petitions
-
బెనిఫిట్ షో అవసరమేముందో చెప్పండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సినిమా టికెట్ల ధరల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వడంలో సర్కార్ తీరుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రముఖ చిత్రాలకు బెని ఫిట్ షోలకు, ఇష్టం వచ్చిన సమయాల్లో ప్రదర్శనకు ఎందుకు అనుమతి ఇస్తున్నారని, వాటి అవసరం ఏముందని ప్రశ్నించింది. ప్రజల భద్రత గురించి కనీసం అలోచించాల్సిన అవస రం లేదా అని నిలదీసింది. 16 ఏళ్లలోపు పిల్ల లను అర్ధరాత్రి, తెల్లవారుజాము ప్రదర్శనలకు అను మతించకూడదని సూచించింది. ఇలాంటి అంశాల్లో ఒక్క చిత్రంపై ఇలా పిటిషన్ దాఖలు చేయడం కాకుండా.. ప్రజా ప్రయో జన వ్యాజ్యంగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది. దిల్ రాజు నిర్మాతగా శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ ధరల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 10న మల్టీప్లెక్స్ థియేటర్లలో ఒక్కో టికెట్‌పై అదనంగా రూ. 150, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికె ట్‌పై అదనంగా రూ. 100 చొప్పున పెంచుకునేందుకు వెసులు బాటు కల్పించింది. జనవరి 11 నుంచి రోజూ 5 షోల నిర్వహణకు అనుమతిస్తు న్నట్లు పేర్కొన్నారు. 11 నుంచి 19 వరకూ మల్టీ ప్లెక్సులలో టికెట్‌పై అదనంగా రూ. 100, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికె ట్‌పై అదనంగా రూ. 50 రూపాయల చొప్పున ధరలు పెంచు కోడానికి సర్కార్ అనుమతిచ్చింది. అర్ధరాత్రి బెనిఫిట్ షోలకు మాత్రం సర్కార్ నిరాకరించింది. ఇదిలా ఉండగా, ఈనెల 8న ఇచ్చిన టికెట్ ధరల పెంపు ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైద రాబాద్‌కు చెందిన కూరగాయల వ్యాపారి గొర్ల భరత్‌రాజ్ లంచ్ మోషన్ రూపంలో హైకోర్టులో పిటిషన్ దాఖ లు చేశారు. జనవరి 10న ఉదయం 4.30 గంటల నుంచి సిని మా ప్రదర్శనకు అనుమతివ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.పిల్‌గా విచారణ చేయాల్సిన అంశం...: ఈ పిటిషన్‌పై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి గురువారం విచారణ చేపట్టారు. టికెట్ ధరల పెంపు నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. గేమ్‌ఛేంజర్ సినిమా టికెట్ ధరల పెంపు ఉత్తర్వులను నిలుపుదల చేసే లా ఆదేశాలివ్వాలని కోరారు. ప్రభుత్వ నిర్ణయం సినిమా రెగ్యులేషన్స్ రూల్స్ 1970, సినిమాస్ లైసెన్సింగ్ షరతులకు విరుద్ధమని తెలిపారు. పుష్ప–2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి తర్వాత.. ఇకపై రాష్ట్రంలో బెనిఫిట్ షోలకు అనుమతి ఉండదని డిసెంబర్ 21న అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారన్నారు. కనీసం పక్షం రోజులైనా కాకముందే వేకువజామున 4 గంటలకే షో నిర్వహించుకునేలా అనుమతులు ఇచ్చారన్నారు. ప్రజలకు చెప్పేదొకటి.. చేసేదొకటి అన్న తీరుగా సర్కార్ వ్యవహారం ఉందని వెల్లడించారు. వాదనలు విన్న న్యాయ మూర్తి.. ఈ అంశంపై పిల్ వేస్తే మరింత అనుకూలంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. పిటిషనర్ న్యాయవాది కోర డంతో విచారణ నేటికి వాయిదా వేశారు. కాగా, తగినంత పార్కింగ్ లేకపోవడం, స్క్రీనింగ్‌ల మధ్య తక్కువ సమయం వంటి ఇబ్బందులపైనా న్యాయమూర్తి వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రజల తొక్కిసలాటకు దారితీస్తుందని పేర్కొన్నారు.హక్కులు హరించడమే..: హైకోర్టు‘సినిమా ప్రదర్శనకు సమయపాలన ఉండాలి. అర్ధరాత్రి, వేకువజామున అనుమతులు ఇవ్వడం మానవ హక్కుల ఉల్లంఘన లాంటిదే. ఇది ప్రజల నిద్రపోయే హక్కును హరించడమే అవుతుంది. ఇలా ఎప్పటికప్పుడు చిత్రాలకు వెళ్లే వాడి ఆరోగ్యం ఏమవుతుంది?’ ‘పిటిషనర్లు కూడా చిత్రం విడుదలకు ముందు పిటిషన్ వేసి ఇక తర్వాత పట్టించుకోవడం లేదు. వేళాపాళా లేని షోలకు 16 ఏళ్లలోపు చిన్నారులను కూడా రద్దీ ఉండే చిత్రాలకు తీసుకొస్తున్నారు.. సర్కార్ కూడా అనుమతిస్తోంది. ఇది సమంజసం కాదు. ప్రజలు బయటకు వెళ్లడానికి, లోనికి రావడానికి స్క్రీనింగ్‌ల మధ్య సమయం ఉండాలి’ -
ప్రార్థనా స్థలాలపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు
-
మేం చెప్పేదాకా సర్వేలపై ఉత్తర్వులు, తీర్పులు ఆపండి
న్యూఢిల్లీ: స్వాతంత్య్రం సిద్ధించిన నాటికి ఉన్న ప్రార్థనాస్థలాలను యథాతథ స్థితిలోనే కొనసాగించాలని నిర్దేశించే 1991నాటి చట్టంలోని సెక్షన్లను సవాల్‌చేస్తూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం గురువారం కీలకమైన సూచనలు చేసింది. ప్రార్థనాస్థలాల్లో సర్వేలపై వివిధ న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంగానీ, తీర్పులు చెప్పడంగానీ చేయొద్దని సుప్రీంకోర్టు సూచించింది. ఈ కేసులపై తమ తదుపరి ఉత్తర్వులు వచ్చేదాకా తమ ఆదేశాలే అమల్లో ఉంటాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ సంజయ్ కుమార్ల ధర్మాసనం స్పష్టంచేసింది. ప్రార్థనాస్థలాలు ముఖ్యంగా మసీదులు, దర్గాల వద్ద సర్వేలు చేపట్టడాన్ని సవాల్‌చేస్తూ, సమరి్థస్తూ కొత్తగా ఎలాంటి ఫిర్యాదులు, కేసులను తీసుకోవద్దని ధర్మాసనం దేశంలోని అన్ని కోర్టులకు సూచించింది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని జ్ఞానవాపి మసీదు, మథురలోని షాహీ ఈద్గా మసీదు, సంభాల్‌లోని షాహీ జామా మసీదు, ఢిల్లీలోని కుతుబ్ మినార్ దగ్గర్లోని ఖ్వాత్– ఉల్–ఇస్లామ్ మసీదు, మధ్యప్రదేశ్‌లోని కమల్ మౌలా మసీదు సహా 10 మసీదులు ఉన్న ప్రాంతాల్లో గతంలో హిందూ ఆలయాలు ఉండేవని, ఆయా స్థలాల్లో సర్వే చేపట్టి ఆ ప్రాంతాల వాస్తవిక మత విశిష్టతను తేల్చాలంటూ 18 కేసులు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. వీటిని విచారించిన సందర్భంగా గురువారం సుప్రీంకోర్టు పై విధంగా స్పందించింది. ప్రార్థనాస్థలాల(ప్రత్యేక అధికారాల)చట్టం, 1991లోని 2, 3, 4వ సెక్షన్ల చట్టబద్ధతను సవాల్‌చేస్తూ న్యాయవాది అశ్వినీ వైష్ణవ్ తదితరులు దాఖలుచేసిన ఆరు పిటిషన్లనూ ఈ స్పెషల్ బెంచ్ గురువారమే విచారించింది. 1947 ఆగస్ట్ 15నాటికి ఉన్న ప్రార్థనాస్థలాల యథాతథస్థితిని మార్చడానికి వీల్లేదంటూ 1991 చట్టంలో పలు సెక్షన్లు పొందుపరిచారు. ఈ సెక్షన్లు అయోధ్యలోని రామజన్మభూమి–బాబ్రీ మసీదు వివాదానికి వర్తించవంటూ గతంలో సుప్రీంకోర్టు ధర్మాసనం చరిత్రాత్మక తీర్పు చెప్పి ఆ స్థలాన్ని హిందూవర్గానికి కేటాయించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే వారణాసి, మథుర, సంభాల్ తదితర ప్రాంతాల్లో దశాబ్దాల నాటి మసీదులు, దర్గాలున్న స్థలాల వాస్తవిక మత లక్షణాన్ని తేల్చాలని కొత్తగా పిటిషన్లు పుట్టుకొచి్చన విషయం విదితమే. కేంద్రానికి 4 వారాల గడువు ‘‘ ఉత్తర్వులను నిలుపుదలచేస్తూ అన్ని కోర్టులను ఆదేశించడానికి ముందే సంబంధిత కేసుల్లో కక్షిదారుల వాదనలను సుప్రీంకోర్టు వినాలి’’ అని హిందువుల తరఫున హాజరైన సీనియర్ లాయర్ జే.సాయి దీపక్ కోరారు. దీనిపై సీజేఐ ‘‘ కింది కోర్టులు సుప్రీంకోర్టు కంటే పెద్దవైతే కాదుకదా. ఈ అంశంపై సుప్రీంకోర్టు విస్తృతస్థాయిలో పరిశీలిస్తున్నపుడు కింది కోర్టులకు ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం సహజమే. అయినా ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం స్పందన లేకుండా ముందుకు వెళ్లలేం. నాలుగు వారాల్లోపు కేంద్రం తన స్పందనను తెలియజేయాలి. కేంద్రం స్పందన తెలిపాక మరో నాలుగు వారాల్లోపు సంబంధిత కక్షిదారులు వారి స్పందననూ కోర్టుకు తెలియజేయాలి’’ అని సూచించారు. ఈ అంశానికి సంబంధించి 2022 సెపె్టంబర్లో దాఖలైన ప్రధాన పిటిషన్ విషయంలో కోర్టు కేంద్రానికి నోటీసులు పంపింది. 1991 చట్టాన్ని సవాల్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ జ్ఞానవాపి మసీదు మేనేజ్మెంట్ కమిటీ తదితర సంస్థలు ముస్లింల తరఫున కేసులు వేశాయి. 1991 చట్టాన్ని తప్పుబట్టి తద్వారా మసీదుల ప్రాచీన ఉనికిని ప్రశ్నార్థకం చేయాలని చూస్తున్నారని మసీదు కమిటీలు వాదిస్తున్నాయి. -
పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ హైకోర్టులో వాదనలు
-
మార్చండి.. మా కులాన్నీ చేర్చండి
సాక్షిప్రతినిధి, వరంగల్: ‘బీసీల్లోని ఏబీసీడీఈ వర్గాలను పునర్వర్గీకరణ చేయాలి. బీసీ కులాలను అవమాన పరిచేవారిని కట్టడి చేసేందుకు ‘బీసీ అట్రాసిటీ యాక్ట్’ను తీసుకు రావాలి. దూదేకుల కులం వారిని బీసీ–డీ నుంచి బీసీ–సీలోకి, సగర ఉప్పర కులçస్థులను బీసీ–డీ నుంచి బీసీ–ఏ లోకి, ముదిరాజ్‌లను బీసీ–డీ నుంచి బీసీ–ఏలోకి, ఒడ్డెర కులస్థులను బీసీ–ఏ నుంచి షెడ్యూల్ తెగ (ఎస్టీ)లోకి మార్చాలి’అని శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రాష్ట్ర బీసీ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ఆయా వర్గాల నుంచి వినతులు వెల్లు్లవెత్తాయి. స్థానిక సంస్థల్లో కల్పించాల్సిన రిజర్వేషన్ల దామాషాను ఖరారు చేసే అంశంపై బీసీ కమిషన్ ఆయా వర్గాలనుంచి అభిప్రా యాలను సేకరిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కులాలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని, ఇంతవరకు రాజకీయ ప్రాతినిధ్యంలేని కులాలకు అవకాశం ఇవ్వాలని, వీరముష్టి పదం తొలగించి ఆ కులం వారికి ‘వీరభద్ర’పదాన్ని వాడాలని కమిషన్‌కు విన్నవించుకు న్నారు. రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మిలు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, బీసీ కులసంఘాల నాయకుల నుంచి అభిప్రాయాలు సేకరించారు.ఇది బృహత్తర కార్యక్రమం: గోపిశెట్టి నిరంజన్తెలంగాణలో స్థానిక సంస్థల వారీగా రిజర్వేషన్ దామాషాను ఖరారు చేసేందుకు ప్రభుత్వం బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ అన్నారు. బహిరంగ విచారణలో మొత్తం 235 అభ్యర్థనలు కమిషన్‌కు అందాయని తెలిపారు. హనుమకొండలోని బాలికల హాస్టల్లో వసతులు సరిగా లేవని ఫిర్యాదు అందిందని ఆ సమస్యలకు పరిష్కారం చూపుతామని నిరంజన్ స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ అమలుపై హైకోర్టు ఏ నిర్ణయం తీసుకున్న గౌరవిస్తామన్నారు. కానీ, ఇప్పటివరకు హైకోర్టు తీసుకున్న నిర్ణయాలు, ఆదేశాలు తమకు అందలేదన్నారు. -
‘విద్యుత్’కమిషన్ దూకుడు!
సాక్షి, హైదరాబాద్: ప్రజలపై విద్యుత్ చార్జీల భారం మోపేలా రాష్ట్ర విద్యుత్ సంస్థలు దాఖలు చేసిన 9 వేర్వేరు పిటిషన్లపై రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) సోమవారం నుంచి వరుసగా ఐదు రోజుల పాటు బహిరంగ విచారణలు నిర్వహించనుంది. మండలి చైర్మన్ టి.శ్రీరంగారావు, సభ్యులు ఎండీ మనోహర్ రాజు, బండారు కృష్ణయ్యల ఐదేళ్ల పదవీకాలం ఈ నెల 29తో ముగియనుండగా, ఈలోపే ఆయా పిటిషన్లపై ఈఆర్సీ కీలక నిర్ణయాలను తీసుకోనుంది. నిర్దేశిత గడువుకి చాలా ఆలస్యంగా విద్యుత్ సంస్థలు పిటిషన్లు చేయడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. నిబంధనల ప్రకారం గతేడాది నవంబర్‌లోపే విద్యుత్ సంస్థలు పిటిషన్లు దాఖలు చేయాల్సి ఉండగా, గత నెలలో దాఖలు చేశాయి.ఒకేసారి పెద్ద సంఖ్యలో దాఖలైన పిటిషన్లను చదివి రాతపూర్వకంగా అభ్యంతరాలను సమర్పించడానికి సమయం సరిపోదని, గడువు పొడిగించాలని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫ్యాప్సీ)తో పాటు విద్యుత్ రంగ నిపుణులు ఎం.వేణుగోపాల్ రావు తదితరులు చేసిన విజ్ఞప్తులను ఈఆర్సీ తోసిపుచ్చింది. సోమవారం నుంచి ఈ నెల 25 వరకు వరుసగా ఐదు రోజుల పాటు హైదరాబాద్, నిజామాబాద్, సిరిసిల్లలో బహిరంగ విచారణలు నిర్వహించనుంది. ఆ తర్వాత 4 రోజుల పదవీకాలం మిగిలి ఉండగా కీలక ఉత్తర్వులు జారీ చేయనుంది. అయితే గడువులోగానే విద్యుత్ రంగ నిపుణులు, పారిశ్రామికవేత్తలు, రైతు సంఘాలు, సాధారణ వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున రాతపూర్వక అభ్యంతరాలు ఈఆర్సీకి అందాయి. కాగా ఈఆర్సీ తీసుకోనున్న కీలక నిర్ణయాలు ఇలా ఉన్నాయి.. జెన్కో ట్రూఅప్ చార్జీల భారం రూ.963 కోట్లు తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.963.18 కోట్ల ట్రూఅప్ చార్జీల పిటిషన్‌తో పాటు 2024–29 మధ్యకాలానికి సంబంధించిన మల్టీ ఇయర్ టారిఫ్ (ఎంవైటీ) పిటిషన్‌ను గత నెల 21న దాఖలు చేసింది. వీటిపై సోమవారం ఈఆర్సీ బహిరంగ విచారణ జరపనుంది. జీటీఎస్ కాలనీలోని విద్యుత్ నియంత్రణ్ భవన్లో ఉదయం 10.30 గంటలకు ఇది ప్రారంభం కానుంది. ఈఆర్సీ ఆమోదించిన విద్యుత్ ధరలు/చార్జీలతో పోల్చితే వాస్తవ ఆదాయంలో వ్యత్యాసాన్ని ట్రూఅప్ చార్జీల రూపంలో విద్యుత్ సంస్థలు సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది.ఒక వేళ ఆదాయ లోటు ఉంటే భర్తీ చేసుకోవడానికి ఎంత మేరకు ట్రూఅప్ చార్జీలను వసూలు చేయాలో ఈఆర్సీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. జెన్కో విద్యుత్ కేంద్రాల నుంచి రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు విద్యుత్ కొనుగోలు చేసి తమ వినియోగదారులకు సరఫరా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జెన్కో ప్రతిపాదించిన రూ.963.18 కోట్ల ట్రూఅప్ చార్జీలను డిస్కంల నుంచి వసూలు చేసుకోవడానికి జెన్కో అనుమతి కోరింది. విద్యుత్ చార్జీలను పెంచడం ద్వారా ఈ ట్రూప్ చార్జీల భారాన్ని డిస్కంలు విద్యుత్ వినియోగదారులపై మోపుతాయి. ఐదేళ్లలో రూ.16,346 కోట్ల ఆదాయ అవసరాలు తెలంగాణ విద్యుత్ సరఫరా సంస్థ (ట్రాన్స్‌కో) దాఖలు చేసిన 2024–29 మధ్యకాలానికి సంబంధించిన రెండు ఎంవైటీ పిటిషన్లపై మంగళవారం ఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించనుంది. వచ్చే ఐదేళ్లలో మొత్తం రూ.16,346.1 కోట్ల ఆదాయ అవసరాలున్నట్టు ట్రాన్స్‌కో అంచనా వేసింది. ఇక సిరిసిల్ల జిల్లాకు విద్యుత్ సరఫరా చేసే కోఆపరేటివ్ ఎలక్రి్టక్ సప్లై లిమిటెడ్ (సెస్) పరిధిలో రూ.5 కోట్ల విద్యుత్ చార్జీల పెంపునకు ప్రతిపాదిస్తూ దాఖలు చేసిన ఏఆర్ఆర్ 2024–25, 2024–29 ఎంవైటీ పటిషన్‌పై ఈ నెల 25న సిరిసిల్లలో విచారణ జరగనుంది. నవంబర్ 1 నుంచి పెరగనున్న చార్జీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25)లో రాష్ట్రంలో రూ.1,200 కోట్ల మేర విద్యుత్ చార్జీల పెంపునకు అనుమతి కోరుతూ దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు (టీజీఎస్పీడీసీఎల్/టీజీఎనీ్పడీసీఎల్) దాఖలు చేసిన రెండు వేర్వేరు ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్ఆర్) పిటిషన్లతో పాటు 2024–29 మధ్యకాలానికి సంబంధించిన మరో రెండు ఎంవైటీ పిటిషన్లపై బుధవారం హైదరాబాద్‌లో, గురువారం నిజామాబాద్‌లో ఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించనుంది. రాష్ట్రంలో హైటెన్షన్ (హెచ్‌టీ) కేటగిరీ విద్యుత్ చార్జీల పెంపు, లోటెన్షన్ (ఎల్టీ) కేటగిరీలో కూడా నెలకు 300 యూనిట్లకుపైగా వినియోగించే వారికి ఫిక్స్డ్ చార్జీ (డిమాండ్ చార్జీ)ల పెంపును డిస్కంలు ప్రతిపాదించాయి. హెచ్‌టీ కేటగిరీకి చార్జీల పెంపుతో రూ.700 కోట్లు, ఫిక్స్డ్ చార్జీల పెంపుతో రూ.100 కోట్లు కలిపి రూ.800 కోట్లు భారం పడనుంది. మరో రూ.400 కోట్లను ఎల్టీ వినియోగదారుల నుంచి ఫిక్స్డ్ చార్జీల పెంపు ద్వారా రాబట్టుకుంటామని డిస్కంలు ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. నవంబర్ 1 నుంచి చార్జీల పెంపు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. -
‘ఎలక్టోరల్ బాండ్’ పై పిటిషన్.. తిరస్కరించిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల (ఇబి) ఎలక్టోరల్ ఫైనాన్సింగ్‌పై న్యాయ పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు సిట్ ఏర్పాటు చేసేందుకు నిరాకరించింది. ఎలక్టోరల్ ఫైనాన్సింగ్ ద్వారా రాజకీయ పార్టీలు, పలు కార్పొరేట్ కంపెనీల మధ్య క్విడ్ ప్రోకో జరిగాయని ఆరోపిస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఇదే అంశంపై సిట్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశాయి.ఈ పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం..శుక్రవారం (ఆగస్ట్2న)విచారించింది. సిట్ ఏర్పాటుకు నిరాకరించింది. ఆర్టికల్ 32 ప్రకారం ఈ దశలో జోక్యం చేసుకోవడం కూడా తొందరపాటే అవుతుందని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. Supreme Court declines petitions seeking a probe by a Special Investigation Team (SIT) into the alleged instances of quid pro quo arrangements between corporates and political parties through Electoral Bonds donations.In February, the Supreme Court had struck down the Electoral… pic.twitter.com/0bnAC6TwIE— ANI (@ANI) August 2, 2024రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్లపై ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రాథమిక హక్కుల ఆర్టికల్ 19(1)(ఎ)ను అనుసరించి.. ఈ పథకం సమాచార హక్కును ఉల్లంఘిస్తుందని.. ఇది రాజ్యాంగ విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది. అలాగే.. నల్లధనాన్ని అరికట్టేందుకు సమాచార హక్కును ఉల్లంఘించడం సమంజసం కాదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ మేరకు ఎలక్టోరల్ బాండ్స్ చెల్లుబాటు కాదంటూ ఏకగ్రీవ తీర్పును రాజ్యాంగ ధర్మాసనం వెల్లడించింది. -
volunteers: మాకు న్యాయం చేయండి
సాక్షి, అమరావతి/మహారాణిపేట(విశాఖ): వలంటీర్లకు జూన్ నెల గౌరవ వేతన బకాయిలను వెంటనే చెల్లించడంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా వలంటీర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు వలంటీర్ల ప్రతినిధులు జిల్లా కలెకరేట్లతో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికల్లో వినతిపత్రాలు సమర్పించారు. ఆయా వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, వారి గౌరవ వేతనాన్ని రూ. 5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని ఎన్నికల ముందు చంద్రబాబు బహిరంగ సభలలో చెప్పడంతో పాటు మేనిఫెస్టోలో హామీ ఇచి్చన విషయం తెలిసిందే. అయితే, ప్రతి నెలా ఇచ్చే సామాజిక పింఛన్లను.. 2019 ఆగస్టులో వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటైనప్పటి నుంచి వారే క్షేత్రస్థాయిలో సమర్థంగా పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం మొదటిసారి ఇచి్చన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వలంటీర్లను దూరంగా పెట్టి, గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా నిర్వహించారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి మొదలయ్యే పింఛన్ల పంపిణీ కూడా వలంటీర్లతో సంబంధం లేకుండా సచివాలయాల ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా లక్షన్నర మంది వలంటీర్లు విధుల్లో కొనసాగుతుండగా, వారిలో దాదాపు 75 శాతం మందికి జూన్ నెల గౌరవ వేతనం ఇప్పటి వరకూ కూడా అందలేదని వలంటీర్ల సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.#APVolunteers ఉద్యోగాల భద్రత, పెండింగ్‌లో ఉన్న వేతనములు విడుదల చేయాలి. రాజీనామా చేసిన వారిని తిరిగి కొనసాగించాలి, మాకు న్యాయం చేయాలని... అందరూ వాలంటీర్లు *సోమవారం(జూలై 29) కర్నూలు కలెక్టరేట్ లో* జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించారు. #GVWV pic.twitter.com/NH5Jt9ASy0— 𝚅𝙾𝙻𝚄𝙽𝚃𝙴𝙴𝚁 𝙲𝙾𝙽𝙽𝙴𝙲𝚃𝙸𝙾𝙽 (@news_volunteer) July 29, 2024రూ. 10 వేలు వేతనం ఇవ్వాలి కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం నెలకు రూ. 10 వేల గౌరవ వేతనం ఇవ్వాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వలంటీర్లు సోమవారం విశాఖ కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆం«ధ్రప్రదేశ్ వలంటీర్లు సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జగదీష్, కార్యదర్శి సంపత్ మాట్లాడుతూ.. ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని తక్షణమే అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న వేతన బకాయిలు వెంటనే ఇవ్వాలని కోరారు.#APVolunteers ఉద్యోగాల భద్రత, పెండింగ్‌లో ఉన్న వేతనములు విడుదల చేయాలి. రాజీనామా చేసిన వారిని తిరిగి కొనసాగించాలి, మాకు న్యాయం చేయాలని.*సోమవారం(జూలై 29) విజయనగరం కలెక్టరేట్ లో* జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ గారికి మరియు MLA గారికి వినతిపత్రం సమర్పించారు. #GVWV pic.twitter.com/hmmBZ2bu1D— 𝚅𝙾𝙻𝚄𝙽𝚃𝙴𝙴𝚁 𝙲𝙾𝙽𝙽𝙴𝙲𝚃𝙸𝙾𝙽 (@news_volunteer) July 29, 2024 #APVolunteers ఉద్యోగాల భద్రత, పెండింగ్‌లో ఉన్న వేతనములు విడుదల చేయాలి. రాజీనామా చేసిన వారిని తిరిగి కొనసాగించాలి, మాకు న్యాయం చేయాలని... అందరూ వాలంటీర్లు సోమవారం(జూలై 29) గుంటూరు కలెక్టరేట్ లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించారు. #GVWV pic.twitter.com/AgWIHFBtaG— 𝚅𝙾𝙻𝚄𝙽𝚃𝙴𝙴𝚁 𝙲𝙾𝙽𝙽𝙴𝙲𝚃𝙸𝙾𝙽 (@news_volunteer) July 29, 2024 #APVolunteers ఉద్యోగాల భద్రత, పెండింగ్‌లో ఉన్న వేతనములు విడుదల చేయాలి. రాజీనామా చేసిన వారిని తిరిగి కొనసాగించాలి, మాకు న్యాయం చేయాలని.*సోమవారం(జూలై 29) విజయనగరం కలెక్టరేట్ లో* జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ గారికి మరియు MLA గారికి వినతిపత్రం సమర్పించారు. #GVWV pic.twitter.com/hmmBZ2bu1D— 𝚅𝙾𝙻𝚄𝙽𝚃𝙴𝙴𝚁 𝙲𝙾𝙽𝙽𝙴𝙲𝚃𝙸𝙾𝙽 (@news_volunteer) July 29, 2024VIDEO and Photo Credits: 𝚅𝙾𝙻𝚄𝙽𝚃𝙴𝙴𝚁 𝙲𝙾𝙽𝙽𝙴𝙲𝚃𝙸𝙾𝙽వలంటీర్ల వ్యవస్థను రద్దు చేయండి సాక్షి, అమరావతి: టీడీపీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన వైవీబీ రాజేంద్రప్రసాద్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ సోమవారం గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేసింది. చాంబర్ రాష్ట్ర కమిటీ సోమవారం విజయవాడలో సమావేశమై ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ,ఎంపీపీ, జిల్లా పరిషత్ చైర్మన్, కౌన్సిలర్, కార్పొరేటర్, చైర్మన్, మేయర్ల ఒక నెల గౌరవ వేతనాన్ని అమరావతి అభివృద్ధికి విరాళంగా ఇవ్వాలని తీర్మానించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్‌ను కలిసి తమ సంఘం 16 డిమాండ్ల వినతిపత్రం ఇచ్చి, చర్చించి ఆయా డిమాండ్లను పరిష్కరించ వలసిందిగా కోరాలని తీర్మానించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఏడాదిలో ఒకరోజు తిరుమల శ్రీవారి దర్శనానికి అవకాశం కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మరో తీర్మానం చేశారు. -
ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతా పిటీషన్లపై హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్: ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతా పిటీషన్లపై నేడు హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావుపై పిటిషన్ దాఖలయ్యాయి. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ పిటిషన్ దాఖల చేశారు.గత విచారణలో స్పీకర్‌కు ఆదేశాలిచ్చే అధికారం హైకోర్టుకు లేదన్న ఏజీ.. గతంలో ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఇదే విషయాన్ని చెప్పిందన్నారు. తలసాని శ్రీనివాస్‌యాదవ్ టీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు ఎర్రబెల్లి దాఖలు చేసిన పిటీషన్ పై తీర్పు ఇవ్వడానికి ఇదే కోర్టు నిరాకరించిందని ఏజీ గుర్తు చేశారు.చట్టసభ నుంచి సభ్యుడి సస్పెన్షన్ లేదా అనర్హత వేటు వంటి నిర్ణయాలు స్పీకర్ పరిధిలోకి వస్తాయన్న ఏజీ.. ఇందులో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోరాదన్నారు. నేడు మరోసారి పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరపనుంది. -
కడప కోర్టు ఉత్తర్వుల రద్దు కోరుతూ పిటిషన్లు
సాక్షి, అమరావతి: సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు పెండింగ్‌లో ఉన్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ నర్రెడ్డి సునీత, టీడీపీ నేత రవీంద్రనాథ్‌రెడ్డి (బీటెక్ రవి) హైకోర్టును ఆశ్రయించారు. కడప జిల్లా కోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ వారు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం గురించి బీటెక్ రవి తరఫు సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావించారు. అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. అత్యవసర విచారణ అవసరం లేదన్న ధర్మాసనం ఈ వ్యాజ్యంపై బుధవారం విచారణ జరుపుతామంది. ఈ వ్యాజ్యం విచారణ నుంచి తాము తప్పుకుంటామని ధర్మాసనం మౌఖికంగా తెలిపింది. ‘మా వాదన వినలేదు’ కడప జిల్లా కోర్టు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా, తమ వాదన వినకుండా ఏకపక్షంగా తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులిచ్చిందని బీటెక్ రవి, సునీత తమ వ్యాజ్యాల్లో పేర్కొన్నారు. బాధితులు సూట్ దాఖలు చేయాల్సి ఉండగా.. పార్టీ తరఫున దాఖలు చేశారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కడప జిల్లా కోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చి ఉండాల్సింది కాదన్నారు. ఆ ఉత్తర్వులు చెల్లుబాటు కావన్నారు. కడప కోర్టు తన పరిధి దాటి వ్యవహరించిందని పేర్కొన్నారు. మధ్యంతర ఉత్తర్వుల ద్వారా కడప కోర్టు తమ వాక్ స్వాతంత్య్రపు హక్కును నిరోధించిందని, ఇది సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమన్నారు. మధ్యంతర ఉత్తర్వుల పేరుతో జిల్లా కోర్టు తుది అభిప్రాయానికి వచ్చిందన్నారు. ఎన్నికల వేళ ప్రజాబాహుళ్యంలో ఉన్న వాస్తవాలను ప్రజలకు తెలియచేసే హక్కు తమకు ఉందన్నారు. -
Delhi High Court : జేమ్స్‌బాండ్ సీక్వెల్సా?
న్యూఢిల్లీ: కేజ్రీవాల్‌ను ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలంటూ పదేపదే పిటిషన్లు దాఖలవడంపై ఢిల్లీ హైకోర్టు అసహనం వ్యక్తంచేసింది. ఆప్ మాజీ ఎమ్మెల్యే సందీప్ కుమార్ వేసిన ఈ తరహా పిటిషన్‌పై ఆగ్రహం వెలిబుచ్చింది. ‘‘దీనిపై ఢిల్లీ లెఫ్ట్గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని గతంలోనే స్పష్టం చేసినా పదేపదే అవే పిటిషన్లు వేస్తున్నారు. ఇవేమీ జేమ్స్‌బాండ్ సినిమా సీక్వెల్స్ కావు. వ్యవస్థను వెక్కిరించేలా పిటిషన్లు వేస్తే ఊరుకోం. మీకు రూ.50,000 జరిమానా వేస్తాం’’ అని సందీప్‌ను హెచ్చరించింది. ఆయన తరఫున లాయర్ వాదించబోయినా, ‘‘రాజకీయ ప్రసంగాలు ఇవ్వాలనుకుంటే వీధి చివరికెళ్లి ఇచి్చ రండి. మీ క్లయింట్ నేత కాబట్టి రాజకీయాలు చేస్తారు. మేం రాజకీయాల్లో మునగదల్చుకోలేదు’’ అని స్పష్టం చేసింది. -
‘సీఏఏ’పై వందల పిటిషన్లు.. నేడు సుప్రీంకోర్టు విచారణ
న్యూఢిల్లీ: కేంద్రం ఇటీవల అమలులోకి తీసుకువచ్చిన సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్(సీఏఏ)పై స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం(మార్చ్ 19)న విచారించనుంది. సీఏఏపై స్టే కోరుతూ సుప్రీంలో ఇప్పటివరకు ఏకంగా 230 పిటిషన్లు ఫైల్ అయ్యాయి. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధీవాలా, జస్టిస్ మనోజ్‌మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించనుంది. సీఏఏ కింద పౌరసత్వం పొందలేకపోయిన ముస్లిం వలసవాదులపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని, ఈ కారణం ఆధారంగా స్టే ఇవ్వాలని కేరళకు చెందిన ఇండియన్ ముస్లిం లీగ్ పిటిషన్లో కోరింది. సీఏఏ సెక్షన్ 6బి కింద ఎవరికి పౌరసత్వాలివ్వకుండా స్టే ఇవ్వాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లే కాక పలు సంస్థలు, ఇతర వ్యక్తులు సీఏఏపై సుప్రీంకు వెళ్లారు. ఇదీ చదవండి.. బాండ్ల నంబర్లేవి -
రేపు ఏపీ స్పీకర్ ముందుకు అనర్హత పిటిషన్లు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ముందు సోమవారం హాజరు కావడంపై ఉత్కంఠ నెలకొంది. రేపు(సోమవారం) ముగ్గురు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు విచారణకు హాజరుకానున్నారు. అయితే గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరి ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నట్లు తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు స్పీకర్ ముందుకు వైస్సార్సీపీ రెబల్ ఎమ్మెల్యేలు హాజరై, వివరణ ఇవ్వనున్నారు. ఇక.. వైఎస్సార్సీపీ, టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు విచారణకు రావాలని స్పీకర్ కార్యాలయం నోటీసులు చేసిన విషయం తెలిసిందే. అనర్హత పిటిషన్లపై విచారణకు 29వ తేదీన స్పీకర్ కార్యాలయంలో హాజరు కావాలని సూచించింది. వైఎస్సార్సీపీ రెబల్ ఎమ్మెల్యేల్లో ఆనం రాంనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు. చదవండి: గంటా రాజీనామా ఆమోదం.. టీడీపీలో కొత్త టెన్షన్! -
‘వార్షిక కౌలు’ వ్యాజ్యానికి విచారణార్హత ఉంది
సాక్షి, అమరావతి: రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లించేలా సీఆర్డీఏను, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య, రాజధాని రైతు పరిరక్షణ సమితి దాఖలు చేసిన వ్యాజ్యానికి విచారణార్హత ఉందని హైకోర్టుస్పష్టం చేసింది. ఈ విషయంలో సీఆర్డీఏ లేవనెత్తిన అభ్యంతరాలను హైకోర్టు తోసిపుచ్చింది. అయితే పిటిషన్లు దాఖలు చేసిన సంఘాల్లో ఉన్న సభ్యులందరి వివరాలను కోర్టు ముందుంచాలని పిటిషనర్లను ఆదేశించింది. అంతేకాక ఆ సంఘాల్లోని ప్రతి సభ్యుడి పేరు మీద కోర్టు ఫీజు చెల్లించాలని కూడా ఆదేశాలిచ్చింది. ఇందుకోసం పది రోజుల గడువు ఇచ్చింది. తదుపరి విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వార్షిక కౌలు చెల్లించేలా ఆదేశాలివ్వాలంటూ రైతుల తరఫున అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య, రాజధాని రైతు పరిరక్షణ సమితి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ వ్యాజ్యం విచారణార్హతపై సీఆర్డీఏ అభ్యంతరం లేవనెత్తింది. రైతుల తరఫున సంఘాల పేరుతో పిటిషన్ దాఖలు చేయడానికి వీల్లేదని సీఆర్డీఏ తరఫు న్యాయవాది కాసా జగన్మోహన్రెడ్డి వాదనలు వినిపించారు. రైతులే నేరుగా పిటిషన్ దాఖలు చేసుకోవాలన్నారు. విచారణార్హతపై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ సుబ్బారెడ్డి గురువారం తన నిర్ణయాన్ని వెలువరించారు. సీఆర్డీఏ అభ్యంతరాలను తోసిపుచ్చారు. అయితే పిటిషన్ దాఖలు చేసిన రెండు సంఘాల్లో ఉన్న ప్రతీ సభ్యుడి పేరు మీద కోర్టు ఫీజు చెల్లించాలని ఆ సంఘాలను న్యాయమూర్తి ఆదేశించారు. -
గవర్నర్‌పై సుప్రీంకోర్టులో కేరళ పిటిషన్
న్యూఢిల్లీ: రాష్ట్ర శాసనసభలో ఆమోదించిన బిల్లులకు అంగీకారం తెలపడంలో రాష్ట్ర గవర్నర్ అరిఫ్ మొహమ్మద్ ఖాన్ విపరీతమైన జాప్యం చేస్తున్నారని కేరళ ప్రభుత్వం ఆక్షేపించింది. బిల్లులకు త్వరగా అంగీకారం తెలిపేలా గవర్నర్‌ను ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖ లు చేసింది. ప్రజల హక్కులను గవర్నర్ అగౌరవపరుస్తున్నారని పేర్కొంది. ప్రస్తుతం 8 బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించింది. వాటిపై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని తెలియజేసింది. ఇవన్నీ ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన బిల్లులేనని ఉద్ఘాటించింది. -
Nov 2nd : చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Naidu Cases, Petitions, Court Hearings & Political Updates 17:30 PM, నవంబర్ 02 2023 BRS పార్టీలో చేరనున్న కాసాని జ్ఞానేశ్వర్ బాబూ.. మీకో దండం.. ► చంద్రబాబు, లోకేష్‌ల నుంచి బయటకొచ్చేసిన కాసాని ► రేపు ఉదయం బీఆర్ఎస్లో చేరనున్న కాసాని ► గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లి ఫార్మ్ హౌజ్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిక ► తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షులుగా రెండు రోజుల క్రితం వరకు పని చేసిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్. 17:00 PM, నవంబర్ 02 2023 రేపటి దాకా ఆస్పత్రిలోనే చంద్రబాబు.! ► హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చంద్రబాబుకు వైద్య పరీక్షలు ► ఉదయం 11 గంటలకు చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన బాబు ► రేపు మధ్యాహ్నం వరకు ఆస్పత్రిలోనే చంద్రబాబు 16:45 PM, నవంబర్ 02 2023 చంద్రబాబుపై మరో కేసు నమోదు ► టిడిపి హయాంలో ఇసుక అక్రమాలపై కేసు నమోదు ► APMDC ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సిఐడీ ► ఏ1 గా పీతల సుజాత, ఏ2గా చంద్రబాబు ► ఏ3గా చింతమనేని, ఏ4 గా దేవినేని ఉమ ► ప్రభుత్వ ఖజానాకు తీవ్రనష్టం చేకూర్చారని ఫిర్యాదు ► ఇప్పటి వరకు చంద్రబాబుపై స్కిల్ స్కాం, ఐఆర్ఆర్, ఫైబర్ నెట్, అసైన్డ్ ల్యాండ్, మద్యం కేసులు ► మొత్తం 6 కేసుల్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆధారాలు 15:45 PM, నవంబర్ 02 2023 జనసేనలో ఏం జరుగుతోంది? ► పవన్ కళ్యాణ్ చర్యలతో విసుగు చెందుతోన్న జనసేన నాయకులు ► నెల్లూరు జనసేన ఇన్ఛార్జ్ కేతంరెడ్డి వినోద్ ఎందుకు దూరంగా ఉంటున్నారు? ► పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మాకినేని శేషుకుమారి ముఖమెందుకు చాటేశారు? ► తిరుపతి జనసేన నాయకులు పసుపులేటి సురేష్, దిలీప్ సుంకర ఎందుకు దూరమయ్యారు? ► రాయలసీమ ప్రాంతీయ మహిళా కోఆర్డినేటర్ పసుపులేటి పద్మావతి ఎందుకు పార్టీవైపు చూడడం లేదు? ► జనసేన నాయకుడు బొలిశెట్టి శ్రీనివాస్ వెనక ఏం జరుగుతోంది? ► ఇప్పుడు జనసేనలో అధికారం ఎవరి చేతిలో ఉంది? ► జనసేన ప్రధాన కార్యాలయంలో రుక్మిణికి పవన్ కళ్యాణ్ ఇచ్చిన బాధ్యతలేంటీ? 15:25 PM, నవంబర్ 02 2023 నారా వారిది అబద్దాల ఫ్యాక్టరీ : YSRCP ► సీమెన్స్ కంపెనీతో ఒప్పందం కుదిరిందని కేబినెట్‌కు చెప్పింది.. అబద్ధం ► పది శాతం నిధులు పెడితే.. సీమెన్స్ సిమన్స్ కంపెనీ 90 శాతం నిధులను గ్రాంట్ ఇన్ ఎయిడ్ గా ఇస్తుందన్నది.. అబద్ధం ► స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా లక్షలాది మందికి నైపుణ్యాలు నేర్పితే వేలాది మందికి బంగారంలాంటి ఉద్యోగాలు వచ్చాయన్నది.. అబద్ధం ►సెప్టెంబరు 9న చంద్రబాబు నాయుడ్ని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేస్తే.. 24 గంటల లోపు కోర్టు ముందు హాజరు పర్చలేదని చంద్రబాబు ఆరోపణ.. అబద్ధం ►48 రోజులకు పైగా జైల్లో ఉండి.. ఏ కోర్టులోనూ బెయిల్ రాకపోవడంతో మధ్యంతర బెయిల్ కోసం ఆరోగ్యం బాగాలేదని చెప్తుండడం.. అబద్ధం ►చంద్రబాబు నాయుడు జైల్లో బరువు తగ్గారని నారా భువనేశ్వరి చేస్తున్న ప్రచారం.. అబద్ధం ► జైల్లో సదుపాయాల గురించి టీడీపీ చేస్తున్న ప్రచారం.. అబద్ధం ►తన తండ్రికి స్టెరాయిడ్స్ ఇచ్చి అంతమొందించేందుకు కుట్ర చేస్తున్నారని నారా లోకేష్ చెప్తుండడం.. అబద్ధం ► చైనా నుండి డ్రాగన్ దోమలను దిగుమతి చేసి వాటిని చంద్రబాబు పైకి ఉసిగొల్పి కుట్టిస్తున్నారని ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయించడం.. అబద్ధం ►తనను అంతమొందించేందుకు కుట్ర చేస్తున్నారని చంద్రబాబు గగ్గోలు పెడుతుండడం.. అబద్ధం ► స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్లో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగనే లేదని చంద్రబాబు చెప్తుండడం.. అబద్ధం 15:25 PM, నవంబర్ 02 2023 కాసాని దెబ్బకు కళ్లు బైర్లు కమ్మిన తెలుగుదేశం ► తెలంగాణలో ఎందుకు పోటీ చేయలేదని అధిష్టానాన్ని ప్రశ్నించిన కాసాని.! ► మీకో దండం, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్లకు వెన్నుపోటేనా అని ప్రశ్నించిన కాసాని ► కాసాని ప్రకటనను ఇప్పటివరకు ఖండించలేకపోతోన్న తెలుగుదేశం అధిష్టానం ► ఎందుకు పోటీ చేయలేకపోతుందో చెప్పలేకపోతోన్న చంద్రబాబు, లోకేష్ ► హైదరాబాద్‌లో చాలా బలంగా ఉన్నామంటూ ర్యాలీలు చేసిన వారు పోటీకి ఎందుకు భయపడ్డారు? ► గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న 150 డివిజన్ లలో గత ఎన్నికల్లో ఒక డివిజన్‌ను కూడా తెలుగుదేశం ఎందుకు గెలవలేదు? ► తెలుగుదేశం పార్టీకి కనీసం ఒక శాతం ఓట్లయినా గ్యారంటీ లేకున్నా బిల్డప్‌లు ఎందుకు? ► నిజంగా నాలుగు ఓట్లయినా పడే సీను లేకున్నా.. గొప్పలకు పోయి వాతలెందుకు పెట్టించుకుంటారు? ► చింత చచ్చినా.. పులుపు చావలేదన్నట్టు కాంగ్రెస్ కోసం ఎందుకు కుటిల ప్రయత్నాలు ► చంద్రబాబు ఏం చేస్తున్నారో నిన్న ఢిల్లీలో బయటపెట్టిన బీజేపీ నేత ఈటల రాజేందర్ ► తెలంగాణలో చంద్రబాబును ఎవరూ నమ్మబోరన్న డాక్టర్ లక్ష్మణ్ ► బీజేపీని బ్లాక్మెయిల్ చేసేలా ఉంటోన్న చంద్రబాబు చర్యలు 15:20 PM, నవంబర్ 02 2023 బాబు విడుదల తర్వాత తేడా కొడుతున్న నెంబర్లు ► తెలుగుదేశం, జనసేన పొత్తుపై పలు సందేహాలు ► జైల్లో చంద్రబాబును కలిసి బయట పొత్తు ప్రకటించిన పవన్ కళ్యాణ్ ► ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ సీట్లు, 25 పార్లమెంటు సీట్లు ► తమకు 50 అసెంబ్లీ, 8 పార్లమెంటు సీట్లు కావాలని చెప్పిన పవన్ ► ఇప్పుడు 20 అసెంబ్లీ, 3 పార్లమెంటు ఇవ్వాలన్న యోచనలో తెలుగుదేశం ► చంద్రబాబు విడుదలైన తర్వాత కరకట్ట ఇంట్లో సుదీర్ఘంగా చర్చలు ► అన్ని చోట్లా మనమే పోటీ చేద్దామని బాబుకు చెబుతోన్న టిడిపి నేతలు ► తెలంగాణలో పొత్తులో భాగంగా జనసేనకు బీజేపీ ఇచ్చేది 10కి మించబోవంటున్న టిడిపి నేతలు ► జనసేన సీను అంతే అయినప్పుడు మనమెందుకు ఎక్కువ సీట్లు ఇవ్వాలంటున్న టిడిపి నేతలు ► పునరాలోచనలో పడ్డ తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్ 15:15 PM, నవంబర్ 02 2023 భువనేశ్వరీ నిజం నిలిచిపోయిందా? ► రూ.3లక్షల చొప్పున ఇస్తామంటూ ఘనంగా తెలుగుదేశం ప్రకటనలు ► చంద్రబాబు కోసం చనిపోయారు కాబట్టి రూ.3లక్షలు ఇస్తామన్న భువనేశ్వరీ ► అలా ఓ నలుగురికి పంచేసరికి మారిపోయిన సీను ► చంద్రబాబు విడుదల కాగానే నిలిచిపోయిన నిజం యాత్ర ► మిగతా వాళ్లకెపుడు ఇచ్చేది మూడు లక్షల చెక్కులు? ► పాత డేట్లతో ముందే చెక్కులు ఎలా తయారు చేశారు? ► మీ నిజం యాత్రకు నిజంగానే బ్రేకులేశారా? 14:55 PM, నవంబర్ 02 2023 చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు టిడిపి చెప్పిన రోగాల జాబితా ► పుట్టుకతోనే చంద్రబాబుకు గుండె సమస్య ఉంది, ఇప్పటి వరకు జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటున్నారు : కొడుకు లోకేష్ ► చంద్రబాబు కంటి సమస్య ఉంది, తక్షణం సర్జరీ చేయాలని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి డాక్టర్లు చెబుతున్నారు : ఎల్లో మీడియాలో ఒక పత్రిక ► చంద్రబాబుకు యాంగిల్ క్లోజర్ గ్లకోమా అనే కంటి వ్యాధి ఉంది. ఇంట్రా ఆక్యులర్ ప్రెజర్ ద్వారా కేవలం ఆస్పత్రిలోనే చికిత్స అందించాలి : ఎల్లోమీడియాలో ఓ ఛానల్ ► చంద్రబాబు వెన్ను కింది భాగంలో నొప్పితో పాటు చర్మవ్యాధులున్నాయి. వీపరీతంగా దద్దర్లు రావడం వల్ల గోకుతున్నారు : ఎల్లో మీడియాలోని మరో ఛానల్ ► చంద్రబాబు మలద్వారం వద్ద తీవ్రంగా నొప్పి వస్తోంది. రాత్రంతా నిద్ర లేకుండా నొప్పితో బాధపడుతున్నారు : ఎల్లో మీడియాలోని ఓ పత్రిక ► చంద్రబాబు ఒకే భంగిమలో ఎక్కువసేపు కూర్చోవద్దు, నడుము తట్టుకోలేదు, వీపరీతంగా నొప్పి ఉంది : ఎల్లోమీడియాలోని మరో ఛానల్ ►మరి, వీటన్నింటికి సరైన ట్రీట్మెంట్ ఇప్పుడయినా చేయిస్తున్నారా? : YSRCP ►ఇన్ని సమస్యలున్నా.. చంద్రబాబు 14గంటల పాటు ర్యాలీ చేశారా? : YSRCP 14:35 PM, నవంబర్ 02 2023 మ్యానిఫెస్టోను అలా విజయవంతంగా మరిచిపోయారు.! ► నవంబర్ 1న ఉమ్మడి మ్యానిఫెస్టో అంటూ టిడిపి, జనసేన గత వారం ఘనంగా ప్రచారం ► అక్టోబర్ 25న రాజమండ్రిలో ప్రెస్‌మీట్ పెట్టి మరీ ప్రకటించిన లోకేష్, పవన్ కళ్యాణ్ ► చంద్రబాబు జైల్లో (అక్టోబర్ 25న) ఉన్నాడు కాబట్టి మినీ మ్యానిఫెస్టో అని ప్రకటన ► ప్రకటన చేసిన పవన్‌కళ్యాణ్ ఇటలీకి జంప్, కోరస్ ఇచ్చిన లోకేష్ ఢిల్లీకి జంప్ ► జైలు నుంచి విడుదలయిన చంద్రబాబు హైదరాబాద్‌కు జంప్ ► మ్యానిఫెస్టో గురించి ఎవరయినా అడిగినా.? అంతే సంగతులు ► మ్యానిఫెస్టోను మాయం చేసిన చరిత్ర ఉన్న పార్టీలే టిడిపి, జనసేన : YSRCP 14:29 PM, నవంబర్ 02 2023 స్కిల్ అంతా స్కామే : ఆర్థికమంత్రి బుగ్గన ►విజయవాడలో ఆర్థికమంత్రి బుగ్గన ►స్కిల్ స్కామ్ GST వల్ల బయట పడింది ►2018 లోనే మన రాష్ట్రానికి విచారణ చెయ్యమని లేఖ రాశారు ►GST, SEBI, ED విచారణ చేసిన స్కామ్ ఇది ►2017 నుండి ఈ కేసులో విచారణ జరుగుతోంది ►అలాంటి కేసు CID విచారణ చెయ్యకూడదా..? ►అసలు వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ ఏంటో తెలుసా..? ►5 రోజుల్లోనే ట్రైనింగ్ సాధ్యమా..? దానిని ట్రైనింగ్ అంటారా..? ►డెమో చూపించి దాన్నే ట్రైనింగ్ అని కోట్లు కొల్లగొట్టారు..? ►370 కోట్ల కి డిజైన్ టెక్ ఈరోజు కి ఎంత ఖర్చయ్యిందో బిల్లే ఇవ్వలేదు ►సీమన్స్ కంపెనీ అసలు ఈ గ్రాంట్ ఇన్ కైండ్ అన్న పద్ధతే లేదు అని చెప్పింది ►అనంతపురం JNTU సెంటర్ లో లెక్కేస్తే 8 కోట్లు పరికరాలు ఉన్నాయి ►ఎంత చూసిన ఈ స్కామ్ లో 250 కోట్లు లెక్కలు దొరకడం లేదు ►పయ్యావుల కేశవ్ కోర్టు తేల్చేంత వరకు ఓపిక పట్టాలి ►కోర్టుకి ఆధారాలు చూపించామో లేదో వీళ్లకు తెలుసా..? ►విచారణలో సేకరించిన ఆధారాలు ఎప్పుడు ఎవరికి ఇవ్వాలో వారికి ఇస్తారు 14:12 PM, నవంబర్ 02 2023 పయ్యావులకు బోలెడు అనుమానాలు ►స్కిల్ కేసుపై పయ్యావుల కేశవ్ పరిశోధన ►90%-10% అనేదే కాదని చెబుతున్నారు, మరో 5 రాష్ట్రాలు చేశాయి ►MOUపై తేదీ లేకుండా సంతకం పెట్టారని ఆరోపిస్తున్నారు ►ప్రధాన కంపెనీ జర్మనీలో ఉంది, సీమన్స్ కు మీరు లేఖ రాశారా? ►గ్రాంట్ ఇన్ ఎయిడ్ కు బదులు గ్రాంట్ ఇన్ కైండ్ అని రాసుకున్నారు. పదాలు మార్చినా.. ఆరోపణలు చేస్తారా? ►అయ్యా.. కేశవా.. ఇదే ఆర్గ్యుమెంట్ కోర్టు ముందు వినిపిస్తారా? : YSRCP ►ఇన్ని ఆధారాలు మీ దగ్గర ఉంటే.. 17a ప్రకారం గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేశారని ఎందుకు వాదిస్తున్నారు? ►తప్పు చేయలేదు అన్న ఏకవాక్యాన్ని కోర్టు ముందు ఎందుకు వినిపించడం లేదు? 14:09PM, నవంబర్ 02 2023 చంద్రబాబు కేరాఫ్ AIG ►చంద్రబాబుకు వైద్య పరీక్షలు ప్రారంభించిన ప్రత్యేక వైద్య బృందం ►ముందుగా చర్మ సంబంధ వైద్య పరీక్షలు ►దాంతో పాటు సాధారణ పరీక్షలు చేయనున్న వైద్యులు ►వెన్నుముక సంబంధిత వైద్య పరీక్షలు ►చంద్రబాబు వైద్య పరీక్షలకు 3 నుంచి 4 గంటల సమయం 13:29PM, నవంబర్ 02 2023 టీడీపీ ఖేల్ ఖతం ►చంద్రబాబు ఒక దొంగ.. ప్రజల డబ్బులు దోచేశాడు ►దొంగ అయిన చంద్రబాబు బయటకు వస్తే జనాలు ఏం ఆదరిస్తారు? ►40ఏళ్ల ఇండస్ట్రీ అనే చంద్రబాబు సింపతీ కోసం ఒక గేమ్ ఆడుతున్నాడు ►ఈ రాష్ట్రంలో అతి పెద్ద రోగిస్టు చంద్రబాబు ►అనేక రోగాలు ఉన్నాయి అని కోరితే కోర్టు చంద్రబాబుకి బెయిల్ ఇచ్చింది ►లోకేష్ వల్ల కాకపోవడంతో పురందేశ్వరి బీజేపీ ముసుగులో బాబు కోసం పని చేస్తున్నారు ►టీడీపీ పని అయిపొయింది.. ఇక కోలుకోదు :::విజయవాడలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కామెంట్లు 12:53PM, నవంబర్ 02 2023 మళ్లీ 4 వారాలకు చంద్రబాబు జైలుకే! ►చంద్రబాబు హయాంలో అడ్డగోలు అవినీతి జరిగింది ►బాబు నిజాయితీపరుడు అయితే జైలుకు ఎందుకు వెళ్లారు? ►కన్ను బాగోలేదనే బెయిల్ ఇచ్చారు ►మళ్లీ నాలుగు వారాల తర్వాత జైలుకు రమ్మన్నారు ►అనకాపల్లి సామాజిక సాధికార యాత్ర ప్రారంభ సమావేశంలో మంత్రి బొత్స వ్యాఖ్యలు ఇదీ చదవండి: బాబుకు అనారోగ్యం సాకు మాత్రమే! 12:29PM, నవంబర్ 02 2023 ఆధారాలివ్వండి ►ఏపీ హైకోర్టులో సంజయ్, పొన్నవోలుపై పిల్ ►ప్రజాధనం దుర్వినియోగం చేశారంటూ పిటిషన్ ►ప్రెస్ మీట్ల కోసం వారు ప్రజాధనం ఖర్చు చేసినట్లు ఆధారాలున్నాయా? ►ఏఏజీ, సీఐడీ చీఫ్ ఏం మాట్లాడారో....తర్జుమా చేసి ఇవ్వండి ►పిటిషనర్ కు ధర్మాసనం ప్రశ్న ►విచారణ 8వ తేదీకి వాయిదా 12:07PM, నవంబర్ 02 2023 బాబుకు వైద్య పరీక్షలు ►హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చంద్రబాబుకు వైద్య పరీక్షలు ►చంద్రబాబు వైద్య పరీక్షలకు సుమారు 4 గంటలు పట్టే అవకాశం 11:54AM, నవంబర్ 02 2023 చంద్రబాబుపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు ►అరెస్ట్ తర్వాత నిన్న హైదరాబాద్‌కు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ►బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి జూబ్లీహిల్స్ నివాసానికి ర్యాలీ ►ర్యాలీపై హైదరాబాద్ లో కేసు నమోదు ►ఎన్నికల కోడ్ ఉల్లంఘన పై కేసు నమోదు చేసిన బేగంపేట పోలీసులు ►పనిగట్టుకుని జనసమీకరణ చేపట్టిన తెలుగుదేశం నేతలు ►చంద్రబాబు ర్యాలీ యాత్రలను సమర్థించుకున్న అచ్చెన్నాయుడు 10:30AM, నవంబర్ 02 2023 ఏఐజీ ఆసుపత్రికి నారా లోకేశ్ ►హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్న నారా లోకేశ్ ►మరికాసేపట్లో ఆసుపత్రికి వెళ్లనున్న చంద్రబాబు ►చంద్రబాబు వెళ్తున్న దృష్ట్యా ఆసుపత్రి వద్ద పోలీసు బందోబస్తు 08:20AM, నవంబర్ 02 2023 వైద్యపరీక్షలు చేయించుకోనున్న చంద్రబాబు ►ప్రత్యేక విమానంలో నిన్న హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు ►జూబ్లీహిల్స్‌లోని నివాసం నుంచి కాసేపట్లో వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి ►నిన్న చంద్రబాబును కలిసిన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) వైద్యుల బృందం ►వైద్యుల సూచన మేరకు నేడు ఏఐజీకి ►హైకోర్టు ఆదేశాల ప్రకారం.. వైద్య పరీక్షల నివేదికల్ని ఏసీబీ కోర్టుకు సమర్పించే అవకాశం 07:18AM, నవంబర్ 02 2023 ఫైబర్ నెట్ కుంభకోణంలో సీఐడీ దూకుడు ►ఫైబర్ నెట్ కుంభకోణంలో చంద్రబాబు సన్నిహితుల స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌కు నిర్ణయం ►ఏడు స్థిరాస్తులను అటాచ్ చేయాలని ప్రతిపాదన ►సీఐడీ ప్రతిపాదనకు హోంశాఖ ఆమోదం ►అనుమతి కోసం నేడు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్న సీఐడీ ►టెరాసాఫ్ట్ కంపెనీ, చంద్రబాబు సన్నిహితులకు చెందిన ఏడు స్థిరాస్తులను అటాచ్ చేయాలన్న సీఐడీ ప్రతిపాదన ►ఆమోదిస్తూ రాష్ట్ర హోంశాఖ ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ ►ఫైబర్ నెట్ కుంభకోణంలో 114 కోట్లు దుర్వినియోగమయ్యామని ఇప్పటికే ఎఫ్ ఐ ఆర్ నమోదు ►ఈ కేసులో ఎ 1 గా వేమూరి హరికృష్ణ, ఎ 11 గా టెర్రా సాఫ్ట్ ఎండి తుమ్మల గోపీచంద్, ఎ -25 గా చంద్రబాబునాయుడి పేర్లు ►ఫైబర్ నెట్ కుంభకోణంలో నిందితులైన టెర్రా సాఫ్ట్ ఎండి తుమ్మల గోపీచంద్ కి ఆస్ధులతో పాటు పలు కంపెనీల ఆస్ధులు అటాచ్ చేయాలని ప్రతిపాదన ►తుమ్మల గోపీచంద్ మరియు ఆయన భార్య పావని పేర్లపై హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ, యూసఫ్ గూడ, జూబ్లీహిల్స్ కాలనీ, చిన్నమంగళారం లలో ఉన్న ఇల్లు, వ్యవసాయ క్షేత్రాలు అటాచ్ ►ఈ కుంభకోణంలో నిందితులైన నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ డైరక్టర్ కనుమూరి కోటేశ్వరరావుకి చెందిన గుంటూరు, విశాఖ కిర్లంపూడి లే అవుట్ లోని ఇల్లులు అటాచ్ ►మొత్తంగా అటాచ్ ఆస్తుల్లో గుంటూరులో ఇంటి స్థలం, విశాఖపట్నంలో ఓ ఫ్లాట్, హైదరాబాద్‌లోని నాలుగు ఫ్లాట్లు, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమి ►హోంశాఖ ఉత్తర్వుల నేపథ్యంలో ఆ స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతించాలని కోరుతూ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్‌ను దాఖలు చేయనున్న సీఐడీ ఇదీ చదవండి: చంద్రబాబు కనుసన్నల్లోనే ‘ఫైబర్ గ్రిడ్’ అక్రమాలు 07:13AM, నవంబర్ 02 2023 అదనపు షరతుల పిటిషన్‌పై నిర్ణయం రేపే ►చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై సీఐడీ అనుబంధ పిటిషన్ ►బెయిల్‌కు మరికొన్ని షరతులు విధించాలని కోర్టుకు విజ్ఞప్తి ►బుధవారం కొనసాగిన వాదనలు ► సీఐడీ కోరుతున్న షరతులు చంద్రబాబు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉన్నాయన్న బాబు లాయర్ దమ్మాలపాటి శ్రీనివాస్ ►కోర్టు ఉత్తర్వులను చంద్రబాబు ఉల్లంఘించారని.. జైలు బయట మీడియా సమావేశం నిర్వహించారన్న సీఐడీ తరఫు లాయర్ ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ►ప్రత్యేక పరిస్థితుల్లోనే చంద్రబాబుకి కోర్టు మధ్యంతర బెయిలు ఇచ్చిందని గుర్తు చేసిన ఏఏజీ ► శుక్రవారం నిర్ణయం వెల్లడిస్తామన్న జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు 06:59AM, నవంబర్ 02 2023 మళ్లీ ఢిల్లీకి వెళ్లిన లోకేష్‌పై సెటైర్లు ►మళ్లీ నిన్న ఢిల్లీకి వెళ్లిపోయిన టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు ►టీడీపీ అధినేత, తండ్రి చంద్రబాబు మీద ఉన్న కేసులపై న్యాయ నిపుణులతో చర్చించేందుకేనన్న ప్రచారం ►వ్యక్తిగత పని మీద అని టీడీపీ వివరణ ►నవంబర్ 8న సుప్రీంలో క్వాష్ పిటిషన్‌పై తీర్పు.. 9న ఫైబర్కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ►పదుల సంఖ్యలో పిటిషన్లపై చర్చ కోసమేనంటూ ప్రచారం ►మళ్లీ.. అరెస్ట్ భయంతోనేనంటూ సోషల్ మీడియాలో సెటైర్లు 06:49AM, నవంబర్ 02 2023 చంద్రబాబు కోసం జనాలు.. టీడీపీ నేతల తంటాలు ►జైలు జీవితం తర్వాత కరకట్ట ఇంటి.. అక్కడి నుంచి హైదరాబాద్‌కు చంద్రబాబు ►యథేచ్ఛగా కోర్టు షరతులను ఉల్లంఘించిన చంద్రబాబు ►మొన్న సాయంత్రం నుంచి నిన్న సాయంత్రం వరకు చంద్రబాబు యాత్రల పేరిట హడావిడి ►నిన్న సాయంత్రం హైదరాబాద్‌కు చేరిక ►బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఇంటి దాకా టీడీపీ భారీ ర్యాలీ ►జనసమీకరణలో పోటీ పడ్డ తెలుగుదేశం నాయకులు 06:40AM, నవంబర్ 02 2023 స్కిల్డ్ దొంగ.. చంద్రబాబు ►స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో అవినీతికి పాల్పడ్డ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ►సీఎంగా ఉన్న టైంలో ప్రభుత్వ ఖజానా నుంచి షెల్ కంపెనీల ద్వారా నిధుల మళ్లింపు ►కొల్లగొట్టిన రూ.371 కోట్లలో రూ.27 కోట్లు టీడీపీ ఖాతాకు చేరాయని ఆధారాలు సమర్పించిన సీఐడీ ►సెప్టెంబర్ 09వ తేదీన అరెస్ట్ చేసిన పోలీసులు.. అక్టోబర్ 31 సాయంత్రం మధ్యంతర బెయిల్ మీద విడుదల ►52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు ►కోర్టుల్లో వరుస ఎదురు దెబ్బలతో వరుస పిటిషన్లు ►చివరకు ఏపీ హైకోర్టులో స్వల్ఫ ఊరట ►షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ►నాలుగు వారాల తర్వాత.. నవంబర్ 28వ తేదీ సాయంత్రం 5గం.లోపు జైల్లో సరెండర్ కావాలని చంద్రబాబుకి ఆదేశం ►కేవలం మానవతా ధృక్పథం.. ఆరోగ్య కారణాల రీత్యా బెయిల్ ఇస్తున్నామన్న హైకోర్టు ►కంటి సర్జరీ కోసం బెయిల్.. ఆస్పత్రి మినహా మరేయితర కార్యక్రమాల్లో పాల్గొనద్దని ఆదేశం ►షరతులు ఉల్లంఘిస్తే వెంటనే బెయిల్ రద్దు అవుతుందని హెచ్చరిక -
చంద్రబాబు బెయిల్ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ
-
ఆ జీవోలపై హైకోర్టు పునర్విచారణ
సాక్షి, అమరావతి: అమరావతి భూ కుంభకోణం, ఏపీ ఫైబర్‌నెట్ స్కాంలతో పాటు గత చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, చేపట్టిన ప్రాజెక్టులు తదితరాలపై సమీక్ష జరిపేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీఓ 1411.. మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ ఆక్రమాలపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటుచేస్తూ జారీచేసిన జీఓ 344ను సవాలుచేస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌లు వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు శనివారం తిరిగి విచారణ జరిపింది. ఈ వ్యాజ్యాల్లో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే, కేంద్రం దాఖలు చేసే కౌంటర్లకు సమాధానం దాఖలు చేయాలని పిటిషనర్లయిన రామయ్య, రాజేంద్రప్రసాద్‌లను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 20కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్ర ప్రభుత్వ వాదనను పట్టించుకోని సింగిల్ జడ్జి.. మంత్రివర్గ ఉప సంఘం, సిట్ ఏర్పాటు జీఓలను సవాలుచేస్తూ టీడీపీ నేతలు వర్ల రామయ్య, రాజేంద్రప్రసాద్‌లు 2020లో వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలుచేశారు. వీటిపై విచారణ జరిపిన నాటి న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, ఆ జీఓల్లో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ 2020 సెపె్టంబర్ 16న మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించే సంపూర్ణాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాలను ఆ తరువాత ప్రభుత్వాలు తప్పనిసరిగా కొనసాగించాలన్నారు. ఈ వ్యాజ్యంలో కేంద్ర ప్రభుత్వం, ఈడీలను ప్రతివాదులుగా చేర్చుకుని వారి వాదనలు వినాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను సైతం న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఈ జీఓలవల్ల వర్ల రామయ్య, రాజేంద్రప్రసాద్‌లు బాధిత వ్యక్తులు కాదని, వారి వ్యాజ్యాలకు విచారణార్హతే లేదన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను సైతం జస్టిస్ సోమయాజులు పరిగణనలోకి తీసుకోలేదు. ‘సుప్రీం’ ఆదేశాలతో తిరిగి విచారణ.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు టీడీపీ నేతలు దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు తిరిగి ఈ ఏడాది జూన్‌లో విచారణ మొదలుపెట్టింది. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చింది. అటు తరువాత పలుమార్లు ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపింది. తాజాగా.. శనివారం ఈ వ్యాజ్యాలపై జస్టిస్ రామకృష్ణప్రసాద్ మరోసారి విచారణ జరిపారు. కౌంటర్ల దాఖలుకు కేంద్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్జీ) ఎన్.హరినాథ్ తరఫు న్యాయవాది వరుణ్ బైరెడ్డి గడువు కోరారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ స్పందిస్తూ.. సిట్ పరిధిలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణాన్ని సీబీఐకి అప్పగించాలంటూ తాజాగా పిల్ దాఖలైందని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. ఆ వ్యాజ్యం విచారణకు వస్తే అందులోనూ కేంద్రం తన వైఖరిని తెలియజేయాల్సి ఉంటుందని వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కౌంటర్ దాఖలు చేసేందుకు కేంద్రానికి గడువునిచ్చారు. తదుపరి విచారణను అక్టోబరు 20కి వాయిదా వేశారు. అప్పటికల్లా ఇరుపక్షాలు కౌంటర్లు, వాటికి రిప్లైలు దాఖలు చేయడం పూర్తిచేయాలని న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణప్రసాద్ స్పష్టంచేశారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు రద్దు.. దీంతో.. జస్టిస్ సోమయాజులు ఇచ్చిన ఉత్తర్వులను సవాలుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఉత్తర్వులను రద్దుచేయాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను తప్పుపట్టి వాటిని రద్దుచేసింది. హైకోర్టు ఆ మధ్యంతర ఉత్తర్వులిచ్చి ఉండాల్సింది కాదని, కేసు ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని గుర్తుచేసింది. రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన రెండు జీఓలను పరిశీలిస్తే, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షించేందుకు ఆ జీఓ జారీ అయినట్లు భావించడానికి వీల్లేదంది. కేంద్రాన్ని సైతం ఈ వ్యాజ్యాల్లో ప్రతివాదిగా చేర్చుకోవాలని హైకోర్టును ఆదేశించింది. కేంద్రం అభిప్రాయం కూడా తెలుసుకోవాలంది. కేసు పూర్వాపరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యాలను మూడునెలల్లో పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఈ ఏడాది మేలో హైకోర్టుకు స్పష్టం చేసింది. -
టీడీపీ నేతల ముందస్తు బెయిల్ పిటిషన్ల తిరస్కరణ
మదనపల్లె: ఉమ్మడి చిత్తూరు జిల్లా అంగళ్లు, పుంగనూరులలో ఆగస్టు 4న చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన అల్లర్ల ఘటనలో నమోదైన కేసులకు సంబంధించి పరారీలో ఉన్న 13 మంది టీడీపీ నేతలు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లను తిరస్కరిస్తూ రెండో ఏడీజే కోర్టు న్యాయమూర్తి అబ్రహాం గురువారం తీర్పునిచ్చారు. అంగళ్లు, పుంగనూరు ఘటనలకు సంబంధించి నమోదైన కేసుల్లో 106 మందిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి బెయిల్ పిటిషన్లను ఇదివరకే కోర్టు తిరస్కరించింది. కాగా, అరెస్ట్ కాకుండా అజ్ఞాతంలో ఉన్న 13 మంది ముందస్తు బెయిల్‌కు సంబంధించి ఆగస్టు 29న రెండో ఏడీజే కోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును 31వ తేదీకి వాయిదా వేశారు. చదవండి: బాబు ష్యూరిటీనా.. నమ్మేదెలా? -
ముందస్తు బెయిల్ మంజూరు చేయండి
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఉసిగొల్పి పోలీసులపై దాడి చేయించి గాయపరిచిన వ్యవహారంలో తమపై అన్నమయ్య జిల్లా, ముదివీడు పోలీస్‌స్టేషన్‌లో నమోదైన వేర్వేరు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ టీడీపీ నేతలు నల్లారి కిషోర్ కుమార్‌రెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు విచారణ జరిపారు. పోలీసుల తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ టీడీపీ నేతల దాడిలో దాదాపు 30 మంది పోలీసులు తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. అందువల్ల తనకు ఈ కేసులకు సంబంధించిన వివరాలు తెలుసుకునే అవకాశం లేకపోయిందన్నారు. పూర్తి వివరాలను తెలుసుకుని కోర్టు ముందుంచేందుకు విచారణను వాయిదా వేయాలని కోరారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ విచారణను 14కి వాయిదా వేశారు. కాగా, ఈలోపే పిటిషనర్లను అరెస్ట్ చేసే అవకాశం ఉందని, అందువల్ల సోమవారం వరకు పిటిషనర్లకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని దేవినేని ఉమా, కిషోర్ కుమార్‌రెడ్డి తరఫు న్యాయవాదులు హైకోర్టును అభ్యర్ధించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి సోమవారం వరకు పిటిషనర్లను అరెస్ట్ చేయవద్దని ఏఏజీ సుధాకర్‌రెడ్డికి మౌఖికంగా స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే..ఇదే వ్యవహారంలో తనపై ముదివీడు పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ టీడీపీ నేత పులవర్తి నాని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై కూడా హైకోర్టు సోమవారం విచారణ జరపనుంది. -
TS: ఎన్నిక చెల్లవంటూ పిటిషన్లు.. కీలక ఆదేశాలు జారీ
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్ ఎన్నిక చెల్లందంటూ తెలంగాణాలో హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు కాగా, ఇవాళ(జులై 31 సోమవారం)దానిపై విచారణ జరిగింది. ఎన్నికల అఫిడవిట్ లో గంగుల కమలాకర్ తప్పుడు వివరాలు ఇచ్చారంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. 2018 ఎన్నికల సమయంలో బండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గంగుల చేతిలో ఓడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన కరీంనగర్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే.. గంగుల తప్పుడు వివరాలతో అఫిడవిట్ సమర్పించారంటూ బండి సంజయ్ పిటిషన్ వేశారు. ఈ తరుణంలో ఇవాళ విచారణ జరగ్గా.. పిటిషనర్‌ను క్రాస్ ఎగ్జామ్ చేసేందుకు అనుమతి ఇచ్చింది హైకోర్టు. రిటైర్డ్ జిల్లా న్యాయమూర్తి శైలజతో కమిషన్ ఏర్పాటు చేసిన హైకోర్టు.. ఆగస్టు 12 నుండి 17 వరకు క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ అగస్ట్ 21కి వాయిదా వేసింది. ఇక మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మంత్రి శ్రీనివాస్ గౌడ్ అనర్హత పిటిషన్‌పైనా హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికల అఫిడవిట్లో శ్రీనివాస్‌గౌడ్ తప్పుడు ధ్రుృవపత్రాలు సమర్పించారని, శ్రీనివాసగౌడ్ ఎమ్మెల్యేగా కొనసాగే అర్హత లేదంటూ మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్రరాజు అనే వ్యక్తి పిటిషన్ వేశాడు. అయితే దీనిని కొట్టేయాలంటూ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హైకోర్టును ఆశ్రయించగా.. తాజాగా చుక్కెదురైంది. ఈ క్రమంలో.. సోమవారమూ ఈ పిటిషన్‌పై విచారణ కొనసాగింది. 19-11-2018వ తేదీన దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ ఆధారంగానే విచారణ జరుపుతోంది ధర్మాసనం. ఈ క్రమంలో.. అఫిడవిట్, ఆధారాలను కోర్టుకు సమర్పించాలని పిటిషనర్‌ను ధర్మాసనం ఆదేశించింది. కోర్టు విచారణ పై మీడియాకు ఎలాంటి సమాచారం షేర్ చేసుకోవద్దు వాది, ప్రతివాది ఇద్దరిని ఆదేశిస్తూ.. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. క్రిమినల్ కేసుకు నాంపల్లి కోర్టు ఆదేశం మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసులో పిటిషనర్ రాఘవేంద్ర రాజు సాక్షితో మాట్లాడారు. ‘‘2022, ఆగస్టు 4వ తేదీన నాంపల్లి కోర్టులో క్రిమినల్ కేసు పిటిషన్ వేశాను. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో పాటు ఎన్నికల అధికారుల మీద క్రిమినల్ కేసు నమోదు చెయ్యాలని కోర్టు ఆదేశించింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో పాటు చీఫ్ ఎలక్షన్ అధికారి రాజీవ్ కుమార్, రోనాల్డ్ రోస్ ప్రస్తుత ghmc కమిషనర్, సంజయ్ కుమార్ కేంద్ర ఎన్నికల అధికారి, మహబూబ్ నగర్ కలెక్టర్ ఎస్ వెంకట్ రావు, ఆర్థివో శ్రీనివాస్, పద్మ శ్రీ డిప్యుటీ కలెక్టర్, కే వెంకటేష్ గౌడ్, నోటరీఅడ్వకేట్ రాజేంద్ర ప్రసాద్, దానం సుధాకర్ ప్రపోజర్ లపై క్రిమినల్ కేసు నమోదు చేయాలనీ ఆదేశించింది అని తెలిపారు రాఘవేంద్ర రాజు. ‘‘ఎన్నికల కమిషన్ కు తప్పుడు నివేదిక ఇచ్చాడని పిటిషన్ లో తెలిపాను. ఎన్నికల కమీషన్ వెబ్సైట్ టాంపరింగ్ కు పాల్పడ్డారని ఆధారాలు ఇచ్చాను. 11 సెప్టెంబర్ పూర్తి నివేదిక ఇవ్వాలని మహబూబ్ నగర్ టూ టౌన్ ఇన్స్పెక్టర్ కు కోర్టు ఆదేశాలు ఇచ్చింది’’ అని తెలిపారు. ఇదీ చదవండి: కాంగ్రెస్ తోక పార్టీలా బీఆర్ఎస్ -
మార్గదర్శి చిట్‌ఫండ్స్ కేసు.. చందాదారుల చాటున పిటిషన్లు!
సాక్షి, అమరావతి: భారీగా ఆర్థిక అక్రమాలు వెలుగు చూసిన మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో కొన్ని చిట్ గ్రూపులను మూసివేసిన నేపథ్యంలో యాజమాన్యం తన చందాదారులను రంగంలోకి దించింది. చిట్ గ్రూపుల మూసివేతను సవాల్ చేస్తూ వారి ద్వారా హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లను దాఖలు చేయించింది. పిటిషన్లు దాఖలు చేసిన న్యాయవాదులు కూడా వేర్వేరు. పిటిషన్లు వేర్వేరు అయినప్పటికీ అందులో పేర్కొన్న వివరాలన్నీ దాదాపు ఒకే రకంగా ఉన్నాయి. పేరా నంబర్లు సైతం ఒకటే ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తు కాగా పిటిషనర్ల తరఫున హైకోర్టులో వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు ప్రముఖ సీనియర్ న్యాయవాదుల్లో ఒకరైన మీనాక్షి అరోరాను రంగంలోకి దించడం గమనార్హం. ఆమె ఒక్కో కేసుకు రోజుకు సగటున రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు (సుప్రీంకోర్టు వెలుపల వాదించే కేసుల్లో) తీసుకుంటారని సుప్రీంకోర్టు న్యాయవాదుల ద్వారా తెలిసింది. అంత పెద్ద మొత్తం తీసుకునే సీనియర్ న్యాయవాదిని నియమించుకునే సామర్థ్యం సాధారణ చందాదారులైన పిటిషనర్లకు ఉంటుందా? అనే సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. చిట్ గ్రూపు చందాదారుల తరఫున బుధవారం వాదనలు వినిపించిన మీనాక్షి అరోరా పిటిషనర్ల తరఫున కంటే మార్గదర్శి గురించే ఎక్కువగా వాదించడం విశేషం. మార్గదర్శి చరిత్ర, టర్నోవర్, చందాదారుల వివరాలను నివేదించారు. ఇప్పటివరకు మార్గదర్శిపై చందాదారుల నుంచి ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని కోర్టుకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ నిరంతరాయంగా మార్గదర్శిని వేధింపులకు గురి చేస్తున్నాయని చెప్పారు. సీఐడీ కేసులపై మార్గదర్శి యాజమాన్యం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి స్టే కూడా పొందిందని తెలిపారు. చందా తాలుకూ చెక్కు మొత్తాన్ని 7 రోజుల్లో చెల్లించాల్సి ఉండగా మార్గదర్శి యాజమాన్యం 30 రోజుల తరువాత చెల్లించిందని, ఇంత చిన్న కారణంతో చిట్ గ్రూపును మూసివేశారని పేర్కొన్నారు. ఎలాంటి నోటీసు, వాదనలు వినిపించుకునే అవకాశం ఇవ్వకుండా నేరుగా చిట్ గ్రూపు మూసివేత ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. ఈ సమయంలో న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య జోక్యం చేసుకుంటూ చిట్ గ్రూపు మూసివేత ఉత్తర్వులపై అప్పీల్ దాఖలు చేసుకునే ప్రత్యామ్నాయం ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకోకుండా నేరుగా హైకోర్టును ఎలా ఆశ్రయిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నందున నేరుగా హైకోర్టును ఆశ్రయించామని మీనాక్షి అరోరా పేర్కొన్నారు. ప్రత్యామ్నాయం ఉన్నా నేరుగా హైకోర్టును ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు తీర్పులున్నాయని చెప్పారు. చిట్ గ్రూపుల మూసివేతకు బదులు అధికారులు జరిమానా విధించి వదిలేసి ఉండాల్సిందన్నారు. మీనాక్షి అరోరా వాదనలను ముగించడంతో న్యాయమూర్తి తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు. -
రాజధానిపై జూలై 11న విచారణ
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించిన పిటిషన్లు జూలై 11న విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. మూడు రాజధానుల ఏర్పాటుపై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌తోపాటు మరికొన్ని వ్యాజ్యాలు మంగళవారం జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చాయి. ఇతర కేసుల విచారణతో కోర్టు సమయం ముగియడంతో ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు కేకే వేణుగోపాల్, నిరంజన్‌రెడ్డిలు పిటిషన్ విచారణ అంశాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఇప్పటికిప్పుడు విచారణ సాధ్యం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. వీలైనంత త్వరగా విచారణ తేదీ ఖరారు చేయాలని, ఏప్రిల్ 11 జాబితాలో చేర్చాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు కోరారు. అయితే, జూలై 11న జాబితాలో చేర్చాలని ఆదేశిస్తామని ధర్మాసనం తెలిపింది. అప్పటి వరకు కాకుండా ఏప్రిల్‌లో ఏదో ఒక తేదీ ఖరారు చేయాలని ఏపీ న్యాయవాదులు కోరారు. ఏప్రిల్ 11న ఇప్పటికే 13 అంశాలు జాబితా అయ్యాయని ఆ తర్వాత అంశంగా చేపడతామని జస్టిస్ జోసెఫ్ చెప్పారు. జాబితాలో తొలి అంశంగా చేర్చాలని, గతంలోనూ తొలి అంశంగా చేర్చారని నిరంజన్‌రెడ్డి తెలిపారు. జూలైలో విచారణ చేపడతామని, ఈ మధ్య కాలంలో సుదీర్ఘ విచారణ సాధ్యం కాదని ధర్మాసనం పేర్కొంది. విచారణకు ఎంత సమయం తీసుకుంటారని అన్ని పక్షాల న్యాయవాదులను జస్టిస్ బీవీ నాగరత్న కోరారు. ప్రతివాదులుగా సుమారు 250 మంది ఉన్నారని ఓ న్యాయవాది తెలిపారు. ఏపీ తరపు న్యాయవాది కేకే వేణుగోపాల్ స్పందిస్తూ.. ‘రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్న చట్టాలపై హైకోర్టు తీర్పు ఇచ్చింది. అలాగని పూర్తిస్థాయి స్టే ఎక్కడా లేదు. పైగా ఈ అంశం కోర్టు పరిధిలోది కాదు. ఇది పూర్తిగా అకడమిక్ (థియరిటికల్ ఆసక్తి ఉంటుంది కానీ ప్రాక్టికల్ రిలవెన్స్ ఉండదు). వాదనలకు ఓ గంట చాలు. రాష్ట్ర ప్రభుత్వం చేతులు కట్టేశారు. అభివృద్ధి ముందుకు వెళ్లడంలేదు. మీరే త్వరగా విచారణ పూర్తి చేయాలి. ఈ అంశాన్ని తేల్చాలి’’ అని ధర్మాసనానికి వివరించారు. దీనికి జస్టిస్ కేఎం జోసెఫ్ స్పందిస్తూ.. జూన్‌లో పదవీ విరమణ చేస్తున్నానని, ఈలోగా సుదీర్ఘంగా కేసు వినడం సాధ్యం కాదని చెప్పారు. జూలై 11న జాబితాలో చేర్చాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. -
మోదీ బీబీసీ డాక్యుమెంటరీ నిషేధంపై సుప్రీంకోర్టులో విచారణ..
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ 2002లో గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు జరిగిన గోద్రా అల్లర్లపై బీబీసీ డాక్యుమెంటరీ రూపొందించిన విషయం తెలిసిందే. ఇది పూర్తి దురుద్దేశంతో ఉందని కేంద్రం ఇందుకు సంబంధించిన రెండు వీడియోలను బ్యాన్ చేసింది. యూట్యూబ్, ట్విట్టర్లో వీడియో లింకులను బ్లాక్ చేసింది. తాజాగా కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. బీబీసీ డాక్యుమెంటరీని నిషేధించడం రాజ్యాంగ విరుద్ధమని, ఏకపక్ష నిర్ణయమని సీనియర్ న్యాయవాదులు ఎంఎల్ శర్మ, సీయూ సింగ్ తమ పిటిషన్లలో పేర్కొన్నారు. వీటిని అత్యవసరంగా విచారించాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. సీనియర్ జర్నలిస్ట్ ఎన్ రామ్, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కూడా బీబీసీ వీడియోలను కేంద్రం బ్లాక్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలు చేశారు. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ జేబీ పార్దీవాలాతో కూడిన బెంచ్ వీటిని పరిశీలించింది. వీటన్నింటిపై ఫిబ్రవరి 6న విచారణ చేపడతామని చెప్పింది. చదవండి: చావనైనా చస్తా.. కానీ బీజేపీతో మాత్రం చేతులు కలపను.. -
ఎమ్మెల్యేల కేసులో ఊహించని ట్విస్ట్‌లు.. బీజేపీకి కొత్త టెన్షన్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే స్పీడ్ పెంచిన సిట్.. బీజేపీ సీనియర్ నేతకు నోటీసులు ఇచ్చింది. దీంతో, ఈ కేసు మరింత ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సిట్ దర్యాప్తుపై మండిపడుతున్నారు. అయితే, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ ఇప్పటికే పలువురికి నోటీసులు ఇచ్చింది. తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు ఈనెల 21వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. విచారణకు హాజరుకాకపోతే అరెస్ట్ చేస్తామని సిట్ నోటీసుల్లో పేర్కొంది. ఇక, బీఎల్ సంతోష్‌కు నోటీసులు ఇవ్వడంపై రాజకీయ దుమారం రేగింది. మరోవైపు.. సిట్ నోటీసులపై హైకోర్టులో స్టే ఇవ్వాలని బీజేపీ కోరింది. దర్యాప్తు పేరుతో కేసుకు సంబంధం లేని వారిని సిట్ వేధిస్తోందని బీజేపీ ఆరోపించింది. ఇదిలా ఉండగా.. సిట్ నోటీసులపై శనివారం హైకోర్టులో బీజేపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. బీఎల్ సంతోష్, న్యాయవాది శ్రీనివాస్‌కు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి పిటిషన్ వేశారు. 41ఏ నోటీసుల వెనుక అరెస్ట్ చేసే కుట్ర దాగి ఉంది. కేసుతో సంబంధంలేని వ్యక్తులకు నోటీసులు ఇచ్చారు. సిట్ నోటీసులపై స్టే విధించాలని పిటిషనర్ కోరారు. ఈ కేసులో 8 మందిని ప్రతివాదులుగా చేర్చుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో, ఈ కేసులో ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. -
AP High Court: అమరావతి పాదయాత్రపై సవరణ పిటిషన్లు కొట్టివేత
సాక్షి, అమరావతి: అమరావతి పాదయాత్రపై సవరణ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. పిటిషన్లకు విచారణ అర్హత లేదని హైకోర్టు పేర్కొంది. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై హైకోర్టు స్పందిస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించాలని స్పష్టం చేసింది. చదవండి: సలహాదారులుగా ఎవరిని నియమించాలో ప్రభుత్వ ఇష్టం కాగా, అమరావతే రాజధానిగా ఉండాలంటూ చేస్తున్న మహా పాదయాత్రపై గతంలో కూడా హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసిన తెలిసిందే. ఈ పాదయాత్రను రాజకీయ యాత్రగా హైకోర్టు తేల్చింది. రైతులను ముందుంచి ఇతరులు ఈ యాత్రను నడిపిస్తున్నారని స్పష్టం చేసింది. అమరావతికి అనుకూలంగా తాము తీర్పు ఇచ్చినప్పటికీ రైతులు పాదయాత్ర చేస్తుండటాన్ని ఆక్షేపించింది. రైతులు ఎందుకు పాదయాత్ర చేస్తున్నారని ప్రశ్నించింది. రాజధాని వ్యవహారంపై సుప్రీంకోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉండగా ఇలాంటి యాత్రలు చేయడం ఏమిటంటూ నిలదీసింది. యాత్రల ద్వారా కోర్టులపై ఒత్తిడి తెస్తున్నారా? అంటూ అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
భోగాపురం ఎయిర్‌పోర్టుపై దాఖలైన అన్ని పిటిషన్లు కొట్టివేత
-
భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి లైన్ క్లియర్
సాక్షి, అమరావతి: భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి లైన్ క్లియర్ అయ్యింది. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఏపీ హైకోర్టు ఎత్తేసింది. భోగాపురం ఎయిర్‌పోర్టుపై దాఖలైన అన్ని పిటిషన్లు కోర్టు కొట్టివేసింది. ఎయిర్‌పోర్టు నోటిఫికేషన్ చెల్లదంటూ గతంలో రైతులు పిటిషన్ దాఖలు చేశారు. అనంతరం పలువురు రైతులు కేసు ఉపసంహరించుకున్నారు. ఇప్పటికే రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించింది. మిగిలిన రైతుల పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం ఇప్పటికే జీఎంఆర్‌తో ఒప్పందం కుదిరింది. హైకోర్టు తీర్పుతో పనుల ప్రారంభానికి అడ్డంకులు తొలగాయి. నిర్మాణంపై గతంలో వేసిన స్టేను కూడా హైకోర్టు ఎత్తేసేంది. చదవండి: అసాగో బయోఇథనాల్ ప్లాంట్‌కు సీఎం జగన్ భూమి పూజ -
AP: ఒకే అంశంపై రెండు పిటిషన్లు.. హైకోర్టు ఆగ్రహం
సాక్షి, అమరావతి: మొదట ఓ పిటిషన్ వేసి, ఆ విషయాన్ని దాచి పెట్టి... అదే అంశంపై మరో పిటిషన్ దాఖలు చేసిన విశాఖ వాసి పి.రంగారావుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని స్పష్టం చేసింది. ఖర్చుల కింద నెల రోజుల్లో రూ.లక్ష హైకోర్టు న్యాయ సేవాధికార సంస్థ వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించింది. గడువు లోపు చెల్లించకపోతే ఆ మొత్తం వసూలుకు చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రార్ జనరల్‌కు తెలిపింది. వాస్తవాలను దాచిపెట్టి కోర్టు ప్రక్రియలో జోక్యం చేసుకున్నందుకు అతనిపై క్రిమినల్ కోర్టు ధిక్కారం కింద చర్యలకు ఉపక్రమించింది. ఈ కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని సంబంధిత బెంచ్ ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరి ఇటీవల తీర్పు వెలువరించారు. చదవండి: విజయవాడ మీదుగా 100 ప్రత్యేక రైళ్లు విశాఖపట్నం సాగర్‌నగర్ ఎంఐజీ ఇళ్ల సమీపంలో కామన్ ఏరియా స్థలాన్ని ఈశ్వరరావు, మరొకరు ఆక్రమించారని, దీనిపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదంటూ అదే ప్రాంతానికి చెందిన రంగారావు ఈ ఏడాది సెప్టెంబర్‌లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇది పెండింగ్‌లో ఉండగానే, ఇదే అంశంపై అక్టోబర్‌లో మరో పిటిషన్ వేశారు. మొదటి దాని గురించి రెండో పిటిషన్లో పేర్కొనలేదు. అలాగే ఈ విషయానికి సంబంధించి ఇంతకు ముందు తానెలాంటి పిటిషన్ వేయలేదని అందులో లిఖితపూర్వకంగా పేర్కొన్నారు. ఈ రెండు వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరి విచారణ జరిపారు రెండో పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు రంగారావు వేసిన మొదటి పిటిషన్ గురించి విశాఖపట్నం పట్టణాభివృద్ధి సంస్థ న్యాయవాది వి.సూర్యకిరణ్, గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ న్యాయవాది ఎస్.లక్ష్మీనారాయణరెడ్డి న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. మొదటి పిటిషన్ దాఖలుకు స్థానిక న్యాయవాదికి అన్ని కాగితాలు ఇచ్చారని, అయితే, ఆ పిటిషన్ వేసిన సంగతి మాత్రం రంగారావుకు తెలియదని ఆయన తరఫు న్యాయవాది వివరించారు. రెండో పిటిషన్ దాఖలుకు ఆయన తన వద్దకు వచ్చారని, గత పిటిషన్ సంగతి చెప్పలేదని అన్నారు. దీంతో న్యాయమూర్తి మొదట పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాదిని పిలిపించారు. రంగారావే ఆ పిటిషన్ దాఖలు చేశారని ఆ న్యాయవాది తెలిపారు. దీంతో మొదటి పిటిషన్ దాఖలు చేసింది రంగారావే అని నిర్ధారణకు న్యాయమూర్తి వచ్చారు. రంగారావు దాఖలు చేసిన రెండో పిటిషన్‌ను కొట్టేస్తూ ఖర్చుల కింద రూ.లక్ష చెల్లించాలని ఆయన్ను ఆదేశించారు. ఆయనపై క్రిమినల్ కోర్టు ధిక్కార కేసు నమోదు చేయాలని ఆదేశించారు. -
సహనం కోల్పోతున్నాం: హిజాబ్ వాదనలపై సుప్రీం
ఢిల్లీ: హిజాబ్ పిటిషన్లపై విచారణలో వాదనలు త్వరగతిన పూర్తి చేయాలని, తాము సహనాన్ని కోల్పోతున్నామంటూ విచారణ కొనసాగిస్తున్న సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. గత తొమ్మిది రోజులుగా సుప్రీం బెంచ్ ఈ పిటిషన్లపై వాదనలు వింటూనే ఉంది. అయితే.. బుధవారం పిటిషన్‌పై విచారణ సందర్భంగా పిటిషనర్ల తరపు న్యాయవాదులను ఉద్దేశించి మందలింపు వ్యాఖ్యలు చేసింది. గురువారం(ఇవాళ) వాదనలు వినిపించేందుకు ఒక గంట టైం ఇస్తాం. ఆలోపు పిటిషనర్ల తరపున న్యాయవాదులు తమ వాదనలు పూర్తిగా వినిపించాలి. వాదనలు మరీ శ్రుతిమించి పోతున్నాయి. ఇంతేసి టైం వృధా చేయడం సరికాదు అని జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాన్షు ధూలియా.. పిటిషనర్లలో ఒకరి తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్ అడ్వొకేట్ హుజేఫా అహ్మదికి గట్టిగానే సూచించారు. కర్ణాటక హిజాబ్ బ్యాన్ వివాదంపై.. సుప్రీం కోర్టులో పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు దుష్యంత్ దవే, సల్మాన్ ఖుర్సీద్ల బృందం వాదనలు వినిపిస్తోంది. ఇక కర్ణాటక ప్రభుత్వం తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, కర్ణాటక అడ్వొకేట్ జనరల్ ప్రభూలింగ్ నవడ్గి, అదనపు సోలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్ వాదనలు వినిపిస్తున్నారు. ఇదీ చదవండి: ఎన్నికలకు ముందే బలమైన విపక్ష కూటమి! -
వినతీపత్రాలు స్వీకరిస్తున్న సీఎం వైఎస్ జగన్
-
ప్రభుత్వాలు సొంతంగా పనిచేస్తే పిటిషన్ల అవసరం ఉండదు
న్యూఢిల్లీ: ప్రభుత్వాలు సొంతంగా పనిచేస్తే న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు చేయాల్సిన అవసరం ఎవరికీ ఉండదని సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. దేశ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్), ఢిల్లీలో వాయు కాలుష్యం నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ విషయంలో ‘ఎన్సీఆర్, పరిసర ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్’ కమిషన్ జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయాలని పేర్కొంది. రాజధానిలో గాలి నాణ్యతను పెంచేలా ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ప్రత్యేక న్యాయస్థానం వరుసగా రెండోరోజు శుక్రవారం కూడా విచారణ జరిపింది. విద్యార్థుల ఆరోగ్యాన్ని, భద్రతను దృష్టిలో పెట్టుకొని ఢిల్లీలో పాఠశాలలను మూసివేయాలని ఆదేశించినందుకు ఓ వర్గం మీడియా, కొందరు వ్యక్తులు తమను(న్యాయమూర్తులు) విలన్‌గా చిత్రీకరిస్తున్నారని ఆక్షేపించింది. ఢిల్లీలో వాయు కాలుష్యం కేసును మూసివేయబోమని స్పష్టం చేసింది. కాలుష్యం కట్టడికి ప్రభుత్వాలు చేపట్టే చర్యలను పర్యవేక్షిస్తూనే ఉంటామని తేల్చిచెప్పింది. కోవిడ్–19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు గాను ఆసుపత్రులను సిద్ధం చేయడానికి వీలుగా నిర్మాణాలను పునఃప్రారంభించేందుకు ఢిల్లీ ప్రభుత్వానికి ధర్మాసనం అనుమతి మంజూరు చేసింది. ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. ఢిల్లీ, దేశ రాజధాని ప్రాంతంలో వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి ఐదుగురు సభ్యులతో ఒక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు తెలియజేసింది. తాము సూచించిన చర్యల అమలు తీరును పర్యవేక్షించడానికి ప్రత్యేక బృందాలను సిద్ధం చేసినట్లు పేర్కొంది. -
అభివృద్ధి వికేంద్రీకరణ, రాజధాని పిటిషన్లపై హైకోర్టులో విచారణ
సాక్షి, అమరావతి : అభివృద్ధి వికేంద్రీకరణ, రాజధానికి సంబంధించిన పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. సీజే అరూప్‌కుమార్ గోస్వామితో పాటు జస్టిస్ బాగ్చి, జస్టిస్ జయసూర్యతో ఏర్పాటైన ఫుల్ బెంచ్ మొత్తం 57 పిటిషన్లపై విచారణ జరిపింది. తదుపరి విచారణ నవంబర్ 15కు వాయిదా వేసింది. -
ఆ నిధుల విడుదలకు హైకోర్టు ఓకే
సాక్షి, హైదరాబాద్: భూసేకరణలో భాగంగా చెల్లించాల్సిన పరిహారానికి సంబంధించి కోర్టు ధిక్కరణ, ఎగ్జిక్యూషన్ పిటిషన్లు దాఖలు చేసినవారికే రూ.59 కోట్లు విడుదల చేస్తూ జీవో 208 జారీ చేశామన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనపై హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు గతంలో ఈ నిధులను విడుదల చేయరాదంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తేసింది. నిధుల విడుదలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. కోర్టుధిక్కరణ కేసుల్లో హాజరైనవారి కోసం అంటూ రూ.59 కోట్లను విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ నాగర్‌కర్నూలు జిల్లాకు చెందిన లెక్చరర్ సి.ప్రభాకర్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం మరోసారి విచారించింది. గతంలో ఆదేశించిన మేరకు జీవోను సవరించి తాజాగా జారీచేశారా అని ధర్మాసనం అడ్వొకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్‌ను ప్రశ్నించింది. ఈ పిటిషన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ దాఖలు చేసిన కౌంటర్లోని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఏజీ నివేదించారు. ఈ నిధులను ఎందుకోసం ఖర్చు చేస్తున్నారో స్పష్టం చేస్తూ సవరించిన జీవో జారీచేయడానికి ఇబ్బంది ఏంటని ధర్మాసనం ప్రశ్నించగా గత ఏడాది విడుదల చేసిన నిధులు సకాలంలో నిర్వాసిత రైతులకు అందించలేకపోయామని, దీంతో తాజాగా ఈ జీవో జారీచేయాల్సి వచ్చిందని వివరించారు. -
సీఎం జగన్‌పై దాఖలైన పిటిషన్లు కొట్టివేత..
సాక్షి, ఢిల్లీ: వైఎస్ జగన్‌ను సీఎం పదవి నుంచి తొలగించాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఆయనపై దాఖలైన పిటిషన్‌కు విచారణ అర్హత లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జిఎస్ మణి, ప్రదీప్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. మీడియాకు లేఖ విడుదలపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరగా.. గ్యాగ్ ఆర్డర్ ఎత్తివేసిన తర్వాత ఇది ఎలా సాధ్యమని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ప్రశ్నించారు. (చదవండి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్) పిటిషన్లో లేవనెత్తిన అంశాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. పత్రికల్లో వచ్చిన వార్తలను చూసి పిటిషన్లు దాఖలు చేయడమేంటని సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సీబీఐ దర్యాప్తు జరపాలా? వద్దా? అన్నది సీజేఐ పరిధిలోని అంశమని ధర్మాసనం స్పష్టం చేసింది. సీఎం పదవి నుంచి తొలగించాలనే అభ్యర్థనకు విచారణ అర్హత లేదని, లేఖలో అంశాలపై ఇప్పటికే వేరే సుప్రీం బెంచ్ పరిశీలిస్తోందని పేర్కొన్నారు. పిటిషన్లలో అభ్యర్థనలు అన్ని గందరగోళంగా ఉన్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. యాంటీ కరప్షన్ కౌన్సిల్ ఎక్కడిదని, నిధులు ఎక్కడివని, ధర్మాసనం ప్రశ్నించింది. లేఖలోని అంశాలపై ఎంత మంది జోక్యం చేసుకుంటారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దాఖలైన మూడు పిటిషన్లలో రెండు పిటిషన్లు సుప్రీంకోర్టు కొట్టివేసింది.(చదవండి: రమేష్ బాబు కేసు: వేగం పెంచిన పోలీసులు) -
పౌరసత్వ రగడ: సుప్రీంలో కేంద్రానికి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్వల్ప ఊరట లభించింది. చట్టంపై స్టే ఇవ్వడానికి న్యాయస్థానం నిరాకరించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తు దాఖలైన మొత్తం పిటిషన్లపై జనవరి 22న విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. అలాగే దీనిపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు జారీచేసింది. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలకు కేంద్ర బిందువైన పౌరసత్వ సవరణ చట్టంపై సుప్రీంకోర్టులో 60 పిటిషన్లు దాఖలు అయిన విషయం తెలిసిందే వీటన్నింటిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం బుధవారం చేపట్టింది. చట్టంపై స్టే ఇవ్వాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చింది. బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్రమాజీ మంత్రి జైరాంరమేష్, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, టీఎంసీ ఎంపీ మహువ మొయిత్రా, ఆర్జేడీ, ముస్లింలీగ్ పార్టీల ప్రతినిధులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ఆరుగురు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఆరుగురు ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్లపై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టింది. వారిని కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. నోటీసులు జారీ అయిన వారిలో వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకురు ఆనంద్, పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఉన్నారు. తదుపరి విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది. రవిప్రకాశ్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ.. టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాశ్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోర్టు మరోసారి సూచించింది. వచ్చే నెల 7లోపు మరో నిర్ణయం తెలపాలని హైకోర్టు తెలిపింది. అప్పటి వరుకు రవిప్రకాష్‌పై ఉన్న స్టే కొనసాగుతుంది. తుదుపరి విచారణను కోర్టు వచ్చే నెల 7 కు వాయిదా వేసింది. -
ఆ కేసుల బదలాయింపుపై త్రిసభ్య ధర్మాసనం విచారణ
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు ఏర్పడే నాటికి దాఖలైన అప్పీళ్లు, కోర్టు ధిక్కార పిటిషన్లు, పునఃసమీక్షా పిటిషన్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముడిపడి ఉన్న వాటిని ఆ రాష్ట్ర హైకోర్టుకు బదిలీ చేయాలా.. వద్దా అన్న అంశంపై ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన హైకోర్టు ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తులు జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. ఉమ్మడి హైకోర్టు ఏర్పడే నాటికి దాఖలైన అప్పీళ్లు, కోర్టు ధిక్కార పిటిషన్లు, పునఃసమీక్షా పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణ జరపడంవల్ల ఏపీ న్యాయవాదులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఏపీ హైకోర్టు ఏర్పడిన నేపథ్యంలో ఏపీకి చెందిన కేసులన్నింటినీ కూడా ఆ రాష్ట్ర హైకోర్టుకు బదిలీ చేసేలా నిర్ణయం తీసుకోవాలంటూ ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసింది. ఈ లేఖను పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి దానిని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించారు. విచారణ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ, రిట్ పిటిషన్లు, సివిల్ కేసులు, క్రిమినల్ కేసులను ఏపీకి బదలాయించడంలో ఇబ్బంది లేదంది. రిట్ అప్పీళ్లు, కోర్టు ధిక్కార పిటిషన్లు, పునః సమీక్షా పిటిషన్లను బదిలీ చేయడం సాధ్యం కాకపోవచ్చంది. ఉద్యోగుల సర్వీసు వివాదాలకు సంబంధించిన కేసుల విషయంలో కూడా తగిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందంది. ఉమ్మడి హైకోర్టు ఏర్పడే నాటికి దాఖలైన అప్పీళ్లు, కోర్టు ధిక్కార పిటిషన్లు, పునఃసమీక్షా పిటిషన్లపై విచారణ జరిపే పరిధి ఉమ్మడి హైకోర్టుకు ఉందంటూ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 40(3) చెబుతోందనిగుర్తు చేసింది. -
టీచర్ల బదిలీలకు లైన్ క్లియర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ప్రభుత్వ టీచర్ల బదిలీలకు లైన్ క్లియర్ అయింది. ఉపాధ్యాయ బదిలీ నిబంధనలను సవాల్ చేసిన వ్యాజ్యాలపై వాదనలు ముగియడంతో హైకోర్టు తుది తీర్పును వెల్లడించింది. టీచర్ల బదిలీ ప్రక్రియ నిలిపి వేయాల్సిన అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. బదిలీలు ఆపాలంటూ హైకోర్టులో దాఖలైన 125 పిటిషన్లను ధర్మాసనం కొట్టేసింది. మరోవైపు.. ‘‘బదిలీ ఉత్తర్వులు చట్ట వ్యతిరేకంగా ఉన్నాయి. ఏకీకృత సర్వీసు నిబంధనలకు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి ఉత్తర్వుల్ని యథాతథంగా ఉంచాలని గతంలోనే హైకోర్టు ఆదేశించింది. ఈ పరిస్థితుల్లో బదిలీ ఉత్తర్వుల్ని రద్దు చేయాలి’’. అని ప్రభుత్వ ఉపాధ్యాయుల తరఫున సీనియర్ న్యాయవాది రామచంద్రరావు, జెడ్పీ టీచర్ల తరఫున సీనియర్ న్యాయవాది సురేందర్‌రావు వాదించిన విషయం తెలిసిందే. ‘‘డీఈవో లేని చోట్ల ఉపాధ్యాయులను బదిలీచేసే అధికారం ఆర్జేడీలకు అప్పగించాం. పూర్వపు పది జిల్లాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని బదిలీలు జరుగుతాయి. పైరవీలకు ఆస్కారం లేదనే కొందరు కావాలని బదిలీ ప్రక్రియను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు. వ్యాజ్యాలను కొట్టివేసి బదిలీలు జరిగేలా చేయాలి’’ అని సర్కార్ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు ప్రతివాదన చేశారు. గతంలో పలు దఫాలు వాయిదా పడగా.. బదిలీలు ఆపాలంటూ దాఖలైన అన్ని పిటిషన్లను నేడు కొట్టివేసిన ధర్మాసనం ప్రక్రియను కొనసాగించవచ్చునని స్పష్టం చేసింది. -
ఆధార్‌పై తీర్పు రిజర్వ్
న్యూఢిల్లీ: ఆధార్ పథకం, దాని అమలుకు రూపొందించిన చట్టం రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. సీజేఐ జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ముందు మొత్తం 31 పిటిషన్లు దాఖలు కాగా.. వాటిలో హైకోర్టు మాజీ జడ్జి కేఎస్ పుట్టుస్వామి దాఖలు చేసిన పిటిషనూ ఉంది. ఈ పిటిషన్లపై నాలుగున్నర నెలల వ్యవధిలో మొత్తం 38 రోజులు ధర్మాసనం వాదనల్ని ఆలకించింది. 1973లో చారిత్రాత్మక కేశవానంద భారతీ కేసు అనంతరం ఎక్కువ రోజులు విచారించిన కేసు ఇదే. ధర్మాసనం ముందు పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది గోపాల సుబ్రమణియమ్ వాదిస్తూ.. ‘సేవలు అందించేందుకు ఆధార్ చట్టం మాధ్యమం కాదు. ఇది కేవలం ఒక గుర్తింపు మాత్రమే. ఆధార్ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం గౌరవం, స్వేచ్ఛకు భద్రత లేదు. ధ్రువీకరణ అనేది ఈ చట్టం ప్రధాన ఉద్దేశం. ధ్రువీకరణలో విఫలమైతే సేవల్ని నిరాకరించవచ్చని చట్టంలో పేర్కొన్నారు’ అని వాదించారు. ఆధార్ సమాచారాన్ని పొందేందుకు ప్రైవేటు వ్యక్తులకు అనుమతిచ్చారని, ఈ చట్టానికి ఎలాంటి భద్రతా లేదన్నారు. ఆధార్ వంటి చట్టానికి నియంత్రణ అవసరమని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. మనీ లాండరింగ్ నియంత్రణ చట్టం ప్రకారం ఆధార్ కేవలం బ్యాంకులకు మాత్రమే పరిమితం కాదని.. మ్యూచువల్ ఫండ్లు, బీమా పాలసీలు, క్రెడిట్ కార్డులు, ఇతర అంశాలకు అవసరమని మరో సీనియర్ న్యాయవాది అర్వింద్ దతర్ ఆందోళన వెలిబుచ్చారు. ఈ కేసులో కక్షిదారుల పక్షాన సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, పి.చిదంబరం, శ్యామ్ దివాన్, కేవీ విశ్వనాథ్, ఆనంద్ గ్రోవర్, సజన్ పూవయ్యలు వాదనలు వినిపించారు. రామన్ మెగసెసె అవార్డు గ్రహీత శాంతా సిన్హా, సామాజిక కార్యకర్తలు అరుణా రాయ్, నిఖిల్ డే, నచికెత్ ఉడుప తదితరులు ఆధార్‌ను వ్యతిరేకిస్తూ పిటిషన్లను దాఖలు చేశారు. కేంద్ర ప్రభుత్వం, ఆధార్ అధీకృత సంస్థ(యూఐడీఏఐ), మహారాష్ట్ర, గుజరాత్ ప్రభుత్వాలు, ఆర్బీఐలు ఆధార్‌కు అనుకూలంగా వాదనలు వినిపించగా.. వారి తరఫున అటార్నీ జనరల్ వేణుగోపాల్, అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్, లాయర్లు రాకేశ్ ద్వివేది, జయంత్ భూషణ్‌లు వాదించారు. -
అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి
ఉట్నూర్(ఖానాపూర్): గిరిజన దర్బార్‌కు వచ్చే ప్రతీ అర్జీని ఆయా విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులకు న్యాయం చేయాలని కలెక్టర్ దివ్యదేవరాజన్ అన్నారు. ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్‌కు కలెక్టర్ హాజరై గిరిజనుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఉట్నూర్ మండలం చాందూరి గ్రామానికి చెందిన మేస్రం మారుతి వికలాంగ పింఛన్ అందించాలని విన్నవించగా.. పింఛన్ మంజూరుతో పాటు మూడు చక్రాల సైకిల్ పంపిణీ చేయాలని డీఆర్డీఏ పీడీ, డీడబ్ల్యూవోను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం కిసాన్ మిత్ర హెల్ప్‌లైన్‌కు వచ్చిన కాల్స్‌పై సమీక్షించారు. ఇటీవల వడగళ్లతో దెబ్బతిన్న పంటలకు పరిహారం విషయమై ఇన్సూరెన్స్ అధికారులతో ఈనెల 21న సమావేశం ఏర్పాటు చేయాలని వ్యవసాయశాఖ అధికారులకు సూచించారు. ఉపాధి, పింఛ న్ల మంజూరు, భూసమస్యలు, ఎకనామిక్ సపోర్టు స్కీం కింద రుణాలు మంజూరు చేయాలని తదితర సమస్యలపై 310 అర్జీలు రాగా వెంటనే పరిష్కరించాలని అధికారులు ఆదేశించారు. కార్యక్రమంలో ఉట్నూర్ ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి, డీటీడీవో పోచం, ఏపీవో నాగోరావు, డీఆర్డీఓ రాజేశ్వర్ రాథోడ్, జిల్లా వ్యవసాయ అధికారి ఆశాకుమారి, జిల్లా, ఐటీడీఏ అధికారులు పాల్గొన్నారు. నీటి సమస్య పరిష్కరించాలి మా గ్రామంలో ఏళ్ల తరబడి నీటి సమస్య ఉంది. అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఉన్న చేతి పంపులు పాడైపోయినయ్. తాగునీళ్ల కోసం దూరంగా ఉన్న బోరింగ్ల వద్దకు వెళ్లాల్సి వస్తంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామంలో నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం. – నైతం శోభ, హస్నాపూర్ మూడేండ్ల సంది తిరుగుతన్నం.. మేం మూడేండ్ల సంది లోను కోసం తిరుగుతన్నం. ఎడ్లబండ్ల లోను కోసమని దరఖాస్తు ఇచ్చాం. రెండేండ్ల కిందనే బ్యాంకు కన్సల్ట్ లెటర్ ఇవ్వడం జరిగింది. అయితే లోను మంజూరు అయినా మాకు సమాచారం అందక ఆగిపోయింది. అధికారులు తొందరగా స్పందించి లోను ఇప్పించేలా చర్యలు తీసుకోవాలె. -ఆదిలాబాద్ మండలం కొలాంగూడ గ్రామస్తులు మేకల లోను మంజూరు చేయాలె మాకు ఉపాధి కోసం మేకల లోను, పంట చేన్లకు నీటి సౌకర్యం కోసం బోర్వెల్ మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నాం. విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం.. లోను తొందరగా వస్తదని అనుకుంటున్నం. -ఉట్నూర్మండలం చిన్నుగుడ గ్రామ గిరిజనులు -
ఎన్సీఎల్టీ ముందుకు 2 మొండిబాకీల కేసులు
♦ ఎలక్ట్రోస్టీల్పై ఎస్బీఐ, ఎస్సార్ స్టీల్‌పై ♦ స్టాండర్డ్ చార్టర్డ్ దివాలా పిటిషన్లు న్యూఢిల్లీ: కార్పొరేట్ల నుంచి మొండిబాకీలను రాబట్టుకునే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ సారథ్యంలోని కన్సార్షియం తాజాగా ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్‌పై దివాలా చట్టం కింద చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో కేసు దాఖలు చేసినట్లు ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్ స్టాక్ ఎక్సే్ఛంజీలకు వెల్లడించింది. కంపెనీ చెల్లించాల్సిన రుణాల సమస్య పరిష్కారంపై జూన్ 22న జరిగిన భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు ఎస్బీఐ కన్సార్షియం ఈ చర్యలు చేపట్టింది. కోల్‌కతాకు చెందిన ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్.. బ్యాంకులకు సుమారు రూ. 10,000 కోట్ల పైగా బాకీ పడింది. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కంపెనీ రూ. 293 కోట్ల మేర నష్టాలు ప్రకటించింది. అటు మరో ఉక్కు తయారీ సంస్థ ఎస్సార్ స్టీల్‌పై స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ దివాలా చర్యలు చేపట్టింది. ఎన్సీఎల్టీలో ఈ మేరకు కేసు దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎస్సార్ స్టీల్ బ్యాంకులకు రూ. 37,284 కోట్లు కట్టాల్సి ఉంది. బ్యాంకులకు భారీగా బాకీ పడ్డాయని ఆర్బీఐ గుర్తించిన 12 సంస్థల్లో ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్, ఎస్సార్ స్టీల్ కూడా ఉన్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థలో సుమారు రూ.8 లక్షల కోట్ల పైగా పేరుకుపోయిన మొండి బకాయిల్లో ఈ 12 కంపెనీలవే 25%. -
‘మీకోసం’.. జనం కోసమేనా?
► ‘మీ కోసం’లో పెరిగిపోతున్న బాధితుల అర్జీలు ► పెద్ద సంఖ్యలో పరిష్కరించినట్లు అధికారిక లెక్కలు ► గణాంకాలతో సమస్యలను కప్పిపుచ్చుతున్న యంత్రాంగం ► నూతన కలెక్టర్ వినయ్చంద్పై ఆశలు పెట్టుకున్న ప్రజల ఒంగోలు టౌన్: ‘ప్రకాశం భవనంలోని సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో ప్రతి సోమవారం నిర్వహించే మీకోసం కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ రకాల సమస్యలకు సంబంధించి గత రెండేళ్లలో 6,04,404 అర్జీలు వచ్చాయి. వాటిలో 5,71,007 అర్జీలు పరిష్కరించినట్లు జిల్లా యంత్రాంగం వెల్లడించింది. కేవలం 33,397 అర్జీలను మాత్రమే పరిష్కరించాల్సి ఉందని ఘనంగా ప్రకటించింది. మీకోసం అర్జీల పరిష్కారంలో రాష్ట్రంలో ప్రకాశం జిల్లా 8వ స్థానంలో ఉన్నట్లు పేర్కొంది. ఈ గణాంకాలు చూస్తే మీకోసం కార్యక్రమంలో అర్జీ ఇస్తే చాలు చిటికెలో పరిష్కారం అవుతుందన్న భ్రమను అమాయక ప్రజలకు జిల్లా యంత్రాంగం కల్పిస్తోంది. అయితే జిల్లా యంత్రాంగం ప్రకటించిన గణాంకాలకు, వాస్తవ పరిస్థితులకు చాలా తేడా ఉంది. ఏ వారానికి ఆ వారం అర్జీలను పరిష్కరించినట్లు గణాంకాలను ఘనంగా ప్రకటించుకుంటుంటే ఒకే సమస్యపై బాధిత ప్రజలు పదేపదే సుదూర ప్రాంతాల నుంచి మీకోసం కార్యక్రమానికి ఎందుకు వస్తున్నారో జిల్లా అధికారులే సమాధానం చెప్పాలి. ప్రస్తుతం జిల్లాలో ఎండల తీవ్రత పెరిగిపోయి వడగాలులు వీస్తున్నాయి. ప్రజలకు వారి సమస్యల ముందు ఎండలు, వడగాలులు పెద్దగా ఇబ్బంది పెడుతున్నట్లు కనిపించడం లేదు. ఎందుకంటే అంతకంటే ముఖ్యమైన తమ సమస్యలను జిల్లా అధికారులు పరిష్కరిస్తే అదే మాకు చల్లటి ఉపశమనం కలిగిస్తుందంటూ సుదూర ప్రాంతాల నుంచి మీకోసంకు అర్జీలు తీసుకొస్తూనే ఉన్నారు. మీకోసం నుంచి సంబంధిత శాఖకు వెళితే పరిష్కారమైనట్లేనా? తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజలు మండల కార్యాలయల చుట్టూ కాళ్లరిగేలా తిరిగి చివరకు జిల్లా కేంద్రమైన ఒంగోలుకు చేరుకొని జిల్లా ఉన్నతాధికారులకు మొర పెట్టుకుంటుంటారు. వారు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వాటిని సంబంధిత శాఖకు పంపిస్తున్నట్లుగా చూపించి అర్జీదారునికి రసీదు అందిస్తారు. అంటే ప్రజల నుంచి వచ్చిన అర్జీని సంబంధిత శాఖకు పంపిస్తే పరిష్కారమైనట్లేనని జిల్లా యంత్రాంగం విచిత్రమైన ప్రకటన చేయడాన్ని అర్జీదారులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ఎండలు, వడగాల్పులకు ఎదురెళ్లి తమ సమస్యలను పరిష్కరించాలని ఉన్నతాధికారులకు నివేదిస్తే.. వారు అర్జీని తీసుకొని రసీదు ఇవ్వడం, ఒకటి రెండు రోజుల తరువాత సమస్య పరిష్కరించినట్లు సంబంధిత వ్యక్తి సెల్‌ఫోన్‌కు మెసేజ్ రావడంతో ఆనందంతో ఆ కార్యాలయానికి వెళితే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా సమస్య పరిష్కారం కాకుండా అర్జీ ఆ కార్యాలయంలో అలాగే కనిపిస్తుంటుంది. తన సమస్యను పరిష్కరించలేదా అని బాధితుడు అడిగితే కలెక్టరేట్ నుంచి మాకు అర్జీ మాత్రమే వచ్చిందని సంబంధిత సిబ్బంది సమాధానం ఇవ్వడంతో అవాక్కవడం బాధితుడికి అలవాటుగా మారింది. అర్జీలను పరిష్కరించకుండానే సంబంధిత శాఖకు పంపిస్తే పరిష్కారమైనట్లుగా జిల్లా యంత్రాంగం అడ్డగోలుగా లెక్కలు చూపిస్తూ ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్త కలెక్టర్‌పైనే కోటి ఆశలు: జిల్లా కలెక్టర్‌గా వి.వినయ్‌చంద్ మూడు రోజుల క్రితం బాధ్యతలు స్వీకరించారు. ఆయన తొలిసారిగా సోమవారం మీకోసం కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆయనపైనే బాధిత ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు. గత కలెక్టర్ సుజాతశర్మ మీకోసం కార్యక్రమానికి మొక్కుబడిగానే హాజరయ్యారు. జిల్లాలో దాదాపు రెండేళ్లపాటు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటికీ కొన్ని పర్యాయాలు వారాల తరబడి మీకోసం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. పైగా ప్రజలు తమ సమస్యలను సుజాతశర్మకు విన్నవించుకున్నప్పటికీ తెలుగు భాషపై ఆమెకు పూర్తి స్థాయిలో పట్టులేకపోవడంతో కొన్నిసార్లు బాధితుల ఆవేదన అరణ్యరోదనగానే మిగిలిపోయేది. ఈ నేపథ్యంలో నూతన కలెక్టర్‌గా వినయ్‌చంద్ బాధ్యతలు స్వీకరించడం, ఆయనకు క్షేత్ర స్థాయిలో ప్రజల సాధక బాధకాలు తెలియడంతోపాటు భాష సమస్య లేకపోవడంతో మీకోసంలో అర్జీలకు త్వరితగతిన పరిష్కారం దక్కుతుందని ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. -
అసెంబ్లీ పిటిషన్ల కమిటీ ముంగిటకు తొలి పిటిషన్
⇒ స్పీకర్‌కు 4 పిటిషన్లు ⇒ సమర్పించిన బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలిసారి శాసన సభలో అసెంబ్లీ పిటిషన్స్ కమిటీ ప్రస్తావన వచ్చింది. ప్రజోపయోగానికి సంబంధించిన ఏదైనా అంశంపై ఎమ్మెల్యేలు ఈ కమిటీకి ఫిర్యాదు చేస్తే దాన్ని పరిశీలించి పరిష్కరించే దిశగా ఆ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది. గడచిన మూడేళ్లలో ఈ కమిటీ ఒక్క పిటిషన్‌ను కూడా పరిశీలించలేదు. అసలు పిటిషన్లే రాలేదు. ఈ కమిటీకి పిటిషన్స్ ఇవ్వ వచ్చన్న సమాచారం కూడా కొందరు ఎమ్మెల్యే లకు లేదనే అంశం మంగళవారం వెలుగు చూసింది. ఉదయం ప్రశ్నోత్తరాల సమయం ముగియగానే స్పీకర్ బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి పేరును పిలిచారు. వెంటనే కిషన్‌రెడ్డి లేచి తెలంగాణ శాసనసభ కొలువుదీరిన తర్వాత తొలిసారి పిటిషన్స్ కమిటీకి పిటిషన్లు అంద జేస్తున్నట్టు ప్రకటించారు. తాను ఇవ్వబోయే పిటిషన్లే ఆ కమిటీ ముంగిటకు వెళ్లే తొలి పిటిషన్స్ అని పేర్కొన్నారు. కిషన్‌రెడ్డి అందజేసిన పిటిషన్లు ఇవీ... 1. ఎస్సీ కార్పొరేషన్ 80 శాతం సబ్సిడీతో ఇచ్చే బ్యాంకు లింకేజీ రుణాల పథకాన్ని సక్రమంగా అమలయేటట్లు చూడాలి. 2. సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో పనిచేసే కుక్, క్లీనర్ల జీతాలను క్రమబద్ధీకరించాలి. 3. పేదలకు జారీ చేసిన అసైన్మెంట్ భూముల ఆక్రమణను నియంత్రించాలి. 4. మహిళా కానిస్టేబుళ్లకు పదోన్నతుల విషయంలో రిజర్వేషన్‌ను పునరుద్ధరించాలి. -
అర్హులకు న్యాయం జరిగేలా చూడాలి
► అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దు ►సమయపాలన పాటించాలి ►స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రియాంక ఉట్నూర్ : గిరిజన దర్భార్‌కు వచ్చె అర్జీలను పరిష్కరించడంలో అలసత్వం ప్రదర్శించకుండా తక్షణమే వచ్చిన అర్జీలను క్షేత్ర స్థారుులో పరిశీలించి అర్హులైన గిరిజనులకు న్యాయం జరిగేలా అధికారులు చర్యలు చెపట్టాలని స్పెషల్ డీప్యూటి కలెక్టర్ ప్రియాంక అన్నారు. సోమవారం ఐటీడీఏ కార్యలయంలో నిర్వహించిన గిరిజన దర్భార్‌లో అమె గిరిజనుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ గిరిజనుల నుంచి వచ్చిన అర్జీలను పరిష్కరించడంలో అధికారులు అలసత్వం చెయ్యవద్దాన్నారు. ప్రతి అర్జీని సంబందింత అధికారులు క్షేత్ర స్థారుులో పరిశీలించి అర్హులైన గిరిజనులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకొవాలన్నారు. ప్రతి వారం నిర్వహించు దర్భార్‌కు కొన్ని విభాగాల అధికారులు సమయపాలనా పాటించడం లేదని వారిపై చర్యలు తప్పావన్నారు. దర్భారుకు వచ్చిన అర్జీలు తనకు ఐటీడీఏ ద్వారా స్వయం ఉపాధి రుణం మంజూరు అరుు్యందని అందుకు సంబందించిన సబ్సిడీ మంజూరు చెయ్యాలని భోథ్ మండలం ఖర్దుకు చెందిన పెందోర్ దెవ్‌రావ్ అర్జీ పెట్టుకున్నాడు. తన కుటుంబ పోషణ కోసం కిరాణ దుకాణం పెట్టుకోవడానికి రుణం అందించాలని సిర్పూర్(యు) మండలం నెట్నూర్కు చెందిన గోడం నేతబారుు విన్నవించింది. తన వ్యవసాయ భూమికి నీటి సౌకర్యం లేక సాగు చెయ్యలేక పోతున్నానని బావి నిర్మించాలని గాదిగూడ మండలం అర్జునికి చెందిన కొడప కట్టు విన్నవించాడు. జీవనోఫాది కోసం మిని డైరి ఫాం పెట్టుకొడానికి రుణం మంజూరు చెయ్యాలని గుడిహత్నుర్ మండలం తోషంకు చెందిన ప్రెమ్సింగ్ వేడుకున్నాడు. తన వ్యవసాయభూమి సాగు కోసం స్పింక్లర్లు మంజూరు చెయ్యాలని ఉట్నూర్ మండలం చింతకర్రకు చెందిన సిడాం తుకారం అర్జీ పెట్టుకున్నాడు. తన పంట పోలాల సాగు కోసం ఎండ్ల జత మంజూరు చెయ్యాలని ఆసిఫాబాద్ మండలం కతోడకు చెందిన ఆత్రం భీంబారుు విన్నవించింది. తన సాగు భూమి అక్రమణ కేసులో ఉండటంతో సాగు చెసుకోలేక పోతున్నానని కేసును వెంటనే విచారణ చేపట్టాలని మందమర్రి మండల కేంద్రానికి చెందిన రమేశ్ వేడుకున్నాడు. తన వ్యవసాయ భూమికి త్రీపేస్ విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఇచ్చోడ మండలం బాబ్జిపెట్కు చెందిన టెకం దెవ్‌రావ్ విన్నవించాడు. తమ గ్రామంలో మంచినీటి పథకం లేక పోవడంతో తాగునీటికి ఇబ్బంది పడుతున్నామని తమ గ్రామంలో మంచినీటి పథకం నిర్మించాలని గాదిగూడ మండలం ఆద్మీయాన్కు చెందిన జుగ్నాక జుగాదిరావ్ వేడుకున్నాడు. తన కుటుంబ పోషణ కోసం 108 లేదా 104 వాహన డ్రైవర్‌గా ఉద్యోగం కల్పించాలని జైనూర్ మండలం ఉషేగాంకు చెందిన నాగోరావ్ అర్జీ పెట్టుకున్నాడు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో జనరల్ నాగోరావ్, తహసీల్దార్ రమేశ్, ఏంపీడీవో లక్ష్మణ్ వివిధ విభాగాల అధికారులు పాల్గోన్నారు. -
నోట్ల రద్దుపై పిటిషన్లు
న్యూఢిల్లీ: పెద్దనోట్లను కేంద్రం రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టుతో సహా దేశంలోని పలు కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈనెల 15న ఈ పిటిషన్లను విచారించే అవకాశం ఉందని సుప్రీం తెలి పింది. నోట్ల రద్దుపై దాఖలైన పిటిషన్లపై ఏవైనా ఆదేశాలు జారీ చేసే ముందు తమ వాదన వినాలంటూ సుప్రీం కోర్టులో గురువారం కేంద్రం కేవియట్ దాఖలు చేసింది. నోట్ల రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను.. ద్రవ్య విధానాలపై ప్రభుత్వ చర్యల్లో తాము జోక్యం చేసుకోబోమంటూ మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. -
రామలింగరాజు కుటుంబ సభ్యుల పిటిషన్లు కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: ఆదాయపు పన్ను చెల్లింపు విషయంలో ఐటీ శాఖ జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ సత్యం కంప్యూటర్స్ మాజీ చైర్మన్ బి.రామలింగరాజు సోదరుడు సూర్యనారాయణ రాజు, మరదలు ఝాన్సీ తదితరులు దాఖలు చేసిన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టేసింది. ఐటీ శాఖ అధికారుల నిర్ణయాన్ని అప్పిలెట్ ట్రిబ్యునల్ సమర్థించిన నేపథ్యంలో ధర్మాసనం ఇటీవల ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. -
చెత్తకుప్పలో జన్మభూమి అర్జీలు
చంద్రగిరి: ‘ప్రజా సమస్యల పరిష్కారం కోసమే జన్మభూమి సభలు నిర్వహిస్తున్నాం. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో తెలియజేస్తే పరిష్కరిస్తాం’ ఇవీ సీఎం నుంచి మంత్రులవరకు పలికిన మాటలు. ఇదంతా ఉత్త బోగస్ అని, జన్మభూమి అర్జీలు చెత్తబుట్టలకే పరిమితమయ్యాయని చంద్రగిరిలో జరిగిన ఘటన నిరూపించింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు సొంత మండలం చంద్రగిరిలో జన్మభూమి అర్జీలు చెత్తకుప్పలో దర్శనమివ్వడం విమర్శలకు తావిస్తోంది. జన ్మభూమి సభల్లో వివిధ సమస్యలపై ప్రజలు అధికారులకు, జన్మభూమి కమిటీలకు అర్జీల రూపంలో వారి సమస్యలను విన్నవించుకున్నారు. అర్జీలను స్వీకరించిన జన్మభూమి కమిటీ సభ్యులు సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని గొప్పలు చెప్పారు. టీడీపీ నాయకుల మాటలు నీటిమూటలే అన్న నానుడిని నిజం చేస్తూ చంద్రగిరి వికలాంగుల కాలనీకి వెళ్లే మార్గంలోని ప్రతిభా స్కూల్ వెనుక భాగంలోని చెత్తకుప్పలో బుధవారం గత జన్మభూమి కార్యక్రమంలో ప్రజలు ఇచ్చిన అర్జీలు ప్రత్యక్షమయ్యాయి. ఇందులో ఇల్లు, వృద్ధాప్య పింఛన్లు, రేషన్ కార్డు కోసం ఇచ్చిన అర్జీలు ఉన్నాయి. దీనిపై స్థానికులు మండిపడ్డారు. సీఎం సొంత మండలంలోనే పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన చోట్ల ఎలా ఉంటుందో అని ప్రజలు చర్చించుకోవడం కనిపించింది. -
డబుల్ ట్రబుల్
♦ గందరగోళం సృష్టిస్తున్న డబుల్ బెడ్రూం పథకం ♦ ఇప్పటివరకు మార్గదర్శకాలివ్వని ప్రభుత్వం ♦ ప్రత్యేక చొరవతో అర్జీలు స్వీకరిస్తున్న యంత్రాంగం ♦ జిల్లాలో లక్షకు పైగా అందిన దరఖాస్తులు ♦ వారం రోజులపాటు కలెక్టరేట్‌కు పోటెత్తిన జనం ♦ మీసేవా కేంద్రాల ద్వారా స్వీకరణకు నిర్ణయం రెండు పడకగదుల ఇళ్ల పథకం గందరగోళాన్ని సృష్టిస్తోంది. ఈ పథకం కింద ఇప్పటికే జిల్లా యంత్రాంగం దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. వాటి పరిశీలన అంశంపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. దీంతో అర్జీలను స్వీకరిస్తున్న అధికారులు వాటిని అటకెక్కిస్తున్నారు. వాస్తవానికి దరఖాస్తుల స్వీకరణపైనా సర్కారు సూచనలివ్వనప్పటికీ.. జిల్లా యంత్రాంగం ప్రత్యేక చొరవతో దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ క్రమంలో అంచనాలకు మించి వేలాదిగా కలెక్టరేట్‌కు తరలివచ్చి దరఖాస్తులిస్తున్నారు. కలెక్టరేట్‌కు వస్తున్న జనతాకిడిని కట్టడి చేసేందుకు తాజాగా మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తుల స్వీకరణకు జిల్లా యంత్రాంగం ఉపక్రమించింది. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా లక్షకుపైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇలా ఇబ్బడిముబ్బడిగా దరఖాస్తులు వస్తుండడం యంత్రాంగానికి తలనొప్పిగా మారింది. - సాక్షి, రంగారెడ్డి జిల్లా సాక్షి, రంగారెడ్డి జిల్లా : డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 400 చొప్పున జిల్లాకు 5,600 ఇళ్లను మంజూరు చేసింది. తాండూరు, మేడ్చల్ నియోజకవర్గాలకు సీఎం ప్రత్యేక కోటా కింద 1,250 ఇళ్లను కేటాయించారు. ఈక్రమంలో జిల్లాలో 6,850 ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఈమేరకు గతేడాది దసరారోజున జిల్లా అంతటా భూమిపూజ పూర్తిచేశారు. స్థలాలపై స్పష్టత లేకపోవడం.. నిర్మాణాలకు సంబంధించి టెండర్లు ఖరారు కాకపోవడంతో ఈ పనులు ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా తయారయ్యాయి. వాస్తవానికి ఈ ఏడాది దసరాలోగా ప్రభుత్వం నిర్దేశించిన సంఖ్యలో అర్హులకు ఇళ్లను నిర్మించి ఇవ్వాలి. నిర్మాణ పనులే మొదలు కాకపోవడంతో దసరా నాటికి ఇళ్ల అప్పగింత జరిగే అవకాశాలు లేవని స్పష్టమవుతోంది. ప్రతిపాదనలతో సరి.. ప్రభుత్వం మంజూరు చేసిన 6,850 ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి జిల్లా యంత్రాంగం ప్రాథమికంగా కసరత్తు చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. జిల్లాకు మంజూరైన ఇళ్లను నిర్మించేందుకు 102 లేఅవుట్లు చేసేలా ప్రణాళికలు తయారు చేశారు. ఈ లేఅవుట్లను ఏకంగా 195.08 ఎకరాల్లో విశాలమైన విస్తీర్ణంలో నిర్మించేలా ఆ ప్రణాళికల్లో పొందుపర్చారు. ఈమేరకు ప్రభుత్వానికి నివేదికలు వెళ్లాయి. వీటిని ఆమోదించిన తర్వాత నిర్మాణాల కోసం కాంట్రాక్టర్లను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియపై ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు.ట ఇళ్ల నిర్మాణమెప్పుడో! యాచారం: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలకు పెద్ద ట్రబుల్ వచ్చి పడింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోనే మొట్టమొదటగా యాచారం మండలం తక్కళ్లపల్లిలో స్థలం ఎంపిక చేశారు. సర్వే నంబరు 252లో ఐదెకరాల స్థలం గుర్తించి, మొదటగా వందమంది లబ్ధిదారులకు ఇళ్లు నిర్మించే విధంగా నిర్ణయించారు. గతేడాది అక్టోబర్ 22న దసరా పండుగ రోజు తక్కళ్లపల్లిలో డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులకు రవాణశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు, స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిం చారు. పనులు ప్రారంభించి ఐదు నెలలు గడిచినా నేటికీ అర్హుల ఎంపిక కూడా జరగలేదు. ఎంపిక చేసిన స్థలంలో నిర్మాణాలు కూడా చేపట్టడం లేదు. మొదటగా 100మంది లబ్ధిదారులకు 120 గజాల్లో డబుల్బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, కనీసం అర్హుల ఎంపిక కూడా చేయకపోవడంతో అర్హులైన లబ్ధిదారులు ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇదే విషయమై మండల హౌసింగ్ ఏఈ కరుణాకర్‌రెడ్డిని సంప్రదించగా పనుల ప్రారంభంపై తనకు ఎటువంటి సమాచారమూ లేదన్నారు. అధికారుల కసరత్తు.. తాండూరు: పట్టణంలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలకు మున్సిపల్ అధికారులు స్థల సేకరణపై దృష్టిసారించారు. పట్టణానికి 600 ఇళ్లు మంజూరయ్యాయి. ఈ అదనపు కోటాను సీఎం ప్రత్యేకంగా మంజూరు చేశారు. పట్టణ శివారులోని రాజీవ్ గృహకల్ప (ఆర్జీకే)తోపాటు ఎన్టీఆర్ కాలనీ సమీపంలో ఇళ్ల నిర్మాణాలకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాజీవ్ గృహకల్ప సమీపంలోని సర్వే నంబర్ 52, 64తోపాటు ఎన్టీఆర్ కాలనీ సమీపంలోని సర్వేనంబర్ 41,44,45 పరిధిలోని సుమారు 15 ఎకరాలను ఎంపిక చేశారు. ఆర్జీకే సమీపంలోని 52,64 సర్వేనంబర్లలో మొదటి విడతలో సుమారు 440 ఇళ్లను, ఎన్టీఆర్ కాలనీ సమీపంలో రెండో విడతలో 160 ఇళ్లను జీ+2 పద్ధతిలో నిర్మించాలని యోచిస్తున్నారు. పట్టణంలోని మీ సేవా కేంద్రంలో ఆన్లైన్లో ఇప్పటి వరకు సుమారు 150 దరఖాస్తులు స్వీకరించారు. ఇటీవలనే గుజరాత్ కన్సల్టెన్సీ ప్రతినిధి అనూప్దబే ఆయా స్థలాలను పరిశీలించినట్లు మున్సిపల్ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి తెలిపారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను ప్రభుత్వానికి అందజేస్తారని ఆమె చెప్పారు. ఈ ప్రక్రియ అనంతరం ఇళ్ల నిర్మాణాల పనులు మొదలవుతాయన్నారు. భూ సేకరణ వరకే.. మేడ్చల్: వుండలంలోని యూడారం, సోవూరం, మేడ్చల్‌లలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. యూడారం గ్రావుం లో సర్వే నం.150లోని ఒకటిన్నర ఎకరాల్లో 30 ఇళ్లు, సోవూరం గ్రావుంలోని సర్వే నం.65లోని ఒకటిన్నర ఎకరాల్లో 30 ఇళ్లు, మేడ్చల్‌లోని 642 సర్వే నంబర్లో 80 ఇళ్లు నిర్మించడానికి అధికారులు భూ సేకరణ చేసి సర్వం సిద్ధం చేశారు. అయితే మేడ్చల్‌లో ఇప్పటి వరకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. మేమే ఎంపిక చేస్తాం.. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం అర్హులైన లబ్ధిదారులను మేమే ఎంపిక చేస్తాం. దరఖాస్తులు ఇచ్చేందుకు ఎవరూ కార్యాలయూలకు రావద్దు. ఎంపిక చేసిన గ్రావూలలో, మేడ్చల్ పట్టణంలోని వార్డుల్లో రెవెన్యూ అధికారులు పర్యటించి అర్హులైన వారిని ఎంపిక చేస్తారు. -శ్రీకాంత్‌రెడ్డి, తహసీల్దార్ స్థలాన్వేషణలో అధికారులు.. ఇబ్రహీంపట్నం: మండలంలో సొంతిల్లు లేని పేదలు గంపెడాశతో డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ ఇంకా స్థలాన్వేషణలోనే ఉంది. తమకు ఇళ్లు మంజూరు చేయాలని ఇప్పటికే ప్రజాదర్బార్‌లో కొంతమంది దరఖాస్తులు సమర్పించారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం కోసం స్థలాలను అన్వేషించాలన్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆదేశాలతో రెవెన్యూ అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. మంగల్‌పల్లి రెవెన్యూ పరిధిలోని సర్వేనంబర్ 242లో పది ఎకరాల స్థలాన్ని, ఎలిమినేడు రెవెన్యూ పరిధిలోని 421 సర్వేనంబర్‌లో 36 గుంటల స్థలాన్ని, ఇబ్రహీంపట్నం రెవెన్యూ పరిధిలోని వినోబాగర్లో ఉన్న భూదాన్‌బోర్డుకు చెందిన సర్వేనంబర్ 2లో 5 ఎకరాల స్థలాన్ని గుర్తించినట్లు తహసీల్దార్ విజయోందర్రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి మార్గనిర్దేశకాలు అందలేదని అయన చెప్పారు. జవహర్నగర్వాసుల ఎదురుచూపులు.. జవహర్‌నగర్: కన్న ఊరును వదిలి బతుకుదెరువు వెతుక్కుంటూ పొట్టచేతపట్టుకొని వేలాదిమంది జవహర్‌నగర్ వచ్చారు. ఎన్నో ఏళ్లుగా అద్దె ఇళ్లలో జీవనం సాగిస్తున్నారు. పేద ప్రజలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో వారంతా ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఇప్పటివరకు దీనికి సంబంధించి దరఖాస్తులు తీసుకోకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జవహర్‌నగర్‌లో దాదాపు రెండు లక్షలమంది నివసిస్తుండగా 25వేల కుంటుంబాలకు పైగా అద్దె ఇళ్లలో కాలం వెళ్లదీస్తున్నారు. వారంతా ప్రభుత్వం ఆశలు రేకెత్తించిన రెండుపడకల ఇళ్ల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు: దేవుజా, తహసీల్దార్ ప్రస్తుతానికి జవహర్నరగ్లో డబుల్బెడ్రూంల దరఖాస్తులు తీసుకోవడం లేదు. దరఖాస్తులు తీసుకోవాలని ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఆదేశాలు వచ్చిన తక్షణమే తప్పకుండా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ చేపడతాం. స్థలాల ఎంపికకే పరిమితం.. పరిగి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న డబుల్బెడ్రూం ఇళ్ల ప్రక్రియ స్థలాలకే ఎంపిక వరకే పరిమితమైంది. మొదటి విడతలో భాగంగా మండలంలోని తుంకలగడ్డ, చిట్యాల్, బసిరెడ్డిపల్లి, నస్కల్ గ్రామాలను ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లో లే అవుట్ల ప్రిపరేషన్ ప్రారంభించారు. ప్రభుత్వ స్థలాలను పరిశీలించి ఫైనల్ కూడా చేశారు. ప్రస్తుతానికి క్షేత్రస్థాయిలో స్థలాల పరిశీలన తోనే ప్రక్రియ నిలిచిపోయింది. కాగా గ్రామాలను ఎంపిక చేసింది మొదలు తుంకలగడ్డలో సమస్య తలెత్తుతోంది. అధికారులు ఎంపిక చేసిన స్థలాలు గతంలోనే ప్రభుత్వం తమకు కేటాయించిందని సంచార జాతులకు చెందిన పేదలు పేర్కొంటున్నారు. ఇచ్చిన పట్టాలను మళ్లీ లాక్కోవడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఆందోళనలు చేపడుతూ వస్తున్నారు. ఎంపిక చేసిన నాలుగు గ్రామాల్లో ఒక్కో గ్రామానికి 20 ఇళ్లు మాత్రమే కేటాయించగా ఇప్పటికే మండలంలో 700 వరకు దరఖాస్తులు వచ్చాయి. పరిగి పంచాయతీకి 20 ఇళ్లు కేటాయించగా ఇప్పటికే 300కు పైగా దరఖాస్తులు వచ్చాయి. గ్రామాల ఎంపికతోనే సరి.. చేవెళ్లరూరల్: డబుల్బెడ్రూం ఇళ్లకోసం మండలంలో నాలుగు గ్రామాలను ఎంపిక చేసి స్థలాల పరిశీలన చేసి వదిలేశారు. మండలానికి 80 ఇళ్లు కేటాయించగా మొదటి విడతలో ప్రభుత్వ స్థలాలు అనుకూలంగా ఉన్న నాలుగు గ్రామాలను ఎంపిక చేశారు. ఎంపిక చేసిన వాటిలో కౌకుంట్ల, ఆలూరు, తంగడపల్లి, నాంచేరి గ్రామాలు ఉన్నాయి. ఎంపిక చేసిన గ్రామాల్లో స్థల పరిశీలన పూర్తయిందని లబ్ధిదారుల ఎంపిక ఇంకా కాలేదని తహసీల్దార్ వెంకట్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఉత్తర్వుల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఆదేశాలు వచ్చిన వెంటనే దరఖాస్తులు స్వీకరిస్తామని స్పష్టం చేశారు. అయితే మండలానికి వచ్చే ఇళ్లలో ప్రతి గ్రామానికి ఒకటి, రెండు కేటాయించేలా చూడాలనే డిమాండ్ వినిపిస్తోంది. మొదటి విడతలో కొన్ని, రెండో విడతలో కొన్ని అనే పద్ధతి బాగాలేదని ప్రతిపక్ష పార్టీలతోపాటు, సొంత పార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాల ఎంపిక.. శామీర్‌పేట్: మండలంలో డబుల్ బెడ్రూంల కోసం మొద టి విడతగా శామీర్‌పేట్, ఉప్పరిపల్లి, తుర్కపల్లి గ్రామాలను ఎంపిక చేశారు. ఎంపిక చేసిన గ్రామాల్లో కలెక్టర్ రఘునందనరావు ఆదేశాల మేరకు అధికారులు పలుమార్లు ప్రభుత్వ స్థలాలను పరిశీలించి ఎంపిక చేశారు. శామీర్‌పేట్‌లో 250, ఉప్పరిపల్లిలో 40, తుర్కపల్లిలో 40 ఇళ్లు మంజూరైనట్లు అధికారులు ప్రకటించారు. శామీర్‌పేట్ రెవెన్యూ పరిధిలోని సర్వేనంబర్ 1284లో 5ఎకరాలు, తుర్కపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వేనంబర్ 413లో 2 ఎకరాలు, ఉప్పరిపల్లి రెవెన్యూ పరిధిలోని 837 సర్వేనంబర్‌లో 2 ఎకరాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. శామీర్‌పేట్‌లో సుమారు 800పై చిలుకు మంది, తుర్కపల్లిలో 450 మంది, ఉప్పరిపల్లిలో 600 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ప్రస్తుతం దరఖాస్తులు ఆన్లైన్లో తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. దరఖాస్తుల కోసం ప్రత్యేక కౌంటర్.. ఘట్కేసర్: మండలంలో డబుల్ బెడ్రూం ఇళ్లకోసం తహసీల్దారు కార్యాలయానికి ఇప్పటివరకు 1200 దరఖాస్తులు అందాయి. దరఖాస్తుదారులు ఎక్కువ సంఖ్యలో రావడంతో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటుచేసి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మండలానికి సుమారు 500వరకు ఇళ్లు మంజూరు చేయనున్నారు. ఇందుకోసం ఏదులాబాద్, ప్రతాప్‌సింగారం గ్రామాల్లో రెండు ఎకరాల చొప్పున గుర్తించారు. ప్రతాప్సింగారంలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఇప్పటికే భూమిపూజ చేశారు. ఏదులాబాద్‌లోని స్థలాన్ని కలెక్టర్ రఘునందన్‌రావు పరిశీలించారు. పది ఎకరాల గుర్తింపు.. శంషాబాద్ రూరల్: రెండు పడకల ఇళ్ల నిర్మాణం కోసం శంషాబాద్ మండలంలోని ఊట్పల్లి, హమీదుల్లానగర్, మల్కారం, జూకల్, చర్లగూడ గ్రామాల్లో పది ఎకరాలను గుర్తించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గానికి 400 ఇళ్లు మంజూరు కాగా.. శంషాబాద్ మండలానికి సుమారు 120 ఇళ్లను మంజూరు చేసే అవకాశాలున్నట్లు అధికారులు పేర్కొం టున్నారు. ఇప్పటి వరకు ఏ గ్రామంలో కూడా ఇళ్ల కోసం దరఖాస్తులను స్వీకరించలేదు. ఇళ్ల నిర్మాణం కోసం స్థలాలను గుర్తించిన గ్రామాల్లో లబ్ధిదారులను ఎంపిక చేసి గ్రామ సభలో ప్రకటించిన అనంతరం తుది జాబితా రూపొందిస్తామని తహసీల్దార్ వెంకట్‌రెడ్డి తెలిపారు. -
బాబోయ్... నకిలీ ఓటర్లు
చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రస్తుత చట్టసభ పదవీకాలం ఈ ఏడాది మే 22వ తేదీతో ముగియనుంది. ఈ ఏడాది జనవరి 1వ తేదీని ఓటు హక్కు కలిగే రోజుగా పరిగణించి 18 ఏళ్లు నిండిన వారిద్వారా దరఖాస్తులు స్వీకరించారు. కొత్త ఓటర్లుగా ఓటర్ల జాబితాలో చేర్చారు. కొత్త ఓటర్ల జాబితాను గత నెల 20వ తేదీన ప్రకటించారు. ఈ జాబితాలో 40 లక్షల వరకు నకిలీ ఓటర్లు ఉన్నట్లు డీఎంకే అధినేత కరుణానిధి ఆనాడే విమర్శించారు. అలాగే నకిలీ ఓటర్లను తొలగించాల్సిందిగా డీఎంకే నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు వినతిపత్రం సమర్పించగా, కొందరు కోర్టులో పిటిషన్లు వేసారు. ఇదిలా ఉండగా, ఓటర్ల జాబితాల్లో మార్పులు చేర్పులకై గత నెల 31, ఈనెల 6వ తేదీన ప్రత్యేక శిబిరాలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. ఈ రెండు రోజుల్లో సుమారు 8 లక్షల మంది ఓటర్లు పలు అంశాల్లో మార్పులు, చేర్పులపై దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికల కమిషన్ సైతం నకిలీ ఓటర్లను ఏరివేసేందుకు చర్యలు చేపట్టింది. సుమారు 75వేల మంది అనేక చోట్ల తమకు ఓటు ఉన్నదని, వాటిని తొలగించాలని దరఖాస్తు చేసుకున్నారు. 2009 నుండి తమిళనాడులో నివసించే వారి జాబితాను పోల్చిచూస్తూ నకలీ ఓటర్ల ఏరివేతకు పూనుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి రాజేష్ లఖానీ సోమవారం చెప్పారు. గత జాబితాతో పోల్చుకుంటే చనిపోయిన లక్షమంది ఓటర్ల పేర్లు చెన్నై జాబితాలో ఉన్నట్లు తేలిందని తెలిపారు. నకిలీ ఓటర్ల తొలగింపుకు అనేక చర్యలను చేపట్టామని అన్నారు. ప్రతి జిల్లా కలెక్టర్‌కు చనిపోయిన ఓటర్ల జాబితాను అందజేశామని చెప్పారు. అలాగే జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో పార్టీ నేతలకు సైతం ఈ పేర్ల జాబితాను అందజేస్తామని అన్నారు. నేతలు ఆ జాబితాను పరిశీలించుకోవచ్చని తెలిపారు. ఈ లెక్కన రాష్ట్రం మొత్తం మీద సుమారు 6 లక్షల మంది నకిలీ (చనిపోయిన వారు) ఓటర్లు ఉన్నట్లు భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అఖిలపక్ష సమావేశాలు: ఇదిలా ఉండగా, ఎన్నికల కమిషన్ నేతృత్వంలో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అఖిలపక్ష సమావేశాలను నిర్వహించారు. చెన్నైలోని రిప్పన్ బిల్డింగ్‌లో మధ్యాహ్నం 3 గంటలకు జరిగిన సమావేశంలో అన్నాడీఎంకే, డీఎంకే, డీఎండీకే, కాంగ్రెస్, పీఎంకే, ఎండీఎంకే, వీసీకే, వామపక్షాల నేతలు పాల్గొన్నారు. -
శింబుపై పిటిషన్లు ఉపసంహరణ
చె న్నై : నటుడు శింబుపై దాఖలైన కోర్టు కేసులు ఒక్కొక్కటి ఉపసంహరించుకోవడం విశేషం. బీప్ సాంగ్ పాటతో మహిళల్ని అవమానించారంటూ నటుడు శింబు,సంగీత దర్శకుడు అనిరుద్‌లపై పెద్ద దుమారమే రేగుతున్న విషయం తెలిసిందే.పలు మహిళా సంఘాలు ఆందోళనకు దిగడంతో పాటు కోవై,చెన్నై లలో పలు పోలీసు కేసులు నమోదయ్యాయి.అంతే కాదు శింబు వ్యవహారం కోర్టుల వరకూ వెళ్లింది. ఒక్క సైదాపేట కోర్టులోనే శింబుపై మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. ఆయన ముందస్తు బెయిల్ కేసు మద్రాసు హైకోర్టులో విచారణలో ఉంది. దానిపై జనవరి4 న విచారణ జరగనుంది. శింబుపై దాఖలైన పీఎంకే పార్టీకి చెందిన నాయకుడు చెన్నై సైదాపేట కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఇప్పటికే ఉపసంహరించుకున్నారు. మరో రెండు పిటిషన్లను బుధవారం ఉపసంహరించుకోవడం విశేషం. శింబు,అనిరుద్‌లపై విడుదలై చిరుతై పార్టీకి చెందిన దక్షిణ చెన్నై న్యాయవాదుల సంఘం కార్యదర్శి వక్ శీల్ కాశీ చెన్నై,సైదాపేట కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై బుధవారం 9వ మెట్రో పాలిటిన్ కోర్టు న్యాయమూర్తి దిలీప్ అలెక్ప్ సమక్షంలో విచారణకు వచ్చింది. పిటిషన్‌దారుడు కాశీ హాజకై పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపారు. అదేవిధంగా కేకే.నగర్‌కు చెందిన విడుదలై చిరుతై పార్టీ కార్యదర్శి పుదియవన్ అలియాస్ లక్ష్మణన్ శింబు, అనిరుద్‌లపై దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం సైదాపేట 23వ మెట్రోపాలిటిన్ కోర్టులో న్యాయమూర్తి సురేష్ సమక్షంలో విచారణకు రాగా ఆ కేసును పిటిషనర్ ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. దీంతో ఇప్పటికి శింబుపై మూడు కోర్టు కేసులు ఉపసంహరించుకోవడం గమనార్హం.శింబు తల్లి వీడియోలో కన్నీటి ఘోష తరువాత ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం.ఇక హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందన్నదే ప్రస్తుతం జరుగుతున్న వాడీవేడి చర్చ. -
కుంటిసాకులు చెప్పొద్దు
మీకోసంలో ఇన్చార్జి కలెక్టర్ ఆగ్రహం మచిలీపట్నం (చిలకలపూడి) : జిల్లా అధికారులు అబద్దాలు చెప్పకుండా మీ కోసం కార్యక్రమంలో ఇచ్చిన అర్జీల పరిష్కరించేలా శ్రద్ధ వహించాలని ఇన్చార్జి కలెక్టర్ గంధం చంద్రుడు అన్నారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయనతో పాటు జేసీ-2 ఒంగోలు శేషయ్య ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ సమావేశాలకు రావాల్సిన అధికారులు కుంటిసాకులు చెప్పకుండా మీకోసం కార్యక్రమానికి హాజరుకావాలన్నారు. సొంత పనులపై వెళుతూ కిందిస్థాయి సిబ్బందిని పంపి.. ప్రభుత్వ సమావేశాల్లో ఉన్నామని చెప్పించడం సబబు కాదన్నారు. సమావేశాలు లేకపోయినా సమావేశంలో ఉన్నామని చెబుతూ ఏ వివరాలు తెలియని సిబ్బందిని పంపి అర్జీలు ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నించారు. మత్స్యశాఖ డీడీ సాల్మన్‌రాజు సమావేశానికి హాజరుకాకుండా సూపరింటెండెంట్‌ను పంపడం, సమస్యలపై అర్జీదారులు ఇచ్చే వినతులకు ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ఇన్చార్జి కలెక్టర్ గెటవుట్ అని ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆమె సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. కొద్దిసేపటికి సమావేశానికి హాజరైన మత్స్యశాఖ డీడీ కూడా పొంతన లేని సమాధానాలు చెప్పటం ఇన్చార్జి కలెక్టర్‌కు విస్మయం కలిగించింది. జిల్లా అధికారులు మీ కోసంలో వచ్చిన అర్జీలు పరిశీలించడాన్ని సీరియస్‌గా తీసుకోవాలని, పరిష్కారశాతం పెరగాలని సూచిం చా రు. స్మార్ట్‌విలేజ్ కార్యక్రమంలో భాగంగా కైకలూరు మండలం ఆటపాక గ్రామంలో ప్రత్యేకాధికారి పర్యటించినప్పుడు అంగన్వాడీ కేంద్రం మూసివేసి ఉండడం, పిల్లలు ఎవరూ లేకపోవడంతో ఆయన నివేదిక సమర్పించారు. నివేదిక ఆధారంగా ఇన్చార్జి కలెక్టర్ ఐసీడీఎస్ పీడీ కృష్ణకుమారిని ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.ు సీడీపీవోకు పంపి విచారణ చేయమని ఆదేశాలిచ్చానని తెలిపారు. జెడ్పీ సీఈవో వి.నాగార్జునసాగర్, డీఎస్వో వి.రవికిరణ్, డీఆర్డీఏ పీడీ వి. చంద్రశేఖరరాజు, డ్వామా పీడీ మాధవీలత, డీఈవో ఎ.సుబ్బారెడ్డి పాల్గొన్నారు. -
రిటైర్మెంట్ బెనిఫిట్ల కోసం అంగన్వాడీల ఆందోళన
-
ప్రజల ఆశలు వమ్ము చేయొద్దు
- కలెక్టర్ కేవీ రమణ కడప సెవెన్‌రోడ్స్: ప్రజలు ఎన్నో ఆశలు నింపుకుని ‘మీ కోసం’ కార్యక్రమంలో అర్జీలు ఇస్తుంటారని, వారి ఆశలు వమ్ము కాకుండా వాటిని పరి ష్కరించాలని కలెక్టర్ కేవీ రమణ అధికారులను ఆదేశించారు. సోమవారం సబా భవనంలో నిర్వహించిన మీకో సం కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి పరిశీ లించారు. పరిష్కార నిమిత్తం ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏవైనా పరిష్కారం కాని సమస్యలుంటే అర్జీదారునికి రాతమూలకం గా తెలుపాలని స్పష్టం చేశారు. అలా కాకుండా కార్యాలయాల చుట్టూ తిప్పుకోరాదని సూచించారు. జేసీ రామారావు, జేసీ-2 చంద్రశేఖర్‌రెడ్డి, డీఆర్వో సులోచన తదితరులు పాల్గొన్నారు. ‘మీ కోసం’లో వచ్చిన అర్జీల్లో కొన్ని.. - ప్రొద్దుటూరులో ఉన్న రేషన్‌కార్డును చాపాడు మండలానికి మార్చాలని ప్రొద్దుటూరులోని విశ్వనాథపురం గ్రామానికి చెందిన వెంకయ్య కోరారు. - మైనార్టీ కార్పొరేషన్ ద్వారా బోరు, మామిడిచెట్లు మంజూరు చేయించాలని కమలాపురం మండలం మారుతీనగర్వాసి అబ్దుల్‌ఖాదర్ విన్నవించారు. - హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా పక్కా గృహం మంజూరు చేయించాలని రాజంపేట మండలం తాళ్లపాక గ్రామానికి చెందిన నాగేంద్రరాజు విజ్ఞప్తి చేశా రు. - తన భూమిలో సర్వే రాళ్లను ఇతరులు తొలగించారని, వారిపై చర్య తీసుకోవడంతోపాటు సర్వే ద్వారా హద్దులు నిర్ణయించాలని జమ్మలమడుగు మండలం సిరిగేపల్లెకు చెందిన శివశంకర్ కోరారు. - తెలుగుగంగ ప్రాజెక్టు కింద 4 ఎకరాల భూమి కోల్పొయిన తమకు ఎకరన్నర భూమి మాత్రమే ప్రభుత్వం ఇ చ్చిందని, పంటలకు అవసరమైన రు ణం, బోరు మంజూరు చేయాలని మై దుకూరు మండలం ఏకర్లపాలెం గ్రా మానికి చెందిన జయరాములు అర్జీ ఇచ్చారు. - వికలాంగుల కోటా కింద తనకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణం ఇప్పించాలని ఖాజీపేట మండలం కొత్తనెల్లూరుకు చెందిన లక్ష్మినారాయణ కోరారు. -
‘ఒకే ఎన్నిక’ కోసం పిటిషన్లపై నేడు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, విశాఖపట్నం, గుంటూరు జిల్లాల నుంచి రెండు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి వేర్వేరుగా ఎన్నిక నిర్వహించాలన్న ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని సవాలుచేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణ బుధవారానికి వాయిదా పడింది. బుధవారం వాదనలు ముగియగానే వీటిపై నిర్ణయం వెలువరిస్తామని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.భొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈసీ నిర్ణయంపై వైఎస్సార్సీపీ నేతలు చల్లా మధుసూదన్‌రెడ్డి, కరణం ధర్మశ్రీలు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వీటిని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారించింది.పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు సి.వి.మోహన్‌రెడి, పి.సుధాకర్‌రెడ్డి వాదించారు. స్థానిక సంస్థల కోటాకు సంబంధించి మొత్తం జిల్లాను ఒక నియోజక వర్గంగా పరిగణించి, ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో సీటును కేటాయించారని, అయితే కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల విషయంలో మాత్రం మొత్తం జిల్లాను ఒక నియోజకవర్గంగానే పరిగణించి రెండు సీట్లు కేటాయించారన్నారు. స్థానిక సంస్థల కోటాలో ఎన్నికలు నిర్వహించేటప్పుడు జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుని, ఒకే ఎన్నిక నిర్వహించాల్సి ఉందన్నారు. ఈలోగా పనివేళలు ముగియడంతో హైకోర్టు విచారణను బుధవారానికి వాయిదా వేసింది. కాగా, చిత్తూరు జిల్లాలో రెండు స్థానాలకు ఖాళీలు ఏర్పడితే, ఈసీ మాత్రం ఒక స్థానానికే ఎన్నిక నిర్వహించాలని నిర్ణయించిందని, ఖాళీ అయిన రెండు స్థానాలకూ ఎన్నిక నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ బుధవారానికి వాయిదా పడింది. -
గ్రీవెన్స్‌పై సూర్య ప్రతాపం
ఖమ్మం జెడ్పీసెంటర్ : భానుడి ప్రభావం గ్రీవెన్స్‌పై కూడా పడింది. ప్రతి సోమవారం కలెక్టర్ సమక్షంలో అధికారులందరితో నిర్వహించే గ్రీవెన్స్ భూ సమస్యలు, ఇళ్లు, సర్టిఫికెట్లు, పింఛన్లు, రేషన్ తదితర సమస్యలపై వందల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చేవి. గత నాలుగు రోజులుగా ఎండతీవ్రత అధికం కావడంతో జిల్లా నలుమూలల నుంచి వచ్చే ఫిర్యాదుదారుల సంఖ్య తగ్గింది. సోమవార జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఇలంబరితి ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదుదారులు తక్కువ సంఖ్యలో వచ్చారు. ఎండతీవ్రతకు గంట వ్యవధిలోనే తిరుగుముఖం పట్టారు. హాలులో కూర్చున్న అధికారులు ఎండ అధికంగా ఉండడంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. తొలుత కలెక్టర్ ఇలంబరితి అదనపు జేసీ బాబూరావుతో కలిసి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలనుంచి వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిస్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మంచినీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని ఆర్‌డబ్లుఎస్ అధికారులను ఆదే శించారు. కోర్టు కేసులకుసంబందించిన విషయాలపై అధికారులు ప్రత్యేకదృష్టి సారించాలన్నారు. గ్రీవెన్స్‌లో వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని ఇలా ఉన్నాయి. * గత కొన్నేళ్లుగా పింఛన్ పొందుతున్నానని, 2015 మార్చి నుంచి పింఛ న్ నిలుపుదల చేశారని, తిరిగి పింఛన్ పునరుద్దరించాలని ముదిగొండ మం డలం యడవల్లి గ్రామానికి చెందిన పుష్పమ్మ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. * తన కుమార్తె 5 వ తరగతి చ దువుతుందని, తనకు చదివించే ఆర్థికస్థోమతలేదని, సాంఘిక సంక్షేమ హాస్టల్ లో సీటు ఇప్పించాలని పెనుబల్లి మం డలానికి చెందిన బి.కృష్ణ కోరాడు. * తాను తల్లాడ ఆంధ్రాబ్యాంక్‌లో పంట రుణం పొందగా, రుణమాఫీ జాబితాలో పేరువచ్చిందని, రీ షెడ్యూల్ కోసం వెళ్లగా రుణమాఫీ కాలేదని అధికారులు చెబుతున్నారని, తనకు న్యాయం చేయాలని తల్లాడ మండలం మిట్టపల్లికి చెందిన కాపా నాగరత్నం పేర్కొంది. * బీసీలకు కల్యాణ లక్ష్మి పథకాన్ని వర్తింపజేయాలని కుల సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చారు. -
పడకేసిన ప్రజావాణి
- కుప్పలుతెప్పలుగా పేరుకుపోయిన అర్జీలు - కార్యాలయాల్లో పరిశీలనకు నోచుకోని వినతులు - అత్యధికంగా రెవెన్యూ విభాగంలో పెండింగ్ - తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్న ప్రజలు ప్రజావాణి.. ప్రజా సమస్యలపై తక్షణం స్పందించి, యుద్ధప్రాతిపదికన పరిష్కార చర్యలు చేపట్టే కార్యక్రమమిది. కలెక్టర్‌గా రఘునందన్‌రావు బాధ్యతలు తీసుకున్న తర్వాత అన్ని శాఖల అధిపతులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాటి పరిష్కారం కోసం అర్జీలను ఆయా శాఖలకు పంపారు. కానీ సదరు శాఖల అధికారులు మాత్రం పరిష్కార చర్యలను పక్కనబెట్టారు. ఫలితంగా ఆయా కార్యాలయాల్లో ప్రజావాణి అర్జీలన్నీ కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయి. నాలుగు నెలలుగా ప్రజావాణి కార్యక్రమానికి 2,667 అర్జీలు రాగా.. అందులో ఇప్పటివరకు కేవలం 812 అర్జీలను మాత్రమే పరిష్కరించారు. మిగతా 1,855 దరఖాస్తులు సంబంధిత కార్యాలయాల్లో మూల్గుతున్. సాక్షి, రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉన్న జిల్లాలో భూములకు అధిక రేట్లు ఉన్న కారణంగా రెవెన్యూ సమస్యలు ఎక్కువ. ఈ క్రమంలో ప్రజావాణకి వచ్చే అర్జీల్లో అధిక శాతం అలాంటివే. కానీ రెవెన్యూ యంత్రాంగం మాత్రం ప్రజావాణి వినతుల పరిష్కారంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. గత నాలుగు నెలల్లో జిల్లాలోని ఐదు రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయాలకు సంబంధించి 95 అర్జీలు రాగా.. వాటిలో ఇప్పటివరకు కనీసం ఒక్కదానికీ మోక్షం కలగలేదు. ఇక జిల్లాలోని 37 తహసీల్దార్ కార్యాలయాలకు సంబంధించి 508 అర్జీలు రాగా.. వాటిని ఆయా కార్యాలయాలకు పంపించారు. కానీ వాటిలో ఒక్క అర్జీ సైతం పరిష్కారానికి నోచుకోలేదు. కలెక్టర్ కార్యాలయంతోసహా సీ, డీ, ఈ, ఎఫ్అండ్జీ సెక్షన్లకు సంబంధించి 162 అర్జీలు ప్రజావాణిలో అందాయి. కానీ వాటిలోనూ ఒక్కటీ పరిష్కారం కాలేదు. మరో 19 ఎంపీడీఓ కార్యాలయాలకు సంబంధించి 33 అర్జీలందగా.. వాటిలోనూ ఒక్కటీ పరిష్కారం కాకపోవడం గమనార్హం. జిల్లా కార్యాలయాల్లోనూ ఇదే తీరు.. మండల కార్యాలయాల్లో అర్జీల పరిష్కారం అటకెక్కగా.. జిల్లా స్థాయి కార్యాలయాల్లోనూ ఇదే సీను కనిపిస్తోంది. జిల్లా పంచాయతీ శాఖ పరిధిలో 124 వినతులు వచ్చాయి. కానీ ఇందులో ఒక్క వినతికి మోక్షం కలగలేదు. ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్‌కు సంబంధించి 41 అర్జీలు పెండింగ్‌లోనే ఉన్నాయి. సైబరాబాద్ పోలీస్ కమిషనర్, పరిశ్రమల శాఖ, కాలుష్య నియంత్రణ శాఖల్లోనూ వినతులు పరిష్కారానికి నోచుకోలేదు. ఎస్సీ కార్పొరేషన్ పరిధిలో 149 ఫిర్యాదులు రాగా.. ఒక్కటీ పరిష్కరించలేదు. అధికంగా పీడీ డీఆర్డీఏ కార్యాలయానికి సంబంధించి 516 అర్జీలు రాగా.. ఇందులో 342 పరిష్కరించారు. జిల్లా పౌరసరఫరాల శాఖ పరిధిలో 183 వినతులు రాగా, 111 పరిష్కరించారు. హడావుడే మిగిలింది.. పరిష్కారం ఆగింది ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని ప్రతి శాఖ ఉన్నతాధికారి విధిగా పాల్గొనాలని కలెక్టర్ పలు మార్లు హితబోధ చేశారు. అయితే జనవరి, ఫిబ్రవరి మొదటిభాగంలో అధికారులు బాగానే స్పందించినప్పటికీ.. ఆ తర్వాత మమ అనిపించారు. కలెక్టర్ హాజరైన రోజు మినహా మిగతా సందర్భాల్లో వారి హాజరు కనించడం లేదు. కేవలం ప్రజావాణి కార్యక్రమానికి చుట్టపుచూపుగా రావడం తప్ప.. శాఖకు సంబంధించి వినతులు పరిష్కారానికి నోచుకోకపోవడంతో అటు ప్రజలు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
కృష్ణా జలాల పిటిషన్లపై సుప్రీం వాయిదా
ఢిల్లీ: కృష్ణా జల వివాదంపై దాఖలు చేసిన పిటిషన్ల పై వాయిదా పడింది. బుధవారం సుప్రీంకోర్టులో రెండు గంటలపాటు ఈఅంశంపై వాదనలు జరిగాయి. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును వ్యతిరేకిస్తూ ఏపీ, తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లను విచారణకు స్వీకరించాలా వద్దా అనే అంశంపై వాదనలు జరిగాయి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రయోజనాలు కాపాడలేదని తెలంగాణ తరఫు న్యాయవాది వాదించగా.. ఏపీకి కేటాయింపుల్లో సరైన ప్రాతిపదిక ఏదీ లేదని ఏపీ తరుఫు న్యాయవాది చెప్పారు. మరోపక్క, సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల తరుఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. ఈ వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం విచారణ వచ్చే నెల 7కు వాయిదా వేసింది. -
‘మీకోసం’
ప్రజావాణి ఇక ‘మీ కోసం’ పేరుమారుతున్నా ప్రయోజనం దక్కేనా పేరుకుపోతున్న అర్జీలు పట్టించుకునే వారు లేరు.. విశాఖపట్నం: తీరు మారదు.. కానీ తరచూ పేరు మారుతుంది. వేలల్లో కాదు..లక్షల్లో పేరుకుపోతున్న అర్జీలను పట్టించుకునే నాథుడు కన్పించరు. సంవత్సరాల తరబడి తిరుగుతున్నా పరిష్కారానికి నోచుకోని సమస్యలతో సామాన్య, నిరుపేదలు అల్లాడుతూనే ఉన్నారు. మొక్కుబడిగా సాగుతున్న గ్రీవెన్స్‌సెల్ వచ్చే వారం నుంచి ‘మీ కోసం’గా పేరు మార్చుకోబోతుంది. రెండు నెలలు కూడా కాలేదు ప్రజాదర్బార్‌ను ప్రజావాణిగా మార్చి. ఇప్పుడు ‘మీ కోసం’ అంటూ ‘గ్రీవెన్స్ సెల్ ’ కొత్తఅవతారమెత్తుతోంది. 2009లో శ్రీకారం చుట్టిన గ్రీవెన్స్‌సెల్ ప్రతీ సోమవారం డివిజన్ స్థాయిలో ఆర్డీఒ, జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. మండల స్థాయి పలుమార్లు తిరిగినా పరిష్కారానికి నోచు కోని సమస్యలను డివిజనల్ స్థాయిలో జరిగే గ్రీవెన్స్‌లో ఇస్తారు. అప్పటికీ పరిష్కారానికి నోచుకోని సమస్యలను నేరుగా కలెక్టరేట్లో జరిగే గ్రీవెన్స్‌సెల్‌లో అంద జేస్తుంటారు. కలెక్టర్ లేదా జేసీ వారిద్దరూ లేకపోతే డీఆర్‌ఒ ఎవరో ఒకరూ వీటిని పరిశీలించి సంబంధిత జిల్లా అధికారులకు ఎండార్స్ చేస్తుంటారు. జిల్లా అధికారులు మళ్లీ మండల స్థాయి అధికారులకు పంపిస్తుంటారు. కొన్ని సమస్యలనైతే నేరుగా మండలాలకే ఎండార్స్ చేస్తూ అర్జీదారులను అక్కడకే వెళ్లి మండల స్థాయి అకారులను కలుసుకోమంటూ హితవు పలుకుతుంటారు. ఇలా అర్జీలు ఎక్కడ నుంచి వస్తాయో అక్కడకే చేరుతుంటాయి. అయినా పరిష్కారానికి నోచుకోవు. ఆన్లైన్లో మాత్రం పరిష్కార మైనట్టుగా కన్పిస్తుంటాయి. ఇదీ ఇప్పటి వరకు గ్రీవె న్స్ఉరఫ్ ప్రజావాణితీరు. పరిష్కారమయ్యేవి 70 శాతం లోపే కలెక్టరేట్లో గ్రీవెన్స్‌కు వచ్చే అర్జీల్లో 70శాతం వరకు పరిష్కారానికి నోచుకుంటున్నా, డివిజన్ స్థాయిలో 50 శాతానికి మించడం లేదంటున్నారు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం క్షేత్రస్థాయిలో వీటిని పరిష్కరించాల్సిన మండల, గ్రామ స్థాయి అధికారుల వైఖరే కారణమని చెబుతున్నారు. గడిచిన ఐదేళ్లలో కలెక్టరేట్ గ్రీవెన్స్‌సెల్‌కు 55,410 అర్జీలు రాగా, 45,258 పరిష్కారమైనట్టుగా చెబుతున్నారు. మరో 9,348అర్జీలు పెండింగ్ లో ఉన్నాయి. వీటిలో నిర్ణీత గడువు ముగిసినా పరిష్కారానికి నోచుకోని అర్జీలు మరో 8412 వరకు ఉన్నాయి. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకున్న దాఖలాలుండవు. డివిజన్ స్థాయిలో వినతుల సంఖ్య లక్షకుపైగానే ఉంటాయంటున్నారు. వీటిలో పరిష్కారమైనవి 50 శాతమే. ఫిర్యాదుల్లో ఎక్కువ శాతం మావి కావంటే మావి కావంటూ సరిహద్దు తగాదాల్లో బుట్టదాఖలు చేసేవే ఎక్కువగా ఉంటున్నాయి. జన్మభూమి ఫిర్యాదులకు దిక్కులేదు రెండు నెలల క్రితం నిర్వహించిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదులెన్నో తెలుసా అక్షరాలా 2,64,829 వచ్చాయి. వీటిలో గ్రామీణప్రాంతాల్లో 1,93,863 రాగా, పట్టణ ప్రాంతాల్లో 70,966 ఉన్నాయి. అత్యధికంగా ఇళ్లు, ఇళ్ల స్థలాల కోసం 76,545, రేషన్ కార్డుల కోసం 64,645, పింఛన్ల కోసం 45,974, రెవెన్యూ సంబంధిత సమస్యలపై 30,168 పిటీషన్లు వచ్చాయి. వీటిలో ఇప్పటి వరకు ఏ ఒక్క పిటీషన్‌ను పరిష్కరించిన పాపాన పోలేదు. మండల స్థాయిలోనూ ‘మీ కోసం’ గ్రీవెన్స్‌సెల్ వచ్చేవారం నుంచి ‘మీ కోసం’గా రూపాంతరం చెందుతోంది. ఇప్పటి వరకు డివిజనల్, జిల్లా స్థాయిల్లో జరిగే ఈ గ్రీవెన్స్‌ను ఇక నుంచి శాఖల వారీగానే కాకుండా మండల స్థాయిలో కూడా నిర్వహించుకునే వెసులుబాటు కల్పించారు. ఫిబ్రవరి రెండవవారం నుంచి అధికారికంగా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
అర్జీకీ ఆధార్
గ్రీవెన్స్‌డే (ప్రజావిజ్ఞప్తుల దినం)లో మార్పులు చోటుచేసుకుంటున్నారుు. పరిష్కారం పేరుతో ఈ ప్రక్రియను పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునికీకరిస్తున్నారు. ప్రజలు సమర్పించే అర్జీలను ఇకపై రాష్ట్ర స్థారుులో మానిటరింగ్ చేయనున్నారు. సమస్యల పరిష్కారానికి రాష్ట్ర స్థారుులో ఆడిట్ విభాగం ఇప్పటికే ఏర్పాటరుుంది. అర్జీలు సమర్పించే ప్రజలతో ఆడిట్ అధికారులు నేరుగా మాట్లాడనున్నారు. వచ్చే వారం నుంచి ఈ మార్పులు అమలులోకి రానున్నారుు. ఇకపై గ్రీవెన్స్‌సెల్‌లో అర్జీ సమర్పించే వారు తమ ఆధార్ నంబర్‌ను కూడా అందులో జతపరచాల్సి ఉంటుంది. ఓ వ్యక్తి ఒక పథకం ద్వారా రెండు సార్లు లబ్ధిపొందే అవకాశం కూడా ఇకపై ఉండదు. నెల్లూరు(రెవెన్యూ): జిల్లాలోని 46 మండల రెవెన్యూ కార్యాలయూలు, ఐదు ఆర్డీఓ ఆఫీసులతో పాటు నెల్లూరులోని కలెక్టరేట్లో ప్రతి సోమవారం గ్రీవెన్స్‌డే నిర్వహిస్తున్నారు. ప్రజలు తాము ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను అర్జీల రూపంలో అధికారుల దృష్టికి తెస్తుంటారు. గతంలో మండల రెవెన్యూ కార్యాలయూల్లో సమర్పించే అర్జీలు జిల్లా అధికారులకు చేరాలంటే వారం నుంచి 10 రోజులు పట్టేది. ఈ క్రమంలో సమస్యల పరిష్కారంలో తీవ్ర తాత్సారం జరిగేది. కొన్ని అర్జీలు బుట్టదాఖలయ్యేవి. ఈ క్రమంలో ఐదేళ్ల క్రితం పిటిషన్ మానిటరింగ్ సిస్టమ్(పీఎంఎస్) అమలులోకి తెచ్చారు. అప్పటి నుంచి ప్రజలు సమర్పించిన అర్జీలు గంటల వ్యవధిలో సంబంధిత శాఖల అధికారులకు చేరేవి. కలెక్టర్‌గా ఎన్.శ్రీకాంత్ పని చేసిన సమయంలో గ్రీవెన్స్‌డే నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పరిష్కారం పేరుతో ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించి సమస్యల పరిష్కారానికి చర్యలను మరింత వేగవంతం చేశారు. అది రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నారుు. ప్రతి అర్జీని రాష్ట్ర స్థారుు అధికారులు మానిటరింగ్ చేయనున్నారు. అందులో భాగంగా రాష్ట్రస్థారుులో ఓ కాల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ప్రతి అర్జీ ఆ కాల్ సెంటర్‌కు చేరుతుంది. అక్కడి నుంచి సంబంధిత శాఖ అధికారులకు పంపుతారు. అధికారులు ఆ సమస్యను నిర్ణీత కాలంలో పరిష్కరించి కాల్‌సెంటర్‌కు వివరాలు సమర్పిస్తారు. ఆడిట్ అధికారులు అర్జీ సమర్పించిన వ్యక్తికి స్వయంగా ఫోన్ చేసి సమస్య పరిష్కారంపై అభిప్రాయం తెలుసుకుంటారు. సమస్య పూర్తిస్థారుులో పరిష్కారమైందని అర్జీదారుడు తృప్తి చెందితేనే ఆన్లైన్ నుంచి ఆ అర్జీని తొలగిస్తారు. నూతన విధానం అమలులో భాగంగా ఇకపై ప్రజలు అర్జీతో పాటు ఆధార్, ఫోన్ నంబర్లను సమర్పించాల్సి ఉంటుంది. మరోవైపు ఒకే పథకంతో పలుమార్లు లబ్ధిపొందే వారికి కూడా చెక్ పడనుంది. గతంలో కొందరు నివేశన స్థలాలు, పక్కా గృహాలు తదితర ప్రయోజనాలను పలుమార్లు పొందిన సందర్భాలున్నారుు. ఇకపై ప్రతి లబ్ధిదారుడి వివరాలను ఆన్లైన్లో పెట్టనుండడంతో ఒక పథకంలో రెండో సారి ప్రయోజనం పొందే అవకాశం ఉండదు. ఒకవేళ ఎవరైనా రె ండోసారి దరఖాస్తు సమర్పించినా తిరస్కరించేలా సాఫ్ట్వేర్ రూపొందించారు. ఈ నూతన విధానంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా అధికారులు చర్యలు చేపడుతున్నారు. అరుుతే గతంలో సమర్పించిన వేలాది అర్జీల పరిష్కారం విషయం మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. సమస్యలకు త్వరితగతిన పరిష్కారం: పరిష్కారం సిస్టమ్‌ను మీకోసం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నారు. ప్రజలు వినతిపత్రంపై ఆధార్, ఫోన్ నంబర్లను తప్పనిసరిగా నమోదు చేయూల్సి ఉంటుంది. ఈ విధానం ద్వారా సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తాం. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న అర్జీల పరిష్కారంపై కూడా దృష్టి పెడతాం. -ఎం.జానకి, కలెక్టర్ -
నెట్లో విన్నవిద్దాం..
తిరుపతి క్రైం: అయ్యా...! మా సమస్య పరిష్కరించండి .. అంటూ అర్జీలు చేతపట్టుకుని.. ఎర్రబస్సు ఎక్కి పల్లె నుంచి పట్టణాలకు.. రాజ ధాని కేంద్రాల్లోని కార్యాలయాల చుట్టూ తిరిగేవారు కోకొల్లాలు. రోజుల తరబడి పనులు మానుకుని ఎన్నో వ్యయప్రయాసాల కోర్చి అంత దూరం వెళ్లాక అధికారులు, ప్రజాప్రతి నిధులు కానరాక సమస్యలు మరుగున పడుతున్న సందర్భాలు అనేకం. ఇప్పుడా పరిస్థితి నుంచి విముక్తి పొందే సరికొత్త సాంకేతిక పోకడలు అందివచ్చాయి. సమస్యలపై ఫిర్యా దు చేయడానికి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ ద్వారా అర్జీ సమర్పించవచ్చు. తర్వాత సమస్య పరిష్కారం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. రాష్ట్ర, దేశ ప్రజాప్రతినిధులను మొదలుకుని రాష్ట్రపతి వరకు ఫిర్యాదు చేయవచ్చు. అదెలాగో ... రాష్ట్రపతికి ఇలా.. రాష్ట్రపతికి వినతిపత్రం పంపాలంటే www. president 0findia.nic.in వెబ్సైట్లోకి వెళ్లాలి. పేజీ తెరుచుకోగానే అడుగుభాగంలో కుడివైపు హెల్ప్‌లైన్ పోర్టల్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే ప్రెసిడెంట్ సెక్రటేరియట్ అనే పేజీ తెరుచుకుంటుంది. అక్కడ కనిపించే ‘లోడేజ్ ఎ రిక్వెస్ట్’ మీద క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది. దాన్ని నింపి గ్రీవెన్స్ డిస్క్రిప్షన్ అనే బాక్స్‌లో 400 పదాలకు మించకుండా సమస్య వివరించి పీడీఎఫ్ రూపంలో అప్లోడ్ చేయాలి. ఈ క్రమంలో మన ఫిర్యాదుకు సంబంధించి ఒక రిజిస్ట్రేషన్ నంబర్ కనిపిస్తుంది. దాన్ని మనం గుర్తుంచుకోవాలి. మన సమస్య పరిష్కారం అయిందో కాలేదో తెలుసుకోవడానికి రిజిస్ట్రేషన్ సంఖ్య ఉపయోగపడుతుంది. ప్రధానికి ఫిర్యాదు ఇలా.. దేశ ప్రధాన మంత్రికి ఫిర్యాదు చేయాలంటే www.pmindia.gov.in వెబ్సైట్లోకి వెళ్లి సమస్యలను విన్నవించుకోవచ్చు. పేజీ ఓపెన్ చేయగానే ‘ఇంటరాక్ట్ విత్ హానరబుల్ పీఎం ’ వస్తుంది. క్లిక్ చేస్తే ‘టు రైట్ టు ది ప్రైమినిస్టర్ క్లిక్ హియర్ ’ అనివస్తుంది. దాన్ని క్లిక్ చే స్తే ‘కామెంట్స్ ’ అనే పేజీ తెరుచుకుంటుం ది. ఫిర్యాదుదారుడి వివరాలు, ఈ-మెయిల్, ఫోన్ నంబర్ తదితర వివరాలు అందులో నమోదు చేయాల్సి ఉంటుంది. సంబంధిత పేజీలో 1000 అక్షరాల లోపు సమస్యను విన్నవించి దిగువ భాగాన ఉన్న కోడ్‌ను నమోదు చేయాలి. గవర్నర్‌కు.. aprajbhavan@gmail.com మెయిల్‌కు ఫిర్యాదుదారుడు తమ పూర్తి చిరునామాతో సమస్యను సంక్షిప్తంగా నేరుగా పంపవచ్చు. ముఖ్యమంత్రికి.. ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయాలంటే www.andhra.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్లాలి. పేజీ తెరుచుకోగానే ఎడమవైపు దిగువ భాగంలో సిటిజన్ ఇంటర్ ఫే అనే పోర్టల్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఈ-మెయిల్ ఐడీని నమోదు చేసి సంబంధిత విషయాన్ని క్లుప్తంగా వివరించాలి. ఇంకేం ప్రయత్నించండి మరీ. -
పింఛన్.. టెన్షన్
సాక్షి, ఖమ్మం: పింఛన్ అందుతుందో లేదో తెలియక లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాలో పింఛన్ల (ఆసరా) పథకం కింద 3.17 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 90వేల పై చిలుకు దరఖాస్తులు అర్హత లేనివిగా అధికారులు తిరస్కరించారు. ఈ పరిస్థితులతో అర్హులైనవారు తమకు అర్హత కల్పించాలని డీఆర్డీఏ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఖమ్మం నగరానికి సంబంధించి వేలాది మంది మళ్లీ దరఖాస్తులు పట్టుకొని ఇటీవల పరిశీలన చేసిన భక్తరామదాసు కళాక్షేత్రం వద్దకు వెళ్లి తమగోడు వెళ్లబోసుకుంటున్నారు. అక్కడ వారికి సమాధానం చెప్పేవారే లేకపోవడంతో తమ బాధ ఎవరికి చెప్పుకోవాలంటూ ఆవేదనతో వెనుదిరిగి పోతున్నారు. దరఖాస్తుల స్వీకరణ.. ఆతర్వాత పరిశీలన దాదాపు పూర్తి కావచ్చింది. ఇక్కడికి ఎవరైనా వెళ్తే కార్పొరేషన్ లేదా, డీఆర్డీఏకు వెళ్లండంటూ అక్కడ ఉండే ఒక్కరిద్దరూ కింది స్థాయి సిబ్బంది సమాధానం చెబుతున్నారు. పీడీ అక్కడ..ఇక్కడ.. జిల్లా పరిశ్రమల కేంద్రం మేనేజర్ శ్రీనివాస్‌నాయక్‌కు పీడీ బాధ్యతలు అప్పగించడంతో ఆయన అక్కడ.. ఇక్కడ విధులు నిర్వహించడం భారంగా మారింది. పింఛన్ల మంజూరు, నూతనంగా అమల్లోకి తెస్తున్న కల్యాణలక్ష్మి అన్నీ డీఆర్డీఏ పరిధిలోకి రావడంతో ఈ శాఖ అధికారులు హైరానా పడుతున్నారు. దరఖాస్తులను ఎందుకు తిరస్కరించారో అర్జీలు పెట్టుకున్న వారికి లేఖలు రాయాలని ప్రభుత్వం తాజాగా అధికారులను ఆదేశించింది. దీంతో సంబంధిత అధికారులు తలపట్టుకుంటున్నారు. ఇక కార్పొరేషన్ కమిషనర్‌గా మెప్మా పీడీ వేణుమనోహర్రావుకు బాధ్యతలు అప్పగించారు. పింఛన్ దరఖాస్తులకు సంబంధించి ఇప్పటివరకు సిబ్బంది తమ ఇళ్ల వద్దకు పరిశీలనకు రాలేదని, తమకు పింఛన్ రాదా..? అంటూ చాలా మంది ప్రతిరోజూ కార్పొరేషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తున్నా.. అధికారులు మాత్రం భక్తరామదాసు కళాక్షేత్రానికి వెళ్లండంటూ సమాధానం చెబుతున్నారే తప్పా.. ఇలా వచ్చే ఫిర్యాదులను మాత్రం కార్పొరేషన్లో నమోదు చేసుకోవడం లేదు. దీంతో ఇక్కడి వచ్చే వారంతా అటు భక్తరామదాసు కళాక్షేత్రం బాటపడుతున్నారు. అక్కడ కింది స్థాయి సిబ్బంది ఇచ్చే సమాచారంతో ఇతర శాఖల అధికారుల కోసం పడిగాపులుగాస్తున్నారు. ఇవే ఇలా ఉంటే కల్యాణలక్ష్మీ పథకానికి అర్హులు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. పూర్తి స్థాయి అధికారులు లేకపోతే ఇది కూడా పింఛన్ల దరఖాస్తుల మాదిరిగా ప్రహాసనంగా మారనుంది. -
గోడు గోడలకే..
ప్రజావాణి... ప్రతీ సోమవారం మండల, డివిజన్, జిల్లా కేంద్రంలో నిర్వహించే కార్యక్రమం. సామాన్యులు తమ గోడు వెల్లబోసుకునేందుకు.. తద్వారా సమస్య పరిష్కారానికి అనువైన వేదిక. కానీ జిల్లా ఉన్నతాధికారులు తమకు ఇచ్చిన అర్జీలను తీసుకోవడం.. ఆ తర్వాత సంబంధిత శాఖలకు పంపించడంతోనే సరిపెడుతున్నారు. ఫలితంగా సమస్య పరిష్కారం కాక.. అర్జీదారులకు వ్యవయప్రయూసలే మిగులుతున్నారుు. సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణిపై ‘సాక్షి’ పరిశీలన జరపగా అక్కడికి వచ్చిన బాధితులు పెద్దమొత్తంలో కనిపించారు. కొన్నేళ్లుగా తాము దరఖాస్తు చేస్తున్నా సమస్య పరిష్కారం కావడం లేదంటూ ఆరోపించారు. - ముకరంపుర ముకరంపుర: కలెక్టరేట్‌కు సోమవారం జిల్లా నలుమూలల నుంచి 220 మంది బాధితులు తరలివచ్చారు. తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు. ఇందులో ప్రధానంగా ఆహారభద్రత, పెన్షన్లపై దరఖాస్తులున్నారుు. సర్వర్ సమస్యతో నమోదులో జాప్యం జరిగింది. దీంతో సిబ్బంది దరఖాస్తులు తీసుకుని చేతిరాతతో కూడిన రశీదులందించారు. ఉదయం 10.30 నుంచి 11 గంటల వరకు కలెక్టరేట్ సమావేశమందిరంలో డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం జరిగింది. అనంతరం 11.15 గంటలకు కలెక్టర్ వీరబ్రహ్మయ్య, జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, డీఆర్వో వీరబ్రహ్మయ్య, డీఆర్డీఏ పీడీ విజయగోపాల్ ఒకరి తర్వాత ఒకరు ఆడిటోరియంలో నిర్వహించే ప్రజావాణికి వచ్చారు. బాధితుల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు దరఖాస్తులు స్వీకరించి కార్యక్రమం ముగించారు. అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఆ తర్వాత వచ్చిన బాధితులు కొంతమంది వెనుదిరిగారు. కానరాని అధికారులు ప్రజావాణిలో కలెక్టర్, జేసీతో పాటు జిల్లాస్థారుు అధికారులు పాల్గొనాల్సి ఉంటుంది. కానీ కొన్నిశాఖల అధికారులు తమ కార్యాలయంలోని కిందిస్థాయి సిబ్బందిని పంపి చేతులు దులుపుకుంటున్నారు. కలెక్టర్, జేసీలు ఏదైనా అధికారిక కార్యక్రమంపై బయటికి వెళ్తే ఇక అక్కడ ఒక్క అధికారి కూడా కనిపించడం లేదు. సోమవారం డీపీవో కుమారస్వామి మినహా జిల్లాస్థాయి అధికారులవెరూ ప్రజావాణిలో లేరు. డీఎంహెచ్‌వో బాలు, హౌసింగ్ పీడీ నర్సింహారావు, డీఎస్వో చంద్రప్రకాశ్, వ్యవసాయశాఖ జేడీ ప్రసాద్ తదితర అధికారులెవరూ కుర్చీలో కానరాలేదు. ఏం జరుగుతోంది? ప్రతి సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి నిర్వహించి బాధితుల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. కలెక్టర్, జేసీ సహా ఉన్నతాధికారులు పాల్గొంటారు. అర్జీలను మొదట ప్రత్యేక కౌంటర్లలో తీసుకుని వెబ్సైట్లో నమోదు చేసుకుని శాఖల వారీగా ఉన్నతాధికారులకు చేరవేస్తారు. దరఖాస్తు నమోదైనట్లు కౌంటర్లో బాధితుడికి ఓ ప్రతి ఇస్తారు. దానిని కలెక్టర్‌కు సమర్పించి గోడు వెల్లబోసుకుంటారు. ఆ తర్వాత ఆ సమస్యను కలెక్టర్ సంబంధిత అధికారులకు రాసి పరిష్కరించాల్సిందిగా సూచిస్తారు. వెబ్సైట్ ఉత్తదే.. ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించిన ఆయా శాఖల అధికారులు తమకు అందిన అర్జీలు, పరిష్కారం, పురోగతి తదితర వివరాలను వెబ్సైట్లో నమోదు చేయాల్సి ఉంటుంది. కొన్ని శాఖలు ప్రజావాణి ద్వారా సంబంధిత సమస్యలు పరిష్కారం కాబడినవి అంటూ బాధితులకు లేఖలు చేరవేస్తుండడంతో అవాక్కయ్యే సంఘటనలు కనిపిస్తున్నాయి. మొక్కుబడిగా కార్యక్రమం ఇక్కడ అధికారులు కంప్యూటర్లో దరఖాస్తులు నమోదు చేసుకోవడం.. తర్వాత సంబంధిత శాఖకు బదిలీ చేయడం.. జిల్లా ఉన్నతాధికారులను కలుసుకోవడం వరకు బాగానే ఉంటున్నా అంతా మొక్కుబడి వ్యవహారంగా సాగుతోంది. మండల, డివిజన్ స్థాయిలో ప్రజావాణి ఉన్నా జిల్లా నలుమూలల నుంచి బాధితులు వ్యయప్రయాసల కోర్చి కలెక్టరేట్‌కు తరలివస్తున్నారు. వేలల్లో దరఖాస్తులు వస్తున్నా పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరించినట్లే పేర్కొంటున్నారు. సమస్యలు పరిష్కారానికి నోచుకోక బాధితులు కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే వున్నారు. అధికారులు డుమ్మా సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి స్పందన కరువైంది. పలు శాఖల అధికారులు డుమ్మా కొట్టారు. చేనేత జౌళి, పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఫారెస్ట్, వైద్య, విద్య, వ్యవసాయ శాఖ అధికారులు హాజరు కాలేదు. ఆర్డీవో భిక్షానాయక్ సమక్షంలో జరిగిన ప్రజవాణికి పెద్దగా ఫిర్యాదులు రాలేదు. భూమి సర్వే కోసం వ్యక్తిగత సమస్యలను ప్రస్తావిస్తూ పలువురు దరఖాస్తు చేసుకున్నారు. సిరిసిల్లలో కార్మికుల కూలి ఒప్పందం కోసం చర్చలు నిర్వహించాలని కోరుతూ సీఐటీయూ, నవోదయ పవర్‌లూం కార్మిక సమాఖ్య వినతిపత్రాలు అందించాయి. ఆగస్టు 19న నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఆన్లైన్లో పూర్తిస్థాయిలో డాటా ఎంట్రీ లేదని, చాలా కుటుంబాల సమాచారం నమోదు కాలేదని నేత చేయూత స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు కుసుమ విష్ణు, వికలాంగుల హక్కుల వేదిక అధ్యక్షుడు తడుక శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎస్కేఎస్ వివరాలు లేకపోవడంతో ఆహారభద్రత, ఆసరా పింఛన్లు అందకుండా పోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. - సిరిసిల్ల అనాథ లకు నీడనివ్వండి 12 ఏళ్లుగా కరీంనగర్ శివారులోని అద్దె ఇంట్లో వీరబ్రహ్మేంద్ర అనాథాశ్రమం నిర్వహిస్తున్నా. ప్రస్తుతం 33 మంది వృద్ధులున్నారు. వయసు మీరడంతో వారు మరణిస్తున్నారు. ఈ కారణంగా ఇళ్లు ఖాళీ చేయాలని ఇంటి యజమాని ఒత్తిడి పెంచుతున్నాడు. అనాథ వృద్ధులకు ఎక్కడ ఆశ్రయమివ్వాలి. పక్కా ఇళ్ల స్థలం కేటాయించాలని 12 ఏళ్లుగా అధికారులు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకుంటున్నా ఫలితం లేదు. ప్రస్తుత ఆశ్రమం వద్దే కుంట శిఖం భూమి, వర్మి కంపోస్ట్ షెడ్ ఉంది. అది వీరబ్రహ్మేంద్ర అనాథవృద్ధాశ్రమానికి కేటాయించాలని వేడుకుంటున్నా. - వీరమాధవ్, వీరబ్రహ్రేంద్ర అనాథాశ్రమం తెరుచుకోని తహశీల్దార్ చాంబర్ ప్రజాసమస్యల పరిష్కారంలో అధికారుల పట్టింపు కరువైంది. సోమవారం మంథనిలో అసలు ప్రజావాణియే నిర్వహించలేదు. సాక్షి విలేకరి ఉదయం 10-30 గంటలకు తహశీల్దార్ కార్యాలయానికి చేరుకోగా తహశీల్దార్ చాంబర్ ఇంకా తెరుచుకోనే లేదు. గడియ పెట్టి ఉన్న గది ఫొటో తీయగా... ఉదయం 11-30 గంటలకు సిబ్బంది కేవలం గది మాత్రమే తెరిచారు. కానీ అర్జీలు తీసుకునేందుకు ఏ ఒక్క అధికారి అందుబాటులో లేరు. వివిధ సమస్యలపై అర్జీలు ఇచ్చేందుకు వచ్చిన చాలామంది బాధితులు ప్రజావాణి లేదని తెలుసుకుని నిరాశతో వెనుదిరిగారు. ఇక్కడ ప్రజావాణి ఎందుకు నిర్వహించలేదో అధికారులకే తెలియాలి. డివిజన్‌లోనూ ప్రజావాణి మొక్కుబడిగా సాగింది. తాను ఐకేపీ కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవానికి వెళ్లగా.. డెప్యూటీ తహశీల్దార్ దరఖాస్తుల పరిశీలనకు వెళ్లారని, ఎంపీడీవో కూడా అదే పనిలో ఉన్నారని మంథని తహశీల్దార్ జల్లా సత్తయ్య తెలపడం కొసమెరుపు. - మంథని ఒక్కటే దరఖాస్తు హూజూరాబాద్‌లో ప్రజావాణికి స్పందన కరువైంది. తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి అధికారులెవరూ హాజరుకాలేదు. ఒకే ఒక్కరు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆమె దరఖాస్తును కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ రాము తీసుకున్నారు. ఓసారి మండల పరిషత్‌లో.. మరోసారి తహశీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహిస్తుతుండడంతో జనం అయోమయానికి గురవుతున్నారు. సర్వే కారణంగా అధికారులు ప్రజావాణికి హాజరు కాలేదని తహశీల్దార్ నాగేశ్వరావు తెలిపారు. - హుజూరాబాద్ టౌన్ జగిత్యాలలో ఫిర్యాదులు జగిత్యాలలో నిర్వహించిన ప్రజావాణికి కొంత స్పందన కనిపించింది. ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కొందరు సమస్యలపై అధికారులకు అర్జీలు అందించారు. సారంగాపూర్ మండలం పోతారం గ్రామానికి చెందిన సురేందర్‌రావు 105, 107 సర్వే నంబరు రికార్డులో పేరును అక్రమంగా తొలగించారని.. బాధ్యులపై చర్య తీసుకుని న్యాయం చేయాలని వినతిపత్రం అందించారు. మెట్పల్లి మండలం కోనారావుపేట రేషన్ డీలర్ ఎన్.జనార్దన్ సరుకులు సక్రమంగా పంపిణీ చేయడంలేదని.. రాయికల్ మండలం యూసూఫ్నగర్గీత పారిశ్రామిక సంఘం భూమి సర్వే నంబర్ 631లోని భూమి కబ్జా చేసినవారిపై చర్యలు తీసుకోవాలని కొందరు అర్జీలు సమర్పించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీ కొంరయ్య, ఆర్డబ్ల్యూఎస్ డీఈ రాజేశం, హౌసింగ్ డీఈ వెంకన్న, డీఎల్పీవో చంద్రశేఖర్, సంక్షేమాధికారులు బాలసురేందర్, జయదేవ్, అబ్రహం, రంగారెడ్డి, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, మెట్పల్లి సీడీపీవో మమత, ఐకేపీ ఏరియా కో-ఆర్డినేటర్ పద్మ పాల్గొన్నారు. ఆర్డీవో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై అధికారులు స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. - జగిత్యాల -
సగం పింఛన్ దరఖాస్తులే!
ఆదిలాబాద్ అర్బన్ : జిల్లా అంతటా పింఛన్ల సమస్యే. ఇందుకోసం రోజూ ధర్నాలు, రాస్తారోకోలు. చివరకు గ్రీవెన్స్‌కు సెల్‌కు కూడా వీటిపైనే అధిక మొత్తంలో అర్జీలు అందాయి. సోమవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో నిర్వహించిన ప్రజాఫిర్యాదుల విభాగంలో కలెక్టర్ ఎం.జగన్మోహన్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అందులో సగానికి పైగా పింఛన్లకు సంబంధించిన దరఖాస్తులే రావడం చర్చనీయాంశమైంది. ఆసరా పథకంలో అర్హులకు పింఛన్ రాకపోవడం, కొత్త వారికి మంజూరు కావడం, భర్త ఉన్నా భార్యకు వితంతువు పింఛన్ రావడం, 80 ఏళ్లు ఉన్నా వృద్ధులకు మంజూరు కాకపోవడం, ఇన్ని రోజులు పింఛన్ ఇచ్చి ఇప్పుడు నిలిపివేయడం వంటి తదితర కారణాలతో దరఖాస్తులు రావడంతో అధికారులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం.జగన్మోహన్ మాట్లాడుతూ పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిష్కరిస్తామని, ప్రతీ అర్జీని పరిశీలించి అర్హులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు జేసీ ఎస్ఎస్.రాజు, జిల్లా పరిషత్ సీఈవో అనితాగ్రేస్, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి, డీఈవో సత్యనారాయణరెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
లెక్కకు మిక్కిలి!
‘సంక్షేమ’ దరఖాస్తులు జిల్లా యంత్రాంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆహారభద్రత, సామాజిక పింఛ న్లకు లెక్కకు మిక్కిలిగా అర్జీలు రావడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 9,38,324 రేషన్‌కార్డులుండగా, తాజాగా వీటికి అదనంగా 1,66,229 మంది ఆహారభద్రత కార్డుల కోసం శనివారం నాటికి దరఖాస్తు చేసుకోగా, అర్జీలకు మరో రెండు రోజులు గడువు ఉండడంతో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సంక్షేమ పథకాలకు కొత్తగా దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం నిర్దేశించడంతో దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి. ఆహారభద్రత, సామాజిక పింఛన్ల కోసం దరఖాస్తుదారులు ఇబ్బడిముబ్బడిగా అర్జీలు పెట్టుకుంటున్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థను పకడ్బందీగా అమలు చేయాలని భావించిన కేసీఆర్ సర్కారు.. ఇటీవల బోగస్ రేషన్‌కార్డులను ఏరివేసింది. ఈ క్రమంలో దాదాపు లక్షన్నర కార్డులను అధికారులు తొలగించారు. తొలగించిన కార్డులను అటుంచితే.. అంచనాలకు మించి ఆహారభద్రతకు దరఖాస్తు చేసుకోవడం యంత్రాంగాన్ని విస్మయానికి గురిచేస్తోంది. మూడు నెలలు కష్టించి బోగస్ కార్డులు ఏరివేస్తే.. ప్రభుత్వ నిర్ణయంతో తమ శ్రమ బూడిదలో పోసిన పన్నీరయిందని ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. బోగస్ కార్డుల పేరిట హడావుడి చేసి.. ఇప్పుడు మరోసారి దరఖాస్తులు పరిశీలించాలనడంలో అర్థంలేదని అభిప్రాయపడ్డారు. ఆహారభద్రతకు 118శాతం! ‘ఆహారభద్రత’కు ఇప్పటివరకు 11,04,553 దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం ఉన్న కార్డులతోపోలిస్తే ఇది 118శాతం అధికం. సరూర్‌నగర్ (270%), కీసర(230%), కుత్బుల్లాపూర్ (176%), హయత్‌నగర్ (170%), ఘట్కేసర్(150%)లో రికార్డు స్థాయిలో దరఖాస్తులు అందాయి. నగరీకరణ నేపథ్యంలో ఇక్కడ కార్డుల కోసం అడ్డగోలుగా దరఖాస్తులు వస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉమ్మడి కుటుంబాలుగా జీవిస్తున్నవారు కూడా కొత్త కార్డులకు దరఖాస్తు చేసుకుంటున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. వలసలు అధికంగా ఉండడంతో శివార్లలో అర్జీల సంఖ్య కూడా అదేస్థాయిలో నమోదవుతోంది. మల్కాజిగిరి, అల్వాల్, ఎల్బీనగర్, ఉప్పల్ డివిజన్లలో ప్రస్తుత కార్డులకంటే దరఖాస్తులు తక్కువ రాగా, గ్రామీణ ప్రాంతంలో కేవలం షాబాద్ మండలంలో ఉన్నవాటికంటే తక్కువ దరఖాస్తులు రావడం గమనార్హం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేంద్రాలు సంఖ్య తక్కువగా ఉండడంతో దరఖాస్తుదారులు అర్జీలు సమర్పణలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే దరఖాస్తులు ఇంకా ఊపందుకోనట్లు తెలుస్తోంది. దరఖాస్తుల సమర్పణకు డెడ్లైన్లేదని ప్రభుత్వం ప్రకటించడంతో ప్రజలు కూడా దరఖాస్తులకు తొందరలేదనే అభిప్రాయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. పింఛన్లకు భారీగా దరఖాస్తులు సామాజిక పింఛన్లకు కూడా అర్జీలు వెల్లువెత్తాయి. వృద్ధులు, వితంతు, వికలాంగులు 4,55,296 మంది లబ్ధిదారులుండగా, ఇప్పటికే 5,99,041 దరఖాస్తులు వచ్చాయి. అంటే అదనంగా 1,43,745 మంది దరఖాస్తు చేసుకున్నారన్నమాట. అర్జీల సమర్పించేందుకు వ్యవధి ఉండడంతో ఈ సంఖ్య మరింత పెరిగే వీలుంది. గ్రామీణ మండలాల్లో 1,90,014 లబ్ధిదారులు ఉండగా.. ఇప్పటివరకు 2,54,992 దరఖాస్తులు అందాయి. అదే గ్రేటర్‌లోని పది సర్కిళ్లు, జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలో 2,65,282 మంది లబ్ధిదారులు ఉండగా, 3,44,048 దరఖాస్తులు వచ్చాయి. ఇది ఉన్నవాటికంటే 129 శాతం అధికం. శంషాబాద్, రాజేంద్రనగర్, హయత్‌నగర్, కుత్బుల్లాపూర్‌లో అత్యధికంగా పింఛన్ల కోసం అర్జీలు వచ్చాయి. -
జిల్లాలో ముగ్గురు ఎంపీపీల ఎన్నిక చెల్లదని పిటిషన్లు
చిత్తూరు (టౌన్) : జిల్లాలోని కేవీబీ పురం, బీ.కొత్తకోట, తిరుపతి రూరల్ ఎంపీపీల ఎన్నికపై ఆయా మండలాలకు చెందిన కొందరు ఎంపీటీసీ సభ్యులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై తమకు నివేదికను సమర్పించాలంటూ జెడ్పీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. జెడ్పీ సీఈవో వేణుగోపాల్‌రెడ్డి కథనం మేరకు..ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో కేవీబీ పురం మండలంలో మొత్తం 12 మంది ఎంపీటీసీ సభ్యులు ఎన్నికయ్యూరు. వీరిలో ఇద్దరు వైఎస్ఆర్ సీపీ, మిగిలిన 10 మంది టీడీపీకి చెందినవారు. అయితే ఎంపీపీ స్థానాన్ని ఎస్టీ మహిళకు ప్రభుత్వం రిజర్వు చేసింది. కానీ టీడీపీకి చెందిన పదిమంది సభ్యులు గెలిచినా ఎస్టీకి చెందిన మహిళా అభ్యర్థి ఓడిపోవడంతో రాజ్యాంగం ప్రకారం పార్టీలతో నిమిత్తం లేకుండా వైఎస్ఆర్ సీపీకి చెందిన తుపాకుల సులోచనను ఎంపీపీ పదవి వరించింది. అయితే ఇది చెల్లదంటూ టీడీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యుడు శేఖర్ కోర్టును ఆశ్రయించారు. అనర్హత వేటు చెల్లదంటూ... తమపై వేసిన అనర్హత వేటు చెల్లదంటూ తిరుపతి రూరల్ మండల టీడీపీ ఎంపీటీసీ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. రూరల్‌లో మొత్తం 40 ఎంపీటీసీ స్థానాలుండగా 21 స్థానాల్లో టీడీపీ,14 స్థానాల్లో వైఎస్ఆర్ సీపీ, ఒక స్థానంలో సీపీఎం అభ్యర్థులు, 4 స్థానాల్లో ఇండిపెండెంట్లు గెలిచారు. అయితే టీడీపీకి ఎంపీపీ అయ్యేందుకు అవసరమైన మెజారిటీ ఉన్నా ఇతరుల మద్దతుతో శెట్టిపల్లె-5 ఎంపీటీసీ సభ్యుడు మునికృష్ణ ఎంపీపీ అయ్యారు. దానికి సాయినగర్-3 ఎంపీటీసీ సభ్యుడు సుధాకర్ రెడ్డి, పద్మావతిపురం-2 ఎంపీటీసీ సభ్యురాలు ఉష మద్దతిచ్చారు. దీంతో ఆ ముగ్గురిపై విప్ ధిక్కారం కింద అనర్హత వేటు ఇటీవలే పడింది. దీంతో ఆ ముగ్గురూ హైకోర్టును ఆశ్రయించారు. అధిక సంతానంవల్ల అనర్హుడిగా ప్రకటించండి బీ.కొత్తకోట ఎంపీపీ ఖలీల్ అహమ్మద్‌కు ఇద్దరు భార్యలు, ముగ్గురు సంతానమని, అతనిని అనర్హుడిగా ప్రకటించాలని బీ.కొత్తకోట-6 ఎంపీటీసీ సభ్యుడు శ్రీనివాసులు హైకోర్టులో పిటిషన్ వేశారు. -
మోగిన నగారా
►ఈ నెల 7న జడ్పీ చైర్పర్సన్, వైస్చైర్మన్ల ఎన్నిక ►6న ఎంపీపీలు, వైస్ ఎంపీపీలకు.. ►ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ►ఆ ‘ఏడు’ మండలాల జడ్పీటీసీలకు ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేదు ►అక్కడ ఎంపీపీ ఎన్నిక కూడా లేనట్టే ►39 మండలాలకే ఎన్నిక నిర్వహించాలని కలెక్టర్‌కు ఆదేశాలు ► కూనవరం, చింతూరు, వీఆర్‌పురం ఎన్నికల బాధ్యత తూర్పుగోదావరి కలెక్టర్‌కు అప్పగింత ►భద్రాచలం, బూర్గంపాడు ఎంపీపీలు పెండింగ్ ►జడ్పీలో మారనున్న పార్టీల బలాబలాలు ►రిజర్వేషన్ యథాతథం ►రసకందాయంలో జిల్లా రాజకీయం సాక్షి ప్రతినిధి, ఖమ్మం : ఎట్టకేలకు జిల్లా, మండల పరిషత్‌ల పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెలువడిన రెండున్నర నెలల తర్వాత జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్, ఎంపీపీలు, వైస్ ఎంపీపీల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. ఈనెల 7న జడ్పీ పాలకవర్గానికి (జడ్పీ చైర్మన్, వైస్‌చైర్మన్, కో ఆప్షన్ సభ్యులు), 6న జిల్లాలోని 39 మండల పరిషత్‌ల పాలకవర్గాలకు (ఎంపీపీ, వైస్‌చైర్మన్, కో- ఆప్షన్ సభ్యులు) ఎన్నికలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌రెడ్డి పేరిట గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే, ఈ ఎన్నికల నుంచి పోలవరం ముంపు ప్రాంతం కింద ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిన ఏడు మండలాలను మినహాయించారు. ఈ మండలాల జడ్పీటీసీలు జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలలో పాల్గొనే అవకాశం లేదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒకే జిల్లాలోని పూర్తి మండలాన్ని మాత్రమే జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గంగా పరిగణిస్తామని, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం - 2014 ప్రకారం ఆ ఏడు మండలాల్లో కొన్ని పూర్తిగా, కొన్ని పాక్షికంగా ఉభయగోదావరి జిల్లాల్లో కలిసినందున సెక్షన్ 178 ప్రకారం ఈ మండలాలను ఎన్నికల నుంచి మినహాయిస్తున్నామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదేవిధంగా ఎంపీపీ ఎన్నికల కోసం వెలువరించిన ఉత్తర్వుల్లో జిల్లాలోని 39 మండలాలకు మాత్రమే నోటిఫికేషన్ జారీ అయింది. మిగిలిన ఏడు మండలాల్లో కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు ఎంపీటీసీ ఎన్నికలు జరగలేదు. ఇక మిగిలిన వాటిలో చింతూరు, వీఆర్‌పురం, కూనవరం మండలాలు తూర్పుగోదావరి జిల్లాలో పూర్తిగా కలిసినందున ఆయా మండల పరిషత్‌ల పాలకవర్గాలకు ఎన్నిక జరిపే బాధ్యతను ఆ జిల్లా కలెక్టర్‌కు అప్పగిస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ఇక పాక్షికంగా గోదావరి జిల్లాల్లో కలిసి మిగిలిన భాగం మన జిల్లాలో ఉండే భద్రాచలం, బూర్గంపాడు మండలాల పాలకవర్గాల ఎన్నిక ప్రక్రియను పెండింగ్‌లో ఉంచారు. కోర్టు కేసుల ఉపసంహరణ.. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పరిషత్, మండల పరిషత్ పాలకవర్గాలు కొలువుదీరినా, జిల్లాలో మాత్రం ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఈ ఏడాది మార్చి 10న నోటిఫికేషన్ విడుదల కాగా, ఏప్రిల్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల ఫలితా లు మే 13న వెలువడ్డాయి. అనంతరం జూన్ 26న తెలంగాణ వ్యాప్తంగా జడ్పీ చైర్మన్లు, ఎంపీపీల ఎన్నిక జరగగా, మన జిల్లాలో మాత్రం నిర్వహించలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి, జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రలో కలిపినందున జిల్లా పరిషత్, మండలపరిషత్ ఎన్నికలకు మళ్లీ రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ విజయగాంధీ తదితరులు కోర్టును ఆశ్ర యించడంతో జూన్13న హైకోర్టు స్టే విధించింది. దీంతో ఎన్నిక నిలిచిపోయింది. ఆ తర్వాత కేసు ఉపసంహరించుకోవడంతో, మిగిలిన పిటిషన్లను కూడా జూలై 24న కోర్టు కొట్టివేసింది. దీంతో జడ్పీ చైర్పర్సన్, ఎంపీపీల ఎన్నికకు మార్గం సుగమం అయింది. -
ప్రధాన సమస్యలపై దృష్టి సారించండి
సమగ్ర నివేదికలు తయారు చేయండి జిల్లా అధికారులతో కలెక్టర్ రఘునందన్‌రావు కలెక్టరేట్ (మచిలీపట్నం) : జిల్లా అధికారులు తమశాఖకు సంబంధించి ఐదు ముఖ్య సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఎం.రఘునందనరావు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ కొద్దిసేపు అధికారులతో మాట్లాడారు. ఆయా శాఖలకు సంబంధించి జిల్లా అధికారులు మూడు, నాలుగు నెలలుగా పరిష్కారమవని సమస్యలు, అపరిష్కృతంగా ఉన్న ప్రధాన సమస్యల్లో ఐదింటిని గుర్తించి జూలై 15వ తేదీలోగా పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయా శాఖల అధికారులు ఐదు ముఖ్యాంశాలపై సమగ్ర నివేదిక తయారు చేసి మంగళవారం మచిలీపట్నంలో ఉండే జిల్లా అధికారులు తన వద్దకు తీసుకురావాలని కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. అధికారులు ఎక్కువ సమయం సమస్యల పరిష్కారానికి వెచ్చించాలన్నారు. ఈ సమస్యలను ముందుగానే నిర్ణయించిన కాలంలో పరిష్కరిస్తేనే ఆ శాఖ పనితీరు తెలుస్తుందన్నారు. సాంఘిక సంక్షేమశాఖకు సంబంధించిన వసతి గృహాల్లో విద్యార్థులు అందరికీ నూరుశాతం యూనిఫాం పంపిణీ చేశారా, లేదా అన్న విషయాన్ని డీడీ మధుసూదనరావు తెలుసుకోవాలని సూచించారు. రాబోయే 30 రోజుల్లో 70 శాతం వసతి గృహాలను తనిఖీ చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో నూరుశాతం పిల్లలకు గ్యాస్ ద్వారానే వంట చేసి ఆహార పదార్థాలను అందించాలన్నారు. రాబోయే రోజుల్లో మంత్రులు, ఆయాశాఖల ఉన్నతాధికారులు జిల్లాకు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇందుకోసం సంబంధితశాఖల అధికారులు తమ శాఖకు సంబంధించి ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి, ఎన్ని పరిష్కారమయ్యాయి, ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి, ప్రభుత్వ స్థాయిలో ఉన్న సమస్యలు ఏవో తెలిసేలా సమగ్ర నివేదిక తయారు చేసి సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఉన్నతాధికారులు వచ్చినప్పుడు సమస్యలపై నివేదిక అడిగితే తరువాత కనుక్కుని చెబుతామనే సమాధానం రాకూడదని స్పష్టంచేశారు. సమస్యల పరిష్కారానికి నివేదికలు రూపొందించడమే కాకుండా వాటిని చిత్తశుద్ధితో పరిష్కరించేలా జిల్లా అధికారులు కృషిచేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ జె.మురళి, ఏజేసీ చెన్నకేశవరావు, డీఆర్వో ఎ.ప్రభావతి, జెడ్పీ సీఈవో డి.సుదర్శనం, సాంఘిక సంక్షేమశాఖ డీడీ డి.మధుసూదనరావు, డీసీవో రమేష్‌బాబు, హౌసింగ్ పీడీ సీహెచ్.ప్రతాపరావు, డీఎంఅండ్‌హెచ్‌వో సరసిజాక్షి, వ్యవసాయశాఖ జేడీ వి.నరసింహులు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎన్.వి.వి.సత్యనారాయణ, బీసీ కార్పొరేషన్ ఈడీ పుష్పలత, రాజీవ్ విద్యామిషన్ ఇన్చార్జ్ పీవో డి.పుష్పమణి, డీఈవో డి.దేవానందరెడ్డి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
పరిశీలించండి.. పరిష్కరించండి
అధికారులకు అదనపు జేసీ సూచన మొత్తం 153 అర్జీల స్వీకరణ కలెక్టరేట్ (మచిలీపట్నం) : ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలించి పరిష్కరించాలని అదనపు జాయింట్ కలెక్టర్ బీఎల్ చెన్నకేశవరావు అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఏజేసీతో పాటు డీఆర్వో ఎ.ప్రభావతి, బందరు ఆర్డీవో పి.సాయిబాబు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన అర్జీదారుల సమస్యలను పరిష్కరించేటప్పుడు క్షుణ్ణంగా పరిశీలించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డ్వామా పీడీ అనిల్‌కుమార్, హౌసింగ్ పీడీ సీహెచ్ ప్రతాపరావు, మత్స్యశాఖ డీడీ టి.కళ్యాణం, పశుసంవర్థక శాఖ డీడీ దామోదరనాయుడు, డీసీవో రమేష్‌బాబు, డీఈవో దేవానందరెడ్డి, డీఎస్వో పీబీ సంధ్యారాణి, ఆర్వీఎం పీవో పుష్పమణి తదితర అధికారులు పాల్గొన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 153 అర్జీలు స్వీకరించారు. పలువురు అర్జీదారుల సమస్యలివీ.. ఆశలు అడియాసలు చేశారు... ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా వికలాంగుల పింఛను రూ.1500 చెల్లిస్తామని ప్రకటించారు. ఇప్పుడు వైకల్య శాతాన్ని సాకుగా చూపి 40 నుంచి 80 శాతం ఉన్న వారికి వెయ్యి రూపాయలు, 80శాతం పైన ఉన్నవారికి రూ.1500 పించను ఇస్తామని ప్రకటించి వికలాంగుల ఆశలను అడియాసలు చేశారని వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గోదా నరసింహారావు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకునేలా వికలాంగులందరికీ రూ.1500 పింఛను అందించాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గోదా నరసింహారావు అర్జీ అందజేశారు. నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకోండి.. యనమలకుదురు గ్రామపంచాయతీలో డీఎల్పీవో విచారణలో రూ.15 లక్షలు దుర్వినియోగం అయ్యాయని వార్తలు వెలువడ్డాయని, సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామస్తులు అర్జీ ఇచ్చారు. గైర్హాజరు అధికారులపై చర్యలేవీ? ప్రజావాణి కార్యక్రమానికి గత సోమవారం హాజరుకాని జిల్లా అధికారులపై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్ కోరారు. గత సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో 56 శాఖలకు చెందిన జిల్లా అధికారులు హాజరుకావాల్సి ఉండగా 12 మంది మాత్రమే హాజరయ్యారని, వారికి మెమోలు జారీ చేయాలని ప్రకటించినా అమలుకాలేదని ఆయన అర్జీలో పేర్కొన్నారు. ఆ పాఠశాలకు అనుమతులు లేవు... విజయవాడ భవానీపురంలోని రవీంద్రభారతి ఎడ్యుకేషన్ అకాడమీ పేరుతో పాఠశాలను నడుపుతున్నారని, ఇప్పటి వరకు ఆ పాఠశాలకు అనుమతులు, కనీస మౌలిక సదుపాయాలు లేకుండా యాజమాన్యం నిర్వహిస్తోందని బసవ సత్యప్రసాద్ అనే వ్యక్తి తెలిపారు. వెంటనే అనుమతులు తీసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన అర్జీ సమర్పించారు. రేషన్ కార్డు బదిలీ చేయరూ... నూజివీడు మండలం సీతారామపురం గ్రామానికి చెందిన పుట్ట వెంకటేశ్వరరావు అదే మండలంలోని మర్రిబంధం గ్రామంలో తాను రేషన్‌కార్డు పొంది ఉన్నానని, జీవనోపాధి నిమిత్తం సీతారామపురంలో వ్యవసాయ కూలి పనులు చేసుకుంటున్నానని అధికారులకు తెలిపారు. తమ రేషన్ కార్డును సీతారామపురం గ్రామానికి బదిలీ చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ అర్జీ అందజేశారు. తొమ్మిదేళ్లుగా పీఆర్సీ బకాయిలు చెల్లించలేదు... బందరు మున్సిపల్ కార్మికులకు 2005 పీఆర్సీ బకాయిలను నేటికీ చెల్లించలేదని ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ కార్యదర్శి కె.సత్యనారాయణ ప్రజావాణిలో అధికారుల దృష్టికి తెచ్చారు. వెంటనే మునిసిపల్ కార్మికులకు పీఆర్సీ బకాయిలు ఇప్పించాలని కోరుతూ అర్జీ అందజేశారు. ఎన్నికల విధులకు భత్యం చెల్లించలేదు... ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో పెడన అసెంబ్లీ నియోజకవర్గంలో ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బందిగా పనిచేసిన తమకు టీఏ, డీఏలు చెల్లించలేదని కె.శ్రీనివాసరావు, వి.రామచంద్రరావు, డి.వెంకటేశ్వరరావు, కేవీ బాలాజీ ప్రజావాణిలో అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. తమకు పెడన తహశీల్దార్ టీఏ, డీఏలు ఇంతవరకు చెల్లించలేదని వారు వివరించారు. ఇతర నియోజకవర్గాల్లో పనిచేసిన సిబ్బందికి ఎన్నికల విధులు పూర్తయిన వెంటనే చెల్లించారని వారు తెలిపారు. వెంటనే తమకు టీఏ, డీఏలు చెల్లించేలా చర్యలు చేపట్టాలని వినతిపత్రంలో కోరారు. -
టీ బిల్లుపై సుప్రీంలో 3 పిటిషన్లు...7న విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు రాజ్యాంగంలోని ఆర్టికల్-3కు విరుద్ధంగా ఉందని, బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టకుండా కేంద్రాన్ని నిలువరించాలని కోరుతూ సోమవారం సుప్రీంకోర్టులో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న మరో నాలుగు పిటిషన్లతో కలిపి ఈ పిటిషన్లంటినీ విచారించేందుకు ప్రధాన న్యాయమూర్తి పి.సదాశివం అనుమతించినట్లు పిటిషనర్ల తరఫు న్యాయవాది సతీష్ గల్లా మీడియాకు వెల్లడించారు. విశాలాంధ్ర మహాసభ, రఘురామకృష్ణరాజు, అడుసుమిల్లి జయప్రకాశ్‌లు వేర్వేరుగా మూడు పిటిషన్లు దాఖలు చేయగా.. గతంలో చిరంజీవిరెడ్డి, సి.ఎం.రమేష్ తదితరులు దాఖలు చేసిన నాలుగు పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవన్నీ వచ్చే శుక్రవారం విచారణకు రానున్నట్టు సతీష్ తెలిపారు. అసెంబ్లీ ఏకగ్రీవంగా బిల్లును తిరస్కరించినా కేంద్రం బిల్లును ప్రవేశపెడుతోందని, అందువల్ల ఈ ప్రక్రియలో జోక్యం చేసుకుని బిల్లును ఆపాలని విజ్ఞప్తి చేసినట్టు ఆయన వెల్లడించారు. బిల్లు సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా, అసమగ్రంగా ఉందని, అసెంబ్లీ అభిప్రాయం పూర్తిగా తెలుసుకోకుండానే పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్టు వివరించారు. -
రిజిస్ట్రార్ ఆఫీసుల్లోనూ...ఇక ఈసీల జారీ
=పభుత్వం ఆదేశం =ఊపిరిపీల్చుకున్న జనం విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : ఈసీ (ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్)ల జారీలో కాస్త వెసులుబాటు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మీ సేవా కేంద్రాల్లో ఈసీలు తదితర సేవల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ప్రభుత్వం సడలింపు ఇస్తూ ఆదేశాలిచ్చింది. ఇంతకుముందు లాగానే ఇకపై సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా వీటిని జారీ చేయాలని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖకు ఉత్తర్వులు అందాయి. దీంతో రిజిస్ట్రేషన్స్ శాఖలో పెద్ద సమస్య పరిష్కారం అయినట్టేనని భావిస్తున్నారు. మీ సేవా కేంద్రాలతో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా ప్రజలు గతంలో మాదిరిగా వివిధ రకాల సేవలు పొందవచ్చని అందిన ఆదేశాలపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏడాదిగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఊరట... గత ఏడాది కాలంగా మీ సేవా కేంద్రాలలో ఈసీలు, దస్తావేజుల నకళ్లు జారీ చేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వాటిని జారీ చేయొద్దని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. దాంతో విజయవాడ నగరంతో పాటు జిల్లాలోని 28 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ఈసీలు, దస్తావేజు నకళ్ల జారీ నత్తనడకన సాగుతోంది. ఈసీల కోసం ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. ఈసీ కోసం దరఖాస్తు చేసి రోజులు గడుస్తున్నా ఆన్లైన్లో అవి పరిష్కారం కావటం లేదు. ఆన్లైన్లో అనేక సమస్యల వల్ల ఈసీ పొందటం గగనమవుతోంది. గతంలో ఈసీ పొందటానికి వంద రూపాయలలోపు ఖర్చు చేసేవారు. మీ సేవల్లో ఈసీ పొందటానికి కనీసం రూ.300 ఖర్చు అవుతోందని చెపుతున్నారు. దీంతోపాటు గంటల వ్యవధిలో పూర్తయ్యే ఈసీల జారీ ప్రక్రియ వారం.. పది రోజులు కూడా పడుతోంది. దస్తావేజుల నకళ్లు, దాఖలైన అర్జీలు మీ సేవల్లో కుప్పలుతెప్పలుగా పేరుకుపోయి ఉంటున్నాయి. వీటిన్నింటిపై ప్రజల నుంచి, రిజిస్ట్రేషన్ అధికారుల నుంచి అందిన విజ్ఞప్తులపై స్పందించిన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ మంత్రి తోట నరసింహం ప్రత్యామ్నాయంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా ఈసీలు, ఇతర సేవలు పొందవచ్చని ఉత్తర్వులు జారీ చేశారు. ఆ మేరకు సాఫ్ట్‌వేర్‌ను కొద్దిరోజుల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఆన్లైన్లో పొందుపరచనున్నారు. అనంతరం ఈసీలు, దస్తావేజు నకళ్లను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జారీ చేస్తారు.