
హైదరాబాద్ : సచివాలయ నిర్మాణం, వ్యయం అంశాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన సచివాలయానికి వెచ్చించిన నిధులు, నిర్మాణం, నాణ్యత, ఐటీ పరికరాల కొనుగోలు అంశాలను తేల్చాలని విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. సర్కారు ఆదేశాలతో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం వింగ్‌ల వారిగా విచారణ మొదలుపెట్టింది. అయితే, ఈ విచారణలో సచివాలయం నిర్మాణంలో భారీ అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఐటీ విభాగంపై విజిలెన్స్ ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఆ నివేదికలో సెక్రటేరియట్‌లో మొత్తం కంప్యూటర్స్, ఫోన్స్, హార్డ్‌వేర్, టీవీలు, ఎలక్ట్రానిక్స్ సహా కలిపి రూ. 320కోట్లకు పైగా ఖర్చు దాటిందని విజిలెన్స్ పేర్కొంది. కనీస నిబంధనలు పాటించకుండా ఐటీ విభాగానికి చెందిన పరికరాలను కొనుగోలు చేసినట్లు తేల్చింది.
బిల్లులు మంజూరు చేయకుండానే నిధులను విడుదల చేసినట్లు గుర్తించింది. రూ. 320 కోట్లకు పైగా నిధుల విడుదలకు ఎలాంటి ఆధారాలు లేవని తేల్చేసింది. ఇప్పటివరకు ప్రభుత్వం సెక్రటేరియట్ వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ ఇవ్వలేదు. దాదాపుగా ఇప్పటివరకు రూ. 500 కోట్ల నుంచి రూ.600 కోట్ల వరకు ప్రభుత్వం సదరు సంస్థకు నిధులను విడుదల చేసింది. మొత్తం అంచనా రూ. 1500 కోట్ల వరకు ఉంటుందని విజిలెన్స్ తాత్కాలిక రిపోర్టులో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment