
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రతిదాడులకు దిగితే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు రాష్ట్రం వదిలి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ హెచ్చరించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అవినీతిపై పోస్టర్లు అంటిస్తున్నారన్న కారణంగా వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ నేత తోట పవన్‌పై దాడి చేయడం హేయమని మంగళవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
తోట పవన్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ అనుచరులు కిరాతకంగా దాడిచేశారని, హత్య చేసేందుకు యత్నించారని, వినయ్‌భాస్కర్‌తో పాటు ఆయన అనుచరులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని మహేశ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దళిత నాయకుడు సాయన్నకు ప్రభుత్వం గౌరవం ఇవ్వదా? అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి దళితులంటే గౌరవం లేదని, కనీసం అధికారిక లాంఛనాలతో కూడా సాయన్న అంత్యక్రియలు పూర్తి చేయకుండా చావులో కూడా సాయన్నకు బాధను మిగిల్చారని మహేశ్ ఆవేదన వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment