
సాక్షి, హైదరాబాద్: ఆరుగురు ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్లపై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టింది. వారిని కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. నోటీసులు జారీ అయిన వారిలో వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకురు ఆనంద్, పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఉన్నారు. తదుపరి విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.
రవిప్రకాశ్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ..
టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాశ్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోర్టు మరోసారి సూచించింది. వచ్చే నెల 7లోపు మరో నిర్ణయం తెలపాలని హైకోర్టు తెలిపింది. అప్పటి వరుకు రవిప్రకాష్‌పై ఉన్న స్టే కొనసాగుతుంది. తుదుపరి విచారణను కోర్టు వచ్చే నెల 7 కు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment