గ్రీవెన్స్‌డే (ప్రజావిజ్ఞప్తుల దినం)లో మార్పులు చోటుచేసుకుంటున్నారుు. పరిష్కారం పేరుతో ఈ ప్రక్రియను పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునికీకరిస్తున్నారు. ప్రజలు సమర్పించే అర్జీలను ఇకపై రాష్ట్ర స్థారుులో మానిటరింగ్ చేయనున్నారు. సమస్యల పరిష్కారానికి రాష్ట్ర స్థారుులో ఆడిట్ విభాగం ఇప్పటికే ఏర్పాటరుుంది.
అర్జీలు సమర్పించే ప్రజలతో ఆడిట్ అధికారులు నేరుగా మాట్లాడనున్నారు. వచ్చే వారం నుంచి ఈ మార్పులు అమలులోకి రానున్నారుు. ఇకపై గ్రీవెన్స్‌సెల్‌లో అర్జీ సమర్పించే వారు తమ ఆధార్ నంబర్‌ను కూడా అందులో జతపరచాల్సి ఉంటుంది. ఓ వ్యక్తి ఒక పథకం ద్వారా రెండు సార్లు లబ్ధిపొందే అవకాశం కూడా ఇకపై ఉండదు.
నెల్లూరు(రెవెన్యూ): జిల్లాలోని 46 మండల రెవెన్యూ కార్యాలయూలు, ఐదు ఆర్డీఓ ఆఫీసులతో పాటు నెల్లూరులోని కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం గ్రీవెన్స్‌డే నిర్వహిస్తున్నారు. ప్రజలు తాము ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను అర్జీల రూపంలో అధికారుల దృష్టికి తెస్తుంటారు. గతంలో మండల రెవెన్యూ కార్యాలయూల్లో సమర్పించే అర్జీలు జిల్లా అధికారులకు చేరాలంటే వారం నుంచి 10 రోజులు పట్టేది. ఈ క్రమంలో సమస్యల పరిష్కారంలో తీవ్ర తాత్సారం జరిగేది. కొన్ని అర్జీలు బుట్టదాఖలయ్యేవి. ఈ క్రమంలో ఐదేళ్ల క్రితం పిటిషన్ మానిటరింగ్ సిస్టమ్(పీఎంఎస్) అమలులోకి తెచ్చారు.
అప్పటి నుంచి ప్రజలు సమర్పించిన అర్జీలు గంటల వ్యవధిలో సంబంధిత శాఖల అధికారులకు చేరేవి. కలెక్టర్‌గా ఎన్.శ్రీకాంత్ పని చేసిన సమయంలో గ్రీవెన్స్‌డే నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పరిష్కారం పేరుతో ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందించి సమస్యల పరిష్కారానికి చర్యలను మరింత వేగవంతం చేశారు. అది రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నారుు.
ప్రతి అర్జీని రాష్ట్ర స్థారుు అధికారులు మానిటరింగ్ చేయనున్నారు. అందులో భాగంగా రాష్ట్రస్థారుులో ఓ కాల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ప్రతి అర్జీ ఆ కాల్ సెంటర్‌కు చేరుతుంది. అక్కడి నుంచి సంబంధిత శాఖ అధికారులకు పంపుతారు. అధికారులు ఆ సమస్యను నిర్ణీత కాలంలో పరిష్కరించి కాల్‌సెంటర్‌కు వివరాలు సమర్పిస్తారు.
ఆడిట్ అధికారులు అర్జీ సమర్పించిన వ్యక్తికి స్వయంగా ఫోన్ చేసి సమస్య పరిష్కారంపై అభిప్రాయం తెలుసుకుంటారు. సమస్య పూర్తిస్థారుులో పరిష్కారమైందని అర్జీదారుడు తృప్తి చెందితేనే ఆన్‌లైన్ నుంచి ఆ అర్జీని తొలగిస్తారు. నూతన విధానం అమలులో భాగంగా ఇకపై ప్రజలు అర్జీతో పాటు ఆధార్, ఫోన్ నంబర్లను సమర్పించాల్సి ఉంటుంది. మరోవైపు ఒకే పథకంతో పలుమార్లు లబ్ధిపొందే వారికి కూడా చెక్ పడనుంది. గతంలో కొందరు నివేశన స్థలాలు, పక్కా గృహాలు తదితర ప్రయోజనాలను పలుమార్లు పొందిన సందర్భాలున్నారుు.
ఇకపై ప్రతి లబ్ధిదారుడి వివరాలను ఆన్‌లైన్‌లో పెట్టనుండడంతో ఒక పథకంలో రెండో సారి ప్రయోజనం పొందే అవకాశం ఉండదు. ఒకవేళ ఎవరైనా రె ండోసారి దరఖాస్తు సమర్పించినా తిరస్కరించేలా సాఫ్ట్‌వేర్ రూపొందించారు. ఈ నూతన విధానంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా అధికారులు చర్యలు చేపడుతున్నారు. అరుుతే గతంలో సమర్పించిన వేలాది అర్జీల పరిష్కారం విషయం మాత్రం ప్రశ్నార్థకంగా మారింది.
సమస్యలకు త్వరితగతిన పరిష్కారం:
పరిష్కారం సిస్టమ్‌ను మీకోసం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నారు. ప్రజలు వినతిపత్రంపై ఆధార్, ఫోన్ నంబర్లను తప్పనిసరిగా నమోదు చేయూల్సి ఉంటుంది. ఈ విధానం ద్వారా సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తాం. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న అర్జీల పరిష్కారంపై కూడా దృష్టి పెడతాం.
-ఎం.జానకి, కలెక్టర్
అర్జీకీ ఆధార్
Published Mon, Jan 19 2015 2:24 AM | Last Updated on Sat, Sep 2 2017 7:52 PM
Advertisement