధితులు సాయిరాం పబ్లిక్ స్కూల్‌కు వెళ్లి ఆరా తీశారు. మరొకరికి పాఠశాల నిర్వహణ బాధ్యతలు అప్పగించి ఉడాయించేశారన్న విషయం తెలుసుకొని లబోదిబోమంటున్నారు. భారీ ఎత్తున డబ్బులు ఇచ్చిన వారు కూడా ఇన్‌కంటాక్స్ ఇబ్బందులు ఉన్నాయని బయటకు రాలేదని బాధితులు చెబుతున్నారు. ఈ ఘరానా మోసంపై టూ టౌన్‌పోలీస్ స్టేషన్లో గతంలో ఫిర్యాదు చేసిన వీరు సోమవారం కలెక్టరేట్‌కు వచ్చి గ్రీవెన్స్‌లోను ఫిర్యాదు చేశారు. నగలు తీసుకుపోయారు ఎన్నాళ్లో కూడబెట్టిన డబ్బులతో సంక్రాంతి పండగ ముందు నల్లపూసలు, నగలు చేయించుకున్నాను. 8 తులాల నగలు దాదాపు రెండున్నర లక్షల విలువైనవి. మెచ్యూర్ ఫంక్షన్‌కు వేసుకెళ్తామని చెప్పి తీసుకుపోయారు. ఇలా ఊరొదిలి వెళతారనుకోలేదు. - సీహెచ్ సూర్యకళ, విజయనగరం పారిపోతామా? అన్నారు. పాఠశాల అభివృద్ధి చేసుకుంటానంటే నా వద్ద ఉన్న డబ్బులతో పాటు వస్తువులు పెట్టి పలుమార్లు రూ.7.50లక్షలు అప్పిచ్చాను. వడ్డీ కూడా ఇస్తామన్నారు. ఇటీవల నా కుమార్తె అల్లుడు కలసి వచ్చారు. అల్లుడు వెళ్లి గట్టిగా అడిగాడు. మార్చిలో స్కూల్ ఫీజులొస్తాయి. అప్పుడిస్తానన్నాడు. గాయత్రి వచ్చి ఇప్పుడు అంత డబ్బులు మీకేం అవసరం వదినా? మేమేం పారిపోతామా అని అడిగింది. ఇస్తారు కదా అనుకుంటే పారిపోయారు. - గూడిపూడి నాగమణి, వక్కలంక వీధి రూ.7.50 లక్షలు ఇచ్చాను టిఫిన్ దుకాణం నడుపుతున్నాను. చీటీలు ఎత్తేవారు నాకు డబ్బులిచ్చి వెళ్తుంటారు. అలా ఇచ్చిన డబ్బులను వారికిచ్చాను. దాదాపు రూ.7.50లక్షలు ఇచ్చాను. దీంతో పాటు మరో రూ.60 వేల చీటీ డబ్బులు ఇచ్చాను. దేనికీ కాగితాలు రాసివ్వలేదు. ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు. - పి అప్పలకొండ, చిన్నిపిల్లి వీధి నాకు తెలియకుండా నా భార్య ఇచ్చేసింది రాజశేఖర్ భార్య గాయత్రి వచ్చి మాయ చేసి అడిగితే నాకు తెలియకుండా నా భార్య పద్మజ రూ.7 లక్షలు ఇచ్చేసింది. భూమి అమ్మితే వచ్చిన డబ్బు ఇంట్లో ఉందని తెలుసుకుని వచ్చి మాయ చేశారు. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాం. కలెక్టర్ దృష్టిలో పెట్టాలని అందరం వచ్చాం. - ఎం జగదీశ్వరరావు, బాధితుడు నా డబ్బులెలా వస్తాయో.. నేను నాలుగైదు వీధుల్లో పాల ప్యాకెట్లు విక్రయిస్తాను. అలాగే సాయిరాం ఆలయం ముందు కొబ్బరి కాయలు విక్రయిస్తాను. నేను పైసా పైసా కూడబెట్టి రూ.30 వేలు పోగేశాను. ఆ డబ్బులు ఉన్నాయని తెలిసి వచ్చారు. మళ్లీ వడ్డీతో సహా ఇస్తామని చెబితే ఇచ్చాను. నా డబ్బులెలా వస్తాయో..! - చిన్నిపిల్లి రమణమ్మ, పన్నీరువారి వీధి రూ. 3లక్షల చీటీ, రెండు లక్షల అప్పు ఇచ్చాం నా భర్త ప్రైవేటు ఇన్‌కంటాక్స్ ఫైళ్లు రాస్తుంటారు. మేం చీటి వేసిన రూ. 3లక్షలకు నేనే ష్యూరిటీ ఉంటానని తీసుకెళ్లిపోయాడు. అలాగే మరో రెండు లక్షలకు మధ్య ఉన్నాం. మొత్తం ఐదు లక్షలు కాజేశారు. ఇలా అర్ధాంతరంగా స్కూల్ మూసేసి వెళ్లిపోతారనుకోలేదు. - కె.సూర్యకళ, విజయనగరం -
సార్..! సమస్యలు ఆలకించండి !!
- ప్రజావాణిలో వినతుల వెల్లువ - స్వయంగా అర్జీలు స్వీకరించిన జేసీ వెంకట్రాంరెడ్డి సంగారెడ్డి జోన్ : ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్‌డేకు వినతులు వెల్లువెత్తాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీ ఎత్తున కలెక్టరేట్‌కు తరలివచ్చారు. జేసీ వెంకట్రాంరెడ్డి ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. విచారణ చేసి సత్వరం న్యాయం చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. తన ప్రమేయం లేకుండానే తన భూమిని ఇతరులకు రిజిస్ట్రేషన్ చేసిన డిప్యూటీ తహసీల్దార్, గ్రామ పట్వారీలపై చర్యలు తీసుకోవాలని పాపన్నపేట మండలం కొడపాక గ్రామానికి చెందిన ప్రభాకర్ కోరారు. తన 2 ఎకరాల 20 గుంటల భూమిని ఎలాంటి అనుమతి లేకుండా ఇతరులపై రిజిస్ట్రేషన్ చేశారని, రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ తమకు ఎకరా భూమి పట్టా ఇచ్చారని, కానీ ఇంతవరకు పొజిషన్ చూపించలేదని పాపన్నపేట మండలం మిన్పూర్కు చెందిన ఏసమ్మ, బాలమ్మలు తెలిపారు. తమకు వెంటనే పొజిషన్ చూపించాలని, లేకుంటే మూడెకరాల భూమి ఇప్పించాలని జేసీకి విన్నవించారు. మావోయిస్టుగా జనజీవన శ్రవంతిలోకి వచ్చిన తనకు ప్రభుత్వ భూమి మంజూరు చేయాలని మెదక్ మండలం తిమ్మాయపల్లి గ్రామానికి చెందిన పోచయ్య కోరారు. విధి నిర్వహణలో తన భర్త మతిస్థిమితం కోల్పోయినందునా తనకు ఉపాధి కల్పించాలని కొండాపూర్మండలం మారేపల్లికి చెందిన ఇందిరమ్మ విజ్ఞప్తి చేశారు. బీడీ కార్మికులైన తమకు ఇళ్లు మంజూరు చేయాలని అందోల్ మండలానికి చెందిన సువర్ణ, దుబ్బాక మండలం ఆరేపల్లికి చెందిన సునీత, యాదమ్మ వినతిపత్రం అందజేశారు. తనకు వితంతు పింఛన్ మంజూరు చేయాలని జహీరాబాద్ మండలం చిన్న హైదరాబాద్‌కు చెందిన కోనమ్మ విజ్ఞప్తి చేశారు. తన భార్యకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించానని, ఈ కారణంగా తమ కూ తురుకు బాలిక సంరక్షణ పథకం వర్తింపజేయాలని జహీరాబాద్ పట్టణం శాంతినగర్ కుచెందిన మంగళి విజయకుమార్ కోరారు. తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకొని ఆస్తినంతా వారికే ఇచ్చారని, న్యాయంగా తనకు రావాల్సిన ఆస్తిలో వాటా ఇప్పించాలని న్యాల్కల్కు చెందిన అంజమ్మ జేసీకి విజ్ఞప్తి చేసింది. తన భూమిలో అక్రమంగా ఇతరులు రోడ్డు వేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోహీర్ మండలం వెంకటాపూర్‌కు చెందిన మల్లయ్య కోరారు. మెదక్ మండలం హవేళీఘన్పూర్కు చెందిన మాజీ సర్పంచ్ వెంకట్‌రెడ్డి ప్రభుత్వ భూమిని ప్లాట్లు చేసి విక్రయిస్తున్నాడని, తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. తనకు అంత్యోదయ కార్డు మంజూరు చేయాలని అందోల్ మండలం పోసానిపేటకు చెందిన వడ్డే యాదమ్మ కోరారు. తాను గత 30 సంవత్సరాలుగా పిండి గిర్ని నడిపిస్తూ జీవనం సాగిస్తున్నానని, దాన్ని తొలగించాలని అధికారులు యత్నిస్తున్నట్టు చేగుంటకు చెందిన రాజలింగం తెలిపారు. పిండి గిర్ని యథావిధిగా నడిపించుకొనేందుకు అనుమతినివ్వాలని విజ్ఞప్తి చేశారు. సత్వరమే సమస్యల పరిష్కారం : ఎస్పీ సంగారెడ్డి క్రైం : ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ బి.సుమతి సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులు తమ సమస్యలను ఎస్పీకి విన్నవించారు. ఈ సందర్భంగా ఎస్పీ అర్జీదారులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి సంబంధిత పోలీసు స్టేషన్ల అధికారులకు సూచిస్తూ త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. -
వడ్డీ వ్యాపారుల బారి నుంచి కాపాడండి
గ్రీవెన్స్‌సెల్‌లో రూరల్ ఎస్పీకి బాధితుల వేడుకోలు గుంటూరు క్రైం : జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలోని రూరల్ ఎస్పీ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ జరిగింది. మొత్తం 50కు పైగా అందిన ఫిర్యాదులను ఎస్పీ కె.నారాయణ నాయక్, అదనపు ఎస్పీ జి.రామాంజనేయులు పరిశీలించారు. ఫిర్యాదుల వివరాలను సంబంధిత అధికారులకు ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని వారు హామీ ఇచ్చారు. బాధితుల సమస్యలు కొన్ని వారి మాటల్లోనే... దస్తావేజులు ఇప్పించండి మా గ్రామంలోని కోటా వెంకటసాంబశివరావు వద్ద ఇంటి దస్తావేజులు హామీగా ఉంచి కొద్ది నెలల క్రితం రూ.20వేలు అప్పుగా తీసుకున్నాను. అతనికి ఇవ్వాల్సిన డబ్బును రూ. 30వేలకు పైగా చెల్లించాను. ఇచ్చిన డబ్బంతా వడ్డీకే సరిపోయిందని, అసలు డబ్బు ఇస్తే దస్తావేజులు తిరిగి ఇస్తానన్నాడు. లేకుంటే ఇల్లు ఖాళీ చేయాలని వేధింపులకు గురి చేస్తున్నాడు. అతని నుంచి రక్షణ కల్పించి ఇంటి దస్తావేజులు ఇప్పించాలి. -షేక్ఘన్సైదా, మసీదు వీధి, ఫిరంగిపురం న్యాయం చేయాలి నాభర్త, అత్త వేధింపుల కారణంగా బాపట్ల టౌన్ పోలీసు స్టేషన్లో గతనెలలో ఫిర్యాదు చేశాను. పోలీసులు నేను ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం కేసు నమోదు చేయకుండా నా సోదరి మాధవిని పిలిపించి ఆమెతో ఫిర్యాదు తీసుకుని గతనెల 31న కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ కాపీ పరిశీలిస్తే ఫిర్యాదులో మార్పు ఉంది. నేను చేసిన ఫిర్యాదు ప్రకారం కేసు నమోదు చేసి న్యాయం జరిగేలా చూడాలి. -ఆర్.సురేఖ, ఏరియా హాస్పటల్ స్టాఫ్‌నర్సు, బాపట్ల చోరీ కేసు రికవరీ చేయాలి ఆర్మీలో 17 ఏళ్ల పాటు సేవలు అందించి ఎనిమిదేళ్ల క్రితం రిటైర్ అయ్యాను. వస్తున్న పెన్షన్‌తో కుటుంబాన్ని పోషించుకుంటూ జీవిస్తున్నా. గత ఏడాది నవంబరు 19న ఇంట్లో చోరీ జరిగింది. పదిసార్లు బంగారు ఆభరణాలు, రూ.10వేలు నగదు చోరీకి గురయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దొంగల ఆచూకీ ఇప్పటివరకు గుర్తించలేకపోయారు. వీలైనంత త్వరగా దొంగలను గుర్తించి చోరీకి గురైన సొత్తును తిరిగి అప్పజెప్పాలి. -పి.వెంకటేశ్వరరావు, కనగాల, చెరుకుపల్లి మండలం -
ఆడపిల్ల జన్మించిందని..
- కాపురానికి వద్దంటున్నాడు - గ్రీవెన్స్‌లో బాధితురాలి నివేదన గుంటూరు క్రైం: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ జరిగింది. రూరల్ ఎస్పీ కె.నారాయణ నాయక్ మొత్తం 32కు పైగా అందిన ఫిర్యాదులను పరిశీలించారు. ముందుగా పోలీసుస్టేషన్లలో న్యాయం జరగని పక్షంలో ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేయాలని బాధితులకు సూచించారు. సివిల్ వివాదాలలో పోలీసుల ప్రమేయం ఉండదని, బాధితులు గుర్తించాలని ఆయన చెప్పారు. బాధితుల సమస్యల్లో కొన్ని వారి మాటల్లోనే.. ఎస్ఐ రూ. 5 వేలు తీసుకున్నారు... - పి.శ్రావణి, పెనుగుదురుపాడు, చుండూరు మండలం పెదకాకాని మండలం వెనిగళ్ల గ్రామానికి చెందిన పాటిబండ్ల డేవిడ్ రాజుతో 2011లో వివాహం జరిగింది. పెళ్లయిన ఏడాదికే ఆడపిల్లలకు జన్మనిచ్చానని, కాపురానికి తీసుకువెళ్లేందుకు నా భర్త నిరాకరించాడు. చుండూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో నా భర్త , బంధువులను పిలిపించి మాట్లాడారు. నా కాపురం చక్కదిద్దుతానని చెప్పి విధుల్లో ఉన్న ఎస్ఐ నా వద్ద రూ.5 వేలు నగదు తీసుకున్నాడు. నా భర్తకు కౌన్సిలింగ్ నిర్వహించకపోగా నాకు న్యాయం చేయలేదు. మోసం చేశారు... - సామ నాగేశ్వరరావు, బోస్‌రోడ్డు, తెనాలి చిలకలూరిపేటలోని కొమరవల్లిపాడుకు చెందిన మురికిపూడి ప్రదీప్‌కుమార్ హైదరాబాద్‌లో జయహూ ట్రేడర్స్ పేరుతో సెల్రీఛార్జి టాప్అప్ డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నాడు. అతని వద్ద రెండేళ్ల నుంచి ప్రతినెలా రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల మధ్య టాప్అప్ బ్యాలెన్స్ చేయిస్తూ అతని అక్కౌంట్లో నగదు చెల్లిస్తూ ఉంటాము. ఈ క్రమంలో గత ఏడాది జులైలో రూ.2 లక్షలు చెల్లించగా బ్యాలెన్స్ వేయకుండా మోసం చేశాడు. ఏడాదిగా పలుమార్లు తన డబ్బు ఇవ్వాలని కోరినా పలుసాకులు చెబుతూ వచ్చాడు. నాయ్యం చేయండి... నా భర్త సత్యానందం ఏడాది క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. నాకు ఇద్దరు కుమారులు. నాకు ఎకరం పొలం, ఇల్లు ఉంది. నా భర్త చనిపోయిన అనంతరం ఆస్తులను నా పేరుతో మారుస్తున్నాని నమ్మించి ఆస్తులను నా పెద్దకుమారుడు పేరుతో రాయించుకున్నాడు. ఇటీవల విషయం తెలిసి నిలదీయడంతో ఆస్తిలో వాటాలు ఇచ్చేది లేదని తేల్చిచెప్పాడు. విచారించి న్యాయం చేయాలి. - పి.రాణి, ఐతానగర్, తెనాలి -
గ్రీవెన్స్‌పై సూర్య ప్రతాపం
ఖమ్మం జెడ్పీసెంటర్ : భానుడి ప్రభావం గ్రీవెన్స్‌పై కూడా పడింది. ప్రతి సోమవారం కలెక్టర్ సమక్షంలో అధికారులందరితో నిర్వహించే గ్రీవెన్స్ భూ సమస్యలు, ఇళ్లు, సర్టిఫికెట్లు, పింఛన్లు, రేషన్ తదితర సమస్యలపై వందల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చేవి. గత నాలుగు రోజులుగా ఎండతీవ్రత అధికం కావడంతో జిల్లా నలుమూలల నుంచి వచ్చే ఫిర్యాదుదారుల సంఖ్య తగ్గింది. సోమవార జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఇలంబరితి ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదుదారులు తక్కువ సంఖ్యలో వచ్చారు. ఎండతీవ్రతకు గంట వ్యవధిలోనే తిరుగుముఖం పట్టారు. హాలులో కూర్చున్న అధికారులు ఎండ అధికంగా ఉండడంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. తొలుత కలెక్టర్ ఇలంబరితి అదనపు జేసీ బాబూరావుతో కలిసి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలనుంచి వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిస్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మంచినీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని ఆర్‌డబ్లుఎస్ అధికారులను ఆదే శించారు. కోర్టు కేసులకుసంబందించిన విషయాలపై అధికారులు ప్రత్యేకదృష్టి సారించాలన్నారు. గ్రీవెన్స్‌లో వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని ఇలా ఉన్నాయి. * గత కొన్నేళ్లుగా పింఛన్ పొందుతున్నానని, 2015 మార్చి నుంచి పింఛ న్ నిలుపుదల చేశారని, తిరిగి పింఛన్ పునరుద్దరించాలని ముదిగొండ మం డలం యడవల్లి గ్రామానికి చెందిన పుష్పమ్మ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. * తన కుమార్తె 5 వ తరగతి చ దువుతుందని, తనకు చదివించే ఆర్థికస్థోమతలేదని, సాంఘిక సంక్షేమ హాస్టల్ లో సీటు ఇప్పించాలని పెనుబల్లి మం డలానికి చెందిన బి.కృష్ణ కోరాడు. * తాను తల్లాడ ఆంధ్రాబ్యాంక్‌లో పంట రుణం పొందగా, రుణమాఫీ జాబితాలో పేరువచ్చిందని, రీ షెడ్యూల్ కోసం వెళ్లగా రుణమాఫీ కాలేదని అధికారులు చెబుతున్నారని, తనకు న్యాయం చేయాలని తల్లాడ మండలం మిట్టపల్లికి చెందిన కాపా నాగరత్నం పేర్కొంది. * బీసీలకు కల్యాణ లక్ష్మి పథకాన్ని వర్తింపజేయాలని కుల సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చారు. -
అర్జీకీ ఆధార్
గ్రీవెన్స్‌డే (ప్రజావిజ్ఞప్తుల దినం)లో మార్పులు చోటుచేసుకుంటున్నారుు. పరిష్కారం పేరుతో ఈ ప్రక్రియను పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునికీకరిస్తున్నారు. ప్రజలు సమర్పించే అర్జీలను ఇకపై రాష్ట్ర స్థారుులో మానిటరింగ్ చేయనున్నారు. సమస్యల పరిష్కారానికి రాష్ట్ర స్థారుులో ఆడిట్ విభాగం ఇప్పటికే ఏర్పాటరుుంది. అర్జీలు సమర్పించే ప్రజలతో ఆడిట్ అధికారులు నేరుగా మాట్లాడనున్నారు. వచ్చే వారం నుంచి ఈ మార్పులు అమలులోకి రానున్నారుు. ఇకపై గ్రీవెన్స్‌సెల్‌లో అర్జీ సమర్పించే వారు తమ ఆధార్ నంబర్‌ను కూడా అందులో జతపరచాల్సి ఉంటుంది. ఓ వ్యక్తి ఒక పథకం ద్వారా రెండు సార్లు లబ్ధిపొందే అవకాశం కూడా ఇకపై ఉండదు. నెల్లూరు(రెవెన్యూ): జిల్లాలోని 46 మండల రెవెన్యూ కార్యాలయూలు, ఐదు ఆర్డీఓ ఆఫీసులతో పాటు నెల్లూరులోని కలెక్టరేట్లో ప్రతి సోమవారం గ్రీవెన్స్‌డే నిర్వహిస్తున్నారు. ప్రజలు తాము ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను అర్జీల రూపంలో అధికారుల దృష్టికి తెస్తుంటారు. గతంలో మండల రెవెన్యూ కార్యాలయూల్లో సమర్పించే అర్జీలు జిల్లా అధికారులకు చేరాలంటే వారం నుంచి 10 రోజులు పట్టేది. ఈ క్రమంలో సమస్యల పరిష్కారంలో తీవ్ర తాత్సారం జరిగేది. కొన్ని అర్జీలు బుట్టదాఖలయ్యేవి. ఈ క్రమంలో ఐదేళ్ల క్రితం పిటిషన్ మానిటరింగ్ సిస్టమ్(పీఎంఎస్) అమలులోకి తెచ్చారు. అప్పటి నుంచి ప్రజలు సమర్పించిన అర్జీలు గంటల వ్యవధిలో సంబంధిత శాఖల అధికారులకు చేరేవి. కలెక్టర్‌గా ఎన్.శ్రీకాంత్ పని చేసిన సమయంలో గ్రీవెన్స్‌డే నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పరిష్కారం పేరుతో ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించి సమస్యల పరిష్కారానికి చర్యలను మరింత వేగవంతం చేశారు. అది రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నారుు. ప్రతి అర్జీని రాష్ట్ర స్థారుు అధికారులు మానిటరింగ్ చేయనున్నారు. అందులో భాగంగా రాష్ట్రస్థారుులో ఓ కాల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ప్రతి అర్జీ ఆ కాల్ సెంటర్‌కు చేరుతుంది. అక్కడి నుంచి సంబంధిత శాఖ అధికారులకు పంపుతారు. అధికారులు ఆ సమస్యను నిర్ణీత కాలంలో పరిష్కరించి కాల్‌సెంటర్‌కు వివరాలు సమర్పిస్తారు. ఆడిట్ అధికారులు అర్జీ సమర్పించిన వ్యక్తికి స్వయంగా ఫోన్ చేసి సమస్య పరిష్కారంపై అభిప్రాయం తెలుసుకుంటారు. సమస్య పూర్తిస్థారుులో పరిష్కారమైందని అర్జీదారుడు తృప్తి చెందితేనే ఆన్లైన్ నుంచి ఆ అర్జీని తొలగిస్తారు. నూతన విధానం అమలులో భాగంగా ఇకపై ప్రజలు అర్జీతో పాటు ఆధార్, ఫోన్ నంబర్లను సమర్పించాల్సి ఉంటుంది. మరోవైపు ఒకే పథకంతో పలుమార్లు లబ్ధిపొందే వారికి కూడా చెక్ పడనుంది. గతంలో కొందరు నివేశన స్థలాలు, పక్కా గృహాలు తదితర ప్రయోజనాలను పలుమార్లు పొందిన సందర్భాలున్నారుు. ఇకపై ప్రతి లబ్ధిదారుడి వివరాలను ఆన్లైన్లో పెట్టనుండడంతో ఒక పథకంలో రెండో సారి ప్రయోజనం పొందే అవకాశం ఉండదు. ఒకవేళ ఎవరైనా రె ండోసారి దరఖాస్తు సమర్పించినా తిరస్కరించేలా సాఫ్ట్వేర్ రూపొందించారు. ఈ నూతన విధానంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా అధికారులు చర్యలు చేపడుతున్నారు. అరుుతే గతంలో సమర్పించిన వేలాది అర్జీల పరిష్కారం విషయం మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. సమస్యలకు త్వరితగతిన పరిష్కారం: పరిష్కారం సిస్టమ్‌ను మీకోసం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నారు. ప్రజలు వినతిపత్రంపై ఆధార్, ఫోన్ నంబర్లను తప్పనిసరిగా నమోదు చేయూల్సి ఉంటుంది. ఈ విధానం ద్వారా సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తాం. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న అర్జీల పరిష్కారంపై కూడా దృష్టి పెడతాం. -ఎం.జానకి, కలెక్టర్ -
వేళా‘పాలన’ లేదు
సాక్షి, ఖమ్మం: ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది సమయ పాలన పాటించడం లేదు. ఉదయం 10.30 గంటలకే విధులకు హాజరు కావాల్సి ఉండగా గంటల తరబడి ఆలస్యంగా వస్తున్నా పట్టించుకునే వారే లేరు. కార్యాలయాల బాస్‌లే ఆలస్యంగా వస్తుండడంతో సిబ్బంది వారినే అనుసరిస్తున్నారు. కొంతమంది ఉద్యోగులు ఖమ్మం, వరంగల్ నుంచి జిల్లాలోని భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు, సత్తుపల్లితో పాటు సుదూర ప్రాంతాలకు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. తరచూ విధులకు ఆలస్యంగా వెళ్తుండటంతో కార్యాలయాల వద్ద ప్రజలకు ఎదురుచూపులు తప్పడం లేదు. ప్రభుత్వ ఉద్యోగుల సమయ పాలనపై సోమవారం జిల్లా వ్యాప్తంగా చేసిన పరిశీలనలో జాడ్యం బయటపడింది. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను భుజానకెత్తుకుంది. వీటి సర్వేలు, క్షేత్రస్థాయి పరిశీలనలో జిల్లా కేంద్రంతో పాటు మండల స్థాయిలో కొంత మంది అధికారులు బిజీగా ఉంటున్నారు. వీరిని మినహాయిస్తే సమయానికి కార్యాలయానికి వచ్చి ప్రభుత్వ పనులు చెక్కబెట్టడం, ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన మిగతా అధికారులు, సిబ్బంది మాత్రం ఏంచక్కా విధులకు డుమ్మా కొడుతున్నారు. లేదంటే ఇష్టం వచ్చినప్పుడు విధులకు హాజరవుతున్నారు. ఉన్నతాధికారులకు సంక్షేమ పథకాల పర్యవేక్షణ బాధ్యతలు ఉండటంతో ఇలా సమయ పాలన పాటించని అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో జిల్లాస్థాయి గ్రీవెన్స్‌తో పాటు మండలాల తహశీల్దార్ కార్యాలయాల్లో పలు శాఖల అధికారులతో గ్రీవెన్స్ నిర్వహించాలి. కానీ తహశీల్దార్లు ఈ కార్యక్రమానికి వస్తే ప్రజల వినతులు స్వీకరించడానికి సంబంధిత శాఖల అధికారులు మాత్రం ప్రభుత్వ పథకాల క్షేత్ర స్థాయి పరిశీలన అంటూ డుమ్మా కొడుతుండటం గమనార్హం. భద్రాచలం ఏజెన్సీలో మాత్రం ఈ పరిస్థితి దారుణంగా ఉంది. అధికారులు, సిబ్బంది ఎప్పుడు వస్తారో..? ఎప్పుడు వెళ్తారో ఉన్నతాధికారులకు కూడా సమాచారం ఉండట్లేదు. సేవలు విస్మరించి..అటెండెన్స్ కోసం.. ప్రభుత్వ సేవలను ప్రజల దరిచేర్చకుండా కొంతమంది అధికారులు, సిబ్బంది కేవలం అటెండెన్స్ కోసమే ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తున్నారు. ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాలకు ఖమ్మం, వరంగల్ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు విధులకు హాజరవుతున్నారు. ఎవరైనా ప్రజాప్రతినిధులు, ప్రజలు ప్రశ్నిస్తే మాత్రం క్షేత్రస్థాయి పర్యటనలో ఉన్నామంటూ దాటవేస్తున్నారు. ఎన్నెస్పీ ఖమ్మం మానిటరింగ్ డివిజన్ కార్యాలయంలో రెండు జిల్లాల పరిధిలో వందలాది మంది వర్క్ ఇన్స్పెక్టర్లు, లష్కర్లు పని చేస్తునాం్నరు. అయితే ఉన్నతాధికారులు మాత్రం వరంగల్ నుంచి రాకపోకలు సాగిస్తుండటంతో వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే లష్కర్లు, వర్క్ఇన్స్పెక్టర్లు.. తమ బాస్‌ల కోసం పడిగాపులు కాస్తున్నారు. మధిర తహశీల్దార్ కార్యాలయానికి సకాలంలో వచ్చినప్పటికీ సిబ్బంది మాత్రం సకాలంలో హాజరుకాలేదు. పాల్వంచ ఎంపీడీఓ కార్యాలయంలో ఉదయం 11 గంటలైనా సిబ్బంది విధులకు హాజరు కాలేదు. ఇల్లెందు తహశీల్దార్, ఎంపీడీఓ కార్యాలయంలోని అధికారులు, సిబ్బంది ఉదయం 11 గంటల తర్వాత నింపాదిగా ఆఫీస్‌కు వచ్చారు. ఇక్కడ ఉద్యోగులు ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచ, మహబూబాబాద్ దూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఖమ్మం నగర పాలక సంస్థలోనూ అధికారులు, సిబ్బంది ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 10 గంటలకు అన్ని రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్, శానిటేషన్ విభాగాల అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా కౌన్సెల్ హాలులో హాజరు కావాలని, తర్వాతనే వారి విభాగాలకు వెళ్లి విధులు నిర్వహించాలని స్వయంగా కలెక్టర్ ఆదేశించినా..పెడచెవినే పెడుతున్నారు. అధికారులు, సిబ్బంది తరచూ ఫీల్డ్‌లో ఉన్నామంటూ కార్యాలయానికి మాత్రం ఆలస్యంగా వస్తున్నారు. పేరుకే గ్రీవెన్స్ మండల స్థాయిలో నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌లో ప్రజల అర్జీలు నెలలు గడుస్తున్నా పరిష్కారానికి నోచుకోవడం లేదు. అయితే ఈ కార్యక్రమానికీ పలు శాఖల అధికారులు డుమ్మా కొడుతున్నారు. సమస్యలపై వినతులు అందించడానికి వచ్చే ప్రజలు సంబంధిత అధికారులు లేకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. ఆ సమస్యకు ఇతర అధికారులు కూడా సమాధానం చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలస్థాయి అధికారులు క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్లినా ఆశాఖ నుంచి ఎవరినైనా గ్రీవెన్స్‌కు పంపాలి. కానీ ఈ విధానం అమలు కాకపోవడంతో ప్రజల వినతులకు మోక్షం కలగడం లేదు. మళ్లీ వారం రోజుల తర్వాత ఇదే సమస్యపై ప్రజలు గ్రీవెన్స్ బాట పట్టాల్సి వస్తోంది. ఏజెన్సీలో అస్తవ్యస్త పాలన ఏజెన్సీలో ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా మారింది. ఇక్కడి ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చి గంటల తరబడి ఎదురుచూసినా ప్రజలకు సమాధానం చెప్పేవారుండరు. అసలు అధికారి, సిబ్బంది ఎటు వెళ్లారోనన్న సమాచారం కూడా ఉండదు. అశ్వారావుపేట తహశీల్దార్ ఆలస్యంగా రావడంతో గ్రీవెన్స్‌డే సందర్భంగా వినతులు సమర్పించేందుకు వచ్చిన వారికి పడిగాపులు తప్పలేదు. భద్రాచలం ఎంపీడీఓ కార్యాలయంలో కింది స్థాయి అధికారులు ఆలస్యంగా రావడంతో దూర ప్రాంతాల నుంచి పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన వృద్ధులు.. అధికారుల కోసం ఎదురుచూశారు. వాజేడు తహశీల్దార్ కార్యాలయానికి మధ్యాహం 12 గంటల వరకు అధికారులు, సిబ్బంది ఎవరూ విధులకు హాజరుకాలేదు. చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో కూడా కిందస్థాయి సిబ్బంది కుర్చీలు ఖాళీగా కనిపిస్తూ దర్శనమిచ్చాయి. వివిధ గూడేల నుంచి గిరిజనులు ఎన్నో ఆశలతో ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చినా వారి సమస్యలు వినేవారు లేకపోవడంతో చేసేదేమీ లేక నిరుత్సాహంతో వెనుదిరుగుతున్నారు. -
సగం పింఛన్ దరఖాస్తులే!
ఆదిలాబాద్ అర్బన్ : జిల్లా అంతటా పింఛన్ల సమస్యే. ఇందుకోసం రోజూ ధర్నాలు, రాస్తారోకోలు. చివరకు గ్రీవెన్స్‌కు సెల్‌కు కూడా వీటిపైనే అధిక మొత్తంలో అర్జీలు అందాయి. సోమవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో నిర్వహించిన ప్రజాఫిర్యాదుల విభాగంలో కలెక్టర్ ఎం.జగన్మోహన్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అందులో సగానికి పైగా పింఛన్లకు సంబంధించిన దరఖాస్తులే రావడం చర్చనీయాంశమైంది. ఆసరా పథకంలో అర్హులకు పింఛన్ రాకపోవడం, కొత్త వారికి మంజూరు కావడం, భర్త ఉన్నా భార్యకు వితంతువు పింఛన్ రావడం, 80 ఏళ్లు ఉన్నా వృద్ధులకు మంజూరు కాకపోవడం, ఇన్ని రోజులు పింఛన్ ఇచ్చి ఇప్పుడు నిలిపివేయడం వంటి తదితర కారణాలతో దరఖాస్తులు రావడంతో అధికారులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం.జగన్మోహన్ మాట్లాడుతూ పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిష్కరిస్తామని, ప్రతీ అర్జీని పరిశీలించి అర్హులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు జేసీ ఎస్ఎస్.రాజు, జిల్లా పరిషత్ సీఈవో అనితాగ్రేస్, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి, డీఈవో సత్యనారాయణరెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
గ్రీవెన్స్... నో క్లియరెన్స్ !
పెనుమూరు మండలం ఉగ్రాణంపల్లెకు చెందిన సూరా జయలక్ష్మమ్మకు ఇందిరమ్మ ఇల్లు ఉంది. అదే గ్రామానికి చెందిన మరోవ్యక్తి దౌర్జన్యంగా ఆక్రమించాడు. బతిమలాడినా గృహాన్ని అప్పగించలేదు. తహశీల్దార్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఏడేళ్లుగా ఆమె కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉంది. సమస్య పరిష్కారం కానే లేదు. బంగారుపాళెం మండలం దామరాకలవజ్జు గ్రామానికి చెందిన పుష్పరాజు ఇంటివద్ద దారిస్థలాన్ని అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి ఆక్రమించాడు. ఇంట్లోకి వెళ్లాలన్నా ఇబ్బందే. తహశీల్దారు స్పందించకపోవడంతో కోర్టుకెళ్లాడు. పుష్పరాజుకు అనుకూలంగానే తీర్పువచ్చింది. కానీ అధికారులు పట్టించుకోలేదు. ఐదేళ్లుగా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నాడు. సాక్షి, చిత్తూరు: మండల కేంద్రాల్లో అధికారులు సమస్యలు పరిష్కరించడంలేదు. కొన్నిచోట్ల గ్రీవెన్స్డేలు మొక్కుబడిగా నిర్వహిస్తుండగా మరికొన్ని చోట్ల అస్స లు ఆ వైపే కన్నెత్తి చూడడంలేదు. దీంతో సమస్యలు పేరుకుపోతున్నాయి. ప్రజలు కలెక్టర్ కార్యాలయ తలుపు తడుతున్నారు. ఇక్కడి అధికారులు అర్జీలు తీసుకుని తిరిగి వారిని మండల కేంద్రాలకే పంపుతున్నారు. ఇలా ఏళ్లకొద్దీ తిరుగుతున్నా సమస్యలు పరిష్కరం కావడంలేదు. జిల్లా వ్యాప్తంగా గత ఆగస్టు నుంచి ఇప్పటివరకు వివిధ సమస్యలపై 1,557 వినతి పత్రాలు అందగా అందులో కేవలం 451 సమస్యలను మాత్రమే అధికారులు పరిష్కరించారంటే గ్రీవెన్స్‌డే ఎంతమొక్కుబడిగా సాగుతోందో స్పష్టమవుతోంది. చంద్రగిరి నియోజకవర్గంలోని తిరుపతి రూరల్, చిన్నగొట్టిగల్లు, రామచంద్రాపురం మండలాల్లో సోమవారం గ్రీవెన్స్ డేకు అధికారులు ఢుమ్మా కొట్టారు. రూరల్ తహశీల్దార్ హాజరుకాలేదు. చిన్నగొట్టిగల్లులో తహశీల్దార్, ఎంపీడీవోతో పాటు మిగిలిన అధికారులు గ్రీవెన్స్‌డేకి హాజరుకాలేదు. రామచంద్రాపురం మండలంలోనూ ఇదే పరిస్థితి. పెన్షన్లు, భూ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జీడీనెల్లూరు నియోజకవర్గంలో పాలసమద్రంలో తహశీల్దార్ మినహా ఏ అధికారీ గ్రీవెన్స్‌డేకు రాలేదు. పెనుమూరులో ఎంపీడీవో, వెలుగు, ఏవో మినహా మిగిలిన అధికారులు రాలేదు. వెదురుకుప్పంలో తహశీల్దార్ మినహా ఎవరూ హాజరుకాలేదు. జీడీనెల్లూరులో ఎంపీడీవో మాలతీకుమారి తప్ప మిగిలిన వారు హాజరుకాలేదు. పలమనేరు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో రెవెన్యూ అధికారులు మినహా మిగిలిన శాఖల వారు హాజరుకాలేదు. పలమనేరులో తహశీల్దార్ కొంతసేపు మాత్రమే ఉండి డీలర్ల సమావేశానికి వెళ్లిపోయారు. తరువాత హైదరాబాద్‌కు వెళ్లారు. 60 మంది వరకు ప్రజలు వినతిపత్రాలను కార్యాలయంలో ఇచ్చి వెళ్లారు పీలేరు నియోజకవర్గంలో గ్రీవెన్స్‌డేకు ముఖ్యమైన అధికారులెవ్వరూ రాలేదు. కేవలం పంచాయతీ కా ర్యదర్శులు వచ్చి అర్జీలను తీసుకుని వెళ్లిపోయారు. పూతలపట్టు నియోజకవర్గంలోని పూతలపట్టులో తహశీల్దార్ మాత్రమే గ్రీవెన్స్‌డేకు వచ్చారు. మిగిలిన చోట్ల తహశీల్దార్, ఎంపీడీవోలు కూడా హాజరుకాలేదు. ప్రజలు తొలగించిన పెన్షన్ సమస్యలపై, భూ సమస్యలపై వినతిపత్రాలు తెచ్చి అధికారులు లేకపోవడంతో వెనుతిరిగి వెళ్లిపోయారు తంబళ్లపల్లె నియోజకవర్గంలో నామమాత్రం గ్రీవెన్స్ డే జరిగింది. బి.కొత్తకోటలో గ్రీవెన్స్‌డే జరగలేదు. చాలా చోట్ల ఇదే పరిస్థితి. పింఛన్లు, ఇంటి స్థలాలు కావాలంటూ అర్జీదారులు వచ్చి తిరిగి వెళ్లిపోయారు. మదనపల్లె నియోజకవర్గంలోని మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్‌డే మొక్కుబడిగా సాగింది. ఉదయం కార్యాలయానికి వచ్చిన సబ్ కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ క్యాంపునకు వెళ్లిపోయారు. తిరిగి 12.10 గంటలకు కార్యాలయానికి వచ్చారు. వైద్యాధికారులు, పంచాయతీరాజ్ , అగ్రికల్చర్ , ఆర్డబ్ల్యూఎస్ శాఖకు చెందిన నలుగురు అధికారులు మాత్రమే వచ్చారు. మండలస్థాయి అధికారులు రాలేదు. 200 మంది ప్రజలు అర్జీలిచ్చేందుకు వచ్చారు. సత్యవేడు నియోజకవర్గంలో సత్యవేడు, నారాయణవనం, బుచ్చినాయుడుకండ్రిగల్లో 11 గంటలవరకు తహశీల్దార్, ఎంపీడీవోలు గ్రీవెన్స్‌డే కార్యక్రమానికి రాలేదు. మిగిలిన మండలాల్లో సైతం ఇదే పరిస్థితి. పుంగనూరు, నగరి నియోజకవర్గాల్లోనూ ఇదేపరిస్థితి. కుప్పం నియోజకవర్గంలో గ్రీవెన్స్‌డే మొక్కుబడిగా జరిగింది. కుప్పంలో అధికారులు గ్రీవెన్స్‌డే నిర్వహించకుండా ఉపాధి హామీ సమావేశం నిర్వహించారు. శాంతిపురంలో ఎంపీడీవో మాత్రమే హాజరయ్యారు. చిత్తూరు కలెక్టరేట్లో కలెక్టర్ లేరు. హైదరాబాద్‌కు వెళ్లారు. జాయింట్ కలెక్టర్ గ్రీవెన్స్‌డే నిర్వహించారు. -
బాధితులం.. న్యాయం చేయండి
గ్రీవెన్స్‌లో ఎస్పీకి వేడుకోలు గుంటూరుక్రైం జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ జరిగింది. రూరల్ అదనపు ఎస్పీ గోళ్ళ రామాంజనేయులు బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 40కు పైగా ఫిర్యాదులను ఏఎస్పీలు రామాం జనేయులు, టి.శోభామంజరి పరిశీలించారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఫిర్యాదు వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. బాధితుల సమస్యలు కొన్ని వారి మాటల్లోనే.. దాడి చేశారు.. అప్పుల బాధతో నా కుమారుడు పాపారావు గత ఏడాది నవంబరు 16న ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనివాసరావు, మరియకుమార్ల వేధింపుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సూసైడ్ నోటు రాశాడు. కేసు విచారణ కొనసాగుతోంది. గ్రామంలోని రాట్నాల హనుమంతరావు, రాజేశ్వరరావు, శేషు, జగన్నాథం, మరికొందరు కలిసి ఈనెల 8వ తేదీన మా ఇంటికి వచ్చి మా కుమారుడు రూ.5 లక్షలు బాకి ఉన్నాడని, ఇల్లు ఖాళీ చేసి వెళ్లాలని, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ బయట పడేశారు. ఇదేమిటని ప్రశ్నించడంతో మాపై దాడికి పాల్పడి తిరిగి మాపైనే అక్రమ కేసు బనాయించారు. వారి నుంచి రక్షణ కల్పించి న్యాయం జరిగేలా చూడాలి. - వెంకాయమ్మ, దుర్గమ్మ, అత్తా కోడళ్ళు, కొత్తపాలెం, యడ్లపాడు మండలం భూమి కాజేశారు.. మా తాతపేరుతో కొల్లిపర మండలం మున్నంగిలో 59 సెంట్ల భూమి ఉంది. అదే గ్రామానికి చెందిన బి.వెంకటరెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, మరికొందరు నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకాలు సృష్టించి ఆ భూమిని విక్రయించారు. ఇదేమిటనిప్రశ్నించిన దుర్భాషలాడుతూ ఈనెల 9న దాడికి యత్నించారు. వారి నుంచి రక్షణ కల్పించి న్యాయం జరిగేలా చూడాలి. - సుగ్గుల రవీంద్రబాబు, గంగానమ్మపేట, తెనాలి కుమార్తె ఆచూకీ తెలపండి.. నా కుమార్తె చేబ్రోలులోని ఓ కళాశాలలో ఎంబీఏ చదువుతోంది. ఈనెల 5న కళాశాలకు వెళుతున్నానని చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. బంధువులు, స్నేహితులు వద్ద విచారించినా ప్రయోజనంలేకపోయింది. మా గ్రామంలోని కొందరు వ్యక్తులపై అనుమానంగా ఉంది. వారిని విచారించి నాకుమార్తెను తిరిగి అప్పగించేలా చర్యలు తీసుకోవాలి. - మద్దెల మంజుల, మారీసుపేట, తెనాలి -
‘పరిష్కారంతో సమస్యలకు చెల్లు
నెల్లూరు(పొగతోట): ప్రతి వారం కలెక్టరేట్లో నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమానికి వందలాదిగా అర్జీలు వస్తుంటాయి. సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో పలువురు కాళ్లరిగేలా అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. అయి నా సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోగా అర్జీలను బుట్టదాఖలు చేసేవారు. తేలికగా పరిష్కరించదగిన సమస్యకు సంబంధించిన అర్జీ కూడా సం బంధిత శాఖకు చేరేందుకు వారం రోజు లు పట్టేది. ప్రజల వద్ద తాము సమర్పించిన అర్జీకి సంబంధించిన ఎలాంటి ఆధారం కూడా ఉండేది కాదు. సమస్య పరిష్కారం కోసం నెలల తరబడి ఎదురుచూసేవారు. ఇదంతా ఆరు నెలల కిందట పరిస్థితి. ఈ తిప్పలన్నింటికి ‘పరిష్కా రం’ ద్వారా కలెక్టర్ శ్రీకాంత్ చెక్‌పెట్టే ప్రయత్నం చేశారు. ఆరు నెలల పాటు శ్రమించి కాల్‌సెంటర్ ఇన్చార్జి యడ్ల నాగేశ్వరరావు సహకారంతో ఓ సాఫ్ట్‌వేర్‌ను ‘పరిష్కారం’ పేరుతో రూపొందిం చారు. గతంలో కలెక్టర్‌గా పనిచేసిన కె.రాంగోపాల్ అమలు చేసిన పిటిషన్ మానిటరింగ్ సిస్టమ్(పీఎంఎస్)కు విభిన్నంగా దీనిని తీర్చిదిద్దారు. జూన్ నుంచి అమల్లోకి వచ్చిన పరిష్కారంలో భాగంగా కలెక్టరేట్లో 14 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. నివేశన స్థలాలు, పింఛన్, రుణాలు, భూమి, రెవెన్యూ తదితర సమస్యలకు సంబంధించి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటయ్యాయి. అర్జీతో పాటు ఫోన్ నంబ ర్, రేషన్, ఆధార్‌కార్డుల జెరాక్స్‌లు సమర్పించారు. వినతిపత్రం స్వీకరించి న వెంటనే ఆన్లైన్లో నమోదు చేసి రసీదు ఇస్తారు. సమస్య పరిష్కారానికి ఏ అధికారిని సంప్రదించాలో దానిలో పేర్కొంటారు. అర్జీదారుని ఫోన్ నంబ ర్ను కూడా ఆన్లైన్లో నమోదు చేసుకుంటారు. సమ స్య పరిష్కారం ఎంత వరకు వచ్చిందనే విషయాన్ని అర్జీదారుడు ఆన్లైన్లో పరిశీలించుకోవచ్చు. ఇదంతా ప్రత్యేక సిస్టమ్ ద్వారా కలెక్టర్ లాగిన్‌కు వెళుతుంది. సంబంధిత అధికారి సమస్యను పరిష్కరించిన తర్వాత వివరాలను కలెక్టర్ లాగిన్‌కు పంపుతారు. ఆ వివరాలను కలెక్టర్ పరిశీలించిన తర్వాత, సమస్య పరిష్కారమైందని భావిస్తే ఆన్లైన్లో నుంచి సంబంధిత అర్జీ వివరాలు తొలగిస్తారు. లేనిపక్షంలో సంబంధిత అధికారుల పెండింగ్ జాబితాలోనే ఉంటుంది. ఈ పరిష్కారం అమలుపై ప్రతివారం అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహిస్తున్నారు.సమస్యల పరిష్కారం కొంత వేగవంతమవుతోంది. కలెక్టర్ ప్రత్యేక చొరవపై జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం ఎదుట డెమో ‘పరిష్కారం’ అమలు తీరును కలెక్టర్ శ్రీకాంత్ మంగళవారం హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబు ఎదుట ప్రదర్శించారు. నిధుల ఖర్చు తదితర వివరాలను వివరించారు. ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ప్రజల వినతికి జవాబుదారీతనం: ఎన్.శ్రీకాంత్, కలెక్టర్ ‘పరిష్కారం’తో ప్రజల వినతికి జవాబుదారీతనం ఉంటుంది. ప్రతి వినతి ఆన్లైన్లో నమోదు చేస్తాం. సమస్య పరిష్కారం ఏ స్థాయిలో ఉందో ఆన్లైన్లో పరిశీలించుకోవచ్చు. కలెక్టర్ లాగిన్‌కు వచ్చిన వినతి పరిష్కరించేంత వరకు తొలగించం. సమస్యకు పూర్తి పరిష్కారం లభించిన తర్వాతే ఆన్లైన్లో నుంచి తొలగిస్తాం. -
టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు..
* గ్రీవెన్స్‌లో రూరల్ ఎస్పీకి బాధితురాలి ఫిర్యాదు * రక్షణ కల్పించాలని వినతి గుంటూరు క్రైం: ‘మా క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న కానిస్టేబుల్ భార్య ఉద్దేశపూర్వకంగా నిత్యం మమ్మల్ని దుర్భాషలాడుతోంది. ఇదేమిటని ప్రశ్నిస్తే మాపై అక్రమ కేసులు బనాయిస్తోంది. ఈ క్రమంలోనే రెండ్రోజుల క్రితం గుంటూరులోని నగరంపాలెం పోలీసుస్టేషన్లో మాపై అక్రమ కేసు బనాయించింది...’ అని జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలోని పోలీసు క్వార్టర్స్‌కు చెందిన పలువురు మహిళలు రూరల్ ఎస్పీ పి.హెచ్.రామకృష్ణను కలిసి రక్షణ కల్పించాలని వేడుకున్నారు. జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలోని రూరల్ ఎస్పీ కార్యాలయంలో సోమవారం పోలీసు గ్రీవెన్స్ జరిగింది. మొత్తం వందకు పైగా అందిన ఫిర్యాదులను ఎస్పీ రామకృష్ణ, అదనపు ఎస్పీ డి.కోటేశ్వరరావులు పరిశీలించారు. సంబంధిత ఫిర్యాదు వివరాలను ఆయా స్టేషన్లకు అధికారులకు ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. కొందరు బాధితుల సమస్యలు వారి మాటల్లోనే... కక్ష పెంచుకున్నారు.. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం చేశాను. అప్పటినుంచి నాపై కక్ష పెంచుకున్న టీడీపీకి చెందిన కార్యకర్తలు చల్లా రాజశేఖరరెడ్డి, ఓర్సు శ్రీను, గోవిందు, గరికపాటి శ్రీను, ఎస్.మంగమ్మలు నిత్యం పలు సాకులు చూపుతూ వేధింపులకు పాల్పడుతున్నారు. ఈనెల 24న ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఐదుగురు మా ఇంటిపై దాడి చేశారు. దుర్భాషలాడి కులం పేరుతో దూషించడంతోపాటు, కాలనీ వదిలి వెళ్లిపోవాలని హెచ్చరించారు. రెండ్రోజుల్లో ఇల్లు ఖాళీ చేయకపోతే హతమారుస్తామని హెచ్చరించారు. వారినుంచి ప్రాణ రక్షణ కల్పించి కులం పేరుతో దూషించినవారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. - జాజుల శాంత, ఆదర్శనగర్ కాలనీ,పిడుగురాళ్ళ మండలం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు.. మా గ్రామంలోని సి.హెచ్.మహేశ్వరరెడ్డి 21 సెంట్ల స్థలానికి సంబంధించి డాక్యుమెంట్లు నా వద్ద తాకట్టు పెట్టి రూ.10 లక్షలు ఈ ఏడాది జూన్‌లో తీసుకున్నాడు. అనంతరం అతని పేరుతో రిజిస్టర్ అయిన స్థలాన్ని నాకు తెలియకుండా రహస్యంగా రిజిస్టర్ రద్దు చేయించాడు. విషయం తెలియడంతో డబ్బు తిరిగి ఇవ్వాలని నిలదీశాను. డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పాడు. ఇదే విషయంపై పిడుగురాళ్ళ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా, వారు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. విచారించి న్యాయం చేయాలి. - భవిరిశెట్టి సూర్యనారాయణ, పిడుగురాళ్ల బెల్టుషాపు తొలగించాలి.. రేపల్లె, చెరుకుపల్లి రహదారిలో ఇటీవల నూతనంగా బార్ అండ్ రెస్టారెంట్ ప్రారంభించారు. దాని పక్కనే బెల్టుషాపును కూడా కొనసాగిస్తున్నారు. ఈ కారణంగా కళాశాలలు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థినులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో బెల్టుషాపులు కొనాగిస్తుండటంతో సమీప ప్రాంతంలో ఉన్న మేం తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నాం. - కె.సాయికుమారి, నగరం -
గుడ్డి దర్బార్
కర్నూలు(కలెక్టరేట్): రోజులు.. వారాలు.. నెలలు.. సంవత్సరాలు గడిచినా ప్రజాదర్బార్ వినతుల్లో అధిక శాతం పరిష్కారానికి నోచుకోని పరిస్థితి. జిల్లా కేంద్రంలో స్వయంగా కలెక్టర్ బాధితుల గోడు విని పరిష్కారానికి సిఫారసు చేస్తున్నా కింది స్థాయిలో నిర్లక్ష్యం వేళ్లూనుకుంది. ప్రతి వారం నిర్వహించే ఈ కార్యక్రమానికి వచ్చిన సమస్యలే 30 శాతం వరకు మళ్లీ వస్తుండటమే అందుకు నిదర్శనం. ఒక్క రెవెన్యూ శాఖకు చెందినవే 11,352 వినతులు పరిష్కారానికి నోచుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇందులో 8,716 వినతులను డిస్పోజల్ (పరిష్కారం) చేసినట్లు చూపుతున్నా.. 80 శాతం సమస్యలు ఎక్కడికక్కడే ఉండటం గమనార్హం. జిల్లా కలెక్టర్ తనకు వచ్చిన వినతులను పరిష్కారం నిమిత్తం ఎండార్స్మెంట్ రాసి సంబంధిత అధికారికి రెఫర్ చేస్తారు. ఆయన తన కింది స్థాయి అధికారికి పంపి డిస్పోజల్ చేసినట్లు చూపడం పరిపాటిగా మారింది. బాధితులు మాత్రం అదే వినతితో ప్రతి వారం ప్రజాదర్బార్ గడప తొక్కాల్సి వస్తోంది. ప్రజాదర్బార్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 33,507 వినతులు అందగా.. 30,007(90 శాతం) పరిష్కరించినట్లు అధికారులు కలెక్టర్‌కు నివేదించారు. పరిష్కారం ఈ స్థాయిలో ఉంటే ప్రజాదర్బార్‌కు బాధితులు పదేపదే ఎందుకు వస్తున్నారనేది వేయి డాలర్ల ప్రశ్న. జిల్లా పరిపాలనకు అధిపతి అయిన కలెక్టర్‌కు నేరుగా వినతులు అందిస్తున్నా సమస్య పరిష్కారానికి నోచుకోకపోవడం వల్ల ప్రజాదర్బార్‌పై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోంది. ఆదోని, ప్యాపిలి, చాగలమర్రి, ఆత్మకూరు, సంజామల, ఆలూరు ప్రాంతాల నుంచి కర్నూలుకు వచ్చి కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వాలంటే బాధితులకు కనీసం రూ.300 ఖర్చు అవుతుంది. ప్రతి వారం ఇలాంటి వారు వందల్లో ఉంటున్నారు. వ్యయ ప్రయాసలకోర్చి సుదూర ప్రాంతాల నుంచి వచ్చి వినతులు ఇస్తున్నా అధికారులు ఎండార్స్‌మెంట్‌తో సరిపెడుతుండటం విమర్శలకు తావిస్తోంది. ఒక సమస్యతో బాధితుడు మళ్లీ వస్తే అందుకు కారణాలను కలెక్టర్, జేసీలు పరిశీలిస్తే లోపం ఎక్కడుందనే విషయం బయటపడుతుంది. ఈ విషయంపై దృష్టి సారించనంత వరకు బాధితులు ప్రజాదర్బార్ చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిందే. మండలాల్లో కనిపించని గ్రీవెన్స్ ప్రతి సోమవారం మండల స్థాయిలో మండల పరిషత్ కార్యాలయంలో విధిగా ప్రజాదర్బార్ నిర్వహించాల్సి ఉంది. ఇప్పటివరకు మండల పరిషత్ అధ్యక్షులు లేనందున స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాంది. మండలస్థాయి గ్రీవెన్స్‌కు విధిగా స్పెషల్ ఆఫీసర్లు, మండల స్థాయి అధికారులు పాల్గొనాలని జిల్లా ఉన్నతాధికారులు ఆదేశించారు. అయితే మండల స్థాయిలో గ్రీవెన్స్ తూతూమంత్రంగా సాగుతోంది. సగం మండలాల్లో ఆ ఊసే కరువైంది. సోమవారం దాదాపు 30 మండలాల్లో ప్రజాదర్బార్ నిర్వహించకపోవడం అధికారుల చిత్తశుద్ధికి నిదర్శనం. -
ఇక ఈ-గ్రీవెన్స్
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రజా సమస్యల పరిష్కారం.. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులైన నిరుపేదలకు అందేవిధంగా కలెక్టర్ అహ్మద్‌బాబు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల విభాగంలో తీసుకునే అర్జీలకు పరిష్కారం చూపడానికి మార్పులు తీసుకొచ్చారు. ఆరు నెలలు శ్రమించి గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్(జీఎంఎస్)ను రూపొందించారు. ఈ పద్ధతిని జనవరి 1 నుంచి అంటే బుధవారం నుంచి అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా కలెక్టరేట్లో శాఖలవారీగా 12 కౌంటర్లు ఏర్పాటు చేసి అర్జీలు స్వీకరించనున్నారు. ఈ ఫిర్యాదులను వెబ్సైట్లో పొందుపరుస్తారు. 30 రోజుల్లో సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారు. మండల స్థాయిలోనూ ఇదే విధమైన సిస్టమ్‌ను అమలు చేయనున్నారు. ఇంతకాలం పరిష్కారానికి నోచుకోని ప్రజావాణి దరఖాస్తులు ఇప్పుడు వెబ్‌సైట్‌తో పరిష్కారమవుతాయని కలెక్టర్ భావిస్తున్నారు. నూతన విధానం ఇలా.. జీఎంఎస్‌పై కలెక్టర్ ప్రత్యేక దృష్టిసారించారు. అర్జీదారు నేరుగా కలెక్టరేట్‌లోగాని, మండల కేంద్రంలోగాని వివరాలు నమోదు చేసుకోవాలి. పేరు, చిరునామా, ఏ సమస్య, రేషన్ కార్డు, ఆధార్ నంబరు, ఫోన్ నంబర్‌ను తప్పని సరిగ్గా ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని సమస్యలకు రేషన్, ఆధార్, ఇతర వాటిని స్కాన్‌చేసి అప్లోడ్ చేస్తారు. ఈ వివరాలను కంప్యూటర్లో నమోదు చేస్తారు. నమోదు చేసినవెంటనే సంబంధిత అధికారికి, అర్జీదారునికి ఫోన్ ద్వారా సమాచారం వెళ్తుంది. దీని కోసం ఒక ఎస్ఎంఎస్కు 13 పైసల చొప్పున(వెయ్యి ఎస్ఎంఎస్లకు రూ.130) ఖర్చు చేస్తున్నారు. చెప్పిన వివరాలు దరఖాస్తు రూపంలో వచ్చే కాపీని అర్జీదారుడికి అందజేస్తారు. సరైన సమయంలో సంబంధిత అధికారి సమస్యను పరిష్కరించని యెడల, ఆర్డీవోకు, ఆయన స్పందించకపోతే జేసీకి, జేసీ స్పందించకపోతే కలెక్టర్ వద్దకు సమస్య వెళ్లే విధంగా రూపొందించారు. ఈ పద్ధతిని కలెక్టర్ మానిటరింగ్ చేస్తున్నారు. అమలుకు ఆటంకాలు గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్(జీఎంఎస్)ను బుధవారం నుంచి అమలుకానుంది. మొదటగా కలెక్టరేట్, ఐటీడీఏ, సబ్ కలెక్టర్, ఆర్డీవో కార్యాలయాలవారీగా అమలు చేయాలని అధికారులు భావించారు. అనంతరం మున్సిపల్, మండలాల్లో అమలు చేయనున్నారు. జిల్లాలోని ప్రభుత్వ శాఖలు, సెక్షన్లవారీగా వివరాలు, సబ్జెక్టు, సబ్‌సబ్జెక్టు, కిందిస్థాయి నుంచి పైస్థాయి అధికారి వరకు పేరు, హోదా, సెల్ నంబరు కంప్యూటర్లో పొందుపర్చాలి. ఆయా శాఖల అధికారులు ఈ వివరాలను జీఎంఎస్‌లో అప్లోడ్ చేసే ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఈ వివరాలను కంప్యూటర్లో అప్లోడ్ చేస్తేనే సమస్య పరిష్కరించే సదరు అధికారికి గ్రీవెన్స్‌కు వచ్చిన సమస్య సమాచారం వెళ్తుంది. ప్రధానంగా సుమరు 85 ప్రభుత్వ శాఖల వివరాలను నమోదు చేయల్సి ఉంది. ప్రస్తుతం మాస్టర్ ఎంట్రీ, సీట్ ఎంట్రీ, ఎంప్లాయి డాటా, సెక్షన్ల వారీగా సబ్జెక్టు వివరాలు కంప్యూటర్లో పొందుపరుస్తున్నారు. -
ప్రజలను తిప్పించుకోవద్దు
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్:గ్రీవెన్స్‌లో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, వారిని కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవద్దని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్, జిల్లా రెవెనూ అధికారి శివశ్రీనివాస్తో కలిసి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దని, మండల స్థాయిలోని సమస్యలను అక్కడే పరిష్కరించేలా చొరవ చూపాలని అన్నారు. సోమవారం గ్రీవెన్స్‌లో వచ్చిన కొని ఫిర్యాదుల వివరాలిలా ఉన్నాయి. రఘునాధపాలెం మండలం వీవెంకటాయపాలెంలో 2010 నుంచి ఇప్పటి వరకు 650 ఇందిరమ్మ గృహాలు మంజూరయ్యాయని, వాటిల్లో వివిధ వర్గాల లబ్ధిదారులకు తెలియకుండా కొంత మంది ఒక్కో ఇంటిపై నాలుగు బిల్లులు డ్రా చేశారని, ఈ వ్యవహారంలో హౌసింగ్ అధికారుల పాత్ర కూ డా ఉందని, అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆ గ్రామ సర్పంచ్ హేమలత, ఉపసర్పంచ్ శంకర్లు ఫిర్యాదు చేశారు. పాల్వంచలోని బసవతారక కాలనీలో సర్వే నంబర్ 817లో ఉన్న ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. బూర్గంపాడు మండలంలోని 2011 -12 వరకు విద్యా వలంటీర్లుగా పని చేశామని, ఇప్పటి వరకు వేతనాలు ఇవ్వలేదని షౌకత్ అలీ, సరోజా, భాగ్యలక్ష్మిలు ఫిర్యాదు చేశారు. తన కుమారుడు బాణోత్ రాములుకు కన్ను లేదని, అతనికి సంవత్సర కాలంగా పింఛన్ ఇవ్వడం లేదని, పింఛన్ ఇప్చించాలని పెనుబల్లి మండలం బ్రహ్మలకుంటకు చెందిన రాములు తండ్రి ఫిర్యాదు చేశారు. తమ గ్రామానికి చెందిన గోరేపాటి తిరుపతమ్మ గ్రామదీపికగా, ఆశ కార్యకర్తగా కొనసాగుతోందని, ఏడు సంత్సరాల వయసున్న విద్యార్థికి తప్పుడు సర్టిఫికెట్లు తయారు చేసి అభయహస్తం పథకం కింద స్కాలర్షిప్ కాజేసిందని తల్లాడ మండలం ముద్దునూరుకు చెందిన నాగేశ్వరరావు ఫిర్యాదు చేశారు. తన మేనల్లుడు రజాలీపాషా వికలాంగుడ(చెవిటి)ని, అతను 2012 డీఎస్పీలో స్కూల్ అసిస్టెంట్‌గా సెలక్టయ్యాడని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉద్యోగం ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష ్యంగా వ్యవహరిస్తున్నారని ఇల్లెందుకు చెందిన గౌస్‌మోహినుద్దీన్ ఫిర్యాదు చేశారు.