ఉత్కంఠ‌పోరులో ఢిల్లీ విజ‌యం.. | IPL 2025: LSG vs DC live updates and highlights | Sakshi
Sakshi News home page

IPL 2025: ఉత్కంఠ‌పోరులో ఢిల్లీ విజ‌యం..

Published Mon, Mar 24 2025 7:10 PM | Last Updated on Tue, Mar 25 2025 12:03 AM

IPL 2025: LSG vs DC live updates and highlights

IPL 2025 LSG vs DC live updates and highlights: 

వారెవ్వా అశుతోష్‌.. ఉత్కంఠ‌పోరులో ఢిల్లీ విజ‌యం
వైజాగ్ వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఒక్క వికెట్ తేడాతో ఢిల్లీ క్యాపిట‌ల్స్ సంచ‌ల‌న విజ‌యం సాధించింది. చివ‌రి వర‌కు ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన ఈ మ్యాచ్‌లో అశుతోష్ శ‌ర్మ ఢిల్లీని గెలిపించాడు.  ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా వ‌చ్చిన అశుతోష్.. త‌న విరోచిత పోరాటంతో ఢిల్లీని ఓట‌మి నుంచి గ‌ట్టెక్కించాడు.  ఫ‌లితంగా 210 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ఢిల్లీ.. 9 వికెట్లు కోల్పోయి 19.3 ఓవ‌ర్ల‌లో అందుకుంది. ఢిల్లీ బ్యాట‌ర్ల‌లో అశుతోష్‌తో పాటు విప్ర‌జ్ నిగ‌మ్‌( 15 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌ల‌తో 39), స్ట‌బ్స్‌(34) కీల‌క ఇన్నింగ్స్‌లు ఆడారు.

ర‌స‌వ‌త్త‌రంగా మ్యాచ్‌..
ఢిల్లీ క్యాపిటల్స్‌, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ మ‌ధ్య మ్యాచ్ ర‌స‌వత్త‌రంగా సాగుతోంది. ఢిల్లీ విజ‌యానికి 12 బంతుల్లో 22 ప‌రుగులు కావాలి. క్రీజులో అశుతోష్ శ‌ర్మ‌(48) ప‌రుగుల‌తో ఉన్నారు.

దూకుడుగా ఆడుతున్న విప్ర‌జ్‌
విప్రజ్ నిగమ్(11 బంతుల్లో 30) దూకుడుగా ఆడుతున్నాడు. విప్ర‌జ్ త‌న బ్యాటింగ్‌తో ఢిల్లీ క్యాపిట‌ల్స్ శిబిరంలో ఆశ‌లు రెకెత్తించాడు. ఢిల్లీ విజ‌యానికి 30 బంతుల్లో 62 ప‌రుగులు కావాలి.

ఢిల్లీ ఆరో వికెట్ డౌన్‌
ట్రిస్టన్ స్టబ్స్ రూపంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఆరో వికెట్ కోల్పోయింది. 34 ప‌రుగులు చేసిన స్ట‌బ్స్‌.. సిద్దార్ధ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ‌య్యాడు. ఢిల్లీ విజ‌యానికి 42 బంతుల్లో 94 ప‌రుగులు కావాలి. క్రీజులో అశుతోష్ శ‌ర్మ‌(17), విప్రాజ్ నిగమ్‌(2) ఉన్నారు.

క‌ష్టాల్లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌..
210 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌డ‌బ‌డుతోంది. ఢిల్లీ కేవ‌లం 66 ప‌రుగుల‌కే 5 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. అక్ష‌ర్ ప‌టేల్‌(22) నాలుగో వికెట్ వెనుదిర‌గగా.. ఫాఫ్ డుప్లెసిస్‌(29) ఐదో వికెట్‌గా పెవిలియ‌న్‌కు చేరాడు. 

4 ఓవర్లకు ఢిల్లీ స్కోర్‌: 32/3
4 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఢిల్లీ 3 వికెట్ల న‌ష్టానికి 32 ప‌రుగులు చేసింది. క్రీజులో ఫాప్ డుప్లెసిస్‌(14), అక్ష‌ర్ ప‌టేల్‌(13) ప‌రుగుల‌తో ఉన్నారు.

ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు బిగ్ షాక్‌.. తొలి ఓవ‌ర్‌లో రెండు వికెట్లు
210 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు భారీ షాక్ త‌గిలింది. శార్థూల్ ఠాకూర్ వేసిన తొలి ఒవ‌ర్‌లో  వ‌రుస‌గా జాక్ ఫ్రెజ‌ర్ మెక్‌గ‌ర్క్(1), అభిషేక్ పోరెల్‌(0) ఔట‌య్యాడు.

మార్ష్‌, పూర‌న్ ఊచ‌కోత‌.. ఢిల్లీ ముందు భారీ టార్గెట్‌
వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ బ్యాట‌ర్లు అద‌ర‌గొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ల‌క్నో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 209 ప‌రుగులు చేసింది. ల‌క్నో బ్యాట‌ర్ల‌లో మిచెల్ మార్ష్‌( 36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌ల‌తో 72), నికోల‌స్ పూర‌న్‌( 30 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌ల‌తో 75 ప‌రుగులు) హాఫ్ సెంచ‌రీల‌తో మెరిశారు. ఢిల్లీ బౌల‌ర్ల‌లో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు, కుల్దీప్ యాద‌వ్ రెండు వికెట్లు సాధించ‌గా.. విప్రాజ్ నిగ‌మ్‌, ముఖేష్ కుమార్ త‌లా వికెట్ సాధించారు.

18 ఓవర్లకు ఢిల్లీ స్కోర్‌: 188/6
ఢిల్లీ క్యాపిట‌ల్స్ వ‌రుస క్ర‌మంలో వికెట్లు కోల్పోయింది. 18 ఓవ‌ర్లు ముగిసే స‌రికి 6 వికెట్ల న‌ష్టానికి 188 ప‌రుగులు చేసింది. క్రీజులో డేవిడ్ మిల్ల‌ర్‌(12), షెబాజ్ ఆహ్మ‌ద్‌(4) ఉన్నారు.

మిచెల్ మార్ష్ ఔట్‌.. 
ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ మిచెల్ మార్ష్ రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. 72 ప‌రుగులు చేసిన మార్ష్‌.. ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. క్రీజులోకి రిషబ్‌ పంత్‌ వచ్చాడు. 14 ఓవర్లకు లక్నో స్కోర్‌: 161/2. క్రీజులో నికోలస్‌ పూరన్‌(70), రిషబ్‌ పంత్‌(0) పరుగులతో ఉన్నారు.
భారీ స్కోర్‌ దిశగా లక్నో..
11 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్‌ నష్టానికి 125 పరుగులు చేసింది. క్రీజులో మిచెల్‌ మార్ష్‌(65), నికోలస్‌ పూరన్‌(41) పరుగులతో ఉన్నారు.

మార్ష్ హాఫ్ సెంచ‌రీ..
ల‌క్నో స్టార్ ఓపెన‌ర్ మిచెల్ మార్ష్ ఆర్ధ‌శ‌త‌కం సాధించాడు. మార్ష్ 21 బంతుల్లో త‌న హాఫ్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. క్రీజులోకి వ‌చ్చిన నికోల‌స్ పూర‌న్ సైతం దూకుడుగా ఆడుతున్నాడు. 8 ఓవర్లకు లక్నో స్కోర్‌: 98/1. ప్ర‌స్తుతం క్రీజులో మిచెల్ మార్ష్‌(20), నికోల‌స్ పూర‌న్(31) ఉన్నారు.

తొలి వికెట్ కోల్పోయిన లక్నో..
ఐడైన్ మార్‌క్రమ్ రూపంలో లక్నో సూపర్ జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన మార్‌క్రమ్‌.. విప్రజ్ నిగమ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 5 ఓవర్లకు లక్నో  స్కోర్‌: 50/1

దూకుడుగా ఆడుతున్న లక్నో..
టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన లక్నో సూపర్ జెయింట్స్ వికెట్ నష్టపోకుండా 33 పరుగులు చేసింది. ఓపెనర్లు ఐడైన్ మార్‌క్రమ్‌(13), మిచెల్ మార్ష్‌(20) దూకుడుగా ఆడుతున్నారు.

తుది జ‌ట్లు
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్(వికెట్ కీప‌ర్‌), సమీర్ రిజ్వి, అక్షర్ పటేల్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, రిషబ్ పంత్(కెప్టెన్‌), డేవిడ్ మిల్లర్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ రాఠీ, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement